City Plus Stories
-
మ్యాగ్నెటిస్ట్.. విపిన్..
సాక్షి, సిటీబ్యూరో: జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అని నానుడి.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక హాబీ ఉంటుంది. కొందరికి కాయిన్స్ సేకరించడం అలవాటు అయితే మరికొందరికి స్టాంప్స్ సేకరించడం అలవాటు. కానీ అందరికీ భిన్నంగా ఫ్రిడ్జ్ లకు అంటించే బొమ్మల మ్యాగ్నెట్స్ సేకరించడం ఆయనకు అలవాటు. ఆయన వృత్తి కంటి వైద్యం.. ఆయన ప్రవృత్తి ట్రావెలింగ్. అందరి లాగా ఏదో వెళ్లామా.. వచ్చామా అన్నట్టు కాకుండా ఆ ప్రదేశం చరిత్రను అందరికీ తెలియజేసేలా మ్యాగ్నెట్స్ సేకరించడం హాబీగా మలుచుకున్నాడు. అతడి పేరే డాక్టర్ అంథోనీ విపిన్ దాస్.ట్రావెల్లింగ్ ప్రాణం..విపిన్ దాస్ వృత్తి రీత్యా ఎంత బిజీ అయినా కూడా ఖాళీ సమయాల్లో ట్రావెలింగ్ చేయడం ఇష్టం. ట్రావెలింగ్‌తో ఎన్నో అనుభవాలు, సంస్కృతి, సంప్రదాయాల గురించి ఎంతో తెలుసుకున్నానని విపిన్ చెబుతున్నాడు. అయితే ఏదైనా విభిన్నంగా చేయాలనే తలంపుతో కొత్తగా మ్యాగ్నెట్స్ సేకరించడం ప్రారంభించాడు.అలా దాదాపు ఏకంగా 500లకు పైగా మ్యాగ్నెట్స్ సేకరించాడు. అలా ఒక్కో ప్రదేశం చరిత్రను ఒక్కో మ్యాగ్నెట్ రూపంలో ఉండేలా చూసుకున్నాడు. అలా ఎన్నో దేశాలు, ప్రదేశాల చరిత్ర, సంప్రదాయాల గురించి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశాడు. ట్రావెలర్స్ కోసం ప్రత్యేకంగా ట్రావెరి్నయా ఫెస్ట్‌ను నవంబర్ 15న హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరుపనున్నారు.తెలంగాణ చరిత్ర తెలుసుకునేలా.. సాధారణంగా ఒక్కో దేశం గురించి మ్యాగ్నెట్స్ సేకరించడం విపిన్ కు అలవాటు. కానీ తెలంగాణపై మక్కువతో తెలంగాణ పర్యాటక ప్రదేశాలపై వినూత్నంగా మ్యాగ్నెట్స్ రూపొందించాడు విపిన్. అంతే కాకుండా తెలంగాణ సంస్కృతిపై మ్యాగ్నెట్స్ తో పాటు.. త్రీడీ బొమ్మలు కూడా రూపొందించారు. దీంతోపాటు అరౌండ్ ది వరల్డ్ పేరుతో తన అనుభవాలతో ఒక పుస్తకాన్ని కూడా రూపొందించాడు. -
పరిసరాలపై విశ్వాసం
సాక్షి, సిటీబ్యూరో: ప్లాస్టిక్ సంచులు, ఇతర వ్యర్థాలను కాల్వలు, చెరువు కట్టలు, రహదారికి ఇరువైపులా ఎక్కడపడితే అక్కడ పడేస్తుండటం గమనిస్తాం. ఆయా ప్రాంతాలను శుభ్రం చేయాలంటే పురపాలక సిబ్బంది రావాలని అనుకుంటాం. ఆలస్యమైతే ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తాం.. అలా కాకుండా మనమే శుభ్రం చేద్దామని కంకణం కట్టుకున్నవారెంతమంది ఉంటారు? అలాంటి వారు నగరంలో చాలా అరుదనే చెప్పాలి.కొందరు యువత మాత్రం చెరువుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాలు, ఇతర వ్యర్థాలను తొలగించే కార్యక్రమానికి నడుం బిగించారు. 2021 నుంచి నగరంలో సరూర్‌నగర్ చెరువు, అమీన్పూర్ చెరువు, నల్లగండ్ల చెరువు, గాంధీ చెరువు, పీరంచెరువు, ఖాజాగూడ చెరువు, తదితర ప్రాంతాల వద్ద కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి సెలవు రోజునా చెరువు కట్ట, పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాలన్నది వారి లక్ష్యం. ఫలితంగా పర్యావరణ పరిరక్షణ, ఇతర వ్యక్తుల్లో క్లీనింగ్ పట్ల స్పృహ కల్పించడం, ఎన్నో రకాల పక్షులను ఆదుకున్నట్లవుతుందని భావిస్తున్నారు. ఐదుగురు స్నేహితులతో ప్రారంభమైన విశ్వ సస్టైనబుల్ ఫౌండేషన్ ప్రస్తుతం సుమారు 500 మందికిపైగా వలంటీర్లను జత చేసుకుంది.బృందాలుగా ఏర్పడి...వీరంతా బృందాలుగా ఏర్పడి చెరువులను దత్తత తీసుకుంటున్నారు. వారాంతంలో వారికి కేటాయించిన చెరువుల దగ్గర ప్రజలు వేసే చెత్త, ప్లాస్టిక్ సంచులు, తాగుబోతులు విసిరేసిన గాజు సీసాలు వంటి వ్యర్థాలను ఏరిపారేస్తున్నారు. సంచుల్లో ప్యాక్ చేసి జీహెచ్ఎంసీకి తరలిస్తున్నారు. దేశంలోనే మొదటి బయోడైవర్సిటీ చెరువుగా గుర్తింపు పొందిన అమీన్పూర్ చెరువుతో పాటు నగరంలో పలు చెరువులకు వలస పక్షలు వస్తున్నాయి.ఈ సీజన్లో వాటి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలా వలస వచ్చిన పక్షలు ఇక్కడ ప్లాస్టిక్ భూతానికి బలైపోతున్నాయి. ఆహారంగా చేపలు, ఇతర కీటకాలను వేటాడే సమయంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్నాయి. ఈ క్రమంలో వాటికి ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలి. ప్రకృతి సిద్ధంగా ఉన్న చెరువులను ఆహ్లాదకరంగా మార్చాలనే పట్టుదలతో ఒక్కో చెరువునూ ఒక్కో బృందం పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం నగరంలో ఏడు బృందాలు పనిచేస్తున్నాయి. -
బ్యూటీ విత్ నేచర్!
అందం అంటే.. ఒకప్పుడు ఆడవారి సొంతం అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా అందరూ అందంగా ఉండేందుకు తాపత్రయపడుతున్నారు. నగరంలో సౌందర్య సాధనాల మార్కెట్ భారీగా నడుస్తోంది. అయితే ఇప్పుడున్న యువత తాము వాడుతున్న బ్యూటీ ప్రొడక్ట్స్‌పై చాలా కచి్చతత్వంగా ఉంటున్నారు. ఎంతలా అంటే ప్రతి ఉత్పత్తిలో ఉన్న పదార్థాలను తరచి తరచి చూస్తున్నారు. వాటి గురించి గూగుల్‌లో వెతికి అవి తమపై ఎలా ప్రభావితం చేస్తాయి.. తమ శరీర తత్వానికి ఎలా సరిపోతాయి.. వాటిని వాడితే ఎంత ప్రమాదకరం వంటి అంశాలను తెలుసుకుంటున్నారు. మరికొందరు కెమికల్స్ తక్కువగా ఉండే హెర్బల్ ఉత్పత్తులను మాత్రమే వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంకొందరైతే ప్యూర్ నేచురల్ ప్రొడక్ట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. యువతలో పెరుగుతున్న అవగాహన చర్మ సౌందర్యంతో పాటు, కేశ సంరక్షణ విషయంలో చాలా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత కాలంలో జుట్టు రాలిపోవడం సర్వసాధారణంగా మారింది. ఇక చర్మం కూడా నిగనిగలాడాలని, తెల్లగా ఉండాలని అనేక సౌందర్య సాధనాలను వాడుతున్నారు. అయితే వాటిలో కూడా కెమికల్స్ లేని నేచురల్ ప్రొడక్ట్స్ వాడితే భవిష్యత్తులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోవని నిర్ధారణ చేసుకున్న తర్వాతే వాటి జోలికి వెళ్తున్నారు. ముఖానికి వాడే ఉత్పత్తుల దగ్గరి నుంచి జుట్టుకు వాడే నూనెల వరకూ దాదాపు సహజసిద్ధంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఉదాహరణకు కొబ్బరినూనె దుకాణాల్లో కొనడం కన్నా ఎక్కడైనా నేచురల్‌గా దొరుకుతుందేమోనని ఆన్లైన్లో వెతుకుతున్నారు. కోల్డ్ ప్రెస్స్డ్ కొబ్బరినూనె, ఆముదం నూనె కొనేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలా ప్రతి సౌందర్యసాధనం సహజసిద్ధంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.కాస్త జాగ్రత్త మరి.. సహజసిద్ధంగా తయారు చేసిన ఉత్పత్తులు బాగానే పనిచేసినా.. గుడ్డిగా ఏదీ నమ్మకూడదని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎవరికి ఎలాంటివి పనిచేస్తాయో.. ఎవరి శరీర తత్వానికి ఎలాంటి రెమెడీలు వాడితే బాగుంటుందో తెలుసుకున్న తర్వాతే వాడటం మంచిదని చెబుతున్నారు. ముందు మన చర్మ తత్వం, జుట్టు సాంద్రత తెలుసుకోవాలని పేర్కొంటున్నారు. కాగా, అన్ని వస్తువులు, అన్ని ఔషధాలూ అందరికీ సరిపోవని, ఎవరికి ఎలాంటివి వాడితే మంచిదో ఓ అవగాహనకు రావాలంటున్నారు. ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఒకసారి డెర్మటాలజిస్టును సంప్రదించి, దాని గురించి వారితో చర్చిస్తే మంచిదని సూచిస్తున్నారు. నిర్మొహమా టంగా వాడాలనుకుంటున్న ఉత్పత్తుల గురించి చెప్పి.. వారి సలహా మేరకు వాడాలని పేర్కొంటున్నారు. లేదంటే ఎంతకాలం ఎలాంటి ప్రొడక్ట్స్ వాడినా ప్రయోజనం ఉండకపోవచ్చని, అనవసరంగా సమయంతో పాటు డబ్బులు వృథా చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. కొన్ని సార్లు చెట్టు నుంచి తీసిన పసరు వంటివి కూడా ఎంత మోతాదులో వాడుతున్నామో తెలియకుండా వాడితే దుష్పరిణామాలు ఉంటాయని, ఏదీ మోతాదుకు మించి వాడటం సరికాదని చెబుతున్నారు.అందరికీ అన్నీ సెట్ కావు.. ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పిన రెమెడీలు అందరి చర్మతత్వం, కేశాలకు సరిపడకపోచ్చు. అందుకే ఏదీ గుడ్డిగా నమ్మడం సరికాదు. మనకు ఎలాంటి రెమెడీలు సరిపోతాయో చూసుకున్న తర్వాతే వాడటం మంచిది. ఏదైనా దీర్ఘకాలిక సమస్య ఉన్పప్పుడు హోం రెమెడీలు వాడటం అస్సలు మంచిది కాదు. సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఏ సమస్యకైనా 60 శాతం మేర చికిత్స అవసరం పడుతుంది. 20 శాతం నేచురల్ ఉత్పత్తులు వాడటం వల్ల మెరుగవుతుంది. మరో 20 శాతం మేర రోజువారీ ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. హోం రెమెడీలతో సమస్యలను తీవ్రతరం చేసుకుని మా వద్దకు చాలామంది వస్తుంటారు. అందుకే నిపుణులను సంప్రదించాకే ఏది వాడాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలి. – డాక్టర్ లాక్షనాయుడు, కాస్మెటిక్ డెర్మటాలజీ, ఏస్తటిక్ మెడిసిన్ఇన్స్టాలో వీడియోలు చూసి..సమాజంపై సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉందో మనకు తెలిసిందే. ఇటీవల సౌందర్యాన్ని పెంపొందించేవంటూ.. పూర్వ కాలంలో పెద్దవాళ్లు వాడే వారంటూ పలు రకాల మొక్కల గురించి సామాజిక మాధ్యమాల్లో తెగ వీడియోలు చేస్తున్నారు. కొందరేమో వంటింట్లో సౌందర్యసాధనాలు అంటూ వీడియోలు పెడుతున్నారు. వాటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్‌గా అందంగా కనిపిస్తారని, చర్మ సమస్యలు తగ్గుతాయని, జుట్టు రాలిపోకుండా.. ఒత్తుగా పెరుగుతుందని సూచిస్తున్నారు. దీంతో చాలా మంది వీడియోలను చూసుకుంటూ ఇంట్లోనే సహజసిద్ధంగా ఉత్పత్తులను తయారుచేసుకుంటున్నారు. మళ్లీ పూర్వకాలంలోకి వెళ్తున్నారని చెప్పొచ్చు. -
ఓల్డేజ్.. ఓల్టేజ్..
చిన్న కుర్రాడిలాగా ఏంటీ ఆ డ్యాన్సులు? అంటూ ఎవరైనా ఆక్షేపించినా వెనకడుగు వేయనక్కర్లేదు. ఎందుకంటే డ్యాన్సులు చేస్తే వృద్ధుల్లో కుర్రతనం ఇనుమడిస్తుందని, వృద్ధాప్య ప్రభావం కనుమరుగవుతుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. వృద్ధాప్యంపై యుద్ధంలో మిగిలిన అన్నిరకాల శారీరక వ్యాయామాల కన్నా డ్యాన్స్ ది బెస్ట్ అని తేల్చడం విశేషం. సిటీలోని ప్రతి డ్యాన్స్ స్టూడియో తమ నేమ్ బోర్డులో ఫిట్నెస్ అనే పదాన్ని చేర్చుకుంటున్న నేపథ్యంలో పెద్దవాళ్లు సైతం డ్యాన్సర్లుగా మారేందుకు ఇలాంటి సర్వే ఫలితాలు తోడ్పడనున్నాయి. వృద్ధాప్యాన్ని జయించడంలో శారీరక శ్రమను మించిన ప్రత్యామ్నాం లేదు. దీనిని ఇప్పుడిప్పుడే ఆధునికులు గుర్తిస్తున్నారు. జిమ్‌లు, యోగాసనాలు.. వగైరా ఎన్నో వ్యాయామ శైలులు.. ఒక్కో వ్యాయామం ద్వారా ఒక్కో రకమైన ప్రయోజనం. అదే క్రమంలో నృత్యం ద్వారా వృద్ధాప్యాన్ని జయించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.స్టడీ ఇదీ.. ఫలితం ఇదీ.. అన్ని వ్యాయామాలూ ఆరోగ్యానికి ఉపయోగపడేవే అయినా నృత్యం వల్ల వృద్ధాప్య సమస్యలకు చాలా మంచిదని ఫ్రంటియర్స్ ఇన్ హ్యూమన్ న్యూరోసైన్స్ జర్నల్‌లో ప్రచురించిన తాజా పరిశోధన నిర్ధారించింది. వయసు పరంగా మీదపడే శారీరక మానసిక సమస్యలను ఎదుర్కోడంలో ఎండ్యురెన్స్ట్రైనింగ్, డ్యాన్సింగ్ రెండింటి మధ్యా వ్యత్యాసాన్ని పరిశీలించినప్పుడు డ్యాన్స్ మరింత లాభదాయకమని తేలిందని పరిశోధనకు సారథ్యం వహించిన జర్మన్ సెంటర్ ఫర్ న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్‌కు చెందిన డాక్టర్ కేథరిన్ అంటున్నారు. సగటున 68 ఏళ్ల వయసున్న వందలాది మందికి 18 నెలల పాటు నృత్య శిక్షణ, ఎండ్యురెన్స్, ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్ ఇచ్చారు. అయితే వీరిలో నృత్యాన్ని ఎంచుకున్నవారి బ్రెయిన్లోని హిప్పో క్యాంపస్ ప్రాంతంలో మరింత ఆరోగ్యకరమైన వృద్ధి కనిపించింది. వృద్ధాప్య ప్రభావాన్ని పెంచి తత్సంబంధిత అల్జీమర్స్ తరహా వ్యాధుల్ని దరిచేర్చడంలో కీలకం ఈ ప్రాంతమే. ఈ పరిశోధన ఫలితాలను అనుసరించి బ్రెయిన్‌పై యాంటీ ఏజింగ్ ప్రభావాలను చూపే సరికొత్త ఫిట్నెస్ ప్రోగ్రామ్‌ను జిమ్మిన్ (జామ్మింగ్, జిమ్నాస్టిక్) అనే పేరుతో శబ్దాలను (మెలొడీస్, రిథిమ్) పుట్టించే ఒక కొత్త పద్ధతిని వీరు రూపొందించారు.నృత్యం ఆరోగ్యకరం.. ప్రతి ఒక్కరూ ఎంత కాలం వీలైతే అంత కాలం స్వతంత్రంగా, ఆరోగ్యవంతంగా జీవించాలని కోరుకుంటారు. శారీరక శ్రమ దీనికి ఉపకరిస్తుంది. దీనిలో నృత్యం భాగమైతే శరీరానికి, మైండ్‌కి కొత్త సవాళ్లను, చురుకుదనాన్ని అందించడం అనివార్యం అని నగరానికి చెందిన డ్యాన్స్ మాస్టర్ బాబీ అంటున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారికి ఇది మరింత మేలు చేస్తుందనేది తమ వద్ద శిక్షణకు వస్తున్నవారి విషయంలో రుజువైందన్నారు.ఇవీ తెలుసుకోండి.. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే సంతోషకారక హార్మోన్లు విడుదల అవుతాయి అని ఆ్రస్టేలియాలోని క్వీన్స్ లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (క్యుయుటి) కూడా నిర్ధారించింది. 👉అంతర్గత ఆరోగ్య సమస్యలున్నవారికి నృత్యాలు సరిపడవు. కాబట్టి నృత్యాన్ని ఎంచుకునే ముందు ఫ్యామిలీ డాక్టర్ అభిప్రాయం తీసుకోవడం అవసరం. 👉 సోలో డ్యాన్సింగ్ సులభమైనది, పెద్దలకు బాగా నప్పుతుంది. అదే విధంగా ఓరియంటల్ డ్యాన్స్, బాలె డ్యాన్స్, ఇండియన్ డ్యాన్స్, ట్యాప్ డ్యాన్స్.. వంటివి చేయవచ్చు. 👉మోకాలు, హిప్, కాలి మడమ నొప్పులు.. వంటివి ఉన్నవారి కోసం సీటెడ్ డ్యాన్స్ కూడా ఉంది. 👉బాల్ రూమ్ డ్యాన్స్‌నే సీనియర్స్ బాగా ఇష్టపడతారు.. ఎందుకంటే ఇవి కపుల్ డ్యాన్స్ క్లాసెస్ కావడంతో పెద్దలకు చాలా ఉపయుక్తం. – ఈ డ్యాన్సుల్లో ఇతరులతో సోషలైజింగ్ ఉంటుంది కాబట్టి, ప్రాధాన్యత కలిగిన వారిమే అనే అభిప్రాయంతో హుషారు వస్తుంది. 👉పెద్దల్లో ట్యాంగో, క్విక్ స్టెప్, వియన్నీస్ వాల్ట్జ వంటివి జ్ఞాపకశక్తి వృద్ధి చెందేందుకు దోహదం చేస్తాయి. 👉 చా– చా– చా, రుంబా, సాంబా, ప్యాసో.. వంటి విదేశీ నృత్యాలు చూడడానికి కాస్త సులభంగా అనిపించినా చేసేందుకు కొంత సంక్లిష్టంగా ఉంటాయి. అలాగే వీటికి మరింత శారరీక సామర్థ్యం అవసరం కాబట్టి వీటిని ఎంచుకోకపోవడమే ఉత్తమం. 👉లైన్ డ్యాన్సింగ్ పెద్ద వయసులో ఉన్నవారికి అత్యంత ఆదరణ పొందుతోన్న నృత్యశైలి. అమెరికాలో ఇది బాగా పాపులర్. ఈ నృత్యంలో డ్యాన్సర్లు ఒకరితో ఒకరు టచ్ చేయాల్సిన అవసరం ఉండదు. -
Sudha Reddy: ఫ్యాషన్ ఐకాన్.. సుధారెడ్డి
సుధారెడ్డి.. ఆమె ఒక ఫ్యాషన్ ఐకాన్. దేశంలోనే కాదు, అంతర్జాతీయ స్థాయితో ప్రముఖ ఫ్యాషన్ వేదికలపై తన సౌందర్యంతో పాటు భారతీయ సాంస్కృతిక వైభవాన్ని మరింత ఉన్నతంగా ప్రదర్శించిన మహిళ. భారత్ తరపున గ్లోబల్ ఈవెంట్ మెట్‌గాలా మొదలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై నడిచిన అతి కొద్ది మందిలో తానొకరు. అంతేకాకుండా సుధారెడ్డి ఫౌండేషన్ ప్రారంభించి నిరుపేదల ఆకలి నుంచి మహమ్మారి క్యాన్సర్ వ్యాధి బాధితుల వరకూ సహకారం అందించడానికి కృషి చేస్తున్నారు. యూనిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంద మంది ఛైర్లలో ఆమె కూడా ఒకరు. యూఎన్ జనరల్ అసెంబ్లీ నుంచి ఫ్యాషన్ 4 డెవలప్మెంట్ ఫిలాంత్రోఫిక్ అవార్డు పొందిన మొదటి భారతీయురాలు. ఆమె ప్రయాణం మహిళా సాధికారతకు స్ఫూర్తిదాయకం. ఈ నేపథ్యంలో ఆమె జీవిత ప్రయాణం గురించి సాక్షితో ముచ్చటించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. హైదరాబాద్ టూ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఫ్యాషన్, సేవ, వ్యాపారం, ఎన్జీఓ ఇలా అనేక రంగాల్లో ఆమె తన ప్రతిభను చాటుకుంటున్నారు. ‘ఇన్ని రంగాలను ఎలా మేనేజ్ చేస్తున్నావని చాలా మంది అడుగుతుంటారు. కానీ, నేను చేసే పనిని ఆస్వాదిస్తాను. అది బిజినెస్ ఐనా, సేవ ఐనా ఇంకేదైనా. చేసే పనిని ఇష్టపడేవారికి బిజీ అనే పదం తెలియదు. మెట్ గాలా, పారిస్ హాట్ కోచర్ వీక్, పారిస్ ఫ్యాషన్ వీక్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి వేదికలపై నడవడం నేనేమీ ప్రత్యేకంగా ఫీల్ అవ్వను. అదే మన దేశ విశిష్టత. విదేశాల్లో భారత్‌ను ఎంత గౌరవంగా చూస్తారో చాలామందికి తెలియదు. అలాంటి వేదికలపై దేశ గత వైభవాన్ని కొనసాగించేలా నావంతు ప్రయత్నం చేస్తాను. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతూ లుల్లా ఆధ్వర్యంలో నా దుస్తులు, అలంకరణలను రూపొందించుకుంటాను. మనకు నచి్చనట్టుగా ఉండటమే సౌందర్యం అని భావిస్తాను. ఒక విద్యారి్థగా, భార్యగా, తల్లిగా, ఫ్యాషన్ ఔత్సాహికురాలిగా, సేవకురాలిగా ప్రతి ప్రయాణాన్నీ అమితంగా ఆస్వాదించాను. అన్నార్థులకే మొదటి ప్రాధాన్యత.. నా కుటుంబంతో గడిపే సమయం నేనెంతగానో ఆస్వాదిస్తాను. నా చుట్టూ ఉన్న మనుషులు నా ఎక్ట్సెండెండ్ ఫ్యామిలీగానే భావిస్తాను. సమాజానికి ఏదైనా చేయాలనే సుధారెడ్డి ఫౌండేషన్ స్థాపించాను. నా భర్త కృష్ణారెడ్డి ఎమ్ఈఐఎల్ ఫౌండేషన్‌తో పాటు నా సంస్థ తరపున సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. మేము ఏనాడూ ఫండ్ రైజింగ్ చేయలేదు. ప్రకృతి అందించే సహజ వనరుల్లో ఆహారం ఒకటి. అందుకే పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టాను. నగరంలోని మా ఇంటి మందు ప్రతి రోజూ మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకూ ఆహారం అందిస్తున్నాం. ఇంట్లో తినే ఆహారమే ఇక్కడ వడ్డిస్తాం. నేను విదేశాల్లో ఉన్నాసరే.. ఆహారం పంపిణీ అయ్యాకే నేను లంచ్ చేస్తాను. ఎవరినైనా లంచ్‌కు పిలిచినా 2 గంటల తర్వాతే ఆహా్వనిస్తాను. అంతర్జాతీయ సేవా సంస్థ యూనిసెఫ్ వరల్డ్ ఫోరంలో భారత్ తరపున బ్రాండ్ అంబాసిడర్‌గా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. భారత్‌లో 14 నుంచి 19 ఏళ్ల వయసు చిన్నారులు బాలకారి్మకులుగా, బాల నేరస్తులుగా మారుతున్నారు. యూనిసెఫ్ అడాలసిస్ ఎంపవర్మెంట్ ప్రాజెక్టులో భాగంగా వారికి డెవలప్మెంట్ స్కిల్స్‌లో శిక్షణ అందించి మేమే ఉద్యోగాలను అందిస్తున్నాం. ఈ ప్రాజెక్ట్‌ను గుజరాత్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహిస్తున్నాం. సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 29న బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కలి్పంచడానికి అతిపెద్ద రన్ నిర్వహిస్తున్నాం. -
ఇన్ఫ్లుయెన్సర్స్.. @రూ. 5 వేల కోట్లు!
సాక్షి, సిటీబ్యూరో: సాంకేతిక యుగంలో అత్యంత ప్రభావం చూపుతున్న సోషల్ మీడియా.. అది పుట్టించిన సెలబ్రిటీల హవా రానున్న రోజుల్లో మరింత పుంజుకోనుంది. నగరంలో సైతం పెద్ద సంఖ్యలో ఇన్ఫ్లుయెన్సర్లు సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సోషల్ బీట్, ఇన్ఫ్లుయెన్సర్. ఇన్ తాజాగా ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ గురించిన విశేషాలు వెల్లడించింది.నగరంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 100కు పైగా బ్రాండ్లు, 500 కంటే ఎక్కువ మంది క్రియేటర్స్– ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ఈ ఏడాది చివరి నాటికి ఇన్ఫ్లుయెన్సర్ ఇండస్ట్రీ రూ.5,500 కోట్లకు చేరుకుంటుందని ఈ నివేదిక అంచనా వేసింది. డిజిటల్ మీడియా పరిశ్రమలో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ 11 శాతంగా లెక్కించింది. ఈ నివేదికను బ్రాండ్లకు వారి మార్కెటింగ్ అవసరంతో పాటు ఈ పరిశ్రమ ఏటా 25% పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.ఒకప్పుడు ఉచితంగానే..దాదాపు ఆరేళ్ల క్రితం తొలిసారి నేను ఇన్ఫ్లుయెన్సర్గా మారినప్పుడు కొన్ని బ్రాండ్స్ మార్కెటింగ్ కోసం సంప్రదించాయి. అయితే అప్పుడు మాకు నామమాత్రంగా ఖర్చులకు తప్ప పారితోíÙకం రూపంలో ఏమీ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు మాత్రం మంచి అమౌంట్స్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. నగరంలో ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో రూ.లక్ష నుంచి రూ.కోటి దాకా డిమాండ్ చేస్తున్నవారు కూడా ఉన్నారు. నాకు వస్తున్న బ్రాండ్స్‌ను బట్టి తొలుత ఫుడ్ ట్రావెలర్‌గా మాత్రమే ఉన్న నేను ఇప్పుడు లైఫ్‌స్టైల్ ఉత్పత్తులతో సహా అనేక బ్రాండ్స్‌కు వర్క్ చేస్తున్నాను. – అమీర్, ఇన్ఫ్లుయెన్సర్ఇవి చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ రొటీన్ కాదు.. ఇక వచ్చేయండి.. -
సరికొత్త బాణీలే.. భవిష్యత్తుకు బాటలు!
సాక్షి, సిటీబ్యూరో: సంగీత పరిశ్రమలో సృజనాత్మకతతో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ సృష్టించేవారు చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ సంగీత దర్శకులు కోటి తెలిపారు. జీ తెలుగు వేదికగా ప్రేక్షకాదరణ పొందిన ప్రముఖ షో సరిగమప 16వ సీజన్ ఈ నెల 29న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమంలో సరిగమప న్యాయనిర్ణేత కోటి మాట్లాడుతూ.. దాదాపు 5 వేల మందిలో అత్యుత్తమ కళా నైపుణ్యాలున్న 26 మందిని ఎంపిక చేశామన్నారు.ప్రస్తుతం ఏఐ వంటి మాధ్యమాలు వచ్చి నకిలీ సంగీతాన్ని సృష్టిస్తున్నాయని, ఇలాంటి ఎన్ని సాంకేతికతలు వచ్చినా స్వచ్ఛమైన, సహజమైన సంగీతం ఎప్పుడూ తన ప్రశస్తిని పెంచుకుంటూ పోతుందని అన్నారు. ప్రముఖ లిరిసిస్ట్ శ్యామ్ క్యాసర్ల ఈ సీజన్లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు ఎంపిక చేసిన మట్టిలో మాణిక్యాలను ప్రముఖ సింగర్లుగా తీర్చిదిద్దేలా సానబెడతామని తెలిపారు. రెండు తరాలకు మధ్య వారధిలా సంగీత, సాహిత్య అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని ఆయన చెప్పారు. ఈ సీజన్లో విలేజ్ వోకల్స్, సిటీక్లాసిక్స్, మెట్రో మెలోడీస్ అనే 3 జట్లుగా పోటీలు కొనసాగుతాయని మరో జడ్జి ఎస్పీ శైలజ వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ సింగర్లు రువంత్, రమ్య, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.ఇవి చదవండి: అతడేమి పాపం చేశాడు.. ఒక్క కారణం చెప్పండి? సెలక్టర్లపై ఫైర్ -
Nagalakshmi: సైక్లింగ్ ఫిఫ్టీస్!
సాక్షి, సిటీబ్యూరో: ఓ వయసు దాటాక సాధారణంగా ఇంట్లో ఉండి.. మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు.. లేదంటే పుణ్యక్షేత్రాలు చుట్టొస్తారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే తమలోని చిన్ననాటి అభిలాషను నెరవేర్చుకుంటారు. ఆ కోవకే చెందుతారు.. డాక్టర్ నాగలక్ష్మి. నిమ్స్ నేచురోపతి విభాగాధిపతిగా పనిచేసిన ఆమె.. 50 ఏళ్ల వయసులో సైక్లింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సాధారణంగా ఆ వయసులో కిలోమీటర్ దూరం నడిస్తేనే అలసిపోతుంటారు. కానీ డాక్టర్ నాగలక్ష్మి మాత్రం అలవోకగా కిలోమీటర్ల మేర సైకిల్‌పై ఎంచక్కా షికారు చేస్తూ, యూత్‌కు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు.ఉదయం నాలుగు గంటలకే..సైక్లిల్ అనగానే ఉదయం నాలుగు గంటలకే మెలకువ వస్తుందని, ఆ వెంటనే రెడీ అయి సైక్లింగ్ చేస్తుంటామని పేర్కొన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో సైక్లింగ్ చేస్తామని వివరించారు. మంత్లీ చాలెంజ్లా పెట్టుకుని, 30 రోజులు 30 ప్రదేశాలు వెళ్లాలనే టార్గెట్ పెట్టుకుని మరీ సైక్లింగ్ చేశామని చెప్పారు.శారీరక, మానసిక ఆరోగ్యం..సైక్లింగ్‌తో ఎన్నో లాభాలు ఉంటాయని, శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా, రోజంతా యాక్టివ్‌గా ఉంటామని నాగలక్ష్మి వివరించారు. అంతేకాకుండా హ్యాపీ హార్మోన్లు విడుదల అవుతాయని, దీంతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని పేర్కొన్నారు.సైకిల్ అంటే ఎమోషన్..చిన్నప్పటి నుంచి తనకు సైకిల్ అంటే ఒక భావోద్వేగమని డా.నాగలక్ష్మి చెబుతున్నారు. చిన్నతనంలో తన తండ్రిని అడిగితే సైకిల్ కొనివ్వలేదని, అప్పటినుంచి ఆ కోరిక అలానే ఉండేదని చెప్పారు. చివరకు తన భర్త, పిల్లలు 50వ పుట్టిన రోజున సైకిల్ కొనిచ్చారని, అప్పటి నుంచి సైక్లింగ్ అలవాటుగా మారిందని వివరించారు. ఒక్కరోజు తాను 7 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లిన విషయాన్ని స్టేటస్ పెట్టుకోవడంతో తన స్నేహితులు ఆశ్యర్యపోయి.. ఆ తర్వాత చాలామంది తమ గ్యాంగ్‌లో కలిసిపోయి చాలా దూరం వెళ్తుండేవారని చెప్పారు. అనంతరం హ్యాపీ హైదరాబాద్ అనే సైక్లింగ్ గ్రూప్‌లో చేరామని వివరించారు. ఆ తర్వాత పైరేట్స్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో 14 మంది స్నేహితులతో గ్రూప్ ఏర్పాటు చేశామని, అప్పటినుంచి కొత్త వారిని కలుస్తూ.. వారితో ఐడియాలు పంచుకుంటూ సైక్లింగ్ చేస్తూ సరదాగా గడుపుతుండేవారిమని పేర్కొన్నారు.ఇవి చదవండి: డాలస్‌లో ఘనంగా అక్కినేని శతజయంతి వేడుకలు..! -
ఇంటి రూఫ్.. మొక్కలు సేఫ్..!
సాక్షి, సిటీబ్యూరో: టెర్రస్‌గార్డెన్.. హైదరాబాద్ నగరంలోని నివాసాల నుంచి పల్లెల వరకూ ఇప్పుడు ఇదే ట్రెండింగ్. పెరుగుతున్న కాలుష్యం ప్రజలను ప్రకృతి ఒడికి చేరువయ్యేలా చేస్తోంది. ఓ వైపు ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం.. మరోవైపు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ తమ నివాసాల్లో మొక్కలు పెంచుతున్నారు. నగరంలో స్థలాభావం కారణంగా మిద్దెలపై మొక్కలు పెంచడం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికితోడు గ్రీన్ సిటీస్, గ్రీన్ హౌస్ అనే కాన్సెప్‌్టతో ఇప్పటికే అత్యాధునిక సౌకర్యాలతో బిల్డింగ్ డిజైన్లు వెలుస్తున్నాయి. దీంతో నగర వాసుల, ప్రకృతి ప్రేమికుల నివాసాలు పచ్చదనానికి ఆవాసాలుగా మారుతున్నాయి. అపార్ట్మెంట్, కాంప్లెక్స్‌ల నిర్వాహకుల నుంచి ఇండివీడ్యువల్ ఇళ్ల వరకూ గ్రీనరీకి ప్రధాన్యతనిస్తున్నారు.ఆరోగ్యం వెంట.. ఇంటి పంట..ఇటీవలి కాలంలో నగరంలో అధిక శాతం మంది భవనాలపై, టెర్రస్‌లో తమ సొంత కూరగాయలను ఆర్గానిక్ పద్ధతుల్లో పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇది వారికి ఆరోగ్యకరమైన తాజా ఉత్పత్తులను అందించడమే కాదు.. సొంతంగా పండించుకుంటున్నామనే గొప్ప సంతృప్తిని కూడా అందిస్తుంది. టెర్రస్ గార్డెన్ కేవలం పచ్చదనాన్ని పంచడం మాత్రమే కాకుండా ఆయా కమ్యూనిటీలు నిర్వహించుకునే ఈవెంట్లకు అద్భుతమైన అనువైన ప్రదేశంగా మారాయి. పండుగల నుంచీ బార్బెక్యూల దాకా వేడుకలుగా జరుపుకోడానికి ఇవి వేదికలవుతున్నాయి. నగర జీవితంలో హడావిడి నుంచి తప్పించుకోడానికి నివాసితులకు వీలు కల్పిస్తోంది. మిద్దెతోట.. పచ్చని బాట..నగరంలో స్థల పరిమితులు ఉండటంతో, స్థలాభావం ఉన్నప్పటికీ పచ్చదనానికి పట్టం కట్టాలని ఆరాటపడుతున్న వారికి.. అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లలోని టెర్రస్ గార్డెన్లు పరిష్కారాన్ని అందిస్తున్నాయి. నగరంలో అపార్ట్మెంట్, కాంప్లెక్సుల్లో టెర్రస్ గార్డెన్లు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఒకప్పుడు భవనాల పైకప్పులపై ఖాళీగా ఉన్న స్థలాలు ఇప్పుడు పచ్చని ప్రదేశాలుగా మారి నగరవాసుల అభిరుచుల వైవిధ్యానికి నిదర్శనాలుగా మారుతున్నాయి.పచ్చని వాతావరణాన్ని అందించడమే కాకుండా కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి గాలిలోకి ఆక్సీజన్‌ను విడుదల చేయడం ద్వారా మిద్దె తోటలు గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. అంతేకాదు కూరగాయలు, మూలికలు, పండ్లను సైతం పెంచడానికి అనేక మార్గాలను అన్వేíÙస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. ఇలా పర్యావరణానికి రక్షణగా నిలవడం.. తద్వారా ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి అలవాటుపడుతున్నారు నగరవాసులు.రసాయనాల నుంచి విముక్తికి..‘పురుగుమందులు లేని సేంద్రీయ కూరగాయలకు పెరుగుతున్న డిమాండ్‌తో, తమ సొంత పెరట్లలో లేదా టెర్రస్లలో కూరగాయలు, పండ్లను పండించడం వైపు చాలా మంది ఆకర్షితులవుతున్నారు. అలాగే ఇంటి ఖర్చులో పొదుపు మార్గాలను అందిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం 45,000 మంది టెర్రస్‌పై తోటలను పెంచేందుకు మా ప్రచారం తోడ్పడింది’ అని శ్రీనివాస్ చెప్పారు. హరిత ఉద్యాన వనాలను మెరుగుపరచడానికి కావాల్సిన విత్తనాలు, మాధ్యమాలు విడిభాగాలను కొనుగోలు చేయడానికి నిపుణుల సలహాలను పొందడంతో పాటు అన్ని రకాల సహకారం అందిస్తామని చెప్పారాయన.సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్..ఆన్లైన్ వేదికగా మిద్దె తోటల పెంపకంపై చర్చోపచర్చలు, గ్రూపులు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది ఉద్యానవన ప్రియుడు శ్రీనివాస్ హర్కరా ‘సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్’ స్థాపించారు. ఇప్పుడు ఇది అత్యధిక సంఖ్యలో నిపుణులు, సభ్యులను కలిగిన గ్రూప్స్‌లో ఒకటి. అటువంటి 16 గ్రూప్స్‌తో దాదాపు 25 వేల మంది సభ్యులతో టెర్రస్ గార్డెన్ హవా నడుస్తోంది. రూఫ్ గార్డెనింగ్, ఆర్గానిక్ కూరగాయలు, పండ్లను పండించడానికి సంబంధించిన అన్ని పరిష్కారాల కోసం వన్ స్టాప్ ప్లాట్‌ఫారమ్‌గా మారింది.గోడల నుంచి.. ఎలివేషన్స్ వరకూ..పచ్చదనం కోసం నగరవాసుల్లో పెరుగుతున్న ఆరాటం గోడల నుంచి ఎలివేషన్స్ వరకూ గతంలో ఉపయోగించని ప్రదేశాలను సైతం మొక్కలతో నింపేలా చేస్తోంది. ఈ క్రమంలోనే రూఫ్ గార్డెనింగ్, టెర్రస్, రూఫ్‌టాప్, పాటియో, బాల్కనీ, పోర్చ్, వరండా, సన్డెక్ వంటి ప్రదేశాల్లో మొక్కలు పెంచేస్తున్నారు. దీంతోపాటు హ్యాంగింగ్ గార్డెనింగ్ కూడా ప్రాచుర్యం పొందుతోంది.. బాల్కనీల్లో వైర్లు, బుట్టలు, కుండీలు వంటివి వేలాడదీస్తూ తీగ మొక్కలను పెంచుతున్నారు. తద్వారా ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కూడా లభిస్తోంది.గ్రాండ్.. గార్డెన్ ట్రీట్స్..ఇంటి మిద్దెలు, టెర్రస్ గార్డెన్స్ ఇటీవలి కాలంలో గ్రాండ్ ట్రీట్స్కి వేదికలు అవుతున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, కమ్యూనిటీ మిత్రులు, ఆఫీస్ కొలీగ్స్‌తో కలిసి వీకెండ్స్, ఇతర ప్రత్యేక ఈవెంట్స్‌లో ట్రీట్స్ ఇచ్చుకోడానికి వీలుగా రూపుదిద్దుకుంటున్నాయి. అవుట్డోర్ సీటింగ్‌కు అనుగుణంగా బెంచ్‌లు, కురీ్చలు, ఊయల వంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు. రట్టన్, వెదురు, కలప, లోహాలు మొదలైన వాటి నుండి ఆల్–వెదర్ ఫరి్నచర్ శ్రేణిలో రూఫ్ గార్డెన్స్ నిర్మాణమవుతున్నాయి.70 వేలకు పైగా సభ్యులు..నగరంలో టెర్రస్ గార్డెన్స్ ట్రెండ్ బాగా పెరుగుతోంది. ప్రస్తుతం మా సంస్థ ఆధ్వర్యంలో 26 గ్రూప్స్ ఉండగా, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు 70వేల మందికిపైగా సభ్యులున్నారు. పర్యావరణ హితంగా, నగర వాతావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడేందుకు ఈ ట్రెండ్‌ని మరింతగా ప్రోత్సహించాలి. నగరం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మా సంస్థ కృషికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు వచి్చంది. – శ్రీనివాస్, వ్యవస్థాపకులు, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్.. (సీటీజీ)ఇవి చదవండి: ఆయిల్, గ్యాస్ బ్లాకుల కోసం పోటాపోటీ -
సిటీలో.. ఏఐ గేమింగ్ జోన్స్!
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుత తరానికి అనుగుణంగా వస్తున్న నూతన ఆవిష్కరణలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్ ముందంజలో ఉంటుంది. ఇందులో భాగంగానే నగరంలో మొట్టమొదటి ఏఐ–గేమింగ్ జోన్ అడుగుపెట్టింది. దేశంలో ప్రఖ్యాతి చెందిన ప్రముఖ కంప్యూటర్ స్టోర్ విశాల్ పెరిఫెరల్స్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ వేదికగా ఏఐ–గేమింగ్ జోన్ మంగళవారం ప్రారంభమైంది. డైరెక్టర్ రాహుల్ మల్హోత్రా, ఇంటెల్ ఇండియా సీనియర్ మేనేజర్ ఛానెల్ డి్రస్టిబ్యూషన్ అరుణ్ రాఘవన్ ఈ సెంటర్‌ను ప్రారంభించారు.ఏ రంగంలోని విద్యార్థులైనా సరే తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు దోహదపడేలా ఈ సెంటర్ రూపొందించడం విశేషం. విద్యార్థులకు ఉచిత ప్రవేశం కలి్పస్తున్నట్లు, ఏఐ గేమింగ్ జోన్లో సదుపాయాలను వినియోగించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కంప్యూటింగ్, ఏఐ–గేమింగ్ జోన్లో ప్రోగ్రామింగ్, ఏఐ డెవలప్మెంట్, గేమింగ్ తదితర విభాగాల్లో సేవలు పొందవచ్చు.ఐడీ కార్డులు తప్పనిసరి..నగరంలో ప్రతి విద్యార్థి టెక్నాలజీని అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో ఈ ఏఐ–గేమింగ్ జోన్‌ను ఆవిష్కరించాం. ఈ ఉచిత సేవలు పొందడానికి, అధునాతన టెక్నాలజీ పై అవగాహన పెంచుకోవడానికి విద్యార్థులు తమ ఐడీ కార్డులను వెంట తీసుకురావాలి. ప్రస్తుత టెక్ యుగంలో విద్యార్థులు విజయాలను సాధించేందుకు ఈ ఏఐ–గేమింగ్ జోన్ ఎంతో ఉపయోగపడుతుంది. – విశాల్ పెరిఫెరల్స్, విశాల్ కంప్యూటెక్ డైరెక్టర్ వికాష్ హిసరియాఇవి చదవండి: తెలంగాణకు అలర్ట్.. నేడు ఏడు జిల్లాలో గట్టి వానలు -
Horse Riding.. సాహసపు.. సవారీ..!
గుర్రపు సవారీ అనేదీ ఆటవిడుపు, సాహస క్రీడ, ప్రస్తుతం నగరంలో ఇదే ట్రెండ్‌గా మారుతోంది. యువతతో పాటు చిన్నపిల్లలు సైతం గుర్రపు సవారీ నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు హార్స్ రైడింగ్‌లో శిక్షణ ఇప్పించి.. వారు గుర్రాలపై సవారీ చేస్తుంటే చూసి ముచ్చటపడుతుంటారు. యువతకు, వారి తల్లిదండ్రుల ఆసక్తికి అనుగుణంగా హార్స్ రైడింగ్ ట్రైనింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. ఈ కోవలోనే నాగోలు డివిజన్ పరిధి రాక్‌టౌన్ కాలనీలో నవీన్ హార్స్ రైడింగ్ స్కూల్ గత కొన్నేళ్లుగా గుర్రపు స్వారీలో అనేక మందికి శిక్షణ ఇస్తూ మన్ననలను పొందుతోంది. – మన్సూరాబాద్మానసిక వికాసానికి, శారీరక ఆరోగ్యానికి సాహసపు సవారీ సంజీవనిలా పనిచేస్తుంది. ముఖ్యంగా మానసిక వికాసం లోపించిన చిన్నారులకు మంచి ఫలితాలనిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలు గుర్రపు స్వారీ చేయడం వల్ల వారిలో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. గుర్రం కళ్లెం పట్టుకోవడం, నిటారుగా కూర్చోవడం, అశ్వాన్ని దూకించడం ఒకే లయలో ముందుకుసాగడం వంటి చర్యలతో మెదడుకు, శరీరానికి మధ్య సమన్వయం ఏర్పడి మానసిక ఉత్తేజం కలుగుతుంది. ఫలితంగా అనేక రుగ్మతలు వాటంతట అవే తగ్గిపోతాయి. అనేక మంది విదేశీయులు కూడ నవీన్ హార్స్ రైడింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నారు.సహసక్రీడతో జర జాగ్రత్త..గుర్రపు స్వారీ అనేది సాహస క్రీడ. ప్రమాదాలకు కూడా ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రమాదాలు సంభవించినా కూడా రైడర్‌కు ప్రమాదం జరగకుండా శిక్షకులు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. గట్టి నేలల్లో ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉండటంతో ఇసుక నేలల్లో శిక్షణ ఇస్తుంటారు.ఎంపిక చేసిన గుర్రాలతో శిక్షణ..మా శిక్షణా కేంద్రంలో మొత్తం 13 గుర్రాలున్నాయి. పదేళ్ల పాటు సేవలు అందించి విశ్రాంతి తీసుకుంటున్న గుర్రాలను ఎంపిక చేసి ప్రత్యేకంగా చికిత్స కోసం వచ్చే పిల్లల సేవలకు వినియోగిస్తాము. చిన్నపిల్లలతో మంచిగా మసలేందుకు, రౌతు తీరుని గమనించేందుకు గుర్రాలకు ముందే శిక్షణ ఇస్తాము. పిల్లల వైకల్యానికి అనుగుణంగా ఏ గుర్రంతో స్వారీ చేయాలనేది నిర్ణయించి శిక్షణ ప్రారంభిస్తాము. ప్రతి నెలా రాజస్థాన్ నుంచి వచ్చిన నిపుణులతో గుర్రాలకు నాడలను వేయిస్తాం. – నవీన్చౌదరీ, హార్స్ రైడింగ్ శిక్షకుడుమానసిక రుగ్మతలకు..చిన్నారుల్లో వివిధ మానసిక రుగ్మతలను నయం చేసేందుకు వివిధ వైద్య విధానాల్లో లొంగని వాటికి అరుదైన చికిత్సా విధానం హార్స్ రైడింగ్ అని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. మా పాపను గత కొన్ని నెలలుగా గుర్రపుస్వారీకి తీసుకొస్తున్నాను. గతంలో కన్నా చాలా మెరుగ్గా ఉంటుంది. తనంతట తానుగా పనులు చేసుకుంటుంది. మెదడు, శారీరక ప్రక్రియ మెరుగ్గా అనిపిస్తుంది. మానసికంగా దృఢంగా తయారవుతుంది. – ఎన్.అపర్ణఇవి చదవండి: నూనెల ధర ఎందుకు పెరిగింది? -
టిక్ టాక్ బామ్మ.. వయసు 78.. ఫాలోవర్లు 23 వేలు
ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ ట్రెండింగ్ డ్యాన్స్ ఇరగదీస్తున్న విజయలక్ష్మి బంజారాహిల్స్: ఆమె భామ కాదు.. బామ్మ.. స్టేజీ ఎక్కి డ్యాన్స్ మొదలెట్టిందంటే చాలు.. కుర్రకారు ఈలలు, గోలలు.. ఆమె డ్యాన్స్ చూస్తే పెద్దవాళ్లు ఐనా సరే ముక్కున వేలు వేసుకోవాల్సిందే.. ఆమె వేసే స్టెప్పులకు కురీ్చల్లో నుంచి అమాంతం లేసి చప్పట్లు చరవాల్సిందే.. ఇంతకూ ఆ బామ్మ వయసు ఎంతో తెలుసా..! సరిగ్గా 78 ఏళ్లు.. ఆమెకు ఇన్‌స్టాలో దాదాపు 23 వేల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. టిక్ టాక్ భామ్మగా పిలుచుకునే ఆమె పేరు విజయలక్ష్మి. పదేళ్ల పాటు హోంగార్డుగా.. బాలానగర్‌కు చెందిన విజయలక్ష్మి పదేళ్లపాటు హోంగార్డుగా పనిచేసింది. బాలనగర్, కూకట్పల్లి, చందానగర్, జీడిమెట్ల, రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసింది. మనువడు ఫోన్ చూసే క్రమంలో ఆమె టిక్ టాక్‌లో తనకు ఒక ఖాతాను ఏర్పాటు చేసుకుంది. డ్యాన్స్ చేయడం, నటులను అనుకరించడం, డైలాగ్‌లకు అనుగుణంగా నటించడం ప్రారంభించింది. ఇంకేముంది ఆమెను ఫాలో చేసే వారి సంఖ్య 12 లక్షలకు చేరింది. దీంతో టిక్ టాక్ బామ్మగా ఆమెకు ఎక్కడలేని గుర్తింపు వచి్చంది. అదే సమయంలో టిక్‌టాక్ నిషేధించడంతో టికి అనే మరో యాప్‌లోకి వెళ్లింది. అందులోనూ దాదాపు 2.5 లక్షల మంది ఫాలోవర్లు వచ్చి చేరారు. అది కూడా బ్యాన్ కావడంతో బామ్మ తాజాగా ఇన్‌స్టా వైపు మళ్లింది.యూత్ ఫిదా.. తన ఇద్దరు కుమారులకు దూరమై ఒంటరిగా ఉన్న విజయలక్ష్మి అక్కడక్కడ నృత్య కార్యక్రమాలకు హాజరయ్యేది. ఈ క్రమంలోనే సినీనటి కరాటే కళ్యాణితో పరిచయం ఏర్పడి నాలుగేళ్లుగా ఆమెతోనే ఉంటోంది. బామ్మ నృత్యాలకు నెటిజన్లు అంతా ఫిదా అవుతున్నారు. ఇన్‌స్టాలో ఇప్పటికే దాదాపు 3300 డ్యాన్స్ వీడియోలను పోస్టు చేసింది. ఇటీవల ఆమె వినాయకుడి మండపం వద్ద వేసిన డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. క్లాస్ అయినా, మాస్ అయినా పాట ఏది వచి్చనా ఆమె స్టెప్పులను ఎవరూ ఆపలేరు. యువతతో కలిసి డ్యాన్స్ చేయడానికి బామ్మనే పోటీపడుతుంది. ఈ వయసులోనూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా డ్యాన్స్ చేసే ఆ బామ్మ ప్రతిరోజు యోగ చేస్తుంది. మితమైన, పోషకాహారం తీసుకుంటానని, అదే తన ఆరోగ్య రహస్యమని చెబుతోంది.సినిమాల్లోకి.. ప్రస్తుతం బామ్మ సినిమాల వైపు అడుగులు వేసింది. విడుదలకు సిద్ధమైన ‘ఉప్పు కప్పురంబు’ చిత్రంలో ఆమె బామ్మ పాత్రలో నటించింది. ఇదే కాకుండా కొన్ని ఛానెళ్లలో బామ్మ మాట పేరుతో సుభాషిౠతాలు, విలువలు, మానవ సంబంధాల గురించి వివరిస్తుంది. ఈ బామ్మకు సినీ పరిశ్రమలోనూ పలువురు ఇన్‌స్టా అభిమానులు ఉన్నారు. -
మిస్ ఇండియా మిస్సవ్వదు..
బ్యూటీ పేజెంట్స్, ఫ్యాషన్ కాంపిటీషన్స్ అంటే కేవలం అందం, సౌందర్యం మాత్రమే కాదని.., నిత్య జీవితంలో మన ఆలోచనా విధానం, సామాజిక అవగాహన, మానవీయ విలువలు తదితర అంశాలతో సంపూర్ణ వ్యక్తిత్వమే ‘మిస్ క్రౌన్’కు ఎంపిక చేస్తాయని తెలుగు రాష్ట్రాల నుంచి ఫెమినా మిస్ ఇండియా ఫైనలిస్టులు ప్రకృతి, భవ్య రెడ్డి తెలిపారు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్, లండన్ ఫ్యాషన్ వీక్, దుబాయ్ ఫ్యాషన్ వీక్, లాక్మే ఫ్యాషన్ వీక్ వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ ఈవెంట్లలో సత్తా చాటిన ప్రముఖ సంస్థ ఎన్‌ఐఎఫ్‌డీ గ్లోబల్ ఆధ్వర్యంలో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ ప్రకృతి కంభం, ఫెమినా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ భవ్య రెడ్డిలతో ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న ఫెమినా మిస్ ఇండియా 2024 పోటీల్లో ఈ ఇరువురూ తెలుగు రాష్ట్రాల తరపున పోటీ పడనున్న నేపథ్యంలో ఫ్యాషన్, అందం, లైఫ్‌స్టైల్ తదితర అంశాలపై వారి అనుభవాలను సాక్షితో పంచుకున్నారు. ఈ రంగంలో రాణించడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచి్చన తమ విద్యార్థులకు మార్గనిర్దేశం చేసిన ఇరువురినీ ఎన్‌ఐఎఫ్‌డీ గ్లోబల్ సెంటర్ డైరెక్టర్ సంజయ్ సరస్వత్ ప్రత్యేకంగా అభినందించారు. డ్రెస్‌లు వ్యక్తిత్వానికి ప్రతీక కాదు.. దక్షిణాది అమ్మాయిలకు బ్యూటీ పేజెంట్స్‌లో గుర్తింపు పెరిగింది. హైదరాబాద్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాల నుంచి ఈ రంగంలో అద్భుత నైపుణ్యాలున్న అమ్మాయిలు రాణిస్తున్నారు. యువతలో పరిపక్వత పెరిగింది. కానీ అవగాహన పెరగాలి. పిల్లలు ఫ్యాషన్ రంగంలో ఆసక్తి చూపిస్తుంటే ఇబ్బందిగా భావిస్తున్నారు. మంచి చెడులు అనేవి అన్ని రంగాల్లో ఉన్నాయి. కానీ ఫ్యాషన్, మోడలింగ్, సినిమాలు అనే సరికి సమాజం సులభంగా జడ్జ్ చేస్తున్నారు. మోడ్రన్ డ్రెస్‌లు మా వ్యక్తిత్వానికి ప్రతీక కాదు. మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి రాగలిగాము. మా సోషల్ మీడియా అకౌంట్స్‌లో చూస్తే తెలుస్తుంది.. సంస్కృతి, సంప్రదాయాలకు ఎంత విలువ ఇస్తున్నామనేది. నార్త్ ష్యాషన్ ఔత్సాహికులను సైతం హైదరాబాద్ అక్కున చేర్చుకుంటోంది. దక్షిణాదిలో సృజనాత్మకత, ఐడియాలజీ, నైపుణ్యాలను వారు అద్భుతంగా వాడుకుంటారు. అదే రీతిలో మనవారినీ ప్రోత్సహించాలి. ఈ రంగంలో బాహ్య, అంతర సౌందర్యం రెండూ ముఖ్యమే. మన రంగూ, రూపు మాత్రమే విజేతగా నిలబెట్టలేవు. ఆలోచనా విధానం, అవగాహన ఇందులో కీలకాంశాలు. – ప్రకృతి కంభం.అలాంటి రోజులు రావాలి..ఈ రోజు సెషన్లో ఎంతో మంది ఫ్యాషన్ ఔత్సాహికులు.. వారి ప్రయాణాన్ని తమ కుటుంబ సభ్యులే ఒప్పుకోవట్లేదని, ఫ్యాషన్, మోడలింగ్ అంటే ఎవరు పెళ్లి చేసుకుంటారని వారిస్తున్నారు. కానీ మాలాంటి అవగాహన, పరిపక్వత, నైపుణ్యాలు ఉన్న అమ్మాయిలు దొరకడం వారి అదృష్టం అని తెలుసుకునే రోజులు రావలి. వ్యవస్థనో, ఫ్యాషన్ పరిశ్రమపై పడిన ముద్ర మమ్మల్ని డిసైడ్ చేయలేవు. కళాత్మకత, సేవ, విద్య, సామాజిక విలువలు తదితర అంశాల్లో మేమెంతో ఉన్నతంగా ఆలోచిస్తాం. కెమెరా, వీఎఫ్ఎక్స్, డైరెక్షన్, సినిమాలు, యాక్టింగ్ అంటూ బాలీవుడ్ వరకూ ఎందరో నగరానకి వస్తున్నారు. కొందరి లోపాలు ఎంచుకుని పరిశ్రమను నిర్ధారిస్తున్నారంటే అది అవగాహనా లోపమే. అందుకే ఎంతో ఇష్టమున్నా రాణించలేకపోతున్నారు. పరిమితులు లేకుండా నచ్చగలిగింది చేయగలిగినప్పుడే మహిళా సాధికారత వస్తుంది. ఒకప్పటిలా స్టిగ్మా లేకపోయినప్పటికీ, పూర్తిగా లేదు అనలేము. గతంలో ఒక ఆటో డ్రైవర్ కూతురు సైతం విజేతగా నిలిచిన సందర్భాలున్నాయి. పోటీలు పారదర్శకంగా జరుగుతున్నాయి. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్‌గా స్థిరంగా ఉంటూ, గ్లోబల్ వేదికపై సత్తా చాటడానికి వినూత్నంగా ప్రయతి్నస్తున్నాం. దేశంలో ఫెమినా మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ ఇండియా వేదికలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునిస్తాయి. సాధారణంగా జరిగే పేజెంట్‌లో పాల్గొనే సమయంలో ఇంతకు ముందు విజేతల ప్రొఫైల్స్ తప్పకుండా గమనించాలి. – భవ్య రెడ్డి -
లక్ష్యం వైపు.. లాక్షనాయుడు
సాక్షి, హైదబారాద్: ఏదైనా రంగంలో రాణించాలంటే ఎంతో శ్రమించాలి.. అలాంటిది అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ప్రతిభ కనబర్చాలంటే ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చాలి? ఏదైనా పని మొదలు పెట్టాలన్నా.. కొత్త రంగంలోకి వెళ్లాలన్నా ఇంటి నుంచే సవాలక్ష ప్రశ్నలు ఎదుర్కొంటుంటాం. మనకు అవసరమా..? చక్కగా ఉన్న పని చేసుకుని హాయిగా ఉండొచ్చుగా అని సలహాలు ఇస్తుంటారు. మరికొందరేమో రెండు, మూడు పడవలపై ప్రయాణం చేయడం మంచిది కాదంటూ హితవు పలుకుతారు. ఇంకొందరు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంటారు. కానీ వైఫల్యం గురించి బాధపడుతూ ఒకే దగ్గర కూర్చుంటే అంతకన్నా వైఫల్యం మరొకటి ఉండదని నిరూపిస్తున్నారు డాక్టర్ లాక్షనాయుడు. డాక్టర్‌గా, సింగర్‌గా, శాస్త్రీయ నృత్యకారిణిగా, రాజకీయవేత్తగా చిన్న వయసులోనే రాణిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. -
ఆర్గానిక్ అ'డ్రెస్'!
సాక్షి, సిటీబ్యూరో: తినే తిండిలో మాత్రమే కాదు మనం ధరించే దుస్తుల్లోనూ రసాయనాల వినియోగం మితిమీరుతోంది. స్వచ్ఛంగా మెరిసిపోయే తెల్లని కాటన్ వస్త్రం తయారీలో కూడా ఆ రంగు కోసం కెమికల్స్ వాడతారని బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే ఆహారం తరహాలోనే ఆహార్యంపై కూడా పెరుగుతున్న శ్రద్ధ.. నగరవాసుల్లో ఆర్గానిక్ దుస్తుల పట్ల ఆసక్తికి కారణమవుతోంది.తిరిగే ప్రదేశం సహజమైన ప్రకృతి అందాలతో ఉండాలి తినే తిండి కూడా సహజమైనదే అయి ఉండాలి.. ధరించే దుస్తులు కూడా సహజసిద్ధమైన రీతిలో రూపొందించినవి కావాలి. లేకపోతే అనారోగ్యాలు ఎటు నుంచి దాడిచేస్తాయో తెలీదు.. ఈ స్పహ ఆధునికుల్లో పెరుగుతోంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే కొన్ని బ్రాండెడ్ దుస్తులు మార్కెట్లో కనిపిస్తుండగా.. ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగాæ డిజైనర్లు కూడా ఆర్గానిక్ దుస్తులకు అడ్రస్‌గా మారుతున్నారు. అలాంటివారిలో సిటీ డిజైనర్ సంతోష్ ఒకరు. గతంలో పూణె ఫ్యాషన్ వీక్‌లో వీటిని ప్రదర్శించారాయన.కాస్ట్ లీ కాదు.. ధనవంతులు మాత్రమే సస్టెయినబుల్ ఫ్యాషన్ ను కొనుగోలు చేయగలరని అభిప్రాయం ఏర్పడింది. అయితే తెలివిగా షాపింగ్ చేయాలనుకునే ఎవరికైనా ఈ తరహా దుస్తులు అందుబాటులోనే ఉంటాయని అంటున్నారు డిజైనర్లు. ‘అందరూ అనుకున్నట్టు ఆర్గానిక్ ఫ్యాషన్ దుస్తులు మరీ ఖరీదైనవి ఏమీ కాదు. ఉత్పత్తి వ్యయం కూడా మీటర్‌కి రూ.వెయ్యిలోపే అవుతుంది. అయితే వీటి వాడకంపై ఫ్యాషన్ ప్రియుల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉంది’ అంటూ చెప్పారు నగరానికి చెందిన డిజైనర్ నయన్. సేంద్రియ పద్ధతిలో తయారు.. ఆధునిక వినియోగదారులు పర్యావరణ అనుకూల డిజైన్ ట్రెండ్లను అనుసరిస్తుండటంతో హానికరమైన రసాయనాలు, పురుగు మందులు లేకుండా ఉంటాయి సేంద్రియ పద్ధతిలో తయారైన వ్రస్తాలకు డిమాండ్ విస్తరిస్తోంది. ఉత్పత్తిదారులు సరళమైన, తటస్థ–రంగు దుస్తులు రూపొందిస్తున్నారు. వీటిలో తెలుపు, నలుపు క్రీం రంగులు కీలకమైనవి. కార్క్, వెదురు, జనపనార, ఆర్గానిక్ కాటన్, రీసైకిల్ కాటన్ లినెన్ సస్టెయినబుల్ ఫ్యాషన్ ఉత్పత్తిలో కీలకమైన ముడి పదార్థాలుగా మారాయి. సేంద్రియ పద్ధతిలో పత్తి లేదా జనపనార వంటి పర్యావరణ అనుకూల పదార్థాలతో రూపొందించిన జీన్స్ దుస్తులు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. శీతాకాలంలో వెచ్చదనాన్ని అందించే స్వెటర్ల కోసం, ఉన్ని లేదా అల్పాకాతో తయారు చేసినవి అందుబాటులోకి వచ్చాయి.వ్యర్థాల రీసైక్లింగ్.. ఫ్యాషన్ పరిశ్రమలో వ్యర్థాలను తగ్గించడానికి అప్‌సైక్లింగ్ రీసైక్లింగ్ పద్ధతులు అనుసరిస్తున్నారు. డిజైనర్లు కొత్త ప్రత్యేకమైన దుస్తుల వెరైటీల సృష్టి కోసం పాత వ్రస్తాలు, స్క్రాప్లు, దుస్తుల తయారీలో వాడగా మిగిలిపోయిన వాటిని సృజనాత్మకంగా పునర్నిరి్మస్తున్నారు. ఇది వ్రస్తాల జీవితచక్రాన్ని పొడిగించడంలో, వ్యర్థాలను తగ్గించడంలో సహాయపడుతోంది. అలాగే స్లో ఫ్యాషన్ మూవ్మెంట్.. స్లో ఫ్యాషన్ అనే భావన పెరిగింది. వినియోగదారులు తమ ఫ్యాషన్ ఎంపికల విషయంలో కంటికి ఇంపుగా ఉండే దుస్తుల కన్నా ఒంటికి మేలు చేసేవే మిన్న అనే భావనకు వస్తున్నారు. ఎక్కువ కాలం ధరించగలిగే శాశ్వతమైన, మన్నికైన దుస్తులను ఎంచుకుంటున్నారు. మరో వైపు ఇది సంప్రదాయ హస్తకళ స్థానిక కళాకారులకు ఇది ఊతమిస్తోంది. సంప్రదాయ నేయడం, అద్దకం, ఎంబ్రాయిడరీ పద్ధతులను సంరక్షించడానికి ప్రోత్సహించడానికి బ్రాండ్లు కళాకారులతో కలిసి పనిచేస్తున్నాయి. ఇది సంప్రదాయ కళలను పునరుజ్జీవింపజేయడమే కాకుండా హస్తకళాకారుల పురోభివృద్ధి అవకాశాలను కూడా పెంచుతోంది."రసాయన రహితంగా పూర్తి ఆర్గానిక్ దుస్తుల తయారీ అనేది ఇప్పటికీ కొంత సాహసంతో కూడిన ప్రయోగమే అని చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా ఆర్గానిక్ ఫ్యాబ్రిక్, డైతో తయారు చేసినవి తక్కువ షేడ్స్‌లో మాత్రమే లభ్యమవుతాయి. దేశంలో ఇప్పటికే కొన్ని బ్రాండ్స్ నాచురల్ డైస్‌తో చేసిన దుస్తులు విక్రయిస్తున్నప్పటికీ.. అవి కూడా పూర్తిగా 100శాతం ఆర్గానిక్ అని చెప్పలేం. ఆర్గానిక్ దుస్తులకు కాటన్, లినెన్, పట్టు.. ఫ్యాబ్రిక్స్ మాత్రమే నప్పుతాయి. అలాగే ఈ దుస్తుల తయారీకి మిగిలిన వాటి తయారీతో పోలిస్తే పట్టే సమయం కూడా బాగా ఎక్కువ. ‘నేను రూపొందించిన ఆర్గానిక్ దుస్తుల తయారీలో ఫ్యాబ్రిక్ మొత్తం చేనేతలనే వినియోగించాను. సిద్ధిపేటలోని ఆదర్శ్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ సునంద ఈ ఫ్యాబ్రిక్స్ తయారీ చేయించారు. అదేవిధంగా ఉల్లిపాయ, పసుపు వంటి దినుసులతో పాటు చెట్ల ఆకులు, కాండం, వేర్లు.. వీటిని ఉపయోగించి ఆకుపచ్చ, విభిన్న రకాల బ్లూషేడ్స్, ఎల్లో, బ్రిక్ షేడ్స్‌తో కలర్స్ సృష్టించాం. కొంచెం డల్ ఫినిష్ ఉండే ఫ్యాబ్రిక్‌కి అత్యాధునిక డిజైనింగ్ వర్క్ జత చేసి ఆకట్టుకునేలా డ్రెసెస్ క్రియేట్ చేశాం. మొత్తం 20 డ్రెస్సెస్ క్రియేట్ చేస్తే.. 16 రకాల డిజైన్లను ఈ షోలో ప్రజెంట్ చేశాను’ అంటూ చెప్పారు సిటీ డిజైనర్ సంతోష్."నేచురల్ డై తయారీ యూనిట్ స్థాపించి..సింథటిక్ వంటి వ్రస్తాలు ఎంచుకుంటే అది పర్యావరణానికి హానికరమని, మన ఆరోగ్యానికి కూడా చేటు చేస్తుందనే స్పృహ నగరవాసుల్లో ఇప్పుడిప్పుడే వస్తోంది. అలాగే దుస్తుల తయారీలో వాడే కొన్ని మెటీరియల్స్ ఆక్సిజన్ నాణ్యతను కూడా దెబ్బతీస్తాయి. అంతేగాకుండా కెమికల్ డైలను నివారించాల్సిన అవసరం ఉంది. కొన్ని రకాల ఆకులు తదితర సహజోత్పత్తుల ద్వారా తయారైన రంగుల వినియోగం పెంచాలి. నేచురల్ డైతో తయారైన.. పూర్తి సహజసిద్ధమైన ఫ్యాబ్రిక్‌ను అందించేందుకు సిటీ శివార్లలో మా సొంత డైయింగ్ యూనిట్‌ను ప్రారంభించాం. – మమత తుళ్లూరి, డిజైనర్ఇవి చదవండి: ఇది.. మైక్రోకరెంట్ ఫేస్ లిఫ్ట్ డివైస్! -
ఉన్నది ఒకటే.. 'జిమ్'దగీ..!
సాక్షి, సిటీబ్యూరో: జిమ్‌కు వెళ్లడం అనేది శారీరక వ్యాయామం, ఆరోగ్యం కోసం అనేది అందరికీ తెలిసిన విషయం. నాణేనికి మరో వైపు ఆదాయ మార్గం ఉంది. శరీర సౌష్టవం కలిగిన వారికి పార్ట్‌టైం, ఫుల్ టైం ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. నగరంలో వందలాది కుటుంబాలు ఈ రకంగా ఉపాధి పొందుతున్నాయి. కండలు తిరిగిన యువత బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొనడం, ఉన్నత శ్రేణి కుటుంబాలకు బాడీగార్డులుగా, ఈవెంట్స్, ప్రముఖ వ్యాపార సంస్థలకు బౌన్సర్లుగా రాణిస్తున్నారు. దీంతో వీరికి ఉపాధితో పాటు సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది.నిత్యం జిమ్ చేస్తూ ఆరోగ్యంగా, బలంగా ఉన్న వారికి మార్కెట్లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కోరుకున్న వారికి పార్ట్ టైం, ఫుల్ టైం రెండు రకాల ఉద్యోగాలూ లభిస్తున్నాయి. భాగ్యనగరంలో రాజకీయ నాయకులు తమ రక్షణ కోసం ప్రైవేటుగా బాడీగార్డులను నియమించుకుంటున్నారు. ఏవైనా జన సమీకరణ కార్యక్రమాలు ఉన్నపుడు బౌన్సర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక ఉన్నత శ్రేణి కుటుంబాలు, సినిమా, ఇతర సెలబ్రిటీలు బయటకు రావాలన్నా, ఏ చిన్న ఫంక్షన్ చేసుకున్నా బౌన్సర్లను పెట్టడం అలవాటుగా మారిపోయింది. కొన్ని వర్గాలకు బౌన్సర్లను పెట్టుకోవడం స్టేటస్‌గానూ భావిస్తున్నారు. దీంతో నగరంలో బౌన్సర్లకు డిమాండ్ పెరుగుతోంది.ఈవెంట్స్‌ను బట్టి..ఒక్కో ఈవెంట్‌కు అక్కడ పరిస్థితులను బట్టి 8 గంటలు, 12 గంటలు, 24 గంటలు ఇలా సమయాన్ని బట్టి డబ్బులు చెల్లిస్తారు. బౌన్సర్లకు 8 గంటలకు కనీసం రూ.1,500 నుంచి రూ.2 వేల వరకూ ఇస్తున్నారు. 12 గంటలు, ఆపై సమయాన్ని బట్టి లెక్కలు ఉంటాయి. మరోవైపు పబ్‌లు, పేరొందిన రెస్టారెంట్లు, స్టార్ హోటల్స్, ప్రముఖ దుకాణాల్లోనూ నెలవారీ వేతనాలకు బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. బాడీగార్డు, బౌన్సర్లకు నెలకు కనీసం రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ చెల్లిస్తున్నారు.17 ఏళ్ల వయసు నుంచి..నాకు 17 ఏళ్ల వయసు నుంచి జిమ్‌కు వెళ్లడం ప్రారంభించాను. ఇపుడు 30 ఏళ్లు. తొలి రోజుల్లో ఆరోగ్యం, శరీర సౌష్టవం కోసం వెళ్లాను. అందరిలోనూ మనం ప్రత్యేకంగా ఉండాలని ఆలోచించాను. శరీరం ఆకర్షణీయమైన ఆకృతిలో తయారయ్యింది. తదుపరి రోజుల్లో బౌన్సర్‌గా అవకాశాలు వచ్చాయి. కొన్నాళ్ల తరువాత సొంతంగా బిజినెస్ ప్రారంభించాను. ప్రస్తుతం పార్ట్ టైం బౌన్సర్‌గా పనిచేస్తున్నాను. ఈవెంట్స్ ఉన్నపుడు వెళుతున్నా. 8 గంటలకు కనీసం రూ.1500 ఆపైన వస్తాయి. 12 గంటలు అయితే రూ.2 వేల వరకూ ఇస్తున్నారు. ఈ ఆదాయం ఆర్థిక వెసులుబాటు కలి్పస్తుంది. – అమోల్, బౌన్సర్, బంజారాహిల్స్పర్సనల్ బాడీగార్డుగా..గత పదేళ్ల నుంచి జిమ్‌కు వెళుతున్నాను. డైట్ పాటిస్తాను. ఆరోగ్యంగా, శారీరకంగా ఫిట్‌గా ఉంటాను. నాకు తెలిసిన వారి రిఫరెన్స్ ద్వారా పర్సనల్ బాడీగార్డుగా చేరాను. నమ్మకంగా పనిచేసుకుంటున్నాను. మంచి వేతనం వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతృప్తికరమైన జీవితం సాగిస్తున్నాను. – ఆదిల్, జూబ్లీహిల్స్ఇవి చదవండి: Pooja Bedi: ప్రతి విషాదం.. నన్ను దృఢం చేసింది! -
Pooja Bedi: ప్రతి విషాదం.. నన్ను దృఢం చేసింది!
సాక్షి, సిటీబ్యూరో, రాయదుర్గం: నా జీవితంలో చోటుచేసుకున్న ప్రతి విషాదం నన్ను దృఢంగా చేసిందని ప్రముఖ నటి పూజా బేడీ అన్నారు. గచ్చిబౌలో గురువారం ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆమె కాసేపు మీడియాతో ముచ్చటించారు. చాలా తెలుగు సినిమాల్లో నటించాను. మోహన్‌బాబు నుంచి జూ.ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోల వరకూ అనేక సినిమాల్లో నటించాను.హైదరాబాద్ షూటింగ్ ప్రదేశాలను ఎంతగానో ఎంజాయ్ చేశాను. చారి్మనార్ గల్లీల్లో తిరిగాను, గాజుల దుకాణాలు ఆకట్టుకుంటాయి. స్థానిక పర్యాటక ప్రాంతాలను సందర్శించాను. ప్రత్యేకించి హైదరాబాద్ ధమ్ బిర్యానీకి పెద్ద ఫ్యాన్‌ను. అలాగే సలాడ్ కూడా ఇష్టం. వివిధ సందర్భాల్లో వచి్చనపుడు బిర్యానీతో పాటు హలీం తినడానికి ఇష్టపడతాను. హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్లే సమయంలో పెద్ద పెద్ద బాక్సుల్లో బిర్యానీ పార్శిల్స్ వచ్చేవి. తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవడం ఇష్టం అని తెలిపారు. అంతకు ముందు ఎఫ్ఐసీసీఐ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) గచి్చబౌలి చాప్టర్ సత్వ నాలెడ్జ్ సిటీలో ‘లిమిటేషన్ టు లిబరేషన్ అండ్ అన్‌లాక్ యువర్ ఇన్నర్ స్ట్రెంక్త్’ అనే అంశంపై ఫిల్మ్ స్టార్, వెల్నెస్ ఎవాంజెలిస్ట్ పూజా బేడితో ఇంటరాక్టివ్ సెషన్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో ఎఫ్ఎల్ఓ ఛైర్పర్సన్ ప్రియా గజ్దర్, ఫ్లో సభ్యులు పాల్గొన్నారు.నేనెప్పుడూ ఏడవలేదు..విద్యార్థి దశలో నేను తరగతిలో ఫస్ట్ ఉండేదాన్ని. సినిమాల్లోకి వస్తానని అస్సలు అనుకోలేదు. మా అమ్మ మంచి డ్యాన్సర్. ఈ ఫీల్డ్‌లోకి వచ్చాక ఎక్కడా వెనుదిరిగి చూడలేదు. గత కొన్నేళ్లుగా నా కుటుంబంలో ప్రతి ఆరు నెలలకూ చెడు వార్త వినాల్సి వచ్చింది. అమ్మమ్మ చనిపోయింది. నాకు ఇష్టమైన కుక్క మృతి చెందింది. తండ్రిలాంటి వ్యక్తిని కోల్పోయాను. నా తమ్ముడికి మరో సమస్య వచి్చంది. నాకు విడాకుల సమస్య. నేనెప్పుడూ ఏడవలేదు. విచారిస్తూ నా లక్ష్యాన్ని మర్చిపోలేదు. ఆత్మస్థైర్యం కోల్పోలేదు. పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నాను. వెల్నెస్ సంస్థను నిర్మించాను. ప్రతి విషాదం నన్నో దృఢమైన వ్యక్తిని చేసింది. జీవితం చాలా చిన్నది. ఇదొక ప్రయాణం. అందరికీ సమస్యలు ఉంటాయి. జీవితంలో అవి ఒక భాగం మాత్రమే. వాటిని మనం ఎలా ఎదుర్కొంటామనేదే నిజమైన వ్యక్తిత్వం.అలా విముక్తి లభించింది..‘నా జీవితంలో ప్రతి విషాదం నన్ను బలమైన వ్యక్తిగా తయారు చేసింది. విడాకుల సమయంలోనూ 12 ఏళ్ల సంతోషమైన జీవితం కోసం 50 ఏళ్లు దయనీయంగా ఉండరాదనుకున్నా. అప్పుడు నాకు విముక్తి లభించింది’ అని తెలిపారు.ఇవి చదవండి: బ్లాక్‌బస్టర్ మూవీకి బంపరాఫర్.. కేవలం ఒక్క రోజు మాత్రమే! -
నవ్వుతూ.. నవ్విస్తూ..
నలుగురితో నారాయణ అని కాకుండా నలుగురిలో నేను వేరయా అన్నట్లు ఆర్జేలలో ఆర్జే స్వాతి వేరయా అని నిరూపిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్‌తో అటు ఆర్జేగా ఇటు సోషల్‌మీడియా సెలబ్రిటీగా మరోవైపు ఇంట్లో ఇల్లాలిగా, పిల్లల ఆలనాపాలనతో పాటు పలు షోలను చేస్తూ తన సత్తాచాటుతోంది. ఆర్జేగా చేశామా అనేది కాకుండా కొంగొత్త థీమ్స్‌తో ఇంటర్వ్యూలు చేస్తూనే ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ రీల్స్ చేస్తూ.. తన గెటప్స్‌తో అదరగొడుతున్నారు. నవ్వించడం చాలా కష్టం.. అందులో ఎదుటువారిమీద జోక్వేసి నవ్వించడం ఒకతీరైతే.. తనమీద తానే జోక్స్ వేసుకొని డిఫరెంట్ గెటప్స్‌తో నవ్వించడం మరోతీరు. ఈ కోవకే చెందుతారు ఆర్జే స్వాతి. పేరడీ, రీమిక్స్‌తో లక్షల్లో వ్యూస్ సంపాదిస్తూ.. సోషల్ మీడియాలో సంచలనాలను సృష్టిస్తున్న ఆర్జే స్వాతి తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు.. టిపికల్ మిడిల్‌క్లాస్ ప్యామిలీ.. టిపికల్ మిడిల్‌క్లాస్, స్ట్రిక్ట్ ప్యామిలీ.. మాది. పుట్టింది వరంగల్.. అక్కడే స్కూలింగ్ చేశాను. హైదరాబాద్ రామాంతపూర్‌లో డిగ్రీ చేసి బీపీఓలో ఉద్యోగం చేసేదానిని. మొదట్లో హైదరాబాద్ కల్చర్‌ను అలవాటు చేసుకోవడానికి చాలా టైం పట్టింది. కానీ త్వరగా మేలుకొని అలవాటయ్యాను. నాకు మాట్లాడటం అలవాటు.. ఎదుటివారితో కలిసిపోవడం, నవి్వంచడం చాలా ఇష్టం. బీపీఓలో గడగడా మాట్లాడుతూ కస్టమర్ కేర్‌లో గడసరిగా పేరుతెచ్చుకున్నాను. అలా 2013లో ఆర్జేగా మీరు కూడా అవ్వొచ్చు అనే అడ్వర్టైజ్మెంట్ రావడంతో ఇంట్లో చెప్పకుండా ఆర్జే ఆడిషన్స్‌కి వెళ్లి ఆడిషన్ ఇచ్చాను. నా ఆడిషన్ రేడియో మిర్చి వారికి నచ్చి నన్ను ఆర్జేగా తీసుకున్నారు.ఇమిటేషన్, కొత్త థీమ్స్ ఇంటర్వ్యూలు.. అందరిలా ఆర్జే చేయడం కన్నా కొద్దిగా సరికొత్తగా చేయడం ఇష్టం. అలా గురు సినిమా హీరో వెంకటేష్‌తో హీరోయిన్ మాదిరి ఇమిటేషన్ ఇంటర్యూ చేయడం ఆయనకు నచి్చంది. సందర్భానుసారం మట్లాడుతూ, మిమిక్రీ చేస్తూ, సినిమా ఇంటర్యూలలో ఆ సినిమా తాలూకూ థీంని తీసుకొని ఇంటర్యూ చేసేదానిని. అలా ఆర్జేగా నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది.ఇన్స్టాగ్రామ్ వీడియోలకు స్పందన.. సోషల్ మీడియా వచ్చాక ఇన్స్టాగ్రామ్ వేదికగా నవ్వించే వీడియోలు చేశాను. కానీ సరికొత్తగా చేయాలనే తపనతో రీమిక్స్ గెటెప్ల వైపు మొగ్గాను. ట్రెండింగ్‌లోని వీడియోలకు అచ్చం అలాగే గెటప్స్ వేసి రీమిక్స్ వీడియోలు చేయడం ప్రారంభించాను. నెటిజన్ల నుండి అనూహ్య స్పందన లభించింది. ట్రెండింగ్ వీడియోస్‌లోని వారిని అనుకరించడానికి వారి గెటప్స్‌కి పేరడీగా ఇంట్లో వంట వస్తువులు, కూరగాయలు, నూడిల్స్, మా కుంటుబసభ్యుల దుస్తులు వాడతాను. అలా చేయడం నెటిజన్లను మరింత ఆకర్షించింది. దీంతో రీమిక్స్‌కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇన్‌స్టాలో లక్షాపదివేల మంది ఫాలోవర్స్ వచ్చారు. కొంగొత్త కంటెంట్‌తో నవి్వంచడం నా కర్తవ్యం. ఓ రోజు మా స్టూడియోకి మాజీ మంత్రి కేటీఆర్ వచి్చనపుడు ర్యాప్ సాంగ్ పాడాను. ఆయనకు చాలా నచ్చి మీరు ర్యాపరా కూడానా అని మొచ్చుకున్నారు.లేడీ కమెడియన్ అవ్వాలి.. నేటితరంలో లేడీ కమెడియన్లు చాలా అరుదుగా ఉన్నారు. కోవై సరళలాగా తనమీద తనే జోకులు వేసుకుంటూ చేసే కామెడీని చేయాలన్నది నా కోరిక. లేడీ కమెడియన్‌గా అడుగులు వేస్తున్నాను. పలు టీవీ షోల వారితో సంప్రదింపులు జరుగుతున్నాయి. త్వరలో ఆర్జేగా, సోషల్ మీడియాతో పాటు బుల్లితెర, వెండితెరలలో నవ్వులు పూయించాలన్నదే నా ఆకాంక్ష.. నవ్వూతూ బ్రతకాలిరా.. నవ్వుతూ చావాలిరా.. నా చివరి శ్వాస వరకూ ప్రేక్షకులను నవి్వంచడానికి ప్రయతి్నస్తూనే ఉంటాను.. ఇట్లు.. మీ ఆర్జే స్వాతి. -
గ్లోబల్ వేదికగా ‘ఏడీపీ ఇండియా’ వృద్ధి
సాక్షి, సిటీబ్యూరో: హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ రంగంలో ‘ఏడీపీ ఇండియా’ వినూత్న ఆవిష్కరణలతో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ అగ్రస్థానంలో కొనసాగుతోందని ఏడీపీ గ్లోబల్ ప్రెసిడెంట్, సీఈఓ మరియా బ్లాక్ తెలిపారు. హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, సరీ్వసెస్‌లో ప్రసిద్ధి చెందిన ఏడీపీ ఇండియా 25వ వార్షికోత్సవాలను ఆదివారం నిర్వహించింది. నగరంలోని హెచ్ఐసీసీ నోవాటెల్‌లో జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రెసిడెంట్ శ్రీని కుటం, సీఎఫ్ఓ డాన్ మెక్‌గ్యురే, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ పాల్ బోలాండ్తో పాటు దాదాపు 5 వేల మంది ఏడీపీ అసోసియేట్లు పాల్గొన్నారు.102 మంది అసోసియేట్లతో కార్యకలాపాలను ప్రారంభించి 25 ఏళ్లలో 12 వేల మందికి పెరగడం విశేషమని మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ వేములపల్లి అన్నారు. 25 శాతం సరీ్వస్ ఆర్గనైజేషన్, 34 శాతం సాంకేతిక బృందాలు ఉన్నాయని, ప్రపంచ మార్కెట్లో కంపెనీ శక్తివంతమైన పనితీరుకు ఇది నిదర్శనమన్నారు. నూతన ఆవిష్కరణలతో క్లైంట్ సేవలను అందించే కేంద్రంగా సంస్థను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తుందని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుజ్ఞాన్ వెంకటేష్ అన్నారు. ఏడీపీ ఇండియా సీఎస్ఆర్ ప్రోగ్రాం–తరంగ్, స్టూడియో, డ్యాన్సింగ్ స్టార్స్, ధోల్ అసోసియేట్ల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. -
ఎక్కుపెట్టిన బాణాలు.. ఈ'విల్' కారులు!
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో హైదరాబాద్‌కు ఒలింపియన్స్ సిటీగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి పీవీ సింధూ, సైనా నెహా్వల్, గుత్తా జ్వాల, నగరంతో అనుబంధమున్న గగన్ నారంగ్ వంటి వారు ఒలింపిక్స్ మెడల్స్ సాధించడమే కారణం. అంతేకాకుండా పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో ఒలింపియన్స్ సన్నద్ధమైంది కూడా ఇక్కడే. ఇలా నగరం నుంచి బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్, హాకీ, చెస్, రైఫిల్ షూటింగ్ వంటి పలు అంతర్జాతీయ క్రీడల్లో ప్రాతినిథ్యం వహించి నగర ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేశారు. ఇదే కోవలో ఆర్చరీ క్రీడ కూడా భవిష్యత్‌లో రాణించనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆర్చరీకి ప్రాధాన్యత చాలా పెరుగుతోంది. ఈ సారి ఒలింపిక్స్‌లో తెలుగు క్రీడా కారుడు ధీరజ్ 4వ స్థానంలో నిలిచిన సంగతి విధితమే. భారతీయ క్రీడా చరిత్రలో తమకంటూ ఒక పేజీ రాసుకోవాలనుకునే నగర క్రీడాకారులు విల్లంబులు చేతబట్టి ఒలింపిక్ వేటకు సిద్ధమవుతున్నారు.ఆర్చరీపై భాగ్యనగర వాసుల గురి..జాతీయ స్థాయి టాప్ 2లో నగర అమ్మాయిలు, టాప్ 8లో అబ్బాయిలు..ఏ క్రీడ ఆడాలన్నా, శిక్షణ పొందాలన్నా మరో క్రీడాకారుడు ఉండాల్సిందే. ఇలా కాకుండా ఇండివీడ్యువల్ గేమ్ (వ్యక్తిగత క్రీడ) విభాగంలో ఆర్చరీ ఒకటి. గత కొన్ని ఏళ్లుగా ఈ గ్లామర్ గేమ్‌పై నగర క్రీడా అభిలాషకులు ఫోకస్ పెట్టారు. నగరం నుంచి ఇప్పటికే పలు క్రీడల్లో చాలా మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడంతో తమను తాము నిరూపించుకోవడానికి ఆర్చరీని ఎంచుకుంటున్నారు. అంతేకాకుండా ఇతర క్రీడల్లో కొనసాగుతున్న పోటీని తప్పించుకోవడానికి కూడా ఆర్చరీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మధ్య కాలంలో నేషనల్స్‌లో నగర ఆర్చరీ క్రీడాకారులు రాణిస్తుండటం మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది. తెలంగాణలో ఆర్చరీ శిక్షణ అందించే ‘సాయ్’ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్, గచి్చబౌలి), హకీం పేట్ స్పోర్ట్స్ స్కూల్ రెండూ నగరానికి అనుబంధమున్నవే. వీటితో పాటు నగరంలో దాదాపు ఎనిమిది ప్రైవేటు శిక్షణా కేంద్రాలున్నాయి. ఈ అంశాల దృష్ట్యా ఇక్కడ ఆర్చరీ క్రీడాకారుల సంఖ్య పెరుగుతోంది. నేషనల్స్‌లో వెయ్యి మంది రాణింపు..జాతీయ స్థాయిలో టాప్ 2లో నా విద్యార్థులు ఉన్నారు. 2000 సంవత్సరంలో ఆర్చరీ ప్రారంభించిన నేను ఏడేళ్ల పాటు 23 విభాగాల్లో నేషనల్స్, ఆల్ ఇండియా యూనివర్సిటీ నేషనల్ ఛాంపియన్స్ ఆడాను. 7 నేషనల్స్‌లో పతకాలు సాధించాను. ఆల్ ఇండియా యూనివర్సిటీ ఛాంపియన్‌గా నిలిచాను. అనంతరం మేటి ఆర్చర్స్‌ను తయారు చేయడమే లక్ష్యంగా 2008 నుంచి శిక్షణ ప్రారంభించాను. ఇప్పటి వరకూ నా శిక్షణలో వెయ్యి మందికి పైగా నేషనల్స్ ఆడారు. కొందరు యూత్ ఒలింపిక్స్ ఇండియా క్యాంపుకు వెళ్లారు.దాదాపు 3 వేల మందికి పైగా శిక్షణ అందించాను. ఫ్రెండ్స్ అండ్ ఆర్చర్స్ ట్రైనింగ్ సెంటర్ పేరుతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఖైరతాబాద్, ప్రగతి నగర్, నార్సింగిలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి అథ్లెట్లను తయారు చేస్తున్నాను. 2028 ఒలింపిక్స్ పతకమే లక్ష్యంగా అద్భుతమైన నైపుణ్యాలున్న ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలను సన్నద్ధం చేస్తున్నాను. ఆర్చరీ శిక్షణతో పాటు వీరికి అవసరమైన ఫిట్నెస్, ఫిజియోథెరపీ, సైకాలజీ కౌన్సిలింగ్, స్పెషల్ ట్యూనింగ్ అందిస్తున్నాం. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆర్చరీకి మంచి భవిష్యత్ ఉంది. రీకర్వ్, కాంపౌండ్ విభాగాల్లో మన ఆర్చర్స్ అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రభుత్వం తరపున మంచి భద్రతా ప్రమాణాలతో మరిన్ని ఆర్చరీ గ్రౌండ్స్ నిర్మిస్తే వందల మంది ఆర్చర్స్కు అవకాశం ఉంటుంది. ఎక్విప్మెంట్ అందించగలిగితే ఆర్చరీ మరింత రాణిస్తుంది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాల్లో అద్భుతమైన కోచ్‌లు ఉన్నారు. నా అకాడమీ తరపున చాలా మంది పేద పిల్లలకు ఆర్చరీలో సహకారం అందిస్తున్నాను. వారిలో రాజ్‌భవన్ స్కూల్‌కు చెందిన వైభవ్ నేషనల్స్ మెడల్ సాధించాడు. మరో అమ్మాయి లలితా రాణి నేషనల్స్ ఆడి సత్తా చాటింది. – రాజు, ఆర్చరీ నేషనల్స్ ఛాంపియన్, ప్రముఖ కోచ్, ఫ్రెండ్స్ అండ్ ఆర్చెర్స్ ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్.నగర వేదికగా..నగరం వేదికగా దాదాపు 150 మంది ఆర్చరీ అథ్లెట్స్ ఉన్నారని అంచనా. జాతీయ స్థాయిలో హైదరాబాద్ టీం రెండో స్థానంలో ఉన్నట్లు క్రీడా నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జాతీయ స్థాయి సీనియర్స్, జూనియర్స్ విభాగంలో నగరానికి చెందిన అమ్మాయిలు ఇద్దరూ సిల్వర్ మెడల్స్ సాధించగా, అబ్బాయిలు ఎనిమిదో స్థానంలో నిలిచారని పేర్కొన్నారు.ఆరు కేటగిరీల్లో..ఆర్చరీకి సంబంధించి నేషనల్స్‌లో అండర్ 10, 13, 15, 17, 19, అబౌ 19 విభాగాలు ఉంటాయి. ఒలింపిక్స్‌కు అయితే ఎలాంటి ప్రమాణాలూ ఉండవు. ఎవరైనా పోటీ పడొచ్చు. ఆరు కేటగిరీల్లో ఈ ఎంపిక కొనసాగుతోంది. మెదటి దశ ఓపెన్ కేటగిరీలో దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడొచ్చు. ఇందులోంచి టాప్ 32, టాప్ 16, టాప్ 8, టాప్ 6 ఇలా ఎంపిక చేసి చివరగా ముగ్గురిని ఒలింపిక్స్‌కు పంపిస్తారు.2028 ఒలింపిక్స్ లక్ష్యంగా.. 12 ఏళ్ల వయస్సు నుంచి ఆర్చరీలో రాణిస్తున్నాను. ఇప్పటి వరకూ ఎనిమిది నేషనల్స్ ఆడాను. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన నేషనల్స్‌లో ఒక గోల్డ్, మరో సిల్వర్ మెడల్ సాధించాను. 2028 ఒలింపిక్స్‌లో ఆడి పతకం సాధించడమే లక్ష్యంగా శిక్షణ కొనసాగిస్తున్నాను. ప్రస్తుతం మోయినాబాద్ కాలేజ్‌లో పీజీ చదువుతున్నాను. – హర్షవర్ధన్నాలుగు నేషనల్స్ ఆడాను..కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాను. ఇప్పటి వరకూ గుజరాత్, ఉత్తరాఖండ్, తమిళనాడు వంటి ప్రాంతాల్లో నాలుగు నేషనల్స్ ఆడాను. అసోసియేషన్ నేషనల్స్, ఫుల్ నేషనల్స్‌లో పోటీ పడ్డాను. భారతీయ ఆర్చర్‌గా ఒలింపిక్స్‌లో సత్తా చాటి దేశ ఖ్యాతిని మరింత పెంచడమే లక్ష్యం. – లలితా రాణి -
గ్రీన్, క్లీన్, సేఫ్ మధ్యప్రదేశ్..
సాక్షి, సిటీబ్యూరో: ప్రఖ్యాతిగాంచిన జ్యోతిర్లింగాలలో ఒక్కటైన ఉజ్జయిని మహకాళి దేవాలయాన్ని ఏటా లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. అదే సమయంలో దేవి లోక్ శక్తిపీఠం, ఓంకారేశ్వరలోని 108 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం, ఇతర దేవాలయాలు మధ్యప్రదేశ్‌లో ఆధ్యాతి్మక పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.ప్రాణ్‌పూర్ చందేరి సమీపంలో భారతదేశపు మొదటి క్రాఫ్ట్ హ్యాండ్లూమ్ గ్రామం, చందేరి ఫెస్టివల్, కునో ఫారెస్ట్ ఫెస్టివల్, గాం«దీసాగర్ ఫారెస్ట్ రిట్రీట్, జల్ మహోత్సవ్ వంటి పండగలు, అక్కడి సంస్కృతి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 785 పులులతో ‘టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా’ టైటిల్‌ను సొంతం చేసుకున్న వన్యప్రాణి అటవీ ప్రాంతం, 14 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లతో సహా హెరిటేజ్ టూరిజం స్పాట్లు మహారాష్త్ర సొంతం. ఎనిమిది నగరాలను కలుపుతూ భారతదేశంలోనే మొదటి ఇంట్రా స్టేట్ ఎయిర్ ట్యాక్సీ సేవలు ఇక్కడే ప్రారంభమయ్యాయి. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న మధ్యప్రదేశ్‌లో పర్యాటక రంగం ఇటీవలి కాలంలో గణనీయంగా వృద్ధి చెందుతోంది.పెరిగిన పర్యాటకులు..అధికారిక లెక్కల ప్రకారం 2022లో పర్యాటకుల సంఖ్య 34.1 మిలియన్లుగా ఉండగా.. 2023లో ఆ సంఖ్య 112.1 మిలియన్లకు చేరింది. గణనీయమైన పెరుగులతో మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు వివిధ రాష్ట్రాల్లో రోడ్‌షోలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గురువారం ‘గ్రీన్, క్లీన్, సేఫ్ మధ్యప్రదేశ్’ అనే థీమ్‌తో మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ స్థానిక ఓ స్టార్ హోటల్లో రోడ్ షో నిర్వహించింది. ట్రావెల్ ఏజన్సీలు, టూర్ ఆపరేటర్లకు ప్రత్యేక అవగాహన కల్పించారు.సాంస్కృతిక కళలు.. ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్, లోక్రంగ్, తాన్సేన్ సమారో (2025లో 100వ ఎడిషన్), అల్లావుద్దీన్ ఖాన్ సంగీత్ సమారో, అఖిల భారతీయ కాళిదాస్ సమారోహ్ తో సహా ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలను అందిస్తోంది. ‘హార్ట్ ఆఫ్ ఇన్క్రెడిబుల్ ఇండియాను సందర్శించడానికి ఔత్సాహికులను ఆహా్వనిస్తున్నారు. సత్సంబంధాల కోసం..హైదరాబాద్‌లో రోడ్ షో విజయవంతమైంది. పలు సంస్థలతో మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ చేసుకున్న అవగాహన ఒప్పందాలు పర్యాటకాభివృద్ధికి ఉపయోగపడతాయని నమ్ముతున్నాం. తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య బలమైన బంధాలు ఏర్పాటు చేస్తుంది. ట్రావెల్ ఏజన్సీలు, టూర్ ఆపరేటర్లు ఈ వర్క్ షాప్‌లో తమ అనుభవాలను పంచుకోవడం సంతోషంగా ఉంది. పర్యాటకంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్నవారిని రాయితీలతో ఆహ్వానిస్తున్నాం. – బిదిషా ముఖర్జీ, అదనపు మేనేజింగ్ డైరెక్టర్ -
ఓటీటీపై.. ఓ లుక్కు!
సాక్షి, సిటీబ్యూరో: చేతిలో రిమోట్ పట్టుకుంటే చాలు కళ్ల ముందు చిత్రాల వెల్లువ, సిరీస్‌ల సముద్రం.. షోల ఫ్లో.. మరి ఎంచుకోవడం ఎలా? ఎవరిని అడగాలి ఏవి చూడాలి? మన సబ్‌స్క్రిప్షన్‌కి ఎలా న్యాయం చేయాలి? ఇవి నగరవాసులకు రోజువారీ సందేహాలుగా మారాయి. సమాధానాల కోసం విభిన్న మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ఓటీటీ వీక్షణలో తమదైన శైలిని ఏర్పరచుకుంటున్నారు. వేల సంఖ్యలో ఉన్న సినిమాల్లో కొన్ని మాత్రమే ఆసక్తికరమైన వాటిని ఎంచుకుని, చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.ఓటీటీ వేదికలంటే.. ఇంటి పట్టునే ఉండి కొత్త కొత్త సినిమాలను ఆస్వాదించడంతో పాటుగానే ఇప్పటి జీవన శైలిలో ఇదో నిత్యకృత్యంగా మారింది. నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్, ఆహా, సోనీ లివ్, హాట్ స్టార్, జీ స్టూడియోస్ ఇలా లెక్కకు మించి ఆదరణ పొందుతున్న ఓటీటీ వేదికల్లో సినిమా చూసే ముందు, ఆ సినిమా విశేషాలను సంక్షిప్తంగా తెలియజేసే షార్ట్ స్టోరీ (సినాప్సిస్) ఉంటుంది. సాధారణంగా ప్రేక్షకులు ఈ సమాచారంతోనే సినిమా చూడాలా వద్దా అనే నిర్ణయానికి వస్తున్నారు. ప్రస్తుతం అన్ని భాషల్లోని సినిమాలు ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేస్తున్నారు. లేదా ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో విడుదల చేస్తున్నారు. ఈ కారణంతో ఏ భాష వారైనా సరే.. అన్ని భాషల్లోని ఉత్తమ సినిమాలను చూడగలుగుతున్నారు. ఇందులో ఈ షార్ట్‌స్టోరీ డి్రస్కిప్షన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ఎంటర్టైన్మెంట్ షోలకు కూడా మంచి క్రేజ్ ఉంది. తెలుగు ఓటీటీ ఛానల్ ‘ఆహా’ వేదికగా ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడెల్ వంటి షోలకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు.ఐఎండీబీ రేటింగ్..విడుదలైన మూవీ ఎలా ఉందని తెలిపే సినిమాల రివ్యూలాగే ఓటీటీ సినిమాలకు కూడా ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) రేటింగ్ ఉంది. ఇది సినిమాలు, టెలివిజన్ సిరీస్, ట్రెండింగ్ కంటెంట్ తదితరాలకు ఆన్లైన్ రేటింగ్‌ను అందిస్తుంది. ఈ రేటింగ్‌లో భాగంగా పదికి 9 శాతం కన్నా ఎక్కువ ఉన్న వాటిని ఎక్కువగా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. 5 శాతం కన్నా తక్కువ రేటింగ్ ఉంటే మాత్రం ఆ వైపు వెళ్లట్లేదు. 7, 8 శాతం రేటింగ్ ఉంటే చూడాల్సిన సినిమాగానే ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం ట్రెండింగ్‌గా మారిన కొన్ని సినిమాలను చూడటం కోసమే ఆ ఓటీటీ ఛానల్ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటున్న వారూ ఉన్నారు. ఒక్కో సినిమాకు వంద మిలియన్ల సీయింగ్ మినిట్స్ రావడం విశేషం. సోషల్ మీడియా ప్రమోషన్..ఓటీటీ సినిమాలకు సంబంధించి సోషల్ మీడియా ప్రచారం జోరుగా సాగుతోంది. ఓటీటీ సబ్‌స్రై్కబర్లకు అదే వేదిక ద్వారానే ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల ప్రమోషన్ జరుగుతుంది. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికల్లోనూ మీమ్స్, రీల్స్, ఆసక్తికర క్రియేటివ్స్తో ప్రచారం చేస్తున్నారు. బాగా క్లిక్ అయిన డైలాగ్, సాంగ్ తదితరాలతో ఈ ప్రచారం ఊపందుకుంటోంది. ఈ మధ్య కాలంలో గామీ, కమిటీ కుర్రాళ్లు, నిందా, ధూమం, శాకాహారి, గరుడన్, మ్యూజిక్ షాప్ మూర్తి, గోట్ లైఫ్, అహం రీబూట్, ఖాదర్ ఐజాక్ వంటి సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి.ఓటీటీలో హిట్.. థియేటర్లో ఫట్..ఎన్నో అంచనాలతో విడుదలైన కొన్ని సినిమాలు థియేటర్లో ప్రేక్షకాదరణ పొందలేక డిజాస్టర్లుగా నిలిచిపోతాయి. ఇది సినిమా రంగంలో సర్వసాధారణం. అయితే థియేటర్లో అంతంత మాత్రమే ఆడిన సినిమాలు ఓటీటీల్లో మాత్రం సూపర్ డూపర్ హిట్లుగా ఆదరణ పొందుతున్నాయి. అదేవిధంగా థియేటర్లో హిట్ టాక్ పొంది, అదే అంచనాలతో భారీ ధరకు కొనుగోలు చేసి ఓటీటీ వేదికల్లో విడుదల చేయగా.. ఆ అంచనాలకు చేరకపోగా, కనీసం ప్రేక్షకాదరణ పొందని సినిమాలు సైతం ఎన్నో ఉన్నాయి. థియేటర్ కల్చర్‌లో స్టార్ హీరోలు, మంచి క్యాస్టింగ్ ఉన్న సినిమాలనే ఎక్కువ ఇష్టపడే వారు జనాలు. కానీ ప్రస్తుతం ఆసక్తికర కథ, కథనం, మేకింగ్ ఉంటే చాలు. అది ఎవరి సినిమా ఐనా, చిన్న సినిమా ఐనా సరే.. విపరీతంగా చూస్తున్నారు. -
Tamannaah Bhatia: ఇప్పుడే ఏమీ చెప్పలేను..
సాక్షి, సిటీబ్యూరో: మిల్కీ బ్యూటీ, ప్రముఖ సినీతార తమన్నా భాటియా మంగళవారం నగరంలో తళుక్కున మెరిశారు. నగరంలో ఓ ప్రయివేటు కార్యక్రమానికి హాజరై తమన్నా ఈ సందర్భంగా మాట్లాడారు.. చాలా రోజుల తరువాత హైదరాబాద్ వచ్చాను, చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. మరి కొద్ది రోజుల్లో ఓదెల –2 సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నానని, ఆ సినిమాకు సంబంధించిన పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఇక సినిమాకు సంబంధించి చిన్న పార్ట్ మాత్రమే పెండింగ్ ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఎప్పటి నుంచో తన పెళ్లి విషయమై ఊరిస్తున్న తమన్నా, ఈ సారి కూడా పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు.., ‘పెళ్లి ఎప్పుడు అనేది ఇప్పుడే ఏం చెప్పలేనని’ దాటవేశారు. అయితే ఈ సందర్భంగా తమన్నా ప్రత్యేకంగా డిజైనింగ్ చేయించుకుని ధరించిన నీలి రంగు డ్రెస్ విశేషంగా ఆకట్టుకుంది. -
లెట్.. సెట్.. గో.. నయాట్రెండ్గా ఆకట్టుకుంటున్న ‘కిట్టీ కల్చర్’!
సాక్షి, సిటీబ్యూరో: కిట్టీపార్టీ.. ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. మహిళలే కాదు. మగవాళ్లు కూడా తాము సైతం అంటూ నెలకోసారి కిట్టీ పార్టీలకు జై కొడుతున్నారు. పది, పదిహేనుమంది ఒక చోట చేరి సరదాగా గడిపేస్తున్నారు. అంతేకాదు.. ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేస్తూ ఆర్థిక అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఆపదలో ఉన్నవాళ్లను ఆదుకుంటున్నారు. నెల నెలా పొదుపు చేసిన డబ్బుతో విహార యాత్రలకు వెళ్తున్నారు. నగరంలో ఈ తరహా కిట్టీ పార్టీలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకే విధమైన ఆలోచన కలిగిన వారి మధ్య స్నేహసంబంధాలను బలోపేతం చేస్తున్నాయి. అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండే మహిళలు నెలకోసారి ఒక చోట చేరి ఈ వేడుకలను ఏర్పాటు చేసుకోవడం అందరికీ తెలిసిందే. కానీ లేడీస్ స్పెషల్ కిట్టీ పార్టీల తరహాలోనే ‘జెంట్స్ స్పెషల్’ కిట్టీ పార్టీలు కూడా నగర సంస్కృతిలో ఒక భాగంగా కనిపిస్తున్నాయి.ఉరుకుల పరుగుల జీవితం. ఒకే కాలనీలో ఉన్నా, ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నా సరే ఒకరికొకరు అపరిచితులే. కనీస పలకరింపులు ఉండవు. చుట్టూ మనుషులే ఉన్నా ఆకస్మాత్తుగా ఏదో ఒక ఆపద ముంచుకొస్తే ఆదుకొనే వారెవరూ అంటే చెప్పడం కష్టమే. అలాంటి సాధారణ, మధ్యతరగతి జీవితాల్లో కిట్టీ పార్టీలు సరికొత్త సంబంధాలను, అనుబంధాలను ఏర్పాటు చేస్తున్నాయి. అదీ ఓ ఐదారు గంటల పాటు సరదాగా గడిపే సమయం. ఆట పాటలు, ఉరకలెత్తే ఉత్సాహాలు, సరదా కబుర్లు.. దైనందిన జీవితంలోని ఒత్తిళ్లను అధిగమించేందుకు అద్భుతమైన టానిక్‌లా పనిచేసే ఔషధం కిట్టీ పార్టీ. ఉప్పల్‌కు చెందిన కొందరు వాకింగ్ ఫ్రెండ్స్ కిట్టీ పార్టీకి శ్రీకారం చుట్టారు. వారిలో కొందరు ఉద్యోగులు, మరి కొందరు వ్యాపారులు. ప్రతి నెలా ఒక చోట సమావేశమవుతారు.ఒకరికొకరు అండగా..ఒక్కొక్కరూ నెలకు రూ.5000 చొప్పున 15 మంది కలిసి రూ.75000 పొదుపు చేస్తున్నారు. అందులో రూ.60 వేల వరకూ ఆ నెల అవసరమైన వారికి ఇచ్చేస్తారు. మిగతా రూ.15000 లతో సరదాగా గడిపేస్తారు. నెలకోసారి కిట్టీ పార్టీని నిర్వహించేందుకు ఆ గ్రూపులో ఒకరిని ఆతిథ్యం ఇచ్చే హోస్ట్‌గా ఎంపిక చేసుకుంటారు. ‘రోజంతా సరదాగా గడిపేస్తాం. అంతా చుట్టుపక్కల కాలనీల్లో ఉండేవాళ్లమే. కానీ కనీసం పరిచయాలు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు మేమంతా మంచి స్నేహితులుగా ఉన్నాం. ఎవరికి ఎలాంటి ఆపద వచి్చనా ఆదుకునేందుకు మా టీమ్ రెడీగా ఉంటుంది.’ అని చెప్పారు టీమ్‌కు సారథ్యం వహించే రవి.నగర శివారుకు..అపార్ట్మెంట్లలో మహిళల బృందంలోని ఒకరి ఇంట్లో కానీ లేదా కమ్యూనిటీ హాల్లో కానీ నిర్వహిస్తారు. కానీ జెంట్స్ పార్టీల్లో ఔటింగ్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తోంది. సిటీకి దూరంగా వెళ్లి ఒక రోజంతా గడిపేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.విహారయాత్రలు కూడా..కిట్టీ పార్టీల మరో ప్రత్యేకత ఏడాదికి ఒకసారి దేశ, విదేశాల్లోని పర్యాటక ప్రాంతాల్లో విహరించడం, ప్రతి నెలా పొదుపు చేసే డబ్బులతో గోవా, కేరళ, కాశ్మీర్, జైపూర్ వంటి ప్రాంతాల్లో పర్యటనలకు వెళ్తారు. అలాగే దుబాయ్, సింగపూర్, మలేసియా, బ్యాంకాక్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు సైతం కిట్టీ పార్టీలు పరుగులు తీస్తున్నాయి. ఏటా ఓ పది రోజులు టూర్‌కు వెళ్లి రావడం కూడా ఈ పార్టీల కల్చర్‌లో భాగంగా కొనసాగుతోంది.ఇదీ ‘కిట్టీ’ చరిత్ర..దేశవిభజన అనంతరం 1950లో ఈ వినూత్నమైన కిట్టీపార్టీ సంస్కృతి ప్రారంభమైంది. ఒకే ప్రాంతంలో నివసించే మహిళల మధ్య స్నేహ సంబంధాలను ఏర్పాటు చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా మొదలయ్యాయి. దేశవిభజన ఫలితంగా ఆర్థికంగా తీవ్ర కష్టాలకు గురైన కుటుంబాలను ఆదుకునేందుకు పది మంది మహిళలు కలిసి రావడం ఒక ఉన్నతమైన సంప్రదాయంగా నిలిచింది. పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో మొదలైన ఈ సంస్కృతి 1980 తరువాత క్రమంగా అంతటా విస్తరించింది. -
కిరాక్ క్లైంబింగ్.. గోడల నుంచీ కొండగుట్టల దాకా ఎక్కేసెయ్..!
సాక్షి, సిటీబ్యూరో: చెట్టులెక్కగలరా ఓ నరహరి పుట్టలెక్కగలరా.. చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురు కోయగలరా.. ఓ నరహరి చిగురు కోయగలరా.. చెట్టులెక్కగలమే ఓ చెంచిత పుట్టలెక్కగలమే.. చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురు కోయగలమే. ఓ చెంచిత బ్రమలు తీయగలమే.. అని అలనాటి చిత్ర కథానాయకుడు ఏఎన్ఆర్ పాడిన పాట ఎంతో పాపులర్.. ఆ మాదిరిగానే.. నేడు నగరంలో చెట్లు పుట్టలు ఎక్కడం సర్వసాధారణ ట్రెండ్‌గా మారుతోంది.. అయితే గుట్టలు, పుట్టలు, చెట్లు ఎక్కడం పల్లెల్లో సర్వసాధారణం..కానీ నగరంలో నాల్గు మెట్లు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడడం ఇక్కడి ప్రజల నైజం. అయితే కొందరు నగరవాసులు మాత్రం గోడలు, గుట్టలు కూడా చకచకా ఎక్కేస్తున్నారు. ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే సరదా క్రీడగా క్లైంబింగ్ హాబీ దినదిన ప్రవర్ధమానమవుతోంది.సూచనలు..– క్లైంబింగ్ చేయడానికి తగినంత శారీరక సామర్థ్యం ఉండాలి.– స్పోర్ట్స్ డ్రెస్సింగ్ కావాలి. అలాగే ప్రత్యేకమైన షూస్ తప్పనిసరి.– ఇందులో ఒకరికొకరు మంచి సపోరి్టంగ్గా ఉండాలి. ఎక్కే సమయంలో పడిపోవడం వంటివి ఉంటాయి.– అలాంటి సందర్భాల్లో ఒకరికొకరు సాయం చేసుకోవాలి.– అవుట్‌డోర్‌లో ప్రాథమిక దశలో చేసినప్పటికీ... రెగ్యులర్ క్లైంబర్‌గా మారాలంటే ఇన్డోర్ ట్రైనింగ్ తీసుకోవడం అవసరం.క్లైంబింగ్ అనేది ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రాచుర్యంలో ఉన్న క్రీడ. అయితే ఇటీవలి కాలంలో నగరంలో దీన్ని ఒక మంచి ఎనర్జిటిక్ ఎంజాయ్‌మెంట్‌గా గుర్తిస్తున్నారు. ఇలా ఫన్గానూ ఫిట్నెస్ సాధనంగా క్లైంబింగ్‌ను అనుసరించేవారి కోసం పలు చోట్ల వాల్స్ అందుబాటులోకి వచ్చాయి. షాపింగ్ మాల్స్, అడ్వెంచర్ జోన్స్‌లో అన్నింటితో పాటు క్లైంబింగ్ ప్రదేశాలు కూడా ఉండగా, కేవలం క్లైంబింగ్ కోసమే కొన్ని ప్రత్యేకమైన సెంటర్లు, హాబీగా చేసే క్లబ్స్ కూడా వచ్చేశాయి. ఈ అభిరుచి వాల్స్ నుంచి రాక్స్ దాకా విస్తరించి సిటీయూత్‌కి చక్కని వ్యాపకంగా మారిపోయింది.క్లైంబింగ్ కథా కమామీషు ఇలా.. క్లైంబింగ్ వాల్ ఎత్తు 15 అడుగులు అంతకన్నా లోపుంటే బౌల్డరింగ్ సెగ్మెంట్ అంటారు. ఈ సెగ్మెంట్లో పాల్గొనేవాళ్ల కోసం కిందపడినా గాయాలు కాకుండా ఫ్లోర్ మీద పరుపులు వేసి ఉంచుతారు. ఇక లీడ్ క్లైంబింగ్లో గోడ 30–40 అడుగుల ఎత్తుపైన ఉంటుంది. సరిపడా ఆత్మవిశ్వాసం ఉండి, భయం లేకుండా ఉంటేనే లీడ్ క్లైంబింగ్ చేయగలరు. దీనిలో గోడకు హ్యాంగర్స్ ఉంటాయి. దీనికి తగినంత శారీరక సామర్థ్యం ఉండాలి. ఈ రెండూ కాకుండా వేగం ప్రధానంగా సాగే ఈ స్పీడ్ క్లైంబింగ్ చాలా వరకూ ప్రొఫెషనల్స్ మాత్రమే ఎంచుకుంటారు. దీనిలో క్రీడాకారుడు రోప్ కట్టుకుని వాల్ మీద ఎక్కుతాడు. ఎంత స్పీడ్ ఉంటుందంటే చూడడానికి నేల మీద పరుగులు తీసినట్టు ఉంటుంది.పర్సనల్‌గా.. ఇంట్లోనే..వీటిని ఇంట్లో కూడా వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆరి్టఫీషియల్ వాల్ని ఫైబర్‌తో చేసి సపోర్ట్ స్ట్రక్చర్ సాలిడ్ వుడ్, లేదా స్టీల్ ఉంటుంది. అయితే వుడ్ ఖరీదు ఎక్కువ కాబట్టి.. స్టీల్ బెటర్. క్లైంబింగ్ సర్ఫేస్‌గా ప్లైవుడ్ లేదా ఫైబర్ గ్లాస్ గాని వాడి చేసే 8 విడ్త్ 12 ఫీట్ హైట్ వాల్కి రూ.లక్ష ఖర్చులోనే అయిపోతుంది. అదే 24 ఫీట్ వాల్కి అయితే రూ.4 లక్షలు వరకూ అవుతుంది.ఎక్కేయాలంటే.. లుక్కేయాలి..నగరం ఒకప్పుడు రాక్స్‌కి నిలయం.. అద్భుతమైన రాళ్ల గుట్టలు, కొండ గుట్టలు మన ప్రాంతానికి ప్రత్యేకంగా ఉండేవి. అభివృద్ధి బారిన పడి చాలా వరకూ కనుమరుగయ్యాయి. నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఖాజాగూడ, మహేంద్రా హిల్స్, ఘర్ ఎ మొబారక్, అడ్డకల్, మర్రిగూడెం, పాండవుల గుట్ట, భువనగిరి లతో పాటు కర్నూలు దాకా వెళ్లి ఓర్వకల్ రాక్ గార్డెన్స్‌లో సైతం క్లైంబింగ్ చేస్తున్నారు. ఫన్ ప్లస్ ఫిట్నెస్..లీడ్, స్పీడ్ క్లైంబింగ్‌లు ఈ క్రీడను సీరియస్ హాబీగా తీసుకున్నవారికి మాత్రమే కావడంతో బౌల్డరింగ్ ఒక ఫన్ యాక్టివిటీగా, ఫిజికల్ ఫిట్‌నెస్‌కు ఉపకరించేదిగా ఇప్పుడు ఆకర్షిస్తోంది. దీంతో జిమ్స్‌లోనూ ఈ బౌల్డరింగ్ వాల్స్ కొలువుదీరుతున్నాయి. గంట పాటు బౌల్డరింగ్ చేస్తే 900 కేలరీలు బర్న్ అవుతాయని, ఒక గంటలో చేసే పరుగు అరగంట పాటు చేసే క్లైంబింగ్‌తో సమానమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక శరీరంలో టాప్ టూ బాటమ్ అన్ని అవయవాలనూ ఇది బలోపేతం చేస్తుందని అంటున్నారు. వయసుకు అతీతంగా దీన్ని సాధన చేయవచ్చు. హై ఎనర్జీ, హైపర్ యాక్టివిటీ ఉన్న చిన్నారులకు ఇప్పుడు వాల్ క్లైంబింగ్ బాగా నప్పే హాబీగా నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా నలుగురితో కలిసి చేసే గ్రూప్ యాక్టివిటీ కాబట్టి అలసట ఎక్కువగా రాదు. శరీరానికి బ్యాలెన్సింగ్ సామర్థ్యం పెరుగుతుంది. కోర్ మజిల్స్ శక్తివంతంగా మారతాయి. చేతులు, కాళ్ల మజిల్స్ టోనప్ అవుతాయి.కొండకు తాడేసి..వీకెండ్ క్లైంబింగ్ ఈవెంట్స్ జరగడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. నగరంలో హైదరాబాద్ క్లైంబర్స్ పేరుతో ఒక క్లబ్ కూడా ఏర్పాటైంది. ఈ క్లబ్ సభ్యులు ప్రతి వారం ఒక రాక్ ఏరియాను ఎంచుకుని క్లైంబింగ్‌కి సై అంటున్నారు. అయితే ఇక్కడ కూడా నిపుణుల ఆధ్వర్యంలోనే రోప్‌ల బిగింపు తదితర ఏర్పాటు జరగాల్సి ఉంటుంది. చాలా మంది అవుట్డోర్ క్లైంబింగ్ తర్వాత అది సీరియస్ హాబీగా మారిన తర్వాత ఇన్డోర్ క్లైంబింగ్‌కు మళ్లుతున్నారు. అక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. మంచి వ్యాయామంగా..25 నుంచి 40 మధ్య వయస్కులు వస్తున్నారు. ఫిట్‌నెస్‌లో వెరైటీని కోరుకునేవారూ దీన్ని ఎంచుకుంటున్నారు మా దగ్గర 40 వరకూ రూట్స్ ఉన్నాయి. వీటిలో తేలికగా చేసేవి కష్టంగా చేసేవి.. ఇలా ఉంటాయి. చాలా మంది హాబీగా చేస్తుంటే ప్రొఫెషన్‌గా ఎంచుకుంటున్నవారూ పెరుగుతున్నారు. వారానికో రోజు అవుట్‌డోర్‌లో న్యాచురల్ రాక్స్ దగ్గర చేయిస్తున్నాం. – రంగారావు, క్లైంబింగ్ శిక్షకులుఈవెంట్స్ నిర్వహిస్తున్నా..కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ హాబీగా క్లైంబింగ్ ప్రారంభించి ఇప్పుడు దీంతో కనెక్ట్ అయ్యాను. వారాంతాల్లో క్లైంబింగ్ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తున్నా. సాహసక్రీడలపైన ఆసక్తి ఉంటేనే దీన్ని ఎంచుకోవాలి. – చాణక్య నాని, క్లైంబర్‘గ్రీస్’లో రాక్ క్లైంబింగ్‌కు వెళ్తున్నాం..గ్రేట్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ ద్వారా 12 సంవత్సరాల క్రితం క్లైంబింగ్ పరిచయమైంది..ఆ తర్వాత రాక్ క్లైంబింగ్ ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా హైదరాబాద్ క్లైంబర్స్‌ను ఏర్పాటు చేసుకున్నాం. ప్రస్తుతం ఇన్‌స్టాలో మా గ్రూప్‌కి 2500 మంది సభ్యులున్నారు. వీరిలో కనీసం 200 మంది గ్రూప్ యాక్టివిటీలో పాల్గొంటుంటారు. వరంగల్‌లో ఉన్న పాండవుల గుట్ట నగరానికి 2 గంటల ప్రయాణ దూరంలోని అడక్కల్ వంటి ప్రదేశాల్లోనే కాక రాష్ట్రం దాటి మనాలి, కర్ణాటకలోని హంపి, బాదామి వంటి ప్రాంతాలతో పాటుగా ఇతర దేశాలైన వియత్నాం, ఇండోనేషియాలో కూడా క్లైంబింగ్ ఈవెంట్స్ చేశాం. త్వరలోనే మన దేశం నుంచి గతంలో ఎవరూ వెళ్లని స్థాయిలో అతిపెద్ద గ్రూప్‌గా గ్రీస్‌కి ఈ డిసెంబర్లో క్లైంబింగ్ యాక్టివిటీ చేపట్టనున్నాం. – రేణుక, హైదరాబాద్ క్లైంబర్స్ -
Dr Vikram Raju: సనాతనమే.. సమాధానం!
సాక్షి, సిటీబ్యూరో: నిద్రలేమి నుంచి నిలకడ లేమి దాకా ఆధునిక సమస్యలన్నింటికీ సనాతనం సమాధానం చెప్పింది అంటున్నారు నగరానికి చెందిన ఇండియన్ వేదిక్ స్కూల్ ఫౌండేషన్ డైరెక్టర్ డా. విక్రమ్‌రాజు.. కఠినమైన గణితం నుంచీ సంక్లిష్ట మానవ సంబంధాల దాకా విడమరిచి చెప్పాయనే పురాణాలను, శాస్త్రాలను స్తుతిస్తారు. ఆధునికులకు వాటిని అందించడం అంటే సమస్యల నుంచి విముక్తి కల్పించడమే అంటున్నారు. ఈ ఆలోచనలకు అనుగుణంగా తాను 2017లో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏళ్ల తరబడి కృషి చేసి సులభంగా అర్థమయ్యే రీతిలో వందలాది పుస్తకాలను, మెటీరియల్‌ను రూపొందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూపొందిన ఈ పుస్తకాలు వచ్చే నెల్లో పాఠశాలలకు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన ఆలోచనలను పంచుకున్నారిలా...దశావతారాన్ని మించిన మానవ పరిణామక్రమ సిద్ధాంతం లేదు. దీని ఆధారంగా మానవ పరిణామ క్రమానికి సంబంధించి 50 థియరీల పుస్తకంతో సహా విభిన్న కేటగిరీల్లో 150 బుక్స్ రూపొందించాం. ఆన్లైన్లో ఇండియన్ వేదిక్ స్కూల్ డాట్ కామ్‌లో 25 రకాల ప్రీ రికార్డెడ్ కోర్సులు తెలుగులో ఉండగా, కొన్ని ఇంగ్లిష్‌లో ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా చదువుకోవచ్చు.‘చిరు’నవ్వుల యోగం..ఆరేళ్ల చిన్నారికి ఎలాంటి యోగా నేర్పాలి? ఎవరికీ తెలియని పరిస్థితిలో 1 నుంచి 10వ తరగతి దాకా ఉపయోగపడేలా యోగా, చక్రాస్, ముద్రాస్, ధ్యాన విశేషాలతో బుక్స్ తయారు చేశాం.వేదం.. నిత్యజీవన నాదం..వేదాలు, పురాణాలను సరిగా అర్థం చేసుకుంటే నిత్య జీవితంలో ఎన్నో చిక్కుముళ్లు విడిపోతాయి. అయితే నేటి చిన్నారులకు ఇవేవీ అందుబాటులో లేవు. అందుకే రుగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం, యజుర్వేదం వంటివన్నీ అర్థమయ్యే రీతిలో అందిస్తున్నాం.మన గణితం.. ఘన చరితం..ప్రస్తుత ఇంగ్లిష్, మ్యాథ్స్ రైట్ నుంచి లెఫ్ట్‌కి వెళితే.. వేదిక్ మ్యాథ్స్‌లో లెఫ్ట్ నుంచి రైట్కి చేస్తాం. ఒక నిమిషం çపట్టే గణిత సమస్యను, వేదిక్ మ్యాథ్స్ వల్ల ఒక సెకనులోనే చేసేయవచ్చు. అందుకే క్లాస్–1 నుంచి క్లాస్–8 వరకూ ఈ కోర్సు మెటీరియల్ తయారు చేయించాం.పురాణం.. ఆభరణం.. మొత్తం 18 పురాణాలు క్లుప్తీకరించి ఒక్కొక్కటి 100 పేజీల చొప్పున చేయించాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మహాభారతం కథ దశరథుడితో ప్రారంభమైతే, మేం అంతకన్నా ముందున్న బ్రహ్మ నుంచి స్టార్ట్ చేశాం. అలాగే రాముడు 81వ రాజు ఆయన కన్నా ముందున్న గొప్ప రాజుల గురించి కూడా ఇచ్చాం. మహాభారతంలో కౌరవ పాండవుల భాగం కన్నా ముందున్న కథని కూడా కలిపి అందిస్తున్నాంమెటీ‘రియల్’ వర్క్ మొదలైంది..పలు ప్రైవేటు పాఠశాలలతో ఒప్పందం చేసుకున్నాం. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలలకూ ఈ మెటీరియల్ అందుబాటులోకి తేవాలని ప్రయతి్నస్తున్నాం. ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి తెచ్చాం. ఇవి చదివిన వారికి పరీక్ష నిర్వహించి పొట్టి శ్రీరాములు వర్సిటీ వారి సర్టిఫికెట్ అందిస్తున్నాం. చిన్నారులకు యోగా నేర్పేందుకు సెట్విన్‌తో కూడా ఒప్పందం చేసుకున్నాం.సహకరిస్తే.. సాధిస్తాం.. ప్రభుత్వం స్పందించి సహకారం అందిస్తే దేశంలోనే ఎక్కడా లేని స్థాయిలో భారీగా వేదిక్ స్కూల్ క్యాంపస్ పెడదాం అనుకుంటున్నాం. సీబీఎస్ఈ సిలబస్‌తో పాటు ప్రతి రోజూ 1వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకూ యోగా, వేదిక్ మ్యాథ్స్, వేదిక్ సైన్సెస్.. భారతీయ సంప్రదాయ నృత్యాలు, క్రీడలు, వేదాలు ఒకే క్యాంపస్‌లో నేర్చుకుంటే భావితరం దృక్పథం చాలావరకూ మారిపోతుంది. కనీసం 100 మంది నిరుపేద చిన్నారులకు ఉచిత ఆశ్రయమిచ్చి ఆ తర్వాత వారినే అక్కడ టీచర్లుగా తయారు చేయాలి.. ఇలాంటి ఆలోచనలతో మా ఫౌండేషన్ పనిచేస్తోంది.బొమ్మరిల్లు.. కొత్తగా..మన చిన్నప్పుడు బొమ్మరిల్లు ఎంతగా ఆదరణ పొందిందో తెలిసిందే. మేం గత 2012లో బొమ్మరిల్లు పబ్లికేషన్స్‌ను సొంతం చేసుకున్నాం. ఆ కథల రీతిలో నైతిక విలువలు జొప్పించిన పురాణేతిహాసాల్లోని కథలను సంక్షిప్తంగా అందిస్తున్నాం. అలాగే ముఖ్యమైన దేవతలు 50 మంది గురించి సింప్లిఫై చేసి 100 పేజీల్లో రాయించాం. -
సిటీ కాప్స్.. గుడ్ మార్నింగ్ హైదరాబాద్!
సాక్షి, సిటీబ్యూరో: ‘గుడ్ మారి్నంగ్ హైదరాబాద్...’ త్వరలో నగర పోలీసుల నోటి వెంట ఇలాంటి మాట వినిపించనుంది. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌తో (హెచ్సీఎస్సీ) కలిసి సిటీ పోలీసు విభాగం ఓ కమ్యూనిటీ రేడియోను ఏర్పాటు చేయనుండటమే దానికి కారణం. ఇతర ఎఫ్ఎం రేడియోలకు దీటుగా, అన్ని హంగులతో త్వరలోనే ఇది అందుబాటులోకి రానుందని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి బుధవారం ప్రకటించారు.నగర పోలీసు విభాగానికి ఇప్పటి వరకూ సొంతంగా ఎలాంటి రేడియో లేదు. అయితే కొన్నేళ్లుగా వివిధ ఎఫ్ఎం రేడియోలతో పాటు ఇతర మీడియా సంస్థలతో కలిసి పని చేస్తున్నారు. బోనాలు, గణేష్ ఉత్సవాలు వంటి కీలక ఘట్టాలతో పాటు సున్నితాంశాల పైనా ప్రజల్లో అవగాహన కలి్పంచడానికి ఈ వేదికల్ని వాడుకుంటున్నారు. రద్దీ వేళల్లో ట్రాఫిక్ జామ్స్, రద్దీ రోడ్లకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎఫ్ఎం రేడియోలకు అందిస్తున్న ట్రాఫిక్ విభాగం అధికారులు ఆ వివరాలను వారి ద్వారా శ్రోతలకు చేరుస్తున్నారు. ఇప్పటి వరకూ కేవలం వారికే..కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు 2019 అక్టోబర్‌లో ఓ కమ్యూనిటీ రేడియోను ఏర్పాటు చేశారు. అందులో వినోద భరిత కార్యక్రమాలతో పాటు ఖైదీలకు ఉన్న హక్కులు, పెరోల్ నిబంధనలు తదితరాలను ప్రచారం చేస్తున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ సెంట్రల్ జైలు అధికారులు సైతం 2021 డిసెంబర్లో ఓ రేడియోను ప్రారంభించారు. ఈ రెండూ ఖైదీల ఆధ్వర్యంలో నడిచేవే కావడం గమనార్హం. ఇండియన్ ఆర్మీ సైతం ఉత్తర కాశ్మీర్లో తొలి రేడియో స్టేషన్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బారాముల్లా, ఉరి సెక్టార్లలో రెండింటికి విస్తరించింది.వినోదంతో పాటు అవగాహన..నగర పోలీసు విభాగం ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ రేడియో అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు హెచ్సీఎస్సీతో కలిసి రూపుదిద్దుతున్నారు. ఈ రేడియోలు పాటలు వంటి వినోదభరిత కార్యక్రమాలకు సమప్రాధాన్యం ఇస్తారు. దీంతో పాటు నగరవాసులకు సమకాలీన అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రధానంగా ట్రాఫిక్ నిబంధనలు, స్థితిగతులు, రోడ్డు భద్రత అంశాలకు పెద్దపీట వేసేలా తమ కమ్యూనిటీ రేడియో ఉండనుందని కొత్వాల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ రేడియో నిర్వహణ బాధ్యతల్ని హెచ్సీఎస్సీ చేపట్టనుంది. -
Prakruthi Kambam: ఈ తెలంగాణ మిస్ డ్రీమ్.. 'మిస్ ఇండియా'!
సాక్షి, సిటీబ్యూరో: ఫెమినా మిస్ ఇండియా..! ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో మంది ఫ్యాషన్ ఔత్సాహికుల చిరకాల కోరిక. సౌందర్య రంగంలో అత్యున్నత స్థానమైన ఫెమినా మిస్ ఇండియాగా నిలవాలంటే దేహ సౌందర్యమే కాదు.. ఆత్మ సౌందర్యం, విజ్ఞాన కౌశలం, సేవా తత్పరత అన్నింటికీ మించి ఆత్మస్థైర్యం కూడా ఉండాలంటున్నారు ఫెమినా మిస్ తెలంగాణ ప్రకృతి కంబం. ఈ సారి ఫెమినా మిస్ ఇండియా పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రకృతి కంబం ఎంపికయ్యారు. ఇందులో భాగంగా ముంబై వేదికగా జరిగిన ప్రీ ఫెమినా మిస్ ఇండియా పేజెంట్స్‌లో తన ప్రత్యేకతను చాటుకుని ఫెమినా మిస్ తెలంగాణ–2024గా నిలిచారు. మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో దేశవ్యాప్తంగా పాల్గొనే 30 మంది అందాల ముద్దుగుమ్మల్లో తానూ ఒకరు. ఈ నేపథ్యంలో తన ప్రయాణంలోని అనుభవాలు, అనుభూతులను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే..ఫైనల్స్‌లో తెలుగమ్మాయి..ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకోవడం నా చిరకాల స్వప్నం. గతంలో జరిగిన సౌందర్య పోటీల్లో పాల్గొని టాప్ 5 స్థానంలో నిలిచి ఆ కిరీటాన్ని అందుకోలేకపోయాను. కానీ ఈ సారి ఫెమినా మిస్ ఇండియా క్రౌన్ గెలిచి హైదరాబాద్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలని ధృడ నిశ్చయంతో ఉన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు దేశం నుంచి ప్రాతినిథ్యం వహించాలన్నా కూడా ఫెమినా మిస్ ఇండియా కిరీటమే ప్రామాణికం. ఫైనలిస్టుగా ఎంపిక చేయడానికి బెంగళూరులో జరిగిన ఆడిషన్స్‌లో ప్రతి రాష్ట్రం నుంచి దాదాపు రెండు వందల మంది ష్యాషన్ ఔత్సాహికులు పాల్గొన్నారు. అందులో ఎంపిక చేసిన కొద్ది మందితో ముంబైలో మరో పేజెంట్ నిర్వహించగా.. అందులో ఫెమినా మిస్ తెలంగాణగా నేను నిలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది.జీవితం నేర్పిన పాఠాలు..నా జీవితంలో స్వతహాగా ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు, అడ్డంకులే నన్ను ఈ స్థాయికి చేర్చాయని అనుకుంటాను. ప్రతి సమస్య నుంచీ, ప్రతి సందర్భం నుంచీ జీవిత పాఠాలను నేర్చుకున్నాను. సౌందర్య రంగం అంటే అందంగా ఉంటే సరిపోతుందిని అంతా అనుకుంటారు. కానీ.. అందంతో పాటు ఆలోచనలు, అభిరుచులు, సంపూర్ణమైన వ్యక్తిత్వం, సామాజిక బాధ్యత–అవగాహన ఇలా పలు అంశాలను పరిశీలించాకే, పరీక్షించాకే ఆ గౌరవమైన స్థానానికి ఎంపిక చేస్తారు. మల్టీ క్వీన్...నాకు 5 భాషల్లో ప్రావీణ్యముంది. ఫ్యాషన్‌తో పాటు థ్రోబాల్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, క్యారమ్ వంటి క్రీడల్లో ఛాంపియన్ని. పలు ఈవెంట్లలో ట్రాక్ ఫీల్డ్ అథ్లెట్‌గా విజేతగా నిలిచాను. డ్యాన్స్–కొరియోగ్రఫీలో మంచి ప్రావీణ్యముంది. బాలీవుడ్, జాజ్, బ్యాలే, ఫోక్, సౌత్ స్టైల్స్ ఇలా అన్ని స్టెప్పుల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించగలను. క్విల్లింగ్, పాట్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, మండాల ఆర్ట్స్ వంటి పలు కళల్లో మంచి పట్టు ఉంది. సమర్థవంతమైన అమ్మాయిగా నిలవడంలో ఈ అంశాలన్నీ దోహదపడ్డాయి. ఫ్యాషన్ రంగానికి సంబంధించి గతంలో మిస్ గ్రాండ్ కర్ణాటక, టైమ్స్ ఫ్రెస్ ఫేస్‌తో పాటు పలు పేజెంట్లలో విజేతగా నిలిచాను. యాక్టింగ్ పై మక్కువతో టాలీవుడ్ వేదికగా ఒక సినిమాలో నటించాను. మరికొద్ది రోజుల్లో వెండి తెరపైన విడుదల కానుంది. ఇవన్నీ చేయగలడంలో నా టైమ్ మేనేజ్మెంట్ కీలకపాత్ర పోషిస్తుంది.25 ఏళ్ల వయసులో..ఈ పోటీలకు అర్హత వయస్సు 25 ఏళ్లు మాత్రమే.. ఇంత చిన్న వయసులో సామాజికంగా, మానసికంగా, మోడలింగ్‌లో ఉన్నత భావజాలం ఉండాలంటే జీవితాన్ని అంకితం చేయాలి. నడక, నడవడిక, అందం, ఆలోచనలు, డ్రెస్సింగ్, మోడ్రన్ ట్రెండ్స్ ఇలా ప్రతీ విషయంలో ఉన్నతంగా ఉంటేనే ఈ పోటీల్లో రాణించగలం. అక్క దగ్గర మోడలింగ్, అమ్మా–నాన్నల దగ్గర సామాజిక అంశాల పైన అవగాహన పొందాను. బాక్స్ ఆఫ్ స్మైల్ పేరుతో అమ్మా నాన్నలు పేద విద్యార్థులకు చేసే సేవా కార్యక్రమాలు నాలో సామాజిక స్పృహను పెంచాయి. -
Chandana Jayaram: వస్త్రోత్పత్తుల సోయగం! హ్యాండ్ టు హ్యాండ్ చేనేత ప్రదర్శన షురూ..
సాక్షి, సిటీబ్యూరో: మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ చందనా జయరాం సందడి చేశారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన హ్యాండ్ టు హ్యాండ్ చేనేత వస్త్ర ప్రదర్శనను ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ కొలువుదీరిన వ్రస్తోత్పత్తుల గురించి చేనేత కళాకారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అనాదిగా వస్తున్న మన సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వ్రస్తోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. వేడుకలు, సంబరాల్లో ఫ్యాషన్ వేర్ కన్నా ఇలాంటి ఉత్పత్తులవైపే యువత ఎక్కువ మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా దాదాపు 14 రాష్ట్రాల నుంచి చేనేతకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తారని నిర్వాహకులు జయేష్ గుప్తా తెలిపారు. ఇందులో భాగంగా75 వేల రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు వివరించారు.వినూత్నంగా మెటల్ సిరీస్ వాచ్‌లు..సాక్షి, సిటీబ్యూరో: అధునాతన ఫ్యాషన్ హంగులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకునే హైదరాబాద్ నగర వేదికగా బోల్డ్–ఫ్యాషన్–ఫార్వర్డ్ మెటల్ సిరీస్ వాచ్‌లు అందుబాటులోకి వచ్చాయి.ప్రముఖ ‘ఫా్రస్టాక్ స్మార్ట్’ఆధ్వర్యంలో ఆవిష్కరించిన ఈ మెటల్ సిరీస్ యువతను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా టైటాన్ కంపెనీ సేల్స్ హెడ్ ఆదిత్యరాజ్ మాట్లాడుతూ ఫా్రస్టాక్ స్టెయిన్లెస్–స్టీల్ వాచ్‌ల నుంచి ప్రేరణ పొంది ఈ స్మార్ట్‌వాచ్ కలెక్షన్ ప్రీమియం–గ్రేడ్ మెటల్‌తో రూపొందించామని తెలిపారు. అధునాతన ఫ్యాషన్ గాడ్జెట్స్‌ను ఆస్వాదించడంలో నగరం ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. -
Hyderabad: జర్నీ ఆఫ్ రిథమ్స్! ఈ నెల 31న ప్రత్యేక నాట్యప్రదర్శన..
సాక్షి, సిటీబ్యూరో: ‘అది ఒక రైల్వేస్టేషన్... పదహారు మంది నాట్యకారిణులు అందరూ ఒకే తరహా దుస్తులు, లగేజ్ ట్రాలీలతో ప్లాట్‌ఫాంపై సిద్ధంగా ఉన్నారు. రైలు ఎప్పుడు వస్తుందా.. అని ఎదురుచూస్తున్నారు. ఇంతలో రైలు ఆలస్యంగా వస్తుందని తెలవడంతో తమ పర్యటనలో భాగంగా ఏయే నగరాలను సందర్శించాలో చర్చించుకుంటున్నారు. ఆయా నగరాల్లో ప్రసిద్ధి చెందిన సంగీత రీతుల్లో భరతనాట్య ప్రదర్శన ఇవ్వాలని నిర్ణయించుకున్నారు..’ ఇంతకీ ఇది ఏ రైల్వేస్టేషన్లో జరిగిందనేకదా.. మీ అనుమానం!ఇది నిజంగా జరగలేదు కానీ.. ఇలాంటి థీమ్‌తో ఓ నాట్యప్రదర్శన ఈ నెల 31న సాయంత్రం 6.30 గంటలకు నగరంలోని గచ్చిబౌలి గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరగనుంది. భరతనాట్యాన్ని మాధ్యమంగా చేసుకుని దేశంలోని ముఖ్యమైన 16 సంగీత రీతులను ప్రయోగాత్మకంగా ప్రదర్శించనున్నారు. శివాన్‡్ష మ్యూజిక్ అకాడమీ, తత్వ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. దాదాపు 1.45 గంటలపాటు ఈ నాట్య ప్రదర్శన నాన్‌స్టాప్‌గా సాగనుంది. ఈ ప్రయోగం కోసం 6 నెలలపాటు శ్రమించినట్లు శివాన్‡్ష అకాడమీ నిర్వాహకురాలు, భరతనాట్య కళాకారిణి మైత్రీరావు చెప్పారు. ‘జర్నీ ఆఫ్ రిథమ్స్’ పేరిట సాగే ఈ నాట్య ప్రదర్శనకు ప్రముఖ రంగస్థల నటి, కర్ణాటక జానపద అకాడమీ అధ్యక్షురాలు పద్మశ్రీ మంజమ్మ జోగతి హాజరుకానున్నారు. -
ఫుడ్ లవర్స్ అడ్డా.. హైదరాబాద్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని హోటల్ తాజ్ డక్కన్ వేదికగా జరిగిన 3వ ఎడిషన్ హైబిజ్ టీవీ ఫుడ్ అవార్డ్స్ ప్రదాన కార్యక్రమంలో టాలీవుడ్ నటి ఫరియా అబ్దుల్లా సందడి చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై.. ఫుడ్ గ్రాఫ్‌లో నగరాన్ని అత్యున్నత స్థానానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన వ్యక్తులతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లు తదితర బ్రాండ్లకు 50 పురస్కారాలను ప్రదానం చేసింది.కంట్రీ ఓవెన్ ఫౌండర్ డాక్టర్ సుధాకర్ రావు, వివేరా హోటల్స్ చైర్మన్ సద్ది వెంకట్‌రెడ్డిలకు లెజెండ్ అవార్డులను అందజేసింది. ‘హైదరాబాద్ అంటేనే ఒక ఎమోషన్. నగరవాసులు ఫుడ్‌ను ప్రేమిస్తారు, ఆస్వాదిస్తారు’అని ఆమె అన్నారు. తనకు కట్టీ దాల్ చావల్ ఫేవరేట్ ఫుడ్ అని చెప్పారు. ఈ వేడుకల్లో భాగంగా మిస్ యూనివర్స్ తెలంగాణ నిహారిక సూద్, మిస్ గ్రాండ్ ఇండియా 2022 ప్రాచీ నాగ్‌పాల్ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సుచిరిండియా సీఈవో లయన్ డాక్టర్ వై.కిరణ్, జెమిని ఎడిబుల్స్ సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖర్‌రెడ్డి, విమల ఫీడ్స్ మధుసూదన్‌రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
Preeti: పనిమనిషి కావాలా... ఆస్క్కు చెప్పండి!
సాక్షి, సిటీబ్యూరో: ఏ ఇంట చూసినా ఇంతి పని అంతా ఇంతాకాదు. పొద్దుతో ఆమె పోటీ పడుతోంది. ఉద్యోగ జీవనంలో ఇంటిపని, వంటపనికి అదనంగా ఇప్పుడు ఆమెకు ఆఫీస్ పని తోడైంది. లివింగ్ కాస్ట్, ఇతర ఖర్చులు పెరిగిన పరిస్థితుల్లో భార్యాభర్తలు జాబ్ చేస్తేనే, అనుకున్న లైఫ్‌ను లీడ్ చేయొచ్చని చాలామంది భావిస్తున్నారు. మహిళాసాధికారత పెరిగిన తర్వాత భర్తతోపాటు భార్య కూడా ఉద్యోగం చేస్తోంది. అదనపు పని, అదనపు ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఆమెకు పనిమనిషి అవసరం చాలా ఏర్పడింది. హైటెక్‌సిటీ లాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న ప్రాంతాల్లో పనిమనుషులకు చాలా డిమాండ్ ఉంది. ఎంతగా అంటే ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఖాళీగా లేము అనేంతగా..! ఇలాంటి సమస్యకు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి వినూత్న పరిష్కారం చూపుతున్నారు. ‘ఆస్క్ లో’పేరుతో వాట్సాప్ వేదికగా ఈ ఆలోచనకు రూపం ఇచ్చారు. ఇలా నలుగురికి సాయపడేందుకు ప్రయతి్నస్తున్నారు.పనిమనుషులు, వంటవారు, డ్రైవర్లు కావాలనుకుంటే.. ‘ఆస్క్ లో’వాట్సాప్‌కు మెసేజ్ పెడితే చాలు, మీకు కావాల్సిన పని చిటికెలో అయిపోతుందని చెబుతున్నారు. మీ మెసేజ్ పనిమనుషులు, డ్రైవర్లకు వెళ్తుంది. అది కూడా వాయిస్ రూపంలో తెలుగులో ఆటోమాటిక్‌గా పంపిస్తారు. మీకు కావాల్సిన సమయంలో వాళ్లు ఖాళీగా ఉంటే తాము వస్తామని తిరిగి మెసేజ్ చేస్తారు. అయితే అప్పటివరకే కాకుండా పూర్తిస్థాయిలో కూడా ఏ టైమ్‌కు రావాలో కూడా మాట్లాడుకుని పనికుదుర్చుకోవచ్చు. ఇలా పనిమనుషులు, డ్రైవర్లకు పని దొరకడంతోపాటు అవసరం ఉన్న ఉద్యోగులకు కూడా మేలు జరుగుతోంది. రెండు పారీ్టల నడుమ మధ్యవర్తి లేకుండా నేరుగా వారే మాట్లాడుకునే వీలుంది.మహిళలకు ఉపయోగంగా ఉంటుందని..రాజస్థాన్‌కు చెందిన ప్రీతి 20 ఏళ్ల కింద హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. 10 ఏళ్ల నుంచి సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నారు. నిత్యజీవితంలో ఎదురైన అనుభవాలు ఈ స్టార్టప్ ఏర్పాటు చేసేందుకు దోహదపడ్డాయని ప్రీతి పేర్కొన్నారు. ఎప్పటి నుంచో సామాన్యులకు ఏదైనా చేయాలనే ఆలోచన ఉండేదని, అది ఈ వేదిక ఏర్పాటుతో నెరవేరిందని ప్రీతి చెబుతున్నారు. అప్లికేషన్ లేదా వెబ్‌సైట్‌తో సంబంధం లేకుండా ఈ సేవలు వినియోగించుకోవచ్చని పేర్కొంటున్నారు. పైగా గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారికి అప్లికేషన్స్ వెబ్సైట్ వాడటం రాకపోవచ్చు. అందుకే అలాంటివారికి సులువుగా పనిదొరికే విధంగా ఈ ప్లాట్ఫారం ఉపయోగపడుతుందని వివరించారు.సేవా దృక్పథంతో..సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ సేవలను అందిస్తున్నా. భవిష్యత్తులో సేవలు మరింత మందికి అందించాలని భావిస్తున్నా. ఇప్పుడు నేను నివసిస్తున్న గచ్చిబౌలి ప్రాంతంలో మాత్రమే అందిస్తున్నా. చాలామంది ఈ సేవలను మెచ్చుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. కాస్త ఇబ్బంది అయినా వారి ప్రశంసలతో ముందుకు వెళ్లాలనే ఆకాంక్ష పెరుగుతోంది. – ప్రీతి, ఆస్క్ లో, వ్యవస్థాపకురాలు -
ట్రెండీ.. టాటూ! ఇవి తెలియకుంటే తప్పదు చేటు!
సాక్షి, సిటీబ్యూరో: నేను ఫ్యాషన్ లవర్ని అని చెప్పకుండానే చెప్పే మార్గం టాటూ.. ఇప్పుడు వయసుతో పనిలేకుండా అన్ని వర్గాల వారూ టాటూస్‌ని ముద్రించుకోవడం నగరంలో సర్వసాధారణంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఎప్పటి నుంచో టాటూస్ వినియోగంలో అనుభవం ఉన్నవారితోపాటు కొత్తగా వాటి పట్ల ఆసక్తి పెంచుకుంటున్నవారికీ కొదవలేదు. ఈ నేపథ్యంలో ఎంత ఫ్యాషన్ అయినప్పటికీ టాటూ కల్చర్‌లోకి అడుగుపెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.టాటూ వేయించుకోవడానికి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం ఎందుకో తెలియాలంటే.. టాటూ సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా మనం తెలు సుకోవాలి. అప్పుడే ప్రిపరేషన్ లోపిస్తే వచ్చే పరేషాన్ ఏమిటో అర్థం అవుతుంది."స్వతహాగా చర్మ అలర్జీలకు గురయ్యే అవకాశం ఉన్నట్లయితే లేదా ముందుగా వ్యాధులు ఏవైనా ఉంటే, పచ్చబొట్టు వేయించుకునే ముందు వాటి గురించి వైద్యునితో చర్చించి వారి సలహా మేరకు టాటూ వేయించుకోవాలి."టాటూ వేయడానికి ముందు, దానికి వినియోగించే సూదులు క్రిమిరహితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. స్టెరిలైజ్ చేయని లేదా కలుíÙతమైన సూదులను ఉపయోగించడం వల్ల హెచ్ఐవీ, హెపటైటిస్ బీ–సీ వంటి రక్తం ద్వారా సంక్రమించే వ్యాధుల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. – వెంటనే లేదా టాటూ వేసిన మొదటి రెండు వారాల్లో స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. వాపు, నొప్పి, ఎరుపు, దురద లేదా దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. తీవ్రమైన సందర్భాల్లో జ్వరం, పుండ్లు లేదా చీముకు దారితీస్తుంది. శరీరంలోకి ఇంజెక్ట్ చేసే ముందు నాన్ స్టెరైల్ వాటర్‌ని కలిపితే స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. కాబట్టి తరచి చూసుకోవడం అవసరం. – ఎంఆర్ఐ స్కానింగ్ ప్రక్రియలు చేయించుకుంటున్న రోగులు పచ్చబొట్టు పొడిచిన ప్రదే శంలో మంట, దురద లేదా వాపును అనుభవించవచ్చు. – ఇది తక్కువ–నాణ్యత లేని రంగులు లేదా టాటూ పిగ్మెంట్లలో ఐరన్ ఆక్సైడ్ వంటి రసాయనాల వల్ల కూడా కావచ్చు. – టాటూ వేయడానికి అయ్యే ఖర్చు కళాకారుడిపై మాత్రమే కాక ఉపయోగించిన సిరా రకం, పచ్చబొట్టు పరిమాణం, ఇంక్ చేయాల్సిన ప్రాంతం మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. ఖర్చుతో రాజీపడకుండా పేరున్న కళాకారుడితో టాటూ వేయించుకోవడం మేలు. – టాటూ వేయించుకున్న కొన్ని నెలల తర్వాత రంగు వాడిపోతుంది. కాబట్టి, రంగు సాంద్రతను స్థిరీకరించడానికి కొన్ని టచ్–అప్లు అవసరం కావచ్చు. – స్కిన్ ఇన్ఫెక్షన్లు లేదా ఇతర సమస్యలను నివారించడానికి టాటూ అనంతర సంరక్షణ చాలా ముఖ్యం. ఆ ప్రాంతం పూర్తిగా నయం అయ్యే వరకూ కళాకారుడి సలహాను పాటించండి.– టాటూలు వేసే పదాల స్పెల్లింగ్‌లు సరైనవని నిర్ధారించుకోవాలి. ఒక్కసారి టాటూ పూర్తయిన తర్వాత అక్షర దోషాలను సరిదిద్దలేరు. – మధుమేహం నియంత్రణలో లేకుంటే వైద్య సలహా తీసుకోవడం మంచిది. – టాటూ ఆర్టిస్ట్ చేతులను కడుక్కొని, స్టెరిలైజ్ చేసుకున్న తర్వాత టాటూ ప్రక్రియకు ముందు కొత్త గ్లౌజ్‌లు ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి. – ప్రక్రియకు 24 గంటల ముందు కెఫిన్ లేదా ఆల్కహాల్‌ను తీసుకోవద్దు. ఈ పదార్థాలు రక్తాన్ని పలచన చేసేవిగా వైద్యులు చెబుతున్న నేపథ్యంలో ప్రక్రియ సమయంలో అధిక రక్తస్రావం ఉండవచ్చు. – టాటూ కోసం ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవలసి ఉంటుంది కాబట్టి వదులుగా సౌకర్యవంతంగా ఉండే దుస్తులను ధరించడం మంచిది. – కనీసం 24 నుంచి 48 గంటల ముందు రక్తాన్ని పలచబరిచే మందులను తీసుకోకుండా ఉండటం మంచిది.అనారోగ్య ‘ముద్ర’.. అనస్థీషియా లేకుండా టాటూ వేయడం వల్ల కొంత నొప్పి, రక్తస్రావం కలిగే అవకాశం ఉంది. దీని గురించి ముందుగా తెలుసుకోవడం అవసరం. అలాగే టాటూ ఇంక్‌లో ఉండే రసాయనాలు లేదా లోహాలు, ప్రత్యేకించి కొన్ని రంగుల కారణంగా కొంతమందిలో అలర్జీ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు దురద, దద్దుర్లు, వాపు తదితర లక్షణాలు టాటూ వేయించుకున్న వెంటనే లేదా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా కనపడవచ్చు. టాటూల వల్ల అరుదుగా చర్మ కారక క్యాన్సర్‌కు కూడా కారణం కావచ్చు. ఎందుకంటే కొన్ని రంగులు లేదా వర్ణ ద్రవ్యాలు క్యాన్సర్ కారకాలు కావచ్చు.జాగ్రత్తలు ఇలా..– క్రిమిరహితం చేసిన సూదులు, మంచి నాణ్యమైన పిగ్మెంట్లు, ఉపయోగించిన సూదులు సరిగ్గా డిస్పోజ్ చేయడం వంటి ప్రమాణాలు పాటించే పేరున్న, లైసెన్స్ పొందిన స్టూడియోను ఎంచుకోవాలి. పరిశుభ్రతగల పరికరాలు భద్రతా ప్రమాణాలకు కొలమానాలు. అవి మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచేందుకు వీలుంటుంది.– పచ్చబొట్టు వేసుకునే రోజున, ప్రక్రియ సమయంలో ఆకలి బాధలు, తల తిరగడం లేదా మూర్ఛ వంటివి నివారించడానికి పుష్కలంగా నీరు తాగండి. తగినంత ఆహారం తీసుకోండి. టాటూ వేయించుకోవడానికి ముందు రోజు రాత్రి తగినంత నిద్రకావాలి.శుభ్రతతోనే.. సురక్షితం...టాటూకి సురక్షితమైన ప్రొఫెషనల్ స్టూడియోను ఎంచుకోవాలి. ఆ ప్రదేశం కూడా పూర్తి పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా ఉండాలి. ఎటువంటి సందేహాలు కలిగినా ఆర్టిస్ట్‌ను ప్రశి్నంచాలి. నీడిల్స్ తమ ముందే ఓపెన్ చేయాలని కోరాలి. రీ యూజబుల్ మెటీరియల్ అంతా ఆటో క్లోవ్లో స్టెరైల్ చేశారో లేదో గమనించాలి. అలాగే టాటూ వేసే సమయంలో నొప్పి భరించగలిగినంతే ఉంటుంది. అయితే శరీరంలో తల, పాదాలు, చేతుల అడుగు భాగం, పొత్తికడుపు, వెన్నెముక వంటి కొన్ని భాగాల్లోని చర్మ స్వభావం వల్ల కొంచెం నొప్పి ఎక్కువగా అనిపించవచ్చు. టాటూ వేసే సమయంలో వేసిన తర్వాత, కొన్ని రోజుల పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. – అమిన్, టాటూ ఆర్టిస్ట్ -
కరాటే మాన్సూన్ క్యాంప్‌లో.. గోవింద్ ప్రతిభ!
పోచారం: జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 18 వరకూ 16వ జాతీయ మాన్సూన్ క్యాంప్‌ను చత్తీస్‌ఘడ్‌లోని రాయపూర్ నగరంలో నిర్వహించారు. క్యాంపులో ముఖ్య అతిథిగా జపాన్ హెడ్ క్వార్టర్స్ నుండి మాస్టర్ షిహాన్ తుకుయ తనియమ, ఇండియన్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ షహన్ ఆనంద రత్న, తెలంగాణ రాష్ట్ర చీఫ్ రాపోలు సుదర్శన్ పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్పోర్ట్స్ కరాటే అకాడమీ తరపున పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడకు చెందిన గుగులోత్ గోవింద్ నాయక్ హాజరయ్యారు.ఈ శిబిరంలో తకుయ తనియమ చేతులమీదుగా ఇంటర్నేషనల్ టెక్నికల్ లైసెన్స్డ్ ఎగ్జామినర్ సరి్టఫికెట్‌ను గోవింద్ నాయక్ అందుకున్నారు. కోర్సు సిలబస్‌ను పూర్తిచేయడంతో పాటు అద్భుతమైన కరాటే నైపుణ్యాలను గోవింద్ ప్రదర్శించి అతిథుల ప్రశంసలు పొందారు. సమాజంలో చోటుచేసుకునే అరాచకాల నుండి రక్షించుకోవడానికి కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గోవింద్ అన్నారు. తల్లిదండ్రులు ఆడబిడ్డలకు ఆత్మరక్షణ కోసం కరాటే వంటి యుద్ధ విద్యలు నేరి్పంచాలన్నారు. -
హీరో గ్లామర్.. ప్రముఖ టూవీలర్ ‘హీరో’ బ్రాండ్స్..
సాక్షి, సిటీబ్యూరో: వ్యక్తిగానో, వ్యవస్థగానో నమ్మకాన్ని పొందాలంటే సంవత్సరాల తరబడి నిరంతరం శ్రమిస్తూనే ఉండాలని, ఆ నమ్మకమే విజయానికి గీటురాయి అని గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ అన్నారు. 40 ఏళ్లకు పైగా హీరోగా ప్రజాదరణ పొందుతున్న తన తండ్రి చిరంజీవి, ప్రముఖ టూవీలర్ ‘హీరో’ బ్రాండ్స్ ఈ నమ్మకానికి నిదర్శనమన్నారు. హీరో మోటోకార్ప్ ఆధ్వర్యంలో నగరంలోని హోటల్ నోవోటెల్ వేదికగా గురువారం న్యూ ఒరిజినల్ గ్లామర్ బైక్ ఆవిష్కరించారు.సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రంజీవ్ జీత్ సింగ్‌తో పాటు హీరో బ్రాండ్ అంబాసిడర్ రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా గ్లామర్ బైక్‌ను ఆవిష్కరించారు. 1984లో ప్రారంభమైన హీరో సంస్థ 40 ఏళ్ల పాటు కస్టమర్ల మన్ననలు పొందుతుందని, ఆ కస్టమర్లే తమ సంస్థకు హీరోలని రంజీవ్ జీత్ సింగ్ అన్నారు. ముఖ్యంగా 19 ఏళ్ల పాటుగా గ్లామర్ బైక్ అందరికీ ఫేవరెట్ బైక్‌గా 80 లక్షల కస్టమర్ల మనసులను చూరగొందని అన్నారు. అనంతరం రామ్ చరణ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. ఆమె అభిమానం నా బాధ్యతను పెంచింది..ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లో భాగంగా జపాన్ వెళ్లిన సమయంలో దాదాపు 70 ఏళ్ల మహిళ 180 పేజీల ఆర్ట్ వర్క్ బుక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. అది తెరచి చూస్తే నా గత సినిమాల్లోని కొన్ని స్టిల్స్‌ని ఆర్ట్‌గా వేశారు. ఇలాంటి అభిమానం నా బాధ్యతను మరింతగా పెంచింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావడం అందులో ఒకటి. నాటు నాటు పాటలోని కొన్ని నిమిషాల స్టెప్ కోసం తారక్, నేను దాదాపు 30 రోజులకు పైగా కష్టపడ్డాం. ఈ కష్టం ఆస్కార్‌తో పాటు ప్రపంచ వ్యాప్త అభిమానులను అందించింది.బైక్స్ అంటే ఇష్టం.. చిన్నప్పటి నుంచీ బైక్ అంటే ఇష్టం. కానీ నాన్న బైక్‌లకు అంతగా ప్రోత్సహించేవారు కాదు. అందుకే నాన్నకు తెలియకుండా ఫ్రెండ్స్ హీరో బైక్స్ నడిపేవాడిని. ఇప్పుడు అదే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం గొప్ప అనుభూతినిస్తుంది. ప్రస్తుతం గుర్రాలన్నా, హార్స్ రైడింగ్ అన్నా చాలా ఇష్టం. ఎంతలా అంటే మగధీర సినిమాలో షూట్ చేసిన గుర్రం విపరీతంగా నచి్చ, షూట్ తరువాత దర్శకులు రాజమౌళితో మాట్లాడి ఆ గుర్రాన్ని నేనే తీసుకున్నా. ఈ మధ్యనే ఆ గుర్రం మరో గుర్రానికి జన్మనిచి్చంది. దానిని నా కూతురు క్లీంకారాకు గిఫ్ట్‌గా ఇచ్చాను. ప్రస్తుతం నా దగ్గర 15 గుర్రాలు ఉన్నాయి. తన కోసమే పక్షులు కొన్నా.. జంతువులంటే నాకు చాలా ఇష్టం. నా కూతరు ఇష్టంగా ఆహారం తినడం కోసమే కొన్ని రకాల పక్షులను కొన్నాను. వాటిని చూపిస్తూ రోజూ ఆహారం తినిపిస్తాం. క్లీంకారా అనే నా కూతురు పేరును సంస్కృత భాషలోని లలిత సహస్ర నామం నుంచి ఎంచుకున్నాం. ఇక సినిమాలు ఎన్నో మరచిపోలేని అనుభూతులతో పాటు బాధ్యతను పెంచాయి. నేనో నిత్య విద్యార్థిని..నా సినిమాల్లో రంగస్థలం, ఆరెంజ్, మగ«దీర సినిమాలు చాలా ఇష్టం. యాక్షన్ సినిమాలు చేయడం ఇష్టం, త్వరలో బుచి్చబాబు దర్శకత్వంలో మంచి కామెడీ సినిమాను చేస్తున్నాను. ఆర్ఆర్ఆర్ ప్రయాణంలో రాజమౌళి కీలకం. తనతో షూటింగ్ అంటే స్కూల్‌కు వెళ్లే విద్యారి్థలా నేర్చుకోవడానికి వెళతాను. నాన్న నుంచి నేర్చుకున్న జీవిత సూత్రాలు తప్పకుండా పాటిస్తాను. మన ప్రయాణంలో భాగమైన ఆతీ్మయులను, సిబ్బందినీ మర్చిపోవద్దని చెప్పేవారు. అందుకే 15 ఏళ్లకు పైగా నా సిబ్బందిని మార్చకుండా నా దగ్గరే ఉండేలా చూసుకుంటున్నా.. మోస్ట్ మెమొరబుల్ మూమెంట్.. స్పోర్ట్స్‌తో ఎంగేజ్ అవ్వడం కన్నా పుస్తకాలు చదవడం ఇష్టం. నటన పరంగా తమిళహీరో సూర్య, సమంతాలను బాగా ఇష్టపడతాను. క్లీంకారా జన్మించిన సందర్భం జీవితంలో అత్యంత అనుభూతికి లోనయ్యాను. మోస్ట్ మెమొరబుల్ మూమెంట్..!! నార్త్ ఇండియా అన్నా.. ముఖ్యంగా రాజస్థాన్, హిమాలయాలు ఫేవరెట్ స్పాట్స్. నా గురించి సింపుల్‌గా ఒక్కమాటలో చెప్పాలంటే.. రామ్ చరణ్ అంటే మిత భాషికుడు, స్నేహితులకు దగ్గరగా ఉండేవాడు, ముఖ్యంగా హోమ్ బాయ్. -
'అలీ క్లబ్ మిస్ ఫినాలే'లో ఐశ్వర్య!
సాక్షి, సిటీబ్యూరో: దేశవ్యాప్తంగా యువ ప్రతిభను కనిపెట్టి, వారిని ప్రోత్సహించే ప్రతిష్టాత్మక పోటీ ‘అలీ క్లబ్ మిస్ అండ్ మిస్టర్ టీన్ ఇండియా’. ఈ పోటీలో పాల్గొనడానికి, విజేతగా నిలవడానికి దేశవ్యాప్తంగా యువత ఆసక్తి చూపిస్తుంది. అయితే ‘అలీ క్లబ్ మిస్ అండ్ మిస్టర్ టీన్ ఇండియా–2024’ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన 17 ఏళ్ల కాటేపల్లి ఐశ్వర్య ఫైనలిస్ట్‌గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది.ఫ్యాషన్, జీవనశైలి, వినోద రంగాల్లో యువ ప్రతిభతో వారి కలలను నెరవేర్చుకోవడానికి అద్భుత వేదికగా ఫ్యాషన్ పోటీలు నిలుస్తా్తయి. ముఖ్యంగా నగరంలో ‘అలీ క్లబ్ మిస్, మిస్టర్ టీన్ ఇండియా’.. ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’ ద్వారా గుర్తింపు పొందింది. ఇలాంటి వేదికపై తన అభిరుచులు, ఫ్యాషన్‌పై ఆమె అంకితభావంతో విజేతగా నిలవడానికి గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది. సెమీ ఫైనల్స్ ఆత్మస్థైర్యాన్ని పెంచింది... ప్రస్తుతం షాఫ్ట్ మల్టీమీడియాలో కంప్యూటర్ సైన్స్‌పై దృష్టి సారిస్తూ 12వ తరగతి చదువుతోంది ఐశ్వర్య. ఆమె చదువులతో పాటు మల్టీమీడియా, ఫైన్ ఆర్ట్స్‌లో డిప్లొమా కోసం కృషి చేస్తుంది. నగరంలోని డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో పనిచేస్తూ వాస్తవ ప్రపంచ అనుభవాన్ని పొందుతోంది. ఈ ప్రయాణం వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన వృద్ధికి ఆమె నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ నెల 31న ఢిల్లీ వేదికగా జరగనున్న గ్రాండ్ ఫినాలేలో విజేతగా నిలవడానికి ఇప్పటికే అక్కడికి చేరుకున్నానని ఐశ్వర్య తెలిపింది.గత నెలలో జరిగిన సెమీ–ఫైనల్ రౌండ్లో దేశవ్యాప్తంగా పాల్గొన్న ఫ్యాషన్ ఔత్సాహికులను దాటుకుని గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టడం మరింత ఆత్మస్థైర్యాన్ని పెంచిందని ఆమె అన్నారు. దేశవ్యాప్తంగా యువ ప్రతిభావంతులకు గుర్తింపునిచ్చే ఈ వారసత్వంలో ప్రాతినిథ్యం వహిస్తూ హైదరాబాద్ నగరాన్ని మరోసారి జాతీయ వేదికపై నిలపడం సంతోషంగా ఉందన్నారు. తన తోటి పారి్టసిపెంట్స్తో కలిసి జడ్జిల ప్యానెల్ ముందు తమ సామర్థ్యాలను ప్రదర్శించే ఫినాలే కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఐశ్వర్య తెలిపింది. -
డైనోసర్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే.. ఇక్కడికి వెళ్లండి చాలు!
సాక్షి, సిటీబ్యూరో: నగర ప్రజలకు సరికొత్త అనుభూతులు అందించడానికి నెక్సస్ మాల్లో ‘డైనోసర్ ఎక్స్పీరియన్స్’ ఏర్పాటు చేశారు. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుంది. డైనోసార్ ప్రదర్శనలో డినో ఫాసిల్ మ్యూజియం, ఎత్తయిన డినో లింబ్, డైనోసార్ ఫుట్‌స్టెప్స్ ట్రయల్, ఆకట్టుకునే స్కెలిటన్ డిస్ప్లే ఉన్నాయి. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులకు అనుమతిస్తారు.బాలీవుడ్ నైట్.. 23న..సాక్షి సిటీబ్యూరో: ముంబైకి చెందిన ప్రముఖ లేడీ డీజే కర్మ.. లైవ్ దర్బూక పేరిట ప్రదర్శన ఇస్తున్నారు.నగరంలోని శ్రీనగర్‌కాలనీ రోడ్లో ఉన్న కమలాపురి కాలనీలోని విన్‌ఫ్లోరా రెసిడెన్సీ హోటల్లో శుక్రవారం రాత్రి 8.30 గంటల నుంచీ ఈ బాలీవుడ్ నైట్ ఈవెంట్ జరగనుంది. ఈ షోలో తనదైన శైలిలో విభిన్న రకాల ట్రాక్స్‌ను ఆమె కదం తొక్కించనున్నారు.డార్క్ కామెడీ షో.. 25న..సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల్ని ఇటీవల అమితంగా ఆకట్టుకుంటున్న వాటిలో కామెడీ షోలదే అగ్రస్థానం. ఈ నేపథ్యంలో మరో హాస్యభరిత కార్యక్రమం ఓన్లీ కామిక్స్ లెఫ్ట్ ఎలైవ్ పేరిట ఏ డేంజరస్ స్టాండప్ కామెడీ షో అనే ట్యాగ్ లైన్‌తో సిటీలో ఓ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్‌లోని ఎన్‌హ్యాన్స్ కేఫ్ అండ్ కన్ఫెక్షనరీలో ఈ నెల 25వ తేదీన రాత్రి 7గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది. -
ప్రతిభ వెలికితీసేందుకు..! ఆర్వీ స్క్వేర్ క్రియేటివ్ హబ్ షురూ..
సాక్షి, సిటీబ్యూరో: సినీరంగంలో రాణించాలనుకుని, ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించేందుకు ఇండో–ఆస్ట్రేలియన్ ప్రొడక్షన్ హౌజ్ అయిన మెల్బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ సంస్థతో మాదల వేణు, రమాకాంత్ కలిసి ఏర్పాటు చేసిన ఆర్వీ స్క్వేర్ క్రియేటివ్ హబ్‌తో కొలాబ్ అయ్యారు. ఔత్సాహిక నిర్మాతలు, ప్రతిభావంతులైన కళాకారుల కలలకు ప్రాణం పోసేందుకు ఈ రెండు సంస్థలు ఒకటయ్యాయి.సినిమా, వెబ్‌సిరీస్‌లకు సంబంధించి ఔత్సాహిక డైరెక్టర్లు, రచయితలు, నటీనటులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రాజెక్టును ముందుకు నడిపించడమే తమ ఉద్దేశమని ఆర్వీ స్క్వేర్ క్రియేటివ్ హబ్ వ్యవస్థాపకుడు మాదల వేణు పేర్కొన్నారు. ఈ రెండు సంస్థల కలయికకు సంబంధించి కార్యక్రమం హైదరాబాద్‌లోని ఓ హోటల్ వేదికగా జరిగింది. ముఖ్య అతిథిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ హాజరయ్యారు. కార్యక్రమంలో భారతీయం సత్యవాణి, పద్మశ్రీ శోభ రాజు, ఉప్పల శారద, పీవీ నర్సింహారావు మనవరాలు అజిత సురభి, మాలావత్ పూర్ణ, మాదల వేణు, ప్రముఖ సింగర్ ఎంఎం శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.వన్నెతగ్గని హ్యాండ్లూమ్..సాక్షి, సిటీబ్యూరో: చేనేతకారులు నేసిన వస్త్ర సౌందర్యాల మధ్య ప్రముఖ టాలీవుడ్ వర్ధమాన నటి సౌమ్య జాను సందడి చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్–12లోని కళింగ కల్చరల్ హాలు వేదికగా బుధవారం ఏర్పాటు చేసిన ‘హ్యాండ్ టూ హ్యాండ్’ చేనేత వస్త్ర ప్రదర్శనను సినీ నటి సౌమ్య జాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వ్రస్తోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని, ఈ ఉత్పత్తులపై నేటికీ వన్నె తగ్గలేదని తెలిపారు.నేటితరం యువత కూడా హ్యాండ్ లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు. వీటిని సినీతారలు ప్రత్యేకంగా కస్టమైజ్ చేసుకుని ధరిస్తున్నారని ఆమె అన్నారు. ప్రదర్శన 24వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. 14 రాష్ట్రాలకు చెందిన చేనేతకారులు, చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్లూమ్ చీరలు, డ్రెస్ మెటీరియల్ వంటి 75 వేల రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని నిర్వాహకులు జయేష్ గుప్తా వెల్లడించారు. -
ఈ బర్మా ఫుడ్.. క్రేజీ టేస్ట్!
సాక్షి, సిటీబ్యూరో: వినూత్న వంటకాలను ఆస్వాదించే వారి సంఖ్య ఈ మధ్య పెరిగింది. సిటీ లైఫ్‌లోని పాశ్చాత్య ఒరవడులకు గతకాలపు అభిరుచులను అద్ది వడ్డించే పసందైన రుచులకు ఆదరణ పెరిగింది. ఇలాంటి రెస్టారెంట్లు, ఫుడ్ స్పాట్స్‌కు నగరంలో మంచి క్రేజ్ ఉంది. ఐతే ఇలాంటి అంశాలతో కొన్ని రెస్టారెంట్లు నగరంలో ఇప్పటికే ఆదరణ పొందుతుండగా.. వారసత్వ వంటకాలకు అధునాతన హంగులద్ది వడ్డించే బర్మా బర్మా రెస్టారెంట్ హైటెక్ సిటీలో సందడి చేస్తోంది. అంతేగాకుండా బర్మీస్ వంటకాల రుచి తెలిసిన ఫుడ్ లవర్స్‌కు క్రేజీ స్పాట్‌గా మారింది.బర్మా సంస్కృతికి ప్రతీకగా.. ఖౌసూయ్, టీ లీఫ్ సలాడ్, సమోసా సూప్, మాండలే నూడిల్ బౌల్, బర్మీస్ ఫలూడా వంటి వంటకాలు ఇప్పడు చాలామందికి ఫేవరెట్ డిషెస్గా మారాయి. పరాటాతో టోహు మాష్, కొబ్బరి క్రీమ్‌తో స్టిక్కీ రైస్, మెకాంగ్ కర్రీ, కుంకుమపువ్వు–సమోసా, చీజ్‌కేక్ వంటి నోరూరించే రుచులకు నాలెడ్జ్ సిటీలోని బర్మా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. బర్మాలో ప్రసిద్ది చెందిన ఈ విభిన్న రుచులు నగరంలో ప్రారంభించడం విశేషం. ఆసియాలోని అతిపెద్ద ఐటీ పార్కులలో ఒకటైన నగరాన్ని తన గమ్యస్థానంగా ఎంచుకోవడం, ఆహారాన్ని ఆస్వాదించడంలోనూ నగరవాసుల వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోంది.బర్మా సంప్రదాయ ప్రతీకలైన బర్మీస్ స్వరాలతో పాటు అక్కడి వీధులు, గృహాల నుంచి ప్రేరణ పొందిన యాంబియన్స్‌తో ఆహ్లాద ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. బర్మీస్ ప్రత్యేకతల నుంచి అత్యుత్తమంగా ఎంపిక చేసిన ఆరి్టసానల్ ‘టీ’లు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ మొదలు తరతరాలుగా ఆదరణ పొందుతున్న గిరిజన, వారసత్వ వంటకాలు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉడికించిన అరటి ఆకు పాకెట్స్(కయునిన్ మావో) సిగ్నేచర్‌గా నిలుస్తుంది.సంస్కృతుల సమ్మేళనం..వలస ఆహార సంస్కృతులు, స్వదేశీ పదార్థాలతో సమ్మిళితమైన గతకాలపు హోమ్‌స్టైల్ వంటలు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుండగా ఇక్కడి బెస్ట్ సెల్లర్స్‌లో ‘మామిడి సలాడ్, స్పైసీ టీ లీఫ్, అవకాడో సలాడ్, లోటస్ రూట్ చిప్స్, సమోసా సూప్, బ్రౌన్ ఆనియన్, రంగూన్ బేక్డ్ మిల్క్’ ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. చిన్ననాటి స్నేహితులైన చిరాగ్ ఛజెర్, అంకిత్ గుప్తాల ఆలోచనల్లోంచి ఆవిష్కృతమైన బర్మా బర్మా.. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, అహ్మదాబాద్‌లో విస్తరించింది.ముఖ్యంగా కోల్‌కతాలో ఎన్నడూ లేనివిధంగా బర్మీస్ సంస్కృతికి జీవం పోస్తోందని సహవ్యవస్థాపకులు అంకిత్ గుప్తా పేర్కొన్నారు. 2023లో అందించిన కొండే నాస్ట్ ట్రావెలర్ టాప్ రెస్టారెంట్ అవార్డ్స్‌లో బర్మా బర్మా 34వ స్థానంలో నిలిచిందని అన్నారు. వంటకాలు పులుపు, కారం రుచులతో.. కాఫీర్ లైమ్లు, బాలాచాంగ్ మిరియాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు తదితరాలను వినియోగిస్తాం. సిటీలో బర్మా నుంచి తీసుకొచ్చిన బాండెల్ చీజ్, పికిల్డ్ ప్లం, బాలచాంగ్ పెప్పర్స్, లాఫెట్ వంటి బర్మీస్ పదార్థాల రుచులతో నగరవాసులను యాంగోన్ వీధులకు తీసుకెళతామని వివరించారు. -
AI: ప్రపంచంలో మొదటి హెల్త్ మానిటరింగ్ ఏఐ యాప్ ఇది..
సాక్షి, సిటీబ్యూరో: ఆరోగ్య సంరక్షణలో భాగంగా యాప్ ఆధారిత హెల్త్ టూల్స్‌లోకి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అడుగులేస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని హోటల్ ఆవాసా వేదికగా బుధవారం ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత డీప్ లెరి్నంగ్ పవర్డ్ హెల్త్ మానిటరింగ్ యాప్ క్విక్ వైటల్స్‌ను ఆవిష్కరించారు.తెలుగు వ్యక్తి, బిసామ్ ఫార్మాస్యూటికల్స్ వ్యవస్థాపకులు ఎండీ హరీష్ బిసామ్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ యాప్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ ద్వారా కీలకమైన హెల్త్ డేటాను అందిస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్కో డాక్టర్ వంద మందికిపైగా రోగులను పరీక్షిస్తుంటారు. ఇలాంటి తరుణంలో ఈ యాప్‌లు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రక్త పరిమాణంలోని వైవిధ్యాలను కాంతి శోషణ మార్పులను విశ్లేíÙంచడానికి ఈ యాప్‌లో ఫొటోప్లెథిస్మోగ్రఫీ(పీపీజీ) అనే సాంకేతికతను వినియోగించడం విశేషం.డేటా భద్రత, గోప్యతకు మా హామీ..ఈ నేపథ్యంలో హరీష్ బిసామ్ మాట్లాడుతూ.. ఈ వినూత్న సాంకేతికత ఆధారంగా మొబైల్ యాప్‌లో కేవలం సెకన్లలో ఆరోగ్య సూచికలను ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. డాక్టర్‌ను కలవకుండానే ప్రాథమిక సమాచారాన్ని పొందడానికి ఈ యాప్ దోహదపడుతుందని అన్నారు. ఈ యాప్ కెమెరా ఆధారిత కాంటాక్ట్‌లెస్ స్పాట్ చెక్‌లు, పీపీజీ సెన్సార్లతో పర్యవేక్షణ చేస్తుంది. ఇది బలమైన క్లౌడ్ రిజి్రస్టేషన్‌తో పాటు కఠినమైన భారతీయ డేటా రక్షణ ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని, కాబట్టి డేటా భద్రత, గోప్యతకు ప్రాధాన్యతనిస్తుందని అన్నారు.ఈ ఆవిష్కరణలో భాగంగా ఏఐ, డీప్ లెరి్నంగ్: ది ఫ్యూచర్ ఆఫ్ హెల్త్‌కేర్ అంశంపై ప్రత్యేకంగా ప్యానెల్ చర్చ నిర్వహించారు. చర్చలో ప్లానింగ్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ చిన్నారెడ్డి, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ డా.సుధ, డ్రగ్ కంట్రోల్ అథారిటీ మాజీ డైరెక్టర్ డా.పి.వెంకటేశ్వర్లు, డా.పూరి్ణమ, ఇన్నోవేటర్–ప్రొడక్ట్ స్పెషలిస్ట్ డేనియల్ గోల్డ్‌మన్, కాటలిస్ట్ వ్యవస్థాపకులు ఆండ్రూ షోస్టాక్, డాక్టర్ ఉషతో పాటు టెక్ ఔత్సాహికులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.ఇవి చదవండి: పీక్స్‌లో.. పికిల్ బాల్! సిటిజనుల్ని ఉర్రూతలూగిస్తోన్న ఆట! -
కె పాప్ పోటీలో.. సిటీ విజేతలు వీరే..!
సాక్షి, సిటీబ్యూరో: కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా (కేసీసీ) సహకారంతో ప్రముఖ గృహోపకరణ ఉత్పత్తుల బ్రాండ్ ఎల్జి ఎల్రక్టానిక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా కె పాప్ పోటీల్లో స్థానిక విజేతలను ప్రకటించారు. ఈ ప్రాంతీయ పోటీల్లో ఆన్లైన్ ఆడిషన్స్ ద్వారా గానంలో నగరానికి చెందిన షైలీ ప్రీతమ్, నృత్యంలో సెజల్ దుబేలు గెలుపొందారని నిర్వాహక సంస్థ ప్రతినిధులు తెలిపారు.కొరియన్ పాప్ సంస్క్రతికి పట్టం గట్టే అభిమానుల కోసం నిర్వహిస్తున్న జాతీయ పోటీలో భాగంగా ఈ ప్రాంతీయ పోటీలు జులై 27న ప్రారంభమయ్యాయి. బెంగళూరు, కొహీమా, కొల్కతా, ముంబై, ఇటానగర్, చెన్నై, ఢిల్లీల తర్వాత నగరంలో ప్రాంతీయ రౌండ్ జరిగింది. ఇవి సెపె్టంబర్ 1 వరకు 11 ప్రాంతాల్లో జరుగుతాయని, వీటి ద్వారా ఎంపికైన విజేతలు ఢిల్లీలో జరిగే సెమీ ఫైనల్స్‌లో పాల్గొంటారని నిర్వాహకులు వివరించారు.స్టార్టప్స్ కోసం మీట్.. 24న..సాక్షి, సిటీబ్యూరో: ఔత్సాహిక వ్యాపారవేత్తల కోసం ది ఫౌండర్స్ కాంక్లేవ్ స్టార్టప్ మీటప్ నగరంలో జరుగుతోంది. కొండాపూర్‌లోని గోకర్ణ కో వర్కింగ్ స్పేస్‌లో ఈ నెల 24న జరగనున్న ఈ కార్యక్రమంలో భిన్న రంగాల ప్రముఖులు వైశాలి నియోటియా, నీతా సచన్, రత్నాకర్ సామవేదం హాజరై ప్రసంగిస్తారు. కార్యక్రమం సాయంత్రం 4గంటలకు ప్రారంభమై రాత్రి 7గంటల వరకూ కొనసాగుతుంది.ఆర్టిస్టిక్ లైసెన్స్.. 25న..సాక్షి, సిటీబ్యూరో: కవితలు, కథలు, సంగీతం, హాస్యం.. ఇలా ఏదైనా సరే మనకు నచి్చన/ వచ్చిన అంశంపై కొన్ని నిమిషాల పాటు మన ఇష్టాన్ని, ప్రతిభను ప్రదర్శించేందుకు వీలుగా ఆర్టిస్టిక్ లైసెన్స్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. మనకు పట్టున్న ఏ భాషలోనైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ నెల 25న జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఉన్న అలైన్ హబ్‌లో నిర్వహిస్తున్న ఈ ఓపెన్ మైక్ కార్యక్రమం సాయంత్రం 5గంటల నుంచి ప్రారంభమవుతుంది.మె‘న్యూ’ ఇటాలియన్ రుచుల టొస్కానో..సాక్షి, సిటీబ్యూరో: సిటీకి ఎన్ని రుచులు పరిచయం అవుతున్నా.. ఎప్పటికీ వన్నెతరగని విదేశీ టేస్ట్‌గా ఇటాలియన్ రుచుల్ని చెప్పొచ్చు. సిటిజనుల్లో ఇటాలియన్ రుచుల ప్రియత్వానికి అనుగుణంగా టొస్కానో పేరిట మరో రెస్టారెంట్ ఏర్పాటైంది. సైబరాబాద్‌లోని నాలెడ్జ్ సిటీ రోడ్లో నెలకొల్పిన ఈ రెస్టారెంట్‌ను ఇటలీ రుచులకు ప్రసిద్ధి చెందిన చెఫ్ గౌతమ్ మంగళవారం ప్రారంభించారు.నగరవాసులు గతంలో రుచి చూడని, ఇటలీలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వంటకాల్ని తాము అందిస్తున్నామని, నేరుగా ఇటలీ నుంచి దిగుమతి చేసుకున్న అత్యుత్తమ ముడి పదార్థాలు, చీజ్‌లను ఉపయోగించి ప్రత్యేక మెనూ తయారు చేశామన్నారు. క్లాసిక్ మార్గెరిటా పిజ్జా, చికెన్ డి టోస్కానో తదితర ఇటలీ వంటకాలు నగరవాసుల్ని ఆకట్టుకుంటాయన్నారు. -
సినీమహోత్సవం! జాతీయ, అంతర్జాతీయ చిత్రాల ప్రదర్శన..
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రేక్షకాదరణ పొందిన సినిమా ఉత్సవాలకు హైదరాబాద్ మరోసారి వేదిక కానుంది. మూవింగ్ ఇమేజెస్ ఫిల్మ్‌క్లబ్ 20 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 23వ తేదీ నుంచి 25 వరకు బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో వివిధ భాషలకు చెందిన చిత్రాలను ప్రదర్శించనున్నారు.23వ తేదీ సాయంత్రం 4 గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా సాయంత్రం 5.45 గంటలకు మరాఠీ కామెడీ చిత్రం ‘బైపన్ భారీ దేవ’ ప్రదర్శించనున్నారు. ప్రముఖ మరాఠీ సినీనటులు వందనాగుప్తా, సుకన్య కుల్కర్ణి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.24వ తేదీ రెండవ రోజు మరో అద్భుతమైన చిత్రం ‘ఆఫ్వాహ్’ ప్రదర్శించనున్నారు. ‘రాత్ కీ సుబ్హా నహీ’, ధారావి, చమేలి వంటి ఎన్నో అత్యుత్తమ చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు సు«దీర్ మిశ్రా ఈ చిత్ర ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అదేరోజు మధ్యాహ్నం అమల అక్కినేని, శార్వానంద్, రితూవర్మ తదితరులు నటించిన తమిళ చిత్రం ‘కనమ్’ ప్రదర్శన ఉంటుంది. చిత్ర దర్శకుడు శ్రీకార్తీక్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు.25న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అసీమ్ మిశ్రాతో ముఖాముఖి చర్చా కార్యక్రమం ఉంటుంది. పాన్‌సింగ్ తోమర్, న్యూయార్క్, బ్యాండ్ బాజా వంటి పలు చిత్రాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అలాగే చివరి రోజు చిత్రాల్లో భాగంగా ‘కాడ్వి హవా’ (చేదు గాలి) సినిమాను ప్రదర్శించనున్నారు. ఎలాంటి టిక్కెట్లు లేవు, అర్ధవంతమైన స్ఫూర్తిదాయకమైన సినిమాలను ప్రేక్షకలోకానికి పరిచయం చేసే లక్ష్యంతో ఈ సినీమహోత్సవం నిర్వహిస్తున్నట్లు మూవింగ్ ఇమేజెస్ ఫిల్మ్‌క్లబ్ నిర్వాహకులు సంఘమిత్ర మాలిక్ తెలిపారు.ప్రదర్శనలు ఇలా..– 23వ తేదీ సాయంత్రం 5.45 గంటలకు బైపన్ భారి దేవ మరాఠీ సినిమా ప్రదర్శన. – 24వ తేదీ ఉదయం 11.30 గంటలకు హిందీ సినిమా ఆఫ్వ్హా. మధ్యాహ్నం 3 గంటలకు తమిళ సినిమా కనమ్ ప్రదర్శన ఉంటుంది. – 25వ తేదీ ఉదయం 11.30 గంటలకు సినిమాటోగ్రాఫర్ అసీమ్ మిశ్రాతో చర్చా కార్యక్రమం, మధ్యాహ్నం 12 గంటలకు కాడ్వి హవా సినిమా ప్రదర్శన.మూవింగ్ ఇమేజెస్ ఫిల్మ్‌క్లబ్ ప్రస్థానం..ప్రముఖ దర్శకులు బిమల్‌రాయ్ కూతురు అపరాజిత సిన్హా మూవింగ్ ఇమేజెస్ ఫిల్మ్క్లబ్ను 2004 ఆగస్టు 28వ తేదీన స్థాపించారు. ఉత్తమ చిత్రాలకు విశేషమైన ప్రాచూర్యం కలి్పంచే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ క్లబ్ ప్రముఖ కవి, రచయిత, దర్శకులు గుల్జార్ సాహెబ్ చేతులమీదుగా ప్రారంభమైంది. 20 ఏళ్లుగా కొనసాగుతున్న అత్యుత్తమ చిత్రాల ప్రదర్శనలో భాగంగానే ప్రస్తుతం 20 ఏళ్ల వేడుకలను నిర్వహిస్తున్నట్లు సంఘమిత్ర చెప్పారు. విభిన్న భాషలకు చెందిన సినీ దర్శకులు, రచయితలు, నటీనటులు ఈ వేడుకల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.ఇవి చదవండి: రెడీ.. సెట్.. గో..! మరో 4 రోజుల్లో.. హైదరాబాద్ మారథాన్! -
రెడీ.. సెట్.. గో..! మరో 4 రోజుల్లో.. హైదరాబాద్ మారథాన్!
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ ఈవెంట్ మరో నాలుగు రోజుల్లో జరగనుంది. ప్రతి సంవత్సరం కంటే ఈసారి సరికొత్తగా మన ముందుకు రానుంది. నగరంలోని ఓ హోటల్లో మారథాన్‌కు సంబంధించి టీషర్ట్, మెడల్స్ లాంచ్ ఈవెంట్ మంగళవారం జరిగింది. ఇందులో ఎన్ఎండీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అమితవ ముఖర్జీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు హెడ్ బ్రాంచ్ బ్యాంకింగ్ సౌత్ నిరీశ్ లలన్, ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొన్నారు.13వ ఎడిషన్ మారథాన్‌కు వర్లడ్ అథ్లెటిక్స్ గుర్తింపు రావడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుందని రేస్ డైరెక్టర్ రాజేశ్ వెచ్చా పేర్కొన్నారు. 30 రాష్ట్రాల నుంచి దాదాపు ఈ ఏడాది 25,500 మంది మారథాన్‌లో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. ఈ మారథాన్‌కు ప్రపంచస్థాయి ఏర్పాట్లు చేశామని వివరించారు. మారథాన్‌లో పాల్గొనే రన్నర్ల సంఖ్య పరంగా చూసుకుంటే.. భారత్‌లోనే అతిపెద్ద రెండో పరుగు ఇదని పేర్కొన్నారు.ప్రైజ్‌మనీ.. రూ.48 లక్షలుఈ మారథాన్‌లో 42 కిలోమీటర్ల దూరం రన్నర్లు పరుగెత్తనున్నారు. ఫుల్ మారథాన్‌తో పాటు హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల పరుగు కూడా ఉంటుంది. ఇటీవలే ఈ మారథాన్ డ్రైరన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ మారథాన్‌లో మొత్తం రూ.48 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. మారథాన్ మొదటి రోజైన 24వ తేదీన ఉదయం 7 గంటలకు ఫన్ రన్ పేరుతో 5కే రన్ ఉంటుంది. ఇది అసలు మారథాన్‌కు కర్టెన్‌రైజర్ లాంటిది. ప్రతిఒక్కరూ రన్నింగ్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ ఫన్ రన్ ఏర్పాటు చేశారు.ఇది హైటెక్స్‌లో ఉంటుంది. ఇక మరుసటి రోజు అసలు ఫుల్ మారథాన్ ప్రారంభం అవుతుంది. పీపుల్స్ ప్లాజా వద్ద ఉదయం మారథాన్ ప్రారంభం అవుతుంది. రాజ్‌భవన్ రోడ్డు, పంజాగుట్ట ఫ్లైఓవర్, కేబీఆర్ పార్కు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, మైండ్ స్పేస్ జంక్షన్, బయోడైవర్సిటీ జంక్షన్, గచి్చ»ౌలి ఫ్లైఓవర్, హెచ్‌సీయూ మీదుగా గచి్చబౌలి అథ్లెటిక్ స్టేడియం వద్ద ముగుస్తుంది. హాఫ్ మారథాన్ పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమై.. 21 కి.మీ. దూరం ఉండేలా నిర్దేశించిన మార్గంలో రన్ ఉంటుంది. గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగుస్తుంది. -
Hyderabad: క్రేజీ మిక్సాలజీ..! సిటీలో ఆదరణ పెంచుకుంటున్న కాక్టెయిల్ మిక్సింగ్..
సాక్షి, సిటీబ్యూరో: వంటకాలను అందంగా తీర్చిదిద్దే క్యులినరీ ఆర్ట్ కావొచ్చు.. పానీయాలను వైవిధ్యంగా మేళవించే కాక్టెయిల్ మిక్సింగ్ కావొచ్చు.. కాదేదీ కళ కావడానికి అనర్హం అంటోంది ఆధునిక ప్రపంచం.. ఇప్పుడు కాక్టెయిల్ మిక్సింగ్ మిక్సాలజీ పేరుతో మరింత ప్రాచుర్యంలోకి వచి్చంది. ఈ కళను ఒంట బట్టించుకుంటే అత్యాధునిక జీవనశైలితో పాటు అనూహ్యమైన ఆదాయం కూడా అందుతుండటంతో యువత తమలోని కల సాకారం కోసం మిక్సాలజీ కళని క్రేజీగా సాధన చేస్తున్నారు. వీరిని మరింత ప్రోత్సహించేందుకు మిక్సాలజీ ఛాంపియన్ షిప్స్ సైతం జరుగుతున్నాయి. ఇటీవలే ఢిల్లీలో జరిగిన డియాగో రిజర్వ్ వరల్డ్ క్లాస్ బార్టెండింగ్ ఛాంపియన్ షిప్లో టాప్–16లో నిలిచిన వారిలో నగరానికి చెందిన గణేష్ బోయినపల్లి మొదటి స్థానంలో నిలవడం సిటీలో యువతకు ఈ కెరీర్ పట్ల ఉన్న క్రేజ్‌కి ఓ నిదర్శనం.సంప్రదాయ రుచులను ఆధునిక పద్ధతులతో మిళితం చేస్తూ మిక్సాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. క్రాఫ్ట్ కాక్‌టెయిల్‌లు ప్రీమియం స్పిరిట్ల పట్ల పెరుగుతున్న ఆదరణతో సిటీలో కాక్టెయిల్ మేకర్స్ అయిన బార్టెండర్లు తమ కళకు మరింత సానబెట్టుకుంటున్నారు. మరోవైపు నవతరం సైతం ఈ రంగంలోకి ప్రవేశించేందుకు ఉత్సాహం చూపుతోంది.ఉపాధికి ఊతం.. ఒకప్పుడు మిక్సాలజీ తెలిసిన బార్టెండర్లు కేవలం బార్లకు మాత్రమే పరిమితం అయ్యేవారు. అయితే ఇప్పుడు ఫైవ్‌స్టార్ హోటల్స్, లాంజ్‌లు, పబ్స్, క్లబ్స్.. వంటివి బాగా పెరిగాక మిక్సాలజిస్ట్స్గా బార్టెండర్లకు గౌరవప్రదమైన పేరు వచి్చంది. అలాగే మిక్సాలజీ ఒక సబ్జెక్ట్‌గా ప్రాచుర్యంలోకి వచి్చంది. కేవలం ఆల్కహాల్ డ్రింక్స్ మాత్రమే కాకుండా మాక్టైల్స్, పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింక్స్.. ఇలా విభిన్న రకాల పానీయాలతో ఈ మిక్సాలజిస్ట్లు వెరైటీ డ్రింక్స్ తయారు చేస్తూ వినియోగదారుల ఆదరణతో పాటు మంచి టిప్స్, రూ.50 వేల వరకూ నెలవారీ ఆదాయం పొందుతున్నారు. దీంతో ఈ ప్రొఫెషన్ ఇప్పుడు యువతకు ప్యాషన్‌గా మారింది.కాక్టెయిల్స్లోనూ హెల్తీ స్టైల్స్..కరోనా తర్వాత వినియోగదారులు సంప్రదాయ పానీయాల వైపు మొగ్గు చూపడం లేదు. దాంతో మిక్సాలజిస్టులు మెనూలను రూపొందించే విధానంలో పూర్తి మార్పు వచ్చింది. సుగంధ ద్రవ్యాలు, మూలికలు పండ్ల వంటి స్థానిక పదార్థాలతో సైతం ప్రయోగాలు చేస్తున్నారు. ఈ మార్పు వల్ల విభిన్నమైన రుచిని అందించే కాక్టెయిల్లకు డిమాండ్ పెరిగింది. మారుతున్న ట్రెండ్లు వినియోగదారుల ప్రాధాన్యతలతో, బార్టెండర్లు తమ కెరీర్‌ను బలోపేతం చేసుకోవడానికి ప్రత్యేకమైన సువాసనగల పానీయాలను రూపొందించడానికి కొత్త పద్ధతులను నిరంతరం అన్వేషిస్తున్నారు.అభ్యాసమే.. అభివృద్ధి..గతంతో పోలిస్తే తాజాగా మేము నిర్వహించిన అల్టిమేట్ బార్టెండింగ్ ఛాంపియన్‌షిప్‌కు అత్యధిక సంఖ్యలో యువత హాజరవడం ఈ రంగంపై పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం. ఈ రంగంలో నైపుణ్యాల అభివృద్ధికి నిరంతర అభ్యాసం అవసరం. బ్రాండ్లు బార్టెండర్లు తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడటానికి శిక్షణ, మార్గదర్శకత్వం వనరులను అందించడం వంటివి యువతకు ఊతమిస్తున్నాయి. కాక్టెయిల్లను తయారు చేసేటప్పుడు మిక్సాలజిస్ట్లు తమ నైపుణ్యాలను నిరంతరం సానబెట్టాల్సిందే. తమ పని ఎవరినీ ఆకట్టుకోవడం కాదు. అతిథులను సంతోషపెట్టడం మాత్రమే అని మిక్సాలజిస్ట్లు గుర్తుంచుకోవాలి. – గౌరవ్ షరీన్, ప్రముఖ మిక్సాలజిస్ట్ -
Hyderabad: ‘హరేకృష్ణ’ టెంపుల్.. 430 అడుగులు!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరం మరో ఆధ్యాత్మిక కట్టడానికి ముస్తాబవుతోంది. హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ‘హరే కృష్ణ హెరిటేజ్ టవర్’ పేరుతో 430 అడుగుల ఎత్తులో అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించనున్నారు. నార్సింగిలోని గోష్పాద క్షేత్రంలో ఆరు ఎకరాల స్థలంలో నిర్మించనున్నారు. శ్రీరాధా, కృష్ణుల అద్భుతమైన విగ్రహాలతో పాటు సీతారామచంద్రులు, గౌర నితాయి విగ్రహాలను ఈ దేవాలయంలో ప్రతిష్ఠించనున్నారు.శ్రీనివాస గోవిందుడి కోసం పూర్తిగా రాతి నుంచి దేవాలయాన్ని చెక్కనున్నారు. ఈ ప్రాజెక్టులో కాకతీయులు, చాళుక్యులు, ద్రవిడ సంస్కృతి, విభిన్నమైన పురాతన కాలం నాటి దేవాలయ కట్టడాల సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. శ్రీకృష్ణ గోసేవ మండల్ ఈ ప్రాజెక్టుకు భూసేవక్లుగా వ్యవహరించనున్నారు. ఈ క్యాంపస్‌లో లైబ్రరీ, మ్యూజియం, థియేటర్, పిల్లలు, యువతకు ఆధ్యాత్మిక, సంస్కృతి, సంప్రదాయాలపై బోధనలు చేసేందుకు భగవద్గీత హాల్స్ నిర్మించనున్నారు. ఇక, ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించి అనంత శేష స్థాపన కార్యక్రమం ఈ నెల 23వ తేదీన జరగనుంది. కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే హరేకృష్ణ మూమెంట్ చైర్మన్ శ్రీమధు పండిట్ దాస ప్రభుజీ, అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీసత్య గౌర చంద్ర దాస ప్రభు జీ తదితరులు పాల్గొననున్నారు. -
Hyderabad: డెలీషియస్ గోల్డ్ ఐస్‌క్రీం అంటే అట్లుంటది.. మన హైదరాబాద్‌తోని!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ అంటేనే వైవిధ్యానికి ఆలవాలం. ఆహర్యంతోపాటు ఆహారంలోనూ విభిన్నతకు అది వేదిక. రకరకాల రుచులకు అడ్డా. ఫుడ్ లవర్స్‌కు స్వర్గధామం. ఇక్కడ హైదరాబాదీ బిర్యానీయే కాదు.. దక్షిణ, ఉత్తర భారత సంప్రదాయ వంటకాలు, వెస్టర్న్ ఫుడ్, చైనీస్, జపనీస్.. ఇలా ఎన్నో దేశాల ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. అలా వారాంతంలో కాస్త డిఫరెంట్ ఫుడ్ తినాలనుకోవాలే కానీ.. దానికి కొదువే ఉండదు. అట్లుంటది మన హైదరాబాద్‌తోని. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే... బంగారం ఏమైనా తింటామా.. ఏంటి? అని ఎవరైనా మాట వరుసకు అనేవారు ఒకప్పుడు.కానీ, ఇప్పుడు బంగారాన్ని కూడా తినేస్తున్నారండోయ్. గోల్డ్ దోశ, గోల్డ్ ఇడ్లీ, గోల్డెన్ స్వీట్స్.. ఇలా బంగారపు పూత ఉన్న ఫుడ్ ఐటెమ్స్‌ను హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఈ వరుసలోకి ఐస్‌క్రీం కూడా వచ్చి చేరింది. హైదరాబాద్‌లో కూడా గోల్డ్ ఐస్‌క్రీం కూడా దొరుకుతోందా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే మన నగరంలో అచ్చు 24 క్యారెట్ల గోల్డ్ ఐస్‌క్రీం లభిస్తోంది. అదెక్కడ అంటారా? మాదాపూర్‌లోని హూబర్, హోలీలో ఈ ఐస్క్రీంను అందుబాటులోకి తీసుకొచ్చారు. మైటీ మిడాస్ పేరుతో ఈ ఐస్క్రీంను అమ్ముతున్నారు. ఖరీదు జస్ట్.. రూ.1,179. సాధారణ కోన్‌లో డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో సర్వ్ చేస్తుంటారు. ఐస్‌క్రీం పైన 24 క్యారెట్ల గోల్డ్ పేపర్‌తో అందంగా ముస్తాబు చేసి మనకు అందజేస్తారు. ఇంకేముంది.. ఇక మోస్ట్ డెలీషియస్ ఐస్క్రీంను ఆరగించేయడమే. -
Hyderabad: త్వరలో.. ‘మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్’ 2024– సీజన్ 1..
సాక్షి, సిటీబ్యూరో: అందమైన వేడుకకు నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. మగువలకు ఈ వేడుక ‘స్ట్రాంగ్’మెసేజ్ ఇవ్వనుంది. మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ 2024– సీజన్ 1 జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి నిర్వహించనున్న ఈ బ్యూటీ పేజెంట్ ఆడిషన్స్ అక్టోబర్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ కర్టెన్ రైజర్‌ను వ్యవస్థాపక నిర్వాహకులు కిరణ్మయి అలివేలు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఔత్సాహిక వనితల నిత్యజీవితంలోని ఆలోచనలు, ఆశయాలకు పెళ్లి ముగింపు కాదు, మరో అద్భుత ఆరంభమని అన్నారు. మగువల సౌందర్యాన్ని మరింత గ్రాండ్‌గా ప్రదర్శించడానికి ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆడిషన్స్‌లో పాల్గొనాలనుకునే ఔత్సాహికులు www.sbtribe.org లేదా https://sbtribe.org/ వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోడల్స్, యువతులతోపాటు ఔత్సాహిక వివాహితలతో నిర్వహించిన ఫ్యాషన్ వాక్ విశేషంగా అలరించింది. -
Hyderabad: కిలిమంజారో పర్వతం.. అధిరోహించిన ప్రీతం!
లక్డీకాపూల్: నగరం నుంచి కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన అతి పిన్న వయసు్కలలో ఒకరిగా ప్రీతం గోలీ చరిత్ర సృష్టించాడు. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న 16 ఏళ్ల ఎన్సీసీ క్యాడెట్ సాహస యాత్ర చేపట్టారు. 8 రోజుల ఈ యాత్రలో శిఖరాన్ని గత నెల 17న చేరుకున్నారు. ప్రముఖ పర్వతారోహకుడు సత్య రూమ్ సిద్ధాంత మార్గదర్శకంలో నలుగురు బృందంతో కూడిన ప్రీతం గత నెల 12న యాత్ర చేపట్టాడు. మరింత ఎతైన శిఖరాలను అధిరోహించాలన్నదే తన తపన అని ప్రీతం అన్నారు. ‘కిలిమంజారో నిటారుగా, కంకర, ఇసుకలతో కూడిన జారే నేల కావడంతో కష్టమనిపించింది. శిఖరాగ్రం చేరుకున్న తర్వాత గర్వంగా భారత జాతీయ జెండా, ఎన్సీసీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జెండాను ఎగరవేశా’అని అన్నారు. -
Hyderabad: పటోలా ఆర్ట్స్.. వస్త్ర ప్రదర్శన ప్రారంభం!
సాక్షి, సిటీబ్యూరో: బంజారాహిల్స్‌లోని లేబుల్స్ పాప్–అప్ స్పేస్ వేదికగా కొలువుదీరిన ’డి సన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శన’ను ప్రముఖ సామాజికవేత్త బినా మెహతా ప్రారంభించారు. విభిన్నమైన హ్యాండ్లూమ్ చీరలతోపాటు పటోలా ఆర్ట్ చీరలు, డిజైనర్ వేర్ వ్రస్తోత్పత్తులను ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమని ఆమె అన్నారు. వస్త్ర ఉత్పత్తులను ఫ్యాషన్‌ప్రియులకు నేరుగా అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన అద్భుతంగా ఉందన్నారు.డి సన్స్ పటోలా ఆర్ట్స్ ఎక్స్పో నిర్వాహకులు భవిన్ మక్వానా మాట్లాడుతూ చేనేత పరిశ్రమకు మంచి మార్కెట్‌ను అందించడమే ఈ ఎగ్జిబిషన్ లక్ష్యమని వివరించారు. ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో రాజ్‌కోట, పటోలా దుపట్టా, పటోలా శాలువాలు, సింగిల్ పటాన్ చీరలు, సింగిల్ పటోలా దుప్పట, పటాన్ పటోలా చీరలు, సిల్క్ టిష్యూ పటోలా వంటి 2 వేల రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.35 మంది కళాకారులు.. 70 చిత్రాలు!– ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభమైన చిత్రప్రదర్శనమాదాపూర్: కళాకారులు వేసిన చిత్రాలు సందేశాత్మకంగా ఉన్నాయని తెలంగాణ టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్ అన్నారు. మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్‌గ్యాలరీలో సోమవారం ఏర్పాటు చేసిన చిత్రప్రదర్శనను ఆమె ప్రారంభించారు.మున్ముందు చిత్రకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. 35 మంది కళాకారులు వేసిన 70 పెయింటింగ్ చిత్రాలు అందుబాటులో ఉన్నాయని ఈ నెల 25వ తేదీ వరకు ప్రదర్శన కొనసాగనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్కియాలజీ డైరెక్టర్ భారతి హోలికేరి, ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కె.లక్షి్మ, టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ఎం.డి. ప్రకాశ్‌రెడ్డి, టూరిజం డైరెక్టర్ ఇలా త్రిపాఠి, భాషా సాంస్కృతిక డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కళాకారులు పాల్గొన్నారు. -
హాయ్.. 'హ్యాండ్'లూమ్! చేనేత కళాకారుల కలల సాకారం కోసం..
సాక్షి, సిటీబ్యూరో: జీవితాన్ని కాచివడబోసి మరెందరి జీవితాలనో తీర్చిదిద్దుతున్న లైఫ్ కోచ్ ఒకరు.. పల్లెటూరు నుంచి వచ్చినా ప్రముఖులకు సైతం డ్రెస్సింగ్ నేర్పుతున్న సెలబ్రిటీ డిజైనర్ మరొకరు... జెండర్ మార్చుకున్న వండర్ ఉమెన్ ఒకరైతే... ఆర్గానిక్ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు మరొకరు... క్యాట్‌వాక్ చేసేవారిని మోడల్స్ అంటారు. కానీ, క్వీన్ వాక్ చేసేవారిని విజేతలు అంటారు.. చేనేత కళాకారుల కలల సాకారం కోసం ఇలా కాంతలంతా... విజయకాంతులై కళకళలాడారు.. వీరి విజయాలెంత ఉన్నతమైనవో.. వీరి నడక వెనుక చేనేతలకు చేయూతనివ్వాలనే లక్ష్యం అంతే సమున్నతమైనది. ‘హ్యాండ్లూమ్ సోయిరీ’ ఈవెంట్ నగర శివార్లలోని కోకాపేట్లో ఉన్న కేసీయార్ కన్వెన్షన్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకుల తరపున శాంతికృష్ణ తదితరులు ‘సాక్షి’తో తమ ఆలోచనలను పంచుకున్నారు. అవి వారి మాటల్లో...చేనేత.. చేయూత.. గతంలో దేశవ్యాప్తంగా ఉన్న ఒక శారీ లవర్స్ గ్రూప్‌లో మేం సభ్యులుగా ఉండేవాళ్లం. ఆన్ లైన్ వేదికగా నడిచే ఆ సంస్థ ద్వారా వైవిధ్యభరితమైన చీరకట్టుతో పాటు ఆలోచనలు కూడా పంచుకునేవాళ్లం. ఆ క్రమంలోనే నగరానికి చెందిన కొందరం కలిసి, చేనేత, హస్త కళాకారుల పరిస్థితులపై చర్చించాం. వారికి ఏదో విధంగా అండగా ఉండాలని, దీన్ని ఒక సొసైటీగా మార్చాలని అనుకున్నాం. 16 మంది కమిటీ మెంబర్స్, ముగ్గురు అపెక్స్ మెంబర్స్‌తో హ్యాండ్లూమ్కి సాయం అందించే సొసైటీగా ఏర్పడాలని భావించాం. ఈ కార్యక్రమాలను ప్రకటించడం కోసమే ఈ ఈవెంట్ నిర్వహించాం.ఈ సొసైటీలోని సభ్యులు అంతా తలా కొంతడబ్బు వేసుకోవడంతో పాటు విభిన్న రకాల ఈవెంట్ల నిర్వహణ ద్వారా నిధి సేకరించాలని నిర్ణయించుకున్నాం. ఆ నిధితో చేనేత హస్తకళాకారుల మరమగ్గాలు, ఇతర పరికరాల మరమ్మతుకు చేయూత అందించడం, స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా కోర్సులు తయారు చేయించడం, కార్పొరేట్ కంపెనీల సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)తో నిర్వహించే కార్యక్రమాలకు వీటిని అనుసంధానించడం, చేనేత కళాకారుల పిల్లలు ఎవరైనా తమ కళలో శిక్షణ పొందాలంటే స్కాలర్íÙప్లు అందించడం వంటివి చేపట్టాలని నిర్ణయించుకున్నాం.నిధి.. సేవకు పెన్నిధి..తరచూ మెంబర్స్ మీట్స్, గెట్ టు గెదర్స్ నిర్వహించడం కూడా ఈ సొసైటీ కార్యక్రమాల్లో భాగమే. అందులో పాల్గొన్నవారు చేనేత చీరలు ధరించి ర్యాంప్ వాక్ చేయడంతో పాటు రోజంతా ఆటపాటలు, నృత్యాలతో సందడి చేస్తారు. ఇది విభిన్న వృత్తులు, వ్యాపకాల్లో బిజీబిజీగా గడిపే మహిళలకు ఆటవిడుపుగా ఉండటంతోపాటు దీని ద్వారా సేకరించిన నిధులను ఓ మంచి సేవా కార్యక్రమానికి వినియోగించాలనేదే మా ఆలోచన.కళ.. కళకళలాడాలనే... మా జీవితాలతో చేనేత చీరలు, దుస్తులది విడదీయలేని అనుబంధం. ఆయా రంగాల్లో మేం ముందడుగు వేసే క్రమంలో అవి హుందాతనాన్ని అందిస్తూ, సంప్రదాయ వైభవాన్ని పెంచాయి. అలాంటి చేనేత కళ భావితరాలకు సైతం అందాలనే ఆలోచనతోనే ఈ సొసైటీకి రూపకల్పన చేశాం. ఈ ఫస్ట్ ఈవెంట్ సక్సెస్ అవడం మాకు సంతోషాన్ని ఇచి్చంది. ఇకపై కూడా వీలున్నన్ని ఈవెంట్స్ నిర్వహించి చేనేత కళాకారులకు చేయూత అందిస్తాం. మాతో చేతులు కలపాలని అనుకునేవారిని ఆహా్వనిస్తున్నాం. – శాంతికృష్ణ, నిర్వాహకురాలు -
Health: వర్క్లెస్.. మోర్ ఫిట్..!
ఉరుకులు, పరుగుల నగరజీవితంలో శరీరానికి శ్రమలేకుండా పోతోంది. దీంతో శరీరంలో భారీగా కొవ్వులు పేరుకుపోతున్నాయి. వీటిని కరిగించేందుకు రకరకాల ఉత్పత్తులూ మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. ఓ వైపు సహజ సిద్ధమైన వ్యాయామ పరికరాలు, రకరకాల ఫుడ్ అండ్ డైట్ ప్లాన్స్, న్యూట్రిషన్ సెంటర్లు, ఫిట్నెస్ సెంటర్లూ వెలసినా.. వాటిని అనుసరించడానికి తీరిక, ఆరి్థక స్థోమత లేక పక్కన పెట్టేస్తున్నారు. అలాంటి వారి కోసమే మార్కెట్లోకి ఎలక్రి్టకల్ మజిల్ స్టిమ్యులేటర్స్ వస్తున్నాయి.. వీటిని షార్ట్ కట్లో ఏఎమ్ఎస్ అంటారు. వీటిని నగరంలోని అనేక జిమ్‌లు ప్రవేశపెట్టాయి. ఇంతకీ ఏఎమ్ఎస్ అంటే ఏమిటి? ఇది నిజంగా శారీరక దృఢత్వాన్ని మెరుగుపరుస్తుందా? ఇది సురక్షితమేనా? దీని ద్వారా తక్కువ శ్రమతో కండలు తిరిగిన శరీరాన్ని పొందగలదా? మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.. – సాక్షి, సిటీబ్యూరోఇది సైన్స్.. – ఆధారిత వ్యాయామ పద్ధతి. సాధారణంగా పట్టించుకోని కండరాలను సైతం ఉత్తేజపరిచేందుకు తక్కువ–ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రికల్ ఇంపల్స్ని ఉపయోగించడం ద్వారా పూర్తి స్థాయి శిక్షణా సెషన్‌కు ఇది సమానమైంది. స్ట్రోక్ నుంచి కోలుకుంటున్న వారు మల్టీ్టపుల్ స్క్లెరోసిస్ ఉన్నవారు వారి చలనశీలతను తిరిగి పొందేందుకు అనేక రకాల వైద్యపరమైన రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు సహాయం చేయడానికి వైద్యులు చాలా కాలంగా దీనిని ఉపయోగిస్తున్నారు. అదే కొద్దిపాటి మార్పు చేర్పులతో ప్రస్తుతం జిమ్స్‌లో చేరింది. పర్యవేక్షణ తప్పనిసరి.. వినియోగదారులు ఓ మెషీన్‌కు అనుసంధానించిన పూ ర్తి ఎలక్ట్రోడ్లను తప్పనిసరిగా ధరించాలి. ఆ మెషీన్ విద్యుత్ తరంగాలను వైర్లు ,ఎలక్ట్రోడ్ల ద్వారా శరీరంలోని కండరాల్లోకి పంపుతుంది. దీని కోసం ప్రత్యేకమైన సూట్లు, పొట్టి చేతుల టాప్ షార్ట్‌లు అవసరం అవుతాయి. పూర్తిగా సమర్ధత కలిగిన శిక్షకుడి పర్యవేక్షణలో మాత్రమే ఈ సెషన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. లాభాలూ.. జాగ్రత్తలూ... గతంలో ఫిజియోథెరపిస్ట్‌ల వద్ద మాత్రమే ఉండే ఈ పరికరాలు ఇప్పుడు వ్యాయామ ప్రియులకు అందుబాటులోకి వచ్చాయి. ఇవి కండర ఉద్దీపనలో సహాయపడే అనేక పోర్టబుల్ పరికరాలు. వర్కవుట్ తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి, వ్యాయామాల కోసం వేడెక్కడానికి లేదా గాయమైతే పునరావాస దశలో సహాయపడతాయి. ఈ పరికరాలను జాగ్రత్తగా ఉపయోగించడం అవసరం. వీటితో అదనపు కండరాల పునరుద్ధరణ లభిస్తుంది. కానీ, అధిక వినియోగం తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఆరంభంలో నిపుణుల సలహా తీసుకోవడం అవసరం.ఐరోపా నుంచే... ఫిట్నెస్ మార్కెట్లో ఎలక్ట్రో కండరాల ప్రేరణ అనే తాజా సాంకేతికత ఐరోపాలో బాగా ప్రాచుర్యం పొందింది. కండరాల సంకోచాలను ప్రేరేపించడానికి వివిధ రకాల విద్యుత్ ప్రవాహాలను ఇది ఉపయోగిస్తుంది. దీని ద్వారా శరీరం అంతటా రక్త ప్రసరణ పెరుగుతుంది, తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. –సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ రామోనా బ్రాగంజాహాలీవుడ్ సెలబ్రిటీలు సైతం.. ఇది కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి గొప్ప మార్గం. హెడీ క్లమ్, ఎలిజబెత్ హర్లీ మడోన్నా వంటి హాలీవుడ్ ప్రముఖులు ఈ టెక్నిక్‌ను ఉపయోగించారు. ఇది చెమట పట్టకుండా కండరాలను నిరి్మంచడానికి సులభమైన మార్గం. – ఫిట్నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా20 నిమిషాల సూట్.. 90 నిమిషాల వర్కవుట్!‘‘ఫిట్నెస్ పరిశ్రమలో ఇదో ఉత్తేజకరమైన మార్పు. దీని సూట్లు ఫిట్నెస్ ఔత్సాహికుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ సూట్లో 20 నిమిషాల పాటు వర్కవుట్ 90 నిమిషాల సాంప్రదాయ వర్కవుట్‌కి సమానం. ఈ ఏఎమ్ఎస్ సూట్లు సెకనుకు 85 కండరాల సంకోచాలను ఉత్పత్తి చేస్తాయి. ప్రధాన కండరాల సమూహాల ద్వారా 98% కంటే ఎక్కువ కండరాలను కదిలేలా చేస్తాయి. కండరాల సడలింపు, పునరుద్ధరణ, చలనశీలతను పెంచడం, స్థిరత్వాన్ని మెరుగుపరచడం, బిగించడం, టోనింగ్ చేయడం, శక్తి స్థాయిలు, రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. ఫిట్‌నెస్‌కు మాత్రమే కాకుండా ఇది ఆస్టియో ఆర్థరైటిస్, ఫైబ్రోమైయాల్జియా, స్నాయువు, నడుము నొప్పి, దీర్ఘకాలిక కటి నొప్పి, మధుమేహం సంబంధిత నరాలవ్యాధి, పరి«దీయ ధమని వ్యాధి వంటి అనేక సమస్యల చికిత్సలో ఉపయోగించబడుతుంది. – ఫిట్నెస్ నిపుణులు, మీనాక్షి మొహంతి -
సోషల్ మీడియాలో సాఫ్ట్వేర్ దంపతుల ట్రెండ్
ఒకరేమో సాప్ట్వేర్ ఉద్యోగం వదిలి మీమర్‌గా, మరొకరు సింగర్.. ఇద్దరూ నేడు సోషల్‌మీడియా వేదికగా నవ్వులు పూయిస్తూ, సరికొత్త కంటెంట్‌తో ఆకట్టుకుంటున్నారు. ప్రవృత్తినే వృత్తిగా మలిచిన సాహిని శ్రీహర్ష, ప్రతిమ కొరడ దంపతులు నేడు ట్రెండింగ్‌లో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో వీరికి లక్షల్లో ఫాలోవర్స్‌ని సంపాదించి ట్రెండింగ్‌లో ఉన్న మాటలు, విజువల్ ఫొటోలు, విడియోలతో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఏ రంగమైనా సోషల్ మీడియాలో మీమ్స్, వీడియో క్రియేటివిటీతోనే మార్కెట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఒకరు డ్యాన్సర్, మరొకరు మీమర్ సోషల్ మీడియాలో సాఫ్ట్వేర్ దంపతుల ట్రెండ్ మీమ్స్ మార్కెట్లో ఆలోచనలే పెట్టుబడిగా ప్రవృత్తినే వృత్తిగా మలచుకున్న శ్రీహర్ష, ప్రతిమసృజనాత్మకత, కొంగొత్త ఆలోచనలే పెట్టుబడి. మీమ్స్, వీడియోస్‌తో మీమ్ మార్కెటింగ్ చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వీరి ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు.డ్యాన్స్, మీమ్స్‌లో ప్రావీణ్యం.. నాకు డ్యాన్స్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. బీటెక్ అయ్యాక డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా బెంగుళూరులో పనిచేశా. కానీ ఇంట్లో నో చెప్పడంతో 2017–18లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా మారాను. అయితే డ్యాన్స్ వీడియోలు చేయడం అలవాటుగా మారింది. అలా హైదరాబాద్ వచ్చి నచి్చన కంటెంట్‌తో విడియోలు స్టార్ట్ చేశాను. లాక్డౌన్ సమయంలో హైదరాబాద్‌లోనే ఉంటూ మరింత ట్రెండింగ్ కంటెంట్‌తో వీడియోలు చేశాను. లైట్ బా అనే మీమ్ పేజ్‌ను స్టార్ట్ చేశాను. మీమ్స్, వీడియోస్‌కి మంచి స్పందన వచ్చింది. కానీ మీమర్‌గా కూడా సంపాదించవచ్చని తెలియదు. కొంత మంది సలహాలతోనే.. కొంతమంది సోషల్‌మీడియా వ్యక్తులను కలిసినపుడు వారి నుండి కొన్ని సలహాలు తీసుకున్నాను. లైట్ బా పేజీకి 5లక్షల మంది, హర్ష ఈజ్ అవైలబుల్ యూట్యూబ్ ఛానెల్‌కి 3లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌కి 2.6లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు. చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి. దీంతో మీమ్ మార్కెటింగ్‌ను మూవీస్, ఒరిజినల్ స్ట్రీమింగ్ సరీ్వస్‌లకు కంటెంట్, ప్రమోషన్ వీడియోస్ చేస్తూ జీవనోపాధి పొందుతున్నాను. యాక్టర్‌గా చేయాలని ఉంది. మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను.సింగర్ టూ మీమర్... నేను సింగర్‌ని.. సరిగమపలో 2020లో కంటెస్టెంట్‌గా చేశాను. కొన్ని పాటలు కూడా పాడాను. నాకు హర్షకి సోషల్‌మీడియా వేదికగా పరిచయం ఉందికానీ మాట్లాడుకోలేదు. మ్యూచువల్గా ఇద్దరికీ మ్యారేజ్ ప్రపోజల్ వచి్చంది. ఇద్దరి మనసులూ కలిశాయి. పెళ్ళి చేసుకున్నాం. నాకు యాక్టింగ్ తెలీదు. కానీ మీమ్ విడియోస్లో చేశారు. హర్ష నా నటన చూసి మెచ్చుకున్నాడు. ఇద్దరం కలిసి యూట్యూబ్, ఇన్‌స్టాలో మీమ్ వీడియోస్ చేస్తుంటాము. నాకు ఇన్‌స్టాలో 85వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇద్దరి వృత్తులు వేరైనా మీమ్ మార్కెంటింగే ఉద్యోగంగా మలుచుకున్నాం. మా కంటెంట్‌తో నెటిజన్లు నవ్వుకుంటే మేము గెలిచినట్టే. -
భావితరాల కోసం..
ఒకప్పుడు ప్రజలంతా చేదుడుబావి, మెట్ల బావుల నీటిని తాగేవారు. కాలక్రమంలో వాటిని పక్కన పెట్టి చెరువులు, వాగులు, బోర్లు, కులాయిల నీటిని తాగుతున్నారు. ఓ దేవాలయం ఉందంటే దానికి చుట్టుపక్కల ఓ బావిని తవ్వి కోనేరుగా వాడే వారు. కాల క్రమంలో వాటి నిర్వహణ భారం కావడం, ఆ నీటిని వాడకపోవడంతో అవన్నీ పూడుకుపోయాయి. అలాంటి మెట్ల బావుల విశిష్టతను నేటి తరానికి తెలియజేయటంతో పాటు వాటిని ఎన్నో జీవరాశులకు కేంద్రంగా మార్చేందుకు సాహే అనే ఎన్జీఓ సంస్థ కృషి చేస్తుంది. అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో బన్సీలాల్‌పేట మెట్ల బావిని పునరుద్ధరించి రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి ఓ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ప్రారంభించిన విషయం తెలిసిందే. – మణికొండబన్సీలాల్పేట మెట్ల బావి తరహాలోనే రాష్ట్రంలోని గచ్చిబౌలి, బైబిల్‌హౌస్, కోకాపేట, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, మంచిరేవుల లాంటి 25 చోట్ల బావులను పునరుద్ధరించారు. పనికిరాని వాటిగా మరుగున పడిన వాటికి జీవం పోసి తిరిగి ఉపయోగంలోకి తేవటం, ఏకంగా వాటిని పర్యాటక, సాంస్కృతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడం అందరినీ ఆకర్షిస్తున్నాయి. జీవరాశులకు ఉపయుక్తంగా.. వందల సంవత్సరాల పాటు ప్రజలకు ఉపయోగపడిన బావులను పునరుద్ధరిస్తే మరో వంద సంవత్సరాల పాటు ప్రజలకు జీవరాశులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో చేపడుతున్న పనులు మన్ననలు పొందుతున్నాయి. బావులను పునురుద్ధరించడంతో పాటు వాటి చుట్టూరా లైటింగ్, పార్కులు ఏర్పాటు చేస్తుండటంతో వాటి వద్ద గడిపేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, చెరువులు, కాలువలు, నదులను పునరుద్ధరించి, వాటిని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో సాహే సంస్థ 12 సంవత్సరాలుగా కృషి చేస్తోంది. అదే క్రమంలో ఇలాంటి మూతబడిన బావులను పునరుద్ధరిస్తే ప్రజలకు ఉపయోగపడతాయని పలువురు సలహా ఇవ్వడంతో వాటి పునరుద్ధరణ పనులను గత మూడు సంవత్సరాలుగా చేపడుతున్నారు. అందులో భాగంగా 25వ బావిగా మంచిరేవుల వేణుగోపాలస్వామి దేవాలయం ఆవరణలో ఉన్న బావిని పునరుద్ధరించారు. దేవాలయానికి ఆగ్నేయంలో వాస్తుకు విరుద్ధంగా ఉందనే ఉద్దేశంతో దాన్ని గతంలో పూర్తిగా పూడ్చివేశారు. సాహే ప్రతినిధులు అలాంటి బావుల విశిష్టతను తెలపడంతో తిరిగి తెరిచేందుకు ఆలయ పూజారులు అంగీకరించటంతో నెల రోజులుగా శ్రమించి పునరుద్ధరించారు. దానిని మరింత అందంగా తీర్చి దిద్దేందుకు చుట్టూరా గోడకట్టడం, లైటింగ్, పార్కు ఏర్పాటు పనులను కొనసాగిస్తున్నారు. ఈ పనులన్నింటికీ రూ.38 లక్షలను వెచి్చస్తున్నారు. కామారెడ్డిలోనూ మరో బావిని, చందానగర్‌లోని భక్షికుంట బావిని పునరుద్ధరించే పనులను చేపడుతున్నారు.జల భాండాగారాలుగా.. పురాతన బావులను పునరుద్ధరిస్తే దాని కేంద్రంగా అనేక జీవరాశులు జీవనం ఏర్పాటు చేసుకుంటాయి. వాటిని కాస్త తీర్చిదిద్దితే పర్యాటక కేంద్రాలుగా ఉపయోగపడతాయి. వాటిల్లో చెత్తా చెదారం వేసి మూసివేసి నిరుపయోగంగా మార్చారు. ఒక్క బావి ఉంటే దాని చుట్టుపక్కల భూగర్భ జలం పెరుగుతుంది. దీంతో ప్రజలు నీటి బాదల నుంచి కొంతైనా ఉపశమనం పొందవచ్చు. రాష్ట్ర స్థాయిలో ఇలాంటి బావులు ఎక్కడ ఉన్నా వాటిని పునరుద్ధరిస్తాం. ఇలాంటి కార్యక్రమాలకు అవసరమైన నిధులను పలు సంస్థల నుంచి సీఎస్ఆర్గా తీసుకుంటున్నాం. – కల్పన రమేష్ సాహే సంస్థ నిర్వాహకురాలు -
Hyderabad: మొఘల్‌పురాలో.. అరుదైన కాయిన్స్, కరెన్సీ ఎగ్జిబిషన్!
నిజాం కరెన్సీతో పాటు బ్రిటిష్ కరెన్సీకి ఇప్పటికీ డిమాండ్ ఉంది. అరుదైన కాయిన్స్, కరెన్సీ ఎగ్జిబిషన్ పాతబస్తీ మొఘల్‌పురాలోని ఉర్దూ ఘర్‌లో గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ నెల 17 వరకూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ కొనసాగనుంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఏపీజే అబుల్ కలాం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ ఎగ్జిబిషన్లో ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలకు సంబంధించిన పురాతన నాణేలు, నోట్లు అందుబాటులో ఉంచారు. మన వద్ద ఉన్న పురాతన కరెన్సీని ఇక్కడ విక్రయించ వచ్చు.. అలాగే తమకు నచి్చనవి కొనుక్కోవచ్చు. వాటికున్న చారిత్రక ప్రాధాన్యత, ప్రాముఖ్యతను బట్టి ధరలు ఉన్నాయి.ఇప్పటి తరం విద్యార్థులకు ఒకప్పటి సిల్వర్(అల్యూమినియం)తో తయారైన ఒక్క పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు పైసలు ఎలా ఉంటాయో తెలీదు. ఒకటి నుంచి ఐదు వరకూ.. మధ్యలో నాలుగో పైసా ఉండదనే విషయం కూడా తెలిసి ఉండదు. తూటు పైసతో పాటు వెండి, బంగారు నాణేలు సైతం చూడని వారున్నారు. వీరందరి సౌకర్యార్థం పాతబస్తీ మొగల్‌పురాలోని ఉర్దూ ఘర్‌లో పురాతన నాణేలు, కరెన్సీతో పాటు పురాతన వస్తువులతో కూడిన ప్రత్యేక ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంది. అల్ ఇండియా చార్మినార్ ఎగ్జిబిషన్ ఆఫ్ కాయిన్స్ అండ్ కరెన్సీ ఇన్ హైదరాబాద్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ను బీఎస్ఎన్ఎల్ మాజీ సీటీఎస్ ముంతాజ్ హుస్సేన్ ప్రారంభించారు. – చార్మినార్తూటు పైసా నుంచి ఏక్ అణా వరకూ..ఇప్పటి తరం వారు చూడని నోట్లు, కాయిన్స్ ఎన్నో ఈ ఎగ్జిబిషన్లో ఉన్నాయి. నిజాం కాలం నాటి ఏక్ అణా, దో అణా.. నయా పైసా, తూటు పైసా, సిల్వర్, గోల్డ్ కాయిన్స్ అందుబాటులో ఉన్నాయి. కేవలం కరెన్సీ మాత్రమే కాకుండా అప్పటి పోస్టల్ స్టాంప్స్, బ్యాంకుల్లో వినియోగించిన టెల్లర్ టోకెన్, సిల్వర్, మెటల్, బ్రాంజ్‌తో తయారైన కుళాయిలు, దీపాంతలు..ఇలా అన్ని రకాల పురాతన వస్తువులకూ ఉర్డూ ఘర్ వేదికైంది.సేకరణకు చక్కటి వేదిక..నగరంతో పాటు గుంటూరు, ముంబయి, ఢిల్లీ, అకోలా, బెంగళూర్, నాగ్‌పూర్, ఓడిస్సా, బీహార్, చెన్నై, కలకత్తా తదితర ప్రాంతాలకు చెందిన ఏజెన్సీలు పురాతన కరెన్సీ, కాయిన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నారు. పురాతన వస్తువులు సేకరించే హాబీ ఉన్నవారికి ఇది చక్కటి వేదిక.నాటి కరెన్సీతోనే.. నాటి కరెన్సీతో నిజాం నవాబులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా దాన, ధర్మాలతో పాటు భారీ భవనాలను నిర్మించారని పలువురి విశ్వాసం. అందుకే నాటి వెయ్యి రూపాయలకు రూ.5 లక్షల వరకూ డిమాండ్ ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇటీవల జర్మనీకి చెందిన ఓ వ్యక్తి రూ.5 లక్షలు పెట్టి ఖరీదు చేశాడని.. తిరిగి తమకు విక్రయిస్తే.. రూ.5లక్షల 50వేలు ఇస్తామంటున్నా.. ఇవ్వడానికి ఇష్టపడడం లేదని చెబుతున్నారు. ఇది అప్పట్లో లండన్‌లో ముద్రించారని, అందుకే డిమాండ్ అని చెబుతున్నారు.ఏడాదికోసారి..ఇలాంటి అరుదైన పురాతన వస్తువుల ఎగ్జిబిషన్ చర్రితను తెలుపుతుంది. దీని ద్వారా పిల్లలు జ్ఞానాన్ని పొందుతారు. పురాతన వస్తువుల సేవకరణ చాలా ఇష్టం. నా దగ్గర ఉన్న పాత కాయిన్స్ విక్రయించడానికి వచ్చాను. ఏడాదికోసారైనా ఇలాంటి ఎగ్జిబిషన్ ఉండాలి. – మహ్మద్ తాహెర్, హసన్నగర్చరిత్రను తెలిపేందుకు.. నాటి చరిత్రను తెలిపేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్ దోహదం చేస్తాయి. అందుకే దేశంలోని అనేక నగరాలకు చెందిన ఏజెన్సీలతో ఇటువంటి అరుదైన చారిత్రక సంపదను ఎగ్జిబిషన్లో ఉంచుతున్నాం.. ప్రజలకు చరిత్రను తెలపడంతోపాటు, పలువురు ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు తోడ్పడుతున్నాం. ఇది దేశ సంపద. – సిరాజుద్దీన్, ఏపీజే అబుల్ కలాం వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ -
పార్సీల నూతన సంవత్సర వేడుకల్లో.. వింటేజ్ కార్ల ప్రదర్శన!
పార్సీల నూతన సంవత్సర వేడుకలు సికింద్రాబాద్‌లో ఘనంగా జరుపుకున్నారు. గురువారం ఎంజీ రోడ్డులోని ఫైర్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు.ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని పార్సీలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన వింటేజ్ కార్ల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. – రాంగోపాల్‌పేట్ -
స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో.. జరిగిన స్విమ్మింగ్, రైడింగ్ పోటీలు..
సాక్షి, సిటీబ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో హైదారాబాద్ పోలో, రైడింగ్ ఆధ్వర్యంలో క్లబ్ చాంపియన్ షిప్ పోటీలను నిర్వహించారు. నగర శివార్లలోని అజీజ్ నగర్ వేదికగా నిర్వహించిన ఈ పోటీల్లో దాదాపు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. బాలికల అండర్ 14 స్విమ్మింగ్ విభాగంలో పూర్వి కస్సాం, పురుషుల 21 ఏళ్ల విభాగంలో కున్వర్ కుషాల్ సింగ్ గోల్డ్ మెడల్స్ పొందారు. జూనియర్ హక్స్గా దీప్ కుక్రేటి, సీనియర్ హక్స్గా అభినవ్‌లు మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. -
లక్ష్మీపూజ.. తెలుగింటి ఆడపడుచుల పండుగ!
నగర జీవనంలో ఎక్కువగా పాశ్చాత్య సంస్కృతే కనిపిస్తుంటుంది. ఆధునిక పోకడలతో మనవైన సంప్రదాయాలను పక్కనపెట్టేస్తున్నారు అనుకునే వారి ఆలోచనలకు నగరవాసులు ఎప్పుడూ కొత్త అర్థాలను చెబుతూనే ఉన్నారు. తెలుగింటి ఆడపడుచులు అత్యంత భక్తి శ్రద్ధలతో, సాంప్రదాయ బద్దంగా ఆచరించే వేడుకలలో మొట్టమొదటి వేడుక శ్రావణ మాసంలో నిర్వహించే వరలక్ష్మీ పూజ. నెల రోజుల పాటు ప్రతి శుక్రవారం సాంప్రదాయ వస్త్రధారణతో చూడముచ్చటగా అలంకరించుకుని.. తెలుగింటి వంటలు ప్రసాదాలుగా చేసి, పచ్చని తోరణాలతో, పుష్పాలతో అమ్మవారి అలంకరణలో వైభవంగా తమదైన సృజనకు మెరుగులు దిద్దుతున్నారు. – సాక్షి సిటీబ్యూరోపర్యావరణ అలంకరణ.. మట్టి లేదా ఇత్తడి పాత్రలో నీళ్లు నింపి, పువ్వులతో అలంకరించి, వాటి మధ్యలో అమ్మవారిని ఏర్పాటు చేస్తున్నారు. లిల్లి, నందివర్ధనం, మల్లెలు, తెల్ల చామంతి, తామర పువ్వులతో పాటు డెకార్ పువ్వులను కూడా వాడుతున్నారు. వాడిన ప్రతి వస్తువునూ రీ సైక్లింగ్ విధానంతో పర్యావరణ అనుకూలంగా మార్చుతున్నారు.తోరణపు కళ.. బ్యాక్ డ్రాప్స్..నెగిటివ్ ఎనర్జీని తీసేసి ఇంటికి శోభని, శుభాన్ని కలుగజేసే వరి తోరణాలతో పాటు ఎంబ్రాయిడరీ చేసిన డిజైనర్ తోరణాలనూ అలంకరణకు ఉపయోగిస్తున్నారు. అమ్మవారి వెనకాల బ్యాక్ డ్రాప్లో వాడుకోవడానికి ఐదారు అడుగుల ఎత్తున్న ఫ్రేమ్‌లు రకరకాల మోడల్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. పచ్చని కళ రావాలంటే విస్తరాకులు, కొబ్బరి ఆకులు, తమలపాకులు, ఇలా ఏదైనా ఆకులతో చేసే బ్యాక్ డ్రాప్‌ను వాడుతున్నారు. పట్టు చీరలు, ఇండోర్ మొక్కలు, రాగి, ఇత్తడి పాత్రలు అలంరకణలో చేరాయి.భక్తిని అలంకరిస్తే ఎంత అందంగా ఉంటుందో వరలక్ష్మీ వ్రతం రోజున ఇంటి కళను బట్టి తెలిసిపోతుంది. వారం పది రోజుల ముందు నుంచే అమ్మవారి అలంకరణకు కావాల్సిన వస్తువుల ఎంపిక మొదలవుతుంది. వీటిని పూజా స్టోర్స్, ఆన్లైన్, జనరల్ స్టోర్స్, బేగం బజార్, డెకార్ ప్లేస్‌లకు వెళ్లి నచి్చనవి ఎంపిక చేసుకోవడం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఒక్కో డిజైన్ సెట్‌కి సాధారణంగా 2 నుంచి 10 వేల రూపాయల వరకూ ఖర్చు చేస్తున్నారు. పెళ్లి లాంటి వేడుకలకే కాదు పండగల్లోనూ కలర్‌ఫుల్ థీమ్‌తో చేసే అలంకరణలో మహిళలు తమదైన ప్రత్యేకతను చూపుతున్నారు. ముందే అడిగి.. ఐదేళ్ల క్రితం అమ్మవారి అలంకరణ వస్తువులు ఎక్కడ దొరుకుతాయి, ఎవరు డెకరేట్ చేస్తారు అని వెదికేవారు. అలా మేం పదిహేనేళ్లుగా వరలక్ష్మీ పూజలకు డెకరేట్ చేస్తున్నాం. ఇప్పుడు సోషల్‌మీడియాలోని వీడియోలు చూసి సొంతంగా ఎవరికి వారు క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. వారి సొంతంగానే డిజైన్ చేసుకుంటున్నారు. ఈ ఆలోచన వల్ల ఆన్లైన్ మార్కెట్ కూడా బాగా పెరిగింది. యువత తమ భక్తిని చాలా అందంగా చూపుతున్నారు. ఎలాంటి డిజైన్స్ కావాలో ముందే అడిగి మరీ అలంకరణ చేయించుకుంటున్నారు.– కల్పనారాజేష్, డెకార్ బై కృష్ణఆర్గానిక్ మెటీరియల్స్.. నా ఎంపిక ప్రతి వస్తువూ తిరిగి ఉపయోగించుకునేలా ఉంటుంది. బ్యాక్‌డ్రాప్‌కి తాజా పువ్వులు వాడతాం. అమ్మవారికి కట్టే చీర హ్యాండ్లూమ్దే ఎంచుకుంటాం. తిరంగా స్టైల్లో అమ్మవారి అలంకరణ చేశాను. అమ్మవారికి ముఖం, కాళ్లూ చేతులు కొని పెట్టి, వాటిని మొత్తం సెట్ చేసి, మేమే అలంకరిస్తాం. తాంబూలాన్ని వస్త్రంతో చేసిన బ్యాగ్‌లో/ తాటాకు బుట్టలలో పెట్టి ఇస్తుంటాం. ప్రతి వస్తువూ ఆర్గానిక్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం.– ప్రతిమ, వైష్ణవి రాపర్తి, వెస్ట్మారేడుపల్లిపాజిటివ్ వైబ్రేషన్స్..బిజీ జీవనంలోనూ అమ్మవారి పూజ ప్రత్యేకంగా అనిపిస్తుంది. కొన్ని రోజులు ముందునుంచే అమ్మవారి అలంకరణకు సంబంధించిన వస్తువులను ఎంపిక చేసుకోవడం, వీలైనంతగా ముందురోజే సిద్ధం చేసుకోవడం జరుగుతుంటుంది. ప్రతియేటా ఒక ప్రత్యేకమైన కళ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాం. పిల్లలు కూడా ఈ పనిలో భాగం అవుతుంటారు. ఈ విధానం వల్ల వారిలో సృజన పెరుగుతుంది, భక్తి కూడా అలవడుతుంది.– డాక్టర్ శిరీషారెడ్డి, తార్నాక -
Hyderabad: ‘అకాన్ ఆహ్వానం’! సిటీలో వినూత్నంగా ఫండ్ రైజింగ్ ఫీస్ట్..
సాక్షి, సిటీబ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో నగరం వేదికగా ’అకాన్ ఆహ్వానం’ పేరుతో వినూత్నంగా ఫండ్ రైజింగ్ ఫీస్ట్‌ను గురువారం నిర్వహిస్తున్నారు. పేద కుటుంబాల్లో నెలలు నిండకుండానే పుట్టిన చిన్నారుల సంరక్షణ, సహకారం అందించడం కోసం ఈ ఫీస్ట్ నిర్వహించడం విశేషం. దుర్గంచెరువు దగ్గరలోని అకాన్ రెస్టారెంట్ వేదికగా ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ ఎక్స్‌ట్రామైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఫండ్ రైజింగ్ ఫీస్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ చెఫ్‌లు తయారు చేసిన పసందైన ఆహార పదార్థాలను, సితార్ ప్రదర్శనను ఆస్వాదిస్తూ ఆరగించవచ్చు. లంచ్ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. లంచ్ అనంతరం చెల్లించే ప్రతిపైసా పేద కుటుంబాల్లోని ప్రీ మెచ్యూర్డ్ చిన్నారులకు, అనారోగ్యాలతో జన్మించిన శిశువులకు విరాళంగా అందిస్తారు. సామాజిక బాధ్యతగా ఈ వినూత్నమైన ఆహారానికి, ఆతిథ్యానికి ఎంతైనా చెల్లించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.ఒక్కో శిశువుకు రూ.10 లక్షల వరకు..నెలలు నిండని శిశు జననాల సంఖ్య ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా బతుకు గడవడమే కష్టంగా మారిన పేద కుటుంబాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఇలాంటి శిశువులకు, వారి కుటుంబాల చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఎక్స్‌ట్రామైల్ ఫౌండేషన్ కృషి చేస్తోంది. ’అకాన్ ఆహ్వానం’ ఫండ్ రైజింగ్ ఫీస్ట్‌లో పోగైన ప్రతి పైసా ప్రీమెచ్యూర్డ్ చిన్నారులకు, అనారోగ్యంతో జన్మించిన శిశువులకు చేరుతుంది. మా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి హాస్పిటల్లో ఉండే ఎన్ఐసీయూ యూనిట్ల ద్వారా సహాయం అవసరమైన శిశువులకు సహకారం అందిస్తున్నాం. ఇప్పటి వరకు 197 మంది చిన్నారులకు సహకారం అందించాం. 400 గ్రాముల బరువుతో జన్మించిన చిన్నారులను రక్షించాలంటే రూ.10–15 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇతర సమస్యలతో జన్మించినా కనీసం రూ.3, 4 లక్షలు అవసరం. ఒక్క లంచ్ ఎన్నో కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుంది. లంచ్ రిజర్వేషన్ల కోసం ఫోన్: 96496 52222 – డా.నిటాషా, ఎక్స్‌ట్రామైల్ ఫౌండేషన్ -
తెలుగు ఇండియన్ ఐడల్.. స్వరాల జల్లు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ సింగింగ్ కాంపిటిషన్ ఆహా ‘తెలుగు ఇండియన్ ఐడల్’కు చెందిన సింగర్ గీతా గ్యాంగ్స్టర్స్, కార్తీక్ కిలాడీలు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్రెండ్ సెట్టర్స్ నగరంలోని ఓ విశ్వవిద్యాలయంలో పాటలతో సందడి చేశారు. ఈ లైవ్ మ్యూజిక్ ఈవెంట్లో యువ సింగర్స్ సాయి వల్లభ, భరత్, అనిరుధ్, నజీర్, అభిజ్ఞలు తమ సంగీత స్వరాలతో యూనివర్సిటీ విద్యార్థులను అలరించారు. ఇందులో భాగంగానే వారి స్ఫూర్తిదాయక వ్యక్తిగత ప్రయాణాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. -
ఎన్సీసీ.. దేశ సేవకు మేము సైతం..!
నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్సీసీ) అనేది జాతీయ యువజన విభాగం. ఇది ఒక స్వచ్ఛంద ప్రాతిపదికన ఏర్పాటు చేసిన సంస్థ. ఇది భారత సాయుధ దళాల అంతర్భాగం. దేశంలోని యువతను క్రమశిక్షణ, దేశభక్తి కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. ఇది పాఠశాల స్థాయిలో మొదలై డిగ్రీ విద్యార్థులను కేడెట్స్‌గా సెలెక్ట్ చేసుకొని శిక్షణ అందిస్తారు. వీరికి డ్రిల్, ఆయుధాల వినియోగం తదితర వాటిపై శిక్షణ ఇచ్చి ఏ, బీ, సీ సర్టిఫికెట్లను అందజేస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌వింగ్‌లో ఎన్సీసీ పూర్తి చేసిన వారికి రిజర్వేషన్ కల్పిస్తారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని దేశసేవకు మేముసైతం అంటున్న ఎన్సీసీ క్యాడెట్లపై సాక్షి ప్రత్యేక కథనం.. – రసూల్పురాస్వచ్ఛంద ప్రాతిపదికన పాఠశాల, కళాశాలల విద్యార్థులకు సైన్యం, నావిక దళం, ఎయిర్‌ఫోర్స్ ట్రై సరీ్వసెస్‌లో శిక్షణ అందజేయడం కోసం ఏర్పడిన భారత సాయుధ దళాల యువ విభాగం నేషనల్ క్యాడేట్ కార్ప్స్(ఎన్సీసీ). మన భారత దేశ సైన్యంలో సిబ్బంది కొరతను భర్తీ చేసే లక్ష్యంతో భారత రక్షణ చట్టం ప్రకారం 1948లో ఎన్సీసీ ఏర్పాటైంది. 1949లో బాలికల విభాగం, 1950లో ఎయిర్‌వింగ్, 1952లో నేవీ వింగ్ ఏర్పడ్డాయి. 1962 చైనా– ఇండియా యుద్ధం తర్వాత దేశం అవసరాన్ని తీర్చడానికి 1963లో ఎన్సీసీ క్యాడెట్లకు ఆయుధాల్లో, డ్రిల్ తదితర అంశాల్లో శిక్షణ తప్పనిసరి చేశారు. తెలంగాణ, ఏపీ ఎన్సీసీ డైరెక్టరేట్‌లో 9 గ్రూపులు..1949లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్సీసీ స్థాపించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో టివోలీ థియేటర్ సమీపంలో రాష్ట్ర ఏన్‌సీసీ డైరెక్టరేట్ కార్యాలయం ఏర్పాటు చేశారు. 1962లో ఎయిర్ కమోడోర్‌ను డైరెక్టర్‌గా నియమించారు. 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్ర, తెలంగాణ డైరెక్టరేట్ కార్యాలయంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, వరంగల్–4 గ్రూపులు, ఆంధ్రలో గుంటూరు, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం 5 గ్రూపులు ఉన్నాయి. 9 గ్రూపుల్లో జూనియర్, సీనియర్ వింగ్‌లలో లక్షా నలభై వేల మందికి పైగా క్యాడెట్లు ఉన్నారు. ప్రస్తుతం ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా ఎయిర్ కమోడోర్ వీఎం.రెడ్డి ఉన్నారు.ఎన్సీసీ క్యాడెట్లకు వివిధ అంశాల్లో శిక్షణ..తొమ్మిది గ్రూపుల పరిధిలోని వివిధ బెటాలియన్లు, పాఠశాల, కళాశాలలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్లకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. ఈ శిక్షణ శిబిరంలో ఆయుధ శిక్షణ, మ్యాప్ రీడింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్ లేదా బాటిల్ క్రాఫ్ట్, ఫైరింగ్‌తో పాటు క్రమశిక్షణ, యోగా, నాయకత్వ లక్షణాలు, మార్చింగ్ డ్రిల్, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ విషయాలపై నిపుణులతో ఉపన్యాసాలు, క్రీడా పోటీలు, వ్యర్థాలను రిసైక్లింగ్ చేసే పద్ధతులు, కెరీర్ కౌన్సిలింగ్‌తో పాటు సేవా కార్యక్రమాల్లో భాగంగా స్వచ్ఛ భారత్, రక్తదానం, వివిధ అంశాలపై అవగాహన ర్యాలీలు తదితర వాటిల్లో క్యాడెట్లకు తర్ఫీదు అందజేస్తారు.ఎన్సీసీ క్యాడెట్లకు ప్రయోజనాలు..ఏ-సర్టిఫికెట్ – జూనియర్ వింగ్ లేదా జూనియర్ క్యాడెట్ల విభాగంలో 2 సంవత్సరాల ఎన్సీసీ కోర్సులో ఉత్తీర్ణత సాధించిన క్యాడెట్లకు ఏ సరి్టఫికెట్ అందజేస్తారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పరీక్షలు జరుగుతాయి.బీ-సర్టిఫికెట్ – పాఠశాల, కళాశాలల తరఫున సీనియర్ వింగ్ లేదా సీనియర్ క్యాడెట్లకు రెండు సంవత్సరాల కోర్సు పరీక్ష ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన క్యాడెట్లకు బి సర్టిఫికెట్ అందజేస్తారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చిలో పరీక్షలు నిర్వహిస్తారు.సీ-సర్టిఫికెట్ – ఎన్సీసీలో సీనియర్ వింగ్ లేదా సీనియర్ క్యాడెట్ల విభాగంలో మూడు సంవత్సరాల కోర్సు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన క్యాడెట్లకు సీ సర్టిఫికెట్ జారీచేస్తారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో పరీక్షలు నిర్వహిస్తారు. డిఫెన్స్‌లో చేరాలనుకునే అభ్యర్థులకు సీ సరి్టఫికెట్ ఉపయోగపడుతుంది. వీరికి ఆర్మీ వింగ్‌లో 3–15 శాతం, నేవీలో 05–08, ఎయిర్‌వింగ్‌లో 10 శాతం రిజర్వేషన్లు ఇతర ప్రయోజనాలు ఉంటాయి. ఇక క్యాడెట్ వెల్ఫేర్ సొసైటీ నుంచి అకాడమిక్ ఇయర్లో క్యాడెట్లకు రూ.6 వేల ఉపకార వేతనం, అత్యుత్తమ క్యాడెట్‌కు రూ.4,500, ద్వితియ అత్యుత్తమ క్యాడెట్లకు రూ.3,500 ప్రోత్సహకాలు అందజేస్తున్నారు.అవకాశాలు ఉంటాయి.. శిక్షణ పొంది వివిధ ఎన్సీసీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన ఎన్సీసీ క్యాడెట్లకు కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రయోజనాలు అందజేస్తోంది. సీ సరి్టఫికెట్లు సాధించిన క్యాడెట్లకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో రిజర్వేషన్లు ఉంటాయి. ఏ, బీ సరి్టఫికెట్లు పొందిన వారికి ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక అవకాశాలు ఉంటాయి.– వి.ఎం.రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ -
నూతన ఓటీటీ హిమాన్షు..
సాక్షి, సిటీబ్యూరో: నగర వేదికగా ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ హిమాన్షు ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో నూతన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యాలయాన్ని ప్రముఖ బాలీవుడ్ నటులు రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియాతో పాటు హిమాన్షు గ్రూప్ ఎండీ సంజీవ్ పూరి ప్రారంభించారు. ఈ వేదికగా ప్రకటనలకు సంబంధించిన షూట్లు, భారీ–బడ్జెట్ సినిమా నిర్మాణాలు, దర్శకత్వం ఇతర ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాలకు సంస్థ కేంద్రంగా పనిచేయనుంది. భారీ సినిమాలకు, పలు వినోద కార్యక్రమాలకు వేదికైన హైదరాబాద్ కేంద్రంగా.. పరిశ్రమలో అధునాతన సౌకర్యాలతో మరిన్ని సేవలను అందించడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించామని సంస్థ వ్యవస్థాపకులు హిమాన్షు దేవ్కేట్ తెలిపారు. హిమాన్షు ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్, నెట్ ఫ్లిక్స్ సహా పలు వెబ్ సిరీస్‌ల నిర్మాణంలో, స్టార్హీరోలతో నిర్మిస్తున్న తెలుగు సినిమాల్లో పని చేస్తోందని వివరించారు. -
హార్ట్ ఆఫ్ ఆదివాసి..
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా నగరంలోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వేదికగా ప్రారంభించిన ఫొటో ఎగ్జిబిషన్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ సతీష్ లాల్ దాదాపు 14 ఏళ్లు దేశంలోని 20 రాష్ట్రాల్లో తిరిగి 40కి పైగా ఆదివాసి తెగలపై తీసిన అద్భుత డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నారు.ఆదివాసి సంస్కృతులు, వారి జీవన విధానం, వేషధారణ, పండుగలు, మేళాలు తదితర అంశాలపై తీసిన పరిశోధనాత్మక ఫొటోల సమాహారమని సతీష్ లాల్ తెలిపారు. ఈ డాక్యుమెంటరీకి గత సంవత్సరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ప్రశంసలు అందుకున్నానని గుర్తు చేశారు. తను తీసిన 65 ఆదివాసి ఫొటోలు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఆదివాసి ఆర్ట్ మ్యూజియంలో శాశ్వతంగా కొలువుదీరాయని అన్నారు. -
‘బిగ్ సిటీస్ ఇన్ మాస్కో’.. ఫొటో ఎగ్జిబిషన్!
సాక్షి, సిటీబ్యూరో: ‘టెరిటరీ ఆఫ్ ది ఫ్యూచర్ మాస్కో 2030’లో భాగంగా మాస్కోలో ‘బిగ్ సిటీస్ ఇన్ మాస్కో’ ఫొటో ఎగ్జిబిషన్, వీడియో ఆర్ట్ కాంటెస్ట్ ‘వావ్ మాస్కో’ అనే రెండు ఈవెంట్లను నిర్వహించనున్నారు. ఈ ఎగ్జిబిషన్‌కు బ్రిక్స్ దేశాల నుంచి 14 మంది ప్రముఖ ఫొటోగ్రాఫర్లు హాజరుకానున్నారు. వీడియో ఆర్ట్ కాంటెస్ట్ వావ్ మాస్కో విజేత నగరంపై షార్ట్ ఫిల్మ్ తీయనున్నారు.ఈ ఈవెంట్‌ను ఫొటో వీసా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ఫొటోగ్రఫీ ఆర్ట్ డైరెక్టర్, అనేక అంతర్జాతీయ ఫొటోగ్రఫీ, కాంటెంపరరీ ఆర్ట్ ఎగ్జిబిషన్ల మోడరేటర్ ఇరినా చ్మిరేవా నిర్వహించనున్నారు. ఎగ్జిబిషన్‌తో పాటు ఫోరమ్ ఫెస్టివల్ అతిథులు ప్రాజెక్ట్ క్యూరేటర్, ఫొటోగ్రాఫర్లతో పబ్లిక్ లెక్చర్లు, మాస్టర్ క్లాసులు ఉంటాయి. వీరు ఫొటోగ్రఫీ విభిన్న శైలులు, సాంకేతికతలపై మాట్లాడతారు. ఎగ్జిబిషన్లో పాల్గొనే వారు మాస్కో చిత్రాలను తీసుకుంటారు. ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్లతో పాటు భారత్, చైనా, ఇండోనేíÙయా, బ్రెజిల్, రష్యా నుంచి పది మంది ఔత్సాహిక చిత్ర నిర్మాతలను మాస్కో స్వాగతించనుంది.ఫోరమ్ ఫెస్టివల్ ‘టెరిటరీ ఆఫ్ ది ఫ్యూచర్ మాస్కో 2030’ ఫ్రేమ్‌వర్క్‌లో నిర్వహించనున్న వావ్ మాస్కో వీడియో ఆర్ట్ కాంటెస్ట్‌లో వీరు ఫైనలిస్టులుగా ఉంటారు. 12 దేశాల నుంచి 294 మంది ఫైనలిస్టుల ఎంపిక జరుగుతుంది. అంతర్జాతీయ జ్యూరీ ఆగస్టు 15న వేడుకలో విజేతను నిర్ణయిస్తారు. విజేతకు బహుమతితో పాటు మాస్కో గురించి ఒక లఘు చిత్రాన్ని రూపొందించే అవకాశం ఇస్తారు. మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్‌లో భాగంగా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 24న జర్యాడే పార్క్‌లోని స్మాల్ యాంఫి థియేటర్లో ప్రదర్శించనున్నారు. ఈ ఫెస్టివల్ 39 రోజుల పాటు జరగనుంది. -
ఇదీ ఫ్లాగ్ కోడ్.. అగౌరవపరిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులు!!
సాక్షి, సిటీబ్యూరో: దేశ ప్రాథమిక, ప్రధాన చిహ్నం.. భారత గౌరవ ప్రతీక.. శాంతి, సౌభ్రాతృత్వం, సమానత్వాన్ని ప్రతిబింబించేది జాతీయ జెండా. ప్రతి ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలతో పాటు పలు ప్రత్యేక రోజుల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తుంటాం. అంతేకాకుండా దేశభక్తిని, భారత ప్రతిష్టను ప్రదర్శించే వివిధ సందర్భాల్లోనూ జాతీయ పతాకాన్ని వినియోగిస్తాం. ఇటీవలి కాలంలో హర్ ఘర్ తిరంగా నినాదంతో ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడుతోంది. అయితే జాతీయ జెండా ఎగరవేయడానికి, ప్రదర్శించడానికి ప్రత్యేక నిబంధనలున్నాయి. ఈ నియమావళికి ఏ మాత్రం అవాంతరం ఎదురైనా దేశ ప్రతిష్టకే అవమానం. ఈ నేపథ్యంలో రాజ్యాంగం సూచించిన ఫ్లాగ్ కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలి. ఆ వివరాలు తెలుసుకుందాం..జాతీయ జెండా కేవలం ప్రభుత్వ భవంతుల మీద, ప్రభుత్వాధికారులకు మాత్రమే ఎగరవేసే ఆధికారముండేది. 2001లో నవీన్ జిందాల్ సుప్రీం కోర్టు కేసులో భాగంగా ప్రతి పౌరుడూ జెండాను ఎగరేయొచ్చని సవరించింది. జాతీయ జెండా పరిరక్షణకు సంబంధించి 1950, 1971 చట్టాలతో పాటు 2002, 2005లో సవరించిన అంశాలతో నూతన జాతీయపతాక నియమావళిని రూపొందించింది. ఈ నియమావళిలో భాగంగా పతాకం నేలనుగానీ, నీటినిగానీ తాకరాదు. టేబుల్ క్లాత్‌గా, వేదికకు ముందు భాగంలో వాడకూడదు.ఉద్దేశపూర్వకంగా జెండాను తలకిందులు చేయకూడదు, విగ్రహాలమీద, ఇతర వస్తువులకు కప్పకూడదు. నడుం కింది భాగంలో, లోదుస్తులమీద జెండాను వాడకూడదు. ఆవిష్కరణకు ముందు పువ్వులు తప్ప ఇతర వస్తువులను జెండాలో ఉంచడం, జెండా మీద ఏదైనా రాయడం నిషిద్ధం. సాధారణంగా సూర్యోదయంలో జెండాను ఎగరవేసి, సూర్యాస్తమయంలో దించివేయాలి. కాషాయరంగు పైన ఉండేటట్లు, నిలువుగా వేలాడదీసినట్లైతే కాషాయరంగు చూసేవారికి ఎడమచేతివైపున ఉండాలి. మురికిగా ఉన్న జెండాను ప్రదర్శించకూడదు. రెండు జాతీయపతాకాలను ఎక్స్ ఆకారంలో కర్రలకు తగిలించినట్లైతే రెండు జెండాలూ వ్యతిరేకదిశల్లో తగిలించాలి. పోడియంలు, బిల్డింగుల మీద కప్పడానికి గానీ, రెయిలింగుల మీద అలంకరణ కోసంగానీ వాడకూడదు.వీరి ఆదేశాల మేరకు..రాష్ట్రపతి ఆదేశాల ప్రకారం మాత్రమే సంతాపసూచకంగా పతాకాన్ని అవనతం (జెండా కర్రకు సగం ఎత్తులో ఎగరెయ్యడం) చెయ్యాలి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రుల్లో ఎవరు మరణించినా దేశవ్యాప్తంగా అవనతం చేస్తారు. అధికార, సైనిక, పారామిలిటరీ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేటప్పుడు శవపేటిక మీద తలవైపు కాషాయరంగు వచ్చేటట్లు కప్పాలి. ఐతే దానిని ఖననం చేసే ముందు తీసేయాలి. శవంతో పాటు సమాధిలోకి దించడం, కాల్చడం చెయ్యరాదు.ఇవి తప్పనిసరి..ఇతర దేశాల జాతీయపతాకాలతో కలిపి ఎగరేసే సమయంలో వరుసలో మొదటి స్థానంలో కుడివైపు (చూసేవారి ఎడమచేతివైపు) ఉండాలి. మిగతా పతాకాలు ఇంగ్లి‹Ùలో ఆయాదేశాల పేర్లను బట్టి అక్షరక్రమంలో అమర్చాలి. అన్ని పతాకాలూ దాదాపు ఒకే పరిమాణంలో ఉండాలి. అన్ని పతాకాలూ విడివిడిగా వేర్వేరు జెండాకర్రలమీద ఎగరెయ్యాలి. వృత్తాకారంలో ఎగరేసినప్పుడు భారత పతాకం దగ్గరే వృత్తం మొదలై, సవ్యదిశలో తిరిగిరావాలి. మన పతాకాన్ని ముందు ఎగరేసి అన్నిటికంటే చివర అవనతం చెయ్యాలి. పతాకాన్ని సమావేశాల్లో వేదికల మీద ప్రదర్శించేటప్పుడు కుడివైపునే (చూసేవారికి ఎడమవైపున) ఉండాలి. వక్తలు ఉపన్యసించేచోట ఉన్నట్లైతే వారికి కుడిచేతి వైపునే ఉండాలి. ఇతర జెండాలతో కలిపి ఊరేగింపులో తీసుకెళ్ళే సమయంలో మొదట్లో ఉండాలి. జెండాలన్నిటినీ ఒకే వరసలో తీసుకెళ్లేటప్పుడు కుడివైపున మొదటిదిగా లేదా మధ్యలో అన్నిటికంటే ముందు ఉండాలి. దేనికీ/ఎవరికీ గౌరవసూచకంగా జాతీయ జెండాను కిందికి దించరాదు.వాహనాలపై..జాతీయపతాకాన్ని వాహనాల మీద ఎగరేసే అధికారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, పార్లమెంటు, శాసనసభల సభ్యులు, లోక్‌సభ, శాసనసభల స్పీకర్లు, రాజ్యసభ, రాష్ట్రాల శాసనమండళ్ల అధ్యక్షులు, సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, సైనిక, నావికాదళ, వాయుసేనల్లోని ఉన్నతాధికారులకు మాత్రమే ఉంది. ఇతర దేశాల నాయకులు భారత ప్రభుత్వ వాహనంలో తిరుగుతున్నప్పుడు భారత జాతీయపతాకం కుడి వైపు చివరన, వారి జాతీయపతాకం ఎడమవైపు చివరన ఉండాలి. -
ఇది ప్రతి ఇంటి కథ.. కడుపుబ్బా నవ్వించిన ‘బాసిర మాతా కీ జై’..
లక్డీకాపూల్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్– 1లోని లామకాన్ హాస్యపు జల్లులతో తడిసి ముద్దయ్యింది. రోడ్డు వేజ్, స్ట్రీట్ ప్లే థియేటర్ ఆధ్వర్యంలో సోమవారం మాజీ ఆర్మీ అధికారి కెప్టెన్ అహ్మద్ రచించిన హాస్యభరిత నాటకం ‘బాసిర మాతా కీ జై’ ఆసాంతం ఆహూతులను కడుపుబ్బా నవ్వించింది. నటీనటులు అద్భుత ప్రదర్శన కనువిందు చేసింది. అలనాటి హిందీ పాటలు మంత్ర ముగ్ధులను చేశాయి. పాటలు వచ్చినప్పుడు ప్రేక్షకులు శృతి కలపడం విశేషం. 45 నిమిషాల పాటు ప్రతి ఇతిహాసంతో సాగిన ఈ నాటకం అద్భుతమైన సందేశాన్ని ఇచ్చింది.ఓ మధ్య తరగతి కుటుంబం. అందులో శర్మా జీ, ఆయన భార్య శ్రీమతి జీ. తమ్ముడు సోను, చెల్లెలు మోను ఉంటారు. సోను, మోనులను పెంచడానికి ఈ జంట తమ జీవితాలను అంకితం చేస్తారు. వీరిద్దరినీ సొంత బిడ్డల్లా చూసుకుంటారు. శ్రీమతి జీకి వంట చేయడం ఇష్టం. ఏదీ వృథా పోనివ్వరు. మిగిలిన ఆహార పదార్థాలతో కొత్త కొత్త వంటకాలు చేస్తుంటారు. ప్రయోగాత్మక వంటకాలను తప్పించుకునేందుకు చూస్తారు. అది కూడా ఆమె మనోభావాలు దెబ్బతినకుండా.. ఈ ప్రయత్నం ఎంతో హాస్యం పండిస్తుంది. ఈ నాటకం ఆహార వృథా సమస్యను స్పృశిస్తుంది. -
Shravanamasam Special.. ప్రతి శుక్రవారం.. మహా నైవేద్యం విందు!
సాక్షి, సిటీబ్యూరో: శ్రావణమాసం వచ్చిందంటే చాలు.. ఈ మాసంలో పూజలతో ఇంటిల్లిపాది పండుగ వాతావరణం నెలకొంటుంది. అయితే చాలా మంది ఉపవాసాలు చేస్తుంటారు. ఈ నెల మొత్తం మాంసాహారం తినకుండా ఉంటారు. అలాంటి వారికోసం ఓ రెస్టారెంట్ వినూత్నంగా ఆలోచించింది. ప్రతి శుక్రవారం పూర్తి శాఖాహారంతో విందు ఏర్పాటు చేసింది. కోకాపేటలోని యునైటెడ్ తెలుగు కిచెన్ ఈ ఆలోచనకు కార్యరూపం తీసుకొచ్చింది. ప్రతి శ్రావణ శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఈ విందును వడ్డించనుంది. రూ.699కు ఈ శ్రావణ మాస మహా నైవేద్య విందును భోజన ప్రియులకు అందిస్తోంది. -
Hyderabad: రాకింగ్ ర్యాంప్ వాక్..! టాప్ మోడల్స్.. క్యాట్ వాక్!!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పార్క్ హోటల్ వేదికగా జరిగిన బిగ్గెస్ట్ ఫ్యాషన్ షోలో టాప్ మోడల్స్ క్యాట్ వాక్ తో అలరించారు. ఇండియన్, వెస్ట్రన్ లుక్స్‌తో మోడల్స్ ర్యాంప్ పై సోమవారం సందడి చేశారు.లండన్‌లోని ప్రముఖ రేవన్స్ బోర్న్ యూనివర్సిటీ, సవరియా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంయుక్త భాగస్వామ్యంతో పలు కొత్త కోర్సులను లాంచ్ చేశారు. ఇందులో భాగంగా ఎంబీఏ ఫ్యాషన్ మేనేజ్మెంట్, బీకాం, బీఏ చేసిన వారికీ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, లగ్జరీ మేనేజ్మెంట్ వంటి కోర్సులను లాంచ్ చేశారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డెలిగేట్ మీట్ అండ్ గ్రీట్ ఫ్యాషన్ షో అలరించింది. ముఖ్య అతిథిగా రావెన్స్బోర్న్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆండీ కుక్, డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సైమన్ రాబర్ట్‌షా, యూనివర్సిటీ ప్రతినిధులు మోహిత్, గంభీర్ తదితర ప్రతినిధులు, ఫ్యాషన్ ఔత్సాహికులు పాల్గొన్నారు. -
చిన్న వయసు.. పెద్ద బాధ్యత!
సాక్షి, సిటీబ్యూరో: టీనేజర్లకు సైబర్ సేఫ్టీపై ఓ టీనేజర్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అమెరికాలోని డల్లాస్‌లో నివసించే పదో తరగతి విద్యార్థి రాజ్ భీమిడి రెడ్డి పిన్న వయసులోనే పెద్ద బాధ్యత తలకెత్తుకోవడం విశేషం. ఆన్‌లైన్‌పై టీనేజర్ల భద్రత అంశంలో పనిచేసే స్వచ్ఛంద సంస్థ సేఫ్ టీన్స్ ఆన్‌లైన్‌కు ప్రాంతీయ అంబాసిడర్‌గా రాజ్ సేవలు అందిస్తున్నాడు. ప్రస్తుతం దేశంలోని అన్ని పాఠశాలల్లో రాజ్ పర్యటిస్తూ సైబర్ సెక్యూరిటీపై విద్యార్థులను చైతన్యవంతులను చేస్తున్నాడు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సాలో 25 పాఠశాలలతో కలిసి పనిచేస్తున్నాడు. నగరంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్, మెరీడియన్ తదితర స్కూల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లోని పాఠశాలల్లో అధ్యయనాలు, సెమినార్లు నిర్వహిస్తున్నాడు. -
'డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్'.. కేన్సర్ బాధితులకు అండగా.. గృహహింసపై పోరాటం!
సాక్షి, సిటీబ్యూరో: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం వారి నైజం. పసి పిల్లలకు పాలు, పేద కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ నుంచి మొదలు అనారోగ్యంతో బాధపడుతున్నవారికి అవసరమైన మందులు అందించడం, రక్తదానం చేయడం వరకు.. మహిళలు, విద్యార్థినులు నెలసరి సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, అవసరమైన ప్యాడ్స్ ఉచితంగా అందించడం నుంచి మహిళల ఆర్థిక స్వావలంబన వరకు.. ఇలా అన్నింటా మేమున్నామంటున్నారు ’డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్’ సభ్యులు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ ఫౌండేషన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి.ఆధునిక వస్త్రధారణతో హైదరాబాద్‌లోని బస్తీకి వెళ్లిన యువతి రెనీ గ్రేస్.. అక్కడున్న ప్రజలను మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని అడిగింది. నాకు చేతనైన సాయం చేస్తానని చెప్పడంతో.. అక్కడున్నవారంతా ఆమెను చూసి నవ్వుకున్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితిలో ఆమె ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ఎంచుకున్న లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. స్నేహితులు నీతోపాటు మేముంటామంటూ మనోధైర్యాన్ని అందించారు. ఆ ధైర్యం ‘డిగ్నిటీ ఫౌండేషన్’ స్థాపన దిశగా నడిపించింది. 2017 నుంచి ఏడేళ్ల ప్రస్థానంలో 5,500 మందికిపైగా వలంటీర్లను ఫౌండేషన్ సొంతం చేసుకుంది. లక్షలాది మందికి సాయం అందిస్తామంటూ.. మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.కేన్సర్ బాధితులకు అండగా.. కూకట్‌పల్లిలోని కుముదినిదేవి హాస్పిటల్లో కేన్సర్ బాధితులు చికిత్స పొందుతున్నారు. పేద కుటుంబాలకు చెందినవారు కావడంతో బాధితులను ఆదుకోవాలని డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ సభ్యులు నిశ్చయించుకున్నారు. అక్కడున్న కేన్సర్ బాధితులకు అవసరమైన పాలు, లిక్విడ్ ఆహారం పంపిణీ చేయాలని సిద్ధమయ్యారు. డిసెంబర్ చివరి వరకు ఏ రోజు ఎవరు సరఫరా చేయాలనేది నిర్ణయించారు. రోజుకు రూ.1,500 నుంచి సుమారు రూ.7,500 వరకు వెచి్చస్తున్నారు.బాలికలకు అవగాహన కల్పిస్తూ.. పాఠశాలలు, కళాశాలలు, పెద్దపెద్ద సాఫ్ట్వేర్ కార్యాలయాల్లో సైతం మహిళలు ఎదుర్కొంటున్న నెలసరి సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆర్థిక స్థోమత లేని విద్యార్థినులు, మహిళలకు శానిటరీ న్యాప్కిన్లు ఉచితంగా అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు అవసరమైన కిట్లను అందుబాటులో ఉంచుతున్నారు.నిత్యావసరాల పంపిణీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోని బస్తీలు, దళితవాడల్లో పేద కుటుంబాలకు 2018 నుంచి ఆహారం, ఉప్పు, పప్పు, బియ్యం వంటి నిత్యావసరాలు, కనీస అవసరాలైన దుప్పట్లు, దుస్తులు వంటివి పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచారు.చేతనైన సాయం చేస్తున్నాం..నా స్నేహితులు పూనం శర్మ, సరితా శర్మ, జైశ్రీరామ్, క్రాంతి రెమ్మల, ప్రతిమతో కలిసి ఫౌండేషన్ నడిపిస్తున్నాను. ఉద్యోగరీత్యా ఎవరి పనులు వారికి ఉన్నాయి. అదనంగా సమాజానికి ఏదైనా సేవ చేసేందుకు 2017లో డిగ్నిటీ డ్రైవ్‌ను స్థాపించాం. మహిళల హక్కులు, ఆర్థిక సాధికారత కోసం ప్రయతి్నస్తున్నాం. నెలసరి సమస్యలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అవసరమైన వారికి కిట్స్ అందిస్తున్నాం. ఆకలి బాధలను అధిగమించేందుకు పేద కుటుంబాలకు నిత్యావసరాలు, మందులు పంపిణీ చేస్తున్నాం. నేను షీ టీంలో సభ్యురాలిగా పనిచేస్తున్నా. చివరి స్టేజ్ కేన్సర్‌తో బాధపడుతున్న పిల్లలు పెయిన్ లెస్ డెత్ కోసం మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. మహిళలు ఒక ఫౌండేషన్ నడిపించడం అంత సులువు కాదనిపిస్తోంది. 5,500 మందికిపైగా వలంటీర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడితే వందలాది మంది స్పందిస్తారు. – రెనీ గ్రేస్, డిగ్నిటీ, డ్రైవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. -
గోల్డ్‌మ్యాన్ దుర్గం శ్రవణ్..
రాయదుర్గం: ‘బంగారం’ అంటే ఎవరికి ప్రేమ, మమకారం ఉండదు చెప్పండి. మరీ ముఖ్యంగా ఆడవాళ్లకు అయితే బంగారంతో తయారుచేసిన ఆభరణాలు ధరించడం ఎంతో మక్కువ, మమకారం. కాగా మగవాళ్లకు ఇటీవలి కాలంలో బంగారం ధరించడం ఒక కొత్త ట్రెండ్‌గా మారిపోయింది. ఆ ట్రెండ్ ఇటీవలి కాలంలో గుర్తింపు సాధించింది మాత్రం దుర్గం శ్రవణ్‌కుమార్ అని చెప్పక తప్పదు. గత 20 ఏళ్లుగా బంగారు నగలు, ఉంగరాలు ధరిస్తూ శేరిలింగంపల్లిలోని గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గంకు చెందిన దుర్గం శ్రవణ్‌కుమార్ బంగారు ఆభరణాలు ధరిస్తూ మొదట్లో ‘హైదరాబాద్ గోల్డ్‌మ్యాన్’గా గుర్తింపు సాధించారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా బంగారు ఆభరణాలు ధరిస్తూ అగుపించడంతో రాష్ట్రమంతటా ప్రస్తుతం ‘తెలంగాణ గోల్డ్‌మ్యాన్’ గుర్తింపు సాధించడం విశేషం.గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గంలో తాత ముత్తాతల నుంచి దుర్గం శ్రవణ్‌కుమార్ కుటుంబం నివాసముంటోంది. ప్రస్తుతం 51 ఏళ్ల వయస్సులో ఉండే శ్రవణ్‌కుమార్ తండ్రి దుర్గం లక్ష్మయ్య, తల్లి పెంటమ్మకు చిన్న తనం నుంచే బంగారంపై చాలా మక్కువ ఉండేది. ఆ తర్వాత ఒక వయస్సు వచి్చన తర్వాత 25 ఏళ్ల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆరంభం నుంచే డబ్బులు సంపాదించడం, ఆ తర్వాత ఫైనాన్స్ చేస్తూ రెండింటిలోనూ రాణిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.బంగారం ధరించేందుకు నాన్నే స్ఫూర్తి..మా నాన్న దుర్గం లక్ష్మయ్యనే బంగారం ధరించడానికి నాకు స్ఫూర్తి. ఒక గొలుసు, రెండు ఉంగరాలు ధరించే వాళ్లు. ఆయన వాటిని నాకు ఇచ్చేశారు. ఆయన నుంచి కష్టపడేతత్వాన్ని నేర్చుకున్నా. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల డబ్బులు సంపాదించే అవకాశం కలిగింది. దీంతోనే బంగారం కొనుగోలు మొదలైంది. మొదట హైదరాబాద్ గోల్డ్ మ్యాన్‌గా పిలిచేవారు. ప్రస్తుతం రాష్ట్రంలోనూ, ఇతర ప్రాంతాలకు ఎక్కడికి వెళ్లినా తెలంగాణ గోల్డ్‌మ్యాన్‌గా పిలవడం సంతోషాన్నిస్తుంది. నా కష్టార్జితంతోనే వీటిని ధరించడం అలవాటుగా మారింది. ప్రతి ఒక్కరూ కష్టపడేతత్వం అలవర్చుకుంటే గుర్తింపు దానంతట అదే వస్తుందనేది నా నమ్మకం. రాయదుర్గం నాగార్జున ఉన్నత పాఠశాలలో పదోతరగతి వరకూ చదివాను. ఆపై చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాను. ప్రతి రూపాయి చెమటోడ్చి సంపాధించినదే, ఇందులో కొంత ఆపదలో ఉన్నవారికి నా వంతూ సేవా కార్యక్రమాలకు వెచ్చించడం అలవాటు. – దుర్గం శ్రవణ్‌కుమార్, తెలంగాణ గోల్డ్ మ్యాన్, రాయదుర్గం -
Saina Nehwal: నా ఆత్మలో.. బ్యాడ్మింటన్!
మణికొండ: బ్యాడ్మింటన్ తన ఆత్మలో ఉందని, దాన్ని ఎప్పటికీ వదలిపెట్టనని పద్మవిభూషన్ అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ, అలకాపూర్ టౌన్షిప్ రోడ్డు నంబర్–3 వద్ద యోనెక్స్ స్పోర్ట్స్ స్టోర్‌ను ఆమె ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన దేశంలో క్రీడాకారుల సంఖ్య మరింతగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువులతో పాటు వారికి నచి్చన క్రీడలో రాణించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడలకు మన దేశంలో రాబోయే రోజుల్లో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఫిట్‌గా ఉండేలా చూసుకుని క్రీడల్లో శిక్షణ ఇప్పించాలన్నారు. రెజ్లర్ వినేష్ పోగట్‌కు మరో పథకం వస్తుందనే ఆశతోనే ఉన్నానన్నారు. కార్యక్రమంలో స్టోర్ యజమానులు అమర్, కిరణ్, వెంకట్‌తో పాటు ఆమె అభిమానులు పాల్గొన్నారు. -
జిమ్.. ఆరెంజ్ థీమ్..!
సాక్షి, సిటీబ్యూరో: ప్రత్యేకమైన ఆరెంజ్ థీమ్‌తో వినూత్నంగా అనిపించే ఆరెంజ్ థియరీ ఫిట్నెస్ ఇండియా.. నగరంలో తన సెంటర్‌ను నెలకొల్పింది. బంజారాహిల్స్ రోడ్ నెం–7లో ఏర్పాటైన ఈ ఫిట్నెస్ సెంటర్‌ను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చినట్లు ఆదివారం బ్రాండ్ చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ దృష్టి చాబ్రియా తెలిపారు. దాదాపు 2,700 చదరపు అడుగులపైగా విస్తీర్ణంలో ఈ విశాలమైన అత్యాధునిక వ్యాయామ కేంద్రం నెలకొల్పామని, శాస్త్రీయ నేపథ్యం కలిగిన వర్కవుట్స్‌కి తమ బ్రాండ్ పేరొందిందని వివరించారు. మితిమీరిన శిక్షణ అవసరం లేకుండా తమ సభ్యులు ఫిట్నెస్ లక్ష్యాలు చేరుకునేలా తమ వర్కవుట్ రొటీన్ డిజైన్ చేశామన్నారు. అంతర్జాతీయ జీవన ప్రమాణాలకు నిలయమైన హైదరాబాద్‌లో స్థానికులకు నచ్చే వ్యక్తిగతీకరించిన వర్కవుట్ అనుభవాలను అందిస్తామన్నారు. -
చిత్రలేఖనంలో డెలివరీ బాయ్ వారెవ్వా..
సాక్షి, సిటీబ్యూరో: అతడో డెలివరీ బాయ్.. అది సమాజానికి తెలిసిన విషయం. కానీ ప్రపంచానికి తెలియని మరో విషయం ఏంటంటే అతడో మంచి చిత్రకారుడు. కుంచె పట్టాడంటే అద్భుతాలు అలా జాలువారుతాయి. చక్కటి రూపాలను మలచడంలో ప్రసిద్ధుడు. కానీ కుటుంబ పరిస్థితులు మాత్రం ఓ డెలివరీ బాయ్ పనికి పరిమితం చేశాయి. అతడి పేరే రాకేశ్ రాజ్ రెబ్బా. పుట్టింది మహారాష్ట్రలోని సోలాపూర్‌లో.. పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చేసి ఇక్కడే డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.చిన్నప్పటి నుంచీ ఆసక్తి..రాకేశ్‌కు చిత్రలేఖనం అంటే చిన్నప్పటి నుంచే ఆసక్తి.. ఆ కళపై ఎలాగైనా పట్టుసాధించాలనే తపనతో చిన్నప్పుడు.. ఎప్పుడూ చూసినా ఏదో ఒక బొమ్మ గీస్తుండేవాడట. అలా కొన్ని వందల చిత్రాలను పుస్తకాల్లో గీసి అపురూపంగా దాచిపెట్టుకున్నాడు.మనుషుల ముఖాలను కూడా గీస్తూ ప్రశంసలు పొందుతున్నాడు. ప్రస్తుతం అప్పుడప్పుడూ వాల్ పెయింటిగ్స్ వేస్తూ తన కళను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తన కళకు మరిన్ని నగిïÙలు అద్దితే ఎన్నో ఎత్తులకు చేరుకుంటాడనడంలో అతిశయోక్తి లేదు.మంచి ఆర్టిస్టు కావాలని కోరిక.. ఆర్ట్ వేయడం అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. సొంతంగానే ఎన్నో బొమ్మలు వేశాను. డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నా. ఎవరైనా ప్రోత్సాహం అందిస్తే మంచి ఆరి్టస్టుగా జీవితంలో పేరు తెచ్చుకోవాలనేది నా కోరిక. – రాకేశ్ రాజ్ రెబ్బా -
షాన్‌దార్ షాండ్లియర్!
సాక్షి, సిటీబ్యూరో: ఇళ్లయినా, స్టార్ హోటలైనా.. మిరుమిట్లుగొలిపే షాండ్లియర్స్ వినియోగం తప్పనిసరి. పైకప్పు నుంచి వేలాడే ఈ దీపాలంకరణ చూపర్లను మంత్రముగ్ధుల్ని చేసేస్తుంది. వెలుగుతో పాటూ వినసొంపైన సంగీతాన్ని వినిపించడమే షాండ్లియర్స్ ప్రత్యేకత. గృహాలంకరణలో దీనికి ప్రాధాన్యం పెరిగిపోయింది. షాండ్లియర్స్ వినియోగం కొత్తమీ కాదు.. నిజాం నవాబుల కాలం నుంచే దీనికి ప్రాధాన్యత ఉంది. కానీ, తాజాగా స్మార్ట్ టెక్నాలజీతో వినూత్న రీతిలో, ఫీచర్లతో మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి.కలల గృహాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు నగరవాసులు ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. ఈక్రమంలో ఇంట్లో విద్యుత్తు వెలుగులకు ప్రాధాన్యత సంతరించుకుంటోంది. కళ్లు మిరిమిట్లుగొలిపే షాండ్లియర్స్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం నగరంలో 5 అడుగుల నుంచి 7 అడుగుల ఎత్తు గల షాండ్లియర్స్ ఎక్కువ అమ్ముడవుతున్నాయి. షాండ్లియర్స్ రూ.5 వేల నుంచ రూ.50 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. ఇందులోని విద్యుత్తు దీపాలను రిమోట్, సెన్సార్ సిస్టం, మొబైల్ ఆపరేటింగ్ సిస్టం, మాన్యువల్గాను ఆపరేట్ చేయవచ్చు.వినియోగం పెరిగింది..డూప్లెక్స్ హౌస్ కట్టుకుంటున్న ప్రతి కుటుంబం షాండ్లియర్స్‌ను వినియోగిస్తున్నారు. ఉన్నత స్థాయి కుటుంబాలు, స్టార్ హోటల్స్, లగ్జరీ లైఫ్‌లో షాండ్లియర్ తప్పనిసరి అయ్యింది. కొత్తకొత్త మోడల్స్ కోరుకుంటున్నారు. రూ.లక్ష నుంచి షాండ్లియర్స్ అందుబాటులో ఉంటాయి. కె9 క్రిస్టల్, ఏక్రలిక్, సిరామిక్, వంటివి ఎక్కువ మంది అడుగుతున్నారు. ఇప్పుడు నెలకు కనీసం 100 వరకు సరఫరా చేస్తున్నాం. అత్యాధునిక కలెక్షన్స్, వస్తువులో నాణ్యత, వినియోగదారుడికి సమస్య వచ్చినప్పుడు మేం అందించే సేవలు మాకంటూ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. జీవితకాలం సరీ్వస్ ఇస్తున్నాం.– రిషబ్ తివారీ, లైట్స్ లైబ్రరీ, మాదాపూర్విదేశాల నుంచి దిగుమతి..షాండ్లియర్స్ తయారీలో వినియోగించే ముడిసరుకును మలేషియా, ఇటలీ, చైనా, సింగపూర్, ఈజిప్టు, మన దేశంలోని ఢిల్లీ, ముంబై తదితర ప్రదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో ప్రధానంగా మాదాపూర్, బేగంబజార్, కోటి, ఉస్మాన్‌గంజ్ తదితర ప్రాంతాలు షాండ్లియర్స్కు కేరాఫ్ అడ్రస్‌గా కనిపిస్తున్నాయి. మొరాకిన్, ఇండియన్, యాంటిక్, నిజాంలు వినియోగించిన రస్టిక్ తదితర మోడల్స్‌కు ఇక్కడ మంచి ఆదరణ ఉంది. మనసు ప్రశాంతంగా..క్రిస్టల్ మేడ్ షాండ్లియర్ తీసుకున్నాను. రూ.7 లక్షలు అయ్యింది. ఎన్నో పనులపై బయట తిరిగి ఇంటికి చేరుకున్నాక సోఫాలో కూర్చుని షాండ్లియర్ నుంచి వచ్చే డిఫరెంట్ లైటింగ్, మనసుకు నచ్చిన పాటలు చిన్నగా సౌండ్ పెట్టుకుని వింటాను. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఒకరకంగా షాండ్లియర్ ఒత్తిడిని తగ్గిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.– టి.ప్రణీత్‌రెడ్డి, హైదరాబాద్ -
Kumanan Sethuraman: తన ఏడుపదుల వయసులోనూ.. ఫిజిక్ ఫిట్!!
సాక్షి, సిటీబ్యూరో: రమణా లోడ్ ఎత్తాలిరా అనే డైలాగ్ వింటే ప్రేక్షకులకు ఆయన గుర్తొస్తాడు కానీ సిటీలోని ఫిట్నెస్ స్టూడియోల్లో మాత్రం సీనియర్ సిటిజన్స్ ఫిజిక్ గురించి మాట్లాడాలంటే ఆయన తప్ప మరెవరూ గుర్తురారు. జన్మతః తమిళనాడుకు చెందిన కుమనన్.. ప్రస్తుతం టాలీవుడ్ నటుడిగా రాణిస్తున్నారు. అంతేకాదు అద్భుతమైన శరీరాకృతితో ఆకట్టుకుంటూ ఏడు పదుల వయసులో ఏకైక మేల్ మోడల్‌గానూ ర్యాంప్‌పై మెరుస్తున్నారు. ఇటీవలే అంతర్జాతీయంగా పనిచేసే బియర్డ్స్ క్లబ్ నుంచి వాషింగ్టన్లో నిర్వహించే ఈవెంట్లో ర్యాంప్ వాక్కు ఆహ్వానం సైతం అందుకున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో ఆయన పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే..ఓ టీవీలు తయారు చేసే కంపెనీలో ఉద్యోగం చేసే సమయంలో చాలా లావుగా ఉండేవాడ్ని. డీలర్ల మీట్స్ కాక్టెయిల్ పార్టీస్‌తో వెయిట్ పెరిగాను. అదే సమయంలో నాకు వ్యక్తిగతంగా ఉన్న ఇష్టంతో ఫ్యాషన్ ఫొటోగ్రఫీ కూడా పార్ట్‌టైమ్‌గా చేసేవాడ్ని. అలా వైజాగ్‌తో పాటు పలు నగరాల్లో ఫ్యాషన్ ఈవెంట్స్‌కు హాజరయ్యేవాడిని. అలాంటి సమయంలో వారిని చూసినప్పుడు మోడల్స్‌లా మనమెందుకు లేం? ఈ పొట్ట, ఫ్యాట్ మనల్ని వదిలిపోవా? అని ఆలోచించేవాడ్ని.మార్చిన మోడల్స్.. ఇలాంటి ఆలోచనలతో కొందరు మోడల్స్‌తో మాట్లాడుతూ అనేక విషయాలపైన అవగాహన పెంచుకున్నాను. ముందు వెయిట్‌లాస్ అవ్వాలి. రోజూ వాకింగ్ చేసి వెయిట్ లాస్ అయ్యాక వర్కవుట్ చేయాలనేది తెలుసుకున్నా. ఒక శుభముహూర్తాన కాక్టెయిల్ పార్టీలు సహా అన్ని అనారోగ్యకర అలవాట్లకు గుడ్‌బై చెప్పేసి ఫిట్నెస్ లవర్‌గా మారిపోయాను. రోజూ విశాఖ బీచ్‌లో కాళిమాత గుడి నుంచి పార్క్ హోటల్ వరకూ 2గంటల పాటు ఇసుకలో జాగింగ్ చేసేవాడ్ని.. ఆ తర్వాత లెమన్ వాటర్ మాత్రమే తాగేవాడ్ని. ఆర్నెళ్లలో బాగా వెయిట్ లాస్ అయ్యాను. ఆ తర్వాత జిమ్‌లో జాయిన్ అయ్యా.. కట్ చేస్తే.. పొట్ట, కొవ్వు అన్నీ మాయమై.. చక్కని ఫిజిక్ సాధ్యమైంది. అదే ఫిజిక్ నాకు సినిమాల్లో నటుడిగా అవకాశం వచ్చేలా చేసింది. అలా 20 ఏళ్లనుంచి నా శరీరం పూర్తిగా నా నియంత్రణలోనే ఉంటోంది. సినిమాల్లో అవకాశాలతో నగరానికి షిఫ్ట్ అయ్యాక కృష్ణానగర్‌లోని ఓ చిన్న జిమ్‌తో మొదలెట్టి, వెంకట్ ఫిట్నెస్ వగైరా జిమ్స్‌లో నా జర్నీ కంటిన్యూ చేశా..ఆరోగ్యకరమైన వంటలు.. తొలిదశలో రోజుకు డజను గుడ్లు.. 4గంటల వర్కవుట్ చేసేవాడ్ని. వయసుతో పాటు మార్పు చేర్పుల్లో భాగంగా ఇప్పుడు అరడజను గుడ్లు కనీసం, 3గంటల పాటు వ్యాయామం చేస్తున్నా. ఇప్పటికీ ఆపకుండా 100 దండీలు ఒకే స్ట్రెచ్‌లో తీయగలను. ట్రైన్ చేయమని టాలీవుడ్ ప్రముఖులు అడుగుతుంటారు. అయితే అది ఒక పూర్తిస్థాయి ప్రొఫెషన్ అనుకుంటేనే అటు వెళ్లాలి. అందుకే సలహాలు చెబుతా తప్ప ట్రైనర్‌గా మారను.డైట్ రొటీన్ ఇదీ... ఉదయం 7గంటలకల్లా నిద్ర లేస్తా. వేడినీళ్లలో నిమ్మకాయ వేసుకుని తీసుకుంటా.. పంచదార, బెల్లం, పెరుగు, వైట్‌రైస్ వినియోగించను. జిమ్ అయ్యాక 4 వైట్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటాను. లంచ్‌లో ఉప్పు లేకుండా బాయిల్డ్ వెజిటబుల్స్ అవి కూడా కాలీఫ్లవర్, బ్రొకొలీ, క్యారెట్, బీన్స్, క్యాబేజీ లాంటివి మాత్రమే తీసుకుంటాను. రాత్రి మిల్లెట్స్, కొర్రలు, లేదా క్వినోవా.. మితంగా తీసుకుంటాను.మోడల్‌గా జర్నీ.. నటుడిగా చేస్తుండగానే పలుచోట్ల ర్యాంప్ షోలపై మోడల్‌గానూ వచ్చిన అవకాశాలను ఉపయోగించుకున్నాను. వేర్వేరు నగరాల్లో జరిగిన మోడలింగ్ ఈవెంట్స్‌లో పాల్గొన్నాను. ఇటీవలే అంతర్జాతీయంగా పనిచేస్తున్న బియర్డ్ క్లబ్ వాళ్లు వాషింగ్టన్లో నిర్వహిస్తున్న ఫ్యాషన్ షోకు ఆహ్వానించారు. అయితే నేనింకా ఈ విషయంలో ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు. వర్కవుట్ రొటీన్ ఇదీ.. రోజూ ఉదయం 7గంటలకు నిద్రలేచి వేడి నిమ్మకాయ నీళ్లు తాగి జిమ్‌కు వెళతాను. అక్కడ 45 నిమిషాల వార్మప్.. ఇందులో ట్రెడ్మిల్ మీద వాకింగ్, బోనియం పాటకి ఎరోబిక్స్.. (ఈ ఒక్కపాట చేస్తే చాలు రోజుకు సరిపడా వర్కవుట్ చేసినట్లు అవుతుంది) వంటివి ఉంటాయి. ఆ తర్వాత వర్కవుట్ స్టార్ట్. రోజుకు 2 బాడీ పార్ట్స్ చేస్తాను. మొదటి రోజు ప్లెయిన్ రాడ్ మీద బెంచ్ ప్రైస్, ఫ్లైస్ ఒక రోజు స్క్వాట్, కాఫ్ మజిల్, మరో రోజు ఆ తర్వాత రోజు మొత్తం లాటిస్, ఆ తర్వాత ట్రైసప్, బైసప్ ఇలా.. రొటీన్‌గా సాగుతుంది.వెయిట్స్తో ఇలా.. చేస్తే భళా.. నేను జిమ్‌లో అడుగుపెట్టిన తొలిరోజే 50 చొప్పున డంబెల్స్‌తో రిపిటీషన్స్ చేయడంతో రెండోరోజు చేతులు పనిచేయలేదు. అయినా తగ్గించకుండా అలాగే చేస్తూ వచ్చా, అలవాటైపోయింది. తక్కువ వెయిట్స్తో ఎక్కువ రిపిటీషన్స్ చేయడం వల్ల ఆర్నెళ్లు వర్కవుట్ చేయకపోయినా షేప్ మారకుండా అలాగే ఉంటుంది. అదే వెయిట్స్ పెంచుకుంటూ పోతే ఇమ్మీడియట్‌గా మజిల్ పంప్ అయి మళ్లీ త్వరితంగానే బెలూన్‌లో గాలి తీసినట్లు అయిపోతాం. బాడీ బిల్డింగ్ చేయవచ్చు కదా అని కొందరు అడిగేవారు.. నాకు అలాంటి లక్ష్యాలేవీ లేవు.. జస్ట్ చూడడానికి లుక్ బాగుండాలి.. అంతేకాదు శరీరం ఎప్పుడూ రెడీ ఫర్ వార్ అన్నట్టు ఉండాలి. ఇక్కడ నుంచి దూకు అంటే దూకేయాలి అలా చురుగ్గా ఉండాలి. ఇప్పటికీ నేను గంటకు 16.5, 17కి.మీ స్ప్రింట్ చేయగలను. -
ఇండియాస్ మోస్ట్ బ్యూటిఫుల్ క్రిమటోరియం
పెట్స్ చనిపోయినప్పడు యజమానుల బాధ అంతా ఇంతా కాదు. కుటుంబంలో ఒకరిని కోల్పోయినట్లు ఉంటుంది.. వారిని ఓదార్చలన్నా ఎవరి తరం కాదు. అలాంటి వారు తమ పెట్స్ చనిపోయినప్పడు ఓ అందమైన ప్రదేశంలో వాటికి అంత్యక్రియలు నిర్వహించామనే అనుభూతిని కోరుకుంటారు. డాగ్, క్యాట్, రాబిట్, పక్షులు వంటి (చిన్న సైజు) జీవుల అంత్యక్రియల కోసం పా(పీఏడబ్ల్యూ) మెమరీస్ పేరిట గోపన్‌పల్లి అత్యాధునిక వసతులతో దహనవాటిక ఏర్పాటు చేశారు. రాగా ఫౌండేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్‌గా ఎంఎస్ రామయ్య బెంగళూర్ విశ్వవిద్యాయంలో బయోటెక్నాలజీ పూర్తిచేసి, కొంపల్లిలో నివాసం ఉండే నందకిశోర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇండియాస్ మోస్ట్ బ్యూటిఫుల్ క్రిమటోరియాన్ని ప్రత్యేక శ్రద్ధతో పా మెమరీస్ పేరిట ఆయన నెలకొల్పారు. మరికొద్ది రోజుల్లోనే నగరవాసులకు అందుబాటులోకి రానుంది. ఇంట్లో పెంచుకునే జంతువుల అంత్యక్రియల కోసం దహన వాటికను ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని రాగా ఫౌండేషన్ జీహెచ్ఎంసీని కోరడంతో గోపన్‌పల్లి సర్వే నంబర్ 34లో 500 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. ఆ స్థలంలోనే అత్యాధునిక వసతులతో పా మెమరీస్ క్రిమషన్ ఏర్పాటు చేశారు. సాధు జీవులను కాల్చేందుకు తమిళనాడు నుంచి మోక్ష కొవడం అనే అత్యాధునిక యంత్రాన్ని తీసుకొచ్చి అమర్చారు. ఇందులో ప్రైమరీ బర్నర్, సెకండరీ బర్నర్లు ఉంటాయి. ఒక్కో పెట్ అంత్యక్రియల కోసం 20 కిలోల నేచురల్ గ్యాస్ వినియోగిస్తారు. జీవి కాలినప్పడు బయటకు వచ్చే పొగను మెకానికల్, వాటర్ శుద్ధి చేసి బయటకు వదులుతారు. దీంతో పరిసరాల్లో ఎలాంటి దుర్వాసన ఉండదు. తుది వ్యర్థాలు నీటిలోకి వదిలి.. అనంతరం శ్మశానవాటికలోని మొక్కలకు వాడతారు. జంతువులు, పక్షుల నుంచి వచ్చే ఎముకలు, బూడిద(బోన్ మీల్)ను యజమానులకు ఇవ్వడం లేదంటే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఎవెన్యూ మొక్కలకు వాడేందుకు వీలుంటుంది. బోన్ మీల్‌తో మొక్కలు బలంగా ఉంటాయి. ఎలాంటి పొల్యూషన్ ఉండదు. పా మెమరీస్ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు. 15 రకాల మొక్కలు నాటి ఆహ్లాదకరంగా ఉండేలా గ్రీనరీ ఏర్పాటు చేశారు. పా మెమరీస్‌లో వీవింగ్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. అంత్యక్రియల కోసం వచ్చే వారు అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. అవసరమైతే వాటర్, కాఫీ, స్నాక్స్ అందజేసి సిబ్బంది ఓదారుస్తారు. తీరని బాధలో ఉన్న వారికి అవసరమైతే మానసిక వైద్య సేవలకు సిఫార్సు చేస్తారు. రెండు ఫ్రీజర్లు.. పా మెమరీస్‌కు చనిపోయిన జంతువులు, పక్షులు రాత్రి సమయంలో వచి్చనా.. యంత్రం పాడైనా.. అంత్యక్రియలకు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నప్పుడు వాటిని భద్రపరి చేందుకు రెండు ఫ్రీజర్లతో మార్చురీ ఏర్పాటు చేశారు. కాటి కాపరి, డ్రైవర్ల కోసం ప్రత్యేక వసతి కలి్పంచారు. 24 గంటలు కాటి కాపరి, డ్రైవర్లు అందుబాటులో ఉంటారు.ప్రత్యేక వాహనాలు పెట్స్ చనిపోయాయన్న సమాచారం అందిన వెంటనే ప్రత్యేక వాహనం వెళ్తుంది. ఆ వాహనంలో నాలుగు పెట్స్‌ను ఒకేసారి తీసుకొచ్చే విధంగా ఫ్రీజర్‌ను అమర్చారు. ఒక్కో పెట్‌కు రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. వివరాల కోసం ఫోన్: 91003 68124, 63026 95966.మనుషుల శ్మశానవాటికలా ఉండాలి పా మెమరీస్ చూస్తే మనుషుల శ్మశానవాటిక కూడా ఇలా ఉండాలే అని అనుకునే విధంగా ఏర్పాటు చేశాం. ఇండియాస్ మోస్ట్ బ్యూటిఫుల్ క్రిమటోరియంగా పిలుచుకుంటున్నాం. రాయదుర్గంలోని మహా ప్రస్తానం చూసినప్పుడు అలాంటి శ్మశానవాటికను పెట్స్ కోసం ఏర్పాటు చేయాలని భావించాను. పా మెమరీస్ కోసం రూ.కోటి 90 లక్షలు ఖర్చు చేశాను. కొద్ది సంవత్సరాలుగా వైల్డ్ లైఫ్‌లో పని చేస్తున్నాను. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న బర్డ్స్ పార్క్ కన్సల్టెన్సీగా పని చేస్తున్నాను. – నంద కిశోర్‌రెడ్డి, రాగా ఫౌండేషన్ అధ్యక్షులు -
ఫ్రీ హెయిర్ కటింగ్
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా సెలూన్ అనగానే మంగళవారం సెలవు. ఆ రోజు ఎక్కడా షాప్ తెరవరు. ఆ రోజు సెలూన్ నిర్వాహకులందరికీ హాలీడే.. జాలీడే.. కానీ ఇబ్రహీంపటా్ననికి చెందిన రాకేశ్ చేరియాలకు మాత్రం ఆ రోజు అత్యంత బిజీడే.. ఆ రోజున పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అనాథ శరణాలయాల్లోని పిల్లలు, వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు ఉచితంగా కటింగ్ చేస్తున్నాడు. వారికి చేతనైనంత ఆహారం తయారుచేసి వారి కడుపు నింపుతున్నాడు. నలుగురికి సాయం చేయాలన్న ఆలోచన ఉంటే చాలు.. డబ్బుతో సంబంధం లేకుండా ఎంతోమందికి కళ్లలో ఆనందం చూడొచ్చు అని నిరూపిస్తున్నాడు. అతడు చేస్తున్న సేవా కార్యక్రమాలతో స్ఫూర్తి పొంది మరికొందరు ఆయన బాటలో నడుస్తున్నారు. దాదాపు 35 మంది ఆయనతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. ఆ సంఘటనతో కదిలి.. మనం ఎలాంటి పరిసరాల్లో ఉంటే అలాంటి అలవాట్లే వస్తాయంటారు పెద్దలు. ఇంటి ముందు ఓ పెద్దాయన తనకు వచ్చే రేషన్ బియ్యంలో మిగిలినవి సమీపంలోని అంధుల వసతి గృహంలో ఇచ్చేవాడట. ఈ విషయం గమనించిన రాకేశ్.. తాను కూడా ఏదో ఒకవిధంగా వారికి సేవ చేయాలనే ఆలోచన వచి్చంది. అలా ఒకరోజు ఆ పాఠశాలకు వెళ్లగా, అక్కడున్న పిల్లలు తమకు స్టైల్ హెయిర్ కటింగ్ చేయించాలని అడిగారట. అప్పటి నుంచి ప్రతి మంగళవారం ఆ వసతి గృహానికి వెళ్లి అవసరం ఉన్న వారికి కటింగ్ చేస్తున్నాడు.రాకేశ్‌ను చూసి మరో నలుగురు.. రాకేశ్ చేస్తున్న సేవలు చూసి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దుర్గాప్రసాద్, శ్రీకాంత్, అరుణ్, శ్రవణ్ అనే నలుగురు తోటి స్నేహితులు ముందుకొచ్చారు. కొంతకాలానికి ఇంకొందరు వీరితో జాయిన్ అయ్యారు. ఇలా ఇప్పుడు దాదాపు 35 మంది కలిసి పలు అనాథాశ్రమాల్లో పిల్లలకు, వృద్ధాశ్రమాల్లోని వారికి కటింగ్ చేయడంతో పాటు వారికి ఆహారం అందజేస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్‌లలో గ్రూపులు ఏర్పాటు చేసుకుని అవసరమైన వాళ్ల సమాచారం షేర్ చేసుకుంటున్నారు. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లు అక్కడికి వెళ్లి కటింగ్ చేస్తున్నారు. ఇలా వీ ఫర్ ఆర్ఫన్స్ ఫౌండేషన్ పేరుతో రాకేశ్ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. అలాగే తలసేమియా బాధితులకు కూడా అప్పుడప్పుడూ క్యాంపు ఏర్పాటు చేసి రక్తదానం చేస్తూ పెద్ద మనసును చాటుకుంటున్నారు.ఉచితంగా హెయిర్ కటింగ్, చేతనైనంత ఆహారం వీ ఫర్ ఆర్ఫన్స్ పేరుతో సేవాభావం చాటుతూ.. -
వెజ్ మెమరి ఫుల్..
సాక్షి, సిటీబ్యూరో: శాకాహారంతో ఎన్నో లాభాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే.. అయితే మానసిక ఆరోగ్యానికి కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పరిశోధకులు తేలి్చచెప్పారు. శాకాహారంతో మెదడు పనితీరు మెరుగు పడుతుందని, డిప్రెషన్ తగ్గుతుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని గుర్తించారు. వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వరలక్ష్మి మంచన నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది. ఈ అధ్యయనం వివరాలు యురోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 40 ఏళ్లు దాటిన 304 మందిపై 6 నెలల పాటు వర్సిటీ పరిశోధకులు పరిశోధనలు చేశారు. శాకాహారులు, మాంసాహారులు మధ్య మానసిక, జ్ఞాపకశక్తి అంశాలలో ఉన్న తేడాలను పరిశోధించారు. శాకాహారం తిన్నవారిలో ప్రొటీన్, కాల్షియం, ఫోలేట్, విటమిన్ సీ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. కాకపోతే వీరిలో విటమిన్ బీ–12 స్థాయి చాలా తక్కువగా ఉందని గుర్తించారు. ఇక, మాంసాహారం తిన్నవారిలో కార్బొహైడ్రేట్స్, సోడియం, రైబోఫ్లావిన్, ఇనుము, విటమిన్ బీ ఎక్కువగా ఉన్నట్లు గమనించారు.విరివిగా యాంటీ ఆక్సిడెంట్లు..శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో కీలకపాత్ర పోషించే యాంటీ ఆక్సిడెంట్లు.. మాంసాహారం తినేవారితో పోలిస్తే శాకాహారం తినేవారిలో విరివిగా పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని కారణంగా మానసిక ఒత్తిడి భారీగా తగ్గిందని, వీరిలో కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యం పెరిగిందని పరిశోధకులు తెలిపారు. మెదడు పనితీరులో కీలక పాత్ర పోషించే ప్రొటీన్లు అధికంగా తీసుకోవడంతో మానసిక ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడిందని వెల్లడించారు. లాభాలు ఎన్నో శాకాహారం తీసుకోవడం వల్ల మానసికపరమైన లాభాలతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి పెరగడం వంటి లాభాలు చేకూరుతాయి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులను మన ఆహారంలో భాగం చేస్తే డిప్రెషన్, యాంగ్జయిటీ దరిచేరవని చెప్పొచ్చు. – డాక్టర్ వరలక్ష్మి మంచన, అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్ వర్సిటీ -
రంగస్థలానికి, నాటకాలకు పూర్వ వైభవం
ఒక తరం వెనక్కి వెళ్లి మన మూలాలను వెతుక్కుంటే రంగస్థలంతో ముడిపడి ఉన్న సమాజం సగర్వంగా కనిపిస్తుంది. నాటకం, నాటక రంగం స్ఫూర్తితోనే ప్రస్తుతం మనం చూస్తున్న పాన్ ఇండియన్ సినిమాలు పుట్టుకొచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రంగస్థలానికి టెక్నాలజీ తోడైన పరిణామక్రమమే సినిమా. ఈ నాటక రంగం మన మూలాలను తిరిగి తీసుకువచ్చేందుకు ఉవ్విల్లూరుతోంది. మోడ్రన్‌గా థియేటర్ ఆర్ట్ అని పిలుచుకునే రంగస్థలానికి, నాటకానికి ఆదరణ పెరుగుతోంది. ఈ పరిణామంలో ‘క్రియేటివ్ థియేటర్’ పేరుతో ఒక కళా సంస్థను స్థాపించి పదేళ్లుగా నాటకానికి పూర్వవైభవం కోసం కృషి చేస్తున్నాడు యువ కళాకారుడు అజయ్ మంకెనపల్లి. గరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని థియేటర్ ఆర్ట్ ఔత్సాహికులకు శిక్షణ అందించడంతో పాటు రంగస్థలం వేదికగా అద్భుతమైన నాటకాలకు ప్రాణం పోస్తూ కళా మూలాలతో ప్రయాణం చేస్తున్నారు. థియేటర్ ఆర్ట్‌ను నేటి తరం యువతకు, సినిమాకు వారధిగా మారుస్తున్న అజయ్ ప్రయత్నం గురించి ఆయన మాటల్లోనే.. కళతోనే ప్రయాణం.. కళ ఏదైనా సరే.., వాస్తవ రూపాన్ని ప్రదర్శించినప్పుడు మాత్రమే భావోద్వాగాన్ని సృష్టిస్తుంది. ఈ కారణంతోనే లైవ్ యాక్టింగ్ (థియేటర్ ఆర్ట్) స్వచ్ఛమైన అనుభూతులను అందిస్తుంది. ఈ సాంత్వన, సంతృప్తి కోసమే ‘క్రియేటివ్ థియేటర్’ ప్రారంభించి శిక్షణ అందిస్తున్నాను. 3 నెలల పాటు కొనసాగే ఈ కోర్సులో వర్క్‌షాప్స్, లైవ్ యాక్టింగ్ సెషన్స్ నిర్వహించడమే కాకుండా ప్రతి బ్యాచ్‌తో రవీంద్రభారతి, రంగభూమి, తెలుగు యూనివర్సిటీ వంటి కళా వేదికలపైన నాటక ప్రదర్శన చేయిస్తున్నాను. ఇలా ఇప్పటి వరకు 2 వేల మందికి పైగా థియేటర్ ఆర్ట్‌లో ప్రావీణ్యాన్ని అందించగలిగాను. ఇందులో భాగంగా ప్రముఖ యువ తెలుగు రచయిత మెర్సీ మార్గరేట్ రచనల ఆధారంగా నాటకీకరణ చేసిన అసమర్థుడు, కో అహం వంటి నాటకాలతో పాటు ఆల్ఫా, విరాట, త్రిపుర శపథం వంటి ఎన్నో నాటకాలు ప్రేక్షకుల నుంచి మన్ననలు పొందాయి. ముఖ్యంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రాసిన కథను నాటకంగా ప్రదర్శించిన ‘గొల్ల రామవ్వ’ నాటకానికి రఘుబాబు నేషనల్ థియేటర్ ఆర్ట్ అవార్డుతో పాటు పలు అవార్డులను అందుకున్నాం. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, విజయవాడ, ఖమ్మం వంటి పలు ప్రాంతాల్లో 60 వరకు ప్రదర్శనలు చేశాం. తెలంగాణలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు వేసవి శిక్షణలో భాగంగా ఇప్పటి వరకు 1800 మందికి పైగా భాగస్వాములయ్యారు.భావోద్వేగాలను ప్రదర్శిస్తున్నాం.. అడ్వెంచరస్, జానపదాలు, టైం ట్రావెల్, సోషియో ఫాంటసీ, నవలలు, కథలు, షేక్స్పియర్ వంటి ప్రముఖుల రచనల నుంచి నాటకాలకు నాటకీకరణ చేసి దర్శకత్వం వహిస్తా. రంగస్థలం కమర్షియల్‌గా వృద్ధిలోకి రావాల్సిన అవసరముంది. ఈ ప్రయాణంలో రచయితలు, వాయిద్యకారులు, మేకప్ ఆరి్టస్టులు, లైటింగ్, క్యాస్టింగ్ ఇలా ఎంతోమంది కృషి ఉంటుంది. మా విద్యార్థులు 60 మంది వరకు సినిమాల్లో అవకాశాలు పొందారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీల్లోని ఎమ్పీఏ కోర్సులకు కూడా ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. 3 నెలల కోర్సులో భాగంగా నాతో పాటు ఈ యూనివర్సిటీల థియేటర్ ఆర్ట్స్ నిపుణులను ఆహ్వానించి శిక్షణ అందిస్తాను. ఐటీ మొదలు టీచింగ్, పోలీసు, మార్కెటింగ్ ఉద్యోగుల నుంచి ఫుడ్ డెలివరీ బాయ్స్ వరకు ఈ ఆర్ట్ కోసం ఆసక్తి చూపిస్తున్నారు. భాషా సాంస్కృతిక శాఖ ప్రోత్సాహంమా ప్రయత్నానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అందిస్తున్న సహకారం ఎనలేనిది. ఈ శాఖ సంచాలకులు మామిడి హరిక్రిష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర కళల ప్రశస్తిని విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా థియేటర్ ఆర్ట్‌కు సైతం ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. శిక్షణ కోసం లలిత కళాతోరణం వేదికగా సహకారం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా సంస్థకు సరిపడా స్థలం అందిస్తే మరింత మందికి శిక్షణ ఇవ్వగలం. -
కదిలిన కావ్యం! వారాంతాల్లో పేదలకు అండగా..
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం.. ఆకర్షణీయమైన వేతనం.. ఆర్థికంగా అన్ని విధాలా స్థిరపడిన కుటుంబం.. ఇలాంటి సమయంలో యువత ఏం ఆలోచిస్తుంది.. మహా అయితే చర్మ సౌందర్యం.. బ్రాండెడ్ దుస్తులు, కార్లు, సెలవు రోజుల్లో రిలాక్స్ కోసంకుటుంబ సభ్యులు, స్నేహితులతో ప్రత్యేకంగా వీకెండ్ ప్లాన్స్ చేసుకుంటారు. దానికితోడు విలాసవంతమైన జీవితం కోరుకోవడం సహజం. అయితే హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కావ్య మాత్రం పేద పిల్లలను చదివిస్తూ, ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టి ఆకలి తీరుస్తూ, నాణ్యమైన దుస్తులు అందిస్తున్నారు. వారం రోజులు పనిదినాల్లో ఉద్యోగ బాధ్యతలతో బిజీగా ఉండే ఆమె సెలవు రోజుల్లో సేవా కార్యక్రమాలపై దృష్టిసారిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోఆమె ఆలోచనలకు కుటుంబ సభ్యులు ఆమోదం తెలుపుతుండగా, సహచర ఉద్యోగులు సైతం సహకరిస్తున్నారు. 2019లో ప్రముఖ సంస్థలో ఆమె సాఫ్ట్వేర్ సంస్థలో చేరారు. కరోనా సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి 200లకుపైగా కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అక్కడి నుంచి సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో 2020లో చారిటీ విజిట్స్ యు ఆల్వేజ్ (చార్వ్య) పేరిట స్వచ్ఛంద సంస్థ స్థాపించారు. సెలవు దినాల్లో కార్యక్రమాలు నడిపిస్తున్నారు.మురికివాడలే లక్ష్యంగా.. నగర పరిధిలోని మురికి వాడలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, వలస కారి్మకులు ఉండే ప్రాంతాలే లక్ష్యంగా ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. ముందుగా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో సుమారు ఎంత మంది జనం సాయం కోసం ఎదురుచూస్తున్నారు? వాళ్ల అవసరాలు తెలుసుకొని, అందుకు అనుగుణంగా సిద్ధమవుతున్నారు. ఆహారం, దుస్తులు, దుప్పట్లు, స్వెటర్లు, నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.ఆ ఆనందం వెలకట్టలేనిది..ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం, దుస్తులు, ఇతర సరుకులు అందించడం సంతోషంగా ఉంది. ఆ ఆనందం వెలకట్టలేనిది. ఇతరులు మంచి జీవితాన్ని పొందడానికి నా వంతు సాయం అందిస్తున్నా. నాకున్న అవకా శాల్లో ఒక మార్గం ఎంచుకొని ముందుకెళ్తున్నా.. కుటుంబ సభ్యులు సరే నీ ఇష్టం అన్నారు. నా వేతనం మొత్తాన్నీ చారిటీకే వెచి్చస్తున్నాను. మరింత మందికి సాయం చేసే అవకాశం కలి్పంచాలని భగవంతుడిని ప్రారి్థస్తున్నా. – కావ్య, చార్వ్య, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు -
ఇంట్లోనే.. రిలీఫ్..! డయాబెటిస్‌పై పోరుకు మెడిసినల్ ప్లాంట్స్ సాయం!
డయాబెటిస్, బీపీ తదితర దీర్ఘకాలిక వ్యాధులు నగరవాసులకు వీడని నీడలుగా మారుతున్నాయి. వైద్యసాయం తీసుకుంటున్నా, మందులు వాడుతున్నా.. తగ్గేదెలే.. అన్నట్టుగా వదలకుండా వెంటాడుతున్న వ్యాధుల విషయంలో కొందరు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా ఇంట్లోనే మెడిసినల్ ప్లాంట్స్‌ను సైతం పెంచుకుంటున్నారు. – సాక్షి, సిటీబ్యూరోరక్తంలో చక్కెర స్థాయిలు, మధుమేహాన్ని నియంత్రించడానికి, ఇన్సులిన్ సహా అనేక రకాల మందులు చికిత్సలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే కారణాలేవైనా.. కొందరు ప్రత్యామ్నాయ విధానాలను ప్రయత్నిస్తున్నారు. మధుమేహంతో పోరాడేందుకు ఔషధ మొక్కలను పెంచుతున్నారు మాజీ సాఫ్ట్వేర్ నిపుణుడు మొట్టమర్రి సందీప్.టెర్రస్‌లో.. ట్రీట్మెంట్..ఇన్సులిన్ మొక్క ఆకులు మధుమేహం నిర్వహణలో ఉపయోగపడతాయని, ఇన్సులిన్ మొక్కల ప్రయోజనాలను గుర్తించి, వాటిని మొహిదీపట్నంలోని తన ఇంటి టెర్రస్‌పై సేంద్రీయంగా పెంచడం ప్రారంభించారు సందీప్. తన మధుమేహం చికిత్స కోసం ఈ సహజమైన విధానాన్ని ఆయన అనుసరించాడు. తన టెర్రస్‌ను ఆరోగ్యానికి తోటగా మార్చాడు. మందులు, ఇంజెక్షన్లకు బదులు ఇన్సులిన్ ఆకులను తీసుకోవడం ద్వారా, ఏడు సంవత్సరాలుగా తన మధుమేహాన్ని అదుపులో ఉంచుకోగలిగానని ఆయన అంటున్నారు. ‘నేను మందులు మానేసి ఏడేళ్లుగా ఇన్సులిన్ మొక్క ఆకులను తీసుకుంటున్నాను. దాంతో ఈ ఏడేళ్లలో డాక్టర్‌ను కలవాల్సిన అవసరం రాలేదు’ అని ఆయన చెప్పారు. ఆయన చెబుతున్న ప్రకారం.. ఇన్సులిన్ ప్లాంట్ తగిన స్థాయిలో పరిపక్వానికి చేరేందుకు దాదాపు నాలుగు నెలల సమయం పడుతుంది. పెంపకం.. పంపకం.. ఇన్సులిన్ మొక్కలతో పాటు అతను కొన్ని కూరగాయలతో పాటు రణపాల వివిధ రకాల తులసి వంటి ఇతర ఔషధ మొక్కలను కూడా ఆయన పెంచుతున్నారు. ఆయన దగ్గర ఉన్న మెడిసినల్ ఇన్సులిన్ ప్లాంట్ల గురించి ఆ నోటా.. ఈ నోటా విని సుదూర ప్రాంతాల నుంచీ కాల్స్ వస్తుంటాయన్నారాయన. ఓపికగా మొక్క ప్రయోజనాలను వివరిస్తానని, మొక్కలను తీసుకెళ్లడానికి వచ్చే వ్యక్తులకు నామమాత్రపు ధరకు వాటిని అందిస్తూనే, మొక్కలను పెంచే చిట్కాలను చెప్తానన్నారు. ‘ఆకులను క్రమం తప్పకుండా తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు క్షీణించడాన్ని గమనించినట్లు చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు’ అని ఆయన చెప్పారు. అయితే ఒక రోజులో 2 కంటే ఎక్కువ ఆకులను వాడొద్దని ఆయన సలహా ఇస్తారు. అధిక మోతాదు కారణంగా సంభవించే ప్రమాదాలను నివారించడానికి ఉదయం ఒక ఆకు సాయంత్రం మరో ఆకును తీసుకోవాలని సూచిస్తున్నారు. -
Rakul Prithi Singh: చిరుధాన్యాలే.. 'ప్రీతి'పాత్రమై..
సాక్షి, సిటీబ్యూరో: నా హృదయంలో హైదరాబాద్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. నా సినిమా కెరీర్‌కు బీజం పడింది ఇక్కడే.. అంటూ తన అభిమానాన్ని తరచూ చాటుకుంటారు బహుభాషా నటి రకుల్ ప్రీతిసింగ్. అందుకే ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌కు దూరంగా ఉన్నా, నగరానికి మాత్రం దగ్గరగానే ఉంటున్నారు. ఇటీవలే కొండాపూర్‌లో తన 2వ మిల్లెట్ రెస్టారెంట్ ‘ఆరంభం’ను ఆమె ప్రారంభించారు.మే నెలలో మాదాపూర్‌లో తొలి రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసిన ఆమె కేవలం 2నెలల్లోనే మరొకటి సిటిజనులకు అందుబాటులోకి తేవడం గమనార్హం. తెలుగు సినిమాల్లో అడపాదడపా మాత్రమే కనిపిస్తూ బాలీవుడ్ ప్రముఖుడ్ని పెళ్లాడి ముంబైలో నివసిస్తున్న రకుల్ ప్రీతిసింగ్.. నగరంతో తన అనుబంధాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. ఫిట్నెస్ లవర్ రకుల్.. గతంలో నగరంలో ఎఫ్–45 పేరిట జిమ్స్ నెలకొలి్పన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా నగరంలో అనేక మంది సినీ ప్రముఖులు రెస్టారెంట్స్, పబ్స్ ఏర్పాటు చేసినప్పటికీ.. ఆరోగ్యాభిలాషుల్ని దృష్టిలో ఉంచుకుని ఫిట్నెస్ సెంటర్లూ, మిల్లెట్ రెస్టారెంట్లూ నెలకొలి్పన క్రెడిట్ మాత్రం రకుల్ దక్కించుకున్నారు. -
హెయిర్.. కేర్..! బట్టతలను దాటి విస్తరించిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్!
సాక్షి, సిటీబ్యూరో: చిన్న వయస్సులోనే జుట్టు రాలడం, బట్టతల మాత్రమే కాదు.. ఇప్పుడు శరీరంలో పలు అవసరమైన చోట్ల కేశాలను కోల్పోవడం/లేకపోవడం కూడా సమస్యలుగానే భావిస్తున్నారు. ఆధునికుల్లో సౌందర్య పోషణ పట్ల పెరిగిన ప్రాముఖ్యత నేపథ్యంలో అవసరమైన చోట కేశాల లేమి సమస్యలకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను అనేకమంది పరిష్కారంగా ఎంచుకుంటున్నారు.ప్రస్తుతం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలను పొందుతున్న వినియోగదారుల్లో 25–45 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువ. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో ఈ మార్కెట్ 25–30శాతం వార్షిక వృద్ధి నమోదు చేస్తోంది. బట్టతలకు మాత్రమే కాకుండా కను»ొమలు, మీసాలు, గెడ్డం కోసం కూడా మగవారు అలాగే నుదుటి భాగంలో జుట్టు పలచబడటం (ఫిమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్) వంటి కారణాలతో మహిళలు ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను ఆశ్రయిస్తుండటంతో ఈ మార్కెట్ రోజురోజుకూ విస్తరిస్తోంది.యూనిట్ వారీగా వ్యయం..ఒకచోట నుంచి హెయిర్ స్ట్రిప్ కట్ చేసి చేసే ఎఫ్యుటి, స్ట్రిప్‌తో సంబంధం లేకుండా చేసేది ఎఫ్యుఇ పేరిట రెండు రకాల ట్రాన్స్‌ప్లాంటేషన్ పద్ధతులున్నాయి. కేశాలనేవి ఒకటిగా కాకుండా 3, 4 చొప్పున మొలుస్తాయి కాబట్టి వాటిని ఫాలిక్యులర్ యూనిట్‌గా పిలుస్తారు. ఒక్కో యూనిట్‌ను పర్మనెంట్ హెయిర్ ఉన్న చోట నుంచి తీసి అవసరమైన చోట అమర్చడానికి యూనిట్‌కు రూ.50 నుంచి రూ70 వరకూ వ్యయం అవుతుంది. ఈ లెక్కన చూసుకుంటే బట్టతల సమస్య పరిష్కారానికి కనీసం రూ.70వేల నుంచి రూ.లక్ష వరకూ ఖర్చుపెట్టాలి. కను»ొమలు తదితర చిన్నచిన్న ట్రాన్స్‌ప్లాంటేషన్ తక్కువ వ్యయంతో రూ.10, రూ.15వేల వ్యయంతో గంట, రెండు గంటల్లోనే పూర్తవుతుంది. అయితే తలభాగం మీద పూర్తిస్థాయిలో చేయాలంటే ఒక పూట నుంచి ఒక రోజు మొత్తం క్లినిక్‌లో ఉండాల్సి రావొచ్చు. ట్రాన్స్‌ప్లాంటేషన్ అనంతరం కొంత కాలం అధిక టెంపరేచర్‌కు గురికాకుండా జాగ్రత్తపడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అర్హత లేమితో అనర్థాలు...తక్కువ రెమ్యునరేషన్‌తో సరిపుచ్చడానికి.. పలు క్లినిక్‌లు అర్హత లేని వ్యక్తుల ఆధ్వర్యంలో శస్త్రచికిత్సలు చేస్తున్నాయి. దీంతో శరీరంపై మచ్చలు పడటం, బేసి వెంట్రుకలు, జుట్టు అపసవ్యంగా పెరగడం దగ్గర నుంచీ తీవ్రమైన ఇన్ఫెక్షన్, జుట్టురాలడం వరకు ఏ పరిస్థితినైనా ఎదుర్కోవాల్సి రావొచ్చు. పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో డెర్మటాలజిస్ట్లకు సైతం అత్యవసరంగా శిక్షణ ఇస్తున్నారు. వీటన్నింటినీ పరిశీలించిన అనంతరం సరైన నిపుణుల పర్యవేక్షణలో జరిగే చికిత్సలు ఖచి్చతంగా సురక్షితమే.అరకొర శిక్షణతో.. నో..హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి క్లిష్టమైన సౌందర్య ప్రక్రియలను నిర్వహించడానికి యూట్యూబ్ లేదా ఇతర ప్లాట్ ఫారమ్‌లలో శిక్షణ వీడియోలను చూస్తే సరిపోదని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) తేల్చి చెప్పింది. సర్జికల్ అసిస్టెంట్/టెక్నీíÙయన్లు (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్) పర్యవేక్షణలో ఇవి చేయాలని సూచించింది. సౌందర్య ప్రక్రియలేవీ అత్యవసర శస్త్రచికిత్స కిందకురావు. శిక్షణ లేని వ్యక్తి చేయడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.వైద్యంతో పరిష్కారం కాకపోతేనే..వంశపారంపర్యంగా వచ్చే బట్టతల విషయంలో ఎలా ఉన్నా మిగిలిన చోట్ల ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు వెళ్లే ముందు తప్పకుండా వైద్య పరమైన పరిష్కారం అన్వేíÙంచాలి. ఉదాహరణకు కను»ొమ్మలు కోల్పోతే.. అల్ట్రా వయెలెంట్ లైట్ వినియోగించి మాగి్నఫైయింగ్ లెన్స్‌లను వినియోగించి దానికి కారణాన్ని గుర్తించాలి. చికిత్సకు అవకాశం ఉంటే చేయాలి. లేని పక్షంలోనే ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎంచుకోవాలి. అవకాశం ఉంటే కొన్ని మందులు అప్లై చేసి చూస్తాం. స్టిరాయిడ్ క్రీమ్స్ కూడా వినియోగిస్తాం.. ఎల్ఎల్ ఎల్టి, లో లెవల్ లోజర్ థెరపీతో కూడా వెంట్రుకలు పెరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనా.. సమస్యను సరైన విధంగా నిర్ధారించి అవసరం మేరకు చికిత్స చేసే అర్హత కలిగిన వైద్యుడి దగ్గరే చేయించుకోవాలి. లేకపోతే ఇతరత్రా ఆరోగ్య సమస్యలకూ కారణం కావొచ్చు.– డా.జాన్ వాట్స్, డెర్మటాలజిస్ట్, సీనియర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ -
Hyderabad: స్ట్రీట్ డాగ్స్‌కు.. ఫుడ్ పెట్టాలా?
సాక్షి, సిటీబ్యూరో: దయాగుణంతో వీధికుక్కలకు ఆహారం పెట్టేవారు తమ పేర్లను జీహెచ్ఎంసీ వద్ద నమోదు చేసుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. అందుకుగాను bit.ly/GHMCdogfreederform లింక్ ద్వారా లేదా సంబంధిత క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపింది. తద్వారా జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో వీధి కుక్కలకు ఆహారం ఉంచేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు జీహెచ్ఎంసీతో కలిసి పనిచేయవచ్చని పేర్కొంది.దాంతో ప్రజలు కుక్కల బారిన పడే ప్రమాదాలు తగ్గుతాయని అభిప్రాయపడింది. పేర్లు నమోదు చేసుకున్న వారికి కుక్కలకు ఆహారం వేసే విధానం, జంతు సంరక్షణ మార్గదర్శకాలు తదితర అంశాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందని తెలిపింది. స్టెరిలైజేషన్, వాక్సినేషన్ జరగని కుక్కల గురించి సమాచారమిచ్చి ఆ కార్యక్రమాల డ్రైవ్స్‌లో భాగస్వాములు కావొచ్చని పేర్కొంది. కార్యక్రమాలకు జంతు సంక్షేమ సంఘాలు కూడా సహకరించాలని కోరింది. తద్వారా నగరాన్ని సురక్షిత, ఆరోగ్యకర నగరంగా మార్చవచ్చని పేర్కొంది. వివరాలకు జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయాల్లో వెటర్నరీ అధికారులను సంప్రదించాల్సిందిగా సూచించింది. -
Hyderabad: మెరి'శారీ'లా..! నూతన బ్రాండ్ ‘జీఎస్ శారీస్ షో రూమ్’..
సాక్షి, సిటీబ్యూరో: చేనేత హస్త కళాకారులు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన నూతన బ్రాండ్ ‘జీఎస్ శారీస్ షో రూమ్’ను నిజాంపేట్‌లో ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ’అల్లరే అల్లరి’ చిత్రబృందం కౌశిక్, విశ్వమోహన్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రముఖ మోడల్స్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు సందడి చేశారు. ఈ సందర్భంగా స్టోర్ ఎండీ శ్రావణి గోపీనాథ్ మాట్లాడుతూ.. తెలుగు సంప్రదాయాలకు చీరకట్టు ప్రాధాన్యం తెలియజేసేలా హ్యాండ్ మేడ్ శారీలను అందిస్తున్నామని తెలిపారు. -
Hyderabad: క్రియాలో.. శ్రియ! కేపీహెచ్బీలో క్రియా జ్యువెల్లర్స్ ప్రారంభం!
సాక్షి, సిటీబ్యూరో: లక్షణమైన దక్షిణాది అమ్మాయిలా ముస్తాబు కావడం ఎంతో ఇష్టమని ప్రముఖ సినీతార శ్రియ శరన్ తెలిపారు. కేపీహెచ్‌బీ రోడ్ నంబర్–1లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రియా జ్యువెల్స్‌ను బుధవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అందరు మగువల్లానే తనకూ బంగారు ఆభరణాలు ఎంతో ఇష్టమన్నారు. ఆభరణాలు మగువలకు మరింత సౌందర్యాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. క్రియా ఆధ్వర్యంలోని లైట్ వెయిట్ ఆభరణాలు వినూత్నంగా ఉన్నాయని చెప్పారు. సినిమాల గురించి మాట్లాడుతూ.. తెలుగులో తేజా సజ్జా సినిమాలో, తమిళ్లో సూర్యతో మరో సినిమాలో నటిస్తున్నానని తెలిపారు. వారసత్వం, సంప్రదాయ ఆవిష్కరణలో భాగంగా క్రియా జ్యువెల్లరీని ప్రారంభించామని నిర్వాహకులు కొణిజేటి వెంకట మహేష్ గుప్తా అన్నారు. వజ్రాభరణాలతో పాటు ప్రత్యేకంగా విక్టోరియన్ కలెక్షన్ అందుబాటులో ఉన్నాయన్నారు. మరికొద్ది రోజుల్లో మరిన్ని స్టోర్లను ప్రారంభించను న్నామని ఆయన తెలిపారు. -
వ్రతం.. వజ్రం..! వ్రతాన్ని పరిపూర్ణం చేసేలా ఈ డిజైన్..
సాక్షి, సిటీబ్యూరో: వరలక్ష్మి వ్రత పూజను పురస్కరించుకుని ప్రత్యేకంగా లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్‌ను బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్ ఆధ్వర్యంలోని ‘త్యాని బై కరణ్ జోహార్’ ఆభరణాల స్టోర్ రూపొందించింది. ఈ ఆభరణాల శ్రేణిని జూబ్లీహిల్స్‌లోని షోరూమ్‌లో మంగళవారం విడుదల చేశారు. ఈ కలెక్షన్లో సంప్రదాయాలను ఆధునికతలను మేళవించిన ఆభరణాలు ఉన్నాయని, వ్రతాన్ని పరిపూర్ణం చేసేలా ఇవి డిజైన్ చేయడం జరిగిందని త్యాని నిర్వాహకులు రిషబ్ తెలిపారు. అదేవిధంగా విభిన్న రకాల మేలిమి వజ్రాభరణాలు కూడా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సరికొత్త కలెక్షన్ ప్రదర్శించారు. -
డియర్ సార్.. ప్లీజ్ ‘వీ ఆర్ హ్యాండ్లూమ్’ అంటూ..
డియర్ సార్.. ప్లీజ్ ‘వీ ఆర్ హ్యాండ్లూమ్’ అంటూ పలకరించే తమ స్నేహితుడి కోసం చేనేత వ్రస్తాలను ధరించే వారు కొందరైతే, వీఆర్ హ్యాండ్లూమ్.. బీ హ్యాండ్సమ్ అని చెబితే గానీ, చేనేత వస్త్ర ధారణ పై తమకు మక్కువ కలగలేదనే వారు మరి కొందరు. చేనేత వస్త్ర ప్రియుడిగా, ప్రోత్సాహకుడిగా తన ఉనికిని చాటుకునే మాచన రఘునందన వృత్తిరీత్యా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పౌర సరఫరాల శాఖలో ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్. చేనేత పట్ల ఆయనకున్న కమిట్మెంట్పై పలు విశేషాలు.. – సాక్షి,సిటీబ్యూరోమూడు దశాబ్దాలుగా చేనేత వస్త్రాలు మాత్రమే ధరిస్తూ చేనేత వ్రస్తాలపై విస్తత ప్రచారం చేస్తున్నారు. ‘చేనేత వస్త్రాలను ధరించండి.. నేతన్నను ఆదరించండి’. అంటూ తన మిత్రులు, సహచర ఉద్యోగులు హ్యాండ్లూమ్ బట్టలు ధరించేలా ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ పద్మశాలి అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్‌లో కీలకపాత్ర పోషిస్తూ చేనేత వ్రస్తాలకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగా ప్రచారం కలి్పస్తున్నారు. హ్యాండ్లూమ్కు తన దైనందిన జీవితంలో అత్యంత ప్రాధాన్యతనివ్వడంతో ఆదర్శ ప్రాయంగా మారారు.చదువుకునే రోజుల నుంచే..మాచన రఘునందన చదువుకునే రోజులనుంచే చేనేత వ్రస్తాలు ధరించడం ఆరంభించారు. తన వివాహ సమయంలో కూడా చేనేత వ్రస్తాలను మాత్రమే విధిగా ఉండేలా నిబంధన పెట్టి సఫలీకృతమయ్యారు. చేనేత ఉపయోగాలను జనబాహుళ్యానికి తెలిసేలా తన దైనందిన జీవితంలో అనుదినం చేనేత వ్రస్తాలనే ధరిస్తూ వస్తున్నారు. చేతిరుమాలు, తువ్వాలు, లుంగీలు, ఇలా ప్రతిదీ చేనేతనే ఉపయోగిస్తారు. తాను చేనేత వ్రస్తాలను ధరించడమే కాకుండా కుటుంబ సభ్యులను, తోటివారిని, ఇరుగు పొరుగు వారిని సైతం చేనేతనే వినియోగించేలా అవగాహన కల్పిస్తున్నారు.ఇంట్లోని దుప్పట్లు, మొదలు వివిధ రకాల అలంకరణ వ్రస్తాలను సైతం చేనేతవే వినియోగిస్తుంటారు. ఇక పుట్టినరోజు, వివాహాది శుభకార్యాలకు కానుకలుగా చేనేత ఉత్పత్తులనే అలంకార వస్తువులుగా తయారు చేయించి ఇస్తుండడం ఆయన ప్రత్యేకత. ఏటా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉన్నతాధికారులను చేనేత తువ్వా ళ్లతో సత్కరించడం ఆయన ఆనవాయితీ. మిత్రుల వివాహాది శుభకార్యాలకు హ్యాండ్లూమ్ షోరూంను సందర్శించేలా చేసి, నచ్చిన వస్త్రాలు తక్కువ ధరలకు లభ్యమయ్యేలా ప్రోత్సహిస్తున్న తీరును ప్రత్యక్షంగా వివరిస్తున్నారు. హ్యాండ్లూమ్ను ఆదరిస్తే.. ఒక నేత కార్మికుడి కుటుంబాన్ని ఆదుకున్నట్లేనని ఆయన అభిప్రాయం. మిత్రులు కలిసిన సందర్భంగా డియర్ ఫ్రెండ్.. వీఆర్ హ్యాండ్లూమ్ అంటూ కరచాలనం చేయడం ఆయన ప్రత్యేకత. -
బుద్ధుడి మార్గంలో.. మానసిక ప్రశాంతతపై ప్రజల్లో అవగాహన!
‘మనిషి మనసు నుంచే యుద్ధాలు పుట్టు కొస్తాయి.. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ప్రపంచ శాంతి స్థాపన సాధ్యం అవుతుంది’ అన్న బుద్ధుడి మాటలే వారికి స్ఫూర్తి.. ఆయన ప్రవచించిన పంచశీల లక్షణాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు.. అంతేకాదు ఆయన బోధనలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు కృషి చేస్తున్నారు. ప్రజల్లో మానసిక ప్రశాంతతను నెలకొల్పేందుకు ప్రయతి్నస్తున్నారు. తెలంగాణలో ఉన్న ప్రముఖ బౌద్ధ క్షేత్రాల గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న కొత్తూరు మండలం తిమ్మాపూర్‌లో బోధిసత్వ బుద్ధ్ధవిహార్ పేరుతో క్షేత్రాన్ని స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారే బుద్ధా లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్ ప్రతినిధులు.మానవతా బౌద్ధ ధర్మం..హైదరాబాద్ చాప్టర్ ప్రధాన కార్యాలయం ఫోగువాంగ్ షాన్ పేరుతో తైవాన్‌లో ఉంది. మానవతా బుద్ధిజాన్ని విరివిగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థ ప్రారంభమైంది. ప్రపంచంలో శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా మైండ్ కల్చర్‌ను పెంపొందించేందుకు కృషి చేస్తోంది. ఈ సంస్థ హైదరాబాద్ శాఖకు ప్రధాన సలహాదారు అయిన డాక్టర్ బాలు సావ్లా 15 ఏళ్లుగా పని చేస్తున్నారు. రెండు సార్లు ఈ సంస్థకు ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు.విద్య, వైద్య సేవలు..హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఎన్నో విద్య, వైద్య పరమైన సేవలు అందిస్తున్నారు. ప్రజల్లో మానసిక ప్రశాంతత గురించి అవగాహన కలి్పస్తూనే చాలా ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు.దేశ, విదేశాల్లో ప్రచారం..తెలంగాణలో బౌద్ధ మతం ఒకప్పుడు విరాజిల్లింది. బుద్ధుడు నడయాడిన ఘనమైన చరిత్ర మన నేలకు ఉంది. కాలక్రమేణా బౌద్ధమతం కనుమరుగైనప్పటికీ అప్పటి ఆనవాళ్లు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఆ చరిత్ర గురించి ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు డాక్టర్ బాలు ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. థాయ్‌లాండ్, మలేసియా, సింగపూర్, చైనా, కెనడా వంటి దేశాలప్రజలకు ఇక్కడి బౌద్ధ క్షేత్రాల గొప్పదనాన్ని చాటి చెబుతున్నారు. మానసిక ప్రశాంతత అవసరం..ప్రస్తుతం ఉన్న బిజీ జీవన విధానంలో మానసిక ప్రశాంతత ఎంతో అవసరం. బుద్ధుడు చూపిన మార్గంలో వెళ్తే సులువుగా దాన్ని సాధించవచ్చు. ఇప్పటి తరానికి బుద్ధుడి బోధనలు ఎంతో అవసరం. – డాక్టర్ బాలు సావ్లా, బుద్ధ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్, హైదరాబాద్ శాఖ ప్రధాన సలహాదారు -
‘ఒలింపిక్’ స్ఫూర్తిని పంచేందుకు..
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచవ్యాప్తంగా క్రీడాస్ఫూర్తిని మేల్కొలిపే ఒలింపిక్స్ వైపు యువత దృష్టిని మరింతగా మళ్లించేందుకు ‘టుగెదర్ ఫర్ టుమారో, ఎనేబ్లింగ్ పీపుల్’ పేరిట ఓ కొత్త కార్యక్రమం రూపుదిద్దుకుంది. దీనిని పారిస్‌లో లాంచ్ చేసినట్టు నిర్వాహక సంస్థ శామ్సంగ్ ఇండియా సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు.దీనిలో భాగంగా ఒలింపిక్ క్రీడా స్ఫూర్తిని పంచడంతో పాటు సామాజిక ప్రయోజనాన్ని అందించే విభిన్న కార్యక్రమాలు నిర్వహించనున్నామని, ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం తాము నిర్వహించిన సాల్వ్ ఫర్ టుమారో పోటీ విజేతలను ప్రచార కర్తలుగా వినియోగించుకోనున్నామని అన్నారు. -
హైదరాబాద్: నగరానికి పెళ్లి కళ! 17, 18 తేదీల్లో బలమైన ముహూర్తాలు..
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి పెళ్లి కళ వచ్చేసింది. ఆషాఢ మాసం వెళ్లి శ్రావణం రావడంతో శుభకార్యాలకు మంచి ముహూర్తాలు కూడా వచ్చేశాయి. దీంతో ఈ నెలలో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నట్లు పురోహితవర్గాలు అంచనా వేస్తున్నాయి. కొంతకాలంగా ఎలాంటి పెళ్లిళ్లు, వేడుకలు లేకుండా ఉన్న పురోహితులు ఈ నెల రోజుల పాటు బిజీ బిజీగా గడపనున్నారు.ఈ నెల 7 నుంచి 28 వరకూ అన్నీ మంచి ముహూర్తాలే అయినా 17, 18 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉన్నాయి. ఆ రెండు రోజుల పాటు నగరంలో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫంక్షన్‌హాళ్లు, కల్యాణమండపాలు, హోటళ్లకు బుకింగ్ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. అలాగే భాజాభజంత్రీలు, మండపాలను అలంకరించేవారికి, కేటరింగ్ సంస్థలకు సైతం ఆర్డర్లు పెరిగినట్లు అంచనా. ఈ నెల 7, 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28 తేదీల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు ప్రముఖ పురోహితుడు చిలకమర్రి శ్రీనివాసాచార్యులు తెలిపారు.15వ తేదీ నుంచి అన్నీ దివ్యమైన ముహూర్తాలే అని చెప్పారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, తదితర శుభకార్యాలకు ఈ నెల ఎంతో అనుకూలమైనదని పేర్కొన్నారు. ఈ నెలలో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్న దృష్ట్యా మార్కెట్లో సైతం సందడి పెరిగింది. వస్త్రదుకాణాలు, బంగారం దుకాణాల్లో అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల బంగారం ధరలు కూడా కొంత వరకూ తగ్గడం వల్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. పైగా ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ రావడంతో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.ఇవి చదవండి: ఫ్యాషన్ ట్రెండ్స్‌కు హైదరాబాద్ నగరం ‘సోల్ సిటీ’.. : స్టార్ డిజైనర్ ఓస్వాల్ -
కేన్ క్రాఫ్ట్! ఆకట్టుకునే ఆకృతులు.. పర్యావరణ స్నేహితులు!
సాక్షి, సిటీబ్యూరో: నడిరోడ్డుపైన కొలువుదీరిన ఉత్పత్తులు చేతి వృత్తుల నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. కాదేదీ సృజనకు అనర్హం అన్నట్టు వెదురు, కేన్లను ఉపయోగించి వివిధ రకాల ఆకృతుల్లో ఉత్పత్తులను తీర్చిదిద్దుతున్నారు. ఈ ఉత్పత్తులు అందానికీ, వైవిధ్యానికి పట్టం గడుతున్నాయి. ఖరీదైన మాల్స్‌లో మాత్రమే కాదు కచ్చా రోడ్లపై కూడా షాపింగ్ ప్రియుల్ని కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా వెదురు, కేన్‌తో తయారు చేసిన బుట్టలు, బ్యాగ్‌లు, ఇతర ఉత్పత్తులు నగరవాసుల మది దోచుకుంటున్నాయి. తయారీ నైపుణ్యంతో పాటు అందుబాటు ధరల్లో ఉండటంతో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.రూ.200 నుంచి రూ.25 వేల వరకూ..ఒకొక్కటీ సుమారుగా రూ.200 నుంచి గరిష్టంగా రూ.25 వేల వరకూ ఉంటాయని తయారీదారులు చెబుతున్నారు. ఎన్ని మార్కెట్లు ఉన్నా మా వినియోగదారులు మాకున్నారంటున్నారు. చేసే పనిలో నైపుణ్యం ఉండాలే గాని ప్లాస్టిక్, ఫ్యాబ్రిక్, ఫైబర్, వంటివి ఎన్ని మోడల్స్ వచి్చనా సంప్రదాయ కళలకు ప్రజాదరణ ఉంటుందని ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.ఇదే జీవనాధారం.. పశ్చిమగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్ వచి్చన ఓ కుటుంబం సంప్రదాయ హస్తకళనే జీవనాధారంగా చేసుకుంది. రామానాయుడు స్టూడియో నుంచి కిందికి వెళ్లే రోడ్డులో ఫుట్‌పాత్‌పై ఈ ఉత్పత్తులు మన ముందే తయారు చేసి విక్రయిస్తున్నారు. పూలు, పండ్లు, ఇతర పూజా సామాగ్రి తీసుకెళ్లేందుకు వినియోగించే బుట్టల నుంచి గార్డెన్లో విద్యుత్తులైట్లు అమర్చుకునేందుకు వివిధ ఆకృతుల్లో బుట్టలు, లాంతరు లైట్లు, తయారుచేస్తున్నారు. లాంతరు లైట్లు, మూత ఉన్న బుట్టలు, గంపలు, పెద్దపెద్ద హాల్స్‌లో అలంకరణ కోసం పెట్టుకునే పలు రకాల వస్తువులను అక్కడికక్కడే తయారుచేసి అందిస్తున్నారు. వీటిని విభిన్నమైన రంగులతో అందంగా తీర్చిదిద్దుతున్నారు.పర్యావరణ హితం కోసం.. వెదురుతో పర్యావరణ హితమైన వస్తువులను తయారు చేస్తున్నాం. మా కుటుంబానికి వంశపారంపర్యంగా వస్తున్న కళ ఇది. మాకు ఇదే జీవనాధారం. వివిధ ఆకృతుల్లో అందంగా, ఆకట్టుకునే వస్తువులను తీర్చిదిద్దుతున్నాం. వస్తువు తయారీకి ఉపయోగించిన ముడిసరుకును బట్టి దాని ధర నిర్ణయిస్తాం. పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. కూలి గిట్టుబాటు అయితే చాలనుకుంటాం. ఫలితంగా అందరికీ అందుబాటైన ధరలోనే వస్తువులు లభిస్తాయి. రోజు పదుల సంఖ్యలో వస్తువులు అమ్మకాలు జరుగుతున్నాయి. – రమేష్, తయారీదారుడు, జూబ్లిహిల్స్ -
ఫ్యాషన్ ట్రెండ్స్‌కు హైదరాబాద్ నగరం ‘సోల్ సిటీ’.. : స్టార్ డిజైనర్ ఓస్వాల్
సాక్షి, సిటీబ్యూరో: ఫ్యాషన్ డిజైనింగ్, అధునాతన ఫ్యాషన్ ట్రెండ్స్‌కు హైదరాబాద్ నగరం ‘సోల్ సిటీ’ అని ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ అనిత ఓస్వాల్ తెలిపారు. దశాబ్దాల కాలం నుంచే ఇక్కడి రిచ్ కల్చర్ ప్రసిద్ధి చెందిందని, ఆ సాంస్కృతిక వారసత్వాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ సౌందర్య వాణిజ్య రంగానికి కూడా కేంద్రంగా రాజసాన్ని నిలుపుకుంటుందని ఓస్వాల్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌కు జ్వువెల్లరీ డిజైన్ చేస్తున్న సమయంలో పలుమార్లు దక్షిణాది సౌందర్య సొగసుల పైన చర్చించిన సందర్భాలూ ఉన్నాయని ఆమె గుర్తు చేసుకున్నారు. అనిత ఓస్వాల్ డిజైన్ చేసిన బంగారు, వజ్రాభరణాలను నగరంలోని రూం 9 పాప్ అప్ వేదికగా ‘ఝౌహరి’ పేరుతో ప్రదర్శిస్తున్నారు. తనతో పాటు కవిత కోపార్కర్ ఆధ్వర్యంలోని అత్యంత విలువైన ప్రతా పైథానీ, బనారస్ శారీస్నూ ప్రదర్శిస్తున్న ’ఝౌహరి’ని ప్రముఖ సామాజిక వేత్త శ్రీదేవి చౌదరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఓస్వాల్ నగరంలోని ఫ్యాషన్ హంగులను, బాలీవుడ్ తారల అభిరుచులను పంచుకున్నారు.హైదరాబాద్.. డ్రీమ్ ప్రాజెక్ట్..విలాసవంతమైన జీవితాల్లో ఆభరణాలు, జీవన శైలి ప్రధానమైన అంశాలని ఓస్వాల్ వివరించారు. 25 ఏళ్లుగా బాలీవుడ్ తారలకు జువెల్లరీ డిజైన్స్ రూపొందిస్తున్నానని, కానీ హైదరాబాద్ వేదికగా తన డిజైన్స్ ప్రదర్శించడం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా పెట్టుకున్నానని అన్నారు. మాజీ మిస్ యూనివర్స్ ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, కిరన్ ఖేర్, సోనాక్షి సిన్హా, సంజయ్ లీలా భన్సాలీ వంటి స్టార్స్‌కు డిజైనర్‌గా చేశాను. ఐశ్వర్యరాయ్ భారతీయ సంస్కృతిలోని ఆభరణాల సౌందర్య వైభవాన్ని మరింత ఉన్నతంగా గ్లోబల్ వేదికపైన ప్రదర్శించడానికి ఇష్టపడేదని ఆమె అన్నారు.ఫ్యాషన్ ఐకాన్ ప్రియాంక చోప్రా అంతర్జాతీయ స్థాయి డిజైనింగ్‌ను అందిపుచ్చుకోవడంలో ఆసక్తిగా ఉంటుంది. ఎప్పటికప్పుడు న్యూ ట్రెండ్స్‌ను అనుకరిస్తూ, సృష్టిస్తూ ఫ్యాషన్‌కు కేరాఫ్‌గా నిలిచే హైదరాబాద్ ఫ్యాషన్ ఔత్సాహికులను కలవడం, వారి అభిరుచులను మరింతగా గమనించడం సంతోషాన్నిచ్చింది. సెలబ్రిటీ సీక్రెట్స్ వ్యవస్థాపకురాలు డా.మాధవి నేతృత్వంలో రిచ్ లైఫ్‌ను ప్రతిబింబించే కవిత కోపార్కర్ ప్రతా పైథానీ, బనారస్ డిజైన్లతో రూం 9 పాప్ అప్‌లో... 3 రోజుల పాటు నగర ఫ్యాషన్ ప్రేమికులకు మరో ప్రపంచాన్ని చేరువ చేయనుందని ఆమె తెలిపారు.ఇవి చదవండి: An Inch.. ఆర్ట్ పంచ్! రూపం సూక్ష్మం.. కళ అనంతం! -
An Inch.. ఆర్ట్ పంచ్! రూపం సూక్ష్మం.. కళ అనంతం!
అద్భుతమైన కళాకృతిని సృష్టించాలంటే అతిపెద్ద కాన్వాస్లే అక్కర్లేదు.. అంగుళం చోటు చాలు.. అని నిరూపిస్తున్నారీ సృజనాత్మక చిత్రకారులు. నగరానికి చెందిన యువ ఆర్కిటెక్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాన్ ఇంచ్ ఆగస్ట్.. సృజనలోని లోతుల్ని స్పృశిస్తూ కళా ప్రపంచంలోని విశేషాలను, విచిత్రాలను ఆవిష్కరిస్తోంది.ఇన్స్టాగ్రామ్ వేదికగా నిర్వహించే ఆన్లైన్ ప్రాజెక్ట్ ‘యాన్ ఇంచ్ ఆగస్ట్’ ఈ నెల అంతా జరుగుతుంది. అత్యంత చిన్నదైన ప్రదేశంలో అత్యుత్తమ కళాప్రతిభను ప్రదర్శించడం ఈ పోటీలో వైవిధ్యం. కేవలం ఒక అంగుళం చతురస్రంలో క్లిష్టమైన, అర్థవంతమైన కళాఖండాలను రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులను ఈ ఆన్లైన్ ఈవెంట్ ఆహా్వనిస్తోంది. సూక్ష్మ కళారూపాలలో సృజనాత్మక నైపుణ్యాన్ని ప్రేరేపిస్తూ యువ ఆరి్టస్టులకు సవాల్ విసురుతోంది. ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని కళాభిమానులు, ఆర్కిటెక్ట్స్ మేఘాలికా, నేహా శర్మలు 2018లో వార్షిక ఛాలెంజ్‌గా ప్రారంభించారు. డ్రాయింగ్, పెయింటింగ్, స్కల్పి్టంగ్, 3డీ మోడలింగ్, మ్యాక్రో ఫొటోగ్రఫీలలో ప్రవేశం ఉన్నవారి కోసం దీనిని నిర్వహిస్తున్నారు.అంగుళంలో భళా.. అనిపించండి ఇలా..ఈ ఆన్లైన్ ఛాలెంజ్ అధికారికంగా ప్రారంభం అవడానికి ముందు, ఎప్పటిలాగే బేగంపేటలోని పంచతంత్ర కెఫెలో జులై ఆఖరి ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు కళాభిమానులకు ప్రీ–ఓపెనింగ్ మీట్ నిర్వహించారు. ఈ ఛాలెంజ్ గురించి విశేషాలు వివరించడంతో పాటు తోటి కళాకారులతో పరస్పర చర్చలు జరిగాయి. ఒక అంగుళం పరిమితిలో సృజనాత్మక ఆవిష్కరణ ప్రక్రియ ఎలా అనేదానిపై సూచనలు కూడా ఈ మీట్ ద్వారా నిర్వాహకులు అందించారు. రోజుకు ఒకటికి తగ్గకుండా కళాకృతిని పోస్ట్ చేయడం ద్వారా ఈ ఛాలెంజ్‌లో పాల్గొనవచ్చు.ఇంచ్ ఇంచై.. వటుడింతై.. అంగుళం–పరిమాణంలోని ఆవిష్కరణల్లో పాల్గొనడానికి వయస్సు, నైపుణ్య స్థాయితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఈ ఆన్లైన్ పోటీ అవకాశం అందిస్తోంది. దీంతో ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 7వేలకు పైగా వన్ ఇంచ్ ఆర్ట్ వర్క్స్‌తో మంచి రెస్పాన్స్ అందుకుంది. కేవలం ఆన్‌లైన్‌కే పరిమితం కాకుండా కళాకారులతో సమావేశాలు నిర్వహించడం, టీ–వర్క్స్‌లో కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వంటి వాటి ద్వారా ఈ ఛాలెంజ్ ఇంచ్ ఇంచై వటుడింతై అన్నట్టుగా ప్రాచుర్యం పెంచుకుంటోంది.సృజనకు పదును పెట్టడమే లక్ష్యం..కళలకైనా, సృజనకైనా ఆకాశమే హద్దు. చిట్టి చిట్టి కళాకృతులను సృష్టించడం ద్వారా కళాసృష్టిలోని వైవిధ్యాన్ని చూపించడమే ఈ యాన్ ఇంచ్ ఆగస్ట్ ముఖ్యోద్దేశ్యం. ఈ కార్యక్రమం తొలిదశలో ఫొటోగ్రఫీ యాడ్ చేయలేదు. కానీ కొందరి అభ్యర్థన మేరకు అంగుళం లోపల ఉన్న సబ్జెక్ట్‌ని ఫొటో తీయడాన్ని కూడా జతచేశాం. హైదరాబాద్‌లో ఇంత మంది మ్యాక్రో ఫొటోగ్రాఫర్స్ ఉన్నారని మాకు తెలీదు అని మాతో ఇప్పుడు చాలా మంది అంటున్నారు.ఇలా ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది కళాకారులకు గుర్తింపు లభిస్తోంది. అంతకు మించి మేం దీని నుంచి ఏమీ ఆశించడం లేదు. ఛాలెంజ్ ముగిసిన తర్వాత ఈ నెలాఖరులో పోస్ట్ మీటప్ను నిర్వహించనున్నాం. దానిలో కళాకారులు పాల్గొని నెల రోజుల పాటు తాము అందుకున్న సృజనాత్మక అనుభవాలను పంచుకుంటారు. – మేఘాలిక, నేహాశర్మ, నిర్వాహకులుఇవి చదవండి: భారత్‌లో అత్యుత్తమ ర్యాంకు పొందిన సంస్థ -
మానసిక ఆరోగ్యంపై సంగీత ప్రభావం.. ‘మ్యూజిక్ ఆఫ్ హోప్’..!
సాక్షి, సిటీబ్యూరో: శిశుర్వేత్తి, పశుర్వేత్తి వేత్తిగాన రసం ఫణిః అనే విశ్వాసాన్ని అనుసరిస్తూ. వంధ్యత్వానికి చికిత్సలో సంగీతాన్ని మిళితం చేస్తూ ‘మ్యూజిక్ ఆఫ్ హోప్’ పేరిట ఓ ట్యూన్‌ను నగరానికి చెందిన ఫెర్టీ–9 ఫెర్టిలిటీ సెంటర్ రూపొందించింది. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవ వేడుకల ముగింపును పురస్కరించుకుని దీనిని విడుదల చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.మానసిక ఆరోగ్యంపై సంగీతం గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని, ఒత్తిడి, ఆందోళనను తగ్గించి ప్రశాంతత, విశ్రాంతి భావాన్ని కలిగిస్తుందని నిరూపితమైన నేపథ్యంలో ఈ ట్యూన్ ప్రత్యేకంగా తయారు చేశామన్నారు. అదే విధంగా ‘టుగెదర్ ఇన్ ఐవీఎఫ్’ పేరిట వంధ్యత్వానికి సంబంధించిన అపోహలను పోగొట్టడం లక్ష్యంగా నిర్వహించిన ప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 15 వేర్వేరు ప్రదేశాల్లో వీధి నాటకాలు లేదా నుక్కడ్ నాటకాలను ప్రదర్శించామని వివరించారు. -
ఇండియా ఛీర్స్ ఫర్ నీరజ్..
సాక్షి, సిటీబ్యూరో: భారతీయ జావలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా ఈ నెల 6న పారిస్ ఒలింపిక్స్‌లో తన సత్తా చూపనున్న నేపథ్యంలో ఆయన విజయాన్ని కాంక్షిస్తూ శామ్సంగ్ ఇండియా ‘ఛీర్స్ ఫర్ నీరజ్ ’ను ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు.తాజా ఒలింపిక్స్‌లో కోట్లాది మంది భారతీయుల ఆశాకిరణమైన నీరజ్ చోప్రాకు తాము ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్ ద్వారా శుభాకాంక్షలు తెలపొచ్చన్నారు. అంతేకాక 98704–94949 నెంబరుకు ’NEERAJ’ అని వాట్సాప్ మెసేజ్ పంపడం ద్వారా, అలాగే తమ సోషల్ soమీడియా చానెల్‌కు ట్యాగ్ చేయడం ద్వారా అందించవచ్చని వెల్లడించారు.ఇవి చదవండి: ఆకట్టుకున్న పర్ఫ్యూమ్ మేకింగ్.. -
ఆకట్టుకున్న పర్ఫ్యూమ్ మేకింగ్..
సాక్షి, సిటీబ్యూరో: అత్యాధునిక ఇంటీరియర్ ఉత్పత్తులపై అవగాహన అందించేందుకు హన్స్ గ్రోహె ఇండియా ఆధ్వర్యంలో ఐటీసీ కోహినూర్ హోటల్లో ‘మేక్ ఇట్ యువర్స్’ పేరిట జరిగిన పర్ఫ్యూమ్ తయారీ కార్యక్రమం ఆకట్టుకుంది.హాజరైనవారు తమకు నచ్చిన పరిమళాలను ఎంపికచేసుకుని పర్ఫ్యూమ్స్ను కస్టమైజ్ చేసుకునే అవకాశం కల్పించారు. అదే విధంగా బాత్రూమ్కు పర్యావరణ హితమైన రీతిలో థీమ్, ప్రశాంతత జతచేసి రూపొందించిన వినూత్న డిజైన్.. ది టీల్క్లబ్ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. డ్రోన్ షో, డీజే మ్యూజిక్‌తో ఆకట్టుకున్న ఈ వెరైటీ ఈవెంట్‌కి నగరానికి చెందిన ఇంటీరియర్ డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్ హాజరయ్యారు.ఇవి చదవండి: ఇదీ.. లగ్గం లాగిన్! -
బంజారాహిల్స్‌లో ఫర్నెస్ట్రీ..
సాక్షి, సిటీబ్యూరో: ఢిల్లీకి చెందిన అత్యాధునిక ప్రీమియం ఫర్నిచర్ బ్రాండ్ ‘ఫర్నెస్ట్రీ’ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. బంజారాహిల్స్‌లో 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో తొలి ఎక్స్పీరియన్స్ స్టూడియోను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫర్నెస్ట్రీ ఫౌండర్ మాన్సీ అలెన్ మాట్లాడుతూ.. కస్టమర్లు కోరుకున్న విధంగా ప్రీమియం ఫర్నీచర్, వాల్ ఆర్ట్ వంటి గృహాలంకరణలను తయారు చేసి ఇస్తామని తెలిపారు.కస్టమర్లకు డిజైన్ కాన్సెప్్టలను విజువలైజ్ చేయడానికి ప్రత్యేకమైన కాంప్లిమెంటరీ మూడ్ బోర్డ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ స్టూడియోలో ఆధునిక, సంప్రదాయ హస్తకళను మిళితం చేస్తూ డైనింగ్ టేబుల్స్, స్థానిక కళాకారుల వాల్ ఆర్ట్, స్కాండినేవియన్ డిజైన్‌తో జపనీస్ సౌందర్యాన్ని మిళితం చేసే జపాండీ ఫ్యూజన్ ఫర్నిచర్ వంటివెన్నో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.ఇవి చదవండి: సిబ్లింగ్ రైటర్స్..! రచయితలుగా రాణిస్తున్న అక్కా, తమ్ముళ్లు.. -
సిబ్లింగ్ రైటర్స్..! రచయితలుగా రాణిస్తున్న అక్కా, తమ్ముళ్లు..
వారిది ఓ మధ్యతరగతి కుటుంబం.. ఇద్దరూ అక్కా, తమ్ముళ్లు.. చిన్నప్పటి నుంచీ ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నారు.. వారి ముందుతరాల్లో ఎవరికీ పుస్తకాలు రాయడమనే మాటే తెలియదు.. అసలు వాటిని చదవడమే గగనమైన కుటుంబం నుంచి వచ్చారు.. అనూహ్యంగా ఇద్దరికీ తెలుగుపై మమకారం పెరిగింది. సాధారణంగా బీటెక్ చదువుకున్న వారిలో చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తూ కాలం గడిపేస్తుంటారు. కానీ వీరిద్దరూ అందుకు భిన్నం. అక్క ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుకోగా.. తమ్ముడేమో విశాఖలోని గీతమ్ యూనివర్సిటీలో బీటెక్ చదివాడు. కానీ వీరిద్దరూ భాషలో పట్టు సాధించి పుస్తకాలు రాస్తూ తమకు తోచినంతలో తెలుగుకు సేవ చేస్తున్నారు. అక్కా, తమ్ముళ్లు ప్రవళిక, ప్రవర్ష్ జర్నీ ఒక్కసారి చూద్దాం.. – సాక్షి, సిటీబ్యూరోతెలుగులో రాయాలనే ఆకాంక్ష అయితే ఉంది.. కాకపోతే పుస్తకాలు రాయడం ఇంట్లో ఎవరికీ అలవాటు లేదు. దీంతో వినూత్నమైన ఆలోచన వారి మదిలో మెదిలింది. 2017లో ‘కరపత్ర’ పేరుతో అవసరం ఉన్న వారికి లేఖలు రాయడం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు విషయంలో మహేశ్పోలోజు అనే మరోరచయిత వీరిద్దరికీ తోడయ్యాడు. వీరు ముగ్గురూ కలసి దాదాపు వెయ్యికి పైగా ఉత్తరాలు రాసిచ్చారు. లేఖలు అందుకున్న వారు అభినందనలతో ముంచెత్తడంతో రచయిత కావాలనే తృష్ణ వారిలో మరింత పెరిగింది.ఛాయాదేవి చెత్త కథలు..ప్రవళిక తొలిసారిగా 2017 సమయంలోనే ‘ఛాయాదేవి చెత్త కథలు’ పేరుతో తన తొలి పుస్తకాన్ని తీసుకొచి్చంది. అక్కను స్ఫూర్తిగా తీసుకుని ప్రవర్ష కూడా తన తొలి పుస్తకాన్ని ‘కథనై.. కవితనై’ పేరుతో వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రవళిక మరో పుస్తకాన్ని ఇప్పటికే పూర్తి చేయగా, ప్రవర్ష్ ‘అభినిర్యాణం’ పేరుతో రెండో పుస్తకాన్ని ఆదివారం ఆవిష్కరించారు.అసిస్టెంట్ డైరెక్టర్‌గా..ప్రవర్ష్ మూడేళ్లు ఓ ఐటీ కంపెనీలో జాబ్ చేశాడు. కానీ తనకు అస్సలు సంతృప్తినివ్వలేదు. ఇక తనకు ఇష్టమైన రంగంలో రాణించాలని నిర్ణయించుకుని ఆ జాబ్ మానేసి పుస్తకాలు రాయడం ప్రారంభించాడు. పుస్తక రచయిత మాత్రమే కాదు.. అటు సినిమాలకు పాటలు రాయడం హాబీగా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఓ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. -
ఇదీ.. లగ్గం లాగిన్!
నాంపల్లి: పెళ్లి కార్డుతో వివాహ వేడుక ఆరంభమై.. మూడు ముళ్ల బంధంతో ముడివేసుకుని సంపూర్ణ దాంపత్యంతో ముగుస్తుంది. ఈ మధ్యలో జరిగే తంతువునే ‘లగ్గం’ అని పిలుస్తారు. ఒక లగ్గం జరగాలంటే వధువు, వరుడు ఇద్దరూ ఉండాలి. ఒకప్పుడు వివాహం చేయాలంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి పెళ్లిళ్లు చేసేవారు. కానీ ఇప్పుడంతా సీన్ రివర్స్. ప్రపంచీకరణ నేపథ్యంలో తరాలు చూడటానికి ముందే ఆన్లైన్లోనే పరిచయమైపోతున్నారు. ఒకరికొకరు నచ్చితే అందులోనే పెళ్లికి ఒప్పేసుకుంటున్నారు..ఆస్తులు, అంతస్తుల కంటే మనసులు నచ్చితే చాలంటూ పెద్దలను ఒప్పిస్తున్నారు. ఒకప్పుడు ఒక పెళ్లి చేయాలంటే మంచి సంబంధం దొరకాలనే వారు. అందుకోసం ఏళ్ళకు ఏళ్లు వేచి చూసేవారు. ఇందుకోసం పెళ్లిళ్ల పేరయ్యలను ఆశ్రయించేవారు. ప్రస్తుతం వారి స్థానంలో మ్యాట్రిమోనీ సంస్థలు పుట్టుకొచ్చాయి. కులాలు, మతాలు, గోత్రాలతో పాటు వధువు వరుల చిత్రాలను మ్యాట్రిమోనీ సంస్థల్లోనే వెతుకుతున్నారు. మార్కెట్లో మ్యాట్రిమోనీ సంస్థలకు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేయడానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులు ‘లగ్గం’ అనే ప్రాజెక్టును రూపొందించారు.బి–డిజైన్ విద్యార్థుల ప్రాజెక్టు..బి–డిజైన్‌లో నాలుగు సంవత్సరాల కాల వ్యవధి కలిగిన విజువల్ కమ్యూనికేషన్ కోర్సును అభ్యసించే మూడో సంవత్సరం విద్యార్థులు తమ ప్రాయోగిక పరీక్షల్లో భాగంగా పెళ్లికి సంబంధించిన పలు అంశాలపై లోతైన అధ్యయనం చేసి మార్కెట్‌కు సరికొత్త ప్రాజెక్టును పరిచయం చేస్తున్నారు. లగ్గం పేరిట లాగిన్ అంటూ సరికొత్త మ్యాట్రిమోనీ ప్రాజెక్టు ద్వారా వధువరుల ముందుకు వచ్చేశారు.సంబంధాలను కుదర్చడంతో పాటు, మార్కెట్లో హోదాకు తగ్గట్టు పెళ్లి వేడుకకు రూపకల్పన చేయడం, పెళ్లికి అవసరమైన సౌకర్యాలను సమకూర్చడం చేస్తున్నారు. ప్రాయోగిక పరీక్షల్లో నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసి పట్టుకుని తమ ఉపాధికి కూడా బాటలు వేసుకునేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. బి–డిజైన్ కోర్సులో ఫ్యాకల్టీ నేరి్పంచే సాంకేతిక నైపుణ్యాలను పుణికి పుచ్చుకుని కార్పొరేట్ సంస్థలకు తమ సత్తా ఏమిటో చూపిస్తున్నారు. అక్కడా ఉద్యోగాలు దక్కకుంటే సొంతంగా మ్యాట్రిమోనీ సంస్థను ఏర్పాటు చేసుకుంటామనే స్థాయిలో స్కిల్స్‌ను నేర్చుకుంటున్నారు.తొందరగా ప్లేస్‌మెంట్స్..బి–డిజైన్‌లోని విజువల్ కమ్యూనికేషన్ కోర్సులో చేరితే తొందరగా ప్లేస్మెంట్ దొరుకుతుందని చేరాను. ప్లేస్మెంట్ లేకున్నా ఉపాధి కల్పనకు ఈ కోర్సు ఎంతగానో దోహదపడుతుంది. మంచి ఫ్యాకలీ్టతో బోధనలు జరుగుతున్నాయి. ప్రతి విషయాన్ని ఒక టాస్్కలాగా తీసుకుని చదువుతున్నాం. కోర్సు పూర్తయితే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాం. – క్యూటీ, మూడో సంవత్సరం విద్యార్థి, సూర్యాపేటప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ కావడమే లక్ష్యం.. విజువల్ కమ్యూనికేషన్ కోర్సును అభ్యసించేందుకు కామారెడ్డి నుంచి వచ్చాను. తెలుగు వర్శిటీలో మూడో సంవత్సరం చదువుతున్నాను. ఈ కోర్సు ద్వారా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అవుతాను. ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని ఉంది. లేదంటే మంచి స్టూడియోను ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందుతాను. – శ్రీధర్, మూడో సంవత్సరం విద్యార్థి, కామారెడ్డి -
‘ఆధునిక హైదరాబాద్’ ఆ ఇద్దరు మిత్రులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఒక అందమైన నగరం. నాలుగు వందల ఏళ్ల చారిత్రక సోయగం. ప్రేమ పునాదులపై వెలసిన భాగ్యనగరం ఇది. విభిన్న మతాలు, భాషలు, సంస్కృతులు ఒకే పాదు నుంచి పూచిన పూలై వికసించాయి. వైవిధ్యభరితమైన స్నేహ సంబంధాలు వెల్లివిరిశాయి. హైదరాబాద్ అంటేనే ఆతీ్మయమైన నగరం. ఎంతోమంది గొప్ప స్నేహితులు ఈ నేలపైన పుట్టిపెరిగారు. చరిత్రను సృష్టించారు. ఆదర్శప్రాయమైన స్నేహితులుగా నిలిచారు. నిజాం నవాబుల కాలంలో రాజులకు, ఉన్నతాధికారులకు మధ్య చక్కటి స్నేహ సంబంధాలు ఉండేవి. ఆధునిక హైదరాబాద్ నిర్మాణాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టించిన దార్శనికుడు ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్, ఆయన దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ ఫక్రుల్ముల్క్ బహదూర్. ఇద్దరూ గొప్ప స్నేహితులుగా చరిత్రలో నిలిచిపోయారు. హైదరాబాద్ అభివృద్ధికి వారిద్దరూ కలిసి ప్రణాళికలను రూపొందించారు. హైదరాబాద్ చరిత్రను మలుపు తిప్పారు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదర్శప్రాయమైన, అజరామరమైన వారి స్నేహంపైన ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. అది స్వర్ణయుగం.. ఆ ఇద్దరి స్నేహం హైదరాబాద్ చరిత్రలో స్వర్ణ యుగం. మీర్ మహబూబ్ అలీఖాన్ ఆధునిక హైదరాబాద్ నగరానికి బాటలు పరిచిన గొప్ప పాలకుడు. ఆయన ఆశయాన్ని, ఆలోచనలను ఆచరణలో పెట్టిన పరిపాలనాదక్షుడు ఫక్రుల్ముల్్క. విధినిర్వహణ దృష్ట్యా ప్రధానమంత్రి. ఇద్దరి అభిరుచులు చాలా వరకూ ఒకేవిధంగా ఉండేవి. 1892 నుంచి 1901 ఫక్రుల్ముల్క్ ప్రధానిగా పనిచేశారు. ఇంచుమించు సమయసు్కలు కావడం వల్ల వారి మధ్య స్నేహం ఏర్పడింది. నాలుగు దశాబ్దాల పాటు ఆ స్నేహం కొనసాగింది.. బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప ప్రతిభావంతుడైన ఫక్రుల్కు సంగీతం, సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. మహబూబ్ అలీఖాన్ కూడా గొప్ప సాహిత్యాభిరుచి కలిగిన వ్యక్తి. ఇద్దరూ కలిసి కవి సమ్మేళనాలు, ముషాయిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొనేవారు. ఉర్ధూ సాహిత్య వికాసం కోసం మహబూబ్ అలీ ఎంతో కృషి చేశారు. ఆధునిక విద్యకు శ్రీకారం చుట్టింది ఆయనే. ఎంతోమంది కవులను, కళాకారులను. పండితులను ప్రోత్సహించారు. ఇద్దరు థారి్మక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అండగా నిలిచారు. అనాథలు, నిస్సహాయులను ఆదుకొనేందుకు ఫక్రుల్ స్వచ్ఛంద సంస్థలకు ధారాళంగా విరాళాలు ఇచ్చేవారు. నిజాంకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా అనేక సమావేశాల్లో, విధానపరమైన అంశాల్లో కీలకంగా వ్యవహరించారు. ‘విజన్ హైదరాబాద్’ లక్ష్యంగా... భావితరాల అవసరాలను, నగర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ‘విజన్ హైదరాబాద్’ లక్ష్యంగా ఇద్దరూ కలిసి అనేక నిర్మాణాలను కొనసాగించారు. రహదారులను నిర్మించారు. కొత్త భవనాలను కట్టించారు. నాటి సంపన్నులు, నవాబుల పిల్లల ఉన్నత చదువుల కోసం 1887లోనే నిజామ్స్ కళాశాలను నిర్మించారు. అనంతర కాలంలో అన్ని వర్గాలకూ చేరువైంది. బాలికల విద్య కోసం మహబూబియా కళాశాల, హైకోర్టు భవనం, అసెంబ్లీహాల్, రైల్వే నిర్మాణం, టెలిఫోన్, బ్యాంకింగ్ వ్యవస్థ, తాగునీటి వ్యవస్థ వంటి కార్యక్రమాలు మహబూబ్ అలీ హయాంలో చేపట్టినవే. స్కూళ్లు, కళాశాలలు కట్టించారు. ఈ నిర్మాణాలన్నింటిలోనూ నిజాంకు ఫక్రుల్ కుడిభుజంగా నిలిచారు.ఎర్రమంజిల్ ఒక కళాఖండం.. ఆ ఇద్దరి అపురూపమైన, ఆదర్శప్రాయమైన స్నేహానికి చిహ్నంగా ఫక్రుల్ అద్భతమైన ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కట్టించాడు. ఇండో యూరోపియన్ శైలిలో నిర్మించిన ఈ రాజ మందిరం అద్భుతమైన మాన్యుమెంట్గా నిలిచింది. ఎత్తయిన ప్రదేశంలో ఈ అందమైన ప్యాలెస్‌ను కట్టించారు. 1890లో నిర్మాణ పనులు ప్రారంభించగా పదేళ్ల పాటు పనులు కొనసాగాయి. 1900లో ఈ భవన నిర్మాణం పూర్తయింది. దేశంలోని మొఘల్, కుతుబ్‌షాహీ వాస్తు శిల్పాన్ని, యురప్లోని విక్టోరియన్, గోథిక్ నిర్మాణ శైలిని మేళవించి ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మాంచారు. ఫక్రుద్దీన్ నివాస మందిరం ఇది. సభలు, సమావేశాలు, వేడుకలు, విందులు, వినోదాలతో ఈ ప్యాలెస్ నిత్యం సందడిగా ఉండేది. -
చారిత్రక ఆనవాలుగా చార్మినార్ గడియారం
చార్మినార్: నిజాం కాలంలో నిర్మించిన చార్మినార్ కట్టడానికి నలువైపుల ఏర్పాటు చేసిన గడియారాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ నాలుగు గడియారాల్లో ఒకటి రిపేర్‌కి వచి్చంది. వాచ్‌లోని 4–5 అంకెల నడుమ సిరామిక్ మెటల్ పగిలిపోవడంతో 12 గంటల పాటు సమయం నిలిచిపోయింది. వెంటనే బాగు చేయించి అందుబాటులోకి తెచ్చారు. ఇక ఈ గడియారాల పనితీరును ఒకసారి పరిశీలిస్తే... నిజాం కాలంలో... నిజాం కాలంలో అంటే.. 1889లోనే చార్మినార్ కట్టడానికి నలువైపులా ఈ గడియారాన్ని నిర్మించారు. అప్పట్లో స్థానిక ప్రజలకు సమయం తెలియడం కోసం నిర్మించిన ఈ గడియారంలోని సెరామిక్ మెటల్ ఇటీవల పగిలిపోవడంతో దాదాపు 12 గంటల పాటు సమయం నిలిచిపో యింది. నాలుగింట్లో జీహెచ్‌యంసీ సర్దార్ మహాల్ భవనం (తూర్పు) వైపు ఉన్న ఈ గడియారం మొరాయించింది.1942 నుంచి వాహెద్ వాచ్ కంపెనీ పర్యవేక్షణలో... 1942 నుంచి లాడ్‌బజార్‌లోని వాహెద్ వాచ్ కంపెనీ యాజమాన్యం చార్మినార్ గడియారం పని తీరును పర్యవేక్షిస్తుంది. అప్పట్లో మోతీగల్లిలో ఉండే సికిందర్ ఖాన్ ఈ గడియారాలకు మరమ్మతులు, పర్యవేక్షణ బాధ్యతలను చూసే వారు. ఆయన మరణానంతరం 1962 నుంచి లాడ్బాజర్లోని గులాం మహ్మద్ రబ్బానీ మరమ్మతు పనులను చూస్తున్నారు.పావురాలు తిష్ట వేయడంతో..విషయం తెలిసిన వెంటనే చార్మినార్ కట్టడం కన్జర్వేషన్ క్యూరేటర్ రాజేశ్వరి సంబంధిత వాహెద్ వాచ్ కంపెనీ టెక్నీషియన్స్‌తో మరమ్మతులు చేయించడంతో సమయం తిరిగి అందుబాటులోకి వచ్చింది. గడియారాన్ని మూసి వేయడానికి అవకాశాలు లేకపోవడంతో అలాగే వదిలేశారు. దీంతో అప్పుడప్పుడు సమయం చూపించే ముల్లులపై పావురాలు కూర్చుంటుండడంతో వాటి బరువుకు సమస్యలు తలెత్తుతున్నాయని క్యూరేటర్ రాజేశ్వరి స్పష్టం చేశారు. నాలుగింట్లో చార్‌కమాన్ వైపు గంటల శబ్దం వినిపించే గడియారం.. ఐదు అడుగుల వ్యాసార్ధంతో గుండ్రంగా ఐరన్ మెటల్‌తో ఏర్పాటు చేశారు. లోపల సిరామిక్ మెటల్‌తో రూపొందించారు. గడియారంలోని అంకెలను చెక్కతో ఏర్పాటు చేశారు. ఇక గంటల ముల్లులను ఐరన్ మెటల్‌తో తయారు చేయించి అమర్చారు. గంట ముల్లు దాదాపు మూడు అడుగుల పొడవు, నిముషాల ముల్లు నాలుగ అడుగుల పొడవు ఉన్నట్లు వాహెద్ వాచ్ కంపెనీ యజమాని గులాం మహ్మద్ రబ్బానీ తెలిపారు. మక్కా మసీదు, లాడ్‌బజార్, చార్‌కమాన్, సర్దార్ మహాల్ వైపు నాలుగు గడియారాలను ఏర్పాటు చేయగా.. ఇందులో కేవలం చార్‌కమాన్ వైపు గడియారం ప్రతి గంటకూ శబ్దం చేస్తుంది. అయితే నాలుగు గడియారాల్లో ఈ ఒక్కదానికే సౌండ్ సిస్టం ఉందంటున్నారు.48 గంటలకోసారి... నలువైపుల ఉన్న గడియారాలకు ప్రతి 48 గంటలకొకసారి కీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా రూపొందించిన ఈ ‘కీ’వాహెద్ వాచ్ కంపెనీ వద్ద ఉంటుంది. దాదాపు అర గంటలో ఈ ‘కీ’ ఇవ్వడం పూర్తి చేస్తారు సిబ్బంది. చేతితో ఇచ్చే ఈ ‘కీ’ని సకాలంలో ఇవ్వకపోతే గడియారాలు పనిచేయవు.నిరంతర పర్యవేక్షణలో...ఏళ్ల తరబడి తమ వాచ్ కంపెనీ ఆధ్వర్యంలో చార్మినార్ గడియారాల పని తీరును పర్యవేక్షిస్తున్నాం. వాచ్ మోరాయిస్తుందని తెలిసిన వెంటనే మరమ్మతు చేస్తాం. 1995లో సాలార్జంగ్ మ్యూజియం గడియారం పనిచేయకపోతే.. మేమే మరమ్మతు చేశాం. – గులాం మహ్మద్ రబ్బానీ–వాహెద్ వాచ్ కంపెనీ యజమాని -
నైస్.. రైస్! రుచికరంగా.. కొత్తదనంగా..!
ఉదయాన్నే పాఠశాలకు వెళ్లే పిల్లలకు, ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలకు సిద్ధమయ్యే పెద్దవారికి లంచ్ బాక్సు కట్టడానికి ఇంట్లో రోజూ హడావుడి కనిపిస్తుంది. తక్కువ సమయంలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నానికి భోజనం, బ్రేక్ సమయంలో స్నాక్స్ అన్నీ సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇటువంటి సమయంలో ఆహారంలో కొద్దిగా ఉప్పు తక్కువైనా, ఎక్కువైనా బాక్సు అలాగే తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. నిత్యం రొటీన్ క్యారేజీ కడితే పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు. ఈ నేపథ్యంలో అటు పిల్లలు ఇష్టపడేలా.. ఇటు పోషకాలు అధికంగా ఉండేలా.. ఆహార నిపుణుల సూచనలతో కొన్ని రెసిపీలు మీ కోసం.. – సాక్షి, సిటీబ్యూరోవంటింట్లో టమాటా రైస్, ఎగ్ రైస్, జీరా రైస్, పుదీనా రైస్, పెరుగన్నం, అప్పుడప్పుడు వెజ్, నాన్‌వెజ్ ఫ్రైడ్ రైస్ వంటివి తెలిసిన వంటకాలు. అలాగే ఆరోగ్యం అందించే కరివేపాకు రైస్, ఉల్లి రైస్, కాలిఫ్లవర్ రైస్ వంటివి కూడా ట్రై చేయండి. తయారీకి తక్కువ సమయం, తినడానికి రుచికరంగా ఉంటాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారుల లంచ్ బాక్సుకు ఉపయోగకరంగా ఉంటాయి.కరివేపాకు అన్నం..జీర్ణశక్తిని పెంపొందించడంలో కరివేపాకు ఉపయోగపడుతుంది. అందుకే తరతరాలుగా అన్ని వంటల్లో కొంచెమైనా కరివేపాకు వేస్తారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయినా పిల్లలు, పెద్దల్లో కొంత మంది మాత్రం కరివేపాకులు కనిపిస్తే తీసి పక్కన పడేస్తారు. అటువంటి వారికోసం కరివేపాకు రైస్ చేసి పెడితే చకచకా తినేస్తారు. కరివేపాకుల వల్ల కలిగే లాభాలన్నీ వారికి అందుతాయి. వంట వేగంగా అయిపోతుంది.– బియ్యం కడిగి, నీటిని వడపట్టి పక్కన పెట్టుకోవాలి.– స్టవ్‌పై పాత్ర పెట్టి టీస్పూను నూనె, ఒకటిన్నర కప్పు కరివేపాకు ముక్కలు, కొబ్బరి తురుము కలిపి ఒక నిమిషం వేయించాలి.– చల్లారిన తరువాత మిక్సీలో రుబ్బుకోవాలి. మరో పాత్రలో నూనె, లవంగాలు, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లి ముక్కలు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్టు వేయించాలి. – అప్పటికే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేయాలి. అందులో కరివేపాకు పేస్ట్, ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి.– బియ్యం పలుగ్గా ఉడికిన తరువాత సిమ్‌లో కొద్దిసేపు ఉంచాలి. అంతే కరివేపాకు అన్నం రెడీ.కాలిఫ్లవర్ రైస్..కాలిఫ్లవర్ ఆరోగ్యానికి మంచిది. కూరలు, ఫ్రై చేయడానికి, వెజ్ మంచూరియా వంటి వంటకాల్లో వాడుతుంటారు. కాలిఫ్లవర్ రైస్ ట్రై చేయాలనుకుంటే మాత్రం ఇలా చేయండి..– బియ్యం 80 శాతం ఉడికించి పక్కన పెట్టుకోవాలి.– మరో పాత్రలో తరిగిన కాలిఫ్లవర్ ముక్కలను ఉప్పు, పసుపు వేసి 10 నిమిషాల పాటు ఉడికించాలి.– అనంతరం నీటిని వడగట్టి ముక్కల్ని ఆరబెట్టుకోవాలి.– జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, పచి్చమిర్చి, బఠాణీలు వేసి తాలింపు సిద్ధం చేసుకోవాలి.– అందులో కాలిఫ్లవర్ ముక్కలు వేసి, గరం మసాలా కలపాలి.– వేగిన తరువాత ఉడకబెట్టిన అన్నం వేసి, అవసరమైనంత ఉప్పు వేసి కలపాలి.– అన్నం పూర్తిగా ఉడికే వరకూ చూసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుంటే కాలిఫ్లవర్ రైస్ సిద్ధమైనట్లే.ఉల్లి రైస్..ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని నానుడి. ఆరోగ్యపరంగా ఉల్లికి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. కూరలు, ఇతర రెసిపీలు తయారీలోనే కాదు, ఉల్లి రైస్‌ని ట్రై చేయాలనుకుంటే మాత్రం ఇది చూడండి.– ఉల్లిని మనకు నచ్చిన రీతిలో (నిలువుగా, అడ్డంగా) ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. బియ్యం కడిగి ఉంచుకోవాలి.– పొయ్యిపై పాత్ర పెట్టి నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శెనగపప్పు వేయించాలి.– కరివేపాకులు వేసి వేగాక, తరిగిన ఉల్లి ముక్కలు, పచ్చి మిర్చి, యాలుకలు, లవంగాలు వేసి వేయించాలి.– తరువాత కడిగి సిద్ధం చేసుకున్న బియ్యం వేసి బాగా కలపాలి.– అవసరమైనంత ఉప్పు వేసుకోవాలి. అన్నం ఉడికిన తరువాత దించితే సరిపోతుంది.ఇవి చదవండి: ఈ వాస్తు చిత్రలేఖనం.. ఇప్పుడొక ట్రెండ్! -
ఈ వాస్తు చిత్రలేఖనం.. ఇప్పుడొక ట్రెండ్!
సాక్షి, సిటీబ్యూరో: ప్రాచీన ఆలయాలు, గోపురాలు, గృహాలు వాస్తు శాస్త్రం ప్రకారమే నిర్మించారని భారతీయ వాస్తు శాస్త్రం చెబుతుంది. వాస్తు అంటే బలం, విశ్వాసం! అందుకే ఇల్లు కొంటున్నామంటే చాలు వాస్తు చూడనిదే నిర్ణయం తీసుకోరు. ఈ వాస్తుకు శిల్ప శా్రస్తాన్ని, చిత్రలేఖనాన్ని జోడించిన వాస్తు చిత్రలేఖనానికి కూడా ప్రాధాన్యం పెరిగిపోయింది. గృహాలు, కార్యాలయాలు, హోటళ్లు వంటి అన్ని రకాల భవన నిర్మాణాల్లో వాస్తు పెయింటింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.చూపరులను ఆకట్టుకునే ఈ వాస్తు చిత్రలేఖనం ఇప్పుడొక ట్రెండ్! దేవాలయానికి, శిల్పకళకు అవినాభావ సంబంధం ఉంది. విశ్వఖ్యాతిగాంచిన భారతీయ శిల్ప కళకు రెండువేల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఇక్షా్వకులు మొదలుకొని విజయనగర చక్రవర్తుల వరకూ వేర్వేరు కాలాల్లో శిల్ప–చిత్రకళాభివృద్ధికి దోహదం చేశారు. వాస్తు, శిల్పశాస్త్రం, చిత్రలేఖనం మూడు వేర్వేరు కళలను మిళితం చేసి.. నేటి తరానికి, అవసరాలకు అనుగుణంగా అందుబాటులోకి వచి్చందే వాస్తు పెయింటింగ్.బ్రహ్మ ముహూర్తంలోనే.. ఒక కుటుంబంలోని అందరి వ్యక్తుల జాతకం, నక్షత్రం ప్రకారం ఆ ఇంటిలో ఎవరి నక్షత్రం బలంగా ఉంటుందో వారు పూజించాల్సిన దేవుడిని నిర్ణయిస్తారు. ఆ ఇంటి వాస్తు, నక్షత్రం తిథి ప్రకారం బ్రహ్మ ముహూర్తం నిర్ణయిస్తారు. దేవుడిని స్మరిస్తూ, ధాన్యంతో వస్త్రం మీద ఈ పెయింటింగ్‌ను వేస్తారు. ఈ చిత్రలేఖనం జరిగినన్ని రోజులు ఆ నక్షత్రానికి బలం చేకూర్చేందుకు జరగాల్సిన అన్ని రకాల హోమాలు, యోగాలు, క్రతువులు ఆగమ శాస్త్రం ప్రకారం చిత్రకారుడే పూర్తి చేస్తాడు. నరఘోష నివారణకూ పెయింటింగ్ వేస్తుంటారు.ఎన్ని రోజులు పడుతుందంటే.. ఒక పెయింటింగ్ పూర్తవడానికి నక్షత్రాన్ని బట్టి 41 నుంచి 108 రోజుల సమయం పడుతుంది. వీటి ధర నక్షత్రాన్ని బట్టి రూ.10 వేల నుంచి ప్రారంభమవుతుంది. యాక్రాలిక్, మిక్స్డ్ కలర్లను వినియోగిస్తారు. నక్షత్ర బలాన్ని బట్టి వీటిని పూజ గదిలో, హాల్లో ఇంటిలోపల పెట్టే చోటును నిర్ణయిస్తారు.ఇళ్లు, ఆఫీసుల్లో.. రాజకీయ నేతలు, ప్రముఖులు, సెలెబ్రిటీల గృహాలు, విల్లాలు, ఫామ్ హౌస్‌లలో ఈ వాస్తు పెయింటింగ్‌లను వేయిస్తున్నారు. ఆఫీసులు, హోటళ్ల, కార్పొరేట్ కార్యాలయాల్లో కూడా చూపరులను ఆకట్టుకునే ఈ చిత్రలేఖనాలు కనిపిస్తున్నాయి. దక్షిణామూర్తి, అభయ హనుమాన్, యంత్రోద్ధారక హనుమాన్, నందీశ్వర, కలియుగ వేంకటేశ్వర్లు, ఇష్టకామేశ్వరి దేవి, ఆగమనం (పుణ్యపురుషులు), నరదృష్టి నారాయణ యంత్రం, తాండవ గణపతి, నయన దర్శనం, శృంగార దేవి, కొలువు శ్రీనివాసమూర్తి, నర్తకి, అభయ సూర్యనారాయణమూర్తి వంటి దేవుళ్ల పెయింటింగ్స్ వేస్తుంటారు.వాస్తు పెయింటింగ్‌తో మనశ్శాంతి వాస్తు పెయింటింగ్ ఉన్న ఇళ్లలో సానుకూల భావాలను కలిగిస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది. చేసే పని మీద ఏకాగ్రత పెరుగుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే వివేకం కలుగుతుంది. – కంభంపాటి, ప్రముఖ వాస్తు చిత్రకారుడుఇవి చదవండి: వయనాడ్ విలయం : ఆమె సీత కాదు...సివంగి -
'మనం' చాక్లెట్ తిన్నామంటే.. మైమరిచిపోవాలంతే!
సాక్షి, సిటీబ్యూరో: మీకు చాక్లెట్లంటే ఇష్టమా..? అసలు చాక్లెట్లు చూస్తేనే నోరూరుతుందా..? డిఫరెంట్ చాక్లెట్లను టేస్ట్ చేయడం మీకు అలవాటా? అయితే మీరు తప్పకుండా నగరంలోని ‘మనం’ చాక్లెట్ కార్ఖానాను ఒక్కసారైనా సందర్శించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ దాదాపు 60కి పైగా వెరైటీ చాక్లెట్లు నోరూరిస్తుంటాయి. ఒకే దగ్గర పెరిగిన కోకో చెట్ల నుంచి తయారైన చాక్లెట్లను వీరు విక్రయిస్తున్నారు.టైమ్ మ్యాగజైన్ జాబితాలో చోటు..ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ‘ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల’ జాబితాను ప్రచురించింది. ఆయా రంగాలతో పాటు ప్రపంచంలో ప్రత్యేకంగా నిలిచే 100 అద్భుతమైన ప్రదేశాలు, కంపెనీలను ఇందులో చేర్చింది. హోటళ్లు, క్రూజ్‌లు, రెస్టారెంట్స్, పర్యాటక స్థలాలు, మ్యూజియాలు, పార్క్‌లను గుర్తించింది. పలు మార్గాల్లో స్వదేశీ పదార్థాలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు మనం చాక్లెట్ కార్ఖానా పనిచేస్తోందని కొనియాడింది.అంతర్జాతీయ గుర్తింపు..భారత్‌లో పండించిన కోకోతో చాక్లెట్ల తయారీకి ‘మనం చాక్లెట్’ ప్రసిద్ధి పొందింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ఈ సంస్థ ఉత్పత్తులకు ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఇక్కడ తయారైన చాక్లెట్లకు అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉంది. 2023 ఆగస్టులో మనం చాక్లెట్ కార్ఖానాను ముప్పల చైతన్య స్థాపించారు. ఆల్మండ్ హౌజ్ మిఠాయి దుకాణం వీరి కుటుంబానికి చెందినది కావడం విశేషం.ఎన్నో రకాల వెరైటీలు.. డార్క్ చాక్లెట్లు, చాక్లెట్ ట్యాబ్లెట్స్, స్నాక్స్, ఒకే ప్రదేశంలో పండించినవి, అంతర్జాతీయంగా పండించిన కోకో నుంచి తయారైనవి, పాల మిశ్రమంతో చేసినవి ఇలా ఎన్నో రకాల వెరైటీ చాక్లెట్లు ఈ కార్ఖానాలో లభిస్తుంటాయి. పండ్లు, ప్లేన్, వీగన్ వంటి చాక్లెట్ల రకాలు కూడా తయారు చేస్తారు. ఇక్కడ తయారైన పది రకాల చాక్లెట్లను అవార్డులు కూడా వరించాయి.వర్క్‌షాప్స్‌తో పిల్లలకు నేరి్పస్తూ..చాక్లెట్ల తయారీలో మనం చాక్లెట్ కార్ఖానా అప్పుడప్పుడూ వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తుంటుంది. సొంతంగా క్లస్టర్లు, కేక్ పాప్స్ తయారు చేసే విషయంలో పిల్లలకు శిక్షణ కూడా ఇస్తుంటుంది. కొన్నిసార్లు అసలు చాక్లెట్లు ఎలా తయారు చేస్తారో తెలుసుకునేలా టూర్ కూడా ఏర్పాటు చేస్తుంటారు. చాక్లెట్ కుకీస్, చాక్లెట్ ఇంక్లూజన్ స్లాబ్స్ తయారీలో 5–10 ఏళ్ల పిల్లలకు మెళకువలు నేర్పిస్తుంటారు.ఇవి చదవండి: అంతా స్మార్ట్.. ఆరోగ్యంపై ముందస్తు సమాచారం! -
వరల్డ్ అథ్లెటిక్స్ గుర్తింపుపై సీఎం హర్షం
సాక్షి, సిటీబ్యూరో: ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్‌కు వరల్డ్ అథ్లెటిక్స్ నుంచి గుర్తింపు రావడంపై సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం మారథాన్ డైరెక్టర్ రాజేశ్ వెచ్చ, తెలంగాణ స్పోర్ట్స్ ఫెడరేషన్ చైర్మన్ స్టాన్లీ జోన్స్, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ కమిటీ మెంబర్ రామ్ కటికనేని సీఎం రేవంత్‌రెడ్డిని సెక్రటేరియట్లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఆగస్టు 24న జరగనున్న ఈ కార్యక్రమానికి అవసరమైన మద్దతు ఇస్తామని, మారథాన్‌లో పాల్గొనే వారందరికీ సీఎం 'ఆల్ ది బెస్ట్' చెప్పారు.ఇవి చదవండి: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు! -
అంతా స్మార్ట్.. ఆరోగ్యంపై ముందస్తు సమాచారం!
సాక్షి, సిటీబ్యూరో: వాచ్ రూపాంతరం చెంది స్మార్ట్ వాచ్‌గా మారింది. భిన్నమైన ఫీచర్లతో దూకుడు ప్రదర్శిస్తోంది. మార్కెట్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అద్భుతమైన పనితీరుకలిగిన స్మార్ట్ వాచ్‌లో అందుబాటులోకి వచ్చాయి. బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని, మన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు డేటా రూపంలో పొందుపరుచుకోవచ్చు. అడ్వెంచర్, వాటర్ స్పోర్ట్స్ అవసరాలకు ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. యాపిల్, ఒప్పో, హువావే, ఫిట్ బిట్, నాయిస్, సామ్సంగ్, టైటాన్ మొదలైన కంపెనీలు స్మార్ట్ వాచ్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. సుమారు రూ.వెయ్యి నుంచి రూ.90 వేల వరకూ అందుబాటులో ఉన్నాయి.పిల్లల కోసం..చిన్న పిల్లలను తల్లిదండ్రులు ట్రాక్ చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. జీపీఎస్ సాయంతో పిల్లల సమాచారాన్ని ట్రాక్ చేయొచ్చు.ఆరోగ్యంపై అలర్ట్స్..ఇందులో గుండె పనితీరుకు సంబంధించిన నోటిఫికేషన్లు, రక్త ప్రసరణ, ఆక్సిజన్ స్థాయి, ఈసీజీ, ఇతర ఆరోగ్య వివరాల సమాచారం అందిస్తాయి. ఫాల్ డిటెక్షన్, క్రాష్ డిటెక్షన్ హార్డ్ ఫాల్, కార్ క్రాష్ సందర్భంలో అత్యవసర సేవలతో అనుసంధానం చేయగలవు. మహిళలకు భద్రత, రుతుచక్రం ట్రాకింగ్లోనూ ఈ స్మార్ట్ వాచ్ ఉపయుక్తం.ఇవి చదవండి: ప్రపంచ బీర్ దినోత్సవం : క్రాఫ్ట్ బీర్ ఇంత పాపులర్?! -
అద్భుతమైన ప్రకృతిని.. చిన్న ప్రదేశంలో చూపించే 'ఇకబెనా ఆర్ట్'.. ఇది!
సాక్షి, సిటీబ్యూరో: అద్భుతమైన ప్రకృతిని చిన్న ప్రదేశంలో చూపించే ఇకబెనా ఆర్ట్‌కు జపాన్‌లో మంచి ఆదరణ ఉంది. దీనికి నగరంలోనూ ఆదరణ పెరుగుతోంది. ది ఒహరా స్కూల్ ఆఫ్ ఇకబెనా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో 35 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా బుధవారం పార్క్ హోటల్లో ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విభిన్నమైన పూలు, ఆకులు ఇతర వస్తువులతో ఇకబెనా శైలిని ప్రదర్శించారు.ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్ హోజుకి ఒయామాడ చేసిన పూల అలంకరణలు అందరినీ ఆకట్టుకున్నాయి. భారత దేశంలోనూ ఇకబెనా కోర్సు ఆదరణ పొందుతోందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జపాన్ గౌరవనీయమైన కాన్సుల్ జనరల్ తకాహషి మునియో దంపతులు, హైదరాబాద్ చాప్టర్ చైర్పర్సన్ రేఖారెడ్డి, ప్రెసిడెంట్ నిర్మలా అగర్వాల్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ఇందుమతి దావ్లూర్, శారద, జ్యోత్స్న, నందరావు, శశి కోలా, రేఖా బయాంకర్, మీనాక్షి సుజనని, కనకదుర్గ, నిరూప తదితరులు భాగమయ్యారు.మేకింగ్ స్కిల్స్ బాగుంటాయి.. హైదరాబాద్‌లో ఇకబెనా ఎగ్జిబిషన్ ఎక్కడున్నా హాజరువుతా.. క్రియేటివిటీ, ఫ్లవర్ డెకరేషన్ వాటి నిర్వహన చాలా బాగుంటుంది. ఈ కోర్సు నేర్చుకోవాలంటే అధునాతన జీవన శైలిపై అవగాహన ఉండాలి. సొంతగా ఇల్లు, కంపెనీని అందంగా అలంకరించుకుంటాను. గార్డెన్‌ను సైతం మొక్కలు, రంగురంగుల పూలతో అందంగా తయారు చేసుకుంటాను. – జీవీఎస్ రామారావు, పారిశ్రామికవేత్త, మల్లాపూర్.అరుదైన కళ.. పెయింటింగ్, సింగింగ్, నృత్యం వంటి కళల్లాగే ఇకబెనా కూడా అరుదైన కళ. ఈ స్కూల్‌కు జపాన్‌లో మంచి గుర్తింపు ఉంది. మనం జపాన్ వెళ్లలేం.. కానీ ఆయా నిపుణులను నగరంలో కలుసుకోవడం మరిచిపోలేని అనుభూతి. పదేళ్ల నుంచి ఇందులో భాగమయ్యాను. ఈ ఆర్ట్‌లో ప్రావీణ్యం పొందాలంటే దీని లోతైన విశిష్టత అవగతమవ్వాలి. – చిలుకూరి అన్నపూర్ణ, హైదరాబాద్.ఏకాగ్రతతోనే సాధ్యం.. ఇకబెనా వినూత్నమైన కోర్సు. ఒహారా స్కూల్ ఆఫ్ ఇకబెనా ఫ్లవర్ డెకరేషన్ చేసే వ్యక్తికి కలర్ కాంబినేషన్‌పై మంచి పట్టుండాలి. సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను ప్రదర్శించగలగాలి. మేమంతా ఎంతో ఇష్టంతో చేస్తున్నాం. దీన్ని ప్రొఫెషన్‌గా తీసుకుని స్కూల్ నడిపిస్తున్న వారు ఇందులో ఉన్నారు. – నీరజ గోదావర్తి, హైదరాబాద్ -
ప్యార్ హువా..! ఆర్గానిక్ ఇంటీరియర్‌పై ఇంట్రెస్ట్!!
సాక్షి, సిటీబ్యూరో: దుస్తుల నుంచి ఆస్తుల దాకా అన్నీ ఆరోగ్యకరమైతేనే మాకు అది మహాభాగ్యం అంటోంది సిటీ. ఆహారంతో మొదలైన ఆర్గానిక్ ట్రెండ్ ఇంతింతై.. విస్తరిస్తూ ఇంటీరియర్ దాకా వచ్చేసింది. నగరంలో ఆర్గానిక్ ఆహారం కోసం ఏకంగా సొంతంగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన సెలబ్రిటీలు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇళ్లు, ఆఫీసులు, ఫార్మ్‌హౌస్‌లు, క్లబ్‌హౌస్‌లతో సహా ఇంటీరియర్ అంటే ఆర్గానిక్కే డియర్ అంటున్నారు.ఇంటీరియర్‌లో అత్యంత ప్రధానమైన సర్ఫేస్ డిజైనింగ్‌లో ఆర్గానిక్ ఉత్పత్తుల వాడకం బాగా పెరిగింది. సర్ఫేస్ డిజైనింగ్ అంటే ఉపరితల అలంకరణగా తెలుగులో పేర్కొనవచ్చు. ఫ్లోరింగ్, సీలింగ్ నుంచి సైడ్ వాల్స్ దాకా.. వాటి ఉపరితలాలపై వేసే పైపూత ఇంటీరియర్‌లో ప్రధానమైన అంశం. దీంతో ఇంట్లో అడుగుపెట్టగానే కనువిందు చేసేలా, కంటికి మాత్రమే కాదు ఆరోగ్యానికి సైతం ఇంపుగా ఉండేలా కోరుకుంటున్నారు ‘లగ్జరీ అంటే ఎవరినో చూసి అనుసరించే ఫ్యాషన్ కాదు పర్సనలైజేషన్ అని చెప్పాలి. సిటిజనులు ఆర్గానిక్ మెటీరియల్/సస్టెయినబుల్ మెటీరియల్ కావాలని అడుగుతున్నారు’ అంటూ చెప్పారు నగరంలో సర్ఫేస్ డిజైనింగ్‌కి చెందిన పేరొందిన బియాండ్ కలర్ నిర్వాహకులు కుమార్ వర్మ.జీరో వివైసీ.. అదే క్రేజీ.. సర్ఫేస్ డిజైనింగ్ కోసం అవసరమైన మెటీరియల్స్ అయిన లైమ్ ప్లాస్టర్, టెర్రాకోట, టెర్రాజోజ్ వంటివన్నీ పూర్తిగా ఆర్గానిక్‌వే వాడుతున్నారు. అలాగే 70శాతం రీసైకిల్డ్ మెటీరియల్స్ వినియోగిస్తున్నారు. ఇక వినియోగించే రంగులు కూడా కెమికల్ కలర్స్ బదులుగా వృక్షాధారితమైన ప్లాంట్ బేస్డ్ కలర్స్ వాడుతున్నారు. ఇవి కూడా దాదాపు అన్నీ ఆక్సైడ్ కలర్స్ మాత్రమే అంటే పౌడర్స్ తప్ప లిక్విడ్ రూపంలో ఉండవు. ఈ తరహా మెటీరియల్‌ని జీరో వాలెంటైల్ ఆర్గానిక్ కాంపౌండ్‌గా పేర్కొంటున్నారు.విదేశాల నుంచీ వచ్చేస్తున్నాయి..ఆధునికుల ఆరోగ్య స్పృహను సంతృప్తి పర్చేందుకు సర్ఫేస్ డిజైనర్స్.. ఆర్గానిక్ మెటీరియల్‌ను విదేశాల నుంచీ దిగుమతి చేసుకుంటున్నారు. వీటిలో అత్యధికంగా ఇటలీ నుంచి కొంత వరకూ స్పెయిన్, అమెరికా నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు. మన పూరీ్వకులు ఇళ్ల నిర్మాణæ శైలిలో ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు భావిస్తున్న నవతరం.. వాటినే తిరిగి కోరుకుంటోంది. శతాబ్దాల క్రితం ఎలాగైతే సున్నంతో కొన్ని రకాల మెటీరియల్ తయారు చేసేవారో అదే కాన్సెప్‌్టతో చేస్తున్నారు. మెటీరియల్‌ని నీటిలో 18 నుంచి 20 నెలలు పాటు హైడ్రేట్ చేసి అందులోనుంచి వచ్చిన క్రీమ్‌ని సర్ఫేస్ డిజైనింగ్‌లో ఉపయోగిస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ.. అదే ట్రెండీ..మన సిటీలోని టీ హబ్ సహా దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రాజెక్ట్‌లకు పనిచేశాం. ఇప్పుడు విల్లాస్, ఫార్మ్‌హౌస్‌లు, సెలబ్రిటీల బిల్డింగ్ దేనికోసమైనా సరే.. సిటీలో ఎకో ఫ్రెండ్లీ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. దీనికోసం ఇంటీరియర్ డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్‌తో కలిసి సర్ఫేస్ డిజైనింగ్ చేస్తున్నాం. మా దగ్గర 8 రకాల మెటీరియల్స్ ఉన్నాయి. 250 రకాల టెక్చర్స్ ఉన్నాయి. అత్యుత్తమ నేచురల్ క్వాలిటీ కోసం ఇటలీ నుంచి 80శాతం, స్పెయిన్, అమెరికా నుంచి 10శాతం చొప్పున మెటీరియల్స్ దిగుమతి చేసుకుంటున్నాం. ఇలా చేసేటప్పుడే భారతీయ వాతావరణానికి నప్పు తుందా లేదా.. అని పూర్తి స్థాయిలో స్కాన్ చేసి తెస్తాం.– కుమార్ వర్మ, బియాండ్ కలర్, సర్ఫేస్ డిజైనింగ్ కంపెనీ -
27 ఏళ్లు శ్రమించి.. 195 దేశాలు చుట్టేసి..
ప్రపంచంలోని అన్ని దేశాలను సందర్శించడమే అతడి లక్ష్యం.. ఆ దిశగా ఎంతో కష్టపడ్డారు. సుమారు 27 ఏళ్లు ఎంతో శ్రమకోర్చి అన్ని దేశాలను సందర్శించి అరుదైన ఘనత సాధించారు. ప్రస్తుతం 195 దేశాల సందర్శన పూర్తి చేసుకుని తెలుగుగడ్డపై బుధవారం అడుగుపెట్టారు. ఈ అరుదైన ఘనత సాధించిన వ్యక్తి మన తెలుగువాడు కావడం విశేషం.ప్రపంచాన్నే చుట్టేసిన 43 ఏళ్ల వయస్సు కలిగిన రవిప్రభు స్వస్థలం విశాఖపట్నం. ఆయన హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో చదువుకున్నాడు. పొలిటికల్ సైన్స్‌లో పట్టభద్రుడైన రవిప్రభు విద్యార్థి దశలోనే 1996లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వివాహం చేసుకొని ఉద్యోగం చేసుకుంటూనే విదేశాలను సందర్శించడం ప్రారంభించారు. భూటాన్ దేశాన్ని సందర్శించడంతో ప్రారంభమైన ఆయన యాత్ర వెనుజులతో ముగిసింది. ప్రపంచంలోని దేశాలను సందర్శిస్తూనే 2020లో ఒక యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. మొత్తం సందర్శన విశేషాలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తూ వచ్చారు.అన్ని దేశాలను చుట్టేసి వచ్చిన ఆయన రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 600 మందికి పైగా అంతరిక్షంలోకి వెళ్లారు. 6,600 మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ప్రపంచంలోని 850 కోట్ల మందిలో 280 మంది మాత్రమే ప్రతి దేశాన్ని సందర్శించారని అన్నారు. ఈ అరుదైన ఘనత సాధించిన 280 మందిలో తనకు స్థానం లభించడం సంతోషంగా ఉందని తెలిపారు. 27 ఏళ్లు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రయాణాల కోసం రూ.25 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. -
క్లైంబింగ్.. సాహసోపేతం
ఎవరెస్ట్ ఎత్తు ఎంతో ఊహించడమే చాలా కష్టం.. అలాంటిది ఎవరెస్టు వంటి శిఖరాలను అధిరోహిస్తూ మనిíÙకి అసాధ్యమంటూ ఏమీ లేదని నిరూపిస్తుంటారు కొందరు పర్వతారోహకులు. ఈ పర్వతారోహణం అనేది గొప్ప ప్రయత్నంగా కీర్తించబడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని అందిస్తుంది. ఈ పర్వతారోహణలో భారతీయులు కూడా సత్తాచాటిన సందర్భాలు ఎన్నో.. హిమాలయాలు మొదలు వివిధ ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలను అధిరోహించి భారత పతాకాన్ని సగర్వంగా నిలిపిన సందర్భాలు సైతం ఎన్నో ఉన్నాయి. అయితే ఈ పర్వతారోహణం అంత సులువు కాదు, విపత్కర పరిస్థితులకు క్లైంబింగ్ ప్రధానమైన ప్రయత్నమని పలువురు పర్వతారోహకులు చెబుతున్నారు. దీనికంటూ ప్రత్యేక శిక్షణ, అనుభవం అవసరమని హెచ్చరిస్తున్నారు. నేడు నేషనల్ మౌంటేన్ క్లైంబింగ్ డే నేపథ్యంలో పలు ఆసక్తికరమైన అంశాలు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తుండటంతో పలువురు ఔత్సాహికులు క్లైంబింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. దీనిని ఆసరా చేసుకుని పలు ప్రైవేటు సంస్థలు సైతం పర్వతారోహణకు సంబంధించి శిక్షణ అందిస్తున్నారు. కానీ క్లైంబింగ్ అనేది అత్యంత సాహసోపేతమైన ప్రయత్నమని, దీని కోసం జాతీయ స్థాయిలో అనుభవం ఉన్న కేంద్రాల్లోనే శిక్షణ పొందడం అవసరమని నిపుణులు, అనుభవజ్ఞులు సూచిస్తున్నారు. ఈ శిక్షణకు నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటేనిరింగ్ (ఉత్తర్ కాశీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటేనిరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్, అటల్‌బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటేనిరింగ్ (హిమాచల్ ప్రదేశ్), హిమాలయన్ మౌంటేనిరింగ్ ఇన్స్టిట్యూట్ (డార్జిలింగ్) వంటి కేంద్రాలు ప్రధానమైనవని పర్వతారోహకులు వెల్లడిస్తున్నారు. ఈ శిఖరాలను చేరడం అంత సులువు కాదు, సరైన శిక్షణ లేకుండా ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని హెచ్చరిస్తున్నారు. ట్రెక్కింగ్, క్లైంబింగ్ ఒకటి కాదు.. వీటి మధ్య ఎంతో వ్యత్యాసముందని నిపుణుల సూచన.ప్రాణాలతో చెలగాటం.. పర్వతారోహణం అంటే ప్రకృతితో మమేకమైతూ.. అక్కడి విపత్కర పరిస్థితులకు మన దేహాన్ని అనువుగా మార్చుకుంటూ లక్ష్యాన్ని చేరడం. దీనికి అత్యంత కఠినమైన శిక్షణ అవసరం. నేను ఎన్సీసీ నుంచి క్లైంబింగ్‌కు ఎంపికై ఉత్తర కాశీలోని నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటేనింగ్లో శిక్షణ పొందాను. ఈ శిక్షణ వల్లే ప్రపంచంలోని ఎత్తయిన పర్వతాల్లో ఐదింటిని అధిరోహించాను. పర్వతారోహణం అంత సులువు కాదు.. ప్రాణాలతో చెలగాటం. ఎంతో మానసిక ధృఢత్వం అవసరం. 2019లో నేను క్లైంబింగ్ చేస్తున్న సమయంలో ఐదుగురితో ఉన్న బృందంలో ఇద్దరు చనిపోవడం చూశాను. ఏడాది ఆలస్యమైనా పర్వాలేదు.. కానీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కేంద్రాల్లోనే శిక్షణ తీసుకోవాలి. క్లైంబింగ్లో ఏ దిశలో, ఎంత కోణంలో, అనువైన ఫిట్నెస్తో ప్రయాణించాలి తదితర అంశాల్లో ప్రామాణికమైన శిక్షణ అవసరం. అంతేగాకుండా ఇదో ప్యాషన్‌గా మారి క్లైంబింగ్ కోసం వచ్చి హిమాలయాల వంటి ప్రదేశాలను ప్లాస్టిక్‌తో నింపేస్తున్నారు. అనవసర చెత్తతో ప్రకృతిని కాలుష్యం చేస్తున్నారు. విశిష్టమైన కేంద్రాల్లో ఆర్మీ అధికారులు వీటన్నింటిపైన బేసిక్, అడ్వాన్స్డ్, అడ్వెంచరస్ తదితర విభాగాల్లో శిక్షణ అందిస్తారు. – అంగోత్ తుకారాం. (దక్షిణాది నుంచి మౌంట్ ఎవరెస్టు అధిరోహించిన మొదటి పిన్న వయసు్కడు.) -
12 రోజులు.. 5000 కిలోమీటర్లు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ సైక్లింగ్ పోటీల్లో అత్యంత కఠినమైన రేస్ ఎక్రాస్ అమెరికా (వరల్డ్ అల్ట్రా సైక్లింగ్ ఛాంపియన్షిప్ ట్రోఫీ) సైక్లింగ్ ఈవెంట్. దీనికి అర్హత సాధించానని హైదరాబాద్ బండ్లగూడకు చెందిన రవీందర్‌రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 10 నుంచి సైక్లింగ్ పోటీలు ప్రారంభం కానున్నాయన్నారు. భారత్ నుంచి తొలిసారి ఈ పోటీల్లో పాల్గొంటున్న తొలి వ్యక్తి తానేనని, 12 రోజులు, 12 నగరాల మీదుగా 5 వేల కిలో మీటర్ల నిరంతరాయంగా సైక్లింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.ఈస్ట్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రారంభమై న్యూజెర్సీలో ముగుస్తుందన్నారు. ప్రపంచంలో 60 ఏళ్ల పైబడిన వారు ఇద్దరు, 50 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసులో 5 గరు పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నుంచి ప్లస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాల్లో ఈ సైక్లింగ్ ఉంటుందన్నారు. పేద పిల్లలకు ఫండ్ రైజింగ్‌లో భాగంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారని, గతంలో 29 మంది సైక్లిస్టులు రూ.100 కోట్ల ఫండ్ రైజ్ చేశారని గుర్తుచేశారు.గతంలో రేస్ ఎక్రాస్ ఇండియా, రేస్ ఎక్రాస్ ఆసియా పోటీల్లో విజేతగా నిలిచానని తెలిపారు. రేస్ ఎక్రాస్ అమెరికా ఈట్లోనూ 50 ఏళ్ల కేటగిరిలో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ముందస్తు ట్రయల్స్‌లో భాగంగా ప్రస్తుతం అమెరికాలో సైక్లింగ్ చేయనున్న రూట్లో ట్రయల్ వేస్తున్నారు.ఇవి చదవండి: Singer Smita: ఓల్డ్ స్కూల్ బృందావనం! నగరంలో కొత్త కాన్సెప్ట్.. -
Singer Smita: ఓల్డ్ స్కూల్ బృందావనం! నగరంలో కొత్త కాన్సెప్ట్..
అధునాతన జీవన విధానం పేరుతో పెంచుకుపోతున్న శరీర కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్యాషన్, బ్యూటీ, ట్రెండ్స్ మాయలో పడిపోయి గత తరం ఆరోగ్యకరమైన పద్ధతులు, సంస్కృతికి సంపూర్ణంగా దూరమవుతున్నాం. ఇప్పటికైనా మేల్కొని స్వీయ సంరక్షణకు, భవిష్యత్ తరం ఆరోగ్య భద్రతకు అమ్మమ్మల కాలం నాటి పద్ధతులను అంతరించిపోకుండా ప్రయత్నం చేయాలని ప్రముఖ సింగర్ స్మిత చెబుతున్నారు. దీని కోసం నగరంలోని ఫిల్మ్ నగర్ వేదికగా ప్రత్యేకంగా ‘ఓల్డ్ స్కూల్ బృందావనం’ను ఆమె ప్రారంభించారు. – సాక్షి, సిటీబ్యూరోతాతల కాలం నాటి ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాల్లోని పద్ధతులను నగరవాసులకు అందించాలనే లక్ష్యంతో సనాతన çపద్ధతులతో సౌందర్య పోషణ కు శ్రీకారం చుట్టారు సింగర్ స్మిత. ఓల్డ్ స్కూల్ రిచువల్స్ నేపథ్యంలో దేశంలోనే మొదటిసారిగా ‘ఓల్డ్ స్కూల్ బృందావనం’ను సొంతంగా ప్రారంభించడం సంతోషంగా ఉందని స్మిత తెలిపారు. ఈ కేంద్రం పాత తరం వైవిధ్యాన్ని కొనసాగించడమే కాకుండా ఈ తరానికి ఆరోగ్య వైద్యంగా దోహదపడుతుందని, వైద్యం, స్వీయ–సంరక్షణ, కళలకు ఏకైక స్థానంగా సంప్రదాయ పద్ధతులకు ఆధునిక లగ్జరీ సమ్మేళనాన్ని అందిస్తామని చెబుతున్నారు..ఆనాటి వైద్యం.. ఈనాటి వైవిధ్యం..ఈ వెల్నెస్ సెంటర్లో ప్రత్యేకమైన క్రిస్టల్ ఆయిల్–ఇన్ఫ్యూజ్డ్ థెరపీలు, నేచురోపతిక్ హీలింగ్ పద్ధతులు, చర్మం, జుట్టు, శరీర సంరక్షణ ఆచారాలను అందిస్తున్నాం. ఇవన్నీ పెద్దలతో పాటు చిన్నారులకూ పాతకాలం నలుగు సంరక్షణను అందిస్తుందని ఆమె వివరించారు. ఈ ఉత్పత్తుల్లో ఎలాంటి రసాయనాలు లేకుండా నాచురల్ ప్రొడక్ట్స్‌ను మాత్రమే వాడతామని, ఎలాంటి జీవహింస చేయకుండా, పురాతన రహస్యాల నుంచి ఉత్పత్తుల తయారీ ఉంటుందని అన్నారు. పాత పద్ధతులలే అయినప్పటికీ 8 ఏళ్లుగా సైంటిఫిక్ పరిశోధనలు చేపట్టి, దాదాపు 2 లక్షల మంది వినియోగదారులపై పరీక్షలు చేశాకే అందుబాటులోకి తీసుకువస్తున్నామని వివరించారు. ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను నగరంలోనే కాకుండా మరి కొద్ది రోజుల్లో గోవా, ఫోర్ట్ కొచ్చి, చెన్నైలలో ప్రారంభించనున్నామని అన్నారు.ఇవి చదవండి: వర్షాకాలంలోనూ వదలకుండా.. జంపింగ్ జాక్స్! -
వర్షాకాలంలోనూ వదలకుండా.. జంపింగ్ జాక్స్!
చెమట పడుతోందని వేసవిలో, ముసురు పట్టిందని వానా కాలంలో, మంచుకురుస్తోందని చలికాలంలోనూ వ్యాయామాన్ని మానకూడదు. ఏ సీజన్‌కు తగ్గట్టు ఆ తరహా వర్కవుట్స్ ప్లాన్ చేసుకోవచ్చని ఫిట్నెస్ ట్రైనర్స్, నిపుణులు అంటున్నారు. వ్యాయామాన్ని స్కిప్ చేయడం మంచి అలవాటు కాదని, దీని వల్ల సీజనల్ వ్యాధుల ప్రభావం తట్టుకునే ఇమ్యూనిటీపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అందుకే సీజన్‌కు తగ్గట్టుగా వర్కవుట్‌ని డిజైన్ చేసుకోవాలని వ్యాయామ నిపుణులు సూచిస్తున్నారు. నగరంలో సీజన్‌కు అనుగుణంగా వర్కవుట్ డిజైన్ అనేది ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతోంది. దీంతో ఫిట్నెస్ ఫ్రీక్లకు వెసులుబాటుగా ఉండే ట్రెయినర్లకు డిమాండ్ పెరుగుతోంది. – సాక్షి, సిటీబ్యూరోవర్షాకాలంలో వ్యాయామ ఆసక్తి తగ్గడానికి అధిక తేమ స్థాయిలు, సూర్యకాంతి లేకపోవడం, వాతావరణ పీడనంలో మార్పులు వంటి కారణాలు ఉన్నాయి. వాతావరణ పీడనం పడిపోవడం అనేది మన శరీర ప్రసరణ వ్యవస్థను ప్రభావితం చేసి, అలసట, శక్తి లేకపోవడం వంటి అనుభూతులకు గురిచేస్తాయి. కానీ వర్షాకాలంలో ఫిట్నెస్ను కాపాడుకోవడం మానసిక స్థితిని మెరుగుపరచడంలో మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుందని అంటున్నారు. దీంతో పలువురు నిపుణులు సింపుల్ వర్కవుట్స్‌పై సలహాలు, సూచనలు అందిస్తున్నారు...సమయానికి తగినట్లు..– స్పాట్ జాగింగ్ చాలా తక్కువ స్పేస్‌లో కదలకుండా చేసే జాగింగ్ ఇది. అవుట్‌డోర్‌లో జాగింగ్‌కి సమానమైన ప్రతిఫలాన్ని అందిస్తోంది. చేతులను స్వింగ్ చేయడం వంటి తదితర మార్పు చేర్పుల ద్వారా ఫుల్బాడీకి వర్కవుట్ ఇవ్వొచ్చు. – జంపింగ్ జాక్స్, క్లైంబర్స్, హై నీస్, సిజర్ చాప్స్ వంటివి ఒకే ప్రదేశంలో కదలకుండా చేయవచ్చు. వీటిని మూడు సెట్స్‌గా విభజించుకుని చేయడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి.– స్కిప్పింగ్ రోజంతా చురుకుగా ఉంచే అద్భుతమైన మాన్ సూన్ వర్కౌట్. రోప్ స్కిప్పింగ్ లేదా జంపింగ్ అధిక సంఖ్యలో కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది అన్ని సీజన్లలోనూ చేయవచ్చు. – వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి ఇండోర్ యోగా ఒక గొప్ప మార్గం. వృక్షాసనం వంటి ఆసనాలతో చల్లని వాతావరణంలో ప్రయోజనకరంగా ఉంటుంది.– వ్యాయామాల్లో వైవిధ్యం కోసం డంబెల్స్ లేదా రెసిస్టెన్స్ బ్యాండ్ల వంటి కొన్ని ప్రాథమిక వ్యాయామ పరికరాలను ఉపయోగించవచ్చు. – సాధారణ నీటికి ప్రత్యామ్నాయంగా హెర్బల్ టీలు, కొబ్బరి నీళ్లను ఉపయోగించడం ద్వారా చురుకుదనాన్ని, ఉత్తేజాన్ని పొందవచ్చు.– ఆన్లైన్లో లేదా ఫిట్నెస్ యాప్‌ల ద్వారా అందుబాటులో ఉన్న ఫిట్నెస్ ఇచ్చే డ్యాన్స్ వీడియోలను అనుసరించాలి. – ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అందుబాటులో ఉంటే స్విమ్మింగ్ ల్యాప్‌లు లేదా ఆక్వా ఏరోబిక్స్ క్లాస్‌లలో పాల్గొనాలి.– వర్షాకాలంలో బద్ధకాన్ని ఎదుర్కోవడానికి, సాధారణ శారీరక శ్రమతో పాటు సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, వీలైనంత వరకూ సూర్యరశ్మి శరీరానికి సోకేలా చూసుకోవడం చాలా ముఖ్యం.మార్పు చేర్పులు అవసరం..ఎండలు ఉన్నాయని కొందరు వానలు ఉన్నాయని కొందరు వర్కవుట్‌కి బద్ధకిస్తుంటారు. కొందరు మాత్రం సీజన్లతో సంబంధం లేకుండా జిమ్స్‌కు వస్తుంటారు. కనీసం వారానికి 3 నుంచి 4 సార్లు చేసేవారిని సిన్సియర్ అని చెప్పొచ్చు. అదే కరెక్ట్ విధానం కూడా. ఈ సీజన్లో తెల్లవారుఝామున బాగా ముసురుపట్టి ఉన్నప్పుడు ఉదయం లేచిన వెంటనే ఎక్సర్సైజ్ చేయాలనే మూడ్ రాదు. కాబట్టి లేవగానే ఇంట్లోనే కొన్ని స్ట్రెచి్చంగ్ వర్కవుట్స్ చేశాక జిమ్‌కి రావచ్చు. వాకింగ్, జాగింగ్, యోగా వంటివి అవుట్‌డోర్‌లో చేసే అలవాటు వల్ల వానాకాలంలో రెగ్యులారిటీ మిస్ అవుతుంది. కాబట్టి ఇన్డోర్ వర్కవుట్స్ ఎంచుకోవడం మంచిది. వర్షాకాలం వర్కవుట్స్..ఈ వాతావరణం హెవీ వెయిట్/ రిపిటీషన్స్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. సో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌కి ఎక్కువ టైమ్ కేటాయించాలి. వైరల్ ఫీవర్స్ ఫ్లూ వచ్చేది ఈ సీజన్లోనే కాబట్టి, ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ప్రత్యేకమైన వర్కవుట్స్ చేయించాలి. ఈ వాతావరణంలో మజిల్స్ బద్ధకిస్తాయి. కాబట్టి వర్కవుట్‌కి ముందు వార్మ్ అప్‌కి కేటాయించే సమయాన్ని కొంత పెంచి చేయిస్తాం. వారానికి 3 నుంచి 4 గంటల పాటు రోజూ 45 నిమిషాలు వ్యాయామం ఈ సీజన్లో చాలా ఉపయుక్తం.– ఎం.వెంకట్, సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ లైఫ్‌స్టైల్ కోచ్ -
హోం బేకర్స్..! ఇంట్లో కిచెన్లోనే బేకరీ ఏర్పాటు..!
ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి క్లౌడ్ కిచెన్ కాన్సెప్‌్టతో ముందుకు స్పెషల్ థీమ్స్‌తో ఔరా అనిపించుకుంటున్న యువత కాస్తంత సృజనాత్మకతకు ఆలోచన తోడైతే అద్భుతాలు సృష్టించొచ్చు. పలువురు యువత ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు. చిన్నప్పటి నుంచి కళల పట్ల ఉన్న ఆసక్తికి, ఆలోచనను జత చేసి ఎంట్రప్రెన్యూర్స్‌గా విజయతీరాలను చేరుకుంటున్నారు. సాధారణంగా బిజినెస్ చేయాలంటే పెట్టుబడి, అనువైన ప్రాంతం దొరకాలి.. అంత కష్టపడి వ్యాపారం చేస్తే, అది సక్సెస్ అవుతుందా అనే అనుమానం ఉంటుంది. అందుకే ఈ తరం యువత సరికొత్త మార్గాన్ని ఎంచుకుంటోంది. క్లౌడ్ కిచెన్ కాన్సెప్‌్టతో ముందడుగు వేస్తున్నారు. ఇటీవల హోం బేకర్స్ నడుపుతూ వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోపలు థీమ్స్‌తో కేక్స్ తయారీ..సాధారణంగా పుట్టినరోజు, పెళ్లి, న్యూఇయర్ ఇలా చాలా సందర్భాల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటుంటాం. అయితే ఎప్పుడూ ఒకే రకమైన కేక్ కట్ చేస్తుంటే మజా ఏముంటుందని, కొందరు విభిన్న రకాల కేకులు ఆర్డర్ చేస్తుంటారు. పిల్లల కోసం స్పైడర్‌మ్యాన్, ఏనుగు, బార్బీ, పెళ్లి రోజు, ఎంగేజ్మెంట్ కోసం ప్రత్యేక థీమ్స్‌తో కేకులు తయారు చేస్తుంటారు. కస్టమర్లకు నచి్చన థీమ్స్ తయారు చేసేందుకు తాము ఎంతో కష్టపడుతుంటామని చెబుతున్నారు.పూర్తి సహజంగా.. ఎలాంటి రసాయనాలూ లేకుండా పూర్తిగా సహజ పదార్థాలతో తయారుచేయాలనే ఉద్దేశంతో చాలామంది హోం బేకర్స్‌ను ప్రారంభించినట్టు చెబుతున్నారు. దీంతో పాటు పరిశుభ్రమైన వాతావారణంలో మన ఇంట్లో తయారు చేసినట్టుగానే కస్టమర్లకు పదార్థాలు తయారు చేసి ఇస్తామని పేర్కొంటున్నారు. చాలా బేకరీల్లో డాల్డాతో తయారుచేస్తారని, అయితే తాము మాత్రం బట్టర్, బ్రౌన్ షుగర్‌ను వాడతామని హోం బేకరీ నిర్వాహకులు చెబుతున్నారు.ఇంట్లో కిచెన్లోనే..సాధారణంగా బేకరీ ఏర్పాటు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కానీ హోం బేకరీని తక్కువ ఖర్చుతోనే ఇంట్లో కిచెన్లోనే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎలాగూ ఇంట్లో వంటకాలను చాలా పరిశుభ్రమైన పరిసరాల్లోనే తయారు చేస్తుంటారు. కాబట్టి అక్కడే చిన్న ఓవెన్ వంటి చిన్న చిన్న పరికరాలతో కేకులు, కుకీస్ తయారు చేస్తున్నారు. కేక్స్, కుకీస్‌తో పాటు మఫిన్స్, చీజ్ కేకులు, డోనట్స్ వంటి ఉత్పత్తులతో చుట్టు పక్కల వారితో ఔరా అనిపించుకుంటున్నారు.సాధికారత కోసం..చాలా మంది మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలనే ఉద్దేశంతోనే ఈ హోం బేకర్స్ ప్రారంభిస్తున్నటు చెబుతున్నారు. ఇంట్లో వారి పై ఆధారపడకుండా సొంత గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయమే వారిలో కనిపిస్తోంది. తమలో ఉన్న సృజనాత్మకతను నలుగురూ మెచ్చుకుంటే అంతే చాలు అని చెబుతున్నారు.ఇది కూడా సమాజ సేవే..ఆరోగ్యకరమైన పదార్థాలు అందిస్తే కూడా సమాజానికి సేవ చేసినట్టే అనేది నా నమ్మకం. కాస్త భిన్నంగా కనిపించడమే కాకుండా, మన పనులు భిన్నంగా ఉండి, సమాజంలో గుర్తింపు రావాలనేది నా తాపత్రయం. అందులో భాగంగానే హోం బేకర్స్ కాన్సెప్ట్ ఆలోచన వచి్చంది. నా కేక్స్ డిజైన్స్ బాగున్నాయని అందరూ మెచ్చుకుంటుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేను. – సాయి శ్రీ, ఓవెన్ కుక్ డిలైట్చాలా టేస్టీగా ఉంటాయి..నేను చాలా సార్లు హోం బేకర్స్ నుంచి కేక్స్ ఆర్డర్ చేసుకున్నాను. సాధారణ బేకరీల కన్నా ఇక్కడ చాలా హైజీనిక్‌తో పాటు రుచికరంగా ఉంటాయి. ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్స్‌లో ఇస్తుంటారు. తక్కువ ధరలోనే మంచి కేక్స్ వస్తున్నాయి. – మెరుగు శివ ప్రకాశ్ నాయుడుఇవి చదవండి: ఎర్ర బచ్చలికూరతో అధిక బరువుకి చెక్! -
Priyanka Chopra : సినీ స్టార్‌తో భోజనం..
సాక్షి, సిటీబ్యూరో: విదేశాల్లో స్థిరపడిన భారతీయుల్లో మన అనే భావనను పెంపొందించే లక్ష్యంతో ఓ ప్రచార కార్యక్రమం చేపట్టినట్టు ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీని కోసం మన దేశానికి చెందిన గ్లోబల్ సూపర్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్‌ను ప్రచారంలో భాగం చేశామని, ‘సినీ స్టార్‌తో భోజనం’ అంటూ, స్వదేశీ రుచులను గుర్తు చేస్తున్నామన్నారు. అంతర్జాతీయంగా పేరొందిన మిచెలిన్–స్టార్ రెస్టారెంట్ ఎగ్జిక్యూటీవ్ చెఫ్, సిద్ అహుజా కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారన్నారు. -
వండర్లాలో ఫ్రెండ్షిప్ డే
సాక్షి, హైదరాబాద్: అందరూ ఎంతో ఇష్టంగా ఎదురు చూసే ఫ్రెండ్షిప్ డే వేడుకల కోసం నగరంతో పాటు వండర్లా కూడా సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ఆగస్టు 4న స్నేహితుల దినోత్సవం సందర్భంగా నగరంలోని ప్రతిష్టాత్మక అమ్యూజ్మెంట్ పార్క్ వండర్లా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. స్నేహానికి ప్రతీకగా ఆ రోజు వండర్లా టిక్కెట్ ఒకటి కొంటే మరొకటి ఉచితంగా అందిస్తున్నారు. ఈ ప్రత్యేక ఆఫర్ ఆన్లైన్లో మాత్రమే అందిస్తున్నామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె.చిట్టిలపిల్లి తెలిపారు. లైవ్ డీజే, స్పెషల్ ఈవినింగ్ జుంబా సెషన్లు, ఫన్ గేమ్స్, ఉత్కంఠ భరిత పార్క్ రైడ్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. సాధారణ రోజుల్లో కన్నా పార్క్‌లు ఎక్కువ సేపు తెరిచి ఉంటాయన్నారు. బుక్కింగ్ కోసం https://bookings.wonderla.com/ లేదా హైదరాబాద్ పార్క్ – 084 146 76333, +91 91000 63636ను సంప్రదించవచ్చు. -
శ్రవణమే.. నయనం
పుట్టుకతోనే అంధత్వంతో అంతా చీకటి. కానీ తన కళతో చుట్టూ ఉన్న ప్రపంచానికి వెలుగులు పంచాడు. అంధత్వంతో పాటు పేదరికం పుట్టినప్పటి నుంచి అతడిని వెక్కిరిస్తూ వస్తోంది. అయినా తన సంకల్పం ముందు ఇవన్నీ దిగదుడుపే అయ్యాయి. ఢోలక్, కంజీర, రిథమ్ ప్యాడ్ వాయిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. అతడి పేరే సిరిపురం మహేశ్. మంచిర్యాల జిల్లా హాజీపురం మండలం దొనబండ మహేశ్ స్వగ్రామం. ఇటీవలే నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన మహేశ్ తన ప్రతిభతో ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతున్నాడు. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి ఉండేది. పుట్టుకతోనే చూపు లేకపోయినా తనకు వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుందని తన నమ్మకం. శాంతారాం అనే తన చిన్ననాటి స్నేహితుడు ఢోలక్‌ను పరిచయం చేశాడు. అప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి పెరిగిందని మహేశ్ పేర్కొన్నాడు. అయితే దుర్గం శంకర్ అనే మాస్టారు ఢోలక్లో మెళకువలు నేరి్పంచి, తనను ఇంతవరకూ తీసుకొచ్చాడని గుర్తు చేసుకున్నాడు. చాలా ఫంక్షన్లలో జరిగే ఆర్కెస్ట్రాల్లో వాయిద్య పరికరాలను వాయిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. అవార్డులు, రివార్డులు తెలుగు టాలెంట్స్ మ్యూజిక్ అవార్డు, తెలంగాణ ప్రభుత్వం కళోత్సవం సందర్భంగా రెండుసార్లు అవార్డు తనను వరించింది. ఆర్కెస్ట్రాలో ఢోలక్, కంజీర వాయిస్తుంటే చాలా మంది ఆశ్చర్యపోయి మెచ్చుకునే వారని మహేశ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక సంగీతంతో పాటు తెలుగులో కూడా ప్రావీణ్యం సాధించాడు మహేశ్. పేరడీ పాటలు, కవితలు కూడా రాస్తుంటాడు. అదే నా కల.. భవిష్యత్తులో తెలుగు టీచర్‌గా స్థిరపడాలనేది తన కల అని చెబుతున్నాడు. అంధులకు తెలుగులో వ్యాకరణం నేర్చుకోవడం చాలా కష్టం. కానీ నిజామ్ కాలేజీలో చంద్రయ్య శివన్న అనే తెలుగు మాస్టారు ఎంతో ఓపికగా పాఠాలు నేరి్పంచేవారని చెప్పుకొచ్చారు. పదో తరగతి వరకూ బ్రెయిలీ లిపిలో పాఠాలు ఉండేవని, ఇంటర్ తర్వాత అంధులు పాఠాలు నేర్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందని పేర్కొన్నాడు. చంద్రయ్య మాస్టారు పుస్తకాలను పీడీఎఫ్‌లోకి మార్చి తన లాంటి వారికి ఇచ్చేవారని చెప్పాడు. -
India Book of Records: చిన్నారి ఆకర్షణ సంకల్పబలం..
కితాబ్తో విజ్ఞానాన్ని పంచుతూ.. లైబ్రరీల ఏర్పాటు పరంపర కొనసాగిస్తూ.. ఇప్పటివరకూ 15 గ్రంథాలయాల ఏర్పాటు.. 25 లైబ్రరీల లక్ష్యం దిశగా అడుగులు.. చిన్నారి ఆకర్షణ సంకల్పబలం.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఏపీ మాజీ సీఎం అభినందనలు.. 25వ లైబ్రరీ ప్రారంభోత్సవానికి హాజరవుతానని ప్రధాని హామీ..పుస్తక పఠనంపై ఆసక్తి రేపుతూ.. పుస్తకం తోడుంటే వెలకట్టలేని స్నేహితుడు వెన్నంటే ఉన్నట్టే. మంచి పుస్తకం నిండైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తోంది. మదిని కమ్మేసిన నిరాశ నిస్పృహలను దూరం చేసి ధైర్యాన్ని కూడగడుతుందంటారు సాహితీవేత్తలు. పుస్తక సాహిత్యం జీవన విధానాన్ని, పోరాట పటిమను అలవర్చుతుందంటారు. అలాంటి పుస్తక విలువను విశ్వవ్యాప్తం చేసేందుకు చిన్నారి ఆకర్షణ కంకణం కట్టుకుంది. పిన్న వయస్సులోనే కితాబ్ గొప్పతనాన్ని గుర్తించి ఎందరికో చదువుకునే భాగ్యాన్ని కలిగిస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 9,536 పుస్తకాలను సేకరించి 15 లైబ్రరీలను ఏర్పాటుచేసి తోటి చిన్నారులతో పాటు ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని రేపుతోంది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీయే ఈ చిన్నారి లైబ్రరీల ఏర్పాటు యజ్ఞం గురించి తెలుసుకుని, ఆమెను కలుసుకుని ప్రశంసల జల్లు కురిపించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఆకర్షణ ఆమెకు ప్రేరణ కలిగించిన అంశాలు, లక్ష్యాలను గురించి ‘సాక్షి’తో పంచుకున్నారు. సాక్షి: ఎన్నో ఏట నుంచి పుస్తక సేకరణ ప్రారంభించారు? ప్రేరణ కలిగించింది ఎవరు ?ఆకర్షణ: తొమ్మిది సంవత్సరాల వయస్సు నుంచి పుస్తకాలను సేకరించడం మొదలుపెట్టాను. 2021లో ఎంఎన్‌జే క్యాన్సర్ చి్రల్డన్ ఆస్పత్రిలోని రోగులకు, వారి సహాయకులకు ఆహారాన్ని అందించేందుకు తల్లిదండ్రులతో కలిసి వెళ్లాను. అక్కడి పిల్లల అవసరాలను గుర్తించాను. ముఖ్యంగా కలరింగ్ బుక్స్‌తో పాటు వారు చదువుకునేందుకు అవసరమైన పుస్తకాలు ఊరటనిస్తాయని అనిపించింది. దీంతో పుస్తకాలను సేకరించి లైబ్రరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాను. నన్ను ప్రేరేపించిన ఎంఎన్‌జే కేన్సర్ హాస్పటల్లోనే మొట్టమొదటి లైబ్రరీని ఏర్పాటుచేశాను.సాక్షి: ఇప్పటి వరకూ ఎన్ని లైబ్రరీలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు. ?ఆకర్షణ: ఇప్పటివరకూ 15 లైబ్రరీలను ఏర్పాటు చేశాను. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి, సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్, బోరబండ అల్లాపూర్ గాయత్రీనగర్ అసోసియేషన్, బాలికల కోసం జువైనల్ అబ్జర్వేషన్ హోమ్, కోయంబత్తూర్ సిటీ పోలీస్–స్ట్రీట్ లైబ్రరీ, చెన్నై బాయ్స్ క్లబ్–నోలంబూర్ పోలీస్‌స్టేషన్, సనత్‌నగర్ ఓల్డ్ ప్రభుత్వ పాఠశాల, సిద్దిపేట ఉమెన్ సేఫ్టీవింగ్ భరోసా సెంటర్, తమిళనాడు కన్యాకుమారి జిల్లాల్లోని కలితురై గ్రామం, అమీర్‌పేట స్టేడియం, ఏఎస్‌రావునగర్ బాలగోకులం భాగ్యనగర్, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలోని ఎయిడ్స్ అనాథ చిన్నారుల గృహం, బోరబండ ఆదర్శ ఫౌండేషన్, బోయిగూడ అనాథ బాలికల వసతి గృహం, బొల్లారంలోని కలాడీ ఆది శంకర మేడోమ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేయడం జరిగింది.సాక్షి: ప్రధాని మన్‌కీ బాత్‌లో మాట్లాడే అవకాశం ఏ విధంగా వచ్చింది. ?ఆకర్షణ: నేను లైబ్రరీల ఏర్పాటు చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ కూడా లైబ్రరీ కార్యక్రమాల నిమిత్తం వెయ్యి పిల్లల పుస్తకాలను విరాళంగా ఇవ్వడానికి ముందుకువచి్చంది. ఈ నేపథ్యంలోనే 2023, సెపె్టంబర్ 24న ప్రధానమంత్రి మన్‌కీ బాత్ 105వ ఎపిసోడ్లో స్వయంగా మాట్లాడే అవకాశం దక్కింది.సాక్షి: స్వయంగా ప్రధానితో ముచ్చటించినప్పుడు మీ ఫీలింగ్? ఆయన ఏమన్నారు ?ఆకర్షణ: ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచి్చన ప్రధాని నరేంద్రమోదీని రాజ్‌భవన్‌లో స్వయంగా కలిసే అవకాశం వచ్చింది. ఈ కార్యక్రమాన్ని నిరి్వరామంగా కొనసాగించు అని ఎంతగానో ప్రోత్సహించి అభినందించారు. నేను ఏర్పాటుచేయబోయే 25వ లైబ్రరీ ప్రారం¿ోత్సవానికి స్వయంగా వస్తానని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డితో పాటు పలువురు అధికారుల అభినందనలు మరువలేనివి. సాక్షి: పుస్తకాల సేకరణకు ఇంకా ఎవరెవరి ప్రోత్సాహం ఉంది ?ఆకర్షణ: తెలంగాణ ఆధారిత మానేరు రచయితల సంఘం, బాల సాహిత్య పరిషత్, దక్కన్ సాహిత్య సభలు లైబ్రరీల ఏర్పాటుకు గాను వెయ్యి పుస్తకాలు విరాళంగా అందజేసేందుకు ముందుకువచ్చాయి. సాక్షి: పిన్న వయస్సులోనే మీరు సాధించిన మరుపురాని జ్ఞాపకాలు ?ఆకర్షణ: న్యూఢిల్లీలో జరిగిన 75వ గణతంత్ర వేడుకలకు రక్షణ శాఖ నుంచి ఆహ్వానం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నుంచి గుర్తింపు పత్రం, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం దక్కడం మధురానుభూతిని కలిగించింది. సాక్షి: మీ కుటుంబ నేపథ్యంఆకర్షణ: తండ్రి సతీష్ హెల్త్‌కేర్ కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తుండగా, తల్లి ప్రవిత గృహిణి. సనత్‌నగర్ లోధా అపార్ట్మెంట్లో ఉంటాం.సాక్షి: ఇప్పటివరకూ ఎన్ని పుస్తకాలు సేకరణ చేశారు? ఎలా సేకరిస్తారుఆకర్షణ: ఇప్పటివరకూ 9,536 పుస్తకాలను సేకరించాను. ఇందులో 8000 పుస్తకాలు ఇతరులు డొనేట్ చేసినవే. అపార్ట్మెంట్ల నివాసితులు, క్లాస్మేట్స్, బంధువుల కుటుంబాల నుంచి సేకరిస్తుంటాను. వారంతా చదివేసిన అనంతరం తమ వద్ద ఉన్న పుస్తకాలు నాకు అందజేస్తుంటారు. వాటిని కలుపుకుని స్వతహాగా నేను కొనుగోలు చేసిన కొన్ని పుస్తకాలతో లైబ్రరీలను ఏర్పాటు చేశాను. -
సెయిలింగ్ సిస్టర్స్..
ఒడ్డున చేరే అలల్లాంటివి వారి జీవితాలు.. ఐనప్పటికీ ఎగిసిపడే కెరటాల్లా తెరచాపలై దూసుకపోతోంది వారి చైతన్యం. చాలామందికి సెయిలింగ్ అంటే ఏంటో కూడా సరిగా తెలియని తరుణంలో.. ఇదే సెయిలింగ్‌లో నేషనల్ చాంపియన్లుగా నిలుస్తున్నారు ఆ అక్కాచెల్లెళ్లు.. పేదరికం అడ్డంకి కాకుండా యాచ్ క్లబ్ అందిస్తున్న సహకారంతో రసూల్‌పుర ఉద్భవ్ స్కూల్లో 8, 10 తరగతులు చదువుతున్న కొమరవెల్లి దీక్షిత, కొమరవెల్లి లాహరిలు టాప్ సెయిలింగ్ సిస్టర్స్‌గా రాణిస్తున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో విజేతలుగానే కాకుండా భారత్ తరపున విదేశాల్లోనూ సెయిలింగ్ పోటీల్లో పాల్గొంటూ దేశ కీర్తికి భవిష్యత్ వారధులుగా నిలుస్తున్నారు. వివిధ క్రీడల్లో నగరానికి చెందిన సానియా మీర్జా, సైనా నెహా్వల్, పీవీ సింధూ, నిఖత్ జరీనా రాణించినట్టే.. రానున్న కాలంలో సెయిలింగ్ క్రీడకూ ఈ అక్కాచెల్లెళ్లు కేరాఫ్ అడ్రస్‌గా మారతారేమో.. ముంగ్గురు ఆడపిల్లలున్న కుటుంబం అది. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితులు.. సామాన్య జీవనమే గగనమైన తరుణంలో అనితర సాధ్యమైన సెయిలింగ్ పోటీల్లో చాంపియన్లుగా నిలుస్తున్నారంటే ఆ అక్కా చెళ్లెల్ల ఆత్మ స్థైర్యమేంటో ఊహించవచ్చు. వీరి సామర్థ్యాలను గుర్తించిన నగరంలోని యాచ్ క్లబ్ వ్యవస్థాపకులు సుహేమ్ షేక్ వారి విద్యతో పాటు సెయిలింగ్ శిక్షణకు సహాకారం అందిస్తున్నారు. అందివచి్చన సహకారాన్ని వినియోగించుకుంటూ.. ఈ హైదరాబాదీ సెయిలర్లు జాతీయ స్థాయిలో పతకాల పంట పండించారు. సౌత్ కొరియా, భారత్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో దీక్షిత కొమురవెళ్లి పోటీపడింది. ప్రస్తుతం లండన్ వేదికగా జరుగుతున్న మరో అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో పతకం కోసం పోరాడుతోంది. ఈ మధ్యనే జరిగిన ఓ ప్రమాదంలో చెయి విరగడంతో లండన్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ పోటీలకు వెళ్లలేకపోయానని లహరి బాధను వ్యక్తం చేసింది. అయితే కొన్ని రోజుల క్రితమే నగరం వేదికగా జరగిన 15వ మాన్సూన్ రెగట్టా పోటీల్లో అదే గాయంతోనే పోటీ చేసి అందరి ప్రశంసలను పొందింది చెల్లి. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న మొదటమ్మాయి కూడా సెయిలింగ్‌లో ప్రవేశముంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సెయిలింగ్‌ను కొనసాగించలేకపోయిందని తల్లి కవిత తెలిపింది. పిల్లల చదువులు, సెయిలింగ్ శిక్షణతో పాటే తనకు కూడా యాచ్ క్లబ్ ఆధ్వర్యంలో వంట వండటానికి ఉద్యోగమిచ్చి ఉపాధి అవకాశాన్ని కల్పించారని సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీక్షిత విజయాలు–పతకాలుకాంస్యం– అప్టిమిస్ట్ బాలికల విభాగం వైఏఐ జూనియర్ నేషనల్స్ 2022. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం 14వ మాన్సూన్ రెగట్టా 2023. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం వైఏఐ 3వ సికింద్రాబాద్ క్లబ్ యూత్ రెగట్టా 2023. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికలవిభాగం వైఏఐ యూత్ నేషనల్స్ 2023. వెండి పతకం– ఆప్టిమిస్ట్ వైఏఐ జూనియర్ నేషనల్స్ 2023. వెండి పతకం– ఆప్టిమిస్ట్ బాలికల విభాగం వైఏఐ జూనియర్ నేషనల్స్ 2023. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం సెయిల్ ఇండియా 2024. వెండి పతకం– ఆప్టిమిస్ట్ 2వ వైఏఐ నార్త్ ఈస్ట్ రెగట్టా 2024. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం 2వ వైఏఐ నార్త్ ఈస్ట్ రెగట్టా 2024. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం వైఏఐ 4వ సికింద్రాబాద్ క్లబ్ యూత్ రెగట్టా 2024. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం 15వ మాన్సూన్ రెగట్టా 2024.లహరి విజయాలు–పతకాలు..బంగారు పతకం– ఆప్టిమిస్ట్ బాలికల విభాగం, మొదటి వైఏఐ నార్త్ ఈస్ట్ రెగట్టా 2023. వెండి పతకం– ఆప్టిమిస్ట్ బాలికల విభాగం, వైఏఐ 3వ సికింద్రాబాద్ క్లబ్ యూత్ రెగట్టా 2023. కాంస్యం– ఆప్టిమిస్ట్ వైఏఐ యూత్ నేషనల్స్ 2022. కాంస్యం– ఆప్టిమిస్ట్ 2వ వైఏఐ నార్త్ ఈస్ట్ రెగట్టా 2024. వెండి పతకం– ఆప్టిమిస్ట్ బాలికల విభాగం 2వ వైఏఐ నార్త్ ఈస్ట్ రెగట్టా 2024.ప్రతిష్ఠాత్మక సెయిలింగ్ పోటీల్లో జాతీయ స్థాయి పతకాలు.. లండన్, కొరియాలో దీక్షిత, నేషనల్స్‌లో లహరి రాణింపు.. విద్య, సెయిలింగ్‌లో యాచ్ క్లబ్ సహాయం -
మాస్ డ్యాన్సర్.. పోలకి విజయ్
ఊ అంటావా...మార్ ముంత వరకూ అనేక హిట్ సాంగ్స్‌కి మాస్ స్టెప్పులు ఏజాస్ మాస్టర్ పరిచయంతో ఇండస్ట్రీకి రణ్వీర్ కపూర్ బాగా ప్రోత్సహించారు ‘సాక్షి’తో కొరియోగ్రాఫర్ పోలకి విజయ్ పుష్ప–1 లో ఊ అంటావా మావా... ఊహూ అంటావా మావ.. పుష్ప–2 లో పుష్ప.. పుష్ప.. పుష్ప రాజ్.. డబుల్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో మార్ముంత చోడ్ చింత.. మ్యాడ్ చిత్రంలో కళ్లజోడు కాలేజీపాప.. కాలేజ్ పోతున్నది.. కోట బొమ్మాళి చిత్రంలోని లింగిడి, లింగిడి.. ఇలాంటి పాటలు వింటుంటే స్టెప్పులు వేయాలనే ఆలోచన తప్పక వస్తుంది.. అలాంటి పాటలకు కొరియోగ్రఫీ చేసింది ఎవరో కాదు.. మన తెలుగబ్బాయే.. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు.. కష్టేఫలి అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని టాలీవుడ్ టు బాలీవుడ్‌కు పాగా వేసిన మన తెలుగు కొరియోగ్రాఫర్ పోలకి విజయ్ డెడికేషన్‌కి టాలీవుడ్ అగ్రహీరోలు ఫిదా అవుతున్నారు. స్టెప్పులు వేస్తే.. క్లాస్ టు మాస్ జనాలు ఉర్రూతలూగేలా చేస్తున్న పోలకి విజయ్ జీవితం ఓ ఇన్స్పిరేషన్లా ఉంటుంది.. ఈ నేపథ్యంలో విజయ్ ‘సాక్షి’తో పంచుకున్న పలు ఆసక్తికర విషయాలు. నేను పుట్టింది శ్రీకాకుళం జిల్లా పలాస. చిన్నతనంలోనే అమ్మ నాన్మ చనిపోయారు. అమ్మమ్మ, తాతమ్మల దగ్గరే పెరిగాను. చిన్నతనం నుండే నటన అంటే ఇష్టం. ఆర్టిస్ట్ అవుదామనే కల ఉండేది. కానీ డ్యాన్స్‌లు సైతం బాగా వేసేవాడిని. అలా నటన, డ్యాన్స్‌లలో స్వతహాగా మంచి ప్రావీణ్యం సంపాదించుకున్నాను. అమ్మమ్మ, తాతయ్యలకు భారం కాకూడదని బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాను. కానీ ఇక్కడ ఎవరూ తెలియదు. ఎవరిని కలవాలో తెలియదు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ.. కషే్టఫలి అనేది నమ్మాను. ఎన్నికష్టాలు వచి్చనా నా ప్రయాణాన్ని ఆపలేదు. పనులు చేస్తూ జీవనం గడుపుతూ అక్కడక్కడా నాకు తెలిసిన డ్యాన్స్‌లు వేసేవాడిని.ఏజాస్ మాస్టర్ పరిచయం..పని, డ్యాన్స్‌లు తప్ప వేరే వ్యాకపం ఉండేది కాదు.. అలా నా అభిలాషను మెచ్చి ఓ అజ్ఞాతవ్యక్తి ఓ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి తీసుకువెళ్లాడు. ఏజాస్ మాస్టర్ స్వర్ణలత మాస్టర్ అసిస్టెంట్. అలా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో చేరాను. చాలా మెళకువలు నేర్చుకున్నాను. నన్ను ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్లిన ఆ అజ్ఞాతవాసి మరలా కనిపించలేదు.డ్యాన్సర్‌గా ఇండస్ట్రీకి..డ్యాన్స్‌లో మంచి పట్టు సాధించాక 2015లో తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కార్డ్‌ను తీసుకున్నాను. సినిమాల్లో డ్యాన్సర్‌గా చేసే సమయంలో తోటిడ్యాన్సర్స్ నీలో మంచి టాలెంట్ ఉంది. కొరియోగ్రాఫర్‌గా చేయమని సలహా ఇచ్చారు. కొన్ని డ్యాన్స్ విడియోస్ చేశాక ‘బేబి’ చిత్ర దర్శకుడు సాయిరాజేష్ నిర్మాణంలోని సంపూర్ణే‹Ùబాబు ‘కొబ్బరిమట్ట’ చిత్రంలో అవకాశం వచి్చంది. ఆ తర్వాత నేను పుట్టిన పలాస పేరుతో కరుణసాగర్ దర్శకత్వంలోని ‘పలాస’ చిత్రంలో నాదీ నక్కిలీసు గొలుసు పాటకు కొరియోగ్రఫీ చేశాను. ఈ పాటకు మంచి పేరు వచి్చంది. అలా కొరియోగ్రాఫర్‌గా స్థానాన్ని నిలబెట్టుకున్నాను.పుష్పతో మరోమెట్టు.. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఊ అంటావా పాటకు కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో కలిసి చేశాను. ఈ పాట దేశంతోపాటు అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది. పుష్ప–2లో పుష్ప, జాతర పాటకూ కొరియోగ్రఫీ చేశాను. రవితేజ, శర్వానంద్, విజయ్‌దేవరకొండ, నాని చిత్రాలకు కొరియోగ్రఫీ చేశాను. రీసెంట్ రామ్ ‘డబుల్ ఇస్మార్ట్‌శంకర్’లో మార్ముంత చోడ్చింతకు కోరియోగ్రఫీ చేశా. యూట్యూబ్‌లో సంచలనంగా మారింది. బాలీవుడ్లో అవకాశం.. హీరో రణ్వీర్ కపూర్ నటిస్తున్న ‘తు ఝూతీ మైన్ మక్కర్’ చిత్రంలోని పాటకు కొరియోగ్రఫీ చేశాను. రణ్వీర్ కపూర్ బాగా ప్రోత్సహించారు. అంతేకాకుండా నాకు నచి్చన బెస్ట్ మాస్టర్ లారెన్స్ మాస్టర్‌కి ‘రుద్రుడు’ చిత్రంలో కొరియోగ్రఫీ చేశాను. ఈ అనుభవం జీవితంలో మరువలేనిది.చిరంజీవికి కొరియోగ్రఫీ నా ఆశయంచిన్నతనం నుండి నా గాడ్‌ఫాదర్ చిరంజీవి. ఆయన డ్యాన్సులు చూసి పెరిగాను. ‘ఇంద్ర’ చిత్రాన్ని 22సార్లు చూశాను. కేవలం దాయి దాయి దామ్మ పాట కోసమే చూశాను. ఆ పాటకు కొరియోగ్రఫీ చేసిన లారెన్స్ మాస్టర్‌కి కొరియోగ్రఫీ చేయడం సంతోషంగా ఉంది. కానీ నా గాడ్‌ఫాదర్ చిరంజీవికి కొరియోగ్రఫీ చేయాలన్నది నా ఆశయం. ఆ దిశగా ఆడుగులు వేస్తున్నాను. డ్యాన్స్‌పై ఇష్టంతో ఈ స్థాయికి వచ్చాను. గుర్తుండిపోయే కొరియోగ్రాఫర్‌గా ప్రజల మదిలో ఉంటూ మరో లక్ష్యం దిశగా నా ప్రయాణాన్ని కొనసాగించి విజయాన్ని సాధిస్తాను. మీ దీవెనలే నాకు కొండత బలమని నమ్ముతూ.. అందరికీ నా కృతజ్ఞతలు.. -
29న శివశంకరికి ‘సినారే’ పురస్కారం!
గన్‌ఫౌండ్రీ: జ్ఞాన్‌పీఠ్ పురస్కార గ్రహిత పద్మభూషణ్ డాక్టర్ సి.నారాయణరెడ్డి 93వ జయంతిని పురస్కరించుకుని ప్రముఖ తమిళ రచయిత్రి శివశంకరికి ఈ నెల 29న విశ్వంభర సినారే జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.ఈ విషయాన్ని సుశీల నారాయణరెడ్డి ట్రస్టు ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, శాంతా బయోటిక్ ఎండి డాక్టర్ కేఐ వరప్రసాద్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి రచించిన పుస్తకావిష్కరణ, నృత్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.ఇవి చదవండి: పదునైన రచయిత పసునూరి.. -
చిరుధాన్యాలతో.. విఠల్ చిత్రాలు!
ముప్పిడి విఠల్ ఓ ల్యాండ్ స్కేప్ ఆర్టిస్ట్. కొన్ని సంవత్సరాలుగా రాంనగర్లో ఓ ఆర్ట్ గ్యాలరీని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కార్పొరేట్ విత్తన సంస్థ విఠల్‌ను సంప్రదించింది. సంస్థకు చెందిన కీలక వ్యక్తి ఉద్యోగ విరమణ పొందుతున్నారు. అతడికి గతంలో ఎవరూ ఇవ్వని ప్రత్యేకమైన జ్ఞాపికను ఇవ్వాలనుకుంటున్నాము చేసి పెట్టగలరా అని అడిగారు. దీనికి మీ సంస్థ నేచర్ ఆఫ్ వర్క్ ఏమిటి? అని అడిగాడు విఠల్. దీనికి బదులుగా విత్తనాలు అమ్మే సంస్థ అని చెప్పారు. వెంటనే చేసి పెడతాను అతడి ఫోటో ఒకటి నాకు ఇవ్వండి అని చెప్పారు. అలా స్కెచ్ ఆర్టిస్ట్ నుంచి చిరుధాన్యాల ఆర్టిస్ట్‌గా మారాడు విఠల్.. ఆ వివరాలు తెలుసుకుందాం.. – ముషీరాబాద్స్వతహాగా రైతు కుటుంబం నుంచి రావడం, సంస్థ కూడా విత్తనాలు అమ్మేది కావడం, విఠల్ కూడా గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే ఆర్టిస్ట్ కావడంతో వారు చెప్పగానే వెంటనే కనెక్ట్ అయ్యాడు. విత్తనాలతోనే అతడి బొమ్మను గీసి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. వడ్లు, పెసర్లు, మినుములు, కందులు, జోన్నలు వంటి చిరుధాన్యాలే వస్తువులుగా వాడి సుమారు 15 రోజుల పాటు కష్టపడి అందమైన ఫొటోను తయారు చేసి ఇచ్చాడు. దీంతో ఈ ఫొటో వారిని అమితంగా ఆకట్టుకుంది. దీంతో ఆ సంస్థకు ఆస్థాన ఆర్టీస్టుగా మారిపోయాడు.మలుపుతిప్పిన హర్షాబోగ్లే పెయింటింగ్..ఆ తరువాత సంస్థ ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షాబోగ్లే సన్మాన కార్యక్రమంలో ఆయనకు కూడా ఇటువంటి వర్క్‌తో ఫొటో చేయించారు. దానికి ముఖ్య అతిథిగా హాజరైన సెంట్రల్ డైరెక్టర్ జనరల్, హర్షబోగ్లేలు ఈ ఫొటోను చూసి ఎంతో ముగ్ధులయ్యారు. ఆ తరువాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు ఇదే తరహా ఫొటోను ప్రజెంట్ చేయడంతో ఆయన కూడా ముగ్ధుడై ఇదే తరహాలో ప్రధాని నరేంద్రమోడీకి కూడా వేయాలని విఠల్‌ను కోరారు.యూపీలోని గోరఖ్‌పూర్‌లో కిసాన్ సమాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మోడీకి అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ ముప్పిడి విఠల్ పెయింటింగ్నే జ్ఞాపికగా అందజేయడం దానికి మోడీ ముగ్ధుడవ్వడం గమనార్హం. ఆ తరువాత ఎలాగైనా మోడీని కలవాలనుకున్న విఠల్ మరో బొమ్మను వేసి ఇటీవల ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో స్వయానా అందజేశారు. అలాగే రైతు బంధు స్కీమ్ ప్రకటించిన సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్కూ ఈ పెయింటింగ్ స్వయంగా అందజేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెయింటింగ్‌ను తయారు చేస్తున్నారు.ఎలా వేస్తారు?మొదటగా పెన్సిల్తోచిత్రం ఔట్ లైన్ గీసుకుని వాటిపై ఫెవికాల్ రాస్తు ఒక్కొ వడ్ల గింజను పేర్చుతాడు. శరీర రంగును బట్టి ఏ విత్తనమైతే అక్కడ సరిపోతుందో దాన్ని పేర్చుకుంటూ సైజు చూసుకుంటూ పెయింటింగ్ వేస్తాడు. అప్పుడే చిత్రం ఎలా ఉంటుందో అలా రూపుదిద్దుకుంటుంది. ఒక్కో పెయింటింగ్ వేయడానికి 15–20 రోజుల సమయం పడుతుంది. అభిమానంతో మోడీ, కేసిఆర్లకు మాత్రమే ఉచితంగా పెయింటింగ్ వేసి ఇచ్చారు. ఇవి ప్రస్తుతం 30–40 వేల వరకూ విక్రయిస్తున్నారు.ఇదీ నేపథ్యం..మెదక్ జిల్లాకు చెందిన ముప్పిడి విఠల్ తెలుగు యూనివర్సిటీలో బీఎఫ్‌ఏలో పట్టాపొందారు. ల్యాండ్ స్కేప్ పెయింటింగ్స్ వేయడంలో దిట్ట. రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన విఠల్ ఆ వాతావరణంతోనే స్ఫూర్తి పొందారు. 30 సంవత్సరాల నుంచి ఇదే రంగంలో ఉంటూ గ్రామీణ వాతావరణాన్ని పల్లెల్లో మనకు కనపడే దృశ్యాలను కనులకు కట్టినట్లు తన పెయింటింగ్స్ ద్వారా చూయించడం అతడి గొప్పతనం. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌తో పాటు పలు జాతీయ ఆర్ట్ ఎగ్జిబిషన్లలో తన ల్యాండ్ స్కేప్స్‌ను ప్రదర్శనకు పెట్టి అందరి మనన్నలూ పొందారు. పలు జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులను అందుకున్నారు.చిరుధాన్యాల చిత్రాలు నా గుర్తింపు..సహజంగా నేను ల్యాండ్ స్కేప్ ఆర్టిస్ట్‌ని. ఇదే నా జీవితం. కానీ చిరుధాన్యాలతో వేసిన చిత్రాలే గుర్తింపు తెచ్చాయి. నగరంలో ఎంతో మంది పేరుమోసిన ఆర్టిస్టులు తమ చిత్రాల ద్వారా లక్షలు, కోట్లల్లో సంపాదించిన వారు ఉన్నారు. కానీ నా చిత్రం ద్వారా ప్రధానమంత్రి వరకూ వెళ్లగలిగిన వారిలో నేను ఒక్కడినే. ఈ చిత్రాలే నాకు గుర్తింపు తెచ్చాయి. చిత్రాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాను. – ముప్పిడి విఠల్, ల్యాండ్ స్కేప్ ఆర్టిస్ట్ -
నగరవాసుల్లో 'నోమో ఫోబియా'
ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి అదే మరో చేత్తో మనల్ని తన గుప్పిట్లోకి తెచ్చేసింది స్మార్ట్‌ఫోన్. అయితే సరికొత్త ధైర్యాలతో పాటు భయాలను కూడా మనకు చేరువ చేస్తోంది. సరదాలను తీర్చడంతో పాటు సమస్యలనూ పేర్చేస్తోంది. రోజంతా ఫోన్‌తోనే గడిపే స్మార్ట్ ఫోన్ ప్రియుల్లో నోమో ఫోబియా అనే సరికొత్త అభద్రతా భావం పెరుగుతోందని ఒప్పో కౌంటర్‌పాయింట్ చేసిన అధ్యయనం వెల్లడించింది.ఈ ఫోబియా తీవ్రతను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లోని 1,500 మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులపై ఈ అధ్యయనం జరిగింది. అదే విధంగా నోమోఫోబియా అంటే నో మొబైల్ ఫోన్ ఫోబియా అంటే... మొబైల్ ఫోన్ నుంచి దూరం అవుతానేమో అనే భయంతో పుట్టే మానసిక స్థితి అని జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్‌లో ప్రచురించబడిన అధ్యయనం పేర్కొంది. మొబైల్ ఫోన్ ల మితిమీరిన వినియోగం వల్ల సంభవించే మానసిక రుగ్మతల్లో ఇది ఒకటిగా తేలి్చంది. – సాక్షి, సిటీబ్యూరోఅప్పటిదాకా చేతిలోనే ఉన్న పోన్ కాసేపు కనబడకపోతే లేదా దూరంగా ఉంటే చాలు.. నా ఫోన్ ఏది? ఎక్కడ ఉంది? ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలిగా... అంటూ ఆందోళనగా, అసహనంగా, గాభరాపడిపోవడం అలాగే ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఆగిపోతుందేమో అనే కంగారుపడేవాళ్లని చాలా మందినే మనం చూస్తున్నాం. అయితే వారిలో ఇది చూడడానికి సాధారణ సమస్యగా కనిపిస్తున్నా.. అది సాధారణం కానే కాదని, ఆ సమయంలో కలిగే భయాందోళనలు తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యగా మారే ప్రమాదం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.కారణం ఏదైనా సరే.. మన ఫోన్‌కు కొద్దిసేపైనా సరే దూరంగా ఉండాలనే ఆలోచన ఎవరికైతే ఆందోళన కలిగిస్తుందో.. తరచుగా తమ ఫోన్‌ను తరచి చూసుకోవడం వంటి లక్షణాలతో నోమో ఫోబియా బాధితులుగా మారే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఇది ప్రతీ నలుగురు స్మార్ట్ ఫోన్ ప్రియుల్లో ముగ్గురిని ప్రభావితం చేస్తోందని, నగరాలు/ గ్రామాలు తేడా లేకుండా ఇది దాదాపు 75 శాతం జనాభాపై దాడి చేస్తోందని అధ్యయన నిర్వాహకులు అంటున్నారు. మితమే హితం..డిజిటల్ అక్షరాస్యత అందరికీ అలవడాలి. బాధ్యతాయుతమైన స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని ప్రోత్సహించడం అవసరం. సమస్య ముదిరితే అంతర్లీన ఆందోళన లేదా డిపెండెన్సీ సమస్యలను పరిష్కరించడానికి కాగ్నిటివ్–బిహేవియరల్ థెరపీ, కౌన్సెలింగ్ అవసరం కావచ్చు. స్మార్ట్‌ఫోన్ వినియోగంపై పరిమితులను సెట్ చేయాలి. అంటే ‘టెక్–ఫ్రీ’ సమయాలు లేదా ప్రాంతాలు వంటివి. శారీరక శ్రమ మానసికోల్లాసం కలిగించే ఆఫ్‌లైన్ కార్యకలాపాలు వంటి హాబీల్లో పాల్గొనడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.ఆరోగ్యంపై దు్రష్పభావం.. నోమోఫోబియాతో ఆందోళన, శ్వాసకోశ మార్పులు, వణుకు, చెమట, ఆందోళన, అయోమయ స్థితి వగైరాలు కలుగుతున్నాయి. అలాగే నిద్రలేమి, ఏకాగ్రత లేమి, నిర్లక్ష్యాన్ని ప్రేరేపించి వ్యక్తిగత సంబంధాలను విస్మరించేలా చేస్తుంది. కారణం ఏదైనా సరే.. స్మార్ట్ఫోన్లపై అతిగా ఆధారపడటం వల్ల ముఖ్యమైన అప్డేట్లు, సందేశాలు లేదా సమచారాన్ని కోల్పోతారనే భయంతో వ్యక్తులు ఈ ఫోబియాకు గురవుతున్నారు.అధ్యయన విశేషాలివీ..– నో మొబైల్ ఫోబియానే షార్ట్ కట్లో ‘నోమో ఫోబియా‘గా పేర్కొంటున్నారు. ఇది వర్కింగ్ కండిషన్లో ఉన్న మొబైల్ ఫోన్ దగ్గర లేకపోవడం వల్ల కలిగే భయం లేదా ఆందోళనను సూచిస్తుంది.– అధ్యయనంలో పాల్గొన్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో 65 శాతం మంది తమ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతున్నప్పుడు రకరకాల మానసిక అసౌకర్యాలకి గురవుతున్నారని అధ్యయనం తేలి్చంది. ఆ సయమంలో వీరిలో ఆందోళన, ఆత్రుత, డిస్కనెక్ట్, నిస్సహాయత, అభధ్రత భావాలు ఏకకాలంలో ముప్పిరిగొంటున్నాయని వెల్లడించింది. అంతేకాకుండా బ్యాటరీ పనితీరు సరిగా లేదనే ఏకైక కారణంతో 60 శాతం మంది తమ స్మార్ట్ఫోన్లను రీప్లేస్ చేయబోతున్నారని అధ్యయనం వెల్లడించింది.– ఈ విషయంలో మహిళా వినియోగదారుల (74 శాతం మంది)తో పోలిస్తే పురుష వినియోగదారులు (82 శాతం మంది) ఎక్కవ సంఖ్యలో ఆందోళన చెందుతున్నారని అధ్యయనంలో తేలింది.– ఫోన్ ఆగకూడదనే ఆలోచనతో 92.5 శాతం మంది పవర్–సేవింగ్ మోడ్‌ను ఉపయోగిస్తున్నారని, 87 శాతం మంది తమ ఫోన్లను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు సైతం ఉపయోగిస్తున్నారని తేలి్చంది.– ‘ముఖ్యంగా 31 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వారిలో బ్యాటరీ గురించిన ఆందోళన ఎక్కువగా ఉంది. తర్వాత స్థానంలో 25 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల వారు ఉన్నారు’ అని రీసెర్చ్ డైరెక్టర్, తరుణ్ పాఠక్ చెప్పారు.సాంకేతికత రోజువారీ జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నందున, నోమోఫోబియా, దాని అనుబంధ సవాళ్లను పరిష్కరించడం ఒక క్లిష్టమైన అంశం కాబోతోంది. ఆరోగ్యకరమైన సాంకేతికత అలవాట్లను పెంపొందించడం స్మార్ట్ఫోన్లతో కాకుండా వ్యక్తుల మ«ధ్య సంబంధాలను శక్తివంతం చేయడం వంటివి నోమోఫోబియా ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తాయి. -
పదునైన రచయిత పసునూరి..
భాగ్యనగరంలో స్థిరపడిన పసునూరి రవీందర్, ఉద్యమాల పురిటిగడ్డ వరంగల్ జిల్లాలో కూలి పనులు చేసుకొని బతికే వరమ్మ, వీరస్వామి దంపతుల మొదటి సంతానం. చిన్ననాటి నుంచి చదువే లోకంగా ఎదిగి, విద్యార్థి సంçఘాల్లో నాయకునిగా, గాయకునిగా పేరు తెచ్చుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ తెలుగులో గోల్డ్ మెడల్ సాధించాడు.అనంతరం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్య పిల్లలమర్రి రాములు పర్యవేక్షణలో ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు సాహిత్య విమర్శ అన్న అంశంపై ఎంఫిల్, తెలంగాణ ఉద్యమపాట– ప్రాదేశిక విమర్శ అన్న అంశంపై పీహెచ్డీ, అలాగే పీహెచ్డీ అనంతరం పరిశోధనలో భాగంగా అస్తిత్వ ఉద్యమాల సాహిత్య విమర్శపై పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ చేశారు. డాక్టరేట్ పట్టాను అందుకున్న పసునూరి సాహిత్య కృషి కూడా ఎంతో స్ఫూర్తివంతమైంది.పసునూరి రచనలు..లడాయి (ధీర్ఘ కవిత), అవుటాఫ్ కవరేజ్ ఏరియా (తెలంగాణ దళిత కథా సంపుటి), తెలంగాణ ఉద్యమ పాట–ప్రాదేశిక విమర్శ(పరిశోధన గ్రంథం), ఇమ్మతి (సాహిత్య విమర్శ వ్యాసాలు), గ్లోబలైజేషన్ సాహిత్య విమర్శ(పరిశోధన గ్రంథం), ఒంటరి యుద్ధభూమి (కవిత్వం), పొటెత్తిన పాట (పాటకవులపై వ్యాసాలు), కండీషన్స్ అప్లయ్ (కథా సంపుటి).కేంద్ర సాహిత్య అకాడమీ యువ తొలి పురస్కార గ్రహిత..కొంతమందికి అవార్డుల ద్వారా పేరొస్తుంది. మరికొందరి వల్ల అవార్డులకే పేరొస్తుంది.. ఈ రెండో కోవకి చెందిన వారే యువ రచయిత డాక్టర్ పసునూరి రవీందర్. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న తొలి తెలంగాణ రచయిత. అప్పటి వరకూ ఇలాంటి ఓ అవార్డు ఉందన్న విషయం సాహితీలోకంలో చాలా మందికి పెద్దగా తెలియదు. కవిగా, రచయితగా, విమర్శకునిగా, వాగ్గేయకారునిగా, వక్తగా, సామాజిక ఉద్యమకారునిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా కృషి అతడి సొంతం. గడిచిన రెండున్నర దశాబ్దాలుగా సాహిత్యానికి అంకితమై సాగుతున్న పసునూరి రవీందర్ స్ఫూర్తి కథనం ‘సాక్షి’ పాఠకుల కోసం...– సుందరయ్య విజ్ఞాన కేంద్రంబాల కళాకారునిగా.. మొదట బాల కళాకారునిగా పాటతో మొదలైన తన పయనం, అనతికాలంలోనే కవిత్వం మీదికి మళ్లింది. ఆ తరువాత కథల్లోకి చేరింది. అలా తాను రాసిన కథలను అవుటాఫ్ కవరేజ్ ఏరియా పేరుతో పుస్తకంగా ప్రచురించాడు. ఈ పుస్తకానికే కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. తాను తెలంగాణ పాటపై చేసిన పరిశోధనకు తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ వారితో సురవరం ప్రతాపరెడ్డి పురస్కారం లభించింది. ఇక సాహిత్య విమర్శపై మక్కువతో తాను రాసిన వ్యాసాలను కలిపి ఇమ్మతి, గ్లోబలైజేషన్ సాహిత్య విమర్శ, పొటెత్తిన పాట వంటి పుస్తకాలను ప్రచురించారు.సినిమా రంగంలోనూ..ఇటీవల సినిమా రంగంలోనూ అడుగుపెట్టిన పసునూరి ప్రముఖ నిర్మాత రాఘవేందర్రావు సారథ్యంలో వచి్చన సర్కార్ నౌకరోడు సినిమాలో చక్కని పాట రాశాడు. అలాగే అక్షర కుమార్ డైరెక్షన్లో వచి్చన షరత్తులు వర్తిస్థాయి సినిమాలోనూ మరో పాటను అందించాడు.అవార్డులు, పురస్కారాలు..– కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం (2015). – సురవరం ప్రతాపరెడ్డి అవార్డు (2015). – తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం (2020) – తెలంగాణ సారస్వత పరిషత్ ఉత్తమ గ్రంథ అవార్డు (2024)– భారతీయ దళిత సాహిత్య అకాడామీ సాహిత్య రత్న (2018) – గూడ అంజయ్య స్మారక పురస్కారం (2019). – సుద్దాల హన్మంతు పురస్కారం (2019). – నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాష్వా పురస్కారం (2015)– గిడుగు పురస్కారం (2017)– కాళోజీ జాతీయ పురస్కారం (2020)లతో పాటు సుమారు 25పైగా అవార్డులు, పురస్కారాలు పొందారు. -
ఆయేషా.. వారెవ్వా..!
సాక్షి, హైదరాబాద్: రష్యాలోని ఉలియనోస్క్ సిటీలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల యూత్ మినిస్టర్స్ సదస్సులో భారత్‌తోపాటు వివిధదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై పలువురు తమ ఆలోచనలు పంచుకుంటున్నారు. అప్పుడే ఒకమ్మాయి లేచి నిల్చుంది. తన మదిలో మెదులుతున్న భావనలను వేదికపై నిలబడి సగర్వంగా చాటిచెప్పింది. ఆమె చెప్పిన మాటలకు అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టి ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె పేరే షేక్ ఆయేషా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న ఆయేషా దేశం తరఫున బ్రిక్స్ సదస్సులో ప్రతినిధిగా పాల్గొన్న ఏౖకైక తెలుగమ్మాయి కావడం విశేషం.పెందుర్తి టు సెంట్రల్ యూనివర్సిటీ ఏపీలోని గాజువాక జిల్లా పెందుర్తికి చెందిన మదీనాబీబీ– రెహ్మాన్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారిలో చిన్నకూతురు ఆయేషా. చిన్నప్పటి నుంచి చదువుతోపాటు సామాజిక చైతన్యంలో ఆయేషా ముందుండేది. డిగ్రీ వరకు విశాఖపట్నంలో చదవగా, విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేసింది. మూడేళ్ల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సింథటిక్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీలో చేరింది.సామాజిక సమస్యలపై పోరాటం చదువుతోపాటు సామాజిక స్పృహ కూడా ఆయేషాకు ఎక్కువే. ఎప్పుడూ తన తోటి విద్యార్థులతో కలిసి హక్కుల కోసం గొంతుక వినిపించేది. ఇటీవల హెచ్‌సీయూలో జరిగిన స్టూడెంట్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. గెలుపోటములు పక్కన పెడితే విద్యార్థుల కోసం తాను ఉన్నానంటూ తెలియజెప్పడమే తన ధ్యేయమని ఆయేషా చెబుతోంది.ఐదు రోజుల సదస్సు.. ఈ నెల 22న రష్యాలో ప్రారంభమైన బ్రిక్స్ యూత్ సదస్సు శుక్రవారంతో ముగియనుంది. ఈ సదస్సులో సామాజిక సేవ విషయంలో బ్రిక్స్ దేశాల మధ్య ఎక్సే్చంజ్ ప్రోగ్రామ్ ఉంటే బాగుంటుందని ఆయేషా ప్రతిపాదించింది. సంస్కృతి, యువతనాయకత్వం, కమ్యూనిటీ సర్వీస్ విషయంలో వలంటీర్ వర్క్ ఎలా జరుగుతుందనే విషయాలను బ్రిక్స్ దేశాల యువత పరస్పరం పంచుకోవాలని చెప్పింది. దీనిపై సదస్సులో చర్చ జరిగిందని, బ్రిక్స్ దేశాలు మద్దతు ఇచ్చాయని ఆయేషా వెల్లడించింది. కేంద్ర యూత్ అఫైర్స్, స్పోర్ట్స్ సహాయమంత్రి రక్ష నిఖిల్ ఖడ్సే కూడా తనపై ప్రశంసలు కురిపించారని ఆమె పేర్కొంది. -
టేస్టీ.. నార్త్ఫుడ్..
ఓ వైపు మాన్సూన్ ముసుర్లతో నగరం తడిసి ముద్దవుతుంటే.. మరోవైపు నార్త్ ఇండియన్ ఫుడ్ఫెస్ట్లో స్పెషల్ డిషెస్ నగరవాసుల జిహ్వకు కొత్త రుచిని పరిచయం చేస్తున్నాయి. ఆనాటి నుంచి దక్కన్ నేల అంటేనే పసందైన రుచులు, మసాల వంటకాలకు నిలయం. అయినప్పటికీ కొత్త రుచులను ఆహ్వానించడంలో, ఆస్వాదించడంలో హైదరాబాద్ ఎల్లప్పుడూ ముందుంటుంది. దీనికి తగ్గట్టుగానే విభిన్న సంస్కృతులకు నిలయమైన నగరంలో దేశీయ వంటకాలతో పాటు కాంటినెంటల్ రెసిపీలకూ పెట్టింది పేరు. ఈ ఆనవాయితిలో భాగంగానే కొంగొత్త రుచులను ఇష్టపడే భాగ్యనగరంలో ఉత్తరాది వంటకాల ఘుమఘుమలు వెదజల్లుతున్నాయి. జూబ్లిహిల్స్‌లోని ఆలివ్ బిస్ట్రో అండ్ బార్ వేదికగా ప్రారంభమైన ఈ నార్త్ ఫుడ్ ఫెస్ట్ ఆగస్టు 31 వరకు కొనసాగుతుంది. ఢిల్లీకి చెందిన ప్రఖ్యాత చెఫ్ ధృవ్ ఒబెరాయ్, అవార్డ్ విన్నింగ్ మిక్సాలజిస్ట్ హరీష్ చిమ్వాల్ ఆధ్వర్యంలోని ఈ ప్రత్యేకమైన డైనింగ్ ఫుడ్ లవర్స్‌కు డెస్టినేషన్‌గా మారింది. స్పైసీ, మసాలాలు, బిర్యానీలు ఆస్వాదించే హైదరాబాద్‌లో పుల్లటి ఉసిరి, కచ్చ మామిడి సలాడ్ మొదలు హిమాలయన్ చీజ్ సౌఫిల్ వరకు వినూత్న రుచులు సందడి చేస్తున్నాయి. చెఫ్ ధ్రువ్ పాకశాస్త్ర నైపుణ్యంతో తయారు చేసిన జామూన్ ఊరగాయ, పొగబెట్టి వడ్డించిన వంకాయ లాబ్నేతో పాటు సిరోహి మటన్, క్వాయిల్ ఎగ్ కుఫ్తే మీట్‌బాల్స్ వంటి నోరూరించే వంటకాలు నగరానికి సరికొత్త ఆకలిని సృష్టిస్తున్నాయి. ఆహ్లాదమైన దుర్గం చెరువు అంచున బటర్నట్ స్క్వా–హరిస్సా, తాహినీ–సీబాస్, కటిల్ ఫిష్–పిసి వంటి ఆధునికత మిళితం చేసిన క్లాసిక్ వంటకాలు మరో లోకాన్ని పరిచయం చేస్తున్నాయి. వీటికి అద్భుత సమ్మేళనంలా హరీష్ చిమ్వాల్ అందిస్తున్న కాక్టెయిల్ మిక్సింగ్ మరో స్పెషాలిటి. ఎథీనా, హైబిస్కస్, రోసా టెక్, మొరాకన్ సోర్, కోకో బౌలేవార్డియర్ వంటి మిక్స్‌లు వెస్ట్రన్ బార్లను తలపిస్తున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ పాప్–అప్.. కొత్త రుచులను ఆస్వాదించడానికి నగరవాసులు విదేశాలకు లేదా ఉత్తరాది నగరాలకు వెళ్లాల్సిన శ్రమ లేకుండా.. ఆ రుచులే నగరానికి వచ్చాయి. ఈ హైదరాబాద్, ఢిల్లీ పాప్–అప్ మునుపెన్నడూ చూడని మంచి అనుభూతిని అందిస్తుంది. ఉత్తరాది వారు నగరంలో ఎంతో మంది ఉన్నారు. నార్త్ వంటకాలను ఇష్టపడే నగరవాసులు కూడా ఉన్నారు. – విజయ్ డేవిడ్ నిరంజన్, చెఫ్–ఆలివ్ బిస్ట్రో హైదరాబాద్.కొత్త రుచులే.. నా హాబీ.. మన సిటీలో నార్త్ డిషెస్ తినడం గొప్ప అనుభూతి. సాధారణంగా కొత్త కొత్త రుచుల కోసం విభిన్న ప్రాంతాలకు వెళ్తుంటాను. నా హాబీలో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతాల వంటకాలను రుచి చూశాను. ఐతే.. నార్త్ వంటకాలకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. స్థానిక వంటకాలతో పాటు వాటికి మోడ్రన్ హంగులను అద్దుతారు. ఈ ఫెస్ట్‌లో హిమాలయన్ చీజ్ జామూన్ భలే రుచిగా ఉంది. ఈ కొండ పైనుంచి దుర్గం చెరువు అందాలను తిలకిస్తూ తినడం మరచిపోలేని అనుభూతి. – కృతిక సనైన, జూబ్లిహిల్స్వావ్ హైదరాబాద్..హైదరాబాద్‌ను సందర్శించాలనే చికాల కోరిక ఈ విధంగా నెరవేరింది. నా దృష్టిలో సౌత్ఫుడ్ ఆరోగ్యకరమైంది.. నార్త్ ఫుడ్ రుచికరమైంది. ఈ ఫెస్ట్‌లో భాగంగా ఉత్తరాది రుచులను నగరవాసులు బాగా ఆస్వాదిస్తున్నారు. కాఫీ, రమ్‌లో నానబెట్టిన స్పాంజ్–మాస్కార్పోన్ ట్రిఫిల్ కొత్త అనుభూతినిస్తుంది. యువతరం టిరామిసు పిక్నిక్ బాస్కెట్లను ఇష్టంగా ఆరగిస్తున్నారు. దక్షిణాది ఆహారప్రియుడిగా నేను కూడా ఓల్డ్‌సిటీ రుచులకు ముగ్దుడినైపోయా.. షాగౌస్ బిర్యానీ రుచి వావ్ అనిపించింది. దేశంలోనే కాదు గ్లోబల్ వేదికగా కూడా ఈ నగరం ఫుడ్ ప్యారడైస్ అని చెప్పొచ్చు. ఇక్కడి సంస్కృతి, వ్యక్తిత్వాలు, ఆదరణ మరే నగరానికి సాటి రాదు. – ప్రఖ్యాత చెఫ్ ధృవ్ ఒబెరాయ్, ఆలివ్ బార్ అండ్ కిచెన్ న్యూఢిల్లీ -
దృష్టి లోపంతో మేధా క్షీణత
సాక్షి, హైదరాబాద్: మతిభ్రమణం, మేధా క్షీణత వంటి సమస్యల పరిష్కారానికి దృష్టి లోపాన్ని సవరించడం కీలక మార్గమని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనికి సంబంధించి నగరానికి చెందిన ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నిపుణుల సహకారంతో బీఎంజే ఓపెన్ యాక్సెస్ అనే శాస్త్రీయ పత్రికలో ప్రచురించిన విశ్లేషణ దృష్టి లోపం ఉన్న వృద్ధుల్లో మేధో సామర్థ్యాల వైకల్యం అధిక ప్రాబల్యాన్ని సూచిస్తుంది. ఈ అధ్యయనంలో భాగంగా నలుగురు వృద్ధుల్లో ఒకరు మేధో సామర్థ్యాల వైకల్యంతో జీవిస్తున్నారని తేలింది. వాస్తవానికి దృష్టి లోపం లేనివారితో పోలిస్తే దృష్టిలోపం ఉన్నవారికి మేధో సామర్థ్యాల వైకల్యం ఉండే అవకాశం 4 రేట్లు ఉంది. సమీప దృష్టి వైకల్యం (కళ్లద్దాలు లేకుండా ఫోన్, పుస్తకాలు చదవలేని స్థితి) కూడా మేధో సామర్థ్యాల వైకల్యానికి సంబంధం ఉంది. మహిళల్లో మేధో వైకల్యం అధికం.. నగరంలోని వృద్ధాశ్రమాల్లో ఉంటున్న 1,500 మందికి పైగా వృద్ధులపై జరిపిన ఈ అధ్యయనంలో 965 మందిని ఇందులో చేర్చారు. ఇందులో దాదాపు 27% మందికి మేధో సామర్థ్యాల వైకల్యం ఉందని వెల్లడైంది. తేలికపాటి దృష్టి లోపం ఉన్న వృద్ధుల్లో 30% కంటే తక్కువ మందికి మేధో సామర్థ్యాల వైకల్యం ఉండగా, దృష్టి వైకల్యం మరింత దిగజారుతున్న కొద్దీ ఈ శాతం క్రమంగా పెరుగుతుంది. అధ్యయనంలో అంధత్వం ఉన్నవారు 15 మంది ఉన్నారు. అందులో 60% మేధో సామర్థ్యాల క్షీణతను ప్రదర్శించారు. మహిళల్లో మేధో సామర్థ్యాల వైకల్య ప్రాబల్యం అధికంగా ఉంటుంది. పురుషులకంటే మేధో సామర్థ్యాల వైకల్యం మహిళలకు 2 రేట్లు ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం కనుగొంది. ఈ సందర్భంగా మేధో సామర్థ్యాల వైకల్యం తీవ్రరూపాలు మతిభ్రమణానికి (డిమెన్షియా) దారితీస్తాయని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ పరిశోధకులు డా.శ్రీనివాస్ మర్మముల పేర్కొన్నారు. ఈ పరిశోధనా పత్రం హైదరాబాద్ ఆక్యులర్ మోర్బిడిటీ ఇన్ ది ఎల్డర్లీ స్టడీ(హోమ్స్)లో భాగంగా ప్రచురించిన 16 పేపర్లలో ఒక భాగమని తెలిపారు. -
‘ఆహా గోదారి’కి నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డు
సాక్షి,హైదరాబాద్: ముంబై వేదికగా నిర్వహించిన నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్‌లో భాగంగా గేబో నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వరంలో నిర్మించిన ‘ఆహా గోదారి’ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా అవార్డు పొందింది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవార్డులను అందించారు. ఈ వేదికపై ఆహా ఏకంగా 13 అవార్డులను గెలుచుకుని దాని ప్రశస్తిని చాటుకుంది. హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో 48 విభాగాల్లో ఈ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ‘అన్‌స్టాపబుల్ సీజన్–2’తో ఉత్తమ నాన్–ఫిక్షన్ ఒరిజినల్ స్పెషల్ షోగానే కాకుండా ‘ఆహా’ ఉత్తమ ప్రాంతీయ వేదికగా టైటిల్‌ను పొందింది. వ్యక్తిగత విభాగంలో ‘అన్యాస్ ట్యుటోరియల్’ చిత్రానికి గాను విజయ్ కె.చక్రవర్తి ఉత్తమ సినిమాటోగ్రాఫర్ (సిరీస్) అవార్డును, ‘ఆహా గోదారి’కి గోపవాఝల దివాకర్ ఉత్తమ డాక్యుమెంటరీ ఒరిజినల్‌గా, ‘న్యూసెన్స్’లో కిరణ్ మామెడి ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ (సిరీస్)గా, ‘భామకలాపం–1’లో ప్రియమణి రాజ్ ఉత్తమ నటిగా, ఇదే చిత్రానికి అభిమన్యు తడిమేటి ఉత్తమ కథా పురస్కారాన్ని, అన్యస్ ట్యుటోరియల్, భామాకలాపం–1 చిత్రాలకు నివేదిత సతీ‹Ù, శరణ్య ప్రదీప్‌లు ఉత్తమ సహాయ నటులుగా తదితర అవార్డులను ఆహా గెలుచుకుంది. బెస్ట్ రీజినల్ ప్లాట్ఫామ్గానూ ఆహా సీఈఓ రవికాంత్ సబ్నవిస్–2 అవార్డులను పొందారు. -
ఆకలి తెలిసిన మనిషి..
ఆకలికి పేద, గొప్ప తారతమ్యం లేదు. దానికి అందరూ సమానమే.. సమయానికి పిడికెడు మెతుకులు పొట్టలో పడకపోతే అల్లాడిపోతాం. ఆ విలువ తెలిసిన వాడు కనుకే ఆయన ఆకలితో ఉన్న వారి కోసం ఆలోచిస్తారు. మానవ సేవే మాధవ సేవ అన్న మాటను బలంగా నమ్ముతూ సేవా మార్గంలో పయనిస్తున్నారు కందూరికృష్ణ. దానికి తాను సంపాదించిన దాంట్లో కొంత పేదల కోసం ఖర్చు చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 30 ఏళ్లుగా (మూడు దశాబ్దాలుగా) ఎంతో మంది ఆకలి తీరుస్తున్నారు. కందూరి కృష్ణ చిక్కడపల్లి నివాసి. స్థానికంగా శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. తనకు వచ్చే సంపాదనలో ఏటా సుమారు రూ.2 లక్షలకు పైగా సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారు. – సుందరయ్య విజ్ఞాన కేంద్రంఆకలితో అలమటించే వారిని ఆదుకోవడం కోసం సాటి మనిషిగా కందూరి కృష్ణ ప్రతినిత్యం పలు ఆలయాల వద్ద అల్పాహారంతో పాటు అన్నదానం చేస్తుంటారు. చిక్కడపల్లిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో యాచకులకు ప్రతిరోజూ ఉదయం అల్పాహారాన్ని అందిస్తారు. సమీప ప్రాంతాల్లోని ఆలయాల పరిసరాల్లో టిఫిన్ సెంటర్ల నిర్వహకులకు కృష్ణ ప్రతినెలా రూ.25 వేలు చెల్లిస్తారు. ఈ మేరకు టిఫిన్ సెంటర్ల నిర్వహకులు నిరుపేదలకు అల్పాహారాన్ని అందిస్తారు. అల్పాహారంతో పాటు అరటి పండ్లను పంపిణీ చేస్తారు. ప్రతిరోజూ తన నగల దుకాణం వద్ద ఉదయం 7 గంటలకు అల్పాహారంతో పాటు అరటి పండ్లను పంపిణీ చేస్తారు. ఇందులో పేదలతో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువకులు కూడా బారులు తీరుతూ అల్పాహారాన్ని అందుకుంటారు.30 ఏళ్లుగా షెడ్యూల్ ప్రకారం.. అప్పుడప్పుడు ఈ అల్పాహారాన్ని తీసుకుని ఉన్నత ఉద్యోగాల్లో చేరిన యువకులు కందూరి కృష్ణ వద్దకు వచ్చి సార్ మీరు ఇచి్చన అల్పాహారం ఎంతో ఉపయోగపడింది. ఈ రోజు ఉన్నత స్థాయికి చేరుకున్నామని చెబితే ఆయన ఆనందానికి అవధులు లేకుండాపోతుందని చెబుతారు.. 30 ఏళ్లుగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సోమవారం శంకరమఠం, మంగళ, బుధ వారాల్లో సికింద్రాబాద్‌లోని పద్మరావునగర్ స్కంధగిరి ఆలయం, గురువారం బాగ్‌లింగంపల్లిలోని సాయిబాబా మందిరం, శుక్రవారం లిబరీ్టలోని వేంకటేశ్వర స్వామి ఆలయం, శనివారం చిక్కడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం పరిసరాల్లో అల్పాహారాన్ని అందిస్తూ నిరి్వరామంగా సేవలను కొనసాగిస్తున్నారు. తరచూ గోశాలలోని పశువులకు ఆహారాన్ని అందిస్తారు. అనేకమార్లు సామాజిక సేవలను కొనియాడుతూ ప్రస్తుత గవర్నర్ బండారు దత్తాత్రేయ లాంటి వారు సైతం కందూరి కృష్ణను సన్మానించారు. ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు.. పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజల ఆరోగ్యానికీ కందూరి కృష్ణ ఇప్పటి వరకూ సుమారు 130కిపైగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. రోగులకు అవసరమైన చికిత్సలు అందించారు. 75 మందికి కంటి శుక్లాల ఆపరేషన్లు చేయించారు. వృద్ధులకు, కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్లో సంభవించిన వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారికి రూ.4 లక్షలతో దుస్తులను పంపిణీ చేశారు. ఎనిమిది సార్లు ఉచిత రక్తదాన శిబిరాలు నిర్వహించి 635 యూనిట్ల రక్తాన్ని సేకరించి రక్తనిధికి అందించారు. ట్విన్ సిటీస్ జ్యూవెలరీస్ అధ్యక్షుడిగా దశాబ్ద కాలంగా కొనసాగుతున్నారు. కందూరి కృష్ణ ఫౌండేషన్ ద్వారా నిరంతరం సేవలను కొనసాగిస్తున్నారు.పేద విద్యార్థులకు ఆర్థికంగా తోడ్పాటు.. ఉచితంగా అల్పాహారం పంపిణీ చేయడం వల్ల పేద విద్యార్థులకు ఎంతో కొంత ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుంది. నాది వరంగల్ జిల్లా నేను ఎంఫార్మసీ పూర్తి చేశాను. ప్రతి రోజూ నాతో పాటు అనేక మంది విద్యార్థులు క్యూలైన్లో నిలబడి అల్పాహారం తీసుకుంటారు. – పల్లవి, ఎంఫార్మసీ పేదల ఆకలి తీర్చే దేవుడు.. ఈయన పేదల ఆకలి తీర్చే దేవుడు. ప్రతిరోజూ ఉదయం అనేక మంది నాతో పాటు పేదలు వచ్చి అల్పాహారాన్ని తీసుకుంటారు. ఈ ప్రధాన రహదారి నుంచి పోయే చిరువ్యాపారులు సైతం క్యూలో నిలబడి జైశ్రీరామ్ అంటూ అల్పాహారం తీసుకొని సంతోషంగా వెళ్లిపోతుంటారు. – లక్షి్మ, చిక్కడపల్లిమిత్రుల సహకారంతో.. ప్రముఖ వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హెచ్.గోవింద్రావుల సహకారం, ప్రోత్సాహంతో సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నాం. నా సంపాదనలో కొంత భాగం పేదలకు ఖర్చు పెట్టాలనేదే ఉద్దేశం. ప్రతి రోజూ స్కూల్ విద్యార్థులతో పాటు డిగ్రీ, పీజీ, బీటెక్ విద్యార్థులు, ఇతర వర్గాల పేదలు ఉదయం 7.30 గంటల వరకు మా షాపు వద్ద క్యూలైన్లో ఉంటారు. ప్రతిరోజూ సుమారు 250 మందికి అల్పాహారంతో పాటు అరటిపండ్లు అందజేస్తున్నా. – కందూరి కృష్ణ, ఫౌండేషన్ నిర్వాహకులు -
ఎలినోర్ 1.0 ఫ్యాషన్..
మాదాపూర్: మోడల్స్, సినీతారలు ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తు హోయలోలికించారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో మంగళవారం ఎలినోర్ 1.0 ఫ్యాషన్ ఫర్ ఫండ్‌రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్యాషన్‌షోను వినూత్న పద్ధతిలో సంగీతం, నృత్యం, పాఠశాల విద్యార్థులతో థియోటర్ ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శ్రావణ్‌కుమార్ థీమ్‌కు అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన భారతీయ ఫ్యాషన్ వర్ణచిత్రాన్ని ప్రదర్శించారు. బ్రిటిష్ పాలనలో, స్వదేశీ ఉద్యమం తరువాత, రేగల్ వర్గాల వైభవంతో, ఆధునిక భారతదేశం వరకూ వస్త్రధారణ ధోరణులను ప్రదర్శించారు. ఈ మొత్తాన్ని జిల్లా పరిషత్ పాఠశాలలో 700 మంది చిన్నారులకు కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడానికి వెచి్చంచనున్నట్లు శ్రవంతి కందారు తెలిపారు. ర్యాంప్‌వాక్‌లో సినీతారలు సంయుక్తమీనన్, ఫరియా అబ్దుల్లా, మిస్ ఇండియా వరల్డ్ 2023 నందినిగుప్త, సిమ్రాన్ చౌదరి, యుక్తిథారేజా, సాన్వే మేఘన, శివాతి్మక రాజశేఖర్, పావని కరణం, దీప్తివర్మ, భరత్ గార్లపాటి, రాహుల్ విజయ్ పాల్గొన్నారు. -
యూకే సమ్మిట్‌కు హెచ్‌సీయూ విద్యార్థిని..
రాయదుర్గం: యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ది సైన్స్ బరీ లాబోరేటరీ సమ్మర్ కాన్ఫరెన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా 20 మందికి అవకాశం కలి్పంచగా అందులో హెచ్‌సీయూ విద్యారి్థనికి అవకాశం లభించింది. హెచ్‌సీయూలో స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ పరిశోధక విద్యార్థి ప్రజ్ఞాప్రియదర్శిని ఎంపికయ్యారు. ‘ప్రారంభ కెరీర్ పరిశోధకుల కోసం మొక్కలు–సూక్ష్మజీవుల పరస్పర చర్యలపై వేసవి సదస్సు’లో పాల్గొనేందుకు అవకాశం రావడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రారంభమైన ఈ సదస్సు ఈనెల 26 వరకూ సాగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 20 మంది పరిశోధకులను ఎంపిక చేశారు. ఇందులో 20 మంది అంతర్జాతీయ ప్రతిని«ధులు, 8 మంది ముఖ్య వక్తలు, 10 మంది స్థానిక వక్తలు భాగస్వాములయ్యారు. ప్రజ్ఞ హెచ్‌సీయూలోని డిపార్ట్మెంట్ ఆప్ ప్లాంట్ సైన్సెస్ ప్రాఫెసర్ ఇర్ఫాన్ ఆహ్మద్ఘాజీ పర్యవేక్షణలో పనిచేస్తున్నారు. ఆమె థీసిస్ వివిధ రకాల వరి(ఒరైజాసటైవా)లో బాక్టీరియల్ లీఫ్ బ్లెట్(బీఎల్బీ) నిరోధకతకు సంబంధించిన జన్యువుల గుర్తింపుపై ఆధారపడింది. -
సాహసం.. శ్వాసగా!
సాక్షి,హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మోటారబుల్ పాస్ వద్దకు ఒంటరిగా బైక్‌పై వెళ్లి రికార్డు సృష్టించాడు మల్కాజిగిరికి చెందిన యువకుడు. దేశంలోని చివరి గ్రామమైన టర్దుక్, పాకిస్తాన్ సరిహద్దు తంగ్ గ్రామం, సియాచిన్ బేస్ క్యాంప్, భూమిపై ఎత్తైన యుద్ధభూమిని సందర్శించి ఔరా అనిపిస్తున్నాడు. మల్కాజిగిరికి చెందిన బత్తిని సాయివంశీ గౌడ్ 26 రోజుల పాటు 8,800 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించి రికార్డులు తిరగరాస్తున్నాడు. ఈ నెల 2న ప్రారంభించిన తన ప్రయాణాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు.19,024 అడుగుల ఎత్తులో.. లఢాక్‌లో 19,024 అడుగుల ఎత్తులోని ఉమ్లింగ్ లా పాస్ 11 రోజుల్లో చేరుకుని రికార్డు సృష్టించాడు. ఎన్నో అడ్డంకులను దాటుకుని, మొక్కవోని దీక్షతో ఉమ్లింగ్లా పాస్ చేరుకుని తెలంగాణ కెరటాన్ని ఎగురవేశాడు. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఆర్మీ అధికారులు ఎంతో సహాయం చేశారు. -
స్టూడెంట్ ఎంటర్‌ప్రెన్యూర్స్!
సాక్షి,హైదరాబాద్: స్కూల్ అంటే పుస్తకాలు.. చదువులు.. మార్కులు.. చిన్నప్పటి నుంచి పిల్లలకు ఇదే చెబుతుంటారు. ఇంట్లో.. స్కూల్లో మార్కుల గోల. అయితే అందరు విద్యార్థులు ఒకేలా ఉండరు.. కొందరు చదువులో ముందుంటే మరికొందరు సృజనాత్మకతలో ముందుంటారు. పాఠశాల స్థాయిలోనే పిల్లల్లో ఉన్న టాలెంట్‌ను వెలికితీసి ఎంకరేజ్ చేస్తే పారిశ్రామిక వేత్తలుగా రాణించగలరు. ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నా బయటకు చెప్పుకునేందుకు భయపడే ఎంతోమంది పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తూ పలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పిల్లలు టెర్రకోట ఆభరణాలు, సాయిల్ టెస్టింగ్ కిట్స్, విండ్ సౌండర్, డిజైన్ కొవ్వొత్తులు.. ఇలా ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలను తయారు చేశారు. వాటిని మంగళవారం హైదరాబాద్‌లోని టీ–హబ్‌లో జరిగిన ‘అంకురం’లోని పలు స్టాళ్లల్లో ప్రదర్శించారు. కోతుల బెడద నుంచి రక్షణకు టీఎస్ఆర్జేసీకి నేరెళ్లలో ఇంటరీ్మడియట్ చదువుతున్న విద్యార్థులు పావని, శ్రీవిద్య, మాని్వత ఏదైనా కొత్త ఆవిష్కరణ చేయాలన్న ఆలోచన చేశారు. తల్లిదండ్రులు, గ్రామంలోని రైతులు కోతుల వల్ల పడుతున్న ఇబ్బందులు వీరిని కదిలించాయి. వెంటనే స్పీకర్లు, విద్యుత్‌తో నడిచే పరికరాలను కాకుండా వినూత్నంగా తయారు చేయాలని చూశారు. వారి ఆలోచనల నుంచి వచి్చందే విండ్ సౌండర్ అనే పరికరం. ఇప్పటికే చాలా మంది రైతులు దీన్ని వాడి, చాలా బాగా పనిచేస్తుందని కితాబిచి్చనట్టు చెబుతున్నారు. జుట్టు రాలిపోకుండా ఆయిల్.. ఈ రోజుల్లో జుట్టు రాలిపోవడం చాలా మందిలో ప్రధాన సమస్యగా మారుతోంది. చిన్న వయసులోనే ఆ సమస్యను తగ్గించేందుకు నూనె తయారు చేశారు ఈ చిన్నారులు. ఎలాంటి కెమికల్స్ లేకుండా సుగంధద్రవ్యాలను వాడి ఆర్య పేరుతో హెయిర్ ఆయిల్ అభివృద్ధి చేశారు. రెండేళ్లుగా చాలామంది వాడిన తర్వాత ఫీడ్ బ్యాక్ తీసుకుని మరింత మెరుగులు చేశామని చెబుతున్నారు టీజీఆర్ఎస్జేసీ ఇన్సాన్పల్లికి చెందిన విద్యార్థులు. టెర్రకోటతో ఆభరణాలు.. టెర్రకోట మట్టితో అద్భుతమైన ఆభరణాలు రూపొందించారు టీజీఎంఎస్ జూనియర్ కాలేజీ విద్యార్థులు. గిల్టు నగల కన్నా ఇవి ఎంతో అందగా ఉన్నాయని పలువురు మెచ్చుకుంటుంటే మరింత సంతోషంగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు. -
Hyderabad: నగరంలో క్రేజ్‌గా మారిన జిప్‌లైన్
ఎగిరే.. ఎగిరే.. చూపే ఎగిరెనే చీకటి ఎరగని దారిలో.. పాదం ఎగిరెనే భయమే తెలియని బాటలో.. ప్రాయం ఎగిరెనే పరిచయమవ్వని త్రోవలో.. ఫ్లై హై.. ఇన్ ది స్కై.. కలలే అలలై పైకెగిరే.. పలుకే స్వరమై పైకెగిరే.. ప్రతి అడుగు స్వేచ్ఛ కోరగా.. పాట చాలా మందికి తెలిసిందే.. ఈ తరహా వినోదాన్వేషణలో భాగంగా సాహసకృత్యాలు నగర యువతకు నిత్యకృత్యాలయ్యాయి. పబ్బులు, క్లబ్బుల్లో ఒళ్లు మరచిపోయే వీకెండ్ రొటీన్‌కు భిన్నంగా ఒళ్లు గగుర్పొడిచే సాహసాలకు వారు ఓటేస్తున్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడు నగరంలో అత్యధికులను ఆకర్షిస్తోంది జిప్‌లైన్.. ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పాపులారిటీ ఉన్న ఈ సాహస క్రీడ నగర యువతకు క్రేజ్‌గా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకుని పలు అడ్వెంచరస్ క్లబ్స్ అడ్వెంచర్ ఔత్సాహికుల కోసం తమ థ్రిల్లింగ్ అవుట్డోర్ యాక్టివిటీలకు జిప్‌లైన్‌ను జత చేస్తున్నాయి. గగనాన పయనాన...అనిపించేలా చేస్తుంది ఈ సాహసక్రీడ జిప్‌లైన్. రోప్‌వే తరహాలో ఒక నిరీ్ణత దూరానికి ఒక కేబుల్ ఆధారంగా గాల్లో వేలాడుతూ ప్రయాణించే ఈ జిప్‌లైన్ దశాబ్దకాలంగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచి్చంది. ఈ క్రీడను ఒకప్పుడు నగరవాసులు విభిన్న టూర్ల సందర్భంగా మాత్రమే ఎంజాయ్ చేసేవారు. అయితే పెరుగుతున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నగరంలోని అడ్వెంచర్ యాక్టివిటీ సెంటర్లలో కూడా అందుబాటులోకి తెచ్చారు. దాదాపు రూ.500 మొదలుకుని రూ.1000లోపు రుసుముతో ఈ క్రీడను ఆనందించడానికి అవకాశం ఇస్తున్నారు. ఎక్కడెక్కడ ఎంజాయ్ అంటే... ⇒ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఫ్లిప్‌సైడ్ అడ్వెంచర్ పార్క్ జిప్లైనింగ్కి ఒక మంచి ప్లేస్. అంతేకాక విభిన్న రకాల అడ్వెంచర్ కార్యకలాపాలతో ఒక రోజంతా సరదాగా గడపడానికి కూడా. ఇక్కడ జిప్‌లైన్ ఎత్తులో థ్రిల్లింగ్ రైడ్‌ను అందిస్తుంది. ⇒ లియోనియా రిసార్ట్స్ సమీపంలో ఉన్న డి్రస్టిక్ట్ గ్రావిటీ సిటీలో మరొక సాహసాల కేంద్రం. ఇదొక అతిపెద్ద అడ్వెంచర్ పార్కు. ఇది విభిన్న రకాల థ్రిల్లింగ్ యాక్టివిటీస్ అందిస్తుంది. కింద పచ్చని పచ్చిక పైన 60 అడుగుల ఎత్తుతో 500 మీటర్ల జిప్‌లైన్ సెట్‌తో ఆకట్టుకుంటుంది. అయితే ఇక్కడ కనీస బరువు 35 కిలోలుగా నిర్ణయించారు. కాబట్టి ఇది చిన్న పిల్లలకు తగినది కాదు. ⇒ ఖైరతాబాద్‌లోని పిట్ స్టాప్ అడ్వెంచర్ పార్క్ ఆటలకు ప్రసిద్ధి. ఇది పిల్లలు, పెద్దలు ఇద్దరికీ సరిపోయే జిప్‌లైన్‌ను అందిస్తుంది. ⇒ శంకర్‌పల్లిలోని వైల్డ్ వాటర్స్ థీమ్ పార్క్ కూడా జిప్లైనింగ్ను అందిస్తుంది. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ ఇది పనిచేస్తుంది. ⇒ వికారాబాద్‌లో ఉన్న అనంత అడ్వెంచర్ క్లబ్ 24–గంటల అడ్వెంచర్ హబ్. జిప్‌లైన్‌తో సహా సాహసికుల కోసంæ వివిధ కార్యకలాపాలను అందిస్తుంది. ⇒ జూబ్లీ హిల్స్‌లో పచ్చని ప్రకృతి అందాల మధ్య ఉన్న ఫ్రీకౌట్స్ అడ్వెంచర్ జోన్‌లోనూ జిప్ లైన్ ఉంది. ]జాగ్రత్తలు ⇒ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా యాక్టివిటీ ఉందా లేదా చూసుకోవాలి. ⇒ ఎంత కాలంగా జిప్‌లైన్ నిర్వహిస్తున్నారో కూడా తెలుసుకోవాలి. ⇒ ఇవి పూర్తి సురక్షితంగా ఉన్నప్పటికీ.. అందరికీ నప్పవు.. కాబట్టి ముందస్తుగా తమ ఆరోగ్యంపై కూడా అవగాహన అవసరమైతే వైద్య సలహా కూడా తీసుకోవాలి. -
‘రామ కథా యాత్ర’పై డాక్యుమెంటరీ
సాక్షి, సిటీబ్యూరో: ప్రఖ్యాత ఆధ్యాతి్మక వేత్త మొరారి బాపు ఇటీవల తాను చేసిన ద్వాదశ జ్యోతిర్లింగ రామకథా యాత్రపై ఒక డాక్యుమెంటరీని విడుదల చేశారు. రెండు రైళ్లలో ఒకదానిలో ప్రయాణించిన బాపు, ఆయన బృందం దీనిని చిత్రీకరించిందనీ, మంచు కప్పేసిన హిమాలయ శిఖరాల మీదుగా పచ్చని లోయలు విశాలమైన సముద్ర తీరాల వరకూ సాగిన ఈ యాత్రలో అనేక ఆధ్యాతి్మక విశేషాలను వీక్షించవచ్చని రూపకర్తలు తెలిపారు. అదే విధంగా బాపు రచించిన జర్నీ విత్ యాన్ ఇని్వజబుల్ పవర్, సాక్ర్డ్ స్టోరీస్ ఫ్రమ్ ది 12 జ్యోతిర్లింగాస్ పుస్తకాలు అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. -
25, 26న స్టైల్ పితార ఫ్యాషన్ ఎగ్జిబిషన్
8 ఏళ్లుగా క్రియేటీవ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో స్టైల్ పితార ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు రమారాటి, వైశాలి ఇనాని, మీనల్ శారద, వినిత బల్దువలు పేర్కొన్నారు. కోఠిలోని కార్యాలయంలో సోమవారం స్టైల్ పితార పోస్టర్‌ను ఆవిష్కరించారు. గృహిణులు వారి ప్రతిభతో తయారు చేసిన ఉత్పత్తులను వారే స్వయంగా స్టాళ్లలో ప్రదర్శించే అవకాశం ఉందన్నారు. సామాజికంగా, ఆధ్యాతి్మకంగా క్రియేటివ్ ఆర్ట్స్ చారిటీ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు రామ్‌కోఠిలోని కచి్చభవన్లో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ ఎగ్జిబిషన్‌ను ప్రముఖ సంఘ సేవకురాలు భగవతి మహేష్ బలద్వా, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ శ్వేత అగర్వాల్ ప్రారంభిస్తారన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు ప్యాషన్ డిజైనింగ్, పేపర్ స్టాల్స్, ఫుడ్‌స్టాల్స్, గేమ్స్, జువెలరీ, హ్యాండీ క్రాప్్ట, ఫుడ్ ఐటమ్స్ 100కుపైగా స్టాళ్లలో ఏర్పాటు చేయనున్నారు. -
ఆయుష్.. నొప్పులు మాయం
లక్డీకాపూల్: జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులతో నగర ప్రజలు వివిధ రకాల నొప్పులతో సతమతమవుతున్నారు. అవే పెద్ద సమస్యలుగా భావించి చాలా మంది కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. తొలనొప్పి, కండరాల, మోకాళ్ల నొప్పులు, మానసిక ఒత్తిడి, మిటమిన్స్ లోపం, అధిక బరువు వంటి సాధారణ సమస్యలను కూడా చాలా మంది పెద్ద జబ్బులుగా భావిస్తున్నారు. దీంతో రిఫరల్ అస్పత్రి అయిన నిమ్స్ సైతం రోగులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతోనే సహజ సిద్ధమైన వైద్య చికిత్సలతో నొప్పులకు ఉపశమనం కలి్పంచాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయూష్ శాఖ నిమ్స్‌లో ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలోపతి వైద్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో బలోపేతం చేస్తూనే.. దేశీయ వైద్యానికి సైతం పెద్దపీట వేస్తున్నారు. సంప్రదాయ వైద్యమైన ఆయుష్ సేవలకు ప్రాచుర్యం కలి్పంచేందుకు దృష్టిని కేంద్రీరించింది. లోపించిన శారీరకశ్రమ..మనిషి కూర్చునే భంగిమని బట్టి కూడా ఈ నొప్పులు చోటుచేకుంటాయి. వాస్తవానికి ఇటీవల కాలంలో శారీరశ్రమ లోపించింది. చెప్పాలంటే.. శరీరాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. విటమిన్ల లోపం వల్ల కొంత మంది ఇబ్బంది పడుతుంటే పోషకాహార లోపం వల్ల మరికొంత మంది అనార్యోగం పాలవుతున్నారు. ఆస్పత్రికి వచి్చన రోగులకు ప్రకృతి వైద్యం పట్ల అవాగాన కల్పిస్తూ.. భవిష్యత్తులో వారు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురికాకుండా చూసేందుకే ఈ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ కృషి చేస్తుంది. – డా.నాగలక్షి్మ, ప్రకృతి వైద్యనిపుణురాలు అలోపతికి సమాంతరంగా...అలోపతి వైద్యానికి సమాంతరంగా ఆయుష్ సేవలు కూడా ప్రజలకు చేరువ కానున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు, సీజనల్, ప్రసూతి సమస్యలు, కీళ్ల నొప్పులు తదితర అన్ని రకాల సమస్యలకూ ప్రకృతి వైద్య చికిత్స అందుబాటులో ఉండడమే కాకుండా వ్యాధి మూలాలపై పనిచేసి, పునరావృతం కాకుండా చేయడమే సహజ వైద్య చికిత్సల లక్ష్యమని నిపుణులు పేర్కొంటున్నారు. నరగంలో పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి స్థాయిలు, ఆందోళన మొదలైన పర్యావరణ మార్పులకు దారితీసింది. అటువంటి సమస్యలను ఎదుర్కోవటానికి ఏకైక మార్గం ప్రకృతి వైద్య చికిత్సలు. సాధారణ నొప్పులతో పాటు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి తక్కువ ఖర్చుకే సహజమైన పద్ధతిలో మెరుగైన సేవలు అందిస్తున్నారు. అలోపతి వైద్య పద్దతిలో లొంగని వ్యాధులకు సైతం ఆయుష్ ఉపశమనం కలి్పస్తుంది. దీంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం ఈ సహజ వైద్య చికిత్సల పట్ల ఆసక్తి చూపుతున్నారు.నామమాత్రపు రుసుము..పంచకర్మ చికిత్సల్లో భాగంగా స్నేహకర్మ, నదిస్వేదం, పిండిస్వేదం, కతివస్తి, జనువస్తి, నాశ్యకర్మ, శిరోధార, డెటాక్స్ థెరపీ, బరువు నియంత్రణ, మానసిక ఒత్తిడి నిర్మూలన, బాడీ మసాజ్, మైగ్రేన్ వంటి సేవలతో పాటు ప్రకృతి వైద్య సేవల్లో భాగంగా జనరల్ మసాజ్, స్టీమ్‌బాత్, డైట్ కౌన్సిలింగ్, కోల్డ్ బ్లాంకెట్ ప్యాక్, తల, కండరాలు, నడుం, భుజాలు, మోకాళ్ల నొప్పులకు చికిత్సలు అందిస్తుంది. ఆక్యుపంక్చర్, యోగ వంటి సేవలను కూడా అందుబాటులో ఉంచింది. రోగులు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి చికిత్సను అందిస్తుంది. ఎంపిక చేసుకున్న చికిత్స, సేవలు, సిట్టింగ్ ఆధారంగా నామమాత్రపు రుసుమును వసూలు చేస్తున్నారు. చికిత్స పొందాలంటే ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి. వాస్తవానికి సహజ వైద్య చికిత్సలను ప్రణాళికబద్ధంగా అనుసరించాల్సిందే. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఒక స్లాట్‌గా, మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదున్నర గంటల వరకూ మరో స్లాట్‌గా నిర్ణయించారు. -
మహిళలను వేధిస్తున్న జుట్టు రాలిపోయే సమస్య
వేగంగా మారుతున్న లైఫ్ స్టైల్, మనం తినే ఆహారపు అలవాట్లు, నీరు, వాయు కాలుష్యం, ఉద్యోగం, వ్యాపారం, ఇతర పనుల్లో ఒత్తిడి, నిద్రలేమి, చుండ్రు, పీసీఓఎస్, మాతృత్వం, ఇలా ఎన్నో కారణాల వల్ల పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా జుట్టు రాలిపోవడం సర్వసాధారణంగా కనిపిస్తోంది. ఇటీవల ట్రాయా అనే సంస్థ చేట్టిన సర్వే ప్రకారం ప్రతి పది మందిలో ఏడెనిమిది మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని తేలింది. ఆ వివరాలను పరిశీలిస్తే.. జుట్టు రాలడంపై ట్రాయా సంస్థ దేశంలో మొత్తం 2.8 లక్షల మంది మహిళల అభిప్రాయాలు సేకరించింది. అందులో మొత్తం 71.19 శాతం మహిళలు జట్టు రాలిపోతుందని తెలిపారు. దీనికి గల కారణాలను, వారి అనుభవాలను సైతం పంచుకున్నారు. 36 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు గల మహిళల్లో 51 శాతం మంది ఈ సమస్యను అనుభవిస్తున్నామన్నారు. దాదాపు ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరికి కేశ సంపద పోతుందని తేలింది. అయితే మహిళలు జుట్టు రాలిపోవడంపై బహిరంగంగా మాట్లాడటానికి సిద్ధంగా లేరని సర్వేలో స్పష్టమైంది. అనేక కారణాలుకురులు రాలిపోవడానికి ప్రధానంగా పని ఒత్తిడి, ఆరోగ్యం పరంగా బలహీనంగా ఉండటం, హార్మోన్ హెచ్చుతగ్గులు వంటి కారణాలుగా కనిపిస్తున్నాయి. జుట్టు రాలిపోయే సమస్య ఉన్న మహిళల్లో ఏకంగా 88.6 శాతం మంది తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని స్పష్టమైంది. ఒత్తిడి, అధికంగా ఆందోళన వంటి అంశాలు జుట్టు రాలిపోవడానికి అధికంగా దోహదపడతాయని స్పష్టమయ్యింది. ఈ సమస్య ఎదుర్కొంటున్న వారిలో 48.14 శాతం స్త్రీలు నిద్రలేమితో బాధపడుతున్నారట. కురులు రాలిపోవడానికి చుండ్రు కారణమని 70 శాతం మంది చెబుతున్నారు. అంతే కాకుండా 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసు గల మహిళల్లో పీసీఓఎస్ హెచ్చుతగ్గులు కారణంగా కనిపిస్తోంది.పరిష్కార దిశగా..‘జుట్టు రాలడం అనేది ప్రధానంగా పురుషులు మాత్రమే ఎదుర్కొనే సమస్యగా కాదు. చాలా మంది మహిళలు శిరోజాలు రాలడాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ సమస్యకు గల కారణాలను తెలుసుకోవడం, సమర్థవంతంగా పరిష్కరించడంలో మా అధ్యయనం సహాయపడాలన్నది లక్ష్యం. – సలోనీఆనంద్, ట్రాయా సహ వ్యవస్థాపకురాలుసరైన ఆహారం తీసుకోవాలిజుట్టు రాలిపోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం. పోషకాహర లేమి, హార్మోన్లలో మార్పులు, ఒత్తడితో జుట్టు రాలిపోతోంది. దీర్ఘకాలిక సమస్యలకు వాడే మందులూ దీనికి కారణమే. సరైన డైట్ పాటించి.. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం, పండ్లు తీసుకోవడం ద్వారా సమస్యను అధిగమించవచ్చు. ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, ధ్యానం వంటివి మంచిది. – డాక్టర్ గంగా హరీశ్, డెర్మటాలజిస్టుఏ వయసు వారిలో ఎందుకు జుట్టు రాలిపోతోంది.. 18 నుంచి 30 ఏళ్ల వయసు వారిలో ఒత్తిడి, పీసీఓఎస్, చుండ్రు 31 నుంచి 40 ఏళ్లు వయసు వారిలో ఒత్తిడి, పీసీఓఎస్, ప్రసవానంతరం 40 ఏళ్లు పైబడిన వారిలో ఒత్తిడి, మోనోపాజ్, థైరాయిడ్ -
హ్యాట్సాఫ్ ప్రవల్లిక: జీవితాన్ని మలుపు తిప్పిన సాఫ్ట్ బాల్
సాఫ్ట్ బాల్ క్రీడ ఆమె జీవితాన్నే మార్చేసింది. నాల్గో తరగతి నుంచే సాఫ్ట్ బాల్ పట్ల మక్కువ పెంచుకున్న ఆమె అంతటితో ఆగిపోలేదు.. నిరంతర సాధనతో ఆ క్రీడపై పట్టు సాధించారు. అంతేకాదు పదో తరగతిలోపే నాలుగు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. దీంతోపాటు బాల క్రీడాకారుల కోటాలో అంతర్జాతీయ విజ్ఞాన పర్యటనలకు ఎంపికయ్యారు. 2017లో అంతర్జాతీయ విమానం ఎక్కే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. 20 రోజులు అమెరికాలో పర్యటించే భాగ్యాన్ని దక్కించుకున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధన కేంద్రం (నాసా)ను సందర్శించారు సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన ప్రవల్లిక. 15 జాతీయ, రెండు అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆమె కనబరిచిన ప్రతిభ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని చేజిక్కించుకున్నారు. సాఫ్ట్‌బాల్ వరల్డ్ కప్‌లో గోల్డ్ మెడల్ సాధించడం, సివిల్ సరీ్వసెస్‌లో చేరడం వంటి లక్ష్యాలతో కసరత్తు చేస్తున్న ప్రవల్లిక ‘సాక్షి’తో పంచుకున్న పలు విశేషాలు... సికింద్రాబాద్ వారాసిగూడలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నవీన్‌గౌడ్, కవిత దంపతుల కుమార్తె ప్రవల్లిక. నాల్గో తరగతి చదువుతున్న సమయంలోనే క్రీడల పట్ల ప్రవల్లిక ఆసక్తి చూపేది. కుమార్తె ఆసక్తికి తగ్గట్టుగా ప్రోత్సహించిన తల్లిదండ్రులు బాల్యం నుంచే సాఫ్ట్ బాల్ క్రీడలో శిక్షణ ఇప్పించారు. శిక్షణలో చేరింది మొదలు అకుంటిత దీక్షతో సాధన చేసిన ఆమె క్రమేణ ఉన్నత శిఖరాలు అధిరోహించారు. తను చదువుతున్న సికింద్రాబాద్ సెయింటాన్స్ స్కూల్ సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణిగా అండర్ –17 విభాగంలో రాష్త్ర స్థాయి క్రీడాకారిణిగా ఎదిగారు. తెలంగాణ జట్టు తరపున మధ్యప్రదేశ్, మహారాష్త్ర తదితర రాష్ట్రాల్లో జరిగిన సాఫ్ట్ బాల్ జాతీయ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఇప్పటి వరకూ వరుసగా 15 జాతీయ స్థాయి పోటీల్లో దక్షిణ భారత దేశం తరపున పాల్గొని పలు పతకాలు గెలుచుకున్నారు. ఇండోనేషియా, సౌత్ కొరియా దేశాల్లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో భారత్ నుంచి పాల్గొని వెండి పతకాన్ని సాధించారు.లవ్లీ యూనివర్శిటీ తోడ్పాటు.. నగరంలో ఇంటరీ్మడియట్ పూర్తిచేసి దక్షిణాది రాష్ట్రాల నుంచి సాఫ్ట్‌బాల్‌లో రాణిస్తున్న తనను పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ చేరదీసింది. స్పోర్ట్స్ కోటాలో తనకు అన్ని వసతులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే అవకాశాన్ని కల్పించిందని ప్రవల్లిక తెలిపారు. అంతేకాదు తను అక్కడకు వెళ్లిన తర్వాత యూనివర్శిటీ తరపున ఇండోనేíÙయా, దక్షిణ కొరియాలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశాన్నీ కలి్పంచారు. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ షిప్లో పాల్గొనేందుకు శిక్షణతోపాటు సివిల్స్ పోటీ పరీక్షలకు కోచింగ్ కూడా లవ్లీ యూనివర్శిటీ యాజమాన్యమే ఇప్సిస్తుండడం గమనార్హం.14 ఏళ్లకే నాసా సందర్శన.. అతి తక్కువ మందికి లభించే అరుదైన నాసా సందర్శన అవకాశం ప్రవల్లికకు 14 ఏళ్ల ప్రాయంలోనే అందివచి్చంది. దేశంలోని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచే బాలలకు విజ్ఞాన పర్యటనలు ఉంటాయి. ఏ రంగానికి చెందిన బాలలైనా విజ్ఞాన పర్యటనల జాబితాలో చేరడం కోసం రాత పరీక్ష రాయాల్సిందే. ఆ పరీక్షను నెగ్గిన ప్రవల్లిక యూఎస్ఏ ఫ్లోరిడాలోని నాసాను సందర్శించారు. 2017లో అంతర్జాతీయ విమానం ఎక్కి ఏకంగా 20 రోజుల పాటు అమెరికాను చుట్టి వచ్చారు.. నాసా పరిశోధకులు, వ్యోమగాములతో కరచాలనాలు, సంభాషణలు చేసే అరుదైన అవకాశం దక్కడం జీవితంలో గొప్ప అనుభూతి అని ఆమె చెబుతున్నారు. సివిల్స్, వరల్డ్ కప్ సాధించాలి.. సాఫ్ట్‌బాల్ క్రీడలో ఇప్పటికీ నిరంతర సాదన చేస్తున్నాను. ఉత్తమ కోచ్‌ల వద్ద శిక్షణ తీసుకుంటున్నాను. భారత్ తరపున ప్రపంచ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్ షిప్లో గోల్డ్ కప్ సాధించాలన్నదే లక్ష్యం. కొద్ది నెలల క్రితమే వచ్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు సివిల్స్‌కి కూడా ప్రిపేర్ అవుతున్నాను. సివిల్స్ సాధించడం మరో లక్ష్యం. బాల్యంలోనే అమెరికా పర్యటన అవకాశం రావడం నా అదృష్టం. నన్ను ప్రోత్సహించిన అప్పటి రాష్త్ర మాజీ క్రీడాశాఖ మంత్రి టీ.పద్మారావు గౌడ్, తెలంగాణ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు కే.శోభన్ బాబు, నవీన్ కుమార్, ఇండియన్ కోచ్ చిన్నాకృష్ణ సహకారంతో ఈ స్థాయికి ఎదిగాను. –ప్రవల్లిక, సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణి -
వాల్స్.. వండర్స్.. ప్రతి గోడా ఓ కళాఖండంలా..
ఖైరతాబాద్: ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం.. అయితే మనలో చాలా మంది అనారోగ్యంపాలైనప్పడు ఆస్పత్రులకు వెళ్లక తప్పదు..వెళ్లాలి కదా..! ఇప్పుడేమంటారు? అంటారా.. అదేనండి.. ఆస్పత్రులు అనగానే చాలా మంది బెదిరిపోతారు.. ఎందుకంటే ఓ వైపు మందుల వాసన, మరోవైపు ఫినాయిల్కంపు, ఎక్కడ చూసినా గోడలకు రోగాలకు సంబంధించిన పోస్టర్లు, చూట్టూ రోగులు.. అబ్బో నా వల్ల కాదు బాబోయ్ అంటారు. అలాంటి వారు కూడా ఈ ఆస్పత్రికి వెళ్లాలంటే మాత్రం ఎంచక్కా మ్యూజియంకో, ఎగ్జిబిషన్‌కో వెళ్తున్నట్లు రెడీ అయిపోతారు.. అదే నగరంలోని కిమ్స్ సన్‌షైన్ హాస్పటల్. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.. క్యారికేచర్స్గా డాక్టర్స్ ఫొటోలు.. ఆయా డిపార్ట్మెంట్ల ముందు డాక్టర్ల ఫొటోలను పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోల్లాగా కాకుండా లైటర్వేయిన్తో క్యారికేచర్స్గా ప్రత్యేకంగా రూపొందించి ఏర్పాటుచేశారు. ఈ ఫొటోలను చూసి హాస్పిటల్‌కు వచ్చిన వారు ఎంజాయ్ చేయడంతో పాటు ఉత్సాహంగా ఫోన్లో ఫొటోలు భద్రపరుచుకుంటున్నారు. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో సతమతమౌతున్న మనిషికి ఆధునిక వైద్య విధానాలు ఎన్ని వచి్చనప్పటికీ ఆప్యాయంగా... ప్రేమగా పలకరించే వైద్యులు, వారి బాధలు చెప్పుకునేంత సమయం.. ఓర్పు, సహనం కలిగిన వైద్యులతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపించే హాస్పిటల్‌కు వెళ్లామనే ïఫీలింగ్ పేషెంట్లకు కలిగించేందుకు కొత్త కొత్త ఏర్పాట్లు చేస్తున్నాయి పలు హాస్పటల్స్. ఈ తరహా ప్రయత్నమే చేస్తోంది నగరంలోని బేగంపేట కిమ్స్ సన్‌షైన్ హాస్పటల్. రొటీన్ వాతావరణానికి భిన్నమైన అనుభూతిని కలి్పంచేలా ఓ మ్యూజియంకు వెళ్లామనే అనుభూతి, పేషెంట్‌ను పేషెంట్‌గా కాకుండా ఒక గెస్ట్‌గా ఆహా్వనించే పద్దతి, ఎక్కడ ఏ సమస్య వచి్చనా వెంటనే హాజరై సలహాలు, సూచనలు చేసే సిబ్బంది ఉంటే ఆ రోగికి సగం జబ్బు నయమైపోయినట్లే అంటున్నారు విశ్లేషకులు. సంస్కృతిని ప్రతిబింబించేలా..హాస్పిటల్లోకి వెళ్లగానే బాబోయ్ హాస్పిటల్‌కు వచ్చామనే ఫీలింగ్ లేకుండా ఉండేవిధంగా లోపలికి అడుగు పెట్టగానే తెలుగు సాంప్రదాయ పద్దతిలో చేతులు జోడించి నమస్కారంతో స్వాగతం పలికే సిబ్బంది మొదలుకొని డాక్టర్ల వరకూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. హాస్పిటల్లో డాక్టర్ ఓపి పరిసరాల్లో ఉండే గోడలపై భారతీయతను ప్రతిబింబించేలా తెలుగు పండగలు, అలనాటి క్రీడలు, అన్ని మతాలనూ ప్రబోధిస్తూ ఫొటోలు, తెలుగు రాష్ట్రాల చీరలు, రామాయణం, మహాభారతం, మనదేశ సంప్రదాయ నృత్యాలు, తల్లిప్రేమను ప్రతిబింబించే ఫొటోలు, మెడిసిన్ హిస్టరీని తెలియజేసే ఫొటో ఎగ్జిబిషన్, ఆయా డిపార్ట్మెంట్ల ప్రాముఖ్యతను తెలిపే ఫొటోలు, మన శరీరం ఆకృతిని నిర్దేశిస్తూ శరీరంలో ఉండే అస్థిపంజరం నమూనాలు, పెయింటింగ్స్ పరిజ్ఞానాన్ని పెంచడంతో పాటు మనస్సుకు ఎంతో ప్రశాంతతను చేకూరుస్తాయని చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చే వారు ప్రతి ఫ్లోర్లో మనస్సు నింపుకొని వెళ్లే విధంగా ఉండటం కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ ప్రత్యేకత.సిబ్బంది పద్దతి నచ్చింది..మేము ఉండేది కొండాపూర్, మా చుట్టుపక్కల ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. అయినా గంటన్నర ప్రయాణం చేసి బేగంపేటలోని కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌కు వస్తాం. ఇక్కడి వాతావరణం, నర్సులు, ఇతర సిబ్బంది పద్దతి మాకు బాగా నచ్చింది. బాధ్యతతో వ్యవహరించే డాక్టర్లు, హాస్పిటల్లో ప్రతి ఫ్లోర్లో ప్రశాంతతను ఇచ్చే వాతావరణం మాలో బరోసాను పెంపొందిస్తుంది. – జే.సుమిత్ర, కొండాపూర్, గృహిణిసేవా ధృక్పథంతో...మేమంతా సేవా ధృక్పథంతో పనిచేస్తున్నాం. మా అందరి గురువు డాక్టర్ గురవారెడ్డి. ఆయన అడుగు జాడల్లో రోగులను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి బాధలు చెప్పుకునేంత సమయం ఇస్తూ, వారి ఆనందంలో భాగస్వాములవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడి సిబ్బంది ఒక కుటుంబంలా పనిచేయడం ఎంతో సంతోషం. – డాక్టర్ నివేదిత సాయిచంద్ర, న్యూరో ఫిజీషియన్కంఫర్ట్ ఇవ్వగలగాలి..రొటీన్ పద్దతికి స్వస్తిచెప్పి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపించేలా మ్యూజియం, హార్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం.. రానున్న సంవత్సరంలో పేషెంట్‌ను గెస్ట్‌లా భావిస్తున్నాం. ఆస్పత్రిలో మంచి వాతావరణం ఉండటం వల్ల సగం జబ్బు నయమవుతుంది. గోడలను రకరకాల పెయింటింగ్స్, డిజైన్స్, ఫొటోలతో ఏర్పాటు చేశాం. అన్ని బాధలూ మేము తగ్గించకపోవచ్చు, కానీ అందరికీ ఆత్మస్థైర్యాన్ని, కంఫర్ట్‌ని ఇవ్వగలగాలి. ఇంగ్లిష్‌లో ఓక సామెత ఉంది ‘యు మే నాట్ క్యూర్ ఆల్ ది టైం.. బట్ యు కెన్ కంఫర్ట్ ఆల్ ది టైం’ అనేది నేను బలంగా నమ్ముతాను. – డాక్టర్ ఏవీ గురవారెడ్డి, కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్. -
‘లైఫ్‌స్పాన్’ బ్రాండ్ అంబాసిడర్‌గా ఈషా సింగ్..
సాక్షి, హైదరాబాద్: భారత ప్రొఫెషనల్ షూటర్ ఈషా సింగ్ హైదరాబాద్ ఆధారిత లైఫ్‌స్పాన్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు ప్రకటించారు. భారత ఒలింపిక్ జట్టులో అతి పిన్న వయసు్కల్లో ఒకరైన ఈషా సింగ్ లైఫ్స్పాన్కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం గర్వంగా ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర రామ్ తెలిపారు. తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌తో పాటు ఈషా సింగ్ భాగస్వామ్యం కావడం క్రీడా రంగానికి కృషి చేయాలనే తమ నిబద్ధతకు నిదర్శనమన్నారు. -
ఎక్స్‌ప్లోరింగ్.. ది హిడెన్ టాలెంట్!
సాక్షి, హైదరాబాద్: కొందరికి హాబీ.. మరికొందరికి ప్యాషన్.. ఇంకొందరికి అభిలాష.. కారణమేదైనా వారందరినీ ఒకే దగ్గరికి చేర్చింది. వారి టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసుకునే అవకాశం కలి్పంచింది. వారి ఐడియాలను షేర్ చేసుకునే వీలునిచ్చింది. అదే ది మూన్‌షైన్ ప్రాజెక్టు వేదికగా ఆదివారం ట్రీ హగ్గర్స్ క్లబ్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లేఅఫేయిర్ ప్రోగ్రాం. టు షో ఆఫ్ స్కిల్స్.. యువతలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. చదువుల వెంట పరుగెడుతూ.. వారిలోని ఔత్సాహికతను, నవ్యాలోచనలను బయటపెట్టే అవకాశం ఉండకపోవచ్చు. ఇంట్లోని నాలుగు గోడల మధ్యే మిగిలిపోకుండా ఉండేలా వారి స్కిల్స్‌ను చాటిచెప్పేందుకు ఇదో అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. గత 11 సంవత్సరాలుగా ట్రీ హగ్గర్స్ క్లబ్ పేరిట కమర్షియల్ వాసనలకు దూరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సుప్రీత అనే ఔత్సాహికురాలు ఈ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. టాలెంట్‌ను వెలికితీసేందుకు.. యువతలోని టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ఈ క్లబ్ ఏర్పాటు చేశాం. ఎంతోమంది కళలకు సరైన ప్రోత్సాహం, అవకాశాలు దొరక్కపోవడంతో ఎంతోమంది తెర వెనుకే ఉండిపోతున్నారు. అలాంటి వారి అరుదైన కళలను వెలుగులోకి తీసుకురావాలనేదే మా కోరిక. కమర్షియల్‌గా కాకుండా ఆర్ట్‌లో ఉన్న ఫ్రీడమ్ వారు ఎంజాయ్ చేసేందుకు ఇలాంటి వేదికలు ఏర్పాటు చేస్తుంటాం. – సుప్రీత ఆమంచెర్ల, ఫౌండర్, ట్రీ హగ్గర్స్ క్లబ్ఫ్యాషన్తో ప్రారంభంచిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఏదో ఒక ఆర్ట్ వర్క్ చేయడం అలవాటు. ఎప్పుడూ ఏదో కొత్తగా ఆలోచిస్తూ ఉంటాను. ఆర్ట్‌లో ఒక ఫ్రీడమ్ ఉంటుందనేది నా భావన. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నుంచి డిజైనింగ్ నేర్చుకున్నాను. ఇందులో భాగంగానే లిటిల్ బోటో పేరుతో ప్రాజెక్టు ప్రారంభించాను. కలరింగ్ బుక్స్‌ను స్వయంగా రూపొందిస్తుంటాను. – విశ్వ సింధూరి నేతి, లిటిల్ బోటో ప్రాజెక్టుఇంట్లోనే బేకరీచిన్నప్పటి నుంచి చెఫ్ కావాలనేది నా లక్ష్యం. అందుకు అనుగుణంగానే నా ఆలోచనలు ఉండేవి. కాకపోతే బేకరీ ఏర్పాటు చేయాలంటే ఆర్థికంగా ఇబ్బంది. అందుకే నేను నేర్చుకున్న కళతో ఇంటి నుంచే కేక్స్, పేస్టరీస్, కప్ కేక్స్ తయారు చేస్తుంటాను. చాలామంది వారికి నచి్చన థీమ్‌తో కేక్స్ తయారు చేయించుకుంటారు. డబ్బుల కన్నా వాళ్లు నా పనితీరును మెచ్చుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. –మనిక ఖట్టర్, ఇంపర్ఫెక్షన్ బేకర్స్ -
‘మిస్ యూనివర్స్ స్టేట్’ గ్రాండ్ ఫినాలే 2024
సాక్షి, హైదరాబా: నగరం పై కురుస్తున్న తొలకరి చిరుజల్లులు ఓ వైపు... నగరం వేదికగా నిర్వహించిన మిస్ యూనివర్స్ స్టేట్ గ్రాండ్ ఫినాలే ర్యాంప్ పై నడుస్తున్న టాప్ మోడల్స్ సోయగాలు మరో వైపు. వెరసి ఆదివారం నగరం అందాల సోయగాలతో పులకించిపోయింది. శ్రీనగర్ కాలనీలోని విన్ఫ్లోరాలో జరిగిన మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక స్టేట్ మొదటి ఎడిషన్ గ్రాండ్ ఫినాలేలో 3 రాష్ట్రాలకు చెందిన అందాల ముద్దుగుమ్మలు క్యాట్‌వాక్‌తో అలరించి విజేతలుగా నిలిచారు. ఇందులో భాగంగా మిస్ యూనివర్స్ తెలంగాణగా నిహారిక సూద్, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ చందన జయరామ్, మిస్ యూనివర్స్ కర్ణాటకగా అవనీ కాకేకోచి టైటిల్ క్రౌన్ గెలుచుకున్నారు. ర్యాంప్ పై వాక్ చేసిన అందాల తారలను బ్యూటీ, ఫ్యాషన్ పరిశ్రమకు చెందిన ప్రముఖులు విజేతలుగా ఎంపిక చేశారు. ఈ ఫ్యాషన్ జ్యూరీలో మిస్ యూనివర్స్ స్టేట్ డైరెక్టర్ ప్రాచీ నాగ్‌పాల్, మిస్టర్ గ్లోబల్ 2023 జాసన్ డైలాన్, సెలబ్రిటీ డెంటిస్ట్ డాక్టర్ నిదా ఖతీబ్, ఫ్యాషన్ డిజైనర్ అంజలి ఝా, ఫౌండర్ చుర్రోల్టో నీహర్ బిసాబతేని పాల్గొన్నారు. మిస్ యూనివర్స్ స్టేట్ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల నుంచి 96 మంది పాల్గొనగా..వీరిలో ఒక్కో రాష్ట్రం నుంచి 7 మంది చొప్పున 21 మందిని ఫైనలిస్టులుగా ఎంపికచేశారు. 21 మందిలో ఒక్కో రాష్ట్రం నుంచి మిస్ యూనివర్స్ స్టేట్ విన్నర్‌తో పాటు, ఇద్దరు రన్నరప్‌లను ఈ గ్రాండ్ ఫినాలే విజేతలుగా ప్రకటించింది. బెస్ట్ స్మైల్, బెస్ట్ అటైర్ టైటిల్స్ ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఈ ఫినాలేలో యువతులు, కార్పొరేట్ ఉద్యోగులు, ఫ్యాషన్ మోడల్స్ సందడి చేశారు. -
ఐ–కేర్ మాన్సూన్ క్యాంప్
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలంలో వచ్చే సమస్యలను దృష్టిలో ఉంచుకుని కార్ల వినియోగదారుల కోసం ఆదివారం నుంచి ఇసుజు మోటార్స్ సరీ్వస్ శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇసుజు ఐ–కేర్ మాన్సూన్ క్యాంప్ పేరిట ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరాల్లో తమ డి మ్యాక్స్ పికప్స్, ఎస్యూవిలకు అవసరమైన సర్వీసులన్నీ అందిస్తామని, ఈ క్యాంప్స్ నగరంలోని తమ అధికారిక డీలర్ల దగ్గర అందుబాటులో ఉంటుందని వివరించారు. ఈ క్యాంపులు ఆదివారం ప్రారంభమై, ఈ నెల 28 వరకూ కొనసాగుతాయన్నారు. -
ఆర్ట్ గ్యాలరీలో ఆరంభ్ చిత్రప్రదర్శన
మాదాపూర్: స్థానిక చిత్రమయి స్టేట్ అర్ట్ గ్యాలరీలో ఆరంభ్ పేరిట చిత్రప్రదర్శనను శనివారం ఏర్పాటు చేశారు. కళాకారులు వేసిన చిత్రాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. చారూస్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న 28 మంది కళాకారులు వేసిన 36 చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శనను మెరీడియన్ పాఠశాల ప్రిన్సిపల్ ఆకృశబెల్లాని ప్రారంభించారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ఆమె కోరారు. విద్యార్థులు వేసిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శన ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకూ అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
అద్భుతం.. ఫ్లో స్టైల్తత్వ..
మాదాపూర్: స్థానిక హైటెక్స్‌లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఫ్లో స్టైల్తత్వ ఎక్స్పోను బుల్లితెర నటి సుమ కనకాల, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వత్సల మిశ్రా, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ ప్రియగజదార్లతో కలసి శనివారం ప్రారంభించారు. ప్రదర్శనలోని ఉత్పత్తులు అద్భుతంగా ఉన్నాయని, దీని ద్వారా వచ్చే ఆదాయంలో కొంతభాగం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా 100 మంది మహిళా రైతులకు కూరగాయల సాగులో ఆధునిక శిక్షణ ఇవ్వడం, సిద్దిపేట క్లస్టర్లో నైపుణ్యం పెంచే మహిళా నేత కారి్మకులకు శిక్షణ వంటి సామాజిక ప్రాజెక్టులకు కేటాయించడంతో సుమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 15 రాష్ట్రాల నుంచి 200లకు పైగా ఎంఎస్ఎంఈలను ఒకే వేదికపైకి తీసుకురావడం సులభం కాదని తెలిపారు. మహిళల సృజనాత్మకతను బయటకు తీసుకొచ్చేందుకు ఫిక్కీ ఎంతోకృషి చేస్తుందని ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వత్సల మిశ్ర అన్నారు. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తుందని, దీనిపై విధానాన్ని రాష్ట్రప్రభుత్వం నెలరోజుల్లో ప్రకటించనున్నట్టు తెలిపారు. రెండు రోజుల్లో 8వేల నుంచి 10వేల మంది సందర్శకులు సందర్శించనున్నట్టు ఫిక్కీ చైర్పర్సన్ ప్రియగజదార్ తెలిపారు. ఫ్లో సహాయక పారిశ్రామికవేత్తల పెవిలియన్, ఉద్యమం రిజి్రస్టేషన్ డెస్క్, తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్, సకల ది హ్యాండ్లూమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్ ఇనిíÙయేటివ్ స్టాల్స్ ప్రత్యేకంగా ఉన్నాయని తెలిపారు. -
మనం మీనం
పెంపుడు జంతువులు అనగానే మనకు కుక్కలు, పిల్లులు గుర్తొస్తాయి. ఎందుకంటే అవి మనుషులను గుర్తు పెట్టుకోవడమే కాదు విశ్వాసంగానూ ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంటే వస్తుంటాయి. చాలా ఫ్రెండ్లీగా ఇంట్లో కలియదిరుగుతాయి. అయితే కుక్కలు, పిల్లులే కాదు.. చేపలు కూడా చాలా విశ్వాసంగా ఉంటాయని మీకు తెలుసా..? అవి మనతో ఫ్రెండ్లీగా ఉంటాయని విన్నారా? అలాంటి చేపలను మన ఇంట్లోని అక్వేరియంలో పెంచుకుంటే? అలాంటి ఫ్రెండ్లీ చేపల గురించి తెలుసుకుందాం.. మనసుకు ప్రశాంతత, కాలక్షేపం కోసం ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది పెంపుడు జంతువులతో సమయం గడుపుతున్నారు. మరికొందరైతే పని ఒత్తిడితో అలిసిపోయి ఇంటికి వచ్చాక కాసేపు వాటితో దోస్తానా చేస్తుంటారు. బిజీ లైఫ్‌స్టైల్‌తో మాన సిక ప్రశాంతత కోసం ఒక్కొక్కరూ ఒక్కో రకమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటారు. తాజాగా హైదరాబాద్ వాసులు కాసేపు రిలాక్స్ అయ్యేందుకు చేపలను పెంచేస్తున్నారు.జీబ్రా చేపలుఈ చేపల శరీరంపై నల్లటి, తెల్లటి చారికలు ఉంటాయి. అందుకే వీటికి జీబ్రా అని పేరుపెట్టారు. జీబ్రా డానియోస్ పూర్తి పేరు. ఇవి యాక్టివ్‌గా ఉంటాయి. భిన్న పరిసరాలకు అనుకూలంగా ఒదిగిపోయే లక్షణాల కారణంగా వీటిని శాస్త్రవేత్తలు రీసెర్చ్ కోసం వాడుతుంటారు. ఇవి ఆరేడు చేపలతో కలిసి గుంపుగా పెరుగుతాయి.నెమలి నాట్యంలా.. నెమలి ఫించం లాంటి మొప్పలు ఉన్న చేపలు కదులుతుంటే అచ్చం నెమలి నాట్యం చేస్తున్నట్లే అనిపిస్తుంది. అవి నీటిలో అలాఅలా కదులుతుంటే మనసు గాల్లో తేలిపోక మానదు. ఇవి యజమానులను గుర్తించడమే కాదు.. మనం నేరి్పంచే టాస్్కలు కూడా నేర్చుకుంటాయి.‘ఆస్కార్’ ఇచ్చేయొచ్చు.. ఆస్కార్ ఫిష్‌లు గోల్డెన్, బ్లాక్, బ్లూ కలర్లో ఉంటాయి. అందంగా, ఫ్రెండ్లీగా ఉండి పెంచుకునే వారిని ఇట్టే గుర్తుపట్టేస్తాయి. వీటికి ట్రైనింగ్ ఇస్తే ముద్దు ముద్దుగా చెప్పినట్టు వింటాయి.ఇంటెలిజెంట్.. గోల్డ్ ఫిష్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. అక్వేరియం ఏర్పాటు చేసుకునే ప్రతి ఒక్కరూ గోల్డ్ ఫిష్ పెంచుకుంటారు. వీటికి జ్ఞాపక శక్తి, తెలివి చాలా ఎక్కువ. వీటికి కూడా మనకు నచ్చినట్టు ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు.హచ్ డాగ్స్‌లా.. పేరుకు తగ్గట్టే ఏంజెల్లా ఉంటాయి ఈ చేపలు. అక్వేరియంలోని ఇతర చేపలతో ఫ్రెండ్షిప్ చేస్తాయి. యజమానులు ఎటువెళ్తే అటు చూస్తాయి. ఇక ఫుడ్ పెట్టేటప్పుడు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంటాయి.వెరీ.. క్యూరియస్ గయ్..గౌరమి అనే రకం చేపలు క్యూరియస్‌గా ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తితో ఉంటాయి. ఒకే ప్రాంతంలో నివాసం ఉంటూనే.. చుట్టుపక్కల ఏం ఉన్నాయనే విషయాలు తెలుసుకుంటాయి. చుట్టుపక్కల చేపలతో ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా యజమానులను గుర్తుంచుకుంటాయి. సిచిల్డ్ చాలా భిన్నం..సిచిల్డ్ చేపలు చాలా భిన్నమైనవి. వాటి ప్రవర్తన క్లిష్టంగా ఉండటమే కాకుండా, చుట్టూ ఉన్న వాతావరణంతో కలగలిసి పోతాయి. ఏదైనా సమస్యలు వస్తే చాకచక్యంగా పరిష్కరించడంలో దిట్ట. జాగ్రత్తగా కాపాడుకోవాలి.. చేపలను పెంచాలని ఇష్టపడటమే కాదు. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. సరైన సమయంలో ఫుడ్పెట్టాలి. ఎప్పటికప్పుడు నీటిని మారుస్తుండాలి. మోటార్లతో ఆక్సిజన్ అందేలా జాగ్రత్తపడాలి. లేదంటే వైరస్ బారినపడి చేపలు చనిపోతుంటాయి. – షేక్ నసీరుద్దీన్ మన బాధ్యత.. ఎలాంటి చేపలను పెంచితే ఎక్కువ కాలం జీవించగలవో తెలుసుకుని పెంచాలి. పెద్ద అక్వేరియం ఏర్పాటు చేసి, నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. చేపలకు మన మీద నమ్మకం రావడానికి సమయం పడుతుంది. ఆ తర్వాత అవి మనతో ఫ్రెండ్లీగా ఉండి, మనల్ని గుర్తుపడతాయి. – ఇబ్రహీం అహ్మద్ దస్తగిర్ -
Hyderabad: కొత్త పుంతలు తొక్కుతున్న సిటీ కల్చర్
నగరంలోని గేటెడ్ కమ్యూనిటీలు చిన్నపాటి అందమైన ఊళ్లను తలపిస్తున్నాయి. వీటి నిర్వహణా వ్యవస్థల మధ్య ఏర్పడుతున్న ఆరోగ్యకరమైన పోటీ సిటీలో వేళ్లూనుకున్న గేటెడ్ కల్చర్‌కు కొత్త రంగులు అద్దుతోంది. అయామ్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పుకున్నంత గర్వంగా ఐయామ్ బిలాంగ్స్ టు పలానా కమ్యూనిటీ అని చెప్పుకునేలా నిర్వహణ కాంతులీనుతోంది.బండ్లగూడలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో గణేశుడి లడ్డూ వేలంలో రూ.1.26 కోట్లు పలికి రికార్డు సృష్టించింది. కరోనా టైమ్‌లో కోకాపేట్‌లోని రాజపుష్పా ఆట్రియా రికార్డ్ స్థాయిలో వ్యాక్సినేషన్ డ్రైవ్స్ అద్భుతంగా నిర్వహించి తమ కమ్యూనిటీని కరోనా కేసుల్లో జీరోకి చేర్చారు. వందల సంఖ్యలో కుటుంబాలు నివసించే గేటెడ్ కమ్యూనిటీల్లో ఉట్టిప డుతున్న ఐక్యతకే కాదు నిర్వహణా సామర్థ్యానికి కూడా ఇవి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.సెక్యూరిటీలో హై‘టెక్’.. సీసీ టీవీలు, కెమెరాలు అనేవి ప్రతి కమ్యూనిటీలో ఇప్పుడు సర్వసాధారణం. కాగా బయోమెట్రిక్ ఫేస్ రికగ్నైజేషన్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నివాసితుల భద్రతకు భరోసా ఇస్తున్నారు. ఇక అత్యంత సుశిక్షితులైన సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకుంటున్నారు. టోల్ గేట్ తరహాలో ప్రతి వాహనానికీ ఒక ఆర్ఎఫ్ఐడీ ఇస్తున్నారు. ఆ ఐడీ ఉన్న వాహనం వస్తేనే గేట్ ఓపెన్ అవుతుంది. ప్రతి గంటకూ ఒకసారి డ్రోన్స్‌తో తనిఖీలు చేసేందుకు త్వరలోనే ఏర్పాట్లు చేయనున్నామని ఓ గేటెడ్ కమ్యూనిటీ ప్రతినిధి చెప్పడం ప్రస్తావనార్హం.నిర్వహణలో నీట్‌గా.. వసతులు కలి్పంచడంలో మాత్రమే కాదు మెయిన్టెనెన్స్ వసూళ్లలో సైతం కమ్యూనిటీలు పోటీపడుతున్నాయి. గత నాలుగేళ్లలో సిబ్బందికి ఏటా పది శాతం జీతాలు పెంచుతూనే, నివాసితులకు మాత్రం నిర్వహణా వ్యయం రూపాయి కూడా పెంచకుండా మియాపూర్‌లోని ఎస్ఎంఆర్ వినయ్ సిటీ గేటెడ్ కమ్యూనిటీల నిర్వహణ చరిత్రలో కొత్త రికార్డ్ సృష్టించింది. మరోవైపు కమ్యూనిటీ పరిధిలో నాలుగేళ్లలో 70కి పైగా సీసీటీవీలు ఏర్పాటు చేయడం ద్వారా నివాసితుల భద్రత పటిష్టంగా మార్చారు. నివాసితుల సమస్యల పరిష్కారానికి బ్లాక్స్ వారీగా ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. బిల్డర్ నిర్ణయించిన మెయిన్టెనెన్స్ ఛార్జీలను కమ్యూనిటీ, ఇతరత్రా ఆదాయ మార్గాలు ద్వారా తగ్గించుకుంటున్నాయి. అభివృద్ధి కోసం సమావేశాలువినాయకచవితి మొదలుకుని దాదాపు అన్ని కుల మతాలకు చెందిన పండుగలనూ ఘనంగా నిర్వహిస్తూనే, వరల్డ్ కప్ విజయం లాంటి అపురూప సందర్భాలకూ అప్పటికప్పుడు స్పందిస్తూ కార్య క్రమాలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి నుంచి సంవత్సరారంభం దాకా కాదేదీ సెలబ్రేషన్‌కి అనర్హం అన్నట్టు గేటెట్ కమ్యూనిటీలు సందడి చేస్తున్నాయి. నల్లగండ్లలోని అపర్ణ సైబర్ కమ్యూన్లో అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా 5వేల లాంతర్లతో సంబరాలు చేశారు. నానక్‌రామ్‌గూడలోని మై హోమ్ విహంగలో అన్నదానాలు నిర్వహించారు. ఇక డ్రగ్స్, సైబర్ నేరాలు తదితర అంశాల మీద అవగాహన, యోగ, ధ్యానంపై శిక్షణా కార్యక్రమాలు రోజువారీగా జరుగుతున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచిన కరోనా... ఆధునిక వసతుల్లో పోటీపడుతున్న గేటెడ్ కమిటీలన్నీ సంపూర్ణంగా ఆరోగ్యసేవలపై శ్రద్ధ పెట్టేలా చేసిన ఘనత కరోనాదే. మహమ్మారి విజృంభణ సమయంలో ఈ కమిటీలన్నీ బలోపేతం అవడమే కాకుండా వ్యాక్సినేషన్, శానిటైజేషన్ వంటి అంశాల్లో పోటీ.. వంటివి గేటెడ్ కమ్యూనిటీలను శక్తివంతగా మార్చాయి. ఆక్సిజన్ ప్లాంట్లు, అంబులెన్స్‌లూ ఏర్పాటు చేసుకున్నారు. ఒంటరి వృద్ధుల కోసం 14 ఆస్పత్రులతో, డయాగ్నసిస్ సెంటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నామని, అలాగే క్లినిక్, ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నామని గ్రీన్ గ్రేస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రతినిధి బద్రీనాథ్ చెప్పడం గమనార్హం.ప్రోత్సహిస్తున్నాం.. అవార్డులు ఇస్తున్నాం..మా పరిధిలో అనేక గేటెడ్ కమ్యూనిటీలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. నివాసితులకు అనేక రకాల సేవలు అందిస్తున్నాయి. నిర్వహణలో పోటీ తత్వాన్ని మరింత పెంచడానికి వారి సేవల్ని అభినందించడానికి మేం అవార్డులు ఇస్తున్నాం. తాజాగా పచ్చదనం విషయంలో మే ఫెయిర్ విల్లాస్‌కు ఇచ్చాం. ఇందులో ఎకరం స్థలంలో ఫారెస్ట్ పెంచారు. అంతేకాక 800, 900 ఏళ్ల నాటి చెట్లను రీలొకేట్ చేశారు. అదే విధంగా అత్యాధునిక మోషన్ కెమెరాలు వినియోగిస్తున్న ఇని్ఫనిటీ విల్లాస్‌కు బెస్ట్ సెక్యూరిటీ అవార్డు ఇచ్చాం. అలాగే వ్యర్థాల రీసైక్లింగ్‌లో అద్భుత పనితీరు కనబరుస్తున్న ముప్పా ఇంద్రప్రస్థకు బెస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ గుర్తింపుని అందించాం. – రమణ, అధ్యక్షులు, తెల్లాపూర్ నైబర్ హుడ్ అసోసియేషన్స్పర్యావరణ హితం.. పురస్కార గ్రహీతలం‘సాధారణంగా గేటెడ్ కమ్యూనిటీలో ఉండే దానికి మించి మా కమ్యూనిటీలో 45 నుంచి 50 శాతం ఎక్కువ పచ్చదనం ఉన్నట్టు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్స్ (ఐజీబీసీ) గుర్తింపుని ఇచి్చంది’ అని చెప్పారు ఖాజాగూడ నుంచి నానక్‌రామ్ గూడ వైపు వెళ్లే దారిలోని చౌరస్తాలో ఉన్న గ్రీన్ గ్రేస్ గేటెడ్ కమ్యూనిటీ కి చెందిన బద్రీనా«థ్. సోలార్ స్ట్రీట్ లైట్స్, సోలార్ వాటర్ హీటర్స్, బాత్రూమ్ సింకులు తదితరాల నుంచి పోయే వేస్ట్ వాటర్‌ని రీసైకిల్ చేసి గార్డెనింగ్, కారిడార్స్, రోడ్ల శుభ్రతకు వినియోగిస్తున్నారు. పర్యావరణ హిత కార్యక్రమాల వల్ల ప్రభుత్వానికి గతంలో తాము కట్టిన రూ.10 లక్షలు నీటి బిల్లులకు డిపాజిట్‌గా మారి గత 45 నెలల నుంచి మాకు నీటి బిల్లు కట్టే అవసరం లేకుండా పోయిందని చెబుతున్నారు. అంతే కాక ఐజీబీసీ గుర్తింపు వల్ల ఆస్తి పన్నులో 20 శాతం రిబేటు కూడా సాధించగలిగామని చెప్పారు. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్న తొలి గేటెడ్ కమ్యూనిటీ తమదేనని డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆటోమేటిక్ రెస్క్యూ డివైజెస్ వల్ల కరెంట్ పోయినా లిఫ్ట్ మధ్యలో ఆగకుండా మరో ఫ్లోర్ దాకా వెళ్లి ఆగి డోర్ తెరుచుకుంటుంది. ఇలాంటి ఎన్నో పకడ్బందీ ఏర్పాట్ల ద్వారా నివాసితులకు మేలు చేయడంతో పాటు పురస్కారాలెన్నో అందుకున్నాం. – బద్రీనాధ్, గ్రీన్ గ్రేస్ కమ్యూనిటీ -
నేతి రుచులు.. మాదాపూర్‌లో ఆకట్టుకుంటున్న రామేశ్వరం కేఫ్
మాదాపూర్: స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన అల్సాహారాలకు కేరాఫ్ అడ్రస్‌గా మాదాపూర్‌లోని రామేశ్వరం కేఫ్ నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నగరంలోని ఆహార ప్రియులు ఒక్కసారైనా ఈ కేఫ్‌లో నేతితో తయారు చేసిన ఆహారపదార్థాలు రుచిచూడకమానరు. ఇక వారాంతాల్లో అయితే నగరవాసులు టోకెన్ల కోసం కౌంటర్ వద్ద క్యూ కడుతుంటారు. వీరితోపాటు ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం రామేశ్వరం కేఫ్‌ను విజిట్ చేస్తుంటారంటే ఆశ్చర్యం కలగక మానదు. మాదాపూర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో అల్పాహారానికి ఓ ప్రత్యేకమైన రుచి ఉంది. అందుకే నగరవాసులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మరీ ఇక్కడి టిఫిన్లను రుచిచూస్తుంటారు. టెంపుల్ థీమ్‌తో ఏర్పాటు చేసిన ఈ హోటల్ చూడడానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ప్రముఖులు, సినీతారలు సైతం వచ్చి చాయ్‌ను ఆస్వాదిస్తుంటారు. దాదాపు 150 రకాలకుపైగా టిఫిన్స్, స్నాక్స్, భోజనం, మాక్టైల్స్, జూసులు అందుబాటులో ఉంటాయి.ప్రతి రోజు 800వందల నుంచి 1000 మంది టోకెన్లు తీసుకుంటుంటారు. ఇక శని, ఆదివారాల్లో 1200 నుంచి 1400 వందల వరకూ టోకెన్స్ తీసుకుంటుంటారు. టెంపుల్ వంటకాలను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. రైస్‌లో టెంపుల్ పులహోర, బిసిబెల్లాబాత్, కర్డ్‌రైస్, గొంగూరరైస్లు అందుబాటులో ఉన్నాయి. టిఫీన్స్లో స్పైసీ వడ, చక్కెర పొంగలి, నెయ్యి దోశ, నేతి ఇడ్లీ ఇక్కడ ప్రత్యేకంగా నిలుస్తాయి.రకరకాల దోశెలు...మల్టీ గ్రెయిన్ దోశ, బటర్ మసాలా దోశ, ఘీ పొడి దోశ, మసాలా దోశ, రవ్వ మసాలా దోశ, ఘీ రాగి దోశ, ఘీ ఆనియన్ దోశ, ఘీ ఆనియన్ ఊతప్పం, గార్లిక్, పుదీనా, మసాలా, ఉప్మా, జైన్ మసాలా దోశలు ప్రత్యేక ఫ్లేవర్‌తో తయారు చేయడంతో వీటి కోసం అల్పాహార ప్రియులు ఎగబడుతుంటారు. వీటితోపాటు సాంబార్ వడ, పెరుగు వడ, క్యారెట్ హల్వా, మిర్చి బజ్జీ, వంటి వెరైటీలూ భలే రుచిగా ఉంటాయని ఆహార ప్రియులు చెబుతుంటారు.పసందైన పానీయాలుబ్లాక్కాఫీ, బాదంమిల్్క, బూస్ట్, కాఫీ, హర్లిక్స్, లెమన్‌టీ, మసాలా బటర్మిల్్క, వివిధ రకాల పళ్ల రసాల మిల్‌్కõÙక్లు అందుబాటులో ఉంటాయి.