Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Defence Minister Rajnath Singh Comments On Pok1
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పై రాజ్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు

జమ్ము:పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే) లేకుండా జమ్ముకశ్మీర్‌(Jammukashmir) అసంపూర్ణమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(Rajnathsingh) అన్నారు.అఖ్నూర్‌ సెక్టార్‌కు సమీపంలోని తాండా ఆర్టిలరీ బ్రిగేడ్‌ వద్ద 9వ సాయుధ దళాల వెటరన్స్‌ డే నిర్వహించారు. ఈ ర్యాలీకి హాజరైన రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ పాకిస్తాన్‌(Pakistan) అక్కడ ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోందని ఆరోపించారు.పాకిస్తాన్‌కు పీఓకే విదేశీ భూభాగం అవుతుంది తప్ప మరొకటి కాదన్నారు.అందుకే ఆ ప్రాంతంలో ఉగ్రవాదులను తయారు చేస్తోందని మండిపడ్డారు.పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రధాని చౌదరి అన్వర్‌ ఉల్‌ హఖ్‌ ఇటీవల భారత్‌పై చేసిన వ్యాఖ్యలను రాజ్‌నాథ్‌ తీవ్రంగా ఖండించారు.కశ్మీర్‌ పట్ల గత ప్రభుత్వాలు భిన్న వైఖరిని అనుసరించాయన్నారు.దీంతో ఇక్కడి సోదరసోదరీమణులు ఢిల్లీకి చేరువ కాలేకపోయారన్నారు. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కశ్మీర్‌ను అనుసంధానించడం మా ఎన్డీయే ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయమన్నారు. జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లాను ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశంసించారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌ ప్రజలకు, ఢిల్లీకి మధ్య దూరాన్ని చెరిపివేసేలా ఆయన పని చేస్తున్నారని ప్రశంసించారు.గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పీవోకేపై కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే భారత్‌లో భాగమేనని, తాము దానిని దానిని తీసుకుంటామన్నారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఒకప్పుడు సమస్యాత్మకమైన కాశ్మీర్‌లో శాంతి నెలకొందన్నారు. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆజాదీ నినాదాలు, నిరసనలతో ప్రతిధ్వనిస్తోందన్నారు. కాగా,పీఓకే ప్రజల స్వయం నిర్ణయాధికారం గురించి మాట్లాడిన పార్టీలన్నింటినీ ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించడాన్ని భారత విదేశాంగ శాఖ గతంలో తప్పు పట్టింది. పాకి‌స్తాన్‌లో పీఓకే విలీనాన్ని ఆమోదించని వారిని, వ్యతిరేక ప్రచారం నిర్వహించేవారిని ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించవచ్చునన్న నిబంధన పీఓకే తాత్కాలిక రాజ్యాంగంలో ఉండడం గమనార్హం.

Who is Howard Buffett Son of Warren Buffett Nominated as His Lead Berkshire Hathaway2
రూ.86 లక్షల కోట్ల సామ్రాజ్యం.. వారసుడిని ప్రకటించిన వారెన్‌ బఫెట్‌

ప్రపంచ కుబేరులలో ఒకరు, దిగ్గజ ఇన్వెస్టర్.. బెర్క్‌షైర్ హాత్వే సహ వ్యవస్థాపకుడు 'వారన్ బఫెట్' (Warren Buffett) ఎట్టకేలకు తన వారసుడిని ప్రకటించారు. తన రెండో కుమారుడు 'హోవార్డ్ బఫెట్' (Howard Buffett)ను 1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 86.55 లక్షల కోట్లు) వ్యాపార సామ్రాజ్యానికి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌ బాధ్యతలు అప్పగించారు.ది వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. దాదాపు తన మిగిలిన సంపదనంతా కొత్త ఛారిటబుల్ ట్రస్ట్‌కు మళ్లించనున్నట్లు వారన్ బఫెట్ వెల్లడించారు. అయితే తన ముగ్గురి పిల్లలైన 'సూసీ, హోవార్డ్, పీటర్'లకు తన సంపదలో తక్కువ భాగాన్ని మాత్రమే ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించిన 140 బిలియన్ డాలర్ల విలువైన బెర్క్‌షైర్ స్టాక్‌లను ఈ ముగ్గురూ పర్యవేక్షిస్తారని ఆయన వెల్లడించారు.హోవార్డ్ బఫెట్‌ను వారసుడిగా ప్రకటించిన తరువాత, నా ముగ్గురు బిడ్డలకు నేను బలంగా విశ్వసిస్తాను అని వారన్ బఫెట్ చెప్పారు. అయితే హోవార్డ్ కూడా నా బిడ్డే కాబట్టి అతనికి వారసత్వ అవకాశం లభించిందని అన్నారు. 30 సంవత్సరాలకు పైగా బెర్క్‌షైర్ బోర్డులో డైరెక్టర్‌గా పనిచేసిన హోవీ.. ఇప్పుడు చైర్మన్‌ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.ఎవరీ హోవార్డ్ బఫెట్‌?➤హోవార్డ్ బఫెట్‌ పూర్తి పేరు 'హోవార్డ్ హౌవీ బఫెట్‌'. ఈయనను 'హౌవీ' అని కూడా పిలుస్తారు. చదువు పూర్తయిన తరువాత తండ్రి బాటలో అడుగులు వేసిన హోవార్డ్.. వారెన్ బఫెట్ సలహా మేరకు లాస్ ఏంజెల్స్‌కు వెళ్లి బెర్క్‌షైర్ హాత్వే యాజమాన్యంలోని సీస్ క్యాండీస్ అనే కంపెనీలో పని చేశాడు. ఆ సమయంలో వ్యాపారానికి సంబంధించిన అనేక కీలక విషయాలను నేర్చుకున్నారు.➤వారెన్ బఫెట్‌.. హౌవీ కోసం ఒక పొలాన్ని కొనుగోలు చేశారు. దానిని వాడుకున్నందుకు కూడా కొడుకు నుంచి అద్దె వసూలు చేశారు. ఆ తరువాత కాలంలో హౌవీ భూమిని దున్నకుండానే సాగు చేస్తూ.. కొత్త వ్యవసాయ విధానాలపై దృష్టిపెట్టారు.➤1989లో హౌవీ బఫెట్ కౌంటీ బోర్డ్ ఆఫ్ కమీషనర్‌లలో చేరారు. తరువాత నెబ్రాస్కా ఇథనాల్ బోర్డ్ సభ్యునిగా చేరి.. చివరికి ఛైర్మన్ అయ్యారు. 2017 నుంచి 2018 వరకు అతను ఇల్లినాయిస్‌లోని మాకాన్ కౌంటీకి షెరీఫ్‌గా పనిచేశారు.➤1993 నుంచి.. హోవీ బఫెట్ బెర్క్‌షైర్ హాత్వే, కోకా కోలా ఎంటర్‌ప్రైజెస్, లిండ్సే కార్పొరేషన్, స్లోన్ ఇంప్లిమెంట్, కొనాగ్రా ఫుడ్స్ & వ్యవసాయ పరికరాల తయారీ సంస్థ జీఎస్ఐ గ్రూప్‌తో సహా పలు ప్రముఖ కంపెనీల బోర్డులలో డైరెక్టర్‌గా పనిచేశారు.ఇదీ చదవండి: పాకిస్తాన్‌లో భారీగా బంగారు నిక్షేపాలు: ఏకంగా అన్ని టన్నులా..➤హోవీ బఫెట్ తండ్రి మాదిరిగానే.. దాతృత్వ కార్యక్రమాలపై దృష్టి సారించి స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. అంతే కాకుండా వన్య పరిరక్షణ, వన్యప్రాణులు సంబంధిత అంశాలపై ఎనిమిది పుస్తకాలను కూడా రచించారు. ఈయన డెవాన్ మోర్స్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు హోవార్డ్ వారెన్ బఫెట్ అనే కుమారుడు ఉన్నారు.

Zuckerberg Election Comment Row: Meta Get Summons From Indian Govt3
జుకర్‌బర్గ్‌ వ్యాఖ్యలు.. మెటాకు భారత్‌ సమన్లు

సోషల్‌ మీడియా దిగ్గజం మెటాకు కేంద్రం సమన్లు జారీ చేయనుంది. లోక్‌సభ ఎన్నికలపై ఆ సంస్థ బాస్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ చేసిన ‘అసత్య ప్రచారపు’ వ్యాఖ్యలే అందుకు కారణం. గతేడాది భారత్‌ సహా ప్రపంచంలో అనేక దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓటమి చెందాయని జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించారు. అయితే.. జుకర్‌బర్గ్‌ చేసిన వాదనను భారత ప్రభుత్వం ఖండించింది. బీజేపీ ఎంపీ, ఐటీ & కమ్యూనికేషన్‌ పార్లమెంటరీ హౌజ్‌ ప్యానెల్‌ చైర్మన్‌ నిషికాంత్‌ దుబే మెటాకు సమన్లు పంపే విషయాన్ని ధృవీకరించారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినందుకే సమన్లు అని ఎక్స్‌ వేదికగా తెలిపారాయన. मेरी कमिटि इस ग़लत जानकारी के लिए @Meta को बुलाएगी । किसी भी लोकतांत्रिक देश की ग़लत जानकारी देश की छवि को धूमिल करती है । इस गलती के लिए भारतीय संसद से तथा यहाँ की जनता से उस संस्था को माफ़ी माँगनी पड़ेगी https://t.co/HulRl1LF4z— Dr Nishikant Dubey (@nishikant_dubey) January 14, 2025ప్రజాస్వామ్య దేశం విషయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం.. ఆ దేశ ప్రతిష్టకు భంగం కలిగించడమే అవుతుంది. ఈ తప్పునకు భారత దేశ ప్రజలకు, చట్ట సభ్యులకు క్షమాపణ చెప్పాల్సిందే అని దుబే ఎక్స్‌ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. అంతకు ముందు.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో.. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏపై ఓటర్లు విశ్వాసం ఉంచి వరుసగా మూడోసారి గెలిపించారని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) కౌంటర్‌ బదులిచ్చారు.‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 2024లో నిర్వహించిన ఎన్నికల్లో 64కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాసం ఉందని తేల్చిచెప్పారు. కొవిడ్‌-19 తర్వాత భారత్‌ సహా అధికారంలో ఉన్న అనేక ప్రభుత్వాలు ఓడిపోయాయి అని జుకర్‌బర్గ్‌ చెప్పడంలో వాస్తవం లేదు. .. 80 కోట్ల మందికి ఉచిత ఆహారం మొదలు 220కోట్ల వ్యాక్సిన్లు అందించడంతోపాటు కొవిడ్‌ సమయంలో ప్రపంచ దేశాలకు భారత్‌ సాయం చేయడం వంటి నిర్ణయాలు మోదీ మూడోసారి విజయానికి నిదర్శనంగా నిలిచాయి’’ అని అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. అలాగే జుకర్‌బర్గ్‌ అలా మాట్లాడటం నిరాశకు గురిచేసిందన్న అశ్వినీ వైష్ణవ్‌.. వాస్తవాలు, విశ్వసనీయతను కాపాడుకుందామంటూ మెటాను టాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు.జుకర్‌బర్గ్‌ ఏమన్నారంటే..జనవరి 10వ తేదీన ఓ పాడ్‌కాస్ట్‌లో జుకర్‌బర్గ్‌ మాట్లాడారు. 2024 సంవత్సరం భారీ ఎన్నికల సంవత్సరంగా నిలిచింది. ఉదాహరణగా.. భారత్‌తో సహా ఎన్నో దేశాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే అన్నిచోట్లా అక్కడి ప్రభుత్వాలు అక్కడ ఓడిపోయాయి. దీనికి కరోనాతో ఆయా ప్రభుత్వాలు డీల్‌ చేసిన విధానం.. అది దారితీసిన ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణం అని అన్నారాయన.

Wiktoria Kozielska Case: Sensational Details Out That Tossing A Coin Decide A Life4
బొరుసు పడుంటే ఆమె బతికి ఉండేదేమో!

మనిషిలోని ‘మృగం’ మేల్కొంటే.. ఎంతటి దారుణానికైనా తెగిస్తుంది. ముఖ్యంగా లైంగిక దాడుల విషయంలో మరీ ఘోరాలను నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడో కేసులో నిందితుడు నేరానికి పాల్పడిన తీరు, కారణం విని.. న్యాయమూర్తితో సహా అందరినీ విస్తుపోయేలా చేశాయి. 18 ఏళ్ల ఓ యువతి నైట్‌క్లబ్‌లో తన స్నేహితులతో పార్టీ ముగించుకుని బస్సులో ఇంటికి వెళ్తోంది. ఆ టైంలో ఓ కుర్రాడి కళ్లు ఆమె మీద పడ్డాయి. హ్యాండ్సమ్‌గా ఉండడంతో ఆమె కూడా అతనితో మాటలు కలిపింది. అర్ధరాత్రి దాటడంతో.. తన ఇంటికి రావాలంటూ ఆమెను ఆహ్వానించాడు. అయితే అమాయకంగా అతని వెంట వెళ్లడం ఆమె పాలిట శాపమైంది.కొన్నిరోజుల తర్వాత.. ఓ ప్లాస్టిక్‌ బ్యాగులో ఆమె శవంగా కనిపించింది. శవపరీక్షలో.. ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు తేలింది. అంతేకాదు ఆమెపై అఘాయిత్యం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. మృతురాలి ఐడెంటిటీని మిస్సింగ్‌ కేసు ద్వారా పోల్చుకున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపిన పోలీసులు.. చివరకు ఆ రాత్రి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి మరీ బలిగొన్న యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా నిందితుడ్ని జనవరి 8వ తేదీన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి ముందు నేరం అంగీకరిస్తూ అతను చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.. ‘‘మా పరిచయం బస్సులో జరిగింది. కాసేపు ఇద్దరం మాటలు కలిపాం. ఇంటికి వెళ్తావా? నాతో వస్తావా? అని ఆమెను అడిగా. ఆమె నాతో రావడానికి ఇష్టపడింది. నా ఇంట్లో ఏం మాట్లాడకుండా ఇద్దరం ఎదురెదురుగా కూర్చున్నాం. ఉన్నట్లుండి ఆమె పడుకుని పోయింది... నాకేం చేయాలో పాలుపోలేదు. ఆమెను నిద్ర లేపేందుకు యత్నించా. కానీ, ఆమె లేవలేదు. నా చేతిలో ఉన్న కాయిన్‌ను ఎగరేశా. బొమ్మ పడితే చంపేయాలి అనుకున్నా. బొరుసు పడితే ప్రాణాలతో వదిలేయాలనుకున్నా. ఆమె దురదృష్టం.. బొమ్మ పడింది. అందుకే ఆమెను చంపేశా. అలా ఎందుకు చేశానో నాకు తెలియదు. అది అలా జరిగిపోయిందంతే..!.. నిర్ణయాలు తీసుకోవడం కష్టమనిపించినప్పుడల్లా నేను అలా కాయిన్‌ ఎగరేస్తుంటా. ఆరోజూ అలానే చేశా. బొమ్మ పడ్డాక.. ఆమె ఛాతీపై కూర్చుకున్నా. నా రూంలోని నైలాన్‌ తాడును ఆమె పీకకు వేసి నలిపేయడం ప్రారంభించా. ఊపిరాడక ఆమె విలవిలలాడింది. తిరిగి పోరాడలేని శక్తి ఆమెది. అప్పటికే ఆలస్యమై ఆమె ప్రాణం పోయింది. రక్తం చుక్క పడకుండా ఆమెను చంపాలని అనుకున్నా.. అలాగే చేశా. .. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. ఆమె దుస్తులు తొలగించి అనుభవించా. ఆపై మళ్లీ దుస్తులు తొడిగి ఓ బ్యాగ్‌లో ఆమె శవాన్ని పార్శిల్‌ చేశా. ఒక దుప్పట్లో చుట్టేసి తగలేయాలని అనుకున్నా. కానీ, ఎందుకనో అలా చేయలేకపోయా!. అందుకే ఆ రాత్రి బయట పారేసి వచ్చా. ఆమెను చంపేశాక ఎందుకనో హాయిగా అనిపించింది. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. కానీ, నా వెంటనే ఆ నిర్ణయం మార్చుకున్నా’’ అని నిందితుడు జడ్జి ముందు ఒప్పుకున్నాడు.కేసు విచారణ పూర్తయ్యాక.. బయటకు వస్తున్న నిందితుడిని తిడుతూ.. దాడికి మృతురాలి స్నేహితులు ప్రయత్నించారు. అయితే.. పోలీసులు వాళ్లను అడ్డుకుని నిందితుడ్ని అక్కడి నుంచి తరలించారు. ఫిబ్రవరి 12వ తేదీన ఈ కేసు తదుపరి విచారణ జరగనుంది. ఆ విచారణలోనే అతనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.పోలాండ్‌(Poland) నగరం కటోవీస్‌లో 2023లో జరిగిన దారుణ ఘటన ఇది. నిందితుడి పేరు మెటాయుజ్‌ హెపా(20). బాధితురాలి పేరు విక్టోరియా కోజిఎలెస్కా(18). దాదాపు నేరం జరిగిన ఏడాది తర్వాత నిందితుడు పోలీసులకు చిక్కాడు. గ్లివిస్‌ కోర్టు ఫిబ్రవరిలో నిందితుడికి శిక్ష ఖరారు చేయనుంది. ప్రస్తుతం ఈ కేసు అక్కడ చర్చనీయాంశమైంది.

Ysrcp Leader Nandigam Suresh Wife Slams Ap police5
మా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు: నందిగం సురేష్‌ సతీమణి

సాక్షి,గుంటూరు:మాజీ ఎంపీ నందిగం సురేష్‌ ఎదుగుదల ఇష్టం లేకనే ఆయనపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని సురేష్‌ సతీమణి బేబి లత ఆరోపించారు. ఈ విషయమై ఆమె మంగళవారం(జనవరి14) మీడియాతో మాట్లాడారు. ‘అర్ధరాత్రి మా ఇంటి చుట్టూ ఇద్దరు వ్యక్తులు బైక్‌పై తిరిగారు. ఒక వ్యక్తి బైక్ నడుపుతుంటే మరొక వ్యక్తి మా ఇంటి ఫోటోలు తీస్తున్నారు.దీనిపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. నందిగం సురేష్ అనుచరులపై అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి వేధిస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి నా భర్తను 134 రోజులు జైల్లో ఉంచారు. 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలేయాల్సిన కేసుల్లో కూడా బెయిల్ రానివ్వకుండా అడ్డుకుంటున్నారు’అని బేబి లత ఆవేదన వ్యక్తం చేశారు.వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు గతంలో జైలులో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. జిల్లా జైలులో ఉన్న ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో జైలు అధికారులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. వైద్యులు నందిగం సురేష్..లో-బీపీతో పాటు భుజం నొప్పితో బాధపడుతున్నట్లు గుర్తించారు. సురేష్‌కు ఒక కేసులో బెయిల్‌ వస్తే మరో కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దీంతో ఆయన సుదీర్ఘ కాలం పాటు జైలులోనే ఉండాల్సి వస్తోందని ఆయన భార్య బేబిలత పలు సందర్భాల్లో వాపోయారు. సురేష్‌ బెయిల్‌ విషయమై సుప్రీం కోర్టులో కూడా ఆమె పిటిషన్‌ వేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఏపీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఇదీ చదవండి: కహానీలు చెబితే కడుపు నిండుతుందా..?

KSR Comment: Under Kutami Govt No Sankranti For AP Poor People6
కహానీలు చెబితే కడుపు నిండుతుందా?

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లోమీడియా తీరు భలే విచిత్రంగా ఉంటుంది. వారికి లాభం జరిగితే ప్రజలందరికీ జరిగినట్లే. వారి ఇబ్బందులు ప్రజలందరి సమస్యలు! ఇప్పుడెందుకు ఈ ప్రస్తావన అంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ‍ప్రజలందరికీ సంక్రాంతి వరాలు వచ్చేశాయట!. అభివృద్ధి పనులతో గ్రామాలకు సంక్రాంతి కళ వచ్చేసిందట!. పచ్చి అబద్ధాలను వండి వార్చేఈ ఎల్లో మీడియా ఉరఫ్‌ ఈనాడులో వచ్చిన కథనాల్లో కొన్ని ఇవి. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలన్నీ అమలు చేసి ఉంటే ప్రజలు సంతోషంగా ఉండేవాళ్లు కానీ.. తిమ్మిని బమ్మి చేసినట్లు ప్రతి వాగ్ధానాన్ని మసిపూసి మారేడు కాయ చేసేందుకు కూటమి నానా తంటాలూ పడుతూంటే ఎల్లోమీడియా ఆ అబద్ధాలకు వంతపాడుతూ మురిసిపోతోంది. ఎన్నికలకు ముందు ఒక రకమైన అసత్యాలు.. ఇప్పుడు ఇంకో రకంగా బిల్డప్‌ ఇస్తూ జనాన్ని మభ్యపెడుతోంది. 😱కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది మొదలు.. రాష్ట్రంలో అరాచకమే ఎక్కువ. జగన్‌ టైమ్‌లో జరిగిన అభివృద్దిని కూడా తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. వృద్దుల ఫించన్‌ వెయ్యి రూపాయలు పెంచడం మినహా మరే ఇతర హామీని పూర్తిగా అమలు చేయని కూటమి, ఎన్నికల ప్రణాళికలో ఉన్న సుమారు 175 వాగ్దానాల జోలికే వెళ్లలేదు. దీన్ని కప్పిపుచ్చడానికి ఎల్లో మీడియా రోజుకో కొత్త రకం భజన కీర్తలను పాడుతోంది. అయితే.. 👉జనం వాస్తవాలు తెలుసుకుంటున్నారు. సూపర్ సిక్స్ పేరుతో కూటమి నేతలు చేసిన మోసాన్ని గుర్తిస్తున్నారు. ఈ మధ్య ఒక సీనియర్ పాత్రికేయుడు ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటించినప్పుడు ప్రజల్లోని ఈ అసంతృప్తిని గమనించారు. జగన్ ఉండి ఉంటే ఫలానా స్కీమ్ కింద తమకు ఇంత డబ్బు వచ్చి ఉండేది.. చేతులలో డబ్బు ఆడేది.. అని చెప్పుకుంటున్నారట. కానీ అంతకు మూడు రెట్లు సాయం చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తమను వంచించారని ఎక్కువ మంది భావిస్తున్నారట!.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఏ స్కీమ్ కూడా ఇప్పుడు ప్రజలకు అందడం లేదు. ‘అమ్మ ఒడి’ని మార్చి ప్రతి బిడ్డకు రూ.15 చొప్పున ఇస్తామన్న కూటమి నేతలు, కావాలంటే ఇంకా పిల్లలను కనండని బంపర్ ఆఫర్ ప్రకటించిన చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత తూచ్‌ అనేశారు. జాకీ మీడియా కూడా ‘అమ్మ ఒడి’ అంటే బటన నొక్కడమని ధనం వృధా చేయడమేనని ఊదరగొట్టింది. కానీ ఇప్పుడు ఏమి జరుగుతోందో చూడండి. 👇ఈ ఏడాదికి తల్లికి వందనం లేదు పొమ్మన్నారురైతు భరోసా జాడ కనిపించడం లేదు. విద్యా దీవెన, వసతి దీవెన ఏమయ్యాయో తెలియదు. ఆరోగ్య శ్రీని నీరుకార్చే పనిలో ఉన్నారు. జగన్ ఇంటింటికి డాక్టర్ ను పంపిచే స్కీమ్ తెస్తే, ఇప్పుడు అది గాలికి పోయినట్లు ఉంది. ప్రతి వ్యక్తికి ప్రభుత్వ సేవలందించేందుకు జగన్ తెచ్చిన వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని జీతాలూ పెంచుతామని చంద్రబాబు ఉగాది పండగనాడు దైవ సాక్షిగా ప్రకటించినా.. ఇప్పుడు దానికి మంగళం పలికారు. మరోవైపు.. ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. వంట నూనెల ధరలే లీటర్‌కు రూ.30 నుంచి రూ.40 వరకూ పెరిగాయి. పప్పులు, కూరగాయల ధరలన్ని అందుబాటులో లేకుండా పోయాయి. వీటన్నిటి ఫలితంగా సంక్రాంతి వచ్చినా ప్రజలు చేతిలో డబ్బులు ఆడక ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారాలు కూడా తగ్గాయి. ఇందుకు ఉదాహరణ ఏమిటంటే.. లెక్కలు ఇలా.. 👇ఒక్క కృష్ణా జిల్లాలోనే వైఎస్ జగన్ పాలనలో 2023 లో పండగల సీజన్ అయిన అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లలో వస్త్ర వ్యాపారం రూ.3000 కోట్ల మేర జరిగితే కూటమి పాలన వచ్చిన 2024లో అదే కాలానికి కేవలం రూ.1200 కోట్లుగానే ఉంది. కిరాణా వ్యాపారం పరిస్థితి అలాగే ఉంది. గతంతో పోల్చితే ఈసారి లావాదేవీలు రూ. వెయ్యి కోట్ల తగ్గాయి. బంగారం వ్యాపారం రెండు నెలల టైమ్‌కు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.3000 కోట్ల టర్నోవర్ జరిగితే, కూటమి పాలనలో అది రూ.1500 కోట్లుగా ఉంది. ఫర్నిచర్ కొనుగోళ్లు కూడా సగానికి సగం పడిపోయాయి. అప్పట్లో రూ.800 కోట్లు ఉంటే, ఈ సారి రూ.400 కోట్లే ఉంది. వీటి ఫలితంగా జీఎస్టీ రూపంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయమూ తగ్గింది. ఏపీలో జీఎస్టీ వసూళ్లు బీహారు కన్నా తక్కువ కావడం పరిస్థితిని తెలియచేస్తుంది. జగన్ టైమ్ లో 12 శాతం జీఎస్టీ వసూళ్లతో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్ర భాగాన ఉంటే, ఈ సారి ‘- 6’ శాతం మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 👉ఈ లెక్కలు ఇలా ఉన్నా, ఎల్లో మీడియా మాత్రం సంక్రాంతికి ప్రజలంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్లుగా బిల్డప్ ఇస్తోంది. అవును.. నిజమే.. మార్గదర్శికి సంబంధించిన కేసులలో గత ప్రభుత్వం జప్తు చేసిన రూ.వెయ్యి కోట్లను ఈ ప్రభుత్వం రాగానే తీసి వేసింది కదా!.. అందువల్ల ఈనాడు వారికే పండగే కావచ్చు. సామాన్యుడికి వస్తే ఎంత? రాకపోతే ఎంత? సంక్రాంతి వరాలు రూ.6700 కోట్లు అంటూ పెద్ద బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. గతంలో జగన్ ఒక్క స్కీమ్ కింద ఈ స్థాయిలో ప్రజలకు డబ్బు ఇచ్చేవారు. కాని చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో రూ.70 వేల కోట్లకు పైగా అప్పులు చేసినా, ఆ డబ్బు అంతా ఏమైందో కాని స్కీమ్ లు అమలు చేయలేదు. 🤔నిజంగానే చెప్పిన హామీలు చెప్పినట్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ అమలు చేసి ఉంటే సుమారు రూ.40 వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఇచ్చి ఉండాలి. కానీ అందులో ఆరోవంతు నిధులు కూడా ఇవ్వలేదు. ఉద్యోగులకు, వివిధ వర్గాలకు ఇవ్వాల్సిన మొత్తాలలో కొద్ది, కొద్దిగా ఇచ్చి పండగ చేసుకోమంటోంది. ఉద్యోగులకు రూ.25 వేల కోట్ల బకాయిలు ఉంటే రూ.1300 కోట్లు ఇచ్చారు. ఇది ఏ మూలకు వస్తాయని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌, ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా అర కొరగానే ఇచ్చారని చెబుతున్నారు. ఉద్యోగులకు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటెరిమ్ రిలీఫ్ ప్రకటిస్తామని అన్నా, దాని గురించి మాట్లాడడం లేదు. ఆర్థికంగా సమస్యలు ఉన్నాయని వాస్తవ పరిస్థితి చెప్పడం వేరు. మొత్తం హామీలు అమలు చేసినట్లు బిల్డప్ ఇచ్చి ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ప్రచారం చేసుకోవడం వేరు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. 😥గతంలో ధరలు కొద్దిగా పెరిగినా, విద్యుత్ చార్జీల సర్దుబాటు జరిగినా ఇదే చంద్రబాబు ,పవన్ ఏ స్థాయిలో విమర్శలు చేసేవారు! ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటివి ఎంత దారుణమైన కథనాలు రాసేవి. మరి ఇప్పుడు రూ.15 వేల కోట్ల విద్యుత్ భారం మోపినా, రెండున్నర లక్షల మంది వలంటీర్ల నోటికాడి కూడు తీసేసినా, తల్లులకు ప్రతి ఏటా వచ్చే రూ.15 వేలు ఎగ్గొట్టినా మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని మోసం చేసినా, నిరుద్యోగులకు రూ.3,000 ఖాయమని చెప్పి ఊరించి తూచ్ అంటున్నా, వారంతా సంతోషంగా ఉన్నారని భ్రమ పడాలన్నది ఎల్లో మీడియా లక్ష్యంగా ఉందనుకోవాలి. అభివృద్ధి పనులతో గ్రామాలకు సంక్రాంతి కళ వచ్చేసిందని ఈనాడు బోగస్ వార్తలు ఇస్తోంది. ప్రజల చేతిలో డబ్బు ఉంటే సంక్రాంతి పండగ బాగా చేసుకుంటారు కాని, కహానీలు చెబితే కడుపు నిండుతుందా?. కాకపోతే క్యాసినోలు, జూదాలు, కోడి పందేలు ఆడించి, ఎక్కడబడితే అక్కడ మద్యం అమ్మించి ఇదే సంక్రాంతి అనుకోండని అంటున్నారు. పేదలు వీటితో సరిపెట్టుకోవలసిందేనా!..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Hyderabad Woman Paying Rs 525 For Corn7
కోహ్లీ రెస్టారెంట్‌లో ఇంత రేటా..?

హైదరాబాద్‌లోని ఒక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థి.. విరాట్ కోహ్లీ రెస్టారెంట్‌ (Virat Kohli Restaurant)లో రూ. 525 విలువైన డిష్‌ ఆర్డర్ చేసి నిరుత్సాహానికి గురైంది. కోహ్లి యాజమాన్యంలోని రెస్టో బార్ అయిన వన్8 కమ్యూన్‌లో ఈ ఘటన జరిగింది.ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థి స్నేహ.. విరాట్ కోహ్లీ రెస్టారెంట్‌లో పెరి పెరి కార్న్ రిబ్స్ (మొక్కజొన్న ముక్కలు) కోసం ఏకంగా రూ. 525 చెల్లించినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఎక్స్ (Twitter) ఖాతాలో చేసింది. ఫోటోలలో గమనిస్తే.. మొక్కజొన్న ముక్కలు రుచి ఉండటానికి పర్మేసన్ చీజ్, స్కాలియన్​తో వడ్డించి ఉండటం చూడవచ్చు.paid rs.525 for this today at one8 commune 😭 pic.twitter.com/EpDaVEIzln— Sneha (@itspsneha) January 11, 2025ఈ ఘటనపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ''ఆర్డర్ చేయడానికి ముందు మీకు ధర తెలుసు, కాబట్టి మీ ఏడుపు ఆపండి" అని ఒకరు కామెంట్ చేయగా.. రెస్టారెంట్ వాతావరణం, శుభ్రత, సర్వీస్ వంటి వాటికి ఎక్కువ డబ్బులు చెల్లిస్తున్నట్లు మరొకరు కామెంట్ చేశారు. నిజానికి ఫుడ్ కోసం కాకుండా, వైబ్స్ కోసం ఎక్కువ డబ్బు చెల్లిస్తున్నారని ఇంకొకరు అన్నారు.ప్రముఖ నగరాలలోని ఫ్యాన్సీ రెస్టారెంట్లలో ధరలు భారీగా ఉంటాయని దాదాపు అందరికీ తెలుసు. అయితే ధరకు తగ్గ క్వాంటిటీ మాత్రం లభించే అవకాశం లేదు. ఇది ఫుడ్ లవర్స్ (Food Lovers)​ను బాధపెడుతోంది. బయట ఇదే ఫుడ్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది. లగ్జరీ అనుభవాన్ని పొందాలంటే మాత్రం ఎక్కువ డబ్బు ఖర్చు చేయకతప్పదు.🚨 Visited One8 Commune in Bengaluru today and here's my experience. Spoiler alert: It was terrible.1. They have valet parking but it's priced at ₹100. Since the road is busy, you have no other option than paying.2. The front desk initially refused entry because I was… https://t.co/8zRSoSwk79 pic.twitter.com/zIyBH7xKYn— Sumukh Rao (@RaoSumukh) December 17, 2023

Sankranthiki Vasthunam Movie Review And Rating In Telugu8
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ

టైటిల్‌: ‘సంక్రాంతికి వస్తున్నాం’నటీనటులు: వెంకటేశ్‌, ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి, వీకే నరేశ్‌, వీటీ గణేష్‌, సాయి కుమార్‌, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర లిమాయే తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు: శిరీష్‌, దిల్‌ రాజుదర్శకత్వం: అనిల్‌ రావిపూడిసంగీతం: భీమ్స్‌ సిసిరిలియోసినిమాటోగ్రఫీ: సమీర్‌ రెడ్డిఎడిటర్‌: తమ్మిరాజువిడుదల తేది: జనవరి 14, 2025​ఈ సంక్రాంతికి చివరిగా వచ్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Review). రిలీజ్‌ విషయంలో చివరిది అయినా.. ప్రమోషన్స్‌లో మాత్రం మిగతా సినిమాలతో పోలిస్తే ఇదే ముందంజలో ఉంది. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు చేసినంత ప్రమోషన్‌ మరే సినిమాకు చేయలేదు. దానికి తోడు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌ అదిరిపోవడంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’పై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ‘ఫ్యామిలీతో వచ్చిన ప్రతిసారి విక్టరీ గ్యారెంటీ’ అనిపించుకున్న వెంకటేశ్‌ ఖాతాలో మరో ‘ ఫ్యామిలీ విక్టరీ’ పడిందా రివ్యూలో చూద్దాం.కథేంటేంటే.. డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్‌ వైడీ రాజు(వెంకటేశ్‌) ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌. మంచి కోసం తాను చేసే ఎన్‌కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్‌ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్‌), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు. కట్‌ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్‌)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్‌(నరేశ్‌). పార్టీ ప్రెసిడెంట్‌(వీటీ గణేశ్‌) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్‌ హౌజ్‌ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్‌ అతన్ని కిడ్నాప్‌ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్‌.. ఎలాగైనా బీజూ గ్యాంగ్‌ నుంచి ఆకేళ్లను రప్పించాలకుంటాడు. ఐపీఎస్‌ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్‌ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్‌ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్‌ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్‌ ఎలా సక్సెస్‌ చేశాడనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. కొన్ని కథలు మన ఊహకందేలా సింపుల్‌గా ఉంటాయి. సినిమా ప్రారంభం మొదలు ఎండ్‌ వరకు ప్రతీది అంచనాకు తగ్గట్టే ఉంటాయి. కానీ తెరపై చూస్తుంటే తెలియని ఒక ఆనందం కలుగుతుంది. పాత కథ, రొటీన్‌ సీన్లే అయినప్పటికీ ఎంటర్‌టైన్‌ అవుతుంటాం. అలాంటి సినిమాలను తెరకెక్కించడం అనిల్‌ రావిపూడికి వెన్నతో పెట్టిన విద్య. సింపుల్‌ పాయింట్‌ని తీసుకొని రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. గత సినిమాల మాదిరే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. టైటిల్‌ మాదిరే సంక్రాంతికి అసలైన సినిమా ఇది.(Sankranthiki Vasthunam Review)అనిల్‌ రావిపూడి(Anil Ravipudi) రిలీజ్‌ ముందే సినిమా కథంతా చెప్పేస్తుంటాడు. ఈ సినిమా విషయంలోనూ అదే చేశాడు. ట్రైలర్‌లోనే కథంతా చెప్పేశాడు. హీరోహీరోయిన్ల క్యారెక్టర్‌ ఎలా ప్రవర్తిస్తాయో కూడా ప్రమోషన్స్‌లోనే చెప్పేశాడు. స్టోరీ మొత్తం తెలిసినా కూడా తెరపై ఆ కథను చూసి ఎంజాయ్‌ చేయాలని ప్రతి ప్రేక్షకుడు అనుకుంటాడు. దానికి కారణం.. ఈ కథ మెయిన్‌ పాయింట్‌. భార్య, భర్త, ప్రియురాలు.. ఈ మూడు పాత్రలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కనిపిస్తాయి. వాళ్ల మధ్య వచ్చే ప్రతీ సీన్‌ మన నిజ జీవితంలో ఎక్కడో ఒక చోట చూసే ఉంటాం. అలాంటి పాయింట్‌ పట్టుకోవడమే అనిల్‌ రావిపూడి సక్సెస్‌. ఓ ఫ్యామిలీ స్టోరీకి ఓ వెరైటీ ఇన్వెస్టిగేషన్‌ యాడ్‌ చేసి ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా కథనాన్ని నడిపించాడు. ఆకెళ్ల కిడ్నాప్‌ సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. అయితే ఈ కిడ్నాప్‌ సీన్‌ని కూడా ఎంటర్‌టైనింగ్‌గానే తీర్చిదిద్ది.. కథనం మొత్తం ఫుల్‌ కామెడీ వేలో సాగుతుందనే ముందే చెప్పేశాడు దర్శకుడు. ఆ తర్వాత రాజు ఫ్యామిలీ పరిచయం నవ్వులు పూయిస్తుంది. వైడీ రాజు కొడుకు బుల్లిరాజు పండించే కామెడీకి పడిపడి నవ్వుతారు. వైడీ రాజు ఇంటికి మీనాక్షి వచ్చిన తర్వాత కామెడీ డోస్‌ డబుల్‌ అవుతుంది. ఒక పక్క భార్య, మరో పక్క మాజీ ప్రియురాలుతో హీరో పడే బాధ థియేటర్‌లో నవ్వులు పూయిస్తుంది. ఆహ్లాదకరమైన పాటలు... పొట్టచెక్కలయ్యే కామెడీ సీన్లతో ఫస్టాఫ్‌ ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌ ప్రారంభం అయిన కాసేపటికే కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. జైలర్‌ జార్జ్‌ ఆంటోనీ(ఉపేంద్ర లిమాయే)తో వచ్చే కొన్ని సీన్లు అంతగా ఆకట్టుకోవు. ఆస్పత్రి సీన్‌ కూడా రొటీన్‌గానే అనిపిస్తుంది. ‘ఆవకాయ’ సీన్‌కు అయితే పడిపడి నవ్వుతారు. క్లైమాక్స్‌ని పకడ్బందీగా రాసుకున్నాడు. క్లైమాక్స్‌ యాక్షన్‌ సీన్‌ అయితే అదిరిపోతుంది. అక్కడ వెంకటేశ్‌ చెప్పే డైలాగ్స్‌ నవ్వులు పూయిస్తాయి. ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతినకుండా.. మగవాళ్లకు మనో ధైర్యాన్ని ఇచ్చేలా ఆ డైలాగ్స్‌ ఉంటాయి. ముగింపులో ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది. మొత్తంగా సంక్రాంతికి చూడాల్సిన మాంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఎవరెలా చేశారంటే.. ఇద్దరి ఆడవాళ్ల మధ్య నలిగిపోయే పాత్రను వెంకటేశ్‌(Venkatesh) చేస్తే ఎలా ఉంటుందో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ చిత్రంలోనే చూసేశాం. ఆయన కామెడీ టైమింగ్‌ గురించి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా వెంకీ అలాంటి పాత్రే చేశాడు. మాజీ ప్రియురాలు, భార్య మధ్య నలిగిపోయే యాదగిరి దామోదర రాజు పాత్రలో ఒదిగిపోయాడు. ఇద్దరి ఆడాళ్ల మధ్య నలిగిపోతూ నవ్వులు పూయించాడు. యాక్షన్‌తో అలరించడమే కాకుండా పాట పాడి ఆకట్టుకున్నాడు. ఇక చదువురాని పల్లెటూరి అమ్మాయి, రాజు భార్య భాగ్యంగా ఐశ్వర్య రాజేశ్‌ తనదైన నటనతో ఆకట్టుకుంది.రాజు మాజీ ప్రియురాలు, ఐపీఎస్‌ అధికారి మీనాక్షిగా మీనాక్షి చౌదరి అదరగొట్టేసింది. తొలిసారి ఇందులో యాక్షన్‌ సీన్‌ కూడా చేసింది. ఇక వీరందరితో పాటు ముఖ్యంగా మట్లాడుకోవాల్సిన మరో పాత్ర బుల్లి రాజు. ఈ పాత్రలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌ రేవంత్‌ ఒదిగిపోయాడు. ఇంత మంది స్టార్స్‌ ఉన్నప్పటికీ.. తనదైన నటనతో అందరి దృష్టి ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్‌ ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగాడానికి బుల్లిరాజు పాత్ర కూడా ఒక ప్రధాన కారణం. ‘కొరికేస్తా.. కొరికేస్తా’ అంటూ ఈ బుడ్డోడు చేసిన కామెడీకి ప్రేక్షకులు పలగబడి నవ్వారు. నరేశ్‌, సాయి కుమార్‌, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా భీమ్స్‌ అందించిన సంగీతం సినిమాకే హైలెట్‌. అద్భుతమైన పాటలతో పాటు అదిరిపోయే బీజీఎం ఇచ్చాడు. ‘గోదారి గట్టు మీద...’పాటతో పాటు ప్రతి పాట తెరపై చూసినప్పుడు మరింత ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌ డెస్క్‌

Bail Granted To MLA Padi kaushik Reddy9
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డికి బెయిల్‌

హైదరాబాద్‌, సాక్షి: హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డికి భారీ ఊరట లభించింది. మంగళవారం ఉదయం ఆయనకు బెయిల్‌ లభించింది. రెండు కేసుల్లోనూ జడ్జి ఆయనకు బెయిల్‌ ఇచ్చారు. జిల్లా సమీక్షా సమావేశంలో తోటి ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించారని ఆయనపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.ఆదివారం కరీంనగర్‌(Karimnagar) కలెక్టరేట్‌లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా.. కౌశిక్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌(Sanjay)ల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుని సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందడంతో కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్‌ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ వచ్చి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. రాత్రంతా ఆయన త్రీటౌన్‌ పోలీస్టేషన్‌లో ఉన్నారు. ఈ ఉదయం వైద్య పరీక్షల అనంతరం పాడి కౌశిక్‌రెడ్డిని (Padi kaushik Reddy) రెండో అదనపు అదనపు మెజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టారు. రూ.10 వేలప్పున మూడు పూత్తులు ఇవ్వాలని ఆదేశిస్తూ మెజిస్ట్రేట్‌ బెయిల్‌ మంజూరు చేశారు.వాదనలు ఇలా..రెండో అదనపు జ్యూడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ప్రేమ లత ముందు కరీంనగర్‌ పోలీసులు కౌశిక్‌ను హాజరు పర్చారు. కౌశిక్‌రెడ్డిపై గతంలోనూ పలు కేసులు ఉన్నందున రిమాండ్‌ విధించాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపించారు. అయితే.. కౌశిక్‌పై నమోదు అయిన సెక్షన్స్ అన్నీ బెయిలేబుల్ కాబట్టి రిమాండ్ రిజెక్ట్ చేయాలని బీఆర్ఎస్ లీగల్ టీం వాదించింది. ఈ క్రమంలో.. అర్ణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు(2014) తీర్పు ప్రకారం రిజెక్షన్ కోసం కోరింది. దీంతో బీఆర్‌ఎస్‌ లీగల్‌ టీం వాదనతో ఏకీభవించిన జడ్జి.. బెయిల్‌ మంజూరు చేశారు. ఇకముందు అలాంటి దూకుడు ప్రదర్శించొద్దని కౌశిక్‌ను హెచ్చరించిన మెజిస్ట్రేట్.. కోర్ట్ ప్రొసీజర్స్ ప్రకారం కరీంనగర్ లో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దనీ ఆదేశించారు.రేపు మాట్లాడతా: కౌశిక్‌ రెడ్డితెలంగాణా ప్రజలు, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది హైడ్రామా. ఈ హైడ్రామాలో నాకు మద్దతు తెలిపిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితతో పాటు అందరికీ నా ధన్యవాదాలు. పండుగ కాబట్టి రాజకీయాలు మాట్లాడొద్దనుకుంటున్నా. రేపు హైదరాబాద్ లో పూర్తి వివరాలు వెల్లడిస్తా. కోర్టు ప్రొసీజర్స్ ప్రకారం ఏ రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి కూడా నిబంధనలు అడ్డువస్తున్నాయి అని మీడియాను ఉద్దేశించి అన్నారాయన.

Australian Open: Djokovic Survives Scare From Indian Origin Fanboy Basavareddy10
Australian Open: జొకోవిచ్‌కు ముచ్చెమటలు పట్టించిన తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్‌

అటువైపు ప్రత్యర్థి 24 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ విజేత... ఏకంగా 1126 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ప్లేయర్‌... కెరీర్‌లో ఇప్పటికే 76 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు ఆడిన అనుభవం సొంతం... ఇటువైపు ప్లేయర్‌కు ‘వైల్డ్‌ కార్డు’ ద్వారా కెరీర్‌లోనే తొలి గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం... ఎదురైన ప్రత్యర్థి తానెంతో ఇష్టపడే ఆటగాడు... ఇద్దరి బలాబలాలు పరిశీలిస్తే మ్యాచ్‌ ఏకపక్షంగా వరుస సెట్‌లలో ముగియడం ఖాయమని విశ్లేషకుల ఏకాభిప్రాయం... కానీ అలాంటిదేమీ జరగలేదు. ఒకే ఒక్క మ్యాచ్‌తో టెన్నిస్‌ ప్రపంచాన్ని ఆకర్షించేందుకు వచ్చిన అవకాశాన్ని ఆ కుర్రాడు వదులుకోలేదు. తన అసమాన పోరాటపటిమతో అందరి దృష్టిలో పడ్డాడు. అతడే 19 ఏళ్ల నిశేష్‌ బసవరెడ్డి... తెలుగు సంతతికి చెందిన అమెరికన్‌ టెన్నిస్‌ టీనేజ్‌ రైజింగ్‌ స్టార్‌.. సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో నిశేష్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయినా... ప్రతి పాయింట్‌ సాధించేందుకు జొకోవిచ్‌ను తెగ కష్టపెట్టాడు. నిశేష్‌కు ఎంతో భవిష్యత్‌ ఉందని మ్యాచ్‌ అనంతరం జొకోవిచ్‌ కూడా వ్యాఖ్యానించడం విశేషం. మెల్‌బోర్న్‌: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌సింగిల్స్‌ టైటిల్‌ లక్ష్యంగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ తొలి అడ్డంకిని అధిగమించాడు. ప్రపంచ 107వ ర్యాంకర్, అమెరికన్‌ రైజింగ్‌ టీనేజ్‌ టెన్నిస్‌ స్టార్‌ నిశేష్‌ బసవరెడ్డితో జరిగిన తొలి రౌండ్‌ పోరులో జొకోవిచ్‌ గెలిచి 18వ సారి ఈ టోర్నీలో రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. 2 గంటల 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నిశేష్‌ 6–4, 3–6, 4–6, 2–6తో జొకోవిచ్‌ చేతిలో పోరాడి ఓడిపోయాడు. గత నెలలోనే ప్రొఫెషనల్‌గా మారిన 19 ఏళ్ల నిశేష్‌ ఏమాత్రం తడబడకుండా తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. బేస్‌లైన్‌ వద్ద సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూనే... అడపాదడపా డ్రాప్‌ షాట్‌లు... కళ్లు చెదిరే రిటర్న్‌లతో వరుసగా 21వ ఏడాది గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడుతోన్న జొకోవిచ్‌కు ఇబ్బంది పెట్టడంలో నిశేష్‌ సఫలమయ్యాడు. తొలి సెట్‌లోని ఎనిమిదో గేమ్‌లో జొకోవిచ్‌ సరీ్వస్‌ను బ్రేక్‌ చేసిన నిశేష్‌ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 5–3తో ముందంజ వేశాడు. తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్‌ సర్వీస్‌ కాపాడుకోగా... పదో గేమ్‌లో నిశేష్‌ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని తొలి సెట్‌ను 49 నిమిషాల్లో 6–4తో సొంతం చేసుకోవడంతో మ్యాచ్‌ను మైదానంలో ప్రత్యక్షంగా చూస్తున్న వేలాది మంది ప్రేక్షకులు, టీవీల ముందున్న లక్షలాది వీక్షకులు ఆశ్చర్యపోయారు. తొలి సెట్‌ నెగ్గిన ఉత్సాహంతో రెండో సెట్‌లోనూ నిశేష్‌ భేషుగ్గా ఆడాడు. అయితే అపార అనుభవజ్ఞుడైన జొకోవిచ్‌ టీనేజర్‌ నిశేష్‌ ఆటతీరుపై అవగాహన పెంచుకొని దూకుడు పెంచాడు. స్కోరు 4–3 వద్ద ఎనిమిదో గేమ్‌లో నిశేష్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన జొకోవిచ్‌ తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని 44 నిమిషాల్లో రెండో సెట్‌ దక్కించుకొని లయలోకి వచ్చాడు. రెండో సెట్‌లోని చివరి గేమ్‌ ఆడుతున్న సమయంలో నిశేష్‌ కాలు బెణకడంతో అతను ఆ తర్వాత చురుగ్గా కదల్లేకపోయాడు. మరోవైపు జొకోవిచ్‌ మరింత జోరు పెంచాడు. మూడో సెట్‌లోని తొలి గేమ్‌లోనే నిశేష్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన జొకోవిచ్‌ ఆ తర్వాత తన సరీ్వస్‌లను కాపాడుకొని 43 నిమిషాల్లో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. నాలుగో సెట్‌లో కూడా తొలి గేమ్‌లో, ఐదో గేమ్‌లో నిశేష్‌ సర్వీస్‌లను బ్రేక్‌ చేసిన జొకోవిచ్‌ కళ్లు చెదిరే ఏస్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ‘నిశేష్‌ పరిపూర్ణ క్రీడాకారుడిలా ఆడాడు. అతను ఆడిన కొన్ని షాట్‌లు నన్నే ఆశ్చర్యానికి గురి చేశాయి. చివరి పాయింట్‌ వరకు పోరాటపటిమతో ఆకట్టుకున్నాడు. భవిష్యత్‌ లో నిశేష్‌ ఆటతీరును చాలాసార్లు చూస్తాము. ఇందులో సందేహం లేదు’ అని మ్యాచ్‌ ముగిశాక జొకోవిచ్‌ వ్యాఖ్యానించాడు. 2005లో అమెరికాలో పుట్టి పెరిగిన నిశేష్‌ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశాడు. నిశేష్‌ తల్లిదండ్రులు మురళీ రెడ్డి, సాయిప్రసన్న స్వస్థలం నెల్లూరు జిల్లా. 1999లో ఉద్యోగరీత్యా భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తొలి రౌండ్‌లో ఓడిన నిశేష్‌కు 1,32,000 ఆ్రస్టేలియన్‌ డాలర్ల (రూ. 70 లక్షల 47 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 10 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీ ముగిశాక విడుదల చేసే ర్యాంకింగ్స్‌లో నిశేష్‌ కెరీర్‌ బెస్ట్‌ 104వ ర్యాంక్‌కు చేరుకుంటాడు. అల్‌కరాజ్‌ అలవోకగా... పురుషుల సింగిల్స్‌లో సోమవారం స్టార్‌ ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. 11వ సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టగా... డిఫెండింగ్‌ చాంపియన్‌ సినెర్‌ (ఇటలీ), మూడో సీడ్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. 2023 ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ రన్నరప్‌ సిట్సిపాస్‌ 5–7, 3–6, 6–2, 4–6తో మికిల్సన్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. 2018 తర్వాత ఈ టోర్నీలో సిట్సిపాస్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోవ డం గమనార్హం. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో సినెర్‌ 7–6 (7/2), 7–6 (7/5), 6–1తో నికోలస్‌ (చిలీ)పై, అల్‌కరాజ్‌ 6–1, 7–5, 6–1తో షెవ్‌చెంకో (కజకిస్తాన్‌)పై విజయం సాధించారు. పసారో (ఇటలీ)తో జరిగిన మ్యాచ్‌లో పదో సీడ్‌ దిమిత్రోవ్‌ గాయం కారణంగా రెండో సెట్‌లో వైదొలిగాడు. 21-టెన్నిస్‌ ఓపెన్‌ శకంలో (1968 నుంచి) వరుసగా 21వ ఏడాది జొకోవిచ్‌ గ్రాండ్‌స్లామ్‌ టోరీ్నలో ఒక్క విజయమైనా సాధించాడు. ఈ జాబితాలో రోజర్‌ ఫెడరర్‌ (22 ఏళ్లు) మాత్రమే ముందున్నాడు. 429-ఓపెన్‌ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా ఫెడరర్‌ (429 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్‌ సమం చేశాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో జొకోవిచ్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో బరిలోకి దిగితే ఫెడరర్‌ రికార్డును అధిగమిస్తాడు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పై రాజ్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు

జమ్ము:పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే) లేకుండా జమ్ముకశ్మీర్‌(Ja

title
ఓట్ల కోసం బంగారం పంచుతున్నారు: కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ:ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.ఎన్న

title
కశ్మీర్‌లో పేలిన మందుపాతర..ఆరుగురు జవాన్లకు గాయాలు

జమ్ము:జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు(ఎల్‌ఓసీ) వద్ద మంగళవారం(జనవర

title
జుకర్‌బర్గ్‌ వ్యాఖ్యలు.. మెటాకు భారత్‌ సమన్లు

సోషల్‌ మీడియా దిగ్గజం మెటాకు కేంద్రం సమన్లు జారీ చేయనుంది.

title
‘చంద్రబాబు ఎప్పుడు చెయ్యిస్తారో చెప్పలేం’

గత రెండు  సార్వత్రి ఎన్నికల్లో 280 ఫ్లస్‌ సీట్లతో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగే స్థాయి నుంచి..

NRI View all
title
Sankranti 2025 : జపాన్‌లో తెలుగువారి సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి వచ్చిందంటే ఊరా వాడా అంతా సంబరంగా జరుపుకుంటారు.

title
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా

ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్

title
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!

అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్‌ దిగ్గజం యాపిల్‌ 185 మంది ఉద్యోగులను త

title
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి

title
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)

Advertisement
Advertisement