Putin
-
కుదిరితే కప్పు టీ
మాస్కో: భారత్, రష్యా మధ్య దశాబ్దాలుగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. భారత ప్రధానమంత్రులు ఎవరైనా సరే రష్యాతో అనుబంధానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. రష్యా అధినేతలు సైతం అదే రీతిలో స్పందిస్తుంటారు. ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో తన స్నేహం, అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. మోదీతో చక్కటి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ప్రపంచదేశాల అధినేతల్లో తనకున్న కొద్ది మంది మిత్రుల్లో మోదీ కూడా ఒకరని అన్నారు.పుతిన్ తాజాగా మీడియా ప్రతినిధుల వార్షిక సమావేశంలో మాట్లాడారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో తేనీరు సేవిస్తూ ఏ దేశ అధినేతతో సంభాషించాలని మీరు కోరుకుంటారు? అని ప్రశ్నించగా, భారత ప్రధాని మోదీతోపాటు జర్మనీ మాజీ చాన్స్‌లర్ హెల్ముత్ కోల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు జాక్విస్ చిరక్, ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ, చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో మాట్లాడడం ఇష్టమని, వారంతా తనకు మంచి స్నేహితులని స్పష్టంచేశారు. కుదిరితే వారితో టీ సేవిస్తూ సంభాషించడానికి ఇష్టపడతానని వెల్లడించారు.బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా, రష్యా, ఇండియాతో కూడిన ‘బ్రిక్స్’ కూటమి పశ్చిమ దేశాలకు వ్యతిరేకం కాదని పుతిన్ తేల్చిచెప్పారు. తమ కూటమి దేశాల ప్రయోజనాల కోసం తప్ప ఇతర దేశాలకు వ్యతిరేకంగా తాము పనిచేయడం లేదని వివరించారు. ఇదిలా ఉండగా, పుతిన్ వచ్చే ఏడాది మొదట్లో భారత్‌లో పర్యటించబోతున్నారు. ప్రతిఏటా కనీసం ఒక్కసారైనా భేటీ కావాలని పుతిన్, మోదీ ఇప్పటికే నిర్ణయించుకున్నారు. -
మీరు రష్యాలో ఉంటేనే సేఫ్ అనుకుంటా సార్!
-
అణ్వాయుధ దాడికి పుతిన్ ఆదేశం.. ప్రపంచదేశాల ఆందోళన
మాస్కో: ప్రపంచమంతా ఎంతగానో భయపడుతున్నట్లే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అణు క్షిపణి సాతాన్-2ను ఉక్రెయిన్‌పై ప్రయోగించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలిసారిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి.ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలు అందించడం గురించి పశ్చిమ దేశాలు యోచిస్తున్న సమయంలో పుతిన్ నుంచి ఈ ఆదేశాలు వెలువడటం గమనార్హం. రష్యాలో రూపొందిన సాతాన్-2 క్షిపణి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణు క్షిపణి. దీనికి ఏకకాలంలో డజన్ల కొద్దీ అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. ఈ అణు క్షిపణి బరువు 208.1 టన్నులు. ఇది 10 టన్నుల వరకు పేలోడ్‌ను మోయగలదు. దీని స్ట్రైక్ రేంజ్ 35 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ వివరాల ఆధారంగా ఈ క్షిపణి ఎంత ప్రమాదకరమో ఇట్టే ఊహించుకోవచ్చు.రష్యా ఇప్పుడు ఈ క్షిపణికి ఆర్ఎస్-28 సర్మత్ అనే పేరు పెట్టింది. ప్రపంచదేశాలు దీనిని సాతాన్-2 పేరుతో పిలుస్తున్నాయి. దీనిని రష్యా విజయవంతంగా పరీక్షించిన తర్వాత, 2023లో దీనిని సైన్యంలో చేర్చింది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన తర్వాత రష్యా ఈ క్షిపణిని పరీక్షించింది. ఈ క్షిపణిని ఆధునిక అవసరాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు.ఇది కూడా చదవండి: నైజీరియన్ యువతులతో వ్యభిచారం 9 మంది అరెస్ట్ -
అణ్వాయుధాల వాడకంపై పుతిన్ సంచలన నిర్ణయం
మాస్కో:ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తీవ్రమవనుందా.. వెయ్యి రోజుల నుంచి రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇక ముందు కొత్త మలుపు తిరగనుందా.. రెండు దేశాల యుద్ధం మరో ప్రపంచ యుద్ధంగా మారనుందా..అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే అవుననే తెలుస్తోంది.తాజాగా రష్యా అణుబాంబుల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే ఫైల్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేశారు. అణుబాంబులు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే..దాన్ని ఆ రెండు దేశాలు కలిసి దాడిగానే రష్యా పరిగణించనుంది. ఇలాంటి సందర్భాల్లో అణ్వాయుధాలు లేని దేశంపైనా రష్యా దాడి చేయనుంది.తాము అందజేసే లాంగ్రేంజ్ క్షిపణులను రష్యాపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతించిన నేపథ్యంలో అణ్వాయుధాలపై పుతిన్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.ఉక్రెయిన్‌కు మద్దతుగా రష్యాపై ఒకవేళ పశ్చిమదేశాలు నేరుగా దాడి చేస్తే వాటిపై అణ్వాయుధాలు వాడటానికి వీలుగా నిబంధనలు సవరించినట్లు సమాచారం. -
ట్రంప్‌తో చర్చలకు సిద్ధం: పుతిన్
మాస్కో: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఎన్నికల్లో విజయానికి ట్రంప్‌ను అభినందించారు. ట్రంప్‌ను ధైర్యశాలిగా అభివర్ణించారు. సోచిలో శుక్రవారం ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. వైట్‌హౌస్‌లో తొలి విడతలో ట్రంప్ అన్నివైపుల నుంచీ ఒత్తిళ్లు ఎదుర్కొన్నారని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముగింపు పలకగలనని ట్రంప్ అనడంపై స్పందిస్తూ.. కనీసం దృష్టి పెట్టాల్సిన అంశమిదని రష్యా అధ్యక్షుడు అన్నారు. జూలైలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంపై మాట్లాడుతూ.. ఆయనపై ఒక అభిప్రాయానికి రావడానికి ఇది దోహదపడిందని పేర్కొన్నారు. కాల్పులు జరిగి చెవి నుంచి రక్తమోడుతున్నా.. ట్రంప్ వెంటనే తేరుకొని పిడికిలి బిగించి.. ఫైట్, ఫైట్, ఫైట్.. అని నినదించిన విషయం తెలిసిందే. దీనిపై పుతిన్ మాట్లాడుతూ.. ‘ట్రంప్ చక్కగా స్పందించారు. ధైర్యంగా పరిస్థి తులను ఎదుర్కొ న్నారు. ధీశాలి’ అని కితాబి చ్చారు. గురువారం ట్రంప్ ఎన్బీసీ ఛానల్‌తో మాట్లాడు తూ.. పుతిన్‌తో మాట్లాడాలని భావిస్తున్నా నన్నారు. దీనిపై పుతిన్ స్పందిస్తూ ట్రంప్‌తో చర్చలకు సిద్ధమని విలేకరులతో అన్నారు. సూపర్ పవర్ దేశాల జాబితాలో భారత్‌ను చేర్చాలిప్రపంచంలోని అత్యంత బలీయమైన దేశాల జాబితాలో భారత్‌ను చేర్చాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ప్రపంచదేశాలన్నింటిలోకి భారత ఆర్థికవ్యవస్థే అతి వేగంగా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. శుక్రవారం పుతిన్ సోచిలో ఒక కార్యక్రమంలో మాట్లాడారు. -
అణు క్షిపణుల పరీక్షకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశం
మాస్కో: ఉక్రెయిన్ విషయంలో పశ్చిమ దేశాలపై పెరుగుతున్న ఒత్తిడి మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ న్యూక్లియర్ ఫోర్స్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. క్షిపణి ప్రయోగాలకు కసరత్తు వెంటనే ప్రారంభించాలని సూచించారు. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని సైనిక అధికారులతో జరిగిన వీడియో సమావేశంలో పుతిన్ ఆదేశించారు. పుతిన్ ఆదేశాల మేరకు రష్యా అణు దళం అణు క్షిపణులను పరీక్షించడం మొదలుపెట్టింది. ఉక్రెయిన్‌కు పెరుగుతున్న పాశ్చాత్య దేశాల మద్దతు నేపథ్యంలో అణుశక్తి సామర్థ్యాన్ని ప్రస్తావించిన పుతిన్.. రష్యాలోని అణు ఆయుధాగారం దేశ సార్వభౌమాధికారం, భద్రతకు నమ్మదగిన హామీ అని పేర్కొన్నారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కొత్త హెచ్చరికలు, ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుంటే, యుద్ధానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం చాలా ముఖ్యమని పుతిన్ పునరుద్ఘాటించారు.కాగా కమ్చట్కా ద్వీపకల్పంలోని కురా టెస్టింగ్ రేంజ్‌లోని ప్లెసెట్స్క్ లాంచ్ ప్యాడ్ నుంచి యార్స్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)ను సైన్యం పరీక్షించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని క్షిపణులు తమ లక్ష్యాలను ధ్వంసం చేశాయని పేర్కొంది. గత నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా, నాటో మిత్రదేశాలను హెచ్చరించారు. రష్యా పై దాడులు చేసేందుకు పాశ్చాత్య దేశాలు ఇచ్చిన లాంగ్ రేంజ్ ఆయుధాలను ఉక్రెయిన్ ఉపయోగిస్తే, రష్యాపై నాటో యుద్ధం ప్రారంభించినట్లుగా భావించాల్సి వస్తుందని పుతిన్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: మరింత దగ్గరైన పాక్- రష్యా.. సైనికాధికారుల భేటీలో వెల్లడి -
ప్రధాని మోదీ, జిన్‌పింగ్ చర్చలు
కజన్: బ్రిక్స్ సమావేశాల సైడ్‌లైన్స్‌లో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో రష్యాలో బుధవారం(అక్టోబర్ 23) సమావేశమయ్యారు. వీరిద్దరూ ఈ భేటీలో ఏం చర్చిస్తారన్నది కీలకలంగా మారింది. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, చైనా వాస్తవాధీన రేఖపై పెట్రోలింగ్ నిర్వహించే విషయంలో ఇరు దేశాల మధ్య ఇటీవలే ఒప్పందం కుదిరిన నేపథ్యంలో జిన్‌పింగ్,మోదీ భేటీ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. 2020లో సరిహద్దులో జరిగిన భారత, చైనా సైనికుల ఘర్షణల తర్వాత చైనా,భారత్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి సరికాదు: మోదీ బ్రిక్స్ రెండో రోజు సమావేశాల్లో బుధవారం ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. సమావేశాలను పుతిన్ విజయవంతంగా నిర్వహించారని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. భవిష్యత్తులో బ్రిక్స్ మరింత పటిష్టమైన వేదిక అవుతుందన్నారు. బ్రిక్స్ చిన్న,మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచంలో 40 శాతం జనాభాకు బ్రిక్స్ ప్రాతినిథ్యం వహిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు తల్లి పేరుతో మొక్క నాటే కార్యక్రమాన్ని భారత్‌లో చేపట్టామని చెప్పారు. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండటం సరికాదన్నారు. బ్రిక్స్ దేశాలు లోకల్ కరెన్సీ ద్వారా వ్యాపారం చేయడాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం అసహనం -
పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ
మాస్కో:పదహారవ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ రష్యా వెళ్లారు. పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ సమావేశమై చర్చలు జరిపారు.ఈ పర్యటనలో చైనా అధ్యకక్షుడు జిన్‌పింగ్‌తోనూ ప్రధాని సమావేశమవనున్నారు. 22,23 తేదీల్లో జరిగే బబ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకుగాను ప్రధాని మంగళవారం రష్యాలోని కజన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో ఆయనకు ఘనస్వాగతం లభించింంది. కాగా, మూడు నెలల వ్యవధిలో ప్రధాని రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి కావడం విశేషం. ఇదీ చదవండి: బ్రిక్స్ సదస్సు.. రష్యాలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం -
పుతిన్‌తో ట్రంప్ రహస్య స్నేహం.. పదవి నుంచి దిగిపోయాక ఆరుసార్లు ఫోన్
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రష్యా అధినేత పుతిన్ కోసం కోవిడ్–19 టెస్టింగ్ కిట్లు రహస్యంగా అందజేశారా? పుతిన్ వీటిని వ్యక్తిగతంగా వాడుకున్నారా? పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా పుతిన్‌తో ట్రంప్ రహస్యంగా స్నేహ సంబంధాలు కొనసాగించారా? అవుననే చెబుతోంది ఓ పుస్తకం. వాటర్‌గేట్ కుంభకోణంపై వార్తలు రాసిన విలేకరి బాబ్ వుడ్‌వర్డ్ రచించిన ‘వార్’అనే పుస్తకంలో ఈ సంచలన విషయాలు ప్రస్తావించారు. ఈ పుస్తకం ఈ నెల 15న విడుదల కానుంది. ఇందులోని కొన్ని ముఖ్య అంశాలను అమెరికా పత్రికలు బయటపెట్టాయి. ట్రంప్ 2021లో అధికారం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ట్రంప్, పుతిన్ కనీసం ఆరుసార్లు ఫోన్లో సీక్రెట్‌గా మాట్లాడుకున్నారని ట్రంప్ సహాయకుడు చెప్పినట్లు పుస్తకాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం మొత్తం అమెరికాలో సంచలనాత్మకంగా మారింది. ఇదిలా ఉండగా, వార్ పుస్తకంలోని అంశాలను ట్రంప్ ప్రచార బృందం ఖండించింది. అదొక చెత్త పుస్తకం, అందులోని కాగితాలు టాయిలెట్ టిష్యూగా వాడుకోవడానికి పనికొస్తాయని ఎద్దేవా చేసింది. ట్రంప్ సైతం స్పందించారు. కథలు చెప్పడంతో దిట్ట అయిన బాబ్ వుడ్‌వర్డ్ చెప్పే పనికిమాలిన విషయాలు నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు. అతడొక చెడ్డవ్యక్తి అని విమర్శించారు. తాజా వివాదంపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ కూడా స్పందించింది. ‘వార్’పుస్తకంలో ప్రస్తావించిన వాటిలో ఏమాత్రం వాస్తవం లేవని, అవన్నీ అభూత కల్పనలు అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తేలి్చచెప్పారు. -
పుతిన్‌పై ప్రశ్న.. రిపోర్టర్‌పై బైడెన్ ఆగ్రహం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా ఓ మీడియా ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం(సెప్టెంబర్13) వైట్‌హౌస్‌లో బైడెన్, బ్రిటన్ పీఎం కీర్ స్టార్మర్ ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించి బ్రీఫింగ్ ఇస్తుండగా స్కై న్యూస్ మీడియా ప్రతినిధి ఒకరు బైడెన్‌ను ప్రశ్నించారు.రష్యాపై ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ క్షిపణులను ప్రయోగించే విషయంలో పశ్చిమ దేశాలకు పుతిన్ వార్నింగ్ ఇవ్వడాన్ని రిపోర్టర్ ప్రస్తావించారు. దీనికి బైడెన్ స్పందిస్తూ నేను మాట్లాడే వరకు మీరు నిశ్శబ్దంగా ఉంటే మంచిది.ముందు నన్నుపూర్తిగా చెప్పనివ్వండని రిపోర్టర్‌పై మండిపడ్డారు. అనంతరం సమావేశం ముగిసిన తర్వాత రిపోర్టర్ బైడెన్‌ను తిరిగి ప్రశ్నించారు.తాను పుతిన్ గురించి అసలు ఆలోచించనని,ఉక్రెయిన్‌తో యుద్ధంలో పుతిన్ గెలిచే ఛాన్సే లేదని బైడెన్ సమానధానమిచ్చారు.ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు అమెరికా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ క్షిపణుల వినియోగించడంపై అమెరికాకు కొత్త విధానమేమీ లేదని చెప్పారు. 2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా,ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. -
పుతిన్ ఆకస్మిక చర్చల ప్రతిపాదన
ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమనీ, అందుకు ఇండియా, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించాలనీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నెల 5న చేసిన ఆకస్మిక ప్రతిపాదన ఆసక్తిని కలిగించింది. చర్చలకు ఆయన సుముఖతను చూపటం ఇది మొదటిసారి కాదు. యుద్ధం రెండున్నరేళ్ల క్రితం మొదలు కాగా చర్చల ప్రస్తావనలు గతేడాదిగా వస్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యూరోపియన్ దేశాల అధినేతలు, వివిధ అంత ర్జాతీయ సంస్థల బాధ్యులు ఈ మాట అంటూనే ఉన్నారు. కానీ కొన్ని కీలకమైన షరతులను పుతిన్ మొదటి నుంచీ పెడుతున్నారు. వీటిని జెలెన్స్కీ అంతే బలంగా తిరస్కరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చర్చలంటూ జరిగినా, అవి ఎలా ముందుకు సాగేదీ ఎవరూ చెప్పలేరు.జెలెన్స్కీ గత జూన్‌లో స్విట్జర్లాండ్‌లో తొంభైకి పైగా దేశాలతో శాంతి సదస్సు నిర్వ హించారు. కానీ ఆ సదస్సుకు ఆయన రష్యాను ఆహ్వానించలేదు. ఆ కారణంగా చైనా వెళ్లలేదు. అంతలోనే ఆయన, త్వరలో మరొక సదస్సు జరపగలమనీ, దానికి రష్యాను ఆహ్వానించగలమనీ ప్రకటించారు. ఆ సదస్సుకు హాజరయ్యేటట్లు రష్యాను ఒప్పించవలసిందిగా కోరేందుకు తన విదేశాంగ మంత్రి దిమిత్రి కునేబాను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వద్దకు రాయబారం పంపారు. ఉక్రెయిన్ ప్రతి పాదనలు ఏమిటో చూసి అపుడు స్పందించగలమన్నది రష్యా జవాబు.ఇవన్నీ జూన్, జూలై పరిణామాలు. అటువంటిది ఇపుడు పుతిన్ ఆకస్మికంగా చర్చల ప్రతిపాదన చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది ఆకస్మికం, ఆశ్చర్యకరంగా తోచటానికి మరికొన్ని కారణాలు న్నాయి. జూన్, జూలై పరిణామాల తర్వాత, కొంత వెనుకముందులుగా చర్చలు ప్రారంభం కావచ్చునని పలువురు భావిస్తుండగా, ఆ తర్వాత కొద్ది వారాలకే ఉక్రెయిన్ సైన్యం తమకూ, రష్యాకూ మధ్యగల ఉత్తర సరిహద్దు నుంచి రష్యాకు చెందిన కర్స్క్ ప్రాంతంపై వేలాది సైన్యంతో మెరుపుదాడి చేసి తగినంత భూభాగాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది. ఇది మరొక ఆశ్చర్యకర పరిణామం. ఎందుకంటే, యుద్ధం జరుగుతున్నది తూర్పు ప్రాంతాలలో. అక్కడ రష్యాది పూర్తి పై చేయిగా ఉండి రోజురోజుకూ ముందుకు చొచ్చుకొస్తున్నారు. ప్రస్తుతం పోక్రొవ్స్‌క్ అనే అతి కీలకమైన కూడలి పట్టణం వద్ద యుద్ధం కేంద్రీకృతమై ఉంది. ఆ పట్టణాన్ని కోల్పోతే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమంతా ప్రమాదంలో పడుతుంది. స్వయంగా ఉక్రె యిన్ సైన్యం చెప్తున్న దానిని బట్టి ఆ కేంద్రం కొద్ది రోజులలోనే రష్యా చేజిక్కవచ్చు. అటువంటి విపత్కర స్థితిలో పోక్రొవ్స్క్కు అదనపు బలాలను పంపి రక్షించుకునేందుకు బదులు కర్స్క్పై దాడి ఎందుకు అన్న సందేహాలు తలెత్తాయి.ఆ చర్చను కొద్దిసేపు వాయిదా వేసి ప్రస్తుతానికి వస్తే, చర్చల మాట రెండు వైపుల నుంచీ కొత్త కాదు. కానీ, అందుకు ఇండియా, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించాలనటం కొత్తమాట. ఇక్కడ ఒక స్పష్టీకరణ అవసరం. వ్లాడివాస్టోక్లో జరుగుతున్న ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం సదస్సు సందర్భంగా ఈ మాట వచ్చింది. ఒక విలేఖరి ప్రశ్నకు సమాధానంగా పుతిన్ ఈ మాట అన్నట్లు వార్తలలో కనిపించింది గానీ, అది నిజం కాదని ఆ వీడియోను చూసినపుడు అర్థమవుతుంది. పుతిన్ ఒక లిఖిత ప్రకటనను చదవటం అందులో కనిపిస్తుంది. అనగా, ముందే ఆలోచించి చెప్పిన మాట అది. వార్తలలో వెలువడిన దానిని బట్టి రష్యా అధ్యక్షుడు అన్నది, చర్చలకు తాము సిద్ధం. అందుకు ఇండియా, చైనా, బ్రెజిల్ మధ్య వర్తిత్వం వహించాలి. వారీ పని చేయగలరు. యుద్ధంతో ముడిపడి ఉన్న అన్ని సమస్యలను వారు పరిష్కరించగలరనే విశ్వాసం ఉంది. ఈ అంశంపై తాను వారితో నిరంతరం సంప్రదిస్తున్నాను. జెలెన్స్కీ, బైడెన్ ఇరువురితో మోదీ మాట్లాడగలరు. అంతర్జాతీయ సంబంధాలలో కీలక పాత్ర వహించేందుకు మోదీకి ఇది మంచి అవకాశం అన్నది పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్య. యథా తథంగా ఈ మాటలు ముఖ్యమైనవే. పుతిన్ మరికొన్ని ముఖ్యమైన మాటలన్నారు. వీడియోలో వినిపించిన ఆ మాటలు ఎందువల్లనో వార్తలలో కనిపించలేదు. అవి, ఉక్రెయిన్‌తో చర్చలకు షరతుల వంటివి. అవి ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ పాలనలో గల డొనెటెస్క్, లుహాన్స్క్, ఖేర్సాన్, జపోరిజిజియా అనే నాలుగు తూర్పు ప్రాంతాలను రష్యాకు వదలి వేస్తున్నట్లు ప్రకటించాలి. (ఇప్పటికే రష్యా అధీనంలో గల క్రిమియా గురించి ఆయన ప్రస్తావించలేదు గానీ, ఆ విషయమై రాజీకి, చర్చలకు అవకాశం లేదని గతంలోనే అన్నారు.) ‘నాటో’లో చేరబోమని కూడా ఉక్రెయిన్ ప్రకటించాలి. ఆ నాలుగు ప్రాంతాల నుంచి సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించాలి. ఇవి జరిగితే ‘అదే నిమిషంలో’ యుద్ధాన్ని విరమించి చర్చలను ప్రకటిస్తాము.అనగా ఇవి చర్చలకు షరతులన్నమాట. ఈ షరతులను పుతిన్ మొదటినుంచీ పెడుతున్నారు. ఆ విషయంలో రాజీ లేదంటున్నారు. వీటిని జెలెన్స్కీ తమ వైపు నుంచి అంతే బలంగా తిరస్కరిస్తున్నారు. పైగా, రష్యా 2014లో ఆక్రమించిన క్రిమియాను తిరిగి ఇవ్వవలసిందేనంటున్నారు. ఇదే మాట ఇటీవల కూడా పునశ్చరించారు. పైన పేర్కొన్న నాలుగు ప్రాంతాలలో గణనీయమైన భాగాన్ని ప్రస్తుత యుద్ధంలో రష్యా ఆక్రమించుకోగా, అక్కడి నుంచి ఖాళీ చేయాలంటున్నారు. నాటో సభ్యత్వం తమ హక్కని వాదిస్తున్నారు. అనగా, ఇవన్నీ చర్చలకు పుతిన్, జెలెన్స్కీల షరతులన్నమాట. తమ సార్వ భౌమత్వం, భౌగోళిక సమగ్రతల పరిరక్షణకు అవసరమని జెలెన్స్కీ చెబుతున్నారు. నాటో కూటమి విస్తరణ నుంచి ఆత్మరక్షణకూ, ఆ నాలుగు ప్రాంతాలలో మెజారిటీలో గల రష్యన్ భాషీయులపై చిరకాలంగా సాగుతున్న ఉక్రెయిన్ వేధింపులు, తరచూ ప్రాణ హననం నుంచి వారిని రక్షించుకునేందుకు ఇది తప్పనిసరి అని రష్యా వాదిస్తున్నది. ఈ షరతులలోని సహేతుకతలలోకి వెళితే రెండు వైపులా న్యాయం కనిపిస్తుంది. ఉక్రెయిన్ భౌగోళిక సమగ్రతకు రక్షణ ఉండవలసిందే. అదే విధంగా, అమెరికన్ నాటో కూటమి క్రమంగా రష్యా సరిహద్దుల వైపు విస్తరిస్తూ, ఉక్రెయిన్ను నాటోలో చేర్చు కొనజూస్తూ, రష్యా అస్తిత్వానికే ముప్పు తలపెడుతున్నపుడు, వారు ఆత్మరక్షణ కోసం ప్రయత్నించరాదని అనలేము. అట్లాగే, పై నాలుగు ప్రాంతాలలోని రష్యన్ భాషీయులపై మొదటినుంచీ తీవ్రమైన వేధింపు మాట నిజమైనందున, వారికి రక్షణ అవసరం.ఈ విధమైన పరిస్థితులు, షరతుల మధ్య ఇండియా, చైనా, బ్రెజిల్‌లు రాజీ మార్గం కనుగొనటం ఎంత మాత్రం తేలిక కాదు. ఉభయ పక్షాలు ఈ షరతులు విధించటం, వాటిని వారు పరస్పరం తిరస్కరించటం ఇప్పటికే పలుమార్లు జరిగాయి. నాటో ద్వారా ప్రపంచాధిపత్యం అనే లక్ష్యం గల అమెరికా, ఆ కూటమిలో చేరరాదని ఒకవేళ ఉక్రెయిన్ నిర్ణయించుకున్నా అందుకు సమ్మతించే అవకాశం కనిపించదు. ఆ విధంగా మధ్యవర్తుల బాధ్యత మరింత క్లిష్టతర మవుతుంది. అదట్లుంచి భారత్, చైనా, బ్రెజిల్ ప్రముఖ దేశాలు కావటమే గాక రష్యాతో పాటు బ్రిక్స్ కూటమిలో భాగస్వాములు. తన ఆధిపత్యానికి నష్టమని భావించే అమెరికా ఆ కూటమిని భంగ పరిచేందుకు మొదటినుంచి ప్రయత్నిస్తున్నది. ఈ పరిస్థితులన్నింటి మధ్య, ఒకవేళ అసలు ఈ ముగ్గురి మధ్యవర్తిత్వమంటూ సాకారమైనా, అది ఏ విధంగా ముందుకు సాగేదీ ఎవరూ చెప్పలేరు. ఇంతకూ ఈ ప్రతిపాదనకు జెలెన్స్కీ స్పందన ఏమిటో తెలియదు... ఆయన ఇండియా, చైనాల పాత్రను ఇప్పటికే కోరి ఉన్నప్పటికీ.తిరిగి యుద్ధం విషయానికి వస్తే, కర్స్క్పై ఉక్రెయిన్ దాడిలోని ఉద్దేశం రష్యన్ సైన్యాన్ని పోక్రొవ్స్‌క్ నుంచి అటు మళ్లించేట్లు చేయటమని సైనిక నిపుణులు ఊహాగానాలు చేశారు. కానీ రష్యన్ వ్యూహకర్తలు ఆ పని చేయక పోక్రొవ్స్క్ను, ఇతర తూర్పు ప్రాంతా లను ఆక్రమించే పని సాగిస్తున్నారు. ఆ విధంగా కర్స్క్ వ్యూహం విఫలమైందని ఇపుడు ఉక్రెయిన్ సైన్యాధికారులే అంగీకరిస్తున్నారు. ఉక్రెయిన్ కొత్త సైన్యాధిపతి జనరల్ అలెగ్జాండర్ సిరిస్కియీ కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ, కర్స్క్ వైపు నుంచి కూడా తమపై దాడికి రష్యా ఆలోచించటంతో దానిని నిరోధించేందుకు తామే ముందు దాడి చేశామన్నారు గానీ అది నిజమని తోచదు. అటువైపు రష్యన్ యుద్ధ సన్నాహాలు అసలు లేనే లేవు. పుతిన్ ప్రతిపాదనకు రాగల రోజులలో జెలెన్స్కీ స్పందనలు వచ్చినపుడు గానీ ఈ విషయమై కొంత స్పష్టత రాదు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
రష్యా యుద్ధం ఆగాలంటే అదొక్కటే మార్గం: జెలెన్ స్కీ
కీవ్: ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రష్యాపై ఉక్రెయిన్ సైన్యం దాడులను తీవ్రతరం చేసింది. ఇదే సమయంలో రష్యా బలగాలు కూడా ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్క్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో రష్యా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం వారి దాడులను ఆపగలిగే అవకాశముందని చెప్పుకొచ్చారు.ఇక, తాజాగా ఓ వీడియోలో జెలెన్ స్కీ మాట్లాడుతూ.. రష్యాపై దాడులను తీవ్రతరం చేసి ఆస్తులను ధ్వంసం చేసినప్పుడు మాత్రమే వారు వెనక్కి తగ్గుతారు. అప్పుడు యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యా ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. రష్యా భూభాగంలో సైనిక లక్ష్యాలను ధ్వంసం చేయడానికి ఉక్రెయిన్ సైన్యానికి అనుమతించాలని అమెరికాను కోరారు. రష్యాలో సుదూర క్షిపణులు ప్రయోగించడానికి తమకు అనుమతి ఇవ్వాలన్నారు. ఈ విషయమై తమ భాగస్వామ్య దేశాలతో చర్చిస్తున్నామని, వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడులను కూడా ప్రస్తావించారు. ఈనెల 30వ తేదీన ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడిలో ఆరుగురు పౌరులు మరణించారు. 97 మంది గాయపడ్డారని చెప్పారు. Il discorso del Presidente d’Ucraina Volodymyr Zelenskyy. pic.twitter.com/5UzBII0WdS— Ukr Embassy to Italy (@UKRinIT) September 1, 2024 ఇదిలా ఉండగా.. ఆగస్టు 30-31 తేదీల్లో ఉక్రెయిన్ రక్షణ మంత్రి రుస్టెమ్ ఉమరోవ్ వాషింగ్టన్లో అమెరికా అధికారులు, నిపుణులతో సమావేశమయ్యారు. రష్యాతో పోరులో ఉక్రెయిన్‌కు కావాల్సిన ఆయుధాలు గురించి చర్చించారు. ఈ నేపథ్యంలోనే జెలెన్ స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు.. ఉక్రెయిన్ సైన్యం రష్యా భూభాగంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రష్యాలోని కుర్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. -
కటకటాల్లో టెలిగ్రామ్ చీఫ్
ఆయనేమీ అమెరికా సైనికుల అకృత్యాలను ఆన్లైన్లో రచ్చకీడ్చిన జులియన్ అసాంజ్ కాదు. దేశదేశాల్లోని కోట్లాదిమంది పౌరులపై నిఘా ఉంచుతున్న అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) తీరుతెన్నులను బట్టబయలు చేసి రష్యాలో తలదాచుకుంటున్న ఎడ్వర్డ్ స్నోడెన్ కాదు. ఆయన వేలాది కోట్ల డాలర్ల విలువైన అతి పెద్ద మెసేజింగ్ సంస్థ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ ద్యురోవ్. రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ పోలీసులు పారిస్‌లో ఆయన్ను అరెస్టు చేసి నిర్బంధించారని తెలియగానే ట్విటర్, టెస్లా సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ ఖండించారు. పావెల్ విడు దల కోసం ట్విటర్ వేదికగా ‘ఫ్రీ పావెల్’ ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రపంచాధినేతల్లో ఎంతో పలుకుబడిగల మస్క్ గతంలో ఎప్పుడూ ఇలాంటి వివాదాల జోలికిపోలేదు. ఆరు నూరైనా... ఎలాంటి పర్యవసానాలూ, పరిణామాలూ ఎదురైనా పౌరుల భావప్రకటనా స్వేచ్ఛ ఉండితీరాలని వాదించటంలో పావెల్‌కి ఎవరూ సాటిరారు. నిజానికి అది వివాదాస్పదం కావటంతోనే అతను జైలుపాలయ్యాడు. కారణాలు వెల్లడి కాకపోయినా పసివాళ్లతో రూపొందించిన బూతుచిత్రాల పంపిణీకీ, మాదకద్రవ్య ముఠాల కార్యకలాపాలకూ, ఉగ్రవాద కార్యకలాపాలకూ, అక్రమమార్గాల్లో ద్రవ్య చలామణీకీ టెలిగ్రామ్ అవకాశమిస్తోందన్నది చాన్నాళ్లుగా ఉంటున్న అభియోగాల సారాంశం. భావప్రకటనా స్వేచ్ఛకు ఏమేరకు హద్దులుండాలి... దానివల్ల ఎదురయ్యే దుష్పరిణామాలకు బాధ్యులెవరు... ఈ విషయంలో ప్రభుత్వాల ప్రమేయాన్ని ఎంతవరకూ అనుమతించాలి వంటి ప్రశ్నలు ఎప్పటినుంచో అందరినీ వేధిస్తున్నాయి. ఇప్పుడు పావెల్ అరెస్టుతో అవి మరింత ప్రము ఖంగా చర్చకొస్తున్నాయి. పావెల్ రష్యా పౌరుడని పేరునిబట్టి ఎవరైనా గుర్తుపడతారు. అయితే ప్రస్తుతం ఆయనకు ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాల పౌరసత్వం ఉంది. అసమ్మతిని అణిచేయటంలో సిద్ధహస్తుడైన రష్యా అధ్యక్షుడు పుతిన్ చాన్నాళ్లుగా అతన్ని బంధించాలని ప్రయత్నిస్తున్నారు. పావెల్‌ను అప్పగించాలని, కనీసం మాట్లాడటానికి అనుమతించాలని తాజాగా ఫ్రాన్స్‌ను రష్యా డిమాండ్ చేస్తోంది. 2011లో రష్యా నిర్వహించిన ఎన్నికలు పూర్తిగా బోగస్ అంటూ బయ ల్దేరిన ‘మంచు విప్లవం’ (స్నో రివల్యూషన్) దేశం నలుమూలలా విస్తరించటానికి పావెల్ దోహద పడ్డాడు. ఆ క్రమంలో ఏర్పడిన మెసేజింగ్ యాప్ కాస్తా తర్వాతకాలంలో టెలిగ్రామ్‌గా రూపుదిద్దు కుంది. పావెల్ ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణను ఖండించే అభిప్రాయాలకు చోటిచ్చాడు.అంతేకాదు... ఇజ్రాయెల్ గాజాలో సాగిస్తున్న అకృత్యాలను బట్టబయలు చేసే వీడియోలను వెల్లడించేందుకు అనుమతించాడు. ఇతర దిగ్గజ సంస్థలు మొహం చాటేసిన ఈ అకృత్యాలు టెలి గ్రామ్ లేకపోతే బాహ్య ప్రపంచానికి బహుశా తెలిసేవి కాదు. వాట్సాప్ వంటి ఇతర సంస్థలకు లేని వెసులుబాటు– రెండు లక్షలమందితో గ్రూప్ నిర్వహించటం– టెలిగ్రామ్లోనే సాధ్యం. అయితే ఇందువల్ల అనర్థాలు తలెత్తటం కూడా వాస్తవం. ఆమధ్య పారిస్, బెర్లిన్ నగరాల్లో పేలుళ్లకు, దాడులకు ఉగ్రవాద సంస్థ ఐఎస్ టెలిగ్రామ్ యాప్‌ను వాడుకుంది. ఆ తర్వాత సంస్థ సాంకేతిక సిబ్బంది దాన్ని కట్టడిచేశారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటీయని వ్యవస్థ ఏర్పర్చు కోవాలని, నేరగాళ్ల ఆనుపానులు ఎప్పటికప్పుడు తమకు అందించాలని అనేక దేశాలు టెలిగ్రామ్‌ను కోరుతున్నాయి. యూరప్ దేశాలు ఈయూ డిజిటల్ సర్వీసుల చట్టాన్ని రెండేళ్ల క్రితం తీసు కొచ్చాయి. పర్యవసానంగా చాలా మాధ్యమ సంస్థలు దారికొచ్చాయి. కృత్రిమ మేధ (ఏఐ) ఆధా రంగా ‘అవాంఛిత’ సందేశాలను జల్లెడ పడుతున్నాయి. వాటిని నిలిపేస్తున్నాయి. అయితే సమస్యే మంటే... ఈ వంకన అనేక మాధ్యమాలు సహేతుకమైన అసమ్మతికి కూడా తలుపులు వేస్తున్నాయి. నియంతలకు వంత పాడుతున్నాయి. కొన్ని సంస్థలైతే సంకేత నిక్షిప్త సందేశాల(ఎన్క్రిప్షన్)కు అవకాశమున్నదని పైకి చెబుతూ తమ వినియోగదారుల ఆనుపానులు తెలుసుకోవటానికి ప్రభు త్వాలకు అవకాశమిస్తున్నాయి. కానీ టెలిగ్రామ్ లొంగటం లేదు. ప్రతి దేశంలోనూ స్థానిక చట్టాల లొసుగులను వాడుకుని బయటపడుతోంది. అలాగని తన వేదికపై వినియోగదారులు పరస్పరం పంపుకునే సందేశాలు టెలిగ్రామ్‌కు తెలియక కాదు. వాటిని అవసరమనుకున్నప్పుడల్లా చూస్తోంది. భావప్రకటనా స్వేచ్ఛకూ, బాధ్యతకూ మధ్య సన్నని విభజన రేఖ ఉంటుంది. స్వేచ్ఛ మాటున వదంతులు సృష్టించటం, అల్లర్లకు ఆజ్యం పోయటం ఎవరు చేసినా తప్పే అవుతుంది. అలాంటి వారు చట్టం ముందు తలవంచాల్సిందే. ఆ మధ్య గోరక్షణ పేరుతో బృందాలు ఏర్పడి వ్యక్తులను కొట్టిచంపిన ఉదంతాలు పెరిగాక సందేశాల పంపిణీపై వాట్సాప్ అనేక పరిమితులు విధించింది. మన దేశంలో టెలిగ్రామ్‌కు 50 లక్షలమంది చందాదారులున్నారు. మాదకద్రవ్యాలు, జూదం, బెది రించి డబ్బులు గుంజుకోవటం వంటి కార్యకలాపాలకు అది వేదిక వుతున్నదని మన ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇటీవల నీట్ ప్రశ్నపత్రాల లీకు పుణ్యం టెలిగ్రామ్దే. కేంద్ర హోంశాఖ నేతృత్వంలోని ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ఆ వ్యవహారాలపై దృష్టి సారించింది. ఇది ఒక కొలిక్కి వస్తే టెలిగ్రామ్ నిషేధానికి కూడా గురికావొచ్చన్నది విశ్లేషకుల అంచనా. ఏదేమైనా తనవల్ల సమాజానికి నష్టం కలుగుతున్నదని గ్రహించాక టెలిగ్రామ్ బాధ్యత గుర్తెరగవలసింది. కనీసం ఆ పని ఇప్పుడైనా జరగాలి. అదే సమయంలో ఆ వంకన ప్రభుత్వాలు సహేతుక విమర్శ లకూ, అసమ్మతికీ పాతరేయకుండా చూడటం ప్రజాస్వామికవాదుల కర్తవ్యం. -
ఏఐ ప్యాషన్ షో.. ప్రముఖుల ర్యాంప్ వాక్! (ఫొటోలు)
-
దేశాధినేతల స్నేహ రహస్యం ఏమిటి?
ఇటీవలి కాలంలో రష్యా–భారత దేశాల మధ్య సరుకుల వర్తకం 65 బిలియన్ల డాలర్ల మేర జరిగిందని తేలింది. ‘వర్తకం’ అంటే తెలుసు కదా? ఈ దేశం, ఆ దేశానికీ; ఆ దేశం, ఈ దేశానికీ సరుకులు అమ్మడమూ, కొనడమూ! రెండు దేశాల మధ్యా వర్తకం అన్నప్పుడు, యంత్రాలూ, ముడి ఆయిలూ, మరీ ముఖ్యంగా మారణాయుధాలూ, ఎన్నో! ముఖ్యంగా రష్యా నించి యుద్ధ సామగ్రిని భారత ప్రభుత్వం, పెద్ద ఎత్తున కొన్నది. ఇంతకీ, ఈ దేశాధినేతలు చేసేది ఏమిటి? రెండు దేశాల పెట్టుబడిదారీ వర్గాల తరఫున ప్రతినిధులుగా వ్యవహరించడమే! అంటే, సరుకుల్ని అమ్ముకోడానికీ, కొనుక్కోడానికీ, దేశాధినేతలు స్నేహాలు ప్రకటిస్తూ, ఒకరిని ఒకరు ఆకాశానికి ఎత్తేసుకుంటారు!నిన్నగాక మొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా వెళ్ళినప్పుడు, రష్యా ప్రెసిడెంటు పుతిన్ అన్న మాటలు ఇవి: ‘‘నా ప్రియాతి ప్రియమైన స్నేహితుణ్ణి కలిసినందుకు ఎంతో సంతోషంగా వుంది.’’‘‘ఇచ్చానమ్మా వాయినం, పుచ్చుకున్నానమ్మా వాయినం’’ అన్నట్టు, పుతిన్ గురించి మోదీ కూడా ఏదో అనాలి కదా? ఆ మాటలు ఇవి: ‘‘నా ప్రియమిత్రుడు పుతిన్, రష్యా–భారత్‌ల మధ్య స్నేహాన్ని శిఖరాగ్రాలకు తీసికెళ్ళాడు’’అని! ఇద్దరూ కలవగానే భారత ప్రధాని, తన ప్రత్యేకమైన అలవాటు ప్రకారం, ఆ ప్రియ మిత్రుణ్ణి ‘ఆత్మీయ ఆలింగనం’ చేసుకున్న దృశ్యాలు అందరూ చూసే వుంటారు. అంతేనా? పుతిన్, మోదీని, తన గుర్రపు శాలకి తీసికెళ్ళడం, అక్కడ వాళ్ళిద్దరూ చెరో గుర్రానికీ ఏదో తినిపిస్తూ, ముద్దు చెయ్యడం! ఇంతేనా! బుజ్జి కారులో మోదీని ఎక్కించుకుని, పుతినే ఆ బుజ్జిని స్వయంగా నడుపుతూ, తన పెద్ద ఎస్టేట్‌లో విలాసంగా తిప్పడం! ఆ ప్రియ స్నేహితులిద్దరికీ అంతా సరదాగా జరిగిపోయింది. ఈ రెండు దేశాల అగ్రనేతలూ ఎందుకు కలిశారంటారు? ఇటీవలి కాలంలో రష్యా–భారత దేశాల మధ్య సరుకుల వర్తకం 65 బిలియన్ల డాలర్లది (సుమారు 542 లక్షల కోట్ల రూపాయలది) జరిగిందని తేలింది. ‘వర్తకం’ అంటే తెలుసు కదా? ఈ దేశం, ఆ దేశానికీ; ఆ దేశం, ఈ దేశానికీ సరుకులు అమ్మడమూ, కొనడమూ! ఈ భారీ వర్తకం వల్ల వచ్చిన మొత్తంలో, భారత దేశానికి వచ్చింది, దాదాపు 20 శాతమేనట! రష్యాకి 80 శాతం! రెండు దేశాల మధ్యా వర్తకం అన్నప్పుడు, యంత్రాలూ, ముడి ఆయిలూ, మరీ ముఖ్యంగా మారణాయుధాలూ, ఎన్నో! ముఖ్యంగా రష్యా నించి యుద్ధ సామగ్రిని భారత ప్రభుత్వం, పెద్ద ఎత్తున కొన్నది. రెండు దేశాల అధినేతలు కలిసినప్పుడు, ఏమేమి మాట్లాడుకునేదీ, ఏ రకం ఒప్పందాలు చేసుకునేదీ, అన్నీ క్షుణ్ణంగా అంతకు ముందే, రెండు దేశాల మంత్రులూ, అధికారులూ, సిద్ధం చేసి వుంచుతారు. మోదీకి ఎర్ర తివాచీలూ, సైనిక వందనాలూ, విందు భోజనాలూ, వగైరాలు అయ్యాక, దేశాధినేతలు సరుకుల గురించి అధికారికంగా, లాంఛనంగా, కాసేపు ముచ్చటించుకుంటారు.వర్తకంలో, ఎగుమతులుగా, దిగుమతులుగా, ఇటూ అటూ తిరిగిన ఆ సరుకుల తయారీదారులు, ఆ రెండు దేశాల కార్మికులే! కార్మికుల యజమానులు, ఆ దేశాల పెట్టుబడిదారులు! కొన్ని సరుకులు ప్రభుత్వ రంగ సంస్థలలో తయారైనవైతే, ప్రభుత్వాలు కూడా పెట్టుబడిదారులే!ఇంతకీ, ఈ దేశాధినేతలు చేసేది ఏమిటి? రెండు దేశాల పెట్టుబడిదారీ వర్గాల తరఫున ప్రతినిధులుగా వ్యవహరించడమే! ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’ అనే 1848 నాటి రచనలో, మార్క్స్, ఎంగెల్సులు చెప్పినట్టు: ‘‘ఆధునిక రాజ్యంలో, ప్రభుత్వం (ఎగ్జిక్యూటివ్) అనేది, మొత్తం బూర్జువా వర్గపు సమష్టి వ్యవహారాలను చక్కబెట్టే కమిటీ మాత్రమే!’’ మైకెల్ పెరెంటీ అనే ఒక అమెరికన్ రాజకీయ శాస్త్రవేత్త అయితే, మార్క్స్, ఎంగెల్సులకన్నా ఒక అడుగు ముందుకు వేసి, అనేక ఆధారాలు చూపుతూ, ‘‘కొద్దిమందికే ప్రజాస్వామ్యం’’ అనే తన పుస్తకంలో, ‘ప్రెసిడెంట్’ అనే దేశాధినేత గురించి, మామూలు మాటల్లో చెప్పాలంటే, ‘సరుకులు అమ్మేవాడు’ (‘‘సేల్సుమాన్ ఆఫ్ ది సిస్టం’’) అంటాడు!అంటే, సరుకుల్ని అమ్ముకోడానికీ, కొనుక్కోడానికీ, దేశాధినేతలు స్నేహాలు ప్రకటిస్తూ, ఒకరిని ఒకరు ఆకాశానికి ఎత్తేసుకుంటారు! తమ దేశాల్లో వున్న అత్యున్నత బిరుదుల్ని ఒకరికి ఒకరు ఇచ్చుకోవడం కూడా! అదే జరిగింది నిన్న! పాతకాలపు రష్యాలో, ‘సనాతన చర్చి’ని (‘ఆర్తొడాక్స్ చర్చ్’) స్థాపించిన మత బోధకుడైన ‘సెయింటు ఆండ్రూ’ పేరుతో వున్న ‘అత్యున్నత బిరుదు’గా ఆ దేశం కీర్తించే బిరుదుని మోదీకి, పుతిన్ ఇచ్చి సత్కరించాడు. ఈ బిరుదుని జారు చక్రవర్తి 1698లో ప్రవేశ పెట్టాడు. దీనిని 1917లో, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన విప్లవం జరిగాక, 1918లో రద్దు చేశారు. 1998లో, ‘ఎల్త్సిన్’ అనే మాజీ కామ్రేడు తిరిగి దానిని ప్రవేశపెట్టాడు. ఈ కామ్రేడే 1991లో ‘సోవియట్ కమ్యూనిస్టు పార్టీ’ని రద్దు చేసినవాడు! అదే సంవత్సరం సోవియట్ యూనియన్ని కూడా రద్దు చేశాడు!భారతదేశపు సనాతన మతాభిమానుల్లో అగ్రగణ్యుడైన వ్యక్తికి, ఆ దేశ సనాతన మత బోధకుడి పేరన వున్న బిరుదు దొరికింది! ఎంత సముచిత సత్కారం! మోదీ రష్యా పర్యటనలో, కొసమెరుపు అనదగ్గ సంగతి ఒకటి వుంది. ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెనిస్కీ, మోదీ రష్యాలో పర్యటించడాన్ని ఇలా తప్పుపట్టాడు: ‘‘ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్యపు దేశాధినేత, మాస్కోలో, రక్త పిపాసిని (పుతిన్‌ని) కావలించుకోవడం నిరాశాజనకం’’ అని! ఈ జెలెనిస్కీని కూడా, ఈ మోదీయే, నిన్న పుతిన్‌ని కావిలించుకున్నట్టే, మొన్న, అంటే, ఆ మధ్య, ఇటలీలో గట్టిగా కావిలించుకున్నాడు! ఈ కావిలింతలు మోదీకి రాజకీయ వెన్నతో పెట్టిన విద్య!ఉక్రెయిన్‌లో పిల్లల ఆసుపత్రి మీద రష్యా బాంబులు పడి, అనేక మంది చచ్చిపోయిన కొన్ని గంటల తర్వాత, మోదీ రష్యానేల మీద అడుగు పెట్టాడు. ఆ వార్త విమానం దిగుతూ విన్నాడేమో! తర్వాత, మొక్కుబడిగా పుతిన్‌తో అన్నమాటలు: ‘‘యుద్ధం పరిష్కారం కాదు. మానవుల ప్రాణాలు అమూల్యం, అమాయక పిల్లల మరణాలు చూస్తే, హృదయం ద్రవిస్తుంది!’’ అబ్బా! ఎంత సున్నిత హృదయం! ఈ మాటలు మోదీ అంటున్నప్పుడు, పుతిన్ బెల్లం కొట్టిన రాయిలాగా ముభావంగా వుండిపోయాడు! ‘ఈ రకం మొక్కుబడి మాటలు అన్ని దేశాల అధినేతలకీ మామూలేలే’ అన్నట్టు!మరి, ఏ సమస్యకీ యుద్ధం పరిష్కారం కాదని, మోదీ భావించినప్పుడు, రష్యా నించీ, అమెరికా నించీ, ఫ్రాన్స్ నించీ, ఇజ్రాయిల్ నించీ కుప్పలు కుప్పలుగా, లక్షల కోట్ల ఖర్చుతో మారణాయుధాలు ఎందుకు కొన్నట్టు? పైగా, ఉక్రెయిన్ మీద రష్యా దాడిని ఖండిస్తూ, ఐక్య రాజ్య సమితిలో కొన్ని దేశాలు తీర్మానాలు చేసినప్పుడు, మోదీ ప్రభుత్వం ఓటింగులో పాల్గొననే లేదు! దీన్ని ఏమనాలి? ‘యుద్ధం వద్దు! అది పరిష్కారం కాదు!’ అనే నీతి వచనాలా! దురాక్రమణ యుద్ధం చేస్తున్న దేశపు ప్రభుత్వం ఇచ్చే ఆ దేశపు ‘అత్యున్నత’ బిరుదుని మోదీ, ఏ శాంతి నీతితో తీసుకున్నట్టు? ఈ రెండు దేశాధినేతల స్నేహ రహస్యం తెలిసిందా? - వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి- రంగనాయకమ్మ -
పుతిన్ కక్ష సాధింపు..! ప్రత్యర్థి భార్యపై వారెంట్
మాస్కో: అయిదోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడా రాజకీయ ప్రత్యర్థులు లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ వేట ఆగలేదు. ప్రత్యర్థులు చనిపోయిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులపై కక్ష సాధింపు కొనసాగుతోంది.గతంలో జైలులో వివాదాస్పదంగా మృతి చెందిన అధ్యక్షుడు పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవాల్ని భార్య యులియా నవల్నయాపై తాజాగా అరెస్టు వారెంట్ జారీ అయింది. తీవ్రవాదసంస్థలో చేరినందుకుగాను వారెంట్ జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.యులియాను రెండు నెలలు నిర్బంధంలో ఉంచేందుకు పోలీసులకు అనుమతిచ్చినట్లు మాస్కోలోని బాస్మన్నే కోర్టు వెల్లడించింది. తనపై వారెంట్ జారీ అవడం పట్ల యులియా తీవ్రంగా స్పందించారు. పుతిన్ ఒక హంతకుడు, వార్ క్రిమినల్, జైలులో ఉండాల్సిన వాడని మండిపడ్డారు. యులియాపై అరెస్ట్ వారెంట్ జారీ అయినట్లు ఆమె సిబ్బంది ఎక్స్(ట్విటర్)లో ధృవీకరించారు.యులియా భర్త, పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవాల్ని ఆర్కిటిక్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈయన మృతిపై అమెరికా సహా పలు దేశాలు స్పందించాయి. నవాల్ని మృతి చెందిన తర్వాత ఆయన పోరాటాన్ని ముందుకు తీసుకువెళతానని భార్య యులియా ప్రతిజ్ఞ చేశారు. -
యుద్ధం వద్దు..!
-
గుర్రపుశాలలో మోదీ, పుతిన్
మాస్కో: రష్యాలో ప్రధాని మోదీ టూర్ రెండోరోజు కొనసాగుతోంది. మంగళవారం(జులై 9) ఉదయం రష్యా అధ్యకక్షుడు పుతిన్, మోదీలు కలిసి పుతిన్ అధికారిక నివాసం నొవో ఒగర్యోవ్లో గార్డెన్లో టీ సేవించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ పలు విషయాలపై అనధికారికంగా చర్చించుకున్నారు. అనంతరం గార్డెన్లో ఇద్దరు కలిసి కొద్దిసేపు నడిచారు. అక్కడే ఉన్న గుర్రాలశాలను సందర్శించి గుర్రాలను చేతితో నిమిరి పలకరించారు. మంగళవారం పుతిన్, మోదీ మధ్య శిఖరాగ్ర సదస్సులో భాగంగా ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో మాస్కో చేరున్నారు. అనంతరం అధ్యక్షుడు పుతిన్ నివాసంలో ఇచ్చిన విందు స్వీకరించారు. ఈ సందర్భంగా భారత ప్రజల కోసం మోదీ చేస్తున్న కృషిని పుతిన్ కొనియాడారు. -
రష్యా టూర్‌కు బయలుదేరిన ప్రధాని
న్యూఢిల్లీ: మూడో టర్ములో ప్రధాని మోదీ రెండో విదేశీ టూర్ మొదలైంది. రష్యా, ఆస్ట్రియా దేశాల్లో పర్యటన కోసం సోమవారం(జులై 8) ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరారు. మూడు రోజుల పాటు రెండు దేశాల్లో ప్రధాని పర్యటన సాగనుంది. Over the next three days, will be in Russia and Austria. These visits will be a wonderful opportunity to deepen ties with these nations, with whom India has time tested friendship. I also look forward to interacting with the Indian community living in these countries.…— Narendra Modi (@narendramodi) July 8, 2024 పర్యటనలో భాగంగా భారత్, రష్యా 22వ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాకక్షిక చర్చలు జరపనున్నారు. రష్యాలో నివసిస్తున్న భారతీయులను ప్రధాని కలవనున్నారు. అనతరం అక్కడి నుంచి ఆస్ట్రియా వెళ్లనున్నారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించనుండటం విశేషం. -
అగ్రరాజ్యాలు కళ్లు తెరుస్తాయా?
తెగేదాకా లాగితే ఏమవుతుందో అమెరికాతోపాటు యూరప్ దేశాలు తెలుసుకోవాల్సిన సందర్భమిది. బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాను సందర్శించి ఆ దేశంతో సైనిక ఒడంబడిక కుదుర్చుకున్నారు. ఆ మర్నాడు వియత్నాం వెళ్లి డజను ఒప్పందాలు చేసుకున్నారు. అందులో అణు పరిశోధనలకు సంబంధించిన అంశం కూడా ఉంది. వియత్నాంతో రక్షణ, భద్రత సహా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవటం తమ లక్ష్యమని కూడా పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం ప్రారంభించిన నాటినుంచీ దాన్ని ఆంక్షల చట్రంలో బిగించి ఏకాకిని చేయాలని అమెరికా, యూరప్ దేశాలు తలపోశాయి. ఉత్తర కొరియా ఏనాటినుంచో అలాంటి ఆంక్షల మధ్యే మనుగడ సాగిస్తోంది. ఇరాన్ సరేసరి. ఇలా ఏకాకుల్ని చేయాలన్న దేశాలన్నీ ఏకమవుతున్నాయని, అది ప్రమాద సంకేతమని అమెరికా, పాశ్చాత్య దేశాలు గ్రహిస్తున్న దాఖలా లేదు. ఆసియా–పసిఫిక్ ప్రాంతానికి సరికొత్త భద్రతా వ్యవస్థ ఏర్పడాలన్నదే తన ధ్యేయమని పుతిన్ అనటంలోని ఉద్దేశమేమిటో తెలుస్తూనే ఉంది. ఉత్తర కొరియా ఆవిర్భావానికీ, దాని మనుగడకూ నాటి సోవియెట్ యూనియనే కారణం. జపాన్ వలస పాలనతో సర్వస్వం కోల్పోయి శిథిలావస్థకు చేరుకున్న కొరియా భూభాగంలోకి రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో సోవియెట్ సైనిక దళాలు అడుగుపెట్టాయి. ఆ వెంటనే అమెరికా సైతం అప్పటికింకా సోవియెట్ సైన్యం అడుగుపెట్టని దక్షిణ ప్రాంతానికి తన సైన్యాన్ని తరలించింది. పర్యవసానంగా ఆ దేశం ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయింది. సోవియెట్ స్ఫూర్తితో సోషలిస్టు వ్యవస్థ ఏర్పడిందని మొదట్లో ఉత్తర కొరియా ప్రకటించినా అక్కడ అనువంశిక పాలనే నడుస్తోంది. ఆ దేశం గురించి పాశ్చాత్య మీడియా ప్రచారం చేసే వదంతులే తప్ప అక్కడ ఎలాంటి వ్యవస్థలున్నాయో, అవి ఏం సాధించాయో తెలుసుకునే మార్గం లేదు. ఇటు పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్లూనుకున్న దక్షిణ కొరియా, అమెరికా అండదండలతో బహుముఖ అభివృద్ధి సాధించింది. సోవియెట్ యూనియన్ కుప్పకూలి రష్యా ఏర్పడ్డాక ఉత్తర కొరియాతో ఆ దేశానికున్న సంబంధాలు క్రమేపీ కొడిగట్టాయి. ప్రచ్ఛన్న యుద్ధ దశ అంతమైందని, ఇక ప్రపంచం నిశ్చింతగా ఉండొచ్చని అందరూ అనుకున్నారు. అమెరికా, పాశ్చాత్య దేశాలు పేరాశకు పోనట్టయితే ఆ ఆశ సాకారమయ్యేది. అది లేకపోబట్టే ప్రపంచం మళ్లీ గతంలోకి తిరోగమిస్తున్న వైనం కనబడుతోంది. అనునిత్యం సమస్యలతో సతమతమయ్యే ఆ పరిస్థితులు తిరిగి తలెత్తటం ఖాయమన్న అంచనాలు వస్తున్నాయి.కొన్నేళ్లక్రితం వరకూ ఉత్తర కొరియాపై కారాలు మిరియాలు నూరుతున్న పాశ్చాత్య దేశాలను రష్యా పెద్దగా పట్టించుకునేది కాదు. పొరుగునున్న చైనానుంచే ఆ దేశానికి సమస్త సహకారం లభించేది. 1994లో తనకున్న ఒక అణు రియాక్టర్నూ మూసేయడానికి ఉత్తర కొరియా అంగీకరించింది. అందుకు బదులుగా అమెరికా నుంచి రెండు విద్యుదుత్పాదన అణు రియాక్టర్లు స్వీకరించటానికి సిద్ధపడింది. కానీ 2002లో జార్జి డబ్ల్యూ బుష్ అధికారంలోకొచ్చాక ఆ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దుచేశారు. ఈ పరిణామాల సమయంలోకూడా రష్యా మౌనంగానే ఉంది. శత్రువు శత్రువు తన మిత్రుడని ఎంచి ఇప్పుడు అదే రష్యా తాజాగా ఉత్తర కొరియాతో సైనిక ఒప్పందం కుదుర్చుకుంది. తన నేతృత్వంలోని వార్సా కూటమిని రద్దుచేసుకుని, నాటోలో చేరడానికి రష్యా సిద్ధపడినప్పుడు తిరస్కరించింది నాటోయే. తూర్పు దిశగా విస్తరించే ఉద్దేశం తమకు లేదని, దాని సరిహద్దు దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వబోమని హామీ ఇచ్చిన ఆ సంస్థ అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. పొరుగునున్న చిన్న దేశాలపై పెత్తనం చలాయించాలన్న యావ రష్యాకుంటే దాన్ని ఎలా దారికి తేవాలో ఆ దేశాలు నిర్ణయించుకుంటాయి. కానీ వాటితో అంటకాగి రష్యాను చికాకు పర్చటమే ధ్యేయంగా గత రెండు దశాబ్దాలుగా అమెరికా, పాశ్చాత్య దేశాలు ప్రవర్తించాయి. ఈమధ్య ఇటలీలో జీ–7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శాంతియుతంగా, చర్చలద్వారా ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం అన్వేషించాలని సూచించారు. కానీ వినేదెవరు? విశ్వసనీయతగల అంతర్జాతీయ సంస్థల మధ్యవర్తిత్వంలో రష్యా, ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగితే, ఒప్పందం కుదిరితే అది ఆ రెండు దేశాలకూ మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా మంచి కబురవుతుంది. ప్రపంచం ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అంచుల్లో ఉంది. అమెరికా, దాని ప్రత్యర్థులు రష్యా, చైనాలు ప్రధాన అణ్వస్త్ర దేశాలు. అమెరికా వద్ద దాదాపు 1,700 అణ్వస్త్రాలున్నాయి. అందులో కనీసం సగం నిమిషాల్లో ప్రయోగించేందుకు వీలుగా నిరంతర సంసిద్ధతలో ఉంటాయంటారు. అమెరికాపై ఒక్క అణ్వస్త్రం ప్రయోగించినా క్షణాల్లో యూరప్, ఆసియా దేశాల్లోని దాని స్థావరాలనుంచి పెద్ద సంఖ్యలో అణ్వస్త్రాలు దూసుకెళ్లి శత్రు దేశాలను బూడిద చేస్తాయి. రష్యా, చైనాలపై దాడి జరిగినా ఇదే పరిస్థితి. చిత్రమేమంటే ఒకప్పుడు అణ్వాయుధాలపై బహిరంగ చర్చ జరిగేది. అది ఉద్రిక్తతల నివారణకు తోడ్పడేది. 80వ దశకంలో మధ్యతరహా అణ్వాయుధాల మోహరింపు యత్నాలు జరిగినప్పుడు అమెరికా, యూరప్ దేశాల్లో భారీయెత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఫలితంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు రీగన్, నాటి సోవియెట్ అధ్యక్షుడు గోర్బచెవ్ వాటి నిషేధానికి సంసిద్ధులయ్యారు. కానీ సాధారణ ప్రజలకు సైతం యుద్ధోన్మాదం అంటించారు. ఈ పరిస్థితులు మారాలి. అగ్రరాజ్యాలు వివేకంతో మెలిగి శాంతి నెలకొనేందుకు చిత్తశుద్ధితో కృషిచేయాలి. -
‘బలి’ కోరుతున్న సాంకేతిక విజయం!
‘ది హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ గురించి క్రీడా ప్రియులందరూ వినే ఉంటారు. 1986 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ సందర్భంగా అర్జెంటీనా – ఇంగ్లండ్ మ్యాచ్‌లో డీగో మారడోనా చేసిన తొలి గోల్ వివాదాస్పదమైంది. డీగో చేసిన హెడర్ గోల్‌ను వాస్తవానికి చేత్తో నెట్టాడని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రికార్డింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల రెఫరీ దాన్ని గోల్‌గానే ప్రకటించాడు. తర్వాత నాలుగు నిమిషాలకే ‘గోల్ ఆఫ్ ది సెంచరీ’ని కొట్టిన మారడోనా, అదే ఊపులో వరల్డ్ కప్‌ను గెలుచుకోవడమే గాక ఫుట్‌బాల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. వివాదాస్పద గోల్‌పై ఆ తర్వాత స్పందించిన మారడోనా అది ‘సగం మారడోనా హెడ్, సగం హ్యాండ్ ఆఫ్ గాడ్’ ఫలితమని ప్రకటించాడు.దుబాయ్‌లో ఇటీవల కురిపించిన కృత్రిమ వర్షం ఎంత బీభత్సాన్ని సృష్టించిందో ప్రపంచమంతా చూసింది. క్లౌడ్ సీడింగ్ ఓవర్‌డోస్‌కు వాతావరణ మార్పులు కూడా తోడైన ఫలితంగా రెండేళ్లలో కురవాల్సిన వర్షమంతా ఒకేరోజు కురిసి ఎమిరేట్‌ను అతలాకుతలం చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఏదో ‘అదృశ్య హస్తం’ (హ్యాండ్ ఆఫ్ గాడ్) పనిచేసినట్టుగా, కృత్రిమ ఓట్ల వర్షం కురిపించినట్టుగా అనిపించక మానదు. లేదంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి ఫలితాలు రావాలంటే రష్యా నాయకుడు పుతిన్ లేదా తుర్కియే పాలకుడు ఎర్డోగాన్ లేదా మయన్మార్ మిలిటరీ జుంటా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి ఉండాలి. అలా జరగలేదు కాబట్టి ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ ప్రమేయం ఉండాలి. ఎవరా గాడ్? కేంద్ర ప్రభుత్వమా? ఎన్నికల సంఘమా... ఎవరు? కృత్రిమ ఓట్ల వర్షానికి క్లౌడ్ సీడింగ్ ఎవరు చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనసామాన్యం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి.ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని స్వయంగా చంద్రబాబే పలుమార్లు ప్రకటించారు. ఆయన అభిమాని వేమూరి రవి ఇంకొంచెం ముందుకెళ్లి ఈవీఎమ్‌లను ఎలా హ్యాక్ చేయవచ్చో మీడియా సమక్షంలోనే ప్రదర్శించి చూపెట్టారు. అందువల్ల ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్ అనే ఆర్ట్‌పై కూటమికి స్పష్టమైన అవగాహన ఉన్నది.రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ తుది వివరాలను ప్రకటించడానికి దాదాపు మూడు రోజుల సమయాన్ని తీసుకున్నది. ఈ అసాధారణ జాప్యంపై సందేహాలను లేవనెత్తుతూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక సైతం కథనాన్ని ప్రచురించింది. ఆ గడువు ముగిసిన తర్వాత పోలయిన ఓట్ల సంఖ్య కూడా అనుమానాలను రేకెత్తించే విధంగానే ఉన్నది.తుది పోలింగ్ శాతాన్ని సుమారు 81గా నిర్ధారిస్తూ మూడు రోజుల తర్వాత ఈసీ తాపీగా ప్రకటన విడుదల చేసింది. మామూలుగా పోలింగ్ సమయం ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రం ఆవరణలో నిలబడి ఉన్నవారికి స్లిప్స్ పంపిణీ చేస్తారు. వారికి మాత్రమే ఓటువేసే అవకాశం కల్పిస్తారు. అలా నిలబడిన వారికి ఈసారి ఎందుకనో స్లిప్స్ లేదా టోకెన్లు పంపిణీ చేయలేదనే వార్తలు వినవస్తున్నాయి. ఇది అనుమానించదగ్గ అంశం.పోలింగ్ గడువు ముగిసిన తర్వాత ప్రాంగణంలో నిలబడి ఉన్నవారి సంఖ్య మనకున్న సమాచారం మేరకు ఎక్కడా యాభై నుంచి వంద దాటలేదు. వీరు ఓట్లు వేయడానికి ఇంకో రెండు, మూడు గంటలు చాలు. అంటే తొమ్మిది గంటలకల్లా పోలింగ్ పూర్తి కావాలి. కానీ అర్ధరాత్రి దాటిందాకా పోలింగ్ జరుగుతూనే ఉందట! అంటే ఆ యాభైమందే అంతసేపూ సైక్లింగ్ చేస్తున్నారా? వేలాది పోలింగ్ బూత్‌లలో గడువు ముగిసే సమయానికి 65 నుంచి 70 శాతం మధ్యనున్న పోలింగ్ శాతం తుది ప్రకటన వచ్చేసరికి 85 నుంచి 95 శాతం దాకా ఎగబాకింది.పోలింగ్‌కు ముందు జరిగిన రాజకీయ పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. ఎన్డీఏ కూటమిలో చేరడం కోసం చంద్రబాబు పడిన పాట్లు, భరించిన అవమానాలు తెలిసినవే. కూటమిగా కుదురుకున్న తర్వాత వారు ‘ఎలక్షనీరింగ్’ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వాధికారులను బదిలీ చేశారు. కనీవినీ ఎరుగని విధంగా ఏ ప్రాంతంలో ఏ అధికారిని నియమించాలో కూడా ఎన్నికల సంఘానికి సూచించారు. ఈసీ కూడా కూటమి కోర్కెలన్నింటినీ మారుమాట్లాడకుండా నెరవేర్చింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడూ తొలి ఫేజ్‌లోనే ఉంటూ వచ్చాయి. కానీ కూటమి కోరిక మేరకు ఈసారి నాలుగో ఫేజ్‌కు నెట్టివేశారు.మొదటి మూడు దశల పోలింగ్ తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏలో అభద్రతా భావం మొదలైందట. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా లేదనే నిర్ధారణకు ఎన్డీఏ పెద్దలు వచ్చారు. నాలుగో దశకు ఎన్నికలను వాయిదా వేయించుకున్న చంద్రబాబు అదనంగా లభించిన సుమారు నెల రోజుల సమయాన్ని ప్రత్యేక ‘ఏర్పాట్ల’ కోసం ఉపయోగించుకున్నారు. ఈ ఏర్పాట్లకు ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ పూర్తిగా సహకరించింది. దేశవ్యాప్తంగా 19 లక్షల ఈవీఎమ్‌ల మిస్సింగ్‌పై ఇప్పటికీ కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదు. ఇవెక్కడున్నాయి? ఏ పనికి వినియోగిస్తున్నారు? ఎవరి సేవల కోసం ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ వీటిని వినియోగిస్తున్నారో తేలవలసి ఉన్నది.గడచిన ఐదేళ్లుగా ప్రత్యర్థులపై లేని దాడులను ఉన్నట్లుగా చూపించి గగ్గోలు పెట్టినవారు పోలింగ్ రోజు సాయంత్రం, మరునాడు – మళ్లీ కౌంటింగ్ రోజు నుంచి గత నాలుగు రోజులుగా జరిగిన హింసాకాండపై మౌనం వహించారు. ఈ హింసాకాండ కూడా అప్పటికప్పుడు ఆవేశంతో చెలరేగినట్టు లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తున్నది. కృత్రిమ ఓట్ల వర్షం కురిసే సమయానికి ఎవరూ పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లకుండా బెదరగొట్టేందుకు దాడులు జరిగాయి. మరుసటి రోజు కూడా చాలాచోట్ల ఇవి కొనసాగాయి. మళ్లీ కౌంటింగ్ పూర్తవుతున్న సమయం నుంచి నాలుగు రోజులుగా యథేచ్ఛగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అసాధారణమైన ఓటింగ్ సరళిని సమీక్షించడానికి ప్రత్యర్థులు గ్రామాల్లో పర్యటించే అవకాశం లేకుండా బెదరగొట్టడానికి ఈ దాడులు జరిగాయి. పోలీసు యంత్రాంగం పూర్తిగా కూటమి వ్యూహానికి తోడుగా నిలబడింది.విచక్షణారహితంగా జరుగుతున్న ఈ దాడులు మన ప్రజాస్వామ్య భవిష్యత్తు మీద ప్రశ్నార్థకాన్ని రచిస్తున్నాయి. ఈ దాడులను ఖండించకపోగా ‘వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యలకు రెచ్చిపోకండ’ని ముఖ్యమంత్రి కాబోయే చంద్రబాబు ట్వీట్ చేశారు. గత రెండేళ్లుగా లోకేశ్ ఒక రెడ్‌బుక్‌ను సభల్లో ప్రదర్శిస్తూ హెచ్చరికలు జారీ చేసేవారు. తాను రెడ్‌బుక్‌లో పేర్లు ఎక్కించిన వారి సంగతి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తానని చెప్పేవారు. ఇప్పుడా రెడ్‌బుక్ హోర్డింగ్‌లను కూడళ్లలో ఏర్పాటు చేశారు. దాని సందేశమేమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.సందేశం గూండాతండాలకు స్పష్టంగానే అర్థమైంది. టీడీపీ వారికి చాలాచోట్ల జనసైనికులు కూడా తోడయ్యారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న సందర్భాల్లో పోలీసులు మౌన ప్రేక్షక పాత్రను పోషించారు. కొన్నిచోట్ల పారిపోతూ కనిపించారు. ఇప్పటివరకు బయటకొచ్చిన వీడియోల్లో ఇటువంటి దృశ్యాలెన్నో కలవరం కలిగించాయి.నూజివీడులో వైసీపీకి చెందిన ముసినిపల్ కౌన్సిలర్‌ను వెంబడించి కత్తులతో పొడుస్తున్న దృశ్యం పిండారీల దండయాత్రను తలపించింది. ఒక హాస్టల్ నిర్వాహకుడి ఇంటిపై దాడిచేసి గృహాన్ని ఛిద్రం చేసి, ఆ పెద్దమనిషిని మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్న పైశాచికత్వం భయానకంగా కనిపించింది. రాళ్ల దాడులు, కర్రలతో దాడులు, కత్తులతో దాడులు, కిడ్నాప్‌లు... ఎన్నెన్ని దృశ్యాలు? వైసీపీకి చెందిన వారి కార్యాలయాలను పెట్రోల్ పోసి తగలబెట్టారు. వాహనాలను తగులబెట్టారు. జెండా దిమ్మెలను సుత్తులతో పగులగొట్టారు. శంకుస్థాపన ఫలకాలను ధ్వంసం చేశారు. గ్రామ సచివాలయాల మీద దాడులు చేశారు. వైఎస్సార్ విగ్రహాలను తొలగించి ఈడ్చుకుంటూ అవమానించారు.వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంపై వైఎస్సార్ అక్షరాలు తొలగించారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్‌ల వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించిన వైఎస్సార్ పేరు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి బాగుంటుందని భావించిన ప్రభుత్వం చట్టసవరణ ద్వారా ఎన్టీఆర్ పేరును మార్చి వైఎస్సార్ పేరు పెట్టారు. బదులుగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టారు. ఒక అల్లరిమూక దాడి చేసి ఇప్పుడా అక్షరాలను తొలగించింది..విశ్వవిద్యాలయాల మీద కూడా దాడులకు తెగబడ్డారు. వీసీలు, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభు త్వం మారితే యూనివర్సిటీ పాలకవర్గాలను కూడా మార్చాలనే ఓ కొత్త ఆచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు కనిపిస్తున్నది. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేయడం సంప్రదాయం కానీ, ఇవి నామినేటెడ్ పదవులు కావు. సెర్చ్ కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ చేసిన నియామకాలు. అయినా సరే తమ పార్టీవాడే వీసీగా కూర్చోవాలనే దుందుడుకుతనం ప్రజాస్వామిక పద్ధతులను దెబ్బతీస్తున్నది.భయానక వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తే అది నెరవేరే అవకాశం ఉండదు. నాలుగు రోజులు ఆలస్యమైనా సరే ఎన్నికల అవకతవకలపై వారు దృష్టి సారించకుండా ఉండరు. నిజానిజాలు తవ్వితీయకుండా ఉండరు. అలాగే కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం జనంతో కలిసి విపక్షాలు కచ్చితంగా ఉద్యమిస్తాయి. కూటమికి లభించిన విజయం సాంకేతికమైనదే. అయినా సరే, ప్రభుత్వాన్ని అదే ఏర్పాటు చేస్తుంది. అడ్డంకులేమీ ఉండవు. చేసిన హామీలను నెరవేర్చి, ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించితే కొత్త ప్రభుత్వం ప్రజల మన్నన పొందుతుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మోదీకి దేశాధినేతల శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: మూడోసారి అధికార పగ్గాలు స్వీకరిస్తున్న ప్రధాని మోదీకి పలు ప్రపంచ దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధా ని రిషి సునాక్, జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలానీ ఇలా 75 దేశాలకు చెందిన అగ్రనేతలు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. -
పుతిన్ ఐదోసారి ప్రమాణం
మాస్కో: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి ప్రమాణం చేశారు. మంగళవారం క్రెమ్లిన్ ప్రాసాదంలో 2,500 మంది ముఖ్య అతిథుల సమక్షంలో పుతిన్ రష్యా రాజ్యాంగంపై ప్రమాణం చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ..అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ఐక్యంగా ఉంటూ లక్ష్యాలను అధిగమించి, విజయాలను అందుకుంటామని చెప్పారు.ఈ కార్యక్రమానికి అమెరికా నటుడు స్టీవెన్ సీగల్ వంటి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే, అమెరికా, యూకే, జర్మనీ దౌత్యవేత్తలు గైర్హాజరయ్యారు. అంతకుముందు పుతిన్ 30 గన్ సెల్యూట్ స్వీకరించారు. క్రెమ్లిన్ కేథడ్రల్ స్క్వేర్ వద్ద ప్రెసిడెన్షియల్ రెజిమెంట్ పరేడ్‌ను తిలకించారు. దగ్గర్లోని అనన్షియేషన్ కేథడ్రల్‌లో రష్యన్ ఆర్థోడాక్స్ పాటియార్క్ కిరిల్ ఆశీస్సులు అందుకున్నారు. ఆరేళ్ల పదవీ కాలానికి గాను 2030 వరకు ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. -
సిరియాలో జోక్యం ముస్లింల అణచివేత
రష్యా రాజధాని మాస్కోలో తాజాగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ (ఐసిస్) చేసిన అమానవీయ దాడి ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచింది. రష్యాపై దాడులు ఐసిస్‌కు కొత్తేమీ కాదు. కొన్నేళ్ల కింద రష్యా పౌరులే లక్ష్యంగా విమానాన్నే బాంబుతో పేల్చేసి 244 మందిని బలి తీసుకున్న చరిత్ర దానిది! కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయంపైనా దాడులకు తెగబడింది. సిరియా అంతర్యుద్ధంలో తమకు వ్యతిరేకంగా పుతిన్ జోక్యం రష్యాపై ఐసిస్ ఆగ్రహానికి ప్రధాన కారణం. రష్యాలోని ముస్లింలు తీవ్ర అణచివేతకు గురవుతున్నారన్న వార్తలు దాని విద్వేషాన్ని మరింతగా పెంచి పోషించాయి. ఫలితంగా రష్యాకు, ఐసిస్‌కు మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం నిత్యం నిప్పుల కుంపటి రాజేస్తూనే ఉంది... అలా మొదలైంది... ఐసిస్ అరాచకం 2015లో సిరియాలో అంతర్యుద్ధానికి దారితీసింది. ఐసిస్‌ను అణిచే ప్రయత్నాల్లో అధ్యక్షుడు బషీర్ అల్ అసద్‌కు పుతిన్ దన్నుగా నిలిచారు. దాంతో రష్యాపై ఐసిస్ తీవ్ర ద్వేషం పెంచుకుంది. మాస్కోలో తాజా మారణహోమానికి తెగబడింది ఐసిస్ ఖోరసాన్ (ఐసిస్–కె). ఇది అఫ్గానిస్థాన్‌లో ఐసిస్ అనుబంధ సంస్థ. 2022లో అఫ్గాన్ రాజధాని కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయంపై ఆత్మాహుతి దాడి చేసి ఇద్దరు ఉద్యోగులతో పాటు ఎనిమిది మందిని పొట్టన పెట్టుకుంది ఐసిస్–కెనే. దీన్ని పాకిస్థానీ తాలిబాన్ ముఠా సభ్యులు 2015లో ప్రారంభించారు. అఫ్గాన్‌లో భద్రతా దళాలతో పాటు మంత్రులపై, మైనారిటీలపై వరుస దాడులతో ప్రాచుర్యంలోకి వచి్చంది. 2018కల్లా ప్రపంచంలోని నాలుగు అత్యంత ప్రమాదకరమైన ఉగ్ర సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఉగ్ర శిక్షణ నిమిత్తం ఇరాక్, సిరియాల్లోని అగ్ర నాయకత్వం నుంచి కోట్లది డాలర్లు అందకుంటూ వచి్చంది. తర్వాత అమెరికా సైన్యం, అఫ్గాన్ కమెండోలు, అఫ్గాన్ తాలిబన్ల ముప్పేట దాడితో ఐసిస్–కె ఆగడాలకు కళ్లెం పడింది. అమెరికా వైమానిక దాడులు దాని అగ్ర నాయకత్వాన్ని దాదాపుగా తుడిచిపెట్టేశాయి. 2021లో అమెరికా సైన్యం అఫ్గాన్ నుంచి వైదొలగడంతో ఐసిస్–కె మళ్లీ పుంజుకుంది. అదే ఏడాది కాబూల్ విమానాశ్రయంపై దాడి చేసి 13 మంది అమెరికా సైనికులతో పాటు ఏకంగా 170 మంది పౌరులను బలి తీసుకుంది. కొన్నేళ్లుగా అఫ్గాన్ ఆవల కూడా విస్తరిస్తోంది. గత జనవరిలో ఇరాన్లో దివంగత మేజర్ జనరల్ ఖాసీం సులేమానీ స్మారక ర్యాలీపై ఆత్మాహుతి దాడికి తెగబడి 84 మందిని పొట్టన పెట్టుకుంది. ఇస్తాంబుల్‌లో ఓ చర్చిపైనా దాడి చేసింది. పుతిన్‌ను, ఆయన విధానాలను ఐసిస్–కె తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెగలపరంగా తమ ప్రబల శత్రువులైన తాలిబన్లతో పుతిన్ సాన్నిహిత్యం రష్యాపై విద్వేషాన్ని మరింత ఎగదోసింది. దీనికి తోడు రష్యాలో ముస్లింలపై అణచివేత పెరుగుతోందని ఆమ్నెస్టీతో పాటు పలు హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. రష్యాలో ముస్లింలు 2 కోట్ల దాకా ఉంటారని అంచనా. మతపరమైన ప్రార్థనలు కూడా చేసుకోలేనంతగా వారిపై తీవ్ర అణచివేత చర్యలు కొనసాగుతున్నాయని, విద్య, ఉపాధి తదితరాల్లో నూ వివక్ష కొనసాగుతోందని వార్తలొస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న క్రిమియాలో కూడా ముస్లింలపై రష్యా తీవ్ర ఆంక్షలు అమలు చేస్తోందని చెబుతున్నారు. ఇవన్నీ ఐసిస్–కెకు మరింత కంటగింపుగా మారాయి. హిజాబ్ ముస్లిం సంప్రదాయం కాదంటూ పుతిన్ చేసిన వ్యాఖ్యలు రష్యాపై దాని ద్వేషాన్ని మరింతగా పెంచాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యా అధ్యక్ష ఎన్నికలు.. పుతిన్ ఘన విజయం
మాస్కో: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ మరోసారి ఘన విజయం సాధించారు. ప్రాథమిక ఫలితాల ప్రకారం పుతిన్‌కు రికార్డుస్థాయిలో 88 శాతం ఓట్లు లభించినట్లు తెలుస్తోంది. మార్చి 15న ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ మూడు రోజుల పాటు జరిగి 17న ముగిశాయి. 1999 నుంచి దేశ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న పుతిన్ తాజా విజయంతో మరో ఆరేళ్లపాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. ఈ ఎన్నికల్లో పుతిన్‌తో కలిపి నలుగురు అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. కాగా, చివరిరోజు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని, పుతిన్ విధానాలను వ్యతిరేకిస్తున్నవారు పోలింగ్ కేంద్రాలకు రావాలని ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన ప్రతిపక్ష నేత నావల్నీ మద్దతుదారులు ఇచ్చిన పిలుపుతోనే చివరిరోజు ఓటర్లు పోటెతినట్లు చెబుతున్నారు. ఎన్నికల సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు జరిగాయి. కొన్నిచోట్ల బ్యాలెట్ పెట్టెల్లో ఇంకు పోశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు అరెస్టయ్యారు. బలమైన ప్రత్యర్థులు, పుతిన్‌ను గట్టిగా విమర్శించేవారెవరూ లేకుండానే ఎన్నికలు కొనసాగాయి. పలు యూరప్ దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్న రష్యా దౌత్య కార్యాలయాల్లో పెద్దఎత్తున రష్యా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో ఉక్రెయిన్ నుంచి రష్యాపైకి డ్రోన్లు దూసుకొచ్చాయి. ఎన్నికలను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపించింది. ఇదీ చదవండి.. వెనక్కి తగ్గేది లేదు.. గాజాపై దాడులు కొనసాగిస్తాం