Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

INCOIS Kallakkadal Warning To Kerala Tamilnadu Coasts1
కేరళ,తమిళనాడుకు ‘కల్లక్కడల్‌’ ముప్పు..!

తిరువనంతపురం: కేరళ,తమిళనాడు(Tamilnadu) తీరాలకు ‘కల్లక్కడల్‌’ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ఇన్‌కాయిస్‌’ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. బుధవారం(జనవరి 15)న రాత్రి అకస్మాత్తుగా సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన రాకాసి అలలు తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపింది.బుధవారం రాత్రి 11.30 గంటల వరకు తీరంలోని వివిధ ప్రాంతాల్లో అర మీటరు నుంచి ఒక మీటరు మేర అలల తాకిడి ఉంటుందని ఇండియన్‌ నేషనల్ సెంటర్‌ ఫర్‌ ఓసియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (Incois‌) హెచ్చరించింది.ఇన్‌కాయిస్‌ హెచ్చరిక నేపథ్యంలో కేరళ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ అప్రమత్తమైంది.తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని సూచించింది.ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న పడవలు పడవలు వేసుకొని సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.మత్స్యకారులు ముందుగానే పడవలను సురక్షిత ప్రదేశానికి చేర్చుకోవాలని ప్రకటించింది. పర్యాటకులు బీచ్‌లలో విహారానికి రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.తీర ప్రాంతాలపై అదనపు నిఘా ఉంచాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది.కల్లక్కడల్‌ అంటే ఏంటి..?కల్లక్కడల్‌ అనేది మళయాలం పదం. కల్లక్కడల్‌ అంటే సముద్రం ఓ దొంగలా దూసుకొస్తుందని అర్థం. హిందూ మహాసముద్రంలోని దక్షిణ భాగంలో కొన్ని సార్లు వీచే బలమైన గాలులే సముద్రం ఇలా అకస్మాత్తుగా ఉప్పొంగడానికి కారణమని Incois వెల్లడించింది.ఎలాంటి సూచన,హెచ్చరిక లేకుండానే ఆ గాలులు వీస్తుంటాయని పేర్కొంది.అందుకే దీనిని స్థానికంగా ‘కల్లక్కడల్‌’ అని పిలుస్తారు.

Minister Ponnam Prabhakar Protest On Officers In Husnabad2
మోకాళ్లపై కూర్చొని మంత్రి పొన్నం నిరసన

సాక్షి,హన్మకొండజిల్లా: హుస్నాబాద్‌ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి సంక్రాంతి జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ నిరసన తెలిపారు. జాతర సందర్భంగా కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు సరిగా చేయకుండా నిర్లక్ష్యం వహించారని పలువురు భక్తులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని వీరభద్రస్వామి ఆలయ కమిటీ మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అలిగిన మంత్రి పోలీసు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆలయ గెస్ట్‌హౌజ్‌ వద్ద నేలపై కూర్చొని అధికారుల తీరుపై నిరసన తెలిపారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలోనూ మోకాళ్లపై నిలబడి తన అసహనాన్ని వెల్లడించారు. కాగా,హైదరాబాద్‌ ఇంఛార్జ్‌గా మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్‌ గతేడాది హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాల సందర్భంగా బల్కంపేట రేణుక ఎల్లమ్మ ఆలయంలో అధికారులపై అలిగి గుడిలోనే బైఠాయించారు.తనకు, జీహెచ్‌ఎంసీ మేయర్‌కు ప్రోటోకాల్‌ పాటించలేదని అధికారులపై తన నిరసనను తెలిపారు. అనంతరం అధికారులు బుజ్జగించిన తర్వాత పొన్నం అలకవీడడం గమనార్హం. సొంత హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని కొత్తకొండ జాతరలోనూ తాజాగా పొన్నం అధికారులపై బహిరంగంగానే తన అసహనాన్ని తెలపడం చర్చనీయాంశమైంది.

TCS to Hire 40000 Freshers From Campuses in 20253
టీసీఎస్‌లో 40000 ఉద్యోగాలు!: వీరికే ఛాన్స్..

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) ఈ ఏడాది 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోందని ఐటీ దిగ్గజం చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) మిలింద్ లక్కడ్ తెలిపారు. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 5,000 మంది తగ్గినట్లు టీసీఎస్ తెలిపింది.2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య తగ్గినప్పటికీ.. ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి కట్టుబడి ఉన్నామని ఓ ఇంటర్వ్యూలో మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు. టీసీఎస్ సంస్థలో ఉద్యోగం పొందాలంటే.. కేవలం కోడింగ్ నైపుణ్యాలు ఉంటే సరిపోదు. వారికి తగిన విద్యార్హత కూడా ఉండాలని ఆయన వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోవని స్పష్టం చేశారు.ఏఐ వల్ల ఉద్యోగుల సామర్థ్యం మెరుగుపడుతుంది. మనిషి ఆలోచనా శక్తికి ఉన్న ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే క్లయింట్లను నేరుగా సంప్రదించాల్సిన విభాగాలలో.. ఇతర అవసరమైన విభాగాల్లో మానవ వనరుల ప్రాధాన్యత తప్పకుండా ఉంటుందని మిలింద్ లక్కడ్ అన్నారు.2024-25 ఆర్ధిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య తగ్గితే.. కంపెనీ వృద్ధి తగ్గినట్లు కాదు. ఉద్యోగుల నియామక ప్రక్రియ అనేది వార్షిక ప్రణాళికలను అనుసరించి జరుగుతాయి. కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపల ఉద్యోగుల భర్తీకి సంబంధించిన బ్యాలెన్స్ జరుగుతుంది. కాబట్టి 2025లో కంపెనీ వృద్ధి రేటు గణనీయంగా ఉంటుందని లక్కడ్ చెప్పారు.ఇదీ చదవండి: రూ.86 లక్షల కోట్ల సామ్రాజ్యం.. వారసుడిని ప్రకటించిన వారెన్‌ బఫెట్‌టీసీఎస్ కార్యకలాపాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఏకీకృతం చేస్తోంది. కాబట్టి ఏఐ సంబంధిత నైపుణ్యాలను పొందేందుకు E0 నుంచి E3.. అంతకంటే ఎక్కువ స్థాయిలలోని అన్ని స్థాయిల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.➤E0 (ఎంట్రీ లెవెల్): లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎమ్‌లు), వాటితో ముడిపడిన అప్లికేషన్‌లపై ప్రాథమిక అవగాహన ఉండే వారు ఈ విభాగంలోకి వస్తారు.➤E1: ప్రాంప్ట్ ఇంజనీర్లు మాత్రమే కాకుండా, ఎల్ఎల్ఎమ్‌ ఏపీఐలతో పని చేయగల సామర్థ్యం ఉన్న వారు ఈ విభాగంలోకి వస్తారు.➤E2: TCS GenAI సాధనాలను ఉపయోగించడంలో నైపుణ్యం కలిగిన వారు ఈ విభాగంలో ఉంటారు.➤E3, దానికంటే పైన: ఏఐలో నైపుణ్యం, అవగాహన కలిగిన వారు, దాని అప్లికేషన్లలను అన్ని విభాగాల్లో ఉపయోగించేవారు ఈ విభాగంలోకి వస్తారు.టీసీఎస్‌ లాభం రూ.12,380 కోట్లుప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో టాటా కన్సల్టెన్సీ సర్విసెస్‌ నికర లాభం 12 శాతం ఎగసి రూ. 12,380 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 11,058 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌(క్యూ2)లో సాధించిన రూ. 11,909 కోట్ల లాభంతో పోలిస్తే త్రైమాసికవారీగా 4 శాతం పుంజుకుంది. మొత్తం ఆదాయం 6 శాతం బలపడి రూ. 63,973 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో రూ. 60,583 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 66 ప్రత్యేక డివిడెండ్‌తో కలిపి మొత్తం రూ. 76 చెల్లించనుంది.

KSR Comment: Under Kutami Govt No Sankranti For AP Poor People4
కహానీలు చెబితే కడుపు నిండుతుందా?

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లోమీడియా తీరు భలే విచిత్రంగా ఉంటుంది. వారికి లాభం జరిగితే ప్రజలందరికీ జరిగినట్లే. వారి ఇబ్బందులు ప్రజలందరి సమస్యలు! ఇప్పుడెందుకు ఈ ప్రస్తావన అంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ‍ప్రజలందరికీ సంక్రాంతి వరాలు వచ్చేశాయట!. అభివృద్ధి పనులతో గ్రామాలకు సంక్రాంతి కళ వచ్చేసిందట!. పచ్చి అబద్ధాలను వండి వార్చేఈ ఎల్లో మీడియా ఉరఫ్‌ ఈనాడులో వచ్చిన కథనాల్లో కొన్ని ఇవి. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలన్నీ అమలు చేసి ఉంటే ప్రజలు సంతోషంగా ఉండేవాళ్లు కానీ.. తిమ్మిని బమ్మి చేసినట్లు ప్రతి వాగ్ధానాన్ని మసిపూసి మారేడు కాయ చేసేందుకు కూటమి నానా తంటాలూ పడుతూంటే ఎల్లోమీడియా ఆ అబద్ధాలకు వంతపాడుతూ మురిసిపోతోంది. ఎన్నికలకు ముందు ఒక రకమైన అసత్యాలు.. ఇప్పుడు ఇంకో రకంగా బిల్డప్‌ ఇస్తూ జనాన్ని మభ్యపెడుతోంది. 😱కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది మొదలు.. రాష్ట్రంలో అరాచకమే ఎక్కువ. జగన్‌ టైమ్‌లో జరిగిన అభివృద్దిని కూడా తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. వృద్దుల ఫించన్‌ వెయ్యి రూపాయలు పెంచడం మినహా మరే ఇతర హామీని పూర్తిగా అమలు చేయని కూటమి, ఎన్నికల ప్రణాళికలో ఉన్న సుమారు 175 వాగ్దానాల జోలికే వెళ్లలేదు. దీన్ని కప్పిపుచ్చడానికి ఎల్లో మీడియా రోజుకో కొత్త రకం భజన కీర్తలను పాడుతోంది. అయితే.. 👉జనం వాస్తవాలు తెలుసుకుంటున్నారు. సూపర్ సిక్స్ పేరుతో కూటమి నేతలు చేసిన మోసాన్ని గుర్తిస్తున్నారు. ఈ మధ్య ఒక సీనియర్ పాత్రికేయుడు ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటించినప్పుడు ప్రజల్లోని ఈ అసంతృప్తిని గమనించారు. జగన్ ఉండి ఉంటే ఫలానా స్కీమ్ కింద తమకు ఇంత డబ్బు వచ్చి ఉండేది.. చేతులలో డబ్బు ఆడేది.. అని చెప్పుకుంటున్నారట. కానీ అంతకు మూడు రెట్లు సాయం చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తమను వంచించారని ఎక్కువ మంది భావిస్తున్నారట!.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఏ స్కీమ్ కూడా ఇప్పుడు ప్రజలకు అందడం లేదు. ‘అమ్మ ఒడి’ని మార్చి ప్రతి బిడ్డకు రూ.15 చొప్పున ఇస్తామన్న కూటమి నేతలు, కావాలంటే ఇంకా పిల్లలను కనండని బంపర్ ఆఫర్ ప్రకటించిన చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత తూచ్‌ అనేశారు. జాకీ మీడియా కూడా ‘అమ్మ ఒడి’ అంటే బటన నొక్కడమని ధనం వృధా చేయడమేనని ఊదరగొట్టింది. కానీ ఇప్పుడు ఏమి జరుగుతోందో చూడండి. 👇ఈ ఏడాదికి తల్లికి వందనం లేదు పొమ్మన్నారురైతు భరోసా జాడ కనిపించడం లేదు. విద్యా దీవెన, వసతి దీవెన ఏమయ్యాయో తెలియదు. ఆరోగ్య శ్రీని నీరుకార్చే పనిలో ఉన్నారు. జగన్ ఇంటింటికి డాక్టర్ ను పంపిచే స్కీమ్ తెస్తే, ఇప్పుడు అది గాలికి పోయినట్లు ఉంది. ప్రతి వ్యక్తికి ప్రభుత్వ సేవలందించేందుకు జగన్ తెచ్చిన వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని జీతాలూ పెంచుతామని చంద్రబాబు ఉగాది పండగనాడు దైవ సాక్షిగా ప్రకటించినా.. ఇప్పుడు దానికి మంగళం పలికారు. మరోవైపు.. ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. వంట నూనెల ధరలే లీటర్‌కు రూ.30 నుంచి రూ.40 వరకూ పెరిగాయి. పప్పులు, కూరగాయల ధరలన్ని అందుబాటులో లేకుండా పోయాయి. వీటన్నిటి ఫలితంగా సంక్రాంతి వచ్చినా ప్రజలు చేతిలో డబ్బులు ఆడక ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారాలు కూడా తగ్గాయి. ఇందుకు ఉదాహరణ ఏమిటంటే.. లెక్కలు ఇలా.. 👇ఒక్క కృష్ణా జిల్లాలోనే వైఎస్ జగన్ పాలనలో 2023 లో పండగల సీజన్ అయిన అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లలో వస్త్ర వ్యాపారం రూ.3000 కోట్ల మేర జరిగితే కూటమి పాలన వచ్చిన 2024లో అదే కాలానికి కేవలం రూ.1200 కోట్లుగానే ఉంది. కిరాణా వ్యాపారం పరిస్థితి అలాగే ఉంది. గతంతో పోల్చితే ఈసారి లావాదేవీలు రూ. వెయ్యి కోట్ల తగ్గాయి. బంగారం వ్యాపారం రెండు నెలల టైమ్‌కు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.3000 కోట్ల టర్నోవర్ జరిగితే, కూటమి పాలనలో అది రూ.1500 కోట్లుగా ఉంది. ఫర్నిచర్ కొనుగోళ్లు కూడా సగానికి సగం పడిపోయాయి. అప్పట్లో రూ.800 కోట్లు ఉంటే, ఈ సారి రూ.400 కోట్లే ఉంది. వీటి ఫలితంగా జీఎస్టీ రూపంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయమూ తగ్గింది. ఏపీలో జీఎస్టీ వసూళ్లు బీహారు కన్నా తక్కువ కావడం పరిస్థితిని తెలియచేస్తుంది. జగన్ టైమ్ లో 12 శాతం జీఎస్టీ వసూళ్లతో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్ర భాగాన ఉంటే, ఈ సారి ‘- 6’ శాతం మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 👉ఈ లెక్కలు ఇలా ఉన్నా, ఎల్లో మీడియా మాత్రం సంక్రాంతికి ప్రజలంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్లుగా బిల్డప్ ఇస్తోంది. అవును.. నిజమే.. మార్గదర్శికి సంబంధించిన కేసులలో గత ప్రభుత్వం జప్తు చేసిన రూ.వెయ్యి కోట్లను ఈ ప్రభుత్వం రాగానే తీసి వేసింది కదా!.. అందువల్ల ఈనాడు వారికే పండగే కావచ్చు. సామాన్యుడికి వస్తే ఎంత? రాకపోతే ఎంత? సంక్రాంతి వరాలు రూ.6700 కోట్లు అంటూ పెద్ద బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. గతంలో జగన్ ఒక్క స్కీమ్ కింద ఈ స్థాయిలో ప్రజలకు డబ్బు ఇచ్చేవారు. కాని చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో రూ.70 వేల కోట్లకు పైగా అప్పులు చేసినా, ఆ డబ్బు అంతా ఏమైందో కాని స్కీమ్ లు అమలు చేయలేదు. 🤔నిజంగానే చెప్పిన హామీలు చెప్పినట్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ అమలు చేసి ఉంటే సుమారు రూ.40 వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఇచ్చి ఉండాలి. కానీ అందులో ఆరోవంతు నిధులు కూడా ఇవ్వలేదు. ఉద్యోగులకు, వివిధ వర్గాలకు ఇవ్వాల్సిన మొత్తాలలో కొద్ది, కొద్దిగా ఇచ్చి పండగ చేసుకోమంటోంది. ఉద్యోగులకు రూ.25 వేల కోట్ల బకాయిలు ఉంటే రూ.1300 కోట్లు ఇచ్చారు. ఇది ఏ మూలకు వస్తాయని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌, ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా అర కొరగానే ఇచ్చారని చెబుతున్నారు. ఉద్యోగులకు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటెరిమ్ రిలీఫ్ ప్రకటిస్తామని అన్నా, దాని గురించి మాట్లాడడం లేదు. ఆర్థికంగా సమస్యలు ఉన్నాయని వాస్తవ పరిస్థితి చెప్పడం వేరు. మొత్తం హామీలు అమలు చేసినట్లు బిల్డప్ ఇచ్చి ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ప్రచారం చేసుకోవడం వేరు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. 😥గతంలో ధరలు కొద్దిగా పెరిగినా, విద్యుత్ చార్జీల సర్దుబాటు జరిగినా ఇదే చంద్రబాబు ,పవన్ ఏ స్థాయిలో విమర్శలు చేసేవారు! ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటివి ఎంత దారుణమైన కథనాలు రాసేవి. మరి ఇప్పుడు రూ.15 వేల కోట్ల విద్యుత్ భారం మోపినా, రెండున్నర లక్షల మంది వలంటీర్ల నోటికాడి కూడు తీసేసినా, తల్లులకు ప్రతి ఏటా వచ్చే రూ.15 వేలు ఎగ్గొట్టినా మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని మోసం చేసినా, నిరుద్యోగులకు రూ.3,000 ఖాయమని చెప్పి ఊరించి తూచ్ అంటున్నా, వారంతా సంతోషంగా ఉన్నారని భ్రమ పడాలన్నది ఎల్లో మీడియా లక్ష్యంగా ఉందనుకోవాలి. అభివృద్ధి పనులతో గ్రామాలకు సంక్రాంతి కళ వచ్చేసిందని ఈనాడు బోగస్ వార్తలు ఇస్తోంది. ప్రజల చేతిలో డబ్బు ఉంటే సంక్రాంతి పండగ బాగా చేసుకుంటారు కాని, కహానీలు చెబితే కడుపు నిండుతుందా?. కాకపోతే క్యాసినోలు, జూదాలు, కోడి పందేలు ఆడించి, ఎక్కడబడితే అక్కడ మద్యం అమ్మించి ఇదే సంక్రాంతి అనుకోండని అంటున్నారు. పేదలు వీటితో సరిపెట్టుకోవలసిందేనా!..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Two Persons Killed In Hyderabad Puppalaguda5
Hyd: పుప్పాలగూడలో జంట హత్యల కలకలం

హైదరాబాద్‌: నగరంలోని పుప్పాలగూడలో జంట హత్యలు కలకలం రేపాయి. యువతీ, యువకుడ్ని కత్తులతో పొడిచి హత్య చేసినట్లు తెలుస్తోంది. పుప్పాలగూడలోని అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది,. ఈరోజు(మంగళవారం) ఉదయం గుట్టల వద్దకు వచ్చిన వారికి మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పరిశీలించారు. మృతులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. అక్కడ బిల్డింగ్‌ నిర్మాణాలు జరుగుతుండటంతో పని చేయడానికి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో కొన్ని ఆధారాలు సేకరించామని, వాటి ద్వారా మృతుల వివరాలను గుర్తిస్తామన్నారు.ఘటన జరిగిన ప్రదేశాన్ని డీసీపీ శ్రీనివాస్‌ పరిశీలించారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు డీసీపీ తెలిపారు. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

Allu Arjun Celebrates Sankranti Celebrations at Home6
గతేడాది ఒకేచోట సంక్రాంతి సెలబ్రేషన్స్‌.. ఈసారి మాత్రం!

ఇంటిల్లిపాదీ కలిసి చేసుకునే పండగ సంక్రాంతి. ఈ పండక్కి ఎవరెక్కడ, ఏ మూలన ఉన్నా సరే ఎలాగోలా వీలు చేసుకుని మరీ ఇంటికి చేరుకుంటారు. అమ్మ చేసే అరిసెలు, చెల్లి వేసే ముగ్గులు, హరిదాసు కీర్తనలు, స్నేహితులతో గాలిపటాలు ఎగరేయడాలు.. కోడిపందేలు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. కుటుంబ బంధాల్ని రెట్టింపు చేస్తూ ఏడాదికి సరిపడా జ్ఞాపకాల్ని పోగుచేసిస్తుంది సంక్రాంతి.గతేడాది కన్నులపండగ్గా..ఈ పండగను మెగా ఫ్యామిలీ (Mega Family) కూడా ఎప్పుడూ ఘనంగా జరుపుకుంటూ ఉంటుంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు అందరూ ఒక్కచోట చేరుతుంటారు. గతేడాదైతే మెగా కుటుంబమంతా కలిసి సంక్రాంతిని సెలబ్రేట్‌ చేసుకున్నారు. బెంగళూరులోని ఫామ్‌ హోస్‌లో మెగా అల్లు ఫ్యామిలీ జాలీగా పండగను ఎంజాయ్‌ చేశారు. చిరంజీవి (Chiranjeevi Konidela), నాగబాబు కుటుంబంతో పాటు అల్లు అరవింద్‌ కుటుంబం కూడా అక్కడే ఉంది. అల్లు అర్జున్‌.. భార్య స్నేహ, పిల్లలు అర్హ, అయాన్‌తో కలిసి ఈ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యాడు.గతేడాది మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో అల్లు కుటుంబంచదవండి: గేమ్‌ ఛేంజర్‌ మూవీకి నా మనసులో ప్రత్యేక స్థానం: రామ్‌ చరణ్‌ఈసారి ఎవరింట్లో వారే..కానీ ఈసారి మాత్రం ఎవరింట్లో వారే పండగ జరుపుకున్నట్లు తెలుస్తోంది. అటు చిరంజీవి తన ఇంట్లో దిగిన ఫోటోలు షేర్‌ చేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపాడు. ఇటు అల్లు అర్జున్‌ (Allu Arjun) తన కుటుంబంతో పండగ జరుపుకున్నాడు. ట్రెడిషనల్‌ డ్రెస్‌లో ముస్తాబైన దిగిన ఫ్యామిలీ ఫోటోను అల్లు స్నేహ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇదంతా చూసిన అభిమానులు రెండు కుటుంబాలు కలిసి పండగ చేసుకుంటే ఎంత చూడముచ్చటగా ఉండేదోనని నిట్టూర్పు విడుస్తున్నారు.క్రిస్‌మస్‌ పార్టీకి చరణ్‌..గతంలో అల్లు అర్జున్‌ క్రిస్‌మస్‌ పార్టీ ఇస్తే దానికి రామ్‌చరణ్‌- ఉపాసన, సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌- లావణ్య త్రిపాఠి, శ్రీజ, నిహారిక, వైష్ణవ్‌తేజ్‌ ఇలా అందరూ హాజరయ్యారు. అలా ఎవరింట్లో ఏ పార్టీ ఉన్నా రెండు కుటుంబాలు కలుసుకునేవి. ఇప్పుడేమో వీరి మధ్య పెద్ద అగాధమే ఏర్పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ దూరం ఇలాగే కొనసాగుతుందా? అని పలువురూ చర్చించుకుంటున్నారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)చదవండి: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ

Sankranthiki Vasthunam Movie Review And Rating In Telugu7
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ

టైటిల్‌: ‘సంక్రాంతికి వస్తున్నాం’నటీనటులు: వెంకటేశ్‌, ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి, వీకే నరేశ్‌, వీటీ గణేష్‌, సాయి కుమార్‌, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర లిమాయే తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు: శిరీష్‌, దిల్‌ రాజుదర్శకత్వం: అనిల్‌ రావిపూడిసంగీతం: భీమ్స్‌ సిసిరిలియోసినిమాటోగ్రఫీ: సమీర్‌ రెడ్డిఎడిటర్‌: తమ్మిరాజువిడుదల తేది: జనవరి 14, 2025​ఈ సంక్రాంతికి చివరిగా వచ్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Review). రిలీజ్‌ విషయంలో చివరిది అయినా.. ప్రమోషన్స్‌లో మాత్రం మిగతా సినిమాలతో పోలిస్తే ఇదే ముందంజలో ఉంది. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు చేసినంత ప్రమోషన్‌ మరే సినిమాకు చేయలేదు. దానికి తోడు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌ అదిరిపోవడంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’పై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ‘ఫ్యామిలీతో వచ్చిన ప్రతిసారి విక్టరీ గ్యారెంటీ’ అనిపించుకున్న వెంకటేశ్‌ ఖాతాలో మరో ‘ ఫ్యామిలీ విక్టరీ’ పడిందా రివ్యూలో చూద్దాం.కథేంటేంటే.. డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్‌ వైడీ రాజు(వెంకటేశ్‌) ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌. మంచి కోసం తాను చేసే ఎన్‌కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్‌ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్‌), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు. కట్‌ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్‌)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్‌(నరేశ్‌). పార్టీ ప్రెసిడెంట్‌(వీటీ గణేశ్‌) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్‌ హౌజ్‌ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్‌ అతన్ని కిడ్నాప్‌ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్‌.. ఎలాగైనా బీజూ గ్యాంగ్‌ నుంచి ఆకేళ్లను రప్పించాలకుంటాడు. ఐపీఎస్‌ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్‌ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్‌ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్‌ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్‌ ఎలా సక్సెస్‌ చేశాడనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. కొన్ని కథలు మన ఊహకందేలా సింపుల్‌గా ఉంటాయి. సినిమా ప్రారంభం మొదలు ఎండ్‌ వరకు ప్రతీది అంచనాకు తగ్గట్టే ఉంటాయి. కానీ తెరపై చూస్తుంటే తెలియని ఒక ఆనందం కలుగుతుంది. పాత కథ, రొటీన్‌ సీన్లే అయినప్పటికీ ఎంటర్‌టైన్‌ అవుతుంటాం. అలాంటి సినిమాలను తెరకెక్కించడం అనిల్‌ రావిపూడికి వెన్నతో పెట్టిన విద్య. సింపుల్‌ పాయింట్‌ని తీసుకొని రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. గత సినిమాల మాదిరే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. టైటిల్‌ మాదిరే సంక్రాంతికి అసలైన సినిమా ఇది.(Sankranthiki Vasthunam Review)అనిల్‌ రావిపూడి(Anil Ravipudi) రిలీజ్‌ ముందే సినిమా కథంతా చెప్పేస్తుంటాడు. ఈ సినిమా విషయంలోనూ అదే చేశాడు. ట్రైలర్‌లోనే కథంతా చెప్పేశాడు. హీరోహీరోయిన్ల క్యారెక్టర్‌ ఎలా ప్రవర్తిస్తాయో కూడా ప్రమోషన్స్‌లోనే చెప్పేశాడు. స్టోరీ మొత్తం తెలిసినా కూడా తెరపై ఆ కథను చూసి ఎంజాయ్‌ చేయాలని ప్రతి ప్రేక్షకుడు అనుకుంటాడు. దానికి కారణం.. ఈ కథ మెయిన్‌ పాయింట్‌. భార్య, భర్త, ప్రియురాలు.. ఈ మూడు పాత్రలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కనిపిస్తాయి. వాళ్ల మధ్య వచ్చే ప్రతీ సీన్‌ మన నిజ జీవితంలో ఎక్కడో ఒక చోట చూసే ఉంటాం. అలాంటి పాయింట్‌ పట్టుకోవడమే అనిల్‌ రావిపూడి సక్సెస్‌. ఓ ఫ్యామిలీ స్టోరీకి ఓ వెరైటీ ఇన్వెస్టిగేషన్‌ యాడ్‌ చేసి ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా కథనాన్ని నడిపించాడు. ఆకెళ్ల కిడ్నాప్‌ సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. అయితే ఈ కిడ్నాప్‌ సీన్‌ని కూడా ఎంటర్‌టైనింగ్‌గానే తీర్చిదిద్ది.. కథనం మొత్తం ఫుల్‌ కామెడీ వేలో సాగుతుందనే ముందే చెప్పేశాడు దర్శకుడు. ఆ తర్వాత రాజు ఫ్యామిలీ పరిచయం నవ్వులు పూయిస్తుంది. వైడీ రాజు కొడుకు బుల్లిరాజు పండించే కామెడీకి పడిపడి నవ్వుతారు. వైడీ రాజు ఇంటికి మీనాక్షి వచ్చిన తర్వాత కామెడీ డోస్‌ డబుల్‌ అవుతుంది. ఒక పక్క భార్య, మరో పక్క మాజీ ప్రియురాలుతో హీరో పడే బాధ థియేటర్‌లో నవ్వులు పూయిస్తుంది. ఆహ్లాదకరమైన పాటలు... పొట్టచెక్కలయ్యే కామెడీ సీన్లతో ఫస్టాఫ్‌ ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌ ప్రారంభం అయిన కాసేపటికే కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. జైలర్‌ జార్జ్‌ ఆంటోనీ(ఉపేంద్ర లిమాయే)తో వచ్చే కొన్ని సీన్లు అంతగా ఆకట్టుకోవు. ఆస్పత్రి సీన్‌ కూడా రొటీన్‌గానే అనిపిస్తుంది. ‘ఆవకాయ’ సీన్‌కు అయితే పడిపడి నవ్వుతారు. క్లైమాక్స్‌ని పకడ్బందీగా రాసుకున్నాడు. క్లైమాక్స్‌ యాక్షన్‌ సీన్‌ అయితే అదిరిపోతుంది. అక్కడ వెంకటేశ్‌ చెప్పే డైలాగ్స్‌ నవ్వులు పూయిస్తాయి. ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతినకుండా.. మగవాళ్లకు మనో ధైర్యాన్ని ఇచ్చేలా ఆ డైలాగ్స్‌ ఉంటాయి. ముగింపులో ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది. మొత్తంగా సంక్రాంతికి చూడాల్సిన మాంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఎవరెలా చేశారంటే.. ఇద్దరి ఆడవాళ్ల మధ్య నలిగిపోయే పాత్రను వెంకటేశ్‌(Venkatesh) చేస్తే ఎలా ఉంటుందో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ చిత్రంలోనే చూసేశాం. ఆయన కామెడీ టైమింగ్‌ గురించి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా వెంకీ అలాంటి పాత్రే చేశాడు. మాజీ ప్రియురాలు, భార్య మధ్య నలిగిపోయే యాదగిరి దామోదర రాజు పాత్రలో ఒదిగిపోయాడు. ఇద్దరి ఆడాళ్ల మధ్య నలిగిపోతూ నవ్వులు పూయించాడు. యాక్షన్‌తో అలరించడమే కాకుండా పాట పాడి ఆకట్టుకున్నాడు. ఇక చదువురాని పల్లెటూరి అమ్మాయి, రాజు భార్య భాగ్యంగా ఐశ్వర్య రాజేశ్‌ తనదైన నటనతో ఆకట్టుకుంది.రాజు మాజీ ప్రియురాలు, ఐపీఎస్‌ అధికారి మీనాక్షిగా మీనాక్షి చౌదరి అదరగొట్టేసింది. తొలిసారి ఇందులో యాక్షన్‌ సీన్‌ కూడా చేసింది. ఇక వీరందరితో పాటు ముఖ్యంగా మట్లాడుకోవాల్సిన మరో పాత్ర బుల్లి రాజు. ఈ పాత్రలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌ రేవంత్‌ ఒదిగిపోయాడు. ఇంత మంది స్టార్స్‌ ఉన్నప్పటికీ.. తనదైన నటనతో అందరి దృష్టి ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్‌ ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగాడానికి బుల్లిరాజు పాత్ర కూడా ఒక ప్రధాన కారణం. ‘కొరికేస్తా.. కొరికేస్తా’ అంటూ ఈ బుడ్డోడు చేసిన కామెడీకి ప్రేక్షకులు పలగబడి నవ్వారు. నరేశ్‌, సాయి కుమార్‌, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా భీమ్స్‌ అందించిన సంగీతం సినిమాకే హైలెట్‌. అద్భుతమైన పాటలతో పాటు అదిరిపోయే బీజీఎం ఇచ్చాడు. ‘గోదారి గట్టు మీద...’పాటతో పాటు ప్రతి పాట తెరపై చూసినప్పుడు మరింత ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌ డెస్క్‌

Makara Jyothi Darshanam Makaravilakku At Sabarimala8
దర్శనమిచ్చిన మకరజ్యోతి..అయ్యప్ప భక్తుల పరవశం

తిరువనంతపురం: అయ్యప్ప భక్తులు ఏడాదిపాటు ఎదురు చూసిన క్షణం మళ్లీ వచ్చింది. మకర సంక్రాంతి పర్వదినమైన మంగళవారం(జనవరి14) సాయంత్రం 6గంటల 44 నిమిషాలకు కేరళలోని శబరిమల ఆలయ సమీపంలోని పొన్నాంబళమేడు కొండపై మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. జ్యోతి రూపంలో అయ్యప్పస్వామి దర్శనమిచ్చిన సందర్భంగా శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమోగాయి. ‍జ్యోతి దర్శనానికి ముందు అయ్యప్పస్వామిని తిరువాభవరణలతో అలంకరించారు.జ్యోతి దర్శనానికి ట్రావెన్‌కోర్‌ దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శబరిమల కొండల్లోని పంబ, హిల్‌టాప్‌, సన్నిధానం సహా పలు చోట్ల భక్తుల కోసం వ్యూపాయింట్‌లు ఏర్పాటు చేసింది. జ్యోతిని సుమారు లక్షన్నర మంది దాకా అయ్యప్ప భక్తులు ప్రత్యక్షంగా జ్యోతిని వీక్షించినట్లు సమాచారం. జ్యోతిని దర్శించుకునేందుకు భక్తుల కోసం ట్రావెన్‌కోర్‌ ఆలయ బోర్డు ప్రత్యేక వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది. పరోక్షంగా టీవీలు, యూ ట్యూబ్‌లో కొన్ని కోట్ల మంది జ్యోతిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా దర్శనం చేసుకున్నారు. జ్యోతి దర్శనం కోసం నియమ నిష్టలతో అయ్యప్ప మాల ధరించిన స్వాములు భారీ సంఖ్యలో శబరిమలకు విచ్చేశారు. 41 రోజుల ఉపవాస దీక్ష చేసిన భక్తులు శబరిమల కొండపై దర్శనమిచ్చిన మకర జ్యోతిని కనులారా వీక్షించి భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. . ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున శబరిమల ఆలయంలో మకరజ్యోతి లేదా మరళవిక్కు కార్యక్రమం నిర్వహిస్తుంటారు. మకర సంక్రాంతి నాడు దర్శనమిచ్చే జ్యోతి కావడంతో దీనిని శబరిమల మకరవిళక్కు లేదా శబరిమల మకర జ్యోతి అని పిలుస్తుంటారు.

Zuckerberg Election Comment Row: Meta Get Summons From Indian Govt9
జుకర్‌బర్గ్‌ వ్యాఖ్యలు.. మెటాకు భారత్‌ సమన్లు

సోషల్‌ మీడియా దిగ్గజం మెటాకు కేంద్రం సమన్లు జారీ చేయనుంది. లోక్‌సభ ఎన్నికలపై ఆ సంస్థ బాస్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ చేసిన ‘అసత్య ప్రచారపు’ వ్యాఖ్యలే అందుకు కారణం. గతేడాది భారత్‌ సహా ప్రపంచంలో అనేక దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓటమి చెందాయని జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించారు. అయితే.. జుకర్‌బర్గ్‌ చేసిన వాదనను భారత ప్రభుత్వం ఖండించింది. బీజేపీ ఎంపీ, ఐటీ & కమ్యూనికేషన్‌ పార్లమెంటరీ హౌజ్‌ ప్యానెల్‌ చైర్మన్‌ నిషికాంత్‌ దుబే మెటాకు సమన్లు పంపే విషయాన్ని ధృవీకరించారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినందుకే సమన్లు అని ఎక్స్‌ వేదికగా తెలిపారాయన. मेरी कमिटि इस ग़लत जानकारी के लिए @Meta को बुलाएगी । किसी भी लोकतांत्रिक देश की ग़लत जानकारी देश की छवि को धूमिल करती है । इस गलती के लिए भारतीय संसद से तथा यहाँ की जनता से उस संस्था को माफ़ी माँगनी पड़ेगी https://t.co/HulRl1LF4z— Dr Nishikant Dubey (@nishikant_dubey) January 14, 2025ప్రజాస్వామ్య దేశం విషయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం.. ఆ దేశ ప్రతిష్టకు భంగం కలిగించడమే అవుతుంది. ఈ తప్పునకు భారత దేశ ప్రజలకు, చట్ట సభ్యులకు క్షమాపణ చెప్పాల్సిందే అని దుబే ఎక్స్‌ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. అంతకు ముందు.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో.. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏపై ఓటర్లు విశ్వాసం ఉంచి వరుసగా మూడోసారి గెలిపించారని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) కౌంటర్‌ బదులిచ్చారు.‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 2024లో నిర్వహించిన ఎన్నికల్లో 64కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాసం ఉందని తేల్చిచెప్పారు. కొవిడ్‌-19 తర్వాత భారత్‌ సహా అధికారంలో ఉన్న అనేక ప్రభుత్వాలు ఓడిపోయాయి అని జుకర్‌బర్గ్‌ చెప్పడంలో వాస్తవం లేదు. .. 80 కోట్ల మందికి ఉచిత ఆహారం మొదలు 220కోట్ల వ్యాక్సిన్లు అందించడంతోపాటు కొవిడ్‌ సమయంలో ప్రపంచ దేశాలకు భారత్‌ సాయం చేయడం వంటి నిర్ణయాలు మోదీ మూడోసారి విజయానికి నిదర్శనంగా నిలిచాయి’’ అని అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. అలాగే జుకర్‌బర్గ్‌ అలా మాట్లాడటం నిరాశకు గురిచేసిందన్న అశ్వినీ వైష్ణవ్‌.. వాస్తవాలు, విశ్వసనీయతను కాపాడుకుందామంటూ మెటాను టాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు.జుకర్‌బర్గ్‌ ఏమన్నారంటే..జనవరి 10వ తేదీన ఓ పాడ్‌కాస్ట్‌లో జుకర్‌బర్గ్‌ మాట్లాడారు. 2024 సంవత్సరం భారీ ఎన్నికల సంవత్సరంగా నిలిచింది. ఉదాహరణగా.. భారత్‌తో సహా ఎన్నో దేశాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే అన్నిచోట్లా అక్కడి ప్రభుత్వాలు అక్కడ ఓడిపోయాయి. దీనికి కరోనాతో ఆయా ప్రభుత్వాలు డీల్‌ చేసిన విధానం.. అది దారితీసిన ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణం అని అన్నారాయన.

Australian Open: Djokovic Survives Scare From Indian Origin Fanboy Basavareddy10
Australian Open: జొకోవిచ్‌కు ముచ్చెమటలు పట్టించిన తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్‌

అటువైపు ప్రత్యర్థి 24 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ విజేత... ఏకంగా 1126 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ప్లేయర్‌... కెరీర్‌లో ఇప్పటికే 76 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు ఆడిన అనుభవం సొంతం... ఇటువైపు ప్లేయర్‌కు ‘వైల్డ్‌ కార్డు’ ద్వారా కెరీర్‌లోనే తొలి గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం... ఎదురైన ప్రత్యర్థి తానెంతో ఇష్టపడే ఆటగాడు... ఇద్దరి బలాబలాలు పరిశీలిస్తే మ్యాచ్‌ ఏకపక్షంగా వరుస సెట్‌లలో ముగియడం ఖాయమని విశ్లేషకుల ఏకాభిప్రాయం... కానీ అలాంటిదేమీ జరగలేదు. ఒకే ఒక్క మ్యాచ్‌తో టెన్నిస్‌ ప్రపంచాన్ని ఆకర్షించేందుకు వచ్చిన అవకాశాన్ని ఆ కుర్రాడు వదులుకోలేదు. తన అసమాన పోరాటపటిమతో అందరి దృష్టిలో పడ్డాడు. అతడే 19 ఏళ్ల నిశేష్‌ బసవరెడ్డి... తెలుగు సంతతికి చెందిన అమెరికన్‌ టెన్నిస్‌ టీనేజ్‌ రైజింగ్‌ స్టార్‌.. సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో నిశేష్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయినా... ప్రతి పాయింట్‌ సాధించేందుకు జొకోవిచ్‌ను తెగ కష్టపెట్టాడు. నిశేష్‌కు ఎంతో భవిష్యత్‌ ఉందని మ్యాచ్‌ అనంతరం జొకోవిచ్‌ కూడా వ్యాఖ్యానించడం విశేషం. మెల్‌బోర్న్‌: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌సింగిల్స్‌ టైటిల్‌ లక్ష్యంగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ తొలి అడ్డంకిని అధిగమించాడు. ప్రపంచ 107వ ర్యాంకర్, అమెరికన్‌ రైజింగ్‌ టీనేజ్‌ టెన్నిస్‌ స్టార్‌ నిశేష్‌ బసవరెడ్డితో జరిగిన తొలి రౌండ్‌ పోరులో జొకోవిచ్‌ గెలిచి 18వ సారి ఈ టోర్నీలో రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. 2 గంటల 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నిశేష్‌ 6–4, 3–6, 4–6, 2–6తో జొకోవిచ్‌ చేతిలో పోరాడి ఓడిపోయాడు. గత నెలలోనే ప్రొఫెషనల్‌గా మారిన 19 ఏళ్ల నిశేష్‌ ఏమాత్రం తడబడకుండా తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. బేస్‌లైన్‌ వద్ద సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూనే... అడపాదడపా డ్రాప్‌ షాట్‌లు... కళ్లు చెదిరే రిటర్న్‌లతో వరుసగా 21వ ఏడాది గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడుతోన్న జొకోవిచ్‌కు ఇబ్బంది పెట్టడంలో నిశేష్‌ సఫలమయ్యాడు. తొలి సెట్‌లోని ఎనిమిదో గేమ్‌లో జొకోవిచ్‌ సరీ్వస్‌ను బ్రేక్‌ చేసిన నిశేష్‌ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 5–3తో ముందంజ వేశాడు. తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్‌ సర్వీస్‌ కాపాడుకోగా... పదో గేమ్‌లో నిశేష్‌ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని తొలి సెట్‌ను 49 నిమిషాల్లో 6–4తో సొంతం చేసుకోవడంతో మ్యాచ్‌ను మైదానంలో ప్రత్యక్షంగా చూస్తున్న వేలాది మంది ప్రేక్షకులు, టీవీల ముందున్న లక్షలాది వీక్షకులు ఆశ్చర్యపోయారు. తొలి సెట్‌ నెగ్గిన ఉత్సాహంతో రెండో సెట్‌లోనూ నిశేష్‌ భేషుగ్గా ఆడాడు. అయితే అపార అనుభవజ్ఞుడైన జొకోవిచ్‌ టీనేజర్‌ నిశేష్‌ ఆటతీరుపై అవగాహన పెంచుకొని దూకుడు పెంచాడు. స్కోరు 4–3 వద్ద ఎనిమిదో గేమ్‌లో నిశేష్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన జొకోవిచ్‌ తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని 44 నిమిషాల్లో రెండో సెట్‌ దక్కించుకొని లయలోకి వచ్చాడు. రెండో సెట్‌లోని చివరి గేమ్‌ ఆడుతున్న సమయంలో నిశేష్‌ కాలు బెణకడంతో అతను ఆ తర్వాత చురుగ్గా కదల్లేకపోయాడు. మరోవైపు జొకోవిచ్‌ మరింత జోరు పెంచాడు. మూడో సెట్‌లోని తొలి గేమ్‌లోనే నిశేష్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన జొకోవిచ్‌ ఆ తర్వాత తన సరీ్వస్‌లను కాపాడుకొని 43 నిమిషాల్లో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. నాలుగో సెట్‌లో కూడా తొలి గేమ్‌లో, ఐదో గేమ్‌లో నిశేష్‌ సర్వీస్‌లను బ్రేక్‌ చేసిన జొకోవిచ్‌ కళ్లు చెదిరే ఏస్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ‘నిశేష్‌ పరిపూర్ణ క్రీడాకారుడిలా ఆడాడు. అతను ఆడిన కొన్ని షాట్‌లు నన్నే ఆశ్చర్యానికి గురి చేశాయి. చివరి పాయింట్‌ వరకు పోరాటపటిమతో ఆకట్టుకున్నాడు. భవిష్యత్‌ లో నిశేష్‌ ఆటతీరును చాలాసార్లు చూస్తాము. ఇందులో సందేహం లేదు’ అని మ్యాచ్‌ ముగిశాక జొకోవిచ్‌ వ్యాఖ్యానించాడు. 2005లో అమెరికాలో పుట్టి పెరిగిన నిశేష్‌ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశాడు. నిశేష్‌ తల్లిదండ్రులు మురళీ రెడ్డి, సాయిప్రసన్న స్వస్థలం నెల్లూరు జిల్లా. 1999లో ఉద్యోగరీత్యా భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తొలి రౌండ్‌లో ఓడిన నిశేష్‌కు 1,32,000 ఆ్రస్టేలియన్‌ డాలర్ల (రూ. 70 లక్షల 47 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 10 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీ ముగిశాక విడుదల చేసే ర్యాంకింగ్స్‌లో నిశేష్‌ కెరీర్‌ బెస్ట్‌ 104వ ర్యాంక్‌కు చేరుకుంటాడు. అల్‌కరాజ్‌ అలవోకగా... పురుషుల సింగిల్స్‌లో సోమవారం స్టార్‌ ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. 11వ సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టగా... డిఫెండింగ్‌ చాంపియన్‌ సినెర్‌ (ఇటలీ), మూడో సీడ్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. 2023 ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ రన్నరప్‌ సిట్సిపాస్‌ 5–7, 3–6, 6–2, 4–6తో మికిల్సన్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. 2018 తర్వాత ఈ టోర్నీలో సిట్సిపాస్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోవ డం గమనార్హం. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో సినెర్‌ 7–6 (7/2), 7–6 (7/5), 6–1తో నికోలస్‌ (చిలీ)పై, అల్‌కరాజ్‌ 6–1, 7–5, 6–1తో షెవ్‌చెంకో (కజకిస్తాన్‌)పై విజయం సాధించారు. పసారో (ఇటలీ)తో జరిగిన మ్యాచ్‌లో పదో సీడ్‌ దిమిత్రోవ్‌ గాయం కారణంగా రెండో సెట్‌లో వైదొలిగాడు. 21-టెన్నిస్‌ ఓపెన్‌ శకంలో (1968 నుంచి) వరుసగా 21వ ఏడాది జొకోవిచ్‌ గ్రాండ్‌స్లామ్‌ టోరీ్నలో ఒక్క విజయమైనా సాధించాడు. ఈ జాబితాలో రోజర్‌ ఫెడరర్‌ (22 ఏళ్లు) మాత్రమే ముందున్నాడు. 429-ఓపెన్‌ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా ఫెడరర్‌ (429 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్‌ సమం చేశాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో జొకోవిచ్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో బరిలోకి దిగితే ఫెడరర్‌ రికార్డును అధిగమిస్తాడు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
కేరళ,తమిళనాడుకు ‘కల్లక్కడల్‌’ ముప్పు..!

తిరువనంతపురం: కేరళ,తమిళనాడు(Tamilnadu) తీరాలకు ‘కల్లక్కడల్‌’

title
కుంభమేళాలో స్టీవ్‌ జాబ్స్‌ భార్యకు అస్వస్థత

దివంగత యాపిల్ సహ వ్యవస్థాపకుడు 'స్టీవ్ జాబ్' భార్య 'లారెన్ పావెల్ జాబ్స్' ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మ

title
దర్శనమిచ్చిన మకరజ్యోతి..అయ్యప్ప భక్తుల పరవశం

తిరువనంతపురం: అయ్యప్ప భక్తులు ఏడాదిపాటు ఎదురు చూసిన క్షణం మళ

title
‘పీఓకే’పై రాజ్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు

జమ్ము:పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే) లేకుండా జమ్ముకశ్మీర్‌(Ja

title
ఓట్ల కోసం బంగారం పంచుతున్నారు: కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ:ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.ఎన్న

NRI View all
title
Sankranti 2025 : జపాన్‌లో తెలుగువారి సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి వచ్చిందంటే ఊరా వాడా అంతా సంబరంగా జరుపుకుంటారు.

title
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా

ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్

title
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!

అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్‌ దిగ్గజం యాపిల్‌ 185 మంది ఉద్యోగులను త

title
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి

title
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)

Advertisement

వీడియోలు

Advertisement