Bharat ane nenu
-
‘సితారా.. సింగర్‌గా ట్రై చేయ్’
కరోనా లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు రద్దవ్వడంతో మన సెలబ్రెటీలందరూ ఇంటికే పరిమితమయ్యారు. అయితే అనూహ్యంగా దొరికిన లాక్డౌన్ సమయాన్ని పూర్తిగా కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తున్నారు. ఇక కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన పిల్లలు సితార, గౌతమ్‌లతో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో మహేశ్ చేస్తున్న అల్లరికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇక చాలా ఆక్టీవ్‌గా ఉండే సితార గతంలో ‘భరత్ అనే నేను’ సినిమాలోని అరరే ఇది కలలా ఉన్నదే అనే సాంగ్‌ను ఆలపించింది. చాలా ఎనర్జటిక్‌గా పాడిన ఈ పాట నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. సితార పాడిన పాటకు సంబంధించిన పాత వీడియోను నమ్రత తాజాగా తన ఇన్‌స్టాలో తిరిగి పోస్ట్ చేస్తూ ‘నాన్న కూతురు’ అనే కామెంట్‌ను జతచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొన్ని గంటల వ్యవధిల్లోనే లక్షకు పైగా వ్యూస్ రాగా వేలల్లో లైక్స్ వచ్చాయి. ‘సింగర్‌గా ట్రై చేయ్ లిటిల్ ప్రిన్స్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram Daddy’s girl !! #MemoryTherapy❤️ One for each day💕💕💕 @sitaraghattamaneni A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on May 7, 2020 at 7:42am PDT చదవండి: మార్పుని అలవాటు చేసుకోవాల్సిందే భారతీయుడు ఆగలేదు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మహేష్ పుట్టిన రోజున పక్కా..!
భరత్ అనే నేను సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల డెహ్రాడూన్‌లో కాలేజ్ ఎపిసోడ్‌కు సంబంధించిన చిత్రకరణ పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా.. బర్త్‌డే కానుకగా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయటం పక్కా అని తెలుస్తోంది. మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను 2019 ఏప్రిల్ 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
‘భరత్ అనే నేను’ రాజకీయ నేతలకు కనువిప్పు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘భరత్ అనే నేను’కమర్షియల్, సందేశాత్మక చిత్రమని, రాజకీయ నేతలకు ఈ చిత్రం కనువిప్పు కలిగించిందని సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్‌బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత, వైఎస్సార్ సీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు (బంగారయ్య) అన్నారు. అశోక థియేటర్ ఆవరణలో శనివారం రాత్రి రాజమహేంద్రవరం నగర సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్‌బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ చిత్రం శత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గీతం ఫిలిమ్స్ శాస్త్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ భరత్ అనే నేను చిత్రానికి మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ పిల్లర్లుగా, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, అభిమానులను మూలస్తంభాలు అభివర్ణించారు. అభిమానులందరికీ అన్నయ్య కృష్ణ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పమన్నారని తెలిపారు. చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లో శత దినోత్సవాలు ఉన్నప్పటికీ ఇక్కడికే వచ్చానని తెలిపారు. మరిన్ని సందేశాత్మక, సామాజికపరమైన సినిమాల్లో మహేష్‌బాబు నటిస్తారని తెలిపారు. ఏపీఐసీసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ చిత్రం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే సంచలనం అయిందన్నారు. సినిమా డిస్ట్రిబ్యూటర్ ఇష్ణా ఎంటర్టైన్మెంట్స్ అధినేత భరత్ చౌదరి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమాలో నటించిన ‘అంతరికరణ శుద్ధి’ సుబ్బారావు మాట్లాడుతూ కోనసీమలో పుట్టి, నగరంలో చదువుకుని, వృత్తి రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్న రాజశేఖర్ అనే నేను.. శుభోదయం సుబ్బారావు అంటూ అభిమానులను అలరించారు. అనంతరం శేషగిరిరావు కేక్‌ను కట్ చేసి, డిస్ట్రిబ్యూటర్స్‌కు, ఎగ్జిబిటర్స్‌కు మెమెంటోలను అందజేశారు. వికలాంగులకు వీల్చైర్లు అందజేశారు. జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి అనుశ్రీ సత్యనారాయణ, వానపల్లి గౌరీశంకర్, సురేష్ మూవీస్ రమేష్, మణికంఠ ఫిలిమ్స్ సత్తిబాబు, బుచ్చిరాజు, అశోక థియేటర్ అధినేత రాజబాబు, మేనేజర్ గెడ్డం శ్రీను, రౌతు రవీంద్ర, ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, మహేష్‌బాబు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పండగ చేసుకుంటున్న మహేష్ ఫ్యాన్స్
టాలీవుడ్లో ప్రస్తుతం ఓ చిత్రం వందరోజులు ఆడటం గగనంగా మారిపోయింది. ఈ దశలో మొన్నీమధ్యే రామ్ చరణ్ ‘రంగస్థలం’ విజయవంతంగా 100 డేస్ పూర్తి చేసుకోగా.. ఇప్పుడు భరత్ అనే నేను కూడా ఆ ఫీట్‌ను సాధించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం నేటితో వంద రోజులు పూర్తి చేసేసుకుంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. నేడు చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్ల వద్ద సందడి నెలకొంది. డైరెక్టర్ కొరటాల శివ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఈ పొలిటికల్ డ్రామాను బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టింది. సీఎం రోల్లో మహేష్ బాబు నటన, ప్రధాన పాత్రల నటన, దేవీ మ్యూజిక్ ఇలా అన్ని అంశాలు చిత్రానికి కలిసొచ్చాయి. రికార్డు స్థాయిలో చిత్రం కలెక్షన్లు రాబట్టింది కూడా. భరత్ అనే నేను 100 డేస్ పూర్తి చేసుకోవటం, 25వ చిత్రం కోసం మహేష్ లుక్ ఛేంజ్, మేడమ్ టుస్సాడ్‌లో మహేష్ విగ్రహం ఏర్పాటు, ...ఇలా అన్ని ఒకదాని వెంట ఒకటి జరిగిపోతుండటంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. 100 days since Bharat has arrived as the C.M. Thank you Superstar @urstrulymahesh garu, director @SivaKoratala garu and the entire cast&crew for giving a blockbuster #BharatAneNenu. Thanks to our dearest fans for all the love that you have shown to the film. #BharatAneNenu100Days pic.twitter.com/tJHbyQ4pQk — DVV Entertainment (@DVVEnts) 27 July 2018 -
ఇదేం సినిమా కథ కాదు...
సినిమాల ప్రభావంతో యువత పడుతున్న దారుల గురించి విరివిరిగా చర్చలు జరుగుతున్న సమయంలో.. ఓ ఎన్నారై యువకుడి ప్రయత్నం తెరపైకి వచ్చింది. విద్యాదానానికి మించింది లేదని బలంగా నమ్మిన ఆ 20 ఏళ్ల యువకుడు ఓ సినిమా ప్రేరణతో చేసిన ప్రయత్నం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం నింపేందుకు ఆ యువకుడు చేసిన ప్రయత్నమే మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. సృజన్ నేపథ్యం.. అమెరికాలోని మేరీల్యాండ్, జర్మన్‌టౌన్‌లో తెలుగు దంపతులకు సృజన్ కోనేరు జన్మించాడు. ప్రస్తుతం పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఎంఐఎస్(మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) కోర్సు అభ్యసిస్తున్నాడు. తల్లి ఏడాదిన్నర క్రితం పాంక్రియాటిక్ కేన్సర్‌తో కన్నుమూశారు. మాతృదేశంలోని విద్యా వ్యవస్థలో మార్పులు రావాలన్నది ఆమె కోరిక. దానిని నెరవేర్చేందుకు ఈ ఎన్నారై యువకుడు కదిలాడు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వ సాయం తీసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషికి తన ఆలోచనను వివరించాడు. ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించటం, సోషల్ రెస్పాన్స్‌బిలిటీస్(సామాజికి బాధ్యత)పై అవగాహన కల్పిస్తానని, అందుకు అనుమతించాలని కోరాడు. అతని ఆలోచన నచ్చిన సీఎస్ జోషి కూడా అందుకు అనుమతిచ్చారు. తన ప్రయత్నానికి వేదికగా శంషాబాద్ దగ్గర్లోని సిద్ధాపురం గ్రామం.. జిల్లా పరిషత్ హైస్కూల్‌ను సృజన్ ఎంచుకున్నాడు. ‘రెగ్యులర్ తరగతులకు ఏ మాత్రం భంగం కలగకుండా నా ప్రయత్నాన్ని మొదలుపెట్టా. మొదట్లో నేను ఆంగ్లం మాట్లాడుతుంటే విద్యార్థులు సిగ్గుపడేవారు. వాళ్ల నేపథ్యం.. పరిస్థితులు నాకు అర్థమయ్యాయి. అప్పటి నుంచి వారిలో తెలుగులో మాట్లాడటం మొదలుపెట్టాక.. క్రమంగా నాకు దగ్గర అవ్వటం ప్రారంభించారు. వారిలో ఆత్మవిశ్వాసం నింపటమే ముఖ్యమని భావించి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టా. క్రమక్రమంగా వాళ్లు ఆంగ్లంలో మాట్లాడటం మొదలుపెట్టారు. చాలా సంతోషంగా ఉంది’ అని సృజన్ చెబుతున్నాడు. ఈ ఎన్నారై అందరిలా కాదు... ‘20 ఏళ్ల యువకుడు. టీచింగ్‌లో ఎలాంటి అనుభవం లేని వ్యక్తి. పైగా ఎన్నారై. అయినా సొంత గడ్డపై మమకారంతో చేస్తున్న ప్రయత్నం నిజంగా అభినందించదగ్గ విషయం. విద్యార్థులు అతని పాఠాల కోసం ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు’ అని స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మణివర్థన్ రెడ్డి సృజన్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం వారాంతం నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తున్న సృజన్.. ఈ నెలాఖరులో ఈ ‘ఎంపవర్మెంట్ బియాండ్ ఎడ్యుకేషన్’ ప్రాజెక్టు పూర్తి రిపోర్టును అందించేందుకు సిద్ధమవుతున్నాడు. తన ఈ ప్రయత్నం ద్వారా మరికొందరు ఎన్నారైల్లో కదలిక తీసుకురావాలన్నదే తన ఉద్దేశమని, తద్వారా మాతృభూమికి ఎంతో కొంత మేలు జరగుతుందని సృజన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. మహేష్ అభిమాని... అన్నట్లు సృజన్ సూపర్‌స్టార్ మహేష్ బాబుకు అభిమాని అంట. అంతేకాదు భరత్ అనే నేను చిత్రంలోని కాన్సెప్ట్(ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడం)తోనే ప్రేరణ పొంది తాను ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టానని సృజన్ చెబుతున్నాడు కూడా. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఇదే సిద్దాపురం గ్రామాన్ని గతంలో మహేష్ దత్తత తీసుకున్నారు కూడా. -
మరో బయోపిక్‌లో భరత్ హీరోయిన్
భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కియారా అద్వానీ. తొలి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ అవుతున్నారు. ఇప్పటికే బోయపాటి శ్రీను, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కియారా మరిన్ని సినిమాలకు రెడీ అవుతున్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్నారు కియారా. ధోని బయోపిక్‌తో బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న కియారా ఇటీవల లస్ట్‌స్టోరిస్ తో సెన్సేషన్ సృష్టించారు. తాజా మరో బయోపిక్ లో నటించేందుకు ఓకె చెప్పారు. పరమవీర చక్ర సాధించిన అమర జవాన్ విక్రమ్ బాత్రా జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో కియారా కీలక పాత్రలో నటించనున్నారు. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా నటిస్తున్న ఈ సినిమాను కరణ్ జోహర్ నిర్మిస్తున్నాడు. -
స్క్రీన్ ప్లే 17th July 2018
-
ఎవరికీ పేమెంట్లు ఎగ్గొట్టలేదు: నిర్మాత దానయ్య
ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్పై సంచలన ఆరోపణలు చక్కర్లు కొట్టాయి. భరత్ అనే నేను చిత్రానికి సంబంధించిన కొందరు టెక్నీషియన్ల(కొరటాల, కైరా పేర్లను ప్రముఖంగా ప్రచురించాయి) పేమెంట్లను ఎగ్గొట్టారంటూ నిర్మాత దానయ్యపై ఆరోపణలు చేస్తూ కొన్నికథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయన ఓ ప్రకటనలో స్పందించారు. ‘ప్రొడక్షన్ హౌజ్ మీద వచ్చిన పుకార్లు చాలా బాధించాయి. భరత్ అనే నేను చిత్రానికి సంబంధించి ఎవరికీ, ఎలాంటి పెమెంట్లు ఎగ్గొట్టలేదు. ఈ విషయంలో ఎవరికైనా ఇంకా అనుమానాలు ఉంటే. హైదరాబాద్‌లోని మా కార్యాలయానికి నేరుగా వచ్చి నివృత్తి చేసుకోవచ్చు. ఇకపై ఇలాంటి చెత్త కథనాలు ఇకపై ప్రచురించకండని జర్నలిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను బ్లాక్ బస్టర్హిట్ గా నిలిచింది. కైరా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించగా, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. మరోవైపు రామ్‌చరణ్-బోయపాటి చిత్రానికి దానయ్యే నిర్మాత కాగా.. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కబోయే భారీ మల్టీస్టారర్‌కు కూడా డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పైనే రూపొందబోతోంది. A statement from our Producer Sri Danayya DVV garu. pic.twitter.com/QHjLL6jro5 — DVV Entertainment (@DVVEnts) 15 July 2018 -
పద్ధతి మారాలి
సింగర్‌గా, కథానాయికగా ఆండ్రియా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఐదేళ్ల క్రితం ‘తడాఖా’లో నటించిన ఆండ్రియా ఆ తర్వాత డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు తెరపై కనిపిస్తున్నారు. సమ్మర్లో విడుదలైన మహేశ్ బాబు ‘భరత్ అనే నేను’లో ‘ఇదే కలలా ఉన్నదే...’ పాట పాడింది ఆండ్రియానే. ఆ సంగతలా ఉంచితే ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు సినిమా ‘ఆయుష్మాన్ భవ’లో కనిపించనున్నారు. చరణ్ తేజ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆయుష్మాన్ భవ’. ఇందులో స్నేహా ఉల్లాల్ కథానాయికగా నటించారు. సీటీఎఫ్ సంస్థ నిర్మాణ బాధ్యతలను నిర్వహించింది. ఈ సినిమాలో ఆండ్రియా సింగర్ జెన్నీఫర్ క్యారెక్టర్ చేయనున్నట్లు చిత్రబృందం తెలియజేసింది. చరణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణతో పాటు కథను అందించిన దర్శకుడు నక్కిన త్రినాథరావుగారికి, స్క్రీన్‌ప్లే అందించిన పరుచూరి బ్రదర్స్‌కు, సహ నిర్మాతగా వ్యవహరించిన దర్శకుడు మారుతికి ధన్యవాదాలు. ఆండ్రియా క్యారెక్టర్ చాలా స్పెషల్‌గా ఉంటుంది. క్యారెక్టర్ విన్న వెంటనే ఆండ్రియా ఒప్పుకున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు మీట్ బ్రోస్ సంగీతం అందించారు. సమాజం ప్రేమను చూసే పద్ధతి మారాలి అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఆండ్రియా ఫస్ట్ లుక్‌ను రీలీజ్ చేయనున్నాం’’ అన్నారు. -
ఫస్టాఫ్ హిట్టే
మొదటి ఆరు నెలలు బాగా ఆడాయి.సినిమాల్లాగే బ్యాంక్ బ్యాలెన్సులు బాగానే నిండాయి.సినిమాలు ఇలాగే ఆడుతూ పాడుతూ భాగమతులను చేస్తూ, రంగస్థలంలో కదం తొక్కుతూ, భరత్ అనే నేనులా ప్రతిజ్ఞ చేస్తూ, తొలి ప్రేమలో మళ్లీ మళ్లీ పడుతూ, మహానటీనటులను ఆవిష్కరిస్తూ మనందర్నీ సమ్మోహనం చేస్తుండాలి. 6 నెలలు...సుమారు 60కి పైగా సినిమాలు..విజయాలెన్ని? వేళ్ల మీద లెక్కపెట్టగలిగినన్ని.కొన్ని సినిమాలు కనకవర్షం కురిపించాయి. కొన్ని వచ్చినంత వేగంగా వెళ్లిపోయాయి. అయితే ఈ ఏడాది హిట్‌గా నిలిచిన సినిమాలను లెక్కలోకి తీసుకుంటే.. 6 నెలల్లో ముఖ్యంగా 6 జానర్లు హిట్. ‘థ్రిల్, లవ్, రివెంజ్ డ్రామా, పొలిటికల్ డ్రామా, కామెడీ, బయోపిక్’ జానర్స్‌లో వచ్చిన మూవీస్‌లో పెద్ద హిట్టయిన సినిమాలున్నాయి. సిక్స్ మంథ్స్, సిక్స్ జానర్స్.. ఆ విశేషాలు తెలుసుకుందాం. లెక్క తేల్చింది ‘ఎవడు పడితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డా... భాగమతి అడ్డా. లెక్కలు తేలాలి’. గడచిన ఆరు నెలల్లో ఫేమస్ అయిన డైలాగ్స్‌లో ఇదొకటి. నిజంగానే బాక్సాఫీస్ వద్ద ‘భాగమతి’ లెక్కలు భేష్. లేడీ ఓరియంటెడ్ మూవీస్ మంచి వసూళ్లు రాబడతాయనడానికి అప్పటి అనుష్క ‘అరుంధతి’, ఇప్పుడు అదే అనుష్క సినిమా ‘భాగమతి’ మరోసారి నిరూపించాయి. ఈ ఏడాది తొలి నెలలో రిలీజైన తొలి థ్రిల్లర్ ఇది. థ్రిల్లర్ మూవీస్‌కి ట్రెండ్‌తో పని లేదు. స్టోరీ–స్క్రీన్‌ప్లే–లీడ్ క్యారెక్టర్ కుదిరి, డైరెక్టర్ బాగా తీయగలిగితే బొమ్మ హిట్. అశోక్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ థ్రిల్లర్ బాక్సాఫీస్ లెక్కలు తేల్చింది. థ్రిల్లర్ జానర్లో చిన్న బడ్జెట్‌తో రూపొందిన మరో మూవీ ‘అ!’ ఫిబ్రవరి 16న రిలీజై, మంచి ప్రయోగం అనిపించుకుంది. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో సాగిన ఈ థ్రిల్లర్ ద్వారా హీరో నాని నిర్మాతగా మారారు. కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మకు మంచి మార్కులు పడ్డాయి. అన్నట్లు జనవరిలో సంక్రాంతికి రిలీజైన పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ అంచనాలను అందుకోలేదు. బాలకృష్ణ ‘జై సింహా’ వసూళ్లు రాబట్టిన సినిమా అనిపించుకుంది. రాజ్ తరుణ్ ‘రంగుల రాట్నం’ బాక్సాఫీస్ చక్రాన్ని తిప్పలేకపోయింది. నెల మొదట్లో విడుదలైన అల్లాణి శ్రీధర్ ‘చిలుకూరి బాలాజీ’ మంచి డివోషనల్ మూవీ అనిపించుకుంది. ఇంకా ఈ నెలలో చోటా మోటా సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. థ్రిల్లర్ వెంటనే కామెడీ ఓ థ్రిల్లర్ మూవీ చూసిన వారానికి ఓ కామెడీ సినిమా చూసే అవకాశం వస్తే పండగే పండగ. ఒకవైపు ‘భాగమతి’ (జనవరి 26) థ్రిల్‌కి గురి చేస్తూ దూసుకెళుతోంది. అది విడుదలైన వారానికి ‘ఛలో’ (ఫిబ్రవరి 2) వచ్చింది. కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే లవ్ స్టోరీ. ఈ మధ్య కాలంలో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన సినిమా అంటే ఇదే. కొత్త దర్శకుడు వెంకీ కుడుముల తీసిన ఈ సినిమాలో నాగశౌర్య హీరో. ఒక్కసారిగా నాగశౌర్య కెరీర్ గ్రాఫ్‌ని పెంచింది. ఐరా క్రియేషన్స్‌లో నాగశౌర్య తల్లిదండ్రులు శంకర్‌ప్రసాద్ మూల్పూరి, ఉషా మూల్పూరి తొలి ప్రయత్నంలోనే తమ బేనర్‌కి గుర్తింపు తెచ్చే సినిమా నిర్మించారు. ‘ఛలో’లా ఈ 6 నెలల్లో ‘కిర్రాక్ పార్టీ’ (ఫిబ్రవరి 16), ‘ఛల్ మోహన్ రంగ’ (ఏప్రిల్ 5) వంటి లవ్ బేస్డ్ కామెడీ మూవీస్ వచ్చినా అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సో.. కామెడీ జానర్లో ప్రస్తుతానికి ‘ఛలో’నే బాగా కితకితలు పెట్టిందనొచ్చు. తొలి ప్రేమదే తొలి స్థానం కామెడీ బాగుంది ఛలో అంటూ నవ్వుకోవడానికి థియేటర్స్‌కి వెళ్లిన ప్రేక్షకులను ఆ తర్వాతి వారం లవ్ జర్నీ చేయించింది. ఫస్ట్ లవ్ ఓ మధురాను భూతి. ‘తొలి ప్రేమ’ (ఫిబ్రవరి 10) సినిమా కూడా ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసింది. ‘ఫిధా’ వంటి లవ్‌స్టోరీతో హిట్ ట్రాక్‌లో ఉన్న వరుణ్ తేజ్ ‘తొలి ప్రేమ’తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. వరుణ్, రాశీ ఖన్నా కెమిస్ట్రీ, కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి టేకింగ్.. మొత్తంగా ఈ సినిమాకి అన్నీ కుదిరాయి. ఫస్టాఫ్‌లో తెరకొచ్చిన లవ్‌స్టోరీస్‌లో ‘తొలి ప్రేమ’దే తొలి స్థానం. ఆ తర్వాత ప్రేక్షకులను సమ్మోహనపరిచిన మరో లవ్‌స్టోరీ ‘సమ్మోహనం’. ఫస్టాఫ్ ఎండింగ్లో ఈ చిత్రం మంచి ఫీల్‌ని కలగజేసింది. జూన్ 15న విడుదలైన ఈ లవ్‌స్టోరీ యాక్టింగ్‌వైజ్‌గా సుధీర్‌బాబు, అదితీ రావులకు మంచి పేరు తెచ్చింది. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ల కాంబినేషన్లో ‘జెంటిల్మన్’ తర్వాత మరో హిట్ నమోదైంది. ఈ ఏడాది లవ్ జానర్లో వచ్చిన మరో మూవీ ‘మెహబూబా’. వార్ బ్యాక్‌డ్రాప్‌లో డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో తనయుడు ఆకాశ్ హీరోగా పూరి జగన్నాథ్ తీశారు. మే 11న విడుదలైన ఈ లవ్‌స్టోరీ భారీ అంచనాల నడుమ విడుదలై, పూరి నుంచి వచ్చిన ఓ ప్రయోగం అనిపించుకుంది. ఇక ఫిబ్రవరిలో విడుదలైన వేరే సినిమాలు రవితేజ ‘టచ్ చేసి చూడు’, మోహన్‌బాబు ‘గాయత్రి’, సాయిధరమ్ తేజ్ ‘ఇంటెలిజెంట్’ వంటి వాటి నుంచి ప్రేక్షకులు ఇంకా ఏదో ఆశించారు. విన్నారా.. 200 కోట్లకు పైనే! మార్చి, ఏప్రిల్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి పరీక్షే. పరీక్షలకు ప్రిపేరయ్యే పిల్లలు థియేటర్లకు రారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను చదివించడంతో బిజీ అవుతారు. సినిమా ఎంతో బాగుంటే తప్ప రారు. ‘రంగస్థలం’ అలాంటి మూవీ. ఇప్పుడు వెళుతోన్న ట్రెండ్‌కి ఫుల్ డిఫరెంట్. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివెంజ్ డ్రామా. గళ్ల లుంగీ, పూల చొక్కా, గడ్డం, కేర్లెస్ బాడీ లాంగ్వేజ్.. ఇవన్నీ ఒక ఎత్తయితే చెవిటివాడిగా రామ్‌చరణ్ కనిపించడం మరో ఎత్తు. అర్బన్ మూవీస్ చేస్తున్న రామ్‌చరణ్‌తో రూరల్ బ్యాక్‌డ్రాప్ ఓ సాహసం. వినిపించని క్యారెక్టర్లో అంటే ఇంకా సాహసం. దర్శకుడు సుకుమార్ ఈ సాహసంలో సక్సెస్ అయ్యారు. నటుడిగా రామ్‌చరణ్ మంచి అంటే సరిపోదు.. అంతకు మించి అనాలి. అంత బాగా చేశారు. మార్చి 30న రిలీజైన ‘రంగస్థలం’ ఫస్ట్ డేనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 200 కోట్లకు పైగా వసూలు చేసి, ‘వింటున్నారా.. మా సినిమా కలెక్షన్స్’ అని వినపడనట్లు వ్యవహరించిన వాళ్లకూ గట్టిగా సౌండ్ చేసి మరీ చెప్పింది. ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్’.. ఇలా వరుస హిట్లతో ఉన్న మైత్రీ మైవీ మేకర్స్ నిర్మాతలు మోహన్ చెరుకూరి, నవీన్ యర్నేని, వై. రవిశంకర్ హ్యాట్రిక్ సాధించారు. మార్చిలో వచ్చిన ఇతర చిత్రాలు ‘దండుపాళ్యం 3’, కల్యాణ్ రామ్ ‘ఎంఎల్ఎ’ ఎక్స్పెక్టేషన్స్ని అందుకోలేకపోయాయి. ఇదే నెలలో వచ్చిన శ్రీవిష్ణు ‘నీదీ నాదీ ఒకే కథ’ బాగుందనిపించుకుంది. ఈ చిత్రంతో దర్శకుడు వేణు ఊడుగుల సీరియస్ ప్రేక్షకుల దృష్టిలో పడ్డారు. సక్సెస్‌కు హామీ మార్చిలో ‘రంగస్థలం’ రూపంలో ఓ బంపర్ హిట్ తగిలితే ఏప్రిల్ మరో బంపర్ హిట్ ఇచ్చింది. ‘భరత్ అనే నేను’ హామీ ఇస్తున్నాను.. అని సినిమాలో మహేశ్‌బాబు అంటారు. ట్రైలర్లో ఈ డైలాగ్ విని, సూపర్ డూపర్ హిట్ ఇస్తామని చిత్రనిర్మాత డీవీవీ దానయ్య, దర్శకుడు కొరటాల శివ హామీ ఇచ్చినట్లుగా ఫ్యాన్స్ అనుకున్నారు. అదే జరిగింది. ఈ స్టైలిష్ పొలిటికల్ డ్రామాలో మేడమ్ స్పీకర్ అంటూ స్టైలిష్ ఇంగ్లిష్తో, సీఎంగా గంభీరమైన బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నారు మహేశ్‌బాబు. ఈ పొలిటికల్ జానర్‌ని కొరటాల శివ ఎంతో ఇంటెలిజెంట్‌గా తీసినట్లుగా అనిపిస్తుంది. వసూళ్లు 200 కోట్లు దాటాయి. ఈ సినిమా తర్వాత ఏప్రిల్‌లో మిగతా సినిమాలు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’, నాని ‘కృష్ణార్జున యుద్ధం’ వంటివి వచ్చాయి. మంచు విష్ణు–జి. నాగేశ్వరరెడ్డిలది సూపర్ హిట్ కాంబినేషన్. అందుకే ఇంకా ఇంకా ఏదో కావాలని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. వరుస విజయాలతో దూసుకెళుతోన్న నాని విషయంలోనూ ఇదే జరిగింది. మహాద్భుతం మే ఆశాజనకంగా మొదలైంది. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ (మే 4) అంటూ దేశభక్తి సినిమాతో అల్లు అర్జున్ సిల్వర్ స్క్రీన్‌పైకి వచ్చారు. ఇప్పటివరకూ బన్నీ చేయని బ్యాక్‌డ్రాప్. రియల్ సోల్జర్ ఎలా ఉంటారో అలా ఫిజిక్‌ని మార్చుకున్నారు. లుక్ పర్ఫెక్ట్. యాక్టింగ్ సూపర్. రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారి తీసిన ఈ సినిమాకి లగడపాటి శ్రీధర్ నిర్మాత. నాగబాబు సమర్పకులు. ‘బన్నీ’ వాసు సహనిర్మాత. ఇందులో ‘సరిహద్దున నువ్వు లేకుంటే ఏ కనుపాప కంటి నిండుగా నిదర పోదురా..’ అనే పాట మనసుకి హత్తుకుంటుంది. సినిమాలో ఆ డెప్త్ లోపించిందన్నది కొందరి వాదన. ఏదైతేనేం దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయడం మెచ్చుకోదగ్గ ప్రయత్నమే. ఇదే నెలలో (మే 9) వచ్చిన ‘మహానటి’ ఓ అద్భుతం. అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం సినిమాలు చూడటం మానేసిన ప్రేక్షకులను కూడా థియేటర్‌కి రప్పించింది. సావిత్రి మీద ఉన్న అభిమానం అలాంటిది. అఫ్కోర్స్ సినిమా బాగా లేకపోతే కష్టమే. సావిత్రిగా కీర్తీ సురేష్ అభినయం భేష్. రిలీజయ్యాక జెమినీ గణేశన్ పాత్ర, కొన్ని విషయాలపరంగా విమర్శలు వచ్చినా అవేవీ సినిమా చూడనివ్వకుండా ఆపలేకపోయాయి. బయోపిక్ జానర్లో ఈ ఏడాది వచ్చిన ఈ తొలి సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నిర్మాతలు ప్రియాంకా దత్, స్వప్నా దత్‌లు తండ్రి అశ్వనీదత్‌లా మంచి నిర్మాతలు అనిపించుకున్నారు. మేలో వచ్చిన రవితేజ ‘నేల టిక్కెట్టు’ అనుకున్నంతగా టిక్కెట్లు తెంచలేకపోయింది. నాగశౌర్య ‘అమ్మమ్మగారిల్లు’ అతని ‘ఛలో’ స్పీడ్‌ని అందుకోలేకపోయింది. సమ్మోహనపరిచింది జూన్ 1 నిరాశగా మొదలైంది. ‘శివ’తో సూపర్ హిట్ కాంబినేషన్ అనిపించుకున్న నాగార్జున–రామ్‌గోపాల్‌వర్మల నుంచి ‘ఆఫీసర్’ వస్తోందంటే ఎంతో ఆశగా ఎదురు చూశారు ఇద్దరి ఫ్యాన్స్. నెల మొదటి రోజున రిలీజైన నాగార్జున ‘ఆఫీసర్’, ఆ తర్వాత కల్యాణ్ రామ్ ‘నా నువ్వే’, రాజ్ తరుణ్ ‘రాజుగాడు’ వంటి పెద్దా చిన్నా సినిమాలు రిలీజయ్యాయి. వచ్చినవి వచ్చినట్లే వెళ్లిపోయాయి. ‘సమ్మోహనం’ ఓ రిలీఫ్. కామెడీ జానర్ ‘జంబలకిడి పంబ’ నాటి ‘జంబ లకిడి పంబ’ అంతగా నవ్వించలేకపోయింది. కమెడియన్ ‘షకలక’ శంకర్ హీరోగా నటించిన ‘శంభో శంకర’ గత శుక్రవారం రిలీజైంది. అదే రోజున ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ దర్శకుడు తరుణ్ భాస్కర్ వచ్చారు. ఆల్మోస్ట్ కొత్తవాళ్లతో తీసిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ‘పెళ్ళి చూపులు’తో మంచి దర్శకుడని నిరూపించుకున్న తరుణ్ భాస్కర్ ఈ చిత్రంతో ఆ ఇమేజ్‌ని ఇంకా పెంచుకోగలిగారు. ఫస్టాఫ్ క్లోజింగ్ ఈ హిట్‌తో ముగిసిందనాలి. ఇక వచ్చే ఆరు నెలలు ఎలా ఉంటుందో చూద్దాం. గతించిన కాలం కంటే రాబోవు కాలము మేలు అనే సామెతను గుర్తు చేసుకుందాం. – డి.జి. భవాని -
వెరీ స్పెషల్ ఇయర్
... అంటున్నారు కియారా అద్వానీ. ఎందుకు? అంటే.. ప్రస్తుతం తన కెరీర్ మోస్ట్ ఎగై్జటింగ్‌గా ఉందట. ‘ఎమ్ఎస్ ధోని’ చిత్రంతో ఈ బ్యూటీ బాలీవుడ్లో ఫేమ్ సంపాదించి, ‘భరత్ అనే నేను’తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించిన విషయం తెలిసిందే. ఈ ఎగై్జటింగ్ జర్నీ గురించి కియారా మాట్లాడుతూ –‘‘2018 నా కెరీర్లో మోస్ట్ ఎగై్జటింగ్ ఇయర్ అనుకుంటున్నాను. ఎక్కువ మంది ఆడియన్స్‌కు దగ్గర కావడమే దానికి కారణం. నాకు తెలియని భాషలో (తెలుగు) సినిమా చేశాను. అందులో కూడా నా మార్క్ చూపించడానికి హార్డ్‌వర్క్ చేశాను. ఇక మీదట కూడా చేస్తాను. కరణ్ జోహార్ దర్శకత్వంలో నటించిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ ద్వారా ప్రపంచ ఆడియన్స్‌కు దగ్గరవుతున్నాను. ఇలా అన్ని ప్రాంతాల ఆడియన్స్‌ను చేరుకోవడంతో 2018 నాకు చాలా స్పెషల్‌గా భావిస్తున్నాను. రానున్న రోజులు మరింత స్పెషల్‌గా ఉంటాయని నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారామె. కియారా ప్రస్తుతం రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. -
మహేష్ తండ్రిగా మరోసారి..!
‘భరత్ అనే నేను’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన సిల్వర్ జూబ్లీ (25) సినిమాలో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వనీదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ డెహ్రాడూన్‌లో జరుగుతోంది. తొలిసారిగా మహేష్ ఈ సినిమా కోసం కొత్తలుక్‌ను ట్రై చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు సినిమా అంటే ఆ సినిమాలో కచ్చితంగా ప్రకాష్ రాజ్ ఉండాల్సిందే. ఒకటి రెండు సినిమాలు తప్ప మహేష్ హీరోగా నటించిన అన్ని సినిమాల్లో ప్రకాష్ రాజ్ నటించాడు. ఇప్పుడు మహేష్ 25వ సినిమాలోనూ ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో నటిస్తున్నాడట. రాయలసీమ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, మహేష్ బాబు తండ్రిపాత్రలో నటిస్తున్నాడు. గతంలో దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వీరిద్దరు తండ్రి కొడుకులుగా నటించారు. అందుకే సెంటిమెంట్ పరంగానూ ఈ కాంబినేషన్ ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఎక్కువ భాగం ఫారిన్లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. -
కొరటాలకు మహేష్ స్పెషల్ విషెస్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు భరత్ అనే చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే నేడు ఈ చిత్ర దర్శకుడైన కొరటాల శివ పుట్టిన రోజు కావడంతో ఆయనకు సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విటర్ వేదికగా విషెస్ తెలియజేశాడు. ‘నా ప్రియమిత్రుడు, అద్భుత దర్శకుడు కోరటాల శివ సర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. జీవితాంతం ఇలానే నవ్వుతూ.. సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. Happy birthday to my dear friend & maverick director @sivakoratala sir. Wish you a lifetime of happiness and success... Stay blessed :) Respect always🙏 pic.twitter.com/FVgTPsXQxV — Mahesh Babu (@urstrulyMahesh) June 15, 2018 భరత్ అనే నేను చిత్రంతో తెలుగులో అడుగుపెట్టిన కైరా అద్వానీ సైతం తన తొలి తెలుగు దర్శకుడికి విషెస్ తెలియజేసింది.‘‘ఎంతో ఉత్తమమైన, వినయపూర్వకమైన నా తొలి తెలుగు సినిమా దర్శకులు కొరటాల శివ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుడి దీవేనలతో మరిన్ని అద్భుతమైన విజయాలు మీకు దక్కాలని కోరుకుంటున్నా. మీ ముఖంలో చిరునవ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నా. మిమ్మల్ని ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా’’ అని కైరా ట్వీట్ చేసింది. భరత్ అనే నేను చిత్రం టాలీవుడ్ సెన్సేషన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. To the kindest, most humble and my very first Telugu film director @sivakoratala Garu wishing you a very Happy Birthday! God bless you Sir with the most amazing year ahead.. may you always have that happy smile on your face! Love and Respect always ❤️ — Kiara Advani (@Advani_Kiara) June 15, 2018 -
స్క్రీన్ ప్లే 6th June 2018
-
గడ్డంతో మహేష్ లుక్..వీడియో వైరల్
-
లీకైన మహేష్ కొత్త లుక్
భరత్ అనే నేను రిలీజ్ తరువాత ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనలో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నారు. కొత్త సినిమాలో డిఫరెంట్ లుక్‌లో కనిపించేందుకు మేకోవర్ అవుతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన తదుపరి చేయనున్నారు మహేష్. ఈ సినిమాలో మహేష్ గడ్డంతో కనిపించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ మహేష్ గడ్డంతో దర్శనమిచ్చాడు. ఇప్పటికే మహేష్ లుక్ పై నమ్రత సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చేశారు. తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన మహేష్ సరికొత్త లుక్‌లో ఆకట్టుకున్నాడు. గతం ఎన్నడూ లుక్ విషయంలో ప్రయోగాలు చేయని మహేష్ తొలిసారిగా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తుండటంతో వంశీ పైడిపల్లి సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మహేష్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీని అశ్వనీదత్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. -
‘భరత్ అనే నేను’ సినిమాపై ఫిర్యాదు
సాక్షి, గుంటూరు(లక్ష్మీపురం): కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలో ‘నవోదయం పార్టీ’పై దుష్ప్రచారం చేశారని గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ గ్రీవెన్స్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు నల్లకరాజు సోమవారం ఫిర్యాదు చేశారు. నవోదయం పార్టీని 2010లో స్థాపించి కేంద్ర ఎన్నికల కమిషన్‌తో రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నల్లకరాజు మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ పట్ల ప్రజల్లో ద్వేషం కలిగించేలా సినిమాలో చూపించారని ఆరోపించారు. తమ పార్టీ జెండాలో ఉన్న ఉదయించే సూర్యుడు గుర్తుని, నవోదయం అనే తమ పార్టీ పేరును సినిమాలో పలుసార్లు చూపిస్తూ అప్రజాస్వామికమైన పదజాలం వాడి తమ పార్టీ లక్ష్యాలకు పూర్తి వ్యతిరేకమైన మాటలను సన్నివేశాల్లో చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నవోదయం పార్టీ తరఫున ఎస్పీకి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినట్లు తెలిపారు. -
కేటీఆర్ ట్వీట్‌కు మహేష్ రియాక్షన్
సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకీయాలకు దూరంగా ఉంటారు. కానీ భరత్ అనే నేను రిలీజ్ తరువాత సీన్ మారిపోయింది. ముఖ్యంగా ఈ సినిమా చూసిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో మహేష్‌కు మంచి రిలేషన్ ఏర్పడింది. భరత్ అనే నేను సినిమా చూసిన తరువాత మహేష్, కొరటాలలతో కలిసి ఓ మీడియా సమవేశాన్ని కూడా ఏర్పాటు చేశారు కేటీఆర్. ఈ సందర్భంగా మహేష్, కేటీఆర్‌ల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. మహేష్ కేవలం అమ్మాయిలకు మాత్రమే సెల్ఫీలు ఇస్తారని, నేను మాత్రం అబ్బాయిలకు కూడా సెల్ఫీలు ఇస్తానంటూ సరదాగా కామెంట్ చేశారు కేటీఆర్. తాజాగా ట్విటర్ ఓ వ్యక్తి కేటీఆర్‌తో దిగిన ఫొటోను ట్వీట్ చేస్తూ ‘నిజమే కేటీఆర్ గారు అబ్బాయిలకు కూడా సెల్ఫీలు ఇస్తారు’ అంటూ కామెంట్ చేశాడు. ఈ ట్వీట్‌ను మహేష్‌కు ట్యాగ్ చేసిన కేటీఆర్ ‘హ..హ.. మహేష్ ఇది నీకోసమే’ అంటూ కామెంట్ చేశారు. కేటీఆర్ ట్వీట్‌పై స్పందించిన మహేష్ ఓ స్మైలితో రిప్లై ఇచ్చారు. -
మహేష్ లుక్ రివీల్ చేసిన నమ్రత
భరత్ అనే నేను సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. స్పెయిన్‌లో ఫ్యామిలీ కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న మహేష్, 25వ సినిమా కోసం సరికొత్త లుక్‌ను ట్రై చేస్తున్నాడు. 24 సినిమాలో నటించిన మహేష్ లుక్ విషయంలో ప్రయోగాలు చేయలేదు. కానీ 25వ సినిమాలో సరికొత్తగా కనిపించబోతున్నాని మహేష్ స్వయంగా ప్రకటించాడు. ఈ సినిమాలో మహేష్ గడ్డం, మీసంతో కనిపించబోతున్నట్టుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే వార్తలకు మరింత బలం చేకూర్చే ఫోటో ఒకటి మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పూర్తిగా మహేష్ ఫేస్ కనిపించకపోయినా.. డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో పాటు బాగా పెరిగిన గడ్డంతో మహేష్ కొత్తగా కనిపిస్తున్నాడు. జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. -
మహేష్ 25 టైటిల్ ఫిక్స్..?
భరత్ అనే నేను సినిమాతో ఘనవిజయం సాధించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం సిద్ధమవుతున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనున్న ఈ సినిమాలో మహేష్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇంకా షూటింగ్ ప్రారంభం కాని ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. మహేష్.. గడ్డం, మీసంతో సీరియస్ లుక్‌లో ఉన్న స్టిల్‌తో పాటు రాజసం అనే టైటిల్‌తో పోస్టర్‌ను డిజైన్ చేశారు. అశ్వనీదత్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో కామెడీ స్టార్ అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటించనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది. -
గుబురు గడ్డం.. కోర మీసం!
‘భరత్ అనే నేను’ మూవీ సక్సెస్ జోష్‌ను ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు మహేశ్‌బాబు. అలాగే రెండు సినిమాలను కూడా ఆయన లైన్లో పెట్టారు. వంశీ పైడిపల్లితో ఓ సినిమా, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో హీరోగా నటించనున్నారు. ప్రస్తుతం మహేశ్ హాలీడేను ఎంజాయ్ చేస్తూ స్పెయిన్‌లో ఉన్నారు. ఫ్యామిలీతో హాలీడే ట్రిప్ వెళ్లి పది రోజుల పైనే అవుతోంది. మరి.. ఇండియా ఎప్పుడు వస్తారు? అంటే, జూన్ 9న అని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే.. వంశీపైడి పల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు నటించనున్న సినిమాపై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. అదేంటంటే.. ఇది ఫ్రెండ్షిప్ నేపథ్యంలో యూఎస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతూనే రాయలసీమ టచ్ ఉంటుందట. అంతేకాదు ఈ సినిమాలో మహేశ్‌బాబు కొన్ని సీన్స్‌లో గుబురు గడ్డం, మీసాలతో కనిపిస్తారని ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం జరుగుతోంది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించనున్నారన్న సంగతి తెలిసిందే. ముందు ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. సుకుమార్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా నటించనున్న సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళుతుంది. -
మీసకట్టుతో మహేష్..?
భరత్ అనే నేను సినిమాతో ఘనవిజయం అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. మహేష్ 25వ గా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ మీసకట్టుతో కనిపించనున్నాడట. భరత్ అనే నేను ప్రమోషన్ సమయంలో తదుపరి చిత్రంలో కొత్త లుక్ లో కనిపించబోతున్నట్టుగా వెల్లడించారు మహేష్. అయితే సినిమా అంతా మహేష్ మీసంతోనే కనిపిస్తాడా..? లేక కొద్దిసేపే అలా కనిపిస్తారా..? అన విషయం తెలియాల్సి ఉంది. -
‘భరత్ అనే నేనులో పేరు మార్పుకు డబ్బులిచ్చిన కేటీఆర్’
సాక్షి, హైదరాబాద్ : భరత్ అనే నేను సినిమాలో హీరో క్యారెక్టర్ పేరును భరత్ రామ్‌గా మార్చేందుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ డబ్బులిచ్చారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్నికల తర్వాత కేటీఆర్ యాంకరింగ్ చేసుకోవాల్సిందే అని అన్నారు. కర్ణాటక ఎన్నికలపై స్పందిస్తూ.. జేడీఎస్‌కు మద్దతిచ్చిన కేసీఆర్ ఇప్పుడు జేడీఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో చెప్పాలని అన్నారు. కర్ణాటకలో జరిగిందే రేపు దేశంలో జరుగుతుందని అప్పుడు కేసీఆర్ ఎటువైపో తెల్చుకోవాలని తెలిపారు. అలాగే బీజేపీ అక్రమ మార్గంలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వాల ఏర్పాటులో గవర్నర్ల పాత్రపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. మెజార్టీ రానప్పుడు గవర్నర్లు తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాలని కోరారు. గోవాలో అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వకుండా.. బీజీపీకి అవకాశం ఇవ్వడం దారుణమన్నారు. మణిపూర్, మేఘాలయల్లో ఎన్నికల తర్వాత ఏర్పాటైన కూటములకు గవర్నర్లు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వలేదా అని ప్రశ్నించారు. సర్కారియా కమిషన్ సిఫార్సుల ప్రకారం.. మెజార్టీ కాకుండా అత్యధిక సీట్లు గెల్చుకున్న పార్టీకి నాలుగో అవకాశం ఉంటుందన్నారు. మొదటి మూడు.. పూర్తి మెజార్టీ సాధించిన పార్టీకి, ఎన్నికల ముందు కూటమికి, ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమికి అవకాశం ఉంటుందన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు భారత రాజ్యంగంపై నమ్మకంలేదని అన్నారు. అఖండ భారత్, సంప్రదాయ రక్షకులుగా ముద్ర వేసుకుని, పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నైతిక విలువల గురించి మాట్లాడే వారు.. ఎమ్మెల్యేల కొనుగొళ్లకు ఎలా మద్దతిస్తారని ప్రశ్నించారు. సంప్రదాయాలను మీకు(బీజేపీ) అనుకులంగా మార్చుకుంటారా అని విరుచుకుపడ్డారు. ఫిరాయింపులను గవర్నర్ పరోక్షంగా ప్రొత్సహిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తక్షణమే కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ రేవంత్.. అప్పటి బీజేపీకి ఇప్పటి బీజేపీకి చాలా తేడా ఉందన్నారు. అప్పుడు అద్వానీ, వాజ్‌పేయి విలువలతో కూడిన రాజకీయం చేస్తే, ఎప్పుడు మోదీ, షాలు కేవలం అధికార కాంక్షతోనే ఫిరాయింపులకు పాల్పడి అక్రమ మార్గాల్లో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వాజపేయి ఒక్క ఓటుతో అధికారాన్ని కోల్పోయారని, అవకాశం ఉన్నా అక్రమ మార్గాల వైపు చూడాలేదని పేర్కొన్నారు. -
మహేశ్‌బాబు.. నేను మంచి స్నేహితులం!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన రంగస్థలం సినిమా ఘనవిజయం సాధించటంతోపాటు నటుడిగా కూడా రామ్ చరణ్ స్థాయిని పెంచింది. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమా విడుదలైన సుమారు ఇరవై రోజుల తర్వాత మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ సక్సెస్‌లతో రామ్‌చరణ్, మహేష్ బాబులు ఇద్దరు ఖుషీగా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది గానీ చరణ్, మహేశ్ అభిమానుల మధ్య మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ కోల్డ్‌వార్ నడుస్తోంది. ఈ విషయంపై స్పందించిన రామ్ చరణ్.. తాను, మహేష్ బాబు మంచి స్నేహితులమని తెలిపాడు. తమ మధ్య ఎలాంటి పోటీలేదని, ఎవరి సినిమా ఎక్కువ వసూళ్లు సాధిస్తుందంటూ తాము లెక్కలేసుకోమని ఓ జాతీయ మీడియాతో చెప్పాడు. మహేష్ సినిమాలు విడుదలైన సమయంలోనే.. ఆయనకు పోటీగా తన సినిమాలు విడుదల చేస్తున్నారంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని చెర్రీ మండిపడ్డాడు. రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు ఘనవిజయం సాధించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్న మెగా పవర్‌స్టార్.. వ్యక్తిగత విజయాల కన్నా తెలుగు చిత్ర పరిశ్రమ శ్రేయస్సే తనకు ముఖ్యమని పేర్కొన్నాడు. కాగా రామ్‌చరణ్ త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. -
భరత్ అనే నేను..
భరత్ అనే నేను.. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాను. రాత్రనక పగలనక కష్టపడి చదివి పదోతరగతి పరీక్ష ఫలితాల్లో పదికి పది జీపీఏ సాధించాను. చదువునైతే జయించ గలిగాను కానీ నా ఆర్థిక పరిస్థితులను మాత్రం జయించలేకపోతున్నాను. ఒక ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ ఇచ్చిన చేయూతతో ఇప్పటివరకు చదువులో రాణించగలిగాను. పదోతరగతిని పూర్తి చేసిన నేను కూలి పనులు చేసుకునే తల్లిదండ్రులకు భారంగా మారాను. ఇక ముందు చదువును ఎలా కొనసాగించాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల : పూతి భరత్ అనే ఈ విద్యార్థి ద్వారకాతిరుమలకు చెందిన పూతి శ్రీను, కొండమ్మ దంపతుల మొదటి కుమారుడు. చదవాలనే కోరిక.. చదువుపై ఆసక్తిని భరత్ చిన్ననాటి నుంచే పెంచుకున్నాడు. అతని తల్లిదండ్రులు కూలిపనికి వెళితేనే పూటగడుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో తన బిడ్డను ఉన్నతస్థితిలో చూడాలన్న ఆకాంక్షతో వారు భరత్‌ను 1 నుంచి 3వ తరగతి వరకు పలు ప్రైవేట్ పాఠశాలల్లో చదివించారు. కుటుంబ పరిస్థితులు అంతంతమాత్రం కావడంతో స్థానిక ఎంపీయూపీ పాఠశాలలో 4వ తరగతి చదివించారు. ఆ తరువాత మండలంలోని తిమ్మాపురం ఉషోదయా పబ్లిక్ స్కూల్లో 5వ తరగతిలో చేర్పించారు. అయితే భరత్ 7వ తరగతి చదువుతున్న సమయంలో తమ కుటుంబ పరిస్థితులు బాగోలేదని, ఇక ఫీజులు చెల్లించి తమ బిడ్డను చదివించలేమంటూ టీసీ ఇవ్వాల్సిందిగా ఆ పాఠశాల కరస్పాండెంట్ గంటా చంద్రశేఖరరావును కోరారు. బాగా చదివే భరత్‌కు టీసీ ఇవ్వడానికి మనసొప్పక ఆ కరస్పాండెంట్ తన సొంత ఖర్చులతో పదోతరగతి వరకు చదివించారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో భరత్ పదికి పది జీపీఏ సాధించి సత్తా చాటి తనకు ఇంతకాలం భరోసా ఇచ్చిన కరస్పాండెంట్ నమ్మకాన్ని నిలిపాడు. దాతలు దయతలిచి ఆర్థిక సహకారం అందిస్తే చదువును కొనసాగిస్తానని భరత్ వేడుకుంటున్నాడు. నా బిడ్డకు చేయూతనివ్వండి భరత్ ఎంతో బాగా చదువుతాడు. ఇటీవల విడుదలైన పదోతరగతి పరీక్షా ఫలితాల్లో పదికి పది జీపీఏ సాధించాడు. కానీ నా బిడ్డను చదివించే స్తోమత మా దగ్గర లేదు. దాతలు స్పందించి నాబిడ్డకు చేయూతనివ్వండి– పూతి కొండమ్మ,భరత్ తల్లి ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం నా చదువుకు చేయూత దొరికితే ఐఐటీలో సీటు సాధిస్తాను. నా తల్లి ఎంతో కష్టపడితేనే గానీ మా కుటుంబం గడవదు. అలాంటి పరిస్థితుల్లో వేలకు వేలు పోసి చదవాలంటే కష్టమే. ఇప్పటి వరకు ఉషోదయ పాఠశాల కరస్పాండెంట్ సహకారంతో చదివాను. సహృదయంతో ఎవరైనా చేయూతనిస్తే చదువుతాను.– పూతి భరత్, విద్యార్థి -
‘భరత్’ రికార్డుల వేట!
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా అంటే రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. శ్రీమంతుడు సినిమా నాన్ బాహుబలి రికార్డులను సాధిస్తే... తరువాత రిలీజైన రెండు సినిమాలు ఆశించినంతగా విజయం సాధించలేదు. అయితే ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలనే కసితో మళ్లీ కొరటాల శివతో కలిసి భరత్ అనే నేను సినిమాను చేశారు. ఈ సినిమా విడుదలైన తొలిరోజు నుంచే రికార్డుల వేటను కొనసాగించింది. తొలిరోజే రూ. 40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని నిర్మాత ప్రకటించారు. మొదటి వారంలో రూ.161 కోట్లు, రెండు వారాలకు రూ. 190 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకున్నట్టు వెల్లడించారు. ఇప్పుడు ఈ చిత్రం మరో మైలురాయిని చేరుకుంది. మూడు వారాల్లో రూ.205 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దూసుకుపోతోందని చిత్ర యూనిట్ ప్రకటించింది. మహేశ్ ప్రస్తుతం ఈ సక్సెస్‌ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. మహేశ్ తన తదుపరి (25వ) చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్నారు. -
తమిళనాడు వెళ్లనున్న ‘భరత్’...?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రం మంచి కలెక్షన్సతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక చెన్నైలోను విడుదలై, అక్కడ కూడా మంచి వసూల్లు సాధించింది. దాంతో ఈ చిత్నాన్ని తమిళంలోను అనువాదించాలని చిత్న నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయని, అయితే విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తారని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి చిత్ర యూనిట్‌నుంచి ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించగా కైరా అద్వానీ కథానాయకిగా నటించారు. -
వివాదంలో ‘భరత్ అనే నేను’
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ‘భరత్ అనే నేను’. ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్లతో ప్రదర్శితమవుతోంది. తాజాగా ఈ చిత్రం ఓ వివాదంలో చిక్కుకుంది. సినిమాలో వాడిన రాజకీయ పార్టీ పేరు, గుర్తు కూడా తమదేనని నవోదయం పార్టీ అధ్యక్షుడు దాసరి రాము ఆరోపిస్తున్నారు. తమ పార్టీకి ఎన్నికల గుర్తింపు కూడా ఉందని.. అలాంటిది పార్టీ పేరు, గుర్తు చిత్రంలో ఎలా ఉపయోగించారని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై దర్శక, నిర్మాతలకు నోటీసులు పంపనున్నట్టు దాసరి రాము పేర్కొన్నారు. -
మహేష్ సినిమా పనులు మొదలెట్టిన సుకుమార్
భరత్ అనే నేను సినిమాతో ఘనవిజయం సాధించిన సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమాను ప్రారంభించనున్నాడు. ఈ సినిమా తరువాత మహేష్ సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. గతంలో వీరి కాంబినేషన్లో తెరకెక్కిన వన్ నేనొక్కడినే ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అయితే రంగస్థలం సినిమా ఘనవిజయం సాధించటంతో సుకుమార్‌కు మరో ఛాన్స్ ఇచ్చాడు మహేష్. రంగస్థలం తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న సుకుమార్.. మహేష్ బాబు హీరోగా తెరకెక్కించబోయే సినిమా పనులు ప్రారంభించాడు. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్‌ను సంగీత దర్శకుడిగా ఫైనల్ చేసిన చిత్రయూనిట్ ఇతర సాంకేతిక నిపుణులను నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. -
రెండై తిరిగే ఒకే ఓ రూపం..
‘బ్రదర్స్’ సినిమా కోసం చంద్రబోస్ రాసిన ‘రెండై తిరిగే..’ పాటను గుర్తుచేసుకుంటున్నారు మహేశ్ బాబు అభిమానులు! కొడుకు గౌతంతో కలిసి ప్రిన్స్ పారిస్ వీధుల్లో పర్యటిస్తోన్న ఫొటోలు.. ‘రెండై పలికే ఒకే ఓ రాగం.. రెండై వెలిగే దీపం మేమంటా..’ తరహాలో ఉన్నాయని, ఆ ఇద్దరూ తండ్రీకొడుకుల కంటే అన్నదమ్ముల్లా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ‘భరత్ అనే నేను’ సక్సెస్ తర్వాత మహేశ్ ఫ్యామిలీతో కలిసి పారిస్ వెళ్లిన సంగతి తెలిసిందే. తమ పర్యటనకు సంబంధించిన వివరాలను నమత్రా ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు. కొద్ది గంటల కిందటే..‘Two of a kind’ అంటూ ఆమె పోస్ట్ చేసిన మహేశ్-గౌతమ్‌ల ఫొటోకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అతికొద్దిరోజుల్లోనే తిరిగి హైదరాబాద్ రానున్న మహేశ్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న మల్టీస్టారర్ షూటింగ్లో పాల్గొననున్నాడు. -
భరత్, సూర్యలను మించిన ‘మహానటి’
అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథ ఆధారంగా మహానటి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. కీర్తీ సురేష్, సావిత్రి పాత్రలో నటించిన ఈ సినిమా రేపు (మే 9న) విడుదలవుతోంది. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిడివి ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపుగా మూడు గంటల నిడివితో మహానటి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన మహేష్ బాబు భరత్ అనే నేను 2 గంటల 53 నిమిషాల నిడివితో రిలీజ్ అయ్యింది. అల్లు అర్జున్ నా పేరు సూర్య 2 గంటల 48 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ రెండు సినిమాల కన్నా మహానటి నిడివి ఎక్కువగా ఉండనుంది. 2 గంటల 56 నిమిషాల నిడివితో మహానటి విడుదలకు రెడీ అయ్యింది. రామ్ చరణ్ రంగస్థలం మాత్రం మహానటి కన్నా ఎక్కువ నిడివితో 2 గంటల 59 నిమిషాల రన్‌టైంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భరత్ అనే నేను, నా పేరు సూర్య సినిమాల విషయంలో సినిమా లెంగ్త్‌పై నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. మరి మహానటి అలాంటి కామెంట్స్ లేకుండా అలరిస్తుందేమో చూడాలి. -
లేడీ ఫ్యాన్‌కు మహేష్ గ్రీటింగ్స్..
గతంలో మహేష్ బాబు పెద్దగా అభిమానులతో కలిసేవారు కాదు. తన సినిమా వేడుకల్లో తప్ప ఇతర ప్రైవేట్ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించేవారు కాదు. కానీ ఇటీవల మహేష్ తీరు మారుతోంది. సినిమా ప్రమోషన్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెగ్యులర్‌గా మీడియాను కలుస్తూ, సోషల్ మీడియలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు మరింతగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ మహిళా అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చాడు మహేష్. సురేఖ, సూపర్ స్టార్ మహేష్ బాబుకు వీరాభిమాని. ఈ విషయం తెలుసుకున్న మహేష్, నమత్రలు ఆమె పెళ్లి రోజున ఓ గ్రీటింగ్ కార్డును పంపించారు. మహేష్, నమ్రతలు స్వయంగా సంతకం చేసిన ఆ గ్రీటింగ్ కార్డును సురేఖ కుటుంబ సభ్యులు పెళ్లి వేడుక జరుగుతుండగా ఆమె చేతికందించారు. తన అభిమాన నటుడి నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ కార్డ్ రావటంతో సురేఖ తెగ సంబరపడిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ గా మారాయి. భరత్ అనే నేను సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మహేష్ త్వరలోనే తన 25వ సినిమాను ప్రారంభించనున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్‌ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
‘భరత్...’ అన్‌సీన్ వీడియోస్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా భరత్ అనే నేను. ఏప్రిల్ 20న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. తాజాగా సూపర్ స్టార్ అభిమానుల కోసం చిత్రయూనిట్ ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. ఎలాంటి ఎనౌన్స్మెంట్ లేకుండానే సినిమాలో లేని నాలుగు వీడియో క్లిప్‌లను రిలీజ్ చేశారు. నిడివి కారణంగా సినిమాలో తొలగించిన సన్నివేశాలను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అసెంబ్లీలో బడ్జెట్‌కు సంబంధించిన డిస్కషన్‌తో పాటు మరో మూడు సన్నివేశాలను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి కాని ఈ సన్నివేశాలు ఈ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. -
భరత్ అనే నేను అన్‌సీన్ వీడియోస్
-
భరత్ అనే నేను: శ్రీరెడ్డి వివాదాస్పద ట్వీట్లు..
సాక్షి, హైదరాబాద్ : గత కొన్నాళ్లుగా ఒకింత మౌనంగా ఉన్న నటి శ్రీరెడ్డి తాజాగా మహేశ్‌బాబు సినిమా ‘భరత్ అనే నేను’ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘భరత్ అనే నేను’ బ్లాక్‌బస్టర్ హిట్ కాదని, బిలో యావరేజ్ మూవీ అని ఆమె ట్విటర్లో కామెంట్ చేశారు. ‘ఇప్పుడే భరత్ అనే నేను మూవీ చూసాను. అసలు ఇది బ్లాక్ బస్టర్ మూవీ ఎంటిరా.. బిలో యావరేజ్ మూవీ. మహేష్ బాబు క్రేజ్ వల్ల హిట్ టాక్ వచ్చింది. లేకపోతే పక్కా ఫ్లాప్. వరెస్ట్ డైరెక్షన్, కంటెంట్ లేని కథ, ఫేస్‌లో ఎక్స్ప్రెషన్ లేని యాక్టర్‌గా మహేష్ బాబుని తయారుచేస్తున్నారు’ అని ఆమె రివ్యూ ఇచ్చారు. దీంతో మహేశ్‌బాబు అభిమానులు ఆమెపై విరుచుకుపడ్డారు. వారి నుంచి విమర్శలు రావడంతో శ్రీరెడ్డి ఆ ట్వీట్లను తొలగించారు. గతంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నారని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె ఆరోపణలను కొరటాల శివ తీవ్రంగా ఖండించాడు. ఈ నేపథ్యంలో ‘భరత్’ సినిమాపై ఆమె నెగిటివ్ ట్వీట్లు చేసి.. తొలగించారు. తాజాగా తన ఫేస్బుక్ ఖాతాలో మాత్రం ‘భరత్ అనే నేను’ సినిమా సక్సెస్ అయినందుకు మహేశ్‌బాబుకు అభినందనలు తెలిపారు. ప్రత్యేక హోదా గురించి మహేశ్ బాబు మాట్లాడాలని ఆమె కోరారు. టాలీవుడ్లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గళమెత్తిన శ్రీరెడ్డి.. ఆ తర్వాత ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత కొన్నిరోజులు మౌనంగా ఉన్న శ్రీరెడ్డి.. బుధవారం ప్రెస్‌మీట్ పెట్టి.. టాలీవుడ్లో మహిళల సమస్యలు, తనపై సోషల్ మీడియాలో దుర్భాషలాడుతున్న వారిపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. -
జాలీ మూడ్.. హాలిడే మోడ్
మహేశ్ బాబు అండ్ ఫ్యామిలీ జాలీ మూడ్‌లో ఉన్నారు. ‘భరత్ అనే నేను’ సూపర్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్‌కు ముందు ఫ్యామిలీతో కలిసి ఓ వారం రోజులు హాలిడే ట్రిప్ వెళ్లారు మహేశ్ బాబు. సినిమా రిలీజ్ టెన్షన్ నుంచి కాస్త రిలీఫ్ కోసం ఆ టూర్. ఇప్పుడు సినిమా సక్సెస్ ఇచ్చిన జాలీ మూడ్‌తో హాలిడే మోడ్‌లోకి వెళ్లారు మహేశ్. భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో మరో టూర్‌ని ప్లాన్ చేశారు. ‘‘ప్యారిస్ వెళ్తున్నాం. అందరికీ హ్యాపీ హాలిడేస్’’ అని కొన్ని ఫొటోలను షేర్ చేశారు నమ్రత. అక్కణ్ణుంచి తిరిగి రాగానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా షూటింగ్లో మహేశ్ పాల్గొంటారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. లొకేషన్స్ సెర్చ్ చేసే పనిలో పడ్డారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అందుకోసం కెమెరామెన్ మోహనన్‌తో కలిసి న్యూయార్క్ వెళ్లారు వంశీ. ‘‘కెమెరామెన్ కేయు మోహనన్‌తో కలిసి న్యూయార్క్‌లో మహేశ్‌బాబు సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాం. మోహనన్ దగ్గర పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా చాలా నేర్చుకోవాలి’’ అన్నారు వంశీ. అశ్వనీదత్, ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ చిత్రంలో పూజా హెగ్డేను కథానాయికగా తీసుకున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. -
ఎవరినీ నొప్పించాలనుకోను
‘‘నేను ఏ సినిమా తీసినా ఎవర్నీ హర్ట్ చేయకూడదనుకుంటాను. నా కాన్సంట్రేషన్ అంతా ఆడియన్స్ పైనే. పర్సనల్‌గా సెటైర్ వేసి సినిమాకు మైలేజ్ పొందుదామనుకునే చీప్ ఫిల్మ్ మేకర్ని కాను నేను. ప్రజలను మోటివేట్ చేయాలనుకున్నాను. అందుకే ఇష్యూస్‌ను అడ్రస్ చేశాను. పీపుల్స్‌కు నా సినిమా రీచ్ అవ్వాలి, నిర్మాతకు డబ్బులు రావాలి, ఎప్రిషియేషన్ కూడా రావాలి అనే ఫ్యాక్టర్స్‌ని కూడా ఆలోచిస్తా’’ అన్నారు దర్శకుడు కొరటాల శివ. మహేశ్‌బాబు హీరోగా ఆయన దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా ‘భరత్ అనే నేను’. ఈ సినిమా సక్సెస్‌ను చిత్రబృందం ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కొరటాల శివ మాట్లాడుతూ –‘‘సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, ఇంత ఎప్రిషియేషన్ రావడం చాలా ఆనందంగా ఉంది. కేటీఆర్‌గారు, జయప్రకాశ్ నారాయణ లాంటి వారు సినిమా బాగుందని చెప్పడం హ్యాపీ. ఎవరైనా కొత్త ఆలోచనలతో వస్తే నేను ప్రొడ్యూస్ చేస్తా. ఆ ఆలోచన ఉంది. ‘శ్రీమంతుడు’ అంటే గ్రామాల దత్తత మాత్రమే. అదే సీయం క్యారెక్టర్ మోర్ పవర్ఫుల్ అయితే మరిన్ని ఇష్యూస్ అడ్రెస్ చేయవచ్చని ఈ కథను తీసుకున్నాం. ప్రతి సినిమాలో కొత్త చాలెంజ్‌ను కోరుకునే నటుడు మహేశ్‌బాబు. ఆలా ప్రయోగాలు చేసే హీరో కెరీర్లో ఓన్లీ హిట్స్ మాత్రమే ఉండకపోవచ్చు. నేను రెండు సార్లు మహేశ్‌గారికి లైఫ్ ఇచ్చానని ఆయన చెప్పారు. అది మహేశ్‌గారి గొప్పదనం. బాలీవుడ్లో ఆఫర్లు వచ్చాయి. ‘మిర్చి’ సినిమాను రీమేక్ చేయమని చాలామంది అడిగారు. టాలీవుడ్లో నాకు కంఫర్ట్ అనిపించింది. రామ్‌చరణ్‌గారితో రెండు సినిమాలు ఉన్నాయి. మహేశ్‌గారితో మరో సినిమా ఉంటుంది. ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేను. అయితే నెక్ట్స్ సినిమా ఏంటి? అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. హాలిడేకి వెళ్లాలనుకుంటున్నా. వచ్చిన తర్వాత పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నా’’ అన్నారు. ‘భరత్ అనే నేను’ గురించి ఇంకా చెబుతూ – ‘‘మొదట్లో టు పార్ట్స్ చేస్తే బాగుండు అనుకున్నాం. అంత కంటెంట్ కూడా ఉంది.చెప్పాల్సిన ఇష్యూస్ ఇంకా ఉన్నాయి. అందుకే అలా అనిపించింది. ఏమో ఎప్పటికైనా చెస్తామేమో! మహేశ్ క్యారెక్టర్ కోసం ఓన్లీ పొలిటీషియన్స్నే రిఫరెన్స్‌గా తీసుకోలేదు. లీడర్‌కి ఉండాల్సిన క్వాలిటీస్‌ను తీసుకొన్నాను. ఆ లీడర్ ఒక సోషల్ వర్కర్ అయ్యి ఉండచ్చు. ఇన్స్ట్యూషన్ హెడ్ అయ్యి కూడా ఉండచ్చు. ఏ ఇండస్ట్రీ అయినా ఫస్ట్ చాన్స్ వారసులకే ఇస్తుంది. సినిమాలో భరత్ రామ్ క్యారెక్టర్ అలానే సీయం అయ్యాడు’’ అన్నారు. ఇటీవల పోసానిగారు మీ కథలను కొందరు తీసుకున్నారు అన్నారు. దీని గురించి ఏమంటారు? అన్న ప్రశ్నకు బదులిస్తూ– ‘‘ఆ విషయం ఇక్కడ అప్రస్తుతం. పాత ఇష్యూస్ అవి. ఒక జాబ్‌లోకి వెళ్లినప్పుడు పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఉంటాయి. ఇది ఇండస్ట్రీలో ఉంది. వాటిని ఓవర్‌కమ్ చేసుకుని ముందుకు వెళ్లాలి’’ అని అన్నారు. -
ఇది కలలా వున్నదే.. సాంగ్ పాడిన సితార
-
వైరల్: పాట పాడిన సితార
‘భరత్ అనే నేను’ ప్రభంజనం కొనసాగుతోంది. ఒకవైపు సినిమా విజయవంతంగా నడుస్తోంది. మరోవైపు ప్రచార కార్యక్రమాలు కూడా అదే ఊపులో కొనసాగుతున్నాయి. సక్సెస్మీట్లు, మేకింగ్ వీడియోలు, ఇంటర్వ్యూలు ఇలా సినిమాకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని బయటకు తెస్తూనే ఉన్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు విజయవాడకు వెళ్లి అభిమానుల మధ్యలో సినిమాను చూశారు. ఇప్పుడు మహేశ్ కూతురు సితార కూడా నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. సితారకు సోషల్‌మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం భరత్ అనే నేను సినిమాలోని అసెంబ్లీ సెట్లో సితార ఉన్న ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా సితార ఈ సినిమాలోని పాటను పాడిన వీడియో కూడా హల్చల్ చేస్తోంది. ఇది కలలా వున్నదే...అన్న సాంగ్‌ను సితార ముద్దుముద్దుగా పాడటంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
‘మిర్చి’ కాంబినేషన్లో మరో సినిమా
భరత్ అనే నేను సినిమాతో మరో ఘనవిజయం సాధించిన కొరటాల శివ తన తదుపరి ప్రాజెక్ట్ ను ఇంకా ప్రకటించలేదు. అయితే మీడియాలో మాత్రం రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్లో వినిపిస్తోంది. తన తొలి చిత్ర హీరోతో మరోసారి కలిసి పనిచేసేందుకు కొరటాల రెడీ అవుతున్నారట. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన కొరటాల శివ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు. తరువాత వరుసగా శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి హిట్స్ సాధించి తాజాగా భరత్ అనే నేనుతో మరో ఘనవిజయాన్ని అందుకున్నారు. ఈ దర్శక రచయిత ప్రభాస్ తో మరో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నారట. అయితే ఈ కాంబినేషన్ ఇప్పట్లో తెరమీదకు వచ్చే అవకాశం కనిపించటం లేదు. ప్రస్తుతం సాహో షూటింగ్లో బిజీగా ఉన్న ప్రభాస్ తరువాత జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. బాలీవుడ్‌లోనూ త్వరలో ఓ సినిమా ఉంటుందని ఇప్పటికే ప్రకటించేశాడు. ఈ సినిమాలన్ని పూర్తయితే గాని ప్రభాస్, కొరటాల కాంబినేషన్ తెర మీదకు వచ్చే అవకాశం లేదు. -
శ్రీవారిని దర్శించుకున్న మహేశ్‌బాబు
సాక్షి, తిరుమల: సినీ హీరో మహేశ్‌బాబు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ‘భరత్ అనే నేను’చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నానని, ఈ సమయంలో స్వామి వారిని దర్శించుకోవడం మరింత ఆనందం కలిగించిందని అన్నారు. తన జీవితంలో ఇది చాలా ఆనందకరమైన రోజు అని చెప్పారు. చిత్ర దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.. ‘భరత్ అనే నేను’చిత్రం భారీ విజయం సాధించటంతో శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చామన్నారు. వారి వెంట వైఎస్సార్సీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారు. -
శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో సినిమాలు చేస్తానని
‘‘డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ హ్యాపీగా చూడటం చాలా ఆనందంగా ఉంది. మా అమ్మగారు పుట్టినరోజున ఈ సినిమా రిలీజైంది. నాన్నగారి పుట్టినరోజు మే 31 వరకు డిస్ట్రిబ్యూటర్స్ షేర్స్ ఇలానే చెబుతుండాలి. నాన్నగారి ఫ్యాన్స్, నా ఫ్యాన్స్ అందరూ నన్ను సూపర్‌స్టార్ సూపర్‌స్టార్ అంటారు. ఆ సూపర్‌స్టార్‌కి నాలుగు సంవత్సరాల్లో రెండుసార్లు లైఫ్ ఇచ్చారు శివగారు. మీకెప్పుడూ రుణపడి ఉంటాను సార్’’ అన్నారు మహేశ్‌బాబు. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు, కియారా అద్వాని జంటగా డీవీవీ దానయ్య నిర్మించిన ‘భరత్ అనే నేను’ సినిమా ఈ నెల 20న రిలీజై సక్సెస్ టాక్‌తో ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన బ్లాక్ బ్లస్టర్ సెలబ్రేషన్స్‌లో మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘పది రోజులుగా నాన్‌స్టాప్‌గా ప్రమోషన్స్ చేస్తున్నాను. విజయవాడకు వెళ్లాను. తిరుపతికి వెళ్లాను. సినిమా రిలీజైన తర్వాత నన్ను పడుకోనివ్వకుండా చేస్తున్నారు శివగారు. ఈ రోజులు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇందాక అందరికీ షీల్డ్స్ ఇచ్చాం. అది నాకు బాగా నచ్చింది. శ్రీకర్ ప్రసాద్‌గారు సినిమాను ఎడిట్ చేస్తే ఒక టెక్ట్స్ బుక్లా ఉంటుంది. దేవి మంచి మ్యూజిక్ ఇచ్చారు. దానయ్యగారూ.. మీరు ఇలానే గొప్ప సినిమాలు తీయాలి. నాన్నగారు, నా అభిమానుల స్పందనకు థ్యాంక్స్. మీ రెస్పాన్స్ని ఎప్పుడూ మర్చిపోలేను. ఇలానే శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో సినిమాలు చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అన్నారు మహేశ్‌బాబు. కొరటాల శివ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో బిగ్ బడ్జెట్ మూవీ ఇది. కాంప్రమైజ్ కాకుండా దానయ్యగారు నిర్మించారు. ఇండస్ట్రీలో మంచి ప్రొడ్యూసర్‌లా ఆయన ఇలానే ఉండాలి. ‘శ్రీమంతుడు’ సినిమా నుంచి మహేశ్‌బాబుతో నాకు అసోసియేషన్ ఉంది. మంచి కథ రాసుకుంటే నా పని అయిపోయినట్లే. మంచి యాక్టర్ ఉన్నాడన్న ధైర్యం. మహేశ్‌గారితో హాట్రిక్ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నాను. రైటర్ శ్రీహరి నాను.. మహేశ్‌గారి ఫ్యాన్. మహేశ్ క్యారెక్టర్ సీయం అయితే బాగుండు అన్న ఆలోచన హరిదే. కథ నాకు ఇచ్చి నా వెన్నంటే ఉన్నందుకు థ్యాంక్స్. ‘రంగస్థలం’ సినిమా రాగానే సగం టెన్షన్ పోయింది. ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ స్ట్రీక్ జాయిన్ అయిపోయిందని టెన్షన్ తగ్గిపోయింది. వెంటనే మరో బ్లాక్‌బస్టర్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నా బ్యానర్లో ఇంత గొప్ప సినిమా, గర్వపడే సినిమా తీసిపెట్టిన డైరెక్టర్ శివగారికి, హీరోగా చేసిన మహేశ్‌బాబుగారికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను. నాకు ఏ సినిమాకూ ఇంత ఎప్రిషియేషన్ రాలేదు. నాకు తెలియనివారు కూడా .. ‘గొప్ప సినిమా తీశారు’ అని సెల్ఫీలు దిగుతుంటే ఆనందంగా ఉంది. శుక్రవారం కలెక్షన్స్ చెప్పాం. ప్రపంచవ్యాప్తంగా 161.28కోట్లు వసూలు చేసింది. ఇవి ఒరిజినల్ కలెక్షన్స్. మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఆనందంగా ఉన్నారు’’ అన్నారు దానయ్య. ‘‘ఈ సినిమా సక్సెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫేస్‌లలో కనిపించింది. మహేశ్‌బాబుగారే కాదు ఆయన హార్ట్ కూడా సూపర్‌స్టార్’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ‘‘ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొరటాల చాలా సంపాదించాడు అనుకుంటారు. కానీ ఎక్కువ పోగొట్టుకున్నాడు. వాడి కథలను చాలా మంది కాజేసారు. లేకపోతే ఈపాటికే ఓ పది సినిమాలు సూపర్‌హిట్ కొట్టేవాడు. మహేశ్ చాలా అందంగా ఉంటాడు. అతని మనసు ఇంకా అందంగా ఉంటుంది. నా కొడుకు ప్రజ్వల్ ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాడు’’ అన్నారు పోసాని. ‘‘ఇలాంటి మంచి మంచి స్క్రిప్ట్‌లు మళ్లీ మళ్లీ రావాలి’’ అన్నారు రామజోగయ్యశాస్త్రి. డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొని సినిమా విజయానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. మహేశ్‌బాబు డిస్ట్రిబ్యూటర్స్‌కు మెమొంటోలు అందించారు. -
రాజకీయాల్లోకి రాను
‘‘రాజకీయాలంటే ఆసక్తి లేదు. జీవితాంతం ప్రేక్షకులు, అభిమానుల కోసం నటిస్తూనే ఉంటాను’’ అని స్పష్టం చేశారు మహేశ్‌బాబు. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా నటించిన చిత్రం‘భరత్ అనే నేను’. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా రీసెంట్గా విడుదలైంది. శుక్రవారం విజయవాడ, తిరుపతిలో ‘భరత్ అనే నేను’ సినిమా సక్సెస్ మీట్స్‌ను నిర్వహించింది చిత్రబృందం. మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘రాజకీయాల్లోకి రాను. వందేళ్ల వయసు వచ్చే వరకు నటిస్తుంటాను. ‘ఒక్కడు, పోకిరి, దూకుడు’ విజయోత్సవాలు విజయవాడలో జరిగాయి. ‘భరత్ అనే నేను’ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను విజయవాడలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నాం. సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు రుణపడి ఉంటాను’’అన్నారు. ఆ నెక్ట్స్ తిరుపతిలో మహేశ్ మాట్లాడుతూ– ‘‘నాన్నగారికి అందరి కన్నా పెద్ద అభిమానిని నేనే. సినిమాలో మంచి సీయంగా నటించాను. నిజ జీవితంలో బెస్ట్ ఫాదర్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తాను. శ్రీవారి ఆశీస్సులు ఉంటే సినిమాలన్నీ హిట్ అవుతాయి’’ అన్నారు. ‘‘విజయవాడలో తెలుగు సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఇక్కడ సినిమా హిట్ సాధిస్తే ప్రపంచమంతా హిట్ అవుతుంది. సినిమా బ్లాక్‌బస్టర్ మూవీగా టాక్ తెచ్చుకుంటే మహేశ్‌బాబును కొండకు తీసుకువస్తానని వెంకన్నకు మొక్కుకున్నాను. భవిష్యత్‌లో మంచి సినిమాతో మరోసారి తిరుపతిలో ఫ్యాన్స్ ముందు భారీ ఫంక్షన్ జరుపుకుందాం’’ అన్నారు కొరటాల శివ. విజయవాడ కార్యక్రమంలో సుధశ్రీ పిక్చర్స్ అధినేత మిక్కిలినేని సుధాకర్ పాల్గొన్నారు. తిరుపతి సక్సెస్‌మీట్‌లో మహేశ్‌బాబు, కొరటాల శివను నిర్మాత ఎన్వీ ప్రసాద్ సత్కరించారు -
కేటీఆర్‌తో భరత్ అనే నేను
-
మహేశ్ బాబు లిస్ట్‌లో ఆ ఇద్దరు!
సూపర్‌స్టార్ మహేశ్ బాబు యమ హ్యాపీగా ఉన్నాడనీ ఇట్టే అర్థమైపోతోంది. సక్సెస్ మీట్లో భావోద్వేగంగా మాట్లాడటం, కొరటాల శివను హత్తుకోవడం, తన శ్రీమతి నమ్రతను ముద్దుపెట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇవన్నీ చూస్తే మహేశ్ ఎంత సంతోషంగా ఉన్నాడో తెలుస్తోంది. రెండు భారీ డిజాస్టర్స్ తరువాత కసితో తీసిన ‘భరత్ అనే నేను’ సినిమా సూపర్‌హిట్ టాక్‌తో రికార్డుల వేటను కొనసాగిస్తోంది. గతంలో శ్రీమంతుడు లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కొరటాల శివతో మళ్లీ అదే రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మహేశ్. మహేశ్‌ను ట్వీటర్లో ఎంతో మంది ఫాలో అవుతున్నా...మహేశ్ మాత్రం ఇంతకాలం ఒక్కడినే ఫాలో అయ్యేవాడు. ఆయనే మహేశ్ బావ గల్లా జయదేవ్. అంటే తన మనసులో ఎంతో ప్రేమ ఉంటే తప్ప ట్వీటర్లో ఫాలో అయ్యేవాడు కాదని తెలుస్తోంది. అయితే ఈ జాబితాలో కొత్తగా ఒక పేరు వచ్చి చేరింది. అది ఎవరూ అనేది ఈపాటికే తెలిసుంటుంది. తన కెరీర్ గ్రాఫ్ పడిపోతున్న సమయంలో మళ్లీ పీక్స్‌లో నిలబెట్టిన దర్శకుడు కొరటాల శివనే మహేశ్ ఫాలో అవుతున్న రెండో వ్యక్తి. సో...మహేశ్‌కు కొరటాల అంటే ఎంత ప్రేమనో చెప్పకనే చెప్పాడు కదా. -
కనకదుర్గమ్మను దర్శించుకున్న మహేశ్
-
వందేళ్ల వరకు సినిమాలే చేస్తా: మహేశ్
సాక్షి, విజయవాడ: సూపర్ స్టార్ మహేశ్ బాబు శుక్రవారం విజయవాడలో సందడి చేశారు. ‘భరత్ అనే నేను’ సినిమా విజయం సాధించడంతో మహేశ్ నగరంలోని అన్నపూర్ణ థియేటర్లో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అంతే కాకుండా ప్రేక్షకులతో కలిసి ఆయన సినిమాను వీక్షించారు. మహేశ్‌తో పాటు చిత్ర దర్శకుడు కొరటాల శివ, ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారు. సినిమా చూసిన తర్వాత మహేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘విజయవాడలో సినిమా చూడటం సంతోషంగా ఉంది. ఒక్కడు, పోకిరి, దూకుడు చిత్రాల విజయోత్సవ వేడుకలను ఇక్కడే నిర్వహించాం. వందేళ్లు వచ్చే వరకు సినిమాలు మాత్రమే చేస్తా. ఇప్పటివరకు నాన్నగారి ఇమేజ్ నాపై పడలేదు. ఈ సినిమాలో నన్ను నాన్నలా చూపించినందుకు కొరటాలకు కృతజ్ఞతలు. భరత్ అనే నేను సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు విజయయాత్రం చేస్తున్నాం.. రాజకీయాల గురించి మాట్లాడను’ అని తెలిపారు. కొరటాల శివ మాట్లాడుతూ.. తెలుగు సినిమాలకు విజయవాడలో క్రేజ్ ఉంటుందన్నారు. విజయవాడలో బ్లాక్ బాస్టర్ అంటే ప్రపంచం మొత్తం బ్లాక్ బాస్టరే అని అన్నారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చిన మహేశ్ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. మహేశ్‌ను చూసేందుకు వందలాది మంది అభిమానులు ఎగబడ్డారు. కాగా మహేశ్ విజయవాడ పర్యటన ముగిసిన తర్వాత తిరుపతికి వెళ్లనున్నారు. తిరుపతిలో కూడా అభిమానుల సమక్షంలో ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని వీక్షించనున్నారు. -
‘భరత్’కు భారీ కలెక్షన్లు
సాక్షి, హైదరాబాద్: ప్రిన్స్ మహేష్‌బాబు తాజా సినిమా ‘భరత్ అనే నేను’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. హిట్ టాక్ రావడంలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విదేశాల్లోనూ ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. అమెరికాలో మొదటి వారంలో(ప్రివ్యూస్‌తో కలుపుకుని) ఈ సినిమా మూడు మిలియన్ డాలర్ల మార్కును దాటింది. అటు ఆస్ట్రేలియాలోనూ ‘భరత్..’ సందడి చేస్తున్నాడు. మొత్తంగా ఓవర్సిస్లో ఇప్పటికి 4 మిలియన్ డాలర్లను క్రాస్ చేసి ఐదు మిలియన్ డాలర్లకు పరుగులు పెడుతోందని ప్రముఖ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేశారు. కేరళలోనూ ఈ సినిమాకు ఆదరణ బాగుంది. మొదటి 5 రోజుల్లో రూ. 7.63 లక్షలు తెచ్చుకుంది. ఈ సినిమా ఇప్పటికే రూ. 125 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. మహేష్‌బాబుకు జోడిగా కియారా అద్వాని నటించిన ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. It's MAHESH MANIA Overseas... Telugu film #BharatAneNenu takes international markets by storm... Week 1: N America $ 3.015 million [incl non-reported] Au NZ $ 535k Europe & UK $ 350k Africa, Malaysia, Singapore [2 days] & Rest $ 150k GCC $ 600k Total: $ 4.65 mn [₹ 31.04 cr]. — taran adarsh (@taran_adarsh) 27 April 2018 -
నిర్మాతగా మారనున్న స్టార్ డైరెక్టర్
భరత్ అనే నేను సినిమాతో ఘనవిజయం సాధించిన దర్శకుడు కొరటాల శివకు సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. దర్శకుడిగా నాలుగు వరుస విజయాలు అందుకొని స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరిపోయిన కొరటాల త్వరలో నిర్మాతగా మారనున్నారట. అయితే నిర్మాణ సంస్థను ఎప్పుడు స్థాపించేది మాత్రం తెలియాల్సి ఉంది. చాలా కథలు నచ్చినా సమయం సరిపోని కారణంగా ఆ చిత్రాలను తాను డైరెక్ట్ చేయలేకపోతున్నానని, అందుకే నిర్మాతగా మారి యువ దర్శకులకు అవకాశాలివ్వాలని కొరటాల భావిస్తున్నారు. భరత్ అనే నేను తరువాత కొరటాల తన తదుపరి చిత్రాన్ని ఇంతవరకు ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక్క అల్లు అర్జున్ తప్ప స్టార్ హీరోలెవరు ఖాలీగా లేకపోవటంతో బన్నీతోనే కొరటాల శివ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. -
భరత్‌కు రాంచరణ్ సూపర్ రివ్యూ
మహేశ్‌బాబు తాజా సినిమా ‘భరత్ అనే నేను’ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. రాజకీయ నేపథ్యంతో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా పాజిటివ్ మౌత్‌టాక్‌తో మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాను ఇటు ప్రేక్షకులే కాదు.. అటు సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాను ప్రశంసించారు. సామాజిక సందేశాన్ని కమర్షియల్ అంశాలతో జోడించి కొరటాల శివ ఈ సినిమాను చక్కగా తెరకెక్కించాడని, మహేశ్‌బాబు అద్భుతంగా నటించాడని ఎన్టీఆర్ కొనియాడారు. తాజాగా మెగా హీరో రాంచరణ్ కూడా ‘భరత్ అనే నేను’ సినిమాకు చక్కటి రివ్యూ ఇచ్చారు. ‘క్లాసిక్ సినిమా అని చెప్పడానికి ఒక పరిపూర్ణ ఉదాహరణ ఈ సినిమా. ఇందులో మహేశ్‌బాబు సటిల్‌గా కనిపిస్తూనే.. పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కనబర్చారు. అందంగా రాసి.. అద్భుతంగా తెరకెక్కించారు శివగారు. దేవీ నువ్వు సూపర్.. మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోరును బాగా ఎంజాయ్ చేశాను. అద్భుతమైన అరంగేట్రం చేసిన కియారాకు, మంచి చిత్రాన్ని అందించిన నిర్మాత డీవీవీ దానయ్యకు అభినందనలు’ అంటూ రాంచరణ్ తన అభిప్రాయాన్ని ఫేస్బుక్లో వెల్లడించారు. ఈ క్రమంలోనే మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ తాజాగా కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
‘సీఎం భరత్’కు కేటీఆర్ ఫిదా
సాక్షి, హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్‌బాబు, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో పొలిటికల్ నేపథ్యంతో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ సినిమా విడుదలై భారీ కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా మహేష్ అదరగొట్టారు. రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో దీనిపై రాజకీయ నాయకుల్లో సైతం ఆసక్తి రేపుతోంది. ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ సినిమా చూడాలనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ‘భరత్ అనే నేను’ సినిమాను తిలకించారు. మహేష్, కొరటాల శివతో కలిసి ఈ సినిమాను చూసిన కేటీఆర్.. సీఎం భరత్‌కు ఫిదా అయిపోయాడు. సినిమా చాలా బాగుందని కితాబిచ్చారు. స్నేహితుడు మహేష్‌తో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేశానని ట్విటర్లో తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సెషన్లో మహేశ్‌బాబు, ఇతర యూనిట్‌తో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. మంత్రి కేటీఆర్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబుతోపాటు చిత్రయూనిట్ ధన్యవాదాలు తెలిపింది. విలువైన సమయాన్ని కేటాయించి, 'భరత్ అనే నేను' సినిమాను చూసినందుకు, తమ చిత్రాన్ని ప్రశంసించినందుకు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. Some more pics from the interactive session with @urstrulyMahesh and @sivakoratala pic.twitter.com/ccOaJXiluH — KTR (@KTRTRS) April 25, 2018 You guys are in for a surprise! Did an interactive session with good friend @urstrulyMahesh and director @sivakoratala on being in public life and the movie ‘Bharat Ane Nenu’ a movie which I personally enjoyed 👍 pic.twitter.com/lF4XqnT7ve — KTR (@KTRTRS) April 25, 2018 -
మహేష్ అనే నేను
-
భరత్ విజయోత్సవ వేడుక ఖరారు
సాక్షి, సినిమా : ప్రిస్స్ మహేశ్ బాబు, కైరా అద్వానీ జంటగా నటించిన ‘భరత్ అనే నేను’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేశ్ ముఖ్యమంత్రి పాత్రలో అదరగొట్టాడు. విడుదలైన రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం.. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇతర సినీ తారలు కూడా చిత్ర బృందానికి తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోమవారం సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం.. తాజాగా విజయోత్సవ వేడుకను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 27న తిరుపతి అలిపిరి రోడ్డులోని నెహ్రు మున్సిపల్ పాఠశాల మైదానంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు వేడుక ప్రారంభమవుతుందని చిత్ర బృందం ప్రకటించింది. -
నా లైఫ్‌లో అదే పెద్ద అభినందన
‘‘రెండేళ్లుగా నాకు చాలా ఎమోషనల్‌గా, ఒత్తిడిగా ఉండేది. ఇప్పుడు రిలీఫ్. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు. చాలా ఆనందంగా ఉంది. ‘భరత్ అనే నేను’ని హిట్ చేసిన ప్రేక్షకులు, నాన్నగారి, నా ఫ్యాన్స్‌కు థ్యాంక్స్’’ అని మహేశ్‌బాబు అన్నారు. మహేశ్‌బాబు, కియారా అద్వాని జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. డి. పార్వతి సమర్పణలో దానయ్య డీవీవీ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘బ్రహ్మాజీ నాతో యాక్ట్ చేసినప్పుడల్లా 99 పర్సెంట్ బ్లాక్‌బస్టర్సే. తెలుగు చిత్ర పరిశ్రమకి కియారా లాంటి ఇంకో పెద్ద హీరోయిన్ వచ్చినందుకు హ్యాపీగా ఉంది. శివగారికి ఎప్పుడూ రుణపడి ఉంటా. ‘శ్రీమంతుడు’ సినిమాకి ముందు కూడా ఇదే ఫేజ్ ఉండేది నాకు. ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చారు. తర్వాత అదే రిపీట్ చేశారు. నేను పడుతున్న టెన్షన్ ఆయనకు తెలుసు. మళ్లీ ఓ బ్లాక్‌బస్టర్ ఇచ్చారు. ‘ఐ యామ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యు సర్’. నేనెప్పుడూ ఏ సినిమాకీ ఇంత కష్టపడి పనిచేయలేదు. మా సినిమా రిలీజ్ ముందు ఏప్రిల్ 27న అనుకున్నాం. 20కి వచ్చాం. అది మా అమ్మగారి పుట్టినరోజు. ఆ రోజు రిలీజ్ డేట్ ప్రకటించిన నిర్మాతకి, యూనిట్‌కి థ్యాంక్స్. ఆ రోజు సినిమా విడుదల అవడం వల్లే ఇన్ని బ్లెసింగ్స్ వచ్చాయేమో మాకు. 20న సినిమా రిలీజ్ అంటే పదో తారీఖు నా డబ్బింగ్ పూర్తయింది. ఈ టెన్షన్ తట్టుకోలేక ఫ్యామిలీతో కలిసి ఐదు రోజులు వెకేషన్ వెళ్లా. దేవి ఈజ్ నాట్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. నేపథ్య సంగీతంతో స్టోరీ చెప్పేశారు. ఎప్పటి నుంచో నాతో సినిమా చేయాలని దానయ్యగారికి ఉండేది. ‘భరత్ అనే నేను’ చేశాం. పెద్ద హిట్ అయింది. రిలీజ్ రోజు సాయంత్రం ఆయన్ని కలిసి.. ‘కొట్టేశాం దానయ్యగారు పెద్ద హిట్’ అంటే.. ‘అవ్వుద్దండీ.. ఎందుకు అవ్వదు.. అవ్వాలి కదా!’ అన్నారు. ‘మీతో మళ్లీ మళ్లీ సినిమా చేస్తాను సార్’. థ్యాంక్యూ. సినిమాలో ఇంకా చాలా ఎగై్జటింగ్ సీన్స్ ఉన్నాయి. అవన్నీ పెట్టలేకపోయా మనే బాధ ఉంది. నాన్నగారికి (కృష్ణ) సినిమా విపరీతంగా నచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ ఓత్ విడుదలైనప్పుడు ‘అరే.. ఇది నా వాయిస్‌లా ఉందే’ అన్నారు. రమేశ్ అన్నయ్య చెన్నైలోనే ఎక్కువగా పెరిగారు. శివాజీ గణేశన్, ఎంజీఆర్గార్లంటే ఆయనకి ఇష్టం. వారికి బిగ్ ఫ్యాన్. ‘భరత్ అనే నేను’ సినిమా చూడగానే నాకు వాళ్లు గుర్తొచ్చారు అని చెప్పారు. అది నా లైఫ్‌లో బిగ్ కాంప్లిమెంట్’’ అన్నారు. నిర్మాత దానయ్య మాట్లాడుతూ– ‘‘మా సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో కృషగారు, మహేశ్ అభిమానులకు ఓ హామీ ఇచ్చా. అది నిలబెట్టుకున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ మూవీ చూసి, చిరంజీవి గారు ఫోన్ చేసి మంచి సినిమా తీశావని అభినందించారు. నా బంధువులు, ఫ్రెండ్స్ గొప్ప సినిమా తీశావని ఫోన్లు, మెసేజ్‌లు చేశారు. గొప్ప సినిమా ఇచ్చిన శివగారికి, మహేశ్‌గారికి థ్యాంక్స్. హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. 27న శుక్రవారం తిరుపతిలో సక్సెస్ మీట్ నిర్వహిస్తాం’’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ– ‘‘నేను నా స్క్రిప్ట్‌ని ఎంత ప్రేమిస్తానో నా నటీనటులు, టెక్నీషియన్స్ కూడా అంతే ప్రేమిస్తారు. మహేశ్‌లాంటి యాక్టర్ ఉన్నప్పుడు ఇంకా ఇంకా ఏదో రాయాలనే ఉంటుంది. ఆయన మంచి సపోర్ట్, కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆయనతో ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా అని ఉంటుంది. గొప్ప సినిమా తీయాలని చెప్పిన దానయ్యగారి నమ్మకాన్ని నిలబెట్టాననుకుంటున్నా. మా కష్టం అంతా మరచిపోయేలా చేసినందుకు జీవితాంతం ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. ‘శ్రీమంతుడు, భరత్ అనే నేను’ సినిమాలను మించిన లైన్ దొరికినప్పుడు మహేశ్‌గారి ఇంటికెళ్లి కాలింగ్ బెల్ నొక్కుతా’’ అన్నారు. ‘‘సక్సెస్, బ్లాక్ బస్టర్ హిట్స్ ఇండస్ట్రీలో అందరికీ వస్తుంటాయి. ఈ సినిమా ఎందుకు ప్రత్యేకం అంటే.. సమాజంలో ఏదైతే జరగాలో.. ఇలాంటోడు ఒకడు రావాలనుకుంటామో అలాంటి వాడు రావడంతో అందరూ కనెక్ట్ అయ్యారు’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ‘‘ఈ మూవీలో భాగమైనందుకు గర్వంగా ఉంది. మహేశ్ సార్‌లాంటి కో–స్టార్‌తో పనిచేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నా. నన్ను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు కియారా. నటుడు బ్రహ్మాజీ, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి పాల్గొన్నారు. -
‘భరత్ అనే నేను’ సినిమా సక్సెస్‌మీట్
-
భరత్: చిరంజీవి..10నిమిషాలు మాట్లాడారు!
సాక్షి, హైదరాబాద్ : ‘భరత్ అనే నేను’ సూపర్‌హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. హీరో మహేశ్‌బాబు, హీరోయిన్ కియా అద్వానీ, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత డీవీవీ దానయ్య, చిత్ర నటీనటులు సక్సెస్ మీట్లో పాల్గొని మాట్లాడారు. కొరటాలకు రుణపడి ఉంటాను ఈ సందర్భంగా హీరో మహేశ్‌బాబు మాట్లాడుతూ.. దర్శకుడు కొరటాల శివకు రుణపడి ఉంటానని అన్నారు. గతంలో శివ తనకు శ్రీమంతుడు లాంటిపెద్ద హిట్ ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చారని అన్నారు. సరైన సినిమాలు లేకపోవడంతో రెండేళ్లుగా ఒత్తిడిలో ఉన్నానని, భరత్ అనే నేను సినిమా హిట్‌తో చాలా ఆనందంగా ఉందని మహేశ్‌బాబు అన్నారు. సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. దేవీశ్రీప్రసాద్ ఈ సినిమా కోసం ఎక్స్ట్రార్డినరీ పాటలు ఇచ్చారని కొనియాడారు. దేవీశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు కాదు.. స్టోరీ టెల్లర్.. సినిమాకు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను అందించారని తెలిపారు. చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ‘‘భరత్ అనే నేను’ సినిమా చూసి చిరంజీవిగారు ఫోన్ చేసి 10 నిమిషాలు మాట్లాడారు. మా సిస్టర్స్ కూడా చూశారు. మంచి సినిమా చేశావు. సినిమా పెద్ద హిట్ అవుతుందని చిరంజీవిగారు అన్నారు’ అని చెప్పారు. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.. ‘మహేష్ లాంటి యాక్టర్ ఉన్నప్పుడు ఇంకా ఇంకా రాయాలి అనిపిస్తుంది. మహేష్ లేకపోతే ‘భరత్ అనే నేను’ సినిమా ఇంత పెద్ద హిట్ కాదు. మహేశ్‌తో సినిమా అంటే ఎప్పుడు స్పెషల్’ అని అన్నారు. ‘ దేవీశ్రీ ప్రసాద్ ఉంటే నాకు చాలా దైర్యం. నా నాలుగు సినిమాలకు నువ్వు ప్రాణం పోశావు. పోసానికి డైలాగ్స్ రాయాలంటే నాకు భయం వేసింది. ఆయన నాకు గురువు. ఆయనతో చేయడం ఇదే మొదటసారి’ అని అన్నారు. -
భార్యకు ప్రేమతో మహేశ్ స్పెషల్ ఫొటో!
సూపర్ స్టార్ మహేశ్‌బాబు తాజా సినిమా ‘భరత్ అనే నేను’ సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. సామాజిక బాధ్యతతో జనహితం కోసం పనిచేసే ముఖ్యమంత్రిగా ఈ సినిమాలో మహేశ్ అదరగొట్టారు. మరోసారి దర్శకుడు కొరటాల శివ తనదైన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సామాజిక అంశాలను తెరకెక్కించి విజయవంతమయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేస్తోంది. రెండురోజుల్లోనే రూ. 100 కోట్లకుపైగా గ్రాస్ సాధించింది. ఈ భారీ విజయాన్ని మహేశ్ ఆస్వాదిస్తున్నారు. కుటుంబానికి అధిక ప్రాధాన్యమిచ్చే మహేశ్ ఈ సినిమా విజయాన్ని కుటుంబసభ్యులతో పంచుకున్నారు. తన సతీమణి నమ్రతకు తన ప్రేమను చాటే ఓ అందమైన ఫొటోతో ఇన్‌స్టాగ్రామ్‌లో మహేశ్ కృతజ్ఞతలు తెలిపారు. మహేశ్, నమ్రత లిప్‌లాక్ చేస్తూ ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఆయన ‘భరత్’ పాలన చూడాలనుకుంటున్నారు..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల్లో వందకోట్ల గ్రాస్ సాధించిన ఈ సినిమా ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చూడాలనుకుంటున్నారన్న వార్త ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలో పొలిటికల్ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్న రజనీ.. భరత్ అనే నేను సినిమా చూడాలనుకుంటున్నారట. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీఎంగా మహేష్ తీసుకున్న నిర్ణయాలు ఆలోచింపచేసేవిగా ఉండటంతో పాటు ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులను ప్రతిభింబించేవిగా ఉండటంతో రజనీ ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. -
అన్ని భాషల్లో మహేష్
భరత్ అనే నేను చిత్రంపై ప్రేక్షకుల నుంచే కాదు.. ప్రముఖలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు కలెక్షన్లు సునామీ కొనసాగుతున్న వేళ ఈ చిత్రం రీమేక్ గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ స్పందించారు. ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ‘సమకాలీన రాజకీయాలు, సందేశాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలన్న ఆలోచన మొదటి నుంచే లేదు. మిగతా భాషల్లో కూడా దీనిని డబ్ చేసి వదలబోతున్నాం. పొలిటికల్ నేపథ్యం కారణంగా ప్రతీ పౌరుడు ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మిగతా చోట్ల కూడా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం’ అని కొరటాల పేర్కొన్నారు. -
మహేష్‌బాబుపై ఎన్టీఆర్ ప్రశంసలు
సాక్షి, సినిమా: ‘భరత్ అనే నేను’ సినిమాపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్టీఆర్ తన ట్విటర్ వేదికగా సినిమాపై అభిప్రాయాన్ని తెలిపారు. మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘ సామాజిక బాధ్యత, వాణిజ్య అంశాలు ఒకే మూవీలో చూపించడం అంత ఈజీ కాదు. ఒకేసారి ఈ రెండూ అంశాలను అంత అందంగా సమతుల్యం చేసి చూపించిన దర్శకుడు కొరటాల శివకు కుడోస్. అద్భుతమైన ప్రదర్శన చూపిన సూపర్ స్టార్ మహేశ్‌బాబుకు శుభాకాంక్షలు. నిజాయతీతో కూడిన అద్భుతమైన సినిమాను రూపొందించినందుకు ‘భరత్ అనే నేను’ మొత్తం చిత్ర బృందానికి నా అభినందనలు తెలుపుతున్నా’ అని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. ‘భరత్ అనే నేను’ మూవీ ప్రీరిలీజ్ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ హాజరైన విషయం తెలిసిందే. ఈ వేడుకలో ఎన్టీఆర్ వేదికపై ప్రసంగిస్తూ ఒకరినొకరు పొగడ్తలు కురిపించుకున్నారు. అన్నయ్యా అంటూ ఎన్టీఆర్, బ్రదర్ అంటూ మహేశ్‌బాబు అప్యాయంగా పలకరించుకున్నారు. ఈ నెల 20న విడుదలైన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డుల వేట మొదలు పెట్టిన భరత్ అనే నేను, బాహుబలి సీరీస్ తరువాత వేగం వంద కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా చరిత్ర సృష్టించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్‌ను సాధించటం విశేషం. -
సుకుమార్‌తో సూపర్ స్టార్
భరత్ అనే నేను సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరో సినిమాను కన్ఫామ్ చేశాడు. త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్న మహేష్ ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా కన్ఫామ్ చేశాడు. సుకుమార్ దర్శకత్వంలో తన 26వ సినిమా చేసేందుకు అంగీకరించాడు మహేష్. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన వన్ నేనొక్కడినే ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా టెక్నికల్‌గా ఆకట్టుకోవటంతో మరోసారి సుకుమార్‌తో కలిసి పనిచేసేందుకు ఓకె చెప్పాడు మహేష్. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రంగస్థలం సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మహేష్, సుకుమార్ ల కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాను నిర్మించనుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. Superstar Mahesh Babu + Mythri Movie Makers + Sukumar#Mahesh26 - 2019 Worldwide pic.twitter.com/RveUzTVpIM — Mythri Movie Makers (@MythriOfficial) 22 April 2018 -
భరత్ రికార్డ్ : రెండ్రోజుల్లో వంద కోట్లు
భరత్ అనే నేను సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరో అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డుల వేట మొదలు పెట్టిన భరత్ అనే నేను, బాహుబలి సీరీస్ తరువాత వేగం వంద కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా చరిత్ర సృష్టించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్‌ను సాధించటం విశేషం. తొలిరోజు మహేష్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా అమెరికాలో రెండు రోజుల్లో రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుంది. ఇదే హవా కొనసాగితే తొలి వారాంతానికి బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి ఎంటర్ అవుతుందని భావిస్తున్నారు. తొలి షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న భరత్ అనే నేను ముందు ముందు మరిన్ని రికార్డులు తిరగరాయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. #100CroreBharatAneNenu pic.twitter.com/6Yg7NIrJOo — DVV Entertainment (@DVVEnts) 22 April 2018 -
ఓవర్ సీస్లో సత్తా చాటిన భరత్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం భరత్ అనే నేను. బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి రెండు డిజాస్టర్ ల తరువాత రిలీజ్ అయిన ఈ సినిమా మరోసారి మహేష్ కలెక్షన్ స్టామినాను ప్రూవ్ చేస్తోంది. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన భరత్ అనే నేను తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఓవర్సీస్లో ఫ్లాప్ సినిమాలతో కూడా మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించే మహేష్, భరత్ అనే నేను సినిమాతో మరిన్ని రికార్డులు సాధిస్తున్నడు. తెలుగు రాష్ట్రాల్లో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసిన సూపర్ స్టార్ ఓవర్ సీస్లో రెండు రోజుల్లోనే 2 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించినట్టుగా అధికారికంగా ప్రకటించారు. మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శరత్‌కుమార్, ప్రకాష్ రాజ్, ఆమని, సితారలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. Bharat Ane Blockbuster Superstar @urstrulyMahesh's #BharatAneNenu crossed 2 Million mark in US within 2 Days — BARaju (@baraju_SuperHit) 22 April 2018 -
మహేష్ బాబుపై కన్నడ అభిమానుల ఆగ్రహం
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా ‘భరత్ అనే నేను’ భారీ విజయపథం వైపు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. తన సినిమాపై అభిమానులు చూపించిన ఆదరణకు మహేష్ బాబు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల నుంచి వస్తున్న ఆదరణకు మహేష్ బాబు ధన్యవాదాలు కూడా తెలిపారు. అయితే కేవలం తెలుగు, తమిళం, ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే మహేష్ తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. దీనిపై కన్నడ ప్రజలు మహేష్ బాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘హలో సార్.. మీ సినిమా కన్నడ భాషల్లో కూడా విడుదలైంది. కర్ణాటకలో 100కిపైగా స్క్రీన్లలో భరత్ అనే నేను సినిమాను విడుదల చేశారు. భరత్ అనే సినిమా విజయానికి కన్నడ అభిమానుల పాత్ర చాలా కీలకం. ఇక్కడ కూడా మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయినప్పటికీ మీరు కన్నడ అభిమానుల విషయంలో పక్షపాతం చూపించారు. మీకు కన్నడ అభిమానులు కనిపించడం లేదా? కనీసం కన్నడలో ధన్యవాదాలు చెప్పలేకపోయారా? అంటూ’ మండిపడ్డారు. కర్ణాటక లేకపోతే మీ సినిమా జీరో, మీరు చేసిన పని చాలా షేమ్ అంటూ కామెంట్లు పెట్టారు. అన్ని భాషలకు సమానమైన ప్రాముఖ్యత ఇవ్వండని, ఎక్కువగా అభిమానులున్న కన్నడకు కూడా కాస్త గౌరవం ఇవ్వడంటూ మహేష్‌కు సూచించారు. తెలుగు అభిమానుల కంటే కూడా ఎక్కువగా కన్నడ ఫ్యాన్సే భరత్ అనే నేను సినిమాను చూశారన్నారు. కన్నడ అభిమానులపై మీరు చూపించిన ఈ పక్షపాతం, మీలో ఉన్న తెలివి తక్కువతనాన్ని ప్రతిబింబిస్తుందని మండిపడ్డారు. త్వరలోనే మీకు కన్నడ అభిమానులు గుణపాఠం చెబుతారని కొందరు హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం చేసిన ఫేస్బుక్, ట్విటర్లో మహేష్ చేసిన ఈ పోస్టుకు పెద్ద ఎత్తున కన్నడ అభిమానుల నుంచి ఆగ్రహం వ్యక్తమవడంతో, ఫేస్బుక్ పోస్టును మహేష్ ఎడిట్ చేసి కన్నడలో కూడా ధన్యవాదాలు తెలిపారు. అయితే ట్విటర్లో మాత్రం ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో, కన్నడ భాషను కూడా చేరుస్తూ మరోసారి అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. -
రంగస్థలం రికార్డ్ బ్రేక్ చేసిన భరత్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా భరత్ అనే నేను. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజు భారీ వసూళ్లను సాధించింది. పూర్తి లెక్కలు రాకపోయినా ఫస్ట్‌డే కలెక్షన్స్ 60 కోట్ల వరకు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే తమిళనాట మాత్రం ఈ సినిమా ఓ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. తొలిరోజు రూ. 78 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఒక్క చెన్నై సిటీలోనే రూ. 27 లక్షలకు పైగా గ్రాస్ సాధించి సత్తా చాటింది. ఇటీవల విడుదలైన రంగస్థలం రూ. 25 లక్షల రికార్డ్‌ను భరత్ అనే నేను 20 రోజులు తిరగకుండానే చెరిపేయటం విశేషం. మహేష్ సరసన కైరా అద్వాని హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, బ్రహ్మాజీ, రావు రమేష్‌లు ఇతర కీలక పాత్రలో నటించారు. #BharatAneNenu Chennai City 1st day gross - 27 Lakhs New day 1 record for a Telugu film — BARaju (@baraju_SuperHit) 21 April 2018 భరత్ అనే నేను మూవీ రివ్యూ -
పైన సన్ కింద స్టార్స్
ఎండాకాలం భగ్గుమంటోంది.సన్ ఆక్సిలేటర్ తొక్కాడు.ఫార్టీ దాటింది!ఏమో ఫిఫ్టీ దాకా పోవచ్చు!ఎటు చూసినా బర్నింగే.దాంట్లోనే ఉంటుందండీ ఎర్నింగూ!సమ్మర్ సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి.పైన సన్ కింద స్టార్. ఎంజాయ్ ద సీజన్. సూపర్ రీసౌండ్ చిట్టిబాబుకు ‘రంగస్థలం’ సినిమాలో సౌండ్ ప్రాబ్లమ్. కానీ మూవీ సక్సెస్ సౌండ్ మాత్రం గట్టిగా సాలిడ్‌గా వినిపించింది. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించిన సినిమా ‘రంగస్థలం’. సినిమా సమ్మర్ హీట్ ‘రంగస్థలం’ హిట్‌తోనే స్టారై్టందని చెప్పవచ్చు. చిత్రంలో చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్, రామలక్ష్మి పాత్రలో సమంత, కుమార్‌బాబు పాత్రలో ఆది పినిశెట్టి, రంగమ్మత్త పాత్రలో అనసూయ నటించారు. ఈ బొమ్మ థియేటర్లో ఇంకా ఆడుతోంది. మరి థియేటర్లో చిట్టిబాబును పలకరించిరండి. గుర్తుపెట్టుకోండి విజిల్స్, అరుపుల్స్తో గట్టిగా సౌండ్ చేయండి. ఎందుకంటే చిట్టిబాబు సౌండ్ ఇంజనీర్ అని తెలుసు కదా. అదేనండి కాస్త వినికిడి లోపం అని మరోసారి గుర్తుండేలా చెబుతున్నాం. భరత్ విజన్ అదుర్స్ ప్రతి ఒక్కరికి భయం, బాధ్యత ఉండాలంటున్నారు సీయం భరత్ రామ్. తప్పు చేస్తే కాస్త కఠినంగానే ఉంటాడు కానీ పరిస్థితుల నుంచి తప్పించుకోడు. చేసిన ప్రామిస్‌ను ఇచ్చిన హామీని మర్చిపోడు. అసెంబ్లీ స్టెప్సే కాదు. గరీబోడి గడప కూడా తొక్కుతాడు. మరి..సీయంగా చేసిన ప్రామిస్‌ను నిలబెట్టుకోవడంలో భరత్ రామ్ ఎలా గెలిచాడు అన్నది మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలో చూడాల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీయం భరత్ రామ్ పాత్రలో మహేశ్‌బాబు నటించారు. కియారా అద్వాని కథానాయిక. మరి..భరత్ రామ్ పరిపాలన అండ్ విజన్ అదిరిపోయాయి అంటున్నారు ప్రేక్షకులు. ఓ సారి భరత్ రామ్‌ను చూసిరండి. థియేటర్స్‌లో మాస్ క్లాస్ కలిపి కుమ్మేశాడు. ఉన్నది ఒకటే ఇండియా మా కులం భారతీయం. మా మతం మానవత్వం. మా వ్యక్తిత్వం సమానత్వం అని ఫీలయ్యేవారు బోర్డర్లో ఉండే సైనికులు. వారిలో ఒకడే సూర్య. అందుకే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్ ఇన్ని ఇండియాలు లేవు. ఉన్నది ఒకటే ఇండియా అంటున్నాడు సోల్జర్ సూర్య. కానీ సూర్యకి కొంచెం కోపం ఎక్కువ? ఈ కోపం వల్లే బోర్డర్లో కొన్ని పరిస్థితులను ఫేస్ చేయాల్సి వచ్చింది. అవేంటో ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ సినిమాలో చూడండి అంటున్నారు చిత్రబృందం. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో కె.నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఈ సినిమాలో సోల్జర్ సూర్య పాత్రలో నటిస్తున్నారు అల్లు అర్జున్. సూర్య కోపాన్ని మే 4న చూడండి. అదేనండి.. ఆ రోజే సినిమా రిలీజŒ అన్నమాట. అనగనగా ఓ మహానటి మధురవాణి...అంటే అర్థం తెలుసుగా మధురమైన మాటలు పలికే అమ్మాయి అని. పైగా బీఏ గోల్డ్ మెడలిస్ట్. ఆపై జర్నలిస్ట్. మరి..విజయ్ ఆంటోనీతో కలిసి మధురవాణి అనగనగా ఓ మహానటి అంటూ అలనాటి అందాల అభినేత్రి సావిత్రి కథను చెప్పడానికి రెడీ అయ్యారు. మరి..సావిత్రి గురించి ఏఏ కొత్త విషయాలు ఎలా చెప్పారనేది మే 9న రిలీజ్ కానున్న ‘మహానటి’ సినిమాలో చూడండి. సావిత్రి జీవితం ఆధారంగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన చిత్రం ‘మహానటి’. సావిత్రి పాత్రలో హీరోయిన్ కీర్తీ సురేశ్ నటించారు. జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో సమంత, విజయ్ ఆంటోనీ పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు. మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, నాగచైతన్య, దుల్కర్ సల్మాన్ తదితరులు నటించారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ పతాకంపై ప్రియాంకా దత్ నిర్మించారు. రాజుగాడి జబ్బు వేరయ్యా! క్లెప్టోమేనియాను తెచ్చుకున్నాడు రాజు...ఇదేదో డిగ్రీ అనుకునేరు.. కాదండి బాబు. దిస్ ఈజ్ డిసీజ్. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా.. వాళ్లకు తెలియకుండానే వాళ్లు దొంగతనాలు చేస్తుంటారు. ఎంతలా అంటే సొంత వస్తువులే దొంగలించుకుని దాచుకునేంతలా. అర్థం అయ్యిందిగా.. జబ్బులందు రాజుగాడి జబ్బు వేరయ్యా అని. రాజ్‌తరుణ్, అమైరా దస్తూర్ జంటగా సంజనరెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘రాజుగాడు’. రాజు పాత్రలో నటిస్తున్నారు రాజ్‌తరుణ్. మరి..రాజుగాడి జబ్బు చిత్రాలు ఎంటో మే 11న తెలుసుకోండి. జన్మజన్మల బంధం సైనికుడిని ప్రేమించింది ఓ అమ్మాయి. ఈ సైనికుడి మనసులో దేశం మీద ఉన్న ప్రేమలో కాస్తో కూస్తో తనపై ఉన్నా చాలని తపన పడుతుంది. అంటే ఆ అమ్మాయి ఎంతగా అబ్బాయిని ఇష్టపడుతుందో అర్థం చేసుకోవచ్చు. అబ్బాయి కూడా దేశం తర్వాత ఆ అమ్మాయికే మనసులో స్థానం ఇచ్చాడు. కానీ వారి ప్రేమ సక్సెస్ కావడానికి మాత్రం ప్రాంతాలు, కులాలు, మతాలు అడ్డుగోడలుగా నిలిచాయి. మరి..ఆ గోడలనుప్రేమికులు ఎలా పగలగొట్టారో తెలుసుకోవాలంటే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘మెహబూబా’ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా కూడా మే11న రిలీజ్ కానుంది. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటించాడు. నేçహాశెట్టి కథానాయికగా నటించారు. ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌ని బట్టి ఈ సినిమా గత జన్మకు కనక్టయ్యేలా ఉంటుందని ఊహించవచ్చు. అంటే వీళ్లది జన్మజన్మల బంధమేమో?. స్పీడ్ పెంచాడు ఫస్ట్ గేర్.. నెక్ట్స్ సెకండ్ గేర్ వేసుకుంటూ కెరీర్లో ముందుకెళ్తుంటారు ఆర్టిస్టులు. కానీ ‘పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి’ సినిమాలతో డైరెక్ట్‌గా థర్డ్గేర్ వేసి కెరీర్లో రయ్యిమంటూ దూసుకెళ్తున్నారు విజయ్ దేవరకొండ. ఇదే స్పీడ్‌లో నోటా చిత్రంతో చెన్నై రోడ్డు కూడా ఎక్కాడు. ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే ఈ వేసవిలో స్పీడ్ బ్రేకర్ వద్ద కాస్త ఆగి థియేటర్స్‌లోకి రానున్నారు. విజయ్ హీరోగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’ వచ్చే నెల 18న రిలీజ్ కానుంది. ప్రియాంకా జవాల్కర్, మాళవిక నాయర్ కథానాయికలు. రాహుల్ సంకృత్యాన్ అనే నూతన దర్శకుడు రూపొందిస్తున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, జీఏ2 బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సేమ్ ఎనర్జీ కొత్త ఊపొస్తుంది. ఉత్సాహం పొంగుకొస్తుంది హీరో రవితేజ ఎనర్జీని సిల్వర్ స్క్రీన్‌పై చూస్తే. ఆయన నటన అలా ఉంటుంది. ఈ వేసవి వినోదాన్ని ప్రేక్షకులకు పంచేందుకు ఆయన కూడా కర్చీఫ్ వేశారు. ఫస్ట్‌లుక్‌తో ఉగాదికి గుర్తు చేశారు. ఫస్ట్‌లుక్‌లో రవితేజ గెటప్ చూస్తుంటే ఆయనలో ఎనర్జీ ఏమాత్రం తగ్గినట్లు లేదు. బాక్సాఫీసు వద్ద టికెట్లు తెచ్చి, థియేటర్లో చించి ఆడియన్స్ మూవీని ఏ లెవల్లో ఎంజాయ్ చేస్తారో చూడాలంటే మాత్రం రవితేజ తాజా చిత్రం ‘నెలటిక్కెటు’్ట బొమ్మ థియేటర్స్‌లో పడేంత వరకు ఆగాల్సిందే. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మాళవిక శర్మ కథానాయిక. షూటింగ్ పూర్తి కావచ్చింది. జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మే 24న సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. పవర్ఫుల్ డ్యూటీ మొదలుపెడితే పూర్తి చేసేంతవరకు ఆగే రకం కాదు ఈ పోలీస్ ఆఫీసర్. ఇన్వెస్టిగేషన్ కోసం హైదరాబాద్ నుంచి ముంబై వచ్చాడు. మరి.. కేసు ఏంటి? ఆఫీసర్ డ్యూటీని ఎంత పవర్‌ఫుల్‌గా చేశాడు అన్నది తెలుసుకోవాలంటే ‘ఆఫీసర్’ సినిమా చూడాల్సిందే. ఆల్మోస్ట్ 25ఏళ్ల తర్వాత నాగార్జున హీరోగా సుధీర్‌చంద్రతో కలిసి రామ్‌గోపాల్‌వర్మ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘ఆఫీసర్’. మైరా సరీన్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ చేశారు. నాగార్జున, రామ్‌గోపాల్‌వర్మ కాంబినేషన్లో వచ్చిన ‘శివ’ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ‘ఆఫీసర్’ మే 25న థియేటర్స్‌లోకి వస్తాడు. మేరా.. మీరా చూశారుగా ‘నా నువ్వే’ సినిమాలో కల్యాణ్‌రామ్ సూపర్ లుక్. ఇంత సూపర్‌గా ఉన్నోడు ఎందుకు ఖాళీగా ఉంటాడు. అందుకే మీరా మేరా అంటున్నాడు. అర్థం కాలేదా మీరా అనే రేడియో జాకీని లవ్ చేస్తున్నాడు. మరి..మ్యాజిక్ లవ్‌లో నెక్ట్స్ ఏం జరిగింది అనేది మాత్రం సస్పెన్స్. థియేటర్లో చూడాల్సిందే. కల్యాణ్‌రామ్, తమన్నా జంటగా జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నా నువ్వే’. ఈ సినిమాను మే 25న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలతో పాటుగా మరికొన్ని చిత్రాలు వేసవిలో వినోదాన్ని ప్రేక్షకులకు అందించడానికి రెడీ అవుతున్నాయి. ఫైనల్‌గా ఆచారి ఫిక్స్ చేసుకున్నాడు ఏప్రిల్ 27న సినిమాను రిలీజ్ చేయడానికి ముందు అల్లు అర్జున్ సూర్యగా బుక్ చేసుకున్నాడు. తర్వాత సీయం భరత్ రామ్‌గా థియేటర్స్‌కు వస్తున్నానని మహేశ్‌బాబు ప్రామిస్ చేశాడు. ఇంతలో.. రోబో రెడీ అయ్యాడన్న వార్తలు వచ్చాయి. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘2.0’. రోబో సినిమాకు సీక్వెల్ చిత్రమిది. అంతలోనే తూచ్ అన్నారు. ‘కాలా’ ఖాయం అన్నారు. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ రంజిత్. పా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాలా’. కానీ ‘కాలా’తో క్లాష్ వద్దనుకుని స్నేహపూర్వకంగా భరత్, సూర్య మాట్లాడుకుని వేరే డేట్స్‌కి షిఫై్ట పోయారు.స్ట్రైక్‌తో ‘కాలా’ రానన్నాడు. దీంతో లక్కొచ్చి ఆచారి డోర్ కొట్టింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఆచారి రంగంలోకి దిగాడు. ఏప్రిల్ 27న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఎనౌన్స్ చేశాడు. విష్ణు, ప్రగ్యా జైస్వాల్ జంటగా జి. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. సో..ఫైనల్‌గా సోల్జర్, సీయం, రోబో, గ్యాంగ్‌స్టర్ రావాలనుకున్నా.. గ్రహచారం అడ్డొచ్చి, ఆచారికి అన్నీ కలిసొచ్చి రిలీజ్‌కు రెడీ అయ్యాడు. అంతేకాదండోయ్.. వేసవికి గోపీచంద్ ‘పతం’ పట్టి థియేటర్స్‌లోకి వద్దాం అనుకున్నాడు కానీ వర్క్ కాస్త బ్యాలెన్స్ ఉండటంతో పంతం కొంచెం సడలించి జూలైకి రెడీ అవుతున్నాడు. అన్నట్లు తమిళనాడులో స్ట్రైక్ క్లోజ్ అయ్యిందిగా ఇక ‘కాలా’ లైన్లోకి వచ్చాడు. జూన్ 7న థియేటర్స్‌లోకి వస్తున్నాడు. – ముసిమి శివాంజనేయులు -
‘భరత్ అనే నేను’ రివ్యూ
టైటిల్ : భరత్ అనే నేను జానర్ : కమర్షియల్ డ్రామా తారాగణం : మహేష్ బాబు, కైరా అద్వానీ, ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, బ్రహ్మాజీ, రావు రమేష్ తదితరులు సంగీతం : దేవీశ్రీ ప్రసాద్ స్టోరీ-డైలాగులు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : కొరటాల శివ నిర్మాత : డీవీవీ దానయ్య టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన మహేష్ బాబుకు గత కొంత కాలంగా సరైన సక్సెస్ పడటం లేదు. ఈ క్రమంలో శ్రీమంతుడితో తనకు ఇండస్ట్రీ హిట్ అందించిన దర్శకుడు కొరటాల శివతో మరోసారి మన ముందకు వచ్చాడు. కంప్లీట్ పొలిటికల్ అండ్ కమర్షియల్ డ్రామాగా కొరటాల దీనిని తెరకెక్కించాడు. పొలిటికల్ సబ్జెక్ట్.. పైగా ముఖ్యమంత్రి పాత్రను మహేష్ పోషించటం విశేషం. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఫలితం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం .. కథ: భరత్ రామ్(మహేష్ బాబు)కు కొత్త విషయాలను నేర్చుకోవటమంటే చాలా ఇష్టం. అందుకే లండన్ ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీలు చేస్తూనే ఉంటాడు. అలాంటి సమయంలో తండ్రి రాఘవ(శరత్ కుమార్) మరణం అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో నవోదయం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా ఎదిగిన రాఘవ మృతితో పార్టీలో చీలిక రాకుండా ఉండేందుకు రాజకీయ గురువు వరద(ప్రకాశ్ రాజ్) భరత్‌ను సీఎంను చేస్తాడు. అదుపు తప్పిన ప్రజా జీవితాన్ని భరత్ తన మొండి నిర్ణయాలతో గాడిన పెట్టే యత్నం చేస్తుంటాడు. భరత్ దూకుడు స్వభావం రాజకీయ వ్యవస్థ మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నాయకుడి కుమారుడి కేసులో భరత్‌కు తొలి ఎదురుదెబ్బ తగులుతుంది. ప్రజల నుంచి భరత్‌కు మద్ధతు పెరుగుతున్నా.. సొంత పార్టీ నుంచే ప్రతిఘటన ఎదురవుతుంటుంది. ఈ పోరాటంలో భరత్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు..? వాటన్నింటిని అధిగమించి భరత్ తన ప్రామిస్‌లను ఎలా పూర్తి చేస్తాడు? అన్నదే కథ. నటీనటులు భరత్ రామ్‌గా మహేష్ బాబు నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన కథను పూర్తిగా తన భుజాల మీదే నడిపించాడు. ముఖ్యమంత్రి పాత్రకు కావాల్సిన హుందాతనం చూపిస్తూనే, స్టైలిష్‌గా రొమాంటిక్‌గానూ ఆకట్టుకున్నాడు. తన కెరీర్లో మహేష్ క్లాస్ రోల్స్ చేసినప్పటికీ.. వాటిలో ఏదో వెలితిగా అనిపించేది. కానీ, భరత్‌గా ఓ ఛాలెంజింగ్ రోల్లో మహేష్ పూర్తిస్థాయిలో ఆకట్టుకున్నాడు. యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ పాత్రలో పర్ఫెక్ట్ గా ఒదిగిపోయాడు. తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా సూపర్ స్టార్ అభిమానులను అలరిస్తాయి. ఇక గాడ్ ఫాదర్ పాత్రలో ప్రకాశ్ రాజ్ మెప్పించాడు. ఇలాంటి పాత్రలను తాను తప్ప మరెవరూ పోషించలేనన్న రీతిలో ఆయన నటించాడు. హీరోయిన్ గా పరిచయం అయిన కైరా అద్వానీది చిన్న పాత్రే.. అయినా ఉన్నంతలో మంచి నటన కనబరిచింది. అందంతో పాటు అభినయంలోనూ మంచి మార్కులు సాధించింది. సీఎం భరత్ పర్సనల్ సెక్రటరీగా బ్రహ్మజీ.. పోసాని కామెడీ ట్రాక్‌లు ఆకట్టుకున్నాయి. శరత్ కుమార్, ఆమని, సితార, అజయ్, రావు రమేష్, దేవరాజ్, తమ పాత్రల మేర అలరించారు. విశ్లేషణ హ్యాట్రిక్ బ్లాక్బస్టర్లతో జోరు మీదున్న కొరటాల.. మహేష్‌తో చేసిన ప్రయత్నం ఆకట్టుకుంది. సమకాలీన రాజకీయ అంశాలు.. వాటికి తగ్గట్లు కమర్షియల్ అంశాలను జోడించి ప్రేక్షకులను ఎంగేజ్ చేశాడు. రాజకీయాలపై అవగాహన లేని వ్యక్తి ఏకంగా సీఎం అయిపోవటం, త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని అందరినీ ఇబ్బంది పెట్టడం, అసెంబ్లీలో సరదాగా సాగిపోయే సన్నివేశాలు... ఫస్టాఫ్‌ను ఎంటర్టైనింగ్గా మలిస్తే, దుర్గా మహల్ ఫైట్.. సామాజిక సందేశం, హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలు... ఇవన్నీ సెకండాఫ్‌ను నిలబెట్టాయి. పది నిమిషాల్లో అసలు కథలోకి ఎంటర్ అయిన దర్శకుడు తరువాత కథనాన్ని నెమ్మదిగా నడిపించాడు. అయితే కొరటాల మార్క్ డైలాగ్స్, మహేష్ ప్రజెన్స్ ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తాయి. సీఎం స్థాయి వ్యక్తి రోడ్డు మీద అమ్మాయిని చూసి ప్రేమించటం లాంటి విషయాల్లో కాస్త ఎక్కువగానే సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కొరటాల గత చిత్రాల్లో కనిపించిన వీక్నెస్ ఈ సినిమాలో కూడా కొనసాగింది. క్లైమాక్స్ అభిమానులు ఆశించిన స్థాయిలో లేదు. భరత్ సీఎంగా రాజీనామా-తిరిగి పగ్గాలు చేపట్టడం లాంటి సన్నివేశాల్లో దర్శకుడు నాటకీయత ఎక్కువగా జోడించాడు. ఇక టెక్నీకల్ టీమ్ మంచి తోడ్పాటును అందించింది. సినిమాటోగ్రఫర్ రవి కే చంద్రన్, తిర్రు టాప్ క్లాస్ పనితనాన్ని అందించారు. ముఖ్యంగా పాటలు, యాక్షన్స్ సీన్స్ పిక్చరైజేషన్స్ వావ్ అనిపిస్తుంది. దేవీ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మెప్పించాడు. ముఖ్యంగా ఒక్కో పాత్రకు ఒక్కో సిగ్నేచర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాత్రలను మరింతగా ఎలివేట్ చేశాడు శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బావుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. భరత్ పాత్ర.. దానిలో మహేష్ కనబరిచిన నటన.. కొరటాల అందించిన డైలాగులు ఇలా అన్ని హంగులు అన్నివర్గాల ప్రేక్షలను అలరించేవిగా ఉన్నాయి. ఫ్లస్ పాయింట్లు : మహేష్ బాబు కథా-కథనం పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకాలీన రాజకీయాంశాలను సమతుల్యంగా చూపించటం మైనస్ పాయింట్లు: స్లో నెరేషన్ సాగదీత సన్నివేశాలు క్లైమాక్స్ -
నా టెన్షన్ ఎప్పుడూ ఆయన గురించే – కొరటాల శివ
‘‘భరత్ అనే నేను’ కథ మహేశ్‌బాబు వినగానే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఇంత స్పాన్ ఉన్న కథ రాయడం కష్టం అన్నారు. మహేశ్ ఇన్వాల్వ్ అయి, కేర్ తీసుకొని ఈ సినిమా చేశారు’’ అని కొరటాల శివ అన్నారు. మహేశ్‌బాబు, కియారా అద్వాని జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. డి. పార్వతి సమర్పణలో దానయ్య డీవీవీ నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. కొరటాల శివ మాట్లాడుతూ– ‘‘మిర్చి’ తర్వాత దానయ్యగారికి సినిమా చెయ్యాలి. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఆయనతో మహేశ్‌గారితో సినిమా చేద్దాం అన్నాను. ‘మహేశ్‌తో సినిమా నా కల. బాగా రెస్పెక్ట్ వచ్చే, రిచ్‌గా ఉండే చిత్రం కావాలి’ అన్నారు దానయ్య. అప్పటినుంచి నాకెప్పుడూ ఆయన గురించే టెన్షన్ ఉండేది. ఫ్యాన్స్‌ని ఈజీగా శాటిస్ఫై చెయ్యొచ్చు. ఈ సినిమా స్క్రిప్ట్ రాసేటప్పుడు ప్రతి సీన్ రిచ్‌గా, గ్రాండ్‌గా ఉండాలనుకున్నా. ఇది రెగ్యులర్ సినిమా కాదు. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్తో కూడిన పొలిటికల్ టచ్‌తో ఉంటుంది. పెద్ద కంటెంట్ ఉంది. రెండు పార్ట్‌లుగా తీయాల్సిన చిత్రమిది. నాలుగు గంటలు వచ్చింది. అంత పెద్ద స్పాన్ ఉన్న సినిమాని శ్రీకర్ ప్రసాద్ మూడు గంటలకు అద్భుతంగా ఎడిట్ చేశారు. కథకు తగ్గ పాటలిచ్చిన రామజోగయ్య శాస్త్రికి, మంచి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్‌కి థ్యాంక్స్’’ అన్నారు. దానయ్య మాట్లాడుతూ– ‘‘నేను గర్వంగా చెప్పుకునే సినిమా ఇచ్చారు శివగారు. సినిమా బ్లాక్ బస్టర్ అని అందరూ ముందుగానే కంగ్రాట్స్ చెపుతుంటే హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘ఇది చాలా హానెస్ట్ మూవీ’’ అన్నారు పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి. -
భరత్ ప్రచారం
-
‘భరత్’.. మహేశ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
భారీ అంచనాల నడుమ మరో రెండు రోజుల్లో ‘భరత్’ థియేటర్లలోకి రాబోతున్నాడు. మహేశ్‌బాబు తొలిసారి ముఖ్యమంత్రిగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వరుస సూపర్హిట్లతో దూకుడు మీదున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మహేశ్‌బాబు ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల సందర్భంగా ఎనిమిది రోజులపాటు డైలీ ఒక ప్రత్యేక షో ప్రదర్శించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వేసవి సెలవులు కావడం, సినిమాకు భారీగా రద్దీ ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో నిర్మాత డీవీవీ దానయ్య అభ్యర్థన మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు ఉదయం 5 గంటల నుంచి పది గంటల మధ్య ప్రత్యేక షో ప్రదర్శించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని థియేటర్లు, మల్టిప్లెక్స్ థియేటర్లలో ఈ ప్రత్యేక షోను ప్రదర్శించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ అసన్ రేజా ఉత్తర్వులు జారీచేశారు. మహేశ్‌బాబు-కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీమంతుడు’ బ్లాక్బస్టర్హిట్గా నిలిచింది. ఆ తర్వాత మహేశ్‌కు పెద్దగా విజయాలు లేవు. శ్రీమంతుడు తర్వాత వచ్చిన మహేశ్ బాబు సినిమాలు బ్రహ్మోత్సవం, స్పైడర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పాత్రలో మహేశ్‌ను చూపిస్తూ కొరటాల శివ తెరకెక్కించిన ‘భరత్ అనే నేను’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
దానయ్య అనే నేను హామీ ఇస్తున్నా
‘‘నాది పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి గ్రామం. అప్పట్లో మా ప్రాంతంలో సినిమా షూటింగ్‌లు ఎక్కువగా జరుగుతుండేవి. కృష్ణగారి ‘పాడి పంటలు’ షూటింగ్ చూసేందుకు వెళ్లా. జనం ఎక్కువ కావడంతో పోలీసులు అడ్డుకున్నారు. ‘మీరు సైలెంట్‌గా ఉంటే షూటింగ్ చేస్తాం.. లేకుంటే వెళ్లిపోతాం’ అని కృష్ణగారు అనడంతో నిశ్శబ్దంగా ఉండి షూటింగ్ చూశాం. ఇలాంటి షూటింగ్‌లు చూస్తూ ఉండటంతో సినిమా రంగంపై ఆసక్తి పెరిగి ఇండస్ట్రీకొచ్చా’’ అన్నారు నిర్మాత దానయ్య డీవీవీ. మహేశ్‌బాబు, కియారా అద్వాని జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. డి. పార్వతి సమర్పణలో దానయ్య డీవీవీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దానయ్య చెప్పిన విశేషాలు. ∙ఈవీవీ సత్యనారాయణతో కలిసి జంధ్యాలగారి వద్ద అసోసియేట్‌గా వర్క్ చేశా. నా స్నేహితులు భగవాన్, పుల్లారావులతో కలిసి ఈవీవీ దర్శకత్వంలో 1992లో ‘జంబలకిడి పంబ’ సినిమా నిర్మించా. ఆ చిత్రంతో నిర్మాతగా మొదలైన నా ప్రయాణం పాతికేళ్లు అయ్యింది. మహేశ్‌గారితో సినిమా అనుకున్నప్పుడు శివగారు ‘భరత్ అనే నేను’ కథ చెప్పారు. నాకు నచ్చింది. మహేశ్గారికీ బాగా నచ్చింది. కథ విన్నప్పుడే కాంప్రమైజ్ కాకుండా సినిమా చేయాలనుకున్నాం. అసెంబ్లీ సెట్‌కు 2 కోట్లు, ‘వచ్చాడయ్యో సామీ’ పాటకు 4 కోట్లు ఖర్చు పెట్టాం. ∙ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కథతో సాగే చిత్రమిది. ఏ పార్టీకీ సంబంధం ఉండదు. మంచి ముఖ్యమంత్రి ఎలాంటి పనులు చేశాడన్నదే సినిమా. ఎవరినీ విమర్శించేలా ఉండదు. మహేశ్‌గారితో సినిమా చేయడం నా కల. అది కొరటాలగారి ద్వారా కుదరడం హ్యాపీగా ఉంది. ∙మంచి కంటెంట్ ఉంటే నిడివి ఎక్కువైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. ‘రంగస్థలం’ సినిమా అందుకు ఉదాహరణ. ఈ నెల 20న ‘భరత్ అనే నేను’ రిలీజ్ అనుకున్నాం. అదే రోజు మహేశ్‌గారి అమ్మ ఇందిరమ్మగారి పుట్టినరోజు అని మాకు తెలియదు. ఈ విషయాన్ని మహేశ్‌గారు చెప్పారు. మా సినిమా చాలా చాలా బాగుంటుందని దానయ్య అనే నేను హామీ ఇస్తున్నా. మహేశ్‌గారు ఉదయం ఏ మూడ్‌తో నవ్వుతూ షూటింగ్‌కి వస్తారో అదే మూడ్‌తో సాయంత్రం నవ్వుతూ వెళతారు. రామ్‌చరణ్‌గారు హీరోగా బోయపాటిగారి దర్శకత్వంలో నిర్మిస్తోన్న సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. రాజమౌళిగారు, ఎన్టీఆర్‌గారు, చరణ్‌గారు కలిసి చేసే సినిమా ఈ ఏడాదే స్టార్ట్ అవుతుంది. ఆ సినిమా చేయడాన్ని గర్వంగా ఫీలవుతున్నా. రాజమౌళిగారితో సినిమా చేయడం నా కల. 2006 నుంచి ప్రయత్నిస్తే ఇప్పటికి కుదిరింది. -
రెండు పాటలకు ఆరు కోట్లు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం భరత్ అనే నేను. శ్రీమంతుడు లాంటి ఘన విజయాన్ని అందించిన కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ మరోసారి హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా చిత్రయూనిట్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా యూనిట్ సభ్యులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో హీరో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తుండటంతో కీలక సన్నివేశాలు అసెంబ్లీ నేపథ్యంలో తెరకెక్కించారు. అందుకోసం 2 కోట్లతో అసెంబ్లీ సెట్ వేసినట్టుగా తెలిపారు. ఈ సెట్లో పలు సన్నివేశాలతో పాటు ‘హామీ ఇస్తున్నా’ పాటకు సంబంధించిన సీన్స్ కూడా చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సూపర్ హిట్ అయిన ‘వచ్చాడయ్యో సామీ’ పాట కోసమే నాలుగు కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. మహేష్ సరసన కిరా అద్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. -
నో కట్స్
‘‘చిన్నప్పుడు మా అమ్మ నాకు ఓ మాట చెప్పింది. ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే.. యు ఆర్ నాట్ కాల్డ్ ఎ మ్యాన్ అని. ఎప్పటికీ ఆ మాట తప్పలేదు.. మర్చిపోలేదు. నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటొచ్చింది. పెద్దదే కాదు.. కష్టమైంది కూడా’’ అంటూ ‘భరత్ అనే నేను’ ట్రైలర్లో మహేశ్‌బాబు చెప్పిన డైలాగులు సినిమాపై మరింత క్రేజ్‌ని పెంచాయి. మహేశ్‌బాబు, కియారా అద్వాని జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. డి. పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్టైన్మెంట్ పతాకంపై దానయ్య డీవీవీ నిర్మించిన ఈ సినిమా సింగిల్ కట్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ప్రకాశ్‌రాజ్, శరత్‌కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రవి కె.చంద్రన్, ఎస్.తిరునవుక్కరసు. -
‘భరత్ అనే నేను’ లోకేషన్ స్టిల్స్
-
అది నిజం కాదు: కొరటాల
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను చిత్రం గురించి ఆ మధ్య కొన్ని కథనాలు వినిపించాయి. ముఖ్యంగా ఈ సినిమా కథ గురించి. ఇది కొరటాల శివ సొంతం కాదని.. రూ. కోటి ఇచ్చి వేరే రచయిత దగ్గరి నుంచి కథను కొనుగోలు చేశాడని వాటి సారాంశం. అయితే ఆ కథనాలపై తాజాగా ఆయన చిత్ర ప్రమోషన్లలో స్పందించారు. అదంతా రూమర్ అని కొట్టిపడేశారు. పనిలో పనిగా కథను ఎలా సిద్ధం చేసిందన్నది ఆయన చెప్పుకొచ్చారు. ‘నా స్నేహితుడు, కెరీర్ తొలినాళ్లల్లో నా రూమ్మేట్ అయిన శ్రీహరి(దర్శకుడు) అప్పట్లో నాకు ఓ ఐడియా ఇచ్చాడు. హీరో ముఖ్యమంత్రి పాత్ర.. అంటూ అతను ఇచ్చిన ఆలోచన అద్భుతంగా ఉంది. అది నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత ఆ లైన్‌ను నేను డెవలప్ చేసుకుని కథను సిద్ధం చేశా. ఇది పూర్తిగా నా సొంత కథ. అయినప్పటికీ ఐడియా మాత్రం నా స్నేహితుడిదే. అందుకే టైటిల్ కార్డులో స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ అతని పేరు కూడా వేయిస్తున్నా’ అని కొరటాల స్పష్టం చేశారు. మహేష్ బాబు-కైరా అద్వానీ జంటగా నటిస్తున్న భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
మహేష్ భయం అంతా అదే!
కెరీర్లో మొదటిసారిగా భరత్ అనే నేను చిత్రంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్నారు. సాధారణంగా రాజకీయాలంటే ఆసక్తి లేని మహేష్.. ఈ రోల్ ఎలా ఒప్పుకున్నాడు? దర్శకుడు కొరటాల శివ.. మహేష్‌ని ఎలా కన్విన్స్ చేశాడు? సినిమాలో ఆ పాత్రను ఎలా పండించి ఉంటాడు.. అన్న అనుమానాలు అభిమానుల్లో నెలకొన్నాయి. దీనిపై ప్రమోషన్లలో చిత్ర దర్శకుడు కొరటాల శివ స్పందించారు. ‘ఈ సినిమా కథ ఓకే అయ్యాక మహేష్ భయం అంతా ఒక్కటే. ‘సర్.. నేను ఈ పాత్రను చేయగలనా?’ అని.. ఆయనకు రాజకీయాల గురించి అవగాహన లేదు. వాటి మీద ఆసక్తి లేదు. ఎలాగా? అని నన్ను అడిగారు. కానీ, తర్వాత సినిమా కోసం ఆయన రాజకీయ నాయకుల మేనరిజం చూడాల్సి వచ్చింది. అంతేకాదు నెట్లో అసెంబ్లీ సమావేశాల తాలూకూ వీడియోలను చాలా ఓపికగా చూశారు. ట్రైలర్ విడుదలయ్యాక.. ఓత్ సీన్‌కి సంబంధించి గొంతులో రాజకీయ నాయకులకు ఉండాల్సిన గాంభీర్యం సరిపోదేమోనని మేం అనుకున్నాం. కానీ, క్లాసీ స్టైల్లో ముఖ్యమంత్రిగా మహేష్ ఎలా అలరించి ఉంటాడో అన్న అంచనాలు ఇప్పుడు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. మహేష్ ఎట్టి పరిస్థితుల్లో నిరాశపరచరు’అని కొరటాల చెప్పుకొచ్చారు. పొలిటికల్ కమర్షియల్ డ్రామాగా తెరకెక్కిన భరత్ అనే నేను ఏప్రిల్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఫ్యామిలీతో విదేశాల్లో ఉన్న మహేష్.. సరిగ్గా చిత్ర విడుదలకు ముందు చిత్ర ప్రమోషన్లో పాల్గొనబోతున్నారు. శ్రీమంతుడు కాంబోలో రాబోతున్న చిత్రం కావటంతో భరత్ అనే నేనుపై మంచి అంచనాలే నెలకొన్నాయి. -
కలెక్షన్స్ పట్టించుకోకపోతే క్రైమ్
వీలైతే ప్రేమిద్దాం. పోయేదేముంది. తిరిగి ప్రేమిస్తారు. మనకు ఎంతో ఇచ్చిన ఊరికి తిరిగి ఇచ్చేయకపోతే లావయిపోతాం.మొక్కలతో పాటు మనుషులను కూడా కాపాడితే భూమి ఇంకా అందంగా ఉంటుంది.జస్ట్ ఒకే వాక్యం. కానీ అర్థం బోలెడు. ‘థాట్ ప్రొవోకింగ్’ వర్డ్స్. మనసుకి ఇట్టే పట్టేసేపదాలు. అందుకే మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ ప్రేక్షకుల మనసుల్లోకి చొచ్చుకువెళ్లాయి. ఇప్పుడు కొరటాల శివ ఇంకో మాట చెప్పారు. ‘ప్రామిస్ నిలబెట్టుకోవాలని’. మహేశ్‌బాబు హీరోగా ఆయన తెరకెక్కించిన‘భరత్ అనే నేను’ లైన్ ఇదే. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా కొరటాల శివతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ► మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్.. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వస్తున్నారు. ప్రెషర్గా ఉందా? కొరటాల శివ: ప్రతి సినిమా ఓ కొత్త పరిక్షే. అందుకే ప్రతి సినిమాని ఫస్ట్ సినిమా అనుకుని వర్క్ చేయడమే. ఇవాళ ఉన్న ఎక్స్పోజర్కు సినిమా హిట్ అయితే ఎంత అప్రిసియేషన్ వస్తుందో ఫ్లాప్ అయితే అదే రేంజ్లో క్రిటిసిజమ్ కూడా వస్తోంది. అందుకని భయం, ఒత్తిడి ఉంటాయి. అది సహజం. మళ్లీ ‘ది బెస్ట్’ ఇచ్చాననే అనుకుంటున్నాను. ప్రతి సినిమాలానే ‘భరత్ అనే నేను’ని ఈజీగా తీసుకోలేదు. టీమ్ వర్క్‌తో మంచి సినిమా అందించబోతున్నాం. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని చిన్న భయం ఉంది. ఆ భయమే అందం. ఆ భయమే ముందుకు వెళ్లేలా చేస్తుంది. ► మీ సినిమాల్లో మెసేజ్ ఫస్ట్ సీట్ తీసుకుంటుంది. ఈ సినిమాలోనూ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సినిమాలో నేనేం చెప్పాలనుకుంటానో అది ఫస్ట్ టీజర్లోనే చెప్పేస్తాను. మా సినిమా ఇలా ఉండబోతోంది అని. ‘ప్రామిస్ చేస్తే మాట తప్పొద్దు నువ్వు’ అని టీజర్లో చెప్పాను. అదే ఈ సినిమాలో ఉన్న మెసేజ్. మనం చిన్నప్పుడు నేర్చుకున్నవే మనసులో నాటుకుపోతాయి. అలా చిన్నప్పుడు తన మనసులో నాటుకుపోయిన ఓ విషయాన్ని భరత్ సీరియస్‌గా తీసుకుంటాడు. లైఫ్‌లో అతను ఓ బిగ్గెస్ట్ ప్రామిస్ చేయాల్సి వస్తుంది. సీయం అంటేనే ప్రమాణ స్వీకారంతో పదవిలో అడుగుపెడతాడు కదా. ఆ ప్రామిస్ నిలబెట్టుకోవటం అన్ని ఫీల్డ్స్‌లో ఉండాలి. పాలిటిక్స్‌లో అయితే ప్రామిస్ చేసేది ప్రజలకు కాబట్టి, దాన్ని నిలబెట్టుకోవాలి. ఆ విషయమే ఈ సినిమాలో చెప్పాం. ► కథను రాష్ట్రం విడిపోకముందు అన్నట్లు ఎందుకు ప్లాన్ చేశారు? విడిపోయాక కథ అంటే.. కొన్ని లాజిక్స్ మిస్ అవుతున్నాయి. రెండూ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలే. కాంట్రవర్శీలు రావడం నాకు ఇష్టం లేదు. ఈ సినిమాలో సీయం పాత్ర ఎవర్నీ ఉద్దేశించకూడదని హోమ్‌వర్క్ చేసి రాసుకున్నాను. మొత్తం కల్పితం. కొన్నిసార్లు పొలిటీషియన్స్ పాత్రలు తీసుకొని సెటైర్ వేస్తుంటారు. అలా కూడా నేను చేయదలుచుకోలేదు. అందుకే రెండు రాష్ట్రాలు విడిపోకముందు జరిగే ఫిక్షనల్ స్టోరీగా రూపొందించాం. ► మీ సినిమాలో సామజిక స్పహ, బాధ్యత కనిపిస్తుంటాయి. ఈ సోషల్ రెస్పాన్సిబులిటీ అందరి దర్శకులకు ఉండాలనుకుంటారా? అది పర్సనల్ చాయిస్. ఇది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. చాలా డబ్బు ఇన్వాల్వ్ అవుతుంది. అన్ని రకమైన సినిమాలు రావాలి. కె.విశ్వనాథ్‌గారు కళాత్మక సినిమాలు, జంధ్యాలగారు కామెడీ సినిమాలు, టి. కృష్ణగారు విప్లవ సినిమాలు తీశారు. అన్నీ ఎంజాయ్ చేశాం. ఆడియన్స్ ‘ఇలాంటి సినిమాలే చూస్తాం’ అని థియేటర్స్‌కు రారు. ‘నువ్వేం చూపిస్తున్నావో చెప్పు. చూస్తాం’ అన్నట్లు వస్తారు. మనం ఎంచుకున్న పాయింట్‌ను ఇంట్రెస్టింగ్గా చెప్పాలే తప్ప సందేశం ఇవ్వాలని పనిగట్టుకుని ట్రై చేయను. అయితే ఒక మంచి విషయం చెబితే బాగుంటుందనుకుంటాను. ► మహేశ్‌గారికి ఈ సినిమాలో ఏ పాయింట్ ఎక్కువగా నచ్చింది? పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ అనగానే ఆయన నవ్వేశారు. ఎంత గట్టిగా నవ్వారంటే ఈ సినిమా చేయనంటారేమో అనుకున్నా. నేనేంటి? సీయం ఏంటీ? అన్నారు. ఆయన రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి. పెద్దగా ఫాలో అవ్వరు కూడా. అయినా ఈ కథకు ఆయనే యాప్ట్ అనిపించింది. ‘మీకే యాప్ట్’ అన్నాను. ‘ఓకే’ అన్నారు. ఎందుకంటే యాక్టర్‌గా తనకు కొత్తగా ఉంటుందనుకున్నారు. ఇలాంటి చాలెంజ్‌లు మహేశ్‌గారికి ఇష్టం. కేక్‌వాక్‌లాగా ఉంటే ఆయనకు నచ్చదు. ► ఓత్ విన్నప్పుడు సేమ్ కృష్ణగారి వాయిస్‌లా అనిపించింది.. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడే అన్నాను. మహేశ్‌గారు కొంచెం వాయిస్ పెంచితే కృష్ణగారి గొంతులా ఉందని. ‘ఏంటి సార్ కళ్లు మూసుకుంటే కృష్ణగారే కనిపిస్తున్నారు’ అంటే నవ్వారు. ఓత్ రిలీజ్ అయ్యాక చాలామంది ఫ్యాన్స్ ఫోన్ చేసి, సేమ్ కృష్ణగారి వాయిస్‌లానే ఉందన్నారు. నాకు అది నైస్ మూమెంట్. మహేశ్‌గారు కొన్ని కొన్ని రాజకీయ పదాలు ఎప్పుడూ అనలేదట. ‘ఓత్’ సీన్ డైలాగ్స్ చెప్పేటప్పుడు ఆయన ఆ విషయం చెప్పారు. ఆయనది ఎక్స్ట్రార్డినరీ మెమరీ. ఇట్టే పట్టేస్తారు. ► ‘భరత్ అనే నేను’ ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌కి ఎన్టీఆర్‌గారిని ఆహ్వానించడం ఓ హైలైట్. ఇద్దరు స్టార్స్ (మహేశ్–ఎన్టీఆర్) ఒకే వేదిక మీద కనిపించేలా చేయాలన్నది మీ ప్రయత్నమే అనుకోవచ్చా? అస్సలు కాదు. ఇంకో వారంలో ఆడియో రిలీజ్ చేద్దాం, ఎక్కడ చేయాలి.. హైదరాబాద్ కాకుండా వేరే ఎక్కడైనా చేద్దామా అనుకుంటున్నప్పుడు షూటింగ్ కొంచెం లేట్ అయింది. దాంతో హైదరాబాద్ బెస్ట్ అనుకున్నాం. మాటల సందర్భంలో ‘ఫంక్షన్ అంటే బోర్ కొడుతుంది. సంవత్సరం అంతా మన ఫేస్‌లే చూసుకొని ఫంక్షన్లోనూ మనమేనా? ఎవరైనా గెస్ట్ వస్తే బావుంటుంది కదా’ అని మహేశ్‌గారు అన్నారు. ఆయన అన్నట్లు నాక్కూడా ఎవరినైనా పిలిస్తే బాగుంటుందనిపించింది. ఆ ఆలోచనలో ఉండగానే ‘తారక్ (ఎన్టీఆర్)ని పిలుద్దామా’ అని మహేశ్‌గారే అన్నారు. వెంటనే నేను తారక్‌కి ఫోన్ చేసి, ‘ఫంక్షన్‌కి రావాలి’ అంటే ‘ఊరుకోండి.. జోక్ చేస్తున్నారా’ అన్నారు. ‘లేదు.. నిజంగా రావాలి’ అని విషయం చెబితే, ‘వస్తాను. రెండు గంటలసేపు నేనూ ఎంజాయ్ చేస్తా’ అన్నారు. అలా ఆ ఫంక్షన్ మాకు స్పెషల్ అయింది. ► ఇప్పుడు చాలామందిలా 100, 150 కోట్ల క్లబ్ మీద మీరూ దృష్టి పెడతారా? కలెక్షన్స్ గురించి దర్శకుడు పట్టించుకోవాలా? అదంతా ఫ్యాన్స్ థింగ్. మనం దేన్నీ ఆపలేం. మా సినిమాను ఇంకొకరు దాటితే మాకు హ్యాపీ. మా బడ్జెట్స్ పెరుగుతాయి. ఇంకా గ్రాండ్ కాన్వాస్ మీద కథ చెప్పొచ్చు. కలెక్షన్ అనేది సినిమాలో భాగం. ఎంత పెట్టాం. ఎంత తిరిగొస్తోంది అని తెలియాలి. ప్రొడ్యూసర్ 50 కోట్లు పెట్టి తీసిన సినిమా 60 కోట్లకు అమ్ముడైతే ఆయన సేఫ్. తర్వాత కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్‌కి మిగిలిందా? లేదా అనే టెన్షన్. వాళ్లు కూడా సేఫ్ అంటే ఫుల్ హ్యాపీ. డైరెక్టర్‌గా ఈ కలెక్షన్స్‌ని ఫాలో అవ్వడం నా బాధ్యత. పెట్టినదానికి లాభం వచ్చిందా? లేదా? అని తెలుసుకోకపోవడం నా దృష్టిలో క్రైమ్. మన ఇంట్లో అన్నింటికీ లెక్కలు వేసుకుంటాం. సినిమా కూడా అంతే. నా పారితోషికం నాకు వచ్చేస్తుంది కాబట్టి, మిగతావాళ్లకు వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? అన్నట్లు ఉండటం సరికాదు. అందుకే సినిమా లాస్ట్ ఎవరి దగ్గరకు చేరుతుందో వాళ్లు సేఫ్ అయితే అప్పుడు హాలిడే మూడ్‌లోకి వెళతాను. ► సినిమాలో మూడు గంటల్లో హీరో పాలిటిక్స్‌లో పెను మార్పు తెస్తాడు. బయట అలా కాదు. రాజకీయాల పై మీ అభిప్రాయం? పొలిటికల్ పవర్ అంటే ఆషామాషీ పవర్ కాదు. రాజులు కూడా తాము అనుకున్నది చేయలేరు. ఎందుకంటే అది అధికారం కాదు. రాజు తర్వాత వాళ్ల అబ్బాయి.. ఆ తర్వాత వాళ్ల అబ్బాయి. కానీ ఇక్కడ డెమోక్రసీలో జనమే అధికారం ఇస్తున్నారు. ‘మమల్ని నువ్వు పరిపాలించు’ అని. దీనికి మించిన సుప్రీమ్ పవర్ ఏదీ లేదు. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు చేయలేనిది ఏదీ ఉండదు. కానీ చేయాలని వాళ్లు అనుకోవాలంతే. వాళ్లకు ఎదురు చెప్పేవాళ్లు లేరు. వాళ్లు చేయలేంది ఏదీ లేదు. చేతిలో పవర్ ఉంటే అలా చేసేయొచ్చు పనులు. ఆ పని అవ్వడం లేదంటే చేయాలనే ఉద్దేశం లేదని అర్థం. పవర్ అంటే జస్ట్ వన్ వర్డ్ కాదు. పవర్ టు సర్వ్, పవర్ టు రూల్. పవర్ టు డూ అని అర్థం. చేతిలో అధికారం ఉంటే మిరాకిల్స్ చేయొచ్చు. అది అవ్వదంటారు. ఎందుకు అవ్వదు? నీకు చేయాలని లేదు. ► నెక్స్›్ట ప్రాజెక్ట్ ? ఈసారి బాగా అలసిపోయాను. ఏమీ ఆలోచించకుండా... సినిమా అనే ఆలోచనే లేకుండా 2 నెలలు బ్రేక్ తీసుకుంటా. ► ఎవరైనా హీరో నుంచి కాల్ వస్తే? ఆ హీరో ఇంటికి వెళ్లి భోజనం చేస్తా (నవ్వుతూ). ఈ రెండు నెలలు తర్వాత పుస్తకాలు చదువుతా. బుక్స్ చదివి చాలా రోజులైంది. రీచార్జ్ అయి మళ్లీ తిరిగొస్తాను. ► మిమ్మల్ని మోటివేట్ చేసిన బుక్, రైటర్? ఒక్క పుస్తకం అని కాదు. శ్రీశ్రీగారి ఎక్స్ప్రెషన్ ఇష్టం. ఎన్నిసార్లు చదివినా అదే హై వస్తుంది. అందరికీ ఉండే ఎక్స్‌ప్రెషనే కానీ అయన డెలివర్ చేసే విధానం చాలా బావుంటుంది. ఎంత పెద్ద మాటని అయినా షార్ప్‌గా, షార్ట్‌గా చెప్పటం ఆయన ప్రత్యేకత. ఆయన్నుంచి ఇన్ఫ్లుయన్స్ అయ్యాను. అందుకే నా సినిమా స్టోరీ లైన్‌ని ఒక్క లైన్లో అర్థం అయ్యేట్లు చెప్పేస్తాను. ‘మిర్చి’లో ‘వీలైతే ప్రేమిద్దాం..’, ‘శ్రీమంతుడు’లో ‘తిరిగి ఇచ్చేయాలి’, ఇప్పుడు ‘భరత్ అనే నేను’లో ‘ప్రామిస్’ అయినా.. ఏదైనా. ► మహేశ్‌గారు ఆడియోలో ‘మేం మేం బావున్నాం, ఫ్యాన్స్ ఇంకా బావుండాలి’ అన్నారు. మహేశ్, ఎన్టీఆర్, ప్రభాస్.. వంటి స్టార్స్‌తో సినిమాలు చేస్తున్న మీరు ఫ్యాన్స్‌కి ఏం చెబుతారు? జనరల్లీ అందరి ఫ్యాన్స్ మూవీ లవర్స్. మహేశ్, ఎన్టీఆర్, చరణ్ సినిమాలను ఏ ఫ్యాన్స్ అయినా ఫస్ట్ డే మార్నింగ్ షోనే చూస్తారు. ఒక 5 శాతం మంది హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్లకు స్పెషల్ అభిమానం ఉంటుంది. ఒక్కోసారి ఉద్రేకం పెరుగుతుంది. వాటిలో నుంచి చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. ఇది తరతరాలుగా వస్తోంది. దాన్ని కంట్రోల్ చేయాలి. హీరోలంతా బాగున్నప్పుడు ఫ్యాన్స్ కూడా బాగుంటే బాగుంటుంది. ► ‘భరత్’ మాటిస్తే మాట తప్పడు. ‘కొరటాల శివ’ మాటిస్తే ? అంత పెద్ద మాటలేమీ ఇవ్వలేదు. నా పరిధిలో నిలబడగలిగేవి మాత్రమే ఇచ్చాను. వాటిని నిలబెట్టుకుంటాను. ఎందుకంటే మాట మీద నిలబడటం గొప్ప విషయం. ► మాట మీద నిలబడటం గొప్ప విషయం అన్నారు. ఇండస్ట్రీ బిగినింగ్ డేస్‌లో మీకు ప్రామిస్ చేసి మాట తప్పినవాళ్లు ఎవరైనా ఉన్నారా? ఇది మోస్ట్ గ్లామరస్ ఫీల్డ్. అందుకే ఇక్కడ ప్రామిస్ చేసినవాళ్ల గురించి, అది నిలబెట్టుకోని వాళ్ల గురించి తెలుసుకోవాలనుకుంటారు. ప్రామిస్ బ్రేక్ చేయడం అనేది వేరే రంగాల్లోనూ ఉంటుంది. బిజినెస్‌లో చూడండి. నీకు ఆ స్థలం అమ్ముతాం అంటారు. ఆ తర్వాత లేదంటారు. అన్నింట్లో ప్రామిస్ బ్రేక్ చేయడం ఉంది. హాస్పిటల్, రాజకీయాల్లోనూ ఉన్నాయి. మా సినిమా ఇండస్ట్రీ ఎంత? గట్టిగా మాట్లాడితే రెండు కిలోమీటర్ల రేడియస్‌లో ఉంది ఈ ఇండస్ట్రీ. 500–1000 కోట్ల ఇండస్ట్రీ. మీకు ప్రామిస్ వేసి చెబుతున్నా.. మిగతా ఇండస్ట్రీల్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి. ► ‘శ్రీమంతుడు’ తర్వాత తక్కువ సమయంలోనే మహేశ్‌గారు మీతో మళ్లీ సినిమా చేశారు. మీ ఇద్దరి మధ్య వేవ్‌లెంగ్త్ కేవలం ఓ హిట్ వల్లే కుదిరిందా? మహేశ్‌గారికి ఓ వ్యక్తి మీద నమ్మకం కుదరాలి. కుదిరితే కనెక్ట్ అవుతారు. ఆయన డైరెక్టర్స్ యాక్టర్. షూటింగ్‌కి వచ్చే ముందు తన బ్రెయిన్ స్విచాఫ్ చేసేస్తారు. డైరెక్టర్ ఎలా చెబితే అలా చేస్తారు. డైరెక్టర్ మీద ఆయనకు నమ్మకం కుదరాలి. కుదిరితే సినిమా చేసేస్తారు. ‘నేను డైరెక్టర్స్‌ని నమ్మే సక్సీడ్ అయ్యాను. ఇదే ఫిలాసఫీ ఫాలో అవుతా’ అంటుంటారు. నమ్మిన డైరెక్టర్‌తో ఫ్లాప్ వచ్చినా ఆయన షేక్ అవ్వరు – గౌతమ్ మల్లాది -
అర్జున్ ప్రసాద్ అనే నేను
పొలిటికల్ డ్రామా జానర్లో వచ్చిన ఓ సూపర్‌హిట్ సినిమాలోని సన్నివేశాలివి. తెలుగులో పొలిటికల్ డ్రామాల్లో ఈ సినిమాకు ఎప్పటికీ మంచి స్థానం ఉంటుంది. సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరున్న డైరెక్టర్ తీసిన ఈ సినిమాతో పరిచయమైన హీరో ఇప్పుడొక స్టార్. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... ‘‘అర్జున్ ప్రసాద్ అనే నేను..’’ అంటూ మొదలుపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణం చేస్తున్న అర్జున్‌కు, తానేం చేస్తున్నాడో, తన ముందు ఏముందో తెలీదు. తన అవసరం మాత్రం చుట్టూ ఉన్న పరిస్థితులకు ఉందని అతనికి తెలుసు. సీఎంగా ప్రమాణం చేశాడు అర్జున్. కోట్లాది మంది ఆకాంక్షలను తనవిగా చేసుకొని ఒక సమాజాన్ని నడిపించే బాధ్యత తీసుకున్నాడు. సీఎం ఆఫీస్‌లో ఉన్న ఆఫీసర్లంతా ‘ఈయన కొత్తగా చేసేది ఏముంటుంది?’ అన్నట్టు చూశారు. అర్జున్ అందరికీ సమాధానం చెప్పాలనుకున్నాడు. మొదటిరోజు నుంచే కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. సీఎంగా ప్రమాణం చేసిన మూడోరోజే అర్జున్‌కు లైఫ్త్రెట్ ఉందని సెక్యూరిటీ కూడా పెంచారు. కానీ ఆ సెక్యూరిటీని దాటుకొని వచ్చి అతనికి రెండు బుల్లెట్లు తగిలాయి. బుల్లెట్‌ప్రూఫ్ ఉంది కాబట్టి చేతికి మాత్రమే గాయాలయ్యాయి. అర్జున్ హాస్పిటల్లో ఉన్నాడు. గాయాలు చిన్నవే కాబట్టి వెంటనే కోలుకున్నాడు. హాస్పిటల్లో ఉన్న కొడుకును చూడటానికి వచ్చింది తల్లి. రావడమే.. ‘‘అయ్యో! ఏంట్రా ఇదీ..’’ అంటూ గట్టిగా ఏడ్చేసింది. ‘‘ఊర్కో అమ్మా! ఇప్పుడు ఏమైందని?’’ అన్నాడు అర్జున్. ‘‘హాయిగా అమెరికాలో ఉండాల్సిన వాడివి. నా మూలానే కదా?’’ ‘‘ఇప్పుడేమైందమ్మా!’’ ‘‘వెళ్లిపోరా! ఈ దేశంలో రాక్షసులు ఎక్కువైపోయారు. వీళ్ల మధ్యన ఉండే ఖర్మ నీకేం పట్టిందిరా..’’ ఆ తల్లి ఇంకా ఏడుస్తూనే ఉంది. ‘‘ఇది ఖర్మ కాదమ్మా! ఇది నా అదృష్టం..’’ అర్జున్‌కు ఇప్పుడిప్పుడే తాను చేయాల్సిన పనులేవో తెలుస్తున్నాయి. అమెరికాలో సెటిల్ అవ్వాలనుకున్నవాడు, ఇలా రాజకీయాల్లోకి రావడానికి ఒకే ఒక్క కారణం అమ్మ. కానీ ఇప్పుడు ఆమే వద్దంటున్నా, అతను నవ్వి, రాజకీయాల్లోనే ఉంటానంటున్నాడు. అతనికిప్పుడు చావన్నా భయం పోయింది. అర్జున్ కోలుకున్నాడు. తాను చేయాల్సిన పనులన్నీ లిస్ట్ చేసి పెట్టుకున్నాడు. సొంత పార్టీ వాళ్లే గొడవ చేసినా అనుకున్నవన్నీ చేస్తూ పోతున్నాడు. రోజులు గడుస్తున్నాయి. గొడవ పెద్దదైంది. అసమ్మతి పెరిగిపోయింది. తన సీఎం సీట్ ఉంటుందో పోతుందోనన్న భయం పట్టుకుంది అర్జున్‌కు. పనులన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. అసమ్మతి నేతలను దగ్గర చేసుకోవాలి. అవిశ్వాసం పెడితే సీఎం సీటునుంచి దిగాల్సి ఉంటుంది. అతనికి వేరే ఆప్షన్ కనబడలేదు, తాను ఇష్టపడ్డ అమ్మాయి అర్చనను ప్రేమించి, ఆ ప్రేమను వాడుకొని ఆమె తండ్రి సపోర్ట్ పొందడం తప్ప. అదే చేశాడు. అర్చనకు నిజం తెలిసింది. ‘‘అన్నీ అబద్ధాలే కదా! మొత్తం అంతా అబద్ధమే కదా!!’’ అడిగింది. ‘‘అర్చనా! నేన్నిన్ను ప్రేమించడం మాత్రం అబద్ధం కాదు.’’ ‘‘పొలిటీషియన్స్‌ను నమ్మొద్దు.. నమ్మొద్దు అని బతికున్నన్నాళ్లూ చెప్పింది అమ్మ. ఇప్పుడు ఏడుస్తూ ఉంటుంది పైన. ఇంత నటన అవసరమా? ఒక మామూలు అమ్మాయిని. గొప్ప సీఎంవి. మోసం చేయడం అవసరమా? ఒక మాట చెప్పుంటే నేనే నీకు సపోర్ట్ చేసేదాన్ని కదా..’’ ఏడుస్తూ కారు దిగింది అర్చన. ‘‘అర్చన నేను పోరాడుతున్నా. ఐయామ్ ఫైటింగ్. ఈ ఫైట్‌లో నేన్నిన్ను మోసం చేయడం కాదు, నన్ను నేనే మోసం చేసుకుంటున్నా..’’ బతిలాడుకున్నాడు అర్జున్. ‘‘వెళ్లిపో..’’ అంటూ చివరగా ఓ మాట చెప్పి అతణ్నుంచి దూరంగా వెళ్లిపోయింది అర్చన. అర్జున్ ఇప్పుడక్కడ ఒంటరివాడు. అమ్మ ముందు నిస్సహాయంగా కూర్చున్నాడు అర్జున్. ‘‘ఏంట్రా?’’ అనడిగింది అమ్మ. ‘‘అమ్మా ఇవ్వాళ నా పదవి కాపాడుకోవడం కోసం ఒక ఆడపిల్లకు అన్యాయం చేసినవాడిని వదిలేసానమ్మా! నాకు ఛాయిస్ లేదమ్మా!’’ అన్నాడు దీనంగా. ‘‘ఒక ఆడపిల్లకు అన్యాయం చేశావా?’’‘‘అన్యాయం చేసినవాడిని వదిలేసానమ్మా!’’ ‘‘అన్యాయం చేసినవాడిని వదిలేసానంటే ఫర్వాలేదనిపిస్తుందిరా.. అదే ఒక ఆడపిల్లకు అన్యాయం చేశాననుకుంటే బాధగా ఉంటుంది. చాలా బాధగా ఉంటుంది.’’‘‘అమ్మా!’’‘‘బాధపడాలో, ఫర్వాలేదనుకోవాలో నువ్వే ఆలోచించుకో..’’ చెప్పింది అమ్మ. ‘రేపు మాట్లాడదాం. వెళ్లి పడుకోరా’ అంటూ అర్జున్ వైపు చూసి, ‘‘అర్జున్! నువ్వు లీడర్ అవ్వాలనుకున్నా కానీ, పొలిటీషియన్ అవ్వాలనుకోలేదురా..’’ అంది. అదే ఆమె అర్జున్‌తో చెప్పిన చివరిమాట. ఆ రాత్రి అలాగే నిద్రలోకి, అక్కణ్నుంచి మరణంలోకి జారుకుంది. అర్జున్ ఇప్పుడు అంతటా ఒంటరివాడు. అమ్మ చనిపోతే ఆమె చివరిచూపు కోసం లక్షమంది ఆడవాళ్లు రావడం అర్జున్ను కంటతడి పెట్టించింది. ‘‘ఆవిడొక దేవత సార్!’’ అంది అర్జున్ ఇంట్లో పనిచేసే వ్యక్తి. ‘‘లక్షమంది ఆడవాళ్లా?’’ ఆ మాటన్నాక అర్జున్ దగ్గర ఇంకే మాటలూ లేవు. వాళ్లందరినీ దాటుకుంటూ వెళ్లి, అర్జున్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన పదవిని వదిలేసుకోవాల్సిన పరిస్థితిని కల్పించే నిర్ణయం అది. ఒక ఆడపిల్లకు అన్యాయం చేసిన వాడిని పదవిని కాపాడుకోవడం కోసం వదిలేసిన అర్జున్, అదే పదవిని లెక్కచెయ్యకుండా ఆ ఆడపిల్లకు న్యాయం చేశాడు. పదవిని వదిలేశాడు. ప్రజల్లోకి వెళ్లిపోయాడు. ఆ ప్రజల్లోనే తిరుగుతూ ఉన్నాడు. అర్జున్‌కి ఇప్పుడు పదవి ముఖ్యం కాదు. ప్రజల కష్టాలు తెలుసుకోవడం ముఖ్యం. రాష్ట్రంలోని చివరి ఊర్లో ఉన్న చివరి మనిషి వరకూ అందరినీ కలుసుకున్నాడు. అర్జున్ మళ్లీ గెలిచాడు. ఈసారి ఏ శక్తికీ భయపడని, ఏ ఒత్తిడికీ లొంగే అవసరం లేని గెలుపును గెలుచుకున్నాడు. అర్జున్ ఈసారి ధైర్యంగా ప్రమాణం చేశాడు – ‘‘అర్జున్ ప్రసాద్ అనే నేను...’’. -
ఇచ్చాడయ్యో...హామీ
‘భరత్ అనే నేను’లో ‘వచ్చాడయ్యో సామీ..’ అనే పాట చాలా పాపులర్ అయిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది. నెక్ట్స్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి మహేశ్ ఎప్పుడో హామీ ఇచ్చేశారు. ఇప్పుడు మరో సినిమాకి హామీ ఇచ్చారు. మహేశ్‌బాబు హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. నాలుగేళ్ల క్రితం మహేశ్‌బాబుతో ‘1 నేనొక్కడినే’ వంటి క్లాస్ అండ్ డీసెంట్ మూవీని తెరకెక్కించిన సుకుమార్ ఈ చిత్రానికి దర్శకుడని సమాచారం. వారంలోపు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా, మహేశ్‌తో సుకుమార్‌కి ఇది రెండో సినిమా అయితే ‘రంగస్థలం’ తర్వాత ఇమీడియట్గా మైత్రీతో కూడా సుకుమార్‌కి ఇది రెండో సినిమా అవుతుంది. వంశీ పైడిపల్లితో చేయనున్న సినిమా, సుకుమార్‌తో చేయనున్న సినిమా షూటింగ్స్ కొంచెం అటూ ఇటూగా జరుగుతాయట. సో.. రానున్న రోజుల్లో ఈ రెండు చిత్రాలతో మహేశ్ ఫుల్ బిజీ అన్నమాట. ప్రస్తుతం మహేశ్‌బాబు స్మాల్ ట్రిప్ కోసం ఫారిన్ వెళ్లారని సమాచారం. -
‘భరత్ బహిరంగ సభ’కు పొగ రాలేదా?
సాక్షి, వికారాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ జన సమితి పార్టీ(టీజేఎస్) ఆవిర్భావ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. నగరం నడిబొడ్డున సభలు జరిపితే, అక్కడికి వచ్చే వాహనాల పొగ వల్ల కాలుష్యం పెరుగుతుందని, పైగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకే అనుమతివ్వడంలేదని పోలీసులు పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ‘‘మేం సభ పెడతామంటే వద్దన్నారు. అదే మొన్న ‘భరత్ అనే నేను’ సినిమాకు ఎల్బీ స్టేడియంలో అనుమతి ఇచ్చారు. ఆ సభకు వాహనాలు రాలేదా? ఆ వాహనాల నుంచి పొగ రాలేదా?’’ అని కోదండరాం ప్రశ్నించారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా 29న సరూర్ నగర్ స్టేడియంలో సభ నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభకు సన్నాకంగా వికారాబాద్ సత్యభారతి గార్డన్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కోదండరాం మాట్లాడారు. ‘‘నాయకులు మాట్లాడకుంటే ప్రజలకు న్యాయం జరగదు. కానీ ఆ నాయకులే అమ్ముడు పోతున్నరు. సమస్యల పరిష్కారాల కోసం నాలుగేళ్లుగా కొట్లాడుతున్నాం. ఆ ఉద్యమ స్ఫూర్తి నుంచి పుట్టిందే తెలంగాణ జనసమితి పార్టీ. ఎవరో వెనుక ఉండి చెబితే పెట్టిన పార్టీకాదిది. తెలంగాణ వచ్చి నాలుగేళ్లైనా వికారాబాద్ జిల్లాకు సాగునీటి జాడలేదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవట్లేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే అబద్ధాలు చెబితే ఇగ ఏం చెప్పాలె!’ అని కోదండరాం అన్నారు. హైకోర్టులో రచనా రెడ్డి పిటిషన్ ఈ నెల 29న తలపెట్టిన తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభకు పోలీసుల అనుమతి నిరాకరణ వ్యవహారం హైకోర్టుకు చేరింది. కాలుష్యం సాకుతో అనుమతి నిరాకరించడాన్ని సవాలుచేస్తూ ప్రముఖ న్యాయవాది రచనా రెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఎల్బీ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియం, ఎన్డీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ఏదో ఒక చోట సభ నిర్వహించుకునేలా అనుమతి ఇవ్వాలని పిటిషనర్ కోరారు. వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. విచారణను సోమవారానికి వాయిదావేసింది.