MS Dhoni
-
ఐపీఎల్-2025లో పాల్గొనబోయే అత్యధిక వయస్కులు వీరే..!
ఐపీఎల్-2025లో పాల్గొనే అత్యధిక వయస్కుల వివరాలను ఈ ఐటంలో చూద్దాం. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్‌లో పాల్గొనబోయే అత్యధిక వయస్కుడిగా ధోని రికార్డు సృష్టించాడు. ధోని 43 ఏళ్ల వయసులో ఐపీఎల్ 2025 ఆడతాడు. ధోనిని ఐపీఎల్ మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ రీటైన్ చేసుకుంది. సీఎస్కేకు ఐదు సార్లు టైటిళ్లు అందించిన ధోని ఈసారి సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగుతాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే రెండో అత్యధిక వయస్కుడు ఫాఫ్ డుప్లెసిస్. డుప్లెసిస్ 40 ఏళ్ల వయసులో క్యాష్ రిచ్ లీగ్ బరిలో ఉంటాడు. గత సీజన్ వరకు ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్ 2025 ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్నాడు. మెగా వేలంలో డీసీ డుప్లెసిస్‌ను 2 కోట్లకు సొంతం చేసుకుంది. డుప్లెసిస్ ఐపీఎల్లో 145 మ్యాచ్‌లు ఆడి 4571 పరుగులు స్కోర్ చేశాడు.ఐపీఎల్-2025లో మూడో అత్యధిక వయస్కుడు రవిచంద్రన్ అశ్విన్. అశ్విన్ 38 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడతాడు. ఇటీవల జరిగిన మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ యష్‌ను 9.75 కోట్లకు సొంతం చేసుకుంది. అశ్విన్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాడు.ఐపీఎల్-2025 నాలుగో అత్యధిక వయస్కుడు రోహిత్ శర్మ. హిట్‌మ్యాన్ 37 ఏళ్ల వయసులో ముంబై ఇండియన్స్‌కు ఆడతాడు. ముంబై ఇండియన్స్ 16.3 కోట్లకు రోహిత్‌ను రీటైన్ చేసుకుంది. ఐదు సార్లు ముంబై ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్ తదుపరి సీజన్లో సాధారణ ఆటగాడిగా బరిలో ఉంటాడు. రోహిత్ ఐపీఎల్లో 257 మ్యాచ్‌లు ఆడి 6628 పరుగులు స్కోర్ చేశాడు.ఐపీఎల్-2025లో పాల్గొనే ఐదో అత్యధిక వయస్కుడు మొయిన్ అలీ. మొయిన్ అలీ 37 ఏళ్ల వయసులో (రోహిత్ కంటే చిన్నవాడు) క్యాష్ రిచ్ లీగ్ బరిలో ఉంటాడు. మెగా వేలంలో కేకేఆర్ మొయిన్‌ను 2 కోట్లకు సొంతం చేసుకుంది. మొయిన్ తన ఐపీఎల్ కెరీర్లో 67 మ్యాచ్‌లు ఆడి 1162 పరుగులు చేసి 35 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే ఆరో అత్యధిక వయస్కుడు కర్ణ్ శర్మ. కర్ణ శర్మ 37 ఏళ్ల (రోహిత్, మొయిన్ కంటే రోజుల్లో చిన్నవాడు) క్యాష్ రిచ్ లీగ్ బరిలో ఉంటాడు. కర్ణ్ శర్మను మెగా వేలంలో ముంబై ఇండియన్స్ 50 లక్షలకు సొంతం చేసుకుంది. కర్ణ్ శర్మ ఐపీఎల్లో 84 మ్యాచ్‌లు ఆడి 76 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే ఏడో అత్యధిక వయస్కుడు ఆండ్రీ రసెల్. రసెల్ 36 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడనున్నాడు. మెగా వేలానికి ముందు రసెల్‌ను కేకేఆర్ రీటైన్ చేసుకుంది. రసెల్ ఐపీఎల్లో 126 మ్యాచ్‌లు ఆడి 2484 పరుగులు చేసి 115 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే ఎనిమిదో అత్యధిక వయస్కుడు సునీల్ నరైన్. నరైన్ 36 ఏళ్ల వయసులో (రసెల్ కంటే రోజుల్లో చిన్నవాడు) ఐపీఎల్ ఆడనున్నాడు. మెగా వేలానికి ముందు కేకేఆర్ నరైన్‌ను రీటైన్ చేసుకుంది. నరైన్ ఐపీఎల్లో 1534 పరుగులు చేసి 180 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే తొమ్మిదో అత్యధిక వయస్కుడు అజింక్య రహానే. రహానే 36 ఏళ్ల (రసెల్, నరైన్ కంటే రోజుల్లో చిన్నవాడు) వయసులో క్యాష్ రిచ్ లీగ్ ఆడనున్నాడు. రహానేను మెగా వేలంలో కేకేఆర్ 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. రహానే తన ఐపీఎల్ కెరీర్లో 185 మ్యాచ్‌లు ఆడి 30.14 సగటున 4642 పరుగులు చేశాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే పదో అత్యధిక వయస్కుడు ఇషాంత్ శర్మ. ఇషాంత్ 36 ఏళ్ల వయసులో (రసెల్, నరైన్, రహానే కంటే రోజుల్లో చిన్నవాడు) ఐపీఎల్ ఆడనున్నాడు. ఇషాంత్‌ను 2025 సీజన్ మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. దీంతో ఇషాంత్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008) నుంచి వేలంలో అమ్ముడుపోయిన ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇషాంత్ ఐపీఎల్లో 79 మ్యాచ్‌లు ఆడి 93 వికెట్లు పడగొట్టాడు. -
విజయ్ హజారే ట్రోఫీలో ధోని శిష్యుడి విధ్వంసం
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని శిష్యుడు, మాజీ సీఎస్కే ప్లేయర్ ఎన్ జగదీశన్ (తమిళనాడు) అదరగొట్టాడు. రాజస్థాన్‌తో ఇవాళ (జనవరి 9) జరిగిన రెండో ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్లో జగదీశన్ ఒకే ఓవర్లో వరుసగా ఆరు బౌండరీలు బాదాడు. రాజస్థాన్ పేసర్ అమన్ సింగ్ షెకావత్ బౌలింగ్‌లో జగదీశన్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఛేదనలో ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన షెకావత్.. తొలి బంతిని వైడ్‌గా వేశాడు. ఈ బంతిని వికెట్ కీపర్ పట్టుకోలేకపోవడంతో బౌండరీకి వెళ్లింది. దీంతో రెండో ఓవర్లో బంతి పడకుండానే తమిళనాడు ఖాతాలో ఐదు పరుగులు చేరాయి. అనంతరం షెకావత్ వేసిన ఆరు బంతులను ఆరు బౌండరీలుగా మలిచాడు జగదీశన్. ఫలితంగా రెండో ఓవర్లో తమిళనాడుకు 29 పరుగులు వచ్చాయి. జగదీశన్ షెకావత్‌కు సినిమా చూపించిన వీడియో (ఆరు బౌండరీలు) సోషల్‌మీడియాలో వైరలవుతుంది.4⃣wd,4⃣,4⃣,4⃣,4⃣,4⃣,4⃣29-run over! 😮N Jagadeesan smashed 6⃣ fours off 6⃣ balls in the second over to provide a blistering start for Tamil Nadu 🔥#VijayHazareTrophy | @IDFCFIRSTBankScorecard ▶️ https://t.co/pSVoNE63b2 pic.twitter.com/JzXIAUaoJt— BCCI Domestic (@BCCIdomestic) January 9, 2025తమిళనాడు వికెట్‌కీపర్ కమ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన జగదీశన్ 2018 నుంచి 2022 వరకు ధోని అండర్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (277) చేసిన రికార్డు జగదీశన్ పేరిటే ఉంది. జగదీశన్‌ను 2023 ఐపీఎల్ వేలంలో కేకేఆర్ 90 లక్షలకు సొంతం చేసుకుంది. 2024, 2025 ఎడిషన్లలో జగదీశన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఐపీఎల్లో 13 మ్యాచ్‌లు ఆడిన జగదీశన్ 110.20 స్ట్రయిక్‌రేట్‌తో 162 పరుగులు మాత్రమే చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 47.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవరి ఐదు వికెట్లు తీసి రాజస్థాన్‌ను దెబ్బకొట్టాడు. సందీప్ వారియర్ (8.3-1-38-2), సాయి కిషోర్ (10-0-49-2), త్రిలోక్ నాగ్ (6-1-31-1) రాణించారు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అభిజీత్ తోమర్ (125 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 111 పరుగులు) సెంచరీతో, కెప్టెన్ మహిపాల్ లోమ్రార్ (49 బంతుల్లో 60;3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో కదం తొక్కారు. తోమర్, లోమ్రార్‌తో పాటు కార్తీక్ శర్మ (35), సమర్పిత్ జోషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తమిళనాడు 30 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. తుషార్ రహేజా (11), భూపతి కుమార్ (0), ఎన్ జగదీశన్ (65; 10 ఫోర్లు), బాబా ఇంద్రజిత్ (37) ఔట్ కాగా.. విజయ్ శంకర్ (18), మొహమ్మద్ అలీ (23) క్రీజ్‌లో ఉన్నారు. రాజస్థాన్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అనికేత్ చౌదరీ, అమన్ సింగ్ షెకావత్, అజయ్ సింగ్‌కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో తమిళనాడు నెగ్గాలంటే మరో 104 పరుగులు చేయాలి. -
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో సచిన్ టెండుల్కర్, యువీ.. కూతురి కోసం ధోని అలా!(ఫొటోలు)
-
సౌతాఫ్రికాతో రెండో వన్డే.. ధోని రికార్డుపై కన్నేసిన బాబర్ ఆజమ్
కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికా, పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్ 19) రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్‌కు శుభారంభం లభించింది. పార్ల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో పాక్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీనికి ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సౌతాఫ్రికా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో మూడో టీ20 వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. పాక్ క్రికెట్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది.ధోని రికార్డుపై కన్నేసిన బాబర్ ఆజమ్గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్, టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోని పేరిట ఉన్న ఓ లాంగ్ స్టాండింగ్ బ్యాటింగ్ రికార్డుపై కన్నేశాడు. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో బాబర్ అన్ని ఫార్మాట్లలో కలిపి ఏడు సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 4732 పరుగులు చేశాడు. మరోవైపు ధోని SENA దేశాల్లో 38 హాఫ్ సెంచరీ సాయంతో 5273 పరుగులు చేశాడు. SENA దేశాల్లో ధోని, బాబర్ ప్రస్తుతం 38 యాభై ప్లస్ స్కోర్లు కలిగి ఉన్నారు. సౌతాఫ్రికాతో జరిగే రెండో వన్డేలో బాబర్ మరో హాఫ్ సెంచరీ చేస్తే.. SENA దేశాల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోనిని అధిగమిస్తాడు.తొలి వన్డేలో పాక్ ఘన విజయంతొలి వన్డేలో అఘా సల్మాన్ ఆల్‌రౌండర్ షో, సైమ్ అయూబ్ సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో సౌతాఫ్రికాపై పాక్ ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాక్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి వన్డేలో బాబర్ ఆజమ్ 23 పరుగులు చేసి ఓట్నీల్ బార్ట్‌మన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో బాబర్‌కు శుభారంభం లభించినా భారీ స్కోర్ చేయలేకపోయాడు. బాబర్ గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా దారుణంగా విఫలమవుతున్నాడు. అతను హాఫ్ సెంచరీ మార్కు తాకి కూడా చాన్నాళ్లవుతుంది. -
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్..
బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ అరుదైన ఘనత నమోదు చేశాడు. టెస్టు క్రికెట్లో 150 ఔట్లు సాధించిన మూడో భారత వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు.ఈ మ్యాచ్‌లో ఉస్మాన్ ఖవాజా క్యాచ్ అందుకున్న పంత్.. ఈ రేర్ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. పంత్ ఇప్పటివరకు 41 టెస్టు మ్యాచ్‌ల్లో వికెట్‌కీపర్‌గా 135 క్యాచ్‌లు, 15 స్టంపింగ్‌లు చేశాడు. పంత్ కంటే ముందు ఎంఎస్ ధోనీ, సయ్యద్ కిర్మాణి మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. మిస్టర్ కూల్ 256 క్యాచ్‌లు, 36 స్టంపింగ్‌లతో 294 ఔట్లలో భాగస్వామ్యమయ్యాడు.అదే విధంగా రెండో స్ధానంలో ఉన్న సయ్యద్ కిర్మాణి 160 క్యాచ్‌లు, 38 స్టంపింగ్‌లతో మొత్తంగా 198 ఔట్ల్లో పాలుపంచుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజు వరుణుడు కరుణించాడు. తొలిసెషన్లో ఆస్ట్రేలియాకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా చుక్కలు చూపించాడు.28/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ఆరంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే తొలి సెషన్లో భారత్ ఆధిపత్యం చెలాయించినప్పటకీ.. తర్వాత ఆస్ట్రేలియా తిరిగి పుంజుకుంది. 53 ఓవర్లకు ఆసీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.చదవండి: IND vs AUS: కోహ్లితో అట్లుంటది మరి.. దెబ్బకు నోరు మూసుకున్న ఆసీస్ ఫ్యాన్స్! వీడియో -
'ధోని లాంటి కెప్టెన్‌ను నేను ఎప్పుడూ చూడలేదు.. అతడొక లెజెండ్'
మహేంద్ర సింగ్ ధోని.. భారత అభిమానులందరూ ఆరాధించే క్రికెటర్లలో ఒకడు. అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికి నాలుగేళ్లు అవుతున్నప్పటికి.. ఈ టీమిండియా లెజెండ్‌పై అభిమానం ఇసుమంత కూడా తగ్గలేదు. ఏడాదికి ఓ సారి ఐపీఎల్లో ఆడే తలైవా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తుంటారు.ఇప్పుడు మరోసారి ఫ్యాన్స్ అలరించేందుకు మిస్టర్ కూల్ సిద్దమయ్యాడు. ఐపీఎల్-2025లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరపున అన్క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో ధోనిపై లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని అద్బుతమైన కెప్టెన్ అని, అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాని గోయోంకా తెలిపాడు."భారత క్రికెట్ చరిత్రలో ధోని పేరు నిలిచిపోతుంది. ధోని లాంటి నాయకుడిని నేను ఎప్పుడూ చూడలేదు. అతడి ఆలోచిన విధానం, పరిపక్వత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతి చిన్న వయస్సులోనే ఎంఎస్ తనను తను తీర్చుదిద్దుకున్న విధానం నిజంగా అద్బుతం.ధోని తన అనుభవంతో ఎంతో మంది యువ క్రికెటర్లను సైతం తీర్చిదిద్దాడు. మతీషా పతిరానానే ఉదాహరణగా తీసుకుండి. పతిరానాను ధోని ఏకంగా మ్యాచ్ విన్నర్‌గా తాయారు చేశాడు. తన ఆటగాళ్లను ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో ధోనికి బాగా తెలుసు.ధోనిని కలిసిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాను. ఓసారి లక్నో, చెన్నై మ్యాచ్ సందర్భంగా నేను ధోనిని కలిశాను. నాతో 11 ఏళ్ల నా మనవడు కూడా ఉన్నాడు. అతడికి క్రికెట్ అంటే పిచ్చి. ఐదారేళ్ల కిందట ధోనినే నా మనవడికి క్రికెట్ ఆడటం నేర్పించాడు.ఈ సందర్భంగా అతడు ధోనికి కంటిన్యూగా ఏవో ఏవో ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అందుకు ధోని విసుగు చెందకుండా సమాధానాలు చెబుతూ వచ్చాడు. చివరికి నేనే ధోని దగ్గరకు వెళ్లి అతడిని విడిచిపెట్టేయండి అని చెప్పా. కానీ ధోని మాత్రం నా మనవుడితో సంభాషణను ఆస్వాదిస్తున్నాను చెప్పాడు.దాదాపు అరగంట పాటు అతడితో ముచ్చటించాడు. ఒక పిల్లవాడి కోసం అంత సమయం వెచ్చించిన ధోని నిజంగా గొప్పవాడు. అతడి క్యారక్టెర్ ఇతరులతో మనం ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. అందుకే అతడు ధోని అయ్యాడు. అతడు ఎప్పుడు లక్నోతో మ్యాచ్ ఆడినా, స్టేడియం మొత్తం ఎంఎస్‌కి సపోర్ట్‌గా పసుపు రంగు జెర్సీలతో నిండిపోతుంది" అని టీఆర్ఎస్ పోడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోయెంకా పేర్కొన్నాడు.చదవండి: యశస్వి జైస్వాల్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం.. ఆఖరికి యువ ఓపెనర్ లేకుండానే.. -
2024 జనవరి నుంచి జూన్ వరకు టాప్ 10 బ్రాండ్ ప్రమోటర్లు (ఫోటోలు)
-
బిగ్‌బీను వెనక్కి నెట్టిన కెప్టెన్ కూల్
ఏదైనా ఉత్పత్తులను తయారు చేసిన తర్వాత వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి, ఆదరణ పొందేలా చేసేది ప్రచారాలే. తమ వ్యాపారాలను మరింత మందికి చేరువ చేసేందుకు చాలామంది విభిన్న ప్రచారపంథాను ఎంచుకుంటారు. కొందరు ఫ్లెక్సీలపై అందరికీ కనిపించేలా తమ ఉత్పత్తుల గురించి తెలియజేస్తే.. ఇంకొందరు టీవీల్లో అడ్వర్టైజ్ ఇస్తారు. ఇలా చాలామంది విభిన్న పద్ధతులను అనుసరిస్తుంటారు. అయితే, దాదాపు అన్ని ప్రచార హోర్డింగ్‌లపై ప్రముఖుల ఫొటోలను మాత్రం కామన్‌గా చూస్తూంటాం. ఓ క్రికెటర్, సినీ యాక్టర్, మోడల్.. ఇలా మన సమాజంలో బాగా పేరున్న వారిని కార్పొరేట్ కంపెనీలు తమ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు వాడుతుంటాయి. అందుకు కొంత పారతోషికం చెల్లిస్తుంటాయి. భారత్‌లో గతేడాదితో పోలిస్తే తమ బ్రాండ్ ప్రమోషన్లు పెరిగిన వ్యక్తుల వివరాలను టామ్ మీడియా రిసెర్చ్ విడుదల చేసింది. ఈ సంస్థ యూఎస్ఏ నీల్సెన్, యూకే కాంటర్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ వివరాలు ప్రకటించింది.ఇదీ చదవండి: రైల్వే ‘ఎం1’ కోచ్ గురించి తెలుసా..?ఈ లిస్ట్‌లో గతేడాది టాప్‌లో నిలిచిన బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ (40 బ్రాండ్లకు ఎండార్స్మెంట్)ను ఈసారి కెప్టెన్ కూల్‌గా పేరున్న ఎంఎస్ ధోనీ(42 బ్రాండ్లకు ఎండార్స్మెంట్) వెనక్కినెట్టారు. -
చెత్త రికార్డు సమం చేసిన రోహిత్.. ధోని, విరాట్‌తో పాటు..!
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో నితీశ్ రెడ్డి (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిచెల్ స్టార్క్ (6/48) టీమిండియాను దెబ్బకొట్టాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (140) శతక్కొట్టడంతో 337 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో సిరాజ్, బుమ్రా తలో నాలుగు వికెట్లు పడగొట్టారు.157 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మరోసారి ఘోరంగా విఫలమైంది. కమిన్స్ (5/57) ధాటికి భారత్ 175 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ నితీశ్ కుమార్ రెడ్డే (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ 3.2 ఓవర్లలో వికెట్ నష్ట పోకుండా విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆసీస్ 1-1తో సమంగా నిలిచింది.చెత్త రికార్డు సమం చేసిన రోహిత్తాజా ఓటమితో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును సమం చేశాడు. టెస్టుల్లో వరుసగా అత్యధిక ఓటములు (4) చవిచూసిన మూడో భారత సారథిగా ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, దత్తా గైక్వాడ్ సరసన నిలిచాడు. రోహిత్ సారథ్యంలో భారత్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ధోని, విరాట్ నేతృత్వాల్లో కూడా భారత్ వరుసగా నాలుగు ఓటములు చవిచూసింది. టెస్టుల్లో అత్యధిక వరుస ఓటములు చవిచూసిన భారత కెప్టెన్ల జాబితాలో మన్సూర్ అలీఖాన్ పటౌడి (6 ఓటములు, 1967-68), సచిన్ టెండూల్కర్ (5 ఓటములు, 1990-2000) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాతి స్థానాల్లో ధోని (4 ఓటములు, 2011, 2014), విరాట్ (4 ఓటములు, 2020-21), రోహిత్ (4 ఓటములు, 2024) ఉన్నారు. కాగా, ఆసీస్‌తో సిరీస్‌కు ముందు టీమిండియా స్వదేశంలో రోహిత్ నేతృత్వంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. -
‘ధోనితో నాకు మాటల్లేవు.. పదేళ్లకు పైగానే అయింది.. అయినా అలాంటి వాళ్లకు’
‘‘లేదు.. నేను ధోనితో మాట్లాడటం లేదు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడినపుడు.. అప్పుడప్పుడు ఆట గురించి మాట్లాడుకునేవాళ్లం. అయితే, ధోనితో మనసు విప్పి మాట్లాడి పదేళ్లకు పైగానే అయింది. ఇందుకు నా దగ్గర ప్రత్యేక కారణమంటూ ఏదీ లేదు.ఎప్పుడూ నా గదికి వచ్చేవాడు కాదుబహుశా ధోని దగ్గర రీజన్ ఉండవచ్చు. అయితే, ఆ కారణం ఏమిటో నాకు మాత్రం తెలియదు. సీఎస్కేతో ఉన్నపుడు కూడా మైదానంలో మాత్రం అప్పుడప్పుడు మాట్లాడేవాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు ఎప్పుడూ నా గదికి వచ్చేవాడు కాదు. నేను కూడా అతడి గదికి వెళ్లేవాడిని కాదు.ధోని పట్ల నాకెలాంటి వ్యతిరేక భావం లేదు. కానీ అతడికి నా మీద ఏదైనా కోపం ఉందేమో! ఒకవేళ అదే నిజమైతే అతడు ఆ విషయం గురించి నాతో మాట్లాడవచ్చు. నేనెప్పుడూ అతడికి కనీసం కాల్ కూడా చేయలేదు. ఎందుకంటే.. నేను ఫోన్ చేసినపుడు లిఫ్ట్ చేసి మాట్లాడితేనే మరోసారి ఫోన్ చేయాలనిపిస్తుంది.అలాంటి వాళ్లతో నేనెందుకు మాట్లాడాలి?లేదంటే.. అటువంటి వాళ్లను నేను అస్సలు పట్టించుకోను. ఎందుకంటే బంధం అనేది రెండువైపులా ఉండాలి. మనం ఎదుటివారికి గౌరవం ఇస్తేనే.. మనకు కూడా గౌరవం దక్కుతుంది. నేను రెండుసార్లు ఫోన్ చేసినా.. అటువైపు నుంచి స్పందన లేకపోతే.. నేనెందుకు అలాంటి వ్యక్తితో మాట్లాడతా!’’ అంటూ టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచిన మహేంద్ర సింగ్ ధోనితో తన అనుబంధం గురించి మాట్లాడుతూ ఈ మేర వ్యాఖ్యలు చేశాడు. తామిద్దరి మధ్య మాటలులేక దశాబ్దకాలం గడిచిందన్నాడు భజ్జీ. తాను మాట్లాడేందుకు ప్రయత్నించినా ధోని నుంచి స్పందన లేకపోవడంతో తాను కూడా అతడికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు భజ్జీ తెలిపాడు.అదంతా నిజమేకాగా ధోని- భజ్జీ మధ్య విభేదాలున్నాయంటూ గతంలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా క్రికెట్నెక్స్ట్తో మాట్లాడిన హర్భజన్ సింగ్ అదంతా నిజమేనని ధ్రువీకరించాడు. కాగా 2007లో ధోని సారథ్యంలో టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో.. అదే విధంగా.. ధోని కెప్టెన్సీలోనే 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియాలోనూ హర్భజన్ సింగ్ సభ్యుడు. అంతేకాదు.. 2018 నుంచి 2020 వరకు ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున భజ్జీ ఆడటం గమనార్హం. అయితే, వీరిద్దరి బంధం బీటలు వారడానికి గల కారణంపై మాత్రం స్పష్టత లేదు. చదవండి: Asia Cup 2024: టీమిండియా ఓపెనర్ల ఊచకోత.. సెమీ ఫైనల్లో భారత్ -
సంజూ శాంసన్ తండ్రి క్షమాపణ చెప్పాలి.. లేదంటే!
టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ గురించి ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రాడ్ హాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సంజూ తండ్రి భారత క్రికెట్ దిగ్గజాలపై ఇష్టారీతిన కామెంట్లు చేయడం తగదని.. ఆయన క్షమాపణ చెబితే బాగుంటుందని హితవు పలికాడు. లేదంటే.. ఆ ప్రభావం సంజూ ఆటపై కచ్చితంగా పడుతుందని పేర్కొన్నాడు.కాగా కేరళకు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ 2015లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన అతడు.. ఆరేళ్ల తర్వాత వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక టెస్టుల్లో ఇంత వరకు సంజూ స్థానం దక్కించుకోలేకపోయాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ అతడికి అరకొర అవకాశాలే వచ్చేవి. అయితే, ఆ సమయంలోనూ నిలకడలేమి ఆటతో చోటు కోల్పోయేవాడు.సఫారీ గడ్డపై శతకాలు బాదిఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. సంజూకు టీ20 జట్టులో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో, సౌతాఫ్రికా గడ్డపై సంజూ బ్యాట్‌తో సత్తా చాటాడు. సఫారీలతో టీ20 సిరీస్‌లో రెండు శతకాలు బాది.. జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేశాడు.ఆ నలుగురి కారణంగానేఇలాంటి తరుణంలో సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ ఓ మలయాళ చానెల్‌తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. టీమిండియా దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ వల్లే తన కుమారుడి పదేళ్ల కెరీర్ నాశనమైనందని ఆయన ఆరోపించాడు. విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలపై ఆసీస్ లెజెండ్ బ్రాడ్ హాగ్ తాజాగా స్పందించాడు.ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదుఈ మేరకు.. ‘‘సంజూ శాంసన్ తండ్రి బహిరంగంగా ధోని, కోహ్లి, రోహిత్, ద్రవిడ్ పేర్లు చెబుతూ.. తన కొడుకు కెరీర్లో పదేళ్లు వెనకబడటానికి కారణం వాళ్లే అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. భారత క్రికెట్లో ముఖ్యమైన, కీలకమైన నాలుగు పేర్లను ఆయన ప్రస్తావించారు.వాళ్లంతా తమ హయాంలో టీమిండియాను అగ్రస్థానంలో నిలిపిన వ్యక్తులు. నిజానికి సంజూ శాంసన్ అద్భుతమైన ఆటగాడు. ఇప్పుడిప్పుడే కెరీర్లో నిలదొక్కుకుంటున్నాడు. రెండు సెంచరీలతో సత్తా చాటి.. తన స్థానాన్ని పదిలం చేసుకునే పనిలో ఉన్నాడు.సంజూ తండ్రి క్షమాపణ చెప్పాలి.. లేదంటే అతడిపై ఒత్తిడి పెరుగుతుందిఇలాంటి సమయంలో సంజూ కుటుంబం నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం.. అతడిపై ఒత్తిడిని పెంచుతుంది. నా అభిప్రాయం ప్రకారం.. సంజూ కెరీర్ సాఫీగా, ప్రశాంతంగా సాగాలంటే.. అతడి తండ్రి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే.. తండ్రి వ్యాఖ్యల వల్ల ఒత్తిడికి లోనైతే.. సంజూ ఆట తీరు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.నోళ్లను అదుపులో పెట్టుకునిఐపీఎల్లో ఇప్పటికే రాజస్తాన్ రాయల్స్ జట్టుకు అతడు కెప్టెన్‌గా ఉన్నాడు. సంజూతో పాటు భారత్‌లో ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు కొదవలేదు. కాబట్టి ఎవరైనా సరే.. నోళ్లను అదుపులో పెట్టుకుని.. బ్యాట్‌తోనే విమర్శకులకు సమాధానం ఇస్తే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు’’ అంటూ బ్రాడ్ హాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.చదవండి: ప్రపంచంలోని ప్రతి జట్టుకు ఇలాంటి ఆల్‌రౌండర్ అవసరం: టీమిండియా కోచ్ -
ఆ నలుగురు మావాడి కెరీర్‌ను నాశనం చేశారు: శాంసన్ తండ్రి
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో అద్బుతమైన సెంచరీతో చెలరేగిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తర్వాతి మ్యాచ్‌ల్లో తన జోరును కొనసాగించలేకపోతున్నాడు. వరుస ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించి చరిత్రకెక్కిన శాంసన్.. ఇప్పుడు అదే వరుస మ్యాచ్‌ల్లో డకౌటై తీవ్ర నిరాశపరిచాడు.ఏదైమైనప్పటకి బంగ్లాదేశ్, సౌతాఫ్రికాలపై వరుసగా సెంచరీలు సాధించిన సంజూ భారత టీ20 జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడనే చెప్పుకోవాలి. 2015లో టీమిండియా తరపున టీ20 అరంగేట్రం చేసిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ఎక్కువ సందర్భాల్లో జట్టు బయటే ఉన్నాడు.కొన్ని సార్లు జట్టులోకి వచ్చినప్పటికి తన పేలవ ప్రదర్శనతో నిరాశపరిచేవాడు. దీంతో అతడిని సెలక్టర్లు పక్కన పెట్టేవారు. అయితే ఇటీవల కాలంలో సీనియర్ ఆటగాళ్లు బీజీ షెడ్యూల్ కారణంగా సంజూకు టీ20 జట్టులో రెగ్యూలర్‌గా చోటు దక్కుతుంది.ఈసారి మాత్రం సంజూ తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. దీంతో అతడి అభిమానులు ఖుషీ అవుతున్నారు. కానీ సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అవకాశాలు ఇవ్వకుండా తన కొడుకు 10 ఏళ్ల కెరీర్‌ను నాశనం చేశారని ఆరోపించాడు. ఆ నలుగురే!"ముగ్గురు-నలుగురు వ్యక్తులు నా కొడుకు 10 ఏళ్ల కెరీర్‌ను నాశనం చేశారు. విరాట్ కోహ్లి, ధోని, రోహిత్ శర్మ వంటి కెప్టెన్లు సంజూ శాంసన్‌కు సరైన అవకాశాలు ఇవ్వలేదు. వారితో కూడా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా సంజూవైపు పెద్దగా మొగ్గు చూపలేదు.ఈ నలుగురు అతడి కెరీర్‌ను నాశనం చేయడంతో పాటు అతడిని తీవ్రంగా బాధపెట్టారు. కానీ సంజూ మాత్రం వాటన్నంటిని బలంగా ఎదుర్కొని ముందుకు వెళ్లాడు"అని మలయాళం అవుట్లెట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్వనాథ్ పేర్కొన్నాడు.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. అశ్విన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ -
థాయ్‌లాండ్ ట్రిప్‌లో ధోని కుటుంబం.. బీచ్ ఒడ్డున అలా (ఫొటోలు)
-
‘ఇకపై నీ పేరును పరిశీలించం’ అని ద్రవిడ్ డైరెక్ట్‌గానే చెప్పేశాడు!
‘సంతోషకరమైన నా క్రికెట్ ప్రయాణంలో ఇది నా చివరి సీజన్. రిటైర్మెంట్‌లోగా రంజీ ట్రోఫీలో మాత్రమే ఆడతాను. బెంగాల్‌కు చివరిసారి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా భావిస్తున్నా. ఈ సీజన్‌ను మర్చిపోలేనిదిగా మార్చుకుంటాం’ అంటూ టీమిండియా వెటరన్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యలు. భారత అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా చెప్పుకోదగ్గ సాహాకు రావాల్సినన్ని అవకాశాలు రాలేదనే చెప్పవచ్చు.ధోని నీడలో..నిజానికి వికెట్ కీపర్‌గా సాహా అద్భుత ప్రతిభావంతుడు. గత కాలపు భారత కీపర్లు సయ్యద్ కిర్మాణీ, కిరణ్ మోరె, నయన్ మోంగియా తరహాలో అత్యుత్తమ కీపింగ్ నైపుణ్యంతో పాటు అవసరమైతే కొంత బ్యాటింగ్ చేయగల సమర్థుడిగానే ఎక్కువగా గుర్తింపు పొందాడు. దేశవాళీ క్రికెట్లో బెస్ట్ కీపర్‌గా పేరు వచ్చినా... టీమిండియాను శాసిస్తున్న ధోని ఉండటంతో అతను తన చాన్స్ కోసం చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది.2010లో నాగపూర్ టెస్టుకు ముందు రోహిత్ శర్మ అనూహ్యంగా గాయపడటంతో సాహాకు బ్యాటర్‌గా తొలి టెస్టు ఆడే అవకాశం దక్కింది. మరో రెండేళ్ల తర్వాత స్లో ఓవర్‌రేట్ కారణంగా ధోనిపై నిషేధం పడటంతో రెండో టెస్టు దక్కింది. ఎట్టకేలకు 2014–15 ఆసీస్ పర్యటనలో తొలి టెస్టు తర్వాత ధోని అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో సాహా అసలు కెరీర్ మొదలైంది. అక్కడి నుంచి దాదాపు ఐదేళ్ల పాటు ప్రధాన కీపర్‌గా సాహా తన సత్తాను ప్రదర్శిస్తూ ప్రపంచ అత్యుత్తమ కీపర్లలో ఒకడిగా నిలిచాడు.పంత్ రాకతో పాత కథ మళ్లీ మొదలుస్వదేశంలో గిర్రున తిరిగే అతి కష్టమైన స్పిన్ బంతులనైనా, విదేశీ గడ్డపై సీమ్ బంతులనైనా స్టంప్‌ల వెనక చురుగ్గా, సమర్థంగా అందుకోవడంలో అతనికి అతనే సాటిగా నిలిచాడు. బ్యాటింగ్‌లో కూడా కొన్ని చక్కటి ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. అయితే రిషభ్ పంత్ దూసుకొచ్చిన తర్వాత సాహా వెనుకబడిపోయాడు. పంత్ ఉన్నప్పుడు కూడా కొంత కాలం రెండో కీపర్‌గా జట్టులో అవకాశం దక్కినా అది ఎంతో కాలం సాగలేదు. కోచ్ ద్రవిడ్ ‘ఇకపై నీ పేరును పరిశీలించం’ అంటూ సాహాకు నేరుగా చెప్పేయడంతో అతని టెస్టు కెరీర్ ముగిసింది. ఐపీఎల్లో అదే హైలైట్2008 నుంచి 2024 వరకు ఐపీఎల్ ఆడిన కొద్ది మంది ఆటగాళ్ల జాబితాలో సాహా కూడా ఉన్నాడు. కోల్‌కతా, చెన్నై, పంజాబ్, హైదరాబాద్, గుజరాత్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన అతను 170 మ్యాచ్‌లలో 127.57 స్ట్రయిక్‌రేట్‌తో 2934 పరుగులు సాధించాడు.ఇక 2014లో ఫైనల్లో పంజాబ్ తరఫున 55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో అజేయంగా 115 పరుగులు సాధించిన ప్రదర్శన అతని ఐపీఎల్ కెరీర్లో హైలైట్. 2022లో టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు.అతడిని తన వారసుడిగా తీర్చిదిద్దిబెంగాల్ యువ కీపర్ అభిషేక్ పొరేల్కు మెంటార్‌గా వ్యవహరించి తన వారసుడిగా అతడిని సాహా తీర్చిదిద్దాడు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)తో విభేదాల కారణంగా రెండేళ్లు త్రిపుర తరఫున ఆడిన సాహా ఈ సీజన్లో మళ్లీ తిరిగొచ్చాడు.అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సాహా... ఈ టోర్నీనే తనకు చివరిదని వెల్లడించాడు. మూడేళ్ల క్రితమే చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన 40 ఏళ్ల సాహా రంజీ తర్వాత దేశవాళీ క్రికెట్లోనూ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ కానున్నట్లు స్పష్టం చేశాడు. ఇక ఈ సీజన్ రంజీలో బెంగాల్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా...లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆడిన ఒకే ఒక ఇన్నింగ్స్‌లో అతను డకౌటయ్యాడు.కాగా టీమిండియా తరఫున 40 టెస్టులు ఆడిన సాహా 29.41 సగటుతో సాహా 1353 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు ఉన్నాయి. కీపర్‌గా 92 క్యాచ్‌లు అందుకున్న అతను 12 స్టంపింగ్‌లు చేశాడు. టీమిండియా తరఫున 9 వన్డేలు కూడా ఆడిన సాహాకు అంతర్జాతీయ టీ20లు ఆడే అవకాశం మాత్రం రాలేదు. 17 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో అతను 138 మ్యాచ్‌లు ఆడటం విశేషం.చదవండి: Rachin Ravindra: నేను వంద శాతం న్యూజిలాండ్‌వాడినే.. కానీ -
IPL 2025: మన లీడర్.. మన కెప్టెన్.. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరు?
గత మూడేళ్లుగా పేలవ ఆట తీరుతో వెనుకబడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తన అద్భుత కెప్టెన్సీతో ఈసారి టైటిల్ రేసులో నిలిపాడు ప్యాట్ కమిన్స్. ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్‌కప్ అందించిన సారథిగా నీరాజనాలు అందుకున్న ఈ ఫాస్ట్ బౌలర్.. ఫ్రాంఛైజీ తనకు చెల్లించిన రూ. 20.50 కోట్లకు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు.సహచర ఆటగాళ్లతో మమేమకమవుతూ సరైన సమయంలో అవకాశాలు ఇచ్చి జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. తద్వారా ఆరెంజ్ ఆర్మీకి ఇష్టమైన కెప్టెన్‌గా మారిపోయాడు. కానీ.. జాతీయ జట్టు విధుల దృష్ట్యా ఈసారి కమిన్స్ అసలు ఐపీఎల్ ఆడతాడా? కెప్టెన్‌గా కొనసాగుతాడా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, రిటెన్షన్ లిస్టు విడుదల సందర్భంగా సన్‌రైజర్స్ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది.మన లీడర్.. మన కెప్టెన్వచ్చే ఏడాది కూడా ప్యాటీనే రైజర్స్‌ను ముందుకు నడిపించబోతున్నాడని..ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది. ‘‘మన లీడర్.. మన కెప్టెన్... ప్యాటీ కమిన్స్ మిమ్మల్ని ఉప్పల్‌లో మరోసారి కలిసేందుకు సిద్ధంగా ఉన్నాడు’’ అంటూ ఆరెంజ్ ఆర్మీకి శుభవార్త అందించింది. ఇక ఈ ఏడాది పరుగుల విధ్వంసంతో రికార్డులు తిరగరాసిన సన్‌రైజర్స్.. రిటెన్షన్ల విషయంలోనూ దూకుడుగా వ్యవహరించింది. హార్డ్ హిట్టర్ హెన్రిక్ క్లాసెన్ కోసం ఏకంగా రూ. 23 కోట్లు ఖర్చు చేసింది. ఆ జట్లు వదిలేశాయిఇదిలా ఉంటే.. ఇతర ఫ్రాంఛైజీలలో కోల్‌కతా, ఢిల్లీ, లక్నో, పంజాబ్, బెంగళూరు తమ కెప్టెన్లను వేలంలోకి వదిలివేయగా.. చెన్నై, ముంబై, గుజరాత్, రాజస్తాన్ మాత్రం తమ సారథులను కొనసాగించాయి. దీంతో ఈసారి ఈసారి ఐపీఎల్ వేలం ఆసక్తికరంగా సాగడం ఖాయం.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం ఈనెల నెలాఖరున జరగనుండగా... రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు ఆటగాళ్లు అనూహ్యంగా కోట్లు కొల్లగొట్టగా... మరికొందరు స్టార్ ప్లేయర్లు ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అధిక ధర వీరికేఅందరికంటే అత్యధికంగా దక్షిణాఫ్రికా ‘హార్డ్ హిట్టర్’ హెన్రిచ్ క్లాసెన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ. 23 కోట్లు కేటాయించగా... విరాట్ కోహ్లీకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... నికోలస్ పూరన్‌కు లక్నో సూపర్ జెయింట్స్ రూ.21 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకున్నాయి. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుకు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా... ఇక మీదట కూడా నాయకుడిగా కొనసాగడం ఖాయం కాగా... ముంబై మొత్తంగా ఐదుగురు ప్రధాన ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అత్యధికంగా రూ. 18 కోట్లు కేటాయించిన ఫ్రాంచైజీ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు చెరో రూ. 16 కోట్ల 35 లక్షలు వెచ్చించింది.ఇక ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మకు రూ. 16 కోట్ల 30 లక్షలు కేటాయించింది. హైదరాబాద్ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మకు రూ.8 కోట్లు ఇచ్చి ముంబై తమ వద్దే పెట్టుకుంది. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరంటే?ఆటగాళ్ల కొనుగోలు కోసం ఒక్కో జట్టు రూ.120 కోట్లు ఖర్చు చేసుకునే అవకాశం ఉండగా... అందులో రూ. 75 కోట్లు రిటెన్షన్‌కు కేటాయించారు. తాజా జాబితాను చూస్తే ముంబై ఇండియన్స్ జట్టు రీటైన్ను సంపూర్ణంగా వాడుకోగా... అత్యల్పంగా పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం ఇద్దరు ప్లేయర్లనే అట్టి పెట్టుకుంది. పంజాబ్ మరీ ఇద్దరినేపంజాబ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆ్రస్టేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యూహాల్లో భాగంగా... కేవలం ఇద్దరు ‘అన్క్యాప్డ్’ ప్లేయర్లను మాత్రమే రీటైన్ చేసుకున్న పంజాబ్ వద్ద వేలం కోసం అత్యధికంగా రూ. 110.5 కోట్లు మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ వేలానికి వదిలేయగా... తొమ్మిదేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో కొనసాగుతున్న రిషబ్ పంత్‌ను ఫ్రాంచైజీ వదిలేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కేఎల్ రాహుల్‌పై నమ్మకం ఉంచలేదు. రింకూ సింగ్‌కు జాక్‌పాట్.. ధోనీ ‘అన్క్యాప్డ్’ ప్లేయర్చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ సహా మొత్తం ఐదుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకోగా... రాజస్తాన్ రాయల్స్ కూడా ఆరుగురు ప్లేయర్లను రీటైన్ చేసుకుంది. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 16 కోట్ల 50 లక్షలు కేటాయించగా... సిక్సర్ల వీరుడు రింకూ సింగ్‌కు కోల్‌కతా రూ.13 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది. వెస్టిండీస్ ద్వయం రసెల్, నరైన్‌తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి తలా రూ. 12 కోట్లు కేటాయించింది. కోల్‌కతా వదిలేసుకున్న శ్రేయస్ అయ్యర్ కోసం వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడటం ఖాయమే కాగా... సారథి కోసం చూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పంత్‌పై కన్నేసే అవకాశాలు ఉన్నాయి. బేబీ మలింగకు రూ. 13 కోట్లుజాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఐదేళ్లు దాటిపోయిన ధోనీని ఐపీఎల్ నిబంధనల ప్రకారం ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ కోటాలో రీటైన్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ... మాజీ సారథికి రూ.4 కోట్లు కేటాయించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చెరో రూ. 18 కోట్లు వెచ్చించింది. శ్రీలంక పేసర్ పతిరణకు రూ. 13 కోట్లు, పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేను రూ.12 కోట్లకు అట్టిపెట్టుకుంది. రాజస్తాన్ రైట్రైట్రిటైనింగ్లో మొత్తం ఆరు అవకాశాలను వాడుకున్న రాజస్తాన్ రాయల్స్... సంజూ సామ్సన్, యశస్వి జైస్వాల్‌కు చెరో రూ.18 కోట్లు కేటాయించింది. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్‌కు చెరో రూ. 14 కోట్లు వెచ్చించింది.పూరన్ కోసం అంత అవసరమా?కేఎల్ రాహుల్‌ను వేలానికి వదిలేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిలకడగా ఆడతాడో లేదో తెలియని వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ కోసం రూ. 21 కోట్లు కేటాయించింది. గాయాలతో సహవాసం చేసే సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్, స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు రూ. 11 కోట్లు కేటాయించిన లక్నో... మొహసిన్ ఖాన్, ఆయుష్ బదోనీలకు చెరో రూ. 4 కోట్లు వెచ్చించింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు రూ.18 కోట్లు కేటాయించిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ... కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను రూ. 16 కోట్ల 50 లక్షలకు అట్టిపెట్టుకుంది. వేలానికి రానున్న ప్రధాన ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్, చాహల్, అశ్విన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, షమీ (భారత్). వార్నర్, మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, స్టొయినిస్ ఆస్ట్రేలియా). బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, స్యామ్ కరన్, బట్లర్, ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్). డుప్లెసిస్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, నోర్జే (దక్షిణాఫ్రికా). కాన్వే, రచిన్ రవీంద్ర, బౌల్ట్ (న్యూజిలాండ్). చదవండి: Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమి -
IPL 2025: సీఎస్కే సంచలన నిర్ణయం!
ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజాను వేలంలోకి విడిచిపెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కోసం జడ్డూను రిలీజ్ చేయాలని నిశ్చయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఆ ముగ్గురిని రిటైన్ చేసుకుని...కాగా తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు ఫ్రాంఛైజీలకు గురువారం వరకే గడువు ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీశ పతిరణలను రిటైన్ చేసుకోవాలని సీఎస్కే భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా అట్టిపెట్టుకోనుందట.ధోని వారసుడి కోసంఅయితే, లెజెండరీ వికెట్ కీపర్ ధోనికి సరైన వారసుడిని ఎంపిక చేసే క్రమంలో జడేజా విషయంలో రిస్క్ తీసుకునేందుకు సీఎస్కే సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో రిషభ్ పంత్ తెగదెంపులు చేసుకున్నాడన్న వార్తల నేపథ్యంలో.. అతడు వేలంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.ప్రైస్ ట్యాగ్ గనుక రూ. 20 కోట్లు దాటితే ఎలా?ఒకవేళ అదే జరిగితే పంత్ భారీ ధర పలకడం ఖాయం. అతడి ప్రైస్ ట్యాగ్ గనుక రూ. 20 కోట్లు దాటితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నల నేపథ్యంలో సీఎస్కే తన రిటెన్షన్ లిస్టు మార్పుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పంత్ కోసం భారీగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమైన సీఎస్కే.. రవీంద్ర జడేజాను వేలంలోకి వదిలి.. రైట్ టు మ్యాచ్(RTM) కార్డు ద్వారా అతడిని మళ్లీ సొంతం చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.వరల్డ్ కప్ విన్నర్.. కానీకాగా జడ్డూ ఇటీవల టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులో సభ్యుడు. అయితే, ఈ మెగా టోర్నీ తర్వాత అతడు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. అంతేకాదు ఇటీవలి కాలంలో అతడి టీ20 గణాంకాలు ముఖ్యంగా బ్యాటింగ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. దీంతో జడ్డూను విడిచిపెట్టినా.. మళ్లీ ఆర్టీఎమ్ కార్డుతో కొనవచ్చని సీఎస్కే భావిస్తోందట.అంటే.. జడ్డూకి డిమాండ్ లేకపోతే.. వేరే ఫ్రాంఛైజీ అతడిని తక్కువ ధరకు కొన్నట్లయితే.. అంతే మొత్తం చెల్లించి అతడిని తిరిగి తాము సొంతం చేసుకునేందుకు ఆర్టీఎమ్ కార్డును వాడుకోనుందన్న మాట. అలా కాకుండా ఒకవేళ జడ్డూను రిటైన్ చేసుకుంటే అతడికి రూ. 18 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుంది.అందుకే రిలీజ్ చేయాలనే యోచనలోఅలా అయితే, వేలంలో పంత్‌ను కొనుక్కునేందుకు తగినంత సొమ్ము ఉండకపోవచ్చు. అందుకే పంత్ కోసం జడ్డూను రిలీజ్ చేయాలని సీఎస్కే నిర్ణయించినట్లు ఐపీఎల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక తమ రిటెన్షన్‌లో భాగంగా రుతుకు రూ. 18 కోట్లు, పతిరణకు రూ. 14 కోట్లు, ధోనికి రూ. 4 కోట్లు చెన్నై ఫ్రాంఛైజీ చెల్లించనుందట!! కెప్టెన్‌గా నియమించినా..కాగా జడ్డూకు సీఎస్కేతో సుదీర్ఘ అనుబంధం ఉంది. జట్టును చాంపియన్‌గా నిలపడంలో అతడి పాత్ర కీలకం. కాగా 2012లో జట్టులో చేరిన జడ్డూ.. తర్వాత గుజరాత్ లయన్స్‌కు ఆడాడు. అనంతరం మళ్లీ 2018లో చెన్నైతో జట్టు కట్టిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటికీ అదే టీమ్‌లో ఉన్నాడు. అయితే, 2022లో కెప్టెన్‌గా అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇక ఇప్పటి వరకు తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో జడ్డూ 240 మ్యాచ్‌లు ఆడి 2959 రన్స్ చేయడంతో పాటు 160 వికెట్లు తీశాడు.చదవండి: Aus A vs Ind A: రుతు, నితీశ్ డకౌట్.. అభిమన్యు, ఇషాన్ విఫలం -
‘నీకు క్రికెట్ రూల్స్ తెలియవు.. నేను చెప్పినట్టే జరుగుతుంది’
ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఒకడు. భారత్‌కు మూడుసార్లు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఈ జార్ఖండ్ డైనమైట్ హయాంలోనే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్లు వెలుగులోకి వచ్చారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత ధోని సొంతం.అలాంటి ఈ లెజెండరీ ఆటగాడికే క్రికెట్ రూల్స్ తెలియవట!.. ఈ మాట అన్నది మరెవరో కాదు.. ధోని సతీమణి సాక్షి. ‘నీకు రూల్స్ తెలియవు.. నేను చెప్పినట్లే జరుగుతుంది’ అని భర్తకే పాఠాలు చెప్పినంత పనిచేసిందట. ఈ విషయాన్ని స్వయంగా ధోనినే వెల్లడించాడు. ఇంతకీ విషయం ఏమిటంటే..?!బౌలర్ వైడ్ బాల్ వేశాడు‘‘ఓరోజు నేను, సాక్షి కలిసి ఇంట్లో వన్డే మ్యాచ్ చూస్తున్నాం. సాధారణంగా ఇద్దరం కలిసి టీవీ చూస్తున్నపుడు మేము క్రికెట్ గురించి మాట్లాడుకోము. అయితే, ఆరోజు మ్యాచ్‌లో.. బౌలర్ వైడ్ బాల్ వేశాడు. బ్యాటర్ మాత్రం షాట్ ఆడేందుకు ముందుకు రాగా.. వికెట్ కీపర్ బంతిని అందుకుని స్టంపౌట్ చేశాడు. అయితే, నా భార్య మాత్రం అతడు అవుట్కాలేదనే అంటోంది.అప్పటికు ఆ బ్యాటర్ పెవిలియన్ వైపు వెళ్లిపోతున్నాడు. అయినా సరే.. అంపైర్లు అతడిని వెనక్కి పిలిపిస్తారని.. వైడ్ బాల్లో స్టంపౌట్ పరిగణనలోకి తీసుకోరని వాదిస్తోంది. అప్పుడు నేను.. వైడ్‌బాల్‌కి స్టంపౌట్ అయినా అవుటైనట్లేనని.. కేవలం నో బాల్ వేసినపుడు మాత్రమే బ్యాటర్ స్టంపౌట్ కాడని చెప్పాను. అయినా సరే తను వినలేదు.నీకు క్రికెట్ గురించి తెలియదు.. ఊరుకో అంటూ నన్ను కసిరింది. థర్డ్ అంపైర్ నిర్ణయం తర్వాత సదరు బ్యాటర్ వెనక్కి వస్తాడు చూడంటూ చెబుతూనే ఉంది. అయితే, అప్పటికే ఆ బ్యాటర్ బౌండరీ లైన్ దాటి వెళ్లిపోవడం.. కొత్త బ్యాటర్ రావడం జరిగింది. ఏదో తప్పు జరిగిందిఅప్పుడు కూడా సాక్షి.. ‘ఏదో తప్పు జరిగింది’ అంటూ తన వాదనను సమర్థించుకునే ప్రయత్నం చేసింది’’ అంటూ ధోని ఓ ఈవెంట్లో చెప్పాడు. తన భార్యతో జరిగిన సరదా సంభాషణను ప్రేక్షకులతో పంచుకుని నవ్వులు పూయించాడు. అదీ సంగతి!! ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో ధోని ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన ఒంట్లో శక్తి ఉన్నన్ని రోజు ఆడుతూనే ఉంటానని 43 ఏళ్ల తలా అభిమానులకు శుభవార్త అందించాడు.చదవండి: శతక్కొట్టిన కృనాల్ పాండ్యా.. ‘మా అన్న’ అంటూ హార్దిక్ పోస్ట్ వైరల్ -
IND VS NZ 2nd Test: ధోని తరహాలో రనౌట్ చేసిన జడ్డూ
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మూడో రోజు ఆటలో రవీంద్ర జడేజా ఎంఎస్ ధోని తరహాలో ఓ రనౌట్ చేశాడు. జడేజా బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ రెండో పరుగు కోసం ప్రయత్నించగా ఫీల్డర్ వాషింగ్టన్ సుందర్ బంతిని నాన్ స్టయికర్ వైపు విసిరాడు. వికెట్ల వద్ద బాల్‌ను కలెక్ట్ చేసుకున్న జడేజా చూడకుండా బంతిని వికెట్లపైకి విసిరాడు. ఈ లోపు నాన్ స్ట్రయికర్ వైపు పరుగు తీస్తున్న విలియమ్ ఓరూర్కీ క్రీజ్‌ను చేరుకోలేకపోయాడు. జడేజా డౌట్ ఫుల్‌గా అప్పీల్ చేయగా.. రీప్లేలో అది ఔట్‌గా తేలింది. గతంలో ధోని చాలా సార్లు ఇలా ఫీల్డర్లు విసిరిన బంతిని చూడకుండానే వికెట్లపైకి నెట్టి రనౌట్స్ చేశాడు. జడ్డూ రనౌట్ చేసిన విధానాన్ని చూసిన నెటిజన్లు ధోని శిష్యుడివి అనిపించుకున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.The Thala effect in Ravindra Jadeja's run out. 😄pic.twitter.com/tBoXdr27O6— Mufaddal Vohra (@mufaddal_vohra) October 26, 2024కాగా, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైన న్యూజిలాండ్ టీమిండియా ముందు 359 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో (సెకెండ్) టామ్ లాథమ్ అర్ద సెంచరీతో (86) రాణించగా.. టామ్ బ్లండెల్ (41), గ్లెన్ ఫిలిప్స్ (48 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4, రవీంద్ర జడేజా 3, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ సాంట్నర్ ఏడు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాశించాడు. గ్లెన్ ఫిలిప్స్ 2, సౌతీ ఓ వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యశస్వి, గిల్ చెరో 30 పరుగులు చేశారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లతో చెలరేగి కివీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కివీస్ ఇన్నింగ్స్‌లో కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) అర్ద సెంచరీలతో రాణించారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ తొలి టెస్ట్‌లో నెగ్గిన విషయం తెలిసిందే. -
జార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎమ్ఎస్ ధోనీ
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎస్ ధోనీ ఫోటోను ఉపయోగించేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె.రవికుమార్ వెల్లడించారు. ‘‘తన ఫోటోను ఉపయోగించుకోవడానికి ఎన్నికల కమిషన్‌కు మహేంద్ర సింగ్ ధోనీ అంగీకారం తెలిపారు. ఇతర వివరాల కోసం మేము ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నాం. మహేంద్ర సింగ్ ధోని ఓటర్ల సమీకరణకు కృషి చేస్తారు’’ అని జార్ఖండ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె.కుమార్ అన్నారు. స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమం కింద ఓటర్లలో అవగాహన పెంచేందుకు ధోనీ కృషి చేయనున్నారు. ముఖ్యంగా ఓటర్లకు.. ఎక్కువ సంఖ్యలో ఓటు వేయాలనే ఉత్సాహాన్ని పెంచేందుకు ధోనీ విజ్ఞప్తిని, ప్రజాదరణను వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. జార్ఖండ్ అసెంబ్లీలోని 81 స్థానాలకు నవంబర్ 13, నవంబర్ 20న రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. -
IND VS NZ 2nd Test: ధోని సరసన హిట్‌మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సరసన చేరాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సార్లు డకౌటైన భారత కెప్టెన్ల జాబితాలో ఈ ఇద్దరూ సరిసమానంగా నిలిచారు. ఇంటర్నేషనల్ క్రికెట్లో ధోని, రోహిత్ చెరో 11 సార్లు డకౌటయ్యారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ డకౌటయ్యాడు. భారత కెప్టెన్‌గా రోహిత్ డకౌట్ కావడం 143 ఇన్నింగ్స్‌ల్లో ఇది 11వ సారి.ఈ విభాగపు జాబితాలో విరాట్ కోహ్లి టాప్‌లో ఉన్నాడు. విరాట్ భారత కెప్టెన్ 250 ఇన్నింగ్స్‌ల్లో 16 సార్లు డకౌటయ్యాడు. ఆతర్వాత సౌరవ్ గంగూలీ అత్యధికంగా 13 సార్లు, ధోని, రోహిత్ 11 సార్లు, కపిల్ దేవ్ 10 సార్లు భారత కెప్టెన్లుగా డకౌట్లయ్యారు.ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. తొలి రోజు ఆఖరి సెషన్లో బ్యాటింగ్‌కు దిగి వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. రోహిత్ శర్మ టిమ్ సౌథీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా.. యశస్వి జైస్వాల్ (6), శుభ్‌మన్ గిల్ (10) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు వాషింగ్టన్ సుందర్ (7/59), రవిచంద్రన్ అశ్విన్ (3/64) ధాటికి న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. వీరిద్దరే 10 వికెట్లు తీసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను పరిసమాప్తం చేశారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) అర్ద సెంచరీలు చేయగా.. మిగిలిన వారెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు.చదవండి: చరిత్ర సృష్టించిన వాషింగ్టన్.. తొలి భారత ప్లేయర్‌గా -
Ind vs NZ: రోహిత్ శర్మ చెత్త రికార్డు.. సచిన్ సరసన
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా ఇటీవల స్వదేశంలో టీమిండియా బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి ఫైనల్‌కు మరింత చేరువైంది. ఈ క్రమంలో సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు గెలిస్తే నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టేదే! అయితే, వరుస విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేనకు కివీస్ ఊహించని షాకిచ్చింది.కివీస్ 36 ఏళ్ల తర్వాతబెంగళూరులో ఘన విజయం సాధించి.. భారత గడ్డపై 36 ఏళ్ల తర్వాత తొలి గెలుపు నమోదు చేసింది. చివరగా 1988లో ముంబైలోని వాంఖడేలో టెస్టు మ్యాచ్ గెలిచిన న్యూజిలాండ్.. ఇప్పుడిలా తాజాగా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. మరోవైపు.. స్వదేశంలో కెప్టెన్‌గా రోహిత్‌కు టెస్టుల్లో ఇది మూడో పరాజయం.రోహిత్ శర్మ చెత్త రికార్డు.. సచిన్ సరసనఈ నేపథ్యంలో సొంతగడ్డపై అత్యధిక టెస్టులు ఓడిన టీమిండియా సారథుల జాబితాలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లిని అధిగమించాడు. బిషన్ బేడి, మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీల సరసన చేరాడు. ఇప్పటి వరకు భారత్‌లో అత్యధికంగా తొమ్మిది మ్యాచ్‌లు ఓడి ఈ జాబితాలో మన్సూర్ అలీ పటౌడీ ఖాన్ ప్రథమ స్థానంలో ఉన్నాడు.కోహ్లి అలా.. రోహిత్ ఇలాకాగా కోహ్లి సారథ్యంలో భారత గడ్డపై టీమిండియా 2017లో ఆస్ట్రేలియా చేతిలో, 2021లో ఇంగ్లండ్ చేతిలో టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే, ఆ రెండు సందర్భాల్లోనూ భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2023-24 బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో, 2024 ఆరంభంలో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైంది.అయితే, అప్పుడు కూడా సిరీస్‌లను 2-1, 4-1తో గెలవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య గురువారం(అక్టోబరు 24) నుంచి పుణె వేదికగా రెండో టెస్టు మొదలుకానుంది. ఇక తొలి టెస్టులో భారత జట్టు ఓడినప్పటికీ సర్ఫరాజ్ ఖాన్(150), రిషభ్ పంత్(99) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. మరోవైపు రోహిత్ శర్మ మొత్తంగా 54 పరుగులు రాబట్టాడు.స్వదేశంలో అత్యధిక టెస్టులు ఓడిన టీమిండియా కెప్టెన్లు👉మన్సూర్ అలీ పటౌడీ ఖాన్- 9👉కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్దీన్- 4👉రోహిత్ శర్మ, బిషన్ బేడి, మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ- 3👉విరాట్ కోహ్లి- 2.చదవండి: Ind vs NZ: టీమిండియాలోకి చెన్నై చిన్నోడు.. బీసీసీఐ ప్రకటన -
IPL 2025- CSK: ధోనికి రూ. 4 కోట్లు! వాళ్లిద్దరూ జట్టుతోనే!
ఐపీఎల్-2025 మెగా వేలానికి ఫ్రాంఛైజీలు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల (అక్టోబరు) 31 నాటికి.. అట్టిపెట్టకునే ఆటగాళ్ల తుదిజాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) రిటెన్షన్స్‌కు సంబంధించి ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.కాగా ఐపీఎల్ పాలక మండలి రిటెన్షన్ విధానంలో భాగంగా కొత్త నిబంధనలు తెచ్చిన విషయం తెలిసిందే. ఈసారి ఫ్రాంఛైజీలు గరిష్టంగా ఆరుగురు(ఆర్టీఎమ్) ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో రిటెన్షన్ స్లాబ్‌లో మొదటి ఆటగాడికిరూ. 18 కోట్లు, రెండో ప్లేయర్‌కు రూ. 14 కోట్లు, మూడో క్రికెటర్‌కు రూ. 18 కోట్లు, నాలుగో ఆటగాడికి రూ. 14 కోట్లు, ఐదో ఆటగాడికి రూ. 11 కోట్లు, ఆరో ఆటగాడికి రూ. 4 కోట్లు(అన్క్యాప్డ్) చెల్లించాల్సి ఉంటుంది.సీఎస్కే రిటైన్ చేసుకునేది వీరినే? ఎవరికి ఎన్ని కోట్లుఇక తాజా సమాచారం ప్రకారం సీఎస్కే తమ టాప్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌లతో పాటు రవీంద్ర జడేజా, శివం దూబే, మతీశ పతిరణలను రిటైన్ చేసుకోవాలని ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఇందులో ధోనిని అన్క్యాప్డ్ కోటాలో ఎంపిక చేసుకుని రూ. 4 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైన ఫ్రాంఛైజీ.. రుతుతో పాటు జడ్డూకు రూ. 18 కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు.. రుతురాజ్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా 2008లో ఐపీఎల్ ఆరంభమైన నాటి నుంచి ధోని చెన్నై ఫ్రాంఛైజీతోనే కొనసాగుతున్నాడు. జట్టును అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి ఈ ఘనత సాధించిన రెండో కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. అయితే, గతేడాది సారథ్య బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన ధోని ఆటగాడిగా కొనసాగాడు.సీఎస్కే అంటే ధోనినిజానికి ధోని అంటే సీఎస్కే.. సీఎస్కే అంటే ధోని. ధోని బ్రాండ్ వల్లే చెన్నై ఫ్రాంఛైజీకి ఆదరణ పెరుగిందనేద కాదనలేని వాస్తవం. అంతేకాదు.. వేలం మొదలు కెప్టెన్సీ వరకు ధోని ఆజ్ఞ లేనిదే అక్కడ ఏ పని జరగదని సన్నిహిత వర్గాలు అంటాయి. మరి అలాంటి ధోని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ఎలా? అంటే.. బీసీసీఐ నిబంధన ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత ఆటగాళ్లను ఫ్రాంఛైజీలో ఈ కోటాలో వేసుకోవచ్చు.PC: BCCIఇద్దరు శిష్యులుచెన్నైకి రుతుతో పాటు జడేజా కూడా ముఖ్యం కాబట్టి వాళ్లిద్దరికి రూ. 18 కోట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. కాగా రుతురాజ 2019లో సీఎస్కేలో చేరాడు. 2020లో అరంగేట్రం చేసిన అతడు ఆ మరుసటి ఏడాదే ఆరెంజ్‌క్యాప్ హోల్డర్ అయ్యాడు. ఆసియా క్రీడలు-2023లో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు సారథ్యం వహించి గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత.. ఈఏడాది సీఎస్కే పగ్గాలు చేపట్టాడు.ఇక రవీంద్ర జడేజాకు సీఎస్కేతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2022లో కెప్టెన్‌గానూ నియమితుడయ్యాడు. కానీ వరుస ఓటముల నేపథ్యంలో మధ్యలోనే కెప్టెన్సీ వదిలేశాడు. ఈ ఇద్దరికి వరుస అవకాశాలు ఇచ్చి జట్టులో కీలక సభ్యులుగా నిలబెట్టింది మాత్రం ధోనినే!చదవండి: Ind vs NZ: టీమిండియాలోకి చెన్నై చిన్నోడు.. బీసీసీఐ ప్రకటన -
వారెవ్వా పంత్.. దెబ్బకు ధోని రికార్డు బద్దలు
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఓ వైపు గాయం బాధపడుతూనే సెకెండ్ ఇన్నింగ్స్‌లో తన 12వ టెస్ట్ హాఫ్ సెంచరీని సాధించాడు. గాయం కారణంగా మూడో రోజు ఆటకు దూరమైన పంత్.. కీలకమైన నాలుగో రోజు ఆటలో తిరిగి మైదానంలో మళ్లీ అడుగుపెట్టాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి భారత స్కోర్ బోర్డును పంత్ పరుగులు పెట్టిస్తున్నాడు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన రిషబ్.. నెమ్మదిగా తన బ్యాటింగ్‌లో స్పీడ్‌ను పెంచాడు. 54 పరుగులతో పంత్ ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 5 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి.ధోని రికార్డు బద్దలుఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన పంత్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 2,500 పరుగుల మైలు రాయిని అందుకున్న భారత వికెట్ కీపర్‌గా పంత్ రికార్డులకెక్కాడు. ఇంతకు ముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ధోని ఈ మైలు రాయిని 69 ఇన్నింగ్స్‌లలో అందుకోగా.. రిషబ్ కేవలం 62 ఇన్నింగ్స్‌లలోనే సాధించాడు. చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి! -
ధోని కోసమే ఆ రూల్స్‌ను మార్చారు: మహ్మద్ కైఫ్
ఐపీఎల్-2025 సీజన్లో టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఆడటం దాదాపు ఖాయమైనట్లే. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్‌ను తిరిగి తీసుకురావడంతో.. ధోని రిటెన్షన్‌కు మార్గం సుగమమైంది. వచ్చే ఏడాది సీజన్లో ధోని అన్క్యాప్డ్ కోటాలో సీఎస్కే తరపున బరిలోకి దిగనున్నాడు. అతడిని రూ. 4 కోట్ల కనీస ధరకు సీఎస్కే రిటైన్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనిలో ఆడాలనే కోరిక ఉన్నంతవరకు ఐపీఎల్ నియమాలు మారుతూనే ఉంటాయని కైఫ్ అభిప్రాయపడ్డాడు."వచ్చే ఏడాది సీజన్లో కూడా ధోని ఆటను మనం చూడబోతున్నాం. అతడు ఫిట్‌గా ఉన్నాడు. అంతేకాకుండా తన స్టైల్లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వికెట్ల వెనక కూడా అద్భుతాలు చేస్తున్నాడు. ఎంఎస్ ఆడాలనుకున్నంత కాలం, నియమాలు మారుతూనే ఉంటాయి. ధోని కోసం రూల్స్ మార్చిన తప్పులేదు. అతడొక లెజెండ్, సీఎస్కేకు మ్యాచ్ విన్నర్. అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్‌ను ధోని కోసమే తిరిగి తీసుకు వచ్చారని నేను భావిస్తున్నాను. ధోనికి మనీతో పనిలేదు. ఈ విషయాన్ని స్వయంగా అతడే చాలా సార్లు చెప్పాడు.టీమ్ మేనేజ్మెంట్ ఏం కోరుకుంటే అది చేస్తానని తలా గతంలో స్పష్టం చేశాడు. రూ. 4 కోట్లు అనేది అతడికి చిన్నమొత్తం అయినప్పటకి, సీఎస్కే రిటైన్ చేసుకునేందుకు సిద్దంగా ఉంది. సీఎస్కేతో అతడికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైఫ్ పేర్కొన్నాడు.అసలేంటి ఈ అన్క్యాప్డ్ పాలసీ?ఐపీఎల్ తొలి సీజన్(2008)లో అన్క్యాప్డ్ పాలసీని నిర్వహకులు తీసుకువచ్చారు. ఈ విధానం ప్రకారం.. గత ఐదేళ్లలో అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఏ ఆటగాడనైనా అనక్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణించవచ్చు. కానీ ఈ నియమాన్ని ఫ్రాంచైజీలు పెద్దగా ఉపయోగించకోకపోవడంతో ఐపీఎల్ నిర్వహకులు 2021 సీజన్లో తొలగించారు. ఇప్పుడు మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఈ నియమం మళ్లీ అమలులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. కాగా ఈ రూల్ ద్వారా రిటైన్ అవ్వడానికి ధోనితో పాటు మోహిత్ శర్మ(గుజరాత్ టైటాన్స్), సందీప్ శర్మ(రాజస్తాన్), పియూష్ చావ్లా(ముంబై ఇండియన్స్) మాత్రమే అర్హులు. వీరిందరూ గత ఐదేళ్ల నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నారు.చదవండి: పాక్ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్? -
ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్: భారత స్పిన్ దిగ్గజం
మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్. అతడి సారథ్యంలో భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 గెలిచింది. ఇక ఫ్రాంఛైజీ క్రికెట్లోనూ ఈ జార్ఖండ్ డైనమైట్.. 2008లో మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆది నుంచి చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)కు ఆడుతున్నాడు. సారథిగా సీఎస్కేను ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిపాడు. మరోవైపు.. రోహిత శర్మ.. టీమిండియా ప్రస్తుత కెప్టెన్. ఇటీవలే టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ గెలిచాడు. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు సుదీర్ఘకాలం పాటు కెప్టెన్‌గా ఉండి.. ధోని కంటే ముందుగానే ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన సారథిగా చరిత్రకెక్కాడు.ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్‌కాగా టీమిండియాలో ఇద్దరితో కలిసి, ఐపీఎల్లో ఈ ఇద్దరి కెప్టెన్సీలోనూ ఆడాడు టీమిండియా దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఈ నేపథ్యంలో ఇద్దరి నాయకత్వ శైలిని పోలుస్తూ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్ అని తన మనసులోని మాట బయటపెట్టాడు. అందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ..ధోని ఎవరితో మాట్లాడడు‘‘ఇద్దరిలో ఎవరు బెటర్ అంటే.. నేను ధోనిని కాదని రోహిత్ వైపే మొగ్గుచూపుతాను. ఎందుంకటే రోహిత్ ప్లేయర్స్ కెప్టెన్. ప్రతి ఒక్క ఆటగాడి దగ్గరికి వెళ్లి వాళ్లకు ఏం కావాలో అడిగి తెలుసుకుంటాడు. సహచరులతో అతడికి మంచి అనుబంధం ఉంటుంది.అయితే, ధోని కెప్టెన్సీ స్టైల్ వేరుగా ఉంటుంది. అతడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. తన మౌనం ద్వారానే ఎదుటివారికి తన మనసులోని మాట చేరాలని భావిస్తాడు. ఇతరులతో ధోని సంభాషించే విధానం ఇలాగే ఉంటుంది’’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. రోహిత్ శర్మకు స్నేహితులే తప్ప.. అతడికి విరుద్ధంగా మాట్లాడేవారు ఒక్కరూ ఉండరని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. స్పోర్ట్స్ యారీ ఇంటర్వ్యూలో భజ్జీ ఈ వ్యాఖ్యలు చేశాడు.చదవండి: Babar Azam: బాబర్ ఆజం సంచలన నిర్ణయం..Rohit Sharma is a better captain than MS Dhoni says Harbhajan Singh Full podcast at 9pm tonight, only on Sports Yaari YouTube Channel 🇮🇳pic.twitter.com/6tVAdJh6qx— Sushant Mehta (@SushantNMehta) October 2, 2024