Bhopal
-
ఆలస్యానికి అతిథులకు క్షమాపణలు చెప్పిన ప్రధాని
-
మధ్యప్రదేశ్‌కు ప్రధాని మోదీ.. క్యాన్సర్ ఆస్పత్రికి శంకుస్థాపన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు (ఆదివారం) మధ్యప్రదేశ్ చేరుకోనున్నారు. నేడు ఆయన ఛతర్‌పూర్‌లోని బాగేశ్వర్ థామ్‌లో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు సాగే మధ్యప్రదేశ్ పర్యటనలో ప్రధాని మోదీ స్థానిక బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. మధ్యప్రదేశ్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ బీహార్, అస్సాంలలోనూ పర్యటించనున్నారు. ఈరోజు(ఆదివారం) మధ్యాహ్నం రెండు గంటలకు ప్రధాని మోదీ ఛతర్పూర్ చేరుకోనున్నారు. అక్కడి బాబా బాగేశ్వర్ థామ్‌లో ఒక ట్రస్ట్ తరపున నిర్మితవుతున్న క్యాన్సర్ ఆస్పత్రికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఆస్పత్రి నిర్మాణానికి రూ. 208 కోట్లు ఖర్చు కానుంది.క్యాన్సర్ ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మోదీ భోపాల్ చేరుకోనున్నారు. ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లో విశ్రాంతి తీసుకోనున్నారు. సోమవారం ఉదయం గ్లోబల్ ఇన్వెంటర్స్ సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం మోదీ.. అస్సాంకు బయలుదేరనున్నారు. ఒక అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రధాని మోదీ ఈరోజు 2:35కు మధ్యప్రదేశ్‌లోని ఖజురహో ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. సాయంత్రం భోపాల్‌లో బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh: ముఖ్యమంత్రి యోగి మరో రికార్డు -
గొంతుకోసి చెత్తకుప్పలోకి విసిరేస్తే..
ఆడబిడ్డ పుట్టిందని ఏ చెత్తకుప్పల్లోనో, గుడిమెట్ల మీద వదిలేసే ఘటనలు చూసే ఉంటారు. కానీ, ఇక్కడ ఓ నాన్నమ్మ వద్దనుకోవడంతోనే ఆగిపోలేదు. అతికర్కశంగా.. తన కొడుకుకు పుట్టిన బిడ్డను గొంతు కోసి చెత్తకుప్పలో పడేసింది. అయితే.. తుంచిన ఆ పసిమొగ్గకు వైద్యులు మళ్లీ ఊపిరిపోసి పునర్జన్మ ప్రసాదించారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో.. నెలరోజుల కిందట అప్పుడే పుట్టిన ఆడపిల్లను గొంతు కోసి చెత్తకుండీలో పడేసింది ఆమె నానమ్మ. రక్తపుమడుగులో చలనం లేని స్థితిలో పడి ఉన్న బిడ్డ దేహాన్ని పోలీసులు భోపాల్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. మెడ భాగంలో తీవ్ర స్రావం కావడంతో బతకడం కష్టమేనని వైద్యులు భావించారు. అయితే.. పెద్ద అద్భుతమే జరిగింది!. పాప గొంతు కోసినా కీలకమైన ధమనులు, సిరల తెగలేదు. దీంతో పలు శస్త్రచికిత్సలు చేసి ఆమెను బతికించగలిగారు వైద్యులు. మొత్తంగా.. ఆ బిడ్డకు నెల రోజులపాటు చికిత్స అందించి కోలుకునేలా చేశారు. పైగా ఆ పాపకు పీహూ అని పేరు పెట్టారు. బాలల సంక్షేమ కమిటీ అనుమతితో మృత్యువును జయించిన పీహూను రాజ్‌గఢ్‌లోని ఓ ఆశ్రయ కేంద్రానికి తరలించినట్లు ఆస్పత్రి హెచ్‌వోడీ డాక్టర్ ధీరేంద్ర శ్రీవాత్సవ్ తెలిపారు. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదుకాగా, నాన్నమ్మ, ఆ పసికందు తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మధ్యప్రదేశ్ లాంటి ఘటనల్లో దేశంలోనే ముందుంది. నవజాత శిశువుల్ని రోడ్డున పడేస్తున్న కేసులు అక్కడే ఎక్కువగా నమోదవుతున్నాయని ఎన్సీఆర్బీ(జాతీయ నేర గణాంకాలు) నివేదికలు చెబుతున్నాయి. -
జేఈఈ మెయిన్‌లో రికార్డు రేంజ్ మార్కులు! కానీ ప్లేస్‌మెంట్స్‌కి వెళ్లలేదు..
ఐఐటీ జేఈఈ లాంటి కఠినతరమైన పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవడం అనేది చాలామంది విద్యార్థుల డ్రీమ్. అలాగే ఉత్తీర్ణత సాధించి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో రికార్డు స్థాయి జీతాలతో అందరినీ విస్తుపరుస్తుంటారు కూడా. అలాంటిది ఈ యువకుడు జేఈఈ మెయిన్‌లో ఎవ్వరూ బ్రేక్ చేయని విధంగా రికార్డు స్థాయిలో మార్కులు తెచ్చుకున్నాడు. మంచి కాలేజ్‌లో సీటు పొందాడు. పైగా ఇంజీనీరింగ్ విద్యను అకడమిక్ సంవత్సరం కంటే ముందే పూర్తి చేశాడు. అయినా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కి వెళ్లలేదు. మరీ లక్షల ప్యాకేజ్‌ల ఉద్యోగాన్ని వద్దనుకుని ఏం చేస్తున్నాడో తెలిస్తే..విస్తుపోతారు. అంతేగాదు అతడి స్టోరీ వింటే గెలుపంటే ఇది కదా అని అనుకుండా ఉండలేరు.ఉదయపూర్‌లోని మహారాణా భూపాల్‌కి చెందిన వ్యక్తి కల్పిత్ వీర్వాల్. లక్షలాది మంది డ్రీమ్ ఐఐటీ జేఈఈ2017లో ఉత్తీర్ణత సాధించాడు. దాన్ని కల్పిత్ అత్యంత అలవొకగా సాధించేశాడు. ఇక్కడ కల్పితేమి ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. పెద్ద బ్యాగ్రౌండ్ ఏమి లేదు కూడా. తల్లి ఓ ప్రైవేటు టీచర్ కాగా, తండ్రి కాంపౌడర్. అలాగే కల్పిత్ జేఈఈ ప్రిపరేషన్ కోసం అందరిలా ఏకంగా 16 గంటలు చదివిన వ్యక్తి కూడా కాదు. అలాగే కోచింగ్ సెంటర్లలోనే ఉండిపోయి ప్రిపేరయ్యేలా పలు సంస్థలు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ముందుక వచ్చినా.. వాటిని కూడా ఇష్టపడకుండా తన ఇంటి నుంచి ప్రిపేరయ్యేందుకే మొగ్గు చూపాడు. ఇక జేఈఈ మెయిన్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా, ఎవ్వరూ బ్రేక్ చేయని రేంజ్లో 360/360 మార్కులు సంపాదించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం దక్కించుకున్నాడు. అంతేగాదు అతనికి కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (KVPY) స్కాలర్, నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్ (NTSE) వంటి ఎన్నో ప్రోత్సాహక స్కాలర్షిప్లను సొంతం చేసుకున్నాడు. అయితే అందరిలా IIT బాంబే కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్‌లో చేరినా.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. ఐఐటీ రెండో సంవత్సరంలోనే ఒక YouTube ఛానెల్‌ను ప్రారంభించాడు. అక్కడ తన అధ్యయన వ్యూహాలను , JEE ప్రిపరేషన్ చిట్కాలను పంచుకున్నాడు. దీనికి అనతికాలంలోనే అనూహ్యస్పందన వచ్చింది. అతడిచ్చే సలహాలు ఆచరణాత్మకంగా ఉండేవి. విద్యార్థులంతా సాధారణ కోచింగ్ సెంటర్లు బోధించే దానికి భిన్నంగా ఉందంటూ ఇంప్రెస్ అయ్యేవారు. అలా అతని యూట్యూబ్ ఛానెల్‌కి లక్షకు పైగా సబ్స్క్రైబర్లు, ఫాలోయింగ్ ఉండేది. తన ఛానెల్‌కి ఉన్న డిమాండ్ దృష్ట్యా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకున్నాడు. అలా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి సహాయపడే ఆన్లైన్ విద్యా వేదిక అయిన AcadBoostను కల్పిట్ ప్రారంభించాడు. మరసుటి ఏడాదే తన తొలి ఆన్లైన్ కోర్సుని డెవలప్ చేశాడు. అది విజయవంతమైంది. అలా అతను తన ఐఐటీ క్యాంపెస్ ప్లేస్మెంట్లలో వచ్చే ప్యాకేజ్‌లకు మంచి ఆదాయాన్ని ఈ ఆన్లైన్ వేదిక AcadBoostతో ఆర్జించాడు. అలాగే తన ఐఐటీ బాంబే ప్రోగ్రామ్‌లో ఒక సెమిస్టర్ ముందుగానే ముగించాడు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో అకాడ్బూస్ట్ టెక్నాలజీస్‌లో పనిచేసేవాడు. దీంతో 2021 నాటికి, లింక్డ్ఇన్ 'టాప్ వాయిసెస్'లో కల్పిత్‌కి స్థానం ఇచ్చింది. అలా 20 మంది అత్యుత్తమ యువ నిపుణుల జాబితాలో కల్పిత్ అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అంతేగాకుండా టెడ్ఎక్స్లో తన జేఈఈ మంచిస్కోర్కి సంబంధించిన సక్సస్ జర్నీని షేర్ చేసుకున్నాడు. ఇక్కడ కల్పిత్ కేవలం విద్యా విషయాలకే కట్టుబడి ఉండలేదు. అతను సీనియర్ NCC క్యాడెట్ అయ్యాడు, కఠినమైన తుపాకీ కసరత్తులు, శిబిరాలు శిక్షణ తర్వాత ఎన్సీసీ ఏ సర్టిఫికేట్‌ని కూడా సంపాదించాడు. అలాగే JEEకి సిద్ధమవుతున్నప్పుడు కూడా, అతను క్రికెట్, టీవీ, బ్యాడ్మింటన్, సంగీతం కోసం సమయం కేటాయించేవాడు. ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, ఎడ్టెక్ దిగ్గజాలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినా..నిరాకరించాడు. తన కంటూ ఓ అచంచలమైన లక్ష్యంతో విభ్నింగా ఉండాలనుకున్నాడు, అలానే జీవించి ఎందరికో ప్రేరణగా నిలిచాడు. ఇక్కడ విజయం అంటే కేవలం మార్కులు కాదని, దృష్టి, వ్యూహాలకు సంబంధించినదని ప్రూవ్ చేశాడు. ఎన్ని గంటలు చదివామన్నది కాదు..ఎంత బాగా చదువుతున్నాం, ఎంత నాలెడ్జ్‌ని పొందుతున్నాం అన్నదే ముఖ్యం అని చాటిచెప్పాడు.(చదవండి: ఆరోగ్యకరమైన ఆహారమే అయినా బరువు తగ్గడం లేదు ఎందుకు..?) -
మద్యం మత్తులో 80 అడుగుల టవర్ ఎక్కి..
‘అసలే కోతి.. ఆపై కల్లు తాగింది’ అని ఓ సామెత. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తి తీరు అచ్చం అలాగే ఉంది. జిల్లాలో ఉన్న బెరాసియా తహసీల్‌లో బర్ఖేడీ గ్రామానికి చెందిన 33 ఏళ్ల వివేక్ అనే వ్యక్తి పీకల దాకా తాగాడు. ఇంకేముంది వెయ్యేనుగుల బలం వచ్చింది. ఆ మత్తులో 80 అడుగుల మొబైల్ టవర్ ఎక్కాలనుకున్నాడు. స్థానికులు అడ్డుకుంటున్నా సరే.. పక్కకు నెట్టిమరీ సునాయాసంగా ఎక్కాడు. టవర్ మీదకు ఎక్కనయితే ఎక్కాడు కానీ.. ఎట్లా దిగాలో అర్థం కాలేదు. ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాలేదు. దీంతో స్థానికులు జహంగీరాబాద్ పోలీసులకు, మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అతడిని 20 నిమిషాలపాటు మాటల్లో పెట్టి.. అగ్నిమాపక క్రేన్ సహాయంతో కిందకు దించారు. కథ సుఖాంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కిందకు దిగిన వివేక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనంతా స్థానికులు తమ సెల్‌ఫోనులో బంధించిన స్థానికులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. వీడియో వైరల్ అవుతోంది. -
ఏసీపీ అనితా: పట్టుదలలోనే కాదు ఫ్యాషన్‌లోనూ తగ్గేదెలే!( ఫోటోలు)
-
సైఫ్ పూర్వీకుల రూ.15 వేల కోట్ల ఆస్తుల పరిస్థితేంటి?
భోపాల్: బ్రిటిషర్లకాలంలో ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ ప్రాంతాల్లో పటౌడీ సంస్థానాన్ని పాలించిన హమీదుల్లాహ్ రాజకుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులు ఎవరి పరం కానున్నాయనే ప్రశ్న తలెత్తింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పూర్వీకులకు చెందిన ఈ ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయనే అంశం మరోసారి తెరమీదకొచ్చింది. సైఫ్ వాళ్ల నానమ్మ.. పటౌడీ సంస్థానానికి అసలైన వారసురాలని సీనియర్ న్యాయవాది జగదీశ్ ఛవానీ వాదిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ వాదన దీనికి భిన్నంగా ఉంది. ‘‘ స్వాతంత్య్రం వచ్చేనాటికి భోపాల్ కేంద్రంగా పాలిస్తున్న పటౌడీ సంస్థానానికి ముహమ్మద్ హమీదుల్లాహ్ చివరి నవాబ్‌గా ఉన్నారు. ఆయన తదనంతరం ఆయన పెద్దకుమార్తె అబీదా సుల్తాన్ బేగమ్‌కు ఈ ఆస్తులు దక్కుతాయి. అయితే స్వాతంత్య్రం వచ్చాక విభజన సమయంలో ఆమె పాకిస్తాన్‌కు వలసవెళ్లారు. ఈ లెక్కన ఇప్పుడు వారసులు భారత్‌లో లేరు. అందుకే శత్రు ఆస్తుల చట్టం కింద ఆ ఆస్తులన్నీ ఇప్పుడు కేంద్ర హోం శాఖ పరిధిలోని భారత శత్రు ఆస్తుల సంరక్షణ సంస్థ(సీఈపీఐ) పర్యవేక్షణలోకి వస్తాయి’’ అని మోదీ సర్కార్ చెబుతోంది. ప్రభుత్వ వాదనను లాయర్ ఛవానీ కొట్టిపారేశారు. ‘‘ పెద్దకుమార్తె అబీదా పాకిస్తాన్‌కు వెళ్లిన తర్వాత 1960లో హమీదుల్లాహ్ మరణించారు. దాంతో ఆస్తి వారసత్వంగా తనకే వస్తుందని రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ బేగమ్ భారత ప్రభుత్వాన్ని కోరారు. అందుకు సమ్మతిస్తూ 1962 జనవరి 10న కేంద్రం ఒక ఉత్తర్వు జారీచేసింది. ఈ లెక్కన సాజిదా అసలైన వారసురాలు. ఆమె నుంచి వారసత్వంగా సాజిదా కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ(టైగర్ పటౌడీ) ఆయన తదనంతరం సైఫ్ అలీ ఖాన్ ఆ ఆస్తులకు హక్కుదారు అవు తారు’’ అని ఛవానీ వాదించారు. తమ ఆస్తులను శత్రు ఆస్తులుగా లెక్కకట్టొద్దని, మోదీ ప్రభుత్వం తెచ్చిన శత్రు ఆస్తుల(సవరణ, ధృవీకరణ) చట్టాన్ని సవాల్ చేస్తూ టైగర్ పటౌడీ భార్య, అలనాటి బాలీవుడ్ నటి షర్మిలా ఠాకూర్ 2015లో మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గత ఏడాది డిసెంబర్ 13న జస్టిస్ వివేక్ ఆగ్రావాల్ విచారణ చేపట్టారు. సైఫ్ తల్లి షర్మిలా వేసిన పిటిషన్‌ను ప్రభుత్వ న్యాయవాది తప్పుబట్టారు. ఇప్పుడు శత్రు ఆస్తుల చట్టం,1968 లేదు. దాని స్థానంలో 2017లో కొత్త చట్టమొచ్చింది. ఏమైనా ఫిర్యాదులుంటే సంబంధిత అప్పీలేట్ అథారిటీ ముందు గోడు వెళ్లబోసుకోండి’’ అని సూచించారు. దీనిపై జడ్జీ స్పందిస్తూ.. ‘‘ వాస్తవాలను పరిగణించాక సైఫ్ కుటుంబం ముంబైలోని సీఈపీఐ ఆఫీస్‌లో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇస్తున్నాం’’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ఆరోజు జడ్జి ఇచ్చిన గడువు ఇప్పడు ముగిసిపోయింది. గడువులోపు సైఫ్ కుటుంబం ముంబై సీఈపీఐ ఆఫీస్‌లో అప్పీల్ చేయలేదు. జనవరి 16వ తేదీన కత్తిపొట్లకు గురై ఆస్పత్రి పాలైన సైఫ్ బాగోగులు చూడటంలోనే వాళ్ల కుటుంబానికి ఉన్న పుణ్యకాలం గడిచిపోయింది. ఇప్పుడు వాళ్లకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందా? లేదా అనేదే అసలు ప్రశ్న. ‘‘ దాడి జరిగిందన్న కారణం చూపి హైకోర్టు గడువు పొడిగించాలని కోరతాం’’ అని న్యాయవాది చెప్పారు. -
సైఫ్ అలీ ఖాన్ కు మరో షాక్?
-
పటౌడీ ఆస్తుల కేసు.. సైఫ్ ఫ్యామిలీకి బిగ్ షాక్ తప్పదా?
ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ తన ఇంట్లోనే దాడికి గురై వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఆరు రోజుల చికిత్స తర్వాత కోలుకుని ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే తాజాగా ఆయన కుటుంబానికి మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఆయన కుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల ఆస్తులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది.2011లో సైఫ్ అలీఖాన్(Saif Ali khan) తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మృతి చెందారు. ఆ తర్వాత సైఫ్‌కు భోపాల్ నవాబ్‌గా బిరుదు లభించింది. ప్రస్తుతం పటౌడీ కుటుంబానికి సైఫ్ అలీ ఖాన్ వారసుడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పటౌడీ కుటుంబానికి చెందిన ఆస్తులు ఉన్నాయి. అదే సమయంలో అక్కడి ఆస్తుల గురించి ఎప్పటి నుంచో వివాదాలు కోర్టులో నడుస్తూనే ఉన్నాయి. సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాగూర్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు అక్కడ ఉన్నాయి. కోహెఫిజా నుండి చిక్లోడ్ వరకు విస్తరించి ఉన్నాయి. ఆ కుటుంబానికి చెందిన సుమారు 100 ఎకరాల భూమిలో దాదాపు లక్షన్నర మంది నివసిస్తున్నారు. అయితే.. ఆ చారిత్రక భూమిపై ఎనిమీ ప్రాపర్టీ కేసులో గత 10 ఏళ్లుగా కొనసాగుతున్న స్టే ఇప్పుడు ముగిసింది. ఆస్తిపై దావా వేయడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు సైఫ్ కుటుంబానికి 30 రోజుల సమయం ఇచ్చింది. అయినా సైఫ్ అలీ ఖాన్ కుటుంబం ఎటువంటి దావా వేయలేదు. కానీ ఇప్పుడు ఆ గడువు ముగిసిపోవడంతో.. తర్వాత ఏం జరగనుందా? అనే ఉత్కంఠ మొదలైంది. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్(Enemy Property Act) 1968 ప్రకారం విభజన తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లిన వ్యక్తులు భారత్‌లో వదిలిపెట్టిన ఆస్తులపై కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుంది.ఈ చట్టం ప్రకారం భోపాల్ చివరి నవాబు ఆస్తులను ప్రభుత్వం నియత్రించాలని ప్రయత్నించింది. అయితే.. సైఫ్ కుటుంబం ఈ నిర్ణయాన్ని 2015లో సవాల్ చేశారు. దీంతో.. కోర్టు స్టే విధించింది. అయితే తాజాగా ఆ స్టేను కోర్టు ఎత్తేసింది. దీంతో ప్రభుత్వం ఆ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. పటౌడీ చివరి నవాబు పెద్ద కుమార్తె యువరాణి అబిదా సుల్తాన్ ఎప్పుడో పాకిస్థాన్ వెళ్లారు. అందువల్ల నవాబు ఆస్తిని శత్రువు ఆస్తిగా(ఎనిమీ ప్రాపర్టీ) ప్రకటించారు. అయితే.. నవాబ్ మరణం తరువాత అతని రెండో కుమార్తె మెహర్ తాజ్ సాజిదా సుల్తాన్ బేగం భోపాల్ వారసత్వ చట్టం 1947 ప్రకారం ఎస్టేట్‌కు వారసురాలుగా ప్రకటించారు. ఇప్పుడు పిటిషన్ వేసిన పటౌడీ కుటుంబంలోని సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాకూర్‌వంటివారు సాజిదా(Sajida) వారసులు. ఈ నేపథ్యలో ఆస్తిపై తమకూ హక్కు ఉందని సైఫ్ ఫ్యామిలీ కోర్టులో దావా వేసింది. వారసత్వ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా డివిజెన్ బెంచ్‌లో ఉత్తర్వులను పటౌడీ కుటుంబం సవాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
కారు నడుపుతూ సోషల్ మీడియా రీల్స్.. తర్వాత ఏమైందంటే?
భోపాల్: ఇటీవలి కాలంలో సోషల్ మీడియా(Social Media)లో ఫేమస్ అయ్యేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ డ్రైవర్ రీల్స్(Social Media Reels) పిచ్చి కారణంగా తనతో పాటు మరో ప్రాణం బలితీసుకున్నాడు. కారు చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరొకరు ఎంతో కష్టం మీద తన ప్రాణాలను దక్కించుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.వివరాల ప్రకారం.. భోపాల్(bhopal)లోని కోలార్ రోడ్లో బుధవారం అర్థరాత్రి కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతులు పలాష్ గైక్వాడ్, వినీత్ దక్ష(డ్రైవర్)లుగా గుర్తించారు. అయితే, డ్రైవర్ కారు నడుపుతూ రీల్స్ రికార్డ్ చేస్తుండగా కారు అదుపు తప్పి చెరువు పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో, పలాష్, వినీత్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇక, ప్రమాదం సమయంలో మరో వ్యక్తి పియూష్ కారు వెనుక అద్దాన్ని పగులగొట్టి తప్పించుకోగలిగాడు. సమాచారం అందుకున్న కోలారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు అద్దాలు పగలగొట్టి మృతదేహాలను బయటకు తీశారు.అనంతరం, ఈ ఘటనపై కోలార్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ సంజయ్ తివారీ మాట్లాడుతూ.. ముగ్గురు స్నేహితులు షాపురా నివాసితులు. వీరు ముగ్డురు దాబా నుంచి తిరిగి వస్తుండగా.. ప్రమాదం జరిగింది. ప్రమాదానికి రీల్స్ చేయడమే కారణం. వేగంతో ఉన్న కారు చెరువు కల్వర్టు దగ్గర అకస్మాత్తుగా అదుపు తప్పి నీటిలో పడిపోయింది. చలి కారణంగా కారు అద్దాలు మూసుకుపోయాయి. అందుకే వారిద్దరూ తప్పించుకోలేకపోయారు అని తెలిపారు. -
నలుగురిని కంటే రూ.లక్ష బహుమతి: పరశురాం బోర్డు
భోపాల్:మధ్యప్రదేశ్(MadhyaPradesh)లో పరశురామ్ కల్యాణ్ బోర్డు(Parashuram Kalyan Board) ఓ ఆసక్తికర ప్రకటన చేసింది. తమ సామాజికవర్గాన్ని పెంచుకునేందుకు బ్రాహ్మణులు ఎక్కువ మంది పిల్లలను కనాలిని పిలుపునిచ్చింది. సోమవారం(జనవరి13) జరిగిన ఓ కార్యక్రమంలో పరశురామ్ కల్యాణ్ బోర్డు అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.మనం మన కుటుంబాలపై దృష్టి పెట్టడం లేదని,ఈ మధ్య యువత ఒక బిడ్డతో సరిపెడుతున్నారన్నారు. ఇది చాలా సమస్యాత్మకంగా మారిందన్నారు. భవిష్యత్ తరాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదేనన్నారు. అందుకే కనీసం నలుగురు సంతానం ఉండాలని పిలుపునిచ్చారు.నలుగురు పిల్లల్ని కనే మహిళలకు బోర్డు తరఫున రూ.లక్ష నజరానా అందిస్తామని ప్రకటించారు.తాను బోర్డు అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత కూడా ఈ అవార్డు కొనసాగుతుందని రాజోరియా స్పష్టం చేశారు.రాజోరియా చేసిన ప్రకటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: ఇంటి నుంచే కుంభమేళా స్నానం..ఎలాగంటే.. -
నాలుగు దశాబ్దాల పీడకల!
భోపాల్ నుంచి భాషబోయిన అనిల్‌కుమార్ : అది పాత భోపాల్ నగరంలోని జేపీనగర్.. అక్కడ ఓతల్లి తన పిల్లలను చంకనేసుకొని కొంగుతో ముక్కుమూసుకొని ప్రాణాల కోసం పరుగులు పెడుతున్నట్టుగా ఉన్న అమరుల స్తూపం 1984 డిసెంబర్ 2, 3వ తేదీల్లో భోపాల్ విషవాయువు లీకేజీ ఘటనకు 40 ఏళ్లుగా మూగ సాక్ష్యంగా నిలుస్తోంది. హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబు వల్ల మానవాళి ఎదుర్కొన్న విపత్తుకు ఏమాత్రం తీసిపోని దుర్ఘటన భోపాల్ విషవాయువు లీకేజీ. ఇటీవల దుర్ఘటనకు 40 ఏళ్లు నిండాయి. అదే సమయంలో విషవాయువు వెలువడి వేలాదిమంది ప్రాణాలు పోయేందుకు కారణమైన యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) ఫ్యాక్టరీ నుంచి నాటి వ్యర్థాలను సమీపంలోని పీతమ్పూర్కు తరలింపు ప్రక్రియ ప్రారంభం కాగానే.. ఈ దుర్ఘటనపై తిరిగి చర్చ మొదలైంది. 40 ఏళ్ల కింద విషవాయువు దుర్ఘటన మనదేశంలో వేలాదిమందిని పొట్టనబెట్టుకొని, లక్షలాదిమందిని అనారోగ్యం పాలు జేసింది. ఆనాటి కాళరాత్రి గురించి అడిగితే..అక్కడి స్థానికులు నేటికీ ఉలిక్కిపడతారు. ఆ రోజు బతికి బట్టకట్టినవారిలో చాలామంది మరణించగా.. కొందరు జీవచ్ఛవాలుగా మారారు. వారి కడుపున పుట్టిన పాపానికి మరికొందరు జీవితాంతం దివ్యాంగులుగా జన్యులోపాలతో మంచాలకే పరిమితమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఘోర దుర్ఘటనలో ఒకటిగా నిలిచిన.. నాటి ఘటన ప్రభావం ఎలా ఉందో సాక్షి.. కనుక్కునే ప్రయత్నం చేసింది. 40 ఏళ్లుగా వెంటాడుతోంది... అది డిసెంబర్ 2, 1984 అంతా వ్యవసాయ, కూలి పనులు చేసుకొని వచ్చారు. రాత్రి 7 గంటలకల్లా భోజనాలు చేసి చాలామంది నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 8 గంటల సమయంలో దాదాపు 100 ఎకరాల్లో విస్తరించిన యూసీఐఎల్ ఫ్యాక్టరీ నుంచి హైడ్రోజన్ సైనైడ్ అనే విషవాయువు లీక్ కావడం మొదలైంది. వేగంగా గాలిలో కలవడం వల్ల అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా పడిపోయాయి. లీకేజీని ఆర్పే క్రమంలో ముందుగా ఫ్యాక్టరీ కార్మికులే బలయ్యారు. పరిశ్రమను ఆనుకొని ఉన్న జేపీనగర్ వాసులు ఘాటైన వాసనతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తొలుత ఏ మీ కాదనుకున్నా.. క్రమంగా ఘాటు పెరగసాగింది. ఒ క్క గంటలోనే బయటకు వచ్చి చూస్తే.. వాకిట్లో హైడ్రోజ న్ సైనైడ్ ధూళి వర్షంలా కురుస్తోంది. చాలామంది స్పృ హ తప్పడం చూసి పిల్లాజెల్లలను పట్టుకొని బయటకు వచ్చారు. రెండు అడుగుల మేర పేరుకుపోయిన ధూళిలో ఈడ్చుకుంటూ ప్రాణాల కోసం పరుగులు తీశారు. అప్పటికే దాదాపు 2 కి.మీల మేర భోపాల్‌ను విషవాయువు కమ్మేసింది. ఈక్రమంలో దాదాపు 2 కిలోమీటర్ల మేర పరుగులు తీసినవారు బతికారు. చాలామంది ఆక్సిజన్ అందక మధ్యలోనే ప్రాణాలొదలగా.. కొందరు అప్పటికే గాఢనిద్రలో ఉండటంతో పడుకునే తుదిశ్వాస విడిచారు. ఇప్పటికీ వెన్నులో వణుకు 40 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ ఆ దుర్ఘటన తలచుకుంటే తమకు వెన్నులో వణుకుపుడుతుందని జేపీనగర్ వాసులు గుర్తుచేసుకున్నారు. ఆ రోజు పనుల మీద భోపాల్‌లో లేనివారు బతికి బట్టకట్టారు. అధికారులు తీవ్రంగా శ్రమించడం, హెలికాప్టర్లలో నీటిని లీకేజీపై కుమ్మరించడం తదితర చర్యల వల్ల.. మరునాడు ఉదయం 8 గంటల కల్లా విషవాయువు లీకేజీ ఆగడం మొదలైందని స్థానికులు తెలిపారు. ఈ ఘటన మరునాడు ఫ్యాక్టరీ పరిసరాల్లోని ఏ వీధి, రోడ్డు చూసినా.. శవాలతో నిండిపోయిందని కన్నీరుమున్నీరయ్యారు. అంతా అనుకున్నట్టుగా ఆ రోజు చనిపోయింది 3787 మంది కానే కాదని, మరునాడు తాము తిరిగి ఇంటిబాట పట్టిన సమయంలో.. ట్రక్కులతో శవాలను తరలించడం తమకు ఇంకా గుర్తేనని కన్నీరు మున్నీరయ్యారు. ఇక కట్టివేసిన మూగజీవాలు, పక్షులు ఎక్కడికక్కడ మరణించాయన్నారు.ఆ రోజు బతికి బట్టకట్టినా.. నేటికీ ఆ పీడకల తమను వెంటాడుతూనే ఉందని, అక్కడి భూగర్భంలో, నేలలో, తమ శరీరాల్లో, రక్తంలో ఈ విషం ఇంకా నిండే ఉందని వాపోయారు. ఆ ప్రభావం తర్వాత తరాలపైనా కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నాం ఆ రోజు వ్యవసాయ పనులు ముగించుకొని రాత్రి త్వరగానే ప డుకున్నం.. ఘాటు వాసనలతో ఉ క్కిరిబిక్కిరి అయ్యాం. కళ్ల వెంట నీరు కారుతుండగా.. ఆగకుండా చేతిలో పిల్లాజెల్లలతో కలిసి దాదాపు 2 కిలోమీటర్లు పరు గులు పెట్టాం. ప్రభుత్వం మంజూరు చేసిన నష్టపరిహారం కూడా దళారులు మింగేశారు. – కన్నయ్య, జేపీనగర్రెండు అడుగుల మేర ధూళి ఆ రోజు విషవాయువు లీకవడం మొదలైనా.. ఆగిపోతుందనుకున్నాం. కానీ పెరిగింది. వాకిళ్లలో రెండడుగుల మేర ధూళి. అందులోనే పడుతూ లేస్తూ.. పరుగులు తీశాం. మరునాడు వీధుల్లో ఎక్కడ చూసినా శవాలే. నాకు శ్వాస సమస్యలు ఇప్పటికీ వేధిస్తున్నాయి. నేటికీ ఆ రోజు రాత్రి గుర్తుకొస్తే ఉలిక్కిపడతా. – లక్ష్మణ్, జేపీనగర్ఇద్దరు కుమారులకు జన్యులోపాలే నేను, నా భర్త ఇద్దరం జేపీ కాలనీకే చెందినవారం. ఆ సమయంలో మాకు పదేళ్లు. మా పెద్దలు భుజాన మీద వేసుకొని పరుగెత్తి మమ్మల్ని కాపాడుకున్నారు. కానీ, ఆ రోజు ఆ గాలి పీల్చడం వల్ల మా ఇద్దరు కుమారులు వికాస్‌యాదవ్, అమన్యాదవ్ మానసిక, శారీరక వైకల్యంతో జన్మించారు. గత డిసెంబర్లో పెద్ద కుమారుడు వికాస్‌యాదవ్ (27) మరణించారు. చిన్న కుమారుడు అమన్ యాదవ్ ఇలా అచేతనంగా ఉంటాడు. – శారదాయాదవ్ప్రభుత్వం నుంచి దక్కింది తక్కువే ఆ ఘోరకలి నుంచి బతికామన్న సంతోషం ఏమాత్రం లేదు. మా శరీరాల్లో ఏవో మార్పులు వచ్చాయి. ఫలితంగా పిల్లలు అచేతనులయ్యారు. వారికి సేవలు చేసి, సాకినా.. ఇటీవల నా పెద్ద కుమారుడు మరణించాడు. ప్రభుత్వం వారికి ఇచ్చే పింఛన్ దేనికీ సరిపోదు. ఇప్పటికైనా మా విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. – సంజయ్ యాదవ్ -
యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను 6 వారాల్లోగా తొలగించండి
భోపాల్: భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ కర్మాగారంలోని వ్యర్థాల తొలగింపుపై మధ్యప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు వారాల గడువిచ్చింది. పితంపూర్‌లోని వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్‌లో వీటిని భద్రతా ప్రమాణాలకు లోబడి శుద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ విషయమై ఎలాంటి అసత్య వార్తలను వార్తలను ప్రసారం చేయరాదని కూడా ప్రింట్, ఆడియో, విజువల్ మీడియాను ఆదేశించింది. మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో యూనియన్ కార్బైడ్ వ్యర్థాల తరలింపుపై తప్పుడు, నిరాధార వార్తలు ప్రసారం కావడంతో పితంపూర్ వాసులు తీవ్ర నిరసనలకు పూనుకోవడం తెలిసిందే. జనవరి 2వ తేదీన మూతబడిన కార్బైడ్ కర్మాగారంలోని వ్యర్థాలను 12 సీల్డ్ కంటెయినర్లలో భోపాల్‌కు 250 కిలోమీటర్ల దూరంలోని పితంపూర్కు తరలించారు. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ కంటెయినర్లలోని వ్యర్థాలు అలాగే ఉండిపోయాయి. వీటిని ట్రక్కుల నుంచి కిందికి దించేందుకు మూడు రోజుల సమయం పడుతుందని ప్రభుత్వ న్యాయవాది తెలపగా, భద్రతా నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ముందుగా ఆ వ్యర్థాల్లోని విష రసాయనాలు ఎంత మేరకు ప్రమాదకరమో పరీక్షించి, ఆ నివేదికను బహిరంగ పరుస్తామని, ప్రజల్లో ఉన్న భయాందోళనలను పోగొడతామని తెలిపారు. -
16 గంటలు శ్రమించినా దక్కని ప్రాణం.. బోరుబావిలో పడిన సుమిత్ మృతి
భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రం గుణ జిల్లాలో బోరు బావి ఘటనలో బాలుడు సుమిత్ మీనా (Sumit Meena) విషాదాంతమైంది. శనివారం సాయంత్రం బోరు బావిలో పడిన 10ఏళ్ల బాలుడు సుమిత్ మీనాను రెస్యూ సిబ్బంది రక్షించారు. అయితే, చికిత్స పొందుతూ మరణించడంతో బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.గుణ జిల్లా (Guna District) రఘోఘర్ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని పిప్లియా అనే గ్రామంలో శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో సుమిత్ మీనా అనే బాలుడు ఆటలాడుకుంటూ 140 అడుగుల బోరుబావిలో పడ్డాడు. 39 అడుగుల లోతులోకి కూరుకుపోయాడు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు,రెస్క్యూ సిబ్బంది బాలుడిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. 16 గంటల పాటు శ్రమించి సుమిత్ మీనాను బోరుబావి (borewell) నుంచి సురక్షితంగా బయటకు తీశాయి. ఆదివారం ఉదయం 9.30గంటల సమయంలో అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాయి. అయినప్పటికీ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందినట్లు గుణ జిల్లా వైద్యాదికారి డాక్టర్ రాజ్‌కుమార్ రిషేశ్వర్ తెలిపారు.#WATCH | Guna, Madhya Pradesh: The 10-year-old boy, Sumit who fell into a borewell in the Janjali area of Raghogarh yesterday has been taken out and sent to a hospital. Details awaited. pic.twitter.com/5rSjIsv48j— ANI (@ANI) December 29, 2024 ‘బాలుడు రాత్రంతా చలి వాతావరణంలో బోర్‌వెల్‌లోనే ఉన్నాడు. అతని చేతులు, కాళ్ళు తడిసి వాచిపోయాయి.నోట్లోకి బురద చేరింది.మోతాదుకు మించి (అల్పోష్ణస్థితి) నీరు చేరడం వల్ల బాలుడి అంతర్గత భాగాల పనితీరు స్తంభించి పోయింది. సకాలంలో మెరుగైన వైద్యం అందించినా సమయం మించిపోయినందున బాలుడిని కాపాడుకోలేకపోయాం’అని విచారం వ్యక్తం చేశారు. -
అడవిలో ఇన్నోవా కారు.. గోల్డ్ బిస్కెట్స్, కరెన్సీ నోట్లు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఉన్న అటవీ ప్రాంతంలో పార్క్ చేసిన కారులో 40 కోట్ల విలువైన బంగారం, 10 కోట్ల నగదు దొరకడం తీవ్ర కలకలం సృష్టించింది. అడవి గుండా బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బంగారం దొరికిన కారును గ్వాలియర్‌కు చెందిన చేతన్ గౌర్‌కు చెందినది గుర్తించారు.వివరాల ప్రకారం..భోపాల్ శివారులోని మెండోరి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన ఇన్నోవా వాహనం నుంచి సుమారు రూ.40 కోట్ల విలువైన 52 కేజీల బంగారం, రూ.10 కోట్ల నగదును ఆదాయపు పన్ను శాఖ, ఆ రాష్ట్ర లోకాయుక్త పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడవి గుండా బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు గురువారం రాత్రి అధికారులకు సమాచారం అందింది. దీంతో, అధికారులు అలర్ట్ అయ్యారు. అటవీ ప్రాంతానికి 30 వాహనాల్లో 100 మంది పోలీసులు చేరుకుని ఇన్నోవాను చుట్టుముట్టారు.అనంతరం.. ఇన్నోవా వాహనాన్ని తనిఖీ చేయగా వాహనంలో భారీ మొత్తంలో బంగారం, రూ.10కోట్ల వరకు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక, వాహనం గ్వాలియర్ వాసి చేతన్ గౌర్‌కు చెందినదిగా గుర్తించారు. చేతన్ గౌర్.. ఆర్టీవో ఆఫీసులో మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మకు అత్యంత సన్నిహితుడు. ఇక, ఈ బంగారం, నగదు ఎవరిదనే విషయమై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు.. ఈ ఘటన రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ సంస్థల మధ్య సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలకు బలం చేకూర్చుతోంది.#WATCH | Madhya Pradesh | In a joint action by Bhopal Police and Income Tax, 52 kg of gold and bundles of money were found in an abandoned car in Bhopal during an IT raid. The car was found abandoned in the jungle of Mendori in the Ratibad area. Police and Income Tax are trying… pic.twitter.com/7KOoJ4AZBJ— ANI (@ANI) December 20, 2024అయితే, అక్రమ ఆస్తుల కేసుల్లో భోపాల్‌కు చెందిన మాజీ కానిస్టేబుల్ శర్మ ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆయన ఇళ్లపై అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. ఈ సోదాల్లో కోటి రూపాయలకు పైగా నగదు, కిలోన్నర బంగారం, వజ్రాలు, వెండి కడ్డీలు, ఆస్తుల పత్రాలను అధికారులు గుర్తించారు. ఆయనకు చెందిన 10 లాకర్లు, 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన వివరాల పత్రాలను కూడా పోలీసులు కనుగొన్నారు. ఇదిలా ఉండగా.. గత రెండు రోజులుగా భోపాల్‌లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందిన వ్యక్తులే టార్గెట్‌గా సోదాలు కొనసాగుతున్నాయి. -
Bhopal Gas Tragedy: ప్రపంచం మరువలేని విషాదమిది..
భోపాల్: 1984, డిసెంబరు 3.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ప్రపంచం మరువలేని విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు నేటికి 40 ఏళ్లు.. ఇన్నేళ్లు దాటినా ఈ దుర్ఘటన ఆనవాళ్లు ఈనాటికీ వెంటాడుతూనే ఉన్నాయి.యూనియన్ కార్బైడ్ ప్లాంట్ నుంచి విషపూరిత వాయువు మిథైల్ ఐసోసైనేట్ (ఎంఐసీ) లీక్ అయిన ఘటన భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది. ఆ రోజు రాత్రి భోపాల్‌లోని జనం గాఢ నిద్రలో ఉండగా మృత్యువు విషవాయువు రూపంలో రెక్కలు విప్పి, లెక్కలేనంతమందిని కబళించింది. నాటి భయానక దృశ్యాలు నేటికీ చాలామంది కళ్లముందు మెదులుతుంటాయి.ఆ రోజు ఏం జరిగింది?భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ సంస్థలో నాడు పనిచేసిన ఒక అధికారి తన అనుభవాన్ని వివరిస్తూ.. ‘1984, డిసెంబర్ 3 మాకు ఎప్పటిలానే తెల్లారింది. ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి, ఫ్యాక్టరీకి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తున్నాను. ఆ సమయంలో ఫ్యాక్టరీ నుండి విడుదలైన విష వాయువు నగరాన్ని కమ్మేసిందని నాకు తెలియదు. మేం బస్సు కోసం ఎదురుచూస్తుండగా అక్కడున్న ఒక వ్యక్తి.. గ్యాస్ లీక్ అయ్యిందని, దాని వల్ల చాలా మంది చనిపోయారని చెప్పడంతో షాక్ అయ్యాను’ అని తెలిపారు.సీనియర్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ అనుభవంలో..భోపాల్‌కు చెందిన సీనియర్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ గోపాల్ జైన్ తన ఇంటికి వచ్చిన ఒక బంధువు చేతిపై హఠాత్తుగా వచ్చిన ఎర్రని వాపును చూసి షాక్ అయ్యారు. పాత భోపాల్ ప్రాంతమంతా పొగతో కమ్ముకుందని ఆ మహిళ అతనికి చెప్పింది. ఉదయం హమీదియా హాస్పిటల్ చుట్టూ మృతదేహాలు చెల్లాచెదురుగా పడటంతో అతనికి జరిగినదేమిటో అర్థం అయ్యింది. నాటి పరిస్థితిని గుర్తుచేసుకున్న జైన్ మాట్లాడుతూ ‘ఉదయం నేను ఆసుపత్రికి చేరుకున్నప్పుడు, అక్కడి పరిస్థితి భయానకంగా ఉంది. మృతదేహాలు కుప్పలుగా పడివున్నాయి. అక్కడ గుమిగూడిన జనం తమవారి కోసం వెదుకుతున్నారు. యూనియన్ కార్బైడ్ ప్లాంట్ నుండి గ్యాస్ లీక్ అయిన కారణంగా ఈ దారుణం చోటు చేసుకున్నదని తెలిసింది’ అని అన్నారు.నాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ దుర్ఘటనలో 5,474 మంది ప్రాణాలు కోల్పోగా, ఐదు లక్షల మందికి పైగా జనం గ్యాస్ విషపూరిత ప్రభావాలకు గురయ్యారు. ఈ ఘటన జరిగి నాలుగు దశాబ్దాలు గడిచినా దాని నాటి గాయం ఇంకా మానలేదు. గ్యాస్ లీకేజీ కారణంగా వేలాది మంది జనం అనారోగ్యం పాలయ్యారు. నాటి విషవాయువు ప్రభావం తరతరాలుగా వెంటాడుతూనే ఉంది. ఇది కూడా చదవండి: లండన్‌లో రేడియో జాకీగా రాణిస్తున్న హైదరాబాదీ -
పాపాల భోపాల్‌లో పారా తారలు.. విషం కాటేసినా ఆటై మెరిశారు
భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి నేటికి 40 ఏళ్లు. డిసెంబర్ 2, 1984 అర్ధరాత్రి మొదలై డిసెంబర్ 3 వరకూ కొనసాగిన విష వాయువులు ఆ ఒక్క రాత్రితో తమ ప్రభావాన్ని ఆపేయలేదు. అవి జన్యువుల్లో దూరి నేటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఆ దుర్ఘటన నుంచి బయటపడిన వారికి నేటికీ అవకరాలతో పిల్లలు పుడుతున్నారు. ఏనాటి ఎవరి పాపమో ఇప్పటికీ వీళ్లు అనుభవిస్తున్నారు. అయితే వీరిలో కొందరు పిల్లలు పారా స్పోర్ట్స్‌లో ప్రతిభ చూపుతుండటం ఒక ఆశ. కాని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పడమే వీరు మనకు కలిగిస్తున్న చైతన్యం.పదిహేడేళ్ల దీక్షా తివారి ‘ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ డిజార్డర్’ (ఐడిడి) రుగ్మతతో బాధ పడుతోంది. ఆ అమ్మాయిని బాల్యంలో గమనించిన తల్లిదండ్రులు మహేష్ తివారి, ఆర్తి తివారి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినప్పుడు ఆయన ‘ఇది భోపాల్ గ్యాస్ విష ఫలితం’ అనంటే ఆ తల్లిదండ్రులు హతాశులయ్యారు. ‘అదెప్పటి సంగతో కదా’ అన్నారు. ‘అవును... ఇప్పటికీ వెంటాడుతోంది’ అన్నాడు డాక్టర్. దానికి కారణం భోపాల్ ఘటన జరిగినప్పుడు మహేష్ వయసు 5 ఏళ్లు, ఆర్తి వయసు 3 సంవత్సరాలు. వారు భోపాల్‌లో ఆ గ్యాస్‌ని పీల్చారు. కాని అది జన్యువుల్లో దూరి సంతానానికి సంక్రమిస్తుందని నాడు వాళ్లు ఊహించలేదు.అదృష్టం ఏమిటంటే దీక్షా తివారి 2023 స్పెషల్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున బాస్కెట్ బాల్లో రజత పతకం తేవడం. ఈ అమ్మాయే కాదు భోపాల్ విష వాయువు వెంటాడుతున్న చాలా మంది బాలలు భోపాల్‌లోని జేపీ నగర్ప్రాంతంలో అత్యధికం ఉన్నారు. వీరంతా తమ శారీరక, మానసిక లోపాలను, రుగ్మతలను జయించడానికి స్పోర్ట్స్‌ను ఎంచుకున్నారు. అథ్లెటిక్స్, సైక్లింగ్, ఫుట్‌బాల్ తదితర ఆటల్లో ప్రతిభ చూపుతున్నారు. బతుకు జీవచ్ఛవం కాకుండా ఉండేందుకు క్రీడలు వారిని కాపాడుతున్నాయి. కాని ప్రభుత్వం వీరికి చేయవలసింది చేసిందా?40 టన్నుల గ్యాస్డిసెంబర్ 2, 1984 అర్ధరాత్రి భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి అత్యంత ప్రాణాంతకమైన ‘మిథైల్ ఐసొసైనెట్’ విడుదలవడం మొదలయ్యి మరుసటి రోజు సాయంత్రం వరకూ వ్యాపించింది. దాదాపు 40 టన్నుల విషవాయువు విడుదలైంది. దీని వల్ల చనిపోయిన వారు అధికారికంగా 2,259 కాని 20 వేల నుంచి 40 వేల వరకు మరణించి ఉంటారని సామాజిక కార్యకర్తల అంచనా. ఆ సమయంలో బతికున్నవారు జీవచ్ఛవాలుగా మారితే కొద్దిపాటి అస్వస్థతతో బయటపడిన వారూ ఉన్నారు. విషాదం ఏమంటే ఈ ఘటన జరిగినప్పుడు చంటిపాపలు, చిన్న పిల్లలుగా ఉన్నవారు ఆ ఘటన నుంచి బయట పడి అదృష్టవంతులం అనుకున్నారు కానీ వారికి యుక్తవయసు వచ్చి పిల్లలు పుట్టాక వారిలో అధిక శాతం దివ్యాంగులుగా, మానసిక దుర్బలురుగా మిగిలారు.1300 మంది దివ్యాంగులు‘‘భోపాల్ విషవాయువులు భోపాల్‌లోని 42 వార్డుల మీద ప్రభావాన్ని చూపాయి. ఆ 42 వార్డుల్లో దివ్యాంగ శిశువులు జన్మిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య అధికారికంగా 1300. వీరిలో అత్యధికులు అంధత్వం, సెరిబ్రల్ పాల్సీ, డౌన్ సిండ్రోమ్, మస్క్యులర్ డిస్ట్రఫీ, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) వంటి సమస్యలతో బాధ పడుతున్నారు.వీరికి రెగ్యులర్‌గా థెరపీ అవసరం. కాని మా వద్ద వున్న వనరులతో కేవలం 300 మందికే సేవలు అందించగలుగుతున్నాం. మిగిలినవారికీ ఏ థెరపీ అందడం లేదు. వీరిలో చాలామంది పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు. ఈనాటికీ వీరికి నష్టపరిహారం అందలేదు’’ అని ‘చింగారి’ ట్రస్ట్ బాధ్యుడొకరు తెలిపారు. భోపాల్ విషవాయువు బాధిత దివ్యాంగ శిశువులకు ఈ సంస్థ వైద్య సహాయం అందిస్తుంది.కల్లాకపటం లేని పిల్లలుభోపాల్లోని జేపీనగర్‌లో కల్లాకపటం లేని అమాయక బాలలు చాలామంది కనిపిస్తారు. ముద్దొచ్చే మాటలు మాట్లాడుతూ అందరిలాగా ఆటలాడాలని, స్కూలుకు వెళ్లాలని, కబుర్లు చెప్పే వీరంతా చాలామటుకు బుద్ధిమాంద్యంతో బాధపడే పిల్లలే. కొందరు శరీరం చచ్చుబడ్డ వారే. ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన వీరంతా నిరసన కార్యక్రమం జరుపుతుంటారు. న్యాయం కోరుతుంటారు. కానీ దుర్ఘటన జరిగి 40 ఏళ్లు అవుతున్నా వీరు రోడ్ల మీదకు వస్తూనే ఉండాల్సి రావడం బాధాకరం.నీరు తాగిభోపాల్ విషవాయులు భూమిలోకి ఇంకడం వల్ల కొన్ని చోట్ల ఇప్పటికీ ఆ నీరు విషతుల్యం అయి ఉంది. వేరే దిక్కు లేక పేదలు ఆ నీరే చాలాకాలం తాగి ఇప్పుడు దివ్యాంగ శిశువులకు జన్మనిస్తున్నారు. ‘ఆటలాడే ఉత్సాహం ఉన్నా వీరికి ఆటవస్తువులు లేవు. హెల్త్ కార్డులు లేవు’ అని తల్లిదండ్రులు భోరున విలపిస్తుంటే ఏ పాపానికి ఈ శిక్ష అనిపిస్తుంది. -
భార్య ముందు అంకుల్ అన్నందుకు చితక బాదాడు
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని నగరం భోపాల్‌లో రెండు రోజుల క్రితం విచిత్ర సంఘటన జరిగింది. భార్యకు చీరలు కొనడానికి వెళ్లిన రోహిత్ అనే వ్యక్తి షాపు యజమానిని చితకబాదాడు. ఇంతకీ కారణమేంటంటే భార్యతో కలిసి చీరలు కొంటున్న రోహిత్‌కు షాపు యజమాని విశాల్ చాలా చీరలు చూపించాడు. ఎన్ని చీరలు చూసినా రోహిత్ దంపతులు ఒక్కటీ సెలెక్ట్ చేయలేదు. దీంతో విసుగెత్తిన విశాల్ మీకు వెయ్యి రూపాయల రేంజ్లో చీరలు కావాలా అని అడిగాడు. ‘మేం అంతకంటే ఎక్కువ రేంజ్ చీరలే కొనగలం, మమ్మల్ని తక్కువ అంచనా వేయకు’అని రోహిత్ షాపు యజమాని విశాల్‌పై అగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో విశాల్ స్పందిస్తూ ‘అంకుల్ మీకు అన్ని రేంజ్‌ల చీరలు చూపిస్తాను’అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. భార్య ముందు అంకుల్ అనడంతో రోహిత్ కోపం కట్టలు తెంచుకుంది. షాపు నుంచి వెళ్లిపోయి కొద్ది సేపటికి స్నేహితులను వెంటేసుకొచ్చి షాపు యజమాని విశాల్‌ను కర్రలు, బెల్టులతో చితకబాది అక్కడి నుంచి పారిపోయారు. ఇదీ చదవండి: బలవంతంగా ఉమ్మి నాకించారు -
Madhya Pradesh High Court: భారత్ మాతాకీ జై అనాల్సిందే
జబల్పూర్: మాతృదేశాన్ని మరచి శత్రుదేశాన్ని పొగిడిన వ్యక్తికి మధ్యప్రదేశ్ హైకోర్టు తగిన శిక్ష విధించింది. తుది తీర్పు వచ్చేదాకా నెలకు రెండు సార్లు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అక్కడి జాతీయ జెండాకు 21 సార్లు సెల్యూట్ చేయాలని, రెండు సార్లు భారత్ మాతా కీ జై అని నినదించాలని ఆదేశించింది. భోపాల్‌లోని మిస్రోడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫైజల్ అలియాస్ ఫైజాన్ మే నెలలో ‘పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్తాన్ ముర్దాబాద్’ అని నినదించాడు. దీంతో ఇతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 153బీ సెక్షన్ కింద కేసునమోదుచేశారు. సమాజంలో రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా, దేశ సమగ్రతను దెబ్బతీసేలా వ్యవహరించాడని పోలీసులు కేసు నమోదుచేశారు. దీంతో బెయిల్ కోసం మధ్యప్రదేశ్ హైకోర్టును ఫైజల్ ఆశ్రయించాడు. ఈ కేసును జస్టిస్ డీకే పలివాల్ మంగళవారం విచారించారు. రూ.50వేల వ్యక్తిగత బాండు, మరో రూ.50వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు అంగీకరిస్తూ రెండు షరతులు విధించింది. ‘‘ ప్రతి నెలా తొలి, చివరి మంగళవారాల్లో భోపాల్‌లోని మిస్రోడ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లు. అక్కడి భవంతిపై రెపరెపలాడే త్రివర్ణ పతాకానికి 21 సార్లు సెల్యూట్చేసి రెండు సార్లు భారత్ మాతాకీ జై అని నినదించు. ఈ కేసులో తుదితీర్పు వచ్చేదాకా ఇలా చేయాల్సిందే. ఇలా చేస్తే అయినా నీలో దేశభక్తి కాస్తయినా పెరుగుతుంది’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ‘‘ ఇతనికి బెయిల్ ఇవ్వకండి. గతంలోనూ ఇలాగే ప్రవర్తించాడు. ఇతనిపై 14 నేరకేసులు పెండింగ్‌లో ఉన్నాయి’ అని ప్రభుత్వ లాయర్ వాదించారు. -
రూ.1,814 కోట్ల డ్రగ్స్ సీజ్
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఓ ఫ్యాక్టరీ నుంచి రూ.1,814 కోట్ల విలువైన 907 కిలోల మెఫెడ్రిన్‌తోపాటు, ముడి సరుకును, యంత్ర పరికరాలను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్), ఢిల్లీ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)సంయుక్తంగా జరిపిన దాడిలో బగ్రోడా పారిశ్రామిక ఎస్టేట్‌పై శనివారం దాడి జరిపినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్ ఏటీఎస్ యూనిట్ సారథ్యంలో ఇంతభారీగా డ్రగ్స్ పట్టుబడిన ఘటన ఇదే. ఫ్యాక్టరీలో రోజుకు 25 కిలోల మెఫెడ్రిన్ తయారవుతోందని చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు 2017లో మహారాష్ట్రలోని అంబోలిలో మెఫెడ్రిన్ పట్టుబడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాడని అధికారులు వివరించారు. అమృత్‌సర్‌లో రూ.10 కోట్ల కొకైన్ లభ్యం అమృత్‌సర్‌లో రూ.10 కోట్ల విలువైన కొకైన్‌ను స్వా«దీనం పోలీసులు చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో రూ.5,620 కోట్ల విలువైన 560 కిలోల కొౖకైన్, 40 కిలోల మారిజువానాను సీజ్ చేయడం తెలిసిందే. ఆ కేసు దర్యాప్తు క్రమంలోనే తాజాగా కొకైన్ పట్టుబడింది. ఈ సందర్భంగా ఒక వ్యక్తితోపాటు అతడి టయోటా కారును స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడు విదేశాలకు పరారయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడని అధికారులు తెలిపారు. -
రూ. 1,800 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ పట్టివేత
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భోపాల్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీ నుంచి సుమారు 1,814 కోట్ల విలువైన భారీ డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటీఎస్), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఢిల్లీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్, వాటి తయారికి ఉపయోగించే ముడిసరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారని గుజరాత్ హోం సహాయ మంత్రి హర్ష్ సంఘవి ఆదివారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.Kudos to Gujarat ATS and NCB (Ops), Delhi, for a massive win in the fight against drugs!Recently, they raided a factory in Bhopal and seized MD and materials used to manufacture MD, with a staggering total value of ₹1814 crores!This achievement showcases the tireless efforts… pic.twitter.com/BANCZJDSsA— Harsh Sanghavi (@sanghaviharsh) October 6, 2024‘‘డ్రగ్స్‌పై పోరాటంలో భారీ విజయం సాధించిన గుజరాత్ ఏటీఎస్ , ఎన్సీబీ, ఢిల్లీ అధికారులకు అభినందనలు.వీరు భోపాల్‌లోని ఒక ఫ్యాక్టరీపై దాడి చేసి, ఎండీ, ఎండీ డ్రగ్స్ తయారీకి ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ మొత్తం విలువ రూ. 1814 కోట్లు ఉంటుందని అంచనా. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగాన్ని ఎదుర్కోవడంలో లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయి. సమాజ ఆరోగ్యం, భద్రతను కాపాడటంలో వారి ప్రయత్నం చాలా కీలకం. చట్టాన్ని అమలు చేసే సంస్థల అంకితభావం నిజంగా అభినందయం. భారతదేశాన్ని సురక్షితమైన, ఆరోగ్యకరమైన దేశంగా మార్చే వారి మిషన్‌కు మద్దతునిస్తూనే ఉందాం’’ అని అన్నారు.చదవండి: ఆపరేషన్ తోడేలు సక్సెస్.. ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు -
దారుణం.. వాటర్ ట్యాంక్‌లో చిన్నారి మృత దేహం
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అదృశ్యమైన ఐదేళ్ల బాలిక కేసు విషాదంగా మారింది. చిన్నారి నివసిస్తున్న ఇంటికి ఎదురుగా ఉన్న మరో ఇంటి వాటర్ ట్యాంక్‌లో శవమై తేలింది. అయితే నిందితులు చిన్నారిపై దారుణానికి ఒడిగట్టి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.మూడు రోజుల క్రితం చిన్నారి అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్లు, డ్రోన్లతో పాటు ఐదు పోలీసు స్టేషన్ల నుండి 100 మంది పోలీసులు రంగంలోకి దిగారు. బృందాలుగా విడిపోయి చిన్నారి కోసం గాలించారు. అనుమానాస్పద ప్రాంతాల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం వెయ్యికి పైగా ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. 72 గంటల తర్వాత చిన్నారి నివసిస్తున్న ఇంటికి ఎదురుగా నిర్మానుష్యంగా ఉన్న మరో ఇంటి నుంచి దుర్వాసన వెదజల్లింది. దీంతో అనుమానంతో ఇంటిని తినిఖీ చేయగా.. ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్‌లో చిన్నారి మృత దేహం లభ్యమైంది. పాప ఆచూకీతో స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా చిన్నారి నివసిస్తున్న ఇల్లు..నిర్మానుష్యంగా ఉన్న మరో ఇంట్లో ఎందుకు తనిఖీలు చేయాలని మండిపడుతున్నారు. -
రాజ రాజ చోర
అది ఓ చిన్న పాఠశాల. విద్యార్థులు టీచర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలోఓ వ్యక్తి తరగతి గది లోపలకు వచ్చాడు. అతడి చేతిలో కత్తెర, బ్లేడు, తాళాలు, స్క్రూడ్రైవర్ వంటి సరంజామా ఉంది.వెంటనే పాఠం మొదలుపెట్టాడు.అంటే ఏవో సైన్స్ ప్రాక్టికల్స్ చెబుతున్నాడేమో అనుకోకండి. అక్కడ జరిగే సంగతి తెలిస్తే నోరెళ్లబెడతారు.పిక్ పాకెటింగ్ ఎలా చేయాలి? దొంగతనం చేసిన తర్వాత దొరక్కుండాఎలా తప్పించుకోవాలి? తాళాలను ఎలా ఓపెన్ చేయాలి వంటి అంశాల్లోఅక్కడ తర్ఫీదు ఇస్తారు.వినడానికి విడ్డూరంగా విన్నా కొన్నేళ్లుగా అక్కడ జరుగుతున్న తతంగం ఇది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖడియా, గుల్ ఖేడి, హుల్ ఖేడి అనే మూడు గ్రామాల్లో దొంగల స్కూళ్లు ఉన్నాయి. 12 సంవత్సరాల నుంచి 17 ఏళ్ల లోపు వయసున్న వారికి దొంగతనాలు, దోపిడీలు ఎలా చేయాలో అందులో శిక్షణ ఇస్తారు. అవసరమైన సందర్భాల్లో హత్యలు ఎలా చేయాలో కూడా నేర్పిస్తారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఓ దొంగల ముఠా ఈ స్కూళ్లు నడుపుతోంది. ఏడాదిపాటు సకల చోర కళల్లో శిక్షణ ఇస్తారు. జనం రద్దీగా ఉండే ప్రదేశాల్లో పిక్ పాకెటింగ్ ఎలా చేయాలి, బ్యాగు ఎలా లాక్కోవాలి? ఆపై ఎవరికీ చిక్కకుండా ఎలా పారిపోవాలి? బ్యాంకులను ఎలా దోచుకోవాలి? పోలీసులకు చిక్కితే వారి లాఠీ దెబ్బలను ఎలా తట్టుకోవాలి? వంటి అన్ని అంశాల్లోనూ సుశిక్షితులను చేస్తారు. ముఖ్యంగా పెద్దింటి పిల్లలు ఎలా వ్యవహరిస్తారో, వారు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటారో కూడా వివరించి అన్ని విధాలా సన్నద్ధం చేస్తారు. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు దొంగతనాల్లో గ్రాడ్యుయేట్ల కిందే లెక్క. అంతేకాదు.. ఏడాదిపాటు ఇచ్చే శిక్షణ కోసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు ఫీజుగా తీసుకుంటున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారిని గ్యాంగులో సభ్యులుగా చేర్చుకుంటారు. అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రాక్టికల్స్‌కు పంపిస్తారు. అలా వారు కొట్టుకొచి్చన సొమ్ము ఈ దొంగల ముఠాయే తీసుకుని, వారి తల్లిదండ్రులకు ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు మాత్రమే ఇస్తుంది. దీంతో ఇదేదో బాగుందని భావిస్తున్న ఆ చుట్టుపక్కల ఊళ్ల జనం నానా తిప్పలూ పడి ఫీజులు చెల్లించి తమ పిల్లలను దొంగల స్కూళ్లలో చేర్పిస్తున్నారు.ఇలా బయటపడింది.. ఈ దొంగల శిక్షణ వ్యవహారం చాలాకాలంగా సాగుతున్నప్పటికీ,ఇటీవల ముంబైలో జరిగిన ఓ దొంగతనంతో వెలుగులోకి వచి్చంది. ఓ బడా పారిశ్రామికవేత్త కుటుంబ వివాహ వేడుక ముంబైలోని ఓ ఖరీదైన హోటల్లో ఘనంగా జరిగింది. ఆ హోటల్లోకి ఈ ముఠాకు చెందిన కుర్రాడు పెద్దింటి బిడ్డగా చొరబడి రూ.కోటిన్నర విలువైన నగలతో మాయమయ్యాడు. నగలు కనిపించకపోవడంతో సీసీ కెమెరాలు పరిశీలించగా దొంగతనం విషయం బయటపడింది. ఆ కుర్రాడు ఎవరా అని ఆరా తీసిన పోలీసులు చివరకు మధ్యప్రదేశ్‌లోని ఈ మూలాలుగుర్తించి అవాక్కయ్యారు. పోలీసులు ఏం చేయలేరా? నిజానికి ఆ మూడు గ్రామాల్లో దొంగల స్కూళ్లు నడుస్తున్నాయనే సంగతి స్థానిక పోలీసులకు తెలిసినా వారు ఏమీ చేయలేని పరిస్థితి. ఆ ఊళ్లోకి పోలీసులు వెళ్తే చాలు.. ఊరి జనమంతా ఏకమై అడ్డుకుంటారు. ఎవరైనా అపరిచితులు అక్కడకు వెళ్లినా వదిలిపెట్టరు. దీంతో ఒక్క దొంగను అరెస్టు చేయడానికి వెళ్లాలంటే పోలీసులు పెద్ద ఎత్తున మందీమార్బలంలో వెళ్లాల్సిందే. పైగా దొంగల స్కూల్‌ను మూయించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అది మామూలు పాఠశాలలాగే ఉంటుంది. మేం విద్యార్థులకు ట్యూషన్ చెబుతున్నాం.. అది కూడా తప్పా అని ప్రశ్నిస్తారు. దీంతో పోలీసులు తిరుగుముఖం పట్టడం తప్ప చేసేదేమీ ఉండదు. దేశవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఈ ముఠాకు చెందిన 2వేల మందికి పైగా వ్యక్తులపై దాదాపు 8వేల కేసులు నమోదయ్యాయి. - సాక్షి సెంట్రల్ డెస్క్ -
మ్యూజియంలో చోరీకి వచ్చి.. పోలీసులకు చిక్కాడిలా..
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గల స్టేట్ మ్యూజియంలో చోరీకి వచ్చిన దొంగ తాను ఊహించని రీతిలో పోలీసుల చేతికి చిక్కాడు. మ్యూజియంలోని కోట్లాది రూపాయల విలువైన వందల ఏళ్లనాటి పురాతన వస్తువులతో పారిపోయేందుకు ఆ దొంగ విఫలయత్నం చేశాడు.ఈ ఉదంతం గురించి పోలీసు కమిషనర్ హరినారాయణచారి మిశ్రా మీడియాకు వెల్లడించారు. స్టేట్ మ్యూజియంలోకి ప్రవేశించిన ఒక వ్యక్తి రాత్రంతా లోపలే ఉండిపోయాడు. ఉదయం భద్రతా సిబ్బంది అతన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మ్యూజియంనకు చేరుకుని అతనిని అరెస్టు చేశారు. నాణేలను, ఇతర వస్తువులను దొంగిలించి, మ్యూజియం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ దొంగ గోడపై నుంచి దూకి తీవ్రంగా గాయపడ్డాడు దీంతో కదలలేకపోయాడు. తరువాత అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని ఉదయం భద్రతా సిబ్బంది గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు ఆ దొంగ దగ్గరి నుంచి గుప్తులు, సుల్తానేట్ కాలానికి చెందిన 100 నాణేలతో పాటు పురాతన నగలు, పాత్రలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ నాణేల విలువ దాదాపు రూ.10 నుంచి 12 కోట్ల వరకూ వరకు ఉంటుందని సమాచారం. ఈ సంఘటన నేపధ్యంలో భోపాలోని మ్యూజియం భద్రతా ఏర్పాట్లపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం మ్యూజియంనకు పటిష్టమైన భద్రతను కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. -
Nikita Kaushik: సిటీకి పల్లె కళ
గ్రామీణ మహిళా కళాకారులను ప్రోత్సహించడానికి, వారి వారసత్వ కళను, ఫ్యాబ్రిక్ క్రాఫ్ట్‌ను భారతదేశం అంతటా పరిచయం చేయడానికి ది వోవెన్ ల్యాబ్ పేరుతో కృషి చేస్తున్నారు భూపాల్ వాసి నిఖితా కౌశిక్. ముంబైలోని నిఫ్ట్ పూర్వవిద్యార్థి అయిన నిఖిత జీరోవేస్ట్ పాలసీతో పాతికమంది గ్రామీణ మహిళల చేత పట్టణ మహిళల కోసం ఆధునికంగా డ్రెస్‌లను డిజైన్ చేయించి, వారికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘స్టైల్ తత్త్వ’ ఎగ్జిబిషన్లో క్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్ క్లస్టర్స్‌కి వారధిగా ఉంటూ చేస్తున్న కృషిని వివరించారు. ‘‘ఈ రోజు మనం భారతీయులమని చెప్పుకోవడానికి గర్విస్తున్నామంటే మన దేశంలోని విభిన్న సంస్కృతులూ, సంప్రదాయాలూ కారణం. వేటికవి సొంత మార్గాలలో ప్రత్యేకమైనవి. ఫలితంగా మన జీవితంలో దుస్తులు ముఖ్యమైన అంశంగా మారాయి. మన గ్రామీణ మహిళా కళాకారుల హస్తకళ శిల్ప నైపుణ్యాన్ని చేతితో నేసిన వస్త్రాలను మరింత మెరుగుపరచడంలో మా పని కీలకంగా ఉంటుంది. చిట్ట చివరగా ఉపయోగించే చిన్న ఫ్యాబ్రిక్ పీస్తో కూడా ‘కళ’ద్వారా అందంగా డిజైన్ చేస్తాం. ఇందుకోసం నిరంతరం పరిశోధన జరుగుతూనే ఉంటుంది. అందుకే, మా బ్రాండ్‌కు ‘ది వోవెన్ ల్యాబ్’ అని పేరు పెట్టాం.జీరో వేస్ట్ పాలసీ రాజస్థాన్, గుజరాత్ భోపాల్.. ్రపాంతాల్లోని గ్రామీణ, గిరిజన మహిళల చేతుల్లో రూపుదిద్దుకున్న మా దుస్తుల డిజైన్స్ బయట షాపుల్లో లభించవు. ఎగ్జిబిషన్లు, ఆన్లైన్ ద్వారా అమ్మకం చేస్తుంటాం. మన దేశీ కాలా పత్తితో పాటు టెన్సెల్, రీసైకిల్ ఫ్యాబ్రిక్స్, పర్యావరణ అనుకూలమైన క్లాత్‌తోనే డిజైన్ చేస్తున్నాం. అరుదైన కాటన్ ఫ్యాబ్రిక్, ్రపాచీన కళా వైభవం గల మోడర్న్ డిజైనరీ డ్రెస్సులు కాబట్టే వీటి ఖర్చు ఎక్కువే. కానీ, ఎక్కడ ఉన్నా ప్రత్యేకతను చాటుతుంటాయి.మహిళా సాధికారతమా సంస్థకు ఉన్న బలమైన స్తంభాలలో ఒకటి మహిళా సాధికారత. ఇప్పటికి పాతిక మంది గ్రామీణ మహిళలు ఈ డిజైన్స్ కోసం కృషి చేస్తున్నారు. కళ పట్ల ఆసక్తి ఉన్న గ్రామీణ బాలికలను ఎంపిక చేసుకొని, శిక్షణ ఇవ్వడమే కాకుండా, వారి ్రపాథమిక విద్య కూడా సవ్యంగా జరిగేలా చూస్తున్నాం. ఒక డ్రెస్ కొనుగోలు చేస్తే ఆ మొత్తంతో ఆ కళాకారుల ఇల్లు నెలంతా ఏ ఇబ్బంది లేకుండా గడిచి΄ోతుంది. భవిష్యత్తు తరాలు ఆ కళావైభవాన్ని సొంతం చేసుకోవాలన్నదే నా కల. చాలావరకు సేకరించే కాటన్ ఫ్యాబ్రిక్ ఐవరీ, గ్రే కలర్ వే ఎంచుకుంటాం. కొన్నింటికి మాత్రం నేచురల్ రంగులతో డైయింగ్ ప్రక్రియ ఉంటుంది. వ్యర్థాలను నివారిస్తూ, పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తులను వెలుగులోకి తీసుకురావాలన్నదే మా ప్రయత్నం తప్ప ఫాస్ట్ ఫ్యాషన్ ΄ోటీ పరుగులో చేరం.రాబోయే తరాలకు మన కళప్రాచీన హ్యాండ్ వర్క్స్‌ని వదిలేస్తే అవి అంతే సులువుగా మరుగున పడి΄ోతాయి. క్రాఫ్ట్స్ క్లస్టర్స్ ఆఫ్ ఇండియాతో అనుబంధంగా వర్క్ చేస్తున్నాను కాబట్టి దేశంలోని హ్యాండ్లూమ్ క్లస్టర్స్తోనూ, ఈ మార్గంలో వచ్చే అంతరాలను పూడ్చేందుకు నిఫ్ట్‌లోని వివిధ కేంద్రాలతో అనుబంధంగా వర్క్ చేస్తున్నాను.ఫ్యాబ్రిక్ సేకరణ, డిజైన్స్ సృష్టి, వ్యర్థాలు మిగలకుండా జాగ్రత్తపడటం అనేది ఓ సవాల్‌గా ఉంటుంది. కానీ, పర్యావరణ హితంగా, మనసుకు నచ్చిన పని చేస్తుండటం ఎప్పుడూ ఉత్సాహాన్ని ఇస్తుంది. అంతేకాదు, ఈ డిజైన్స్‌ని ఇష్టపడి కొనుగోలు చేసేవారి ద్వారా ప్రాణం పెట్టే కళాకారులకు ఉపాధి ΄÷ందేలా చేయడం మరింత సంతృప్తిని ఇస్తుంది’’ అని వివరించారు ఈ డిజైనర్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
‘డిగ్రీలతో ఉపయోగం లేదు.. పంక్చర్ షాప్ తెరవండి’
భోపాల్: మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య విద్యార్థులను ఉద్దేశించి విచిత్రమైన వ్యాఖ్యాలు చేశారు. ఆయన సోమవారం గుణ అసెంబ్లీ నియోజకవర్గంలో పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. డిగ్రీలు చదవటం వల్ల ఏం రాదు.. డబ్బులు సంపాదించాలంటే విద్యార్థులు మోటర్ సైకిల్ రిపేర్ చేసే.. పంక్చర్ షాప్‌ను పెట్టుకొవాలని సూచించారు.‘మేము ఇవాళ పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్సీని ప్రారంభించాం. నేను అందరికీ ఒక్కటే మాట చెప్పదల్చుకున్నా.. దానిని మీరు గుర్తు పెట్టుకోండి. కాలేజీలో డిగ్రీలతో ఏం రాదు. దాని బదులు మోటర్ సైకిల్ రిపేర్ చేసే.. పంక్చర్ షాప్‌ను పెట్టుకోండి. కనీసం దాని వల్ల రోజువారిగా డబ్బులు సంపాదించుకోవచ్చు’ అని అన్నారు.डिग्री से कुछ नहीं होने वाला, पंक्चर की दुकान खोल लेना" गुना से BJP विधायक पन्नालाल शाक्य ने कहा #Guna | Pannalal Shakya | #PannalalShakya pic.twitter.com/j3u7w4HvQ7— Deshhit News (@deshhit_news) July 15, 2024 ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మధ్యప్రదేశ్‌లోని 55 జిల్లాలో ఏర్పాటు చేసిన పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్సీని వర్చువల్‌గా ప్రారంభించారు. బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. -
భోజ్‌శాల కాంప్లెక్స్: ప్రభుత్వం చేతికి ఏఎస్ఐ రిపోర్టు
భోపాల్: హైకోర్టు ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్ ధార్‌లోని వివాదాస్పద భోజ్‌శాల(కమల్ మౌలా మాస్క్) కాంప్లెక్స్‌లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే చేపట్టింది. తాజాగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే రిపోర్టును సోమవారం మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి అందజేసింది.సర్వే రిపోర్టు ప్రకారం.. సిల్వర్, కాపర్, అల్యూమినియం, స్టీల్‌తో తయారు చేయబడ్డ 31 నాణేలను గుర్తించారు. ఈ నాణేలు ఇండో-సస్సానియన్ (10-11వ శతాబ్దం), ఢిల్లీ సుల్తానేట్ (13-14వ శతాబ్దం), మాల్వా సుల్తానేట్ (15-16వ శతాబ్దం), మొఘల్ (16-18వ శతాబ్దం), ధార్ రాష్ట్రం (19వ శతాబ్దం), బ్రిటిష్(19-20వ శతాబ్దం)వారికి చెందినవిగా పేర్కొంది. మొత్తం 94 శిల్పాలు, శిల్పాల శకలాలు, నిర్మాణాలు బయటపడినట్లు పేర్కొంది.బయటపడిన ఈ శిల్పాలు బసాల్ట్, పాలరాయి, మృదువైన రాయి, ఇసుకరాయి, సున్నపురాయితో తయారు చేయబడినట్లు తెలిపింది. ఈ శిల్పాలు హిందూ దేవుళ్లు వినాయకుడు, బ్రహ్మ, నరసింహ, భైరవలో పాటు పలు జంతువులు, మానవుల రూపంలో ఉన్నాయి. వాటితో పాటు సింహం, ఎనుగులు, గుర్రాలు, కుక్క, కోతి, పాము, తాబేలు, పక్షులతో కూడిన శిల్పాలను గుర్తించినట్లు తెలియజేసింది. పలు శాసనాలపై సంస్కృతం, ప్రాకృత భాష రాసి ఉన్నట్లు పేర్కొంది. వాటిపై విద్యావ్యవస్థకు సంబంధించిన కార్యకలాపాలు జరిగినట్లు సూచిస్తున్నాయి. మరోవైపు.. భోజ్ రాజు హాయాంలో అక్కడి విద్యాకేంద్రం ఉన్నట్లు ఏఎస్ఐ రిపోర్టు సూచిస్తోంది.మార్చి 11న భోపాల్ హైకోర్టు భోజ్‌శాలలో సర్వే నిర్వహించాలని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను ఆదేశించింది. మధ్య యుగానికి సంబంధించిన భోజ్‌శాల కాంప్లెక్స్ సరస్వతీ దేవీ ఆలయమని హిందువులు, కమల్ మౌలా మసీదు అని ముస్లింలు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాంప్లెక్సులో ప్రతి మంగళవారం హిందువులు పూజలు చేస్తుండగా శుక్రవారం ముస్లింలు నమాజ్ చేస్తున్నారు.ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు పూర్తి సర్వే రిపోర్టును జూలై 15వరకు సమర్పించాలని ఏఎస్ఐని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు జూలై 22కు వాయిదా వేసింది. -
‘శివరాజ్ సింగ్ భారీ గెలుపుతో.. ఢిల్లీ మొత్తం తలవంచింది’
భోపాల్: లోక్‌సభ ఎన్నికల్లో తన తండ్రి, కేంద్ర వ్యవసాయం శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌పై గెలుపుతో ఢిల్లీ మొత్తం తలవంచిందని కార్తికేయ సింగ్ అన్నారు. ఆయన శుక్రవారం బుధ్నీ అసెంబ్లీ స్థానంలో నిర్వహించిన ఓ సభలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఢిల్లీ నుంచి వచ్చాను. అయతే మన నేత(శివరాజ్ సింగ్ చౌహన్) ఒక ముఖ్యమంత్రిగా చాలా పాపులర్. అయిన ఇప్పుడు సీఎం కాకున్నా మరింత పాపుల్ అయ్యారు. మన నేత భారీ విజయం సాధించారు. దీంతో ఢిల్లీ మొత్తం ప్రస్తుతం మన నేత ముందు తలవంచంది. ఢిల్లీ మొత్తానికి ఆయనేంటో తెలుసు. అదేవిధంగా ఆయనకు గుర్తింపు, గౌరవం ఇస్తుంది. ఒక్క ఢిల్లీనే కాదు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన్ను గౌరవిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద నేతల జాబితాలో శివరాజ్‌సింగ్ ఒకరుగా నిలుస్తారు’అని తండ్రిపై ప్రశంసలు కురిపించారు.లోక్‌సభ ఎన్నికల విదిశ పార్లమెంట్ స్థానంలో బీజేపీ తరఫున బరిలోకి దిగిన మాజీ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ 8.20 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. దీంతో ఆయన కేంద్ర కేబినెట్లో చోటుదక్కించుకొని వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఇక.. తన తండ్రిపై కార్తికేయ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. కార్తికేయ సింగ్ వ్యాఖ్యలతో ఢిల్లీకి అసమ్మతి భయం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.‘కేంద్ర మంత్రి కుమారుడు (యువరాజు) కార్తికేయ ఢిల్లీ భయంతో ఉందని ఉంటున్నారు. ఇది 100 శాతం నిజం. ఎందుకంటే దేశం భయంతో ఉన్న ఓ నియంతను నిశితంగా పరిశీలిస్తోంది. పార్టీలో వ్యక్తం అవుతున్న అసమ్మతి స్వరం. రెబెల్ అవుతున్న పెద్ద నేతలు. సంకీర్ణ ప్రభుత్వ సమన్వయం. ప్రభుత్వానికి మద్దతు తగ్గటం వల్ల భయంతో అధికార పీఠం కదులుతోంది’అని జితూ పట్వారీ అన్నారు. మరోవైపు.. శివరాజ్ సింగ్ కేంద్రమంత్రి కావటంతో బుధ్నీ అసెంబ్లీ నియోజకర్గం నుంచి పోటీ చేయడానికి ఆయన కుమారుడు కార్తికేయ సింగ్ చౌహాన్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. -
ఓటు వేశారు.. డైమండ్ రింగ్ గెలుచుకున్నారు!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాలలో మంగళవారం మూడో విడత పోలింగ్ జరిగింది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎన్నికల సంఘం పలు చర్యలు తీసుకుంటుంది. ఇదే కోవలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓటర్లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక బహుమతులను అందించారు.భోపాల్‌లోని పలు పోలింగ్ కేంద్రాలలో లాటరీ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ లాటరీ పథకంలో ఉదయం 11 గంటలకు జరిగిన మొదటి డ్రాలో యోగేష్ సాహు డైమండ్ రింగ్ గెలుచుకున్నారు. తరువాత మధ్యాహ్నం 2, 5 గంటలకు మరో రెండు డ్రాలు జరిగాయి. దీని తర్వాత బంపర్ డ్రా కూడా జరిగింది.లోక్‌సభ ఎన్నికల రెండవ దశలో ఓటింగ్ శాతం తగ్గిన నేపధ్యంలో ఓటర్లను ప్రోత్సహించడానికి భోపాల్‌లోని పలు పోలింగ్ బూత్‌లలో ఎన్నికల సంఘం లాటరీ పథకాన్ని ప్రారంభించింది. ఓటు హక్కును వినియోగించుకున్న వారికి ఆకర్షణీయమైన బహుమతిని అందజేస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.భోపాల్ ఎన్నికల చరిత్రలో తక్కువ ఓటింగ్ నమోదవుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో ఇక్కడ ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చొరవ చూపింది. ఈ నేపధ్యంలో 65.7 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఎన్నికల సంఘం నిర్వహించిన లక్కీ డ్రాలో ముగ్గురు ఓటర్లకు వజ్రాల ఉంగరాలు లభించగా, మరికొంతమందికి మిక్సర్లు, వాటర్ కూలర్లు లభించాయి. కొందరు టీ షర్టులను గెలుచుకున్నారు. -
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
లక్కీ డ్రాలో బహుమతులు గెలుచుకోవచ్చంటే సామాన్యుల కాలు కదలకుండా ఉంటుందా..? మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లోక్‌సభ స్థానంలో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు ఇలాంటి ఆఫరే ఇస్తున్నారు. మూడో దశలో భాగంగా ఈ నెల 7న భోపాల్‌లో పోలింగ్ జరుగుతోంది. ఆ రోజున ఓటేసే వారి పేర్లనుంచి ప్రతి మూడు గంటలకు ఒకసారి లక్కీ డ్రా తీయనున్నారు. విజేతలకు వజ్రపు ఉంగరాలు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు తదితర కానుకలిస్తారట! ‘‘నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉదయం 10, మధ్యాహ్నం 3, సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులిస్తం. పోలింగ్ మర్నాడు మెగా డ్రా తీసి విజేతలకు మరింత పెద్ద బహమతులిస్తాం’’అని జిల్లా ఎన్నికల అధికారి కౌసలేంద్ర విక్రమ్ సింగ్ ప్రకటించారు. ఓటింగ్ పెంచేందుకే.. మధ్యప్రదేశ్‌లో ఇప్పటిదాకా జరిగిన రెండు దశల్లో పోలింగ్ 2019తో పోలిస్తే సగటున 8.5 శాతం తగ్గింది. 2019లో భోపాల్‌లో 65.7 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి ఎండలు విపరీతంగా ఉన్నందున ఓటర్లు పెద్దగా ఇల్లు కదలకపోవచ్చన్న ఆందోళనలున్నాయి. దీంతో ఎలాగైనా ఓటింగ్‌ను పెంచాలని ఈసీ కృత నిశ్చయంతో ఉంది. భోపాల్ నియోజకవర్గంలో 3,097 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి బూత్ వద్ద ఒక బీఎల్వో, వలంటీర్‌ను లక్కీ డ్రా కోసం నియమించారు. ఓటేశాక అక్కడి కూపన్ బుక్‌లెట్‌లో పేరు, మొబైల్ నంబర్ రాసి రసీదు తీసుకోవాలి. బహమతుల ఖర్చును కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కంపెనీలు భరిస్తున్నాయి. మెగా డ్రా కోసం డైమండ్ ఉంగరాలు, ల్యాప్‌టాప్‌లు, ఫ్రిజ్‌లు ఎనిమిది డిన్నర్ సెట్లు, రెండు మొబైల్ ఫోన్లు రెడీగా ఉన్నాయి. దీంతోపాటు ప్రతి పోలింగ్ కేంద్రంలో తొలి ఓటర్ను గౌరవించేందుకు ప్రత్యేకంగా ఏదైనా చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
భోపాల్: లోక్‌సభ ఎన్నికల రెండు దశలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇదివరకు నమోదైన విధంగా తక్కువ ఓటింగ్ శాతాన్ని పరిష్కరించడానికి లేదా ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడానికి భోపాల్‌లోని అధికారులు ఓ కొత్త వ్యూహాన్నిరూపొందించారు. ఓటు ప్రాముఖ్యతను గుర్తించి.. ఓటర్లను ఆకర్శించడానికి (ఓటు హక్కును వినియోగించుకోవడానికి) లక్కీ డ్రా నిర్వహించడానికి అధికారులు కంకణం కట్టుకున్నారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 13 ఎంపీ స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన స్థానాలకు మూడు, నాలుగవ దశల్లో ఓటింగ్ జరగనుంది. ఈ దశల్లో ఓటర్లను ఎక్కువ సంఖ్యలో ఆకర్శించడానికి పోలింగ్ రోజు ప్రతి రెండు గంటలకు ఒక లక్కీ డ్రా నిర్వహించడానికి అధికారులు సంకల్పించారు.లక్కీ డ్రాలో డైమండ్ రింగ్స్, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్ వంటి ఆకర్షణీయమైన బహుమతులు అందించనున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్ అంతటా 8.5 శాతం ఓటింగ్ తగ్గింది. 2019 ఎన్నికలలో కూడా ఓటింగ్ శాతం 65.7% మాత్రమే. ఈ సారి మాత్రం ఓటు హక్కును తప్పకుండా అందరూ ఉపయోగించుకోవాలని అనే నేపథ్యంలో ఈ లక్కీ డ్రా విధానం ప్రవేశపెట్టారు.జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ ఈ లక్కీ డ్రా గురించి మాట్లాడుతూ.. పోలింగ్ రోజు ప్రతి బూట్ వద్ద ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రాలో విజేతలను ప్రకటిస్తాము. ఎన్నికలు పూర్తయిన ఒకటి లేదా రెండు రోజుల్లో వారికి గిఫ్ట్స్ ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఓటరులో చైతన్యాన్ని తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కౌశలేంద్ర పేర్కొన్నారు.భోపాల్ పార్లమెంటరీ నియోజకవర్గం 2,097 పోలింగ్ బూత్‌లను కలిగి ఉంది. పోలింగ్ రోజున ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఒక వాలంటీర్‌ను నియమిస్తారు. ఓటు వేసిన తరువాత ఓటరు పేరు, మొబైల్ నెంబర్ రాసి వారి దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత జరిగే లక్కీ డ్రాలో విజేతలను ఎంపిక చేయడం జరుగుతుంది.#SVEEP के अंतर्गत 'राज्य स्तरीय स्लोगन प्रतियोगिता' ▶️प्रविष्टि भेजने की अंतिम तिथि आज ▶️“प्रत्येक वोट जरूरी है” विषय पर लिखें स्लोगन और जीतें आकर्षक पुरस्कार ➡️प्रविष्टि भेजने के लिए विजिट करें 👇https://t.co/ZX4TawpjyZ @rajivkumarec @ECISVEEP @SpokespersonECI pic.twitter.com/f4CSpBaKDK— Chief Electoral Officer, Madhya Pradesh (@CEOMPElections) April 30, 2024 -
భారత్‌లో డ్రైవర్‌లెస్ కారు.. రోడ్లపై రయ్ రయ్ మంటూ చక్కర్లు
భోపాల్ : కృత్రిమమేధతో నడిచే.. డ్రైవర్ లేని స్వయంగా నడిచే వాహనాలు వచ్చేస్తున్నాయనే ప్రచారం ఇటీవల బాగా జరగుతోంది. నిర్లక్ష్యపు డ్రైవర్లు, మద్యం తాగి వాహనాలు నడిపేవారి నుంచి విముక్తి లభిస్తుందన్న అంచనాలు జోరుగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది సులువేమీ కాదని ఏఐ నిపుణులు అంటుంటే.. భారత్‌కు చెందిన ఓ కంపెనీ మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఆటోమొబైల్ రంగంలో ఏఐ టెక్నాలజీని సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. డ్రైవర్‌లెస్ కారును అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఆ డ్రైవర్ లెస్ కారు భారత్ రోడ్లపై రయ్ రయ్ మంటూ చక్కెర్లు కొడుతుండడం విశేషం. సంజీవ్ శర్మ స్వయాత్ రోబోట్ ఫౌండర్, సీఈఓ తాజాగా ఆ సంస్థ గత కొన్నేళ్లుగా ఓ ప్రముఖ కార్ల తయారీ సంస్థకు చెందిన ఓ డీజిల్ కారుపై అనేక పరిశోధనలు చేస్తూ వచ్చింది.ముఖ్యంగా ఏఐ టెక్నాలజీని జోడించి డీజిల్ వేరియంట్ కారును అటానమస్ డ్రైవర్ లెస్ కారుగా మార్చేశారు. ఈ సందర్భంగా భోపాల్‌లోని కంకాళి కాళీ మాత దేవాలయం నుంచి ఇరుకు సందుల్లో, రోడ్లమీద ట్రాఫిక్‌ను క్లియర్ చేసుకుంటూ డ్రైవర్ లెస్ కారు ప్రయాణాన్ని జీపీఎస్‌తో నావిగేట్ చేస్తున్న వీడియోని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ వీడియోలో ఎదురుగా వస్తున్న వాహనాల్ని ఢీకొట్టకుండా పక్కకి వెళ్లడం, జనావాసాల్లో ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ముందుకు కారు ప్రయాణించడం మనం గమనించవచ్చు. Autonomous driving through tight, dynamic, stochastic, and adversarial traffic-dynamics on sub-urban roads in India, as well as through partially unstructured environments. This demos showcases the robustness of our motion planning and decision making algorithmic frameworks in… pic.twitter.com/UcY07arxSK — Sanjeev Sharma (@sanjeevs_iitr) February 29, 2024 అయితే దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టెస్లాతో పాటు ఇతర కంపెనీలు డ్రైవర్ లెస్ కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటే స్వయాత్ రోబోట్ డీజిల్ కారును డ్రైవర్‌లెస్ కారు మార్చడమే కాకుండా విజయవంతంగా డ్రైవ్ చేయించడంపై ఆటోమొబైల్ కంపెనీలు అధినేతలు, టెక్నాలజీ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
భోపాల్‌లో హైదరాబాద్ షర్బత్.. క్యూ కడుతున్న జనం!
వేసవిలో ఎండవేడిమి నుంచి ఉపశమనానికి చల్లని ఐస్ క్రీం లేదా ఏదైనా పానీయాన్ని తాగాలని ఎవరైనా అనుకుంటారు. హైదరాబాద్‌లో ఆదరణ పొందిన తహురా పానీయం ఇటీవలే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోకి ప్రవేశించింది. ముగ్గురు స్నేహితులు ఈ శీతల పానీయ విక్రయాలను భోపాల్‌లో ప్రారంభించారు. హైదరాబాద్‌లో రంజాన్ సందర్భంగా ఈ పానీయానికి మంచి డిమాండ్ ఉంటుంది. అయితే వేసవి ఉపశమనానికి ఈ షర్బత్ మ్యాజిక్‌లా పనిచేస్తుందని పలువురు అంటుంటారు. డ్రై ఫ్రూట్స్, పాలతో తయారు చేసే ఈ షర్బత్‌ను భోపాల్ ప్రజలు ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఈ శీతలపానీయాల దుకాణం ప్రారంభించిన నాలుగైదు రోజుల్లోనే ఈ షర్బత్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. భోపాల్‌లోని మోతీ మసీదు కూడలిలో తహురా పేరుతో ఒక దుకాణాన్ని ఈ ప్రాంతానికి చెందిన ఫరూక్ షేక్, జునైద్ అలీ షేక్, జైన్ ఖాన్ ప్రారంభించారు. మహారాష్ట్రంలోని పూణేలో వీరు ఈ షర్బత్‌ను రుచి చూశాక భోపాల్‌లో ఈ పానీయాన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ షర్బత్‌ను ఫరూఖ్, అతని స్నేహితులు స్వయంగా తయారు చేస్తారు. వీరి దుకాణం సాయంత్రం 5 నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. బాదం, పిస్తా, పాలతో తయారు చేసే ఈ పానీయంలో చక్కెరను అస్సలు ఉపయోగించరు. ఇది వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందిస్తుందని చాలామంది చెబుతుంటారు. ఈ పానీయాన్ని తాగేందుకు జనం ‘తహురా’ దుకాణం ముందు క్యూ కడుతుంటారు. -
తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్ : ఈ బాలీవుడ్ నటిని గుర్తు పట్టారా?
డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన చాలామంది నటులను చూశాం. అలాగే అటునటులుగా, ఇటు డాక్టర్లుగా కొనసాగిన వారి గురించీ విన్నాం. కానీ యాక్టర్ నుంచి పోలీసు అధికారి కావడం గురించి విన్నారా? 2010 బ్యాచ్‌కి చెందిన ఒక మహిళా ఐపీఎస్ ఆఫీసర్‌ను పరిచయం చేసుకుందాం.. రండి..! ఆకర్షణీయమైన ఎంటర్ టైన్మెంట్ రంగంనుంచి ఐపీఎస్ అధికారిగా మారింది ప్రముఖ బాలీవుడ్ నటి సిమల ప్రసాద్. సంకల్పం, పట్టుదల ఉంటే చాలా నిరూపించారు. ఐఏఎస్ అధికారి భగీరథ్ ప్రసాద్, ప్రముఖ రచయిత్రి మెహ్రున్నీసా పర్వేజ్‌ల కుమార్తె సిమల ప్రసాద్. నటిని కావాలన్న ఆశయంతో బాలీవుడ్లో నటిగా అడుగు పెట్టిన తర్వాత కూడా తన మరో లక్ష్యాన్ని మాత్రం మర్చిపోలేదు. (రణపాలతో ఆరోగ్య ప్రయోజనాలు : పేరులోనే ఉంది అంతా!) భోపాల్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ చదువు, ఆ తరువాత కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. నృత్యం, నటనపై ఆసక్తిని పెంచుకుంది. మరోవైపు తండ్రి ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పటికీ, సివిల్ సర్వీస్ మార్గంవైపు చూడలేదు. నటనపై ఆసక్తితో “అలిఫ్”, “నక్కష్” మూవీల్లో అవకాశాలను దక్కించుకున్నారు. ఈ క్రమంలో “అలీఫ్” సినిమాలో షమ్మీ పాత్రకు గాను విమర్శకులు ప్రశంసలు దక్కాయి. అలా నటి కావాలనే ఆమె కల నెరవేరింది. ఇలా నటనను కొనసాగిస్తూనే భోపాల్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారామె. (గర్ల్ ఫ్రెండ్ కోసం, సాహసం: అతగాడి కష్టం తెలిస్తే ఔరా అనాల్సిందే!) తరువాత మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అలా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోదా వరించింది. ఈ క్రమంలోనే యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ కావడం కూడా ప్రారంభించింది. ఇక్కడితో ఆమె ఆగిపోలేదు. ఈ క్రమంలోనే యూపీఎస్సీ పరీక్షపై దృష్టిపెట్టారు. అంతేకాదు తొలిప్రయత్నంలోనే ఎలాంటి కోచింగ్ లేకుండానే పరీక్షలో విజయం సాధించి ఐపిఎస్ అధికారిణి కావడం విశేషం. -
‘టికెట్ కోరటం లేదు..’ ప్రజ్ఞా ఠాకూర్ స్పందన
బీజేపీ తొలి జాబితాలో 33 మంది సిట్టింగ్ ఎంపీలను పక్కకుపెట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో 370 స్థానాల్లో విజయమే లక్ష్యంగా గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని నిర్ణయించుకుంది. దానికి నిదర్శనమే తొలిజాబితా. ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన వారికి బీజేపీ ఈసారి మొండి చేయి చూపింది. అటువంటి వారిలో ఒకరు ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్. ప్రస్తుతం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానాన్ని అలోక్ శర్మకు కేటాయించింది. అయితే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు మళ్లీ టికెట్ రాకపోవటానికి కారణమని బీజేపీలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ తనకు బీజేపీ టికెట్ కేటాయించకపోవటంపై స్పందించారు. ‘గతంలో నేను టికెట్ కోరలేదు.. ఇప్పడూ కూడా నేను లోక్‌సభ టికెట్ కోరటం లేదు. గతంలోనే నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రధాని మోదీకి నచ్చలేదు. నా వ్యాఖ్యలపై ప్రధాని.. నేను ఎప్పటికీ పూర్తి స్థాయిలో క్షమించబడనని అన్నారు. ఏదేమైనా నేను క్షమాపణలు కూడా చెప్పాను’ అని సాధ్వీ ఆదివారం మీడియాకు వివరించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక నేత దిగ్విజయ్ సింగ్‌పై 3,64, 822 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక.. సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్‌పై గతంలో అనేక వివాదాలున్నాయి. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసు, నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడు అని వ్యాఖ్యానించటం, 2008 ఉగ్రదాడుల సమయంలో మరణించిన ముంబై ఏటీఎస్ మాజీ చీఫ్ హేమంత్ కర్కరే గురించి చేసిన కామెంట్లు అప్పట్లో పెను సంచలనంగా మారాయి. ఇలా సాధ్వీ సున్నితమైన అంశాల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కమలం పెద్దలకు ఆగ్రహం తెప్పించిదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు.. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం
భోపాల్: ఆర్థికంగా వెనుకబడిన జనరల్ కేటగిరీ కులాల వారికే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయా అనే అంశాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు విచారించింది. ఈ విషయంలో చీఫ్ జస్టిస్ రవి విజయ మలిమత్, జస్టిస్ విశాల్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో స్పందనను తెలియజేయాలని ఆదేశించింది. అడ్వకేట్ యూనియన్ ఫర్ డెమొక్రసీ అండ్ సోషల్ జస్టిస్ సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఇతర కులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారిని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించడం లేదని కోర్టుకు తెలిపింది. పేదలపై కులం పేరుతో ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధంగా భావించి కొట్టి వేయాలని పిటిషనర్ కోరారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్ -
‘బుల్డోజర్ చర్య ఫ్యాషన్ అయింది’.. హైకోర్టు సీరియస్
మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న బుల్డోజర్ చర్యను రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా ఖండించింది. బుల్డోజర్ చర్యలు ఇటీవల కాలంలో ఒక ఫ్యాషన్‌గా తయారైందని కోర్టు సీరియస్ అయింది. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇల్లును ప్రభుత్వ అధికారులు కూల్చేయడాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ తప్పు పట్టింది. సరైన విధానాలు అమలు పర్చకుండా నిందితుడి ఇంటిని కూల్చివేయటం సరికాదని ప్రభుత్వ అధికారులపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిందితుడు రాహుల్ లాంగ్రీ.. ఓ వ్యక్తి వద్ద ఆస్తిని దోచుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడితో ఆగకుండా ఆ వ్యక్తిపై బెదింపులకు పాల్పడగా అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ కేసులో ప్రస్తుతం రాహుల్ లాంగ్రీ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదే సమయంలో తాజాగా రాహుల్ లాంగ్రీ ఇంటిపై ప్రభుత్వ అధికారులు బుల్డోజర్ చర్య చేపట్టి.. అతని ఇంటిని కూల్చేశారు. దీంతో రాహుల్ లాంగ్రీ భార్య రాధా కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ అధికారుల బుల్డోజర్ చర్యలకు వ్యతిరేకంగా రాధా దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. తమ ఇంటి పాత యజమాని అధికారులు నోటీసులు పంపారు. తమ వివరణ వినకుండా ఉజ్జయినిలోని తమ ఇంటిని ప్రభుత్వ అధికారులు కూల్చివేశారని లాంగ్రీ భార్య పిటిషన్లో పేర్కొన్నారు. తమ ఇల్లు అక్రమంగా కట్టింది కాదని.. ఆ ఇంటికి బ్యాంక్‌లో లోన్ కూడా తీసుకున్నామని ఆమె పిటిషన్లో తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు ఇండోర్ బెంచ్ ప్రభుత్వ అధికారుల చేపట్టిన బుల్డోజర్ చర్యలను తప్పుపడుతూ.. నష్టపరిహారంగా లాంగ్రీ భార్య, తల్లికి చెరో రూ.లక్ష చెల్లించాలని ఆదేశించింది. ఇక..ఈ కేసులో మరింత నష్టం పరిహారం పొందేందుకు పిటిషన్‌దారులు సివిల్ కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి: బిహార్‌లో మోదీని ఎదుర్కొంటాం: తేజస్వీ యాదవ్ -
103 ఏళ్ల తాత మూడో పెళ్లి
లక్నో: మధ్యప్రదేశ్‌లో 103 ఏళ్ల వ్యక్తి 49 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్నాడు. తన ఇద్దరు భార్యలు మరణించిన కారణంగా మూడో పెళ్లి చేసుకున్నట్లు ఆయన చెప్పారు. తాత వయసున్న ఆయన తన మూడో భార్యతో బయటకు వెళ్లిన క్రమంలో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హబీబ్ నాజర్(103) మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. స్వాతంత్య్ర ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నాడు. ఆయన ఇద్దరు భార్యలు ఇప్పటికే మరణించారు. దీంతో మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న ఆయన ఒంటరిగా జీవించాలని అనుకోలేదు. అందుకే మూడో వివాహం చేసుకోవాలనుకున్నారట. అందుకే 49 ఏళ్ల ఫిరోజ్ జహాన్ అనే మహిళను వివాహం చేసుకున్నారు. शादी की कोई उम्र नहीं! 103 साल के बुजुर्ग ने 49 की फिरोज जहां से किया निकाह, देखें Video पूरी खबर पढ़ें: https://t.co/rgQhoNLQli#Bhopal #ndtvmpcg #viralvideos pic.twitter.com/dDtcsUOlEm — NDTV MP Chhattisgarh (@NDTVMPCG) January 29, 2024 విహహం అనంతరం నాజర్ మాట్లాడుతూ..' నాకు 103 ఏళ్లు. నా భార్యకు 49. నాసిక్‌లో మొదటిసారి వివాహం అయింది. ఆమె చనిపోయాకు లక్నోలో మరో వివాహం చేసుకున్నారు. రెండో భార్య కూడా చనిపోయింది. నాకు జీవితం ఒంటరిగా అనిపిస్తోంది. ఆరోగ్యంగా ఉన్నాను. ఎలాంటి మెడికల్ సమస్యలు లేవు. అందుకే మరో వివాహం చేసుకున్నాను.' అని తెలిపారు. ఫిరోజ్ జహాన్‌కు ఇది రెండో వివాహం. తన భర్త చనిపోయిన కారణంగా ఒంటరిగా జీవిస్తోంది. 103 ఏళ్ల హబీబ్ నాజర్‌కు స్థానికంగా మంచి పేరు కూడా ఉంది. ఆయనకు చూసుకునే వారు ఎవరూ లేనందున వివాహానికి జహాన్ ఒప్పుకుంది. ఇదీ చదవండి: Preeti Rajak: సుబేదార్ ప్రీతి -
25 అడుగుల జాయింట్ కైట్ ఎగురుతుందిలా..
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని ఎంవీఎం గ్రౌండ్లో ‘సంక్రాంతి మహోత్సవ్-2024’కు సర్వం సిద్ధమైంది. నేటి ఉదయం (జనవరి 14) రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సూర్యునికి అర్ఘ్యం సమర్పించి ఉత్సవాన్ని ప్రారంభించనున్నారు. ఉత్సవంలో భాగంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి ఒకరికొకరు పసుపు, కుంకుమ పూసుకుంటారు. తరువాత పతంగుల పోటీ జరగనుంది. ఈ సందర్భంగా గుజరాత్‌కు చెందిన పతంగుల కళాకారులు ప్రత్యేకంగా తయారుచేసిన జాయింట్ గాలిపటాన్ని ఎగురవేయనున్నారు. దాని పరిమాణం 25 అడుగుల వరకు ఉంటుంది. ఈ జాయింట్ పతంగులలో కార్టూన్లు, సింహాలు, వివిధ బొమ్మలు ఉంటాయి. ‘సంక్రాంతి మహోత్సవ్-2024’లో మహిళల ఆధ్వర్యంలో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటయ్యాయి. అలాగే జిల్లా స్థాయి పతంగుల ఎగురవేత పోటీ ఏర్పాటు చేశారు. సాయంత్రం లోహ్రీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భోగి మంటలు వేయడంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గాలిపటాలు ఎగురవేయాలనే ఉత్సాహం కలిగినవారికి నిపుణులు శిక్షణ అందిస్తారు. ‘సంక్రాంతి మహోత్సవ్-2024’ జనవరి 15న ముగుస్తుంది. ఇది కూడా చదవండి: తొలి గాలిపటాన్ని ఎవరు తయారు చేశారు? ఎందుకు ఉపయోగించారు? -
భోపాల్: షెల్టర్ హోం నుంచి 26 మంది బాలికల మిస్సింగ్!
మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భోపాల్‌లో చట్టవిరుద్దంగా నిర్వహిస్తున్న షెల్టర్ హోమ్ నుంచి 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. భోపాల్ శివారు ప్రాంతంలో అంచల్ బాలికల హాస్టల్ నిర్వహిస్తున్నారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) చైర్మన్ ప్రియాంక్ కనుంగో .. ఈ చిల్డ్రన్స్ హోమ్‌ను ఆకస్మికంగా సందర్శించారు. అయితే రిజిస్టర్‌ను తనిఖీ చేయగా.. అందులో 68 బాలికల ఎంట్రీలు ఉండగా.. 26 మంది గల్లంతైనట్లు గుర్తించారు. మిస్ అయిన వారిలో గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని సెహోర్, రైసెన్, చింద్వారా, బాలాఘాట్ ప్రాంతాలకు చెందిన బాలికలు ఉన్నారు. అదృశ్యమైన బాలికల గురించి షెల్టర్ హోమ్ డైరెక్టర్ అనిల్ మాథ్యూను ప్రశ్నించగా.. ఆయన పొంతన లేని సమాధానలు చెప్పాడు. అనుమానం వచ్చిన అధికారి.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో బాలికల హాస్టల్లో అనేక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. అసలు షెల్టర్ హోంను అక్రమంగా నిర్వహిస్తున్నట్లు తేలింది. వీధుల్లో ఒంటరిగా కనిపించిన పిల్లలను ఒక చోట చేర్చి, ఎలాంటి లైసెన్స్ లేకుండా ఓ మిషనరీ( మత గురువు) ఈ షెల్టర్ హోమ్‌ను నడుపుతున్నట్లు కనుంగో ట్వీట్ చేశారు. రక్షించిన పిల్లలకు రహస్యంగా క్రైస్తవ మతాన్ని ఆచరించేలా చేశారని ఆరోపించారు. హాస్ట్‌లో ఎక్కువమంది అమ్మాయిలు ఆరు నుంచి 18 సంవత్సరాల వారేనని.. వీరిలో అధికంగా హిందువులే ఉన్నట్లు తెలిపారు. కాగా ఈ విషయం గురించి తెలుసుకున్న గవర్నర్.. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశిస్తూ ప్రభుత్వ సీఎస్‌కు నోటీసులు పంపినట్లు తెలిపారు. ఇక షెల్టర్ హోంలోని మిగతా పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పజెప్పారు. చదవండి: రామమందిర ప్రారంభం.. ఆలయానికి వెళ్లి మహా హారతి ఇస్తా: ఉద్ధవ్ -
22న అయోధ్యలో డమరూ బృందం ప్రదర్శన
అయోధ్యలోని నూతన రామాలయంలో ఈనెల 22న బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఈ ఉత్సవంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన డమరూ బృందం పాల్గొననుంది. 108 మంది సభ్యుల డమరూ బృందం జనవరి 22న అయోధ్యలో ప్రదర్శన ఇవ్వనుంది. దేశంలో రామ భజన, రామ స్తుతి, శివ తాండవ స్తోత్రాన్ని పఠించే ఏకైక బృందంగా భోపాల్ డమరూ బృందం పేరుగాంచింది. జనవరి 22న అయోధ్యలో దేశ నలుమూలలకు చెందిన పలువురు కళాకారులు తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ నేపధ్యంలోనే భోపాల్‌కు చెందిన డమరూ బృందం కూడా తమ ప్రదర్శనతో ఉర్రూతలూగించనుంది. భోపాల్‌లోని శ్రీ బాబా బటేశ్వర్ కీర్తన సమితికి అయోధ్య నుండి ఆహ్వానం అందింది. దీంతో జనవరి 22న రామభక్తులు ఆలయానికి వెళ్లే మార్గంలో శ్రీ బాబా బటేశ్వర్ కీర్తన సమితికి చెందిన డమరూ బృందం ప్రదర్శన ఇవ్వనుంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి జనవరి 20న ఈ డమరూ బృందానికి చెందిన 108 మంది సభ్యులు అయోధ్యకు చేరుకుంటారు. అక్కడ వారు 21న రిహార్సల్ చేస్తారు. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర వీవీఐపీల సమక్షంలో వీరి ప్రదర్శన సాగనుంది. ఇది కూడా చదవండి: అయోధ్యాపురిలో నూతన రామాలయ వైభవమిదే.. -
రెండు నెలల్లో రూ.4 లక్షలు.. ఏసీ కోచ్‌ల నుంచే..
గత రెండు నెలల్లో ట్రైన్ ఎస్ కోచ్‌ల నుంచి లక్షల విలువైన దుప్పట్లు, బెడ్షీట్లు, దిండ్లు, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయని ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. చోరీకి గారైన వస్తువుల విలువ ఎంత? ఎక్కడ ఈ చోరీలు ఎక్కువగా జరిగాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. ఏసీ కోచ్‌ల ప్రయాణించే ప్రయాణికులకు దుప్పట్లు, దిండ్లు వంటి వస్తువులను రైల్వే శాఖ ఉచితంగానే అందిస్తుంది. కొందరు ప్రయాణికులు వారి ప్రయాణం పూర్తయిన తరువాత ఆ దుప్పట్లను మడిచి బ్యాగులో వేసుకునే వెళ్లిపోయే సంఘటనలు చాలానే ఉన్నాయి. ప్రయాణికులు కాకుండా.. ఏసీ కోచ్ అటెండర్లు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా భోపాల్‌లో జరిగినట్లు సమాచారం. భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లలో ఇలాంటి చోరీలు జరిగాయని కొందరు అధికారులు తెలియజేసారు. భోపాల్ ఎక్స్‌ప్రెస్, రేవాంచల్ ఎక్స్‌ప్రెస్, మహామన ఎక్స్‌ప్రెస్, హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ గమ్యస్థానానికి చేరుకోవడానికి సుమారు 12 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుండటంతో ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా జరిగాయి. అన్ని రైళ్లలో 12 కోచ్‌లు, ఇద్దరు అటెండర్లు మాత్రమే ఉంటారు. వారు రాత్రి సమయంలో పడుకునే సందర్భంలో మధ్యలో దిగిపోయేవారు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని చెబుతున్నారు. ఇదీ చదవండి: బిలినీయర్స్ జాబితాలో కొత్త వ్యక్తి.. మద్యం అమ్ముతూ అరుదైన ఘనత కేవలం గత రెండు నెలల్లో రైళ్లలో రూ.2.65 లక్షల విలువైన 1,503 బెడ్షీట్లు, రూ.1.9 లక్షల విలువైన 189 దుప్పట్లు, రూ.10 వేలకు పైగా విలువ చేసే 326 దిండ్లు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకులు ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై పెద్దగా చర్యలు తీసుకోలేదని.. చోరీలను ఆపడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. 🚨 Blankets, bed sheets, pillows and other stuff worth 4 lakh were stolen from trains AC coaches in last two months. Most incidents took place in Bhopal, Rewanchal, Mahamana and Humsafar express (GRP Officials) pic.twitter.com/paAGnaNSRH — Indian Tech & Infra (@IndianTechGuide) December 14, 2023 -
బీజేపీకి ఓటేసినందుకు దాడి.. భద్రతకు సీఎం భరోసా
భోపాల్: బీజేపీకి ఓటేసినందుకు బావ వరుస అయ్యే వ్యక్తి తనపై దాడి చేశాడని ఓ ముస్లిం మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెహోర్‌లోని అహ్మద్‌పూర్ ప్రాంతానికి చెందిన సమీనా బీ అనే మహిళ డిసెంబ్ 4న బీజేపీ విజయం సాధించినందుకు సంబరాలు చేసుకున్నారు. అయితే ఇదంతా గమనించిన జావేద్ ఖాన్ బీజేపీకి ఎందుకు ఓటు వేశావంటూ వేధించటం మొదలుపెట్టాడు. దుర్భషలాడిన తన బావ జావేద్‌ను ఆమె ప్రశ్నించగా.. అతడు ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆపై బీజేపీ మద్దతుగా నిలిస్తే ఊరుకోనని ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఇచ్చిన ఫిర్యాదుతో సెహోర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. అయితే ఆమె జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీన్ సింగ్‌ను కూడా కలిసి తనపై దాడి చేసిన జావేద్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయం తెలిసిన సీఎం శీవరాజ్ సింగ్ చౌహాన్ ఆమెను తన అధికార నివాసానికి పిలిపించుకున్నారు. ఆమె తన పిల్లలతో సీఎం చౌహాన్ కలిసి.. తాను బీజేపీ ఓటు వేసినందుకు తన బావ జావేద్ దాడి చేసినట్లు తెలిపారు. జావేద్ నుంచి తమకు భద్రత కల్పించాలని ఆమె సీఎంను కోరారు. సీఎంను కలిసిన అనంతరం సమీనా బీ మీడియాతో మాట్లాడుతూ.. తనకు, తన పిల్లలకు భద్రత కల్పించాలని సీఎం కోరినట్లు తెలిపారు. దానికి సీఎం చౌహాన్ సానుకూలంగా స్పందిస్తూ.. తన పిల్లల పూర్తి భద్రతకు హామీ ఇచ్చారని తెలిపారు. ఓటు ఎవరికి వేయాలనేది తన హక్కు అని చెప్పారు. రాజ్యాంగం ఆ హక్కును కల్పించిందని అన్నారు. సీఎం శివరాజ్సంగ్ చౌహాన్.. ఎప్పుడూ తప్పు చేయరని, అందుకు ఆయన పార్టీ అయిన బీజేపీకి ఓటు వేశానని తెలిపారు. కాగా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 163 స్థానాల్లో భారీ విజయం సాధిందించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కేవలం 66 సీట్లకు మాత్రమే పరిమితమైంది. -
Madhya Pradesh: బీజేపీ కార్యకర్తల సంబరాలు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ పైచేయి సాధించి మెజారిటీ మార్కును సునాయాసంగా అధిగమించి భారీ మెజారిటీతో రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో సంబరాలు మిన్నంటాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం భోపాల్‌లోని తన నివాసంలో సంతోషంగా కనిపించారు. తన కుటుంబంతో కలిసి విజయ సంకేతాన్ని చూపుతూ కార్యకర్తలకు అభివాదం చేశారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ మార్కును దాటడంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చారు. స్వీట్లు పంచకుని సందడి చేశారు. చౌహాన్ తన కుటుంబంతో సహా భోపాల్‌లో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను పలకరించారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. ఈ సంబరాల్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం మధ్యప్రదేశ్‌లోని 230 స్థానాల్లో బీజేపీ 161 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 66 స్థానాల్లో ముందంజలో ఉంది. -
భోపాల్ విషాదానికి 39 ఏళ్లు.. ఆ రోజు ఏం జరిగింది?
భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి నేటికి 39 ఏళ్లు. 1984, డిసెంబర్ 2,3 తేదీల మధ్య రాత్రి జరిగిన ఈ గ్యాస్ లీక్ ఘటనలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నేటికీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ప్రజలు నాటి ఘటన మిగిల్చిన విషాదాన్ని దిగమింగుతూనే కాలం వెళ్లదీస్తున్నారు. ప్రపంచంలోనే భారీ పారిశ్రామిక దుర్ఘటనగా పేరొందిన భోపాల్ ఉదంతపు గాయాలు 39 ఏళ్లు గడిచినా మానలేదు. ఈ గ్యాస్ దుర్ఘటనలో వేలాది మంది మృతిచెందారు. వారి పిల్లలు, మనుమలు ఇప్పటికీ ఈ విష వాయువు ప్రభావాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రభుత్వాలు అందించిన సాయం ఎందుకూ సరిపోలేదు. నాడు గ్యాస్ దుర్ఘటన జరిగిన ప్రదేశంలో విషపూరిత వ్యర్థాలు నేటికీ కనిపిస్తాయి. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ విషపూరిత వ్యర్థాలను కాల్చడం సాధ్యం కావడం లేదు. ఈ దుర్ఘటనకు బలై, న్యాయ పోరాటానికి దిగిన చాలామంది ఈ లోకం నుండి నిష్క్రమించారు. ఈ ఉదంతంలో బాధ్యులను శిక్షించాలనే అంశం ఇంకా కోర్టుల్లో పెండింగ్‌లోనే ఉంది. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో 15 వేల మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం దరిమిలా నగరం మృతదేహాలతో నిండిపోయింది. 1979లో మిథైల్ ఐసోసైనైడ్ ఉత్పత్తి కోసం ఇక్కడ ఒక కర్మాగారం ఏర్పాటయ్యింది. అయితే ఈ పరిశ్రమ యాజమాన్యం తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదు. డిసెంబర్ 2, 3వ తేదీ రాత్రి ఫ్యాక్టరీలోని ఏ 610 నంబర్ ట్యాంక్‌లో నీరు లీకైంది. మిథైల్ ఐసోసైనేట్లో నీరు కలవడంతో ట్యాంకులోపల ఉష్ణోగ్రత పెరిగింది. ఆ తర్వాత విషవాయువు వాతావరణంలోకి వ్యాపించించింది. 45 నిమిషాల వ్యవధిలోనే దాదాపు 30 మెట్రిక్ టన్నుల గ్యాస్ లీకైనట్లు సమాచారం. ఈ వాయువు నగరమంతటా వ్యాపించింది. ఈ విషవాయువుల బారినపడి 15 వేల మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు కూడా విష వాయువు ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు. వైకల్యం రూపంలో వారిని, వారి తరాలను వెంటాడుతోంది. ఈ విష వాయువు ప్రభావంతో మరణించిన వారి అధికారిక సంఖ్య ఇంకా అందుబాటులో లేదు. అధికారిక మరణాల సంఖ్య మొదట్లో 2259గా నివేదించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 3,787 మంది గ్యాస్ బారిన పడినట్లు నిర్ధారించింది. ఇతర అంచనాల ప్రకారం ఎనిమిది వేల మంది మరణించారు. మరో ఎనిమిది వేల మంది గ్యాస్ సంబంధిత వ్యాధులతో కన్నుమూశారని వివిధ నివేదికలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: రెబల్స్, స్వతంత్రుల టచ్‌లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు? -
ఒకే కుటుంబం.. రాజకీయ విరోధం!
సాక్షి, భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఒకే కుటుంబంలోని వారు వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేస్తున్నారు. ఇలా అధికారం కోసం బద్ధ వైరులుగా మారిన వారిలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల నేతలున్నారు. నవంబర్ 17వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో తోబుట్టువులు, మామ– మేనల్లుడు, బావమరుదులు, అల్లుళ్లు, అత్తలు, మామలు..ఇలా రాజకీయ ప్రత్యర్థులుగా రంగంలోకి దిగారు. నర్మదాపురం స్థానంలో బీజేపీ అభ్యరి్థ, అసెంబ్లీ స్పీకర్ సీతాశరణ్ శర్మపై స్వయానా ఆయన సోదరుడు గిరిజాశంకర్ శర్మ కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే అయిన గిరిజా శంకర్ సొంత పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరో ఉదాహరణ..సాగర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌కు చెందిన నిధి సునీల్ జైన్, తన బావ, సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే శైలేంద్ర జైన్‌పై పోటీకి దిగారు. శైలేంద్ర జైన్ చిన్న తమ్ముడు సునీల్ జైన్ భార్యే నిధి జైన్. దియోరి నియోజకవర్గ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సునీల్ జైన్. అదేవిధంగా, రేవా జిల్లా డియోతలాబ్లో కాంగ్రెస్ పార్టీ పద్మేష్ గౌతమ్‌ను పోటీకి నిలిపింది. ఈయన మామ, బీజేపీకి చెందిన ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ గిరీశ్ గౌతమ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. హర్దా జిల్లా తిమారి్నలో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి సంజయ్ షాపై ఆయన మేనల్లుడు అభిజీత్ షా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ ముఖాముఖి తలపడటం ఇది రెండోసారి. గ్వాలియర్ జిల్లా దాబ్రాలో బీజేపీకి చెందిన మాజీ మంత్రి ఇమార్తి దేవిపై ఆమె బంధువు సిట్టింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేశ్ రాజేతో తలపడుతున్నారు. ఇమార్తి దేవి మేనకోడలు రాజే కుటుంబంలో కోడలిగా ఉన్నారు. కుటుంబసభ్యులు ఎన్నికల్లో పరస్పరం తలపడటంపై సీనియర్ జర్నలిస్ట్, వ్యాఖ్యాత ఆనంద్ పాండే మాట్లాడుతూ..‘ఇది సైద్ధాంతిక సంఘర్షణ కానే కాదు. కేవలం అధికారం, పదవుల కోసం జరిగే పోరాటం’అని పేర్కొన్నారు. -
ఐఎఎఫ్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఐఎఎఫ్‌హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. భారత వైమానిక దళానికి చెందిన ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ భోపాల్ సమీపంలో ముందుజాగ్రత్తగా ల్యాండ్ అయ్యింది. ప్రాథమికంగా అందిన వార్తల ప్రకారం హెలికాప్టర్‌లోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో అందులో ఆరుగురు సైనికులు ఉన్నారని ఐఏఎఫ్ వర్గాలు తెలిపాయి. సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్ భోపాల్‌కు 60 కిలోమీటర్ల దూరంలోని పొలంలో దిగాల్సి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఆ హెలికాప్టర్ ఆనకట్టపై చాలా సేపు చెక్కర్లు కొట్టింది. అనంతరం కిందకు ల్యాండ్ అయ్యింది. బెరాసియాలోని డూమారియా గ్రామంలోని ఆనకట్ట సమీపంలో ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ల్యాండింగ్ జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో హెలికాప్టర్ ల్యాండ్ అయిన దృశ్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వీడియోలో హెలికాప్టర్ చుట్టూ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కూడా కనిపిస్తున్నారు. కాగా ఈ హెలికాప్టర్‌ను చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ జవానులు సాంకేతిక నిపుణుల రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇది కూడా చదవండి: భారత సంతతి జడ్జి చేతిలో గూగుల్ భవితవ్యం #WATCH | Madhya Pradesh: An Indian Air Force ALH Dhruv helicopter made a precautionary landing near Bhopal. As per the initial reports, the crew is safe and a team is on the way to look into the technical issues: IAF sources pic.twitter.com/cQRxCrJjzK — ANI (@ANI) October 1, 2023 -
ఉజ్జయిని కేసు: నిందితుడు తప్పించుకునే ప్రయత్నం
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉజ్జయిని బాలిక రేప్ కేసులో నిందితుడు భరత్ సోనిని ఇదివరకే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆధారాలు సేకరించేందుకు సంఘటన స్థలానికి నిందితుడిని తీసుకుని వెళ్లగా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడని అప్రమత్తమై పోలీసులు అతడిని పట్టుకున్నట్లు ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు. సచిన్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో బాలిక దుస్తులతోపాటు ఇతర ఆధారాలను సేకరించే క్రమంలో నిందితుడిని సంఘటనా స్థలానికి తీసుకెళ్లగా అదే అదనుగా భావించి నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడని ఈ ప్రయత్నంలో అతడి సిమెంట్ రోడ్డుపై పడిపోవాడంతో మోకాళ్ళకు, కాళ్లకు గాయాలు కూడా అయ్యాయన్నారు. సర్జరీ తర్వాత ప్రస్తుతం బాలిక ఆరోగ్యం కుదుటపడినా కూడా ఆమె ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉందని తెలిపారు. ఉజ్జయిని ఘోరానికి సంబంధించిన దృశ్యాలు బయటకు రాగానే అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అక్కడి ఆటో డ్రైవర్లను విచారించి భరత్ సోనీని నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో అత్యాచారానికి గురైన పదిహేనేళ్ల బాలిక దుస్తులు లేకుండా రక్తం కార్చుకుంటూ దయనీయ స్థితిలో ఉజ్జయిని వీధుల్లో సాయం కోరుతూ తిరిగిన వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. కనిపించిన వారందరినీ సాయమడుగుతూ చివరికి ఆ బాలిక ఒక ఆశ్రమం ఎదుట స్పృహ తప్పి పడిపోగా ఆశ్రమవాసులు ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. #WATCH | Ujjain minor rape case: Ujjain SP Sachin Sharma says, "There is an accused in the rape case. There is another auto driver against whom a case will be registered for not informing the police about the incident. When we were taking (the accused) for recreation of the crime… pic.twitter.com/6x3AggXxqq — ANI (@ANI) September 28, 2023 ఇది కూడా చదవండి: బస్సులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి -
ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు: ఎంపీ తివారి
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు 79 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది బీజేపీ అధిష్టానం. కానీ అందులో ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చోహాన్ పేరు లేకపోవడం ఆయనకు ఘోర అవమానమన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ. మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అక్కడ సరికొత్త వ్యూహంతో బరిలోకి దిగుతోంది. స్థానిక నాయకత్వాన్ని పక్కన పెట్టి కేంద్ర నాయకత్వానికి పెద్దపీట వేస్తోంది. తలపండిన రాజకీయ ఉద్దండులను రంగంలోకి దించుతోంది. అందులో భాగంగా ఇప్పటివరకు మొత్తం 79 మంది అభ్యర్థులను ప్రకటించింది బీజీపీ అధిష్టానం. మొత్తం రెండు విడతల్లో ప్రకటించిన జాబితాల్లో సీఎం పేరు లేకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ కాస్త ఘాటుగానే స్పందించారు. ఇది ఆయనకు ఘోర అవమానానికి పరాకాష్ట అని అన్నారు. బీజేపీ సరికొత్త ప్రణాళికలో భాగంగా కేంద్రంలో చక్రం తిప్పే స్థాయిలో ఉన్న సీనియర్ నాయకులకు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించింది. రెండో జాబితాలో ఇండోర్-1 నుంచి స్థానం దక్కించుకున్న కైలాష్ విజయవర్గీయ తనకు పోటీచేసే ఉద్దేశ్యం లేదన్నారు. తివారీ దీనిపై స్పందిస్తూ.. కైలాష్ విజయవర్గీయకు తన మానసిక ఆరోగ్యం సహకరించడం లేదని చెబుతున్నా సరే వినకుండా పోటీచేయాల్సిందేనని అధిష్టానం ఆయనపై ఒత్తిడి చేస్తోంది. ప్రస్తుతం కైలాష్ పరిస్థితి నీళ్లలోంచి బయటపడ్డ చేపలా తయారైందన్నారు. 39 మంది అభ్యర్థులతో బీజేపీ ప్రకటించిన ఈ రెండో జాబితాలో విజయవర్గీయ తోపాటు ముగ్గురు కేంద్ర మంత్రులు నలుగురు ఎంపీలు కూడా ఉన్నారు. వీరిలో నరేంద్ర సింగ్ తొమార్, ఫగ్గాన్ సింగ్ కులాస్తే, ప్రహ్లాద్ సింగ్ పటేల్ కూడా ఉన్నారు. ఇది కూడా చదవండి: మణిపూర్‌ను 'కల్లోలిత ప్రాంతం'గా ప్రకటించిన ప్రభుత్వం -
ఈ ఎన్నికల్లో హామీలకు 'మోదీ గ్యారెంటీ'
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ జన ఆశీర్వాద యాత్ర పేరుతో ప్రచారాన్ని నిర్వహించగా ముగింపు సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధాని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ వారికి మళ్లీ అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అనారోగ్య రాష్ట్రంగా చేస్తారని ఆరోపించారు. బీజేపీ చలవే.. జన ఆశీర్వాద యాత్ర సందర్బంగా 'కార్యకర్తల మహాకుంభ' పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కార్యక్రమంలో మొదట దీన్ దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకోవాలని చెబుతూ ఆయనకు నివాళులర్పించిన ప్రధాని.. అనంతరం కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రధాని మాట్లాడుతూ.. ఈరోజు మధ్యప్రదేశ్ ఇంతగా అభివృద్ధి చెందిందంటే అది మొదటిసారి యుక్కా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం వల్లనే సాధ్యమైందన్నారు. ఓటు వేసిన ప్రతి ఒక్కరు ఇంతటి అభివృద్ధిని చూడగలిగారంటే మీరంతా నిజంగా అదృష్టవంతులని అన్నారు. కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని చాలా కాలం పరిపాలించింది కానీ ఇక్కడ ఏదీ అభివృద్ధి చేయలేకపోయిందని పైగా అవినీతిని పెంచి పోషించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని అన్నారు. తుప్పుపట్టిన ఇనుము.. యావత్ భర్త దేశం కొత్త పార్లమెంట్ భవన నిర్మాణాన్ని అభినందిస్తుంటే వారు మాత్రం వ్యతిరేకించారు. అలాగే వారు మొదట్లో యూపీఐ చెల్లింపులను డిజిటల్ పేమెంట్లను కూడా వ్యతిరేకించారు. కానీ అదే ఈ రోజు దేశంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్షంలో పెడితే పాడైపోయే తుప్పు పట్టిన ఇనుములాంటి పార్టీ అని అవినీతిలో కూరుకుపోయిన వంశపారంపర్య పార్టీ అని అన్నారు. వచ్చే ఎన్నికలు చాలా కెలకమైనవని ఇక్కడి యువత బీజేపీ ప్రభుత్వ హయాంలో ఏంటో మార్పును చూశారు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. బిల్లును అడ్డుకోలేకపోయారు.. మీ తల్లిదండ్రులు, తాతలు కాంగ్రెస్ పాలనలో చాలా సమస్యలను ఎదుర్కొన్నారని మారు మాత్రం ఆ తప్పు చేయవద్దని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ పార్ట్ ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు రానివ్వమని అన్నారు. మీకు మాటిచ్చినట్టుగానే పార్లమెంట్ సాక్షిగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం జరిగింది. దానికి ఆ కుయుక్తులు కూటమి కూడా ఆమోదించింది. వారి మనసు అంగీకరించకపోయినా ఈ చారిత్రాత్మక బిల్లును వారు ఆమోదించకుండా ఉండలేక పోయారని అన్నారు. వాళ్లకు తెలియదు.. వారంతా బాగా డబ్బున్న కుటుంబాల్లో పుట్టినవారు కాబట్టి వారికి పేదవాళ్ల కష్టాలు గురించి తెలియదు. అందుకే వారెప్పుడూ పేద వారిని పట్టించుకోలేదని అన్నారు. ఈ ఎన్నికల్లో మీకు ఇచిన హామీలకు మోదీ గ్యారెంటీ ఉంటారని అన్నారు. తరాలుగా కాంగ్రెస్ పార్టీ తుంగలోకి తొక్కిన అభివృద్ధిని నేను వెలుగులోకి తీసుకొచ్చానని అన్నారు. जब मोदी गारंटी देता है, जब भाजपा गारंटी देती है, तो वो गारंटी जमीन पर उतरती है, घर-घर पहुँचती है। मोदी यानी हर गारंटी पूरी होने की गारंटी... - प्रधानमंत्री श्री @narendramodi#भाजपा_कार्यकर्ता_महाकुम्भ pic.twitter.com/Wr3Bu7qhUR — BJP Madhya Pradesh (@BJP4MP) September 25, 2023 ఇది కూడా చదవండి: మీరొక డమ్మీ సీఎం.. అందుకే పక్కన పెట్టేశారు -
మీరొక డమ్మీ సీఎం.. అందుకే పక్కన పెట్టేశారు
భోపాల్: ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని మన రాష్ట్రం ఎప్పుడు వచ్చినా నోటికొచ్చిన అబద్దాలు చెప్పడంతో ప్రధానికి మీ విషయం అర్థమైందని మీరు ముఖ్యమంత్రే కానీ డమ్మీ ముఖ్యమంత్రి అని అన్నారు. డమ్మీ సీఎం.. ఈరోజు 'జన ఆశీర్వాద యాత్ర' ముగింపు సందర్బంగా ప్రధాని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్న నేపథ్యంలో ఎక్కడా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్ ఉనికి కనిపించడంలేదని చెబుతూ ఆయనొక అబద్దాలు కోరు అని ప్రధానికి అర్థమైందని అందుకే ప్రచార కార్యక్రమంలో ఈయన లేకుండా జాగ్రత్త పడ్డారని చెప్పుకొచ్చారు. మీరు ముఖ్యమంత్రే కానీ అసలు ముఖ్యమంత్రి కాదని అందుకే బీజేపీ నేత అమిత్ షా ఎన్నికలు పూర్తైన తర్వాతే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామన్నట్టు గుర్తు చేశారు. అన్నీ అబద్దాలే.. మీరు అబద్ధాలతో ప్రధానిని చాలా ఇబ్బంది పెట్టారని రైతుల ఆదాయం రెట్టింపయ్యిందని మీరు చెబితే నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రైతుల ఆదాయం గణనీయంగా తగ్గినట్లు ఆయనకు తెలిసిపోయిందని పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు తగ్గాయని మీరు చెప్పినవి కూడా అబద్ధాలేనని ఆయనకు తెలిసిపోయిందన్నారు. ప్రధానికి అర్ధమైపోయింది.. అన్నిటినీ మించి ప్రధాని బుందేల్‌ఖండ్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ బుందేల్‌ఖండ్‌పై నిర్లక్ష్య వైఖరితో వ్యవహారించిందని ఏకంగా ప్రధానితోనే చెప్పించారు. కానీ కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం బుందేల్‌ఖండ్‌కు రూ.7,600 కోట్లు స్పెషల్ ప్యాకేజీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇలా నోటికొచ్చిన అబద్దాలు చెప్పడం వల్లనే ప్రధాని సీఎంను పక్కన పెట్టేశారని అన్నారు. ఇది కూడా చదవండి: ‘మామూలు రైళ్లకే రంగులేసి వందేభారత్‌గా దోపిడీ’ -
వారిది 'జన ఆశీర్వాద యాత్ర'.. వీరిది 'జన ఆక్రోశ యాత్ర'..
భోపాల్: త్వరలో మధ్యప్రదేశ్‌లో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో వినాయక చవితి సందర్బంగా ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలంతా కలిసి అధికార బీజీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'జన ఆక్రోశ యాత్ర'కు శ్రీకారం చుట్టారు. ఒకపక్క బీజేపీ పార్టీ జన ఆశీర్వాద యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 10,500 కిలోమీటర్లు యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. వారికి దీటుగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యాత్రను ప్రారంభించినట్లు తెలుస్తోంది.15 రోజులపాటు నిర్దేశించిన ఈ యాత్త్ర 11,400 కిలోమీటర్ల మేర రాష్ట్రంలో 230 అసెంబ్లీ స్థానాల్లోనూ కొనసాగుతుందని చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు.. యాత్రలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు డా.గోవింద్ సింగ్, అజయ్ సింగ్, మాజీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్ పచౌరీ, కాంతిలాల్ భూరియా, అరుణ్ యాదవ్, మాజీ మంత్రులు జీతూ పట్వారీ కమలేశ్వర్ పటేల్ రాధా సారధులుగా వ్యవహరించనున్నారు. రాష్ట్రంలోని ముఖ్య కేంద్రాల్లో పూజలు ముగిశాక ఆయా ముఖ్య నేతలు ఈ యాత్రలను ప్రారంభించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్ మాట్లాడుతూ.. వినాయాక చవితి సందర్బంగా ఈ జన ఆక్రోశ యాత్రలు ప్రారంభమవుతున్నాయని శివరాజ్ సింగ్ చొహాన్ ప్రభుత్వ పాలనలో 18 ఏళ్ల పాటు అణగారిన వర్గాల బాధలను తెలియజేయడమే ఈ యాత్రల ముఖ్య ఉద్దేశ్యమన్నారు. Massive response for Congress' Jan Akrosh Yatra in Madhya Pradesh. Congress is coming in MP.🔥🔥 #जन_आक्रोश_यात्रा pic.twitter.com/VIb66N181U — Madhu (@Vignesh_TMV) September 19, 2023 ఇది కూడా చదవండి: 2027 తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమలు! -
‘ఇండియా’ కూటమి బహిరంగ సభ వాయిదా
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అక్టోబర్‌లో నిర్వహించ తలపెట్టిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ వాయిదా పడింది. మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ శనివారం ఈ విషయం ప్రకటించారు. బహిరంగ సభ ఎప్పుడు నిర్వహించాలన్నది ఇంకా నిర్ణయించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా చెప్పారు. భోపాల్‌లో ఉమ్మడిగా భారీ సభ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని ఇండియా కూటమి పక్షాలు ఇటీవలే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. -
భోపాల్‌లో ‘ఇండియా’ మొట్టమొదటి ర్యాలీ
న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి తమ మొట్టమొదటి బహిరంగసభను వచ్చే నెలలో భోపాల్‌లో నిర్వహించనుంది. అదేవిధంగా, భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపిణీకి సంబంధించిన చర్చలను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించనుంది. ఇండియా కూటమి సమన్వయ కమిటీ మొదటి సమావేశం బుధవారం ఢిల్లీలో జరిగింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈ భేటీకి కమిటీలోని 14 మంది సభ్యులకు గాను 12 మంది హాజరయ్యారు. సనాతనధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. కమిటీ సభ్యుడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అనంతరం మాట్లాడుతూ, విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడంతో టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ భేటీకి రాలేదని చెప్పారు. హాజరైన వారిలో..ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్, జార్ఖండ్ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సోరెన్, సీపీఐ నేత డి.రాజా, ఎస్పీ నుంచి జావెద్ అలీ ఖాన్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, జేడీయూకు చెందిన సంజయ్ ఝా, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, శివసేన(యూబీటీ)కి చెందిన సంజయ్ రౌత్ ఉన్నారు. ‘సీట్ల పంపకాల ప్రక్రియను ప్రారంభించాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది. భాగస్వామ్య పక్షాలు చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా సీట్ల పంపణీని ఖరారు చేయాలి.. కూటమి ఉమ్మడి సమావేశాలను దేశవ్యాప్తంగా చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మొట్టమొదటి సభను అక్టోబర్ మొదటి వారంలో భోపాల్‌లో చేపట్టాలని అంగీకారానికి వచ్చారు. బీజేపీ పాలనలో పెరిగిన అవినీతి, నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం ప్రధాన ఎజెండాగా ఈ సభలు జరుగుతాయి’అని కమిటీ ఉమ్మడి ప్రకటనను వేణుగోపాల్ చదివి వినిపించారు. మహారాష్ట్ర, తమిళనాడు, బిహార్‌ల్లో సీట్ల పంపకం సులువుగా కనిపిస్తుండగా, పంజాబ్, ఢిల్లీ, పశి్చమబెంగాల్ల్లో మాత్రం భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. -
ఇండియా కూటమి సమన్వయ కమిటీ కీలక నిర్ణయం..
ఢిల్లీ: ఇండియా కూటమి సమన్వయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ మొదటి వారంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మొదటి బహిరంగ సభను నిర్వహించాలని ప్రకటించింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, బీజేపీ అవినీతి పాలన వంటి ప్రధాన అంశాలను జనంలోకి తీసుకువెళ్లాలని స్పష్టం చేసింది. నేడు ఢిల్లీలో ఇండియా కూటమి సమన్వయ కమిటీ సమావేశమైంది. ఈ మేరకు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని పేర్కొంది. లోక్ సభ సీటు షేరింగ్ ప్రక్రియ ప్రారంభమైందని స్పష్టం చేసింది. లోక్‌సభ సీట్ షేరింగ్ ప్రారంభమైందని, త్వరలో పూర్తి నిర్ణయం తీసుకుంటామని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తెలిపారు. జాయింట్ పబ్లిక్ ర్యాలీ భోపాల్‌లో నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. #WATCH | AAP MP Raghav Chadha on INDIA bloc Coordination Committee meeting "It has been decided that member parties will start the process for seat-sharing and take a decision on it soon; a joint public rally will be held in Bhopal. It was also decided that the issue of caste… pic.twitter.com/smktxqoDBA — ANI (@ANI) September 13, 2023 సమన్వయ కమిటీ మీటింగ్ అనంతరం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. సీట్ షేరింగ్ విధానం ప్రారంభమైందని చెప్పారు. పార్టీల చర్చలు జరిపి వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. #WATCH | On INDIA alliance Coordination Committee meeting, Congress General Secretary KC Venugopal says, "The Coordination Committee has decided to start the process for determining seat-sharing. It was decided that member parties would hold talks and decide at the earliest. The… pic.twitter.com/JnOmapYJ7Z — ANI (@ANI) September 13, 2023 కుల గణన అంశంపై నిర్ణయం.. జేడీయూ, ఆర్జేడీ ప్రతిపాదించిన కుల గణన సర్వే సమస్యను పరిగణలోకి తీసుకుంటామని ఇండియా కూటమి సమన్వయ కమిటీ నేడు తీర్మానించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఈ రోజు 14 మంది సమన్వయ కమిటీ మీటింగ్‌కు 12 మంది హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా టీఎంసీ అభ్యర్థి, ఎంపీ అభిషేక్ బెనర్జీ గౌర్హాజరయ్యారు. కుల గణన అంశాన్ని కూటమి చేపట్టడాన్ని టీఎంసీ ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీ సభ్యులు మీటింగ్‌కు హాజరు కానప్పటికీ నేడు ఆ అంశాన్ని చర్చించి, నిర్ణయం తీసుకున్నారు. కుల గణన అంశాన్ని బిహార్‌లోని జేడీయూ, ఆర్జేడీలు ముందుకు తీసుకువచ్చాయి. జులైలో జరిగిన ఇండియా కూటమి మీటింగ్‌లోనే ఈ అంశంపై పోరాడాలని కూటమికి అభ్యర్థనలు వచ్చాయి. కానీ కూటమిలోని టీఎంసీ దీనిని వ్యతిరేకించింది. అటు.. సీటు షేరింగ్ అంశంలోనూ టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సీటు షేరింగ్ చేసే ప్రసక్తే లేదని అన్నారు. నేడు సాయంత్రం ఇండియా కూటమి సమన్వయ కమిటీ సమావేశమయింది. సమన్వయ కమిటీ ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ షేరింగ్ , ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై చర్చించారు. ఇదీ చదవండి: ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు.. -
దళిత యువకుడిని చంపి.. తల్లిని వివస్త్రను చేసి..
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఓ కేసు విషయమై చెలరేగిన వివాదంలో దళిత యువకుడైన నితిన్ అహిర్వార్(18)ని కొట్టి చంపారు దుండగులు. మొదట అతడి ఇంటిని ధ్వంసం చేసిన ఆ ముఠా తర్వాత అతడిని కొట్టి చంపి అడ్డుకోబోయిన అతడి తల్లిని వివస్త్రను చేశారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుడి సోదరి చెప్పిన కథనం ప్రకారం.. విక్రమ్ సింగ్ ఠాకూర్ అనే యువకుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ 2019లో కేసు దాఖలు చేసింది. ఈ కేసు ఉపసంహరించుకోవాలని నిందితుడు కొంతమందితో కలిసి తన ఇంటికి వచ్చి మరీ బెదిరించాడని అందుకు ఆమెతోపాటు ఆమె తల్లి కూడా నిరాకరించిందని, దాంతో ఆ ముఠా తమ ఇంటిని నాశనం చేశారని తెలిపింది. వారంతా అక్కడి నుండి బస్‌స్టాండ్‌కు వెళ్లి అక్కడున్న తన సోదరుడు నితిన్ అహిర్వార్ను తీవ్రంగా గాయపరుస్తుండగా వారిని అడ్డుకోబోయిన ఆమె తల్లిని కూడా కొట్టి వివస్త్రను చేశారంది. వదిలేయమని ఎంతగా ప్రాధేయపడినా వినలేదని తనపై కూడా అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా తాను తప్పించుకున్నానని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి హత్య కేసును నమోదు చేసి ప్రధాన నిందితుడితో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశామని గ్రామపెద్ద భర్తతో సహా కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని వారికోసం ప్రత్యేక బృందాలతో సెర్చ్ ఆపరేషన్లను నిర్వహిస్తున్నామని తెలిపారు అడిషనల్ ఎస్పీ సంజీవ్ ఉయికే. MP News : 'मामा' का राज, लाडलियों पर अत्याचार... @ChouhanShivraj || @BJP4MP || @MPDial100 || @OfficeOfKNath || @INCMP || @Zeepramod #MadhyaPradesh #LadliBehna #ShivrajSinghChouhan #CrimeNews #TopNews #ZeeMPCG For More Updates : https://t.co/uXPUZQobFo pic.twitter.com/sfDdDqnoQL — Zee MP-Chhattisgarh (@ZeeMPCG) August 27, 2023 ఇది కూడా చదవండి: కూలీలకు దొరికిన 240 బంగారు నాణేలు.. కానీ అంతలోనే.. -
కాంగ్రెస్ పార్టీకి చురకలంటించిన ఆ పార్టీ సీనియర్ నేత
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. హిందూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ నేతలు హిందూత్వ మంత్రాన్ని జపిస్తుండటంపై ఆ పార్టీ సీనియర్ నేత అజీజ్ ఖురేషి తమ పార్టీపైనే విమర్శలు చేయడం మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఇటీవల కాలంలో ఎక్కువగా హిందూ దేవాలయాలను సందర్శిస్తూ హిందుత్వ అస్త్రాన్ని ప్రయోగించడాన్ని తప్పుబట్టారు సీనియర్ కాంగ్రెస్ నేత అజీజ్ ఖురేషి(82). మంత్రిగానూ, ఎంపీగానూ, ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ గానూ సేవలందించిన అజీజ్ ఖురేషీ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొని మీరు చెప్పిందల్లా చెయ్యడానికి ముస్లింలు మీ బానిసలు కాదని. కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు ఈ విషయాన్ని తెలుసుకోవాలని అన్నారు. పోలీస్ శాఖలోనూ, రక్షణ శాఖలోనూ, బ్యాంకుల్లోనూ ముస్లింలకు ఉద్యోగాలు రావు, వారికి కనీసం బ్యాంకు లోనులు కూడా రావు.. అలాంటప్పుడు మీకు ఎందుకు ఓటు వెయ్యాలని ప్రశ్నించారు. ముస్లింల ఇళ్ళు, దుకాణాలు, మందిరాలు తగలబెడుతూ వారి పిల్లలను అనాధలుగా చేస్తుంటే చూస్తూ ఉంటారనుకోకండి. వారేమీ పిరికివారు కాదు. 22 కోట్ల మందిలో 2 కోట్లు మంది ప్రాణాలర్పిస్తే పోయేదేమీ లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ లీడర్లు గురించి మాట్లాడుతూ.. ఈ మధ్య వారు కొత్తగా హిందూత్వ మంత్రాన్ని జపిస్తున్నారు. పార్టీ ఆఫీసుల్లో దేవుళ్ళ ప్రతిమలు ఏర్పాటు చేస్తున్నారు. ఓట్ల కోసం దిగజారడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత కేకే మిశ్రా స్పందిస్తూ అది ఆయన అభిప్రాయమని కాంగ్రెస్ ఎప్పుడూ లౌకికవాదాన్ని విశ్వసిస్తుందని అన్నారు. ఇక బీజేపీ నేత నరేంద్ర సాలూజ అజీజ్ ఖురేషీ చేసిన వ్యాఖ్యలను ఆధారం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి మైరిటీలను బుజ్జగించే రాజకీయాలు అలవాటేనని రాహుల్ గాంధీ, కమల్ నాథ్ సహా కాంగ్రెస్ నాయకులంతా ఎన్నికల నేపథ్యంలో హిందువుల అవతారం ఎత్తుతారని మధ్యప్రదేశ్‌లో ఉండే 82 శాతం హిందూ ఓటర్లను ప్రభావితం చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని ఆయన అన్నారు. చేతనైతే ఖురేషీ అడిగిన దానికి సమాధానం చెప్పాలని అన్నారు. ఇది కూడా చదవండి: మిజోరంలో కుప్పకూలిన రైల్వే వంతెన.. 17 మంది మృతి -
కాంగ్రెస్‌పై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
భోపాల్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో తనవైన రాజకీయాలకు తెరతీశారు. సాట్నాలో ఓ కార్యక్రమానికి అతిధిగా హాజరైన ఢిల్లీ సీఎం INDIA కూటమిలో భాగస్వామిగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో తమకు అవకాశమిస్తే INDIA కూటమిలో తమ భాగస్వామి కాంగ్రెస్ పార్టీని బీజేపీని కూడా మర్చిపోతారని అన్నారు. మధ్యప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు అప్పుడే ఎన్నికలకు శంఖారావాన్ని పూరించాయి. ఇదిలా ఉండగా మేమేమీ తక్కువ తినలేదంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా మధ్యప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మధ్యప్రదేశ్‌లోని సాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రస్తావన తీసుకొస్తూ తమ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో తమను మరో 50 ఏళ్ల వరకు ఏ పార్టీ కదపలేదని అన్నారు. మధ్యప్రదేశ్‌లో కూడా ఒకసారి అవకాశమిచ్చి చూడండి.. కాంగ్రెస్, బీజేపీల కంటే గొప్ప పరిపాలన అందిస్తామని అన్నారు. కాంగ్రెస్ బీజేపీని విమర్శిస్తుంది.. బీజేపీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది.. మాకు విమర్శించడం తెలియదు. జాతిని నిర్మించడం ఒక్కటే మా ప్రధాన లక్ష్యం. జాతి నిర్మాణం కోసమే మేము అన్నా ఆందోళన నుండి విడిపోయామని అన్నారు. ఇన్కమ్ టాక్స్ కమీషనర్‌గా పని చేస్తోన్న నేను జాతిని నిర్మించాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో ఉద్యోగాన్ని విడిచిపెట్టేశానని అన్నారు. మేము రాజకీయ నాయకులం కాదు. జాతి నిర్మాణమే మా ప్రధాన ఎజెండా. మధ్యప్రదేశ్‌లో మమ్మల్ని గెలిపిస్తే బీజేపీ తోపాటు కాంగ్రెస్ పార్టీని కూడా మర్చిపోయేలా పరిపాలిస్తామని అన్నారు. VIDEO | "We are not politicians, we are here to build the nation. I request you to give us one chance, and I promise you will forget BJP and Congress," says Delhi CM @ArvindKejriwal at AAP's town hall programme in Satna, Madhya Pradesh. pic.twitter.com/xzIkfJgXc7 — Press Trust of India (@PTI_News) August 20, 2023 ఇది కూడా చదవండి: ధైర్యముంటే రిపోర్టు కార్డు విడుదల చెయ్యండి.. అమిత్ షా -
ధైర్యముంటే రిపోర్టు కార్డు విడుదల చెయ్యండి.. అమిత్ షా
భోపాల్: త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ మధ్యప్రదేశ్‌లో దూకుడును పెంచింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన గరీబ్ కళ్యాణ్ మహా అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2003 నుండి 2023 వరకు పరిపాలనకు సంబంధించి రిపోర్టు కార్డును విడుదల చేశారు. ధైర్యముంటే కాంగ్రెస్ పార్టీ కూడా తమ 53 ఏళ్ల పరిపాలన తాలూకు ప్రగతి నివేదిక సమర్పించాలని సవాల్ విసిరారు. గరీబ్ కళ్యాణ్ మహా అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్, బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ సమక్షంలో 20 ఏళ్ల ప్రగతి నివేదికను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాటలాడుతూ మధ్యప్రదేశ్ ప్రజలు 2003లో కాంగ్రెస్ పార్టీని, వేర్పాటుదారుడు దిగ్విజయ్ సింగ్ ను సాగనంపి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. గడిచిన 20 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ధైర్యముంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఐదు దశాబ్దాల పరిపాలనలో మధ్య ప్రదేశ్ కు ఏమి చేసిందో నివేదిక విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. 1956లో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2003 వరకు ఐదారేళ్లు మినహాయిస్తే మిగతా సమయమంతా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని ఆ సమయంలో ఇక్కడ అభివృద్ధి కరువై BIMARU(ఆరోగ్యం నశించి)గా మారిందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్రాభివవృద్ధికి కృషి చేసిందని.. మధ్యలో డిసెంబరు 2018 నుండి మార్చి 2002 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపివేసి అభివృద్ధిని కుంటుపడేలా చేసిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం అన్ని విభాగాల్లోనూ దూసుకుపోతోందని.. 45 శాతంతో గోధుమల ఎగుమతిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని.. ప్రభుత్వ ఆరోగ్య పథకానికి సంబంధించి ఆయుష్మాన్ కార్డులు జారీ చేయడంలోనూ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద గ్రామీణ రోడ్డులను మెరుగుపరచడంలోనూ దేశానికే తలమానికంగా నిలిచిందని అన్నారు. వ్యవసాయ రంగానికి మౌలిక నిధుల పథకం కింద రూ. 4300 కోట్ల నిధులు సమకూర్చి దేశంలో నెంబర్ వన్ స్థానంలోనూ.. స్వచ్ఛతలో ఇండోర్ ఎప్పటినుంచో మొదటి స్థానంలోనూ కొనసాగుతున్నాయని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పేదలకు ఇల్లు కట్టించడంలో రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో నిలిచిందని.. సుమారు 44 లక్షల పేద కుటుంబాలు ఈ పథకం కింద గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ పక్కా ఇళ్లు సొంతం చేసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో జరిగిన సంక్షేమాభివృద్ధి గురించి వివరిస్తూ రాష్ట్రంలోని సుమారు 1.36 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని 2003లో రూ.12000 గా ఉన్న తలసరి ఆదాయం ఇప్పుడు రూ.1.4 లక్షలకు చేరిందని అన్నారు. ఒకప్పుడు విభజనలు పాలైన రాష్ట్రంగా పిలవబడిన మధ్య ప్రదేశ్ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు, రోడ్లు, మంచినీరు, విద్య విభాగాల్లో ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు. చివరిగా ఆయన మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రస్తావన తీసుకొస్తూ 2014లో 29 ఎంపీ సీట్లకు గాను 27 సీట్లలో బీజేపీ పార్టీని గెలిపించగా 2019లో 28 సీట్లలోనూ గెలిపించారని.. ఈసారి జరగబోయే ఎన్నికల్లో మిగిలిన ఆ ఒక్క సీట్లో కూడా ప్రజలు గెలిపిస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన ఖర్గే.. తెలంగాణకు మొండిచేయి -
మధ్యప్రదేశ్‌లో కూడా కర్ణాటక ఫార్ములానే నమ్ముకున్న కాంగ్రెస్
భోపాల్: కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచి అక్కడ ఆ పార్టీకి పట్టం కట్టాయి. అందుకే త్వరలో మధ్య ప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ పార్టీని మట్టి కరిపించేందుకు కర్ణాటక ఎన్నికల ఫార్ములానే అనుసరిస్తోంది. మధ్య ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి వ్యూహాలను రచిస్తోంది. కర్ణాటకలో తాము చేసిన హామీలకు ప్రజలు బ్రహ్మరధం పట్టడంతో అదే తరహాలో మధ్య ప్రదేశ్‌లో కూడా కొన్ని ఉచిత పథకాలను ప్రకటించింది. ఉచితాలను ప్రధానాస్త్రంగా చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ ప్రభుత్వ అవినీతిని కూడా లక్ష్యం చేసుకుని ప్రచారానికీ శ్రీకారం చుట్టనుంది. జూన్ 12న జబల్ పూర్ వేదికగా జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కర్ణాటకలో మేము ప్రజలకు ఐదు గ్యారెంటీ పథకాలను హామీ ఇచ్చాము. అధికారంలోకి రాగానే మొదట ఆ అయిదింటినీ నెరవేర్చామని తెలిపారు. మధ్య ప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.1500, గ్యాస్ సిలిండర్ రూ.500కు, 100 యూనిట్ల ఉచిత కరెంటు, 200 యూనిట్ల వరకు సగం ధరకు, పాత పెన్షన్ స్కీమును మళ్ళీ అమలు చేస్తామని.. పేద రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తామని ఐదు హామీలను ప్రకటించారు. ఎన్నికల ప్రణాళికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికలకు ఇంఛార్జిగా వ్యవహరించిన రణదీప్ సూర్జేవాలాను మొదట ఇంఛార్జిగా నియమించింది. కర్ణాటక ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలును కూడా రంగంలోకి దించింది. కర్ణాటకలో అధికార పక్షంపై 40 శాతం కమీషన్ అంటూ విమర్శలు గుప్పించైనా కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రదేశ్ విషయానికి వచ్చేసరికి 50 శాతం కమీషన్ అంటూ బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ కుంభ మేళా, సింహస్త మేళా, మహాకాళీ దేవాలయ నిర్మాణంలోనూ యథేచ్ఛగా అవినీతి జరుగుతోందని ఆరోపణలు చేసి ప్రభుత్వ అవినితిని కూడా లక్ష్యం చేశారు. ప్రచారపర్వంలో కాంగ్రెస్ నేతల దూకుడుకి అడ్డుకట్ట వేస్తామని వారు అబద్ద ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఒక నకిలీ లేఖను ప్రజలకు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తోన్న ప్రియాంక గాంధీకి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు మధ్యప్రదేశ్ బీజేపీ అధినేత విడి శర్మ. సెంట్రల్ ఎలెక్షన్ కమిటీ సమావేశం పూర్తయి మొదటి విడతలో 39 అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ పార్టీ కూడా ఎన్నికల్లో దూకుడును పెంచింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చోహాన్ మాట్లాడుతూ సరైన సమయంలో మేము వారికి సమాధానమిస్తామని.. మా అభ్యర్ధులు అప్పుడే కదనరంగంలోకి దూకారని వారు మాత్రం అభ్యర్థులను ప్రకటించడానికి కూడా భయపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రదేశ్‌లో డివిజనల్ స్థాయి సమావేశాలను నిర్వహించనుంది. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ కు చెందిన 230 మంది ఎమ్మెల్యేలు ఏడు రోజులపాటు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. మరోపక్క బీజేపీ తొలివిడత జాబితాను ప్రకటించిన తర్వాత ప్రచారానికి ఊపు తీసుకురావడానికి కేంద్ర మంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీ విషయంలో ప్రజలు తమ తప్పు తెలుసుకున్నారు.. -
కుక్కల గొడవ కాస్తా ఎంత దూరం వెళ్లిందో చూడండి
భోపాల్: ఇండోర్‌లో ఒక కాలనీలో కుక్కలను వాకింగ్ కోసమని తీసుకొచ్చారు ఇద్దరు వ్యక్తులు. కానీ ఆ కుక్కలు ఒక్కసారిగా కయ్యానికి కాలు దూశాయి. వాటి తరపున వకాల్తా పుచ్చుకుని వాటి యజమానులు కూడా గొడవపడ్డారు. అందులో ఒకరు ఆగ్రహంతో పక్కనే ఉన్న తన ఇంటిలోకి వెళ్లి తుపాకీతో కాల్పులు జరిపగా కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.. ఆరుగురు గాయపడ్డారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఇండోర్ కృష్ణ బాగ్ కాలనీలో రాత్రి 11 గంటలకు ఒక ఇరుకైన సందులో రజావత్, విమల్ అచల్ ఇద్దరూ తమ పెంపుడు కుక్కలతో వాకింగ్ చేయడానికి బయటకు వచ్చారు. ఆ సమయంలో రెండు కుక్కలు ఎదురుపడేసరికి పెద్దగా మొరుగుతూ తగువుకు దిగాయి. వాటికంటే గట్టిగా అరుపులతో రజావత్, అచల్ గొడవపడ్డారు. అంతలో ఏమైందో రజావత్ ఆగ్రహంతో పక్కనే ఉన్న బిల్డింగ్ మొదటి అంతస్తులోని తన ఇంటిలోకి ఆవేశంగా వెళ్లి బాల్కనీలోకి వచ్చి 12-బోర్ రైఫిల్ తో కాల్పులు జరిపాడు. కాల్పుల్లో అచల్ అక్కడికక్కడే చనిపోయాడు. అతడి తోపాటు అక్కడే ఉన్న మరో వ్యక్తి రాహుల్ వర్మ కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరో ఆరుగురికి బులెట్ గాయాలయ్యాయి. రజావత్ కు గన్ లైసెన్స్ ఉన్నందున అతడిని ఒక ప్రయివేట్ కంపెనీ సెక్యూరిటీ గార్డుగా నియమించింది. మృతుడు అచల్ కు నిపనియాలో కటింగ్ షాపు ఉంది. రజావత్ క్షణికావేశంలో చేసిన పొరపాటుకు రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు రజావత్ ను, అతడి కుమారుడిని, వారి బంధువు శుభంను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. Indore | Dog Fight | कुत्ता घुमाने निकले दो पड़ोसियों के कुत्ते आपस में लड़ गए। दोनों पड़ोसियों के बीच भी हाताहपाई हो गई। इतने में एक पड़ोसी अपने घर गया, बंदूक लाया और गोली चला दी। तमाशा देख रहे 2 लोगों की मौत हो गई और 6 घायल हो गए। गोली चलाने वाले व्यक्ति गिरफ्तार: अमरेंद्र… pic.twitter.com/NhKKSLLBcZ — काश/if Kakvi (@KashifKakvi) August 18, 2023 ఇది కూడా చదవండి: మసాజ్ కోసం కక్కుర్తి పడ్డ బెజవాడ కుర్రాళ్ళు. -
బీజేపీ తొలి జాబితా విడుదల.. అత్యధికులు వారే..
భోపాల్: త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. వీరిలో ఎక్కువగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు కావడం విశేషం. గురువారం బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో అత్యధికులు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారే. చాలా కాలంగా బీజేపీ ఈ రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన వర్గాల్లో పట్టు సాధించడం కోసం ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఎప్పటినుంచో కాంగ్రెస్ అభ్యర్థులు పట్టుకుపోయారు. ఈ కారణంతోనే ఈ ఎత్తుగడ వేసింది బీజేపీ అధిష్టానం. అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు తగిన సమయం దొరుకుతుందన్న ఉద్దేశ్యంతోనే చాలా ముందస్తుగా జాబితాను ప్రకటించింది బీజీపీ. మొదటి విడత జాబితాలో ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ కోసం 21 మంది అభ్యర్థులను మధ్యప్రదేశ్ అసెంబ్లీ కోసం 39 మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ పార్టీ. గ్వాలియర్ చంబల్ ప్రాంతంలో 34 సీట్లకు గాను ఆరుగురు వెనుకబడిన కులాల అభ్యర్థులను ప్రకటించింది. ఇదిలా ఉండగా 2018 ఎన్నికల్లో ఓటమిపాలైన 14 మంది అభ్యర్థులకు మళ్ళీ టికెట్లు ఇచ్చింది పార్టీ అధిష్టానం. వీరిలో మాజీ మంత్రులు అచల్ సోంకర్, నానాజీ మొహద్, ఓంప్రకాష్ ధుర్వే, ఐదల్ సింగ్ కంసనా, నిర్మల భూరియా, లలితా యాదవ్, లాల్ సింగ్ ఆర్య కూడా ఉన్నారు. మొదటి జాబితాను విడుదల చేసిన తర్వాత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్ మాట్లాడుతూ పార్టీ అభ్యర్థులపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ఘనవిజయం సాధించాలని అన్నారు. గోహాడ్ అసెంబ్లీ సీటును జ్యోతితాదిత్య సింధియా సన్నిహితుడు రణ్ వీర్ జటావ్ ను కాదని షెడ్యూల్డ్ కులాల మోర్చా అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్యకు టికెట్ ఇచ్చారు. జాతీయ షెడ్యూల్డ్ కులాల ఇంఛార్జిగా ఉన్న మాజీ మంత్రి లాల్ సింగ్ ఆ వర్గం వారిని ప్రభావం చేయగలరని పార్టీ అధిష్టానం ఆలోచన. 2018లో కాంగ్రెస్ తరపున గెలిచిన రణ్ వీర్ జటావ్ కొద్దీ కాలానికి జోతిరాధిత్య సింధియా ఆశీస్సులతో బీజేపీ పార్టీలో చేరారు. 2020 లో జరిగిన ఉప ఎన్నికల్లో రణ్ వీర్ జటావ్ ఓటమిపాలవ్వగా బీజేపీ ఆయనను హ్యాండ్స్ క్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించి క్యాబినెట్ హోదాను కల్పించింది కానీ ఈసారి మాత్రం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. బీజేపీ ప్రకటించిన జాబితాలో కొంతమంది నేరచరిత్ర ఉన్న నేతలు కూడా ఉండడం విశేషం. వారిలో భోపాల్ సెంట్రల్ అసెంబ్లీ అభ్యర్థి ధృవ్ నారాయణ్ సింగ్ RTI కార్యకర్త షెహ్లా మాసూద్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. రెండ్రోజుల క్రితమే షెహ్లా మసూద్ కుటుంబసభ్యులు కేసు పునర్విచారణ జరిపించాలని సీబీఐని డిమాండ్ చేశారు. ఇక శివపురి జిల్లాలోని కాంగ్రెస్ కంచుకోట పిచోర్ అసెంబ్లీ సీటును ప్రీతమ్ సింగ్ లోధీకి కేటాయించింది పార్టీ అధిష్టానం. అక్కడ కాంగ్రెస్ నేత కేపీ సింగ్ కక్కజుపై ప్రీతమ్ సింగ్ లోధీ పోటీ చేయడం ఇది మూడోసారి కావడం వవిశేషం. కొద్ది రోజులక్రితం బ్రాహ్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు లోధీని పార్టీ సస్పెండ్ కూడా చేసింది. అయినా ఇప్పుడు ఆయనకే మళ్ళీ టికెట్ ఇచ్చి ఆశీర్వదించింది. వీరితోపాటు కొంతమంది రాజకీయ వారసులు కూడా మొదటి జాబితాలో టిక్కెట్లు దక్కించుకున్నారు. సబల్‌గఢ్ మాజీ ఎమ్మెల్యే మెహర్బన్ సింగ్ రావత్ కోడలు సరళ రావత్, దామోహ్ మాజీ ఎంపీ శివరాజ్ సింగ్ లోధీ కుమారుడు వీరేంద్ర సింగ్ లోధి, మాజీ ఎమ్మెల్యే ప్రతిభా సింగ్ కుమారుడు నీరజ్ సింగ్ లు ఈ జాబితాలో ఉన్నారు. సాగర్ లోని బందా అసెంబ్లీ స్థానాన్ని వీరేంద్ర సింగ్ లోధీకి కేటాయించారు బీజేపీ పెద్దలు. ఇక్కడి నుండి కాంగ్రెస్ పార్టీ తరపున తర్వార్ సింగ్ లోధీ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఛతర్పూర్ జిల్లాలోని మహారాజ్‌పూర్ నుంచి మాజీ ఎమ్మెల్యే మన్వేంద్ర సింగ్ కుమారుడు కామాఖ్య ప్రతాప్ సింగ్ టికెట్ దక్కించుకున్నారు. ఇది కూడా చదవండి: కశ్మీరీ పండిట్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆజాద్ -
మానవమృగం.. శిక్ష అనుభవించినా బుద్ధి మారలేదు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సాట్నాకు చెందిన ఓ దుర్మార్గుడు రాకేష్ వర్మ(35) చేసిన నేరమే మళ్ళీ చేసి తానొక మానవ మృగాన్నని నిరూపించుకుని కటకటాల పాలయ్యాడు. గతంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చి మళ్ళీ మరో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను స్థానికంగా ఒక ఆసుపత్రిలో చేర్పించగా ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెబుతున్నాయి ఆసుపత్రి వర్గాలు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేంద్ర సింగ్ చోహాన్ తెలిపిన వివరాల ప్రకారం సాట్నా జిల్లాలోని కృష్ణా నగర్లో నివాసముండే రాకేష్ వర్మ పన్నెండేళ్ల క్రితం నాలుగున్నరేళ్ల వయసున్న మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఆ నేరానికి అతడికి పదేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఏడు సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించిన రాకేష్ వర్మ ఏడాదిన్నర క్రితమే జైల్లో సత్ప్రవర్తన కింద విడుదలయ్యాడు. బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జగత్ దేవ్ తాలిబ్ ప్రాంతం నుండి ఓ మైనర్ బాలికను లాలిస్తున్నట్లు నటించి అపహరించుకుపోయాడు. మాకు విషయం తెలిసిన తర్వాత గాలింపు చేపట్టగా బాలిక రేప్ కు గురైందని గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ప్రాధమిక చికిత్స అనంతరం మైనర్ బాలికను రేవాకు తరలించగా బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు అక్కడి వైద్యులు. ఇది కూడా చదవండి: స్పా ముసుగులో వ్యభిచారం.. -
Viral Video: వర్షంలో ఆదమరచి డాన్స్ చేసిన ప్రేమజంట
భోపాల్: రద్దీ రహదారిపై ఎవరి పనులు వారు చేసుకుంటుంటే ఒక లవ్ కపుల్ మాత్రం హాయిగా జోరువానలో తడుస్తూ రొమాంటిక్ గా డాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దీనిపై కామెంట్ల వెల్లువ వెల్లువెత్తింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఏ క్షణంలో వర్షం పడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. దైనందిన జీవితంలో దినవారి పనులు చేసుకునేవారికి, వ్యాపారస్తులకు, ఉద్యోగులకి, విద్యార్ధులకి ఇలా కొన్ని వర్గాల వారికి వర్షాలు పెద్ద అడ్డంకనే చెప్పాలి. ఇలాంటి వీడియోలు చూసినప్పుడే అనిపిస్తుంది ప్రేమికులకు మాత్రమే వర్షాకాలం అనుకూలమని కవులు ఎందుకు చెప్పారోనని. భోపాల్‌లో హోరున వర్షం పడుతుండగా ప్రధాన రహదారి మీద ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు రోడ్డు మీద దూసుకుపోతుంటే ఓ ప్రేమ జంట మాత్రం పరిసరాలను అసలేమాత్రం పట్టించుకోకుండా తన్మయత్వంతో ఒకరి చేయి ఒకరు పట్టుకుని హాయిగా డాన్స్ చేస్తూ కనిపించారు. పరిసరాలు కూడా వీరి రొమాన్స్ ని పట్టించుకోకపోవడం విశేషం. వీరు డాన్స్ చేస్తుంటే వెనుక విక్కీ కౌశల్, సారా ఆలీ ఖాన్ కలిసి నటించిన "జరా హట్కే జరా బచ్కే" చిత్రంలోని తూ హై తో ముఝే పాట వినిపిస్తోంది. ఈ సన్నివేశాన్నివీడియో తీసి సొషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇంటర్నెట్లో దీనిపై కామెంట్ల రూపంలో విశేష స్పందన లభిస్తోంది. A beautiful couple enjoying this #mansoon in #Bhopal.#IamPureVegetarian #Karba #BusAccident #Beast #ModiAgainin2024 pic.twitter.com/GveBVp815C — Aisha Bhat (@aishabhat02) July 29, 2023 ఇది కూడా చదవండి: గాల్లో ఆగిపోయిన రోలర్ కోస్టర్.. బిక్కుబిక్కుమంటూ పర్యాటకులు -
వందే భారత్ ఎక్స్ ప్రెస్.. ఆహారంలో స్పెషల్ ఐటెం..
భోపాల్: వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన నాటినుండి ఎదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ప్రమాదాల కారణంగానో, సౌకర్యాల విషయంలోనే ఎదో ఒక విధంగా హైలైట్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో ఈ ట్రైన్ మరోసారి ట్రెండింగ్ అయ్యింది. ఈ రైలులో ప్రయాణిస్తున్న ఓ అభాగ్యుడికి ఫుడ్ పార్సిల్ లో బొద్దింక రావడంతో రైలు పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. పైన పటారం లోన లొటారం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైల్లో ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. సరికొత్త హంగులతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ రైళ్ళలో అంతా అత్యాధునికమేనని ప్రచారం చేస్తుండటంతో ఆహారం కూడా హైజీనిక్ గా ఉంటుందని భావించి ఫుడ్ ఆర్డర్ చేశాడో అభాగ్యుడు. తీరా ఆర్డర్ వచ్చాక ఆత్రుతతో ఓపెన్ చేసి చూస్తే రోటీలకు బొద్దింక అతుక్కుని ఉంది. దీంతో రోటీలకంటే ముందు ఖంగుతిన్న ప్రయాణికుడు సుబోధ్ పహాలాజన్ ఈ ఉదంతం మొత్తాన్ని ఎక్స్(ఒకప్పటి ట్విట్టర్) సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రోటీకి అతుక్కున్న బొద్దింక ఫోటో తోపాటు వందే భారత్ రైలులో నాకు ఒక బొద్దింక వచ్చిందని క్యాప్షన్ కూడా రాశారు. దీనికి రైల్వే కేటరింగ్ సేవ వారు స్పందింస్తూ.. మీకు ఎదురైన చేదు అనుభవానికి చింతిస్తున్నాము. దీనికి బాధ్యులైన వారి మీద వెంటనే చర్యలు తీసుకుంటాము. మీ పీఎన్ఆర్ నెంబరు ఫోన్ నెంబరు మాకు డైరెక్ట్ మెసేజు పంపగలరు అని కోరుతూనే మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. @IRCTCofficial found a cockroach in my food, in the vande bharat train. #Vandebharatexpress#VandeBharat #rkmp #Delhi @drmbct pic.twitter.com/Re9BkREHTl — pundook🔫🔫 (@subodhpahalajan) July 24, 2023 ఇది కూడా చదవండి: మహిళా అధికారులకు 12 నెలలు ప్రసూతి సెలవులు -
ఆక్సిజన్ మాస్క్‌తో విమానంలో సోనియా గాంధీ.. రాహుల్ భావోద్వేగ పోస్టు..
భోపాల్: బెంగళూరులో విపక్ష భేటీ అనంతరం ఢిల్లీకి వెళుతుండగా.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలో విమానంలో ఆక్సిజన్ తక్కువ అయింది. ఈ కారణంగా సోనియా గాంధీ ఆక్సిజన్ మాస్క్ ధరించారు. ఈ ఫొటోను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ షేర్ చేశారు. 'ఆపదలోనూ దయకు అమ్మే ఉదాహారణ' అని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. పోస్టు చేసిన మొదటి గంటలోనే 1.8 లక్షల లైకులు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రయాణిస్తున్న విమానం మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఎయిర్ పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. సాంకేతిక లోపం కారణంగా విమానం భోపాల్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణ్ చారీ మిశ్రా పీటీఐ వార్తా సంస్థకు తెలియజేశారు. View this post on Instagram A post shared by Rahul Gandhi (@rahulgandhi) సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు బెంగళూరులో జరిగిన విపక్ష నేతల సమావేశంలో పాల్గొని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. దాదాపు గంటన్నర సేపు ఎయిర్ పోర్టులో బస చేసిన తర్వాత మంగళవారం రాత్రి 9.35కి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇదీ చదవండి: దంచికొట్టిన వానలు.. నీటమునిగిన కార్లు.. ఒక్క రోజులోనే.. -
వందే భారత్ రైలులో మంటలు..
-
వందే భారత్ రైలులో మంటలు.. పరుగు తీసిన ప్రయాణీకులు
భోపాల్: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రైలులోని సీ-14 కోచ్ వద్ద మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో భయంతో ప్రయాణీకులు పరుగు తీశారు. వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం వందే భారత్ రైలు భోపాల్ నుంచి ఢిల్లీ బయలు దేరింది. ఈ క్రమంలో రాణికమలాపాటి స్టేషన్ నుంచి ప్రయాణం మొదలైన తర్వాత కుర్వాయి స్టేషన్ వద్ద రైలులోని బ్యాటరీ నుంచి మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో రైల్వే సిబ్బంది మంటలను గుర్తించిన వెంటనే లోకోపైలట్‌కు సమాచారం అందించారు. దీంతో, రైలును అక్కడే నిలిపివేశారు. ఈ క్రమంలో అగ్నిమాపక దళం అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అర్పివేశారు. రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. Vande Bharat train from Bhopal to Delhi catches fire today morning at around 7:15am. Was on board but by God’s grace everyone is safe!#VandeBharatExpress #traincatchesfire pic.twitter.com/8k5uHDn7lT — Nupur Singh (@NupurSiingh) July 17, 2023 ఇది కూడా చదవండి: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై రాళ్ల దాడులు.. -
12 పెళ్లిచూపులు..కట్నం ఇవ్వనందుకు సంబంధం క్యాన్సిల్
ఎంఎస్సీ మాథ్స్ చేసి ఆన్లైన్లో లెక్కలు చెప్పే భోపాల్ యువతికి పెళ్లి కావడం లేదు. కట్నం ఇవ్వను అనడమే కారణం. ‘50 లక్షలు అడుగుతున్నారు మా నాన్న ఎక్కడ నుంచి తెస్తాడు’ అని ఆమె ప్రశ్న. ‘సంబంధం కేన్సిల్’ అనేది తరచూ వినవస్తున్న జవాబు. ఇప్పటికి 12 పెళ్లి చూపులు భగ్నమయ్యాయి. విసిగిపోయిన ఆమె పోరాటానికి దిగింది. పోలీసులకు కంప్లయింట్ చేసింది. అన్ని చోట్లా చైతన్యానికి నడుం బిగించింది. ‘ఇది రొటీన్‌గా జరుగుతోంది. ఎప్పట్లాగే నేను ట్రేలో టీకప్పులు పెట్టుకుని వస్తాను. దానికి ముందు మా అమ్మ నాకు బాగుంటుందని చెప్పి ఆకుపచ్చ డ్రస్సు తీస్తుంది. నా పళ్లు కొంచెం ఎగుడుదిగుడుగా ఉంటాయని ఎక్కువగా నవ్వొద్దని హెచ్చరిస్తుంది. టీ ట్రేతో నేను హాల్లోకి రాగానే అందరూ నన్ను ఆపాదమస్తకం శల్యపరీక్ష చేస్తున్నట్టుగా చూస్తారు. ఏం చదివావు, ఏం పని చేస్తున్నావు, వంటొచ్చా... అవే ప్రశ్నలు. ఆ తర్వాత కీలకమైన సందర్భం వస్తుంది. కట్నం ఎంత ఆశిస్తున్నారు అని మా నాన్న అడుగుతాడు. అప్పుడు పెళ్లికొడుకు తరుఫువారు ఏ యాభైలక్షలో అరవైలక్షలో లేకుంటే పెళ్ళిళ్లు జరుగుతున్నాయా అనంటారు. కొంచెం ఆలోచించండి అని మా నాన్న అంటాడు. మీ అమ్మాయి అందంగా ఉంది కాబట్టి డిస్కౌంట్ ఇవ్వొచ్చులేండి అని వారు జోక్ చేస్తారు. నాకు మాత్రం ఇదంతా చాలా అసహ్యంగా ఉంటుంది’ అంటుంది రూప. ఇది ఆమె అసలు పేరు కాదు. ఇలాంటి అమ్మాయిలు దేశమంతా ఉన్నారు. వారికి వేరే వేరే పేర్లు ఉంటాయి. కాని వారందరి సమస్య మాత్రం ఒకటే– కట్నం. నేషనల్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం మన దేశంలో 2017 నుంచి 2022 వరకు 35,493 మంది నవ వధువులు, కొత్త పెళ్లి కూతుళ్లు వరకట్న చావులకు గురయ్యారు. అంటే రోజుకు సగటున 20 మంది. అయినా కట్నం కొనసాగుతూనే ఉంది. పేరు మారిందంతే మన దేశంలో వరకట్నం 1961లో నిషేధించారు. కాని అలాంటి చట్టం ఒకటుందని సమాజం ఆనాడు పట్టించుకోలేదు.. ఈనాడూ పట్టించుకోవడం లేదు. 1980ల కాలంలో వరకట్న పిశాచం దేశాన్ని పీడించింది. ఎందరో కొత్తకోడళ్లు కిరోసిన్ స్టవ్ మంటల్లో కాలిపోయారు. ఆ తర్వాత కొంత చైతన్యం వచ్చింది. అమ్మాయిలు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. కొన్నివర్గాల ఆర్థిక స్థితి మెరుగయ్యింది. కట్నం అనే మాట వాడటం నామోషీగా మారింది. దానికి బదులుగా లాంఛనాలు అంటున్నారు. ఫార్మాలిటీస్ అంటున్నారు. ఏ మాట వాడినా ఉద్దేశం మాత్రం ఆడపిల్ల తరఫువారు మగపెళ్లి తరఫు వారికి ఆర్థికంగానో ఆస్తిపాస్తుల రూపేణానో ముట్టజెప్పాలి. అంతస్తును బట్టి ఈ లాంఛనాల స్థాయి ఉంటుంది. లక్షల నుంచి కోట్ల వరకు. కట్నం ఇవ్వను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి, భోపాల్‌లో తన కాళ్ల మీద తాను నిలబడే స్థితిలో ఉన్న రూపకు 27 ఏళ్లు వచ్చేశాయి. ఈమె తల్లిదండ్రులు ఐదారేళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నారు. కాని కట్నం కారణంగా కుదరడం లేదు. ‘మా నాన్న నూటాయాభై మంది కుర్రాళ్ల ప్రొఫైల్స్ చూసి 20 మందిని సెలక్ట్ చేశాడు. వారిలో 12 మందితో పెళ్లిచూపులు అయ్యాయి. అందరూ కట్నం అడిగేవాళ్లే. ఎవరూ 50 లక్షలకు తక్కువ లేరు. మా నాన్న అంత ఖర్చు పెట్టలేడు. అసలు కట్నం ఎందుకివ్వాలి? నేను కట్నం ఇవ్వను... కట్నం అనేది చాలా చెడ్డ ఆచారం. పెళ్లి ఖర్చులు పెట్టుకుంటాను అని ఏ అబ్బాయికి చెప్పినా నా ముందు తలాడిస్తున్నాడు కాని ఆ తర్వాత సంబంధం కేన్సిల్ అనే కబురు వస్తోంది. నా ఆత్మవిశ్వాసం మొత్తం పోయింది. మరోవైపు మా బంధువులేమో అమ్మాయి ఇప్పటికే ముదిరిపోయింది అని టెన్షన్ పెడుతున్నారు. పెళ్లి చేసుకోవాలని నాకూ ఉంది. ఒంటరిగా జీవితాన్ని లాగలేము కదా. కాని ఈ కట్నం బాధ ఏమిటి? ఎంతమంది అప్పులు చేసి, ఆస్తులు అమ్మి ఇంకా ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలి?’ అని ప్రశ్నిస్తోంది రూప. పోలీసులు పూనుకోవాలి కట్నం తీసుకోవడం శిక్షార్హం కాబట్టి పోలీసులు పూనుకొని ఈ దురాచారాన్ని నిలువరించాలని, ప్రతి పెళ్లి జరిగే మంటపాల్లో చెకింగులు చేయాలని, కట్నం తీసుకుంటున్న కొంతమందికైనా శిక్ష పడితే కట్నం డిమాండ్ తగ్గుతుందని అంటుంది రూప. ఈమేరకు ఆమె భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణ్‌ను వినతిపత్రం ఇచ్చింది. వరకట్న దురాచారం వల్ల వస్తున్న ఆర్థిక బాధల గురించి చైతన్యం రావాలని మీడియాను సంప్రదించింది రూప. ‘నేను కట్నం వద్దంటున్నానని మా అమ్మ నాతో మాట్లాడటం లేదు. కట్నం వద్దంటే జన్మలో నీ పెళ్లి చేయలేనని మా నాన్న టెన్షన్ పడుతున్నాడు. నేటి కాలంలో కట్నం ఉంటే తప్ప పెళ్లి కాని స్థితిలో ఒక యువతి ఉండటం ఎంత విషాదమో ఈ సమాజం ఆలోచించాలి’ అంటోంది రూప. ఈ స్థితికి తాము ఎంత కారణమో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ పరిస్థితిలో మార్పుకోసం ప్రయత్నించాలి. -
భోపాల్ సభలో కుటుంబ రాజకీయాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు
-
'ఒకే దేశంలో రెండు చట్టాలా..?' ప్రతిపక్షాలకు ప్రధాని స్ట్రాంగ్ కౌంటర్..
భోపాల్: భోపాల్ సమావేశంలో ఉమ్మడి పౌరస్మృతిని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెరమీదకు తెచ్చారు. ఒకే దేశంలో రెండు చట్టాలు ఎలా నడుస్తాయని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఒకే కుటుంబంలో మనిషికో చట్టం ఉండటం సబబు కాదని చెప్పారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని గుర్తు చేశారు. భోపాల్‌లో నిర్వహించిన 'మేరే బూత్ సబ్సే మజ్బూత్' కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులతో మాట్లాడారు. సమావేశంలో భాగంగా ట్రిపుల్ తలాక్‌పై కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. దేశంలో ఎవరి ప్రయోజనం కోసం ఇన్నాళ్లు ట్రిపుల్ తలాక్‌ను కొనసాగించారని ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈజిప్టు, ఇండోనేషియా, ఖతార్, జోర్డన్, సిరియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి ముస్లిం దేశాల్లో తలాక్ ఆచారాన్ని ఎప్పుడో రద్దు చేశారని గుర్తుచేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ట్రిపుల్ తలాక్‌ను కొనసాగించారని ప్రధాని దుయ్యబట్టారు. తలాక్ రద్దు చట్టం తేవడంతో ముస్లిం స్త్రీలకు స్వేచ్ఛ కల్పించినట్లు పేర్కొన్నారు. అందుకే ఎక్కడకు వెళ్లినా బీజేపీకి ముస్లిం మహిళలు అండగా ఉంటున్నారని చెప్పారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు ముస్లింలను రెచ్చగొడుతున్నారని ప్రధాని ఆరోపించారు. అలాంటి పార్టీలను దూరంగా ఉంచాలని అన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్‌ను ఉద్దేశిస్తూ.. దేశంలో ప్రజలందరికీ ఒకే చట్టం అవసరాన్ని రాజ్యాంగం కూడా తెలిపిందని ప్రధాని చెప్పారు. మతాలకతీతంగా అందరికీ ఒకే చట్టాలు అందుబాటులో ఉండేలా ఉమ్మడి పౌరస్మృతి సూచిస్తుంది. ఉత్తరఖండ్ ఇప్పటికే ఈ చట్టాన్ని తీసుకురావడానికి ప్రణాళికలు చేస్తోంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరాన్ని సుప్రీంకోర్టు కూడా గుర్తించింది. లా కమిషన్ కూడా ఇటీవల ఈ చట్టంపై పనిచేస్తోంది. దేశంలో పలు మత సంస్థలను, ప్రముఖ వ్యక్తులను ఇప్పటికే ఉమ్మడి పౌరస్మృతిపై సూచనలను కోరింది. ఇదీ చదవండి: కేసీఆర్ కుటుంబ రాజకీయాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. -
పట్టాలెక్కిన మరో ఐదు వందే భారత్ రైళ్లు.. పచ్చ జెండా ఊపిన ప్రధాని..
భోపాల్: మధ్యప్రదేశ్ నుంచి ఐదు వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. వీటిలో రెండిటిని ప్రత్యక్షంగా ప్రారంభించగా మూడింటిని మాత్రం వర్చువల్ గా ప్రారంభించారు. దీంతో ప్రధాని ప్రకటించిన 75 వందే భారత్ రైళ్లలో ఇప్పటికి 23 రైళ్లు పట్టాలెక్కాయి. మధ్యప్రదేశ్ షాహ్ధూల్ జిల్లాలో పర్యటించిన ప్రధాని మొదట భోపాల్ రాణి కమలాపాటి రైల్వే స్టేషన్ చేరుకుని భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్ పూర్ మధ్య వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అనంతరం గోవా- ముంబై, ధార్వాడ్-బెంగుళూరు, హతియా-పాట్నా వందేభారత్ రైళ్లను కూడా వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ.. ఈరోజు ప్రారంభించిన రైళ్లు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచుతాయని.. మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల మధ్య అనుబంధాలను మరింత మెరుగుపరుస్తాయని అన్నారు. వాణిజ్యపరంగా, పర్యాటకంగా కూడా ఈ కనెక్టివిటీ ఉపయోగపడుతుందని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, గవర్నర్ మంగుభాయ్ పటేల్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని సుమారు 10 లక్షల మంది బూత్ స్థాయి కార్యకర్తలతో వర్చువల్ గా సమావేశం కానున్నారు. అనంతరం దేశంలోని 3000 మంది బూత్ స్థాయి కార్యకర్తలతో కూడా మాట్లాడనున్నారు. #WATCH | Madhya Pradesh | PM Narendra Modi flags off five Vande Bharat trains from Rani Kamlapati Railway Station in Bhopal. Vande Bharat trains that have been flagged off today are-Bhopal (Rani Kamalapati)-Indore Vande Bharat Express; Bhopal (Rani Kamalapati)-Jabalpur Vande… pic.twitter.com/N4a72zwR0m — ANI (@ANI) June 27, 2023 ఇది కూడా చదవండి: దేశంలో ఏం జరుగుతోందో తెలియాలంటే మణిపూర్ వెళ్లి చూడండి.. -
కలిసి కట్టుగా.. పులిని తరిమికొట్టిన ఆవుల మంద
ఐకమత్యమే మహాబలం.. మన చిన్నప్పటి నుంచి వింటున్న మాటే ఇది. ఆరణలోనూ ఇది సాధ్యమేనంటూ నిరూపించే ఘటనలనూ చూస్తూ వస్తున్నాం కూడా. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ భోపాల్‌లో జరిగిన ఓ ఘటన.. సీసీటీవీఫుటేజీ బయటకు రావడంతో వైరల్ అవుతోంది. ఆవుల మంద నుంచి ఒంటరిగా ఉన్న ఓ ఆవుపై నక్కినక్కి వచ్చి దాడికి దిగింది ఓ పెద్దపులి. దీంతో అది చావుకేకలు వేయగా.. అది చూసిన మిగతా ఆవులు బెదిరి చెల్లాచెదురు కాలేదు. క్షణం ఆలస్యం చేయకుండా ధైర్యంగా ముందుకు ఉరికాయి. వాటి ధైర్యానికి ఆ పులి బెదిరింది. ఆవును వదిలేసి అక్కడి నుంచి పొదల్లోకి లంఘించుకుంది. అయితే పులి అక్కడక్కడే ఉండడంతో.. గాయపడిన ఆ ఆవును చుట్టుముట్టి మళ్లీ దాడికి దిగకుండా తెల్లవారే దాకా కాపలాగా ఉన్నాయి మిగతా ఆవులు. ఆదివారం అర్ధరాత్రి భోపాల్ కేర్వా శివారుల్లోని ఓ డెయిరీ ఫామ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. గాయపడిన ఆ ఆవు పరిస్థితి పాపం విషమంగా ఉన్నట్లు సమాచారం. संगठन में शक्ति है… भोपाल के मदरबुल फार्म में बाघ ने एक गाय पर हमला किया तो उस गाय को बचाने दौड़ पड़ा गायों का झुंड। देखिए वीडियो…#Bhopal #cows pic.twitter.com/678Gy4YyN2 — Upmita Vajpai (@upmita) June 20, 2023 ఇదీ చూడండి: ఆ ఊర్లో మహిళలంతా దుస్తుల్లేకుండా ఐదురోజులపాటు.. -
కుక్కలా అరవమని వేధిస్తూ..యువకుల పిచ్చి చేష్టలు..
మధ్యప్రదేశ్:మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకున్ని కుక్కలా అరవమని ఆదేశిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఓ గుంపు బాధితుని చుట్టూ చేరి క్షమాపణలు కోరమని చెబుతూ కుక్కలా అరవమని డిమాండ్ చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దర్యాప్తు చేసి 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా పోలీసులను ఆదేశించారు. 50 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో కొంత మంది యువకులు ఓ వ్యక్తిని వేధిస్తున్నారు. 'కుక్కలా నటించు..క్షమాపణలు చెప్పు' అంటూ అతని చుట్టూ చేరి అరుస్తున్నారు. గుంపులో ఓ వ్యక్తి బాధితున్ని బిగ్గరగా పట్టుకుని ఉన్నాడు. 'సాహిల్ నా తండ్రి, సాహిల్ నా అన్నయ్య లాంటివాడు' అంటూ బాధితుడు అరుస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన రాష్ట్ర హోం మంత్రి..' ఆ వీడియోను చూశాను. ఇలాంటి స్వభావాన్ని ఖండిస్తున్నాం. దర్యాప్తు చేయాలని కమిషనర్‌ను ఆదేశించాం. దోషులకు కఠిన శిక్షలు విధిస్తాం' అని అన్నారు. సాహిల్, అతని గ్యాంగ్ తమ వ్యక్తికి డ్రగ్స్, మాంసం అలవాటు చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మతం మారాలని బలవంతం చేస్తున్నారని చెప్పారు. బాధితుడు తన సొంత ఇంట్లోనే దొంగతనం చేసేలా సాహిల్ గ్యాంగ్ ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, వీడియో వైరల్ అయ్యాక కేసు నమోదు చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ అంశంపై పోలీసు స్టేషన్ ముందు బజరంగ్ దళ్ సభ్యులు ఆందోళనలు చేపట్టారు. జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఇదీ చదవండి:పరువుహత్య చేసి.. బండరాళ్లు కట్టి మొసళ్లకు మేతగా పడేశారు -
ప్రభుత్వ కార్యాలయంలో మంటలు.. విలువైన ఫైల్స్ బుగ్గిపాలు..
మధ్యప్రదేశ్:మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వా కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. సాత్పురా భవన్‌లోని మూడో అంతస్తులో ఆదివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విలువైన ధ్రువపత్రాలు దగ్దమయ్యాయని అధికారులు తెలిపారు. సెలవు దినమైనందున ఎవరూ కార్యాలయానికి వెళ్లలేదని పేర్కొన్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో కూడా ఫోన్లో ప్రమాదం గురించి వివరించినట్లు వెల్లడించారు. కేంద్రం నుంచి అన్ని విధాలు సహాయం అందుతుందని హామీ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కూడా రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. పలు ప్రభుత్వ కార్యాలయాలకు నిలయమైన సాత్పుర భవన్లో మంటలు చెలరేగడంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వ అవినీతి భయటపడుతుందనే భయంతోనే ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపించాయి. ఎలాగూ వచ్చేసారి అధికారంలోకి రాలేమనే భయం అధికార పార్టీకి పట్టుకుందని విమర్శించాయి. ఇదీ చదవండి:‘220 నెలల్లో 225 కుంభకోణాలు.. అది బీజేపి ఘనత’ -
ఎన్ఐఏ చేతికి భోపాల్ ఉగ్ర కేసు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–భోపాల్‌లలో మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అరెస్టు చేసిన ఉగ్రవాదులకు సంబంధించిన కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పరిధిలోకి వెళ్లింది. ఈ నెల 9న ఏకకాలంలో దా డులు చేసిన ఏటీఎస్ అధికారులు హైదరాబాద్‌లో ఐదుగురు, భోపాల్‌లో 11 మంది ఉగ్రవాదులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గురువారం భోపాల్‌లో ఏటీఎస్ అధికారులతో భేటీ అయిన ఎన్ఐఏ అధికారులు.. శుక్రవారం నుంచి అధికారికంగా దర్యాప్తు ప్రారంభించారు. దీనికోసం ప్రత్యే కంగా కేసు నమోదు చేశారు. ఈ ఉగ్రవాదులకు ఉన్న విదేశీ లింకులు, ఆర్థిక మూలాలపైనే తొలుత దృష్టి సారించారు. దీనితోపాటు వారికి అందిన శిక్షణ, ఎక్కడెక్కడ శిబిరాలు నిర్వహించారన్నది ఆరా తీస్తున్నారు. హెచ్‌యూటీ పేరుతోనే కొనసాగింపు.. హైదరాబాద్, భోపాల్‌లలో అరెస్టైన ఉగ్రవాదులు తొలుత అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ హిజ్బ్ ఉత్ తెహ్రీర్ (హెచ్‌యూటీ)కి అనుబంధంగా పనిచేశారు. రాకెట్ చాట్, త్రీమా యాప్స్‌లో ఏర్పాటు చేసుకున్న గ్రూపుల్లో హెచ్యూటీకి చెందినవారు పంపిన వీడియోలు, ఆడియోలు, పత్రాలను చూసి ప్రేరణ పొందారు. కానీ ఎంతకాలం ఎదురుచూసినా హెచ్‌యూటీ నుంచి విధ్వంసాలకు సంబంధించిన ఆదేశాలు అందలేదు. దీంతో సొంతంగా సలీం, యాసిర్‌ల నేతృత్వంలో హైదరాబాద్, భోపాల్ మాడ్యుల్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. నిషేదం నుంచి తప్పించుకోవడానికి ఈ మాడ్యూల్స్‌కు ఎలాంటి పేర్లూ పెట్టుకోలేదు. ప్రాథమిక ఆధారాలను బట్టి హెచ్‌యూటీ ఉగ్రవాదులుగానే పరిగణించాలని, ఆ సంస్థపై నిషేధం విధించాలని కేంద్ర హోంశాఖకు నివేదిక పంపేందుకు ఎన్ఐఏ సన్నాహాలు చేస్తోంది. కేసు దర్యాప్తు పూర్తిచేసి, అభియోగపత్రాలు దాఖలు చేశాక ఈ ప్రక్రియ చేపట్టనుంది. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో లాడెన్ వీడియోలు ఏటీఎస్ అధికారులు ఉగ్రవాదుల నుంచి స్వా«దీనం చేసుకున్న ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో విశ్లేషణ చేయించగా.. పలు కీలక అంశాలను గుర్తించారు. యువత ఉగ్రవాద బాటపట్టా లని రెచ్చగొట్టేలా ఒసామా బిన్‌లాడెన్ చేసిన ప్రసంగాల వీడియోలు, తఫ్సీర్–ఎ–జిహాద్ పేరిట రెచ్చ గొట్టే వ్యాఖ్యల ఆడియోలు వాటిలో ఉన్నట్టు ఏటీఎస్ అధికారులు చెప్తున్నారు. ఈ ఉగ్రవాదుల్లో ఇంజనీరింగ్ చదివిన రిజ్వీ, డానిష్, కరీం, అబ్దుర్ రెహ్మాన్ (హైదరాబాద్‌లో అరెస్టయ్యాడు) ఎల్రక్టానిక్ పరికరాలను వినియోగించడంపై మిగతా వారికి శిక్షణ ఇచ్చారు. భోపాల్ మాడ్యుల్‌కు చెందినవారు అక్కడి ఇంద్రపురిలో ఉన్న కమల పార్కులో వివిధ అంశాలపై శిక్షణ తీసుకున్నరని దర్యాప్తు అధికారులు గుర్తించారు. యాసిర్ వీరికి తన ఫిట్నెస్ సెంటర్లో బాక్సింగ్, కత్తిని ఉపయోగించడం వంటి వాటిలో చిట్కాలు నేర్పినట్టు తేల్చారు. హైదరాబాద్‌లో శిబిరం ఎక్కడ? ఉగ్రవాదులను విచారించిన సమయంలో.. హైదరాబాద్‌తోపాటు భోపాల్‌కు చెందిన ఉగ్రవాదులు 2021 జూలైలో ఇక్కడి గోల్కొండలోని మహ్మద్ సలీం ఇంట్లో సమావేశమయ్యారని ఏటీఎస్ గుర్తించింది. తర్వాత రెండు రోజుల పాటు పెద్ద శిక్షణ శిబిరం నిర్వహించారని.. ఎయిర్ గన్ కాల్చడం, బరువు తగ్గడంతోపాటు ఆత్మరక్షణ, పోలీసుల ఇంటరాగేషన్‌ను ఎదుర్కోవడం వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చారని తేల్చింది. అయితే ఈ శిక్షణ శిబిరం ఎక్కడ నిర్వహించారనేది ఉగ్రవాదులు బయటపెట్టలేదని.. ఆ ప్రాంతాన్ని గుర్తించడానికి ఎన్ఐఏ అధికారులు సాంకేతికంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారని తెలిసింది. ఇక గత ఏడాది నవంబర్‌లో భోపాల్ సమీపంలో జరిగిన శిబిరంలో వీరంతా నాటు తుపాకీ కాల్చడం, చిన్న చిన్న బాంబులు తయారు చేయడాన్ని ప్రాక్టీస్ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. -
వచ్చారు, పెట్రోల్ నింపుమన్నారు.. లైటర్ వెలిగించారు.. కొంచెమైతే!
-
వచ్చారు, బైక్‌లో పెట్రోల్ నింపుమన్నారు.. లైటర్ వెలిగించారు..
భోపాల్: వాహనంలో ఇంధనం నింపుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, భోపాల్ మాత్రం కొందరు ఆకతాయిలు కావాలనే ఓ పెంట్రోల్ బంక్‌కు నిప్పంటినట్టు తెలుస్తోంది. బైక్‌లో పెట్రోల్ కొట్టించుకునే క్రమంలో ముగ్గురు యువకులు బంక్‌కు వెళ్లారు.సిబ్బంది పెట్రోల్ నింపుతున్న క్రమంలో ఓ యువకుడు అకస్మాత్తుగా లైటర్ వెలిగించాడు. దాంతో ఒక్కసారిగా మంటలు పెట్రోల్ నాజిల్ ద్వారా బైక్‌కు వ్యాపించాయి. అటునుంచి పెట్రోల్ పంపుకు ఎగబాకాయి. భయంతో అందరూ బయటకు పరుగులు పెట్టారు. పరిస్థితిని గమనించిన పెట్రోల్ పంపు సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇసుకను ఉపయోగించి మంటలను అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పింది.ఈ దృశ్యాలు కెమెరాలో నమోదయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కటరా హిల్స్‌లోని రేణుగా పెట్రోల్ బంక్‌లో జరిగింది. రూ.8000 నష్టం జరిగినట్లు బంక్ యాజమాన్యం పేర్కొంది. (చదవండి: వాహనంలో పెట్రోల్ ఉదయం పోయించాలా? రాత్రి పోయించాలా?... దీనికి సరైన సమయం ఏదంటే..) సంఘటన స్థలం నుంచి ఇద్దరు నిందితులు పారిపోగా, ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. టైల్స్ వర్క్ చేసే ఇతనిపై ఇప్పటికే క్రిమినల్ రికార్డ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతన్ని విజయ్ సింగ్‌గా గుర్తించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు భరత్ గట్ఖానే, ఆకాష్ గౌర్లుగా గుర్తించారు. వీరు మెకానిక్ వర్క్ చేసేవారని స్థానికులు వెల్లడించారు. అయితే, నిందితులు కావాలనే లైటర్ వెలిగించారా? లేక మరే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైక్‌లో సిబ్బంది పెట్రోల్ నింపే క్రమంలో రీడింగ్ చూడడం కోసం ఓ యువకుడు లైటర్ వెలిగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులు పట్టుబడ్డ తర్వాతే ఈ ఘటనకు అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. (మనిషి చనిపోయేది రెండు వారాల ముందే తెలుస్తుందా?.. పరిశోధనలు ఏం చెప్తున్నాయి!) -
ఆ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు ప్లాన్.. భోపాల్-హైదరాబాద్ ఉగ్ర కోణంలో సంచలన నిజాలు
సాక్షి, హైదరాబాద్: భోపాల్ ఉగ్రవాదుల కేసులో పలు కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. భోపాల్-హైదరాబాద్ ఉగ్ర కోణంలో నిజాలు బయటపడుతున్నాయి. కస్టడీలో నిందితుల నుంచి ఏటీఎస్ పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. హైదరాబాద్- భోపాల్ యువకులకు జిమ్ ట్రైనర్ యసిర్ ఉగ్ర శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. భోపాల్ శివార్లలో యువకులకు హెచ్‌యూటీ శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు. హెచ్‌యూటీ కోడ్ భాషలో ఫిదాయీ అంటే.. ఆత్మాహుతి దాడి అని ఏటీఎస్ గుర్తించింది. 16 మంది హిజ్బుత్ సభ్యులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం లోతుగా విచారిస్తోంది. భోపాల్‌లోని.. భోజ్‌పురా సమీపంలోని రైసన్ అడవుల్లో యువతకు ఉగ్ర కర్యకలాపాలపై శిక్షణ ఇచ్చినట్లు గుర్తించగా, అరెస్ట్ అయిన వారి వద్ద పలు వీడియోలు.. కోడ్ భాషలో వున్న 50కి పైగా ఆడియోలు స్వాధీనం చేసుకున్నారు. భోపాల్‌లోని శాంతి ద్వీపం పేల్చేయాలన్న కోడ్ భాషను ఏటీఎస్ డీకోడ్ చేసింది. శాంతి ద్వీపం పేల్చడం అంటే.. బాంబు పేలుళ్లు జరపడం అని ఏటీఎస్ గుర్తించింది. చదవండి: అవసరమైతే ఆత్మాహుతి దాడులు! భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్, మోతీలాల్ నెహ్రూ స్టేడియం, బరాసియా డ్యాం వద్ద బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు గుర్తించారు. ఉగ్ర కార్యకలాపాల కోసం విదేశాల నుండి హవాలా మార్గం లో నిధులు వచ్చినట్టు ఏటీఎస్ బృందం గుర్తించింది. -
అవసరమైతే ఆత్మాహుతి దాడులకూ ప్లాన్!..
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఇటీవల హైదరాబాద్–భోపాల్‌లలో అరెస్టు చేసిన 16 మంది ఉగ్రవాదుల కేసులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏకకాలంలో దాడులు చేయడానికి ఈ మాడ్యూల్స్ సిద్ధమయ్యాయని, వీటికి విదేశాల నుంచి ఆదేశాలు అందుతున్నాయని ప్రాథమిక ఆధారాలు లభించాయి. మహ్మద్ సలీం, యాసిర్ ఖాన్ సహా ముగ్గురి నుంచి రికవరీ చేసిన ఫోన్లను ఏటీఎస్ అధికారులు విశ్లేషించారు. అవసరమైతే ఆత్మాహుతి దాడులకు సిద్ధం కావాలంటూ ఓ వ్యక్తి నుంచి వీరికి ఆదేశాలు అందినట్టు గుర్తించారు. ఫోన్ల నుంచి ఆడియోలు రికవరీ ఏటీఎస్ అధికారులు అరెస్టు చేసిన 16 మందిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఉగ్రవాదులు సమాచార మారి్పడికి రాకెట్ చాట్, త్రీమా యాప్స్ వినియోగించారని.. ఎప్పటికప్పుడు డేటాను డిలీట్ చేయడం వల్ల కీలకమైన సమాచారమేదీ లభించలేదని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా 50 ఆడియో ఫైళ్లను రికవరీ చేసినట్టు సమాచారం. ఈ ఆడియోల్లో ప్రసంగించిన వ్యక్తి.. ఒకేసారి అనేక మందిని చంపడం (మాస్ కిల్లింగ్), సాబోటేజ్ (విధ్వంసాలు సృష్టించడం), ఎంపిక చేసుకున్న వ్యక్తులను హతమార్చడం (టార్గెట్ కిల్లింగ్)తోపాటు ఆత్మాహుతి (ఫిదాయీన్) దాడులకు సిద్ధంగా ఉండాలని సూచించినట్టు తేల్చారు. ఈ ఆడియోలతోపాటు వీరికి అందిన ఆదేశాలు, సూచనల సందేశాలూ రికవరీ అయ్యాయి. ఇక ఈ ఫోన్లకు పాకిస్తాన్ నంబర్ల నుంచి కాల్స్ వచ్చాయని, కాంటాక్ట్స్ లిస్టులోనూ ఆ దేశ నంబర్లు ఉన్నాయని గుర్తించారు. ఆ ఫోన్ నంబర్లు ఎవరివి, ఆడియోల్లోని వ్యక్తి ఎవరు అనేది గుర్తించేందుకు కేంద్ర నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. కొన్ని ఆడియోల్లో కఫీల్ అహ్మద్ ప్రస్తావన ఫోన్ల నుంచి రిట్రీవ్ చేసిన ఆడియోల్లో లండన్‌లోని గ్లాస్గో విమానాశ్రయంపై 2007లో మానవ బాంబు దాడికి ప్రయత్నించిన బెంగళూరు వాసి, వృత్తిరీత్యా డాక్టర్ అయిన కఫీల్ అహ్మద్ ప్రస్తావన ఉన్నట్లు ఏటీఎస్ గుర్తించింది. ఇతను హిజ్బ్ ఉత్ తెహరీర్ (హెచ్‌యూటీ) సంస్థ తరఫునే మానవబాంబుగా మారాడు. హైదరాబాద్–¿ోపాల్ మాడ్యూల్ ఉగ్రవాదులూ తొలినాళ్లలో ఇదే ఉగ్రవాద సంస్థ తరఫున పనిచేశారు. ఈ క్రమంలో ఫోన్లలోని ఆడియోలు హెచ్‌యూటీ హ్యాండ్లర్‌విగా భావిస్తున్నారు. ఇక ఏటీఎస్ విచారిస్తున్న 16 మంది పోలీసు కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. మరో ఐదు రోజులు కస్టడీ కోరాలని ఏటీఎస్ భావిస్తోంది. ఈ కేసులో మరో ముగ్గురు హైదరాబాద్ వాసులను సాక్షులుగా చేరుస్తున్నారు. చదవండి: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 17 రైళ్లు రద్దు -
Hyderabad: ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు ముమ్మరం..మరో ఇద్దరు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఇంటిలిజెన్స్ సమాచారంతో మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్), తెలంగాణ కౌంటర్ ఇంటిలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు హిజబ్ ఉట్ తెహ్రిర్ సంస్థతో సంబంధాలున్న ఉగ్రవాద మూలాలు హైదరాబాద్‌లో ఉన్నట్లు తేలడంతో అధికారులు దీనిపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వారంతా పెద్ద పెద్ద నగరాలనే టార్గెట్ చేస్తూ.. మధ్యప్రదేశ్, హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో ఉగ్రదాడులకు పాల్పడే కుట్రలు జరుగతున్నట్లు అనుమానాలు రావడంతో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. దీనికి సంబంధించి ఇటీవలే హైదరాబాద్‌లో ఆరుగురు, భోపాల్‌లో 11 మందిని అరెస్టు చేశారు. తాజాగా మరో ఇద్దర్ని బాబానగర్, చంద్రాయన్ గుట్టలలో అదుపులోకి తీసుకున్నట్లు ఏటీఎస్ అధికారులు వెల్లడించారు. దీంతో అరెస్టయిన నిందితుల సంక్య 19కి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి: దేశవ్యాప్తంగా ఏకకాల దాడులకు కుట్ర! పరారీలోనే సల్మాన్.. విచారణలో కీలక విషయాలు.. ) -
దేశవ్యాప్తంగా ఏకకాల దాడులకు కుట్ర! విచారణలో కీలక విషయాలు
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు భోపాల్, హైదరాబాద్‌లలో అరెస్టు చేసిన ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నినట్లు బయటపడింది. మధ్యప్రదేశ్, హైదరాబాద్‌తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులకు వారు సిద్ధపడ్డట్లు తెలియవచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో పట్టుకున్న ఐదుగురినీ ఏటీఎస్ అధికారులు బుధవారం భోపాల్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారిని ఈ నెల 20 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. పోలీసుల నుంచి తృటిలో తప్పించుకున్న జవహర్‌నగర్‌లోని శివాజీనగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్ కోసం ఏటీఎస్తోపాటు రాష్ట్ర నిఘా వర్గాలు, పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బుధవారం రాత్రి వరకు అతడి ఆచూకీ లభించలేదు. భోపాల్, హైదరాబాద్‌లలో ఇప్పటివరకు అరెస్టయిన 16 మంది విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం... టాస్క్ లు ఇవ్వకపోవడంతో... భోపాల్‌లోని షాజహానాబాద్‌కు చెందిన యాసిర్ ఖాన్ నేతృత్వంలో 2018లో ఈ మాడ్యూల్ ఏర్పడింది. ఓ వర్గానికి చెందిన వారితో మతమార్పిళ్లు చేయించి యాసిర్ వారిని ఉగ్రవాద బాట పట్టించాడు. అతడి మాడ్యూల్‌లోని వారిలో 90 శాతం ఇలాంటి వాళ్లేనని నిఘా వర్గాలు గుర్తించాయి. యాసిర్ తొలినాళ్లలో హిజ్బ్ ఉత్ తహ్రీర్ (హెచ్‌యూటీ) సంస్థలో పనిచేశాడు. మొదట్లో ఐసిస్‌కు అనుబంధంగా పనిచేసిన ఆ సంస్థ ఆపై దాన్నే విమర్శించింది. విదేశాల్లోని హెచ్‌యూటీ కేడర్‌తో యాసిర్ రాకెట్ చాట్‌తోపాటు త్రీమా యాప్ ద్వారా సంప్రదింపులు జరిపేవాడు. ఎన్నాళ్లు నిరీక్షించినా ఎలాంటి టాస్్కలు ఇవ్వకపోవడంతో ఆ సంస్థకు దూరమై మహ్మద్ సలీంగా మారిన సౌరభ్‌రాజ్ విద్యతో కలసి సొంతంగా మాడ్యూల్ తయారు చేయడం మొదలెట్టాడు. ఆ పని మీదే సలీంను హైదరాబాద్ పంపి కొందరిని ఉగ్రబాట పట్టించడంతోపాటు మరో ముఠా తయారయ్యేలా ప్రేరేపించాడు. వాటికి హెచ్‌యూటీ (భోపాల్), హెచ్‌యూటీ (హైదరాబాద్) పేర్లు పెట్టుకున్నారు. ఎప్పుడైనా దాడులకు సిద్ధంగా ఉండేలా... టార్గెట్ కిల్లింగ్స్‌గా పిలిచే ఎంపిక చేసుకున్న వారిని హత్య చేయడం, తద్వారా మత కలహాలు రెచ్చగొట్టడం లక్ష్యంగా పెట్టుకున్న యాసిర్, సలీంలు ఆ పంథాలోనే సిద్ధమవుతున్నారు. దేహదారుఢ్యంతోపాటు తుపాకులు కాల్చడం, కత్తులు, గొడ్డళ్ల వినియోగంపై దృష్టి పెట్టారు. పెల్లెట్స్‌తో పనిచేసే ఎయిర్ పిస్టల్స్ వాడకంపై అనంతగిరి అడవుల్లో, నాటు తుపాకులు కాల్చడంపై భోపాల్ సరిహద్దుల్లోని నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రాక్టీస్ చేశారు. అటు యాసిర్ ఇంట్లో, ఇటు హైదరాబాద్‌లోని ఐదుగురి ఇళ్లలో తరచూ సమావేశాలు నిర్వహించారు. ఏడాదిన్నరగా ఈ శిక్షణ పెరిగినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 32 గంటల వరకు ఏమీ ముట్టకుండా... టార్గెట్ కిల్లింగ్స్తోపాటు కిడ్నాప్‌లు, మాల్స్, సినిమా హాళ్లను అదీనంలోకి తీసుకోవడమూ వారి పథకాల్లో భాగమే. హోస్టేజ్‌గా పిలిచే అలాంటి సందర్భాల్లో నిర్భంధంలోని వారికి అన్నీ అందించినా... ఉగ్రవాదులు సైతం కొన్ని గంటలపాటు నీళ్లు, ఆహారం లేకుండా ఉండాల్సి వస్తుంది. పోలీసులు లేదా భద్రతా బలగాలు నీళ్లు, ఆహారంలో మత్తుమందు కలిపి తమను పట్టుకొనే ఆస్కారం ఉందని ఉగ్రవాదులు ఏమీ ముట్టకుండా ఉంటారు. ఇలా గరిష్టంగా 48 గంటల వరకు మాడ్యూల్‌లోని వారంతా ఏమీ తీసుకోకుండా ఉండేలా శిక్షణ ఇవ్వాలని యాసిర్ నుంచి సలీంకు ఆదేశాలు అందాయి. ఈ సర్వైవల్ టెక్నిక్స్‌తోపాటు పర్వతారోహణను ముష్కరులు అనంతగిరి అడవుల్లో ప్రాక్టీస్ చేసినట్లు బయటపడింది. గరిష్టంగా 32 గంటల వరకు ఏమీ తీసుకోకున్నా జీవించేలా హైదరాబాద్ గ్యాంగ్ సిద్ధమైంది. రెండు నెలల క్రితం తన ఇంటికి వచ్చిన యాసిర్‌కు సలీం ఈ వీడియోలను చూపించాడు. పక్కింటి వాళ్లు ఫోన్ చేయడంతో... ముష్కరులను పట్టుకోవడానికి మధ్యప్రదేశ్ ఏటీఎస్, రాష్ట్ర నిఘా వర్గాలు హైదరాబాద్‌తోపాటు భోపాల్‌లోనూ మంగళవారం తెల్లవారుజామున ఏకకాలంలో దాడులు చేశాయి. ఫలితంగా అక్కడ 11 మంది, నగరంలో ఐదుగురు చిక్కారు. నగరానికి చెందిన మహ్మద్ సలీం, అబ్దుర్ రెహ్మాన్, మహ్మద్ అబ్బాస్ అలీ, షేక్ జునైద్, మహ్మద్ హమీద్లతోపాటు జవహర్‌నగర్‌లోని శివాజీనగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్‌ను కూడా పట్టుకోవాల్సి ఉంది. అయితే పోలీసుల దాడి సమయంలో అతడు పాల ప్యాకెట్ల కోసం బయటకు వెళ్లాడు. అయితే పోలీసుల రాకను పక్కింటి వాళ్లు ఫోన్ చేసి చెప్పడంతో సల్మాన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మరోవైపు పోలీసులు బుధవారం ఆరుగురు ఉగ్రవాదుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించగా అరెస్టయిన ఉగ్రవాదులతోపాటు వారి భార్యలూ మతమారి్పడి చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. -
హైదరాబాద్ లో ఉగ్ర కుట్రలో కొత్త ట్విస్ట్ లు
-
నా పరువు మంటగలిపేందుకు తెగించారు: ప్రధాని మోదీ
భోపాల్: తన వ్యక్తిగత ప్రతిష్టను సర్వనాశనం చేసేందుకు ‘కొందరు’ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వేస్టేషన్లో భోపాల్–ఢిల్లీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాడే కొందరు నా పరువు ప్రతిష్టలను గంగలో కలపాలని కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం ఎంతకైనా దిగజారుతున్నారు. ‘మోదీ.. నీ సమాధికి గొయ్యి తవ్వుతాం’ అని కూడా కొందరు బహిరంగంగా ప్రతిజ్ఞ చేశారు. తమ లక్ష్యం నెరవేర్చుకునేందుకు దేశ, విదేశీ శక్తులతో చేతులు కలిపారు. కొందరు ఇక్కడి నుంచి పనిచేస్తే, ఇంకొందరు విదేశాల నుంచి కుట్రలు చేస్తున్నారు. ఇందుకు ‘సుపారీ’ సైతం ఇచ్చారు. వారికో విషయం తెలీదనుకుంటా. ఓట్లేసి నన్ను గెలిపించుకున్న కోట్లాది ప్రజానీకం సురక్షా కవచంలా నావైపు నిలిచినంతకాలం నన్నెవరూ ఏమీ చేయలేరు. ఇలాంటి కుట్రలను పటాపంచలు చేస్తూ దేశాభివృద్ధి కోసం, జాతి నిర్మాణం కోసం ప్రతి ఒక్క పౌరుడు పాటుపడాలి’’ అన్నారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని బ్రిటన్‌లో రాహుల్ వ్యాఖ్యానించడం, రాహుల్‌ను ఎంపీగా అనర్హుడిగా ప్రకటించిన ఉదంతాన్ని నిశితంగా గమనిస్తున్నామని జర్మనీ, అమెరికా ఉన్నతాధికారులు ప్రకటించిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలుచేయడం గమనార్హం. భారత అంతర్గత వ్యవహారాల్లోకి రాహుల్ కుట్రపూరితంగా విదేశాల జోక్యాన్ని ఆహ్వానిస్తున్నారని బీజేపీ తీవ్రంగా ఆక్షేపించడం తెల్సిందే. బుజ్జగింపులతో సరిపుచ్చారు ‘గత ప్రభుత్వాలు రైల్వే సేవల విషయంలో ప్రజలను బుజ్జగింపులతోనే సరిపుచ్చాయిగానీ సరైన ప్రయాణ భాగ్యం దక్కనివ్వలేదు. ఆ ఒక్క కుటుంబం గురించే పట్టించుకున్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజల ప్రయాణ సేవలను గాలికొదిలేశారు. మా సర్కార్ సంస్కరణలు తెచ్చి ప్రజానీకం సౌకర్యవంతంగా ప్రయాణించేలా, వారి ఆకాంక్షలకు తగ్గట్లు రైల్వే శాఖను ఆధునీకరిస్తోంది. ప్రజల్ని మోదీ ఒకటోతేదీన ఏప్రిల్ ఫూల్ చేస్తాడని కాంగ్రెస్ మిత్రులు అంటున్నారు. కానీ మేం అదే ఏప్రిల్ ఒకటిన రైలు ప్రారంభించి చూపించాం. ఈ సెమీ–హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ దేశ నైపుణ్యం, సామర్థ్యం, భరోసాకు ప్రతీక’ అని అన్నారు. ‘ 2014కు ముందు వరకు రైల్వే బడ్జెట్లో మధ్యప్రదేశ్‌కు రూ.600 కోట్లు దక్కేవి. మా హయాంలో ఇది ఏకంగా రూ.13,000 కోట్లను దాటింది. కొత్త రైలుతో ఇక్కడి నుంచి ఢిల్లీకెళ్లే వ్యాపారాలు, వృత్తినిపుణులకు ఎంతో ప్రయోజనం. పర్యాటకాభివృద్ధితో ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి’ అని అన్నారు. ఈ మార్గానికి సమీపంలోనే సాచీ, భీమ్బెట్కా, భోజ్‌పూర్, ఉదయగిరి గుహలు ఉన్నాయి. ‘ స్వాతంత్య్రంరాగానే సిద్ధంగా ఉన్న రైల్వే నెట్‌వర్క్‌ను మాత్రమే గత ప్రభుత్వాలు అప్‌గ్రేడ్ చేశాయి. కొత్త రైల్వేస్‌ను సొంత రాజకీయ ప్రయోజనాలకు పణంగా పెట్టాయి. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా ఎందుకు ఈశాన్య రాష్ట్రాలను రైల్వేనెట్‌వర్క్‌లో అనుసంధానం చేయలేదు?. గతంలో ఎందుకు ఆధునీకరించి నవీకరించలేదు ? ’ అని ప్రశ్నించారు. కార్యక్రమంలో భాగంగా ‘భారతీయ రైల్’ ఇతివృత్తంతో చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో ఎంపికైన 300 మంది చిన్నారులతో మోదీ మాట్లాడారు. ఆ రైలులో సిబ్బందితోనూ సంభాషించారు. రైలు సర్వీస్ ప్రారంభోత్సవంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర గవర్నర్ మంగూ భాయ్, సీఎం చౌహాన్ పాల్గొన్నారు. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో శనివారం తప్ప మిగతా వారమంతా నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లలో ఇది 11వది. కొత్త రైలులో అధునాతన బ్రేకింగ్ వ్యవస్థ కారణంగా విద్యుత్ 30 శాతం ఆదా అవనుంది. సైనిక సన్నద్ధతపై సమీక్ష సైనిక దళాల సన్నద్ధత, దేశం ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లు తదితరాలపై ప్రధాని మోదీ కీలక వార్షిక సమీక్ష నిర్వహించారు. భోపాల్‌లో జరిగిన ఈ సమీక్షలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సరిహద్దుల వెంబడి చైనాతో సవాళ్లు, పాకిస్తాన్ నుంచి సీమాంతర ఉగ్రవాదం తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు రక్షణ శాఖ పేర్కొంది. ‘‘కొత్త సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధాని సూచించారు. అందుకవసరమైన సాయుధ, సాంకేతిక సంపత్తిని ఎప్పటికప్పుడు అందజేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు వివరించారు’’ అని వివరించింది. పలు అంశాలను ప్రధానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ వివరించారు. -
కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ‘ఏప్రిల్ ఫూల్’ కామెంట్స్..
న్యూఢిల్లీ: భోపాల్-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌లోని రాణి కమలాపతి స్టేషన్లో జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, మధ్యప్రదేశ్ గవర్నర్ మంగు భాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఫ్లాగ్ పాల్గొన్నారు..కాగా భారత్‌లో ఇది 11వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కాగా మధ్యప్రదేశ్‌లో తొలి రైలు. ఇది 708 కిలోమీటర్ల దూరాన్ని 7.45 గంటల్లో చేరుకోనుంది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ‘నేడు మోదీ అందరినీ ఏప్రిల్ ఫూల్స్ చేస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కానీ అదే ఏప్రిల్ 1వ తేదీన వందే భారత్ రైలును ప్రారంభించాం. ఇది మన నైపుణ్యం, సామర్థ్యం, విశ్వాసానికి చిహ్నం’ అని తెలిపారు. గత ప్రభుత్వాలు కేవలం ఒక కుటుంబాన్ని మాత్రమే దేశపు ప్రథమ కుటుంబంగా భావించేవారని పరోక్షంగా గాంధీ కుటుంబంపై ధ్వజమెత్తారు. దేశంలోని మధ్యతరగతి కుటుంబాలను ఆ ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. చదవండి: పది నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ భారతీయ రైలు సామాన్యులకు, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటాయన్నారు. రైలు ప్రయాణం ఇప్పుడు సురక్షితంగా మారిందని చెప్పారు. వందే భారత్ దేశంలో సరికొత్త పరిణామానికి, అభివృద్ధికి ప్రతీక అని అన్నారు. దేశంలోని అన్ని వైపుల నుంచి ఈ రైళ్లకు డిమాండ్ ఉందని, వందే భారత్ సూపర్‌హిట్‌గా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కొత్త వందే భారత్ రైళ్లు నూతన ఉద్యోగావకాశాలను, అభివృద్ధిని తీసుకొస్తాయని తెలిపారు. Flagged off the Vande Bharat Express connecting MP with Delhi. pic.twitter.com/3H47xA6dYN — Narendra Modi (@narendramodi) April 1, 2023 గత 9 ఏళ్లలో భారతీయ రైల్వేను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు మోదీ తెలిపారు. దేశంలోని 900 రైల్వే స్టేషన్లలో సీసీటీవీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైళ్లు పరిశుభ్రంగా ఉంటున్నాయని, సకాలంలో నడుస్తున్నాయని తెలిపారు. గతంలో మధ్య ప్రదేశ్ రైల్వేలకు కేవలం రూ.600 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించారని, ఇప్పుడు రూ.13,000 కోట్లు కేటాయించామని చెప్పారు. మధ్య ప్రదేశ్ పాత రోజులను వెనుకకు నెట్టి, నూతన అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందన్నారు. Glad to flag off Bhopal-New Delhi Vande Bharat Express. Our endeavour is to transform the railways sector and provide greater comfort for the citizens. https://t.co/4xY1Adta4G — Narendra Modi (@narendramodi) April 1, 2023 -
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం
భోపాల్: ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌ను భారత్ కాంస్య పతకంతో ముగించింది. చివరిరోజు ఆదివారం భారత్ ఖాతా లో ఒక కాంస్య పతకం చేరింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో సిఫ్ట్ కౌర్ సామ్రా మూడో స్థానంలో నిలిచింది. ఎంబీబీఎస్ చదువుతోన్న పంజాబ్‌కు చెందిన 21 ఏళ్ల సిఫ్ట్ కౌర్ క్వాలిఫయింగ్‌లో 588 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంలో నిలిచి ర్యాంకింగ్ రౌండ్‌కు అర్హత సాధించింది. ఎనిమిది మంది పాల్గొన్న ర్యాంకింగ్ రౌండ్లో సిఫ్ట్ కౌర్ 403.9 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. సిఫ్ట్ కౌర్కిది రెండో ప్రపంచకప్ పతకం. గత ఏడాది కొరియాలో జరిగిన ప్రపంచకప్‌లోనూ ఆమె కాంస్య పతకం సాధించింది. సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో ఓవరాల్‌గా భారత్ ఒక స్వర్ణం, ఒక రజతం, ఐదు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. చైనా ఎనిమిది స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. చదవండి: PAK vs AFG: టీ20ల్లో పాక్ బ్యాటర్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా -
Bhopal ISSF World Cup: మనూ భాకర్‌కు కాంస్యం
భోపాల్‌లో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్లో భారత్ ఖాతాలో ఆరో పతకం చేరింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో మనూ భాకర్ (20 పాయింట్లు) కాంస్య పతకం గెలుచుకుంది. టోర్నీలో భాకర్‌కు ఇదే మొదటి పతకం. ఈ పోరులో డొరీనా (30 పాయింట్లు), జియూ డు (29 పాయింట్లు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. ఇదే విభాగంలో మరో భారత షూటర్, తెలంగాణకు చెందిన ఇషా సింగ్ పతకం సాధించడంలో విఫలమైంది. శనివారం ఈవెంట్లు ముగిసే సరికి భారత్ 1 స్వర్ణం, 1 రజతాలు, 4 కాంస్యాలతో రెండో స్థానంలో కొనసాగుతుండగా...6 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు (మొత్తం 10 పతకాలు) చైనా అగ్ర స్థానంలో నిలిచింది. -
డ్యాన్స్ చేయకుంటే.. కుప్పకూలి ప్రాణం పోయేది కాదా?
బస్.. ఆజ్‌కీ రాత్ హై జిందగీ.. కల్ హమ్ కహాన్.. తుమ్ కహాన్.. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. అందుకే సంతోషంగా గడపడమని చెప్తుండేవాళ్లు పెద్దలు. కానీ, సీను మారింది. మనుషులు ప్రాణాలు.. గాల్లో దీపంగా మారిపోయాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదుకాబట్టి.. ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దానికి తోడు.. కుప్పకూలి మరణిస్తున్న వార్తలు ఈమధ్య కాలంలో చాలా చూస్తున్నాం. అందులో వయసు తేడాలు కూడా ఉండడం లేదు మరి!. సీసీ టీవీ ఫుటేజీలు, సోషల్ మీడియా-మెయిన్‌స్ట్రీమ్ మీడియా ఛానెల్స్ కారణంగా అందరికీ ఆ చావు క్షణాలను వీక్షించే స్థాయికి పరిస్థితి చేరింది. ఒకరకంగా ఇలాంటివి చూడడం అలవాటు అయిపోయింది జనాలకు. కర్ణుడి చావుకి లక్ష కారణాల మళ్లే.. ఇలాంటి హఠాన్మరణాలపై కూడా పోస్ట్‌మార్టం అనేక రకాలుగా, రకరకాల వెర్షన్లుగా ఉంటోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పోస్టల్ డిపార్ట్మెంట్కు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ సురేంద్ర కుమార్ దీక్షిత్ మరణం.. మరో చర్చకు తావిచ్చింది. ఉన్నట్లుండి కుప్పకూలి చనిపోతున్న ఉదంతాల్లో జిమ్ మరణాలతో పాటు డ్యాన్స్లవి కూడా ఉంటున్నాయి. వేడుకల్లో హుషారుగా చిందులేయడం కూడా ఒకరకంగా ప్రమాదమే అంటూ వాదిస్తున్న కొందరు.. సురేంద్ర మరణాన్ని అందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. కానీ, దురదృష్టవశాత్తూ.. వైద్యులు, పరిశోధకుల దగ్గరే దీనికి సమాధానం లేకుండా పోయింది. ఆల్ ఇండియా పోస్టల్ హాకీ టోర్నమెంట్లో భాగంగా.. మార్చి 16వ తేదీన సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అందులో హుషారుగా చిందులేస్తూ సందడి చేశారాయన. ఈక్రమంలోనే ఉన్నట్లుండి కుప్పకూలి మరణించాడు. అందుకు కార్డియాక్ అరెస్ట్ కారణమని చెప్పారు వైద్యులు. అన్నట్లు.. పైన రెడ్ కలర్లో పేర్కొన్న హిందీ లైన్లతో కూడిన పాటకే పాపం సురేంద్ర డ్యాన్స్ వేశారు. విధి విచిత్రం అంటే ఇదేనేమో!. Bhopal: Officer dies of cardiac arrest while dancing at a function. #Bhopal #CardiacArrest pic.twitter.com/xgFW2XjqP6 — TIMES NOW (@TimesNow) March 20, 2023 Video Credits: టైమ్స్ నౌ సౌజన్యంతో.. -
బంగారం: చెప్పుల్లేకుండా రోజూ 7 కిమీ పరుగెత్తిన ఆ అమ్మాయి ఇప్పుడు ఏకంగా..
Khelo India Games: చెప్పుల్లేకుండా రోజూ 7 కిలోమీటర్లు ఆకలి కడుపుతో స్కూల్‌కు పరిగెత్తిన అమ్మాయి గత వారం రోజుల్లో రెండు బంగారు పతకాలు సాధించింది. నిన్న మొన్నటి దాకా ఆమె ఇంటికి కరెంట్ లేదు. తల్లికి వచ్చే వెయ్యి రూపాయల వితంతు పెన్షన్ బతకడానికి ఆధారం. అయినా సరే ఆటల్లో నిలిచి గెలిచి పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్ కోసం ఆశలు పెట్టుకోదగ్గ అమ్మాయిగా నిలిచింది. 16 ఏళ్ల నిరుపేద బాలిక ఆశా కిరణ్ బార్లా స్ఫూర్తి గాథ ఇది. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు భోపాల్‌లో జరుగుతున్న జాతీయ ఖేలో ఇండియా పోటీల్లో న్యూస్ మేకర్ ఆశా కిరణ్ బార్లా. వారికి పేదరికం శాపం. కాని వారి పోరాటానికి అడ్డు లేదు. వారికి పోషకాహారలోపం. కాని వారి బలానికి తిరుగులేదు. దేశంలో ఎందరో పేద క్రీడాకారులు. కాని వారి సంకల్పానికి ఓటమి లేదు. 17 ఏళ్ల లోపు ఉండే దేశగ్రామీణ క్రీడాకారులను ఉత్సాహపరచడానికి 2018 నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’లో భాగంగా జనవరి 30 మొదలయ్యాయి. ఫిబ్రవరి 11 వరకూ జరుగుతున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022’ పోటీల్లో ఎందరో ఇలాంటి మట్టిలో మాణిక్యాలు. ఎందరినో ఆశ్చర్యపరుస్తున్న కొత్త ముఖాలు. ఆశా కిరణ్ బార్లా కూడా అలాంటి మాణిక్యమే. ఎవరీ బార్లా అని అందరూ ఆమె పట్ల ఆరా తీస్తున్నారు. నిజానికి ఇప్పటికే ఆశా సాధించిన విజయాలతో ఎంతో ప్రచారం పొందాల్సింది. కాని జార్ఖండ్‌కు చెందిన ఈ నిరుపేద ఆదివాసీ క్రీడాకారిణిని ఎవరు పట్టించుకుంటారు? పరుగుల రాణి ‘పీటీ ఉష నాకు ఆదర్శం’ అని చెప్పే 16 ఏళ్ల బార్ల చిరుతతో సమానంగా పరిగెత్త గలదు. 2022లో కువైట్‌లో జరిగిన ఆసియా యూత్ ఫెస్టివల్లో 800 మీటర్ల పరుగుల పోటీలో మన దేశం నుంచి రికార్డు నమోదు చేసింది. ఇంతకు ముందు ఉన్న రికార్డును చెరిపేసింది. ఈ ఘనవిజయానికి ఆమెకు రావలసినంత పేరు భారతీయ మీడియాలో రాలేదు. విషాదం ఏమంటే కువైట్‌లో సాధించిన ఈ ఘనతను వారి ఇంట్లో రెండు రోజుల తర్వాత తెలుసుకున్నారు. ఎందుకంటే వారి ఇంటికి కరెంట్ లేదు. ఇంట్లో టీవీ లేదు. వారికి ఫోన్ కూడా లేదు. ఆశా కిరణ్ బార్లా ఈ ఘనత సాధించాక అధికారులు వచ్చి హడావిడిగా కరెంట్ ఇచ్చారు. జిల్లా స్పోర్ట్స్ యంత్రాంగం ఒక టీవీ కొని ఇచ్చింది. ‘కాని మాకు తిండి ఎట్లా?’ అంటుంది బార్లా. ఆకలితో పరిగెత్తి ఆశా కిరణ్ బార్లాది జార్ఖండ్‌లో రాంచీకి 100 కిలోమీటర్ల దూరంలో అడవిలో కొండల మధ్య ఉన్న అతి చిన్న గిరిజన తండా. 22 ఇళ్లు ఉంటాయి. చుట్టుపక్కల నక్సల్స్ బెడద ఉండటంతో కరెంటు, ఫోన్ సిగ్నల్స్ దాదాపుగా ఆ తండాకి లేవు. అలాంటి ఊర్లో పని చేసిన ఏకైక టీచర్ విలియమ్స్ కుమార్తె ఆశా కిరణ్. కాని 9 ఏళ్ల క్రితం ఆ విలియమ్స్ మరణించడంతో ఆ కుటుంబం దిక్కు లేనిదైంది. నలుగురు పిల్లల్ని వితంతు పెన్షన్తోటి తల్లి రోసానియా సాకాల్సి వచ్చింది. ఆశా కిరణ్ అక్క ఫ్లోరెన్స్ బాగా పరిగెత్తుతుంది. అది చూసి ఆశా కూడా పరిగెత్తడం నేర్చింది. చిన్నప్పటి నుంచి కొండలు గుట్టలు ఎక్కిన కాళ్లు కనుక వారి కాళ్లల్లో విపరీతమైన వేగం. కాని తండ్రి మరణం తర్వాత జరుగుబాటు కోసం ఐదో తరగతి పూర్తి చేసిన ఆశాను వాళ్లమ్మ రాంచిలో ఏదో ఇంటిలో పనికి పెట్టింది. ఒక సంవత్సరం ఇంట్లో పనిమనిషిగా, వెట్టి కార్మికురాలిగా పని చేసింది ఆశా. టీచర్ తెచ్చిన మార్పు ఆశా అక్క ఫ్లోరెన్స్ వాళ్ల తండాకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మహుగావ్కు వెళ్లి చదువుకునేది. ఫ్లోరెన్స్ పరుగు చూసి వాళ్ల స్కూల్ టీచర్ సిస్టర్ దివ్య ‘నువ్వు బాగా పరిగెత్తుతున్నావ్’ అనంటే ‘మా చెల్లెలు ఇంకా బాగా పరిగెత్తుతుంది’ అని ఫ్లోరెన్స్ చెప్పింది. దాంతో ఆ టీచర్ రాంచీలో పనిమనిషిగా ఉన్న ఆశా కిరణ్‌ను తెచ్చి తన స్కూల్లో చేర్చింది. అక్కచెల్లెళ్లు ఇద్దరూ టిఫిన్ చేయకుండా స్కూల్‌కి పరిగెత్తుకుంటూ వచ్చేవారు. స్కూల్ అయ్యాక ఆకలికి తాళలేక మళ్లీ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లేవారు. టీచర్ ఇది గమనించి తానే స్వయంగా వారికి రేషన్ ఇచ్చి చదువులో క్రీడల్లో ప్రోత్సహించడమే కాదు ఇలాంటి గిరిజన బాలికలను సొంత ఖర్చులతో ట్రయిన్ చేసే కోచ్ ఆశు భాటియా దృష్టికి తీసుకెళ్లింది. బొకారో థర్మల్ టౌన్లో ఉన్న తన అథ్లెట్స్ అకాడెమీలో ఆశా కిరణ్‌ను చేర్చుకున్న ఆశు భాటియా తగిన శిక్షణ ఇవ్వడంతో ఇప్పుడు ఆమె పతకాల పంట పండిస్తోంది. రెండు స్వర్ణాలు ఇప్పటికి 11 నేషనల్, 2 ఇంటర్నేషనల్ పతకాలు సాధించిన ఆశా తాజాగా భోపాల్‌లో జరుగుతున్న ఖేల్ రత్న యూత్ గేమ్స్‌లో 800 మీటర్ల పరుగులో, 1500 మీటర్ల పరుగులో స్వర్ణ పతకాలు సాధించింది. దాంతో పరిశీలకులు 2024లో పారిస్ ఒలింపిక్స్‌లో ఆశాను ఒక ప్రాపబుల్గా ఎంపిక చేశారు. ‘కాని ఏం లాభం? ఆమెను ఒలింపిక్స్ స్థాయిలో శిక్షణ ఇవ్వడానికి నా దగ్గర వనరులు లేవు’ అని దిగులు పడుతున్నాడు కోచ్ ఆశు భాటియా. ‘మా జీవితాలు మెరుగు పరిస్తే మా అమ్మాయి ఇంకా రాణిస్తుంది’ అంటుంది తల్లి. ఈ ప్రతికూలతలు ఎలా ఉన్నా గెలిచి తీరాలనే సంకల్పం ఆశాలో. ఇలాంటి క్రీడాకారిణుల గురించి ఎంత ప్రచారం చేస్తే అంత సాయం దక్కుతుంది. ప్రోత్సాహం లభిస్తుంది. ఇప్పుడు అందరూ చేయవలసిన పని అదే. చదవండి: Sneh Rana: కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్న టీమిండియా ఆల్‌రౌండర్ WPL 2023: డబ్ల్యూపీఎల్ వేలం.. బరిలో 409 మంది -
Khelo India Youth Games: ‘స్వర్ణ’ సురభి
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ ఖాతాలో మూడో స్వర్ణ పతకం చేరింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఆదివారం జరిగిన జిమ్నాస్టిక్స్ అండర్–18 బాలికల టేబుల్ వాల్ట్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన కె.సురభి ప్రసన్న పసిడి పతకం సాధించింది. సురభి 11.63 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఈవెంట్లో సురభి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. అథ్లెటిక్స్‌లో 2000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో డిండి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అథ్లెటిక్స్ అకాడమీ విద్యార్థిని చెరిపెల్లి కీర్తన (పాలకుర్తి) రజత పతకం సొంతం చేసుకుంది. కీర్తన 7 నిమిషాల 17.37 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. బాలికల కబడ్డీ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 28–46తో మధ్యప్రదేశ్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈనెల 11 వరకు జరగనున్న ఈ క్రీడల్లో తెలంగాణ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో 11వ స్థానంలో ఉంది. -
Khelo India Youth Games: ప్రణయ్‌కు పసిడి పతకం
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ క్రీడాకారుల తమ పతకాల వేట కొనసాగిస్తున్నారు. భోపాల్‌లో జరుగుతున్న ఈ క్రీడల్లో శనివారం అథ్లెటిక్స్ బాలుర ట్రిపుల్ జంప్‌లో తెలంగాణ ప్లేయర్ కొత్తూరి ప్రణయ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకోగా.. బాలికల 100 మీటర్ల హర్డిల్స్‌లో నామాయి రుచిత రజత పతకాన్ని గెల్చుకుంది. శుక్రవారం 1500 మీటర్ల రేసులో సుమిత్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. శనివారం జరిగిన జూనియర్ పురుషుల సైక్లింగ్ కెరిన్ రేసు వ్యక్తిగత విభాగంలో ఆశీర్వాద్ సక్సేనా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. బ్యాడ్మింటన్‌లో అండర్–19 బాలుర సింగిల్స్ విభాగంలో కె.లోకేశ్ రెడ్డి తెలంగాణకు స్వర్ణ పతకాన్ని అందించాడు. ఫైనల్లో లోకేశ్ రెడ్డి 21–19, 15–21, 22–20తో అభినవ్ ఠాకూర్ (పంజాబ్)పై గెలుపొందాడు. బాక్సింగ్‌లో బాలుర 51 కేజీల విభాగంలో బిలాల్... బాలికల 75 కేజీల విభాగంలో గుణనిధి పతంగె కాంస్య పతకాలు సాధించారు. పతకాల పట్టికలో ప్రస్తుతం తెలంగాణ పది పతకాలతో 14వ ర్యాంక్‌లో ఉంది. -
కాంగ్రెస్ ఎమ్మెల్యే భవనంలో విద్యార్థి ఆత్మహత్య.. ఏం జరిగింది?
భోపాల్: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చెందిన అధికారిక భవనంలో కళాశాల విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవటం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కలకలం సృష్టించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓంకార్ సింగ్ మార్కమ్‌కు చెందిన అధికారిక భవనంగా పోలీసులు తెలిపారు. శ్యామల హిల్స్ ప్రాంతంలో జరిగిన సంఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తీరథ్ సింగ్ అనే విద్యార్థి గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యే భవనంలోనే ఉంటూ చదువుకుంటున్నట్లు గుర్తించారు పోలీసులు. క్యాన్సర్‌తో విద్యార్థి బాధపడుతున్నాడని, దాని కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. సూసైడ్ నోట్‌ను చేతిరాత నిపుణుల వద్దకు పంపించి అది అతడిదేనా అనే కోణంలో విచారిస్తున్నారు. విద్యార్థి మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారిస్తున్నామని శ్యామల హిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఉమేశ్ యాదవ్ తెలిపారు. ‘ ప్రొఫెసర్ కాలనీలో ఉన్న దిడోద్రి ఎమ్మెల్యే ఓంకార్ సింగ్ మార్కమ్ అధికారిక నివాసంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది. అక్కడ సూసైడ్ నోట్ సైతం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించాం.’ అని తెలిపారు. ప్రభుత్వ భవనంలో బాధితుడితో పాటు ఉంటున్న మరో వ్యక్తితో మాట్లాడినట్లు చెప్పారు. అతడికి క్యాన్సర్ ఉందని భోపాల్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిసిందన్నారు. ఇదీ చదవండి: Hyderabad: గొంతులో కోడి గుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి -
‘పసిడి’కి పంచ్ దూరంలో...
జాతీయ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (50 కేజీలు) పసిడి పతకానికి విజయం దూరంలో నిలిచింది. భోపాల్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో నిఖత్ 5–0తో శివిందర్ కౌర్ (ఆలిండియా పోలీస్)పై ఘనవిజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో అనామిక (రైల్వేస్)తో నిఖత్ తలపడుతుంది. 75 కేజీల విభాగంలో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ (అస్సాం) కూడా ఫైనల్ చేరింది. -
ఇషాకు రజతం.. జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్ విజేత ఎవరంటే!
National Shooting Championship 2022: జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ రజత పతకం సాధించింది. జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్లో 13–17తో హరియాణాకు చెందిన ఒలింపియన్ మను భాకర్ చేతిలో ఇషా ఓడిపోయింది. దీంతో ఆమె వెండి పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే.. సీనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కర్ణాటక షూటర్ టీఎస్ దివ్య విజేతగా నిలిచింది. కాగా భోపాల్‌లో సోమవారం ఈ టోర్నీ ముగిసింది. చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. అక్షర్‌కు నో ఛాన్స్! ఆల్‌రౌండర్ అరంగేట్రం Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే! -
తొలిరేయి నుంచే ఆమెకు నరకం
క్రైమ్: పెద్దల తొందరపాటు నిర్ణయంతో ఓ నవ వధువు(22) నరకం చవిచూసింది. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆమెకు.. వరుసగా ఒక్కో షాక్ తగులుకుంటూ వచ్చింది. చిన్నప్పటి నుంచి తెలిసివాడని, మంచోడని భావించిన భర్త.. మొదటి రాత్రి నుంచే ఆమెపై శాడిజం ప్రదర్శిస్తూ వచ్చాడు. పైగా పరాయి పురుషులకు పడక సుఖం పంచాలంటూ ఆమెపై ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో మాట వినని ఆమెకు దారుణాతి దారుణంగా హింసించాడు. రాజస్థాన్ బికనీర్ ఫైవ్ స్టార్ హోటల్లో జరిగిన నవ వధువు వేధింపుల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో మేనేజర్‌గా పని చేసే వ్యక్తి.. తన భార్యను అత్యంత పైశాచికంగా హింసించిన ఉదంతం విస్మయానికి గురి చేస్తోంది. శారీకంగా, మానసికంగా దెబ్బ తిన్న ఆమె అనారోగ్యం నుంచి కోలుకోవడానికి నెలల సమయమే పట్టింది. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఆ భర్త కిరాతకాలు వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్ భోపాల్ ఖోహేఫిజా ప్రాంతంలో ఇరు కుటుంబాలు పక్కపక్కనే ఉంటాయి. చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నవాళ్లు కావడంతో పెద్దలు, వాళ్ల పిల్లలకు ఈ ఏడాది జూన్‌లో వివాహం చేశారు. అయితే నవ వధువును తీసుకుని రాజస్థాన్ బికనీర్‌లో ఉన్న తమ ఇంటికి కాపురం వెళ్తానని అందరినీ నమ్మించాడు ఆ భర్త. తీరా అక్కడికి వెళ్లాక తాను పని చేసే ఫైవ్ స్టార్ హోటల్గదిలో ఆమెను బంధించాడు. తొలి రాత్రి నుంచే తన శాడిజంతో ఆమెకు చుక్కలు చూపించాడు. తమకు అసలు సొంతిల్లే లేదని.. ఇక్కడే ఉండాలంటూ ఆమెను బలవంతం చేశాడు. ఆపై ఆమె ఫోన్ లాక్కుని.. ఎవరితో కాంటాక్ట్ లేకుండా చేశాడు. చివరకు.. వైఫ్ స్వాపింగ్ గేమ్(ఒకరి భార్యతో మరొకరు శృంగారంలో పాల్గొనే క్రీడ)లో పాల్గొనాలని బాధితురాలిపై ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో ఆమె మాట వినకపోవడంతో దారుణంగా హింసించాడు. ఆపై ఆమె కుటుంబ సభ్యుల్ని రూ. 50 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే ఆమె తల్లిదండ్రుల నుంచి సరైన స్పందన రాలేదు. ఈలోపు పదిహేను రోజుల పాటు హోటల్ గదిలోనే బంధించి.. ఆమె ముందు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. భార్యను మంచానికి కట్టేసి డ్రగ్స్ సేవించి.. ఆమె ఎదురుగానే అమ్మాయిలతో పాటు మగవాళ్లతోనూ శృంగారంలో పాల్గొన్నాడు. అంతటితో ఆగకుండా ఆమెతో అసహజ శృంగారంలో పాల్గొని నరకం చూపించాడు. ఈ తరుణంలో ఆమె ఆత్మహత్యయత్నం చేయగా.. హోటల్ నుంచి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అదనపు కట్నం కోసం అత్తమామ, భర్త కలిసి ఆమెను వేధించడం మొదలుపెట్టారు. ఎలాగోలా పుట్టింటికి ఫోన్ చేసి సమాచారం అందించిన ఆమె.. మేనమామ సాయంతో ఆ నరకం నుంచి బయటపడింది. ఈలోపు ఆరోగ్యం క్షీణించడంతో ఆమెకు ఇన్నాళ్లపాటు చికిత్స అందించారు. చివరకు స్వస్థలం చేరుకుని భోపాల్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్నారు పోలీసులు. అయితే ఇంతవరకు నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంతో.. బాధిత కుటుంబం ఆందోళనకు సిద్ధమైంది. ఇదీ చదవండి: యువతుల కోసం అపార్ట్‌మెంట్‌కు సాఫ్ట్వేర్ ఉద్యోగి.. షాకింగ్ ట్విస్ట్ -
నవరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి.. రెండు వర్గాల మధ్య పోట్లాట
భోపాల్: నవారాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. రెండు వర్గాల వారు బీభత్సంగా కర్రలతో కొట్లాడుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో బోపాల్‌లోని కంకర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన గర్బా ఫంక్షన్లో ఇద్దరు అమ్మాయిలు చేసిన అశ్లీల నృత్యంపై వాదన ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు. ఐతే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారని అన్నారు. వారంతో కర్రలతో తీవ్రంగా కొట్లాడుకున్నారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఐతే దళిత సంఘాల సభ్యులు దుర్గామాత విగ్రహం ప్రతిష్టించినందుకు అగ్రవర్ణాలవారు తమపై దాడి చేశారని చెబుతున్నారు. మరోవర్గం వారు ఆ అమ్మాయిల చేసిన అశ్లీల నృత్యం కారణంగానే గొడవ ప్రారంభమైందని అంటున్నారు. దీంతో ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: టీచర్ అయ్యి ఉండి ఇదేం పని... పిల్లల ముందే అలా..) -
వైరల్: రూ.5 గొడవ.. కండక్టర్‌ను ఉతికారేశాడు
వైరల్: ఆర్టీసీ ఛార్జీల బాదుడుతో.. ఏ రూట్లలో ఎంతెంత పెరిగాయో, అదీ రోజువారీ ప్రయాణాలు చేసే ప్రయాణికులకు సైతం అంతుచిక్కడం లేదు. పైగా టార్గెట్ల పేరిట ఒక స్టాప్ బదులు.. మరోస్టాప్‌కు టికెట్ కొడుతూ ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు కొందరు కండక్టర్లు. దేశంలోని చాలా నగరాల్లోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అలా.. అధిక ఛార్జీలు వసూలు చేసినందుకు ఓ కండక్టర్‌ను చితకబాదేశాడు ఓ ప్రయాణికుడు. మధ్యప్రదేశ్ భోపాల్‌లో తాజాగా జరిగిన ఘటన ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటోంది. మంగళవారం ఉదయం పది గంటల ప్రాంతంలో.. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ బస్టాప్ దగ్గర ఓ వ్యక్తి బస్సెక్కాడు. తాను దిగాల్సిన స్టాప్‌కు పది రూపాయలే టికెట్ కాగా.. కండక్టర్ మాత్రం ముందుస్టాప్ నుంచి టికెట్ కొట్టి.. మరో ఐదు రూపాయలు ఎక్కువగా వసూలు చేయాలని ప్రయత్నించాడు. NCC cadet thrashed city bus conductor in Bhopal, an argument broke out between the bus conductor and the NCC cadet over the difference of 5 rs. bus fare @ndtv @ndtvindia pic.twitter.com/hnA8B08sBw — Anurag Dwary (@Anurag_Dwary) September 14, 2022 ఈ క్రమంలో ఎన్సీసీ క్యాడెట్‌కు చెందిన సదరు ప్రయాణికుడు.. అధిక వసూలుపై నిలదీశాడు. తాను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చేశాడు. అయినా సరే ఐదు రూపాయలు ఇవ్వాలని, లేదంటే దిగిపోవాలని కండక్టర్ చెప్పాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన సదరు ప్రయాణికుడు.. కండక్టర్‌ను చితకబాదేశాడు. అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు వాళ్లను ఆపే ప్రయత్నం చేయగా.. ప్రయాణికుడు బస్సు దిగిపోవడం, ఆ వెనకాల కండక్టర్ పరుగులు తీయడం వరకు బస్సులోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించింది రవాణా శాఖ. దీంతో సదరు ఎన్సీసీ క్యాడెట్‌పై జహాంగీర్‌బాద్ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. నెట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇదీ చదవండి: కన్నతల్లి అనుకుని.. ఆ బస్సు వెంట పరుగులు -
కామాంధుడి దాష్టీకం.. ఇల్లు నేలమట్టం
భోపాల్/రేవా: స్కూలు బస్సులోనే చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడాడు ఓ మృగం. మూడున్నరేళ్ల చిన్నారిపై కామాంధుడి దాష్టీకం ఆలస్యంగా వెలుగుచూసింది. భోపాల్‌లో ఈ నెల 8న ఈ దారుణం జరిగింది. నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో నర్సరీ చదివే చిన్నారి ఇంటికెళ్లాక.. ఆమె బ్యాగ్‌లో ఉండాల్సిన స్పేర్ దస్తులు మార్చేసి ఉన్నాయి. పైగా ప్రైవేట్ భాగాల్లో నొప్పిగా ఉందని తల్లికి చెప్పింది. తల్లి ఆరాతీయడంతో జరిగిన దారుణం వెలుగు చూసింది. బాధిత చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకు ముందు ఘటనపై స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. వాళ్లు నిర్లక్ష్యంగా స్పందించారు. పైగా ఘటన జరిగిన రోజు బస్సులోని సీసీటీవీ ఫుటేజీని మాయం చేశార. దీంతో ఆ పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు.. బస్సు డ్రైవర్‌ను, ఘటన జరిగినపుడు సహకరించిన మహిళా హెల్పర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, పోక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. డ్రైవర్ అక్రమంగా నిర్మించిన ఇంటిని అధికారులు కూల్చేశారు. ఈ మేరకు అక్రమ కట్టడంగా పేర్కొంటూ నోటీసులు జారీ చేసిన అధికారులు.. పోలీసుల సమక్షంలో షాపురా ఏరియాలోని నిందితుడి ఇంటిని నేలమట్టం చేశారు. ఘటన గురించి తెలిసి ఆగ్రవేశాలతో ఉన్న స్థానికులతోనే ఆ ఇంటిని అధికారులు నేలమట్టం చేయించడం విశేషం. ఇదిలా ఉంటే.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. స్కూల్ యాజమాన్యం ధోరణిపైనా మండిపడ్డారు హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా. video courtesy: IBC24 ఇదీ చదవండి: నాకు మా అమ్మ కావాలి.. గుండెల్ని పిండేస్తున్న చిన్నారి రోదన -
Divorce Celebration: వివాహ రద్దు వేడుక.. ఆహ్వాన ప్రతిక చూశారా!
వివాహం అనేది మనుషులు జీవితాల్లో ముఖ్యమైన ఘట్టం. అందుకే పెళ్లి జ్ఞాపకాలు చిరకాలం గుర్తుండిపోయేలా వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటారు. ఆలుమగల మధ్య అంతా సవ్యంగా సాగితే ఏ సమస్యా ఉండదు. పొరపొచ్చాలు వస్తే పెళ్లి కాస్తా పెటాకులు అవుతుంది. ఇటీవల కాలంలో విడాకులు అనేవి సాధారణంగా మారిపోయాయి. రాజీపడి బతకడానికి ఎవరు ఇష్టపడటం లేదు. విడాకులు తీసుకుని ఎవరికి వారు హ్యాపీగా లైఫ్‌ను లీడ్ చేస్తున్నవారు ఎంతో మంది మనకు కనబడుతున్నారు. ఇక విషయానికి వస్తే వెడ్డింగే కాదు విడాకులను కూడా సెలబ్రెట్ చేసుకుంటామంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఇన్విటేషన్ తెగ వైరలయింది. రెండున్నరేళ్ల పాటు కోర్టులు చుట్టూ తిరిగి డివోర్స్ సాధించిన 18 మంది పురుషులు తమ ‘సింగిల్’ స్టేటస్‌ను సెలబ్రెట్ చేసుకోవాలని అనుకుని.. ఈ ఆహ్వానపత్రికను తయారు చేయించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారులోని బిల్ఖిరియాలోని రిసార్ట్‌లో సెప్టెంబర్ 18న ఈ కార్యక్రమం తలపెట్టారు. భాయి వెల్ఫేర్ సొసైటీ అనే ఎన్జీవో ఆధ్వర్యంలో ‘వివాహ రద్దు’ను వేడుకగా చేసుకోవాలని నిర్ణయించారు. స్వేచ్ఛ లభించినపుడు సెలబ్రెట్ చేసుకోవడంలో తప్పేంలేదని, విడాకుల అనంతర జీవితం కూడా ఆనందంగానే సాగుతుందన్న సందేశం ఇవ్వడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు భాయి వెల్ఫేర్ సొసైటీ చెప్పుకొచ్చింది. తాము మహిళలకు వ్యతిరేకం కాదని.. చట్టాలను దుర్వినియోగం కాకుండా చూడాలన్నదే తమ అభిమతమని వివరణయిచ్చింది. అన్నట్టు విడాకుల కేసులతో సమస్యలను ఎదుర్కొంటున్న పురుషుల కోసం ఈ ఎన్జీవో హెల్ప్‌లైన్‌ను కూడా నడుపుతోందట! వివాహ రద్దు వేడుక సాగేదిలా.. పెళ్లి తంతుకు రివర్స్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. పెళ్లి దండలను నిమజ్జనం చేయడం, జెంట్స్ సంగీత్, సద్బుద్ధి శుద్ధీకరణ యజ్ఞం వంటి క్రతువులు చేస్తారు. మనుషుల గౌరవాన్ని కాపాడతామని ఏడడుగుల సాక్షిగా ప్రమాణం చేయిస్తారట. (క్లిక్ చేయండి: పెళ్లి అనుకుంటే లొల్లి) సంప్రదాయవాదుల మండిపాటు భాయి వెల్ఫేర్ సొసైటీ నిర్వహించ తలపెట్టిన వివాహ రద్దు కార్యక్రమంపై సంప్రదాయవాదులు తీవ్రస్థాయిలో మడిపడుతున్నారు. కొన్ని స్థానిక హిందూ సంస్థలు కూడా ఆక్షేపించడంతో నిర్వాహకులు వెనక్కు తగ్గారు. ‘ప్రైవేట్ ఈవెంట్’ను రాజకీయం చేయాలని తాము కోరుకోవడం లేదని.. అందుకే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని నిర్వాహకులు ప్రకటించారు. (క్లిక్ చేయండి: చెప్పులతో చితక్కొట్టుకున్న అంకుల్స్..) -
టోల్ ఛార్జీ కట్టమన్నందుకు దాడి, తిరిగి చెప్పుతో..
భోపాల్: టోల్ ఛార్జీ కట్టమన్నందుకు టోల్ బూత్‌లో పని చేసే యువతిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. అయితే ఆ వ్యక్తిని తీవ్రంగానే ప్రతిఘటిస్తూ.. ఆ యువతి కూడా ప్రతిదాడి చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ రాజ్ఘడ్-భోపాల్ కచ్నారియా టోల్‌ప్లాజా వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. రాజ్‌కుమార్ గుజార్ అనే వ్యక్తి తన కారుకు ఫాస్ట్‌ట్యాగ్(ఈ-టోల్ పేమెంట్ వ్యవస్థ) లేకుండానే అక్కడికి వచ్చాడు. తాను స్థానికుడినని, టోల్ ఛార్జీల నుంచి తనకు మినహాయింపు ఉందని, ఆ ప్లాజా నిర్వాహకుడికి సైతం తనకు తెలుసని చెప్పాడు. అయితే అతను, ఆ వాహనం లోకల్‌దే అని నిరూపించుకోవడానికి ఎలాంటి ఆధారాలు అతని వద్ద లేవు. పైగా నిర్వాహకుడు సైతం ఆ వ్యక్తి ఎవరో తెలీదని చెప్పాడు. దీంతో.. టోల్ ఛార్జీ కట్టాల్సిందేనని సిబ్బందిగా పని చేస్తున్న అనురాధా దాంగి తేల్చి చెప్పింది. ఆ మాట వినగానే కోపోద్రిక్తుడైన రాజ్‌కుమార్ ఆమె వైపు దూసుకొస్తూ.. దుర్భాషలాడాడు. అంతటితో ఆగక ఆమె చెంప చెల్లుమనిపించాడు. అయితే అనురాధా ఊరుకోలేదు. ఆమె సైతం తన చెప్పు తీసి రాజ్‌కుమార్‌ను చెడామడా వాయించింది. ఇద్దరి మధ్య పెనుగులాట జరగ్గా.. అక్కడే ఉన్న కొందరు ఆ ఇద్దరినీ నిలువరించే ప్రయత్నం చేశారు. బూత్‌లో ఏడుగురు మహిళా సిబ్బంది ఉన్నా.. సెక్యూరిటీ గార్డులెవరూ లేనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మహిళా సిబ్బంది ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయ్యింది. అయితే.. నిందితుడిని ఇంకా పోలీసులు అరెస్ట్ చేయలేదని సమాచారం. A man slapped a woman employee of a toll both in Rajgarh after she refused to let him go without paying the tax. The man is seen angrily walking towards the employee and then slapping her across the face, The woman hits him back with her footwear @ndtv @ndtvindia pic.twitter.com/hmK0ghdImX — Anurag Dwary (@Anurag_Dwary) August 21, 2022 -
భక్తురాలిపై అఘాయిత్యం... దేవతే అలా చేసిందని బుకాయింపు
ఇటీవల కాలంలో స్వామిజీ పేరుతో భక్తులపై అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలు కోకొల్లలు. అయినా ప్రజల్లో కూడా మార్పు రావడం లేదు. ఈ డిజిటల్ యుగంలో పిచ్చి బాబాలు, స్వామీజీల మాయలో పడి కోరి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ స్వామీజీని నమ్మీ జీవితాన్ని నాశనం చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మధ్యప్రధేశ్లో ఒక వ్యక్తి తనను దేవుడిగా ప్రకటించుకుని స్వామి వైర్యాగ్యనంద గిరిగా పబ్లిక్‌లో చెలామణి అవుతున్నాడు. ఈ మేరకు ఒక మహిళ తనకు చాలా ఏళ్లుగా పిల్లలు కలగకపోవడంతో ఈ వైర్యాగ్యనంద స్వామిని కలిసినట్లు పోలీసులుకు తెలిపింది. కొన్ని పూజలు చేస్తే పిల్లలు కలుగుతారని నమ్మబలికి ఒక ప్రసాదం ఇచ్చాడని చెప్పింది. సదరు మహిళ ఆ ప్రసాదం తిని స్ప్రుహ కోల్పోయాననని, ఆ తర్వాత ఆ వ్యక్తి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చింది. ఐతే తనకు మెలుకువ వచ్చిన తర్వాత ఆ వైరాగ్యానంద స్వామీ.. దేవత నీపై అత్యాచారం చేసిందని చెబుతున్నాడని వాపోయింది. ఆ బాధిత మహిళ వెంటనే ఆ స్వామీజీ పై ఫిర్యాదు చేయలేకపోయింది. ఎందుకంటే ఆ స్వామిజీకి రాజకీయ పార్టీల అండదండ ఉంది. పైగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీకి మద్దతుగా నిలబడటమే కాకుండా ఒక సీనియర్ నాయకుడి గెలుపు కోసం యజ్ఞం చేశాడు. పైగా అతను గెలవకపోతే సమాదిలోకి వెళ్లిపోతానంటూ ప్రగల్పాలు కూడా పలికాడు. ఆ వ్యక్తికి సమాజంలో కాస్త పలుకుబడి ఉండడంతో భయప్డడానని చెప్పుకొచ్చింది సదరు బాధితరాలు. ఈ మేరకు పోలీసులు అతని పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. (చదవండి: లాలు యాదవ్ కుమార్తె ట్వీట్... బలపడనున్న 'గత బంధం') -
నెలకు 4వేల జీతంతో మొదలైన ‘హీరో’, కళ్లు చెదిరే ఇల్లు,కోట్ల ఆస్తి..చివరికి!
భోపాల్: భోపాల్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి కోట్ల ఆస్తిని కూడబెట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఫిర్యాదుపై విచారణ జరిపిన మధ్యప్రదేశ్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యు) అతని ఇంట్లో దొరికిన నగదు, ఇతర ఆస్తి పత్రాలు చూసిన నివ్వెర పోయారు. స్థిరాస్తులు, ఇతర కోట్ల రూపాయల విలువైన ఇతర ఆస్తులకు సంబంధించిన పత్రాలతో పాటు రూ 85 లక్షలకు పైగా నగదు లభించినట్టు అధికారులు వెల్లడించారు. లెక్కింపు, పత్రాల వెరిఫికేషన్ తర్వాతే అతడి మొత్తం విలువ తెలుస్తుందని ఈఓడబ్ల్యు ఎస్పీ రాజేష్ మిశ్రా తెలిపారు. (ఇదీ చదవండి: అరుదైన ఘనత దక్కించుకున్న ఎల్ఐసీ!) నెలకు నాలుగువేల రూపాయల జీతంతో రాష్ట్ర వైద్య విద్యా శాఖలో అప్పర్ డివిజన్ క్లర్క్‌గా కరియర్ ప్రారంభించిన హీరో కేశ్వాని ప్రస్తుతం నెలకు దాదాపు రూ.50 వేల జీతం తీసుకుంటున్నాడు. అక్రమ ఆస్తులు ఫిర్యాదుల విచారణ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు అతని నివాసంలో సోదాలు నిర్వహించగా రూ. 85 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. నోట్ లెక్కింపు యంత్రాన్ని సాయంతో డబ్బును లెక్కించినట్టు ఈఓడబ్ల్యు అధికారి తెలిపారు. అలాగే కోట్లాది రూపాయల పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అంతేకాదు ఖరీదైన అలంకార వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే కేస్వానీ నివాసం విలువ సుమారు కోటిన్నర ఉంటుందని అంచనా వేశారు. కేశ్వాని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో లక్షల రూపాయలు జమ అయినట్లు గుర్తించారు. ఎలాంటి ఆదాయ వనరులు లేని గృహిణి అయిన కేశ్వాని భార్య పేరిట చాలా ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారి తెలిపారు. బైరాగఢ్ ప్రాంతంలో బుధవారం అర్థరాత్రి వరకు ఈ సోదాలు కొనసాగాయి. అయితే ఇంకో ట్విస్టు ఏంటంటే అధికారుల సోదాలను ప్రతిఘటించిన కేశ్వానీ, తన ఎత్తులు సాగకపోయేసరికి బాత్రూమ్ క్లీనర్‌ను తాగేశాడు. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందని ఎస్పీ మిశ్రా తెలిపారు. #WATCH | MP:Around Rs 80 Lakhs cash, property documents & gold-silver recovered from residence of Hero Keswani, sr clerk of Medical Education Dept in Bhopal. Economic Offences Wing conducted a raid at his residenc. He was hospitalised after his health deteriorated when raid began pic.twitter.com/FgK73jBMQx — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 3, 2022 -
టైం కోసం వేచి చూశాడు.. ఫ్రెండ్ ఇంట్లోలేడని తెలిసి ఆమెపై..
పెళ్లి చేసుకుని భార్యకు అండగా ఉండాల్సిన భర్తే.. ఆమె పాలిట కీచకుడయ్యాడు. భర్త స్నేహితుడు.. ఆమెపై అత్యాచారం చేసినా.. అదేదీ పట్టించుకోకుండా ఆమెకు విడాకుల ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. భోపాల్‌కు చెందిన ఓ హిందూ మహిళ(28)కు మరో వర్గానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం అనంతరం.. సదరు మహిళ తన భర్త వర్గంలోకి మారింది. కాగా, మొదట్లో కొద్ది రోజుల బాగానే సాగిన వివాహ బంధంలో అడ్డంకులు ఎదురయ్యాయి. కొంత కాలం తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రతీరోజు ఏదో ఒక విషయంలో వారి మధ్య తగువు జరుగుతూనే ఉంది. అయితే, వీరి సమస్యను తీర్చేందుకు భర్త స్నేహితుడు.. హసీబ్ సిద్ధిఖీ రంగ ప్రవేశం చేశారు. ఈ క్రమంలో తరచూ వారి ఇంటికి వస్తూ బాధితురాలిపై కన్నేసిన సిద్ధిఖీ దారుణానికి ఒడిగట్టాడు. ఓరోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా, జరిగిన విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పి కన్నీరు పెట్టుకుంది. ఆమె గోడు వినిపించుకోని భర్త.. ఆమె పాలిట దుర్మార్గంగా ప్రవర్తించాడు. స్నేహితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా భార్యకు విడాకులు ఇచ్చాడు. అనంతరం ఇంట్లో నుంచి ఆమె పంపించేశాడు. దీంతో బాధితురాలు ఇండోర్ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లైంగిక దాడికి పాల్పడిన సిద్ధిఖీతోపాటు మహిళ భర్తను కూడా అరెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: దేశ సరిహద్దుల్లో అమ్మాయిల మృతదేహాల కలకలం.. ఎలా చనిపోయారు? -
మధ్యప్రదేశ్‌లో ‘ఆప్’ పాగా.. మేయర్ పీఠం కైవసం
భోపాల్: దేశ రాజధాని ఢిల్లీతోపాటు పంజాబ్‌లో అధికారం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్‌లో కూడా కాలుమోపింది. సింగ్రౌలీ మున్సిపల్ ఎన్నికల్లో మేయర్‌గా ఆప్ అభ్యర్థి రాణి అగర్వాల్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ప్రకాశ్ విశ్వకర్మను 9,352 ఓట్ల తేడాతో ఓడించారు. కాంగ్రెస్ అభ్యర్థి మూడో స్థానానికి పరిమితమయ్యారు. మధ్యప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ నెగ్గడం ఇదే తొలిసారి. 2014లో తొలిసారి జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైన రాణి అగర్వాల్.. తాజాగా సింగ్రౌలీ మేయర్‌గా విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె పోటీ చేసినప్పటికీ పరాజయం పాలయ్యారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఆమెకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంలో పాల్గొని రోడ్ షో నిర్వహించారు. తాజా ఫలితాల్లో రాణి అగర్వాల్ విజయం సాధించటంతో సింగ్రౌలీ మేయగా గెలిచారు. సింగ్రౌలీ మేయర్‌గా ఎన్నికైన రాణి అగర్వాల్‌తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ఆప్ నేతలకు ఆ పార్టీ కన్వినర్ అరవిందక్ కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆప్ నిజాయతీ రాజకీయలాను దేశవ్యాప్తంగా ప్రజలందరూ విశ్వసిస్తున్నారని అన్నారు. ఇదీ చూడండి: Margaret Alva: విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా -
ఈవ్ టీజింగ్‌ను ప్రతిఘటించిన మహిళ.. బ్లేడుతో దాడి.. 118 కుట్లు
భోపాల్: ఈవ్ టీజింగ్‌ను ప్రతిఘటించిన మహిళపై ముగ్గురు బ్లేడుతో విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారు. ముఖమంతా రక్తమోడుతున్న ఆమెకు ఆస్పత్రిలో 118 కుట్లువేసి చికిత్స చేశారు. భోపాల్‌లో జూన్ 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రాత్రిపూట భర్తతో కలిసి బైక్ మీద ఇంటికొస్తున్న మహిళపట్ల ఇద్దరుబాలురు, ఒక వ్యక్తి ఈవ్‌టీజింగ్‌కు పాల్పడ్డారు. ప్రతిఘటించిన ఆమె ముఖంపై 10 సెంటీమీటర్ల మేర లోతైన గాటు పెట్టి బ్లేడుతో పలుచోట్ల దాడిచేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్‌చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం శివరాజ్ ఆదేశించారు. బాధితురాలిని సీఎం పరామర్శించి లక్ష ఆర్థికసాయం ప్రకటించారు. మున్సిపల్ అధికారులు ఒక నిందితుని ఇంటిని కూల్చివేశారు. अन्याय का प्रतिकार करना अन्य लोगों के लिए प्रेरणा का कार्य है, इस नाते बहन सीमा अन्य महिलाओं के लिए प्रेरक भी हैं। उनके बेटा और बेटी पढ़ते हैं और उनके सहयोग के लिए भी कलेक्टर भोपाल को आवश्यक निर्देश दिये हैं। pic.twitter.com/BXQ5ywPCxG — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) June 12, 2022 -
పోస్ట్‌మాస్టర్ యవ్వారం.. ఐపీఎల్ బెట్టింగ్‌లో కోటి లాస్.. అంతా మంది సొమ్మే!
భోపాల్: తేరగా వచ్చే డబ్బును అనుభవించాలనుకుంటే.. ఆ కర్మఫలితాన్ని కూడా తర్వాత అనుభవించాల్సి ఉంటుంది. మంది సొమ్ముతో ఐపీఎల్లో బెట్టింగ్ వేయడమే కాదు.. ఆ సొమ్మంతా పొగొట్టి ఇప్పుడు కటకటాల పాలయ్యాడు ఓ పోస్ట్‌మాస్టర్. మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా బినా సబ్ పోస్ట్ ఆఫీస్‌లో విశాల్ అహిర్వార్ పోస్ట్‌మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో బెట్టింగులు పెడుతున్నాడు అతను. ఈ క్రమంలో దాదాపు కోటి రూపాయలకు పైనే పొగొట్టుకున్నాడు. అయితే ఆ డబ్బంతా మంది సొమ్మని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. సుమారు 24 కుటుంబాలకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ సొమ్మును ఐపీఎల్లో బెట్టింగ్ కోసం వాడుకున్నాడు. విశాల్ చేసిన మోసం వెలుగులోకి రావడంతో మే 20న బినా గవర్నమెంట్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో చేసిన తప్పును ఒప్పుకున్నాడు అతను. నిందితుడు పోస్ట్‌మాస్టర్ నకిలీ ఎఫ్డి ఖాతాల కోసం నిజమైన పాస్‌బుక్‌లను జారీ చేశాడని, గత రెండేళ్ల నుండి ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్‌లో మొత్తం డబ్బును పెట్టినట్లు పోలీసులు తెలిపారు. చీటింగ్, ఖాతాదారులను మోసం చేయడం సెక్షన్ల కింద విశాల్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. -
క్షణికావేశంలో తప్పు చేసిన భార్య.. భర్త ఏం చేశాడంటే..?
దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవలు సహజం. గొడవలున్నా సర్దుకుపోయి జీవించాలని పెద్దలు చెబుతుంటారు. కాగా, క్షణికావేశంలో భార్య చేసిన చిన్న తప్పు వివాహ బంధాన్ని నాశనం చేసింది. ఆమెను జీవితాంతం బాధపడేలా చేసి.. చివరకు విడాకులకు దారి తీసింది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన దంపతులు పదేళ్లకుపైగా విదేశంలో నివసిస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ కారణంగా వారు నివసిస్తున్న దేశంలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో వారు తిరిగి స్వదేశానికి రావాల్సి వచ్చింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా, వారు విదేశాల్లోనే చదువుతున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత భర్త.. ఓ వ్యాపారం ప్రారంభించగా.. భార్య ఓ కాలేజీలో ఉద్యోగం చేస్తోంది. అయితే, వారు భోపాల్‌కు రావడం భార్యకు ఎంతమాత్రం ఇష్టం లేకపోవడంతో భర్తతో ఆమె తరచూ గొడవపడేది. ఈ క్రమంలోనే వీరిద్దరూ గొడవ పడుతుండగా ఆవేశంతో రగిలిపోయిన భార్య.. భర్తను చెప్పుతో కొట్టింది. దీంతో ఒక్కసారిగా షాకైన భర్త.. తేరుకొని దీన్ని అవమానంగా ఫీలయ్యాడు. అనంతరం ఆమెతో విడిపోయేందుకు సిద్ధపడి విడాకులకు దరఖాస్తు చేశాడు. కానీ, కుటుంబ సభ్యులు మాత్రం వీరిద్దరికీ కౌన్సిలింగ్ ఇప్పించడానికి ప్రయత్నించారు. కౌన్సిలింగ్ సమయంలో భార్య తన తప్పును ఒప్పుకుంది. భర్త మాత్రం జరిగిన ఘటనను అవమానంగా భావించి.. ఆమెతో జీవించలేనని తెగెసిచెప్పాడు. విడాకులు కావాలని పట్టుబట్టాడు. అనంతరం భర్తను భార్య ఎంత బ్రతిమిలాడిన అతను మససు మాత్రం మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో చేసేదేమీలేక కోర్టు వారికి విడాకులు మంజూరుచేసింది. ఇది కూడా చదవండి: వివాహమైన మూడు నెలలకే దారుణం -
బైక్‌పై లవర్‌తో సోదరి షికారు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన అన్న
భోపాల్: తన సోదరి.. లవర్‌తో బైక్ మీద వెళ్తోందని ఆమె అన్న గమనించాడు. దీంతో వారిని రోడ్డుపై ఆపే ప్రయత్నం చేశాడు. కానీ, వారు బైక్ స్పీడ్ పెంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహం పట్టలేక దారుణనికి ఒడిగట్టాడు. వారు వెళ్తున్న బైక్‌ను ఓ మినీ ట్రక్కుతో ఫాలో చేసి హైస్పీడ్‌లో ఢీకొట్టాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని అయోధ్యనగర్‌లో చోటుచేసుకుంది. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, తన సోదరి.. లవర్‌తో బైక్‌పై వెళ్తోందన్న కోపంతో ఆమె సోదరుడు అజీం మస్సూరీ వారిని వెంబడించాడు. వారు వెళ్తున్న బైక్‌ను ఓ మినీ ట్రక్కుతో వెంబడించి.. బలంగా ఢీకొట్టాడు. అలాగే బైకును, వారిద్దరినీ 10 మీటర్ల దూరం ట్రక్కుతో రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. అంతటితో ఆగకుండా వాహనం దిగి.. తన సోదరి సహా ఆమెతో ఉన్న వ్యక్తిపై దాడికి దిగాడు. అనంతరం అతను అక్కడి నుంచి వెళ్లిపోగా.. స్థానికులు వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. దాడి తర్వాత.. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు అజీం మన్సూరీని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ట్రక్కు డ్రైవర్ రవిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు తెలిపారు. #WATCH | Bhopal: A couple in their twenties from different communities were injured after the girl’s cousin allegedly chased, hit their scooter and assaulted them while they were trying to elope in Ayodhya Nagar on Monday afternoon. pic.twitter.com/hFgg3kOfVC — TOI Bhopal (@TOIBhopalNews) April 20, 2022 ఇది చదవండి: హైదరాబాద్‌లో కొత్తరకం సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. పోలీసులు సైతం షాక్ -
భోపాల్ స్టడీ... మత్తుకు రెడీ
సాక్షి హైదరాబాద్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో విద్యాభ్యాసానికి, గంజాయి సహా ఇతర మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడానికి మధ్య ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రశ్నకు సమాధానం అవుననే అంటున్నారు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు. ఇటీవల తాము అరెస్టు చేసిన, కౌన్సెలింగ్ చేసిన వారిలో అనేక మందికి భోపాల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నట్లు గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో పాటు లోతుగా ఆరా తీస్తున్నట్లు ఓ అధికారి పేర్కొన్నారు. బీటెక్‌లోనే గంజాయికి అలవాటు పడి.. హష్ ఆయిల్ దందాకు సంబంధించిన వారం రోజుల వ్యవధిలో హెచ్–న్యూ అధికారులు.. దంపతులుగా చెప్పుకుంటున్న ఇద్దరిని అరెస్టు చేశారు. బోయిన్పల్లి కేసుకు సంబంధించి మదన్ మానేకర్, కొండపనేని మాన్సీలను కటకటాల్లోకి పంపారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన మాన్సీ కుటుంబం కొన్నేళ్ల క్రితం వ్యవసాయం కోసం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ శివార్లకు వలసవెళ్లింది. మాన్సీ విద్యాభ్యాసం కొంత మధ్యప్రదేశ్‌లో సాగింది. భోపాల్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో బీటెక్ చదివింది. అప్పట్లోనే గంజాయికి అలవాటు పడింది. నగరంలోని మల్టీ నేషనల్ ఐటీ కంపెనీలో ఉద్యోగం రావడంతో సిటీకి వచ్చి గంజాయితో పాటు హష్ ఆయిల్ సేవించడం, దందా చేయడం మొదలెట్టింది. తన సహోద్యోగులతో పాటు స్నేహితులు, పరిచయస్తులకు గంజాయి, హష్ ఆయిల్ నింపిన సిగరెట్లు అలవాటు చేసింది. విక్రేతగా మారి.. నల్లగొండలో పని చేస్తున్న రిజర్వ్ సబ్–ఇన్స్పెక్టర్ కుమారుడు వి.లక్ష్మీపతి కొన్నాళ్లు ఇక్కడే విద్యాభ్యాసం చేశాడు. నగరంలోని ఓ కాలేజీలో బీటెక్ కోర్సులో చేర్పించినా... మొదటి సంవత్సరం పూర్తికాకుండానే మానేశాడు. దీంతో అతడి తండ్రి భోపాల్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేర్చారు. అక్కడ ఉండగానే గంజాయికి అలవాటుపడిన ఇతగాడు ఆపై విక్రేతగా మారి హష్ ఆయిల్ దందాలోకి దిగి ఈ స్థాయికి ‘ఎదిగాడు’. వీరిద్దరు మాత్రమే కాదు భోపాల్ లింకులతో మరికొన్ని ఉదంతాలు ఇటీవల హెచ్–న్యూ దృష్టికి వచ్చాయి. ఈ విభాగం అధికారులు మాదక ద్రవ్యాల విక్రేతలతో పాటు వినియోగదారులను పట్టుకుంటున్నారు. పదేపదే వినియోగిస్తున్న, మరికొందరికి అలవాటు చేస్తున్న వారిని అరెస్టు చేస్తున్నారు. ఒకటిరెండుసార్లు మాత్రమే వారికి మారే అవకాశం ఇస్తూ తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి పంపుతున్నారు. బయటపడుతున్న లింకులు.. గడిచిన నెల రోజులుగా ఇలా కౌన్సెలింగ్ చేసిన విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల్లో అనేకమందికి భోపాల్ విద్యాభ్యాసం లింకులు బయటకు వచ్చాయి. అక్కడ చదువుతున్న రోజుల్లోనే ఈ మత్తుపదార్థాలకు అలవాటుపడ్డామంటూ వాళ్లు చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయంపై హెచ్–న్యూ ప్రత్యేక దృష్టి పెట్టింది. వివిధ మార్గాల్లో భోపాల్‌లోని విద్యాసంస్థలు, వాటిలోని విద్యార్థుల స్థితిగతులను తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో నగర అధికారులకు కొన్ని కీలకాంశాలు తెలిశాయి. భోపాల్‌లో విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ వినియోగం పెరుగుతున్నట్లు గుర్తించారు. అక్కడి వైద్యుల వద్దకు వస్తున్న మత్తు బానిసల్లో 15 నుంచి 17 సంవత్సరాల వాళ్లూ ఉంటున్నట్లు తెలుసుకున్నారు. క్షుణ్నంగా అధ్యయనం చేయడం కోసం త్వరలో ఓ ప్రత్యేక బృందాన్ని మధ్యప్రదేశ్ పంపాలని యోచిస్తున్నారు. ఆ తర్వాతే ఈ అంశంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. మాన్సీ ఫ్యామిలీ మహారాష్ట్రకు వలస వెళ్లగా.. ఆ రాష్ట్రంలోని తుల్జాపూర్ పరిసర ప్రాంతానికి చెందిన మదన్ మానేకర్ కుటుంబం బతుకుతెరువు కోసం నాచారానికి వచ్చింది. ఇతడి స్నేహితుడైన టాటూ దుకాణం నిర్వాహకుడు సోని ద్వారా మాన్సీతో పరిచయమైంది. కొ న్నాళ్లు సోనితో కలిసి ఉన్న మాన్సీ మియాపూర్‌లో నమోదైన డ్రగ్స్ కేసులో అతడు అరెస్టు కావడంతో మదన్‌తో కలిసి జీవిస్తోందని, ఇటీవల అతడిని వివాహం చేసుకున్నట్లు చెబుతోందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. (చదవండి: ఈ ఊరికి చేరాలంటే.. 8 కి.మీ. నడవాలి) -
ఆకాశమంత: రూ. 5600 పెట్టుబడితో.. 500 మిలియన్ల టర్నోవర్ స్థాయికి..
మనదేశంలోని విమానయాన సంస్థల్లో అత్యంత పెద్దదైన సంస్థ జెట్‌సెట్‌గో. దీనిని స్థాపించింది ఓ మహిళ. పేరు కనికా టేక్రీవాల్. పదేళ్ల కిందట స్థాపించిన ఆ సంస్థ ఇప్పుడు ఐదు వందల మిలియన్ల టర్నోవర్‌తో నడుస్తోంది. ఐదేళ్ల కిందట ఫోర్బ్స్ అండర్ థర్టీ విభాగంలో ఆసియాలో ప్రముఖ ఎంటర్ప్రెన్యూర్ కనికా టేక్రీవాల్. కనికా టేక్రీవాల్ది భోపాల్‌కు చెందిన మార్వారీ వ్యాపార కుటుంబం. ఈ కుటుంబానికి దేశవ్యాప్తంగా మారుతీ డీలర్షిప్ ఉంది. కనిక తండ్రి అనిల్ టేక్రీవాల్ ఉమ్మడి కుటుంబం భాగాలు పంచుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. తల్లి సునీత గృహిణి. కనిక ఆమె తమ్ముడు కనిష్క్... ఇదీ వాళ్ల చిన్న కుటుంబం. మంచి చదువు కోసం అనే కారణం గా సొంతూరికి 17 వందల కిలోమీటర్ల దూరాన ఉన్న ఊటీకి వచ్చి పడిందామె బాల్యం. పదవ తరగతి తర్వాత తిరిగి భోపాల్‌కి వెళ్లి పన్నెండు వరకు అక్కడే చదివింది. ఆ తర్వాత ముంబయిలోని బీడీ సోమాని ఇన్స్టిట్యూట్లో విజువల్ కమ్యూనికేషన్ అండ్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. ‘ముంబయి తనకు జీవించడం నేర్పించింది’ అంటోంది కనిక కాలేజ్ రోజులను తలుచుకుంటూ. కారు నుంచి బస్సుకు ‘‘గ్రాడ్యుయేషన్‌కి ముంబయిలో హాస్టల్లో ఉన్నప్పుడు మా నాన్న నాకు పాకెట్ మనీ చాలా తక్కువగా కచ్చితంగా లెక్కపెట్టినట్లు ఇచ్చేవారు. చేతిలో డబ్బు ఎక్కువ ఉంటే వ్యసనాలకు అలవాటు పడతానని నాన్న భయం. ఈ నేపథ్యంలో ముంబయి నగరం నాకు జీవించడం నేర్పించింది. అప్పటివరకు నేను చూసిన జీవితంలో నేను బయటకు వెళ్లడానికి ఇంట్లో నుంచి కాలు బయటపెడితే ఏ కారు అడుగుతానోనని మా డ్రైవర్లు నా చుట్టూ మూగేవాళ్లు. హాస్టల్లో ఉన్నప్పుడు ఖర్చులు తగ్గించుకోవడానికి సిటీబస్‌లో ప్రయాణించడం మొదలుపెట్టాను. నాన్న నెలకు ఒక సినిమాకు డబ్బిస్తే మేము నాలుగు సినిమాలు చూడాలి కదా మరి. అందుకే ఆ పొదుపు. కొన్నాళ్లకు అది కూడా కాదని నెలకు మూడు వందల రూపాయలకు పార్ట్‌టైమ్ వర్క్ మొదలుపెట్టాను. జీవితంలో అత్యంత సంతోషం అప్పుడు కలిగింది. సొంత సంపాదన ఇచ్చే కిక్కు అంతా ఇంతా కాదు. ఆ డబ్బును ఖర్చు చేయబుద్ధి కాలేదు. అందుకే మా అమ్మకిచ్చాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి యూకేకి వెళ్లాను. ఎంబీఏ చేస్తూ ఏరోస్పేస్ రీసోర్సెస్లో ఉద్యోగం చేశాను. క్యాన్సర్ పరీక్ష పీజీతోపాటు చదువులో పరీక్షలన్నీ పూర్తయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్లు ఎందుకో తెలియదు కానీ అమ్మానాన్నల దగ్గర ఉందామనిపించింది. నా ఎదురుగా మరో పరీక్ష ఉందని ఇండియాకి వచ్చిన తర్వాత తెలిసింది. అప్పటికే నన్ను క్యాన్సర్ పీడిస్తోంది. ట్రీట్మెంట్ సమయమంతా మోటివేషనల్ బుక్స్ చదవడానికే కేటాయించాను. లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ జీవితం నాకు స్ఫూర్తినిచ్చింది. ఒక సైక్లిస్ట్ క్యాన్సర్‌తో పోరాడి తిరిగి ట్రాక్‌లో పోటీపడడం నాకు ధైర్యాన్నిచ్చింది. నన్ను నేను దృఢంగా మార్చుకోవడానికి బాగా ఉపయోగపడింది. పన్నెండు కీమో థెరపీలు, రేడియేషన్ల తర్వాత మామూలయ్యాను. అప్పటికి నా వయసు 23. ఆ తర్వాత ఏడాది అంటే 2012లో జెట్‌సెట్‌గో ప్రారంభించాను. ఆరోగ్యరీత్యా ఇంతపెద్ద వెంచర్‌ను తలకెత్తుకోవడానికి ఎవరూ ప్రోత్సహించలేదు. ‘ఏమీ చేయకుండా ఊరుకోవడం ఇష్టం లేకపోతే బేకరీ పెట్టి కప్‌కేక్స్ చేసుకోవచ్చు కదా’ అని నిరుత్సాహపరిచిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ మనమేం చేయాలనేది మనమే నిర్ణయించుకోవాలి. ఆ అవకాశం ఇతరులకు ఇవ్వకూడదు. సామాన్యులకూ సాధ్యమే! జెట్‌సెట్‌గోలో నా తొలి పెట్టుబడి 5,600 మాత్రమే. ఆ డబ్బుతో యాప్ తయారు చేసుకున్నాను. చార్టెడ్ ఫ్లయిట్స్‌ను బుక్ చేసుకోగలిగిన యాప్ అది. రెండేళ్ల పాటు క్లయింట్ల నుంచి అడ్వాన్స్ పేమెంట్ తీసుకోవడంతోపాటు వెండర్స్ నుంచి హైర్ చేసి వ్యాపారం నిర్వహించాను. అద్దె హెలికాప్టర్లతో మొదలైన వ్యాపారం 2020కి ఎనిమిది సొంత ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 200 మంది ఉద్యోగులు, 15 కోట్ల టర్నోవర్‌కు చేరింది. ఆ తర్వాత వేగంగా పుంజుకుంది. మా సర్వీస్ ద్వారా 2020–21 ఆరువేల ఫ్లైట్లతో లక్ష మంది ప్రయాణించారు. మా క్లయింట్లలో సాధారణంగా కార్పొరేట్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులే ఉంటారు. ఢిల్లీ – ముంబయి, ముంబయి – బెంగళూరు, హైదరాబాద్ – ఢిల్లీలకు ప్రయాణించేవాళ్లు ఎక్కువ. మా క్లయింట్ అవసరాన్ని బట్టి ఆరు సీట్ల చార్టర్ ఫ్లైట్ నుంచి 18 సీట్ల ఫ్లయిట్ వరకు అందించగలుగుతాం. మెడికల్ ఎమర్జెన్సీలు కూడా ఉంటాయి. మనదేశంలో ఉన్న ప్రైవేట్ చార్టర్ కంపెనీలలో మాది బెస్ట్ ప్రైవేట్ చార్టర్. ఈ స్థాయికి చేరిన తర్వాత ముంబయిలో ఓ ప్రయోగం చేశాం. హెలికాప్టర్లో ప్రయాణించాలనే సరదా చాలామందిలో ఉంటుంది. కానీ ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లడానికి అంత ఖర్చు చేసి చార్టర్ తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చు. హెలికాప్టర్లో విహరించాలనే సరదా బలంగా ఉంటుంది. అలాంటి వాళ్ల కోసమే ఈ షటిల్ సర్వీస్ ప్రయోగం. నగరంలో ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లి రావచ్చన్నమాట. అది కూడా ఊబెర్ సర్వీస్‌లో ముంబయిలో ఒక చోట నుంచి మరో చోటికి వెళ్లి వచ్చిన ఖర్చులోనే. దూరాన్ని బట్టి కనీసం వెయ్యి నుంచి గరిష్టంగా రెండున్నర వేల రూపాయలుగా నిర్ణయించాం. మాది ఎయిర్ ట్యాక్సీ సర్వీస్ అన్నమాట. భవిష్యత్తులో ఇది బాగా పాపులర్ అవుతుందని కచ్చితంగా చెప్పగలను’’ అంటోంది కనిక. ఆ హక్కు నాకు లేదు ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను గర్వంగా చెప్పుకోగలిగిన విషయం ఏమిటంటే... కోవిడ్ సమయంలో ఉద్యోగులను తగ్గించడం కానీ, జీతాల్లో కోత విధించడం కానీ చేయలేదు. నేను మా ఉద్యోగుల కు సంస్థ లాభాల్లో భాగస్వామ్యం ఎప్పుడూ ఇవ్వలేదు. కాబట్టి మా నష్టాలను వాళ్లను కొంత పంచుకోమని అడగడం అనైతికం. యజమానిగా నేను నష్టంలో ఉన్న కారణంగా ఉద్యోగుల జీతంలో కోత విధించే హక్కు నాకు ఉండదు. – కనికా టేక్రీవాల్, జెట్‌సెట్‌గో ఫౌండర్ -
బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి.. వైన్ షాపుపై రాళ్లతో దాడి.. వీడియో వైరల్
భోపాల్: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమా భారతి మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. ఆమెకు సంబంధించిన ఓ వీడియోలో హల్ చల్ చేస్తోంది. మధ్యప్రదేశ్‌లో మద్యం నిషేధించాలని అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ డిమాండ్ చేసింది. జనవరి 15వ తేదీ నాటికి రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని కోరింది. లేని పక్షంలో రోడ్ల మీదకు వచ్చి నిరసలకు దిగుతామని వార్నింగ్ ఇచ్చింది. కాగా, ఇప్పటి వరకు మధ్యప్రదేశ్‌లో మద్యంపై నిషేధం విధించకపోవడంతో ఆమె రంగంలోకి దిగింది. అన్న మాట నిలుబెట్టుకుంది. భోపాల్‌లోని ఓ వైన్ షాపుపై రాళ్లతో ఆమె దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉండటం గమనార్హం. బీజేపీ ప్రభుత్వంపైనే ఇలా నిరసనకు దిగి మరోసారి ఆమె ఫైర్ బ్రాండ్ అని నిరూపించుకున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Senior #BJP leader #UmaBharti in action at a #Liquor vend in #Bhopal, she has been batting for #LiquorBan in the state. What is called LAW & ORDER? Is this the way to protest?#MadhyaPradesh pic.twitter.com/hvHLCjmtOr — Safa 🇮🇳 (@safaperaje) March 13, 2022 అయితే, ఉమా భారతి ఏం చేసినా.. ఏం మాట్లాడినా అది సంచలనమే అవుతుంది. అంతకు ముందు భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చేదీ మేమే, వాళ్లకు జీతాలు ఇచ్చేది కూడా మేమే.. వాళ్ళు కేవలం మా చెప్పులు మోయడానికి పనికి వస్తారు. రాజకీయాలకు వారిని మేము వాడుకుంటామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. -
ఒకటి తర్వాత మరొకటి.. వందల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు..
సాక్షి,హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్సిటీ (ఎస్ఆర్కేయూ) నుంచి నగరంలోని విద్యార్థులకు వందల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు సరఫరా అయ్యాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేతన్ సింగ్‌తో పాటు మూడు కన్సల్టెన్సీల నిర్వాహకులను ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరో కన్సల్టెన్సీ నిర్వాహకుడిని కటకటాల్లోకి నెట్టారు. ఇతడి విచారణలో కేతన్‌తో పాటు ఆ వర్సిటీ ఇంజినీరింగ్ (ఈఈఈ) విభాగాధిపతి ఇ.విజయ్‌కుమార్‌కు ఈ స్కామ్‌లో ప్రమేయం ఉన్నట్లు తేలిందని సోమవారం ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు. ► విజయవాడకు చెందిన పీకే వీరన్నస్వామి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలసవచ్చాడు. చాదర్‌ఘాట్ పరిధిలో వీఎస్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇందులో ఆశించిన మేర ఆదాయం లేకపోవడంతో నకిలీ సర్టిఫికెట్ల దందా మొదలుపెట్టాడు. ► కేతన్ సింగ్‌తో పాటు విజయ్‌కుమార్‌తో ఒప్పందం చేసుకున్న ఇతగాడు ఈ పని మొదలెట్టాడు. డ్రాప్ఔట్స్, బ్యాక్‌లాగ్స్ ఉన్న వాళ్లతో పాటు ఫెయిల్ అయిన విద్యార్థుల వివరాలను కాలేజీల నుంచి సేకరిస్తున్నాడు. ఆ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను సంప్రదిస్తున్న వీరన్న స్వామి ఎలాంటి అడ్మిషన్లు, పరీక్షలు లేకుండా సర్టిఫికెట్లు ఇస్తానని ఒప్పందాలు చేసుకుంటున్నాడు. ► వీరన్న ఈ విద్యార్థులు, నిరుద్యోగుల వివరాలను వాట్సాప్ ద్వారా వర్సిటీలో ఉన్న కేతన్, విజయ్‌లకు పంపిస్తున్నాడు. వీటి ఆధారంగా బ్యాక్ డేట్స్‌తో డిగ్రీలు రూపొందిస్తున్న వాళ్లు వర్సిటీలోనూ రికార్డులు సృష్టిస్తున్నారు. ఇలా తయారు చేసిన డిగ్రీలను కోర్సును బట్టి రూ.80 వేల నుంచి రూ.2.5 లక్షలు వరకు విక్రయిస్తున్నా రు. కొన్నాళ్లుగా ఈ దందా గుట్టుగా సాగుతోంది. ► సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సై శ్రీకాంత్ తదితరులతో కూడిన బృందం కన్సల్టెన్సీపై దాడి చేసింది. వీరన్నతో పాటు సర్టిఫికెట్లు ఖరీదు చేయడానికి వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులైన కంభపు సాయి గౌతమ్ (కొత్తపేట), చిన్రెడ్డి రితీష్ రెడ్డి (వనస్థలిపురం), బచ్చు వెంకట సాయి సుమ రోహిత్ (ఫతేనగర్), మున్నా వెల్‌ఫ్రెడ్ (వికారాబాద్), కోసిమెత్తి సూర్యతేజ (మాదాపూర్), తుమ్మల సాయితేజ (బాచుపల్లి) పట్టుబడ్డారు. ► నిందితులతో పాటు వారి నుంచి స్వాధీనం చేసుకున్న సర్టిఫికెట్లు, స్టాంపులు తదితరాలను తదుపరి చర్యల నిమిత్తం చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించారు. ఇప్పటికే అరెస్టు అయిన కేతన్‌ను పీటీ వారెంట్‌పై ఈ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. పరారీలో ఉన్న విజయ్‌కుమార్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
కదులుతున్న రైలులో దారుణం.. వంటగదిలో సీటు ఉందని నమ్మించి..
భోపాల్ : ఇటీవలి కాలంలో దేశంలో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మహిళలు, బాలికలు అనే బేధం లేకుండా కొందరు మృగాళ్లు వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో మరో నిర్భయ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న రైలులోనే ఓ వ్యక్తి యువతి (21)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు యశ్వంత్ పూర్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తుండగా ఓ యువతి రైలు ఎక్కింది. అయితే, సదరు యువతికి సీటు దొరక్కపోవడంతో ఓ వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి వంట చేసే గదిలో ఖాళీ స్థలం ఉందని నమ్మించాడు. ఆ తర్వాత బాధితురాలిని అతడు అక్కడికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమె నిద్రిస్తున్న సమయంలో సదరు వ్యక్తి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. (చదవండి: యూపీ పీఠానికి అదే దారి?) ఈ విషయం కాస్తా పోలీసులకు తెలియడంతో హుటాహుటిన వారు భోపాల్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. వంట చేసే బోగీ డోర్ తెరచి చూడగా బాధితురాలు అపస్మాకర స్థితిలో పడి ఉంది. దీంతో వారు ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్సలు అందించిన తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు పోలీసులకు జరిగిన విషయాన్ని వివరించింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న 15 మంది చిరు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. (చదవండి: భర్త వివాహేతర సంబంధం.. మహిళా డాక్టర్ ఏం చేసిందంటే..?) -
రైల్వే పట్టాలపై పడి ఉన్న బాలిక...వేగంగా వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురెళ్లిన వ్యక్తి....ఐతే
Bhopal man jumps under moving train to rescue girl: ఇంతవరకు మనం తమ ప్రాణాలకు తెగించి కాపాడిన ధైర్యవంతులు గురించి విని ఉన్నాం. నిజానికి ఎవరైన తమకు వీలైనంత పరిధిలో లేదా సాథ్యమైనంత మేర వరకు సాయం చేయగలరు. కానీ మృత్యువుకి ఎదురెళ్లి మరీ అవతల వ్యక్తికి సాయం చేయడం అంటే నిజంగా మాములు విషయం కాదు. పైగా ఆ వ్యక్తిని ప్రశంసించేందుకు మాటలు కూడా సరిపోవు. అచ్చం అలాంటి సంఘటన భోపాల్‌లో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని బర్ఖేడి ప్రాంతంలో మహ్మద్ మెహబూబ్ వృత్తిరీత్యా వడ్రంగి. అయితే మెహబూబ్ ఒక రోజు తన విధులు ముగించుకుని ఫ్యాక్టరీ నుంచి తన స్నేహితులతో కలిసి వస్తున్నాడు. ఇంతలో వెనుక వైపు నుంచి గూడ్స్ రైలు రావడంతో కాసేపు ఆగిపోయారు. అనుకోకుండా అదే సమయంలో తల్లిదండ్రులతో వస్తున్న ఒక బాలిక రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. అయితే ఆమె రక్షించే వ్యవధి లేదు పైగా రైలు వేగంగా వచ్చేస్తుంది. దీంతో అందరూ ఆందోళనగా చూస్తుండిపోవడమే ఏంచేయలేని సంకట పరిస్థితి. అక్కడే ఉన్న మెహబూబ్ తన ప్రాణాలను లక్ష్య పెట్టక మెరుపువేగంతో రైలుకి ఎదురెళ్లాడు. ఆ రైల్వే పట్టాలపై పడి ఉన్న బాలిక చేతిని పట్టుకుని ట్రాక్ మధ్యలో కదలకుండా ఇద్దరూ పడుకుని ఉండిపోయారు. అంతేకాదు ఆమె భద్రత నిమిత్తం తల పైకెత్తనీయకుండా కిందకి ఉంచేలా పట్టుకున్నాడు. ఇంతలో గూడ్స్‌రైలు వేగంగా వారి మీద నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత వారిద్దరూ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షింతంగా బయటపడ్డారు. ఈ మేరకు ఈ ఘటనకు సబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. Incredible bravery! 37 year old Mehboob was returning to his factory when he and some other pedestrians saw a goods train they stopped to let it pass a girl standing with her parents in fell on the tracks Mehboob sprinted dragged kept her head down @manishndtv @GargiRawat pic.twitter.com/IDqQiBLAv7 — Anurag Dwary (@Anurag_Dwary) February 12, 2022 -
Priyanka Nanda: గ్లామర్ ప్రపంచాన్ని వదిలి గ్రామానికి.. సర్పంచ్‌గా పోటీ!
Priyanka Nanda Contest In Panchayat Polls: మనలో మొలకెత్తిన ఒక ఆలోచన కొత్త మార్గాన్ని తెలుసుకునేదై ఉండాలి. ఆ ఆలోచనను ఆచరణలో పెడితే అది ఉత్తమమైన మార్గం వైపు సాగేలా ఉండాలి. ప్రియంకానంద ఆలోచన, ఆచరణ ఉన్నతి వైపుగా అడుగులు వేయించింది. గ్లామర్ ప్రపంచాన్ని వదిలి, తన గ్రామంలోని ఇరుకు రోడ్ల గతుకుల బతుకులను మార్చడానికి ప్రయాణమైంది. ఒరిస్సాలోని బలంగిర్ జిల్లాలోని ధులుసర్ గ్రామానికి చెందిన ప్రియంకానంద తన ఊళ్లో స్కూల్ చదువు పూర్తవగానే భోపాల్‌కి వెళ్లిపోయింది. అక్కడే పై చదువులు చదువుకుంది. కాలేజీ చదువులు పూర్తి చేసుకునే క్రమంలోనే గ్లామర్ ప్రపంచంవైపుగా అడుగులు వేసింది. ర్యాంప్ షోలలో పాల్గొంది. అందాల పోటీలలో టైటిల్స్ ఎన్నో గెలుచుకుంది. 2015 నుంచి మోడల్‌గా పనిచేస్తోంది. ఫస్ట్ ఇండియా రన్‌వే దివా బ్యూటీ పోటీలో పాల్గొని ఐదవస్థానంలో నిలిచింది. 2020లో ఇండియా స్టైల్ ఐకాన్ పోటీలో విజేతగా నిలిచింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకునే ప్రయత్నం చేసింది. లాక్డౌన్ సమయంలో తన ఊరు ధులుసర్ గ్రామానికి వచ్చిన ప్రియాంకానంద దృష్టి అక్కడ ప్రజల మీద పడింది. తన చిన్ననాటి రోజులకు ఇప్పటికీ ఏ మాత్రం మార్పు లేని ఊరి పరిస్థితులు ఆమెను ఆలోచనల్లో పడేలా చేశాయి. మోడలింగ్‌లో తనకు ఎన్నో అవకాశాలు రావచ్చు. సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకోవచ్చు. డబ్బు సంపాదించడంలో అన్ని రకాల అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లచ్చు. ‘కానీ, ఎంతవరకు..? నా ఊరు లాంటి ఎన్నో ఊళ్ల పరిస్థితులు మార్చాలంటే ఇక్కడే ఉండాలి. గ్రామాభ్యుదయానికి పాటుపడే పని చేయాలి’ అనుకుంది. ఆ అనుకోవడానికి ఇటీవల వచ్చిన అవకాశం గ్రామ సర్పంచ్ ఎన్నికలు. సర్పంచ్ పోటీలో బరిలో దిగి, వీధి వీధి తిరుగుతూ ‘మీ కోసం వచ్చాను. బాగు చేసే అవకాశం ఇవ్వండి’ అంటూ ఓట్లను అడుగుతోంది. గ్లామర్ ప్రపంచంలో బ్యూటీ గర్ల్ అని పిలిపించుకునే ప్రియంకానంద ఒక మంచి పని కోసం చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. యువత ఆలోచనలు దేశాభ్యున్నతి వైపుగా కదలాలి అంటూ అంతా ప్రశంసిస్తున్నారు. ప్రియాంకానంద గెలిచి తన ఆలోచనలు అమలులో పెట్టే అవకాశం రావాలని అంతా కోరుకుంటున్నారు. చదవండి: Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? -
వేద పండితులకు క్రికెట్ టోర్నమెంట్.. కామెంటరీ ఏ భాషలో అంటే!
మహర్షి మహేశ్ యోగి జయంతిని పురస్కరించుకుని మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో వేద పండితులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఆటగాళ్లకు ధోతీ కుర్తా డ్రెస్ కోడ్‌గా నిర్ణయించారు. సాధారణంగా క్రికెట్ కామెంటరీ ఇంగ్లీష్, హిందీ,తెలుగు భాషలో వింటూ ఉంటాం. కానీ ఈ టోర్నమెంట్లో సంస్కృత భాషలో కామెంటరీ చెప్పడం విశేషం. నాలుగు రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది. కాగా వైదిక కుటుంబాలలో క్రీడాస్ఫూర్తి, ప్రాచీన భాషని ప్రోత్సహించడమే ఈ టోర్నమెంట్ లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. విజేతలకు నగదు బహుమతులు, వేద పుస్తకాలు, 100 సంవత్సరాల పంచాంగాన్ని బహుకరించారు. కాగా, సంస్కృత బచావో మంచ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ తివారీ మాట్లాడుతూ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులు వేదాల ప్రకారం కర్మలు చేసే వారని పేర్కొన్నారు. ఇక ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: టీమిండియాకు మరో బిగ్ షాక్.. -
కోపంతో రెచ్చిపోయిన మహిళ.. రోడ్డుపై పండ్లు విసురుతూ.. వీడియో వైరల్
రోడ్డు పై వెళ్తున్నపుడు చిన్న చిన్న తప్పులు జరగడం సహజం. అయితే కొందరు మాత్రం చిన్న చిన్న వాటికి కూడా కోపంతో రెచ్చిపోతుంటారు. తాజాగా ఓ మహిళ రోడ్డుపై కోపంతో విచక్షణ లేకుండా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని చోటు చేసుకుంది. (చదవండి: వైరల్: దొంగతనానికి వచ్చి.. ఆకలేయడంతో వంటగదిలో కిచిడీ వండుతూ.. ) వివరాల్లోకి వెళితే.. తోపుడు బండపై పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగించే ఓ వ్యక్తి ఎప్పటిలానే తన బండిని రోడ్డు పై తోసుకుంటూ వెళ్తున్నాడు. ఆ దారిలో ఓ కారు పార్క్ చేసి ఉంది. పొరపాటున చిరు వ్యాపారి తోపుడు బండి ఆ కారుకు తగిలింది. ఈ విషయాన్ని గమనించిన ఆ కారు యజమాని అయన మహిళ విచక్షణ కోల్పోయి మరి అతని పట్ల కర్కశంగా ప్రవర్తించింది. కోపంతో ఊగిపోతు బండిపై ఉన్న పండ్లను రోడ్డుపై విసిరేసింది. అతను తప్పు జరిగింది క్షమించండి అంటూ వేడుకున్న ఏ మాత్రం కనికరం చూపలేదు. దారిన పోయే వాహనదారులు ఆమె అనూహ్య ప్రవర్తనను వీడియో తీస్తున్నా కూడా ఆగకుండా అలాగే చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారింది. Bhopal : After a slight touch of a car parked on the road, the woman in anger threw all the fruits of the fruit seller on the road. It is said that a professor of a private university in Bhopal, madam. The cartman kept pleading but madam did not listen.#Bhopal #MadhyaPradesh pic.twitter.com/cAFvPL7LRN — Mario David Antony Alapatt (@davidalapatt) January 11, 2022 -
తగ్గేదేలే... ఈసారి గర్వంగా మెలేశాడు
భోపాల్: తగ్గేదేలే... సస్పెండ్ చేసినా సరే బారు మీసం తీయనంటే తీయనని భీష్మించిన మధ్యప్రదేశ్ కానిస్టేబుల్ రాకేశ్ రాణా పంతమే నెగ్గింది. మీసం నా ఆత్మగౌరవానికి ప్రతీకన్న ఆయన సగర్వంగా మీసం తిప్పాడు. పోలీసు శాఖ రాణాపై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. మధ్యప్రదేశ్‌లో పోలీసు రవాణా విభాగంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాకేశ్ రాణాను మీసాలు, తలపై జుట్టును తగ్గించాలని.. అలా పెంచడం నిబంధనలకు విరుద్ధమని ఉన్నతాధికారులు హెచ్చరించినా.. అతను ఖాతరు చేయలేదు. దాంతో సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వార్తకు బాగా ప్రాచుర్యం లభించడంతో పోలీసు శాఖ యూటర్న్ తీసుకుంది. రాణాను సస్పెండ్ చేసే అధికారం లేకున్నా ఏఐజీ ప్రశాంత్ శర్మ... ఆ మేరకు ఆదేశాలు ఇచ్చారని, అందువల్ల రాకేశ్ రాణాను తిరిగి విధుల్లో చేర్చుకుంటున్నట్లు పోలీసు హెడ్‌క్వార్టర్స్ డీఐజీ (పర్సనల్) ఉత్తర్వులు జారీచేశారు. -
ఖతర్నాక్ కానిస్టేబుల్.. మీసాలపై తగ్గేదేలే... తీయనంటే తీయను, ఇంకేముంది!
భోపాల్: ఉద్యోగం ఊడినా బేఖాతర్.. మెలేయడానికి మీసాలుంటే చాలు.. ఇదీ భోపాల్‌కి చెందిన ఓ పోలీసు కానిస్టేబుల్ వైఖరి. పొడవుగా పెంచిన జుట్టు, మీసాలు తగ్గించనందుకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన రాకేశ్ రాణా అనే పోలీసు కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. క్రమశిక్షణా చర్యల కింద అతనిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. పోలీసుశాఖలోని రవాణా విభాగంలో డ్రైవర్‌గా ఉన్న రాణా ఎంతో మక్కువతో చాలా ఏళ్లుగా మీసాలు పెంచుతున్నాడు. అవి ఏకంగా మెడవరకు వచ్చేశాయి. పోలీసుశాఖలో పనిచేస్తున్నప్పుడు చూడడానికి హుందాగా ఉండాలంటూ సీనియర్లు రాణాని మీసాలు, జుట్టు తగ్గించాలని ఆదేశించారు. కానీ ఆ ఆదేశాలను రాణా ధిక్కరించాడు. ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే మీసం విషయంలో రాజీ పడలేనని తెగేసి చెప్పేశాడు. దీంతో రాణాని సస్పెండ్ చేసినట్టు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ప్రశాంత్ శర్మ చెప్పారు. అయినప్పటికీ రాణా తగ్గేదేలే అంటున్నాడు. తాను ఒక రాజ్‌పుత్‌నని మీసం మెలేయడమే తప్ప వాటిని తగ్గించడం చేతకాదని టీవీ ఛానెళ్లకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పాడు. -
చిన్నారిపై కుక్కలు మూకుమ్మడి దాడి.. నిజంగానే దేవుడిలా వచ్చాడు!
On CCTV 4 Year Old Girl Bitten: ఇటీవల కాలంలో కుక్కల దాడి చేసి పిల్లలను హతమార్చిన ఘటనలను ఎన్నో చూశాం. అంతెందుకు ఇటీవలే ఒక బాలుడిపై సుమారు 12 కుక్కలు దాడి చేస్తుండగా ఆ బాలుడిని కాపాడే ప్రయత్నంలో అడ్డుగా వెళ్లిన తల్లి పై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనలు గురించి విన్నాం. అచ్చం అలానే నాలుగేళ్ల బాలికపై కుక్కలు అత్యంత భయంకరంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. (చదవండి: ఫుడ్ కంటైనర్‌లో స్పై కెమెరా!) అసలు విషయంలోకెళ్లితే...మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఒక కూలి కూతురు అయిన నాలుగేళ్ల బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా ఐదు కుక్కలు ఆమెపై దాడి చేశాయి. పైగా ఆబాలిక తప్పించుకనే నిమిత్తం పరిగెట్టడానికి ప్రయత్నించినప్పటికి అవి చుట్టుముట్టి దాడి చేశాయి. ఈ క్రమంలో ఆ కుక్కలు తల, బొడ్డు, కాళ్లపై అత్యంత దారుణంగా కొరికాయి. అయితే ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఆ కుక్కలను తరిమి కొట్టడంతో ఆ బాలిక ప్రాణాలతో బయటపడింది. సదరు వ్యక్తి రాకపోయి ఉంటే ఆ చిన్నారి పరిస్థితి దారుణంగా ఉండేది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన భోపాల్‌లో బాగ్ సెవానియాలోని సీసీటీవీలో రికార్డు అవ్వడంతో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ భయనకమైన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి నిజంగా దేవుడిలా రావడంతోనే ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడిందనే విషయాన్ని ఒప్పుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: ఫుల్‌గా తాగి సెక్యూరిటీ గార్డ్‌తో గొడవపడిన మహిళ) Horrific! Stray dogs mauled a 4 year old girl in Bhopal a passerby threw stones at the dogs and chased them away. The child has been hospitalized with severe injuries. pic.twitter.com/X4EyruZxra — Anurag Dwary (@Anurag_Dwary) January 2, 2022 -
ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి రూ.15 లక్షలు డిమాండ్!
Kidnapped child in greed of 15 lakhs మధ్యప్రదేశ్: శివపురిలోని భావఖేడి గ్రామానికి చెందిన బాలుడిని కిడ్నాప్ చేసిన ముగ్గురు నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. రూ.15 లక్షల కోసం చిన్నారిని ఇద్దరు కిడ్నాప్ చేశారని, మూడో నేరస్థుడు గ్రామంలోనే ఉంటూ ప్రతి వార్తను నేరగాళ్లకు చేరవేస్తున్నాడని పోలీసులు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఎస్పీ రాజేష్ సింగ్ చందేల్ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుడు రామ్జీలాల్ యాదవ్ తన మేనల్లుడు నరేంద్ర యాదవ్ కుమారుడు హరిఓమ్ (6) డిసెంబర్ 25న మధ్యాహ్నం 3 గంటల నుండి కనిపించకుండా పోయాడని భావ్‌ఖేడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎంతవెతికినా జాడకనిపించలేదని, సాయంత్రం 4 గంటల 26 నిముషాలకు ఓ ఫోన్ కాల్ వచ్చిందన్నాడు. చిన్నారి తమ వద్దనే ఉన్నాడని, రూ. 15 లక్షలు సిద్ధం చేసుకోమని, ఏదైనా తెలివితేటలు ప్రదర్శిస్తే బిడ్డ దక్కడని చెప్పి కిడ్నాపర్లు కాల్ డిస్కనెక్ట్ చేసినట్లు తెలిపాడు. దీంతో వెంటనే పోలీసు బృందం రంగంలోకి దిగింది. భయాందోళనలకు గురైన నేరస్థులు చిన్నారిని గ్రామంలో రహదారిపై విడిచిపెట్టారు. అనంతరం పోలీసులు చిన్నారిని ప్రశ్నించగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పేరు చెప్పాడు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా 15 లక్షల రూపాయల డబ్బు కోసం రెండు నెలల క్రితమే ఇద్దరు స్నేహితులతో కలిసి చిన్నారి కిడ్నాప్‌కు ప్లాన్ చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. కాగా పోలీసులు ముగ్గురు నేరగాళ్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు మీడియాకు తెలిపారు. చదవండి: Warning: పెను ప్రమాదంలో మానవాళి! కిల్లర్ రోబోట్ల తయారీకి అగ్రదేశాల మొగ్గు.. -
ఐదేళ్లుగా ఈ హాస్పిటల్లో రోజూ 37 మంది శిశువుల మృతి.. అసలేం జరుగుతోందక్కడ?
Most unsafe hospital భోపాల్‌లోని హమీడియా హాస్పిటల్‌లోని స్పెషల్ నియోనాటల్ కేర్ యూనిట్ (ఎస్ఎన్సీయూ)లో గత ఐదేళ్లలో సగటున దాదాపు 37 మంది శిశువులు మృతిచెందారు. దేశంలోని మొత్తం శిశు మరణాలలో 13 శాతం మరణాలు ఈ హాస్పిటల్లోనే చోటుచేసుకుంటున్నాయి. ఎస్ఎన్సీయూ యూనిట్లో ఈ ఏడాది (2020- 21) దాదాపు 5,00,996 నవజాత శిశువులను చేర్చుకోగా, వారిలో 68,301 మంది మరణించారు. 2019-20 మధ్య 14,759 మంది శిశువులు మరణించారు. ఈ యూనిట్లో చేరిన చాలా మంది శిశువులు క్రిటికల్ కండీషన్లో ఉన్నారు. డిసెంబర్ 21న (మంగళవారం) రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభ్యుడు జితు పట్వారీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి ప్రభురామ్ చౌదరి ఈ డేటాను అందించారు. నెలలు నిండని శిశువులు కూడా హమీడియా ఆసుపత్రిలో చేరారని ఆరోగ్య మంత్రి తెలియజేశారు. ఐతే ఈ శిశువుల ఆరోగ్య భద్రతపై మంత్రి వ్యాఖ్యానించలేదు. అత్యంత ప్రమాదకర ఆసుపత్రి ఈ డేటాను పరిశీలిస్తే తెలుస్తోంది మధ్యప్రదేశ్‌లోనే హమీడియా హాస్పిటల్ అత్యంత ప్రమాదకర ఆసుపత్రి అని పట్వారీ పేర్కొన్నాడు. ఇది ఆందోళన కలిగించే విషయమని, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో ఆరోగ్య కార్యకర్తలు, ఇతర సిబ్బంది పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉందని పట్వారీ పేర్కొన్నారు. ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు. కాగా 2018 శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం అత్యధిక శిశు మరణాల రేటులో మధ్యప్రదేశ్ ముందంజలో ఉండటం గమనార్హం. ఇక్కడ ప్రతి వెయ్యి శిశుజననాలకుగాను 48 శిశుమరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలో భవనాలు కూలిపోవడం, ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాల వంటివాటివల్లకూడా వందలాది మంది శిశువులు మృతి చెందుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్‌లో భోపాల్‌లోని కమ్లా నెహ్రూ చిల్డ్రన్స్ హాస్పిటల్లో సంభవించిన అగ్నిప్రమాదంలో గాయపడిన 40 మంది నవజాత శిశువుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, తర్వాత 48 గంటల్లో మరో పది మంది మరణించారు. చదవండి: Jos Alukkas Jewellery Store: యూట్యూబ్‌లో చూసి రూ.10 కోట్ల విలువైన బంగారం దోపిడీ! -
పురుషుడిగా మారేందుకు మహిళా కానిస్టేబుల్‌కు అనుమతి
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళా కానిస్టేబుల్‌కు తీపి కబురు అందించింది. మహిళ విన్నపం మేరకు.. లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఆమెకు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చికిత్స జరుగుతుందని తెలిపారు. ఆమెకు.. చిన్న తనం నుంచి పురుషులలో ఉన్నట్లు కొన్ని లక్షణాలు, హర్మోన్లు ఉన్నట్లు ఆమె గుర్తించింది. దీంతో ఆమె.. 2019లో లింగమార్పిడి శస్త్ర చికిత్సకోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, గ్వాలియర్, ఢిల్లీలోని వైద్యుల సూచనమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కానిస్టేబుల్ తెలిపారు. దీనిపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు.‘లింగమార్పిడి అనేది వ్యక్తి హక్కు..’ అని అన్నారు. అందుకే మహిళా కానిస్టేబుల్‌కు అనుమతి తెలుపుతూ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సర్జరీకి ఆమె కుటుంబంవారు అంగీకరించలేదని తెలుస్తోంది. కానీ.. మహిళా లింగ మార్పిడి చేసుకోవడానికి మొగ్గుచూపుతుంది. దీనికోసం తాను.. దాచుకున్న డబ్బులతో సర్జరీ చేయించుకోవడానికి సిద్ధపడినట్లు కానిస్టెబుల్ తెలిపారు. కాగా, 2018లో మహరాష్ట్రకు చెందిన లలితా సాల్వె అనే మహిళా కానిస్టేబుల్ కూడా ఇదేవిధంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆమెకు సెయింట్ జార్జ్ ఆస్పత్రి వైద్యులు లింగమార్పిడి చికిత్సను నిర్వహించారు. -
Bhopal Mass Suicide: నా కుటుంబాన్ని తీవ్రంగా హింసించారు..వాళ్లని వదిలిపెట్టొద్దు!
మధ్యప్రదేశ్: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు అప్పుల వేధింపులు తట్టుకోలేక గత గురువారం విషంతాగి మూకుమ్మడి ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసందే. ఐతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చివరి వ్యక్తి కూడా సోమవారం ఉదయం మృతి చెందడంతో స్థానికంగా విషాదచాయలు అలముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని పిపలానీ ప్రాంతానికి చెందిన సంజీవ్ జోషి (47), అతని తల్లి నందిని (67), భార్య అర్చన (45), వారి సంతానం గ్రీష్మ (21), పూర్వి (16) కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని నవంబర్ 25 (గురువారం) రాత్రి సేవించారు. ఆటోమొబైల్ విడిభాగాల దుఖానం నడిపే జోషి వాట్సాప్ లైవ్ స్ట్రీమ్‌లో తమ మరణాలకు కారణమైనవారి పేర్లను తెలుపుతూ కుటుంబంగా విషంతీసుకోవడాన్ని వీడియో తీసి వాట్సప్‌లో పంపించాడు. సూసైడ్‌నోట్‌ను ఇంటి గోడపై అంటించారు కూడా. ఇద్దరు కుమార్తెలు వేర్వేరుగా సూసైట్ నోట్లను వాట్సప్‌లో పంపారు. సైంటిస్ట్ అవ్వడం తన కలని ఒకరు, ఫ్యాషన్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకున్నట్లు మరొకరు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తమ కలలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయని కూడా నోట్లో తెలిపారు. సమాచారం అందుకున్న బంధువులు, పోలీసులు వీరిని ఆసుపత్రికి తరలించగా.. వేర్వేరు సమయాల్లో కుటుంబం మొత్తం మృతి చెందారని ఒక పోలీస్ అధికారి స్థానిక మీడియాకు తెలియజేశారు. కాగా ఈ కేసు విచారణలో అప్పులిచ్చిన వారిలో నలుగురు మహిళలను అరెస్ట్ చేసినట్లు, మిగిలిన వారినికూడా అదుపులోకి తీసుకుంటామని ఏఎస్పీ రాజేష్ సింగ్ భదౌరియా మీడియాకు తెలిపారు. చదవండి: అదృష్టమంటే ఇది.. రూ.2250 కి కొంటే.. ఏకంగా 374 కోట్లపైనే!! -
దొంగతనం: 3 నెలలుగా ఒంటిపూట భోజనం.. 10 కేజీలు బరువు తగ్గి మరీ
గాంధీనగర్: ఆరోగ్యంగా, అందంగా ఉండాలని బరువు తగ్గే వారి గురించి చదివాం.. విన్నాం. కానీ దొంగతనం చేయడం కోసం బరువు తగ్గిన వ్యక్తి గురించి ఎప్పుడైనా విన్నారా.. లేదా.. అయితే ఇది చదవండి. గుజరాత్‌కు చెందిన మోతీ సింగ్ చౌహాన్ దొంగతనం చేయడం కోసం కఠినమైన డైట్ ఫాలో అయ్యి.. మూడు నెలల్లో 10 కేజీల బరువు తగ్గాడు. దొంగతనం అనంతరం పోలీసులకు చిక్కడంతో ఇతగాడి వెయిట్‌లాస్ జర్నీ బయటకు వచ్చింది. ఆ వివరాలు.. రెండేళ్ల క్రితం భోపాల్‌లోని బసంత్ బహార్ సొసైటీలో మోహిత్ మరాడియా అనే వ్యక్తి ఇంట్లో నిందితుడు మోతీ సింగ్(34) పనిచేసేవాడు. ఈ క్రమంలో మరాడియా ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కడ ఉంటాయి.. సీసీటీవీ కెమరాలు ఎక్కడ ఫిట్ చేశారు వంటి వివరాలన్ని మోతీ సింగ్‌కు పూర్తిగా తెలుసు. ఇంటి తలుపులు కూడా ఎలక్ట్రిక్‌వి కావడంతో వాటిని సాధారణ పద్దతుల్లో బ్రేక్ చేయడం కష్టమని అర్థం చేసుకున్నాడు మోతీ. (చదవండి: పట్టపగలే సినీ ఫక్కీలో ఘరానా మోసం) ఈ క్రమంలో కిటికీ గుండా ఇంట్లోకి ప్రవేశించాలని భావించిన మోతీ.. ఇందుకు తగ్గట్లు తన శరీరాన్ని మార్చుకున్నాడు. ఈ క్రమంలో బరువు తగ్గడం కోసం మూడు నెలలుగా ఒక్క పూట మాత్రమే ఆహారం తీసుకున్నాడు. ఎందుకిలా అని తోటి పనివారు ప్రశ్నిస్తే.. బరువు పెరుగుతున్నాను.. అందుకే డైటింగ్ చేస్తున్నాని చెప్పుకొచ్చాడు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం.. మరాడియా ఇంట్లో ఉన్న సీసీకెమరాలకు చిక్కకుండా మోతీ ఆ ఇంట్లో దొంగతనం చేశాడు. అనంతరం తాను దొంగిలించిన సొత్తును ఓ హార్డ్‌వేర్ షాపులో 37 లక్షల రూపాయలకు విక్రయించాడు. ఇక మోతీ చర్యలు షాప్ ఎదురుగా ఉన్న సీసీకెమరాలో రికార్డయ్యాయి. మరో విశేషం ఏంటంటే ఇదే హార్డ్‌వేర్ షాపులో మోతీ దొంగతనానకి ముందు రంపం, తాపీని కొనుగోలు చేశాడు. వీటి సాయంతో మరాడియా ఇంటి వంటగది కిటికీని కత్తిరించి లోపలికి ప్రవేశించి తన పని కానిచ్చాడు. (చదవండి: హ్యాండ్సప్ అని గన్ గురిపెట్టాడో లేదో.. వాటే రియాక్షన్!) అప్పటికే మరాడియా ఇంటి సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడి కోసం గాలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో హార్డ్‌వేర్ షాప్ బయట ఉన్న సీసీటీవీ కెమరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా అతడిని అరెస్ట్ చేశారు. మోతీ నవంబర్ 5న మరాడియా ఇంట్లో 37 లక్షల రూపాయలకు చోరీకి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మోతీని అరెస్ట్ చేసే సమయంలో అతడి వద్ద ఉన్న ఇతర విలువైన వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కూడా దొంగిలించిన సొత్తే అని పోలీసులు తెలిపారు. మోతీ సెల్ ఫోన్ లొకేషన్ పోలీసులకు అతడి గురించి సమాచారం ఇచ్చింది. చివరకు మోతీ తన స్వస్థలమైన ఉదయపూర్‌కు పారిపోతుండగా ఎస్పీ రింగ్ రోడ్ వద్ద పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మోతీ వద్ద నుంచి చోరీకి గురైన నగదు, విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: తమ గుట్టు రట్టు కాకుండా ఉండేందుకు.. మహిళ ప్రాణం తీసి! -
ఎవరీ రాణి కమలాపతి.. ఈమె పేరును ఆ రైల్వేస్టేషన్‌కు ఎందుకు పెట్టారు..?
నవంబర్ 15 ‘ఆదివాసీ గౌరవ దినోత్సవం’ సందర్భంగా భోపాల్‌లోని ప్రసిద్ధ హబిబ్‌గంజ్ రైల్వేస్టేషన్‌ను ‘రాణి కమలాపతి స్టేషన్’గా పేరు మార్చారు. దాంతో రాణి కమలాపతి ఎవరు అని దేశంలో చాలా మంది ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అపూర్వ సౌందర్యవతి అయిన గోండు రాణిగా రాణి కమలాపతి చరిత్రలో నిలిచి ఉంది. రాణి కమలాపతి రైల్వేస్టేషన్ భోపాల్ వెళితే రాణి కమలాపతి గురించి అనేక కథలు వినిపిస్తాయి. భోపాల్‌లో భిల్లుల తర్వాత గోండులే అత్యధిక గిరిజన జనాభా. దేశంలో గోండులు దాదాపు కోటీ ఇరవై లక్షల మంది ఉన్నారని అంచనా. వారి సంస్కృతి, వారి కథా నాయకులు, వారిలో జన్మించిన ధీర వనితలు ఇన్నాళ్లు అడపా దడపా మాత్రమే వెలుగులోకి వస్తున్నా ఇటీవల కాలంలో రాజకీయ కారణాల రీత్యా కూడా కొన్ని పేర్లు బయటకు రావాల్సి వస్తోంది. అలా రాణి కమలాపతి ఇప్పుడు దేశానికి çకుతూహలం కలిగిస్తోంది. దానికి కారణం మొన్నటి ‘ఆదివాసీ గౌరవ దినోత్సవం’ సందర్భంగా భోపాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అక్కడి హబిబ్‌గంజ్ రైల్వేస్టేషన్‌కు ‘రాణి కమలాపతి’ పేరును పెట్టడమే. ఇంతకీ ఎవరీమె? ముద్దుల భార్య 18వ శతాబ్దంలో భోపాల్ ప్రాంతం గోండు రాజ్యం. నిజాం షా అనే గోండు రాజు సెహోర్ జిల్లాలోని గిన్నోర్ ఘర్ కోట నుంచి ఆ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. అతనికి 7 గురు భార్యలని కాదు ముగ్గురు భార్యలని కథనాలు ఉన్నాయి. వారిలో ఒక భార్య రాణి కమలాపతి. కమలావతికి అపభ్రంశం ఈ పేరు. కమలాపతి అపూర్వ సౌందర్యరాశి. ఆమె సౌందర్యానికి ఆరాధకుడైన నిజాం షా ఆమె కోసం భోపాల్‌లో ఒక 7 అంతస్తుల కోట కట్టించాడని ఒక కథనం. ఆ కోట ఇప్పుడు భోపాల్‌లో ఉంది. 5 అంతస్తులు నీట మునిగి రెండు పైకి కనిపిస్తూ ఉంటాయని అంటారు. ఇంకా విశేషం ఏమిటంటే ఈ కోటలో ఇంకా కమలాపతి ఆత్మ తిరుగాడుతుందని విశ్వసిస్తారు. భర్త చావుకు బదులు గోండు రాజ్యం మీద, కమలాపతి మీద కన్నేసిన మరిది వరసయ్యే చైన్ సింగ్ అనే వ్యక్తి నిజాం షాకు విషం పెట్టి చంపుతాడు. అతడు తనను లోబరుచుకుంటాడని భావించిన కమలాపతి పసిబిడ్డైన తన కుమారుడు నావెల్ షాను తీసుకొని మారు పేరుతో కోటను విడిచి దేశం పట్టింది. కొన్నాళ్లకు ఆమె గోండులకు విశ్వాస పాత్రుడైన యుద్ధవీరుడు మహమ్మద్ ఖాన్‌ను కలిసింది. తన భర్త హంతకుడైన చైన్ సింగ్‌ను చంపమని ఆమె కోరిందని, అందుకు వెయ్యి రూపాయల సుపారీ ఇచ్చిందని ఒక కథనం. ఆ సుపారీ ధనంలో కూడా ఒక వంతే చెల్లించి మిగిలిన దానికి భోపాల్‌లోని కొంత భాగం ఇవ్వజూపిందని అంటారు. మరో కథనంలో ఆమెకు సంబంధం లేకుండానే ఆమె బాధను చూసి మహమ్మద్ ఖానే స్వయంగా గిన్నోర్‌ఘర్ కోట మీద దాడి చేసి చైన్ సింగ్‌ను హతమారుస్తాడు. అంతే కాదు, తానే ఇప్పుడు భోపాల్‌లో ఉన్న కమలాపతి మహల్‌ను కట్టించి కమలాపతికి ఇచ్చాడు. కథ మలుపు ఇక్కడి నుంచే కథ మలుపు తిరిగింది. మహమ్మద్ ఖాన్ కమలాపతిని సొంతం చేసుకోవాలని ఆశించాడు. ఈ సంగతి తెలిసిన కమలాపతి కుమారుడు 14 ఏళ్ల నావల్ షా ఆగ్రహంతో మహమ్మద్ ఖాన్ మీద యుద్ధానికి దిగుతాడు. ‘లాల్‌ఘాటీ’ అనే ప్రాంతంలో జరిగిన ఆ యుద్ధంలో మరణిస్తాడు. కమలాపతి వర్గీయులు ఆ వెంటనే లాల్‌ఘాటీ నుంచి నల్లటి పొగను వదులుతారు (గెలిస్తే తెల్ల పొగ). మహల్ నుంచి ఆ పొగను చూసిన కమలాపతి తాము అపజయం పొందినట్టు గ్రహించి మహల్ ఒడ్డున ఉన్న సరస్సు గట్టును తెగ్గొట్టించింది. నీళ్లు మహల్‌ను ముంచెత్తాయి. కమలాపతి తన నగలు సర్వస్వం నదిలో వేసి జల సమాధి అయ్యింది. 1722లో ఆమె మరణం తర్వాత అక్కడి గోండు రాజ్యం అంతరించింది. గోండు రాణి కమలాపతి జీవితం సాహసంతో, ఆత్మాభిమానంతో, ఆత్మబలిదానంతో నిండినది. అందుకనే ఆమెను మధ్యప్రదేశ్‌లోనూ గోండులు అధికంగా ఉన్న రాష్ట్రాలలో అభిమానంగా తలుస్తారు. ఇప్పుడు ఆమె పేరు ఒక పెద్ద రైల్వే స్టేషన్‌కు పెట్టడం భావితరాలకు ఆమె స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది. -
గిరిజన కష్టాలకు కాంగ్రెస్సే కారణం
భోపాల్: కాంగ్రెస్ హయాంలో గిరిజనుల సంక్షేమం మరుగునపడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. గత పాలకుల వల్ల ఇప్పటికీ వెనుకబాటుకు గురైన ప్రాంతాల అభివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. గత ప్రభుత్వాల వీఐపీ సంస్కృతి నుంచి ఈపీఐ(ప్రతి వ్యక్తీ ముఖ్యుడే) సాధన దిశగా దేశం ప్రస్తుతం పరివర్తన చెందుతోందని ప్రధాని అన్నారు. సోమవారం ఆయన భోపాల్‌లో జన్‌జాతీయ గౌరవ్ దివస్ మహాసమ్మేళన్‌లో మాట్లాడారు. అనంతరం ప్రధాని ఆధునీకరించిన రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. గోండ్ రాణి దుర్గావతి ధైర్యసాహసాలు, రాణి కమలాపతి త్యాగాలను దేశం ఎన్నటికీ మరువదన్నారు. ‘గత ప్రభుత్వాల్లో గిరిజనులకు సముచిత స్థానం దక్కలేదు. కనీస సౌకర్యాలకు కూడా నోచుకోలేదు. అంబేద్కర్ జయంతి, గాంధీ జయంతి, వీర్‌సావర్కర్ జయంతిల మాదిరిగానే భగవాన్ బిర్సాముండా జయంతిని ఏటా నవంబర్ 15న నిర్వహిస్తాం’అని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్న 50 ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈపీఐ దిశగా పరివర్తన: గత ప్రభుత్వాల వీఐపీ సంస్కృతి నుంచి ఈపీఐ(ప్రతి వ్యక్తీ ముఖ్యుడే) సాధన దిశగా దేశం ప్రస్తుతం పరివర్తన చెందుతోందని ప్రధాని చెప్పారు.‘వీఐపీ సంస్కృతి నుంచి ఈపీఐ(ప్రతి ఒకరూ ముఖ్యులే) అన్న ఆదర్శం దిశగా దేశం పరివర్తన చెందుతోందనడానికి ఇదే ఉదాహరణ. దేశవ్యాప్తంగా 175 రైల్వే స్టేషన్లలో ఇటువంటి అత్యాధునిక వసతులను సమకూరుస్తాం’అని చెప్పారు గత ప్రభుత్వాల హయాంలో రైల్వే ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు 40–50 ఏళ్లు పట్టేంది. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1,100 కిలోమీటర్ల ఈస్టర్న్, వెస్టర్న్ ఫ్రెయిట్ కారిడార్ల పనులు ఏడేళ్లలోపే పూర్తయిందన్నారు. -
ఐసీయూలో అగ్ని ప్రమాదం.. నలుగురు చిన్నారులు సజీవ దహనం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని చిన్నారులు అగ్నికి ఆహుతి అయ్యారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఉన్న కమలా నెహ్రూ ఆస్పత్రిలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. పీడియాట్రిక్స్ ఐసీయూ వార్డులో మంటలు చెలరేగి ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటన చోటు చేసుకున్న సమయంలో వార్డులో 40 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. 36 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని 25 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. మధ్యప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. (చదవండి: అతడు అడవిని ప్రేమించాడు! ఎందుకీ తారతమ్యం..) ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ‘‘కమలా నెహ్రూ ఆస్పత్రిలో చోటు చేసుకున్న సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాను. ఏసీఎస్ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ మహ్మద్ సులేమాన్ పర్యవేక్షణలో ఈ విచారణ జరుగుతుంది’’ అన్నారు. (చదవండి: ‘జోకర్’ బీభత్సం: రైల్లో మంటలు.. 10 మందికి గాయాలు) ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చామని.. అయితే అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన కొందరు చిన్నారులను రక్షించలేకపోయామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మూడో అంతస్తులోని ఐసీయూలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. చదవండి: రూ.90 కోట్ల విలువైన మద్యం దగ్ధం -
భార్య వివాహేతర సంబంధం.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య.. 12 గంటల్లోనే
వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. కట్టుకున్న భార్య వివాహేతర సంబంధాన్ని తట్టుకోలేని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త చనిపోయిన వార్త తెలిసిన 12 గంటల్లోనే భార్య సైతం బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రుల ఆత్మహత్యతో నాలుగేళ్ల బిడ్డ అనాథగా మారిపోయింది. ఈ ఘోర ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. భోపాల్‌లోని టీటీ నగర్‌కు చెందిన 25 ఏళ్ల గొల్లు బలన్ అనే వ్యక్తికి 22 ఏళ్ల సుధతో మహిళతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. చదవండి: ‘నేను ఐపీఎస్ అధికారిని.. తొలిచూపులోనే నచ్చావ్.. పెళ్లి చేసుకుందాం’ అయితే ఇటీవల మహిళకు మరో వ్యక్తి సాగర్‌బాబాతో అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. భార్య, సాగర్ల మధ్య స్నేహం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యభర్తలిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో వివామిత తన తల్లిగారింటికి వెళ్లింది. అయితే ఈ గొడవను పరిష్కరించుకునేందుకు భర్త ఎంత ప్రయత్నించినా సర్ధుమనగలేదు. దీంతో భర్త ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త చనిపోయిన విషయం తెలియగానే భార్య సైతం పెట్రోల్ పోసుకొని నిప్పటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఇంట్లో దొరికిన సుసైడ్ నోట్, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సాగర్‌పై కేసు నమోదైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: తప్పతాగి వేరే వాళ్ల ఇంటికి వెళ్లి గొడవ.. మాజీ ఎంపీని చితకబాదిన ఓనర్ -
అతడు అడవిని ప్రేమించాడు! ఎందుకీ తారతమ్యం..
వాషింగ్టన్ డీసిలోని నేచరల్ హిస్టరీ మ్యూజియం గురించి తరగతిగదిలో ఎన్నోసార్లు విని ఉన్నాడు సుయాస్. అక్కడ మొక్కల నుంచి జంతువుల వరకు, శిలల నుంచి శిలాజాల వరకు ఎన్నో కళ్లకు కడతాయి. మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకువెళతాయి. అలాంటి మ్యూజియంను జీవితంలో ఒక్కసారైనా చూడాలనేది సుయాస్ కల. చిత్రమేమిటంటే...పదిహేడేళ్ల వయసులో సుయాస్ తీసిన ఆరు మాసాల పులిపిల్ల ఫొటోను ఆ మ్యూజియంలో సంవత్సరం పాటు ప్రదర్శించారు. ఈ ఫొటో నేచర్స్ విభాగంలో బెస్ట్ ఫొటోగ్రఫీ ఏషియా అవార్డ్ అందుకుంది. ఎంత సంతోషం! భోపాల్(మధ్యప్రదేశ్)కు చెందిన సుయాస్ కేసరికి చిన్నప్పటి నుంచి వైల్డ్‌లైఫ్‌పై అంతులేని ఆసక్తి ఉండేది. తాను విన్న మృగరాజు, పులి, కుందేలు, నక్క...మొదలైన కథలు జంతుజాలంపై తనకు ఆసక్తిని కలిగించాయి. తన వయసు పిల్లలు టామ్ అండ్ జెర్రీలాంటి కార్టూన్ సీరియల్స్ చూస్తుంటే తాను మాత్రం జంతుజాలం, పర్యావరణానికి సంబంధించిన చానల్స్ చూసేవాడు. తాను చూసిన విశేషాలను స్నేహితులతో పంచుకునేవాడు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోనే కాకుండా వేసవి సెలవులకు కోల్‌కతాకు వెళ్లినప్పుడు...బెంగాల్‌లోని జూపార్క్లను చూసేవాడు. చదవండి: Health Tips: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా.. తన బాల్యంలో ఒకసారి... ఒక జూలో కటకటాల వెనకాల ఉన్న పులులను చూసి సంతోషంతో చప్పట్లు కొట్టాడు. ‘నువ్వు సంతోషంగా ఉన్నావు కాని అవి సంతోషంగా లేవు’ అన్నది అమ్మమ్మ. ‘ఎందుకు?’ అని ఆశ్చర్యంగా అడిగాడు సుయాస్. ‘వాటి నివాసస్థలం అడవులు. అక్కడే అవి సంతోషంగా, స్వేచ్ఛగా ఉండగలవు. జూ వాటికి జైలు మాత్రమే’ అని చెప్పింది అమ్మమ్మ. ఇక అప్పటి నుంచి అడవుల్లో జంతుజాలానికి సంబంధించిన జీవనశైలిని తెలుసుకోవాలనే ఆసక్తి అంతకంతకూ పెరిగింది. చిన్నప్పటి ఆసక్తులు వేరు పెదయ్యాక కెరీర్ గురించి ఆలోచనల వేరు. చాలా సందర్భాల్లో చిన్నప్పటి ఆసక్తి బాల్యంలోనే ఆగిపోతుంది. అయితే సుయాస్ విషయంలో అలా జరగలేదు. కాలేజీ రోజుల్లో, అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కూడా తన ఆసక్తి తనను విడిచి పెట్టలేదు. అందుకే యూఎస్‌లో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి అడవులను వెదుక్కుంటూ ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇక్కడ... అడవులు ఎన్నో తిరుగుతూ కన్జర్వేటర్లు, ఫారేస్ట్ రేంజ్ ఆఫీసర్లతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. అడవులన్నీ తిరుగుతున్న క్రమంలో తనకొక విషయం అర్థమైంది. మనుషులు అడవులకు వస్తున్నారు, జంతుజాలం మనుషులను చూస్తుంది...కాని ఇద్దరికీ మధ్య ఎక్కడో గ్యాప్ ఉన్నట్లు అనిపించింది. జంగిల్ పర్యటన వినోదానికి మాత్రమే పరిమితమైపోతుంది. అలా కాకుండా అడవిలో ప్రతి జీవి గురించి మనసుతో తెలుసుకోవాలి. అవి మనలో ఒకటి అనుకోవాలి.... ఇలా ఆలోచిస్తూ, తన ఆలోచనకు వేదికగా సోషల్ మీడియాను ఎంచుకున్నాడు. రకరకాల జంతువుల గురించి చిన్న చిన్న మాటలతోనే లోతైన పరిచయం చేయడం మొదలుపెట్టాడు. ఊహించని స్థాయిలో ఫాలోవర్స్! అందులో యూత్ ఎక్కువ. చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. అందుకే ‘20 సంవత్సరాల వ్యక్తి దృష్టికోణంలో ‘అడవి’ అనే టాపిక్‌ను తీసుకొని ఫిల్మ్సిరీస్ చేశాడు. మంచి స్పందన వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ ఫర్ నేచర్) స్వచ్ఛంద సంస్థ చేయూత ఇచ్చింది. తమ పంటలను ధ్వంసం చేస్తున్నాయి అనే కారణంతో ఛత్తీస్‌గఢ్ నుంచి మధ్యప్రదేశ్‌కు వస్తున్న 18 అడవి ఏనుగులపై దాడి చేయడానికి కొందరు రైతులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న సమయంలో వారి నుంచి ఏనుగులను రక్షించడమే కాదు, వారి పంటలు దెబ్బతినకుండా తన బృందాలతో కలిసి కంచెలు ఏర్పాటు చేశాడు సుయాస్. జంతుజాలం సంక్షేమం గురించి అడవంత విశాలమైన పనులు చేయాలనేది సుయాస్ కల. అందులో ఒకటి వైల్డ్‌లైఫ్ గురించి సొంతంగా వోటీటీ ప్లాట్‌ఫామ్ మొదలుపెట్టాలని! విజయోస్తు సుయాస్. చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..! -
డెయిరీ ముసుగులో వ్యభిచారం.. ఇంట్లోనే దందా
భోపాల్: మధ్యప్రదేశ్‌లో భారీ సెక్స్ రాకెట్ దందా బయటపడింది. గ్వాలియర్‌లోని మురార్ ప్రాంతంలోని జాడేరు డామ్ సమీపంలో ఉన్న ప్రీతమ్ మనోహర్ అనే వ్యక్తి ఇంట్లో.. వ్యభిచారం జరుగుందనే సమాచారంతో పోలీసులు నిన్నరాత్రి (గురువారం) దాడులు చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు మహిళలతో పాటు 10 మంది పురుషులను పోలీసులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, ప్రీతమ్ మనోహర్ ఇంట్లో పాల వ్యాపారం ముసుగులో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజు చాలా మంది వారి ఇంటికి వస్తుండటంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. రెండెళ్లుగా ఈ రాకెట్ నడుస్తోందని తెలిపారు. ఇంటి యజమాని భార్య.. విటుల నుంచి భారీగా నగదు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విటులను, మహిళలను పోలీస్‌స్టేషన్‌కు తరలించామని మురార్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ శైలేంద్ర భార్గవ్ తెలిపారు. చదవండి: ముగ్గురు స్నేహితురాళ్ల ఆత్మహత్య? -
Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్.. ఛీ! డ్రైనేజీ వాటర్‌తోనా..
అటెన్షన్... మీ ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో ఉంది. డ్రైనేజీ వాటర్‌లో కడిగిన కూరగాయలు మీ వంటింటికి చేరుతున్నాయి. దయచేసి కూరగాయను కొనేముందు ఓ క్షణం ఆలోచించండి.. మరింత అవగాహన పెంచుకోండి.. అనే క్యాప్షన్‌తో ట్విటర్లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. చూశారంటే యాక్.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కి చెందిన ఓ గుర్తుతెలియని కూరగాయల వ్యాపారిపై కేసు ఫైల్ అయ్యింది. ఏం చేశాడో తెలెస్తే మీకు స్పృహ తప్పుతుంది. పొద్దుపొద్దునే తాజా కొత్తమీర కట్టల్ని సింథికాలనీ రోడ్డుపై లీకైపారుతున్న డ్రైనేజీ వాటర్‌లో కడిగాడు మరి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైనేజీ నీళ్లతో కడిగితే ఆరోగ్యానికి ప్రమాదమని వీడియో తీసిన వ్యక్తి పదేపదే చెబుతున్నా సదరు వ్యాపారి మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయాడట. చదవండి: True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ! దీంతో జిల్లా కలెక్టర్ అవినాష్ లవనియా... ఈ కల్తీ, కలుషిత ఆహార సమాచార సంఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆహార శాఖ, పౌర అధికారులకు ఆదేశించినట్లు మీడియాకు వెల్లడించారు. అంతేకాకుండా భోపాల్ జిల్లా ఆహార భద్రత అధికారి దేవేంద్ర కుమార్ దుబే ఐపీసీ సెక్షన్ 269 కింద సరదు గుర్తుతెలియని వ్యాపారిపై కేసు ఫైల్ చేశామని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెల్పారు. కాబట్టి.. కూరగాయల వ్యాపారుల దగ్గర కూరగాయాలు కొనే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించిమరీ కొంటే మంచిది. ఏం తింటున్నామో.. ఎలాంటి ఆహారం కొంటున్నామో.. తెలసుకోకపోతే బతుకు డ్రైనేజి పాలౌతుంది! చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. सावाधान देखिए आपकी सेहत से कैसे हो रहा खिलवाड़, कंही पर ऐसी सब्जी तो नही खरीद रहे ,भोपाल के सिंधी कॉलोनी में नाली के पानी से धुक रही सब्जी @bhupendrasingho जी @CollectorBhopal @digpolicebhopal मामले पर संज्ञान लेकर उचित कार्यवाही का आग्रह है , @KamalPatelBJP @DrPRChoudhary pic.twitter.com/10Em39YxPz — sudhirdandotiya (@sudhirdandotiya) October 26, 2021 -
వైరల్: భర్త మరో మహిళతో జిమ్‌లో.. చెప్పులతో చితకబాదిన భార్య
తన భర్త మరో మహిళతో జిమ్‌లో ఉండగా భార్య రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుంది. సదరు మహిళతో భర్త ఎఫైర్ కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో భార్య ఆమెను చితకబాదింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అక్టోబర్ 15న జరిగిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాలు.. భోపాల్‌లోని కోహో ఇ ఫిజా ప్రాంతంలో నివసిస్తున్న మహిళ తన భర్త మరొకరితో సంబంధం పెట్టుకున్నాడని అనుమానం పెంచుకుంది. అప్పటి నుంచి భర్త కదలికలపై ఓ కన్నేసి పెట్టింది. ఇదే క్రమంలో తన సోదరితో కలిసి జిమ్‌కు వెళ్లింది. చదవండి: వైరల్: పెళ్లిలో వధువు సర్ప్రైజ్ డ్యాన్స్.. ఎమోషనల్ అయిన వరుడు అదే జిమ్‌లో భర్త తన గర్ల్‌ఫ్రెండ్‌గా అనుమానిస్తున్న మరో మహిళతో వర్కౌట్స్ చేస్తూ కనిపించింది. దీంతో తన భర్త ఆమెతో రిలేషన్లో ఉన్నాడని భావించి మహిళను చెప్పులతో కొట్టడం ప్రారంభించింది. అంతటితో ఆగకుండా ఆవేశంతో ఊగిపోయి జుట్టు పట్టుకొని లాగేసింది. మధ్యలో జోక్యం చేసుకోవడానికి వచ్చిన భర్తపై సైతం విరుచుకుపడింది. ఈ గొడవను అక్కడున్న వారు ఆపడానికి ప్రయత్నించినా వీలు పడలేదు. దాదాపు పది నిమిషాలపాటు జిమ్‌లో రచ్చ రచ్చ చేశారు. అనంతరం మహిళ, ఆమె భర్త ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోగా భోపాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే భార్య ఆరోపణలను భర్త ఖండించాడు. గర్ల్‌ఫ్రెండ్ అని చెబుతున్న అమ్మాయి అసలు ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. చదవండి: ‘వ్యాక్సిన్ వద్దంటే వద్దు.. వెళ్లకపోతే పాముతో కరిపిస్తా’ -
రివర్స్ తీస్తుండగా.. ఒక్కసారిగా జనంపైకి దూసుకెళ్లిన కారు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దసరా వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. దుర్గామాత విగ్రహాల నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో ఓ కారు జనాలపైకి దూసుకేళ్లింది. ఈ ఘటన శనివారం భోపాల్‌లోని బజారియా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు కారకుడైన కారు డ్రైవర్‌ను పట్టుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. కారును రివర్స్ తీసే క్రమంలో వేగం అదుపు తప్పి జనంపైకి దూసికేళ్లింది. ఈ ఘటనలో గాయపడిన ఓ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై భోపాల్ డీఐజీ ఇర్షాద్ వలీ మాట్లాడుతూ.. కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశామని తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #WATCH Two people were injured after a car rammed into people during Durga idol immersion procession in Bhopal's Bajaria police station area yesterday. Police said the car driver will be nabbed.#MadhyaPradesh pic.twitter.com/rEOBSbrkGW — ANI (@ANI) October 17, 2021 -
Viral: కబడ్డీ ఆడిన బీజేపీ మహిళా ఎంపీ
భోపాల్: తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచే భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ సరదాగా కబడ్డీ ఆడారు. ఆమె కబడ్డీ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుధవారం ఆమె భోపాల్‌లోని ఓ కాళీ దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె యువతుల కబడ్డీ పోటీల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీని మహిళా క్రీడాకారులు కబడ్డీ ఆడాల్సిందిగా కోరారు. దీంతో ఆమె కొర్టులోకి అడుగుపెట్టి కబడ్డీ ఆడారు. ప్రస్తుతం ఆమె వైద్య పరీక్షల నిమిత్తం బెయిల్‌పై బయటకు వచ్చారు. 2008 సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని మాలేగావ్ ప్రాంతంలో చోటు చేసుకున్న పేలుళ్లలో ఎంపీ సాధ్వి నిందితురాలు ఉన్న విషయం తెలిసిందే. कल गरबा आज भोपाल सांसद @SadhviPragya_MP आज मां काली के दर्शन के लिए पहुंचीं,वहां ग्राउंड में मौजूद खिलाड़ियों के अनुरोध पर महिला खिलाड़ियों के साथ कबड्डी खेली।😊 pic.twitter.com/X1wWOg55aW — Anurag Dwary (@Anurag_Dwary) October 13, 2021 -
Colored Rims: నెస్టింగ్ డాల్స్..బెంగళూరు టు చంఢీగఢ్!
ఒకప్పుడు చదువులు పూర్తయ్యాక గానీ ఉద్యోగాన్వేషణ మొదలయ్యేది కాదు. ఇప్పుడా పరిస్థితులు లేవు. వేగంగా పెరిగిపోతున్న టెక్నాలజీని ఒడిసి పట్టుకుని ఆసక్తి ఉన్న రంగాల్లో ఉద్యోగాలు సాధిస్తుంటే, మరికొందరు నైపుణ్యాలను ఔపోసన పట్టి ఏకంగా స్టార్టప్‌లతో దూసుకుపోతున్నారు. వాళ్లు నిలదొక్కుకోవడమేగాక, మరికొంతమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మన్‌ప్రీత్ సింగ్, శ్రేయా గుప్తా, శృతి చౌహాన్లు ఈ బాటలోనే నడుస్తూ ఎంతోమంది యువతకు ప్రేరణగా నిలుస్తున్నారు. మన్‌ప్రీత్ సింగ్, శ్రేయా గుప్తా, శృతి చౌహాన్లు భోపాల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాజీ తొలి బ్యాచ్ విద్యార్థులు. డిగ్రీ నుంచి మంచి స్నేహంగా మెలిగిన ఈ ముగ్గురు తరువాత ఫ్యాషన్ మేనేజ్ మెంట్లో మాస్టర్స్ పూర్తిచేశారు. మాస్టర్స్ చేసే సమయంలో ‘ముగ్గురం కలిసి కొత్తగా ఏదైనా చేద్దాం. ఉద్యోగాలు కాకుండా మనమే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభిద్దాం’ అనుకున్నారు. 2015లో మాస్టర్స్ అయ్యాక ముగ్గురూ మూడు రంగాలను ఎంచుకుని వారి ఉద్యోగాల్లో బిజీ అయిపోయినా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కష్టసుఖాలు పంచుకోవడం మానలేదు వారు. ఈ క్రమంలోనే ఒకరోజు శృతి.. ‘‘హ్యాండ్ మేడ్ మార్కెట్ బావుంది. దీనిలో ఏదైనా కొత్తగా చేద్దాం’’ అని ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదనే నేడు ఈ ముగ్గురు స్నేహితుల స్టార్టప్‌కు పునాది. కలర్డ్ రిమ్స్ కాలేజీ రోజుల నుంచి బాటిల్ క్యాప్స్ మీద వివిధ రకాల పెయింటింగ్‌లు వేసి ఆకట్టుకునే శృతి ప్రతిపాదన అందరికి నచ్చింది. దీంతో వినూత్నమైన హ్యాండ్ మేడ్ పెయింటింగ్‌ను కలర్పుల్గా తీసుకువస్తే బావుంటుందని భావించారు. ఈ క్రమంలోనే 2016 బెంగళూరులో ‘కలర్డ్ రిమ్స్’ పేరిట స్టార్టప్‌ను ప్రారంభించి నెస్టింగ్ డాల్స్‌ను తయారు చేసి విక్రయిస్తున్నారు. నెస్టింగ్ డాల్స్ సెట్లో మొత్తం ఆరు బొమ్మలు ఉంటాయి. 17 సెంటీమీటర్ల నుంచి 4.5 సెంటీమీటర్ల మధ్య పరిమాణంలో ఈ డాల్స్ ఉంటాయి. బొమ్మల సైజుతోపాటు బొమ్మల మీద ఉన్న ఆకారాలు మారడం ఈ బొమ్మల ప్రత్యేకత. కలర్డ్ రిమ్స్ టీమ్ వారణాసి, చెన్నైలలో దొరికే బీచ్ ఉడ్‌తో బొమ్మలను తయారు చేస్తున్నారు. కర్రను సిలిండర్ ఆకారంలోకి మార్చడమే ఈ డాల్స్ తయారీలో ముఖ్యమైన... కష్టమైన పని. బొమ్మ ఆకారం తయారయ్యాక దానిమీద వివిధ రకాల పెయింటింగ్స్‌తో అందంగా తీర్చిదిద్దుతారు. పెయింటింగ్స్‌లో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, పాతకాలపు బొమ్మల ప్రతిరూపాలు ఉండేలా పెయింట్ చేస్తారు. కస్టమర్లు ఈ బొమ్మలను ఎవరికైనా బహుమతిగా ఇవ్వాలనుకున్నప్పుడు వారి అభిరుచి మేరకు, సూచించిన విధంగా వివిధ రూపాలను బొమ్మలపై చిత్రీకరిస్తారు. దీనిలో ముఖ కవళికలు అన్ని స్పష్టంగా ఉండేలా తయారు చే స్తారు. చెక్కబొమ్మల(నెస్టింగ్ డాల్స్) పై రంగురంగుల పెయింటింగ్స్ వేసి దేశంలోని వివిధ విమానాశ్రయాలు, షాప్స్‌లో విక్రయిస్తున్నారు. వీరి బొమ్మలకు మంచి ఆదరణ ఉంది. బెంగళూరు టు చండీగఢ్... విక్రయాలు బాగానే జరుగుతున్నా, తయారీకి అయ్యే ఖర్చు కంటే అమ్మగా వచ్చే ఆదాయం తక్కువగా ఉండడాన్ని ముగ్గురు గమనించారు. దీనిని అధిగమించడానికి 2017లో స్టార్టప్‌ను బెంగళూరు నుంచి చండీగఢ్‌కు మార్చారు. జీఎస్టీ భారం, జీవన వ్యయం, ముడిసరుకు కొనుగోలు ఖర్చులు తగ్గడంతో నెస్టింగ్ డాల్స్ తయారీ భారం తగ్గింది. ప్రస్తుతం ఈ స్టార్టప్‌లో శ్రేయా, మన్‌ప్రీత్‌లు మార్కెటింగ్ మేనేజ్మెంట్ చూసుకొంటుండ గా, శృతి ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది. వీళ్ల టీమ్‌లో మొత్తం 21 మంది సభ్యులు ఉన్నారు. కొంతమంది కాలేజీ విద్యార్థులు, వికలాంగ కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నారు. కరోనా సమయంలో బాగా పడిపోయిన కలర్డ్ రిమ్స్‌కు, కుటుంబాల్లోని అనుబంధాల థీమ్‌ను జోడించి డాల్స్‌ను రూపొందించడంతో ఎక్కువ మంది ఈ డాల్స్‌కు కనెక్ట్ అయ్యారు. దీంతో ఆన్లైన్ విక్రయాలు పెరిగాయి. కుక్క, పిల్లి, తాబేలు బొమ్మలకు ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నాయి. అంతేగాక తమకు ఎంతో ఇష్టమైన వారి ముఖచిత్రాలను బొమ్మలపై చిత్రించి బహుమతి ఇవ్వాలనుకున్న వారు సైతం వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ముగ్గురు స్నేహితుల నెస్టింగ్ డాల్స్ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. -
Kanksshi Agarwal: డర్టీప్లేస్ అంటారు కానీ..
ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని..ప్రభుత్వాలు తీసుకొచ్చే పాలసీలు, చట్టాలు... సామాన్యులకు నష్టం కలిగించేవిగా ఉంటే వాటిని రద్దు చేయమని ప్రతిపక్ష పార్టీలు, సామాజిక కార్యకర్తలు ఉద్యమాలు, పోరాటాలు చేస్తుంటారు. మరోపక్క, తమ నెత్తిన బలవంతంగా మోపిన భారాన్ని సామాన్యులు మౌనంగా భరిస్తుంటారు. భోపాల్‌కు చెందిన కనక్షి అగర్వాల్ మాత్రం అలా మౌనంగా ఉండలేదు. ప్రభుత్వాలు ప్రజలకు ఇబ్బందులకు గురయ్యే విధానాలను అలా ఎలా తీసుకొస్తారు..? విధాన నిర్ణయాల్లో తమలాంటి వాళ్లు కూడా పాల్గొంటే విధానాలను మరింత మెరుగుపరిచే అవకాశం ఉంటుందని, ఏకంగా పొలిటికల్ టీచర్‌గా మారింది. దేశ రాజకీయాల్లో మహిళల సంఖ్య పెంచాలన్న లక్ష్యంతో రాజకీయ పాఠాలను బోధిస్తోంది. నేత్రి ఫౌండేషన్.. అది 2017... జూలై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చింది. నాలుగు స్లాబుల్లో వివిధ రకాల వస్తుసేవలపై పన్ను విధించారు. ఈ క్రమంలోనే మహిళలు ఎక్కువగా వినియోగించే శానిటరీ న్యాప్కిన్స్ మీద కూడా 18 శాతం పన్ను భారం పడింది. దాదాపు దేశంలో ఉన్న మహిళలంతా మౌనంగా 18 శాతం అదనపు ట్యాక్స్‌ను చెల్లిస్తూ ఎప్పటిలాగే శానిటరీ న్యాప్కిన్స్ను కొనుగోలు చేస్తున్నారు. కనక్షి మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేదు. జీఎస్టీ కౌన్సిల్లో మహిళలు లేకపోవడం వల్లే శానిటరీ ప్యాడ్స్‌పై ఇంత పన్ను విధించగలిగారు. అదే కౌన్సిల్లో ఎవరైనా మహిళలు ఉంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకోరు కదా... అనుకుంది. 2019 ఎన్నికల్లో సైతం మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దేశరాజకీయాల్లో ఎలాగైనా మహిళల సంఖ్యను పెంచాలనుకుని ‘నేత్రి ఫౌండేషన్’ను స్థాపించింది. పొలిటికల్ టీచర్‌గా... టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ‘అర్బన్ పాలసీ అండ్ గవర్నెన్స్’ చదివిన కనక్షికి ‘లెజిస్లేటివ్ ఎయిడ్ టు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ (ఎల్‌ఎఎంపీ)’ ఫెలోషిప్ చేసే అవకాశం వచ్చింది. దీంతో చాలామంది ఎమ్పీ, ఎంఎల్ఏలతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ఈ సమయంలో.. పాలన లో ఎక్కువగా పురుషులే ఉండడం, పురుషులతోపాటు స్త్రీలకు సమానత్వం లేకపోవడాన్ని గమనించింది. అంతేగాక మగవాళ్లు ఆడవాళ్లలా డ్రెసులు ధరించరు. నెలనెలా వచ్చే పిరియడ్స్‌పై వారికి అంత అవగాహన ఉండదు. అందువల్ల వాళ్లు ఇటువంటి పాలసీలు తీసుకు రాగలిగారు. అని కనక్షి ప్రత్యక్షంగా దగ్గర నుంచి చూసి, మహిళలు ఉంటే ఇలా జరగదని పొలిటికల్ టీచర్‌గా మారింది. నేత్రి ద్వారా గ్రామస్థాయి నుంచి మహిళలకు రాజకీయ పాఠాలు నేర్పిస్తుంది గ్రామపంచాయితీ స్థాయి నుంచి రాజకీయాల్లోకి ఎలా రావాలి? బూత్, నియోజక వర్గాల నిర్వహణ, ఆర్గనైజింగ్ స్కిల్స్, కెపాసిటీ బిల్డింగ్, సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలి, కమ్యూనిటీ ఎలా ఏర్పర్చుకోవాలి వంటి వాటి గురించి మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటిదాకా 400 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు.. ఇవేగాక న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక, శాసనసభలు ఎలా పనిచేస్తాయి? వాటినుంచి సాయం ఎలా తీసుకోవాలి వంటి అంశాలను కూడా నేరి్పస్తున్నారు. డర్టీప్లేస్ అంటారు కానీ.. ‘‘చాలామంది అభిప్రాయం ప్రకారం రాజకీయాలు అనేవి మహిళలకు నప్పవు, అది ఒక డర్టీప్లేస్. అందుకే సమాజంలోని చాలామంది తల్లిదండ్రులు తమ కూతుర్లను టీచర్, ఇంజినీర్, ఐఏఎస్ వంటి కెరియర్‌లవైపు మాత్రమే ప్రోత్సహిస్తుంటారు. ఎవ్వరూ కూడా రాజకీయాల్లోకి రమ్మని, వెళ్లమని అస్సలు చెప్పరు. వాటిని కేవలం మగవాళ్ల కెరియర్‌గా పరిగణిస్తారు. గత కొన్నేళ్లుగా ఉన్న ఈ మూస ఆలోచనకు స్వస్తి పలకాలని ‘నేత్రి’ ద్వారా మహిళలను ఎడ్యుకేట్ చేస్తున్నాను. పొలిటికల్ కెరియర్లో మహిళలకు పూలదారి ఏమీ ఉండదు. అనేక సమస్యలు ఎదుర్కొంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. అందుకే ముందుగా వివిధ జిల్లాల్లోని సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల మహిళలతో ప్రారంభించి, బరేలీ, రాయ్‌బరేలీ, అమేథి, హరుదా జిల్లాలకు విస్తరించాము. నేత్రి ద్వారా మహిళలు తమదైన నిర్ణయాలతో సమాజాన్ని సరికొత్తగా అభివృద్ధి పరచడమేగాక, దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తారు’’ అని కనక్షి చెప్పింది. చదవండి: Sirimiri Nutrition Food: ఓ ఇల్లాలి వినూత్న ఆలోచన.. కట్‌చేస్తే.. కోట్లలో లాభం! -
కాంగ్రెస్‌కు షాక్: బీజేపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లోను అనూహ్యమార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సులోచనా రావత్, తన కుమారుడితో కలిసి భారతీయ జనతా పార్టీలోకి చేరారు. కాగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఆమె.. బీజేపీ కండువ కప్పుకున్నారు. సులోచనా రావత్... జోబాత్ (ఎస్టీ) రిజర్వుడ్ నియోజక వర్గం నుంచి 1998, 2008లలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ అందిస్తున్న పారదర్శక పాలన, గిరిజనుల అభివృద్ధి చేస్తున్న కృషి, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్శించబడి పార్టీలో చేరినట్లు సులోచనా రావత్ తెలిపారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం మధ్యప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మూడు అసెంబ్లీ, ఒక లోకసభ స్థానానికి అక్టోబరు 30న ఎన్నికల షెడ్యుల్‌ను ప్రకటించనుంది. అయితే, జోబాట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన కళావతి భూరియా ఆకస్మిక మరణం వలన ఆ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమయింది. జోబాట్ స్థానానికి బీజేపీ నుంచి.. సులోచన రావత్ బరిలో ఉండవచ్చని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే విధంగా నివారీపూర్లోని పృథ్వీపూర్ నుంచి కాంగ్రెస్ నేత నితేంద్ర సింగ్ రాథోడ్ బరిలో ఉన్నారు. ఈయన తండ్రి బ్రిజేంద్ర సింగ్ రాథోడ్ మరణంతో ఇక్కడ ఖాళీ ఏర్పడింది. అదే విధంగా, సత్నాజిల్లాలోని రాయగావ్ ఎమ్మెల్యే జుగల్ కిషోర్ మరణంతో ఖాళీ ఏర్పడింది. ఖాండ్వా లోక్‌సభ నుంచి కేంద్ర మంత్రి అరుణ్‌యాదవ్ ఎంపీ పదవికి బరిలో నిలబడనున్నారు. చదవండి: Bhabanipur Bypoll:భారీ మెజార్టీతో మమతా బెనర్జీ విజయం -
మహిళ పోలీస్ అధికారి బాత్రూమ్లో కెమెరా.. స్నానం చేస్తుండగా..
భోపాల్: ఓ కానిస్టేబుల్‌పై సామూహిక అత్యాచార దాడి మరువకముందే మధ్యప్రదేశ్‌లో మరో పోలీస్ అధికారిణికి వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె డ్రైవర్ ఏకంగా ఆమె ఇంట్లోనే బాత్రూమ్లో కెమెరా పెట్టి ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడు. రూ.5 లక్షలు ఇస్తే వీడియోలు డిలీట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమె ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రస్తుతం అతడిని గాలిస్తున్నారు. చదవండి: అంగన్వాడీ టీచర్‌పై అమానుషం.. దుస్తులు చింపి.. సెల్‌ఫోన్ లాగేసుకుని ఓ పోలీస్ అధికారిణికి డ్రైవర్‌గా ఓ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 22వ తేదీన కానిస్టేబుల్ ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. బాత్రూమ్ తలుపుపై వీడియో రికార్డింగ్ ఆన్ చేసి సెల్‌ఫోన్ ఉంచాడు. స్నానం కోసం వెళ్లిన ఆమె ఆ సెల్‌ఫోన్ గుర్తించి వెంటనే బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ పరారయ్యాడు. తర్వాత సెప్టెంబర్ 26వ తేదీన ఇంటికొచ్చిన ఆ ఆకతాయి డ్రైవర్ రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. చదవండి: మగువ, మందుతో ఖాకీలకు వల.. సవాల్‌గా కార్పొరేటర్ భర్త కేసు దీంతో ఆమె పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. భోపాల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు. కాగా శనివారం నిందితుడు హబీబ్‌గంజ్ పోలీస్‌స్టేషన్ చేరుకున్నాడు. తనపై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రామ్‌జీ శ్రీవాస్తవ, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
రైజెన్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లాలో 15 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు కలసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ తతంగాన్నంతా నిందితులు వీడియో రికార్డు చేశారని పోలీసులు బుధవారం వెల్లడించారు. తన సోదరికి సాయం చేసేందుకు 10వ తరగతి చదువుతున్న బాధితురాలు గుంగాకు వెళ్లింది. ఆమె సోదరి ఆస్పత్రిలో ఉండగా, బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే సమయంలో తమ బంధువు ఉన్నాడా అంటూ ఓ వ్యక్తి ఇంట్లో ప్రవేశించాడు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న నిందితుడు మరో ఇద్దరితో కలసి బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటననంతా నిందితులు కలసి వీడియో కూడా తీశారు. బాలిక తిరిగి తన ఇంటికి వచ్చాక తండ్రికి ఈ విషయం చెప్పింది. వెంటనే వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
డ్రింక్ చేసి.. సీన్ క్రియేట్ చేసిన మోడల్
భోపాల్: తాగి నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం వల్ల ఎన్నో నిండు ప్రాణాలు బలైపోతున్న ఘటనలను ఈ మధ్య మనం తరుచు చూస్తున్నాం . వాటిని కట్టడి చేసేందుకు పోలీస్ యంత్రాంగం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న అవి సఫలం కావటం లేదు. అంతేకాదు మరికొంత మంది డ్రింక్ చేసి రోడ్ల పైకి వచ్చి హల్చల్ చేసి పెద్ద హంగామా సృష్టిస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడి....ట్రాఫ్రిక్ పోలీసులకు పెద్ద తలనొప్పిగా తయారవుతోంది. తాజాగా అలాంటి సంఘటనే గాల్వియార్‌లో చోటు చేసుకుంది. (చదవండి: బాలకార్మికుడి స్థాయి నుంచి గురువుగా!) మధ్యప్రదేశ్‌లోని గాల్వియార్‌లో ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల ఒక మోడల్ రద్దీ రహదారి పైకీ వచ్చి ఆర్మీ వాహనాన్ని అడ్డుకుని ధ్వంసం చేయడం మొదలుపెట్టింది. దీంతో ఆ కారు డ్రైవర్ జోక్యం చేసుకుని ఆమెని వారించటానికీ ప్రయత్నిస్తుంటే ..ఆమె అతన్ని పక్కకు నెట్టేసి వాదనకు దిగింది. ఈ క్రమంలో పోలీసులు వచ్చి ఆమెను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. తర్వాత ఆమె బెయిల్ మీద బయటకు వచ్చింది. ఆ ఆర్మీ అధికారి ఆమె పై ఎలాంటి కంప్లయింట్ ఇవ్వలేదని పోలీసు అధికారి చెప్పారు. సదరు మోడల్ గాల్వియార్‌లో పర్యటించటానికి వచ్చినట్టుగా పేర్కొన్నారు.(చదవండి: డాక్టరేట్ గ్రహీత.. మాజీ అథ్లెట్.. మాజీ టీచర్‌కు దయనీయ పరిస్థితి) -
ఐఏఎస్ కావాలనుకుంటున్నారా? ఈ సూచనలు పాటించారంటే..
ఐఏఎస్ ఎందరికో కల. కానీ కొందరు మాత్రమే విజయతీరాలను చేరగలుగుతారు. యూపీఎస్సీ ప్రతియేటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు క్లియర్ చేయడం అంతసులువేంకాదనే విషయం మనందరికీ తెలిసిందే! అందుకు చదువుతోపాటు మానసిక, శారీరక ఆరోగ్యం కూడా కీలకమే. ఎందుకంటే.. అభ్యర్ధులు మానసికంగా, శారీరకంగా ఎప్పుడైతే దృఢంగా ఉండగలుగుతారో ప్రిపరేషన్‌పై మరింత ఫోకస్ చేయగలుగుతారు. 2018 బ్యాచ్‌కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ అనుపమ అంజలి కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. సివిల్స్ ఆశావహ అభ్యర్ధులకు అనుపమ సూచనలు, సలహాలు ఇవే.. విద్యాభ్యాసం అనుపమ అంజలి మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రెండో ప్రయత్నంలోనే సివిల్ సర్వీస్ పరీక్షలను క్లియర్ చేశారు. ఆమె సామాజిక కార్యకర్త కూడా. కుటుంబ నేపథ్యం అనుపమ తండ్రి కూడా సివిల్ సర్వెంటే. ఐపీఎస్ ఆఫీసర్‌గా భోపాల్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫొటో కర్టెసీ: డీఎన్ఏ విజయ సూత్రం ఇదే సివిల్స్ ప్రిపరేషన్లో అభ్యర్ధులు బోర్‌గా ఫీలవడం సర్వసాధారణం. అనుపమ ఏం చెబుతున్నారంటే.. ఇటువంటి సందర్భాల్లో అభ్యర్ధులు తమని తాము పునరుత్తేజ పరచుకోవడానికి మధ్య మధ్యలో కొద్దిపాటి విరామాలు తీసుకుంటూ ఉండాలి. తద్వారా నూతన ఉత్సాహం నిండి, ప్రిపరేషన్ కొనసాగించడానికి ప్రోత్సాహకంగా ఉంటాయి. అలాగే శారీరక వ్యాయామాలు, ధ్యానం చేయడం కూడా ప్రతి అభ్యర్థికి ఎంతో ముఖ్యం. ఇది మిమ్మల్ని దృఢంగా, సానుకూలంగా ఉంచడానికి తోడ్పడుతుంది. సెల్ఫ్ మోటివేషన్ లేదా స్వీయ ప్రేరణ సుదీర్ఘ యూపీఎస్సీ ప్రిపరేషన్లో వ్యతిరేక ఆలోచనలు రావడం సాధారణమే. అయితే అనుపమ ఏమంటారంటే.. ప్రిపరేషన్ సమయంలో అభ్యర్ధులు తరచుగా ఒత్తిడికి గురై, నిరాశకు లోనవ్వడం జరుగుతుంది. ఏదేమైనా పాజిటివ్‌గా ఉండటం మాత్రం చాలా అవసరం. ఎందుకంటే ఈ విధమైన ధోరణి అత్యుత్తమ ప్రదర్శన కనబరచడానికి దోహదపడుతుంది. ప్రతికూల ఆలోచనలను అధిగమించకపోతే విజయం సాధించడం చాలా కష్టం. కాబట్టి పరీక్షలు సమర్ధవంతంగా రాయాలనుకునే అభ్యర్ధులు స్వీయ ప్రేరణను అలవరచుకోవాలి. ప్రేరణ పొందడానికి కొంత కృషి కూడా అవసరమౌతుంది. ఎందుకంటే.. మీ ప్రిపరేషన్ సజావుగా కొనసాగేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సివిల్స్ ఆశావహ అభ్యర్ధులకు అనుపమ సూచనలు యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు అన్నిరకాల ఆటంకాలకు/ఆందోళనలకు దూరంగా ఉండాలి. ఫ్యామిలీ ఫంక్షన్లు, ఫ్రెండ్స్ పార్టీలకు కూడా దూరంగా ఉండాలి. అలాగే కుటుంబ బాధ్యలకు దూరంగా ఉంటే మంచిది. యూపీఎస్సీ పరీక్షలను క్లియర్ చేయడానికి ఈ సూచనలు ఎంతో సహాయపడతాయి. చదవండి: Trupti Gaikwad: రెండేళ్ల కిందట అలా మొదలైంది.. పూజ తర్వాత -
గోమయ గణేషుడు.. ఇలా ఎందుకంటే..
వినాయకుడు వరములు ఇచ్చువాడు. ఇవాళ ప్రపంచానికి ఒక వరం కావాలి. అది గ్లోబల్ వార్మింగ్ వల్ల గతి తప్పుతున్న రుతువులను, ఉష్ణోగ్రతలను అదుపులోకి తేవడం. వినాయకుడు విఘ్నాలు తొలగిస్తాడు. కాని ఒక విషయంలో మాత్రం పదే పదే విఘ్నాలు కలిగించాలి. ఏ విషయంలో? పర్యావరణానికి హాని చేసే ఏ పని ఎవరు మొదలెట్టినా అది జరగకుండా విఘ్నాలు కలిగిస్తూ ఉండాలి. అప్పుడు గిరులు పచ్చగా ఉంటాయి. ఝరులు కళకళలాడుతాయి. వినాయకుడు గణపతి. ఆయన ఏ గణాలకు అధిపతి అయినా అసలు అధిపతిగా ఉండాల్సింది మాత్రం ప్రకృతి గణాలకే. అవి శక్తిమంతమయ్యి మనుషులకు శక్తి ఇవ్వాలి. అది కూడా ఈ వినాయక చవితి పండగ సందర్భంగా మనం కోరుకోవాలి. Bhopal Kanta Yadav Eco Friendly Idol With Cow Dung: భోపాల్‌లోని కాంతా యాదవ్ వినాయకుడి శక్తి ప్రకృతికి అందాలంటే ఏం చేయాలో ఆలోచించింది. ఇంతకాలం ఆమె కుటుంబం దేవతల విగ్రహాలు చేస్తూ బతికింది. అవి దాదాపు పర్యావరణ కాలుష్యాన్ని కలిగించే పదర్థాలతోనే అయి ఉండేవి. కాని ఈసారి కొత్త పని మొదలెడదాం అనుకుందామె. కొత్త పని అంటే ప్రకృతికి మేలు చేసేదే. వినాయకుడి పూజకు మట్టి విగ్రహం తయారు చేయడం ఒక మంచి ఆలోచన. కాని కాంతా యాదవ్ కొంచెం ముందుకు వెళ్లి వినాయకుడు తిరిగి మొక్కకు శక్తిగా మారే విధంగా విగ్రహం తయారు చేయాలనుకుంది. అందుకు గోమయం (ఆవుపేడ)ను ఎంచుకుంది. ఆవుపేడకు ఒక పవిత్రత ఉంది. దాంతోపాటు ఎరువు స్వభావం కూడా ఉంది. అందుకే కాంత ఆవు పేడతో వినాయకుడి విగ్రహాలు తయారు చేయడం మొదలెట్టింది. ‘ఆవు పేడను ఎండ పెడతాను. తర్వాత దానికి రంపంపొట్టు, మైదా పిండి కలిపి మెత్తటి పదార్థంగా చేసి అచ్చులో పోసి విగ్రహం తయారు చేస్తాను. ఇది తయారు చేయడం పది నిమిషాల పనే అయినా ఆరడానికి మూడు నాలుగు రోజులు పడుతుంది. ఆ తర్వాత రంగులు వేస్తాను. విగ్రహం పూజలు అందుకున్నాక నీటి బకెట్టులో సులభంగా నిమజ్జనం అవుతుంది. ఆ తర్వాత ఆ నీటిని మొక్కలకు పోస్తే ఎరువు అవుతుంది. ఈ ఆలోచన చాలామందికి నచ్చింది. అందుకే నా దగ్గరకు వచ్చి చాలామంది బొమ్మలు కొంటున్నారు. అంతే కాదు ఢిల్లీ, పూనా నుంచి కూడా నాకు ఆర్డర్లు వస్తున్నాయి’ అంది కాంత. కాంత ఈ పనిని అందరికీ నేర్పుతుంది. బహుశా వచ్చే సంవత్సరం నాటికి చాలాచోట్ల గోమయ వినాయకుడు దర్శనం ఇచ్చినా ఆశ్చర్యం లేదు. చదవండి: మహా గణపతిం మనసా స్మరామి... -
నడి రోడ్డుపై మహిళల ఫ్యాషన్ షో.. ఎందుకో తెలుసా?
భోపాల్: మహిళలు నడిరోడ్డుపై.. నీటి కుంటల వద్ద హొయలొలుకుతూ క్యాట్ వాక్ చేశారు. రోడ్డుపై ఫ్యాషన్ షో మొదలుపెట్టడం మధ్యప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. వారు అలా ఎందుకు చేశారో తెలుసా..? తమ ప్రాంతంలో రోడ్లు బాగా లేవని చెప్పేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లు మహిళలు తెలిపారు. రోడ్డుపై గుంతలతో తాము ఇబ్బందులు పడుతున్నామని చెప్పేందుకు.. అధికారుల నిర్లక్ష్యం చూపించేందుకు తాము ఈ తరహా ఆందోళన చేసినట్లు వివరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. చదవండి: పదో తరగతి పాసయిన మాజీ సీఎం.. దాంతోపాటు ఇంటర్ కూడా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని హోషంగాబాద్, ధనిశ్‌నగర్‌లో రోడ్లు బాగా లేవు. గుంతలు తేలడంతో రోడ్డు ప్రమాదకరంగా మారింది. దీనికి తోడు వర్షాలకు నీరు నిలిచి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులకు చెప్పినా పట్టింపు లేకపోవడంతో నారీమణులు కొంగు బిగించి రోడ్డు బాట పట్టారు. ధర్నాలు, కార్యాలయాల ముట్టడితో పని లేదని విన్నూత్నంగా చేద్దామని ఫ్యాషన్ షో ప్లాన్ వేశారు. అనుకున్నదే తడువుగా ధనీశ్‌నగర్ మహిళలు బయటకు వచ్చారు. రోడ్డుపై గుంతలు ఉన్న చోట.. నీరు నిలిచిన చోట ప్రత్యక్షమయ్యారు. ఫ్యాషన్ షో మాదిరి క్యాట్ వాక్ చేస్తూ నడిచారు. బురదలోనే నడిచారు. రోడ్డు మరమ్మతులు వెంటనే చేయాలని తమ అందచందాలతో డిమాండ్ చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో తాము ఈ విధంగా నిరసన చేపట్టినట్లు మహిళలు తెలిపారు. రోడ్డుపై ప్రమాదకరంగా గుంతలు తయారయ్యాయని వాపోయారు. మున్సిపల్ అధికారులు పన్నుల వసూళ్లపై చూపించే శ్రద్ధ ప్రజల సమస్యలను పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం చెల్లించే పన్నులను ఏం చేస్తున్నారని నిలదీశారు. ఈ మహిళల విన్నూత్న నిరసన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
విజిటింగ్ ఫ్యాకల్టీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
ఐఐఈఎస్టీ, శిబ్పూర్లో తాత్కాలిక, విజిటింగ్ ఫ్యాకల్టీ పోస్టులు శిబ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఐఐఈఎస్టీ).. ఒప్పంద ప్రాతిపదికన విజిటింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (బెంగళూరు రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌లు.. ఇక్కడ క్లిక్ చేయండి) ► మొత్తం పోస్టుల సంఖ్య: 30 ► విభాగాలు: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, టౌన్ అండ్ రీజినల్ ప్లానింగ్, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథమేటిక్స్ తదితరాలు. ► తాత్కాలిక ఫ్యాకల్టీ(టెంపరరీ): అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: దరఖాస్తు చేసే నాటికి 60ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.75,000 వరకు చెల్లిస్తారు. ► విజిటింగ్ ఫ్యాకల్టీ: అర్హత: పీహెచ్డీ ఉత్తీర్ణతతోపాటు బోధన/రీసెర్చ్‌లో సుదీర్ఘ అనుభవం ఉండాలి. వయసు: దరఖాస్తు చేసే నాటికి 68ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.1,00,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, పర్సనల్ డిస్కషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021 ► వెబ్సైట్: www.iiests.ac.in ఎంఏఎన్ఐటీ, భోపాల్‌లో 107 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భోపాల్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఏఎన్ఐటీ).. వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (యూనియన్ బ్యాంకులో.. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు) ► మొత్తం పోస్టుల సంఖ్య: 107 ► విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ తదితరాలు. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. ► వేతనం: నెలకు రూ.70,900 నుంచి రూ.1,01,500 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: క్రెడిట్ పాయింట్ స్కోర్, రీసెర్చ్/అకడమిక్ ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని ప్రజంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 15.09.2021 ► దరఖాస్తును ది రిజిస్ట్రార్, ఎంఏఎన్ఐటీ, భోపాల్–462003 చిరునామకు పంపించాలి. ► వెబ్సైట్: http://www.manit.ac.in -
స్టేషన్‌కు వెళ్లి మరీ ట్రాఫిక్ ఎస్సైపై దాడి.. కత్తితో కడుపులో..
భోపాల్: భోపాల్‌లో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరీ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసును కత్తితో కడుపులో పొడిచాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ‘‘నిందితుడు హర్ష్ మీనా శనివారం జ్యోతి టాకీస్‌కు వెళ్లాడు. అక్కడ అతను తన బైక్‌ను నో పార్కింగ్ జోన్లో పార్క్ చేశాడు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ దూబే, నో పార్కింగ్ జోన్లో పార్క్ చేసిన వాహనాలను పోలీసు క్రేన్ సహాయంతో ఎత్తి క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే సమాచారం అందుకున్న హర్ష్ మీనా క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. జరిమానా డబ్బులు రూ.600 చెల్లించడానికి ఇంటికి వెళ్లి వచ్చి డిపాజిట్ చేశాడు. అదే సమయంలో పోలీస్ స్టేషన్ వద్ద క్రేన్ దగ్గర నిలబడి ఉన్న ఎస్ఐ శ్రీరామ్ దూబేని నిందితుడు చూశాడు. అతడి దగ్గరకు వెళ్లి ఎస్ఐను కత్తితో కడుపులో పొడిచాడు. కాగా నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించడంతో.. క్రేన్ దగ్గర ఉన్న వ్యక్తులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే జరిమానా డిపాజిట్ చేసిన తర్వాత నిందితుడు ట్రాఫిక్ పోలీసును పై కత్తితో ఎందుకు దాడి చేశాడనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అంతే కాకుండా విచారణ సమయంలో నిందితుడు పలు రకాల సమాధానాలు ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక నిందితుడు స్టేషన్లో సైకో లాగా ప్రవర్తించాడని, పెద్దగా నవ్వడం, అరవడం వంటివి చేశాడని పోలీసులు తెలిపారు. కాగా ఎస్ఐ దుబేను చికిత్స కోసం జేపీ ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్సీ రాజేష్ భదౌరియా తెలిపారు. ప్రాథమిక చికిత్స తర్వాత ఎస్ఐని డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. -
మధ్యప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ నిరోధక బిల్లు.. 10 ఏళ్ల జైలు శిక్ష.. ఆస్తుల జప్తు
భోపాల్: మంద బలం, అధికార బలం కోసం కొందరు తహతహలాడుతుంటారు. ఓ పది మంది రౌడీలను వెంటేసుకుని ఓ గ్యాంగ్‌కు లీడర్ అయిపోతారు. డబ్బుల కోసం జనాలను పీడిస్తూ.. వివిధ నేరాలకు పాల్పడుతూ.. అడ్డు అదుపు లేకుండా ప్రర్తిస్తారు. అయితే ఇకపై గ్యాంగ్‌స్టర్‌గా మారాలంటే వారి వెన్నుల్లో వణుకు పుట్టించే ఓ చట్టాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసురానుంది. మధ్యప్రదేశ్‌లో వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా "మధ్యప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ నిరోధక బిల్లు" ను ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుందని ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. ఈ చట్టం ప్రకారం.. గ్యాంగ్స్టర్లకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో పాటు ఆస్తులను అటాచ్ చేయడం జరుగుతుందని అన్నారు. లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఫారెస్ట్ మాఫియా, పేకాట డెన్లు నిర్వహిస్తున్న వారిని కట్టడి చేయడానికి ఈ చట్టం తీసుకు రానున్నట్లు ఆయన చెప్పారు. -
దారుణం: 12 ఏళ్ల బాలికను చంపి, చెట్టుకు వేలాడదీశారు..!
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ 12 ఏళ్ల బాలికను హత్య చేసి, చెట్టుకు వేలాడదీశారు. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఓ 12 ఏళ్ల బాలిక విదిశలోని అటవీ ప్రాంతానికి తన తల్లితో కలిసి వెళ్లినట్లు తెలిపారు. ఈ విషయాన్ని బాలిక తన తండ్రితో 11 గంటల సమయంలో చెప్పి వెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయం బాధితురాలి తల్లి గమనించలేదని అన్నారు. అయితే ఆమె ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో కూరుతు కనిపించకపోవడంతో.. గ్రామస్తులతో కలిసి తండ్రి బాలిక కోసం అడవిలో వెతికినట్లు తెలిపారు. కొన్ని గంటల తరువాత ఆ చిన్నారి మృతదేహం కండువాతో చెట్టుకు వేలాడతూ కనిపించిందని పేర్క్నన్నారు. అయితే హత్యకు ముందు అత్యాచారం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పదిలో రెండుసార్లు ఫెయిల్.. హ్యాకింగ్ పాఠాలు!
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సిన్గ్రులి జిల్లాలో ఓ 16 ఏళ్ల మైనర్ బాలుడు మొబైల్ ఫోన్లను హ్యాకింగ్ చేసి, బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతుడటంతో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..‘‘ నిందితుడు మధ్యప్రదేశ్‌లోని మోర్వా పట్టణానికి చెందినవాడు. అతడి పుట్టిన రోజున తల్లిదండ్రులు ఓ ల్యాప్‌టాప్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. నిందితుడు పదవ తరగతి ఫెయిల్ అయ్యాడు. హ్యాకింగ్‌లో శిక్షణ కూడా తీసుకోలేదు. కానీ, రోజుకు 15 గంటలపాటు యూట్యూబ్ వీడియోలు చూస్తూ హ్యాకింగ్ చేయడం నేర్చుకున్నాడు. కెనడియన్ ఫోన్ నెంబర్‌తో ఓ వాట్సాప్ సృష్టించాడు. అతను ఒక ప్రవాస భారతీయ అమ్మాయిగా నటిస్తూ.. చుట్టుపక్కల వాళ్లతో, పరిచయం ఉన్న వారితో చాట్ చేసేవాడు. అదే సమయంలో వారి కాంటాక్ట్ నంబర్లు, సోషల్ మీడియా ఖాతాలు, చిత్రాలు, వీడియోలతో సహా డేటాను తస్కరించి, అందులో ఏవైనా అశ్లీల వీడియోలు ఉంటే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేవాడు. కాగా ఈ విషయంపై ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదు. అయితే తాజాగా ఓ పొరుగు వ్యక్తి నిందితుడిపై ఫిద్యాదు చేశాడు. దీంతో అతడిని విచారించగా నేరాన్ని అంగీకరించాడని’’ మోర్వా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి మనీష్ త్రిపాఠి తెలిపారు. -
టీనేజర్ ఉసురు తీసిన చోరీ.. చేతిలో లోదుస్తులతో పరిగెడుతుండగా
బాల్కనీలో ఆరేసిన లోదుస్తులు చోరీ చేస్తుండగా ఓ టీనేజర్‌ను ఆ జంట చూసింది. అతన్ని వెంటాడి పట్టుకుని గదిలో బంధించింది. పోలీసులు వచ్చి చూసేసరికి ఆ టీనేజర్ ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు. భోపాల్: రవి(24), అతని భార్య స్థానికంగా గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి వాళ్ల బాల్కనీలో శబ్దం రావడంతో చూశారు. ఆరేసిన రవి భార్య లోదుస్తులను తీసుకుని ఓ కుర్రాడు పరిగెడుతూ కనిపించాడు. అతని వెంటాడి పట్టుకున్న ఆ జంట గదిలో వేసి బంధించారు. పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఆ డోర్ తెరిచి చూసేసరికి.. ఫ్యాన్‌ను ఉరేసుకుని చనిపోయాడు. అయితే మృతుడి బంధువు ఫిర్యాదు ఆధారంగా ‘ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరం కింద రవి, అతని భార్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ వ్యవహారంలో ఆ దంపతుల తప్పేమీ లేదని, అవమానంతో ఆ కుర్రాడే ఆత్మహత్య చేసుకున్నాడని చుట్టుపక్కలవాళ్లు చెప్తున్నారు.