Arjun reddy
-
అర్జున్ రెడ్డిగా ఎన్టీఆర్.. అదిరిపోయిన కాంబో ...
-
అవార్డును వేలం వేసిన విజయ్ దేవరకొండ.. దక్కించుకున్నది ఎవరంటే?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్రేజ్ యూత్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. 2017లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన అర్జున్ రెడ్డితో విజయ్ జీవితం మారిపోయింది. అందులో ఆయన నటనకు గుర్తింపుగా ఫిల్మ్‌ఫేర్‌లో ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. అయితే ఆ వార్డును 2018లో వేలం వేశాడు. తాజాగా ఈ విషయం మరోసారి వైరల్ అవుతుంది. ఏప్రిల్ 5న ఆయన నటించిన ఫ్యామిలీస్టార్ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రస్థావన మరోసారి తెరపైకి వచ్చింది. ఫ్యామిలీస్టార్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ పాల్గొన్నాడు. అర్జున్ రెడ్డి సినిమాకు గాను ఉత్తమ నటుడిగా వచ్చిన ఫిలింఫేర్ అవార్డును భారీ మొత్తానికి వేలం వేసినట్లు విజయ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తనకు ఎలాంటి అవార్డులంటే ఇష్టం లేదని చెప్పిన విజయ్.. ఇప్పటి వరకు తనకు వచ్చిన అవార్డ్స్లలో కొన్ని ఆఫీసులో ఉంటే, మరికొన్ని ఇంట్లో ఉన్నాయని చెప్పాడు. 2018లో ఏం జరిగిందంటే.. అర్జున్ రెడ్డి సినిమాకు గాను ఫిలింఫేర్ నుంచి ఉత్తమ నటుడిగా విజయ్‌కు అవార్డు దక్కింది. దానిని 2019లో ఆయన వేలం వేశారు. మొదట రూ. 5లక్షలు వస్తే చాలు అనుకుని ఆన్లైన్లో వేలం ప్రక్రియ ప్రారంభించారు. ఆ సమయంలో దివి ల్యాబ్స్ కుటుంబానికి చెందిన శ్యామలాదేవి రూ. 25 లక్షలకు దక్కించుకున్నారు. అందుకోసం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ ఫిలింఫేర్ అవార్డును ఆమెకు అందించారు విజయ్. అనంతరం ఆమె ఇచ్చిన రూ. 25 లక్షల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి (CMRF) అందించారు. The 1st @TheRowdyClub Sundowner Party. Filmfare given away. 25 lakhs raised for CMRF 😁 Divi labs you are now a part of my journey. This blacklady is special to all of us. I shall show my appreciation by visiting you all :) pic.twitter.com/OgqA8Q0P3U — Vijay Deverakonda (@TheDeverakonda) July 15, 2018 -
నెగెటివ్ అప్రోచ్.. కచ్చా బాదం..సందీప్ రెడ్డి సీక్రెట్ ఇదే!
ఇప్పుడు దేశవ్యాప్తంగా సందీప్‌రెడ్డి ఓ కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు. అంతా కచ్చా బాదం. ఎలాంటి గోప్యత అవసరం లేదు. కుల్లం కుల్ల.. బూతు సీన్లు కూడా హీరో, హీరోయిన్లు చేయాల్సిందే. వ్యాంపు పాత్రలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇదేంటని చాదస్తంగా ఎవరయినా అడిగితే .. ఇదే ట్రెండ్ అంటున్నాడు. లిప్ లాక్‌లు, దుస్తులు విప్పడాలు, నేరుగా బెడ్రూమ్ సీన్లు.. ఇవన్నీ హాలీవుడ్‌ను తలపించేలా చేయడం సందీప్‌రెడ్డి సీక్రెట్‌గా మారింది. కథ, కథనం, దర్శకత్వం ఇవన్నీ పాత డైరెక్టర్లు నమ్మిన పద్ధతులు. జనానికి ఇప్పుడంతా యానిమల్ టైప్ కావాలట. అదే సందీప్‌రెడ్డి గుర్తించిన అంశం. ఎంత కచ్చాగా ఉంటే.. అంత రియాల్టీ అంటున్నాడు. తీసింది మూడు సినిమాలే అయినా.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సందీప్‌రెడ్డి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అర్జున్‌రెడ్డితో సంచలనం తొలి సినిమాకే ప్రత్యేక ముద్రను సంపాదించుకునే దర్శకులు చాలా అరుదు. అలాంటి అరుదైన దర్శకుల్లో సందీప్ రెడ్డి ఒకరు. తొలి సినిమా అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించాడు. టాలీవుడ్లో అప్పటి వరకు వచ్చిన సినిమా ఒకెత్తు. అర్జున్ రెడ్డి సినిమా మరో ఎత్తు. ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను బోల్డ్‌గా చూపించి సక్సెస్ అయ్యాడు. అర్జున్‌రెడ్డి సినిమా చూస్తున్నంతసేపు..ప్రతి ప్రేక్షకుడు ఆ పాత్రతో ముందుకు సాగుతాడు. హీరోని వైల్డ్‌గా చూపించినా.. కథంతా బోల్డ్‌గా నడిపించినా కంటికి అది అసహ్యంగా కనిపించదు. హీరోకి కోపమొస్తే పచ్చి బూతులు తిడతాడు.. ప్రేమ పొంగుకొస్తే.. చుట్టూ ఉన్న పరిసరాలనే మర్చిపోతారు. శారీరక వాంఛ తీరకపోతే అండర్వేర్లో ఐస్ వేసుకుంటాడు. అయినా ఆ క్యారెక్టర్‌పై మనకు ప్రేమే కలుగుతుంది తప్పా ఎక్కడా నెగెటివ్ ఇంప్రెషన్ రాదు. అంతాలా తన కథతో కన్విన్స్ చేశాడు సందీప్ రెడ్డి. ఒక బోల్డ్ కంటెంట్ ను కరెక్ట్ వేలో చూపిస్తూ... ఆడియెన్స్ ను మెప్పించడం ఒక్క సందీప్ రెడ్డికే సాధ్యమైంది. అదే కథను మరింత బోల్డ్‌గా బాలీవుడ్ ప్రేక్షకులను చూపించి.. సూపర్ హిట్ కొట్టాడు. ఇలా తన తొలి రెండు సినిమాలతో ఇటు విజయ్ దేవరకొండ..అటు షాహిద్ కపూర్ల హోదానే మార్చేశాడు. అర్జున్ రెడ్డి తర్వాత ఆ తరహాలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి.ప్రస్తుతం వస్తూనే ఉన్నాయి. ‘యానిమల్’తో మరో ప్రయోగం సాధారణంగా సినిమా అంటే నిడివి ఇంత ఉండాలి.. ప్రారంభం ఇలా.. ఇక్కడ ఇంటర్వెల్.. క్లైమాక్స్ అలా అని కొన్ని పద్దతులు ఉంటాయి. కానీ అవేవి పట్టించుకోకుండా.. తండ్రి కొడుకుల ఎమోషన్ని బోల్డ్‌గా, వయోలెన్స్‌గా చూపిస్తూ..సినిమా ఇలా కూడా చెయ్యొచ్చు అని ‘యానిమల్’తో నిరూపించాడు సందీప్‌రెడ్డి. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తూ.. రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి చేరేందుకు అడుగు దూరంలో ఉంది. వాస్తవానికి ఈ కథ రొటీన్ రివేంజ్ డ్రామా. ఇందులోని సంఘర్షణ కూడా పాతదే. కానీ సందీప్ రెడ్డి కథనాన్ని నడిపించిన విధానం.. హీరో పాత్రని మలిచిన తీరు ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు సంప్రదాయ ప్రవర్తనలకు విరుద్ధంగా ఉంటాయి. కానీ హీరో పాత్ర మనస్తత్వాన్ని అర్థం చేసుకొని సినిమా చూస్తే.. దర్శకుడు అంతర్లీనంగా చెప్పదలచుకున్న విషయాలు ఇంకా స్పష్టంగా తెలుస్తాయి. సందీప్‌రెడ్డి చెప్పాలనుకే పాయింట్‌కి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు కాబట్టే.. ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. వంగాపై బాలీవుడ్ ఫోకస్ యానిమల్ సినిమాతో మరోసారి తెలుగువాడి సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశాడు సందీప్ రెడ్డి. ఇప్పుడీ సెన్సెషనల్ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్స్ క్యూ కడుతున్నారు. రణ్‌బీర్ కపూర్ అయితే మరోసారి సందీప్‌తో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. షారుఖ్, సల్మాన్ కూడా సందీప్‌పై ఫోకస్ పెట్టారు. అలాగే బాలీవుడ్‌కి చెందిన బడా నిర్మాణ సంస్థలన్నీ సందీప్‌రెడ్డికి అడ్వాన్స్‌లు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. అయితే సందీప్ రెడ్డి మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. తన తదుపరి సినిమాను ప్రభాస్‌తో ప్లాన్ చేశాడు. దానికి స్పిరిట్ అనే టైటిల్‌ని కూడా ఖారారు చేశారు. ఆ చిత్రం తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో మహేశ్‌బాబు, రామ్‌చరణ్ లాంటి టాలీవుడ్ స్టార్స్ కూడా సందీప్ సినిమా సినిమా తీసే అవకాశాలు ఉన్నాయి. -
అర్జున్ రెడ్డి రికార్డు బ్రేక్ చేసిన బేబీ
-
వారి కోసం అవార్డునే అమ్మేశాడు.. దటీజ్ విజయ్ దేవరకొండ!
తక్కువ సినిమాలతో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. సినిమాల కంటే తన యాటిట్యూడ్‌తో యూత్‌లో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్నాడు ఈ రౌడీ హీరో. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి.. హీరో.. స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఈ స్టార్డమ్ విజయ్‌కి అంత ఈజీగా రాలేదు. తన కెరీర్ తొలినాళ్లలో చాలా కష్టపడ్డాడు. అవకాశాల కోసం నిర్మాతల ఆఫీసుల చుట్లూ తిరిగాడు. హీరోగా అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గాను చేశాడు. 'పెళ్లి చూపులు' చిత్రంతో హీరోగా ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 'అర్జున్ రెడ్డి' చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఆపై గీత గోవిందం, టాక్సివాలా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ తదితర చిత్రాలతో యూత్‌ను ఆకట్టుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘లైగర్’ డిజాస్టర్‌గా నిలిచినా.. విజయ్‌కి మాత్రం నార్త్‌లో మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన విజయ్ బర్త్‌డే నేడు(మే 9). ఈ సందర్భంగా ఈ రౌడీ హీరో గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.. ► విజయ్ దేవరకొండ పూర్తి పేరు దేవరకొండ విజయ్ సాయి. స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా తమ్మన్ పేట గ్రామం. నటనపై ఉన్న ఆసక్తితో విజయ్ తండ్రి గోవర్దన్‌రావు ఫ్యామిలీతో కలిసి హైదారాబాద్‌కు షిఫ్ట్ అయ్యాడు. యాక్టర్‌గా అవకాశాలు లభించకపోవడంతో టెలివిజన్ డైరెక్టర్‌గా మారాడు. సినిమా రంగంపై తనకున్న ఇష్టంతోనే విజయ్ యాక్టర్ అవుతానంటే.. ఆయన అడ్డుచెప్పలేదు. ► విజయ్ తన పాఠశాల విద్యను పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ పూర్తి చేశాడు. ఇంటర్, డిగ్రీని హైదరాబాద్‌లోని ప్రైవేట్ కాలేజిల్లో పూర్తి చేశాడు. (చదవండి: ముస్లిం యువతిగా సమంత.. 'ఖుషి' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది ) ► డిగ్రీ పూర్తయిన తర్వాత విజయ్ నటనపై దృష్టిపెట్టాడు. హైదరాబాద్‌లోని ఓ యాక్టింగ్ స్కూల్లో చేరాడు. కొన్నాళ్ల తర్వాత రవిబాబు దర్శకత్వం వహించిన నువ్విలా చిత్రంలో అవకాశం లభించింది.అందులో విష్ణు పాత్రను పోషించాడు. ► నువ్విలా సినిమా చేస్తున్న సమయంలోనే శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహించారు. ఈ విషయం తెలుసుకొని అందరిలాగే అడిషన్స్‌కి వెళ్లాడు విజయ్. ఆ చిత్రంలో అజయ్ అనే చిన్న పాత్రను పోషించాడు. ► తొలి రెండు సినిమాలు విజయ్‌కి ఎలాంటి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కానీ నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో పోషించిన రిషి పాత్ర మాత్రం విజయ్‌కి మంచి గుర్తింపు తెచ్చింది. అయినా కూడా హీరోగా అవకాశాలు లభించలేదు. కొన్నాళ్ల తర్వాత తరుణ్ భాస్కర్ ‘పెళ్లి చూపులు’ చిత్రానికి హీరోగా విజయ్‌ని సెలక్ట్ చేశాడు. అయితే ఈ సినిమాను నిర్మించడానికి ఏ నిర్మాత ముందుకు రాలేదు. చివరకు రాజ్ కందుకూరి ముందుకొచ్చి ఆ చిత్రాన్ని నిర్మించాడు. అదే విజయ్ కెరీర్‌ని మలుపు తిప్పింది. హీరోగా తొలి సినిమాతోనే జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఇక అర్జున్ రెడ్డితో స్టార్‌గా హీరోగా ఎదిగాడు. ► అర్జున్ రెడ్డి తర్వాత విజయ్‌కి వరుస అవకాశాలు లభించాయి. ఏ మంత్రం వేసావే, నోట, డియర్ కామ్రెడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి చిత్రాలకు మిశ్రమ స్పందల రాగా.. గీత గోవిందం చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘లైగర్’విజయ్ కెరీర్లోనే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్ చూసి షూటింగ్ ప్రారంభించిన ‘జనగణమన’ను మధ్యలోనే ఆపేశారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు. ► ఒకవైపు హీరోగా సినిమాల్లో నటిస్తూనే నిర్మాతగానూ మారాడు. కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చిన్న చిత్రాలను నిర్మిస్తున్నాడు. ‘మీకు మాత్రమే చెప్తా’. ‘పుష్పక విమానం’లాంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ► 'ది రౌడీ వేర్' పేరుతో విజయ్ దేవరకొండ సొంతంగా ఓ క్లాతింగ్ బ్రాండ్ స్థాపించాడు. ‘మిడిల్ క్లాస్ ఫండ్’పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎన్నో మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తున్నాడు. (చదవండి: ఒకప్పటిలా కాదు.. హీరోయిన్స్ అంటే వాటికే పరిమితం కాదు) ► ఇక విజయ్ గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. పేద ప్రజలకు సాయం చేయడం కోసం తన అవార్డును కూడా అమ్మేశాడు. అర్జున్ రెడ్డి సినిమాకు గాను విజయ్‌కి బెస్ట్ యాక్టర్ ఫిలిం ఫేర్ అవార్డు లభించింది. ఆ అవార్డుని వేలం వేసి రూ.25 లక్షలకు అమ్మేశాడు. ఆ డబ్బంతా ప్రజా సేవ కోసం ప్రభుత్వం ఉపయోగించే సీఎం రిలిఫ్ ఫండ్‌కి విరాళంగా అందించి గొప్ప మనసు చాటుకున్నాడు. ► ప్రతీ ఏడాదికి ఒకసారి ‘ 'దేవర శాంటా’ పేరిట అభిమానులను సర్ఫ్రైజ్ చేయడం విజయ్‌కి అలవాటు. ఇలా పేద ప్రజల కోసం ఎన్నో సేవ కార్యక్రమాలు చేపడుతూ రియల్ లైఫ్‌లోనూ హీరోగా నిలుస్తున్న విజయ్ కెరీర్లో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ ‘సాక్షి’ తరపున, అభిమానుల తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు. -
అర్జున్ రెడ్డిలో శివ పాత్రకు ఫస్ట్ చాయిస్ నేను కాదు, ఆ కమెడియన్: రాహుల్ రామ్కృష్ణ
రాహుల్ రామకృష్ణ.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. షార్ట్ ఫిల్మ్ హీరోగా కెరీర్ ప్రారంభించిన అతడు సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్ పాత్రలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. అర్జున్‌రెడ్డి, జాతిరత్నాలు చిత్రాలతో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ‘అర్జున్ రెడ్డి’లో హీరో విజయ్ దేవరకొండ స్నేహితుడిగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో హీరోకి సమానమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు రాహుల్. చదవండి: జబర్దస్త్ ‘పంచ్’ ప్రసాద్ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే? ఈ గుర్తింపుతో ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ టాక్‌లో షో పాల్గొన్న అతడు తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ఈ మేరకు రాహుల్ రామక్రష్ణ మాట్లాడుతూ.. ‘‘నేను పుట్టిపెరిగిందంతా హిమాయత్ నగర్లోనే. మా ఫ్యామిలీలో ఎవరికీ సినిమా ప్రపంచంతో సంబంధం లేదు. నేను, తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ, ప్రియదర్శి అందరం ఒకేసారి సినిమాల్లోకి వచ్చాం. పెళ్లి చూపులు సినిమాకి ముందు మేమంత సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్నాం. చదవండి: ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్మెంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే అదే సమయంలో తరుణ్ భాస్కర్ ‘పెళ్లి చూపులు’ చేసే అవకాశం వచ్చింది. అందులో విజయ్ హీరోగా ముందు అనుకున్నాడు. ఇక అతడి ఫ్రెండ్ రోల్‌కు అప్పటికే తరుణ్ ప్రియదర్శికి ఛాన్స్ ఇచ్చాడు. అదే సమయంలో విజయ్ దేవరకొండతో సందీప్ రెడ్డి ‘అర్జున్ రెడ్డి’ సినిమా అనుకున్నాడు. ఆయనకి నన్ను పరిచయం చేసింది విజయ్ దేవరకొండనే. అలా ఆ సినిమాలో ‘శివ’ పాత్ర చేసే ఛాన్స్ నాకు వచ్చింది. అయితే అర్జున్ రెడ్డిలో నా పాత్రకి డబ్బింగ్ జరుగుతున్నప్పుడు ఒక విషయం తెలిసింది. మొదట ఈ సినిమాలో నా పాత్రకు ఫస్ట్ చాయిస్ నేను కాదని, ప్రియదర్శిని అనుకున్నారని తెలిసింది’’ అని చెప్పుకొచ్చాడు. -
నెట్టింట వైరల్ అవుతున్న ‘అర్జున్‌రెడ్డి’ డిలీటెడ్ సీన్
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు స్టార్ హోదా తీసుకొచ్చిన చిత్రం ‘అర్జున్‌రెడ్డి’. ఈ సినిమా విడుదలైన నిన్నటికి(ఆగస్ట్ 25)ఐదేళ్లు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సందీప్ వంగా ‘అర్జున్ రెడ్డి’నుంచి ఓ డిలీట్ సీన్‌ని విడుదల చేశారు. 2.53 నిమిషాలు ఉన్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సీన్లో విజయ్ దేవరకొండ, రాహుల్ రామకృష్ణ మధ్య సంభాషణలను చూపించారు. ప్రీతి(షాలినీ పాండే) ఇంటికి వెళ్లిన అర్జున్ రెడ్డి... అక్కడ ఆమెను ముద్దు పెట్టుకోవడం.. అది చూసి ప్రీతి నాన్న గొడవపెట్టుకోవడంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. (చదవండి: రజనీకాంత్‌తో సినిమా.. రాజమౌళి స్టేట్మెంట్, ‘ఆర్ఆర్’కి చాన్స్ ఉందా?) ‘అమ్మ, నాన్న, నానమ్మ .. ఒక పది రోజుల తర్వాత వాళ్లను కలిస్తే.. నాకు హగ్ ఇచ్చి కిస్ పెట్టుకునేవాళ్లురా. ఆ రోజు ప్రీతికి ఇచ్చింది అలాంటి కిస్సే. వేరే ఉద్దేశంతో కాదు. దాన్ని ఆమె తండ్రి తప్పుగా అర్థం చేసుకున్నాడు’అంటూ విజయ్ చెప్పే డైలాగ్‌తో ఆ వీడియో మొదలవుతుంది. ఈ డిలీట్ సీన్‌ని దర్శకుడు సందీప్ వంగా ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘అర్జున్‌రెడ్డి’కి ఐదేళ్లు. ఈ సందర్భంగా ఈ సీన్‌ని షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. చిత్రబృందానికి నా కృతజ్ఞతలు’అని రాసుకొచ్చాడు. ఆసక్తికరమైన ఈ డిలీటెడ్ సీన్‌పై ఓ లుక్కేయండి. 5 years for ARJUN REDDY 🙂 Very happy to share this scene 🙏 Thanks to the entire cast & crew🙏@TheDeverakonda #ShaliniPandey @eyrahul @VangaPranay @VangaPictures @rameemusic @Synccinema#5yearsforarjunreddy https://t.co/3qiQhM3YvW — Sandeep Reddy Vanga (@imvangasandeep) August 25, 2022 -
రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ బలపడదు
సాక్షి, హైదరాబాద్: రేవంత్ నాయక త్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాదని,, ఆ పార్టీని వీడి వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేసిన కల్వకుర్తికి చెందిన యువనేత చీమర్ల అర్జున్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం లోటస్ పాండ్‌లోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో తన అనుచరులతో కలిసి చీమర్ల అర్జున్ రెడ్డి పార్టీలో చేరారు. ఆయనకు షర్మిల కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం అర్జున్‌రెడ్డి మాట్లాడుతూ.. మొదట పాలేరు.. ఆ తర్వాత కుల్వకుర్తిలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని అర్జున్ రెడ్డి జోస్యం చెప్పారు. చదవండి: కాంగ్రెస్‌లోకి చెరుకు సుధాకర్.. మునుగోడు కోసమేనా? -
లిప్ లాక్ ఫోటోతో పెళ్లి అనౌన్స్ చేసిన ప్రముఖ కమెడియన్
ప్రముఖ టాలీవుడ్ యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కాబోయే భార్యకు ముద్దు ఇస్తున్న ఫోటోను షేర్చేస్తూ.. త్వరలోనే పెళ్లి అంటూ అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. అసలైన జాతిరత్నానివి నువ్వు.. అర్జున్ రెడ్డి స్టైల్లో చెప్పినవ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకూ డజనుకు పైగా చిత్రాల్లో నటించిన రాహుల్ రామకృష్ణకు అర్జున్ రెడ్డితో పాటు గీత గోవిందం, హుషారు,ఆర్ఆర్ఆర్ తదితర చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. రాహుల్ నటించిన 'కృష్ణ వ్రింద విహారి', 'విరాటపర్వం' సినిమాలు ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. Getting married, finally, soonly! pic.twitter.com/o4Fg5XlsT6 — Rahul Ramakrishna (@eyrahul) May 7, 2022 -
‘అర్జున్ రెడ్డి’ ముద్దుగుమ్మ రైజా విల్సన్ (ఫోటోలు)
-
హీరోకు జబ్బు.. నిర్మాతకు డబ్బు
-
అర్జున్ రెడ్డి @ 4
-
‘అర్జున్‌రెడ్డి’ని వదులుకున్నందుకు బాధపడుతోన్న హీరోయిన్
Parvathy Nair Missed Arjun Reddy Movie: అన్ని కథలు అందరికీ నచ్చవు. అందుకే తారలు కొన్ని ప్రాజెక్టులకు ఓకే చెప్తారు, మరికొన్నింటిని సున్నితంగా తిరస్కరిస్తారు. అయితే తిరస్కరించిన సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్లుగా రికార్డు సృష్టించినప్పుడు మాత్రం అనవసరంగా మంచి అవకాశం చేజార్చుకున్నామే అని నాలుక్కరుచుకుంటారు. ఇలాంటి అనుభవమే ఎదుర్కొంది హీరోయిన్ పార్వతీ నాయర్. టాలీవుడ్లో సంచలన విజయం నమోదు చేసుకున్న అర్జున్‌రెడ్డిని చేజేతులా వదిలేసుకుంది. తనను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని కాలితో తన్నేసుకున్నట్లైందని ఇప్పటికీ బాధపడుతోంది. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన ఆమెను ఓ అభిమాని 'అర్జున్ రెడ్డిలో రొమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉన్నాయనే మీరు ఆ సినిమాకు నో చెప్పారా? ఆ మూవీని వదులుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నారా?' అని ప్రశ్నించాడు. దీనికి పార్వతీనాయర్ బదులిస్తూ.. 'అవును, నిజమే. కానీ అర్జున్‌రెడ్డి ఓ మంచి చిత్రం. ఆ సినిమాను వదులుకోకుండా ఉంటే బాగుండేది. అలాంటి మంచి సినిమా అవకాశాలు ఇంకా వస్తాయని ఆశిస్తున్నాను' అని పేర్కొంది. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు ముసురుకున్నప్పటికీ మంచి వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రం హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, షాలిని పాండేకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాతో రౌడీ హీరో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇది హిందీలో కబీర్ సింగ్, తమిళంలో ఆదిత్మ వర్మ పేరుతో రీమేక్ అవగా అక్కడ కూడా హిట్ కొట్టింది. -
‘అర్జున్ రెడ్డి’లా పవన్ కల్యాణ్.. ఓల్డ్ పిక్ వైరల్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు యూత్‌లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. ఫ్యాన్స్ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. హిట్లు ప్లాప్‌లకు అతీతంగా ఆయన ప్రయాణం కొనసాగుతోంది. తొలి సినిమా నుంచే ఆయన ప్రత్యేకమైన అభిమానుల సంపాదించుకున్నాడు. అప్పట్లో పవన్ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ ఓ సెన్సేషన్. తాజాగా అప్పటి పవన్ కల్యాణ్ స్టైల్ గురించి చర్చించుకుంటున్నారు ఆయన అభిమానులు. దానికి కారణం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఓల్డ్ ఫోటోనే. అచ్చం అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండను పోలి ఉన్న పవన్ అన్ సీన్ పిక్ నిన్న సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.దాన్ని మళ్లీ రకరకాల ఎడిట్స్ లో కూడా షేర్ చేసుకుంటు పాత పవన్ ను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఇక సినిమా విషయాలకొస్తే.. అజ్ఞాతవాసి సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న పవన్.. ఇటీవల ‘వకీల్ సాబ్’తో రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 30 శాతం పూర్తయింది. దీంతో పాటు ‘అయ్యప్పనుమ్ కోషియం’రీమేక్ చిత్రంలో నటిస్తున్నాడు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి రానా కీలకపాత్రలో నటిస్తున్నాడు. చదవండి: నా హృదయం ఉప్పొంగిపోయింది: మహేశ్‌బాబు -
ఫ్యామిలీకి దగ్గరయ్యేలా...
‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్ పంజా హీరోగా మూడో సినిమా షురూ అయింది. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్‌ను తెరకెక్కించిన గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు. కేతికా శర్మ హీరోయిన్ . బాపినీడు సమర్పణలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వైష్ణవ్ తేజ్ తల్లి విజయ దుర్గ కెమెరా స్విచాన్ చేయగా, ఆయన సోదరుడు, హీరో సాయితేజ్ క్లాప్ ఇచ్చారు. ‘‘ఉప్పెన’తో యూత్‌కు దగ్గరైన వైష్ణవ్‌ను ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర చేసే కథతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రూపొందించనున్నాం’’ అన్నారు బీవీయస్‌యన్ ప్రసాద్. -
సెట్స్‌పైకి వైష్ణవ్ కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరంటే..
తొలి సినిమా ఉప్పెన తోనే బాక్సాఫీస్ బద్దలు కొట్టిన హీరో వైష్ణవ్ తేజ్. తొలి చిత్రంతోనే తనదైన నటనతో సముద్రమంత క్రేజ్ సంపాదించుకొని ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు. దీంతో వైష్ణవ్ తేజ్‌కి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. మెగా కాంపౌండ్ హీరో కోసం దర్శకనిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు. ఉప్పెన రిలీజ్ కాకముందే క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాను పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరపుకుంటోంది. ఇందులో వైష్ణవ్‌కు జోడీగా రకుల్ ప్రీత్ నటించింది. ఇప్పటికే పలు సినిమాలు వైష్ణవ్ చేతిలో ఉన్నాయి. తాజాగా వైష్ణవ్ చేస్తున్న మూడో సినిమా గురించి అప్డేట్ వచ్చేసింది. అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్‌ను డైరెక్ట్ చేసిన గిరీశయ్యతో చేస్తున్న సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. శుక్రవారం సాయి ధరమ్ తేజ్ క్లాప్ కొట్టి ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో వైష్ణవ్ సరసన 'రొమాంటిక్' బ్యూటీ కేతిక శర్మ నటిస్తుంది. ప్రస్తుతం ఈమె ఆకాష్ పూరీ హీరోగా రూపొందుతున్న 'రొమాంటిక్' మూవీలోనూ నటిస్తుంది. తొలి సినిమాతోనే లక్కీ హీరో అనిపించుకున్న వైష్ణవ్‌తో సినిమా అనగానే కేతిక వెంటనే ఓకే చేసిందట. మరి రెండవ సినిమాతో వైష్ణవ్..మరో హిట్‌ను అందుకుంటాడా అన్నది చూడాల్సి ఉంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చదవండి : వైష్ణవ్ తేజ్ తొలి పారితోషికం ఎంతంటే? ‘ఉప్పెన’ డిలీటెడ్ సీన్.. ఆ అమ్మాయి కాళ్లు పట్టుకున్న వైష్ణవ్ -
బిగ్‌బాస్ కంటెస్టెంట్ ‘సైకిల్’
పునర్ణవి భూపాలం, మహత్ రాఘవేంద్ర శ్వేతావర్మ, సూర్య లీడ్‌రోల్స్‌లో ఆట్ల అర్జున్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సైకిల్'. గ్రే మీడియా బ్యానర్ పై, ఓవరసీస్ నెట్వర్క్ ఎంటర్టైన్మెంట్ విజయా ఫిలింస్, ఓంశ్రీ మణికంఠా ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం. సంక్రాంతి బరిలో పోటీకి దిగుతున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జనవరి 15న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అర్జున్‌రెడ్డి మాట్టాడుతూ... "భారతీయ సినిమాలో ఇంకా చెప్పటానికేం లేవు అన్నట్లుగా బోలెడన్ని కథలతో సినిమాలొచ్చాయి." "ఐనా కొత్త కథలు రాస్తున్నాం కొత్త సినిమాలు తీస్తున్నాం. ఆ ప్రయత్నంలోనే పుట్టిన్పప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంజన్‌కాని, ఇంధనం కానీ లేకుండా నడుస్తూ, మనతో కలిసి ప్రయాణిస్తున్న సైకిల్ పేరుని మా సినిమాకి టైటిల్‌గా పెట్టుకుని ఫస్ట్ సీన్లోనే దానికి సంబంధించిన ఇంట్రస్టింగ్ లింక్‌తో క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ తీశాము. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్స్‌తో పాటు సుదర్శన్, అనితా చౌదరి, క్యారెక్టర్స్ మ్యాజిక్ చేస్తాయి. వీళ్లతోపాటు, సూర్య, మధుమణి నవీన్‌నేని, ఆర్ఎక్స్ 100 లక్ష్మణ్, అన్నపూర్ణమ్మ జోగీబ్రదర్స్ కూడా చాలా ఎంటర్టైన్ చేస్తారు. కామెడీ జోనర్ సినిమాకి బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ మ్యాజిక్ యాడ్ ఐతే, ఎంత కొత్తగా వుంటుందో, మా చిత్రంతో చూస్తారు" అని తెలిపారు. (చదవండి: స్వర్గంలో అడుగుపెట్టి 15 ఏళ్లు: రామ్) ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు చేరువగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో 90 స్క్రీన్లలో విడుదల చేస్తోంది చిత్రయూనిట్. త్వరలో టీజర్‌తోపాటు, ఆడియో రిలీజ్ చేసుకుని ధియేటర్స్‌లోకి రాబోతున్న ఈ సినిమాకు నిర్మాతలు, పి.రాంప్రసాద్, డి.నవీన్‌రెడ్డి, సహనిర్మాతఃవి.బాలాజీరాజు, కెమెరాఃసిద్ధంమనోహర్, సంగీతంః జి.ఎం.సతీష్, ఎడిటింగ్ః గడుతూరిసత్య, ఆర్ట్ః రామ్‌కుమార్, పిఆర్వో శ్రీ, పబ్లిసిటీ డిజైనర్ ఓంకార్ కడియం. (చదవండి: ఈ హ్యాపీనెస్ ఏమిటి? ఎట్లా ఇట్లా అయితే?: కత్తి మహేష్) -
విజయ్ ఎదురుగానే అర్జున్ రెడ్డిని ఏకిపారేసిన నటి
‘అర్జున్ రెడ్డి’ విడుదలై రెండేళ్లు అయినా ఆ సినిమాపై వివాదాలు మాత్రం ఇంకా రాజుకుంటూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని కబీర్ సింగ్ పేరుతో హిందీలోనూ తెరకెక్కించడంతో విమర్శకులు మండిపడిన విషయం తెలిసిందే. ఈ చిత్రాలపై మలయాళ నటి పార్వతీ మీనన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఒక నటిగా తానైతే ఆ సినిమాల్లో నటించేదాన్నే కాదంటూ కుండబద్ధలు కొట్టారు. తాజాగా గోవా ఫిల్మ్ ఫెస్ట్‌వల్ వేదికలో విజయ్ దేవరకొండ ఎదురుగానే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఒక సినిమా చూస్తే అది విషాదంగా ఉన్నా అక్కడే వదిలేస్తాం. అయితే అర్జున్‌రెడ్డి సినిమాలో హీరో మహిళను చెంపదెబ్బ కొడతాడు. దానికి యూట్యూబ్‌లో వచ్చిన కామెంట్లు చూసి షాకయ్యాను. ఈ సినిమాలో హింస ఎక్కువగా ఉండి, యువతను ప్రేరేపించేదిగా ఉంది. అయితే ఒక నటిగా ఈ సినిమాలో భాగం కాకుండా మాత్రమే ఉండగలను కానీ దర్శకుడిని సినిమా చేయవద్దని చెప్పలేను’ అని పార్వతి పేర్కొన్నారు. అయితే తనకు ఎదురొచ్చిన వాళ్లను చంపేసుకుంటూ పోయే జోకర్ సినిమా మాత్రం వాస్తవాలను చూపించిందనడం గమనార్హం. నటి పార్వతీ మీనన్ వ్యాఖ్యలపై హీరో విజయ్ స్పందిస్తూ.. ‘ఈ వార్తలు చూస్తుంటే చిరాకు పుడుతోంది. ప్రేమలో ఉన్నప్పుడు చిన్నపాటి ఘర్షణలు సహజం.. అది ప్రేమజంటకు అర్థమవుతుంది. అయినా దాన్ని ఎందుకు పెద్దదిగా చూస్తున్నారో అర్థం కావట్లేదు. ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉన్నప్పుడు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. పార్వతిని, ఆమె చేసే పనిని నేను ఇష్టపడతాను. ఆమె ప్రశ్నల వెనుక ఉన్న ఆంతర్యాన్ని నేను అర్థం చేసుకోగలను. కొన్నిసార్లు ఆమె మాటలతో ఏకీభవిస్తాను. కానీ సోషల్ మీడియా హడావుడే తనకు చికాకు కలిగిస్తోందన్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావట్లేదు’ అంటూ చివరాఖరకు సోషల్ మీడియాపై ఫైర్ అయ్యాడు రౌడీ. -
ఆదిత్య వర్మను ఢీ కొట్టనున్న మాగీ
ఆదిత్య వర్మ చిత్రంతో పోటీకి మాగీ చిత్రం సిద్ధం అవుతోంది. నటుడు విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఆదిత్యవర్మ. ఈ చిత్రం 22న తెరపైకి రానుంది. కాగా ఆదిత్య వర్మతో పోటీ పడుతోంది మాగీ చిత్రం. సాయిగణేశ్ పిక్చర్స్ పతారంపై ఆర్.కార్తికేయన్ జగదీశ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం మాగీ. రియా, నిమ్మి, హరిణి ముగ్గురు కథానాయికలు నటించిన ఈ చిత్రంలో డౌట్ సెంథిల్, తిథియన్ కథానాయకులుగా నటించారు. రేయ, లియో, చిన్నసామి, మన్నై సాధిక్, ప్రదీప్, సాయి, జీవా, తిలక్ శంకర్, వీరలక్ష్మి, విజయరాఘవ్, పొన్.కరుణ, సాయిరాం ముఖ్యపాత్రల్లో నటించారు. మణిరాజు ఛాయాగ్రహణం, ప్రభాకరన్ మెయ్యప్పన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయ్యింది. చిత్ర వివరాలను దర్శక, నిర్మాత తెలుపుతూ చిత్రాన్ని పూర్తిగా కొడైకెనాల్, ఆ చుట్టు పక్క ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్రం జనరంజకమైన అంశాలతో పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ అలరించే విధంగా ఉంటుందన్నారు. హర్రర్‌తో కూడిన నూరు శాతం వినోదభరిత కథాచిత్రంగా మాగీ ఉంటుందని తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న చిత్రాన్ని ఈ నెల 22న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఆదిత్య వర్మకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ కోలీవుడ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. అందులోనూ చియాన్ విక్రమ్ వారసుడు తెరంగేట్రం చేస్తున్న చిత్రం కావడంతో ఆదిత్య వర్మపై భారీ అంచానాలే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో వినూత్న కథతో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన మాగీ.. ఆదిత్య వర్మను ఢీ కొట్ట బోతోంది. మరి ప్రేక్షకులు ఏ చిత్రాన్ని ఆదరిస్తారో.. బాక్సీఫీస్ వద్ద ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. ఇక తెలుగులో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన ‘అర్జున్ రెడ్డి’ తమిళ రిమేక్‌గా ‘ఆదిత్య వర్మ’ వస్తున్న విషయం తెలిసిందే. -
దీపికా, అలియాలతో విజయ్ దేవరకొండ సందడి
‘అర్జున్‌రెడ్డి’ సక్సెస్‌తో టాలీవుడ్లో క్రేజీ హీరో అయ్యాడు విజయ్‌దేవరకొండ. సినిమాలలో, అడియో రిలీజ్ ఫంక్షన్లతో పాటు పలు సినిమా కార్యక్రమాలలో తనదైన రీతి మాట్లాడుతూ తనకుంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్నాడు. టాలీవుడ్లో వరస విజయాలతో దూసుకుపోతూ మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు ఈ ‘గీత గోవిందం’ హీరో. ఇక బాలీవుడ్ నిర్మాత కరణ్‌జోహర్ అర్జున్‌రెడ్డిని హీందీలో రీమేక్‌లో నటించమని అడగడంతో విజయ్ క్రేజ్ మరింత పెరిగింది. అలాగే ఇటీవల విజయ్ నటించిన డియర్ కామ్రేడ్‌ను కూడా కరణ్ హీందీలో రీమేక్ చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో విజయ్‌కి టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్‌కు కూడా సుపరిచితుడయ్యాడు. ఈ క్రమంలో ఈ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ హీరోకి బాలీవుడ్లో ఆఫర్లు కూడా వస్తున్నాయంటా. అయితే ప్రస్తుతం టాలీవుడ్లో బీజీగా ఉండటంతో బీటౌన్‌కి వెళ్లడానికి కాస్త సమయం పడుతుందని చెపుకొస్తున్నాడు రౌడీ. తాజాగా ఇంటర్నేషనల్ సింగర్ ‘క్యాటీ పెర్రి’ మ్యుజిక్ షో కోసం ముంబాయిలోని వన్ప్లేస్ హోటల్లో ఏర్పాటు చేసిని పార్టీకి నిర్మాత కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఈ పార్టీకి విజయ్ దేవరకొండకు కూడా ఆహ్వనం అందింది. ఇక ఈ పార్టీకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, కైరా అద్వానీ, దీపికా పదుకోన్, జాక్వేలిన్ ఫేర్నాండేస్, హీరో రణ్వీర్ సింగ్ తమిళ హీరో విజయ్ సేతుపతి, అర్జున్ కపూర్, సిధ్దార్థ చతుర్వేది, అభిషేక్ బచ్చన్‌లతో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. ఈ క్రమంలో విజయ్ను అలియా భట్ హాయ్ అంటూ పలకరించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. కాగా ప్రేమకథగా తెరకెక్కుతున్న రౌడీ తాజా సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో నలుగురు హీరోయిన్స్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నట్లు సమాచారం. View this post on Instagram Vijay deverakonda ❣️ Vijay ❤️ Follow me @thedeverakondaf Follow me @thedeverakondaf _______________⏫_______________ Turn on Post Notification 🔔 _______________⏫_______________ Follow me @thedeverakondaf Follow me @thedeverakondaf _______________⏫______________ #arjunreddyfever #arjunreddy😎 #arjunreddy #arjunreddymania #shalinipandey #vijay #vijayfans #vijaydeverakonda # #rowdywear #kajal #rowdies #rowdy #rowdyclub #geethagovindam #NOTA # #ajith #tamil #taxiwaala #teluguactress rajini #dearcomrade #alluarjun #prabhas #samantha #bollywoodactress #tamilactress #kollywoodcinema #thedeverakondafc _________________________________ Follow me @thedeverakondaf Follow me @thedeverakondaf @thedeverakonda A post shared by Vijay Deverakonda🔵 (@thedeverakondaf) on Nov 15, 2019 at 12:57am PST -
‘ఆయన లేకుంటే.. ఇక్కడ ఉండేవాడిని కాదు’
తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ద్రువ్ విక్రమ్ తెలుగు ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘అదిత్య వర్మ’తో వెండితెరకు పరిచయం కానున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ద్రువ్తో కలిసి సినిమాను ప్రమోట్ చేయడంలో విక్రమ్ కూడా బీజీ అయిపోయారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘అదిత్య వర్మ’ ద్రువ్కు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని తాను గట్టిగా నమ్ముతున్నానని అన్నారు. ద్రువ్ సినిమా కెరీర్‌కు అదిత్య వర్మ సరైన చిత్రం అన్నారు. తెలుగు అర్జున్ రెడ్డి చుశానని అది నాకు బాగా నచ్చిందని, ఈ సినిమా పలు బాషాల్లో రీమేక్ అవ్వడం సవాలుతో కూడుకున్న విషయం అన్నారు. అందుకే నిర్మాత ముఖేష్ మెహతా అర్జున్ రెడ్డి మిళ రీమేక్‌కు ద్రువ్‌ను ఎంచుకున్నారని విక్రమ్ అన్నారు. ఇక గిరిసయ్య దర్శకత్వం వహిస్తున్న అదిత్య వర్మ షూటింగ్‌ను పూర్తి చేసుకుని నవంబర్ 21వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు అర్జున్ రెడ్డి హీరోయిన్ ప్రీతి పాత్రలో బనితా సింధు అదిత్య వర్మతో తమిళ తెరంగేట్రం చేయగా, ప్రియానంద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా గత నెలలో జరిగిన అదిత్య వర్మ అడియో లాంచ్‌లో ద్రువ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో తాను నటించడానికి మా నాన్న విక్రమ్ చాలా శ్రమించారు. ఆయనకు నా కృతజ్ఞతలు. అలాగే ‘నా తండ్రి అంకితాభావం ఉన్న నటుడని నాకు తెలుసు, మా నాన్న ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. ఆయన ప్రోత్సహం, ప్రమేయం లేకుంటే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదని’ అన్నాడు. -
నాన్న పదేళ్ల స్ట్రగుల్ చూశా!
సినిమా: తన తండ్రి 10 ఏళ్ల స్ట్రగుల్స్‌ను అనుభవించినట్లు ఆయన వారసుడు ధ్రువ్ విక్రమ్ పేర్కొన్నారు. ఈయన కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ఆదిత్యవర్మ. ఇది తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్ అన్న విషయం తెలిసిందే. ధ్రువ్ విక్రమ్‌కు జంటగా భవితసంధు నటించిన ఇందులో నటి ప్రియాఆనంద్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం ఈ నెల 8న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరోహీరోయిన్లు ధ్రువ్‌విక్రమ్, భవితసంధు బుధవారం సాయంత్రం విలేకరులతో ముచ్చటించారు. నటుడు ధ్రువ్ ముచ్చట్లు చూద్దాం.. ప్ర: ఆదిత్యవర్య చిత్రం గురించి చెప్పండి? జ: ఆదిత్యవర్మ చిత్రం చాలా కేర్‌ఫుల్‌గా యూనిట్ అంతా కలిసి శ్రమించిన చిత్రం ఇది. ప్ర:అర్జున్‌రెడ్డి చిత్రాన్ని ఎంచుకోవడానికి కారణం? జ: నాకు హీరో పాత్ర హ్యాబిట్. నాకు చాలెంజింగ్ అనిపించింది. ప్ర: చిత్రంలో హీరోయిన్‌తో లిప్‌లాక్ సన్నివేశాలు గురించి? జ: అవన్నీ స్క్రిప్ట్‌లో భాగంగానే చేశాం. భవితసంధు చాలా బాగా నటించింది. ప్ర:చిత్రం చూశారా? జ:నేనింకా చూడలేదు. నాన్న అయితే ఇప్పటికి వంద సార్లు చూసి ఉంటారు. ఆయన హ్యాపీ. ప్ర: మీ నాన్నగారిలో మీకు నచ్చిన విషయం? జ: ఆయన డెడికేషన్, తపన. పాత్ర కోసం పడే శ్రమ అన్నీ నన్ను ఆశ్చర్యపరిచేవే. అలా భవిష్యత్‌లో నేను కూడా చేస్తానోలేదో చెప్ప లేను. ఆయన ప్రారంభంలో నటుడిగా నిలదొక్కుకోవడానికి 10 ఏళ్లు స్ట్రగుల్స్ పడ్డారు. ప్ర: మీ నాన్న నటించిన చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రం? జ: నాన్న నటించిన చిత్రాలన్నీ బాగున్నాయి.సేతు, పితామగన్, బీమ, దూళ్ అన్నీ నచ్చాయి. ప్ర: మీ నాన్న నటించిన చిత్రాల రీమేక్‌లో ఏ చిత్రంలో నటించాలని కోరుకుంటున్నారు? జ: భీమ చిత్ర రీమేక్ చేస్తే అందులో నటించాలని ఆశగా ఉంది. ప్ర:నాన్నతో కలిసి నటించనున్నట్లు ప్రచారం జరగడం గురించి? జ: దర్శకుడు వెట్రిమారన్ నాన్నను కలిసి మా ఇద్దరితో చిత్రం చేయాలని చెప్పారు. మాకోసం ఆయన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లున్నారు. అది నాన్నకు వినిపించారు.అయితే ఇంకా ఫైనలైజ్ కాలేదు. ప్ర:మీకు నచ్చిన నటుడు? జ: నాకు అందరు నటులు ఇష్టమే.అయితే అందరికంటే నాన్న ఎక్కువ ఇష్టం. ప్ర: మీరు నటించే చిత్రాల కథలను మీరే ఎంపిక చేసుకుంటారా? మీ నాన్న సెలెక్ట్ చేస్తారా? జ: ప్రస్తుతానికి అలాంటి సందర్భం రాలేదు. అయితే కథ నాకు నచ్చితే ఆ తరువాత నాన్న దృష్టికి తీసుకెళ్లతాను. ప్ర:తదుపరి చిత్రం? జ: ఇంకా ఏ చిత్రాన్ని అంగీకరించలేదు. ఆదిత్యవర్య చిత్రంపైనే నా దృష్టి అంతా. ఈ చిత్రం విడుదలైన తరువాత కొత్త చిత్రంపై దృష్టిసారిస్తాను -
సీన్ టు సీన్ అర్జున్‌రెడ్డే..!!
తెలుగులో అర్జున్‌రెడ్డి.. హిందీలో కబీర్ ఖాన్.. ఇప్పుడు తమిళంలో ఆదిత్యవర్మ. తెలుగు నాట సూపర్‌హిట్ అయిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా హిందీలోనూ ‘కబీర్ సింగ్’గా ప్రేక్షకుల ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. హిందీలోనూ ఈ సినిమా కథ మీద, ఈ సినిమాలో హీరో పాత్రను చూపించిన తీరు మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ భారీ వసూళ్లతో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచి ‘కబీర్ సింగ్’ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఇదే కథ త్వరలో తమిళ ప్రేక్షకులను ‘ఆదిత్య వర్మ’గా పలుకరించనుంది. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించారు. ఆయన సరసన బనితా సంధు కథానాయికగా నటించింది. అర్జున్ రెడ్డి కథ మనకు తెలిసిందే. అచ్చం తమిళంలోనూ సీన్ టు సీన్ అదే కథను తెరకెక్కించినట్టు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. కానీ, ఈ ట్రైలర్లో ధ్రువ్ తనదైన ఒరిజినల్, ఇంటెన్స్, రా నటనతో ఆకట్టుకున్నాడు. ప్రేమలో విఫలమైన వైద్యుడిగా, డ్రగ్, ఆల్కాహల్ ఆడిక్ట్గా ఎమోషనల్ సీన్లలో తనదైన నటనను కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ తమిళ ట్రైలర్‌పై ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయినట్టు కనిపిస్తోంది. అన్నట్టు, బాలా దర్శకత్వంలో అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్‌ను పూర్తిస్థాయిలో తెరకెక్కించిన తర్వాత.. అది బాగా రాలేదని నిర్మాతలు పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త దర్శకుడు గిరాషాయా దర్శకత్వంలో మళ్లీ పూర్తిస్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించారు. బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిత్యవర్మ’ టీజర్లో తమిళ నేపథ్యానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసినట్టు కనిపించింది. కానీ ఇప్పుడు కొత్త దర్శకుడు తీసిన ట్రైలర్లో మాత్రం పూర్తిగా ‘అర్జున్‌రెడ్డి’ యథాతథంగా కనిపిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. -
నాన్న లేకుంటే నేను లేను
సినిమా: నాన్న లేకుంటే తాను లేను అని పేర్కొన్నారు నవ నటుడు ధ్రువ్ విక్రమ్. నటుడు విక్రమ్ వారసుడైన ఈయన కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ఆదిత్యవర్మ. తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి ఇది రీమేక్. ఇందులో ధ్రువ్ విక్రమ్‌కు జంటగా బనిత, ప్రియా ఆనంద్, అన్భుదాసన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. గిరిసాయి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందించారు. కాగా ఆదిత్యవర్మ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఉదయం చెన్నైలోని సత్యం థియేటర్లో జరిగింది. చిత్ర నిర్మాత ముఖేశ్ మెహతా మాట్లాడుతూ ఆదిత్యవర్మ చిత్ర షూటింగ్లో నటుడు విక్రమ్ ఎప్పుడు ఒక స్టార్ నటుడిగా నడుచుకోలేదన్నారు. 2021లో విక్రమ్, ధ్రువ్‌విక్రమ్ కలిసి నటించి మనల్ని ఆనందపరుస్తారని భావిస్తున్నానన్నారు. ధ్రువ్ విక్రమ్ మాట్లాడుతూ తాను పలు పాఠాశాలల్లో, కళాశాల్లో ప్రసంగించానన్నారు. అయితే ఈ వేడుక కొంచెం ప్రత్యేకం అన్నారు. కారణం తన కుటుంబం ఇక్కడ ఉందన్నారు. చిత్ర దర్శకుడు గిరిసాయి, సహ దర్శకుడి గురించి ధ్రువ్ విక్రమ్ మాట్లాడుతూ ప్రారంభం నుంచి ఈ చిత్రానికి ప్రతిభావంతులు ఉండడం చూసి ఘనతగా భావించానన్నారు. తన తండ్రి విక్రమ్ గురించి చెప్పడానికి మాటలు లేవన్నారు. ఈ చిత్రానికి అంకితభావం 100 శాతం అని చెప్పారు. తన తండ్రి మంచి నటుడన్నదానికంటే మంచి తండ్రి అన్నదే తనకు తెలుసన్నారు. నటుడు విక్రమ్ మాట్లాడుతూ ధ్రువ్ మాదిరి మాట్లాడడం తనకు రాదన్నారు. తనకు 12వ తరగతి పరీక్ష ఫలితాల కోసం వేచి ఉన్నప్పుడో, తాను నటించిన సేతు చిత్రం విడుదల కోసం ఎదురు చూసినప్పుడో ఎలాంటి ఆందోళనకు గురి కాలేదన్నది ఒప్పుకుంటున్నానన్నారు. ఇప్పుడే కాదు, కొద్ది రోజులుగా తాను చాలా ఆందోళన చెందుతున్నానన్నారు. ఈ చిత్రంలో ధ్రువ్‌ను కథానాయకుడిగా ఎంచుకున్నందుకు, అతనిపై నమ్మకం పెట్టినందుకు నిర్మాత ముఖేష్ మెహతాకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. దర్శకుడు గిరిసాయి, సహ దర్శకుడు షరియా లేకుంటే ఈ చిత్రం సాధ్యం అయ్యేది కాదని పేర్కొన్నారు. -
వైరల్ ట్రైలర్స్
‘‘ప్రైవేటైజేషన్ ఈజ్ టేకింగోవర్. పూర్ స్టేయింగ్ పూర్ అండ్ రిచ్ బికమింగ్ రిచర్’’.జార్జిరెడ్డి మాట్లాడుతున్నాడు.‘‘.. బీయింగ్ అగైనెస్ట్ దిస్, వి హ్యావ్ రైజ్డ్ అవర్ వాయిస్ టు ప్రొటెస్ట్.. బట్ అవర్ ప్రొటెస్ట్ హ్యాజ్ రిమెయిన్డ్ అన్హర్డ్..’’(పేదోడు పేదోడిగానే ఉండిపోతున్నాడు. ఉన్నోడు ఇంకా ఇంకా ఉన్నోడు అయిపోతున్నాడు. దీనిపై మేము గళం విప్పాం. పిడికిలి బిగించాం). ఉస్మానియా విశ్వవిద్యాలయం 1967. హాస్టల్ డైనింగ్ హాల్. ‘‘మనం తిన్న ప్లేట్లల్ల ఉప్పేసి కడుగుతరు ఈ నా కొడుకులు. తినండ్రా మీరు తిన్నంక అదే ప్లేట్లల్లో ఉచ్చ పోసి కడుగుత..’’అన్నం పరబ్రహ్మ స్వరూపం. వర్ణం? మనుధర్మ వికృతరూపం. తింటున్న ప్లేట్లు గాల్లోకి లేచాయి. ‘‘రేయ్.. ఏం కూశావ్‌రా’’ అగ్రవర్ణం పైకి లేచింది. జార్జిరెడ్డి కూడా పైకి లేచాడు. తనది ఏ వర్ణమో అతడు చూసుకోలేదు. ‘ఉచ్చపోసి కడుగుతా’ అని అరిచిన ‘అధమ’ వర్ణం వైపు నిలబడ్డాడు! ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో అమిత్గాడి హాస్టల్‌కి వెళ్లి మరీ వాడి ముక్కూమూతి పగలగొట్టినట్లు.. ‘ఏం కూశావ్‌రా..’ అని అధమ వర్ణంపైకి లేచిన అగ్రవర్ణం ముక్కు బద్దలు కొట్టాడు జార్జిరెడ్డి.‘‘ఈ దేశంలో పుట్టి, ఈ దేశం గాలి పీల్చి, ఈ దేశం కోసం పోరాడుతున్న విద్యార్థులారా.. యుద్ధానికి సిద్ధం కండి. భారత్ మాతాకీ జై.’’క్యాంపస్‌లోకి అవుట్ సైడర్స్! టార్గెట్ జార్జిరెడ్డి!‘‘ఎవరు వాడు?’’.. పొలీస్ ఇన్స్పెక్టర్ అడిగాడు.‘‘ఎవడో కొత్త కుర్రోడు సార్. పేరు జార్జిరెడ్డి’’.. ముఖం పచ్చడైన భరతమాత ముద్దుబిడ్డ ఒకడు చేతులు కట్టుకుని చెబుతున్నాడు.‘‘ఎనీ బడి కెన్ సాల్వ్ దిస్?’’.. ఫిజిక్స్ క్లాస్ రూమ్‌లో లెక్చరర్ అడిగాడు. జార్జిరెడ్డి చెయ్యెత్తాడు. క్లాసయ్యాక క్లాస్మేట్ అడిగాడు.. ‘‘నిజం చెప్పు డబుల్ ఎమ్మెస్సీ కదా!’’ జార్జిరెడ్డి నవ్వలేదు. నవ్వీ నవ్వనట్లు చూశాడు. క్యాంపస్‌లోకి మళ్లీ ఔట్ సైడర్స్. మళ్లీ జార్జిరెడ్డే టార్గెట్. వీడిని ఇలాగే వదిలేస్తే క్యాంపస్ చేజారిపోతుంది. ‘‘పోతేపోయింది.. ఆ నా కొడుకుల చేతిలోకి పోతుంది’’. కత్తులు, కర్రలు.. ఉస్మానియాలో ఉద్రిక్తత. కారణం.. మళ్లీ జార్జిరెడ్డి! ‘‘వన్ ఇయర్ రస్టికేట్ లెటర్ టైప్ చెయ్యండి’’.. వైస్ చాన్స్‌లర్ ఆర్డర్. ఇంటికొచ్చాడు జార్జిరెడ్డి. ‘‘నేను అనుకున్న క్యాంపస్ ఇది కాదమ్మా..’’ తల్లితో అన్నాడు. కానీ క్యాంపస్ అనుకున్న హీరో మాత్రం జార్జిరెడ్డే. రష్యన్ రివల్యూషన్ పుస్తకాన్ని కొడుకు చేతికిచ్చింది తల్లి. జార్జిరెడ్డి రీచార్జ్రెడ్డి అయ్యాడు. ‘‘జార్జిరెడ్డి దాదా అయిండన్నా.. ఔటర్స్ లోపలికి రావాలంటేనే భయపడుతున్నారు. అంతేకాదు.. అప్పర్ క్యాస్ట్ అంటే.. అసలు ఆలోచించకుండా కొడుతున్నాడు’’ ‘‘అసలు ఈడెవడు భయ్యా. నిన్నగాక మొన్నొచ్చాడు’’ వచ్చింది నిన్నగాక మొన్ననే. ఉండబోతున్నది ఉస్మానియా క్యాంపస్ ఉన్నంతకాలం. ‘‘స్కాలర్షిప్పులు రాకుండా చేసినా, ఏం చేసినా సరే.. గల్లా పట్టుకుని ప్రశ్నించండి.. రైజ్ యువర్ వాయిస్’’.. జార్జిరెడ్డి స్పీచ్‌కి క్యాంపస్‌లోని చెట్టు కూడా తలలు ఊపుతున్నాయి. ‘‘ఈ కాలేజేమైనా వాళ్ల అయ్యదా? తాతదా? ఎవరికి ఆయాసమొచ్చినా ఉరికొస్తుండు’’ ‘‘ఎవరో కనుక్కోండి’’ జార్జిరెడ్డి. మ్యాన్ ఆఫ్ యాక్షన్. ‘‘టుడే వాట్ వియ్ లెఫ్ట్ విత్ అజ్ ఈజ్ ఆర్గనైజింగ్ దిస్ అండ్ మీట్ వయొలెన్స్ విత్ వయొలెన్స్’’ జార్జిరెడ్డి మాట్లాడుతున్నాడు. ‘‘రైజ్ యువర్ వాయిస్. బిఫోర్ ద ట్రూత్ డైస్’’. జార్జిరెడ్డి కొట్లాడుతున్నాడు. ‘‘జీనా హైతో మర్నా సీకో.. కదమ్ కదమ్ పర్ లడ్నా సీకో’’. బతకాలంటే చావడం ఎలాగో నేర్చుకో. ప్రతి అడుగులోనూ పోరాడటం నేర్చుకో. రెండేళ్ల క్రితం ‘అర్జున్‌రెడ్డి’ సినిమా ట్రైలర్ ఎంత వైరల్ అయిందో.. ఇప్పుడు ‘జార్జిరెడి’్డ ట్రైలర్ అలాగే యూత్‌ని ఊపేస్తోంది. అర్జున్‌రెడ్డి లవ్ స్టోరీ. జార్జిరెడ్డి వార్ స్టోరీ. పేదరికంపై వార్. ప్రైవేటీకరణపై వార్. అగ్రవర్ణ ఆధిపత్యంపై వార్. ఉత్తమాటలపై వార్. చెత్త రాజకీయాలపై వార్. సమసమాజ స్థాపనే ధ్యేయంగా జీవించి, పోరాడి, అమరుడైన విద్యార్థి ఉద్యమ నాయకుడు జార్జిరెడ్డిపై ఈ సినిమాను తీస్తున్నది జీవన్‌రెడ్డి (‘దళం’ఫేమ్). జార్జిరెడ్డిగా నటిస్తున్నది సందీప్ మాధవ్ (‘వంగవీటి’ ఫేమ్). ఇది హిట్ కొట్టేలా కనిపిస్తోంది. కొట్టాలి. విద్యార్థి ఉద్యమ నిర్మాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1970వ దశాబ్దారంభంలో ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నిర్మాణానికి జార్జిరెడ్డి రాజకీయ పునాదులు వేశాడు. ఆ క్రమంలోనే 1972లో 25 ఏళ్ల వయసులో క్యాంపస్‌లోని ఇంజినీరింగ్ కాలేజ్ హాస్టల్ బయట ప్రత్యర్థి శక్తుల చేతుల్లో హత్యకు గురయ్యాడు. ఓయూ క్యాంపస్‌లో సామాజికంగా అట్టడుగు విద్యార్థులను చైతన్య పరచిన చరిత్ర జార్జిరెడ్డిది.