Rashmika Mandanna
-
షాకింగ్.. యూట్యూబ్ నుంచి పుష్ప 2 సాంగ్ డిలీట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. సినిమా విడుదలై 20 రోజులు దాటినా ఇప్పటికీ భారీ కలెక్షన్స్‌తో రికార్డులు సృష్టిస్తోంది. ఇక హిందీలో అయితే రూ. 700 కోట్లకు పైగా వసూళ్ల సాధించి.. అత్యధిక వేగంగా 700 కోట్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఓవరాల్‌గా ఇప్పటికే రూ.1600 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. త్వరలోనే 2 వేల కోట్ల క్లబ్‌లోకి చేరుతుందని ట్రేండ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వరుసగా వీడియో సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా మంగళవారం ‘దమ్ముంటే పట్టుకోరా’ అనే పాటను రిలీజ్ చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ పాటను అల్లు అర్జున్ ఆలపించగా.. సుకుమార్ లిరిక్స్ అందించాడు. టీ సీరిస్ తన యూట్యూబ్ చానల్లో ఈ పాటను రిలీజ్ చేయగా..అది కాస్త వైరల్ అయింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఈ పాటను యూట్యూబ్ నుంచి తొలగించారు.కాగా, అల్లు అర్జున్ను పోలీసులు విచారించిన రోజు డిసెంబర్ 24 సాయంత్రం ఈ సాంగ్‌ను టీ సిరీస్ విడుదల చేసింది. అయితే ఈ పాట పోలీసులను ఉద్దేశించే రిలీజ్ చేశారంటూ కొంతమంది నెటిజన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఆ కారణంతోనే పాటను యూట్యూబ్ నుంచి డిలీట్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరగుతోంది.కాగా, అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన పుష్ప 2 చిత్రం డిసెంబర్ 5న విడుదలై తొలి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఫహద్ ఫాజిల్ ఇందులో పోలీసు అధికారి షెకావత్ గా నటించాడు. పుష్ప రాజ్‌కు షెకావత్‌కి మధ్య జరిగే ఓ సన్నివేశంలో భాగంగానే ఆ పాట వస్తుంది. సినిమాలో సంభాషణలుగా చూపించిన మేకర్స్. . ఇప్పుడు అది పాట రూపంలో రిలీజ్ చేసి.. మళ్లీ డిలీట్ చేశారు. -
బాక్సాఫీస్ క్వీన్ గా మారిన రష్మిక
-
గౌనులో చిన్నపిల్లలా హన్సిక.. వింటేజ్ లుక్‌లో పుష్ప భామ
గౌనులో చిన్నపిల్లలా హన్సిక హోయలు..వింటేజ్ లుక్ డ్రెస్సుల్లో పుష్ప భామ రష్మిక..హీరోయిన్ శ్రియా శరణ్ స్మైలీ లుక్స్..దుబాయ్‌లో చిల్ అవుతోన్న కల్యాణి ప్రియదర్శన్..ట్రేడిషనల్ డ్రెస్‌లో యాంకర్ శ్రీముఖి.. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Genelia Deshmukh - जेनेलिया रितेश देशमुख (@genelia.deshmukh) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Vishnu Priya (@vishnupriyaaofficial) View this post on Instagram A post shared by Nayan🇮🇳 (@nayansarika_05) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) -
'పుష్ప 2' పీలింగ్స్ సాంగ్.. ఇబ్బందిగా ఫీలయ్యా.. కానీ.. : రష్మిక మందన్నా
పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ పుష్ప 2 మూవీ ఇప్పటివరకు రూ.1600 కోట్లపైనే వసూళ్లు రాబట్టింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది. ఈ మూవీలోని పాటలన్నీ కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే పీలింగ్స్ పాట మాత్రం కాస్త సంచలనానికి తెర తీసింది.పీలింగ్స్ పాటపై రష్మిక రియాక్షన్సాంగ్లోని కొన్ని స్టెప్పులపై సోషల్ మీడియా వేదికగా పలువురూ అభ్యంతరం తెలిపారు. మరికొందరేమో కొత్తగా ట్రై చేశారు, బాగుందంటూ మెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా పీలింగ్స పాటపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. 'పీలింగ్స్ రిహార్సల్ వీడియో చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయాను. అల్లు అర్జున్ సర్‌తో కలిసి డ్యాన్స్ చేశాను అని మురిసిపోయాను. నాకు ఆ ఫోబియా ఉందికానీ మొదట చాలా భయమేసింది. ఎవరైనా నన్ను ఎత్తుకుంటే భయమేస్తుంది. ఈ పాటలో బన్నీ సర్ నన్ను ఎత్తుకుని స్టెప్పేస్తాడు. మొదట అసౌకర్యంగా ఫీలయ్యాను. కానీ సుకుమార్, బన్నీ సర్ నన్ను ఆ ఇబ్బంది నుంచి బయటపడేశారు. ఒక్కసారి ఆయన్ను నమ్మాక అదేమంత ఇబ్బందిగా అనిపించలేదు. అంతా ఫన్‌గా జరిగిపోయింది.కొందరికి నచ్చకపోవచ్చునాపై నేనే డౌట్ పడితే నటిగా రాణించడం కష్టం. నేనున్నది జనాలను ఎంటర్టైన్ చేయడానికే! మరీ ఎక్కువ ఆలోచిస్తే నా కొమ్మను నేనే నరుకున్నట్లు అవుతుంది. అలా చేయడం నాకిష్టం లేదు. ఇకపోతే ఈ పాట కొందరికి నచ్చకపోవచ్చు. ప్రతీది అందరికీ నచ్చాలనేం లేదు' అని రష్మిక చెప్పుకొచ్చింది. చదవండి: 'సలార్' రిజల్ట్‌తో నేను హ్యాపీగా లేను: ప్రశాంత్ నీల్ -
'పుష్ప 2' సక్సెస్‌తో 2024కి రష్మిక సెండాఫ్
రష్మిక కెరీర్లోనే 2024 గుర్తుండిపోయే ఏడాది. ఇప్పుడు దీనికి సెండాఫ్ ఇచ్చేందుకు రెడీ అయింది నేషనల్ క్రష్. ఈ ఏడాది ఆమె 'పుష్ప 2' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వసూళ్లలో బాలీవుడ్‌లోనూ ఈ మూవీ సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తోంది. శ్రీవల్లిగా రష్మిక పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది.(ఇదీ చదవండి: పొరపాటు చేసి క్షమాపణ చెప్పిన రష్మిక)ప్రస్తుతం రష్మిక.. 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీతో బిజీగా ఉంది. రీసెంట్గా టీజర్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ 'సికందర్' మూవీలో ఈమెనే హీరోయిన్. 'పుష్ప 2' బ్లాక్ బస్టర్ కావడంతో రష్మిక ఫుల్ హ్యాపీ. వచ్చే ఏడాదిలోనూ గర్ల్ ఫ్రెండ్, కుబేర, సికందర్ తదితర చిత్రాలతో అలరించేందుకు రష్మిక రెడీ అయిపోయిందనే చెప్పాలి.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్) -
'పుష్ప 2'తో రేర్ ఫీట్ సాధించిన హీరోయిన్ రష్మిక (ఫొటోలు)
-
పొరపాటు చేసి క్షమాపణ చెప్పిన రష్మిక
'పుష్ప 2'తో మరో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన హీరోయిన్ రష్మిక.. సారీ చెప్పింది. తాను చేసిన పొరపాటు విషయంలో ఇలా చేసింది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు మూవీస్ విషయంలో కన్ఫ్యూజ్ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ రచ్చంతా జరిగింది. ఇంతకీ అసలేమైంది? రష్మిక సారీ ఎందుకు చెప్పింది?ప్రస్తుతం 'పుష్ప 2' సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న రష్మిక.. మిస్ మాలిని అనే యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూలో ఇచ్చింది. మీరు చూసిన తొలి సినిమా ఏది? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. తమిళ హీరో దళపతి విజయ్ 'గిల్లీ' అని చెప్పింది. అందుకే విజయ్ దళపతి అంటే తనకు ఇష్టమని చెప్పింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్)'నేను చూసిన ఫస్ట్ సినిమా గిల్లి. ఈ మూవీ పోకిరి చిత్రానికి రీమేక్ అని నాకు ఈ మధ్యే తెలిసింది. నాకు దాని గురించి తెలీదు. అయితే ఇందులో అప్పిడి పోడే పోడే సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. నా లైఫ్ మొత్తంలో ఆ పాటకు ఎన్ని సార్లు డ్యాన్స్ చేశానో కూడా తెలీదు' అని రష్మిక చెప్పింది.రష్మిక చెప్పిన సినిమాలు వేర్వేరు. ఎందుకంటే మహేశ్ బాబు 'ఒక్కడు' సినిమాకు రీమేక్‌గా తమిళంలో 'గిల్లీ' తీశారు. 'పోకిరి' సినిమాని అదే పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూ అనంతరం తను పొరబడ్డానని తెలుసుకున్న రష్మిక.. 'అవును. ఇంటర్వ్యూ అయిపోయాక గుర్తొచ్చింది' అని సారీ చెప్పింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)Avunu .. telusu sorry.. okka booboo aipoindi.. 🐒 interview ayipointarvata annukunna reyyyy ghilli is okkadu ra .. pokkiri is pokiri ani.. 🤦🏻♀️ social media lo ippudu estuntaaru ani.. sorry sorry my bad.. but I love all of their movies so it’s ok. 🐒— Rashmika Mandanna (@iamRashmika) December 21, 2024 -
ప్రేమ,పెళ్లిపై రష్మిక అలా.. విజయ్ ఇలా
సినీ నటుల వ్యక్తిగత జీవితాలపై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి విషయంలో రకరకాలు పుకార్లు పుట్టుకొస్తుంటాయి. ఇలాంటి గాసిప్లను కొంతమంది సీరియస్‌గా తీసుకొని ఖండిస్తుంటారు. మరికొంతమంది అయితే పెద్దగా పట్టించుకోరు. పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నప్పుడు ఇలాంటి కామన్లే అనుకొని వదిలేస్తుంటారు. విజయ్ దేవరకొండ ఆ కోవలోకి చెందిన హీరో అనే చెప్పాలి. ఆయన ప్రేమ, పెళ్లిపై చాలా రోజులుగా గాసిప్స్ వస్తునే ఉన్నాయి. ఓ స్టార్ హీరోయిన్‌తో రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. విజయ్ మాత్రం ఈ రూమర్స్‌ని పెద్దగా పట్టించుకోకుండా..తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. గతంలో ఒకసారి తన పెళ్లి గురించి వచ్చిన వార్తలను ఖండించాడు. ఆ తర్వాత చాలా గాసిప్స్ వచ్చిన స్పందించలేదు. చాలా రోజుల తర్వాత తాజాగా తన రిలేషన్షిప్ గురించి వస్తున్న వార్తలపై స్పందించాడు. ఓ జాతీయ మీడియాతో విజయ్ మాట్లాడుతూ..సమయం వచ్చినప్పుడు తానే తన రిలేషన్షిప్ గురించి మాట్లాడతానన్నాడు. ‘నా రిలేషన్షిప్ గురించి ప్రపంచానికి తెలియజేయాలని నాకు అనిపించినప్పుడు నేనే ఆ విషయాన్ని బయట పెడతా. దానికంటూ ఓ సమయం రావాలి. ఆ టైం వచ్చినప్పుడు నేనే సంతోషంగా ఆ విషయాన్ని అందరితో పంచుకుంటాను. నా డేటింగ్ విషయంపై వస్తున్న రూమర్స్‌ని నేను పెద్దగా పట్టించుకోను. పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నప్పుడు వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తారు. అది కూడా నా వృత్తిలో భాగంగానే భావిస్తాను. ఆ రూమర్స్ నాపై ఎలాంటి ఒత్తిడిని కలిగించవు. వార్తలను వార్తగానే చూస్తా’ అని విజయ్ అన్నారు. ఇక ప్రేమ గురించి మాట్లాడుతూ.. ‘అపరిమితమైన ప్రేమ ఉంటే..దానికి తోడుగా బాధ కూడా ఉంటుంది. మీరు ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి వస్తుంది’ అని విజయ్ చెప్పుకొచ్చాడు.ఇక మరో ఇంటర్వ్యూలో హీరోయిన్ రష్మిక మందన్నా తన ప్రేమ, రిలేషన్ గురించి మాట్లాడుతూ.. తనకు రాబోయే భాగస్వామి ఎలా ఉండాలో చెప్పింది. ‘లైఫ్ పార్ట్నర్ అనేవాడు అన్ని వేళలా నాకు తోడుగా నిలవాలి. కష్ట సమయంలో నాకు సపోర్ట్‌గా ఉండాలి. మంచి మనసు కలిగి ఉండాలి. ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి’ అని చెప్పింది. ఇక ప్రేమ గురించి మాట్లాడుతూ.. సా దృష్టింలో ప్రేమలో ఉన్నారంటే.. వాళ్లు తమ భాగస్వామితో కలిసి ఉన్నట్లే. జీవితంలో ప్రతి ఒక్కరికి తోడు కావాలి. తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనమే ఉండదు’ అని రష్మిక అన్నారు. -
బ్లాక్ బ్యూటీలా శ్రీవల్లి.. హాట్ హాట్‌గా ఉప్పెన భామ!
బ్లాక్ బ్యూటీలా శ్రీవల్లి లుక్స్..మరింత హాట్‌గా ఉప్పెన భామ కృతి శెట్టి!టోక్యో షూట్లో బిజీ బిజీగా సుహాసిని..సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన పూనమ్ బజ్వా..మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఆదితి గౌతమ్..అనసూయ డిసెంబర్ మెమొరీస్..న్యూ ఇయర్ మూడ్‌లో బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam | Actor (@aditigautamofficial) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Suhasini Hasan (@suhasinihasan) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
పుష్ప2 'పీలింగ్స్' సాంగ్ వీడియో విడుదల
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'పుష్ప2'. ఈ చిత్రం సాంగ్స్, ట్రైలర్, కలెక్షన్స్ ఇలా అన్నింటిలోనూ పలు రికార్డ్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి పీలింగ్స్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. సోషల్‌మీడియాలో ఈ పాట సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే మిలియన్ల కొద్ది రీల్స్ కూడా ఇన్‌స్టాలో వైరల్ అవుతున్నాయి.పుష్ప2 విజయంలో పాటలు కూడా ప్రధాన బలమని చెప్పవచ్చు. అల్లు అర్జున్, రష్మిక మందన్న స్టెప్పులకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పుష్ప2లో భారీ క్రేజ్‌ను అందుకున్న పీలింగ్స్ సాంగ్ వీడియో అన్ని భాషలలో రిలీజ్ కావడంతో యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది.విడుదలైన రోజు నుంచే 'పీలింగ్స్' సాంగ్ దూసుకుపోతోంది. ఈ పాటను చంద్రబోస్ రచించగా తెలుగులో (శంకర్ బాబు, లక్ష్మీ దాసా), హిందీలో (జావేద్ అలీ, మధుబంతీ) , తమిళంలో (సెంథిల్ గణేశ్, రాజలక్ష్మి) మలయాళంలో (ప్రణవమ్ శశి, సితార కృష్ణకుమార్) కన్నడలో (సంతోశ్ వెంకీ, అమల) ఆలపించారు. -
'ఈ పరిస్థితిని నమ్మలేకపోతున్నా'.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన శ్రీవల్లి!
అల్లు అర్జున్ అరెస్ట్‌పై పుష్ప హీరోయిన్ రష్మిక మందన్నా స్పందించింది. ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాలను తాను నమ్మలేకపోతున్నానంటూ ట్వీట్ చేసింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని తెలిపింది. ప్రతి విషయాన్నికి ఓకే వ్యక్తిని నిందించడం బాధాకరమైన విషయమన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉందని ట్వీట్ చేసింది.కాగా.. పుష్ప-2 రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ రోజు ఉదయం అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ కేసులో బన్నీకి హైకోర్డు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.I can’t believe what I am seeing right now.. The incident that happened was an unfortunate and deeply saddening incident.However, it is disheartening to see everything being blamed on a single individual. This situation is both unbelievable and heartbreaking.— Rashmika Mandanna (@iamRashmika) December 13, 2024 -
నా ఆరోగ్యం బాలేనప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపించాడు: రష్మిక
అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో కుబేర, చావ, సికిందర్, ద గర్ల్‌ఫ్రెండ్, థామ సినిమాలున్నాయి. ఇకపోతే సికిందర్ సినిమా విశేషాలను తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రష్మిక.ఆరోగ్యం బాగోలేకపోయినా..ఆమె మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్‌తో నటించడమనేది గొప్ప విషయం. ఆయన చాలా ప్రత్యేకమైన వ్యక్తి. అలాగే ఎంతో హుందాగా ఉంటాడు. ఒకసారి నాకు ఆరోగ్యం బాగోలేదు. అయినా షూటింగ్‌కు వెళ్లాను. నా పరిస్థితి తెలిసిన సల్మాన్ సర్ ఎలా ఉంది? అంతా ఓకేనా? అని ఆరా తీశాడు. స్పెషల్ కేర్మంచి హెల్తీ ఫుడ్, వేడి నీళ్లు అన్నీ ఏర్పాటు చేయమని అక్కడున్నవారికి చెప్పాడు. నన్ను చాలా బాగా చూసుకున్నాడు. స్పెషల్ కేర్ చూపించాడు. దేశంలోనే బడా స్టార్స్‌లో ఒకరైనప్పటికీ ఎంతో అణుకువతో ఉంటాడు. సికిందర్ నాకెంతో స్పెషల్ మూవీ. ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జయిట్‌గా ఉన్నాను అని రష్మిక చెప్పుకొచ్చింది.చదవండి: రాజకీయాల్లోకి అల్లు అర్జున్.. క్లారిటీ ఇచ్చిన టీమ్ -
ఐకానిక్ లెహంగాలలో నేషనల్ క్రష్ స్టన్నింగ్ లుక్స్..!
-
రష్మిక 'గర్ల్‌ఫ్రెండ్'ని పరిచయం చేసిన దేవరకొండ
'పుష్ప 2'తో అందరి మనసుల్ని దోచేసిన రష్మిక.. ఇప్పుడు 'ద గర్ల్ ఫ్రెండ్'గా రాబోతుంది. ప్రముఖ నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తీస్తున్న ఈ సినిమాలో ఎమోషనల్ లవ్ స్టోరీ. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ సాగడం విశేషం.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత లైఫ్ గురించి చెప్పిన కొత్త కోడలు శోభిత)'నీకని మనసుని రాసిచ్చేసా.. పడ్డానేమో ప్రేమలో బహుశా' అని విజయ్ దేవరకొండ చెబుతుంటే.. స్క్రీన్‌పై రష్మిక కనిపిస్తుంటే వీళ్లిద్దరి ఫ్యాన్స్‌కి కనులవిందుగా అనిపిస్తోంది. ఎందుకంటే చాన్నాళ్లుగా వీళ్ల రిలేషన్ గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్ టైంలో చూచాయిగా ప్రేమలో ఉన్నమన్నట్లు చెప్పారు. ఇప్పుడు ఈ టీజర్ చూస్తుంటే రష్మిక కోసం విజయ్ కవిత్వం చెబుతున్నాడేమో అనిపించింది.'ద గర్ల్ ఫ్రెండ్' సినిమాని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. హేసమ్ అబ్దుల్ సంగీతమందించగా.. 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి.. రష్మికకు జోడిగా కనిపించబోతున్నాడు. టీజర్ మొత్తం రష్మిక క్లోజప్ షాట్స్ కనిపించాయి. ఇదంతా చూస్తుంటే ఈ మూవీలో రష్మిక యాక్టింగ్ అదరగొట్టేయబోతుందనిపిస్తోంది. బహుశా ఫిబ్రవరిలో మూవీ రిలీజ్ ఉండొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు) -
తెర వెనక శ్రీవల్లి.. 'పుష్ప 2'ని మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)
-
Pushpa2: థియేటర్స్‌లో మహిళలకు పూనకాలు.. వీడియో వైరల్
ఇండియన్ బాక్సాఫీస్‌ని పుష్ప 2 షేక్ చేస్తుంది. అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్లో నాలుగో చిత్రంగా తెరకెక్కిన పుష్ప 2 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రిమియర్ షో నుంచి ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. దీంతో తొలి రోజే ఏకంగా రూ. 294 కోట్ల కలెక్షన్స్ రాబట్టి.. ఇండియన్ సినీ హిస్టరీలోనే ఫస్ట్‌డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డుకెక్కింది. (చదవండి: పుష్ప చూశాక.. బన్నీ కూడా చిన్నగా కనిపించాడు, ఆర్జీవీ ట్వీట్)ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు జాతర సీన్, క్లైమాక్స్ గురించే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్లో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడని చెబుతున్నారు. థియేటర్స్‌లో జాతర ఎపిసోడ్ చూస్తే గూస్బంప్స్ గ్యారెంటీ అంటున్నారు. చెప్పడం కాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు చూస్తుంటే.. సినిమా చూడని వారికి కూడా పూనకాలు వస్తున్నాయి.(చదవండి: పుష్ప 2 మూవీ రివ్యూ)థియేటర్లో సినిమా చూస్తున్న ఓ మహిళకు.. జాతర ఎపిసోడ్ రాగానే నిజంగానే పూనకం వచ్చింది. అమ్మవారు పూనడంతో సీట్లో కూర్చొనే గట్టిగా కేకలు వేస్తూ ఊగిపోయింది. అలాగే మరో మహిళ కూడా జాతర సీన్ చూసి.. పూనకం వచ్చినట్లుగా ప్రవర్తించింది. పక్కన ఉన్నవారి వచ్చి వారిని శాంతింపజేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పులను మైత్రీ మూవీ మేకర్స్ తమ ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేయగా..అవి కాస్త వైరల్‌గా మారాయి. ఇక పుష్ప 2 విషయానికొస్తే.. సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప ’చిత్రానికి సీక్వెల్ ఇది. అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక నటించగా.. ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. Neekanna Peddha Dhikku... Lokaana YekkadundhiNaivedhyam Ettanga... Maa Kaada YemitundhiMoralanni Aaalakinchi... Varameeyyave Thalli 🙏🙏🙏GANGO RENUKA THALLI 🙏🙏🙏 https://t.co/shS1a4rYvH— Mythri Movie Makers (@MythriOfficial) December 7, 2024 -
విజయ్ దేవరకొండ పెళ్లి టాపిక్.. తండ్రి ఏమన్నారంటే?
విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రాబోయే మార్చిలో రిలీజ్ కానుందని ఇదివరకే ప్రకటించారు. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు విజయ్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. విజయ్ దేవరకొండ పెళ్లి గురించి ఇతడి తండ్రి స్వయంగా మాట్లాడటినట్లు కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ టాపిక్ అసలు ఎందుకొచ్చింది?(ఇదీ చదవండి: 'పుష్ప2' టికెట్ల ధరలు తగ్గనున్నాయా.. కారణం ఇదేనా..?)విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే చాలామంది రష్మిక అని అంటారు. ఎందుకంటే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలారోజులుగా రూమర్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇది నిజమనేలా ఎప్పటికప్పుడు ఏదో ఓ టూర్‌కి కలిసి వెళ్తుంటారు. కానీ సోషల్ మీడియాలో వేర్వేరుగా ఫొటోలు పోస్ట్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో దీని గురించి ఎంత చర్చ నడిచినా కిక్కురుమనరు.తాజాగా విజయ్ తండ్రి గోవర్దన్ని కొడుకు పెళ్లి గురించి అడిగితే.. విజయ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడని, గౌతమ్ సినిమా జరుగుతోందని, సంక్రాంతి తర్వాత మైత్రీ మూవీస్ నిర్మాణంలో సినిమా ఉంటుందని, అనంతరం కొన్నాళ్లకు దిల్ రాజు నిర్మాతగా కొత్త ప్రాజెక్ట్ మొదలవుతుందని చెప్పారు. అందుకే కాస్త వీలు చూసుకుని, విజయ్‌కి టైమ్ కుదిరినప్పుడే పెళ్లి ఆలోచన చేస్తామని అన్నారు. దీనికి మరో ఆరు నెలల నుంచి ఏడాది పట్టొచ్చని చెప్పారు. అంటే ఇప్పట్లో విజయ్ పెళ్లి లేనట్లే!(ఇదీ చదవండి: నటిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ దర్శకుడు సందీప్ రాజ్) -
రష్మిక డిసెంబర్ సెంటిమెంట్ రిపీట్?
-
'పుష్ప' లైఫ్‌ని మార్చేసే పాత్ర.. ఈ నటి ఎవరో తెలుసా? (ఫొటోలు)
-
దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప 2' చూసిన రష్మిక
హీరోయిన్ రష్మిక.. హీరో విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందనే రూమర్స్ చాన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఇది నిజమేనని అనడానికి ఎప్పటికప్పుడు ఏదో ఓ విషయం కనిపిస్తూనే ఉంటుంది. విజయ్-రష్మిక అప్పుడప్పుడు కలిసి టూర్స్‌కి వెళ్తుంటారు. కానీ ఎవరికి వాళ్లు ఒంటరిగా దిగిన పిక్స్ పోస్ట్ చేస్తుంటారు. వాటిని కలిపి చూస్తే జంటగా వెళ్లారని నెటిజన్లు పట్టేస్తారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' కలెక్షన్స్.. హిందీలో బన్నీ బ్రాండ్ రికార్డ్!)కొన్నాళ్ల క్రితం చెన్నైలో జరిగిన 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్లో పెళ్లి, ప్రియుడి గురించి టాపిక్ రాగానే రష్మిక తెగ సిగ్గుపడిపోయింది. నేను చేసుకోబోయేది ఎవరో మీకు కూడా తెలుసుగా! అని సమాధానమిచ్చింది. అంటే విజయ్ దేవరకొండ అని పరోక్షంగా కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు 'పుష్ప 2' సినిమా దేవరకొండ ఫ్యామిలీతో కలిసి చూసింది.బుధవారం రాత్రి మూవీ టీమ్‌తో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేటర్లో సినిమా చూసిన రష్మిక.. గురువారం సాయంత్రం ఏఎంబీలో విజయ్ దేవరకొండ తల్లి, తమ్ముడితో కలిసి సినిమా చూసింది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇన్నాళ్లు విజయ్ కుటుంబాన్ని కలిసినప్పటికీ ఎప్పుడు ఇలా బయటపడలేదు. కానీ ఇప్పుడు సినిమాని కలిసి చూడటం లాంటివి చూస్తుంటే త్వరలో విజయ్-రష్మిక గుడ్ న్యూస్ చెప్పేస్తారేమో అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 19 సినిమాలు) -
వైల్డ్ ఫైర్.. ఆంధ్రా అంతా 'పుష్ప 2' నామస్మరణే (ఫొటోలు)
-
పుష్ప-2 మూవీ స్టిల్స్.. ఫోటోలు షేర్ చేసిన రష్మిక
-
‘పుష్ప 2’ మాస్ జాతర.. అల్లు అర్జున్ (ఫొటోలు)
-
Pushpa 2 Review: ‘పుష్ప 2’ మూవీ రివ్యూ
టైటిల్: పుష్ప 2: ది రూల్నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫహద్ పాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్, ధనంజయ, తారక్ పొన్నప్ప, అజయ్ ఘోష్ తదితరులునిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్నిర్మాతలు: నవీన్ కుమార్, రవిశంకర్రచన-దర్శకత్వం: సుకుమార్సంగీతం: దేవీశ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్ఎడిటింగ్: నవీన్ నూలివిడుదల తేది: డిసెంబర్ 5, 2024అల్లు అర్జున్ అభిమానుల మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేల పుష్ప 2 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల తర్వాత ఆ స్థాయిలో యావత్ సినీలోకం ఎదురు చూస్తున్న తెలుగు సినిమా పుష్ప 2. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప: ది రైజ్’కి సీక్వెల్ ఇది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా చాలా గ్రాండ్‌గా నిర్వహించడంతో దేశం మొత్తం ‘పుష్ప 2’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? బన్నీ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.‘పుష్ప 2’ కథేంటంటే..?ఒక సాధారణ కూలీగా జీవీతం మొదలు పెట్టిన పుష్పరాజ్(అల్లు అర్జున్) ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది ‘పుష్ప పార్ట్-1’లో చూపించారు. పుష్పరాజ్ సిండికేట్ లీడర్ కావడంతో ‘పుష్ప : ది రైజ్’ కథ ముగుస్తుంది. పుష్ప 2: ది రూల్ (Pushpa 2 The Rule Movie Telugu Review) సినిమా కథ అక్కడ నుంచే ప్రారంభం అవుతుంది. శ్రీవల్లి(రష్మిక)ని పెళ్లి చేసుకొని అటు వ్యక్తిగతం జీవితాన్ని హాయిగా గడుపుతూనే.. మరోవైపు ఎర్ర చందనం స్మగ్లింగ్‌ని దేశం మొత్తం విస్తరిస్తాడు పుష్పరాజ్. ఎంపీ సిద్దప్ప(రావు రమేశ్) అండతో తన వ్యాపారానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటాడు. ఓ సారి చిత్తూరుకి వచ్చిన ముఖ్యమంత్రి నరసింహరెడ్డిని కలిసేందుకు పుష్పరాజ్ వెళ్తాడు. భార్య శ్రీవల్లి కోరిక మేరకు అతనితో ఫోటో దిగేందుకు ప్రయత్నించగా..‘స్మగ్లర్‌తో ఫోటో దిగలేను’ అంటూ సీఎం నిరాకరిస్తాడు. అంతేకాదు శ్రీవల్లిని అవమానించేలా మాట్లాడతాడు. దీంతో ఆ సీఎంనే మార్చాలని పుష్పరాజ్ డిసైడ్ అవుతాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్దప్పను చేయాలనుకుంటాడు. దాని కోసం పుష్పరాజ్ ఏం చేశాడు? తనను అవమానించిన పుష్పరాజ్‌ని ఎలాగైన పట్టుకోవాలని చూస్తున్న ఎస్పీ షెకావత్(ఫాహద్ ఫాజిల్) ప్రయత్నం ఫలించిందా? షెకావత్‌కి పుష్పరాజ్ విసిరిన సవాల్ ఏంటి? కేంద్రమంత్రి ప్రతాప్‌రెడ్డి(జగపతి బాబు), పుష్పరాజ్ మధ్య ఎందుకు గొడవ వచ్చింది? ప్రతాప్‌రెడ్డి తమ్ముడు కొడుకు (తారక్ పొన్నప్ప) పుష్పరాజ్‌పై పగ పెంచుకోవడానికి గల కారణం ఏంటి? తనను తప్పించి సిండికేట్ లీడర్‌గా ఎదిగిన పుష్పరాజ్‌ను అణచివేసేందుకు మంగళం శ్రీను(సునీల్), దాక్షాయణి(అనసూయ)వేసిన ఎత్తుగడలు ఏంటి? చివరకు పుష్పరాజ్ అనుకున్నట్లుగా సిద్దప్పను సీఎం చేశాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..కొన్ని సినిమాలకు కథ అవసరం లేదు. స్టార్ హీరో.. ఆయన స్థాయికి తగ్గట్లు ఎలివేషన్స్..భారీ యాక్షన్ సీన్స్.. మాంచి పాటలు ..ఇవి ఉంటే చాలు బొమ్మ హిట్టైపోతుంది. పుష్ప 2లో డైరెక్టర్ సుకుమార్ కూడా ఇదే ఫార్ములాను అప్లై చేశాడు. పుష్ప : ది రైజ్ సినిమాతో పుష్పరాజ్ పాత్రను డ్రగ్‌లా ఎక్కించిన సుక్కు.. పార్ట్ 2లో ఆ మత్తును అలానే కంటిన్యూ చేసేశాడు. కథపై కాకుండా ఎలివేషన్స్.. యాక్షన్ సీన్స్‌పై ఎక్కువ ఫోకస్ చేశాడు. పార్ట్ 1లో ఉన్నంత కథ కూడా ఈ సీక్వెల్లో లేదు. హై ఇవ్వడమే లక్ష్యంగా కొన్ని సీన్లను అల్లుకుంటూ పోయాడు అంతే. ప్రతి పది నిమిషాలకొకసారి హై ఇచ్చే సీన్ ఉండేలా స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. కథనం నీరసంగా సాగుతుందన్న ఫీలింగ్ ఆడియన్స్‌కి వచ్చేలోగా.. ఓ భారీ యాక్షన్ సీన్ పడుతుంది. అందులో బన్నీ నటవిశ్వరూపం చూసి గూస్బంప్స్ తెచ్చుకోవడమే తప్ప.. మరో ఆలోచన రాదు. భార్య మాట భర్త వింటే ఎలా ఉంటుందనే పాయింట్‌ని ఈ స్మగ్లింగ్ కథతో ముడిపెట్టి చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.ఓ భారీ యాక్షన్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. పుష్పరాజ్ క్యారెక్టర్, అతని ప్రపంచం గురించి అల్రేడీ తెలుసు కనుక.. స్టార్టింగ్ నుంచే హీరోకి ఎలివేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఫహాద్ పాత్ర ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. ఫస్టాఫ్ అంతా షెకావత్-పుష్పరాజ్ మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్‌లా కథనం సాగుతుంది. ఎర్రచందనం పట్టుకునేందుకు షెకావత్ ప్రయత్నించడం.. పుష్పరాజ్ అతన్ని బురిడీ కొట్టించి దాన్ని తరలించడం .. ఫస్టాఫ్ మొత్తం ఇదే తంతు నడుస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే స్విమింగ్ఫూల్ సీన్ అదిరిపోతుంది. ఇద్దరి జరిగే సవాల్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అలాగే శ్రీవల్లీ, పుష్పరాజ్‌ల మధ్య వచ్చే ‘ఫీలింగ్స్’ సీన్లు నవ్వులు పూయిస్తాయి. ఇక ద్వితియార్థంలో ఎమోషన్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. జాతర ఎపిసోడ్ అదిరిపోతుంది. ఆ తర్వాత కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్ అయితే పూనకాలు తెప్పిస్తుంది. ఆ సీన్లో బన్నీ మాస్ తాండవం చేశాడు. క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోదు. పార్ట్ 3కి ఇచ్చిన లీడ్ అంతగా కిక్ ఇవ్వలేదు. సినిమా నిడివి (దాదాపు 3 గంటల 20 నిమిషాలు) ఎక్కువగా ఉండడం సినిమాకు కాస్త మైనస్ అనే చెప్పాలి. లాజిక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాకుంటే అంత మంచిది. అయితే మాస్ ఆడియన్స్‌కి ఇవేవి అవసరం లేదు. వారిని ఎంటర్టైన్ చేస్తే చాలు. అలాంటి వారికి పుష్ప 2 విపరీతంగా నచ్చుతుంది. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి అయితే సుకుమార్ ఫుల్ మీల్స్ పెట్టారనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే..పుష్ప: ది రూల్’ అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కథనంతా తన భుజాన వేసుకొని నడిపించాడు. మాస్ లుక్‌లోనే కాదు నటనలోనూ బన్నీ అదరగొట్టేశాడు. యాక్షన్ సీన్స్‌లో అయితే ‘తగ్గేదేలే’ అన్నట్లుగా తన నట విశ్వరూపం చూపించాడు. జాతర ఎపిసోడ్, క్లైమాక్స్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్లో బన్నీ ఫెర్మార్మెన్స్ నెక్ట్స్ లెవన్‌లో ఉంది. చిత్తూర యాసలో ఆయన పలికిన సంభాషణలు అలరిస్తాయి.ఇక శ్రీవల్లీగా డీగ్లామర్ పాత్రలో రష్మిక జీవించేసింది. పార్ట్ 1తో పోలిస్తే ఈ చిత్రంలో ఆమె పాత్ర నిడివి చాలా ఎక్కువగా ఉంటుంది. జాతర ఎపిసోడ్లో ఆమె చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటాయి. డీఎస్పీ షెకావత్‌గా ఫహద్ పాజిల్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎంపీ సిద్దప్పగా రావు రమేశ్ మరోసారి తెరపై తమ అనుభవాన్ని చూపించారు. తారక్ పొన్నప్పకు మంచి పాత్ర లభించింది. బన్నీకి ఆయన మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. స్పెషల్ సాంగ్‌లో శ్రీలీల అదరగొట్టేసింది. బన్నీతో పోటీ పడి మరి డ్యాన్స్ చేసింది. మంగళం శ్రీను పాత్రలో నటించిన సునీల్‌కి పెద్దగా గుర్తుంచుకునే సీన్లేవి పడలేదు. దాక్షయణిగా నటించిన అనసూయ పరిస్థితి కూడా అంతే. ఒకటి రెండు చోట్ల ఆమె చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక కేంద్రమంత్రి ప్రతాప్ రెడ్డిగా జగపతి బాబు ఉన్నంత చక్కగా నటించాడు. పార్ట్ 3లో ఆయన నిడివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జగదీశ్, ధనుంజయ, అజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. దేవీశ్రీ ప్రసాద్, శ్యామ్ సీఎస్ల నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. ‘సూసేకీ..’, కిస్సిక్’, ‘ఫీలింగ్స్’ పాటలు తెరపై అలరించాయి. సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ప్రతి సీన్ చాలా రిచ్‌గా, వాస్తవాన్ని ప్రతిబింబించేలా చూపించాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెపాల్సింది. నిడివిని కొంచెం తగ్గిస్తే బాగుండేవి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా ‘తగ్గేదేలే’ అన్నట్లుగా ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారు.- అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
Pushpa 2 X Review: ‘పుష్ప 2’మూవీ ట్విటర్ రివ్యూ
అల్లు అర్జున్ ఫ్యాన్‌తో పాటు యావత్ సినీలోకం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం.. బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప- ది రైజ్’ కి సీక్వెల్ కావడంతో ‘పుష్ప 2: ది రూల్’పై ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. దానికి తోడు పాట్నా మొదలుకొని చెన్నై, ముంబై, కొచ్చి లాంటి నగరాలతో పాటు దేశమంతా తిరిగి ప్రచారం చేయడంతో ‘పుష్ప 2’పై భారీ బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 5) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో గురువారం రాత్రి 9.30 గంటల నుంచే స్పెషల్ షోస్ పడిపోయాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.పుష్ప 2 కథేంటి? ఎలా ఉంది? బన్నీ ఖాతాలో మరో భారీ హిట్ పడిందా లేదా? తదితర విషయాలు ఎక్స్(ట్విటర్ ) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.ఎక్స్‌లో పుష్ప 2 చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. బన్నీ మాస్ యాక్టింగ్ అదిరిపోయిందని అంటున్నారు. సుకుమార్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారీ బ్లాక్ బస్టర్‌తో ఈ ఏడాది ముగించారని కామెంట్ చేస్తున్నారు. మరికొంత మంది అయితే ఇది యావరేజ్ మూవీ అంటున్నారు. #Pushpa2 definately cross 250 cr on 1st day 🔥 What a film https://t.co/zSTuWaSX93— Sameer Chauhan 🥷 (@srk_MrX) December 5, 2024 First Day First Show #Pushpa2TheRulereviewReally A Great Movie - Full Paisa Wasool. #RashmikaMandana And #AlluArjun𓃵 Killer🔥 #Pushpa2 #AlluArjun #Pushpa2ThaRule #Pushpa2Review #WildfirePushpa pic.twitter.com/ii4jx7vbWs— Lokesh 🕉️ (@LokeshKhatri__) December 5, 2024 #Pushpa2 is a Decently Packaged Commercial Entertainer with a Good 1st Half and a 2nd Half that started well but drops pace significantly in the last hour. The first half starts right where Part 1 ends. This half runs purely on drama which feels slightly slow at times but…— Venky Reviews (@venkyreviews) December 4, 2024 పుష్ప 2 డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్.ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ స్టార్టింగ్ బాగుంది కానీ చివరి గంట డ్రాప్ అయినట్లుగా అనిపించిదంటూ ఓ నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాను.#Pushpa2TheRule Review 1st Half = Excellent 🥵2nd Half = Justified 🙂Rating = 3.25/5🥵❤️🔥— Rama (@RameshKemb25619) December 4, 2024 ఫస్టాప్ అద్భుతంగా ఉంది. సెకండాఫ్ కథకి న్యాయం జరిగింది అంటూ మరో నెటిజన్ 3.25 రేటింగ్ ఇచ్చారు.Icon star #ALLUARJUNNata viswaroopam 🔥🔥brilliant Director Sukumar Ramapage 🔥🔥🔥India’s Biggest Blockbuster #Pushpa2 #pushpatherule— Maduri Mattaiah Naidu (@madurimadhu1) December 4, 2024 ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నటవిశ్వరూపం, సుకుమార్ డైరెక్షన్ అదిరిపోయింది. ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2 అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.Kuthaa Ramp undhi Movie🔥🔥🔥@alluarjun acting ayithe vere level especially aa Jathara scene ayithe punakale🔥🔥🔥🔥🔥🔥🔥🔥#Sukumar writing excellent @ThisIsDSP bgm 🔥🔥Pushpa gadi Rulu India shake avuthadi🔥🔥🔥❤️🔥❤️🔥❤️🔥#Pushpa2TheRule #Pushpa2 #Pushpa2TheRuleReview #Pushpa2— Hanish (@HarishKoyalkar) December 4, 2024Good 1st half Below average 2nd half Bad climax#Pushpa2 #Pushpa2TheRule Bhaai one man show ! #Pushpa2Review #Pushpa2Celebrations— CeaseFire 🦖 (@Rebelwood_45) December 4, 2024#Pushpa2 #1stHalfReviewSuperb and very entertaining. Just a mass 🔥🔥 Comedy, dialogue delivery @alluarjun just nailed it. The real Rule of #Pushpa #FahadFaasil craziness is just getting started. Waiting for 2nd half 🔥#SamCS BGM 🔥🔥🔥— Tamil TV Channel Express (@TamilTvChanExp) December 4, 2024#Pushpa2 #AlluArjun𓃵 Power packed first half followed by a good second halfSukkumark in writing and screenplay 3hr 20 mins lo oka scene kuda bore kottadu 💥Rashmika acting 👌Songs bgm💥Cinematography too good vundi asalu @alluarjun nee acting ki 🙏Peak commercial cinema.— Hussain Sha kiran (@GiddaSha) December 4, 2024