Nagarjuna Akkineni
-
ఇదిదా సర్ప్రైజ్.. విలన్స్‌గా స్టార్ హీరోలు
కెరీర్ ప్రారంభంలో విలన్‌గా చేసి, ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్న హీరోలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. కానీ హీరోగా సక్సెస్ అయిన తర్వాత కూడా విలన్ రోల్స్‌ను ప్రయత్నిస్తున్నారు కొందరు హీరోలు. ‘ఇదిదా సర్ప్రైజ్’ అంటూ ఇలా తమ నెగటివ్ షేడ్స్ ట్యాలెంట్‌తో ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేసిన, సర్ప్రైజ్ చేయనున్న కొందరు హీరోల గురించి ఓ లుక్ వేద్దాం.కూలీకి విలన్?సిల్వర్ స్క్రీన్‌పై నాగార్జున నెగటివ్ రోల్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి ఆడియన్స్‌లో తప్పక ఉంటుంది. పూర్తి స్థాయి గ్రే షేడ్స్ క్యారెక్టర్లో నాగార్జునను స్క్రీన్‌పై చూడాలని కొందరు ఆడియన్స్ కోరుకుంటున్నారు. ఆ తరుణం ఆసన్నమైందని, రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో నాగార్జున నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారనే టాక్ కోలీవుడ్‌లో ప్రచారంలోకి వచ్చింది. ‘కూలీ’ సినిమా చిత్రీకరణప్రారంభమైనప్పుడు నాగార్జున ఓ వ్యక్తిని క్రూరంగా కత్తితో చంపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ నెగటివ్ షేడ్స్‌లో ఉంటుందనే వార్తలకు ఈ వీడియో రూపంలో బలం చేకూరినట్లయింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది. శ్రుతీహాసన్, ఉపేంద్ర, సత్యరాజ్ ఇతర కీలకపాత్రల్లో నటించారు. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ‘కూలీ’ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీపై ఓ స్పష్టత రానుంది.బ్రహ్మ రాక్షస హీరోగా ప్రభాస్ కటౌట్‌కి ఉన్న బాక్సాఫీస్ స్టామినా ఏంటో ఆడియన్స్ చూశారు. మరి... ప్రభాస్‌లాంటి కటౌట్ ఉన్న హీరో క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటే ఎలా ఉంటుందో ‘బిల్లా’ సినిమాలో శాంపిల్‌గా ఆడియన్స్ చూశారు. కానీ ఈ డోస్‌ను ఇంకాస్త పెంచి ‘బ్రహ్మ రాక్షస’ సినిమాతో ఆడియన్స్‌ని తన నెగటివ్ షేడ్ యాక్టింగ్ స్కిల్‌తో సర్ప్రైజ్ చేయాలని ప్రభాస్ భావిస్తున్నారట. ప్రభాస్ మెయిన్ లీడ్ రోల్లో ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘బ్రహ్మ రాక్షస’ అనే మూవీ రానుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబ్, ఫౌజి’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ మూవీ చేస్తారు. ఈ ‘స్పిరిట్’ మూవీ చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే... ప్రశాంత్ వర్మతో ‘బ్రహ్మ రాక్షస’ సినిమాను టేకాఫ్ చేస్తారు ప్రభాస్. ఈ లోపు రిషబ్ శెట్టితో ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ను పూర్తి చేస్తారు ప్రశాంత్ వర్మ. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభాస్–ప్రశాంత్ వర్మ కాంబోలోని మూవీ 2026 చివర్లో లేదా 2027ప్రారంభంలో మొదలు కానున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ ‘బ్రహ్మ రాక్షస’ సినిమాను తొలుత రణ్వీర్ సింగ్‌తో చేయాలనుకున్నారు ప్రశాంత్ వర్మ. కానీ కొన్ని కారణాల వల్ల రణ్వీర్ సింగ్ ఈప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.బాలీవుడ్ వార్ ‘టెంపర్, జై లవకుశ’ వంటి చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్‌లో ఎన్టీఆర్ స్క్రీన్‌పై ఎంత రెచ్చిపోయారో ఆడియన్స్ చూశారు. కాగా ఎన్టీఆర్లోని నెగటివ్ షేడ్ యాంగిల్ ఈసారి నార్త్ ఆడియన్స్‌కు కూడా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుందని తెలిసింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్‌లో హిందీలో ‘వార్ 2’ అనే మూవీ రానుంది. ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ‘వార్ 2’ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని బాలీవుడ్ సమాచారం. ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్ వీరేంద్ర నాథ్పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారని, ఆయన క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని టాక్. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఆగస్టు 14న ‘వార్ 2’ సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే.తొలిసారిగా విలన్‌గా... సిల్వర్ స్క్రీన్‌పై బ్లాక్ బస్టర్ హీరోస్లో అల్లు అర్జున్ ఒకరు. కాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘ఆర్య 2’ చిత్రంలో ఆయన క్యారెక్టర్లో కాస్త గ్రే షేడ్స్ ఉంటాయి. ఆ తర్వాత ‘పుష్ప’ వంటి ఎగ్రెసివ్ ఎనర్జీ ఉన్న క్యారెక్టర్స్ చేశారు కానీ, పూర్తి స్థాయి గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ను అల్లు అర్జున్ చేయలేదు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందట. అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్లో ఓ భారీ బడ్జెట్ మూవీ రానుందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ మూవీలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నారని, ఈ రెండు రోల్స్‌లో ఓ రోల్లో నెగటివ్ షేడ్స్ ఉంటుందని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనుందట. ఈ వేసవిలో చిత్రీకరణనుప్రారంభించి, 2026 చివర్లో ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని భోగట్టా. ఈ చిత్రంపై పూర్తి స్థాయి సమాచారం అందాల్సి ఉంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.బ్లాక్ స్వార్డ్ హీరోగా తెలుగు స్క్రీన్‌పై సక్సెస్ అయ్యారు మంచు మనోజ్. ఇప్పుడు విలన్‌గా కనిపించనున్నారు. ‘హను–మాన్’ ఫేమ్ తేజ సజ్జా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ ఈ మైథలాజికల్ అండ్ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్‌ను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సూపర్ యోధపాత్రలో తేజ సజ్జా నటిస్తుండగా, బ్లాక్ స్వార్డ్పాత్రలో మంచు మనోజ్ విలన్‌గా కనిపిస్తారు. ఇక ‘మిరాయ్’ చిత్రం ఆగస్టు 1న విడుదల కానుంది. ఈ హీరోలే కాదు... ఇంకొందరు స్టార్స్ కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్‌కి సై అన్నారు. – ముసిమి శివాంజనేయులుకోలీవుడ్ హీరోలు కూడా వీలైనప్పుడు విలన్ రోల్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో మెయిన్ విలన్‌గా కమల్‌హాసన్ నటించారు. కమల్‌హాసన్ హీరోగా చేసిన ‘విక్రమ్’ మూవీ క్లైమాక్స్‌లో రోలెక్స్‌గా విలన్‌పాత్రలో కనిపించారు సూర్య. ఇక సూర్య హీరోగా చేసిన ‘కంగువ’ మూవీలో కార్తీ విలన్‌గా కనిపించారు. కార్తీ హీరోగా చేసిన ‘ఖైదీ’ సినిమాలో తమిళ యువ నటుడు అర్జున్ దాస్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపించారు. కమల్‌హాసన్ ‘విక్రమ్’, కార్తీ ‘ఖైదీ’ చిత్రాల దర్శకుడు లోకేశ్ కనగరాజ్ నేతృత్వంలోని ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంలోనివే. సో... ‘ఖైదీ 2’ చిత్రంలో సూర్య విలన్‌గా నటించే చాన్సెస్ ఉన్నాయి.⇒ ఇంకా శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘పరాశక్తి’ సినిమా కోసం తొలిసారిగా విలన్‌గా స్క్రీన్‌పై కనిపించనున్నారు రవి మోహన్ (ఇటీవల ‘జయం’ రవి తన పేరును రవి మోహన్‌గా మార్చుకున్నారు). సుధ కొంగర దర్శకత్వంలోని ఈ మూవీ వచ్చే ఏడాదిప్రారంభంలో రిలీజ్ కానుందని తెలిసింది. ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇడ్లీ కడై’లో అరుణ్ విజయ్ విలన్‌గా చేస్తున్నారన్న వార్తలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఇంకా వీలైనప్పుడల్లా విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, మాధవన్ వంటి యాక్టర్స్ కూడా విలన్ రోల్స్ చేస్తున్నారు. ఇలా ఇంకొంతమంది ఉన్నారు.⇒ బాలీవుడ్ హీరోలు కూడా విలన్ రోల్స్ చేస్తున్నారు. షారుక్ ఖాన్ హీరోగా చేయ నున్న నెక్ట్స్ మూవీ ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో అభిషేక్ బచ్చన్ తొలిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నారు. రణ్‌బీర్ కపూర్ హీరోగా చేస్తున్న ‘రామాయణ’ సినిమాలో ‘కేజీఎఫ్’ హీరో యశ్ రావణుడిపాత్ర చేస్తున్నారు. గత ఏడాది విడుదలైన అజయ్ దేవగన్ ‘సింగమ్ ఎగైన్’లో అర్జున్ కపూర్ విలన్‌గా చేశారు. ఇంకా బాలీవుడ్లో హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్న సంజయ్ దత్, బాబీ డియోల్ (హరిహర వీరమల్లు), ఇమ్రాన్ హష్మి (ఓజీ, జీ 2), జిమ్ సర్ఫ్ (కుబేర), సోహైల్ ఖాన్ (అర్జున్ సన్నాఫ్ వైజయంతి), దివ్యేందు (పెద్ది) వంటి వారు తెలుగు సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తున్నారు. ఇలా ఇంకొందరు ఉన్నారు.⇒ కథ నచ్చితే నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేసేందుకు హీరోయిన్స్ సైతం వెనకాడటం లేదు. ఈ విషయంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ముందుంటారు. హీరోయిన్గా చేస్తూనే ఎక్కువగా విలన్ రోల్స్ చేస్తుంటారామె. ఇక వెంకటేశ్ ‘సైంధవ్’లో ఆండ్రియా, విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ‘వెన్నెల’ కిశోర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’లో అనన్య నాగళ్ల, అజిత్ ‘విడాముయర్చి’ లో రెజీనా, రణ్‌బీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర’లో మౌనీ రాయ్, ‘పొన్నియిన్ సెల్వన్’లో ఐశ్వర్యా రాయ్ వంటి వారు కెరీర్లో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్న సమయంలోనే నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు. ఇలా మరికొంతమంది ఉన్నారు. -
చరణ్ బర్త్‌డే వేడుకల్లో నాగార్జున.. కనిపించని అల్లు ఫ్యామిలీ
టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ (Ram Charan) మార్చి 27న 40వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈసారి బర్త్‌డేను మెగా ఫ్యామిలీ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీతో పాటు దగ్గరి ఫ్రెండ్స్ సమక్షంలో చరణ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫోటోలను చరణ్ భార్య ఉపాసన (Upasana Konidela) సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఎంతో ప్రత్యేకం: ఉపాసనమార్చి 27.. ఎప్పటికీ గ్రేట్‌ఫుల్‌గా ఉంటాను. ఈ రోజును ఇంత ప్రత్యేకంగా మలిచిన అందరికీ కృతజ్ఞతలు అని రాసుకొచ్చింది. మొదటి ఫోటోలో చిరంజీవి- సురేఖ, రామ్ చరణ్ -ఉపాసనతో పాటు సుష్మిత కొణిదెల ఉంది. తర్వాతి ఫోటోల్లో చరణ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ఫోటోలో అయితే చిరంజీవి క్లోజ్ ఫ్రెండ్ కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) ఉన్నాడు. ఈ వేడుకల్లో అల్లు ఫ్యామిలీ మాత్రం కనిపించలేదు.పార్టీలో కనిపించని 'అల్లు' కుటుంబంచరణ్ బర్త్‌డేరోజు మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ అల్లు ఫ్యామిలీ మాత్రం చరణ్ కోసం సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టు పెట్టలేదు. ఇప్పుడు బర్త్‌డే పార్టీలో కూడా అల్లు ఫ్యామిలీ లేకపోవడంతో ఈ రెండు కుటుంబాల మధ్య వైరం అలాగే కొనసాగుతోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.చరణ్ సినిమాలురామ్చరణ్ చివరగా గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించాడు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం చరణ్.. బుచ్చిబాబుతో పెద్ది సినిమా చేస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయిక. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీని తర్వాత సుకుమార్‌తో ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే రంగస్థలం తర్వాత చరణ్- సుకుమార్ కాంబినేషన్లో ఇది రెండో సినిమాగా తెరకెక్కనుందన్నమాట! రంగస్థలం, పుష్ప వంటి బ్లాక్బస్టర్లు అందించిన సుకుమార్ ఈసారి అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో చరణ్‌ను చూపించే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: 'స్నేహ.. కొంచెమైనా బుద్ధుందా? చెప్పులేసుకుని గిరిప్రదక్షిణా?' -
నాగార్జునకు ఏం మాట్లాడాలో తెలీదు
-
బిగ్‌బాస్ నుంచి నాగార్జున తప్పుకోవాలి.. రానా బెటర్: సోనియా
బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show) వల్ల కంటెస్టెంట్లకు పాపులారిటీ వస్తుందనేది నిజం. కానీ చాలామంది పాజిటివ్ పాపులారిటీకి బదులుగా నెగెటివిటీని మూటగట్టుకునే బయటకు వస్తుంటారు. తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌కు వెళ్లిన సోనియా ఆకుల (Soniya Akula) విషయంలోనూ ఇదే జరిగింది. నాదే పెత్తనం ఉండాలి.. నేను చెప్పిందే వేదం అన్నట్లుగా మాట్లాడటంతో ఆమెపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఆమె చేష్టల వల్ల విపరీతంగా ట్రోల్ అయింది. తాజాగా ఆమెకు బిగ్‌బాస్‌లో ఛాన్స్ వస్తే మళ్లీ వెళ్తారా? అన్న ప్రశ్న ఎదురైంది.నాగార్జున వద్దుఅందుకు సోనియా మాట్లాడుతూ.. నాకైతే వెళ్లాలని లేదు. కానీ ఈసారి మాత్రం హోస్ట్‌గా నాగార్జున (Nagarjuna Akkineni) సార్ ఉండకూడదని కోరుకుంటున్నాను. హౌస్‌లో నేనొకటి మాట్లాడితే దాన్ని బాడీ షేమింగ్ అని ముద్ర వేశారు. అది చాలా తప్పు కదా! హోస్ట్‌గా సరైన జడ్జిమెంట్ ఇవ్వాలి. ఉన్నది లేనట్లుగా మాట్లాడకూడదు. అందుకే ఆయన వెళ్లిపోతే బాగుండు. తన స్థానంలో రానా దగ్గుబాటి రావాలనుకుంటున్నాను.రానాకు ఎలా మాట్లాడాలనేది తెలుసురానా.. ఫ్రెండ్షిప్ను లవ్ అని ముద్ర వేయరనుకుంటున్నాను. తనకెలా మాట్లాడాలనేది తెలుసు. నాగార్జున హోస్ట్ అయితే మాత్రం నేను కచ్చితంగా బిగ్‌బాస్‌కు వెళ్లను. ప్రస్తుతం తెలుగు, తమిళంలో సినిమా అవకాశాలొస్తున్నాయి. సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాను. అందుకే నా కెరీర్ నెమ్మదిగా ముందుకుసాగుతోంది అని చెప్పుకొచ్చింది. సోనియా ప్రధాన పాత్రలో నటించిన కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ నేడు (మార్చి 21న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చదవండి: బెట్టింగ్ యాప్స్.. సడన్‌గా ఇలా చేయడం సరికాదు: ఆర్జీవీ -
కూలి VS వార్-2
-
రూ.100 కోట్లతో నాగార్జున 100వ సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్.. ఈ నలుగురిని టాలీవుడ్‌కి నాలుగు స్తంభాలు అంటారు. ప్రస్తుతం టాలీవుడ్లో అత్యధిక సినిమాలలో హీరోలుగా నటించింది వీరే. చిరంజీవి ఇప్పటికే 156 చిత్రాలకు పైగా నటించగా.. బాలకృష్ణ కూడా సెంచరీ పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు నాగార్జున(Nagarjuna) తన 100వ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే హీరోగా 99 చిత్రాల్లో నటించిన నాగ్.. తన సెంచరీ మూవీ కోసం ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు.నాగ్ సోలో హీరోగా నటించిన చివరి చిత్రం 'నా సామి రంగ'. ఇది గతేడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజైంది. ఆ తర్వాత సోలో సినిమా ఇంత వరకూ ప్రకటించలేదు. ఇప్పుడు తన బెంచ్ మార్క్ సినిమా కోసం అదిరిపోయే ప్లాన్ వేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కింగ్ నాగ్ నటించబోయే 100వ సినిమాని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చేందుకు స్కెచ్ వేస్తున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోందిప్రస్తుతం నాగార్జున ‘కుబేర’, ‘కూలీ’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తయిన తర్వాత 100వ సినిమా ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. తాజా వార్తల ప్రకారం, ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. కార్తీక్ గతంలో తమిళంలో ‘నితం ఓరువానం" చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ సినిమా తెలుగులో 'ఆకాశం' పేరుతో డబ్ అయ్యింది. ఇక్కడ ఆశించిన స్థాయిలో ఆ చిత్రం ఆడలేదు కానీ దర్శకుడు కథను తెరపై చూపించిన విధానం నాగ్‌కి బాగా నచ్చిందట. వెంటనే అతన్ని పిలిపించి..వందో చిత్రం బాధ్యతలు అప్పజెప్పాడట.తన 100వ విజువల్ వండర్‌గా, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని నాగ్ కోరుకుంటున్నట్లు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నిన్న మొన్నటి వరకు నాగార్జున వందో చిత్రానికి పూరి జగన్నాధ్, బెజవాడ ప్రసన్న కుమార్, తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా, నవీన్ పేర్లు గట్టిగా వినిపించాయి.. అయితే, తాజా సమాచారం ప్రకారం కార్తీక్‌తోనే ఈ ప్రాజెక్ట్ ఖరారైనట్లు కనిపిస్తోంది. షూటింగ్ ఈ ఏడాది చివరలో లేదా 2026 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. నాగ్ అభిమానులకు ఆకట్టుకునేలా ఓ సూపర్ స్టోరీని రెడీ చేశాడట కార్తీక్. రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్ లో నాగ్ సెంచరీ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
రజినీకాంత్ 'కూలీ' మూవీ వర్కింగ్ స్టిల్స్
-
టాలీవుడ్ కింగ్ తో పూరీ జగన్నాథ్..
-
పూరి జగన్నాథ్ టెర్రిఫిక్ కమ్ బ్యాక్
-
అక్కినేని హీరోయిన్ గా పూజా హెగ్దే..!
-
చిరు, వెంకీ రూట్లో నాగార్జున
-
Bigg Boss 9: నాగార్జున ఔట్.. హోస్ట్‌గా మరో స్టార్ హీరో!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్(Bigg Boss)కు దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. అన్ని భాషల్లోనూ ఈ షోని ఆదరిస్తున్నారు. ఇక తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రారంభమైన ఈ షో.. ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లను దిగ్విజయంగా ముగించుకుంది. రెండో సీజన్‌కి నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. ఇక మూడో సీజన్ నుంచి ఎనిమిదో సీజన్ వరకు కింగ్ నాగార్జుననే బిగ్‌బాస్ సోకి వ్యాఖ్యాతగా ఉన్నారు. తనదైన మాటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆటలో తప్పొప్పులను ఎత్తి చూపుతూ నాగార్జున చేసే విశ్లేషణ బిగ్‌బాస్ షోకి మరింత ప్లస్ అయింది. వారం మొత్తం చూడకపోయినా సరే.. శని,ఆదివారాలు షో చూసేవారు చాలా మందే ఉన్నారు. అందుకే ఎనిమిది సీజన్లు దిగ్విజయంగా ముగిశాయి. ఇక త్వరలోనే తొమ్మిదో సీజన్(Bigg Boss 9 Telugu) ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్‌కి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించడం లేదట. ఆయన ప్లేస్‌లో ఓ యంగ్ హీరో రాబోతున్నట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.కొత్తదనం కోసం కొత్త హోస్ట్!బిగ్‌బాస్ షోకి మొదట్లో ఉన్న ఆదరణ ఇప్పుడు లేడు. షో రొటీన్‌గా సాగడం, పెద్ద సెలెబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా పాల్గొనకపోవడంతో ఎనిమిదో సీజన్ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో తొమ్మిదో సీజన్‌ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దబోతున్నారట. కొత్తదనం కోసం హోస్ట్‌ని కూడా మార్చబోతున్నారట మేకర్స్. ఈ షోకి మరింత క్రేజ్ పెంచడానికి ఓ యంగ్ హీరోని రంగంలోకి దించబోతున్నారట. గేమ్‌లోనూ భారీ మార్పులు చేయబోతున్నట్లు సమాచారం. ఇక హోస్ట్‌గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ వ్యవహరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మేకర్స్ విజయ్‌ని సంప్రదించారట. భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఎక్స్పీరియన్స్ కోసం విజయ్ కూడా హోస్ట్‌గా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది మేకర్స్ చెబితే తప్ప తెలియదు.కంటెస్టెంట్స్ ఎంపికలో కొత్తట్రెండ్బిగ్బాస్ తొమ్మిదో సీజన్ కొత్తగా ఉండబోతుందట. ఇప్పటికే కంటెస్టెంట్స్ వేటలో పడ్డారు మేకర్స్. ఈ సారి బాగా తెలిసిన ముఖాలనే హౌస్‌లోకి పంపిస్తారట. గత సీజన్లలో ఒక కామన్ మ్యాన్ కచ్చితంగా హోస్‌లోకి వెళ్లేవాడు. కానీ ఆ సారి ఆ రూల్కి బ్రేక్ వేశారట. ఈ సారి సెలెబ్రీలను మాత్రమే తీసుకోబోతున్నారట. అంతేకాదు గేమ్‌లోనూ మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ఓ యంగ్ హీరో సైతం ఈసారి కంటెస్టెంట్‌గా పాల్గొనబోతున్నాడట. అలాగే ఓ కమెడిన్, ప్రముఖ సింగర్, కొరియోగ్రాఫర్ కూడా ఈ సారి హౌస్‌లో సందడి చేయబోతున్నట్లు సమాచారం. గత సీజన్లలో చేసిన తప్పులను మళ్లీ రిపీట్ చేయకుండా.. చాలా పకడ్భందీగా తొమ్మిదో సీజన్‌ని ప్లాన్ చేస్తున్నారు. -
నాగార్జున కుబేర మూవీ.. రిలీజ్ డేట్ వచ్చేసింది!
నాగార్జున, ధనుశ్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం కుబేర. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజవుతుందని భావించినా అలా జరగలేదు. ఈ సినిమా రిలీజ్ కోసం నాగార్జున ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కుబేర టీమ్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.ఈ పాన్ ఇండియా చిత్రాన్ని జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా విడుదలైన పోస్టర్లో నాగార్జున్, ధనుశ్‌తో పాటు బాలీవుడ్ నటుడు జిమ్ షర్బ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నాగ్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. రష్మిక హీరోయిన్గా నటిస్తుండడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. A story of power..👑A battle for wealth..💰A game of fate..♟️#SekharKammulasKuberaa is ready to deliver an enchanting theatrical experience from 𝟐𝟎𝐭𝐡 𝐉𝐮𝐧𝐞, 𝟐𝟎𝟐𝟓. @dhanushkraja KING @iamnagarjuna @iamRashmika @sekharkammula @ThisIsDSP @SVCLLP @amigoscreation pic.twitter.com/OUATNh4iES— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) February 27, 2025 -
అక్కినేని కుటుంబం మూలస్తంభాన్ని కోల్పోయింది: నాగార్జున
టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున(Akkineni Nagarjuna) సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ ఒకటి చేశారు. తన కుటుంబానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి మరణించారంటూ ఎక్స్ పేజీలో పేర్కొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వంగా ఆయన అభిమానులు ఎందరో ఇప్పటికీ నాగ్ కుటుంబంతోనే ఉన్నారు. తన తండ్రి అభిమానులను నాగార్జున ఎంతో ప్రత్యేకంగా చూస్తారని తెలిసిందే. ఈ క్రమంలో అక్కినేని ఫ్యామిలీ అభిమాని మరణ వార్తను తెలుసుకున్న నాగ్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఈమేరకు సంతాపం తెలిపారు.మా కుటుంబానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి యద్దుల అయ్యప్పరెడ్డి మరణించడం నన్ను బాగా కలచివేసింది. ఆయన మా నాన్నగారికి వీరాభిమాని. నాన్న నుంచే మాకు మరింత దగ్గరయ్యారు. అక్కినేని కుటుంబానికి మూలస్తంభంగా ఇన్నాళ్ల పాటు ఉన్నారు. మా ఫ్యామిలీ మీద ఆయన చూపిన ప్రేమ, అభిమానం ఎప్పటికీ మరిచిపోలేను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.. ఈ కష్ట సమయం నుంచి వారు త్వరగా కోలుకునే శక్తిని దేవుడు అందిస్తాడు.' అని కోరుకుంటున్నాను. యద్దుల అయ్యప్పరెడ్డి కర్నూలుకు చెందిన వ్యక్తి. నాగేశ్వరరావు అభిమానిగా చాలా ఏళ్ల నుంచి అక్కినేని ఫ్యామిలీకి దగ్గరగా ఉంటున్నారు. నాగార్జున కుటుంబానికి సంబంధించిన అన్ని పనుల్లో ఆయన అండగా ఉండేవారని సమాచారం. వారి కుటుంబంలో జరిగే ప్రతి శుభకార్యంలో కూడా అయ్యప్పరెడ్డి ఉండే వారు. అక్కినేని హీరోల ప్రతి సినిమా విడుదల సమయంలో ఆయన సందడిగా కనిపించేవారని అభిమానులు చెబుతుంటారు.Deeply saddened by the passing of Yeddhula Ayyappa Reddy garu, he was ardent fan of my father, ANR garu and pillar of strength for the Akkineni family.His love and affection to us can never be forgotten 🙏My deepest condolences to his family, and may God give them the strength… pic.twitter.com/6i2k3ycNUt— Nagarjuna Akkineni (@iamnagarjuna) February 26, 2025 -
'కుబేర'కు టైటిల్ కష్టాలు..
ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధమౌతున్న ‘కుబేర’ సినిమాకు టైటిల్ సమస్యలు ఎదురౌతున్నాయి. ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న పాన్–ఇండియన్ మూవీ ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా టైటిల్ వివాధంలో చిక్కుకుంది.కుబేర సినిమా టైటిల్ తనదే అని తాను 2023 నవంబర్ 29వ తేదీనే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించానని త్రిశక్తి ఎంటర్ప్రైజెస్ నిర్వాహ కుడు, సినీ నిర్మాత నరేందర్ తెలిపారు. 2024 మార్చి 5 నుంచి దర్శకుడు శేఖర్ కమ్ముల కుబేర అనే సినిమా టైటిల్‌కు కాపీ చేసుకుని టైటిల్‌కు ముందు శేఖర్ కమ్ముల అని పెట్టి తమ సినిమాకు ఇబ్బంది కలిగిస్తున్నాడని ఆయన ఆవేదనవ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శేఖర్ కుమ్ముల కుబేర టైటిల్ కాపీ చెయ్యగానే తాను ప్రొడ్యూసర్ కౌన్సిల్లో సంప్రదిస్తే వారు పెద్దవారితో ఎందుకు పెట్టుకుంటున్నారు అంటూ తమనే బెదిరిస్తున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. న్యాయం జరుగకపోతే న్యాయపోరాటం చేస్తామన్నారు. -
విమానంలో వివాహ వేడుక.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి తన వివాహా వార్షికోత్సవాన్ని చాలా సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. విమానంలో తన సన్నిహితులు, స్నేహితులతో కలిసి జరుపుకున్నారు. ఫ్టైట్‌లో దుబాయ్ వెళ్తూ తమ పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నామని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఈ వేడుకల్లో అక్కినేని నాగార్జున, అమల దంపతులు కూడా ఉన్నారు. తాజాగా చిరు తమ పెళ్లి రోజు వేడుకకు సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. చిరంజీవి తన ట్వీట్లో రాస్తూ..' ప్రియమైన స్నేహితులతో కలిసి విమానంలో మా వివాహ వార్షికోత్సవాన్ని చాలా జరుపుకుంటున్నాం. సురేఖ లాంటి డ్రీమ్ లైఫ్ పార్ట్నర్ దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఆమె నా బలం, నా యాంకర్ కూడా. ప్రపంచంలోని అద్భుతమైన నాకు తెలియని వాటిని నావిగేట్ చేయడానికి ఎల్లప్పుడూ సహాయం చేస్తుంది. తను నా పక్కన ఉంటే సౌకర్యంతో పాటు అద్భుతమైన ప్రేరణ కూడా. ఈ సందర్భంగా నా సోల్‌మేట్ సురేఖకు ధన్యవాదాలు. నీ పట్ల నాకున్న ప్రేమ, అభిమానాన్ని తెలియజేయడానికి ఇలాంటివీ మరిన్నీ సందర్భాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా శుభాకాంక్షలు తెలిపిన మిత్రులు, అభిమానులు, కుటుంబ సభ్యులు, నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బింబిసార్ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. Celebrating our wedding anniversary on a flight with some very dear friends en route Dubai ! 🎉I always feel I am very fortunate to have found a dream life partner in Surekha. She is my strength, my anchor and the wind beneath my wings. Always helps me navigate through the… pic.twitter.com/h4gvNuW1YY— Chiranjeevi Konidela (@KChiruTweets) February 20, 2025 -
ఈ స్టార్ హీరోల రెస్టారెంట్స్, పబ్స్ గురించి తెలుసా..?
ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న వ్యాపారరంగంలోకి కంగనా రనౌత్ అడుగుపెట్టారు. సినీ, రాజకీయ రంగాల్లో బిజీగా ఉన్న ఆమె హిమాచల్‌లోని మనాలిలో కేఫ్‌ను ప్రారంభించారు. హిమాలయాల నడిబొడ్డున ‘ది మౌంటెన్ స్టోరీ’ పేరుతో ఒక సుందరమైన రెస్టారెంట్‌ను ప్రారంభించడంతో అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, హైదరాబాద్ వేదికగా కొందరు సినీ సెలబ్రిటీలు పలు రెస్టారెంట్స్లను ప్రారంభించారు. విలాసవంతమైన ఆహారం, బ్రేవరేజస్తో పాటు, అధునాతన జీవన శైలికి అద్ధం పట్టే అద్భుతమైన ఇంటీరియర్ ఫ్యాషన్ లుక్ నేటి రెస్టారెంట్ కల్చర్‌లో భాగమైపోయింది. అయితే నగర వాసుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ ఆకర్షించేందుకు ఎవరికి వారు తమ సొంత స్టైల్లో యునీక్ యాంబియన్స్ కోసం తాపత్రయపడుతున్నారు.బంజారా హిల్స్‌లో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ 'AN రెస్టారెంట్'తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ డిసెంబర్ 8, 2022న AN రెస్టారెంట్‌ని బంజారా హిల్స్‌లో ప్రారంభించారు. మినర్వా, ఆసియన్ ఫుడ్ గ్రూపులతో కలిసి వారు దీనిని ప్రారంభించారు. రెస్టారెంట్లో అద్భుతమైన ఇంటీరియర్స్, అగ్రశ్రేణి సర్వీస్‌తో పాటు వివిధ రకాల ప్రపంచ వంటకాలతో భారీగానే మెనూ లిస్ట్ ఉంటుంది. ఆహార ప్రియులకు తప్పకుండా నచ్చేలా ఇక్కడి ఫుడ్ ఉంటుందని చాలామంది పేర్కొన్నారు.విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వన్–8 కమ్యూన్గత ఏడాదిలో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీకి దగ్గరలో వన్–8 కమ్యూన్ పేరుతో ఒక లగ్జరీ రెస్టారెంట్‌ను కోహ్లీ, అనుష్క శర్మ ప్రారంభించారు. హైదరాబాద్‌కు ఉన్న రాజసాన్ని, రిచ్ ఫ్లేవర్‌ను ప్రతిబింబిస్తుంది. ఇందులోని కిచెన్.. పాక ప్రపంచానికి నూతన హంగులు అద్దిందని ఫుడ్ లవర్స్ చెబుతున్నారు. వన్–8 కమ్యూన్ బ్రాండ్ ఎథోస్‌కు కట్టుబడి, రెస్టారెంట్ డిజైన్ అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఇక్కడి వింటేజ్ లుక్స్ నగరవాసులను విశేషంగా ఆకర్షిస్తుంది. జుహు, బెంగుళూరు, గుర్గావ్లలో ఇప్పటికే ఆదరణ పొందుతున్న ఈ రెస్ట్రో బార్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడంతో చాలామంది చిల్ అవుతున్నారు. ఫుడ్ లవర్స్‌తో పాటు క్రికెట్ ప్రియులు సైతం ఆసక్తిగా ఇక్కడికి విచ్చేస్తున్నారు. రెస్ట్రో బార్లో భాగంగా రిచ్ ఫుడ్ డిషెస్‌తో పాటు బ్రేవరేజస్ అందుబాటులో ఉండటంతో అన్ని వర్గాల వారికీ హాట్ స్పాట్‌గా మారింది. కోహ్లీకి అత్యంత ఇష్టమైన కార్న్ బార్లీ రిసోట్టో, మష్రూమ్ గూగ్లీ డిమ్ సమ్, టార్టేర్ టాప్డ్ అవకాడో వంటి పలు వంటకాలను ప్రత్యేకంగా వండి వడ్డిస్తున్నారు.రకుల్ ప్రీత్ సింగ్ 'ఆరంభం'గచ్చిబౌలి 'ఎఫ్ 45' పేరుతో జిమ్‌ను ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్ .. జూబ్లీహిల్స్‌లో కూడా ఓ బ్రాంచ్ మొదలు పెట్టి లీజ్‌కు ఇచ్చేసింది. అయితే, ఆరోగ్యంపై అవగాహన పెంచే ప్రయత్నంలో, నటి రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్‌లో మిల్లెట్ ఆధారిత రెస్టారెంట్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ వద్ద 'ఆరంభం' పేరుతో ఒక రెస్టారెంట్‌ను ఓపెన్ చేశారు. Curefoods భాగస్వామ్యంతో, సాంప్రదాయ భారతీయ వంటకాల డొమైన్లో మిల్లెట్-ఎయిడెడ్ ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేయడానికి ఆమె ఈ వెంచర్‌ను ప్రారంభించారు. మిల్లెట్‌ను భారతీయ ఆహారంలో ప్రధాన భాగం చేయడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో ఈ చొరవ తీసుకున్నట్లు ఆమె చెప్పారు. రుచిలో రాజీ పడకుండా ఆరోగ్యకరమైన, పోషకమైన భోజనం అందిస్తున్నట్లు ఆమె రెస్టారెంట్‌పై ప్రశంసలు వచ్చాయి. అల్లు అర్జున్ హైలైఫ్పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో అభిమానులను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ కూడా రెస్టారెంట్ వ్యాపారంలో ఉన్నారు. అంతర్జాతీయ రేంజ్లో గుర్తింపు ఉన్న హైలైఫ్ బ్రూయింగ్ కంపెనీ గురించి వినే వింటారు. హైలైఫ్ పేరుతో 2016లోనే జూబ్లీహిల్స్‌లో ఈ రెస్టారెంట్‌ను ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయ హాస్పిటాలిటీ బ్రాండ్ M కిచెన్, నిర్మాత కేదార్ సెలగంశెట్టితో కలిసి రన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్లోబఫెలో వైల్డ్ వింగ్స్ (B-డబ్స్) అనే అమెరికన్ రెస్టారెంట్‌ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ రెండూ కూడా హైదరాబాద్‌లోని పార్టీలకు స్వర్గధామంగా మారాయి. మీరు ఏదైనా సందర్బంలో పార్టీ కోసం వెతుకుతున్నట్లయితే, హైలైఫ్ మీకు సరైన స్థలమని చెప్పవచ్చు.అక్కినేని నాగార్జున యొక్క 'N గ్రిల్, N ఏషియన్'టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు కూడా హైదరాబాద్‌లో ప్రముఖ రెస్టారెంట్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్ వద్ద N గ్రిల్ పేరుతో ఆయనకు ఒక రెస్టారెంట్ ఉంది. 2014లో ఎంటర్ప్రెన్యూర్ ప్రీతం రెడ్డి సహకారంతో ఆయన దీనిని ప్రారంభించారు. ఇది ఆధునిక గ్రిల్ హౌస్‌గా గుర్తింపు ఉంది. దీంతో పాటు జూబ్లీ హిల్స్‌లో కూడా ఎన్ ఏషియన్ అనే చైనీస్ రెస్టారెంట్‌ని కూడా నాగ్ ఏర్పాటు చేయడం విశేషం. రెండు రెస్టారెంట్లు భారతీయ, ఇటాలియన్, పాన్ ఆసియన్‌తో పాటు మెడిటరేనియన్ వంటకాలను అందించే విభిన్న మెనూకు ప్రసిద్ధి చెందాయి. హైదరాబాద్‌లో ప్రీమియం డైనింగ్ అనుభవం కోసం వెతుకుతున్న ఆహార ప్రియుల కోసం ఈ ప్రదేశాలు బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. నాగ చైతన్య 'షోయూ'ఫుడ్ బిజినెస్‌లోకి 2022లోనే నాగచైతన్య ఎంట్రీ ఇచ్చేశాడు. 'షోయూ' పేరుతో జూబ్లీహిల్స్ ప్రాంతలో ఓ సరికొత్త రెస్టారెంట్‌ను ఆయన ఓపెన్ చేశాడు. అక్కడ అనేక రకాల పాన్-ఆసియన్ వంటకాలు దొరుకుతాయి. క్లౌడ్ కిచెన్‌గా తన వ్యాపారాన్ని ఆయన ప్రారంభించారు. స్విగ్గీ ఫుడ్ డెలివరీ సంస్థతో హైదరాబాద్ చుట్టూ ఉన్న ఆహారప్రియులకు తమ వంటకాలను అందిస్తుంది. రుచికరమైన జపనీస్ మీల్స్ అక్కడి ప్రత్యేకత. బ్రాండ్ స్థిరమైన ప్యాకేజింగ్‌ను ఉపయోగించడం ద్వారా పర్యావరణ స్పృహతో కూడిన విధానాన్ని అవలంబిస్తుంది, క్లయింట్లు పర్యావరణ ప్రయోజనకరమైన భోజన అనుభవాన్ని కలిగి ఉండేలా రెస్టారెంట్ యాజమాన్యం చూస్తుంది.నవదీప్- BPM పబ్హీరో నవదీప్ కూడా చాలా రోజుల క్రితమే ఒక పబ్‌ను ప్రారంభించారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే ఈ వ్యాపారంలో ఆయన రాణించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో బీట్స్ పర్ మినిట్ అకా BPM పబ్‌ను నవదీప్ నడుపుతున్నాడు. చాలామంది సెలబ్రిటీలు అక్కడకు వెళ్తూ ఉంటారు. -
పుష్ప ఓ కథ కాదు.. విజయానికి కారణం ఇదే: నాగార్జున
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప, పుష్ప 2 చిత్రాలు సృష్టించిన రికార్డుల గురించి అందరికి తెలిసిందే. పుష్ప మూవీ రిలీజ్ అయినప్పుడు టాలీవుడ్లో నెగెటివ్ టాకే వినిపించింది. కానీ బాలీవుడ్లో మాత్రం తొలి రోజు నుంచే హిట్ టాక్‌తో దూసుకెళ్లింది. ఆ తర్వాత పుష్ప 2(pushpa 2: The Rule) కూడా మన దగ్గర కంటే బాలీవుడ్లోనే ఎక్కువ వసూళ్లను రాబట్టించింది. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప 2 చిత్రాన్ని ఆదరించారు. విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయేలా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్‌ని రాబట్టింది. పుష్ప సీక్వెల్ ఈ స్థాయిలో విజయం సాధించడం వెనక గల కారణాలను సీనియర్ హీరో నాగార్జున(Nagarjuna Akkineni) వెల్లడించాడు. పుష్ప చిత్రం ఇంత సూపర్ హిట్‌గా నిలవడానికి కారణం కథ కాదని.. పుష్పరాజ్ పాత్రకు దక్కిన ఆదరణనే అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘పుష్ప రిలీజ్ తర్వాత పుష్పరాజ్ పాత్ర ఒక సూపర్ హీరో పాత్రగా మారాడు. సోషల్ మీడియాలో ఆ పాత్రకు విపరీతమైన క్రేజీ ఏర్పడింది. మీమ్స్, స్పూఫ్లోనూ పుష్పరాజ్ ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారాడు. అందుకే పుష్ప 2 చిత్రం భారీ విజయం సాధించింది. ఇక్కడ కథ ముఖ్యం కాలేదు.. ఒక పాత్రకు దక్కిన ఆదరణ ఇది’అని నాగార్జున అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగార్జున ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక పుష్ప 2 విషయానికొస్తే.. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. థియేటర్స్‌లో రికార్డులు సృష్టించిన ఈ చిత్రం ఇటీవల ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. -
తల ట్రైలర్ బాగుంది: అక్కినేని నాగార్జున
‘‘తల’(Thala) చిత్రం ట్రైలర్ చాలా బాగుంది. ‘అమ్మ’ రాజశేఖర్(Amma Rajasekhar) డైరెక్షన్ చాలా ఆసక్తిగా ఉంది. ఈ సినిమాలో హీరోగా నటించిన తన కుమారుడు రాగిన్ రాజ్ పెద్ద హీరో అవుతాడనిపిస్తోంది. ఈ చిత్రం తప్పకుండా మంచి విజయం సాధించాలి. నిర్మాత శ్రీనివాస్ గౌడ్‌కు ఆల్ ది వెరీ బెస్ట్’’ అని హీరో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) అన్నారు.‘రణం’ మూవీ ఫేమ్ ‘అమ్మ’ రాజశేఖర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘తల’. ఈ మూవీలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా, అంకిత నాన్సర్ హీరోయిన్గా నటించారు. రోహిత్, ఎస్తేర్ నోరోన్హా, ‘సత్యం’ రాజేశ్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, విజ్జీ చంద్రశేఖర్ కీలక పాత్రల్లో నటించారు. పి. శ్రీనివాస్ గౌడ్ నిర్మించారు.‘అమ్మ’ రాజశేఖర్ వైఫ్ రాధ ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమా నేడు తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమా తొలి టికెట్‌ని అక్కినేని నాగార్జున కొనుగోలు చేసి, యూనిట్‌ని అభినందించారు. ‘‘నాగార్జునగారు ‘తల’ మొదటి టికెట్‌ను కొనడం మా సినిమా సాధించబోతోన్న పెద్ద విజయానికి చిహ్నం. మా సినిమాని థియేటర్లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని ‘అమ్మ’ రాజశేఖర్ అన్నారు. -
నాంపల్లి స్పెషల్ కోర్టులో హాజరైన మంత్రికొండ సురేఖ
-
నాగార్జున పరువు నష్టం కేసు.. కోర్టుకు మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంత్రి కొండా సురేఖ గురువారం నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. గతంలో తన కుటుంబ వ్యవహారంపై ఆమె చేసిన వ్యాఖ్యలకుగానూ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా ఇవాళ స్పెషల్ జడ్జి ముందు ఆమె హాజరై వివరణ ఇవ్వనున్నారు.ఈ పిటిషన్‌కు సంబంధించి ఇప్పటికే నాగార్జున కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం సేకరించింది కోర్టు. గత వాదనల్లో.. కొండా సురేఖ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోయిందని నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు.బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలని వాదించారు. అయితే తన వ్యాఖ్యలకు ఆమె క్షమాపణ చెప్పిన విషయాన్ని సురేఖతరఫు న్యాయవాది గురుప్రీత్ సింగ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే మీడియా ముఖంగా ఆమె చేసిన వ్యాఖ్యలకు, కోర్టుకు సమర్పించిన వివరాలకు పొంతన లేకుండా ఉందని అశోక్ రెడ్డి వాదించారు.ఈ క్రమంలో ఇరువైపులా వాదనల అనంతరం వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు పలుమార్లు మంత్రికి సమన్లు జారీ చేసింది. అయితే పలు ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు ఆమె వివరణ ఇస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఇవాళ ఆమె కోర్టు ఎదుట హాజరై వివరణ ఇచ్చుకున్నారు. -
చైతన్య నటన చూశాక నాన్నగారు గుర్తొచ్చారు: అక్కినేని నాగార్జున
‘‘తండేల్’ కోసం చైతన్య రెండేళ్లు కష్టపడ్డాడు. ఓ రోజు ‘సముద్రంలో ఈ సినిమా షూటింగ్ చేస్తుంటే మత్స్యకారుల కష్టాలు అర్థం అవుతున్నాయి’ అన్నాడు చైతన్య. నెలల తరబడి సముద్రంలో చిన్న పడవపై ఉండే మత్స్యకారులందరికీ చేతు లెత్తి దండం పెడుతున్నాను. ఈ మూవీలో నాగచైతన్య నటన చూస్తుంటే మా నాన్నగారు (అక్కినేని నాగేశ్వరరావు) గుర్తొచ్చారు. 2025లో ‘తండేల్’ మంచి ముహూర్తం. వస్తున్నాం... కొడుతున్నాం’’ అన్నారు అక్కినేని నాగార్జున. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ‘తండేల్’ ఈ నెల 7న విడుదలైంది.మంగళవారం నిర్వహించిన ‘తండేల్ లవ్ సునామీ సెలబ్రేషన్స్’కి ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘అరవింద్‌గారు ‘తండేల్’ కథ విన్న, చందు మొండేటితో తీద్దామన్న, దేవిశ్రీతో మ్యూజిక్ చేయిద్దామన్న వేళా విశేషం... టీమ్ అందర్నీ సెట్ చేయడానికి బన్నీ వాసు, అందరూ ప్రయత్నించిన వేళా విశేషం... వీళ్లందరూ నాగచైతన్యని అడిగిన వేళా విశేషం.. శోభితని చైతన్య పెళ్లి చేసుకున్న వేళా విశేషం... ఇవన్నీ బాగున్నాయి. ‘తండేల్’ విడుదలైన రోజు ఉదయం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారిని కలిసేందుకు వెళ్లాం. అప్పుడు ఫోన్ సెక్యూరిటీలో ఇచ్చి వెళ్లాం.వచ్చాక ఫోన్ ఆన్ చేయగానే... ఫ్యాన్స్ వద్ద నుంచి కంగ్రాట్స్ అంటూ మెసేజులు. నాకన్నా, చైతన్య కన్నా మా శ్రేయోభిలాషులు, అక్కినేని ఫ్యాన్స్ ఎంత ఆనందపడుతున్నారో అప్పుడు అర్థమైంది. ‘తండేల్’ కథని నాక్కూడా వినిపించారు అరవింద్‌గారు. ‘100 పర్సెంట్ లవ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, తండేల్’... ఇలా మా ఫ్యామిలీకి ఒకదాన్ని మించి మరొక సక్సెస్ ఇచ్చిన మీకు థ్యాంక్స్. అల్లు... అక్కినేని కుటుంబాలకు బాగా సెట్టయింది. అరవింద్‌గారిని బన్నీ వాసు చక్కగా కన్విన్స్ చేసి, ఇలాంటి మంచి సినిమాలు తీసేలా చేస్తాడు. చైతన్యలోని ఒక నటుణ్ణి బయటకు తీసుకొచ్చాడు చందు’’ అన్నారు.‘‘తండేల్’కి సంబంధించి బిగ్గెస్ట్ తండేల్ (నాయకుడు) చందు మొండేటి. మా గీతా ఆర్ట్స్‌లో కలకాలం నిలిచి΄ోయే చిత్రాల్లో ‘తండేల్’ని ది బెస్ట్ సినిమాగా తీసుకుంటాం. తన నటనతో చింపేశాడు చైతు’’ అని పేర్కొన్నారు అల్లు అరవింద్. ‘‘నాపై నమ్మకంతో చైతన్యగారిని నాకు అప్పగించిన నాగార్జున సార్‌కి రిటర్న్ గిఫ్ట్‌గా ‘తండేల్’తో నాగచైతన్యగారిని వంద కోట్ల క్లబ్లో కూర్చోబెడతాం. నాలుగైదు రోజుల్లో 100 కోట్ల ΄పోస్టర్ని వేసి, పెద్ద వేడుక చేస్తాం. చైతన్యతో ‘100 పర్సెంట్ లవ్, తండేల్’, అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచి లర్’ వంటి హిట్ సినిమాలు తీశాం. ఇక మీరు (నాగార్జున) కూడా గీతా ఆర్ట్స్‌కి డేట్స్ ఇస్తే వీటన్నిటికంటే పెద్ద సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొడతాం’’ అని చె΄్పారు బన్నీ వాసు. ‘‘మా నాన్నగారిని చూసి నాకు క్రమశిక్షణ, భక్తి వచ్చాయి. నాన్నగారి కన్నా ఇంకా గొప్ప అర్హతలు ఎవరిలో అయినా ఉన్నాయా? అంటే అది అరవింద్‌గారే. చైతన్యగారితో భవిష్యత్తులో ఓ గొప్ప హిస్టారికల్ మూవీ చేయబోతున్నాం. అక్కినేని నాగేశ్వరరావుగారు చేసిన ‘తెనాలి రామకృష్ణ’ కథని మళ్లీ అత్యద్భుతంగా రాసి, ఈ తరానికి ఎలా కావాలి? ఏం చె΄్పాలి? అని తీసుకొస్తాం. ఆ మూవీలో ఏఎన్‌ఆర్‌గారు చేసినటువంటి అభినయం మళ్లీ చైతన్యగారు చేస్తారు. అది మనం చూడబోతున్నాం’’ అని తెలి΄ారు చందు మొండేటి. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘తండేల్ రాజులాంటిపాత్రలు అరుదుగా దొరుకుతాయి. ఈ మూవీతో వంద కోట్ల క్లబ్లో చేరతావని వాసు ఎప్పుడో చె΄్పాడు. ఈ మూవీ నీ కెరీ ర్లో బెస్ట్ అవుతుందని అరవింద్‌గారు చె΄్పారు. నేనూ నమ్మా. చందు, నా కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడం హ్యాపీగా ఉంది. ఎన్నోపాత్రలతో ఆడియన్స్‌ని అలరించాలి, ఎంతో కష్టపడాలనేప్రోత్సాహం, ధైర్యాన్ని ఈ సినిమా ద్వారా అరవింద్‌గారు, వాసు ఇచ్చారు. సినిమా లవర్స్ అంటే మన తెలుగు ప్రేక్షకుల తర్వాతే. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇస్తే ఎలా ఆదరిస్తారో మీరు మాకు చూపించారు’’ అన్నారు. నిర్మాత అశ్వినీదత్, సహ నిర్మాత భాను, నటి, నాగచైతన్య వైఫ్ శోభితా ధూళి΄ాళ్ల,పాటల రచయిత శ్రీమణి, కథా రచయిత కార్తీక్ తదితరులుపాల్గొన్నారు. -
నాగచైతన్య-శోభిత పెళ్లి చేసుకున్న వేళా విశేషం: నాగార్జున ఆసక్తికర కామెంట్స్
అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవలే తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీలో చైతూ సరసన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. దీంతో మూవీ టీమ్ విజయోత్సవ వేడుకల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో తండేల్ మూవీ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. తండేల్ మూవీ సక్సెస్ ఈవెంట్‌కు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తండేల్ సినిమా గురించి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.నాగార్జున మాట్లాడుతూ.. ' తండేల్ సినిమా విడుదలైనరోజు ఢిల్లీలో ప్రధాని మోదీ గారి దగ్గర ఉన్నాం. నా ఫోన్ కూడా నా దగ్గర లేదు.. ఫోన్ తీసుకున్నాక ఫోన్స్, మెసేజులతో నిండిపోయింది. అరవింద్ కథ విన్న వేళా విశేషం.. చందు మొండేటితో తీద్దామన్న వేళా విశేషం.. డీఎస్పీతో చేద్దామన్న వేళ.. మీరందరూ వచ్చి నాగచైతన్య అడిగిన వేళ.. శోభితను నాగచైతన్య పెళ్లి చేసుకున్న వేళా విశేషం ఇలా అన్నీ బాగున్నాయి. తండేల్ సక్సెస్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. సక్సెస్ మీట్‌కు వచ్చి చాలా రోజులవుతోంది. చైతుని చూస్తే నాన్న గారు గుర్తొచ్చారు. 2025లో మళ్లీ వస్తున్నాం. గట్టిగా కొడుతున్నాం. అయితే దయచేసి కొంచెం కొడుకు, కోడలు ముందు నా రొమాంటిక్ వీడియోలను చూపించవద్దని' నవ్వుతూ మాట్లాడారు. ప్రస్తుతం నాగార్జున చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కొడుకు, కోడలు ముందు నా రొమాంటిక్ వీడియోలను చూపించవద్దు 😂 - #Nagarjuna #NagaChaitanya #SobhitaDhulipala #Thandel #TeluguFilmNagar pic.twitter.com/XyLy2bXmO3— Telugu FilmNagar (@telugufilmnagar) February 11, 2025 -
మీ గుర్తింపు ఆయన సేవలకు నిదర్శనం: నాగార్జున్ ట్వీట్
భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)కి హీరో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాసిన 'అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ' పుస్తకాన్ని ప్రధానికి అందజేశారు. మీకు ఈ పుస్తకాన్ని అందించడం గౌరవంగా భావిస్తున్నన్నట్లు వెల్లడించారు. ఇది నా తండ్రి ఏఎన్నార్ సినిమా వారసత్వానికి నివాళిగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆయన సేవలను మీరు గుర్తించడం మా కుటుంబం, అభిమానులు, భారతీయ సినీ ప్రేమికులకు ఒక విలువైన జ్ఞాపకమని నాగార్జున ట్వీట్ చేశారు.పార్లమెంట్ హౌస్‌లో అక్కినేని కుటుంబ సభ్యులంతా ప్రధానిని కలిసి ఫోటో దిగారు. నాగార్జునతో పాటు అక్కినేని అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాల కూడా నరేంద్ర మోదీని కలిశారు. కాగా.. ఇటీవల మన్ కీ బాత్‌లో తెలుగువారి లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రధాని మోదీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. Profoundly thankful to Hon'ble Prime Minister @narendramodi ji for today's meeting at Parliament House. It was an honor to present 'Akkineni Ka Virat Vyaktitva' by Padma Bhushan awardee Dr. Yarlagadda Lakshmi Prasad, a tribute to my father ANR garu's cinematic heritage. Your… pic.twitter.com/4y5y1C1eRY— Nagarjuna Akkineni (@iamnagarjuna) February 7, 2025 -
సరైన డైరెక్టర్ కోసం వెతుకుతున్న నాగార్జున & నితిన్..
-
ఇండియాలో రిచ్ స్టార్ మన టాలీవుడ్ హీరోనే. .ఏ హీరో ఆస్తి ఎంతంటే..?
ఒకప్పుడు నార్త్ ఇండియా స్టార్స్ అన్ని విధాలుగా మన టాలీవుడ్ తారల కన్నా ముందుండేవారు. వ్యక్తిగత సంపదలో సైతం అక్కడి అగ్రగామి నటులదే పైచేయిగా ఉండేది. ఇటీవలి కాలంలో ఉత్తరాది చిత్రాల రికార్డ్స్‌ను మన టాలీవుడ్ తుడిచిపెడుతున్నట్టే... సంపద విషయంలోనూ వారిని మనవాళ్లు తోసిరాజంటున్నారు. తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించింది మనీ కంట్రోల్ అనే ఆర్ధిక వ్యవహారాల సంస్థ. ఈ సంస్థ చెబుతున్న ప్రకారం చూస్తే... దక్షిణాదికి చెందిన అత్యంత సంపన్న తార వాస్తవానికి బాలీవుడ్లో చాలా మంది కంటే సంపన్నుడుగా ఉన్నారు. ఆయన ఎవరో కాదు మన టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యంత సంపన్నుడు అని మనీకంట్రోల్ తేల్చి చెప్పింది. సంస్థ విశ్లేషణ ప్రకారం, నాగార్జున నికర ఆస్తుల విలువ 410 మిలియన్లు (రూ.3572 కోట్లకు పైగా) కలిగి ఉన్నారు, తద్వారా దేశంలోనే అత్యంత రిచ్ స్టార్స్‌లో ఒకరుగా నిలిచారు. మన నాగ్ కన్నా ముందున్నది కేవలం షారుఖ్ ఖాన్, జుహీ చావ్లాలు మాత్రమే. అమితాబ్ బచ్చన్ (రూ.3200 కోట్లు), హృతిక్ రోషన్ (రూ3100 కోట్లు), సల్మాన్ ఖాన్ (రూ.2900 కోట్లు), అక్షయ్ కుమార్ (రూ.2700 కోట్లు) అమీర్ ఖాన్ (రూ1900 కోట్లు) వంటి ఎ–లిస్ట్ బాలీవుడ్ తారల కంటే నాగార్జున ముందున్నారు.నాలుగు దక్షిణాది పరిశ్రమలకు చెందిన నటులలో, నాగార్జున సమకాలీనుడైన చిరంజీవి సైతం నాగ్ తర్వాతి స్థానంలో ఉన్నారు, ఆయన నికర ఆస్తుల విలువ రూ1650 కోట్లు. ఇతర అత్యంత ధనవంతులైన దక్షిణాది తారల్లో రామ్ చరణ్ (రూ1370 కోట్లు), కమల్ హాసన్ (రూ600 కోట్లు), రజనీకాంత్ (రూ500 కోట్లు), జూనియర్ ఎన్టీఆర్ (రూ500 కోట్లు), ప్రభాస్ (రూ250 కోట్లు)...గా ఉన్నారు. నిస్సందేహంగా నాగార్జున తెలుగు సినిమాలలో అత్యంత విజయవంతమైన నటులలో ఒకరు. కానీ, ఆయన సమకాలికులైన చిరంజీవి కన్నా అలాగే నేటి బిగ్ స్టార్స్ అయిన ప్రభాస్ రామ్ చరణ్ కన్నా కూడా ఎలా సూపర్‌రిచ్ అయ్యారు? అంటే వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు స్మార్ట్ వ్యాపార పెట్టుబడుల ద్వారా నాగ్ టాప్ ప్లేస్‌ను సాధించారని సదరు మనీ కంట్రోల్ వెల్లడించింది.నాగార్జున కేవలం సినిమాల నుంచే కాకుండా రియల్ ఎస్టేట్, సినిమా స్పోర్ట్స్ ఫ్రాంచైజీలతో సహా ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా తన దైన మార్క్‌ని చూపారు. టాలీవుడ్‌లోని అతిపెద్ద నిర్మాణ సంస్థలు స్టూడియోలలో ఒకటైన అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున సొంతం. ఆయన రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థ అయిన ఎన్3 రియల్టీ ఎంటర్‌ప్రైజెస్‌ను కూడా కలిగి ఉన్నారు. దైనిక్ భాస్కర్ ప్రకారం, నాగార్జునకు చెందిన అన్ని రియల్ ఎస్టేట్ వాల్యూ ప్రకారం దాదాపు రూ.900 కోట్లు. అలాగే నాగార్జునకు మూడు స్పోర్ట్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి, ప్రైవేట్ జెట్ అర డజనుకు పైగా లగ్జరీ కార్లు నాగ్ స్వంతం. అయితే ఇవన్నీ పలు సంస్థలు లెక్కగట్టిన విలువలే తప్ప వీటికి ఎటువంటి అధికారిక థృవీకరణ లేదనే విషయం ఇక్కడ గమనార్హం. -
నో కాంప్రమైజ్ అంటున్న శేఖర్ కమ్ముల: Kubera Movie
-
అక్కినేని వారి మరో పెళ్లి సందడి.. శోభిత- నాగచైతన్యకే ఆ బాధ్యతలు..! (ఫోటోలు)
-
అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్ మ్యారేజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఇంట్లో మరో శుభకార్యం జరగనుంది. గతేడాది చైతూ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ఆయన వివాహమాడారు. అంతకుముందే అఖిల్ అక్కినేని సైతం ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. తాజాగా అఖిల్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఏడాది మార్చిలో అఖిల్ పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం అఖిల్, జైనాబ్ ఈ ఏడాది మార్చి 24న వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. అంటే మార్చి చివరి వారంలో అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి మొదలు కానుంది.అఖిల్ పెళ్లి వేడుక కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతేడాది నవంబర్ 26న జైనాబ్ రావ్జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కొంతకాలంగా డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఓ ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి తేదీకి సంబంధించి అక్కినేని ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చైతూ బాటలోనే అఖిల్..అయితే అఖిల్ పెళ్లి వేడుక కూడా హైదరాబాద్‌లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. చైతూ- శోభిత పెళ్లి మాదిరే అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా వీరి వివాహా వేడుక జరగనున్నట్లు టాక్. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందే నాగచైతన్య పెళ్లి వేడుక జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు స్థాపించినందున ఈ స్టూడియో నాగార్జున కుటుంబానికి సెంటిమెంట్‌గా కనెక్ట్ అయింది. అయితే మరోవైపు ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కూడా వెళ్లే అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అదే జరిగితే టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. అయితే పెళ్లి తేదీ, వేదికపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.ఇక సినిమాల విషయాకొనిస్తే.. అఖిల్ అక్కినేని 1994లో సిసింద్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత2 015 అఖిల్ మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి చిత్రాలతో అభిమానులను మెప్పించారు. -
అన్నపూర్ణ స్టాఫ్‌ని ఫ్యామిలీలా భావిస్తాం: నాగార్జున
‘‘రోడ్లు కూడా లేని రోజుల్లో నాన్నగారు (అక్కినేని నాగేశ్వరరావు) హైదరాబాద్ వచ్చి, ఇంత పెద్ద అన్నపూర్ణ స్టూడియోని ఎలా స్థాపించారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ, ఒక్కటి మాత్రం తెలుసు... అన్నపూర్ణ స్టూడియోస్ ఎంతో మంది సాంకేతిక నిపుణులు, నూతన నటీనటులు, కొత్త డైరెక్టర్స్‌కు ఉపాధి కల్పించింది. ఎంతోమందికి ఏఎన్‌ఆర్‌గారు స్ఫూర్తి’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు చేసి 50 ఏళ్లయిన సందర్భంగా నాగార్జున ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ– ‘‘అన్నపూర్ణ స్టూడియోస్కి 50వ ఏడాది మొదలైంది. ప్రతి మగాడి విజయం వెనక ఒక మహిళ ఉంటుందని నాన్నగారు నమ్మేవారు. ఆయన సక్సెస్ వెనక మా అమ్మ అన్నపూర్ణగారు ఉన్నారనేది ఆయన నమ్మకం. అందుకే ఈ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియోస్ అని పేరు పెట్టారు. ఈ స్టూడియోకి వచ్చినప్పుడల్లా అమ్మానాన్నలు ఇక్కడే ఉన్నారనిపిస్తుంటుంది. అన్నపూర్ణ స్టాఫ్‌ని మేం ఫ్యామిలీలా భావిస్తాం. స్టూడియో ఇంత కళకళలాడుతోందంటే దానికి అన్నపూర్ణ ఫ్యామిలీనే కారణం. ఈ సందర్భంగా వారికి థ్యాంక్స్. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండక్కి అన్నపూర్ణ స్టూడియోస్ ఓపెన్ అయ్యింది. ఆ తర్వాత ప్రతి సంక్రాంతికి అమ్మానాన్నలు అన్నపూర్ణ ఫ్యామిలీతో కలసి బ్రేక్ ఫాస్ట్ చేసేవారు. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. బయట చాలా మందిని కలసినప్పుడు నాన్నగారి గురించి పాజిటివ్‌గా మాట్లాడతారు. ఆయన జీవితం పెద్ద స్ఫూర్తి అనడం హ్యాపీగా ఉంటుంది’’ అన్నారు. -
వీడియో: అన్నపూర్ణ స్టూడియోని చూశారా.. ఎంత అద్భుతంగా ఉందో..
చెన్నైలో ఉన్న చిత్రపరిశ్రమను హైదరాబాద్‌కి తీసుకురావడానికి నాటి అగ్ర హీరో అక్కినేని నాగేశ్వర్ రావు తీవ్రంగా శ్రమించారు. కొండలు, గుట్టలు ఉన్న అడవి ప్రాంతాన్ని కొని స్టూడియోని నెలకొల్పాడు. అదే అన్నపూర్ణ స్టూడియో. ఈ స్టూడియో నెలకొల్పి ఈ ఏడాదికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అక్కినేని తనయుడు, హీరో నాగార్జున ఓ స్పెషల్ వీడియోని విడుదల చేశాడు.రోడ్లే లేని ప్రాంతంహైదరాబాద్లో సినీ పరిశ్రమ స్థాపించేందుకు.. ఇక్కడ స్టూడియో ఏర్పాటుకు నాగేశ్వర రావు ముందుకువచ్చారు. 1976లో అప్పటి ప్రభుత్వం అక్కినేనికి 22 ఎకరాల భూమికి తక్కువ ధరకు కేటాయించింది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అక్కినేని నాగేశ్వర రావు అతి కష్టపడి స్టూడియో నిర్మించారు. దానికి తన భార్య పేరు మీద 'అన్నపూర్ణ స్టూడియో' అని పెట్టారు. ఆ స్టూడియో నిర్మించే సమయంలో అక్కడికి వెళ్లడానికి రోడ్డు మార్గం కూడా సరిగా లేదట. కొండలు,గుట్టలు ఉన్న ప్రాంతం కొని ఏం చేస్తాడని అంతా ఏఎన్నార్‌ని హేళన చేశారట. కానీ అక్కినేని మాత్రం పట్టుపట్టి మరీ స్టూడియోని నిర్మించారట. తను ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఈ స్టూడియోకి తన భార్య పేరే పెట్టాలనుకున్నాడట. అందుకే ఆ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియో అని నామకరణం చేశారు. ‘అమ్మ అంటే నాన్నగారికి చాలా ఇష్టం. ఆయన విజయం వెనుక అమ్మగారు ఉన్నారని ఎప్పుడూ నమ్మేవాడు. అందుకే ఆమె పేరును స్టూడియోకి పెట్టి.. ప్రాణంగా చూసుకున్నాడు. ఎక్కువ సమయం ఆ స్టూడియోలోనే గడిపేవారు. అందుకే అన్నపూర్ణ స్టూడికి వచ్చినప్పుడల్లా..అమ్మానాన్న ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది’ అని నాగార్జున అన్నారు.సంక్రాంతి ఆనవాయితీఏఎన్నార్ స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోని మరింత డెవలప్ చేశాడు నాగార్జున. ఇప్పుడు అక్కడ పదుల సంఖ్యలో సినిమాలు తెరకెక్కుతున్నారు. వందలాది మంది టెక్నీషియన్స్ , ఆర్టిస్టులు, డైరెక్టర్లకు ఉపాధి పొందుతున్నారు. 1976 సంక్రాంతికి ఈ స్టూడియో స్థాపించారట. ఆ రోజు నుంచి ప్రతి ఏడాది సంక్రాంతికి ఏఎన్నార్ తన సతీమణితో అక్కడికి వచ్చి.. అక్కడి ఎంప్లాస్తో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసేవాడట. ఇప్పటికీ ఆ సంప్రదాయాన్ని అక్కినేని ఫ్యామిలీ కొనసాగిస్తుందట. ‘అన్నపూర్ణ స్టూడియో ఇప్పటికీ ఇంత చక్కగా రన్ అవుతుందంటే కారణం ఇక్కడి ఉద్యోగులు. వారు ఎంప్లాస్ కారు అన్నపూర్ణ ఫ్యామిలీ. వారంతా ఈ స్టూడియో కోసం చాలా కష్టపడతారు. నాన్నగారి మొదలుపెట్టన సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాం. సంక్రాంతి పండక్కి మేమంతా ఇక్కడి ఎంప్లాస్తో కలిసి టిఫిన్ చేస్తాం’ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు నాగార్జున. -
అన్నపూర్ణ స్టూడియోస్ సరికొత్త చరిత్ర..
-
దేశ సినీ చరిత్రలోనే మొదటిసారి.. ఆవిష్కరించిన రాజమౌళి
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోస్‌లో సందడి చేశారు. మనదేశంలోనే మొట్టమొదటిసారి ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన డాల్బీ పోస్ట్ ప్రొడక్షన్(Dolby Technology)ను ప్రారంభించారు. సినీ ఇండస్ట్రీలో ఇండియాలో ఇప్పటివరకు అందుబాటులో లేని డాల్బీ-సర్టిఫైడ్ పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకొచ్చారు. చిత్ర నిర్మాణంలో ఈ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి ఆడియో, విజువల్ ఎఫెక్ట్స్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో సినిమాటిక్ అనుభూతిని కలిగించేలా సినిమాలను తెరకెక్కించనున్నారు. ఆడియన్స్‌కు సినిమాటిక్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ టెక్నాలజీని ఏర్పాటుచేశారు. అది కూడా మన హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభించడం మరో విశేషం.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. 'ఆర్ఆర్ఆర్ సమయంలో డాల్బీ విజన్‌లో సినిమాను అప్ గ్రేడ్ చేయాలనుకున్నా. కానీ ఆ టెక్నాలజీ మనదగ్గర లేదు. దాని కోసం మేము జర్మనీ వరకు ప్రయాణించాల్సి వచ్చింది. ఇది నాకు కొంత వరకు నిరుత్సాహానికి గురిచేసింది. నా సొంత దేశంలో నా సినిమాని డాల్బీ విజన్‌లో చూడలేకపోయానని నిరాశకు గురయ్యా. కానీ ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో డాల్బీ విజన్ గ్రేడింగ్ సదుపాయాన్ని చూసి థ్రిల్ అయ్యా. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే నా నెక్ట్స్ మూవీ విడుదలయ్యే సమయానికి భారతదేశం అంతటా బహుళ డాల్బీ సినిమాలు ఉంటాయి. డాల్బీ విజన్‌లో సినిమా చూడటం పూర్తిగా ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుంది. ప్రతి ఫ్రేమ్‌లోని కథనాన్ని సరికొత్త స్థాయికి తీసుకువెళ్తుంది. ప్రేక్షకులు ఈ డాల్బీ సదుపాయాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నా" అని అన్నారు.అనంతరం నాగార్జున మాట్లాడుతూ..'వర్చువల్ ప్రొడక్షన్లో అగ్రగామిగా ఉండటం కోసం ఎల్లప్పుడు ముందుంటాం. దేశంలోనే మొట్టమొదటి డాల్బీ సర్టిఫైడ్ పోస్ట్‌ప్రొడక్షన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. భారతీయ సినిమాను వరల్డ్ మ్యాప్‌లో ఉంచేందుకు ప్రయత్నం చేస్తాం. అన్నపూర్ణ స్టూడియోస్ తన 50వ సంవత్సరాన్ని జరుపుకుంటున్న సందర్భంగా డాల్బీని ఏర్పాటు చేయడం విశేషం. అత్యాధునికి టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలకు మరో ముందడుగు"అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్ఆర్ఆర్కు సంబంధించిన స్పెషల్ ఫుటేజ్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రదర్శించారు.మహేశ్ బాబుతో రాజమౌళి..కాగా.. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వస్తోన్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు తొలిసారిగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో జతకట్టనున్నారు మన జక్కన్న. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈనెల చివరి వారంలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలిపారు. జనవరి 2న హైదరాబాద్‌లోని రాజమౌళి ఆఫీస్‌లోనే చిత్రయూనిట్ సభ్యుల సమక్షంలో ఈ పూజా కార్యక్రమం జరగనుంది.హీరోయిన్‌పై చర్చ..కాగా.. మహేశ్‌బాబు - రాజమౌళి కాంబినేషన్ చిత్రంపై మరోవైపు రూమర్స్ భారీగా వస్తూనే ఉన్నాయి. వీరిద్దరి సినిమా తీస్తున్నట్లు ప్రకటన వచ్చిన సమయం నుంచి ఈ ప్రాజెక్టపై ప్రేక్షకులు అమితాసక్తిని చూపుతున్నారు. టైటిల్ వంటి తదితర వివరాల కోసం నెట్టింట ఆరా తీస్తున్నారు. SSMB 29 పేరుతో ఈ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కనుంది. ఇటీవల ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే అంశం సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అయింది. -
ఆ రోజు ఏది తినాలపిస్తే అది తింటా.. తాగుతా...: నాగార్జున
టాలీవుడ్ స్టార్ హీరో, కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) ఈ ఏడాది 66వ ఏట అడుగుపెడుతున్నారు. అయినా తెరపై తన వయసులో సగం లాగా కనిపిస్తారు. సిసలైన ఫిట్‌నెస్‌కు అసలైన చిరునామాలా కనిపించే నాగ్.. ఆరోగ్యకరమైన జీవనశైలి దీనికి కారణంగా చెప్పొచ్చు. తాజాగా ఆంగ్ల పత్రిక హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున తన ఫిట్నెస్ సీక్రెట్స్‌తో పాటు ఆరోగ్యార్ధుల కోసం పలు సూచనలు కూడా అందించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...ఉదయం వ్యాయామం..నిద్ర లేవగానే వర్కవుట్ చేయడమే నా మొదటి ప్రాధాన్యత. ఖచ్చితంగా వారానికి ఐదు రోజులు, వీలైతే ఆరు రోజులు వర్కవుట్ చేస్తాను. ఉదయం పాటు 45 నిమిషాల నుంచి ఒక గంట వరకు వ్యాయామం చేస్తాను. ఇలా వారానికి ఐదు నుంచి ఆరు రోజులు ఉదయం దాదాపు గంటసేపు వ్యాయామం చేస్తా. ఆ గంటలో స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియో వర్కవుట్స్ మేళవిస్తా. గత 30–35 సంవత్సరాలుగా నా రొటీన్ ఇదే. కాబట్టి స్థిరత్వం ఎక్కువ. నేను రోజంతా చురుకుగా ఉంటాను. నేను జిమ్‌కి వెళ్లలేకపోతే, కనీసం వాకింగ్ లేదా ఈత కొట్టడానికి అయినా వెళ్తాను. ఫిట్ బాడీ మాత్రమే కాదు సౌండ్ మైండ్‌ని నిర్వహించడానికి ఈత కొట్టడం గోల్ఫ్ ఆడటం వంటి కార్యకలాపాలను ఆస్వాదిస్తా. డైట్..నా ఆహారం కొన్ని సంవత్సరాల నుంచి మారిపోయింది. ఉదయం 7 గంటలకు వ్యాయామంతో ప్రారంభిస్తా. నా ఉదయపు దినచర్య లో ప్రోబయోటిక్స్ కూడా భాగం, ఇది గట్ ఆరోగ్యాన్ని పెంచడానికి శక్తివంతంగా రోజు గడిపేందుకు ఇది గొప్ప మార్గం. దీని కోసం‘నా దగ్గర కిమ్చి, సౌర్‌క్రాట్, పులియబెట్టిన క్యాబేజీ వంటి కొన్ని సహజమైన ప్రోబయోటిక్స్ ఉంటాయి. నేను కొంచెం గోరువెచ్చని నీరు కాఫీ తాగి వ్యాయామానికి వెళతాను. రాత్రి 7 గంటలకు లేదా గరిష్టంగా 7.30 గంటలకు నా డిన్నర్ పూర్తి చేస్తాను. నేను అడపాదడపా ఉపవాసం చేస్తాను. ప్రతిరోజూ 14 గంటల ఉపవాసం ఉంటుంది, నేను సాయంత్రం నుంచి మరుసటి ఉదయం వరకు రోజుకు కనీసం 12 గంటలు ఉపవాసం ఉంటాను. జీర్ణక్రియకు అది శ్రమను తగ్గిస్తుంది. ఆదివారం నా ఛీటింగ్ డే. ఆ రోజున నాకు ఇష్టమైన ఫుడ్‌ని ఆస్వాదిస్తాను. ముఖ్యంగా హైదరాబాదీ వంటకాలు బిర్యానీ కూడా లాగించేస్తా. ఆ రోజున నాకు ఏది తాగాలనిపిస్తే అది తిని తాగుతాను. నేను దాని గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించను. ఇలా చేయడం వల్ల మనం దేన్నీ కోల్పోతున్నట్టు మనకు అనిపించదు. (చదవండి: Game Changer: ‘గేమ్ ఛేంజర్’ని వదలని సినిమా కష్టాలు!)గోల్ఫ్‌తో మానసిక స్పష్టతశారీరకంగానే కాదు మానసికంగానూ చురుకుగా ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. మానసిక ఆనందం కోసం కొంచెం సేపు గోల్ఫ్ ఆడతాను. ఈ గేమ్‌ను సరిగ్గా ఆడటానికి ఏకాగ్రత స్థాయిలు చాలా ఎక్కువ కావాలి. అది మన మనస్సును చాలా చురుకుగా ఉంచుతుంది.నాగ్ సూచనలు→ చాలా మందికి, ఆ వ్యాయామాన్ని మానేయడానికి ఎప్పుడూ ఒక సాకు అందుబాటులో ఉంటుంది. అలా ఆలోచించొద్దు. ఫలితం కనిపించాలంటే సమయం, శ్రమ పెట్టాల్సిందే. వర్కవుట్ చేయడం వల్ల శారీరక లాభాలే కాదు అంతకు మించిన ప్రయోజనాలు ఉన్నాయి.→ మీ వ్యాయామాల మధ్య ఎక్కువ విశ్రాంతి తీసుకోకండి, కూర్చోవద్దు, వర్కవుట్ చేసే చోటుకి ఫోన్స్ తీసుకెళ్లవద్దు. ఏకాగ్రతతో మీ హార్ట్ బీట్ ఒక నిర్దిష్ట స్థాయి కంటే ఎక్కువగా ఉందని నిర్ధారించుకోండి. నేను నమ్ముతున్న (ఫిట్నెస్) మంత్రం స్థిరత్వం. మీ శరీరానికి ప్రతిరోజూ ఒక గంట నుంచి 45 నిమిషాల సమయం ఇస్తే సరిపోతుంది. నిద్ర (తగినంత) నీటితో ఎప్పుడూ హైడ్రేట్ చేయడం మర్చిపోవద్దు.→ మీరు 30 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మీ శరీరం ఏమి చేయగలదో అదే పని ఇప్పుడు చేయలేదు. దానికి అనుగుణంగా ఆహారంలో మార్పు చేర్పులు చేయాలి.–’ఆరోగ్యకరమైన అల్పాహారం, లంచ్ తినండి కానీ డిన్నర్‌తో జాగ్రత్తగా ఉండండి’ ఇది మీ ఆహారం జీవనశైలిని ట్రాక్ చేస్తుంది. చాలా మంది భారతీయులకు ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత డైరీ ఉత్పత్తులు నప్పవు. అలాగే బ్రెడ్, రోటీ తదితర కొన్నింటిలో కనిపించే గ్లూటెన్ కూడా. ఈ రెండూ, మీరు ఆపివేస్తే, సమస్యలు సగం పరిష్కారమవుతాయి. చాక్లెట్లు , స్వీట్స్ మాననక్కర్లేదు. అయితే మనకు ఇతర ఆరోగ్య సమస్యలు లేనప్పుడు వర్కవుట్ చేసినంత కాలం వాటి వల్ల నష్టం లేదు.→ షేప్‌ని పొందడానికి ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి ‘కొంతకాలం క్రితం ఒక శిక్షకుడు నాకు నేర్పించిన ఒక పాఠం.. అది కార్డియో లేదా శక్తి శిక్షణ అయినా, హృదయ స్పందనను మీ గరిష్ట రేటులో 70 శాతం కంటే ఎక్కువగా ఉంచుకోండి అనేది. అది రోజంతా మీ జీవక్రియను సమర్ధవంతంగా ఉంచుతుంది.చదవండి: స్నేహితుడు పోయిన దుఃఖంలో నటుడు.. 'ఆ వెధవ ఆత్మకు శాంతి అక్కర్లేదు -
జూన్‌లో కుబేర?
జూన్‌లో థియేటర్స్‌లోకి రానున్నారట ‘కుబేర’. ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న పాన్–ఇండియన్ మూవీ ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కానుందనే ప్రచారం సాగింది. కానీ జూన్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
నాగార్జునకు, రామ్‌చరణ్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన ముక్కు అవినాష్ (ఫోటోలు)
-
టాలీవుడ్ ప్రముఖ హీరో కుమారుడు.. సినిమా ఎంట్రీకి రెడీ
తెలుగు చిత్ర పరిశ్రమకు చిరంజీవి, బాలకృష్ణ ,నాగార్జున, వెంకటేష్ మూల స్థంబాలు అని చెప్పవచ్చు. ఇప్పటికే వారి వారసులు కూడా సినిమాలో ఎంట్రీ ఇచ్చేశారు. వారిలో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ పాన్ ఇండియా రేంజ్ దాటి గ్లోబల్ రేంజ్‌కు చేరిపోయాడు. నాగార్జున కుమారులు నాగ చైతన్య, అఖిల్ సత్తా చాటుతున్నారు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేందుకు హిట్ డైరెక్టర్‌తో రెడీగా ఉన్నాడు. అయితే, త్వరలో వెంకటేష్ కూడా తన వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.రామానాయుడి వారసులుగా వెంకటేష్, రానా, సురేష్ బాబు ఇండస్ట్రీలో రానిస్తున్నారు. ఇప్పుడు తర్వాతి జనరేషన్ నుంచి వెంకీ కుమారుడు అర్జున్ ఎంట్రీ గురించి తెరపైకి వచ్చింది. బాలకృష్ణ టాక్ షోలో తాజాగా పాల్గొన్న వెంకటేష్.. ఆయనతో అర్జున్ సినిమా ఎంట్రీ గురించి ఆఫ్‌స్క్రీన్‌లో చర్చించారట. తన కుమారుడిని కూడా త్వరలో సినిమా రంగానికి పరిచయం చేయాలని ఉన్నట్లు బాలయ్యతో వెంకీ తెలిపారట. అర్జున్ అమెరికాలో చదువుకొంటున్నాడని త్వరలో అక్కడి నుంచి ఇండియాకు రానున్నట్లు కూడా చెప్పాడని సమాచారం. ఈ క్రమంలో అర్జున్‌కు కూడా సినిమాలంటే ఆసక్తి ఉందని వెంకీ చెప్పుకొచ్చాడట. దీంతో వెంకటేష్ వారసుడిగా అర్జున్ ఎంట్రీపై వార్తలు నెట్టింట భారీగా వైరల్ అవుతున్నాయి. తొలి సినిమా తమ సొంత బ్యానర్లోనే తెరకెక్కించే అవకాశం ఉంది.వెంకటేష్ నలుగురు పిల్లల వివరాలు ఇవేవెంకటేష్కు ముగ్గురు కుమార్తెలు కాగా, అర్జున్ చివరి వాడు. పెద్ద కుమార్తె ఆశ్రిత అందరికీ సుపరిచితమే.. పెళ్లి తర్వాత ఫుడ్ వ్లాగర్‌గా ఆమె చాలామందికి తెలుసు. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేతగా కొనసాగిన సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రిత వివాహం 2019లో జరిగిన సంగతి తెలిసిందే. ఆశ్రిత మామయ్య రఘురాంరెడ్డి ఖమ్మం ఎంపీగా ప్రస్తుతం ఉన్నారు. ఇక వెంకటేష్ రెండవ కుమార్తె హయ వాహిని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేశారు. విజయవాడకు చెందిన డాక్టర్ కుమారుడితో ఆమె వివాహం కొద్దిరోజుల క్రితమే జరిగింది. మూడో కూతురు భావన హైదరాబాద్‌లోనే గ్రాడ్యువేషన్ చదువుతుంది. ఇక వెంకీ కుమారుడు అర్జున్ సినిమా ఎంట్రీ కోసం దగ్గుబాటి అభిమానులు ఎదురుచూస్తున్నారు. -
'రాబోయే తరాలకు ఆదర్శం'.. ప్రధానికి నాగార్జున కృతజ్ఞతలు
భారత ప్రధాని నరేంద్ర మోదీకి టాలీవుడ్ హీరో నాగార్జున ధన్యవాదాలు తెలిపారు. మన్ కీ బాత్‌లో అక్కినేని నాగేశ్వరరావు పేరును ప్రస్తావించడంపై నాగ్ స్పందించారు. మా నాన్న శతజయంతి ఏడాది సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని నాగార్జున పోస్ట్ చేశారు. ఈ గుర్తింపు మా కుటుంబంతో పాటు సినీ ప్రపంచానికి దక్కుతుందన్నారు. ఆయన సినీ జీవితం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.కాగా.. ఏడాది ఏఎన్నాఆర్ శతజయంతి ఉత్సావాలను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం అవార్డ్‌ను మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. ఈ వేడుకలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. అక్కినేని శతజయంతి ఉత్సావాల సందర్భంగా చివరిసారి అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడిన ఆడియోను కూడా ప్రదర్శించారు.ఇక సినిమాల విషయానికొస్తే నాగార్జున కుబేర మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ ధనుశ్, రష్మిక మందన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.Thank you, Hon’ble Prime Minister shri @narendramodi ji, for honoring my father, ANR Garu, on his centenary year alongside such iconic legends. 🙏His vision and contributions to Indian cinema continue to inspire generations, and this recognition means the world to our family and… https://t.co/PK0kah9gHT pic.twitter.com/Yh5QSYm4cA— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 29, 2024 -
సీఎం ముందు అక్కినేని నాగార్జున ప్రతిపాదనలు
-
సీఎం రేవంత్‌తో సీనీ ప్రముఖుల భేటీ (ఫోటోలు)
-
పీవీ సింధు రిసెప్షన్లో సినీ స్టార్స్.. చిరు, అజిత్‌తో పాటు
ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu).. రీసెంట్గా వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకుంది. రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోగా.. హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుకని అంగరంగ వైభవంగా చేశారు. అయితే ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది విచ్చేశారు. సినీ సెలబ్రిటీలు మాత్రం తెలుగు, తమిళ స్టార్స్ విచ్చేశారు.(ఇదీ చదవండి: Allu Arjun Issue: 3.30 గంటలు.. 20 ప్రశ్నలు)టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి(Chiranjeevi), నాగార్జునతో పాటు హీరోయిన్ మృణాల్ ఠాకుర్ (Mrunal Thakur).. సింధు రిసెప్షన్లో సందడి చేసింది. తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar) ఏకంగా ఫ్యామిలీతో పాటు హైదరాబాద్ వచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీళ్లందరితో పాటు ఉపాసన కూడా సింధుని ఆశీర్వదించేందుకు రిసెప్షన్‌కి వచ్చింది.గత ఆదివారం రాత్రి రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో పీవీ సింధు వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. సింధు పెళ్లాడిన వెంకట్ దత్త సాయి (Venkat Datta Sai) బడా వ్యాపారవేత్త కావడం విశేషం.(ఇదీ చదవండి: ముంబైలో చాలామంది హీరోలు కీర్తి ఫోన్ నెంబర్ అడిగారు: వరుణ్ ధావన్)Boss❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥 at #PVSindhuWedding Reception 🥳 @KChiruTweets #MegaStarChiranjeevi Congratulations 💐@Pvsindhu1 pic.twitter.com/Vobmc1K8l1— Team Chiru Vijayawada (@SuryaKonidela) December 24, 2024#akkineninagarjuna at #pvsindhu wedding reception #nagarjuna #PVSindhuWedding pic.twitter.com/tTVQc3h6vs— Cinema Factory (@Cinema__Factory) December 24, 2024#MrunalThakur with #PVSindhu and #VenkatDatta at their wedding reception 💙 pic.twitter.com/vqh005nHlF— y. (@yaaro__oruvan) December 24, 2024AK Family ❤️#Ajith | #Ajithkumar | #AK | #VidaaMuyarchi | #GoodBadUgly | #PVSindhu pic.twitter.com/1i5hvSUWC2— vanakkam world (@VanakkamWorld) December 24, 2024 -
వెబ్ సిరీస్ చేసే ఆలోచనలో నాగ్
-
బిగ్‌బాస్ 8 హైలైట్స్: ఈ విషయాలు గమనించారా?
ఎన్నో ట్విస్టులు, టర్నులతో బిగ్‌బాస్ 8 మొదలైంది. అన్లిమిటెడ్ ఫన్ గ్యారెంటీ అంటూ షో మొదలుపెట్టాడు హోస్ట్ నాగార్జున. రానురానూ ఫన్ తగ్గిపోవడంతో వైల్డ్‌కార్డ్స్‌ను రంగంలోకి దింపాడు. అప్పటినుంచి షోపై హైప్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్లుగానే కంటెస్టెంట్లు కూడా హోరాహోరీగా పోరాడారు. చివరకు నిఖిల్ విజేతగా నిలిచాడు. మరి 105 రోజుల జర్నీలో ఏమేం జరిగాయో హైటైల్స్లో చూసేద్దాం..⇒ సెప్టెంబర్ 1న బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ప్రారంభం⇒ లాంచింగ్ రోజు హౌస్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు.. వీరిని జంటలుగా పంపించిన బిగ్‌బాస్⇒ ప్రైజ్‌మనీని జీరోగా ప్రకటించిన నాగార్జున.. హౌస్‌మేట్సే దాన్ని సంపాదించాలని వెల్లడి⇒ రెండో వారం శేఖర్ బాషాను పంపించేసిన హౌస్మేట్స్⇒ అక్టోబర్6న రీలోడ్ ఈవెంట్ ద్వారా 8 మంది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ⇒ ఈ ఎనిమిది మంది వైల్డ్ కార్డ్స్ గత సీజన్స్‌లో వచ్చినవాళ్లే కావడం గమనార్హం⇒ పాతవారిని ఓజీగా, వైల్డ్‌కార్డ్స్‌ను రాయల్స్ క్లాన్‌గా విభజించిన బిగ్‌బాస్⇒ తొమ్మిదోవారంలో క్లాన్స్ తీసేసి అందర్నీ కలిపేసిన బిగ్‌బాస్⇒ ఈ సీజన్లో కెప్టెన్ పదవికి బదులుగా మెగా చీఫ్ పదవిని పెట్టారు⇒ రేషన్ కూడా కంటెస్టెంట్లే సంపాదించుకోవాలన్నారు, కిచెన్‌లో టైమర్ ఏర్పాటు చేశారు⇒ ఈ సీజన్లో జైలుకు వెళ్లిన ఏకైక కంటెస్టెంట్ మణికంఠ⇒ ఏడోవారంలో నాగమణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ వల్ల బతికిపోయిన గౌతమ్⇒ పదోవారంలో గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్⇒ 12 వారం.. ఎలిమినేట్ అయినవారితో నామినేషన్స్⇒ ఎవిక్షన్ షీల్డ్ గెలిచిన నబీల్⇒ పదమూడోవారంలో ఎవిక్షన్ షీల్డ్‌ను అవినాష్‌కు వాడిన నబీల్.. ఫలితంగా తేజ ఎలిమినేట్⇒ ఈ సీజన్లో ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్⇒ బీబీ పరివారం వర్సెస్ మా పరివారం ఛాలెంజ్‌లో అన్ని గేముల్లోనూ బిగ్‌బాస్ కంటెస్టెంట్లదే గెలుపు⇒ ఈ సీజన్ చిట్టచివరి టాస్క్ గెలిచి ప్రైజ్‌మనీకి రూ.1 యాడ్ చేసిన గౌతమ్⇒ దీంతో టోటల్ ప్రైజ్‌మనీ రూ.55 లక్షలకు చేరింది.⇒ తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే ఇదే అత్యధిక ప్రైజ్‌మనీ⇒ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా రామ్‌చరణ్⇒ బిగ్‌బాస్ 8 విన్నర్‌గా నిఖిల్, రన్నరప్‌గా గౌతమ్⇒ తర్వాతి మూడు స్థానాల్లో నబీల్, ప్రేరణ, అవినాష్ ఉన్నారు.నాగమణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అవకపోయినా, నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడకపోయినా గౌతమ్, అవినాష్ ఫైనల్స్‌లో ఉండేవారే కాదు. అప్పుడు వీళ్లకు బదులుగా వేరే ఇద్దరికి ఫైనల్స్‌లో చోటు లభించేది!చదవండి: ఫినాలేలో గౌతమ్‌పై నాగ్ సెటైర్లు.. కానీ చివర్లో మాత్రం..! -
బిగ్ బాస్ ఆఖరి వారం విశ్లేషణ... తెలుగు బిగ్ బాస్‌లో విజేత కన్నడ నటుడు
భాషేదైనా భావం ముఖ్యమన్న విషయాన్ని నిరూపించింది ఈ సీజన్ బిగ్ బాస్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో విన్నర్ గా కన్నడ నటుడు నిఖిల్ విజేతగా నిలిచాడు. 22 మంది కంటెస్టెంట్స్ తో 105 రోజుల హోరాహోరీగా జరిగిన పోరాటంలో అజేయంగా నిలిచాడు. మొదటి ఎపిసోడ్ నుండీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తూనే వస్తున్నాడు నిఖిల్. ఓ దశలో ఫస్ట్ రన్నరప్ గౌతమ్ గట్టి పోటీ ఇచ్చినా చివరికి విజయం మాత్రం నిఖిల్‌నే వరించింది. ఫైనల్ ఎపిసోడ్ లో టాప్ 5 గా నిలిచిన అవినాష్, ప్రేరణ, ముందుగా ఎలిమినేట్ అయ్యి టాప్ 3లో నబీల్, గౌతమ్, నిఖిల్ నిలిచారు. ఈ ముగ్గురిలో విన్నర్గాల్ని ప్రకటించారు హోస్ట్ నాగార్జున. ఈ సీజన్లలో ప్రత్యేకత ఏంటంటే విన్నర్ పరభాషా నటుడవడం. ఆదివారం ప్రసారమైన గ్రాండ్ ఫినాలే యధావిధిగా ఆర్భాటంగా జరిగింది. ఈ సీజన్ లో పలు సెలబ్రిటీస్ తో పాటు ఫినాలేలో గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ గెస్ట్‌గా రావడం ఎపిసోడ్ కే హైలైట్. ఇక ఈ సిజన్ విశ్లేషణకొస్తే.. 14మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ హౌజ్‌లోకి తర్వాత మరో 8 మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో ఎంట్రీ ఇచ్చారు. దీంతో మొత్తంగా 22 మంది పార్టిసిపెంట్స్ తో 15 వారాలు ప్రేక్షకులను అలరించింది. బిగ్ బాస్ అనేది ప్రపంచ ప్రేక్షకాదరణ పొందిన కాన్సెప్ట్. అటువంటిది తెలుగులోనూ విశేష ఆదరణ లభించింది. ఇదే ఈ కార్యక్రమాన్ని భారత్‌లో నెం.1గా నిలబెట్టింది. అన్ని సీజన్లకు మాదిరిగానే ఈ సీజన్ లోనూ పార్టిసిపెంట్స్ మధ్య వాడి, వేడి టాస్కులతో సెగలు పుట్టించగా.. హోస్ట్ నాగార్జున వారాంతంలో వీరి ఆట తీరుపై విశ్లేషణతో ప్రేక్షకులను కట్టిపడేసే ప్రయత్నం చేశారు. నత్తి మెదడు, మగళై, కుట్టి వంటి పదాలు ఈ సీజన్లో పార్టిసిపెంట్స్ మధ్య బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతి సీజన్‌ని ఫాలో అయ్యే ప్రేక్షకులకు రొటీన్ టాస్కుల పరంగా కాస్తంత అసహనం కలిగించినా సెలబ్రిటీలతో సీజన్ కవర్ చేయడానికి బాగానే ప్రయత్నించారు. బిగ్ బాస్ టీవి షోనే అయినా దీని తాకిడి మాత్రం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. సోషల్ మీడియాలోనే పార్టిసిపెంట్స్ పరంగా గ్రూపులతో పాటు కార్యక్రమంలోని అంశాలపై రోజువారీ చర్చలు జరిగాయి. బిగ్ బాస్ కార్యక్రమానికి కావలసిందీ ఇదే. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇప్పటిదాకా ఎక్కువగా యాంకరింగ్ చేసింది నాగార్జునే. తన ఛరిష్మాతో ఇటు పార్టిసిపెంట్స్‌ను అటు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. పార్టిసిపెంట్స్ గొడవ ఓ ఎత్తయితే ఆ గొడవకు సంబంధించిన నాగార్జున విశ్లేషణ మరో ఎత్తు. దీని కోసమే చాలా మంది వెయిట్ చేసేవారు. మామూలుగా అపరిచితులతో ప్రయాణం చేసేటప్పుడు జరిగే చిన్నపాటి ఘర్షణ తలెత్తినా చుట్టూ పదిమంది గుమిగూడి గొడవ సద్దుమణిగేదాకా సినిమా చూసినట్టు చూస్తారు. అలాంటిది 22 మంది అపరిచితులను వంద రోజులకు పై ఓ ఇంట్లో పెట్టి వారి మధ్య టాస్కులు పెడితే ఆ బొమ్మ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతిరోజూ ఒకే స్క్రీన్ మీద 22కు పైగా సినిమాలను చూసినట్టుండేది.. అదే బిగ్ బాస్. ఈ సీజన్ తో బిగ్ బాస్ కార్యక్రమానికి కామా పడింది. మరో సీజన్ సినిమా కోసం ప్రేక్షకులు మరో 9 నెలలు వెయిట్ చేయాల్సిందే. వచ్చే సీజన్ వరకు ఈ సీజన్ వేడి మాత్రం చల్లారేదేలే. ఎందుకంటే బిగ్ బాస్ ఎప్పటికీ అస్సలు తగ్గేదేలే. - హరికృష్ణ ఇంటూరు -
ఫినాలేలో గౌతమ్‌పై నాగ్ సెటైర్లు.. కానీ చివర్లో మాత్రం..!
కష్టపడు.. ఫలితం ఆశించకు అంటుంటారు. కానీ బిగ్‌బాస్ షోలో ఫలితం ఆశించి కష్టపడ్డా కొన్నిసార్లు ప్రతిఫలం దక్కదు. ఈ సీజన్లో వైల్డ్ ఫైర్‌లా మారిన గౌతమ్ కృష్ణ గత సీజన్లోనూ పాల్గొన్నాడు. అప్పుడు కూడా గ్రూప్ గేమ్స్ జోలికి వెళ్లకుండా సోలో బాయ్‌లా ఆడాడు. అయితే కొన్నిసార్లు నువ్వెంత ప్రయత్నించావన్నదానికి బదులు ఎన్ని గెలిచావన్నదే చూస్తారు. ఈ విషయంలో గౌతమ్ వెనకబడిపోయాడు.బెడిసికొట్టిన అశ్వత్థామ బిరుదుకానీ శివాజీ కపట నాటకాన్ని వేలెత్తి చూపించి హైలైట్ అయ్యాడు. అయితే బిగ్‌బాస్‌కు కూడా కొందరు ఫేవరెట్స్ ఉంటారు. వాళ్లనేమైనా అంటే ఆ కంటెస్టెంట్ గేటు బయట ఉండాల్సిందే! హోస్ట్ నాగార్జున కూడా అతడి నోరు నొక్కేసి నానామాటలన్నారు. చివరకు 13వ వారంలో గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. అశ్వత్థామ 2.0 అంటూ తనకు తాను ఇచ్చుకున్న బిరుదు కూడా జనాలకు రుచించలేదు, ట్రోల్ చేశారు.దారి తప్పిన గౌతమ్అయితే ఎక్కడ తగ్గాడో అక్కడే నెగ్గాలనుకున్నాడు. మళ్లీ బిగ్‌బాస్ 8లో అడుగుపెట్టాడు. ఈసారి ఏదేమైనా వెనక్కు తగ్గకూడదని బలంగా ఫిక్సయ్యాడు. కానీ వచ్చినవారంలోనే క్రష్ అంటూ యష్మిపై ఫీలింగ్స్ బయటపెట్టడంతో జనం అతడిని తిరస్కరించాడు. వెంటనే ఎక్కడ తప్పు చేశానన్నది గ్రహించి తనను మార్చుకున్నాడు. కేవలం ఆటపైనే దృష్టిసారించాడు. తప్పు జరుగుతుంటే వేలెత్తి చూపించాడు. (చదవండి: ఆడు మగాడ్రా బుజ్జి.. గౌతమ్ కృష్ణ సంపాదన ఎంతంటే?)ఆ ఒక్క మాటతో విపరీతమైన నెగెటివిటీగ్రూప్ గేమ్స్ తప్పు కాదని హోస్ట్ చెప్తున్నా సరే అది తప్పని వాదించాడు. అతడి గుండెధైర్యానికి జనాలు ఫిదా అయ్యారు. అతడి ప్రవర్తన, మాటతీరుకు సెల్యూట్ చేశారు. గెలుపు ఖాయం అనుకుంటున్న సమయంలో నిఖిల్‌పై అనవసరంగా నోరు జారాడు. అమ్మాయిలను వాడుకుంటున్నావ్ అనడంతో గౌతమ్‌పై ఉన్న పాజిటివిటీ కాస్త తగ్గిపోయింది. అది ఎంత పెద్ద మాట అని నాగార్జున చెప్తున్నా కూడా అతడికి చెవికెక్కలేదు. వివరణ ఇస్తూనే పోయాడు. ఈ వ్యవహారం అతడికి మైనస్ అయింది.సెటైర్.. అంతలోనే ప్రశంసగౌతమ్ ఎదుటివారు చెప్పేది వినిపించుకోకుండా తన పాయింట్స్ తను చెప్పుకుంటూ పోతూనే ఉంటాడు. ఫినాలేలో గౌతమ్ తండ్రి కూడా అలా ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. అది చూసిన నాగ్.. ఎవరైనా మాట్లాడుతుంటే వినకుండా నీ వర్షన్ నువ్వు చెప్పే క్వాలిటీ మీ తండ్రి నుంచే వచ్చిందా? అని సెటైర్ వేశాడు. అయితే ఎక్కువగా తన చేతిలో తిట్లు తినే గౌతమ్‌ను చిట్టచివరిసారి మెచ్చుకున్నాడు నాగార్జున. గౌతమ్‌ను రన్నరప్‌గా ప్రకటించినప్పుడు.. గర్వించే కొడుకును కన్నారంటూ అతడి పేరెంట్స్‌ను ప్రశంసించాడు. అది చూసిన ఫ్యాన్స్.. ఇది కదా సక్సెస్ అంటే, నువ్వు జనాల మనసులు గెలిచేశావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.తెర వెనక 'బిగ్‌బాస్ 8' ఫినాలే హంగామా.. ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్: తేజకు నాగార్జున బంపరాఫర్.. అతడి పెళ్లికి..!
బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు నాగార్జున ఒక టీచర్‌లాగా! పొరపాట్లు చేస్తే సరిదిద్దుకోమని హెచ్చరిస్తాడు. మంచి చేస్తే చప్పట్లు కొడతాడు. బాధలో ఉంటే మోటివేట్ చేస్తాడు. సంతోషాన్ని నలుగురితో పంచుకోమంటాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నన్ని రోజులు కంటెస్టెంట్లకు గురువుగా, అండగా ఉండేది నాగార్జున ఒక్కరే!గత సీజన్లో..అయితే వీకెండ్లో నాగార్జున వేసుకొచ్చే షర్ట్స్‌కు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. పోయిన సీజన్లో షర్ట్ కావాలని శోభా శెట్టి ఇలా అడగ్గానే నాగ్ అలా ఇచ్చేశాడు. అమర్దీప్ అడిగితే మాత్రం అసలు లెక్కచేయలేదు. ఈ సీజన్లో టేస్టీ తేజ కూడా తనకు చొక్కా కావాలని సిగ్గు విడిచి అడిగాడు. సన్నబడితే షర్ట్ ఇస్తానని నాగ్ మాటిచ్చాడు. అందుకోసం తేజ కష్టపడ్డాడు కానీ ఫలితం లేకపోయింది. బరువు తగ్గకుండానే హౌస్ నుంచి వెళ్లిపోయాడు.నేను ఫిక్స్ చేస్తాతాజాగా ఫినాలేకు వచ్చిన తేజ మీ షర్ట్ దక్కలేదన్న కోరిక అలాగే మిగిలిపోయిందన్నాడు. అందుకు నాగ్ ముందు పెళ్లి ఫిక్స్ చేసుకో.. అప్పుడు నీకు పెళ్లి డ్రెస్ నేను ఫిక్స్ చేస్తా అని హామీ ఇచ్చాడు. ఊహించని బంపరాఫర్ తగలడంతో తేజ తెగ సంతోషపడిపోయాడు.చదవండి: కప్పు గెలిచేసిన నిఖిల్.. అడుగుదూరంలో ఆగిపోయిన గౌతమ్! -
BB Telugu 8 Telugu: బిగ్‌బాస్ 8 విజేతగా నిఖిల్ మళియక్కల్
బిగ్‌బాస్ 8వ సీజన్ ఫినాలే షురూ. 100 రోజులకు పైగా ప్రేక్షకుల్ని అలరించిన ఈ రియాలిటీ షో.. తుది అంకానికి చేరుకుంది. టాప్-5లో నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్, అవినాష్ ఉన్నారు. వీళ్లలో విజేత ఎవరనేది మరో మూడు గంటల్లో తేలుతుంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి విజేతకు రూ.55 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వబోతున్నట్లు హోస్ట్ నాగార్జున స్వయంగా ప్రకటించాడు. ఈసారి విజేతగా నిలిచిన వాళ్లకు హీరో రామ్ చరణ్ ట్రోఫీ బహుకరించనున్నారు. -
‘బిగ్‌బాస్ సీజన్ 8’ గ్రాండ్ ఫినాలే...హైలెట్స్ (ఫొటోలు)
-
'బిగ్ బాస్' విన్నర్ ప్రైజ్ మనీ రివీల్ చేసిన నాగ్.. హిస్టరీలో ఇదే టాప్
బిగ్ బాస్ 8 తెలుగు ఫైనల్‌కు చేరుకుంది. నేడు విజేత ఎవరో తేలనుంది. టైటిల్ రేసులో గౌతమ్, నిఖిల్,నబీల్,ప్రేరణ,అవినాష్ ఉన్నారు. వీరిలో గెలుపొందిన విజేతకు ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని కూడా అందిస్తారు. సుమారు 100 రోజులకు పైగా బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా వారందరూ ప్రేక్షకులను మెప్పించారు. హోస్ట్‌గా ఉన్న అక్కినేని నాగార్జున మాత్రమే వారితో టచ్‌లో ఉండేవారు. అయితే, తాజాగా బిగ్ బాస్ ఫైనల్‌కు సంబంధించిన ఫస్ట్ ప్రోమోను విడుదల అయింది. అందులో ప్రైజ్ మనీ, ట్రోఫీని నాగ్ రివీల్ చేశారు.బిగ్ బాస్ విడుదల చేసిన ప్రోమోలో ఈ సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్స్ అందరూ కనిపించారు. ఆ సమయంలో అక్కినేని నాగార్జున ప్రైజ్ మనీ రివీల్ చేశారు. విజేతకు రూ. 55 లక్షలు అందేజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బిగ్ బాస్‌లో ఇదే అత్యంత ఎక్కువ మొత్తం అని నాగ్ తెలిపారు. గతంలో రూ. 50 లక్షలు వరకు మాత్రమే విజేతకు ఇస్తుండగా.. ఈసారి ప్రైజ్ మనీ కాస్త పెరిగిందని చెప్పవచ్చు. ఈ సీజన్ విన్నర్ మారుతి కార్ కూడా దక్కించుకోనున్నారు. ఇప్పటికే ఆ సంస్ధ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.బిగ్ బాస్ 8 ఫైనల్స్ ప్రోమోలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సందడి చేశారు. ఆయన నటించిన కొత్త సినిమా 'యూఐ' ప్రమోషన్స్‌లో భాగంగా షోలో పాల్గొన్నారు. మొదటి ఫైనలిస్ట్‌గా సెలెక్ట్ అయన అవినాష్‌ను ఎలిమినేట్ చేసి హౌజ్ నుంచి స్టేజీపైకి ఉపేంద్రనే తీసుకొచ్చారని తెలుస్తోంది. బిగ్ బాస్ హౌజ్‌లోకి డాకు మహారాజ్ టీమ్ కూడా వెల్లింది. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ హౌజ్‌లోకి వెళ్లి కొంత సమయం పాటు సరదాగా వారితో గడిపింది. -
నాగార్జున పరువునష్టం కేసు.. మంత్రి కొండా సురేఖ గైర్హాజరు!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర మనోవేదనకు గురి చేశాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు మంత్రికి నోటీసులు జారీ చేసింది. ఈనెల 12న వ్యక్తిగతంగా హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.అయితే ఇవాళ విచారణకు మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. పలు కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు ఆమె తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత గడువు కావాలని న్యాయమూర్తిని కోరారు. దీంతో న్యాయస్థానం ఈ నెల 19కి విచారణను వాయిదా వేసింది. అసలేంటి వివాదం..గతంలో మంత్రి కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో నాగార్జున ఫ్యామిలీపై కామెంట్స్ చేసింది. దీంతో తమ పరువుకు భంగం కలిగేలా మంత్రి మాట్లాడారని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఆయన పరువు నష్టం కేసు దాఖలు చేయగా.. న్యాయస్థానం విచారణకు అనుమతించింది. -
'బిగ్‌బాస్' ఫైనల్ చీఫ్ గెస్ట్‌గా స్టార్ హీరో.. భద్రత పెంచిన పోలీసులు
ఈ నెల 15వ తేదీన బిగ్‌బాస్ సీజన్–8 ఫైనల్ జరగనుంది. ఈ సీజన్ విన్నర్ రేసులో గౌతమ్,నిఖిల్,నబీల్,ప్రేరణ,అవినాష్ ఉన్నారు. బిగ్ బాస్‌లోకి మొత్తం 22మంది ఎంట్రీ ఇస్తే వారిలో ఈ ఐదుమంది మాత్రమే సుమారు 100 రోజులకు పైగా గెలుపు రేసులో ఉన్నారు. అయితే, డిసెంబర్ 15వ తేదీన జరగనున్న గ్రాండ్ ఫినాలే కోసం చీఫ్ గెస్ట్‌గా నేషనల్ అవార్డ్ విన్నర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్లలో ముఖ్య అతిథిగా ఒక సెలబ్రెటీ రావడం సహజమే.. బిగ్ బాస్ రేసులో గెలిచిన వారికి చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా ట్రోపీతో పాటు ప్రైజ్ మనీ చెక్‌ను కూడా అందిస్తారు. అయితే, గత సీజన్లో ముఖ్య అతిథిగా ఎవరూ రాలేదు. దీంతో హోస్ట్‌గా షోను నడిపించిన నాగార్జున చేతుల మీదుగానే పల్లవి ప్రశాంత్ ట్రోఫీ అందుకున్నాడు. దీంతో ఈ సీజన్లో తప్పకుండా సినీ సెలబ్రిటీని ముఖ్య అతథిగా తీసుకురావాలని మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ను బిగ్ బాస్‌కు రానున్నారని ప్రచారం జరుగుతుంది. పుష్ప2 విజయంతో బన్నీ విజయోత్సవంలో ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం రూ. 1000 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ ఫైనల్లో అతిథిగా పాల్గొంటే షో మరింత బజ్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బన్నీనే ముఖ్య అతిథిగా బిగ్‌బాస్‌కు వెళ్తే.. అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీగా జనం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది.బిగ్ బాస్ ఫైనల్ కోసం భారీ సెక్యూరిటీబిగ్బాస్ సీజన్–8 ఫైనల్ జరగనున్న నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అల్లర్లు, గొడవలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోలోని ఏడెకరాల్లో బిగ్‌బాస్ సెట్టింగ్ వేయగా..ఫైనల్ కూడా ఇక్కడే జరగనుంది. గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన బిగ్‌బాస్ సీజన్–7 ఫైనల్ సందర్భంగా తలెత్తిన పరిణామాలు, గొడవలు, బస్సులపై రాళ్లు రువ్వడం తదితర అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ 53 సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని ఇప్పటికే పోలీసులు ఆయా పాయింట్లతో కూడిన జాబితాను అన్నపూర్ణ స్టూడియో, బిగ్‌బాస్ యాజమాన్యానికి అందజేశారు. ఫైనల్ రోజుకు ముందే 14వ తేదీన ఉదయమే వీటిని అమర్చుకోవాలని సూచించారు. -
నువ్వేం ఆడావో తెలీట్లేదు.. గౌతమ్‌పై విషం కక్కిన విష్ణు
ప్రైజ్‌మనీ గెలిస్తే ఏం చేస్తావ్? ప్రతి సీజన్లో అడిగినట్లే ఈ సీజన్లోనూ టాప్ 6 కంటెస్టెంట్లను ఇదే ప్రశ్న అడిగాడు నాగార్జున. ముందుగా అవినాష్.. మా అన్నయ్యకు ముగ్గురు ఆడపిల్లలు. వారిలో పెద్దమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని తన గొప్ప ఆలోచనను బయటపెట్టాడు. మరి మిగతావారు ఏమేం అన్నారు? విష్ణు వెళ్లేముందు ఏం చెప్పిందో తెలియాలంటే నేటి (డిసెంబర్ 8) ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే!అందరికీ పంచిపెడతానన్న విష్ణునబీల్ ప్రైజ్‌మనీ గెలిస్తే తన కెరీర్‌పై ఇన్వెస్ట్ చేస్తానని, మంచి సినిమా తీస్తానని చెప్పాడు. ప్రేరణ.. నా పేరెంట్స్‌కు ఉన్న అప్పులు తీర్చేస్తా.. మిగిలిన డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెడతా అని తెలిపింది. విష్ణుప్రియ.. అభయ్ నవీన్ ఫారిన్ ట్రిప్‌కు రూ.2 లక్షలు, మణికంఠ కారుకు రూ.1.5 లక్ష, గంగవ్వ ఇంటికోసం రూ.5 లక్షలు, పృథ్వీకి గోల్డ్ ఇయర్ రింగ్స్.. ఇలా అందరికీ పంచాలనుకుంటున్నాను అని చెప్పింది.ప్రైజ్‌మనీతో ఏం చేస్తానంటే?నిఖిల్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి అద్దె ఇంట్లో ఉంటున్నా.. అమ్మానాన్నలకు ఓ ఇల్లు కట్టాలి. ఇప్పటిదాకా నాకోసం ఎంతో ఖర్చుపెట్టిన మా అన్న, తమ్ముడి కోసం ఈ డబ్బు ఉపయోగిస్తాను అన్నాడు. గౌతమ్.. మా అమ్మానాన్న రిటైర్మెంట్ కోసం ప్రైజ్‌మనీ వాడతాను. అలాగే గంగవ్వ తన కూతురికి కట్టివ్వాలనుకున్న ఇంటి కోసం రూ.10 లక్షలు ఇద్దామనుకుంటున్నాను అని తెలిపాడు.మీ వాడిగా స్వీకరించారు: నిఖిల్అనంతరం నాగార్జున నిఖిల్‌ను సెకండ్ ఫైనలిస్ట్‌గా ప్రకటించాడు. ఈ సందర్భంగా నిఖిల్.. నేను ఆర్టిస్టుగా ఇక్కడికి వచ్చినప్పుడు బయటివాడిని అని కామెంట్స్ చేశారు. కానీ మీరు అది తప్పని రుజువు చేశారు. నన్ను మీ వాడిగా స్వీకరించారు అని ఎమోషనలయ్యాడు. మూడో ఫైనలిస్ట్‌గా గౌతమ్‌ను ప్రకటించాడు. నాలుగో ఫైనలిస్ట్‌గా ప్రేరణను ప్రకటించగానే ఆమె షాకై, ఆ వెంటనే సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది.నిఖిల్‌కు ముద్దుపెట్టిన గౌతమ్ఈ సీజన్లో ఎవరికైనా థాంక్యూ, సారీ చెప్పాలనుకుంటే చెప్పేయమన్నాడు నాగ్. విష్ణుప్రియ.. తనతో స్నేహం చేసిన సీతకు థాంక్యూ.. తెలిసీతెలియకుండా కొన్నిసార్లు బాధపెట్టినందుకు రోహిణికి సారీ చెప్పింది. నబీల్.. ఏదున్నా మణికంఠకు షేర్‌తో చేసుకునేవాడినంటూ అతడికి థాంక్యూ.. ప్రేరణను నామినేట్ చేసినందుకు సారీ చెప్పాడు. నిఖిల్.. నేనెలా ఉన్నానో అలాగే యాక్సెప్ట్ చేసినందుకు పృథ్వీకి థ్యాంక్స్.. గౌతమ్‌పై నోరు జారినందుకు క్షమించమన్నాడు. ఈ సందర్భంగా గౌతమ్.. నిఖిల్‌కు బుగ్గపై ముద్దు పెట్టాడు.థాంక్స్, సారీ.. రెండూ నిఖిల్‌కు చెప్పిన గౌతమ్అవినాష్.. ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చిన నబీల్‌కు థాంక్స్.. నా ఫ్రెండ్ అయిన విష్ణును నామినేట్ చేసినందుకు సారీ అన్నాడు. గౌతమ్ వంతు రాగా.. ఇప్పటివరకు జరిగిన అన్నింటికీ సారీ అంటూ నిఖిల్‌ను హత్తుకున్నాడు. అలాగే అందరికీ వండిపెట్టినందుకు అతడికి థాంక్యూ చెప్పాడు. ప్రేరణ.. ప్రతీది నబీల్‌కు చెప్పుకుంటానని అతడికి థాంక్యూ చెప్పింది. విష్ణుపై నోరు జారినందుకు క్షమాపణలు తెలిపింది. చివరగా నాగ్.. నబీల్ను ఐదో ఫైనలిస్ట్‌గా పేర్కొంటూ విష్ణు ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు.గౌతమ్‌పై విష్ణు సెటైర్లుఎప్పుడూ గ్రహాలు అంటూ వేదాంతం మాట్లాడే విష్ణుతో అందుకు సంబంధించిన గేమ్ ఆడించాడు నాగ్. ట్రోఫీ అనే సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం/ కంటెస్టెంట్ ఎవరో చెప్పాలన్నాడు. దీంతో విష్ణు.. గౌతమ్ ఆట ఇప్పటికీ తెలియట్లేదు.. అర్జంట్‌గా నువ్వేం ఆడావో చూసేయాలంటూ అతడిని ఐదో స్థానంలో పెట్టింది. అవినాష్‌ను నాలుగు, నబీల్ను మూడో స్థానంలో ఉంచింది. ప్రేరణ గెలవాలంటూనే ఆమెను రెండో స్థానంలో పెట్టింది.డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలేట్రోఫీకి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం నిఖిల్ అంటూ అతడికి విన్నర్ స్థానంలో కూర్చోబెట్టింది. ఈ పిచ్చిపిల్లను, నత్తిబుర్రను ఇన్నాళ్లు భరించినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ వీడ్కోలు తీసుకుంది. వచ్చేవారమే గ్రాండ్ ఫినాలే అని ప్రకటించిన నాగార్జున.. ఎపిసోడ్ అయిపోయిన క్షణం నుంచి శుక్రవారం వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయన్నాడు. మరి నబీల్, ప్రేరణ, నిఖిల్, గౌతమ్, అవినాష్‌లలో ఎవరు గెలవాలనుకుంటున్నారో వారికి ఓట్లు వేసేయండి.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
జైపూర్‌కు కూలీ
జైపూర్ వెళ్లనున్నారు కూలీ. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో నాగార్జున, శ్రుతీహాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, హీరోయిన్ రెబ్బా మౌనికా జాన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జైపూర్‌లో జరగనుందని, ఈ షెడ్యూల్లో రజనీకాంత్, ఆమిర్ ఖాన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌తో సినిమా దాదాపు పూర్తవుతుందట. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘కూలీ’ సినిమాను కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1న రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉందని సమాచారం. -
గౌతమ్‌కు హ్యాట్సాఫ్ చెప్తూ.. నిఖిల్‌ను విలన్ చేసిన రోహిణి
ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉందంటూ నాగార్జున బాంబు పేల్చాడు. వచ్చేవారం ఫినాలే జరగబోతుందని తెలిపాడు. ఇక ఇన్నివారాల ప్రయాణంలో ఏ విషయంలో రిగ్రెట్ ఫీలయ్యారు? అది ఏ వారమో చెప్పాలన్నాడు నాగ్. మరి ఎవరెవరు ఏమేం చెప్పారో నేటి (డిసెంబర్ 7) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..మెగా చీఫ్ నా కొంప ముంచిందిమొదటగా అవినాష్.. 12వ వారంలో నేను మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు విష్ణు, రోహిణి మధ్య గొడవను పరిష్కరించలేకపోయానన్నాడు. ప్రేరణ.. పదకొండోవారంలో నేను మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు సాఫ్ట్‌గా ఉండాల్సింది. కానీ బ్యాలెన్స్ కోల్పోయాను. దానివల్ల నాకు, హౌస్‌మేట్స్‌కు ఎఫెక్ట్ అయిందని చెప్పుకొచ్చింది. నబీల్.. తొమ్మిదో వారంలో మెగా చీఫ్ అయ్యే ఛాన్స్ వచ్చింది. కానీ, ఏదో బాధలో ఉండటంతో ఆ అవకాశాన్ని ఈజీగా వదిలేసుకుని తప్పు చేశానన్నాడు. ఎందుకంత తుత్తర? ఈ సందర్భంగా నాగ్.. టాస్కులు సరిగా పూర్తిచేయకముందే ఎందుకు గంట కొడతావ్? ఎందుకంత తుత్తర? అని ప్రశ్నించాడు. అలాగే ఫైనలిస్ట్ అవడానికి చెక్‌పై రూ.15 లక్షలు రాసి, దాన్నెందుకు చించేశావని సూటిగా అడిగాడు. మొదట నా స్వార్థం కొద్దీ రాశాను కానీ తర్వాత మనసొప్పకపోవడంతో దాన్ని చింపేశానని తెలిపాడు. రోహిణి వంతురాగా పదోవారం ఎవిక్షన్ షీల్డ్ గేమ్‌లో అవినాష్ గుడ్డు పాము నోట్లో వేసినందుకు ఎన్నోసార్లు బాధపడ్డానంది. పృథ్వీతో ఫ్లర్ట్ చేశావిష్ణుప్రియ వంతురాగా.. పృథ్వీతో ఫ్లర్ట్ చేయడం వల్ల అతడి గేమ్ ఏమైనా ఎఫెక్ట్ అయిందేమోనని బాధపడుతున్నాను. అలాగే తొమ్మిదో వారంలో నేను చీఫ్ అయినప్పుడు ఐదుగుర్ని నామినేట్ చేయమన్నారు. అప్పుడు నబీల్ను నామినేట్ చేసినందుకు రిగ్రెట్ అయ్యానంది. గౌతమ్.. ఆరో వారంలో కామెడీ టాస్క్‌లో నన్ను అశ్వత్థామ అన్నందుకు ఫీలయ్యాను. అది నామినేషన్స్ దాకా వెళ్లింది. అక్కడ ఫీలయ్యాను అని చెప్పాడు. సారీ చెప్పాలి కదా!ఈ సందర్భంగా నిఖిల్‌తో గొడవ గురించి అడిగాడు నాగ్. నా క్యారెక్టర్ గురించి తప్పుగా అనడంతో నేనూ నోరు జారానన్నాడు. వాడుకున్నావ్ అనేది ఎంత పెద్ద మాటో తెలుసా? అని నాగ్ చెప్తుంటే గౌతమ్.. తాను చేసింది తప్పని, కానీ వేరే ఉద్దేశంలో అనలేదన్నాడు. తప్పు ఎలా చేసినా తప్పే.. మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి కదా అని క్లాస్ పీకడంతో గౌతమ్ మరోసారి నిఖిల్‌ను అందరి ముందు క్షమాపణలు కోరాడు.వీడియోతో క్లారిటీనిఖిల్ వంతు రాగా.. ఎన్నడూ నోరు జారని నేను పద్నాలుగోవారంలో గౌతమ్‌పై నోరు పారేసుకున్నందుకు రిగ్రెట్ అవుతున్నానన్నాడు. రంగుపడుద్ది టాస్క్‌లో గౌతమ్ నిఖిల్‌ను కావాలని కొట్టాడా? లేదా? అనేది వీడియో ప్లే చేసి చూపించాడు. అది అనుకోకుండా తగిలిందని క్లారిటీ రావడంతో నిఖిల్ సైతం అతడికి సారీ చెప్పాడు. తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారో అవిష్ను గెస్ చేయమన్నాడు నాగ్. అవినాష్ ఊహించిందే నిజమైందిఫస్ట్ టైమ్ నామినేషన్స్‌కు రావడం పెద్ద మైనస్.. కాబట్టి రోహిణి ఎలిమినేట్ అవుతుందని అంచనా వేశాడు. అతడు చెప్పిందే నిజమైంది. రోహిణి ఎలిమినేట్ అయింది. అయితే హౌస్‌లో ఆమె మాటతీరు, ఆటతీరును ప్రశంసిసిస్తూ చప్పట్లు కొట్టి, సెల్యూట్ చేసి మరీ సెండాఫ్ ఇచ్చారు. స్టేజీపైకి వచ్చిన రోహిణి.. అవినాష్, గౌతమ్, ప్రేరణను హీరోలుగా పేర్కొంది. ఆ ముగ్గురు హీరోలు: రోహిణిగౌతమ్తో.. వైల్డ్ కార్డ్‌గా వచ్చిన మొదటివారమే ఎలిమినేషన్ అంచుల దాకా వెళ్లొచ్చావ్.. అలా ఎందుకు జరిగిందన్న ఆలోచనతో ఆ తర్వాతి వారం నుంచి నువ్వు ఆడిన విధానానికి హ్యాట్సాఫ్. సోలో.. సోలో అంటూ ఫైనల్‌కు వచ్చేశావ్.. ఫ్రెండ్స్‌తో ఉండటం తప్పేం కాదు, అందరికీ కాసేపు సమయం కేటాయించు సలహా ఇచ్చింది. విష్ణు, నబీల్, నిఖిల్‌ను విలన్లుగా పేర్కొంది. ట్రోఫీ గెలవకపోయినా రోహిణి సగర్వంగా విన్నర్లా బయటకు వెళ్లిపోయింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రోహిణి ఎలిమినేట్.. తప్పు ఒప్పుకొన్న ప్రేరణ
బిగ్‌బాస్ 8 ముగింపుకు ముహూర్తం పెట్టేసినట్లు నాగార్జునే స్వయంగా చెప్పాడు. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు ఉండగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌తో ఇద్దర్ని పంపించేస్తున్నట్లు తెలిపాడు. ఈ పద్నాలుగు వారాల జర్నీలో మీరు రిగ్రెట్ ఫీలైన వారమేంటో చెప్పాలన్నాడు. అందుకు ప్రేరణ పదకొండో వారం అని చెప్పింది. మెగా చీఫ్ అయినప్పుడు సాఫ్ట్‌గా ఉండాల్సింది. కానీ బ్యాలెన్స్ కోల్పోయానని తప్పు ఒప్పేసుకుంది. సంచాలక్‌గా బాగా చేశావా?నిజమే, అప్పటిదాకా ప్రేరణ గ్రాఫ్ రయ్యిమని పైకెళ్లింది. కానీ మెగా చీఫ్ అయిన వెంటనే తన డౌన్‌ఫాల్ మొదలైంది. ఇక నిన్నటి రంగుపడుద్ది టాస్క్‌లో సంచాలక్‌గా బాగా చేశావని అనుకుంటున్నావా? అని నాగ్ ప్రశ్నించగా లేదంటూ నిజం ఒప్పేసుకుంది. మరోవైపు పోల్‌కు సరిగా తాడు చుట్టాల్సిన గేమ్‌లో నబీల్ ఇష్టమొచ్చినట్లు తాడును కట్టి తానే గెలిచానని వాదించాడు. అప్పుడు స్వయంగా బిగ్‌బాసే కలగజేసుకుని అది చుట్టడమా? అని కౌంటర్ ఇచ్చాడు. స్వార్థంగా ఆలోచించా..ఇప్పుడు నాగ్ కూడా సరిగ్గా చుట్టడమేంటో ఏంటో తెలుసా? అంటూ అతడికి క్లాస్ పీకాడు. నీ తిత్తర ఎప్పుడు తగ్గుతుంది? అని ప్రశ్నించాడు.ఫైనలిస్ట్ అవడం కోసం చెక్‌పై రూ.15 లక్షలు రాశావు, అలాంటప్పుడు దాన్ని ఎందుకు చించేశావని అడిగాడు. కొంచెం సెల్ఫిష్‌గా ఉందామనే రాశా.. కానీ తర్వాత మరీ ఎక్కువ డబ్బు రాసేశాననిపించింది అని తెలిపాడు. డబుల్ ఎలిమినేషన్సెల్ఫిష్గా ఉండి గేమ్ సరిగా ఆడకపోతే ఎవరూ గెలవలేరన్నాడు నాగ్. అలాగే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందన్నాడు. ఇప్పటికే శనివారం షూటింగ్ పూర్తవగా అందులో రోహిణిని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇంకో ఎలిమినేషన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పెళ్లి తర్వాత మొదటిసారి జంటగా గుడికి వెళ్లిన నాగచైతన్య-శోభిత
అక్కినేని నాగ చైతన్య ,శోభిత ధూళిపాళ మూడు ముళ్లతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే, ఈ నూతన దంపతులు కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభించాలని అక్కినేని అభిమానులు, ఆత్మీయులు ఆశీర్వదించారు. పెళ్లి అయిన వెంటనే వారిద్దరూ మొదటగా శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.నూతన వధూవరులతో పాటు అక్కినేని నాగార్జున కూడా ఉన్నారు. ఇరువురి కుటుంబ సభ్యులు అందరూ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. కొత్త దంపతులకు అర్చకులు వేదాశీర్వచనంతో పాటు ఆలయ మహాద్వారం వద్ద వారికి అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రసాదాలు వారికి అందించారు. పెళ్లి తర్వాత మొదటిసారి జంటగా చై-శోభిత కనిపించడంతో అభిమానులు భారీగా గుమికూడారు. -
కొత్త జంట చైతూ-శోభితకు ఏఎన్నార్ ఆశీర్వాదం! (ఫొటోలు)
-
నాగచైతన్య-శోభిత వివాహం.. నాగార్జున స్పెషల్ ట్వీట్
హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇన్నాళ్లు ప్రేమపక్షులుగా ఉన్న ఈ జంట నేడు (డిసెంబర్ 4న) భార్యాభర్తలుగా ప్రమోషన్ పొందారు. బుధవారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో 8.13 గంటలకు చై.. శోభిత మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇరుకుటుంబ సభ్యులు సహా బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు అల్లు అరవింద్ దంపతులు, కీరవాణి, దర్శకుడు శశికిరణ్ తిక్క, అశోక్ గల్లా, దర్శకుడు చందు మొండేటి, టి సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరినాథ్, రానా దగ్గుబాటి, సుహాసిని, అడివి శేష్, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తదితరులు హాజరయ్యారు.నా మనసు సంతోషంతో నిండిపోయిందికుమారుడి వివాహం గురించి నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ పెళ్లి మా కుటుంబానికి చాలా గొప్ప క్షణం. చై, శోభిత అన్నపూర్ణ స్టూడియోస్‌లో వారి ప్రయాణాన్ని ప్రారంభించడం.. కుటుంబం, స్నేహితుల ప్రేమతో నా హృదయం సంతోషంతో ఉప్పొంగుతోంది. ఇది ప్రేమ, సాంప్రదాయం, ఐక్యత కలగలిపిన వేడుక, ఇది మా నాన్న కోసం నిలబడిన విలువలను ప్రతిబింబిస్తుంది. శోభితను మా కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నువ్వు ఆల్రెడీ మా జీవితాల్లో అంతులేని ఆనందాన్ని తీసుకొచ్చావు అని రాసుకొచ్చాడు. Watching Sobhita and Chay begin this beautiful chapter together has been a special and emotional moment for me. 🌸💫 Congratulations to my beloved Chay, and welcome to the family dear Sobhita—you’ve already brought so much happiness into our lives. 💐 This celebration holds… pic.twitter.com/oBy83Q9qNm— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 4, 2024 చదవండి: ఆదిత్య 369 సీక్వెల్ ఫిక్స్.. హీరోగా బాలకృష్ణ కాదు! -
కథ విన్నారా?
సోలో హీరోగా నాగార్జున కొత్త సినిమాపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ నాగార్జున మాత్రం ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటూనే ఉన్నారట. కాగా ‘హుషారు, రౌడీబాయ్స్, ఓం భీమ్ బుష్’ సినిమాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హర్ష కొనుగంటి ఇటీవల నాగార్జునకు ఓ స్టోరీ లైన్ వినిపించగా, నచ్చి ఈ సినిమా చేసేందుకు అంగీకరించారట నాగార్జున. దీంతో కథకు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారట హర్ష.ఫైనల్‌గా కథ ఓకే అయితే ఈ సినిమాను సంక్రాంతి తర్వాత సెట్స్‌పైకి తీసుకువెళ్లాలని నాగార్జున భావిస్తున్నారని భోగట్టా. మరి... నాగార్జున–హర్షల కాంబినేషన్ సెట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’, ధనుష్ హీరోగా చేస్తున్న ‘కుబేర’ చిత్రాల్లో లీడ్ రోల్స్ చేస్తూ నాగార్జున బిజీగా ఉన్నారు. ఫిబ్రవరిలో ‘కుబేర’, మేలో ‘కూలీ’ విడుదల కానున్నాయి. -
శోభిత- నాగచైతన్య పెళ్లి.. సతీసమేతంగా హాజరు కానున్న ఐకాన్ స్టార్!
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను పెళ్లాడబోతున్నారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్‌కు ఇప్పటికే అంతా సిద్ధమైంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి పెళ్లి వేడుక జరగనుంది. దీంతో ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు టాలీవుడ్ ప్రముఖులు ఎవరెవరు హాజరవుతారన్న విషయంపై ఆసక్తి నెలకొంది.తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబసమేతంగా హాజరు కానున్నారు. వీరితో పాటు ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కూడా చై వివాహా వేడుకలో సందడి చేయనున్నారు. అంతేకాకుండా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు, సన్నిహితులు కూడా హాజరయ్యే అవకాశముంది. ఈనెల 4న అంటే బుధవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లోని నాగేశ్వరరావు విగ్రహం ఎదుట వీరి పెళ్లి వేడుక జరగనుంది.కాగా.. ఈ ఏడాది ఆగస్టులో శోభిత- నాగచైతన్య నిశ్చితార్థ చేసుకున్నారు. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఇప్పటికే పెళ్లి వేడుకలు మొదలవ్వగా శోభిత హల్దీ వేడుగ ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో మంగళస్నాన వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను శోభిత ఇన్‌స్టాలో షేర్ చేశారు. -
కింగ్ నాగార్జున గ్యారేజిలోని కార్లు ఇవే (ఫోటోలు)
-
'బిగ్ బాస్ అంటే ప్రేక్షకులకు ఫ్లవరు.. పార్టిసిపెంట్స్‌కు ఫైరు'
నిను వీడను నేను....అనే పాటలోని వాక్యం బిగ్ బాస్ పార్టిసిపెంట్స్‌కు సరిగ్గా సరిపోతుంది. ఏ సిరీస్ అయినా సరే, ఎక్కడ ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే...ఒక్కసారి బిగ్ బాస్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళును జీవితకాలం బిగ్ బాస్ నీడలా వారి వెంట ఉంటాడు. అదెలాగంటారా..ప్రతి సీరిస్‌లో పాత వాళ్ళు వచ్చి పార్టిసిపెంట్స్ ను పలకరిస్తారు, వారి టాస్కులతో పులకరిస్తారు. ఇదే జరిగింది ఈ వారం బిగ్ బాస్‌లో. టికెట్ టు ఫినాలె కాంటెస్ట్ కోసం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు పాత సీజన్ల నుండి పార్టసిపెంట్సును తీసుకువచ్చి వారిచే టాస్కులు ఆడే ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. అలానే ఆ కంటెస్టెంట్లు టాస్కులతో పాటు కంటెస్టెంట్స్ మధ్య కాసింత గిల్లికజ్జాలు పెట్టి వెళ్ళారు. ఇదే ఈ వారం బిగ్ బాస్ ప్రేక్షకులకు పండుగ. అందరికీ తెలిసినట్టు హౌస్‌లో గ్రూపిజం బాగా కనపడుతుంది. ఒకటి మొదటి నుండి వున్న గ్రూప్ అయితే రెండోది వైల్డ్ కార్డ్ గ్రూప్. ఆ గ్రూపులు మధ్య ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీ ఫైట్లు. టికెట్ టు ఫినాలె కాంటెస్ట్ ఫైనల్ టాస్కు ముందు ఈ గ్రూపుల మధ్య ఓ పెద్ద తగాదానే నడిచింది. ఆ తగాదా తినే దోశ కోసం ఎగ పడ్డారు. ఎపిసోడ్లో ఈ దోశ పంచాయితీ కనీసం పది నిమిషాల చూపించి ప్రేక్షకుల ఆరాటాన్ని బాగానే క్యాష్ చేసుకున్నాడు బిగ్ బాస్. టికెట్ టు ఫినాలె కాంటెస్ట్ కోసం పెట్టిన టాస్కులలో విజేతగా నిలిచాడు అవినాష్. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా టేస్టీ తేజ , పృథ్వి ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లోపల, బయట చూసే ప్రేక్షకులు బిగ్ బాస్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారో కాని సోషల్ మీడియాలో బోలెడన్ని మీమ్స్, గ్రూప్స్ ఆ పై సోషల్ యూజర్స్ మధ్య బిగ్ బాస్ గురించి కొట్లాట... ఇన్ని జరుగుతున్నాయి. అందుకే బిగ్ బాస్ అంటే ఫ్లవర్ కాదు బిగ్ బాస్ చేస్తున్నవాళ్ళకి, చూస్తున్నవాళ్ళకి వాళ్ళ మధ్య మంట పెట్టే ఫైరు. కాబట్టే బిగ్ బాస్ తగ్గేదేలే....-ఇంటూరు హరికృష్ణ -
కొత్త కోడలు గురించి తొలిసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన 'అమల అక్కినేని'
తెరమీద పోషించిన పాత్రల సంగతి అటుంచితే, ‘నిత్య జీవితంలో తాను పోషించిన ప్రతి పాత్రా తనకు పూర్తి సంతృప్తిని అందించింది’ అని చెబుతున్నారు సీనియర్ నటి, అగ్రనటుడు అక్కినేని నాగార్జున భార్య అమల అక్కినేని. తమ ఇంట పెళ్లి బాజాలు మోగుతున్న నేపథ్యంలో.. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.సాక్షి: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో పాల్గొన్నారు కదా.. ఎలా అనిపించింది?అమల : ఈ సారి అక్కినేని నాగేశ్వరరావు గారితో పాటు ఐదుగురు లెజెండరీ సెంచురీ ఇయర్‌ను ఇఫీ నిర్వహించింది. అదే కాకుండా ప్రారంభ కార్యక్రమం నుంచి ఇఫీ బాగా నచ్చింది. బొమన్ ఇరానీ లెజెండ్స్ గురించి ఎంతో బాగా చెప్పారు. క్లాసిక్స్ నుంచి న్యూ టాలెంట్స్ దాకా, అలాగే ప్రపంచ సినిమాని, ఇండియన్ సినిమాని ఒకే చోట చేర్చడం అద్భుతం. ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. మనం అంతా మన చిన్న ప్రపంచంలో బిజీగా ఉంటాం. ఇలాంటివి జరిగితేనే ఎన్నో మననం చేసుకోగలుగుతాం.. మరెన్నో తెలుసుకోగలుగుతాం.. సాక్షి: మీ ‘అన్నపూర్ణ’ స్టూడెంట్స్‌కి కూడా ఇఫీలో చోటు దక్కిందా..?అమల : ఎస్.. గతంలో ఎన్నో చోట్ల మా విద్యార్థుల చిత్రాలను ప్రదర్శించారు. కానీ ఇఫీలో మా అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకి అవకాశం రావడం తొలిసారి. సంస్థ డైరెక్టర్‌గా ఇది నాకు చాలా సంతోషాన్ని అందిస్తోంది.సాక్షి: సీనియర్ నటిగా సినిమా రంగంలోకి వచ్చే యువతులకు ఏం చెబుతారు? అమల : ఇప్పుడు కొందరు నిర్మాతలు మంచి పాత్రల్ని మహిళలకు ఇస్తున్నారు. అయినా మహిళలంటే కెమెరా ముందు కేవలం నటిగా మాత్రమే కాదు టెక్నీషియన్స్ కావచ్చు, ఫిల్మ్ మేకర్స్‌గా కూడా కావచ్చు. సినిమా పరిశ్రమలోకి ఎటువంటి జంకూ లేకుండా రమ్మంటూ అమ్మాయిలకు నేను ధైర్యాన్ని ఇస్తున్నాను.సాక్షి: నిత్య జీవితంలో మీరు పోషించిన పాత్రలు ఎలా అనిపించాయి.. అమల : నేను పోషించిన ప్రతి పాత్రా నన్ను ఇంత దూరం తీసుకొచ్చాయి. ఇంట్లో భార్యగా, కోడలిగా, తల్లిగా.. ఇవన్నీ నాకు ప్రత్యేకమైన పాత్రలు. అద్భుతమైన ప్రయాణాన్ని అందించాయి. అలాగే గడపదాటితే.. బ్లూ క్రాస్ ద్వారా జంతు సంరక్షణ.. మరోవైపు భవిష్యత్తు సినిమా రంగం కోసం యువతను తీర్చిదిద్దడం.. అన్నీ మధురమైనవి మాత్రమే కాక నేనేంటో నాకు చూపించాయి. సాక్షి: కొత్త కోడలికి ఏవైనా సలహా లాంటివి.. అమల : ఆమె చాలా టాలెంటెడ్. చాలా మెచ్యూర్డ్ మహిళ. ఆ అమ్మాయికి నేను సలహా అంటూ ప్రత్యేకంగా ఏమీ ఇవ్వనక్కర్లేదు. ఆమె తప్పకుండా ఒక మంచి భార్యగా మంచి జీవితాన్ని ఆస్వాదించాలని నా కోరిక. మీ పాఠకులు కూడా కొత్త జంట భవిష్యత్తు బాగుండాలని ఆశీస్సులు ఇవ్వాలని కోరుతున్నా. సాక్షి: పిల్లల విజయాలా? విద్యార్థుల విజయాలా? ఏవి ఎక్కువ? అమల : సినిమా రంగంలో నా పిల్లల విజయాలు సంతోషాన్ని అందిస్తాయనేది నిజమే, కానీ నిజం చెప్పాలంటే.. నా విద్యార్థుల విజయాలు అంతకన్నా ఒకింత ఎక్కువ ఆనందాన్నే పంచుతాయి.. పంచుతున్నాయి. -
పృథ్వీ ఎలిమినేట్.. నిజాయితీగా ఎలా ఉండాలో నేర్చుకోమన్న విష్ణు
ఈరోజు మొదటగా గౌతమ్‌ను సేవ్ చేశాడు నాగార్జున. తర్వాత ఓ ఫన్ గేమ్ కోసం హౌస్‌మేట్స్‌ను రెండు టీమ్స్‌గా విడగొట్టాడు. అవినాష్, రోహిణి, నబీల్, గౌతమ్ ఒక టీమ్ కాగా మిగతావారంతా విష్ణుప్రియ టీమ్‌గా విభజించాడు. హుక్ స్టెప్ వేస్తే ఆ సాంగ్ ఏంటో గెస్ చేయాలన్నదే గేమ్. ఇందులో విష్ణుప్రియ టీమ్ గెలిచింది. మరి తర్వాత ఏం జరిగిందో నేటి (డిసెంబర్ 1) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..షాక్‌లో ప్రేరణఈ వారం ప్రేరణ సేవ్ అవుతుందని కలలో కూడా అనుకోలేదేమో! ఆమె సేవ్ అయినట్లు చెప్పగానే నమ్మలేనట్లు నోరెళ్లబెట్టింది. వెంటనే తేరుకుని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. ఆ వెంటనే నిఖిల్‌ను సైతం సేవ్ చేశాడు. తర్వాత కళ్లకు గంతలు కట్టి మ్యూజికల్ చెయిర్ గేమ్ ఆడించాడు. ఇందులో నిఖిల్, అవినాష్‌ను సంచాలకులుగా పెట్టారు. ఇందులో పృథ్వీ గెలిచాడు.టాప్ 8 కోసం స్పెషల్ పోస్టర్స్హౌస్లో ఉన్న ఎనిమిది కోసం బిగ్‌బాస్ స్పెషల్ పోస్టర్స్ క్రియేట్ చేశాడు. అలా నబీల్ కోసం డబుల్ ఇస్మార్ట్, విష్ణుప్రియ కోసం నిన్ను కోరి, పృథ్వీ కోసం యానిమల్, గౌతమ్ కోసం ఏక్ నిరంజన్, రోహిణి కోసం అరుంధతి, ప్రేరణకు అందాల రాక్షసి, నిఖిల్‌కు ద ఫ్యామిలీ స్టార్, అవినాష్ కోసం సుడిగాడు పోస్టర్స్ వేశాడు.ఎక్స్‌ట్రాలు చేయకుండా ఉండటం ఎలా?అనంతరం నబీల్ను సేవ్ చేసినట్లు ప్రకటించాడు. నెక్స్ట్ ఓ చిన్న టాస్క్ పెట్టాడు. కొన్ని టైటిల్స్ రాసున్న బుక్స్‌ను హౌస్‌మేట్స్‌కు అంకితమివ్వాలన్నాడు. ఎక్స్‌ట్రాలు చేయకుండా ఉండటం ఎలా? అన్న పుస్తకాన్ని ప్రేరణ.. అవినాష్‌కు డెడికేట్ చేసింది. సరైన కారణాలు లేకుండా నామినేట్ చేయడం ఎలా? పుస్తకాన్ని గౌతమ్ నిఖిల్‌కు ఇచ్చాడు.బ్రెయిన్ వాడమన్న అవినాష్బ్రెయిన్ వాడి ఆడటం ఎలా? పుస్తకాన్ని అవినాష్.. విష్ణుప్రియకు ఇచ్చాడు. సపోర్ట్ కోరుకోకుండా ఉండటం నేర్చుకో అన్న పుస్తకాన్ని నబీల్.. రోహిణికి డెడికేట్ చేశాడు. సేఫ్ గేమ్ ఆడకుండా ఉండటం ఎలా? అనేది అవినాష్‌కు ఇచ్చాడు పృథ్వీ. నిజాయితీగా ఉండటం ఎలా? అన్న పుస్తకాన్ని విష్ణు.. అవినాష్‌కు ఇచ్చింది.పృథ్వీ ఎలిమినేట్ఒక్కరిని టార్గెట్ చేయకుండా ఉండటం ఎలా? అన్న బుక్‌ను నిఖిల్.. అవినాష్‌కు ఇచ్చాడు. తర్వాత నాగార్జున విష్ణును సేవ్ చేసి పృథ్వీ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దాంతో విష్ణు కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు గొప్ప మనిషివి పృథ్వీ, ఐ మిస్ యూ అంటూ ఏడ్చేసింది.కన్నీళ్లు పెట్టుకున్న పృథ్వీఅటు స్టేజీపైకి వచ్చిన పృథ్వీ తన జర్నీ చూసుకుని ఎమోషనలయ్యాడు. కాసేపటికి తేరుకున్నాక హౌస్‌మేట్స్‌తో మాట్లాడాడు. నిఖిల్, నబీల్, విష్ణు సూపర్ హిట్ అని.. రోహిణి, అవినాష్ సూపర్ ఫ్లాప్ అని చెప్పాడు. నిఖిల్, నబీల్, విష్ణు, ప్రేరణకు తప్పకుండా ఓటేస్తానన్నాడు. చివర్లో నాగార్జున ఓ సర్ప్రైజ్ రివీల్ చేశాడు. ఈ సీజన్ విజేతకు ట్రోఫీ, ప్రైజ్‌మనీతో పాటు బ్రాండెడ్ కారు కూడా లభిస్తుందని చెప్పాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీ, విష్ణు.. ఇద్దరూ ఎలిమినేటెడ్..: నాగార్జున
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ముగింపుకు వచ్చేస్తోంది. ఈ వారం అవినాష్, నిఖిల్, నబీల్, విష్ణుప్రియ, గౌతమ్, పృథ్వీ, ప్రేరణ, తేజ నామినేషన్స్‌లో ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందన్న నాగ్.. ఈ మేరకు తేజను ఆల్రెడీ ఎలిమినేట్ చేసేశాడు. టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్‌కు నామినేషన్స్ నుంచి మినహాయింపు ఉంటుందన్నాడు.ఎలిమినేషన్నేడు మరో ఎలిమినేషన్ జరగనుంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో విష్ణు, పృథ్వీ డేంజర్ జోన్లో ఉన్నట్లు చూపించారు. ఎవరి అక్వేరియంలో నీళ్లు ఎరుపురంగులో ఉంటాయో వారు ఎలిమినేట్ అని తెలిపాడు. చివర్లో మాత్రం ఇద్దరూ ఎలిమినేట్ అని ప్రకటించాడు. అయితే ఇది నిజమయ్యే ఛాన్సే లేదు.ప్రాంక్?ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ అని నాగార్జునే శనివారం ఎపిసోడ్లో ఓపెన్‌గా చెప్పాడు. ఈపాటికే తేజను పంపించేయగా మరొకరిని మాత్రమే పంపించే ఛాన్స్ ఉంది. కానీ ఈరోజు ఇద్దరూ ఎలిమినేట్ అన్నాడంటే ఇది ప్రాంక్ అని ఇట్టే తెలిసిపోతుంది. పైగా పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన విష్ణు హౌస్‌లోనే ఉండనుంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కోడలు శోభితకి నాగార్జున ఆ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడా?
అక్కినేని వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. రెండు రోజుల క్రితం మంగళస్నానాలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలని స్వయంగా శోభితనే ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. మరోవైపు పెళ్లి కోసం ఇప్పటికే ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అదే టైంలో కాబోయే కోడలికి అక్కినేని ఫ్యామిలీ ఇవ్వబోయే బహుమతుల ఇవేనంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: తేజ ఎలిమినేట్.. 8 వారాలకు ఎంత సంపాదించాడు?)నాగచైతన్య-శోభిత గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెద్దల్ని ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. డిసెంబరు 4న అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోలోనే వివాహం జరగనుంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి మెగా, దగ్గుబాటి కుటుంబ సభ్యులతో పాటు రాజమౌళి లాంటి అతికొద్ది మందే హాజరుకానున్నారని టాక్.రీసెంట్గా నాగార్జున.. రూ.2 కోట్లు విలువైన లెక్సెస్ కారు కొన్నారు. అయితే ఇది శోభితకి బహుమతిగా ఇవ్వడం కోసమే కొన్నారనే అనుకుంటున్నారు. దీనితో పాటు కొన్ని విలువైన బంగారు ఆభరణాల్ని కూడా శోభితకు అక్కినేని ఫ్యామిలీ బహుమతిగా ఇవ్వబోతున్నారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: ధనుష్‌తో వివాదం.. విఘ్నేశ్ శివన్ మిస్సింగ్!) -
నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రేరణ.. టాప్ 2లో గౌతమ్ పక్కా!: తేజ
నాగార్జున వచ్చీరావడంతోనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించాడు. అయితే టికెట్ టు ఫినాలే గెలిచి అవినాష్ ఈ నామినేషన్స్ నుంచి తప్పించుకుని నేరుగా ఫైనల్‌కు వెళ్లిపోయాడని గుడ్‌న్యూస్ చెప్పాడు. అంతేకాదు ఫస్ట్ ఫైనలిస్ట్ అంటూ అతడికి ఓ ట్రోఫీ కూడా ఇచ్చారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 30) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నోరు తీపి చేసిన బిగ్బాస్ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్‌ను మనసులో కోరిక చెప్పమనగా.. మందు బాటిల్స్, స్వీట్స్ కావాలంటూ చిట్టా బయటపెట్టాడు. మందు కుదరదు కానీ స్వీట్స్‌తో సరిపెట్టుకోమంటూ బిగ్‌బాస్ గులాబ్‌జామూన్ పంపించి హౌస్మేట్స్ నోరు తీపి చేశాడు. అలాగే టికెట్ టు ఫినాలే టాస్క్‌లో అతడికి హౌస్మేట్స్ పెట్టిన బ్యాడ్జ్ ప్రకారం రూ.4 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. అలా ప్రైజ్‌మనీ రూ.54,30,000కి చేరింది.బ్లాక్ టికెట్.. గోల్డెన్ టికెట్తర్వాత నాగ్.. హౌస్‌లో కొందరికి బ్లాక్ టికెట్, మరికొందరికి గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. ఎవరికి బ్లాక్ టికెట్ ఇవ్వాలని నిఖిల్‌ను అడగ్గా తేజ పేరు చెప్పాడు. గౌతమ్ వంతు రాగా.. అతిథులు బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తే వారితో సరిగా ప్రవర్తించలేదని ప్రేరణ పేరు సూచించాడు. దీంతో ఆమె ఫౌల్ గేమ్ ఆడిన వీడియో నాగ్ ప్లే చేశాడు. ఇలా ఆడితే బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వకపోతే ఏం చేస్తారన్నట్లు క్లాస్ పీకాడు. రోహిణి.. ఫౌల్ గేమ్ ఆడాడంటూ పృథ్వీకి బ్లాక్ టికెట్ ఇవ్వాలంది. గేమ్స్ గెలిస్తే టైటిల్ రాదు!అవినాష్.. నబీల్‌కు, తేజ.. విష్ణుకు బ్లాక్ టికెట్ ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఎవరు ఈ సీజన్ విన్నర్ అనుకుంటున్నావని విష్ణును అడగ్గా తనే గెలుస్తానంది. గెలవాలంటే ఈ ఆట సరిపోదుకదా అని నాగ్ అంటుంటే.. ఆటలన్నీ గెలిచినవారు టైటిల్ సాధించినట్లు బిగ్‌బాస్ చరిత్రలోనే చూడలేదని వేదాంతం చెప్పింది. అది తప్పని, జనాలు.. ఆట, మాట.. ఇలా ప్రతి ఒక్కటి చూస్తారని స్పష్టం చేశాడు.గౌతమ్‌కు గోల్డెన్ టికెట్ప్రేరణ.. గౌతమ్‌కు బ్లాక్ టికెట్ ఇవ్వాలంది. గౌతమ్ అందుకు అర్హుడంటూ నబీల్, విష్ణు, పృథ్వీ, నిఖిల్ కూడా చేయెత్తారు. అప్పటివరకు హౌస్మేట్స్ చెప్పిన అందరికీ బ్లాక్ టికెట్ ఇచ్చుకుంటూ పోయిన నాగార్జున.. గౌతమ్‌కు మాత్రం బ్లాక్ టికెట్ ఇవ్వనంటూ గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. అలాగే రోహిణి, నిఖిల్, అవినాష్‌కు సైతం గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. అనంతరం దమ్ము-దుమ్ము అని ఓ గేమ్ ఆడించాడు. ట్రోఫీని పైకి ఎత్తగల దమ్మున్న ప్లేయర్ ఎవరు? ఫినాలే వరకు రాకుండా దుమ్ముదుమ్మయిపోయే వ్యక్తి ఎవరు? అనేది చెప్పాలన్నాడు. నిఖిల్ దమ్మున్న ప్లేయర్నబీల్, పృథ్వీ, విష్ణుప్రియ.. నిఖిల్ దమ్మున్న ప్లేయర్ అని, తేజ దుమ్ము అని తెలిపారు. రోహిణి.. గౌతమ్ దమ్మున్న ప్లేయర్ అని, ప్రేరణ ఫినాలే వరకు రాకపోవచ్చంది. తేజ.. ఎంటర్టైనర్లు కూడా గెలవగలరని నిరూపిస్తారంటూ అవినాష్ దమ్మున్న ప్లేయర్ అన్నాడు. విష్ణు ఉట్టి దుమ్మున్న ప్లేయర్ అన్నాడు. గౌతమ్.. రోహిణి దమ్మున్న ప్లేయర్ అని, ప్రేరణ దుమ్ము అని తెలిపాడు. అవినాష్.. నబీల్ దమ్మున్న ప్లేయర్ అని, ఫౌల్ గేమ్స్ ఆడతాడంటూ పృథ్వీని దుమ్ము కంటెస్టెంట్‌గా పేర్కొన్నాడు.గౌతమ్‌పై కోపాన్నంతా కక్కేసిన తేజతర్వాత తేజ.. గౌతమ్‌పై తన కోపాన్నంతా కక్కేశాడు. టికెట్ టు ఫినాలే ఆడే క్రమంలో ఓ గేమ్‌లో గౌతమ్ నా పేరు సెలక్ట్ చేయకపోవడంతో బాధేసిందని, అదే విషయం అతడిని నిలదీశానన్నాడు. నామినేషన్స్‌లో ప్రేరణతో అంత గొడవైనా కూడా ఆమెనే ఎందుకు సెలక్ట్ చేశాడు? అక్కడ నేను ఫ్రెండ్ కాబట్టి నన్ను సెలక్ట్ చేస్తే అతడికి సోలో బాయ్ అనే ట్యాగ్ పోతుందని వెనకడుగు వేశాడు. ప్రేరణను సెలక్ట్ చేస్తే తనకు మంచి పేరొస్తుందని లెక్కలు వేసుకున్నాడని తెలిపాడు.తేజ ఎలిమినేట్నా మనసుకు ఏదనిపిస్తే అది చేసుకుంటూ పోయా.. నువ్వు నమ్మినా, నమ్మకపోయినా అది నీ ఇష్టం అని గౌతమ్ ఒక్కముక్కలో తేల్చేశాడు. ఇక ప్రేరణ, నిఖిల్.. నబీల్ దమ్మున్న ప్లేయర్ అని, తేజ దుమ్ము కంటెస్టెంట్ అని అభిప్రాయపడ్డారు. తేజ ఆడలేకపోతున్నాడని పేర్కొన్నాడు. అనంతరం నాగార్జున తేజ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. తల్లిని హౌస్‌లోకి తీసుకురావాలన్న కల నెరవేర్చుకున్నాకే వెళ్లిపోతున్నానంటూ తేజ సంతోషపడితే అవినాష్ మాత్రం కంటనీరు పెట్టుకున్నాడు. స్టేజీపైకి వచ్చిన తేజతో నాగ్ ఓ గేమ్ ఆడించాడు. హౌస్‌మేట్స్‌ను కూరగాయలతో పోల్చాలన్నాడు. టాప్ 2లో గౌతమ్..అలా అవినాష్ ఉల్లిపాయ అని, ఈ సీజన్లో పెద్ద గెలుపు రోహిణిదేనంటూ బంగాళాదుంపతో పోల్చాడు. విష్ణుప్రియ కాకరకాయ అన్నాడు. ప్రేరణ.. మాట సరిగా లేకపోతే నెక్స్ట్ నువ్వే బయటకు వచ్చేస్తావని హెచ్చరిస్తూ బెండకాయ ఇచ్చాడు. పృథ్వీ.. విష్ణుప్రియను వదిలినట్లు కొన్ని గేమ్స్ కూడా వదిలేస్తున్నావంటూ పచ్చిమిర్చి ట్యాగ్ ఇచ్చాడు. గౌతమ్‌లో ఎన్ని పొరలుంటాయో వాడికే తెలీదంటూ క్యాబేజీతో పోల్చాడు. అతడు టాప్ 2లో పక్కాగా ఉంటాడనన్నాడు. నబీల్.. గేమ్‌లో కన్ఫ్యూజ్ అవుతున్నాడని, టాప్ 2లో ఉంటాడనుకుంటే ఇప్పుడు టాప్ 5కి వచ్చేశాడంటూ టమాటతో పోల్చాడు. నిఖిల్.. ఎమోషనల్‌గా వీక్ అంటూ అతడికి సోరకాయ ఇచ్చాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నామినేషన్స్ నుంచి డైరెక్ట్‌గా టాప్ 5లోకి అవినాష్: నాగ్
అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచినప్పటి నుంచి అందరి మనసులో ఒకటే డౌట్.. అతడు డైరెక్ట్‌గా ఫినాలేలో అడుగుపెట్టినట్లేనా? లేదంటే ఈ వారం ఎలిమినేషన్ గండం గట్టెక్కితేనే ఫైనల్లో ఉంటాడా? అని! ఈ అనుమానాలకు నాగార్జున క్లారిటీ ఇచ్చేశాడు. అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్తాజా ప్రోమోలో నాగ్ మాట్లాడుతూ.. 'టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్.. ఈ వారం నామినేషన్స్ నుంచి బయటకు వచ్చి నేరుగా ఫైనల్స్‌కు వెళ్లాడు. ఈ సీజన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్' అని ప్రకటించాడు. అలాగే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని కూడా హింటిచ్చాడు. హౌస్‌లో కొందరికి గోల్డ్ టికెట్, మరికొందరికి బ్లాక్ టికెట్ ఇచ్చాడు. ఫస్ట్ బ్లాక్ టికెట్ ఎవరికి వస్తుందో గెస్ చేయమని నిఖిల్‌ను అడిగితే.. తనకు తెలియదని అమాయకంగా ముఖం పెట్టాడు. అందుకే సేఫ్ గేమ్ ఆడొద్దనేదంటూ నాగ్.. నిఖిల్‌కు చురకలంటించాడు.వీడియోతో దొరికిపోయిన ప్రేరణఇదే ప్రశ్న రోహిణిని అడగ్గా.. పృథ్వీకి బ్లాక్ టికెట్ ఇవ్వాలంది. నేను గేమ్స్ ఆడలేను, అతడు మాత్రమే ఆడగలను అని ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించేవాడని కారణం చెప్పింది. గౌతమ్ వంతురాగా.. బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారన్న కోపంతో ప్రేరణ.. గెస్టులతో కూడా సరిగా ప్రవర్తించలేదన్నాడు. ఈ క్రమంలో నువ్వు ఫెయిర్‌గా ఆడావా? అని నాగ్.. ప్రేరణను ప్రశ్నించాడు. ఆమె అవునని తలూపడంతో ఫౌల్ గేమ్ ఆడిన వీడియో ప్లే చేశాడు.విష్ణుప్రియను తప్పుపట్టిన ఆడియన్స్అది నా గేమ్ అని ప్రేరణ అనగా.. నువ్వు ఫెయిర్‌గా ఆడలేదన్నాడు నాగ్. హౌస్‌లో విన్నర్ ఎవరని విష్ణుప్రియను అడగ్గా ఆమె తన పేరే చెప్పింది. మరి విన్నర్లా ఆడుతున్నావా? అని నాగ్ అంటే.. నేను చూసిన సీజన్స్‌లో అన్ని ఆటలు గెలిచినవారు టైటిల్ కొట్టలేకపోయారు అంది. ఆమె అభిప్రాయాన్ని సెట్లో ఉన్న ఆడియన్స్ తప్పుపట్టారు. చదవండి: డబుల్ ఎలిమినేషన్.. తేజ అవుట్.. మరి అవినాష్? -
నాగ్ పిటిషన్.. కొండా సురేఖకు బిగ్ షాక్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంతత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకుంది. దీని ఆధారంగా.. మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేస్తూ తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాగార్జున దావా వేసిన విషయం తెలిసిందే.చేసిన ఆరోపణలకుగానూ కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనల సందర్భంగా నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునపై కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ తర్వాత ‘ఎక్స్’లో క్షమాపణ కోరుతూ పోస్ట్ పెట్టారన్నారు.ఎక్స్‌లో మంత్రి కొండా సురేఖ పెట్టిన పోస్టును ఆయన కోర్టు ముందు చదివి వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అశోక్‌రెడ్డి అన్నారు. కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలు అని పేర్కొన్నారు. అంతకు ముందు.. కొండా సురేఖ తరఫు న్యాయవాది గురుప్రీత్ సింగ్.. ఆమె క్షమాపణలు చెప్పినట్లుగా కౌంటర్ దాఖలు చేశారు.అయితే ఈ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోయిందని న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు. అంతకు ముందు.. నాగార్జున, ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటూ.. డిసెంబర్ 12న సురేఖను కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఇదీ చదవండి: కొండా సురేఖకు ఇదొక గుణపాఠం కావాలి! -
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నాగార్జున
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా తను కొనుగోలు చేసిన లగ్జరీ కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన అక్కడకు రావడంతో భారీగా ఆయన ఫ్యాన్స్ అక్కడకు చేరుకున్నారు. అక్టోబర్ నెలలో ఆయన ఈ కారు కొన్నారు. కొత్త కారు TG9 GT/R4874 రిజిస్ట్రేషన్ కోసం ఫొటో దిగి, సంతకం చేసిన నాగ్.. అక్కడి అధికారులతో కొంత సమయం పాటు సరదాగ మాట్లాడి వెళ్లిపోయారు.నాగార్జున కొత్త కారు టయోటా లెక్సస్‌ను చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇదే మోడల్ కారును నటుడు రామ్ చరణ్ కూడా ఇటీవల కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్లో చాలామంది స్టార్స్ ఈ కారును కొనుగోలు చేశారు. దీంతో ఇప్పుడు టయోటా లెక్స్‌స్ కారు బాగా ట్రెండ్ అవుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 2.5 కోట్లు ఉంటుందని సమాచారం.నాగార్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కుబేర' సినిమాలో ఆయన చాలా కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ సినిమా 'కూలీ'లో కూడా నాగ్ చాలా ప్రాముఖ్యత ఉన్న రోల్లో కనిపించనున్నారు. త్వరలో ఆయన ఇద్దరి కూమారులలో నాగచైతన్య పెళ్లి తేదీ ఇప్పటికే ఫిక్స్ కాగా.. అఖిల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇలా ఫుల్ బిజీ షెడ్యూల్లో నాగ్ ఉన్నారు. -
అఖిల్-జైనాబ్ నిశ్చితార్థం.. ఈ ఏడాది మాకెంతో ప్రత్యేకం: నాగార్జున
అక్కినేని వారి ఇంట త్వరలోనే శుభకార్యం జరగనుంది. వచ్చేనెల 4వ తేదీన నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల వివాహా వేడుక జరగనుంది. ఈ పెళ్లి పనులతో ఇరు కుటుంబాలు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అంతలోనే మరో సర్ప్రైజ్ ఇచ్చేశారు అక్కినేని ఫ్యామిలీ. నాగార్జున తనయుడు, హీరో అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. ముంబయికి చెందిన జైనాబ్ రవ్జీతో నిశ్చితార్థం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.అయితే మరోవారంలో నాగచైతన్య పెళ్లి జరగనుంది. దీంతో అఖిల్ పెళ్లి ఎప్పుడని అప్పుడే ఆరా తీయడం మొదలెట్టారు నెటిజన్స్. అయితే అఖిల్- జైనాబ్ల పెళ్లి 2025లోనే జరగనుందని నాగార్జున ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఈ ఏడాది తమకు ఎంతో స్పెషల్ అని కింగ్ తెలిపారు. ఓకే ఏడాదిలో అక్కినేని శతజయంతి ఉత్సవాలు, నాగచైతన్య- శోభితల పెళ్లి, అఖిల్ ఎంగేజ్మెంట్ జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే కాకుండా అఖిల్, జైనాబ్ రవ్జీల రిలేషన్‌పై నాగ్ మాట్లాడారు.నాగార్జున మాట్లాడుతూ..'అఖిల్ ఎంగేజ్మెంట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నా. జైనాబ్ అందమైన అమ్మాయి మాత్రమే అఖిల్‌కు సరైన జోడి. వారిద్దరు తమ జీవితాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నందుకు ఆనందంగా ఉంది. వారిద్దరి వివాహం 2025లోనే జరుగుతుంది" అని తెలిపారు. అఖిల్- జైనాబ్ల నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను ట్విటర్ ద్వారా పంచుకున్నారు నాగార్జున. కాగా.. నాగ చైతన్య, నటి శోభిత ధూళిపళ్ల వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. -
అక్కినేని ఇంట మరో పెళ్లి సందడి..అఖిల్ ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
భారీ అంచనాలతో కుబేర.. విడుదల ఎప్పుడు..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది.ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న కుబేర విడుదల తేదీ ప్రకటించే పనిలో ఉన్నాడు. వాస్తవంగా ఈ మూవీ దీపావళీ కానుకగా రావాల్సి ఉంది. పలు కారణాల వల్ల జాప్యం జరగడంతో ఇప్పుడు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. హీరో ధనుష్ కుబేరలో సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు భారీగానే ఎదురుచూస్తున్నారు. -
అతడి నిజస్వరూపం బయటపడాలన్న యష్మి
ఒకరి పొరపాట్లను మరొకరు పేపర్‌పై రాయాలన్నాడు బిగ్‌బాస్. తన మీద వచ్చిన ఫిర్యాదు చదివిన కంటెస్టెంట్.. అది ఎవరు రాయాలో గెస్ చేయాల్సి ఉంటుంది. అలా తేజ. తనపై వచ్చిన కంప్లైంట్ చదివాడు. తను మాట్లాడదల్చుకుంది మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తను చెప్పేది మాత్రమే నిజమని భావిస్తాడు అని రాసుంది. ఇది కచ్చితంగా విష్ణుప్రియ, యష్మి రాసుంటారని తేజ అభిప్రాయపడ్డాడు.ఫిర్యాదుల గోలఅన్ప్రిడక్టబుల్గా ఉండటం వల్ల తనను నేను నమ్మలేను. చాలా త్వరగా ట్రిగ్గర్ అవుతుంది. అది నాకు నచ్చదు.. ఈ ఫిర్యాదు తనపై గౌతమ్ చేసి ఉంటాడని యష్మి గెస్ చేసింది. కెమెరాలతో కన్నా మనుషులతో ఎక్కువ మాట్లాడు.. ఫుడ్ విషయంలో అందరికోసం ఆలోచించు అని గౌతమ్‌కు ఫిర్యాదు వచ్చింది. ఇది విష్ణు, అవినాష్ కంప్లైంట్ చేసుంటారన్నాడు.నిజస్వరూపం చూపించాలిఆటపట్ల ఆసక్తి ఉన్నట్లు అనిపించలేదు, అందర్నీ నిరుత్సాహపరుస్తుంది అని అవినాష్.. విష్ణుప్రియపై కంప్లైంట్ చేశాడు. కామెడీ వెనకున్న ఎమోషన్స్ దాచుకోవడం ఆపేసి తన నిజస్వరూపం అందరికీ చూపించాలి అని యష్మి.. అవినాష్ గురించి రాసింది. ప్రోమోలో చివర్లో పృథ్వీ, యష్మి డేంజర్ జోన్లో ఉన్నట్లు చూపించారు. అయితే యష్మి ఎలిమినేట్ అన్న విషయం ఇదివరకే తెలిసిందే! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విన్నర్లు కాదు, పాములు.. గ్రూప్ గేమ్ తప్పు కాదన్న నాగ్..
విష్ణుప్రియ- రోహిణి, గౌతమ్-పృథ్వీల గొడవలు పరిష్కరించడానికి నాగార్జున తలప్రాణం తోకకొచ్చింది. గేమ్‌లో మిమ్మల్ని వెనక్కు లాగుతుందెవరు? అన్నప్పుడు గౌతమ్, నిఖిల్ పేర్లే ఎక్కువమంది చెప్పడం గమనార్హం. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..క్యారెక్టర్‌లెస్ అనలేదుగా: విష్ణునువ్వు జీరో, నీకు అర్హత లేదు.. అని నానామాటలన్నవారికి నీ విజయంతోనే సమాదానం చెప్పావంటూ నాగార్జున.. మెగా చీఫ్ రోహిణిని మెచ్చుకున్నాడు. ఆ వెంటనే రోహిణి, విష్ణును కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి వీళ్లిద్దరి గొడవకు సంబంధించిన వీడియో క్లిప్ చూపించాడు. క్యారెక్టర్ అని తన వ్యక్తిత్వం గురించి అన్నానే తప్ప క్యారెక్టర్‌లెస్ అనలేదంది విష్ణు. దీనికి నాగ్.. ఆ పదం వాడినప్పుడే నీ క్యారెక్టర్ కనిపించిందన్నాడు.నిఖిల్‌కు ట్రై చేశా అనలేదునిఖిల్కు ట్రై చేశా వర్కవుట్ కాలేదు.. తర్వాత పృథ్వీకి ట్రై చేశా.. అని విష్ణు నిజంగానే అందా? అని రోహిణిని అడిగాడు. అందుకామె అవునని తలూపింది. అదే తన ప్లానా? అంటే కాదని చెప్పింది. దీనిపై విష్ణు స్పందిస్తూ.. నిఖిల్, నేను కలిసి బయట ఓ షో చేశాం. తన పర్సనాలిటీ అంటే ఇష్టమని చెప్పానే తప్ప ట్రై చేశాననలేదు అని క్లారిటీ ఇచ్చింది. ఏ ప్లాన్ వర్కవుట్ అయిందని విష్ణు హౌస్‌లో ఉంటోందన్నావని రోహిణిని అడగ్గా.. పృథ్వీతో లవ్ ట్రాక్ వల్లే ఆమె హౌస్‌లో ఉంటుందనిపిస్తోందని రోహిణి అభిప్రాయపడింది. తర్వాత ఇద్దరూ క్షమాపణలు చెప్పుకున్నారు.గ్రూప్ గేమ్ ఆడితే తప్పేంటన్న నాగ్పృథ్వీ, గౌతమ్ గొడవ గురించి నాగ్ చర్చించాడు. వైల్డ్‌కార్డ్స్‌ను పంపించేయాలని గ్రూప్ గేమ్ ఆడారని గౌతమ్ చెప్పగా.. అందులో తప్పేముందన్నాడు నాగ్. నా ఉద్దేశంలో తప్పేనంటూ హోస్ట్పైకే తిరగబడ్డాడు గౌతమ్. పెద్ద తప్పు చేసినవారినే నామినేట్ చేయాలే తప్ప వైల్డ్ కార్డ్ అన్న కారణంతో నామినేట్ చేయడం ముమ్మాటికీ తప్పేనని వాదించాడు. ఇంతలో పృథ్వీ.. అతడు ఇండివిడ్యువల్ ప్లేయర్ అని నిరూపించుకోవడానికి మమ్మల్ని బ్యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు.నోర్మూయ్.. నాగ్ సీరియస్ఆట అయిపోయాక కెమెరాలతో మాట్లాడతావు, నీ ఆట ఎవరూ నొక్కలేరు అని నాగార్జున గౌతమ్‌పై సెటైర్లు వేశాడు. అప్పటికీ గౌతమ్ మాట్లాడుతూనే ఉండటంతో బీపీ తెచ్చుకున్న నాగ్.. నోర్మూయ్, నేను మాట్లాడేటప్పుడు మధ్యలోకి రాకు అని తిట్టిపోశాడు. మనిషి పైపైకి వెళ్లడం తప్పని పృథ్వీని సైతం హెచ్చరించాడు. అనంతరం హౌస్‌మేట్స్‌తో ఓ గేమ్ ఆడించాడు.నిచ్చెన- పాముఆటలో మిమ్మల్ని ముందుకు తోస్తున్నదెవరు?(నిచ్చెన), వెనక్కు లాగుతుందెవరు?(పాము) చెప్పాలన్నాడు. రోహిణి.. అవినాష్ నిచ్చెన అని, పృథ్వీ పాము అని పేర్కొంది. అవినాష్.. తేజ నిచ్చెన, పృథ్వీ పాము అని తెలిపాడు. నబీల్.. పృథ్వీ నిచ్చెన, నిఖిల్ పాము అని పేర్కొన్నాడు. పృథ్వీ.. నబీల్ నిచ్చెన, గౌతమ్ పాము అన్నాడు. గౌతమ్.. రోహిణి నిచ్చెన, నిఖిల్ పాము అని చెప్పాడు.రెండు పాములునిఖిల్.. పృథ్వీ నిచ్చెన, గౌతమ్ పాము అంది. యష్మి.. ప్రేరణ నిచ్చెన, నిఖిల్ పాము అని తెలిపింది. తేజ.. అవినాష్ నిచ్చెన, విష్ణుప్రియ పాము అన్నాడు. విష్ణుప్రియ వంతురాగా పృథ్వీ వల్లే తనకు ఆక్సిజన్, కార్బండయాక్సైడ్ అందుతున్నాయంటూ.. చివరకు నబీల్‌కు నిచ్చెన ఇచ్చింది. రోహిణికి పాము ఇచ్చేసింది. ప్రేరణ.. రోహిణి నిచ్చెన, గౌతమ్ పాము అని పేర్కొంది. నిఖిల్, గౌతమ్‌కు పాముగా సమాన ఓట్లు పడ్డాయని, వీరిలో ఒకరిపై బిగ్‌బాంబ్ పడబోతుందన్నాడు నాగ్. నిఖిల్‌ను సేవ్ చేయడంతో నేటి ఎపిసోడ్ పూర్తయింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
షటప్ గౌతమ్.. నేనేం కంటెస్టెంట్ కాదు: నాగ్ ఫైర్
ఇద్దరు మగవాళ్ల ఇష్యూ గురించి మాట్లాడాలని నాగార్జున అనగానే నేను చెప్తా, సర్ అంటూ అవినాష్ లేచాడు. వాడు, వీడు అని మొదలుపెట్టింది పృథ్వీ.. తర్వాత గౌతమ్ ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. అప్పుడు పృథ్వీ.. ఛాతీపై వెంట్రుక పీకి పారేశాడు అని జరిగింది చెప్పాడు. ఇక గౌతమ్ గొడవ ఎక్కడ మొదలైందో చెప్పడం ప్రారంభించాడు. అందులో తప్పేముంది?వైల్డ్ కార్డ్స్‌ను నామినేట్ చేయాలని గ్రూప్ గేమ్ ఆడారని చెప్తుండగా.. అందులో తప్పేముందని నాగ్ ప్రశ్నించాడు. అందుకు గౌతమ్.. నా ఉద్దేశంలో తప్పేనని కరాఖండిగా తేల్చి చెప్పాడు. నువ్వు రోహిణికి సపోర్ట్ చేయడం గ్రూపిజమా? కాదా? అని నాగ్ ప్రశ్నించాడు. ప్రతిసారి ఒకరికే సపోర్ట్ చేయడం గ్రూపిజమా? ఎప్పుడో ఒకసారి సపోర్ట్ చేయడం గ్రూపిజమా? అని హోస్ట్‌నే తిరిగి ప్రశ్నించాడు గౌతమ్. షటప్ గౌతమ్గ్రూపిజం తప్పని నీ ఉద్దేశ్యమా? అంటూ నాగార్జున మాట్లాడుతూ ఉండగా గౌతమ్ మధ్యలో కలగజేసుకుంటూ ఉన్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన నాగ్.. నేను మాట్లాడుతున్నప్పుడు షటప్.. నువ్వు మధ్యలో కలుగజేసుకోవడానికి నేనేమీ హౌస్‌మేట్ కాదు అని హెచ్చరించాడు. చదవండి: బిగ్‌బాస్ నుంచి యష్మి ఎలిమినేట్ -
నీ క్యారెక్టర్ కనిపిస్తోంది.. విష్ణుపై నాగార్జున సీరియస్
నాగార్జున వచ్చీరావడంతోనే విష్ణుప్రియ- రోహిణిల గొడవపై స్పందించాడు. ఇద్దర్నీ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి గొడవకు సంబంధించిన వీడియో ప్లే చేశాడు. నీ ప్లాన్ వర్కవుట్ అయింది.. అందుకు ఉన్నావ్ అని రోహిణి అనగా నీ క్యారెక్టర్ తెలుస్తోందని విష్ణు రిప్లై ఇచ్చింది. క్యారెక్టర్ అనే మాట చాలా పెద్దది అని నాగార్జున చెప్తుంటే.. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు.. అది తప్పే కాదని వాదించింది విష్ణు.నీ క్యారెక్టర్ కనిపిస్తోందిదీంతో నాగ్.. ఆ పదం వాడకుండా ఉండాల్సింది.. అక్కడ నీ క్యారెక్టర్ కనిపిస్తోంది అని విమర్శించాడు. నిఖిల్‌కు ట్రై చేసి, కుదరకపోవడంతో విష్ణు.. పృథ్వీకి ట్రై చేసిందని.. అదంతా ప్లాన్ అని రోహిణి అనడాన్ని కూడా నాగ్ తప్పుపట్టాడు. ఈ విషయంలో ఎవరిది తప్పు? అని హౌస్మేట్స్ అభిప్రాయాన్ని తీసుకున్నాడు.తప్పు ఒప్పుకోని విష్ణుప్లాన్ అనడం రోహిణిదే తప్పని అవినాష్ అనగా.. ప్లాన్ కంటే క్యారెక్టర్ అనేది పెద్ద పదం కాబట్టి విష్ణుదే తప్పని ప్రేరణ అభిప్రాయపడింది. అక్కడ కూడా విష్ణు మళ్లీ సంజాయిషీ ఇచ్చుకోవడంతో నాగ్ తనను సైలెంట్ అయిపోమన్నాడు. ఇక్కడ తప్పు ఇద్దరిదీ ఉంది.. కానీ విష్ణు వాడిన పదాల వల్ల తన గోయి తనే తవ్వుకున్నట్లయింది. -
గోవా ఐఎఫ్ఎఫ్ఐ ఈవెంట్లో అక్కినేని ఫ్యామిలీ సందడి (ఫొటోలు)
-
అలాంటప్పుడే నటీమణులకు గౌరవం పెరుగుతుంది: సుహాసిని
తెరపై పోషించే పాత్రల నిడివి పెరిగితే నటీమణులకు తెరవెనుక గౌరవం కూడా పెరుగుతుంది అన్న అభిప్రాయం ఇఫీ (భారతదేశపు అంతర్జాతీయ చిత్రోత్సవం) సదస్సులో వ్యక్తమైంది. సినీ ఇండస్ట్రీలో మహిళా భద్రత అనే అంశంపై శుక్రవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా నటి సుహాసిని మణిరత్నం మాట్లాడుతూ.. సినిమాల్లో ఏదో అలా వచ్చి ఇలా పోయేవి కాకుండా మెరుగైన కీలక పాత్రల కోసం మహిళలు ప్రయత్నించాలన్నారు. భద్రత, గౌరవం కావాలిపరిశ్రమలో వర్క్ ఎథిక్స్ గురించి అవగాహన పెoచాలని పిలుపునిచ్చారు. ఇంతియాజ్ అలీ మాట్లాడుతూ.. నటీమణులు వేధింపులకు గురయ్యే అవకాశం లేని సినిమా సెట్లను రూపొందించాలన్నారు. వారికి తాము చేసే పని వాతావరణంలో భద్రత, గౌరవం తప్పనిసరిగా ఉండాలన్నారు. కుష్బూ సుందర్ మాట్లాడుతూ వినోదంపై దృష్టి సారిస్తూనే, సమానత్వానికి కూడా ప్రాధాన్యతనిస్తూ బాధ్యతాయుతంగా సినిమాలను రూపొందించాలన్నారు. లింగ వివక్షపై చర్చఅలా ఈ సదస్సులో పని చేసే చోట భద్రత, సమానత్వం, సినిమా పాత్రలపై చర్చించారు. లింగ వివక్ష ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్యానెలిస్ట్‌లు ఏకగ్రీవంగా అంగీకరించారు. మహిళల భద్రతకు సినిమా ఉదాహరణగా ఉండాలనే పిలుపుతో ప్యానెల్ ముగిసింది. ఇకపోతే భారత్ హై హమ్ పేరిట దూరదర్శన్‌లో ప్రసారం కానున్న యానిమేషన్ సిరీస్ పోస్టర్‌ను నాగార్జున విడుదల చేశారు. ఇసుకలో అద్భుతాలుఅలాగే ప్రఖ్యాత ఆర్టిస్ట్ సుందరం పట్నాయక్.. గోవాలోని మెరామర్ బీచ్‌లో అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, మహ్మద్ రఫీ, తపన్ సిన్హాల సైకత శిల్పాలను తయారు చేశాడు. కాగా నవంబర్ 20న.. 55వ ఇఫీ ( భారతదేశపు అంతర్జాతీయ చిత్రోత్సవం) వేడుకలు గోవాలో మొదలయ్యాయి. ఈ సెలబ్రేషన్స్ ఈ నెల 28 వరకు జరగనున్నాయి. -
ఆర్ఆర్ఆర్ టైమ్‌లో లేదు.. అందుకే పుష్ప-2తో ప్రారంభిస్తున్నాం: నాగార్జున
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున టెక్నాలజీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మనదేశంలో డాల్బీ విజన్ సాంకేతికతను తొలిసారి అన్నపూర్ణ స్టూడియో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సదుపాయం ఇప్పటివరకు ఇండియాలో ఎక్కడా కూడా లేదన్నారు.గతంలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు డాల్బీ విజన్ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో జర్మనీకి వెళ్లారని అన్నారు. అక్కడే సినిమాకు సంబంధించిన పనులు పూర్తి చేశారని నాగ్ వెల్లడించారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సదస్సులో పాల్గొన్న నాగార్జున సినిమా, థియేటర్ టెక్నాలజీపై మాట్లాడారు.మొట్ట మొదటిసారి ఈ సదుపాయాన్నిఅన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీతో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నామని నాగార్జున తెలిపారు. మనదేశంలో తొలిసారి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. సినిమా ప్రమాణాలు పెంచి ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించేందుకు ఈ డాల్బీ విజన్ సాంకేతికతను వినియోగించనున్నారు. కాగా.. గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ-2024 ఈవెంట్ ఈనెల 28 వరకు కొనసాగనుంది. -
నాగచైతన్య- శోభితల పెళ్లి.. చైతూ కోరడం వల్లే అలా: నాగార్జున
అక్కినేని వారి ఇంట త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న శోభిత- నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టనున్నారు. వచ్చేనెల 4వ తేదీన హైదరాబాద్‌లోనే వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లి పనులపై అక్కినేని నాగార్జున స్పందించారు. పెళ్లి వేడుక చాలా సింపుల్‌గా చేయాలని చైతూ కోరినట్లు ఆయన వివరించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ్ కామెంట్స్ చేశారు.నాగార్జున మాట్లాడుతూ..'ఈ ఏడాది మాకు ఎప్పటికీ గుర్తుంటుంది. మా నాన్నగారి శతజయంతి వేడుక కూడా నిర్వహించాం. అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే వీరి పెళ్లి జరగడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ స్టూడియో మా కుటుంబ వారసత్వంలో ఓ భాగం. మా నాన్నకు చాలా ఇష్టమైన ప్రదేశం. చైతన్య పెళ్లిని చాలా సింపుల్‌గా చేయమని కోరాడు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులతో కలిపి 300 మందిని పిలవాలని నిర్ణయించాం. స్టూడియోలో అందమైన సెట్లో వీళ్ల పెళ్లి జరగనుంది. అలాగే పెళ్లి పనులు కూడా వాళ్లిద్దరే చేసుకుంటామన్నారని' తెలిపారు.గూఢచారి సినిమా చూసి శోభితను ఫోన్లో అభినందించినట్లు నాగార్జున వెల్లడించారు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటికి వచ్చి కలవమని చెప్పినట్లు తెలిపారు. వైజాగ్ నుంచి వచ్చి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని నాగ్ అన్నారు. ఈ స్థానానికి రావడానికి ఎంతో కష్టపడిందని.. ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి అని కాబోయే కోడలిపై ప్రశంసలు కురిపించారు. -
IFFI : గోవా సినిమా పండుగ..సందడి చేసిన స్టార్లు (ఫొటోలు)
-
నాగార్జున పరువు నష్ట దావా కేసులో కోర్టులో ముగిసిన వాదనలు
-
పరువు నష్టం కేసు.. మంత్రిపై క్రిమినల్ చర్యలకు డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖ టాలీవుడ్ హీరో నాగార్జునపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అక్కినేని నాగార్జున మంత్రిపై పరువునష్టం దావా వేశారు. తాజాగా ఈ కేసులో నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా కొండా సురేఖ ట్విట్టర్లో పెట్టిన పోస్ట్‌ను నాగార్జున తరఫున న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టు ముందు చదువు వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం సరైంది కాదని.. కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలని ఆయన వాదించారు. ఇలాంటి కామెంట్స్ వల్ల నాగార్జున కుటుంబ సభ్యులు మానసికంగా ఎంతో కుంగిపోయారని న్యాయమూర్తికి విన్నవించారు.కొండాసురేఖ లాయర్ వేసిన కౌంటర్‌పై నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కొండ సురేఖ మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని.. నాగార్జున ఫ్యామిలీని కించ పరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారని అన్నారు. కొండ సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. ఇప్పటికే ఈ కేసులో నాగార్జున, ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది.ట్విటర్లో క్షమాపణలు..అయితే తన కామెంట్స్‌పై మంత్రి కొండా సురేఖ ట్విట్టర్ ద్వారా క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే. ఆ పోస్ట్‌ను కూడా కోర్టు ముందు నాగార్జున తరుపు న్యాయవాది అశోక్ రెడ్డి చదివి వినిపించారు. నాగార్జున కుటుంబంపై మంత్రి చేసిన కామెంట్స్ తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దీంతో వెంటనే మంత్రి సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కోరింది. 'నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ.. మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నా.. అన్యద భావించవద్దు' అంటూ కొండా సురేఖ ట్విట్ చేసింది. -
IFFI : ఘనంగా గోవా సినిమా పండుగ ప్రారంభం.. సందడి చేసిన నాగ్, ఇతరులు (ఫొటోలు)
-
మా నాన్న వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను – నాగార్జున
‘‘మా నాన్న నేర్పిన జీవిత పాఠాలు నన్ను ఎన్నో రకాలుగా ప్రభావితం చేశాయి. మా నాన్న బాటలో నడవడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. ప్రతి ఏడాది కేంద్ర ప్రసార సమాచార శాఖ సహకారంతో జాతీయ చిత్ర పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే భారతదేశపు అంతర్జాతీయ చిత్రోత్సవం (ఇఫీ) బుధవారం గోవాలోప్రారంభమైంది. ఈ నెల 28 వరకూ ఈ చిత్రోత్సవం జరగనుంది. తొలి రోజు నటులు ఏఎన్నార్, రాజ్ కపూర్, గాయకుడు మహమ్మద్ రఫీ, దర్శకుడు తపన్ సిన్హాల శతాబ్ది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా లెజండరీ ఆల్బమ్‌ని విడుదల చేశారు. ఈ వేదికపై తండ్రి ఏఎన్నార్ గురించి మాట్లాడారు నాగార్జున. యాంకర్ కోరిన మీదట తాను నటించిన ‘బంగార్రాజు’ చిత్రంలోని ‘వాసివాడి తస్సాదియ్యా..’ డైలాగ్ చెప్పారు నాగార్జున. ఈ చిత్రోత్సంలో నాగార్జున, అమల దంపతులను, నటుడు శరత్ కుమార్, దర్శకుడు ఆర్కే సెల్వమణి, చిదానంద నాయక్, నిర్మాత–దర్శకుడు సుభాష్ ఘాయ్, నటీమణులు నిత్యా మీనన్, ప్రణీతలను సన్మానించారు. ‘‘పేపర్ బాయ్‌గా నా ప్రస్థానం ప్రారంభించాను’’ అని శరత్‌కుమార్ పేర్కొన్నారు. ‘‘తెలుగు సినిమాల్లోని కొత్తదనం, పాజిటివిటీ అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులకు టాలీవుడ్‌ని చేరువ చేస్తున్నాయి’’ అన్నారు అమల.ఐఫీ... ఇంకొన్ని విశేషాలు→ కార్యక్రమప్రారంభంలో భారత వందనం నృత్య కార్యక్రమం ఆహూతులను విశేషంగా అలరించింది.→ సినీ దిగ్గజాలు అక్కినేని నాగేశ్వరరావు, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హా, రాజ్ కపూర్ల జీవితం గురించి బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ అందించిన వీడియో సహిత కార్యక్రమం ఆకట్టుకుంది.→ పలుమార్లు ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం ప్రస్తావన వచ్చింది.→ చిత్రోత్సవంలో భాగంగా విభిన్న కేటగిరీలో చిత్రాలను ఎంపిక చేసే జ్యూరీల్లో తెలుగు దర్శకుడు హరీష్ శంకర్, హైదరాబాద్‌కు చెందిన యువ డిజైనర్ అర్చనా రావు ఉన్నారు.→ బాలీవుడ్ నటి మానుషీ చిల్లర్ ‘ఆ కుర్చీని మడతపెట్టి..’ పాటకు నృత్యంతో అలరించారు.→ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మిక గురు పండిట్ రవిశంకర్ జీవిత ఘట్టాల ఆధారంగా తీస్తున్న చిత్ర విశేషాలు ప్రదర్శించారు.→ ఆహూతుల్లో ఖుష్బూ, సుశాంత్ తదితరులు ఉన్నారు. – గోవా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి -
నిఖిల్ గొప్పతనాన్ని చెప్పిన అమర్, బిగ్‌బాస్ మాస్టర్ ప్లాన్
కొందరి ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ శనివారం ఎపిసోడ్లో స్టేజీపైకి వచ్చేసి మాట్లాడారు. మిగిలినవారి ఫ్యామిలీస్ నేడు స్టేజీపై సందడి చేశారు. మరి ఎవరెవరు వచ్చారు? ఎవర్ని టాప్ 5లో పెట్టారు? అనేది నేటి (నవంబర్ 17) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..మందు తాగుతానన్న యష్మియష్మి కోసం ఆమె ఫ్రెండ్స్ శ్రీసత్య, సంయుక్త స్టేజీపైకి వచ్చారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత యష్మిని మీరు చూడలేరని నాగార్జునతో అన్నారు. అందుకు కారణమేంటో ఎలాగైనా తెలుసుకోవాలనుకున్న నాగ్.. ఆ సీక్రెట్ చెప్తే ప్రైజ్‌మనీకి రూ.3 లక్షలు యాడ్ అవుతాయన్నారు. ఈ బంపరాఫర్‌కు టెంప్ట్ అయిపోయిన యష్మి.. తాను మందు తాగుతానని ఒప్పేసుకుంది. నిన్నటిలాగే వీరితోనూ టాప్ 5 ఎవరనేది గేమ్ ఆడించాడు. టాప్ 5లో ఎవరంటే?తమ కంటెస్టెంట్‌ను పక్కనపెట్టి మిగతావారిలో ఐదుగురిని ఫైనలిస్టులుగా సెలక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా గౌతమ్ 1, నిఖిల్ 2, నబీల్, అవినాష్, ప్రేరణ మిగతా మూడు స్థానాల్లో ఉన్నారు. తర్వాత యష్మిని సేవ్ చేశారు. తేజ తండ్రి శ్రీనివాసరెడ్డి, ఫ్రెండ్ వీజే సన్నీ వచ్చారు. తల్లిని హౌస్‌లోకి తీసుకురావాలన్న కలను నెరవేర్చుకున్నావు.. నిన్ను ఫినాలేలో చూడాలనుకున్న అమ్మ కలను కూడా నెరవేర్చు అని తేజపై భారం వేశాడు అతడి తండ్రి.అవినాష్‌తో సినిమాసన్నీ.. గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్‌ను వరుసగా టాప్ 5లో పెట్టాడు. అందరి అంచనాలను మనం అందుకోలేము.. నువ్వు నీలా ఉండు అంటూ నిఖిల్‌కు గోల్డెన్ సలహా ఇచ్చాడు. అనంతరం ముక్కు అవినాష్ కోసం అతడి తమ్ముడు అశోక్‌తో పాటు దర్శకుడు కోన వెంకట్ వచ్చారు. బిగ్‌బాస్ నుంచే చాలామంది నటుల్ని తీసుకుంటున్నాను.. అవినాష్‌తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపాడు కోన వెంకట్. కంటెస్టెంట్లందరికీ తన సినిమా టైటిల్స్‌ను డెడికేట్ చేశాడు. అవినాష్ అదుర్స్, నబీల్ దూకుడుఅలా నిఖిల్‌కు బాద్షా, పృథ్వీకి బలుపు, విష్ణుప్రియకు నిన్ను కోరి, యష్మికి దేనికైనా రెడీ, ప్రేరణకు గీతాంజలి, రోహిణికి హ్యాపీ, గౌతమ్‌కు శివమణి, అవినాష్‌కు అదుర్స్, తేజకు ఢీ, నబీల్‌కు దూకుడు సినిమా టైటిల్స్ అంకితమిచ్చాడు. వీరు.. నబీల్ను 1, నిఖిల్‌ను 2, రోహిణిని 3, విష్ణుప్రియను 4, గౌతమ్‌ను 5వ ర్యాంకులో ఉంచారు. తర్వాత నిఖిల్ కోసం అతడి తండ్రి శశికుమార్, నటుడు అమర్దీప్ వచ్చేశారు. రెండు రోజులు నాతోనేఅమర్దీప్ మాట్లాడుతూ.. ఓ షో తర్వాత నా రెండు కాళ్లు నొప్పితో కదల్లేని స్థితికి వచ్చేశాయి. పూర్తిగా బిగుసుకుపోయాయి. షో నుంచి ఇంటికి వెళ్లకుండా సరాసరి నాతో పాటే నా రూమ్‌కు వచ్చాడు. రెండు రోజులు నాతోనే ఉన్నాడు. నన్ను వాష్‌రూమ్‌కు కూడా ఎత్తుకుని తీసుకుపోయాడు అంటూ నిఖిల్ స్నేహానికిచ్చే విలువను చాటిచెప్పాడు. అలాగే విష్ణుప్రియ, నబీల్, రోహిణి, గౌతమ్, తేజకు వరుస ఐదు ర్యాంకులిచ్చాడు.మగాళ్లపై ఆడాళ్ల విజయంర్యాంకుల గోల అయిపోవడంతో నాగ్.. హౌస్‌మేట్స్‌తో చిన్న గేమ్ ఆడించాడు. అమ్మాయిలను, అబ్బాయిలను రెండు టీములుగా విడగొట్టాడు. సినిమా పేరు చెప్పగానే హీరో, దర్శకుడు, హీరోయిన్ ఫోటోలను బోర్డుపై పెట్టాలన్నాడు. అలా ఈ ఆటలో మహిళల టీమ్ గెలిచింది. తర్వాత విష్ణుప్రియ సేవ్ అయినట్లు ప్రకటించాడు.అవినాష్‌ను సేవ్ చేసిన నబీల్చివరగా అవినాష్, తేజ నామినేషన్లో మిగిలారు. ఈ క్రమంలో నబీల్ను ఎవిక్షన్ షీల్డ్ వాడతావా? అని నాగ్ అడిగాడు. నాకు షీల్డ్ రావడానికి అవినాష్ కూడా ఓ కారణమే.. అందుకే అతడి కోసం వాడాలనుకుంటున్నాను. నేను గేమ్ ద్వారా మాత్రమే ముందుకు వెళ్తాను అని నబీల్ తన నిర్ణయం చెప్పాడు. దీంతో అవినాష్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించిన నాగ్.. నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడటం వల్ల అతడు సేవ్ అయినట్లు తెలిపాడు. టెన్షన్‌తో చచ్చిపోయిన తేజబిగ్బాస్ నాలుగో సీజన్లో ఎవిక్షన్ షీల్డ్‌తో సేవ్ అయ్యానని.. ఇప్పుడు మరోసారి అదే షీల్డ్ తనను కాపాడిందన్నాడు అవినాష్ మరి నా పరిస్థితి ఏంటని తేజ అయోమయానికి లోనయ్యాడు. అతడిని కాసేపు టెన్షన్ పెట్టిన నాగ్.. చివరకు సేవ్ అయినట్లు ప్రకటించాడు. ఈ వారం ఎలిమినేషనే లేదని తెలిపాడు. అయితే రేపు మాత్రం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో నామినేషన్స్ చేయించాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో సోనియా.. నిఖిల్‌ను నామినేట్ చేయడం గమనార్హం. ఆ తతంగమంతా రేపు చూసేయండిమరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మి సీక్రెట్ ఖరీదు రూ.3 లక్షలు.. ఆరు దాటిందంటే పెగ్గు..
కంటెస్టెంట్ల కోసం ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు కూడా వచ్చేస్తున్నారు. అలా యష్మి కోసం ఆమె సోదరితో పాటు శ్రీసత్య వచ్చారు. వచ్చీరావడంతోనే యష్మి నోటితోనే సీక్రెట్ బయటపెట్టించారు. సాయంత్రం ఆరుగంటల తర్వాత యష్మి ఏం చేస్తుందో మీకు తెలియదు సర్ అని హోస్ట్ నాగార్జునతో అన్నారు.సాయంత్రం ఆరు దాటితే..ఆ సీక్రెట్ ఏంటో బయటపెడితే ప్రైజ్‌మనీకి మరో రూ.3 లక్షలు యాడ్ చేస్తానని నాగ్ బంపరాఫర్ ఇచ్చాడు. దీంతో యష్మి క్షణం ఆలోచించకుండా మావా.. ఏక్ పెగ్‌లా.. అంటూ తను మద్యం తాగుతానన్న రహస్యాన్ని బయటపెట్టింది.. ఒక్క పెగ్ కాస్ట్ మూడు లక్షలా? అని అవినాష్ ఆశ్చర్యపోయాడు. శ్రీసత్య వెళ్లిపోయేముందు తనకు పాత యష్మి కావాలని అడిగింది.అవినాష్ కోసం కోన వెంకట్బిగ్బాస్కు వీరాభిమాని అయిన కోన వెంకట్ అవినాష్ కోసం వచ్చేశాడు. తన సినిమా టైటిల్స్‌ను హౌస్‌మేట్స్‌కు అంకితమిచ్చాడు. అలా పృథ్వీకి 'బలుపు', యష్మికి 'దేనికైనా రెడీ' అన్న టైటిల్స్ ఇచ్చాడు. అమర్దీప్.. వస్తే కప్పుతోనే రావాలని నిఖిల్‌కు బూస్ట్ ఇచ్చాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తెలుగింటి హీరో... పక్కింటి దర్శకుడు
హీరోయిన్లు ఒకే భాషకు పరిమితం కారనే విషయం తెలిసిందే. హీరోలు, దర్శకులు మాత్రం దాదాపు ఒకే భాషలోనే సినిమాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలకు, దర్శకులకు హద్దులు, సరిహద్దులు లేవని పాన్ ఇండియన్ సినిమాలు చెబుతున్నాయి. దర్శకులు, హీరోలు ఇప్పుడు ఏ భాషలో అయినా సినిమాలు చేస్తున్నారు. కానీ ఈ ట్రెండ్ టాలీవుడ్లో మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. మరి... మన తెలుగింటి హీరోలు... ఏ పక్కింటి దర్శకులతో సినిమాలు చేస్తున్నారో తెలుసుకుందాం. కాంబో రిపీట్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వేసవిలో రిలీజ్ కావొచ్చని టాక్. ఈ చిత్రం తర్వాత చిరంజీవి ఏ దర్శకుడితో సినిమా చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. హరీష్ శంకర్, మారుతి... ఇలా చాలామంది పేర్లు వినిపించాయి. అయితే ఇటీవల ఓ సందర్భంలో తన తర్వాతి చిత్రాల్లో ఒకటి చిరంజీవితో ఉంటుందని, సామాజిక నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని, రచయిత–దర్శకుడు బీవీఎస్ రవి పేర్కొన్నారు. ఈ సినిమాకు బీవీఎస్ రవి కేవలం కథ మాత్రమే ఇస్తున్నారని, దర్శకత్వ బాధ్యతలు మోహన్‌రాజా తీసుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మోహన్ రాజా తెలుగు అయినప్పటికీ చెన్నైలో సెటిల్ అయి, తమిళ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. ఇక చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలిసింది. త్వరలోనే ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక హీరో చిరంజీవి–దర్శకుడు మోహన్‌రాజా కాంబినేషన్లో ఆల్రెడీ ‘గాడ్ ఫాదర్’ (2022) అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మోహన్ లాల్ మలయాళ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా ‘గాడ్ ఫాదర్’ చిత్రం రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. నవీన్‌తో నెక్ట్స్ సోలో హీరోగా నాగార్జున నెక్ట్స్ ఫిల్మ్ ఎవరితో ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కానీ తమిళంలో ‘మూడర్ కూడం, అగ్ని సిరగుగళ్’ సినిమాలు తీసిన దర్శకుడు నవీన్ గత ఏడాది నాగార్జునకు ఓ కథ వినిపించారట. ఈ మూవీకి నాగార్జున కూడా ఓకే చెప్పారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరచే పనిలో నవీన్ బిజీగా ఉన్నారని, ఈ సినిమా విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని భోగట్టా. మరోవైపు ప్రస్తుతం నాగార్జున తమిళ చిత్రం ‘కూలీ’లో ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘కూలీ’ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. అలాగే తమిళ హీరో ధనుష్‌తో కలిసి నాగార్జున ‘కుబేర’ చేస్తున్నారు. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకుడు. బిజీ బిజీ ప్రభాస్ చాలా చాలా బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా ‘రాజా సాబ్, ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్)’ సినిమాలు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా సెట్స్‌లోకి వెళ్తారు. కాగా ఇటీవల కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్లో ప్రభాస్ మూడు సినిమాలు కమిట్ అయ్యారు. ఈ చిత్రాల్లో ఒకటి తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో ఉంటుందని తెలిసింది. మరోటి కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ 2’ అని ఊహించవచ్చు. ఇంకో సినిమాకు తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇలా... ఓ తమిళ దర్శకుడు, ఓ కన్నడ దర్శకుడితో ప్రభాస్ సినిమాలు చేయనున్నారు. అంతేకాదు... ఇటీవల ప్రభాస్‌కు ఓ హిందీ దర్శకుడు కథ వినిపించారని, ఇప్పటికే ప్రభాస్ కమిటైన సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమాను ప్రకటిస్తారని బాలీవుడ్ భోగట్టా. ‘జైలర్’ దర్శకుడితో...ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘వార్ 2’. హిందీ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరోగా చేస్తున్నారు. ‘వార్ 2’ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే ఈ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా షూట్లో జాయిన్ అవుతారు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభమయ్యేలా ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేశారు. ముందుగా ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరించి, కొత్త సంవత్సరంలో ఎన్టీఆర్ పాల్గొనే సన్నివేశాల షూట్‌ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారని తెలిసింది. 2026 జనవరి 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. అలాగే తమిళంలో ‘కోలమావు కోకిల, డాక్టర్, జైలర్’ సినిమాలను తీసిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఇటీవల ఎన్టీఆర్‌కు ఓ కథ వినిపించారు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా చేసేందుకు అంగీకరించారని తెలిసింది. అయితే రజనీకాంత్‌తో ‘జైలర్ 2’ చేసిన తర్వాత ఎన్టీఆర్‌తో నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా చేస్తారు. కాబట్టి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేది 2026లోనే అని ఊహింవచ్చు. కథ విన్నారా? రామ్‌చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారన్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రం జనవరి 10న సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే రామ్‌చరణ్ తర్వాతి చిత్రాలకు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన, సుకుమార్ డైరెక్ట్ చేస్తారు. అయితే ఓ హిందీ దర్శకుడు రామ్‌చరణ్‌కు కథ వినిపించారనే టాక్ కొన్ని రోజులు క్రితం ప్రచారంలోకి వచ్చింది. మరి... ఈ వార్త నిజమేనా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మహాభారతం దర్శకుడితో... హిందీ సీరియల్ ‘మహాభారతం’ చాలా ఫేమస్. ఈ సీరియల్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్‌ను ‘కన్నప్ప’ కోసం టాలీవుడ్‌కు తెచ్చారు విష్ణు మంచు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు, శరత్‌కుమార్, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ సినిమా విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది. జీబ్రా తమిళంలో కీర్తీ సురేష్‌తో ‘పెంగ్విన్’ సినిమా తీసిన తమిళ దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘జీబ్రా’. సత్యదేవ్ ఈ చిత్రంలో హీరోగా నటించగా, కన్నడ నటుడు డాలీ ధనుంజయ మరో లీడ్ రోల్లో నటించారు. ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈశ్వర్ కార్తీక్‌కు తెలుగులో ఇదే స్ట్రయిట్ సినిమా. ఇతర భాషల దర్శకులతో సినిమాలు చేసే తెలుగు హీరోల జాబితాలో మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
విష్ణు గెలవాలన్న శివాజీ.. గౌతమ్‌పై పంచులు
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో పట్టుమని పదిమందే మిగిలారు. వీళ్లందరి కుటుంబసభ్యులను హౌస్‌లోకి పంపించి నూతనోత్తేజాన్ని నింపారు. అయితే ఎప్పటిలాగే వీకెండ్లో మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్‌ను తీసుకువచ్చారు. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు.మరోసారి ఫ్యామిలీస్..ప్రేరణ కోసం ఆమె తల్లి, చెల్లితో పాటు సినీ నటి ప్రియ వచ్చింది. విష్ణుప్రియ కోసం ఆమె చెల్లి, యాంకర్ రవి వచ్చారు. రోహిణి కోసం ఆమె తండ్రి, శివాజీ వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చినవాళ్లతో టాప్ 5లో ఎవరుంటారన్న గేమ్ ఆడించారు. నువ్వు గెలవాలంటూ విష్ణును టాప్ 1 ప్లేస్‌లో పెట్టాడు శివాజీ. అది చూసి విష్ణుప్రియ సైతం షాకైంది. గౌతమ్‌పై శివాజీ పంచులుగౌతమ్ను కూడా శివాజీ ఓ ఆట ఆడుకున్నాడు. యష్మి బిజీగా ఉంది, నిన్ను పట్టించుకోలేదు.. నీకు వర్కవుట్ కాలేదని అక్కా అన్నావ్.. అయినా నీకు రోహిణి కంటే మంచి అమ్మాయి దొరుకుతుందా? అని సెటైర్లు వేశాడు. ఎవరికి టైటిల్ దక్కనుంది? ఎవరు ఫినాలేలో అడుగుపెడతారన్నది కంటెస్టెంట్ల ఇంటిసభ్యులు డిసైడ్ చేయనున్నారు. దీంతో హౌస్‌లో ఉన్నవారికి కూడా గేమ్‌పై ఓ క్లారిటీ రానుంది. చదవండి: నా అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్‌లను పట్టించుకోవద్దు: విశ్వంభర దర్శకుడు -
'కుబేర' మ్యూజికల్ గ్లింప్స్ విడుదల
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదలైంది. రష్మిక మందన్న కీలక పాత్రలో కనిపించనుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు.తాజాగా విడుదలైన గ్లింప్స్ ఎలాంటి డైలాగ్స్ అయితే లేవు. కానీ, ధనుష్ పాత్రను మాత్రం బిచ్చగాడిగానే కాకుండా డబ్బున్న వ్యక్తిలా చూపించారు. 52 సెకండ్ల పాటు ఉన్న ఈ గ్లింప్స్ మొత్తం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోనే నడుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ప్రధాన హైలెట్‌గా ఉంది. పాన్ ఇండియా రేంజ్లో వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా విడుదల కానుంది. -
బిజినెస్‌మ్యాన్ బర్త్ డే పార్టీలో చిరు-మహేశ్-వెంకటేశ్ ఫుల్ చిల్ (ఫొటోలు)
-
కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మల గ్రాండ్ రిసెప్షన్.. హాజరైన చిరంజీవి, నాగార్జున(ఫొటోలు)
-
భార్య అంటే శ్రీకాంత్‌కు ఎంత ప్రేమో!.. చెప్పినట్లే విన్నాడు! వీడియో
Srikanth Kidambi - Shravya Varma Wedding Reception: భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్ వన్ ర్యాంకర్ కిదాంబి శ్రీకాంత్ పెళ్లిపీటలెక్కాడు. టాలీవుడ్ సెలబ్రిటీ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. హైదరాబాద్‌లో శనివారం అంగరంగ వైభవంగా శ్రీకాంత్- శ్రావ్యల పెళ్లి జరిగింది.రిసెప్షన్లో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునబ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్‌తో పాటు పలువురు క్రీడా ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకాగా.. శ్రావ్య తరఫున టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, కీర్తి సురేశ్ తదతర స్టార్లు వీరి పెళ్లిలో సందడి చేశారు. ఇక ఆదివారం నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తదితర విశిష్ట అతిథులు తళుక్కుమన్నారు.కాగా కొంతకాలంగా ప్రేమలో ఉన్న శ్రీకాంత్- శ్రావ్య పెద్దల అంగీకారంతో ఒక్కటైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీరి అన్యోన్య బంధానికి అద్దంపట్టేలా ఉన్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రిసెప్షన్ వేడుకలో శ్రావ్య భారీ లెహంగా ధరించిగా.. శ్రీకాంత్ వైట్సూట్లో మెరిసిపోయాడు.నాగ్ సర్ వచ్చారు.. త్వరగా రా!అయితే, పార్టీ మొదలుకావడానికి ముందే నాగార్జున హాల్లో అడుగుపెట్టాడు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో శ్రావ్యకు ఫోన్ చేశాడు. దీంతో కంగారూపడిన శ్రావ్య.. ‘‘నాగ్ సర్ వచ్చారు.. త్వరగా రా’’అంటూ భర్త శ్రీకాంత్‌కు ఫోన్ చేసింది. వెంటనే శ్రీకాంత్ శ్రావ్యతో కలిసి లిఫ్ట్‌లోకి చేరుకున్నాడు.‘‘నేను వేగంగా వెళ్లాలి కాబట్టి.. నువ్వు నా లెహంగాను పట్టుకోవాలి’’ అంటూ శ్రావ్య భర్తకు ప్రేమపూర్వకంగా ఆర్డర్ వేసింది. అందుకే ఎంచక్కా తలూపిన శ్రీకాంత్ ఆమె చెప్పినట్లుగానే లెహంగాను పట్టుకుని.. భార్య వెనకాలే పరిగెత్తాడు. ఇద్దరూ కలిసి నాగార్జున దగ్గరకు వెళ్లగా.. కొత్త జంటను ఆశీర్వదించాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు శ్రీకాంత్‌కు భార్య అంటే ఎంత ప్రేమో.. భయం- భక్తీ రెండూ ఉన్నాయంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. థామస్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడుకాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకాంత్ నమ్మాల్వార్ కిదాంబి 1993, ఫిబ్రవరి 7న జన్మించాడు. తొలుత కామన్వెల్త్ యూత్ గేమ్స్-2011లో మెన్స్ డబుల్స్ విభాగంలో కాంస్యం గెలిచిన శ్రీకాంత్.. మిక్స్డ్ డబుల్స్‌లో రజత పతకం కైవసం చేసుకున్నాడు.అదే విధంగా.. 2013లో థాయ్‌లాండ్ ఓపెనర్ గ్రాండ్ పిక్స్ గోల్డ్ టైటిల్‌ను శ్రీకాంత్‌ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. చారిత్రాత్మక థామస్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు కూడా! ఇక ప్రపంచ నంబర్ వన్ షట్లర్‌గా ఎదిగిన శ్రీకాంత్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీ ,అర్జున అవార్డులతో సన్మానించింది.చదవండి: ఓటమి అంచుల్లో ఉన్నా... ఆందోళన చెందకుండా! రూ. 40 కోట్ల 55 లక్షల ప్రైజ్‌మనీ View this post on Instagram A post shared by Shravya Varma & Srikanth Kidambi (@weshranth) -
హరితేజ ఎలిమినేట్.. నిఖిల్ సహా ఆ నలుగురు మాస్క్ తీయాల్సిందే!
ఈరోజు హౌస్ జంబలకిడిపంబగా మారిపోయింది. వాళ్లు వీళ్లయ్యారు, వీళ్లు వాళ్లయ్యారు. అదేనండి.. ఆడాళ్లు మగాళ్ల గెటప్‌లోకి. మగాళ్లు ఆడాళ్ల గెటప్‌లోకి మారిపోయారు. వీరినలా చూస్తుంటేనే ప్రేక్షకులు పడీపడీ నవ్వడం ఖాయం. అలా ఉన్నాయి ఒక్కొక్కరి అవతారాలు.. పైగా ఒకరి పాత్రల్లో మరొకరు లీనమై నటించారు. ముఖ్యంగా ప్రేరణ.. నిఖిల్‌గా నటించి అదరగొట్టేసింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 10) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..ఐటం సాంగ్నాగ్.. ప్రేరణ, గౌతమ్‌ను సేవ్ చేశాడు. తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ మట్కా సినిమా ప్రమోషన్స్ కోసం స్టేజీపైకి వచ్చాడు. వచ్చీరావడంతోనే ఆడవేషంలో ఉన్న మగవారికి ఐటం సాంగ్ చేసే టాస్క్ ఇచ్చాడు. అలాగే మగవేషంలో ఉన్న ఆడపిల్లలు మాస్ పాటలకు చిందేయాలన్నాడు. పర్ఫామెన్స్ బట్టి మార్కులిస్తానన్నాడు. ఈ గేమ్‌లో నబీల్‌కు 6, రోహిణి, తేజ, విష్ణుప్రియకు 10, అవినాష్, ప్రేరణ, నిఖిల్, హరితేజలకు 9, యష్మికి 8, గౌతమ్‌కు 7 మార్కులిచ్చాడు. తేజ డ్యాన్స్‌కు ముచ్చెమటలుముఖ్యంగా తేజ పర్ఫామెన్స్కైతే వరుణ్‌తేజ్‌కు చెమటలు పట్టాయి. ఒక్కరు నవ్వకుండా ఉంటే ఒట్టు! ఆ రేంజ్లో ఉంది మనోడి పర్ఫామెన్స్. ఫైనల్‌గా ఈ గేమ్‌లో బాయ్స్ వేషంలో ఉన్న ఆడవారు గెలిచారు. అనంతరం వరుణ్ తన మనసుకు దగ్గరైనవారి గురించి మాట్లాడాడు. రామ్ చరణ్ తనకు సోదరుడని, ఏ సమస్య వచ్చినా అతడి దగ్గరకు వెళ్తానన్నాడు. నిహారిక కొడుతుందా?చిరంజీవి తన ఇన్స్పిరేషన్ అని, అల్లు అర్జున్ హార్డ్‌వర్కర్ అని, పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవన్నాడు. నిహారిక బెస్ట్‌ఫ్రెండ్ అని.. ఎప్పుడూ తనను కొడుతుందన్నాడు. తర్వాత సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. అనంతరం నాగ్ నిఖిల్‌ను సేవ్ చేశాడు. ఇకపోతే కొన్ని హ్యాష్‌ట్యాగులు ఇచ్చిన బిగ్‌బాస్ అవి ఎవరికి సెట్టవుతాయో చెప్పాలన్నాడు. ముందుగా తేజ.. ఎవరికోసం ఆలోచించకుండా పండ్లు తినేసిన గౌతమ్‌కు సెల్ఫిష్ ట్యాగ్ ఇచ్చాడు. బిల్లు మాఫీ చేయించిన నాగ్ఈ క్రమంలో హౌస్‌లో జరుగుతున్న దొంగతనం గురించి నాగ్ ఆరా తీశాడు. సూపర్ మార్కెట్లో హౌస్మేట్స్ కొన్ని వస్తువులు దొంగతనం చేశారు. అందుకుగానూ బిగ్‌బాస్ రూ.1,85,000 బిల్లు వేశాడు. అసలు ఏమేం దొంగిలించారనేది నాగ్ వీడియో ప్లే చేసి మరీ చూపించాడు. అయితే చిన్నచిన్న దొంగతనాలను చూసీ చూడనట్లు వదిలేయమని, ఆ బిల్లును ప్రైజ్‌మనీలో నుంచి కట్ చేయొద్దని నాగ్ బిగ్‌బాస్‌ను అభ్యర్థించడం విశేషం.అవినాష్ కట్టప్పహ్యాష్ట్యాగుల గేమ్ విషయానికి వస్తే.. విష్ణుప్రియ.. ప్రేరణ టేప్‌రికార్డర్ అని, హరితేజ.. తేజ లేజీబాయ్ అని, నబీల్.. ప్రేరణకు ఇగో ఎక్కువ, యష్మి.. అవినాష్ కట్టప్ప (వెన్నుపోటు), అవినాష్.. విష్ణుప్రియ ఓవర్ డ్రమటిక్, గౌతమ్.. ప్రేరణ కంట్రోల్ ఫ్రీక్, రోహిణి.. అవినాష్ అటెన్షన్ సీకర్, ప్రేరణ.. గౌతమ్ ఇరిటేటింగ్, పృథ్వీ.. నిఖిల్ ఇమ్మెచ్యూర్, నిఖిల్.. పృథ్వీ అటెన్షన్ సీకర్ అని పేర్కొన్నారు. తర్వాత విష్ణు, పృథ్వీ సేవ్ అయ్యారు.హరితేజ ఎలిమినేట్చివరగా హరితేజ, యష్మి మాత్రమే మిగిలారు. నబీల్ను ఎవిక్షన్ షీల్డ్ వాడతావా? అని నాగ్ అడగ్గా అతడు ఇప్పుడు వాడనని తేల్చిచెప్పాడు. దీంతో నాగ్ యష్మిని సేవ్ చేసి హరితేజ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. హరితేజ వెళ్లిపోతుంటే విష్ణుప్రియ వెక్కివెక్కి ఏడ్చింది. చివర్లో హరితేజ.. హౌస్‌లో ఎవరు మాస్కులు తీసేస్తే బెటరో చెప్పాలన్నాడు. ఐదుగురు మాస్క్ తీయాల్సిందే!అవినాష్, రోహిణి మాస్కు తీసేయాలని అభిప్రాయపడింది. తేజ.. రూల్స్ చెప్పడమే కాకుండా పాటించాలని సూచించింది. ప్రేరణ మంచి అమ్మాయే కానీ కొన్ని చెడు లక్షణాల వల్ల తన మంచి కనడకుండా పోతుందని తెలిపింది. నిఖిల్.. తన ఎమోషన్స్ బయటకు చూపించాలన్నాడు. అలా ఈ ఐదుగురు మాస్క్ తీసేస్తే బెటర్ అని చెప్పింది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఒకే ఫ్రేమ్‌లో చిరు, నాగ్, మహేశ్.. ఇది కదా కావాల్సింది!
ఒకరిద్దరు స్టార్ హీరోలు ఒక చోట కనిపిస్తేనే అభిమానులు పండగ చేసుకుంటారు. అలాంటిది టాలీవుడ్ అగ్ర హీరోలందరూ ఒక్కచోట కనిపిస్తే ఇంకేమైనా ఉందా? సరిగ్గా అలాంటి అద్భుతమే జరిగింది.. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, అఖిల్.. ఇలా అందరూ కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టార్స్ అంతా ఒకేచోటఓ వ్యాపారవేత్త పుట్టినరోజు వేడుకకు వీళ్లంతా హాజరైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే హీరోలందరూ కలిసి భోజనం చేశారు. ఉపాసన, నమ్రత సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ అద్భుత కలయికకు మాల్దీవులు వేడుకగా నిలిచింది.సినిమా..సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడు. నాగార్జున కుబేర, కూలీ సినిమాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మహేశ్‌బాబు.. రాజమౌళి డైరెక్షన్లో సినిమా కోసం రెడీ అవుతున్నాడు.చదవండి: ఫైట్ యాక్షన్ సీక్వెన్స్.. సునీల్ శెట్టికి గాయాలు! -
నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేదిక అక్కడేనా..?
అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల త్వరలో పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఆగష్టులో వారిద్దరి నిశ్చితార్థం జరగగా ఇప్పుడు పెళ్లి వేడుకకు ముస్తాబు అవుతున్నారు. శోభిత ఇంట్లో గోధుమరాయి పసుపు దంచడంతో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.నాగచైతన్య-శోభితాల పెళ్లి డిసెంబర్ 4న జరగనుందని తెలుస్తోంది. అధికారికంగా అయితే ప్రకటించలేదు. ముందుగా డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకున్నారట. కానీ, నాగార్జున ఆ ఆలోచనను విరమించుకొని రాజస్థాన్‌లోని ఓ మంచి ప్యాలెస్‌లో పెళ్లి చేద్దామని ఆలోచించారట. అయితే, ఇప్పుడు ఆ ప్లాన్‌ను కూడా నాగ్ వద్దనుకున్నారట. హైదరాబాద్‌లోనే తన కుమారుడి పెళ్లి చేయాలని ఆయన ఫిక్స్ అయ్యారట. అందుకు వేదికగా అన్నపూర్ణ స్టూడియోను ఎంపిక చేశారని సమాచారం. ఈ వేదికను సిద్ధం చేసేందుకు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్‌కు పనులు కూడా అప్పగించారని తెలుస్తోంది.అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఎన్-కన్వెన్షన్ టాపిక్‌ను మరోసారి తెరపైకి తీసుకొస్తున్నారు. హైదరాబాద్‌లో ఎన్-కన్వెన్షన్ వేదికకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందరో సెలబ్రీటిల శుభకార్యాలు అక్కడ జరిగాయి. కానీ, తమ హీరో పెళ్లి మాత్రం అక్కడ జరగకపోవడంతో అక్కినేని ఫ్యాన్స్ కాస్త హర్ట్ అవుతున్నారు. ఒకవేల ఆ వేదిక అందుబాటులో ఉంటే మరో ఆలోచన లేకుండా చైతూ-శోభిత పెళ్లి అక్కడే జరిగి ఉండేది. -
నయని ఎలిమినేట్.. ప్రోమోలోనే హింట్ ఇచ్చిన నాగ్
బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారు? ఇంకెవరు నయని పావని అని సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం జరుగుతోంది. అది నిజమేనని కన్ఫామ్ చేసేశాడు కింగ్ నాగార్జున. బిగ్‌బాస్ రిలీజ్ చేసిన ప్రోమోలో నాగ్.. నయని, యూ ఆర్ ఎలిమినేట్ అనేశాడు. లీక్ చేసిన నాగ్సరిగ్గా 1 నిమిషం 17 సెకన్ల వద్ద ఈ మాటన్నాడు. ఇది చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. నయని ఎలిమినేట్ అని నాగ్ సారే చెప్పేశారు, ఎలాగో ఈ వార్త లీకైపోయిందని లైట్ తీసుకున్నారా? ఎడిటర్ మరీ ఇంత ఘోర తప్పిదం ఎలా చేశాడబ్బా?, ఏదైనా గేమ్‌లో నయని ఎలిమినేట్ అయి ఉండవచ్చు.. బహుశా అందుకే అలా చెప్పాడేమో? అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఎలా ఓదారుస్తారో?ఈ ఎలిమినేషన్ లీక్స్ వల్ల ఉత్కంఠ లేకుండా పోయింది. ఇకపోతే సాధారణంగానే ఏడ్చే నయని ఎలిమినేట్ అయినందుకు ఇంకెంత ఏడుస్తుందో! ఆమెను అటు హౌస్మేట్స్, ఇటు నాగ్ ఎలా ఓదారుస్తారో, తన కన్నీటికి ఆనకట్ట ఎలా కడతారో చూడాలి! -
Bigg Boss 8: అట్లుంటది ‘బిగ్ బాస్’తో
మామూలుగా ఒక్క టికెట్ మీద ఒక సినిమానే చూడగలం. అలాగే వేరే టికెట్ మీద వేరే సినిమా చూడగలం. కాని అదే ఒక్క టికెట్ మీద డజనుకు పైగా సినిమాలు దాదాపు వంద రోజులు చూడగలిగితే అదే బిగ్ బాస్ కార్యక్రమం. మనం చూసే సినిమా సినిమాకీ ప్రత్యేకత కోరుకుంటాం. ఓ చిన్న సన్నివేశం కానీ, అంతెందుకు కనీసం చిన్న ప్రదేశం కానీ... ఒక సినిమాలోది మరో సినిమాలో కనబడితే నానా యాగీ చేస్తాం. కానీ బిగ్ బాస్ కార్యక్రమం మాత్రం ఇందుకు మినహాయింపు. గడచిన 8 సిరీస్‌లలో బిగ్ బాస్ కార్యక్రమ అంశం కానీ, కంటెస్టెంట్లు ఆడిన టాస్కులు కానీ అంతెందుకు వాళ్లున్న సెట్ అంతా ఒకటే. కాకపోతే సెట్‌కు కాస్త రంగులు మారుస్తారు. సిరీస్‌కు కంటెస్టెంట్లు మారతారు. అయినా ప్రతి సిరీస్‌కు బిగ్ బాస్కున్న ఆదరణ పెరుగుతుందే కానీ తరగట్లేదు. బిగ్ బాస్ కార్యక్రమానికి ప్రేక్షక అభిమానం ఆకాశమంత ఎత్తయితే, విమర్శకుల దురభిమానం అంతరిక్షమంత ఎత్తు అని చెప్పవచ్చు. ఈ వారం మెగా ఛీఫ్ ఎంపిక (విష్ణుప్రియ) ఓ విడ్డూరమయితే వారం మధ్యలో తన నటనతో గంగవ్వ చేసిన హారర్ ఎపిసోడ్ ఓ అద్భుతమనే అనాలి. యధావిధిగా కంటెస్టెంట్లు మూడు లవ్ ఎపిసోడ్లు నాలుగు ఫ్లర్టింగ్ ఎపిసోడ్లతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. వారాంతంలో దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌గా ప్రసారమయిన ఫార్మెట్ కూడా పేలవంగా అనిపించింది. కాకపోతే కొత్త సినిమాల సెలబ్రిటీస్‌తో కాస్త కళకళలాడించడానికి ప్రయత్నించాడు బిగ్ బాస్. వారమంతా కాస్త టాస్కులలో తన సత్తా చాటుతూ స్క్రీన్ స్పేస్ మిగతావారి కన్నా ఎక్కువ షేర్ చేసుకున్నా మెహబూబ్‌కు మొండి చేయి చూపించి ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. ఈ వారం ఎపిసోడ్ ట్విస్ట్ ఏంటంటే అవినాష్ కూడా తాను అనారోగ్య కారణాలతో హౌస్ బయటకు వెళుతున్నట్టు ఎపిసోడ్ చివర ప్రోమోలో చూపించారు. పోయిన సారి మన విశ్లేషణలో చెప్పుకున్నట్టు హౌస్‌లోని కంటెస్టెంట్లు తమ ఉనికి, ఉపాధి కోసం తమ ఆరోగ్యాలను కూడా లెక్క చేయడంలేదు. ఇన్ని జరుగుతున్నా బిగ్ బాస్ మాత్రం తన షో లాభాలను లెక్క పెట్టుకుంటూనే ఉన్నాడు. ఏదేమైనా అట్లుంటది బిగ్ బాస్‌తో. -
నాగ్ చేసిన పనికి షాక్‌లో తేజ.. త్వరలో వెళ్లిపోతానంటున్న గంగవ్వ
హౌస్‌మేట్స్‌కు నాగార్జున గట్టిగా క్లాస్ పీకి చాలాకాలమైంది. అందుకే ఈ రోజు అందరికీ కోటింగ్ ఇవ్వడమే పనిగా పెట్టుకున్నాడు. గౌతమ్, నిఖిల్, యష్మి, ప్రేరణలపై సీరియస్ అయ్యాడు. ప్రత్యేకంగా ఈ నలుగురిపైనే ఫైర్ అవడానికి కారణమేంటో తెలియాలంటే నేటి (నవంబర్ 2) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నువ్వేమైనా పుడింగా?నాగార్జున వచ్చీరాగానే ప్రేరణపై విరుచుకుపడ్డాడు. నువ్వేమైనా పుడింగా? అందరిపై నోరు ఎందుకు జారుతున్నావ్? అని నిలదీశాడు. అందుకామె పుడుంగి అనేది తప్పు పదమని తెలీదని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో నయని లేచి.. తను ఎప్పుడూ అమర్యాదగానే మాట్లాడుతుందని అగ్నికి ఆగ్జం పోసింది. అటు నాగ్ వీడియో ప్లే చేయడంతో అడ్డంగా దొరికిపోయిన ప్రేరణ నయనికి సారీ చెప్పింది. నిఖిల్‌ను తిట్టడాన్ని సైతం తప్పుపడుతూ నోరు అదుపులో పెట్టుకోమని హెచ్చరించాడు.ఎందుకంత కోపం?పానీపట్టు యుద్ధం టాస్క్‌లో అగ్రెసివ్‌గా ఆడావు. అప్పుడు ప్రేరణ, యష్మిపై ఎందుకంత కోపం చూపించావని నాగ్ నిఖిల్‌ను అడిగాడు. అందుకతడు ప్రేరణ, గౌతమ్ బూతు వాడటంతో మరింత ట్రిగ్గర్ అయ్యానన్నాడు. దీనిపై గౌతమ్ స్పందిస్తూ.. తాను బూతు మాట అనలేదన్నాడు. దీంతో నాగ్ వీడియో వేసి చూపించాడు. అందులో అతడు పెదాలాడించినట్లు ఉందే తప్ప బూతు మాట్లాడినట్లు లేదు.నిరూపిస్తే హౌస్ నుంచి వెళ్లిపోతా..వీడియో చూసిన తర్వాత కూడా గౌతమ్.. తల్లిపై ప్రమాణం చేస్తున్నాను. నేను బూతు మాట్లాడలేదు. చేయని తప్పును ఒప్పుకోను. నేను బూతు మాట్లాడినట్లు నిరూపిస్తే హౌస్ నుంచి వెళ్లిపోతానని శపథం చేశాడు. దీంతో నాగ్.. గౌతమ్ మాటల్ని ఎవరు నమ్ముతున్నారని అటు హౌస్‌మేట్స్‌ను, ఇటు స్టూడియోలో ఉన్నవారిని అడిగాడు. కానీ ఏ ఒక్కరూ గౌతమ్‌కు సపోర్ట్ చేయకపోవడంతో అతడి ముఖంలో నెత్తురుచుక్క లేకుండా పోయింది.మధ్యలో దూరకుతర్వాత యష్మి వంతురాగా.. నీ ప్రాబ్లమేంటక్కా? అని నాగ్ ప్రశ్నించాడు. గౌతమ్ తనను సడన్‌గా క్రష్, సడన్‌గా అక్క అని పిలిస్తే తీసుకోలేకపోయానని బదులిచ్చింది యష్మి. దీంతో నాగ్ వీడియో ప్లే చేశాడు. అందులో గౌతమ్.. విష్ణుతో మాట్లాడుతుంటే యష్మి మధ్యలో దూరింది. ఈ గొడవ పెద్దదై ఒకరినొకరు అక్కాతమ్ముడు అనుకున్నారు. నువ్వు కూడా తమ్ముడు అన్నావుగా.. ఏదైనా జరుగుతున్నప్పుడు మధ్యలోకి దూరకూడదు అని సూచించాడు. ఫ్లిప్ అవుతున్నావ్అలాగే బీబీ ఇంటికి దారేది ఛాలెంజ్‌లో తన రెడ్ టీమ్‌లో గౌతమ్‌ను ఎలిమినేట్ చేయడం గురించి అడగ్గా.. అతడు పెద్దగా ఆడలేదని తెలిపింది. దీంతో గౌతమ్ లేచి.. నేను ఆల్రెడీ ఒకసారి మెగా చీఫ్ అయ్యానని, అందుకే సైడ్ చేస్తున్నామని చెప్పిందే తప్ప ఆడలేదని చెప్పలేదన్నాడు. ఇది విన్న నాగ్.. ఇలా మాటలు మారుస్తూ ఉంటే నువ్వు ఫ్లిప్ అవుతున్నావని జనాలు భావిస్తారని హెచ్చరించాడు.సిగ్నల్స్ ఇచ్చిన గంగవ్వఅనంతరం బాగా ఆడావంటూ నాగ్ తేజను మెచ్చుకోగా ఇది కలా? నిజమా? అర్థం కాక అతడు నోరెళ్లబెట్టాడు. సెకనులో ఇదంతా నిజమేనని తెలుసుకుని తెగ సంతోషించాడు. ఇక మెగా చీఫ్ పోస్ట్‌ను త్యాగం చేయడం బాగోలేదని నబీల్‌కు చురకలంటించాడు. గండం గట్టెక్కింది!గంగవ్వను ఆటలో ఇంకాస్త యాక్టివ్‌గా ఆడాలని నాగ్ సలహా ఇవ్వగా.. తనకు ఒళ్లునొప్పులు వస్తున్నాయంది. తనవల్ల కానిరోజు హౌస్ నుంచి తనే స్వయంగా వెళ్లిపోతానంది. చివర్లో తేజ సేవ్ అయినట్లు ప్రకటించాడు. గతంలో తొమ్మిదో వారమే షో నుంచి ఎలిమినేట్ అయ్యానని ఈసారి ఆ వారం నుంచి తప్పించుకున్నానంటూ ఫుల్ ఖుషీ అయ్యాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాగ్ సీరియస్.. నిరూపిస్తే షో నుంచి వెళ్లిపోతానన్న గౌతమ్
ఆవేశం అందరికీ వస్తుంది.. కానీ ఎంత ఆవేశం వచ్చినా, కోపమొచ్చినా మాట అదుపులో పెట్టుకోవాలి. ఒక్కసారి నోరు జారితే ఆ మాటను వెనక్కు తీసుకోలేం. ఈ విషయాన్ని నాగార్జున పృథ్వీకి ఎన్నోసార్లు చెప్పాడు. ఇప్పుడు పృథ్వీ బాగానే ఉన్నాడు కానీ మరో ఇద్దరికీ మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేయాల్సి వచ్చింది.ప్రేరణ, గౌతమ్‌లపై సీరియస్తాజాగా రిలీజైన ప్రోమోలో నాగ్.. ప్రేరణ, గౌతమ్‌లపై సీరియస్ అయ్యాడు. పుడింగి ప్రేరణ.. అందరికీ మైండ్ యువర్ లాంగ్వేజ్ అని చెప్తుంటావ్.. మరి నీ నోరు అదుపులో పెట్టుకున్నావా? అని అడిగాడు. నిఖిల్‌పై నోరు జారిన వీడియోను ప్లే చేసి ఇది కరెక్టేనా? అని అడిగాడు.వీడియో ప్లే చేసి మరీ..అటు నిఖిల్పైనా మండిపడ్డాడు. ఆటలో అంత అగ్రెసివ్ అవ్వాల్సిన అవసరం లేదని చురకలంటించాడు. అటు గౌతమ్ నిఖిల్‌పై అరిచిన వీడియో ప్లే చేసి అక్కడ ఏం అన్నావ్? అని నిలదీశాడు. నేను ఏదో నసిగినట్లు పెదాలాడించానే తప్ప ఎలాంటి బూతు మాట్లాడలేదు అన్నాడు. తల్లిపై ప్రమాణంచాలా తెలివిగా వాడాల్సిన పదం వాడేశావ్ అని నాగ్ అనగా.. అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా.. నేను నిజంగా అలా అన్నట్లు నిరూపిస్తే హౌస్ నుంచి వెళ్లిపోతానన్నాడు. అయితే అతడు ఏమీ అనలేదని నమ్ముతున్నారా? అని అటు హౌస్‌మేట్స్‌ను, ఇటు స్టూడియోలో ఉన్న ప్రేక్షకులను అడగా ఏ ఒక్కరూ నమ్ముతున్నట్లు చెప్పలేదు. దీంతో గౌతమ్ బిక్కముఖం వేశాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పండగ వేళ పసందుగా...
కొత్త లుక్స్, విడుదల తేదీల ప్రకటనలతో దీపావళి సందడి తెలుగు పరిశ్రమలో బాగానే కనిపించింది. మాస్ లుక్, క్లాస్ లుక్, భయంకరమైన లుక్, కామెడీ లుక్... ఇలా పండగ వేళ పసందైన వెరైటీ లుక్స్‌లో కనిపించారు స్టార్స్. ఆ వివరాల్లోకి వెళదాం.⇒ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న పాన్ ఇండియన్ మల్టిస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నల పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. టీజర్‌ని ఈ నెల 15న విడుదల చేయనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ⇒ హీరో వెంకటేశ్ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌ని ఖరారు చేసి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. దీపావళిని పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. యూనిక్ ట్రయాంగిలర్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. ⇒ సంక్రాంతికి ఆట ప్రారంభించనున్నారు రామ్‌చరణ్. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ మూవీ టీజర్‌ని ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, రామ్‌చరణ్ లుక్‌ని రిలీజ్ చేశారు. ⇒ అర్జున్ సర్కార్‌గా చార్జ్ తీసుకున్నారు హీరో నాని. ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ప్రొడక్షన్స్పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి నాని యాక్షన్ ఫ్యాక్డ్ పోస్టర్ రిలీజ్ చేశారు. 2025 మే 1న ఈ సినిమా విడుదల కానుంది. ⇒ నితిన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ విడుదలైంది. త్వరలో టీజర్ రిలీజ్ కానుంది. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ⇒ నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్లస్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘లెవెన్’. రేయా హరి కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రంలోని ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్..’ అంటూ శ్రుతీహాసన్ పాడిన పాట చాలా పాపులర్ అయింది. ‘లెవెన్’ని నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ⇒ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాత–మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందంగా రాజా గౌతమ్ పోషిస్తున్న పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్ హీరోయిన్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానుంది.⇒ నాగ సాధువుగా తమన్నా లీడ్ రోల్లో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓదెల 2’. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై బహు భాషా చిత్రంగా రూపొందుతోంది. ఈ డివోషన్ యాక్షన్ థ్రిల్లర్‌లో విలన్ తిరుపతి పాత్రలో వశిష్ఠ ఎన్. సింహ నటిస్తున్నట్లు పేర్కొని, లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ మరో కీలక -
నాగార్జున 'కుబేర'.. ఫ్యాన్స్‌కు దీపావళీ అప్డేట్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ ధనుశ్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం కుబేర. ఈ సినిమాను శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. దీపావళి సందర్భంగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈనెల 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ విడుదల చేస్తూ అనౌన్స్మెంట్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో ఇదివరకెన్నడూ చేయని ఓ సరికొత్తపాత్రలో ధనుష్ కనిపించనున్నరు. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని ఇప్పటికే చిత్రయూనిట్ పేర్కొంది. బాలీవుడ్ నటుడు జిమ్‌సర్భ్ కీలకపాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. Wishing you a sparkling Diwali from #SekharKammulasKubera! 💥The wait is almost over!!Catch the explosive #KuberaTeaser on Kartik Purnima, November 15th! 💥🔥@dhanushkraja KING @iamnagarjuna @iamRashmika @sekharkammula @jimSarbh @Daliptahil @ThisIsDSP @AsianSuniel @SVCLLP… pic.twitter.com/9vAsnAv4tu— Annapurna Studios (@AnnapurnaStdios) November 1, 2024 -
కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం కేసు.. విచారణ వాయిదా
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా కేసు విచారణను నాంపల్లి ప్రత్యేక కోర్టు నవంబర్ 13కు వాయిదా వేసింది. కేటీఆర్ దాఖలు చేసిన పిటీషన్‌పై ఇవాళ (బుధవారం) నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. గత విచారణలో కేటీఆర్, దాసోజు శ్రవణ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన కోర్టు.. ఇవాళ మిగిలిన ముగ్గురు సాక్షులు తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేయనుంది.కాగా, తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా తన గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ కోర్టుకు చదివి వినిపించారు. ఇలా మొత్తం 23 రకాల ఆధారాలను కోర్టుకు అందించారు.మరోవైపు హీరో అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌పై మంత్రి కొండా సురేఖ కౌంటర్ దాఖలు చెయ్యనున్నారు. ఈకేసులో నాగార్జునతో పాటు సాక్షుల స్టేట్మెంట్ను న్యాయస్థానం రికార్డు చేయనుంది. -
ANR అవార్డు అందుకున్న హీరో చిరంజీవి (ఫొటోలు)
-
కాబోయే కోడలు అంటూ.. శోభితను చిరంజీవికి పరిచయం చేసిన నాగార్జున (ఫొటోలు)
-
నా సినీ జీవితానికి పరిపూర్ణత ఇచ్చిన అవార్డు ఇది: చిరంజీవి
‘‘సినీ పరిశ్రమను నా ఇల్లు అనుకుంటే... ఈ పరిశ్రమలో గెలిచే అవకాశం వజ్రోత్సవాలప్పుడు (2007) వచ్చింది. అందరూ కలిసి నాకు లెజండరీ అవార్డు ప్రదానం చేస్తుంటే హ్యాపీ ఫీలై, ఎంత ధన్యుణ్ణి అనుకున్నా. కానీ... కొన్ని ప్రతికూల పరిస్థితులు... కొంతమంది హర్షించని ఆ సమయంలో ఆ అవార్డు తీసుకోవడం సముచితంగా అనిపించలేదు. అందుకే ఈ టైమ్ క్యాప్సూ్యల్లో అవార్డు ఉంచి, నాకు అర్హత ఎప్పుడైతే ఉందో అప్పుడే తీసుకుంటాను అన్నాను.ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈ రోజు ది గ్రేట్ ఏఎన్నార్ అవార్డు్డను పుచ్చుకున్న రోజున... అదీ అమితాబ్‌గారి చేతుల మీదుగా పుచ్చుకున్న రోజున... నా మిత్రుడు... నా సోదరుడు నాగ్ మనస్ఫూర్తిగా ఈ అవార్డుకు మీకు అర్హత ఉంది... తీసుకోండి అని అన్న రోజున ఇప్పుడు ఇంట గెలిచాను... రచ్చా గెలిచాను’’ అని హీరో చిరంజీవి ఎంతో భావోద్వేగంగా ప్రసంగించారు. లెజండరీ నటుడు ‘ఏఎన్నార్’ అవార్డు అందుకున్న సందర్భంగా చిరంజీవి ఈ విధంగా పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు, పలువురు చిత్రరంగ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతుల మీదగా ‘ఏఎన్నార్ అవార్డు’ అందుకున్నారు చిరంజీవి. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘పద్మభూషణ్‌లు, పద్మ విభూషణ్‌లు, పర్సనాలిటీ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు... ఇలా ఎన్ని అవార్డులు వచ్చినా సరే... ఏఎన్ఆర్ అవార్డు నాకు ప్రత్యేకం. ఎందుకంటే నా వాళ్లు నన్ను గుర్తించి, ప్రశంసించి, ఇలాంటి అవార్డులు ఇచ్చినప్పుడు అది నిజమైన అచీవ్మెంట్ అని ఫీలయ్యాను. అందుకే నాగ్‌తో ఇది ప్రత్యేకమైన అవార్డు అని చెప్పాను. అమితాబ్‌గారి మాటలు ఎనర్జీ ఇచ్చాయినాకు పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ నన్ను సత్కరించింది. ఆ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చి, అమితాబ్ బచ్చన్‌గారు ‘చిరంజీవి ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అన్నారు. నా హిందీ ‘ప్రతిబంథ్’ సినిమా చూసి, అమితాబ్‌గారు ‘పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్. డన్ ఏ గుడ్ జాబ్. ప్రయోజనాత్మక సినిమా’ అన్నారు. ఆ మాటలు ఎనర్జీ ఇచ్చాయి.నాన్న పొగడాలనుకున్నానుమా నాన్నగారికి నటనంటే చాలా ఇష్టం. కానీ నన్ను పొగిడేవారు కాదు... ఏంటమ్మా... నాన్నగారు ఏం అనరు.. మాట్లాడరు. బయట ఎంత గెలిచినా ఇంట గెలవమంటుంటారు కదా అనేవాడిని. ‘చాలా పొగుడుతారు... కానీ తల్లిదండ్రులు పిల్లలను పొగడకూడదు. అది వారికి ఆయుక్షీణం’ అని మా అమ్మ అన్నారు. ఆ రోజు అనిపించింది... నేను ఎప్పుడో ఇంట గెలిచాను అన్నమాట. అలాగే రచ్చ కూడా గెలిచాను. మా అమ్మ ఏఎన్నార్ సీనియర్ మోస్ట్ ఫ్యాన్ ఏఎన్నార్‌గారి ఫ్యాన్స్‌లో సీనియర్ మోస్ట్ ఫ్యాన్ మా అమ్మ. ఆమె నిండు గర్భిణీతో ఉన్నప్పుడు ఏఎన్నార్‌గారి ‘రోజులు మారాయి’ సినిమా చూడాలనుకుంది. అమ్మ తన పుట్టింట్లో మొగల్తూరులో ఉండేది. నర్సాపూర్ దాటి పాలకొల్లు వెళ్లి, సినిమా చూడాలి. నాన్న జట్కా బండి ఏర్పాటు చేశారు. గతుకుల రోడ్డు. మొగల్తూరు వైపు వెళుతున్న బస్సు ఈ బండికి ఎదురుగా వచ్చింది. దానికి దారి ఇచ్చే క్రమంలో జట్కా బండి పొలాల్లో దొర్లింది. బండిలో ఉన్న అందరూ కిందపడ్డారు. నాన్న కంగారుపడి, అమ్మతో ‘పద.. ఇంటికి వెళ్లిపోదాం’ అన్నా ‘సినిమా చూడాల్సిందే’ అని పట్టుబట్టి వెళ్లింది. ఆ తర్వాత రెండు నెలలకు నన్ను బయట పడేసింది. ఏఎన్ఆర్గారి మీద నాకు ఉన్న అభిమానం అమ్మ ద్వారా... ఆ బ్లడ్ ద్వారా వచ్చిందేమో. చిరంజీవికి ఎముకలు లేవన్నారు ఏఎన్‌ఆర్‌గారు నాకు నాగేశ్వరరావుగారి సినిమాల్లో డ్యాన్సులంటే ఇష్టం. ఆయన పాటలకు నాకు తెలిసిన పద్ధతిలో డ్యాన్సులు వేసుకునేవాడిని. నాకు డ్యాన్సుల్లో ఇన్స్పిరేషన్ ఎవరంటే అక్కినేనిగారు. అయితే ఆయన నా గురించి ఓ ఇంటర్వ్యూలో ‘నాకు ఎముకలు ఉన్నాయి... కానీ చిరంజీవికి లేవు. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి డ్యాన్సులు పరిచయం చేసింది నేనే. కానీ ఆ డ్యాన్సులకి స్పీడు పెంచింది, గ్రేసు పెంచింది చిరంజీవి’ అన్నారు. ‘ఇది గొప్ప గొప్ప అవార్డులతో సమానం’ అనిపించింది.అలాగే ఇండస్ట్రీ మద్రాసు నుంచి ఇక్కడికి రావడానికి కృషి చేసిన మహానుభావుడు ఏఎన్‌ఆర్‌గారు. ‘కాలేజీ బుల్లోడు’ హండ్రెడ్ డేస్ ఫంక్షన్‌కి నన్ను పిలిస్తే వెళ్లాను. అందరూ ఒకటే కేరింతలు... కేకలు. ఆయన పక్కకి తిరిగి, ‘ఎవరి కోసం అవన్నీ అనుకున్నావ్...’ అంటే ‘మీ కోసం’ అన్నాను. ‘మాది అయిపోయింది. నీ కోసమే’ అంటూ, నన్ను ఎంకరేజ్ చేశారు. అలా ప్రశంసించే గొప్ప మనసు చాలామందికి ఉండదు. ఆ తర్వాత ఆయనతో ‘మెకానిక్ అల్లుడు’ చేసే గొప్ప చాన్స్ వచ్చింది. ఆయన్ను చూస్తే నాకో ‘ఫాదర్లీ ఫీలింగ్’.నాగ్ నాకు డాక్టర్‌లాంటి వాడు ఆరోగ్య సూత్రాలు పాటించడం, ఎక్సర్సైజుల విషయంలో, యంగ్‌గా ఉండటానికి చూపించే శ్రద్ధలో నాగ్ నాకెంతో ఇన్స్పిరేషన్. నాకు ఆరోగ్య సూత్రాలు తెలిపే డాక్టర్. ఇక దేవానంద్, లతా మంగేష్కర్, అమితాబ్, బాలచందర్‌గార్లు... ఇలా గొప్ప గొప్పవారికి ఇచ్చిన ఏఎన్నార్ అవార్డు రావడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నా సినీ జీవితానికి ఒక పరిపూర్ణత ఇచ్చిన అవార్డులా భావిస్తున్నాను’’ అన్నారు.ఏఎన్ఆర్ని ఎవరూ మ్యాచ్ చేయలేరు: అమితాబ్ బచ్చన్ ‘‘ఇండియన్ సినిమాకు ఏఎన్నార్‌గారు చేసిన కాంట్రిబ్యూషన్‌ను ఎవరూ మ్యాచ్ చేయలేరు. ఈ సందర్భంగా నా తండ్రి రాసిన ఓ హిందీ పద్యంలోని ఓ లైన్‌ను ఇక్కడ ప్రస్తావించాలనుకున్నాను. ‘‘నా కుమారులైనంత మాత్రాన... నా కుమారులు నాకు వారసులు కాలేరు. ఎవరైతే నా వారసులవుతారో వారే కుమారులు’’ అని ఉంది. గొప్ప వ్యక్తి ఏఎన్నార్‌గారికి నిజమైన వారసులుగా, కుమారులుగా నాగార్జున ఆయన కుటుంబం నిరూపించుకుంది. నా ఫ్రెండ్ చిరంజీవికి ఈ అవార్డును అందించేందుకు నన్ను ఎంపిక చేసిన నాగ్‌కు థ్యాంక్స్.ఆ ఇద్దరూ ఏబీసీ ఆఫ్ ఇండియన్ సినిమా: నాగార్జున ‘‘ఏఎన్ఆర్... ఈ మూడు అక్షరాలే నాకు ప్రపంచం. ఏ లెజెండ్ లివ్స్ ఆన్. భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచే గొప్ప వ్యక్తులని గౌరవించడం ఏయన్నార్ అవార్డు ముఖ్యోద్దేశం. ఈ రోజు అలాంటి గొప్ప వ్యక్తులు ఇద్దరు. ఇండియన్ సినిమాకు ఏబీ (అమితాబ్) సి (చిరంజీవి).. అమితాబచ్చన్‌గారు, మెగాస్టార్ చిరంజీవిగారు. చిరంజీవిగారికి అవార్డు ప్రదానం చేయడానికి అమితాబచ్చన్‌గారు రావడం ఆనందంగా ఉంది. ఏఎన్ఆర్ శతజయంతి సందర్భంగా ఇది మాకు ఎంతో ప్రత్యేకం. అమితాబ్‌గారి సామాజిక బాధ్యతకు మేం సెల్యూట్చేస్తున్నాం. 1985లో నేను సినిమాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు.. నాన్నగారు అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవిగారి షూటింగ్ జరుగుతుంటే ఆయన డాన్స్ చూడమని చెప్పారు. ఆ డాన్స్, గ్రేస్, కరిష్మా చూసి ఆయనలా డాన్స్ చేయగలనా అనిపించింది. చేయలేం... కెరీర్లో మరో దోవ వెతుక్కుంద్దామనుకుని బయటకు వచ్చాను. మనం సొసైటీ నుంచి ఏదైనా తీసుకున్నప్పుడు మళ్లీ తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంటుందని నాన్నగారు అనేవారు. చిరంజీవిగారు, అమితాబచ్చన్ గారు అదే చేసి చూపించారు. ఒకటే చెప్పగలను... ఈ ఇద్దరూ ‘ఏబీసీ ఆఫ్ ఇండియన్ సినిమా’. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ «థ్యాంక్స్. ‘ఏఎన్ఆర్ లీవ్స్ ఆన్’. ఈ వేడుకలో కీరవాణి ఆధ్వర్యంలో ఏఎన్ఆర్ హిట్ పాటలను పలువురు గాయనీ గాయకులు ఆలపించారు. ఇక ఆస్కార్ విజేత కీరవాణిని ఈ వేదికపై నాగార్జున ప్రత్యేకంగా సన్మానించారు. -
ఆ సమయంలో అవార్డ్ తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది: మెగాస్టార్
పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మక ఘనతను సొంతం చేసుకున్నారు. తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం ఆయనను వరించింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సినీతారలంతా పాల్గొన్నారు. ఈ అవార్డ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏఎన్ఆర్పై ప్రశంసలు కురిపించారు. ఆయనతో నాకున్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైందని అన్నారు. అక్కినేని జాతీయ అవార్డు ప్రదానోత్సవంలో భావోద్వేగానికి గురైన చిరు పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.చిరంజీవి మాట్లాడుతూ..' ఎవరైనా ఇంటి గెలిచి రచ్చ గెలవాలంటారు. నా సినీ ప్రస్థానంలో రచ్చ గెలిచాను. ఇంట గెలిచే అవకాశం సినీ వత్రోత్సవాల్లో వచ్చింది. నాకు లెజెండరీ అవార్డు ప్రదానంతో ధన్యుడిగా భావించా. కానీ నాకు లెజెండరీ అవార్డు ఇవ్వడాన్ని కొందరు హర్షించలేదు. ఆ సమయంలో అవార్డు తీసుకోవడం సముచితం అనిపించలేదు. అందుకే ఆ రోజు లెజెండరీ అవార్డును క్యాప్సుల్ బాక్సులో వేశా. పద్మవిభూషణ్ సహా ఎన్ని అవార్డులొచ్చినా ఆ అసంతృప్తి ఇంకా మిగిలే ఉంది' అని అన్నారు.ఏఎన్నార్ అవార్డ్ గురించి మాట్లాడుతూ.. 'ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈ రోజు ఏఎన్నార్ అవార్డ్ అందుకున్నప్పుడు ఇంట గెలిచాననిపిస్తోంది. ఇప్పుడు ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను. ఈ అవార్డ్ గురించి నాగార్జున, వెంకట్ మా ఇంటికి వచ్చినప్పుడు చాలా ఆనందపడ్డా. నాకు పద్మభూషణ్, పద్మ విభూషణ్, గిన్నిస్ బుక్‌తో సహా ఎన్ని అవార్డులు వచ్చినా ఈ రోజు నా భావోద్వేగం వేరుగా ఉంది. నా వాళ్లు నన్ను గుర్తించి నాకు అవార్డు ఇవ్వడం చాలా గొప్ప విషయంగా అనిపించింది. అన్ని పురస్కారాలకు మించిన ఘనత ఇదేనని నాగార్జునతో చెప్పా. ఇదే మాట స్టేజీ మీద కూడా చెబుతున్నా.' అంటూ ఆనందం వ్యక్తం చేశారు. -
మెగాస్టార్‌కు ఏఎన్నార్ జాతీయ అవార్డ్.. హాజరైన టాలీవుడ్ సినీ ప్రముఖులు (ఫొటోలు)
-
సాగర తీరాన మన్మధుడు హీరోయిన్.. రీ ఎంట్రీ ఇవ్వనుందా?
-
మెహబూబ్ అవుట్.. నొప్పి భరించలేక అవినాష్ సెల్ఫ్ ఎలిమినేట్
పండగ సెలబ్రేషన్స్‌లో బిగ్‌బాస్ ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవలే హౌస్‌లో బతుకమ్మ, దసరా వేడుకలు జరిగాయి. ఇప్పుడు దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకలల్లో సినీ తారలు భాగమయ్యారు. మరి హౌస్‌లో జరిగిన రచ్చ, హంగామా ఏ రేంజ్లో ఉందో లైవ్ అప్డేట్స్లో చూసేయండి..పండగ సర్ప్రైజ్నాగార్జున దీపావళి పాటకు స్టెప్పులేస్తూ పండగ కళను తీసుకొచ్చాడు. తర్వాత హౌస్‌మేట్స్‌ను జంటలుగా విడగొట్టిస్టెప్పులు మీవి- మార్కులు మావి అనే గేమ్ ఆడించాడు. ప్రతి రౌండ్లో గెలిచిన టీమ్‌కు ఒక సర్ప్రైజ్ ఉంటుందన్నాడు. అలా మొదటి రౌండ్లో గంగవ్వ-తేజ గెలిచారు. ఈ జంటలో ఒకరికే ఇంటిసభ్యుల నుంచి మెసేజ్ వస్తుందన్నాడు. అలా తేజ త్యాగంతో గంగవ్వకు తన కూతురి వీడియో మెసేజ్ ప్లే చేశారు. అది చూసిన అవ్వ సంతోషంతో కన్నీళ్లుపెట్టుకుంది. తర్వాత విష్ణుప్రియను సేవ్ చేశారు.ప్రైజ్‌మనీలో మరో రూ.1లక్షఅనసూయ డ్యాన్స్‌తో జోష్ నింపింది. ప్రైజ్‌మనీ కవర్స్ కనుక్కోవాలన్న రెండో గేమ్‌లో నిఖిల్, యష్మీ గెలిచారు. వీరు కనిపెట్టిన కవర్లలోని రూ.1 లక్ష ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. తర్వాత ఈ జంటకు సంబంధించిన ఇంటిసభ్యుల ఫోటో చూపించారు. యష్మి త్యాగం చేయడంతో నిఖిల్ పేరెంట్స్ వీడియో ప్లే చేశారు. అలాగే నాగ్ నిఖిల్‌ను సేవ్ చేశాడు.ప్రేరణకు సర్ప్రైజ్తర్వాత 'క' మూవీ టీమ్ స్టేజీపైకి వచ్చింది. వీరు హౌస్మేట్స్ కళ్లకు గంతలు కట్టి గేమ్ ఆడించారు. ఇందులో ప్రేరణ-మెహబూబ్ గెలిచారు. మెహబూబ్ త్యాగంతో ప్రేరణకు వీడియో ప్లే చేశారు. ఆమె తన పేరెంట్స్ మాటలు విని మురిసిపోయింది. తర్వాత మెహరీన్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. సింగర్ సమీరా భరద్వాజ్.. హౌస్మేట్స్ అందరిపైనా అలవోకగా పాటలు పడేసి అబ్బురపరిచింది. ప్రతి ఒక్కరిపైనా అద్భుతంగా పాట పాడి అదరొట్టేసింది. స్టేజీపై దుల్కర్ సల్మాన్లక్కీ భాస్కర్ మూవీ హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ వెంకీ స్టేజీపైకి వచ్చారు. డైరెక్టర్స్ త్రివిక్రమ్, వెంకీలలో ఎవరిని సెలక్ట్ చేస్తావన్న ప్రశ్నకు మీనాక్షి.. వెంకీ అని బదులిచ్చింది. లక్కీ భాస్కర్ టీమ్ ఆడించిన గేమ్‌లో గౌతమ్-నయని పావని జంట గెలిచింది. వీరిలో నయని పావని తన తల్లి మెసేజ్‌ను త్యాగం చేయడంతో గౌతమ్.. అతడి తండ్రి వీడియో సందేశాన్ని వినగలిగాడు. ఇంట్లో గొడవపడి వచ్చిన గౌతమ్.. తండ్రికి సాష్టాంగ నమస్కారం చేసి మరీ సారీ చెప్పాడు.హరితేజ ఎమోషనల్హీరోయిన్ శాన్వీ స్పెషల్ డ్యాన్స్ పర్ఫామెన్స్తో మైమరపించింది. తర్వాత ప్రేరణ, పృథ్వీని సేవ్ చేశారు. అనంతరం అమరన్ హీరో శివకార్తికేయన్, హీరోయిన్ సాయిపల్లవి స్టేజీపైకి వచ్చారు. వీరు ఆడించిన గేమ్‌లో రోహిణి, అవినాష్ గెలిచారు. వీళ్లిద్దరూ తమకు బదులుగా హరితేజకు తన కూతురి వీడియో చూపించమన్నాడు. హాయ్ అమ్మ, హ్యాపీ దివాళి అంటూ కూతురు మాట్లాడిన ముద్దుముద్దు మాటలు విని హరితేజ ఏడ్చేసింది. తర్వాత హైపర్ ఆది హౌస్‌లోకి వచ్చి తన పంచ్ కామెడీతో నవ్వించాడు.ఏడ్చిన యష్మిఈ ఎపిసోడ్ కంటే ముందు ఏం జరిగిందన్నది చూపించారు. ఎవరినో ఉడికించడానికి యష్మి తనను వాడుకోవడం నచ్చలేదన్నాడు గౌతమ్. ఆ మాటలు విన్న యష్మి.. తన ఉద్దేశం అది కాదంటూ ఏడ్చేసింది. నిఖిల్, నేను ఫ్రెండ్స్‌లా టీజ్ చేసుకున్నాం తప్ప నువ్వంటే నాకు బాగా ఇష్టం అని ఎక్కడా ఒకరికొకరం ఎక్స్‌ప్రెస్ చేసుకోలేదు. నా వల్ల తప్పు జరిగుంటే సారీ అని చెప్పింది. దీంతో గౌతమ్.. ఇకపై నువ్వు నాకు కంటెస్టెంటు మాత్రమే.. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అని క్లారిటీ ఇచ్చేశాడు. నాగ్ నయనిని సేవ్ చేసి మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు.అప్పుడలా ఇప్పుడిలా..వెళ్లిపోయేముందు మెహబూబ్ హౌస్‌మేట్స్‌ను పటాకాలతో పోల్చాడు. అవినాష్ ధౌజండ్‌వాలా, గంగవ్వ లక్ష్మీబాంబ్, నబీల్ రాకెట్, రోహిణి కాకరబత్తి, గౌతమ్ మ్యాచ్ స్టిక్ అన్నాడు. గతంలోనూ దీపావళికి నేను ఎలిమినేట్ అయ్యా.. ఈసారి కూడా దీపావళికే బయటకు వచ్చేశాను. ఎందుకో అర్థం కావట్లేదంటూ ఎమోషనల్ అయ్యాడు. అవినాష్ ఎలిమినేట్ఇక రేపటి ప్రోమోలో అవినాష్ అనారోగ్యంతో సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు చూపించారు. కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. మెడికల్ రూమ్‌కు వెళ్తే బయటకు వచ్చేయమన్నారు. వెళ్లిపోతున్నాను అంటూ వీడ్కోలు తీసుకున్నాడు. హాస్పిటల్‌కు వెళ్లి మళ్లీ హౌస్‌లో అడుగుపెడతాడా? లేదా నిజంగానే వెళ్లిపోతాడా? అన్నది రేపు తేలనుంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ట్రయాంగిల్ లవ్‌స్టోరీని బయటపెట్టిన పృథ్వీ.. సూర్యకు సర్ప్రైజ్
గంగవ్వ అర్ధరాత్రి దెయ్యం పట్టినట్లు ప్రవర్తించిన వీడియో ప్లే చేసిన నాగ్ అది కేవలం ప్రాంక్ అని బయటపెట్టాడు. ప్రైజ్‌మనీలో అరలక్ష పోయినా నామినేషనే ముఖ్యమనుకున్న నబీల్‌పై పోయిన డబ్బును తీసుకొచ్చే బాధ్యతను వేశాడు. హీరో సూర్య నేటి (అక్టోబర్ 26) ఎపిసోడ్లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారాడు. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి..ఇవే తగ్గించుకుంటే మంచిదిఘోస్ట్ ప్రాంక్‌లో గంగవ్వ యాక్టింగ్‌కు ఇంప్రెస్ అయిన నాగ్ ఆమెను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి మరీ సీక్రెట్‌గా మెచ్చుకున్నాడు. పృథ్వీ ప్రాణం పెట్టి సింహంలా ఆడాడని పొగిడాడు. అయితే నామినేషన్స్‌లో రోహిణిని కింది నుంచి పైకి చూస్తే అది బాడీ షేమింగ్లానే కనిపిస్తుందని.. దాన్ని మార్చుకోమని సూచించాడు. పృథ్వీ- నిఖిల్.. ఆర్ఆర్ఆర్ మూవీ హీరోల్లా కలిసి ఆడారని క్లాప్స్ కొట్టాడు. నీ వల్ల అరలక్ష గోవిందా..ప్రైజ్‌మనీలో రూ.50 వేలు కట్ అవుతాయని తెలిసినా హరితేజను నామినేట్ చేశావు. ఆ అర లక్ష మళ్లీ ప్రైజ్‌మనీలో జమ చేయాల్సిన బాధ్యత నీదేనని నబీల్‌కు నొక్కి చెప్పాడు. గౌతమ్ గురించి మాట్లాడుతూ.. మహిళలపై గౌరవం ఉందని చెప్పే నువ్వు యష్మిపై ఎందుకు అరిచావ్? నీ షార్ట్ టెంపర్ తగ్గించుకో అని సలహా ఇచ్చాడు.ట్రయాంగిల్ లవ్ స్టోరీతర్వాత నిఖిల్- యష్మి - గౌతమ్‌ల ట్రయాంగిల్ లవ్‌స్టోరీని నాగ్ బయటపెట్టాడు. హౌస్‌లో జరిగిన టీ షర్ట్ వ్యవహారం గురించి పృథ్వీ చెప్తే ప్రైజ్‌మనీలో రూ.50 వేలు యాడ్ చేస్తానని నాగ్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇంకేముంది, ఫ్రెండ్షిప్ను పక్కన పెట్టి పృథ్వీ లేచి నిల్చున్నాడు. గౌతమ్ టీషర్ట్ కావాలని యష్మి అడిగింది. నిఖిల్ టీషర్ట్ లేదు కాబట్టి గౌతమ్‌ది వేసుకుంది. అప్పుడు నిఖిల్ జెలసీ ఫీల్ అవుతున్నాడని యష్మి నాతో చెప్పింది. అక్కడినుంచి ఏమైనా ఉందా? అని అడిగింది అంటూ పూసగుచ్చినట్లు చెప్పాడు.యష్మికి గడ్డి పెట్టిన నాగ్రాయల్ టీమ్‌లో విభేదాలున్నాయని.. అవన్నీ పక్కనపెట్టి ఓజీ టీమ్‌లా ఐకమత్యంగా ఉండాలని సలహా ఇచ్చాడు. ఇక నిఖిల్ చుట్టూ తిరిగిన యష్మిని.. ఎవరి చుట్టూనో తిరగడం మానేయ్, మళ్లీ గేమ్‌కు వచ్చేయమని సూచించాడు. అలాగే సంచాలకురాలిగా నా స్ట్రాటజీ నాకుంటుంది, నా గ్రూపును నేను గెలిపించుకోవాలనడం తప్పు అని కుండబద్ధలు కొట్టాడు. దీంతో అడ్డంగా దొరికిపోయిన యష్మి నాకు ఏ స్ట్రాటజీ లేదంటూ కవర్ చేసుకునేందుకు ప్రయత్నించింది.అప్పుడు కెమెరామన్, ఇప్పుడు డైరెక్టర్ఇక గంగవ్వ దెయ్యంగా మారి భయపెట్టింది ప్రాంక్ అని.. ఈ ఐడియా అవినాష్, తేజదని వీడియోతో సహా క్లారిటీ ఇచ్చాడు నాగ్. తర్వాత కంగువా ప్రమోషన్స్ జరిగాయి. అందులో భాగంగా హీరో సూర్య, దర్శకనిర్మాత స్టేజీపైకి వచ్చాడు. డైరెక్టర్ అవ్వకముందు నాగార్జున నటించిన నేనున్నాను, బాస్: ఐ లవ్యూ సినిమాలకు శివ కెమెరామెన్‌గా నటించాడు. ఆ సమయంలో ఒకరోజు నాగ్ పిలిచి.. నువ్వు కచ్చితంగా డైరెక్టర్ అవుతావన్నాడు అని చెప్పుకొచ్చాడు.సూర్య కోసం వచ్చేందుకు రెడీసూర్య వస్తున్నాడని తెలిసి నయని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుందట! ఇక హౌస్మేట్స్ అందరూ సూర్య పాటలకు డ్యాన్స్ వేసి అతడిని సర్ప్రైజ్ చేశాడు. సూర్యను కలవడానికి హౌస్ నుంచి శాశ్వతంగా బయటకు వచ్చేస్తావా? అని నాగ్ అడగ్గా తప్పకుండా వస్తాను సర్ అంటూ నయని మెలికలు తిరిగిపోయింది. పృథ్వీ కోరిక మేరకు సూర్య.. రోలెక్స్ డైలాగ్ చెప్పాడు. తర్వాత బై చెప్పివెళ్లిపోయాడు.డ్యాన్స్ రిహార్సల్స్‌లో గొడవఅయితే డ్యాన్స్ రిహార్సల్స్‌లో యష్మి హర్టయిందట! ప్రాక్టీస్ మీద ఆసక్తి చూపించడం లేదు, నీకసలు డ్యాన్స్ పార్ట్నర్ ఎవరు కావాలి? అని విష్ణు పృథ్వీని అడిగగింది. అందుకతడు ఎవరైనా ఓకే అన్నాడు. దీంతో హర్టయిన విష్ణు.. నేను, పృథ్వీ కంఫర్ట్‌గా లేము బిగ్‌బాస్. పార్ట్నర్స్ మార్చుకునే వీలుందా? అని అడిగింది. దీంతో బిగ్‌బాస్ నిఖిల్ -యష్మిని విడదీశాడు. నిఖిల్‌తో విష్ణు, యష్మితో పృథ్వీ కలిసి డ్యాన్స్ చేయాలన్నాడు.బిత్తరపోయిన విష్ణుఇది యష్మికి అస్సలు నచ్చలేదు. తన కోసం నా ఆనందాన్ని చెడగొడుతోందని ఏడ్చేసింది. నువ్విలా చేస్తావని ఊహించలేదంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడింది. దీంతో బిత్తరపోయిన విష్ణు.. పృథ్వీతో డ్యాన్స్ చేసేందుకు ఒప్పుకోవడంతో సమస్య సద్దుమణిగింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీకి నాగ్ క్లాస్.. సూర్య కోసం బయటకు వచ్చేస్తానన్న కంటెస్టెంట్
చేసేదంతా చేస్తారు.. అంతా అయిపోయాక మాత్రం తన ఉద్దేశం అది కాదని యూటర్న్ తీసుకుంటారు. సోనియా, యష్మి, తేజ, విష్ణుప్రియ, ప్రేరణ, నాగమణికంఠ.. ఇలా బిగ్‌బాస్ కంటెస్టెంట్లలో చాలామంది ఇదే కోవలోకి వస్తారు. ఈవారం పృథ్వీ.. రోహిణిని కింది నుంచి పైకి చూస్తూ చులకనగా మాట్లాడాడు.. దీని గురించి నాగ్ ప్రస్తావించగా బాడీ షేమింగ్ చేయాలన్న ఉద్దేశం తనది కాదని కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో నాగ్ క్లాస్ పీకాడు. ఇక యష్మి ఇండివిడ్యువల్ గేమ్ కనిపించడం లేదంటూ ఆమె ఫోటో ఉన్న కుండ పగలగొట్టాడు.స్పెషల్ గెస్ట్‌గా సూర్యఇకపోతే ఈరోజు ఎపిసోడ్లో హీరో సూర్య అతిథిగా విచ్చేయనున్నాడు. కంగువా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా స్టేజీపైకి వచ్చాడు. అతడిని చూసి సూర్య అభిమానురాలు నయని పావని తెగ సంతోషపడిపోయింది. అతడి కోసం 5 నిమిషాలు హౌస్‌లో నుంచి బయటకు వస్తావా? అంటే వచ్చేస్తానని తలూపింది. మళ్లీ హౌస్‌లోకి పంపించను అని నాగ్ తిరకాసు పెట్టినప్పటికీ సూర్య కోసం బయటకు వచ్చేందుకు రెడీ అని చెప్పింది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఈ సంవత్సరం మాకు ప్రత్యేకం: నాగార్జున
దివంగత ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరుతో ఇస్తున్న ‘ఏఎన్ఆర్’ అవార్డు వేడుకని ఈ నెల 28న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 20న ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ‘ఏఎన్ఆర్’ అవార్డుని హీరో చిరంజీవికి ఇవ్వనున్నట్లు నాగార్జున పేర్కొన్న విషయమూ తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం చిరంజీవిని కలిసిన నాగార్జున అవార్డు వేడుకకి రావాలంటూ ఆహ్వానించారు.‘‘మా నాన్న ఏఎన్ఆర్గారి శత జయంతి వేడుకలు జరుపుకుంటున్న ఈ సంవత్సరం మాకు చాలా ప్రత్యేకమైనది. ఈ మైలురాయికి గుర్తుగా ఈ అవార్డు వేడుకకి అమితాబ్ బచ్చన్‌గారు, చిరంజీవిగారిని ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఈ అవార్డు ఫంక్షన్‌ను మరపురానిదిగా చేద్దాం’’ అంటూ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు నాగార్జున. ఈ అవార్డు ప్రదానోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక ఇప్పటివరకూ దేవానంద్, షబానా అజ్మీ, అంజలీ దేవి, వైజయంతీ మాల బాలి, లతా మంగేష్కర్, కె. బాలచందర్, హేమ మాలిని, శ్యామ్ బెనెగల్, అమితాబ్ బచ్చన్, ఎస్.ఎస్. రాజమౌళి, శ్రీదేవి, రేఖ వంటి దిగ్గజాలు ‘ఏఎన్ఆర్’ అవార్డును అందుకున్నారు. -
చిరంజీవికి అక్కినేని నాగార్జున ఆహ్వానం
ఈ నెల(అక్టోబర్ 28)న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు హాజరుకావాలని మెగాస్టార్ చిరంజీవిని అక్కినేని నాగార్జున ఆహ్వానించారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్‌ను కూడా ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరవుతారని ఎక్స్ వేదికగా నాగార్జున తెలియజేశారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన చిత్ర ప్రముఖులకు తన పేరుతో జాతీయ అవార్డ్ ఇచ్చి సత్కరించాలని ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు 2006లో ఏఎన్నార్ అవార్డులను ప్రారంభించారు. మధ్యలో రెండేళ్ల గ్యాప్ ఇచ్చి.. 2014 తిరిగి అమితాబ్ బచ్చన్‌కు ఈ అవార్డు అందజేశారు. ఆ తర్వాత మళ్లీ రెండేళ్లు గ్యాప్ వచ్చింది. 2016లో జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరికి ఏఎన్నార్ అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత రాజమౌళి, శ్రీదేవి, రేఖలకు ఈ అవార్డులు అందుకున్నారు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత తాజాగా మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ అవార్డును అందజేయబోతున్నట్లు నాగార్జున ప్రకటించారు. ఈ నెల 28న అన్నపూర్ణ స్టూడియో జరగబోతున్న ఈ వేడుకల్లో అమితాబ్ చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును అందుకోబోతున్నారు. -
కేటీఆర్ పరువునష్టం పిటిషన్: విచారణ ఈ నెల 30కి వాయిదా
హైదరాబాద్, సాక్షి: మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇవాళ (బుధవారం) నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరిపింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువునష్టం దావా పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈనెల 30న కౌంటర్ ఫైల్ చేస్తామని మంత్రి కొండా సురేఖ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం వకాలత్ దాఖలు చేశారు. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది. మరోవైపు నాగార్జున.. కొండా సురేఖపై వేసిన పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే నాగార్జున స్టేట్మెంట్ను కోర్టు రికార్డు చేసింది. చదవండి: కొండా సురేఖపై పరువు నష్టం కేసు.. ఇదొక గుణపాఠం కావాలి: కేటీఆర్ -
అనంతపురంలో జ్యువెలరీ షాప్ ప్రారంభించిన అక్కినేని నాగార్జున (ఫొటోలు)
-
బిగ్ బాస్ ఏడవ వారం విశ్లేషణ...'బిగ్ బాస్ ఆలోచించు'
చాలా ఏళ్ళ క్రితం తెలుగు శాటిలైట్ టెలివిజన్ చరిత్రలో ఓ వార్తా ఛానల్ వచ్చింది. అందరి కంటే తాము విభిన్నంగా కనిపించాలని వాళ్ళు ఓ వినూత్న ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం వల్ల వాళ్ళు లబ్ధి కూడా పొందారు. అదెలాగంటారా అప్పట్లో ఒక రోజు వున్న అన్ని ఛానళ్ళలో ఓ వార్త ఇలా వుంది.. ఫలానా మంత్రి ఫలాన చోట నడుచుకుంటూ వచ్చారు. కాని ఈ కొత్త ఛానల్ వాళ్ళు ఇచ్చిన వార్త ఏంటంటే...ఫలానా మంత్రి ఫలాన చోట నడుచుకుంటూ తడబడ్డారు. ఇంకేముంది వార్తను చూడనివాళ్ళు కూడా ఆ ఛానల్‌ను ఎగబడి చూశారు. దానితో ఆ ఛానల్ వాళ్ళు దానినే వాళ్ళ సంప్రదాయంగా పెట్టుకుని తమ ఛానల్‌ని లాభాలపాట పట్టిస్తున్నారు. ఎప్పుడైనా రోడ్డులో ఏదైనా మూల ఓ గొడవ జరిగితే ఆగి చూసే కుతూహలం వున్న మన సమాజం దాన్ని ఆపే ప్రయత్నం ఏ మాత్రం చేయదు సరికదా ఇంకా ఏం జరుగుతుందో అని వేచి చూసే మనస్తత్వం మన ప్రస్తుత సమాజంది. సరిగ్గా దీన్నే మంత్రంగా మలచుకొని బిగ్ బాస్ కార్యక్రమం రూపకల్పన జరిగిందని చెప్పవచ్చు. అందుకే బిగ్ బాస్ హౌస్ లో ఎంత రచ్చ జరిగితే అంత వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దానికి నిదర్శనమే ఈ వారం బిగ్ బాస్ సెల్ఫ్ ఎలిమినేషన్. మణికంఠ అనే కంటెస్టెంట్ వీక్షకుల దృష్టిలో ఇంకా హౌస్ లోనే వుండాలి అనే ఓటేస్తే, నాకు ఈ హౌస్ వద్దు, టార్చర్ అంతకన్నా వద్దు అని తానే సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. అర కొర బట్టలతో, అసభ్య పద దూషణలతో ప్రతిరోజు చూసే ప్రేక్షకుడికి కనువిందు చేస్తూ లోపల వున్న కంటెస్టెంట్స్ తమలో తాము మధనపడుతూ ఈ కార్యక్రమంలో కొనసాగుతున్నారంటే వారికి నిజంగా హాట్సాఫ్. అలా అని బిగ్ బాస్ కార్యక్రమం మొత్తమ్మీద చెడు అనట్లేదు, మన పండుగల్లో భాగంగా మన సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ కంటెస్టెంట్స్ తో పండుగ ఆచారాలను ప్రేక్షకులకు తెలియజేసేలా చేస్తున్నారు. మున్ముందు ఇంకెన్ని సంచలనాలకు తెర తీయనిందో ఈ బిగ్ బాస్ విపరీత వినోద వ్యాపారం వేచి చూడాలి. ఏదేమైనా చెడు గ్రహించినంతగా మంచిని చూడలేని ఈ సమాజానికి ఇంతటి భావావేశాలు అవసరమా బిగ్ బాస్ ఆలోచించు. - ఇంటూరు హరికృష్ణ -
పాపం గౌతమ్.. వెళ్లిపోయేముందు వాళ్లను ముంచేసిన మణికంఠ
బిగ్‌బాస్ అనేది గోల్డెన్ ఛాన్స్. ప్రేక్షకులకు దగ్గరచేసే సాధనం, ఫ్రీ పబ్లిసిటీ! అలాంటిది.. ప్రేక్షకులు తనను సేవ్ చేసినా కాదనుకుని వెళ్లిపోయాడు. షో గెలుస్తానన్న అతడు ఏడువారాలకే తన వల్ల కావట్లేదని చేతులెత్తేశాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 20) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..రెండు జంటల డ్యాన్స్ హైలైట్బిగ్బాస్ హౌస్‌లో అందరూ సమానమే.. లింగబేధం, కమ్యూనిటీ బేధాలుండవని నాగార్జున హౌస్‌మేట్స్‌కు నొక్కి చెప్పాడు. దీంతో కమ్యూనిటీ గురించి మాట్లాడిన నబీల్, మెహబూబ్ ముఖం వాడిపోయింది. తర్వాత నాగ్.. యష్మిని సేవ్ చేసి హౌస్‌మేట్స్‌తో చిత్రం భళారే విచిత్రం గేమ్ ఆడించాడు. ఇందులో అబ్బాయిల టీమ్ విజయం సాధించింది. ఈ గేమ్‌లో విష్ణు-పృథ్వీ, యష్మి- గౌతమ్ జంటల డ్యాన్సులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. తర్వాత నాగ్ నిఖిల్‌ను సేవ్ చేశాడు.డైలాగ్ డెడికేషన్హౌస్మేట్స్పై సోషల్ మీడియాలో వైరలవుతున్న కొన్ని మీమ్స్ చూపించడంతో అందరూ పగలబడి నవ్వారు. నబీల్ను సేవ్ చేసిన అనంతరం డైలాగ్ డెడికేషన్ అని మరో గేమ్ ఆడించారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా కొన్ని డైలాగులను హౌస్‌మేట్స్‌కు అంకితమివ్వాలన్నాడు. అలా మొదటగా నిఖిల్.. నువ్వు ఊరుకోమ్మా.. ఊరికే తుత్తుత్తు అంటావ్.. అన్న డైలాగ్ బోర్డును ప్రేరణ మెడలో వేశాడు. హరితేజ.. వీడిని ఎవడికైనా చూపించండ్రా.. అలా వదిలేయకండ్రా డైలాగ్ నాగమణికంఠకు అంకితమచ్చింది. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారుతేజ.. అదంతా అప్పుడండి.. ఇప్పుడు నేను మారిపోయాను డైలాగ్ అవినాష్‌కు సూట్ అవుతుందన్నాడు. విష్ణుప్రియ.. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారు డైలాగ్ గంవ్వకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందంది. తు సమ్జా.. నై సమ్జా డైలాగ్ పృథ్వీకి సరిపోతుందన్నాడు మెహబూబ్. ఇక నయని.. నవ్వాపుకుంటున్నావ్ కదరా డైలాగ్ బోర్డును విష్ణు మెడలో వేసింది. అన్న రూల్స్ పెడ్తాడు కానీ ఫాలో అవడు డైలాగ్ నిఖిల్‌కు సెట్ అవుతుందన్నాడు గౌతమ్. సరె సర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ అవుతాయా ఏంటి? అన్న డైలాగ్‌ను విష్ణు మెడలో వేసింది రోహిణి. బేసిక్ సెన్స్ ఉండదునాకు అర్థం కాలేదు సార్ డైలాగ్ పృథ్వీకి సెట్ అవుతుందన్నాడు మణి. నువ్వు అంత హార్ష్‌గా మాట్లాడకు, ఫీల్ అవుతాను డైలాగ్ తేజకు డెడికేట్ చేసింది యష్మి. నబీల్ వంతు రాగా.. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం డైలాగ్‌ను గౌతమ్‌కు అంకితమిచ్చాడు. గంగవ్వ.. బేసిక్ సెన్స్ ఉండదు, అంటే ఏమో హర్ట్ అయిపోతారు అన్న డైలాగ్ నయనికి డెడికేట్ చేసింది. ఓవరాక్షన్ చేస్తున్నావేంట్రా, ఓవరాక్షన్ అన్న బోర్డును అవినాష్.. పృథ్వీకి ఇచ్చాడు. నాకు ఇంట్రస్ట్ పోయింది సర్ అన్న డైలాగ్‌ను మణికి డెడికేట్ చేసింది ప్రేరణ. మండుతున్నట్లుంది డైలాగ్‌ను మెహబూబ్‌కు అంకితమిచ్చాడు పృథ్వీ. మణికంఠ ఎలిమినేట్తర్వాత నాగ్.. పృథ్వీని సేవ్ చేశాడు. చివర్లో గౌతమ్, మణికంఠ మిగిలారు. ఈ క్రమంలో మణి తనవల్ల కావట్లేదు, వెళ్లిపోతానన్న వీడియను హౌస్‌మేట్స్‌కు ప్లే చేసి చూపించాడు నాగ్. అతడు ఉండాలా? వద్దా? అని హౌస్‌మేట్స్‌ను అడగ్గా మెజారిటీసభ్యులు మణి వెళ్లడమే బెటర్ అన్నారు. చివరిసారి మణికంఠను అడిగి చూశాడు నాగ్. అప్పటికీ అతడు వెళ్లిపోయేందుకే మొగ్గుచూపాడు. దీంతో మణికంఠ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. అయితే మణికంఠ కంటే గౌతమ్‌కు తక్కువ ఓట్లు పడ్డాయన్నాడు. నిజానికి ఎలిమినేట్ కావాల్సింది గౌతమ్ అని చెప్పాడు. ఎక్కడ తప్పు జరుగుతోందని గౌతమ్ ఆలోచనలో పడిపోయాడు. ఆ ఐదుగురినీ బోటు ఎక్కించాడుఅటు మణికంఠ.. జైలు నుంచి విడుదలవుతున్న ఖైదీలా నవ్వుతూ వెళ్లిపోయాడు. పోరాడలేకపోయాను, నా ఓపిక అయిపోయిందంటూ హౌస్మేట్స్ దగ్గర సెలవు తీసుకున్నాడు. స్టేజీపైకి వచ్చిన మణికంఠతో నాగ్ ఓ గేమ్ ఆడించారు. అందులో భాగంగా మణి.. నయని, విష్ణుప్రియ, నబీల్, హరితేజ, మెహబూబ్ ఫోటోలను బోటు ఎక్కించాడు. మెహబూబ్‌కు విన్నర్‌కు కావాల్సిన లక్షణాలున్నాయన్నాడు. అనంతరం ఆటలో ఒకప్పుడు ఉన్నంత ఊపు ఇప్పుడు లేదు, ఫినాలే వరకు వస్తావని ఆశిస్తున్నానంటూ నిఖిల్ ఫోటోను నీటిలో ముంచేశాడు. మునిగిపోతావ్, జాగ్రత్త..తేజ ఎనర్జీ చూపించకపోతే ముగిపోతాడన్నాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఆడితే బెటర్ అంటూ పృథ్వీని ముంచాడు. అవసరమైనప్పుడే నోరు విప్పు.. వచ్చిన మొదటివారమే చీఫ్ అయ్యావ్.. ఆ ఒత్తిడిని హ్యాండిల్ చేయకపోతే ఆటలో మునిగిపోతావని గౌతమ్‌ను హెచ్చరించాడు. అనవసరమైన చోట నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం వల్ల నీ ఆటకే ఎసరు పడుతుందని ప్రేరణ ఫోటోను ముంచాడు. చివర్లో ప్రేక్షకుల ఓట్లను కాదని వెళ్లిపోయినందుకు తనను క్షమించమని వేడుకున్నాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బుల్లితెర అవార్డుల పండుగ.. ఛీఫ్ గెస్ట్ ఎవరంటే?
స్టార్ మా పరివార్ అవార్డ్స్ వేడుక బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం నుంచి స్టార్ మాలో ప్రసారం కానుంది. టాలీవుడ్ టీవీ ఇండస్ట్రీలో స్టార్ మా సీరియల్స్‌కు ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా అందించే స్టార్ మా పరివార్ అవార్డ్స్ కార్యక్రమం ఇవాళ బుల్లితెరపై ప్రేక్షకులను అలరించనుంది.ఈ గ్రాండ్ అవార్డ్స్ వేడుకలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతేకాకుండా ఈవెంట్లో పలువురు స్టార్ హీరోలు, ప్రముఖులు పాల్గొన్నారు. అక్కినేని నాగేశ్వరావు శతజయంతి పురస్కరించుకొని టీవీ నటులు, అక్కినేనిని గుర్తు చేస్తూ చేసిన మెడ్లీ ఈ కార్యక్రమంలో హైలైట్‌గా నిలువనుంది. ఈ వేడుకలో బుల్లితెర నటీనటుల సందడి స్టార్ మా పరివార్ అవార్డ్స్‌లో చూసేయండి. -
మణిని అలా వదిలేయకండ్రా.. ఎవరికైనా చూపించండ్రా!
ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో ఎలిమినేషన్ కాస్త వింతగా జరగనుంది. పృథ్వీ స్థానంలో మణికంఠ ఎలిమినేట్ కానున్నాడు. తను ఫిట్‌గా ఉన్నాడని వైద్యులు సర్టిఫికెట్ ఇచ్చినా సరే చేతనైతలేదంటూ పంపించేయమని వేడుకున్నాడు. అతడు అంతలా అడిగితే కాదనలేక గేట్లు ఎత్తి మరీ బయటకు తీసుకొచ్చేశారని సమాచారం.డైలాగ్ డెడికేషన్..ఇక ఈ ఎలిమినేషన్ కంటే ముందు ఫన్ టాస్కులు జరిగాయి. అందులో ఒకటే డైలాగ్ డెడికేషన్. ఈ క్రమంలో నిఖిల్.. నువ్వు ఊరుకోమ్మా.. అన్నింటికీ తుత్తుత్తు అంటావ్.. అన్న డైలాగ్‌ను ప్రేరణకు అంకితం చేశాడు. వాడినలా వదిలేయకండ్రా.. ఎవరికైనా చూపించండ్రా.. అన్న డైలాగ్‌ను హరితేజ మణికి అంకితమిచ్చింది. డైలాగ్ పర్ఫెక్ట్గా సెట్ అయిందని అందరూ చప్పట్లు కొట్టారు.మస్తు షేడ్స్ ఉన్నయ్..అవును మరి మణి వాలకం అలా ఉంది.. భార్యాబిడ్డలు తిరిగి తన దగ్గరకు రావాలంటే ఈ షో గెలవాలి, ఈ బిగ్‌బాస్ తనకు చాలా ముఖ్యం అంటూ ఎన్నోసార్లు ఏడ్చాడు. కట్ చేస్తే ఈ వారం శరీరం సహకరించడం లేదంటూ, మైండ్ కూడా పని చేయట్లేదంటూ ఇంటికెళ్లిపోతానన్నాడు. తనకు ఓట్లు వేయొద్దని ప్రేక్షకులను వేడుకున్నాడు. ఇదే వారం తాను సేవ్ అయితే అరతులం బంగారం ఇస్తానని గంగవ్వకు మాటిచ్చాడు. అంతలోనే ఇన్ని షేడ్స్ చూపించాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: పులిహోర పార్టిసిపెంట్స్ ఉప్పు సత్యాగ్రహం
బిగ్ బాస్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నాడు. తన ప్రేక్షకులను తిమ్మెని బమ్మిని అయినా చేసి ఆకట్టుకునే తీవ్ర ప్రయత్నంలో ఉన్నాడు. ఇందులో భాగంగా హౌస్‌లోకి కొంతమందిని కొత్తవారిని తీసేసి పాతవారిని తీసుకువచ్చి కలగాపులగం చేశాడు. ఇంకా చెప్పాలంటే... ఓ పులిహోర లాంటి పార్టిసిపెంట్స్ ఇప్పుడు హౌస్‌లో ఉన్నారు. కొత్తవాళ్లు ఎంతలా ఆడినా, నామినేషన్స్ ప్రక్రియ నుండి టాస్క్‌లు కాని, ఎలిమినేషన్ కాని అంతా రాయల్ క్లాన్స్దే పైచేయిగా ఉంది. గమనిక... ఇక్కడ పాతవాళ్లుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గ్రూప్‌కు రాయల్ క్లాన్స్ అనే పేరు పెట్టాడు బిగ్ బాస్. హౌస్‌లో కన్నడ పార్టిసిపెంట్స్, తెలుగు పార్టిసిపెంట్స్ మధ్య పోటీ అనిపిస్తుంది కాని హౌస్ మొత్తం ఒకే పార్టిసిపెంట్స్ అని అనిపించట్లేదు. బిగ్ బాస్ ఫాలో అవుతున్న సదరు ప్రేక్షకుడికి ఇట్టే అర్థమవుతుంది గేమ్ అంతా ఏకపక్షమైందని. ఇక ఈ వారం టాస్క్‌ల పరంగా ఉప్పు గురించి ఓ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. కాకపోతే అది చాలా సిల్లీగా అనిపించింది. దసరా పండగ స్పెషల్‌గా వారాంతం ఎపిసోడ్ కొన్ని మెరుపులతో కొన్ని పాత ఆటలతో మమ అనిపించాడు బిగ్ బాస్. బిగ్ బాస్ అన్ని సిరీస్‌లు ఫాలో అవుతున్నవారికి తెలుస్తుంది... బిగ్ బాస్ టాస్కులన్నీ పాత టాస్కులే అని. ఇక్కడ టాస్కులు పాతవైతే ఫర్వాలేదు ఆ పాత టాస్కులు ఆడేవారు కూడా పాతవారే. ఓ సారి ఆట ఆడినవారు మరోసారి జాగ్రత్తగా ఆడతారు కదా. అప్పుడు కొత్తవాళ్ళెప్పుడూ పాతవాళ్ల మీద గెలుస్తారు కదా. ఇంత చిన్న లాజిక్ బిగ్ బాస్ ఎందుకు గమనించలేదో ఏమో. కాని ఒక్క విషయంలో మాత్రం బిగ్ బాస్‌ను మెచ్చుకోవాలి. ఈ కాన్సెప్ట్ పరదేశానిదైనా మన దేశంలో చేస్తున్నప్పుడు మన సంస్కృతికి పెద్ద పీట వేసి మన పండగ శోభలను కార్యక్రమంలో పొందుపరచడం నిజంగా అభినందనీయం. ముఖ్యంగా వారాంతంలో ప్రసారమయిన ఎపిసోడ్లో ప్రముఖ గాయని మంగ్లీ హౌస్‌లోని పార్టిసిపెంట్స్ చేత బతుకమ్మ ఆడించడం ఆకర్షణగా నిలిచింది. ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ ఈ సీజన్లో ముందు ముందు ఇంకెన్ని కష్టాలు పడి ప్రేక్షకుల కోసం ఇంకెంత పులిహోర కలుపుతాడో చూడాలి మరి. -
చేతనైతలే.. వెళ్లిపోతా, ఓట్లు వేయకండి: ఏడ్చేసిన మణికంఠ
హౌస్మేట్స్ ఒకరి గురించి మరొకరు ఏమనుకుంటున్నారో తెలియజేసేందుకు నాగార్జున ఓ టాస్క్ పెట్టాడు. మరోవైపు హౌస్‌లో గౌతమ్ కృష్ణ.. యష్మి అంటే తనకు క్రష్ అంటున్నాడు. అటు బిగ్‌బాస్ కప్పు గెలుస్తానన్న మణి.. ఇంటికి వెళ్లిపోతానని ఏడ్చాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (అక్టోబర్ 19) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..వెళ్లిపోతా..ఈ గొడవలు, కొట్లాటలు నావల్ల కావడం లేదు, వెళ్లిపోతానంటూ కెమెరాల ముందు మొరపెట్టుకున్నాడు నాగమణికంఠ. దయచేసి ఓట్లు వేయొద్దని ప్రేక్షకులను వేడుకున్నాడు. ఫ్యామిలీ వీక్ వరకు ఉందామనుకున్నా.. కానీ నా వల్ల కావట్లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.యష్మిపై గౌతమ్ క్రష్అటు గౌతమ్.. 'నేను సింగిల్, నీపై నాకు క్రష్ ఉంది.. ప్రస్తుతానికైతే ఫ్రెండ్స్‌లా ఉందాం. మన మధ్య బాండింగ్ ఎటువైపు వెళ్తుందో చూద్దాం.. అందరిలో నువ్వు నాకు స్పెషల్' అని యష్మితో మాటలు కదిపాడు. తర్వాత నాగార్జున బీబీటైమ్స్ హెడ్‌లైన్స్ అని ఓ గేమ్ ఆడించాడు. అందులో భాగంగా కంటెస్టెంట్లకు సరిపోయే హెడ్‌లైన్స్‌ను బోర్డ్‌పై పెడతాడు. అది నిజంగా ఎంతమేరకు సూట్ అవుతుందన్నది హౌస్మేట్స్ చెప్పాలి. నిన్న హీరో- ఈరోజు జీరోఅలా మొదటగా కండబలం ఎక్కువ- బుద్ధిబలం తక్కువ అన్న హెడ్డింగ్ గౌతమ్‌కు సరిగ్గా సరిపోతుందన్నారు. ఈ క్రమంలో నిఖిల్, గౌతమ్ కొట్లాడుకున్న వీడియో చూపించిన నాగ్.. కసిగా ఆడండి కానీ ఉన్మాదంగా ఆడొద్దని హెచ్చరించాడు. నిఖిల్‌కు నిన్న హీరో- ఈరోజు జీరో అన్న ట్యాగ్ కరెక్ట్‌గా సరిపోతుందన్నాడు. హరితేజ.. ఒకప్పుడు ఫైర్- ఇప్పుడు ఫ్లవర్‌లా మారిపోయిందన్నారు.ఆట కంటే నాకు నేనే ముఖ్యంపృథ్వీకి.. 'కింగ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్- వాంట్స్ రెస్పెక్ట్ (అగౌరవపరుస్తాడు కానీ తనను గౌరవించాలనుకుంటాడు)', 'ఆట కంటే నాకు నేనే ముఖ్యం' అన్న రెండు ట్యాగులు సరిగ్గా సూటవుతాయన్నారు. గడ్డం, మీసం తీసుకోవడానికి ఎందుకు వెనకడుగు వేశావని నాగ్ ఆరా తీశాడు. పోనీ రూ.5 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ చేస్తా, గడ్డం తీసుకుంటావా? అన్నాడు. పృథ్వీ ఒప్పుకోకపోవడంతో దాన్ని రూ.8 లక్షలకు పెంచాడు. అయినా అడ్డంగా తలూపడంతో నామినేషన్స్‌తో పని లేకుండా నేరుగా పదో వారంలోకి అడుగుపెట్టేందుకు ఛాన్స్ ఇస్తానన్నాడు. అయినా పృథ్వీ అంగీకరించలేదు.అశ్వత్థామ 3.0ఇక నామినేషన్స్‌లో పృథ్వీ- ప్రేరణపై రివేంజ్ నామినేషన్ చేయడాన్ని నాగ్ సమర్థించడం విశేషం. అనంతరం అవినాష్‌కు పైకి నవ్విస్తా- వెనక ప్లాన్ వేస్తా అన్న హెడ్డింగ్ సరిగ్గా సరిపోతుందన్నారు. ఆ వెంటనే భార్య అనూజ వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పిన ఆడియో ప్లే చేయగా అవినాష్ ఎమోషనలయ్యాడు. ఇక గౌతమ్ అశ్వత్థామ 3.0 అని చెప్తూ నాగ్ అతడిని మెచ్చుకున్నాడు. ముందు ఒక ఆట-వెనక ఒక ఆట హెడ్డింగ్ యష్మికి కాస్త సూట్ అవుతుందన్నారు. ఆటలో వీక్- డ్రామాలో పీక్తర్వాత నాగ్.. ప్రేరణ, తేజను నాగ్ సేవ్ చేశాడు. 'ఆటలో వీక్- డ్రామాలో పీక్' హెడ్డింగ్ మణికంఠకు సెట్ అవుతుందని హౌస్మేట్స్ అన్నారు. ఈ సందర్భంగా మణి.. కూర్చుంటే లేవలేకపోతున్నా.. నా శరీరం నా కంట్రోల్లో లేదు, ఇంకా ఆడాలని ఉంది.. కానీ ఇలాగే ఉంటే నా శరీరం, మెదడు సహకరించదు. నేను వెళ్లిపోతాను సర్. నాకు నేనే వీక్ అయిపోయాను అని తన గోడు వెల్లబోసుకున్నాడు. అయితే ప్రేక్షకుల ఓటింగ్ ఎలా ఉందో చూద్దామని నాగ్ అతడిని కూర్చోబెట్టాడు.మత్తు వదలరా..తేజకు హౌస్ అంతా కలిసి మత్తు వదలరా ట్యాగ్ ఇచ్చేసింది. ప్రేరణకు.. గుంపులో గుర్తింపు కోరుకోవద్దని చెప్పారు. నయని పావనికి క్రై బేబీ అన్న ట్యాగ్ ఇచ్చారు. మెహబూబ్.. ఈ సీజన్‌కు ఫ్లాప్ చీఫ్ అని నిర్ణయించారు. కత్తిలాంటి నా నాలుక.. కాదు మీకు తేలిక శీర్షిక గంగవ్వకు పర్ఫెక్ట్గా సెట్ అయిందన్నారు. ఈ సందర్భంగా గంగవ్వ.. తనను ఎవరూ నామినేట్ చేయొద్దని మీరైనా చెప్పండని నాగార్జునను వేడుకుంది.మాటలో పులి- ఆటలో పిల్లిఇక రోహిణికి.. మనసులే కాదు ఆట కూడా గెలవాలన్నారు. విష్ణుప్రియకు 'రివేంజ్ నా సరికొత్త ఆట', 'వీకెండ్లో ఆట, మిగతా రోజులు టాటా' అన్న రెండు హెడ్‌లైన్స్ కరెక్ట్‌గా సరిపోయాయన్నారు. నబీల్.. 'మాటలో పులి- ఆటలో పిల్లి' అన్నారు. అలా ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీకి బంపరాఫర్.. నేరుగా పదో వారంలోకి అడుగుపెట్టే ఛాన్స్!
కొన్ని టాస్కులు, ఛాలెంజ్‌లు ప్రతి సీజన్లోనూ కొనసాగుతూ ఉంటాయి. అలాంటిదే హెయిర్ కట్ చాలెంజ్. పొడవాటి హెయిర్‌ను చిన్నగా చేస్తామంటారు.. గడ్డం, మీసం తేసేయాలంటారు. అందుకు ఒప్పుకుంటే ఏదో ఒక బెనిఫిట్ ఇస్తామంటారు.ఛాలెంజ్ తిరస్కరించిన పృథ్వీఈ సీజన్లో అవినాష్, పృథ్వీలకు ఇలాంటి ఛాలెంజ్ ఎదురైంది. హెయిర్ కట్‌తో పాటు గడ్డం తీసేయాలన్నారు. ఇందుకుగానూ ప్రైజ్‌మనీలో రూ.50 వేలు యాడ్ చేస్తామని ఆఫర్ ఇచ్చారు. ఎంత డబ్బిచ్చినా సరే, తనను బయటకు పంపించినా సరే గడ్డం తీసేదే లేదని పృథ్వీ నో చెప్పాడు. తాజాగా రిలీజైన ప్రోమోలో పృథ్వీని దీని గురించే అడిగాడు నాగ్.నాగ్ బంపరాఫర్పృథ్వీ గడ్డం తీసేస్తే ఏకంగా రూ.5 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ చేస్తానని ఆఫర్ ఇచ్చాడు. అందుకు పృథ్వీ ఒప్పుకోలేదు. దీంతో మూడువారాలపాటు నామినేషన్స్‌లో లేకుండా ఇమ్యూనిటీ ఇస్తానన్నాడు. దానివల్ల నేరుగా 10వ వారంలోకి అడుగుపెట్టొచ్చన్నాడు. ఇంత మంచి బంపర్ ఆఫర్ ఇచ్చినా సరే పృథ్వీ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.బుద్ధి ఏమైపోయింది?ఇకపోతే నిఖిల్, గౌతమ్.. ఆటలో హద్దులు మీరి కొట్టుకున్నట్లుగా ఉందని వీడియో వేసి మరీ క్లాస్ పీకాడు. ఇక్కడ మీ బుద్ధి ఏమైందని ప్రశ్నించడంతో ఇద్దరూ సైలెంట్ అయ్యారు. మరి నాగ్ చేతిలో ఎవరికి ఎక్కువ అక్షింతలు పడ్డాయో తెలియాలంటే మరికాసేపట్లో ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తిరుపతి నేపథ్యంలో...
వాట్ నెక్ట్స్? అఖిల్ అక్కినేని చేయనున్న కొత్త చిత్రం గురించిన చర్చ ఇది. వార్తల్లో ఉన్న ప్రకారం అఖిల్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న సినిమా అని, ఈ చిత్రాన్ని అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నారని ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఇక మరో చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుందని భోగట్టా. కిరణ్ అబ్బవరం హీరోగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రాన్ని తెరకెక్కించిన మురళీ కిషోర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం.మురళి చెప్పిన కథ నాగార్జునకు నచ్చడంతో హోమ్ బేనర్లో నిర్మించాలని నిర్ణయించుకున్నారట. తిరుపతి నేపథ్యంలో పీరియాడిక్ మూవీగా రూపొందనుందని టాక్. ఈ చిత్రానికి ‘లెనిన్’ టైటిల్ అనుకుంటున్నారని భోగట్టా. అలాగే యూవీ క్రియేషన్స్‌లో నటించనున్న చిత్రానికి ‘ధీర’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఇది కూడా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ అట. ఇక అఖిల్ అయితే ఈ మధ్య మేకోవర్ అయ్యారు. ఈ మేకోవర్ ఏ సినిమా కోసం అనేది తెలియాల్సి ఉంది. -
బిగ్ బాస్ 6th వీక్ విశ్లేషణ...'పులిహార పార్టిసిపెంట్స్ ఉప్పు సత్యాగ్రహం'
బిగ్ బాస్ చాలా కన్ఫ్యూజన్లో వున్నట్టున్నాడు. తన ప్రేక్షకులను తమ్మిని బమ్మి అయినా చేసి ఆకట్టుకునే తీవ్ర ప్రయత్నంలో వున్నాడు. ఇందులో భాగంగా హౌస్ లోకి కొంతమందిని కొత్తవారిని తీసేసి పాతవారిని తీసుకువచ్చి కలగాపులగం చేసాడు. ఇంకా చెప్పాలంటే ఓ పులిహార లాంటి పార్ట్సిపెంట్స్ ఇప్పుడు హౌస్‌లో వున్నారు. కొత్త వాళ్ళు ఎంతలా ఆడినా, నామినేషన్స్ ప్రక్రియ నుండి టాస్క్ లుగాని, ఎలిమినేషన్ కాని అంతా రాయల్ క్లాన్స్ దే పైచేయిగా వుంది. గమనిక ఇక్కడ పాత వాళ్ళగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గ్రూప్‌కు రాయల్ క్లాన్స్ అనే పేరు పెట్టాడు బిగ్ బాస్. హౌస్‌లో కన్నడ పార్టిసిపెంట్స్, తెలుగు పార్టిసిపెట్స్ మధ్య పోటీ అనిపిస్తుంది కాని హౌస్ మొత్తం ఒకే పార్టిసిపెంట్స్ అని అనిపించట్లేదు. బిగ్ బాస్ ఫాలో అవుతున్న సదరు ప్రేక్షకుడికి ఇట్టే అర్ధమవుతుంది గేమ్ అంతా ఏకపక్షమయిందని. ఇక ఈ వారం టాస్క్‌ల పరంగా ఉప్పు గురించి ఓ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. కాకపోతే అది చాలా సిల్లీగా అనిపించింది. దసరా పండుగ స్పెషల్‌గా వారాంతం ఎపిసోడ్ కొన్ని మెరుపులతో కొన్ని పాత ఆటలతో మమ అనిపించాడు బిగ్ బాస్. బిగ్ బాస్ అన్ని సీరిస్‌లు ఫాలో అవుతున్నవారికి తెలుస్తుంది. బిగ్ బాస్ టాస్క్‌లు అన్నీ పాత టాస్కులే అని. ఇక్కడ టాస్కులు పాతవైతే ఫరవాలేదు ఈ సీరిస్ లు ఆ పాత టాస్కులు ఆడే వారు కూడా పాతవారే. ఓ సారి ఆట ఆడినవాడు మరోసారి జాగ్రత్తగా ఆడతారు కదా. అప్పుడు కొత్తవాళ్ళెప్పుడూ పాత వాళ్ళ మీద గెలుస్తారు కదా. ఇంత చిన్న లాజిక్ బిగ్ బాస్ ఎందుకు గమనించలేదో ఏమో. కాని ఒక్క విషయంలో మాత్రం బిగ్ బాస్‌ను మెచ్చుకోవాలి. ఈ కాన్సెప్ట్ పరదేశానిదైనా మన దేశంలో చేస్తున్నపుడు మన సంస్కృతికి పెద్ద పీట వేసి మన పండుగ శోభలను కార్యక్రమంలో పొందుపరచడం నిజంగా అభినందనీయం. ముఖ్యంగా వారాంతంలో ప్రసారమయిన ఎపిసోడ్ లో ప్రముఖ గాయని మంగ్లీ హౌస్ లోని పార్టిసిపెంట్స్ చేత బతుకమ్మ ఆడించడం ఆకర్షణగా నిలిచింది. ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ ఈ సీజన్లో ముందు ముందు ఇంకెన్ని కష్టాలు పడి ప్రేక్షకుల కోసం ఇంకెంత పులిహార కలుపుతాడో చూడాలి మరి. - ఇంటూరు హరికృష్ణ -
దసరా సంబరాల్లో పాల్గొన్న చిరంజీవి, నాగార్జున (ఫొటోలు)
-
సీత ఎలిమినేట్.. 'అతడు గెలిస్తే చూడాలనుంది'
దసరా సందర్భంగా బిగ్‌బాస్ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. హీరోయిన్ల డ్యాన్స్, గెస్టుల రాక, టీమ్స్ మధ్య పోటీతో నేటి ఎపిసోడ్ వినోదాత్మకంగా సాగింది. పండగ సందర్భంగా నాగ్ పంచెకట్టుకుని సాంప్రదాయంగా ముస్తాబయ్యాడు. అటు హౌస్మేట్స్ కూడా అంతే కలర్ ఫుల్‌గా రెడీ అయ్యారు. మరి ఈ దసరా ఎపిసోడ్ ఎలా సాగిందో లైవ్ అప్డేట్స్లో చూసేయండి..అన్లిమిటెడ్ ఫుడ్ కావాలి!నాగార్జున మొదటగా యష్మిని సేవ్ చేశాడు. ఆ వెంటనే ఓ గుడ్‌న్యూస్ చెప్పాడు. ఇన్ఫినిటీ రూమ్‌కు వెళ్లి బిగ్‌బాస్‌ను ఏదైనా కోరిక కోరవచ్చని ఆఫర్ ఇచ్చాడు. కానీ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఓజీ టీమ్‌లో ఒకరికే ఈ ఛాన్స్ ఉంటుందన్నాడు. ఈ బంపర్ ఆఫర్ ఎవరికివ్వాలని అడిగినప్పుడు రాయల్ టీమ్‌లోని మెజారిటీ సభ్యులు నబీల్ పేరు సూచించారు. దీంతో అతడు ఇన్ఫినిటీ రూమ్‌కు వెళ్లి.. ప్రతివారం మార్కెట్‌కు వెళ్లే బాధ లేకుండా అన్లిమిటెడ్ ఫుడ్ కావాలన్నాడు. దీనికి బిగ్‌బాస్ ఏ నిర్ణయం తీసుకుంటాడు? ఎలాంటి కండీషన్స్ పెడతాడనేది సస్పెన్స్‌లోనే ఉంచారుఫస్ట్ టాస్క్‌లో ఓజీ టీమ్ గెలుపుతర్వాత లడ్డు తయారుచేసి మరీ స్పూన్‌తో తినిపించాలంటూ మొదటగా ఫన్ టాస్క్ ఇవ్వగా ఇందులో ఓజీ టీమ్ గెలిచింది. అనంతరం అమృత అయ్యర్ దాండియా పాటతో స్టేజీ దద్దరిల్లేలా చేసింది. ఇక నాగ్.. విష్ణుప్రియను సేవ్ చేశాడు. పకడో.. పకడో అనే రెండో గేమ్‌లో రాయల్ టీమ గెలుపొందింది. బతుకమ్మసింగర్ మంగ్లీ మాస్, లవ్, భక్తి పాటలు పాడుతూ అదరగొట్టేసింది. హౌస్‌లోకి వెళ్లి రెండు టీమ్స్‌తో బతుకమ్మ తయారు చేయించింది. గంగవ్వ అందంగా బతుకమ్మ పేర్చడంతో ఈ మూడో టాస్క్‌లో రాయల్ టీమ్ గెలిచింది. అనంతరం విశ్వం డైరెక్టర్ శ్రీను వైట్ల, హీరో గోపీచంద్ స్టేజీపైకి వచ్చి కాసేపు కబుర్లాడారు. విశ్వం సినిమా ట్రైలర్ కూడా ప్లే చేశారు.ఫరియా డ్యాన్స్దసరా దోస్తీ పేరిట హౌస్‌మేట్స్‌తో నాలుగో గేమ్ ఆడించారు. ఇందులో రాయల్ టీమ్ గెలిచింది. తర్వాత డింపుల్ హయాతి డ్యాన్స్‌తో అలరించగా అటు గంగవ్వ సేవ్ అయినట్లు ప్రకటించారు. మాట-పాట-టాటా అని హౌస్‌మేట్స్‌తో ఐదో గేమ్ ఆడించారు. ఇందులోనూ రాయల్ టీమే గెలిచింది. అనంతరం ఫరియా అబ్దుల్లా ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఓ ఊపు ఊపేసింది.రాయల్ టీమ్‌కు బంపర్ ఆఫర్నాగ్ హౌస్‌మేట్స్‌తో ఆర్మ్ రెజ్లింగ్ అని ఆరో గేమ్ ఆడించారు. ప్రేరణ.. హరితేజను, విష్ణుప్రియ.. రోహిణిని ఓడించింది. మెహబూబ్.. నిఖిల్‌ను, గౌతమ్.. పృథ్వీని ఓడించారు. ఈ గేమ్‌లో ఓజీ టీమ్ గెలిచింది. అయితే మెజారిటీ టాస్కులు గెలుపొందిన రాయల్ టీమ్ ఓవరాల్ విజేతగా నిలిచింది. దీంతో ఈవారం మెగా చీఫ్ అయ్యేందుకు రాయల్ టీమ్‌కు మాత్రమే అవకాశం ఉంటుందన్నాడు. రాయల్ టీమ్‌లోని వారే మెగా చీఫ్ కంటెండర్స్ అవుతారని నాగ్ తెలిపాడు.ముగ్గురికీ హార్ట్ ఇచ్చిన సీతచివర్లో నామినేషన్స్‌లో మిగిలినవారిలో మెహబూబ్‌ను సేవ్ చేసి సీతను ఎలిమినేట్ చేశారు. దీంతో విష్ణు ఎమోషనలైంది. నీకు నీ తల్లిని మర్చిపోయేంత మంచి పార్ట్నర్ దొరకాలని ఆశీస్సులు ఇచ్చింది. ఎలాంటి ముసుగు లేకుండా ఉండే నబీల్ గెలవాలంది. అవినాష్ పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చాడంది. అలా ఈ ముగ్గురికీ వైట్ హార్ట్ ఇచ్చింది.సీత కోసం మాటిచ్చిన మెహబూబ్తర్వాత నిఖిల్, గౌతమ్, నయనికి బ్లాక్ హార్ట్ ఇచ్చింది. నిఖిల్.. హజ్బెండ్ మెటీరియల్ అని చెప్పింది. గౌతమ్.. చిన్నచిన్నవాటికే హర్ట్ అవొద్దని సూచించింది. నయనికి.. వచ్చినప్పుడు నన్ను క్రై బేబీ అన్నావ్.. కానీ నాకన్నా ఎక్కువ ఏడుస్తున్నావ్.. ఈసారి చాలారోజులు ఉండమంటూ బాగా ఆడమని సూచించింది. చివర్లో మెహబూబ్ లేచి.. సీత తన తండ్రికివ్వాలనుకున్న బైక్‌ను తాను గిఫ్ట్‌గా ఇస్తానని మాటిచ్చాడు. మరిన్ని బిగ్‌బాస వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఒకే విమానంలో చిరంజీవి, నాగార్జున.. ఎక్కడికి వెళ్లారంటే..?
టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. ఆదివారం వారిద్దరూ కలిసి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లారు. దీంతో వారు ఎక్కడికి వెళ్తున్నారంటూ నెటిజన్లు ఆరా తీశారు. మెగాస్టార్, కింగ్ నాగార్జున నడుచుకుంటూ వెళ్తున్న వీడియో కూడా ఒకటి నెట్టింట వైరల్ అయింది. వారి అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు కూడా.చిరంజీవి, నాగార్జున ఇద్దరూ కలిసి కేరళలోని త్రిశూర్ వెళ్లారు. కళ్యాణ్ జ్యువెలర్స్ అధినేత T. S. కళ్యాణరామన్ ఆహ్వానం మేరకు వారి ఇంట్లో జరుగుతున్న దసరా సంబరాల్లో పాల్గొన్నారు. త్రిశూర్‌లో దేవి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయని, ఈ క్రమంలో తమ ఇంట్లో కూడా చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తామని కళ్యాణ్ జ్యువెలర్స్ అధినేత ప్రత్యేక ఆహ్వానం పంపడంతో వారిద్దరూ వెళ్లారు. T. S. కళ్యాణరామన్ కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర టీజర్ తాజాగానే విడుదలైంది. ఇప్పటి వరకు సుమారు 30 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక నాగార్జున కుబేర, కూలీ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
విలన్ గా మారుతున్న కింగ్ నాగార్జున
-
ముగ్గుర్ని బ్యాగులు సర్దమన్న నాగ్.. వాళ్లు పతనం, వీళ్ల ఎదుగుదల
నాలుగువారాలు చీఫ్‌గా కొనసాగిన నిఖిల్ ఈ వారం గేమ్‌లో కనిపించకుండా పోయాడు. అటు యష్మి హోటల్ టాస్క్‌ను తన భుజాలపై మోసింది. ఈ ఇద్దరిదే కాదు.. అందరి ఆట గురించి నాగ్ విశ్లేషించాడు. మరి ఆయన ఏమేం చెప్పాడో నేటి (అక్టోబర్ 12) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..రైజింగ్ స్టార్స్బిగ్బాస్ హోటల్ టాస్క్‌లో అవినాష్, తేజ దొంగతనంగా గులాబ్ జామ్ తిన్నారు. అందుకని నాగార్జున ఓ గిన్నె నిండా గులాబ్ జామ్స్ పంపించి అవి ఆ ఇద్దరితో మాత్రమే తినిపించాడు. ఇక హౌస్మేట్స్ ఆటను బట్టి వారిని రైజింగ్ స్టార్స్, ఫాలింగ్ స్టార్స్‌గా నాగ్ విభజించాడు. గంగవ్వ, మెహబూబ్, అవినాష్, రోహిణి, నాగమణికంఠ, నయని, యష్మి.. రైజింగ్ స్టార్స్ అని పేర్కొన్నాడు.నాతో గేమ్స్ద్దునువ్వు బచ్చా అన్నందుకు మణికంఠ ఫీలయ్యాడని నాగ్ రోహిణితో అన్నాడు. అయితే మణి మాత్రం.. నేను మరీ అంత ఫీల్ అవలేదన్నాడు. దీంతో నాగ్.. ఇప్పుడు కవరింగ్ చేయకు, నా దగ్గర ఆటలాడొద్దంటూ అతడి నోరు మూయించాడు. నువ్వు గేమ్ సీరియస్‌గా తీసుకోకపోతే నిన్ను ఆడియన్స్ కూడా సీరియస్‌గా తీసుకోరని విష్ణుప్రియకు మరోసారి గుర్తు చేశాడు. మణికంఠలో ఎనర్జీ, ఫన్ మరో లెవల్లో ఉందంటూ ఓ వీడియో చూపించాడు.తేజకు పనిష్మెంట్నబీల్, గౌతమ్, విష్ణుప్రియ, యష్మి, పృథ్వీ, నిఖిల్, సీతలను ఫాలింగ్ స్టార్స్‌గా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ.. నబీల్‌కు ఏదైనా సమస్య ఉంటే నేరుగా అందుకు కారణమైన వ్యక్తితోనే మాట్లాడాలన్నాడు. గతం గురించి ఆలోచించుకుంటే వర్తమానం మిస్ అయిపోతావ్ అని గౌతమ్‌కు సలహా ఇచ్చాడు. తేజ.. నయనిపావనిపై నోరు పారేసుకున్న వీడియోను ప్లే చేసి మరీ క్లాస్ పీకాడు. 10 పుషప్స్ తీయమని పనిష్మెంట్ ఇచ్చాడు. ప్రేరణ వంతు రాగా ఆమె సగం రైజింగ్, సగం ఫాలింగ్ అని తెలిపాడు.అవినాష్ దృష్టిలో అతడు స్ట్రాంగ్ కాదట!ఇంట్లో ఉండేందుకు అర్హత లేని కంటెస్టెంట్ల బ్యాగుని ఎగ్జిట్ గేట్ దగ్గర పెట్టాలన్నాడు నాగ్. అయితే ఎవరి టీమ్‌లో నుంచి వాళ్లు కాకుండా.. అవతలి టీమ్‌లోని వారి పేర్లను మాత్రమే చెప్పాలన్నాడు. మొదటగా తేజ.. ఇంటి పనులు చేయట్లేదంటూ పృథ్వీ బ్యాగును పెట్టాడు. హరితేజ.. నబీల్‌కు క్లారిటీ తక్కువగా ఉందంది. అవినాష్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదంటూ నిఖిల్ బ్యాగు గేటు దగ్గర పెట్టాడు. గంగవ్వ.. మణి పేరును, రోహిణి.. ప్రేరణ, గౌతమ్.. సీత, మెహబూబ్.. పృథ్వీ పేర్లను సూచించారు. నయని.. విష్ణుప్రియలో ఇంప్రూవ్మెంట్ కనిపించలేదని పేర్కొంది.చివర్లో ముగ్గురి బ్యాగులుతర్వాత ఓజీ టీమ్సభ్యుల వంతు వచ్చింది. నాగమణికంఠ.. నా అంచనాలు అందుకోలేకపోయాడంటూ తేజ బ్యాగు ఎగ్జిట్ దగ్గర పెట్టాడు. సీత.. హోటల్ టాస్క్‌లో పెద్దగా పర్ఫామ్ చేయలేదంటూ గౌతమ్ పేరు చెప్పింది. పృథ్వీ, యష్మి.. బాగా ఆడలేదని తేజను, నిఖిల్, నబీల్.. గౌతమ్‌ను, విష్ణుప్రియ, ప్రేరణ.. నయని పేర్లను సూచించారు. చివర్లో ఎక్కువ ఓట్లు పడ్డ పృథ్వీ, తేజ, గౌతమ్ బ్యాగుల్ని సర్దేసి స్టోర్ రూమ్‌లో పెట్టాలన్నాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తయింది. ఇక రేపటి ఎపిసోడ్లో సీత ఎలిమినేట్ కానుంది.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎప్పుడో, ఎవరో ట్రోల్ చేసినదాని గురించి ఇప్పుడెందుకు?: నాగార్జున
బిగ్‌బాస్ హౌస్‌లో ఉండేందుకు అర్హత లేని ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (పాత కంటెస్టెంట్లు) ఎవరో చెప్పండని నాగార్జున హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు. దీంతో తేజ.. పృథ్వీ పేరు, హరితేజ.. నబీల్, గంగవ్వ.. మణికంఠ, రోహిణి.. ప్రేరణ, నయని.. విష్ణుకు ఇంట్లో ఉండేందుకు అర్హత లేదన్నారు.రైజింగ్ స్టార్స్ ఎవరంటే?అలాగే రాయల్ టీమ్‌లో కూడా హౌస్‌లో ఉండేందుకు అర్హత లేనివాళ్ల పేర్లను సూచించమని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నబీల్.. గౌతమ్ పేరు చెప్పాడు. ఇకపోతే మరో ప్రోమోలో నాగ్.. రైజింగ్ స్టార్, ఫాలింగ్ స్టార్ అంటూ ఓ బోర్డు ముందు పెట్టాడు. మెహబూబ్, హరితేజ, మణికంఠ, అవినాష్, గంగవ్వను రైజింగ్ స్టార్లుగా పేర్కొంటూ నబీల్, తేజ, విష్ణుప్రియ, గౌతమ్‌ను ఫాలింగ్ స్టార్స్‌గా అభివర్ణించాడు. ఇప్పుడెందుకు?ఈ సందర్భంగా ఎప్పుడో, ఎవడో ట్రోల్ చేసినదాని గురించి ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావ్.. అశ్వత్థామ 2.0 అనేది నువ్వు పెట్టుకున్నావా? లేదా మేము పెట్టామా? అని గౌతమ్‌ను సూటిగా ప్రశ్నించాడు. అటు తేజ.. నయనిపావనితో ర్యాష్‌గా మాట్లాడిన వీడియో చూపించి మరీ తేజకు క్లాస్ పీకాడు. రోహిణి తనను బచ్చా అనడంతో మణికంఠ ఫీలైన విషయాన్ని కూడా నాగ్ ప్రస్తావించాడు. అమాయకంగా ఫేస్ పెట్టిన మణిరోహిణి.. మణికంఠ నీకు బచ్చాలా కనిపిస్తున్నాడా? అని సెటైరికల్‌గా అడిగాడు. తన శక్తిసామర్థ్యాలను నువ్వు అవమానించావని అనుకున్నాడు అని పేర్కొన్నాడు. అందుకు మణి నోరు తెరుస్తూ.. అమ్మో, అంత పెద్ద మాట అన్లేదు సర్ అని అమాయకంగా అన్నాడు.నాతో గేమ్స్ వద్దుదీంతో నాగ్.. ఫీలయ్యావన్నదే చెప్పాను.. ఇప్పుడు కవరింగ్ వద్దు, నాతో గేమ్స్ ఆడొద్దు అని సీరియస్ అయ్యాడు. ఇక విష్ణును నువ్వు గేమ్ సీరియస్‌గా తీసుకోకపోతే ఆడియన్స్ కూడా నిన్ను సీరియస్‌గా తీసుకోరని తెలిపాడు. నబీల్.. మనుషుల ఎదుట కాకుండా వారి వెనకాల మాట్లాడటం ఏమాత్రం బాగోలేదన్నాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు
సిటీ కోర్టులు: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. సినీ హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ గురువారం నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజి్రస్టేట్, ఎక్సైజ్ కోర్టులో జరిగింది. హీరో నాగచైతన్య, సమంత విడాకుల అంశంపై మంత్రి కొండా సురేఖ అసంబద్ధమైన మాటలు మాట్లాడారని, ఆమె తమ కుటుంబ పరువు తీసేలా మాట్లాడినందుకు ఆమెపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని హీరో నాగార్జున మంత్రిపై పరువునష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే.అయితే గత విచారణలో ఫిర్యాదుదారు నాగార్జునతో పాటు మరో సాక్షి సుప్రియా వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసుకుంది. దీనిపై విచారణ చేపట్టిన స్పెషల్ జ్యుడీíÙయల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, ఎక్సైజ్ కోర్టు జడ్జి ఎస్. శ్రీదేవి మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది. ఆరోజు కొండా సురేఖ కోర్టుకి హాజరైతే ఆమె వాంగ్మూ లాన్ని కోర్టు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఈ కేసు విచారణకు నాగార్జున తరఫున న్యాయ వాది అశోక్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ తరఫున న్యాయవాది, టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ తిరుపతి వర్మ హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం కేసు మంత్రి కొండా సురేఖపై మరో పరువు నష్టం కేసు దాఖలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజి్రస్టేట్, ఎక్సైజ్ కోర్టులో సెక్షన్ 356 కింద పరువునష్టం కేసు దాఖలు చేశారు. మంత్రి పదవిలో ఉండి.. స్థాయిని మరచి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని, తన ప్రతిష్ట దెబ్బతినేలా ఆమె మాట్లాడారని కేటీఆర్ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం దురుద్దేశపూర్వకంగా, అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తనపై అసత్యపు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువునష్టం కేసు దాఖలు చేస్తామని లీగల్ నోటీసు కూడా జారీ చేశామని పేర్కొన్నారు.అయితే లీగల్ నోటీసు గడువు తీరినా ఆమె క్షమాపణ చెప్పలేదని, అందుకే ఆమెపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కేసు దాఖలు చేసినట్టు కేటీఆర్ పేర్కొన్నారు. కొండా సురేఖ గతంలో కూడా అసత్యపు ఆరోపణలు, అడ్డగోలు వ్యాఖ్యలు చేసినప్పుడు భారత ఎన్నికల సంఘం ఆమెకు చీవాట్లు పెట్టిందని, ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయపరమైన వ్యాఖ్యలు మాత్రమే కావని, తన పరువుకు భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా, ప్రణాళికా బద్ధంగా చేసిన కుట్రగా ఉన్నాయని ఆయన తెలిపారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను, వాటి వెనుక ఉన్న నేరపూరిత దురుద్దేశాలను పరిగణనలోకి తీసుకొని ఆమెపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్ సోమవారం జడ్జి ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
రాజకీయ లబ్ధికి మా పరువు తీశారు
సిటీ కోర్టులు: రాజకీయ లబ్ధి కోసమే మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టులో పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలన్నీ అవాస్తవాలేనని.. వాటిలో ఎలాంటి నిజం లేదన్నారు. మంత్రిపై వేసిన క్రమినల్ పరువునష్టం కేసు విచారణలో భాగంగా మంగళవారం నాగార్జున తన సతీమణి అమల, కుమారుడు నాగచైతన్యతో కలిసి నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజి్రస్టేట్ ఎక్సైజ్ కోర్టుకు హాజరయ్యారు. జడ్జి ఎస్.శ్రీదేవి ఎదుట ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. నాలుగు దశాబ్దాలుగా గౌరవప్రదంగా జీవిస్తున్నాఅక్కినేని వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాల గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిసున్నానని నాగార్జున కోర్టుకు తెలిపారు. నటుడిగా, నిర్మాతగా, టీవీ వ్యాఖ్యాతగా, స్టూడియో యజమానిగా తాను, తన కుటుంబం ప్రజల ఆద రాభిమానాలు పొందుతున్నామన్నారు. తన కుమారుడు నాగచైతన్య సైతం సినీ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్నాడ న్నారు. కానీ తన కుమారుడి వైవాహిక జీవితాన్ని ఉద్దేశించి కొండా సురేఖ మాట్లాడిన మాటలు ప్రజలను తప్పుదోవ పట్టించాయని పేర్కొన్నారు.ఇందుకు సంబంధించిన వీడియోలు, పేపర్ క్లిప్పింగ్‌ల వల్ల తమ కుటుంబం పరువు పోయిందని.. తాము ఎంతో కలత చెందామని చెప్పారు. అందుకే మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకుని తమ కుటుంబ పరువు కాపాడాలని కోరారు. నాగార్జునతోపాటు ఆయన తరఫు సాక్షిగా సుప్రియ వాంగ్మూలాన్ని కూడా కోర్టు నమోదు చేసింది. అనంతరం నాగార్జున తరుఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కొండా సురేఖ మాట్లాడిన వీడియోతో కూడిన పెన్‌డ్రైవ్, పేపర్ క్లిప్పింగ్‌లను మెమోతోపాటు కోర్టుకు సమరి్పంచారు. సాక్షుల స్టేట్మెంట్ సమయంలో కొండా çసురేఖ తరుఫు న్యాయవాది, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ, సురేఖ కూడా హాజరయ్యారు. ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. -
నాంపల్లి కోర్టుకు నాగార్జున
-
కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చిన నాగార్జున.. విచారణ వాయిదా
కొన్నిరోజుల క్రితం అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి కాస్త పెద్ద రచ్చకు కారణమయ్యాయి. ఒకరిపై ఒకరు పిటిషన్లు వేసుకునేంత వరకు వెళ్లారు. ఈ క్రమంలోనే తాజాగా పిటిషన్ విషయమై నాంపల్లి కోర్టుకు మంగళవారం హాజరయ్యారు. ఈ క్రమంలోనే న్యాయస్థానానికి నేరుగా తన స్టేట్మెంట్ ఇచ్చారు. సాక్షులుగా యార్లగడ్డ సుప్రియ, అట్ల వెంకటేశ్వర్లు హాజరయ్యారు. నాగచైతన్య, అమల, సుశీల కూడా కోర్టుకు వచ్చారు.(ఇదీ చదవండి: త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ముందా? నిర్మాతపై పూనమ్ కౌర్ ఫైర్)నాగ్ ఏం చెప్పారంటే?ఈ పిటిషన్ ఎందుకోసం ఫైల్ చేసారని కోర్ట్ ప్రశ్నించగా.. మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాద పూర్వక వాఖ్యలు చేశారని, తద్వారా మా కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని చెప్పారు. సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని, దేశవ్యాప్తంగా మా కుటుంబం పట్ల ప్రజల ఆధారాభిమానాలు ఉన్నాయని, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని నాగార్జున అన్నారు.సినిమా రంగం తో పాటు సామజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నామని చెప్పిన నాగార్జున.. మాజీ మంత్రి కేటీఆర్ వల్ల మా కొడుకు విడాకులు తీసుకున్నాడని మంత్రి అసభ్యంగా మాట్లాడారని, అలా మాట్లాడం వలన మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని అన్నారు. బీఎన్ఎస్ యాక్ట్ 356 ప్రకారం మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని నాగార్జున కోరారు.విచారణ వాయిదాసాక్షిగా వచ్చిన సుప్రియ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలతో మా కుటుంబం మొత్తం షాక్ గురయ్యము. ఇలా మా కుటుంబం గురించి ఎందుకు ఇలా మాట్లాడారో అర్ధం కాలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాం. మరో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ని 10వ తేదీన రికార్డ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.(ఇదీ చదవండి: నిర్మాతకు మూడేళ్ల జైలు శిక్ష.. న్యాయం గెలిచిందని హీరోయిన్) -
బిగ్‌బాస్ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ సెలూన్ ప్రారంభించిన హీరో నాగార్జున (ఫొటోలు)
-
కోర్టుకు హాజరుకానున్న నాగార్జున!
-
నేడు నాంపల్లి కోర్టుకు హీరో నాగార్జున
సాక్షి,హైదరాబాద్:మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం పిటిషన్‌పై మంగళవారం(అక్టోబర్8) నాంపల్లికోర్టులో విచారణ జరగనుంది. నాగార్జున వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోర్టు ఆదేశించడంతో ఆయన కోర్టుకు హాజరుకానున్నారు.నాగార్జున వేసిన పిటిషన్‌పై సోమవారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. తమ కుటుంబ గౌరవం, ప్రతిష్ఠ దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయంటూ పిటిషన్లో నాగార్జున పేర్కొన్నారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అశోక్‌రెడ్డి వాదనలు వినిపించారు.కాగా, ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించడంలో భాగంగా నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో నాగార్జున కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కొండాసురేఖపై సోషల్‌మీడియాలో విమర్శలు గుప్పించారు. ఇదీ చదవండి: సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు -
నాగార్జునకు మద్దతిస్తే కేసులు వేస్తామంటూ కొండా సురేఖ లాయర్ హెచ్చరిక
టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జున నేడు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. తన కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై ఆయన పరువునష్టం పిటిషన్ వేశారు. ఈమేరకు సోమవారం విచారణ జరిగింది. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని నాంపల్లి న్యాయస్థానాన్ని నాగార్జున ఆశ్రయించారు. అయితే, న్యాయస్థానంలో మరోసారి విచారణ వాయిదా పడింది.నేడు నాంపల్లి మనోరంజన్ కోర్టులో నాగార్జున్ పిటీషన్‌పై మరోసారి విచారణ జరగనుంది. నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. అక్టోబర్ 8న నాగార్జున వాగ్మూలం రికార్డ్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో మంగళవారం కోర్ట్‌కు నాగార్జున హాజరుకానున్నారు. ఇదే సమయంలో సాక్షుల స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయాలని న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు. ఇదీ చదవండి: ఆ ఫోటోలన్నీ ఫేక్.. దర్శన్ కేసులో కీలక మలుపుఅయితే, నాగార్జున మీదే కేసులు వేస్తామని మంత్రి కొండా సురేఖ తరుపున వాదనలు వినిపిస్తున్న లాయర్ హెచ్చరించారు. అయిపోయిన విషయానికి నాగార్జున ఎందుకింత రాద్దాంతం చేస్తున్నాడు..? అని ఆయన ప్రశ్నించారు. నాగార్జునతో పాటు ఆయనకు మద్దతు ఇచ్చే అందరిపై కేసులు వేస్తామని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీంతో నాగార్జున అభిమానులు కూడా మండిపడుతున్నారు. బాధితుడి మీదే కేసులు వేస్తామని ఎలా వార్నింగ్‌లు ఇస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. -
కొండా సురేఖ వివాదం.. కోర్టుకు హాజరుకానున్న నాగార్జున
టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై తాజాగా కోర్టులో విచారణ జరిగింది. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని నాంపల్లి న్యాయస్థానంలో పరువు నష్టం దావా కేసును నాగార్జున వేశారు. అయితే, న్యాయస్థానంలో మరోసారి విచారణ వాయిదా పడింది.మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది. నేడు నాంపల్లి మనోరంజన్ కోర్టులో నాగార్జున్ పిటీషన్‌పై విచారణ జరగాల్సి ఉండగా వాయిదా పడింది. నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. వాటిని పరిశీలించిన కోర్టు.. అక్టోబర్ 8న నాగార్జున వాగ్మూలం రికార్డ్ చేయాలని వాయిదా వేస్తూ కోర్టు ఆదేశించింది. దీంతో మంగళవారం కోర్ట్‌కు నాగార్జున హాజరుకానున్నారు. ఇదే సమయంలో సాక్షుల స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయాలని న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు. -
ఇవాళ కొండా సురేఖ కామెంట్స్ పై నాంపల్లి కోర్టులో విచారణ
-
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈరోజే.. వారిద్దరి ఎంట్రీ ఖాయం!
నెల రోజులకు పైగా బిగ్‌బాస్ సీజన్-8 టాలీవుడ్ సినీ ప్రియులను అలరిస్తోంది. అయితే ఈ ఆదివారం ఈ షోపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ఎందుకంటే ఇప్పటికే హౌస్ నుంచి ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. దీంతో హోస్లో కాస్తా ఎంటర్టైన్మెంట్ తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీజన్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఎప్పటిలాగే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే వీరిలో గతంలో హౌస్‌లోకి వచ్చినా వాళ్లు కూడా ఉన్నారు.తాజాగా ఈరోజు జరిగే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. కొత్త కంటెస్టెంట్స్‌పై హౌస్ సభ్యులందరినీ నాగార్జున అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. వారిని త్వరగా ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ హౌస్మేట్స్ అంతా సరదాగా మాట్లాడారు. అంతేకాకుండా మూవీ ప్రమోషన్లలో భాగంగా స్వాగ్ టీమ్, జనక అయితే గనక, మా నాన్న సూపర్ హీరో టీమ్స్ సందడి చేశాయి.(ఇది చదవండి: Bigg Boss 8 : మాజీలతో మసాలా వర్కౌట్ అయ్యేనా?)వారిపైనే ఆసక్తి?అయితే అందరి దృష్టి వారిపైనే ఉంది. ఇంతకీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరు ఎంట్రీ ఇస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి మరింత పెరిగింది. ప్రోమో చూస్తే కొందరి పేర్లు కనిపెట్టేలా హింట్స్ కూడా ఇచ్చారు. ఈ రోజు హౌస్‌లోకి గతంలో మధ్యలోనే బయటికెళ్లిన గంగవ్వ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాకుండా యాంకర్ హరితేజ కూడా హౌస్‌లో అడుగుపెట్టనుంది. వీరితో పాటు మరికొంత ప్రముఖులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. తాజాగా రిలీజైన ప్రోమోను చూస్తే మీకు మరింత క్లారిటీ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి. -
ఆ రోజు నాన్నగారు చెప్పిందే నిజమైంది: నాగార్జున
టాలీవుడ్ సెన్సెషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ- నాగార్జున కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం శివ. 1990లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన 35 ఏళ్లు పూర్చి చేసుకున్న సందర్భంగా హీరో నాగార్జున ట్వీట్ చేశారు. శివ మూవీ రోజులను గుర్తు చేసుకున్నారు.నాగార్జున తన ట్వీట్లో రాస్తూ..'శివ రిలీజై నేటికి 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆ రోజు మా నాన్నగారు ఏఎన్ఆర్ కలిసి కారులో డ్రైవింగ్ చేయడం ఇప్పటికీ మరిచిపోలేను. ఆరోజు రాత్రి నాన్నాగారు శివ సినిమా చూసి..తెలుగు సినీ చరిత్రలోనే అతిపెద్ద హిట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని చెప్పారు. ఆ రోజు నాన్న చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా శివ సినిమాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. ముఖ్యంగా శివని సూపర్‌హిట్ చేసిన అభిమానులకు.. అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ ఆర్జీవీకి నా ప్రత్యేక ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు.నాగార్జున పోస్ట్‌కు దర్శకుడు ఆర్జీవీ సైతం స్పందించారు. నా జీవితంలో గొప్ప బ్రేక్ ఇచ్చారంటూ నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు. మీ మద్దతు, నాపై విశ్వాసం ఉంచినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. శివ లేకపోతే ఈ రోజు నేను ఉండేవాన్ని కాదంటూ రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. కాగా.. శివ చిత్రంలో అమలా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో రఘువరన్, జేడీ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించారు.And thank you for giving me a BREAK of a LIFE TIME ..Without ur unwavering support and absolute trust in me , there wouldn’t have been neither SHIVA nor ME 🙏🏻 https://t.co/a5W2Y8BcUn— Ram Gopal Varma (@RGVzoomin) October 6, 2024 -
దేవర సాంగ్.. నాగార్జున డ్యాన్స్ చూశారా!
టాలీవుడ్ హీరో నాగార్జున ప్రస్తుతం రజినీకాంత్ కూలీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే వైజాగ్‌లో కూలీ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. నాగార్జున యాక్షన్ సీన్స్‌కు సంబంధించిన వీడియోలు కూడా ఇటీవల నెట్టింట లీక్ అయ్యాయి.అయితే నాగార్జున ప్రస్తుతం బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-8కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా నాగార్జున బిగ్‌బాస్ షో సందడి చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీలోని సాంగ్‌కు స్టెప్పులతో అదరగొట్టారు. ఆయుధ పూజ పాటకు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.(ఇది చదవండి: మీ రుణాన్ని వడ్డీతో సహా తీర్చుకుంటా.. అభిమానులపై ఎన్టీఆర్)కాగా.. ఎన్టీఆర్- కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ మూవీ యంగ్ టైగర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ద్వారానే టాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో మెప్పించారు. Nagarjuna performance for Ayudhapooja song ❤🔥#Nagarjuna #NTR @tarak9999 pic.twitter.com/5xuXrHS3Yr— Devara NTR (@DevaraTsunamiOn) October 5, 2024 -
Bigg Boss 8 : మాజీలతో మసాలా వర్కౌట్ అయ్యేనా?
ఈ వారం హౌస్‌లోని కంటెస్టెంట్ల మనసులో ఉన్న ముసుగులను తొలగించడానికి ఫోమ్‌ని నామినేషన్ పర్వంలో వాడాడు బిగ్ బాస్. ఏ నురగైనా కరిగితే అసలు పదార్థం బయట పడుతుందన్నట్టు ఈ ఫోమ్ ఉపయోగించిన తరువాత కంటెస్టెంట్ల అసలు రంగులు చాలానే బయటపడ్డాయని చెప్పవచ్చు. ఆ రంగులు బయటకు రాగానే ఆట మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. యథావిధిగా నామినేషన్లో వాడి వేడి రచ్చతో పాటు ఈ వారం క్లాన్ల మధ్య పోటీగా నిర్వహించిన వినూత్న బెలూన్ కాంటెస్ట్ ప్రేక్షకులను అలరించిందనే చెప్పాలి. (చదవండి: కాలేజీలో మోసపోయానన్న యష్మి.. కన్నింగ్, సెల్ఫిష్ 'మణికంఠ' ఏడుపు)ఒక్క నామినేషన్లో తప్ప మిగతా రోజులంతా కంటెస్టెంట్లు ఆనందంగా కనిపించారు. కానీ వారి ఆనందాన్ని ఎక్కువ సేపు బిగ్ బాస్ తట్టుకోలేకపోయాడు. అంతే బెలూన్ కాంటెస్ట్ ముందే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని బాంబు పేల్చాడు. దాంతో ఇంకేముంది... ఓ పక్క తమను తాము కాపాడుకుంటూ వైల్డ్ కార్డ్స్‌ని హౌస్‌లోకి రానివ్వకుండా బిగ్ బాస్ పెట్టే ఆటలన్నీ ప్రాణం పెట్టి ఆడుతున్నారు ప్రస్తుత కంటెస్టెంట్స్. ఇక ఇదంతా ఒక ఎత్తయితే గత వారం ఊహించని ఎలిమినేషన్ సోనియా. కాకపోతే ఈ సోనియాని ప్రేక్షకులు ఎలిమినేట్ చేయలేదు... హౌస్‌లోని కంటెస్టెంట్స్ చేయడం విశేషం. ముఖ్యంగా కంటెస్టెంట్స్లోని మిగతా లేడీ పార్టిసిపెంట్స్ సోనియాని వద్దనుకోవడం విడ్డూరం. ఎలిమినేట్ అయిన తరువాత ఈ విషయాన్ని నాగార్జునతో సోనియా బాహాటంగానే అందరి ముందు చెప్పింది. (చదవండి: విశ్వంలో చాలా రహస్యాలున్నాయి: దర్శకుడు శ్రీను వైట్ల)కండబలం ఉన్నవారికి గుండెబలం తక్కువ ఉంటుందన్న విషయాన్ని నిరూపించాడు నిఖిల్. సోనియా ఎలిమినేట్ అవ్వగానే ఒక్కసారిగా భోరుమన్నాడు హౌస్‌లోనే బలవంతుడైన నిఖిల్. పృథ్వీ కూడా నిఖిల్‌తో జత కలిశాడు. ఆఖరికి ఇద్దరికిద్దరూ ఓ అమ్మాయి కోసం ఏడవడం ప్రేక్షకులకు కాస్త నవ్వు తెప్పించి ఉండవచ్చు. ఈ వారం చివర్లో కూడా నాగార్జున ప్రేక్షకులకు ఓ ఝలక్ ఇచ్చి ముగించారు. వారం మధ్యలో ఒక ఎలిమినేషన్ ఉంటుంది అని ప్రకటించారు. చెప్పినట్లుగానే మిడ్ వీక్‌లో ఆదిత్యను ఎలిమినేట్ చేశాడు. ఇక ఇప్పుడు హౌస్‌లో ఉన్నవాళ్ల దగ్గర నుండి ఎక్కువ మసాలా రావట్లేదని అనుకున్నాడో ఏమో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పేరిట ఎనిమిది మంది మాజీ కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి పంపడానికి రెడీ అయ్యాడు బిగ్ బాస్. మరి ఈ మాజీలతో మసాల వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. -
టాటూ సీక్రెట్ బయటపెట్టిన యష్మి.. మణికంఠ సింపతీ డ్రామాలొద్దు!
వైల్డ్‌కార్డులు లేకుండా ఈరోజే లాస్ట్డే.. రేపు ఈ సమయానికల్లా ఎనిమిది మంది మాజీలు హౌస్‌లో తిష్ట వేస్తారు. సింపతీ ఏడుపులు వద్దంటూ నాగార్జున నాగమణికంఠకు క్లాసు పీకాడు. ఇదే మంచి తరుణమని హౌస్మేట్స్ అంతా కూడా మణిపైనే పడ్డారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగిందో తెలియాలంటే నేటి(అక్టోబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..మణికంఠకు క్లాస్ పీకిన నాగ్నాగార్జున వచ్చీరావడంతోనే సింపతీకి ఫుల్స్టాప్ పెట్టమని మణికంఠకు గట్టిగా క్లాస్ పీకాడు. ఎంత బాధున్నా ఇప్పుడే ఏడ్చేసేయ్, కానీ తర్వాత మాత్రం ఏడవడానికి వీల్లేదన్నాడు. అయినా మణి కంట నుంచి ఒక్క నీటి చుక్క కూడా రాలేదు. దీంతో నాగ్.. నీ భార్య నీదగ్గరకు రానంటే ఏం చేస్తావ్? నీకు ఫుడ్ పంపించింది కూడా నీ భార్య కాదు ఫ్రెండ్ రాహుల్ అని చెప్పడంతో మణి ఏడ్చేశాడు. ఇంకా ఎన్నాళ్లు ఇలా ఏడుస్తూ సింపతీ కోరుకుంటావని తిట్టాడు.ఫైర్? అదెలా ఉంటుంది సర్?మణికి ఈ రేంజ్లో క్లాస్ పీకడంతో హౌస్మేట్స్ అంతా కూడా అతడి మీదే పడ్డారు. మొదటగా ప్రేరణ.. మణి అందరూ తన గురించే ఆలోచించాలనుకుంటాడంది. విష్ణుప్రియ, పృథ్వీ కూడా అతడిని సెల్ఫిష్ అనేశారు. ఈ సందర్భంగా నాగ్.. విష్ణుప్రియలో ఫైర్ చూడాలనుందనగా.. అదెలా ఉంటుంది సర్? అని అమాయకంగా ముఖం పెట్టి అడిగింది విష్ణు. దీంతో నాగార్జున మారు మాట్లాడలేక తన నోటికి తాళం వేసుకున్నాడు. ప్రేరణను సెల్ఫిష్ అనేసిన యష్మినబీల్ వంతురాగా.. తాను గెలిచినప్పుడు యష్మి జెలసీతో ఏడ్చేసిందన్నాడు. యష్మి మళ్లీ మణి దగ్గరకే వచ్చి అతడు ప్రవర్తన అన్నోయింగ్గా అనిపిస్తుందంది. అలాగే ప్రేరణ సెల్ఫిష్‌గా అనిపిస్తోందని అభిప్రాయపడింది. నాగ్ మాత్రం.. ప్రేరణ గేమ్ అద్భుతంగా ఆడుతుందని మెచ్చుకున్నాడు. ఇక యష్మికి తండ్రి పంపిన మెసేజ్ చెప్తానన్నాడు నాగ్. కాకపోతే ఏదైనా సీక్రెట్ చెప్పాలని షరతు విధించాడు. మోసపోయిన యష్మిదీంతో యష్మి ఓపెన్ అవుతూ.. కాలేజీలో ఒకర్ని ప్రేమించాను.. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని మా ఇద్దరి పేర్ల మొదటి అక్షరాలను చైనీస్ భాషలో పచ్చబొట్టు వేయించుకున్నాను. తర్వాత తెలిసిందేంటంటే.. ఇది జపనీస్ భాష అంట.. పైగా ఈ అక్షరాలకు అసలు అర్థమే లేదంటూ తను మోసపోయిన విషయం బయటపెట్టింది. సీక్రెట్ బయటపెట్టిన యష్మికి తండ్రి పంపిన మెసేజ్‌ను తెలియజేశాడు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది, వారియర్‌లా పోరాడు, మిస్ అవుతున్నానని సందేశం పంపాడన్నాడు. మణికంఠ కన్నీళ్లుసీతకు ఈర్ష్య ఉందని పృథ్వీ, ప్రేరణ అభిప్రాయపడ్డారు. మణి కన్నింగ్ అని నిఖిల్, మణి టాక్సిక్ అని నైనిక పేర్కొన్నారు. మణికంఠ వంతు వచ్చేసరికి.. ఎవరినీ జడ్జ్ చేసే పరిస్థితిలో లేనంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. గేమ్ ఆడాల్సిందే అని నాగ్ గద్దించడంతో సీతకు జెలసీ ఉందన్నాడు. నేను ఎలా సేవ్ అవుతున్నానో అర్థం కావడం లేదనేసిందని చెప్పాడు. కిచెన్‌లో ప్రేరణ ప్రవర్తించిన తీరు నచ్చలేదన్నాడు. ఈరోజు ఎపిసోడ్లో నిఖిల్, నబీల్ను సేవ్ చేశారు.ఆ నలుగురికీ ఆదిత్య పంచ్తర్వాత వారం మధ్యలోనే ఎలిమినేట్ అయిన ఆదిత్యను స్టేజీపైకి పిలిచి జర్నీ చూపించాడు. అతడితో హగ్ అండ్ పంచ్ గేమ్ ఆడించాడు. నబీల్, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, ప్రేరణ, నిఖిల్‌కు హగ్స్ ఇచ్చిన ఆదిత్య.. యష్మి, నైనిక, సీత, నాగమణికంఠకు పంచ్ ఇచ్చాడు. ఒక్కవారమైనా ఏ గొడవా లేకుండా ఆడమని మణికి సలహా ఇచ్చాడు. ఇక పుట్టినరోజునాడే ఆదిత్య బిగ్‌బాస్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మంత్రి కొండా సురేఖపై రూ. 100 కోట్లకు మరో దావా వేస్తా
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ తమ కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల ఉదంతం గురించి సినీ హీరో నాగార్జున మరోసారి స్పందించారు. మంత్రిపై ఇప్పటికే క్రిమినల్ పరువునష్టం కేసు వేశామని.. ఆమెపై రూ. 100 కోట్లకు మరో పరువునష్టం దావా వేసేందుకు సిద్ధమవుతు న్నామని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. మంత్రి కొండా సురేఖ కేవలం సమంతపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పారని.. కానీ తనకు, తన కుటుంబానికి మాత్రం ఒక్క ముక్క క్షమాపణ కూడా చెప్పలేదని నాగార్జున మండిపడ్డారు. ఒకవేళ ఇప్పుడు తనకు, తన కుటుంబానికి ఆమె క్షమాపణ చెప్పినా దావా విషయంలో వెనక్కి తగ్గబోనని తేల్చిచెప్పారు. సినీ పరిశ్రమలోని వ్యక్తులను సున్నిత లక్ష్యాలుగా చేసుకోవడాన్ని ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ‘కొంతకాలంగా ఒక దాని తర్వాత ఒకటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఎప్పటికప్పుడు ఇదే చివరిదని అనుకున్నా. కానీ దైవానికి ఇంకేవో ప్రణాళికలు ఉన్నట్లు అనిపిస్తోంది. అయినా పరవాలేదు. నేనెప్పుడూ బలమైన వ్యక్తిత్వంగల వాడినని నమ్ముతా. నా కుటుంబాన్ని కాపాడే విషయంలో నేను ఓ సింహాన్ని. అదృష్టవశాత్తూ మొత్తం తెలుగు సినీ పరిశ్రమంతా మాకు అండగా నిలిచింది. ఇదంతా మా నాన్న మంచితనం, ఆశీర్వాదమేనని భావిస్తున్నా’ అని నాగార్జున పేర్కొన్నారు. -
నేను సింహాన్ని.. టాలీవుడ్ అంతా నాకు అండగా.: నాగార్జున
హీరో అక్కినేని నాగార్జున కుటుంబంతో పాటు సమంతపై తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్ భగ్గుమంది. రాజకీయ దురుద్దేశాల కోసం సినీ సెలబ్రిటీలను వాడుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని తెలుగు చలనచిత్ర పరిశ్రమ వార్నింగ్ ఇచ్చింది. టాలీవుడ్ మొత్తం తనకు అండగా నిలబడ్డందుకు నాగార్జున సంతోషం వ్యక్తం చేశాడు. సింహంలా పోరాడతా..'నేను బలమైన వ్యక్తినని ఎప్పుడూ అనుకుంటాను. నా కుటుంబాన్ని రక్షించే విషయంలో సింహంలా నిలబడతాను. అదృష్టవశాత్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతా కూడా ఈ విషయంలో మాకు అండగా నిలబడింది. ఇది మా నాన్నగారి ఆశీర్వాదాలుగా భావిస్తున్నాను' అంటూ ఓ నోట్ రిలీజ్ చేశాడు.అసలేమైందంటే?ఇకపోతే నాగచైతన్య, సమంత విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ నోరు పారేసుకున్నారు. ఇందులో నాగార్జున హస్తం కూడా ఉందంటూ ఆరోపించారు. ఈమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగ్ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. తన కుటుంబసభ్యుల పరువుకు భంగం కలిగించిన తనపై చర్యలు తీసుకోవాలని కోరారు.చదవండి: ఫస్ట్ మీటింగ్‌లోనే చేదు అనుభవం.. నా వల్ల కాదని ఊరెళ్లిపోయా! -
కొండా సురేఖ వివాదం.. నాగార్జున పిటీషన్‌పై విచారణ వాయిదా
టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని నాంపల్లి న్యాయస్థానంలో పరువు నష్టం దావా కేసును నాగార్జున వేశారు. అయితే, నేడు జరగాల్సిన విచారణ వాయిదా పడింది. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో సోమవారం విచారణ జరుగుతుందని కోర్టు తెలిపింది.ఇదీ చదవండి: మమ్మల్ని బలిపశువులను చేసింది: అఖిల్తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో కొండ సురేఖ ఈ వ్యాఖ్యలే చేశారు. అక్కినేని నాగార్జున కుటుంబం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను లేవనెత్తుతూ.. సినీనటి సమంత విడాకులు, రకుల్ ప్రీత్‌సింగ్ పెళ్లి వంటి అంశాలపై ఆమె వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారమే రేగింది. అధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్లూ ఊరుకోమంటూ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు రియాక్ట్ అయ్యారు.