Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Daily Horoscope: Rasi Phalalu On 04-05-2024 In Telugu
Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.ఏకాదశి సా.5.58 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: పూర్వాభాద్ర రా.7.51 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: ఉ.8.44 నుండి 10.13 వరకు, తిరిగి రా.1.54 నుండి 3.23 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.36 నుండి 7.13 వరకు, అమృతఘడియలు: ప.12.27 నుండి 1.56 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.37, సూర్యాస్తమయం: 6.16. మేషం: ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవరోధాలు. దైవదర్శనాలు.  మిత్రులతో విభేదిస్తారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఆరోగ్యసమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.వృషభం: ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు. కుటుంబసమస్యలు తీరతాయి. ఆస్తుల కొనుగోలలో ఆటంకాలు తొలగుతాయి. విందువినోదాలు.మిధునం: ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు.వృత్తి,వ్యాపారాలలో ఆశించిన ప్రగతి ఉంటుంది. ఆలయ దర్శనాలు. కళాకారుల యత్నాలు సఫలం.కర్కాటకం: అనుకోని ధనవ్యయం. పనుల్లో తొందరపాటు. బంధువులతో మాటపట్టింపులు. విద్యార్థులు కొంత శ్రమపడాలి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో  ఊహించని మార్పులు.సింహం: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు.బంధువులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు సామాన్యమే. కళాకారులకు చికాకులు..కన్య: పనులు విజయవంతంగా పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.నూతన ఉద్యోగయోగం. ఆలయ  దర్శనాలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూలత.తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు.వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన.వృశ్చికం: రుణఒత్తిడులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. అనారోగ్యం.ధనుస్సు: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు.  ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. నిరుద్యోగులకు ఒత్తిడులు. దైవచింతన..మకరం: కొత్త పనులు ప్రారంభిస్తారు. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. ధనలబ్ధి. ప్రముఖుల పరిచయం. కళాకారులకు మంచి గుర్తింపు.కుంభం: అనుకోని ధనవ్యయం. అదనపు బాధ్యతలు. వృత్తి, వ్యాపారాలు కొంత  నిరాశ కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలు. నిరుద్యోగుల ప్రయత్నాలు ముంందుకు సాగవు. దూరప్రయాణాలు.మీనం: నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వృత్తి,వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. సోదరులతోసఖ్యత. నూతన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. 

Special article over chandrababu Propaganda of lies
మళ్ళీ వచ్చారు...మౌత్ టాక్ మల్లిగాళ్ళు

సినిమా ఎప్పుడైతే చప్పగా ఉన్నట్లు అనిపిస్తుందో... సరిగ్గా అప్పుడే రెండు కామెడీ జోక్స్...లేదా మంచి మసాలా ఐటం సాంగ్ వేస్తారు... దీంతో మళ్ళీ థియేటర్లో ప్రేక్షకులు ఎటెన్షన్లోకి వచ్చి...సినిమాలో లీనమవుతారు... అచ్చం చంద్రబాబు కూడా ఇదే విధానము ఫాలో అవుతున్నారు.టీడీపీ గ్రాఫ్... చంద్రబాబు ప్రతిష్ట ఎప్పుడైతే డౌన్ అవుతోందని గ్రహిస్తారో.... అప్పుడు  తన మీడియాను... పచ్చ జనాన్ని... అలవోకగా బొంకగలిగేవాళ్లను జనంలోకి దించుతారు... వీళ్ళే మౌత్ టాక్ మల్లిగాళ్ళు  వీళ్ళు జనం ఎక్కువగా ఉండే హోటళ్లు... టీ స్టాళ్లు..బస్సులు...రైల్వే కౌంటర్ల వద్ద అకస్మాత్తుగా ప్రత్యక్షమై ఉన్నఫళంగా ప్రభుత్వాన్ని తిడుతూ అరుస్తూ కేకలు వేస్తారు.. అక్కడ ఉన్నవాళ్ళంతా ఆటే చూసేలా చేస్తారు.ఐదారు నిముషాలు స్క్రిప్ట్ ప్రకారం తమిళ యాక్టర్లు మనోరమ.. శివాజీ గణేష్‌లను  మించిపోయేలా యాక్టింగ్ చేసేసి   వెళ్ళిపోతారు... చూసేవాళ్ళు మాత్రం...వామ్మో ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉందా అని జనం అనుకోవాలనేది వాళ్ళ ప్లాన్. దీనికోసం టీడీపీ ఎన్నారై విభాగం సైతం గ్రామాల్లోకి దిగింది.తమ చుట్టుపక్కల ఉన్నవాళ్లను ప్రభావితం చేసి తెలుగుదేశానికి ఓటేయించడం వారి విధి.. దీనికోసం కోట్లలో నిధులు సైతం సమీకరించి దేశవిదేశాల్లోని ఎన్నారై యువత సెలవులు పెట్టుకుని మరీ పల్లెల్లో, పట్టణాల్లోని కాలనీల్లో పాగా వేసింది..వాస్తవానికి టీడీపీ మ్యానిఫెస్టో జనంలోకి వెళ్ళకపోవడం, ప్రజలు పెద్దగా నమ్మకపోవడం.. సీఎం వైయస్ జగన్ అందిస్తున్న పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలు అర్థం చేసుకుని రాష్ట్రం మరింతగా ప్రగతి సాధించాలంటే మళ్ళీ జగన్ రావాలి..పోర్టులు... మెడికల్ కాలేజీలు... స్కూళ్ళు.. ఇంగ్లిష్ మీడియం చదువులు... ఇప్పుడిప్పుడే ఊపందుకున్న పరిశ్రమలు... ఇవన్నీ పూర్తి కావాలన్నా... ఉద్యోగావకాశాలు పెరగాలన్నా మళ్ళీ జగన్ గెలవాలి...అలాగైతే ఇప్పుడు పురోగతిలో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి అని జనం అనుకుంటున్నారు...దీంతోబాటు   గ్రామస్థాయిలో ప్రజల అభిప్రాయం మాత్రం వేరేలా ఉంది. ఇల్లు కదలకుండా తమ గుమ్మం వద్దకే వస్తున్నా సంక్షేమ పథకాలు... ఊరు దాటకుండానే సచివాలయంలో అందుతున్న ప్రభుత్వ సేవలను అందుకుంటున్న తీరు ప్రజల స్మృతిపథంలో కదులుతూనే ఉన్నాయి. . దీనికితోడు మహిళలు... వికలాంగులు... రైతులు ఈ ఐదేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌ తమకు ఎంత మేలు  ఎంత మేలు  చేశారన్నది లెక్కలు వేసుకుని మరీ ప్రజలు ఓటు చేతబట్టుకుని ఎన్నికల తేదీ కోసం సిద్ధంగా ఉన్నారు.మళ్ళీ తమ సోదరుడిని గెలిపించుకోవాలని వాళ్లంతా ఎదురుచూస్తున్నారు... ప్రజల్లో అలా అభిప్రాయం ఉన్నపుడు ఈ మౌత్ టాక్ మల్లిగాళ్ళు ప్రజల మనోభిప్రాయాలను మార్చలేరని అంటున్నారు. ఎన్నిసారు అరిచినా ఇత్తడిని పుత్తడి చేయలేరని.. చంద్రబాబును మళ్ళీ గెలిపించలేరని అంటున్నారు. గట్టిగా అరిచినంతమాత్రాన అబద్ధాలు నిజాలు కాలేవని... గ్రామసింహం సింహం కాలేదని ప్రజలు అంటున్నారు.-- సిమ్మాదిరప్పన్న 

Revanna File Petition For Pre Arrest Bail In Bengaluru Court
ముందస్తు బెయిల్‌ ఇవ్వండి: కోర్టులో రేవణ్ణ పిటిషన్‌

బెంగళూరు: ఒక మహిళ కిడ్నాప్‌ కేసులో మాజీ మంత్రి హెచ్‌డి రేవణ్ణ ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేశారు. బెయిల్‌ కోసం బెంగళూరు సెషన్స్‌కోర్టులో శుక్రవారం(మే3) పిటిషన్‌ వేశారు. తన తల్లిని రేవణ్ణ ఎత్తుకుపోయారని రేవణ్ణ ఫామ్‌హౌజ్‌లో పనిచేసే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులోని కేఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో రేవణ్ణపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక వేధింపుల(సెక్స్‌ స్కాండల్‌) వీడియోల కేసులో రేవణ్ణ శుక్రవారం సిట్‌ ముందుకు రావాల్సి ఉండగా ఆయన గైర్హాజరయ్యారు. 

TDP is a new fraud in the name of volunteers
ఈ దొంగల్ని నమ్మొద్దు

చిత్తూరు రూరల్‌(కాణిపాకం): కొత్త వలంటీర్ల పేరుతో తెలుగుదేశం పార్టీ సరికొత్త మోసానికి తెరతీసింది. ఇటీవల రాజీనామా చేసిన వలంటీర్ల స్థానంలో తమ పార్టీకి చెందిన కొందరు యువకులను గ్రామాల్లోని పేదల ఇళ్లకు పంపిస్తోంది. వారి ద్వారా ఓటర్లను ప్రలోభా­లకు గురిచేస్తోంది. చిత్తూరు రూరల్‌ మండలంలో ఈ నయా మోసం వెలుగులోకి వచ్చింది. ఇటీవల చిత్తూరు మండలంలో చా­లా­మంది వలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. దీనిని ఆసరాగా చేసుకుని స్థానిక టీడీపీ నేతలు కొందరు యువకులను ఎంపిక చేసి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్లుగా మిమ్మల్నే నియమిస్తామని నమ్మబలికారు. వారికి వలంటీర్లు ఎలాంటి సేవలు అందిస్తారనే విషయంపై శిక్షణ ఇచ్చారు. అనంతరం 50 ఇళ్లకు ఒకరిని చొప్పున పంపించారు. ఇక వారు పేదల ఇళ్లకు వెళ్లి ‘తాము కొత్త వలంటీర్లం. ఇక వచ్చేది టీడీపీ. కాబట్టి టీడీపీకి ఓటు వేయండి. లేకపోతే ఏ పథకం రాదు..’ అని బెదిరిస్తున్నారు. టీడీపీ కరపత్రాలు చూపిస్తూ పింఛన్లు, ఇంటి స్థలం.. అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తు­న్నారు. మరోవైపు పేదల అవసరాలను గుర్తించి ఆర్థికంగా ప్రలో­భాలకు గురిచేస్తున్నారు. టీడీపీ ఆడుతున్న ఈ కొత్త వలంటీర్ల డ్రామాపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ ఎటువంటి మోసాలకైనా పాల్పడుతుందనేందుకు కొత్త వలంటీర్ల డ్రామా ఒకటని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి దొంగలను నమ్మరాదన్న భావనను వారు వెలిబుచ్చారు. దీనిపై కొందరు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

Misa Bharti Comments On Pm Photo On Covid Vaccine Certificates
వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లపై ప్రధాని ఫొటో ఎటు పోయింది: మీసా భారతి

పాట్నా: కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అనుమనాలు వ్యక్తం అవుతుండటం వల్లే ప్రధాని  ఫొటోవ్యాక్సిన్‌ సర్టిఫికెట్లపై తొలగించారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాదా్‌ యాదవ్‌ కుమార్త్‌ మీసా భారతి అన్నారు. మీసా భారతి బిహార్‌లోని పాటలిపుత్ర నియోజకవర్గం నుంచి ఎంపీ పదవికి పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా  మీసా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ‘వ్యాక్సిన్‌ దుష్ప్రభావాలపై వస్తున్న వార్తలతో ప్రధాని భయపడుతున్నారు. ప్రధానికి ప్రతి దానిపై క్రెడిట్‌ తీసుకోవడం అలవాటు. అయితే కరోనా వ్యాక్సిన్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నందున ప్రధాని పక్కకు తప్పుకుంటున్నారు.వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌లపై తన ఫొటోలను తొలగించారు. వ్యాక్సిన్‌పై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి’ అని మీసా డిమాండ్‌ చేశారు. కాగా, ఎన్నికల కోడ్‌ ఉన్నందు వల్లే కొవిడ్‌ వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లపై ప్రధాని ఫొటో తొలగించారని బీజేపీ నేతలు మీసాకు కౌంటర్‌ ఇస్తున్నారు.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                       

IPL 2024: KKR Thrash MI By 24 Runs
కేకేఆర్ చేతిలో ముంబై ఓట‌మి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్‌?

ఐపీఎల్‌-2024లో దాదాపుగా ముంబై ఇండియ‌న్స్ క‌థ ముగిసింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా వాంఖ‌డే వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 24 ప‌రుగుల తేడాతో ముంబై ఓట‌మి పాలైంది. దీంతో త‌మ ప్లే ఆఫ్ అవ‌కాశాల‌ను ముంబై మ‌రింత సంక్లిష్టం చేసుకుంది. 170 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్‌.. 18.5 ఓవ‌ర్లలో 145 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ముంబై బ్యాట‌ర్ల‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌(56) ఒక్క‌డే ప‌ర్వాలేద‌న్పించాడు.  మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సునీల్ న‌రైన్‌, ర‌స్సెల్‌, చ‌క్ర‌వ‌ర్తి త‌లా రెండు వికెట్లు సాధించారు. అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్‌..  169 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్ కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో అయ్య‌ర్‌ 70 ప‌రుగులు చేశాడు. అయ్య‌ర్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన మ‌నీష్ పాండే కూడా త‌న వంతు పాత్ర పోషించాడు. 31 బంతులు ఎదుర్కొన్న పాండే 2 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 42 ప‌రుగులు చేశాడు. ఇక ముంబై బౌల‌ర్ల‌లోతుషారా, బుమ్రా త‌లా 3 వికెట్లతో చెల‌రేగ‌గా.. హార్దిక్ పాండ్యా రెండు, చావ్లా ఒక్క వికెట్ సాధించారు. ఇక ఈ ఏడాది సీజ‌న్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన కేవ‌లం 3 మ్యాచ్‌ల్లోనే విజ‌యం సాధించిన ముంబై.. పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్ధానంలో నిలిచింది.

Bandi Sanjay Satirical Comments On Congress Party
రిజర్వేషన్లు రద్దంటే చెప్పుతో ఉరికించి కొట్టండి

హుజూరాబాద్‌/కరీంనగర్‌ టౌన్‌: రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పేవాళ్లను చెప్పు, చీపుర్లతో తరిమితరిమి కొట్టాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. ఫోన్‌ ట్యాపింగ్‌ పైసలతో కరీంనగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్ధి ఓట్లను కొనాలనుకుంటున్నారని ఆరోపించారు. పొరపాటున ఆ పైసలు తీసుకుంటే.. నోటీసులు వచ్చే ప్రమాదముందని ప్రజలను హెచ్చరించారు.300 సీట్లకు మించి పోటీ చేయని కాంగ్రెస్‌ పార్టీకి కేంద్రంలో అధికారం ఎలా సాధ్యమని ప్రశ్నించిన బండి సంజయ్‌ ఆ పారీ్టకి ఓటేస్తే మూసీలో వేసినట్లేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూరాబాద్‌లో కార్నర్‌ మీటింగ్, కరీంనగర్‌లో నిర్వహించిన సమావేశాలు, సభల్లో ఆయన మాట్లాడారు. ’’కాంగ్రెస్‌ నన్ను ఓడగొట్టడానికి బి.సంజయ్‌ అనే వ్యక్తిని బరిలోదింపి కాలీఫ్లవర్‌ గుర్తు ఇప్పిస్తామని మభ్యపెట్టింది. తనను ఎదుర్కొనే దమ్ములేక ఇట్లాంటి లుచ్చా పనులు చేస్తోంది’అని మండిపడ్డారు. 6 గ్యారంటీలపై ఎందుకు మాట్లాడరు? ‘‘సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడితే బీజేపీ తెలంగాణకు ఏమిచ్చిందని అడుగుతున్నడు. బండి సంజయ్‌ ఏం చేసిండని అంటున్నడు. ఆయనకు తెల్వదేమో.. రాష్ట్రానికి కేంద్రం రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచి్చంది. జమ్మికుంటకు వచ్చి ప్రధానిని తిట్టినవ్‌. నన్ను కూడా గుండు అని తిట్టినవ్‌. గాడిద గుడ్డు అన్నవ్‌. నా మీద, గాడిద గుడ్డు మీద ఉన్న శ్రద్ధ ఆరు గ్యారంటీల అమలుపై ఎందుకు లేదు’’అని బండి ప్రశ్నించారు. తాను మాట్లాడితే దేవుడితో రాజకీయమంటారు? మరి రేవంత్‌ చేస్తుందేమిటని నిలదీశారు.  ‘‘సీఎం రేవంత్‌కి సీటు పోతుందని భయం పట్టుకుంది. ఎంపీ సీట్లు రాకపోతే ఎట్లా అని ఆలోచిస్తున్నడు. ఆ బాధతోనే మోదీని తిడుతున్నడు. మోదీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని అబద్ధాలు చెబుతున్నడు. మేం మళ్లీ చెబుతున్నాం.. రిజర్వేషన్లను కొనసాగించి తీరుతాం. మోదీ బతికున్నంత వరకు రిజర్వేషన్లను కొనసాగిస్తాం’’అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఎట్ల అధికారంలోకి వస్తది? పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి ఎట్లా వస్తది? ఆ పార్టీ పోటీ చేసే స్థానాలే 300 దాటడం లేదు? అధికారం కావాలంటే 275 సీట్లు కావాలి కదా. మరి అధికారం ఎట్లా సాధ్యం? అసలు కాంగ్రెస్‌కు ఎవరిని చూసి ఓటేయాలి? ఆ పార్టీ ప్రధాని అభ్యర్ధి ఎవరు?’’అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే మూసీలో వేసినట్లేనన్నారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠకు పిలిస్తేనే రాని కేసీఆర్‌ రామభక్తుడు ఎట్లా అవుతారని నిలదీశారు. భారతీయ జనతా మహిళా మోర్చా మహిళ శక్తి సమ్మేళనంలో పాల్గొన్న బండి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహిళల పక్షపాతి అని కొనియాడారు.

Vishnu Manchu speaks about Kannappa co star Akshay Kumar
కన్నప్పకి బై బై 

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ‘కన్నప్ప’కి బై బై చెప్పారు. తన పాత్రకి సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసిన ఆయనకి చిత్ర యూనిట్‌ వీడ్కోలు పలికింది. విష్ణు మంచు హీరోగా ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మంచు మోహన్‌బాబు పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్‌ కుమార్, మోహన్‌బాబు, మోహన్‌ లాల్, శరత్‌ కుమార్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైన షెడ్యూల్‌లో అక్షయ్‌ కుమార్‌ జాయిన్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా తన సీన్లకు సంబంధించిన షూట్‌ను ఆయన పూర్తి చేశారు. ‘‘అక్షయ్‌ కుమార్‌గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైనది’’ అని సోషల్‌ మీడియా ద్వారా పేర్కొన్నారు విష్ణు మంచు. ‘‘ధైర్యవంతుడైన యోధుడు, శివ భక్తుడైన కన్నప్ప కథతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది’’ అన్నారు మేకర్స్‌.   

Amit Shah Deepfake Video Row: Telangana Congress Social Media Team Arrested
అమిత్‌ షా డీప్‌ఫేక్‌ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్‌

సాక్షి, న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా డీప్‌ఫేక్‌ వీడియో ఎక్కడ నుంచి వచ్చిందనే సందేహానికి తెరపడింది. ఆ ఫేక్‌ వీడియోను మొదట పోస్ట్‌ చేసినది తెలంగాణ నుంచేనంటూ ప్రముఖ సోష­ల్‌ మీడియా సంస్థ ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌) ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులకు నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. మొదట పోస్ట్‌ చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంలో ‘ఎక్స్‌’ నుంచి మరింత సమాచారం కోసం వేచి చూస్తున్నారు.ల్యాండ్‌ లైన్‌ ఐపీ అడ్రస్‌ నుంచి..గత నెల 23న మెదక్‌ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బీజేపీ గెలిస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ మాట్లాడినట్టు ఓ వీడియో ప్రత్యక్షమైంది. ఎక్స్, ఫేస్‌బుక్‌ ఖాతాల్లో అది వైరల్‌గా అయి దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు.. ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేశవ్యాప్తంగా నలుగురిని అరెస్టు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె సతీశ్, శివకుమార్‌ అంబాలా, నవీన్, ఆస్మా తస్లీంలకు నోటీసులు జారీ చేశారు.మరోవైపు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ముందు పోస్ట్‌ చేశారన్న దానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎక్స్, ఫేస్‌బుక్‌లను స్పెషల్‌ సెల్‌ పోలీసులు ఆదేశించారు. ఈ మేరకు ప్రాథ­మిక నివేదిక ఇచ్చిన ‘ఎక్స్‌’ సంస్థ.. తొలుత ఆ వీడి­యో పోస్ట్‌ అయినది తెలంగాణ నుంచేనని వెల్లడించింది. ఒక ల్యాండ్‌లైన్‌ ఐపీ అడ్రస్‌ నుంచి ఈ వీడియో పోస్ట్‌ అయినట్టుగా పేర్కొంది. అయితే ఎవరు చేశారనేది ఇంకా వెల్లడించలేదు. దీంతో ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు మళ్లీ ‘ఎక్స్‌’కు లేఖ రాశారు. కచ్చితంగా ఎవరి ఐపీ అడ్రస్‌ నుంచి వచ్చింది? ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన తర్వాత ఎంతమంది వీక్షించారు? ఎవరెవరు షేర్‌ చేశారు? కామెంట్లు/లైకులు తదితర సమగ్ర వివరాలు ఇవ్వాలని కోరారు. ‘ఎక్స్‌’ సంస్థ ఒకట్రెండు రోజు­ల్లో సమగ్ర నివేదిక అందించే అవకాశం ఉంది. 

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement


ఫోటో స్టోరీస్

View all