Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YS Jagan Election Campaign In Hindupur
నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని పలమనేరులోని బస్టాండ్‌ సెంటర్‌లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో ఉన్న గాంధీ విగ్రహం సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.    

Daily Horoscope: Rasi Phalalu On 04-05-2024 In Telugu
Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.ఏకాదశి సా.5.58 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: పూర్వాభాద్ర రా.7.51 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: ఉ.8.44 నుండి 10.13 వరకు, తిరిగి రా.1.54 నుండి 3.23 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.36 నుండి 7.13 వరకు, అమృతఘడియలు: ప.12.27 నుండి 1.56 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.37, సూర్యాస్తమయం: 6.16. మేషం: ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవరోధాలు. దైవదర్శనాలు.  మిత్రులతో విభేదిస్తారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఆరోగ్యసమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.వృషభం: ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు. కుటుంబసమస్యలు తీరతాయి. ఆస్తుల కొనుగోలలో ఆటంకాలు తొలగుతాయి. విందువినోదాలు.మిధునం: ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు.వృత్తి,వ్యాపారాలలో ఆశించిన ప్రగతి ఉంటుంది. ఆలయ దర్శనాలు. కళాకారుల యత్నాలు సఫలం.కర్కాటకం: అనుకోని ధనవ్యయం. పనుల్లో తొందరపాటు. బంధువులతో మాటపట్టింపులు. విద్యార్థులు కొంత శ్రమపడాలి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో  ఊహించని మార్పులు.సింహం: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు.బంధువులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు సామాన్యమే. కళాకారులకు చికాకులు..కన్య: పనులు విజయవంతంగా పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.నూతన ఉద్యోగయోగం. ఆలయ  దర్శనాలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూలత.తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు.వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన.వృశ్చికం: రుణఒత్తిడులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. అనారోగ్యం.ధనుస్సు: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు.  ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. నిరుద్యోగులకు ఒత్తిడులు. దైవచింతన..మకరం: కొత్త పనులు ప్రారంభిస్తారు. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. ధనలబ్ధి. ప్రముఖుల పరిచయం. కళాకారులకు మంచి గుర్తింపు.కుంభం: అనుకోని ధనవ్యయం. అదనపు బాధ్యతలు. వృత్తి, వ్యాపారాలు కొంత  నిరాశ కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలు. నిరుద్యోగుల ప్రయత్నాలు ముంందుకు సాగవు. దూరప్రయాణాలు.మీనం: నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వృత్తి,వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. సోదరులతోసఖ్యత. నూతన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. 

Revanna File Petition For Pre Arrest Bail In Bengaluru Court
ముందస్తు బెయిల్‌ ఇవ్వండి: కోర్టులో రేవణ్ణ పిటిషన్‌

బెంగళూరు: ఒక మహిళ కిడ్నాప్‌ కేసులో మాజీ మంత్రి హెచ్‌డి రేవణ్ణ ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేశారు. బెయిల్‌ కోసం బెంగళూరు సెషన్స్‌కోర్టులో శుక్రవారం(మే3) పిటిషన్‌ వేశారు. తన తల్లిని రేవణ్ణ ఎత్తుకుపోయారని రేవణ్ణ ఫామ్‌హౌజ్‌లో పనిచేసే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులోని కేఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో రేవణ్ణపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక వేధింపుల(సెక్స్‌ స్కాండల్‌) వీడియోల కేసులో రేవణ్ణ శుక్రవారం సిట్‌ ముందుకు రావాల్సి ఉండగా ఆయన గైర్హాజరయ్యారు. 

How do you label an accused as a murderer
నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?

సాక్షి, అమరావతి: వైఎస్‌ వివేకా హత్య ఐదేళ్ల క్రితం జరిగితే ఇప్పుడెందుకు దాని గురించి ఇంతలా మాట్లాడుతున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె సునీత, టీడీపీ నేత బీటెక్‌ రవిని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసుకు ఎందుకు మసాలా జోడిస్తున్నారని నిలదీసింది. కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించింది. ఓవైపు కేసు విచారణలో ఉంటే నిందితుడిగా ఉన్న వ్యక్తిని హంతకుడని ఎలా చెబుతారని నిలదీసింది. అలాగే హంతకుడిని ముఖ్యమంత్రి రక్షిస్తున్నారని ఎలా అంటారని ప్రశ్నించింది. ఇలా చెప్పడం తప్పు కాదా? నేరపూరిత చర్యల కిందకు రాదా? అని నిలదీసింది. అలాంటప్పుడు కడప కోర్టు అంత అత్యవసరంగా ఎందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని బీటెక్‌ రవి తరఫు సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు ప్రశ్నించారు. దీనికి హైకోర్టు ఘాటుగా స్పందించింది. కోర్టును నిందించవద్దని హెచ్చరించింది. వివేకా హత్య గురించి మాట్లాడొద్దని, అలాగే తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారం చేయొద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ బీటెక్‌ రవి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై వీలైనంత త్వరగా విచారణ ముగించాలని కడప జిల్లా కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 8లోపు నిర్ణయం వెలువరించాలని స్పష్టం చేసింది.తద్వారా కడప జిల్లా కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సునీత, బీటెక్‌ రవి, షర్మిల దాఖలు చేసిన వ్యాజ్యాలను పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ గుహనాథన్‌ నరేందర్, జస్టిస్‌ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.వివేకా హత్య కేసుకు మసాలా ఎందుకు కలుపుతున్నారు..?ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారని ప్రశ్నించింది. అలా హంతకుడని చెప్పడం కోర్టు ధిక్కారమే అవుతుందని వైఎస్సార్‌సీపీ తరఫు సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి తెలిపారు. తిరిగి ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఫలానా వ్యక్తి (ముఖ్యమంత్రి) నిందితులను రక్షిస్తున్నారని ఎలా చెబుతారని నిలదీసింది. వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ పబ్లిక్‌ డాక్యుమెంట్‌ అని, తాము మాట్లాడుతోంది అందులో అంశాలనేనని మురళీ­ధరరావు చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. వివేకా హత్య కేసుకు ఎందుకు మసాలా కలుపుతున్నారని ప్రశ్నించింది. తాము అలాంటిదేమీ చేయడం లేదని గత ఎన్నికల్లో వివేకా హత్య కేసును నారాసుర రక్తచరిత్ర అంటూ ఎన్నికల్లో వాడుకున్నారన్నారు. అదే తాము మాట్లాడుతుంటే తప్పుపడు­తున్నార­న్నారు. సునీత తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో నేతల వ్యాఖ్యలపై అభ్యంతరాలుంటే ఎన్నికల కమిషన్‌ వద్దకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అలాంటిదేమీ చేయకుండా నేరుగా కోర్టులో వేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఈ నెల 8 తేదీలోపు బీటెక్‌ రవి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం వెలువరించాలని కడప జిల్లా కోర్టును ఆదేశించింది.సునీత తదితరుల వ్యాజ్యాలకు విచారణార్హతే లేదు..వైఎస్సార్‌సీపీ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ సునీత, తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్నారు. కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ బీటెక్‌ రవి తదితరులు అక్కడే పిటిషన్లు దాఖలు చేశారని తెలిపారు. వాటిపై కడప జిల్లా కోర్టులో విచారణ జరుగుతోందన్నారు. మళ్లీ ఇదే అంశంపైనే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారని, ఇది ఏమాత్రం సరికాదన్నారు. తాము పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని గడువు ఇవ్వాలని కోరారు. బీటెక్‌ రవి తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. వైఎస్సార్‌సీపీ పిటిషన్‌లో ప్రతివాదులుగా ఉన్న తమ వాదనలు వినకుండానే కడప జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.  

2 crore case without progress
కందికుంట అడ్డంగా దొరికినా..

సాక్షి ప్రతినిధి, అనంతపురం:  శ్రీసత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ కారులో సుమారు రూ.2 కోట్ల నగదు పట్టివేత వ్యవహారంలో పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారింది. నగదు తరలింపులో కందికుంట పాత్రపై పక్కా ఆధారాలు లభ్యమైనప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే కేసును పక్కదోవ పట్టించి.. కందికుంటను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కందికుంట వెంకటప్రసాద్‌ కారులో సుమారు రూ.2 కోట్ల నగదును అనంతపురం నుంచి కదిరికి తరలిస్తుండగా.. నాలుగు రోజుల కిందట అనంతపురం విద్యుత్‌ నగర్‌ సర్కిల్‌లో పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. అది కందికుంట డబ్బేనని కారు డ్రైవర్‌ వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇదే కారుకు ఎన్నికల ప్రచారానికి అనుమతి తీసుకున్నారు. ఇన్ని ఆధారాలున్నప్పటికీ  కందికుంటపై చర్యలు తీసుకోవడానికి జాప్యమెందుకన్నది అంతుచిక్కని విషయం. ఈ కేసును నీరుగార్చేందుకు కుట్ర జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో క్లిష్టమైన కేసులను ఇట్టే ఛేదించిన అనంతపురం పోలీసులు ఈ కేసు విషయంలో ఎందుకో దోబూచులాడుతున్నారు. కేసు నుంచి కందికుంటను తప్పించేందుకు ఏమైనా ప్లాన్‌ వేస్తున్నారా అన్న అనుమానాలు నెలకొన్నాయి. నాలుగు బైకులు పట్టుకుంటేనే హడావుడిగా ప్రెస్‌మీట్‌ పెట్టిమరీ వివరాలు వెల్లడించే పోలీసు అధికారులు.. సుమారు రూ.2 కోట్ల నగదు పట్టుబడిన విషయంలో మాత్రం ఎందుకు నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారో అర్థం కావడంలేదు.రోజుకో మలుపు   భారీస్థాయిలో నగదు పట్టుబడిన ఈ కేసు మలుపులు తిరుగుతోంది. దీనిపై కిందిస్థాయి పోలీసులు ముందుకెళ్లకుండా పైస్థాయి అధికారులు బంధనాలు వేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే కదిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటరి్నంగ్‌ అధికారి (ఆర్‌వో)కి సమాచారం ఇచ్చామని పోలీసులు చెప్పారు. వాస్తవానికి వారు ఆర్‌వోకి సమాచారం ఇవ్వనేలేదు. కందికుంట ఎవరి ద్వారానైనా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారా? లేదా పోలీసులకే దీనిపై ‘ప్రత్యేక శ్రద్ధ’ ఉందా అన్నది తేలడం లేదు. అనంతపురం పోలీసు ఉన్నతాధికారుల వద్ద ఈ కేసు విషయంపై కిందిస్థాయి పోలీసులు చర్చించడానికి కూడా భయపడుతున్నట్టు తెలుస్తోంది. కందికుంట కారులో మూడు బ్యాగులు ఉన్నట్టు పలు టీవీ చానళ్ల విజువల్స్‌లో స్పష్టంగా కనిపిస్తుండగా, పోలీసులు మాత్రం రెండు బ్యాగులే ఉన్నట్లు చెబుతున్నారు. మూడో బ్యాగులోనూ డబ్బులు ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఎక్కడికి వెళ్లాయన్నది తేలాల్సి ఉంది. గతంలో హైదరాబాద్‌–బెంగళూరు జాతీయ రహదారిపై భారీస్థాయిలో హవాలా నగదు పట్టుబడిన కేసులో రెండురోజుల్లోనే నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. అదే ఈ కేసులో మాత్రం ‘అనంత’ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. ఆర్‌వోకి సమాచారం ఇవ్వకుండానే ఇచ్చామని ఒక సీఐ చెప్పడం కూడా అనుమానాలకు తావిస్తోంది.ఆర్వోకి సమాచారం ఇచ్చాం డబ్బుకు సంబంధించి విచారణ చేస్తున్నాం. ఇందులో ఉన్నది రెండు బ్యాగులే. ఒకవేళ  ఉంటే మూడో బ్యాగు బట్టల బ్యాగ్‌ అయి  ఉండొచ్చు. ఆర్వో దగ్గరకు మా అధికారులు వెళ్లారు. ఆర్వో నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయి. ఈలోగా మిగతా విచారణ జరుగుతూనే ఉంటుంది.   – ఈ నెల 2వ తేదీన  అనంతపురం టూటౌన్‌ సీఐ  క్రాంతికుమార్‌‘సాక్షి’కి చెప్పిన వివరాలు నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కందికుంట వెంకటప్రసాద్‌కు  సంబంధించి సీజ్‌చేసిన రూ.2 కోట్ల కేసు వివరాలు ఇప్పటివరకు నాకు అందలేదు. నేను కదిరి ఆర్‌వోగా ఉన్నాను. కేసు అనంతపురంలో బుక్‌ చేశారు. అయినా నేను పోలీసులను అడిగాను. కానీ ఇప్పటివరకు వివరాలు ఇవ్వలేదు. పోలీసులు ఇచ్చే వివరాలను బట్టి మాత్రమే చర్యలు తీసుకోగలం.  – ఈ నెల 3వ తేదీన కదిరి రిటరి్నంగ్‌ అధికారి సన్నీ వంశీకృష్ణ వెల్లడి 

Special article over chandrababu Propaganda of lies
మళ్ళీ వచ్చారు...మౌత్ టాక్ మల్లిగాళ్ళు

సినిమా ఎప్పుడైతే చప్పగా ఉన్నట్లు అనిపిస్తుందో... సరిగ్గా అప్పుడే రెండు కామెడీ జోక్స్...లేదా మంచి మసాలా ఐటం సాంగ్ వేస్తారు... దీంతో మళ్ళీ థియేటర్లో ప్రేక్షకులు ఎటెన్షన్లోకి వచ్చి...సినిమాలో లీనమవుతారు... అచ్చం చంద్రబాబు కూడా ఇదే విధానము ఫాలో అవుతున్నారు.టీడీపీ గ్రాఫ్... చంద్రబాబు ప్రతిష్ట ఎప్పుడైతే డౌన్ అవుతోందని గ్రహిస్తారో.... అప్పుడు  తన మీడియాను... పచ్చ జనాన్ని... అలవోకగా బొంకగలిగేవాళ్లను జనంలోకి దించుతారు... వీళ్ళే మౌత్ టాక్ మల్లిగాళ్ళు  వీళ్ళు జనం ఎక్కువగా ఉండే హోటళ్లు... టీ స్టాళ్లు..బస్సులు...రైల్వే కౌంటర్ల వద్ద అకస్మాత్తుగా ప్రత్యక్షమై ఉన్నఫళంగా ప్రభుత్వాన్ని తిడుతూ అరుస్తూ కేకలు వేస్తారు.. అక్కడ ఉన్నవాళ్ళంతా ఆటే చూసేలా చేస్తారు.ఐదారు నిముషాలు స్క్రిప్ట్ ప్రకారం తమిళ యాక్టర్లు మనోరమ.. శివాజీ గణేష్‌లను  మించిపోయేలా యాక్టింగ్ చేసేసి   వెళ్ళిపోతారు... చూసేవాళ్ళు మాత్రం...వామ్మో ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉందా అని జనం అనుకోవాలనేది వాళ్ళ ప్లాన్. దీనికోసం టీడీపీ ఎన్నారై విభాగం సైతం గ్రామాల్లోకి దిగింది.తమ చుట్టుపక్కల ఉన్నవాళ్లను ప్రభావితం చేసి తెలుగుదేశానికి ఓటేయించడం వారి విధి.. దీనికోసం కోట్లలో నిధులు సైతం సమీకరించి దేశవిదేశాల్లోని ఎన్నారై యువత సెలవులు పెట్టుకుని మరీ పల్లెల్లో, పట్టణాల్లోని కాలనీల్లో పాగా వేసింది..వాస్తవానికి టీడీపీ మ్యానిఫెస్టో జనంలోకి వెళ్ళకపోవడం, ప్రజలు పెద్దగా నమ్మకపోవడం.. సీఎం వైయస్ జగన్ అందిస్తున్న పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలు అర్థం చేసుకుని రాష్ట్రం మరింతగా ప్రగతి సాధించాలంటే మళ్ళీ జగన్ రావాలి..పోర్టులు... మెడికల్ కాలేజీలు... స్కూళ్ళు.. ఇంగ్లిష్ మీడియం చదువులు... ఇప్పుడిప్పుడే ఊపందుకున్న పరిశ్రమలు... ఇవన్నీ పూర్తి కావాలన్నా... ఉద్యోగావకాశాలు పెరగాలన్నా మళ్ళీ జగన్ గెలవాలి...అలాగైతే ఇప్పుడు పురోగతిలో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి అని జనం అనుకుంటున్నారు...దీంతోబాటు   గ్రామస్థాయిలో ప్రజల అభిప్రాయం మాత్రం వేరేలా ఉంది. ఇల్లు కదలకుండా తమ గుమ్మం వద్దకే వస్తున్నా సంక్షేమ పథకాలు... ఊరు దాటకుండానే సచివాలయంలో అందుతున్న ప్రభుత్వ సేవలను అందుకుంటున్న తీరు ప్రజల స్మృతిపథంలో కదులుతూనే ఉన్నాయి. . దీనికితోడు మహిళలు... వికలాంగులు... రైతులు ఈ ఐదేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌ తమకు ఎంత మేలు  ఎంత మేలు  చేశారన్నది లెక్కలు వేసుకుని మరీ ప్రజలు ఓటు చేతబట్టుకుని ఎన్నికల తేదీ కోసం సిద్ధంగా ఉన్నారు.మళ్ళీ తమ సోదరుడిని గెలిపించుకోవాలని వాళ్లంతా ఎదురుచూస్తున్నారు... ప్రజల్లో అలా అభిప్రాయం ఉన్నపుడు ఈ మౌత్ టాక్ మల్లిగాళ్ళు ప్రజల మనోభిప్రాయాలను మార్చలేరని అంటున్నారు. ఎన్నిసారు అరిచినా ఇత్తడిని పుత్తడి చేయలేరని.. చంద్రబాబును మళ్ళీ గెలిపించలేరని అంటున్నారు. గట్టిగా అరిచినంతమాత్రాన అబద్ధాలు నిజాలు కాలేవని... గ్రామసింహం సింహం కాలేదని ప్రజలు అంటున్నారు.-- సిమ్మాదిరప్పన్న 

Vishnu Manchu speaks about Kannappa co star Akshay Kumar
కన్నప్పకి బై బై 

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ‘కన్నప్ప’కి బై బై చెప్పారు. తన పాత్రకి సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసిన ఆయనకి చిత్ర యూనిట్‌ వీడ్కోలు పలికింది. విష్ణు మంచు హీరోగా ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మంచు మోహన్‌బాబు పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్‌ కుమార్, మోహన్‌బాబు, మోహన్‌ లాల్, శరత్‌ కుమార్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైన షెడ్యూల్‌లో అక్షయ్‌ కుమార్‌ జాయిన్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా తన సీన్లకు సంబంధించిన షూట్‌ను ఆయన పూర్తి చేశారు. ‘‘అక్షయ్‌ కుమార్‌గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైనది’’ అని సోషల్‌ మీడియా ద్వారా పేర్కొన్నారు విష్ణు మంచు. ‘‘ధైర్యవంతుడైన యోధుడు, శివ భక్తుడైన కన్నప్ప కథతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది’’ అన్నారు మేకర్స్‌.   

Piyush Chawla overtakes Dwayne Bravo to achieve this incredible milestone
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో రెండో బౌలర్‌గా

టీమిండియా మాజీ క్రికెట‌ర్‌, ముంబై ఇండియ‌న్స్ వెట‌ర‌న్ స్పిన్న‌ర్ పీయూష్ చావ్లా అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్‌లో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన రెండో బౌల‌ర్‌గా పీయూష్ చావ్లా రికార్డుల‌కెక్కాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖ‌డే వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో మ్యాచ్‌లో రింకూ సింగ్‌ను ఔట్ చేసిన చావ్లా.. ఈ అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 189 మ్యాచ్‌లు ఆడిన చావ్లా.. 184 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు విండీస్ దిగ్గజం డ్వెన్ బ్రావో(183) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బ్రావో రికార్డును పీయూష్ బ్రేక్ చేశాడు. ఈ అరుదైన  ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ ఉన్నాడు.  చాహ‌ల్ ఇప్ప‌టివ‌ర‌కు 155 మ్యాచ్‌ల్లో 200 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక   ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 169 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్‌(70) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా.. మ‌నీష్ పాండే(42) ప‌రుగుల‌తో రాణించాడు.  ఇక ముంబై బౌల‌ర్ల‌లో తుషారా, బుమ్రా త‌లా 3 వికెట్లతో చెల‌రేగ‌గా.. హార్దిక్ పాండ్యా రెండు, చావ్లా ఒక్క వికెట్ సాధించారు.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement


ఫోటో స్టోరీస్

View all