Top Stories
ప్రధాన వార్తలు
వెంకన్న సన్నిధిలో విషాదం.. టీటీడీ చరిత్రలో కనివినీ ఎరుగని నిర్లక్ష్యం
చంద్రబాబు ప్రభుత్వ పెనునిర్లక్ష్యం మరోసారి అమాయక భక్తుల ప్రాణాలను బలిగొంది. పవిత్ర తిరుమల-తిరుపతి క్షేత్రాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టుపట్టించిన చంద్రబాబు దుర్మార్గం ఏడుగురు భక్తుల ప్రాణాలను హరించింది. ప్రభుత్వ వైఫల్యమే తిరుపతిలో తొక్కిసలాటకు దారితీసింది. చిత్తశుద్ధి లేని వ్యక్తులకు, వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇచ్చి.. తిరుమల క్షేత్రాన్ని రాజకీయ కేంద్రంగా మార్చారు. భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారు.
Tirupati Stampede: తప్పు ఎవరి వల్ల జరిగింది?
తిరుపతి, సాక్షి: వైకుంఠ ద్వారా దర్శన కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనల వెనుక.. విస్తుపోయే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు తప్పు జరిగిపోయిందంటూ టీటీడీ చైర్మన్ బాధ్యతారాహిత్యంగా ఒక ప్రకటన ఇవ్వగా.. మరోవైపు భక్తులను నియంత్రించాల్సిన పోలీసు యంత్రాగం తీరుపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో.. ఎవరి వల్ల తప్పు జరిగింది? అనేదానిపై దాదాపుగా ఓ స్పష్టత వచ్చింది. టీటీడీ విజిలెన్స్, జిల్లా పోలీసులకు సమన్వయం లేకపోవడంతోనే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు.. భక్తులను మేనేజ్ చేయడంలో ఘోరంగా విఫలమైన పోలీసులు.. భక్తులు క్యూలలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. పశువులతో వ్యవహరించినట్లు భక్తులతో వ్యవహరించారు వాళ్లు. అయితే పోలీసులు ఎందుకు అలర్ట్‌గా ఉండలేకపోయారనేదానికి సమాధానం దొరికింది.జనవరి 6, 7, 8 తేదీల్లో తన సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటించారు. నిన్న మధ్యాహ్నాం దాకా కుప్పంలోనే సీఎం చంద్రబాబు ఉన్నారు. దీంతో పోలీస్ యంత్రాంగం అంతా ఆయన సేవలోనే తరించింది. పైగా.. పర్యటనకు రెండు రోజుల ముందు నుంచే జిల్లా పోలీసులకు డ్యూటీలు వేశారు. దీంతో వరుసగా నాలుగు రోజులపాటు చంద్రబాబు బందోబస్తులోనే పోలీసులు అలసిపోయినట్లు కనిపిస్తోంది. అదే టైంలో..వైకుంఠ ఏకాదశి క్యూ లైన్ల మేనేజ్మెంట్పై ఒక్క రివ్యూ కూడా జిల్లా పోలీసులు నిర్వహించలేదు. బాబు పర్యటన మీద ఫోకస్‌తో ఎస్పీ కూడా ఈ విషయంపై దృష్టి సారించలేదని తెలుస్తోంది. ఆపై ఆ బాధ్యతలను.. తిరుపతి వెస్ట్ సీఐ రామకృష్ణకే అప్పగించారు. దీంతో ఆయన అత్తెసరు పోలీసులతో క్యూలైన్ మేనేజ్మెంట్ బాధ్యతలు నిర్వహించడంతో.. ఘోరం జరిగింది.
Updates: కేటీఆర్‌పై ఏసీబీ ప్రశ్నల వర్షం!
కారు కేసు.. ఏసీబీ ఆఫీస్‌కు కేటీఆర్ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామంబీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్(KTR) విచారణఈ కేసులో ఏ1గా కేటీఆర్తెలంగాణ కోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరటహైకోర్టు తీర్పుతో.. కేటీఆర్ అరెస్ట్‌కు ఏసీబీకి తొలగిన అడ్డంకులు!ఏసీబీ తదుపరి చర్యలపై ఉత్కంఠరెండు గంటలుగా విచారణ ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న ఏసీబీ ప్రత్యేక బృందం రెండు గంటలుగా కొనసాగుతున్న విచారణకేటీఆర్ ఓ రూంలో.. ఆయన లాయర్ మరో రూంలోరేసు ఒప్పందాలు, నగదు బదిలీపైనే ప్రధానంగా కొనసాగుతున్న విచారణకేటీఆర్కు ప్రశ్నల వర్షంఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న అధికారులు ఓ గదిలో కేటీఆర్, పక్కనే లైబ్రరీలో ఆయన లాయర్ రామచందర్రావులాయర్కు కేటీఆర్ కనిపించేలా ఏర్పాట్లుకేటీఆర్పై ప్రశ్నల వర్షం గుప్పిస్తున్న ఏసీబీ అధికారుల బృందంHMDA నుంచి FEOకు రూ. 55 కోట్ల నగదు బదిలీపై ఆరారేసు ఒప్పందాల కోసం ఎవరిని కలిశారు? ఎప్పడెప్పుడు కలిశారు? ఎలాంటి చెల్లింపులు జరిగాయి? ఏదైనా వివాదాలు వస్తాయని ముందు జాగ్రత్తగా ఆర్బిట్రేషన్ పెట్టుకున్నారా?అని ప్రశ్నించే అవకాశం. ACB-KTR వాదనలు ఇలా.. ఏసీబీ: ఒప్పందం కుదరకముందే చెల్లింపులు జరిగాయిKTR: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకే రూ.55 కోట్ల ఖర్చుఏసీబీ: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ చెల్లింపులు జరిగాయిKTR: గ్రీన్కో సంస్థ వెళ్లిపోవడంతో డబ్బులు సర్దుబాటు చేశాంఏసీబీ: ఒప్పందంలో భాగం కాకపోయినా హెచ్ఎండీఏ ద్వారా చెల్లింపులుKTR: డబ్బులు ఇచ్చిన సంగతి హెచ్ఎండీఏకి తెలుసుఏసీబీ: రూ.54 కోట్ల 88 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగంKTR: ఈవెంట్ ద్వారా వచ్చిన ప్రయోజనం రూ.700 కోట్లుఏసీబీ: ఫార్ములా-ఈకి రెండు విడుతల్లో రూ.45 కోట్ల చెల్లింపులుKTR: కొన్ని సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయిఏసీబీ: తొలి విడతలో రూ.22 కోట్ల 69 లక్షల విడుదలKTR: బ్యాటరీ వెహికిల్స్ రీపర్పస్ చేసే విధంగా జీవో తెచ్చాంఏసీబీ: మలివిడతలో రూ.23 కోట్లు చెల్లించిన హెచ్ఎండీఏKTR: మరో సంస్థ రూ.1200 కోట్ల పెట్టుబడులు పెట్టిందిఏసీబీ: ఆర్బీఐ గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా విదేశీ కంపెనీకి చెల్లింపులుKTR: మొబిలిటీ వీక్ ద్వారా ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టాయిప్రత్యేక గదిలో కేటీఆర్ విచారణఏసీబీ కార్యాలయంలో కొనసాగుతున్న కేటీఆర్ విచారణఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులుజాయింట్ డైరెక్టర్, డీఎస్పీ, సీఐల సమక్షంలో కొనసాగుతున్న విచారణవిచారణకు కేటీఆర్ లాయర్, మాజీ ఏఏజీ రామచందర్రావును లోపలికి అనుమతించిన అధికారులుఅరవింద్కుమార్తో పాటు దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ విచారణ?బిజినెస్ రూల్స్ ఉల్లంఘనతో పాటు నిధుల దుర్వినియోగం అభియోగాలుకేబినెట్ అనుమతి లేకుండా ఒప్పందాలు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపుల అభియోగాలపై ప్రశ్నలుఏసీబీ ఆఫీస్‌కు కేటీఆర్ఏసీబీ ఆఫీస్‌కు చేరుకున్న కేటీఆర్నందినగర్ నివాసం నుంచి ఏసీబీ ఆఫీస్‌కు చేరుకున్న కేటీఆర్కేటీఆర్ వెంట ఆయన లాయర్, మాజీ ఏఏజీ రామచంద్రరావు నిఖార్సైన తెలంగాణ బిడ్డను..: కేటీఆర్నందినగర్ నివాసం వద్ద మీడియాతో కేటీఆర్తెలంగాణ ప్రతిష్టను పెంచడానికే నేను ప్రయత్నించానుహైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ప్రయత్నించాంఈ క్రమంలోనే ఈ కార్ రేసు నిర్వహించాంమంత్రిగా తన బామర్దులకు కాంట్రాక్ట్ ఇప్పించే ప్రయత్నం నేనేం చేయలేదుఅరపైసా కూడా అవినీతి చేయలేదుఇంకా ఎన్ని కేసులైనా పెట్టుకో.. వాటిని ఎదుర్కొంటాం (సీఎం రేవంత్‌ను ఉద్దేశించి..)తెలంగాణ బిడ్డగా రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడిగా స్పష్టంగా చెప్తున్నారాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం ప్రపంచ స్థాయిలో ఎదిగేలా పని చేశా.. మేము కుటుంబం కోసం పని చేయలేదునేను 50 లక్షల డబ్బుతో ఎమ్మెల్యే లను కొని దొరికిన దొంగను కాదునిజం నిలకడ మీద తెలుస్తది మీ వైఫల్యాలపై పోరాడింది బీఆర్ఎస్.. అందుకే మా మీద కేసులు మీ డైవర్షన్ లకు లోనుకామునేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను.. ఏ తప్పు చేయలేదుఏ ప్రశ్నలు అడిగిన చెప్తం .. తెలంగాణ కోసం చస్తాను తప్ప తల వంచను ఎక్స్‌లో కేటీఆర్తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకేర్ములా ఈ కార్ రేసు నిర్వహించాంపెట్టుబడులను రప్పించేందుకు కోసం కృషి చేశాంవీటన్నింటిని ప్రజలు అర్థం చేసుకుంటారని విశ్వసిస్తున్నాఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుంది Worked tirelessly for bringing a prestigious event to India, to enhance the Brand image of Hyderabad & Telangana globallyAgenda was to make Hyderabad a pivotal hub for sustainable mobility as the world transitions towards it. Formula-E race was a part of the effort to realise… pic.twitter.com/JhqimVe9TI— KTR (@KTRBRS) January 9, 2025భారీ భద్రత ఏర్పాటుబంజారాహిల్స్లోని ఏసీబీ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తుకేటీఆర్ విచారణ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఏర్పాటుఏసీబీ ఆఫీస్‌కు ఇరువైపులా భారీ బారికేడ్లుమరోవైపు బీఆర్ఎస్ నేతల హౌజ్ అరెస్టులుకేటీఆర్ ఇంటికి బీఆర్ఎస్ నేతల క్యూ
లోకేష్‌కు ప్రత్యేక హోదా వచ్చింది..
ప్రధాని మోదీ విశాఖ పర్యటన పూర్తయింది. గతంలో వైఎస్ జగన్ హయాంలో ఒప్పందాలు కుదుర్చుకున్న పలు సంస్థలు మళ్లీ అదే ఒప్పందాలు ఇప్పుడే కుదర్చుకున్నట్లు ఫోటోలు దిగాయి.. అదంతా బాబు గొప్పతనం అన్నట్లుగా మీడియాలో ప్రచారం కూడా జరిగింది. ఇక పత్రికల్లో భారీ ప్రకటనలు.. రాష్ట్ర స్వరూపం మారిపోతున్నట్లు పెద్ద పెద్ద హోర్డింగులు.. ఇవన్నీ చంద్రబాబు హయాంలో సహజమే అయితే ప్రధాని మీటింగ్ వలన రాష్ట్రానికి. విశాఖ నగరానికి పెద్దగా ప్రయోజనం ఏమీ లేకున్నా లోకేష్ కు మాత్రం ప్రత్యేక హోదా దక్కింది.మోదీ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పెద్దపెద్ద పత్రికా ప్రకటనలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు ఆ ప్రకటనల్లో పెట్టారు అంటే అర్థం ఉంది కానీ కేబినెట్లో అందరిలా మంత్రి పదవి తప్పితే ప్రత్యేకమైన ఏ గుర్తింపు లేని లోకేష్ ఫోటోలు ఎందుకు పెట్టినట్లు.. సీఎం, డిప్యూటీ సీఎం సహా లోకేష్‌ను ప్రధానితో వేదిక మీద ఎందుకు కూర్చోబెట్టినట్లు. ఆయనకు చంద్రబాబు కొడుకుగా కాకుండా ప్రత్యేక గుర్తింపు ఏముంది.?ఇప్పటికే అన్నిశాఖల్లోనూ విపరీతంగా జోక్యం చేసుకుంటూ పెత్తనం సాగిస్తున్న లోకేష్ ఇప్పుడు అనధికార సీఎంగా.. సూపర్ పవర్‌గా ఎదిగారని అధికారులే అంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ పెద్ద ఫైల్ కదలాలన్నా.. ఎవరికీ ఏ పోస్టింగ్ ఇవ్వాలన్నా లోకేష్‌ను కలవాలి అనేది ఒక అనధికారిక జీఓ మాదిరి నడుస్తోంది. ఇక ఇప్పుడు ఆయన్ను డిప్యూటీ సీఎం హోదాలో అధికారికంగా నియమించడమే తరువాయి అని అంటున్నారు.ప్రస్తుతానికి అధికారికంగా అయితే చంద్రబాబు తరువాత పవన్‌కు మాత్రమే ఉప ముఖ్యమంత్రిగా ప్రాధాన్యం దక్కుతోంది. ఇక త్వరలో లోకేష్‌కు కూడా డిప్యూటీ స్థాయికి ఎలివేషన్ ఇచ్చారంటే ఇక పవన్ ప్రాధాన్యం తగ్గినట్లే.. ఇక డిప్యూటీ హోదాలో లోకేష్ మరింతగా రెచ్చిపోయి శాఖలన్నింటినీ కెలికేస్తాడు. పాపం ఇటు పవన్ తన పంచాయతీ రాజ్.. గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన పనులే అర్థం కాక తికమకపడిపోతున్నారు. రానున్న రోజుల్లో పవన్ ప్రాధాన్యం తగ్గించి లోకేష్‌ను ముందుకు తెచ్చేందుకు ఈ మోదీ పర్యటన బాగా ఉపయోగించుకున్నారని అర్థం అవుతోంది.-సిమ్మాదిరప్పన్న
ప్రభాస్ హీరోయిన్‌కి వేధింపులు.. రంగంలోకి పోలీసులు!
సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది చేసింది హీరోయిన్ నిధి అగర్వాల్( Nidhhi Agerwal). సదరు వ్యక్తి తనను చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పంపిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. సదరు వ్యక్తి తనతో పాటు తనకు ఇష్టమైన వారిని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిపింది. ఆయన బెదిరింపుల వల్ల తాను మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నానని, సదరు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిధి అగర్వాల్ తన ఫిర్యాదులో కోరింది. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు నిధి అగర్వాల్ కంప్లైంట్ తీసుకుని, విచారణ చేపట్టారు.వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నిధిబాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్లో రాణిస్తున్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది నిధి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత అక్కినేని అఖిల్ తో మజ్ను అనే సినిమా చేసింది. ఆ సినిమా కూడా నిరాశపరిచింది. దాంతో ఈ బ్యూటీకి ఇక అవకాశాలు రావడం కష్టమే అని అనుకున్నారు అంతా.. ఆతర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాలో నటనతో పాటు గ్లామర్ పరంగాను ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస సినిమా చాన్స్‌లు వచ్చాయి. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌లతో నటిస్తోంది.‘రాజాసాబ్’తో రొమాన్స్మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’(The Raja Saab). కామెడీ హారర్‌గా రాబోతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే మిగతా హీరోయిన్లలో పోలిస్తే నిధి పాత్రకు కాస్త ప్రాధాన్యత ఎక్కువే ఉందట. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.‘వీరమల్లు’కి జోడీగాపవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu). క్రిష్ సారథ్యంలో జ్యోతికృష్ణ దర్శకత్వంలో రానుంది. ఈ చిత్రంలో పవన్‌కి జోడీగా నిధి నటిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ తొలిభాగం ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుంది. అనుపమ్‌ఖేర్, బాబీ దేవోల్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 28న ఈ చిత్రం మొదటి భాగం ప్రేక్షకుల ముందుకురానుంది.
కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. అత్యవసర పరిస్థితి విధింపు
లాస్ ఏంజిల్స్: అమెరికాలోని లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలలోని అడవుల్లో కార్చిచ్చు చల్లారడంలేదు. ఈ కార్చిచ్చుకు ప్రభావితమైన పదివేల మందిలో నటులు, సంగీతకారులు, ఇతర ప్రముఖులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. పాలిసాడ్స్, ఈటన్ తదితర ప్రాంతాల్లో గాలి వేగం చాలా ఎక్కువగా ఉండటంతో అటవీ మంటలు అదుపులోనికి రావడంలేదు. గడచిన 24 గంటల్లో లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలోని గ్రేటర్ లాస్ ఏంజిల్స్ ప్రాంతాల నుండి 70 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ఇళ్లను విడిచిపెట్టిన పదివేల మంది పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు కాలిఫోర్నియా(California) ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని విధించారు.అలాగే అనుభవం ఉన్న రిటైర్డ్ అగ్నిమాపక సిబ్బందిని సహాయం కోసం పిలిపించారు. కాలిఫోర్నియా నగరం చుట్టూ చెలరేగిన మంటల కారణంగా వెయ్యికిపైగా భవనాలు కాలిబూడిదయ్యాయి. పదివేల మంది తమ ఇళ్లను విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అటవీ మంటల నుంచి వెలువడుతున్న పొగ ఆకాశాన్నంతా కమ్మేసింది. పరిస్థితిని అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు.వందల మీటర్ల మేర ఎగిరిపడుతున్న నిప్పురవ్వలుహాలీవుడ్ ప్రముఖులు అమితంగా ఇష్టపడే కాలిఫోర్నియాలోని రియల్ ఎస్టేట్ నేలమట్టమయ్యింది. బలమైన గాలులు మంటలను మరింతగా వ్యాపింపజేశాయి. వందల మీటర్ల మేరకు నిప్పురవ్వలు ఎగిరి పడుతున్నాయి. లాస్ ఏంజిల్స్ కౌంటీ ఫైర్ చీఫ్ ఆంథోనీ మర్రోన్ తెలిపిన వివరాల ప్రకారం మంటలు విస్తరిస్తున్న తీరు అగ్నిమాపక సిబ్బంది(Firefighters)కే ఆశ్చర్యం కలిగిస్తోంది. అయినప్పటికీ సిబ్బంది ఏమాత్రం వెనక్కి తగ్గక అగ్నికీలలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు.చుట్టుపక్కల ప్రాంతాలకు అగ్నికీలలుపసిఫిక్ పాలిసాడ్స్‌లో చెలరేగిన మంటలు బుధవారం మధ్యాహ్నం నాటికి దాదాపు 16 వేల ఎకరాలను దగ్ధం చేశాయి. వెయ్యి ఇళ్లు , వ్యాపార స్థలాలు నాశనమయ్యాయి. నగరానికి ఉత్తరాన ఉన్న అల్టాడెనా సమీపంలోని 10,600 ఎకరాల అడవులు తగలబడిపోతున్నాయి. ఈ మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ లూనా మీడియాతో మాట్లాడుతూ ఈ అగ్ని ప్రమాదాల్లో తొలుత ఇద్దరు మరణించారని, మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.సురక్షిత ప్రాంతాలకు నటులుహాలీవుడ్ ఈవెంట్లలో నిత్యం కళకళలాడే లాస్ ఏంజిల్స్(Los Angeles) లో పమేలా ఆండర్సన్ సినిమా ప్రీమియర్‌తో పాటు పలు కార్యక్రమాలు రద్దయ్యాయి. ప్రముఖ గాయని, నటి మాండీ మూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో చాట్ చేస్తూ అల్టాడెనాలో వ్యాపిస్తున్న మంటలను చూసి తాను తన పిల్లలు, పెంపుడు జంతువులతో పాటు సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లానని తెలిపారు. ఎమ్మీ విజేత, నటుడు జేమ్స్ వుడ్స్ తన ఇంటి సమీపంలోని చెట్లు దహనవడాన్ని సోషల్ మీడియాలో వీడియో ద్వారా చూపించారు. తాను తన ఇంటిని ఖాళీ చేశానని తెలిపారు.ఆస్కార్ నామినేషన్ల ఆవిష్కరణ వాయిదా‘స్టార్ వార్స్’ స్టార్ మార్క్ హామిల్ తన ఇంటిని మంటలు చుట్టుముట్టే పరిస్థితులు ఉండటంతో తన భార్య, పెంపుడు కుక్కతోపాటు సురక్షిత ప్రాంతానికి వెళ్లానని తెలిపారు. ఆస్కార్ విజేత జామీ లీ కర్టిస్ కూడా అయిష్టంగా తన ఇంటిని ఖాళీ చేయవలసి వచ్చింది. కాగా అగ్నిప్రమాదాల బారిన పడిన అకాడమీ సభ్యులు తమ బ్యాలెట్లను వేయడానికి మరింత సమయం ఇచ్చారు. ఆస్కార్ నామినేషన్ల ఆవిష్కరణను జనవరి 19కి వాయిదా వేశారు.ఇది కూడా చదవండి: దేశంలో జరిగిన తొక్కిసలాటలు.. మిగిల్చిన విషాదాలు
చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు ఇదే.. వాళ్లిద్దరికి నో ఛాన్స్!
కొత్త సంవత్సరంలో క్రికెట్ ప్రేమికులకు మజా అందించేందుకు మరో ఐసీసీ టోర్నీ సిద్ధమైంది. హైబ్రిడ్ విధానంలో చాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy 2025) నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్లో.. టీమిండియా మాత్రం తటస్థ వేదికపై తమ మ్యాచ్‌లు ఆడనుంది. దుబాయ్ వేదికగా ప్రత్యర్థి జట్లతో తలపడనుంది.వన్డే ఫార్మాట్ టోర్నీలో ఎనిమిది జట్లుఇక ఈ ఐసీసీ టోర్నీకి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాక్ నేరుగా అర్హత సాధించగా.. వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ క్వాలిఫై అయ్యాయి. ఈ టోర్నీలో పాల్గొనబోయే ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.డెడ్‌లైన్ ఆరోజేగ్రూపు-‘ఎ’లో భారత్‌తో పాటు న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఉండగా.. గ్రూపు-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ పోటీపడనున్నాయి. ఈ మెగా టోర్నీకి సంబంధించి జట్లను ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 12 వరకు గడువు ఇచ్చింది. అదే విధంగా ఈ ప్రొవిజనల్ జట్లలో మార్పులు చేసుకునేందుకు వీలుగా ఫిబ్రవరి 13 వరకు సమయం ఇచ్చింది.ఈ నేపథ్యంలో జనవరి 11న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు బీసీసీఐ ముందుగా జట్టును ప్రకటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈలోపు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఈ రెండు ఈవెంట్లకు తన జట్టును ఎంచుకున్నాడు.మరోసారి కెప్టెన్‌గా, ఓపెనర్‌గా రోహిత్ శర్మ రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగించిన ఆకాశ్ చోప్రా(Aakash Chopra).. శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అయితే, వన్డేల్లో తేలిపోతున్న సూర్యకుమార్ యాదవ్‌తో పాటు సంజూ శాంసన్‌ను కూడా నొర్మొహమాటంగా పక్కన పెట్టాలని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్‌గా, ఓపెనర్‌గా ఉండబోతుఉన్నాడు.వన్డే వరల్డ్‌కప్-2023 నుంచి అతడు 14 ఇన్నింగ్స్ ఆడి 754 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ అర్ధ శతకం ఉంది. ఇక శుబ్‌మన్ గిల్ గణాంకాలు అంత గొప్పగా ఏమీలేవు. ప్రపంచకప్ కలుపుకొని 12 ఇన్నింగ్స్‌లో కలిపి 411 రన్స్ చేశాడు. కాబట్టి యశస్వి జైస్వాల్‌పై కూడా మేనేజ్మెంట్ దృష్టి సారించే అవకాశం ఉంది.సూర్య, సంజూలకు నో ఛాన్స్అయితే, తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కకపోవచ్చు. అయినప్పటికీ ప్రధాన జట్టులో జైస్వాల్ ఉండాలి. ఇక విరాట్ కోహ్లి తప్పక ఈ జట్టులో ఉంటాడు. కానీ సూర్యకుమార్ యాదవ్‌కు మాత్రం ఈసారి జట్టులో స్థానం దక్కదు. విజయ్ హజారే ట్రోఫీలోనూ అతడు పరుగులు రాబట్టలేకపోయాడు.ఇక సంజూ శాంసన్ ఇంత వరకు ఈ దేశీ వన్డే టోర్నీలో ఆడనేలేదు. అయితే, శ్రేయస్ అయ్యర్ మాత్రం వరల్డ్‌కప్ నుంచే మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచకప్ నుంచి 15 ఇన్నింగ్స్‌లో కలిపి 620 రన్స్ చేశాడు. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా కూడా ఈ జట్టులో ఉంటారు. వన్డేల్లో పంత్ రికార్డు గొప్పగా లేకున్నా ఇషాన్ కిషన్ స్థానంలో అతడు టీమ్‌లోకి వస్తాడు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లోనూ దాదాపు ఇదే జట్టు పాల్గొంటుందని అంచనా వేశాడు.చాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.చదవండి: SL vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్
హై-ఎండ్ ప్రాజెక్ట్‌లో ఫ్లాట్స్ కొన్న హీరో వరుణ్ ధావన్ : ఎన్ని కోట్లో తెలుసా?
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అయితే ఇది తన లేటెస్ట్ మూవీ ‘బేబీజాన్’ ఫ్లాప్ గురించి ఎంతమాత్రం కాదు. ముంబైలోని ఖరీదైన జుహూ ఏరియాలో రెండు లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ను కొనుగోలు చేశాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట సందడి చేస్తోంది. ఇంతకీ ఎవరి కోసం ఆ ఫ్లాట్లు కొన్నాడు. తెలుసుకుందాం ఈ కథనంలో..ముంబైలోనిముంబైలోని అత్యంత ప్రీమియం జుహు ఏరియాలో ట్వంటీ అనే హై-ఎండ్ ప్రాజెక్ట్‌లో రెండు అపార్ట్మెంట్లను కొనుగోలు చేశాడు. వీటి ధర ఏకంగా రూ.86.92 కోట్లు. ఫ్యామిలీతో కలిసి ఒకటి భార్య నటాషా దలాల్ కోసం , మరోకటి తల్లి కరుణ్ ధావన్‌కోసం వీటిని సొంతం చేసుకున్నాడు.ఈ ట్వంటీ అనే బిల్డింగ్ లోని ఏడో అంతస్తులో ఒక ఫ్లాట్‌ను నటాషా దలాల్‌తో కలిసి కొన్నాడు. దీని విస్తీరం 5112 చదరపు అడుగులు. ధర రూ.44.52 కోట్లు. ఇందులో నాలుగు కారు పార్కింగ్ స్థలాలున్నాయట. ఇక తల్లి కోసం ఇక అదే బిల్డింగ్ ఆరో అంతస్తులో తన తల్లి కరుణా ధావన్‌తో కలిసి వరుణ్ మరో 4617 చదరపు అడుగుల అపార్ట్మెంట్ కొన్నాడు. దీని ధర రూ.42.4 కోట్లు. ప్రస్తుతం ఈ రెండూ ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి. ఈ ఏడాది మే 31వ తేదీలోపు వీటిని అందజేయనున్నారని స్క్వేర్ యార్డ్స్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఒక్కో అదరపు అడుగు విలువ రూ.60 వేల నుంచి రూ.1.3 లక్షల వరకు ఉంటుంది.విలాసవంతమైన ప్రాజెక్ట్ గురించి మరింత చెప్పాలంటే, ఇది ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీల్లో పెద్ద డిమాండ్ ఉన్న ఏరియా. ఈ ప్రాజెక్ట్‌లో ప్రీమియం సౌకర్యాలతో 3BHK , 4BHK నివాసాలు ఉన్నాయి. అలాగే ముంబైలోని జుహులో అమితాబ్ బచ్చన్ కు రెండు బంగ్లాలు ఉన్నాయి. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, కాజోల్, గోవిందా తదితర హీరోలకు కూడా ఇక్కడ ఇళ్లున్నాయి. ఇక బాంద్రాలో బాలీవుడ్ స్టార్‌హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఆమిర్ ఖాన్, సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ లాంటివాళ్ల నివాసాలు కూడా ఇక్కడే ఉన్నాయి. (ఎప్పటినుంచో ఐఏఎస్ కల..కానీ 13 ఏళ్లకే అనూహ్య నిర్ణయం)వరుణ్ ధావన్ తన చిన్నప్పటి నుంచి తన తండ్రి, నిర్మాత డేవిడ్ ధావన్ ద్వారా బాలీవుడ్‌తో దగ్గరి సంబంధాలతో పెరిగాడు. అయితే ధావన్ కుటుంబం మధ్యతరగతి జీవితాన్ని గడిపింది. 1990లలో డేవిడ్ అనేక విజయాలను అందించినప్పటికీ. నిర్మాత జీవితం దర్శకుడి జీవితం కంటే చాలా భిన్నంగా ఉంటుందని స్వయంగా ఒకసారి చెప్పుకొచ్చాడు. దర్శకుడిగా ఉన్నప్పటికీ తన తండ్రి పెద్దగా సంపాదించలేదన్నారు. అలా సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ నుంచి ముంబైలోని ఎలైట్ సెలబ్రిటీ హాట్‌స్పాట్‌లో రెండు లగ్జరీ రియల్ ఎస్టేట్లను కొనుగోలు దాకా వరుణ్ ఎదగడం విశేషమే మరి.ఇదీ చదవండి : రూ. 25 లక్షల ఐటీ జాబ్ వదిలేసి.. ఆర్గానిక్ వైపు జాహ్నవి జర్నీ!కాగా వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన మూవీ బేబీ జాన్. తమిళ బ్లాక్ బస్టర్ తేరి మూవీ రీమేక్‌గా దీన్ని తీసుకొచ్చారు. అయితే హిందీలో మాత్రం పెద్దగా సక్సెస్‌కాలేకపోయింది. కొత్త పెళ్లికూతురుగా పసుపుతాడుతో కీర్తి సురేష్ ప్రమోషన్స్‌లో పాల్గొన్నప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ‘బేబీ జాన్’ డిజాస్టర్ గా మిగిలి పోయింది.
తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ వింత వ్యాఖ్యలు
సాక్షి, తిరుమల: తిరుపతి తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వింత వ్యాఖ్యలు చేశారు. చింతించడం తప్ప చేసేదేమీ లేదన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎవరూ ఏం చేయలేరు.. దైవ నిర్ణయం. పరిపాలనా లోపం వల్లే తొక్కిసలాట. గొడవలు జరుగుతాయని ముందే తెలుసు’’ అంటూ వ్యాఖ్యానించారు. భక్తుల మరణాలపై టీటీడీ ఛైర్మన్ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‘‘క్యూలైన్లలో సౌకర్యాలు లేవు.మమ్మల్ని చావిడిలో గొడ్డుల్లా లోపల వేశారు. క్యూ లైన్లలో రద్దీని నియంత్రించకలేకపోయారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగింది. తిరుపతిలో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదు. టీటీడీ వైఫల్యం వల్లే తొక్కిసలాట’’ జరిగిందని భక్తులు మండిపడుతున్నారు.వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇచ్చి..ప్రభుత్వ వైఫల్యమే తిరుపతిలో తొక్కిసలాటకు దారితీసిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. చిత్తశుద్ధి లేని వ్యక్తులకు, వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇచ్చి.. తిరుమల క్షేత్రాన్ని రాజకీయ కేంద్రంగా మార్చారన్నారు. భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారని, అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి తిరుమలను వాడుకున్నారన్నారు. గడచిన ఐదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని, మరి ఇప్పుడు ఎందుకు జరిగిందని ప్రభుత్వాన్ని నిలదీశారు.ఇదీ చదవండి: ప్రాణాలతో చెలగాటం.. తిరుమల ఘటనపై భక్తుల రియాక్షన్టీటీడీ చరిత్రలో ఇదొక చీకటి రోజని, చంద్రబాబు ప్రభుత్వం ఈ పాపం మూటగట్టుకుందని వ్యాఖ్యానించారు. ప్రచారాలు, ఆర్భాటాలు తప్ప చంద్రబాబుకు ఏమీ పట్టవని, గోదావరిలో పుష్కరాల తొక్కిసలాట ఘటన ఇప్పటికీ వెంటాడుతున్న చేదు జ్ఞాపకమని చెప్పారు. హిందూ ధర్మంపై భక్తి, శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున దర్శనానికి లక్షలాదిమంది వస్తారని అందరికీ తెలుసని, తెలిసీ ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని నిలదీశారు.తిరుపతిలో పోలీసు అధికారుల దృష్టి అంతా రాజకీయంగా కక్ష తీర్చుకునే కేసులపైనే ఉందన్నారు. తిరుపతి ఎస్పీ టీడీపీ కార్యకర్తగా మారి భక్తుల రక్షణ బాధ్యతలను పట్టించుకోలేదన్నారు. అధికారుల, పోలీసుల మధ్య సమన్వయం లేదని, శ్రీవారి భక్తుల సేవకన్నా, టీటీడీ చైర్మన్‌కు రాజకీయ వ్యాఖ్యానాలే ఎక్కువయ్యాయని ఆక్షేపించారు. ఆయన పనంతా రాజకీయ దు్రష్పచారం చేయడమేనని, టీటీడీ చైర్మన్ తన టీవీ కార్యాలయాలను తిరుమల టికెట్ల విక్రయ కేంద్రాలుగా మార్చారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయని చెప్పారు. తొక్కిసలాట ఘటనపై వెంటనే విచారణ జరగాలని, టీటీడీ చైర్మన్ సహా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆసియా.. ఇండియాలోని ధనవంతుల జాబితా
పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఆసియా, దేశీ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. 2025 జనవరి ప్రారంభం నాటికి పోర్బ్స్ ఆసియా(Forbes Asia) కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ(Ambani) మొదటిస్థానంలో నిలువగా, గౌతమ్ అదానీ(Adani) రెండో స్థానంలో ఉన్నారు. ముఖేశ్ అంబానీ మొత్తం సంపద 96.6 బిలియన్ డాలర్లు ఉండగా, గౌతమ్ అదానీ సంపద 62.1 బిలియన్ డాలర్లుగా ఉంది.ఫోర్బ్స్ ప్రకారం 2025 ప్రారంభం నాటికి ఆసియాలోని టాప్ 10 ధనవంతులుముఖేష్ అంబానీ - 96.6 బిలియన్ డాలర్లు (ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్)గౌతమ్ అదానీ - 62.1 బిలియన్ డాలర్లు (ఇండియా, అదానీ గ్రూప్)జోంగ్ షాన్షాన్ - 53.6 బిలియన్ డాలర్లు (చైనా, నోంగ్ఫు స్ప్రింగ్)ప్రజోగో పంగేస్తు - 55.9 బిలియన్ డాలర్లు (ఇండోనేషియా, బారిటో పసిఫిక్ గ్రూప్)తడాషి యానై అండ్ ఫ్యామిలీ - 47.2 బిలియన్ డాలర్లు (జపాన్, ఫాస్ట్ రిటైలింగ్)జాంగ్ యిమింగ్ - 45.6 బిలియన్ డాలర్లు (చైనా, బైడ్‌డ్యాన్స్, టాక్‌టాక్)సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ - 44.3 బిలియన్ డాలర్లు (ఇండియా, జిందాల్ గ్రూప్)మా హువాటెంగ్ - 43.3 బిలియన్ డాలర్లు (చైనా, టెన్సెంట్ హోల్డింగ్స్)శివ్ నాడార్ - 40 బిలియన్ డాలర్లు (ఇండియా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్)రాబిన్ జెంగ్ - 37.2 బిలియన్ డాలర్లు (హాంకాంగ్, కాంటెంపరరీ ఆంపరెక్స్ టెక్నాలజీ-సీఏటీఎల్)ఇదీ చదవండి: వడ్డీరేట్ల కోత పక్కా..?ఫోర్బ్స్ ప్రకారం 2025 ప్రారంభం నాటికి ఇండియాలోని టాప్ 10 ధనవంతులుముఖేష్ అంబానీ - 96.6 బిలియన్ డాలర్లు (రిలయన్స్ ఇండస్ట్రీస్)గౌతమ్ అదానీ - 62.1 బిలియన్ డాలర్లు (అదానీ గ్రూప్)సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ - 44.3 బిలియన్ డాలర్లు (ఓపీ జిందాల్ గ్రూప్)శివ్ నాడార్ - 40 బిలియన్ డాలర్లు (హెచ్‌సీఎల్ టెక్నాలజీస్)రాధాకిషన్ దమానీ - 31.5 బిలియన్ డాలర్లు (డీమార్ట్)ఉదయ్ కోటక్ - 28 బిలియన్ డాలర్లు (కోటక్ మహీంద్రా బ్యాంక్)సునీల్ మిట్టల్ - 27 బిలియన్ డాలర్లు (భారతీ ఎంటర్ప్రైజెస్)లక్ష్మీ మిట్టల్ - 26 బిలియన్ డాలర్లు (ఆర్సెలర్ మిట్టల్)కుమార మంగళం బిర్లా - 25 బిలియన్ డాలర్లు (ఆదిత్య బిర్లా గ్రూప్)అనిల్ అగర్వాల్ - 24 బిలియన్ డాలర్లు (వేదాంత రిసోర్సెస్)
‘‘అలాగైతే ఇండియా కూటమిని రద్దు చేయండి’’
ఆఫీసు స్థలాలకు డిమాండ్.. ఆల్‌టైమ్ హై!
‘గంభీర్ ఒక మోసగాడు.. గెలిస్తే క్రెడిట్ నాదే అంటాడు.. కానీ’
అన్ని ఫార్మాట్లలో బుమ్రానే బెస్ట్ బౌలర్: ఆసీస్ మాజీ కెప్టెన్
సాక్షి కార్టూన్
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్ఆర్ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా
స్క్రీన్ టైమ్ గురించి ఆలోచించను: శ్రద్ధా శ్రీనాథ్
నేను చేసిన పెద్ద తప్పు అదే!: కంగనా రనౌత్
తొక్కిసలాట బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి: ఆర్కే రోజా
అపోహలు వీడితేనే మంచి స్కోరు
క్షమాపణలు చెప్పిన యాంకర్ శ్రీముఖి.. అసలేం జరిగిందంటే?
ఎన్ని ఫిర్యాదులొచ్చినా మిమ్మల్ని వెతకడానికి ఎవరూ సాహసించరు సార్!!
తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ వింత వ్యాఖ్యలు
ఏడు కొండలవాడా.. ఎంత ఘోరం.. ఎంత ఘోరం
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పనులు చకచకా సాగుతాయి.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
నా బండి ఫొటో ఎందుకు తీశావురా?
తిరుపతి ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
రేపటి నుంచి (జనవరి 9) మరో క్రికెట్ పండుగ.. అభిమానులకు జాతరే..!
బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. సంక్రాంతికి మిస్ 'ఫైర్' !
‘‘అలాగైతే ఇండియా కూటమిని రద్దు చేయండి’’
ఆఫీసు స్థలాలకు డిమాండ్.. ఆల్‌టైమ్ హై!
‘గంభీర్ ఒక మోసగాడు.. గెలిస్తే క్రెడిట్ నాదే అంటాడు.. కానీ’
అన్ని ఫార్మాట్లలో బుమ్రానే బెస్ట్ బౌలర్: ఆసీస్ మాజీ కెప్టెన్
సాక్షి కార్టూన్
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్ఆర్ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా
స్క్రీన్ టైమ్ గురించి ఆలోచించను: శ్రద్ధా శ్రీనాథ్
నేను చేసిన పెద్ద తప్పు అదే!: కంగనా రనౌత్
తొక్కిసలాట బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి: ఆర్కే రోజా
అపోహలు వీడితేనే మంచి స్కోరు
క్షమాపణలు చెప్పిన యాంకర్ శ్రీముఖి.. అసలేం జరిగిందంటే?
ఎన్ని ఫిర్యాదులొచ్చినా మిమ్మల్ని వెతకడానికి ఎవరూ సాహసించరు సార్!!
తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ వింత వ్యాఖ్యలు
ఏడు కొండలవాడా.. ఎంత ఘోరం.. ఎంత ఘోరం
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పనులు చకచకా సాగుతాయి.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
నా బండి ఫొటో ఎందుకు తీశావురా?
తిరుపతి ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
రేపటి నుంచి (జనవరి 9) మరో క్రికెట్ పండుగ.. అభిమానులకు జాతరే..!
బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. సంక్రాంతికి మిస్ 'ఫైర్' !
సినిమా
నా మౌనం బలహీనతకు సంకేతం కాదు: చాహల్ సతీమణి
భారత స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ (Dhanashree Verma) విడాకులకు సిద్ధమవుతున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె పలుమార్లు పరోక్షంగా పోస్టులు పెడుతూనే ఉంది. అయితే, తాజాగా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. విడాకుల నేపథ్యంపై ప్రచారం మొదలైన సందర్భం నుంచి ఆమెపై ఎక్కువగా ట్రోల్స్ వస్తున్నాయి. వాటి వల్ల తాను చాలా వేదనకు గురౌతున్నట్లు ఆమె పేర్కొంది.'గత కొన్ని రోజులుగా నా కుటుంబంతో పాటు నేను కూడా చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. నా కుటుంబంపై కొందరు నిరాధారమైన వార్తలు రాస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా నాపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ట్రోల్స్ చేస్తూ నా ప్రతిష్టను కొందరు పూర్తిగా నాశనం చేస్తున్నారు. నేను చాలా కలత చెందుతున్నాను. నేను ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డాను. నా మౌనం బలహీనతకు సంకేతం కాదు. సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం చాలా సులభం. ఇలాంటి సమయంలో కూడా ఇతరులపై కరుణ చూపాలంటే ధైర్యం చాలా అవసరం. నిజం తప్పకుండా గెలుస్తోంది. నేను ఏ విషయంలోనూ సమర్థించుకోను' అని ఆమె తెలిపారు. (ఇదీ చదవండి: 'పుష్ప2' మేకింగ్ వీడియో.. బెంగాల్లో బన్నీ ఆల్ టైమ్ రికార్డ్)2020 డిసెంబర్లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ విడిపోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. 2022లో తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ‘చాహల్’ (Yuzvendra Chahal) పేరును ధనశ్రీ తొలగించింది. అప్పుడు కూడా ఇలాంటి వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ముంబయికి చెందిన దంత వైద్యురాలు అయిన ధనశ్రీ మంచి కొరియోగ్రాఫర్ కూడా. ఓ డ్యాన్స్ రియాలిటీ షోలోనూ ఆమె పోటీపడింది. తనకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో ఆమె డ్యాన్స్ వీడియోలకు మిలియన్ కొద్ది వ్యూస్ వస్తుంటాయి. స్వతహాగా డ్యాన్సర్ అయిన ధనశ్రీ వర్మ.. పలు ఆల్బమ్ సాంగ్స్‌తో చాలా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకు సినిమా ఛాన్స్ దక్కింది. తెలుగులో 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీస్తున్న ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్.. హీరోగా పరిచయమవుతున్నాడు.
'పుష్ప2' మేకింగ్ వీడియో.. బెంగాల్లో బన్నీ ఆల్ టైమ్ రికార్డ్
పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ (Allu Arjun) నటనకు సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో బన్నీ అస్సలు తగ్గడం లేదు. వసూళ్ల విషయంలో కనపడిన ప్రతి రికార్డ్‌ను రప్పా రప్పా అంటూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇంతలోనే పుష్ప రీలోడ్ వర్షన్ పేరుతో జనవరి 17న మళ్లీ థియేటర్స్‌లోకి రానున్నాడు. దీంతో తాజాగా ఈ చిత్రం నుంచి మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.కేవలం 32 రోజుల్లోనే ‘పుష్ప 2 : ది రూల్’ (Pushpa 2: The Rule ) ప్రపంచ వ్యాప్తంగా రూ.1831 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు. అల్లు అర్జున్ , రష్మికా మందన్నా(Rashmika Mandanna) జోడీగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేకపాటలో ప్రేక్షకులను మెప్పించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 5న విడుదలైంది. (ఇదీ చదవండి: నయనతార, ధనుష్ కేసు విచారణలో ఏం జరిగిందంటే..?)అయితే, 22నిమిషాల నిడివిని అదనంగా ఈ చిత్రానికి కలపనున్నారు. వాస్తవంగా పుష్ప2 రీలోడ్ వర్షన్ జనవరి 10వ తేదీనే విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, సంక్రాంతి రేసులో మూడు సినిమాలు వస్తుండటంతో కలెక్షన్స్ పరంగా వాటిపై ప్రభావం చూపించవచ్చని విడుదలను వాయిదా వేసుకున్నారు. దీంతో జనవరి 17న రీలోడ్ వర్షన్ రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించడం విశేషం.బెంగాల్లో పుష్పరాజ్ ఆల్ టైమ్ రికార్డ్బెంగాల్లో పుష్ప ఓ రికార్డ్ సాధించింది. మామూలుగా బెంగాలీ సినిమా మార్కెట్ చాలా చిన్నదని తెలిసిందే. అక్కడ ఎక్కువగా తక్కువ బడ్జెట్ చిత్రాలు మాత్రమే తెరకెక్కుతుంటాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ బెంగాల్లో రూ. 50 కోట్లు వసూలు చేసి, సంచలనం సృష్టించింది. కాగా ‘అమేజాన్ ఓబిజాన్’ (2017) అనే చిత్రం రూ. 48 కోట్ల వసూళ్లతో అప్పట్లో రికార్డ్ నెలకొల్పింది. ఇది స్ట్రయిట్ చిత్రం. ఆ రికార్డును తాజాగా ‘పుష్ప 2’ బ్రేక్ చేసింది. ఒక డబ్బింగ్ సినిమా ఇలా ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పడం అంటే మామూలు విషయం కాదని చెప్పవచ్చు.
నయనతార, ధనుష్ కేసు విచారణలో ఏం జరిగిందంటే..?
కోలీవుడ్ నటి నయనతారపై నటుడు ధనుష్ చెన్నై హైకోర్టులో వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం నుంచి వచ్చే తీర్పుపై ఆసక్తి నెలకొంది. నయనతార తన బయోపిక్‌ను 'నయనతార బిహైండ్ ది ఫెయిరీ టెల్' పేరుతో డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. దీని విడుదల హక్కులను నెట్‌ప్లిక్స్ ఓటిటి సంస్థ పొంది ఇటీవలే విడుదల చేసింది. కాగా ఈ చిత్రంలో నటుడు ధనుష్ తన వండర్ ఫిలిమ్స్ పతాకంపై విజయ్ సేతుపతి, నయనతార జంటగా నిర్మించిన నాను రౌడీదాన్ చిత్రంలోని రెండు మూడు నిమిషాల నిడివి కలిగిన సన్నివేశాలను ఆ డాక్యుమెంటరీ చిత్రంలో వాడుకున్నారు. దీంతో తన అనుమతి లేకుండా తన చిత్రంలోని సన్నివేశాలను వాడుకున్నందుకుగాను నటుడు ధనుష్ నయనతారపై రూ.10 కోట్లు నష్టపరిహారం కోరుతూ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో న్యాయస్థానం అ పిటిషన్ పై వివరణ కోరుతూ గత నెల 8వ తేదీన నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్తోపాటూ నెట్‌ప్లిక్స్ ఓటీటీ సంస్థకు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసు తాజాగా మరోసారి కోర్టులో న్యాయమూర్తి అబ్దుల్ ఖుదూస్ సమక్షంలో విచారణకు వచ్చింది. కాగా నెట్ ఫిక్స్ ఓటీటీ సంస్థ వివరణ ఇవ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని కోరడంతో, అందుకు అవకాశం ఇచ్చిన న్యాయమూర్తి తదుపరి విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు.చంద్రముఖితో కూడా అదే వివాదంనయనతార చంద్రముఖి సినిమాతో కూడా వివాదంలో చిక్కుకుంది. తమ అనుమతి లేకుండా చంద్రముఖి సినిమాలోని సన్నివేశాలను తన డాక్యుమెంటరీలో వాడుకున్నందుకు నిర్మాతలు నయనతారకు నోటీసులు పంపించారు. హీరోయిన్, ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తమకు రూ.5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధనుష్‌పై పదునైన మాటలతో విరుచుకుపడిని నయన్.. చంద్రముఖి చిత్ర యూనిట్‌పై ఎలాంటి కామెంట్ చేయలేదు.ధనుష్‌పై భగ్గుమన్న నయన్ధనుష్ తమపై చాలాకాలంగా ద్వేషాన్ని పెంచుకున్నాడని నయన్ తెలిపింది. తనలోని దాగి ఉన్న పగన ఇలా చూపించడం వల్లే తాము బాధపడాల్సి వస్తోందని ఆమె అన్నారు. 'నేనూ రౌడీనే షూటింగ్ టైంలో మేం మా ఫోన్లో తీసుకున్న వీడియోని ట్రైలర్లో 3 సెకన్లు ఉపయోగించినందుకు నువ్వు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం. నువ్వు ఇంతలా దిగజారుతావ్ అనుకోలేదు. దీన్నిబట్టి నీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతోంది. నీ అభిమానుల ముందు, బయట ఎంతలా నటిస్తున్నావో తెలుస్తోంది. మాతో మాత్రం అలా ప్రవర్తించకు. సినిమా సెట్లో ఉన్న వాళ్లందరి జీవితాల్ని శాసించే హక్కు నిర్మాతకు ఉందా..?' అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
షష్టిపూర్తి సినిమాని కుటుంబమంతా చూడాలి– రాజేంద్ర ప్రసాద్
‘‘మంచి కథతో రూపొందిన చిత్రం ‘షష్టిపూర్తి’. తెలుగు వారి సంప్రదాయం, సంస్కృతిని ఇష్టపడేవారు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలి. మన ఇంట్లో ఏం ఉంటే సంతోషంగా ఉంటామనేది ఈ చిత్రం చెబుతుంది. అందుకే అందరూ కుటుంబంతో సహా థియేటర్‌కి వెళ్లి ఈ సినిమా చూడాలి’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ కోరారు. రూపేష్, ఆకాంక్షా సింగ్ జంటగా, రాజేంద్ర ప్రసాద్, అర్చన మరో జోడీగా నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించారు. బుధవారం జరిగిన సమావేశంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఆ నలుగురు’ తర్వాత నేను చేసిన సినిమాలు భగవంతుడు వేసిన భిక్ష అనుకోవాలి. ‘షష్టిపూర్తి’ లాంటి అద్భుతమైన సినిమా చేసే అవకాశాన్ని నాకు కల్పించాడు దర్శకుడు పవన్. ‘లేడీస్ టైలర్’ తర్వాత అర్చన, నేను మళ్లీ నటించిన ‘షష్టిపూర్తి’లో మా ఇద్దరి పాత్రలు అద్భుతంగా ఉంటాయి’’ అని చెప్పారు. అర్చన మాట్లాడుతూ–‘‘చాలా విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ‘షష్టిపూర్తి’ ద్వారా నాకు ఇంత గొప్ప స్వాగతం పలికిన అందరికీ కృతజ్ఞతలు’’ అని తెలిపారు. ‘‘నా మొదటి సినిమా ఇది. అందరూ ఆదరించాలి’’ అన్నారు రూపేష్. పవన్ ప్రభ మాట్లాడుతూ–‘‘నాకు ఇంతమంచి నటీనటులను, సాంకేతిక నిపుణులను ఇచ్చిన నిర్మాత రూపేష్‌గారికి థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. ‘‘మా సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడాలి’’ అని ఆకాంక్షా సింగ్ అన్నారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు
చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు ఇదే.. వాళ్లిద్దరికి నో ఛాన్స్!
కొత్త సంవత్సరంలో క్రికెట్ ప్రేమికులకు మజా అందించేందుకు మరో ఐసీసీ టోర్నీ సిద్ధమైంది. హైబ్రిడ్ విధానంలో చాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy 2025) నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్లో.. టీమిండియా మాత్రం తటస్థ వేదికపై తమ మ్యాచ్‌లు ఆడనుంది. దుబాయ్ వేదికగా ప్రత్యర్థి జట్లతో తలపడనుంది.వన్డే ఫార్మాట్ టోర్నీలో ఎనిమిది జట్లుఇక ఈ ఐసీసీ టోర్నీకి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాక్ నేరుగా అర్హత సాధించగా.. వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ క్వాలిఫై అయ్యాయి. ఈ టోర్నీలో పాల్గొనబోయే ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.డెడ్‌లైన్ ఆరోజేగ్రూపు-‘ఎ’లో భారత్‌తో పాటు న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఉండగా.. గ్రూపు-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ పోటీపడనున్నాయి. ఈ మెగా టోర్నీకి సంబంధించి జట్లను ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 12 వరకు గడువు ఇచ్చింది. అదే విధంగా ఈ ప్రొవిజనల్ జట్లలో మార్పులు చేసుకునేందుకు వీలుగా ఫిబ్రవరి 13 వరకు సమయం ఇచ్చింది.ఈ నేపథ్యంలో జనవరి 11న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు బీసీసీఐ ముందుగా జట్టును ప్రకటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈలోపు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఈ రెండు ఈవెంట్లకు తన జట్టును ఎంచుకున్నాడు.మరోసారి కెప్టెన్‌గా, ఓపెనర్‌గా రోహిత్ శర్మ రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగించిన ఆకాశ్ చోప్రా(Aakash Chopra).. శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అయితే, వన్డేల్లో తేలిపోతున్న సూర్యకుమార్ యాదవ్‌తో పాటు సంజూ శాంసన్‌ను కూడా నొర్మొహమాటంగా పక్కన పెట్టాలని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్‌గా, ఓపెనర్‌గా ఉండబోతుఉన్నాడు.వన్డే వరల్డ్‌కప్-2023 నుంచి అతడు 14 ఇన్నింగ్స్ ఆడి 754 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ అర్ధ శతకం ఉంది. ఇక శుబ్‌మన్ గిల్ గణాంకాలు అంత గొప్పగా ఏమీలేవు. ప్రపంచకప్ కలుపుకొని 12 ఇన్నింగ్స్‌లో కలిపి 411 రన్స్ చేశాడు. కాబట్టి యశస్వి జైస్వాల్‌పై కూడా మేనేజ్మెంట్ దృష్టి సారించే అవకాశం ఉంది.సూర్య, సంజూలకు నో ఛాన్స్అయితే, తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కకపోవచ్చు. అయినప్పటికీ ప్రధాన జట్టులో జైస్వాల్ ఉండాలి. ఇక విరాట్ కోహ్లి తప్పక ఈ జట్టులో ఉంటాడు. కానీ సూర్యకుమార్ యాదవ్‌కు మాత్రం ఈసారి జట్టులో స్థానం దక్కదు. విజయ్ హజారే ట్రోఫీలోనూ అతడు పరుగులు రాబట్టలేకపోయాడు.ఇక సంజూ శాంసన్ ఇంత వరకు ఈ దేశీ వన్డే టోర్నీలో ఆడనేలేదు. అయితే, శ్రేయస్ అయ్యర్ మాత్రం వరల్డ్‌కప్ నుంచే మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచకప్ నుంచి 15 ఇన్నింగ్స్‌లో కలిపి 620 రన్స్ చేశాడు. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా కూడా ఈ జట్టులో ఉంటారు. వన్డేల్లో పంత్ రికార్డు గొప్పగా లేకున్నా ఇషాన్ కిషన్ స్థానంలో అతడు టీమ్‌లోకి వస్తాడు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లోనూ దాదాపు ఇదే జట్టు పాల్గొంటుందని అంచనా వేశాడు.చాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.చదవండి: SL vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్
బుమ్రా చాంపియన్స్ ట్రోఫీకి డౌటే.. కానీ: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు సందర్భంగా అతడి గాయం తిరగబెట్టింది. వెంటనే బుమ్రాను ఆట మధ్యలోనే స్కానింగ్‌కు తరలించారు.ఈ క్రమంలో అతడు రెండు ఇన్నింగ్స్ మొత్తానికి దూరమయ్యాడు. కీలకమైన మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్ చేయలేకపోయాడు. అయితే ఛాంపియన్స్ ట్రోపీ 2025కు ముందు బుమ్రా గాయం భారత సెలక్టర్లను తెగ ఆందోళన కలిగిస్తోంది. అస్సలు ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడుతాడా? లేదా అని అభిమానులు సైతం టెన్షన్ పడుతున్నారు. కాగా బుమ్రా గాయంపై ఇంకా స్పష్టత రాలేదు.అతడి గాయం తీవ్రత ఏ స్ధాయిలో ఉందో కూడా తెలియదు. ఒకవేళ అతడి గాయం గ్రేడ్ 1 కేటగిరీలో ఉంటే, ఈ స్టార్ పేసర్ దాదాపు 5 నుంచి ఆరు వారాల పాటు ఆటకు దూరం ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అతడు ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లను కోల్పోవలసి ఉంటుంది.అయితే బీసీసీఐ మాత్రం బమ్రా గాయంపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనే ఆయా దేశ క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను జనవరి 12 నాటికి ఐసీసీకి సమర్పించాలి. దీంతో బుమ్రా గాయంపై ఒకట్రెండు రోజుల్లో అప్డేట్ వచ్చే అవకాశముంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడేది అనుమానమే అని అలీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బుమ్రా గాయంపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు ఆడే అవకాశాలు కేవలం 10 శాతం మాత్రమే ఉన్నాయని తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.కాగా జస్ప్రీత్ భారత జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ బుమ్రా అదరగొట్టాడు. మొత్తం 5 మ్యాచ్‌లో 32 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా జస్ప్రీత్ నిలిచాడు. ఈ సిరీస్‌లో మొత్తం 150 ఓవర్లకు పైగా బౌలింగ్ చేయడం విశేషం.టాప్‌లోనే బుమ్రా..ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ బుమ్రా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇప్పటికే 907 రేటింగ్ పాయింట్లతో భారత్ నుంచి అత్యుత్తమ రేటింగ్ సాధించిన బౌలర్‌గా నిలిచిన బుమ్రా... ఇప్పుడు మరో పాయింట్ సాధించి 908 పాయింట్లతో నంబర్‌వన్‌గా నిలిచాడు.ఈ జాబితాలో కమిన్స్ (841) రెండో స్థానంలో కొనసాగుతుండగా... భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా ఒక స్థానం మెరుగుపర్చుకొని 9వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో యశస్వి జైస్వాల్ తన 4వ స్థానాన్ని నిలబెట్టుకోగా... సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మెరుపు అర్ధసెంచరీ సాధించిన రిషభ్ పంత్ మూడు స్థానాలు ఎగబాకి 9వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. టెస్టు ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో జడేజా నంబర్‌వన్‌గానే కొనసాగుతున్నాడు.చదవండి: SL vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్..
అథ్లెట్స్ కమిషన్ చైర్‌పర్సన్‌గా అంజూ
చండీగఢ్: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) నూతన కార్యవర్గం తొలి వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా 9 మంది అథ్లెట్లతో కూడిన ఏఎఫ్ఐ అథ్లెట్స్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఆరుగురు మహిళా అథ్లెట్లు, ముగ్గురు పురుష అథ్లెట్లకు చోటు దక్కింది. తాజా ఎన్నికల్లో మరోసారి సీనియర్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన ‘డబుల్ ఒలింపియన్’ మాజీ లాంగ్‌జంపర్ అంజూ బాబీ జార్జి... ఈ కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా వ్యవహరించనుంది. ఈ కమిషన్‌లో అంజూతో పాటు జ్యోతిర్మయి సిక్దర్ (రన్నింగ్), కృష్ణ పూనియా (డిస్కస్ త్రో), ఎండీ వల్సమ్మ (హర్డిల్స్), సుధా సింగ్ (స్టీపుల్‌ఛేజ్), సునీతా రాణి (రన్నింగ్) చోటు దక్కించుకున్నారు. పురుషుల విభాగం నుంచి ఏఎఫ్ఐ అధ్యక్షుడు బహదూర్ సింగ్ సాగూతో పాటు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, అవినాశ్ సాబ్లే (స్టీపుల్ ఛేజ్) ఉన్నారు. గత కమిషన్‌లో నలుగురు మహిళలు ఉండగా... ఇప్పుడు వారి ప్రాతినిధ్యాన్ని పెంచుతూ ఆ సంఖ్యను 6 చేశారు. బహదూర్ సింగ్ గతంలో సుదీర్ఘ కాలం ఈ కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. బిజీ షెడ్యూల్ కారణంగా కమిషన్‌కు ఎక్కువ సమయం కేటాయించలేనని చెప్పినప్పటికీ... ఏఎఫ్ఐ ఎక్స్క్యూటివ్ కౌన్సిల్ నీరజ్ చోప్రాతో చర్చించి అతడిని కమిషన్‌లో భాగం చేసింది. 2012 నుంచి వరుసగా మూడు పర్యాయాలు ఏఎఫ్ఐ అధ్యక్షుడిగా వ్యవహరించిన అదిలె సుమరివాలా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కొనసాగనున్నారు. ప్రస్తుతం ప్రపంచ అథ్లెటిక్స్ కౌన్సిల్ బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్న సుమరివాలాకు.. ఏఎఫ్ఐ ఎక్స్క్యూటివ్ కౌన్సిల్ సమావేశాలకు హజరయ్యే అధికారాలు ఉన్నాయి. డోపింగ్ ఉదంతాల వల్ల దేశ అథ్లెటిక్స్ ప్రభ మసకబారకుండా తగిన చర్యలు చేపట్టాలని ఏఎఫ్ఐ నిర్ణయించింది. దీని కోసం అథ్లెట్ల శిక్షణకు సంబంధించిన వివరాలను జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)తో కలిసి పర్యవేక్షించనుంది.
ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్..
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో ఆస్ట్రేలియా తమ ఆఖరి సిరీస్‌కు సిద్దమవుతోంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న ఆసీస్.. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య జనవరి 29 నుంచి ఈ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.ఈ క్రమంలో లంకతో సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ టూర్‌కు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(Pat cummins) దూరమయ్యాడు. అతడి భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుండడంతో ఈ సిరీస్ నుంచి కమ్మిన్స్ తప్పుకున్నాడు. అతడి స్దానంలో స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith ) ఎంపికయ్యాడు.స్టార్క్‌కు నో రెస్ట్..అదే విధంగా ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆడనున్నాడు. తొలుత అతడికి విశ్రాంతి ఇస్తారని వార్తలు వినిపించినప్పటికి, ఆసీస్ సెలక్టర్లు మాత్రం జట్టులో కొనసాగించారు. మరోవైపు స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ప్రక్కటెముకుల గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు.భారత్‌తో జరిగిన సిరీస్‌లో గాయపడిన హాజిల్‌వుడ్.. ఇంకా కోలుకోవడానికి నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అతడు తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో రానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి. ఈ లంక సిరీస్‌కు ఎంపికైన జట్టులో మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, స్కాట్ బోలాండ్ ఫ్రంట్‌లైన్ పేసర్లగా ఉన్నారు.యువ సంచలనానికి పిలుపు..ఆస్ట్రేలియా అండర్-19 జట్టు మాజీ కెప్టెన్ కూపర్ కొన్నోలీకి తొలిసారి సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఈ 16 మంది సభ్యుల జట్టులో కొన్నోలీకి చోటు దక్కింది. దేశీవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు. కొన్నోలీ ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్స్కార్చర్స్ తరపున ఆడుతున్నాడు.ఈ 21 ఏళ్ల కొన్నోలీకి బ్యాటింగ్‌తో అద్బుతమైన బౌలింగ్ సిల్క్స్ కూడా ఉన్నాయి. ఇక భారత్‌తో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్న స్పిన్నర్లు మాట్ కుహ్నెమాన్, టాడ్ మర్ఫీ తిరిగి జట్టులోకి వచ్చారు. అదేవిధంగా బీజీటీలో అదరగొట్టిన సామ్ కాన్స్టాస్, వెబ్స్టార్లను శ్రీలంక సిరీస్‌కు కూడా ఆసీస్ సెలక్టర్లు కొనసాగించారు.ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్ (వైస్ కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, నాథన్ మెక్‌స్వీనీ, టాడ్ మర్ఫీ , మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్చదవండి: 'రోహిత్ నిర్ణయం సరైనది కాదు.. ఇక టెస్టులకు విడ్కోలు పలికితే బెటర్'
బిజినెస్
ఆసియా.. ఇండియాలోని ధనవంతుల జాబితా
పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఆసియా, దేశీ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. 2025 జనవరి ప్రారంభం నాటికి పోర్బ్స్ ఆసియా(Forbes Asia) కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ(Ambani) మొదటిస్థానంలో నిలువగా, గౌతమ్ అదానీ(Adani) రెండో స్థానంలో ఉన్నారు. ముఖేశ్ అంబానీ మొత్తం సంపద 96.6 బిలియన్ డాలర్లు ఉండగా, గౌతమ్ అదానీ సంపద 62.1 బిలియన్ డాలర్లుగా ఉంది.ఫోర్బ్స్ ప్రకారం 2025 ప్రారంభం నాటికి ఆసియాలోని టాప్ 10 ధనవంతులుముఖేష్ అంబానీ - 96.6 బిలియన్ డాలర్లు (ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్)గౌతమ్ అదానీ - 62.1 బిలియన్ డాలర్లు (ఇండియా, అదానీ గ్రూప్)జోంగ్ షాన్షాన్ - 53.6 బిలియన్ డాలర్లు (చైనా, నోంగ్ఫు స్ప్రింగ్)ప్రజోగో పంగేస్తు - 55.9 బిలియన్ డాలర్లు (ఇండోనేషియా, బారిటో పసిఫిక్ గ్రూప్)తడాషి యానై అండ్ ఫ్యామిలీ - 47.2 బిలియన్ డాలర్లు (జపాన్, ఫాస్ట్ రిటైలింగ్)జాంగ్ యిమింగ్ - 45.6 బిలియన్ డాలర్లు (చైనా, బైడ్‌డ్యాన్స్, టాక్‌టాక్)సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ - 44.3 బిలియన్ డాలర్లు (ఇండియా, జిందాల్ గ్రూప్)మా హువాటెంగ్ - 43.3 బిలియన్ డాలర్లు (చైనా, టెన్సెంట్ హోల్డింగ్స్)శివ్ నాడార్ - 40 బిలియన్ డాలర్లు (ఇండియా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్)రాబిన్ జెంగ్ - 37.2 బిలియన్ డాలర్లు (హాంకాంగ్, కాంటెంపరరీ ఆంపరెక్స్ టెక్నాలజీ-సీఏటీఎల్)ఇదీ చదవండి: వడ్డీరేట్ల కోత పక్కా..?ఫోర్బ్స్ ప్రకారం 2025 ప్రారంభం నాటికి ఇండియాలోని టాప్ 10 ధనవంతులుముఖేష్ అంబానీ - 96.6 బిలియన్ డాలర్లు (రిలయన్స్ ఇండస్ట్రీస్)గౌతమ్ అదానీ - 62.1 బిలియన్ డాలర్లు (అదానీ గ్రూప్)సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ - 44.3 బిలియన్ డాలర్లు (ఓపీ జిందాల్ గ్రూప్)శివ్ నాడార్ - 40 బిలియన్ డాలర్లు (హెచ్‌సీఎల్ టెక్నాలజీస్)రాధాకిషన్ దమానీ - 31.5 బిలియన్ డాలర్లు (డీమార్ట్)ఉదయ్ కోటక్ - 28 బిలియన్ డాలర్లు (కోటక్ మహీంద్రా బ్యాంక్)సునీల్ మిట్టల్ - 27 బిలియన్ డాలర్లు (భారతీ ఎంటర్ప్రైజెస్)లక్ష్మీ మిట్టల్ - 26 బిలియన్ డాలర్లు (ఆర్సెలర్ మిట్టల్)కుమార మంగళం బిర్లా - 25 బిలియన్ డాలర్లు (ఆదిత్య బిర్లా గ్రూప్)అనిల్ అగర్వాల్ - 24 బిలియన్ డాలర్లు (వేదాంత రిసోర్సెస్)
డబ్బు లేకపోయినా ఫ్లైట్ బుకింగ్.. వినూత్న ఆఫర్
ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ మేక్మైట్రిప్ (MakeMyTrip) దేశంలో తొలిసారిగా వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. విమానాల్లో విదేశాలకు (international flights) వెళ్లేవారికి పార్ట్ పేమెంట్ (part payment) ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. మొత్తం ఛార్జీలో తొలుత 10 నుండి 40 శాతం మధ్య చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని ప్రయాణ తేదీకి ముందు లేదా టికెట్ బుక్ చేసిన 45 రోజుల్లోగా పూర్తి చేయాలి.పార్ట్ పేమెంట్ ఆప్షన్ని ఎంచుకునే కస్టమర్లు చార్జీ మొత్తాన్ని చెల్లించిన తర్వాత నిబంధనల ప్రకారం ధృవీకరించిన బుకింగ్‌లను సవరించుకోవచ్చని మేక్మైట్రిప్ తెలిపింది. ‘పెద్ద కుటుంబాలు, బృందాలు ఒకేసారి మొత్తం టికెట్ చార్జీని చెల్లించడం భారం అవుతుంది. అటువంటి వారికి పార్ట్ పేమెంట్ ఆప్షన్ సౌకర్యవంతంగా చెల్లించేందుకు వీలు కల్పిస్తుంది’ అని కంపెనీ సీవోవో సౌజన్య శ్రీవాస్తవ తెలిపారు.కాగా, ఎక్కువ మందిని అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రోత్సహించేందుకు పార్ట్ పేమెంట్ ఆప్షన్ దోహద పడుతుందని రిటైల్ రంగ నిపుణులు కలిశెట్టి నాయుడు తెలిపారు. ‘ఇటువంటి సౌకర్యంతో విమానయాన సంస్థలకు క్యాష్ రొటేషన్ అవుతుంది. విద్యార్థులు, వ్యాపారస్తులకు చెల్లింపుల సౌలభ్యం ఉంటుంది’ అని వివరించారు. ఈ కొత్త ఫీచర్ సుదూర, స్వల్ప-దూర అంతర్జాతీయ విమానాలను, ముఖ్యంగా రూ. 1 లక్షకుపైగా టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులను ఆకట్టుకుంటోందని కంపెనీ పేర్కొంది. దీనిపై సానుకూల ప్రారంభ స్పందన వచ్చిందని చెప్పిన కంపెనీ ఈ ఫీచర్ కస్టమర్లకు ప్రయాణ బుకింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందని ఆశిస్తోంది.ఇలా పని చేస్తుందంటే..కొత్తగా ప్రవేశపెట్టిన పార్ట్ పేమెంట్ ఆప్షన్ మొత్తం ఛార్జీలో కేవలం 10-40% ముందుగా చెల్లించడం ద్వారా నిర్ధారిత బుకింగ్‌లను పొందేందుకు ప్రయాణికులను అనుమతిస్తుంది. ఖచ్చితమైన శాతం విమానయాన సంస్థ, ప్రయాణ మార్గం, బుకింగ్ విండో వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.మిగిలిన మొత్తాన్ని ప్రయాణ తేదీకి ముందు లేదా బుకింగ్ చేసిన 45 రోజులలోపు, ఏది ముందు అయితే అది ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా చెల్లించవచ్చు. పూర్తి చెల్లింపు చేసిన తర్వాత, వినియోగదారులు ఛార్జీల నిబంధనల ప్రకారం ధ్రువీకరించిన బుకింగ్‌లను సవరించవచ్చు.ఇది కాకుండా జీరో క్యాన్సిలేషన్, ఫేర్ లాక్ ఫీచర్లతో పాటు ఉచితంగా ప్రయాణ తేదీని మార్చుకునే వెసులుబాటును కూడా మేక్మైట్రిప్ కల్పిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ప్రయాణికులు బయలుదేరడానికి రెండు గంటల ముందు వరకు విమానాలను రీషెడ్యూల్ చేయడానికి అవకాశం ఉంటుంది.
కొనసాగుతున్న నష్టాలు.. నిఫ్టీ@23,600
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:48 సమయానికి నిఫ్టీ(Nifty) 88 పాయింట్లు నష్టపోయి 23,602కు చేరింది. సెన్సెక్స్(Sensex) 267 పాయింట్లు దిగజారి 77,890 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 109 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 76.2 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.69 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం లాభపడింది. నాస్డాక్ 0.06 శాతం దిగజారింది.ఇదీ చదవండి: వడ్డీరేట్ల కోత పక్కా..?అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆర్థిక విధానాలపై అనిశ్చితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు నెలకొన్నాయి. యూఎస్ బాండ్లపై రాబడులు 4.68 శాతానికి చేరుకోవడంతో ఎఫ్ఐఐల పెట్టుబడులు తరలిపోతున్నాయి. మరోవైపు డాలర్ ర్యాలీ ఆగడం లేదు. ఈ పరిణామాలు భారత్ లాంటి వర్థమాన దేశాలకు ప్రతికూలంగా మారాయి. వీటికి తోడు భారత్‌లో హెచ్ఎంపీవీ కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశీయ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
వడ్డీరేట్ల కోత పక్కా..?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) పరపతి విధాన కమిటీ సమావేశంలో ఈసారి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో జరగబోయే ఈ సమావేశంలో కీలక వడ్డీరేట్లలో కోత విధిస్తారని పరిశ్రమల సంఘం సీఐఐ అంచనా వేసింది. ఇప్పటికే అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్(US Fed) యూఎస్‌లో వడ్డీరేట్లను తగ్గించింది. ఈ తరుణంలో భారత్‌లోనూ వడ్డీరేట్లను తగ్గించాలనే డిమాండ్ ఉంది.భారత వృద్ధికి ఊతమిచ్చేందుకు వచ్చే ఆర్బీఐ మానిటరీ సమావేశంలో వడ్డీరేట్ల కోత ఉండే అవకాశం ఉందని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ పురి అన్నారు. కార్మికుల అవసరం అధికంగా ఉండే రంగాల్లో ఉద్యోగ కల్పన ఉండవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో కార్మిక సంస్కరణలను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు. దానివల్ల భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు సృష్టించబడుతాయని తెలిపారు. ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఫిబ్రవరి 5-7 తేదీల్లో ఆర్బీఐ ఎంపీసీ(MPC) సమావేశం జరగనుంది. చైనా వంటి దేశాల నుంచి భారీగా వస్తువులు దిగుమతి అవుతున్న నేపథ్యంలో యాండీ డంపింగ్ డ్యూటీని పెంచే యోచనలో ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉక్కు, పేపర్‌బోర్డు, రసాయనాలు, పాలిమర్స్ వంటి ప్రత్యేక రంగాలకు దీనిని అమలు చేయబోతున్నట్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: ‘తొందర’ తెచ్చిన తంటా.. ఓలాకు సెబీ హెచ్చరికరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వచ్చే ఎంపీసీ సమావేశంలో 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఆర్బీఐ నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు. ఆర్బీఐ దేశంలో పెట్టుబడులు పెంచేలా నిర్ణయం తీసుకోవాలి. అందులో భాగంగా వడ్డీరేట్లను తగ్గించాల్సి ఉంది.
ఫ్యామిలీ
అందంలో మన్మథుడు...యువ సామ్రాట్ నాగర్జున డైట్ సీక్రెట్ ఇదే..!
అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా నాగార్జున సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. ఎన్నో అవార్డులను, సత్కారాలను పొందారు. ఒకప్పుడు అమ్మాయిల క్రేజీ హీరో, కలల మన్మథుడిగా పేరు తెచ్చుకున్న నటుడు ఆయన. ప్రస్తుతం నాగార్జున వయసు 65 ఏళ్లు. అయినా అదే అందం, గ్లామర్‌తో యువ హీరోలకు తీసిపోని విధంగా ఫిట్‌గా ఉంటాడు. వయసుతో సంబంధం లేకుండా అంతలా యవ్వనంగా ఫిట్‌గా బాడీ మెయిటైన్ చేసేందుకు నాగార్జున ఏం చేస్తుంటాడో తెలుసుకుందామా..!నాగార్జునని చూడగానే అందరూ సార్ ఇప్పటికీ అలానే అంతే అందంగా ఎలా మెయిటైన్ చేస్తారు అని అడుగుతారట. అందరికీ ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటని కుతుహలమే. ఆ సందేహాలకు చెక్‌పెట్టేలా ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ మంత్ర గురించి మాట్లాడారు. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు కూడా అవేంటంటే..తన రోజుని వ్యాయమాలతోనే ప్రారంభిస్తాడట. ముఖ్యంగా కార్డియో వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తారట. ఒకవేళ జిమ్‌కి వెళ్లకపోతే కనీసం వాకింగ్ లేదా స్విమ్మింగ్ చేస్తారట. అంతే తప్ప ఏ వ్యాయామాన్ని మిస్ చేయానని చెబుతున్నారు నాగ్. వర్కౌట్లు చేయడమే తన తొలి ప్రాధాన్యత అని అంటున్నారు. కచ్చితంగా వారానికి ఐదు రోజులు వ్యాయామాలు చేస్తానని చెప్పారు. ఒక గంట 45 నిమిషాలు వ్యాయమాలకే కేటాయిస్తారట. అదే తన బాడీ ఆకృతి సీక్రెట్ అంటున్నారు. మన శరీరం షేప్అవుట్ అవ్వకూడదంటే ఇవి తప్పనసరి అని నొక్కి చెబుతున్నారు. అంతేగాదు ఓ చిట్కాను షేర్ చేశారు. క్రమ తప్పకుండా సక్రమంగా వ్యాయామాలు చేయాలంటే ఫోన్లు వంటి గాడ్జెట్లు తీసుకెళ్లొద్దని అన్నారు. శక్తితో కూడిన వర్కౌట్లు చేస్తూ..హృదయస్పందన రేటు 70% ఉండేలా చూడండి. ఇది మీ ఏకగ్రతను పెంచి, రోజంత జీవక్రియను మెరుగ్గా ఉంచుతుందని అన్నారు. ఇదే తన ఫిట్నెస్మంత్ర అని దృఢంగా చెబుతున్నారు. దీంతోపాటు తగినంత నిద్ర, హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవడం వంటివి చేయాలన్నారు.అందంగా కనిపించేందుకు..మంచి డైట్‌ని తీసుకుంటారట. అదే తన ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగ్గా ఉంచుతాయని నమ్ముతానన్నారు. ఆరోగ్యకరమైన అల్పహారం, లంచ్, డిన్నర్లు తీసుకుంటే ఎవ్వరైనా అందంగానే ఉంటారని చెప్పారు. రాత్రి ఏడు లేదా ఏడున్నర లోపే డిన్నర్ పూర్తి చేసేస్తారట నాగ్. పాల సంబంధిత పదార్థాలకు నిర్ధిష్ట వయసు వచ్చేటప్పటికీ తీసుకోవడం మానేస్తేనే బెటర్ అని అన్నారు. నాగ్ కచ్చితంగా 12 గంటలు తిని 12 గంటలు ఉపవాసం ఉంటారట. ఆయన అడపాదడపా ఉపవాసం కూడా ఉంటారట. అప్పడప్పుడు చీట్ మీల్స్ కూడా ఉంటాయని నవ్వుతూ చెబుతున్నారు. ఎప్పుడు నోరుని కట్టేసుకుని స్ట్రిక్ట్‌గా ఉండనవసరం లేదని అంటున్నారు. ఆదివారం వచ్చినప్పుడల్లా తనకు నచ్చినవి మొహమాటం లేకుండా తినేస్తా వర్కౌట్లతో అదనపు కేలరీలు కరిగించేస్తా అంటున్నారు. ఒకవేళ నచ్చింది తినాలనుకుంటే..అమ్మో డైట్ అని ఆలోచించను అది తినేదైనా..తాగాలనుకున్నా మందైనా.. ఏ మాత్రం సంకోచించనని అన్నారు. ఆయనకు స్వీట్లంటే మహా ఇష్టమట. ముఖ్యంగా చాక్లెట్లు తినకుండా ఉండరట. అయితే వర్కౌట్లు చేసినంత కాలం హాయిగా అవి తీసుకోవచ్చని అంటున్నారు. అలాగే గోల్ఫ్ తప్పనిసరిగా ఆడతారట. ఇది తన మనసుకు చక్కటి వ్యాయామంలా ఉండి తనకొక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఇక ఈత యవ్వనంగా ఉండేందుకు ఉపకరిస్తుందట. ఇది ఒక అద్భుతమైన వ్యాయమం అట. మొత్తం ఆరోగ్యానికి, అందానికి ఉపయోగపడుతుందని నాగార్జున చెబుతున్నారు.(చదవండి: పెళ్లి పాట్లు..!అంత ఈజీ కాదు మ్యాచ్ సెట్టవ్వడం..)
పిడుగులాంటి వార్త..ఇలా అయితే కష్టమే..!
ప్రస్తుత జీవన విధానం, కాలుష్యం కారణంగా తొందరగా జుట్టు నెరిసిపోవడం, ఊడిపోవడం వంటి సమస్యలు సర్వ సాధారణమైపోయాయి. ఒక ఏజ్ వచ్చాక బట్టతల కూడా కామనే అనే స్థితికి వచ్చేశాం. ఒకప్పుడూ బట్టతల అంటే బాధపడిపోయేవారు. కానీ ఇప్పుడూ టేకీటీజీ అంటున్నారు. కటింగ్ చేయించుకునే బాధ తప్పుతుంది, ఏ చిరాకు ఉండదు అనే స్థైర్యాన్ని పెంపొందించుకుంటున్నారు. ఇప్పుడు అదికాస్త ఢమాల్ అనేలా ఓ పిడుగులాంటి వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటో తెలిస్తే..వామ్మో ఇక జుట్టు ఉన్న మనిషి కనిపించడమే గగనమైపోదుందేమో అనిపిస్తుంది. ఈ వింత పరిస్థితి మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని మూడు గ్రామాల నివాసితులకు ఎదురైంది. గత కొన్ని రోజులగా అక్కడ ఉన్న మహిళలు, పురుషులు జుట్టు రాలిపోవడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారట. ఒక్క వారం రోజుల్లోనే చాలమందికి బట్టతల వచ్చేసిందట. మొదట్లో కొద్దిగా జుట్టు రాలడం మొదలై.. ఒక్క వారంలోనే ఇలా బట్టతలగా మారిపోతుందట. ఇలా ఏ ఒక్కరికో ఇద్దరికో కాదు..దాదాపు అందరిది ఇదే పరిస్థితినే. ఇది దావానంలా వ్యాపించడంతో మూడు గ్రామాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఈ గ్రామాన్ని సందర్శించారు. ఆరోగ్య శాఖ సర్వే ప్రకారం..అక్కడ సుమారు 50 మంది దాక ఈ సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందన్నారు అధికారులు. ఇక సామూహికంగా అందరికి జుట్టు ఎందుకు రాలుతుందని పరీక్షించేందుకు వాళ్ల చర్మం, వెంట్రుకల నమునాలను సేకరించినట్లు తెలిపారు. ఈ పరిస్థితికి కారణం కలుషిత నీరు, ఏవైనా ఆరోగ్య సమస్యలు అయ్యి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే దీని గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోనే యత్నం చేయమని సూచించారు. తాము ప్రజల నుంచి సేకరించిన చర్మం, వెంట్రుకలను పరీక్షించి ఈ పరిస్థితికి గల కారణాన్ని నిర్థారించి, పరిష్కారిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు అదికారులు.(చదవండి: పెళ్లి పాట్లు..!అంత ఈజీ కాదు మ్యాచ్ సెట్టవ్వడం..)
ఇలా అయితే మగపిల్లలకి పెళ్లి అవుద్దా..!
"పెళ్లి ఎప్పుడవ్వుతుంది బాబు..నీకు పిల్ల ఏడ దొరుకుతుంది బాబు".. అని పాడుకోవాల్సిన పరిస్థితి ఎదురవ్వుతోంది మగపిల్లలున్న తల్లిదండ్రులకు. విజ్ఞానం గొప్ప జ్ఞానం ఇవ్వాలే గానీ అతి తెలివి, అత్యాశని ఇవ్వకూడదు. ఆ విధంగా విద్యను ఆర్జించకూడదు కూడా. కానీ ఆడపిల్లల తల్లిదండ్రుల ఆలోచనలు ఇలానే ఉన్నాయి. వారి కోరికలకు అంతులేదు. వారి అంచనాలకు సరితూగలేకపోతున్నామనే వ్యధలో పెళ్లికానీ ప్రసాదులుగా మిగిలిపోతున్నారు చాలామంది. చెప్పాలంటే వివాహం ఓ వ్యాపారంగా మారిపోయింది. ఈడు జోడు అన్న మాటకు తావులేకుండా పోయింది. ఇంతకుముందు కట్నలు ఇవ్వలేక లభోదిభోమనే ఆడపెళ్లివారే డిమాండ్ చేసే స్థాయికి చేరిపోయింది పరిస్థితి. ఈ పరిణామం బాగుందనిపించినా..వాస్తవికతకు అద్దం పెట్టేలా సమంజసమైనా డిమాండ్లు ఉంటే బావుండు..ఇదేంటిది అని పారిపోయేలా ఉంది పరిస్థితి. అస్సలు మగవాళ్లకి పెళ్లి అవుద్దా?. మ్యాచ్ సెట్ అవుద్దా..? అనే సందిగ్ధ స్థితికి వచ్చేసింది. సింపుల్‌గా చెప్పాలంటే ఏ కుర్రాడికైనా పెళ్లి కుదిరిందంటే..అదృష్టవంతుడివిరా అనాల్సి వస్తోంది. అంతలా పెళ్లి కరువు తాండవిస్తోంది మగపిల్లలకి. ఎందుకిలా..? ఇది మంచి పరిణమామేనా అంటే..ఒకప్పుడు పెళ్లిళ్లు ఇరువైపుల పెద్దలు ఈడు-జోడు, స్థాయిలు చూసుకుని చక్కగా కుదర్చుకునేవారు. ఈజీగా పిల్లలకు ముడిపెట్టేసేవారు. హైరానా పడేవారు కాదు. కానీ ఇప్పుడు పెళ్లి అనే రెండక్షరాల పదమే భయానకం అనేలా హడలెత్తిస్తోంది. ముఖ్యంగా మగపిల్లల తల్లిదండ్రులు భయంగుప్పిట్లో బతుకీడుస్తున్నారు. ఒకప్పడు మా అబ్బాయి ఈ ఉద్యోగం చేస్తున్నాడు..కట్నం ఇంత అని డిమాండ్ చేసే నోళ్లు కాస్త తడబుడుతున్నాయి. అమ్మాయినిస్తే అదే పదివేలు అనే పిరిస్థితికి వచ్చేశారు. ఎందుకిలా అంటే..పెరుగుతున్న టెక్నాలజీ మనకు విజ్ఞానం ఇస్తోందో లేదో చెప్పలేకపోతున్నా..బంధాలను కాలరాసుకునే అజ్ఞానాన్ని సముపార్జిస్తున్నాం అని కచ్చితంగా చెప్పొచ్చు. ఈ టెక్నాలజీ సాయంతోనే కడుపులో ఉంది ఆడపిల్ల ? మగపిల్ల అని ముందుగా తెలుసుకుని వాళ్లని భూమ్మీద పడనీయకుండా చేశాం. దీంతో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది. అదే నేటి ఈ దుస్థితికి కారణం కూడా. అందువల్లే పిల్లనిచ్చేవాళ్లు దొరకడం లేదని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు ఆడపిల్లలు కూడా మగపిల్లలతో పోటీ పడి మరీ చదువుకుంటున్నారు. వారికంటే మెరుగ్గా ఉండేస్థాయికి చేరుకుంటున్నారు. వారి కాళ్లపై వారు నిలబడి బతికే స్థాయిలో ఉంటున్నారు కూడా. ఇది మంచి శుభపరిణామమే కానీ..దీన్నే చూసుకుని ఆడిపిల్లలు తల్లిదండ్రులు అంచనాలు ఓ రేంజ్‌కి వెళ్లిపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే "గొప్ప" కాస్తా ఇగోగా మారిపోయింది. మా అమ్మాయి మీ అబ్బాయికి తక్కువ కాదు అనేస్థితికి వచ్చేసి.. అణుకువకు తిలోదాకాలు ఇచ్చి "అహాం" తలెకెక్కించుకుంటున్నారు. అంటే విద్యావంతులుగా మారుతున్నాప్పుడు తక్కువ ఎక్కువలకు చోటిస్తే..అది చివరకు ఏ స్థాయికి తీసుకొస్తుందో ఊహించలేం. ఇక్కడ సరిజోడికి తావివ్వకపోయినా..కనీసం ఒక్కటవ్వనున్న జంట ఇష్టాలకు ప్రాధాన్యత, వారి ఫైనాన్షియల్ స్థితి చూస్తే బాగుండు. కానీ అంతకు మించి అంటున్నారు ఆడిపిల్లల తల్లిదండ్రులు. జస్ట్ 25 నుంచి 30 ఏళ్లలోపు ఏ మగపిల్లవాడైనా..మహా అయితే రూ. 30-50 వేలు లేదా లక్షలోపు సంపాదించగలరు. ఎక్కడో మహా ఇంటిలిజెంట్స్ లక్షల్లో వేతనాలు అందుకోగలరు. దాన్ని ఆలోచింకుండా ఓ కారు, బంగ్లా, లక్షల్లో జీతాలు, అత్తమామలు పక్కన ఉండకూదు అనే అంచనాలు ఉంటే..పెళ్లి అనే పదం బరువైపోతుంది. చెప్పాలంటే ఈ అంచనాలను చేరుకోవడం అందరికీ సాద్యం కాకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న జీవనవిధానానికి ఇరువురు ఉద్యోగాలు చేస్తే కుటుంబాన్నిబ్యాలెన్స్ చేయగలరా లేదా అన్నదానికి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే మన అమ్మాయిని మంచిగా చూసుకోగలడా, బాధ్యతయుతంగా ప్రవర్తించగలడా అన్నది పరీక్షించండి అంతే తప్ప ఇలా గొంతెమ్మ కోరికల లిస్ట్ ముందే పెడితే..ఏ వరుడి తల్లిదండ్రులు ముందుకు రాగలరు. ఈ కారణాలతోనే చాలామంది అబ్బాయిలకు పెళ్లి అవ్వడం కష్టమవుతుంది. ఇక్కడ ఆలోచించాల్సింది ఇంకొకటి కూడా ఉంది. పెళ్లితో బాధ్యతలు తెలుసుకుని సంసారాన్ని చక్కబెట్టే స్థాయికి వచ్చిన వాళ్లు ఉన్నారనే విషయాన్ని గుర్తు ఎరగండి. సర్దుకుపోవడం, అణుకువ, బాంధవ్యాన్ని నిలబెట్టుకోవడం వంటి విలువైన పదాలకు వాల్యు ఇవ్వండి అప్పుడూ పెళ్లికి అర్థం..పరమార్థం ఉంటుంది. ఇలా పిచ్చి పిచ్చి అంచనాలతో పెళ్లిళ్లు చేయడం..అవతలవాళ్లు పెళ్లి కోసం అబద్ధాలు చెప్పడం...చివరికి ఒకరికొకరు మోసం పోయామని అరవడం..కోర్టుల చుట్టూ తిరగడం..మన వివాహ వ్యవస్థ గొప్పది..అది వ్యాపారంగా మార్చుకోవద్దు. భవిష్యత్తులో హాయిగా ఉంచే ఓ గొప్ప ఇన్వెస్టెమంట్గా చూడొద్దు. జీవితం అనేది ఎంతో విలువైనది..ఏరోజు ఎవరంటారో తెలియని స్థితి..ఉన్నన్నిరోజులు సంతోషంగా హాయిగా ఉండేలా వర్తమానానికి విలువ ఇద్దాం. ప్రస్తుతం ఈ విషయమే నెట్టింట తెగ వైరల్ అయ్యి చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు కూడా పోస్ట్‌లలో ఇదే ఏకరవు పెడుతున్నారు కాబట్టి పెద్దలు ఆలోచనా తీరు మార్చుకోండి..వయసు దాటక ముందే పిల్లలకు పెళ్లి చేసి హాయిగా ఉండండి. Salary expectations of groom during wedding matches is insane … <1L / month are not even being considered if person is in IT Mindset of parents requires RESET. How can 28 year old earn 1-2L, have own car and a house ??Your generation had all these for retirement#Life— Vineeth K (@DealsDhamaka) January 6, 2025 (చదవండి: సేద్యంలో మహిళా సైన్యం!)
ఎప్పటినుంచో ఐఏఎస్ కల..కానీ 13 ఏళ్లకే అనూహ్య నిర్ణయం
జీవితం ఎపుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. జీవితం పట్ల దృక్పథం మారి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీన్నివిధి లిఖితం అంటారేమో. ఆగ్రాకు చెందిన 13 ఏళ్ల రాఖీ సింగ్ కథ వింటే ఎవరికైనా ఇలానే అనిపించకమానదు.ఆగ్రాకు చెందిన రాఖీ సింగ్ అనే బాలిక కేవలం 13 ఏళ్ల వయసులోనే ప్రాపంచిక ప్రపంచానికి దూరంగా బతకాలని నిర్ణయించుకుంది. దైవ మార్గంలో నడిచేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈమె చిన్నప్పటినుంచీ ఐఏఎస్ అధికారి కావాలని కలలు కనేది. ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్ శిబిరాన్ని ఆమె సందర్శించిన తరువాత ఆమె ఆలోచన మారిపోయింది. సాధ్విగా మారాలని నిశ్చయించుకుంది. ఆమె నిర్ణయానికి తల్లిదండ్రులు కూడా మద్దతుగా నిలిచారు. ఆమెను హృదయపూర్వకంగా సమర్థిస్తున్నామనీ, ఆశ్రమానికి తమ కుమార్తెను ఇష్టపూర్వకంగా ఇస్తున్నామని ప్రముఖ మహంత్ (మత నాయకుడు)తో తెలిపారు. ఈ కుంభమేళా తర్వాత మహంత్ కౌశల్ గిరి ఆశ్రమంలో భాగం అవుతుంది రాఖీ.ఎవరీ రాఖీ సింగ్ఆగ్రా జిల్లా దౌకి పట్టణానికి చెందిన వ్యాపారవేత్త సందీప్ సింగ్ ధాకార పెద్ద కుమార్తె రాఖీ. అఖారా సంప్రదాయం ప్రకారం ఆమె గౌరి అని పేరు పెట్టారు. జనవరి 19న 'పిండాన్' ఆచారాన్ని నిర్వహిస్తారు. ఆ తరువాత రాఖీ కుటుంబంలో ఇక భాగంగా ఉండదు. అఖారాలో సభ్యురాలిగా సాధ్విగా ఉంటుంది. ఆగ్రాలో నివసిస్తున్న ఆమె కుటుంబం, ప్రముఖ హిందూ సన్యాసులలో ఒకటైన జునా అఖారాకు చెందిన మహంత్ కౌశల్ గిరి మహారాజ్‌తో కనెక్ట్ అయినప్పుడు రాఖీ ప్రయాణం ప్రారంభమైంది.గత మూడేళ్లుగా,తమ గ్రామంలో మహంత్ కౌశల్ గిరి భగవత్ కథా సెషన్లు నిర్వహించారు. ఈ సమయంలో రాఖీ, ఆమె కుటుంబంతో సహా, అతని బోధనల ద్వారా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ సెషన్లలో ఒకదానిలో రాఖీ తన గురు దీక్ష లేదా దీక్షను తీసుకుందట. అంతేకాదు ఆమె ఆధ్యాత్మిక మార్గానికి నాంది పలికింది ఆమె తల్లి రీమా సింగ్ . ఫలితంగా గౌరీ గిరిగా పిలువబడే రాఖీ పవిత్ర పరిత్యాగ ప్రక్రియ తరువాత కొత్త ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించనుంది.కాగా 12 ఏళ్ల తర్వాత మహాకుంభ మేళా జనవరి 13 నుంచి మహా కుంభ మేళా జరగబోతోంది. ఈ మేళాకి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మహా కుంభ మేళా.. ఫిబ్రవరి 26 వరకూ జరుగుతుంది. దేశవ్యాప్తంగా వేర్వేరు అఖారాల నుంచి అఘోరాలు, స్వాములు, రుషులు వస్తూన్నారు. ముఖ్యంగా కొన్ని అఖారాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. అటల్ అఖారా, మహానిర్వాణి అఖారా, నిరంజని అఖారా, అశ్వాన్ అఖారా, జునా అఖారా ఇవన్నీ అలాంటివే. ఇవన్నీ మహా కుంభమేళాలో తమ క్యాంపులను ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఫొటోలు
National View all
‘డిజిటల్ మహాకుంభ్’.. సంస్కృతి, సాంకేతికతల కలబోత
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జనవరి 13 నుంచి ప్రారంభంకానుం
‘‘అలాగైతే ఇండియా కూటమిని రద్దు చేయండి’’
ఒకవైపు విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు నడుస్తుండగా..
Mahakumbh 2025: తొమ్మిదేళ్లకే నాగ సన్యాసి.. గడ్డకట్టే చలిలో కఠోర తపస్సు
మహాకుంభమేళా ఈ నెల(జనవరి) 13 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత
మొదటి భర్త ఉండగానే రెండో పెళ్లి
హొసపేటె: మొదటి భర్త ఉండగానే అతనిని వదిలేసి మరో పెళ్లి చేసుకు
దేశంలో జరిగిన తొక్కిసలాటలు.. మిగిల్చిన విషాదాలు
ఆంధప్రదేశ్‌లోని తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకోవాలనే భక
NRI View all
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్ఆర్ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా
ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!
అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్ దిగ్గజం యాపిల్ 185 మంది ఉద్యోగులను త
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!
భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్..!అచ్చం భారత్‌లో..
ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్ బిజినెస్‌లు.
International View all
గుంపులో చిక్కుకుపోయారా? మిమ్మల్ని మీరు ఇలా కాపాడుకోండి
రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రమాదాలు పొంచివుంటాయి.
కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. అత్యవసర పరిస్థితి విధింపు
లాస్ ఏంజిల్స్: అమెరికాలోని లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలలోని అడవుల్లో కార్
హసీనా వీసా గడువు పెంపు
న్యూఢిల్లీ: విద్యార్థుల ఉద్యమం, ఎగసిన అల్లర్లతో స్వదేశం వీడి
ఆగని రష్యా దాడులు
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ దాడులు కొనసాగుతున్నాయి.
Viral: హిజాబ్ ధరించమన్నందుకు ఏం చేసిందంటే..
వైరల్ వీడియో: హిజాబ్ విషయంలో ఇస్లాం దేశాలు ఎంత కఠినంగా వ్య
క్రైమ్
క్లాస్‌మేట్‌పై జూనియర్ డాక్టర్ అత్యాచారం
గ్వాలియర్: ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలోని ఉపయోగంలో లేని హాస్టల్లో ఓ జూనియర్ డాక్టర్(25) తోటి వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలోని గజరాజా మెడికల్ కాలేజీలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు, బాధితురాలు వేర్వేరు హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. ఆదివారం నిందితుడు కాలేజీ ఆవరణలోనే ఉన్న ఉపయోగంలో లేని బాయ్స్ హాస్టల్లోకి రావాలని బాధితురాల్ని కోరాడు. అంగీకరించి అక్కడికి వెళ్లిన ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై బాధితురాలు కాంపు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు నగర ఎస్పీ అశోక్ జడొన్ చెప్పారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
ఏస్ నెక్ట్స్ జెన్, గ్రీన్కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
(మచిలీపట్నం): ఫార్ములా –ఈ రేసు కేసులో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. ఇప్పటివరకు రేసు నిర్వహణ, నిధుల మళ్లింపులో నిబంధనల అతిక్రమణ, హెచ్ఎండీఏ అధికారిక ఖాతాల నుంచి విదేశీ కంపెనీలకు నిధుల మళ్లించడంపై ఫోకస్ పెట్టిన అధికారులు, తాజాగా క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. తాజాగా తెరపైకి వచ్చిన క్విడ్ ప్రోకో కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫార్ములా–ఈ కారు రేసు నిర్వహణకు సంబంధించిన ఒప్పందాలకు కొద్ది నెలల ముందే బీఆర్ఎస్కు గ్రీన్కో అనుబంధ సంస్థల నుంచి ఎలక్టొరల్ బాండ్ల రూపంలో కోట్ల రూపాయలు వచ్చాయనే సమాచారంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ఫార్ములా ఈ రేసుకు మొదట్లో స్పాన్సర్‌గా వ్యవహరించిన ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు దాని అనుబంధ సంస్థ గ్రీన్కో కార్యాలయాల్లో మంగళవారం ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో సైబర్ టవర్స్‌లో, మచిలీపట్నంలోని గ్రీన్కో కార్యాలయాల్లో మంగళవారం రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. సహకరించని సిబ్బంది! ఏసీబీ అధికారుల తనిఖీలకు ఆయా సంస్థల సిబ్బంది ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. మాదాపూర్ సైబర్ టవర్స్‌లోని గ్రీన్కో కార్యాలయంలో సోదాలకు ఆ సంస్థ సిబ్బంది మొదట అనుమతించలేదు. అధికారులు సెర్చ్ వారెంట్ వారెంట్ చూపడంతో వెనక్కి తగ్గారు. ఇక అదే ప్రాంతంలోని ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో అధికారులు సోదాలు జరిపారు. పలు కీలక పత్రాలు, పైళ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. మరోవైపు ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న గ్రీన్ కో అనుబంధ సంస్థలైన ఏస్ అర్బన్ రేస్, ఏస్ అర్బన్ డెవలపర్స్ కార్యాలయాల్లోనూ మంగళవారం రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. పలు ఫైళ్లతో పాటు హార్డ్ డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మచిలీపట్నంలో కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న గ్రీన్ కో కంపెనీకి చెందిన గెస్ట్‌హౌస్‌లో కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కేటీఆర్‌కు తాజాగా ఈడీ సమన్లు ఫార్ములా–ఈ కారు రేస్ కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్‌కు ఈడీ అధికారులు మరోమారు సమన్లు జారీ చేశారు. వాస్తవానికి కేటీఆర్ మంగళవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సి ఉన్నా..తనకు మరికొంత సమయం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 16న విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్‌కు మంగళవారం మరోమారు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. కాగా ఈడీ అధికారులు ఇప్పటికే ఇచ్చిన సమన్ల ప్రకారం..ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ మాజీ సీఈ బీఎల్ఎన్ రెడ్డి బుధవారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు.
విధుల్లో ఉండగా.. కానిస్టేబుల్‌కు గుండెపోటు
మహబూబ్‌నగర్ క్రైం: విధుల్లో ఉన్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ గుండెపోటు రాగా.. ఆస్పత్రితో చికిత్స అందిస్తుండగానే మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని మర్లులో నివాసం ఉంటూ హెడ్‌క్వార్టర్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటేష్(50)కు సోమవారం ఎస్కాట్ డ్యూటీ పడింది. ఈక్రమంలో సోమవారం ఉదయం ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లా జైలుకు వెళ్లి అక్కడ ఖైదీలను వాహనంలో తీసుకుని కోర్టులో హాజరుపరిచి మళ్లీ మధ్యాహ్నం సమయంలో జైలులో ఖైదీలను అప్పగించి తిరిగి బయట వచ్చాడు. ఆ సమయంలో చాతీలో నొప్పి వస్తున్నట్లు వెంకటేష్ తోటి కానిస్టేబుల్స్‌కు చెప్పి కింద కూర్చుకున్నాడు. వెంటనే వారు చికిత్స కోసం జిల్లా జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు సీపీఆర్ చేయడంతో పాటు చికిత్స అందిస్తున్న క్రమంలోనే మృతి చెందాడు. క్యాజువాలిటీలో ఉన్న వెంకటేష్ మృతదేహన్ని ఎస్పీ డి.జానకి పరిశీలించి కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుడు వెంకటేష్‌కు భార్య వనీత, ఇద్దరూ కొడుకులు అభినవ్, వర్షవర్ధన్లు ఉన్నారు. మృతదేహన్ని అతని స్వస్థలం సీసీకుంటకు తరలించారు.
బాలిక ప్రాణం తీసిన సెంట్రింగ్ కట్టె
దొడ్డబళ్లాపురం: నిర్మాణదారుల నిర్లక్ష్యం తల్లిదండ్రుల కంటి దీపాన్ని బలిగొంది. పాఠశాల నుండి ఇంటికి తిరిగి వెళ్తున్న బాలిక తలపై సెంట్రింగ్‌కు వాడిన వెదురు కట్టె పడి చనిపోయిన బెంగళూరు వీవీ పురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలిక తేజస్విని (15) రోజు మాదిరిగానే శనివారం సాయంత్రం ఇంటికి తిగిరి వెళ్తుండగా రోడ్డుపక్కన కొత్తగా నిర్మిస్తున్న కట్టడంపై నుండి సెంట్రింగ్ కట్టె తలమీద పడడంతో తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చేర్పించగా సోమవారం మరణించింది. బాలిక తండ్రి సుధాకర్ రావ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీవీ పురం పోలీసులు భవన ఇంజినీర్‌ను అరెస్టు చేసారు. కట్టడం యజమాని, అనుమతులు ఇచ్చిన బీబీఎంపీ అధికారులు, కాంట్రాక్టర్లపై కూడా కేసు నమోదు చేశారు.