Top Stories
ప్రధాన వార్తలు
వెంకన్న సన్నిధిలో విషాదం.. టీటీడీ చరిత్రలో కనివినీ ఎరుగని నిర్లక్ష్యం
చంద్రబాబు ప్రభుత్వ పెనునిర్లక్ష్యం మరోసారి అమాయక భక్తుల ప్రాణాలను బలిగొంది. పవిత్ర తిరుమల-తిరుపతి క్షేత్రాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టుపట్టించిన చంద్రబాబు దుర్మార్గం ఏడుగురు భక్తుల ప్రాణాలను హరించింది. ప్రభుత్వ వైఫల్యమే తిరుపతిలో తొక్కిసలాటకు దారితీసింది. చిత్తశుద్ధి లేని వ్యక్తులకు, వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇచ్చి.. తిరుమల క్షేత్రాన్ని రాజకీయ కేంద్రంగా మార్చారు. భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారు.
నెపం అధికారులపైకి నెట్టేస్తే సరిపోతుందా?
తిరుమల... ఎంత ప్రతిష్టాత్మక, పవిత్రమైన దేవాలయం..? ఎంత గొప్ప పేరు ఉన్న పుణ్య క్షేత్రం..? కానీ ఈ రోజు జరుగుతున్నదేమిటి? ఆంధ్ర ప్రదేశ్‌కే కాదు.. దేశానికే గర్వకారణమైన దేవస్థానంలో వైకుంఠ ద్వార ప్రవేశ టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన ఉదంతం ప్రపంచ వ్యాప్త హిందువులను కలచి వేస్తోంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక , చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో ఘోరాలు జరగుతున్నాయి. అకృత్యాలు, విధ్వంసాలు, అరాచకాలు చోటు చేసుకుంటున్నాయి. చివరికి తిరుమలేశుని కూడా వదలిపెట్టలేదు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీయడానికి కూడా వెనుకాడని నాయకత్వం ఇప్పుడు ఏపీలో పాలన చేస్తోంది. హిందూ మత ఉద్దారకులుగా పైకి ఫోజు పెట్టడం, లోపల మాత్రం ఎన్ని దందాలు చేయాలో అన్నీ చేయడం. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో లక్షల సంఖ్యలో భక్తులు వచ్చినా వారిని అసౌకర్యం లేకుండా స్వామి వారి దర్శన భాగ్యం కల్పించే వారు. అయోధ్య ఆలయ నిర్వాహకులు ఈ విషయాన్ని గుర్తించారు. అదెలాగో నేర్చుకోవడానికీ టీటీడీ అధికారులను ఆయోధ్యకు ఆహ్వానించి సలహాలు తీసుకున్నారు. అది జగన్ జమానా.. మరి ఇప్పుడు...??? అంతటి ఖ్యాతి వహించిన టీటీడీ క్రౌడ్ మేనేజ్మెంట్లో విఫలమైంది. వేలల్లో వచ్చిన జనాన్నే నియంత్రించలేకపోయింది. ఫలితంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించారు. యాభై మంది వరకూ గాయపడ్డారు. ఇంతటి విషాదం... దశాబ్దాలలో ఎన్నడూ జరగలేదు. ఈ ఘటన తిరుపతి గొప్పదనాన్ని దెబ్బ తీసిందని చెప్పక తప్పదు. తిరుమలను పరిరక్షించేందుకు, భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి, జగన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో టీటీడీ పలు సంస్కరణలు తెచ్చింది. ఇప్పుడు ఆ పని మాని గత ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిల కాలంలో ఏమైనా తప్పులు జరిగాయా? అని భూతద్దం పెట్టి అన్వేషించి వైఎస్సార్సీపీ రాజకీయ కక్ష సాధించడానికి, జగన్ ప్రభుత్వాన్ని ఎలా బద్నాం చేయాలన్న దానిపైనే చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో టీటీడీ పరువును పణంగా పెడుతోంది. కొత్తగా టీటీడీ ఛైర్మన్ అయిన ఒక టీవీ సంస్థ యజమాని బీఆర్ నాయుడు పూర్తి అసమర్థంగా వ్యవహరించారనిపిస్తుంది. గొడవ జరుగుతుందని ముందుగానే తనకు తెలుసునని ఆయన చెప్పడం గమనార్హం. గొడవ జరుగుతుందని తెలిస్తే ఎందుకు నివారణ చర్యలు తీసుకోలేకపోయారన్న ప్రశ్నకు జవాబు ఇవ్వలేక మళ్లీ మాట మార్చారు. ఈ మొత్తం ఘటనను బాధ్యతను అధికారులపైకి నెట్టి తప్పించుకునేందుకు చంద్రబాబు, బీఆర్ నాయుడులు చూస్తున్నారు. మరో ఘట్టం గురించి కూడా మాట్లాడుకోవాలి. తిరుమల ప్రసాదం లడ్డూకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆ లడ్డూను భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. ప్రత్యేకమైన రుచి కూడా ఉంటుంది. అలాంటి లడ్డూపై తీవ్రమైన అనుచిత ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘోర అపచారానికి పాల్పడ్డారని భక్తులు భావిస్తారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి ని వాడారంటూ చంద్రబాబు నీచమైన ఆరోపణ చేసి గత ముఖ్యమంత్రి జగన్ కు రుద్దాలని ప్రయత్నం చేశారు. పవన్ కల్యాణ్ సడన్ గా సనాతని వేషం కట్టి బాండ్ బాజా వాయించారు. దానికి జగన్ మీ ఇష్టం వచ్చిన విచారణ చేసుకోండి... కాని స్వామి వారికి అపచారం చేస్తున్నారు సుమా! అని హెచ్చరించారు. అయినా టీడీపీ, జనసేన, బీజేపీలు ఇష్టారీతిన దుర్మార్గపు ప్రచారం చేసి తిరుమల ఔన్నత్యాన్ని దెబ్బతీశాయి. ఒకవేళ లడ్డూకు సంబంధించి నిజంగానే ఏవైనా పొరపాట్లు జరుగుతుంటే వాటిని సరిచేసి బాధ్యతగా ఉండవలసిన ముఖ్యమంత్రే తన రాజకీయ స్వార్థం కోసం ఒక వదంతిని ప్రచారం చేశారు. చివరికి దానిపై సీబీఐ విచారణ వేస్తే ఏమైందో అతీగతీ లేదు. అనంతరం చంద్రబాబే మాట మార్చారు. దీనివల్ల స్వామి వారి ఆలయానికి అపవిత్రత తెచ్చిన అపఖ్యాతిని చంద్రబాబు, పవన్ లు పొందారు. కేవలం జగన్‌పై ద్వేషంతో ఆయన పాలనలో వీరు తిరుమలపై అనేక విమర్శలు చేసేవారు. దానివల్ల తిరుమల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఎన్నడూ ఫీల్ అయ్యేవారు కారు. జగన్ పై మతపరమైన ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయంగా లబ్ది పొందాలన్న యావ తప్ప మరొకటి ఉండేది కాదు. చంద్రబాబు ,పవన్ లు నిజాలు చెప్పరులే అని ప్రజలు భావించారు కాబట్టి సరిపోయింది కాని, లేకుంటే కూటమి పెద్దలు తిరుమలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితిని సృష్టించడానికి యత్నించారు. తిరుమలలో ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా సంక్రాంతి పర్వదినాల నుంచి వారం రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కార్యక్రమం జరిగింది. దీనిని చాలా పవిత్రంగా భక్తులు పరిగణిస్తారు. దానికి అధికారులు కూడా విస్తృతంగా ప్రచారం కల్పిస్తారు. ప్రతి ఏటా వేల సంఖ్యలో భక్తులు వచ్చినా ఇలాంటి తొక్కిసలాట జరగలేదు. కానీ ఈసారి తిరుపతిలో తొమ్మిది చోట్ల 90 కౌంటర్లు ఏర్పాటు చేసినా, ఈ తొక్కిసలాట జరిగిందంటే పర్యవేక్షణ లోపం తప్ప ఇంకొకటి కాదు. కారణం ఏమైనా బైరాగి పట్టెడ అనే చోట అకస్మాత్తుగా గేటు తెరవడంతో టిక్కెట్లు ఇస్తున్నారని అనుకున్న భక్తులు ఒక్కసారిగా తోసుకు వచ్చారు. అంటే అక్కడ అలా తోపులాట లేకుండా ముందుగానే అధికారులు చర్య తీసుకోలేదన్నమాట. గురువారం ఉదయం నుంచి ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక మొదలైన రాష్ట్రాల నుంచి కూడా భక్తులు బుధవారం మధ్యాహ్నమే తరలివచ్చారు. అధికారులు ఈ విషయాన్ని గమనించినా వారి నియంత్రణకు తగిన ప్రణాళిక రూపొందించలేదు. అందరిని ఒక పార్కులో పెట్టేశారు. మంచినీటి వసతి కూడా కల్పించలేకపోయారు. మరో రెండు చోట్ల కూడా తొక్కిసలాటలు జరిగాయి. ఇలాంటి వాటిపై కదా.. టీటీడీ ఛైర్మన్ ,పాలక మండలి, ఉన్నతాధికారులు దృష్టి పెట్టవలసింది?. గతంలో సమర్థంగా పనిచేసిన అధికారులపై వైఎస్సార్సీపీ ముద్ర వేసి, వారిని తొలగించి తమ అంతేవాసులను నియమించుకున్నారు. తిరుపతిలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసం ఒక పోలీసు అధికారిని ప్రత్యేకంగా పోస్టు చేశారట. వారు ఆ పనిలో ఉంటారు కాని, ప్రజల అవసరాలను ఎందుకు పట్టించుకుంటారు? పైరవీ చేసుకుని టీటీడీ ఛైర్మన్ అయిన బిఆర్ నాయుడుకు అసలు ఇలాంటి విషయాలలో ఏమి అనుభవం ఉంది? లేకపోయినా ఫర్వాలేదు. ఆయన నిబద్ధత ఏమిటి? కేవలం ఒక టీవీ సంస్థ ద్వారా తనకు బాజా వాయిస్తే పదవి ఇచ్చేశారు. పదవి తీసుకున్న తర్వాత అయినా టీటీడీ ఉద్దరణకు కృషి చేశారా? పోసుకోలు ఇంటర్వ్యూలు, ప్రకటనలు చేస్తూ కాలం గడిపి అసలు భక్తులను ఇక్కట్ల పాలు చేశారు. టెక్నాలజీని తానే కనిపెట్టినట్లు చంద్రబాబు మాట్లాడుతుంటారు. అయినా ఆన్ లైన్ లో కాకుండా ఇన్ని వేల మందిని, అది కూడా గంటల తరబడి వేచి ఉండేలా చేయడం అంటే ఈ ప్రభుత్వ చేతకాని తనమే కాదా? చంద్రబాబు నాయుడు గతంలో పుష్కరాల సమయంలో పబ్లిసిటీ కోసం, సినిమా షూటింగ్ కోసం సామాన్య భక్తుల స్నాన ఘట్టంలో స్నానం చేసి నప్పుడు కూడా ఇలాగే గేట్లు సడన్ గా తెరవడంతో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు. ఆ విషయంలో ఒక్క కానిస్టేబుల్ పై కూడా చర్య తీసుకోలేదు. సీసీటీవీ ఫుటేజీ సైతం మాయమైంది. ఆయన టైమ్ లో కేసును నీరుకార్చేసినా, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్ కూడా దానిపై దృష్టి పెట్టలేదు. తదుపరి కందుకూరు, గుంటూరులలో చంద్రబాబు సభలలో పదకుండు మంది మరణించినా, చంద్రబాబుపై ఆనాటి ప్రభుత్వం కేసులు పెట్టలేదు. అయినా చంద్రబాబు పోలీసులదే వైఫల్యం అని దబాయించి, రోడ్లపై సభలు వద్దన్నందుకు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించేవారు. ఇటీవల హైదరాబాద్ సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణిస్తే, దానికి నటుడు అల్లు అర్జున్ కారణమని ఆయనను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. అలా చేసినందుకు, టీడీపీ, జనసేన శ్రేణులు సమర్థించి సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టాయి. అదే కొలమానంగా తీసుకుంటే ఇప్పుడు ఎవరిపై చర్య తీసుకోవాలి. ఎవరిని అరెస్టు చేయాలి? టీటీడీ ఈవో, జాయింట్ ఈవో, తిరుపతి ఎస్పీ, డీఎస్పీ మొదలైనవారిని బాధ్యులు చేస్తారా? లేదా? ఎలాంటి చర్య తీసుకుంటారు? అసలు ఈ ఘటనకు నైతిక బాధ్యతగా బిఆర్ నాయుడు ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తారా? లేదా? ఒకవేళ ఆయన చేయకపోతే చంద్రబాబు ఆ మేరకు ఆదేశిస్తారా? అంటే అది జరిగే పని కాకపోవచ్చు. ఎందుకంటే బిఆర్ నాయుడుని నియమించిన చంద్రబాబు నాయుడు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది.అలాగే పనికట్టుకుని తనకు కావల్సిన అధికారులను నియమించి ,వారిని తన అడుగులకు మడుగులు ఒత్తేవారిగా మార్చుకున్న ఆయన కూడా బాధ్యత తీసుకోవాలి. అదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈపాటికి చంద్రబాబు, పవన్ లు రెచ్చిపోయి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసేవారు. ఎల్లో మీడియా గోల,గోల చేసేది. ఇప్పుడు మాత్రం అంత గప్ చిప్ అయ్యారు. అదేదో అధికారులదే తప్పన్నట్లుగా కథ నడపాలని చూస్తున్నారు. మొత్తం తిరుమలకు అపవిత్రత వచ్చేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇప్పటికైనా మార్చుకుంటే మంచిది. వైకుంఠ ద్వార దర్శనం ద్వారా మోక్షం పొందవచ్చన్న కొండంత ఆశతో వెళ్లిన భక్తులకు చంద్రబాబు ప్రభుత్వం నరకం సృష్టించడం బాధాకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
తిరుపతికి బయల్దేరిన వైఎస్ జగన్
తిరుపతి/గుంటూరు, సాక్షి: తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) తిరుపతికి బయల్దేరారు. కాసేపట్లో స్విమ్స్(SVIMS)లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించనున్నారు. అంతకు ముందు ఆయన.. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారాయన. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచి్చన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని అన్నారు. అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అధికారుల ఓవరాక్షన్తొక్కిసలాట ఘటన తర్వాత అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. బాధిత కుటుంబాలకు సరైన సమాచారం ఇవ్వకపోగా.. ఆపై సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో చేసిన హడావిడి చర్చనీయాంశమైంది. తొక్కిసలాట ఘటనలో గాయపడి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జగన్ పరామర్శిస్తారనే సమాచారం అధికారులకు అందింది. దీంతో.. ప్రభుత్వం అధికారులకు ఆగమేఘాల ఆదేశాలు జారీ చేసింది. తొలుత సీఎం చంద్రబాబు వచ్చి వాళ్లను పరామర్శిస్తారని.. అయితే జగన్ వచ్చేలోపు ఆ క్షతగాత్రులను డిశ్చార్జి చేసి ఇళ్లకు పంపించేయాలని అధికారులకు అదేశాలు వెళ్లాయి. నిర్లక్ష్యంతో భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడిన ప్రభుత్వాన్ని జగన్ నిలదీస్తారనే భయం ఈ ఆదేశాలతో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
Updates: కేటీఆర్ విచారణ వేళ ఉత్కంఠ
ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ విచారణ. ఏసీబీ ఆఫీస్‌లో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న అధికారులుఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామంబీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్(KTR) విచారణఈ కేసులో ఏ1గా కేటీఆర్తెలంగాణ కోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరటహైకోర్టు తీర్పుతో.. కేటీఆర్ అరెస్ట్‌కు ఏసీబీకి తొలగిన అడ్డంకులు!ఏసీబీ తదుపరి చర్యలపై ఉత్కంఠకేటీఆర్ విచారణ.. పెరుగుతున్న ఉత్కంఠఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కొనసాగుతున్న విచారణKTR విచారణ పై గంట గంటకు కొనసాగుతున్న ఉత్కంఠ..KTR ఏసీబీ విచారణ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం పరిసరాల్లో భారీగా మొహరించిన BRS శ్రేణులుఆరు గంటలుగా కొనసాగుతున్న ఏసీబీ విచారణఫిర్యాదు దారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కొనసాగుతున్న విచారణIAS అరవింద్ కుమార్ ఇచ్చిన వాగ్మూలం ముందు ఉంచి ప్రశ్నిస్తున్న ఏసీబీFEO తో ఒప్పందాలు నగదు,బదిలీ అంశాలపై ప్రశ్నిస్తున్న ఏసీబీకేబినెట్ ఆమోదం, ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు?ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడానికి కారణం ఏంటి?BRS పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్లపై ప్రశ్నిస్తున్న ఏసీబీఇప్పటికే సేకరించిన పత్రాలు ముందు ఉంచి ప్రశ్నిస్తున్న ఏసీబీకేటీఆర్కు ఏసీబీ సంధించిన ప్రశ్నలు ఇవేనా?అసలు హైదరాబాద్‌లో ఫార్ములా రేస్ ప్రతిపాదన ఎవరిది? ఎవరు ఆమోదించారు?ఇక్కడే ఎందుకు నిర్వహించారు?ప్రభుత్వానికి ఏమైనా ప్రయోజనం కలిగిందా?నగదు బదిలీ చేస్తే ఇబ్బందులు వస్తాయని ఎవరైనా హెచ్చరించరా?అసలు నిబంధనలు పట్టించుకోకుండా ఎందుకు బదిలీ చేశారు?గ్రీన్కో ఎందుకు స్పాన్సర్షిప్ నుంచి వైదొలగిందినిధుల మళ్లింపు కేబినెట్ దృష్టికి ఎందుకు వెళ్లలేదు?లంచ్‌బ్రేక్ తర్వాత తిరిగి ప్రారంభమైన కేటీఆర్ విచారణకేటీఆర్ను తిరిగి విచారిస్తున్న ఏసీబీలంచ్ తర్వాత కేటీఆర్‌ను విచారిస్తున్న ఏసీబీకేటీఆర్ విచారణ.. లంచ్ బ్రేక్కేటీఆర్ ఏసీబీ విచారణకు లంచ్ బ్రేక్భోజన విరామం తర్వాత కొనసాగనున్న విచారణఇప్పటిదాకా.. మూడున్నర గంటలకు పైగా కొనసాగిన విచారణ రెండు గంటలుగా విచారణ ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న ఏసీబీ ప్రత్యేక బృందం రెండు గంటలుగా కొనసాగుతున్న విచారణకేటీఆర్ ఓ రూంలో.. ఆయన లాయర్ మరో రూంలోరేసు ఒప్పందాలు, నగదు బదిలీపైనే ప్రధానంగా కొనసాగుతున్న విచారణకేటీఆర్కు ప్రశ్నల వర్షంఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న అధికారులు ఓ గదిలో కేటీఆర్, పక్కనే లైబ్రరీలో ఆయన లాయర్ రామచందర్రావులాయర్కు కేటీఆర్ కనిపించేలా ఏర్పాట్లుకేటీఆర్పై ప్రశ్నల వర్షం గుప్పిస్తున్న ఏసీబీ అధికారుల బృందంHMDA నుంచి FEOకు రూ. 55 కోట్ల నగదు బదిలీపై ఆరారేసు ఒప్పందాల కోసం ఎవరిని కలిశారు? ఎప్పడెప్పుడు కలిశారు? ఎలాంటి చెల్లింపులు జరిగాయి? ఏదైనా వివాదాలు వస్తాయని ముందు జాగ్రత్తగా ఆర్బిట్రేషన్ పెట్టుకున్నారా?అని ప్రశ్నించే అవకాశం. ACB-KTR వాదనలు ఇలా.. ఏసీబీ: ఒప్పందం కుదరకముందే చెల్లింపులు జరిగాయిKTR: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకే రూ.55 కోట్ల ఖర్చుఏసీబీ: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ చెల్లింపులు జరిగాయిKTR: గ్రీన్కో సంస్థ వెళ్లిపోవడంతో డబ్బులు సర్దుబాటు చేశాంఏసీబీ: ఒప్పందంలో భాగం కాకపోయినా హెచ్ఎండీఏ ద్వారా చెల్లింపులుKTR: డబ్బులు ఇచ్చిన సంగతి హెచ్ఎండీఏకి తెలుసుఏసీబీ: రూ.54 కోట్ల 88 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగంKTR: ఈవెంట్ ద్వారా వచ్చిన ప్రయోజనం రూ.700 కోట్లుఏసీబీ: ఫార్ములా-ఈకి రెండు విడుతల్లో రూ.45 కోట్ల చెల్లింపులుKTR: కొన్ని సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయిఏసీబీ: తొలి విడతలో రూ.22 కోట్ల 69 లక్షల విడుదలKTR: బ్యాటరీ వెహికిల్స్ రీపర్పస్ చేసే విధంగా జీవో తెచ్చాంఏసీబీ: మలివిడతలో రూ.23 కోట్లు చెల్లించిన హెచ్ఎండీఏKTR: మరో సంస్థ రూ.1200 కోట్ల పెట్టుబడులు పెట్టిందిఏసీబీ: ఆర్బీఐ గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా విదేశీ కంపెనీకి చెల్లింపులుKTR: మొబిలిటీ వీక్ ద్వారా ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టాయిప్రత్యేక గదిలో కేటీఆర్ విచారణఏసీబీ కార్యాలయంలో కొనసాగుతున్న కేటీఆర్ విచారణఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులుజాయింట్ డైరెక్టర్, డీఎస్పీ, సీఐల సమక్షంలో కొనసాగుతున్న విచారణవిచారణకు కేటీఆర్ లాయర్, మాజీ ఏఏజీ రామచందర్రావును లోపలికి అనుమతించిన అధికారులుఅరవింద్కుమార్తో పాటు దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ విచారణ?బిజినెస్ రూల్స్ ఉల్లంఘనతో పాటు నిధుల దుర్వినియోగం అభియోగాలుకేబినెట్ అనుమతి లేకుండా ఒప్పందాలు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపుల అభియోగాలపై ప్రశ్నలుఏసీబీ ఆఫీస్‌కు కేటీఆర్ఏసీబీ ఆఫీస్‌కు చేరుకున్న కేటీఆర్నందినగర్ నివాసం నుంచి ఏసీబీ ఆఫీస్‌కు చేరుకున్న కేటీఆర్కేటీఆర్ వెంట ఆయన లాయర్, మాజీ ఏఏజీ రామచంద్రరావునిఖార్సైన తెలంగాణ బిడ్డను..: కేటీఆర్నందినగర్ నివాసం వద్ద మీడియాతో కేటీఆర్తెలంగాణ ప్రతిష్టను పెంచడానికే నేను ప్రయత్నించానుహైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ప్రయత్నించాంఈ క్రమంలోనే ఈ కార్ రేసు నిర్వహించాంమంత్రిగా తన బామర్దులకు కాంట్రాక్ట్ ఇప్పించే ప్రయత్నం నేనేం చేయలేదుఅరపైసా కూడా అవినీతి చేయలేదుఇంకా ఎన్ని కేసులైనా పెట్టుకో.. వాటిని ఎదుర్కొంటాం (సీఎం రేవంత్‌ను ఉద్దేశించి..)తెలంగాణ బిడ్డగా రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడిగా స్పష్టంగా చెప్తున్నారాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం ప్రపంచ స్థాయిలో ఎదిగేలా పని చేశా.. మేము కుటుంబం కోసం పని చేయలేదునేను 50 లక్షల డబ్బుతో ఎమ్మెల్యే లను కొని దొరికిన దొంగను కాదునిజం నిలకడ మీద తెలుస్తది మీ వైఫల్యాలపై పోరాడింది బీఆర్ఎస్.. అందుకే మా మీద కేసులు మీ డైవర్షన్ లకు లోనుకామునేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను.. ఏ తప్పు చేయలేదుఏ ప్రశ్నలు అడిగిన చెప్తం .. తెలంగాణ కోసం చస్తాను తప్ప తల వంచను ఎక్స్‌లో కేటీఆర్తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకేర్ములా ఈ కార్ రేసు నిర్వహించాంపెట్టుబడులను రప్పించేందుకు కోసం కృషి చేశాంవీటన్నింటిని ప్రజలు అర్థం చేసుకుంటారని విశ్వసిస్తున్నాఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుంది Worked tirelessly for bringing a prestigious event to India, to enhance the Brand image of Hyderabad & Telangana globallyAgenda was to make Hyderabad a pivotal hub for sustainable mobility as the world transitions towards it. Formula-E race was a part of the effort to realise… pic.twitter.com/JhqimVe9TI— KTR (@KTRBRS) January 9, 2025భారీ భద్రత ఏర్పాటుబంజారాహిల్స్లోని ఏసీబీ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తుకేటీఆర్ విచారణ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఏర్పాటుఏసీబీ ఆఫీస్‌కు ఇరువైపులా భారీ బారికేడ్లుమరోవైపు బీఆర్ఎస్ నేతల హౌజ్ అరెస్టులుకేటీఆర్ ఇంటికి బీఆర్ఎస్ నేతల క్యూ
‘భార్యవైపు ఎంతసేపు చూస్తావు? వచ్చి పని చెయ్’
టెక్ పరిశ్రమలో పని గంటలపై ఇటీవల కాలంలో తీవ్ర చర్చ జరుగుతున్న సందర్భంలో ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని, ఆదివారాలను కూడా వదులుకోవాలని ఉద్యోగికి సూచించారు. వీడియో ఇంటెరాక్షన్ సందర్భంగా ఎల్ అండ్ టీ కంపెనీ ఉద్యోగి అడిగిన ప్రశ్నకు సుబ్రహ్మణ్యన్ ఈ విధంగా బదులిచ్చారు.ఇటీవల కాలంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి వారానికి 70 గంటల పని చేయాలని సూచించడంతో టెక్ ఉద్యోగుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యలపై చాలామంది విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే కార్తీ చిదంబరం వంటి ఎంపీలు పార్లమెంట్‌లోనూ ఈ అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వారానికి 90 గంటలు పని చేయాలని చెప్పడంతోపాటు, ఆదివారం కూడా వదిలేయాలని సూచించడం మరింత చర్చకు దారితీసింది.ఆదివారం కూడా..ఎల్ అండ్ టీ ఉద్యోగి ఒకరు ఛైర్మన్‌తో వీడియో ఇంటెరాక్షన్‌లో భాగంగా కొన్ని అంశాలను అడుగుతూ..ఉద్యోగులు శనివారాల్లో ఎందుకు పని చేయాల్సి ఉంటుందని అన్నారు. దాంతో వెంటనే సుబ్రహ్మణ్యన్ స్పందిస్తూ ‘ఆదివారాన్ని కూడా పని దినంగా ఆదేశించలేం కదా. నేను మీతో ఆదివారం పని చేయించుకోలేకపోతున్నాను. మీరు సండే కూడా పని చేస్తే మరింత సంతోషిస్తాను. ఎందుకంటే నేను ఆ రోజు కూడా పని చేస్తున్నాను’ అని అన్నారు. ఇంట్లో ఉండి ఉద్యోగులు ఏం చేస్తారని సుబ్రహ్మణ్యన్ ప్రశ్నించారు. ‘ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? నీ భార్యవైపు ఎంతసేపు చూస్తూ ఉంటావు? రండి, ఆఫీసుకు వచ్చి పని ప్రారంభించండి. మీరు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలంటే వారానికి 90 గంటలు పని చేయాలి’ అన్నారు.ఇదీ చదవండి: అపోహలు వీడితేనే మంచి స్కోరుయూఎస్ను దాటనున్న చైనారెడ్డిట్లో పోస్ట్ అయిన ఈ ఇంటెరాక్షన్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనికి మద్దతుగా కొందరు, విరుద్ధంగా ఇంకొదరు నెటిజన్లు స్పందిస్తున్నారు. సుబ్రహ్మణ్యన్ అభిప్రాయాలకు మద్దతుగా ఉన్న ఓ చైనా వ్యక్తి ‘అమెరికన్లు పనిచేసే 50 గంటలతో పోలిస్తే చైనా వారు వారానికి 90 గంటలు పని చేస్తారు. కాబట్టి చైనా యునైటెడ్ స్టేట్స్ను అధిగమించగలదు’ అని అన్నాడు. చాలా మంది నెటిజన్లు సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు సరికాదని కామెంట్ చేస్తున్నారు.
‘గంభీర్ ఒక మోసగాడు.. గెలిస్తే క్రెడిట్ నాదే అంటాడు.. కానీ’
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)పై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి(Manoj Tiwary) ఘాటు విమర్శలు చేశాడు. గంభీర్‌ను మోసకారిగా అభివర్ణిస్తూ.. అతడొక కపట మనస్తత్వం కలిగిన వ్యక్తి అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. జట్టు గెలిచినపుడు విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు మాత్రమే ముందుంటాడని.. ఓడితే మాత్రం ఏవో సాకులు చెబుతాడంటూ మండిపడ్డాడు.పట్టుబట్టి మరీ కోచింగ్ స్టాఫ్‌లోకి తీసుకున్నాడుఅసలు గంభీర్ నాయకత్వంలోని కోచింగ్ సిబ్బంది ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని మనోజ్ తివారి విమర్శించాడు. కాగా రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) స్థానంలో గతేడాది గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో తనతో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, మోర్నీ మోర్కెల్, ర్యాన్ టెన్ డష్కటేలను పట్టుబట్టి మరీ కోచింగ్ స్టాఫ్‌లో చేర్చుకున్నాడు.ఘోర వైఫల్యాలుఅయితే, గంభీర్ హయాంలో టీమిండియా ఇప్పటి వరకు పెద్దగా సాధించిందేమీ లేకపోగా.. ఘోర వైఫల్యాలు చవిచూసింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ 3-0తో వైట్‌వాష్‌కు గురికావడంతో పాటు.. పదేళ్ల తర్వాత తొలిసారి ఆస్ట్రేలియాకు బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఆసీస్ పర్యనటలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో 3-1తో ఓడి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో మనోజ్ తివారి మాట్లాడుతూ.. ‘‘గౌతం గంభీర్ ఒక మోసకారి. అతడు చెప్పేదొకటి. చేసేదొకటి. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ అభిషేక్ నాయర్.. ఇద్దరూ ముంబైవాళ్లే. ఓటముల సమయంలో రోహిత్‌ను ముందుకు నెట్టేలా ప్లాన్ చేశారు. అసలు జట్టుకు బౌలింగ్ కోచ్ వల్ల ఏం ప్రయోజనం కలిగింది?వారి వల్ల ఏం ఉపయోగం?ప్రధాన కోచ్ ఏది చెబితే దానికి తలాడించడం తప్ప బౌలింగ్ కోచ్ ఏం చేస్తాడు? మోర్నీ మోర్కెల్ లక్నో సూపర్ జెయింట్స్ నుంచి వచ్చాడు. ఇక అభిషేక్ నాయర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందినవాడు. ఈ ఇద్దరూ గంభీర్‌తో కలిసి పనిచేశారు. గంభీర్ ఇప్పుడు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్. వీరు అతడి అసిస్టెంట్లు. గంభీర్ హాయిగా తనదైన కంఫర్ట్జోన్లో ఉన్నాడు’’ అని న్యూస్18 బంగ్లా చానెల్‌తో పేర్కొన్నాడు.సమన్వయం లేదుఅదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మతో గంభీర్‌కు సమన్వయం లోపించిందన్న మనోజ్ తివారి.. వారిద్దరు ఇక ముందు కలిసి పనిచేస్తారా? అనే సందేహం వ్యక్తం చేశాడు. ‘‘రోహిత్ ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్. మరోవైపు.. గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా, మెంటార్‌గా టైటిల్స్ అందించాడు. నాకు తెలిసి వీరిద్దరికి ఏకాభిప్రాయం కుదరడం లేదు’’ అని మనోజ్ తివారి పేర్కొన్నాడు.క్రెడిట్ అంతా తనకే అంటాడుకాగా ఐపీఎల్-2024లో గంభీర్ మెంటార్‌గా వ్యవహరించిన కోల్‌కతా నైట్ రైడర్స్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. అతడికి కోచ్‌గా పనిచేసిన అనుభవం లేకపోయినా బీసీసీఐ ఏకంగా టీమిండియా హెడ్‌కోచ్‌గా పదవిని ఇచ్చింది. ఈ విషయం గురించి మనోజ్ తివారి ప్రస్తావిస్తూ..‘‘గంభీర్ ఒంటిచేత్తో ఎన్నడూ కోల్‌కతాకు టైటిల్ అందించలేదు. జాక్వెస్ కలిస్, సునిల్ నరైన్.. నేను.. ఇలా చాలా మంది సహకారం ఇందులో ఉంది. అయితే, క్రెడిట్ అంతా ఎవరు తీసుకున్నారో అందరికీ తెలుసు’’ అంటూ గంభీర్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు.చదవండి: ఆస్ట్రేలియాకు భారీ షాక్!.. చాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరం?
లోకేష్‌కు ప్రత్యేక హోదా వచ్చింది..
ప్రధాని మోదీ విశాఖ పర్యటన పూర్తయింది. గతంలో వైఎస్ జగన్ హయాంలో ఒప్పందాలు కుదుర్చుకున్న పలు సంస్థలు మళ్లీ అదే ఒప్పందాలు ఇప్పుడే కుదర్చుకున్నట్లు ఫోటోలు దిగాయి.. అదంతా బాబు గొప్పతనం అన్నట్లుగా మీడియాలో ప్రచారం కూడా జరిగింది. ఇక పత్రికల్లో భారీ ప్రకటనలు.. రాష్ట్ర స్వరూపం మారిపోతున్నట్లు పెద్ద పెద్ద హోర్డింగులు.. ఇవన్నీ చంద్రబాబు హయాంలో సహజమే అయితే ప్రధాని మీటింగ్ వలన రాష్ట్రానికి. విశాఖ నగరానికి పెద్దగా ప్రయోజనం ఏమీ లేకున్నా లోకేష్ కు మాత్రం ప్రత్యేక హోదా దక్కింది.మోదీ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పెద్దపెద్ద పత్రికా ప్రకటనలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు ఆ ప్రకటనల్లో పెట్టారు అంటే అర్థం ఉంది కానీ కేబినెట్లో అందరిలా మంత్రి పదవి తప్పితే ప్రత్యేకమైన ఏ గుర్తింపు లేని లోకేష్ ఫోటోలు ఎందుకు పెట్టినట్లు.. సీఎం, డిప్యూటీ సీఎం సహా లోకేష్‌ను ప్రధానితో వేదిక మీద ఎందుకు కూర్చోబెట్టినట్లు. ఆయనకు చంద్రబాబు కొడుకుగా కాకుండా ప్రత్యేక గుర్తింపు ఏముంది.?ఇప్పటికే అన్నిశాఖల్లోనూ విపరీతంగా జోక్యం చేసుకుంటూ పెత్తనం సాగిస్తున్న లోకేష్ ఇప్పుడు అనధికార సీఎంగా.. సూపర్ పవర్‌గా ఎదిగారని అధికారులే అంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ పెద్ద ఫైల్ కదలాలన్నా.. ఎవరికీ ఏ పోస్టింగ్ ఇవ్వాలన్నా లోకేష్‌ను కలవాలి అనేది ఒక అనధికారిక జీఓ మాదిరి నడుస్తోంది. ఇక ఇప్పుడు ఆయన్ను డిప్యూటీ సీఎం హోదాలో అధికారికంగా నియమించడమే తరువాయి అని అంటున్నారు.ప్రస్తుతానికి అధికారికంగా అయితే చంద్రబాబు తరువాత పవన్‌కు మాత్రమే ఉప ముఖ్యమంత్రిగా ప్రాధాన్యం దక్కుతోంది. ఇక త్వరలో లోకేష్‌కు కూడా డిప్యూటీ స్థాయికి ఎలివేషన్ ఇచ్చారంటే ఇక పవన్ ప్రాధాన్యం తగ్గినట్లే.. ఇక డిప్యూటీ హోదాలో లోకేష్ మరింతగా రెచ్చిపోయి శాఖలన్నింటినీ కెలికేస్తాడు. పాపం ఇటు పవన్ తన పంచాయతీ రాజ్.. గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన పనులే అర్థం కాక తికమకపడిపోతున్నారు. రానున్న రోజుల్లో పవన్ ప్రాధాన్యం తగ్గించి లోకేష్‌ను ముందుకు తెచ్చేందుకు ఈ మోదీ పర్యటన బాగా ఉపయోగించుకున్నారని అర్థం అవుతోంది.-సిమ్మాదిరప్పన్న
ప్రభాస్ హీరోయిన్‌కి వేధింపులు.. రంగంలోకి పోలీసులు!
సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది చేసింది హీరోయిన్ నిధి అగర్వాల్( Nidhhi Agerwal). సదరు వ్యక్తి తనను చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పంపిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. సదరు వ్యక్తి తనతో పాటు తనకు ఇష్టమైన వారిని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిపింది. ఆయన బెదిరింపుల వల్ల తాను మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నానని, సదరు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిధి అగర్వాల్ తన ఫిర్యాదులో కోరింది. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు నిధి అగర్వాల్ కంప్లైంట్ తీసుకుని, విచారణ చేపట్టారు.వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నిధిబాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్లో రాణిస్తున్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది నిధి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత అక్కినేని అఖిల్ తో మజ్ను అనే సినిమా చేసింది. ఆ సినిమా కూడా నిరాశపరిచింది. దాంతో ఈ బ్యూటీకి ఇక అవకాశాలు రావడం కష్టమే అని అనుకున్నారు అంతా.. ఆతర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాలో నటనతో పాటు గ్లామర్ పరంగాను ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస సినిమా చాన్స్‌లు వచ్చాయి. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌లతో నటిస్తోంది.‘రాజాసాబ్’తో రొమాన్స్మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’(The Raja Saab). కామెడీ హారర్‌గా రాబోతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే మిగతా హీరోయిన్లలో పోలిస్తే నిధి పాత్రకు కాస్త ప్రాధాన్యత ఎక్కువే ఉందట. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.‘వీరమల్లు’కి జోడీగాపవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu). క్రిష్ సారథ్యంలో జ్యోతికృష్ణ దర్శకత్వంలో రానుంది. ఈ చిత్రంలో పవన్‌కి జోడీగా నిధి నటిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ తొలిభాగం ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుంది. అనుపమ్‌ఖేర్, బాబీ దేవోల్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 28న ఈ చిత్రం మొదటి భాగం ప్రేక్షకుల ముందుకురానుంది.
హై-ఎండ్ ప్రాజెక్ట్‌లో ఫ్లాట్స్ కొన్న హీరో వరుణ్ ధావన్ : ఎన్ని కోట్లో తెలుసా?
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అయితే ఇది తన లేటెస్ట్ మూవీ ‘బేబీజాన్’ ఫ్లాప్ గురించి ఎంతమాత్రం కాదు. ముంబైలోని ఖరీదైన జుహూ ఏరియాలో రెండు లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ను కొనుగోలు చేశాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట సందడి చేస్తోంది. ఇంతకీ ఎవరి కోసం ఆ ఫ్లాట్లు కొన్నాడు. తెలుసుకుందాం ఈ కథనంలో..ముంబైలోనిముంబైలోని అత్యంత ప్రీమియం జుహు ఏరియాలో ట్వంటీ అనే హై-ఎండ్ ప్రాజెక్ట్‌లో రెండు అపార్ట్మెంట్లను కొనుగోలు చేశాడు. వీటి ధర ఏకంగా రూ.86.92 కోట్లు. ఫ్యామిలీతో కలిసి ఒకటి భార్య నటాషా దలాల్ కోసం , మరోకటి తల్లి కరుణ్ ధావన్‌కోసం వీటిని సొంతం చేసుకున్నాడు.ఈ ట్వంటీ అనే బిల్డింగ్ లోని ఏడో అంతస్తులో ఒక ఫ్లాట్‌ను నటాషా దలాల్‌తో కలిసి కొన్నాడు. దీని విస్తీరం 5112 చదరపు అడుగులు. ధర రూ.44.52 కోట్లు. ఇందులో నాలుగు కారు పార్కింగ్ స్థలాలున్నాయట. ఇక తల్లి కోసం ఇక అదే బిల్డింగ్ ఆరో అంతస్తులో తన తల్లి కరుణా ధావన్‌తో కలిసి వరుణ్ మరో 4617 చదరపు అడుగుల అపార్ట్మెంట్ కొన్నాడు. దీని ధర రూ.42.4 కోట్లు. ప్రస్తుతం ఈ రెండూ ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి. ఈ ఏడాది మే 31వ తేదీలోపు వీటిని అందజేయనున్నారని స్క్వేర్ యార్డ్స్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఒక్కో అదరపు అడుగు విలువ రూ.60 వేల నుంచి రూ.1.3 లక్షల వరకు ఉంటుంది.విలాసవంతమైన ప్రాజెక్ట్ గురించి మరింత చెప్పాలంటే, ఇది ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీల్లో పెద్ద డిమాండ్ ఉన్న ఏరియా. ఈ ప్రాజెక్ట్‌లో ప్రీమియం సౌకర్యాలతో 3BHK , 4BHK నివాసాలు ఉన్నాయి. అలాగే ముంబైలోని జుహులో అమితాబ్ బచ్చన్ కు రెండు బంగ్లాలు ఉన్నాయి. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, కాజోల్, గోవిందా తదితర హీరోలకు కూడా ఇక్కడ ఇళ్లున్నాయి. ఇక బాంద్రాలో బాలీవుడ్ స్టార్‌హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఆమిర్ ఖాన్, సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ లాంటివాళ్ల నివాసాలు కూడా ఇక్కడే ఉన్నాయి. (ఎప్పటినుంచో ఐఏఎస్ కల..కానీ 13 ఏళ్లకే అనూహ్య నిర్ణయం)వరుణ్ ధావన్ తన చిన్నప్పటి నుంచి తన తండ్రి, నిర్మాత డేవిడ్ ధావన్ ద్వారా బాలీవుడ్‌తో దగ్గరి సంబంధాలతో పెరిగాడు. అయితే ధావన్ కుటుంబం మధ్యతరగతి జీవితాన్ని గడిపింది. 1990లలో డేవిడ్ అనేక విజయాలను అందించినప్పటికీ. నిర్మాత జీవితం దర్శకుడి జీవితం కంటే చాలా భిన్నంగా ఉంటుందని స్వయంగా ఒకసారి చెప్పుకొచ్చాడు. దర్శకుడిగా ఉన్నప్పటికీ తన తండ్రి పెద్దగా సంపాదించలేదన్నారు. అలా సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ నుంచి ముంబైలోని ఎలైట్ సెలబ్రిటీ హాట్‌స్పాట్‌లో రెండు లగ్జరీ రియల్ ఎస్టేట్లను కొనుగోలు దాకా వరుణ్ ఎదగడం విశేషమే మరి.ఇదీ చదవండి : రూ. 25 లక్షల ఐటీ జాబ్ వదిలేసి.. ఆర్గానిక్ వైపు జాహ్నవి జర్నీ!కాగా వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన మూవీ బేబీ జాన్. తమిళ బ్లాక్ బస్టర్ తేరి మూవీ రీమేక్‌గా దీన్ని తీసుకొచ్చారు. అయితే హిందీలో మాత్రం పెద్దగా సక్సెస్‌కాలేకపోయింది. కొత్త పెళ్లికూతురుగా పసుపుతాడుతో కీర్తి సురేష్ ప్రమోషన్స్‌లో పాల్గొన్నప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ‘బేబీ జాన్’ డిజాస్టర్ గా మిగిలి పోయింది.
తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ వింత వ్యాఖ్యలు
సాక్షి, తిరుమల: తిరుపతి తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వింత వ్యాఖ్యలు చేశారు. చింతించడం తప్ప చేసేదేమీ లేదన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎవరూ ఏం చేయలేరు.. దైవ నిర్ణయం. పరిపాలనా లోపం వల్లే తొక్కిసలాట. గొడవలు జరుగుతాయని ముందే తెలుసు’’ అంటూ వ్యాఖ్యానించారు. భక్తుల మరణాలపై టీటీడీ ఛైర్మన్ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‘‘క్యూలైన్లలో సౌకర్యాలు లేవు.మమ్మల్ని చావిడిలో గొడ్డుల్లా లోపల వేశారు. క్యూ లైన్లలో రద్దీని నియంత్రించకలేకపోయారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగింది. తిరుపతిలో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదు. టీటీడీ వైఫల్యం వల్లే తొక్కిసలాట’’ జరిగిందని భక్తులు మండిపడుతున్నారు.వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇచ్చి..ప్రభుత్వ వైఫల్యమే తిరుపతిలో తొక్కిసలాటకు దారితీసిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. చిత్తశుద్ధి లేని వ్యక్తులకు, వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇచ్చి.. తిరుమల క్షేత్రాన్ని రాజకీయ కేంద్రంగా మార్చారన్నారు. భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారని, అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి తిరుమలను వాడుకున్నారన్నారు. గడచిన ఐదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని, మరి ఇప్పుడు ఎందుకు జరిగిందని ప్రభుత్వాన్ని నిలదీశారు.ఇదీ చదవండి: ప్రాణాలతో చెలగాటం.. తిరుమల ఘటనపై భక్తుల రియాక్షన్టీటీడీ చరిత్రలో ఇదొక చీకటి రోజని, చంద్రబాబు ప్రభుత్వం ఈ పాపం మూటగట్టుకుందని వ్యాఖ్యానించారు. ప్రచారాలు, ఆర్భాటాలు తప్ప చంద్రబాబుకు ఏమీ పట్టవని, గోదావరిలో పుష్కరాల తొక్కిసలాట ఘటన ఇప్పటికీ వెంటాడుతున్న చేదు జ్ఞాపకమని చెప్పారు. హిందూ ధర్మంపై భక్తి, శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున దర్శనానికి లక్షలాదిమంది వస్తారని అందరికీ తెలుసని, తెలిసీ ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని నిలదీశారు.తిరుపతిలో పోలీసు అధికారుల దృష్టి అంతా రాజకీయంగా కక్ష తీర్చుకునే కేసులపైనే ఉందన్నారు. తిరుపతి ఎస్పీ టీడీపీ కార్యకర్తగా మారి భక్తుల రక్షణ బాధ్యతలను పట్టించుకోలేదన్నారు. అధికారుల, పోలీసుల మధ్య సమన్వయం లేదని, శ్రీవారి భక్తుల సేవకన్నా, టీటీడీ చైర్మన్‌కు రాజకీయ వ్యాఖ్యానాలే ఎక్కువయ్యాయని ఆక్షేపించారు. ఆయన పనంతా రాజకీయ దు్రష్పచారం చేయడమేనని, టీటీడీ చైర్మన్ తన టీవీ కార్యాలయాలను తిరుమల టికెట్ల విక్రయ కేంద్రాలుగా మార్చారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయని చెప్పారు. తొక్కిసలాట ఘటనపై వెంటనే విచారణ జరగాలని, టీటీడీ చైర్మన్ సహా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సుధారాణి కుటుంబానికి ధైర్యం చెప్పిన వైఎస్ జగన్
టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే!
‘‘ఇదెక్కడి పెళ్లి గోలరా నాయనా’’ వైరల్ వీడియో : ఎలిమినేట్ చేసేయండంటూ ఫైర్
2025లో బెస్ట్ డీజిల్ కార్లు.. ధర కూడా తక్కువే!
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ని వదలని సినిమా కష్టాలు!
'హనీరోజ్ డ్రెస్‌పై చర్చ.. అందులో ఎలాంటి తప్పు లేదు'.. ప్రముఖ కామెంటేటర్
సినిమాలు మానేయాలనుంది, గతేడాదే ఈ పని చేయాలనుకున్నా!
ఈ ఘటనకు టీటీడీనే బాధ్యత వహించాలి: వైవీ సుబ్బారెడ్డి
నెపం అధికారులపైకి నెట్టేస్తే సరిపోతుందా?
చైనాలో మంకీపాక్స్ కొత్త వేరియంట్ కలకలం
క్షమాపణలు చెప్పిన యాంకర్ శ్రీముఖి.. అసలేం జరిగిందంటే?
తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ వింత వ్యాఖ్యలు
ఎన్ని ఫిర్యాదులొచ్చినా మిమ్మల్ని వెతకడానికి ఎవరూ సాహసించరు సార్!!
ఏడు కొండలవాడా.. ఎంత ఘోరం.. ఎంత ఘోరం
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పనులు చకచకా సాగుతాయి.
సాక్షి కార్టూన్
నా బండి ఫొటో ఎందుకు తీశావురా?
తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తిరుపతి ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
రేపటి నుంచి (జనవరి 9) మరో క్రికెట్ పండుగ.. అభిమానులకు జాతరే..!
సుధారాణి కుటుంబానికి ధైర్యం చెప్పిన వైఎస్ జగన్
టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే!
‘‘ఇదెక్కడి పెళ్లి గోలరా నాయనా’’ వైరల్ వీడియో : ఎలిమినేట్ చేసేయండంటూ ఫైర్
2025లో బెస్ట్ డీజిల్ కార్లు.. ధర కూడా తక్కువే!
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ని వదలని సినిమా కష్టాలు!
'హనీరోజ్ డ్రెస్‌పై చర్చ.. అందులో ఎలాంటి తప్పు లేదు'.. ప్రముఖ కామెంటేటర్
సినిమాలు మానేయాలనుంది, గతేడాదే ఈ పని చేయాలనుకున్నా!
ఈ ఘటనకు టీటీడీనే బాధ్యత వహించాలి: వైవీ సుబ్బారెడ్డి
నెపం అధికారులపైకి నెట్టేస్తే సరిపోతుందా?
చైనాలో మంకీపాక్స్ కొత్త వేరియంట్ కలకలం
క్షమాపణలు చెప్పిన యాంకర్ శ్రీముఖి.. అసలేం జరిగిందంటే?
తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ వింత వ్యాఖ్యలు
ఎన్ని ఫిర్యాదులొచ్చినా మిమ్మల్ని వెతకడానికి ఎవరూ సాహసించరు సార్!!
ఏడు కొండలవాడా.. ఎంత ఘోరం.. ఎంత ఘోరం
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పనులు చకచకా సాగుతాయి.
సాక్షి కార్టూన్
నా బండి ఫొటో ఎందుకు తీశావురా?
తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తిరుపతి ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
రేపటి నుంచి (జనవరి 9) మరో క్రికెట్ పండుగ.. అభిమానులకు జాతరే..!
సినిమా
తిరుపతి తొక్కిసలాట: హృదయాన్ని కలిచివేసిందన్న మోహన్‌బాబు
తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రముఖ నటుడు మోహన్ బాబు (Mohanbabu) దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు. 'తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు టికెట్ల కోసం తిరుపతిలో కౌంటర్ల వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ జరిగిన తొక్కిసలాటలో కొంతమంది మరణించడం నా హృదయాన్ని కలిచివేసింది.ఇలా జరగడం దురదృష్టంప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) భక్తుల కోసం తీసుకునే జాగ్రత్తలు, సదుపాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అయినా ఇలా జరగడం దురదృష్టకరం. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని.. మరణించిన వారి కుటుంబాలకు ఆ వైకుంఠవాసుడు మనోధైర్యాన్ని కల్పించాలని ప్రార్థిస్తున్నాను అంటూ ఎక్స్ (ట్విటర్)లో ట్వీట్ చేశారు.ఏం జరిగింది?వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. పదిరోజులపాటు కొనసాగే వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులకు టీటీడీ టోకెన్ల జారీ ప్రక్రియ మొదలుపెట్టింది. ఇందుకోసం తిరుమలలో ఒకటి, తిరుపతిలో తొమ్మిది కౌంటర్లు ఏర్పాటు చేశారు. టోకెన్లు తీసుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో, పక్క రాష్ట్రాల భక్తులు సైతం భారీగా తరలి వచ్చారు.(చదవండి: మోహన్ బాబును జైలుకు పంపాలా..? నష్టపరిహారం కావాలా..?: సుప్రీంకోర్టు)ఒక్కసారిగా విడిచిపెట్టడంతో..తిరుపతిలోని బైరాగిపట్టెడ ప్రాంతంలోని ఎంజీఎం స్కూల్‌కు చేరుకున్న భక్తులను క్యూలైన్లోకి అనుమతించలేదు. రాత్రి 8.35 గంటల ప్రాంతంలో అందరినీ ఒకేసారి విడిచి పెట్టమని డీఎస్పీ ఆదేశించటంతో పోలీసులు గేట్లు తెరిచారు. భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లోకి ప్రవేశించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. కిందపడిపోయినవారికి ఊపిరాడక ఆరుగురు మృతి చెందారు.భీతిల్లిన తిరుపతిఅదేవిధంగా శ్రీనివాసం ప్రాంతంలోని కౌంటర్ కేంద్రంలో భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరగ్గా ఒకరు మరణించగా పలువురూ గాయపడ్డారు. తిరుపతిలోని రామానాయుడు స్కూల్లో బుధవారం రాత్రి ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట సంభవించి 40 మంది వరకు స్పృహ తప్పి పడిపోయారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గోవింద నామస్మరణతో ప్రతిధ్వనించాల్సిన తిరుమల అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో భీతిల్లింది.కన్నప్ప సినిమా విశేషాలుసినిమా విషయానికి వస్తే.. మోహన్‌బాబు చివరగా శాకుంతలం సినిమాలో నటించాడు. ప్రస్తుతం అతడు కన్నప్ప మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఇందులో మోహన్ బాబు తనయుడు విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. శివ భక్తుడు కన్నప్పగా కనిపించనున్నాడు. విష్ణు తనయుడు అవ్రామ్ బాలకన్నప్పగా మెప్పించనున్నాడు. ఈ చిత్రాన్ని 2023లో ప్రకటించారు. ప్రభాస్, కాజల్, మధుబాల, ఆర్ శరత్‌కుమార్, బ్రహ్మానందం, రఘుబాబు, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు టికెట్ల కోసం తిరుపతిలో కౌంటర్ల వద్దకు వెళ్ళి అక్కడ జరిగిన తొక్కిసలాటలో కొంతమంది మరణించడం నా హృదయాన్ని కలిచివేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం తీసుకునే జాగ్రత్తలు, సదుపాయాలు బ్రహ్మాండంగా…— Mohan Babu M (@themohanbabu) January 9, 2025 చదవండి: 400 ఏళ్ల నాటి గుడి కాన్సెప్ట్‌తో సినిమా.. గ్లింప్స్‌తోనే భారీ అంచనాలు
నేను చేసిన పెద్ద తప్పు అదే!: కంగనా రనౌత్
హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ఏ ముహూర్తాన ఎమర్జెన్సీ సినిమా మొదలుపెట్టిందో కానీ అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడో రిలీజవ్వాల్సిన సినిమా ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు. అన్ని అడ్డంకులు దాటుకుని ఎమర్జెన్సీ (Emergency Movie) ఎట్టకేలకు జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.తప్పు చేశా..ఎమర్జెన్సీ సినిమా తీయడమేమో కానీ తనను మూడు చెరువుల నీళ్లు తాగించారంటోంది కంగనా. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఎమర్జెన్సీని థియేటర్లలో విడుదల చేయాలనుకోవడం నేను చేసిన పెద్ద తప్పు. ఓటీటీకి వెళ్లుంటే ఇంకా అక్కడ మంచి డీల్ దొరికేది. ఈ సెన్సార్ బాధలు పడే గత్యంతరమే వచ్చుండేది కాదు. అసలు సెన్సార్ బోర్డు (The Central Board for Film Certification) నా చిత్రంలో ఆయా సన్నివేశాలను ఎందుకు తీసేయాలనుకుందో అర్థమే కాలేదు. వారు సూచించిన కట్స్ అన్నీ కూడా చరిత్రలో భాగమైనవే! అయినా వాటిని తీసేసినా కూడా నా సినిమా ధృడంగానే ఉంది.అది నా మొదటి తప్పుఎమర్జెన్సీని థియేటర్లలో విడుదల చేయాలనుకోవడం ఒక్కటే నేను చేసిన తప్పు కాదు. దానికంటే ముందు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం అతి పెద్ద తప్పుగా భావిస్తున్నాను. గతంలో కిస్సా కుర్సీ కా (ఇందిరా గాంధీ, ఆమె తనయుడు సంజయ్ గాంధీల రాజకీయాలపై వచ్చిన సెటైరికల్ మూవీ) మూవీ వచ్చింది. దీన్ని ఎవరూ చూడలేదు. కారణం.. బ్యాన్ చేశారు. అప్పట్లోనే ఈ సినిమా ప్రింట్లన్నింటినీ కాల్చేశారు. ఆ చిత్ర దర్శకుడు అమృత్ నహ్త ఆత్మహత్య చేసుకున్నాడు. (చదవండి: 'డాకు మహారాజ్' ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు)మీకే తెలుస్తుందిఅప్పటినుంచి ఇప్పటివరకు ఇందిరా గాంధీపై ఏ ఒక్కరూ సినిమా తీసే ధైర్యం చేయలేదు. నాకూ దాదాపు అలాంటి పరిస్థితులే వస్తాయని ఊహించలేదు. స్టూడియో కోసం, బడ్జెట్ కోసం కష్టపడాల్సి వచ్చింది. ఇంత చేస్తే నా మూవీ రిలీజ్ అవుతుందని ఎవరూ నమ్మలేదు. ఇప్పుడీ సినిమా చూశాక ఇప్పటి జనరేషన్‌కు ఇందిరాగాంధీ మూడుసార్లు ప్రధాని ఎలా అయిందో తెలుస్తుంది అని చెప్పుకొచ్చింది.అది తెలుసుకుని మాట్లాడుఈమె ఇంటర్వ్యూ విన్న నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అంతా ఓకే కానీ, కిస్సా కుర్సీ కా డైరెక్టర్ అమృత్ నహ్త బలవన్మరణం చేసుకోలేదని చెప్తున్నారు. ఆయన అనారోగ్యంతో మరణించారని.. కాస్త తెలుసుకుని మాట్లాడమని సూచిస్తున్నారు.సినిమా విశేషంకాగా కంగనా దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన ఎమర్జెన్సీ. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో విధించిన ఎమర్జెన్సీ, ఆపరేషన్ బ్లూస్టార్ వంటి సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో కంగనాతో పాటు అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పడే, అశోక్ చబ్రా, మహిమ చౌదరి, మిలింద్ సోమన్, విశాక్ నాయర్, సతీశ్ కౌశిక్ కీలక పాత్రలు పోషించారు. గతేడాది సెప్టెంబర్ 6న విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు వాయిదాల అనంతరం ఈ నెల 17న రిలీజవుతోంది.చదవండి: ప్రభాస్ హీరోయిన్‌కి వేధింపులు.. రంగంలోకి పోలీసులు!
ప్రభాస్ హీరోయిన్‌కి వేధింపులు.. రంగంలోకి పోలీసులు!
సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది చేసింది హీరోయిన్ నిధి అగర్వాల్( Nidhhi Agerwal). సదరు వ్యక్తి తనను చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పంపిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. సదరు వ్యక్తి తనతో పాటు తనకు ఇష్టమైన వారిని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిపింది. ఆయన బెదిరింపుల వల్ల తాను మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నానని, సదరు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిధి అగర్వాల్ తన ఫిర్యాదులో కోరింది. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు నిధి అగర్వాల్ కంప్లైంట్ తీసుకుని, విచారణ చేపట్టారు.వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నిధిబాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్లో రాణిస్తున్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది నిధి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత అక్కినేని అఖిల్ తో మజ్ను అనే సినిమా చేసింది. ఆ సినిమా కూడా నిరాశపరిచింది. దాంతో ఈ బ్యూటీకి ఇక అవకాశాలు రావడం కష్టమే అని అనుకున్నారు అంతా.. ఆతర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాలో నటనతో పాటు గ్లామర్ పరంగాను ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస సినిమా చాన్స్‌లు వచ్చాయి. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌లతో నటిస్తోంది.‘రాజాసాబ్’తో రొమాన్స్మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’(The Raja Saab). కామెడీ హారర్‌గా రాబోతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే మిగతా హీరోయిన్లలో పోలిస్తే నిధి పాత్రకు కాస్త ప్రాధాన్యత ఎక్కువే ఉందట. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.‘వీరమల్లు’కి జోడీగాపవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu). క్రిష్ సారథ్యంలో జ్యోతికృష్ణ దర్శకత్వంలో రానుంది. ఈ చిత్రంలో పవన్‌కి జోడీగా నిధి నటిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ తొలిభాగం ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుంది. అనుపమ్‌ఖేర్, బాబీ దేవోల్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 28న ఈ చిత్రం మొదటి భాగం ప్రేక్షకుల ముందుకురానుంది.
మోహన్ బాబును జైలుకు పంపాలా..? నష్టపరిహారం కావాలా..?: సుప్రీంకోర్టు
కొద్దిరోజుల క్రితం జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో సినీ నటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో (Supreme Court ) స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ జరిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ జరిగే వరకు మోహన్‌బాబుపై (Mohan Babu) ఎలాంటి చర్యలు తీసుకోకవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.అయితే, విచారణలో భాగంగా న్యాయస్థానం పలు ప్రశ్నలు అడిగింది. జర్నలిస్టులు లోపలికి వచ్చినంత మాత్రాన దాడి చేస్తారా.. ? అంటూ నటుడు మోహన్ బాబును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అది ఆవేశంలో జరిగిన ఘటన అని, బాధితుడికి పూర్తి నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోహన్ బాబు తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి తెలిపారు. అయితే, ఈ కేసుకు సంబంధించి నష్టపరిహారం కావాలా.. ? మోహన్ బాబును జైలుకు పంపాలా..? అని జర్నలిస్టు తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు అడిగింది. అయితే, ఈ అంశం గురించి తదుపరి విచారణలో సమాధానం ఇస్తామని జర్నలిస్ట్ తరఫు న్యాయవాది చెప్పడంతో మూడు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని రంజిత్ కుమార్‌ను కోర్టు ఆదేశించింది.(ఇదీ చదవండి: 400 ఏళ్ల నాటి గుడి కాన్సెప్ట్‌తో సినిమా.. గ్లింప్స్‌తోనే హైప్)మోహన్ బాబు తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇలా వాదనలు వినిపించారు. జర్నలిస్టులకు ఆహ్వానం లేకుండానే ఎందుకు ఇంటికి వచ్చారని న్యాయవాది ప్రశ్నించారు. అయినప్పటికీ ఇది ఆవేశంలో జరిగిన ఘటనగా చూడాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ సంఘటనతో జర్నలిస్ట్‌కు క్షమాపణలు చెపుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే, నష్టపరిహారం చెల్లించేందుకు మోహన్ బాబు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ఆయన వయసు 76 సంవత్సరాలు కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని ముకుల్ కోరారు. అయితే, మోహన్ బాబు దాడిలో తీవ్రంగా గాయపడ్డానని జర్నలిస్ట్ కోర్టుకు తెలిపారు. ఆ కారణంగా ఐదు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఈ దాడి వల్ల వృత్తిపరంగా తనకు నష్టం జరిగిందని జర్నలిస్ట్ తెలిపారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు
Ind vs Eng: నేను సిద్ధం.. సెలక్టర్లకు మెసేజ్ ఇచ్చిన భారత పేసర్!
వెటరన్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) టీమిండియా పునరాగమనానికి సై అంటున్నాడు. ఇప్పటికే దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటిన ఈ బెంగాల్ బౌలర్.. వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆకట్టుకుంటున్నాడు. మధ్యప్రదేశ్‌తో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తో(42 పరుగులు నాటౌట్)నూ సత్తా చాటిన షమీ.. తాజాగా ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో బంతితో రాణించాడు.వడోదర వేదికగా తొలి ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ - హర్యానా(Haryana vs Bengal) మధ్య గురువారం మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హర్యానాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు అర్ష్ రంగా(23), హిమాన్షు రాణా(14) తక్కువ స్కోర్లకే వెనుదిరగగా.. కెప్టెన్, వన్‌డౌన్ బ్యాటర్ అంకిత్ కుమార్(18) కూడా నిరాశపరిచాడు.రాణించిన మిడిలార్డర్ బ్యాటర్లుఅయితే, మిడిలార్డర్లో పార్థ్ వత్స్(62), నిశాంత్ సింధు(64) మాత్రం దుమ్ములేపారు. ఇద్దరూ అర్ధ శతకాలతో రాణించి.. జట్టును కష్టాల నుంచి గట్టెక్కించారు. మిగిలిన వాళ్లలో రాహుల్ తెవాటియా(29) ఫర్వాలేదనిపించగా.. ఎనిమిదో స్థానంలో వచ్చిన సుమిత్ కుమార్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 32 బంతుల్లో 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి హర్యానా 298 పరుగులు చేసింది.ఇక ఈ మ్యాచ్‌లో బెంగాల్ పేసర్ మహ్మద్ షమీ తన బౌలింగ్ కోటా పూర్తి చేయడంతో పాటు.. వికెట్లు తీయడం టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది. హర్యానాతో మ్యాచ్‌లో షమీ పది ఓవర్లు బౌల్ చేసి.. 61 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఆరంభంలో ఓపెనర్ హిమాన్షు రాణాను అవుట్ చేసిన షమీ.. డెత్ ఓవర్లలో దినేశ్ బనా(15), అన్షుల్ కాంబోజ్(4)లను వెనక్కి పంపాడు.సర్జరీ తర్వాత నో రీ ఎంట్రీఇలా ఓవరాల్‌గా తన ప్రదర్శన ద్వారా షమీ.. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నాననే సంకేతాలు ఇచ్చాడు. మిగతా బెంగాల్ బౌలర్లలో ముకేశ్ కుమార్ రెండు, సయాన్ ఘోష్, ప్రదీప్త ప్రామాణిక్, కౌశిక్ మైటీ, కరణ్ లాల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా షమీ టీమిండియాకు చివరగా ఆడాడు.స్వదేశంలో జరిగిన నాటి ఐసీసీ టోర్నీలో ఈ రైటార్మ్ పేసర్ 24 వికెట్లతో సత్తా చాటాడు. చీలమండ గాయం వేధిస్తున్నా ఈ మెగా ఈవెంట్లో కొనసాగిన షమీ.. అనంతరం శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన మహ్మద్ షమీ.. ఇంత వరకు భారత జట్టులో రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు.నేను సిద్ధం.. సెలక్టర్లకు మెసేజ్!కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి.. పదకొండు వికెట్లు తీసినా.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి అతడిని పక్కనపెట్టారు. టెస్టుల్లో బౌలింగ్ చేసే స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదన్న కారణంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు. అయితే, తదుపరి టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. జనవరి 22 నుంచి ఐదు టీ20, మూడు వన్డేలు ఆడనుంది. ఈ నేపథ్యంలో షమీ పది ఓవర్ల కోటా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసి.. తానూ రేసులో ఉన్నానని సెలక్టర్లకు గట్టి సందేశం ఇచ్చాడు. చదవండి: ‘చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు ఇదే.. వాళ్లిద్దరికి నో ఛాన్స్!’
‘గంభీర్ ఒక మోసగాడు.. గెలిస్తే క్రెడిట్ నాదే అంటాడు.. కానీ’
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)పై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి(Manoj Tiwary) ఘాటు విమర్శలు చేశాడు. గంభీర్‌ను మోసకారిగా అభివర్ణిస్తూ.. అతడొక కపట మనస్తత్వం కలిగిన వ్యక్తి అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. జట్టు గెలిచినపుడు విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు మాత్రమే ముందుంటాడని.. ఓడితే మాత్రం ఏవో సాకులు చెబుతాడంటూ మండిపడ్డాడు.పట్టుబట్టి మరీ కోచింగ్ స్టాఫ్‌లోకి తీసుకున్నాడుఅసలు గంభీర్ నాయకత్వంలోని కోచింగ్ సిబ్బంది ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని మనోజ్ తివారి విమర్శించాడు. కాగా రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) స్థానంలో గతేడాది గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో తనతో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, మోర్నీ మోర్కెల్, ర్యాన్ టెన్ డష్కటేలను పట్టుబట్టి మరీ కోచింగ్ స్టాఫ్‌లో చేర్చుకున్నాడు.ఘోర వైఫల్యాలుఅయితే, గంభీర్ హయాంలో టీమిండియా ఇప్పటి వరకు పెద్దగా సాధించిందేమీ లేకపోగా.. ఘోర వైఫల్యాలు చవిచూసింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ 3-0తో వైట్‌వాష్‌కు గురికావడంతో పాటు.. పదేళ్ల తర్వాత తొలిసారి ఆస్ట్రేలియాకు బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఆసీస్ పర్యనటలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో 3-1తో ఓడి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో మనోజ్ తివారి మాట్లాడుతూ.. ‘‘గౌతం గంభీర్ ఒక మోసకారి. అతడు చెప్పేదొకటి. చేసేదొకటి. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ అభిషేక్ నాయర్.. ఇద్దరూ ముంబైవాళ్లే. ఓటముల సమయంలో రోహిత్‌ను ముందుకు నెట్టేలా ప్లాన్ చేశారు. అసలు జట్టుకు బౌలింగ్ కోచ్ వల్ల ఏం ప్రయోజనం కలిగింది?వారి వల్ల ఏం ఉపయోగం?ప్రధాన కోచ్ ఏది చెబితే దానికి తలాడించడం తప్ప బౌలింగ్ కోచ్ ఏం చేస్తాడు? మోర్నీ మోర్కెల్ లక్నో సూపర్ జెయింట్స్ నుంచి వచ్చాడు. ఇక అభిషేక్ నాయర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందినవాడు. ఈ ఇద్దరూ గంభీర్‌తో కలిసి పనిచేశారు. గంభీర్ ఇప్పుడు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్. వీరు అతడి అసిస్టెంట్లు. గంభీర్ హాయిగా తనదైన కంఫర్ట్జోన్లో ఉన్నాడు’’ అని న్యూస్18 బంగ్లా చానెల్‌తో పేర్కొన్నాడు.సమన్వయం లేదుఅదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మతో గంభీర్‌కు సమన్వయం లోపించిందన్న మనోజ్ తివారి.. వారిద్దరు ఇక ముందు కలిసి పనిచేస్తారా? అనే సందేహం వ్యక్తం చేశాడు. ‘‘రోహిత్ ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్. మరోవైపు.. గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా, మెంటార్‌గా టైటిల్స్ అందించాడు. నాకు తెలిసి వీరిద్దరికి ఏకాభిప్రాయం కుదరడం లేదు’’ అని మనోజ్ తివారి పేర్కొన్నాడు.క్రెడిట్ అంతా తనకే అంటాడుకాగా ఐపీఎల్-2024లో గంభీర్ మెంటార్‌గా వ్యవహరించిన కోల్‌కతా నైట్ రైడర్స్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. అతడికి కోచ్‌గా పనిచేసిన అనుభవం లేకపోయినా బీసీసీఐ ఏకంగా టీమిండియా హెడ్‌కోచ్‌గా పదవిని ఇచ్చింది. ఈ విషయం గురించి మనోజ్ తివారి ప్రస్తావిస్తూ..‘‘గంభీర్ ఒంటిచేత్తో ఎన్నడూ కోల్‌కతాకు టైటిల్ అందించలేదు. జాక్వెస్ కలిస్, సునిల్ నరైన్.. నేను.. ఇలా చాలా మంది సహకారం ఇందులో ఉంది. అయితే, క్రెడిట్ అంతా ఎవరు తీసుకున్నారో అందరికీ తెలుసు’’ అంటూ గంభీర్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు.చదవండి: ఆస్ట్రేలియాకు భారీ షాక్!.. చాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరం?
అన్ని ఫార్మాట్లలో బుమ్రానే బెస్ట్ బౌలర్: ఆసీస్ మాజీ కెప్టెన్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25ను టీమిండియా కోల్పోయినప్పటికి.. పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తన అద్బుత ప్రదర్శనతో ప్రత్యర్ధిలను సైతం ఆకట్టుకున్నాడు. పెర్త్ నుంచి సిడ్నీ వరకు మొత్తం 5 టెస్టుల్లోనూ బుమ్రా సత్తాచాటాడు. ఈ సిరీస్‌లో చాలా సందర్భాల్లో బుమ్రా తన పేస్ బౌలింగ్‌తో ఆసీస్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు.బుమ్రా మొత్తం 5 టెస్టుల్లో 13.06 సగటుతో 32 వికెట్లు సాధించి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. బుమ్రా మరో రెండు వికెట్లు సాధించి ఉంటే, ఆస్ట్రేలియాలో ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన పర్యాటక బౌలర్‌గా రికార్డులెక్కెవాడు.ప్రస్తుతం ఈ రికార్డు ఇంగ్లండ్ బౌలింగ్ దిగ్గజం సిడ్నీ బర్న్స్ పేరిట ఉంది. బర్న్స్ 1911-12 సిరీస్‌లో ఏకంగా 34 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖల్ క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆల్ ఫార్మాట్లలో బుమ్రాను మించిన బౌలర్ లేడని క్లార్క్ కొనియాడాడు."బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తర్వాత బుమ్రా ప్రదర్శన గురించి నేను ఆలోచించాను. నా వరకు అయితే అన్ని ఫార్మాట్లలో బుమ్రానే అత్యుత్తమ బౌలర్. చాలా మంది గొప్ప ఫాస్ట్ బౌలర్లు నాకు తెలుసు. కర్ట్లీ ఆంబ్రోస్, గ్లెన్ మెక్‌గ్రాత్ దిగ్గజ బౌలర్లు ఉన్నా, వారు టీ20 క్రికెట్ ఆడలేదు.కాబట్టి బుమ్రాను ఆల్‌ఫార్మాట్ బెస్ట్ బౌలర్‌గా ఎంచుకున్నాను. ఆడే ఫార్మాట్, కండీషన్స్‌తో సంబంధం లేకుండా బుమ్రా అద్బుతంగా రాణించగలడు. అదే అతడి అత్యుత్తమ బౌలర్‌గా మార్చింది. సిడ్నీ టెస్టులో భారత్ మరో 20 పరుగులు ఎక్కువగా చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది.బుమ్రా జట్టులో ఉంటే సిడ్నీ టెస్టు భారత్ గెలుస్తుందని నేను అనుకున్నాను. జట్టులోని ఇతర బౌలర్ల కంటే బుమ్రా చాలా బెటర్‌గా ఉన్నాడు" అని క్లార్క్ ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. అతడు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. బుమ్రా తిరిగి మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో మైదానంలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: ఆస్ట్రేలియాకు భారీ షాక్!.. చాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరం?
ఆస్ట్రేలియాకు భారీ షాక్!.. చాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరం?
‘కెప్టెన్‌గా టీమిండియాపై టెస్టు సిరీస్ గెలవలేకపోవడమే నాకున్న అతిపెద్ద లోటు.. ఈసారి ఎలాగైనా ఆ పని పూర్తిచేస్తాను’.. భారత్‌తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అనుకున్నట్లుగానే ఈసారి కంగారూ జట్టుకు ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని అందించాడు ఈ స్టార్ పేసర్.సుదీర్ఘ నిరీక్షణకు తెరబౌలర్గా, కెప్టెన్‌గా తనదైన వ్యూహాలతో 3-1తో టీమిండియాను ఓడించి.. పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. అంతేకాదు.. తన కెప్టెన్సీలో వరుసగా రెండోసారి ఆస్ట్రేలియాను ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేర్చాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌తో పాటు కమిన్స్‌పై కూడా తీవ్రమైన భారం పడింది.స్కాట్ బోలాండ్, స్టార్క్ నుంచి సహకారం అందినా.. కమిన్స్ కూడా వీలైనన్ని ఎక్కువ ఓవర్లు బౌల్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కమిన్స్ గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు చీలమండ నొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. శ్రీలంక పర్యటనకు టెస్టు జట్టును ప్రకటించిన సందర్భంగా ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ ఈ విషయాన్ని వెల్లడించాడు.చీలమండ గాయంకాగా సొంతగడ్డపై టీమిండియాపై టెస్టు సిరీస్ విజయం తర్వాత ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. కమిన్స్ ఈ టూర్‌కు దూరం కాగా.. అతడి డిప్యూటీ స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ విషయాల గురించి జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. ‘‘కమిన్స్‌కు వ్యక్తిగతంగా కాస్త పని ఉంది. అయితే, అతడు జట్టుకు దూరం కావడానికి అదొక్కటే కారణం కాదు.అతడు చీలమండ నొప్పితో బాధపడుతున్నాడు. వచ్చే వారం అతడు స్కానింగ్‌కు వెళ్తాడు. వైద్య పరీక్షల నివేదిక వచ్చిన తర్వాతే గాయంపై పూర్తి స్పష్టత వస్తుంది’’ అని తెలిపాడు. కాగా కమిన్స్ గాయం గనుక తీవ్రతరమైతే ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లే.చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఎదురుదెబ్బఎందుకంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో ఐసీసీ ప్రధాన టోర్నమెంట్ సమీపిస్తోంది. ఫిబ్రవరి 19- మార్చి 9 వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. టోర్నీ మొదలయ్యేనాటికి కమిన్స్ పూర్తి ఫిట్‌గా లేనట్లయితే.. ఈ వన్డే వరల్డ్‌కప్-2023 చాంపియన్‌కు కష్టాలు తప్పవు. కాగా భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఆటగాడిగా, కెప్టెన్‌గా సత్తా చాటాడు కమిన్స్. ఫైనల్లో టీమిండియాను ఓడించి ఆసీస్‌ను చాంపియన్‌గా నిలిపాడు.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లతో కలిసి ఆస్ట్రేలియా గ్రూప్-‘బి’లో ఉంది. ఇందులో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో ఆసీస్ లాహోర్ వేదికగా ఫిబ్రవరి 22న ఇంగ్లండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా.. పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను దక్కించుకోగా.. టీమిండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ నేపథ్యంలో భారత జట్టు తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతుంది.శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టుస్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కూపర్ కొన్నోలీ, ట్రవిస్ హెడ్ (వైస్ కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్‌స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, నాథన్ మెక్‌స్వీనీ, టాడ్ మర్పీ, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.చదవండి: ‘చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు ఇదే.. వాళ్లిద్దరికి నో ఛాన్స్!’
బిజినెస్
ముప్పు అంచున మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు..
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ఆలోచన ఉద్యోగులను కలవరపెడుతోంది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం.. మైక్రోసాఫ్ట్ పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులను తొలగించాలని (lay off) యోచిస్తోంది. ఈ ఉద్యోగాల కోతలు కంపెనీలోని ముఖ్యమైన భద్రతా విభాగంతో సహా అన్ని భాగాలలో జరుగుతున్నాయి.మైక్రోసాఫ్ట్ దాని పోటీదారుల మాదిరిగానే ఉద్యోగుల పనితీరు నిర్వహణపై బలమైన వైఖరిని తీసుకుంటోంది. మేనేజర్లు గత కొన్ని నెలలుగా ఇదే పనిమీద ఉన్నారు. ఉద్యోగుల పనితీరును వివిధ స్థాయిల్లో లెక్కిస్తున్నారు. ఉద్యోగాల కోతలను కంపెనీ ప్రతినిధి ధ్రువీకరించారని, అయితే బాధిత ఉద్యోగుల సంఖ్యను పంచుకోవడానికి నిరాకరించారని నివేదిక పేర్కొంది."మైక్రోసాఫ్ట్‌లో అధిక-పనితీరు ప్రతిభపై దృష్టి పెడతాము" అని కంపెనీ ప్రతినిధిని ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. "ఉద్యోగులు నేర్చుకోవడానికి, ఎదగడానికి సహాయం చేయడంలో మేము ఎల్లప్పుడూ సహకారం అందిస్తాం. అదే సమయంలో ప్రతిభ చూపనివారి పట్ల తగిన చర్యలు తీసుకుంటాము" అని ప్రతినిధి వివరించినట్లుగా చొప్పుకొచ్చింది.మైక్రోసాఫ్ట్ 2023 నుండి అనేక రౌండ్ల తొలగింపులను చేపడుతూ వస్తోంది. 2024 మేలో మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన ఎక్స్‌బాక్స్ (Xbox) విభాగం ప్రసిద్ధ ఆర్కేన్ ఆస్టిన్‌తో సహా అనేక గేమింగ్ స్టూడియోలను మూసివేసింది. పునర్నిర్మాణ ప్రయత్నంగా సంబంధిత సిబ్బందిని తొలగించింది. అదే సంవత్సరం జూన్‌లో మళ్లీ దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. జూలైలో మరో రౌండ్ తొలగింపులు చేపట్టింది.ఇలా పనితీరు కారణాల వల్ల ఏర్పడిన ఖాళీలను మైక్రోసాఫ్ట్ అప్పుడప్పుడూ భర్తీ చేస్తూ వస్తోంది. దీంతో ఇది టెక్ దిగ్గజం మొత్తం హెడ్‌కౌంట్‌లో స్వల్ప మార్పులకు దారితీసింది. నివేదిక ప్రకారం.. ఇది జూన్ చివరి నాటికి 228,000గా ఉంది.ఏఐలో పెట్టుబడులుభారత్లో క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాలను విస్తరించడం కోసం మైక్రోసాఫ్ట్ 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,700 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. భారత్‌లో మానవ వనరులకున్న సామర్థ్యం దృష్ట్యా, 2030 కల్లా కోటి మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తాజాగా చెప్పారు.ఏ దేశంలోనైనా విస్తరణ నిమిత్తం మైక్రోసాఫ్ట్ పెడుతున్న పెట్టుబడుల్లో ఇదే అత్యధికమని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఎంత కాలావధిలో ఈ మొత్తం పెడతారన్నది ఆయన వెల్లడించలేదు. భారత్‌లో ఏఐ ప్రగతి చాలా బాగుందని కితాబునిచ్చారు. గతేడాది ఫిబ్రవరిలో మన దేశంలో పర్యటించిన నాదెళ్ల, 2025 కల్లా 20 లక్షల మందికి ఏఐ నైపుణ్య శిక్షణ ఇస్తామని.. గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లోని వ్యక్తులపై దృష్టి పెడతామని పేర్కొన్నారు.
‘పెండింగ్ సబ్సిడీలను విడుదల చేయాలి’
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(PLI) పథకం కింద తమకు రావాల్సిన, పెండింగ్‌లో ఉన్న సబ్సిడీలను విడుదల చేయాలని ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు ఫాక్స్‌కాన్(Foxconn), డిక్సన్ టెక్నాలజీస్ ప్రభుత్వాన్ని కోరాయి. ఈ రెండు కంపెనీలు మొత్తం రూ.700 కోట్ల సబ్సిడీలను కోరుతుండగా, ఫాక్స్‌కాన్ రూ.600 కోట్లు, డిక్సన్‌కు రూ.100 కోట్లు రావాల్సి ఉంది.భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పీఎల్ఐ పథకం సబ్సిడీలో భాగంగా ప్రభుత్వం రూ.41,000 కోట్లు (4.8 బిలియన్ డాలర్లు) కేటాయించింది. అయితే, కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోకపోవడంతో ఈ మొత్తంలో కొంత భాగం చెల్లించలేదు. ఫాక్స్‌కాన్, డిక్సన్(Dixon) తమ ఉత్పత్తి పరిమితులను అధిగమించాయని, అందువల్ల కేటాయించని నిధుల్లో తాము వాటా పొందేందుకు అర్హులమని చెబుతున్నాయి.ఇదీ చదవండి: ఎల్ఐసీ బీమా సఖి.. 30 రోజుల్లో 50,000 రిజిస్ట్రేషన్లుదేశంలో యాపిల్ ఉత్పత్తులు తయారు చేస్తూ కంపెనీకి ప్రధాన సరఫరాదారుగా ఉన్న ఫాక్స్‌కాన్ మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.30,000 కోట్ల విలువైన ఐఫోన్లను ఉత్పత్తి చేసింది. ఇది దాని రూ.20,000 కోట్ల ఉత్పత్తుల తయారీ పరిమితిని అధిగమించింది. అదేవిధంగా, డిక్సన్ టెక్నాలజీస్ మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.8,000 కోట్ల విలువైన స్మార్ట్ఫోన్లను ఉత్పత్తి చేసింది. ఈ రెండు కంపెనీలు తయారు చేసిన ఉత్పత్తులకు ప్రభుత్వ పోత్సాహకాలు అందాల్సి ఉంది. ఇరు కంపెనీల నుంచి వచ్చిన అభ్యర్థనలను ప్రభుత్వం ప్రస్తుతం సమీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రోత్సాహకాలు రెండు సంస్థలకు కీలకంగా మారనున్నాయి. ఈ నిధులు ఉత్పత్తిని పెంచడానికి, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి, వాటి తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు ఎంతో ఉపయోగపడుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరింత ఖరీదైన బంగారం.. కొనాలంటే..
దేశంలో బంగారం ధరలు (Gold Price) వరుసగా రెండో రోజూ మరింత పెరిగాయి. మూడు రోజులు స్థిరంగా ఉన్న పసిడి ధరలు క్రితం రోజున ఉన్నట్టుండి స్వల్పంగా పెరిగాయి. ఈ పెరుగుదలను కొనసాగిస్తూ నేడు (January 9) మరింతగా ఎగిశాయి. దీంతో కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు.బంగారం ధరలు ద్రవ్యోల్బణం , గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతంలో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు రూ.350 (22 క్యారెట్స్), రూ.380 (24 క్యారెట్స్) చొప్పున పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 72,600కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,200 వద్దకు ఎగిశాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.79,350 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.72,750 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.350, రూ.380 చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.350 పెరిగి రూ. 72,600 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.380 బలపడి రూ. 79,200 వద్దకు చేరాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా రెండు రోజుల క్రితం వెండి ధర కేజీకి రూ.1000 మేర పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,00,000 వద్ద, ఢిల్లీలో రూ. 92,500 వద్ద ఉన్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
ఎల్ఐసీ బీమా సఖి.. 30 రోజుల్లో 50,000 రిజిస్ట్రేషన్లు
బీమా సేవలందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) ఇటీవల ప్రారంభించిన బీమా సఖి యోజనలో నెలలోపే 50,000కు పైగా రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. పథకంలో నమోదైన 52,511 మందిలో 27,695 మంది బీమా సఖిలకు పాలసీలను విక్రయించేందుకు నియామక పత్రాలు అందించినట్లు ఎల్ఐసీ తెలిపింది. ఇప్పటికే 14,583 మంది పాలసీలను విక్రయించడం మొదలుపెట్టారని పేర్కొంది. మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడం, స్థిరమైన ఆదాయ ప్రోత్సాహకాలు అందించడం, ఆర్థిక అక్షరాస్యత పెంపొందించి, బీమాపై అవగాహనను కల్పించడం ఈ పథకం లక్ష్యంగా ఎల్ఐసీ గతంలో తెలిపింది.ఎల్ఐసీ బీమా సఖి యోజన పథకందేశవ్యాప్తంగా మహిళల సాధికారత లక్ష్యంగా జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) బీమా సఖి యోజన పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2024 డిసెంబర్ 9న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకంలో బీమా సఖీలుగా పిలువబడే ఏజెంట్లుగా మారడానికి మహిళలకు శిక్షణ ఇస్తారు. దాంతో వారికి ఉపాధి అవకాశాలను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.లక్ష్యాలు, ప్రయోజనాలుగ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అక్షరాస్యత, బీమాపై అవగాహనను పెంపొందించడం బీమా సఖి యోజన(LIC Bima Sakhi Yojana) ప్రాథమిక లక్ష్యం. పథకం ప్రారంభించిన మొదటి సంవత్సరంలో 1,00,000 మంది మహిళలను, వచ్చే మూడేళ్లలో 2,00,000 మంది మహిళలను ఈ పథకంలో భాగం చేయడం దీని లక్ష్యం. ఫలితంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వారికి బీమాను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు, సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.ఈ పథకంలో చేరినవారు మూడు సంవత్సరాల పాటు ప్రత్యేక శిక్షణ పొందుతారు. ఈ సమయంలో వారికి నెలవారీ స్టైఫండ్ అందిస్తారు. మొదటి ఏడాది స్టైపెండ్ రూ.7 వేలు, రెండో ఏడాది రూ.6 వేలు, మూడో ఏడాది రూ.5 వేలు ఉంటుంది. దాంతోపాటు నిబంధనలకు అనుగుణంగా ఇన్సెంటివ్‌లు అందిస్తారు. ఆర్థిక ఒత్తిళ్ల గురించి ఆందోళన చెందకుండా మహిళలు తమ శిక్షణపై దృష్టి పెట్టడానికి ఈ ఆర్థిక వెసులుబాటు సహాయపడుతుంది. బీమా విక్రయ లక్ష్యాలను సాధించిన మహిళలు కమీషన్ ఆధారిత రివార్డులను కూడా పొందవచ్చు.ఇదీ చదవండి: ఆసియా.. ఇండియాలోని ధనవంతుల జాబితాఅర్హతలు ఇవే..కనీసం పదో తరగతి పూర్తి చేసిన 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్నవారు ఎల్ఐసీ ఏజెంట్లుగా మారి వారు విక్రయించే పాలసీల ఆధారంగా కమీషన్లు(Commissions) పొందవచ్చు. బీమా సఖి యోజన ప్రారంభమైనప్పటి నుంచి మొదటి నెలలోనే 50,000 రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీరిలో 27,695 మంది మహిళలకు అపాయింట్మెంట్ లెటర్లు జారీ చేయగా, 14,583 మంది ఇప్పటికే పాలసీలను విక్రయించడం ప్రారంభించారు. ఏడాదిలోగా దేశంలోని ప్రతి పంచాయతీకి కనీసం ఒక బీమా సఖిని అందించాలని ఎల్ఐసీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రోగ్రామ్‌లో చేరిన గ్రాడ్యుయేట్ మహిళలను భవిష్యత్తులో ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీకి పరిగణనలోకి తీసుకోవచ్చని అధికారులు తెలియజేస్తున్నారు.
ఫ్యామిలీ
దొన్నె బిర్యానీ.. ఈ డిష్ వెరీ స్పెషల్
విభిన్న సంస్కృతుల సమ్మేళనం ‘హైదరాబాద్’లో ఒక్కో గల్లీ ఒక్కో ప్రత్యేకత సంతరించుకున్న విషయం విదితమే. ముఖ్యంగా ఆనాటి నుంచి విభిన్న రుచులకు సైతం భాగ్యనగరం కేంద్రంగా కొనసాగుతోంది. స్థానిక ఆహార వంటకాలు మొదలు విదేశాల కాంటినెంటల్ రుచుల వరకు మన నగరం విరాజిల్లోతోంది. ఈ ఆనవాయితీలో భాగంగానే ఈ మధ్య ‘దొన్నె బిర్యానీ’ సైతం నగరానికి చేరుకుంది.విశ్వవ్యాప్తమైన హైదరాబాద్ బిర్యానీ గురించి అందరికీ తెలుసు.. కానీ.. దొన్నె బిర్యానీ ఏంటనే కదా..?! ఇది కూడా దక్షిణాది ప్రత్యేక వంటకమే. కర్ణాటక, ప్రధానంగా బెంగళూరులో ఈ డిష్ వెరీ స్పెషల్. కొంత కాలంగా దొన్నె బిర్యానీ అక్కడక్కడా కనిపిస్తూనే ఉంది. అయితే బెంగళూరులో 90 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న శివాజీ మిలటరీ హోటల్ నగరంలోని మాదాపూర్‌కు విస్తరించింది. ఈ నేపథ్యంలో నగరంలో మరో కొత్త రుచి చేరిపోయిందని ఆహారప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.దక్షిణాది రుచులకు ఆదరణ.. బెంగళూరులోని ప్రముఖ శివాజీ మిలిటరీ హోటల్, నోరూరించే మాంసాహార వంటకాలకు ప్రసిద్ధి చెందింది. వందేళ్ల క్లబ్లో చేరబోతున్న ఈ ప్రముఖ భారతీయ హోటల్ మొదటిసారి మరో నగరంలో ఆవిష్కృతం అవడం, అది కూడా హైదరాబాద్‌ను ఎంచుకోవడంతో ఇక్కడి వైవిధ్యాన్ని మరింత పెంచుతోంది. కన్నడ వంటకాలు నగరంలో ఇది మొదటిసారి ఏమీ కాదు.. ఎస్ఆర్నగర్, మాదాపూర్, గచి్చ»ౌలి వంటి ప్రాంతాల్లో కన్నడ రుచులు ఇప్పటికే లభ్యమవుతున్నా.. పూర్తిస్థాయిలో అక్కడి రుచులకు ఆదరణ లభిస్తోందనడానికి ఇదో నిదర్శనం. దొన్నె బిర్యానీ, మటన్ ఫ్రై వంటి పలు వంటకాలకు ప్రసిద్ధి చెందిన శివాజీ హోటల్ హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో తమ సేవలను విస్తరించింది. 1935 నుంచి దక్షిణాదిలో తన ప్రత్యేకత పెంచుకున్న శివాజీ మిలిటరీ హోటల్ నగరవాసులకూ చేరువైంది. స్పైసీగా ఉండే మన హైదరాబాదీ బిర్యానీకి దొన్నె బిర్యానీ కాస్త బిన్నంగా ఉన్నప్పటికీ.. భౌగోళిక సమ్మేళనంలో భాగంగా ఇప్పటికే తెలుగు వారు సైతం ఈ బిర్యానీని రుచి చూస్తున్నారు.
మంచు పులులు
గడ్డ కట్టే మంచు, కోత పెట్టే చలి పరీక్ష పెట్టే వాతావరణంకాని తప్పని బతుకుపోరు...కశ్మీర్లో పురుషులతో పాటు స్త్రీలూ శ్రమ చేసి సంపాదిస్తేనే ఇళ్లు గడుస్తాయి. దాల్ లేక్ వెంబడి వందలాది స్త్రీలు చిల్లర వస్తువులు అమ్ముతూ బతుకు ఈడుస్తారు. ప్రస్తుతం దాల్ లేక్ గడ్డ కట్టింది. ఆగక మంచుకురుస్తోంది. బిడ్డల ఆకలి తీర్చడానికి సరస్సు వొడ్డున మంచుపులుల్లా తల్లులు తమ కొట్లు తెరిచి నిలుచున్నారు. వారి బతుకు చిత్రం.కశ్మీరీలు గిరిజనులే అయినా వారికి జ్ఞానం మెండు. ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడవ వారం నుంచి జనవరి మొదటి వారం వరకూ వచ్చే ‘చిలాయి కలాన్’ (భారీ మంచు)కు వారు సిద్ధమయ్యే వుంటారు. కాని ఈసారి చిలాయి కలాన్ గత 30 ఏళ్లలో లేనంత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకూ పడిపోయాయి. దాల్ లేక్ రాత్రిళ్లు పూర్తిగా గడ్డకట్టి మధ్యాహ్నానికి గాని కొద్దిగా పలుచబడదు. ఈలోపు ఎలా జీవించాలి?‘ఇంట్లో పండిన కూరగాయలను ఉదయాన్నే తీసుకొని షికారా (చిన్న పడవ)లో బయలుదేరి దాల్ లేక్ ఒడ్డు మీదకు వచ్చి అంగడి తెరుస్తాను. దాల్ లేక్ గడ్డ కడితే షికారా కదలదు. ట్రాలీలు వెతుక్కుని రోడ్డు మార్గాన రావాలి. అసలే మంచుతో కరువు... ఇదో ఖర్చు’ అంటుంది ఒక కశ్మీరీ దుకాణం దారు.శ్రీనగర్‌లో జనం రెండు విధాలుగా జీవిస్తారు. ఒక విధం దాల్ లేక్ చుట్టుపక్కల... మరో విధం మైదాన, ఎత్తయిన ఏరియాల్లో. దాల్ లేక్‌లో జీవించే వారికి హౌస్బోట్లు, విహార బోట్లు, రోడ్డు మీద చిల్లర అంగళ్లు... ఇవే ఆధారం. ‘మేము చాలామంది స్త్రీలము రోడ్డు మీద కూరగాయలు, పూలు, చేపలు, చిన్న చిన్న వస్తువులు అమ్ముతాం. నిజానికి మా అందరికీ ఈ పని చాలా కష్టం. కాని మా పిల్లలైనా బాగుపడాలని వేణ్ణీళ్లకు చన్నీళ్లుగా ఈ ప్రయత్నం చేస్తాం. ఇలా మా పూర్వికులు కూడా చేశారు. కాని బాగుపడిన వారు తక్కువ’ అంటారు వారు.8 నుంచి 13 గంటలు...కశ్మీర్ అంటే టూరిస్టులు. టూరిస్టులు వచ్చే వేసవి కాలంలో బేరాలు ఒక రకంగా ఉంటాయి. మంచు తీవ్రంగా కురిసే సమయంలో టూరిస్ట్‌లకు బ్రేక్ పడుతుంది. ఆ సమయంలో కూడా బతకడానికి దాల్ లేక్ ఒడ్డున అంగళ్లు తెరవక తప్పదు. ‘రోజూ తెల్లవారు జామునే వచ్చి సాయంత్రం వరకూ నిలబడతాము. 8 నుంచి 13 గంటలు రోడ్డు మీద ఉంటాము’ అని చె΄్తారు వీళ్లు. ‘నా కూతురు డాక్టర్ కావాలనుకుంటోంది. బాగా చదువుతోంది. దాని చదువు కోసం ఈ కష్టాన్ని మునిపంట నొక్కి చేస్తున్నాను’ అని ఒకావిడ చెప్పింది. దట్టమైన మంచు కురిసే సమయంలో వీరికి ఆస్పత్రి సౌకర్యం ఉండదు. ప్రసూతి అవసరాలకు ఆస్పత్రికి వెళ్లడానికి వీలు కానంతగా దార్లు మూసుకుపోతాయి. దాల్ లేక్ ఒడ్డున అమ్ముకునే స్త్రీలకు అవసరమైన టాయిలెట్లు కూడా ఉండవు. అయినా సరే వారు తమ కుటుంబాలు గడవడానికి మంచులో తడుస్తూనే ఉంటారు.టార్పాలిన్ కట్టకూడదు!దాల్ లేక్ ఒడ్డున రోడ్డు మీద వెళుతూ ఉంటే స్త్రీలు ఏ టార్పాలిన్ కట్టకుండా ఆకాశం కింద నిలబడి వస్తువులు అమ్ముతుంటారు స్త్రీలు. ‘మేము చలికి ఆగలేక, మంచు నుంచి రక్షించుకుందామని టార్పాలిన్లు కట్టుకుంటాం. కాని భద్రత దృష్ట్యా మునిసిపాలిటీ వాళ్లు, రక్షణ దళాలు వాటిని పీకేస్తాయి. ఏ ఉగ్రవాదులో ఈ టార్పాలిన్ల దగ్గర చాటు తీసుకుంటారని వీరి భయం. కాని మా ్రపాణాల సంగతి?’ అని మరో మహిళ ప్రశ్నించింది. మంచుకు తడిసి, నీటికి నాని ఈ స్త్రీలకు ఎన్నో ఆరోగ్య సమస్యలు. కాని చిరునవ్వు చెరగనివ్వరు. టూరిస్ట్‌లతో స్నేహంగా మాట్లాడుతూ సంధ్య చీకట్లలో ఇళ్ల వైపుకు వెళ్లిపోతారు. ఈ స్త్రీల శ్రమకు విలువ కట్టే షరాబు ఉన్నాడా?
పేద పిల్లల నేస్తం
బిహార్ విద్యాశాఖలో ఉన్నతాధికారి అయిన డాక్టర్ మంజు కుమారి రోహ్తాస్ జిల్లాలో, ముఖ్యంగా వెనకబడిన ప్రాంతమైన తిలౌతు బ్లాక్‌లో రకరకాల సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. బ్లాక్ రిసోర్స్ సెంటర్(బీఆర్‌సి) ఇంచార్జిగా ఆమె తన అధికారిక విధులకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఆర్థికంగా వెనకబడిన పిల్లలు చదువులో ముందుండేలా తన వంతు కృషి చేస్తోంది....ఆఫీసు సమయం అయిపోగానే అందరిలా ఇంటికి వెళ్లదు మంజు కుమారి. సమీపంలోని ఏదో ఒకగ్రామానికి వెళ్లి పేదపిల్లలకు పుస్తకాలు. బ్యాగులు, యూనిఫామ్ లాంటివి అందజేస్తుంది. దీని కోసం ఇతరులు ఇచ్చే డబ్బులు, స్వచ్ఛంద సంస్థలపై ఆధారపడకుండా తన జీతం నుంచే కొంత మొత్తాన్ని వెచ్చిస్తుంది. మంజు కుమారికి సామాజిక సేవపై ఆసక్తి చిన్నప్పటి నుంచే ఉంది. నాన్న శివశంకర్ షా తనకు స్ఫూర్తి.‘సామాజిక సేవకు సంబంధించి నాన్న ఎప్పుడూ చురుగ్గా ఉండేవారు. మా ఊరి పాఠశాల కోసం భూమిని ఉదారంగా ఇవ్వడమే కాదు అవసరమైన వనరులు అందించారు. ఇలాంటివి చూసి నాలో సామాజిక బాధ్యత పెరిగింది. ఆ స్కూల్ ఇప్పటికీ ఉంది. సామాజిక సేవాకార్యక్రమాలు మరిన్ని చేసేలా నిరంతరం స్ఫూర్తినిస్తుంది’ అంటుంది మంజు కుమారి.రాంచీ యూనివర్శిటీ నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్... ఆ తర్వాత పీహెచ్డీ చేసిన మంజు డెహ్రీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దశాబ్దానికి పైగా హిందీ టీచర్‌గా పనిచేసింది. 2023లో బీ ఆర్సి ఇంచార్జిగా నియామకం అయింది. దీంతో సామాజిక సేవలో మరింత క్రియాశీలంగా పనిచేస్తోంది.స్థానిక పాఠశాలలను తనిఖీ చేస్తుంటుంది. పాఠశాల పరిశ్రుభతపై ఎన్నో సూచనలు ఇస్తుంటుంది. విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగానికి ముందు ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేది మంజు కుమారి. ఆ సమయంలో గిరిజన గూడేలకు వెళ్లి ఎప్పుడూ స్కూల్‌కు వెళ్లని పిల్లలకు అక్షరాలు నేర్పించేది, పాఠాలు చెప్పేది. ఇది చూసి తల్లిదండ్రులు పిల్లలను రోజూ స్కూల్‌కు పంపించేవారు.‘ఇది నేను సాధించిన పెద్ద విజయం’ అంటుంది మంజు కుమారి. అయితే మంజుకుమారి ప్రయాణం నల్లేరు మీద నడక కాదు. ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. అత్తమామలు, భర్త అభ్యంతరం చెప్పేవాళ్లు. మంజుకుమారిని సామాజిక సేవ దారి నుండి తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవాళ్లు. అయినప్పటికీ ఆమె పట్టుదలగా ముందుకు వెళ్లింది.సామాజిక బాధ్యత, నైతిక విలువలు క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మంజు కుమారి... ‘తమ గురించి మాత్రమే ఆలోచించే ధోరణి ప్రజలలో బాగా పెరిగింది. సామాజిక స్పృహ లోపిస్తుంది. సేవా స్ఫూర్తిని, సామాజిక నిబద్ధతను పునరుద్ధరించాలని ఆశిస్తున్నాను’ అంటుంది.
పుట్టినింటికి ఆడబిడ్డలు
ఊరు అంటే ఊరు కాదు. జ్ఞాపకాల తోట. ఖండాంతరాలు దాటినా ఆ పరిమళం మనసును వీడిపోదు. ఏదో ఒక సమయాన స్వరూపకు నాగమణి గుర్తుకు వస్తుంది. పక్కింటి నాగమణి, స్వరూప క్లోజ్‌ఫ్రెండ్స్. దగ్గరలో ఉన్న మండల కేంద్రానికి సినిమాకు వెళ్లడం నుంచి సీమచింతకాయల వేట వరకు వారి జ్ఞాపకాల్లో ఎన్నో ఉన్నాయి. పెళ్లి అయిన తరువాత నాగమణి అక్కడెక్కడో సూరత్‌లో ఉంటుంది. స్వరూప కూడా పెళ్లయిన తరువాత సొంతూరులో కాకుండా వేరే ఊళ్లో ఉంటుంది. ఆ దూరం అలా కొనసాగుతూనే ఉంది.ఇక అంతేనా?‘ఈ 5జీ జమానాలో కూడా అంతేనా... ఇంతేనా అంటూ నిట్టూరిస్తే ఎలా?’ అంటూ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజన్న గూడెం మహిళలు. పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న స్నేహితుల ‘పూర్వ విద్యార్థుల సమ్మేళనం’ మనకు తెలుసు. అయితే ఇది అలాంటి సమ్మేళనం కాదు... రాజన్న గూడెం ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళనం!పెళ్లయిన తరువాత ఎక్కడెక్కడో వేరు వేరు ఊళ్లలో ఉంటున్న ఆడపడుచులు ఈ సమ్మేళనం పుణ్యమా అని ఎన్నో సంవత్సరాల తరువాత కలుసుకున్నారు. రోజంతా సంబరాలు చేసుకున్నారు! ‘నా బిడ్డలందరూ నా దగ్గరికి వచ్చారు’ అని ఊరు సంతోషంతో ఉప్పొంగి పోయిన రోజు అది....బతుకమ్మ పండుగ రోజు...యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాజన్న గూడెం ఆడబిడ్డలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఉన్న ఊరిని వదిలి అత్తారింటికి వెళ్లిన ఆడపడుచులందరు ‘ఆత్మీయ సమ్మేళనం’ పేరుతో ఒక చోటకు చేరారు. అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చే వారి సంఖ్య ప్రతి యేడూ తగ్గుతోంది. పోయిన బతుకమ్మ పండుగ రోజు ఇదే విషయం గురించి మాట్లాడుకున్నారు కొందరు మహిళలు. ‘అందరం ఒక రోజు కలుసుకొని మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది’ అనుకున్నారు. అది అసాధ్యమైన కోరికేమీ కాదనే విషయం కూడా వారికి తెలుసు. ‘ఎంత బాగుంటుంది అని ఒకటికి పదిసార్లు అనుకోవడం కాదు. కచ్చితంగా కలవాల్సిందే’ అంటూ నడుం బిగించారు.సోషల్ మీడియా వేదికగా....అనుకున్నదే తడవుగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. వివిధ రంగాల్లో ఉన్న తమ ఊరి ఆడబిడ్డలను ఒకదగ్గర చేర్చడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. పేరాల ఇందిర, సూదిని రజిని, యాట ఇందిరాదేవి, రావుల ఉమాదేవి, ఊట్కూరి లక్ష్మి నాలుగు నెలల పాటు ఎంతో శ్రమ తీసుకున్నారు. ఫోన్ నెంబర్లు సేకరించడం నుంచి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వరకు ఎన్నో చేశారు.దాగుడుమూతలు... దస్తీబిస్తీలుఅనుకున్న రోజుకు దాదాపు అందరూ వచ్చారు. ఇరవై ఏళ్ల నుంచి తొంభై ఏళ్ల వయసు వరకు ఎంతోమంది మహిళలు వచ్చారు. వయసు తేడా లేకుండా చిన్నపిల్లలై పోయారు. దాగుడు మూతలు, దస్తీబిస్తీ, మ్యూజికల్ చైర్, బెలూన్ బ్లాస్టింగ్, ఒంటికాలి కుంటుడు ఆటలు, డీజే పాటలతో హోరెత్తించారు.‘ఎవరి లోకం వారిదే’ అయిపోయిన ఈ కాలంలో, ఒకే ఇంటి కుటుంబ సభ్యులు కూడా వేరు వేరు ప్రపంచాలు అయిన ఈ ఉరుకులు పరుగుల కాలంలో ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తాయి. పల్లె మోములో రోజూ పండగ కళను తీసుకువస్తాయి.మరెన్నో ఊళ్లకు ‘రాజన్న గూడెం ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళనం’ స్ఫూర్తిని ఇవ్వాలని ఆశిద్దాం.ఇక ప్రతి సంవత్సరం...ఆ రోజు పండగే!మా ఊరి ఆడబిడ్డలం అందరం ఒకచోట చేరి చిన్న పిల్లలమయ్యాం. చిన్నప్పటి పండుగలను, ఆనాటి సంబరాలను గుర్తు చేసుకున్నాం. వయసు తేడా లేకుండా ఆటలాడుకున్నాం. మా ఊరి మీద మరింత ప్రేమ పెంచుకున్నాం. ప్రతి సంవత్సరం ‘ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం’ ఏర్పాటు చేయాలని, మరింత ఎక్కువమంది హాజరయ్యేలా చూడాలనుకుంటున్నాం.– ఊట్కూరి లక్ష్మి, నల్లగొండకళ్లనీళ్లు పెట్టుకున్నారు‘రాజన్న గూడెం ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం’ పేరుతో చేపట్టిన కార్యక్రమం మా జీవితంలో మరవలేనిది. ఎన్నోతరాల ఆడబిడ్డలను ఒకచోటికి రప్పించాం. రకరకాల కారణాలతో పుట్టిన ఊరికి ఇక రాలేమనుకున్న వారిని సైతం గుర్తించి రప్పించడం విశేషంగా భావిస్తున్నాం. ఆడబిడ్డలందరినీ ఒకచోట చూసి పెద్ద వయసు వారు కన్నీటి పర్యంతమయ్యారు.– పేరాల ఇందిర, మోత్కూరుమళ్లీ మళ్లీ రావాలని...తల్లిదండ్రులు చనిపోయిన వారు, సింగిల్ పేరేంట్స్... మొదలైనవారు మా ఊరికి చాలా ఏళ్లుగా రావడం లేదు. అలాంటి వారందరినీ ‘ఆత్మీయ సమ్మేళనం’ ద్వారా రప్పించాం. వచ్చినవారంతా ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకున్నారు. నిక్‌నేమ్‌లను గుర్తు చేసుకున్నారు. మరోసారి ఇలాంటి కార్యక్రమం పెడితే మళ్లీ పుట్టింటికి వచ్చినట్లు వస్తామని సంతోషంగా చెప్పి వెళ్లారు. – సూదిని రజిని, సిరిపురంఅంబరాన్ని అంటిన సంబరంప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకు కొద్దిమందిమి మాత్రమే పుట్టింటికి వస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఆత్మీయ సమ్మేళనం’కు రూపకల్పన చేశాం. ఊరు దాటగానే ఎవరి లోకం వారిదై పోతుంది. అలా కాకుండా పట్టుదలగా, ఇష్టంగా పనిచేశాం. రాలేమన్న వారిని ఒప్పించి రప్పించాం. మా ఊరి ఆడబిడ్డల ముఖాల్లో మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని చూశాం. – యాట ఇందిరాదేవి, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్,సీతాఫల్ మండి, సికింద్రాబాద్ – యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి
ఫొటోలు
International View all
చైనాలో మంకీపాక్స్ కొత్త వేరియంట్ కలకలం
బీజింగ్ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్
గుంపులో చిక్కుకుపోయారా? మిమ్మల్ని మీరు ఇలా కాపాడుకోండి
రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రమాదాలు పొంచివుంటాయి.
కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. అత్యవసర పరిస్థితి విధింపు
లాస్ ఏంజిల్స్: అమెరికాలోని లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలలోని అడవుల్లో కార్
హసీనా వీసా గడువు పెంపు
న్యూఢిల్లీ: విద్యార్థుల ఉద్యమం, ఎగసిన అల్లర్లతో స్వదేశం వీడి
ఆగని రష్యా దాడులు
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ దాడులు కొనసాగుతున్నాయి.
National View all
గూగుల్ మ్యాప్‌తో పోలీసులు కాస్త దొంగలయ్యారు!
గూగుల్ మ్యాప్ మరోసారి హ్యాండిచ్చిన ఘటన ఇది. ఓ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గూగుల్ మ్యాప్‌ను నమ్ముకున్నారు.
బీబీఎంపీ బోర్ల స్కాం.. రెండోరోజూ ఈడీ తనిఖీలు
బనశంకరి: బెంగళూరు మహానగర పాలికెలో బోరుబావుల తవ్వకం, ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు పథకంలో 2016–2019 మధ్య కోట్లా
‘డిజిటల్ మహాకుంభ్’.. సంస్కృతి, సాంకేతికతల కలబోత
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జనవరి 13 నుంచి ప్రారంభంకానుం
‘‘అలాగైతే ఇండియా కూటమిని రద్దు చేయండి’’
ఒకవైపు విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు నడుస్తుండగా..
Mahakumbh 2025: తొమ్మిదేళ్లకే నాగ సన్యాసి.. గడ్డకట్టే చలిలో కఠోర తపస్సు
మహాకుంభమేళా ఈ నెల(జనవరి) 13 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత
NRI View all
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్ఆర్ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా
ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!
అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్ దిగ్గజం యాపిల్ 185 మంది ఉద్యోగులను త
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!
భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్..!అచ్చం భారత్‌లో..
ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్ బిజినెస్‌లు.
క్రైమ్
క్లాస్‌మేట్‌పై జూనియర్ డాక్టర్ అత్యాచారం
గ్వాలియర్: ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలోని ఉపయోగంలో లేని హాస్టల్లో ఓ జూనియర్ డాక్టర్(25) తోటి వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలోని గజరాజా మెడికల్ కాలేజీలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు, బాధితురాలు వేర్వేరు హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. ఆదివారం నిందితుడు కాలేజీ ఆవరణలోనే ఉన్న ఉపయోగంలో లేని బాయ్స్ హాస్టల్లోకి రావాలని బాధితురాల్ని కోరాడు. అంగీకరించి అక్కడికి వెళ్లిన ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై బాధితురాలు కాంపు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు నగర ఎస్పీ అశోక్ జడొన్ చెప్పారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
ఏస్ నెక్ట్స్ జెన్, గ్రీన్కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
(మచిలీపట్నం): ఫార్ములా –ఈ రేసు కేసులో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. ఇప్పటివరకు రేసు నిర్వహణ, నిధుల మళ్లింపులో నిబంధనల అతిక్రమణ, హెచ్ఎండీఏ అధికారిక ఖాతాల నుంచి విదేశీ కంపెనీలకు నిధుల మళ్లించడంపై ఫోకస్ పెట్టిన అధికారులు, తాజాగా క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. తాజాగా తెరపైకి వచ్చిన క్విడ్ ప్రోకో కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫార్ములా–ఈ కారు రేసు నిర్వహణకు సంబంధించిన ఒప్పందాలకు కొద్ది నెలల ముందే బీఆర్ఎస్కు గ్రీన్కో అనుబంధ సంస్థల నుంచి ఎలక్టొరల్ బాండ్ల రూపంలో కోట్ల రూపాయలు వచ్చాయనే సమాచారంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ఫార్ములా ఈ రేసుకు మొదట్లో స్పాన్సర్‌గా వ్యవహరించిన ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు దాని అనుబంధ సంస్థ గ్రీన్కో కార్యాలయాల్లో మంగళవారం ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో సైబర్ టవర్స్‌లో, మచిలీపట్నంలోని గ్రీన్కో కార్యాలయాల్లో మంగళవారం రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. సహకరించని సిబ్బంది! ఏసీబీ అధికారుల తనిఖీలకు ఆయా సంస్థల సిబ్బంది ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. మాదాపూర్ సైబర్ టవర్స్‌లోని గ్రీన్కో కార్యాలయంలో సోదాలకు ఆ సంస్థ సిబ్బంది మొదట అనుమతించలేదు. అధికారులు సెర్చ్ వారెంట్ వారెంట్ చూపడంతో వెనక్కి తగ్గారు. ఇక అదే ప్రాంతంలోని ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో అధికారులు సోదాలు జరిపారు. పలు కీలక పత్రాలు, పైళ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. మరోవైపు ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న గ్రీన్ కో అనుబంధ సంస్థలైన ఏస్ అర్బన్ రేస్, ఏస్ అర్బన్ డెవలపర్స్ కార్యాలయాల్లోనూ మంగళవారం రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. పలు ఫైళ్లతో పాటు హార్డ్ డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మచిలీపట్నంలో కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న గ్రీన్ కో కంపెనీకి చెందిన గెస్ట్‌హౌస్‌లో కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కేటీఆర్‌కు తాజాగా ఈడీ సమన్లు ఫార్ములా–ఈ కారు రేస్ కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్‌కు ఈడీ అధికారులు మరోమారు సమన్లు జారీ చేశారు. వాస్తవానికి కేటీఆర్ మంగళవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సి ఉన్నా..తనకు మరికొంత సమయం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 16న విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్‌కు మంగళవారం మరోమారు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. కాగా ఈడీ అధికారులు ఇప్పటికే ఇచ్చిన సమన్ల ప్రకారం..ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ మాజీ సీఈ బీఎల్ఎన్ రెడ్డి బుధవారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు.
విధుల్లో ఉండగా.. కానిస్టేబుల్‌కు గుండెపోటు
మహబూబ్‌నగర్ క్రైం: విధుల్లో ఉన్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ గుండెపోటు రాగా.. ఆస్పత్రితో చికిత్స అందిస్తుండగానే మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని మర్లులో నివాసం ఉంటూ హెడ్‌క్వార్టర్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటేష్(50)కు సోమవారం ఎస్కాట్ డ్యూటీ పడింది. ఈక్రమంలో సోమవారం ఉదయం ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లా జైలుకు వెళ్లి అక్కడ ఖైదీలను వాహనంలో తీసుకుని కోర్టులో హాజరుపరిచి మళ్లీ మధ్యాహ్నం సమయంలో జైలులో ఖైదీలను అప్పగించి తిరిగి బయట వచ్చాడు. ఆ సమయంలో చాతీలో నొప్పి వస్తున్నట్లు వెంకటేష్ తోటి కానిస్టేబుల్స్‌కు చెప్పి కింద కూర్చుకున్నాడు. వెంటనే వారు చికిత్స కోసం జిల్లా జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు సీపీఆర్ చేయడంతో పాటు చికిత్స అందిస్తున్న క్రమంలోనే మృతి చెందాడు. క్యాజువాలిటీలో ఉన్న వెంకటేష్ మృతదేహన్ని ఎస్పీ డి.జానకి పరిశీలించి కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుడు వెంకటేష్‌కు భార్య వనీత, ఇద్దరూ కొడుకులు అభినవ్, వర్షవర్ధన్లు ఉన్నారు. మృతదేహన్ని అతని స్వస్థలం సీసీకుంటకు తరలించారు.
బాలిక ప్రాణం తీసిన సెంట్రింగ్ కట్టె
దొడ్డబళ్లాపురం: నిర్మాణదారుల నిర్లక్ష్యం తల్లిదండ్రుల కంటి దీపాన్ని బలిగొంది. పాఠశాల నుండి ఇంటికి తిరిగి వెళ్తున్న బాలిక తలపై సెంట్రింగ్‌కు వాడిన వెదురు కట్టె పడి చనిపోయిన బెంగళూరు వీవీ పురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలిక తేజస్విని (15) రోజు మాదిరిగానే శనివారం సాయంత్రం ఇంటికి తిగిరి వెళ్తుండగా రోడ్డుపక్కన కొత్తగా నిర్మిస్తున్న కట్టడంపై నుండి సెంట్రింగ్ కట్టె తలమీద పడడంతో తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చేర్పించగా సోమవారం మరణించింది. బాలిక తండ్రి సుధాకర్ రావ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీవీ పురం పోలీసులు భవన ఇంజినీర్‌ను అరెస్టు చేసారు. కట్టడం యజమాని, అనుమతులు ఇచ్చిన బీబీఎంపీ అధికారులు, కాంట్రాక్టర్లపై కూడా కేసు నమోదు చేశారు.