Sai Pallavi
-
బిగ్గెస్ట్ మైల్స్టోన్ చేరుకున్న 'తండేల్'.. నాగచైతన్యకు ఫస్ట్ సినిమా
తండేల్ సినిమా మరో అరుదైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. నాగచైతన్య, సాయిపల్లవి నటించిన ఈ చిత్రాన్ని చందు మొండేటి తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించారు. ముఖ్యంగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించిన తండేల్ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది. నాగ చైతన్య కెరీర్లో వంద కోట్ల మొదటి చిత్రంగా నిలిచింది.తండేల్ సినిమా కేవలం 10 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ దాటింది. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ అయిన తండేల్.. మొదటి రోజు నుంచే కలెక్షన్ల స్పీడ్ చూపింది. ఈ చిత్రం HD వెర్షన్ సినిమా విడుదలైన మొదటి రోజే లీక్ అయింది. పైరసీ ఆందోళనలు పెద్ద ఎత్తున తలెత్తాయి. అయితే అలాంటి అవాంతరాలని కూడా దాటుకొని వందకోట్ల క్లబ్లో చేరడం మామూలు విషయం కాదు. ఓవర్సీస్లో 1 మిలియన్ దాటింది. ఈ చిత్రం డొమస్టిక్ మార్కెట్లో అద్భుతంగా రాణించడమే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్స్‌కు లాభదాయకమైన వెంచర్ అయ్యింది. ఇప్పటికే బ్రేక్ఈవెన్ అయి లాభాలు తెచ్చిపెట్టింది.పద్నాలుగు నెలలు పాకిస్తాన్ జైలులో మగ్గిపోయిన 22 మంది మత్స్యకారుల వలస జీవితం ఇతివృత్తంగా తెరకెక్కించిన ‘తండేల్’ చిత్రానికి ప్రేక్షకులు క్యూ కట్టేశారు.. శ్రీకాకుళం,విజయనగరం , తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన మత్స్యకారులు పాక్ నుంచి ఎలా విడుదలయ్యారనే అంశాన్ని ఉన్నది ఉన్నట్లు సినిమాలో చూపలేదని వారు వాపోయిన విషయం తెలిసిందే. -
శ్రీకాకుళంలో ‘తండేల్’ మూవీ విజయోత్సవ వేడుక (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న ‘తండేల్’ మూవీ యూనిట్ (ఫొటోలు)
-
మరోసారి ఆర్టీసీ బస్సులో 'తండేల్'.. వివరాలు షేర్ చేసిన నిర్మాత
నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన తండేల్ సినిమాను పైరసీ వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే నిర్మాతలు బన్నీ వాసు, అల్లు అరవింద్ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. కొద్దిరోజుల క్రితమే పలాస నుంచి విజయవాడ వెళ్లిన ఆర్టీసీ బస్సులో ఈ సినిమాను ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో చిత్ర యూనిట్ ఫైర్ అయింది. అయితే, తాజాగా మరోసారి ఏపీఎస్ ఆర్టీసీ బస్సులోనే ఈ సినిమాను ప్రదర్శించడంతో ఆ వార్త నెట్టింట వైరల్ అయింది. దీనిపై నిర్మాత బన్ని వాసు తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.ఫిబ్రవరి 11న విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సులో తండేల్ సినిమాను ప్రదర్శించినట్లు బన్నీ వాసు తెలిపారు. ఆ బస్సుకు సంబంధించిన వివరాలు (AP 39 WB. 5566) షేర్ చేశారు. రెండోసారి ఏపీఎస్ ఆర్టీసీలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో అక్కినేని ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని బన్నీ వాసు కోరారు. 'మా సినిమా పైరసీని రెండోసారి ప్రదర్శించారు. ఎంతో కష్టపడి సినిమా తీశాం. ఇలాంటి పనుల వల్ల చిత్ర పరిశ్రమకు నష్టం జరుగుతుంది. ఎంతోమంది క్రియేటర్స్ శ్రమను అగౌరవపరచడమే అవుతుంది.' అని వాసు పేర్కొన్నారు.నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తండేల్’(Thandel). అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ రావడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. ఇలాంటి సమయంలో ఇలా పైరసీని ప్రొత్సాహిస్తే చిత్ర పరిశ్రమకు తీరని నష్టాన్ని తెచ్చినట్లు అవుతుందని చాలామందిలో అభిప్రాయం వ్యక్తమౌతుంది. సినిమా రిలీజైన రెండు రోజుల్లోనే పైరసీ ప్రింట్ బయటకు వస్తే సినిమా మనగుడ ఉండదని కూడా కొందరు హెచ్చరిస్తున్నారు.Once again the pirated version of our #Thandel played on the @apsrtc bus (Vehicle No: AP 39 WB. 5566). Piracy harms the film industry and disrespects creators' hard work. APSRTC Chairman #KonakallaNarayanaRao Garu, kindly ensure a strict circular is issued, prohibiting the… pic.twitter.com/xIrhziUkNP— Bunny Vas (@TheBunnyVas) February 11, 2025 -
అరెస్ట్ చేయిస్తాం... జాగ్రత్త : అల్లు అరవింద్ వార్నింగ్
‘‘పైరసీ చేయడం పెద్ద క్రైమ్. ప్రస్తుతం సైబర్ సెల్స్ బాగా పని చేస్తున్నాయి. మిమ్మల్ని (పైరసీదారులను) పట్టుకోవడం తేలిక. వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్లకు ఇదే నా హెచ్చరిక... జాగ్రత్తగా ఉండండి. మీరు జైలుకు వెళ్లే అవకాశం ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) హెచ్చరించారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తండేల్’(Thandel). అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ అయింది. కాగా, ‘తండేల్’ సినిమాను పైరసీ చేసి, ఆన్లైన్లో పెట్టారు. ఈ విషయంపై సోమవారం ప్రెస్మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఓటీటీ చర్యల వల్ల కొన్నేళ్లుగా సినిమా పైరసీ ఆగింది. కానీ రెండు నెలల నుంచి మళ్లీ పెరిగింది. మొన్న ‘దిల్’ రాజుగారి సినిమాను ఇలానే ఆన్లైన్లో విడుదల చేశారు. పైరసీ నియంత్రణకు ఫిల్మ్ ఛాంబర్లోని సెల్ రాత్రీ పగలూ పని చేస్తోంది. కానీ కొందరు వాట్సప్ గ్రూపుల్లో లింకులను ఫార్వార్డ్ చేస్తున్నారు. ఇలా చేస్తున్న వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్‌ల అడ్మిన్లను గుర్తించి, సైబర్ క్రైమ్ దృష్టికి తీసుకెళ్లాం. వారిని అరెస్ట్ చేయిస్తాం. ఏపీఎస్ఆర్టీసీ బస్సులో సినిమా పైరసీ ప్రింట్‌ను ప్రదర్శించడం డ్రైవర్ అమాయకత్వం. సినిమా సక్సెస్‌ను మేం ఆస్వాదించే క్రమంలో ఈ పైరసీ సమస్య మాకు ప్రతిబంధకం’’ అన్నారు. ‘‘క్రిమినల్ కేసులు నమోదు అయితే వెనక్కి తీసుకోలేము. పైరసీ చేసినవాళ్లకి, దాన్ని డౌన్లోడ్ చేసుకున్న వాళ్లకీ కేసులు వర్తిస్తాయి. ‘తండేల్’ సినిమా పైరసీ కాపీ ఓవర్సీస్ నుంచే వచ్చింది. ఇది తమిళ ప్రింట్ నుంచి వచ్చింది. దానికి తెలుగు ఆడియో కలిపారు. పైరసీ కాపీని ప్రదర్శించవద్దని కేబుల్ ఆపరేటర్స్‌ని కూడా హెచ్చరిస్తున్నాం’’ అని బన్నీ వాసు అన్నారు. ఇదిలా ఉంటే... ఈ సమావేశం నిర్వహించిన కొంత సమయానికి బన్నీ వాసు ‘ఎక్స్’ వేదికగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కె. నారాయణరావుని ఉద్దేశించి, ‘‘పైరసీని అడ్డుకునేందుకు కఠినమైన చర్యలు తీసుకోవడానికి నిజాయితీగా మీరు చేసిన ప్రయత్నాన్ని, ఈ విషయంపై త్వరితగతిన స్పందించినందుకు, ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.ప్లీజ్... లీవ్ అజ్ బిహైండ్‘తండేల్’ ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడినప్పుడు... ‘గేమ్ ఛేంజర్’ని తక్కువ చేసినట్లుగా ఉందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ‘‘ఆ రోజు ‘దిల్’ రాజుగారిని ఉద్దేశించి, నేను మాట్లాడిన మాటలకు అర్థం... ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు–నష్టాలు–ఇన్కమ్ట్యాక్స్లు.. ఇవన్నీ అనుభవించారని. ఉద్దేశపూర్వకంగా నేను మాట్లాడిన మాటలు కాదు. మెగా అభిమానులు ఫీలై, నన్ను ట్రోల్ చేశారు. ఫీలైన ఆ అభిమానులకు చెబుతున్నాను... నాకు చరణ్ (రామ్‌చరణ్) కొడుకులాంటి వాడు. నాకున్న ఏకైక మేనల్లుడు. అందుకని ఎమోషనల్‌గా చెబుతున్నాను. ప్లీజ్... లీవ్ అజ్ బిహైండ్’’ అన్నారు. -
ఇండస్ట్రీ ప్లే బాయ్‌తో చెయ్యి కలపనున్న 'సాయి పల్లవి'
సాయిపల్లవికి నటిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. వచ్చిన అవకాశాలన్నింటినీ ఒప్పేసుకోవడం ఈమె నైజం కాదు. కథ, అందులో తన పాత్ర నచ్చితేనే నటించడానికి పచ్చజెండా ఊపుతారు. అదీ తన పాత్రకు ప్రాధాన్యత ఉండాలి. ఇకపోతే గ్లామరస్‌గా ఉండకూడదు. అలాంటి పాత్రల్లో నటిస్తూనే వరుస విజయాలను అందుకుంటున్నారు. ఇటీవల శివకార్తికేయన్‌కు జంటగా అమరన్ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా తాజాగా నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం హిందీలో రామాయణం చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్నారు. కాగా తాజాగా మరో కోలీవుడ్ చిత్రం కోసం సాయిపల్లవి పేరు వినిపిస్తోంది. అదీ సంచలన నటుడు శింబుతో జత కట్టే విషయమై ప్రచారం జోరందుకుంది. శింబు ఇప్పుడు నటుడు కమలహాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో నటించిన థగ్‌లైఫ్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రం జూన్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా తాజాగా వరుసగా మూడు చిత్రాల్లో నటించడానికి శింబు సిద్ధం అవుతున్నారు. అందులో ఒకటి పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్‌కుమార్ దర్శకత్వం వహించనున్న చిత్రం. డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల నటుడు శింబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. అందులో శింబు చేతిలో ఉన్న పుస్తకంలో రక్తం మరకలు కలిగిన కత్తి ఉండడంతో ఇది యాక్షన్ ఎంటర్టెయినర్ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..ఈ చిత్రంలో కథానాయకిగా నటి సాయిపల్లవి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా మరో ముఖ్య పాత్రలో నటుడు సంతానం నటించనున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. హాస్య నటుడిగా పరిచయం అయ్యి ఆ తరువాత కథానాయకుడిగా రాణిస్తున్న సంతారం ఈ చిత్రం ద్వారా మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇకపోతే శింబు నటించిన గత సినిమాలను పరిశీలిస్తే ఎక్కువగా హీరోయిన్‌తో రొమాంటిక్ సీన్స్ లేదా సాంగ్స్ ఉండటం సహజం. కోలీవుడ్ ప్లే బాయ్ అనే ట్యాగ్‌లైన్ కూడా ఆయనకు ఉంది. నయనతార,హన్సిక,ఆండ్రియా, హర్షిక,త్రిష,సనా ఖాన్ వంటి వారితో ఆయనకు ఎఫైర్స్ ఉన్నాయంటూ కోలీవుడ్‌లో వార్తలు కూడా వచ్చాయి. అయితే, సింబు సినిమాలో సాయి పల్లవి నటించడానికి సమ్మతించారా..? అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. నిజంగా ఆమె అంగీకరించినట్లయితే అందులో ఆమె పాత్ర స్ట్రాంగ్ అయ్యి ఉంటుందని భావించవచ్చు. కాగా ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా ఇది శింబు నటించనున్న 49వ చిత్రం అన్నది గమనార్హం. -
రెండు రోజులకు 'తండేల్' కలెక్షన్స్.. బాక్సాఫీస్ వద్ద తగ్గేదే లే
బాక్సాఫీస్ వద్ద తండేల్ రెండో రోజు కూడా భారీ కలెక్షన్స్ సాధించింది. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం ఉండనుందని బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. చందు మొండేటి డైరెక్షన్‌కు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తోడైతే ఎలా ఉంటుందో తండేల్ విజయం చూపుతుంది. నాగచైతన్య, సాయి పల్లవి జోడిపై ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు రూ. 21.27 కోట్లు రాబట్టి నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.శనివారం వీకెండ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద తండేల్ దెబ్బ బలంగానే పడింది. రెండురోజులకు గాను రూ. 41.20 కోట్లు రాబట్టింది. ఇంకా ఆదివారం సెలవు రోజు ఉంది కాబట్టి సులువుగా రూ. 50 కోట్ల మార్క్‌ను దాటుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు, అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మించారు. సినిమా విడుదలకు ముందే తండేల్ పాటలు, డైలాగులతో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. సినిమా బాగుందని పాజిటివ్ టాక్ రావడంతో టికెట్ల బుకింగ్‌లో వేగం పెరిగింది. -
రెండుసార్లు మ్యాజిక్ రిపీట్... అందుకే హిట్ పెయిర్ అంటున్న ఇండస్ట్రీ
-
'తండేల్' ఫస్ట్ డే కలెక్షన్స్.. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్
బాక్సాఫీస్ వద్ద తండేల్ మొదటిరోజే భారీ కలెక్షన్స్ సాధించింది. నాగచైతన్య, సాయి పల్లవి జోడికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు, అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మించారు. సినిమా విడుదలకు ముందే తండేల్ పాటలు, డైలాగులతో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. సినిమా బాగుందని పాజిటివ్ టాక్ రావడంతో టికెట్ల బుకింగ్‌లో వేగం పెరిగింది. దీంతో ఫస్ట్ డే నాడు భారీ కలెక్షన్స్ రాబట్టింది.తండేల్ సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 21.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో సినిమా విడుదలైనప్పటికీ తెలుగులోనే అత్యధికంగా వసూళు చేసింది. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా తండేల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు గతంలో తను నటించిన 'లవ్‌స్టోరీ' మొదటిరోజు సుమారు రూ. 10 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పుడా రికార్డ్‌ను తండేల్ దాటేసింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నెట్టింట భారీగా వైరల్ చేస్తున్నారు. విదేశాల్లో మొదటిరోజు ఈ చిత్రం రూ. 3.7 కోట్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. 'అలలు మరింత బలపడుతున్నాయి' అంటూ ఒక క్యాప్షన్‌ను పెట్టింది. విదేశాల్లోనే సుమారు రూ. 10 కోట్ల వరకు రాబట్టవచ్చని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.బుక్‌మై షోలో మొదటిరోజే సుమారు 2.5 లక్షలకు పైగా ‘తండేల్’ టికెట్స్ సేల్ అయ్యాయి. ఆ ట్రెండ్ ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ప్రతి గంటకు 10 వేల టికిట్లు అమ్ముడుపోతున్నాయి. రాజుగా నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి జోడికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాకు సంగీతం, విజువల్స్ చాలా బాగున్నాయని ప్రశంసలు వస్తున్నాయి. -
Thandel Movie Review: 'తండేల్' మూవీ రివ్యూ
టైటిల్ : తండేల్నటీనటులు: నాగచైతన్య, సాయి పల్లవి, పృథ్వీ రాజ్, ప్రకాష్ బెలవాడి, కల్ప లత తదితరులునిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్నిర్మాతలు: బన్నీ వాసు,అల్లు అరవింద్కథ: కార్తీక్ తీడదర్శకత్వం-స్క్రీన్‌ప్లే: చందూ మొండేటిసంగీతం: దేవి శ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుదీన్విడుదల: పిబ్రవరి 7, 2025సంక్రాంతి సినిమాల సందడి తర్వాత బాక్సాఫీస్ వద్ద విడుదలవుతున్న పెద్ద సినిమా 'తండేల్' కావడంతో బజ్ బాగానే క్రియేట్ అయింది. 'లవ్ స్టోరీ' చిత్రంతో మంచి విజయం చూసిన నాగ చైతన్యకు ఆ తర్వాత సరైన హిట్ పడలేదు. గతేడాదిలో విడుదలైన కస్టడీ కూడా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇండస్ట్రీలో సరైన హిట్ కోసం గత ఐదేళ్లుగా నాగచైతన్య ఎదురుచూస్తున్న సమయంలో దర్శకుడు చందూ మొండేటితో 'తండేల్' కథ సెట్ అయింది. కార్తికేయ 2 విజయంతో పాన్ ఇండియా రేంజ్లో ఆయనకు గుర్తింపు దక్కింది. ఆ మూవీ తర్వాతి ప్రాజెక్ట్ ఇదే కావడంతో వీరిద్దరి కాంబినేషన్ తప్పకుండా విజయాన్ని తెచ్చిపెడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ‘తండేల్’ స్టోరీని చూపించనున్నారు. ఈ కథలో సాయి పల్లవి ఎంపిక కూడా సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది. ఆపై ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ భారీ అంచనాలు పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా ఆఖరులో పెంచేశారు. జనాల్లోకి తండేల్ చొచ్చుకుపోయాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది..? నాగచైతన్య, చందూ మొండేటి ఖాతాలో బిగ్ హిట్ పడిందా లేదా..? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 మంది మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తుండగా పొరపాటున పాకిస్థాన్ ప్రాదేశిక జలాల్లోకి వారు ప్రవేశించారు. అప్పుడు పాక్ వారిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంది. తండేల్ కథకు ఇదే మూలం.. డి.మత్స్యలేశం గ్రామం నుంచే తండేల్ కథ మొదలౌతుంది. రాజు (నాగచైతన్య), సత్య (సాయి పల్లవి) ప్రేమికులుగానే మనకు పరిచయం అవుతారు. ప్రాణాలకు ఎదురీదుతూ సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం ఉండదు. వారు ఎప్పుడైతే తమ ఇంటికి చేరుతారో అప్పుడే కుటుంబ సభ్యులు ఊపిరిపోసుకుంటారు. ఇదే పాయింట్ సత్యలో భయం కలిగేలా చేస్తుంది. తను ప్రేమించిన రాజు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్తే.. ఏదైనా ప్రమాదం జరగవచ్చని అతన్ని వేటకు వెళ్లొద్దంటూ ఆమె నిరాకరిస్తుంది. అప్పటికే తండేల్ (నాయకుడు)గా ఉన్న రాజు.. సత్య మాటను కాదని వేట కోసం గుజరాత్ వెళ్తాడు. ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. సాధారణ కూలీగా ఉన్న రాజు తండేల్ ఎలా అయ్యాడు..? వేటకు వెళ్లొద్దని సత్య చెప్పినా కూడా రాజు గుజరాత్‌కు ఎందుకు వెళ్తాడు..? ఈ కారణంతో తన పెళ్లి విషయంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? అందుకు ఎదురైన కారణం ఏంటి..? వేటకు వెళ్లిన వారందరూ పాక్ చెరలో ఎలా చిక్కుకుంటారు..? రాజు మీద కోపం ఉన్నప్పటికీ వారందరినీ తిరిగి ఇండియాకు రప్పించేందుకు సత్య చేసిన పోరాటం ఏంటి..? చివరగా రాజు, సత్య కలుసుకుంటారా..? అనేది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లి 'తండేల్' కథ పూర్తిగా తెలుసుకోవాలి.ఎలా ఉందంటేచందూ మొండేటి దర్శకత్వం నుంచి వచ్చిన సినిమాలన్ని కూడా ప్రేక్షకులకు ప్రత్యేకంగానే ఉంటాయి. నాగ చైత్యన్యతో ప్రేమమ్, సవ్యసాచి చిత్రాలను తెరకెక్కించిడంతో వారిద్దరి మధ్య బాండింగ్ ఉంది. అయితే, కార్తికేయ2 సినిమా తర్వాత ఒక బలమైన కథతో దర్శకుడు వచ్చాడు. అందుకు తగ్గట్లుగానే ఒక టీమ్‌ను రెడీ చేసుకుని తండేల్ బరిలోకి ఇద్దరూ దిగారు. అనకున్నట్లుగానే తండేల్ కోసం సాయి పల్లవి, నాగచైతన్య, దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ షామ్‌దత్ సైనుదీన్ నాలుగు పిల్లర్లుగా నిలబడ్డారు. శ్రీకాకుళం మత్స్యకారుడిగా నాగ చైతన్య ఇరగదీశాడని చెప్పవచ్చు. తండేల్ సినిమాతో అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని తిరొగచ్చు అనేలా ఉంది. కార్తీక్ తీడ అందించిన కథకు చందు మొండేటి తనదైన స్టైల్లో భారీ ఎమోషనల్ టచ్ ఇచ్చారు. అందుకే చాలామంది సినిమాకు కనెక్ట్ అయ్యారు.ఈ సినిమా నేపథ్యం ఇద్దరి ప్రేమకుల మధ్యనే కొనసాగుతుంది. ప్రియుడికి ఏమైనా అవుతుందేమోననే భయం ప్రియురాలిలో ఆందోళన మొదలౌతుంది. ఆ సమయంలో ఆమె పడే తపన, మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో చూపించడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కథలో ఇది జరగవచ్చు అని మనం అంచనా వేస్తున్నప్పటికీ వారి మధ్య వచ్చే భావోద్వేగభరితమైన సీన్లు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. ఎక్కడా కూడా కథలో సాగదీతలు లేకుండా సింపుల్‌గానే దర్శకుడు ప్రారంభిస్తాడు. హీరో, హీరోయిన్ల పరిచయం ఆపై వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ప్రతి ప్రేమికులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. క్షణం కూడా ఒకరినొకరు విడిచి ఉండలేని పరిస్థితిలో వారు ఉంటారు. అలాంటి సమయంలో కొంత కాలం ఎడబాటు ఏర్పడితే.. ఆ ప్రేమికుల మధ్య సంఘర్షణ ఎలా ఉంటుందో చాలా ఎమోషనల్‌గా దర్శకుడు చూపించాడు. అందుకు తోడు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ కథను మరో లెవల్‌కు తీసుకెళ్తాయి.చిత్ర యూనిట్ మొదటి నుంచి ఇదొక అద్భుతమైన లవ్‌స్టోరీ అంటూ చెప్పారు. వారు చెప్పినట్లుగా ప్రేమికులు అందరూ ఈ కథకు కనెక్ట్ అవుతారు. సినిమా ఫస్ట్ కార్డ్‌లోనే రాజు వద్దని చెప్పిన సత్య.. మరో పెళ్లి చేసుకుంటానని తన తండ్రితో చెబుతుంది. ఆమె అలా చెప్పడానికి కారణం ఏంటి అనేది ఫస్టాఫ్‌లో తెలుస్తుంది. ఇక సెకండాఫ్‌లో పాకిస్తాన్ జలాల్లోకి తండేల్ టీమ్ వెళ్లడం.. అక్కడ వారు పాక్‌కు చిక్కడంతో జైలు జీవితం మొదలౌతుంది. అక్కడ వారి జైలు జీవితం ఎంత దారుణంగా ఉండేదో మన కళ్ళకు కట్టినట్లు దర్శకుడు చూపించడంలో విజయం సాధించాడు. కానీ, కథ మొత్తంలో పాకిస్తాన్ ట్రాకే మైనస్ అని కూడా చెప్పవచ్చు. సెకండాఫ్ అక్కడక్కడా కాస్త స్లో అయినట్లు ఉంటుంది. గత చిత్రాలను మనకు గుర్తు చేస్తూ కొంచెం చిరాకు తెప్పిస్తాయి.అయితే, ఒక పక్క లవ్‌స్టోరీ.. మరో సైడ్ దేశభక్తితో పర్ఫెక్ట్గా చూపించారు. చివరిగా రాజు, సత్య కలిశాడా, లేదా అనే పాయింట్‌ను చాలా ఎంగేజ్ చేస్తూ అద్భుతంగా చూపించాడు. పాన్ ఇండియా రేంజ్లో సినిమా ఉండటంతో ఈ కథలో ఆర్టికల్ 370 రద్దు వల్ల పాక్ జైల్లో వారు ఎలాంటి సమస్యల్లో పడ్డారని చూపారు. ముఖ్యంగా తండేల్ కథలో లవ్‌స్టోరీ ఎంత బలాన్ని ఇస్తుందో.. దేశభక్తి కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉంటుంది. పాక్‌కు చెందిన తోటి ఖైదీలతో మన జాలర్లకు ఎదురైన చిక్కులు ఏంటి అనేది బాగా చూపారు.ఎవరెలా చేశారంటే..నాగచైతన్య నట విశ్వరూపం చూపారు. గత సినిమాలకు భిన్నంగా ఇందులో ఆయన పాత్ర ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే ఆయన తగిన జాగ్రత్తలు తీసుకున్నారనిపిస్తుంది. భాషతో పాటు ఒక మత్స్యకారుడి జీవితం ఎలా ఉంటుదో మనకు చూపించాడు. వాస్తవంగా ఒక సీన్లో సాయి పల్లవి ఉంటే అందులో పూర్తి డామినేషన్ ఆమెదే ఉంటుంది. కానీ, నాగ చైతన్య చాలా సీన్స్‌లలో సాయి పల్లవిని డామినేట్ చేశాడనిపిస్తుంది. ఎమోషనల్ సీన్ల నుంచి భారీ యాక్షన్ ఎపిసోడ్ వరకు ఆయన దుమ్మురేపాడని చెప్పవచ్చు. సాయి పల్లవి పాత్ర తండేల్ సినిమాకు ఒక ప్రధాన పిల్లర్‌గా ఉంటుంది. పృథ్వీ రాజ్, నరేన్, కరుణాకరన్, రంగస్థలం మహేష్ తమ పరిధిమేరకు నటించారు. తమిళ నటుడు కరుణాకరన్ పెళ్లికొడుకుగా అందరినీ మెప్పించగా.. మంగళవారం ఫేమ్ దివ్యా పిళ్లై కూడా సాయి పల్లవితో పాటుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్ సైనుదీన్ చాలా అద్భుతంగా చూపించాడు. ప్రతి సీన్ సూపర్ అనేలా తన కెమెరాకు పనిపెట్టాడు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి ఒక మిసైల్‌లా పనిచేశాడు. పాటలకు ఆయన ఇచ్చిన మ్యూజిక్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టేశాడు. ఈ సినిమాకు హార్ట్‌లా ఆయన మ్యూజిక్ ఉండనుంది. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఫైనల్‌గా నాగచైతన్య- సాయి పల్లవి ఖాతాలో భారీ హిట్ పడిందని చెప్పవచ్చు.- కోడూరు బ్రహ్మయ్య, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆడియన్స్ ముందుకు తండేల్.. అవుతుందా బ్లాక్ బస్టర్ ?
-
Thandel Twitter Review: నాగచైతన్య 'తండేల్' ట్విటర్ రివ్యూ
అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ మూవీతో ఫిబ్రవరి 7న థియేటర్స్‌లోకి వచ్చేశాడు. ఇప్పటికే ఓవర్సీస్లో షోలు పడ్డాయి. దీంతో సినిమా ఎలా ఉందో ట్విటర్ ద్వారా వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. శోభితతో పెళ్లి తర్వాత వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చందు మొండేటి డైరెక్షన్‌కు తోడు ఈ మూవీలో సాయి పల్లవి ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెల కొన్నాయి. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన తండేల్ మూవీకి ప్రధాన బలం సంగీతం అంటూ ఎక్కువమంది దేవీ శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా కథ చెప్పడంలో కాస్త స్లోగా ఉన్నా ఫైనల్‌గా ప్రేక్షకులకు నచ్చుతుందని నెటిజన్లు అంటున్నారు. కథలో చాలా బలం ఉన్నప్పటికీ కొన్ని సీన్ల విషయంలో బాగా విసుగుతెప్పించాడని డైరెక్టర్‌పై విమర్శలు వస్తున్నాయి. కొందరు మాత్రం అలాంటిదేమీ లేదని, కొందరు కావాలనే పనికట్టుకుని మరీ సినిమాపై నెగటివిటిని తీసుకొస్తున్నారని తెలుపుతున్నారు. 'లవ్‌స్టోరి' హిట్ తర్వాత ఈ జోడి మరోసారి భారీ విజయం అందుకుందని తెలుపుతున్నారు.తండేల్ ప్రయాణంలో నాగచైతన్య, సాయి పల్లవి నటన అద్భుతమని కొందరు అంటున్నారు. ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉందని, సెకండాఫ్ మాత్రం దుమ్మురేపారని చెబుతున్నారు. ముఖ్యంగా నాగచైతన్య కెరీర్లో ఎప్పటికీ మరిచిపోలేని నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని తెలుస్తోంది. తెరపై ఆయన్ను చూసిన ఆభిమానులే ఆశ్చర్యపోతున్నారు. ప్రతి సీన్లో ఏంతమాత్రం తగ్గకుండా మెప్పించాడంటూ ప్రశంసలు వస్తున్నాయి.తండేల్ సినిమాకు మరో బలం దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటూ కొందరు చెబుతున్నారు. ప్రతి సీన్లో బీజీఎమ్‌తో గూస్బంప్స్ తెప్పించాడని మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా బుజ్జి తల్లి పాటతో సినిమాను మరింత పీక్స్‌కు తీసుకెళ్లారని చెబుతున్నారు. సినిమా విషంయలో ఒకటి లేదా రెండు నెగటివ్ కామెంట్లకు మించి పెద్దగా ఎక్కడేకాని కనిపించడం లేదు. ట్విటర్లో సినిమాపై బాగుందనే ఎక్కువగా వినిపిస్తుంది. అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా తండేల్ కథ సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇదీ 'లవ్‌స్టోరి' బ్లాక్ బస్టర్ జోడీ అంటూ సినిమాపై భారీగా ప్రశంసలు వస్తున్నాయి. ప్రస్తుతం ట్విటర్లో వచ్చిన అంశాలను మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి రివ్యూ గురించి మరి కొన్ని గంటల్లో తెలుసుకుందాం.Sad version em kottav ra 🫡@ThisIsDSP #Thandel ❤️🔥 pic.twitter.com/CQZzw3V3of— Nick9999 (@NickTarak9999) February 6, 2025#ThandelReview- Oka manchi love track 🧡- Beautiful Songs 👌🎶- koncham patriotic touch tho movie ni end chestaad bhayya 👌Chatinaya Comeback after 5yrs 🔥 3.5/5 #Thandel pic.twitter.com/uwOJnYKLZO— ᴏʀᴀɴɢᴇ ᴀʀᴍʏ 🧡 (@Baahubali230) February 7, 2025#Thandel storms overseas premieres with BLOCKBUSTER reports. 🔥🔥🔥Yuvasamrat @chay_akkineni & @Sai_Pallavi92 shine with their electrifying performances, winning hearts everywhere. 💥💥Rockstar @ThisIsDSP strikes gold again, his songs & BGM receive thunderous applause. 🤘… pic.twitter.com/lx7m5Qc2ll— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 7, 2025Show completed :- #thandel My rating 3/5Ok first half Solid blockbuster 2nd half 👌👏@chay_akkineni performance and @Sai_Pallavi92 performance Vera level 👌👌👌👌Finally movie dhulla kottesindi 👌👌 pic.twitter.com/DeUm3q1zqB— venkatesh kilaru (@kilaru_venki) February 6, 2025Just now finished watching #ThandelIt’s simply a comeback film for @chay_akkineni❤️🔥. He delivered a very good performance in his career after Majili and YMC.🙇🏻🫂It has decent first half followed by a good second half 🙌🏻.Dsp is the soul for the movie🙇🏻❤️🔥 #ThandelReview pic.twitter.com/smAwxuQcOD— Legend Prabhas (@CanadaPrabhasFN) February 7, 2025The #LOVESTORY MAGIC REPEATS AGAIN 🤩All praises & love pouring in from the USA PREMIERES for the BLOCKBUSTER JODI of @chay_akkineni & @Sai_Pallavi92 as RAJU & SATYA in #Thandel 💕 pic.twitter.com/fth6ywe972— Ramesh Bala (@rameshlaus) February 7, 20253/5 rating hit bomma @ThisIsDSP bgm #Thandel ❤️❤️❤️❤️❤️ pic.twitter.com/2JlkMQTjKN— PAWANKALYAN ✨ (@PSPk9999999) February 7, 2025Unanimous blockbuster reports from USA premieres! 🤩🇺🇸💥💥Blockbuster #Thandel 🔥 pic.twitter.com/UE7WveG18i— Prathyangira Cinemas (@PrathyangiraUS) February 7, 2025#Thandel - Unanimous FEEL GOOD BLOCKBUSTER- 3.25/5 🔥YUVASAMRAT @chay_akkineni is the biggest asset of the film 🎥 entertains throughout the film with his stunning chemistry and career BEST PERFORMANCE with @Sai_Pallavi92 💥💥💥💥💥💥💥🔥🔥🔥MAINLY @ThisIsDSP BGM AND SONGS… pic.twitter.com/wIjGqj1Bvm— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) February 6, 2025Chandu Mondeti pedda boring Ass**l asalu veedena Karthikeya tisindi anipistundi.scenes asalu engaging levvu neersam teppinchadu manchi line inka yavarikanna iste bagundedi,ee movie chusaka #Uppena tisina @BuchiBabuSana meeda respect perigindi #NagaChaitanya #SaiPallavi #Thandel— E.Mahesh babu (@babu_mahesh99) February 7, 2025 -
'సాయి పల్లవి'పై నమ్మకం, 'రామ్ చరణ్'పై ప్రేమ.. అల్లు అరవింద్ వ్యాఖ్యలు
నాగచైతన్య- సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన ‘తండేల్’ సినిమా ప్రమోషన్స్ చాలా స్సీడ్గానే జరుగుతున్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ‘లవ్ స్టోరీ’ (2021) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జోడీగా నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చందు మొండేటి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తండేల్ కోసం సాయి పల్లవిని ఎందుకు తీసుకున్నారో చెప్పారు.అమ్మాయిలకు వైట్ స్కిన్ ఉంటే సరిపోదు..వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందిన చిత్రం ‘తండేల్’ అని అల్లు అరవింద్ అన్నారు. లవ్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి యాక్షన్ కూడా ఇందులో ఉంటుంది. తండేల్ రాజు పాత్రలో నాగచైతన్య అద్భుతమైన నటన చూస్తారని ఆయన అన్నారు. ఇదే సమయంలో సాయి పల్లవి గురించి ఆయన ఇలా అన్నారు. 'తండేల్‌లో సాయి పల్లవి ఎంపిక నాదే.. కమర్షియల్‌గా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. బుజ్జితల్లి పాత్ర కోసం ముంబైకి వెళ్లి హీరోయిన్ను తీసుకురాలేదు. అక్కడి నుంచి వచ్చిన అమ్మాయిల స్కిన్ వైట్‌గా ఉండొచ్చు కానీ, ఈ పాత్రకు జీవం తీసుకురాలేరనేది నా అభిప్రాయం. కథలో ఈ పాత్ర చుట్టూ చాలా భావోద్వేగాలు ఉంటాయి. సినిమా చూశాక సాయి పల్లవి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ పాత్ర సాయి పల్లవి అయితే చాలా నిజాయతీగా నటించగలదని అనుకున్నాను. అందరి అంచనాలకు మించి ఆమె వంద శాతం సినిమాకు న్యాయం చేసింది. ఆమెలోని టాలెంట్ అనంతం.' అని చెప్పవచ్చన్నారు.అదీ.. నా అల్లుడిపై ప్రేమరామ్ చరణ్‌తో పాటు గీతా ఆర్ట్స్‌కు మగధీర సినిమా చాలా ప్రత్యేకం. ఈ సినిమాను చరణ్‌తో చేయాలని రాజమౌళినే ఎందుకు కలిశారని అల్లు అరవింద్‌ను బాలీవుడ్ మీడియా ప్రశ్నించింది. నా అల్లుడు (రామ్ చరణ్) మొదటి సినిమా చిరుత యావరేజ్‌గా రన్ అయింది. అలాంటి సమయంలో అతని తర్వాతి సినిమా చేసే ఛాన్స్ నాదే. చరణ్‌కు మంచి హిట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే మంచి దర్శకుడిని సంప్రదించాలని ముందే అనుకున్నాను. చరణ్ సినిమా కోసం ఎంత ఖర్చు అయినా పెట్టేందుకు రెడీగా ఉన్నాను. అలాంటి సమయంలో రాజమౌళిని సంప్రదించాను. అలా మగధీర రావడానికి కారణం అయింది. అలా నా అల్లుడికి పెద్ద హిట్ ఇచ్చాను. అది తనపై నాకున్న ప్రేమ' అంటూ అరవింద్ పేర్కొన్నారు.గతంలో కూడా మగధీర గురించి అల్లు అరవింద్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కోసం అనుకున్నదానికంటే 80 శాతం ఖర్చు అధికమైందని ఆయన అన్నారు. మగధీర కోసం తన దగ్గర ఉన్న మొత్తం డబ్బులను పెట్టానని ఆయన అన్నారు. అయితే, ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్స్‌తో సంబంధం లేకుండా ఆయనే సొంతంగా విడుదల చేశారు. మూవీ విడుదలయ్యాక దానికి మూడింతలు వచ్చిందని ఆయనే అన్నారు. ఒక్కోసారి రిస్క్ చేసి పొగొట్టుకున్న సందర్భాలూ కూడా ఉన్నాయని తెలిపారు. -
‘తండేల్’ మూవీ విశేషాలు చెప్పిన నాగచైతన్య (ఫొటోలు)
-
నటుడిగా సంతృప్తినిచ్చింది – అక్కినేని నాగచైతన్య
‘‘తండేల్’ అందమైన ప్రేమకథా చిత్రం. ఈ కథలో ఆ ప్రేమ వెనుకే మిగతా లేయర్స్ ఉంటాయి. నా కెరీర్లో కథ, నా పాత్ర పరంగానే కాదు... బడ్జెట్ పరంగా పెద్ద సినిమా ఇది. ఇప్పటికే మా యూనిట్ అంతా సినిమా చూశాం... విజయంపై చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రత్యేకించి సెకండ్ హాఫ్, చివరి 30 నిమిషాలు, భావోద్వేగా లతో కూడిన క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. నటుడిగా నాకు బాగా సంతృప్తి ఇచ్చిన చిత్రం ‘తండేల్’’ అని అక్కినేని నాగచైతన్య అన్నారు. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ‘తండేల్’ రేపు (శుక్రవారం) తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం నాగచైతన్య విలేకరులతో చెప్పిన విశేషాలు ఈ విధంగా... → ‘ధూత’ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ‘తండేల్’ మూవీ లైన్‌ని విక్రమ్ కె. కుమార్‌గారు చెప్పారు. ఈ కథని వాసుగారు గీతా ఆర్ట్స్‌లో హోల్డ్ చేశారని తెలిసింది. ఈ కథని డెవలప్ చేసి, ఫైనల్ స్టోరీని చెప్పమని వాసుగారికి చెప్పాను. సినిమాటిక్ లాంగ్వేజ్‌లోకి మార్చిన ‘తండేల్’ కథ విన్నాక అద్భుతంగా అనిపించింది. నాకు ఎప్పటి నుంచో వాస్తవ ఘటనల ఆధారంగా సినిమా చేయాలని ఉండేది. పైగా ఇది మన తెలుగోళ్ల కథ కావడంతో రాజు పాత్ర చేయాలనే స్ఫూర్తి కలిగింది. → ‘తండేల్’ అంటే లీడర్. ఇది గుజరాతీ పదం. ఈ సినిమాని దాదాపు సముద్రంలోనే చిత్రీకరించాం. రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం నటనకి కూడా ప్లస్ అవుతుంది. జైలు సెట్లో చిత్రీకరించిన ఎపిసోడ్స్ చాలా భావోద్వేగంగా ఉంటాయి. రాజు పాత్రకి తగ్గట్టు నేను మారాలంటే మత్స్యకారుల జీవన శైలి తెలుసుకోవాలి. అందుకే శ్రీకాకుళం వెళ్లి వాళ్లతో కొద్ది రోజులు ఉండి... హోం వర్క్ చేశాక ఈ పాత్ర చేయగలననే నమ్మకం వచ్చాకే ‘తండేల్’ జర్నీ మొదలైంది. నటుడిగా తర్వాతి స్థాయికి వెళ్లే చాన్స్ ఈ సినిమాలో కనిపించింది. దాదాపు ఎనిమిది నెలలు స్క్రిప్ట్, నా ట్రాన్స్ఫర్మేషన్ మీదే ఉన్నాను. శ్రీకాకుళం యాసలో మాట్లాడటం సవాల్‌గా అనిపించింది. → చందు, నా కాంబోలో ‘తండేల్’ మూడో సినిమా. నన్ను కొత్తగా చూపడానికి ప్రయత్నిస్తాడు. ‘‘100 పర్సెంట్ లవ్’ మూవీ తర్వాత గీతా ఆర్ట్స్‌లో మళ్లీ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటుంటే.. ‘తండేల్’తో కుదిరింది. అరవింద్‌గారు, వాసుగారు సినిమాలు, ఎంచుకునే కథలు చాలా బాగుంటాయి. → ‘తండేల్’ షూటింగ్ కోసం కేరళ వెళ్లినప్పుడు అక్కడి కోస్ట్ గార్డ్స్ కెమేరామేన్, కొందరు యూనిట్‌ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇలా కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ఈ సినిమా చేస్తున్నప్పుడు అవార్డులు, రికార్డులు, వసూళ్ల గురించి ఆలోచించలేదు. ప్రేక్షకులను అలరించడమే నాకు ముఖ్యం. అయితే అరవింద్‌గారు మాత్రం ‘తండేల్’ రిలీజ్ తర్వాత నేషనల్ అవార్డ్స్‌కి పంపిస్తానని అన్నారు. సినిమా కోసం నా కాస్ట్యూమ్స్‌ని డిజైనర్స్ సెలక్ట్ చేస్తుంటారు. వ్యక్తిగత విషయానికొస్తే... ట్రిప్‌లకు వెళ్లినప్పుడు షాపింగ్ చేసి, నాకు నచ్చినవి కొనుక్కుంటాను. అలాగే ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటాను. అయితే ప్రస్తుతం నా డ్రెస్‌లను నా భార్య శోభిత సెలెక్ట్ చేసి, నాకు సర్ప్రైజ్ ఇస్తోంది. -
నాగచైతన్య తండేల్.. టికెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి
టాలీవుడ్ హీరో నాగచైతన్య తాజా చిత్రం తండేల్ మూవీ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిలిచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే మల్టీప్లెక్స్‌ల్లో రూ.75 అదనంగా వసూలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టికెట్ ధరలు వారం రోజుల పాటు కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. (ఇది చదవండి: తండేల్ మూవీ.. నాగచైతన్య జర్నీ చూశారా?)చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించిన తండేల్ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శ్రీకాకుళంలో జరిగిన రియల్ స్టోరీ అధారంగా ఈ సినిమాను రూపొందించారు. పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించిన మత్స్యకారులను బంధించి పాక్‌కు తీసుకెళ్తారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి చైతూ సరసన హీరోయిన్గా నటించింది. కాగా.. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్లో బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా కోసం చైతూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్..తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరు కావాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా రాలేకపోయారు. ఈ విషయాన్ని బన్నీ తండ్రి అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ ఈవెంట్లో రియల్ తండేల్ రాజ్ అలియాస్ రామారావు తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. -
చైతు, సాయి పల్లవి స్టెప్పులకు పూనకాలు గ్యారెంటీ: బన్నీ వాసు
‘‘తండేల్’ మూవీ యాభై శాతం ఫిక్షన్ అయితే యాభై శాతం నాన్ ఫిక్షన్. రాజు, సత్య అనే ఫిక్షనల్ క్యారెక్టర్స్‌ని చందు అద్భుతంగా డిజైన్ చేశారు. మా సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే స్వచ్ఛమైన ప్రేమకథ. ఆ లవ్ స్టోరీ ద్వారా వాస్తవ ఘటనలను ప్రేక్షకులకు చూపిస్తున్నాం’’ అని నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu) చెప్పారు. నాగచైతన్య, సాయి పల్లవి(sai Pallavi) జోడీగా నటించిన చిత్రం ‘తండేల్’(Thandel). చందు మొండేటి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బన్నీ వాసు విలేకరులతో మాట్లాడుతూ–‘‘రచయిత కార్తీక్ రాసిన కథ నా క్లాస్ మేట్ భానుకి నచ్చింది. దీంతో కార్తీక్‌ని నా వద్దకు తీసుకొచ్చాడు.. నాకూ బాగా నచ్చడంతో కథ వినమని చందూగారికి చెప్పాను. ఆయనకి కూడా నచ్చడంతో చాలా పరిశోధన చేసి, పూర్తి కథని డెవలప్ చేశాం. మత్సలేశ్యం అనే ఊరు ఆధారంగా తీసుకున్న కథ ‘తండేల్’. ఇక్కడి వారు గుజరాత్ పోర్ట్‌కి చేపల వేటకి వెళుతుంటారు. మెయిన్ లీడర్ని తండేల్ అంటారు. అలా మా మూవీకి ‘తండేల్’ టైటిల్ పెట్టాం. ఈ చిత్రంలో రాజు పాత్ర కోసం నాగచైతన్య మౌల్డ్ అయిన విధానం అద్భుతం.ఈ చిత్రం కథ నాగార్జున గారికి బాగా నచ్చిందని చైతన్యగారు చెప్పారు. సాయి పల్లవి కూడా చైతన్యకి మ్యాచ్ అయ్యేలా నటించారు. ‘నమో నమశ్శివాయ..’ పాటలో చైతన్య, సాయి పల్లవి డ్యాన్స్ థియేటర్స్‌లో పూనకం తెప్పిస్తుంది. అరవింద్‌గారు ‘తండేల్’ చూసి, విజయంపై చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే ప్రమోషన్స్‌లో చాలా ఉత్సాహంగా, ఎంజాయ్‌మెంట్‌గా కనిపిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయింది. శ్యామ్దత్గారి విజువల్స్ అద్భుతంగా ఉంటాయి’’ అని తెలిపారు. -
‘తండేల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నా రియల్ లైఫ్ హీరోలు వీళ్లే!
‘‘ఒక యాక్టర్‌కి ఒక లిస్ట్ ఉంటుంది.. ఫలానా డైరెక్టర్‌తో చేస్తే కెరీర్‌కి ఉపయోగపడుతుందని. కానీ నా లిస్ట్‌లో గీతా ఆర్ట్స్ పేరు టాప్‌లో ఉంటుంది. ఈ బేనర్లో సినిమా చేసిన ఏ యాక్టర్ అయినా ఒక మంచి రిజల్ట్‌తో బయటికొస్తారు’’ అని హీరో నాగచైతన్య అన్నారు. నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి(Sai Pallavi) జంటగా నటించిన తాజా చిత్రం ‘తండేల్’(Thandel). 2018లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు.అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘తండేల్ జాతర’ అంటూ యూనిట్ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event)లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఈ వేడుకకు వచ్చినందుకు సందీప్ రెడ్డిగారికి ధన్యవాదాలు. ఈ మధ్యకాలంలో మీలా నిజాయతీ ఉన్న వ్యక్తిని చూడలేదు. మీ సినిమాలే కాదు... మీ ఇంటర్వ్యూల్లో ఓ నిజాయితీ కనిపిస్తుంది. ఇక నా రియల్ లైఫ్‌కి, తండేల్ రాజు క్యారెక్టర్‌కి చాలా తేడా ఉంటుంది. నేను రాజుగా ట్రాన్స్‌ఫార్మ్ కావడానికి టైమ్ ఇచ్చారు. చందు నన్ను నమ్మాడు. చందూతో నాకిది మూడో సినిమా. ప్రతి సినిమాకి నన్ను కొత్తగా చూపిస్తాడు. దేవిశ్రీ ప్రసాద్ ట్రూ రాక్‌స్టార్. ‘నమో నమః శివాయ...’ పాట రిహార్శల్స్ జరుగుతున్నపుడు దేవి సెట్‌కి వచ్చి ఎంతో ఎనర్జీ ఇచ్చాడు. కెమేరామేన్ శ్యామ్ సార్, ఇతర యూనిట్ అందరికీ థ్యాంక్స్. శ్రీకాకుళం నుంచి వచ్చిన మత్స్యకారులందరూ వేదిక మీదకు రావాలి.వీళ్లు లేకుండా ఈ తండేల్ రాజు క్యారెక్టరే లేదు. చందు నాకు ఈ కథను ఓ ఐడియాలా చెప్పాడు. చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఆ తర్వాత మచ్చలేశంకి తీసుకెళ్లాడు. అక్కడ వీళ్లందర్నీ కలిశాను. అక్కడి మట్టి వాసన, వాళ్ల లైఫ్ స్టయిల్, ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవాలు, తీసుకునే ఆహారం అన్నీ తెలుసుకున్నాను. అప్పుడు తండేల్ రాజు పాత్ర ఎలా చేయాలో ఐడియా వచ్చింది. పాకిస్తాన్ లో సంవత్సరం పైన జైల్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని వచ్చారు కదా... మళ్లీ ఎందుకు వేటకి వెళుతున్నారని వీళ్లని అడిగితే... ‘మాకు ఇదే వచ్చు. సముద్రం తప్ప వేరే తెలియదు’ అన్నారు. వాళ్ల ఆడవాళ్లల్లో భయం కనిపించింది. ఇది నిజమైన హ్యూమన్ ఎమోషన్ . వీళ్లే నా రియల్ లైఫ్ హీరోలు. వ్యక్తులుగా వీళ్లు నన్ను ఎంతో ఇన్ స్పైర్ చేశారు. ఈ సినిమా చూసి మీరంతా సంతోషపడతారని అనుకుంటున్నాను’’ అని అన్నారు.‘‘ట్రైలర్, టీజర్, సాంగ్స్... ఏది చూసినా సినిమాలో మంచి ఎమోషనల్ కనెక్ట్ కనిపిస్తోంది. నాగచైతన్య – సాయిపల్లవి స్క్రీన్‌పై రియల్ పీపుల్లా కనిపిస్తున్నారు. ఇలా ఆర్టిస్టులు కనిపించిన సినిమాలన్నీ హిట్స్‌గా నిలిచాయి. ‘అర్జున్ రెడ్డి’ సినిమా కోసం హీరోయిన్ గా సాయిపల్లవిని సంప్రదించాలని కో ఆర్డినేటర్‌తో మాట్లాడాను. ఆమె స్లీవ్‌లెస్ డ్రెస్‌లు ధరించరని చెప్పారు. భవిష్యత్‌లో అలానే ఉంటారా? అనిపించింది. ఆమె ఇప్పటికీ అలానే ఉన్నారు’’ అన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ‘‘నాగచైతన్య, సాయిపల్లవి, అరవింద్‌గారు, చందు... ఇలాంటి టీమ్ అంతా కష్టపడి చేసిన మూవీ తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో మాట్లాడతాను’’ అన్నారు చందు మొండేటి.సాయిపల్లవి మాట్లాడుతూ– ‘‘తండేల్ రాజుగా నాగచైతన్యగారు మారిన తీరు స్ఫూర్తిదాయకం. చందూగారికి ఫుల్ క్లారిటీ ఉంటుంది. దర్శకుడు సందీప్‌గారు ఎవరితో మాట్లాడారో నాకు తెలియదు. ‘అర్జున్ రెడ్డి’ మూవీలో షాలినీ బాగా యాక్ట్ చేశారు. ఎవరు చేయాల్సిన మూవీ వారికే వెళ్తుంటుంది. ‘తండేల్’ వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందింది. ఈ ఘటనలో భాగమైన మహిళలందరూ ధైర్యవంతులు’’ అన్నారు.దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నాగార్జునగారి ‘ఢమరుకం’ కోసం శివుడు పాట చేశాను. ఇప్పుడు చైతూ కోసం శివుడి పాట చేశాను. తండ్రీకొడుకులతో శివుడి పాట చేయడం సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘రాజు–సత్యల మధ్య జరిగే కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కార్తీక్ రాసిన మంచి కథకు చందు మంచి స్క్రీన్ ప్లే ఇచ్చారు’’ అన్నారు బన్నీ వాసు. 2018లో శ్రీకాకుళం నుంచి గుజరాత్‌కు వలస వెళ్లిన మత్స్యకారులు పొరపాటున పాకిస్తాన్ బోర్డర్ క్రాస్ చేసి, అక్కడి కోస్టుగార్డులకు బందీలుగా చిక్కారు. ఈ ఘటన ఆధారంగా ‘తండేల్’ తీశారు. ఈ ఘటనలో నిజంగా భాగమైన వారిలో తండేల్ రామారావు, రాజు, కిశోర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని, వారి అనుభవాలను పంచుకున్నారు.‘‘ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో మాట్లాడతాను. ఇక ఈ ఈవెంట్‌కు బన్నీ (అల్లు అర్జున్) వస్తారని అనుకున్నాం. కానీ ఫారిన్ నుంచి వచ్చాడు. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్‌తో రాలేక΄ోయాడు’’ అని తెలిపారు అల్లు అరవింద్. -
సందీప్ రెడ్డి వంగా చిత్రంలో సాయి పల్లవి.. కానీ..?
అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన 'తండేల్' చిత్రం ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా తండేల్ జాతర పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది యాక్టర్లను చూసిన వెంటనే ఇష్టం కలుగుతుంది. వారితో పరిచయం లేకపోయినా వాళ్ళని ప్రత్యేకంగా ఇష్టపడతాం. నేను కేడి చిత్ర షూటింగ్ సమయంలో నాగ చైతన్యని తొలిసారి చూశాను. అప్పటి నుంచే చైతు అంటే నాకు చాలా ఇష్టం అన్నారు. ఇక సాయి పల్లవి గురించి మాట్లాడుతూ.. ప్రేమమ్ చిత్రం దగ్గర నుంచి సాయి పల్లవి నటన అంటే నాకు ఇష్టం. నా అర్జున్ రెడ్డి చిత్రం మొదట తనని హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నాను. కేరళలో సాయి పల్లవిని అప్రోచ్ కావాలని ఒక వ్యక్తిని అడిగాను. అతను స్టోరి ఎంటని అడిగితే లవ్ డెస్ట్రోయ్ అయిన వ్యక్తి స్టోరి అని, ఇది చాలా రొమాంటిక్ మూవీ అని చెప్పా. దానికి సమాధానంగా అతడు వెంటనే.. సార్ ఆ అమ్మాయి గురించి మీరు మరచిపోండి. ఎందుకంటే సాయి పల్లవి కనీసం స్లీవ్ లెస్ డ్రెస్ కూడా వేసుకోదు అని తనతో చెప్పినట్లు సందీప్ రెడ్డి తెలిపారు. ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ఒక పెద్ద ఆఫర్ వస్తే గ్లామర్ రోల్స్ చేద్దాం అని అనుకుంటారు. మొదట్లో అలా ఉండి ఆ తర్వాత అవకాశాల కోసం మారిపోతారు. కానీ సాయి పల్లవి వచ్చి ఇన్నేళ్లైనా ఆమె మాత్రం మారలేదు. అది సాయి పల్లవి గొప్పతనం అంటూ సందీప్ రెడ్డి ప్రశంసించారు. -
బన్నీ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ‘తండేల్’ టీమ్.. నో ఎంట్రీ!
‘సంధ్య థియేటర్’ ఘటన తర్వాత అల్లు అర్జున్ సినిమా ఈవెంట్లకు దూరంగా ఉన్నాడు. ఇంతవరకు ఏ సినిమా ఫంక్షన్‌కి కానీ, ఇతర ఈవెంట్స్‌కి కానీ రాలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ ‘తండేల్’(Thandel) ప్రీరిలీజ్‌కి వస్తున్నాడు. ఈ వార్త వినగానే బన్నీ ఫ్యాన్స్ ఆనందంతో చిందులేశారు. తమ అభిమాన నటుడిని నేరు చూడొచ్చని చాలా మంది ఫ్యాన్స్ భావించారు. కానీ వారందరికి ‘తండేల్’ టీమ్ షాకిచ్చింది. ఈ రోజు(ఫిబ్రవరి 2) సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్‌కి పబ్లిక్‌కి ఎంట్రీ లేదని ప్రకటించింది. ‘కొన్ని కారణాల రీత్యా దురదృష్టవశాత్తు ‘ఐకానిక్ తండేల్ జాతర’ను చిత్రబృందం సమక్షంలో మాత్రమే నిర్వహిస్తున్నాం. ఈవెంట్లోకి పబ్లిక్కు ఎలాంటి ప్రవేశం లేదు. ప్రసార మాధ్యమాల వేదికగా ఈ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ వీక్షించి ఎంజాయ్ చేయండి’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెల్లడిస్తున్నారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత బన్నీ హాజరవుతున్న తొలి ఈవెంట్ ఇది. ఈ ఈవెంట్లో ఆయన ఏం మాట్లాడతారా? అని అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. . నాగచైతన్య, సాయి పల్లవి(Sai Pallav)i జంటగా నటించిన చిత్రం తండేల్. ‘కార్తికేయ 2’ ఫేం చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా తండేల్ సాంగ్సే వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అదిరిపోయింది. లవ్‌స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవిరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.తండేల్ కథేంటి?శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ జాలరి కథ ఇది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. అయితే సినిమా మొత్తంలో పాకిస్తాన్ ఎపిసోడ్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందట. మిగతా కథంతా రాజు-బుజ్జితల్లి పాత్రల చుట్టే తిరుగుతుందట. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమెస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. -
డార్లింగ్ కు జోడీగా సాయి పల్లవి..?
-
అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం చీర కట్టులో మెరిసిన సాయిపల్లవి
-
సాయి పల్లవికి అనారోగ్యం.. బెడ్ రెస్ట్ అవసరమన్న వైద్యులు!
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని రోజులుగా ఆమె విపరీతమైన జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్నారని తండేల్(Thandel) సినిమా దర్శకుడు చందు మొండేటి తెలిపారు. అంతేకాదు ఆమెకు రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని, అందుకే ఆమె ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి రాలేదని చెప్పాడు. అక్కినేని హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి సాయి పల్లవి మినహా మిగతా యూనిట్ అంతా హాజరైంది. దీంతో నేచురల్ బ్యూటీ ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. ఈవెంట్‌కి రాకపోవడానికి గల కారణం ఏంటని ఆరా తీశారు. సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వచ్చాయి. దీంతో ఈ విషయంపై తాజాగా డైరెక్టర్ చందునే క్లారిటీ ఇచ్చాడు.బెడ్ రెస్ట్‘సాయి పల్లవి కొన్ని రోజులుగా జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. వైద్యులు ఆమెకు కనీసం రెండు రోజుల పాటు బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు. అందుకే ముంబైలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి రాలేకపోయింది. ఆమె ఆరోగ్యం కుదుట పడిన తర్వాత మళ్లీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంది’ అని చందూ మొండేటి తెలిపారు.ఆమీర్ చేతుల మీదుగా హిందీ ట్రైలర్తండేల్ హిందీ ట్రైలర్‌ని బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండేల్ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఫెంటాస్టిక్ గా ఉంది. డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశారు. మ్యూజిక్ ఫెంటాస్టిక్ గా ఉంది. దేవిశ్రీ చేసిన డింకచిక డింకచిక సాంగ్ నా ఫేవరెట్. బేసిగ్గా నాకు డాన్స్ చేయడం ఇష్టం ఉండదు కానీ డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాను. తండేల్ ట్రైలర్ లో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ వున్నాయి. చైతన్య ఫెంటాస్టిక్ యాక్టర్. ఐడియల్ కోస్టార్. తనతో వర్క్ చేయడం చాలా అమెజింగ్ ఎక్స్ పీరియన్స్’ అన్నారు.నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘సాయి పల్లవి తో చేసిన లవ్ స్టోరీ ట్రైలర్ ని అమీర్ ఖాన్ గారు చూసి చాలా బాగుందని మెసేజ్ పెట్టారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు తండేల్ ట్రైలర్ ని అమీర్ ఖాన్ గారు లాంచ్ చేయడం చాలా బలాన్ని ఇచ్చింది. అరవింద్ గారితో చేసిన 100% లవ్ నా కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్. తండేల్’ కూడా మరో టర్నింగ్ పాయింట్ అవుతుందని భావిస్తున్నాను.చందు చాలా అద్భుతంగా సినిమాని తీశాడు. దేవిశ్రీ పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సాయి పల్లవి చాలా అద్భుతంగా నటించింది. మీరంతా ఫిబ్రవరి 7న సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
నాగచైతన్య తండేల్ మూవీ.. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే వైజాగ్ వేదికగా తండేల్ మూవీ ట్రైలర్‌న కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ‘తండేల్ అంటే ఓనరా..?’, ‘ కాదు లీడర్’ అనే డైలాగ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది.సినిమా రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఆడియన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నట్లు చిత్రనిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ వెల్లడించింది. ఫిబ్రవరి 1న హైదరాబాద్‌లోనే గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిపింది. పుష్పరాజ్ ఫర్ తండేల్ రాజ్... తండేల్ జాతర అంటూ పుష్పరాజ్ మాస్ పోస్టర్‌తో పాటు తండేల్ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. దీంతో చైతూ ఫ్యాన్స్‌తో పాటు బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తండేల్ కథేంటంటే...శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. 𝐏𝐔𝐒𝐇𝐏𝐀 𝐑𝐀𝐉🔥for 𝐓𝐇𝐀𝐍𝐃𝐄𝐋 𝐑𝐀𝐉𝐔 ⚓🌊ICON STAR @alluarjun garu will grace the #ThandelJaathara on February 1st in Hyderabad ❤️🔥Stay excited for more details #Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7th.#ThandelonFeb7th #AlluArjunYuvasamrat… pic.twitter.com/W9DfVSHkEK— Geetha Arts (@GeethaArts) January 31, 2025