Vikram
-
విశ్వక్ సేన్, విక్రమ్ సినిమాలకు అరుదైన గౌరవం
గత ఏడాదిలో విడుదలైన రెండు సౌత్ ఇండియా సినిమాలకు అరుదైన గౌరవం దక్కింది. 2024లో తెలుగు సినిమా గామి, తమిళ మూవీ తంగలాన్ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డామ్ (International Film Festival Rotterdam) 2025కు ఈ రెండు చిత్రాలు అధికారికంగా ఎంపికయ్యాయి. ఈమేరకు అధికారికంగా ఇరు సినిమాల మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరి 9వ తేదీ వరకూ జరగనున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రాలను ప్రదర్శించనున్నారు. నెదర్లాండ్స్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భారత సినిమాలకు చోటు దక్కడంతో నెట్టింటి ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు.విశ్వక్ సేన్ (Vishwak sen), చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా విద్యాధర కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గామి’(Gaami). వి సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు ఆరేళ్లపాటు షూటింగ్ చేసి మరీ ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇందులో విశ్వక్ సేన్ అఘోరాగా నటించడం విశేషం. టాక్ పరంగా పాజిటివ్ వచ్చినప్పటికీ డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులు ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యారు. హరిద్వార్‌లో ఉండే అఘోరా శంకర్ (విశ్వక్ సేన్) వింత సమస్యతో బాధపడుతుంటాడు. దీంతో ఆ ప్రాంతం నుంచి నుంచి ఎక్కడికి వెళ్లడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా శంకర్ తనున్న ప్రదేశాన్ని వీడి తన సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటూ కాశీకి వెళతాడు. అక్కడ తన సమస్యకు పరిష్కారం దొరికే చోటు హిమాలయాలు అని తెలుస్తుంది. అక్కడ 36 ఏళ్లకు అరుదుగా దొరికే మాలి పత్రాలు కోసం శంకర్ అన్వేషిస్తూ బయలుదేరుతాడు. అదే సమయంలో అతనికి డాక్టర్ జాహ్నవి (చాందిని చౌదరి)తో పరిచయం అవుతుంది. వారిద్దరూ కలిసి చేసిన ప్రయాణంలో ఎదురైన చిక్కులు ఏంటి..? ఎన్నో ప్రమాదాలను దాటుకొని చివరకు వాళ్లు సాధించింది ఏంటి..? అనేదే గామి కథ. జీ5 ఓటీటీ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.తమిళ్ నుంచి తంగలాన్ తమిళ స్టార్ హీరో విక్రమ్, దర్శకుడు పా. రంజిత్ (Pa Ranjith) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం తంగలాన్ (Thangalaan). గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ విజయాన్ని నమోదుచేసింది. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. -
కాళీ వస్తున్నాడు
విక్రమ్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘వీర ధీర సూరన్ పార్ట్ 2’. ఈ సినిమాలో ఆయన ఓ కిరాణా కొట్టు యజమాని. పేరు కాళీ. మంచి ఫ్యామిలీ మేన్. అయితే ఒక భయంకర మైన క్రైమ్ నెట్‌వర్క్‌తో ఈ కాళీకి సంబంధం ఉంటుంది. మరి... కాళీ సీక్రెట్ మిషన్ ఏంటి? అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందిందని సమాచారం. ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషారా విజయన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం మార్చి 27న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో ఎన్వీఆర్ సినిమాస్ విడుదల చేయనుంది. ‘‘పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం అందర్నీ అలరించేలా ఉంటుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. -
ప్రేమ వివాహం చేసుకున్న స్టార్ డైరెక్టర్.. ఆశీర్వదించిన విక్రమ్ (ఫొటోలు)
-
ప్రియురాలిని పెళ్లి చేసుకున్న హిట్ సినిమాల దర్శకుడు
కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తు వివాహ బంధంలో అడుగుపెట్టాడు. తన చిరకాల ప్రేయసి షిమోనా రాజ్‌కుమార్‌తో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. వారి పెళ్లి వేడుకులో కేవలం ఇరువురి కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఎలాంటి ప్రచారం లేకుండా అతికొద్దిమంది సమక్షంలో ఘనంగా పెళ్లి జరిగింది. అయితే, ఆయన సతీమణి షిమోనా గురించి వివరాలు ప్రకటించలేదు. కొత్త దంపతులను స్టార్ హీరో విక్రమ్ ఆశీర్వదించారు.విభిన్నమైన హారర్ థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకుల్ని మెప్పించిన ‘డిమోంటి కాలనీ’ చిత్రానికి ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. 2015లో వచ్చిన ఈ చిత్రానికి కొనసాగింపుగా గతేడాదిలో ‘డిమోంటి కాలనీ-2’ కూడా విడుదలైంది. హారర్ థ్రిల్లర్ సినిమాలు బాగా ఇష్టపడే వారికి ఆయన పరిచయమేనని చెప్పవచ్చు. విక్రమ్(Vikram) కథా నాయకుడిగా జ్ఞానముత్తు(Ajay Gnanamuthu) తెరకెక్కించిన చిత్రం ‘కోబ్రా’. 2022లో విడుదలైన ఈ మూవీ కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయమే అందుకుంది. ఇందులో విక్రమ్ గెటప్పుల విషయంలో డైరెక్టర్ క్రియేట్ చేసిన విధానం ప్రేక్షకులను ఫిదా చేసింది.(ఇదీ చదవండి: డబ్బుల కోసం కోర్టుకు వెళ్లిన నటుడు దర్శన్)జ్ఞానముత్తు 2010లో షార్ట్ ఫిల్మ్ మేకింగ్ షో, నాలయ అయ్యకునార్ సీజన్-1 లో పోటీలో పాల్గొన్నాడు. అందులో ఫైనలిస్టులలో ఒకరిగా జ్ఞానముత్తు నిలవడంతో గుర్తింపు పొందాడు. తరువాత అతను ప్రముఖ దర్శకుడు మురుగదాస్ వద్ద సహాయ దర్శకుడిగా చేరాడు. 7th సెన్స్, తుపాకి, వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన పనిచేశాడు. View this post on Instagram A post shared by Ajay R Gnanamuthu (@ajaygnanamuthu) -
జాతీయ అవార్డ్ విన్నింగ్ హీరో సినిమాకు నో చెప్పిన సాయిపల్లవి
నటి సాయి పల్లవి సినిమా రంగంలో సంపాదించుకున్న పేరు మామూలుగా లేదు. ముఖ్యంగా గ్లామర్‌కు దూరంగా సహజ నటిగా ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ మలయాళ చిత్రం ప్రేమమ్‌తో కథానాయకిగా పరిచయమైంది. అయితే, సాయి పల్లవి తన తొలి చిత్రంతోనే నటనలో తనదైన ముద్ర వేసుకుంది. దీంతో వెంటనే టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. ఇక్కడ పలు చిత్రాల్లో నటించి సక్సెస్ ఫుల్ కథానాయకిగా రాణిస్తోంది. అదేవిధంగా కోలీవుడ్ లోనూ నటిస్తూ దక్షిణాదిలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన సాయి పల్లవి ఇటీవల శివకార్తికేయన్‌కు జంటగా అమరన్ చిత్రంలో నటించి మరోసారి నటిగా తన సత్తా చాటుకుంది. కథలోని తన పాత్ర నచ్చితేనే నటించడానికి సమ్మతించే ఈమె పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎలాంటి అవకాశం అయినా తిరస్కరిస్తుంది. అయితే తాజాగా అందుకు భిన్నంగా ఒక అవకాశాన్ని చేజార్చుకుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరందుకుంది. అదే నటుడు విక్రమ్ సరసన నటించే అవకాశం అని సమాచారం. తంగలాన్ చిత్రంలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన నటుడు విక్రమ్ ప్రస్తుతం వీర వీర సూరన్ చిత్రంలో నటిస్తున్నారు. ఎస్.అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. కాగా తదుపరి మడోన్ అశ్విన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు ఈ దర్శకుడు ఇంతకుముందు యోగిబాబు కథానాయకుడిగా మండేలా, శివ కార్తికేయన్ హీరోగా మావీరన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. కాగా విక్రమ్ హీరోగా ఈయన దర్శకత్వం వహించనున్న చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. కాగా ఇందులో విక్రమ్ సరసన నటి సాయిపల్లవి నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. అయితే కాల్షీట్స్ సమస్య కారణంగా ఆమె ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని చేజార్చుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆరు ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్న సాయిపల్లవి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ అందుకున్న విక్రమ్‌తో కలిసి ఒక సినిమా చేస్తే అంచనాలు భారీగానే ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనేది ఎంతవరకు నిజమో అన్నది తెలియాల్సి ఉంది. అదేవిధంగా విక్రమ్ దర్శకుడు మండోన్ అశ్విన్ కాంబోలో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
సరికొత్త లుక్‌లో...
హీరో విక్రమ్ 63వ చిత్రం షురూ అయింది. ‘చియాన్ 63’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని ప్రకటించారు మేకర్స్. ‘మండేలా, మావీరన్’ (తెలుగులో ‘మహావీరుడు’) వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు మడోన్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. శాంతి టాకీస్‌పై అరుణ్ విశ్వ నిర్మించనున్నారు. ఈ సందర్భంగా అరుణ్ విశ్వ మాట్లాడుతూ– ‘‘దేశంలోని అత్యుత్తమ నటుల్లో ఒకరైన విక్రమ్‌తో కలిసి మా ప్రోడక్షన్ నంబర్ 3ని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. మనకు ఎన్నో చిరస్మరణీయమైనపాత్రలు, సంచలనాత్మక చిత్రాలను అందించిన విక్రమ్‌గారితో సినిమా నిర్మించనుండటం మాకు గౌరవం. మడోన్ అశ్విన్‌తో రెండో సినిమా చేయనుండటం చాలా ఆనందంగా ఉంది. విక్రమ్‌గారికి కరెక్టుగా సరిపోయే కథతో ఆయన్ని సరికొత్త లుక్‌లో చూపించబోతున్నారు మడోన్ అశ్విన్. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలో తెలియజేస్తాం’’ అని చెప్పారు. -
సడెన్‌గా ఓటీటీలో 'తంగలాన్' సినిమా
విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా తంగలాన్. ఎలాంటి ప్రకటన లేకుండానే సైలెంట్‌గా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఏడాది ఆగష్టు 15న విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. అయితే, తంగలాన్ ఓటీటీ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా చాలారోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. అయితే, సడెన్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తంగలాన్ చిత్రం స్ట్రీమింగ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.తంగలాన్ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిల్,మలయాళం,కన్నడలో ఈ చిత్రం తాజాగా విడుదలైంది. తంగలాన్ సినిమాను ఓటీటీలో విడుదల చేయవద్దని తిరువళ్లూరుకు చెందిన పోర్కోడి మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వైష్ణవులను అవమానించేలా చాలా సన్నివేశాలు ఉన్నాయని ఆయన పిటీషన్ వేశారు. అంతేకాకుండా బౌద్ధమతం గురించి చాలా పవిత్రంగా చూపించిన దర్శకుడు వైష్ణవులను మాత్రం కించపరిచేలా తెరకెక్కించారని పిటీషన్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఓటీటీలో విడుదలైతే ఇరువర్గాల మధ్య మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేసు విచారణ అనంతరం ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదలైంది.కథేంటి..?గోల్డ్ హంట్ నేపథ్యంలో తంగలాన్ను తెరకెక్కించారు పా. రంజిత్. 1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో జరిగిన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్).. తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. మరి తంగలాన్ చివరకు బంగారం కనిపెట్టాడా? అరణ్య, ఆరతితో ఇతడికి ఉన్న సంబంధమేంటి అనేదే మెయిన్ స్టోరీ. ఈ మూవీకి సీక్వెల్ తంగలాన్ 2 ఉంటుందని విక్రమ్ వెల్లడించారు. -
'వీర ధీర శూరన్'గా విక్రమ్.. టీజర్ ఎలా ఉంది..?
విక్రమ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’. ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఎస్జే సూర్య, సూరజ్ వెంజరమూడు, దుషారా విజయన్ ఇతర పాత్రల్లో నటించారు. హెచ్ఆర్ పిక్చర్స్‌పై రియా శిబు నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకోవడంతో యూట్యూబ్‌లో 14 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. తాజాగా విడుదల చేసిన టీజర్లో విక్రమ్ నటన, యాక్షన్ సీక్వెన్సులు, విజువల్స్, నేపథ్య సంగీతం వంటివి అభిమానుల అంచనాలను మించిపోయాయి. విక్రమ్ డిఫరెంట్ లుక్స్, యాక్టింగ్, పోలీస్ ఆఫీసర్‌గా ఎస్జే సూర్య పెర్ఫామెన్స్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటాయి. ఈ జనవరిలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి కెమెరా: తేని ఈశ్వర్, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
ఎవరీ విక్రమ్‌గౌడ?
విక్రమ్‌గౌడ కుదురేముఖ్ జాతీయ ఉద్యానవనం వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. కరావళి ప్రాంతంలో విక్రమ్‌గౌడ, మలెనాడు ప్రాంతంలో ముండగారు లతా బృందం చురుకుగా ఉండేవి. విక్రమ్‌గౌడ ఉడుపి జిల్లా హెబ్రి తాలూకా కూడ్లు నాడ్వాలు గ్రామ నివాసి. మొదట కార్మిక సంఘంలో పనిచేసిన విక్రమ్‌గౌడ ఆ తరువాత నక్సలైట్లలో చేరి అగ్రశ్రేణి నక్సల్‌గా ఎదిగారు. మూడుసార్లు కర్ణాటక పోలీసుల నుంచి తప్పించుకున్నారు. 2016 నుంచి కేరళ అటవీ ప్రాంతాల నుంచి కార్యకలాపాలను నడుపుతున్నారు. ఆయన మృతితో నక్సలైట్ నేతల సంఖ్య తగ్గింది. గతంలో పలువురి అరెస్టులు, లొంగుబాట్లు జరిగాయి.బనశంకరి: కర్ణాటక, కేరళ, తమిళనాడు పోలీసులకు మోస్ట్‌వాటెండ్ నక్సలైట్‌గా ఉన్న విక్రమ్ గౌడ ఎన్కౌంటర్లో చనిపోయారు. కర్ణాటకకు చెందిన నక్సల్స్ వ్యతిరేక దళం(ఏఎన్ఎఫ్) పోలీసులు సోమవారం రాత్రి ఉడుపి జిల్లాలో కబ్బినాలే అటవీ ప్రదేశంలో కూంబింగ్‌లో మట్టుబెట్టారు.ఎదురు కాల్పులు...విక్రమ్‌గౌడ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో 50 కి పైగా నేరాల్లో మోస్ట్ వాటెండ్‌గా ఉన్నారు. కొద్దిరోజులుగా ఉడుపి ప్రాంతంలో నక్సల్స్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీంతో ఏఎన్ఎఫ్ పోలీసులు విస్తృతంగా కూంబింగ్ జరుపుతున్నారు. ఐదుమంది నక్సలైట్లు నిత్యావసర వస్తువులను కొనడానికి కబ్బినాలెకు వచ్చినట్లు తెలిసి చుట్టుముట్టారు. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి, ఇందులో విక్రమ్‌గౌడ (46) మరణించగా, మిగిలిన నక్సల్స్ పారిపోయినట్లు పోలీసు అధికారులు చెప్పారు.రూ.5 లక్షల రివార్డువిక్రమ్గౌడ, ముండగారు లతా, జయణ్ణ, వనజాక్షి, సుందరి అనేవారు నక్సల్ నేతలు కాగా, వారిపైన ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున బహుమానం ప్రకటించింది. గత 20 ఏళ్లు నుంచి నక్సల్ కార్యకలాపాల్లో విక్రమ్‌గౌడ పాల్గొంటున్నాడు. ఆయనపై చిక్కమగళూరు జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 50 కి పైగా దాడులు, విధ్వంసం కేసులు ఉన్నాయి.కేరళ నుంచి వచ్చి తూటాలకు చిక్కికేరళలో నక్సల్స్ కార్యకలాపాలు హెచ్చుమీరడంతో అక్కడ పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టారు. దీంతో చాలామంది నక్సల్స్ పొరుగునే ఉన్న ఉడుపి, మంగళూరు జిల్లాల్లోకి వచ్చారు. పశ్చిమ కనుమల్లోని అటవీ గ్రామాల పరిసరాల్లో తలదాచుకున్నారు. ఇటీవల కస్తూరిరంగన్ నివేదిక అమలు, అటవీ ప్రాంతం ఆక్రమణల తొలగింపు అంశాలపై ప్రజలతో సమావేశాలు జరిపారు. ఇది తెలిసి పెద్ద సంఖ్యలో పోలీసులు అడవుల్లో గాలింపు ప్రారంభించారు. విక్రమ్‌గౌడ మృతదేహాన్ని మంగళూరు ఆస్పత్రికి తరలించారు.లొంగిపోవాలని చెప్పాంబనశంకరి: ఎన్కౌంటర్ స్థలాన్ని మంగళవారం రాష్ట్ర ఆంతరిక భద్రతా విభాగం డీఐజీ రూపా మౌద్గిల్ పరిశీలించి మీడియాతో మాట్లాడారు. నక్సల్స్ కదలికల గురించి తెలిసి గాలింపు మొదలైంది, నక్సల్స్ ఎదురుపడ్డారు, లొంగిపోవాలని సూచించినప్పటికీ కాల్పులకు దిగారు. ఈ సమయంలో ఏఎన్ఎఫ్ బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో విక్రమ్‌గౌడ మృతిచెందారు. ఇతడిపై హత్య, దోపిడీలు, దొంగతనాలు తో పాటు 60 కి పైగా కేసులు ఉన్నాయి అని రూపా మౌద్గిల్ చెప్పారు. 10 రోజుల నుంచి గాలింపు జరుగుతోందని ఆమె చెప్పారు. -
బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న సూర్య, విక్రమ్
-
తంగలాన్ తర్వాత 'వీర ధీర సూరన్'గా విక్రమ్
నటుడు చియాన్ విక్రమ్ ఇటీవల నటించిన తంగలాన్ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దాని తరువాత విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వీర ధీర సూరన్. తంగలాన్ చిత్రానికి పూర్తి భిన్నమైన కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రం ఇది. హెచ్ఆర్. పిక్చర్స్ పతాకంపై రియాశిబు నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టెయినర్ కథా చిత్రానికి ఎస్‌యూ. అరుణ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్‌లో పన్నైయారుమ్ పద్మినియుమ్ , సేతుపతి, చిత్తా (చిన్నా) వంటి విజయవంతమైన చిత్రాలను అరుణ్‌కుమార్ తెరకెక్కించారు. నటి దుషారా విజయన్ నాయకిగా నటిస్తున్న ఇందులో నటుడు ఎస్జే.సూర్య, సురాజ్ వెంజరమూడు, సిద్ధిక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని, తేనీ ఈశ్వర్ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ చివరి దశకు చేరింది. ఇందులో విక్రమ్ కాళీ అనే మాస్ పాత్రలో నటిస్తున్నారు. చిత్ర ఫస్ట్‌లుక్ పోస్లర్ను విడుదల చేయగా చాలా మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. ఇది రెండు భాగాలుగా తెరకెక్కనున్నట్లు సమాచారం. విశేషం ఏమిటంటే రెండో భాగాన్ని ముందు విడుదల చేయనున్నారని తెలిసింది. కాగా ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కులను ఫైవ్‌స్టార్ కే. సెంథిల్ పొందారని యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. కాగా వీర ధీర సూరన్ చిత్రాన్ని వచ్చే ఏడాది పొంగల్‌కు రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తాజా సమాచారం. దీంతో ఇక నుంచి చియాన్ విక్రమ్ హవా కొనసాగుతుందని ఆయన అభిమానులు సంబరపడుతున్నారు. -
'తంగలాన్' ఓటీటీ విషయంలో తీర్పు వెల్లడించిన కోర్టు
విక్రమ్ హీరోగా పా.రంజిత్ తెరకెక్కించిన చిత్రం 'తంగలాన్'. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఓటీటీ విడుదల విషయంలో కాస్త జాప్యం ఎదురైంది. సినిమా రిలీజ్ అయి రెండు నెలలు దాటిని ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి రాలేదు. అయితే, తంగలాన్ ఓటీటీ అంశంపై మద్రాస్ ప్రధాన న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇప్పటికే పలు తేదీలలో స్ట్రీమింగ్ కానుందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, అవన్నీ రూమర్స్‌గానే మిగిలిపోయాయి. మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.తంగలాన్ సినిమాను ఓటీటీలో విడుదల చేయవద్దని తిరువళ్లూరుకు చెందిన పోర్కోడి మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమాలో వైష్ణవులను అవమానించేలా చాలా సన్నివేశాలు ఉన్నాయని ఆయన పిటీషన్ వేశారు. అంతేకాకుండా బౌద్ధమతం గురించి చాలా పవిత్రంగా చూపించిన దర్శకుడు వైష్ణవులను మాత్రం కించపరిచేలా తెరకెక్కించారని పిటీషన్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఓటీటీలో విడుదలైతే ఇరువర్గాల మధ్య మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాబట్టి ఓటీటీలో తంగలాన్ సినిమా విడుదలను నిషేధించాలని పిటిషన్లో తెలిపారు.తంగలాన్ ఓటీటీ వివాదం పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఆర్ శ్రీరామ్, జస్టిస్ సెంథిల్ కుమార్ రామ్మూర్తిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. దానిని పరిశీలించిన న్యాయమూర్తులు మాట్లాడుతూ.. 'తంగళన్ సినిమా ప్రభుత్వ నింబధనల మేరకు సెన్సార్ సర్టిఫికెట్ పొంది థియేటర్లలో విడుదలైంది కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకోలేమని కోర్టు తెలిపింది. తంగలాన్ సినిమాను ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయడానికి ఎలాంటి అడ్డంకి లేదని ఆదేశిస్తూ ఈ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. స్టూడియో గ్రీన్ కెఇ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రానికి జి.వి ప్రకాష్ సంగీతం సమకూర్చారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన తంగలాన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 110 కోట్లు రాబట్టింది. కోర్టు తీర్పుతో దీపావళి కానుకగ తంగలాన్ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. -
సల్మాన్ ఖాన్ సోదరుడితో విడాకులు.. ఇప్పుడేమో మాజీ భాయ్‌ఫ్రెండ్‌తో!
ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్, సల్మాన్ ఖాన్ తమ్ముడి భార్య సీమా సజ్దేహ్ ఓ షోలో మెరిసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ సీజన్-3లో కనిపించింది. ఈ షోలో పాల్గొన్న సీమా సజ్దేహ్ తన వివాహా జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. సోహైల్ ఖాన్‌తో పెళ్లికి ముందే ప్రముఖ రచయిత విక్రమ్ అహుజాతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్‌ను పెళ్లాడింది. వీరిద్దరు 2022లో విడాకులు తీసుకున్నారు.తాజాహా నెట్‌ఫ్లిక్స్ షోలో కనిపించిన సీమా.. తన డేటింగ్ గురించి నోరు విప్పింది. సోహైల్‌తో డివోర్స్ తర్వాత విక్రమ్ అహుజాతో డేటింగ్లో ఉన్నట్లు సీమా వెల్లడించింది. ప్రస్తుతం అతనితో డేటింగ్లో ఉన్నానని షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ముంబయిలోని వర్లీ నుంచి బాంద్రాకు మారినప్పుడు తన ఇంటికోసం సాయం చేశాడని సీమా తెలిపింది. తన గురించి నాకంటే అతనికే ఎక్కువగా తెలుసని చెప్పింది. అతనితో మళ్లీ ప్రేమలో పడినందుకు సంతోషంగా ఉందని తెలిపింది.కాగా.. విక్రమ్ అహుజా ఒక వ్యాపారవేత్త. మల్టీ మిలియనీర్ దేవేంద్ర అహుజా కుమారుడు. అతను సెంచూరియన్ బ్యాంక్ ప్రమోటర్‌గా పనిచేశాడు. గతంలో సీమా, విక్రమ్ 1990 నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ఊహించని కారణాలతో వాళ్లిద్దరు విడిపోయారు. ఆ తర్వాత సీమా.. సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. కానీ వీరిద్దరు రెండేళ్ల క్రితమే విడాకులు తీసుకున్నారు. దీంతో తాజాగా సీమా తన మాజీ బాయ్‌ఫ్రెండ్ విక్రమ్ అహుజాతో డేటింగ్ చేస్తున్నట్లు తెలిపింది. నెట్‌ఫ్లిక్స్ షో ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ షోలో ఈ విషయాన్ని వెల్లడించింది. -
తంగలాన్ ఓటీటీ విడుదలపై ప్రకటన చేసిన నిర్మాత
విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా తంగలాన్. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్న ఈ మూవీ ఆగష్టు 15న విడుదల అయింది. అయితే, తంగలాన్ ఓటీటీ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో తంగలాన్ వేట కొనసాగించి ఇప్పటికే రెండు నెలలు పూర్తి అయింది. బాలీవుడ్లో కూడా విడుదలైన ఈ మూవీ అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి చిత్ర నిర్మాత ప్రకటన చేశారు.డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మించారు. అయితే, తంగలాన్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. కానీ, స్ట్రీమింగ్ విషయంలో మేకర్స్ నుంచి పలు అడ్డంకులు రావడంతో ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేయలేదని ఊహాగానాలు వినిపించాయి. ఈ విషయంపై తాజాగా జ్ఞానవేల్ రాజా క్లారిటీ ఇచ్చారు. 'దీపావళికి తంగలాన్ సినిమాను విడుదల చేయాలని వారు (నెట్‌ఫ్లిక్స్) నిర్ణయించారు. తంగలన్ పెద్ద సినిమా కాబట్టి పండుగ నాడు విడుదల చేస్తే బాగుంటదని తెలిపారు. అయితే, తంగలాన్ ఓటీటీ విడుదల విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. వాస్తవానికి సమస్య లేకున్నా కూడా.. సమస్య ఉందని చెప్పుకునే నేర్పు నేటి సోషల్‌మీడియా వార్తలకు ఉంది.' అని ఆయన తెలిపారు. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1న తంగలాన్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కావడం ఖాయమని చిత్ర నిర్మాత పేర్కొన్నారు.కథేంటి..?గోల్డ్ హంట్ నేపథ్యంలో తంగలాన్ను తెరకెక్కించారు పా. రంజిత్. 1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో జరిగిన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్).. తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. మరి తంగలాన్ చివరకు బంగారం కనిపెట్టాడా? అరణ్య, ఆరతితో ఇతడికి ఉన్న సంబంధమేంటి అనేదే మెయిన్ స్టోరీ. ఈ మూవీకి సీక్వెల్ తంగలాన్ 2 ఉంటుందని విక్రమ్ వెల్లడించారు. -
ఓటీటీకి రాని తంగలాన్.. అసలు సమస్య ఇదేనా?
తమిళ స్టార్ హీరో విక్రమ్ ఇటీవల నటించిన సినిమా 'తంగలాన్'. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. పా.రంజిత్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మూవీని తెలుగు, తమిళంలో ఓకేసారి రిలీజ్ చేశారు.అయితే ఈ మూవీ రిలీజైన రెండు నెలల కావొస్తున్నా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు. ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తంగలాన్ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా కూడా ప్రకటించారు. దీంతో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుందని ఓటీటీ ఆడియన్స్ వెయిట్ చేశారు. కానీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాలేదు.తాజా సమాచారం మేరకు నెట్ ఫ్లిక్స్‌తో మేకర్స్‌కు సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఒప్పందాన్ని నెట్‌ఫ్లిక్స్ రద్దు చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో తంగలాన్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ కొనుగోలు చేసినట్లు లేటేస్ట్ టాక్. త్వరలోనే స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సమాచారం.తంగలాన్ కథేంటంటే..'తంగలాన్' విషయానికొస్తే 1850లో చిత్తూరు ప్రాంతంలోని పల్లెటూరు. తంగలాన్ ఓ శ్రామికుడు. అతడికి భార్య ఐదుగురు పిల్లలు. ఓ రోజు పిల్లలతో.. ఏనుగు కొండ వెనకాల బంగారం కొండ ఉందని, దానికి ఓ రక్షకురాలు ఉందని ఏవో కథలు చెబుతాడు. కట్ చేస్తే తంగలాన్‌తోపాటు కొందరిని బ్రిటీష్ దొరలు బంగారం నిధుల కోసం కూలీలుగా తీసుకెళ్తారు. నిధి అన్వేషణ కోసం సాగించిన ప్రయాణంలో వీళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు ఏమైందనేదే కథ. -
రెండు దశాబ్దాల తర్వాత...
రెండు దశాబ్దాల తర్వాత హీరోలు విక్రమ్, సూర్య కలిసి నటించే అవకాశం కనిపిస్తోంది. తమిళ రచయిత ఎస్యు వెంకటేశన్ రాసిన ‘వీరయుగ నాయగన్ వేళ్‌పారీ’ నవల హక్కులు ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద ఉన్నాయి. ఈ నవల ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారట శంకర్. ఈ సినిమాను ఆయన రెండు భాగాలుగా తీయనున్నారని, ఇందులో విక్రమ్–సూర్య హీరోలుగా నటించనున్నారని కోలీవుడ్ టాక్.2003లో వచ్చిన ‘పితాగమన్’ (తెలుగులో ‘శివపుత్రుడు’) చిత్రం తర్వాత సూర్య, విక్రమ్ కలిసి నటించలేదు. మరి... 21ఏళ్ల తర్వాత శంకర్ సినిమా కోసం వీరిద్దరూ కలిసి మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. అలాగే ఆయన దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్ 3’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాల తర్వాతనే ‘వీరయుగ నాయగన్ వేళ్‌పారీ’ నవలను సినిమాగా తీసే పనులపై శంకర్ పూర్తి స్థాయి దృష్టి పెట్టాలనుకుంటున్నారని కోలీవుడ్ భోగట్టా. -
డైరెక్టర్ శంకర్ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు
భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ దర్శకుడు శంకర్. తాజాగా విడుదలైన ఇండియన్– 2 చిత్రం వరకూ ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవే.. అయితే ఇటీవల విడుదలై ఇండియన్– 2 చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. కాగా ప్రస్తుతం స్టార్ హీరో రామ్‌చరణ్ కథానాయకుడిగా గేమ్ ఛేంజర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో మళ్లీ సూపర్‌హిట్ బాట పట్టడానికి దర్శకుడు శంకర్ శ్రమిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సినిమా తరువాత ఇండియన్– 3 చిత్రాన్ని పూర్తి చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇకపోతే మరో భారీ చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో దర్శకుడు శంకర్ ఉన్నారు. ఏల్పారి నవల హక్కులను పొందిన శంకర్ దీన్ని భారీ బడ్జెట్లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే దీన్నీ మల్టీస్టారర్ చిత్రంగా రూపొందించనున్నట్లు తెలిసింది. ఆ స్టార్ హీరోలెవరో కాదు చియాన్ విక్రమ్, సూర్య అని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే మరికొద్ది కాలం ఆగాల్సిందే. అయితే వీరిద్దరూ చాలా కాలం క్రితం నటించిన పితామగన్ అనే సంచలన విజయం సాధించింది. కాగా ఇప్పుడు నటుడు విక్రమ్, సూర్య కలిసి నటిస్తే వేల్పారి నవల మరో సంచలన చిత్రం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
దుబాయ్ లో సైమా 2024 అవార్డ్స్ ప్రదానోత్సవం...తారల సందడి (ఫొటోలు)
-
ఓటీటీ రిలీజ్‌కి ముందే 'తంగలాన్'కి దెబ్బ
తమిళ స్టార్ హీరో విక్రమ్ లేటెస్ట్ సినిమా 'తంగలాన్'. ఆగస్టు 15న తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజైంది. మన దగ్గర మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే ఊహించని మూవీ టీమ్ షాకయ్యే సంఘటన జరిగింది. తమిళ వెర్షన్ ప్రింట్ ఆన్లైన్లో లీక్ అయిపోయింది. దీంతో ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో ప్లాన్ మారినట్లు తెలుస్తోంది.విలక్షణ చిత్రాలు తీసే దర్శకుడు పా.రంజిత్.. 'తంగలాన్' సినిమా కోసం సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. 18వ శతాబ్దంలో మొదలయ్యే కథ 5వ శతాబ్దానికి వెళ్లి మరీ ఆగుతుంది. ఇందులో అందరూ డీ గ్లామర్ లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరచగా.. కథ కూడా ఓ పట్టాన అర్థం కాదు. ఒకవేళ అర్థమైతే మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది.(ఇదీ చదవండి: Bhargavi Nilayam Review: ఓ దెయ్యం పరిష్కరించుకున్న కథ!)లెక్క ప్రకారం ఆరు వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో 'తంగలాన్' స్ట్రీమింగ్ కావాలి. కానీ ఇప్పుడు ప్రింట్ లీక్ కావడంతో సెప్టెంబరు 20 నుంచే దక్షిణాది భాషల్లో ఓటీటీ రిలీజ్ కానుందని, 27వ తేదీ నుంచి హిందీ వెర్షన్ అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఆన్లైన్లో ప్రింట్ లీక్ అయిపోయింది కాబట్టి బహుశా ఇదే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.'తంగలాన్' విషయానికొస్తే 1850లో చిత్తూరు ప్రాంతంలోని పల్లెటూరు. తంగలాన్ ఓ శ్రామికుడు. అతడికి భార్య ఐదుగురు పిల్లలు. ఓ రోజు పిల్లలతో.. ఏనుగు కొండ వెనకాల బంగారం కొండ ఉందని, దానికి ఓ రక్షకురాలు ఉందని ఏవో కథలు చెబుతాడు. కట్ చేస్తే తంగలాన్‌తోపాటు కొందరిని బ్రిటీష్ దొరలు బంగారం నిధుల కోసం కూలీలుగా తీసుకెళ్తారు. నిధి అన్వేషణ కోసం సాగించిన ప్రయాణంలో వీళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు ఏమైందనేదే కథ.(ఇదీ చదవండి: రూ. 2 వేల కోట్ల భారీ స్కామ్‌లో సినీ నటి అరెస్ట్) -
ఓటీటీలో బంగారు వీరుడు 'తంగలాన్'
విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా తంగలాన్. ఆగష్టు 15న విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. విక్రమ్ కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా తంగలాన్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వాణిజ్యపరంగా కూడా సుమారు రూ. 110 కోట్లు రాబట్టిన తంగలాన్ బాలీవుడ్లో కూడా తాజాగా విడుదలైంది. అక్కడి సినీ అభిమానులు కూడా విక్రమ్ నటనకు ఫిదా అవుతున్నారు. అయితే, తాజాగా తంగలాన్ ఓటీటీ ప్రకటన గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.తంగలాన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. విక్రమ్ మీద నమ్మకంతో సినిమా విడుదలకు ముందే డీల్ సెట్ చేసుకుంది. సెప్టెంబర్ 20న ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించినట్లు ఒక పోస్టర్ వైరల్ అవుతుంది. అయితే, అదే నిజమని ఇండస్ట్రీ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. కానీ, నెట్‌ఫ్లిక్స్ అధికారిక సోషల్‌మీడియాలో తంగలాన్ గురించి ఎలాంటి సమాచారం లేదు. సెప్టెంబర్ 20 తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళంలో మాత్రమే తంగలాన్ విడుదల తప్పకుండా అవుతుందని సమాచారం. అయితే, హిందీ వర్షన్ మాత్రం ఒక వారం గ్యాప్‌తో రిలీజ్ కానున్నట్లు టాక్.కథేంటి..?గోల్డ్ హంట్ నేపథ్యంలో తంగలాన్ను తెరకెక్కించారు పా. రంజిత్. 1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో జరిగిన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్).. తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. మరి తంగలాన్ చివరకు బంగారం కనిపెట్టాడా? అరణ్య, ఆరతితో ఇతడికి ఉన్న సంబంధమేంటి అనేదే మెయిన్ స్టోరీ. ఈ మూవీకి సీక్వెల్ తంగలాన్ 2 ఉంటుందని విక్రమ్ వెల్లడించారు. -
'మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో అర్థం కాదు'.. విక్రమ్‌కు వార్నింగ్!
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఇటీవలే తంగలాన్ మూవీతో ప్రేక్షకులను అలరించాడు. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విక్రమ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శంకర్ తెరకెక్కించిన ఐ మూవీ కోసం బరువు తగ్గినట్లు వెల్లడించారు. దాదాపు 86 కిలోల నుంచి ఏకంగా 52 కేజీలకు తగ్గానని తెలిపారు. అయితే తన శారీరక మార్పులతో తీవ్రమైన సమస్య నుంచి బయటపడ్డానని వివరించారు. 50 కంటే బరువు తగ్గితే మీ శరీరంలో అవయవాలు పనిచేయవని డాక్టర్ హెచ్చరించినట్లు తెలిపారు. ఆర్గాన్స్ ఫెయిల్ అయితే.. మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో కూడా మాకు అర్థం కాదంటూ వైద్యులు చెప్పారని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా కాశీ అనే మూవీలో విక్రమ్ అంధుడి పాత్రలో నటించారు. ఈ పాత్ర కోసం విపరీతమైన శారీరక మార్పులకు ప్రయత్నించానని తెలిపారు. ఆ చిత్రంలో నటించాక దాదాపు మూడు నెలలపాటు సరిగా చూడలేకపోయానని విక్రమ్ వెల్లడించారు. ఆ మూవీలో అంధుడిగా కనిపించడానికి కళ్లు పైకెత్తి చూడాల్సి వచ్చేదని.. ఆ ఎఫెక్ట్ నా కంటి చూపుపై తీవ్ర ప్రభావం చూపిందని వివరించారు. దీంతో మెల్లకన్ను వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్స్ వార్నింగ్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. సినిమాల్లో పాత్రల కోసం తన ప్రాణాలనే రిస్క్‌లో పెడుతున్న విక్రమ్‌ను చూస్తుంటే ఆయన డెడికేషన్ ఏంటో అర్థమవుతోంది. కాగా.. ఇటీవల విడుదలైన 'తంగలాన్' కోసం కొంత బరువు తగ్గడంతో పాటు సగం తల గుండు చేయించుకున్నాడు. -
అభిమానులకు భోజనం వడ్డించిన స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన పీరియాడికల్ చిత్రం తంగలాన్. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లు రాబట్టింది. పా రంజిత్ డైరెక్షన్లో ఈ మూవీని స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించారు.భోజనం వడ్డించిన హీరో..బాక్సాఫీస్ వద్ద తంగలాన్ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సభ్యులు, అభిమానులతో కలిసి సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన అభిమానులకు హీరో విక్రమ్ స్వయంగా భోజనం వడ్డించారు. స్టార్ హీరో అయి ఉండి సింపుల్‌గా కనిపించారు. తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో కనిపించి సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #Thangalaan success meetA @chiyaan treat 🥳 pic.twitter.com/nFoFtL7FAA— Kalaiarasan 𝕏 (@ikalaiarasan) August 27, 2024 -
చరిత్ర కుహరాల నుంచి...
అణగారిన ప్రజలు తమకి ఓ గొప్ప పోరాట చరిత్ర ఉందని తెలిస్తే యధాతథ వాదాన్ని అంగీ కరించరు. వర్తమానంలో తమపై అమలయ్యే వివక్షను కచ్చితంగా ఎదిరిస్తారు. అది తమ తలరాత అని ఊరుకోకుండా తమపై రుద్దిన బానిసత్వంపై తిరగబడి తమదైన కొత్త సమాజాన్ని నిర్మించుకుంటా రని మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎప్పుడో చెప్పాడు. ఫూలే చెప్పిన పోరాటాల చరిత్రను... ప్రాచీన భారత దేశ చరిత్ర అంతా బౌద్ధానికి– వైదిక హిందూ మతానికి మధ్య జరిగిన ఘర్షణ అని బాబాసాహెబ్ అంబేడ్కర్ విశదీ కరించాడు. ఇంతకాలం కట్టుకథలు, పిట్టకథలు చరిత్రగా చలామణి అయినట్లే మన సినిమాలు కూడా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మసిపూసి మారేడుకాయ చేస్తూ కొందరి జీవితాన్నే అందరి జీవితంగా కాకమ్మ కథలతో జనం కంట్లో కారం కొట్టి బతికేస్తున్నాయి.అయితే సింహాల నుంచి చరిత్రకారుడు పుట్టు కొచ్చాడు. వర్ణ అంధత్వంతో కునారిల్లిన నూరేళ్ళ వెండి తెరను బదబదాలుగా చించి పోగులు పెడుతూ సరికొత్త దారిని వేసుకుంటూ పోతున్నాడు పా. రంజిత్. అవును పా. రంజిత్ అసలైన చరిత్రను రక్తమాంసాలతో సిల్వర్ స్క్రీన్ మీద పరుస్తున్నాడు. తంగలాన్ ఈ దేశ మూలవాసుల అసలు చరిత్ర... చూసినవాళ్లకి కంటి మీద కునుకు పడ నీయని చరిత్ర! తంగలాన్ అందర్నీ తీవ్రంగా డిస్టర్బ్ చేస్తున్నాడు. కడుపులో చేయిపెట్టి దేవుతున్నాడు. కొందరు బాహాటంగానే వాంతులు చేసుకుంటున్నారు. మరికొందరికి రక్తం మరుగుతుంది, కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. చారెడు భూమి కోసం, కాసింత గౌరవం కోసం తమవాళ్ళు చేసిన హాహాకారాలు, కొండలు గుట్టలు దాటి నడిచిన యోజనాలు, కడచిన దారులు, చరిత్ర పొడవునా పారిన నెత్తురు కళ్ళముందు కదులుతూంటే గుండె చెరువవుతోంది.ఎవరు కాదని బుకాయించినా ఈ దేశ సాంస్కృతిక వారసత్వం బౌద్ధంలో ఉంది. నేటి దళితులు బౌద్ధ సాహి త్యంలో పేర్కొన్న నాగుల సంతతివారు. వారే బౌద్ధాన్ని అవలంబించి బుద్ధుని మార్గంలో నడి చిన శాంతి కాముకులు. కానీ బౌద్ధాన్ని చంపి, బౌద్ధులపై అంటరాని తనాన్ని రుద్దుతూ వారి మెడలో ముంతలు కట్టింది వైదిక బ్రాహ్మణ మతం. తర్వాత తన సంఖ్యా బలాన్ని పెంచుకోవడానికి దళితుల మెడలో ముంతను అంతే ఉంచి జంధ్యం వేసింది. వైష్ణవ మతంలోకి వెళ్ళిన దళితులను వెళ్లని వారి నెత్తిన కూర్చోబెట్టింది. ఈ చరిత్రను తంగలాన్‌లో పా. రంజిత్ కళ్ళకు కట్టించాడు.బౌద్ధంలో ‘హారీతి’ అనే దేవత ఉన్నట్టు తెలుగు శాస నాల్లో కూడా ఉంది. ఆమె ఒక ప్రకృతి దేవత. వజ్రయానంలో సిద్దులు చేసిన ప్రయోగాలు, సిద్దుల రసవాదం పక్కన పెట్టి వారిని ‘క్షుద్ర’ విద్యలు తెలిసిన మాంత్రి కులనీ, బుద్ధుడిని అశుభానికి గుర్తుగా ప్రచారం చేసింది పూజారి వర్గం. బౌద్ధాన్ని అవలంబించేవారిని ఉలిపి కట్టెలుగా, సమాజానికి కీడు చేసేవారిగా చిత్రించి వారిపట్ల ద్వేష భావం పెంచడాన్ని ఈ సినిమాలో సందర్భానుసారంగా చూపించాడు. తమిళనాడు నుంచి కోలార్ బంగారు గనులకు కూలికోసం గని తవ్వకం పనికి వెళ్లి అక్కడే స్థిరపడిన దళితులు 19వ శతాబ్దం చివరికి కేజీఎఫ్‌లో ఓ కొత్త సమాజాన్ని నిర్మించుకున్నారు. పండిత అయోతీదాసు కేజీఎఫ్ కేంద్రంగా ఆది ద్రావిడ ఉద్యమాన్ని నిర్మించాడు. దళితులు హిందువులు కాదు, ఆది బౌద్ధులని చెప్పి వారిలో ఆత్మగౌరవాన్ని నూరిపోసి ‘శాక్య బౌద్ధ సమాజాన్ని’ స్థాపించిన అయోతీదాసుకి కేజీఎఫ్ ఒక లిబరేటెడ్ లాండ్ (విముక్త భూమి). దీనికి కొనసాగింపుగా పెరియార్ 1932లో ద్రావిడ ఉద్యమాన్ని కేజీఎఫ్ నుంచే ప్రారంభించడం విశేషం.కేజీఎఫ్‌లో దళితులు ఇప్పటికీ కులానికీ, మత తత్వానికీ ఎదురు నిలుస్తూ ప్రత్యామ్నాయ రాజకీయాలు కూడా నిర్మిస్తున్నారు. దాని వెనుక ఉన్న త్యాగాల చరిత్రను పట్టుకున్నాడు పా. రంజిత్. తంగలాన్ దళిత సమస్య తాలూకు ప్రతి అంశాన్నీ తడిమిందని చెప్పాలి. దళిత స్త్రీలు ఒకప్పుడు పైవస్త్రం రవిక వేసుకునే వీలు లేదు. అది కొన్ని ప్రాంతాలలో నిషేధం అయితే మరికొన్ని చోట్ల తమ పేదరికం వలన కూడా వారికి అది దక్కేది కాదు. వారు రవిక ధరించడం తమ జనంలో ఓ గొప్ప ఉత్సవం. ఈ సినిమాలో అటువంటి సన్నివేశం ఒకటి అద్భుతంగా చిత్రించాడు పా. రంజిత్.అలాగే దళితుల ఆహారం! వారంతా గని తవ్వకం పనికి కోలార్ వెళ్లినాక కథానాయకుడు తంగలాన్‌తో అతని భార్య గంగమ్మ ‘మావా చింతపండు పులుసు పోసి నెత్తళ్ళ కూర వొండేదా?’ అంటే అతడు ‘కాదుమే, ఎండు తునకలు కూర చెయ్’ అంటాడు. వారు తిండిలేక అలమటిస్తున్నప్పుడు ఒక అడవి దున్న కనిపిస్తే దానిని నరికి మాంసం తిని తిరిగి శక్తి తెచ్చుకుని పని మెదలు పెట్టాలి అనుకుంటారు. ఇవన్నీ వారి జీవితాలలో సహజాతి సహజం. దళిత సమాజంలో స్త్రీ–పురుష సంబంధాలలో ఒకప్పుడు కనిపించే అరమరికలు లేనితనం, గుంపులో ఒకరిపట్ల మరొకరికి ఉండే కన్సర్న్, సామూహికత, చక్కటి సంభాషణలు తంగలాన్ సినిమాకు గొప్ప సౌందర్యాన్ని అద్దాయనవచ్చు.తెగిపడిన శాక్యముని తలని అతికించడం, చరిత్రలో కానరాకుండా పోయిన బంగారం లాంటి మూలవాసుల చరిత్రను వెలికితీయడం... అనే రెండు ముఖ్యమైన కర్తవ్యా లను తంగలాన్ శక్తిమంతంగా నిర్వహించింది. భూమి కోసం, భుక్తికోసం, ఆత్మగౌరవం కోసం చరిత్ర పొడవునా దళితులు వేసిన పొలికేకలు ఈ సినిమాలో మనకి అడుగ డుగునా వినిపిస్తాయి. చరిత్ర కళ్ళకు కట్టినట్టు వాస్తవికంగా కనిపించడం తంగలాన్ విజయం! నూరేళ్ళ వెండితెరపై మట్టి పాదాల్ని తన సంతకంగా ముద్రించిన సిసలైన తంగలాన్ పా. రంజిత్, తంగలాన్ పాత్రలో పూర్తిగా నిమగ్నమై గొప్పగా దానికి జీవం పోసిన హీరో విక్రమ్, అతని భార్యగా నటించిన పార్వతి, ప్రకృతి దేవత ‘ఆరతి’గా నటించిన మాళవిక, ఇతర నటీనటులు; ఒళ్ళు గగుర్పొడిచే సంగీతాన్ని అందించిన జీవీ ప్రకాష్, ‘అంటారానోళ్ల’ చరిత్రని సంగర్వంగా సమర్పించిన జ్ఞాన వేల్... అందరికీ జై భీమ్!'తమిళనాడు నుంచి కోలార్ బంగారు గనులకు కూలికోసం గని తవ్వకం పనికి వెళ్లి అక్కడే స్థిరపడిన దళితులు 19వ శతాబ్దం చివరికి కేజీఎఫ్‌లో ఓ కొత్త సమాజాన్ని నిర్మించుకున్నారు. పండిత అయోతీదాసు కేజీఎఫ్ కేంద్రంగా ఆది ద్రావిడ ఉద్యమాన్ని నిర్మించాడు. దళితులు హిందువులు కాదు, ఆది బౌద్ధులని చెప్పి వారిలో ఆత్మగౌరవాన్ని నూరిపోసి ‘శాక్య బౌద్ధ సమా జాన్ని’ స్థాపించిన అయోతీదాసుకి కేజీఎఫ్ ఒక లిబరేటెడ్ లాండ్ (విముక్త భూమి). దీనికి కొనసాగింపుగా పెరియార్ 1932లో ద్రావిడ ఉద్యమాన్ని కేజీఎఫ్ నుంచే ప్రారంభించడం విశేషం. కేజీఎఫ్‌లో దళితులు ఇప్పటికీ కులానికీ, మత తత్వానికీ ఎదురు నిలుస్తూ ప్రత్యామ్నాయ రాజకీయాలు కూడా నిర్మిస్తున్నారు. దాని వెనుక ఉన్న త్యాగాల చరిత్రను పట్టుకున్నాడు పా. రంజిత్'.– చల్లపల్లి స్వరూపరాణి, వ్యాసకర్త, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ -
బాలీవుడ్ వైపు తంగలాన్.. విడుదల తేదీ ప్రకటన
విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా తంగలాన్. ఆగష్టు 15న విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా సినీ ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. సుమారు రూ. 40 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు,తమిళ,కన్నడలో మాత్రమే విడుదలైన తంగలాన్ ఇప్పుడు హిందీలో కూడా విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.గోల్డ్ హంట్ నేపథ్యంలో తంగలాన్ను తెరకెక్కించారు పా. రంజిత్. సౌత్ ఇండియా అభిమానులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్లో అడుగుపెట్టబోతుంది. తాజాగా డైరెక్టర్ పా.రంజిత్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్టర్‌తో ఈ విషయం తెలిపారు. 'బంగారు వీరుడు ఆగస్టు 30న ఉత్తర భారత దేశానికి వస్తున్నాడు. ఈ ఎపిక్ స్టోరీని చూసేందుకు సిద్ధంగా ఉండండి' అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.కథేంటి..?1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో జరిగిన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్).. తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. మరి తంగలాన్ చివరకు బంగారం కనిపెట్టాడా? అరణ్య, ఆరతితో ఇతడికి ఉన్న సంబంధమేంటి అనేదే మెయిన్ స్టోరీ. -
'తంగలాన్' మరో కోణంలో చూస్తే.. సోషల్ మీడియా రివ్యూస్
ఆగస్టు 15న రిలీజైన డబ్బింగ్ సినిమా 'తంగలాన్'. ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకొచ్చిన ఈ చిత్రానికి తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ తర్వాత తర్వాత మెల్లగా పికప్ అవుతోంది. 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్' ఫెయిలవడం కూడా దీనికి ప్లస్. రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌లా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఉండటంతో కొందరు తెగ నచ్చేస్తే.. మరికొందరికి మాత్రం అస్సలు నచ్చలేదు. అయితే 'తంగలాన్'ని మరో కోణంలో చూసిన కొందరు సోషల్ మీడియాలో తమదైన రివ్యూలు ఇచ్చారు. అలాంటి వాటిలో కొన్ని మీకోసం..(ఇదీ చదవండి: 'పుష్ప 2'కి పోటీగా రష్మిక నుంచే మరో సినిమా)'ఆత్మగౌరవంతో ఎలా బ్రతకాలో చెప్పేదే 'తంగలాన్' సినిమా. అలాగే మన సంస్కృతి, జీవన విధానాన్ని తెలియపరిచేలా లోతుగా అర్థం అయ్యేలా చాటి చెప్పిన దర్శకుడు పా.రంజిత్. మహిళలకు రవికలు పంచగానే అవి వేసుకుని ఊరంతా సంబరాలు జరుపుకొనేలా వచ్చే పాట 'మనకి మనకి'.. మన అమ్మలు, నాయనమ్మలు చిన్నతనంలో రోళ్లలో వడ్లు పోసి, దంచుతూ పాడుకునేలా సంగీతాన్ని అందించిన జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, తంగలాన్ బట్టలు వేసుకుంటే ఓర్వకుండా చింపిన మళ్ళీ సూది దారంతో కుట్టుకుని తిరిగి వేసుకోవడం ఇదే కదా ఆత్మ గౌరవంతో కూడిన చారిత్రక జీవన విధానం. -సతీశ్ పొనగంటి'తంగలాన్' సినిమా ఆలోచన నాకు చాలా నచ్చింది. దక్షిణాది భారతీయుల చరిత్రని చూపించాడు. అప్పటి పరిస్థితులని చాలా అద్భుతంగా చూపించాడు. అయితే కథలో వివరణ మొదలవగానే నాకెందుకో డిస్ కనెక్ట్ అయిపోయాను. తంగలాన్ చూస్తుంటే.. ఫిట్జ్ కరాల్డో సినిమా గుర్తొచ్చింది. ప్రస్తుతమున్న వాళ్లలో డేరింగ్ అండ్ ఇంపార్టెంట్ ఫిల్మ్ మేకర్ పా.రంజిత్. 'తంగలాన్' అస్సలు మిస్సవ్వొద్దు. -వెంకట సిద్ధారెడ్డి(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)కటిక దరిద్రుల ఆకలి పోరాటం- తంగలాన్... వాళ్లు పేదవాళ్ళు, కూటికి గతి లేని వాళ్ళు, మూల వాసులు, దళితులు, ఎండుగడ్డి పోచలు, మొలకు గోచీల వాళ్ళు.. భార్యలతో బిడ్డలతో అరణ్యాల్లో నడుస్తూ బంగారం అనే అంతుచిక్కని ఐశ్వర్యం వేటకు బయల్దేరుతారు. అటు ఒక పసిడి భూతం ఈ దరిద్రులను వెన్నాడుతూ వుంటుంది. ఇది ఒక పురాతన జానపద గాథ. నెత్తురూ కన్నీళ్ళూ కలిసి ప్రవహించిన కథ. ఆధునిక కెమెరాలతో, ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో వందల ఏళ్ళ క్రితం జరిగిన ఓ ఘాతుకాన్ని అంతే క్రూరంగా చూపించిన సాహసం పేరు 'తంగలాన్'. కొన్ని నిజజీవిత సంఘటనలు, కొంత కల్పన, పేదల వేదన కలిసిన తిరుగుబాటు సిద్ధాంతం- తంగలాన్.సర్పట్ట చూశారా? కాలా చూసే వుంటారు. ఇప్పుడు తంగలాన్! వీటిని తీసిన పా.రంజిత్ అనే వాడు మామూలు మనిషి కాదు. మహాదర్శకుడు. కన్నీటి కావ్యామృత రసావిష్కరణ తెలిసిన మాంత్రికుడు. మన కాలం వీరుడు. 'నేను అంబేద్కరిస్ట్ని' అని ప్రకటించుకున్న రంజిత్.. రొటీన్ రొడ్డకొట్టుడు చిల్లర ప్రచార సినిమాలు తీయడు. అతని ఆవేశానికో అర్థముంది. అతని ఆగ్రహానికో పద్ధతి ఉంది. అతని తిరుగుబాటుకో లక్ష్యముంది. తంగలాన్ తీయడం వెనుక వున్నది పరిశోధన, కమర్షియల్ ప్లాన్ మాత్రమే కాదు. అదో తపస్సు. చెక్కు చెదరని నిబద్ధత. ఓ సూపర్ హీరోకి గోచీ పెట్టి దుర్గమారణ్యాల్లో నడిపించిన దుస్సాహసం!కోలార్ బంగారు గనుల్ని మొట్టమొదట కనిపెట్టడానికి జరిగిన సాహస యాత్రలో చరిత్ర చూసిన కన్నీళ్ళనీ, రక్తపుటేర్లనీ, వీరుల చావునీ, ఆడవాళ్ళ నిస్సహాయతనీ ఒళ్ళు జలదరించేలా రికార్డు చేయడంలోని నిజాయితీ మనల్ని షాక్ చేస్తుంది. అటు అగ్రవర్ణ బ్రాహ్మణ దురహంకారం, ఇటు హృదయం లేని బ్రిటిష్ పాలకుల దౌర్జన్యం. దళిత బహుజనులకు వెనక తుపాకులూ, ముందు మొనదేలిన ఈటెలూ, బంగారం ఒక తీరని దాహం, దురాశ. ఇటు నిరుపేద తల్లుల బిడ్డల ఆకలి! ఇలాంటి ఒక మానవ మహావిషాదాన్ని డాక్యుమెంటరీగా తీస్తే చాలదు. నీరసంగా నడిచే కళాత్మక చిత్రంగా తీసినా కుదరదు. ఎఫెక్టివ్‌గా చెప్పాలంటే, కమర్షియల్ స్కీమ్తోనే కొట్టాలి. బలమైన బ్లాక్‌బస్టర్ టెక్నిక్‌తోనే చెలరేగిపోవాలి. ఆ ఎత్తుగడ ఫలించింది. పా.రంజిత్ గెలిచాడు. బీభత్సరస ప్రధానమైన ఓ చారిత్రక విషాదాన్ని మన కళ్ళముందు పరిచాడు. -తాడి ప్రకాష్ (ఇదీ చదవండి: ఆ దర్శకులపై లేని అటాక్ నా ఒక్కడి మీదే ఎందుకు?: హరీశ్ శంకర్) -
కేజీఎఫ్ బాటలో విక్రమ్ తంగలాన్
-
తంగలాన్ కోసం విక్రమ్ కష్టం.. మేకింగ్ వీడియో విడుదల
విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా తంగలాన్. ఆగష్టు 15న విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణిస్తుంది. మూడు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ. 40 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. అయితే, ఈ సినిమా మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఎప్పుడూ కూడా ఆలోచనాత్మకత సినిమాలను డైరెక్ట్ చేసే పా. రంజిత్.. ఇప్పుడు కూడా విక్రమ్‌తో పెద్ద ప్రయోగమే చేశాడు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో వచ్చి రికార్డులు బద్దలు కొట్టింది 'కేజీఎఫ్'. మళ్లీ అదే గోల్డ్ హంట్ నేపథ్యంలో తంగలాన్ను తెరకెక్కించారు పా. రంజిత్.తంగలాన్ మేకింగ్ వీడియో చూసిని ప్రేక్షకులు విక్రమ్‌ను ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో కొంతమేరకు మాత్రమే మేకింగ్ వీడియోలో చూపించారు. వైవిధ్య పాత్రలతో ఎప్పుడూ మెప్పించే చియాన్ విక్రమ్ 'తంగలాన్' కోసం కొత్త మేకోవర్‌లో దుమ్మురేపాడు. కేవలం విక్రమ్ కోసమే ఈ సినిమా చూడొచ్చు అనేలా వెండితెరపైన విజృంభించాడు. తంగలాన్ యాక్షన్ సీక్వెన్స్‌లలో బరిసెలతో, ఈటెలతో ఫైట్ సీన్స్‌లో అద్భుతంగా ఆయన నటించారు. ప్రేక్షకులను మెప్పించిన తంగలాన్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని తాజాగా విక్రమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ఈ సినిమా మేకింగ్ వీడియోను మీరూ చూసేయండి. -
'తంగలాన్' అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన విక్రమ్
విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా తంగలాన్. ఆగష్టు 15న విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణిస్తుంది. ప్రస్తుతం థియేటర్స్‌లలో రన్ అవుతున్న సినిమాల్లో తంగలాన్ కాస్త బెటర్ అంటూ నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. ఎప్పుడూ కూడా ఆలోచనాత్మకత సినిమాలను డైరెక్ట్ చేసే పా. రంజిత్.. ఇప్పుడు కూడా విక్రమ్‌తో పెద్ద ప్రయోగమే చేశాడు. ప్రేక్షకులను మెప్పించిన తంగలాన్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని తాజాగా విక్రమ్ ప్రకటించారు.పాన్ ఇండియా రేంజ్లో కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, జ్యోతి దేశ్ పాండే నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ ఇందులో కీలకమైన పాత్రలు పోషించారు. రెండురోజుల్లో బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 30 కోట్లకు వరకు కలెక్షన్స్ రాబట్టిన తంగలాన్ తాజాగా హైదరబాద్‌లో సక్సెస్‌మీట్ ఏర్సాటు చేశారు. అక్కడ విక్రమ్ ఇలా చెప్పుకొచ్చాడు. తంగలాన్ అనేది ఒక మట్టి సినిమా అని ఆయన పేర్కొన్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని బలంగా నమ్మానని ఆయన అన్నాడు. ఈ క్రమంలోనే 'తంగలాన్ 2' కూడా తీసుకొస్తామని విక్రమ్ ప్రకటించాడు. ఇదే విషయం గురించి దర్శకుడు పా. రంజిత్, నిర్మాత జ్ఞానవేల్‌రాజాతో ఈ విషయంపై మాట్లాడుకున్నామని ఆయన అన్నాడు. పా రంజిత్ కాస్త రిలాక్స్ అయ్యాక అయ్యాక పార్-ట్ 2 ప్రారంభిస్తామని తెలిపాడు.1850ల్లో ఆంగ్లేయుల పాలనా కాలంలో జరిగే కథాంశంతో తెరకెక్కిన తంగలాన్ సినిమా మాస్టర్పీస్లా చరిత్రలో నిలిచిపోతుందని స్టూడియోగ్రీన్ ప్రొడక్షన్ హౌస్ సీఈవో ధనుంజేయన్ చెప్పారు. ఆస్కార్ అవార్డు రేంజ్ వరకు ఈ సినిమాను తీసుకెళ్లాలని ఇప్పటికే అభిమానుల నుంచి విన్నపం అందుతుందని ఆయన అన్నారు. -
మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్.. ఫస్ట్ డే కలెక్షన్స్
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా టాలీవుడ్లో సినిమాల జాతర జరిగింది. ముఖ్యంగా మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాల మధ్యే బిగ్ ఫైట్ నడిచింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు సినిమాలకు కూడా మిక్సిడ్ టాక్ వచ్చింది. ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించేలా లేవని నెటిజన్ల నుంచి విమర్శలు అందుకున్నాయి. కోలీవుడ్ సినిమా 'తంగలాన్' కాస్త బాగుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. విక్రమ్ నటన కోసం అయినా సినిమా చూడాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.మిస్టర్ బచ్చన్ కలెక్షన్స్రవితేజ- హరీశ్ శంకర్ సినిమా మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద రూ.7.5 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ఈ కలెక్షన్లు అడ్వాన్స్ ప్రీమియర్ షోలతో కలిపి అని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మొదటిరోజు సుమారు రూ. 10 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబడుతుందని అందరూ అంచనా వేశారు. కానీ మిస్టర్ బచ్చన్ ఆ మార్క్ అందుకోలేకపోయిందని తెలుస్తోంది. దాదాపు రూ. 35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన మిస్టర్ బచ్చన్ ఆ టార్గెట్ రీచ్ అవుతాడా..? అనే సందేహాలు వస్తున్నాయి. సినిమా పట్ల దారుణమైన నెగటివ్ టాక్ రావడంతో బయర్స్‌కు నష్టాలు తప్పవని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్స్యంగ్ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించాడు. దాదాపు రూ. 60 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో విడుదలైన ఈ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదు. ఈ క్రమంలో మొదటిరోజు రూ. 12. 45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ట్రేడ్ వర్గాలు మాత్రం రూ. 10.40 కోట్లు మాత్రమే కలెక్షన్లు వచ్చినట్లు పేర్కొన్నాయి. మొత్తానికి కలెక్షన్ల పరంగా మిస్టర్ బచ్చన్ కంటే ఇస్మార్ట్ శంకర్ కాస్త బెటర్ అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మించారు.తంగలాన్ కలెక్షన్స్ప్రయోగాత్మక పాత్రలతో మెప్పించే విక్రమ్ తాజాగా తంగలాన్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటిరోజు రూ. 19.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. 1850ల్లో ఆంగ్లేయుల పాలనా కాలంలో జరిగే కథాంశంతో తెరకెక్కిన తంగలాన్ ఈ పోటీలో విజయం సాధించింది. సినిమా పట్ల పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అన్ని వర్గాల సినీప్రియులకు తంగలాన్ థ్రిల్ చేస్తాడు. చెన్నైలో మొత్తం 592 స్క్రీన్లలో తంగలాన్ ప్రదర్శించారు. 81 శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. తంగలాన్ తెలుగు వర్షన్ రూ. 2 కోట్ల వరకు రాబట్టింది. -
'తంగలాన్' సినిమా రివ్యూ
'అపరిచితుడు', 'ఐ' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన విక్రమ్.. సాహసోపేతమైన పాత్రలకు పెట్టింది పేరు. ఇప్పుడు అలానే 'తంగలాన్' అనే మూవీలో ఓ ఆటవిక తెగ మనిషిగా నటించాడు. టీజర్, ట్రైలర్‌తోనే డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అందివ్వబోతున్నామని ఫీల్ కలిగించారు. ఇప్పుడీ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చింది. ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అది 1850. బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తుంటారు. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్).. తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. మరి తంగలాన్ చివరకు బంగారం కనిపెట్టాడా? అరణ్య, ఆరతితో ఇతడికి ఉన్న సంబంధమేంటి అనేదే మెయిన్ స్టోరీ.ఎలా ఉందంటే?'దురాశ దుఃఖానికి చేటు'.. ఈ సామెత చాలాసార్లు వినే ఉంటాం. ఇదే పాయింట్‌తో తీసిన సినిమా 'తంగలాన్'. కేజీఎఫ్ సినిమా మీరు చూసే ఉంటారు. కోలార్ జిల్లాలోని ఓ చోట టన్నుల కొద్ది బంగారం దొరుకుతుంది. అయితే అదంతా ప్రస్తుతంలో జరిగిన కథలా తీశారు. 'తంగలాన్' మాత్రం ఏకంగా వందల ఏళ్ల క్రితం జరిగిన నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తీశారు.'తంగలాన్', అతడి కుటుంబం, చుట్టూ ఉన్న పరిస్థితులని పరిచయం చేస్తూ సినిమా మొదలుపెట్టడం వరకు బాగానే ఉంది. కొంతసేపటి తర్వాత తంగలాన్.. తన కూతురికి ఓ కథ చెప్పడం.. బంగారం కోసం తన తాత, నాగిని జాతి స్త్రీతో పోరాడటం లాంటివి చెబుతాడు. అయితే సినిమాలో వైవిధ్యముంది కానీ ఎక్కడ కూడా కనెక్ట్ కాలేకపోతాం. మొదటిది సుధీర్ఘంగా సాగే సన్నివేశాలైతే, రెండోది దర్శకుడు అసలేం చెప్పాలనుకున్నాడో ఎంతకీ అర్థం కాకపోవడం.ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలదే ట్రెండ్. అంత మాత్రాన నేల విడిచి సాము చేయడం కరెక్ట్ కాదు. ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా మూవీ తీయాలి. ఈ విషయంలో 'తంగలాన్' ఆమాద దూరంలో ఆగిపోయింది. దాదాపు రెండున్నర గంటల నిడివి.. కానీ నాలుగు గంటల చిత్రాన్ని చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కడో 18వ శతాబ్దంలో మొదలైన స్టోరీ కాస్త 5 శతాబ్దం దగ్గరకు వెళ్లి ఆగుతుంది. హీరోకి అప్పుడప్పుడు కలలో కొందరు మనుషులు కనిపిస్తుంటారు. ఇందుకు కారణాన్ని క్లైమాక్స్‌లో రివీల్ చేస్తారు. కానీ అప్పటికే ఎగ్జైట్మెంట్ చచ్చిపోయింటుంది.ఇందులో హీరోని పల్లెటూరిలో పనిచేసే వాడిగా తొలుత చూపిస్తారు. కొన్నిసీన్ల తర్వాత ఇతడికి బ్రిటీషర్ల మాట్లాడిన ఇంగ్లీష్ చాలా సులభంగా అర్థమైపోతుంది. ఇక్కడ లాజిక్ మిస్సయిపోయారు. అలానే వర్ణ, కుల వివక్ష గురించి సినిమాలో అక్కడక్కడ చూపించిన సీన్లు బాగున్నాయి.ఎవరెలా చేశారు?తంగలాన్‌గా విక్రమ్ తప్ప ఎవరూ ఊహించలేం! ఎందుకంటే ఈ పాత్రలో అలా అదరగొట్టేశాడు. మధ్యలో కొన్ని సీన్లలో తప్పితే అసలు ఒంటిపై బట్టలే ఉండవు. మేకప్ కూడా ఏం ఉండదు. ఇలాంటి పాత్రని టాలీవుడ్లో కొందరు హీరోలు.. జీవితంలో చేయలేరేమో! తంగలాన్ భార్యగా చేసిన మలయాళ నటి పార్వతి తిరువత్తు.. ఉన్నంతలో ఓకే. నాగిని జాతి నాయకురాలు ఆరతిగా మాళవిక మోహనన్ వేరే లెవల్. స్క్రీన్‌పై ఆమె కనిపిస్తుంటే భయమేస్తుంది. మిగిలిన పాత్రధారులు కష్టాన్ని కూడా మర్చిపోలేం.టెక్నికల్‌గా చూసుకుంటే 'తంగలాన్' బ్రిలియంట్ మూవీ. ఆర్ట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్స్ ప్రాణం పెట్టేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ తన సంగీతంతో సినిమాని బాగానే ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మిగిలిన విభాగాలతో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడింది. కాకపోతే ఈ తరహా మూవీస్ అందరికీ నచ్చవు. డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే వాళ్లకు 'తంగలాన్' మంచి ఆప్షన్. ఫైనల్‌గా చెప్పొచ్చేది ఏంటంటే కష్టం కనిపించింది కానీ చాలా సాగదీత అయిపోయింది!-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
కోర్టు ఆదేశాలు పాటించిన నిర్మాత.. తంగలాన్‌కు లైన్ క్లియర్..!
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తాజాగా నటించిన భారీ యాక్షన్ చిత్రం తంగలాన్. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు హీరోయిన్లుగా నటించారు. కర్ణాటకలోని కేజీఎఫ్ గనుల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం విక్రమ్ ఆటవిక జాతికి చెందిన పాత్రలో మెప్పించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్లో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు.అయితే రిలీజ్‌కు తంగలాన్ నిర్మాతకు ఇబ్బందులు ఎదురు కావడంతో విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలోనే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నిర్మాత కేఈ జ్ఞానవేల్ రూ.1 కోటి రూపాయలు డిపాజిట్ చేశారు. తాజాగా తంగలాన్ రిలీజ్‌కు లైన్ క్లియర్ అయింది. దీంతో విక్రమ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాకుండా సూర్య హీరోగా నటిస్తోన్న కంగువా చిత్రం విడుదలకు ముందు కూడా కోటి రూపాయలు డిపాజిట్ చేయాలని నిర్మాతకు సూచించింది. కాగా.. గతంలో సుందర్‌దాస్ అనే వ్యక్తికి చెల్లించాల్సి డబ్బుల విషయంలో ఆయన కుటుంబం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే..గతంలో అర్జున్‌లాల్ సుందరదాస్ అనే వ్యక్తితో కలిసి నిర్మాత జ్ఞానవేల్ రాజా రూ.40 కోట్లతో ఓ సినిమా నిర్మించాలని అనుకున్నారు. అయితే ప్రీ-ప్రొడక్షన్‌కి ఖర్చులకు గానూ స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్థకు సుందర్‌దాస్ రూ.12.85 కోట్లు చెల్లించారు. తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు రావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి సుందర్‌దాస్ తప్పుకున్నాడు. అయితే అందులో కేవలం రూ.2.5 కోట్లు మాత్రమే తిరిగి వచ్చాయి. ఆ తర్వాత ఆయన మరణించడంతో మిగిలిన రూ.10.35 కోట్ల కోసం సుందర్‌దాస్ కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు.అయితే ఈ కేసు గురించి నిర్మాత కేఈ జ్ఞానవేలు మాట్లాడుతూ... మూడు తమిళ సినిమాల హిందీ డబ్బింగ్ హక్కులకు ఇవ్వాల్సిన డబ్బుకు బదులుగా.. ఆ రూ.12.85 కోట్లు ఇచ్చాడని తెలిపారు. అంతే కానీ తమకు ఎలాంటి డబ్బు ఇవ్వలేదని చెప్పారు. కానీ గ్రీన్ స్టూడియోస్ తమకు రూ.10.25 కోట్లను 18 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ అర్జున్ లాల్ సుందర్ దాస్ కుటుంబం కోర్టులో దావా వేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టినా ధర్మాసనం నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా సినిమాల రిలీజ్‌కు ముందు కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. -
విక్రమ్'తంగలాన్' ట్విటర్ రివ్యూ
'అపరిచితుడు' తర్వాత తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన తమిళ హీరో విక్రమ్. కాకపోతే ఈ మధ్య సరైన సినిమాలు పడట్లేదు. ప్రయోగాలు చేస్తున్న తెలుగు ఆడియెన్స్ కి ఎక్కట్లేదు. అయినా సరే మరో ఎక్స్పరిమెంట్ పాత్రతో వచ్చేశాడు. అదే 'తంగలాన్'. కర్ణాటకలోని కేజీఎఫ్ బంగారు గనుల నేపథ్యంలో ఈ సినిమా తీశారు.ఇందులో విక్రమ్ ఆటవిక జాతికి చెందిన వ్యక్తిగా కనిపించనున్నాడు. మాళవిక మోహనన్, పార్వతి తిరువత్తు హీరోయిన్లుగా నటించారు.పా.రంజిత్ దర్శకత్వం వహించిన 'తంగలాన్' షోలు ఆల్రెడీ థియేటర్లలో పడ్డాయి. చూసిన ప్రతి ఒక్కరూ యాక్టింగ్, డైరెక్షన్, సంగీతం అదిరిపోయాయని మెచ్చుకుంటున్నారు. విజువల్స్ కూడా కేక పుట్టించేలా ఉన్నాయని చెబుతున్నారు. విక్రమ్ తన కెరీర్ లోనే బెస్ట్ మూవీని ప్రేక్షకులకు అందించాడని ఆకాశానికెత్తేస్తున్నారు.First half over 💥Goosebumps Alert 😳😩@chiyaan Anna carrier best acting flim 🥵@beemji Nov cook panniruka na 🥶@MalavikaM_ Acting and character payangaram mam 😱#ChiyaanVikram#Thangalaan pic.twitter.com/iuWHpxiczI— Dΐcͥapͣrͫΐ☢ 🥃 (@Sathees29688731) August 15, 2024BRUTAL BRUTAL BRUTAL @beemji GV Prakash bgm 👌#Thangalaan pic.twitter.com/uDne87litZ— Munna Bhayya (@Nayan_Tarse) August 15, 2024#Thangalaan 🔥🔥🔥🔥 pic.twitter.com/65s5540gT0— Pravendra Sathasivam (@PravendraSatha1) August 15, 2024#Thangalaan Review 👌 pic.twitter.com/wTkZ1Bgntl— T F C (@TFC_Back) August 15, 2024#Thangalaan @chiyaan First Half : 4/5 🔥Second Half : 4.9/5 🔥🔥#Best: 1. @chiyaan Acting 5/5 2. @beemji Direction 🔥🔥🔥3. @gvprakash 🔥🔥🔥🔥Award - Worthy film100% தியேட்டர்ல தாராளமா பாக்கலாம்... கிளைமேக்ஸ் செம்ம.. 😍 pic.twitter.com/8pZe4n1ocD— Magizh Amudhan (@Amuthan1015) August 15, 2024What a Blockbuster 🔥 🔥 🔥 #Thangalaan 🌟 🌟 🌟 🌟/5Literally kolar gold Mines Scences 🥵🥵🥵 Plz Do watch in Theatres Only, Visual treat 💥🔥#ChiyaanVikram Acting 👏👏 @gvprakash Semma Mass BGM 💥💥 @beemji great work 🔥#ThangalaanReview pic.twitter.com/qjpPeFlKIs— ✒சொல் வித்துவான் (@palanikannan04) August 15, 2024BRUTAL BRUTAL BRUTAL @beemji GV Prakash bgm 👌#Thangalaan pic.twitter.com/uDne87litZ— Munna Bhayya (@Nayan_Tarse) August 15, 2024#THANGALAANSo far the Good Film in 2024 for KW 👏 @chiyaan deserves a awards for his acting ; An absolute BANGER from @gvprakash 🔥 All Kudos goes to @beemji sir , as usual your direction was top notch . Second Half worked out well ; Good Screenplay 🌟🌟🌟🌟Blockbuster pic.twitter.com/6GJIlKAzFi— Lets X OTT CINEMA (@LetsXOtt_Cinema) August 15, 2024 -
ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుంది: జీవీ ప్రకాశ్‌కుమార్
‘‘టెక్నాలజీని మనం ఎంతవరకూ సద్వినియోగం చేసుకుంటున్నాం అన్నది ముఖ్యం. కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను ఉపయోగించి కొందరు ప్రముఖ సంగీత దర్శకులు చేసిన సంగీతం, పాటలు శ్రోతలను ఎందుకు మెప్పించలేకపోయాయి? అనే విషయాలపై నేను మాట్లాడను. కానీ సినిమా స్క్రిప్ట్, అందులో నుంచి వచ్చే సందర్భాలపైనే సంగీత దర్శకులు ఇచ్చే సంగీతం ఆధారపడి ఉంటుంది’’ అన్నారు సంగీత దర్శకుడు–నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్. విక్రమ్ హీరోగా నటించిన తాజా పీరియాడికల్ ఫిల్మ్ ‘తంగలాన్’. పా. రంజిత్ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం రేపు (గురువారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జీవీ ప్రకాశ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘తంగలాన్’ కథ ప్రధానంగా ట్రైబల్స్ నేపథ్యంలో ఉంటుంది. దాంతో ఆఫ్రికన్, ఆస్ట్రేలియన్ ట్రైబ్స్‌కు చెందిన సంగీతాన్ని కూడా పరిశీలించాను.సినిమా సంగీతానికి, ట్రైబల్స్ సంగీతానికి మధ్యలో నేను ఓ వారధిగా ఉంటూ ఈ సినిమా మ్యూజిక్‌ను ప్రేక్షకులకు చేరువ చేయడం సవాల్‌గా అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంటుంది. విక్రమ్‌గారితో ఇది నా మూడో సినిమా. నా సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘అసురన్, ఆకాశం నీ హద్దురా!’ లాంటి మ్యాజిక్ ‘తంగలాన్’తో రిపీట్ అవుతుందని అనుకుంటున్నాను’’ అని అన్నారు. -
విశాఖలో ‘తంగలాన్’ టీమ్ సందడి (ఫొటోలు)
-
తంగలాన్ నుంచి 'పైరు కోత' సాంగ్ విడుదల
చియాన్ విక్రమ్ ఫ్యాన్స్ తంగలాన్ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే ట్రైలర్‌ను విడుదల చేసిన టీమ్ తాజాగా మరో పాటను రిలీజ్ చేసింది. జి. వి. ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆగష్టు 15న విడుదల కానున్న తంగలాన్ నుంచి 'పైరు కోత' సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. భాస్కర భట్ల రచించిన ఈ సాంగ్‌ను నారాయణన్ రవిశంకర్, రమ్య బెహరా ఆలపించారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
విక్రమ్‌కు అవమానకరమైన ప్రశ్న.. సమాధానం అదుర్స్
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన తంగలాన్ సినిమా ప్రమోషనల్ టూర్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 15న విడుదల కానున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఒక ప్రెస్ మీట్లో విక్రమ్‌ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఎదురైనా తనదైన స్టైల్లో చెప్పి అందరినీ మెప్పించాడు.కోలీవుడ్‌లో సూర్య,అజిత్, విజయ్ వంటి స్టార్స్‌కు ఉన్నంత రేంజ్లో మీకు అభిమానులు ఉన్నారా..? అని ఒక పాత్రికేయుడు అడిగాడు. అందుకు విక్రమ్ ఇలా రియాక్ట్ అయ్యాడు.నా ఫ్యాన్స్ బలం ఎంటో తెలుసుకోవాలంటే..కోలీవుడ్‌లో విజయ్, సూర్య, అజిత్‌లకు ఉన్నంత అభిమానులు మీకు లేరు కదా అంటూ విక్రమ్‌పై విలేకరుల వేసిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుంది. 'నా అభిమానుల గురించి మీకు ఏమీ తెలియదు అనుకుంటున్నాను. సినీ అభిమానులంతా నా అభిమానులే. అందుకు రుజువు కావాలంటే ఆగష్టు 15న థియేటర్‌కి రండి.. సినిమా చూసి నా అభిమానుల బలం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడండి. అప్పుడు మీకే తెలుస్తుంది. టాప్ 3, టాప్ 4, టాప్ 5 అంటూ నాకు కొలమానం లేదు. ఏది ఏమైనా ఆరోజు మీరు థియేటర్‌కి వస్తారని ఆశిస్తున్నాను. నా అసిస్టెంట్‌కి మీ నంబర్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఈ టాపిక్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. మీరు థియేటర్‌కు వచ్చి నా అభిమానులను చూస్తే.. ఏదోరోజు ఆ స్టార్స్‌ను కడా ఇదే ప్రశ్న అడుగుతారు. నా అభిమానుల గురించి మీకు ఏమీ తెలియదు కాబట్టే ఇలాంటి ప్రశ్న అడిగారు. నాకు టాప్ హీరో లిస్ట్‌లో ఉండటం ముఖ్యం కాదు. ప్రేక్షకులే ముఖ్యం. ధూల్, సామి లాంటి సినిమాలు ఎలా తీయాలో నాకు తెలుసు, తంగలాన్ కోసం నా బెస్ట్ ఇచ్చాను. నా విషయానికొస్తే అందరూ ఏదో ఒక విధంగా నా అభిమానులే.' అని విక్రమ్ బదులిచ్చారు.ఇతర హీరోల అభిమానులు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. అదే, విక్రమ్‌ను అయితే ఎవరూ ద్వేషించేవారు లేరని ఆ వేదిక మీద చర్చజరిగింది. విక్రమ్ భారీ స్టార్ కాదనే సూచనపై అభిమానులు విరుచుకుపడ్డారు. ఒక అభిమాని ఇలా వ్యాఖ్యానించాడు, చియాన్ లాంటి లెజెండ్‌కు చాలా అసహ్యకరమైన, అమర్యాదకరమైన ప్రశ్న వేస్తారా అంటూ తమిళ జర్నలిస్ట్‌పై ఫైర్ అయ్యాడు. తంగలాన్ సినిమా కోసం అతను డీ గ్లామర్ పాత్రలో కనిపించాడు. అంతే కాకుండా సుమారు 15కేజీల బరువు తగ్గాడు. సినిమా కోసం ఎన్నో కఠినమైన కష్టాలను అనుభవించాడు.. అసలు సిసలైన స్టార్ అంటే విక్రమ్ అని, దానిని మీడియా ప్రతినిధులు గుర్తించకపోవడం ఆపై ఇలా అసహ్యకరమైన ప్రశ్నలు అడగడం ఏంటీ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.Q: You are giving the best in everytime, but you don't have fans like Ajith, Suriya etc?Chiyaan: I know to do commercial films like Saamy & Dhool. But I want to bring cinema to next level like #Thangalaan❤️🔥And Final question from Chiyaan😂💥pic.twitter.com/CsnPBnNCrV— AmuthaBharathi (@CinemaWithAB) August 11, 2024 -
'తంగలాన్' మూవీ'.. బెజవాడలో సందడి చేసిన టీమ్!
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన భారీ యాక్షన్ చిత్రం తంగలాన్. పా రంజిత్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ మాళవిక మోహనన్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో చిత్రయూనిట్ అంతా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఏపీలోని విజయవాడలో తంగలాన్ చిత్రబృందం సందడి చేసింది. బెజవాడ గాంధీనగర్‌లోని ఫేమస్ అయిన బాబాయ్ హోటల్లో టిఫిన్ చేశారు. దీంతో సెలబ్రిటీలతో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. హీరో విక్రమ్, మాళవికతో పాటు నిర్మాత జ్ఞానవేల్ రాజా సైతం ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. కాగా.. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, పోస్టర్లకు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ విక్రమ్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 15న ఇండిపెండెన్స్ సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. #Thangalaan 💥Chiyaan at Vijaywada's Babai Hotel for Breakfast!pic.twitter.com/ID4sppnPSJ— Christopher Kanagaraj (@Chrissuccess) August 12, 2024 -
'కాంతార' హీరో ఎమోషనల్ పోస్ట్.. ఆనందం పట్టలేక!
'కాంతార' ఫేమ్ హీరో రిషబ్ శెట్టి ఆనందాన్ని ఆపుకోలేకపోయాడు. దాదాపు 24 ఏళ్ల తర్వాత తన కల నిజమైందని చెబుతూ తెగ ఎగ్జైట్ అయిపోయాడు. తమిళ హీరో విక్రమ్‌ని కలుసుకున్న సందర్భంగా ఇదంతా చెప్పుకొచ్చాడు. ఇంతకీ అసలు వీళ్లు ఎక్కడ కలుసుకున్నారు? రిషబ్ ఇంకేమన్నాడు?(ఇదీ చదవండి: వయనాడ్ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే?)'నటుడిగా నేను కెరీర్ ప్రారంభించడానికి విక్రమ్ స్ఫూర్తి. ఆయన్న కలవడం నా 24 ఏళ్ల కల. ఈ రోజు నా దేవుడిని కలిశాను. ప్రస్తుతం ఈ భూమ్మీద అదృష్టవంతుడిని నేనే అనిపిస్తోంది. నాలాంటి ఎంతోమంది ఆర్టిస్టుల్లో ఆయన స్ఫూర్తి నింపుతున్నారు. ఈ విషయంలో ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. లవ్ యూ విక్రమ్ సర్' అని రిషబ్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి భావోద్వేగానికి లోనయ్యాడు.విక్రమ్ నటించిన 'తంగలాన్' ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ జరగ్గా.. తాజాగా బెంగళూరు వెళ్లారు. ఈ క్రమంలోనే రిషబ్.. విక్రమ్‌ని కలిశాడు. తన సంతోషాన్ని ఫొటోలు, పోస్ట్ రూపంలో షేర్ చేసుకున్నాడు.(ఇదీ చదవండి: బంగ్లాదేశ్ అల్లర్లలో విషాదం.. యంగ్ హీరోని కొట్టి చంపారు!) View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
రూ.750 జీతం, కాళ్లకు 23 ఆపరేషన్లు.. 'తంగలాన్' విక్రమ్ క్లిష్ట ప్రయాణం
కోలీవుడ్ హీరో విక్రమ్ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టక ముందు తాను ఎదుర్కొన్న కష్టాలను పంచుకున్నారు. విక్రమ్- పా రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన తంగలాన్ మ్యూజిక్ లాంచ్ కార్యక్రమం చెన్నైలో జరిగింది. అక్కడ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తంగలాన్ లాంటి సినిమా చేయడానికి చాలా ధైర్యం కావాలని ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు విక్రమన్‌ను ప్రశంసించారు. ఈ క్రమంలో సినిమా గురించి విక్రమ్ ఇలా చెప్పుకొచ్చారు.'ఈ సినిమాలో పనిచేసిన సహాయ దర్శకులకు కృతజ్ఞతలు. నటుడు పశుపతితో ఇది నా ఆరో సినిమా. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆయన పాత్ర గురించి పెద్దగా చర్చ జరుగుతుంది. మాళవిక ఈ సినిమాలో ఆర్తి పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. మలయాళ నటి పార్వతితో నటించాలని చాలాసార్లు అనుకున్నాను. ఈ సినిమాలో ఆమెతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా అందరికీ పెద్ద హిట్ అవుతుంది.సేతు, శివ పుత్రుడు, అపరిచితుడు వంటి సినిమాల్లో చాలా కష్టపడి ఆయా పాత్రలను పోషించాను. కానీ తంగలాన్‌తో పోలిస్తే ఆ పాత్రలు కేవలం 8 శాతం మాత్రమే. తంగలాన్ ప్రపంచంలో మీరు తప్పకుండా సంతోషిస్తారు. ఈ పాత్ర మనకు బాగా కనెక్ట్ అవుతుంది. నా చిన్నతనం నుంచే నటుడిని కావాలని కలలు కన్నాను. ఈ క్రమంలో 8వ తరగతి వరకు బాగా చదివాను. ఆ తర్వాత నటించాలనే కోరికతో పెద్దగా చదువుకోలేదు. అదృష్టవశాత్తూ పాస్ అయి కాలేజీలో చేరాను. అక్కడ నాటకంలో నటిస్తున్నప్పుడు ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. కానీ ఆ రోజు నా కాలు విరిగింది. దీంతో సంవత్సరం పాటు నేను మంచం మీద ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 23 ఆపరేషన్స్ జరిగాయి. నేను నడుస్తున్నానని డాక్టర్ చెప్పినప్పుడు మా అమ్మ ఏడ్చేసింది. కానీ, నేను తప్పకుండా నడుస్తానని చెప్పాను. సుమారు పదేళ్ల పాటు ఆ సమయంలో కష్టపడ్డాను. నా కుటుంబానికి అండగా ఉండేందుకు రూ.750 జీతానికి పనికి వెళ్లాను. అలాంటి సమయంలో కూడా సినిమాల్లో నటించాలనే తపనను మాత్రం వదల్లేదు. దీంతో కొన్ని అవకాశాలు వచ్చాయి. అలా నా పోరాటం సాగించడంతోనే ఈరోజు మీ ముందు ఇలా ఉన్నాను. ఒకవేళ అప్పుడు సక్సెస్ కాకపోతే సినిమా అవకాశాల కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉండేవాన్ని. అనుకున్నది సాధించాలంటే కష్టం తప్పదని గుర్తుపెట్టుకోండి. అంటూ విక్రమ్ చెప్పుకొచ్చారు. -
Vikram: తంగలాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
తంగలాన్ సర్ప్రైజ్ చేస్తుంది
‘‘తంగలాన్ ’ తమిళ సినిమానో, తెలుగు సినిమానో కాదు. ఓ మంచి సినిమా. నా మనసుకు దగ్గరైన సినిమా. ‘తంగలాన్ ’ చూసి ఆడియన్స్ సర్ప్రైజ్ అవుతారు. ఈ సినిమాలో ఎమోషన్స్, అడ్వెంచర్స్, మెసేజ్.. ఇలా చాలా అంశాలు ఉన్నాయి’’ అని విక్రమ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘తంగలాన్ ’. పార్వతీ తిరువోతు, మాళవికా మోహనన్ హీరోయిన్స్. పా. రంజిత్ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘తంగలాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విక్రమ్ మాట్లాడుతూ–‘‘వందేళ్ల క్రితం జరిగిన కథ ‘తంగలాన్’. ‘మద్రాస్’ సినిమా నుంచి పా.రంజిత్‌తో వర్క్ చేయాలనుకుంటే ‘తంగలాన్ ’తో కుదిరింది. నాకు మంచి రోల్ ఇచ్చిన రంజిత్‌కు థ్యాంక్స్. జ్ఞానవేల్ రాజాగారు బాగా స΄ోర్ట్ చేశారు. నేను గతంలో నటించిన పాత్రల్ని (శివపుత్రుడు, నాన్న, సేతు, అపరిచితుడు, ఐ..) ఈ వేదికపై చూడగానే భావోద్వేగంగా అనిపించింది. ఇలాంటి విభన్నమైన పాత్రలు ఇంకా చేయాలనే స్ఫూర్తి కలిగింది’’ అన్నారు. పా. రంజిత్ మాట్లాడుతూ–‘‘తంగలాన్ ’ రెగ్యులర్ మూవీ కాదు. దేశ స్వాతంత్య్రానికి పూర్వం ఉంటుంది. విక్రమ్‌గారు అద్భుతంగా నటించారు. ఆయన దొరకడం నా అదృష్టం. ‘తంగలాన్ ’ ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే ్రపాణం. ‘తంగలాన్ ’ని స΄ోర్ట్ చేయండి. ఆగస్టు 15న విడుదలవుతున్న ‘మిస్టర్ బచ్చన్ ’, ‘డబుల్ ఇస్మార్ట్’, ‘ఆయ్’ వంటి సినిమాలూ విజయాలు సాధించాలి’’ అన్నారు నిర్మాత జ్ఞానవేల్ రాజా. ‘‘ఈ చిత్రంలో ‘గంగమ్మ’ పాత్రలో నటించాను. విక్రమ్‌లాంటి కో స్టార్‌ని నేను ఇప్పటి వరకూ చూడలేదు’’ అన్నారు పార్వతి తిరువోతు. ‘‘విక్రమ్‌గారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకున్న నా కల ‘తంగలాన్ ’తో నిజమైంది’’ అన్నారు మాళవికా మోహనన్ . ‘‘ఇదొక అద్భుతమైన మూవీ’’ అన్నారు నటుడు డేనియల్. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, స్టూడియోగ్రీన్ ఎగ్జిక్యూటివ్ సీఈవో ధనుంజయన్ , నిర్మాతలు ‘మధుర’ శ్రీధర్, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, ఎస్కేఎన్ , దర్శక–నిర్మాత సాయిరాజేష్, దర్శకుడు కరుణకుమార్, మైత్రీ మూవీస్ శశి మాట్లాడారు. -
వైరల్ అవుతున్న 'తంగలాన్' వార్ సాంగ్
చియాన్ విక్రమ్ ఫ్యాన్స్ తంగలాన్ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా విజయంపై నమ్మకాన్ని కలిగించాయి. తాజాగా తంగలాన్ వార్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. జి. వి. ప్రకాష్ అందించిన మ్యూజిక్ ఈ పాటకు హైలెట్ కానుంది. చంద్రబోస్ రచించిన ఈ సాంగ్‌ను శరత్ సంతోష్ ఆలపించారు.భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా ఇండిపెండెన్స్ డే ఆగష్టు 15న విడుదల కానుంది. పా. రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మాళవికా మోహనన్ నెగటివ్ రోల్ పోషిస్తుండగా.. పార్వతి తిరువోతు, పశుపతి, సంపత్ రామ్ వంటి వారు కీలక పాత్రలలో కనిపించనున్నారు. నిర్మాత కేఈ జ్ఞానవేల్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. -
కేరళకు అండగా తమిళ హీరోలు.. భారీ మొత్తంలో సాయం
కేరళలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన వారికి అండగా కోలీవుడ్ హీరోలు నిలిచారు. మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా పడుతున్న వర్షాలకు కొండ చరియలు విరిగిపడి పలు గ్రామాలపై పడటంతో సుమారు 200 మంది మరణించారు. అయితే, 250 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని అక్కడి ప్రభుత్వం తెలుపుతుంది. ముఖ్యంగా వయనాడ్, తిరువనంతపురం ప్రజలు తీరని నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసిన నేలకూలిన భవనాలు, బురదతో నిండిన వీధులు మాత్రమే కనిపిస్తున్నాయి. కేరళలో ఇటువంటి పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. అయితే, తాజాగా కోలీవుడ్ టాప్ హీరోలు ఇద్దరూ కేరళకు తమ వంతు అండగా నిలిచారు.తమిళ స్టార్ చియాన్ విక్రమ్, కేరళలో సంభవించిన విపత్తుపై ఉదారంగా స్పందించినందుకు అభిమానుల నుంచి విస్తృతంగా ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్రంలో జరిగిన విషాద సంఘటనలను చూసి చలించిన విక్రమ్ సహాయక చర్యల కోసం తన వంతుగా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 20 లక్షలు అందించారు. కేరళ ప్రజలతో తనకున్న అనుబంధాన్ని ఆయన చాటుకున్నాడు.దేశంలో ఎక్కడ విపత్తు వచ్చిన సాయం చేయడంలో ముందు ఉండే దంపతులు సూర్య- జ్యోతిక. తాజాగా వీరిద్దరూ కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షలు ప్రకటించారు. సూర్య చేసిన సాయానికి ఆయన అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు. కేరళలో ప్రస్థుత పరిస్థితిని చూస్తుంటే తనను ఎంతో కలచి వేసిందని సూర్య తెలిపారు. కేరళ రెస్క్యూ ఆపరేషన్ ద్వారా సాయం చేస్తున్న వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ ఘటనలో ప్రమాధానికి గురైన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆయన ఆశించారు. -
తంగలాన్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే..
కోలీవుడ్ సినీ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విక్రమ్ ఫ్యాన్స్ తంగలాన్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా ఇండిపెండెన్స్ డే ఆగష్టు 15న విడుదల కానుంది. పా. రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో మాళవికా మోహనన్ నెగటివ్ రోల్ పోషిస్తుండగా.. పార్వతి తిరువోతు, పశుపతి, సంపత్ రామ్ వంటి వారు కీలక పాత్రలలో కనిపించనున్నారు. నిర్మాత కేఈ జ్ఞానవేల్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.కోలార్ బంగారు గనుల నేపధ్యంలో, అక్కడ పని చేసే కార్యికుల ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్ర విడుదల తేదీని పలు మార్లు వాయిదా వేస్తూ వచ్చారు. కొద్దిరోజుల క్రితం ఆగస్ట్ 15వ తేదీన తమిళం,తెలుగు భాషల్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తంగళాన్ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డు ఇచ్చింది. ఈ సినిమా 2 గంటల 37 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.విక్రమ్, మాళవికా మోహనన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని ట్రైలర్‌తోనే తెలుస్తోంది. వారిద్దరి మేకప్ కోసమే చాలా సమయం తీసుకున్నట్లు పలుప ఇంటర్వ్యూలలో చెప్పిన విషయం తెలిసిందే. సినిమా కోసం ఎంతటి కష్టమైన భరించే విక్రమ్ తంగలాన్ కోసం 35 కేజీలు తగ్గారట. ఈ సినిమాలో మరో విశేషం విక్రమ్‌కు ఎలాంటి డైలాగ్స్ ఉండకపోవడమని తెలుస్తోంది. అభిమానుల అంచనాలకు మించి తంగలాన్ చిత్రాన్ని డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కించాడు. ఆగష్టు 15న తంగలాన్ ప్రపంచంలో అద్భుతాలు ఉంటాయని అభిమానులు అంచనాలతో ఉన్నారు. -
టార్గెట్ పంద్రాగస్ట్.. గెలుపు జెండా ఎగరేసేది ఎవరు?
వరుసగా సెలవులు వస్తే సినిమాలకు పండగే పండగ. ఆగస్ట్ రెండో వారం అలాంటి పండగే కానుంది. ఆగస్ట్ 15 గురువారం... స్వాతంత్య్ర దినోత్సవం కాబట్టి గవర్నమెంట్ హాలిడే. ఆ రోజుతో పాటు శుక్ర, శని, ఆదివారాల వసూళ్లు రాబట్టుకోవచ్చు. సోమవారం రక్షా బంధన్... అది కూడా కలిసొస్తుంది. అందుకే పంద్రాగస్ట్ టార్గెట్‌గా థియేటర్స్‌లో గెలుపు జెండా ఎగురవేయడానికి కొందరు నిర్మాతలు తమ చిత్రాలను ఆ తేదీన విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.మిస్టర్ బచ్చన్ రెడీరవితేజ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్‌ల సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14 లేదా 15న థియేటర్స్‌లోకి రానుందని సమాచారం.కేజీఎఫ్ కథకేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్’. 18వ శతాబ్దం నేపథ్యంలో పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటించారు. పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో విడుదల కాలేదు. అలా వాయిదా పడి ఫైనల్‌గా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. కేజీఎఫ్‌లోని బంగారం కోసం జరిగే అక్రమ తవ్వకాలకు, అక్కడి ఓ గిరిజన తెగకు ఉన్న సంబంధం ఏంటి? అనేది ఈ చిత్రం ప్రధానాంశం. ఇందులో ఆ తెగ నాయకుడిగా విక్రమ్ కనిపిస్తారు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం తెలుగులోనూ ఆగస్ట్ 15నే రిలీజ్ కానుంది. డబుల్ ఎనర్జీపంద్రాగస్ట్కు థియేటర్స్‌లోకి వచ్చేందుకు డబుల్ ఎనర్జీతో రెడీ అయ్యాడు ‘డబుల్ ఇస్మార్ట్’. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కింది. సీక్వెల్లో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించగా, సంజయ్ దత్, అలీ కీలక పాత్రధారులు. పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఓ సీబీఐ ఆఫీసర్ మెమొరీని ఓ సైన్స్ చిప్ సాయంతో కిరాయి హంతకుడు శంకర్ (రామ్) మొదడులోకి ట్రాన్స్‌ఫార్మ్ చేస్తారు. ఆ తర్వాత శంకర్ జీవితం ఏ విధంగా ప్రభావితమైంది? అనే కోణంలో ‘ఇస్మార్ట్ శంకర్’ కథ సాగిన విషయం తెలిసిందే. ఈ కథకు కొనసాగింపుగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.చిన్న కథ కాదు‘అమ్మ టెన్త్ ఫెయిల్... కొడుకు ఫిఫ్త్ ఫెయిల్... చిన్న కథ కాదు..’ అనే డైలాగ్ ‘35: చిన్న కథ కాదు’ సినిమాలోనిది. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ఇది. నంద కిశోర్ ఈమాని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రసాద్ (విశ్వతేజ్), సరస్వతి (నివేదా థామస్) భార్యాభర్తలు. వీరి కొడుక్కి 35 పాస్ మార్కులు కూడా రావు. దీంతో వాళ్ల కుటుంబం కాస్త నిరాశకు లోనవుతుంది. నిజంగా... 35 పాస్ మార్కులు ముఖ్యమా? ఆ ఊర్లోని మాస్టర్ (ప్రియదర్శి) వల్ల సరస్వతి కొడుకు పడిన ఇబ్బందులు ఏంటి? అనే అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.స్ఫూర్తిదాయక పోరాటం కీర్తీ సురేష్ నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రఘుతాత’. తన గ్రామం కోసం కయల్విళి అనే ఓ యువతి చేసే స్ఫూర్తిదాయక పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. సుమన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బేనర్ నిర్మించింది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్‌పై మరో అప్డేట్ రాలేదు. మరి.. ఆగస్టు 15 బరిలో కీర్తీ సురేష్ ‘రఘుతాత’ సినిమా ఉంటుందా? లేదా అనేది చూడాలి. ఈ తమిళ చిత్రం తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. మేం ఫ్రెండ్సండి....మేం ఫ్రెండ్సండి అంటూ థియేటర్స్‌లోకి వస్తున్నారు కార్తీక్, సబ్బు, హరి. మరి... వీళ్ల కథ ఏంటి? అనేది ఆగస్టు 15న థియేటర్స్‌లో తెలియనుంది. ఈ చిత్రంలో కార్తీక్‌గా నార్నే నితిన్, అతని ప్రేయసి పల్లవి పాత్రలో నయన్ సారిక, సుబ్బుగా రాజ్‌కుమార్ కసిరెడ్డి, హరిగా అంకిత్ నటించారు. ప్రేమ, స్నేహం అంశాల మేళవింపుతో అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. పుష్ప వాయిదా పడటంవల్లేనా?‘పుష్ప’ ఫ్రాంచైజీలో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప: ది రూల్’ సినిమా రానుంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావాల్సింది. అయితే క్వాలిటీ విషయంలో రాజీ పడాలనుకోవడం లేదని, అందుకే విడుదలను వాయిదా వేశామని యూనిట్ పేర్కొంది. ఆ తర్వాత ‘పుష్ప: ది రూల్’ను డిసెంబరు 6న విడుదల చేస్తామని ప్రకటించింది. ఆగస్టు 15కి ‘పుష్ప’ రాకపోవడంవల్ల, లాంగ్ వీకెండ్, రక్షాబంధన్ ఫెస్టివల్ కూడా కలిసొచ్చి తమ సినిమాలకు లాభాలు వస్తాయని ఆయా చిత్రయూనిట్లు ఆలోచన చేసి ఆగస్టు 15ను టార్గెట్‌గా చేసుకుని ఈ సినిమాలను రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 15కి ఇంకా సమయం ఉంది. సో... ఈ విడుదల జాబితా ఇంకా పెరిగే చాన్స్ ఉంది. -
డేట్ ఫిక్స్
‘తంగలాన్’ సినిమా థియేటర్స్‌కు వచ్చే తేదీ ఖరారైంది. విక్రమ్ హీరోగా నటించిన ఈ పీరియాడికల్ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ శుక్రవారం ప్రకటించింది. పా. రంజిత్ దర్శకత్వంలో నీలమ్ప్రోడక్షన్స్, స్టూడియో గ్రీన్ ఫిలింస్ పతాకాలపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మించారు.18వ శతాబ్దంలో కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) నేపథ్యంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో మాళవికా మోహనన్, పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో విక్రమ్ ఓ తెగకు చెందిన నాయకుడిగా కనిపిస్తారు. -
'తంగలాన్' విడదలపై ప్రకటన.. రెండు తెలుగు సినిమాలతో పోటీ
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'తంగలాన్' విడుదల తేదీ ప్రకటన వచ్చేసింది. విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టూడియో గ్రీన్ సంస్థ నుంచి కేఈ జ్ఞానవేల్‌రాజా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది.కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా. రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆగష్టు 15న తంగలాన్ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బంగారం కోసం అన్వేషణ అందుకోసం జరుగుతున్న పోరాటం ఆసక్తి కలిగించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తంగలాన్‌లో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషించారు.తంగలాన్ చిత్రాన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. కేజీఎఫ్ గోల్డ్ మైన్స్ ను బ్రిటీష్ వాళ్ల నుంచి తంగలాన్ అనే ఒక తెగ ఎలా కాపాడుకున్నదో ఈ చిత్రంలో చూపించనున్నారు. 19వ శతాబ్దంలో జరిగిన ఘటనలను ఈ సినిమాలో మేకర్స్ చూపించనున్నారు. ఈ మూవీలో విక్రమ్ లుక్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. విక్రమ్ ప్రయోగాత్మక లుక్‌లో కనిపించనున్నారు.తంగలాన్‌కు పోటీగా ఆగష్టు 15న రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. రామ్ పోతినేని, పూరీల డబల్ ఇస్మార్ట్ అందరి కంటే ముందుగా ఆగస్టు 15న విడుదల అని తెలియచేస్తూ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక మరో పెద్ద సినిమా మాస్ మహారాజ రవితేజ, పీపుల్స్ మీడియాల MR. బచ్చన్ ఆగస్టు 15న విడుదలకు సన్నాహాలు చేస్తోంది. -
పండగ వచ్చిందే చాన్నాళ్లకి...
గూడెంలోని ప్రజలందరూ ఆ రోజు శుభవార్త విన్నారు. ఆ ఆనందంలో ‘మనకి మనకి మనలో మనకి పండగ వచ్చిందే చాన్నాళ్లకి... అలికీ అలికీ ఊరే అలికీ ముగ్గులు ఏసేద్దాం ముంగిళ్లకీ...’ అంటూ ΄ాడుకున్నారు. విక్రమ్ హీరోగా నటించిన ‘తంగలాన్’ చిత్రంలోని ΄ాట ఇది. ΄ా. రంజిత్ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రంలో ΄ార్వతీ తిరువోతు, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూ΄÷ందింది. బుధవారం ఈ చిత్రంలోని ‘మనకి మనకి...’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరపరచిన ఈ ΄ాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా సింధూరీ విశాల్ ΄ాడారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. -
ట్రైబల్ కథల్
ఒక సింహాసనం కోసం రెండు తెగలు పోటీ పడతాయి... సముద్ర తీరంలో ఉండే ఆదివాసీల కోసం ఓ వ్యక్తి పోరాటం చేస్తాడు... తమ హక్కుల కోసం పోరాటం చేస్తాడు ఓ గిరిజన తెగ నాయకుడు... ఓ తెగకు చెందిన వ్యక్తి శివభక్తుడిగా మారతాడు... సినిమా పాయింట్ ఏదైనా ఈ సినిమాలన్నింటిలోనూ కామన్ పాయింట్ ‘ట్రైబల్’ నేటివిటీ. ఇలా ట్రైబల్ కథల్తో రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.⇒ ‘కాన్సార్ ఎరుపెక్కాలా...’ అంటూ ‘సలార్: సీజ్ఫైర్’ చిత్రంలో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్‌కి అటు అభిమానులు ఇటు ప్రేక్షకుల కేకలు, అరుపులతో థియేటర్లు దద్దరిల్లాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్’. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా మొదటి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ గత ఏడాది విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాన్సార్ సింహాసనం కోసం శౌర్యాంగ, ఘనియార్ తెగలు పోటీపడటం, వారికి దక్కకుండా తన సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం మన్నార్ తెగకు చెందిన రాజ మన్నార్ చేసే ప్రయత్నం... ఈ మూడు తెగలు ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలు రచించడం మొదటి భాగంలో చూశాం. చివరికి ఏ తెగవారు కాన్సార్ సింహాసనం చేజిక్కించుకున్నారనేది తెలియాలంటే మలి భాగం ‘సలార్: శౌర్యాంగపర్వం’ విడుదల వరకూ ఆగాల్సిందే. ఇంకా సెకండ్ పార్ట్ షూటింగ్ ఆరంభం కాలేదు. ⇒ ‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ సూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ ‘దేవర’ కోసం ఎన్టీఆర్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ సినిమా బ్యాక్‌డ్రాప్ ఏంటో చెప్పింది. ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. భారతదేశంలో విస్మరణకు గురైన సముద్ర తీర ్రపాంతాలకు చెందిన ఆదివాసీల కోసం దేవర చేసే పోరాటమే ఈ సినిమా అని సమాచారం. ఈ చిత్రం మొదటి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ⇒ ‘చావుని ఎదిరించే వాళ్లకు మాత్రమే ఇక్కడ జీవితం’ అంటూ ‘తంగలాన్’ మూవీ ట్రైలర్లో హీరో విక్రమ్ చెప్పిన డైలాగ్ పవర్‌ఫుల్‌గా ఉంది. పా. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాలతో ఈ చిత్రం రూపొందింది. బంగారు గనుల తవ్వకాన్ని వ్యతిరేకించే గిరిజన తెగ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఆ తెగ నాయకుడి పాత్రలో విక్రమ్ నటించారట. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ⇒ సూర్య హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘కంగువ’. శివ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాలో సూర్య ఆటవిక జాతికి చెందిన ఓ తెగ నాయకుడిగా నటించారు. ఓ దట్టమైన అడవిలో రెండు ఆటవిక జాతుల మధ్య పోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు గ్లింప్స్ చూస్తే అర్థం అవుతుంది. అలాగే ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఓ గిరిజన యోధుడైన కంగువ 1678 నుంచి ప్రస్తుత కాలానికి వస్తాడు. ఓ మహిళా సైంటిస్ట్ సాయంతో తన మిషన్‌ని పూర్తి చేయాలనుకుంటాడు. ఆ మిషన్ ఏంటి? ఆ కాలం నుంచి ఇప్పటి కాలానికి అతను టైమ్ ట్రావెల్ ఎలా చేశాడు? అనే నేపథ్యంలో భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలతో ఈ సినిమా కథ సాగుతుందని టాక్. ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. ⇒ మంచు విష్ణు నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాలో ఓ తెగకు చెందిన తిన్నడు (ఆ తర్వాత శివ భక్తుడు కన్నప్పగా మారారు) పాత్ర చేస్తున్నారు మంచు విష్ణు. ఈ చిత్రంలో తిన్నడు వాడిన విల్లు విశిష్టత గురించి ఇటీవల మేకర్స్ తెలిపారు. తన బిడ్డ తిన్నడు ధైర్యసాహసాలకు ముగ్దుడైన నాద నాథుడు ప్రత్యేకమైన విల్లును తయారు చేస్తాడు. ఆ విల్లును ఉపయోగిస్తూ తన తెగను, అడవిలో సమతుల్యతను తిన్నడు ఎలా కాపాడాడు? అనే నేపథ్యంలో సాగే సీన్స్ ఆసక్తిగా ఉంటాయట. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుందట. -
విక్రమ్ 'తంగలాన్' ట్రైలర్ విడుదల.. చావుని ఎదురిస్తేనే జీవితం
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'తంగలాన్' ట్రైలర్ వచ్చేసింది. విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టూడియో గ్రీన్ సంస్థ నుంచి కేఈ జ్ఞానవేల్‌రాజా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా. రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టీజర్‌తో ఫిదా చేసిన విక్రమ్ తాజాగా విడుదలైన ట్రైలర్‌తో ప్రేక్షకులను మరో ప్రపంపంలోకి తీసుకెళ్లాడని చెప్పవచ్చు. బంగారం కోసం అన్వేషణ అందుకోసం జరుగుతున్న పోరాటం ఆసక్తి కలిగించే విధంగా ట్రైలర్ ఉంది. తంగలాన్‌లో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్ ఎలా ఉందంటే..'తంగలాన్' సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - బ్రిటీష్ పాలనా కాలంలో కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో బంగారం కోసం వేట మొదలుపెడతారు బ్రిటీష్ అధికారులు. స్థానిక తెగల వారిని బంగారం వెలికి తీసేందుకు పనిలో పెట్టుకుంటారు. ఒక తెగ నాయకుడిగా విక్రమ్‌ను చూపించారు. ఈ బంగారం వేటలో రెండు తెగల మధ్య పోరు మొదలవుతుంది. తన వారిని కాపాడుకునేందుకు ఎంతటి సాహసానికైనా వెనకడుగు వేయని నాయకుడిగా విక్రమ్ చూపించిన భావోద్వేగాలు ఆకట్టుకుంటున్నాయి. విక్రమ్ ఈ పాత్ర కోసం మారిపోయిన తీరు కూడా ఆశ్చర్యపరుస్తోంది. ట్రైలర్ లో విల్లు, బరిసెలు, ఈటెలతో చేసిన యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ గా నిలుస్తున్నాయి. విక్రమ్ బ్లాక్ పాంథర్ తో చేసిన ఫైట్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చరిత్రలోని వాస్తవ ఘట్టాలను దర్శకుడు పా. రంజిత్ తన సినిమాటిక్ యూనివర్స్ లో ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు 'తంగలాన్' ట్రైలర్ తో తెలుస్తోంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు త్వరలోనే 'తంగలాన్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. -
విక్రమ్ భారీ బడ్జెట్ చిత్రం.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటిస్తోన్న తాజా చిత్రం తంగలాన్. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్లో విక్రమ్ లుక్, నటన ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది.ఈ మూవీ ట్రైలర్ కోసం విక్రమ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈనెల 10న తంగలాన్ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ పా రంజిత్ పోస్టర్‌ను పంచుకున్నారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీని ఆగస్టు 15న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.కాగా.. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తంగలాన్ తెరకెక్కిస్తున్నారు. గతంలో కబాలి, కాలా, సార్పట్ట చిత్రాలకు దర్శకత్వం వహించిన పా. రంజిత్ దర్శకత్వం వహిస్తుండగా.. గ్రీన్ స్టూడియోస్ బ్యానర్లో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతమందిస్తున్నారు. A quest for gold and a battle for liberation meet through bloodshed 🔥#ThangalaanTrailer July 10th ✨@chiyaan @Thangalaan @GnanavelrajaKe @StudioGreen2 @OfficialNeelam @parvatweets @MalavikaM_ @gvprakash @NehaGnanavel @dhananjayang @NetflixIndia @jungleemusicSTH pic.twitter.com/rqyngoHRur— pa.ranjith (@beemji) July 8, 2024 -
తంగలాన్ రెడీ.. విడుదల ఎప్పుడంటే..?
విక్రమ్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘తంగలాన్ ’. ఈ మూవీ థియేటర్స్‌కు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా పా. రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కోసం విక్రమ్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రోడక్షన్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ‘తంగలాన్ ’ సినిమాను తొలుత ఈ ఏడాది జనవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కుదర్లేదు. ఆ తర్వాత ఏప్రిల్‌కు వాయిదా వేశారు. కానీ, అప్పుడు కూడా ‘తంగలాన్ ’ చిత్రాన్ని విడుదల చేయలేకపోయారు.తాజాగా తంగలాన్ చిత్రాన్ని ఆగష్టు 15న థియేటర్స్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ, అదే తేదీలో తంగలాన్ ఎంట్రీ గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఆగష్టు 15న విడుదల కావాల్సిన అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 వాయిదా పడింది. డిసెంబర్ 6న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు కూడా. దీంతో తంగలాన్ సినిమాకు లైన్ క్లియర్ అయింది. బన్నీ ముందుగా ఫిక్స్ చేసుకున్న ఆగష్టు 15ను విక్రమ్ లాక్ చేయనున్నాడని సమాచారం. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తామని పా. రంజిత్ తాజాగా తెలిపారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన ఈ సినిమాలో మాళవికా మోహనన్, పార్వతీ తిరువోరు, పశుపతి, హరికృష్ణన్, అన్భుదురై కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. -
తంగలాన్ రెడీ
విక్రమ్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘తంగలాన్ ’. ఈ మూవీ థియేటర్స్‌కు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా పా. రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రోడక్షన్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రం నిర్మించారు. కాగా ‘తంగలాన్ ’ సినిమాను తొలుత ఈ ఏడాది జనవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కుదర్లేదు.ఆ తర్వాత ఏప్రిల్‌కు వాయిదా వేశారు. ఏప్రిల్‌లోనూ ‘తంగలాన్ ’ థియేటర్స్‌కు రాలేదు. అయితే తాజాగా ఈ మూవీని ఆగస్టులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పార్వతీ తిరువోరు, పశుపతి, హరికృష్ణన్, అన్భుదురై కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. -
కంగనా- విక్రమాదిత్య.. గెలుపోటముల లెక్కలివే?
హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానానికి గట్టిపోటీ ఏర్పడనుంది. ఎందుకంటే ఇక్కడ అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌లకు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. సాధారణ ఓటరును తమవైపు తిప్పుకోవడంలో ఏ పార్టీ విజయం సాధిస్తే అది పార్లమెంటు వరకూ చేరుకోగలుగుతుంది.మోదీ మ్యాజిక్, మాజీ సీఎం జైరాం ఠాకూర్ మద్దతు, స్టార్డమ్ మొదలైనవి బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌కు కలసివచ్చే అంశాలుగా భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకు బలంగా ఉంది. అలాగే అతని తండ్రి, ఆరుసార్లు రాష్ట్రాన్ని ఏలిన మాజీ ముఖ్యమంత్రి, దివంగత వీరభద్ర కె సింగ్ అభిమానులు విక్రమాదిత్యకు అండగా నిలుస్తారనే వాదన వినిపిస్తోంది. దీంతో ఎవరు గెలిచినా వారికి స్వల్ప ఆధిక్యత మాత్రమే దక్కుతుందనే అంచనాలున్నాయి.ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచార పర్వంలో పరస్పర మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. విక్రమాదిత్య తండ్రి దివంగత వీరభద్ర సింగ్, తల్లి ప్రతిభా సింగ్‌లు మండీ నియోజక వర్గం నుండి మూడుసార్లు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 1952 నుంచి 2021 వరకు ఈ నియోజక వర్గంలో జరిగిన 20 ఎన్నికల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ 14 సార్లు, బీజేపీ ఐదుసార్లు, జనతా పార్టీ ఒకసారి గెలుపొందాయి. ప్రస్తుతం మండీ నియోజకవర్గంలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కులు, కిన్నౌర్, లాహౌల్-స్పితి, సిమ్లాలోని రాంపూర్, చంబాలోని భర్మౌర్ స్థానాల్లో ఆధిక్యత సాధించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. మే 24న మండిలో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ నిర్వహించారు. ఈ రోజు (బుధవారం) కులు, సుందర్‌నగర్‌లలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు. -
విక్రమ్ తంగలాన్.. ఆ నెలలోనే రిలీజ్‌కు ప్లాన్!
పాత్ర కోసం ప్రాణం పెట్టే అతి కొద్ది మంది నటుల్లో చియాన్ విక్రమ్ ఒకరు. విక్రమ్ నటించిన తాజా చిత్రం తంగలాన్. ఈ సినిమాను డైరెక్టర్ పా.రంజిత్ తెరకెక్కిస్తున్నారు. స్టూడి యో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటి మాళవిక మోహన్, పార్వతి, డేనియల్ కల్టిగరోన్, పశుప తి ప్రధాన పాత్రలు పోషించారు.ఈ సినిమా స్వాతంత్య్రానికి ముందు కర్ణాటకలోని గోల్డ్ మైన్ కార్మికుల జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో విక్రమ్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. కాగా.. మొదట తంగలాన్ చిత్రాన్ని ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే గ్రాఫిక్స్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో పలుసార్లు వాయిదా వేస్తూ వచ్చారు.కాగా తాజాగా చిత్రాన్ని జూన్ నెలలో తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో తంగలాన్ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతమందించారు. -
‘కంగనా కాలు మోపిన ఆలయాలను శుద్ధి చేయాలి’
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ నేతలు ముమ్మరంగా ప్రచారాలు సాగిస్తున్నారు. ఈ సమయంలో పలువురు నేతల ప్రత్యర్థి అభ్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు.హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ఎన్నికల బరిలోకి దిగిన విక్రమాదిత్య సింగ్ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కంగనా వెళుతున్న ఆలయాలను శుద్ధి చేయాల్సి న అవసరం ఉందన్నారు. టకోలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.దేవ్ సమాజానికి చెందిన కంగనా తన సోషల్ మీడియా ఖాతాలో ఆహారపు అలవాట్ల గురించి చెబుతుంటారని, ఇది దేవ్ సమాజంవారికి తలవంపులుగా మారాయన్నారు. ఆమె దేవ్ సమాజపు పరువు తీస్తున్నారని ఆరోపించారు. దేవభూమిలో ఉంటున్నవారికి ఇక్కడి దేవనీతిపై ఎంతో నమ్మకం ఉందన్నారు.తన తండ్రి వీరభద్ర సింగ్ ఆరు సార్లు సీఎం అయ్యారని, అది ప్రజల ఆశీర్వాదమని, కంగనా మా కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషించే బదులు ప్రధాని మోదీని పదవి నుంచి తప్పుకోవాలని కోరాలన్నారు. ప్రధాని మోదీ గుజరాత్‌కు చాలా ఏళ్లుగా సీఎంగా ఉన్నారని, ఇప్పుడు 74 ఏళ్ల వయసులో మూడోసారి ప్రధాని కావాలని కలలు కంటున్నారని విక్రమాదిత్య సింగ్ వ్యాఖ్యానించారు.నటి కంగనా ముంబైలో ఒక కాలు, హిమాచల్‌లో ఒక కాలు పెడుతూ రెండు పడవలపై ప్రయాణిస్తున్నారని, ఆమె అతి త్వరలో మునిగిపోతారన్నారు. కంగనాకు జూన్ 4 తర్వాత తిరిగి ముంబైలో సినిమా షూటింగ్‌లకు వెళ్లిపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. -
రెమో మళ్లీ వచ్చేస్తున్నాడు.. బుకింగ్స్ అదుర్స్!
స్టార్ డైరెక్టర్ శంకర్, విక్రమ్ కాంబోలో వచ్చిన చిత్రం అపరిచితుడు. సదా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రభుత్వ అధికారుల్లో అవినీతి, అక్రమాల కథ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా 2005లో విడుదలై సూపర్‌హిట్‌ను సొంతం చేసుకుంది. ఆస్కార్ సినిమా బ్యానర్‌పై రూపొందించిన ఈ చిత్రాన్ని రూ.20 కోట్లతో తెరకెక్కించగా.. రూ.60 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఆ ఏడాది రిలీజైన అన్ని చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ రి రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాను మే 17వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.కాగా.. ఈ చిత్రంలో విక్రమ్, ప్రకాశ్ రాజ్ మధ్య సన్నివేశాలు అభిమానులను అలరించాయి. విక్రమ్ నటనా విశ్వరూపాన్ని ప్రేక్షకులు చూడగలిగారు. త్రిపాత్రాభినయంతో రెమో, అపరిచితుడు, బ్రాహ్మణుడిగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగు, తమిళ రాష్ట్రాల్లో రి రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వగా.. ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఎన్నికల తర్వాత సరైనా సినిమా థియేటర్లో లేకపోవడంతో విక్రమ్ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తుందని ఆశిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు హరీశ్ జైరాజ్ మ్యూజిక్ అందించారు. -
19 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అవుతున్న హిట్ సినిమా.. అదేంటంటే?
గత కొన్నాళ్ల నుంచి తెలుగు, తమిళ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. కొత్త సినిమాలు సరిగా ఆడకపోయేసరికి హిట్ చిత్రాల్ని మళ్లీ థియేటర్లకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో 'అపరిచితుడు' చేరింది. విక్రమ్, సదా జంటగా నటించిన ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. విక్రమ్‌ను మూడు ఢిఫరెంట్ షేడ్స్‌లో అద్భుతంగా ఈ చిత్రంలో శంకర్ చూపించారు. హాలీవుడ్ చిత్రాలకు దీటుగా తెరకెక్కించారు.(ఇదీ చదవండి: అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్)2005లో తెలుగులో ఓ అనువాద చిత్రంలా కాకుండా స్ట్రెయిట్ మూవీలానే విడుదలై బయ్యర్లకు వసూళ్ల వర్షం కురిపించింది. కథ, కథనాలు, దర్శకుడి స్టైలిష్ దర్శకత్వం, నటుడు విక్రమ్ నటనా ప్రతిభ ప్రేక్షకలను విపరీతంగా ఆకట్టుకుంది. మల్టీపుల్ పర్సనాలిటీ డిజాస్టర్ కారణంగా మామూలు మనిషి సూపర్ హీరోగా మారి సమాజంలో జరుగుతున్న అరాచకాలను, కాలరాస్తూ, తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా నరకాన్ని అనుభవించేలా శిక్షలు వేసే పాత్రలో నటుడు విక్రమ్ నటన గురించి ఎంత చెప్పినా చాలదు.ఇకపోతే ఫ్రెంచ్ భాషలోకి డబ్ అయిన తొలి ఇండియన్ చిత్రం అపరిచితుడు కావడం విశేషం. అలాంటి ఈ సినిమాని ఇప్పుడు మళ్లీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు 700 థియేటర్లలో విడుదలకు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులు కూడా కాస్త ఆసక్తి చూపిస్తున్నారు.(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్) -
రీరిలీజ్‌కు రెడీ అయిన అపరిచితుడు.. ఏకంగా 700 థియేటర్స్‌లో!
తమిళసినిమా: ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో రీ రిలీజ్‌ల కాలం నడుస్తోందనే చెప్పాలి. కొత్త చిత్రాలు ఆశించిన ప్రేక్షకాదరణ పొందకపోవడంతో రీ రిలీజ్ చిత్రాలే థియేటర్లను కాపాడుతున్నాయి. ఆ జాబితా లో అపరిచితుడు చిత్రం చేరుతోంది. నటుడు విక్రమ్, సదా జంటగా నటించిన తమిళ చిత్రం అన్నియన్ చిత్రానికి తెలుగు అనువాదం అపరిచితుడు. గ్రేట్ డైరెక్టర్ శంకర్ సృష్టి ఈ చిత్రం. నటుడు విక్రమ్‌ను మూడు ఢిఫరెంట్ షేడ్స్‌లో అద్భుతంగా ఈ చిత్రంలో శంకర్ చూపించారు. హాలీవుడ్ చిత్రాలకు దీటుగా తెరకెక్కించిన అపరిచితుడు చిత్రం 2005లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. తెలుగులో ఓ అనువాద చిత్రంలా కాకుండా ఒక భారీ నేరు చిత్రంలా విడుదలై బయ్యర్లకు వసూళ్ల వర్షం కురిపించింది. కథ, కథనాలు, దర్శకుడి స్టైలిష్ దర్శకత్వం, నటుడు విక్రమ్ నటనా ప్రతిభ ప్రేక్షకలను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పట్లోనే అత్యంత భారీ బడ్జెట్లో రూపొందిన అపరిచితుడు చిత్ర క్లైమ్యాక్స్ సన్నివేశాల కోసమే 120 కెమెరాలతో 270 డిగ్రీల రొటేషన్ ఫొటోగ్రఫీ టెక్నిక్‌తో చిత్రీకరించారు దర్శకుడు శంకర్. ఇదే టెక్నాలజీతో రూపొందిన హాలీవుడ్ చిత్రం మ్యాట్రిక్స్ కంటే అపరిచితుడు చిత్రాన్ని శంకర్ బ్రహ్మండంగా తెరకెక్కించారు. దాదాపు 200 మంది స్టంట్ కళాకారులతో చిత్రీకరించిన ఫైట్ దృశ్యాలను చూస్తుంటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తోంది. నెదర్లాండ్‌లోని పుష్పాల ఎగ్జిబిషన్లో చిత్రీకరించిన ఇందులోని పాట మరో హైలెట్. మల్టీపుల్ పర్సనాలిటీ డిజాస్టర్ కారణంగా మామూలు మనిషి సూపర్‌హీరోగా మారి సమాజంలో జరుగుతున్న అరాచకాలను, కాలరాస్తూ, తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా నరకాన్ని అనుభవించేలా శిక్షలు వేసే పాత్రలో నటుడు విక్రమ్ నటన గురించి ఎంత చెప్పినా చాలదు. అదేవిధంగా ఫ్రెంచ్ భాషలోకి అనువాదం అయిన తొలి ఇండియన్ చిత్రం అపరిచితుడు. కాగా అలాంటి అపరిచితుడు చిత్రం ఇప్పుడు మళ్లీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు 700 థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది. -
సూర్య మూవీ వాయిదా.. విక్రమ్ కొడుకుతో సుధాకొంగర కొత్త చిత్రం!
తమిళసినిమా: నటుడు విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా సుధాకొంగర చిత్రం చేయబోతున్నారా? అన్న ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. 2010లో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టిన సుధా కొంగర, 2016లో మాధవన్ హీరోగా తెరకెక్కించిన ఇరుదు చుట్రు చిత్రంతో సంచలన విజయాన్ని సాధించారు. ఆ చిత్రం ద్వారా బాలీవుడ్ రియల్ బాక్సర్ రిత్వికాసింగ్ను కథానాయకిగా పరిచయం చేశారు. ఆ తరువాత అదే చిత్రాన్ని తెలుగులోనూ వెంకటేశ్ హీరోగా రీమేక్ చేశారు. కాగా 2022లో సూర్య కథానాయకుడిగా సూరరై పోట్రు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం సూపర్‌హిట్ అయ్యింది.ప్రస్తుతం అదే చిత్రాన్ని హిందీలో అక్షయ్‌కుమార్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. కాగా తదుపరి మరోసారి సూర్య హీరోగా పురనానూరు పేరుతో చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి మరింత సమయం అవసరం కావడంతో వాయిదా వేసినట్లు, నటుడు సూర్య, దర్శకురాలు సుధాకొంగర సంయుక్తంగా ఓ ప్రకటనను ఇటీవల మీడియాకు విడుదల చేశారు. దీంతో సూర్య, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో నటుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా సుధాకొంగర చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. దీనికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించనున్నట్లు టాక్. అయితే ఇది ఏ బ్యానర్లో రూపొందనుంది? ఎప్పుడు ప్రారంభం అవుతుందీ? వంటి వివరాలు తెలియా ల్సి ఉంది. కాగా ప్రస్తుతం నటుడు ధ్రువ్ విక్రమ్ మారిసెల్వరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని దర్శకుడు పా.రంజిత్ తన నీలం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. -
విక్రమ్ తంగలాన్.. ఈ స్పెషల్ వీడియో చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన తాజా చిత్రం తంగలాన్. ఈ చిత్రంలో మాళవిక మోహన్, పార్వతి హీరోయిన్లుగా నటించారు. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కె ఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం చాలా రోజుల ముందే తెరపైకి రావాల్సింది. అయి తే గ్రాఫిక్స్ పూర్తి కాకపోవడంతో విడుదల తేదీ రెండుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. కాగా ఇప్పటికీ దర్శక, నిర్మాతలు తంగలాన్ చిత్రం విడుదల తేదీని ప్రకటించలేదు. తాజాగా ఈనెల 17న విక్రమ్ బర్త్ డే కావడంతో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తంగలాన్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఆదివాసి ప్రాంతాలలో నటుడు విక్రమ్ గుర్రమెక్కి వెళుతున్న పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో విక్రమ్ కొండవాసీ గెటప్‌లో కనిపించిన దృశ్యం తంగలాన చిత్రంపై ఆసక్తిని పెంచేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పా.రంజిత్ మాట్లాడుతూ తంగలాన్ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ కె ఈ జ్ఞానవేల్ రాజా నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. నటుడు విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం గ్లింప్స్ విడుదల చేయడం ఇంకా ఆనందంగా ఉందన్నారు. తంగలాన్ చిత్రం కోసం విక్రమ్ పూర్తిగా మేకోవర్ అయ్యాయన్నారు. ఆయన ఎంతో అంకిత భావంతో పని చేశారన్నారు. ఇతర నటీనటులు ఎంతగానో శ్రమించినట్లు చెప్పారు. ఇది గోల్డ్ మైన్స్ నేపథ్యంలో రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు. చిత్ర విడుదల తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు పా.రంజిత్ చెప్పారు. -
డైరెక్టర్ శంకర్ కూతురి రెండో పెళ్లి.. ఆశీర్వదించిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
నాడు గ్లామర్ ఫోటోలతో రచ్చ.. నేడు మూడు భారీ సినిమాల్లో ఛాన్సులు
చియాన్ విక్రమ్ అంటేనే వైవిధ్యానికి మారు పేరు. ఈయన తాజాగా నటించిన తంగలాన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీంతో విక్రమ్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇది ఆయన నటించే 62వ చిత్రం అవుతుంది. ఇటీవల చిత్తా (చిన్నా) వంటి సక్సెస్‌పుల్ చిత్రాన్ని తెరకెక్కించిన ఎస్‌యూ అరుణ్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. హెచ్ఆర్.పిక్చర్స్ పతాకంపై రియా శిబూ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టెయిన్ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు. కాగా ఇందులో నటుడు ఎస్జే.సూర్య, సురాజ్ వెంజరముడు తదితరులు ముఖ్యపాత్రలు పోషించనున్నారు. హీరో యిన్‌గా నటించే లక్కీఛాన్స్‌ను యువ నటి దుషారా విజయన్ దక్కించుకున్నారు. పా.రంజిత్ దర్శకత్వం వహించిన సార్పట్టా పరంపరై చిత్రంతో నాయకిగా రంగప్రవేశం చేసిన ఈ చిన్నది అందులో మరియమ్మ పాత్రలో జీవించి, అందరి ప్రశంసలను అందుకున్నారు. ఆ తరువాత నక్షత్రం నగరుదు వంటి పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఇటీవల గ్లామర్ వైపు దృష్టి సారించారు. అలా గ్లామరస్ ఫొటోలను ప్రత్యేకంగా తీయించుకుని, సామాజక మాధ్యమాల్లో విడుదల చేశారు. అలా మరింత వార్తల్లోకి ఎక్కిన దుషారా ప్రస్తుతం ధనుష్ కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన ఆయన 50వ చిత్రంలో నటించారు. ఇది త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా నటుడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వేట్టైయాన్ చిత్రంలోనూ ఈ అమ్మడు నటించడం విశేషం. తాజాగా విక్రమ్‌తో జత కట్టే లక్కీఛాన్స్‌ను దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు బుధవారం అధికారికంగా ప్రకటించాయి. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతం, తేని ఈశ్వర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ క్రేజీ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లనుంది. View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) -
తంగలాన్ భామ స్పెషల్ లుక్.. బంగారు వర్ణంతో మెరిసిన భామ!
సినీ కుటుంబం నుంచి వచ్చిన మలయాళ భామ మాళవిక మోహనన్. మొదట్లో మాతృభాషలో నటించిన ముద్దుగుమ్మ.. ఆ తరువాత పేట చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైంది. పేట చిత్రంలో రజనీకాంత్ మిత్రుడు శశికుమార్ భార్యగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత విజయ్ సరసన మాస్టర్ చిత్రంలో నటించారు. అందులో పాత్ర పరిమితే అయినా, హిట్ చిత్రంలో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత ధనుశ్కు జంటగా మారన్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం కరోనా కాలంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. మరోపక్క మలయాళం, తెలుగు చిత్రాల్లోనూ నటిస్తూ బహు భాషా నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా తాజాగా పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్‌కు జంటగా తంగలాన్ చిత్రంలో నటించారు. ఇందులో గిరిజన అమ్మాయి పాత్రలో నటించడం విశేషం. దీంతో తంగలాన్ చిత్రంపై అభిమానుల్లో చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రావలసిన ఈ చిత్రం ఎన్నికల కారణంగా వాయిదా పడే అవకాశం ఉంది. కాగా ఈమె నటించిన చిత్రాల విడుదల ఆలస్యమైనప్పటికీ.. ఈ బ్యూటీ మాత్రం అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తరచు ప్రత్యేక ఫొటో షూట్ చేసుకుంటూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తోంది. అదే విధంగా తాజాగా 24 క్యారెట్ల బంగారంలా మెరిసి పోయే దుస్తులు ధరించి స్పెషల్ ఫొటో షూట్ చేసుకున్న ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) -
విక్రమ్ క్రేజీ మూవీ.. డైరెక్టర్ లేటేస్ట్ అప్డేట్!
చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తంగలాన్. ఈ సినిమాకు పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇప్పటికే చాలాసార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడుతూనే వస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి డైరెక్టర్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన పా.రంజిత్ సినిమా విడుదలపై స్పందించారు. దర్శకుడు పా. రంజిత్ మాట్లాడుతూ.. 'తంగలాన్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఇప్పటికే సెన్సార్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకుంటున్నాం. ప్రస్తుతం ఎన్నికల తేదీల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నాం. ఎన్నికలు పూర్తయిన తర్వాత సినిమా విడుదల చేస్తాం. ఈ సినిమాను సినీ ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం' అని తెలిపారు. కాగా.. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ డిఫెరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి కీలక పాత్రలు పోషించారు. -
ఒక్క సినిమా కోసం ఇద్దరు వారసులు కలిస్తే..?
ఇద్దరు ప్రముఖుల వారసులు కలిసి చిత్రం చేయడం అనేది అరుదైన విషయమే అవుతుంది. ఇప్పుడు అదే జరగబోతోందా..? అంటే అవుననే సమాధానమే కోలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది. విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ గురించి తెలిసిందే. తెలుగు చిత్రం అర్జున్ రెడ్డి రీమేక్ ద్వారా కోలీవుడ్‌లో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆదిత్య వర్మ పేరుతో రూపొందిన ఈ చిత్రం నిరాశ పరచింది. ఆ తరువాత తన తండ్రి విక్రమ్‌తో కలిసి ధ్రువ్ విక్రమ్ నటించిన మహాన్ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టినా, అది ఓటీటీలో విడుదల కావడంతో ధ్రువ్ విక్రమ్ మంచి థియేటరికల్ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన మరో చిత్రంలో నటించే విషయమై వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రముఖ నటుడు విజయ్ వారసుడు జాసన్ సంజయ్ కూడా సినీ రంగప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే. లండన్‌లో సినిమా గురించి చదివి వచ్చిన ఈయనకు హీరోగా పలు అవకాశాలు వచ్చినా, వాటిని కాదని దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. అలా కథను రెడీ చేసుకున్న జాసన్ సంజయ్‌కు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ అవకాశం కల్పించింది. ఈ సంస్థలో ఈయన దర్శకత్వం వహించనున్న చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కొద్ది నెలల క్రితమే జరిగాయి. అప్పటి నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఇందులో నటించే హీరోల ఎంపిక చాలా కాలంగా జరుగుతోంది. ఈ వరుసలో నటుడు విజయ్‌సేతుపతి, కవిన్ వంటి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే చివరిగా నటుడు ధ్రువ్ విక్రమ్‌ను ఇందులో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించిన చర్చ తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
విక్రమ్ సినిమాలో అడుగుపెడుతున్న క్రేజీ నటుడు
తంగలాన్ చిత్రాన్ని పూర్తి చేసిన సియాన్ విక్రమ్ తాజాగా తన 62వ చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇందులో ఎస్జే సూర్య ముఖ్య పాత్రను పోషించనున్నారు. కాగా తాజాగా ప్రముఖ మలయాళ నటుడు ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం కానున్నారు. హాస్య నటుడిగా బహుళ ప్రాచుర్యం పొంది మూడుసార్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను అందుకున్న సురాజ్ వెంజారమూడు 2016లో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సైతం గెలుచుకున్నారు. ఈయన మలయాళంలో నటించిన ఆండ్రాయిడ్ కుంజప్పన్, డ్రైవింగ్ లైసెన్స్, జన గణమన, ది గ్రేట్ ఇండియన్ కిచ్చెన్ వంటి చిత్రాలు సంచలన విజయాన్ని సాధించాయి. కాగా తాజాగా విక్రమ్ కథానాయకుడిగా నటించనున్న తన 62వ చిత్రం ద్వారా సురాజ్ కోలీవుడ్‌కు పరిచయం కానున్నారు. ఇందులో ఈయన ముఖ్య పాత్రను పోషించనున్నట్లు చిత్ర వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పలు ఓటీటీలలో ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. దీంతో టాలీవుడ్లో కూడా ఆయనకు ఎనలేని గుర్తింపు దక్కింది. ఎస్‌యూ అరుణ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై రియా శిబు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏప్రిల్‌లో ఈ క్రేజీ చిత్రం సెట్ పైకి వెళ్లనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
Cars24: పదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు..
న్యూఢిల్లీ: ఆదాయాలు, మధ్యతరగతి ప్రజలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా యూజ్డ్ కార్ల మార్కెట్ గణనీయంగా పెరగనుంది. వచ్చే పదేళ్లలో ఇది 100 బిలియన్ డాలర్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు కార్స్24 సహ వ్యవస్థాపకుడు, సీఈవో విక్రమ్ చోప్రా తెలిపారు. తమ అంతర్గత అధ్యయనం ప్రకారం 2023లో 25 బిలియన్ డాలర్లుగా ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ 2034 నాటికి ఏటా 15 శాతం చక్రగతి వృద్ధితో 100 బిలియన్ డాలర్లకు చేరే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల క్రితం కార్స్24 ప్రారంభమైనప్పుడు ఇది 10–15 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండేదని, గత 3–4 ఏళ్లలో వివిధ రకాల కార్ల రాకతో మార్కెట్ వేగం పుంజుకుందని చోప్రా తెలిపారు. పట్టణీకరణ, పెరుగుతున్న మధ్య తరగతి వర్గాల ప్రజలు, వినియోగదారుల్లో మారుతున్న ప్రాధాన్యతలు, అందుబాటు ధరల్లో మొబిలిటీ సొల్యూషన్స్‌కి డిమాండ్ పెరుగుతుండటం మొదలైన అంశాలు వృద్ధికి తోడ్పడగలవని చోప్రా వివరించారు. సొంత కార్లు ఉన్న వారు తక్కువే.. అభివృద్ధి చెందిన ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో సొంత కారు ఉన్న వారి సంఖ్య చాలా తక్కువేనని చోప్రా తెలిపారు. అమెరికా, చైనా, యూరప్ జనాభాలో 80–90 శాతం మందికి కార్లు ఉంటే భారత్‌లో 8 శాతం మందికే సొంత ఫోర్ వీలర్లు ఉన్నాయని పేర్కొన్నారు. కాబట్టి మార్కెట్ పెరిగేందుకు మరింతగా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. యువ జనాభా .. కార్లను కొనుగోలు చేసిన 5–6 ఏళ్లలోనే విక్రయించేసి మరో కొత్త వాహనం వైపు మొగ్గు చూపుతున్నారని చోప్రా తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం కనీసం 10–12 ఏళ్లయినా కార్లను అట్టే పెట్టుకునే వారని వివరించారు. ఎస్‌యూవీలకు డిమాండ్.. గడిచిన నాలుగేళ్లలో వినూత్న ఫీచర్లున్న ఎస్‌యూవీలకు యూజ్డ్ కార్ల మార్కెట్లోనూ డిమాండ్ పెరిగింది. అంతర్గత అధ్యయనం ప్రకారం 2018–23 మధ్య కాలంలో రూ. 8 లక్షలకు పైబడిన విలువ గల కార్ల అమ్మకాలు 14 శాతం పెరిగాయి. ఆదాయాలు, మధ్యతరగతి ప్రజల జనాభా పెరుగుతుండటమనేది మార్కెట్ ముఖచిత్రాన్ని మార్చేస్తోందని చోప్రా తెలిపారు. 2022 ఆర్థిక సంవత్సరంలో ప్రీ–ఓన్డ్ కార్ల అమ్మకాల్లో మెట్రోపాలిటన్ నగరాల వాటా 65 శాతంగా ఉంది. మరోవైపు, పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా వచ్చే అయిదేళ్లలో యూజ్డ్ ఎలక్ట్రిక్ కార్లు కూడా పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చోప్రా చెప్పారు. -
విక్రమ్ తనయుడి కొత్త మూవీ.. హీరోయిన్ ఎవరంటే?
హీరో విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ 'ఆదిత్య వర్మ' సినిమా ద్వారా కథానాయకుడిగా తెరంగేట్రం చేశారు. ఆ తరువాత తన తండ్రి విక్రమ్‌తో కలిసి మహాన్ చిత్రంలో నటించారు. అయితే తొలి చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడం, మహాన్ చిత్రం ఓటీటీలో విడుదల కావడంతో ధృవ్ విక్రమ్ కెరీర్ ఇంకా పుంజుకోలేదు. దీంతో కొంచెం గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ హీరో తాజాగా మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్, మామన్నన్ చిత్రాల ఫేమ్ మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించనున్నారు. స్పోర్ట్స్ డ్రామా.. నిజానికి ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన విడుదలై చాలా రోజులైంది. తర్వాత అంతా సైలెంట్‌గా ఉండటంతో ఈ చిత్రం అటకెక్కిందనే ప్రచారం కూడా జరిగింది. అలాంటిది ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. ఇది కబడ్డీ క్రీడ నేపథ్యంలో యధార్థ సంఘటన ఆధారంగా రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ధృవ్ విక్రమ్ కబడ్డీ ఆటలో ఇప్పటికే శిక్షణ పొందుతున్నారని తెలిసింది. అప్పటినుంచే షూటింగ్.. ఇందులో ఆయనకు జంటగా మలయాళ భామ దర్శనా రాజేంద్రన్ నటించనున్నారు. ఈమె ఇప్పటికే తమిళంలో కవన్, ఇరుంబు తిరై వంటి చిత్రాలలో నటించడం గమనార్హం. ఈ చిత్ర షూటింగ్ మార్చి 15 నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. తూత్తుకుడిలో ప్రారంభించి 80 రోజులలో షూటింగ్‌ను పూర్తి చేయడానికి దర్శకుడు మారి సెల్వరాజ్ ప్రణాళికను సిద్ధం చేశారట! -
పాన్ ఇండియా సినిమాలు.. 'కంగువా, తంగలాన్' విడుదలకు ఇబ్బందులు
తంగలాన్, గంగువా చిత్రాలను స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్నాయి. భారీ బడ్జెట్‌తో నిర్మించబడుతున్న ఈ రెండు సినిమాల్లో 'తంగలాన్' షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా వేసి ఏప్రిల్‌లో విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు ప్రకటించారు. వాయిదాకు సంబంధించిన కారణాలు మాత్రం ఆ సమయంలో తెలుపలేదు. సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’. శివ దర్శకుడు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలపై నిర్మాతల్లో ఒకరైన ధనంజయన్ గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సినిమా పూర్తి కాకముందే రిలీజ్ డేట్ ప్రకటించి ఒత్తిడికి గురి కావడం మాకు ఇష్టం లేదు. ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. 3డీ, సీజీ వర్క్‌కు చాలా సమయం పట్టొచ్చు. అందుకే మేమింకా రిలీజ్ డేట్ నిర్ణయించలేదు. సూర్య పార్ట్ షూట్ పూర్తైంది. బాబీ దేవోల్‌పై కొంత చిత్రీకరణ ఉంది. 10 భాషల్లో రిలీజ్ చేస్తాం. ప్రస్తుతం మా దృష్టి పోస్ట్ ప్రొడెక్షన్పై ఉంది.' అని కొద్దిరోజుల క్రితం ఆయన చెప్పారు. కంగువా చిత్రం పోస్ట్ ప్రొడెక్షన్ పనులు వల్ల ఆలస్యమైతే.. తంగలాన్ మాత్రం గ్రాఫిక్స్ వర్క్ వల్ల ఆలస్యమవుతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ ఫైనాన్స్ సమస్యల కారణంగా ఈ రెండు సినిమాల విడుదలకు ఇబ్బంది ఏర్పడిందని కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. అసలు విషయం చెప్పకుండా గ్రాఫిక్స్ వర్క్ ఉందని వారు చెబుతున్నారని ప్రచారం జరుగుతుంది. పా.రంజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న 'తంగలాన్' చిత్రాన్ని ఆస్కార్‌కి తీసుకెళ్తామని నిర్మాతలు చెప్పడంతో ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. ఇలాంటి సినిమాలకు గ్రాఫిక్స్ వర్క్ నిజంగానే ఎక్కువగా ఉంటుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. వాస్తవంగా 'తంగలాన్' చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ విడుదలపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.. అదే విధంగా 'కంగువా' కూడా షూటింగ్ ప్రారంభమై రెండేళ్లు కావస్తుంది. ఈ చిత్రం విడుదలపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. దీంతో ఈ రెండు ప్రాజెక్ట్‌లకు ఫైనాన్స్ ఇబ్బందులు వచ్చినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. -
కల్లర్ మ్యాజిక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మన హీరోలు
కథ బొగ్గు గనుల్లో జరుగుతోంది.. అక్కడ పనిచేసేవాళ్లు ఎలా కనిపిస్తారు? ఫుల్ డార్క్‌గా.. కథ బంగారు గనుల్లో జరుగుతోంది.. కానీ తవ్వేవాళ్లు బంగారంలా మెరిసిపోరు.. కమలిపోయిన చర్మంతో ఉంటారు. ఇక మత్స్యకారులో... వాళ్లూ అంతే.. స్కిన్ ట్యాన్ అయిపోతుంది. ఇప్పుడు కొందరు హీరోలు ఇలా ఫుల్ బ్లాక్‌గా, ట్యాన్ అయిన స్కిన్‌తో కనిపిస్తున్నారు. పాత్రలకు తగ్గట్టు బ్లాక్ మేకప్ వేసుకుని, సిల్వర్ స్క్రీన్‌పై మేజిక్ చేయడానికి రెడీ అయ్యారు. ఆ హీరోలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. 31లో కొత్తగా... హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ల క్రేజీ కాంబినేషన్లో ‘ఎన్టీఆర్ 31’ (వర్కింగ్ టైటిల్) సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్లో సినిమా అనగానే ఎలా ఉంటుందో? అనే ఆసక్తి ఇటు చిత్ర వర్గాల్లో అటు సినిమా లవర్స్‌లో నెలకొంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్లో ఎన్టీఆర్ పూర్తి నలుపు రంగు మేకప్‌లో కనిపించారు. ప్రశాంత్ నీల్ గత చిత్రాలు ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్’ల తరహాలో ఎన్టీఆర్ 31 బ్లాక్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని టాక్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘ఎన్టీఆర్ 31’ షూటింగ్ ఈ ఏడాది లోనే ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకాలపై ఈ సినిమా రూపొందనుంది. ‘‘ఎన్టీఆర్ ఇప్పటి వరకు చేయని పాత్ర, కథతో ‘ఎన్టీఆర్ 31’ సినిమా చేయబోతున్నాను. ఇందులో మునుపెన్నడూ చూడని విధంగా ఎన్టీఆర్ కనిపిస్తారు’’ అంటూ ప్రశాంత్ నీల్ ఆ మధ్య చెప్పిన సంగతి తెలిసిందే. గోల్డ్ ఫీల్డ్స్‌లో తంగలాన్ పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేస్తుంటారు విక్రమ్. దర్శకుడి విజన్ 100 శాతం అయితే విక్రమ్ 200 శాతం న్యాయం చేస్తారనడం అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించిన విక్రమ్ ‘తంగలాన్’ కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 19వ శతాబ్దం బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ డ్రామాగా రూపొందింది. బ్రిటిష్ పరిపాలన కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వద్ద ఆక్రమణదారులకు ఎదురెళ్లి పోరాడిన ఓ ఆదివాసి తెగ నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుందట. ఇందులో విక్రమ్ ఆ తెగ నాయకుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన విక్రమ్ ఫస్ట్ లుక్ పూర్తి స్థాయి నలుపులో ఎంతో వైవిధ్యంగా ఉంది. మాళవికా మోహనన్, పార్వతి తిరువోతు, పశుపతి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమాని తొలుత సంక్రాంతికి, ఆ తర్వాత రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఏప్రిల్‌లో రిలీజ్ చేయ నున్నట్లు ఇటీవల పేర్కొన్నారు. భ్రమయుగంలో... దాదాపు 50 ఏళ్ల కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు మమ్ముట్టి. అయితే ఇప్పటివరకూ పోషించనటువంటి సరికొత్త పాత్రని ‘భ్రమయుగం’ సినిమాలో పోషిస్తున్నారాయన. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో మమ్ముట్టి లీడ్ రోల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘భ్రమయుగం’. హారర్ థ్రిల్లర్ జోనర్లో కేరళలోని కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి వాస్తవ ఘటనలతో ఈ చిత్రం రూపొందుతోంది. అక్కడి చీకటి యుగాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మమ్ముట్టి పాత్ర పూర్తి నలుపు రంగులో ఉంటుంది. ఇటీవల విడుదలైన ‘భ్రమయుగం’ మలయాళ టీజర్ పూర్తిగా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. ఆద్యంతం ఉత్కంఠతో సాగిన టీజర్లో సరికొత్త లుక్‌లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు మమ్ముట్టి. రామచంద్ర చక్రవర్తి నిర్మిస్తున్న ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. గొర్రెల కాపరి పృథ్వీరాజ్ సుకుమారన్ హ్యాండ్సమ్గా ఉంటారు. తన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన తొలిసారి ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) సినిమా కోసం పూర్తి స్థాయిలో నల్లటి మనిషిగా మారిపోయారు. బెన్యామిన్ రాసిన ‘గోట్ డేస్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బ్లెస్సీ. హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలా పాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి సౌదీ అరేబియాకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథ ఆధారంగా వాస్తవ ఘటనలతో ఈ సినిమా రూపొందుతోంది. గొర్రెల కాపరి నజీబ్ పాత్రలో నటిస్తున్నారు పృథ్వీరాజ్. గుబురు గడ్డం,పొడవైన జుట్టుతో నలుపు రంగులో ఉన్న పృథ్వీరాజ్ లుక్ ఇటీవల విడుదలైంది. ఈ పాత్ర కోసం ఆయన బరువు తగ్గారు. పూర్తి స్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా మాదేనంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏప్రిల్ 10న విడుదల కానుంది. ∙హ్యాండ్సమ్గా, పక్కింటి కుర్రాడిలా కనిపించే నాగచైతన్య ‘తండేల్’ సినిమా కోసం పక్కా మాస్ అవతారంలోకి మారిపోయారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం మత్య్సకారుల జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మత్స్యకారుని పాత్రలో నటిస్తున్నారు నాగచైతన్య. 2018లో జరిగిన వాస్తవ ఘటనలతో తెరకెక్కుతోంది. ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్’ అంటూ ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ ఓ డైలాగ్ చెబుతారు. నిజమే.. ఆయన కటౌట్ చూస్తే అలానే అనిపిస్తుంది. ‘బాహుబలి’ సినిమా నుంచి వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారాయన. ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సలార్: పార్ట్ 1– సీజ్ఫైర్’ డిసెంబరు 22న విడుదలై హిట్‌గా నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ అంతా బ్లాక్‌గా ఉంటుంది. బొగ్గు గనుల్లో మెకానిక్ దేవ పాత్రలో ప్రభాస్ లుక్ కూడా బ్లాక్ షేడ్‌లో ఉంటుంది. రెండో భాగంలోనూ ప్రభాస్ ట్యాన్ లుక్‌లో కనిపిస్తారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.. ప్రయోగాలు చేసే హీరోల్లో సూర్య ఒకరు. కమల్‌హాసన్ గత బ్లాక్ బస్టర్ మూవీ ‘విక్రమ్’ (2022)లో రోలెక్స్ పాత్రలో ట్యాన్ లుక్‌లో కనిపించారు సూర్య. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్లైమాక్స్‌లో ఈ పాత్ర వస్తుంది. రెండో భాగంలోనూ ఉంటుంది. సెకండ్ పార్ట్ చిత్రీకరణ ఇంకా ఆరంభం కాలేదు. అలాగే విడుదలకు సిద్ధమవుతున్న ‘కంగువా’ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో హీరో సూర్య ట్యాన్ లుక్‌లో కనిపిస్తారు. -
వేసవికి వాయిదా పడిన 'తంగలాన్'.. ఈసారైనా పక్కానా
-
మళ్లీ మళ్లీ వాయిదా పడుతున్న స్టార్ హీరో సినిమా
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ లేటెస్ట్ మూవీ 'తంగలాన్'. మాళవిక మోహనన్ హీరోయిన్. పశుపతి ముఖ్యపాత్ర పోషించారు. పా.రంజిత్ దర్శకత్వం వహించగా.. స్టూడియో గ్రీన్ పతాకంపై కే.ఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. కోలార్‌లోని కేజీఎఫ్ నేపథ్య కథతో ఈ సినిమా తీశారు. అయితే వచ్చే వారంలో రిలీజ్ కావాల్సిన చిత్రం ఇప్పుడు వాయిదా పడింది. (ఇదీ చదవండి: Salaar OTT: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?) ఈ సినిమా కోసం విక్రమ్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. షూటింగ్ అయితే చాన్నాళ్ల నుంచి చేస్తూ వచ్చారు. తొలుత సంక్రాంతి అన్నారు. ఆ తర్వాత జనవరి 26 అని డేట్ ప్రకటించారు. తాజాగా ఇప్పుడు వేసవికి 'తంగలాన్' చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇలా మళ్లీ మళ్లీ వాయిదా పడటంతో విక్రమ్ ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు. అయితే ఈ వాయిదాకు కారణం ఏమిటో తెలియలేదు. అదేవిధంగా అందులో తేదీని చెప్పలేదు. ఒకవేళ చెప్పినట్లు వేసవికి రిలీజ్ చేస్తారా? మళ్లీ అప్పుడు వాయిదా వేస్తారా? అనేది చూడాలి. అయితే తమిళ నూతన సంవత్సరం కానుకగా ఏప్రిల్ 1న మూవీ రిలీజయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. తాజాగా సంక్రాంతి సందర్భంగా ఈ విషయాన్ని పోస్టర్ రిలీజ్ చేసి మరీ అనౌన్స్ చేసింది. (ఇదీ చదవండి: సంక్రాంతి సినిమాల సందడి.. ఏది హిట్? కలెక్షన్స్ ఎంత?) In the darkness of Kolar Gold mines is a story waiting to be told. 👷#Thangalaan is coming soon on Netflix in Tamil, Telugu, Malayalam, Kannada, Hindi after theatrical release! #NetflixPandigai pic.twitter.com/8JXA9sEvdI — Netflix India South (@Netflix_INSouth) January 17, 2024 -
చియాన్ విక్రమ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు... ఫ్యాన్స్ ఫైర్
-
'ఆ స్టార్ హీరోకు అలా నటించడమే రాదు'.. డైరెక్టర్ సంచలన కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఆయనకు పెద్దఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఎలాంటి పాత్రనైనా ఇమిడిపోయే ప్రత్యేకత ఆయనకే సొంతం. అపరిచితుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ సినిమాలో ఏకంగా మూడు రూపాల్లో కనిపించి అభిమానులను మెప్పించాడు. అంతే కాదు కోలీవుడ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా.. గతేడాది మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సిరీస్ చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం ఆయన మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. పా రంజిత్ డైరెక్షన్లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తోన్న తంగలాన్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త ఏడాదిలో జనవరి 26న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ కోలీవుడ్ స్టార్‌పై తమిళ డైరెక్టర్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రముఖ తమిళ డైరెక్టర్, నటి దేవయాని భర్త రాజకుమారన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. విక్రమ్ నటనను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. డైరెక్టర్ రాజకుమారన్ మాట్లాడుతూ..'విక్రమ్ గొప్ప నటుడని నేను అనుకోవడం లేదు. ఉత్తమ నటుడు అని అంగీకరించను కూడా. అతను కమల్ హాసన్, రజనీకాంత్‌లా నటించగలడు అంతే. అలా కాకుండా ఎలా నటించాలో కూడా అతనికి తెలియదు. అతను గెటప్ మార్పులు మాత్రమే మార్చగలడు. క్లోజ్-అప్ షాట్లలో మేక్ఓవర్, విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా అతనికి ఎలా నటించాలో, ఎలా స్పందించాలో కూడా తెలియదు. స్పెషల్ ఎఫెక్ట్స్ లేకుండా విక్రమ్ ఆకట్టుకోలేకపోయాడు. నేను తీసిన విన్నుకుమ్ మన్నుకుమ్ చిత్రంలో అతనితో నాకు ఇదే సమస్య వచ్చింది. చేయి విరగగొట్టినట్లుగా, కాలు విరిగినట్లుగా, ఒక కన్ను కప్పినట్లుగా నటించడం నిజమైన నటన కాదు. మంచి నటుడు అలాంటి వాటిపై ఆధారపడకుండా భావోద్వేగాలను పండిచాలి. ముఖ్యంగా క్లోజప్ షాట్ల సమయంలో విక్రమ్ అలాంటి నటనను ప్రదర్శించలేడు.' అని అన్నారు. అయితే రాజకుమారన్ కామెంట్స్‌పై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. విక్రమ్ ప్రతిభ ఉన్న నటుడని.. ఆయన అలా మాట్లాడడం తెలివితక్కువ పనేనని నెటిజన్స్ మండిపడుతున్నారు. కాగా.. 2001లో రాజకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కించిన విన్నుకుమ్ మన్నుకుమ్ చిత్రంలో నటించారు. రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కించిన ఈ సినిమాలో శరత్‌కుమార్, ఖుష్బు, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. I dont agree that Chiyaan Vikram is a best actor. He can mimic act either like Kamal or like Rajini. He Cant act other than these two mode, he only can do getup changes. In Closeup, With plain face & no makeover, he doesnt know how to act or react. I had this issue with him in… pic.twitter.com/q2JjWoXkO2 — Christopher Kanagaraj (@Chrissuccess) January 9, 2024 -
తిరుత్తణి నేపథ్యంలో విక్రమ్ 62వ చిత్రం
కోలీవుడ్ నటుడు విక్రమ్ చిత్రం అంటే కచ్చితంగా కొత్తగా ఉంటుందని అభిమానులు, ప్రేక్షకులు విశ్వసిస్తారు. దాన్ని ఆయన వమ్ము కాకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. అందుకోసం విక్రమ్ శాయశక్తులా శ్రమిస్తారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం తంగలాన్. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 2024 జనవరి 26వ తేదీన రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్రంలో విక్రమ్ అసాధారణ నటనను చూడవచ్చని ఆయన గెటప్, టీజర్ చూస్తే అనిపిస్తోంది. తంగలాన్ చిత్రం కోసం విక్రమ్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఆయన తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఇది విక్రమ్ నటించే 62వ చిత్రం అవుతుంది. దీనికి అరుణ్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ దర్శకుడు ఇంతకు ముందు పన్నైయారుమ్ పద్మినియుమ్, సేతుపతి, చిత్రా వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. విక్రమ్ 62వ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించనున్నారు. దీన్ని రియా శిబు నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటనతో కూడిన టీజర్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఇది తిరుత్తణి నేపథ్యంలో సాగే కథా చిత్రం అని సమాచారం. చిత్రం వచ్చే ఏడాది మార్చి నెలలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. ఇందులో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. దర్శకుడు అరుణ్‌కుమార్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రా చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకోవడంతో ఈయన విక్రమ్ హీరోగా తెరకెక్కించనున్న చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. -
విక్రమ్ 'ధ్రువ నక్షత్రం' వాయిదా.. చివరి క్షణంలో నిర్ణయం!
కోలీవుడ్ టాప్ హీరో 'విక్రమ్' నటించిన చిత్రం 'ధ్రువ నక్షత్రం'. స్పై, యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో 'గౌతమ్ మేనన్' దీనిని సిద్ధం డైరెక్ట్ చేశారు. 2016లోనే ఈ సినిమా పట్టాలెక్కిన ఈ చిత్రాన్ని 2017లో విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. చిత్రీకరణ పూర్తైనప్పటికీ అనుకోని కారణాలతో ఈ చిత్రం వాయిదా పడింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. నేడు నవంబర్ 24న ఇది ప్రేక్షకుల ముందుకు రానుందని అధికారికంగా ప్రకటన కూడా చేశారు. ఇప్పటికే విక్రమ్ అభిమానులు టికెట్లు కూడా కొన్నారు. కొన్ని గంటల్లో బొమ్మ థియేటర్లలో పడుతుండగా తాజాగా ఈ చిత్రాన్ని మరోసారి వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు గౌతమ్ మేనన్ ప్రకటించారు. దీంతో విక్రమ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. గౌతమ్ మేనన్ ఏం చెప్పారంటే ఈరోజు విడుదల కానున్న ధ్రువ నక్షత్రం చిత్రాన్ని వాయిదా వేస్తున్నాం. కొన్ని కారణాల వల్ల నేడు ఈ సినిమా విడుదల చేయడం లేదు. అందుకు గాను నన్ను క్షమించండి. సినిమా విడుదల కోసం చాలా ప్రయత్నించాను. మరో రెండు రోజుల్లో ఈ సినిమాపై ప్రకటన ఇస్తాం. ఈ సినిమా అందరికీ అందుబాటులోకి రావాలని నేను కోరుకుంటున్నాను.' అని ఆయన అన్నారు. కారణం ఏంటి..? కోలీవుడ్‌లో శింబు నటించిన 'సూపర్ స్టార్' చిత్రానికి దర్శకత్వం వహించేందుకు వాసుదేవ్ మీనన్ ఆల్ ఇన్ పిక్చర్స్ నుంచి రూ.2.40 కోట్లు తీసుకున్నారని, అయితే ఆ సినిమా పనులు పూర్తి చేయలేదని, సంస్థకు డబ్బులు తిరిగి చెల్లించలేదని గతంలో వార్తలు వచ్చాయి. తదనంతరం, డబ్బు తిరిగి ఇవ్వకుండా ధృవ నక్షత్రం విడుదల చేయవద్దని నిర్మాణ సంస్థ ఆల్ ఇన్ పిక్చర్స్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈరోజు (నవంబర్ 24) ఉదయం 10.30 గంటలలోపు ఆన్ ఇన్ పిక్చర్స్‌కు రూ. 2 కోట్ల రూపాయలను తిరిగి ఇస్తే సినిమా విడుదల చేస్తామని కోర్టు షరతులు విధించింది. దీంతో ధ్రువ నక్షత్రం సినిమాకు బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. #DhruvaNatchathiram #DhruvaNakshathram pic.twitter.com/dmD4ndEnp9 — Gauthamvasudevmenon (@menongautham) November 23, 2023 -
పాన్ ఇండియాని షేక్ చేయబోతున్న విక్రమ్
-
తంగలాన్ గురించి బిగ్ సీక్రెట్ రివీల్ చేసిన విక్రమ్
చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ కోసం సౌత్ ఇండియా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇందులో పార్వతి, మాళవిక మోహన్, పశుపతి ముఖ్యపాత్రలు పోషించారు. పా.రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా విడుదల చేసిన తంగలాన్ టీజర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. టీజర్లో విక్రమ్ చాలా వైల్డ్‌గా కనిపించాడు. ఇందులో ఎలాంటి డైలాగ్స్ లేకుండా టీజర్‌ను చూపించారు. కానీ యాక్షన్ సీన్స్,బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని చెప్పవచ్చు. టీజర్లో పామును పట్టుకుని చేతితోనే విక్రమ్ రెండు ముక్కలు చేస్తాడు.. ఈ సీన్ భారీగా వైరల్ అవుతుంది. టీజర్ విడుదల చేసిన తర్వాత తంగలాన్ గురించి విక్రమ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయాన్ని ఆయన రివీల్ చేశాడు. ఈ సినిమాలో ఎక్కడా కూడా విక్రమ్‌కు డైలాగ్స్ ఉండవట. గతంలో శివపుత్రుడు చిత్రంలో కూడా ఆయనకు ఎలాంటి డైలాగ్స్ లేవు కానీ తన నటనతో సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. ఆ సినిమాతోనే తెలుగులో ఆయనకు క్రేజ్ పెరిగింది. టాలీవుడ్ గురించి విక్రమ్ ఇలా అన్నాడు. 'తెలుగు అభిమానులకు సినిమా అంటే ఎంత అభిమానమో నాకు తెలుసు.. కథ బాగుంటే భాషతో సంబంధం లేకుండా వారు ఆదరిస్తారు. దానికి నిదర్శనమే శివపుత్రుడు. ఆ సినిమాను వారు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. ఆ సినిమా నాకు ఎంతపేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు తంగలాన్ కూడా అంతే పేరు తెస్తుంది. ఈ చిత్రంలో నాకు ఎలాంటి డైలాగ్స్ లేవు.. అంతా అరవడమే. దానికి కారణం ఉంది. అదేంటో సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. శివపుత్రుడు మాదిరే తంగలాన్‌లో కూడా ఎలాంటి డైలాగ్స్ ఉండవు.' అని విక్రమ్ తెలిపాడు. -
తంగలాన్ నాకో కొత్త అనుభవం
‘‘నేను విదేశాలు వెళ్లినప్పుడు మీరు బాలీవుడ్డా అని అడుగుతుంటారు. నేను కోలీవుడ్, టాలీవుడ్ అని చెబుతుంటాను. అంటే... వారు ఎక్కువగా హిందీ చిత్రాలే చూసేవారు. కొన్నేళ్లుగా సౌత్ సినిమాలు చూస్తున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్’..లాంటి సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి. దక్షిణాది సినిమాలు ఇప్పుడు ఓ మార్క్‌ని క్రియేట్ చేస్తున్నాయి. రాజమౌళిగారు ఆస్కార్‌ను మనకు తీసుకొచ్చారు. ఆయనతో ఓ సినిమా చేయాలని ఉంది’’ అన్నారు విక్రమ్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘తంగలాన్’. విక్రమ్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. పా. రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా జనవరి 26న రిలీజ్ కానుంది. బుధవారం జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో విక్రమ్ మాట్లాడుతూ– ‘‘తంగలాన్’ ఎమోషనల్ అండ్ రా ఫిల్మ్. రెగ్యులర్ సాంగ్స్, ఫైట్స్.. ఇలాంటి తరహా సినీ గ్లామర్ ‘తంగలాన్’లో లేదు. నా పాత్రకు డైలాగ్స్ అంతగా ఉండవు. లైవ్ సౌండింగ్లో సినిమా చేశాం. నాకు కొత్త ఎక్స్పీరియన్స్. మేకప్‌కు మూడు గంటలు పట్టేది. మీనింగ్‌ఫుల్ సినిమాలు చేస్తుంటారు పా. రంజిత్‌గారు. ‘తంగలాన్’తో ప్రేక్షకులు ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. ఇక నేను చేసిన ‘9 నెలలు’ చిత్రానికి సురేందర్‌రెడ్డి, వినయ్‌లు అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా చేశారు. ఇప్పుడు సురేందర్ రెడ్డి ఈ ఈవెంట్‌కు వచ్చారు. లైఫ్ సర్కిల్లా అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘విక్రమ్‌గారితో నేను చేసిన తొలి చిత్రమిది. ఆయన అంకితభావం, టైమింగ్ సూపర్. ‘తంగలాన్’ సినిమా ప్రేక్షకులను మెప్పి స్తుంది’’ అన్నారు పా. రంజిత్. ‘‘విక్రమ్ ట్రెమండస్ యాక్టర్. వరల్డ్ సినిమా లవర్స్‌కు ‘తంగలాన్’ ఓ గ్రేట్ ట్రీట్‌లా ఉంటుంది’’ అన్నారు కేఈ జ్ఞానవేల్ రాజా. ‘‘విక్రమ్ సార్ ఓ నటుడుగా తనను తానే మళ్లీ ఆవిష్కరించుకుంటుంటారు’’ అని అతిథిగా పాల్గొన్న సత్యదేవ్ అన్నారు. దర్శకులు వేణు ఊడుగుల, కరుణకుమార్, దర్శక–నిర్మాత మధుర శ్రీధర్ అతిథులుగా పాల్గొన్నారు.