Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ex Minister Kurasala Kannababu Slams On Chandrababu1
‘చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ కాదు.. సూపర్‌ షాక్‌లిచ్చారు’

సాక్షి, కాకినాడ: గత ఏడు నెలలుగా చంద్రబాబు ప్రజలకు షాక్ ఇస్తున్నారని.. ఆరోగ్యశ్రీ ఉందా? లేదా? అనే పరిస్ధితికి తీసుకువచ్చారంటూ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్సులిన్‌ కూడా లేని పరిస్ధితి ఉందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారని.. కొందర్ని తొలగించారని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.సూపర్ సిక్స్ కాదు.. సూపర్ షాక్ అన్నట్లుగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. భుజాలపై మోసే సొంత మీడియా ఉండడమే చంద్రబాబు అదృష్టం. పేరులో ఉచితం తప్పా.. ఉచిత ఇసుక ఎక్కడా?. చంద్రబాబుకు ఇస్తున్న షాకులకు ఎవరూ మినహయింపు కాదు. బాబు వస్తే తమకు స్వర్గం అనుకున్న మద్యం ప్రియులకు కూడా షాక్ ఇచ్చారు’’ అని కన్నబాబు దుయ్యబట్టారు.‘‘ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు ఇవాళ వైఎస్సార్‌సీపీ పోరుబాట దిగ్విజయంగా జరిగింది. విద్యుత్ భారం, మూడు డిమాండ్లను అధికారులకు వినతిపత్రం ద్వారా అందించాం. ఒక్క నెలలోనే ఆరు వేల కోట్లు విద్యుత్ ఛార్జీల రూపంలో వసూలు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఎంత కాలం జగన్ నామ స్మరణం చేస్తారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. పచ్చి అబద్దాలను కూటమి ప్రభుత్వం మానిఫెస్టోలో పెట్టింది. చంద్రబాబు సర్కార్‌ ఎన్ని కుట్రలు చేసిన ప్రజల తరఫున వైఎస్సార్‌సీపీ పోరు ఆపదు.’’ అని కన్నబాబు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: కరెంట్‌ కోత.. చార్జీల మోత‘‘ఉచిత విద్యుత్ అంటే వైఎస్సార్‌ గుర్తుకు వస్తారు. తొమ్మిది గంటల పాటు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. రైతుల ఉచిత విద్యుత్ కోసం ఫీడర్లను ఆధునీకరించారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు పట్ల ప్రజల ఆగ్రహం బయటకు వచ్చింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలను అమలు చేయాలి’ అని చంద్రబాబు సర్కార్‌ను కురసాల కన్నబాబు డిమాండ్‌ చేశారు.

Rupee Hits Record Low of rs 85 50 against US dollar2
రూపాయి భారీ పతనం.. రికార్డు కనిష్టం నమోదు

డాలరుతో రూపాయి మారక విలువ శుక్రవారం అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. దాదాపు రెండేళ్ల జీవితకాల ఇంట్రాడే కనిష్ట స్థాయికి పడిపోయి రూ. 85.80కి చేరుకుంది. తర్వాత సెంట్రల్ బ్యాంక్ గట్టి ప్రయత్నాలతో కొంత మేర పుంజుకుని రికార్డు స్థాయికి 23 పైసలు దిగువన 85.50 (తాత్కాలిక) వద్ద స్థిరపడింది.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ స్వల్పకాలిక ఫార్వర్డ్ కాంట్రాక్ట్‌లలో డాలర్ చెల్లింపులను కొనసాగించడం డాలరు కొరతను పెంచింది. దీంతో నెలాఖరు చెల్లింపుల కోసం దిగుమతిదారుల నుంచి డాలరుకు డిమాండ్‌ పెరిగింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో బలమైన సెంటిమెంట్ ఉన్నప్పటికీ, విదేశీ నిధుల నిరంతర ప్రవాహం, పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా రూపాయి పతనమైనట్లు దిగుమతిదారులు చెబుతున్నారు.ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ వద్ద రూ.85.31 వద్ద బలహీనంగా ప్రారంభమైన రూపాయి 53 పైసలు పడిపోయి ఇంట్రాడేలో కనిష్ట స్థాయి రూ.85.80కి పడిపోయింది. చివరకు డాలరుతో పోలిస్తే రూ.85.50 (తాత్కాలిక) వద్ద సెషన్‌ను ముగించింది. దాని మునుపటి ముగింపు స్థాయి రూ.85.27 నుండి 23 పైసలు నష్టపోయింది.గత రెండు వారాల్లో రూపాయి దాదాపు ప్రతిరోజూ కొత్త కనిష్ట స్థాయిలను తాకుతోంది. గత రెండు సెషన్లలో 13 పైసలు క్షీణించిన తర్వాత గురువారం డాలర్‌తో పోలిస్తే 12 పైసలు పతనమై 85.27 వద్దకు చేరుకుంది. రూపాయి అంతకుముందు 2023 ఫిబ్రవరి 2న 68 పైసలు పతనమైంది.

Rohit Sharma To Retire After BGT Series? Report Makes Big Agarkar Claim3
మెల్‌బోర్న్‌లోనే అగార్కర్‌?.. రోహిత్‌ భవిష్యత్తుపై నిర్ణయం అప్పుడే!

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) త్వరలోనే రిటైర్‌ కానున్నాడా? బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో గనుక భారత జట్టు ఓడిపోతే.. అతడు టెస్టుల నుంచి కూడా తప్పుకుంటాడా?.. క్రికెట్‌ వర్గాల్లో ప్రస్తుతం ప్రధానంగా నడుస్తున్న చర్చ ఇదే!వరుస వైఫల్యాలుగతంలో ఎన్నడూ లేని విధంగా రోహిత్‌ శర్మపై తీవ్ర విమర్శలు రావడానికి కారణం అతడి పేలవ ఫామ్‌. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆటగాడిగా.. కెప్టెన్‌గా రోహిత్‌ విఫలమయ్యాడు. సొంతగడ్డపై కివీస్‌తో సిరీస్‌లో అతడు చేసిన పరుగులు వరుసగా.. 2, 52, 0, 8, 18, 11.ఇక న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రోహిత్‌ సారథ్యంలోని టీమిండియా 0-3తో క్లీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే. తద్వారా భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో.. స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలిసారి ఇంతటి ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(World Test Championship డబ్ల్యూటీసీ)2023-25 ఫైనల్‌ చేరాలంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో కచ్చితంగా నాలుగు టెస్టులు గెలవాల్సిన స్థితిలో నిలిచింది.చావో- రేవోఅయితే, బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు రోహిత్‌ శర్మ దూరమయ్యాడు. అతడి గైర్హాజరీలో టీమిండియాను ముందుకు నడిపించిన జస్‌ప్రీత్‌ బుమ్రా భారీ విజయం అందించాడు. ఇక రెండో టెస్టు నుంచి రోహిత్‌ జట్టుతో చేరినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది.రోహిత్‌ కెప్టెన్సీలో ఆసీస్‌ చేతిలో పింక్‌బాల్‌ టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడింది. మూడో టెస్టులోనూ విఫలమై.. వర్షం కారణంగా అదృష్టవశాత్తూ డ్రా చేసుకోగలిగింది. అయితే, ఈ రెండు మ్యాచ్‌లలోనూ రోహిత్‌ పూర్తిగా నిరాశపరిచాడు. మూడు ఇన్నింగ్స్‌ ఆడి 3, 6, 10 పరుగులు చేశాడు.ఓపెనర్‌గా వచ్చినా నో యూజ్‌!ఇక మెల్‌బోర్న్‌ వేదికగా నాలుగో టెస్టులోనూ రోహిత్‌ శర్మ పూర్తిగా నిరాశపరిచాడు. రెండు, మూడు టెస్టుల్లో మిడిలార్డర్‌లో వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఈ టెస్టులో మాత్రం తన రెగ్యులర్‌ స్థానంలో ఓపెనర్‌గానే బరిలోకి దిగాడు. కానీ.. ఈసారి కూడా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఐదు బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులే చేశాడు.ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో మరో పేసర్‌ స్కాట్‌ బోలాండ్‌కు క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ శర్మ పెవిలియన్‌ చేరాడు. నిజానికి అనవసరపు షాట్‌కు యత్నించి అతడు వికెట్‌ పారేసుకోవడంతో విమర్శలు మరింత పదునెక్కాయి.మెల్‌బోర్న్‌లోనే అగార్కర్‌?.. రోహిత్‌ భవిష్యత్తుపై నిర్ణయం అప్పుడే!ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ అంశం మరోసారి చర్చకు వచ్చింది. టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ప్రస్తుతం మెల్‌బోర్న్‌లోనే ఉన్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో గనుక భారత జట్టు ఓడిపోతే.. రోహిత్‌ శర్మ భవిష్యత్తు గురించి కఠిన నిర్ణయం తీసుకునే యోచనలో టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఉన్నట్లు తెలుస్తోంది.రోహిత్‌ మనసులో ఏముందో?అదే విధంగా.. రోహిత్‌ సైతం ఈసారి తన సారథ్యంలో భారత్‌ డబ్ల్యూటీసీ తుదిపోరుకు అర్హత సాధించడంలో విఫలమైతే.. రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. 37 ఏళ్ల హిట్‌మ్యాన్‌ టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు కూడా ఊహాగానాలు వస్తున్నాయి. కాగా డబ్ల్యూటీసీ మొట్టమొదటి సీజన్‌ 2019-21లో కోహ్లి కెప్టెన్సీలో ఫైనల్‌ చేరిన టీమిండియా.. న్యూజిలాండ్‌కు ట్రోఫీని చేజార్చుకుంది. ఇక 2021-23 సీజన్‌లో రోహిత్‌ సేన ఫైనల్‌కు చేరుకున్నా.. ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడి మరోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈసారి మాత్రం ఫైనల్‌కు చేరేందుకే ఆపసోపాలు పడుతోంది. ఈ నేపథ్యంలోనే రోహిత్‌ శర్మపై మునుపెన్నడూ లేని విధంగా ప్రతికూల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా కెప్టెన్‌ హోదాలో టీ20 ప్రపంచకప్‌-2024 గెలిచిన తర్వాత రోహిత్‌ కేవలం టెస్టు, వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: నిర్దాక్షిణ్యంగా అతడిపై వేటు వేయండి.. అప్పుడైనా..: టీమిండియా దిగ్గజం Indian skipper Rohit Sharma is gone for just three runs! #AUSvIND pic.twitter.com/m1fLiqKLO7— cricket.com.au (@cricketcomau) December 27, 2024

YSRCP Protests Against Power Charges Hike In AP
విద్యుత్ చార్జీల పెంపుపై వైఎస్సార్‌సీపీ పోరుబాట

కూటమి ప్రభుత్వంలో విద్యుత్‌ ఛార్జీల పెంపుపై వైఎస్సార్‌సీపీ పోరుబాట.. ప్రజలకు అండగా నిలుస్తూ..

Man Hangs Under Train To Travel 250 Km From Itarsi To Jabalpur5
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే సీన్‌.. ట్రైన్ చక్రాల కింద వేలాడుతూ 250 కి.మీ. జర్నీ

నమ్మండి నమ్మకపోండి.. ఇది నిజంగానే ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. రైలు చక్రాల మధ్య వేలాడుతూ ఓ వ్యక్తి చేసిన ప్రయాణం మామూలుగా లేదు. మధ్యప్రదేశ్‌లోని దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ కింద దాక్కున్న ఓ వ్యక్తి.. ఇటార్సీ నుండి జబల్‌పూర్ వరకు దాదాపు 250 కిలోమీటర్లు రైలు బోగీ చక్రాల మధ్య వేలాడుతూ ప్రయాణించడం షాక్‌కు గురిచేస్తోంది. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జబల్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు రోలింగ్ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో S-4 కోచ్ కింద ఈ వ్యక్తిని గుర్తించారు.అతడిని ఆ పరిస్థితిలో చూసిన సిబ్బంది అశ్చర్యానికి గురై వెంటనే. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులకు సమాచారం అందించగా, అతనిని బోగీ కింద చక్రాల మధ్య నుంచి బలవంతంగా బయటకు తీసి అదుపులోకి తీసుకున్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి రైలుకు కింద వేలాడుతూ ప్రయాణించినట్లు స్పష్టమవుతోంది.అధికారుల విచారణలో ఆ వ్యక్తి టిక్కెట్‌ కొనడానికి డబ్బులు లేవని.. అందువలనే ప్రయాణం కోసం ఈ రిస్క్‌ చేసినట్లు తెలిపాడు. ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా వివరాలు వెల్లడి కాలేదు. ఆ వ్యక్తి రైలు కింద ఎలా దాక్కున్నాడో కూడా అస్పష్టంగానే ఉంది. ప్రస్తుతం ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. #BreakingNews‌ *"यह खबर हैरान कर देगी"**टिकट के लिए पैसा नही था, तो ट्रेन के बोगी के नीचे पहिये के पास बैठ कर एक शख्स ने किया 250 किलोमीटर का सफर!!*मध्य प्रदेश में इटारसी से जबलपुर आने वाली दानापुर एक्सप्रेस ट्रेन के S-4 बोगी के नीचे पहिये के पास बने ट्राली में एक व्यक्ति ने… pic.twitter.com/41ZUpDOBxY— THIS IS WRONG NUMBER (@Thiswrongnumber) December 27, 2024

German President Dissolves Parliament For February 23 Snap Elections6
జర్మనీ పార్లమెంట్‌ రద్దు.. 7 నెలల ముందే ఎన్నికలు

బెర్లిన్: జర్మనీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముందస్తు ఎన్నికలకు మార్గం సుగమమైంది. ఆ దేశ అధ్యక్షుడు ఫ్రాంక్‌ వాల్టర్ పార్లమెంట్‌ను రద్దు చేశారు. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. "ముఖ్యంగా కష్ట సమయాల్లో జర్మనీకి ముందస్తు ఎన్నికలు సరైన మార్గమని స్టెయిన్‌మీర్ అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.ఛాన్సలర్‌ ఒలాఫ్‌ స్కోల్జ్‌ విశ్వాస పరీక్షలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో పార్లమెంటును రద్దు చేసి, ఫిబ్రవరి 23న ఎన్నికలు జరపడానికి నిర్ణయించారు. అయితే, అనుకున్న సమయం కన్నా ఏడు నెలల ముందుగానే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రధాన పార్టీల నేతలు అంగీకారం తెలిపారు.జర్మనీ చాన్సెలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ డిసెంబర్‌ 16న పార్లమెంట్‌లో విశ్వాస పరీక్షలో ఓటమి పాలు కావడంతో యూరప్‌లోనే అత్యధిక జనాభా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీలో ఫిబ్రవరిలోనే ముందస్తు ఎన్నికలకు ఈ పరిణామం దారి తీసింది. మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం నవంబర్‌ 6న కుప్పకూలింది. రాజ్యాంగం ప్రకారం సభలో విశ్వాస పరీక్ష చేపట్టగా, మొత్తం 733 మంది సభ్యులుండే దిగువ సభ బుండెస్టాగ్‌లో షోల్జ్‌కు అనుకూలంగా 207 మంది ఓటేశారు.దీంతో, ఆయన సభ విశ్వాసం పొందలేకపోయినట్లు ప్రకటించారు. విశ్వాసంలో గెలవాలంటే మరో 367 ఓట్ల అవసరముంది. కాగా, ఉక్రెయిన్‌కు ఆయుధ, ఆర్థిక సాయమందించేందుకు సిద్ధమని ప్రకటిస్తున్న షోల్జ్‌ ‘సోషల్‌ డెమోక్రాట్‌’పార్టీకి వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు తక్కువని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం యూనియన్‌ బ్లాక్‌ ముందంజలో ఉందంటున్నారు.ఇదీ చదవండి: అంత ప్రమాదంలో బతికి బట్టకట్టాడు.. మరో వీడియో వైరల్‌

Condolences On Former Pm Manmohansingh Demise Updates7
మన్మోహన్‌కు ప్రధాని,రాష్ట్రపతి నివాళి

మన్మోహన్‌సింగ్‌ పార్థివ దేహానికి ప్రధాని మోదీ నివాళులు..మన్మోహన్‌ సింగ్‌ ఇంటికి చేరుకున్న ప్రధాని మోదీమాజీ ప్రధాని పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన మోదీమన్మోహన్‌ సతీమణి గురుశరణ్‌కౌర్‌, కుటుంబ సభ్యులకు సంతాపంప్రధానితో పాటు మన్మోహన్‌ ఇంటికి వచ్చిన అమిత్‌ షా, జేపీ నడ్డా మన్మోహన్‌ పార్థివ దేహానికి రాష్ట్రపతి నివాళిమన్మోహన్‌సింగ్‌ పార్థివ దేహానికి రాషష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళిమన్మోహన్‌ సింగ్‌ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపిన ముర్ము ఢిల్లీమన్మోహన్‌సింగ్‌ పార్థివ దేహానికి తెలంగాణ సీఎం రేవంత్‌ నివాళులుమన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిమన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్‌ను, ,కుటుంబ సభ్యులను పరామర్శించిన రేవంత్ రెడ్డిమన్మోహన్‌‌ నివాసానికి కాంగ్రెస్‌ అగ్రనేతలుమన్మోహన్‌ ఇంటికి వచ్చిన సోనియాగాంధీ రాహుల్‌గాంధీ, మల్లికార్జునఖర్గే, ప్రియాంకగాంధీమన్మోహన్‌ పార్థివ దేహానికి నివాళులర్పించిన నేతలు వ్యక్తిగతంగా నాకు తీరనిలోటు: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మన్మోహన్‌ లేని లోటు పూడ్చలేనిదిచాలా కాలం నుంచి మన్మోహన్‌ నాకు తెలుసుసభ్యతకు నిలువెత్తు రూపం మన్మోహన్‌సింగ్‌వీడియో విడుదల చేసిన మాజీ రాష్ట్రపతిఆ మాటే నిజమైంది: శశిథరూర్‌ మాజీ ప్రధాని మన్మోహన్‌ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టిన శశిథరూర్‌చరిత్ర నా పట్ల దయతో ఉంటుందని 2014లో వ్యాఖ్యానించిన మన్మోహన్‌ఆయన చెప్పిన మాటలను గుర్తుచేస్తూ పోస్టు పెట్టిన కాంగ్రెస్‌ ఎంపీపదేళ్ల తర్వాత అదే నిజమైందని వ్యాఖ్యమన్మోహన్‌ దేశ సేవ..రాబోయే తరాలకు స్ఫూర్తి: సిక్కిం సీఎం తమాంగ్‌మన్మోహన్‌ మృతిపట్ల సంతాపం తెలిపిన సిక్కిం సీఎం ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ఆర్థిక సంస్కరణలకు నాంది పలికి దేశాభివృద్ధికి గట్టి పునాది వేశారుదేశానికి మన్మోహన్‌ చేసిన సేవలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని వ్యాఖ్య మాజీ ప్రధాని మన్మోహన్‌ మృతి పట్ల అమెరికా సంతాపంగత రెండు దశాబ్దాల్లో అమెరికా,భారత్‌ సాధించిన మన్మోహన్‌ పునాది వేశారుఅమెరికా‌, భారత్‌ పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మన్మోహన్‌ కీలక పాత్ర పోషించారుభారత్ వేగంగా అభివృద్ధి చెందడానికి ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజలకు గుర్తుండిపోతాయిప్రకటించిన అమెరికా‌ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌

Punjab Sensational Ram Saroop Case Chilling Details Here8
‘చీర కడితే.. బొట్టు పెడితే హేళన చేస్తారా?’

విలన్స్‌ ఆర్‌ నాట్‌ బార్న్‌.. దే ఆర్‌ మేడ్‌ బై సొసైటీ.. వ్యవస్థే విలన్లను తయారు చేస్తుందని అర్థం. అవసరాలకు తగ్గట్లు బతికే మనిషి.. అవతలివాళ్లను అవహేళన చేయడం అంతే పరిపాటిగా మార్చేసుకున్నాడు. అయితే మానసిక రుగ్మతలో కూరుకుపోయిన మనిషి ముందు అది ప్రదర్శిస్తే.. అది ప్రాణాల మీదకే రావొచ్చు. అలాంటి వాస్తవ ఘటనే ఇది. ‘‘తస్మాత్‌ జాగ్రత్త! ఇలాంటి నేరగాళ్లు మన మధ్యే ఉంటారు’’ అని పాఠకులకు తెలియజేయడమే మా ఉద్దేశం.33 ఏళ్ల రామ్‌ స్వరూప్‌. చూడడానికే కాదు.. మీడియా ముందు అతని మాటలు అంతే అమాయకంగా ఉన్నాయి. కానీ, ఓ హత్య కేసు ఇంటరాగేషన్‌లో నోరు విప్పి అతను చెప్పిన విషయాలు ఖాకీలనే విస్తుపోయేలా చేశాయి. ఏడాదిన్నర కాలంలో 11 మందిని అతికిరాకతంగా హతమార్చిన సీరియల్‌ కిల్లర్‌ ఇతనేనంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు!.పంజాబ్‌(Punjab)లో ఈ సీరియల్‌ కిల్లర్‌ ఉదంతం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. మగవాళ్లకు మాత్రమే లిఫ్ట్ ఇచ్చి.. ఆపై వాళ్లను దారుణంగా హతమార్చాడతను. ఈ క్రమంలో అతను నేరాలకు పాల్పడ్డ తీరు.. అందుకు అతను చెప్తున్న కారణాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ‘‘వాళ్లు నన్ను కొజ్జావాడంటూ హేళన చేశారు. నా వేషధారణను అవహేళన చేశారు. పైగా నాతో శారీరక అవసరాలు తీర్చుకుని ఇస్తానన్న డబ్బూ ఇవ్వలేదు. ఈ విషయాలు నన్ను ఎంతో బాధించాయి. అందుకే చేతికి ఏది దొరికితే దాంతో.. అక్కడికక్కడే వాళ్లను చంపాల్సి వచ్చింది’’ ఇది నేరాంగీకారంలో రామ్‌ స్వరూప్‌ అలియాస్‌ సోధీ చెప్పిన అసలు విషయం.👉రామ్‌ స్వరూప్‌ స్వస్థలం.. హోషియార్పుర జిల్లా చౌరా గ్రామం. అతని తల్లిదండ్రులు విద్యావంతులు. ఆర్థికంగా ఉన్న కుటుంబమే. కానీ, రామ్‌ స్వరూప్‌లోపల ఇంకొకరు ఉన్నారు. అతనికి చిన్నప్పటి నుంచి ఆడవాళ్లలా అలంకరించుకోవడం ఇష్టం. చెబితే.. ఇంట్లోవాళ్లు కోప్పడతారనే భయం. అందుకే తల్లిదండ్రులు లేనప్పుడు రహస్యంగా మేకప్‌ వేసుకుని మురిసిపోయేవాడు. ఆ రహస్య జీవితం చాలా ఏళ్లపాటు అలాగే కొనసాగింది. అయితే 2005లో దుబాయ్‌ జీవితం అతనిలో మరో కోణాన్ని బయటకు తీసింది. 👉అక్కడ స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డాడతను. ఆపై తిరిగి స్వదేశానికి వచ్చాడు. కోడుకులోని ఆ కోణం తెలిసి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. నిపుణులతో కౌన్సెలింగ్‌ ఇప్పించారు. అయినా అతనిలో మార్పు రాలేదు. చివరకు.. రామ్‌ స్వరూప్‌కు వివాహం చేశారు. ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. అయితే అతనిలోని ఆ కోణం.. భార్యకు ఆలస్యంగా తెలిసింది. రెండేళ్ల కిందట పిల్లలను తీసుకుని పుట్టింటి వెళ్లిపోయింది. ఇటు తల్లిదండ్రులు అతన్ని దూరం పెట్టారు.ఒంటరి అయిన రామ్‌ స్వరూప్‌కు ‘తేడాగాడు’ అనే ముద్ర వేసి ఎవరూ పని ఇవ్వలేదు. దీంతో తనదైన అవసరాల కోసం రోడ్డెక్కాడతను. అందుకోసం చీర కట్టి.. బొట్టు పెట్టి.. ముస్తాబయ్యేవాడు. చూసేవాళ్లంతా తనను తేడా అనుకున్నా ఫర్వాలేదనే ధీమా అతనికి కలిగింది అప్పుడు. అయితే.. ఎప్పుడైతే తాను అనుకున్నది నెరవేరలేదో.. అతనిలో మృగం బయటికి వచ్చింది.👉 మోద్రా టోల్‌ప్లాజా వద్ద టీ, వాటర్‌ బాటిళ్లు అమ్ముకునే మహిందర్‌ సింగ్‌ అనే వ్యక్తి ఆగష్టు 18వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనా స్థలంలో క్లూస్‌ టీంకు ఓ చిన్న గుడ్డముక్క దొరికింది. అయితే అప్పటిదాకా దొరక్కుండా జాగ్రత్త పడిన రామ్ స్వరూప్‌.. ఎప్పుడూ తన మెడలో ఉంచుకునే మఫ్లర్‌తో అడ్డంగా దొరికిపోయాడు.‌ నాలుగు నెలలపాటు జరిగిన దర్యాప్తు.. గాలింపు అనంతరం డిసెంబర్‌ 25వ తేదీన రామ్‌ స్వరూప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ​👉తనతో శారీరక అవసరం తీర్చుకునే సమయంలో మహిందర్‌ తన కట్టూబొట్టును అవమానించాడని.. అది తట్టుకోలేకే అతన్ని హతమార్చినట్లు రామ్‌ స్వరూప్‌ నేరం ఒప్పుకున్నాడు. అంతేకాదు.. దీనికంటే ముందు 10 హత్యలు చేసినట్లు ఈ సీరియల్‌ కిల్లర్‌(Serial Killer) పోలీసుల దిమ్మతిరిగిపోయేలా విషయం ఒకటి చెప్పాడు.👉రామ్‌ స్వరూప్‌ చేసిన తొలి హత్య.. హర్‌ప్రీత్‌ అనే మాజీ ఆర్మీ అధికారిది. 18 నెలల కిందట జరిగిందా ఘోరం. ఆయనతో లైంగికంగా కలిశాక.. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో హర్‌ప్రీత్‌ను హతమార్చి.. ఆయన వీపులో ధోకేబాజ్‌(మోసగాడు) అని రెడ్‌ ఇంక్‌తో రాత రాశాడు. ఈ కేసు పంజాబ్‌లో ఆ మధ్య చర్చనీయాంశం అయ్యింది కూడా. అయితే విచారణలో పోలీసులు ఎలాంటి పురోగతిని సాధించలేకపోయారు.👉ఈ ఘటన తర్వాత.. రామ్‌ స్వరూప్‌ అప్రమత్తం అయ్యాడు. రోజూవారీ పని చేసుకునే కూలీలు, మెకానిక్‌లు, సెక్యూరిటీ గార్డును రామ్‌ స్వరూప్‌ టార్గెట్‌ చేసుకునేవాడు. మరికొందరికి లిఫ్ట్‌ ఆఫర్‌ చేసేవాడు. వాళ్లతో మాటలు కలిపి తన కోరిక బయటపెట్టేవాడు. అందుకు ఒప్పుకున్నవాళ్లతో నిర్మాణుష్య ప్రాంతాలకు వెళ్లేవాడు. అయితే ఏకాంతంగా ఉన్న టైంలో.. వాళ్లు తనతో ప్రవర్తించిన తీరే.. తనను నేరానికి ఉసిగొల్పిందని చెబుతున్నాడను. వాళ్ల మాటలు, చేతలు అతన్ని మానసికంగా కుంగదీశాయట. ఆ ఆవేశంలో చేతికి దొరికిన వస్తువుతో వాళ్లను దారుణంగా హతమార్చి.. తన సిగ్నేచర్‌ వీపులో మోసగాడు అని రాసి.. వాళ్ల జేబుల్లో ఉన్నదంతా దోచుకుని వెళ్లిపోయేవాడట. అలా రూపానగర్‌, సర్‌హింద్‌, ఫతేఘడ్‌ సాహిబ్‌.. ఇలా చుట్టుపక్కల జిల్లాల్లో ఇప్పటిదాకా 11 మందిని హతమార్చాడు. వీటిలో ఆరు కేసుల్లో ఈ సైకో గే కిల్లర్‌ పాత్రను పోలీసులు ధృవీకరించుకున్నారు. మరో ఐదు కేసుల్లో.. రామ్‌ స్వరూప్‌ పాత్రపై నిర్ధారణకు రావాల్సి ఉంది. రాబోయే.. రోజుల్లో రామ్‌ స్వరూప్‌ నేరచరితను ఏ సినిమాగానో, వెబ్‌ సిరీస్‌(Web Series)గానో తెర మీద చూడాల్సిన వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో కదా!.

Analysis On Manmohan Singh Economic Reforms9
అసలు సిసలు విజనరీ..

అదేంటి మావాడు పోస్టాఫీసులో రన్నర్‌గా పంజేస్తున్నాడు.. పర్మినెంట్ కాదు గానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం.. కట్నం కింద సైకిల్.. నేషనల్ టూ ఇన్ వన్ టేప్ రికార్డర్ ఇవ్వాల్సిందేఒరేయ్ రాముడూ బామ్మ సీరియస్.. స్టార్ట్ ఇమీడియట్లి అని హైదరాబాద్‌లో మీ అన్నకు టెలిగ్రామ్ పంపరాఒసేయ్ గీతా.. నీకు కొత్త పుస్తకాలు ఎందుకే.. మీ అక్క పాత బుక్స్ ఉన్నాయిగా అవి కొత్త అట్టలు వేసుకుని వాడుకోమొన్న దసరాకే లాగు చొక్కా కొన్నాను.. మళ్ళీ సంక్రాంతికి కొనాలంటే ఎలా..మళ్ళీ వచ్చే సారి చూద్దాంలేచుట్టాలొచ్చారు.. పప్పు.. గుడ్డు వండి అప్పడాలు వేయించాలిఒరేయ్ చింటూ సైకిల్ బాగా కడిగి..తుడిస్తే నీకు సాయంత్రం ఓ అరగంట తొక్కనిస్తాఢిల్లీ వెళ్ళాలంటే మాటలా రైల్లో మూడురోజులు పడుతుంది మరిఆకాశవాణిలో పుష్ప సినిమా సంక్షిప్త శబ్ద చిత్రం వచ్చిందట పెట్టాండర్రఈసారి పెళ్లి బంతిలో మొదట వేసే లడ్డూను జేబులో దాచేసి ఇంకో లడ్డూ అడగాలిపెళ్లవ్వగానే ఆయన వెళ్ళిపోయారు. లెటర్స్ వస్తున్నాయి కానీ ఆయన్ను చూస్తే బావుణ్ణు.. ఉత్తరాల్లో మనిషి కనిపిస్తే ఎంత బావుణ్ణుఅసలు ఈ పట్ట పగలు ఫుల్ చార్జి పే చేసి ఫోన్ ఎందుకు చేయాలి..రాత్రి పది తరువాత ఐతే హాఫ్ చార్జి ఉండేదిగాఒరేయ్ నాగులూ నాన్న ప్యాంట్ కాస్త సైజ్ చేసి వాడుకోరా నీకు సరిపోతుందిఅమెరికాలో జేబులో పెట్టుకునే ఫోన్లు ఉన్నాయట తెలుసా?ఎన్నైనా చెప్పు..రాజ్ దూత్ అంబాసిడర్..ఈ రెండూ భూమి ఉన్నంత వరకూ ఉంటాయ్బ్యాంకులో ఖాతా ఉండడం అంటే మాటలా.. అమ్మో ఆయనకు ఎంత పరపతి..మేం బ్లాక్ అండ్ వైట్ టివి మాత్రమే ఇస్తాం..కలర్ టీవీ ఇవ్వలేం.. సంబంధం క్యాన్సిల్ ఐనా ఫర్లేదు.. మేం తూగలేమురామారావు అప్పుడే బజాజ్ చేతక్ కోసం మొడువేలు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేశాడట.. అంటే ఆయన బయటి ఆదాయం ఎంత ఉందో మరిఎదురింటి లక్ష్మి గోద్రెజ్ పఫ్ ఫ్రిజ్ కొనింది.. మొగుడు బానే సంపాదిస్తున్నాడునేను ఎంత రాత్రయినా కానీ మీ అన్నయ్య వచ్చాకే వంట చేస్తాను.. మాకు గ్యాస్ పొయ్యి ఉందిగా వదినా..ఇదీ మన్మోహన్ సింగ్ అనే ఒక ఆర్థిక మేధావి లేకుంటే భారతదేశ పరిస్థితి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన్నుంచి 1990ల వరకూ దేశం ఇలాగే ఉండేది. ఏ మూల చూసినా నిరుద్యోగం. వెనుకబాటు.. ఒక చిన్న ఉద్యోగం కోసం పోరాటం.. ఇంటిల్లిపాదీ ఆ ఉన్న కొద్దిపాటి పొలంపైనే జీవనం. మూడు నెలలు పని ఉంటే మిగతా తొమ్మిది నెలలూ ఖాళీగా ఉండడమే. ఎకరాకు 18-20 బస్తాల ధాన్యం పండితే గొప్ప. అసలు ఇంత పెద్ద దేశానికి మన్మోహన్.. పీవీ నరసింహారావు వంటివాళ్లు ప్రధానులు.. అర్థికమంత్రులు కాకపోయి ఉంటే దేశం ఆకలితో అల్లాడిపోయేది. ఒరిస్సాలోని కలహండి ఒక్కటే కాదు దేశం నలుమూలలా ఆకలి చావులు ఉండేవి. దేశంలో ఇన్ని పరిశ్రమలు.. ఇంత ఉత్పత్తి.. ఇన్ని లక్షల ఉద్యోగాలు.. ఈ స్థాయి ఆదాయం ఉండేదే కాదు. ఇప్పుడు మన కళ్లముందు ఉన్న భారత దేశం అనే చిత్తరువు మన్మోహన్.. పీవీ అనే విజనరీ చిత్రకారులు తమ మనో నేత్రంతో ఊహించి గీసిన చిత్తరువే ఈ ఆధునిక భారతదేశం. వేలాది ఆటోమొబైల్ పరిశ్రమలు.. పోర్టులు.. టూరిజం..ప్రైవేటు బ్యాంకులు.. చెప్పులు.. వస్త్రాలు.. మొబైల్ ఫోన్లు ..దేశంలో వేసిన రహదారులు.. ఎయిర్పోర్ట్ లు..ప్రైవేటు విమానయాన సంస్థలు.. విద్యుత్ ప్రాజెక్టులు... రైల్వే లైన్లు.. ఐస్ క్రీములు.. ఆఖరుకు ఫ్లేవర్డ్ కండోమ్స్.. కోట్లలో ఉద్యోగాల కల్పన.. ఇవన్నీ ఆ ఇరువురి చలవే..అన్నిటికీ మించి భారత సాఫ్ట్‌వేర్ రంగం మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థను మార్చేసింది. దానిద్వారా ఉత్పన్నమైన సంపద దేశ రియల్ ఎస్టేట్.. నిర్మాణ రంగాన్ని సమున్నతంగా నిలిపింది.. ఇలా ఆ దర్శనికులు ఆనాడు శ్రీకారం చుట్టి మొక్కగా వేసిన ఆర్థిక సంస్కరణలు దేశ గతిని మార్చాయి. అంతర్జాతీయంగా మనను సగౌరవంగా నిలబెట్టింది. దేశానికి ఎంతోమంది ప్రధానులుగా పని చేసినా పీవీ.. మన్మోహన్ అనే జోడుగుర్రాలు మాత్రమే దేశాన్ని పేదరికం స్థాయి నుంచి మరో మెట్టు పైకి ఎక్కించారు.. ఇప్పుడు భారత్ పేద దేశం కాదు.. ఎన్నో రంగాల్లో ప్రపంచాన్ని శాసిస్తున్న ఒక మహా మేరు పర్వతమిది.. దీనికి ఇంధనం.. శక్తి నింపింది ఆ ఇద్దరే . మరోమారు ఆ మౌనముని మన్మోహన్ సింగ్‌కు అంజలి ఘటిస్తూ.. -సిమ్మాదిరప్పన్న

Allu Arjun Bail Petition Enquiry  Postpone On December 3010
అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

సంధ్య థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్‌ రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించిగా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే, రెగ్యులర్‌ బెయిల్‌ కోసం నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కానీ, బన్నీ పిటిషన్‌ దాఖలుపై కౌంటర్‌ వేసేందుకు ప్రభుత్వం తరపున ఉన్న న్యాయవాది సమయం కోరారు. దీంతో బెయిల్‌ పిటిషన్ విచారణ డిసెంబర్‌ 30కి వాయిదా పడింది.సంధ్య థియేటర్ ఘటనలో ఆన్‌లైన్‌ ద్వారా నాంపల్లి కోర్టు విచారణలో అల్లు అర్జున్‌ పాల్గొన్నారు. పుష్ప2 ప్రీమియర్స్‌ సమయంలో సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్‌ కారణం అంటూ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
డల్లాస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

ఐనవోలు: మండలంలోని జగ్గయ్యగూడెం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ గొలమారి క్రాంతికుమార్

title
పార్వతీపురంలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ..

title
చికాగోలో నాట్స్ వింటర్ క్లాత్ డ్రైవ్

 భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదం తో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్..

title
‘ఎన్నారై’ కుటుంబం వేధింపులకు ఒకరి బలి

అల్వాల్‌ (సికింద్రాబాద్‌): ఎన్నారై అల్లుడు, అతని కుటుంబీకుల

title
సింగపూర్‌లో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి  జన్మదిన వేడుకలు సింగపూర్ లో ఘనంగా జరిగాయి.

Advertisement

వీడియోలు

Advertisement