Vishal
-
యాక్షన్... కామెడీ
విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో రూపొందిన ‘మదగజరాజా’ చిత్రం జనవరి 12న తమిళంలో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి మంచి స్పందన లభించిందని యూనిట్ పేర్కొంది. కాగా ఈ నెల 31న సత్య కృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. ‘‘విశాల్ పవర్ఫుల్ యాక్షన్, సంతానం కామెడీ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్’’ అని యూనిట్ పేర్కొంది. ఇక ‘మదగజరాజ’ పన్నెండేళ్ల క్రితమే రూపొందింది. కానీ రిలీజ్ కాలేదు. చివరికి తమిళంలో ఈ పొంగల్‌కి రిలీజైంది. -
12 ఏళ్ళకు విశాల్ సంచలనం దెబ్బకు సంక్రాంతి రికార్డు బద్దలు
-
అనారోగ్యంపై వార్తలు.. క్లారిటీ ఇచ్చిన హీరో విశాల్
హీరో విశాల్ (Vishal) ప్రధాన పాత్రలో నటించిన మదగజరాజ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షూటింగ్ పూర్తయిన 12 ఏళ్ల తర్వాత ఈ చిత్రం రిలీజ్‌కు నోచుకోవడం గమనార్హం. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విశాల్ బక్కచిక్కిపోయి వణుకుతూ కనిపించాడు. మైక్ పట్టుకున్నప్పుడు అతడి చేతులు వణకడంతో పాటు మాట కూడా తడబడుతూ వచ్చింది. సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అభిమానులు విశాల్‌కు ఏమైందని ఆందోళన చెందారు.వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న విశాల్ఈ క్రమంలో విశాల్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు అతడి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ప్రస్తుతం అతడు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని, పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ విశాల్ సినిమా ఈవెంట్‌కు రావడాన్ని పలువురూ అభినందిస్తున్నారు. అభిమానులు మాత్రం.. ఆయన ఆరోగ్యంపై దృష్టి సారించాలని, త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేశారు.ఆరు నెలలకోసారి దూరం?తాజాగా విశాల్ కోలుకున్నట్లు తెలుస్తోంది. మదగజరాజ సినిమా (Madha Gaja Raja Movie) ప్రీమియర్ షోకు హాజరైన విశాల్.. తన హెల్త్ అప్డేట్ ఇచ్చాడు. మా నాన్నగారి సంకల్పం వల్లే నేను ధృడంగా ఉండగలుగుతున్నాను. ఆయన ఇచ్చిన శక్తి వల్లే నా జీవితంలో ఎదురైన అడ్డంకులను దాటగలుగుతున్నాను. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే.. మూడు, ఆరు నెలలకోసారి సినిమాలకు దూరంగా ఉంటున్నానని, సరిగా పని చేయట్లేదని అంటున్నారు. ఎన్ని మాటలన్నా నేను మరింత శక్తి కూడదీసుకుని మీ ముందుకొస్తాను.(చదవండి: Daaku Maharaaj Review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ)ఇప్పుడు బానే ఉన్నానునేను అనారోగ్యంగా ఉండటం చూసి అభిమానులు ఆందోళన చెందారు. ఇప్పుడు నేను బాగున్నాను. చూడండి, నా చేతులు కూడా వణకడం లేదు. నా ఆరోగ్యం బాగుంది. మీరు చూపించిన ప్రేమకు తుదిశ్వాస వరకు రుణపడి ఉంటాను. మీ అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. మీరందరూ తప్పకుండా సినిమా చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పుకొచ్చాడు.ఆ సినిమాతో హీరోగా క్రేజ్కాగా విశాల్.. చెల్లమే (Chellamae Movie) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. సండ కోడి మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇంది తెలుగులో పందెం కోడిగా విడుదలవగా ఇక్కడ కూడా హిట్‌గా నిలిచింది. తామిరభరణి, మలైకొట్టాయి, సత్యం, తోరణై (పిస్తా), అవన్ ఇవన్, వేడి, పాట్టతు యానై, పాండియ నాడు, తుప్పరివాలన్, ఎనిమీ, సండకోడి 2, మార్క్ ఆంటోని వంటి పలు చిత్రాలతో అలరించాడు.ఎయిట్ ప్యాక్‌తో విశాల్మార్క్ ఆంటోని మూవీలో అదరదా పాట.. విశాలే ఆలపించాడు. అంతేకాదు మదగజరాజ సినిమాలోని మై డియర్ లవరూ సాంగ్ కూడా అతడే పాడటం విశేషం. ఇందులో విశాల్ ఎయిట్ ప్యాక్స్‌లో కనిపిస్తాడని డైరెక్టర్ సుందర్ తెలిపాడు. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో సుందర్ మాట్లాడుతూ.. క్లైమాక్స్‌లో 8 ప్యాక్స్‌తో కనిపించాలని హీరోకు చెప్పాను. కొన్ని కారణాల వల్ల ఆ క్లైమాక్స్ షూట్ ఆలస్యమైంది. అయినా సరే విశాల్ తన ఎయిట్ ప్యాక్ బాడీని ఏడాదిపాటు మెయింటెన్ చేశాడు అని సుందర్ పేర్కొన్నాడు. ఈ చిత్రంలో అంజలి హీరోయిన్గా నటించగా ఖుష్బూ కీలక పాత్ర పోషించింది. #Vishal Watching #MadhaGajaRaja Special Premiere 💯pic.twitter.com/sb9XNuvrt0— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) January 11, 2025 చదవండి: పుష్ప-2 రీ లోడ్ వర్షన్.. మేకర్స్ బిగ్ అప్డేట్ -
ఎగ్సలెంట్ ఎక్సలెంట్ ఐడియా - నెలపాటు గుడ్లు ఫ్రెష్
కోడిగుడ్డు ఓ మంచి పౌష్టికాహారం, ప్రతి రోజు ఓ గుడ్డు తినమని వైద్యులు సైతం సలహాలిస్తుంటారు. కాబట్టి చాలామంది రోజుకో గుడ్డు తినేస్తుంటారు. అయితే ప్రతి రోజూ గుడ్లు తెచ్చుకోవడం, వాటిని నిల్వ చేసుకోవడం కొంత కష్టమైన పనే. అయినా తగ్గేదేలే అన్నట్టు కొందరు గుడ్లు నిల్వచేయడానికి వివిధ పద్ధతులను అనుసరిస్తుంటారు. కానీ చాలా రోజులు నిల్వ చేసుకోవడం మాత్రం దాదాపు అసాధ్యమే. దీనిని సుసాధ్యం చేయడానికి 'ఎగ్సలెంట్' (EGGcellent) ముందుకు వచ్చింది. దీని గురించి తెలుసుకోవడానికి సంస్థ ఫౌండర్ 'విశాల్ నారాయణస్వామి'తో సంభాషించాము.మీ గురించి చెప్పండినా పేరు 'విశాల్ నారాయణస్వామి'. నేను ఎగ్సలెంట్ ప్రారభించడానికి ముందు హైడ్రోపోనిక్ వ్యవసాయంతో పంటలు పండించాను. తరువాత ఆహార వ్యర్థాలను తగ్గించడానికి.. వాటిని ఫ్రీజింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇందులో భాగంగానే గుడ్లను ఎక్కువ రోజులు నిల్వ చేసి అందించాలని ఈ సంస్థ ప్రారంభించాను.గుడ్లను ఎక్కువ రోజులు నిల్వ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?ఇతర దేశాల్లో అయితే చిప్స్, నూడుల్స్ వంటి ఆహార పదార్థాల మాదిరిగా.. ఉడికించిన గుడ్లను కూడా షాపింగ్ మాల్స్ లేదా ఇతర స్టోర్లలో కొనుగోలు చేసి తింటున్నారు. ఈ విధానం మనదేశంలో లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని భారతీయులకు కూడా ఉడికించిన గుడ్లనే నేరుగా అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఆలోచన వచ్చింది.ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి? ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయా?ఎగ్సలెంట్ గుడ్లు నెల రోజులు (30 రోజులు) తాజాగా ఉంటాయి. ఇప్పటికే దీనిపై రీసెర్చ్ చేసి సక్సెస్ కూడా సాధించాము. ప్రస్తుతం 60 రోజుల నుంచి 90 రోజులు నిల్వ చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా త్వరలోనే రానున్నాయి.గుడ్లను నిల్వ చేయడానికి ఏమైనా ద్రావణాలు ఉపయోగిస్తున్నారా?అవును, మేము గుడ్లను నిల్వ చేయడానికి ప్రత్యేకంగా తయారు చేసిన 'ఎగ్సలెంట్ ఎగ్స్టెండర్' (EGGcellent EGGstender) ద్రావణం ఉపయోగిస్తున్నాము.ఎగ్సలెంట్స్ ప్రారంభించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?ఒకేసారి ఎక్కువ గుడ్లను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవడం కష్టం. అంతే కాకుండా గుడ్ల ధరలు ప్రతి రోజూ మారుతూ ఉంటాయి. ఉదాహరణకు.. ఈ రోజు గుడ్డు ధర రూ.5 అనుకుంటే, మరుసటి రోజు అది రూ.5.50 పైసలు కావొచ్చు, 6 రూపాయలు కూడా కావొచ్చు. అలాంటప్పుడు వారానికి 10 గుడ్లు, నెలకు 30 గుడ్లు చొప్పున కొంటే.. ఎంత ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రజలు కూడా కొంత డబ్బుకు ఆదా చేసుకోవాలని.. మళ్ళీ మళ్ళీ గుడ్ల కోసం స్టోర్స్‌కు వెళ్లే పని తగ్గించాలని అనుకున్నాను.ఇప్పటికి కూడా చాలా మంది కొనుగోలు చేసిన గుడ్లలో.. చెడిపోయినవి లేదా పాడైపోయినవి కనిపిస్తూనే ఉంటాయి. అంతే కాకుండా ఎక్కువగా గుడ్లను కొనుగోలు చేస్తే.. కొన్ని రోజులకు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ దూరాలకు గుడ్లను ఎగుమతి చేయాలనంటే అవి తప్పకుండా పాడైపోకుండా ఉండాలి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఎగ్సలెంట్స్ ప్రారభించాలనుకున్నాను.ఎగ్సలెంట్స్ గుడ్ల వల్ల ఉపయోగాలు ఏమిటి?భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా సంకోచం లేకుండా ఎగ్సలెంట్స్ గుడ్లను ఎగుమతి చేసుకోవచ్చు. రిమోట్ ఏరియాలలో గుడ్లను విక్రయించాలనుకునే వారు కూడా కొన్ని రోజులు నిల్వ చేసుకుని వీటిని అమ్ముకోవచ్చు.ఎగ్సలెంట్స్ గుడ్ల ధరలు ఎక్కువగా ఉంటాయా?ఎగ్సలెంట్స్ గుడ్ల ధరలు సాధారణ మార్కెట్ ధరల కంటే 6 పైసల నుంచి 15 పైసలు మాత్రమే ఎక్కువ. కానీ ధర తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ గుడ్లను కొనుగోలు చేస్తే.. ధరలు పెరిగినప్పుడు ఆ ప్రభావం ప్రజల మీద పడకుండా ఉంటుంది. విక్రయదారులు కూడా వాటిని అప్పటి పెరిగిన ధరలకే విక్రయించుకోవచ్చు. -
విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు.. అసలు విషయం ఇదీ: ఖుష్భూ
కోలీవుడ్ హీరో విశాల్( Vishal) అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ‘మదగజరాజ’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన వణుకుతూ మాట్లాడారు. అంతకు ముందు కొన్నాళ్ల పాటు కెమెరాకు కనిపించలేదు. సడెన్‌గా ఈవెంట్లో కనిపించి.. అలా వణుకుతూ మాట్లాడడంతో తమ హీరోకి ఏమైందోనని అభిమానులు కంగారు పడ్డారు. ఆయన జ్వరంతో బాధపడుతన్నాడని వైద్యులు చెప్పినప్పటికీ.. విశాల్ హెల్త్‌పై రకరకాల పుకార్లు వస్తున్నాయి. అసలు విశాల్‌కి ఏమైందనే విషయాన్ని తాజాగా నటి ఖుష్బూ(khushboo sundar) వివరించింది.కంగారు పడాల్సిన అవసరం లేదుతాజాగా ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..విశాల్ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పారు. ‘ఢిల్లీలో ఉన్నప్పుడే విశాల్‌కి జ్వరం వచ్చింది. కానీ 12 ఏళ్ల తర్వాత ‘మదగజరాజ’ రిలీజ్ అవుందుని ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఈవెంట్‌కి వచ్చాడు. అప్పటికే విశాల్ డెంగీ ఫీవర్‌తో బాధపడుతున్నాడు. 103 డిగ్రీల జ్వరం కారణంగా వణికిపోయారు. ‘ఇంత జ్వరంతో ఎందుకు వచ్చావు?’అని అడిగితే.. ‘నేను నటించిన చిత్రం 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ఈవెంట్‌కి కచ్చితంగా రావాలనుకున్నాను. అందుకే బాడీ సహకరించకపోయినా వచ్చేశాను’ అని విశాల్ చెప్పారు. ఈ ఈవెంట్ పూర్తయిన వెంటనే విశాల్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. కంగారుపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. అయినా కూడా కొంతమంది యూట్యూబర్స్ విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. సెలబ్రిటీల గురించి నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలను ప్రచారం చేయకండి’ అని ఖుష్భూ విజ్ఞప్తి చేశారు.కాగా, విశాల్, ఖుష్భూ మధ్య మంచి స్నేహబంధం ఉంది. కలిసి సినిమాలు చేయకపోయినా.. చాలా క్లోజ్‌గా ఉంటారు. మదగజరాజు సినిమాకు ఖుష్భూ భర్త సుందర్.సి దర్శకత్వం వహించారు. విశాల్‌తో తనకున్న అనుబంధం గురించి ఖుష్భూ మాట్లాడుతూ.. ‘మేమిద్దరం కలిసి సినిమాలు చేయలేదు. కానీ మొదటగా ఇద్దరం కలిసి ఓకే పార్టీలో పని చేశాం. ఆ కారణంగానే మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. విశాల్ నటించిన సినిమాల్లో కొన్ని నాకు చాలా ఇష్టం. మంచి టాలెంట్ ఉన్న నటుడు ఆయన. సినిమా కోసం చాలా కష్టపడతాడు’ అని ఖష్భూ చెప్పుకొచ్చింది.12 ఏళ్ల తర్వాత రిలీజ్విశాల్ హీరోగా సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘మదగజరాజ’(Madha Gaja Raja). 2013లో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పలు కారణాల వల్ల వాయిదా పడి దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్ కామెడీగా రూపొందిన ఈ మూవీలో అంజలి, వరలక్ష్మీ శరత్‌కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఆర్య, సదా అతిథి పాత్రల్లో సందడి చేయనున్నారు. ఈ సినిమా కోసం విశాల్ ఎయిట్ ప్యాక్ చేశాడట. షూటింగ్ ఆసల్యం అయినా కూడా మరో సినిమా చేయకుండా.. ఈ మూవీ కోసం కష్టపడ్డాడని ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సుందర్ చెప్పారు. అంతేకాదు విశాల్ తనకు సొంత తమ్ముడి లాంటి వాడని చెప్పాడు. మొదట్లో విశాల్‌ని అపార్థం చేసుకున్నానని, అతనితో పరిచయం ఏర్పడిన తర్వాత అతను ఎంత మంచి వాడనే విషయం తెలిసిందన్నాడు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలతో పని చేసినప్పటికీ.. కార్తిక్ తర్వాత విశాల్‌తోనే తను బాగా క్లోజ్ అయ్యానని చెప్పారు. #Vishal na get well soon.. #MadhaGajaRajapic.twitter.com/I2K3lTRR0Q— Tamil Cinema Spot (@tamilcinemaspot) January 5, 2025 -
విశాల్‌కు తీవ్ర అస్వస్థత.. డాక్టర్లు ఏమన్నారంటే?
హీరో విశాల్ (Vishal) వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని, తనకు చికిత్స అందిస్తున్నామని అపోలో వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం విశాల్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కాగా విశాల్ హీరోగా నటించిన మదగజరాజ సినిమా 12 ఏళ్ల తర్వాత విడుదలవుతోంది. బక్కచిక్కిపోయిన విశాల్చెన్నైలో జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ (Madha Gaja Raja Pre-Release Event)లో విశాల్ సన్నబడిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. తన మాటలతో పాటు చేతులు కూడా వణికాయి. అతడు సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అభిమానులు విశాల్‌కు ఏమైందని ఆందోళన చెందారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.(చదవండి: త్రివిక్రమ్ వివాదంపై శివ బాలాజీకి కౌంటర్ ఇచ్చిన పూనమ్ కౌర్)సినిమాకాగా విశాల్.. చెల్లమే (Chellamae Movie) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. సండకోడి (పందెంకోడి) మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. తామిరభరణి, మలైకొట్టాయి, సత్యం, తోరణై (పిస్తా), అవన్ ఇవన్, వేడి, పాట్టతు యానై, పాండియ నాడు, తుప్పరివాలన్, ఎనిమీ, సండకోడి 2, మార్క్ ఆంటోని వంటి పలు చిత్రాలతో అలరించాడు. పాండియ నాడు మూవీతో నిర్మాతగానూ అవతారమెత్తాడు. మార్క్ ఆంటోని మూవీలో అదరదా పాట విశాలే ఆలపించాడు. అంతేకాదు మదగజరాజ సినిమా మై డియర్ లవరూ సాంగ్ కూడా అతడే పాడటం విశేషం. ప్రస్తుతం విశాల్.. బ్లాక్‌బస్టర్ మూవీ తుప్పరివాలన్ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నాడు. 2019లోనే ఈ చిత్రం ప్రకటించారు. ఈ మూవీతో విశాల్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మదగజరాజ సినిమా..మదగజరాజ మూవీలో విశాల్ ఎయిట్ ప్యాక్స్‌లో కనిపిస్తాడట! ఈ విషయాన్ని డైరెక్టర్ సుందర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో వెల్లడించాడు. క్లైమాక్స్‌లో 8 ప్యాక్స్‌తో కనిపించాలని విశాల్‌తో అన్నాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ క్లైమాక్స్ షూట్ ఆలస్యమైంది. అయినా సరే విశాల్ తన ఎయిట్ ప్యాక్ బాడీని ఏడాదిపాటు మెయింటెన్ చేశాడు అని సుందర్ పేర్కొన్నాడు. ఇక ఈ చిత్రంలో అంజలి హీరోయిన్గా నటించగా ఖుష్బూ కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ జనవరి 12న విడుదల కానుంది.(చదవండి: బాలకృష్ణ హీరోయిన్‌కు వేధింపులు.. మద్దతుగా నిలిచిన అమ్మ!)ఆ రెండూ సస్పెన్స్‌లో..సూపర్ హిట్ మూవీ అభిమన్యుడికి సీక్వెల్ ఉంటుందని హీరో విశాల్ 2021లో ప్రకటించాడు. అది కూడా తనే డైరెక్ట్ చేస్తానన్నాడు. ఏమైందో ఏమో కానీ మళ్లీ దాని ఊసే ఎత్తలేదు. అలాగే గతేడాది ఓ సంచలన ప్రకటన కూడా చేశాడు. త్వరలోనే రాజకీయ అరంగేట్రం ఉంటుందని ప్రకటించాడు. 2026లో తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో తాను బరిలోకి దిగుతానన్నాడు. తన పార్టీ అభ్యర్థులు కూడా పోటీ చేస్తారని వెల్లడించాడు. మరి తను పెట్టబోయే పార్టీ గురించి, అటు అభిమన్యుడు సీక్వెల్ గురించి ఈ ఏడాదేమైనా అప్డేట్ ఇస్తాడేమో చూడాలి! Actor #Vishal 🥹❤️❤️Though he is suffering from high fever, he came to promote his film #MadhaGajaRaja ...pic.twitter.com/4LrLpQmiEh— Official CinemaUpdates (@OCinemaupdates) January 5, 2025 చదవండి: హీరో విశాల్‌కు ఏమైంది? ఎందుకిలా అయిపోయాడు? -
హీరో విశాల్‌కు ఏమైంది? ఎందుకిలా అయిపోయాడు?
హీరో విశాల్ (Vishal) నటించిన సినిమా పుష్కరకాలం తర్వాత రిలీజవుతోంది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన మదగజరాజ మూవీ (Madha Gaja Raja Movie) షూటింగ్ 2012లోనే పూర్తయింది. కానీ పలు కారణాల వల్ల ఎన్నో ఏళ్లుగా విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 12న రిలీజ్ అవుతోంది. తాజాగా చెన్నైలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ చేశారు.వణికిపోతున్న విశాల్ఈ కార్యక్రమానికి విశాల్ పంచెకట్టులో హాజరయ్యాడు. అయితే ఆయన బక్కచిక్కిపోయి దీన స్థితిలో కనిపించాడు. తను మైక్ పట్టుకుని మాట్లాడుతుంటే చేతులు, గొంతు వణుకుతోంది. ఆయన కొద్దిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని.. దానివల్లే శరీరం, గొంతు వణుకుతోందని పలువురూ చెప్తున్నారు. తన ఆరోగ్య పరిస్థితిని లెక్క చేయకుండా విశాల్ ఈవెంట్‌కు వచ్చాడని తెలుసుకున్న అభిమానులు.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇంకేదైనా..?ఇలాంటి పరిస్థితిలో తన సినిమా కోసం ఈవెంట్‌కు రావడం చిన్న విషయం కాదని, అతడి అంకితభావాన్ని మెచ్చుకోవాల్సిందేనని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే జ్వరం వస్తే మరీ ఇంత చిక్కిపోతారా? విశాల్ ఇంకేదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.సినిమా విషయానికి వస్తే..మదగజరాజ మూవీలో విశాల్ ఎయిట్ ప్యాక్స్‌లో కనిపిస్తాడట! ఈ విషయాన్ని డైరెక్టర్ సుందర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో వెల్లడించాడు. క్లైమాక్స్‌లో 8 ప్యాక్స్‌తో కనిపించాలన్నాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ క్లైమాక్స్ షూట్ ఆలస్యమైంది. అయినా సరే విశాల్ తన ఎయిట్ ప్యాక్ బాడీని ఏడాదిపాటు మెయింటెన్ చేశాడు అని సుందర్ పేర్కొన్నాడు. ఈ చిత్రంలో అంజలి హీరోయిన్గా నటించగా ఖుష్బూ కీలక పాత్ర పోషించింది. Actor #Vishal 🥹❤️Though he is suffering from high fever, he came to promote his film #MadhaGajaRaja ...Dedication 💪 ❤️pic.twitter.com/qb1o3vHvuh— Movies4u Official (@Movies4u_Officl) January 5, 2025 చదవండి: 'గేమ్ ఛేంజర్' కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా: దిల్ రాజు -
భారీ తారాగణం.. 12 ఏళ్ల తర్వాత 'విశాల్' సినిమాకు మోక్షం
విశాల్ నటించిన ఒక సినిమా సుమారు 12 ఏళ్ల తర్వాత విడుదల కానుంది. సౌత్ ఇండియాలో విశాల్ సినిమాలకు మంచి మార్కెట్ ఉన్న సమయంలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఇందులో టాప్ నటీనటులు కూడా ఉన్నారు. చిత్రీకరణ కూడా పూర్తి అయింది. అయితే, పలు కారణాల వల్ల సినిమా థియేటర్స్‌లో విడుదల కాలేదు.హీరో విశాల్, ప్రముఖ దర్శకుడు సుందర్ సి కాంబోలో తెరకెక్కిన చిత్రం 'మదగజరాజ'. ఈ చిత్రంలో విశాల్‌తో పాటు అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ నటించారు. షూటింగ్ పనులన్నీ కూడా 2012లోనే పూర్తి అయ్యాయి. ఈ మూవీలో ఐటెంసాంగ్‌లో సదా మెరుపులు ఉన్నాయి. ఆపై కోలీవుడ్ హీరో ఆర్య గెస్ట్ రోల్లో నటించాడు. సోనూసూద్, సంతానం వంటి ప్రముఖులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు. బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ సంగీతం సమకూర్చాడు. ఇంతటి క్రేజీ కాంబినేషన్ ఉన్న ఈ సినిమా విడుదల తేదీని కూడా అప్పట్లో మేకర్స్ ప్రకటించారు. అయితే, నిర్మాతలు తనకు ఇస్తానన్న రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టారని కమెడియన్ సంతానం కోర్టును ఆశ్రయించారు. అక్కడి నుంచి సినిమా విడుదలకు బ్రేకులు పడుతూనే వచ్చాయి.'మదగజరాజ'కు మోక్షంసుమారు 12 సంవత్సరాల తర్వాత 'మదగజరాజ'కు మోక్షం దక్కింది. జనవరి 12 విడుదల చేసేందుకు కోలీవుడ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మాతల నుంచి డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను విశాల్ తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పుడు తన బ్యానర్ మీదనే ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఈ విషయాన్ని అధికారికంగా విశాల్ ప్రకటించనున్నారు. విశాల్ అసలు టార్గెట్ కోలీవుడ్. ఇప్పుడు అజిత్ విడాముయార్చి వాయిదా వేసుకోవడంతో టాప్ హీరోలు ఎవరూ రేసులో లేరు. దీంతో ఈ సినిమాకు కాస్త కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఆయన ఆ ప్లాన్ అనుసరిస్తున్నట్లు సమాచారం. -
ఈ ఏడాది ఇదే అతిపెద్ద ఐపీవో..!
ముంబై: సూపర్‌మార్కెట్ చైన్ విశాల్ మెగా మార్ట్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్లో ఐపీవో చేపట్టనుంది. తద్వారా రూ. 8,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. పీఈ దిగ్గజం కేదారా క్యాపిటల్ అండ్ పార్ట్నర్స్కు పెట్టుబడులున్న కంపెనీ లిస్టయితే 2024 ఏడాదికి అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది.అంతేకాకుండా దేశీ ప్రైమరీ మార్కెట్లో నాలుగో పెద్ద ఐపీవోగా రికార్డులకు ఎక్కనుంది. మార్చితో ముగిసిన గతేడాది(2023–24) రూ. 8,912 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 462 కోట్ల నికర లాభం ఆర్జించింది.డిసెంబర్ మధ్యలో.. నిజానికి దేశీ స్టాక్ మార్కెట్లలో ఇటీవల నమోదవుతున్న దిద్దుబాట్ల కారణంగా నవంబర్‌లో చేపట్టదలచిన ఇష్యూని విశాల్ మెగామార్ట్ డిసెంబర్‌కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కంపెనీ ఇప్పటికే లండన్, సింగపూర్ తదితర ప్రాంతాలలో రోడ్‌షోలపై విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో చర్చలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. వచ్చే నెల మధ్యలో చేపట్టనున్న ఐపీవోలో తాజా ఈక్విటీ జారీ లేనట్లు తెలుస్తోంది.నిధుల సమీకరణకు వీలుగా హోల్డింగ్ కంపెనీ సంయత్ సర్వీసెస్ ఎల్ఎల్పీ వాటాలు విక్రయించనుంది. ప్రస్తుతం విశాల్ మెగామార్ట్‌లో సంయత్ సర్వీసెస్‌కు 96.55 శాతం వాటా ఉంది. కంపెనీ సీఈవో గుణేందర్ కపూర్ వాటా 2.45 శాతంగా నమోదైంది. సుమారు 626 సూపర్మార్కెట్ల ద్వారా కంపెనీ దుస్తులు, ఎఫ్ఎంసీజీ, సాధారణ వర్తక వస్తువులు తదితర పలు ప్రొడక్టులను విక్రయిస్తోంది. -
లైంగిక దాడులు చేసేవారిపై తీవ్రమైన చర్యలు: విశాల్
దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) 68వ వార్షిక సర్వసభ్య సమావేశం చెన్నైలో జరిగింది. చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక దాడుల గురించి హీరో విశాల్ రియాక్ట్ అయ్యారు. నటీమణలకు రక్షణగా నడిగర్ సంఘం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ జనరల్ కమిటీ సమావేశంలో సంఘం అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షులు పూచీ మురుగన్, కరుణాస్, ఇతర సంఘం సభ్యులు పాల్గొన్నారు.తమిళ సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక దాడులకు ఒడిగట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ తెలిపారు. మహిళ రక్షణ కోసం విశాఖ కమిషన్‌ను ఇప్పటికే ఏర్పాటు చేసిందని ఆయన గుర్తుచేశారు. లైంగిక వేధింపులకు ఎవరైన గురైనట్లు ఫిర్యాదు వస్తే.. తప్పు చేసినవారిపై తీవ్రమైన చర్యలుంటాయని విశాల్ హెచ్చరించారు. ఈమేరకు ఒక తీర్మానం కూడా చేశామని ఆయన అన్నారు. బాధితులు నేరుగా తమకే ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. ఇప్పటికైతే తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.అనంతరం విలేకరులతో అధ్యక్షుడు నాజర్ మాట్లాడుతూ.. '68వ వార్షిక సభను అద్భుతంగా పూర్తి చేశాం. ప్రతి కార్యక్రమంలో సీనియర్ ఆర్టిస్టులను అభినందించి వారిని సత్కరిస్తున్నాం. జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తాం. నటీనటుల సంఘం పొడిగింపును సభ్యులందరూ అంగీకరించారు.' అని అన్నారు. -
సైకిల్‌పై వచ్చిన స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో, నిర్మాత విశాల్ చెన్నైలో సందడి చేశారు. చాలా సింపుల్‌గా సైకిల్ తొక్కుతూ కనిపించారు. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి అయిన విశాల్ 68వ సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశానికి హాజరయ్యేందుకు కార్యాలయానికి వచ్చారు. సైకిల్‌పై తమ అభిమాన హీరో రావడంతో ఫ్యాన్స్ చుట్టుముట్టారు. అక్కడే గేట్ దగ్గర ఉన్న అభిమానులతో విశాల్ కరచాలనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. ఇటీవల మాలీవుడ్‌లో హేమ కమిటీ నివేదిక తర్వాత ఇండస్ట్రీలో మహిళల భద్రత అంశం చర్చనీయాంశంగా మారింది. దీంతో కొద్దిరోజుల క్రితమే నడిగర్ సంఘం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. మరో పది రోజుల్లో నడిగర్ సంఘం ప్రత్యేక కమిటీ వేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని.. త్వరలోనే ప్రకటన వస్తుందని విశాల్ వెల్లడించారు. ఎవరైనా వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే ఇండస్ట్రీ నుంచి ఐదేళ్లపాటు నిషేధిస్తామని ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. VIDEO | Actor Vishal arrives on a bicycle to attend 68th South Indian Artist Association meeting being organised in Chennai.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/EYP25aY3rb— Press Trust of India (@PTI_News) September 8, 2024 -
నడిగర్ సంఘం హెచ్చరిక.. అలాంటి వారిపై ఐదేళ్ల నిషేధం!
హేమ కమిటీ నివేదిక సినీ ఇండస్ట్రీలను కుదిపేస్తోంది. ఇప్పటికే కన్నడ సినీ పరిశ్రమలోనూ ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్స్ వస్తున్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టాలీవుడ్‌లోనూ మహిళల భద్రత, రక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లుగా మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. తాజాగా కోలీవుడ్‌కు చెందిన నడిగర్ సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని నడిగర్ సంఘం నిర్ణయించింది. వారిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే సినీ ఇండస్ట్రీ నుంచి ఐదేళ్ల పాటు నిషేధం విధించాలని విశాల్ నేతృత్వంలోని కమిటీ తీర్మానించింది. చిత్ర పరిశ్రమలో మహిళల భద్రతపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.బాధితులకు న్యాయపరమైన సహాయాన్ని అందించడానికి నడిగర్ సంఘం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కార సెల్ కోసం ప్రత్యేక మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వేధింపులకు గురైన వారు నేరుగా తమ ఫిర్యాదులను ముందుగా నడిగర్ సంఘానికి సమర్పించాలని కోరారు. మీడియాకు వెల్లడించవద్దని హెచ్చరిక కూడా ఉంది. చెన్నైలో నడిగర్ సంఘం నిర్వహించిన సమావేశంలో నాసర్, విశాల్, కార్తీ పాల్గొన్నారు. -
అలాంటివారిని చెప్పు తీసుకుని కొట్టండి: విశాల్
మలయాళ చలనచిత్రపరిశ్రమలో ఆడవారిని వేధిస్తున్నారని, ఆర్టిస్టులు దుర్భరమైన జీవనం గడుపుతున్నారని జస్టిస్ హేమ కమిటీ బయటపెట్టింది. అయితే ఈ ఒక్కచోటే కాదు దాదాపు ప్రతి ఇండస్ట్రీలోనూ ఇలాంటి సమస్యలున్నాయి. అందుకే తమిళనాట కూడా దీనిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నాడు హీరో విశాల్.అతడు మాట్లాడుతూ.. అవకాశం కావాలంటే తాము చెప్పినదానికి అంగీకరించమని ఎవరైనా అడిగితే చెప్పు తీసుకుని కొట్టండి. కొందరు ఫోటోషూట్ పేరుతో ఆడవారిని ఆఫీసుకు రమ్మని అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇలాంటివి ఎదురైనప్పుడు మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే వెంటనే చెంప చెళ్లుమనిపించాలి. దీని గురించి ఫిర్యాదు చేయాలి. తమిళ ఇండస్ట్రీలోనూ ఇలాంటి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పుకొచ్చాడు.ఇకపోతే విశాల్ నేడు (ఆగస్టు 29న) 48వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇతడు చెల్లమే మూవీతో వెండితెరపై అడుగుపెట్టాడు. సండకోడి (పందెంకోడి)తో హిట్ అందుకున్నాడు. లాఠీ, మార్క్ ఆంటోని, రత్నం.. తదితర చిత్రాలతో అలరించాడు.చదవండి: 'నా భర్త అందగాడు.. గతాన్ని మర్చిపో'.. హీరోయిన్‌కు సూచన! -
నాపై చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి: విశాల్
‘‘ప్రస్తుత తమిళ నిర్మాతల మండలి నాపై చేసిన తీర్మానాన్ని 24 గంటల్లో వెనక్కి తీసుకోవాలి. లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను’’ అని హీరో విశాల్ అన్నారు. గతంలో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా పని చేసిన విశాల్ పలు అవకతవకలకు పాల్పడ్డారని, మండలి నిధుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, ఇకపై విశాల్‌తో చిత్రాలు చేసే దర్శక–నిర్మాతలు తమను సంప్రదించాలంటూ తమిళ నిర్మాతల మండలి ఓ ప్రకటనలో పేర్కొంది.దీనిపై విశాల్ స్పందించి, తమిళ నిర్మాతల మండలికి ఓ లేఖ రాశారు. ‘‘మండలి నిబంధనలకు అనుగుణంగానే అప్పటి కార్యవర్గంలో బాధ్యతలు నిర్వహించిన కదిరేశన్, ఇతర సభ్యుల అంగీకారంతోనే సభ్యుల సంక్షేమం కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాం.. వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు వేశాం. ప్రత్యేక ఆడిటర్ చేసిన ఆరోపణల విషయంలో నన్ను వివరణ కోరలేదు.కార్యవర్గం చేసిన తీర్మానంతోనే ‘ఇళయరాజా 75’ పేరుతో సంగీత విభావరి నిర్వహించి, నిర్మాతల మండలికి మంచి పేరు తెచ్చిపెట్టాను. వాటికి సంబంధించిన వివరాలు మండలి కార్యాలయంలో ఉన్నాయి. అలాంటిది ఏ ఆధారాలున్నాయని నాతో చిత్రాలు చేసే దర్శక–నిర్మాతలు మండలిలో చర్చించాలని తీర్మానం చేస్తారు? ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి’’ అని స్పందించారు విశాల్. – సాక్షి, చెన్నై -
ఇది మూవీ షూటింగ్ కాదు, సరిగ్గా ఆన్సరివ్వు: విశాల్‌పై మండిపడ్డ కోర్టు
చెన్నై: కోలీవుడ్ హీరో విశాల్‌పై న్యాయస్థానం మండిపడింది. విశాల్‌కు, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య కొన్నాళ్ల క్రితం డబ్బు విషయంలో విభేదాలు తలెత్తాయి. దీనిపై లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. కేసు విచారణలో భాగంగా విశాల్ కోర్టుకు హాజరయ్యాడు. తాను ఖాళీ కాగితంపై సంతకం చేశానని, లైకా సంస్థతో అగ్రిమెంట్ జరిగిందన్న విషయమే తెలియదన్నాడు. అతడి వ్యాఖ్యలపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలివిగా సమాధానం చెబుతున్నారనుకుంటున్నారా? ఇదేం షూటింగ్ కాదు. సరిగ్గా బదులివ్వండి అని గద్దించి అడిగారు.కాగా విశాల్.. ఫైనాన్షియర్ అన్బచెలియన్ దగ్గర తీసుకున్న రూ.21.29 కోట్ల రుణాన్ని లైకా సంస్థ చెల్లించింది. అందుకుగానూ ఆ డబ్బు తిరిగిచ్చేవరకు విశాల్ నిర్మించే సినిమా హక్కుల్ని తమకు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే విశాల్.. వీరమె వాగై చూడమ్ అనే సినిమా హక్కుల్ని లైకాకు బదులు వేరే సంస్థకు విక్రయించాడు. దీంతో రెండేళ్లక్రితం లైకా సంస్థ చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది.చదవండి: కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్‌కు వెళ్లనన్న బ్యూటీ.. వెనక్కు తగ్గిందా? -
హీరో విశాల్‌ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?
హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 'పందెం కోడి' సినిమా నుంచి ఇప్పటివరకు అడపాదడపా ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడూ వివాదాలని వెంటేసుకునే తిరిగే విశాల్.. గతంలోనూ ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్ గుత్తాధిపత్యాన్బ్ని, థియేటర్ల మాఫియాని ప్రశ్నించాడు. ఇప్పుడు తమిళ నిర్మాతల మండలితో వాగ్వాదానికి దిగాడు.(ఇదీ చదవండి: సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సింగర్ పోస్ట్ వైరల్!)గతంలో ఇదే తమిళ నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా విశాల్ పనిచేశాడు. ఆ సమయంలో దాదాపు రూ.12 కోట్ల మేర నిధులు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే విశాల్‌తో ఎవరూ సినిమాలు చేయొద్దని నిర్మాతల మండలి అల్టిమేటర్ జారీ చేసింది. ఈ క్రమంలోనే విశాల్ ట్విట్టర్ వేదికగా పెద్ద పోస్ట్ పెట్టాడు.'మనం ఓ బృందంగా, సమష్టిగా కలిసి తీసుకున్న నిర్ణయాలు నీకు తెలియదా? మిస్టర్ కథిరేశన్.. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లోని సభ్యుల సంక్షేమం కోసం నిధులు ఖర్చు చేశాం. వారి కుటుంబం, విద్య, వైద్యం అంటూ ఇలా సంక్షేమానికి ఖర్చు చేశాం. మీరు అక్కడ మీ పని సక్రమంగా చేయండి.. ఇండస్ట్రీలో చాలా పని ఉంది.. డబుల్ టాక్సేషన్, థియేటర్ మెయింటైన్స్ ఛార్జెస్ అంటూ ఇలా ఎన్నో సమస్యలకు పరిష్కరాలు వెతకాల్సి ఉంది.. విశాల్ ఇక్కడ కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంటాడు.. కావాలంటే నన్ను ఆపేందుకు ట్రై చేసుకోవచ్చు.. అసలు అక్కడ సినిమాలు తీసే నిర్మాతలున్నారా?' అని విశాల్ తన ట్వీట్‌తో ఆగ్రహాన్ని అంతా బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ధనుష్ 'రాయన్' సినిమా రివ్యూ) -
చిత్రపరిశ్రమలో మీ జోక్యం ఎందుకు అంటూ విశాల్ ఫైర్
కోలీవుడ్ హీరో విశాల్ తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో ప్రభుత్వ జోక్యం ఎక్కువైందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం చిత్ర పరిశ్రమలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలో తన రత్నం సినిమా విడుదల సమయంలో జరిగిన సంఘటనను గుర్తు చేశారు.తమిళ చిత్రసీమలో రెడ్ జెయింట్ మూవీస్ ఆధిపత్యం గురించి బహిరంగంగానే విశాల్ మాట్లాడారు. ఆ సంస్థ అధినేత తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై కూడా విశాల్ విమర్శలు చేశారు. తను నటించిన రత్నం సినిమా విడుదలను కూడా అడ్డుకున్నారంటూ.. వారికి అలాంటి అధికారం ఎవరిచ్చారో చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కడలూరులో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన విశాల్ మీడియాతో సమావేశమై మాట్లాడారు. ఇక సినిమా రంగంపై డీఎంకే ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని సంచలన ఆరోపణ చేశాడు.ఆయన మాట్లాడుతూ.. 'తమిళ సినిమాకు ఈ ఏడాది చాలా కష్టం కాలంగా ఉంది. సినిమాలను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడమే దీనికి కారణం. రాబోయే రోజుల్లో 10 పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. ఆ 10 సినిమాలు కూడా దీపావళి, దసరా, క్రిస్మస్ పండుగలను టార్గెట్ చేసుకుని విడుదలవుతున్నాయి. దీంతో చిన్న సినిమాలను కొనేవారు లేరు, విడుదల చేసేవారు లేరు. మంచి సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. అయితే ఈ ఏడాది కమర్షియల్‌గా చిత్ర పరిశ్రమకు కష్టతరమైన సంవత్సరంగా మారనుంది. దీనికి ప్రధాన కారణం సినిమా పరిశ్రమలోకి ప్రభుత్వం చొచ్చుకు రావడమే.. ఇందులోకి ప్రభుత్వం ఎందుకు రావాలి..? గత ప్రభుత్వం ఇలాంటి పనులు చేయలేదు. అని విశాల్ తెలిపారు. తమిళనాడులో తాము షూటింగ్‌కి వెళ్లినప్పుడు తాగునీరు లేని గ్రామాలు ఎన్నో చూశామని విశాల్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పైగానే అవుతున్నా తాగునీరు లేని గ్రామాలు చూస్తున్నామంటే కాస్త విడ్డూరంగానే ఉందని ఆయన పేర్కొన్నారు. -
రెబల్ ఎంపీ మద్దతు.. వందకు చేరిన కాంగ్రెస్ బలం!
ముంబై: కాంగ్రెస్ పార్టీ ఎంపీల సంఖ్య 100కు చేరనుంది. మహారాష్ట్రలోని సాంగ్లీ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన విశాల్ పాటిల్ గెలుపొందిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకి తన పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గేను కలిసి తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపే లేటర్‌ను అందజేశారు. ఈ విషయాన్ని ఖర్గే ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడాన్ని అధ్యక్షడు ఖర్గే స్వాగతించారు. మహారాష్ట్ర మాజీ సీఎం వసంత్‌దాదా పాటిల్ మనవుడు విశాల్ పాటిల్. ఇక లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల ఒప్పందాని కంటే ముందే శివసేన(యూబీటీ) కూటమి తరఫున తమ అభ్యర్థిని పోటీకి నిలిపింది. దీంతో కాంగ్రెస్ పునరాలోచించాలని శివసేన(యూబీటీ)ని కోరినా ఫలితం లేకుండా పోయింది.People of Maharashtra defeated the politics of treachery, arrogance and division. It is a fitting tribute to our inspiring stalwarts like Chhatrapati Shivaji Maharaj, Mahatma Jyotiba Phule and Babasaheb Dr Ambedkar who fought for social justice, equality and freedom.… pic.twitter.com/lOn3uYZIFk— Mallikarjun Kharge (@kharge) June 6, 2024 దీంతో విశాల్ పాటిల్.. సాంగ్లీలో స్వతంత్రంగా బరిలోకి దిగి గెలుపొందారు. ఆయన బీజేపీ అభ్యర్థి సంజయ్ కాకాపై విజయం సాధించారు. విశాల్ పాటిల్ గురువారమే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మద్దతు తెలిపే లెటర్‌ను అందజేశారు. లోక్‌సభ సెక్రటరీ అనుమతి ఇస్తే.. విశాల్ పాటిల్ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన ఎంపీగా కొనసాగుతారు. దీంతో కాంగ్రెస్ అభ్యుర్థులు సంఖ్య కూడా 99 నుంచి 100కు పెరుగుతుంది. మరోవైపు.. బిహార్‌లో పూర్ణియా లోక్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన పప్పు యాదవ్ సైతం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపిన పప్పు యాదవ్.. ఆర్జేడీతో సీట్ల ఒప్పందంతో టికెట్ లభించకపోవటంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. -
అప్పు చేసి జిరాక్స్ షాప్.. వందల కోట్ల వ్యాపారవేత్త సక్సెస్ స్టోరీ
ఎక్కడ మొదలు పెట్టాం అన్నది ముఖ్యం కాదు.. ఎక్కడికి చేరుకున్నాం అన్నదే ప్రధానం. పట్టుదల, కృషి, తెలివితేటలతో వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలకు చేరిన ఎందరో వ్యాపారవేత్తలు ఉన్నారు. అయితే నడకకు దూరం చేసిన విధికి తన విజయంతో గుణపాఠం చెప్పిన స్ఫూర్తిదాయక వ్యాపారవేత్త విశాల్ మెగా మార్ట్ వ్యవస్థాపకుడు రామచంద్ర అగర్వాల్.పోలియో బాధితుడైన రామచంద్ర తన వైకల్యానికి ఎప్పుడూ కుంగిపోలేదు. తన కాళ్ల మీద తాను నిలబడాలన్న కసితో తెలిసినవారి వద్ద అప్పు చేసి 1986లో ఒక చిన్న ఫోటోస్టాట్ దుకాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కోల్‌కతాలో 15 ఏళ్ల పాటు బట్టల వ్యాపారం చేశారు. అక్కడి నుంచి ఢిల్లీకి మకాం మార్చిన ఆయన 2001-02లో విశాల్ రిటైల్ సంస్థను స్థాపించారు. ఆ వ్యాపారంలో విజయం సాధించి క్రమంగా విశాల్ రిటైల్స్ విశాల్ మెగా మార్ట్ గా మారింది.రెండో దెబ్బరూ.1000 కోట్ల ల ఆయన కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. అయితే 2008లో స్టాక్ మార్కెట్ పతనం కారణంగా ఆయన కంపెనీ విశాల్ మెగా మార్ట్ అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో ఆయన తన కంపెనీని శ్రీరామ్ గ్రూపునకు విక్రయించాల్సి వచ్చింది. ఎవరైనా అయితే ఇంత పెద్ద దెబ్బ తగిలితే ఇక్కడితో ఆగిపోతారు. కానీ రామచంద్ర అలా ఆగిపోలేదు.మరోసారి విధి కొట్టిన దెబ్బను తట్టుకుని ముందుకు సాగి వీ2 రిటైల్ సంస్థను స్థాపించి రిటైల్ మార్కెట్లో మరోసారి తనదైన ముద్ర వేశారు. ఆయన కంపెనీ వీ2 రిటైల్ మార్కెట్ ప్రస్తుతం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ కంపెనీలలో ఒకటిగా ఉంది. రూ .800 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. -
Vishal Marriage: పెళ్లెప్పుడు? విశాల్ సమాధానమిదే! ఇంక చేసుకున్నట్లే!
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి కాని ప్రసాదులు చాలామందే ఉన్నారు. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన హీరోలు పెళ్లి వైపు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. అదేమంటే.. ఆ హీరో పెళ్లయ్యాక చేసుకుంటా, ఈ హీరో జోడీని వెతుక్కున్నాక చేసుకుంటా అని సాకులు చెప్తుంటారు. హీరో విశాల్ కూడా ఇదే రూటులో వెళ్తున్నాడు.పెళ్లి ఊసే లేదు!తను గతంలో ప్రేమించిన ఓ బ్యూటీ కూడా పెళ్లి చేసుకోబోతుంది. 46 ఏళ్లొచ్చినా ఈయన మాత్రం వివాహానికి తొందరేముంది అన్నట్లుగా నిమ్మకు నీరెత్తకుండా ఉండిపోయాడు. కానీ జనాలు ఊరుకుంటారా? మెడ మీద కత్తిపెట్టి అడిగినట్లుగా పెళ్లెప్పుడో చెప్పు అని ప్రశ్నిస్తూనే ఉన్నారు.తెలివైన సమాధానందీనికి విశాల్ చాలా తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. సల్మాన్ ఖాన్, శింబు, ప్రభాస్.. ఈ ముగ్గురు పెళ్లి చేసుకున్నాకే నేను కూడా లైఫ్‌లో సెటిలవుతాను అని చెప్పాడు. శింబుకు మంచి అమ్మాయిని చూసి మూడు ముళ్లు వేయించాలని వేట మొదలుపెట్టారట అతడి పేరెంట్స్. ప్రభాస్ అంటారా? సినిమాల మీద తప్ప పర్సనల్ లైఫ్ గురించి పట్టించుకుందే లేదు.సల్మాన్ పేరు చెప్పాడంటే..ఇక సల్మాన్ విషయానికి వస్తే.. ఆయనకసలు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశమే లేదు. మరి విశాల్ ఈ ముగ్గురి తర్వాతే అంటున్నాడంటే తనకసలు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? లేదా బ్రహ్మచారిగా మిగిలిపోతాడా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.చదవండి: విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు -
నెల రోజుల్లోపే ఓటీటీకి స్టార్ హీరో సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం 'రత్నం'. గతనెల ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈనెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తమిళ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మేనన్ కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్ 26 విడుదలైన ఈ చిత్రం నెల రోజుల్లోపే ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చేస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. -
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
కోలీవుడ్ డైరెక్టర్ హరి- విశాల్ కాంబోలో వచ్చిన సినిమా 'రత్నం'. ఏప్రిల్ 26న విడుదలైన ఈ చిత్రం విశాల్ అభిమానులను మెప్పించింది. పలు ట్విస్ట్‌లతో పాటు భారీ ఫైట్స్‌తో మాస్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంది. అయితే, సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. కమర్షియల్ చిత్రాలను అందించడంలో దర్శకుడిగా హరికి మంచి గుర్తింపు ఉంది. ఆయన నుంచి ఇప్పటికే భరణి, పూజా,సింగం సీక్వెల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ నటించింది. ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆ రోజు సినిమాకు పోటీగా మరే పెద్ద సినిమా విడుదల కాకపోవడంతో రత్నం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడంతో రత్నం సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఇప్పుడు రత్నం సినిమా ఓటీటీలోకి రానుంది. మే 24న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని నెట్టింట వైరల్ అవుతుంది. కొద్దిరోజుల్లో చిత్ర మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన రావచ్చని తెలుస్తోంది. -
‘రత్నం’ మూవీ రివ్యూ
టైటిల్ : రత్నంనటీనటులు: విశాల్, ప్రియా భవానీ శంకర్, మురళీ శర్మ, గౌతమ్ మీనన్, సముద్రఖని, యోగిబాబు తదితరులునిర్మాణ సంస్థలు: జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్దర్శకత్వం: హరిసంగీతం: దేవీ శ్రీ ప్రసాద్విడుదల తేదిఫ: ఏప్రిల్ 26, 2024‘భరణి’, ‘పూజా’సినిమాల తర్వాత మాస్ యాక్షన్ హీరో, పురుచ్చి దళపతి విశాల్, యాక్షన్ డైరెక్టర్ హరి కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘రత్నం’. కార్తికేయన్ సంతానం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌ని ప్రేక్షకులను నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ‘రత్నం’పై టాలీవుడ్‌లోనూ భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రత్నం(విశాల్) చిత్తూరు మార్కెట్లో పని చేస్తుంటాడు. చిన్నప్పుడు ఓ సారి అదే మార్కెట్‌కు చెందిన పన్నీర్ సామి(సముద్రఖని)ని చంపేందుకు వచ్చిన ఓ మహిళను కత్తితో చంపేస్తాడు. తన ప్రాణాలను కాపాడడనే సానుభూతితో రత్నాన్ని తనవద్దే ఉంచుకుంటాడు పన్నీర్. కొన్నాళ్లకు పన్నీర్ ఎమ్మెల్యే అవుతాడు. అతని తోడుగా ఉంటూ నియోజకవర్గంలో ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తాడు రత్నం. ఓ సారి నీట్ పరీక్ష రాసేందుకు చిత్తూరు వచ్చిన మల్లిక(ప్రియా భవానీ శంకర్)ని చూసి, ఫాలో అవుతాడు. అదే సమయంలో అమెను చంపేందుకు లింగం(మురళీ శర్మ) గ్యాంగ్ చిత్తూరు వస్తుంది. వారి నుంచి మల్లికను కాపాడమే కాదు, దగ్గరుండి మరీ పరీక్ష రాయిస్తాడు. అసలు మల్లిక ఎవరు? ఆమెకు రత్నంకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? లింగం మనుషులు ఆమెను ఎందుకు వెంబడిస్తున్నారు? రత్నం తల్లి రంగనాయకమ్మ ఎలా చనిపోయింది? లింగం నేపథ్యం ఏంటి? మల్లిక కుటుంబానికి వచ్చిన సమస్యను తీర్చే క్రమంలో రత్నంకు తెలిసిన నిజం ఏంటి? ఆ నిజం తెలిసిన తర్వాత రత్నం ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. మాస్ సినిమాలను డిఫరెంట్‌గా తెరకెక్కించడంలో డైరెక్టర్ హరి స్పెషలిస్ట్. నాన్ స్టాప్ యాక్షన్‌తో కథనాన్ని పరుగులు పెట్టిస్తాడు. అందుకే సింగంతో పాటు దానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రాలన్నీ తెలుగులోనూ మంచి విజయం సాధించాయి. రత్నం కూడా అదే తరహాలో తెరకెక్కించాడు. కావాల్సినంత యాక్షన్‌తో కథనాన్ని పరుగులు పెట్టించాడు. కానీ కథలో మాత్రం కొత్తదనం మిస్ అయింది. యాక్షన్ సీన్స్‌తో పాటు ప్రతి సన్నివేశం రొటీన్‌గానే అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల పాత్రల మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రం కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. కాని అది ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. 1994లో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో జరిగే బస్సు దోపిడి సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథంతా చిత్తూరు మార్కెట్ చుట్టూ తిరుగుతుంది. రత్నం చైల్డ్ ఎపిసోడ్ తర్వాత కథ వెంటనే 2024లోకి వెళ్లిపోతుంది. అక్కడ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. హీరో.. హీరోయిన్ చూసి ఎక్కడో చూసినట్లు భావించడం.. ఆమెను ఫాలో అవుతూ.. లింగం గ్యాంగ్ నుంచి కాపాడడం.. ఇలా ప్రతీ సన్నివేశం రొటీన్‌గానే అనిపిస్తుంది. మధ్య మధ్య యోగిబాబు వేసే కామెడీ పంచులు మినహా ఫస్టాఫ్ అంతా రొటీన్‌గానే సాగుతుంది. హీరోయిన్ విషయంలో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ కన్విసింగ్‌గా అనిపించడు. దీంతో సెకండాఫ్ అంతా మరింత రొటీన్ సాగుతు బోర్ కొట్టిస్తుంది. కథనం పరుగులు పెట్టినట్లే అనిపిస్తుంది కానీ..ఎక్కడా ఆసక్తిని రేకెత్తించదు. కొన్ని యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశాల్. ఆయన నుంచి ఓ యాక్షన్ సినిమా వస్తుందంటే ఆ క్రేజే వేరే లెవల్లో ఉంటుంది. ఈ జానర్ సినిమాల్లో విశాల్ మరింత రెచ్చిపోయి నటిస్తాడు. రత్నంలోనూ అలానే నటించాడు. ఎప్పటిమాదిరే కథంతా తన భుజానా వేసుకొని నడిపించాడు. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషన్ సీన్స్‌లోనూ చక్కగా నటించాడు. మల్లిక పాత్రకు ప్రియా భవానీ శంకర్ న్యాయం చేసింది. కథంతా ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. లింగంగా మురళీ శర్మ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.ఎమ్మెల్యే పన్నీర్‌గా సముద్రఖనీ తన పాత్ర పరిధిమేర బాగానే నటించాడు. హీరో స్నేహితుడు మూర్తిగా యోగిబాబు వేసే పంచులు, కామెడీ బాగా వర్కౌట్ అయింది. హరీశ్ పేరడీ, గౌతమ్ మీనన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. పాటలతో పాటు కొన్ని చోట్ల అదిరిపోయే బీజీఎం అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
రత్నం కథ ఇదే.. అందరికి నచ్చే హీరో ఎవరంటే: హరి
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన రత్నం చిత్రం ఏప్రిల్ 26న తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరపైకి రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రచారంలో ముమ్మరంగా మునిగిపోయింది. కమర్శియల్ దర్శకుడిగా ముద్ర వేసుకున్న హరి దర్శకత్వం వహించిన చిత్రం రత్నం. ఈయన నటుడు విశాల్‌తో భరణి,పూజా చిత్రాలతో హిట్ కొట్టారు. ఇప్పుడు మూడో చిత్రంగా రత్నం వస్తుంది. కాగా దర్శకుడు హరి ఇటీవల పుదుచ్చేరిలో విశాల్ అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రత్నం చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.రోడ్డులో వెళుతున్నప్పుడు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎవరూ సాయపడటానికి ముందుకు రావడం లేదని, వేడుకగా చూస్తున్నారని, అలా సాయం చేసే ఒక యువకుడి ఇతి వృత్తమే రత్నం చిత్రం కథ అని చెప్పారు. ఇకపోతే నటుడు విజయ్, త్రిష జంటగా నటించిన గిల్లీ తెలుగులో (ఒక్కడు) చిత్రం ఇటీవల రీ-రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు సాధిస్తోందన్నారు. మంచి చిత్రాలు ఎప్పుడు విడుదలైనా ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఈ చిత్రం ఒక ఉదాహరణ అన్నారు.ఇలాంటి చిత్రాలను చూస్తున్నప్పుడు మంచి చిత్రాలు చేయాలని దర్శకులకు ఉద్వేగం కలుగుతుందన్నారు. సాధారణంగా నటులకు ఒక వర్గం అభిమానులే ఉంటారని, అయితే రజకాంత్ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమాన నటుడని పేర్కొన్నారు. తలైవన్ చిత్రం వస్తుందంటే తొలిరోజునే చూస్తానని చెప్పారు. మరో విషయం ఏమిటంటే ఏ దర్శకుడు జాతి గురించో, మతం గురించో చిత్రం చేయాలని భావించరని దేశంలో జరుగుతున్న జాతి, మతం ఆలోచనలనే సినిమాగా తీస్తారని చెప్పారు. సినిమా అనేది జాతి, మతం, భాషలకు అతీతం అని దర్శకుడు హరి పేర్కొన్నారు. -
రూ. 50 లక్షలు విరాళం ప్రకటించిన హీరో శివకార్తికేయన్
తమిళ ప్రముఖ హీరో శివకార్తికేయన్ రూ.50 లక్షలు విరాళం అందించారు. 'సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' భవన నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నడిగర్ సంఘం నుంచి శివకార్తికేయన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లేఖ రాశారు. నడిగర్ భవన నిర్మాణ కోసం ఇప్పటికే కోలీవుడ్ టాప్ హీరోలు తమ వంతుగా సాయం చేస్తూనే ఉన్నారు. 'సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్'కు జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న హీరో విశాల్.. భవన నిర్మాణం కోసం విరాళాలు సేకరించే పనిలో గత కొన్ని నెలలుగా ఉన్నారు. ఆయన పిలుపుతో కమల్ హాసన్,విజయ్,సూర్య,కార్తీ వంటి స్టార్ హీరోలు తమ వంతుగా సాయం అందించారు. తాజాగా శివకార్తికేయన్ కూడా రూ. 50 లక్షలు విరాళం అందించారు. ఇప్పటికే రూ.40 కోట్లతో నిర్మాణ పనులు పూర్తి కాగా, నిర్మాణ పనులకు మరో రూ.25 కోట్లు అవసరం ఏర్పడటంతో నటీనటుల సంఘం తరపున బ్యాంకు రుణం ఇప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే రూ.12.5 కోట్లు డిపాజిట్ చేస్తే రూ.30 కోట్ల రుణం ఇచ్చేందుకు బ్యాంకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అందుకు సరిపడ మొత్తాన్ని ఏర్పాటు చేసే పనిలో విశాలు ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్, జనరల్ సెక్రటరీగా విశాల్, ట్రెజరర్‌గా హీరో కార్తీ కొనసాగుతున్నారు. Actor #Sivakarthikeyan donated Rs 50Lakh from his personal fund towards the construction of New Nadigar Sangam Building. He handed the cheque to South Indian Artistes' Association President M.Nasser and Treasurer Si.Karthi.#NadigarSangam #siaa@actornasser @VishalKOfficial… pic.twitter.com/vGfoTURb0t — Ramesh Bala (@rameshlaus) April 23, 2024