Dinesh Karthik
-
గిల్.. భారత్‌లో ఆడినట్లు అక్కడ ఆడితే కుదరదు: దినేష్ కార్తీక్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న సంగతి తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు గాయం కారణంగా దూరమైన గిల్ రెండో టెస్టు నుంచి అందుబాటులో వచ్చాడు.ఇప్పటివరకు ఈ సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌లు ఆడిన గిల్.. వరుసగా 31, 28, 1 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో గిల్‌పై భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్ తన బ్యాటింగ్ టెక్నిక్‌లో స్వల్ప మార్పులు చేయాలని చేయాలని కార్తీక్ సూచించాడు."శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో చిన్న సాంకేతిక లోపం ఉంది. అతడు బంతిని బలంగా కొట్టడానికి ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోతున్నాడు. మీరు వైట్‌బాల్ క్రికెట్ ఎక్కువగా ఆడే సమయంలో ఇది సహజంగా జరుగుతోంది. ట్రావిస్ హెడ్ కూడా అలానే ఆడేవాడు.కానీ ఇప్పుడు అతడు తన సమస్యకు పరిష్కరం కనుగొన్నాడు. శుబ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లు భారత కండీషన్స్‌కు ఎక్కువగా అలవాటు పడడంతోనే.. విదేశీ పిచ్‌లలో ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. బౌలర్ బంతిని రిలీజ్ చేసిన వెంటనే మీ మనసు దానిని ఫుల్బాల్గా అంచనావేసి.. ఫ్రంట్ ఫుట్కు వెళ్లి ఆడమని చెబుతుంది.కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి విదేశీ టార్లకు వెళ్లే ఆటగాళ్లు కొత్త బంతిని ఎలా ఆడాలో ముందే ప్రాక్టీస్ చేస్తారు. కొత్త బాల్‌ను ఆడేందుకు రెండు రకాలుగా ప్రయత్నిస్తారు. ఒకటి షాప్ట్ హ్యాండ్స్‌తో ఆడుతారు లేదా శరీరానికి దగ్గరగా బంతిని ఆడటం లేదా వదిలేయడం చేస్తారు. శుబ్‌మన్ గిల్ భారత్‌లో ఆడినట్లే ఆస్ట్రేలియాలో ఆడుతున్నాడు.స్వదేశంలో పరిస్థితులకు ఆసీస్ కండీషన్స్‌కు చాలా తేడా ఉంది. బంతిని గట్టిగా హిట్ చేయడానకి వెళ్లి ఔట్ అవుతున్నాడు. గబ్బా వంటి స్టేడియాల్లో ఫ్రంట్ ఫుట్ ఆడటం కొంచెం కష్టం. ఇన్నింగ్స్ ఆరంభంలోనే మీ మనస్సును నియంత్రించుకుని అలాంటి బంతులను వదిలేస్తాని నిర్ణయించుకోవాలి.టెస్టుల్లో చాలా కాలం నుంచి నంబర్3లో ఆడుతున్నావు. అటువంటి అప్పుడు అంత సులువగా ఔట్ అవ్వడం సరైనది కాదు. నిజం చెప్పాలంటే గిల్ ఒక్కడే కాదు, భారత బ్యాటింగ్ సమష్టిగానే విఫలమవుతోంది. ప్రతీ ఇన్నింగ్స్‌లో వారు ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు అన్పిస్తోందని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. -
బుమ్రా తర్వాత బెస్ట్ బౌలర్.. భీకర ఫామ్‌లో ఆర్సీబీ పేసర్
ఐపీఎల్-2025 నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఈసారి తమ పేస్ దళాన్ని మరింత పటిష్టం చేసుకుంది. మెగా వేలానికి ముందే యశ్ దయాళ్ను రిటైన్ చేసుకున్న ఆర్సీబీ.. వేలంలో భాగంగా టీమిండియా స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్‌ను సొంతం చేసుకుంది. ఈ వెటరన్ పేసర్ కోసం ఏకంగా రూ. 10.75 కోట్లు ఖర్చు చేసింది.రిటెన్షన్స్ సమయంలో టీమిండియా ప్రస్తుత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను వదిలేసిన తర్వాత.. ఆర్సీబీ ఈ మేర అతడి స్థానాన్ని సీనియర్‌తో భర్తీ చేసుకుంది. ఈ నేపథ్యంలో భువీ గురించి ఆర్సీబీ కోచింగ్ సిబ్బందిలో భాగమైన దినేశ్ కార్తిక్ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్నాయి.అతడు బెస్ట్ టీ20 బౌలర్ఆర్సీబీ ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్, మొ బొబాట్, ఓంకార్ సాల్వీలతో డీకే మాట్లాడుతూ.. ‘‘బుమ్రా తర్వాత.. ఇప్పటికీ తన ప్రభావం చూపగలుగుతున్న అత్యుత్తమ బౌలర్ ఎవరైనా ఉన్నారా అంటే.. భువనేశ్వర్ కుమార్ పేరు చెబుతాను. అతడు బెస్ట్ టీ20 బౌలర్’’ అని ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా.. కుర్ర పేసర్ రసీఖ్ సలాం గురించి ప్రస్తావనకు రాగా.. 24 ఏళ్ల ఈ ఆటగాడి నైపుణ్యాలు అద్భుతమని డీకే కొనియాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. అభిమానులను ఆకర్షిస్తోంది.భీకర ఫామ్‌లో భువీభువనేశ్వర్ కుమార్ టీ20 ఫార్మాట్లో ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ స్వింగ్ సుల్తాన్.. ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి పదకొండు వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక హ్యాట్రిక్ కూడా ఉంది. ఇక భువీ ఈ టోర్నీలో ఇప్పటి వరకు సగటు 12.90తో ఎకానమీ రేటు 5.64గా నమోదు చేయడం విశేషం. అంతేకాదు సారథిగానూ జట్టును విజయపథంలో నడిపి క్వార్టర్ ఫైనల్లో నిలిపి.. సెమీస్ రేసులోకి తెచ్చాడు.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టువిరాట్ కోహ్లి (రూ. 21 కోట్లు) రజత్ పాటిదార్ (రూ.11 కోట్లు) యశ్ దయాళ్ (రూ. 5 కోట్లు) జోష్ హాజల్‌వుడ్ (రూ.12.50 కోట్లు) ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు) జితేశ్ శర్మ (రూ.11 కోట్లు) భువనేశ్వర్ కుమార్ (రూ.10.75 కోట్లు) లియామ్ లివింగ్‌స్టోన్ (రూ.8.75 కోట్లు) రసిఖ్ ధార్ (రూ.6 కోట్లు) కృనాల్ పాండ్యా (రూ. 5.75 కోట్లు) టిమ్ డేవిడ్ (రూ. 3 కోట్లు) జాకబ్ బెథెల్ (రూ. 2.60 కోట్లు) సుయాశ్ శర్మ (రూ.2.60 కోట్లు) దేవ్‌దత్ పడిక్కల్ (రూ. 2 కోట్లు) తుషార (రూ. 1.60 కోట్లు) రొమరియో షెఫర్డ్ (రూ. 1.50 కోట్లు లుంగి ఇన్‌గిడి (రూ. 1 కోటి) స్వప్నిల్ సింగ్ (రూ.50 లక్షలు) మనోజ్ (రూ. 30 లక్షలు) మోహిత్ రాఠి (రూ. 30 లక్షలు) అభినందన్ (రూ. 30 లక్షలు) స్వస్తిక్ చికార (రూ. 30 లక్షలు) .చదవండి: కెప్టెన్ ఫామ్‌లో లేకుంటే కష్టమే.. రోహిత్ ఇకనైనా..: ఛతేశ్వర్ పుజారా -
అతడొక విధ్వంసక బ్యాటర్.. అందుకే కొనుక్కున్నాం: ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ డీకే
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ కోసం ఈసారి భారీ మొత్తమే ఖర్చుపెట్టింది. సౌదీ అరేబియా వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం-2025లో అనూహ్య రీతిలో అతడి కోసం రూ. 11.50 కోట్లు ధారపోసింది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సాల్ట్ కోసం.. తొలుత ముంబై ఇండియన్స్‌తో పోటీపడిన ఆర్సీబీ.. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో తలపడింది.ధరను ఏకంగా రూ. 8 కోట్ల పెంచి కేకేఆర్‌కు సవాలు విసిరింది. అయినప్పటికీ కోల్‌కతా వెనుకంజ వేయలేదు. రూ. 10 కోట్ల వరకు వచ్చింది. అయితే, ఆ తార్వత ఆర్సీబీ ఏకంగా ధరను రూ. 11.50 కోట్లకు పెంచగా కేకేఆర్ తప్పుకొంది. దీంతో సాల్ట్ ఆర్సీబీ సొంతమయ్యాడు.అతడొక విధ్వంసర బ్యాటర్.. పవర్ ప్లేలో..అయితే, సాల్డ్ కోసం అంతమొత్తం వెచ్చించడం సరైందేనా అన్న చర్చల నడుమ ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తిక్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘‘ఫిల్ సాల్ట్.. అతడి గురించి ఏమని చెప్పాలి?!... అతడొక విధ్వంసర బ్యాటర్. పవర్ ప్లేలో ఏ బౌలర్ బౌలింగ్‌నైనా చితక్కొట్టగలడు.అలాంటి ఆటగాడు మా జట్టులో సానుకూలాంశం. ఆర్సీబీకి ఎలాంటి ప్లేయర్ కావాలో.. ఫిల్ అలాంటివాడే’’ అని డీకే సాల్ట్‌పై ప్రశంసలు కురిపించాడు. కాగా ఆర్సీబీ జితేశ్ శర్మ రూపంలో మరో వికెట్ కీపర్ కోసం రూ. 11 కోట్ల ఖర్చుపెట్టిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో సాల్ట్, జితేశ్లలో ఎవరు కీపింగ్ చేస్తారనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘టోర్నీ మొదలైన తర్వాతే మేము ఈ విషయంపై సరైన నిర్ణయానికి రాగలము. అత్యుత్తమ ఆటగాడినే మేము ఎంచుకుంటాము’’ అని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. మూడు సెంచరీలుకాగా ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకు 38 టీ20లు ఆడిన ఫిల్ సాల్ట్ సగటున 36.86తో 1106 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేటు 165.32. అతడి ఖాతాలో మూడు అంతర్జాతీయ టీ20 సెంచరీలతో పాటు నాలుగు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి.ఇక ఓవరాల్‌గా పొట్టి ఫార్మాట్లో సాల్ట్ 268 మ్యాచ్‌లు పూర్తి చేసకుని 155కు పైగా స్ట్రైక్‌రేటుతో 6517 రన్స్ సాధించాడు సాల్ట్. ఇందులో మూడు సెంచరీలు, 41 ఫిఫ్టీలు ఉన్నాయి. గతేడాది కేకేఆర్‌కు ఆడిన సాల్ట్ 12 మ్యాచ్‌లలో కలిపి.. నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 435 పరుగులు చేశాడు.రాయల్ చాలెంజర్స్ బెంగళూరురిటెన్షన్స్: విరాట్ కోహ్లి (రూ. 21 కోట్లు) ,రాజత్ పటిదార్ (రూ.11 కోట్లు) ,యశ్ దయాళ్ (రూ. 5 కోట్లు) వేలంలో కొన్నప్లేయర్లుహాజల్వుడ్ (రూ.12.50 కోట్లు) ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు) జితేశ్ శర్మ (రూ.11 కోట్లు) భువనేశ్వర్ (రూ.10.75 కోట్లు) లివింగ్‌స్టోన్ (రూ.8.75 కోట్లు) రసిక్ ధార్ (రూ.6 కోట్లు) కృనాల్ పాండ్యా (రూ. 5.75 కోట్లు) టిమ్ డేవిజ్ (రూ. 3 కోట్లు) జాకబ్ బెథెల్ (రూ. 2.60 కోట్లు) సుయాశ్ శర్మ (రూ.2.60 కోట్లు) పడిక్కల్ (రూ. 2 కోట్లు) తుషార (రూ. 1.60 కోట్లు) రొమరియో (రూ. 1.50 కోట్లు ఇన్‌గిడి (రూ. 1 కోటి) స్వప్నిల్ సింగ్ (రూ.50 లక్షలు) మనోజ్ (రూ. 30 లక్షలు) మోహిత్ రాఠి (రూ. 30 లక్షలు) అభినందన్ (రూ. 30 లక్షలు) స్వస్తిక్ చికార (రూ. 30 లక్షలు) చదవండి: Mohammed Siraj: బిగ్‌బాస్ ఫేమ్, నటితో సిరాజ్ డేటింగ్?.. రూమర్లకు కారణం ఇదే! -
Ind vs NZ 3rd Test: బుమ్రాను జట్టు నుంచి తీసేయండి!
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరాలంటే టీమిండియా ఇక ముందు మరింత జాగ్రత్తగా అడుగువేయాల్సి ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడో టెస్టు గెలవడం సహా ఆస్ట్రేలియాలో మెరుగ్గా రాణిస్తేనే టైటిల్ పోరుకు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కివీస్ జట్టుతో ఆఖరిదైన మూడో టెస్టులో తుదిజట్టు ఎంపికపై డీకే తన అభిప్రాయం పంచుకున్నాడు. ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్ నుంచి ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విరామం ఇవ్వాలని మేనేజ్మెంట్కు సూచించాడు. కాగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ ఇప్పటికే 0-2తో కోల్పోయిన విషయం తెలిసిందే.ఐదు టెస్టులు ఆడేందుకు ఆసీస్కుఈ క్రమంలో నవంబరు 1 నుంచి ఆరంభం కానున్న మూడో టెస్టులోనైనా గెలుపొంది పరువు నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది. అంతేకాదు.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే టీమిండియాకు ఈ మ్యాచ్ కీలకం. ఎందుకంటే.. డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో ఆఖరిగా రోహిత్ సేన ఆస్ట్రేలియాతో తలపడనుంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఆసీస్‌కు వెళ్లనుంది.ఈ నేపథ్యంలో కామెంటేటర్ దినేశ్ కార్తిక్ మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్ చేతిలో సిరీస్ పరాజయం తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇప్పటికీ నా మెదడు ఈ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. ఇక నామమాత్రపు మూడో టెస్టులో ప్లేయింగ్ ఎలెవన్ ఉండబోతుందో ఇప్పుడే చెప్పలేం.బుమ్రా స్థానంలో సిరాజ్ రావాలిఅయితే, నా దృష్టిలో మాత్రం బుమ్రాను తప్పించి మహ్మద్ సిరాజ్‌ను తీసుకురావాలి. ఎందుకంటే.. బుమ్రాకు ఇప్పుడు విశ్రాంతి అత్యవసరం. మిగతవాళ్లందరినీ కొనసాగించడమే మంచిది. గత మ్యాచ్ ఆడిన బ్యాటర్లు లేదా బౌలర్లలో ఒక్కరిని కూడా తప్పించడానికి సరైన కారణం కనిపించడం లేదు. బుమ్రాకు మాత్రం రెస్ట్ కావాలి’’ అని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో ఈ పేస్‌గుర్రానికి బ్రేక్ ఇస్తే మంచిదని డీకే ఈ సందర్భంగా క్రిక్‌బజ్‌తో వ్యాఖ్యానించాడు.ఇదిలా ఉంటే.. వాంఖడే పిచ్ స్పిన్నర్లకు పూర్తిగా అనుకూలిస్తుందన్న అంచనాల నడుమ టీమిండియా ఒకే ఒక పేసర్‌తో బరిలోకి దిగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్‌లలో ఆ ఒక్కరు ఎవరన్నది శుక్రవారం తేలుతుంది. కాగా కివీస్‌తో బెంగళూరు టెస్టులో మూడు వికెట్లు తీసిన బుమ్రా.. పుణె టెస్టులో మాత్రం ఖాతా తెరవలేదు.చదవండి: IPL 2025: నికోలస్ పూరన్‌కు 18 కోట్లు..! -
దినేశ్ కార్తిక్- దీపికా ట్విన్స్ మూడో బర్త్‌డే.. కనిపించని డీకే (ఫొటోలు)
-
రాణించిన గబ్బర్.. అయినా డీకే జట్టు చేతిలో ఓటమి
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా సథరన్ సూపర్ స్టార్స్‌తో నిన్న (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధవన్ సారథ్యం వహిస్తున్న గుజరాత్ గ్రేట్స్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ధవన్ హాఫ్ సెంచరీతో రాణించినప్పటికీ.. దినేశ్ కార్తీక్ నేతృత్వంలోని సథరన్ సూపర్ స్టార్స్‌పై పైచేయి సాధించలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. చతురంగ డిసిల్వ మెరుపు అర్ద సెంచరీతో (28 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. మార్టిన్ గప్తిల్ 22, హమిల్టన్ మసకద్జ 20, దినేశ్ కార్తీక్ 18 పరుగులు చేశారు. కేదార్ జాదవ్ (1), పార్థివ్ పటేల్ (4),పవన్ నేగి (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. గుజరాత్ గ్రేట్స్ బౌలర్లలో మనన్ శర్మ ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. ప్లంకెట్, ప్రసన్న తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ గ్రేట్స్.. శిఖర్ ధవన్ మినహా ఎవరూ రాణించకపోవడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధవన్ 48 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన మోర్నీ వాన్ విక్ ఈ మ్యాచ్‌లో 15 పరుగులకే ఔటయ్యాడు. లెండిల్ సిమన్స్ 7, మొహమ్మద్ కైఫ్ 5, అస్గర్ అఫ్ఘాన్ 3, మనన్ శర్మ 10 పరుగులు చేశారు. సథరన్ సూపర్ స్టార్స్ బౌలర్లలో పవన్ నేగి 3, అబ్దుర్ రజాక్ 2, చతురంగ డిసిల్వ, కేదార్ జాదవ్ చెరో వికెట్ పడగొట్టారు. చదవండి: ఆస్ట్రేలియాను మట్టికరిపించిన టీమిండియా -
ముగిసిన లెజెండ్స్ లీగ్ వేలం.. భారీ ధర అతడికే
లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC)-2024 సెప్టెంబర్ 20న ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ క్రికెట్ టోర్నీ.. ఇప్పుడు మూడో సీజన్‌కు సిద్దమవుతోంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గోనునున్నాయి. తొలి సీజన్(2022)లో ఇండియా క్యాపిటల్స్ విజేతగా.. రెండువ సీజన్లో మణిపాల్ టైగార్స్ ఛాంపియన్‌గా అవతరించింది.ఇక ఇది ఇలా ఉండగా.. ఎల్ఎల్సీ మూడో సీజన్‌కు సంబంధించిన వేలం ముంబై వేదికగా గురువారం(ఆగస్టు 29)న జరిగింది. అయితే భారత మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్ ఈ ఏడాది ఎల్ఎల్సీ సీజన్లో భాగం కావడంతో మరింత ప్రాధన్యత సంతరించుకుంది. వేలానికి ముందే శిఖర్ ధావన్‌ను గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకోగా.. కార్తీక్‌తో సదరన్ సూపర్ స్టార్స్ ఒప్పందం కుదర్చుకుంది.అయితే ధావన్, కార్తీక్‌ల కోసం ఆయా ఫ్రాంచైజీలు ఎంత మొత్తం వెచ్చించియో వెల్లడించలేదు. వీరిద్దరూ మినహా మిగితా క్రికెటర్లందరూ వేలంలో పాల్గోనున్నారు. మొత్తం ఈ వేలంలో దాదాపు 300 మంది క్రికెటర్లు పాల్గోనగా.. 97 మంది మాత్రమే అమ్ముడు పోయారు. ఈ 97 మంది క్రికెటర్లను కొనుగోలు చేయడానికి ఆరు ఫ్రాంచైజీలు మొత్తం రూ. 39.63 కోట్లు వెచ్చించాయి. ఈ వేలంలో శ్రీలంకకు చెందిన ఇసురు ఉదానా అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. రూ. అర్బనైజర్స్ హైదరాబాద్ అతడిని రూ. 62 లక్షలకు సొంతం చేసుకుంది.ఉదానా తర్వాత భారీ ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్‌గా వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ చాడ్విక్ వాల్టన్ నిలిచాడు. అతడిని కూడా అర్బన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. కాగా బ్రెట్‌లీ, దిల్షాన్, షాన్ మార్ష్, ఫించ్, ఆమ్లా వంటి దిగ్గజ క్రికెటర్లు అమ్ముడుపోలేదు.వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే..మణిపాల్ టైగర్స్హర్భజన్ సింగ్, రాబిన్ ఉతప్ప, తిసర పెరీరా, షెల్డన్ కాట్రెల్, డాన్ క్రిస్టియన్, ఏంజెలో పెరీరా, మనోజ్ తివారీ, అసేలా గుణరత్నే, సోలమన్ మిరే, అనురీత్ సింగ్, అబు నెచిమ్, అమిత్ వర్మ, ఇమ్రాన్ ఖాన్, రాహుల్ శుక్లా, అమిటోజ్ సింగ్, ప్రవీణ్ గుప్తా, సౌరభ్ గుప్తా .ఇండియా క్యాపిటల్స్ యాష్లే నర్స్, బెన్ డంక్, డ్వేన్ స్మిత్, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, నమన్ ఓజా, ధవల్ కులకర్ణి, క్రిస్ మ్ఫోఫు, ఫైజ్ ఫజల్, ఇక్బాల్ అబ్దుల్లా, కిర్క్ ఎడ్వర్డ్స్, రాహుల్ శర్మ, పంకజ్ సింగ్, జ్ఞానేశ్వరరావు, భరత్ చిప్లి, పర్వీందర్ అవానా, పవన్ సుయాల్, మురళీ సుయాల్ విజయ్, ఇయాన్ బెల్.గుజరాత్ జెయింట్స్క్రిస్ గేల్, లియామ్ ప్లంకెట్, మోర్నే వాన్ వైక్, లెండిల్ సిమన్స్, అసోహర్ అఫోహాన్, జెరోమ్ టేలర్, పరాస్ ఖాడా, సీక్కుగే ప్రసన్న, కమౌ లెవర్రాక్, సైబ్రాండ్ ఎనోయెల్బ్రెచ్ట్, షానన్ గాబ్రియేల్, సమర్ క్వాద్రీ, మహమ్మద్ కైఫ్, శ్రీసన్హవాన్, శ్రీసన్హవాన్.కోణార్క్ సూర్యస్ ఒడిశాఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, కెవిన్ ఓ బ్రియాన్, రాస్ టేలర్, వినయ్ కుమార్, రిచర్డ్ లెవీ, దిల్షన్ మునవీర, షాబాజ్ నదీమ్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, బెన్ లాఫ్లిన్, రాజేష్ బిష్ణోయ్, ప్రవీణ్ తాంబే, దివేష్ పఠానియా, కేపీ అప్పన్న, అంబటి రాయుడు, అంబటి రాయుడు.సదరన్ సూపర్ స్టార్స్దినేష్ కార్తీక్, ఎల్టన్ చిగుంబుర, హామిల్టన్ మసకద్జా, పవన్ నేగి, జీవన్ మెండిస్, సురంగ లక్మల్, శ్రీవత్స్ గోస్వామి, హమీద్ హసన్, నాథన్ కౌల్టర్ నైల్, చిరాగ్ గాంధీ, సుబోత్ భాటి, రాబిన్ బిస్ట్, జెసల్ కరీ, చతురంగ డి సిల్వా, మోను కుమార్అర్బన్రైజర్స్ హైదరాబాద్సురేష్ రైనా (కెప్టెన్), మార్టిన్ గప్టిల్, డ్వేన్ స్మిత్, టినో బెస్ట్, స్టువర్ట్ బిన్నీ, క్రిస్టోఫర్ ఎంఫోఫు, అస్గర్ ఆఫ్ఘన్, చమర కపుగెదెరా, పీటర్ ట్రెగో, రిక్కీ క్లార్క్, పవన్ సుయాల్, ప్రజ్ఞాన్ ఓజా, శివ కాంత్ శుక్లా, సుదీప్ త్యాగి, తిరుమలశెట్టి సుమన్, యోగేష్ నగర్, షాదాబ్ జకాతి, జెరోమ్ టేలర్, గురుకీరత్ మాన్, అమిత్ పౌనికర్, దేవేంద్ర బిషూ. -
టీమిండియా స్టార్ రీ ఎంట్రీ.. ఆ జట్టులో చేరిక
టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ కీలక ప్రకటన చేశాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్లో తాను భాగం కానున్నట్లు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తర్వాత కూడా ఆటగాడిగా కొనసాగే అవకాశం టీ20 లీగ్‌ల ద్వారా దక్కిందని.. మరోసారి మైదానంలో దిగి అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డీకే వెల్లడించాడు.ఇటీవలే రిటైర్మెంట్కాగా ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన ఈ చెన్నై క్రికెటర్.. సీజన్ ముగిసిన తర్వాత క్యాష్ రిచ్ లీగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అదే విధంగా అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు డీకే ఈ ఏడాది జూన్ 1న ప్రకటన విడుదల చేశాడు. అనంతరం సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫ్రాంఛైజీ పర్ల్ రాయల్స్‌తో జట్టు కట్టిన దినేశ్ కార్తిక్.. ఈ లీగ్‌లో ఆడనున్న భారత తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.ఆ జట్టులో చేరిన డీకేఇక తాజాగా లెజెండ్స్ లీగ్‌లోనూ పాల్గొనన్నుట్లు తెలిపాడు. ఈ టీ20 లీగ్‌లో సదరన్ సూపర్‌స్టార్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నట్లు మంగళవారం వెల్లడించాడు. అభిమానుల మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నానని.. తనలో ఆడగల సత్తా ఉన్నంత కాలం క్రికెటర్‌గా కొనసాగుతానని డీకే పేర్కొన్నాడు. మైదానంలో దిగేందుకు శారీరకంగా, మానసికంగా సన్నద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించాడు.కాగా 2004 నుంచి 2022 వరకు టీమిండియాకు ఆడిన దినేశ్ కార్తిక్.. 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20లలో భాగమయ్యాడు. టెస్టుల్లో 1025, వన్డేల్లో 1752, టీ20లలో 686 పరుగులు సాధించాడు. ఐపీఎల్లో 257 మ్యాచ్‌లు ఆడి 4842 రన్స్ స్కోరు చేశాడు.ఇక శనివారం రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం తాను లెజెండ్స్ లీగ్‌లో పాల్గొననున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గబ్బర్ సోమవారం ప్రకటించాడు.తాజాగా డీకే సైతం ఇదే బాటలో నడవడం విశేషం. ఈ లీగ్‌లో ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్, క్రిస్ గేల్,ఆరోన్ ఫించ్ తదితర మాజీ క్రికెటర్లు ఇప్పటికే భాగమయ్యారు. కాగా సెప్టెంబరు 29న లెజెండ్స్ లీగ్ వేలం జరుగనుంది. ఇందులో 200కు పైగా ఆటగాళ్లు పాల్గొననున్నారు. చదవండి: టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటన -
కుల్దీప్ కాదు!.. టీమిండియాలో అశ్విన్ వారసుడు ఇతడే: డీకే
ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ఇప్పటివరకు 100 టెస్టులు ఆడిన ఈ చెన్నై స్టార్ 516 వికెట్లు తన ఖతాలో వేసుకున్నాడు. తద్వారా అనిల్ కుంబ్లే తర్వాత భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్ బౌలర్‌గా అశూ కొనసాగుతున్నాడు.ఇక అశ్విన్ తదుపరి సొంతగడ్డ వేదికగా బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. 37 ఏళ్ల ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్‌కు సరైన వారసుడు ఇతడేనంటూ టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో అశ్విన్ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా మరో చెన్నై స్టార్కే ఉందని అభిప్రాయపడ్డాడు.కుల్దీప్ కాదు!ఇప్పటికే జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్న చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను కాదని.. వాషింగ్టన్ సుందర్ పేరును చెప్పాడు డీకే. ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘కొత్త తరం ఆఫ్ స్పిన్నర్ కోసం టీమిండియా వెదుకుతోంది. ఇంగ్లండ్ లయన్స్‌తో ఇండియా-ఏ సిరీస్ సందర్భంగా మూడు మ్యాచ్‌లలో ముగ్గురు వేర్వేరు స్పిన్నర్లను బరిలోకి దించడమే ఇందుకు నిదర్శనం.పుల్కిత్ నారంగ్, వాషింగ్టన్ సుందర్, సారాంశ్ జైన్లను ఈ సిరీస్ సందర్భంగా పరీక్షించింది. వీరిలో రవిచంద్రన్ అశ్విన్ స్థానాన్ని భర్తీ చేయగల నైపుణ్యం వాషింగ్టన్ సుందర్‌కే ఉంది. అశూ వారసుల పోటీలో అతడే ముందుంటానడంలో సందేహం లేదు. తనకు లభించిన కొద్దిపాటి అవకాశాలను కూడా వాషీ సద్వినియోగం చేసుకున్నాడు.అతడే సరైన వాడు.. ఎందుకంటే?అందుకే.. అశూ స్థానంలో అతడే సరైన వాడని చెప్పగలను’’ అంటూ దినేశ్ కార్తిక్ వాషీ పేరు చెప్పడానికి గల కారణాన్ని వెల్లడించాడు. కాగా 2017లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన వాషింగ్టన్ సుందర్ లెఫ్టాండ్ బ్యాటర్.. అదే విధంగా రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. 24 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 4 టెస్టులు, 22 వన్డేలు, 49 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 6, 23, 44 వికెట్లు తీశాడు. చివరగా శ్రీలంకతో వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు వాషీ. -
ధోనీ విషయంలో తప్పు చేశాను, క్షమించండి: దినేశ్ కార్తీక్
టీమిండియా మాజీ వికెట్‌కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ గత వారం తన ఆల్‌టైమ్, ఆల్ ఫార్మాట్ ఫేవరెట్ టీమిండియాను ప్రకటించాడు. ఇందులో రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్ సభ్యులుగా ఉన్నారు. అయితే ఆశ్చర్యకరంగా డీకే ఈ జాబితాలో ఎంఎస్ ధోనికి చోటివ్వలేదు. ఈ కారణంగా అతను ధోని అభిమానుల నుంచి దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో డీకే తాజా వివరణ ఇచ్చాడు.ధోని విషయంలో చాలా పెద్ద తప్పు చేశానని ఒప్పుకున్నాడు. పొరపాటున ధోని పేరును లిస్ట్‌లో చేర్చలేదని వివరణ ఇచ్చాడు. స్వతహాగా వికెట్‌కీపర్‌ను అయి ఉండి, ధోని పేరును చేర్చకపోవడం నిజంగా పెద్ద పొరపాటని అన్నాడు. రాహుల్ ద్రవిడ్ జట్టులో ఉండటంతో అందరూ అతనే వికెట్‌కీపర్ అనుకున్నారని పేర్కొన్నాడు. ఈ అంశానికి సంబంధించిన ఎపిసోడ్ బయటికి వచ్చే వరకు ధోనిని ఎంపిక చేయలేదని తనకు కూడా తెలీదని వివరణ ఇచ్చాడు. జట్టు ఎంపిక సమయంలో తన మదిలో చాలా విషయాలు ఉన్నాయని, అందుకే పొరపాటు జరిగిందని అన్నాడు.తన జట్టులో ధోని తప్పనిసరిగా ఉంటాడని తెలిపాడు. ధోని ఏడో స్థానంలో వికెట్‌కీపర్‌గా మాత్రమే కాకుండా జట్టుకు నాయకుడిగా కూడా వ్యవహరిస్తాడని అన్నాడు. ధోని ఈ జట్టులోనే కాదు, తాను ఎంపిక చేసే ఏ జట్టులోనైనా ఉంటాడని తెలిపాడు. కాగా, ధోని నేతృత్వంలో టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను గెలిచిన విషయం తెలిసిందే. -
ఓపెనర్లుగా వీరూ, రోహిత్.. మిడిలార్డర్లో సచిన్, విరాట్: డీకే
టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ కామెంటేటర్‌గా మరింత బిజీ అయ్యాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత మ్యాచ్ ఫలితాలు, ఆటగాళ్ల ప్రదర్శనను తనదైన శైలిలో విశ్లేషిస్తూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గానూ చరిత్ర సృష్టించిన డీకే తాజాగా.. తన ఆల్‌టైమ్ టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు.ఓపెనర్లుగా వీరూ, రోహిత్మూడు ఫార్మాట్లలో కలిపి టీమిండియా తరఫున అత్యుత్తమంగా రాణించిన ఆటగాళ్లకు తన జట్టులో దినేశ్ కార్తిక్ చోటిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు సింహస్వప్నంగా మారి.. విధ్వంసకర బ్యాటర్‌గా పేరొందిన వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు డీకే.మిడిల్ ఆర్డర్లో సచిన్, విరాట్పరిమిత ఓవర్ల క్రికెట్లో 100కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టిన వీరూతో పాటు.. ఇటీవలి టీ20 ప్రపంచకప్-2024లో 257 పరుగులతో రెండో హయ్యస్ట్ రన్‌స్కోరర్‌గా నిలిచిన రోహిత్‌కు ఇన్నింగ్స్ ఓపెన్ చేసే అవకాశమిస్తానన్నాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్‌గా మాజీ కెప్టెన్, మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను ఎంచుకున్న డీకే.. వంద సెంచరీల దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్‌ను నాలుగో స్థానానికి ఎంచుకున్నాడు.ఇక ఆ తర్వాతి స్థానంలో రన్‌మెషీన్, 80 శతకాల వీరుడు విరాట్ కోహ్లికి చోటిచ్చిన దినేశ్ కార్తిక్.. ఆల్‌రౌండర్ల జాబితాలో వరల్డ్‌కప్ విన్నర్స్ యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజాలను ఎంపిక చేసుకున్నాడు. అదే విధంగా బౌలింగ్ విభాగంలో.. సీమర్లు జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్, స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, లెజెండ్ అనిల్ కుంబ్లేలకు స్థానం కల్పించాడు డీకే. పన్నెండో ఆటగాడిగా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్‌ను ఎంచుకున్నాడు ఈ తమిళనాడు మాజీ బ్యాటర్. క్రిక్‌బజ్ షోలో ఈ మేరకువ్యాఖ్యలు చేశాడు.వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్లలో డీకే ఎంచుకున్న భారత అత్యుత్తమ జట్టువీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖన్.12th మ్యాన్: హర్భజన్ సింగ్. -
ఆర్సీబీ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..? కార్తీక్ రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని రోహిత్ శర్మ వీడనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది సీజన్‌కు ముందు ముంబై ఫ్రాంచైజీ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించిన సంగతి తెలిసిందే. హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరి తమ జట్టు పగ్గాలను ముంబై ఇండియన్స్ కట్టబెట్టింది. దీంతో అప్పటినుంచి తన జట్టు యాజమాన్యంపై హిట్‌మ్యాన్ అసంతృప్తిగా ఉన్నాడు. ఐపీఎల్-2024 సందర్భంగా ఈ విషయం స్పష్టమైంది. అప్పటి కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో ముంబై ఇండియన్స్ గురించి రోహిత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ముంబై జట్టుతో ఇదే నా చివరి సీజన్ అని హిట్‌మ్యాన్ అన్న మాటలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఈ క్రమంలోనే ముంబైని వీడి ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలంలో రోహిత్ భాగం కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రోహిత్ శర్మ వేలంలోకి వస్తే ఎంత ధరైనా వెచ్చించి కొనుగోలు చేయడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ సిద్దంగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న డుప్లెసిస్పై వేటు వేసి రోహిత్ శర్మ తమ జట్టు పగ్గాలను అప్పగించాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తాజా ఇదే విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్, ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్‌ను అభిమానులు ప్రశ్నించారు. డీకే ఇటీవలే క్రిక్‌బజ్ చిట్‌చాట్‌లో పాల్గోనున్నాడు. ఈ సందర్భంగా ఐపీఎల్-2025లో ఆర్సీబీకి రోహిత్ శర్మ సారథ్యం వహిస్తాడా అని ఓ అభిమాని డీకేను ప్రశ్నించాడు. అందుకు బదులుగా కార్తీక్ షాకింగ్ రియాక్షన్ ఇస్తూ సైలెంట్‌గా ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. What changes should #India make ahead of #ChampionsTrophy? 🤔Why did #Rohit & Co. struggle against spinners❓#LaapataaLadies to #Maharaja: A special binge-watch list for cricketers! 🎦@DineshKarthik talks about it all, only on #heyCB, here ⬇️ pic.twitter.com/e6Q2ipzZei— Cricbuzz (@cricbuzz) August 11, 2024 -
'అదొక విచిత్రమైన పిచ్.. అక్కడ ఆడటం కోహ్లి, రోహిత్కైనా కష్టమే'
శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం దారుణ ప్రదర్శన కనబరిచాడు. మూడు మ్యాచ్‌ల్లో కోహ్లి కేవలం 54 పరుగులు మాత్రమే చేశాడు.ముఖ్యంగా ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ స్పిన్నర్‌కే కోహ్లి ఔట్ కావడం గమనార్హం. కోహ్లి ఒక్కడే కాకుండా మిగితా బ్యాటర్లు కూడా లంక స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు భారత జట్టుపై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు.తమ సొంతపిచ్లపై తప్ప స్వింగ్, స్పిన్ కండీషన్స్‌లో ఆడలేరని వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత జట్టుకు మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ మద్దతుగా నిలిచాడు. కొలంబోలోని వికెట్ కండీషన్స్ చూసి భారత ఆటగాళ్లంతా ఆశ్చర్యపోయారని కార్తీక్ తెలిపాడు."ఈ సిరీస్‌లో టీమిండియా స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. దాన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను. కానీ బంతి కొంచెం పాతబడ్డాక బాగా టర్న్ అవుతోంది. ముఖ్యంగా 8-30 ఓవర్ల మధ్య స్పిన్నర్లను ఎదుర్కొవడం ఆటగాళ్లకు చాలా కష్టమైన పని. అది విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ అయినా కావచ్చు. అందులో కొలంబో పిచ్ ఇంకా కఠినమైన పిచ్. ఈ పిచ్‌పై స్పిన్నర్లకు ఆడటం చాలా కష్టం. ఆటలో గెలుపు ఓటుములు సహజం. ఈ ఒక్కసిరీస్లో ఓడిపోయినంతమాత్రాన డీలా పడాల్సిన పనిలేదన్నారు.అన్ని పిచ్‌లు ఈ విధంగా ఉండవు. నేను ఏదో విరాట్ కోహ్లిని సపోర్ట్ చేసేందుకు ఈ వాఖ్యలు చేయడం లేదు. కొలంబో వికెట్ పరిస్థితులను మాత్రమే తెలియజేశానని" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. -
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడనున్న దినేష్ కార్తీక్.. తొలి భారత క్రికెటర్‌గా
భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో భాగం కానున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 సీజన్లో పార్ల్ రాయల్స్ తరపున కార్తీక్ ఆడనున్నాడు. వచ్చే ఏడాది సీజన్‌కు గాను విదేశీ ప్లేయర్ కోటాలో డీకేతో పార్ల్ రాయల్స్ ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకుంది.తద్వారా ఎస్ఎ టీ20లో ఆడనునున్న తొలి భారత ఆటగాడిగా కార్తీక్ నిలిచాడు. కాగా ఐపీఎల్-2024 అనంతరం అన్నిరకాల క్రికెట్ ఫార్మాట్లకు కార్తీక్ విడ్కోలు పలికాడు. కాగా భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో ఆడాలంటే కచ్చితంగా అన్ని ఫార్మాట్లకు ఖచ్చితంగా రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే. ఈ క్రమంలోనే కార్తీక్‌కు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడే ఛాన్స్ లభించింది. ఇక ఇటీవలే ఎస్ఎ టీ20 టోర్నమెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా కార్తీక్ ఎంపికయ్యాడు. కాగా టీ20ల్లో కార్తీక్‌కు అపారమైన అనుభవం ఉంది. తన కెరీర్లో 401 టీ20లు ఆడిన డీకే.. 136.96 స్ట్రైక్-రేట్‌తో 7407 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఏకంగా ఆరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. అదే విధంగా భారత్ తరుపన దినేష్ 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. కాగా డీకేతో పాటు ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్ జో రూట్‌ను కూడా పార్ల్ రాయల్స్ సొంతం చేసుకుంది. ఇక దక్షిణాఫ్రికా టీ20 లీగ్ మూడో సీజన్ వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరగనుంది.పార్ల్ రాయల్స్ జట్టుడేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, బ్జోర్న్ ఫోర్టుయిన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, దినేష్ కార్తీక్, మిచెల్ వాన్ బ్యూరెన్, కోడి యూసుఫ్, కీత్ డడ్జియోన్, న్కాబా పీటర్, క్వేనా మఫాకా, లువాన్-డ్రే ప్రిటోరియస్, దయాన్ గలీమ్చదవండి: 'గంభీర్ ఒక చిన్న పిల్లాడు.. ఓటమిని అస్సలు జీర్ణించుకోలేడు' -
సౌతాఫ్రికా టీ20 లీగ్ అంబాసిడర్‌గా దినేశ్ కార్తీక్
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రపంచపు అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్ దినేశ్ కార్తీక్ సౌతాఫ్రికా టీ20 లీగ్ బెట్‌వే ఎస్ఏ20కు అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని లీగ్ కమిషనర్ గ్రేమ్ స్మిత్ అధికారికంగా ప్రకటించారు. లీగ్ క్రికెట్లో డీకేకు ఉన్న అనుభవం, భారత్‌లో కార్తీక్‌కు ఉన్న క్రేజ్ తమ లీగ్ వృద్ధికి తోడ్పడుతుందని స్మిత్ అన్నాడు. బెట్‌వే ఎస్ఏ20 లీగ్‌కు అంబాసిడర్‌గా ఎంపిక కావడంపై డీకే స్పందించాడు. కొత్త బాధ్యతలు చేపట్టనుండటం ఆనందాన్ని కలిగిస్తుందని అన్నాడు. గ్రేమ్ స్మిత్ బృందంతో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నానని తెలిపాడు. కార్తీక్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సహచర అంబాసిడర్ ఏడీ డివిలియర్స్‌తో కలిసి పని చేస్తాడు.ఎస్ఏ20 లీగ్ గత రెండు సీజన్లుగా విజయవంతంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్‌లోనూ ఐపీఎల్ తరహాలో చాలామంది విదేశీ స్టార్లు పాల్గొంటున్నారు. ఈ లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు ఎడిషన్లలో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ విజేతగా నిలిచింది. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం చేతుల్లో నడుస్తుంది. ఈ జట్టుకు సౌతాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో పాటు ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్, ఎంఐ కేప్‌టౌన్ ఫ్రాంచైజీలు ఎస్ఏ20 లీగ్‌లో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలన్నీ ఐపీఎల్ ఓనర్ల యాజమాన్యంలోనే నడుస్తున్నాయి.కార్తీక్ ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే.. ప్రారంభ ఎడిషన్‌ను (2008) నుంచి వివిధ ఫ్రాంచైజీలకు ఆడిన డీకే.. ఐపీఎల్ 2024 అనంతరం రిటైర్మెంట్ ప్రకటించాడు. డీకే రిటైర్మెంట్ ముందు వరకు ఆర్సీబీకి ఆడాడు. రిటైర్మెంట్ అనంతరం ఆర్సీబీ డీకేను తమ మెంటార్‌గా నియమించుకుంది. 16 ఏళ్ల ఐపీఎల్ కెరీర్లో కార్తీక్ 135.66 స్ట్రయిక్‌రేట్‌తో 4842 పరుగులు చేశాడు. వికెట్‌కీపింగ్‌లో కార్తీక్ 145 క్యాచ్‌లు, 37 స్టంపింగ్‌లు చేశాడు. -
'అతడొక అద్భుతం.. కోహునూర్ డైమండ్ కంటే విలువ ఎక్కువ'
టీ20 ప్రపంచకప్-2024 విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో భారత్ 13 ఏళ్ల వరల్డ్‌కప్ నిరీక్షణకు తెరపడింది. అయితే భారత్ ఛాంపియన్స్‌గా నిలవడంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర. టోర్నీ అసాంతం బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.కీలకమైన ఫైనల్లో సైతం బుమ్రా సత్తాచటాడు. భారత్‌కు ఓటమి తప్పదనుకున్న ప్రతీసారి బుమ్రా బంతితో మ్యాజిక్ చేసేవాడు. తన బౌలింగ్‌తో వరల్డ్‌క్లాస్ బ్యాటర్లను సైతం ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ మెగా టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 4.17 ఏకానమీతో 15 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు వరించింది. వరల్డ్ క్రికెట్లో బుమ్రాని మించిన బౌలర్ మరొకడు లేడని కార్తీక్ కొనియాడాడు."బుమ్రా ఒక వరల్డ్‌క్లాస్ బౌలర్. జస్ప్రీత్ కోహినూర్ వజ్రం కంటే విలువైనవాడు. కామెంటరీలో కూడా ఇదే విషయం చాలా సార్లు చెప్పాను. వరల్డ్ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలోనూ బుమ్రాని మించిన వాడు మరొకడు లేడు. ఒత్తడిలో అద్బుతంగా బౌలింగ్ చేయడమే బుమ్రా స్పెషల్. అతడు లాంటి బౌలర్ ఒకరు జట్టులో ఉండాలని ప్రతీ కెప్టెన్ కోరుకుంటాడు. ఎటువంటి పరిస్థితులైనా బుమ్రా రాణించగలడు. ఇది అందరూ బౌలర్లు చేయలేరు. నిజంగా బుమ్రా చాలా బ్రిలియంట్ అంటూ" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. -
కోచ్‌గా దినేశ్ కార్తీక్
టీమిండియా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఐపీఎల్లో కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. డీకే.. తన తాజా మాజీ జట్టైన ఆర్సీబీకి బ్యాటింగ్ కోచ్ కమ్ మెంటార్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విటర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. వచ్చే సీజన్ (2025) నుంచి డీకే కొత్త విధుల్లో చేరతాడని ఆర్సీబీ పేర్కొంది. "సరికొత్త అవతారంలో మరోసారి మాలో భాగమవుతున్న దినేష్ కార్తీక్‌కు స్వాగతం"అని ఆర్సీబీ ట్వీట్లో రాసుకొచ్చింది.39 ఏళ్ల డీకే.. ఈ ఏడాదే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో (2008, 2009, 2010, 2014) ఐపీఎల్ ప్రస్తానాన్ని ప్రారంభించిన కార్తీక్.. గత మూడు సీజన్లలో ఆర్సీబీకి (2024, 2023, 2022) ప్రాతినిథ్యం వహించాడు. ఈ మధ్యలో కార్తీక్.. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (2011), ముంబై ఇండియన్స్ (2012, 2013), ఆర్సీబీ (2015), గుజరాత్ లయన్స్ (2016, 2017), కేకేఆర్ (2018, 2019, 2020, 2021) ఫ్రాంచైజీలకు ఆడాడు.ఐపీఎల్ ఆరంభ ఎడిషన్ (2008) నుంచి ఆడిన అతి కొద్ది మంది క్రికెటర్లలో (ఏడుగురు) కార్తీక్ ఒకడు. ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, సాహా, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్ మాత్రమే ఇనాగురల్ ఎడిషన్ నుంచి ఐపీఎల్ ఆడారు. ఇప్పటివరకు జరిగిన 16 ఎడిషన్లలో పాల్గొన్న కార్తీక్ కేవలం రెండే రెండు మ్యాచ్‌లు మిస్ అయ్యాడు. ఐపీఎల్లో కార్తీక్‌కు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. డీకే.. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. డీకే, రోహిత్ శర్మ ఐపీఎల్లో 257 మ్యాచ్‌లు ఆడారు. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు ధోని (264) పేరిట ఉంది. డీకే తన ఐపీఎల్ కెరీర్లో 135.36 స్ట్రయిక్‌రేట్‌తో 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కార్తీక్ ఖాతాలో 145 క్యాచ్‌లు, 37 స్టంపింగ్‌లు ఉన్నాయి.Dinesh Karthik talking about RCB and he continues to be with this family. ❤️- RCB 🤝 DK...!!!! pic.twitter.com/TiHTs3yjaA— Tanuj Singh (@ImTanujSingh) July 1, 2024కార్తీక్ కెరీర్‌ను 2022 ఐపీఎల్ ఎడిషన్ మలుపు తప్పింది. ఆ సీజన్లో పేట్రేగిపోయిన కార్తీక్ మ్యాచ్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సీజన్ ప్రదర్శన కారణంగా అతనికి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. 2024 సీజన్లోనూ కార్తీక్ చెలరేగి ఆడాడు. ఈ సీజన్లో అతను 187.35 స్ట్రయిక్‌రేట్‌తో 326 పరుగులు చేశాడు. -
అలా మొదలై.. 'డి' ఫర్ దినేశ్ వరకూ..
‘పడిపోవడంలో తప్పు లేదు కాని, పడ్డ ప్రతిసారి పైకి లేవడమే గొప్ప’... కన్ఫ్యూషియస్ చెప్పిన ఈ మాట అతనికి సరిగ్గా సరిపోతుంది. రెండు దశాబ్దాల క్రితం తొలిసారి భారత జట్టు తరఫున అతను అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టాడు. ఈ ఇరవై ఏళ్ల అతని ప్రయాణం అందరికంటే ఎంతో భిన్నంగా సాగింది. ఆటలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఎంతో ప్రతిభ ఉన్నా అనివార్య కారణాలతో అతడికి జట్టులో చోటు దక్కలేదు. అయినా, ఏనాడూ ఆశ కోల్పోలేదు. ఎప్పుడూ సాధన మానలేదు. ఇక ముగించాలని భావించలేదు.స్థానం కోల్పోయిన ప్రతిసారి పట్టుదలగా పోరాడి పునరాగమనం చేశాడు. ఎప్పుడు వచ్చినా కొత్తగా ఏదో ఒకటి నేర్చుకొని తన ప్రత్యేకతను ప్రదర్శిస్తూ వచ్చాడు. మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. మరొకరైతే అలాంటి స్థితిలో అన్నింటినీ వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయేవారేమో! కానీ అతను ధైర్యంగా నిలబడ్డాడు. ఎక్కడా తన కెరీర్‌పై ఆ ప్రభావం లేకుండా స్థితప్రజ్ఞతో ముందుకు సాగాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఆగిపోయినా ఐపీఎల్లో సత్తా చాటి తన విలువేంటో చూపించాడు. ఆడే అవకాశం లేని సమయంలో వ్యాఖ్యాతగా తన మాట పదునును ప్రదర్శించాడు.39 ఏళ్ల వయసులోనూ యంగ్‌గా, మైదానంలో చురుగ్గా ఆడుతూనే ఇటీవలే ఐపీఎల్‌కు ముగింపు పలికిన ఆ క్రికెటరే దినేశ్ కార్తీక్. గత ఇరవై ఏళ్లలో భారత జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారిన పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడిన ఇతర ఆటగాళ్లందరితో పోలిస్తే కార్తీక్ ప్రస్థానం వైవిధ్యభరితం, ఆసక్తికరం. దిగ్గజ ఆటగాళ్ల మధ్య కూడా తన ప్రత్యేకతను నిలుపుకోవడంలో అతను సఫలమయ్యాడు.భారత క్రికెట్లో వికెట్ కీపింగ్‌కు సంబంధించి అన్ని రుతువులతో పాటు ‘మహేంద్ర సింగ్ ధోని కాలం’ కూడా ఒకటి నడిచింది. వికెట్ కీపర్లను ధోనికి ముందు, ధోని తర్వాతగా విభజించుకోవచ్చు. ‘ధోని కాలం’లో ఎంతో మంది యువ వికెట్ కీపర్లు తెర వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఎంతో ప్రతిభ ఉన్నా, దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా ఆడుతూ వచ్చినా ధోని హవా, అతని స్థాయి ముందు అవన్నీ చిన్నవిగా మారిపోయాయి.అలాంటి బాధితుల జాబితాలో అగ్రస్థానం దినేశ్ కార్తీక్‌దే. 2008–2016 మధ్య ఐదు సీజన్ల పాటు అతను దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించడంతో పాటు వికెట్ కీపర్‌గా కూడా రాణించాడు. కానీ ఈ ప్రదర్శన కూడా అతడికి టీమిండియాలో రెగ్యులర్‌గా చోటు ఇవ్వలేకపోయింది. నిజానికి ధోనికి ఏడాది ముందే భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన కార్తీక్...ధోని అరంగేట్రానికి మూడు నెలల ముందే వన్డేల్లోకి అడుగు పెట్టాడు.కానీ ఒక్కసారి ధోని పాతుకుపోయిన తర్వాత కార్తీక్‌కు అవకాశాలు రావడం గగనంగా మారిపోయింది. కానీ అతను ఎప్పుడూ నిరాశ పడలేదు. తన ఆటనే నమ్ముకుంటూ ముందుకు సాగాడు. కీపర్‌గా స్థానం లభించే అవకాశం లేదని తెలిసిన క్షణాన తన బ్యాటింగ్‌ను మరింతగా మెరుగుపరచుకున్నాడు. తన ప్రదర్శనలతో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా తనకు చోటు కల్పించే పరిస్థితిని సృష్టించుకోగలిగాడు.అలా మొదలై...సెప్టెంబర్ 5, 2004... అంతర్జాతీయ క్రికెట్లో దినేశ్ కార్తీక్ తొలి మ్యాచ్. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఈ పోరులో అద్భుత వికెట్ కీపింగ్‌తో అతను ఆకట్టుకున్నాడు. భూమికి దాదాపు సమాంతరంగా గాల్లో పైకెగిరి మైకేల్ వాన్‌ను అతను స్టంపౌట్ చేసిన తీరు ఈ కొత్త ఆటగాడి గురించి అందరూ చర్చించుకునేలా చేసింది. మరో రెండు నెలల తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం.2007లో ధోని సారథ్యంలో భారత జట్టు సాధించిన టి20 ప్రపంచకప్ విజయాన్ని ఎవరూ మరచిపోలేరు. ఈ మెగా టోర్నీకి దాదాపు పది నెలల ముందు భారత జట్టు ఒకే ఒక అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడింది. ఇందులో కూడా ధోని ఉన్నా, బ్యాటర్‌గా దినేశ్ కార్తీక్‌కు స్థానం లభించింది. దక్షిణాఫ్రికాపై మన టీమ్ నెగ్గిన ఈ పోరులో కార్తీక్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కడం విశేషం. చారిత్రాత్మక వరల్డ్ కప్ విజయంలో కూడా కార్తీక్ తన వంతు పాత్ర పోషించాడు.అలా మూడు ఫార్మాట్లలో కూడా అతను భారత జట్టులో భాగంగా మారాడు. టెస్టుల్లో కార్తీక్ హైలైట్ ప్రదర్శన 2007లోనే వచ్చింది. స్వింగ్‌కు విపరీతంగా అనుకూలిస్తూ అగ్రశ్రేణి బ్యాటర్లకే కొరుకుడు పడని ఇంగ్లండ్ గడ్డపై అతను సత్తా చాటాడు. కొత్త బంతిని ఎదుర్కొంటూ అక్కడి పరిస్థితుల్లో ఓపెనర్‌గా రాణించడం అంత సులువు కాదు. కానీ తాను ఎప్పుడూ ఆడని ఓపెనింగ్ స్థానంలో జట్టు కోసం ఆడేందుకు సిద్ధమయ్యాడు. నాటింగ్‌హామ్‌లో అతను చేసిన 77 పరుగులు, ఆ తర్వాత ఓవల్‌లో సాధించిన 91 పరుగులు భారత జట్టు 1986 తర్వాత ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాయి.జట్టులోకి వస్తూ పోతూ...ఇంగ్లండ్‌లో రాణించిన తర్వాత కూడా కార్తీక్ కెరీర్ వేగంగా ఊపందుకోలేదు. తర్వాతి మూడేళ్లలో అతను 7 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. కీపర్ స్థానానికి అసలు అవకాశమే లేకపోగా, రెగ్యులర్ బ్యాటర్ స్థానం కోసం తన స్థాయికి మించిన అగ్రశ్రేణి ఆటగాళ్లతో పోటీ పడాల్సి రావడంతో తగినన్ని అవకాశాలే రాలేదు. వన్డేల్లోనైతే వరుసగా రెండు మ్యాచ్‌లలో ఆడే అవకాశం వస్తే అదే గొప్ప అనిపించింది. 2010లో వన్డే జట్టులోనూ స్థానం పోయింది. కానీ కార్తీక్ బాధపడలేదు.పునరాగమనం చేయాలంటే ఏం చేయాలో తనకు బాగా తెలుసని నమ్మాడు. అందుకే మూడేళ్ల పాటు దేశవాళీ క్రికెట్లో చెలరేగాడు. ఫలితంగా 2013లో ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లో మళ్లీ స్థానం లభించింది. ధోని ఉన్నా సరే, బ్యాటర్‌గా చోటు దక్కించుకొని విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడయ్యాడు. మరో ఏడాది తర్వాత టీమ్‌లో మళ్లీ చోటు పోయింది. ఇప్పుడూ అదే పని. దేశవాళీలో బాగా ఆడటంతో మూడేళ్ల తర్వాత వెస్టిండీస్ పర్యటనకు ఎంపికయ్యాడు.ఆ తర్వాత కొన్ని చక్కటి ప్రదర్శనలతో తర్వాతి రెండేళ్లు నిలకడగా రాణించిన అనూహ్యంగా 2019 వన్డే వరల్డ్ కప్ టీమ్‌లోనూ చోటు దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరచాడు. టెస్టుల్లో ధోని రిటైర్మెంట్ తర్వాత కూడా దురదృష్టవశాత్తూ కార్తీక్ పేరును పరిశీలించకుండా సెలక్టర్లు సాహాను ప్రధాన కీపర్‌గా తీసుకున్నారు. అయినా అతను కుంగిపోలేదు. ఏకంగా ఎనిమిదేళ్ల విరామం తర్వాత 2018లో మళ్లీ టెస్టు మ్యాచ్ బరిలోకి దిగగలిగాడంటే అతని పట్టుదల ఎలాంటితో అర్థమవుతుంది.2021 ముస్తక్ అలీ ట్రోఫీతో...మరచిపోలేని ప్రదర్శనతో...అంతర్జాతీయ టి20ల్లోనూ కార్తీక్ ప్రస్థానం పడుతూ లేస్తూనే సాగింది. వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడే అయినా ఎక్కువ అవకాశాలు రాలేదు. అన్నింటికీ ఒకటే సమాధానం...ధోని ఉండగా చోటెక్కడుంది? 2010లో భారత్ తరఫున టి20 ఆడిన మరో ఏడేళ్లకు 2017లో అతను తన తర్వాతి మ్యాచ్ ఆడాడంటే అతని కమ్‌బ్యాక్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే 2018లో నిదాహస్ ట్రోఫీలో కార్తీక్ ప్రదర్శన అతనికి కొత్త అభిమానులను తెచ్చి పెట్టింది.సరిగ్గా చెప్పాలంటే 14 ఏళ్ల కెరీర్ తర్వాత ఇది కార్తీక్ మ్యాచ్ అనే గుర్తింపును తెచ్చి పెట్టింది. శ్రీలంకతో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్ విజయానికి చివరి 12 బంతుల్లో 34 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో కేవలం 8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో అతను జట్టును గెలిపించాడు. ఆఖరి బంతికి అతను కొట్టిన సిక్సర్ హైలైట్‌గా నిలిచింది. ఎప్పుడో కెరీర్ ముగిసింది అనుకున్న దశలో 2022 టి20 వరల్డ్ కప్ జట్టులో కూడా అతను చోటు దక్కించుకొని 37 ఏళ్ల వయసులో అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడటం మరో విశేషం. మరో వైపు ఐపీఎల్లో కూడా ఎన్నో మంచి ప్రదర్శనలు కార్తీక్‌కు గుర్తింపును తెచ్చి పెట్టాయి. ఐపీఎల్లో 6 టీమ్‌లకు ప్రాతినిధ్యం వహించిన కార్తీక్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్ మొదలైన 2008నుంచి 2024 వరకు కార్తీక్ 257 మ్యాచ్‌లు ఆడి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంతో తన లీగ్ కెరీర్ ముగించాడు. ఈ టోర్నీలో 4842 పరుగులు చేసిన అతను అత్యధిక పరుగులు చేసినవారిలో పదో స్థానంలో నిలిచాడు.ఫ్యామిలీతో...ఆటుపోట్లు ఎదురైనా...కార్తీక్ స్వస్థలం చెన్నై. మాతృభాష తెలుగు. తండ్రి ఉద్యోగరీత్యా బాల్యం కువైట్‌లో గడిపినా... తర్వాత మద్రాసులోనే స్థిరపడ్డాడు. తండ్రి నేర్పించిన ఆటతో దిగువ స్థాయి క్రికెట్లో మంచి ప్రదర్శనలు ఇస్తూ సీనియర్ జట్టు వరకు ఎదిగాడు. అయితే ఆటగాడిగా భారత జట్టులో సుస్థిర స్థానం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కార్తీక్ వ్యక్తిగత జీవితంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 2007లో అతను తన మిత్రురాలు నికితను పెళ్లి చేసుకున్నాడు.ఐదేళ్ల తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. అయితే తనతో వివాహ బంధంలో ఉండగానే భారత జట్టు, తమిళనాడు జట్లలో తన సహచరుడైన మురళీ విజయ్ను ప్రేమించడం, ఆపై తనకు దూరం కావడం అతడిని తీవ్రంగా బాధించాయి. ఆ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు భారత స్టార్ స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్‌తో పరిచయం అతని జీవితంలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. 2015లో వీరిద్దరు పెళ్లి చేసుకోగా, వీరికి మూడేళ్ల వయసు ఉన్న కవల అబ్బాయిలు ఉన్నారు. –మొహమ్మద్ అబ్దుల్ హాది -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్
టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ కీలక ప్రకటన చేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు శనివారం ప్రకటించాడు. ఇటీవలే ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన డీకే.. అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా తాజాగా వీడ్కోలు పలికాడు.తన 39వ పుట్టినరోజున దినేశ్ కార్తిక్ ఈ మేరకు ఇన్‌స్టా ఉద్వేగపూరిత పోస్ట్‌తో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘‘గత కొన్ని రోజులుగా నాకు లభిస్తున్న మద్దతు, నాపై కురిపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలలో తడిసి ముద్దవుతున్నా. దీనకంతటికి కారణమైన అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా. బాగా ఆలోచించిన తర్వాత రిప్రెజెంటేటివ్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. అధికారికంగా నా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నా.దీపికకు కూడా చాలా రుణపడి పోయాను!ఈ ప్రయాణంలో నాకు సహకరించిన కోచ్‌లు, కెప్టెన్లు, సెలక్టర్లు, సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు. జాతీయ జట్టుకు ఆడే అవకాశం దక్కడం నిజంగా నా అదృష్టం.నేను ఇక్కడిదాకా చేరుకోవడానికి నా తల్లిదండ్రులే కారణం. వారి ఆశీర్వాదాలు లేకుండా నేను ఇదంతా సాధించేవాడినే కాదు. దీపికకు కూడా చాలా రుణపడి పోయాను.తను స్వతహాగా ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్ అయినప్పటికీ తన కెరీర్ కొనసాగిస్తూనే నాకూ అండగా నిలిచింది. ఇక అందరికంటే పెద్ద థాంక్స్ చెప్పాల్సింది నా అభిమానులకే! క్రికెట్ అయినా.. క్రికెటర్లు అయినా... మీ మద్దతు లేకుండా ఏదీ సాధ్యం కాదు’’ అని దినేశ్ కార్తిక్ సుదీర్ఘ నోట్ రాశాడు.2004లో అరంగేట్రంతమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అదే ఏడాది.. ఆస్ట్రేలియాతో వాంఖడే వేదికగా టెస్టుల్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లకు టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చాడు.మొత్తంగా 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన డీకే 3463 పరుగులు చేశాడు. 172 డిస్మిసల్స్లో భాగమయ్యాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. చదవండి: Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు.. దటీజ్ డీకే! -
బ్యాట్ వదిలి బల్లెం పట్టిన డీకే
టీమిండియా మాజీ వికెట్‌కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ కొద్ది రోజుల కిందటే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికి వార్తల్లో నిలిచాడు. సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం డీకే క్రికెట్ ప్రపంచం మొత్తం నుంచి ఘనంగా సెడాంఫ్ను అందుకున్నాడు.క్రికెట్‌కు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి కమిట్మెంట్స్ లేకపోవడంతో సేద తీరుతున్న డీకే.. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో కలిసి జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. Neeraj Chopra trained Dinesh Karthik to be his partner at 2024 Olympics.#Neerajchopra #Dineshkarthik pic.twitter.com/zOLswEDjW8— scOut Op (@ScOutoppp69) May 29, 2024డీకే జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో బాగా వైరలవుతంది. ఈ వీడియోలో డీకే రెండు ప్రయత్నాల అనంతరం బల్లెంను విజయవంతంగా నిర్దేశిత ప్రాంతం ఆవలికి విసరగలిగాడు. లాస్ట్ ఛాన్స్ అని నీరజ్‌ను అడిగి మరీ జావెలిన్‌ను అందుకున్న డీకే.. ప్రొఫెషన్ అథ్లెట్‌లా రన్ అప్ తీసుకుని జావెలిన్‌ను సంధించాడు. మండే ఎండలో డీకే చేస్తున్న ప్రయత్నానికి ముగ్దుడైన నీరజ్.. నువ్వు చేయగలవు దినేష్ భాయ్ అంటూ ప్రోత్సహించాడు. నీరజ్ ప్రోత్సాహంతో జావెలిన్‌ను విసిరిన డీకే అనుకున్న లక్ష్యాన్ని అధిగమించి సక్సెస్ సాధించాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు డీకేను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నీ ప్రయత్నం అమోఘమని కొనియాడుతున్నారు. తెలీని క్రీడలోనూ సక్సెస్ సాధించావని కితాబునిస్తున్నారు. క్రికెట్లో మ్యాచ్ ఫినిషన్ ఇప్పుడు సక్సెస్ఫుల్ జావెలిన్ త్రోయర్ అంటూ కొనియాడుతున్నారు. మరికొందరేమో నీరజ్‌తో పాటు ఒలింపిక్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోమని సూచిస్తున్నారు. 38 ఏళ్ల డీకే 2004 నుంచి 2022 వరకు మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. డీకే ఐపీఎల్ స్టార్టింగ్ సీజన్ నుంచి తాజాగా ముగిసిన 2024 సీజన్ వరకు వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు.నీరజ్ చోప్రా విషయానికొస్తే.. 26 ఏళ్ల ఈ జావెలిన్ త్రోయర్ 2020 టోక్యో ఓలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించాడు. ఈ ఏడాది జులైలో జరిగే సమ్మర్ ఓలింపిక్స్లో నీరజ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. -
టీ20 వరల్డ్‌కప్-2024కు కామెంటేటర్లు వీరే.. డీకేకు చోటు
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌కప్-2024కు మరో వారం రోజుల్లో తెరలేవనుంది. జాన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కామెంటేటర్ల (వ్యాఖ్యాతలు) జాబితాను శుక్రవారం ప్రకటించింది. 41 మంది సభ్యులున్న ఈ కామెంట్రీ ప్యానెల్లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ దేశాలకు చెందిన దిగ్గజాలు ఉన్నారు. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి , లెజెండరీ సునీల్ గవాస్కర్, దినేష్ కార్తీక్, ఆసీస్ మాజీ కెప్టెన్ పాంటింగ్, వసీం అక్రమ్ వంటి వారు ఈ ప్యానల్లో ఉన్నారు.కాగా దినేష్ కార్తీక్ ఇటీవలే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కామెంటేటర్‌గా వ్యవహరించడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో వన్డే వరల్డ్‌కప్-2023, యాషెస్ సిరీస్‌లో వ్యాఖ్యతగా వ్యవహరించాడు. మరోవైపు టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు ఆశించి భంగపడ్డ ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్‌కు ఈ వ్యాఖ్యాతల జాబితాలో చోటుదక్కింది.టీ20 ప్రపంచ కప్ 2024 కోసం కామెంటరీ ప్యానెల్: రికీ పాంటింగ్, సునీల్ గవాస్కర్, మాథ్యూ హేడెన్, రమీజ్ రాజా, ఇయాన్ మోర్గాన్, టామ్ మూడీ, జాంబోయ్, రవిశాస్త్రి, ఇయాన్ బిషప్, నాజర్ హుస్సేన్, హర్ష భోగ్లే, డేల్ స్టెయిన్, గ్రేమ్ స్మిత్, మైఖేల్ అథర్టన్, వకార్ యూనిస్, సైమన్ డౌల్, షాన్ పొలాక్, కేటీ మార్టిన్, దినేష్ కార్తీక్, మెల్ జోన్స్,ఎబోనీ రెయిన్‌ఫోర్డ్-బ్రెంట్, లిసా స్థలేకర్, శామ్యూల్ బద్రీ, మ్పుమెలెలో మ్బాంగ్వా, ఇయాన్ స్మిత్, నటాలీ జర్మనోస్, కార్లోస్ బ్రాత్‌వైట్, డానీ మోరిన్సెల్, అలీసన్ విల్కిన్‌సెల్, అలీసన్ విల్కిన్‌సెల్, ఫించ్, బ్రియాన్ ముర్గాట్రాయిడ్, మైక్ హేస్మాన్, ఇయాన్ వార్డ్, స్టీవ్ స్మిత్, అథర్ అలీ ఖాన్, రస్సెల్ ఆర్నాల్డ్, నియాల్ ఓబ్రియన్, కాస్ నైడూ, డారెన్ గంగా , వసీం అక్రమ్ -
థ్యాంక్యూ డీకే.. అతడి నుంచి ఎంతో స్ఫూర్తిని పొందా: కోహ్లి
టీమిండియా వెటరన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తన కెరీర్లో చివరి ఐపీఎల్ ఆడేశాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఎలిమినేటర్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై ఓటమి అనంతరం కార్తీక్ తన 17 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌కు విడ్కోలు పలికాడు. ఈ క్రమంలో తన సహచర ఆటగాడు, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి.. కార్తీక్‌తో అనుబంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.దినేష్ కార్తీక్‌ను నేను తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ 2009 సందర్భంగా కలిశాను. బహుశా దక్షిణాఫ్రికాలో అనుకుంటా. నేను అతడితో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం అదే మొదటి సారి. అతడు చాలా సరదాగా ఉంటాడు. డికే చాలా యాక్టివ్ ఉంటాడు. అదేవిధంగా కన్ఫ్యూజ్డ్ పర్సన్. చాలా సార్లు అతడు ఏదో ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. దినేశ్‌పై నాకు కలిగిన తొలి అభిప్రాయం ఇదే. డీకేకు అద్భుతమైన టాలెంట్ ఉంది. నేను మొదటిసారిగా చూసిన దినేష్‌కు, ఇప్పటి దినేష్‌లో ఎలాంటి మార్పులేదు. అతడు తెలివైనవాడు. అంతేకాకుండా చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఫీల్డ్‌లోనే కాదు, ఆఫ్‌ది ఫీల్డ్ కూడా డీకేతో నాకు మంచి అనుబంధం ఉంది. కార్తీక్‌కు క్రికెట్‌పైనే కాకుండా ఇతర విషయాలపై మంచి అవహగహన ఉంది. అతడితో నాకు సంబంధించిన ఏ విషయమైన నేను చర్చిస్తాను. ఐపీఎల్-2022లో నేను పెద్దగా రాణించలేదు. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయి చాలా ఇబ్బంది పడ్డా. ఆ సమయంలో దినేష్ నా పక్కను కూర్చోని నాలో ఆత్మ విశ్వాసాన్ని నింపాడు. నాలో ఉన్న లోపాలను నాకు అర్ధమయ్యేలా చెప్పాడు. నేను ఈ రోజు మెరుగ్గా ఆడుతున్నానంటే అందుకు కారణం డీకేనే. కార్తీక్‌లో తన నిజాయితీ, ధైర్యం నాకు బాగా నచ్చాయి. నాకు పరిచయం అయినందుకు థంక్యూ డీకే అంటూ విరాట్ ఆర్సీబీ షేర్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు. -
నేనైతే వదిలేసేదాన్నేమో: దినేశ్ కార్తిక్ భార్య భావోద్వేగం
‘‘జీవితంలో ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది. మేము 2013లో తొలిసారి ఒకరినొకరం నేరుగా కలిశాం. ఇద్దరి మనసులోనూ కలిసి జీవించాలనే ఆలోచనే వచ్చింది. ఆ తర్వాత అన్నీ సజావుగా సాగిపోయాయి.తనలో నాకు నచ్చే గొప్ప గుణం ఏమిటంటే.. ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగటం. బాగా ఆడలేక విమర్శలు ఎదుర్కొన్నపుడు.. జట్టులో స్థానం కరువైనపుడు రెండు- మూడు రోజుల పాటు కాస్త నిరాశగా కనిపిస్తాడు.తిరిగి వెంటనే కోలుకుని తర్వాత ఏం చేయాలన్న అంశంపై దృష్టి పెడతాడు. నాకు తెలిసి అలాంటి స్థితిలో వేరే ఎవరైనా ఉంటే కచ్చితంగా చాలా రోజుల పాటు కుంగిపోతారు.వదిలేసేదాన్నేమో!నేను కూడా అథ్లెట్‌నే కాబట్టి అప్పుడు అతడి మానసిక స్థితి ఎలా ఉంటుందో అంచనా వేయగలను. తన స్థానంలో గనుక నేనే ఉంటే.. ఇక చాల్లే అని వదిలేసేదాన్నేమో!కానీ తను అలా కాదు. తన కెరీర్లో వివిధ దశల్లో విభిన్న పాత్రలు పోషించాల్సి వచ్చింది. చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లోనూ తను పట్టుదలగా నిలబడ్డాడు.గతం కంటే మెరుగ్గా ఆడుతూ ముందుకు సాగాడు. డీకే తన జీవితంలో ఏవైతే సాధించాలనుకున్నాడో అన్నీ సాధించేశాడు. ఒక అథ్లెట్ లైఫ్‌లో అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు.అలాంటి వ్యక్తి ఇకపై ఆటకు దూరంగా ఉండాలంటే అంత సులువేమీ కాదు. అయితే, వ్యక్తిగతంగా తన జీవితంలో ముందుకు సాగాలని అతడు నిర్ణయించుకున్నాడు.తన కోసం, తన కుటుంబం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడు. తను సాధించిన విజయాలు మమ్మల్ని గర్వపడేలా చేశాయి’’ అని టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ భార్య దీపికా పళ్లికల్ ఉద్వేగానికి లోనయ్యారు.తన భర్త కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాడని.. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి తాను అనుకున్న స్థాయికి చేరుకున్నాడని తెలిపారు. కాగా ఐపీఎల్లో ఆరంభం నుంచి పదిహేడేళ్ల పాటు కొనసాగిన క్రికెటర్లలో ఒకడైన దినేశ్ కార్తిక్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు.క్యాష్ రిచ్ లీగ్‌కు గుడ్బైఐపీఎల్-2024లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన అతడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో చివరిసారిగా ఆడాడు. రాజస్తాన్ చేతిలో ఆర్సీబీ ఓటమి తర్వాత క్యాష్ రిచ్ లీగ్‌కు గుడ్‌బై చెప్పాడు. ఓటమితో తన ఐపీఎల్ కెరీర్ ముగించాడు.ఈ నేపథ్యంలో దినేశ్ కార్తిక్ భార్య, భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పళ్లికల్ పైవిధంగా స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా దీపికా పళ్లికల్ కామన్వెల్త్ గేమ్స్‌లో నాలుగుసార్లు భారత్ తరఫున పతకాలు సాధించారు. ఆసియా క్రీడలు, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లోనూ మెడల్స్ గెలిచారు. డీకే- దీపిక 2015లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు(కవలలు) సంతానం.చదవండి: Dinesh Karthik: మొదటి భార్య మోసం: ఆ నవ్వే నన్ను ముంచేసింది!.. ఎల్లప్పుడూ నా వాడే!(ఫొటోలు)Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు.. దటీజ్ డీకే!DK, We love you! ❤ Not often do you find a cricketer who’s loved by everyone around him. DK is one, because he was smart, humble, honest, and gentle! Celebrating @DineshKarthik's career with stories from his best friends and family! 🤗#PlayBold #ನಮ್ಮRCB #WeLoveYouDK pic.twitter.com/fW3bLGMQER— Royal Challengers Bengaluru (@RCBTweets) May 24, 2024 -
Dinesh Karthik: ఆ నవ్వే నన్ను ముంచేసింది!.. ఎల్లప్పుడూ నా వాడే!(ఫొటోలు)
-
Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభం నుంచి పదిహేడో ఎడిషన్ దాకా కొనసాగిన కొంత మంది ఆటగాళ్లలో దినేశ్ కార్తిక్ ఒకడు. తమిళనాడుకు చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ అరంగేట్ర సీజన్ నుంచి ఇప్పటి దాకా ఆరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.ఇక పదిహేడేళ్ల పాటు నిరంతరాయంగా క్యాష్ రిల్ లీగ్ ఆడుతున్న 38 ఏళ్ల డీకే.. తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్-2024 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి తర్వాత తన నిర్ణయాన్ని పరోక్షంగా తెలియజేశాడు.ఈ క్రమంలో ఆర్సీబీ ఆటగాళ్లు, అభిమానులు డీకేకు శుభాకాంక్షలు చెబుతూ వీడ్కోలు పలికారు. ఇక సుదీర్ఘకాలంగా ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడుతున్న డీకే తన ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ ఆడి భారంగా మైదానాన్ని వీడాడు.ఒక్క టైటిల్...👉దినేశ్ కార్తిక్ 2008 నుంచి 2024 వరకు అన్ని ఐపీఎల్ సీజన్లలో ఆడాడు. 2008లో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ. 2.1 కోట్లకు డీకేను కొనుక్కుంది.👉మూడేళ్ల పాటు ఆ జట్టుతో కొనసాగిన దినేశ్ కార్తిక్.. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో జట్టుకట్టాడు. రెండేళ్ల పాటు పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. 2013లో ముంబై ఇండియన్స్‌కు మారాడు.👉ఆ ఏడాది రోహిత్ శర్మ ట్రోఫీ గెలవడంతో డీకే ఖాతాలో తొలిసారి ఐపీఎల్ టైటిల్ చేరింది. నాటి ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడిన ముంబై తుదిజట్టులో దినేశ్ కార్తిక్ కూడా ఉన్నాడు.👉అయితే, ముంబై ఇండియన్స్‌తో అతడి ప్రయాణం అంతటితో ముగిసిపోయింది. 2014 వేలంలో ఢిల్లీ ఫ్రాంఛైజీ మరోసారి డీకేను దక్కించుకుంది. ఏకంగా 12.5 కోట్లు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది.ఆర్సీబీ అప్పుడే తొలిసారి👉కానీ మరుసటి ఏడాదే డీకేను ఢిల్లీ విడిచిపెట్టింది. ఈ క్రమంలో 2015 ఐపీఎల్ వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలిసారి దినేశ్ కార్తిక్‌ను సొంతం చేసుకుంది. ఈ వికెట్ కీపర్బ్యాటర్ కోసం ఏకంగా రూ 10.50 కోట్లు ఖర్చు పెట్టింది.👉అయితే, ఆ సీజన్లో డీకే 11 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 141 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. దీంతో మరుసటి ఏడాది ఆర్సీబీ అతడిని వదిలించుకుంది.గుజరాత్ లయన్స్‌తో రెండేళ్ల ప్రయాణం👉ఈ క్రమంలో సురేశ్ రైనా సారథ్యంలోని గుజరాత్ లయన్స్ డీకేను కొనుగోలు చేయగా.. రెండేళ్ల పాటు అక్కడే కొనసాగాడు. ఆ తర్వాత గుజరాత్ లయన్స్ జట్టు కనుమరుగు కాగా.. 2018లొ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరాడు దినేశ్ కార్తిక్.కేకేఆర్ కెప్టెన్‌గా నియామకం👉ఆ ఏడాది వేలంలో రూ. 7.4 కోట్లకు కేకేఆర్ యాజమాన్యం డీకేను కొనుక్కుంది. ఈ క్రమంలో గౌతం గంభీర్ జట్టు నుంచి నిష్క్రమించగా.. దినేశ్ కార్తిక్‌ను కెప్టెన్‌గా నియమించింది.👉ఇక కేకేఆర్ సారథిగా రెండున్నరేళ్ల పాటు కొనసాగిన డీకే 37 మ్యాచ్‌లలో జట్టును ముందుండి నడిపించాడు. అయితే, 2020 సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ వైదొలగగా ఇయాన్ మోర్గాన్ ఆ బాధ్యతలను స్వీకరించాడు.మరోసారి ఆర్సీబీ చెంత.. ఇక్కడే వీడ్కోలు👉ఈ క్రమంలో ఐపీఎల్ మెగా వేలం-2022కు ముందు కేకేఆర్ కార్తిక్‌ను రిలీజ్ చేసింది. అయితే, ఆర్సీబీ ఫ్రాంఛైజీ మరోసారి డీకేపై నమ్మకం ఉంచి అతడిని రూ. 5.5 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.👉ఆ సీజన్లో ఆర్బీసీ తరఫున 183కు పైగా స్ట్రైక్‌రేటుతో డీకే 330 పరుగులతో రాణించాడు. ఫినిషర్‌గా అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఈక్రమంలో టీ20 ప్రపంచకప్-2022 భారత జట్టులో చోటు కూడా సంపాదించాడు డీకే.👉అయితే, మెగా టోర్నీలో నిలకడలేమి ఆటతో విమర్శలపాలైన డీకే.. 2023 సీజన్లోనూ విఫలమయ్యాడు. 13 మ్యాచ్‌లలో కలిపి కేవలం 140 పరుగులే చేశాడు. ఇక ఈ ఏడాది ఆర్సీబీ తరఫున 13 ఇన్నింగ్స్ ఆడిన డీకే 326 పరుగులు సాధించాడు.👉ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్తాన్ చేతిలో బెంగళూరు పరాజయం నేపథ్యంలో ఓటమితో తన ఐపీఎల్ కెరీర్‌ను ముగించాడు దినేశ్ కార్తిక్. మొత్తంగా ఓవరాల్ ఐపీఎల్ కెరీర్లో డీకే.. 257 మ్యాచ్‌లు ఆడి 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 అర్థ శతకాలు ఉన్నాయి. దినేశ్ కార్తిక్ ఐపీఎల్ రికార్డులు👉మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, వృద్ధిమాన్ సాహా, మనీశ్ పాండేలతో పాటు 17 సీజన్ల పాటు ఐపీఎల్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆటగాడు.👉క్యాష్ రిచ్ లీగ్ పదిహేడేళ్ల చరిత్రలో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే అతడు మిస్సయ్యాడు.👉ధోని తర్వాత అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు. ధోని 264 మ్యాచ్‌లు ఆడగా.. డీకే తన కెరీర్లో 257 మ్యాచ్‌లలో భాగమయ్యాడు.2018- 2020 మధ్య కేకేఆర్ కెప్టెన్‌గా 37 మ్యాచ్‌లు ఆడి 19 విజయాలు సాధించాడు. తద్వారా గంభీర్(61) తర్వాత కేకేఆర్‌ను అత్యధికసార్లు గెలిపించిన కెప్టెన్‌గా రికార్డు.👉దినేశ్ కార్తిక్ వికెట్ కీపర్‌గా 174 డిస్మిసల్స్లో భాగమయ్యాడు. ధోని(190) తర్వాత ఈ జాబితాలో రెండో స్థానం ఆక్రమించాడు. From #RCB to Dinesh Karthik ❤️ #TATAIPL | #RRvRCB | #TheFinalCall | #Eliminator | @RCBTweets | @DineshKarthik pic.twitter.com/p2XI7A1Ta6— IndianPremierLeague (@IPL) May 22, 2024 చదవండి: అదే మా ఓటమిని శాసించింది.. లేదంటే విజయం మాదే: డుప్లెసిస్