Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

TTD Stampede Six Devotees Lost Breath For Vaikuntha Ekadashi Tickets1
ఏడు కొండలవాడా.. ఎంత ఘోరం.. ఎంత ఘోరం

గోవింద నామాలతో ప్రతిధ్వనించాల్సిన చోట మృత్యు ఘోష వినిపించింది.. ఏడుకొండలవాడి సాక్షిగా భక్తుల ఆర్తనాదాలతో ఆధ్యాతి్మక నగరి దద్దరిల్లింది.. అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో తిరుపతి భీతిల్లింది.. చిన్నారులు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరయ్యారు.. మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. కిందపడ్డ వాళ్లను తొక్కుకుంటూ వెళ్తున్న వారు కొందరు.. ప్రాణ భీతితో తోసుకొచ్చేసిన వారు మరికొందరు.. వెరసి కనీవినీ ఎరుగని రీతిలో తొక్కిసలాటకు కారణమైంది.. పడిపోయిన వారిని బతికించు కోవాలని ఆయా కుటుంబాల తాపత్రయం గుండెలు పిండేసింది.. ఆ దృశ్యాలు చూపరుల కంట తడిపెట్టించాయి.గతంలో గోదావరి పుష్కరాలు.. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి..! నాడు పబ్లిసిటీ పిచ్చి.. నేడు అలవిమాలిన అలసత్వం!సందర్భం ఏదైనప్పటికీ ప్రభుత్వం నిలువెత్తు నిర్లక్ష్యానికి అమాయకులు బలి అవుతున్నారు! కోట్లాది మంది తమ జీవిత కాలంలో ఒక్క అవకాశం కోసం ఆరాట పడే వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ ఏర్పాట్లలో సర్కారు వైఫల్యం కారణంగా పెను తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.సాక్షి తిరుపతి నెట్‌వర్క్‌: చంద్రబాబు ప్రభుత్వ పెనునిర్లక్ష్యం మరోసారి అమాయక భక్తుల ప్రాణాలను బలిగొంది. పవిత్ర తిరుమల–తిరుపతి క్షేత్రాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టుపట్టించిన చంద్రబాబు దుర్మార్గం ఆరుగురు భక్తుల ప్రాణాలను హరించింది. 30 మందికిపైగా తీవ్రంగా గాయపడేలా చేసింది. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ బాధ్యతారాహిత్యం శ్రీవారి పుణ్యక్షేత్రం తిరుపతిలో భక్తుల ప్రాణాలతో చలగాటమాడింది. చెల్లాచెదురుగా పడిన అమాయక భక్తుల మృతదేహాలు.. తీవ్రగాయాలపాలైన భక్తుల ఆర్తనాదాలు.. వేలాది మంది భక్తుల హాహాకారాలతో తిరుపతి నగరం హృదయ విదారకంగా మారిపోయింది. రాజకీయ ప్రచారం కోసం, నిరాధార ఆరోపణలతో ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల కోసం చంద్రబాబు తిరుమల–తిరుపతి దేవస్థానాలు(టీటీడీ) వ్యవస్థను భ్రష్టు పట్టించడమే ఇంతటి పెను విషాదానికి దారితీసింది. ఏటా భారీగా భక్తులు తరలివచ్చే వైకుంఠ ఏకాదశికి టికెట్ల జారీ కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం కనీస మార్గదర్శకాలను గాలికొదిలేయడంతో భక్తులు బలైపోయారు. రోజుకు 75 వేల మందికిపైగా భక్తులు తరలివస్తున్నా.. ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా దాదాపు ఆరేడు లక్షల మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నా.. ఏనాడూ ఇటువంటి విషాదం సంభవించ లేదు. కేవలం చంద్రబాబు ప్రభుత్వ బాధ్యతారహిత్యంతోనే తిరుమల–తిరుపతి చరిత్రలో తొలిసారిగా తొక్కిసలాట సంభవించి మాటలకందని పెను విషాదానికి దారితీసింది. ముమ్మాటికీ ఇది నిర్లక్ష్యమేవైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని టీటీడీ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించటం ఆనవాయితీ. పది రోజుల పాటు కొనసాగనున్న వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా భక్తులకు టీటీడీ టోకెన్ల జారీ ప్రక్రియ ఏర్పాటు చేసింది. తిరుపతిలో తొమ్మిది, తిరుమలలో ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. పది రోజుల పాటు ఈ టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగనుంది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం శుక్రవారం నుంచి 10 రోజుల పాటు ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుపతి నగరంలో బైరాగిపట్టెడ ఎంజీఎం స్కూల్, ఎంఆర్‌పల్లి, శ్రీనివాసం, విష్ణునివాసం, రెండో చౌల్ట్రీ, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, సత్యనారాయణపురం (జీవకోన) ప్రాంతాల్లో టీటీడీ టోకన్ల కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ టోకెన్లను గురువారం ఉదయం 5 గంటల నుంచి పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయాన్ని భక్తులకు చేరవేయంలో టీటీడీ విఫలమైంది. దీంతో భక్తులు మంగళవారం రాత్రే తిరుపతికి పయనమయ్యారు. బుధవారం ఉదయం నుంచే తండోపతండాలుగా టోకెన్లు జారీ చేసే కేంద్రాలకు చేరుకున్నారు. ముఖ్యంగా తిరుపతి బైరాగిపట్టెడ ప్రాంతంలోని ఎంజీఎం స్కూల్‌కు చేరుకున్న భక్తులను క్యూలైన్‌లోకి అనుమతించలేదు. దీంతో సాయంత్రానికి భారీగా భక్తులు పెరిగిపోయారు. వచ్చిన వారిని వచ్చినట్లు క్యూలైన్లోకి పంపమని సూచించినా, డీఎస్పీ ఒకరు నిరాకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. రాత్రి 8.35 గంటల ప్రాంతంలో అందరినీ ఒకేసారి విడిచి పెట్టమని డీఎస్పీ ఆదేశించటంతో పోలీసులు గేట్లు తెరిచారు. భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లోకి ప్రవేశించటంతో తీవ్ర స్థాయిలో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో కింద పడిపోయిన వారిని పైకి లేపే అవకాశం లేక.. ఊపిరి ఆడక ఆరుగురు మృతి చెందారు. కింద పడిపోయిన వారిని బతికించేందుకు భక్తులు, పోలీసులు కొందరు తీవ్ర ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అదే విధంగా శ్రీనివాసం, ఇందిరా మైదానం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్‌ కేంద్రాలకు వచ్చిన వారిని వచ్చినట్లే క్యూలైన్లోకి అనుమతించారు. సాయంత్రం అయ్యే సరికి ఒక్కసారిగా భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట ప్రారంభమైంది. శ్రీనివాసం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. మరి కొందరు గాయాలపాలయ్యారు. మృతి చెందిన వారిని, తీవ్ర గాయాలపాలైన వారిని రుయా, సిమ్స్‌ ఆస్పత్రులకు తరలించారు. మరణించిన వారు, తీవ్ర గాయాలైన వారిలో ఎక్కువ మంది మదనపల్లి, తమిళనాడుకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.అన్ని కౌంటర్ల వద్ద తొక్కిసలాటఅలిపిరి భూదేవి కాంప్లెక్స్‌ వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్‌ వద్ద బుధవారం ఉదయం నుంచి భక్తులు పడిగాపులు కాశారు. రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్‌ వద్ద భక్తులను క్యూలైన్లోకి అనుమతించే క్రమంలో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు భక్తులపై లాఠీ చార్జ్‌ చేశారు. క్యూ లైన్‌లోకి వెళ్లే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో అనేక మంది భక్తులు కిందపడిపోయారు. ఈ తోపులాటలో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిన్నారులు ఆర్తనాదాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. తోపులాట చోటు చేసుకోవటంతో భక్తుల అరుపులు, రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. టీటీడీ వైఫల్యం..వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భారీగా భక్తులు వస్తారని తెలిసినా అందుకు తగ్గ ఏర్పాట్లు చేయటంలో ప్రభుత్వం, టీటీడీ పూర్తిగా విఫలమైంది. క్యూలైన్ల వద్ద టాయిలెట్లు లేవు. దీంతో మహిళలు, చిన్నారులు నరకం అనుభవించారు. అనేక ప్రాంతాల్లో కనీసం తాగు నీరు కూడా ఏర్పాటు చేయలేదు. అన్న ప్రసాద వితరణ ఎక్కడా కనిపించలేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మంచి నీరు అందించి చేతులు దులుపుకున్నారు. తిరుపతిలోని రామానాయుడు స్కూల్‌లో ఒకసారిగా గేట్లు తెరవడంతో జనాలు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగి 40 మంది స్పృహ తప్పి పడిపోయారు. ఇందులో అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం నరసాపురం నుంచి 360 మంది గోవిందమాల భక్తులు కాలి నడకన తిరుపతికి చేరుకున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి సీరియస్‌గా ఉంది. వీరితో పాటు వచ్చిన బంధువులు బాధితులకు ఏమి జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు. ఎటు వెళ్లాలో.. ఎక్కడికి వెళ్లాలో తెలియక స్కూల్‌కు దగ్గరలో ఉన్న పద్మావతి పార్కులో వేచి చూస్తున్నారు. ఈ స్కూల్‌లో జరిగిన తొక్కిసలాటలో మదనపల్లె, పుంగనూరు, నరసాపురం, చిత్తూరు, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. దారుణం జరిగిపోయాక పోలీసు బలగాలు రంగంలోకి దిగడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అప్పుడు, ఇప్పుడు ప్రచారార్భాటమే2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు ప్రచారార్భాటం కోసం చేసిన షూటింగ్‌ గిమ్మిక్కుతో 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం చంద్రబాబు తన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు టీటీడీ వ్యవస్థను భ్రష్టు పట్టించడం అడుగడుగునా కనిపిస్తోంది. బాబుకు తోడుగా అభినవ సనాతన ధర్మ పరిరక్షకుడిగా బ్రాండ్‌ ఇమేజ్‌ కోసం తిరుపతిలో సినీ తరహాలో గిమ్మిక్కులు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కూడా టీడీడీ వ్యవస్థను దెబ్బ తీయడంలో తానో చేయి వేశారు. దీంతో అధికార టీడీపీ కూటమి సేవలో తరిస్తే చాలు.. సామాన్య భక్తులు ఏమైపోయినా పర్వాలేదన్నట్లుగా టీటీడీ యంత్రాంగం నిర్లిప్తంగా మారిపోయింది. టీటీడీ చైర్మన్, ఈవో, తిరుమల అదనపు జేఈవో వైఖరి భక్తుల పాలిట యమపాశమైంది. వైకుంఠ ఏకాదశినాడు తిరుమలలో శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని ఆశించిన భక్తుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఈ ఘోరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తులను కలచివేస్తోంది. రామానాయుడు స్కూల్‌లో దారుణంఅక్కడే 40 మంది వరకు అపస్మారక స్థితిలోకి.. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంతిరుపతి అర్బన్‌: తిరుపతిలోని రామానాయుడు స్కూల్‌లో బుధవారం రాత్రి ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట సంభవించి 40 మంది వరకు స్పృహ తప్పి పడిపోయారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 360 మంది గోవిందమాల భక్తులు మూడ్రోజులపాటు నడిచి తిరుపతికి చేరుకున్నారు. వీరంతా అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండల నరసాపురం నుంచి వచ్చారు. వీరితో పాటు వచ్చిన బంధువులు తమ వారికి ఏం జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు. ఎటు వెళ్లాలో.. ఎక్కడికి వెళ్లాలో తెలియక స్కూల్‌కు దగ్గరలో ఉన్న పద్మావతి పార్కులో తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా ఈ స్కూల్‌లో జరిగిన తొక్కిసలాటలో మదనపల్లె, పుంగనూరు, నరసాపురం, చిత్తూరు, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారున్నట్లు సమాచారం. భక్తజ నాన్ని అదుపుచేయడంలో అధికార యంత్రాంగం పూర్తి గా విఫలమైంది. అయితే, ఈ చీకట్లోనే దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. పెద్దఎత్తున పర్సులు, సెల్‌ఫోన్లు, జేబులు కొల్లగొట్టారు. దారుణం జరిగిపో యాక పోలీసు రావడంతో భక్తులు మండిపడుతున్నారు.నాడు కట్టుదిట్టంగా.. నేడు నిర్లక్ష్యంగా..తిరుపతి సిటీ: వైకుంఠ ఏకాదశి రోజు నుంచి పదిరోజుల పాటు సామాన్య భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో టీటీడీ పటిష్ట ఏర్పాట్లుచేసింది. కానీ, నేడు కూటమి ప్రభుత్వంగానీ, టీటీడీ గానీ సామాన్య భక్తులను పట్టించుకోలేదని శ్రీవారి భక్తులు దుమ్మెత్తిపోస్తూ గత ప్రభుత్వంలో చేపట్టిన చర్యలను గుర్తుచేస్తున్నారు.నాడు2023 డిసెంబరు 23వ తేదీ వైకుంఠ ఏకాదశి, 2024 జనవరి 1వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. 22వ తేదీ వేకువజాము 5 గంటల నుంచి టోకెన్ల జారీ ప్రారంభించారు. తిరుపతిలోని ఎనిమిది ప్రాంతాల్లో వీటిని జారీచేశారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 10వేల చొప్పున పంపిణీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. మొత్తం పది రోజుల్లో లక్ష టోకెన్లు జారీచేశారు. ప్రతి కౌంటర్‌ దగ్గర సింగిల్‌ లైన్‌ క్యూలు ఏర్పాటుచేశారు. కౌంటర్‌ వద్ద ఒకే వ్యక్తి టోకెన్‌ తీసుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మేరకు కౌంటర్ల వద్ద రద్దీలేకుండా చర్యలు చేపట్టారు. అలాగే.. జారీచేసిన టోకెన్లు, మిగిలినవి పారదర్శకంగా తెలిసేలా డిస్‌ప్లే బోర్డులు పెట్టారు. దీంతో భక్తులకు సక్రమంగా సమాచారం అందేది. అలాగే.. ఒక్కో కౌంటర్‌ వద్ద టీటీడీ సెక్యూరిటీతోపాటు పోలీసులు సుమారు 25 మంది భద్రతా విధులు నిర్వర్తించేవారు. గంట గంటకూ టీటీడీ అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించే వారు.నేడు..వైకుంఠ ద్వార దర్శన టోకెన్లకు తిరుపతిలోని తొమ్మిది కేంద్రాలు ఏర్పాటుచేశారు. గురువారం వేకువజాము 5 గంటలకు టోకెన్ల జారీ ప్రారంభించాల్సి ఉంది. అయితే, భక్తుల రద్దీ కారణంగా బుధవారం రాత్రి 9 గంటలకే పంపిణీ మొదలుపెట్టారు. దీనికితోడు అపరిమితంగా టోకెన్ల జారీకి టీటీడీ సన్నద్ధం కావడంతో కౌంటర్ల వద్దకు పెద్దసంఖ్యలో భక్తులు చేరుకున్నారు. అదుపు చేయలేని పరిస్థితుల్లో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో భక్తుల మధ్య తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. శ్రీనివాసం దగ్గర ఏర్పాటుచేసిన కౌంటర్ల వద్దకు భక్తులను ఒక్కసారి గుంపులుగా వదలడమే తొక్కిసలాటకు కారణంగా భావిస్తున్నారు. ఒక్కో కౌంటర్‌ వద్ద కేవలం ఇద్దరు ముగ్గురు పోలీసులు మాత్రమే విధులు నిర్వర్తించారు. తొక్కిసలాట జరిగాక అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. చనిపోయిన వారు వీరే..లావణ్య స్వాతి(37) తాటిచెట్లపాలెం, విశాఖపట్నం శాంతి (35) కంచరపాలెం, విశాఖపట్నం రజని (47), మద్దెలపాలెం, విశాఖపట్నం మల్లిగ(50), మేచారి గ్రామం. సేలం జిల్లా, తమిళనాడు బాబు నాయుడు(51), రామచంద్రపురం, నరసరావుపేట నిర్మల (45), పొల్లచ్చి, తమిళనాడు వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతిసాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ సీఎం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతా పం తెలియజేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని అన్నారు. అక్కడి పరిస్థితు లను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.తిరుపతి ఘటనపై సీఎం రేవంత్‌ విచారం సాక్షి, హైదరాబాద్‌: తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు సాను భూతి ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన సాయం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి తొక్కిసలాట ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఎప్పుడేం జరిగిందంటే..8వ తేదీ బుధవారం ఉ.5 గంటలకు..⇒ తిరుపతిలోని తొమ్మిది కౌంటర్లలో భక్తుల రాక ప్రారంభం⇒ ఉ.7.30కు 60 శాతం భక్తులతో నిండిన క్యూలైన్లు⇒ ఉ.8.30కు క్యూలైన్ల వద్దకు చేరుకున్న పోలీసులు⇒ ఉ.9.30కు పూర్తిస్థాయిలో క్యూలైన్లు నిండి ప్రవేశద్వారాల వద్ద పెద్ద సంఖ్యలో గుమ్మికూడిన భక్తులు⇒ ఉ.10.30కు టీటీడీ అధికారులు మొక్కుబడిగా పర్యవేక్షించి వెళ్లిపోయారు.⇒ ఉ.11.30కు భక్తులు టాయిలెట్స్‌ కోసం, తాగునీరు, భోజనం కోసం ఇబ్బందులు పడుతూ అధికారులను నిలదీశారు.⇒ మ.12.30కు.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో చేరుకున్న భక్తులు⇒ మ.1.30కు భక్తుల తాకిడి తారాస్థాయికి చేరుకుంది.⇒ మ.2.30 అవుతున్నా కౌంటర్‌ కేంద్రాల వద్ద భక్తులను అప్రమత్తం చేయని అధికారులు⇒ మ.3.30కు క్యూలైన్‌లో వేచి ఉండలేక.. టికెట్లు ఎప్పుడిస్తారంటూ భక్తుల నిలదీత.. ప్రశ్నించినా పట్టించుకోని అధికారులు⇒ సా.4.30కు శ్రీనివాసం, బైరాగిపట్టిడి రామానాయుడు స్కూల్స్‌ వద్ద రాత్రి 9 గంటలకు టోకెన్లు ఇస్తారని ప్రకటన⇒ సా.5.30కు రైల్వేస్టేషన్, బస్టాండ్‌ ప్రాంతాల నుంచి శ్రీనివాసం, రామానాయుడు స్కూల్‌ వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో కౌంటర్‌ వద్దకు చేరిక.⇒ సా.6.30కు కౌంటర్‌ కేంద్రాల వద్ద టీటీడీ సిబ్బంది కంప్యూటర్ల పనితీరును పరిశీలిస్తుండడంతో టోకెట్లు ఇస్తారని భక్తుల్లో ఉత్సాహం.⇒ రాత్రి 7.30 గంటలకు ఒక్కసారిగా కేకలు వేస్తూ భక్తులు ముందుకు సాగడంతో శ్రీనివాసం కౌంటర్‌ వద్ద తమిళనాడుకు చెందిన మల్లిక అనే మహిళా క్యూలైన్‌లో కిందపడిపోయింది.⇒ రాత్రి 7.45కు కిందపడిన మహిళపై నుంచి భక్తులు తొక్కుకుంటూ వెళ్లిపోయారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది.⇒ రాత్రి 8 గంటలకు మరో పదిమందిæ భక్తులు కింది పడిపోయారు. వారంతా గాయపడ్డారు. అప్పుడు అప్రమత్తమైన అధికారులు గాయపడ్డ భక్తులను రుయా, స్విమ్స్‌ అస్పత్రులకు తరలించే ప్రయత్నాలు చేశారు.⇒ రాత్రి 8.30కు స్పృహ కోల్పోయిన మహిళ ఆస్పత్రికి వెళ్లే మార్గంమధ్యలోనే మృతిచెందింది. అదే సమయంలో బైరాగిపట్టిడి రామానాయుడు స్కూల్‌ వద్ద తోపులాటలో 40 మంది కిందపడి స్పృహ కోల్పోయారు. వెనుక ఉన్న భక్తులు వీరిని తొక్కుకుంటూ వెళ్లిపోయారు.⇒ రాత్రి 9.10కు కిందిపడిపోయిన భక్తులను రుయా అస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు గుర్తించారు.⇒ 9.20కు అధికారులు ఇదేమీ పట్టించుకోకుండా టోకెన్ల జారీని కొనసాగించే పనిలో పడ్డారు.

YS Jagan expresses shock over deaths of devotees in Tirupati stampede2
తిరుపతి తొక్కిసలాటలో భక్తుల మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

తాడేపల్లి: తిరుమల వేంకటేశ్వరస్వామి వైకుంఠ దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు కోలుకోవాలని ఆకాంక్షించారు.

Sakshi Guest Column On USA Donald Trump Elon Musk3
ఒకే ఒరలో రెండు కత్తులు!

అమెరికా రిపబ్లికన్‌ పార్టీలో టెక్‌ మితవాదులు, జాతీయ మితవాదులు వేర్వేరు వర్గాలు. ఇరువురూ ఒక్కటై డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు తోడ్పడ్డారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ట్రంప్‌ విజయం తర్వాత మొదటిసారి ఈ రెండు వర్గాలూ పరస్పరం కత్తులు దూసుకున్నాయి. అమెరికా జనాభాలో తెల్లవాళ్ల స్థానాన్ని ఇతర దేశాల శ్వేతేతరులతో భర్తీ చేయడానికి ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందన్నది జాతీయవాద మితవాదుల ఆరోపణ. అందివచ్చే ఎలాంటి అవకాశాలైనా సరే వాడుకుని అమెరికా యావత్‌ ప్రపంచాన్ని జయించాలని టెక్‌ రైటిస్టులు అనుకుంటారు. అయితే ట్రంప్‌ దగ్గర టెక్‌ రైటిస్టులకే ప్రాధాన్యత లభిస్తోంది. కలసికట్టుగా ఎన్నికలు గెలిచినా, ఇప్పుడు ఒక వర్గం ఓడిపోబోతోంది.మొన్న క్రిస్మస్‌ రోజు అమెరికా సోషల్‌ మీడియా భగ్గుమంది. ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కేంద్రబిందువుగా సంస్కృతి పరమైన విష పోరాటం మొదలైంది. విమర్శకులు ఆయనపై విద్వేషంతో బుసలు కోట్టారు. అసభ్య వ్యాఖ్యలతో దాడి చేశారు. మస్క్‌ కూడా వారితో ఢీ అంటే ఢీ అన్నాడు. అసలేమిటి ఈ వివాదం? వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ శ్రీరామ్‌ కృష్ణన్‌ను డోనాల్డ్‌ ట్రంప్‌ తన ఏఐ–పాలసీ సీనియర్‌ సలహాదారుగా నియమించుకోడంతో అమెరికాలో అగ్గి రాజుకుంది. ‘మాగా’ (ఎంఏజీఏ– మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌) వాదానికి గట్టి మద్దతుదారు, ఇంటర్నెట్‌ ట్రోలింగ్‌ సుప్రసిద్ధుడు అయిన లారా లూమర్‌ పెట్టిన పోస్టు తీవ్ర మితవాదులను అట్టుడికించింది. ‘అమెరికా ఫస్ట్‌’ ఉద్యమానికి ట్రంప్‌ వెన్నుపోటు పొడిచాడంటూ రగిలిపోయారు. కృష్ణన్‌ భారతీయ వలసదారు. అమెరికా పౌరుడు. ఆయన భారతీయ మూలాలను ‘మాగా’ మితవాద శిబిరం సహించలేక పోయింది. హెచ్‌–1బి వీసా విధానంపై మండిపడింది. అమెరికన్‌ కంపెనీలు నిపుణులైన వలసదారులను నియమించుకోడానికి ఇది వీలు కల్పిస్తోంది. ఇలా వచ్చి పనిచేస్తున్న వారిలో మూడొంతుల మంది ఇండియన్లే. ఈ నేపథ్యంలో శ్రీరామ్‌ కృష్ణన్‌ నియామకానికి స్పందనగా ఇంటర్నెట్‌లో జాత్యహంకారం జడలు విప్పింది. జాతీయ వాదులు భారతీయ టెక్‌ వర్కర్లపై విద్వేషపూరితమైన మీమ్స్‌తో సోషల్‌ మీడియాను ముంచెత్తారు. వారిని ‘మూడో ప్రపంచ ఆక్రమణ దారులు’గా లూమర్‌ అభివర్ణించాడు. అంతేకాదు, అతడో సిద్ధాంతం లేవనెత్తాడు. దాని పేరు ‘గ్రేట్‌ రీప్లేస్‌మెంట్‌ థియరీ’. అమెరికా జనా భాలో తెల్లవాళ్ల స్థానాన్ని ఇతర దేశాల శ్వేతే తరులతో భర్తీ చేయడా నికి ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందన్నది లూమర్‌ సిద్ధాంతం. హెచ్‌–1బి వీసా విధానానికి మస్క్‌ మద్దతునిజానికి శ్వేత ఆధిక్యానికి మస్క్‌ వ్వతిరేకం ఏమీ కాదు. తన సొంతమైన ‘ఎక్స్‌’ వేదిక మీద దాన్ని సమర్థించినట్లే కనిపించేవాడు. అయినా, తనకు విశేషమైన అవకాశాలు అందించిన, అపార సంపద కట్టబెట్టిన ప్రభుత్వ విధానం (హెచ్‌–1బి) మీద ఇప్పుడు జరుగు తున్న దాడిని సహించలేక పోయాడు. అమెరికా పౌరుడిగా మారక ముందు మస్క్‌ కూడా వలస వచ్చినవాడే. దక్షిణాఫ్రికా నుంచి హెచ్‌–1బి వీసా మీద వచ్చి స్థిరపడ్డాడు. ఆయన కూడా తన కంపెనీల్లో అలాంటి వారిని నియమించుకున్నాడు. ఈ హెచ్‌–1బి వీసా విధానానికి మద్దతు ఇస్తూ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టాడు. ఈ విధానం వల్ల అమెరికా గొప్ప ప్రతిభావంతులను సమకూర్చుకుంది అని అతడి వాదన. ఐటీ కేంద్రమైన సిలికాన్‌ వ్యాలీకి ఈ దృక్పథం ఇబ్బందికరమైంది కానప్పటికీ, రిపబ్లికన్‌ పార్టీలోని తిరోగమన, జాతీయ వాద వర్గాలకు మస్క్‌ అభిప్రాయం అసంతృప్తి కలిగించింది ‘అమెరికా ప్రజలు ఎప్పటికీ అమెరికాను ఒక స్పోర్ట్స్‌ టీమ్‌ లేదా కంపెనీ అనుకోరు’ అంటూ జాక్‌ పొసొబిక్‌ బదులిచ్చాడు. వీటన్నిటికీ బదు లిస్తూ, ‘ఈ అంశం మీద నేను యుద్ధానికి సిద్ధం, దాని పర్యవ సానాలు మీ ఊహక్కూడా అందవు’ అంటూ మస్క్‌ తన విమర్శకు లను హెచ్చరించాడు. దీంతో ట్రంప్‌ మాజీ సలహాదారు స్టీవ్‌ బానన్‌ రంగంలోకి దిగాడు. హెచ్‌–1బి వీసాలు పెద్ద స్కామ్‌ అనీ, వాటిని సమర్థించి మస్క్‌ తన ‘నిజ స్వరూపం’ బయట పెట్టుకున్నాడని ప్రతి దాడికి దిగాడు.నిజానికి హెచ్‌–1బి వీసాలను వ్యతిరేకించడం ‘మాగా’ పంథా కాదు. ఈ విధానంలో లోపాలు ఉన్నాయి కాబట్టి దీని పట్ల వ్యతిరేకత వచ్చింది. ఇండిపెండెంట్‌ సెనెటర్‌ బెర్నీ శాండర్స్‌ గతంలో మాట్లా డిన ప్రకారం, వ్యాపారవేత్తలు అత్యంత నిపుణులైన వలస ఉద్యోగులను నియమించుకుని సిబ్బంది వ్యయాలు గణనీయంగా తగ్గించు కోడానికి హెచ్‌–1బి పదునైన ఆయుధంలా ఉపకరిస్తుంది. మస్క్‌ సమ్మిళిత వలసవాదంగా పేర్కొంటూ అత్యంత నిపుణులైన విదేశీ ఉద్యోగులకు ఇప్పుడు మద్దతు ఇస్తున్నాడు. అయితే, ఎక్స్‌ వేదిక మీద జాతివివక్ష అంశంలో దొంగాటలు ఆడాడు. నియో నాజీలతో సంబంధాలు నెరిపే జర్మన్‌ తీవ్ర మితవాద పార్టీకి గట్టి మద్దతు ఇచ్చాడు. సయోధ్య కుదిరేనా?రిపబ్లికన్‌ పార్టీలోని ఈ రెండు మితవాద వర్గాల ఐక్యత ప్రశ్నా ర్థకంగా మారింది. ఏమైనా ఇవి తమ విభేదాలు పరిష్కరించుకున్నా యని ఒక దశలో అనిపించింది. జాతీయ మితవాదులకు, టెక్‌ మిత వాదులకు మధ్య సయోధ్యకు కాబోయే ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్‌ ఒక ఉదాహరణ. పీటర్‌ థియల్‌ అనే మితవాద టెక్‌ బిలియనీర్‌ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న కంపెనీలో వాన్స్‌ పనిచేశాడు. అడ్డూ ఆపూ లేని స్వేచ్ఛావిపణులను ఈ కాబోయే ఉపాధ్యక్షుడు విమర్శించాడు. తద్వారా మంచి పలుకుబడి ఉన్న జాతీయ మితవాద నేతలను ఆకట్టుకున్నాడు. హెచ్‌–1బి వీసా ఉద్యోగులను నియమించుకునే కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నప్పటికీ వాన్స్‌ హెచ్‌–1బి వీసాలను వ్యతిరేకించాడు. పార్టీని ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా సమైక్యం చేయడం ఆయన బాధ్యత కావడం ఇందుకు కారణం కావచ్చు. అయితే ఎన్నికల తరువాత దాన్ని పక్కన పెట్టారు.ట్రంప్‌ పదవి చేపట్టిన తర్వాత టెక్‌ రైట్‌–నేషనలిస్ట్‌ రైట్‌ మధ్య ఉద్రిక్తతలు ఎలా ఉండబోతున్నాయన్న దానికి తాజా ఘర్షణ ఒక ప్రివ్యూ లాంటిది. జాతీయవాదులు వారు కోరుకున్నది చాలావరకు సాధించుకుంటారు. మూకుమ్మడి దేశ బహిష్కరణలు ఉంటాయని ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించాడు. ఇది వారికి ఆనందం కలిగించి తీరు తుంది. సిలికాన్‌ వ్యాలీతో వారి పోరు విషయాన్ని ప్రస్తుతానికి ఆయన పట్టించుకోడు. ట్రంప్‌ గత హయాంలోనూ ఇదే జరిగింది. బడా కార్పొరేట్ల ప్రయోజనాలు పక్కన పెట్టి సామాన్యులకు మేలు చేసే ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తానని 2016లో చేసిన వాగ్దానాన్ని ఆయన పూర్తిగా విస్మరించాడు. ఇది జాతీయ మితవాదులు కోరుకున్నదానికి విరుద్ధం. భారీ వ్యాపార సంస్థలకు, ధనికులకు ట్రంప్‌ అప్పట్లో పన్నులు తగ్గించాడు. మరోవంక, ‘ముస్లిం బ్యాన్‌’, అక్రమ వలస దారుల పిల్లలను వారి తల్లిదండ్రుల నుంచి వేరుచేయడం వంటి కఠిన చర్యలను టెక్‌ అధిపతులు, సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకించారు. టెక్‌ రైట్‌కే ప్రాధాన్యం?ఈసారి టెక్‌ మితవాద వర్గానికి పాలనలో ప్రాధాన్యం లభిస్తోంది. మస్క్, టెక్‌ వ్యాపారవేత్త వివేక్‌ రామస్వామి కొత్తగా ఏర్పా టైన ప్రభుత్వ సామర్థ్య విభాగం (డోజ్‌–డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్న మెంట్‌ ఎఫిషియన్సీ) నిర్వహించబోతున్నారు. బిలియనీర్‌ వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ మార్క్‌ ఆండ్రీసెన్‌ ఈ విభాగం సిబ్బంది నియామకంలో తోడ్పడతాడు. ఇక శ్రీరామ్‌ కృష్ణన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విధాన రూపకల్పనలో అధ్యక్షుడికి సలహాలు ఇస్తాడు. ట్రంప్‌ ఇతర నియా మకాల్లో సైతం ధనికవర్గాలకు, శక్తిమంతులకు ప్రాధాన్యం ఇచ్చాడు. ప్రభుత్వం వారితో స్నేహపూర్వకంగా ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు. ఇక జాతీయ మితవాదుల్లోని కొద్దిమంది ముఖ్యులకూ ట్రంప్‌ క్యాబినెట్‌లో చోటు లభించనుంది.ట్రంప్‌ ‘న్యూయార్క్‌ పోస్ట్‌’తో మాట్లాడుతూ, ‘నేనెప్పుడూ వీసా లను ఇష్టపడ్డాను. వీసాలకు నేను ఎప్పుడూ అనుకూలమే. అందుకే వాటిని అమలు చేశాను’’ అన్నాడు. ఈ ప్రకటన ద్వారా మస్క్‌కు ఆయన పూర్తి మద్దతు పలికాడు. చిట్టచివరిగా ఇంకో విషయం ప్రస్తా వించాలి. సంపన్నుల చేతిలో ముఖ్యంగా క్రితంసారి కంటే ఈసారి మరింత ఎక్కువ అధికారం ఉంటుంది. అలీ బ్రెలాండ్‌ వ్యాసకర్త సీనియర్‌ పత్రికా రచయిత(‘ది అట్లాంటిక్‌’ సౌజన్యంతో)

Vizag Steel Plant: Chandrababu Lies In Pm Modi Meeting4
అన్నన్న చంద్రన్నా.. మోదీ సభలో పచ్చి అబద్ధాలు

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ (Visakha Steel Plant)పై చంద్రబాబు (Chandrababu) మోసం మరోసారి బయటపడింది. విశాఖ మోదీ (PM Modi) సభలో స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై కనీసం ప్రస్తావించని సీఎం చంద్రబాబు.. స్టీల్ ప్లాంట్‌ను ఆదుకోవాలని ప్రధానికి కనీసం విజ్ఞప్తి కూడా చేయలేదు.1400 రోజులకుపైగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యమం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కాపాడతామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఎన్నికల తర్వాత స్టీల్ ప్లాంట్ అంశాన్ని చంద్రబాబు పక్కన పెట్టారు. ప్రైవేట్‌ స్టీల్‌ ప్లాంట్‌ గనుల గురించి ప్రస్తావించిన చంద్రబాబు.. విశాఖ స్టీల్ ప్లాంట్ గనుల గురించి మాత్రం ప్రస్తావించలేదు. ప్రధానికి అపాయిమెంట్‌ ఇప్పించాలని కార్మికుల కోరిన కూడా చంద్రబాబు పట్టించుకోలేదు.విశాఖ స్టీల్ ప్లాంట్‌ చంద్రబాబు తీరని ద్రోహం చేశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీ వద్ద కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ ఊసెత్తని చంద్రబాబు.. మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు మాత్రం ఐరన్ఓర్ సప్లై చేసేందుకు పైప్‌లైన్‌ వేసేందుకు అనుమతించాలని మోదీని చంద్రబాబు కోరారు.స్టీల్ ప్లాంట్‌కు ఐరన్ ఓర్ అడగకుండా.. మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు ఐరన్ ఓర్ సప్లైకు పైప్ లైన్‌ను చంద్రబాబు అడిగారు. రైల్వే జోన్‌పై అబద్ధాలు చెప్పిన చంద్రబాబు.. గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదంటూ ప్రధాని సభలో పచ్చి అబద్ధాలు చెప్పారు. మొత్తం పెట్టుబడులు తానే తీసుకువచ్చానంటూ చంద్రబాబు డాంబికాలు పలికారు.ఇదీ చదవండి: ఇదీ వాస్తవం.. గణాంకాలతో సహా వివరించిన మార్గాని భరత్‌ఏడు నెలల్లో తామే అంతా చేశాం అన్నట్లు చంద్రబాబు బిల్డప్ ఇచ్చారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించిన ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు.. నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తించారు. అటు ఇంగ్లీషు, ఇటు హిందీలోనూ ప్రధానిని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు.

Telangana govt approves increase Ram Charan Game Changer ticket rates5
గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం. జనవరి 10వ తేదీ ఒకరోజు ఉదయం 4 గంటల షో నుంచి 6 షోస్‌కు అనుమతి. మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 150 రూపాయలు పెంపుకు అనుమతి. సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 100రూపాయలు పెంపు. అలానే జనవరి 11 నుంచి 5 షోస్‌కు అనుమతి. జనవరి 11 నుంచి మల్టీ ప్లెక్స్ ధర 100 రూపాయలు. సింగిల్ స్క్రీన్ ధర్ 50 రూపాయలు పెంపు. టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇచ్చిన తెలంగాణా ప్రభుత్వం బెనిఫిట్ షోస్‌కు మాత్రం అనుమతి నిరాకరించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'గేమ్ చేంజర్' (Game Changer Movie). జనవరి 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్‌, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. తమన్‌ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో కేవలం ఐదు పాటల కోసమే ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు పెట్టారు. ఓ నిజాయితీ ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీతి పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పోరాటమే గేమ్‌ ఛేంజర్‌ కథ.

YS Jagan Meeting With Nellore District YSRCP Leaders Full Details6
జెండా మోసిన ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటా: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కీలక హామీ ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూసుకుంటామని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ భరోసాగా ఉంటామని ధైర్యానిచ్చారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు.నేడు తాడేపల్లిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యతిరేక రావడానికి కనీసం ఏడాదైనా పడుతుంది కదా అని అందరూ అనుకుంటారు.కానీ, ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో హామీలను పూర్తిగా గాలికొదిలేశారు. ప్రతీ ఇంట్లో ఇదే చర్చ కొనసాగుతోంది. మనం ఇచ్చిన పథకాలను రద్దుచేశారు, అవి అమలు కావడంలేదున్నారు...ప్రతీ ఇంటికీ వెళ్లి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ హామీలు గుప్పించారు. చాలామంది శ్రేయోభిలాషులు వచ్చి.. చంద్రబాబులా హామీలు ఇవ్వాలని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం, విశ్వసనీయ ఉండాలి. అలాంటి వారికే విలువ ఉంటుంది. ఒక నాయకుడిగా మనం ఒక మాట చెప్పినప్పుడు ప్రజలు దాన్ని నమ్ముతారు. ఆ మాట నిలబెట్టుకున్నామా? లేదా? అని చూస్తారు. అమలు కాకపోతే.. ఆ నాయకుడి విలువ పోతుంది. అందుకనే మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. ఎన్నికల సమయంలో మేనిఫెస్టో సందర్భంగా ప్రజంటేషన్‌ ఇచ్చాను. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మేనిఫెస్టోను మనం అమలు చేశాం.జగనే కరెక్ట్‌ అంటున్నారు..బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడే ఏ నెలలో ఏ క్యాలెండర్‌ అమలు చేస్తామో క్యాలెండర్‌ విడుదల చేశాం. ప్రజల సంతోషం కోసం నిరంతరం తాపత్రయ పడ్డాం. మనం చేస్తున్న హామీలకు ఇంత ఖర్చు అవుతోంది, చంద్రబాబు హామీల అమలు చేయాలంటే రూ.1.72లక్షలకోట్లు ఇవ్వాలి అని చెప్పాను. చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే అని సూచించాను. పులినోట్లో తలకాయపెట్టడమే అని చెప్పాను. ఈరోజు ఆ వీడియోలు చూస్తే.. జగన్‌ కరెక్టుగానే చెప్పాడనుకునే పరిస్థితి ఉందని తెలిపారు. ప్రతీనెలా ఏదో పథకం ద్వారా ప్రజలకు మేలు చేశాం. చంద్రబాబుకు, జగన్‌కు మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఏ పథకమైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు డోర్‌ డెలివరీ జరిగేది. మరి చంద్రబాబు పాలనలో ఎందుకు ఇలా జరగడంలేదు?. ఎందుకు చంద్రబాబు మనలా చేయలేకపోతున్నాడు?. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. మరి చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ ప్రతీ ఇంట్లోనూ జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ‌ ప్రభుత్వం ఉండి ఉంటే.. ప్రతీనెలా ఏదో పథకం వచ్చేది. ఐదేళ్ల పాటు షెడ్యూల్‌ ఇచ్చి పథకాలు అమలు చేసినట్టు చెప్పారు. బాబు బాదుడు..కేవలం ముఖ్యమంత్రి మారడంతో ఇవి ఇప్పుడు జరగడం లేదు. మన పార్టీలో ఏ నాయకుడైనా గర్వంగా తలెత్తుకుని ఏ ఇంటికైనా వెళ్లగలడు. మనం చెప్పినవి చేసి చూపించాం. అబద్ధాలు చెప్పలేదు, మెసాలు చేయలేదు. అధికారం కోసం ఏ గడ్డైనా మనం తినలేదు. ఇప్పుడు కూటమి నాయకులు ఏ ఇంటికీ వెళ్లలేరు, వారికీ ఆ ధైర్యంకూడా లేదు. ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు బాదుడే బాదుడు కనిపిస్తోంది. ఆరు నెలల తిరక్కముందే కరెంటు ఛార్జీలు భారీగా పెంచారు. గ్రామీణ రోడ్లలో టోల్‌గేట్లు కూడా పెడుతున్నారు. నేషనల్‌ హైవేల మీదలానే టోల్‌ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరుగుతున్నాయి. స్థలాల్లోని పాత ఇళ్ల మీద కూడా ఛార్జీలు వేస్తున్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ డబ్బులు చెల్లించడం లేదు. మనం ప్రతీ మూడు నెలలకూ విద్యా దీవెన కింద డబ్బులు చెల్లించాం. విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు పెండింగ్‌లో పెట్టారు.ఆరోగ్యశ్రీ కింద వేయి ప్రొసీజర్లను 3300 వరకూ పెంచి గొప్పగా అమలు చేశాం. ఆరోగ్య ఆసరా కూడా అమలు చేశాం. ఈ 8 నెలల కాలంలోనే రూ.3వేల కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయిపెట్టారు. పేదవాడు ఆస్పత్రికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఉచితంగా వైద్యం అందుకునే పరిస్థితి ఎక్కడా లేదు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఇస్తానన్న రూ.20వేలు ఇవ్వలేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలన.. ఈ నాలుగు రంగాలను చూసుకోవడమే ప్రభుత్వం బాధ్యత. కానీ, ఈ నాలుగు రంగాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.రెడ్‌ బుక్‌ రాజ్యాంగమే..రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. ఇంటి వద్దకే డోర్‌ డెలివరీ పరిపాలన నుంచి తిరిగి టీడీపీ నాయకుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు తోడుగా ఉన్నవారే నాయకులుగా ఎదుగుతారు. నాయకులంతా యాక్టివ్‌గా ఉండాల్సిన సమయం వచ్చేసింది. చంద్రబాబు దుర్మార్గపు పరిపాలన వల్ల మనం ప్రజలకు తోడుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. పార్టీని వ్యవస్థీకృతంగా తీర్చిదిద్దాలి. ప్రతీ గ్రామంలో కూడా పార్టీ నిర్మాణం ఉండాలి. కమిటీల ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావాలి.నెలఖారు నుంచి ప్రజలతోనే..నేను కూడా జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటనకు వస్తాను. ప్రతీ వారంలో మూడు రోజులు ఒక పార్లమెంటులో విడిది చేస్తాను. ప్రతీ రోజూ రెండు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలను కలుసుకుంటాను. మండల స్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ పార్టీ బలోపేతం కావాలి. గ్రామస్థాయి కమిటీలు, బూత్‌ కమిటీలు ఇవన్నీ కూడా బలోపేతం కావాలి. సోషల్ ‌మీడియాను బలమైన ఆయుధంగా ఉపయోగించుకోవాలి. కేవలం మనం చంద్రబాబుతో యుద్ధం చేయడం లేదు. చెడిపోయి ఉన్న మీడియాతోనూ యుద్ధం చేస్తున్నాం. వీరిని ఎదుర్కోవాలంటే.. సోషల్ ‌మీడియా ద్వారానే సాధ్యం అవుతుంది.సోషల్‌ మీడియా వినియోగించుకోవాలి..గ్రామస్థాయిలో ఉన్న ప్రతీ కమిటీ సభ్యుడు కూడా సోషల్‌ మీడియాను వినియోగించుకోవాలి. ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకురావాలి. అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నించాలి. ఇచ్చిన హామీల అమలుకు పట్టుబట్టాలి. చంద్రబాబుని నిలదీసే కార్యక్రమం చేయాలి. దాదాపు మూడున్నర లక్షల పెన్షన్లు కట్‌ అయిపోయాయి. ఇక దివ్యాంగుల మీద కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు.కార్యకర్తల విషయంలో ఇంతవరకూ ఒకలా చూశాం. ఇకపై మరోలా చూస్తాం. మనం కూడా కొంత నేర్చుకోవాల్సి ఉంది. జెండా మోసిన ప్రతీ కార్యకర్తకు భరోసాగా ఉంటాం. అన్యాయానికి గురైన ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటాం. మీకు అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి. వారిని చట్టం ముందు కచ్చితంగా నిలబెడతాం. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. కచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉంటాను’ అని భరోసా ఇచ్చారు.

Visakha Ukku Porata Committee Expressed Anger Over Chandrababu And Pawan7
మోదీ భజనకే బాబు, పవన్‌ పరిమితం.. ఇక ఉక్కు ఉద్యమం ఉధృతం

సాక్షి, విశాఖపట్నం: ప్రధాని మోదీ సభలో చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్‌(Pawan Kalyan) ప్రసంగాలపై ఉక్కు పోరాట కమిటీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు నిర్ణయిస్తూ.. పోరాటానికి సన్నద్ధమవుతోంది. 35 గంటలకే దీక్ష విరమించి పెద్ద ఎత్తున నిరసన చేయాలని పోరాట కమిటీ నిర్ణయించింది.ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు పోరాట కమిటీ నిర్ణయించింది. పోరాట కమిటీ ఛైర్మన్ ఆదినారాయణ తో సహా మరి కొంతమంది ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. దీక్షా శిబిరం వద్దే ఉక్కు కార్మికులు ఉక్కు కార్మికులు బైఠాయించారు. కాగా, ఇప్పటికే దీక్షా శిబిరం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిరసన చేస్తే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిస్తామంటూ పోలీసులు హెచ్చరించారు.ఏపీ హక్కులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ గాలికొదిలేశారు. రాష్ట్ర హక్కుల కోసం ప్రధాని మోదీ ముందు వారు కనీసం నోరు విప్పలేదు. స్టీల్ ప్లాంట్ సహా ఏ సమస్యపై కూడా చంద్రబాబు, పవన్‌ అడగలేదు. కేవలం ప్రధాని మోదీ భజనకే చంద్రబాబు ప్రసంగం పరిమితమైంది.ఇదీ చదవండి: అన్నన్న చంద్రన్నా.. మోదీ సభలో పచ్చి అబద్ధాలువిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని అడగని చంద్రబాబు.. ప్రత్యేక హోదా కోసం పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. వాల్తేర్ డివిజన్‌తో కూడిన రైల్వే జోన్ కోసం అడగని చంద్రబాబు.. పోలవరం నిర్వాసితుల నిధులపై కూడా స్పష్టత కోరలేదు.చంద్రబాబు, పవన్‌లపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడిదంటూ నిత్యం ప్రగల్భాలు పలికే చంద్రబాబు, పవన్.. ఎంపీల బలం ఉన్నా ఏపీ హక్కుల కోసం నోరువిప్పలేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల సాగిలపాటు వైఖరి విశాఖ, ఏపీ ప్రజలను పూర్తిగా నిరాశపరిచింది.

Sakshi Editorial On Tamil Nadu Government and Governor RN Ravi8
గౌరవం నిలపాలి!

తమిళనాడు సర్కారుకూ, ఆ రాష్ట్ర గవర్నర్‌కూ పొసగడం లేదన్నది కొన్నేళ్ళుగా జగమెరిగిన సత్యమే. ఆ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. నూతన సంవత్సరంలో తమిళనాడు శాసనసభ తొలిసారి సమావేశమైనప్పుడు సభను ఉద్దేశించి గవర్నర్‌ చేయాల్సిన ప్రారంభ ప్రసంగం వరుసగా మూడో ఏడాది సైతం రచ్చ రాజేసింది. శాసనసభలో ప్రసంగించకుండానే గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి నిష్క్రమించడం వివాదాస్పదమైంది. రాష్ట్రాల యూనియనైన భారత సమాఖ్య వ్యవస్థలో గవర్నర్ల పాత్రపై ఇది మళ్ళీ చర్చకు తావిచ్చింది. అత్యంత గౌరవాస్పదమైనదైన గవర్నర్‌ పదవి, ఇటీవల గవర్నర్లు కొందరు వ్యవహరిస్తున్న తీరు దురదృష్టవశాత్తూ చర్చనీయాంశమవుతోంది. రాజ్యాంగబద్ధ పదవిని చేపట్టాక రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సిన వ్యక్తులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలతో కయ్యానికి కాలుదువ్వుతూ, రాజ్యాంగ పరిధిని మించి ప్రవర్తిస్తున్నారన్నదీ నిష్ఠురసత్యమే. గవర్నర్‌ హోదా దుర్వినియోగం కావడం కొత్త ఏమీ కాదు. అదో సుదీర్ఘ చరిత్ర. ఒకప్పుడు కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ చక్రం తిప్పిన రోజుల్లో గవర్నర్లు వట్టి రబ్బరు స్టాంపులనే పేరుండేది. కేంద్రం పనుపున రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలను ఒక్క కలం పోటుతో బర్తరఫ్‌ చేశారనే దుష్కీర్తికీ కొదవ లేదు. ఢిల్లీ గద్దెపై పార్టీ జెండా మారినా... ఇప్పుడూ అదే రకమైన దుర్వినియోగం వేరొక పద్ధతిలో కొనసాగుతోందని వాపోవాల్సి వస్తోంది. గతంలో కాంగ్రెస్‌ పాలకులు చేశారు కాబట్టి ఇప్పుడు మేమూ ఆ రకంగానే ప్రవర్తిస్తామని ప్రస్తుత పాలకులనుకుంటే అది సమర్థనీయం కాదు. రాజ్యాంగ విధినిర్వాహక పదవుల దుర్వినియోగం వ్యక్తులకే కాక, వ్యవస్థకూ మాయని మచ్చవుతుంది. ‘టీమ్‌ ఇండియా’ అంటూ కేంద్ర పాలకులు తరచూ ఆదర్శాలు పైకి వల్లె వేస్తున్నా, ఆచరణలో జరుగుతున్నది వేరు. బీజేపీయేతర ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకొని, రాజ్‌భవన్‌ను రాజకీయ అస్త్రంగా వాడుతున్నారనే ఆరోపణ... కొన్నేళ్ళుగా కేరళ నుంచి కశ్మీర్‌ దాకా అనేకచోట్ల వినిపిస్తున్నది. తమిళనాట డీఎంకే సర్కారుతో గవర్నర్‌ రవికి మొదటి నుంచీ ఉప్పూ నిప్పే! ఏళ్ళ తరబడి పాటిస్తూ వస్తున్న వ్యవస్థీకృత సభా సంప్రదాయాలను తోసిరాజనడమే కాదు... లౌకికవాదం సహా పలు అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సాక్షాత్తూ రాజ్యాంగమే లౌకికవాదాన్ని ఔదలదాల్చిన దేశంలో... రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నరే... అది వట్టి యూరోపియన్‌ సిద్ధాంతమనీ, భారతదేశంలో దానికి చోటులేదనీ వ్యాఖ్యానించారు. అది తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆ మధ్య ప్రసారభారతి కార్యక్రమంలో, ఇప్పుడు చట్టసభలో జాతీయ గీతాలాపనపై ఆయన రగడ చేశారు. నిజానికి, తమిళనాట అధికారిక కార్యక్రమాలన్నిటా ‘తమిళతల్లి స్తుతి’ (తమిళ్‌తాయ్‌ వాళ్తు)ని ప్రార్థనా గీతంగా పాడడం 1970 నుంచి ఉన్నదే. 2021 డిసెంబర్‌లో దాన్ని రాష్ట్ర గీతంగానూ ప్రకటించారు. తమిళ ప్రభుత్వ కార్యక్రమాలన్నిటినీ తమిళ్‌తాయ్‌ వాళ్తుతో ఆరంభించి, జాతీయ గీతాలాపనతో ముగించడం దశాబ్దాల సంప్రదాయం. ఆ సంగతే ముందుగానే ప్రభుత్వం చెప్పినప్పటికీ, దాన్ని గౌరవించాల్సిన గవర్నర్‌ పదేపదే విభేదించడం, అంతటితో ఆగక ‘ద్రావిడనాడు’ భావనపైనే అభ్యంతరాలు చెప్పడం, ఒక కార్యక్రమంలో అధికారిక గీతం నుంచి ద్రావిడనాడు ప్రస్తావన అనుమానాస్పద రీతిలో తొలగింపునకు గురికావడం... అన్నీ వివాదాలే. సభాసమావేశాల ప్రారంభ ప్రసంగంలో ప్రభుత్వ విధానప్రకటనను సభ్యుల ముంగిట ప్రతిపాదించడం గవర్నర్‌ రాజ్యాంగ విధి. కానీ, 2023లోనూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రసంగ పాఠంలో ‘ద్రావిడ నమూనా పాలన’ సహా కొన్ని అంశాలను రవి ఉద్దేశపూర్వకంగానే వదిలేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయన్నదీ చదవలేదు. అదేమంటే, ప్రసంగపాఠంలో కొన్ని అంశాలు తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ తీవ్రమైన వ్యాఖ్యే చేశారు. పెరియార్‌ రామసామి, కామరాజ్, అణ్ణాదురై, కరుణానిధి, అంబేడ్కర్‌ లాంటి పేర్లను చదవడానికి నిరాకరించడం, ‘తమిళనాడు’ బదులు ‘తమిళగం’ అనాలనడం రవిపై గతంలోనే విమర్శల వేడి పెంచాయి. ఇలా రాజ్యాంగ పరిధిని పదేపదే ఉల్లంఘించి, వివాదాలకు కేంద్రమవడం సరికాదు. ఆ మాటకొస్తే ప్రజలెన్నుకున్న ప్రభుత్వంతో కేంద్ర పాలకులు కూర్చోబెట్టిన గవర్నర్లు తలపడడం, ప్రభుత్వ అధికారిక బిల్లుల్ని ఆమోదించకుండా తాత్సారం చేయడం, వైస్‌ ఛాన్సలర్ల నియామకానికి మోకాలడ్డడం, బాహాటంగా పాలనను విమర్శించడం... ఇవన్నీ పశ్చిమ బెంగాల్, పంజాబ్, కర్ణాటక సహా పలుచోట్ల కొద్దికాలంగా చూస్తున్నదే. రాజ్‌భవన్లు రాజకీయ కేంద్రాలవుతున్నాయన్న విమర్శకు ఇలాంటివే కారణం. ప్రాథమిక హక్కుల్లో భాగంగా వ్యక్తిగత హోదాలో ఎవరికి ఎలాంటి అభిప్రాయాలున్నా తప్పు లేదు. భావప్రకటన స్వేచ్ఛను తప్పుపట్టనూ లేము. కానీ, రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వ్యక్తుల నుంచి ఆశించేది వేరు. సదరు హోదా తాలూకు గౌరవానికి భిన్నమైన అభిప్రాయాల్ని వ్యక్తీకరించినా, ప్రజా ప్రభుత్వ పాలనకు రాజ్యాంగహోదాతో అభ్యంతరం చెప్పినా అది హర్షణీయం కాదు. ఒక విధంగా అది రాజ్యాంగ విధులకే ఉల్లంఘన. రాష్ట్ర మంత్రిమండలి సలహా సూచనల మేరకే గవర్నర్‌ వ్యవహరించాలంటూ 1974లోనే ఏడుగురు సభ్యుల సుప్రీమ్‌ కోర్ట్‌ ధర్మాసనం చెప్పిన మాట శిరోధార్యం కావాలి. కేంద్రంలో రాష్ట్రపతి లాగా, రాష్ట్రంలో ప్రభుత్వ ఆలోచనకు అద్దం పట్టాల్సిన గవర్నర్లు ఆ రాజ్యాంగ విధిని విస్మరించ లేరు. వన్నె తగ్గించే పనుల్ని మానుకుంటేనే ప్రజాస్వామ్య స్ఫూర్తి గెలుస్తుంది. రాజ్యాంగ రూపకర్తల సదాశయం నిలుస్తుంది.

Telangana High Court Decision on Lawyer With Ktr In Formula E Case9
ఏసీబీ విచారణకు వెళ్లండి: కేటీఆర్‌కు హైకోర్టు సూచన

సాక్షి,హైదరాబాద్‌: ఫార్ములా-ఈ కార్‌ కేసు(Formula-e race)లో ఏసీబీ విచారణకు న్యాయవాదిని అనుమతించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(Ktr) వేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌ పిటిషన్‌పై హైకోర్టు బుధవారం(జనవరి 8) మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం నాలుగు గంటలకు మరోసారి విచారించింది. కేటీఆర్‌తో పాటు న్యాయవాది ఏసీబీ విచారణకు రావొచ్చు అని హైకోర్టు తెలిపింది. అయితే ఈ విషయంలో కోర్టు కొన్ని షరతులు విధించింది.కేటీఆర్‌తో పాటు రాంచందర్‌ అనే న్యాయవాది ఏసీబీ విచారణకు వచ్చేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. అయితే విచారణ గదిలోకి న్యాయవాది వెళ్లకూడదని ఆదేశించింది. విచారణ గదిలో మాత్రం కేటీఆర్‌తో పాటు ఏసీబీ అధికారులు మాత్రమే ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. విచారణ గది పక్కనే లైబ్రరీ గదిలో న్యాయవాది కూర్చోవచ్చని ఏసీబీ హైకోర్టు తెలిపింది. గురువారం(జనవరి 9) ఏసీబీ విచారణకు వెళ్లాలని కోర్టు కేటీఆర్‌కు సూచించింది. స్టేట్‌మెంట్‌ రికార్డులో ఏమైనా అనుమానాలుంటే తమను సంప్రదించవచ్చని కోర్టు తెలిపింది. విచారణను ఆడియో వీడియో రికార్డింగ్‌ చేయడానికి హైకోర్టు నో చెప్పింది. ఇప్పటికే ఒకసారి కేటీఆర్‌ తన లాయర్‌తో పాటు ఏసీబీ విచారణకు వెళితే ఏసీబీ అనుమతించని విషయం తెలిసిందే. దీంతో గురువారం(జనవరి 9) ఏసీబీ ఆఫీసులో జరగనున్న విచారణ కీలకంగా మారింది. ఫార్ములా ఈ కార్‌ రేసులో తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు ఇప్పటికే కొట్టేసిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు

Allu Arjun Pushpa 2 The Rule Re loading Version latest Update10
బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. సంక్రాంతికి మిస్ 'ఫైర్' !

నెల రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్- అల్లు అర్జున్‌ కాంబోలో వచ్చిన ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటికే బాహుబలి, కేజీఎఫ్, బాహుబలి-2 రికార్డులను తిరగరాసింది. ప్రస్తుతం రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.ఈ నేపథ్యంలోనే అమిర్ ఖాన్‌ చిత్రం దంగల్ వసూళ్ల రికార్డ్‌పై పుష్పరాజ్ కన్నుపడింది. రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో తొలిస్థానంలో దంగల్ కొనసాగుతోంది. ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టేందుకు పుష్ప మేకర్స్ సరికొత్త ప్లాన్‌తో ఆడియన్స్‌ ముందుకొచ్చారు. ఈనెల 11 నుంచి దాదాపు 20 నిమిషాల పాటు అదనంగా సీన్స్ జోడించనున్నట్లు ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.అయితే తాజాగా ఈ విషయంలో బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌ చెప్పారు మేకర్స్. పుష్ప-2 ది రూల్ రీ లోడింగ్ వర్షన్‌ తేదీని మార్చారు. ముందుగా ప్రకటించిన డేట్ కాకుండా జనవరి 17న తీసుకు రానున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ నెల 11న పుష్ప-2 ఎక్స్‌ట్రా ఫైర్ చూడాలనుకున్న ఐకాన్ స్టార్‌ ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. అందుకోసమేనా?..అయితే పుష్ప-2 రీ లోడింగ్‌ తేదీని మార్చడంపై నెట్టింట చర్చ మొదలైంది. ఈనెల 10న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద పోటీపడుతోంది. బాలయ్య డాకు మహారాజ్‌, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో గేమ్ ఛేంజర్ కూడా బరిలో నిలిచింది. ఈ నేపథ్యంలో పుష్ప-2 రీ లోడింగ్ వర్షన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించి సంక్రాంతి సినిమాలకు షాకిచ్చారు మైత్రి మూవీ మేకర్స్.దీంతో పొంగల్‌కు రిలీజ్ అవుతోన్న సినిమాలకు పుష్ప-2 వల్ల పెద్ద డ్యామేజ్‌ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రూ.1831 కోట్లకు పైగా వసూళ్లతో బాహుబలి-2ను వెనక్కి నెట్టిన పుష్పరాజ్‌.. సంక్రాంతి చిత్రాలతో పోటీ పడితే వాటి పరిస్థితి ఏంటన్నది గమనార్హం. అందువల్లే మైత్రి మూవీ మేకర్స్ తమ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి సినిమాలకు పోటీ ఉండకూడదనే రీ లోడింగ్ వర్షన్‌ తేదీని జనవరి 17 వరకు పొడిగించారు. దీంతో ఈ ఏడాది పొంగల్ బరిలో నిలిచిన నిర్మాతలకు ఊరట లభించింది. ఏదేమైనా మరో 20 నిమిషాల పాటు సీన్స్ యాడ్‌ చేయడం రూ.2 వేల కోట్ల వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.ఇండియన్‌ బాక్సాఫీస్‌పై పుష్పరాజ్‌ రూల్‌ ..అల్లు అర్జున్‌ పుష్ప-2 ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. కేృవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికే 'బాహుబలి-2' వసూళ్లను పుష్ప-2 అధిగమించింది. దీంతో జనవరి 11 నుంచి పుష్ప-2 రీ లోడెడ్‌ వెర్షన్‌ వస్తుందని చెప్పడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లోనూ రికార్డ్..పుష్ప-2 విడుదలకు ముందే ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టించింది. పుష్పరాజ్ కలెక్షన్స్ చూసి ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు. తొలి రోజు నుంచే ఇండియాలో ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టించింది. కేవలం 32 రోజుల్లో రూ.1831 కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్‌టైమ్‌ రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటించంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ అద్భుతమైన సంగీతమందించారు. #Pushpa2Reloaded in cinemas from January 17th. 🔥#Pushpa2 #Pushpa2TheRule#WildFirePushpa https://t.co/zBHbNJpZKD pic.twitter.com/ItZRonNWJt— Pushpa (@PushpaMovie) January 8, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!

అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్‌ దిగ్గజం యాపిల్‌ 185 మంది ఉద్యోగులను త

title
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి

title
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)

title
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్‌..!అచ్చం భారత్‌లో..

ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్‌ బిజినెస్‌లు.

title
అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసా?

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసు ఎలా పెడ

Advertisement

వీడియోలు

Advertisement