Pakistan Super League
-
పాక్ యువ పేసర్ సంచలన నిర్ణయం
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ సెన్సేషన్ ఇహసానుల్లా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 22 ఏళ్లకే పాకిస్తాన్ క్రికెట్ లీగ్‌కు (PSL) గుడ్‌బై చెప్పాడు. నిన్న జరిగిన పీఎస్ఎల్-10 డ్రాఫ్ట్‌లో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఫ్రాంచైజీలు పట్టించుకోకపోవడంతో చిర్రెత్తిపోయిన ఇహసానుల్లా ఇకపై పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడనని శపథం చేశాడు. వాస్తవానికి ఇహసానుల్లా తరుచూ గాయాల బారిన పడుతుండటంతో అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దేశవాలీ క్రికెట్లో రాణిస్తున్నా ఇహసానుల్లాపై ఫ్రాంచైజీలు ఆనాసక్తిని ప్రదర్శించాయి. ఇహసానుల్లా గంటకు 150 కిమీకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తాడు. ఇహసానుల్లాకు పేస్ కింగ్‌గా పేరుంది. పీఎస్ఎల్ డ్రాఫ్ట్ అనంతరం ఇహసానుల్లా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. తాను కోపంలో ఈ నిర్ణయం తీసుకోలేదని చెబుతూనే పీఎస్ఎల్ ఫ్రాంచైజీలపై అసహనం వ్యక్తిం చేశాడు. నెలన్నర రోజుల్లో పీఎస్ఎల్ ఫ్రాంచైజీలకు తానేంటో తెలిసొచ్చేలా చేస్తానని అన్నాడు. దేశవాలీ క్రికెట్ ఆడి సత్తా చాటుతానని తెలిపాడు. పీఎస్ఎల్లో కాకుండా దేశవాలీ క్రికెట్లో బాగా పెర్ఫార్మ్ చేసి పాకిస్తాన్ జట్టుకు ఎంపికవుతానని అన్నాడు.కాగా, నిన్న జరిగిన పీఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో అన్ని ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్లను ఎంపిక చేసుకుని తమ జట్లను పటిష్టం చేసుకున్నాయి. డ్రాఫ్ట్‌లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, రస్సీ వాన్ డర్ డస్సెన్ లాంటి అంతర్జాతీయ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. పీఎస్ఎల్ 2025లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ ఒకే ఫ్రాంచైజీకి ఆడనున్నారు. వీరిద్దరిని కరాచీ కింగ్స్ కొనుగోలు చేసింది. వార్నర్, కేన్ ద్వయం గతంలో ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడింది.పాకిస్తాన్ సూపర్ లీగ్ డ్రాఫ్ట్‌లో ఆయా ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్న విదేశీ ఆటగాళ్లు..కరాచీ కింగ్స్- డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, జేమ్స్ విన్స్, టిమ్ సీఫర్ట్, ఆడమ్ మిల్నే, మొహమ్మద్ నబీ, లిటన్ దాస్లాహోర్ ఖలందర్స్- కుసాల్ పెరీరా, డారిల్ మిచెల్, సికందర రజా, సామ్ కర్రన్, రిషద్ హొసేన్, డేవిడ్ వీస్, సామ్ బిల్లింగ్స్ముల్తాన్ సుల్తాన్స్- మైఖేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లే, గుడకేశ్ మోటీ, జాన్సన్ ఛార్లెస్, షాయ్ హోప్, జాషువ లిటిల్, క్రిస్ జోర్డన్ఇస్లామాబాద్ యునైటెడ్- మాథ్యూ షార్ట్, ఆండ్రియస్ గౌస్, బెన్ డ్వార్షుయిష్, రిలే మెరిడిత్, జేసన్ హోల్డర్, రస్సీ వాన్ డర్ డస్సెన్, కొలిన్ మున్రోక్వాట్టా గ్లాడియేటర్స్- ఫిన్ అలెన్, కైల్ జేమీసన్, అకీల్ హొసేన్, రిలీ రొస్సో, మార్క్ చాప్మన్, సీన్ అబాట్, కుసాల్ మెండిస్పెషావర్ జల్మీ- బ్రైయాంట్, కొర్బిన్ బాష్, అల్జరీ జోసఫ్, ఇబ్రహీం జద్రాన్, నహిద్ రాణా, టామ్ కొహ్లెర్ కాడ్మోర్ -
కేన్ విలియమ్సన్కు అవమానం
దిగ్గజ బ్యాటర్, న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్కు అవమానం జరిగింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) డ్రాఫ్ట్‌లో కేన్ మామను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ప్లాటినమ్ డ్రాఫ్ట్‌లో కేన్ మరో 43 మంది స్టార్ ఆటగాళ్లతో కలిసి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఐపీఎల్ 2025 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన కేన్‌ను పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కూడా ఎవరూ పట్టించుకోలేదు. కేన్ బరిలో నిలిచిన ప్లాటినమ్ డ్రాఫ్ట్ నుంచి 10 మంది ఆటగాళ్లను ఎంపిక చేసున్నాయి ఫ్రాంచైజీలు.అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. వార్నర్ రిటైర్మెంట్ తర్వాత కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో వార్నర్ అదరగొడుతున్నాడు. ఈ లీగ్‌లో వార్నర్ ఏడు ఇన్నింగ్స్‌ల్లో 63.20 సగటున 142.34 స్ట్రయిక్‌రేట్‌తో 316 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుత ఫామ్ కారణంగానే పీఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో వార్నర్‌కు మాంచి గిరాకీ ఉండింది.విలియమ్సన్ విషయానికొస్తే.. ఈ కివీస్ లెజెండ్ ఇటీవలి కాలంలో పెద్దగా టీ20లు ఆడింది లేదు. 2023లో ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా ఆడని కేన్.. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్ (2024) కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్, పీఎస్ఎల్లో కేన్ ఎంపిక కాకపోవడానికి అతని ఫిట్నెస్ కూడా ఓ కారణమే. ఇటీవలి కాలంలో కేన్ తరుచూ గాయాల బారిన పడుతున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్ ఉండి కూడా కేన్ పొట్టి ఫార్మాట్లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతున్నాడు. బ్యాటింగ్‌లో వేగం లేకపోవడం, భారీ షాట్లు ఆడలేకపోవడం కేన్‌కు ప్రధాన సమస్యలు.కేన్ ప్రైవేట్ లీగ్‌ల్లో పెద్దగా రాణించలేకపోయినా అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం పర్వాలేదనిపించాడు. కేన్ తన దేశం తరఫున 93 టీ20లు ఆడి 33.44 సగటున 2575 పరుగులు చేశాడు. కేన్‌ను ప్రైవేట్ లీగ్‌ల్లో ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకోకపోవడానికి అతని వయసు మరో ప్రధాన కారణం. ప్రస్తుతం కేన్ మామ వయసు 34 ఏళ్లు.కేన్ ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో కేన్ డర్బన్ జెయింట్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే కేన్ అదరగొట్టాడు. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేన్ 40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.పీఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో ఆయా ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్న పలువురు స్టార్ ఆటగాళ్లు..డేవిడ్ వార్నర్ (కరాచీ కింగ్స్)డారిల్ మిచెల్ (లాహోర్ ఖలందర్స్)మార్క్ చాప్మన్ (క్వెట్టా గ్లాడియేటర్స్)మైఖేల్ బ్రేస్‌వెల్ (ముల్తాన్ సుల్తాన్స్)ఆడమ్ మిల్నే (కరాచీ కింగ్స్)ఫిన్ అలెన్ (క్వెట్టా గ్లాడియేటర్స్)జేసన్ హోల్డర్ (ఇస్లామాబాద్ యునైటెడ్)ఆమెర్ జమాల్ (కరాచీ కింగ్స్) -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 సీజన్‌కు ఎండ్ కార్డ్ పడింది. ఈ ఏడాది పీఎస్ఎల్ ఛాంపియన్స్‌గా ఇస్లామాబాద్ యునైటడ్ నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో ముల్తాన్ సూల్తాన్స్ను 2 వికెట్ల తేడాతో ఓడించిన ఇస్లామాబాద్.. మూడో సారి ఛాంపియన్స్‌గా అవతరించింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది సీజన్లో పెషెవర్ జెల్మీ టైటిల్ సాధించకపోయినప్పటికి ఆ జట్టు కెప్టెన్, పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజం మాత్రం అరుదైన ఘనతను సాధించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో మూడు సార్లు హనీఫ్ మొహమ్మద్ క్యాప్ సొంతం చేసుకున్న మొదటి క్రికెటర్‌గా బాబర్ రికార్డులకెక్కాడు. పీఎస్ఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి హనీఫ్ మొహమ్మద్ క్యాప్(గ్రీన్ క్యాప్)ను అందిస్తారు. ఇప్పుడు వరకు మూడు పీఎస్ఎల్ సీజన్లలో లీడింగ్ రన్ స్కోరర్‌గా బాబర్ నిలిచాడు. 2020 సీజన్లో 473 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన బాబర్.. ఆ తర్వాత 2021 సీజన్లోనూ 554 పరుగులతో గ్రీన్ క్యాప్‌ను తన వద్దే ఉంచుకున్నాడు. ఇప్పుడు పీఎస్ఎల్-2024లోనూ 569 పరుగులతో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. 11 మ్యాచ్‌ల్లో 569 పరుగులు చేశాడు. అందులో 5 ఫిప్టీలతో పాటు ఓ సెంచరీ కూడా ఉంది. -
ఛీ.. ఇదేం పని.. మ్యాచ్ మధ్యలోనే పాక్ క్రికెటర్ ఇలా! వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 విజేతగా ఇస్లామాబాద్ యునైటడ్ నిలిచింది. ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్‌ను ఓడించిన ఇస్లామాబాద్ యునైటెడ్.. మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంలో ఇస్లామాబాద్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం కీలక పాత్ర పోషించాడు. తొలుత బౌలింగ్‌లో 5 వికెట్లు పడగొట్టిన వసీం.. అనంతరం బ్యాటింగ్‌లోనూ కీలకమైన 19 పరుగులు చేశాడు. దీంతో అతడికి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే తన ప్రదర్శనతో అందరిని అకట్టుకున్న ఇమాద్ వసీం.. ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నాడు. మ్యాచ్ జరుగుతుండగా డ్రెసింగ్ రూంలో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. తమ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వసీం సిగరెట్ వెలగించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు 'పీఎసీఎల్ అంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ కాదు.. పాకిస్తాన్ స్మోకింగ్ లీగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్!? PAKISTAN "SMOKING" LEAGUE 🚬🔥🔥#HBLPSL9 #HBLPSLFinal pic.twitter.com/pwpaj4bLh8 — Farid Khan (@_FaridKhan) March 18, 2024 -
ఆఖరి బంతికి సంచలనం.. పీఎస్ఎల్ ఛాంపియన్స్‌గా ఇస్లామాబాద్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 విజేతగా ఇస్లామాబాద్ యునైటెడ్ నిలిచింది. కరాచీ వేదికగా జరిగిన ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్‌ను 2 వికెట్లతో ఓడించిన ఇస్లామాబాద్.. ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోరులో హునైన్ షా ఫోర్ కొట్టి ఇస్లామాబాద్‌ను గెలిపించాడు. ఆఖరి ఓవర్లో ఇస్లామాబాద్ విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసే బాధ్యతను ముల్తాన్ కెప్టెన్ రిజ్వాన్ పేసర్ మహ్మద్ అలీకి అప్పగించాడు. ఈ క్రమంలో తొలి బంతిని ఇమాద్ వసీం సింగిల్ తీసి నసీం షాకు స్ట్రైక్ ఇచ్చాడు. నసీం షా రెండో బంతిని ఫోర్‌గా మలిచాడు. దీంతో యూనైటడ్ విజయ సమీకరణం నాలుగు బంతుల్లో 3 పరుగులగా మారింది. మూడో బంతి నసీం సింగ్ తీసి వసీంకు మళ్లీ స్ట్రైక్ ఇచ్చాడు. దీంతో ఆఖరి మూడు బంతుల్లో రెండు పరుగులు అవసరమయ్యాయి. ఇక నాలుగో బంతికి ఇమాద్ వసీం సింగిల్ తీసి స్కోర్లను సమం చేశాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆఖరి రెండు బంతుల్లో ఒక్కపరుగు కావల్సిన సమయంలో నషీం ఔటయ్యాడు. ఐదో బంతికి రిజ్వాన్ క్యాచ్‌కు ఔటయ్యాడు. దీంతో ఇస్లామాబాద్ డగౌట్లో టెన్షన్ వాతవారణం నెలకొంది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హునైన్ షా ఆఖరి బంతికి ఫోరు బాది తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ముల్తాన్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్(57) హాఫ్ సెంచరీతో చెలరేగగా, ఆఖరిలో ఇఫ్తికర్ ఆహ్మద్(20 బంతుల్లో 32, 3 సిక్స్‌లు, 3 ఫోర్లు) మెరుపులు మెరిపించాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో స్పిన్నర్ ఇమాద్ వసీం 5 వికెట్లతో చెలరేగాడు. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఇస్లామాబాద్ ఛేదించాడు. ఇస్లామాబాద్ బ్యాటర్లలో ఓపెనర్ మార్టిన్ గప్టిల్(50) హాఫ్ సెంచరీతో రాణించాడు. కాగా ఐదు వికెట్లతో ఇస్లామాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇమాద్ వసీం 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. అలాగే 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డ్ షదాబ్ ఖాన్‌కు దక్కింది. Shadab Khan won at this life! 😭♥️#HBLPSLFinal I #PSL2024 I #PSLFinal pic.twitter.com/gd53bAzPpy — Rizwan Babar Army (@RizwanBabarArmy) March 18, 2024 -
సూపర్ మ్యాన్‌లా.. గాల్లోకి ఎగురుతూ? బాబర్‌కు ఫ్యూజ్‌లు ఔట్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 లీగ్ ఫైనల్లో ఇస్లామాబాద్ యునైటెడ్ అడుగుపెట్టింది. శనివారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో పెషావర్ జల్మీపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇస్లామాబాద్ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్బుతమైన క్యాచ్‌తో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజంను పెవిలియన్‌కు పంపాడు. పెషావర్ ఇన్నింగ్స్ 8 ఓవర్ వేసిన నసీమ్ షా 4వ బంతిని బాబర్‌కు ఫుల్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. బాబర్ కొంచెం రూమ్ తీసుకుని మిడ్ ఆఫ్ మీదగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో మిడ్ ఆఫ్‌లో ఉన్న షాదాబ్ ఖాన్.. ఒక్కసారిగా గాల్లోకి ఎగురుతూ బంతిని అందుకున్నాడు. ఇది చూసిన బాబర్ షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. A bird, a plane? No, it's SUPERMAN SHADAB KHAN 😱#HBLPSL9 | #KhulKeKhel | #PZvIU pic.twitter.com/PZFbd2ZNHV — PakistanSuperLeague (@thePSLt20) March 16, 2024 -
నిరాశపరిచిన బాబర్.. ఫైనల్‌కు చేరిన షాదాబ్ ఖాన్ జట్టు
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో పెషావర్ జల్మీ కథ ముగిసింది. ఈ లీగ్‌లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 5 వికెట్ల తేడాతో పెషావర్ ఓటమి పాలైంది. దీంతో ఈ లీగ్ నుంచి బాబర్ ఆజం సారథ్యంలోని పెషావర్ ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జల్మీ బ్యాటర్లలో సైమ్ అయూబ్(44 బంతుల్లో 73,6 ఫోర్లు, 4 సిక్స్‌లు) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు మహ్మద్ హ్యారిస్(40) పరుగులతో రాణించాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో నసీం షా 3 వికెట్లు పడగొట్టగా.. మెకాయ్, షాదాబ్ ఖాన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇస్లామాబాద్ బ్యాటర్లలో మిడిలార్డర్ బ్యాటర్లు ఇమాద్ వసీం(59 నాటౌట్), హైదర్ అలీ(52 నాటౌట్) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పెషావర్ బౌలర్లలో అయూబ్ రెండు వికెట్లు పడగొట్టగా.. వుడ్, ముమ్టాజ్, కుర్రామ్ తలా వికెట్ సాధించారు. ఇక మార్చి 18న కరాచీ వేదికగా జరగనున్న ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్‌తో ఇస్లామాబాద్ యూనైటడ్ తలపడనుంది. -
మరోసారి చెలరేగిన బాబర్ ఆజమ్.. వరుసగా మూడో హాఫ్ సెంచరీ
పాకిస్తాన్ సూపర్ లీగ్ చివరి దశకు చేరింది. లీగ్ దశలో మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ప్లే ఆఫ్స్ బెర్తులు ఇదివరకే ఖరారయ్యాయి. పెషావర్ జల్మీ, ముల్తాన్ సుల్తాన్స్, ఇస్లామాబాద్ యునైటెడ్, క్వెట్టా గ్లాడియేటర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు చేసుకోగా.. కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్ లీగ్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. నిన్న జరిగిన నామమాత్రపు లీగ్ మ్యాచ్‌లో పెషావర్ జల్మీ.. కరాచీ కింగ్స్‌ను 2 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (51) మరోసారి చెలరేగడంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. బాబర్‌కు ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. పెషావర్ ఇన్నింగ్స్‌లో రోవ్‌మన్ పావెల్ (30) ఓ మోస్తరుగా రాణించాడు. కరాచీ బౌలర్లు డేనియల్ సామ్స్, జహీద్ మహమూద్, ఆరాఫత్, హసన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన కరాచీ.. పెషావర్ బౌలర్ల దెబ్బకు చేతులెత్తేసింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నవీన్ ఉల్ హాక్ తన కోటా 4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో పాటు 2 వికెట్లు పడగొట్టగా.. వుడ్, ఆమెర్ జమాల్, సైమ్ అయూబ్ పొదుపుగా బౌలింగ్ చేసి తలో వికెట్ పడగొట్టారు. టిమ్ సీఫర్ట్ (41), ఇర్ఫాన్ ఖాన్ (39 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించినా కరాచీని గెలిపించలేకపోయారు. -
వికెట్లను కాలితో తన్నాడు.. ఫలితం అనుభవించాడు?
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 ప్లే ఆఫ్స్‌కు ఇస్లామాబాద్ యునైటెడ్ ఆర్హత సాధించింది. ఆదివారం ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇస్లామాబాద్.. తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఇస్లామామాబాద్ విజయంలో మున్రో(84), ఇమాద్ వసీం(30) కీలక పాత్ర పోషించారు. నసీం షాకు బిగ్ షాక్.. ఇస్లామామాబాద్ స్టార్ పేసర్ నసీం షాకు ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో పీఎస్ఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు నసీంకు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించాడు. షా లెవెల్1 అత్రికమణకు పాల్పడ్డాడని, ఈ విషయంలో మ్యాచ్ రెఫరీదే తుది నిర్ణయమని పీఎస్ఎల్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఏం చేశాండంటే? ముల్తాన్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ షాదాబ్ ఖాన్‌ను నసీం షా అప్పగించాడు. కెప్టెన్ నమ్మకాన్ని షా వమ్ము చేయలేదు. అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే ఇక్కడ వరకు అంతబాగానే ఉన్నప్పటికి ఓవర్ పూర్తి అయిన వెంటనే నసీం తన కాలితో స్టంప్స్‌ను తన్నాడు. ఈ విషయాపై అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామా అతడిపై ఈ చర్యలు తీసుకున్నాడు. చదవండి: ధోని, యువీ కాదు..! టీమిండియాలో గ్రేటెస్ట్ సిక్స్ హిట్టర్ అతడే: ద్రవిడ్ -
కొలిన్ మున్రో విధ్వంసం.. ఉస్మాన్ ఖాన్ మెరుపు శతకం వృధా
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో మరో హై స్కోరింగ్ మ్యాచ్ జరిగింది. ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య ఇవాళ (మార్చి 10) జరిగిన మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 460 పరుగులు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్ 228 పరుగులు చేయగా.. ఛేదనలో ఇస్లామాబాద్ చివరి బంతికి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ చేసిన స్కోర్ సీజన్ మొత్తానికే అత్యధిక స్కోర్‌గా రికార్డైంది. పీఎస్ఎల్ చరిత్రలో ఇస్లామాబాద్‌కు ఇదే అత్యుత్తమ ఛేదన. ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇస్లామాబాద్.. ప్లే ఆఫ్స్ బెర్త్‌ను సైతం ఖరారు చేసుకుంది. ఈ సీజన్లో ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ ఇదివరకే నాకౌట్ దశకు క్వాలిఫై కాగా.. లాహోర్ ఖలందర్స్ లీగ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఉస్మాన్ ఖాన్ ఊచకోత.. ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ ఆటగాడు ఉస్మాన్ కేవలం 50 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 15 బౌండరీలు, 3 సిక్సర్లు బాదాడు. ఉస్మాన్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ. మార్చి 3న కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉస్మాన్ 59 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఉస్మాన్ సెంచరీలు చేసిన ఈ రెండు సందర్భాల్లో నాటౌట్‌గా మిగిలాడు. ఉస్మాన్‌తో పాటు జాన్సన్ చార్లెస్ (18 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), యాసిర్ ఖాన్ (16 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. మున్రో విధ్వంసం.. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇస్లామాబాద్.. కొలిన్ మున్రో (40 బంతుల్లో 84; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), షాదాబ్ ఖాన్ (31 బంతుల్లో 54; 6 ఫోర్, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో చివరి బంతికి విజయం సాధించింది. ఇమాద్ వసీం (13 బంతుల్లో 30) చివరి రెండు బంతులకు సిక్సర్, బౌండరీ బాది ఇస్లామాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. -
ఉస్మాన్ ఖాన్ ఊచకోత.. 50 బంతుల్లోనే శతకం.. వరుసగా రెండవది
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో మరో భారీ స్కోర్ నమోదైంది. ఇస్లామాబాద్ యునైటెడ్‌తో ఇవాళ (మార్చి 10) జరుగుతున్న మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక స్కోర్. ముల్తాన్ సుల్తాన్స్ భారీ స్కోర్ చేయడంలో ఉస్మాన్ ఖాన్ ప్రధానపాత్ర పోషించాడు. వన్‌డౌన్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన ఉస్మాన్ కేవలం 50 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ 15 బౌండరీలు, 3 సిక్సర్లు బాదాడు. ఉస్మాన్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ. మార్చి 3న కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉస్మాన్ 59 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఉస్మాన్ సెంచరీలు చేసిన ఈ రెండు సందర్భాల్లో నాటౌట్‌గా మిగిలాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఉస్మాన్‌తో పాటు జాన్సన్ చార్లెస్ (18 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), యాసిర్ ఖాన్ (16 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (17 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్), ఇఫ్తికార్ అహ్మద్ (12 బంతుల్లో 13; 2 ఫోర్లు), క్రిస్ జోర్డన్ (7 బంతుల్లో 15 నాటౌట్; ఫోర్, సిక్స్) రాణించారు. ఇస్లామాబాద్ బౌలర్లలో ఫహీమ్ అష్రాఫ్ 2 వికెట్లు పడగొట్టగా.. నసీం షా, హునైన్ షా తలో వికెట్ దక్కించుకున్నారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇస్లామాబాద్.. తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డేవిడ్ విల్లే భారీ హిట్టర్ అలెక్స్ హేల్స్‌ను డకౌట్ చేయగా.. అఘా సల్మాన్‌ను మొహమ్మద్ అలీ (2) పెవిలియన్‌కు పంపాడు. 4 ఓవర్ల తర్వాత ఇస్లామాబాద్ స్కోర్ 38/2గా ఉంది. షాదాబ్ ఖాన్ (8 బంతుల్లో 13; 2 ఫోర్లు), కొలిన్ మున్రో (10 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. -
పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఆసీస్ దిగ్గజం..?
పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఆసీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ఎంపిక కానున్నాడని తెలుస్తుంది. ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాట్సన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వాట్సన్ సమాధానం కోసం పీసీబీ ఎదురు చూస్తున్నట్లు నివేదికలు ద్వారా తెలుస్తుంది. వాట్సన్ త్వరలోనే పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వి కలుస్తాడని సమాచారం. ప్రస్తుతం వాట్సన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ అయిన క్వెట్టా గ్లాడియేటర్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. పీసీబీ ప్రతిపాదనకు వాట్సన్ నో చెప్పినా వారి వద్ద ప్రత్యామ్నాయ ఆప్షన్ ఉన్నట్లు సమాచారం. పీసీబీ అధికారుల దృష్టిలో విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో సామి పీఎస్ఎల్ ఫ్రాంచైజీ పెషావర్ జల్మీకి కెప్టెన్‌గా వ్యవహరించి ఉండటంతో అతనికి పాక్‌లో భారీ క్రేజ్ ఉంది. పాక్ హెచ్ కోచ్ పదవికి వాట్సన్ నో చెబితే పీసీబీ సామినే కోచ్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. కాగా, పాకిస్తాన్ టీమ్ డైరెక్టర్‌గా మొహమ్మద్ హఫీజ్ తొలగించబడినప్పటి నుంచి పాక్ జట్టు కోచ్ లేకుండానే ఉంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన అనంతరం పీసీబీ నాటి విదేశీ కోచింగ్ సిబ్బంది మొత్తాన్ని తొలగించింది. ప్రస్తుతం పాకిస్తాన్లో పీఎస్ఎల్ సీజన్ నడుస్తుంది. ఈ లీగ్ చివరి దశకు చేరింది. లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ నాకౌట్ దశకు క్వాలిఫై అయ్యాయి. లాహోర్ ఖలందర్స్ లీగ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. -
బాబర్ ఆజమ్ పరుగుల ప్రవాహం కొనసాగింపు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో పెషావర్ జల్మీ సారధి బాబర్ ఆజమ్ పరుగుల ప్రవాహం కొనసాగుతుంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటికే లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్న బాబర్.. తాజాగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో హాఫ్ సెంచరీ చేసి తన పరుగుల సంఖ్యను మరింత పెంచుకున్నాడు. క్వెట్టతో జరుగుతున్న మ్యాచ్‌లో 30 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 53 పరుగులు చేసిన బాబర్.. ప్రస్తుత ఎడిషన్‌లో తన పరుగుల సంఖ్యను 447కి పెంచుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన బాబర్.. సెంచరీ, 4 అర్దసెంచరీలు చేశాడు. క్వెట్టాతో మ్యాచ్‌లో బాబర్ రాణించడంతో పెషావర్ జల్మీ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. 15 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 156 పరుగులుగా ఉంది. జల్మీ ఇన్నింగ్స్‌లో బాబర్‌తో పాటు సైమ్ అయూబ్ (12 బంతుల్లో 30), మొహమ్మద్ హరీస్ (13 బంతుల్లో 20), కోహ్లెర్ కాడ్మోర్ (19 బంతుల్లో 33) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. రోవ్‌మన్ పావెల్ (6), ఆమెర్ జమాల్ (5) క్రీజ్‌లో కొనసాగుతున్నారు. -
నిప్పులు చెరిగిన హసన్ అలీ.. టిమ్ సీఫర్ట్ మెరుపులు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో ఇవాళ (మార్చి 6) జరిగిన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్.. హసన్ అలీ (4-0-15-4), బ్లెస్సింగ్ ముజరబానీ (4-0-27-2), జహీద్ మెహమూద్ (4-0-25-2), మీర్ హమ్జా (3.1-0-25-1) ధాటికి 19.1 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. .@RealHa55an is a vibe 😄pic.twitter.com/oq7KK1mc5M — CricTracker (@Cricketracker) March 6, 2024 గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ (33) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జేసన్ రాయ్ (15), ఖ్వాజా నఫే (17), రిలీ రొస్సో (10), అకీల్ హొసేన్ (14) రెండంకెల స్కోర్లు చేశారు. బిగ్ హిట్టర్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (9), సర్ఫరాజ్ ఖాన్ (7), ఆమిర్ (2), హస్నైన్ (5), ఉస్మాన్ తారిక్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కరాచీ కింగ్స్.. 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. టిమ్ సీఫర్ట్ (31 బంతుల్లో 49; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. షోయబ్ మాలిక్ (27 నాటౌట్) కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. మధ్యలో జేమ్స్ విన్స్ (27) పర్వాలేదనిపించగా.. కెప్టెన్ షాన్ మసూద్ (7) తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. గ్లాడియేటర్స్ బౌలర్లలో అకీల్ హొసేన్, మొహమ్మద్ ఆమిర్, అబ్రార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. -
సత్తా చాటిన బాబర్.. మరోసారి బ్యాట్ ఝులిపించిన ఆమెర్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో పెషావర్ జల్మీ మరోసారి భారీ స్కోర్ సాధించింది. ముల్తాన్ సుల్తాన్స్‌తో ఇవాళ (మార్చి 5) జరుగుతున్న మ్యాచ్‌లో పెషావర్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్‌కు ఓపెనర్లు సైమ్ అయూబ్ (22 బంతుల్లో 46;3 ఫోర్లు, 5 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (40 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరికి వికెట్‌కీపర్ హసీబుల్లా ఖాన్ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్), రోవ్‌మన్ పావెల్ (15 బంతుల్లో 23 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), ఆసిఫ్ అలీ (10 బంతుల్లో 11; 2 ఫోర్లు) తోడయ్యారు. ఆఖర్లో ఆమెర్ జమాల్ (5 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) గత మ్యాచ్ తరహాలో (జమాల్ నిన్న ఇస్తామాబాద్తో జరిగిన మ్యాచ్‌లో పూనకం వచ్చినట్లు ఊగిపోయి 49 బంతుల్లో 8 ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేశాడు) రెచ్చిపోయాడు. సుల్తాన్స్ బౌలర్లలో ఉసామా మిర్, క్రిస్ జోర్డన్లు పెషావర్ బ్యాటర్లకు అడ్డుకట్ట వేయగలిగారు. ఉసామా 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. జోర్డన్ 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. వీరిద్దరు మినహా మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మొహ్మద్ అలీ 3 ఓవర్లలో 46, డేవిడ్ విల్లే 4 ఓవర్లలో 36, ఇఫ్తికార్ ఓవర్లో 12, ఖుష్దిల్ షా ఓవర్లో 13, అఫ్తాబ్ 3 ఓవర్లలో 30 పరుగులు సమర్పించుకున్నారు. -
సూపర్ క్యాచ్ పట్టిన బాల్ బాయ్.. హగ్ చేసుకున్న స్టార్ బ్యాటర్! వీడియో
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో భాగంగా సోమవారం రావల్పిండి వేదికగా పెషావర్ జెల్మీ, ఇస్లామాబాద్ యునైటెడ్ జట్లు తలపడ్డాయి. ఈ హైలోల్టేజ్ పోరులో పెషావర్‌ను 29 పరుగుల తేడాతో ఇస్లామాబాద్ చిత్తు చేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ ఆటగాడు, కివీస్ స్టార్ కోలిన్ మున్రో ఓ బాల్ బాయ్‌ను ఎత్తుకున్నాడు. ఏం జరిగిందంటే? పెషావర్ ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లో అమీర్ జమాల్ భారీ సిక్స్ బాదాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ అవతల ఉన్న ఓ బాల్ బాయ్ బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఇది గమనించిన మున్రో అతడి దగ్గరకు వెళ్లి బంతిని ఎలా పట్టుకోవాలో కొన్ని సూచనలు ఇచ్చాడు. ఆ తర్వాత అదే ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లో పెషావర్ బ్యాటర్ ఆరిఫ్ యూకుడ్ అదే పొజిషన్లో సిక్సర్ బాదాడు. ఈ సారి మాత్రం బాల్‌బాయ్ ఎటువంటి తప్పిదం చేయలేదు. అద్భుతంగా క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన మున్రో వెంటనే అతడి దగ్గరకు వెళ్లి హగ్ చేసుకుని అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2024: ధోని సంచలన నిర్ణయం.. సీఎస్కే కెప్టెన్‌గా రుత్‌రాజ్ గైక్వాడ్!? From drop to dazzling catch! 😲 Ball boy redeems himself in #IUvPZ match and gets a warm hug from Colin Munro. #HBLPSL9 | #KhulKeKhel pic.twitter.com/ncTKJ0xPfr — PakistanSuperLeague (@thePSLt20) March 4, 2024 -
ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి విధ్వంసం.. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో! వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో పెషావర్ జల్మీ మరో ఓటమి చవిచూసింది. రావల్పిండి వేదికగా ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో పెషావర్ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో పెషావర్ ఓటమి పాలైనప్పటికి.. ఆ జట్టు యువ ఆల్‌రౌండర్ అమీర్ జమాల్ తన విరోచిత పోరాటంతో అందరని అకట్టుకున్నాడు. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పెషావర్ కేవలం 18 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అమీర్ జమీల్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. మరో ఎండ్‌లో ఉన్న వాల్టర్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. బౌండరీలు వర్షం కురిపించాడు. జమాల్ ఇన్నింగ్స్ చూసి పెషావర్ మరో విజయం తమ ఖాతాలో వేసుకుంటుందని అంతా భావించారు. కానీ ఆఖరిలో జమాల్ ఔట్ కావడంతో పెషావర్ ఓటమి చవిచూసింది. ఓవరాల్‌గా 49 బంతులు ఎదుర్కొన్న జమాల్ 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 87 పరుగులు చేశాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి సంచలన ఇన్నింగ్స్ ఆడిన జమాల్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా లక్ష్య ఛేదనలో పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. AAMER JAMAL PLAYING LIKE HE DID IN THE TESTS IN AUSTRALIA 🔥🔥🔥#HBLPSL9 #tapmad #HojaoAdFree pic.twitter.com/UeiRi24PSB — Farid Khan (@_FaridKhan) March 4, 2024 ఇస్లామాబాద్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రీస్, హునైన్ షా తలా రెండు వికెట్లు సాధించారు.ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇస్లామాబాద్ బ్యాటర్లలో కెప్టెన్ షాదాబ్(51 బంతుల్లో 80, 4ఫోర్లు,6 సిక్స్‌లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. Aamer Jamal REMEMBER THE NAME !🤝#HBLPSL9 #IUvPZ #PSL2024 pic.twitter.com/7Dgqv69zTD — Aussies Army🏏🦘 (@AussiesArmy) March 4, 2024 -
విధ్వంసకర సెంచరీ.. 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో! వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో ముల్తాన్ సుల్తాన్స్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. తాజాగా కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముల్తాన్ ఘన విజయం సాధించింది. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేసింది. కరాచీ బ్యాటర్లలో షోయబ్ మాలిక్(38) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు షాన్ మసూద్(36) పరుగులతో రాణించాడు. ముల్తాన్ సుల్తాన్స్ బౌలర్లలో ఉసమా మీర్ రెండు వికెట్లు పడగొట్టగా.. డేవిడ్ విల్లీ, మహ్మద్ అలీ, క్రిస్ జోర్డాన్, కుష్దుల్ షా తలా ఒక్క వికెట్ సాధించారు. ఉస్మాన్ ఖాన్ విధ్వంసకర సెంచరీ.. అంతకముందు బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ముల్తాన్ ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కరాచీ బౌలర్లను ఉస్మాన్ ఖాన్ ఊచకోత కోశాడు. కేవలం 59 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 106 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(58) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక ఈ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ముల్తాన్ సుల్తాన్ ఖారారు చేసుకుంది. USMAN KHAN, TAKE A BOW! 🙇 Second HBL PSL 💯 for the Sultans star 👏#HBLPSL9 | #KhulKeKhel | #KKvMS pic.twitter.com/DCP60FJwoD — PakistanSuperLeague (@thePSLt20) March 3, 2024 -
విండీస్ ప్లేయర్ సిక్సర్ల సునామీ
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024లో భాగంగా కరాచీ కింగ్స్‌తో నిన్న (ఫిబ్రవరి 29) జరిగిన మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేర్స్ బ్యాటర్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ చెలరేగిపోయాడు. 31 బంతుల్లో బౌండరీ, ఆర డజను సిక్సర్ల సాయంతో అజేయమైన 58 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. చివరి బంతికి బౌండరీ బాది గ్లాడియేటర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కరాచీ ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. జేమ్స్ విన్స్ (37) టాప్ స్కోరర్‌గా కాగా.. టిమ్ సీఫర్ట్ 21,షోయబ్ మాలిక్ 12, మొహమ్మద్ నవాజ్ 28, పోలార్డ్ 13, ఇర్ఫాన్ ఖాన్ 15, హసన్ అలీ 2 పరుగులు చేశారు. ఆఖర్లో అన్వర్ అలీ (14 బంతుల్లో 25 నాటౌట్) మెరపు ఇన్నింగ్స్ ఆడగా.. జహిద్ మహమూద్ 3 పరుగులతో అజేయంగా నిలిచారు. క్వెట్టా బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. అకీల్ హొసేన్, ఉస్మాన్ తారిక్ తలో 2 వికెట్లు, వసీం ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్వెట్టా.. 5 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయతీరాలకు చేరింది. జేసన్ రాయ్ (31 బంతుల్లో 52; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్ మెరుపు అర్దశతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో అకీల్ హొసేన్ (17 బంతుల్లో 22 నాటౌట్) రూథర్‌ఫోర్డ్‌కు జత కలిశాడు. క్వెట్టా ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ 24, ఖ్వాజా నఫే 2, సర్ఫరాజ్ అహ్మద్ 3, రిలీ రొస్సో 6 పరుగులు చేశారు. కరాచీ బౌలర్లలో హసన్ అలీ, జహిద్ మహమూద్ తలో 2 వికెట్లు.. షోయబ్ మాలిక్ ఓ వికెట్ పడగొట్టారు. -
పాకిస్తాన్ లీగ్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. 13 మందికి అస్వస్థత, ఒకరికి సీరియస్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కరాచీ కింగ్స్‌కు చెందిన 13 మంది క్రికెటర్లు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారని సమాచారం. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పరిస్థితి చేయి దాటేలా ఉండటంతో సదరు ఆటగాడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. క్వెట్టా గ్లాడియేటర్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 29) జరుగుతున్న మ్యాచ్‌కు ముందు ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తుంది. ఆసుపత్రికి తరలించిన క్రికెటర్ సౌతాఫ్రికాకు చెందిన తబ్రేజ్ షంషి అని సమాచారం. నిన్న ఆస్ట్రేలియాకు చెందిన డేనియల్ సామ్స్, సౌతాఫ్రికాకు చెందిన లూయిస్ డు ప్లూయ్ ఉదర సంబంధింత సమస్యల కారణంగా చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది. కరాచీ కింగ్స్ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ సైతం స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఇంతమంది ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారని తెలుస్తున్నప్పటికీ.. కరాచీ కింగ్స్ యాజమాన్యం వాస్తవాలను బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతున్నట్లు పాక్ మీడియానే ప్రచారం చేస్తుంది. క్వెట్టాతో కొద్ది సేపటి క్రితం మొదలైన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్.. పై పేర్కొన్న ఆటగాళ్లు కాకుండా వేరే ముగ్గురు ఫారెన్ ప్లేయర్లతో బరిలోకి దిగింది. క్వెట్టాతో జరుగుతున్న మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 16.1 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 134/6గా ఉంది. షాన్ మసూద్ (2), టిమ్ సీఫర్ట్ (21), జేమ్స్ విన్స్ (37), షోయబ్ మాలిక్ (12), మొహమ్మద్ నవాజ్ (28), పోలార్డ్ (13) ఔట్ కాగా.. ఇర్ఫాన్ ఖాన్ (15), హసన్ అలీ క్రీజ్‌లో ఉన్నారు. క్వెట్టా బౌలర్లలో అకీల్ హొసేన్, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్ తలో 2 వికెట్లు పడగొట్టారు. -
న్యూజిలాండ్ ఓపెనర్ ఊచకోత.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో ఇస్లామాబాద్ యునైటెడ్ రెండో విజయం నమోదు చేసింది. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఇస్లామాబాద్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కరాచీ బ్యాటర్లలో కిరాన్ పొలార్డ్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 28 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 48 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో ఇమాడ్ వసీం, నసీం షా, సల్మాన్, హునైన్ షా తలా వికెట్ సాధించారు. మున్రో ఊచకోత.. అనంతరం 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ 18.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇస్లామాబాద్ బ్యాటర్లలో కొలిన్ మున్రో విధ్వంసం సృష్టించాడు. 47 బంతులు ఎదుర్కొన్న మున్రో.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 పరుగులు చేశాడు. అతడితో పాటు అలెక్స్ హేల్స్(47), అఘా సల్మాన్(25) పరుగులతో రాణించారు. చదవండి: BAN vs SL: హసరంగాపై వేటు.. శ్రీలంక కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ -
ఉస్మాన్ ఖాన్ ఊచకోత.. విధ్వంసం సృష్టించిన ఇఫ్తికార్, హెండ్రిక్స్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో మరో భారీ స్కోర్ నమోదైంది. లాహోర్ ఖలందర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ డకౌటైనా సుల్తాన్స్ ఏ మాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేశారు. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, సిక్స్), ఇఫ్తికార్ అహ్మద్ (18 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడగా.. వికెట్‌కీపర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ (55 బంతుల్లో 96; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. వీరికి తయ్యబ్ తాహిర్ (14 బంతుల్లో 21; 3 ఫోర్లు) జత కలిశాడు. లాహోర్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 2 వికెట్లు పడగొట్టగా.. బ్రాత్‌వైట్, సికందర్ రజా తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, పాయింట పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుండగా.. ముల్తాన్ సుల్తాన్స్ 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్, ఇస్తామాబాద్ యునైటెడ్ వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నాయి. -
బాబర్ ఆజమ్ విధ్వంసం.. టీ20ల్లో 11వ శతకం
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజమ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఇస్లామాబాద్ యునైటెడ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్‌లో బాబర్.. 59 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 63 బంతులను ఎదుర్కొన్న బాబర్.. 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 111 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.పెషావర్ ఇన్నింగ్స్‌లో బాబర్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. సైమ్ అయూబ్ (38) కాస్త పర్వాలేదనిపించగా.. మొహమ్మద్ హరీస్ (2), హసీబుల్లా ఖాన్ (0), పాల్ వాల్టర్ (19), రోవ్‌మన్ పావెల్ (8) విఫలమయ్యారు. ఆఖర్లో ఆసిఫ్ అలీ (17 నాటౌట్) వేగంగా పరుగులు సాధించాడు.ఈ మ్యాచ్‌లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు 42 బంతులు తీసుకున్న బాబర్.. ఆతర్వాతి హాఫ్ సెంచరీని కేవలం 21 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2, నసీం షా, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, పొట్టి క్రికెట్లో 11వ సెంచరీ (284 మ్యాచ్‌ల్లో) పూర్తి చేసుకున్న బాబర్.. ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీల రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. ఈ ఫార్మాట్లో గేల్ అత్యధికంగా 22 సెంచరీలు (463 మ్యాచ్‌ల్లో) చేశాడు. -
సౌతాఫ్రికా ఆటగాడి విధ్వంసకర సెంచరీ.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో!
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో లాహోర్ ఖలందర్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఈ లీగ్‌లో భాగంగా ఆదివారం పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో లాహోర్ 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లాహోర్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. 212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లాహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు మాత్రమే చేసింది. లాహోర్ స్టార్ బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. భారీ లక్ష్య ఛేదనలో డస్సెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ క్రమంలో కేవలం 50 బంతుల్లోనే తన తొలి పీఎస్ఎల్ సెంచరీని ఈ సఫారీ స్టార్ బ్యాటర్ అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 52 బంతులు ఎదుర్కొన్న డస్సెన్ 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఏదేమైనప్పటికీ డస్సెన్ విధ్వంసకర సెంచరీ వృథా అయిపోయింది. లహోర్ బ్యాటర్లలో డస్సెన్ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. పెషావర్ బ్యాటర్లలో ఓపెనర్ సైమ్ అయూబ్(55 బంతుల్లో 88, 8 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు బాబర్ ఆజం(48), పావెల్(46) పరుగులతో రాణించారు. 2024 PSL's first centurion 💯🥇 Take a bow, Rassie van der Dussen 🤩🔥pic.twitter.com/6RIybWt2Ay — Sport360° (@Sport360) February 25, 2024 -
సైమ్ అయూబ్ విధ్వంసం.. రోవ్‌మన్ పావెల్ ఊచకోత
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో ఇవాళ (ఫిబ్రవరి 25) లాహోర్ ఖలందర్స్, పెషావర్ జల్మీ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఖలందర్స్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన పెషావర్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సైమ్ అయూబ్ (55 బంతుల్లో 88; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), రోవ్‌మన్ పావెల్ (20 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (36 బంతుల్లో 48; 5 ఫోర్లు), మొహమ్మద్ హరీస్ (5 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో పెషావర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ చేసింది. పెషావర్ ఇన్నింగ్స్‌లో ఆసిఫ్ అలీ (6) తక్కువ స్కోర్‌కు ఔట్ కాగా.. పాల్ వాల్టర్ 2 పరుగులతో అజేయంగా నిలిచాడు. లాహోర్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది (4-0-33-3) విజృంభించగా.. జహాన్దాద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు. లీగ్ ప్రస్తుత ఎడిషన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన లాహోర్ ఇంతవరకు బోణీ కొట్టలేదు. ఈ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌లు ఆడిన పెషావర్ ఓ విజయం, రెండు పరాజయాలతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ముల్తాన్ సుల్తాన్స్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. క్వెట్టా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.