Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

AP Deputy CM Pawan Kalyan Seize The Ship Utter Flop1
Pawan Kalyan సీజ్‌ ద షిప్‌.. ప్చ్‌!

కాకినాడ, సాక్షి: సీజ్‌ ద షిప్‌.. పోర్టులో కొద్ది రోజుల కిందట కాకినాడ పోర్టులో బియ్యం తనిఖీల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) అన్న మాట వైరల్‌గా మారింది. ఎంతలా అంటే.. ఆయన హార్డ్‌కోర్‌ అభిమానులకు ఆ డైలాగ్‌ నిద్రలేకుండా చేసింది. తమ అభిమాన నటుడు.. ప్రియతమ నేత రంగంలోకి దిగి మరీ అధికారులపై శివాలెత్తిపోయి ఆదేశాలివ్వడంతో మురిసిపోయారంతా. ఆ వెంటనే సోషల్‌ మీడియాలో వాళ్లు ఇచ్చిన ఎలివేషన్లు.. ఎక్స్‌లో #Seizetheship హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి రావడం.. మాములుగా సాగలేదా హడావిడి. అయితే ఆ వ్యవహారంలో తాజా పరిణామం.. ఆయన అభిమానులకు మింగుడు పడనివ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన నౌక ‘స్టెల్లా ఎల్‌- పనామా- ఐఎంవో 9500687’. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఏ షిప్‌ను అయితే సీజ్‌ చేయమని చెప్పారో.. ఆ షిప్‌ త్వరలో ఇంటి ముఖం పట్టబోతోంది. ఈ నెల 5 లేదంటే 6వ తేదీల్లో స్లెల్లా నౌక కాకినాడ నుంచి బయల్దేరనుందని సమాచారం. ఆపై అది వెస్ట్‌ ఆఫ్రికా కోటోనౌ పోర్టు(Port of Cotonou)కు చేరుకోనుంది. ఇందుకు సంబంధించిన క్లియరెన్స్‌ ఈపాటికే లభించినట్లు సమాచారం.పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్‌(Benin) దేశ వాణిజ్య కేంద్రం కోటోనౌ పోర్టుకు.. కాకినాడ యాంకరేజి పోర్టు నుంచి బియ్యం నిల్వలు దీని ద్వారా చేరవేయాల్సి ఉంది. ఇందుకోసం హల్దియా నుంచి కాకినాడ తీరానికి నవంబర్‌ 11న ‘స్టెల్లా’ నౌక వచ్చింది.ఇంపీరియల్‌ ఏజెంట్‌ ద్వారా నౌకలో 52,200 టన్నుల బియ్యం ఎగుమతి చేసేలా 28 ఎగుమతి సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 32,415 టన్నులు లోడ్‌ చేశారు. అయితే నవంబర్‌ 27న కలెక్టర్‌ తనిఖీలు చేసి 640 టన్నుల పేదల బియ్యం గుర్తించి నౌకను అదుపులోకి తీసుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న పవన్‌ కల్యాణ్‌.. రెండ్రోజుల తర్వాత కాకినాడ తీరంలో పర్యటించారు. స్వయంగా బోటులో షిప్‌ దగ్గరకు వెళ్లి మరీ సీజ్‌ ద షిప్‌ అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అక్కడి టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుతో (వనమాడి వెంకటేశ్వరరావు)పాటు ఎస్పీ, సివిల్‌ సప్లై డిపార్ట్‌మెంట్‌ అధికారులపైనా ఆయన సీరియస్‌ అయ్యారు.అయితే.. విదేశీ నౌకను సీజ్ చేసే అధికారం లేకపోవడంతో అధికార యంత్రాంగం తర్జనబర్జన పడింది. అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉండడం.. దేశాల మధ్య ఎగుమతి- దిగుమతుల సమస్య కావడం కారణాలు. అందుకే స్టెల్లా షిప్ సీజ్ చేయడం అంత సులువు కాదని కాకినాడ కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ తేల్చేశారు. కావాలంటే నౌకలోని రేషన్‌ బియ్యం అన్‌లోడ్‌ చేశాక ఆ విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ఇష్యూ నుండి బయట పడేందుకు మల్టీ డిసిప్లెయినరీ కమీటీ కూడా ఏర్పాటు చేశారు. ఆపై వాస్తవ పరిస్థితిని పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెండ్ల మనోహర్‌కు పరిస్థితి వివరించే ప్రయత్నం చేశారు. ఈలోపు ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రకరకాల కారణాలతో రేషన్‌ బియ్యాన్ని దించడం కాస్త ఆలస్యమైంది. చివరకు.. తాజాగా నౌకలో గుర్తించిన 1,320 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని ఆన్ లోడ్ చేసి పోర్ట్ గోడౌన్‌లకు అధికారులు తరలించారు. ఆ వెంటనే షిప్‌ వెళ్లిపోయేందుకు క్లియరెన్స్‌ ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి.. పవన్‌ సీజ్‌ ద షిప్‌ వ్యవహారం సోషల్ మీడియా రీల్స్ కే పరిమితమైందన్నమాట!.ప్చ్‌..కొసమెరుపు..కాకినాడ పోర్టు నుంచి రేషన్‌ బియ్యాన్ని ఆఫ్రికాకు అక్రమంగా తరలించే వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీనిని కూటమి అనుకూల మీడియా ఘనంగా ప్రచారం చేసుకుంది. ఇందులోనూ వైఎస్సార్‌సీపీ ప్రస్తావన తెచ్చి బద్నాం చేయజూసింది. అయితే.. ఇక్కడో కొసమెరుపు ఏంటంటే.. ఆ సిట్‌ అధికారులు ఇప్పటిదాకా కాకినాడ ముఖం చూడలేదు. అదే సమయంలో పట్టుబడిన రేషన్‌ బియ్యం తాలుకా 6ఏ కేసులు నమోదు అయినప్పటికీ సివిల్‌ సప్లై అధికారులు మాత్రం క్రిమినల్ కేసులు పెట్టకపోవడం గమనార్హం.ఇదీ చదవండి: పవన్‌కు చంద్రబాబుతోనే పోటీ!

Ram Charan Upcoming Movie Game Changer Trailer Out Now2
'కలెక్టర్‌కి ఆకలేస్తోంది అంటా'... 'గేమ్ ఛేంజర్‌' ట్రైలర్‌ చూసేయండి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్'(Game Changer Movie). స్టార్ డైరెక్టర్‌ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ పాటలకు సంబంధించి మూవీ టీమ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను (Game Changer Trailer)మేకర్స్ రిలీజ్ చేశారు.(ఇది చదవండి: Game Changer: తగ్గిన రామ్‌ చరణ్‌ రెమ్యునరేషన్‌!)తాజాగా రిలీజైన గేమ్ ఛేంజర్ ట్రైలర్‌ చూస్తే ఫుల్ యాక్షన్‌ అండ్ పొలిటికల్‌ స్టోరీగానే తెరెకెక్కించినట్లు తెలుస్తోంది. ఫైట్స్, డైలాగ్స్ మెగా ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. రామ్ చరణ్, ఎస్‌జే సూర్య మధ్య సన్నివేశాలు ఆడియన్స్‌లో అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. 'నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్‌.. నేను చనిపోయే వరకు ఐఏఎస్‌' ‍అనే డైలాగ్‌ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ట్రైలర్ చివర్లో వచ్చే 'అర్థమయిందిరా.. రా కి రా.. సర్‌ కి సర్‌..' అనే డైలాగ్‌ ఎస్‌జే సూర్యతో చెప్పే డైలాగ్‌ మెగా ‍ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. దాదాపు 2 నిమిషాల 40 సెకన్ల పాటు ఉన్న గేమ్ ఛేంజర్‌ ట్రైలర్‌లో ఫైట్స్, విజువల్స్‌లో డైరెక్టర్ శంకర్‌ మార్క్ కనిపిస్తోంది. (ఇది చదవండి: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్‌'.. కేవలం పాటలకే అన్ని కోట్లా!)ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శంకర్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ కావడంతో కోలీవుడ్‌లోనూ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా ‍‍అద్వానీ హీరోయిన్‌గా నటించింది. కోలీవుడ్ హీరో ఎస్‌జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్ పొంగల్ కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

New Bangladesh Textbooks Claim Ziaur Rahman Declared Independence, Not Mujib3
జాతిపితనే మార్చేసిన బంగ్లాదేశ్‌

ఢాకా: బంగ్లాదేశ్ జాతిపిత మారినట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు స్వాతంత్రపోరాట యోధుడు బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ (Sheikh Mujibur Rahman) బంగ్లాదేశ్‌ జాతిపితగా కొనసాగుతున్నారు. ఈ తరుణంలో తాజాగా, అక్కడి మహ్మద్ యూనిస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫాదర్‌ ఆఫ్‌ ది నేషన్‌ షేక్ ముజిబుర్ రెహ్మాన్ పేరును తొలగించింది.1971 మార్చి 26న బంగ్లాదేశ్‌ (bangladesh)కు స్వాంతత్య్రం వచ్చింది. స్వాంతంత్య్రానికి ముందు పాకిస్థాన్‌ భూభాగంలో ఈస్ట్‌ పాకిస్థాన్‌ పేరుతో కొనసాగేది. అయితే, ఈస్ట్‌ పాకిస్థాన్‌ కాకుండా తమకూ బంగ్లాదేశ్‌ పేరుతో ప్రత్యేక దేశం కావాలని ఉద్యమాలు జరిగాయి. ఈ ఉద్యమానికి షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ ముందుండి నడిపించారు. అలా 1971,మార్చి 26న బంగ్లాదేశ్‌ ప్రత్యేక దేశంగా అవతరించింది. స్వాంతంత్య్రం సాధించించి షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ కాబట్టే.. బంగ్లాదేశ్‌ జాతిపితగా కొనసాగుతూ వచ్చారనే అక్కడి చరిత్ర చెబుతోంది.ఈ తరుణంలో బంగ్లాదేశ్‌ మధ్యంతర ప్రభుత్వ సారధి మహ్మద్ యూనిస్.. ముజిబుర్‌ రెహ్మాన్‌ను దేశ జాతిపితను మార్చేసింది. వచ్చే విద్యా సంవత్సరం పాఠ్యపుస్తకాల్లో ఫాదర్‌ ఆఫ్‌ ది నేషన్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌కు బదులు జియావుర్ రెహమాన్ పేరును చేర్చినట్లు బంగ్లా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి పాఠ్యపుస్తకాల్లో బంగ్లాదేశ్‌ జాతిపితగా జియావుర్ రెహమాన్ పేరును చేర్చింది. ఈ సందర్భంగా 2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన కొత్త పాఠ్యపుస్తకాలలో ‘మార్చి 26, 1971న జియావుర్ రెహమాన్ బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం తెచ్చారు. మార్చి 27న ప్రజల హక్కుల కోసం బంగాబంధు పేరుతో షేక్ ముజిబుర్ రెహ్మాన్‌ మరో స్వాతంత్య్ర ప్రకటన చేశారు’ అని నేషనల్ కరికులం అండ్ టెక్స్ట్‌బుక్ బోర్డ్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఏకేఎం రీజుల్ హసన్ ప్రకటించారు అని స్థానిక మీడియా కథనాలు హైలెట్‌ చేశాయి. 👉చదవండి : చిన్మయ్‌ కృష్ణదాస్‌కు నో బెయిల్‌

Chandrababu Cabinet Has Not Taken A Decision On Thalliki Vandanam Scheme4
‘తల్లికి వందనం’ పథకానికి మంగళం.. ఈ ఏడాది లేనట్టే..

సాక్షి, విజయవాడ: తల్లికి వందనం పథకానికి కూటమి సర్కార్‌ మంగళం పాడేసింది. చంద్రబాబు కేబినెట్‌ విద్యార్థుల తల్లులకు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఆలోచిద్దామంటూ కేబినెట్‌ చేతులు దులుపుకుంది. ఈ ఏడాది తల్లికి వందనం లేనట్టేనని తేలిపోయింది.అధికారంలోకి రాగానే పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ప్రభుత్వం అమలు చేయలేదు. తల్లికి వందనం పథకం అమలపై కేబినెట్‌ నిర్ణయం తీసుకోలేదు. ఏపీలో 80 లక్షల మందికి 15 వేలు చొప్పున తల్లికి వందనం ఇస్తామంటూ హామీ ఇవ్వగా, ఈ ఏడాది తల్లికి వందనం ఎగనామం పెట్టేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.కేబ్‌నెట్‌ భేటీ అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ, సూపర్ సిక్స్‌లో పథకాలపై చర్చించామన్నారు. తల్లికి వందనం వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేస్తామని తెలిపారు. ఈ అకడమిక్ సంవత్సరంలో అప్పుల కోసం ఆరా తీశాం. వచ్చే విద్యా సంవత్సరం లోపు తల్లికి వందనం చెల్లిస్తాం. రైతు భరోసా చెల్లింపుపై చర్చించాం. కేంద్రం ఇచ్చే షేర్ బట్టి రాష్ట్ర ప్రభుత్వం షేర్ రైతులకు ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడే ఇస్తాం. కేంద్రం నిర్ణయం బట్టి ఎంత చెల్లిస్తామో నిర్ణయిస్తాం’’ అని మంత్రి చెప్పారు.కాగా, ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ ‘తల్లికి వందనం’ పథకం వర్తింపజేస్తామంటూ మంత్రి నారా లోకేష్‌ ఊదరగొట్టారు. తల్లులు, పిల్లల డేటా సిద్ధంగా ఉన్నా.. విధివిధానాల రూపకల్పనలో జాప్యం జరుగుతోందని చెబుతూ.. ఇప్పట్లో పథకం అమలు చేయబోమని శాసన మండలిలో కూడా ప్రశ్నోత్తరాల సమయంలో పరోక్షంగా చెప్పిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: కిక్కే.. కిక్కుతల్లికి వందనం అమలుకు విధివిధానాలు రూపొందించడానికి కొంత సమయం కావాలని అడిగామని, దీనిపై మంత్రులందరితో చర్చిస్తు­న్నట్టు చెప్పారు. తాజాగా, కేబినెట్‌ కూడా చేతులెత్తేసింది. ఏపీలో కూటమి సర్కార్‌ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టే పనిని ప్రారంభించింది. అయితే, తాజాగా తల్లికి వందనం విషయంలోనూ పిల్లిమొగ్గలు వేస్తుందనే చర్చ ప్రజల్లో మొదలైంది.

He is looking better Than Captain: Dont Drop Pant Warns Aakash Chopra5
కెప్టెన్‌ కంటే బెటర్‌.. ప్లీజ్‌.. అతడిని తప్పించకండి: భారత మాజీ క్రికెటర్‌

‘‘రిషభ్‌ పంత్‌(Rishabh Pant) ఎక్కువగా రివర్స్‌ స్లాప్‌ షాట్లు ఆడతాడు. అదే అతడి బలం. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్‌లో పంత్‌ కచ్చితంగా ప్రభావం చూపుతాడు. కాబట్టి అతడిని కట్టడి చేస్తే మా పని సగం పూర్తయినట్లే’’- టీమిండియాతో టెస్టులకు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ చేసిన వ్యాఖ్యలు.గత నాలుగు పర్యాయాలుగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(బీజీటీ)సిరీస్‌ను టీమిండియానే దక్కించుకున్న విషయం తెలిసిందే. 2020-21 పర్యటన సందర్భంగా భారత యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ తొలిసారి కంగారూ గడ్డపై సత్తా చాటాడు. నాడు అద్భుత రీతిలోసిడ్నీ టెస్టులో 97 పరుగులతో రాణించి.. సిరీస్‌ ఆశలను సజీవం చేశాడు. నాడు ఆఖరిగా గబ్బాలో జరిగిన టెస్టులో 89 పరుగులతో అజేయంగా నిలిచి.. భారత్‌ను గెలిపించాడు. తద్వారా సిరీస్‌ గెలవడంలో తన వంతు పాత్ర పూర్తి చేశాడు.అందుకే ఈసారి ఆసీస్‌ గడ్డపై బీజీటీ నేపథ్యంలో పంత్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కమిన్స్‌ కూడా అతడి గురించి పైవిధంగా స్పందించాడు. కానీ సీన్‌ రివర్స్‌ అయింది. ఇప్పటి వరకు బీజీటీ 2024-25లో నాలుగు టెస్టులు పూర్తి కాగా.. పంత్‌ సాధించిన పరుగులు 154 మాత్రమే. స్టుపిడ్‌.. స్టుపిడ్‌.. స్టుపిడ్‌ఏ ఆటగాడికైనా ఒక్కోసారి ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదురవడం సహజమే అయినా.. పంత్‌ వికెట్‌ పారేసుకుంటున్న తీరు విమర్శలకు దారితీసింది. టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ అయితే పంత్‌ను ఉద్దేశించి.. ‘‘స్టుపిడ్‌.. స్టుపిడ్‌.. స్టుపిడ్‌.. నువ్వు భారత జట్టు డ్రెసింగ్‌రూమ్‌లోకి వెళ్లనే కూడదు’’ అంటూ మండిపడ్డాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.తుదిజట్టులో చోటు ఉంటుందా? లేదా?ఈ నేపథ్యంలో సిడ్నీలో జరుగనున్న ఆఖరి టెస్టులో పంత్‌ తుదిజట్టులో చోటు దక్కించుకోవడంపై సందేహాలు నెలకొన్నాయి. అతడిపై వేటు వేసి యువ వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ను ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా తాజాగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘రిషభ్‌ పంత్‌ను జట్టు నుంచి తప్పించాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ యోచిస్తోందా? రాహుల్‌కు కీపింగ్‌ బాధ్యతలు అప్పగించి.. శుబ్‌మన్‌ గిల్‌ను మళ్లీ జట్టులోకి తీసుకువస్తారా? దయచేసి అలా మాత్రం చేయకండి. సమస్య ఎక్కడ ఉందో అర్థం చేసుకోకుండా తక్షణ పరిష్కారం కోసం వెతకకండి.కెప్టెన్‌ కంటే బెటర్‌.. ప్లీజ్‌.. అతడిని తప్పించకండిరిషభ్‌ పంత్‌ ఈ సిరీస్‌లో ఎక్కువగా పరుగులు సాధించలేదన్న వాస్తవాన్ని నేనూ అంగీకరిస్తాను. అయితే, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కంటే అతడు బాగానే ఆడుతున్నాడు. అంతేకాదు.. అతడి వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలు కూడా అద్భుతం. అతడికి ఆసీస్‌ గడ్డపై మంచి రికార్డు ఉంది.పంత్‌.. ఒక్కసారి విఫలమైనంత మాత్రాన పక్కనపెట్టేంత విలువలేని ఆటగాడు కాదు. కాబట్టి దయచేసి అతడిని జట్టు నుంచి తప్పించకండి. ప్రతి ఒక్కరికి తమదైన ప్రత్యేకశైలి ఉంటుంది. అయితే, ఒక్కోసారి ఎంత జాగ్రత్తపడినా.. ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయి.పిచ్‌ పరిస్థితులు కూడా గమనించాలి. మ్యాచ్‌ స్వరూపం ఎలా ఉందన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇలాంటి కీలక విషయాలను పట్టించుకోకపోతే కష్టమే. ఏదేమైనా.. పంత్‌ ఒక్కసారి తన లోపాలు సరిదిద్దుకుంటే అతడికి తిరుగు ఉండదు’’ అని ఆకాశ్‌ చోప్రా పంత్‌ను సమర్థించాడు.సిడ్నీలో ఐదో టెస్టుఇదిలా ఉంటే.. ఆసీస్‌తో రెండో టెస్టు నుంచి జట్టుతో కలిసిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇప్పటి వరకు మొత్తం 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక భారత్‌- ఆసీస్‌ మధ్య శుక్రవారం నుంచి ఐదో టెస్టు సిడ్నీలో మొదలుకానుంది.చదవండి: NZ vs SL: కుశాల్‌ పెరీరా ‘ఫాస్టెస్ట్‌ సెంచరీ’.. ఉత్కంఠ పోరులో ఆఖరికి!

New Orleans Case: Who was Shamsud Din Jabbar Check Full Details Here6
న్యూఓర్లీన్స్‌ ట్రక్కు దాడి.. ఎవరీ జబ్బర్‌?

కొత్త సంవత్సరం వేళ.. కేవలం గంటల వ్యవధిలో అమెరికాను వరుస దాడులు వణికించాయి. ముఖ్యంగా న్యూ ఓర్లీన్స్‌ ట్రక్కు దాడి కేసు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై విచారణ పూర్తిగా ఉగ్రకోణంలోనే సాగుతోందని ఎఫ్‌బీఐ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు అనుమానితుడికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు విడుదల చేసింది.గతంలో అమెరికా సైన్యం పని చేసిన షంసుద్‌ దిన్‌ జబ్బార్‌(42)ను ఈ దాడికి ప్రధానసూత్రధారిగా అనుమానిస్తున్నారు. ట్రక్కుతో దాడికి పాల్పడిన అనంతరం.. అతడ్ని భద్రతా బలగాలు అక్కడికక్కడే కాల్చి చంపాయి. అయితే అతనొక మానసిక రోగినా? లేకుంటే ఉగ్రవాదినా? అనేదానిపై ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. కానీ.. 👉జబ్బార్‌ గతంలో టెక్సాస్‌లో రియల్‌ ఎస్టేట్‌(Real Estate) ఎజెంట్‌గా పని చేశాడు. అంతకు ముందు చాలాఏళ్లు అమెరికా సైన్యంలో పని చేశాడు. అయితే.. ఆర్థిక సమస్యలతో పాటు విడాకులు అతని వ్యక్తిగత జీవితాన్ని కుంగదీసినట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల కిందట.. యూట్యూబ్‌ ఛానెల్‌లో తనను తాను రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌గా పరిచయం చేసుకున్న ఓ వీడియో సైతం ఇప్పుడు బయటకు వచ్చింది.👉ఇదిలా ఉంటే.. జబ్బార్‌ 2005 నుంచి 2015 మధ్య అమెరికా సైన్యంలో హ్యూమన్‌ రీసోర్స్‌ స్పెషలిస్ట్‌గా, ఐటీ స్పెషలిస్ట్‌గా పని చేశాడని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్‌ ప్రకటించింది. అంతేకాదు.. 2009-10 మధ్య అఫ్గనిస్థాన్‌లో అతను విధులు నిర్వహించాడు. తాజా దాడి ఘటన తర్వాత.. అమెరికా సైన్యంలో అతను పని చేసిన టైంలో ఓ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌ అయ్యింది. అయితే కాసేపటికే ఆ వీడియోను ఎవరో యూట్యూబ్‌ నుంచి డిలీట్‌ చేశారు.👉వీటితో పాటు 2021 నుంచి ప్రముఖ ఆడిటింగ్‌ సంస్థ డెలాయిట్‌లో అతడు సీనియర్‌ సొల్యూషన్‌ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వహించాడు.👉దాడి ఘటనపై అతని కుటుంబం స్పందించింది. తన సోదరుడు జబ్బార్‌ ఎంతో మంచివాడని అబ్దుర్‌ జబ్బార్‌ చెప్తున్నాడు. చిన్నతనంలో మా కుటుంబం మతం మారింది. కానీ, ప్రస్తుత దాడిని మతానికి ముడిపెట్టడం సరికాదు. రాడికలైజేషన్‌ ప్రభావంతోనే నా సోదరుడు ఉన్మాదిగా మారిపోయి ఉంటాడు అని అబ్దుర్‌ చెప్తున్నాడు.👉జార్జియా స్టేట్‌ యూనివర్సిటీలో జబ్బార్‌ విద్యాభ్యాసం కొనసాగింది. 2015-17 మధ్య కంప్యూటర్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడతను. జబ్బార్‌ డైవోర్సీ. రెండుసార్లు వివాహం జరగ్గా.. ఇద్దరితోనూ విడాకులు తీసుకున్నాడు. ఆర్థిక సమస్యలతోనే రెండో భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు 2022లో అతను పంపిన మెయిల్‌ను అధికారులు పరిశీలించారు.👉రియల్‌ ఎస్టేట్‌ నష్టాలతో జబ్బార్‌ ఆర్థికంగానూ జబ్బార్‌ చితికిపోయి ఉన్నాడు. ఒకానొక టైంలో అద్దె కూడా చెల్లించని లేని స్థితికి చేరుకున్నాడు. ఆఖరికి లాయర్‌కు ఫీజులను కూడా క్రెడిట్‌ కార్డులతో చెల్లించి.. వాటిని ఎగ్గొట్టాడు.👉నేర చరిత్రను పరిశీలిస్తే.. 2002లో దొంగతనం, 2005లో కాలం చెల్లిన డ్రైవింగ్‌ లైసెన్స్‌తో బండి నడిపి శిక్ష అనుభవించాడు.👉షంషుద్దీన్‌ జబ్బార్‌ దాడి చేస్తాడని కొన్ని గంటల ముందే ఎఫ్‌బీఐ తనకు సమాచారం అందించినట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ వెల్లడించారని ఏబీసీ న్యూస్‌ ఓ కథనం ప్రచురించింది. ఐసిస్‌ స్ఫూర్తితోనే తాను ఈ చర్యకు ఉపక్రమిస్తున్నట్లు వీడియో పోస్ట్‌ చేశాడు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఆర్మ్‌డ్‌ గ్రూప్‌(ఐసిస్‌కు మరో పేరు) జెండా కూడా దాడికి పాల్పడిన ట్రక్కులో ఉన్నట్లు ఎఫ్‌బీఐ తనకు నివేదించిందని బైడెన్‌ చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. 👉షంషుద్దీన్‌ జబ్బార్‌ను ఐసిస్‌ ఒంటరి తోడేలు (Lone Wolf)గా ఎఫ్‌బీఐ భావిస్తోంది. అంటే.. ఒంటరిగాగానీ లేదంటే చిన్నగ్రూపులుగా ఏర్పడి దాడులు చేయడం. అమెరికాలో జరిగే అత్యధిక ఉగ్రదాడులు ఈ రూపంలోనే ఉంటున్నాయి. 2014లో బెల్జియంలో యూదుల మ్యూజియంపై, 2012లో బ్రస్సెల్స్‌లో మసీదుపై, 2016లో ఫ్రాన్స్‌లో బాస్టిల్‌డే నాడు ట్రక్కుతో దాడి ఇలా చేసినవే. ‘‘అతడికి సైనిక నేపథ్యం ఉంది. కానీ, ఏనాడూ యుద్ధంలో పాల్గొనలేదు. నౌకాదళంలో చేరేందుకు ప్రయత్నించినా.. అది వీలుకాలేదు. దాడికి ముందు సెయింట్‌ రోచ్‌ సమీపంలో ఓ ఇంటి సమీపంలో అతడు ట్రక్కును ఆపి కొన్ని పెట్టెలను కిందకి దించుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. ఆ తర్వాత కొన్ని గంటలకే అక్కడున్న ఆ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిందితుడు జబ్బార్‌ ఎయిర్‌ బీఎన్‌బీలో ఒక గది తీసుకొని.. అక్కడ న్యూఆర్లీన్‌ దాడికి పేలుడు పదార్థాలు తయారుచేశాడు. టూరో అనే యాప్‌ సాయంతో అతడు ఫోర్డ్‌ ఎఫ్‌-150 లైటినింగ్‌ అనే భారీ ఎలక్ట్రిక్‌ పికప్‌ ట్రక్కును బుక్‌ చేశాడు. దానిని వాడే నూతన సంవత్సర వేడుకల వేళ బర్బన్‌ వీధిలో విచక్షణా రహితంగా దాడి చేసి 15 మందిని బలిగొన్నాడు’’ అని లూసియానా అటార్నీ జనరల్‌ లిజ్‌ ముర్రిల్ల్‌ తెలిపారు.అయితే జబ్బార్‌ తన కుటుంబాన్ని ఐసిస్‌లో కలవాలని కుటుంబ సభ్యులను ఒత్తిడి చేశాడని.. వినకపోయేసరికి వాళ్లను సైతం కడతేర్చడానికి వెనుకాడలేదని అధికారులు చెప్తుండగా.. కుటుంబ సభ్యులు మాత్రం ఆ వాదనను కొట్టిపారేస్తున్నారు.

Bajaj Auto Beats Ola Electric Becomes India's No 1 Electric Two Wheeler Brand7
ఓలాకు బజాజ్‌ గట్టి దెబ్బ

ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా ఎలక్ట్రిక్‌కు (Ola Electric) బజాజ్ (Bajaj Auto) గట్టి దెబ్బ కొట్టింది. 2024 డిసెంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్‌ని అధిగమించి ఎలక్ట్రిక్ టూ-వీలర్ (Electric Two-Wheeler) మార్కెట్లో కొత్త లీడర్‌గా అవతరించింది. వాహన్ పోర్టల్‌లోని రిటైల్ సేల్స్ డేటా ప్రకారం.. బజాజ్ ఇప్పుడు 25% మార్కెట్ వాటాను కలిగి ఉంది. మునుపటి నెల కంటే 3 శాతం వాటాను పెంచుకుంది.మరోవైపు తీవ్రమైన పోటీలో ఓలా ఎలక్ట్రిక్ వెనుకబడిపోయింది. 2024 డిసెంబర్‌లో కంపెనీ మార్కెట్‌ వాటా 19%కి పడిపోయింది. అంతకుముందు నెలతో పోల్చితే ఇది 5% క్షీణించింది. దీంతో మూడో స్థానానికి పరిమితమైంది. ఇక టీవీఎస్‌ (TVS) మోటార్స్ 23% మార్కెట్ వాటాతో రెండవ అతిపెద్ద ప్లేయర్‌గా తన స్థానాన్ని నిలుపుకొం​ది.బజాజ్ విజయానికి కారణాలుబజాజ్ ఆటో వృద్ధికి దాని చేతక్ 35 సిరీస్ వ్యూహాత్మక లాంచ్ కారణమని చెప్పవచ్చు. ఫీచర్-రిచ్ స్కూటర్‌లను తక్కువ ఉత్పత్తి ఖర్చుతో దాని మునుపటి మోడళ్ల కంటే 45% తక్కువకే టీవీఎస్‌ అందిస్తోంది. ఇది తక్కువ ధరలో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లను కోరుకునే వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంది.తీవ్ర పోటీఎలక్ట్రిక్‌ టూవీలర్లకు ఆదరణ పెరుగుతుండటంతో ఈ మార్కెట్‌లో ప్రస్తుతం పోటీ తీవ్రంగా మారింది. భిన్న వ్యూహాలతో కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. టీవీఎస్‌ వివిధ బ్యాటరీ సామర్థ్యాలతో (2-4 kWh) స్కూటర్‌లను అందించడం ద్వారా తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. ముఖ్యంగా కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఐ-క్యూబ్‌ (I-Qub) 250 ప్రత్యేక ఈవీ అవుట్‌లెట్‌లతో సహా దాదాపు 4,000 స్టోర్‌లలో అందుబాటులో ఉంది.మరో కంపెనీ ఏథర్ ఎనర్జీ తన ఫ్యామిలీ-ఓరియెంటెడ్ రిజ్టా స్కూటర్‌ను విడుదలతో ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర వంటి బలమైన ఈవీ మార్కెట్‌లను ఆకట్టుకుంది. అంతేకాకుండా ఉత్తర భారతదేశమంతటా తన ఉనికిని విస్తరించడంపై కూడా కంపెనీ దృష్టి సారిస్తోంది.ఓలాకు సవాళ్లుఒకప్పుడు ఈవీ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించిన ఓలా ఎలక్ట్రిక్.. ఇప్పుడు పెరిగిన పోటీ, ధరల సవాళ్ల కారణంగా మార్కెట్ వాటాలో తిరోగమనాన్ని చవిచూసింది. ఎస్‌1 (Ola S1) స్కూటర్ స్వాపింగ్‌ బ్యాటరీ వెర్షన్‌ను రూ.59,999కే ప్రారంభించడం, తమ నెట్‌వర్క్‌ను 800 నుండి 4,000 స్టోర్‌లకు విస్తరించడం వంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కంపెనీ తన ఆధిక్యాన్ని కొనసాగించలేకపోయింది.

78 year old woman victim to a cyber scam and lost Rs 1.5 crore after being tricked by fraudsters8
రూ.1.5 కోట్లు మోసపోయిన 78 ఏళ్ల మహిళ.. అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్‌, మొబైల్‌ డేటా వినియోగంతో దేశంలో ఆన్‌లైన్‌ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్‌ మోసగాళ్లు రకరకాల పేర్లతో మభ్యపెట్టి, వేశాలు మార్చి అమాయకులను దారుణం‍గా వంచిస్తున్నారు. ఎంతోమంది వీరి బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ముంబయికి చెందిన 78 ఏళ్ల మహిళ సైబర్ స్కామ్‌(cyber scam)కు బలైంది. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందంగా నమ్మబలికిన ఓ సైబర్‌ ముఠా చేతిలో ఏకంగా రూ.1.5 కోట్ల మేర నష్టపోయింది.వివరాల్లోకి వెళితే.. దక్షిణ ముంబయిలో ప్రముఖ బిల్టర్‌గా పేరున్న ఓ వ్యక్తి, 78 ఏళ్ల మహిళ బంధువులు. కొన్ని వారాల క్రితం యూఎస్‌లో ఉన్న తన కుమార్తెకు ఆ మహిళ కొన్ని వంటకాలు పంపడానికి కొరియర్ సర్వీస్‌ను ఆశ్రయించింది. అక్కడే సైబర్‌ మోసం ప్రారంభమైంది. మరుసటి రోజు ఆమెకు కొరియర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నట్లు ఒకరు కాల్‌ చేశారు. ఆమె ప్యాకేజీలో ఫుడ్‌ ఐటమ్స్‌తోపాటు ఇతర వస్తువులు ఉన్నాయని తెలిపాడు. ఆ ప్యాకేజీలో ఆధార్ కార్డ్, గడువు ముగిసిన పాస్‌పోర్ట్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, చట్టవిరుద్ధమైన పదార్థాలు, 2,000 యూఎస్‌ డాలర్లు(Dollars) ఉన్నట్లు చెప్పాడు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆమె కుట్రకు పాల్పడినట్లు సైబర్‌ మోసగాళ్లు ఫోన్లో తీవ్రంగా ఆరోపించారు.ఒత్తిడిలో పూర్తి వివరాలు..ఈ స్కామ్‌లో భాగంగా సైబర్ క్రైమ్ బ్రాంచ్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌తో సహా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులుగా నటిస్తూ పలువురు తర్వాత రోజుల్లో ఆమెను సంప్రదించారు. తమ వాదనలను ఆమె విశ్వసించేలా నటిస్తూ, మోసగాళ్లు(Fraudsters) పోలీసు యూనిఫామ్‌లో కనిపించేవారు. అరెస్ట్ వారెంట్లు, దర్యాప్తు నివేదికల వంటి నకిలీ పత్రాలను ఆమెకు చూపించి వీడియో కాల్స్ కూడా చేశారు. స్కామర్లు నకిలీ వారెంట్లు, విచారణ నివేదికలను వాట్సాప్‌లో చూపించినందున ఒత్తిడిలో మహిళ తన వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను తెలియజేశారు. ఇన్వెస్ట్‌గేషన్‌(Investigation) సమయంలో ఆమె తన ఆస్తులను కాపాడుకోవాలనే తాపత్రయంలో వారిని ప్రభుత్వ అధికారులుగానే నమ్మి, మోసగాళ్లు అందించిన బ్యాంకు ఖాతాలకు రూ.1.51 కోట్లను బదిలీ చేసింది. కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలు తెలియజేసి వారితో చర్చించి తాను మోసపోయానని గ్రహించింది.ఇదీ చదవండి: ప్యాసివ్‌ ఫండ్స్‌.. కార్యాచరణ ప్రకటించిన సెబీఅప్రమత్తత అవసరంసైబర్ క్రైమ్ పోలీస్ హెల్ప్‌లైన్‌ ద్వారా పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి ముంబై సౌత్ సైబర్ సెల్‌కు కేసు బదిలీ చేశారు. మహిళ పంపిన నగదును త్వరగా ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి మోసగాళ్లు పలు ఖాతాలను ఉపయోగించారని, దీంతో వారిని ట్రేస్ చేయడం కొంత క్షిష్టమవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ నిపుణులు కోరారు. తెలియని వారు చేసిన కాల్స్‌ను లిఫ్ట్‌ చేసినా ఎలాంటి వివరాలు పంచుకోవద్దని చెప్పారు. ఫోన్‌లో వ్యక్తిగత సమాచారాన్ని చెప్పకూడదని తెలిపారు. అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.

Madras HC Comments On Anna University Assault Case9
‘అత్యాచారం కేసును రాజకీయం చేస్తున్నారు’

చెన్నై: తమిళనాడును కుదిపేసిన అన్నా యూనివర్సిటీ(Anna University) ఘటనపై ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంజనీరింగ్‌ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి దాఖలైన ఓ పిటిషన్‌ను తాజాగా మద్రాస్‌ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ఈ ఘటనను రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించింది.ఘటనను నిరసిస్తూ చెన్నై వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పట్టాలి మక్కల్‌ కట్చి(పీఎంకే) భావించింది. అయితే.. పోలీసులు అందుకు అనుమతి నిరాకరించారు. దీంతో పీఎంకే హైకోర్టు(High Court)ను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం.. ‘‘అసలు మహిళల భద్రతపై ఎవరికీ అసలు చిత్తశుద్ధి లేదు. అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసును అంతా రాజకీయం చేస్తున్నారు. కేవలం వాళ్ల అవసరం వాడుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించింది.మరోవైపు..ఈ కేసులో ప్రజాగ్రహం పెల్లుబిక్కడంతో సిట్‌తో దర్యాప్తు చేయించాలని మద్రాస్‌ హైకోర్టు ఇదివరకే ఆదేశించింది కూడా.డిసెంబర్‌ 23వ తేదీన రాత్రి 8గం. ప్రాంతంలో క్యాంపస్‌లో విద్యార్థిని తన స్నేహితుడితో మాట్లాడుతుండగా.. దాడి చేసి ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగాయి. అదే సమయంలో..ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ జ్ఞానేశ్వర్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానికంగా బిర్యానీ వ్యాపారి అయిన జ్ఞానేశ్వర్‌.. అధికార డీఎంకే యువ విభాగానికి గతంలో పని చేశాడు. దీంతో రాజకీయంగానూ దుమారం రేగింది. విద్యా సంస్థలలోనూ విద్యార్దినులకు భద్రత కరువైందన్న ఆందోళనను ప్రతిపక్షాలు వ్యక్తంచేశాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, బీజేపీ అధ్యక్షుడు అన్నామలై(Annamalai), డీఎండీకే ప్రధాన కార్యదర్శిప్రేమలత విజయకాంత్‌, పీఎంకే నేతలు రాందాసు, అన్బుమణి రాందాసు వేర్వేరు ప్రకటనలో ఈ ఘటనను ఖండించారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో పాటు పలువురు డీఎంకే నేతలతో జ్ఞానేశ్వర్‌ దిగిన ఫొటోలను వైరల్‌ చేస్తూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓ అడుగు ముందుకు వేసి ఘటనకు నిరసనగా కొరడాతో బాదుకున్నారు. ప్రభుత్వం కదిలేవరకు చెప్పులు వేసుకోనంటూ ప్రతిన బూనారు. మరోవైపు టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్‌ కూడా కేసులో బాధితురాలికి సత్వర న్యాయం జరగాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజా మద్రాస్‌ హైకోర్టు రాజకీీయం చేస్తున్నారని వ్యాఖ్యానించడం గమనార్హం.

Norovirus spike in US Health officials issue warning10
అమెరికాలో విజృంభిస్తున్న వైరస్‌ అధికారుల వార్నింగ్‌ బెల్స్‌

అమెరికాలో నోరో వైరస్‌ విజృంభిస్తోంది. డిసెంబర్‌ మొదటి వారంలో 91 కొత్త కేసులు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.యూఎస్‌ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుండి వచ్చిన కొత్త డేటా ప్రకారం, నోరో వైరస్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. నవంబరు మొదటి వారంలో 69 కేసులు నమోదు కాగా, డిసెంబర్‌ తొలివారంలో ఈ సంఖ్య 91 కి పెరిగింది. వాంతులు , విరేచనాలకు కారణమయ్యే అంటువ్యాధి వైరస్ పెరుగుదలపై ఆరోగ్య అధికారులలో ఆందోళన మొదలైంది.నోరో వైరస్ అంటే ఏమిటి?నోరోవైరస్. దీన్నే కడుపు ఫ్లూ లేదా కడుపు బగ్ అని పిలుస్తారు. జీర్ణకోశానికి సోకే ఈ వ్యాధి వాంతులు, విరేచనాలు కలిగించి రోగులను డీహైడ్రేట్ చేసి మరిన్ని ఆరోగ్య సమస్యల బారిన పడేస్తుంది. వాంతులు , విరేచనాలతో మొదలై కడుపు లేదా ప్రేగులలో మంటకు దారితీస్తుంది. ఈ పరిస్థితిని అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్ అంటారు. చాలా మంది వ్యక్తులు 1-3 రోజుల్లో కోలుకుంటారు. కానీ వ్యాప్తి బాగా ఉంటుంది. నోరో వైరస్ సోకిన వారి నుంచీ ఇది నేరుగా సోకే అవకాశముంది.లక్షణాలు వైరస్‌ సోకిన సాధారణంగా 12 -48 గంటల తర్వాత కనిపిస్తాయి. అతిసారం, వాంతులు, వికారం, కడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి బాడీ నొప్పులు ఉంటాయి. మూత్రం సరిగారాకపోవడం, నోరు పొడిబారడం, కళ్లు తిరగడం, అసాధారణమైన నిద్ర లేదా గందరగోళం లాంటి లక్షణాలుంటాయి. వైరస్‌ సోకిన రెండు రోజులపాటు తీవ్రత అధికంగా ఉంటుంది. తర్వాత తగ్గుముఖం పడుతుంది.నోరో వైరస్ ప్రధానంగా జీర్ణ కోశాన్ని ప్రభావితం చేస్తుంది. జీర్ణాశయం, తర్వాత కొనసాగింపుగా ఉండే పేగులపై అటాక్ చేస్తుంది. అందుకే ఇది సోకగానే కడుపులో మంట, వాంతి వచ్చేట్టు, కడుపులో తిప్పినట్టూ అవుతుంది. అనారోగ్యంతో ఉన్నవారు, పిల్లలు, సీనియర్‌ సిటిజన్స్‌ల్లో ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తాయి. నివారణ, చికిత్సనోరోవైరస్ అంటువ్యాధి కనుక ఈ వైరస్ వ్యాప్తికి పరిశుభ్రంగా ఉండటమే పెద్ద చికిత్స. ఆల్కహాల్ బేస్డ్ లిక్విడ్స్‌ కరోనా వైరస్‌ను చంపినట్టు నోరో వైరస్‌ను చంపలేవు. ఆహారం తీసుకునే ముందు చేతులు శుభ్రంగా సబ్బు, నీటితో కడుక్కోవాలి. టాయిలెట్ యూజ్ చేసిన తర్వాత కూడా సబ్బుతో కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవాలి. క్లోరినేట్ చేసిన నీటిని వినియోగించుకోవాలి. ఎప్పటికప్పుడు ఉపరితలాలను శుభ్రం చేసుకోవాలి.పండ్లు, కూరగాయలను కడగాలి. బట్టలను కూడా వేడి నీటితో ఉతకడం మంచిది. కాచి చల్లార్చిన నీటినే తాగడానికి వినియోగించాలి.హైడ్రేటెడ్ గా ఉండేందుకు ఇంట్లోనే ఉండి, విశ్రాంతి తీసుకోవాలి. వ్యాధి తీవ్రతను బట్టి IV ఫ్లూయిడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది వ్యక్తులు తదుపరి చికిత్స తీసుకోవలసిన అవసరం లేకుండా కొన్ని రోజుల వ్యవధిలో కోలుకుంటారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
రైల్వేస్టేషన్‌లో ఎన్నారైకి టోకరా.. అధికారులు సీరియస్‌

సాధారణంగా రైల్వే స్టేషన్లలో నడవలేని వారి కోసం వీల్‌చైర్స్ అందుబాటులో ఉంటాయి.

title
చిన్మయ్‌ కృష్ణదాస్‌కు నో బెయిల్‌

ఢాకా : దేశ ద్రోహం నేరారోపణలతో అరెస్టై జైల్లో ఉన్న బంగ్లాదేశ్

title
ఒకతాటిపైకి పవార్‌ ఫ్యామిలీ!

పవార్‌ ఫ్యామిలీ మళ్లీ కలిసిపోతుందా? రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి పవార్‌ కుటుంబం ఒక్కటి కానుందా?

title
‘అత్యాచారం కేసును రాజకీయం చేస్తున్నారు’

చెన్నై: తమిళనాడును కుదిపేసిన అన్నా యూనివర్సిటీ(Anna Universi

title
టెన్త్‌ అర్హతతో 10 మెడికల్‌ కోర్సులు.. తక్షణ ఉపాధి.. అధిక జీతం

టెన్త్‌ చదువుతున్న చాలామందికి వైద్యవిద్యను అభ్యసించాలని ఉంటుంది.

NRI View all
title
న్యూ ఇయర్‌ వేళ విషాదం : భారత సంతతి వైద్యుడు దుర్మరణం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశంలో దుబాయ్ ఎమిరేట్,  రాస్ అల్ ఖైమాలో  జరిగిన చిన్న ప్రైవేట్  విమాన ప్రమ

title
మహిళా క్యాషియర్‌పై దాడి, అనుచిత వ్యాఖ్యలు, ఎన్‌ఆర్‌ఐకు జైలు, జరిమానా

మహిళా క్యాషియర్‌పై అనుచితంగా ప్రవర్థించిన భారత సంతతికి చెందిన  27 ఏళ్ల వ్యక్తికి  సింగపూర్‌  కోర్టు జైలు

title
సుచీర్‌ బాలాజీ కేసులో షాకింగ్ ‌ట్విస్ట్‌!

ఓపెన్‌ఏఐ విజిల్‌బ్లోయర్‌

title
యూకే స్టూడెంట్ వీసా.. మ‌రింత భారం!

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక కావడంతో భారత విద్యార్థులకు యూఎస్‌ వీసాలు కష్టమేనన్న ప్రచారం జోరందుకుంది.

title
ఖతార్‌లో తెలుగు ప్రవాసికి ప్రతిష్ఠాత్మక 'సౌత్ ఐకాన్ (ఆంధ్రప్రదేశ్)' పురస్కారం

ఖతార్‌లో జరిగిన ప్రతిష్టాత్మక "సౌత్ ఇండియన్ గ్లోబల్ టాలెంట్ అచీవర్స్ (SIGTA) అవార్డ్స్ 2024" వేడుకలో ప్రపంచవ్యాప్తంగా సు

Advertisement
Advertisement