Yuzvendra Chahal
-
అవన్నీ నిజం కాకపోవచ్చు: ఎట్టకేలకు మౌనం వీడిన చహల్
టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక వదంతులు వ్యాప్తిలోకి వచ్చాయి. భార్య ధనశ్రీ వర్మ(Dhanashree Verma)తో చహల్‌కు విభేదాలు తలెత్తాయని.. త్వరలోనే ఈ జంట విడిపోనుందనేది(Divorce Rumours) వాటి సారాంశం. అందుకు చహల్ సోషల్ మీడియా పోస్టులు ఊతమిచ్చాయి.పెళ్లి ఫొటోలు డిలీట్సతీమణి ధనశ్రీతో ఉన్న ఫొటోలన్నింటినీ యజువేంద్ర చహల్(Yuzvendra Chahal) డిలీట్ చేశాడు. పెళ్లి ఫొటోలను కూడా తన అకౌంట్ల నుంచి తీసేశాడు. అంతేకాదు.. ఈ దంపతులు సామాజిక మాధ్యమాల్లో ఒకరినొకరు అన్‌ఫాలో చేశారు. అయితే, ధనశ్రీ ఇన్‌స్టా ఖాతాలో మాత్రం చహల్‌తో దిగిన ఫొటోలు అలాగే ఉన్నాయి.కాగా ధనశ్రీ చహల్‌ను మోసం చేస్తోందంటూ అప్పట్లో రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. మరో టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ పేరుతో ఆమె పేరును ముడిపెట్టి దారుణమైన కామెంట్లు, మీమ్స్ చేశారు కొంతమంది నెటిజన్లు. మరోవైపు.. చహల్ ఇటీవల ఓ పెళ్లికి మరో అమ్మాయితో కలిసి హాజరైనట్లు ఫొటోలు బయటకు వచ్చాయి.ఆర్జేతో డేటింగ్?అంతేకాదు.. మహ్వశ్ అనే రేడియో జాకీతో కలిసి చహల్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలు కూడా వైరల్‌గా మారాయి. వీటికి మహ్వశ్ ఫ్యామిలీ అనే ట్యాగ్ జతచేయడంతో చహల్‌తో ఆమె డేటింగ్ చేస్తుందనే వదంతులు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో చహల్ కూడా ధనశ్రీకి ద్రోహం చేశాడని.. దొందూ దొందేనంటూ ఈ జంటపై విమర్శల వర్షం కురుస్తోంది.ఈ పరిణామాలపై యజువేంద్ర చహల్ ఎట్టకేలకు మౌనం వీడాడు. ‘‘మీ ప్రేమ, మద్దతు వల్లే నేను ఈస్థాయికి చేరుకోగలిగాను. అందుకు నా అభిమానులందరికీ ఎల్లకాలం రుణపడి ఉంటాను. అయితే, ఇప్పటికి ఈ ప్రయాణం ఈ ముగిసిందా?.. లేదు.. నేను వేయాల్సిన ఓవర్లు ఇంకా మిగిలే ఉన్నాయి. నా దేశం కోసం.. నా జట్టు కోసం.. నా అభిమానుల కోసం నేను ఆడుతూనే ఉంటాను.నిజం కావచ్చు.. కాకపోవచ్చు కూడా!దేశానికి ప్రాతినిథ్యం వహించే ఆటగాడిగా ఉండటం నాకెంతో గర్వకారణం. అదే విధంగా.. నేను ఓ కొడుకుని, ఒకరికి సోదరుడిని.. అలాగే చాలా మందికి స్నేహితుడిని. ఈ మధ్యకాలంలో నా వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలపై చాలా మందికి ఆసక్తి కలిగించడం సహజమే. అయితే, కొన్ని సోషల్ మీడియా పోస్టుల వల్ల పుడుతున్న వార్తలు నిజం కావచ్చు.. కాకపోవచ్చు కూడా!అందరూ బాగుండాలిఓ కొడుకుగా.. సోదరుడిగా, స్నేహితుడిగా.. మీ అందరికీ ఓ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి వదంతులు నా కుటుంబ దుఃఖానికి కారణమవుతున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ఎదుటివారికి అంతా మంచే జరగాలని కోరుకునేలా నా కుటుంబం నాకు విలువలు నేర్పించింది. అదే విధంగా.. అడ్డదారుల్లో వెళ్లకుండా.. అంకిత భావం, కఠిన శ్రమతోనే విజయాన్ని అందుకోవాలని చెప్పింది. నేను ఇప్పటికీ ఆ విలువలకే కట్టుబడి ఉన్నాను.ఆ దేవుడి దయ వల్ల మీ అందరి ప్రేమ, మద్దతు ఎల్లప్పుడూ నాతోనే ఉండాలి. కానీ మీ సానుభూతిని భరించలేను. లవ్ యూ ఆల్’’ అని చహల్ ఇన్‌స్టా స్టోరీలో సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశాడు. అయితే, ఇందులో ఎక్కడా ధనశ్రీ పేరుగానీ, భర్త అనే పదం కానీ అతడు వాడలేదు. కాబట్టి విడాకుల విషయాన్ని చెప్పకనే చెప్పాడంటూ మరోసారి గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు.డాన్స్ టీచర్‌తో ప్రేమలో పడికాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ కొరియోగ్రాఫర్, యూట్యూబర్ అయిన ధనశ్రీ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో ధనశ్రీ వద్ద డాన్స్ నేర్చుకునే క్రమంలో ఆమెతో ప్రేమల్లో పడ్డ చహల్.. ఇరు కుటుంబాల సమ్మతంతో 2020, డిసెంబరు 20న ఆమెను వివాహం చేసుకున్నాడు.ఇదిలా ఉంటే.. టీమిండియా తరఫున 2016లో అరంగేట్రం చేసిన చహల్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో స్పిన్నర్‌గా సత్తా చాటాడు. ఇప్పటి వరకు 72 వన్డేల్లో 121, 80 అంతర్జాతీయ టీ20లలో 96 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లోనూ 205 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. వచ్చే ఏడాది అతడు పంజాబ్ కింగ్స్‌కు ఆడనున్నాడు. చదవండి: వన్డే సిరీస్ నుంచి అతడికి విశ్రాంతి! -
నా మౌనం బలహీనతకు సంకేతం కాదు: చాహల్ సతీమణి
భారత స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ (Dhanashree Verma) విడాకులకు సిద్ధమవుతున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె పలుమార్లు పరోక్షంగా పోస్టులు పెడుతూనే ఉంది. అయితే, తాజాగా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. విడాకుల నేపథ్యంపై ప్రచారం మొదలైన సందర్భం నుంచి ఆమెపై ఎక్కువగా ట్రోల్స్ వస్తున్నాయి. వాటి వల్ల తాను చాలా వేదనకు గురౌతున్నట్లు ఆమె పేర్కొంది.'గత కొన్ని రోజులుగా నా కుటుంబంతో పాటు నేను కూడా చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. నా కుటుంబంపై కొందరు నిరాధారమైన వార్తలు రాస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా నాపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ట్రోల్స్ చేస్తూ నా ప్రతిష్టను కొందరు పూర్తిగా నాశనం చేస్తున్నారు. నేను చాలా కలత చెందుతున్నాను. నేను ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డాను. నా మౌనం బలహీనతకు సంకేతం కాదు. సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం చాలా సులభం. ఇలాంటి సమయంలో కూడా ఇతరులపై కరుణ చూపాలంటే ధైర్యం చాలా అవసరం. నిజం తప్పకుండా గెలుస్తోంది. నేను ఏ విషయంలోనూ సమర్థించుకోను' అని ఆమె తెలిపారు. (ఇదీ చదవండి: 'పుష్ప2' మేకింగ్ వీడియో.. బెంగాల్లో బన్నీ ఆల్ టైమ్ రికార్డ్)2020 డిసెంబర్లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ విడిపోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. 2022లో తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ‘చాహల్’ (Yuzvendra Chahal) పేరును ధనశ్రీ తొలగించింది. అప్పుడు కూడా ఇలాంటి వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ముంబయికి చెందిన దంత వైద్యురాలు అయిన ధనశ్రీ మంచి కొరియోగ్రాఫర్ కూడా. ఓ డ్యాన్స్ రియాలిటీ షోలోనూ ఆమె పోటీపడింది. తనకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో ఆమె డ్యాన్స్ వీడియోలకు మిలియన్ కొద్ది వ్యూస్ వస్తుంటాయి. స్వతహాగా డ్యాన్సర్ అయిన ధనశ్రీ వర్మ.. పలు ఆల్బమ్ సాంగ్స్‌తో చాలా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకు సినిమా ఛాన్స్ దక్కింది. తెలుగులో 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీస్తున్న ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్.. హీరోగా పరిచయమవుతున్నాడు. -
గ్లామర్‌లో హీరోయిన్లకు పోటీ ఇస్తున్న ధనశ్రీ వైరల్ ఫొటోలు
-
IPL 2025: వేలంలో చహల్‌కు కళ్లు చెదిరే ధర.. జాక్‌పాట్ కొట్టేశాడు
టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఐపీఎల్ మెగా వేలం-2025లో జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా రూ. 18 కోట్లు కొల్లగొట్టాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చహల్ కొనసాగుతున్నాడు.ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించిన చహల్.. ఏకంగా 205 వికెట్లు కూల్చాడు. తద్వారా ఇప్పటికీ లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు.ఇక ఐపీఎల్-2024లో రాజస్తాన్‌కు ఆడిన చహల్ 18 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, వేలానికి ముందు రాజస్తాన్ అతడిని వదిలేయగా.. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు.ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఆదివారం జరిగిన మొదటి సెట్వేలంలో చహల్ కోసం.. గుజరాత్ తొలుత బిడ్ వేసింది. ఈ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పోటీలో దిగింది. అయితే, ధర రూ. 15 కోట్లు దాటిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీలోకి వచ్చింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రంగంలోకి దిగింది. ఆ తర్వాత ఊహించినవిధంగా.. పంజాబ్ కింగ్స్ రేసులోకి వచ్చి ధరను రూ. 18 కోట్లకు పెంచింది. దీంతో సన్ రైజర్స్తప్పుకోగా.. పంజాబ్ చహల్‌ను దక్కించుకుంది.చదవండి: Rishabh Pant: అయ్యర్ రికార్డు బ్రేక్.. కోట్లు కొల్లగొట్టిన పంత్! లక్నో సొంతం -
చహల్ కోసం పోటా పోటీ.. రూ.12 కోట్లకు కొనుక్కున్న ఆర్సీబీ!?
ఐపీఎల్-2025 మెగా వేలానికి కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉంది. నవంబర్ 24, 25వ తేదీలలో జెడ్డా వేదికగా ఈ మెగా ఆక్షన్ జరగనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి.ఈ మెగా వేలం కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్లను ఏ ఫ్రాంచైజీ దక్కుంచుకుంటుందోనని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. తాజాగా టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ కోసం ఫ్యాన్స్ ఆన్లైన్లో మాక్ వేలం నిర్వహించారు. ఈ మెగా వేలం కోసం చహల్ తన కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీంతో రూ. 2 కోట్ల బిడ్డింగ్ నుంచే మాక్ వేలం ప్రారంభమైంది. ఈ క్రమంలో చాహల్ కోసం తొలుత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్,గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అయితే రూ.9 కోట్లకు పైగా ఆర్సీబీ వెచ్చించేందుకు సిద్దం కావడంతో పోటీ నుంచి పంజాబ్, గుజరాత్ తప్పుకొన్నాయి. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పోటీలోకి వచ్చింది. చహల్ కోసం రూ. 11.5 కోట్లకు బిడ్ వేసింది. ఆఖరికి ఈ మాక్ వేలంలో చాహల్‌ను రూ. 12 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. చహల్ ఐపీఎల్ జర్నీ ఇదే.. చహల్ 2013లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అతడు ఆర్సీబీకి 8 సీజన్ల పాటు ప్రాతినిథ్యం వహించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి ఎన్నో అద్బుత విజయాలు అందించాడు. కానీ ఆర్సీబీ ఫ్రాంచైజీ మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తూ ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. రాజస్తాన్ తరపున తొలి సీజన్లోనే పర్పుల్ క్యాప్‌ను చహల్ గెలుచుకున్నాడు. ఇప్పుడు రాజస్తాన్ కూడా చహల్ మెగా వేలంలోకి విడిచిపెట్టింది. ఈ మెగా వేలంలో చహల్‌ను ఆర్సీబీ మళ్లీ సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. కాగా చహల్ ప్రస్తుతం ఐపీఎల్లో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో ఇప్పటివరకు 155 మ్యాచ్‌లు ఆడిన చహల్.. 22.12 సగటుతో 200 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా టీమిండియా తరఫున టీ20లలో అత్యధిక వికెట్ల(96) వీరుడిగానూ ఉన్నాడుచదవండి: NPL 2024: మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్న శిఖర్ ధావన్.. -
ప్రొఫెషనల్ బ్యాటర్లా మారిన చహల్
టీమిండియా ఆటగాడు యుజ్వేంద్ర చహల్ బౌలర్‌గా అందరికీ సుపరిచితుడు. అయితే ఇతనిలో ఓ బ్యాటర్ దాగి ఉన్నాడన్న విషయం ఇప్పుడిప్పుడే బయటి ప్రపంచానికి తెలుస్తుంది. బక్క పలచని శరీరాకృతి కలిగిన చహల్ ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఇది చూసి అతని అభిమానులు ఔరా అంటున్నారు. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో చహల్ 152 బంతులు ఎదుర్కొని 48 పరుగులు చేశాడు. తాజాగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 142 బంతులు ఎదుర్కొని 27 పరుగులు చేశాడు. వేదిక ఏదైనా ఎప్పుడూ ఇంతటి సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడని చహల్ ఒక్కసారిగా ప్రొఫెషనల్ బ్యాటర్లా మారిపోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. టీమిండియాకు నయా ఆల్‌రౌండర్ దొరికాడంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగా, రంజీల్లో హర్యానాను ప్రాతినిథ్యం వహించే చహల్ తాజాగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓ మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. పదో నంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన చహల్.. తొమ్మిదో నంబర్ ఆటగాడు హర్షల్ పటేల్‌తో (72 నాటౌట్) కలిసి దాదాపు 300 బంతులు ఎదుర్కొన్నాడు. హర్షల్, చహల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడటంతో మధ్యప్రదేశ్‌పై హర్యానా పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు చేయగా.. హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి హర్యానా 123 ఆధిక్యంలో ఉంది. హర్షల్ పటేల్‌తో పాటు అమన్ కుమార్ (4) క్రీజ్‌లో ఉన్నాడు. -
భారత టెస్టు జట్టులోకి రావడమే నా లక్ష్యం: చాహల్
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సత్తాచాటిన సంగతి తెలిసిందే. కౌంటీ క్రికెట్ డివిజన్ IIలో నార్తాంప్టన్‌షైర్ ప్రాతినిథ్యం వహించిన చాహల్.. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.ఈ ఇంగ్లండ్ దేశీవాళీ టోర్నీలో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రడే ఆడిన చాహల్ ఏకంగా 19 వికెట్లు పడగొట్టాడు. అందులో రెండు ఫైవ్ వికెట్ల హాల్స్ కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ మాట్లాడుతూ.. భారత తరపున టెస్టు క్రికెట్ ఆడాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్ కోసం రేసులో ఉండాలని చాహల్ భావిస్తున్నాడు.కౌంటీ క్రికెట్ ఆడటం చాలా కష్టం. నా స్కిల్స్‌ను మరింత మెరుగుపరుచుకోవడం కోసం నాకు మంచి అవకాశం లభించింది. వచ్చే ఏడాది భారత్ ఇంగ్లండ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో రెడ్‌బాల్‌తో నా సత్తా ఎంటో సెలక్టర్లకు తెలియజేయాలనకున్నాను. నాకు కౌంటీ క్రికెట్లో ఆడే అవకాశాన్ని కల్పించిన బ్రిండన్ సర్కి ధన్యవాదాలు. ఆపై రాజస్తాన్ రాయల్స్ కోచ్‌లు సైతం నాకు ఎంతో సహాయం చేశారు. భారత టెస్టు జట్టులోకి రావడమే నా లక్ష్యమని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ పేర్కొన్నాడు. -
‘మరో ఏడాది.. మరింత అద్భుతంగా’: భార్యకు భారత క్రికెటర్ విషెస్(ఫొటోలు)
-
ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్న చహల్.. తాజాగా మరో మ్యాచ్‌లో..!
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్నాడు. కౌంటీ క్రికెట్లో చహల్ చెలరేగిపోతున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న చహల్.. లీసెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో (తొలి ఇన్నింగ్స్‌లో) సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌కు ముందు డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లతో (తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన చహల్, సెకెండ్ ఇన్నింగ్స్‌లో నాలుగు) మెరిశాడు.అంతకుముందు ఇంగ్లండ్ వన్డే కప్‌లోనూ చహల్ చెలరేగాడు. నార్తంప్టన్‌షైర్ తరఫున తన తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో చహల్ తన కోటా 10 ఓవర్లలో ఐదు మెయిడిన్లు వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చహల్ రాకతో నార్తంప్టన్‌షైర్ ఫేట్ మారిపోయింది. ఆ జట్టు వరుస విజయాలు సాధిస్తుంది. చహల్ నార్తంప్టన్‌షైర్ తరఫున ఫార్మాట్లకతీతంగా సత్తా చాటుతున్నాడు. కాగా, చహల్ టీమిండియా తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్న విషయం తెలిసిందే.మ్యాచ్ విషయానికొస్తే.. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 మ్యాచ్‌ల్లో భాగంగా లీసస్టర్షైర్తో జరుగుతున్న మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించారు. చహల్‌తో పాటు రాబ్ కియోగ్ (3/20), జాక్ వైట్ (2/16), సాండర్సన్ (1/32) సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లీసెస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 203 పరుగులకు ఆలౌటైంది. లీసెస్టర్ ఇన్నింగ్స్‌లో బుడింగర్ (56) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హిల్ (32), రెహాన్ అహ్మద్ (30) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్తంప్టన్‌షైర్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఆ జట్టు లీసెస్టర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 69 పరుగులు వెనుకపడి ఉంది. చదవండి: భారత్‌పై అక్కసు తీర్చుకున్న పాక్ హాకీ జట్టు! -
తొమ్మిది వికెట్లు తీసిన చహల్
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ సత్తా చాటాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 పోటీల్లో నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్న చహల్.. డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన చహల్, సెకెండ్ ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న నార్తంప్టన్‌షైర్ డెర్బీషైర్‌పై 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్తంప్టన్‌షైర్ 219 పరుగులకు ఆలౌటైంది. సైఫ్ జైబ్ (90) సెంచరీ చేజార్చుకోగా.. జస్టిన్ బ్రాడ్ (45) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. డెర్బీషైర్ బౌలర్లలో జాక్ చాపల్, ఆండర్సన్, జాక్ మార్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హ్యారీ మూర్, రీస్, థాంప్సన్, లాయిడ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన డెర్బీషైర్.. చహల్ (5/45), రాబ్ కియోగ్ (3/65), సాండర్సన్ (1/17), జస్టిన్ బ్రాడ్ (1/16) సత్తా చాటడంతో 165 పరుగులకు ఆలౌటైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్‌లో రీస్ (50), మాడ్సన్ (47), గెస్ట్(28), డొనాల్డ్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.211 పరుగులకు ఆలౌటైన నార్తంప్టన్‌షైర్54 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్తంప్టన్‌షైర్ 211 పరుగులకు ఆలౌటైంది. రాబ్ కియోగ్ (63) అర్ద సెంచరీతో రాణించాడు. డెర్బీ బౌలర్లలో ఆండర్సన్, జాక్ మార్లీ చెరో 3, హ్యారీ మూర్ 2, జాక్ చాపెల్, థాంప్సన్ తలో వికెట్ పడగొట్టారు.టార్గెట్ 266266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డెర్బీషైర్‌ను రాబ్ కియోగ్ (5/44), చహల్ (4/54) మరోసారి దెబ్బకొట్టారు. వీరి ధాటికి డెర్బీషైర్ 132 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్‌లో వేన్ మాడ్సన్ (48 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైన పృథ్వీ షాఈ మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్ పృథ్వీ షా రెండు ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులు చేసిన షా.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు పరుగులకు ఔటయ్యాడు.చదవండి: ఐదేసిన చహల్ -
ఐదేసిన చహల్
కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 పోటీల్లో భాగంగా డెర్బీషైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా బౌలర్ యుజ్వేంద్ర చహల్ ఐదు వికెట్ల ఘనతతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో చహల్ ఈ ఫీట్‌ను సాధించాడు. చహల్‌తో పాటు రాబ్ కియోగ్ (3/65), సాండర్సన్ (1/17), జస్టిన్ బ్రాడ్ (1/16) వికెట్లు తీయడంతో డెర్బీషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకు ఆలౌటైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్‌లో రీస్ (50), మాడ్సన్ (47), గెస్ట్(28), డొనాల్డ్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.FIVE-WICKET HAUL FOR YUZI CHAHAL...!!!! 👌Chahal took 5 wickets for 45 runs in County against Derbyshire, What a spell by the Champion of India. pic.twitter.com/1IzH2xow0W— Johns. (@CricCrazyJohns) September 10, 2024అంతకుముందు నార్తంప్టన్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకు ఆలౌటైంది. సైఫ్ జైబ్ (90) సెంచరీ చేజార్చుకోగా.. జస్టిన్ బ్రాడ్ (45) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. డెర్బీషైర్ బౌలర్లలో జాక్ చాపల్, ఆండర్సన్, జాక్ మార్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హ్యారీ మూర్, రీస్, థాంప్సన్, లాయిడ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.రెండు ఇన్నింగ్స్‌ల్లో ఫెయిల్ అయిన పృథ్వీ షాఈ మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్ పృథ్వీ షా రెండు ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులు చేసిన షా.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు పరుగులకు ఔటయ్యాడు. ఆట రెండో రోజు రెండో సెషన్ సమయానికి నార్తంప్టన్‌షైర్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. షా, ప్రాక్టర్ (2) ఔట్ కాగా.. గస్ మిల్లర్ (15), జేమ్స్ సేల్స్ (7) క్రీజ్‌లో ఉన్నారు.అరంగేట్రంలోనూ ఐదేసిన చహల్చహల్ గత నెలలో జరిగిన ఇంగ్లండ్ వన్డే కప్‌లోనూ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. నార్తంప్టన్‌షైర్ తరఫున తన తొలి మ్యాచ్‌లో కెంట్‌పై ఈ ఫీట్‌ను సాధించాడు. ఆ మ్యాచ్‌లో చహల్ తన కోటా 10 ఓవర్లలో ఐదు మెయిడిన్లు వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫలితంగా తన జట్టు కెంట్‌పై ఘన విజయం సాధించింది. చహల్ టీమిండియా తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్న విషయం తెలిసిందే. -
చహల్ మాయాజాలం.. తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ డొమెస్టిక్ వన్డే కప్‌లో నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న చహల్.. ఈ కౌంటీ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. కెంట్‌తో ఇవాళ (ఆగస్ట్ 14) జరిగిన మ్యాచ్‌లో చహల్ ఈ ఘనత సాధించాడు. చహల్ మాయాజాలం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన కెంట్ 35.1 ఓవర్లలో 82 పరుగులకు కుప్పకూలింది. చహల్ 10 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐదు మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం. చహల్‌తో పాటు జస్టిన్ బ్రాడ్ (6.1-1-16-3), లూక్ ప్రోక్టర్ (10-2-25-2) కూడా రాణించడంతో కెంట్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టు తరఫున జేడెన్ డెన్లీ (22), ఏకాంశ్ సింగ్ (10), మ్యాట్ పార్కిన్సన్ (17 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. YUZI CHAHAL SHOW: 10-5-14-5. ⭐ pic.twitter.com/byxSVc404X— Mufaddal Vohra (@mufaddal_vohra) August 14, 2024అనంతర 83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్తంప్టన్‌షైర్ 14 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. పృథ్వీ షా 17 పరుగులు చేసి ఔట్ కాగా.. జేమ్స్ సేల్స్ 33, జార్జ్ బార్లెట్ 31 పరుగులతో అజేయంగా నిలిచారు. బేయర్స్ స్వేన్పోయెల్కు పృథ్వీ షా వికెట్ దక్కింది. కాగా, చహల్ ఈ మ్యాచ్‌తో పాటు ఐదు కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్‌లు ఆడేందుకు నార్తంప్టన్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. నార్తంప్టన్‌షైర్ ఈ మ్యాచ్‌లో గెలిచినా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించలేదు. ఇంగ్లండ్ డొమెస్టిక్ వన్డే కప్‌లో గ్రూప్ దశ మ్యాచ్‌లు ఇవాల్టితో ముగుస్తాయి. ఆగస్ట్ 16న క్వార్టర్ ఫైనల్స్, 18న సెమీస్, సెప్టెంబర్ 22న ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. -
చహల్‌కు విషెస్.. నీ బిగ్గెస్ట్ చీర్ లీడర్ నేనే అంటున్న భార్య (ఫొటోలు)
-
కళ్లు చెదిరే అందం.. టీమిండియా స్టార్ భార్య ఫొటోలు వైరల్
-
RR Vs SRH: చాహల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డును చాహల్ నెలకొల్పాడు. ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో క్వాలిఫయర్-2లో రెండు సిక్స్‌లు ఇచ్చిన చాహల్.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో చాహల్ ఇప్పటివరకు 224 సిక్స్‌లు ఇచ్చాడు. ఇంతుకుముందు ఈ రికార్డు భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా(222) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో చావ్లాను చాహల్ అధిగమించాడు. ఇక కీలక మ్యాచ్‌లో చాహల్ నిరాశపరిచాడు. తన నాలుగు ఓవర్లలో కోటాలో వికెట్లు ఏమీ తీయకుండా 34 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రాహుల్ త్రిపాఠి(37), హెడ్(34) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ రెండు వికెట్లు సాధించాడు. -
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీమిండియా స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్(అంతర్జాతీయ క్రికెట్, లీగ్‌లు)లో 350 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి భారత బౌలర్‌గా చాహల్ రికార్డులకెక్కాడు.ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ను ఔట్ చేసిన చాహల్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. చాహల్ ఇప్పటివరకు 350 వికెట్లు పడగొట్టాడు. చాహల్ తర్వాత స్ధానంలో భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా 310 వికెట్లతో ఉన్నాడు.ఇక ఐపీఎల్లో సైతం అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా చాహల్(201) కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్లు జెక్ ఫ్రెజర్ మెక్ గర్క్(20 బంతుల్లో 50), అభిషేర్ పోరెల్(65) అదరగొట్టారు. వీరిద్దరితో పాటు ఆఖరిలో ట్రిస్టన్ స్టబ్స్ మెరుపులు మెరిపించాడు.20 బంతులు ఎదుర్కొన్న స్టబ్స్.. 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడువికెట్లు పడగొట్టగా.. చాహల్, బౌల్ట్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు. -
IPL 2024: భర్తను చీర్ చేసేందుకు వచ్చిన ధనశ్రీ వర్మ.. లేటెస్ట్ పిక్స్
-
నేనొక ఫైటర్.. వెనకడుగు వేయను: ధనశ్రీ వర్మ
టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన భర్త చాహల్‌తో కలిసి వీడియోలు, రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ధనశ్రీ తను చేసిన ఓ పని వల్ల విపరీతమైన ట్రోల్స్‌కు గురైంది. ధనశ్రీ.. హిందీ పాపులర్ డ్యాన్స్ షో జలక్ దికలాజాలో కంటెస్టెంట్‌గా బరిలోకి దిగింది. ఈ షో ఫైనల్ సందర్భంగా కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉతేకర్‌తో ధనశ్రీ వర్మ అత్యంత సన్నిహతంగా దిగిన ఫొటో వైరల్‌గా మారింది. దీంతో ధనశ్రీని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేశారు. భర్తను మోసం చేస్తూ ఇలాంటి పనులు చేయడం సరికాదని, నీకు పెళ్లైందని గుర్తుపెట్టుకో అంటూ కామెంట్లు చేశారు. తాజాగా తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందిస్తూ ధనశ్రీ వర్మ ఓ వీడియో విడుదల చేసింది. "అస్సలు మీరు ఎలా ఏదో ఏదో ఊహించుకుంటారు. మీ అభిప్రాయాలను వ్యక్తం చేసేముందు దయచేసి మనుషులగా ఆలోచించండి. నేను ట్రోల్స్, మీమ్స్‌ను పట్టించుకోను. నా పనిని నేను చేసుకుంటూ పోతాను. కొన్నిసార్లు ఇటువంటి వాటిని చూసి నాలో నేను నవ్వుకుంటాను. కానీ ఈ సారి ఈ చెత్త ట్రోల్స్‌పై స్పందించాల్సి వచ్చింది. ఎందుకంటే ఈసారి అవి నా కుటుంబాన్ని, నా సన్నిహితులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. సోషల్ మీడియా వేదికల్లో అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ అందరికి ఉంది. కానీ ఇతరుల వ్యక్తి గత జీవితాన్ని టార్గెట్ చేసి మనోభావాలను దెబ్బతీయడం సరికాదు. కొంత మంది ద్వేషాన్ని, విద్వేషాన్ని వ్యాప్తి చేయడమే పనిగా పెట్టుకున్నారు. నా పనిలో సోషల్ మీడియా ప్రధాన భాగం కాబట్టి నేను విడిచిపెట్టలేను. కాబట్టి మీరు కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించి.. మా ప్రతిభ, నైపుణ్యాలను గమనించాలని కోరుతున్నా. మేమంతా మిమ్మల్ని అలరించడానికే సోషల్ మీడియాలో ఉన్నాము. మీ అమ్మ, మీ సోదరి, మీ స్నేహితురాలు, మీ భార్య లాగే నేను కూడా ఒక స్త్రీని అనే విషయాన్ని మర్చిపోకండి. నేను ఒక పోరాట యోధురాలిని. .ఏ విషయానికి భయపడి వెనకడుగు వేయను. ఇకనైనా ఈ వేదికగా ప్రేమను పంచండి. కాస్త సున్నితంగా వ్యవహరించండి. విద్వేషం వ్యాప్తి చేయకండి. మంచి విషయాలపై దృష్టి మీ జీవితంలో ముందుకు సాగాలని నేను ఆశిస్తున్నాని ధనశ్రీ పేర్కొంది. View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
చహల్ భార్య ధనశ్రీ వర్మ చార్మింగ్ లుక్స్ (ఫొటోలు)
-
అతడితో చహల్ భార్య ధనశ్రీ ఫొటో.. రచ్చ రచ్చ.. పదే పదే ఇలా?
టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ సతీమణి ధనశ్రీ వర్మ మరోసారి విమర్శల పాలయ్యారు. యూట్యూబర్, కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చున్న ఈ డాక్టరమ్మ తీరు చహల్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ‘‘చహల్ భయ్యా కూడా మీతో పదే పదే ఇదే తరహాలో వ్యవహరిస్తే భరించగలరా? లేదంటే.. ప్రచార యావ కోసం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటివి చేస్తున్నారా?’’ అంటూ తీవ్ర స్థాయిలో ధనశ్రీని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది?! టీమిండియా బౌలర్‌గా కెరీర్ తారస్థాయిలో ఉన్న సమయంలో ధనశ్రీ వర్మను పెళ్లి చేసుకున్నాడు చహల్. డిసెంబరు 22, 2020లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో.. స్వతహాగా కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ తొలుత తనకు నృత్య పాఠాలు నేర్పిందని.. ఈ క్రమంలోనే తాము ప్రేమలో పడి పెళ్లిదాకా వచ్చినట్లు చహల్ ఓ సందర్భంలో తెలిపాడు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ధనశ్రీకి భర్తతో కలిసి దిగిన ఫొటోలు, అతడితో కలిసి చేసిన రీల్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం అలవాటు. అలాగే తన వృత్తిగత విషయాలను ఆమె షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో గతేడాది తన ఇన్‌స్టా అకౌంట్లో చహల్ ఇంటి పేరును ఆమె తొలగించడంతో విడాకుల వదంతులు తెరమీదకు వచ్చాయి. అదే సమయంలో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో ధనశ్రీ సన్నిహితంగా మెలగడమే ఇందుకు కారణమని కొంతమంది నెటిజన్లు అసభ్యకరరీతిలో కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో యజువేంద్ర చహల్- ధనశ్రీ వర్మ స్పందిస్తూ.. విడాకుల విషయాన్ని కొట్టిపారేశారు. అయినప్పటికీ ధనశ్రీ చర్యలను జడ్జ్ చేయడం మానలేదు నెటిజన్లు. చహల్‌కు అప్పట్లో ఉన్న క్రేజ్ దృష్ట్యానే అతడిని ఆమె పెళ్లాడిందనే తమ సొంత అభిప్రాయాలను వీరి బంధానికి ఆపాదిస్తూ ఇష్టారీతిన కథనాలు అల్లేశారు. తాజాగా ధనశ్రీ వర్మ దిగిన ఓ ఫొటో మరోసారి ఇలాంటి ట్రోల్స్‌కు కారణమైంది. ధనశ్రీ ప్రస్తుతం ఝలక్ దిఖ్లాజా అనే టీవీ షోలో భాగమయ్యారు. ఈ క్రమంలో మరో కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్‌తో అత్యంత సన్నిహితంగా దిగిన ఫొటో బయటకు వచ్చింది. ప్రతీక్ స్వయంగా ఈ పిక్చర్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నెటిజన్లు ధనశ్రీ తీరును విమర్శిస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం వృత్తిగతం(యాక్టింగ్, డ్యాన్స్)గా ప్రమోషన్స్‌లో భాగంగా ఇలాంటి ఫొటోలను చేయడాన్ని తప్పుపట్టని వారు.. ఒక్క ఫొటోతో ఒకరి వ్యక్తిత్వాన్ని ఎలా నిర్ణయిస్తారు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఝలక్ దిఖ్లా జా షోలో ఫైనల్స్ వరకు వెళ్లిన ధనశ్రీ వర్మ విజేతగా నిలవలేకపోయింది. ఈ సీజన్లో ఫైనల్ వరకూ వచ్చిన మనీషా రాణి అనే మరో ఫిమేల్ కంటెస్టెంట్ ట్రోఫీని అందుకున్నారు. What will be the Dhanashree Verma reaction if Yuzvendra Chahal does this constantly with his ladies friends ? We all are human and any husband who loves his wife will be hurt by these incidents. This is utter nonsense, and needs to be stopped. pic.twitter.com/xKW2tf7K9v — Sujeet Suman (@sujeetsuman1991) March 2, 2024 I wouldn't post such an intimate pic on instagram even if it was with my wife #ShameOnDhanshree #YuziChahal pic.twitter.com/9pEhXEmtAi — brigadier🇮🇳 (@brigadierdude) March 2, 2024 -
బీసీసీఐ షాకిచ్చింది.. చహల్ అక్కడ అలా!
టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ చాలా కాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. గతేడాది జూలైలో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా బరిలోకి దిగిన అతడు మళ్లీ పునరాగమనం చేయలేదు. షాకిచ్చిన బీసీసీఐ వన్డే ప్రపంచకప్-2023 జట్టులోనూ అతడికి స్థానం దక్కలేదు. ఇటీవల సౌతాఫ్రికా పర్యటనకు ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ ఇవ్వలేదు సెలక్టర్లు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టుతో పాతుకుపోవడంతో చహల్‌కు అవకాశాలు సన్నగిల్లాయి. ఈ క్రమంలో 2023-24 ఏడాదికి గానూ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలోనూ యజువేంద్ర చహల్‌కు మొండిచేయి చూపింది బీసీసీఐ. ఐపీఎల్లో కింగ్ ఈ నేపథ్యంలో ఇక ఐపీఎల్‌లోనే మళ్లీ యుజీ స్పిన్ మాయాజాలాన్ని చూసే వీలుంది. గత సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన చహల్ 14 మ్యాచ్‌లలో కలిపి 21 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు(187) తీసిన బౌలర్‌గా చహల్ చరిత్రకెక్కాడు. చుక్కలు చూపించిన సంగీత ఇదిలా ఉంటే.. తనకు దొరికిన విరామ సమయాన్ని భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ కోసం కేటాయించాడు చహల్. ధనశ్రీ ప్రస్తుతం ఝలక్ దిఖ్లాజా షోతో బిజీగా ఉంది. భారత రెజ్లర్ సంగీత ఫొగట్ కూడా ఈ టీవీ షోలో పాల్గొంది. ఈ నేపథ్యంలో విరామ సమయంలో చహల్‌తో కలిసి సంగీత సందడి చేసింది. అతడిని గొర్రెపిల్లలా వీపుపై వేసుకుని గిరాగిరా తిప్పుతూ తన రెజ్లింగ్ నైపుణ్యాలు ప్రదర్శించింది. ఆ సమయంలో చహల్ కిందపడతానేమోన్న భయంతో దింపేయమంటూ వేడుకున్నా ఆమె వినలేదు. View this post on Instagram A post shared by Tadka Bollywood (@tadka_bollywood_) ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. కాగా ఫొగట్ సిస్టర్స్‌లో చిన్నవారైన సంగీత ఫొగట్.. స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాను వివాహమాడింది. ఇక ఝలక్ దిఖ్లాజా షోలో పాల్గొన్న సంగీత తాజాగా ఎలిమినేట్ అయింది. ధనశ్రీ వర్మ మాత్రం టాప్-5లో కొనసాగుతోంది. చదవండి: అతడు తప్పు చేయలేదు.. అలాంటపుడు శిక్ష ఎందుకు? -
'అతడొక లీడింగ్ వికెట్ టేకర్.. అయినా కాంట్రాక్ట్ నుంచి'
బీసీసీఐ తాజాగా 2024-25 ఏడాదికి గానూ వార్షిక ఆటగాళ్ల కాంట్రాక్టులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో భారత స్టార్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ లిస్ట్‌లో వీరిద్దరితో పాటు చాలా మంది క్రికెటర్ల పేర్లు లేవు. అందులో స్టార్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఒకడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి చాహల్‌ను తప్పించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని చోప్రా తెలిపాడు. "సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో యూజీ చాహల్ పేరు లేకపోవడం చూసి నేను ఆశ్యర్యపోయాను. ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే,శిఖర్ ధావన్, దీపక్ హుడాలను తప్పించడంలో ఒక అర్ధముంది. కానీ చాహల్ టీ20ల్లో భారత తరుపున లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. అటువంటి ఆటగాడికి కాంట్రాక్ట్ దక్కకపోవడం దురదృష్టకరం. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం దేనికి సంకేతమో నాకు అర్ధం కావడం లేదు. బహుశా వారు చాహల్ స్ధానంలో కొత్త ఆటగాడిని వెతుకుతున్నట్లున్నారని" తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు. కాగా చాహల్ గతేడాది ఆగస్టు నుంచి జట్టుకు దూరంగా ఉంటున్నాడు. -
Dhanashree Verma Pics: కొత్త సంవత్సరం వేళ చహల్ భార్య ధనశ్రీ ఇలా..గ్లామర్ ఫొటోలు
-
ఒకే రోజున టీమిండియా క్రికెటర్ల వివాహ వార్షికోత్సవం (ఫొటోలు)
-
పెళ్లిళ్లు అక్కడే నిశ్చయమవుతాయంటారు: చహల్ భావోద్వేగం
‘‘నా ప్రియమైన సతీమణి... మనం మొట్టమొదటిసారి కలిసిన రోజు నుంచి ఈ క్షణం దాకా.. ఈ ప్రయాణంలోని ప్రతీ సెకండ్ నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయంటారు. ఈ మాట ఎవరు చెప్పారో గానీ.. సరిగ్గా నా కోసం చెప్పినట్లే ఉంది. ప్రతి రోజు నా వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరచుకునేలా చేస్తున్నావు. నీ రాకతో నేను సంపూర్ణమయ్యాను!! నా ప్రేమ దేవతకు పెళ్లిరోజు శుభాకాంక్షలు’’ అంటూ టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ భార్య ధనశ్రీ వర్మ పట్ల ప్రేమను చాటుకున్నాడు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా సతీమణికి కవితాత్మక సందేశాన్ని బహుమతిగా ఇచ్చాడు. Dear wifey , From the first day we met to this moment, every second of this journey has been close to my heart. They say matches are made in heaven and I am sure whoever has written our script is on my side 💕 You make me a better human being every single day.❤️ You complete… pic.twitter.com/1xxe8KqfSt — Yuzvendra Chahal (@yuzi_chahal) December 22, 2023 ఈ సందర్భంగా తన నిచ్చెలితో దిగిన అందమైన ఫొటోలను యుజీ ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. ఇందుకు స్పందనగా ధనశ్రీ సైతం.. ఓ పాటకు తామిద్దరం డాన్స్ చేసిన వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంది. మూడేళ్లుగా పరస్పర సహకారంతో తమ ప్రయాణం ఇక్కడిదాకా వచ్చిందంటూ భర్త పట్ల ఆప్యాయతను చాటుకుంది. View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) కాగా టీమిండియా బౌలర్‌గా కెరీర్లో తారస్థాయిలో ఉన్న సమయంలో యూట్యూబర్ ధనశ్రీ వర్మను చహల్ పెళ్లాడాడు. 2020, డిసెంబరు 22న గూర్గావ్లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి జరిగింది. అయితే, కొన్నాళ్ల క్రితం ధనశ్రీ తన ఇన్‌స్టా అకౌంట్లో చహల్ ఇంటి పేరును తొలగించడంతో వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వదంతులు వచ్చాయి. అంతేకాదు.. టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో ధనశ్రీ పేరును ముడిపెట్టి అసభ్యకరమైన రీతిలో ట్రోల్ చేశారు కొంతమంది నెటిజన్లు. ఈ క్రమంలో యజువేంద్ర చహల్ స్వయంగా స్పందించి విడాకుల రూమర్స్‌ను కొట్టిపడేశాడు. ధనశ్రీ సైతం భర్తతో కలిసి ఉన్న వీడియో షేర్ చేసి పుకార్లకు చెక్ పెట్టింది. View this post on Instagram A post shared by Sanju V Samson (@imsanjusamson) ఇదిలా ఉంటే.. టీమిండియా యువ బ్యాటర్ సంజూ శాంసన్ పెళ్లిరోజు కూడా నేడు. ఈ సందర్భంగా సతీమణికి విష్ చేస్తూ అందమైన ఫొటోలను పంచుకున్నాడు సంజూ. కాగా తన చిన్ననాటి స్నేహితురాలు చారులతా రమేశ్‌ను ఐదేళ్ల క్రితం వివామమాడాడు సంజూ. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న ఈ కేరళ బ్యాటర్ మూడో వన్డేలో శతకం బాది టీమిండియాను గెలిపించాడు. మరోవైపు.. చహల్‌కు మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. చదవండి: బజరంగ్ పునియా సంచలన ప్రకటన.. ప్రధాని మోదీకి లేఖ!