Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP High Court Reserved Verdict On Pinnelli Ramakrishna Reddy Bail Petition
AP High Court : పిన్నెల్లి కేసులో రికార్డులు మార్చిందెవరు?

అమరావతి: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో కొందరు పోలీసులు తీరు ప్రశ్నార్థకంగా మారింది. ఇవ్వాళ హైకోర్టు ముందు జరిగిన విచారణలో ఏపీ డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా, పల్నాడు పోలీసుల తీరు పలు ప్రశ్నలకు దారి తీసేలా మారింది.ఏం జరిగింది? ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలపై ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈవీఎంకు సంబంధించి ఒక కేసు నమోదయింది. దీనిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు ఈవీఎం డ్యామేజీ కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఈనెల 23న హైకోర్టులో ఊరట ఇచ్చింది. అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు ఉన్నందున కేసులోకి వెళ్లట్లేదని, పిన్నెల్లిని జూన్ 5 వరకూ అరెస్టు చేయవద్దని హైకోర్టు తేల్చిచెప్పింది. పోలీసులు ఏం చేశారు?హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఇవ్వడంతో కొందరు పోలీసు అధికారులు ప్లాన్‌ మార్చారు. డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా, పల్నాడు పోలీసులు ఉద్దేశపూర్వకంగా పిన్నెల్లిపై వరుస కేసులు పెట్టారు. కౌంటింగ్‌ తేదీ కంటే ముందే పిన్నెల్లిని అరెస్ట్‌ చేయాలని, అసలు ఆ సమయంలో పిన్నెల్లి లేకుండా చూడాలని నిర్ణయించారు. ఈవీఎం కేసు ఉండగానే పిన్నెల్లిపై మరో మూడు కేసులు పెట్టారు. ఇదే సమయంలో పిన్నెల్లిని అరెస్ట్‌ చేస్తారంటూ ఎల్లో మీడియాకు లీకులిచ్చారు. హైకోర్టులో ఏం తేలింది? ఒకదాని వెంట ఒకటి వరుస కేసులు పెడుతుండడంతో .. పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వాదనల సందర్భంగా పోలీసులకు సంబంధించి ఓ కీలకమైన కుట్ర బయటపడింది. ఈ కేసులను ఎప్పుడు పెట్టారంటూ హైకోర్టు ప్రశ్నించగా.. మే 22న నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై పిన్నెల్లి తరపున లాయర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆయన హైకోర్టు న్యాయమూర్తికి తెలిపారు. దీంతో ఈ విషయంలో మొత్తం రికార్డులు తెప్పించమని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ముందు రికార్డులు సమర్పించగా.. వాటిని హైకోర్టు న్యాయమూర్తి పరిశీలించారు. ఆ రికార్డుల్లో ఏం తేలిందంటే.. పిన్నెల్లిపై అదనంగా మోపిన మూడు కేసులు మే 23న పోలీసులు నమోదు చేశారుఅది కూడా ఈవీఎంల కేసులో హైకోర్టు ఆదేశాల తర్వాత కేసులు నమోదు చేశారుఆ తర్వాత మే 24నే స్థానిక మెజిస్ట్రేట్‌కు తెలియపరిచారుఅయినా హైకోర్టుకు కేసు నమోదు విషయంలో పోలీసులు తప్పుడు సమాచారం అందించారుహైకోర్టు విచారణ సందర్భంగా ఇంకేం తేలింది?ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో లేకుండా లాయర్‌ అశ్వనీకుమార్‌ను రంగంలోకి దించారుపోలీసుల తరపున ఒక లాయర్‌ వాదించాలంటే కొన్ని నిబంధనలు పాటించాలినిబంధనలన్నింటిని తుంగలో తొక్కి అశ్వనీకుమార్‌ను వాదనల కోసం తెచ్చారుఅశ్వనీ కుమార్‌ ద్వారా ముందే కేసు నమోదు చేశామంటూ తప్పుడు సమాచారాన్ని హైకోర్టుకు ఇచ్చారుతమ వాదనలు వినిపిస్తున్న పోలీసు పిపికి కూడా సమాచారం ఇవ్వని డిజిపి, పోలీసులుఇవ్వాళ కోర్టుకు రాని అశ్వనీకుమార్‌ఇదే కేసులో టిడిపి లీగల్‌ సెల్‌ లాయర్‌ పోసానితో ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేయించారుఇవ్వాళ కోర్టు ముందు వాదనలు వినిపించిన టిడిపి లీగల్‌ సెల్‌ లాయర్‌ పోసాని వెంకటేశ్వర్లురికార్డులను పరిశీలించిన తర్వాత హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. వాస్తవాలు ఇలా ఉంటే పోలీసులు పీపీ ద్వారా, స్పెషల్ కౌన్సిల్ అశ్వనీకుమార్ ద్వారా కోర్టుకు ఎందుకు తప్పడు సమాచారం ఇచ్చారో అర్థం కావడం లేదంటూ పిన్నెల్లి తరఫు న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో హైకోర్టు పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌పై కోర్టు తీర్పు వాయిదా వేసింది. పిన్నెల్లి విషయంలో వ్యక్తిగత కక్ష కనిపిస్తోందని తాజా ఘటనల ద్వారా అర్థమవుతోంది. ఈ కేసులో డీజీపీ, పల్నాడు పోలీసుల తీరు రోజురోజుకూ దిగజారుతోంది. కౌంటింగ్ సమయంలో పిన్నెల్లి లేకుండా చేయడానికి కొందరు పోలీసు అధికారులు కుట్ర పన్నుతున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని పిన్నెల్లి లాయర్‌ హైకోర్టుకు తెలిపారు. "పీపీకి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా, దాన్ని సమర్థించేందుకు స్పెషల్ కౌన్సిల్‌ను కూడా పెట్టారని పిన్నెల్లి తరఫు న్యాయవాది తెలిపారు. హైకోర్టు చరిత్రలో ఇదొక తప్పుడు సంప్రదాయమని తెలిపారు.

Supreme Court Comments On Guarantees In Manifesto
రాజకీయ పార్టీల హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోల్లో ఇచ్చే హామీలు అవినీతి కిందకు రావని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హామీలు ఇవ్వడం అంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఓటర్లకు ఆర్థిక సాయం చేసినట్లే అవుతుందని, ఇది అవినీతేనని పిటిషనర్‌ చేసిన వాదనతో సుప్రీం ఏకీభవించలేదు. పిటిషనర్‌ వాదన వింతగా ఉందని జస్టిస్‌ సూర్యకాంత, జస్టిస్‌ వీకే విశ్వనాథన్‌లతో కూడిన బెంచ్‌ అభిప్రాయపడింది. కాగా, రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలకు సంబంధించిన మరో కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారంటీలు అవినీతి కిందకే వస్తాయని, అందుకే ఆ పార్టీ నుంచి గెలుపొందిన అభ్యర్థిని పక్కన పెట్టాలని ఒక ఓటరు స్థానిక హైకోర్టును ఆశ్రయించాడు.

IPL 2024 SRH Owner Kavya Maran Personal Life: Myths And Facts if She Has
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్‌ లైఫ్‌లో..

ఐపీఎల్‌ వేలం మొదలు... స్టేడియంలో తన జట్టును ఉత్సాహపరచడం.. గెలిచినపుడు చిన్న పిల్లలా సంబరాలు చేసుకోవడం.. ఓడినపుడు అంతే బాధగా మనసు చిన్నబుచ్చుకోవడం..అంతలోనే ఆటలో ఇవన్నీ సహజమే కదా అన్నట్లుగా ప్రత్యర్థిని అభినందిస్తూ చప్పట్లు కొట్టడం.. ఇలా ప్రతీ విషయంలోనూ ఆమె ఓ ప్రత్యేక ఆకర్షణ. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ను ఫాలో అయ్యే వాళ్లలో చాలా మందికి ఆమె కంటే క్రష్‌.ఆమె మ్యాచ్‌ వీక్షించడానికి వచ్చిందంటే చాలు.. ఆద్యంతం తను పలికించే హావభావాలు.. స్టాండ్స్‌లో చుట్టుపక్కల వారితో తను మెదిలే విధానం.. ఆనాటి హైలైట్స్‌లో ముఖ్యమైనవిగా నిలుస్తాయనడం అతిశయోక్తి కాదు‌.తను నవ్వితే అభిమానులూ నవ్వుతారు. తను భావోద్వేగంతో కంటతడి పెడితే తామూ కన్నీటి పర్యంతమవుతారు. ఐపీఎల్‌-2024 ఫైనల్‌ సందర్భంగా ఇలాంటి దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ఆమె పేరేంటో అర్థమైపోయిందనుకుంటా.. యెస్.. కావ్యా మారన్‌. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ ఓనర్‌.వేల కోట్ల సామ్రాజ్యానికి ఏకైక వారసురాలుదేశంలోనే అతి పెద్ద మీడియా గ్రూపులో ఒకటైన సన్‌ టీవీ గ్రూప్‌ నెట్‌వర్క్‌ అధినేత కళానిధి మారన్‌- కావేరీ మారన్‌ దంపతుల ఏకైక కుమార్తె. వేల కోట్ల సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు.తమిళనాడులోని చెన్నైలో ఆగష్టు 6, 1992లో జన్మించారు కావ్య. అక్కడే స్టెల్లా మేరీ కాలేజీలో బీకామ్‌ చదివిన ఆమె.. 2016లో ఇంగ్లండ్‌లోని వార్విక్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు.తల్లిదండ్రులు ఇద్దరూ వ్యాపారవేత్తలే కావడంతో కావ్య కూడా అదే బాటలో పయనిస్తున్నారు. 2018లో సన్‌రైజర్స్‌ సీఈఓగా ఎంట్రీ ఇచ్చిన కావ్య.. అంతకంటే ముందే సన్‌ మ్యూజిక్‌, సన్‌ టీవీ ఎఫ్‌ఎం రేడియోలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.తీవ్ర స్థాయిలో విమర్శలుఇక ఐపీఎల్‌లో వేలం మొదలు కెప్టెన్‌ నియామకం వరకు అన్ని విషయాల్లోనూ భాగమయ్యే కావ్యా మారన్‌.. ఈ ఏడాది అనుకున్న ఫలితాలు రాబట్టడంలో సఫలమయ్యారు. కానీ.. సీజన్‌ ఆరంభంలో మాత్రం తీవ్ర విమర్శల పాలయ్యారు కావ్య.ఆస్ట్రేలియా కెప్టెన్‌, వన్డే వరల్డ్‌కప్‌-2023 విజేత ప్యాట్‌ కమిన్స్‌ కోసం ఏకంగా.. రూ. 20.50 కోట్లు ఖర్చు చేయడం.. అతడిని కెప్టెన్‌గా నియమించడం, బ్రియన్‌ లారా స్థానంలో డానియల్‌ వెటోరీని కోచ్‌గా తీసుకురావడం వంటి నిర్ణయాలను మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు.ఇప్పటికే ఐడెన్‌ మార్క్రమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, ట్రావిస్‌ హెడ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ వంటి వాళ్లు జట్టులో ఉండటంతో తుదిజట్టు కూర్పు ఎలా ఉంటుందో అంటూ ఎద్దేవా చేశారు. పేపర్‌ మీద చూడటానికి జట్టు బాగానే కనిపిస్తున్నా.. మైదానంలో తేలిపోవడం ఖాయమంటూ విమర్శించారు.సంచలన ప్రదర్శనఅయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ సన్‌రైజర్స్‌ ఈసారి అద్భుతాలు చేసింది. గతేడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన హైదరాబాద్‌ ఈసారి సంచలన ప్రదర్శనతో ఫైనల్‌ చేరింది.విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా నిలిచి లీగ్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డులు సృష్టించింది. అయితే, తుదిమెట్టుపై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో ఓటమి పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది.చెన్నై వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలడం.. కేకేఆర్‌ ఏకపక్షంగా గెలవడంతో కావ్యా మారన్‌ కన్నీటి పర్యంతమయ్యారు. కన్నీళ్లు కారుస్తూనే కేకేఆర్‌ను అభినందించారు కూడా!ఈ నేపథ్యంలో కావ్య మంచి మనసును కొనియాడుతూ ఆమె అభిమానులు సైతం ఉద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో సన్ నెట్‌వర్క్‌ మాజీ ఉద్యోగిగా చెప్పుకొన్న ఓ నెటిజన్‌ పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.ఆమెను ఒంటరితనం నుంచి బయటపడేసేందుకు మాత్రమే!‘‘తన తలిదండ్రుల కంటే కూడా కావ్య ఎంతో గొప్ప వ్యక్తి. మంచి మనసున్న అమ్మాయి. కానీ ఎందుకో తనకు ఎక్కువగా ఫ్రెండ్స్‌ ఉండరు. సన్‌ మ్యూజిక్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ మినహా ఇతర కంపెనీ బాధ్యతలేవీ తల్లిదండ్రులు ఆమెకు అప్పగించరు.ఇది కూడా ఆమెను ఒంటరితనం నుంచి బయటపడేసేందుకు మాత్రమే!ఐపీఎల్‌ వేలం సమయంలో కావ్య గురించి చాలా మంది జోకులు వేశారు. కానీ క్రికెట్‌ పట్ల తనకున్న ప్యాషన్‌ వేరు. వేలం నుంచి ఫైనల్‌ దాకా ప్రతి విషయంలోనూ తనదైన ముద్ర వేయగలిగింది. తను కోరుకున్న ఫలితాలు రాబట్టింది.కావ్య మిలియనీర్‌ అయినప్పటికీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓనర్‌(సంజీవ్‌ గోయెంకా కేఎల్‌ రాహుల్‌ను బహిరంగంగానే తిట్టడం)లా కాదు. ఫైనల్లో తమ జట్టు ఓటమిపాలైనా కన్నీళ్లు దిగమింగుకుంటూ నవ్వడానికి ప్రయత్నించిన గొప్ప హృదయం ఉన్న వ్యక్తి’’ అని సదరు నెటిజన్‌ పేర్కొన్నారు.ఒంటరితనమా? ఎందుకు?తన పోస్టులో సదరు నెటిజన్‌ కావ్య ఒంటరితనం నుంచి విముక్తి పొందడం కోసమే ఈ వ్యాపకాలు అంటూ పేర్కొనడం చర్చనీయాంశమైంది. తోబుట్టువులు, స్నేహితులు(ఎక్కువగా) లేరు కాబట్టి ఇలా అన్నారా?లేదంటే 32 ఏళ్ల కావ్య వ్యక్తిగత జీవితంలో ఏమైనా దెబ్బతిన్నారా? అనే చర్చ జరుగుతోంది. కాగా కావ్య ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నారు. గతంలో.. తమిళ ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌, టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌తో కావ్య పేరును ముడిపెట్టే ప్రయత్నం చేశారు గాసిప్‌రాయుళ్లు.అయితే, అవన్నీ వట్టి వదంతులేనని తేలిపోయింది. మరికొన్ని సైట్లు మాత్రం కావ్య ఓ బిజినెస్‌మేన్‌తో గతంలో ప్రేమలో ఉన్నారని కథనాలు ఇచ్చాయి. కానీ.. అవి కూడా రూమర్లే! ప్రస్తుతానికి కావ్య తన కెరీర్‌, తన తండ్రి వ్యాపారాలను ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న విషయాల మీద మాత్రమే దృష్టి సారించారని సమాచారం.సౌతాఫ్రికాలో దుమ్ములేపుతూఅందుకు తగ్గట్లుగానే ఆమె అడుగులు సాగుతున్నాయి. కేవలం ఐపీఎల్‌లోనే కాకుండా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ కావ్య కుటుంబానికి ఫ్రాంఛైజీ ఉంది. సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌కేప్‌ పేరిట నెలకొల్పిన ఈ జట్టుకు ఐడెన్‌ మార్క్రమ్‌ కెప్టెన్‌. 2023 నాటి అరంగేట్ర సీజన్‌లో, ఈ ఏడాది కూడా సన్‌రైజర్స్‌కు అతడు టైటిల్‌ అందించాడు. సౌతాఫ్రికాలో వరుసగా రెండుసార్లు ట్రోఫీ సాధించిన సన్‌రైజర్స్‌.. ఐపీఎల్‌-2024లో ఆఖరి పోరులో ఓడి టైటిల్‌ చేజార్చుకుంది.

Do You Know The Tata Sumo Story
టాటా కారుకి ‘సుమో’ అనే పేరు ఎలా వచ్చింది ? ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే..

విలాసం కోసం కాకుండా కారు అవసరం అనే యుగంలో ఉన్నాం మనం. అందుకే కాబోలు ప్రతి నగరం, పట్టణం, గ్రాముల్లో కార్ల వినియోగం పెరిగిపోయింది. అయితే నైన్‌టీస్‌లో అలా కాదు. మారుతి 800, 1000 తర్వాత 1990లలో టాటా కంపెనీ ‘టాటా సుమో ఎంయూవీ’ని మార్కెటికి పరిచయం చేసింది. నాటి నుంచి టాటా కార్లలో టాటా సుమో అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాల్లో ఒకటిగా నిలిచింది. ఎంతలా అంటే కేవలం మూడేళ్లలో లక్షకుపైగా అమ్ముడు పోయింది. అదే సమయంలో టాలీవుడ్‌ వెండితెరపై సుమోలు ఎగిరించి.. కథానాయకులతో తొడలు కొట్టించి.. మాస్‌ ప్రేక్షకుల్ని మురిపించిన దర్శకులు వెలుగులోకి వచ్చారు.అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన టాటా సుమో కారు వెనుక కథ ఏంటో తెలుసా? ఈ కారుకు సుమో అని పేరు పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటి ? ఈ పేరు జపనీస్ రెజ్లర్ల నుండి ప్రేరణ పొందిందని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది తప్పు. టాటాలో కష్టపడి పనిచేసి, టాటా సంస్థ విజయంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగి పేరు మీద టాటా సుమో అని కారుకి పేరు పెట్టారు.పుకార్లు షికార్లుసాధారణంగా ప్రతి రోజు టాటా మోటార్స్‌ టాప్‌ ఎగ్జిక్యూటీవ్‌లు అందరూ కలిసి భోజనం చేసే వారు. కానీ ఆ సంస్థ ఎండీ మూల్‌గావ్‌కర్‌ అలా కాదు రోజు ఏదో ఒక సాకు చెప్పి బయటకు వెళ్లేవారు. కొన్ని గంటల తర్వాత వచ్చేవారు. ఆ తర్వాత టాటా డీలర్లు మూల్‌గావకర్‌కు ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో లంచ్‌ ట్రీట్‌ ఇచ్చారని, అందుకే తమతో భోజనానికి రావడం లేదనే పుకార్లు వ్యాపించాయి.ట్రక్‌ డ్రైవర్లతో రోడ్‌ సైడ్‌ దాబాలో ఇంతకీ ఎండీ తమతో భోజనానికి ఎందుకు రావడం లేదా అనే ప్రశ్నే ఉన్నత ఉద్యోగుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ప్రశ్నార్ధకంగా మారేది. అయితే దీన్ని చేదించేందుకు కొంతమంది ఉద్యోగులు మూల్‌గావ్‌కర్‌ మధ‍్యాహ్న దినచర్య గురించి తెలుసుకునేందుకు రహస్యంగా ఆయన్ను వెంబడించారు. వారు ఆశ్చర్యానికి గురి చేసేలా మూల్‌గావ్‌కర్‌ ట్రక్‌ డ్రైవర్లతో కలిసి రోడ్డు పక్కన దాబాలో ఆహారం తింటూ కనిపించారు. భోజన సమయంలో టాటా వాహనాలు వినియోగిస్తున్న డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, అడ్డంకులు గురించి చర్చించేవారు.లోపాల్ని సరిదిద్దే ప్రయత్నంఏ అంశాలు బాగున్నాయో, లోపాల్ని గుర్తించిన తర్వాత కార్యాలయానికి వచ్చేవారు. అందులో పనిచేస్తున్న రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ బృందానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేవారు. అలా టాటా మోటార్స్‌ అభివృద్దికి మూల్‌గావ్‌కర్‌ కృషి చేశారు.టాటా సుమో పేరు అలా వచ్చిందికాబట్టే టాటా ఆయన పేరు మీద ఐకానిక్‌ ఎస్‌యూవీని లాంచ్‌ చేసింది. సు-మంత్ మో-ఓల్గాకర్ పేరు మొదటి అక్షరాలతో టాటా సుమో పేరును మార్కెట్‌కి పరిచయం చేసింది. చివరగా టాటా సుమో గోల్డ్‌ 10 సీట్ల ఎస్‌యూవీ ధరరూ.5.26లక్షల నుంచి రూ.8.93లక్షల మధ్య ఉంది.

Shah Rukh Khan Skull Watch At IPL 2024 Final In Chennai Price Goes Viral
ఐపీఎల్‌ ఫైనల్లో షారూఖ్ సందడి.. ఆ వాచ్‌తో లైఫ్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌!

బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్ గతేడాది జవాన్‌, డుంకీ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం ఈ ఏడాదిలో ఇంకా కొత్త సినిమాని ప్రకటించలేదు. అయితే తాజాగా తన టీమ్ కేకేఆర్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు హాజరయ్యారు. కుటుంబంతో సహా చెన్నైలో జరిగిన మ్యాచ్‌ను వీక్షించారు. చెపాక్‌ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ టైటిల్‌ సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది.కేకేఆర్ విజయంతో బాలీవుడ్‌ బాద్‌షా సంబురాలు చేసుకున్నారు. స్టేడియంతో కలియ తిరుగుతూ సందడి చేశారు. అయితే ఈ మ్యాచ్‌కు హాజరైన షారూఖ్ ఖాన్‌ వాచ్‌పైనే అందరిదృష్టి పడింది. ఆయన ధరించిన స్కల్ వాచ్ గురించి నెట్టంట చర్చ మొదలైంది. షారుఖ్ ధరించిన వాచ్ రిచర్డ్ మిల్లే కంపెనీకి చెందిన స్కల్ టైటానియం వాచ్‌గా గుర్తించారు. ఈ వాచ్‌ ధర దాదాపు రూ.4 కోట్లు ఉంటుందని సమాచారం.ఇది చూసిన నెటిజన్స్‌ క్రేజీ కామెంట్స్‌ చేస్తున్నారు. దట్‌ ఇజ్ కింగ్ ఖాన్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఐపీఎల్ ముగింపు వేడుకల్లో షారుఖ్‌తో పాటు అతని భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ ఖాన్, అనన్య పాండే, షానయ కపూర్, మహీప్ కపూర్, చుంకీ పాండే, భావన పాండే కూడా పాల్గొన్నారు.

Kommineni Srinivasa Rao Strong Counter to ABN Radha Krishna
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!

తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రికగా గుర్తింపు పొందిన, ఆ పార్టీ అనధికార ప్రతినిధిగా పేరొందిన ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణకు ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాలపై గజిబిజి ఉందట. ఆంధ్ర ఓటర్లు ఏ తీర్పు ఇస్తారో అర్ధం కావడం లేదట. అంటే తెలుగు దేశం గెలవడం లేదన్న సంకేతం అందుతున్నట్లే కదా!అందుకు భిన్నంగా ఉంటే ఈయన ఎగిరి గంతేసి రచ్చ,రచ్చ చేసేవారు కదా! అంతేకాదు. ఆయన జర్నలిస్టులకు సుద్దులు, పత్తిత్తు కబుర్లు కూడా చెప్పారు. కొత్త పలుకు పేరుతో వ్యాసాలు రాసే ఆయన పచ్చి అబద్దాలను ఇంతకాలం ప్రచారం చేస్తూ వచ్చారు. తెలుగుదేశం గెలుపు తన గెలుపు అని భావించి , ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంట్లో మనిషి మాదిరిగా వ్యవహరించే ఈయన తాజాగా చెప్పిన నీతులు వింటే ఆశ్చర్యం చెందాల్సిందే. అదే టైమ్ లో ఆయన యధాప్రకారం వైఎస్సార్‌సీపీపైన, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైన విషం కక్కారు. అయినా జర్నలిజం గురించి మాట్లాడగలరు. తను తప్ప మిగిలినవారంతా ఎర్నలిస్టులు అని రాయగలరు. అసలు తానేమిటో, తన మూలాలేమిటో మర్చిపోయి, ఒక ఆగర్భ శ్రీమంతుడు మాదిరి, సత్య సంధుడు మాదిరి. హరిశ్చంద్రుని తమ్ముడి మాదిరి ,అత్యంత నీతిమంతుడు మాదిరి ఆయన రాసే పలుకులు చూస్తే ఔరా అనుకోవల్సిందే. ఏపీ ప్రజలలో ఈ శాసనసభ ఎన్నికలలో ఎవరు గెలుస్తారన్నదానిపై ఎవరి అభిప్రాయం వారికి ఉండవచ్చు. కొందరు వైఎస్సార్‌సీపీకి, మరి కొందరు టీడీపీకి అనుకూలంగా ఆలోచించవచ్చు. కాని చంద్రబాబుకు నమ్మిన బంటు తరహాలో ఉండే ఆంధ్రజ్యోతి యజమానికి టీడీపీ గెలుపుపై ఎందుకు సందేహం వచ్చిందో తెలియదు. అందుకే గెలుపు అంచనాలలో గజిబిజి అని హెడింగ్ పెట్టుకున్నట్లు ఉన్నారు. ఎన్నికల వరకు ఉన్నవి, లేనివి పచ్చి అబద్దాలు రాసి ప్రజలను మోసం చేసే యత్నం చేసిన రాధాకృష్ణ ఇప్పుడు జర్నలిజం ఎలా ఉండాలో నీతులు వల్లెవేస్తున్నారు. దీనిని బట్టే అర్దం అవుతోంది. ఆయనకు టీడీపీ అధికారంలోకి రావడం లేదన్న సమాచారం వచ్చి ఉండాలి. పైకి ఏవో కబుర్లు చెప్పినా, అంతర్లీనంగా చదివితే రాధాకృష్ణ ఎంత భయపడుతున్నది తెలుస్తుంది. వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని అనేవారికి శాపనార్ధాలు పెడుతున్న తీరే ఆయన బలహీనతను తెలియపరుస్తుంది. ప్రతి పత్రికకు సొంత నెట్ వర్క్ ఉంటుంది. ఆంధ్రజ్యోతి కి కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో నెట్ వర్క్ ఉంది కదా!. ఆ నెట్ వర్క్ లో పనిచేసే ప్రతినిధులుఉంటారు కదా!వారితో పోలింగ్ కు ముందు, పోలింగ్ జరిగే రోజున, అవసరమైతే పోలింగ్ తర్వాత కూడా అభిప్రాయ సేకరణ అనండి, ఎగ్జిట్ పోల్ అనండి..పేరేదైనా పెట్టండి ..ప్రజల నాడి ఎలా ఉందో పసికట్టడానికి ప్రయత్నించి ఉంటారు కదా!. ఒక వేళ అది టీడీపీకి పూర్తి అనుకూలంగా ఉంటే ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికలలో కదనాలు ఇచ్చే వారే కదా?. అలా చేయలేకపోగా, గజిబిజి గా పరిస్తితి ఉందని రాసుకున్నారంటే తెలుగుదేశంలో ఉన్న గందరగోళం ఏమిటో తెలుసుకోవచ్చు. ఆంధ్రజ్యోతి రాసిందంటే టీడీపీ రాసినట్లే కదా!. రాధాకృష్ణ రాసిన కొన్ని అంశాలు చూద్దాం. అనుభవం ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సైతం అనేక సందర్భాలలో లెక్క తప్పాయని ఆయన అన్నారు. అందులో కొన్నిసార్లు నిజం ఉండవచ్చు. కాని ఎక్కువసార్లు వాస్తవమే అయ్యాయనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ తో సంబంధం లేకుండా కాంగ్రెస్ కు పట్టం కట్టారట. ఇది కూడా అసత్యమే. తెలంగాణలో అత్యధిక ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు విజయావకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. కనీస అవగాహన లేనివారు, జనం నాడి తెలియని వారు అంచనాలు రూపొందించడం రాధాకృష్ణకు ఆశ్చర్యం కలిగించిందట. చంద్రబాబుకు, జగన్ కు లేని టెన్షన్ ను ఈ తరహా ఎర్నలిస్టులు ప్రదర్శిస్తుండడం విశేషం అని రాశారు. తాను ఎలా సంపాదించి పైకి వచ్చింది. తను రిపోర్టర్‌గా పనిచేసిన పత్రికకే తాను ఎలా యజమాని అయింది రాధాకృష్ణకు తెలియదా! మళ్లీ ప్రత్యేకంగా ఎర్నలిస్టులు అంటూ ఎవరినో అనడం దేనికి? ప్రభుత్వ పని తీరుతో సంబంధం లేకుండా సోషల్ మీడియా సైన్యం మాత్రమే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయజాలదని రాధాకృష్ణ రాసుకొచ్చారు. సోషల్ మీడియా వరకు దేనికి!. మిమ్మల్ని మీరు మెయిన్ మీడియా అనుకుంటారుగా? ఇంతకీ మీరు రాసిన పచ్చి అబద్దాలను జనం నమ్మారనుకుంటున్నారా? నమ్మ లేదని అనుకుంటున్నారా?ఉదాహరణకు లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, స్టాంప్ రిజిస్ట్రేషన్ గురించి ఆంధ్రజ్యోతితో పాటు ఈనాడు రాసిన దారుణమైన అబద్దాలను ప్రజలు నమ్మలేదన్న సంగతి మీకు తెలిసిందా? అనే అనుమానం వస్తుంది. పనిలో పనిగా యూట్యూబ్ చానల్స్ గురించి కూడా తెగ వాపోయారు. ముందు మీరు మీ యూట్యూబ్ చానల్ లో నిజాలు చెప్పడం అలవాటు చేసుకుని అప్పుడు ఎదుటివారి గురించి మాట్లాడండి. తెలుగుదేశం పార్టీ ఐటిడిపి పేరుతో ఎంత నీచమైన ఆరోపణలతో వైఎస్సార్‌సీపీపైన, జగన్ పైన ప్రచారం చేస్తే సమర్దించిన రాధాకృష్ణ నంగనాచి కబుర్లు చెబుతున్నారు. యూట్యూబ్‌ ఛానెల్స్‌ను రాజకీయ పార్టీలు స్పాన్సర్ చేస్తున్నాయట. ఈనాడు, ఆంద్రజ్యోతివంటి ఎల్లో మీడియాను తెలుగుదేశం పార్టీ స్పాన్సర్ చేసిన విషయాన్ని తొలుత రాసి ఆ తర్వాత మిగిలినవారి గురించి మాట్లాడితే బాగుండేది. సోషల్ మీడియాలో వ్యూస్ ను బట్టి కూడా ఎవరికి మద్దతు ఉందో చెప్పవచ్చని మళ్లీ ఇదే కొత్త పలుకు లో ఈయన చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్ కు అనుకూలంగా ఉండే వార్తలు, కధనాలకు రెండే క్రితం వరకు అధికంగా వ్యూస్ ఉండేవని, రాను..రాను అవి తగ్గిపోయాయని మరో అబద్దం రాసుకొచ్చారు.ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ ఇంటర్వ్యూని టీవీ9లోను, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటర్వ్యూని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలోనూ ఒకే రోజు, ఒకే సమయంలో ప్రసారం చేశారు. చంద్రబాబును ఇదే రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. జగన్ చేసిన ఇంటర్వ్యూకు టీవీ9 యూట్యూబ్‌ ఛానల్‌లో 11లక్షల వ్యూస్ వస్తే, చంద్రబాబు ఇంటర్వ్యూకు నాలుగైదు లక్షల వ్యూసే వచ్చాయి. ఇది ఎవరయినా గమనించవచ్చు. లైవ్ జరుగుతున్నప్పుడు కూడా ఎబిఎన్ కంటే టీవీ9 కంటెంట్‌ను ఎన్నోరెట్ల మంది యుట్యూబ్‌లో చూసినట్లు లెక్కలు చెబుతున్నాయి కదా! ఈయన థియరీ ప్రకారం చూసుకున్నా జగన్ గెలుస్తున్నట్లే కదా!. తెలంగాణను మించిన నిర్భంధం ఏపీలో ఉందట. నిజంగా ఆ పరిస్థితి ఉంటే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంత అరాచకంగా, జర్నలిజానికి తలవంపులు తెచ్చేరీతిలో వార్తలు,కధనాలు ఇచ్చి ఉండేవారా?. ఎందుకు వీరు ఆత్మవంచన చేసుకుంటున్నారు!. ఉద్యోగ సంఘాల నేతలు జగన్‌కు అనుకూలమైనా ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. పాపం ఉద్యోగులపై అంత ప్రేమ ఉంటే,వారిని పనిపాట లేనివారని, వారికి ఊరికే వందల కోట్ల జీతాలు కూర్చోబెట్టి ఇస్తున్నారన్నట్లుగా చంద్రబాబుతో మాట్లాడింది రాధాకృష్ణే కదా! 2019 లో ఎన్నికలలో తాను మళ్లీ అధికారంలోకి వస్తానని ప్రకటించి బోల్తా కొట్టిన చంద్రబాబు ఈ పర్యాయం మాత్రం ఎన్నికల ఫలితాల జోస్యం చెప్పలేదని ఈయన అంటున్నారు. నిజానికి అప్పుడు చంద్రబాబే కాదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు తదతితర ఎల్లో మీడియా అంతా ఇదే మాట ఊదరగొట్టాయి. చంద్రబాబు ఇచ్చిన పసుపు-కుంకుమ తో మహిళలంతా టీడీపీ కి ఓటు వేశారని ఈయన పత్రికలోరాశారో లేదో ఒక్కసారి వెనక్కి వెళ్లి చూసుకోమనండి కానీ, 2019లో జగన్ చెప్పినట్లు వైసిపి భారీ మెజార్టీతో గెలుపొందిందన్న ఒక్క సత్యాన్ని ఒప్పుకున్న ఈయన అక్కడ కూడా వక్రీకరించారు. జగన్ అండ్ కో అప్పుడు అసత్య ప్రచారం మీద నమ్మకం పెట్టుకుందని ఈ సత్యసంధుడు రాస్తున్నాడు. చంద్రబాబు అండ్ కో లో భాగస్వామి అయిన రాధాకృష్ణ అబద్దాల సృష్టికర్తలలో ఒకడన్న సంగతి ప్రజలందరికి తెలుసు. 2024 ఎన్నికల ప్రచారంలో జగన్ అసత్యాలు చెప్పారో, చంద్రబాబు అబద్దాలు చె్ప్పారో, ప్రజలు ఏమి అనుకుంటున్నారో ఒక సర్వే చేయించుకుంటే తెలుస్తుంది. రాధాకృష్ణ ఎంతసేపు ఆత్మ వంచన చేసుకుంటూ ప్రజలను కూడా అలాగే మోసం చేయాలని చూస్తున్నారు. 2019 ఎన్నికలలో జగన్ ఆశ్రిత పక్షపాతం, భావోద్వేగాలు ప్రేరేపించడం, విమర్శనాత్మక ఆలోచనా ధోరణి నశింప చేయడం.. వంటివాటివల్ల గెలిచారట.ఎంత అక్కసో చూడండి. జగన్ గెలిస్తే ఆలోచన సరిగా లేనట్లట. చంద్రబాబు గెలిస్తే మేధావితనం అట. ఈయనకు వందల కోట్ల ప్రయోజనం చేకూర్చుతారు కాబట్టి చంద్రబాబు పాలన గొప్పదిగా కనిపించవచ్చు. కాని జగన్ ప్రజలకు లక్షల కోట్ల మేర మేలు చేశారు. కాబట్టి ఆయన తనవల్ల మేలు జరిగితేనే ఓటు వేయండని ధైర్యంగా చెప్పారు. ఆ మాట చంద్రబాబుతో ఎందుకు చెప్పించలేకపోయారు.? మళ్లీ జన్మభూమి కమిటీల పాలన తెస్తానని, వలంటీర్లను రద్దు చేస్తానని, గ్రామ, వార్డు సచివాలయాలను ఎత్తివేస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోయారు. రాధాకృష్ణ ఎందుకు చెప్పించలేకపోయారు? అమ్మ ఒడి ఇస్తుంటే బటన్ నొక్కడం తప్ప జగన్ ఏమి చేస్తున్నారని ఆ రోజుల్లో రాధాకృష్ణ తెగ బాధపడ్డారు. అదే చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏమన్నాడు? ఇంటిలో ఒకరికి కాదు.. ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తానని చంద్రబాబు చెబితే రాధాకృష్ణ మాత్రం వైఎస్సార్‌సీపీపైన రోధిస్తున్నారు. జగన్ స్కీములతో రాష్ట్రం నాశనం అయితే, వాటన్నిటిని కొనసాగిస్తామని చంద్రబాబు, పవన్ లతో ఎందుకు చెప్పించారు.? ప్రొఫెసర్ నాగేశ్వర్, తెలకపల్లి రవి వంటి వారి పేర్లు రాయకుండా సిపిఎం సంబంధాలు కలిగిన వారు జగన్‌కు అనుకూలంగా విశ్లేషణలు వదలుతున్నారట. జగన్ కు అనుకూలంగా విశ్లేషణలు ఇస్తున్నవారు వ్యతిరేక ఫలితాలు వస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటారు అని అమాయకంగా ప్రశ్నించారు.2019 లో రాధాకృష్ణ ఎక్కడ మొహం పెట్టుకున్నారు? 2024లో జగన్ కు అనుకూల ఫలితం వస్తే ఈయన ఎక్కడ మొహం పెట్టుకుంటారు! ప్రశాంత కిషోర్ లో రాధాకృష్ణకు ఇప్పుడు విశ్వసనీయత కనిపిస్తోంది. అంత గొప్ప ప్రశాంత కిషోర్ తెలంగాణలో బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని ఎలా చెప్పారో, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఎలా చెప్పారో కూడా ఈయన వివరించాలి. చంద్రబాబు ఎన్నికల ముందు మహిళలకు పదివేల రూపాయలు చొప్పున ఇచ్చినా ఓడిపోయారని, జగన్ పధకాల పేరుతోడబ్బు పంచితే ఓట్లు వేస్తారా అని రెంటిని సమం చేసే దిక్కుమాలిన ఆలోచన చేశారు. చంద్రబాబు ఎన్నికల కోసం పదివేల రూపాయలు ఇచ్చారు. జగన్ తను ఇచ్చిన హామీ ప్రకారం ఐదేళ్లపాటు స్కీముల ద్వారా లబ్ది చేకూర్చారు. ఆ మాత్రం జ్ఞానం లేకుండా రాధాకృష్ణ వ్యాసాలు రాసిపడేసి, చేతిలో పత్రిక ఉందని అచ్చేసి, టీవీ ఛానెల్‌ ఉంది కదా అని ఊదరగొట్టేస్తే జనం నమ్ముతారా? ఎన్నికలకు ముందు ఆ సర్వే అని,ఈ సర్వే అని తెలుగుదేశంకు డప్పు వాయించిన రాధాకృష్ణ తినబోతూ రుచులు అడగకూడదని అంటున్నారు. ఆయన రాసిన చివరిమాటలోని అంగుళీమాలుడు అనే దొంగ పాత్ర అమరావతి పేరుతో మూడు పంటలు పండే వేలాది ఎకరాలను ధ్వంసం చేసిన చంద్రబాబు అవుతారు లేదా ఆయన సేవలో తరించే రాధాకృష్ణ అవుతారు తప్ప ఇంకొకరు కారు. జగన్ ను దూషించడం తప్ప, ఈయన చెత్తపలుకులో చేసిన విశ్లేషణ ఏముంది? ఏపీ ఫలితాలపై ఈయనకు గజిబిజి ఉందేమో కాని, ప్రజలకు మాత్రం కాదని చెప్పవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Prajwal Revanna: will appear before police on May 31 cooperate Probe
మే 31న సిట్‌ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్‌ రేవర్ణ

బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపుల కేసులో ఇరుకున్న హాసన్‌ జేడీఎస్‌ ఎంపీ ప్రజల్వ్‌ రేవణ్ణ త్వరలోనే భారత్‌కు తిరిగి రానున్నారు. ఈనెల 31న సిట్‌ ముందు విచారణకు హాజరు కానున్నట్లు స్వయంగా తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.‘నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మే 31 ఉదయం 10 గంటలకు సిట్‌ ముందు హాజరవుతాను. విచారణకు సహకరిస్తాను. నాపై నమోదైనవి తప్పుడు కేసులు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది.’ అని సోమవారం పేర్కొన్నారు.అయితే తనపై వచ్చిన ఆరోపణలను రాజకీయ కుట్రగా రేవణ్ణ పేర్కొన్నాడు. తాను మానసిక ఒత్తిడి, ఒంటరిగా ఉన్నట్లు చెప్పాడు. తన ఆచూకీ వివరాలు చెప్పనందుకు జేడీఎస్ నేతలు, పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు కూడా చెప్పారు.‘విదేశాల్లో నేను ఎక్కడ ఉన్నానో సరైన సమాచారం అందించనందుకు నా కుటుంబ సభ్యులకు, మా కుమారన్న (కుమారస్వామి],పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఏప్రిల్ 26వ తేదీన ఎన్నికలు ముగిసినప్పుడు, నాపై ఎటువంటి కేసు లేదు. సిట్ ఏర్పాటు చేయలేదు. నేను వెళ్లిన రెండు, మూడు రోజుల తర్వాత యూట్యూబ్‌లో నాపై ఈ ఆరోపణలను చూశాను. అలాగే ఏడు రోజుల సమయం కావాలని నా లాయర్ ద్వారా సిట్‌కి లేఖ రాశాను.’ అని పేర్కొన్నారు.కాగా మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడైన ప్రజ్వల్‌ రేవణ్ణ(36) మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనేక మహిళలను లైంగికంగా వేధించినట్లు వీడియో బయటకు రావడంతో ప్రజ్వల్‌ ఏప్రిల్‌ 26న దేశం విడిచి వెళ్లిపోయారు.కాగా తనను లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు హాసన్‌ జిల్లా హొళె నరసీపుర పోలీస్‌ స్టేషన్‌లో ప్రజ్వల్‌తోపాటు ఆయన తండ్రి, జేడీఎస్‌ ఎమ్మెల్యే రేవణ్ణపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రజ్వల్‌ రేవణ్ణ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. రేవణ్ణ రాసలీలలపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అతనిపై లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేసింది. అనంతరం అతనిపై బ్లూ కార్నర్ నోటీసు' కూడా జారీ అయ్యింది.తన మనవడిని భారతదేశానికి తిరిగి రావాలని, పోలీసులకు లొంగిపోవాలని లేదా అతని ఆగ్రహాన్ని ఎదుర్కోవాలని కోరుతూ హెచ్‌డి దేవెగౌడ తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత అతని ప్రకటన రావడం గమనార్హం. అంతేగాక ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గత వారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

Video: Stage Collapses At Rahul Gandhi Bihar Poll Rally
Video: రాహుల్‌ గాంధీకి తప్పిన ముప్పు.. కుంగిన స్టేజ్‌

కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీకి తృటిలో ప్రమాదం తప్పింది. బిహార్‌లోని ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ నిల్చున్న వేదిక కొంతభాగం కుంగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాలు.. బిహార్‌లోని పాలిగంజ్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియా కూటమి నేతలు సభ ఏర్పాటు చేశారు. ఆర్జేడీ నేతలు తేజస్వీ యాదవ్‌, మిసా భారతితో కలిసి రాహుల్‌ గాంధీ స్టేజ్‌పైకి చేరుకున్నారు. అయితే ఆ వేదికపై అప్పటికే ఎక్కువ మంది నాయకులు ఉండటంతో స్టేజ్‌ కొంతమేర కూలింది. దీంతో కొంత బ్యాలెన్స్‌ కోల్పోయిన రాహుల్‌.. మిసా భారతి చేతులు పట్టుకుని మళ్లీ సర్దుకున్నారు.వెంటనే రాహుల్‌ గాంధీ సెక్యూరిటీ సిబ్బంది కూడా స్పందించారు. కొద్దిగా కుంగిన వేదిక వద్ద ఉన్న ఆయనకు సహాయం కోసం ముందుకు వచ్చారు. స్టేజ్‌ నుంచి దిగిపోవాలని రాహుల్‌కు సూచించారు. అయితే తనకు ఏమీ కాలేదని, కంగారు పడవద్దని సెక్యూరిటీ గార్డులకు సూచించారు. అనంతరం అదే వేదికపై రాహుల్‌ గాంధీ ప్రసంగించారు.मंच टूट सकता है, हौसला नहीं!#Rahul_Gandhi_जीpic.twitter.com/CjvfvibFco— 🇮🇳 Vishal JyotiDev Agarwal 🇮🇳 (@JyotiDevSpeaks) May 27, 2024

AP Elections 2024: May 27th Political Updates In Telugu
May 27th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 26th AP Elections 2024 News Political Updates..7:00 PM, May 27th, 2024వ్యక్తిగత గొడవలకి రాజకీయ రంగుపులిమి టీడీపీ రాక్షసానందంవ్వక్తిగత గొడవలకి రాజకీయ రంగుపులిమి @JaiTDP రాక్షసానందం పల్నాడు జిల్లా మాచర్లలో గొడవకి అసలు కారణం చెప్పిన గాయపడిన మహిళ నీలావతిఅబద్ధపు ప్రచారంతో గగ్గోలు పెట్టిన టీడీపీ, ఎల్లో మీడియా నవ్వులపాలుజూన్ 4తో టీడీపీ దుకాణం క్లోజ్.. ఎల్లో మీడియా ఏడుపులకి శాశ్వత తెర!#TDPLosing… pic.twitter.com/5gV3miHsrw— YSR Congress Party (@YSRCParty) May 27, 2024 5:36 PM, May 27th, 2024పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌రేపటికి తీర్పు రిజర్వ్‌ చేసిన ఏపీ హైకోర్టుతనపై నమోదైన కేసుల్లో బెయిల్‌ ఇవ్వాలంటూ పిన్నెల్లి పిటిషన్‌ 4:00 PM, May 27th, 2024చెప్పేదేమో శుద్ధ పూస మాటలు చేసేవన్నీ తప్పుడు పనులు..!.@JaiTDP చెప్పేదేమో శుద్ధ పూస మాటలు చేసేవన్నీ తప్పుడు పనులు..!ఓటమి భయంతో పోలింగ్ జరిగిన మరుసటి రోజు కారంపూడిలో గుంపులు గుంపులుగా రోడ్ల మీదకు వచ్చి వైయస్ఆర్ సీపీ కార్యకర్తల షాపులను ధ్వంసం చేసి తగలబెట్టింది మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాదా?#TDPLosing#TDPGoons pic.twitter.com/nFbNNxxvt7— YSR Congress Party (@YSRCParty) May 27, 2024 3:30 PM, May 27th, 2024విచారణకు రఘురాజు గైర్హాజరు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీ రఘురాజును విచారణకు పిలిచిన మండలి ఛైర్మన్ మోషేన్ రాజుఅనర్హత వేటు పిటిషన్‌ విచారణకు ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు గైర్హాజరు.ఈ నెల 31వ తేదీకి విచారణ వాయిదా.వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి రఘురాజు పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. 3:00 PM, May 27th, 2024ఓట్ల లెక్కింపు కార్యక్రమంపై అధికారులతో సీఈసీ రాజీవ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమంపై అధికారులతో సీఈసీ రాజీవ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్.సీఈసీ మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరగా ప్రకటించేలా చర్యలు చేపట్టాలని దిశా నిర్దేశంసీఈసీతో పాటు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఈసీలు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్ బీర్ సింగ్, ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా.2:00 PM, May 27th, 2024పోస్టల్‌ బ్యాలెట్లు కృష్ణా యూనివర్సిటీ తరలింపు..కృష్ణా జిల్లా..మచిలీపట్నం పార్లమెంట్ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లను కలెక్టరేట్ నుండి కృష్ణా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్‌కి తరలింపురాజకీయ పార్టీల సభ్యుల సమక్షంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌కి పోస్టల్ బ్యాలెట్లు తరలించిన అధికారులు 1:30 PM, May 27th, 2024ఈసీకి పేర్ని నాని ప్రశ్నలు..ఎన్నికల సంఘానికి ప్రశ్నలు సంధించిన పేర్ని నాని.పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13వ తేదీనే ఎందుకు కేసు నమోదు చేయలేదు?పోలింగ్‌ ఆగినట్టు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ లాగ్‌ బుక్‌లో ఎందుకు లేదు?డీజీపీకి సిట్‌ ఇచ్చిన నివేదికలో కూడా పిన్నెల్లి ప్రస్తావన లేదు? ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.-మాజీ మంత్రి పేర్ని నాని#TDPLosing… pic.twitter.com/VS0ESyDEMz— YSR Congress Party (@YSRCParty) May 26, 2024 11:20 AM, May 27th, 2024పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్లపై నేడు విచారణ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్లపై హైకోర్టులో నేడు కొనసాగనున్న విచారణపిన్నెల్లిపై అక్రమంగా మూడు కేసులు నమోదుపచ్చ బ్యాచ్‌ సూచనల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు. 11:00 AM, May 27th, 2024దాడులపై చోద్యం చూస్తున్న ఈసీ..టీడీపీ దాడులపై ఇంకా చోద్యం చూస్తున్న ఎన్నికల సంఘం. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పచ్చ మూకల అరాచకాలు. ఈసీ, పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ శ్రేణుల దారుణాలు. వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేసిన టీడీపీ అనుకూల పోలీసులు. పోలింగ్‌, ఆ తర్వాత మాచర్లలో పచ్చ మూకల అరాచకాలు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి హత్యకు కుట్ర పన్నిన పచ్చ మూకలు. దాడులకు పరోక్షంగా వత్తాసు పలికిన పోలీసులు. 10:30 AM, May 27th, 2024ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అనర్హతపై నేడు విచారణఇందుకూరి రఘురాజు అనర్హతపై నేడు విచారణపార్టీ ఫిరాయించిన రాఘురాజు వ్యక్తిగత విచారణను రావాలని ఆదేశం.విచారణ అనంతరం అనర్హతపై నిర్ణయం తీసుకోనున్న మండలి చైర్మన్‌నేడు 11 గంటలకు విచారించనున్న మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు.వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి పార్టీ ఫిరాయించిన రఘురాజు. 9:30 AM, May 27th, 2024ఎన్నికల దృష్ట్యా పోలీసుల కార్డన్‌ సెర్చ్‌..ఎన్టీఆర్ జిల్లా:గంపలగూడెం మండలం సొబ్బాల గ్రామంలో తిరువూరు సీఐ అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో పోలీసుల కార్డన్ సెర్చ్..ఎన్నికల ఫలితాల భద్రతా దృష్యా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు..రికార్డులు లేని 11 వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలింపు.. 8:50 AM, May 27th, 2024బరితెగించిన పచ్చ గూండాలు..ఎన్నికల్లో ఓటమి భయంతో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌కారంపూడిలో బరితెగించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలుపోలింగ్‌ జరిగిన మరుసటి రోజే వైఎస్సార్‌సీపీకి చెందిన కార్యకర్తలను టార్గెట్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల షాపులను ధ్వంసం చేసి తగలపెట్టారు. ఓటమి భయంతో కారంపూడిలో బరితెగించిన @JaiTDP నాయకులుపోలింగ్ జరిగిన మరుసటి రోజున వైయస్ఆర్ సీపీకి చెందిన కార్యకర్తల షాపులను ధ్వంసం చేసి తగలపెట్టిన టీడీపీ గుండాలు.#TDPLosing#TDPGoons pic.twitter.com/BzBkJBOkT1— YSR Congress Party (@YSRCParty) May 26, 2024 7:45 AM, May 27th, 2024పిన్నెళ్లిపై పోలీసుల అక్రమ కేసులు..తాడేపల్లి..మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై వరుస కేసులుఎమ్మెల్యే అరెస్టే లక్ష్యంగా అక్రమ కేసులు పెడుతున్న పోలీసులుటీడీపీకి అనుబంధ సంఘాలుగా మారిన ఈసీ, పోలీసు శాఖఈవీఎం కేసులో బెయిల్ రాగానే వెంటనే మరో మూడు హత్యాయత్నం కేసులు పెట్టిన పోలీసులుసీఐ నారాయణస్వామి చౌదరి ఆధ్వర్యంలోనే కుట్ర జరుగుతోందన్న వైఎస్సార్‌సీపీఏదోలా ఎమ్మెల్యే పిన్నెళ్లిని అరెస్టు చేసి హతమార్చేందుకే కుట్రలంటున్న వైఎస్సార్‌సీపీ నేతలు 7:00 AM, May 27th, 2024ఓటు తెచ్చిన చేటు..కౌలురైతులపై ‘మంగళగిరి’లో ఓ సామాజికవర్గం దుర్మార్గంసాగు కోసం పొలాల వద్దకు రావొద్దని హెచ్చరికలుఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు టీడీపీకి చెందిన ఆ వర్గీయుల అల్టిమేటందశాబ్దాలుగా కౌలుకు చేస్తున్న పేదలపై బరితెగింపువ్యవసాయ సీజన్‌ ఆరంభంలో ఒక్కసారిగా రోడ్డునపడ్డ కౌలుదారులునారా లోకేశ్‌కు ఓట్లు వేయకపోవడమే వారు చేసిన నేరంఆ సామాజికవర్గానికి చెందిన సంస్థల్లో పనిచేసే వారికీ ఇదే అనుభవంనీ పేరు లోకేశ్‌ రెడ్‌బుక్‌లోకి ఎక్కిందంటూ బెదిరింపులు‘ఫ్యాను’కు ఓటేసినందుకే అంటూ లబోదిబోమంటున్న బాధితులుఇల్లు కట్టుకుంటున్నా ఓర్వలేకపోతున్నారని.. మాకిష్టమైన వారికి ఓటు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా అని ఆవేదనఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు వస్తున్నాయని కూడా ఏడుపు 6:50 AM, May 27th, 2024సీల్‌ లేదని పోస్టల్‌ బ్యాలెట్‌ తిరస్కరించొద్దుడిక్లరేషన్‌పై అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం, పేరు, హోదా ఉంటే ఆమోదించండి అనుమానం వస్తే పోస్టల్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌లోని కౌంటర్‌ ఫాయిల్‌తో సరిచూడండిడిక్లరేషన్‌పై ఓటరు, అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకాలు లేకపోయినా తిరస్కరించండి డిక్లరేషన్‌ ఫారం విడిగా కవర్‌–బీలో లేకపోతే ఓపెన్‌ చేయకుండానే తిరస్కరించొచ్చు బ్యాలెట్‌ పేపర్‌ నెంబరు డిక్లరేషన్‌పైన ఒకలాగా, ఫారం–13బీ పైన మరొకటి వుంటే తిరస్కరించాలి.. బ్యాలెట్‌ పేపర్‌ ఓపెన్‌ చేసిన తర్వాత ఒకరి కంటే ఎక్కువమందికి సంతకాలు చేసినా తిరస్కరించొచ్చు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్‌ మీనా ఆదేశాలు 6:40 AM, May 27th, 2024‘పిన్నెల్లి’కి మధ్యంతర ముందస్తు బెయిల్‌ ఇవ్వండిఈవీఎంల కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వగానే హత్యాయత్నం కేసులు పెట్టారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా నిరోధించేందుకే ఈ తప్పుడు కేసులు ఎన్నికల సంఘం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.. పరిధి దాటి పనిచేస్తోంది ఆయన్ను అరెస్టు చేసి తీరాలన్న లక్ష్యంతోనే ఇలా చేస్తోంది ఘటనలు జరిగిన పది రోజుల తర్వాత నిందితుడిగా చేర్చారు అంత జాప్యం ఎందుకు జరిగిందో పోలీసులు చెప్పడం లేదు ఈవీఎంల కేసులో కల్పించిన రక్షణే ఈ కేసుల్లో కూడా కల్పించండి హైకోర్టుకు నివేదించిన సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి మరోవైపు.. టీడీపీ నేత అస్మిత్‌పై హత్యాయత్నం కేసున్నా బెయిల్‌ను వ్యతిరేకించని పోలీసులు 6:30 AM, May 27th, 2024తాపీగా తప్పుడు కేసులుపిన్నెల్లికి బెయిల్‌ రావడంతో మరో మూడు అక్రమ కేసులు.. కారంపూడిలో సీఐ తలకు గాయమైతే వారానికిపైగా ఏం చేస్తున్నట్లు? నరసరావుపేటలో ఇంట్లో బాంబులు దాచిన టీడీపీ నేత అరవిందబాబును వదిలేసి గోపిరెడ్డిపై కేసులా?టీడీపీ గూండాలకు చట్టం చుట్టమా?

Guess This Actor: South Star Heroine Sisters Childhood Pic
అతిలోక సుందరితో ముగ్గురు హీరోయిన్లు.. ఎవరో గుర్తుపట్టారా?

పై ఫోటోలో శ్రీదేవితోపాటు కలిసి కూర్చున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు సౌత్‌ ఇండస్ట్రీలో చాలా పాపులర్‌ హీరోయిన్లు. తెలుగులో స్టార్‌ హీరోల సరసన నటించారు. మెగాస్టార్‌ చిరంజీవితో ఈ ముగ్గురూ యాక్ట్‌ చేశారు. ఇంతకీ ఈ కథానాయికలెవరో గుర్తుపట్టారా?తెలుగులో ఆ చిత్రంతో ఎంట్రీఫోటోలో అతిలోక సుందరి శ్రీదేవి పక్కన కూర్చుని క్యూట్‌గా కనిపిస్తున్న ఈ ముగ్గురు నగ్మా, జ్యోతిక, రోషిణి. నగ్మా విషయానికి వస్తే సల్మాన్‌ ఖాన్‌ భాగి: ఎ రెబల్‌ ఫర్‌ లవ్‌ అనే సినిమాతో తన కెరీర్‌ మొదలైంది. పెద్దింటి అల్లుడు చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఘరానా మొగుడు, మేజర్‌ చంద్రకాంత్‌, కొండపల్లి రాజా, అల్లరి అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు, రిక్షావోడు, అల్లరి రాముడు.. ఇలా అనేక చిత్రాల్లో యాక్ట్‌ చేసింది.అక్కడ ఫుల్‌ బిజీజ్యోతిక.. డోలి సజా కే రఖ్‌ణా అనే హిందీ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బిజీ అయింది మాత్రం తమిళ ఇండస్ట్రీలోనే! ఠాగోర్‌, మాస్‌, చంద్రముఖి, షాక్‌ చిత్రాలతో తెలుగువారికీ దగ్గరైంది. హీరో సూర్యను పెళ్లి చేసుకుని సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన ఆమె సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తోంది.తెలుగులో ఫేమస్‌రోషిణి.. తన ఇద్దరు అక్కల్లా ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా రాణించలేకపోయింది. శిష్య అనే తమిళ చిత్రంతో కథానాయికగా పరిచయమైన ఈ మూవీ మాస్టర్‌, పవిత్ర ప్రేమ, శుభలేఖలు సినిమాతో తెలుగులో ఫేమస్‌ అయింది. రెండేళ్లు మాత్రమే సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్న ఆమె తర్వాత చిత్రపరిశ్రమకు గుడ్‌బై చెప్పింది.పేరెంట్స్‌..కాగా ఈ హీరోయిన్ల తల్లి సీమా 1969లో అరవింద్‌ మొరార్జీని పెళ్లాడింది. వీరికి పుట్టిన కూతురే నగ్మా. మనస్పర్థల వల్ల ఈ దంపతులు 1974లో విడాకులు తీసుకున్నారు. తర్వాతి ఏడాది నిర్మాత చందర్‌ను పెళ్లాడింది. వీరికి ఒక బాబుతో పాటు జ్యోతిక, రోషిణి సంతానం.చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement