Top Stories
ప్రధాన వార్తలు
కహానీలు చెబితే కడుపు నిండుతుందా?
ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లోమీడియా తీరు భలే విచిత్రంగా ఉంటుంది. వారికి లాభం జరిగితే ప్రజలందరికీ జరిగినట్లే. వారి ఇబ్బందులు ప్రజలందరి సమస్యలు! ఇప్పుడెందుకు ఈ ప్రస్తావన అంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలందరికీ సంక్రాంతి వరాలు వచ్చేశాయట!. అభివృద్ధి పనులతో గ్రామాలకు సంక్రాంతి కళ వచ్చేసిందట!. పచ్చి అబద్ధాలను వండి వార్చేఈ ఎల్లో మీడియా ఉరఫ్ ఈనాడులో వచ్చిన కథనాల్లో కొన్ని ఇవి. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలన్నీ అమలు చేసి ఉంటే ప్రజలు సంతోషంగా ఉండేవాళ్లు కానీ.. తిమ్మిని బమ్మి చేసినట్లు ప్రతి వాగ్ధానాన్ని మసిపూసి మారేడు కాయ చేసేందుకు కూటమి నానా తంటాలూ పడుతూంటే ఎల్లోమీడియా ఆ అబద్ధాలకు వంతపాడుతూ మురిసిపోతోంది. ఎన్నికలకు ముందు ఒక రకమైన అసత్యాలు.. ఇప్పుడు ఇంకో రకంగా బిల్డప్ ఇస్తూ జనాన్ని మభ్యపెడుతోంది. 😱కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది మొదలు.. రాష్ట్రంలో అరాచకమే ఎక్కువ. జగన్ టైమ్‌లో జరిగిన అభివృద్దిని కూడా తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. వృద్దుల ఫించన్ వెయ్యి రూపాయలు పెంచడం మినహా మరే ఇతర హామీని పూర్తిగా అమలు చేయని కూటమి, ఎన్నికల ప్రణాళికలో ఉన్న సుమారు 175 వాగ్దానాల జోలికే వెళ్లలేదు. దీన్ని కప్పిపుచ్చడానికి ఎల్లో మీడియా రోజుకో కొత్త రకం భజన కీర్తలను పాడుతోంది. అయితే.. 👉జనం వాస్తవాలు తెలుసుకుంటున్నారు. సూపర్ సిక్స్ పేరుతో కూటమి నేతలు చేసిన మోసాన్ని గుర్తిస్తున్నారు. ఈ మధ్య ఒక సీనియర్ పాత్రికేయుడు ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటించినప్పుడు ప్రజల్లోని ఈ అసంతృప్తిని గమనించారు. జగన్ ఉండి ఉంటే ఫలానా స్కీమ్ కింద తమకు ఇంత డబ్బు వచ్చి ఉండేది.. చేతులలో డబ్బు ఆడేది.. అని చెప్పుకుంటున్నారట. కానీ అంతకు మూడు రెట్లు సాయం చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తమను వంచించారని ఎక్కువ మంది భావిస్తున్నారట!.వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఏ స్కీమ్ కూడా ఇప్పుడు ప్రజలకు అందడం లేదు. ‘అమ్మ ఒడి’ని మార్చి ప్రతి బిడ్డకు రూ.15 చొప్పున ఇస్తామన్న కూటమి నేతలు, కావాలంటే ఇంకా పిల్లలను కనండని బంపర్ ఆఫర్ ప్రకటించిన చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత తూచ్ అనేశారు. జాకీ మీడియా కూడా ‘అమ్మ ఒడి’ అంటే బటన నొక్కడమని ధనం వృధా చేయడమేనని ఊదరగొట్టింది. కానీ ఇప్పుడు ఏమి జరుగుతోందో చూడండి. 👇ఈ ఏడాదికి తల్లికి వందనం లేదు పొమ్మన్నారురైతు భరోసా జాడ కనిపించడం లేదు. విద్యా దీవెన, వసతి దీవెన ఏమయ్యాయో తెలియదు. ఆరోగ్య శ్రీని నీరుకార్చే పనిలో ఉన్నారు. జగన్ ఇంటింటికి డాక్టర్ ను పంపిచే స్కీమ్ తెస్తే, ఇప్పుడు అది గాలికి పోయినట్లు ఉంది. ప్రతి వ్యక్తికి ప్రభుత్వ సేవలందించేందుకు జగన్ తెచ్చిన వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని జీతాలూ పెంచుతామని చంద్రబాబు ఉగాది పండగనాడు దైవ సాక్షిగా ప్రకటించినా.. ఇప్పుడు దానికి మంగళం పలికారు. మరోవైపు.. ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. వంట నూనెల ధరలే లీటర్‌కు రూ.30 నుంచి రూ.40 వరకూ పెరిగాయి. పప్పులు, కూరగాయల ధరలన్ని అందుబాటులో లేకుండా పోయాయి. వీటన్నిటి ఫలితంగా సంక్రాంతి వచ్చినా ప్రజలు చేతిలో డబ్బులు ఆడక ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారాలు కూడా తగ్గాయి. ఇందుకు ఉదాహరణ ఏమిటంటే.. లెక్కలు ఇలా.. 👇ఒక్క కృష్ణా జిల్లాలోనే వైఎస్ జగన్ పాలనలో 2023 లో పండగల సీజన్ అయిన అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లలో వస్త్ర వ్యాపారం రూ.3000 కోట్ల మేర జరిగితే కూటమి పాలన వచ్చిన 2024లో అదే కాలానికి కేవలం రూ.1200 కోట్లుగానే ఉంది. కిరాణా వ్యాపారం పరిస్థితి అలాగే ఉంది. గతంతో పోల్చితే ఈసారి లావాదేవీలు రూ. వెయ్యి కోట్ల తగ్గాయి. బంగారం వ్యాపారం రెండు నెలల టైమ్‌కు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.3000 కోట్ల టర్నోవర్ జరిగితే, కూటమి పాలనలో అది రూ.1500 కోట్లుగా ఉంది. ఫర్నిచర్ కొనుగోళ్లు కూడా సగానికి సగం పడిపోయాయి. అప్పట్లో రూ.800 కోట్లు ఉంటే, ఈ సారి రూ.400 కోట్లే ఉంది. వీటి ఫలితంగా జీఎస్టీ రూపంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయమూ తగ్గింది. ఏపీలో జీఎస్టీ వసూళ్లు బీహారు కన్నా తక్కువ కావడం పరిస్థితిని తెలియచేస్తుంది. జగన్ టైమ్ లో 12 శాతం జీఎస్టీ వసూళ్లతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్ర భాగాన ఉంటే, ఈ సారి ‘- 6’ శాతం మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 👉ఈ లెక్కలు ఇలా ఉన్నా, ఎల్లో మీడియా మాత్రం సంక్రాంతికి ప్రజలంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్లుగా బిల్డప్ ఇస్తోంది. అవును.. నిజమే.. మార్గదర్శికి సంబంధించిన కేసులలో గత ప్రభుత్వం జప్తు చేసిన రూ.వెయ్యి కోట్లను ఈ ప్రభుత్వం రాగానే తీసి వేసింది కదా!.. అందువల్ల ఈనాడు వారికే పండగే కావచ్చు. సామాన్యుడికి వస్తే ఎంత? రాకపోతే ఎంత? సంక్రాంతి వరాలు రూ.6700 కోట్లు అంటూ పెద్ద బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. గతంలో జగన్ ఒక్క స్కీమ్ కింద ఈ స్థాయిలో ప్రజలకు డబ్బు ఇచ్చేవారు. కాని చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో రూ.70 వేల కోట్లకు పైగా అప్పులు చేసినా, ఆ డబ్బు అంతా ఏమైందో కాని స్కీమ్ లు అమలు చేయలేదు. 🤔నిజంగానే చెప్పిన హామీలు చెప్పినట్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్ అమలు చేసి ఉంటే సుమారు రూ.40 వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఇచ్చి ఉండాలి. కానీ అందులో ఆరోవంతు నిధులు కూడా ఇవ్వలేదు. ఉద్యోగులకు, వివిధ వర్గాలకు ఇవ్వాల్సిన మొత్తాలలో కొద్ది, కొద్దిగా ఇచ్చి పండగ చేసుకోమంటోంది. ఉద్యోగులకు రూ.25 వేల కోట్ల బకాయిలు ఉంటే రూ.1300 కోట్లు ఇచ్చారు. ఇది ఏ మూలకు వస్తాయని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఫీజ్ రీయింబర్స్మెంట్ స్కీమ్, ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా అర కొరగానే ఇచ్చారని చెబుతున్నారు. ఉద్యోగులకు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటెరిమ్ రిలీఫ్ ప్రకటిస్తామని అన్నా, దాని గురించి మాట్లాడడం లేదు. ఆర్థికంగా సమస్యలు ఉన్నాయని వాస్తవ పరిస్థితి చెప్పడం వేరు. మొత్తం హామీలు అమలు చేసినట్లు బిల్డప్ ఇచ్చి ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ప్రచారం చేసుకోవడం వేరు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. 😥గతంలో ధరలు కొద్దిగా పెరిగినా, విద్యుత్ చార్జీల సర్దుబాటు జరిగినా ఇదే చంద్రబాబు ,పవన్ ఏ స్థాయిలో విమర్శలు చేసేవారు! ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటివి ఎంత దారుణమైన కథనాలు రాసేవి. మరి ఇప్పుడు రూ.15 వేల కోట్ల విద్యుత్ భారం మోపినా, రెండున్నర లక్షల మంది వలంటీర్ల నోటికాడి కూడు తీసేసినా, తల్లులకు ప్రతి ఏటా వచ్చే రూ.15 వేలు ఎగ్గొట్టినా మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని మోసం చేసినా, నిరుద్యోగులకు రూ.3,000 ఖాయమని చెప్పి ఊరించి తూచ్ అంటున్నా, వారంతా సంతోషంగా ఉన్నారని భ్రమ పడాలన్నది ఎల్లో మీడియా లక్ష్యంగా ఉందనుకోవాలి. అభివృద్ధి పనులతో గ్రామాలకు సంక్రాంతి కళ వచ్చేసిందని ఈనాడు బోగస్ వార్తలు ఇస్తోంది. ప్రజల చేతిలో డబ్బు ఉంటే సంక్రాంతి పండగ బాగా చేసుకుంటారు కాని, కహానీలు చెబితే కడుపు నిండుతుందా?. కాకపోతే క్యాసినోలు, జూదాలు, కోడి పందేలు ఆడించి, ఎక్కడబడితే అక్కడ మద్యం అమ్మించి ఇదే సంక్రాంతి అనుకోండని అంటున్నారు. పేదలు వీటితో సరిపెట్టుకోవలసిందేనా!..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ
టైటిల్: ‘సంక్రాంతికి వస్తున్నాం’నటీనటులు: వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, వీకే నరేశ్, వీటీ గణేష్, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర లిమాయే తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు: శిరీష్, దిల్ రాజుదర్శకత్వం: అనిల్ రావిపూడిసంగీతం: భీమ్స్ సిసిరిలియోసినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డిఎడిటర్: తమ్మిరాజువిడుదల తేది: జనవరి 14, 2025ఈ సంక్రాంతికి చివరిగా వచ్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Review). రిలీజ్ విషయంలో చివరిది అయినా.. ప్రమోషన్స్‌లో మాత్రం మిగతా సినిమాలతో పోలిస్తే ఇదే ముందంజలో ఉంది. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు చేసినంత ప్రమోషన్ మరే సినిమాకు చేయలేదు. దానికి తోడు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ అదిరిపోవడంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ‘ఫ్యామిలీతో వచ్చిన ప్రతిసారి విక్టరీ గ్యారెంటీ’ అనిపించుకున్న వెంకటేశ్ ఖాతాలో మరో ‘ ఫ్యామిలీ విక్టరీ’ పడిందా రివ్యూలో చూద్దాం.కథేంటేంటే.. డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు. కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రప్పించాలకుంటాడు. ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. కొన్ని కథలు మన ఊహకందేలా సింపుల్‌గా ఉంటాయి. సినిమా ప్రారంభం మొదలు ఎండ్ వరకు ప్రతీది అంచనాకు తగ్గట్టే ఉంటాయి. కానీ తెరపై చూస్తుంటే తెలియని ఒక ఆనందం కలుగుతుంది. పాత కథ, రొటీన్ సీన్లే అయినప్పటికీ ఎంటర్టైన్ అవుతుంటాం. అలాంటి సినిమాలను తెరకెక్కించడం అనిల్ రావిపూడికి వెన్నతో పెట్టిన విద్య. సింపుల్ పాయింట్‌ని తీసుకొని రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. గత సినిమాల మాదిరే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. టైటిల్ మాదిరే సంక్రాంతికి అసలైన సినిమా ఇది.(Sankranthiki Vasthunam Review)అనిల్ రావిపూడి(Anil Ravipudi) రిలీజ్ ముందే సినిమా కథంతా చెప్పేస్తుంటాడు. ఈ సినిమా విషయంలోనూ అదే చేశాడు. ట్రైలర్లోనే కథంతా చెప్పేశాడు. హీరోహీరోయిన్ల క్యారెక్టర్ ఎలా ప్రవర్తిస్తాయో కూడా ప్రమోషన్స్‌లోనే చెప్పేశాడు. స్టోరీ మొత్తం తెలిసినా కూడా తెరపై ఆ కథను చూసి ఎంజాయ్ చేయాలని ప్రతి ప్రేక్షకుడు అనుకుంటాడు. దానికి కారణం.. ఈ కథ మెయిన్ పాయింట్. భార్య, భర్త, ప్రియురాలు.. ఈ మూడు పాత్రలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కనిపిస్తాయి. వాళ్ల మధ్య వచ్చే ప్రతీ సీన్ మన నిజ జీవితంలో ఎక్కడో ఒక చోట చూసే ఉంటాం. అలాంటి పాయింట్ పట్టుకోవడమే అనిల్ రావిపూడి సక్సెస్. ఓ ఫ్యామిలీ స్టోరీకి ఓ వెరైటీ ఇన్వెస్టిగేషన్ యాడ్ చేసి ఫుల్ ఎంటర్టైనింగ్గా కథనాన్ని నడిపించాడు. ఆకెళ్ల కిడ్నాప్ సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. అయితే ఈ కిడ్నాప్ సీన్‌ని కూడా ఎంటర్టైనింగ్గానే తీర్చిదిద్ది.. కథనం మొత్తం ఫుల్ కామెడీ వేలో సాగుతుందనే ముందే చెప్పేశాడు దర్శకుడు. ఆ తర్వాత రాజు ఫ్యామిలీ పరిచయం నవ్వులు పూయిస్తుంది. వైడీ రాజు కొడుకు బుల్లిరాజు పండించే కామెడీకి పడిపడి నవ్వుతారు. వైడీ రాజు ఇంటికి మీనాక్షి వచ్చిన తర్వాత కామెడీ డోస్ డబుల్ అవుతుంది. ఒక పక్క భార్య, మరో పక్క మాజీ ప్రియురాలుతో హీరో పడే బాధ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. ఆహ్లాదకరమైన పాటలు... పొట్టచెక్కలయ్యే కామెడీ సీన్లతో ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా ముగుస్తుంది. ఇక సెకండాఫ్ ప్రారంభం అయిన కాసేపటికే కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. జైలర్ జార్జ్ ఆంటోనీ(ఉపేంద్ర లిమాయే)తో వచ్చే కొన్ని సీన్లు అంతగా ఆకట్టుకోవు. ఆస్పత్రి సీన్ కూడా రొటీన్‌గానే అనిపిస్తుంది. ‘ఆవకాయ’ సీన్‌కు అయితే పడిపడి నవ్వుతారు. క్లైమాక్స్‌ని పకడ్బంధీగా రాసుకున్నాడు. క్లైమాక్స్ యాక్షన్ సీన్ అయితే అదిరిపోతుంది. అక్కడ వెంకటేశ్ చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతినకుండా.. మగవాళ్లకు మనో ధైర్యాన్ని ఇచ్చేలా ఆ డైలాగ్స్ ఉంటాయి. ముగింపులో ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది. మొత్తంగా సంక్రాంతికి చూడాల్సిన మాంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఎవరెలా చేశారంటే.. ఇద్దరి ఆడవాళ్ల మధ్య నలిగిపోయే పాత్రను వెంకటేశ్(Venkatesh) చేస్తే ఎలా ఉంటుందో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ చిత్రంలోనే చూసేశాం. ఆయన కామెడీ టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా వెంకీ అలాంటి పాత్రే చేశాడు. మాజీ ప్రియురాలు, భార్య మధ్య నలిగిపోయే యాదగిరి దామోదర రాజు పాత్రలో ఒదిగిపోయాడు. ఇద్దరి ఆడాళ్ల మధ్య నలిగిపోతూ నవ్వులు పూయించాడు. యాక్షన్‌తో అలరించడమే కాకుండా పాట పాడి ఆకట్టుకున్నాడు. ఇక చదువురాని పల్లెటూరి అమ్మాయి, రాజు భార్య భాగ్యంగా ఐశ్వర్య రాజేశ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. రాజు మాజీ ప్రియురాలు, ఐపీఎస్ అధికారి మీనాక్షిగా మీనాక్షి చౌదరి అదరగొట్టేసింది. తొలిసారి ఇందులో యాక్షన్ సీన్ కూడా చేసింది. ఇక వీరందరితో పాటు ముఖ్యంగా మట్లాడుకోవాల్సిన మరో పాత్ర బుల్లి రాజు. ఈ పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ ఒదిగిపోయాడు. ఇంత మంది స్టార్స్ ఉన్నప్పటికీ.. తనదైన నటనతో అందరి దృష్టి ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగాడానికి బుల్లిరాజు పాత్ర కూడా ఒక ప్రధాన కారణం. ‘కొరికేస్తా.. కొరికేస్తా’ అంటూ ఈ బుడ్డోడు చేసిన కామెడీకి ప్రేక్షకులు పలగబడి నవ్వారు. నరేశ్, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా భీమ్స్ అందించిన సంగీతం సినిమాకే హైలెట్. అద్భుతమైన పాటలతో పాటు అదిరిపోయే బీజీఎం ఇచ్చాడు. ‘గోదారి గట్టు మీద...’పాటతో పాటు ప్రతి పాట తెరపై చూసినప్పుడు మరింత ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్
నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం
నిజామాబాద్, సాక్షి: రైతుల పండుగ సంక్రాంతి నాడే ఇందూరు ప్రజల చిరకాల కల నెరవేరింది. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పసుపు బోర్డు ప్రారంభించారు. ఆయన వెంట నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కుమార్ ఉన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ‘‘మోదీ ఆశీర్వాదంతో పసుపు బోర్డు నిజామాబాద్‌లో ఏర్పాటైంది. పసుపు రైతులకు అలాగే తొలి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కి అభినందనలు. ప్రపంచ వ్యాప్తంగా రైతుల ఉత్పత్తులు ఇతర అనేక ఉత్పత్తులు గతంలో ఎక్కువగా ఎగుమతి అయ్యేవి కాదు. ప్రధాని మోదీ కృషితో ఆ పరిస్థితి మారింది. .. అనేక దేశాలు భారత్ ఉత్పత్తులు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఆంధ్రాలో నాణ్యమైన పసుపు పండిస్తారు. అందుకే నిజామాబాద్ లో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి చాలా ఉంది. పసుపు సాగు నాణ్యత మరింత పెంచాల్సిన అవసరం ఉంది. పసుపు ప్రాధాన్యం కరోనా సమయంలో అందరికీ తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ ఎగుమతి రవాణా అన్నింటిపై కేంద్రం ఆధ్వర్యంలో పసుపు బోర్డు దృష్టి సారిస్తుంది’’ అని అన్నారు.పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిని నియమించింది కేంద్రం. ఇక.. ఇటు నిజామాబాద్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, నిజామాబాద్ ఆర్మూర్ ఎమ్మెల్యేలు దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా రాకేష్ రెడ్డి, స్పైసెస్ బోర్డు నేషనల్ సెక్రటరీ రమశ్రీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. భారీగా హాజరైన పసుపు రైతులు.. ఎంపీ అర్వింద్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.అంతకు ముందు.. పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘పసుపు రైతుల దశాబ్దాల కల నెరవేరింది. బోర్డు ఏర్పాటుతో అన్నదాతలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పసుపు ప్రాసెసింగ్, మార్కెటింగ్ విషయంలో బోర్డుతో ఎంతో ఉపయోగం ఉంటుంది’’ అని అన్నారు.పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబరు 1న మహబూబ్‌నగర్ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబరు 4న కేంద్ర వాణిజ్యశాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేదీ మాత్రం అందులో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్‌లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. సాకారమైన రైతుల పోరాటంపసుపు బోర్డు సమస్య 2019 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో ప్రధాన అంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశంతో ఏకంగా 176 మంది రైతులు నామినేషన్లు వేశారు. ఆ ఎన్నికల్లో ఒక్కో బూత్‌లో 12 ఈవీఎంలు వాడాల్సి వచ్చింది. అదే టైంలో.. ఇందూరుకు చెందిన 30 మంది పసుపు రైతులు.. ప్రధాని నరేంద్ర మోదీ పోటీచేసిన వారణాసిలోనూ నామినేషన్లు వేశారు. ఈ అంశం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది కూడా. అయితే.. నిజామాబాద్‌లో తాను గెలిస్తే 100 రోజుల్లోపు పసుపు బోర్డు తీసుకొస్తానంటూ బాండ్ పేపర్‌పై రాసిచ్చారు ధర్మపురి అర్వింద్. ఎన్నికల్లో గెలుపొందినా.. బోర్డు ఏర్పాటులో జాప్యం కావడంతో ఆయనపై విమర్శలొచ్చాయి. చివరకు.. ఎట్టకేలకు నిజామాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేయడంతో అటు రైతుల పోరాటం సాకారమైంది.మన పసుపు మార్కెట్ ఇదిప్రపంచంలోనే అత్యధికంగా పసుపు భారత్‌లో సాగవుతోంది. 202223 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 3.24 లక్షల హెక్టార్లలో సాగు చేయగా.. 11.61 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సాగయ్యే పంటలో ఇది 75%. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 2.78 లక్షల టన్నులు, ఆ తర్వాత తెలంగాణలో 2.32 లక్షల టన్నులు పండింది. 202223లో 207.45 మిలియన్ డాలర్ల విలువైన 1.53 లక్షల టన్నుల పసుపు, పసుపు ఆధారిత ఉత్పత్తులు భారత్ నుంచి ఎగుమతి అయ్యాయి. ప్రపంచ మార్కెట్లో భారత్ వాటా సుమారు 62 శాతం. తొలి చైర్మన్‌గా పల్లె గంగారెడ్డిపల్లె గంగారెడ్డి అంకాపూర్లోని రైతు కుటుంబంలో పుట్టారు. డిగ్రీ చదివారు. తొలుత ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. 1991 నుంచి 1993 వరకు అంకాపూర్ గ్రామకమిటీ అధ్యక్షుడిగా, 1993 నుంచి 1997 వరకు బీజేపీ ఆర్మూర్ మండలాధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత జాతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, పార్టీ జిల్లా కార్యదర్శిగా, రెండు పర్యాయాలు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2020 నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. నిజామాబాద్ జాతీయ పసుపు బోర్డు తొలి ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ.. కేంద్ర వాణిజ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్
హైదరాబాద్, సాక్షి: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీ ఊరట లభించింది. మంగళవారం ఉదయం ఆయనకు బెయిల్ లభించింది. రెండు కేసుల్లోనూ జడ్జి ఆయనకు బెయిల్ ఇచ్చారు. జిల్లా సమీక్షా సమావేశంలో తోటి ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించారని ఆయనపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.ఆదివారం కరీంనగర్(Karimnagar) కలెక్టరేట్లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా.. కౌశిక్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్(Sanjay)ల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుని సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందడంతో కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. రాత్రంతా ఆయన త్రీటౌన్ పోలీస్టేషన్లో ఉన్నారు. ఈ ఉదయం వైద్య పరీక్షల అనంతరం పాడి కౌశిక్‌రెడ్డిని (Padi kaushik Reddy) రెండో అదనపు అదనపు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. రూ.10 వేలప్పున మూడు పూత్తులు ఇవ్వాలని ఆదేశిస్తూ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.వాదనలు ఇలా..రెండో అదనపు జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ ప్రేమ లత ముందు కరీంనగర్ పోలీసులు కౌశిక్‌ను హాజరు పర్చారు. కౌశిక్‌రెడ్డిపై గతంలోనూ పలు కేసులు ఉన్నందున రిమాండ్ విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. అయితే.. కౌశిక్‌పై నమోదు అయిన సెక్షన్స్ అన్నీ బెయిలేబుల్ కాబట్టి రిమాండ్ రిజెక్ట్ చేయాలని బీఆర్ఎస్ లీగల్ టీం వాదించింది. ఈ క్రమంలో.. అర్ణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు(2014) తీర్పు ప్రకారం రిజెక్షన్ కోసం కోరింది. దీంతో బీఆర్ఎస్ లీగల్ టీం వాదనతో ఏకీభవించిన జడ్జి.. బెయిల్ మంజూరు చేశారు. ఇకముందు అలాంటి దూకుడు ప్రదర్శించొద్దని కౌశిక్‌ను హెచ్చరించిన మెజిస్ట్రేట్.. కోర్ట్ ప్రొసీజర్స్ ప్రకారం కరీంనగర్ లో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దనీ ఆదేశించారు.రేపు మాట్లాడతా: కౌశిక్ రెడ్డితెలంగాణా ప్రజలు, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది హైడ్రామా. ఈ హైడ్రామాలో నాకు మద్దతు తెలిపిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితతో పాటు అందరికీ నా ధన్యవాదాలు. పండుగ కాబట్టి రాజకీయాలు మాట్లాడొద్దనుకుంటున్నా. రేపు హైదరాబాద్ లో పూర్తి వివరాలు వెల్లడిస్తా. కోర్టు ప్రొసీజర్స్ ప్రకారం ఏ రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి కూడా నిబంధనలు అడ్డువస్తున్నాయి అని మీడియాను ఉద్దేశించి అన్నారాయన.
‘బరి’తెగించిన కూటమి నేతలు
సాక్షి, కాకినాడ జిల్లా: సంక్రాంతి (Sankranti) పండగ సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని.. కోడి పందేలకు(Cockfighting), జూద క్రీడలకు దూరంగా ఉండాలని.. లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ పోలీసు యంత్రాంగం కొన్ని రోజులుగా హెచ్చరిస్తూనే ఉంది. అయినప్పటికీ ఆఫ్ట్రాల్ అన్నట్టుగా ఆ హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయని పందేలరాయుళ్లు.. అధికార కూటమి నేతల అండతో.. తమకు అడ్డే లేదన్నట్టుగా ‘బరి’ తెగించేశారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరుల్లో షరా మామూలుగానే పందెం కోడి కాలు దువ్వింది.. కత్తి కట్టించుకుని.. తగ్గేదేలే అన్నట్లుగా బరిలో తలపడింది.పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బరులు ఏర్పాటయ్యాయి. మూడు రోజుల సంక్రాంతి పండగల్లో తొలి రోజయిన భోగి నాడే కోడి పందేలు, గుండాట, పేకాట, లాటరీ, జూదం, ఇతర అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో సోమవారం జరిగిన కోడిపందేలు, గుండాటల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మొదటి స్థానంలో నిలవగా కాకినాడ జిల్లా రెండో స్థానంలో ఉంది.ఉమ్మడి జిల్లాలో మొత్తం సుమారు 350 బరుల్లో కోడి పందేలు జరిగాయని అంచనా. ఇందులో కోనసీమ జిల్లాలోనే అత్యధికంగా 110 బరుల్లో కోడి పందేలు జరిగాయి. ఈ ప్రాంతంలో తొలి రోజు రూ.110 కోట్లుపైనే పందేలు జరిగాయని లెక్కలేస్తున్నారు. బెల్టు షాపులు ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. కూటమి నేతల. ప్రజలను నిలువునా దోచేస్తున్నారు.పశ్చిమ గోదావరి జిల్లా: జీవహింస వద్దన్న కోర్టు మార్గదర్శకాలను కూటమి నేతలు లెక్కచేయడం లేదు. యథేచ్ఛగా కూటమి నేతల కనుసన్నల్లో పందెం కోళ్లు కత్తులు దూశాయి. రాజ్యాంగబద్ధ పదవిలో కొనసాగుతూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు జూదాలను ప్రోత్సహిస్తున్నారు. కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు పందెం బరులను ప్రారంభించారు. పోలీసుల మైకులు మూగబోయాయి. జిల్లా వ్యాప్తంగా బరుల వద్ద కోడిపందేలు, గుండాట, పేకాట నిర్వహణ యథేచ్ఛగా సాగిపోతోంది. మద్యం స్టాళ్లు ఏర్పాటు చేసి భారీగా అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో మద్యం ఏరులై పారుతోంది. తొలి రోజే రూ.100 కోట్లకు పైగాచేతులు మారింది.ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి
'90 గంటల పని'పై ఎల్&టీ హెచ్ఆర్ టీం స్పందన
ఉద్యోగులు వారంలో 90 గంటలు పనిచేయాలని, ఆదివారాలు కూడా విధులకు హాజరుకావాలంటూ ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. సోషల్ మీడియాలో దీని మీద మామూలు చర్చ జరగడం లేదు. అయితే.. తమ చైర్మన్ చేసిన వ్యాఖ్యలపై ఎల్ అండ్ టీం హెచ్ఆర్ టీం స్పందించింది. ఆయన వ్యాఖ్యలపై వివరణతో హెచ్ఆర్ హెడ్ సోనికా మురళీధరన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ఉంచారు.90 పని గంటల విషయంలో ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్(SN Subrahmanyan) వ్యాఖ్యలు జనాల్లోకి చాలా పొరపాటు వెళ్లాయంటూ లారెన్స్ & టూబ్రో(L & T) హెచ్ఆర్ హెడ్ సోనికా అంటున్నారు. ‘మా ఎండీ వ్యాఖ్యలు పొరపాటుగా జనంలోకి వెళ్లాయి. ఆయన చాలా సాధారణంగానే ఆ మాటలు అన్నారు. కానీ, అవి అనవసర విమర్శలు దారితీయడం నిజంగా బాధాకరం. వారానికి 90 గంటలు పని తప్పనిసరనిగానీ.. దానిని అమలు చేయాలనిగానీ ఆయనేం అనలేదు. .. ఆయన ప్రతీ ఉద్యోగిని తన కుటుంబ సభ్యుడిగానే భావిస్తారు. అలాగే తన టీం బాగోగుల గురించి కూడా ఆలోచిస్తారు. ఇప్పుడున్న కార్పొరేట్ ప్రపంచంలో ఇది అంత్యంత అరుదైన విషయం’’ అని ఆమె అన్నారు. అలాగే.. ఆయన నాయకత్వాన్ని ఆమె ఆకాశానికెత్తారు. కాబట్టి.. ఆయన మాటల్ని అర్థం చేసుకుని, విమర్శలకు పుల్‌స్టాప్ పెట్టాలని ఆమె కోరారు.అంతటితో ఆగలేదు..ఉద్యోగులు వారానికి 90 గంటలు(90 Hours Work) పనిచేయాలని ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. అయితే ఆయన పనిగంటల వరకు మాట్లాడినా ఈ వివాదం అంతగా ముదిరేది కాదేమో. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇంట్లో కూర్చొని ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు? ఇంట్లో తక్కువ, ఆఫీసులో ఎక్కువగా ఉంటామని భార్యలకు చెప్పాలి. అవసరమైతే ఆదివారాలు కూడా పనిచేయాలి’’ అని అన్నారు. దీంతో రచ్చ మొదలైంది.ఉన్నతహోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం చూసి ఆశ్చర్యానికి గురయ్యానంటూ బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొణె అసహనం వ్యక్తం చేశారు. వారానికి 90 గంటలు పనిచేయాలనే ఆలోచన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా సైతం ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. అలాగైతే సండే పేరును ‘సన్ డ్యూటీ’గా మార్చాలని వ్యంగ్యంగా రాసుకొచ్చారు. బానిసలాగా కష్టపడటాన్ని కాకుండా తెలివిగా పనిచేయడాన్ని తాను నమ్ముతానని తెలిపారు. పనిని, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడం చాలా అవసరమన్నారు. మరోవైపు.. పలువురు ప్రముఖులు సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలతో ఏకీభవించడం కొసమెరుపు.చర్చ సరైన దిశగా వెళ్లడం లేదు. పని పరిమాణంపైనే కదా ఇదంతా. నా దృష్టిలో అయితే 40 గంటలా.. 70 గంటలా లేదంటే 90 గంటలా అని కాదు. ఎంత నాణ్యమైన పనిని అందించామా అన్నదే ముఖ్యం. 10 గంటల్లో కూడా ప్రపంచాన్ని మార్చవచ్చు. అందుకే పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. ఎంతసేపు పని చేశామన్నది ముఖ్యం కాదు:::మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా
అలా చేయకుంటే కోర్టుకెళ్తాం.. ‘కూటమి’కి వైవీ సుబ్బారెడ్డి వార్నింగ్
సాక్షి, ప్రకాశం జిల్లా: తిరుమల తొక్కిసలాట (Tirupati stampede) దురదృష్టకరమని ఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ (YSRCP) రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) డిమాండ్ చేశారు. లేదంటే తమ పార్టీ తరఫున కోర్టుకెళ్తామని హెచ్చరించారు. లడ్డూ విషయంలో హంగామా చేసిన చంద్రబాబు, పవన్ ఎందుకు సెలైంట్‌గా ఉన్నారని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.పల్లెల్లో సంక్రాంతి కళ కనిపించడం లేదు. రైతుల మొఖాల్లో ఆనందం లేదు. రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ఏడు నెలలైనా పింఛన్ తప్ప ఏం సంక్షేమ పథకం అమలు కాలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పవన్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. హామీలు అమలు చేసి మాపై ఆరోపణలు చేయండి’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి
సంక్రాంతి వచ్చెనట సందడి తెచ్చెనట!
మంచుకు తడిసిన ముద్దబంతులు... ముగ్గులు... పూలు విచ్చుకున్న గుమ్మడి పాదులు... కళ్లాపిలు.... వంట గదుల్లో తీపీ కారాల ఘుమఘుమలు...కొత్త బట్టలు... కొత్త అల్లుళ్ల దర్పాలు...పిల్లల కేరింతలు... ఓపలేని తెంపరితనాలుసంక్రాంతి అంటే సందడే సందడి.మరి మేమేం తక్కువ అంటున్నారు సినిమా తారలు.మా సంక్రాంతిని వినుమా అని ముందుకొచ్చారు.రచయిత్రులు ఊసుల ముత్యాల మాలలు తెచ్చారు.‘ఫ్యామిలీ’ అంతా సరదాగా ఉండే సంబరవేళ ఇది.ప్రతిరోజూ ఇలాగే పండగలా సాగాలని కోరుకుంటూసంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం.ఇన్పుట్స్ : సాక్షి సినిమా, ఫ్యామిలీ బ్యూరోమన పండుగలను ఎన్నో అంశాలను మిళితం చేసి ప్రయోజనాత్మకంగా రూపొందించారు మన పెద్దలు. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా పండుగ విధులుగా చెప్పి వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక క్షేమాలని కలిగించేవిగా వాటిని రూపొందించారు. మన పండుగల్లో ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక మొదలైన శాస్త్రవిజ్ఞానాలు మిళితమై ఉంటాయి. తెలుగువారి ప్రధానమైన పండుగ సంక్రాంతిలో కూడా అంతే! ప్రధానంగా చాంద్రమానాన్ని పాటించే తెలుగువారు సౌరమానాన్ని పాటించే ముఖ్యమైన సందర్భం ఇది. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం అంటారు. అది డిసెంబరు 15 కాని, 16వ తేదీ కాని అవుతుంది. అప్పటి నుండి మకర సంక్రమణం వరకు అంటే జనవరి 14 కాని, 15 వ తేదీ వరకు కాని ఉంటుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు మకర సంక్రాంతి. ఆ రోజు నుండి సూర్యుడు తన గమన దిశని దక్షిణం నుండి ఉత్తరానికి మార్చుకుంటాడు కనుక మకర సంక్రమణానికిప్రాధాన్యం. ఆ రోజు పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు. బొమ్మల కొలువుపెట్టుకునే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది. అసలు ప్రధానమైనది సంక్రాంతి. ఈ పుణ్యకాలంలో దానాలు, తర్పణాలుప్రాధాన్యం వహిస్తాయి. ఈ సమయంలో చేసే దానాలకి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడురోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలి తనకి ఇష్టమైన దానాలు చేస్తే సంతోషిస్తాడు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయటం మరీ శ్రేష్ఠం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. మకరరాశిలో ఉండే శ్రవణానక్షత్రానికి అధిపతి అయిన శని శాంతించటానికి నువ్వుల దానం చేయటం శ్రేయస్కరం. వస్త్రదానం,పెరుగుదానంతో పాటు, ఏ దానాలు చేసినా మంచిదే. భోగినాడు ఏ కారణంగానైనా పేరంటం చేయనివారు ఈ రోజు చేస్తారు. అసలు మూడురోజులు పేరంటం చేసే వారున్నారు. సంక్రాంతి మరునాడు కనుము. కనుముని పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి,పూలదండలని వేసి, ఊరేగిస్తారు. వాటికి పోటీలు పెడతారు. ఎడ్లకి పరుగు పందాలు, గొర్రె పొట్టేళ్ళ పోటీలు, కోడిపందాలు మొదలైనవి నిర్వహిస్తారు. నాగలి, బండి మొదలైన వాటిని కూడా పూజిస్తారు. ఇప్పుడు ట్రాక్టర్లకి పూజ చేస్తున్నారు. భూదేవికి, రైతులకి, పాలేర్లకి, పశువులకి, వ్యవసాయ పనిముట్లకి కూడా తమ కృతజ్ఞతలని తెలియచేయటం పండుగలోని ప్రతి అంశంలోనూ కనపడుతుంది. మాంసాహారులు ఈరోజు మాంసాహారాన్ని వండుకుంటారు. సాధారణంగా కోడిపందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఉపయోగించటం కనపడుతుంది. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవమర్యాదలని చూపటం అనే సంస్కారం ఇక్కడ కనపడుతుంది. పంటను పాడుచేసే పురుగులని తిని సహాయం చేసినందుకు పక్షులకోసం వరికంకులను తెచ్చి కుచ్చులుగా చేసి, ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కనుమునాడు గుడిలో వరికంకుల గుత్తులను కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ‘కనుము నాడు కాకైనా కదలదు’,‘కనుము నాడు కాకైనా మునుగుతుంది’,‘కనుము నాడు మినుము తినాలి’ అనే సామెతలు కనుముకి పితృదేవతలకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి. మొత్తం నెల రోజులు విస్తరించి, నాలుగు రోజుల ప్రధానంగా ఉన్న పెద్ద పండగ సంక్రాంతి తెలుగువారికి ఎంతో ఇష్టమైన వేడుక. – డా. ఎన్.అనంతలక్ష్మిముక్కనుముముక్కనుము నాడు ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు. కానీ, కొంతమంది కనుమునాడు కాక ఈ రోజుని మాంసాహారం తినటానికి కేటాయిస్తారు. సంక్రాంతికి అందరూ తమ గ్రామాలకి చేరుకుంటారు. అల్లుళ్లు, ముఖ్యంగా కొత్త అల్లుళ్లు తప్పనిసరి. నెల రోజులు విస్తరించి, నాలుగు రోజులు ప్రధానంగా ఉండే సంక్రాంతి పెద్దపండుగ. పెద్దల పండుగ కూడా. పెద్ద ఎత్తున చేసుకునే పండుగ కూడా.థీమ్‌తో బొమ్మల కొలువుసంక్రాంతికి ప్రతియేటా ఐదు రోజులు బొమ్మలు కొలువు పెడుతుంటాం. చిన్నప్పటి నుంచి నాకున్న సరదా ఇది. నేను, మా అమ్మాయి, మనవరాలు కలిసి రకరకాల బొమ్మలను, వాటి అలంకరణను స్వయంగా చేస్తాం. ప్రతి ఏటా ఒక థీమ్‌ను ఎంచుకుంటాం. అందకు పేపర్, క్లే, అట్టలు, పూసలు, క్లాత్స్.. ఎంచుకుంటాం. ఈ సారి ఉమెన్ పవర్ అనే థీమ్‌తో నవదుర్గలు పెట్టాం. అమ్మ వార్ల బొమ్మలు ఇప్పటికీ ఇంట్లో ఉన్నాయి. గుడిలాగా అలంకారం చేశాం. గుడికి అమ్మాయిలు వస్తున్నట్టు, పేపర్లతో అమ్మాయిల బొమ్మలను చేశాం. తిరుపతి చందనం బొమ్మల సేకరణ కూడా ఉంది. ఆ బొమ్మలతో కైలాసం అనుకుంటే శివపార్వతులుగా, తిరుపతి అనుకుంటే వెంకటేశ్వరస్వామి, పద్మావతి... ఇలా థీమ్‌కు తగ్గట్టు అలంకరణ కూడా మారుస్తాం. ఈ బొమ్మల కొలువుకు మా బంధువులను, స్నేహితులను పిలుస్తుంటాం. ఎవరైనా అడిగితే వాళ్లు వచ్చేవరకు ఉంచుతాం. – శీలా సుభద్రాదేవి, రచయిత్రిపండగ వైభోగం చూతము రారండి– రోహిణితమిళ, మలయాళ, కన్నడ సినిమాలలో ఎంతో పెద్ద పేరు తెచ్చుకున్న రోహిణి అనకాపల్లి అమ్మాయి అనే విషయం చాలామందికి తెలియదు. అయిదేళ్ల వయసులో చెన్నైకి వెళ్లిపోయినా... అనకాపల్లి ఆమెతోనే ఉంది. అనకాపల్లిలో సంక్రాంతి జ్ఞాపకాలు భద్రంగా ఉన్నాయి. నటి, స్క్రీన్ రైటర్, పాటల రచయిత్రి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోహిణి మొల్లెటి... ‘సంక్రాంతి ఇష్టమైన పండగ’ అంటుంది, ఆనాటి పండగ వైభోగాన్ని గుర్తు చేసుకుంటుంది.నా చిన్నప్పుడు .. సంక్రాంతికి స్కూల్‌కి సెలవులు ఇచ్చేవారు. అదో ఆనందం. అలాగే కొత్త బట్టలు కొనిపెట్టేవాళ్లు. ఇంట్లో చక్కగా పిండి వంటలు చేసి పెట్టేవాళ్లు. ఫుల్లుగా తినేవాళ్లం. మాది అనకాపల్లి. నాకు ఐదేళ్లప్పుడు చెన్నై వెళ్లిపోయాం. సో... నాకు ఊహ తెలిశాక జరుపుకున్న పండగలన్నీ చెన్నైకి సంబంధించినవే.సంక్రాంతికి నెల ముందే నెల గంట పడతారు. అప్పట్నుంచి రోజూ ముగ్గులు పెట్టేవాళ్లం. అయితే ఎవరి ముగ్గు వారిది అన్నట్లు కాకుండా మా ముగ్గుకి ఇంకొకరు రంగులు వేయడం, మేం వెళ్లి వాళ్ల ముగ్గులకు రంగులు వేయడం... ఫైనల్లీ ఎవరి ముగ్గు బాగుందో చూసుకోవడం... అవన్నీ బాగుండేది. నేను రథం ముగ్గు వేసేదాన్ని. ఇక సంక్రాంతి అప్పుడు గంగిరెద్దుల సందడి, హరిదాసులను చూడడం భలేగా అనిపించేది. సంక్రాంతి నాకు ఇష్టమైన పండగ. ఎందుకంటే మనకు అన్నం పెట్టే రైతుల పండగ అది. వారికి కృతజ్ఞత తెలపాలనుకుంటాను. రైతుల విలువ పిల్లలకు చెప్పాలి. ఏమీ చెప్పకుండా పండగ చేసుకుంటే ఇది కూడా ఓ వేడుక అనుకుంటారు... అంతే. అసలు ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నామో పిల్లలకి చెప్పాలి. అర్థం తెలిసినప్పుడు ఇంకాస్త ఇన్ వాల్వ్ అవుతారు.ఇప్పుడు పండగలు జరుపుకునే తీరు మారింది. వీలైనంత వైభవంగా చేయాలని కొందరు అనుకుంటారు. అయితే ఎంత గ్రాండ్‌గా చేసుకుంటున్నామని కాదు... అర్థం తెలుసుకుని చేసుకుంటున్నామా? లేదా అనేది ముఖ్యం. తాహతుకి మించి ఖర్చుపెట్టి పండగ చేసుకోనక్కర్లేదన్నది నా అభిప్రాయం.సంక్రాంతి అంటే నాకు గుర్తొచ్చే మరో విషయం చెరుకులు. చాలా బాగా తినేవాళ్లం. ఇప్పుడూ తింటుంటాను. అయితే ఒకప్పటి చెరుకులు చాలా టేస్టీగా ఉండేవి. ఇప్పటి జనరేషన్ చెరుకులు తింటున్నారో లేదో తెలియడం లేదు. షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నారు. అయితే చెరుకు కొరుక్కుని తింటే పళ్లకి కూడా మంచిది. మన పాత వంటకాలు, పాత పద్ధతులన్నీ మంచివే. ఇలా పండగలప్పుడు వాటి గురించి చెప్పడం, ఆ వంటకాలు తినిపించడం చేయాలి.నెల్నాళ్లూ ఊరంతా అరిసెల వాసనపండగ మూడు రోజులు కాదు మాకు నెల రోజులూ ఉండేది. వ్యవసాయం, గోపోషణ సమృద్ధిగా ఉండటం వల్ల నెల ముందు నుంచే ధాన్యం ఇల్లు చేరుతుండేది. నెల గంటు పెట్టగానే పీట ముగ్గులు వేసేవారు. వాటిల్లో గొబ్బిళ్లు పెట్టేవారు. రోజూ గొబ్బిళ్లు పెట్టి, వాటిని పిడకలు కొట్టేవారు. ఆ గొబ్బి పిడకలన్నీ పోగేసి, భోగిరోజున కర్రలు, పిడకలతోనే భోగి మంట వేసేవాళ్లు. మామూలు పిడకల వాసన వేరు, భోగి మంట వాసన వేరు. ప్రధాన సెలబ్రేషన్ అంటే ముగ్గు. బొమ్మల కొలువు పెట్టేవాళ్లం. అందరిళ్లకు పేరంటాలకు వెళ్లేవాళ్లం. ఊరంతా అరిసెల వాసన వస్తుండేది. కొత్త అటుకులు కూడా పట్టేవారు. చెరుకు గడలు, రేగుపళ్లు, తేగలు, పిల్లల ఆటలతో సందడిగా ఉండేది. బంతిపూల కోసం అక్టోబర్‌లో మొక్కలు వేసేవాళ్లం. అవి సంక్రాంతికి పూసేవి. కనుమ నాడు గోవులను అలంకరించి, దండం పెట్టుకునే వాళ్లం. చేసుకున్న పిండి వంటలు పంచుకునేవాళ్లం. హరిదాసులకు, గంగిరెద్దుల వాళ్లకు ధాన్యాన్ని ఇచ్చేవాళ్లం. ఇప్పటికీ పండగలను పల్లెలే సజీవంగా ఉంచుతున్నాయి. పట్టణాల్లో మాత్రం కొన్నేళ్లుగా టీవీల్లోనే సంక్రాంతి సంబరాలను చూస్తున్నాం. – రమారావి, కథకురాలు, ఆధ్యాత్మికవేత్తనా జీవితంలో సంక్రాంతి చాలా స్పెషల్– మీనాక్షీ చౌదరి‘ఆరు నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారు’ అనేది మన అచ్చ తెలుగు సామెత. తెలుగుతనం ఉట్టిపడే పేరున్న మీనాక్షీ చౌదరి తెలుగు అమ్మాయి కాదు. ఉత్తరాది అమ్మాయి మీనాక్షీ చౌదరి కాస్త బాపు బొమ్మలాంటి తెలుగింటి అమ్మాయిగా మారడానికి మూడు సంవత్సరాల కాలం చాలదా! మీనాక్షీ నటి మాత్రమే కాదు స్విమ్మర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కూడా. ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ (2018) కిరీటాన్ని గెలుచుకుంది. ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమా తో తెలుగు తెరకు సైలెంట్‌గా పరిచయం అయిన చౌదరి ‘హిట్: ది సెకండ్ కేస్’తో హిట్ కొట్టింది. సూపర్‌హిట్ సినిమా ‘లక్కీభాస్కర్’ లో సుమతిగా సుపరిచితురాలైంది. కొందరికి కొన్ని పండగలు ప్రత్యేకమైనవి. సెంటిమెంట్‌తో కూడుకున్నవి. మీనాక్షీ చౌదరికి కూడా సరదాల పండగ సంక్రాంతి ప్రత్యేకమైనది. సెంటిమెంట్‌తో కూడుకున్నది. ఈ హరియాణ అందాల రాశి చెప్పిన సంక్రాంతి ముచ్చట్లు ఇవి.మాది హర్యానా రాష్ట్రంలోని పంచకుల. మూడేళ్లుగా నేను హైదరాబాద్‌లో ఉంటూ తెలుగు సినిమాల్లో పని చేస్తున్నాను కాబట్టి సంక్రాంతి పండగ గురించి నాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి జనవరిలో ఒక సెలబ్రేషన్ (సంక్రాంతి) ఉంది. సంక్రాంతి–సినిమా అనేది ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ . సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి అన్నది సినిమాల రిలీజ్‌కి, సెలబ్రేషన్స్ కి చాలా మంచి సమయం. కుటుంబమంతా కలిసి సందడిగా పూజలు చేసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. అది నాక్కూడా చాలా ఎగ్జయిటెడ్‌గా ఉంటుంది. గాలిపటాలంటే నాకు చాలా ఇష్టం. కానీ, ఎగరేయడంలో నేను చాలా బ్యాడ్ (నవ్వుతూ). అయినా, మా ఫ్రెండ్స్‌తో కలిసి మా ఊర్లోనూ, హైదరాబాద్‌లోనూ ఎగరేసేందుకు ప్రయత్నిస్తుంటాను. హైదరాబాద్‌లో ప్రతి ఏటా అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహించడం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే గాలిపటాలు ఎగరేయడం అన్నది కూడా ఒక ఆటే. సంక్రాంతి టు సంక్రాంతి2024 నాకు చాలా సంతోషంగా, గ్రేట్‌ఫుల్‌గా గడిచింది. గత ఏడాది మంచి సినిమాలు, మంచి కథలు, పాత్రలు, మంచి టీమ్‌తో పని చేయడంతో నా కల నిజం అయినట్లు అనిపించింది. 2025 కూడా అలాగే ఉండాలని, ఉంటుందని కోరుకుంటున్నాను. చూస్తుంటే సంక్రాంతి టు సంక్రాంతి వరకు ఓ సర్కిల్లా అనిపిస్తోంది. నా జీవితం లో కూడా సంక్రాంతి చాలా స్పెషల్. ఎందుకంటే గత ఏడాది నేను నటించిన ‘గుంటూరు కారం’ వచ్చింది.. ఈ ఏడాది కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలవుతోంది! అందుకే చాలా సంతోషంగా... ఎగ్జయిటింగ్‌గా ఉంది.ముగ్గుల లోకంలోకి– దివి వాఢత్యాదివి పదహారు అణాల తెలుగు అమ్మాయి. ఎం.టెక్ అమ్మాయి దివి మోడలింగ్‌లోకి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చింది. ‘బిగ్‌బాస్4’తో లైమ్‌లైట్‌లోకి వచ్చింది. హీరోయిన్గా చేసినా, పెద్ద సినిమాలో చిన్న పాత్ర వేసినా తనదైన మార్కును సొంతం చేసుకుంది. గ్లామర్ పాత్రలలో మెరిసినా, నాన్–గ్లామరస్ పాత్రలలో కనిపించినాతనదైన గ్రామర్ ఎక్కడీకి పోదు! మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లుగానే... మహా పండగ సంక్రాంతి కోసం ఎదురు చూడడం దివికి ఇష్టం. సంక్రాంతి వస్తే చాలు... ఆమెకు రెక్కలు వస్తాయి. సరాసరి వెళ్లి విజయవాడలో వాలిపోతుంది. పండగ సంతోషాన్ని సొంతం చేసుకుంటుంది. భోగిమంటల వెలుగు నుంచి గగనసీమలో గాలిపటాల వయ్యారాల వరకు దివి చెప్పే సంక్రాంతి కబుర్లు...మాది హైదరాబాదే అయినా, నేను పుట్టింది విజయవాడలో. ఊహ తెలిసినప్పటి నుంచి సంక్రాంతి వచ్చిందంటే చాలు, విజయవాడలోని మా అమ్మమ్మగారి ఇంట్లో వాలిపోతా. వారం ముందు నుంచే మా ఇంట్లో పండుగ సందడి మొదలయ్యేది. మా మామయ్యలు, పిన్నులు, చుట్టాలందరితో కలసి గారెలు, అరిసెలు ఇలా ఇతర పిండి వంటలు చేసుకుని, ఇరుగు పొరుగు వారికి ఇచ్చుకుంటాం. పండుగ రోజు ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసుకునేవాళ్లం. తర్వాత నలుగు పెట్టుకుని స్నానం చేసి, ముగ్గులు పెడతాం. అమ్మమ్మ పూజ చే స్తే, మేమంతా పక్కనే కూర్చొని, దేవుడికి దండం పెట్టుకునేవాళ్లం. కానీ ఆ రోజుల్ని ఇప్పుడు చాలా మిస్ అవుతున్నా. ఏది ఏమైనా సంక్రాంతికి కచ్చితంగా ఊరెళతాను. ఆ మూడు రోజుల పాటు బయటి ప్రపంచాన్ని మర్చిపోయి కుటుంబ సభ్యులతో కలసి పండుగ చేసుకోవటం నాకు చాలా ఇష్టం. సాయంత్రం స్నేహితులతో కలసి సరదాగా గాలిపటాలు ఎగరేస్తా. ఇప్పుడు నటిగా ఎదుగుతున్న సమయంలో సంక్రాంతి జరుపుకోవటం మరింత ఆనందంగా ఉంది. ఊరెళితే చాలు, అందరూ ఇంటికొచ్చి మరీ పలకరిస్తుంటారు. వారందరినీ చూసినప్పుడు నాపై నాకే తెలియని విశ్వాసం వస్తుంది. చివరగా సంక్రాంతికి ప్రత్యేకించి గోల్స్ లేవు కాని, అందరినీ సంతోషంగా ఉంచుతూ, నేను సంతోషంగా ఉంటే చాలు. ఇక నన్ను బాధించే వ్యక్తులకు, విషయాలకు చాలా దూరంగా ఉంటా. ఇంటర్వ్యూ: శిరీష చల్లపల్లిమర్చిపోలేని పండుగ– అంజలి‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో సీత ఎవరండీ? అచ్చం మన పక్కింటి అమ్మాయి. మన బంధువుల అమ్మాయి. తన సహజనటనతో ‘సీత’ పాత్రకు నిండుతనం తెచ్చిన అంజలికి... ‘మాది రాజోలండీ’ అని చెప్పుకోవడం అంటే ఇష్టం. మూలాలు మరవని వారికి జ్ఞాపకాల కొరత ఉంటుందా! కోనసీమ పల్లె ఒడిలో పెరిగిన అంజలి జ్ఞాపకాల దారిలో వెళుతుంటే....మనం కూడా ఆ దారిలో వెళుతున్నట్లుగానే, పల్లె సంక్రాంతిని ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగానే ఉంటుంది! ఒకటా ... రెండా... పండగకు సంబంధించిన ఎన్నో విషయాలను నాన్‌స్టాప్‌గా చెబుతుంది. అంజలి చెప్పే కోనసీమ సంక్రాంతి ముచ్చట్లు తెలుసుకుందాం...చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే తెలుగమ్మాయిలందరికీ నటి అంజలి ఓ స్ఫూర్తి. మనందరి అమ్మాయి.. తెలుగమ్మాయి.. ఈ పెద్ద పండుగను ఎలా జరుపుకుంటుందంటే...కోనసీమజిల్లా రాజోలు మా ఊరు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు.. అందరికీ వారం ముందు నుంచి పండుగ మొదలయితే, మాకు నెల ముందు నుంచే ఇంకా చెప్పాలంటే పండుగయిన తర్వాతి రోజే.. వచ్చే సంక్రాంతి కోసం ఏర్పాట్లు చేస్తుంటాం. మా తాతయ్య సుబ్బారావుగారు పండుగలంటే అందరూ కలసి చేసుకోవాలని చెప్పేవారు. అందుకే, చిన్నప్పటి నుంచే నాకు అదే అలవాటు. మా ఫ్యామిలీ చాలా పెద్దది. అందరూ వస్తే ఇల్లు మొత్తం నిండిపోయేది. అయినా సరే, ఏ పండుగైనా అందరం కలసే జరుపుకుంటాం. ఇంట్లోనూ పొలాల్లోనూ ఘనంగా పూజలు నిర్వహిస్తాం. చిన్నప్పుడు కజిన్స్ అందరం కలసి ఉదయాన్నే భోగి మంటలు వేయటానికి, అందులో ఏమేం వేయాలో అనే విషయాల గురించి వారం ముందు నుంచే మాట్లాడుకునేవాళ్లం. తాతయ్య పిండివంటలన్నీ చేయించేవారు. అందుకే, ఈ పండుగ కోసం ఎంతో ఎదురు చూసేదాన్ని. కాని, సిటీకి వచ్చాక అంత ఎంజాయ్మెంట్ లేదు. చిన్నతనంలో మా పెద్దవాళ్లు ముగ్గు వేస్తే, మేము రంగులు వేసి, ఈ ముగ్గు వేసింది మేమే అని గర్వంగా చెప్పుకుని తిరిగేవాళ్లం. అందుకే, ముగ్గుల పోటీల్లో నేనెప్పుడూ పాల్గొనలేదు. గాలిపటాన్ని కూడా ఎవరైనా పైకి ఎగరేసిన తర్వాత ఆ దారాన్ని తీసుకుని నేనే ఎగరేశా అని చెప్పుకుంటా. అందుకే, సంక్రాంతి నాకు మరచిపోలేని పండుగ.నిండుగా పొంగితే అంతటా సమృద్ధిసంక్రాంతి పండగ అనగానే తెల్లవారకుండానే పెద్దలు పిల్లల్ని నిద్రలేపడం, చలికి వణుకుతూ ముసుగుతన్ని మళ్లీ పడుకోవడం ఇప్పటికీ గుర్తు వస్తుంటుంది. సందడంతా ఆడపిల్లలదే. ముగ్గులు వేయడం, వాటిల్లో గొబ్బెమ్మలు పెట్టి, నవధాన్యాలు, రేగుపళ్లు వేసేవాళ్లం. ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, ఆవు పిడకల మీద మట్టి గురిగలు పెట్టి, పాలు పొంగించేవాళ్లం. ఎటువైపు పాలు పొంగితే అటువేపు సస్యశ్యామలం అవుతుందని నమ్మకం. నిండుగా పొంగితే అంతటా సమృద్ధి. మిగిలిన గురుగుల్లోని ప్రసాదాన్ని అలాగే తీసుకెళ్లి లోపలి గదుల్లో మూలకు పెట్టేవారు ఎలుకల కోసం. సాధారణ రోజుల్లో ఎలుకలు గింజలు, బట్టలు కొట్టేస్తున్నాయని వాటిని తరిమేవారు. అలాంటిది సంక్రాంతికి మాత్రం, బయట పక్షులతోపాటు ఇంట్లో ఎలుకలకు కూడా ఇలా ఆహారం పెట్టేవాళ్లు. ముగ్గులు పెట్టడంలో ఇప్పడూ పోటీపడే అమ్మాయిలను చూస్తున్నాను. మేం ఉండేది వనపర్తిలో. అప్పటి మాదిరిగానే ఇప్పడూ జరుపుకుంటున్నాం. – పోల్కంపల్లి శాంతాదేవి, రచయిత్రి
పండగ వేళ పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్
సేఫ్డ్ అసెట్‌గా భావించే బంగారం(Gold) పెట్టుబడులను ఇటీవల కాలంలో ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు(Stock Market) భారీగా తగ్గుతున్న నేపథ్యంలో కొన్ని స్టాక్‌లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దాంతో చాలా మంది బంగారంలోని పెట్టుబడులను ఈక్వీటీలకు మళ్లిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే పండగవేళ(Festive Time) మంగళవారం బంగారం ధర తగ్గిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.73,300 (22 క్యారెట్స్), రూ.79,960 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్స్‌పై రూ.100, 24 క్యారెట్స్‌పై రూ.110 చొప్పున తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.73,300 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.79,960 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.100 తగ్గి రూ.73,450కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.110 దిగజారి రూ.80,110 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు మంగళవారం తగ్గినట్లే వెండి ధరల్లోనూ మార్పులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు కేజీ వెండి(Silver Price) రేటు రూ.2,000 తగ్గి రూ.1,00,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
పూరన్ సిక్సర్ల సునామీ.. బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్.. హోప్ సెంచరీ వృధా
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ బోణీ కొట్టింది. దుబాయ్ క్యాపిటల్స్‌తో నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. టామ్ బాంటన్ (52 బంతుల్లో 74; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), నికోలస్ పూరన్ (29 బంతుల్లో 59; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. కెప్టెన్ నికోలస్ పూరన్ అర డజను సిక్సర్లతో సునామీ సృష్టించాడు. ముంబై ఇన్నింగ్స్‌లో పోలార్డ్ (19 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్), ముహమ్మద్ వసీం (18) రెండంకెల స్కోర్లు చేశారు. క్యాపిటల్స్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఓలీ స్టోన్ 2, చమీరా ఓ వికెట్ దక్కించుకున్నారు.హోప్ సెంచరీ వృధాఛేదనలో క్యాపిటల్స్ ఓపెనర్ షాయ్ హోప్ (59 బంతుల్లో 101; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేశాడు. హోప్‌కు మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం అందలేదు. బెన్ డంక్ (10), బ్రాండన్ మెక్‌ముల్లెన్ (16), గుల్బదిన్ నైబ్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సికందర్ రజా (6), దుసన్ షనక (0) విఫలమయ్యారు. క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫజల్ హక్ ఫారూఖీ, అల్జరీ జోసఫ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. వకార్ సలామ్కిల్, అల్లా ఘజన్ఫర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. క్యాపిటల్స్ చేసిన స్కోర్‌లో హోప్ ఒక్కడే మూడొంతులు చేయడం విశేషం. 161 పరుగుల్లో హోప్ 101 పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు, ఎక్స్‌ట్రాల రూపంలో 60 పరుగులు వచ్చాయి.
Mahakumbh: ఉత్సాహం ఉరకలేస్తోంది: బల్గేరియా పర్యాటకులు
జపాన్‌లో ఇంత క్లీన్‌గా ఉంటుందా..!
‘విలీనానికి ఆర్బీఐ ఎన్ఓసీ అవసరం లేదు’
ఏడాదిన్నర క్రితమే తీసుకున్నా.. మీలో స్ఫూర్తి కోసమే చెబుతున్నా: మంచు విష్ణు
నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం
Ashes Series 2025: రెండో వన్డే కూడా ఆసీస్‌దే
Mahakumbh: రైల్వేస్టేషన్లో తొక్కిసలాట.. తప్పిన ప్రమాదం
కహానీలు చెబితే కడుపు నిండుతుందా?
మహాకుంభ మేళలో యోగమాతగా తొలి విదేశీ మహిళ..!
పూరన్ సిక్సర్ల సునామీ.. బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్.. హోప్ సెంచరీ వృధా
సాక్షి కార్టూన్ 14-01-2025
నా భద్రతా బృందంతో బాషాను పంపేలా ఆదేశాలివ్వండి: వైఎస్ జగన్
గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్స్.. రాం గోపాల్ వర్మ సెటైరికల్ ట్వీట్
డెలివరీ తర్వాత వీల్‌చైర్‌కు పరిమితం.. జీవితాంతం ఇంజక్షన్స్..!
సాక్షి కార్టూన్ 14-01-2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్విటర్ రివ్యూ
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం. నూతన వ్యక్తుల పరిచయం.
ఇదెక్కడి ఫామ్ రా సామీ.. 6 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటిస్తారా..?
తల్లే కూతురు పెళ్లిని ఆపేసింది..! ట్విస్ట్ ఏంటంటే..
అలా చేయకుంటే కోర్టుకెళ్తాం.. ‘కూటమి’కి వైవీ సుబ్బారెడ్డి వార్నింగ్
Mahakumbh: ఉత్సాహం ఉరకలేస్తోంది: బల్గేరియా పర్యాటకులు
జపాన్‌లో ఇంత క్లీన్‌గా ఉంటుందా..!
‘విలీనానికి ఆర్బీఐ ఎన్ఓసీ అవసరం లేదు’
ఏడాదిన్నర క్రితమే తీసుకున్నా.. మీలో స్ఫూర్తి కోసమే చెబుతున్నా: మంచు విష్ణు
నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం
Ashes Series 2025: రెండో వన్డే కూడా ఆసీస్‌దే
Mahakumbh: రైల్వేస్టేషన్లో తొక్కిసలాట.. తప్పిన ప్రమాదం
కహానీలు చెబితే కడుపు నిండుతుందా?
మహాకుంభ మేళలో యోగమాతగా తొలి విదేశీ మహిళ..!
పూరన్ సిక్సర్ల సునామీ.. బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్.. హోప్ సెంచరీ వృధా
సాక్షి కార్టూన్ 14-01-2025
నా భద్రతా బృందంతో బాషాను పంపేలా ఆదేశాలివ్వండి: వైఎస్ జగన్
గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్స్.. రాం గోపాల్ వర్మ సెటైరికల్ ట్వీట్
డెలివరీ తర్వాత వీల్‌చైర్‌కు పరిమితం.. జీవితాంతం ఇంజక్షన్స్..!
సాక్షి కార్టూన్ 14-01-2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్విటర్ రివ్యూ
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం. నూతన వ్యక్తుల పరిచయం.
ఇదెక్కడి ఫామ్ రా సామీ.. 6 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటిస్తారా..?
తల్లే కూతురు పెళ్లిని ఆపేసింది..! ట్విస్ట్ ఏంటంటే..
అలా చేయకుంటే కోర్టుకెళ్తాం.. ‘కూటమి’కి వైవీ సుబ్బారెడ్డి వార్నింగ్
సినిమా
రాజకీయాల్లోకి వస్తానంటోన్న హీరోయిన్.. ఆమెనే ఆదర్శం!
సినీ రంగాన్ని, రాజకీయ రంగాన్ని వేరుచేసి చూడలేం. నటులే కాదు.. నటీమణులు కూడా రాజకీయ రంగప్రవేశానికి సై అంటున్నారు. ఈ మధ్య నటి త్రిష ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలైంది. తాజాగా మరో హీరోయిన్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమంటోంది. దక్షిణాదిలో ఓ రేంజ్లో క్రేజ్ దక్కించుకున్న ఆ నటి ఎవరో తెలుసుకుందాం.తాజాగా నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ తానూ రాజకీయాల్లోకి వస్తానని అంటోంది. తెలుగులో గతేడాది హనుమాన్తో మెప్పించిన వరలక్ష్మి శరత్‌కుమార్ దక్షిణాదిలో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది సచ్ దేవ్ నికోలయ్‌ను పెళ్లి చేసుకుని నటనను కొనసాగిస్తున్నారు.తాజగా విశాల్, వరలక్ష్మీ శరత్‌కుమార్, నటి అంజలి హీరో, హీరోయిన్లుగా నటించిన మదగజరాజా చిత్రం 12 ఏళ్ల తరువాత సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. ఇటీవల మూవీ ప్రమోషన్లలో కార్యక్రమంలో పాల్గొన్న నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ మీడియాతో ముచ్చటించారు.12 ఏళ్ల క్రితం నటించిన మదగజరాజా చిత్రం పొంగల్ సందర్భంగా తెరపైకి రావడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయని వరలక్ష్మి శరత్ కుమార్ అన్నారు. పోడా పోడీ చిత్రం తరువాత తాను నటించిన రెండవ చిత్రం ఇదేనని చెప్పారు. కమర్శియల్ అంశాలతో కూడిన వినోదభరిత కథా సినిమా అన్నారు. పది ఏళ్లలో సినిమా చాలా మారిపోయిందన్నారు.సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న నెగెటివ్ కామెంట్స్‌పై వరలక్ష్మి స్పందిచారు. సామాజిక మాధ్యమాల్లో అనవసరంగా వదంతులు ప్రచారం చేస్తున్తన్నారని అన్నారు. తాను ఒక సారి విమానాశ్రయంలో విమానం బయలుదేరే సమయం కావడంతో అత్యవసరంగా వెళుతుండగా పలువురు వచ్చి తనతో ఫొటోలను తీసుకున్నారన్నారు.అప్పుడు ఒకతను వచ్చి ఫొటో తీసుకుంటానని అడిగారన్నారు. కానీ నాకు సమయం మించి పోవడంతో తాను వద్దని చెప్పాన్నాననీ, దీంతో అతను తమతో ఫొటో తీసుకోనివ్వరా? మరి మీరెందుకు నటనలోకి వచ్చారని కామెంట్ చేశాడన్నారు. అలాంటి వారికి బుద్ధి లేదని, వారికి బదులివ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక రాజకీయ రంగప్రవేశం చేస్తారా అన్న ప్రశ్నకు బదులిస్తూ కచ్చితంగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని స్పష్టం చేశారు. అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నారు. తనకు స్ఫూర్తి దివంగత ముఖ్యమంత్రి జయలలిత అని అన్నారు.
'అందరికీ ఇస్తుంది కానీ.. నాకు మాత్రం'.. నక్కిన త్రినాథరావు అభ్యంతరకర కామెంట్స్!
టాలీవుడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు (Trinadha Rao Nakkina) కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. హీరోయిన్ అన్షుపై (Actress Anshu) అసభ్యకర రీతిలో మాట్లాడారు. మజాకా మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన హీరోయిన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దీంతో ఆయనపై మహిళా కమిషన్ సైతం సీరియస్ అయింది.మహిళా కమిషన్ ఆగ్రహం..తెలుగు సినిమా డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు పై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరోయిన్ అన్షుపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. త్రినాథరావు వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించినట్లు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద వెల్లడిచింది. దర్శకుడికి త్వరలోనే నోటీసు జారీ చేస్తామని తెలిపింది.(ఇది చదవండి: హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. డైరెక్టర్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం)ఇలా చేయడం రెండోసారి..అయితే నక్కిన త్రినాథరావు అన్షుపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పాత వీడియో నెట్టింట వైరలవుతోంది. గతంలోనూ చౌర్య పాఠం మూవీ హీరోయిన్ పాయల్ రాధాకృష్ణపై కూడా ఇదే రీతిలో కామెంట్స్ చేశారు. 'అందరికీ హగ్ ఇస్తుంది కానీ.. నాకు మాత్రం ఇవ్వడం లేదు' అని ఈవెంట్లో మాట్లాడారు. మా యూనిట్లో అందరినీ హగ్ చేస్తుంది.. కానీ నేను ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదని అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. పేమేంట్ విత్ జీఎస్టీతో కలిపి మొత్తం ఇచ్చినా కూడా ఇప్పటికీ కూడా నాకు హగ్ ఇవ్వడం లేదు అని నక్కిన త్రినాథరావు అభ్యంతంకర వ్యాఖ్యలు చేశారు.ఇటీవల జరిగిన ఈవెంట్లో అన్షుపై కామెంట్స్ చేయడంతో పాత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నక్కిన త్రినాథరావు ఇలా మాట్లాడటం తొలిసారి కాదని అంటున్నారు. తాజాగా మన్మధుడు హీరోయిన్‌పై అలా మాట్లాడటం రెండోసారని మండిపడుతున్నారు.అసలేం జరిగిందంటే..కాగా నక్కినేని త్రినాథరావు ప్రస్తుతం మజాకా సినిమా (Mazaka Movie)కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఆదివారం (జనవరి 12న) జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు త్రినాధ రావు.. హీరోయిన్ అన్షు గురించి మాట్లాడాడు. అన్షును చూసేందుకే మన్మథుడు సినిమాకు వెళ్లామని, అందులో ఆమె ఓ రేంజ్లో ఉంటుందని చెప్పాడు. అలాంటి అన్షు.. మరోసారి హీరోయిన్గా కళ్లముందుకు వచ్చేసరికి నమ్మలేకపోయానన్నాడు.సన్నబడింది.. కానీ!అయితే అప్పటికి, ఇప్పటికి అన్షు కాస్త సన్నబడిందన్నాడు. మరీ ఇంత సన్నగా ఉంటే సరిపోదు, లావు పెరగమని చెప్పానంటూ హద్దులు దాటుతూ అసభ్యకరంగా మాట్లాడాడు. తన శరీరాకృతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఇదే ఈవెంట్లో అల్లు అర్జున్ (Allu Arjun) ఇన్సిడెంట్ను రీక్రియేట్ చేశాడు. పుష్ప 2 ఈవెంట్లో బన్నీ.. తెలంగాణ సీఎం పేరు మర్చిపోయి వాటర్ బాటిల్ అడిగి.. కవర్ చేసి తర్వాత పేరు చెబుతాడు. సేమ్.. అలాగే ఇక్కడ కూడా త్రినాధరావు రెండో హీరోయిన్ పేరు మర్చిపోయినట్లు నాటకమాడాడు. సమయానికి గుర్తు రావడం లేదన్నట్లుగా వాటర్ బాటిల్ అడిగాడు. కాసేపటికి రీతూ వర్మ కదూ.. నిజంగానే నీ పేరు పేరు గుర్తుండదంటూ కవర్ చేశాడు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్విటర్ రివ్యూ
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 14) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు కొన్ని చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. సంకాంత్రికి వస్తున్నాం సినిమా కథ ఏంటి..? ఎలా ఉంది..? వెంకీ, అనిల్ కాంబో ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడిందా లేదా..? తదితర అంశాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.ఎక్స్‌లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుంది. సినిమా ఎంటర్టైనింగ్గా ఉందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. రొటీన్ కథ అయినప్పటికీ కామెడీ బాగా వర్కౌట్ అయిందని చెబుతున్నారు. #SankranthikiVasthunamDone with my show 💯2nd half is hilarious 🤣 That avakaya episode is too goodAlthought it felt lengthy at parts, @AnilRavipudi handled last 30 minutes very well and ended with a messageMy rating would be 3.5/5Families gonna have a feast in… pic.twitter.com/HtUK07VSmT— INNOCENT EVIL 😈 (@raju_innocentev) January 14, 2025 ఇప్పుడే సినిమా చూశాను. సెకండాఫ్ హిలేరియస్. అవకాయ ఎపిసోడ్ అదిరిపోయింది. అయితే కొన్ని సీన్లు సాగదీతగా ఉన్నాయి. చివరి 30 నిమిషాలు అనిల్ రావిపూడి చక్కగా హ్యాండిల్ చేశాడు. ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా ఇది అంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్‌ఇచ్చాడు.#SankranthikiVasthunam is a timepass festive family entertainer with the only motive being to entertain. The film flows in a Typical zone that Director Ravipudi follows similar to F2. The comedy works well in parts but is over the top and irritates a bit in others. Production…— Venky Reviews (@venkyreviews) January 13, 2025 సంక్రాంతికి వస్తున్నాం టైంపాస్ కామెడీ సినిమా. పండక్కి వినోదాన్ని అందించే చిత్రం. ఎఫ్2 మాదిరే హిలేరిస్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు అనిల్ రావిపూడి. పార్టులుగా చూస్తే కామెడీ బాగా వర్కౌట్ అయింది. ప్రొడక్షన్ క్యాలిటీస్ అంతగా బాగోలేవు. సినిమాలో పెద్ద కథ కూడా ఉండదు. లాజిక్స్ గురించి పట్టించుకోవద్దు. వెంకటేశ్ తనదైన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఈ పండక్కి ఫ్యామిలీస్‌కి ఈ సినిమా మంచి ఛాయిస్ అంటూ మరో నెటిజన్ 2.75 రేటింగ్ ఇచ్చాడు.#SankranthikiVasthunam Liked it! Baagundi!A hilarious entertainer with mediocre story but makes you laugh out loud❤️The theme itself has a lot of potential to make you chuckle, #Venkatesh & #AnilRavipudi are very successful in it#AishwaryaRajesh is impressive👌FUN GUARANTEED! pic.twitter.com/J8AVr2Nei5— Sanjeev (@edokatile) January 14, 2025CLEAN HIT 🎯 🎯 #SankranthikiVasthunam is a fun family Entertainer with Anil Ravipudi's racyscreenplay and songs.🥵🎶🎶It's a Good Family Entertainer 3.5/5 Rating 🤞🤙#SankranthikiVasthunamreview #makarsankranti2025 #Pongal#HappyLohri #MahaKumbh2025 #MakaraSankranti2025 pic.twitter.com/2tJWwcbzTz— Ashok (@imashok1234) January 14, 2025#SankranthikiVasthunam - Family Entertainer!Anil Ravipudi succeeds in entertaining his target audience with a fun film. Bheems music and songs💥Family audience elaago hit ichestharu🫡#SankranthikiVasthunamReview #SankranthikiVasthunnam#VenkyMama #Venkateshdaggubati https://t.co/SHy9jWy6r4 pic.twitter.com/Vokja82Kdi— IndianCinemaLover (@Vishwa0911) January 14, 2025#Bheemsceciroleo music is very good - foot tapping and BGM is 🔥Except some over the top scenes ( as expected ) everything goes according to @AnilRavipudi 's meter and should score a hit for this pongal too.#SankranthikiVasthunam #SankranthikiVasthunamreview— Shiva Kumar Grandhi (@sivakumargrandh) January 13, 2025#SankranthikiVasthunamReview - For Families!Positives:- Venky Mama 👌❤️ - Bheems' Music and Songs ❤️❤️ - Comedy Scenes 😂 Negatives:- Over-the-top Scenes,Especially in the Second Half - Predictable PlotAn Enjoyable Entertainer for Families! Follow 👉…— Movies4u Reviews (@Movies4uReviews) January 13, 2025
సంక్రాంతికి మంచి మూవీతో వస్తున్నాం: వెంకటేశ్
‘‘సంక్రాంతికి వస్తున్నాం’ బాగా వచ్చింది. మీరంతా మీ ఫ్యామిలీతో థియేటర్స్‌కు వచ్చి, మా సినిమాని ఎంజాయ్ చేయండి’’ అన్నారు వెంకటేశ్. ఆయన హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూ΄పొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం నేడు (మంగళవారం) విడుదలవుతోంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘బ్లాక్‌బస్టర్ మ్యూజికల్ నైట్’ ఈవెంట్లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘సంక్రాంతికి వస్తున్నాం’ తరహా సినిమాలను నా ఫ్యాన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. అనిల్ ప్రతి సీన్‌ని అద్భుతంగా తీశాడు. మళ్లీ మేము సంక్రాంతికి మంచి సినిమాతో వస్తున్నాం’’ అన్నారు. ‘‘వెంకటేశ్‌గారితో నేను చేసిన మూడో ఫిల్మ్ ఇది. ఆడియన్స్ హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం. ఈ సినిమా నా కెరీర్లోనే బెస్ట్ ఎంటర్టైనర్గా నిలవనుంది’’ అని తెలిపారు అనిల్ రావిపూడి.‘‘వెంకటేశ్‌గారితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నా కల నిజమైనట్లుగా ఉంది’’ అని పేర్కొన్నారు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు ‘దిల్’ రాజు. ఈ వేడుకలో నటుడు ఉపేంద్ర లిమాయే, సింగర్ రమణ గోగుల, లిరిక్ రైటర్స్ రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్, ఎడిటర్ తమ్మిరాజు, డీవోపీ సమీర్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు
‘గత విజయాలే నాకు ప్రేరణ’
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు సాధించిన ఘనతలు, రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో రజత, కాంస్యాలు... వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సహా ఐదు పతకాలు మాత్రమే కాదు... ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలతో తోడు పెద్ద సంఖ్యలో బీడబ్ల్యూఎఫ్ ట్రోఫీలతో ఆమె ఎన్నో అద్భుత విజయాలతో ఆమె తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకుంది. అయితే గత ఏడాది కాలంగా ఆమె కెరీర్ కాస్త ఒడిదుడుకులకు లోనవుతోంది. ఆశించిన స్థాయిలో ఆమె ప్రదర్శన ఉండటం లేదు. దాంతో 29 ఏళ్ల సింధు భవిష్యత్తుపై సందేహాలు వస్తున్నాయి. కానీ సింధు వీటన్నింటిని కొట్టిపారేసింది. ఆటలో మరింత కాలం కొనసాగే సత్తా తనలో ఉండటమే కాదు... విజయాలు సాధించాలనే తపన, ఆకలి కూడా మిగిలి ఉన్నాయని ఆమె స్పష్టం చేసింది. సరిగ్గా చెప్పాలంటే తాను సాధించిన గత విజయాలు తనకు స్ఫూర్తినిస్తాయని ఆమె పేర్కొంది. ‘మున్ముందు కెరీర్లో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని తపన నాలో ఇంకా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. నేను గొప్ప విజయాలు అందుకున్న గత వీడియోలు చూస్తే ఎంతో సంతోషం కలగడమే కాదు అవి ఎంతో స్ఫూర్తినిస్తాయి కూడా. వాటిని చూస్తే చాలు కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. ముఖ్యంగా కొన్ని టైటిల్స్ నేను చాలా చిన్న వయసులోనే గెలుచుకున్నాను. అప్పుడు అంతా బాగా చేయగా లేనిది ఇప్పుడు చేయలేనా అనే ప్రశ్న నాలో మొదలవుతుంది. అక్కడినుంచే మళ్లీ విజయాల వేట మొదలవుతుంది’ అని సింధు వ్యాఖ్యానించింది. కోలుకొని చెలరేగడం కొత్త కాదు... గతంలో తాను వివిధ సందర్భాల్లో వేర్వేరు కారణాలతో వెనుకబడిపోయానని, కానీ ఎప్పుడూ ఆశలు వదులుకోలేదని ఆమె వెల్లడించింది. ‘క్రీడల్లో నేను ఎంతో నేర్చుకున్నాను. గాయాలతో ఆటకు దూరమై అసలు తిరిగొస్తానో లేదో అనే సందేహాల మధ్య కూడా నాపై నేను నమ్మకం ఉంచాను. 2015లో నేను గాయపడినప్పుడు ఇలా జరిగింది. కానీ ఆ తర్వాత కోలుకొని రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచాను. కెరీర్ ఆరంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో విజయాలు, అవార్డులు, రివార్డులు సాధించాను. ఇన్ని గెలిచిన నేను ఎంతో అదృష్టవంతురాలిని. అవన్నీ నాతో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. గెలుపోటములు ఆటలో, జీవితంలో భాగం. కష్టసమయాల్లో ఓపిగ్గా ఉండటం అనేది నేను నేర్చుకున్నాను. సరైన సమయం కోసం ఎదురు చూడటం ఎంతో ముఖ్యం’ అని సింధు విశ్లేషించింది. గడ్డు కాలం అధిగమించాను... 2024లో ఆడిన చివరి టోర్నీ సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్‌లో విజేతగా నిలవడం మినహా గత ఏడాది సింధు చెప్పుకోగ్గ ఫలితాలు సాధించలేకపోయింది. మరో పతకం ఆశలతో బరిలోకి దిగిన పారిస్ ఒలింపిక్స్‌లో కూడా నిరాశపర్చింది. అయితే ఇలాంటి దశను దాటి మున్ముందు మంచి విజయాలు అందుకుంటానని ఆమె ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. ‘మనం అనుకున్న విజయాలు సాధించనప్పుడు, కోర్టులో కష్ట సాగుతున్నప్పుడు సహజంగానే బాధ వేస్తుంది. ఇలాంటప్పుడు మరింత పట్టుదలగా ఉండాలి. నేను ఎన్నో మ్యాచ్‌లలో గెలుపునకు బాగా చేరువగా వచ్చి కూడా ఓడిపోయాను. నాకు ఇలా జరుగుతోందేమిటి అని ఆలోచించిన సందర్భాలు కూడా చాలా వచ్చాయి. అయితే ఈ గడ్డు సమయంలో మన సన్నిహితులు అండగా నిలవడం కీలకం. అప్పుడే మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. నా తల్లిదండ్రులిద్దరూ క్రీడాకారులు కావడం నా అదృష్టం. గెలుపోటముల సమయంలో ఎలా ఉండాలో వారు నాకు నేర్పారు. ఇంకా సాధించాల్సింది, నిరూపించుకోవాల్సింది ఏమీ లేకపోయినా సరే ఓటములు బాధించడం సహజం. నాకు సంబంధించి ఫిట్‌గా ఉంటే నేను ఇంకా చాలా ఆడగలనని, ఎన్నో టోర్నీలు గెలవగలననే నమ్మకం ఉంది’ అని సింధు స్పష్టం చేసింది. ఫిట్నెస్ ప్రధానం... 2025లో తన ప్రణాళిక ప్రకారం ఎంపిక చేసిన టోర్నీల్లో పాల్గొంటూ ఫిట్నెస్ను కాపాడుకుంటానని సింధు వెల్లడించింది. ‘ప్రతీ నెలలో పెద్ద సంఖ్యలో టోర్నమెంట్లు జరుగుతాయి. దాదాపు 15–20 రోజులు బయటే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి టోర్నిలను ఎంపిక చేసుకొని బరిలోకి దిగుతాను. పూర్తి ఫిట్నెస్తో ఉంటేనే వంద శాతం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలం. బీడబ్ల్యూఎఫ్ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఆడాల్సిన టోర్నీలు కాకుండా మిగతా వాటిలో కొన్నింటిని ఆటగాళ్లు ఎంచుకోవడం సహజం. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మరో పతకం, ఆల్ ఇంగ్లండ్‌లో పతకం గెలవడం నా ప్రణాళికల్లో ఉన్నాయి. ఎన్ని గెలిచినా మైదానంలో దిగగానే ఎవరైనా ఇంకా గెలవాలనే కోరుకుంటారు’ అని ఆమె చెప్పింది. ఇంకా నేర్చుకుంటున్నా... ఇన్నేళ్ల కెరీర్ తర్వాత ఇంకా తాను ఆటలో ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని... ఆటలో వస్తున్న కొత్త మార్పులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటున్నానని సింధు పేర్కొంది. ‘బ్యాడ్మింటన్‌లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్లేయర్ల డిఫెన్స్ చాలా దుర్బేధ్యంగా మారుతోంది. దానిని బద్దలు కొట్టాలంటే మరింత శ్రమించాలి. ప్రతీసారి అటాక్ చేసే అవకాశం అందరికీ రాదు. ముఖ్యంగా నేను ఎత్తుగా ఉంటాను కాబట్టి నేను ఎక్కువగా అటాక్ చేయకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటారు. నా డిఫెన్స్ కూడా మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంది. భారత బ్యాడ్మింటన్‌లో నా తర్వాత ఎంతో మంది యువ తారలు వేగంగా దూసుకొస్తున్నారు. ఉన్నతి, మాళివకల ఆట బాగుంది. వారికి సరైన మార్గనిర్దేశనం లభిస్తే మంచి ఫలితాలు వస్తాయి’ అని సింధు అభిప్రాయపడింది. కొత్త కోచ్ అండగా... సింధు కొత్త సీజన్లో కొత్త కోచ్ శిక్షణలో బరిలోకి దిగనుంది. ఇండోనేసియాకు చెందిన ఇర్వాన్స్యా ఆది ప్రతమ ఆమెకు ఇకపై కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని సింధు ఖరారు చేసింది. గత కొద్ది రోజులుగా బెంగళూరులో ప్రతమ పర్యవేక్షణలో సింధు సాధన చేస్తోంది. నేటి నుంచి జరిగే ఇండియా ఓపెన్ సూపర్–750 టోర్నమెంట్ వీరిద్దరి భాగస్వామ్యంలో తొలి టోర్నీ కానుంది. ‘కోచ్, ప్లేయర్ మధ్య సమన్వయం ఎంతో ముఖ్యం. అది కుదిరేందుకు కొంత సమయం పడుతుంది. మరికొన్ని ప్రాక్టీస్ సెషన్ల తర్వాత ఒకరిపై మరొకరికి స్పష్టమైన అవగాహన రావచ్చు. ప్రతమ గురించి చాలా విన్నాను. నాకు సరైన కోచ్‌గా అనిపించి ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని సింధు వెల్లడించింది.
కేన్ విలియమ్సన్కు అవమానం
దిగ్గజ బ్యాటర్, న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్కు అవమానం జరిగింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) డ్రాఫ్ట్‌లో కేన్ మామను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ప్లాటినమ్ డ్రాఫ్ట్‌లో కేన్ మరో 43 మంది స్టార్ ఆటగాళ్లతో కలిసి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఐపీఎల్ 2025 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన కేన్‌ను పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కూడా ఎవరూ పట్టించుకోలేదు. కేన్ బరిలో నిలిచిన ప్లాటినమ్ డ్రాఫ్ట్ నుంచి 10 మంది ఆటగాళ్లను ఎంపిక చేసున్నాయి ఫ్రాంచైజీలు.అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. వార్నర్ రిటైర్మెంట్ తర్వాత కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో వార్నర్ అదరగొడుతున్నాడు. ఈ లీగ్‌లో వార్నర్ ఏడు ఇన్నింగ్స్‌ల్లో 63.20 సగటున 142.34 స్ట్రయిక్‌రేట్‌తో 316 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుత ఫామ్ కారణంగానే పీఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో వార్నర్‌కు మాంచి గిరాకీ ఉండింది.విలియమ్సన్ విషయానికొస్తే.. ఈ కివీస్ లెజెండ్ ఇటీవలి కాలంలో పెద్దగా టీ20లు ఆడింది లేదు. 2023లో ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా ఆడని కేన్.. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్ (2024) కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్, పీఎస్ఎల్లో కేన్ ఎంపిక కాకపోవడానికి అతని ఫిట్నెస్ కూడా ఓ కారణమే. ఇటీవలి కాలంలో కేన్ తరుచూ గాయాల బారిన పడుతున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్ ఉండి కూడా కేన్ పొట్టి ఫార్మాట్లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతున్నాడు. బ్యాటింగ్‌లో వేగం లేకపోవడం, భారీ షాట్లు ఆడలేకపోవడం కేన్‌కు ప్రధాన సమస్యలు.కేన్ ప్రైవేట్ లీగ్‌ల్లో పెద్దగా రాణించలేకపోయినా అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం పర్వాలేదనిపించాడు. కేన్ తన దేశం తరఫున 93 టీ20లు ఆడి 33.44 సగటున 2575 పరుగులు చేశాడు. కేన్‌ను ప్రైవేట్ లీగ్‌ల్లో ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకోకపోవడానికి అతని వయసు మరో ప్రధాన కారణం. ప్రస్తుతం కేన్ మామ వయసు 34 ఏళ్లు.కేన్ ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో కేన్ డర్బన్ జెయింట్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే కేన్ అదరగొట్టాడు. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేన్ 40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.పీఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో ఆయా ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్న పలువురు స్టార్ ఆటగాళ్లు..డేవిడ్ వార్నర్ (కరాచీ కింగ్స్)డారిల్ మిచెల్ (లాహోర్ ఖలందర్స్)మార్క్ చాప్మన్ (క్వెట్టా గ్లాడియేటర్స్)మైఖేల్ బ్రేస్‌వెల్ (ముల్తాన్ సుల్తాన్స్)ఆడమ్ మిల్నే (కరాచీ కింగ్స్)ఫిన్ అలెన్ (క్వెట్టా గ్లాడియేటర్స్)జేసన్ హోల్డర్ (ఇస్లామాబాద్ యునైటెడ్)ఆమెర్ జమాల్ (కరాచీ కింగ్స్)
రాణించిన కొన్‌స్టాస్.. వార్నర్ జట్టుకు ఊహించని గెలుపు
బిగ్‌బాష్ లీగ్‌లో డేవిడ్ వార్నర్ సారథ్యం వహిస్తున్న సిడ్నీ థండర్‌కు ఊహించని విజయం దక్కింది. పెర్త్ స్కార్చర్స్‌తో ఇవాళ (జనవరి 13) జరిగిన మ్యాచ్‌లో థండర్ జట్టు 61 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ (42 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించాడు. ఆఖర్లో టామ్ ఆండ్రూస్ (13 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆండ్రూస్‌కు క్రీస్ గ్రీన్ (16 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్) సహకరించాడు. ఈ ముగ్గురు మినహా థండర్ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (8) సహా అంతా విఫలమయ్యారు. మాథ్యూ గిల్కెస్ 8, సామ్ బిల్లింగ్స్ 8, జార్జ్ గార్టన్ 1, హగ్ వెబ్జెన్ 6, మెక్ ఆండ్రూ 9 పరుగులకు ఔటయ్యారు. స్కార్చర్స్ బౌలర్లలో లాన్స్ మోరిస్ మూడు వికెట్లు పడగొట్టగా.. బెహ్రెన్‌డార్ఫ్, అస్టన్ అగర్, కూపర్ కన్నోలీ, మాథ్యూ స్పూర్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. 97 పరుగులకే కుప్పకూలిన స్కార్చర్స్థండర్ 158 పరుగుల స్కోర్‌ను డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టమని అంతా అనుకున్నారు. అయితే ఆ జట్టు బౌలర్లు అద్భుతం చేశారు. కలిసికట్టుగా బౌలింగ్ చేసి స్వల్ప స్కోర్‌ను విజయవంతంగా కాపాడుకున్నారు. క్రిస్ గ్రీన్ 3, నాథన్ మెక్ఆండ్రూ 2, మొహమ్మద్ హస్నైన్, తన్వీర్ సంఘా, టామ్ ఆండ్రూస్ తలో వికెట్ పడగొట్టారు. ఫలితంగా స్కార్చర్స్ 17.2 ఓవర్లలో 97 పరుగులకే చాపచుట్టేసింది. స్కార్చర్స్ ఇన్నింగ్స్‌లో ఆరోన్ హార్డీ (22), నిక్ హాబ్సన్ (10), మాథ్యూ స్పూర్స్ (13), జేసన్ బెహ్రెన్‌డార్ఫ్ (17 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. సామ్ ఫాన్నింగ్ (1), ఫిన్ అలెన్ (9), కూపర్ కన్నోలీ (7), అస్టన్ టర్నర్ (4), అస్టన్ అగర్ (7), లాన్స్ మోరిస్ (0), మహ్లి బియర్డ్మ్యాన్ (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సిడ్నీ థండర్ ఫైనల్‌కు చేరింది. ఆ జట్టు తొమ్మిది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో (11 పాయింట్లు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
అంబటి రాయుడు అంటే విరాట్ కోహ్లికి నచ్చేది కాదు.. రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు
టీమిండియా మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై సంచలన ఆరోపణలు చేశాడు. టీమిండియా మాజీ ఆటగాడు, ఆంధ్ర ప్లేయర్ అంబటి రాయుడు అంటే విరాట్ కోహ్లికి నచ్చేది కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ కారణంగానే రాయుడు 2019 వన్డే వరల్డ్‌కప్ జట్టు నుంచి చివరి నిమిషంలో తప్పించబడ్డాడని అన్నాడు. వరల్డ్‌కప్‌కు సంబంధించిన కిట్‌బ్యాగ్‌లు, బట్టలు, సూట్లు రాయుడు ఇంటికి చేరాయని, ఆతర్వాత కోహ్లి జోక్యం చేసుకోవడంతో రాయుడుకు వరల్డ్‌కప్ బెర్త్ దక్కలేదని బాంబు పేల్చాడు.కోహ్లికి ఎవరైనా నచ్చకపోతే జట్టులో చోటు దక్కేది కాదని అన్నాడు. టీమిండియా కెప్టెన్‌గా కోహ్లి తీసుకున్న నిర్ణయాలను ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూ సందర్భంగా ఎండగట్టాడు. అంబటి రాయుడు విషయంలో కోహ్లి చాలా అన్యాయంగా ప్రవర్తించాడని దుయ్యబట్టాడు. రాయుడుకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని వాపోయాడు. రాయుడు వరల్డ్‌కప్ జట్టులో ఉంటానని ఎన్నో కలలు కన్నాడని, అలాంటి వ్యక్తికి చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు. కాగా, 2019 వన్డే వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో అంబటి రాయుడును కాదని చివరి నిమిషంలో తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. విజయ్ శంకర్ త్రీడి ప్లేయర్ అని.. అందుకే రాయుడు స్థానంలో అతన్ని ఎంపిక చేశామని అప్పటి చీఫ్ సెలెక్టర్, తెలుగువాడు ఎంఎస్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు. దీనిపై రాయుడు త్రీడి అద్దాలు పెట్టుకుని బహిరంగంగా తన అసంతృప్తికి వెల్లగక్కాడు.కోహ్లితో పోలిస్తే రోహిత్ గ్రేట్ లీడర్రాబిన్ ఉతప్ప కోహ్లి కెప్టెన్సీని రోహిత్ శర్మ కెప్టెన్సీతో కంపేర్ చేశాడు. కెప్టెన్‌గా నిర్ణయాలు తీసుకున్న తర్వాత వాటిని అమలు చేయడంలో కోహ్లికి రోహిత్ శర్మకు చాలా తేడా ఉందని అన్నాడు.రాయుడుకు జరిగినట్టే 2024 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు ముందు సంజూ శాంసన్‌కు జరిగిందని గుర్తు చేశాడు. అయితే ఆ సందర్భంలో రోహిత్ సంజూ శాంసన్ దగ్గరికి వెళ్లి అతన్ని ఎందుకు పక్కకు పెట్టాల్సి వచ్చిందో స్పష్టంగా వివరించాడని తెలిపాడు. రోహిత్ సర్ది చెప్పాక శాంసన్ ఆ విషయాన్ని పెద్దగా పట్టంచుకోలేదని పేర్కొన్నాడు. ఇలాంటి విషయాలను హ్యాండిల్ చేయడంలో కోహ్లితో పోలిస్తే రోహిత్ చాలా బెటర్ అని కొనియాడాడు.కాగా, 2024 వరల్డ్‌కప్ ఫైనల్లో సంజూ శాంసన్ ఆడాల్సి ఉండిది. అయితే చివరి నిమిషంలో శాంసన్ స్థానంలో శివమ్ దూబే తుది జట్టులోకి వచ్చాడు. ఫైనల్ మ్యాచ్ టాస్ తర్వాత రోహిత్ శాంసన్ దగ్గరికి పర్సనల్‌గా వెళ్లి అతన్ని ఎందుకు పక్కకు పెట్టాల్సి వచ్చిందో వివరించాడు. రోహిత్ వివరణ తర్వాత శాంసన్ కామ్ అయిపోయాడు. ఈ విషయంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.యువరాజ్ సింగ్ కెరీర్ ముగియడానికి కూడా కోహ్లినే కారణం..!రాయుడు విషయాన్ని ప్రస్తావించడానికి ముందు ఉతప్ప కోహ్లికి వ్యతిరేకంగా సంచలన ఆరోపణలు చేశాడు. సిక్సర్ల వీరుడు, వన్డే, టీ20 వరల్డ్‌కప్ విన్నర్ యువరాజ్ సింగ్ కెరీర్ అర్దంతరంగా ముగిసిపోవడానికి కూడా కోహ్లినే కారణమని అన్నాడు. క్యాన్సర్‌పై విజయం సాధించిన అనంతరం యువరాజ్ కోహ్లి కోరుకున్నట్లు ఫిట్నెస్ సాధించలేకపోయాడని.. ఈ కారణంగానే కోహ్లి యువరాజ్‌కు మెల్లమెల్లగా చెక్ పెట్టాడని వ్యాఖ్యానించాడు.
బిజినెస్
బేర్.. ఎటాక్! మార్కెట్ నేల చూపులు ఎందుకంటే..
ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో స్టాక్ సూచీలు సోమవారం ఒకశాతానికిపైగా నష్టపోయాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడమూ, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలూ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 1,049 పాయింట్లు క్షీణించి 76,330 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 346 పాయింట్లు కోల్పోయి 23,086 వద్ద ముగిసింది. సూచీలకిది నాలుగోరోజూ నష్టాల ముగింపు. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా అదే బాటలో నడిచాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,129 పాయింట్లు క్షీణించి 76,250, నిఫ్టీ 384 పాయింట్లు పతనమై 23,047 వద్ద ఇంట్రాడే కనిష్టాలు తాకాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు, ద్రవ్యల్బోణం పెరగొచ్చనే ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.మార్కెట్లో మరిన్ని సంగతులుఅధిక వాల్యుయేషన్లు, వృద్ధిపై ఆందోళనలతో ఇన్వెస్టర్లు భారీ ఎత్తున చిన్న, మధ్య తరహా షేర్లను భారీగా విక్రయించారు. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 4.17%, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 4.14 శాతం నష్టపోయాయి. బీఎస్ఈ ఎక్సే్చంజీలో మొత్తం 3,562 కంపెనీల షేర్లలో 2,876 షేర్లు నష్టపోగా, 508 షేర్లు ఏడాది కనిష్టాన్ని తాకింది. సూచీల వారీగా బీఎస్ఈ రియల్టీ ఇండెక్స్ 6.50% అత్యధికంగా పతనమైంది. యుటిలిటీ 4.50%, సర్వీసెస్ 4.35% చొప్పున పడ్డాయి.4 రోజుల్లో 24.7 లక్షల కోట్లు ఆవిరిస్టాక్ మార్కెట్ వరుస పతనంలో భాగంగా నాలుగు రోజుల్లో రూ.24.69 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. సోమవారం ఒక్కరోజే రూ.12.61 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.417.05 లక్షల కోట్ల(4.82 ట్రిలియన్ డాలర్లు)కు దిగివచ్చింది. అమెరికా డిసెంబర్ వ్యవసాయేతర ఉద్యోగాలు (2.56 లక్షలు) అంచనాలను మించాయి. నిరుద్యోగ రేటు 4.2% నుంచి 4.1 శాతానికి దిగివచ్చింది. అధిక ఉద్యోగాల నియామకంతో ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాదిలో వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు తలెత్తాయి. ద్రవ్యోల్బణం పెరగొచ్చనే ఆందోళనలు మెదలయ్యాయి. బాండ్లపై రాబడులు 14 ఏళ్ల గరిష్టం 4.79% భారీగా పెరిగాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు ఈక్విటీల్లోంచి బాండ్లలోకి మళ్లిస్తున్నారు.భారత్, చైనాకు చౌకగా చమురును అందిస్తున్న రష్యా క్రూడాయిల్ ఉత్పత్తి సంస్థలపై అమెరికా కఠిన ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు మూడు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. భారత్ దిగుమతి చేసుకొనే బ్రెంట్ క్రూడాయిల్ ధర 1.5% పెరిగి 81.67 స్థాయికి చేరింది. తన చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకొనే భారత్‌కు అధిక ధరలు నష్టదాయకం. పెరిగిన దిగుమతుల బిల్లు చెల్లించేందుకు ప్రభుత్వం వద్దనున్న విదేశీ మారక నిల్వలు కరిగించాల్సి వస్తుంది.ఇదీ చదవండి: మరింత క్షీణిస్తున్న రూపాయి!ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.4 శాతానికి పరిమితమవుతుందని కేంద్రం ముందస్తు అంచనా వేసింది. పలు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు 2024–25 ఏడాది కార్పొరేట్ ఆదాయాలు ఒక అంకె వృద్ధికే పరిమితం కావచ్చని చెబుతున్నాయి. కార్పొరేటు ఆదాయాలు, జీడీపీ వృద్ధి అంచనాలు మార్కెట్ వర్గాలను నిరాశపరిచాయి.
మరింత క్షీణిస్తున్న రూపాయి!
రూపాయి విలువ రోజురోజుకూ తెగ్గోసుకుపోతోంది. డాలర్ మారకంలో సోమవారం ఏకంగా 66 పైసలు బలహీనపడి జీవితకాల కనిష్ట స్థాయి 86.70 వద్ద స్థిరపడింది. అమెరికా కరెన్సీ బలపడంతో పాటు చమురు ధరలు భగ్గుమనడంతో దేశీయ కరెన్సీ భారీ కోతకు గురైంది. ఫారెక్స్(Forex) మార్కెట్లో రోజంతా తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైంది రూపాయి... ఏ దశలోనూ కోలుకోలేక చివరికి ఇంట్రాడే కనిష్టం (86.70) వద్ద ముగిసింది. దాదాపు రెండేళ్ల తర్వాత (2023 ఫిబ్రవరి 6న 68 పైసలు) దేశీయ కరెన్సీకి ఇదే అతిపెద్ద పతనం.గతేడాది డిసెంబర్ 30 ముగింపు 85.52 నుంచి రూపాయి ఏకంగా 118 పైసలు పడింది. ‘ఫారెక్స్ నిల్వలు 634 బిలియన్ డాలర్లకు దిగిరావడం, వర్ధమాన దేశాల కరెన్సీలూ క్షీణిస్తున్న తరుణంలో రూపాయి పతనంపై ఆర్బీఐ జోక్యాన్ని తగ్గించుకుంది. మరోవైపు బ్రెంట్ క్రూడాయిల్ ధర 3 నెలల గరిష్టానికి ఎగసింది. డాలర్ ఇండెక్స్ రెండేళ్ల గరిష్టం 109.91 స్థాయికి చేరింది. దీంతో రూపాయి భారీగా క్షీణించింది’ అని ఫిన్రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ఎండీ అనిల్ కుమార్ బన్సాలీ తెలిపారు.బలహీనతకు కారణాలు..బలపడుతున్న డాలర్అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాల కారణంగా అమెరికా డాలర్ బలపడుతోంది. ఈ నిర్ణయం వల్ల డాలర్‌కు డిమాండ్ అధికమవుతుంది. రూపాయి(Rupee)తో సహా ఇతర కరెన్సీలతో పోలిస్తే ఇది మరింత ఖరీదైనదిగా మారింది.ఎఫ్‌పీఐల విక్రయాలురెండు-మూడు నెలల కొందట ఇండియన్ మార్కెట్ జీవితకాల గరిష్టాలను తాకింది. దాంతో దాదాపు అన్ని స్టాక్‌ల వాల్యుయేషన్ పెరిగింది. అప్పటికే ఇన్వెస్ట్ చేసిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. దాంతోపాటు సురక్షితమైన అమెరికా ట్రెజరీలకు ప్రాధాన్యం ఇవ్వడంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్ల(Equity Market) నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నారు. ఇది గణనీయమైన మూలధన ప్రవాహానికి దారితీసింది. దాంతో రూపాయిపై ఒత్తిడి పెరిగింది.పెరుగుతున్న ముడిచమురు ధరలుభారతదేశం ముడి చమురు ప్రధాన దిగుమతిదారు. పెరుగుతున్న అంతర్జాతీయ చమురు ధరలు దిగుమతుల ఖర్చును పెంచాయి. ఈ దిగుమతులకు డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. దాంతో రూపాయి విలువ మరింత తగ్గుతుంది.వాణిజ్య లోటుభారతదేశ వాణిజ్య లోటు పెరుగుతోంది. అంటే దేశం చేసే ఎగుమతుల కంటే దిగుమతులు పెరుగుతున్నాయి. ఈ అసమతుల్యత వల్ల దిగుమతులకు చెల్లించడానికి ఎక్కువ డాలర్లు అవసరం అవుతుంది.ఇదీ చదవండి: మహా కుంభమేళాకు సైబర్ భద్రతదేశీయ ఆర్థిక కారకాలువృద్ధి మందగించడం, లిక్విడిటీ లోటు వంటి సవాళ్లను భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోంది. ఫారెక్స్(Forex) మార్కెట్లో దూకుడుగా జోక్యం చేసుకునే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సామర్థ్యానికి ఇవి అడ్డంకిగా మారాయి.ఆర్బీఐ జోక్యంఫారెక్స్ మార్కెట్లో అధిక అస్థిరతను అరికట్టడానికి, రూపాయికి మద్దతు ఇవ్వడానికి ఆర్బీఐ జోక్యం చేసుకుంటోంది. అయితే రూపాయి స్థిరమైన పడిపోతున్న తరుణంలో ఆర్బీఐ మరింత చాకచక్యంగా వ్యహహరించాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఫండ్స్‌లో పెట్టుబడులకు క్యూ
న్యూఢిల్లీ: గత క్యాలండర్ ఏడాది(2024)లో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు) పట్ల ఇన్వెస్టర్లు అత్యంత ఆసక్తిని ప్రదర్శించారు. దీంతో 239 కొత్త ఫండ్ ఆఫరింగ్స్(ఎన్‌ఎఫ్‌వోలు) ద్వారా మొత్తం రూ. 1.18 లక్షల కోట్లను అందుకున్నాయి. వీటిలో సెక్టోరల్ లేదా థిమాటిక్ ఈక్విటీ ఫండ్స్ ఇన్వెస్టర్లను గరిష్టంగా ఆకట్టుకున్నట్లు జెర్మినేట్ ఇన్వెస్టర్ సర్వీసెస్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. కాగా.. 2023లో 212 ఎన్‌ఎఫ్‌వోలు ఉమ్మడిగా రూ. 63,854 కోట్లు సమీకరించగా.. 2022లో 228 పథకాలకు రూ. 62,187 కోట్లు లభించాయి. అంతక్రితం అంటే 2020లో 81 కొత్త పథకాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. తద్వారా ఫండ్స్ రూ. 53,703 కోట్లు సమీకరించాయి. వీటితో పోలిస్తే గతేడాది రెట్టింపు పెట్టుబడులు అందుకోవడం గమనార్హం! ఇది ఇన్వెస్టర్లలో పెరిగిన విశ్వాసంతోపాటు.. పటిష్ట వృద్ధి పథాన్ని ప్రతిబింబిస్తోంది. మార్కెట్ల ఎఫెక్ట్ సాధారణంగా స్టాక్ మార్కెట్లు పురోగమిస్తున్నప్పుడు ఎన్‌ఎఫ్‌వోలు వెలువడుతుంటాయని విశ్లేషకులు పేర్కొన్నారు. సానుకూల సెంటిమెంటు, ఇన్వెస్టర్ల ఆశావహ ధృక్పథం ప్రభావం చూపుతుంటాయి. ఇన్వెస్టర్ల ఆసక్తి ఆధారంగా కొత్త పథకాలకు ఫండ్స్ తెరతీస్తుంటాయి. దీంతో పెట్టుబడులను సమకూర్చుకోగలుగుతాయి. వెరసి 2024లో అధిక ఎన్‌ఎఫ్‌వోల ద్వారా భారీగా పెట్టుబడులను సమీకరించాయి. గతేడాది స్టాక్ ఇండెక్స్‌లలో సెన్సెక్స్ 5,899 పాయింట్లు(8.2 శాతం) జంప్‌చేయగా.. నిఫ్టీ 1,913 పాయింట్లు(8.8 శాతం) ఎగసింది. ఈఎస్జీ సైతం గతేడాది పెట్టుబడుల్లో థిమాటిక్, సెక్టోరల్, ఇండెక్స్, ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు) అధిక శాతం ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. నివేదిక ప్రకారం 53 ఎన్‌ఎఫ్‌వోల ద్వారా ఫండ్స్‌కు రూ. 79,109 కోట్లు లభించాయి. ఇన్వెస్టర్ల ఆసక్తికి అనుగుణంగా రూపొందించిన థీమ్స్ లేదా థిమాటిక్, సెక్టోరల్ ఫండ్స్ ఇందుకు సహకరించాయి. తయారీ, టెక్నాలజీ, పర్యావరణం, సామాజిక, సుపరిపాలన(ఈఎస్జీ) విభాగాలను ఇందుకు ప్రస్తావించవచ్చు. విడిగా చూస్తే హెచ్డీఎఫ్సీ మ్యాన్యుఫాక్చరింగ్ ఫండ్ ఎన్ఎఫ్వో గత ఏప్రిల్‌లో రూ. 12,500 కోట్లు అందుకుంది. డిసెంబర్లో అత్యధిక ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లను తాకడం ప్రస్తావించదగ్గ అంశం!
ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.16.90 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి 12వ తేదీ నాటికి (2024 ఏప్రిల్ 1 నుంచి) 16 శాతం పెరిగి రూ.16.90 లక్షల కోట్లకు ఎగశాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (సీబీడీటీ) గణాంకాల ప్రకారం మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో వ్యక్తిగత పన్ను వసూళ్లు రూ.8.74 లక్షల కోట్లు. కార్పొరేట్ వసూళ్లు రూ. 7.68 లక్షల కోట్లు. సెక్యూరిటీ లావాదేవీల పన్ను వసూళ్లు రూ.44,538 కోట్లు. రిఫండ్స్ రూ.3.74 లక్షల కోట్లు స్థూలంగా చూస్తే, జనవరి 12 నాటికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 20.64 లక్షల కోట్లు. ఇందులో రిఫండ్స్ రూ.3.74 లక్షల కోట్లు. (వార్షికంగా 42.49 శాతం పెరుగుదల). వెరసి నికర వసూళ్లు రూ. 16.90 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. లక్ష్యం రూ.22.07 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నుల ద్వారా మార్చితో ముగిసే ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.22.07 లక్షల కోట్లు వసూలు చేయాలన్నది వార్షిక బడ్జెట్ లక్ష్యం. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్ల వాటా రూ.10.20 లక్షల కోట్లు. వ్యక్తిగత ఆదాయ, ఇతర పన్నుల ద్వారా వసూళ్లు రూ.11.87 లక్షల కోట్లు.
ఫ్యామిలీ
డెలివరీ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం, రూ..11.42 కోట్ల జరిమానా
ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ బిడ్డకు జన్మనివ్వడమంటే మహిళకు మరో జన్మ. గర్భంలో పాపాయి రూపు దిద్దుకోవడం మొదలు, ప్రసవం దాకా నిరంతరం పర్యవేక్షణ అవసరం. స్వయంగా గర్భిణీతోపాటు, కుటుంబ సభ్యులు, చికిత్స అందించే వైద్యులు అప్రమత్తంగా ఉండాల్సిందే. కానీ వైద్యుల నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారులకు కన్నతల్లిని దూరం చేసింది. మలేసియాలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈకేసులో ఆ దేశ కోర్టు ఇచ్చిన తీర్పు నెట్టింట చర్చకు దారి తీసింది. 2019లో జరిగిన సంఘటన ఇది. 36 ఏళ్ల పునీత మోహన్(Punita Mohan) రెండో కాన్పుకోసం ఆస్పత్రి లో చేరింది. అయితే ప్రసవం తరువాత ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. పోస్ట్‌పార్టమ్ హెమరేజ్ (Postpartum Hemorrhage) కారణంగా విపరీత రక్తస్రావం అయింది. నొప్పితో ఆమె విలవిల్లాడి పోయింది. బ్లీడింగ్ అవుతోందని ఆమె తల్లి ఆమెకు వైద్యం చేసిన వైద్యడు డాక్టర్లు రవి, క్లినిక్ యజమాని షణ్ముగానికి చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. ప్రాణాంతకమని తెలిసినా నిర్ల్యక్ష్యంగా వ్యవహరించారు. పైగా మావిని చేతితో తీయడం వల్ల రక్తస్రావం అవుతోందని, అంతా సర్దుకుంటుందని కుటుంబ సభ్యులకు చెప్పి ఎటో వెళ్లి పోయారు. రెండు గంటలు గడిచిన తరువాత కూడా ఆమె గురించి వాకబు చేయలేదు. పరిస్థితి విషమించడంతో ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. తన కళ్ల ముందే తన బిడ్డ ఊపిరి తీసుకోవడానికి కష్టపడి నానాయతన పడిందని, ఇద్దరు చిన్నారులకు తల్లిని దూరం చేశారంటూ పునీత తల్లి కన్నీటి పర్యంతమైంది.ఈ కేసును విచారించిన హైకోర్టు బాధిత కుటుంబానికి రూ.11.42 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. వైద్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఈ మరణం సంభవించి ఉండేది కాదని కోర్టు పేర్కొంది. వైద్యులు రోగికి భద్రత కల్పించకుండా, గంటల తరబడి వదిలివెళ్లడం క్షమించరాని నేరమని వ్యాఖ్యానించింది. అంతులేని నిర్లక్ష్యం కారణంగానే పునీత మరణించిందని ఆగ్రహించిన కోర్టు ఇద్దరు వైద్యులకు భారీ జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఇలాంటి మేకప్ నైపుణ్యం ఉంటే ఏ వధువైనా అదుర్స్..!
మేకప్ అనగానే వేసుకున్నప్పుడూ అతిలోక సుందరిలా..తీసేశాక ఆమెనా అన్నంత సందేహం వస్తుంది. ముఖ్యంగా కలర్ తక్కువగా ఉండే వాళ్ల గురించి ఇక చెప్పాల్సిన పని లేదు. అందుకే చామనఛాయా ఉన్న చాలమంది వధువులు, కాస్త రంగు తక్కువగా ఉన్నవారు మేకప్ వేసుకునేందుకు సుముఖత చూపించరు. ఎందుకంటే మేకప్ తర్వాత వాళ్ల లుక్ మారిపోతుంది. దీంతో ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అదే తమ రంగుకి అనుగుణమైన మేకప్‌తో అందంగా కనిపించేలా చేస్తే ఆత్మవిశ్వాసంగా, నిండుగా ఉంటుంది. అలాంటి మేకప్ నైపుణ్యంతో ఇక్కడొక కళాకారిణి అందరి హృదయాలను దోచుకుంటోంది. ఎవ్వరైనా ఆమె మేకప్ నైపుణ్యతకు ఫిదా అయిపోతారు. ఇంతకీ ఎవరంటే ఆమె..!చెన్నై(Chennai)కి చెందిన మేకప్ ఆర్టిస్ట్(makeup artist) నిర్మలా మోహన్ స్కిన్ టోన్‌కు సరిపోయే మేకప్‌లతో ఆకట్టుకుట్టోంది. రంగు తక్కువగా ఉన్నా కూడా ఇనుమడింప చేసే మేకప్‌తో అందంగా కనిపించేలా చేస్తోంది. అందానికి అసలైన నిర్వచనం చెప్పేలా మేకప్ నైపుణ్యంతో ఫిదా చేస్తోంది. చర్మం కలర్(skin colour) నలుపుగా ఉన్నవాళ్లని తెల్లగా కనిపించేలా మేకప్ వేస్తారు చాలామంది. ఆ తర్వాత అసలు రంగు ఇదా అని ముఖం మీదే అనడంతో కలర్ తక్కువగా ఉండే అమ్మాయిలు మేకప్ వేసుకునేందుకు భయపడుతున్నారు. అలా కాకుండా వారి రంగుకి సరిపోయే మేకప్‌తో వాళ్ల చర్మం రంగులోనే మరింత అందంగా కనిపించేలా తీర్చిదిద్దితుంది నిర్మల. ఇదే ఆమె బ్యూటీ ట్రిక్కు. అందుకు సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అందరూ ఆమె కళా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Nirmala Mohan 💃🏻 (@nirmala_makeupartistry) ఇలా రంగు తక్కువగా ముదురు గోధుమ రంగులో ఉండే వాళ్ల స్కిన్ టోన్‌కి అనుగుణమైన రంగులోనే కాంతిమంతంగా కనిపించేలా చేస్తే.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపినవాళ్లం అవుతాం. వారి ముఖాలు కూడా కాంతిగా వెలుగుతాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి వాళ్లకు వైట్ వాష్ చేయకూడదు. మేకప్ వేస్తేనే అందం లేదంటే చూడలేం అన్నట్లు ఉండకూడదు. సహజ సౌందర్యం ఉట్టిపడేలా తీర్చిదిద్దే మేకపే అమ్మాయిలకు గౌరవంగా ఉంటుందని అంటోంది నిర్మల. దీంతో వాళ్లు మునుపటి రూపాన్ని చూపించేందుకు వెనడుగు వేయరని నమ్మకంగా చెబుతోంది. View this post on Instagram A post shared by Nirmala Mohan 💃🏻 (@nirmala_makeupartistry) (చదవండి: తల్లే కూతురు పెళ్లిని ఆపేసింది..! ట్విస్ట్ ఏంటంటే..)
తల్లే కూతురు పెళ్లిని ఆపేసింది..! ట్విస్ట్ ఏంటంటే..
కూతురు పెళ్లి చేసుకుని ఆనందంగా భర్త, అత్తమామలతో ఉండాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. అందుకోసం ఆచితూచి మరీ వెతికి వెతికి మంచి సంబంధం తెచ్చుకుంటారు. అన్నేళ్లుగా అపురూపంగా పెంచుకున్న కూతుర్ని ఇంకో ఇంటికి పంపించేటప్పుడూ.. అక్కడ కూడా అంతే ఆనందంగా సంతోషంగా జీవించాలని కోరుకుంటాం. అలా ఆలోచించే ఓ తల్లి తన కూతురు పెళ్లిని పెళ్లి పీటల మీదే అర్థాంతరంగా ఆపేసింది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని చూసి అక్కడ వేదికపై ఉన్నవారు, వరుడు తరుపు వారు కంగుతిన్నారు. అయితే ఆ తల్లి ఇలాంటి అనూహ్య నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలిస్తే..ఆమెను అభినందించకుండా ఉండలేరు.ఎందుకంటే..ఈ అనూహ్య సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఇంకొద్దిసేపులో అంగరంగ వైభవంగా పెళ్లి జరగనుంది. సరిగ్గా ఆ సమయంలో వధువు తల్లి ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నాం..ప్లీజ్ వెళ్లిపోండని వరుడిని, అతని కుటుంబ సభ్యులను వేడుకుంది. ఇదేంటి కరెక్ట్‌గా ఈ టైంలో ఇలా అంటుందని అంతా విస్తుపోయారు. కానీ అక్కడున్న కొంతమంది ఆమె సరైన నిర్ణయం తీసుకుందనే అనుకున్నారు. ఎందుకంటే సరిగ్గా పెళ్లితంతు సమయంలో కూడా వరుడు ఫుల్‌గా తాగి స్నేహితులతో కలిసి గొడవ చేశాడు. అక్కడున్న వారిని ఇబ్బందికి గురి చేశారు వరుడు, అతడి స్నేహితులు. దీంతో వధువు తల్లి ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడే అతడి ప్రవర్తన ఇలా ఉంది. భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందనే భయంతో ఆ తల్లి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు నిజంగా "ఇది చాలా ధైరవంతమైన నిర్ణయం. ఫైనాన్షియల్ పరంగా ఇంత ఖర్చు అయ్యిందే అనే ఆలోచనకు తావివ్వకుండా కూతురు భవిష్యత్తే ముఖ్యం అని ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందా ఆ తల్లి, అందుకు ఎంతో ధైర్యం ఉండాలి కూడా అంటూ నెటిజన్లు ఆ తల్లి పై ప్రశంసలు జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు". View this post on Instagram A post shared by News For India (@news.for.india) (చదవండి: 'ఏది వడ్డించినా సంతోషంగా తింటా': మోదీ)
Sankranti 2025 : అసలు భోగి పళ్లు ఎలా పోయాలో తెలుసా?
దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి సూర్యుడు అడుగుపెట్టే సమయంలో వచ్చే అందమైన పండుగ సంక్రాంతి. ఊరూ వాడా అంతా సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా మొదలైపోయాయి. తెల్లవారుఝామున భోగి మంటలతో ఆరంభమై మకర సంక్రాంతి, పొంగళ్లు, కనుమ, ముక్కనుమ మూడు రోజుల పాటు ముచ్చటైన వేడుకలతో పల్లెలన్నీ కళకళ లాడతాయి. ఈ వేడుకల్లో ప్రధానమైంది భోగిపళ్లు. పిల్లలకు భోగి పళ్లు పోయడం అనేది మన సంప్రదాయాల్లో ఒకటి. అసలు పిల్లలకు భోగి పళ్లు ఎందుకు పోస్తారు? ఎలా పోయాలి? ఈ విషయాలు తెలుసుకుందాం రండి.సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు భోగిపళ్లు పోస్తారు..చిన్నారుల్లో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అందుకే రేగుపళ్లు పోయడం ద్వారా చాలా రోగాల నుంచి రక్షణ లభిస్తుందంటారు పెద్దలు. అంతేకాదు వారిపై ఉన్న చెడు దిష్టి మొత్తం పోతుందని ప్రతీతి. సూర్యుడికి ప్రతీకగా, పోషకాల ఖజానాగా పిలిచే వీటిని తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారనీ, అలాగే ఆరోజన పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోస్తే సంవత్సరం మొత్తం శ్రీమన్నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.రేగి పండును అర్కఫలం అని కూడా అంటారు. ‘అర్కుడు’ అంటే సూర్యుడు. భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లుతాడు. అందుకే ఆ లోక నాయరాణుని కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పళ్ల పోసే వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తారు. భోగి రోజు వచ్చిందంటే... ఇంట్లో చిన్నపిల్లలందరికీ భోగి పళ్లు పోసే వేడుక నిర్వహించేందుకు ఉవ్విళ్లూరుతారు అమ్మమ్మలు, అమ్మలు. ఎలాగా పిల్లలందరికీ భోగి రోజు పొద్దున్నే భోగి మంటల సందడి ఉంటుంది. పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకొని, తలారా స్నానాలు చేసి, కొత్త బట్టలు వేసుకొని భోగిమంటల విభూదిని దిద్దుకుంటారు.నోటి తీపి చేసుకుంటారు. ఇక భోగి పళ్లు పోస్తున్నామంటూ ముత్తుయిదువలను పేరంటానికి ఆహ్వానిస్తారు. సాయంత్రం ఇంట్లో 10 ఏళ్ల లోపు పిల్లలందరికీ కొత్త బట్టలు తొడిగి ముస్తాబు చేస్తారు. రేగి పళ్లు, పూల రెక్కలు, చిల్లర నాణేలు, చెరుకు గడల ముక్కలు, నానబెట్టిన సెనగలు, అక్షింతలు మొదలైనవి కలిపి ఉంచుతారు. అందరు రాగానే, తూర్పు ముఖంగా కానీ, ఉత్తరముఖంగా చిన్నారులను కూర్చోపెడతారు. ఎలా పోయాలి? ఇంట్లోని పెద్దవాళ్లు (అమ్మమ్మ, నానమ్మ) తల్లి కలిపి ఉంచుకున్న భోగిపళ్లను మూడు గుప్పిళ్లతో పిల్లల శిరస్సు చుట్టూ దిష్టి తీసినట్టు తలచుట్టూ తిప్పి పోయాలి. అంటే మూడు సార్లు సవ్య దిశలో, మూడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసి తలమీద పోయాలి. ఆ తరువాత పేరంటాళ్లు కూడా ఇలాగే చేయాలి. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని పిల్లల్ని నిండు మనస్సుతో దీవించాలి.ఈ సందర్భంగా "ఓం సారంగాయ నమః" అనే నామం చెప్పాలని పెద్దలు చెబుతారు.ముత్తయిదువలకు పండూ ఫలం కానుకగా ఇస్తారు. ఇలా కార్యక్రమం పూర్తైన తర్వాత వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వదిలిపెడతారు. పిల్లలకు దిష్ట పోవాలని తీసినవి కాబట్టి, ఈ రేగు పళ్లును ఎవరూ తినకూడదని కూడా చెబుతారు.విశిష్టతశ్రీమన్నారాయణుడు రేగుచెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడనీ, ఆ ఫలాన్ని తింటూనే తపస్సు చేశాడని చెబుతారు. రేగుపళ్లను అర్కఫలం అంటారు. ‘అర్కుడు’ అంటే సూర్య భగవానుడు. సూర్యుడితో సమానంగా రేగుపళ్లను భావించి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటూ భోగిపళ్లు పోస్తారు. రేగుపళ్లతోపాటు బంతిపూల రెక్కలు కూడా ఉండడంతో చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయట.
ఫొటోలు
National View all
‘చంద్రబాబు ఎప్పుడు చెయ్యిస్తారో చెప్పలేం’
గత రెండు సార్వత్రి ఎన్నికల్లో 280 ఫ్లస్ సీట్లతో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగే స్థాయి నుంచి..
Mahakumbh: ఉత్సాహం ఉరకలేస్తోంది: బల్గేరియా పర్యాటకులు
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు జన
నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం
నిజామాబాద్, సాక్షి: రైతుల పండుగ సంక్రాంతి నాడే ఇందూరు ప్రజల
Mahakumbh: రైల్వేస్టేషన్లో తొక్కిసలాట.. తప్పిన ప్రమాదం
ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా ప్రారంభమయ్యింది.
Mahakumbh: ఉదయం 8:30కే కోటిమందికిపైగా పుణ్యస్నానాలు
నేడు మకర సంక్రాంతి సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పుణ్
International View all
South Africa: బంగారు గనిలో చిక్కుకుని 100 మంది కార్మికులు మృతి
దక్షిణాఫ్రికాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
సైనికుల్ని మార్చుకుందాం
కీవ్: నిర్బంధంలో ఉన్న సైనికులను మార్చుకుందామంటూ ఉక్రెయిన్
సముద్రంలో నౌక నుంచి చైనా ఉపగ్రహ ప్రయోగం
బీజింగ్: చైనా తన అంతరిక్ష సామర్థ్యాన్ని మరోసారి చాటుకుంది.
యూన్ వేతనం పెరిగింది!
సియోల్: దేశంలో స్వల్ప కాలం మార్షల్ లా అమలు చేసినందుకు అభిశ
బుద్ధుడిలా ట్రంప్ విగ్రహాలు
డొనాల్డ్ ట్రంప్. ఎప్పుడూ కాసింత చిరాకు ప్రతిబింబించే ముఖం.
NRI View all
Sankranti 2025 : జపాన్‌లో తెలుగువారి సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి వచ్చిందంటే ఊరా వాడా అంతా సంబరంగా జరుపుకుంటారు.
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్ఆర్ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా
ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!
అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్ దిగ్గజం యాపిల్ 185 మంది ఉద్యోగులను త
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!
భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)
క్రైమ్
ప్రేమజంట ఆత్మహత్య
కృష్ణరాజపురం: బెంగళూరు నగరంలో దారితప్పిన ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. జాన్సన్ అలియాస్ నాగరాజ్ (23), దిల్దాద్ (25) అనే యువతి ప్రేమించుకుంటున్నారు. దిల్దాద్కు ఇప్పటికే పెళ్లి కాగా నాగరాజ్‌కు ఇంకా పెళ్లి కాలేదు. సోషల్ మీడియా ద్వారా ఇద్దరికీ పరిచయమై ప్రేమగా మారింది. తరచూ షికార్లకు వెళ్తూ ఉండేవారు. తమ ఇద్దరి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించబోరని విరక్తి చెందిన నాగరాజ్ శుక్రవారం రాచేనహళ్లి వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన దిల్దాద్ మనసులోనే కుమిలిపోయింది. ప్రియుడు లేని లోకం వద్దంటూ శనివారం అమృతహళ్లిలోని తమ ఇంటిలో దిల్దాద్ కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఘటనపై అమృతహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వేడి నీళ్లు మీద పడి బాలుడి మృతి
గచ్చిబౌలి: తల్లి స్నానం కోసం పెట్టుకున్న వేడి నీళ్ల బకెట్‌ను పట్టుకోవడంతో ప్రమాదవశాత్తు నీళ్లు మీదపడి తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా దోమ మండలం గొడుగోనిపల్లికి చెందిన దంపతులు మైసం రాజు, సోనీ బతుకు దెరువు కోసం వచ్చి మణికొండలోని శివపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. రాజు వాచ్‌మెన్‌గా పని చేస్తూనే కారు డ్రైవింగ్ చేస్తుంటాడు. ఈ నెల 6న సాయంత్రం 4.40 గంటల సమయంలో సోనీ స్నానం చేసేందుకు బకెట్లో హీటర్ పెట్టి నీళ్లను వేడి చేసింది. ఆమె కొడుకు ధీరజ్ (04) ఆడుకుంటూ బకెట్‌ను పట్టుకున్నాడు. బకెట్ కిందపడటతో నీళ్లన్నీ శరీరంపై పడి బాలుడికి 60 శాతం కాలిన గాయాలయ్యాయి. వెంటనే గమనించిన తల్లి హుటాహుటిని సమీపంలోని ఓ ప్రైవేట్ అస్పత్రికి తరలించింది. అక్కడి నుంచి నిలోఫర్‌కు వెళ్లగా ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ధీరజ్ శుక్రవారం రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. వేడి నీళ్లు మీదపడి ఒక్కగానొక్క మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గృహిణి అదృశ్యంపై కేసు నమోదు
పహాడీషరీఫ్: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ గురువారెడ్డి శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరాం కాలనీకి చెందిన సంపంగి గణేష్ ఏడాది క్రితం శిరీష(21) అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి శిరీష కుటుంబ సభ్యులు ఆమెతో మాట్లాడడం లేదు. తాజాగా ఆమె తల్లితో మాట్లాడుతుంది. ఈ క్రమంలోనే ఈ నెల 9న తల్లి వద్దకు వెళ్లొస్తానని చెప్పి శిరీష బయటికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఈ విషయమై గణేష్ అత్తగారింటిలో వాకబు చేయగా, అక్కడికి రాలేదని తెలిపారు. దీంతో పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లోగాని 87126 62367 నంబర్లో గాని సమాచారం అందించాలని తెలిపారు.
సంక్రాంతికి వస్తానని.. తిరిగిరాని లోకాలకు
జవహర్‌నగర్: ‘సంక్రాంతికి వస్తా..నీవు ఆరోగ్యంగా ఉండు. నాకు చిన్న పని ఉంది చూసుకుని రేపు ఇంటికి బయలుదేరి వస్తా. పండగ అయ్యాక మనమిద్దరం కలిసి బియ్యం తీసుకుని హైదరాబాద్‌కు వెళ్దాం..’ అని గర్భవతి అయిన భార్యతో ఫోన్లో మాట్లాడి వెళ్లిన కొన్ని గంటలకే ఆ ఇంటి యజమాని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కరెంటు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృతిచెందాడు. జవహర్‌నగర్ సీఐ సైదయ్య, బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల బంజారా తండాకు చెందిన బానోతు ప్రశాంత్ (26), సరిత దంపతులు. వీరు సంతో నగర్లో నివాసం ఉంటున్నారు. ప్రశాంత్ బాలాజీనగర్ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే ప్రశాంత్ శుక్రవారం సంతోష్‌నగర్‌లో విద్యుత్ లైన్ల మరమ్మతులకు తోటి కారి్మకులతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో ఏఈ సాంబశివరావు, లైన్మెన్ నాగరాజుతో పాటు కాంట్రాక్టర్ రాజేశ్‌లు ఎల్సీ తీసుకున్నామని, మీరు పని పూర్తి చేయాలని చెప్పడంతో ప్రశాంత్ ఉదయం 10.20 నిమిషాల సమయంలో విద్యుత్ స్తంభం ఎక్కి వైర్ కట్‌చేస్తుండగా 11కేవీ తీగలు తగిలాయి. ప్రశాంత్ స్తంభంపైన పనిచేస్తుండగానే అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యుత్ సరఫరాను ఆన్ చేశారు. దీంతో విద్యుదాఘాతానికి గురై ప్రశాంత్ మృతిచెందాడు. తోటి కార్మికులు, ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం అందించి సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భార్యతో ఉదయం ఫోన్లో మాట్లాడిన కొద్దిసేపటికే..మృత్యువాత పడిన విషయం తెలిసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ప్రశాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం, అధికారులు అన్ని విధాలా ఆదుకోవాలని ఖమ్మం జిల్లా కామేపల్లి మండల మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్‌కుమార్ నాయక్ డిమాండ్ చేశారు. స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్మికుని కుటుంబానికి అన్నివిధాల ఆదుకుంటామని విద్యుత్ అధికారులు హమీ ఇచ్చారు. ప్రస్తుతానికి తక్షణ సహాయంగా రూ.10 లక్షలు ఇస్తున్నట్లు అధికారులు, కాంట్రాక్టర్ ప్రకటించారు. పండక్కి ఊరికి వస్తానంటివే.!