Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

KSR Comment On CM Revanth Reddy Allu Arjun Episode1
ఇది సీఎం రేవంత్‌ వ్యూహంలో భాగమా?

రాజకీయ నేతలు తమకు లాభం ఉందనుకుంటేనే ఏదైనా వివాదాన్ని రేకెత్తిస్తుంటారు. తమకు నష్టం చేస్తుందని భావిస్తే కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు.కాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) కావాలని కయ్యానికి దువ్వుతున్నట్లుగా అనిపిస్తుంది.ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌ను ఉద్దేశించి శాసనసభలో చేసిన వ్యాఖ్యలు ఆయనలోని ఆక్రోశాన్ని బయటపెట్టాయనిపిస్తుంది.రేవంత్ ను తెలివైన రాజకీయ నేతగానే అంతా చూస్తారు.కాని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనలో వచ్చిన అధికార దర్పమో,లేక ఎవరైనా సలహాదారుల ప్రభావమో కాని,అనవసర వివాదాలను తెచ్చి పెట్టుకుంటున్నారనిపిస్తుంది. బహుశా ఇది ఆయన వ్యూహం కావచ్చు.లేక సినిమావారిని తన దారిలో పెట్టుకోవాలన్న లక్ష్యం కావచ్చు. లేదా అల్లు అర్జున్(Allu Arjun) అరెస్టు అయి బెయిల్ పై విడుదలైన తర్వాత పెద్ద సంఖ్యలో సినీ పరిశ్రమవారు, ఇతర ప్రముఖులు కలవడం పై ఆయనకు కలిగిన ఉక్రోశం కావచ్చు..ఏదైనా కావచ్చు.రాజకీయంగా చూస్తే ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఉన్న కష్టాలు కూడా ఒక కారణం అనుకోవచ్చు.ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇదో ప్రయత్నమా అన్న భావన కలగవచ్చు. లేదా తాను ఎవరిపైన అయినా దూకుడుగా వెళ్లగలనని నిరూపించుకోవాలన్న తాపత్రయం కూడా ఇందులో ఉండవచ్చు. సంధ్యా ధియేటర్(Sandhya theater Incident) వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన ఘటనపై అల్లు అర్జున్‌ను బాధ్యుడిని చేస్తూ రేవంత్ ప్రభుత్వం కేసు పెట్టింది. అక్కడితో ఆగకుండా ఆయనను అరెస్టు చేసింది.ఈ క్రమంలో ఎక్కడా అర్జున్ వాదనను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వెళ్లింది.సాధారణంగా పోలీసులు ఇలాంటి కేసులలో ముఖ్యమంత్రి ఏమి చెబితే అది చేస్తుంటారు. దానిని నిర్దారిస్తూ శాసనసభలో రేవంత్ ప్రసంగించినట్లు అనిపిస్తుంది.నిజానికి ఈ కేసు కోర్టు పరిధిలోకి వెళ్లింది.అలాంటప్పుడు ప్రభుత్వంలోని వారు కోర్టులో కేసు ఉంది కాబట్టి అని చెప్పి దాని గురించి మాట్లాడకుండా తప్పించుకుంటారు.కాని రేవంత్ మాత్రం పనికట్టుకుని అర్జున్ ను తిట్టడానికే అవకాశం కల్పించుకున్నట్లుగా ఉంది.శాసనసభ జరిగిన ఈ ఐదు రోజులలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం, చివరి రోజు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ లేవనెత్తడం,దానిపై రేవంత్ ఘాటుగా మాట్లాడడం చూస్తే అంతా ప్లాన్ ప్రకారమే సాగిందన్న అభిప్రాయం కలుగుతుంది.ఈ సందర్భంలో రేవంత్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ కు ఏమైనా కాలు పోయిందా? కన్ను పోయిందా?కిడ్ని పోయిందా?అంతమంది ఎందుకు పరామర్శించారు. తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రిలో ఉన్న బాలుడిని ఎందుకు పరామర్శించలేదు?అంటూ వితండ వాదన తీసుకు వచ్చారు.నిజానికి ఎవరిని ఇలా అనరాదు.అందులోను సెలబ్రెటిగా ఉన్న వ్యక్తి పట్ల ఇంత అమర్యాదగా మాట్లాడవలసిన అవసరం ఏమిటో తెలియదు. అంటే అర్జున్ కు ఏదైనా జరగాలని కోరుకున్నట్లుగా ఉందన్న విమర్శలకు ఆస్కారం ఇచ్చారు.ఇక్కడే అసలు విషయం బోధ పడిందనిపిస్తుంది.తన ప్రభుత్వం అర్జున్‌ను అరెస్టు చేస్తే, ఆయనను పలకరించడానికి ఇంత మంది సినీ పెద్దలు ఆయన వద్దకు వెళతారా?అన్న భావన ఏదో ఏర్పడి ఉండాలి. చిరంజీవితో సహా అనేక మంది బంధువులు, రాఘవేంద్రరావు తదితర సినిమా పెద్దలు ఇలా కలిసినవారిలో ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఫోన్ చేసి పరామర్శించారని వార్తలు వచ్చాయి.ఈ పరామర్శల వల్ల అర్జున్ పట్ల ప్రజలలో సానుభూతి ఏర్పడిందని అనిపించి ఉండాలి. అలాగే ప్రభుత్వంపై నెగిటివ్ వచ్చిందని ఫీడ్ బ్యాక్ ఉండి ఉండాలి.అందుకే ఈ ఉదంతం జరిగిన పది రోజుల తర్వాత మళ్లీ తనది పైచేయి అనిపించుకోవడానికి రేవంత్ మాట్లాడినట్లుగా ఉంది.ఈ క్రమంలో అర్జున్‌ రోడ్ షో చేశారని, పోలీసులు అనుమతి ఇవ్వలేదని,తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిందని తెలిసినా ,పోలీసులు చెప్పినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. మరో వైపు అల్లు అర్జున్ దీనిపై మీడియా సమావేశం పెట్టి తన వాదన తెలిపారు.అయితే ఆయన కాస్త జాగ్రత్తగా ముఖ్యమంత్రి రేవంత్ పై నేరుగా ఎక్కడా విమర్శలు చేయకుండా మాట్లాడారు.తాను రోడ్ షో చేయలేదని, పోలీసుల సూచన మేరకే చేతులు ఊపుతూ అబిమానులకు ఇబ్బంది లేకుండా చేయడానికి యత్నించానని వివరించారు.తనపై చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.అర్జున్ ఈ తొక్కిసలాటకు తాను ఎలా కారణం అవుతానని చెప్పడానికి యత్నించారు.అలాగే మరణించిన మహిళ కుటుంబాన్ని, గాయపడ్డ వారి కుమారుడు శ్రీ తేజ్ ను పరామర్శించడానికి వెళ్లాలని అనుకుంటే తనపై కేసు పెట్టినందున అలా వెళ్లడం లీగల్‌గా కుదరదని చెప్పారని ఆయన వివరించారు.రేవంత్ చేసిన వాదనలో హేతుబద్దత కనిపించదు. ఒక సినిమా నటుడు సినిమా ధియేటర్ కు వెళ్లకూడదన్నట్లుగా ఆయన మాట్లాడారు. అదే సూత్రం కరెక్టు అని అనుకుంటే ఆయా ఉత్సవాలలో తొక్కిసలాటలు జరిగి కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవించాయి.మరి ఆ ఉత్సవాలను పూర్తిగా నిలిపివేస్తున్నారా?ప్రముఖ రాజకీయ నేతలు మీటింగ్‌లు పెట్టినప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగి కొందరు మరణించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. చేపమందు పంపిణీలో , నాంపల్లి ఎక్జిబిషన్ గ్రౌండ్ లో గతంలో కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగాయి.అయినా వాటి నిర్వాహకులపై కేసులు పెట్టలేదే!అరెస్టులు చేయలేదే! మరి నేతలు రోడ్ షో లను ,సభలను ఆపివేస్తున్నారా.ఇక అర్జున్ ఎవరూ పరామర్శించకూడదని అనుకుంటే ఎలా? ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్టు అయి కొన్నాళ్లు జైలులో ఉన్నారు.ఆయన బెయిల్ పై విడుదలయ్యాక చర్లపల్లి జైలు నుంచి ఊరేగింపుగా ఎందుకు వచ్చారు? అని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు.అర్జున్‌ను టార్గెట్ చేయడం సరికాదని బిజెపి నేతలు,కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు వ్యాఖ్యానించారు. రేవంత్ గురువుగా భావించే చంద్రబాబు నాయుడు సభలలో తొక్కిసలాటలు జరిగి పదకొండు మంది మరణించారు. అయినా అప్పుడు అది పోలీసుల వైఫల్యం అని ఆయన డబాయించారు.పు ష్కరాలలో ఆయన కుటుంబం స్నానాలు చేసినప్పుడు జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణిస్తే ఆయన ఏమన్నారో గుర్తుకు తెచ్చుకోండి.కుంభమేళాలలో చనిపోవడం లేదా?రోడ్డు ప్రమాదాలలో పోవడం లేదా?పూరి జగన్నాధ్ రథం వద్ద తొక్కిసలాట జరగలేదా అని ప్రశ్నించారు.హైదరాబాద్ లో రేవంత్ మాత్రం అర్జున్ దే పెద్ద తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు.అర్జున్ ఒక్కరే కాదు..సినీ నటులంతా మొదటి షో కు వెళ్లి అబిమానులను ఉత్సాహపరుస్తుంటారు. బెనిఫిట్ షో లకుఅనుమతి ఇవ్వబోనని చెబుతున్నారు. తొలుత అధిక ధరలకు టిక్కెట్ అమ్ముకోవచ్చని అనుమతి ఇవ్వడానికి, ఇప్పుడు ఆ పర్మిషన్ ఇవ్వనని అనడానికి కారణాలు ఉండాలి కదా? సినీ పరిశ్రమవారిని తనకు సరెండర్ అయ్యేలా చూసుకోవడానికి ఏమైనా రేవంత్ ఈప్రయత్నం చేస్తున్నారా అన్న సందేహాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.రేవంత్‌కు ఇక్కడ టీడీపీ మీడియా మద్దతు ఇస్తోంది కాబట్టి సరిపోయింది.లేకుంటే ఈ పాటికి సినిమా పరిశ్రమపై రేవంత్ దాడి చేశారని పెద్ద ఎత్తున ప్రచారం చేసేది. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిక్కెట్ల రేట్లు పెంపుదలకు కొన్ని షరతులు పెడితేనే నానా యాగీ చేశాయి. పవన్ కళ్యాణ్ వంటివారు ఎన్ని ఆరోపణలు చేశారో చూశాం. ఇప్పుడు తెలంగాణలో ఏకంగా ప్రముఖ హీరోని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాటీడీపీ మీడియా కాని, పవన్ కళ్యాణ్ వంటివారు కాని నోరు విప్పడం లేదు.వ్యతిరేకంగా ఎవరూ ట్వీట్లు కూడా చేయడం లేదు. ఎందుకంటే రామోజీ ఫిల్మ్ సిటీతో సహా సినీ పరిశ్రమ ఎక్కువగా ఇక్కడే ఉంది కనుక.రేవంత్ ఇంకేదైనా చేస్తే తమకు ఇబ్బంది అవుతుందని భయపడుతుండవచ్చు.కాని సినీ పరిశ్రమకు రేవంత్ తెలియకుండానే నష్టం చేస్తున్నారు.ఈ వ్యవహారం రాజకీయంగా కూడా ఆయనకు అంత కలిసివచ్చేది కాకపోవచ్చు. ఒకసారి కేసు పెట్టాక దాని మానాన దానిని వదలివేయకుండా ఇలా కెలకవలసిన అవసరం ఏమిటో తెలియదు.ఆయన మెప్పు కోసం కొందరు అబ్బో అదిరింది అని పొగడవచ్చు. రేవంత్ ఫైర్ మాదిరి వ్యవహరిస్తున్నారని డబ్బా కొట్టవచ్చు.కాని తేడా వస్తే వీళ్లే ఘోరంగా ప్రచారం చేస్తారు. రేవంత్ సరళి ఫైర్ మాదిరి ఉంటే ఉపయోగమో,లేదో కాని, ఫైర్‌తో గేమ్ ఆడితే చేతులు కాలతాయన్న సంగతి గ్రహించడం మంచిది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

YS Jagan Key Comments At YSR District Leaders corporators Meeting2
2027 చివర్లో జమిలి ఎన్నికలు: వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌ జిల్లా, సాక్షి: ఎన్నికలకు ముందు అలవి గాని హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. పులివెందుల పర్యటనలో భాగంగా.. కడప నేతలు, కార్పొరేటర్లతో తాజా పరిణామాలపై ఆయన చర్చించారు.‘‘కష్టాలు అనేవి శాశ్వతం కావు. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు.మనమందరం కలిసికట్టుగా పని చేయాలి. దేశ చరితలో ఏ ఒక్కరూ చేయని మంచి పనులు చేశాం. అబద్ధాలు చెప్పలేకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నాం. మోసపూరిత హామీలతో చంద్రబాబు(Chandrababu) అధికారంలోకి వచ్చారు. కానీ, ..మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మనం మార్చాం. కోవిడ్‌ సమయంలో కూడా సంక్షేమాన్ని ఆపలేదు. కార్యకర్తలు కాలర్‌ ఎగరేసుకునేలా పాలన చేశాం. 2027 చివరిలో జమిలి ఎన్నికలు(Jamili Elections) రావొచ్చు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. ప్రతికార్యకర్తకు అండగా ఉంటాం’’ అని అన్నారాయన. ఈ కార్యక్రమంలో.. ఆంజాద్‌ బాషా, కడప మేయర్‌ సురేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. పార్టీ కార్యక్రమాలతో పాటు ఇటీవల కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) చేస్తున్న అరాచకాలను కడప నాయకులు వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువెళ్లారు. కార్పొరేషన్లలో బలం లేకపోయినా టీడీపీ నేతలు పెత్తనం కోసం ఎలా పాకులాడుతున్నారో తమ అధినేతకు వివరించారు. ‘‘మాట మీద నిలబడితే ప్రజలు వాస్తవాలను తెలుసుకుని ఆదరిస్తారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా నిత్యం మనం ప్రజల కోసమే పోరాడాలి’’ అని నేతలకు వైఎస్‌ జగన్‌(YS Jagan) సూచించారాయన.

Jr Ntr Team Helps His Fan Koushik Who Is Takn Treatment In Hospital3
ఎన్టీఆర్ గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు: కౌశిక్ తల్లి

జూనియర్ ఎన్టీఆర్ సాయం చేస్తానని మాట తప్పారని ఓ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ బాబు ఆస్పత్రి చికిత్స కోసం ఆర్థికసాయం చేయలేదంటూ మహిళ మాట్లాడిన వీడియో నెట్టింట వైరలైంది. ఆమె చేసిన కామెంట్స్‌తో ఎన్టీఆర్ టీమ్ రంగంలోకి దిగింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్‌ ఆరోగ్యంపై ఎన్టీఆర్ టీమ్ ఆరా తీసింది.క్యాన్సర్‌తో బాధపడుతూ చెన్నై అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఎన్టీఆర్ అభిమాని కౌశిక్‌ను ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించారు ఎన్టీఆర్ టీమ్.. అంతేకాదు అతని చికిత్సకు అయిన ఖర్చును మొత్తం చెల్లించారు. దీంతో తమను ఆదుకున్న ఎన్టీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా కౌశిక్ తల్లి ధన్యవాదాలు తెలిపింది.(ఇది చదవండి: జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన)థాంక్యూ ఎన్టీఆర్ సార్.. కౌశిక్ తల్లిఅయితే తాను ఎన్టీఆర్ గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని ఆమె తెలిపింది. నా మాటలను తప్పుగా ‍అర్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం నా కుమారుడు కౌశిక్ ఆనందంగా, సంతోషంగా ఉన్నాడని పేర్కొంది. ఈరోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళుతున్నామని ఆమె వెల్లడించింది. మా కుటుంబం అంతా ఎన్టీఆర్‌కు అభిమానులు అని.. నాకు అన్ని విధాల సహకరించిన ఎన్టీఆర్ టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

ICC release schedule for Champions Trophy 20254
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. భారత్ మ్యాచ్‌లు ఎక్కడంటే?

క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 షెడ్యూల్‌ వచ్చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అధాకరికంగా మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. పాకిస్తాన్‌ ఆతిధ్యమిస్తున్న ఈ మెగా టోర్నమెంట్‌ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీ భారత్‌ ఆశించినట్లే హ్రైబిడ్‌ మోడల్‌లో జరగనుంది.భారత్‌ తమ మ్యాచ్‌లను దుబాయ్‌ వేదికగా ఆడనుంది. ఇక ఈ మెగా ఈవెంట్‌ తొలి మ్యాచ్‌లో కరాచీ వేదికగా పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీ ఫిబ్రవరి 19న ప్రారంభమై మార్చి 9న జరగనున్న ఫైనల్‌తో ముగియనుంది. ఈ ఈవెంట్‌ ఫైనల్‌ కోసం ఐసీసీ రిజర్వే డేను కేటాయించింది. పాక్‌లో జరిగే మ్యాచ్‌లకు లాహోర్, కరాచీ రావల్పిండి మైదానాలు ఆతిథ్యమివ్వనున్నాయి.దాయాదుల పోరు ఎప్పుడంటే?ఇక ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న దుబాయ్‌ వేదికగా అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. అనంతరం ఫిబ్రవరి 23న ఇదే దుబాయ్‌ అంతర్జాతీయ స్టేడియంలో చిరకాల ప్రత్యర్ధులు భారత్‌-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.భారత్‌ తమ చివరి లీగ్‌ ‍మ్యాచ్‌ మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడనుంది. కాగా గ్రూపు-ఎలో భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌,పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. అదే విధంగా గ్రూపు-బిలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా ఉన్నాయి. షెడ్యూల్‌ ఇదే..ఫిబ్రవరి 19, 2025 (కరాచీ)- పాకిస్తాన్ vs న్యూజిలాండ్ఫిబ్రవరి 20, 2025 (దుబాయ్)- బంగ్లాదేశ్ vs భారత్‌ఫిబ్రవరి 21, 2025 (కరాచీ)- ఆఫ్ఘనిస్తాన్ vs సౌత్ ఆఫ్రికాఫిబ్రవరి 22, 2025 (లాహోర్)- ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ఫిబ్రవరి 23, 2025 (దుబాయ్)- పాకిస్తాన్ vs భారత్‌ఫిబ్రవరి 24, 2025 (రావల్పిండి)- బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ఫిబ్రవరి 25, 2025 (రావల్పిండి)- ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికాఫిబ్రవరి 26, 2025 (లాహోర్)- ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్ఫిబ్రవరి 27, 2025 (రావల్పిండి)- పాకిస్తాన్ vs బంగ్లాదేశ్ఫిబ్రవరి 28, 2025 (లాహోర్)- ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియామార్చి 1, 2025 (కరాచీ) దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్మార్చి 2, 2025 (దుబాయ్) న్యూజిలాండ్ vs భారత​మార్చి 4, 2025 (దుబాయ్) సెమీ-ఫైనల్ A1 vs B2మార్చి 5, 2025 (లాహోర్ )సెమీ-ఫైనల్ B1 vs A2మార్చి 9, 2025 (లాహోర్) ఫైనల్మార్చి 10, 2025 – దుబాయ్ రిజర్వ్ డే👉ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:00 గంటలకు మొదలు కానున్నాయి.

YSRCP Ambati Rambabu Approaches Ap High Court ITDP Derogatory Posts5
ఐటీడీపీ పోస్టులపై హైకోర్టులో అంబటి రాంబాబు పిటిషన్‌

అమరావతి, సాక్షి: ఐటీడీపీ అనుచిత పోస్టుల వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని.. కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని ఆయన తన పిటిషన్‌లో న్యాయస్థానాన్ని కోరారు.‘‘ఐటీడీపీ(iTDP)లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. మా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కించపరుస్తున్నారు. నాపై , నాకుటుంబ సభ్యులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేం ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు ఒక్క కేసు నమోదు చేయలేదు. మాపై వివక్ష ప్రదర్శిస్తున్నారు’’ అని అంబటి పిటిషన్‌లో పేర్కొన్నారు. తన పిటిషన్‌ ఆధారంగా.. కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలువ్వాలని పిటిషన్‌ ద్వారా అంబటి కోరారు. ఈ పిటిషన్‌పై స్వయంగా ఆయనే వాదనలు వినిపించనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. ఐటీడీపీ, టీడీపీ అనుబంధ పేజీల్లో వైఎస్‌ జగన్‌(YS Jagan)పై, తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయితే అటు నుంచి ఎలాంటి స్పందన ఉండడం లేదు. దీంతో తాజాగా ఆయన పట్టాభిపురం పీఎస్‌ వద్ద నిరసన తెలిపారు. అయితే న్యాయం చేయకపోగా.. అంబటిపైనే పోలీసులు తిరిగి కేసు నమోదు చేయడం గమనార్హం.ఇదీ చదవండి: ఉన్న ఉద్యోగం పీకేసి.. అయినవాళ్ల కోసం!

Allu Arjun Issue: Tamil Nadu BJP chief Annamalai slams Revanth Reddy6
Allu Arjun Issue:‘సూపర్‌స్టార్‌లా ఫీలైపోతున్న రేవంత్‌’

సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటన.. నటుడు అల్లు అర్జున్‌ విషయంలో తెలంగాణ పోలీసులు(Telangana Police) వ్యవహరిస్తున్న తీరును రాజకీయ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అనుమతి లేకుండా ర్యాలీగా రావడం ముమ్మాటికీ తప్పేనని.. చట్టం తన పని తాను చేసుకుపోతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం మరింత దుమారాన్ని రేపింది. అయితే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్‌ను ఇబ్బంది పెడుతోందని ఇటు బీఆర్‌ఎస్‌, అటు బీజేపీలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో మరో గొంతుక ఇప్పుడు రేవంత్‌కు వ్యతిరేకంగా వినిపించింది. అల్లు అర్జున్‌ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) తనను తాను ఓ సూపర్‌స్టార్‌లా ఫీలవుతున్నారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మండిపడ్డారు. ‘‘తెలంగాణలో ఎవరు సూపర్‌ స్టార్‌ అనే విషయంలో ఆయన(రేవంత్‌ రెడ్డి ) పోటీ పడుతున్నారనుకుంటా. అల్లు అర్జున్‌ కంటే తానే సూపర్‌స్టార్‌నని ఆయన చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌ పార్టీలో నటిస్తున్నారు. తెలంగాణలో ఆయనే ఇప్పుడు మెయిన్‌ యాక్టర్‌. అల్లు అర్జున్‌ నివాసంపై రాళ్లు విసిరి రచ్చ చేసిన వాళ్లలో ఇద్దరు ముగ్గురు ఆయన (రేవంత్‌ రెడ్డి ) నియోజకవర్గానికి చెందిన వాళ్లే. ఇది రాజకీయ దురుద్దేశంతో జరిగిన దాడేనని స్పష్టం అవుతోంది. .. అలాంటి ఘటన జరగకుండా ఉండాల్సింది. ఒక నిండుప్రాణం పోవాలని అల్లు అర్జున్‌ (Allu Arjun) కూడా అనుకోరు కదా. ఒకరిని బలిపశువు చేయడం, వేధించడం ముమ్మాటికీ తప్పే’’ అని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నామలై అన్నారు. #WATCH | Chennai: Tamil Nadu BJP president K Annamalai says, " I think he (Revanth Reddy) is trying to compete regarding who is the superstar in Telangana, he trying to show he is superstar than Allu Arjun...right now also he is acting in Congress, he is the main actor in… pic.twitter.com/zjqPDj5BCY— ANI (@ANI) December 24, 2024 ఇదీ చదవండి: అల్లు అర్జున్‌ను ఆనాడు అడ్డుకుని ఉంటే..

Times have changed Father has changed7
కాలం మారింది.. నాన్నను మార్చింది

నాన్న.. అమ్మలా మారుతున్నాడు. కోపం చిరాకు లేదు.. ఎక్కువటైం పిల్లలతోనే!. కాలం తెచ్చిన మార్పు.. పిల్లలకు తండ్రితోనే ఎక్కువ సాన్నిహిత్యం!కుటుంబలో నాన్న అంటేనే ఒక ప్రత్యేక క్యారెక్టర్... నాన్న అంటే గాంభీర్యతకు ప్రతీక .. ఎప్పుడూ పనులు.. బాధ్యతలు.. కుటుంబ సమస్యలు.. అప్పులు.. వ్యవసాయం వంటి పనుల్లో బిజీ.. నాన్నను కలవాలంటేనే ముందుగా ప్రిపరేషన్ ఉండాలి. నాన్నతో మాట్లాడడం అంటే హైడ్మాస్టర్ దగ్గర నిలబడినట్లే.. నాన్న ఒక సీరియస్ క్యారెక్టర్... నాన్న వేలు పట్టుకుని నడిస్తే ఎంతబావున్ను.. నాన్న నన్ను తన భుజాలమీద ఎక్కించుకుని జాతరలో తిప్పుతూ.. జీళ్ళు కొనిపెడితే ఎంతబావుణ్ను... నాన్న పక్కన పడుకోబెట్టుకొని కబుర్లు.. కథలు చెప్పే రోజులు నాకు రావా ? ఇదీ సగటు తండ్రి క్యారెక్టరైజేషన్. దాదాపు 1990ల వరకూ నాన్న(Father) పరిస్థితి ఇదే.. ఇంట్లో అందరి బాధ్యతలూ మోస్తూ అందరికీ దూరంగా ఉండే ఒక సెమి విలనీ పాత్ర...ఎప్పుడూ పనులు.. బాధ్యతల్లో ఉంటూ అసలు పిల్లలతో టైం గడపడం.. వారిని ఆడించడం.. వారితో ముచ్చట్లు ఆడడం అనేది తనకు సంబంధం లేదనుకునే పాత్ర ఆయనది. కేవలం పిల్లల ఖర్చులు.. బట్టలు.. పుస్తకాలు.. జ్వరం వస్తే మందులు వంటివి తేవడం తప్పిస్తే పిల్లలతో టైం గడపడం అనేది తండ్రి డైరీలోలేదు. పిల్లలకు స్నానం చేయడం.. వారిబట్టలు మార్చడం .. ఇలాంటివి అంటే డాడీకి ఎన్నడూ అసలు పరిచయం లేని పనులు. నాన్న కేవలం కొన్ని బాధ్యతలు మోయడం తప్ప పిల్లలతో ప్రేమను పంచుకునే సందర్భాలు.. సన్నివేశాలు దాదాపు తక్కువే. అప్పట్లో అన్నీ ఉమ్మడికుటుంబాలు.. పిల్లలతో టైం గడపడం అనేది ఆయనకు తెలియని పని.. అలాంటివి అన్నీ అమ్మే చూసుకుంటుంది.. పిల్లల విషయంలో తండ్రిది ఎప్పటికీ గెస్ట్ పాత్ర మాత్రమే....కాలం మారింది .. నాన్నను మార్చింది1960 ల నుంచి 1990, 2000 వరకు నాన్నది అదే సీరియస్ పాత్ర.. కానీ రోజులు మారుతున్న కొద్దీ నాన్నలోని కాఠిన్యం కరిగిపోతూ వస్తోంది.. నాన్నలో కూడా అమ్మలాంటి సున్నితత్వం... పిల్లలపట్ల ఎనలేని ప్రేమ పొటమరిస్తున్నాయి. ఇవన్నీ కాలం తెస్తున్న మార్పులే. గ్లోబలైజేషన్ కారణంగా ఉపాధి అవకాశాలు పెరగడం.. ఉమ్మడికుటుంబాల ప్రాబల్యం తగ్గడం.. ఎక్కడికక్కడ ఉపాదివేటలో పట్టణాలకు వలసవెళుతున్న కుటుంబాలు(Families) అక్కడే స్థిరపడడం వంటివి నాన్న పాత్రలో మార్పులు తెస్తోంది. పట్టణానికి చేరిన నాన్న.. తన కుటుంబాన్ని తానే చూసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ తమ బిడ్డలకు సాయం చేసేందుకు బామ్మలు.. మామ్మలు లేరు.. తల్లి ఒక్కతీ పనులు చేసుకోదు .. చేసుకోలేదు.. దరిమిలా నాన్న కూడా అమ్మకు పనుల్లో తోడుగా నిలవాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది. ఈక్రమంలోనే నాన్న కూడా సున్నితత్వాన్ని సంతరించుకుంటున్నాడు . గత పాతిక ముప్పై ఏళ్ళ క్రితం జనరేషన్లకు ఊహాకు కూడా అందని సేవలు ఇప్పుడు నాన్న తన బిడ్డలకు చేస్తున్నాడు. 1980ల్లో 43 శాతం మంది తండ్రులకు తమ పిల్లల \డైపర్లు మార్చడం అనేది తెలియదట ప్రస్తుతానికి అది 3 శాతానికి తగ్గింది. అంటే ఇప్పుడు తండ్రులు పిల్లల సేవల్లో(Father-Kids Relation) తల్లితోబాటు సమానంగా బాధ్యత తీసుకుంటున్నారట.నాన్నతోనే స్నేహం ఇప్పుడుఅప్పట్లో సీరియస్ పాత్రలో ఉండే నాన్న ఇప్పుడు పిల్లలపట్ల అత్యంత ప్రేమతో ఉంటున్నారట. పిల్లలకు కెరీర్ సంబంధ సలహాలు ఇవ్వడం.. వారికి సైకిల్.. బైక్.. నేర్పడం.. వేలు పట్టుకుని నడిపించడం.. సాధ్యమైనంత ఎక్కువటైం పిల్లలతో గడపడం.. కథలు చెప్పడం.. టూర్లకు తీసుకెళ్లడం.. పిల్లలకు స్నానం చేయించడం.. వాళ్లతో పడుకోవడం.. ఇలా ప్రతి పనిలోనూ నాన్న తోడుగా ఉంటున్నాడు.. అమ్మలా మారిపోతున్నాడు. గ్లోబలైజేషన్(Globalisation) తెచ్చిన మార్పులతో నాన్నల పాత్రల్లోనూ మార్పులు వస్తున్నాయి..:::సిమ్మాదిరప్పన్న

Manu Bhaker breaks silence on Khel Ratna snub8
ఖేల్‌రత్న వివాదం: తొలిసారి స్పందించిన మనూ భాకర్‌

దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు నామినీ జాబితాలో పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్‌, భారత షూటర్ మను భాకర్‌(Manu Bhaker)కు చోటు దక్కపోయిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ వేదికపై దేశ పతాకాన్ని రెపరెపలాడించిన మనును ప్రతిష్టాత్మక ఖేల్ రత్న(Major Dhyan Chand Khel Ratna) అవార్డుకు నామినెట్ చేయకపోవడం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఈ క్రమంలో నామినీల జాబితాలో మను పేరు లేకపోవడంపై ఆమె రామ్ కిషన్ భాకర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కుమార్తెను షూటర్ కాకుండా, క్రికెటర్‌ను చేసి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. అదేవిధంగా తన పేరు లేకపోవడంతో మను కూడా బాధపడిందని కిషన్ భాకర్ వ్యాఖ్యనించారు. తాజాగా ఈ విషయంపై మను భాకర్‌ తొలిసారి స్పందించారు. అవార్డుల కంటే దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడమే తన లక్ష్యమని మను చెప్పకొచ్చారు. "అవార్డుల గురుంచి నేను ఎప్పుడూ ఆలోచించను. ఒక అథ్లెట్‌గా దేశం తరపున ఆడి మరిన్ని పతకాలు తీసుకు రావడమే నా లక్ష్యం.ద‌యచేసి ఈ విష‌యాన్ని ఇక్క‌డితో వ‌దిలేయండి. అన‌వ‌స‌రమైన ఊహాగానాలు ప్ర‌చారం చేయవద్దు. నామినేషన్‌ కోసం అప్లై చేసేటప్పుడు పొరపాటు జరిగిందని అనుకుంటున్నా" ఎక్స్‌లో రాసుకొచ్చారు.కాగా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రమణ్ నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం.. భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌తో పాటు పారా అథ్లెట్‌ ప్రవీణ్‌ కుమార్‌ పేర్లను నామినేట్‌ చేసింది. ప్యారిస్‌ ఒలిపింక్స్‌-2024 షూటింగ్‌లో మను రెండు కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే.

Techie Paid 10000 Bitcoins for 2 Pizza in 20109
రెండే రెండు పిజ్జాలు.. రూ. 8 వేల కోట్లు

ఒక బిట్‌కాయిన్ ధర ఈ రోజు సుమారు రూ. 80 లక్షల కంటే ఎక్కువే. కాబట్టి ఎవరైనా 10,000 బిట్‌కాయిన్‌లను కలిగి ఉంటే.. అతడు పెద్ద సంపన్నుడనే చెప్పాలి. అయితే కొన్ని సంవత్సరాలకు ముందు ఓ వ్యక్తి 10వేల బిట్‌కాయిన్‌లు (Bitcoins) చెల్లించి కేవలం రెండు పిజ్జాలను కొనుగోలు చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.అమెరికాకు చెందిన ఐటీ ప్రోగ్రామర్ 'లాస్లో హనిఎజ్' (Laszlo Hanyecz) 2010 మే 17న తన దగ్గరున్న 10వేల బిట్‌కాయిన్‌లను డాలర్లలోకి మార్చుకున్నాడు. ఆ డాలర్లతో 2 డామినోస్ పిజ్జాలను ఆర్డర్ చేసుకుని తినేసాడు. ఆ బిట్‌కాయిన్‌ల విలువ నేడు రూ. 8వేల కోట్లు. అయితే హనిఎజ్ ఇప్పుడు పశ్చాతాప పడిన ఏం ప్రయోజనం లేదు.బిట్‌కాయిన్2010లో ఒక బిట్‌కాయిన్ విలువ 0.05 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 2.29 రూపాయలకు సమానమన్నమాట. అయితే ఈ రోజు ఒక బిట్‌కాయిన్ విలువ రూ. 80 లక్షల కంటే ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే బిట్‌కాయిన్ విలువ ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.అమెరికా ఎన్నికల్లో 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) గెలిచిన తరువాత బిట్‌కాయిన్ విలువ భారీగా పెరిగింది. కొన్నాళ్ల కిందట తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఇప్పుడు లక్ష డాలర్ల మార్కుని దాటేసింది. కాగా ఇటీవల కాలంలో బిట్‌కాయిన్ కొంత తగ్గుముఖం పట్టింది. ట్రంప్ గెలుపు తరువాత బిట్‌కాయిన్ విలువ తగ్గడం ఇదే మొదటిసారి.

Christmas 2024: YS Jagan Christmas Wishes to Christians10
క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌, సాక్షి: క్రిస్మస్‌ పర్వదినం పురస్కరించుకుని క్రెస్తవులందరికీ వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారాయన.‘‘కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. తద్వారా, మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారు.... దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్‌ బాటలు వేశారు. క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయి’’ అని తన క్రిస్మస్‌(Christmas) సందేశంలో వైఎస్‌ జగన్‌(YS Jagan) పేర్కొన్నారు.ప్రస్తుతం వైఎస్సార్‌ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఇవాళ ఇడుపులపాయలో నిర్వహించిన క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
అట్లాంటాలో వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా

అమెరికాలోని అట్లాంటాలో వైయస్సార్‌సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి

title
మెల్‌బోర్న్‌లో ఘనంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు

 వైయస్సార్‌ సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం  వై.ఎస్.

title
ట్రంప్‌ ప్రభుత్వంలో మరో భారతీయ అమెరికన్‌కు చోటు

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్..

title
విదేశాల్లోనూ ఘనంగా వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మా­జీ ముఖ్యమంత

title
అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి

కమలాపూర్‌: హనుమకొండ జిల్లా కమలాప

Advertisement

వీడియోలు

Advertisement