Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Former Prime Minister Manmohan Singh Passed Away1
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కన్నుమూత

భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌(92) కన్నుమూశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన మన్మోహన్‌ సింగ్‌ తుదిశ్వాస విడిచారు.మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా సేవలందించారు.మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో ఆర్బీఐ గవర్నర్ హోదాలో కీలక పాత్ర పోషించిన మన్మోహన్ సింగ్.. 1991 అక్టోబరు 1 నుండి 2019 జూన్ 14 వరకు ఐదు పర్యాయాలు అస్సాం నుండి రాజ్యసభ సభ్యునిగా, ఆ తర్వాత ఆయన 2019 ఆగస్టు 20 నుండి 2024 ఏప్రిల్ 3 వరకు రాజస్థాన్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు.

Fact Check: Donald Trump Warn Elon Musk on Shadow Presidency2
ఎలాన్‌ మస్క్‌కు ట్రంప్‌ స్వీట్‌ వార్నింగ్‌?

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎవరు?. ‘‘ఇదేం ప్రశ్న!. మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగేన్‌ నినాదంతో మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ మీద నెగ్గిన డొనాల్డ్‌ ట్రంప్‌దే’’ అని మీరు అనొచ్చు. కానీ, గత వారం పదిరోజులుగా అమెరికాలో సోషల్‌ మీడియాలో మరో తరహా చర్చ నడుస్తోంది. ట్రంప్‌ పేరుకే వైట్‌హౌజ్‌లో అధ్యక్ష స్థానంలో ఉంటారని.. కానీ ఎలాన్‌ మస్క్‌ మొత్తం నడిపిస్తారనే ప్రచారం నడిచింది. అయితే..మస్క్‌ అధ్యక్షుడని.. ట్రంప్‌ ఉపాధ్యక్షుడంటూ ప్రచారం తారాస్థాయికి చేరడం డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ఏమాత్రం భరించలేకపోతున్నారట!. అందుకే ఎలాన్‌ మస్క్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారట!.ఈ మేరకు సోషల్‌ మీడియాలోనూ ఓ సందేశం వైరల్‌ అయ్యింది. దాని సారాంశం పరిశీలిస్తే..‘‘అమెరికాకు కాబోయే అధ్యక్షుడ్ని నేనే. ఇంకెవరో కాదు. మీడియాగానీ, ఇంకెవరైనాగానీ ఎలాన్‌ మస్క్‌ అంతా తానై నడిపిస్తారని ప్రచారం చేయొచ్చు. కానీ, ఇది నా విజన్‌.. నా నాయకత్వం.. నా అమెరికా. ఎలాన్‌ మస్క్‌ నా ఎన్నికల ప్రచారం కోసం సాయం చేసి ఉండొచ్చు.అతను గొప్ప మేధావే కావొచ్చు. కానీ, రాజకీయాలకొచ్చేసరికి నా ఇష్టప్రకారమే నడుస్తుంది. ఎలాన్‌.. నీ మద్దతుకు కృతజ్ఞతలు. కానీ, అదే సమయంలో నువ్వు గీత దాటొద్దు. అమెరికాను మరింత గొప్పగా తీర్చిదిద్దడమే ఇప్పుడు నా ముందున్న ఆశయం. ఇది అమెరికన్ల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అంతేగానీ మస్క్‌ ఇగోకు సంబంధించిన అంశం కాదు’’ అంటూ ఓ సందేశం గత ఐదు రోజులుగా చక్కర్లు కొడుతోంది.అయితే.. ఆ సందేశానికి డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఎలాంటి సంబంధం లేదు. అసలు ఆయన సోషల్‌ మీడియా అకౌంట్‌ నుంచి అలాంటి సందేశమూ ఒకటి వైరల్‌ కాలేదు. ఆ ఇమేజ్‌ను వెరిఫై చేయగా.. ఉత్తదేనని ఫ్యాక్ట్‌ చెక్‌(Fact Check)లో తేలింది. అయితే ప్రస్తుత పరిణామాల ఆధారంగానే ఆ సందేశాన్ని ఉద్దేశపూర్వకంగా ఎవరో వైరల్‌ చేసినట్లు స్పష్టం అవుతోంది.అసలు విషయం ఏంటంటే.. సాధారణంగా డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ఎవరినీ లెక్కచేయరు. గతంలో అది చూశాం. కానీ, ఈసారి అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్‌కు ప్రపంచదేశాధినేతలు ఫోన్‌ చేస్తే పక్కనే ఉన్న మస్క్‌తోనూ మాట్లాడించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆపై స్వయంగా మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌ ప్రయోగాన్ని స్వయంగా హాజరై వీక్షించారు ట్రంప్‌. ఇక.. కొత్తగా సృష్టించిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ(డోజ్‌)కు సహ సారథిగా కొనసాగాల్సిన మస్క్‌ ఏకంగా అధ్యక్షుడి నిర్ణయాల్లో కలగజేసుకుంటున్నారనేది ఆ ఆరోపణల సారాంశం. సొంత వ్యాపార ప్రయోజనాలే పరమావధిగా నడుచుకునే ఓ టెక్‌ బిలియనీర్‌ ఆలోచనలే.. జనవరి 20వ తేదీ నుంచి ప్రభుత్వ నిర్ణయాలుగా అమలుకాబోతున్నాయని డెమొక్రాట్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే.. ఈ వాదనకు బలం చేకూరేలా.. డోజ్‌తో మొదలుపెట్టి ఆపై వేలుపెట్టి.. అమెరికా ప్రభుత్వ అనవసర ఖర్చులకు కత్తెర వేసే పనిని ట్రంప్‌ తన భుజాలకెత్తుకున్నారు. ఇది అంతటితో ఆగలేదు. అమెరికా తాత్కాలిక బడ్జెట్‌ అయిన ద్రవ్య వినిమయ బిల్లులోనూ వేలు పెట్టారు. బిల్లు తెచ్చిన దిగువసభ స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌పై మస్క్‌ బహిరంగంగా విమర్శలు చేశారు. అమెరికా తలపై షట్‌డౌన్‌ కత్తి వేలాడుతున్నా సరే ఈ బిల్లు ఆమోదం పొందకూడదని మస్క్‌ తెగేసి చెప్పారు. ట్రంప్‌ సైతం మస్క్‌ అభిప్రాయంతో ఏకీభవించడంతో రిపబ్లికన్లు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు.. ద్రవ్య బిల్లులో ఏముందో ఆ పార్టీ సెనేటర్లు మస్క్‌కు చెందిన ఎక్స్‌(ట్విటర్‌) ద్వారానే తెలుసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.ట్రంప్‌ ఏన్నారంటే..ఆరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్‌ సిటీలో ట్రంప్‌ పాల్గొన్న అమెరికాఫీస్ట్‌ కార్యక్రమంలో ప్రేక్షకులు ‘అధ్యక్షుడు మస్క్‌’అంటూ నినాదాలు ఇవ్వడంతో ట్రంప్‌ స్పందించారు. పీఎం కాకపోతే ఏకంగా ప్రెసిడెంట్‌ అవుతారని డెమొక్రాట్ల చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై ట్రంప్‌ మాట్లాడారు. ‘‘మస్క్‌(Musk) ఏనాటికీ అధ్యక్షుడు కాలేడు. నా సీటు భద్రం. ఆయన అమెరికాలో పుట్టలేదుగా. అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన వ్యక్తికే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసే అర్హత ఉంటుంది’’అని ట్రంప్‌ అన్నారు. మస్క్‌ మనసులో..ఎలాన్‌ మస్క్‌(Elon Musk) ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ఏనాడూ ప్రకటించలేదు. అలాగే.. ట్రంప్‌నకు తన మద్దతును బహిరంగంగానే ప్రకటించారు. కానీ, దేశ ప్రయోజనాలకంటే మస్క్‌ సొంత వ్యాపారాలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారనే ఆరోపణలను మాత్రం ఎందుకనో ఖండించడం లేదు. పైగా ‘అధ్యక్షుడు’ అనే ట్యాగ్‌ మీద కూడా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.అగ్రరాజ్యానికి అధినేతగా ట్రంప్‌ కొనసాగినా.. ఆర్థిక వ్యవస్థ మస్క్‌ చేతుల్లోకి వెళ్తుందని ఇటు డెమోక్రాట్లు.. అటు రిపబ్లికన్‌లు కూడా గుసగుసలాడుకుంటున్నారు. త్వరలో కొలువుతీరే కొత్త ప్రభుత్వంలో మస్క్‌ నిర్ణయాలే ఎక్కువగా అమలుకు నోచుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే జరిగితే.. రిపబ్లికన్‌ పార్టీలో కలకలం రేగడం, వాళ్లిద్దరి మధ్య స్నేహ బంధానికి బీటలు వారడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు!.చదవండి👉పంజాబ్‌ పోలీస్‌ వర్సెస్‌ బ్రిటన్‌ ఆర్మీ!

Boxing Day Test: Abhishek Nayar Confirms Rohit Set to Open Says Why Gill Dropped3
Ind vs Aus: వ్యూహం మార్చిన టీమిండియా!.. అందుకే గిల్‌పై వేటు

ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా స్థాయికి తగ్గట్లుగా రాణించడం లేదు. పెర్త్‌ టెస్టులో 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించినా.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. అడిలైడ్‌ పింక్‌ బాల్‌ మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో చిత్తైన రోహిత్‌ సేన.. బ్రిస్బేన్‌ టెస్టులో వర్షం వల్ల ఓటమి నుంచి తప్పించుకుందనే విమర్శలు మూటగట్టుకుంది.ఈ క్రమంలో బాక్సింగ్‌ డే టెస్టు(Boxing Day Test)లో గెలుపొంది సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. అయితే, తొలి రోజు ఆటలో మాత్రం టీమిండియాకు కలిసిరాలేదు. టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌కు దిగిన భారత్‌.. ఆసీస్‌ బ్యాటర్లను కట్టడి చేసేందుకు ఆపసోపాలు పడాల్సి వచ్చింది.ఆఖరి సెషన్లో భారత బౌలర్లు ప్రభావం చూపినా.. అప్పటికే కంగారూలు పైచేయి సాధించారు. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. గురువారం నాటి మొదటిరోజు ఆట ముగిసే సరికి ఆసీస్‌ ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో.. మెల్‌బోర్న్‌ టెస్టులో టీమిండియా తమ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది.అందుకే గిల్‌పై వేటు..ఇప్పటికే శుబ్‌మన్‌ గిల్‌(Shubman Gill)పై వేటు వేసిన యాజమాన్యం.. రెగ్యులర్‌ ఓపెనింగ్‌ జోడీతోనే బరిలోకి దిగనుంది. టీమిండియా అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘‘పిచ్‌ పరిస్థితులకు అనుగుణంగానే శుబ్‌మన్‌ గిల్‌ను తప్పించి.. వాషింగ్టన్‌ సుందర్‌ను తుదిజట్టులోకి తీసుకున్నాం.ఓపెనర్‌గా మళ్లీ అతడేవాషీ కోసం గిల్‌ త్యాగం చేయాల్సి వచ్చింది. జట్టు ప్రయోజనాల కోసం మేము తీసుకున్న నిర్ణయాన్ని అతడు గౌరవించాడు. ఇక రోహిత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లోనూ మార్పు ఉంటుంది. అతడు భారత్‌ తరఫున ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడు’’ అని అభిషేక్‌ నాయర్‌ మీడియాతో పేర్కొన్నాడు.కాగా పితృత్వ సెలవుల కారణంగా రోహిత్‌ శర్మ(Rohit Sharma) తొలి టెస్టుకు దూరం కాగా.. బుమ్రా సారథ్యంలో టీమిండియా గెలిచింది. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్‌ రాహుల్‌ ఓపెనింగ్‌ చేశాడు. అయితే, రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చినా అదే జోడీని కొనసాగించగా.. రోహిత్‌ మిడిలార్డర్లో బ్యాటింగ్‌ చేశాడు.వ్యూహం మార్చిన టీమిండియాకానీ రెండు టెస్టుల్లోనూ రోహిత్‌(3, 6, 10) విఫలమయ్యాడు. కెప్టెన్‌గానూ అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌ మెల్‌బోర్న్‌లో తన రెగ్యులర్‌ స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగనుండగా.. గిల్‌ ఆడే మూడో స్థానంలో కేఎల్‌ రాహుల్‌ రానున్నట్లు తెలుస్తోంది. ఇక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం.. ఆతిథ్య జట్టుతో కలిసి 1-1తో సమంగా ఉంది.చదవండి: గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా?.. చెప్పింది చెయ్‌: రోహిత్‌ శర్మ ఫైర్‌

Chevireddy Bhaskar Reddy Fires On Yellow Media4
అదంతా అబద్ధం.. ఓర్వలేకే ఎల్లో మీడియా దుష్ప్రచారం: చెవిరెడ్డి

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: వైఎస్‌ జగన్‌ వద్దకు వస్తున్న ప్రజల్ని చూసి ఎల్లో మీడియా ఓర్వలేకపోతుందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అభూత కల్పనలు సృష్టించి ప్రజలు తప్పుడు సంకేతాలు పంపేయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు జగన్‌ ఆఫీస్‌పై దాడి చేశారనడం అబద్ధమని స్పష్టం చేశారు.‘‘తమ సమస్యలు చెప్పుకోవడానికే జగన్‌ వద్దకు వచ్చారు. ప్రతి ఒక్కరూ బాబు దుష్టపాలనను జగన్‌కు వివరిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ వెంట జనం నడుస్తున్నారనే ఎల్లో మీడియా దుష్ప్రచారానికి ఒడిగడుతోంది. వైఎస్‌ జగన్‌ ఎప్పుడూ ప్రజా నాయకుడే. ప్రజల మనసు నుంచి వైఎస్‌ జగన్‌ను తొలగించడం టీడీపీకి, ఎల్లో మీడియాకు సాధ్యం కాదు’’ అని చెవిరెడ్డి చెప్పారు.ఇలాంటి పిచ్చి రాతలు మానుకోవాలి: సాంబశివారెడ్డిఇది చేతకాని ప్రభుత్వం.. చేతగానితనాన్ని ప్రజలు జగన్‌కు వివరిస్తున్నారనే దుష్ప్రచారం మొదలు పెట్టారని వైఎస్సార్‌సీపీ నాయకులు సాంబశివారెడ్డి ధ్వజమెత్తారు పులివెందుల కార్యాలయంపై దాడి జరిగింది అనడం పూర్తి అబద్ధం. ఇలా ప్రచారం చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. ఈ ఏడు నెలల్లో ఈ ప్రభుత్వం పూర్తి ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకుంది. ఆ విషయాన్నే ప్రజలు జగన్‌కి వివరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున ప్రజలు జగన్‌ను కలిసేందుకు వచ్చారు. జగన్ ఓపికగా నిలబడే ఉదయం నుంచి వారి సమస్యలు వింటున్నారు. పచ్చ మీడియా ఇకనైనా ఇలాంటి పిచ్చి రాతలు మానుకోవాలి’’ అని సాంబశివారెడ్డి హెచ్చరించారు.చౌక బారు రాజకీయాలు మానుకోవాలి: సతీష్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటనలో ఆయన పలకరింపు కోసం జనం బారులు తీరారు. సెల్ఫీల కోసం యువకులు ఎగబడ్డారు. పులివెందుల కార్యాలయంపై ఎలాంటి దాడి జరగలేదు. ఎల్లో మీడియా సిగ్గులేకుండా దుష్ప్రచారం చేస్తోంది. పులివెందుల నుంచి తాతి రెడ్డి పల్లెకు 25 కిలోమీటర్లు మాత్రమే. దారి పొడవునా వేలాది మంది ప్రజలను పలకరిస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగారు. తాతిరెడ్డి పల్లెకు చేరుకోవడానికి 7గంటల సమయం పట్టింది. జన సందోహం మధ్య కార్యకర్తలను చెదరగొట్టే సమయంలో ఒక్కసారిగా కార్యకర్తలు అద్దాలపై పడ్డారు. చిన్న ఇష్యూను దాడి అంటూ ఎల్లో మీడియా స్క్రోలింగ్‌లు వేయడం విడ్డూరం. చౌక బారు రాజకీయాలు మానుకోవాలి’’ అని సతీష్‌కుమార్‌రెడ్డి హితవు పలికారు.

Wont Wear Footwear Till: Tamil Nadu BJP Chief Big Promise For 2026 Polls5
అప్పటివరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన

చెన్నై: తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై లైంగికదాడి ఘటన ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలో డీఎంకే అధికారం కోల్పోయేంత వరకు తాను చెప్పులు ధరించబోనంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై శపథం చేశారు. గురువారం ఆయన కోయంబత్తూర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ డీఎంకే సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్నా విశ్వవిద్యాలయ విద్యార్థిని లైంగిక వేధింపుల కేసుపై ప్రభుత్వం తీరు పట్ల ఆయన నిరసన వ్యక్తం చేశారు.డీఎంకే ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించే వరకు తాను పాదరక్షలు ధరించనని.. చెప్పులు లేకుండానే నడుస్తానంటూ తేల్చిచెప్పారు. ఎన్నికల్లో గెలుపునకు ఎప్పటిలాగే డబ్బులు ఆశగా చూపమన్న అన్నామలై.. రూపాయి కూడా పంచకుండా ఎన్నికలకు వెళ్తామంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలుపు సాధించే వరకు చెప్పులు ధరించను’’ అని అన్నామలై స్పష్టం చేశారు.కాగా, చెడు అంతమైపోవాలంటూ తన నివాసంలో కొరడా దెబ్బలతో మురుగున్‌కు మొక్కు చెల్లించుకుంటానని చెప్పారు. రాష్ట్రంలోని ఆరు మురుగన్‌ క్షేతాలను దర్శించుకునేందుకు 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేపట్టనున్నట్లు కూడా ఆయన తెలిపారు.#WATCH | During a press conference, Tamil Nadu BJP President K Annamalai removed his shoe and said, "From tomorrow onwards until the DMK is removed from power, I will not wear any footwear..."Tomorrow, K Annamalai will protest against how the government handled the Anna… https://t.co/Jir02WFrOx pic.twitter.com/aayn33R6LG— ANI (@ANI) December 26, 2024 ఇదీ చదవండి: వీడియో: కోడిగుడ్లతో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై దాడి..

West Godavari: Shocking Facts In The Parcel Case6
డెడ్ బాడీ పార్శిల్ కేసు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలో డెడ్ బాడీ పార్శిల్ కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. పోలీసులకే ఈ కేసు పెను సవాలుగా మారింది. ఒకరిని హత్య చేయాలని భావించిన శ్రీధర్ వర్మ.. రెండు శవ పేటికలను ఎందుకు తయారు చేయించాడు? శ్రీధర్ వర్మ టార్గెట్ మరొకరు ఉన్నారా? కేవలం తులసిని బెదిరించడానికే ఇంత స్కెచ్ వేశాడా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి..పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో డెడ్‌బాడీ పార్సిల్‌ కేసులో రోజుకో ట్విస్ట్‌ వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో అనుమానితుడు శ్రీధర్‌వర్మను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. విచారణ జరుగుతున్నకొద్దీ నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. సాగి తులసి ఇంటికే డెడ్‌బాడీని శ్రీధర్‌వర్మ ఎందుకు పార్శిల్‌ చేశాడన్నదానిపై క్లారిటీ వస్తోంది.తన వదిన ఆస్తిని కాజేసేందుకే ఈ స్కెచ్‌ వేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. జులై నుంచే ఈ కుట్రకు ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. తొలుత ఓ సామాజిక సేవా సంస్థ ద్వారా తులసి ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని అందిస్తున్నట్లు కథ నడిపించాడు. తులసికి శవాలంటే భయమన్న విషయం తెలుసుకున్న శ్రీధర్‌వర్మ.. ఆమెను భయటపెట్టేందుకు డెడ్‌బాడీని పంపించినట్టు సమాచారం. వదిన తులసిని భయపెట్టాలంటే.. డెడ్‌బాడీ కావాలి. మృతదేహమంటే.. అదేదో అంగట్లో దొరికే వస్తువు కాదు. అందుకే అమాయకుడైన బర్రె పర్లయ్యను టార్గెట్ చేశాడు శ్రీధర్‌వర్మ. ఈ నెల 17న హత్య చేసి ఉంటే 19 వరకు మృతదేహాన్ని ఎక్కడ దాచారు? అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. శ్రీధర్ వర్మకు గతంలోనే నేరచరిత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శ్రీధర్ వర్మకు మూడు పేర్లు, ముగ్గురు భార్యలు ఉన్నట్లు తెలిసింది. శ్రీధర్ వర్మ రెండో భార్య అక్క అయిన సాగి తులసితో ఆస్తి గొడవలు నడుస్తున్నాయని.. ఈ క్రమంలో ఆమెను బెదరించడానికి పక్కా స్కెచ్‌తో పర్లయ్యను హత్య చేసి డెడ్‌బాడీని పార్శిల్‌లో పంపించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.పర్లయ్యను హత్య విషయంలోనూ శ్రీధర్‌వర్మ ముందుగానే పెద్ద ప్లానే వేసుకున్నాడు. ఇందులో భాగంగా రెండు శవపేటికలను తయారు చేయించాడు. రోజు వారీ కూలీలైన పర్లయ్య, రాజు ఇద్దరికి పని ఇప్పిస్తానంటూ తీసుకెళ్లాడు. ముందుగా అనుకున్న ప్రకారం ఇద్దరిలో ఒకరిని చంపి పార్శిల్ చేయాలని భావించాడు. అయితే రాజుకు కుటుంబసభ్యులు ఉన్నందును అతడిని చంపితే గొడవలు అవుతాయని భావించిన శ్రీధర్ వర్మ.. పర్లయ్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. పర్లయ్యకు కుటుంబసభ్యుల ఉన్నా వారు పట్టించుకోరని భావించిన శ్రీధర్.. అనుకున్న ప్రకారం పర్లయ్యను హతమార్చాడు.బర్రె పర్లయ్య హత్య అంతా శ్రీధర్‌వర్మ మూడో భార్య ఇంట్లోనే జరిగినట్లు తెలుస్తోంది. పర్లయ్యను హత్య చేసి ఆపై అప్పటికే తాను ముందే సిద్ధం చేసిపెట్టుకున్న శవపేటికలో మృతదేహాన్ని ఉంచాడు. అయితే ఈ మొత్తం వ్యహారంలో శ్రీధర్ వర్మ మూడో భార్య ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నెల 17న బర్రె వర్లయ్యను హత్య చేసేందుకు శ్రీధర్ వర్మ పక్కా ప్రణాళికతో చెక్క పెట్టెను సిద్ధం చేసుకున్నాడు. మద్యం తాగించి అనంతరం ఉండి మండలం వాండ్రం గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి హత్య చేశాడు. మృతదేహాన్ని చెక్కపెట్టెలో పార్శిల్ చేయడానికి గాంధీనగర్ తీసుకువెళుతుండగా వర్షం కురవడంతో, కారు ముందుకు వెళ్లే అవకాశం లేకపోయింది. దీంతో శవాన్ని కారులోనే ఉంచి, మరొక పెట్టెను కైకలూరు నుంచికొని తెచ్చాడు. అనంతరం మృత దేహాన్ని గణపవరం మండలం సాగిపాడు వద్దకు పెట్టెలో తీసుకువెళ్లి మూడో భార్య సుష్మ సాయంతో ఆటోడ్రైవర్‌కు అప్పగించి తులసికి డోర్ డెలివరీ చేశారు.ఇప్పటి వరకు అనుమానాస్పద కేసుగా విచారణ చేసిన పోలీసులు దీనిని హత్య కేసుగా మార్పు చేశారు. తులసికి చెందిన ఆస్తిని కాజేయడం కోసమే శ్రీధర్ వర్మ, అతడి రెండో భార్య రేవతి పన్నాగం పన్నారని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. శ్రీధర్ వర్మ రెండో భార్య రేవతి భీమవరంలోని పలు నగల దుకాణాల్లో బంగారం తాకట్టు పెట్టి, మరికొంత విక్రయించినట్లు తెలియడంతో మూడు బంగారం దుకాణాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గాంధీనగర్‌లో మొదటి భార్య ఇంట్లో క్షుద్రపూజలకు సంబంధించిన కొన్ని వస్తువులు, పుస్తకాలు పోలీసులకు దొరికినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా మల్లంపూడిలో శ్రీధర్ వర్మ తల్లిదండ్రులను, ఆయన ముగ్గురు భార్యలు, పిల్లలు, యండగండికి చెందిన ముదునూరి రంగరాజు, అతడి భార్య హైమావతి, సాగి తులసిలను పోలీసులు వేర్వేరుగా పలు ప్రదేశాల్లో విచారిస్తున్నారు. ఒకట్రెండ్రోజుల్లో వివరాలు పూర్తిగా వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ నయీం అస్మి అంటున్నారు.ఇదీ చదవండి: కామారెడ్డి మిస్టరీ డెత్స్ కేసులో కొత్త కోణాలు.. జరిగింది ఇదేనా?మరోవైపు అమాయకుడైన బర్రె పర్లయ్యను.. శ్రీధర్‌వర్మ హతమార్చడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. వివాదరహితుడిగా ఉన్న పర్లయ్యను ఇంత దారుణంగా హత్య చేయడంతో వారు తట్టుకోలేకపోతున్నారు. అమాయకుడిని అన్యాయంగా చంపేశారని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మూడో భార్య ఇంట్లో మరో శవపేటికను కూడా పోలీసులు గుర్తించారు. అసలు ఇంకో శవపేటికను శ్రీధర్ వర్మ ఎందుకు తీసుకువచ్చాడనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అలాగే శ్రీధర్‌వర్మ ఇంట్లో పోలీసులు సెర్చ్ చేయగా చేతబడి చేసే సామాగ్రి కూడా లభించడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అసలు శ్రీధర్‌ వర్మ వృత్తి ఏంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా తులసిని ఆస్తి కోసం బెదిరించడానికి ఎలాంటి సంబంధం లేని పర్లయ్యను ఎందుకు హత్య చేశాడు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే ఒకరిని హత్య చేయాలని భావించిన శ్రీధర్ వర్మ.. రెండు శవ పేటికలను ఎందుకు తయారు చేయించాడు? శ్రీధర్ వర్మ టార్గెట్ మరొకరు ఉన్నారా? కేవలం తులసిని బెదిరించడానికే ఇంత స్కెచ్ వేశాడా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పోలీసుల విచారణకు శ్రీధర్ వర్మ సహకరించడం లేదని.. పోలీసులు వేస్తున్న ప్రశ్నలకు శ్రీధర్ వర్మ సరైన సమాధానాలు చెప్పడం లేదని తెలుస్తోంది. మొత్తానికి డెడ్ బాడీ పార్శిల్ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఇందులో ఎవరెవరు ఉన్నారనే దానిపై లోతుగా విచారణ చేస్తున్నారు.

iPhone vs Android Are Ola Uber Charging Different Social Media Post Viral7
ఫోన్ మారితే ఉబర్ ఛార్జ్ మారుతోంది - ఫోటోలు వైరల్

ఉబర్, ఓలా వంటి క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఎక్కడికెళ్లాలన్నా వెహికల్ బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకుంటున్నాము. అయితే క్యాబ్ లేదా ఆటో ఛార్జీలు మాత్రం మనం బుక్ చేసుకోవడానికి ఉపయోగించే మొబైల్ ఫోన్లను బట్టి మారుతూ ఉంటాయి. ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. దీనికి సంబంధించిన ఒక ట్వీట్, ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోను గమనిస్తే.. రెండు వేరువేరు మొబైల్ ఫోన్‌లలో రెండు వేర్వేరు ధరలను చూడవచ్చు. నిజానికి పికప్ పాయింట్, డ్రాపింగ్ పాయింట్ రెండూ ఒకటే. చేరుకోవడానికి పట్టే సమయం కూడా ఒకటే. కానీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో బుక్ చేస్తే.. ఉబెర్ (Uber) ఆటో రైడ్‌కు రూ.290.79 చూపించింది. యాపిల్ ఐఫోన్‌లో (Apple iPhone) అదే రైడ్‌కు రూ.342.47 చూపించింది.దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ.. నా కుమార్తె ఆండ్రాయిడ్ ఫోన్‌లో కంటే.. నా యాపిల్ ఐఫోన్‌లో రైడ్ ధర ఎక్కువగా చూపిస్తోందని 'సుధీర్' అనే ఎక్స్ (Twitter) యూజర్ పేర్కొన్నాడు. బుక్ చేసుకునే టైమ్, దూరం, డిమాండ్ వంటి వాటిని బట్టి ధరలలో మార్పు ఉంటుంది. కానీ బుక్ చేసుకునే మొబైల్ ఫోన్‌ను బట్టి ఛార్జీలు ఉండవని ఉబర్ వెల్లడించింది.Same pickup point, destination & time but 2 different phones get 2 different rates. It happens with me as I always get higher rates on my Uber as compared to my daughter’s phone. So most of the time, I request her to book my Uber. Does this happen with you also? What is the hack? pic.twitter.com/bFqMT0zZpW— SUDHIR (@seriousfunnyguy) December 23, 2024మొబైల్ ఛార్జ్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ రేటుగతంలో ఉబర్ క్యాబ్స్ మొబైల్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్, ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్ వసూలు చేస్తున్నట్లు ఒక పరిశోధన ద్వారా వెల్లడైంది. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపించారు. డెర్నియర్ హ్యూర్ బ్రస్సెల్స్‌లోని వారి ఆఫీస్ నుంచి సిటీ సెంటర్‌లోకి వెళ్లడానికి రెండు ఐఫోన్‌ మొబైల్స్ ద్వారా టాక్సీ బుక్ చేసింది.ఒక ఐఫోన్‌లో 84 శాతం ఛార్జ్ ఉన్నప్పుడు 16.6 యూరోలు (రూ.1,498), 12 శాతం బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు 17.56 యూరోలు (రూ.1,585) చూపించింది. మొబైల్ ఛార్జ్‌లో ఉన్న తేడా ట్రిప్‌ ఛార్జ్‌పై ప్రభావం చూపిస్తుందని ఈ విధంగా నిరూపించింది. బ్యాటరీ లెవెల్స్ ఎలా ఉన్నా ధరల మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదని, మొబైల్ ఛార్జ్‌కి ధరలకు ఎటువంటి సంబంధం లేదని ఉబెర్ తిరస్కరించింది.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతున్నాయ్!ఈ కామర్స్ సైట్లలో..సాధారణంగా ఒక ప్రొడక్ట్ విలువ ఒక్కో యాప్‌లో.. ఒక్కో విధంగా ఉండొచ్చు. కానీ ఒకే యాప్‌లో ఒక ప్రొడక్ట్ ధర రెండు ఫోన్‌లలో వేరువేరు చూపిస్తే? ఇదెలా సాధ్యం, ఎక్కడైనా జరుగుతుందా.. అనుకోవచ్చు. కానీ సౌరభ్ శర్మ అనే ఐఓఎస్ యూజర్.. ఐఫోన్‌లోని ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఓ చిన్న క్యాబిన్ సూట్‌కేస్ కొనుగోలు చేయాలని చూసారు. అయితే దాని ధర రూ.4,799 అని చూపిస్తోంది. అదే ఉత్పత్తిని ఆండ్రాయిడ్ యాప్‌లో చూస్తే.. దాని ధర 4,119 రూపాయలుగా చూపిస్తోంది. ఈ రెండింటినీ సౌరభ్ స్క్రీన్ షాట్ తీసి, తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.Android vs iOS - different prices on @Flipkart App??same @my_mokobara cabin suitcase costs 4119₹ on FK Android App vs 4799₹ on iOS App.Apple charges 30% commission on subscriptions etc, so different pricing for iOS makes sense there.But for ecommerce? Very shady & unfair. pic.twitter.com/YmIq8nhuXO— Saurabh Sharma (@randomusements) October 30, 2024

 YS Jagan Participated In Praja Darbar At Pulivendula8
పులివెందులలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌.. వినతులు స్వీకరణ

సాక్షి, వైఎస్సార్: పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు.కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్‌ జగన్‌ వద్ద వాపోయారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ఎవరూ అధైర్యపడొద్దని, మంచి రోజులు వస్తాయని, సమస్యలు శాశ్వతం కాదంటూ భరోసా కల్పించారు. త్వరలోనే మన ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు.కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులకు శ్రీ వైయస్‌ జగన్‌ సూచించారు.ఆపన్నులకు అండగావివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైఎస్‌ జగన్‌ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సూచించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు ఒకటి కూడా జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్‌ జగన్, వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్‌ ఛార్జీలపై ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని, రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని ఆయన అన్నారు.

Heavy Rain Forecast To Nellore District9
అల్పపీడనం ఎఫెక్ట్‌.. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు

సాక్షి, విశాఖపట్నం: తీవ్ర అల్పపీడనం అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం మరింత బలహీన పడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు విస్తాయని పేర్కొంది.రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురవనున్నాయని.. నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ముందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 65 కిమీ వేగంతో గాలులు విస్తాయని.. ఏపీలో అన్ని పోర్టులకు మూడో నంబర్‌ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన వాతావరణ శాఖ.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తెలిపింది.ఇక, తెలంగాణపై కూడా అల్పపీడన ప్రభావం చూపుతోంది. హైదరాబాద్‌లో పలు చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. రాబోయే నాలుగు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో 2,3 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేసింది. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణా వైపు శీతలు గాలులు వీస్తున్నాయని ఐఎండీ పేర్కొంది. దీంతో, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: సంక్రాంతి సెలవులపై ఏపీ ప్ర‌భుత్వం క్లారిటీ.. ఆ వార్త‌ల్లో నిజం లేదు Heavy Rain Forecast to Tirupati, Nellore Districts

Uganda man with 12 wives, 102 kids, 578 grandchildren going viral10
‘బాహుబలి ఫ్యామిలీ’ నెట్టింట వైరల్‌, ఎవరీ గేమ్‌ ఛేంజర్‌!

ఒక భార్య, ఓ నలుగురో , ఐదుగురో కొడుకులు, కుమార్తెలు,20-30 మంది మనవలు మనవరాళ్లతో అలరారే కుటుంబాన్ని పెద్ద కుటుంబం అంటూ ఉంటాం. మరి 12 మంది భార్యలు, 102 మంది పిల్లలు , 578 మంది మనవళ్లు ఉన్న ఫ్యామిలీని ఏమని పిలవాలి? 12 మంది భార్యలా? 102 మంది సంతానమా అని నోరెళ్ల బెట్టకండి. నిత్యం ఆకలి , కరువుతో సతమతమయ్యే ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఉగాండాలో ఉందీ బాహుబలి ఫ్యామిలీ.తూర్పు ఉగాండాలోని ముకిజాకు చెందిన 70 ఏళ్ల ముసా హసహ్య కసేరా (MusaHasahyaKasera) ఈ జెయింట్‌ ఫ్యామిలీకి మూల పురుషుడు. ఈయనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. 'దిఇండోట్రెక్కర్' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ అయిన ఈ వీడియోకు ఒక్క రోజులోనే 8.6 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.1972లో 17 ఏళ్ల వయస్సులో వివాహం చేసుకోవడంతో అతని పెళ్లిళ్ల పరంపర మొదలైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 మందిని వివాహం చేసుకున్నాడు. వీరికి 102 మంది పిల్లలు పుట్టారు. అంటే ఒక్కో భార్యకు దాదాపు తొమ్మిది మంది. అంతేనా మరో 578 మంది వారసులకు తాత కూడా. దశాబ్దాలుగా, అతని కుటుంబం అలా విస్తరిస్తూ పోయింది. అతని పిల్లలు ఇప్పుడు 10 - 50 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నారు. అతని భార్యలలో చిన్న ఆమెకు 35 ఏళ్ల వయస్సు. ఇపుడు ఈ సంతానం కడుపు నింపేందుకు నానా పాట్లు పడటమే కాదు, మనవలు,మనవరాళ్ల పేర్లు గుర్తు పెట్టుకోవడం కూడా కష్టంగా ఉందట ముసాకు. అందుకే ఒక రిజిస్టర్‌ను మెయింటైన్‌ చేస్తున్నారు.అతనికున్న ఆస్తల్లా శిథిలావస్థలో ఇల్లు. రెండు ఎకరాల భూమి. దీంతో ఇల్లు గడవక చాలా కష్టపడుతున్నామని వాపోయింది మూడో భార్య జబీనా. పిల్లలు, మనుమలు చేతికి వచ్చిన పని చేస్తారు. మరికొందరు కుటుంబం కోసం నీళ్లు కట్టెలు తీసుకురావడానికి వారి రోజులు గడుపుతారు. వీరందరూ కడుపు నిండా భోంచేయండం కూడా గగనమే. View this post on Instagram A post shared by Kailash Meena (@theindotrekker)మరోవైపు అతని ఆరోగ్యం క్షీణించడం, ఇంత పెద్ద ఇంటిని నిర్వహించడం కష్టంగా ఉండటంతో, అతని ఇద్దరు భార్యలు వెళ్లిపోయారు. టీచర్‌గా పనిచేస్తున్న అతని కుమారుడు షాబాన్ మాజినో(30) కుటుంబ నిర్వహణలో సహాయం చేస్తాడు.దీంతో నెటిజన్లు ఛలోక్తులతో సందడి చేస్తున్నారు. 'ప్రపంచంలో ఎక్కువ మంది పిల్లలను ఉత్పత్తి చేసిన వ్యక్తి' ఒకరు, “ఇస్కో పరివార్ క్యోం బోల్తే హో ...? జిల్లా ఘోషిత్ క్యోం నహీ దేతే.” (వీళ్లని కుటుంబమని అంటారేంటి...జిల్లాగా ప్రకటించాలి) అంటూ వ్యాఖ్యానించారు. బాహుబలి ఫ్యామిలీ, తాతగారు గేమ్‌ ఛేంజర్‌ అంటున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కన్నుమూత

భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌(92) కన్నుమూశారు.

title
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అస్వస్థత

ఢిల్లీ: భార‌త మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్(92) అస్వ‌స్థ‌త‌

title
అప్పటివరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన

చెన్నై: తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై లై

title
ఉత్సాహంగా ఎఫ్‌–టామ్‌ ట్రెడిషనల్‌ ఫ్యాషన్‌ షో..

ముంబై సెంట్రల్‌: ఎఫ్‌–టామ్‌ ఆధ్వర్యంలో బుధవారం థాణేలో తెలుగ

title
జోరుగా.. హుషారుగా వసూళ్లు : ప్రీ వెడ్డింగా? ప్రీ వేస్టింగా!

పెళ్లంటే..పందిళ్లు, బాజాలు, భజంత్రీలు, బంధువుల, విందు భోజనాలు...ఇది ఒకప్పుడు ఇప్పుడు ట్రెండ్‌ మారింది.

International View all
title
‘బాహుబలి ఫ్యామిలీ’ నెట్టింట వైరల్‌, ఎవరీ గేమ్‌ ఛేంజర్‌!

ఒక భార్య, ఓ నలుగురో , ఐదుగురో  కొడుకులు, కుమార్తెలు,20-30 మంది మనవలు మనవరాళ్లతో అలరారే కుటుంబాన్ని పెద్ద కుటుంబం అం

title
ఎలాన్‌ మస్క్‌కు ట్రంప్‌ స్వీట్‌ వార్నింగ్‌?

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎవరు?. ‘‘ఇదేం ప్రశ్న!.

title
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌..మసూద్ అజార్‌కి గుండెపోటు!

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషీ మహ్మద్‌

title
శివగామినే మించిపోయిన సాహసమది!.. గుర్తుందా?

తన ప్రాణం పోతున్నా లెక్కచేయకుండా పసికందుగా ఉన్న మహేంద్రుడిని నీట మునగకుండా ఒక చేత్తో పైకెత్తి ముందుకెళ్తుంది రాజ

title
ఇజ్రాయెల్ దాడులు.. పలువురు జర్నలిస్టులు మృతి

జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

NRI View all
title
పార్వతీపురంలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ..

title
చికాగోలో నాట్స్ వింటర్ క్లాత్ డ్రైవ్

 భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదం తో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్..

title
‘ఎన్నారై’ కుటుంబం వేధింపులకు ఒకరి బలి

అల్వాల్‌ (సికింద్రాబాద్‌): ఎన్నారై అల్లుడు, అతని కుటుంబీకుల

title
సింగపూర్‌లో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి  జన్మదిన వేడుకలు సింగపూర్ లో ఘనంగా జరిగాయి.

title
ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2025-28 ఎన్నికల ఫలితాలు : సరికొత్త చరిత్ర

అమెరికన్ తెలుగు అసోసియేషన్ -బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2025-2028 పదవీ కాలానికి సంబంధించి ఎన్నికల ఫలితాలు  రికార్డ్‌ సృష్ట

Advertisement

వీడియోలు

Advertisement