Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

KSR Comment: Pawan Became Bakara In Tirupati Stampede Row1
బాబు డ్రామాలో పవన్‌ బకరా!

తిరుపతిలో జరిగిన ఘోరమైన తప్పిదాన్ని కూటమి ప్రభుత్వం ‘సారీ’లతో ముగించేస్తోందా?. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే తన వంతు పాత్ర పోషించి పరువు పోగొట్టుకుంటే.. టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఏకంగా పవన్‌ గాలి తీసేందుకే ప్రాధాన్యమిచ్చి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. దీంతో మొత్తం కథ అడ్డం తిరిగినట్లు అయ్యింది. చివరకు బీఆర్‌ నాయుడు చర్యతో టీడీపీ అధిష్టానం కూడా కంగు తినాల్సిన పరిస్థితి. అయితే..స్వయంగా రంగంలోకి దిగి ఆయనతోనూ ఓ సారీ చెప్పించాల్సి వచ్చింది. మొత్తమ్మీద చూస్తే.. ఈ వ్యవహారంలో అసలు ఎవరి తప్పూ లేనట్టుగా తేల్చేసి అటు ప్రభుత్వాధినేతలు.. ఇటు టీటీడీ ఉన్నతాధికారులూ జారుకున్నారు. స్వామివారిపై భక్తితో భక్తులు తిరుమతి రావడమే తప్పు అని చెప్పడమే తరువాయి!!.వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం టోకన్ల జారీ కాస్తా తొక్కిసలాటకు దారితీయడం ఆరుగురు మరణించడం వెనుక టీటీడీ, పోలీసుల వైఫల్యం, అలసత్వం సుస్పష్టం. పైరవీలతో టీటీడీ ఛైర్మన్‌, బోర్డు సభ్యులను నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వాన్ని పరోక్షంగా నడుపుతున్న లోకేష్‌ల బాధ్యతారాహిత్యం కూడా కనపడతూనే ఉంది. అంత పెద్ద ఘోరం జరిగినా దాన్ని చిన్నదిగా చూపేందుకు ప్రయత్నించారు. ఇతర అంశాలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టి మరల్చేందుకూ చూశారు. సహకరించే మీడియా ఉండనే ఉంది. దానికి అనుగుణంగానే టీడీపీ జాకీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి తమ వంతు పాత్ర పోషించాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అనవసరంగా అప్రతిష్టపాలైంది పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఆటలో అరటి పండు చందంగా ఎవరూ పట్టించుకోనిది.. ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి!. అందుకేనేమో.. ఆయన తన ఉనికి కాపాడుకోవడానికి ఏవో పిచ్చి ఆరోపణలు చేశారు.గాయపడ్డ వారిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వేర్వేరుగా వెళ్లారు. సాధారణంగా ముఖ్యమంత్రి వెంటే మంత్రులు ఉండటం రివాజు. కానీ వేరే పార్టీ అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్‌ విడిగా వెళ్లి కొంత స్వతంత్రంగా వ్యవహరించారని చాలామంది భావించారు. జరిగిన తప్పుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు భక్తులకు క్షమాపణ చెప్పాలని పవన్‌ డిమాండ్‌ చేయడమే కాకుండా, ప్రభుత్వం తరుఫున తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు కూడా. అంతా ఓకే అనుకుంటున్న సమయంలోనే పవన్‌.. తొక్కిసలాటలో కుట్ర కోణం ఉందా? అని ప్రశ్నించి బాబు దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశారు.భక్తులకు క్షమాపణ చెప్పాలన్న పవన్ మాటలను టీటీడీ బాధ్యులు ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. దాంతో పవన్ పిఠాపురంలో సభలో కూడా మళ్లీ అదే డిమాండ్ చేశారు. అప్పుడే పవన్ ఈ ఉదంతం నుంచి చంద్రబాబును, టీడీపీని రక్షించే యత్నం చేస్తున్నారన్న సందేహం కలిగింది. కాకపోతే ఈ విషయం అర్థం బీఆర్‌ నాయుడు పవన్ కల్యాణ్‌ ఎవరో అన్నట్లుగా మాట్లాడి గాలి తీశారు. ఎవరో ఏదో చెప్పారని తానెందుకు స్పందిస్తానని అనడం ద్వారా ఈ వ్యవహారానికి కొత్త ట్విస్టు ఇచ్చారు. ఇది కాస్తా పవన్ వర్గానికి చిర్రెత్తించింది. చంద్రబాబుకు వెంటనే నిరసన చెప్పి ఉండాలి. ఆ వెంటనే చంద్రబాబు రంగంలో దిగి బీఆర్‌ నాయుడును ఆదేశించడంతో ఆయన తప్పనిసరి స్థితిలో సారీ చెప్పి, తన వ్యాఖ్యలు పవన్‌ను ఉద్దేశించి కాదని బుకాయించే యత్నం చేశారు.నిజానికి పవన్ కళ్యాణ్ కూడా ఇతర మంత్రుల మాదిరే ఒక మంత్రి. కాకపోతే ఉప ముఖ్యమంత్రి. ఈయనకేమీ ప్రత్యేక అధికారాలు ఉండవు. ఇతర మంత్రులపై, తనకు సంబంధం లేని ప్రభుత్వ సంస్థలపై అధికారం ఉండదు. అయితే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించవచ్చు. ఈ అవకాశాన్ని వాడుకుని స్వతంత్రంగా వ్యక్తిత్వంతో తిరుపతిలో తొక్కిసలాటపై మాట్లాడారులే అనుకున్న వారికి కొద్ది గంటలలోనే ఆయన అసలు స్వరూపం తెలిసిపోయింది.చంద్రబాబు నాయుడు సూచనల మేరకే పవన్ ఈ కథ నడిపారన్న విశ్లేషణ వస్తోంది. లేకుంటే పవన్ తిరుపతి ఆస్పత్రిలోని బాధితులను సందర్శించి టీటీడీ చైర్మన్ తదితరులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం ఏమిటి? ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఎవరెవరు బాధ్యులో వారందరిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని అడగాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని అనాలి. అవేవి చేయకుండా క్షమాపణల డ్రామా ఆరంభించారు. దీంతో తనకేదో పేరు వస్తుందని కూడా అనుకుని ఉండవచ్చు. కానీ అసలు విషయం బయటపడ్డాక, పవన్ కల్యాణ్‌ మళ్లీ భక్తులను, ప్రజలను మోసం చేశారని తేటతెల్లమవుతోందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పిన అబద్ధాలను భుజాన వేసుకుని ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ ఆరుగురు మరణించిన ఘటనలో ఆ ఊసే ఎత్తకపోవడాన్ని అంతా గుర్తిస్తున్నారు. అప్పుడు వేసుకున్న సనాతని వేషాన్ని ఇప్పుడు ఎందుకు ధరించలేదని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా హైందవ ధర్మాన్ని రక్షించడమా అని అడుగుతున్నారు.గతంలో చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ యావ కారణంగా రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే కూడా పవన్ నోరు విప్పలేదు. ఇప్పుడేమో తిరుపతిలో ఎన్నడూ జరగని దారుణ ఘటన జరిగితే, దానిని సైడ్ ట్రాక్ చేయడానికి అన్నట్లుగా అదేదో తనకు పవర్ ఉన్నట్లుగా హడావుడి చేసి చివరికి సారీలతో తుస్సుమనిపించారు. విశాఖ ప్రధాని సభలో తనతో సమానంగా లోకేష్ కు కూడా ప్రాధాన్యత ఇవ్వడంపై, ప్రచార ప్రకటనలలో లోకేష్ ఫోటో కూడా వేయడంపై పవన్ కు కొంత అసంతృప్తి ఉందని, దానిని పరోక్షంగా వ్యక్తం చేయడానికి తిరుపతి వెళ్లి తొక్కిసలాటకు తానే బాధ్యుడిని అన్నట్లు క్షమాపణ చెప్పారని కొందరు అనుకుంటున్నారు. పవన్ చర్య కొంత మంది టీడీపీ వారికి కూడా కోపం తెప్పించింది.ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు, పవన్ లు కలిసే ఈ కథ నడిపించారన్న అభిప్రాయం చివరికి కలుగుతుంది. కాకపోతే బీఆర్‌ నాయుడు తెలివితక్కువ వల్ల ఈ విషయం అంతా గందరగోళమై పవన్ పరువు పోయినట్లయింది. ఈ మొత్తం ‍వ్యవహారంలో కులాల గొడవ రావడం కూడా గమనించవలసిన అంశమే. కమ్మ సామాజిక వర్గం వారిని కాపాడుకుని మిగిలిన వారిని బలి చేస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.తాజాగా పాలక మండలి సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావును ఒంటరి చేసి బోర్డు ఛైర్మన్, సభ్యులు మాటల దాడి చేశారట. అంతేకాక ,శ్యామలరావు దేవాలయానికి వెళ్లినా అధికారులు ఎవరూ ఆయనతో మాట కలపలేదట!. దీనిని బట్టి ఆయనను బదిలీ చేస్తున్నారన్న ప్రచారం ఆరంభమైంది. బీసీ వర్గానికి చెందిన శ్యామలరావును అవమానించి బలి చేస్తారా? ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. తానేదో మానవత్వం ఉన్న వ్యక్తిగాను, అల్లు అర్జున్ వంటివారికి అది తెలియనట్లుగాను మాట్లాడిన పవన్ పిఠాపురంలో వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతూ ప్రమాదంలో మరణించిన ఇద్దరు యువకుల కుటుంబాలను వారి ఇళ్లకు వెళ్లి పవన్ పరామర్శిస్తారని అనుకున్నారు. కానీ ఆయన అలా చేయలేదు. వారి గ్రామాల నుంచి పిఠాపురం రప్పించారట. పవన్ సంక్రాంతి సంబరాలలో పాల్గొంటే బాధిత కుటుంబాల వారు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉసూరు మంటూ ఉదయం నుంచి అక్కడే కూర్చున్నారట. అయినా అంతిమంగా ఆయన వారిని పలకరించకుండానే వెళ్లిపోయారు. దాంతో బాధిత కుటుంబాలు తమవాళ్లు పోయారన్న విషాదంతో పాటు, ఈ అవమానపు బాధను కూడా భరించవలసి వచ్చింది.ఏది ఏమైనా రాజకీయాలలో ఎల్లప్పుడూ డ్రామానే పండదు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నట్లు ఆంధ్ర ప్రజలకు సినిమా వైబ్ అనండి.. పిచ్చి అనండి ఎక్కువగానే ఉండవచ్చు. వారివల్లే పవన్ వంటివారు అధికారంలోకి వచ్చి ఉండవచ్చు. కానీ సినిమా పిచ్చే ఎప్పటికీ ఉంటుందా? అనేది ఇక్కడ అసలు ప్రశ్న. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Delhi Liquor Policy CAG Report RS 2000 Crore Loss Lapses AAP Kickbacks2
రూ.2026 కోట్ల నష్టం.. ఢిల్లీ మద్యం పాలసీపై కాగ్ తాజా రిపోర్టు

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటువంటి తరుణంలో వచ్చిన కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్ జనరల్(కాగ్‌) రిపోర్టు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు మరిన్ని తలనొప్పులు తెచ్చేదిగా మారింది. ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన ఎక్సైజ్ విధానంపై తాజాగా వెలువడిన కాగ్‌ రిపోర్టులో నాడు పాలసీ అమలులో చోటు చేసుకున్న పలు లోపాలు వెలుగు చూశాయి.ఢిల్లీ ప్రభుత్వం అనుసరించిన మద్యం పాలసీ(Delhi Liquor Policy) కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.2,026 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్‌ నివేదిక పేర్కొంది. ఈ డేటాను కాగ్‌ తొలిసారిగా సమర్పించింది. అయితే ఇది బీజేపీ కాగ్‌ నివేదిక అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నివేదికలోని వివరాల ప్రకారం దేశరాజధానిలో మద్యం వ్యాపారం నష్టాల్లో ఉన్నప్పటికీ ఆప్‌ ప్రభుత్వం కొంతమంది బిడ్డర్లకు లైసెన్సులు ఇచ్చిందని కాగ్‌ నివేదిక పేర్కొంది. ఎక్సైజ్ విధానాన్ని అమలు చేయడంలో ప్రధాన లోపాలను ఈ నివేదిక ప్రస్తావించింది. ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాల కారణంగా సర్కారుకు దాదాపు రూ.2,026 కోట్ల నష్టం(RS 2000 Crore Loss) వాటిల్లింది.ఈ నష్టానికి సామాన్యులు మూల్యం చెల్లించాల్సి వచ్చిందని, ఆప్ నేతలు మాత్రం భారీగా కమీషన్లు అందుకున్నారని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది.నాడు ఎక్సైజ్ శాఖకు సారధ్యం వహించిన మనీష్ సిసోడియాతో పాటు అతని మంత్రుల బృందం.. నిపుణుల ప్యానెల్ సిఫార్సులను విస్మరించిందని నివేదిక పేర్కొంది. మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ నిబంధనలు ఉల్లంఘించారని తెలిపింది. ఎక్సైజ్‌ పాలసీ అమలులో పలు కీలక నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకున్నారని నివేదిక పేర్కొంది. ఇందుకోసం కేబినెట్ నుండి లేదా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నుండి ఆమోదం తీసుకోలేదని నివేదిక తెలియజేసింది.కాగ్‌ నివేదికలోని ముఖ్యాంశాలు1. భారీ నష్టాలు: విధానంలోని లోపాల కారణంగా ప్రభుత్వానికి ₹2,026 కోట్ల నష్టం వాటిల్లింది.2. నిపుణులను విస్మరించడం: మద్యం విధానాన్ని రూపొందించే ముందు నిపుణులను సంప్రదించారు. కానీ వారి సిఫార్సులను పాటించలేదు.3. బిడ్డింగ్ అక్రమాలు: ఫిర్యాదులు ఎదుర్కొంటున్న లేదా నష్టాల్లో నడుస్తున్న కంపెనీలకు కూడా లైసెన్సులు జారీ చేశారు.4. ఆమోదం తీసుకోలేదు: అనేక కీలక నిర్ణయాలలో క్యాబినెట్, లెఫ్టినెంట్ గవర్నర్ నుండి ఆమోదం తీసుకోలేదు.5. పారదర్శకత లేకపోవడం: మద్యం ధర నిర్ణయించడంలో, లైసెన్సులు జారీ చేయడంలో పారదర్శకత లోపించింది. నియమాలను ఉల్లంఘించిన వారికి ఎటువంటి జరిమానా విధించలేదు.6. పాలసీ సరిగ్గా అమలు చేయలేదు: మద్యం నాణ్యతను తనిఖీ చేయడానికి ప్రయోగశాలలు, పరీక్షా సౌకర్యాలు కల్పించలేదు. రిటైల్ మద్యం దుకాణాలను అన్ని ప్రాంతాలకూ సమానంగా పంపిణీ చేయలేదు.7. తప్పుడు మినహాయింపులు: కోవిడ్-19 పేరుతో రూ.144 కోట్ల విలువైన లైసెన్స్ ఫీజులను మాఫీ చేశారు. అయితే అలా చేయవలసిన అవసరం లేదు.8. జోనల్ లైసెన్స్‌దారులకు ఇచ్చిన రాయితీల ఫలితంగా రూ. 941 కోట్ల నష్టం వాటిల్లింది.9. సెక్యూరిటీ డిపాజిట్లను సరిగా రికవరీ చేయకపోవడం వల్ల రూ. 27 కోట్ల నష్టం.10. ఉపసంహరించిన లైసెన్స్‌లకు టెండర్లు వేయకపోవడం వల్ల రూ. 890 కోట్ల నష్టం వాటిల్లింది.కోవిడ్-19 ఆంక్షల కారణంగా కేజ్రీవాల్ ప్రభుత్వం రూ.144 కోట్ల విలువైన లైసెన్స్ ఫీజులను మాఫీ చేసిందని నివేదిక పేర్కొంది. దీని వలన ఆదాయం మరింతగా తగ్గింది. సెక్యూరిటీ డిపాజిట్‌ను తప్పుగా డిపాజిట్ చేయడం వల్ల రూ. 27 కోట్ల నష్టం వాటిల్లిందని నివేదిక పేర్కొంది.ఇది కూడా చదవండి: ప్రియురాలి మృతదేహాన్ని 9 నెలలుగా ఫ్రిడ్జ్‌లో దాచి..

Nampally Court Big Relief To Allu Arjun3
అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట

సంధ్య థియేటర్‌ (Sandhya Theatre) తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు (Nampally Court ) ఊరట కల్పించింది. పలు షరతులతో ఆయనకు ఇప్పటికే రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు తాజాగా వాటిలో సడలింపు ఇచ్చింది. పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేసే వరకు 2 నెలల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు చిక్కడపల్లి పోలీసుల ఎదుట ఆయన హాజరు కావాల్సి ఉంది. అయితే, ఈ విషయంలో బన్నీకి కోర్టు మినహాయింపు ఇచ్చింది.అల్లు అర్జున్‌ (Allu Arjun) గత ఆదివారం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేసి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన్ను చూసేందుకు ఫ్యాన్స్‌ భారీగా అక్కడికి వెళ్లారు. దీంతో కాస్త ఇబ్బంది వాతావరణం అక్కడ కనిపించింది. ఇలాంటి సమయంలో ప్రతి ఆదివారం చిక్కడపల్లి స్టేషన్‌కు వెళ్లడం వల్ల సెక్యూరిటీ పరంగా పలు ఇబ్బందులు వస్తున్నాయని కోర్టులో ఆయన పిటిషన్‌ పెట్టుకున్నారు. తాజాగా విచారించిన న్యాయస్థానం బన్నీకి ఊరట కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదంటూ కోర్టు ఆదేశించింది. ఈ కేసు విషయంలో పోలీసుల విచారణకు సహకరించాలని న్యాయస్థానం కోరింది.(ఇదీ చదవండి: 'గేమ్‌ ఛేంజర్' కలెక్షన్స్‌ ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు)పుష్ప–2 ప్రీమియర్‌ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్‌ కారణం అంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూ­రు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు, రూ.50 వేలతో రెండు పూచీకత్తులు కోర్టుకు సమర్పించాలని సూచించింది. రెండు నెలల పాటు ప్రతి ఆదివారం సంబంధిత పోలీస్‌స్టేషన్‌ (చిక్కడపల్లి)లో హాజరు కావా­లని ఆదేశించింది. అయితే, ఇప్పుడు ఈ అంశంలో ఆయనకు సడలింపు ఇచ్చింది.డిసెంబర్‌ 5న జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కొడుకు శ్రీతేజ ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా అల్లు అర్జున్‌ పరామర్శించి వచ్చారు. బాలుడికి కావాల్సిన వైద్య సదుపాయం అల్లు అర్జున్‌ కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రేవతి కుటుంబానికి పుష్ప2 చిత్ర యూనిట్‌ రూ. 2 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Steve Harmison calls for brutal punishment after altercation with Sam Konstas4
'ముమ్మాటికీ కోహ్లిదే తప్పు.. అతడిపై నిషేధం పడాల్సింది'

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి(Virat Kohli), ఆస్ట్రేలియా యువ బ్యాటర్ సామ్ కొన్‌స్టాస్‌ మధ్య వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆడిలైడ్‌ వేదికగా పింక్‌ బాల్‌ టెస్టు సందర్భంగా కొన్‌స్టాస్‌ పిచ్‌పై నడుస్తుండగా కోహ్లి వచ్చి భుజాన్ని ఢీకొట్టడంతో వివాదం మొదలైంది. దీంతో కోహ్లి తీరును చాలా మంది తప్పుబట్టారు.అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ కూడా కోహ్లిపై సీరియస్‌ అయింది. కోహ్లి మ్యాచ్‌ ఫీజులో ఐసీసీ 20 శాతం కోత విధించింది. అయితే తాజాగా ఈ వివాదంపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ హార్మిసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముమ్మాటికి కోహ్లిదే తప్పు అని, అతడు తృటిలో నిషేధం నుంచి తప్పించుకున్నాడని హార్మిసన్ అభిప్రాయపడ్డాడు. "ఆడిలైడ్‌లో యువ ఆటగాడు కాన్‌స్టాస్‌ పట్ల విరాట్‌ కోహ్లి వ్యవహరించిన తీరు సరికాదు. ఆ సమయంలో విరాట్‌ మితిమీరి ప్రవర్తించినట్లు అన్పించింది. అతడు చేసిన పనికి నిషేధం విధించి ఉండాల్సింది. విరాట్‌ కోహ్లి అంటే నాకు కూడా ఎంతో ఇష్టం. అతడు జెంటిల్‌మేన్‌ గేమ్‌కు ఎంతో వన్నె తెచ్చాడు. కానీ దేనికైనా ఒక హద్దు ఉంటుంది. అది మీరి ప్రవర్తించకూడదు. ఇక కాన్‌స్టాస్‌ అద్బుతంగా ఆడుతున్నాడు.నిజంగా అతడి స్కూప్‌ షాట్లు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే హిట్టింగ్‌ వరకు సరే కానీ, అతడి వద్దా డిఫెన్సివ్ టెక్నిక్ ఉందా లేదా గుర్తించాలి. టెస్టు క్రికెట్‌లో డిఫెన్స్‌ స్కిల్స్‌ కూడా చాలా ముఖ్యం. డేవిడ్ వార్నర్‌ వారసుడిగా అతడు నిరూపించుకోవాలి. సామ్‌కు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. అతడికి ఇంకా కేవలం 19 సంవత్సరాలు మాత్రమే అని టాక్‌ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్మిసన్ పేర్కొన్నాడు.ఆసీస్‌ గడ్డపై విఫలం..ఇక కోహ్లి గత కొంతకాలంగా టెస్టు క్రికెట్‌లో పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో తీవ్ర నిరాశపరిచిన విరాట్‌.. అదే తీరును ఆస్ట్రేలియా పర్యటనలో సైతం కనబరిచాడు.తొలి టెస్టులో సెంచరీ చేసిన కోహ్లి.. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పూర్తిగా తేలిపోయాడు. సిరీస్‌ అసాంతం ఆఫ్‌సైడ్‌ బంతులను వెంటాడి తన వికెట్‌ను కోహ్లి కోల్పోయాడు. కోహ్లి ఐపీఎల్‌ తర్వాత ఇంగ్లండ్‌ కౌంటీల్లో ఆడనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌ పర్యటన దృష్టిలో పెట్టుకుని కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను 3-1 తేడాతో భారత్‌ కోల్పోయిన సంగతి తెలిసిందే.చదవండి: SA T20: ఐపీఎల్‌ వద్దంది.. కట్‌ చేస్తే! అక్కడ కేన్‌ మామ విధ్వంసం

Tirupati Stampede: RK Roja Slams CBN, Pawan For Protecting Accused5
సీఎంకు, డిప్యూటీ సీఎంకు ఇంకా బుద్ధి రాలేదు: ఆర్కే రోజా

చిత్తూరు, సాక్షి: తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా కారకులపై ఇంతదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూటమి సర్కార్‌పై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా మండిపడ్డారు. ఈ కేసులో మొదటి ముద్దాయిగా చంద్రబాబు పేరునే చేర్చాలని ఆమె డిమాండ్‌ చేస్తున్నారు. నగరిలో శనివారం ఆమె మాట్లాడుతూ.. ‘‘సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో ఒకరు చనిపోతే.. 14 మందిపై అక్కడి పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. అలాంటిది తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయారు. 60 మంది గాయపడ్డారు. ఘటన జరిగింది మూడు రోజులు గడిచింది. అయినా ఇంకా చర్యలు కనిపించడం లేదు. చంద్రబాబు, టీటీడీ చైర్మన్‌, ఈవో, ఏఈవో, ఎస్పీ.. కారకులైన అందరిపైనా కేసు నమోదు చేయాలి. తిరుపతి తొక్కిసలాట ఘటనలో సీఎం చంద్రబాబును మొదటి ముద్దాయిగా చేర్చాలి. .. తొక్కిసలాట ఘటన(Stampede Incident) వల్ల భక్తులు తిరుమలకు రావడం లేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ఇంత జరిగినా బుద్ధి రాలేదు. అసలైన నిందితులపై చర్యలు తీసుకోకపోగా.. ఇంకా కాపాడాలనే చూస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తోంది. అయినా టోకెన్‌ సిస్టమ్‌ ఎందుకు తీయలేదు? అని ప్రశ్నించారామె. పవన్‌కు సూటి ప్రశ్న‘‘సంధ్యా థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్‌కు మానవత్వం లేదని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మరి గేమ్‌ ఛంజర్‌ ఈవెంట్‌కు వెళ్లి ఇద్దరు చనిపోతే.. బాధిత కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు. అల్లు అర్జున్‌కు ఉన్న మానవత్వం కూడా మీకు లేదా?. లడ్డూ వ్యవహారంలో చేయని తప్పునకు కాషాయం కప్పేసుకుని మాట్లాడారు. మరి తిరుపతిలో ఇంత ఘోరం జరిగితే ఇప్పుడేం మాట్లాడరే?. తప్పు చేసిన వాళ్లు ఫలానా వాళ్లే అని మీరే చెబుతున్నారు. మరి వాళ్ల తాట ఎందుకు తీయడం లేదు’’ అని రోజా ప్రశ్నించారు.

Shocking  9 years girl dies of heart attack in Ahmedabad Gujarat 6
మాయదారి గుండెపోటు : చిన్నారి ‘గుండెల్ని’ పిండేస్తున్న వీడియో

చిన్నారుల నుంచి పెద్దల దాకా గుండెపోటుతో సంభవిస్తున్న హఠాన్మరణాలు ఆందోళన రేపుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కారణంలో చిన్నారుల గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తుండటం కలచివేస్తోంది. తాజాగా మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈసారి 8 ఏళ్ల బాలిక (School Girl) ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని (Ahmedabad) థల్తేజ్ ప్రాంతంలో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి.అహ్మదాబాద్‌లోని గార్గి రాణపరా(Gargi Ranapara) జేబార్ స్కూల్ ఫర్ చిల్డ్రన్‌లో గార్గి మూడో తరగతి చదువుతోంది. పాఠశాలకు వచ్చిన కొద్దిసేపటికే ఛాతీ నొప్పికి గురైంది. క్లాస్ రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా నొప్పి రావడంతో కాసేపు అక్కడే నిలబడింది. నొప్పితో బాధపడుతూనే అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది. అంతే కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఇది గమనించిన టీచర్లు ఆమెకు సపర్యలు చేశారు. బాలికను కాపాడేందుకు టీచర్లు సీపీఆర్ చేశారు. అయినా బాలికలో ఎలాంటి చలనం లేదు. వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే సమయానికే బాలిక పరిస్థితి విషమించింది. వైద్యులు ఆమెను బతికించేందుకు తీవ్రంగా శ్రమించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. గార్గి గుండెపోటుతో మరణించిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పాఠశాల ప్రిన్సిపల్ శర్మిష్ఠ సిన్హా వెల్లడించారు.గార్గి పాఠశాల ఆవరణలో కొంచెం అనారోగ్యంగా కనిపించిందని, కొద్దిసేపు కూర్చున్న వెంటనే కుప్పకూలిపోయిందని చెప్పారు. వెంటనే అప్రమత్తమైన టీచర్లు, విద్యార్థులు వెంటనే ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించినా, ఆమెనుకాపాడలేకపోయామని విచారం వ్యక్తం చేశారు.మరోవైపు దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక గుండెపోటుకు గల కారణాలలపై అన్ని కోణల్లో దర్యాప్తు చేస్తున్నామని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నీరజ్ బడ్గుజర్ ప్రకటించారు.🚨HEART BREAKING A 8 year old girl , all of a sudden fell down and died in school. Video from Krnavati (Ahmedabad) , Gujarat.What is happening to kids and youngsters ?? Almost every week we see or hear such cases . Instead of blaming Covid vaccines , we need to get into the… pic.twitter.com/R66mcrOIK9— Amitabh Chaudhary (@MithilaWaala) January 10, 2025 > కాగా ముంబైకి చెందిన గార్గి, తన బంధువుల ఇంటిలో ఉంటూ అహ్మదాబాద్‌లో చదువుకుంటోంది. గతంలో పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవని సమాచారం. ఇటీవల బెంగళూరులో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలిక తేజస్విని పాఠశాల కారిడార్‌లో గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.గుండెపోటు లక్షణాలుఛాతీ నొప్పి,ఊపిరి ఆడకపోవడంవికారం, చెమటలు పట్టడం చేతులు, వీపు లేదా దవడలో నొప్పి వంటివి సాధారణ లక్షణాలునోట్‌: గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. అయితే, గుండె పోటు వెనుక చాలా కారణాలు ఉండొచ్చు. అందుకే ఏ చిన్న అనారోగ్యం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. మరీ ముఖ్యంగా జిమ్‌ చేస్తున్నాం కదా, ఆరోగ్యంగానే ఉన్నాం కదా అని అస్సలు అనుకోకూడదు. ఇటీవలి కేసులను దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లల్లో అయినా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి కారణాలను రూల్‌ అవుట్‌ చేసుకోవడం చాలా అవసరం.

Biden Raises Bounty for Nicolás Maduro to $25 Million7
ఆయన అరెస్టుకు ఆధారాలిస్తే రూ.215 కోట్ల రివార్డు!

వెనిజులా అధ్యక్షునిగా నికోలస్ మదురో మూడవసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే వెనిజులా ఎన్నికల్లో ఆయన ఓడిపోయారనడానికి స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ నేపధ్యంలో మదురోను అరెస్టు చేసేందుకు తగిన అధారాలు అందించినవారికి ఇచ్చే బహుమతి మొత్తాన్ని 25 మిలియన్‌ డాలర్లకు(సుమారు 215 కోట్ల రూపాయలు) పెంచినట్లు బైడెన్‌ పరిపాలనా విభాగం ప్రకటించింది.మదురోను వెనిజులాకు అధ్యక్షునిగా అమెరికా గుర్తించలేదు. 2024, జూలై జరిగిన ఎన్నికల్లో తాను గెలిచినట్లు మదురో(Nicolás Maduro) ఎటువంటి ఆధారాలను సమర్పించలేదు. అయితే అతని ప్రత్యర్థి ఎడ్ముండో గొంజాలెజ్ అందుబాటులోవున్న ఓట్ల లెక్కింపు ఆధారాలను సమర్పించారు. ఇవి అతను అత్యధిక ఓట్లు గెలుచుకున్నారని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో గొంజాలెజ్.. వెనిజులా అధ్యక్షునిగా ఎన్నికయ్యారని యునైటెడ్ స్టేట్స్ ప్రకటించింది. అలాగే మదురోను పదవి నుంచి తప్పుకోవాలని కోరింది.కాగా తాత్కాలిక రక్షిత హోదాతో యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్న దాదాపు 600,000 మంది వెనిజులా వలసదారులకు మరింత రక్షణ కల్పిస్తున్నట్లు బైడెన్‌ పరిపాలనా విభాగం ప్రకటించింది. ఈ వలసదారులు అదనంగా మరో 18 నెలలు ఉండడానికి బైడెన్‌ హామీనిచ్చారు. జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ(John Kirby) మీడియాతో మాట్లాడుతూ మదురో అరెస్టుకు ఆధారాలు సమర్పించినవారికి బహుమతిని పెంచే నిర్ణయం వెనుక వెనిజులా ప్రజలకు సంఘీభావం అందించడమే ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈ బహుమతిని పెంచడం ద్వారా మదురోతో పాటు అతని ప్రతినిధులపై ఒత్తిడిని కొనసాగించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను మరింత పెంచామన్నారు.కాగా వెనిజులా వలసదారులకు తాత్కాలిక రక్షిత హోదా పొడిగింపును వారికి మద్దతు ఇచ్చే ప్రయత్నంగా బైడెన్‌(Biden) పరిపాలన ప్రతినిధి అభివర్ణించారు. 2020లో మదురోపై అమెరికాలో పలు కేసులు నమోదయ్యాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న నార్కో-టెర్రరిజం, అంతర్జాతీయ కొకైన్ అక్రమ రవాణా కుట్రలో మదురో నిందితుడు. మదురో తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిమిషాలకే, అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఎనిమిది మంది వెనిజులా అధికారులపై పలు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.ఇది కూడా చదవండి: అయోధ్యలో ఘనంగా ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవాలు

Hyderabad real estate goes next level with metro 2.08
మెట్రో వెంట.. సొంతింటి ప్రయాణం!

హైదరాబాద్‌ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లింది మెట్రో, ఔటర్‌ ప్రాజెక్ట్‌లే.. మెట్రో రైలుతో ప్రధాన నగరంలో, ఓఆర్‌ఆర్‌తో శివారు ప్రాంతాలతో కనెక్టివిటీ పెరిగింది. దీంతో నగరంలో రియల్‌ బూమ్‌ ఏర్పడింది. తాజాగా ప్రభుత్వం రెండో దశలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకూ మెట్రో విస్తరించాలని నిర్ణయించింది. దీంతో మెట్రో మార్గంలో చుట్టూ 10 కి.మీ. వరకూ స్థిరాస్తి అవకాశాలు మెరుగవుతాయి. ఇదే సమయంలో మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్లను అనుసంధానిస్తే నగరం నలువైపులా ప్రయాణం సులువవుతుంది. బడ్జెట్‌ గృహాల లభ్యత పెరిగి, ఐటీ ఉద్యోగ వర్గాల సొంతింటి కల సాకారమవుతుందని జనప్రియ అప్‌స్కేల్‌ ఎండీ క్రాంతి కిరణ్‌రెడ్డి అన్నారు. – సాక్షి, సిటీబ్యూరోప్రజల దైనందిన జీవితంలో ప్రజారవాణా అత్యంత కీలకం. దీంతో ప్రభుత్వం మెట్రోని పొడిగించాలని నిర్ణయించింది. వచ్చే 5–10 ఏళ్లలో దశలవారీగా మెట్రో 2.0 అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ రియల్టీ మరింత దూరం విస్తరిస్తోంది. సాధారణంగా ప్రజలు మెరుగైన రవాణా సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోనే ఉండేందుకు ఇష్టపడతారు.ఐటీ కేంద్రాల చుట్టుపక్కల ఇళ్ల ధరలు రూ.కోటి దాటిపోయాయి. ఐటీ ఉద్యోగ వర్గాలకు అందనంత ఎత్తుకు ఎగబాకాయి. మెట్రోతో శివార్లకు రవాణా సౌకర్యం రావడంతో ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులు ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో వీరంతా తమ బడ్జెట్‌లో నివాసాలు దొరికే తూర్పు హైదరాబాద్‌లో కొనుగోలు చేశారు.విదేశాల్లో ప్రైవేట్‌కే స్టేషన్ల బాధ్యత.. సింగపూర్, న్యూయార్క్‌ వంటి దేశాల్లో మాదిరిగా నగరంలోనూ భూగర్భ మెట్రో ఉంటే మేలు. విదేశాలలో భూగర్భ మెట్రో స్టేషన్‌ నిర్మాణ వ్యయాన్ని స్థానికంగా హోటల్స్, మాల్స్‌ వంటి వాణిజ్య సముదాయాలకే అప్పగిస్తారు. స్టేషన్‌ నుంచి వచ్చిపోయే ప్రయాణికులకు ఆయా వాణిజ్య సముదాయాలకు యాక్సెస్‌ ఉంటుంది. దీంతో యజమానులకు బిజినెస్‌ అవుతుంది. ప్రతిఫలంగా స్టేషన్‌ నిర్మాణ వ్యయాన్ని వాణిజ్య యజమానులే భరిస్తారు. దీంతో అటు ప్రభుత్వం, ఇటు యజమానికి ఇద్దరికీ లాభమే.ఇదీ చదవండి: వెస్ట్‌ హైదరాబాద్‌.. వామ్మో ఎంత ఎత్తో..చిత్తడి, వదులుగా ఉండే నేలలో భూగర్భ మెట్రో కష్టమవుతుంది. కానీ, మనది రాతి భూభాగం. భూగర్భ మెట్రో లైన్‌ కోసం సొరంగం తవ్వడం కష్టమవుతుందేమో.. కానీ ఒకసారి తవ్వాక నియంత్రణ సులువు. రోడ్డు మార్గం ఎలా ఉంటుందో మెట్రో లైన్‌ కూడా అలాగే వేయాల్సి ఉంటుంది. పైగా వంకర్లు ఉండే మార్గంలో ఎక్కువ బోగీలతో మెట్రోను నడపడం కుదరదు. కానీ, భూగర్భ మెట్రోను ఏ నుంచి బీ పాయింట్‌కు సరళ రేఖ మాదిరిగా వేయవచ్చు. దీంతో మెట్రో రైలు వేగం పెరగడంతో పాటు ఎక్కువ బోగీలతో మెట్రో నడపొచ్చు.భవిష్యత్తు ఈ ప్రాంతాలదే.. ఇప్పటి వరకు ఐటీ, ఫార్మా రంగాల బహుళ జాతి సంస్థలే నగరానికి ప్రాధాన్యం ఇచ్చాయి. కానీ, కొన్నేళ్లుగా తయారీ రంగంలో కూడా మల్టీనేషనల్‌ కంపెనీలు విస్తరిస్తున్నాయి. ఫాక్స్‌కాన్, టాటా ఎయిరోస్పేస్‌ వంటి సంస్థలు ఆదిభట్ల, శంషాబాద్‌ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఐటీ అంతా వెస్ట్‌లోనే ఉంది కాబట్టి ఈ ప్రాంతాలకు ఎప్పటికీ డిమాండ్‌ ఉంటుంది. కానీ, ఇప్పటికే ఆయా ప్రాంతాలలో నివాస, వాణిజ్య భవనాలతో కిక్కిరిసిపోవడంతో ఈ అభివృద్ధి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తుంది. కొంగరకలాన్, ఆదిభట్ల, శంషాబాద్, కొల్లూరు, శామీర్‌పేట వంటి ప్రాంతాల్లో మార్కెట్‌ ఊపందుకుంటుంది.హైదరాబాద్‌ వర్సెస్‌ బెంగళూరు.. ఐటీలోనే కాదు రియల్‌ ఎస్టేట్‌లోనూ హైదరాబాద్, బెంగళూరు పోటీ పడుతున్నాయి. రెండు నగరాలకు ఉన్న తేడా.. రోడ్ల వెడల్పు. బెంగళూరులో ఎయిర్‌పోర్టు రోడ్డు తప్ప అన్నీ దాదాపు 60 ఫీట్ల రోడ్లే.. కానీ, మన దగ్గర 100, 140 ఫీట్ల రోడ్లు కూడా ఉన్నాయి. నగరంలో అంత పెద్ద రోడ్లు ఎలా వచ్చాయి? రోడ్డు వెడల్పుగా ఉంటే అపరిమిత ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌(ఎఫ్‌ఎస్‌ఐ) ఉంటుందని యజమానులు రోడ్ల కోసం భూములు ఇచ్చారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో అక్కడ.. కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!దీంతో భారీ టౌన్‌షిప్‌లు, స్కై స్క్రాపర్లు వస్తున్నాయి. తాజాగా హైరైజ్‌ ప్రాజెక్ట్‌లతో ట్రాఫిక్‌ పెరుగుతోందని ఎఫ్‌ఎస్‌ఐపై ఆంక్షలు పెట్టాలనే ప్రతిపాదనకు బదులుగా రోడ్లను ఇంకా వెడల్పు చేయడం ఉత్తమం. హైదరాబాద్‌ రియల్టీకి వరమైన జీవో–86 వల్లే దేశ, విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అలాంటి సమర్థవంతమైన జీవోపై ఆంక్షలు పెట్టాలనుకోవడం సరైన నిర్ణయం కాదు.

Special Train Delay of Sankranti Train9
సంక్రాంతి రద్దీ.. ప్రయాణికులకు చుక్కలే!

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి రద్దీ మొదలైంది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో నగర వాసులు సొంత ఊళ్లకు తరలివెళ్తున్నారు. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్‌ రైళ్లలో రిజర్వేషన్‌లు పూర్తిగా నిలిచిపోయి రిగ్రేట్‌ దశకు చేరాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి టెర్మినల్ నుంచి కాకినాడ, తిరుపతి, విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాలకు కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది నగరవాసులు సొంత ఊళ్లకు తరలి వెళ్తుండగా.. అరకొరగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు ఏ మాత్రం ప్రయాణికుల డిమాండ్‌లను భర్తీ చేయడం లేదు. మరోవైపు అన్ని ప్రత్యేక రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అతికష్టంగా బెర్తులు సంపాదించి రైలెక్కినా గంటల తరబడి పట్టాలపైనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. సికింద్రాబాద్‌ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరితే మరుసటి రోజు మధ్యాహ్నం 12 దాటినా విశాఖకు చేరుకోలేకపోయామని కూకట్‌పల్లికి చెందిన కృష్ణారావు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి శబరిమలకు నడిచే రైళ్లు కూడా అయ్యప్ప భక్తులకు నరకం చూపుతున్నాయి. రెండు రోజులు గడిచినా హైదరాబాద్‌ నుంచి శబరిమలకు, తిరిగి అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోలేకపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చార్జీలు కూడా ‘ప్రత్యేకమే’.. ⇒నగరం నుంచి ప్రతి రోజు సుమారు వందకు పైగా రెగ్యులర్‌ రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. సుమారు 2.5 లక్షల మంది ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం రోజుకు మరో 50 వేల మంది అదనంగా బయలుదేరే అవకాశం ఉంది. ఈ డిమాండ్‌ మేరకు అదనపు రైళ్లు లేవు. కొన్ని రైళ్లలో బెర్తులు, అదనపు బోగీలు ఏర్పాటు చేశారు. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు మాత్రం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. కానీ ఈ రైళ్లలో చార్జీలు కూడా ఎక్కువే. సాధారణ చార్జీలపై 25 శాతం వరకు అదనపు చార్జీలు విధిస్తారు. అయినప్పటికీ మరో గత్యంతరం లేక ప్రత్యేక రైళ్లను ఆశ్రయించే ప్రయాణికులకు రైళ్లలో పడిగాపులు తప్పడం లేదు. ⇒ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పట్టాలపై రైళ్ల ఒత్తిడి పెరిగిందని, దీంతో సకాలంలో సిగ్నల్స్‌ లభించకపోవడం వల్ల జాప్యం చోటుచేసుకుంటోందని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ ఆలస్యం ప్రయాణికుల పండగ సంతోషాన్ని ఆవిరి చేస్తోంది. కనిష్టంగా 3 నుంచి గరిష్టంగా 12 గంటల వరకు కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. గతంలో ఇలాంటి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెల్లువెత్తినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. సంక్రాంతి సందర్భంగా బయలుదేరిన ప్రయాణికులు భోగి పండగ రోజు కూడా సొంత ఊళ్లకు చేరుకోలేకపోయారు. ప్రస్తుతం మరోసారి అదే పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. ఆర్టీసీ సైతం అదే బాటలో.. ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సుల పేరిట 50 శాతం అదనపు దోపిడీకి దిగింది. ఏపీతో పాటు, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో కూడా 25 శాతం నుంచి 50 శాతం వరకు అదనపు వసూళ్లకు పాల్పడుతోంది. చివరకు దివ్యాంగుల పాస్‌లను అనుమతించకుండా ఇష్టారాజ్యంగా చార్జీలు విధిస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని సుమారు 6 వేలకు పైగా అదనపు బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజులుగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఎల్‌బీనగర్, ఉప్పల్, హయత్‌నగర్, ఎంజీబీఎస్, జేబీఎస్‌ తదితర ప్రాంగణాలుప్రయాణికులతో సందడిగా మారాయి.ప్రైవేట్‌ బస్సుల దోపిడీ.. సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అడ్డగోలుగా దారి దోపిడీకి పాల్పడుతున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి విశాఖకు లగ్జరీ రూ.1800 వరకు ఉంటుంది. ఇప్పుడు ఆ చార్జీ రూ.3000 వరకు చేరింది. అలాగే ఏసీ బస్సుల్లో రూ.2500 నుంచి ఏకంగా రూ.5000 వరకు పెరిగినట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటిల్లిపాదీ కలిసి వెళితే చార్జీల కోసమే రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోందని ఏఎస్‌రావు నగర్‌కు చెందిన మల్లికార్జున్‌రావు చెప్పారు. అలాగే.. హైదరాబాద్‌ నుంచి కాకినాడ, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాలకు సైతం ప్రైవేట్‌ బస్సుల దోపిడీ విమాన చార్జీలను తలపిస్తోంది.సాక్షి ఎఫెక్ట్‌.. బస్సులు సీజ్‌అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తున్నప్రైవేట్‌ వాహనాల దందాపై సాక్షి వరుస కథనాలు ఇచ్చింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ఎల్బీనగర్ లో ప్రైవేట్ వాహనాలపై ఆర్టిఏ అధికారుల కొరడా జులిపించారు. సంక్రాంతికి అధిక బస్సు చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ వాహనాలపై ఆర్టిఏ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలోని టీం అడ్డుకుంది. దాదాపు 20 బస్సులపై కేసు నమోదు చేశారు. ఇక.. పెద్ద అంబర్ పేట్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారుల సీజ్ చేశారు. మరోవైపు.. రాజేంద్రనగర్‌ ఆరాంఘడ్‌ చౌరస్తా వద్ద రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల ఈ ఉదయం 4 గంటల నుంచే తనిఖీ చేపట్టారు. చెన్నై, తిరువంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారి నుండి హైదరాబాద్ వస్తున్న బస్సులను తనిఖీలు చేస్తున్నారు . ఈ క్రమంలో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నట్రావెల్స్‌పై కేసులు నమోదు చేస్తున్నారు. 11 బస్సుల పై కేసు నమోదు అయినట్లు సమాచారం.

Ravindra Jadeja puts up cryptic post amid uncertainty over ODI future10
రవీంద్ర జడేజా రిటైర్మెంట్..! హింట్‌ ఇచ్చిన స్టార్‌ ఆల్‌రౌండర్‌

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టులకు గుడ్‌బై చెప్పనున్నాడా? అంటే అవును అనే సమాధనమే ఎక్కువ విన్పిస్తోంది. ఆస్ట్రేలియాతో సిడ్నీలో ఆడిన టెస్టే తన చివరి ‍మ్యాచ్‌, త్వరలోనే జడ్డూ రెడ్‌ బాల్‌ క్రికెట్‌కు విడ్కోలు పలకనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా జడేజా పెట్టిన ఓ పోస్ట్‌ ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో మూడో ధరించిన జెర్సీ ఫొటోను ఈ సౌరాష్ట్ర క్రికెటర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. దీంతో అతడు టెస్టులకు గుడ్‌బై చెప్పనున్నాడనే ప్రచారం మరింత ఊపందుకుంది.ఇక బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024-25లో జడేజా పర్వాలేదన్పించాడు. మిగితా క్రికెటర్లతో పోలిస్తే కాస్త మెరుగ్గానే కన్పించాడు. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన జడ్డూ.. 27 సగటుతో 135 పరుగులు చేశాడు.అదే విధంగా బౌలింగ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు 80 టెస్ట్‌లు ఆడిన జడేజా 3, 370 పరుగులు చేసి 323 వికెట్లు పడగొట్టాడు. కాగా సిరీస్‌ను 3-1 తేడాతో భారత్‌ కోల్పోయిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ సిరీస్‌ మధ్యలోనే స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. వన్డేల్లో డౌటే..ఇక ఇప్పటికే టీ20లకు విడ్కోలు పలికిన రవీంద్ర జడేజా.. వన్డేల్లో ఆడేది కూడా అనుమానమే. ప్రస్తుత పరిస్థితుల దృష్టా భారత వన్డే జట్టులో జడేజా చోటు ప్రశ్నర్ధాకంగా మారింది. జడేజా వన్డే కెరీర్‌ ముగిసినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఇంగ్లండ్‌తో వన్డేలు, ఛాంపియన్స్‌ ట్రోఫీకి అతడి స్దానంలో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ పేర్లను సెలక్టర్లు పరిశీలిస్తున్నారు. వీరిద్దరూ ఇప్పటికే తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకున్నారు. ఇంగ్లీష్‌ జట్టుతో సిరీస్‌కు, ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టును బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. ఒకవేళ ఈ జట్టులో జడ్డూ చోటు దక్కకపోతే పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికే అవకాశముందని క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు 197 వన్డేలు ఆడిన జడేజా 2756 పరుగులతో పాటు 220 వికెట్లు తీసుకున్నాడు.చదవండి: CT 2025: ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు స్టార్‌ ప్లేయర్‌ రిటైర్మెంట్‌..

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
National View all
title
రూ.2026 కోట్ల నష్టం.. ఢిల్లీ మద్యం పాలసీపై కాగ్ తాజా రిపోర్టు

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

title
ప్రియురాలి మృతదేహాన్ని 9 నెలలుగా ఫ్రిడ్జ్‌లో దాచి..

దేశంలోని పలు ప్రాంతాల్లో హృదయవిదారక దారుణాలు చోటుచేసుకుంటున్నాయి.

title
అయోధ్యలో ఘనంగా ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవాలు

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన మొదటి వార్షికోత్స

title
Delhi Election: 29 సవాల్‌

దేశరాజధాని ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి.

title
Lal Bhadur Shastri: నాటి ప్రధాని అభ్యర్థనతో దేశమంతా ఉపవాసం

దేశానికి సేవలు అందించిన మహనీయులను స్మరించుకోవడం దేశవాసులుగా మన కర్తవ్యం.

NRI View all
title
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా

ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్

title
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!

అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్‌ దిగ్గజం యాపిల్‌ 185 మంది ఉద్యోగులను త

title
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి

title
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)

title
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్‌..!అచ్చం భారత్‌లో..

ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్‌ బిజినెస్‌లు.

Advertisement
Advertisement