Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Clash Between Brs And Congress Workers In Bhuvanagiri1
భువనగిరి బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడి

సాక్షి, భువనగిరి: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. భువనగిరి బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సీఎంపై బీఆర్‌ఎస్‌ నేత కంచర్ల వ్యాఖ్యలకు నిరసనగా దాడికి దిగారు. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తల దాడిలో ఫర్నీచర్‌ ధ్వంసమైంది.కాగా, సీఎం రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి భువనగిరిలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు మండిపడుతున్నారు. సీఎం పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై దాడి చేసి కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు కార్యాలయం భారీగా చేరుకున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తామంటున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. భువనగిరి పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళనకు దిగారు.బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై దాడిని ఖండించిన కేటీఆర్‌బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపైన కాంగ్రెస్ శ్రేణుల దాడిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటుగా మారిందన్నారు. ఇందిర రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండా రాజ్యం చెలాయిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ గుండాలను పంపి దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అని కేటీఆర్‌ పేర్కొన్నారు.ఎన్నుకున్న ప్రజలతో పాటు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. పదేళ్లపాటు ప్రశాంతంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం, ఈ రోజు అరాచకాలకు చిరునామాగా మారిందని, దాడులు, గుండాగిరి తమ మార్కు పాలన అని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించుకుంటుందన్నారు. మా పార్టీ కార్యకర్తల జోలికి, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. వెంటనే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు, వారి వెనుక ఉన్న నలగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ఎటు చూసినా సంక్రాంతి రద్దీ.. ప్రత్యేక రైళ్లతో ప్రయాణికులకు చుక్కలే

Bhumana Karunakar Reddy Challenges Minister Anam Ramanarayana Reddy2
నిజమైతే నిరూపించండి.. మంత్రి ఆనంకు భూమన సవాల్‌

సాక్షి, తిరుపతి: తిరుపతి తొక్కిసలాట(tirupati stampede)లో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించిన సందర్భంగా.. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy) చేసిన అర్థం లేని ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) వీడియో ద్వారా ధీటుగా బదులిచ్చారు.భూమన కరుణాకర్‌రెడ్డి ఏమన్నారంటే..:‘మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాపై చేసిన ఆరోపణలు దారుణంగా ఉన్నాయి. నిజానికి మీ నిర్వాకం వల్ల ఆరుగురు మరణిస్తే, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సింది పోయి, జగన్‌పై ఆరోపణలు చేశారు. ఇది కచ్చితంగా మీరు స్థాయి దిగజారి మాట్లాడటమే. ఇంత హీనంగా మాట్లాడగలనని మీకు మీరు నిరూపించుకున్నారు. మీ మాటలతో తొక్కిసలాటలో మరణించిన వారి బంధువులు, క్షతగాత్రులను దారుణంగా అవమానించారు’.‘తొక్కిసలాట బాధితులపై సానుభూతి చూపాల్సింది పోయి, పరామర్శించి ఆర్థిక సాయం చేయాల్సింది పోయి.. మేం డబ్బులిచ్చి మిమ్మల్ని తిట్టించడానికి వాడుకున్నామనడం రాజకీయం కాదా?. దీన్ని బట్టే ఎవరు రాజకీయం చేస్తున్నారో తేటతెల్లం అవుతోంది. మీకు క్షతగ్రాత్రుల మీద కూడా సదభిప్రాయం లేదని అర్థమవుతోంది. వారు మీ గురించి మాట్లాడలేదని మీరు ఇలా మాట్లాడుతారా? మీ అస్తిత్వానికి ఇబ్బంది వస్తుందని ఇలా ఆరోపణలు చేస్తారా?’.‘మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే ట్రాక్టర్లు అడ్డుపెట్టి అడ్డుకోవాలనుకోవడం దారుణం కాదా?. కనీస భధ్రత ఇవ్వాలని కూడా తెలియదా?. జగన్‌ ఆస్పత్రికి వస్తున్నారని తెలిసి కూడా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అంతసేపు అక్కడెందుకు ఉన్నారు?. అది కావాలనే ఉద్దేశపూర్వకంగా చేసింది కాదా?. జగన్‌ ఆసుపత్రికి రాకుండా కుట్ర చేసిన మాట నిజం కాదా?’.ఇదీ చదవండి: బాబు డ్రామాలో పవన్‌ బకరా!‘మిమ్మల్ని తిట్టించడం కోసం మేం ఆస్పత్రిలో డబ్బులిచ్చామన్నది సీసీ కెమెరాలో రికార్డయిందని అంటున్నారు కదా?. ఆనం రామనారాయణ రెడ్డికి సవాల్‌ చేస్తున్నాం. తొక్కిసలాట క్షతగాత్రులతో మిమ్మల్ని తిట్టించడం కోసమే మేము వారికి డబ్బులు ఇచ్చామంటున్నారు కదా!. ఒకవేళ అది నిజమైతే, మీకు నిజంగా దేవుడిపై భక్తి కలిగి ఉంటే మేం కేవలం మిమ్మల్ని తిట్టించడం కోసమే తొక్కిసలాట క్షతగాత్రులకు డబ్బులిచ్చినట్లు మీరు నిరూపించాలి. ఆ పని చేయలేకపోతే వెంటనే మీ పదవికి రాజీనామా చేయాలి’.‘నిజానికి జగన్‌ వచ్చేవరకు మమ్మల్ని ఆసుపత్రి వైపు మీ పోలీసులు, అధికార గణం వెళ్లనీయలేదు. ఆ విషయం గుర్తుంచుకొండి. చంద్రబాబు పాలనపై ప్రజలకు ఏ అభిప్రాయం ఉందో ఇప్పటికే అందరికీ అర్థమవుతోంది. మీరు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నా.. మీ పార్టీలో ఎవరూ గుర్తించడం లేదనే మీరు, ఇలా ఆరోపణలు చేశారనేది స్పష్టంగా అర్థమవుతోంది’’ అని భూమన పేర్కొన్నారు.

South Korea Plane Incident: Back Box stopped 4 minutes before Crash3
South Korea: బ్లాక్‌బాక్స్‌ సైలెన్స్‌!!

దక్షిణ కొరియా ఘోర విమాన ప్రమాదంపై ఆ దేశ రవాణా శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రమాదానికి సరిగ్గా నాలుగు నిమిషాల ముందే విమానంలో బ్లాక్‌ బాక్సు పని చేయకుండా పోయిందని ప్రకటించింది. దీంతో కేసు దర్యాప్తు మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.179 మంది ప్రాణాలను బలిగొన్న జెజు విమానం శకలాల నుంచి బాక్‌ బాక్స్‌ను సేకరించి అధికారులు విశ్లేషించారు. అయితే అందులో ఎలాంటి సమాచారం లేకపోయేసరికి అధికారులు ఆశ్చర్యపోయారు. దీంతో.. అమెరికాలోని ట్రాన్స్‌పోర్టేషన్‌‌ సేఫ్టీ బోర్డు ల్యాబోరేటరీకి పంపించారు. యూఎస్‌ సేఫ్టీ రెగ్యులేటరీ సహకారంతో డాటా రికార్డర్‌ను విశ్లేషిస్తున్నట్లు దక్షిణ కొరియా ప్రకటించింది.‘‘రక్షణగోడను ఢీకొట్టి ప్రమాదం జరగడానికి నాలుగు నిమిషాల ముందే విమానంలో ఉండే బ్లాక్‌ బాక్సుల్లో ఎలాంటి డేటా రికార్డు కాలేదని దర్యాప్తులో భాగంగా వెల్లడైంది. అసలు ఆ డేటా పోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నాం ’’ అని మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే దర్యాప్తులో కీలకమైన ఈ సమాచారం కోల్పోవడంతో ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలుసుకోవడం కష్టంగా మారే అవకాశం లేకపోలేదు. అయితే ఇది అత్యంత అరుదైన ఘటన అని మాజీ అధికారి సిమ్‌ జై డోంగ్‌ అంటున్నారు. ఇలా బ్లాక్‌బాక్స్‌లు మూగబోయిన సందర్భాలు గతంలోనూ నమోదయ్యాయని చెబుతున్నారాయన.ఇటీవల జెజు ఎయిర్‌ విమానం థాయ్‌లాండ్‌ నుంచి 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో దక్షిణ కొరియా ముయాన్‌కు బయలుదేరింది. మరో అయిదు నిమిషాల్లో క్షేమంగా దిగుతామనుకుంటుండగా.. విమానం రన్‌వేపై జారుతూ.. నిప్పురవ్వలు రాజేస్తూ రక్షణగోడ వైపు దూసుకెళ్లి, గోడను ఢీకొట్టి, పేలిపోయింది. విమాన వెనుక భాగంలో కూర్చున్న ఇద్దరు మినహా మిగతా వాళ్లంతా ప్రాణాలు కోల్పోయారు.Death toll from the crash of a Jeju Air passenger plane during landing in South Korea has risen to 96▪️ The plane failed to deploy its landing gear on the first attempt and crashed during an emergency landing on the second attempt▪️ The aircraft veered off the runway and… pic.twitter.com/8uDMwRcIpn— Anadolu English (@anadoluagency) December 29, 2024అనుమానాలెన్నో..విమానాన్ని పక్షి ఢీ కొట్టిందనే సమాచారాన్ని పైలట్లు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సమాచారం అందించారు. అయితే అత్యవసర ల్యాండింగ్‌కు విమానం ఒకసారి ప్రయత్నించి విఫలమైంది. ఈ క్రమంలో రెండోసారి సింగిల్‌ రన్‌వేపై దిగగా ల్యాండింగ్‌ గేర్‌ సమస్యతో దూసుకెళ్లి అక్కడున్న గోడను ఢీ కొట్టింది. అయితే విమాన ప్రమాదం జరిగిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవై దర్యాప్తు జరుగుతున్న తీరుపైనా బాధిత కుటుంబాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే.. లోకలైజర్‌ను రన్‌వే చివర.. అదీ అంతటి గట్టి పదార్థంతో నిర్మించాల్సిన అవసరం ఏంటనే కోణంలో దర్యాప్తు జరగాల్సి ఉంది.

UP Kannauj Railway Station Collapses Incident Latest Updates4
Kannauj: రైల్వే స్టేషన్‌లో కూలిన నిర్మాణం.. శిథిలాల కింద పలువురు!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ప్రమాదం జరిగింది. కన్నౌజ్‌ రైల్వే స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు కూలిపోయింది. దీంతో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాల కింద కనీసం 20 మంది చిక్కుకుని ఉండొచ్చని ప్రాథమిక సమాచారం. ఇప్పటివరకు 12 మందిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్‌(DM) శుభ్రాంత్‌ కుమార్‌ శుక్ల్‌ తెలిపారు. కన్నౌజ్‌ రైల్వే స్టేషన్‌లో ఆధునికీకరణ పనుల్లో భాగంగా పలు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం రెండో అంతస్తులో ఉన్న పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో 35 మంది కూలీలు అక్కడ ఉన్నట్లు సమాచారం.ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు.

Sanju New Yuvraj Singh Ex India Batting Coach Impressed With Six Hitting Ability5
సిక్సర్లు బాదడంలో యువీ తర్వాత అతడే!

సంజూ శాంసన్‌(Sanju Samson)కు తాను పెద్ద అభిమానినైపోయానని టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌(Sanjay Manjrekar) అన్నాడు. గతంలో బ్యాటింగ్‌ బాగా చేసినా.. పరుగులు రాబట్టలేక ఇబ్బంది పడేవాడని.. ఇప్పుడు మాత్రం దుమ్ములేపుతున్నాడని ప్రశంసించాడు. సంజూ ఆట తీరుకు తాను ఫిదా అయ్యానంటూ కితాబులిచ్చాడు. రానున్న కాలంలో ఈ కేరళ బ్యాటర్‌ అద్భుతాలు చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.కాగా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌కు అద్భుత నైపుణ్యాలున్నా.. నిలకడలేమి ఆట తీరుకు మారుపేరని అపవాదు ఉంది. అయితే, ఇటీవల అంతర్జాతీయ టీ20లలో అతడి ఆట తీరు అభిమానులతో పాటు విమర్శకులనూ మెప్పించింది. తొలుత స్వదేశంలో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డ సంజూ.. సౌతాఫ్రికా గడ్డ మీద కూడా రెండు సెంచరీలతో రాణించాడు.బంగ్లాదేశ్‌పై 47 బంతుల్లోనే 111 పరుగులు సాధించిన సంజూ శాంసన్‌.. ఆ తర్వాత సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో 107, 109 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో సొంతగడ్డపై ఇంగ్లండ్‌(India Vs England)తో టీ20 సిరీస్‌ ఆడనున్న భారత జట్టులో అతడికి చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. సంజూ అలాంటి వాడేఈ నేపథ్యంలో కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ షో లో మాట్లాడుతూ.. ‘‘ఆత్మవిశ్వాసం.. పరిణతితో కూడిన బ్యాటింగ్‌.. వికెట్‌కు విలువ ఇచ్చే విధానం.. సంజూలోని ఈ గుణాలు నన్ను ఆకట్టుకున్నాయి. అతడు సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడలేడని, నిలకడలేని ఆటగాడని విమర్శలు ఉండేవి. కానీ ఇప్పుడు అద్భుతంగా ఆడుతున్నాడు. కొంతమంది ఆలస్యంగా పేరు తెచ్చుకుంటారు. సంజూ అలాంటి వాడే. నేనిప్పుడు అతడికి వీరాభిమానిని. గతంలో అతడు బ్యాటింగ్‌ మాత్రమే బాగా చేస్తాడు.. పరుగులు చేయడని అంతా అంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు రెండూ బాగానే చేస్తున్నాడు’’ అని ప్రశంసలు కురిపించాడు.ఇక ఇదే షోలో మరో మాజీ క్రికెటర్‌, టీమిండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ సైతం సంజూ గురించి ప్రస్తావన రాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్రస్తుతం అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌లలో బాగా ఆడితే.. బ్యాటర్‌పై కాస్త ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా అతడు మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయగలుగుతాడు.సిక్సర్లు బాదడంలో యువీ తర్వాత అతడే!టాపార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం అతడికి సానుకూలాంశం. వికెట్‌ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని ఉండదు. అంతేకాదు.. సంజూ సిక్స్‌ హిట్టర్‌. ఎంతో ఈజ్‌తో సిక్సర్లు బాదుతాడు. యువరాజ్‌ సింగ్‌ తర్వాత.. అదే స్టైల్లో సిక్స్‌లు కొట్టగల మరో బ్యాటర్‌ సంజూ శాంసనే. అతడు పరుగుల వరద పారిస్తుంటే చూడటానికి చక్కగా ఉంటుంది’’ అని సంజయ్‌ బంగర్‌ కొనియాడాడు.కాగా జింబాబ్వేతో టీ20 సిరీస్‌ ద్వారా 2015లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సంజూ శాంసన్‌.. ఆ తర్వాత ఆరేళ్లకు వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. 37 టీ20లు, 16 వన్డేలు ఆడాడు. వన్డేల్లో ఓ శతకం సాయంతో 510 పరుగులు చేయగా.. టీ20లలో మూడు సెంచరీల సహాయంతో 810 రన్స్‌ సాధించాడు. ఇదిలా ఉంటే.. జనవరి 22 నుంచి టీమిండియా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ మొదలుపెట్టనుంది.చదవండి: IND Vs IRE 1st ODI: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. వన్డేల్లో ఫాస్టెస్ట్‌గా..

KSR Comment: Pawan Became Bakara In Tirupati Stampede Row6
బాబు డ్రామాలో పవన్‌ బకరా!

తిరుపతిలో జరిగిన ఘోరమైన తప్పిదాన్ని కూటమి ప్రభుత్వం ‘సారీ’లతో ముగించేస్తోందా?. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే తన వంతు పాత్ర పోషించి పరువు పోగొట్టుకుంటే.. టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఏకంగా పవన్‌ గాలి తీసేందుకే ప్రాధాన్యమిచ్చి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. దీంతో మొత్తం కథ అడ్డం తిరిగినట్లు అయ్యింది. చివరకు బీఆర్‌ నాయుడు చర్యతో టీడీపీ అధిష్టానం కూడా కంగు తినాల్సిన పరిస్థితి. అయితే..స్వయంగా రంగంలోకి దిగి ఆయనతోనూ ఓ సారీ చెప్పించాల్సి వచ్చింది. మొత్తమ్మీద చూస్తే.. ఈ వ్యవహారంలో అసలు ఎవరి తప్పూ లేనట్టుగా తేల్చేసి అటు ప్రభుత్వాధినేతలు.. ఇటు టీటీడీ ఉన్నతాధికారులూ జారుకున్నారు. స్వామివారిపై భక్తితో భక్తులు తిరుమతి రావడమే తప్పు అని చెప్పడమే తరువాయి!!.వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం టోకన్ల జారీ కాస్తా తొక్కిసలాటకు దారితీయడం ఆరుగురు మరణించడం వెనుక టీటీడీ, పోలీసుల వైఫల్యం, అలసత్వం సుస్పష్టం. పైరవీలతో టీటీడీ ఛైర్మన్‌, బోర్డు సభ్యులను నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వాన్ని పరోక్షంగా నడుపుతున్న లోకేష్‌ల బాధ్యతారాహిత్యం కూడా కనపడతూనే ఉంది. అంత పెద్ద ఘోరం జరిగినా దాన్ని చిన్నదిగా చూపేందుకు ప్రయత్నించారు. ఇతర అంశాలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టి మరల్చేందుకూ చూశారు. సహకరించే మీడియా ఉండనే ఉంది. దానికి అనుగుణంగానే టీడీపీ జాకీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి తమ వంతు పాత్ర పోషించాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అనవసరంగా అప్రతిష్టపాలైంది పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఆటలో అరటి పండు చందంగా ఎవరూ పట్టించుకోనిది.. ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి!. అందుకేనేమో.. ఆయన తన ఉనికి కాపాడుకోవడానికి ఏవో పిచ్చి ఆరోపణలు చేశారు.గాయపడ్డ వారిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వేర్వేరుగా వెళ్లారు. సాధారణంగా ముఖ్యమంత్రి వెంటే మంత్రులు ఉండటం రివాజు. కానీ వేరే పార్టీ అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్‌ విడిగా వెళ్లి కొంత స్వతంత్రంగా వ్యవహరించారని చాలామంది భావించారు. జరిగిన తప్పుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు భక్తులకు క్షమాపణ చెప్పాలని పవన్‌ డిమాండ్‌ చేయడమే కాకుండా, ప్రభుత్వం తరుఫున తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు కూడా. అంతా ఓకే అనుకుంటున్న సమయంలోనే పవన్‌.. తొక్కిసలాటలో కుట్ర కోణం ఉందా? అని ప్రశ్నించి బాబు దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశారు.భక్తులకు క్షమాపణ చెప్పాలన్న పవన్ మాటలను టీటీడీ బాధ్యులు ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. దాంతో పవన్ పిఠాపురంలో సభలో కూడా మళ్లీ అదే డిమాండ్ చేశారు. అప్పుడే పవన్ ఈ ఉదంతం నుంచి చంద్రబాబును, టీడీపీని రక్షించే యత్నం చేస్తున్నారన్న సందేహం కలిగింది. కాకపోతే ఈ విషయం అర్థం బీఆర్‌ నాయుడు పవన్ కల్యాణ్‌ ఎవరో అన్నట్లుగా మాట్లాడి గాలి తీశారు. ఎవరో ఏదో చెప్పారని తానెందుకు స్పందిస్తానని అనడం ద్వారా ఈ వ్యవహారానికి కొత్త ట్విస్టు ఇచ్చారు. ఇది కాస్తా పవన్ వర్గానికి చిర్రెత్తించింది. చంద్రబాబుకు వెంటనే నిరసన చెప్పి ఉండాలి. ఆ వెంటనే చంద్రబాబు రంగంలో దిగి బీఆర్‌ నాయుడును ఆదేశించడంతో ఆయన తప్పనిసరి స్థితిలో సారీ చెప్పి, తన వ్యాఖ్యలు పవన్‌ను ఉద్దేశించి కాదని బుకాయించే యత్నం చేశారు.నిజానికి పవన్ కళ్యాణ్ కూడా ఇతర మంత్రుల మాదిరే ఒక మంత్రి. కాకపోతే ఉప ముఖ్యమంత్రి. ఈయనకేమీ ప్రత్యేక అధికారాలు ఉండవు. ఇతర మంత్రులపై, తనకు సంబంధం లేని ప్రభుత్వ సంస్థలపై అధికారం ఉండదు. అయితే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించవచ్చు. ఈ అవకాశాన్ని వాడుకుని స్వతంత్రంగా వ్యక్తిత్వంతో తిరుపతిలో తొక్కిసలాటపై మాట్లాడారులే అనుకున్న వారికి కొద్ది గంటలలోనే ఆయన అసలు స్వరూపం తెలిసిపోయింది.చంద్రబాబు నాయుడు సూచనల మేరకే పవన్ ఈ కథ నడిపారన్న విశ్లేషణ వస్తోంది. లేకుంటే పవన్ తిరుపతి ఆస్పత్రిలోని బాధితులను సందర్శించి టీటీడీ చైర్మన్ తదితరులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం ఏమిటి? ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఎవరెవరు బాధ్యులో వారందరిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని అడగాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని అనాలి. అవేవి చేయకుండా క్షమాపణల డ్రామా ఆరంభించారు. దీంతో తనకేదో పేరు వస్తుందని కూడా అనుకుని ఉండవచ్చు. కానీ అసలు విషయం బయటపడ్డాక, పవన్ కల్యాణ్‌ మళ్లీ భక్తులను, ప్రజలను మోసం చేశారని తేటతెల్లమవుతోందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పిన అబద్ధాలను భుజాన వేసుకుని ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ ఆరుగురు మరణించిన ఘటనలో ఆ ఊసే ఎత్తకపోవడాన్ని అంతా గుర్తిస్తున్నారు. అప్పుడు వేసుకున్న సనాతని వేషాన్ని ఇప్పుడు ఎందుకు ధరించలేదని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా హైందవ ధర్మాన్ని రక్షించడమా అని అడుగుతున్నారు.గతంలో చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ యావ కారణంగా రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే కూడా పవన్ నోరు విప్పలేదు. ఇప్పుడేమో తిరుపతిలో ఎన్నడూ జరగని దారుణ ఘటన జరిగితే, దానిని సైడ్ ట్రాక్ చేయడానికి అన్నట్లుగా అదేదో తనకు పవర్ ఉన్నట్లుగా హడావుడి చేసి చివరికి సారీలతో తుస్సుమనిపించారు. విశాఖ ప్రధాని సభలో తనతో సమానంగా లోకేష్ కు కూడా ప్రాధాన్యత ఇవ్వడంపై, ప్రచార ప్రకటనలలో లోకేష్ ఫోటో కూడా వేయడంపై పవన్ కు కొంత అసంతృప్తి ఉందని, దానిని పరోక్షంగా వ్యక్తం చేయడానికి తిరుపతి వెళ్లి తొక్కిసలాటకు తానే బాధ్యుడిని అన్నట్లు క్షమాపణ చెప్పారని కొందరు అనుకుంటున్నారు. పవన్ చర్య కొంత మంది టీడీపీ వారికి కూడా కోపం తెప్పించింది.ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు, పవన్ లు కలిసే ఈ కథ నడిపించారన్న అభిప్రాయం చివరికి కలుగుతుంది. కాకపోతే బీఆర్‌ నాయుడు తెలివితక్కువ వల్ల ఈ విషయం అంతా గందరగోళమై పవన్ పరువు పోయినట్లయింది. ఈ మొత్తం ‍వ్యవహారంలో కులాల గొడవ రావడం కూడా గమనించవలసిన అంశమే. కమ్మ సామాజిక వర్గం వారిని కాపాడుకుని మిగిలిన వారిని బలి చేస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.తాజాగా పాలక మండలి సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావును ఒంటరి చేసి బోర్డు ఛైర్మన్, సభ్యులు మాటల దాడి చేశారట. అంతేకాక ,శ్యామలరావు దేవాలయానికి వెళ్లినా అధికారులు ఎవరూ ఆయనతో మాట కలపలేదట!. దీనిని బట్టి ఆయనను బదిలీ చేస్తున్నారన్న ప్రచారం ఆరంభమైంది. బీసీ వర్గానికి చెందిన శ్యామలరావును అవమానించి బలి చేస్తారా? ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. తానేదో మానవత్వం ఉన్న వ్యక్తిగాను, అల్లు అర్జున్ వంటివారికి అది తెలియనట్లుగాను మాట్లాడిన పవన్ పిఠాపురంలో వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతూ ప్రమాదంలో మరణించిన ఇద్దరు యువకుల కుటుంబాలను వారి ఇళ్లకు వెళ్లి పవన్ పరామర్శిస్తారని అనుకున్నారు. కానీ ఆయన అలా చేయలేదు. వారి గ్రామాల నుంచి పిఠాపురం రప్పించారట. పవన్ సంక్రాంతి సంబరాలలో పాల్గొంటే బాధిత కుటుంబాల వారు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉసూరు మంటూ ఉదయం నుంచి అక్కడే కూర్చున్నారట. అయినా అంతిమంగా ఆయన వారిని పలకరించకుండానే వెళ్లిపోయారు. దాంతో బాధిత కుటుంబాలు తమవాళ్లు పోయారన్న విషాదంతో పాటు, ఈ అవమానపు బాధను కూడా భరించవలసి వచ్చింది.ఏది ఏమైనా రాజకీయాలలో ఎల్లప్పుడూ డ్రామానే పండదు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నట్లు ఆంధ్ర ప్రజలకు సినిమా వైబ్ అనండి.. పిచ్చి అనండి ఎక్కువగానే ఉండవచ్చు. వారివల్లే పవన్ వంటివారు అధికారంలోకి వచ్చి ఉండవచ్చు. కానీ సినిమా పిచ్చే ఎప్పటికీ ఉంటుందా? అనేది ఇక్కడ అసలు ప్రశ్న. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Dil Raju Apologises Over His Telangana Culture Comments7
తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్‌ రాజు

సంక్రాంతి బరిలో గేమ్‌ ఛేంజర్‌ దిగిపోగా రేపు డాకు మహారాజ్‌ ఎంట్రీ ఇవ్వనుంది. జనవరి 14 సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు గేమ్‌ ఛేంజర్‌, ఇటు సంక్రాంతికి వస్తున్నాం.. ఈ రెండు సినిమాలకు దిల్‌ రాజే నిర్మాత. అందుకే క్షణం తీరిక లేకుండా ప్రమోషన్ల కోసం అటూ ఇటు పరుగులు తీస్తున్నారు.నిజమాబాద్‌లో ఈవెంట్‌ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను తన సొంత జిల్లా నిజామాబాద్‌లో నిర్వహించారు. ఈసారి స్పీచ్‌ మామూలుగా ఉండొద్దు.. ఒక్క దెబ్బకు వైరల్‌ అయిపోవాలని యాంకర్‌ శ్రీముఖి కోరడం.. ఇప్పుడు చూడు, నా తడాఖా చూపిస్తా అన్న రేంజ్‌లో దిల్‌ రాజు రెచ్చిపోవడం జరిగాయి. ఈ క్రమంలోనే స్టేజీపై హుషారుగా మాట్లాడాడు.దిల్‌ రాజు హుషారైన స్పీచ్‌స్టేజీపై ఉన్న హీరో వెంకటేశ్‌ను చూస్తూ.. సర్‌, మా నిజామాబాద్‌ల తెల్ల కల్లు ఫేమస్‌. పొద్దునపూట నీర తాగితే వేరే లెవల్‌ ఉంటుంది. మా వోళ్లకు (తెలంగాణ ప్రజలకు) సినిమా అంటే అంత ఆసక్తి ఉండదు. అదే ఆంధ్రకు వెళ్తే సినిమాకు స్పెషల్‌ వైబ్‌ ఇస్తారు. తెలంగాణలో మటన్‌, తెల్లకల్లుకే వైబ్‌ ఇస్తారు అని స్పీచ్‌ దంచుకుపోయాడు. ఆయన స్పీచ్‌కు అక్కడున్నవారు చప్పట్లు కొట్టినా సోషల్‌ మీడియాలో మాత్రం మిశ్రమ స్పందన లభించింది. తెలంగాణవాసి అయ్యుండి మన ప్రాంతాన్ని కించపరిచేలా మాట్లాడతాడా? అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదంపై దిల్‌ రాజు (Dil Raju) స్పందించాడు.(చదవండి: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట)దావత్‌ గురించి మాట్లాడా..మొన్నీ మధ్య నిజామాబాద్‌లో సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్‌ చేశాం. నిజామాబాద్‌ పట్టణంలో పెద్దగా సినిమా ఈవెంట్లు జరగవు. అప్పట్లో ఫిదా సక్సెస్‌ మీట్‌ చేశాం.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనేది చేశాం. నిజామాబాద్‌వాసిగా ఆ జిల్లాతో నాకున్న అనుబంధం అలాంటిది! అందుకే అక్కడ ఈ మూవీ ఈవెంట్‌ చేశాం. అప్పుడు నేను మన కల్చర్‌లో ఉండే దావత్‌ గురించి మాట్లాడాను. తెల్ల కల్లు, మటన్‌ గురించి మాట్లాడాను. నా మాటలతో తెలంగాణవాళ్లను అవమానించానని, తెలంగాణను హేళన చేశానని కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.క్షమించండినా ఉద్దేశమేంటో అదే స్పీచ్‌లో చెప్పాను. మన కల్చర్‌, దావత్‌ నేను మిస్‌ అవుతున్నాను.. సంక్రాంతికి నా రెండు సినిమాలు రిలీజయ్యాక తెలంగాణ దావత్‌ చేసుకోవాలనుందని చెప్పాను. మన విధానాలను నేను అభిమానిస్తాను. అది అర్థం చేసుకోకుండా సోషల్‌ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారు. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతినుంటే క్షమించండి అని చెప్పుకొచ్చాడు.ఎలా అనుకున్నారు?నిజామాబాద్‌ జిల్లాలోని బాన్సువాడలో ఫిదా సినిమా షూటింగ్‌ చేశాం. మనం కుటుంబానికి ఎంత విలువిస్తాం, మన కల్చర్‌ ఏంటనేది ఆ మూవీలో చూపించాం. ఫిదా ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్టయిందో తెలుసు. అలాగే బలగం చిత్రాన్ని కూడా అందరూ గుండెకు హత్తుకున్నారు​. తెలంగాణవాసిగా మన రాష్ట్రాన్ని అభిమానించే నేను హేళన చేస్తానని ఎలా అనుకున్నారో అర్థం కావడం లేదు. మీ మనో భావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి. రాజకీయాల్లోకి లాగకండిఎఫ్‌డీసీ చైర్మన్‌గా సినిమాకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ హైదరాబాద్‌లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఉంచుతాను. తెలంగాణలో ఉండే రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి. నన్ను రాజకీయాల్లోకి లాగకండి. ఎఫ్‌డీసీ సినిమాకు సంబంధించిందే కానీ రాజకీయాలకు సంబంధించినది కాదు. ఎఫ్‌డీసీ, నేను సినిమాలకే ఉపయోగపడతాం. అవసరంలేని విషయాల్లో నన్ను లాగొద్దని కోరుతున్నాను అన్నాడు. #DilRaju garu has spoken out about the Nizamabad incident, offering his sincere apologies to anyone who may have been hurt. He has requested not to associate him with politics in any way. pic.twitter.com/X9W3grU8O0— Sri Venkateswara Creations (@SVC_official) January 11, 2025 చదవండి: ప్రభాస్‌ పెళ్లి ఎవరితో.. రివీల్‌ చేసిన రామ్‌ చరణ్‌

Delhi Liquor Policy CAG Report RS 2000 Crore Loss Lapses AAP Kickbacks8
రూ.2026 కోట్ల నష్టం.. ఢిల్లీ మద్యం పాలసీపై కాగ్ తాజా రిపోర్టు

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటువంటి తరుణంలో వచ్చిన కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్ జనరల్(కాగ్‌) రిపోర్టు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు మరిన్ని తలనొప్పులు తెచ్చేదిగా మారింది. ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన ఎక్సైజ్ విధానంపై తాజాగా వెలువడిన కాగ్‌ రిపోర్టులో నాడు పాలసీ అమలులో చోటు చేసుకున్న పలు లోపాలు వెలుగు చూశాయి.ఢిల్లీ ప్రభుత్వం అనుసరించిన మద్యం పాలసీ(Delhi Liquor Policy) కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.2,026 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్‌ నివేదిక పేర్కొంది. ఈ డేటాను కాగ్‌ తొలిసారిగా సమర్పించింది. అయితే ఇది బీజేపీ కాగ్‌ నివేదిక అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నివేదికలోని వివరాల ప్రకారం దేశరాజధానిలో మద్యం వ్యాపారం నష్టాల్లో ఉన్నప్పటికీ ఆప్‌ ప్రభుత్వం కొంతమంది బిడ్డర్లకు లైసెన్సులు ఇచ్చిందని కాగ్‌ నివేదిక పేర్కొంది. ఎక్సైజ్ విధానాన్ని అమలు చేయడంలో ప్రధాన లోపాలను ఈ నివేదిక ప్రస్తావించింది. ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాల కారణంగా సర్కారుకు దాదాపు రూ.2,026 కోట్ల నష్టం(RS 2000 Crore Loss) వాటిల్లింది.ఈ నష్టానికి సామాన్యులు మూల్యం చెల్లించాల్సి వచ్చిందని, ఆప్ నేతలు మాత్రం భారీగా కమీషన్లు అందుకున్నారని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది.నాడు ఎక్సైజ్ శాఖకు సారధ్యం వహించిన మనీష్ సిసోడియాతో పాటు అతని మంత్రుల బృందం.. నిపుణుల ప్యానెల్ సిఫార్సులను విస్మరించిందని నివేదిక పేర్కొంది. మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ నిబంధనలు ఉల్లంఘించారని తెలిపింది. ఎక్సైజ్‌ పాలసీ అమలులో పలు కీలక నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకున్నారని నివేదిక పేర్కొంది. ఇందుకోసం కేబినెట్ నుండి లేదా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నుండి ఆమోదం తీసుకోలేదని నివేదిక తెలియజేసింది.కాగ్‌ నివేదికలోని ముఖ్యాంశాలు1. భారీ నష్టాలు: విధానంలోని లోపాల కారణంగా ప్రభుత్వానికి ₹2,026 కోట్ల నష్టం వాటిల్లింది.2. నిపుణులను విస్మరించడం: మద్యం విధానాన్ని రూపొందించే ముందు నిపుణులను సంప్రదించారు. కానీ వారి సిఫార్సులను పాటించలేదు.3. బిడ్డింగ్ అక్రమాలు: ఫిర్యాదులు ఎదుర్కొంటున్న లేదా నష్టాల్లో నడుస్తున్న కంపెనీలకు కూడా లైసెన్సులు జారీ చేశారు.4. ఆమోదం తీసుకోలేదు: అనేక కీలక నిర్ణయాలలో క్యాబినెట్, లెఫ్టినెంట్ గవర్నర్ నుండి ఆమోదం తీసుకోలేదు.5. పారదర్శకత లేకపోవడం: మద్యం ధర నిర్ణయించడంలో, లైసెన్సులు జారీ చేయడంలో పారదర్శకత లోపించింది. నియమాలను ఉల్లంఘించిన వారికి ఎటువంటి జరిమానా విధించలేదు.6. పాలసీ సరిగ్గా అమలు చేయలేదు: మద్యం నాణ్యతను తనిఖీ చేయడానికి ప్రయోగశాలలు, పరీక్షా సౌకర్యాలు కల్పించలేదు. రిటైల్ మద్యం దుకాణాలను అన్ని ప్రాంతాలకూ సమానంగా పంపిణీ చేయలేదు.7. తప్పుడు మినహాయింపులు: కోవిడ్-19 పేరుతో రూ.144 కోట్ల విలువైన లైసెన్స్ ఫీజులను మాఫీ చేశారు. అయితే అలా చేయవలసిన అవసరం లేదు.8. జోనల్ లైసెన్స్‌దారులకు ఇచ్చిన రాయితీల ఫలితంగా రూ. 941 కోట్ల నష్టం వాటిల్లింది.9. సెక్యూరిటీ డిపాజిట్లను సరిగా రికవరీ చేయకపోవడం వల్ల రూ. 27 కోట్ల నష్టం.10. ఉపసంహరించిన లైసెన్స్‌లకు టెండర్లు వేయకపోవడం వల్ల రూ. 890 కోట్ల నష్టం వాటిల్లింది.కోవిడ్-19 ఆంక్షల కారణంగా కేజ్రీవాల్ ప్రభుత్వం రూ.144 కోట్ల విలువైన లైసెన్స్ ఫీజులను మాఫీ చేసిందని నివేదిక పేర్కొంది. దీని వలన ఆదాయం మరింతగా తగ్గింది. సెక్యూరిటీ డిపాజిట్‌ను తప్పుగా డిపాజిట్ చేయడం వల్ల రూ. 27 కోట్ల నష్టం వాటిల్లిందని నివేదిక పేర్కొంది.ఇది కూడా చదవండి: ప్రియురాలి మృతదేహాన్ని 9 నెలలుగా ఫ్రిడ్జ్‌లో దాచి..

Edelweiss Mutual Fund CEO Radhika Gupta Reflects On Her Experience Working 100 Hour Weeks9
బాత్రూమ్‌లో ఏడ్చేదాన్ని: పనిగంటలపై రాధికా గుప్తా

వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి' (Narayana Murthy), 70 గంటలు కాదు.. వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్ అండ్ టీ చైర్మన్ 'సుబ్రమణ్యన్' (Subrahmanyan) పేర్కొన్నారు. తాజాగా ఇప్పుడు ఎడెల్‌వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ 'రాధికా గుప్తా' (Radhika Gupta) తాను వారానికి 100 గంటలు పనిచేశానని వెల్లడించారు.రాధికా గుప్తా ఉద్యోగంలో చేరిన మొదటి రోజుల్లో వారానికి 100 గంటలు పనిచేసాను. అలా నాలుగు నెలల పాటు పని చేసినట్లు పేర్కొన్నారు. పనిగంటలు పెరిగినంత మాత్రమే ఉత్పాతకత పెరుగుతుందనుకోవడం కేవలం ఒక భ్రమ మాత్రమే. ఇది ఉద్యోగిపై ఒత్తిడిని పెంచడమే కాకుండా.. మానసికంగా కృంగదీస్తుంది. కుటుంబాలకు సైతం దూరం చేస్తుందని అన్నారు.ఛాయిస్, హార్డ్‌వర్క్, ఆనందం పేరుతో ట్వీట్ చేస్తూ.. రాధికా గుప్తా ఒక సుదీర్ఘ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పనిగంటలపై పెద్ద డెబిట్ జరుగుతోంది. కాబట్టి ఈ అంశం మీద ట్వీట్ చేయాలా? వద్దా? అని ఆలోచించాను. అయితే వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనే అంశం మీద చెప్పడానికి ప్రయత్నిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.కష్టపడి పనిచేయడం ముఖ్యం. నేను దానిని నేర్చుకున్నాను. మనిషి ఎదగడానికి ఉన్న ఏకైక మార్గం కష్టపడిపని చేయడం అని నమ్ముతున్నాను. కష్టపడి పనిచేసే వ్యక్తి వేగంగా ఎదుగుతాడని కూడా నేను నమ్ముతానని అన్నారు.ఇక పని గంటల విషయానికి వస్తే.. నేను ఉద్యోగంలో చేరిన మొదటిరోజుల్లో, మొదటి ప్రాజెక్ట్‌లో నెలకు వారానికి 100 గంటలు, రోజుకు 18 గంటలు పని చేశాను. పని ఒత్తిడి తట్టుకోలేక ఆఫీసు బాత్రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేదాన్ని. కొన్ని సార్లు తెల్లవారుజామున 2 గంటలకు తినేదాన్ని. ఈ కారణంగానే రెండు సార్లు ఆసుపత్రిలో చేరాను. బ్యాంకింగ్, కన్సల్టింగ్ మొదలైన రంగాలలో ఉద్యోగాలు చేసే నా స్నేహితులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు.ఎక్కువ గంటలు పనిచేసినంత మాత్రాన.. ఎక్కువ ఉత్పాదకత ఉండదు. ఉన్న సమయంలో ఎంత సమర్ధవంతంగా పనిచేశామన్నదే ముఖ్యం అని రాధికా గుప్తా పేర్కొన్నారు. పని గంటలు ఎక్కువైతే.. ఆందోళన, గుండెపోటు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతూ.. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తరువాత కూడా ఇబ్బందులను కలిగిస్తుందని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ప్రపంచంలోని చాలా అభివృద్ధి చెందిన దేశాలలో ఉద్యోగులు రోజుకు గరిష్టంగా 8 గంటలు మాత్రమే పనిచేస్తారు. అయితే ఆ సమయంలో ఉత్పాదకత ఉండేలా చూసుకుంటారు. కాబట్టి సమయానికి ఆఫీసుకు రండి, చేయాల్సిన పనిని పూర్తి చేయండి. అవసరమైన సమావేశాలను మాత్రమే నిర్వహించండి, టెక్నాలజీని కావలసిన విధంగా ఉపయోగించుకోండని రాధికా గుప్తా పేర్కొన్నారు.ఇదీ చదవండి: టెక్ దిగ్గజం కీలక రిపోర్ట్: వేలాది ఉద్యోగులు బయటకుభారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి మనమందరం దోహదపడాలి. కానీ మనం అలా చేస్తున్నప్పుడు, ఆ అభివృద్ధి ఫలాలను ఆస్వాదించడానికి కూడా మనం ప్రయత్నించాలి. పని చేస్తూనే కుటుంబాలతో కలిసి ఉండటం.. పిల్లలకు మెరుగైన జీవితాలను అందించడం వంటి వాటి మీద కూడా దృష్టి సారించాలని ఆమె పేర్కొన్నారు.నేను ఎంతోమంది యువతను.. ముఖ్యంగా మహిళలకు కలుస్తుంటాను. కుటుంబం & కెరీర్ కలిసి ఉండలేవనే భయం కారణంగా తమకు కుటుంబం ఉండాలా వద్దా అని వారు నన్ను ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న నన్ను చాలా భయపెడుతుంది. అయితే ప్రతి ఒక్కరూ.. వికసిత్ భారత్ కల సాకారానికి దోహదపడుతూనే.. పని - జీవితంతో సంతోషాన్ని ఆస్వాదించాలని రాధికా గుప్తా స్పష్టం చేశారు.Choices, Hard Work and Happiness I debated whether to write this post, because the risk of being misquoted on this issue in this clickbait world is high. But I am trying to share what is a nuanced point of view on the issue of work-life balance.1. Hard work is important and…— Radhika Gupta (@iRadhikaGupta) January 11, 2025

Special Train Delay of Sankranti Train10
సంక్రాంతి రద్దీ.. ప్రయాణికులకు చుక్కలే!

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి రద్దీ మొదలైంది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో నగర వాసులు సొంత ఊళ్లకు తరలివెళ్తున్నారు. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్‌ రైళ్లలో రిజర్వేషన్‌లు పూర్తిగా నిలిచిపోయి రిగ్రేట్‌ దశకు చేరాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి టెర్మినల్ నుంచి కాకినాడ, తిరుపతి, విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాలకు కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది నగరవాసులు సొంత ఊళ్లకు తరలి వెళ్తుండగా.. అరకొరగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు ఏ మాత్రం ప్రయాణికుల డిమాండ్‌లను భర్తీ చేయడం లేదు. మరోవైపు అన్ని ప్రత్యేక రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అతికష్టంగా బెర్తులు సంపాదించి రైలెక్కినా గంటల తరబడి పట్టాలపైనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. సికింద్రాబాద్‌ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరితే మరుసటి రోజు మధ్యాహ్నం 12 దాటినా విశాఖకు చేరుకోలేకపోయామని కూకట్‌పల్లికి చెందిన కృష్ణారావు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి శబరిమలకు నడిచే రైళ్లు కూడా అయ్యప్ప భక్తులకు నరకం చూపుతున్నాయి. రెండు రోజులు గడిచినా హైదరాబాద్‌ నుంచి శబరిమలకు, తిరిగి అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోలేకపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చార్జీలు కూడా ‘ప్రత్యేకమే’.. ⇒నగరం నుంచి ప్రతి రోజు సుమారు వందకు పైగా రెగ్యులర్‌ రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. సుమారు 2.5 లక్షల మంది ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం రోజుకు మరో 50 వేల మంది అదనంగా బయలుదేరే అవకాశం ఉంది. ఈ డిమాండ్‌ మేరకు అదనపు రైళ్లు లేవు. కొన్ని రైళ్లలో బెర్తులు, అదనపు బోగీలు ఏర్పాటు చేశారు. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు మాత్రం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. కానీ ఈ రైళ్లలో చార్జీలు కూడా ఎక్కువే. సాధారణ చార్జీలపై 25 శాతం వరకు అదనపు చార్జీలు విధిస్తారు. అయినప్పటికీ మరో గత్యంతరం లేక ప్రత్యేక రైళ్లను ఆశ్రయించే ప్రయాణికులకు రైళ్లలో పడిగాపులు తప్పడం లేదు. ⇒ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పట్టాలపై రైళ్ల ఒత్తిడి పెరిగిందని, దీంతో సకాలంలో సిగ్నల్స్‌ లభించకపోవడం వల్ల జాప్యం చోటుచేసుకుంటోందని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ ఆలస్యం ప్రయాణికుల పండగ సంతోషాన్ని ఆవిరి చేస్తోంది. కనిష్టంగా 3 నుంచి గరిష్టంగా 12 గంటల వరకు కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. గతంలో ఇలాంటి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెల్లువెత్తినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. సంక్రాంతి సందర్భంగా బయలుదేరిన ప్రయాణికులు భోగి పండగ రోజు కూడా సొంత ఊళ్లకు చేరుకోలేకపోయారు. ప్రస్తుతం మరోసారి అదే పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. ఆర్టీసీ సైతం అదే బాటలో.. ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సుల పేరిట 50 శాతం అదనపు దోపిడీకి దిగింది. ఏపీతో పాటు, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో కూడా 25 శాతం నుంచి 50 శాతం వరకు అదనపు వసూళ్లకు పాల్పడుతోంది. చివరకు దివ్యాంగుల పాస్‌లను అనుమతించకుండా ఇష్టారాజ్యంగా చార్జీలు విధిస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని సుమారు 6 వేలకు పైగా అదనపు బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజులుగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఎల్‌బీనగర్, ఉప్పల్, హయత్‌నగర్, ఎంజీబీఎస్, జేబీఎస్‌ తదితర ప్రాంగణాలుప్రయాణికులతో సందడిగా మారాయి.ప్రైవేట్‌ బస్సుల దోపిడీ.. సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అడ్డగోలుగా దారి దోపిడీకి పాల్పడుతున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి విశాఖకు లగ్జరీ రూ.1800 వరకు ఉంటుంది. ఇప్పుడు ఆ చార్జీ రూ.3000 వరకు చేరింది. అలాగే ఏసీ బస్సుల్లో రూ.2500 నుంచి ఏకంగా రూ.5000 వరకు పెరిగినట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటిల్లిపాదీ కలిసి వెళితే చార్జీల కోసమే రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోందని ఏఎస్‌రావు నగర్‌కు చెందిన మల్లికార్జున్‌రావు చెప్పారు. అలాగే.. హైదరాబాద్‌ నుంచి కాకినాడ, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాలకు సైతం ప్రైవేట్‌ బస్సుల దోపిడీ విమాన చార్జీలను తలపిస్తోంది.సాక్షి ఎఫెక్ట్‌.. బస్సులు సీజ్‌అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తున్నప్రైవేట్‌ వాహనాల దందాపై సాక్షి వరుస కథనాలు ఇచ్చింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ఎల్బీనగర్ లో ప్రైవేట్ వాహనాలపై ఆర్టిఏ అధికారుల కొరడా జులిపించారు. సంక్రాంతికి అధిక బస్సు చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ వాహనాలపై ఆర్టిఏ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలోని టీం అడ్డుకుంది. దాదాపు 20 బస్సులపై కేసు నమోదు చేశారు. ఇక.. పెద్ద అంబర్ పేట్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారుల సీజ్ చేశారు. మరోవైపు.. రాజేంద్రనగర్‌ ఆరాంఘడ్‌ చౌరస్తా వద్ద రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల ఈ ఉదయం 4 గంటల నుంచే తనిఖీ చేపట్టారు. చెన్నై, తిరువంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారి నుండి హైదరాబాద్ వస్తున్న బస్సులను తనిఖీలు చేస్తున్నారు . ఈ క్రమంలో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నట్రావెల్స్‌పై కేసులు నమోదు చేస్తున్నారు. 11 బస్సుల పై కేసు నమోదు అయినట్లు సమాచారం.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
Kannauj: రైల్వే స్టేషన్‌లో కూలిన నిర్మాణం.. శిథిలాల కింద పలువురు!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ప్రమాదం జరిగింది.

title
రూ.2026 కోట్ల నష్టం.. ఢిల్లీ మద్యం పాలసీపై కాగ్ తాజా రిపోర్టు

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

title
ప్రియురాలి మృతదేహాన్ని 9 నెలలుగా ఫ్రిడ్జ్‌లో దాచి..

దేశంలోని పలు ప్రాంతాల్లో హృదయవిదారక దారుణాలు చోటుచేసుకుంటున్నాయి.

title
అయోధ్యలో ఘనంగా ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవాలు

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన మొదటి వార్షికోత్స

title
Delhi Election: 29 సవాల్‌

దేశరాజధాని ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి.

NRI View all
title
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా

ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్

title
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!

అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్‌ దిగ్గజం యాపిల్‌ 185 మంది ఉద్యోగులను త

title
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి

title
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)

title
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్‌..!అచ్చం భారత్‌లో..

ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్‌ బిజినెస్‌లు.

Advertisement

వీడియోలు

Advertisement