Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

KSR Comment: Under Kutami Govt No Sankranti For AP Poor People1
కహానీలు చెబితే కడుపు నిండుతుందా?

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లోమీడియా తీరు భలే విచిత్రంగా ఉంటుంది. వారికి లాభం జరిగితే ప్రజలందరికీ జరిగినట్లే. వారి ఇబ్బందులు ప్రజలందరి సమస్యలు! ఇప్పుడెందుకు ఈ ప్రస్తావన అంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ‍ప్రజలందరికీ సంక్రాంతి వరాలు వచ్చేశాయట!. అభివృద్ధి పనులతో గ్రామాలకు సంక్రాంతి కళ వచ్చేసిందట!. పచ్చి అబద్ధాలను వండి వార్చేఈ ఎల్లో మీడియా ఉరఫ్‌ ఈనాడులో వచ్చిన కథనాల్లో కొన్ని ఇవి. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలన్నీ అమలు చేసి ఉంటే ప్రజలు సంతోషంగా ఉండేవాళ్లు కానీ.. తిమ్మిని బమ్మి చేసినట్లు ప్రతి వాగ్ధానాన్ని మసిపూసి మారేడు కాయ చేసేందుకు కూటమి నానా తంటాలూ పడుతూంటే ఎల్లోమీడియా ఆ అబద్ధాలకు వంతపాడుతూ మురిసిపోతోంది. ఎన్నికలకు ముందు ఒక రకమైన అసత్యాలు.. ఇప్పుడు ఇంకో రకంగా బిల్డప్‌ ఇస్తూ జనాన్ని మభ్యపెడుతోంది. 😱కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది మొదలు.. రాష్ట్రంలో అరాచకమే ఎక్కువ. జగన్‌ టైమ్‌లో జరిగిన అభివృద్దిని కూడా తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. వృద్దుల ఫించన్‌ వెయ్యి రూపాయలు పెంచడం మినహా మరే ఇతర హామీని పూర్తిగా అమలు చేయని కూటమి, ఎన్నికల ప్రణాళికలో ఉన్న సుమారు 175 వాగ్దానాల జోలికే వెళ్లలేదు. దీన్ని కప్పిపుచ్చడానికి ఎల్లో మీడియా రోజుకో కొత్త రకం భజన కీర్తలను పాడుతోంది. అయితే.. 👉జనం వాస్తవాలు తెలుసుకుంటున్నారు. సూపర్ సిక్స్ పేరుతో కూటమి నేతలు చేసిన మోసాన్ని గుర్తిస్తున్నారు. ఈ మధ్య ఒక సీనియర్ పాత్రికేయుడు ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటించినప్పుడు ప్రజల్లోని ఈ అసంతృప్తిని గమనించారు. జగన్ ఉండి ఉంటే ఫలానా స్కీమ్ కింద తమకు ఇంత డబ్బు వచ్చి ఉండేది.. చేతులలో డబ్బు ఆడేది.. అని చెప్పుకుంటున్నారట. కానీ అంతకు మూడు రెట్లు సాయం చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తమను వంచించారని ఎక్కువ మంది భావిస్తున్నారట!.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఏ స్కీమ్ కూడా ఇప్పుడు ప్రజలకు అందడం లేదు. ‘అమ్మ ఒడి’ని మార్చి ప్రతి బిడ్డకు రూ.15 చొప్పున ఇస్తామన్న కూటమి నేతలు, కావాలంటే ఇంకా పిల్లలను కనండని బంపర్ ఆఫర్ ప్రకటించిన చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత తూచ్‌ అనేశారు. జాకీ మీడియా కూడా ‘అమ్మ ఒడి’ అంటే బటన నొక్కడమని ధనం వృధా చేయడమేనని ఊదరగొట్టింది. కానీ ఇప్పుడు ఏమి జరుగుతోందో చూడండి. 👇ఈ ఏడాదికి తల్లికి వందనం లేదు పొమ్మన్నారురైతు భరోసా జాడ కనిపించడం లేదు. విద్యా దీవెన, వసతి దీవెన ఏమయ్యాయో తెలియదు. ఆరోగ్య శ్రీని నీరుకార్చే పనిలో ఉన్నారు. జగన్ ఇంటింటికి డాక్టర్ ను పంపిచే స్కీమ్ తెస్తే, ఇప్పుడు అది గాలికి పోయినట్లు ఉంది. ప్రతి వ్యక్తికి ప్రభుత్వ సేవలందించేందుకు జగన్ తెచ్చిన వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని జీతాలూ పెంచుతామని చంద్రబాబు ఉగాది పండగనాడు దైవ సాక్షిగా ప్రకటించినా.. ఇప్పుడు దానికి మంగళం పలికారు. మరోవైపు.. ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. వంట నూనెల ధరలే లీటర్‌కు రూ.30 నుంచి రూ.40 వరకూ పెరిగాయి. పప్పులు, కూరగాయల ధరలన్ని అందుబాటులో లేకుండా పోయాయి. వీటన్నిటి ఫలితంగా సంక్రాంతి వచ్చినా ప్రజలు చేతిలో డబ్బులు ఆడక ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారాలు కూడా తగ్గాయి. ఇందుకు ఉదాహరణ ఏమిటంటే.. లెక్కలు ఇలా.. 👇ఒక్క కృష్ణా జిల్లాలోనే వైఎస్ జగన్ పాలనలో 2023 లో పండగల సీజన్ అయిన అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లలో వస్త్ర వ్యాపారం రూ.3000 కోట్ల మేర జరిగితే కూటమి పాలన వచ్చిన 2024లో అదే కాలానికి కేవలం రూ.1200 కోట్లుగానే ఉంది. కిరాణా వ్యాపారం పరిస్థితి అలాగే ఉంది. గతంతో పోల్చితే ఈసారి లావాదేవీలు రూ. వెయ్యి కోట్ల తగ్గాయి. బంగారం వ్యాపారం రెండు నెలల టైమ్‌కు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.3000 కోట్ల టర్నోవర్ జరిగితే, కూటమి పాలనలో అది రూ.1500 కోట్లుగా ఉంది. ఫర్నిచర్ కొనుగోళ్లు కూడా సగానికి సగం పడిపోయాయి. అప్పట్లో రూ.800 కోట్లు ఉంటే, ఈ సారి రూ.400 కోట్లే ఉంది. వీటి ఫలితంగా జీఎస్టీ రూపంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయమూ తగ్గింది. ఏపీలో జీఎస్టీ వసూళ్లు బీహారు కన్నా తక్కువ కావడం పరిస్థితిని తెలియచేస్తుంది. జగన్ టైమ్ లో 12 శాతం జీఎస్టీ వసూళ్లతో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్ర భాగాన ఉంటే, ఈ సారి ‘- 6’ శాతం మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 👉ఈ లెక్కలు ఇలా ఉన్నా, ఎల్లో మీడియా మాత్రం సంక్రాంతికి ప్రజలంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్లుగా బిల్డప్ ఇస్తోంది. అవును.. నిజమే.. మార్గదర్శికి సంబంధించిన కేసులలో గత ప్రభుత్వం జప్తు చేసిన రూ.వెయ్యి కోట్లను ఈ ప్రభుత్వం రాగానే తీసి వేసింది కదా!.. అందువల్ల ఈనాడు వారికే పండగే కావచ్చు. సామాన్యుడికి వస్తే ఎంత? రాకపోతే ఎంత? సంక్రాంతి వరాలు రూ.6700 కోట్లు అంటూ పెద్ద బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. గతంలో జగన్ ఒక్క స్కీమ్ కింద ఈ స్థాయిలో ప్రజలకు డబ్బు ఇచ్చేవారు. కాని చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో రూ.70 వేల కోట్లకు పైగా అప్పులు చేసినా, ఆ డబ్బు అంతా ఏమైందో కాని స్కీమ్ లు అమలు చేయలేదు. 🤔నిజంగానే చెప్పిన హామీలు చెప్పినట్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ అమలు చేసి ఉంటే సుమారు రూ.40 వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఇచ్చి ఉండాలి. కానీ అందులో ఆరోవంతు నిధులు కూడా ఇవ్వలేదు. ఉద్యోగులకు, వివిధ వర్గాలకు ఇవ్వాల్సిన మొత్తాలలో కొద్ది, కొద్దిగా ఇచ్చి పండగ చేసుకోమంటోంది. ఉద్యోగులకు రూ.25 వేల కోట్ల బకాయిలు ఉంటే రూ.1300 కోట్లు ఇచ్చారు. ఇది ఏ మూలకు వస్తాయని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌, ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా అర కొరగానే ఇచ్చారని చెబుతున్నారు. ఉద్యోగులకు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటెరిమ్ రిలీఫ్ ప్రకటిస్తామని అన్నా, దాని గురించి మాట్లాడడం లేదు. ఆర్థికంగా సమస్యలు ఉన్నాయని వాస్తవ పరిస్థితి చెప్పడం వేరు. మొత్తం హామీలు అమలు చేసినట్లు బిల్డప్ ఇచ్చి ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ప్రచారం చేసుకోవడం వేరు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. 😥గతంలో ధరలు కొద్దిగా పెరిగినా, విద్యుత్ చార్జీల సర్దుబాటు జరిగినా ఇదే చంద్రబాబు ,పవన్ ఏ స్థాయిలో విమర్శలు చేసేవారు! ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటివి ఎంత దారుణమైన కథనాలు రాసేవి. మరి ఇప్పుడు రూ.15 వేల కోట్ల విద్యుత్ భారం మోపినా, రెండున్నర లక్షల మంది వలంటీర్ల నోటికాడి కూడు తీసేసినా, తల్లులకు ప్రతి ఏటా వచ్చే రూ.15 వేలు ఎగ్గొట్టినా మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని మోసం చేసినా, నిరుద్యోగులకు రూ.3,000 ఖాయమని చెప్పి ఊరించి తూచ్ అంటున్నా, వారంతా సంతోషంగా ఉన్నారని భ్రమ పడాలన్నది ఎల్లో మీడియా లక్ష్యంగా ఉందనుకోవాలి. అభివృద్ధి పనులతో గ్రామాలకు సంక్రాంతి కళ వచ్చేసిందని ఈనాడు బోగస్ వార్తలు ఇస్తోంది. ప్రజల చేతిలో డబ్బు ఉంటే సంక్రాంతి పండగ బాగా చేసుకుంటారు కాని, కహానీలు చెబితే కడుపు నిండుతుందా?. కాకపోతే క్యాసినోలు, జూదాలు, కోడి పందేలు ఆడించి, ఎక్కడబడితే అక్కడ మద్యం అమ్మించి ఇదే సంక్రాంతి అనుకోండని అంటున్నారు. పేదలు వీటితో సరిపెట్టుకోవలసిందేనా!..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Bail Granted To MLA Padi kaushik Reddy2
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డికి బెయిల్‌

హైదరాబాద్‌, సాక్షి: హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డికి భారీ ఊరట లభించింది. మంగళవారం ఉదయం ఆయనకు బెయిల్‌ లభించింది. రెండు కేసుల్లోనూ జడ్జి ఆయనకు బెయిల్‌ ఇచ్చారు. జిల్లా సమీక్షా సమావేశంలో తోటి ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించారని ఆయనపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.ఆదివారం కరీంనగర్‌(Karimnagar) కలెక్టరేట్‌లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా.. కౌశిక్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌(Sanjay)ల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుని సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందడంతో కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్‌ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ వచ్చి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. రాత్రంతా ఆయన త్రీటౌన్‌ పోలీస్టేషన్‌లో ఉన్నారు. ఈ ఉదయం వైద్య పరీక్షల అనంతరం పాడి కౌశిక్‌రెడ్డిని (Padi kaushik Reddy) రెండో అదనపు అదనపు మెజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టారు. రూ.10 వేలప్పున మూడు పూత్తులు ఇవ్వాలని ఆదేశిస్తూ మెజిస్ట్రేట్‌ బెయిల్‌ మంజూరు చేశారు.వాదనలు ఇలా..రెండో అదనపు జ్యూడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ప్రేమ లత ముందు కరీంనగర్‌ పోలీసులు కౌశిక్‌ను హాజరు పర్చారు. కౌశిక్‌రెడ్డిపై గతంలోనూ పలు కేసులు ఉన్నందున రిమాండ్‌ విధించాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపించారు. అయితే.. కౌశిక్‌పై నమోదు అయిన సెక్షన్స్ అన్నీ బెయిలేబుల్ కాబట్టి రిమాండ్ రిజెక్ట్ చేయాలని బీఆర్ఎస్ లీగల్ టీం వాదించింది. ఈ క్రమంలో.. అర్ణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు(2014) తీర్పు ప్రకారం రిజెక్షన్ కోసం కోరింది. దీంతో బీఆర్‌ఎస్‌ లీగల్‌ టీం వాదనతో ఏకీభవించిన జడ్జి.. బెయిల్‌ మంజూరు చేశారు. ఇకముందు అలాంటి దూకుడు ప్రదర్శించొద్దని కౌశిక్‌ను హెచ్చరించిన మెజిస్ట్రేట్.. కోర్ట్ ప్రొసీజర్స్ ప్రకారం కరీంనగర్ లో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దనీ ఆదేశించారు.రేపు మాట్లాడతా: కౌశిక్‌ రెడ్డితెలంగాణా ప్రజలు, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది హైడ్రామా. ఈ హైడ్రామాలో నాకు మద్దతు తెలిపిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితతో పాటు అందరికీ నా ధన్యవాదాలు. పండుగ కాబట్టి రాజకీయాలు మాట్లాడొద్దనుకుంటున్నా. రేపు హైదరాబాద్ లో పూర్తి వివరాలు వెల్లడిస్తా. కోర్టు ప్రొసీజర్స్ ప్రకారం ఏ రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి కూడా నిబంధనలు అడ్డువస్తున్నాయి అని మీడియాను ఉద్దేశించి అన్నారాయన.

Sankranthiki Vasthunam Movie Twitter Review3
‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్విటర్‌ రివ్యూ

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్‌ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 14) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు కొన్ని చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. సంకాంత్రికి వస్తున్నాం సినిమా కథ ఏంటి..? ఎలా ఉంది..? వెంకీ, అనిల్‌ కాంబో ఖాతాలో హ్యాట్రిక్‌ హిట్ పడిందా లేదా..? తదితర అంశాలను ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.ఎక్స్‌లో సం‍క్రాంతికి వస్తున్నాం సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వస్తుంది. సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉందని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. రొటీన్‌ కథ అయినప్పటికీ కామెడీ బాగా వర్కౌట్‌ అయిందని చెబుతున్నారు. #SankranthikiVasthunamDone with my show 💯2nd half is hilarious 🤣 That avakaya episode is too goodAlthought it felt lengthy at parts, @AnilRavipudi handled last 30 minutes very well and ended with a messageMy rating would be 3.5/5Families gonna have a feast in… pic.twitter.com/HtUK07VSmT— INNOCENT EVIL 😈 (@raju_innocentev) January 14, 2025 ఇప్పుడే సినిమా చూశాను. సెకండాఫ్‌ హిలేరియస్‌. అవకాయ ఎపిసోడ్‌ అదిరిపోయింది. అయితే కొన్ని సీన్లు సాగదీతగా ఉన్నాయి. చివరి 30 నిమిషాలు అనిల్‌ రావిపూడి చక్కగా హ్యాండిల్‌ చేశాడు. ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా ఇది అంటూ ఓ నెటిజన్‌ 3.5 రేటింగ్‌ఇచ్చాడు.#SankranthikiVasthunam is a timepass festive family entertainer with the only motive being to entertain. The film flows in a Typical zone that Director Ravipudi follows similar to F2. The comedy works well in parts but is over the top and irritates a bit in others. Production…— Venky Reviews (@venkyreviews) January 13, 2025 సంక్రాంతికి వస్తున్నాం టైంపాస్‌ కామెడీ సినిమా. పండక్కి వినోదాన్ని అందించే చిత్రం. ఎఫ్‌2 మాదిరే హిలేరిస్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు అనిల్‌ రావిపూడి. పార్టులుగా చూస్తే కామెడీ బాగా వర్కౌట్‌ అయింది. ప్రొడక్షన్‌ క్యాలిటీస్‌ అంతగా బాగోలేవు. సినిమాలో పెద్ద కథ కూడా ఉండదు. లాజిక్స్‌ గురించి పట్టించుకోవద్దు. వెంకటేశ్‌ తనదైన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. క్లైమాక్స్‌ ఆకట్టుకుంటుంది. ఈ పండక్కి ఫ్యామిలీస్‌కి ఈ సినిమా మంచి ఛాయిస్‌ అంటూ మరో నెటిజన్‌ 2.75 రేటింగ్‌ ఇచ్చాడు.#SankranthikiVasthunam Liked it! Baagundi!A hilarious entertainer with mediocre story but makes you laugh out loud❤️The theme itself has a lot of potential to make you chuckle, #Venkatesh & #AnilRavipudi are very successful in it#AishwaryaRajesh is impressive👌FUN GUARANTEED! pic.twitter.com/J8AVr2Nei5— Sanjeev (@edokatile) January 14, 2025CLEAN HIT 🎯 🎯 #SankranthikiVasthunam is a fun family Entertainer with Anil Ravipudi's racyscreenplay and songs.🥵🎶🎶It's a Good Family Entertainer 3.5/5 Rating 🤞🤙#SankranthikiVasthunamreview #makarsankranti2025 #Pongal#HappyLohri #MahaKumbh2025 #MakaraSankranti2025 pic.twitter.com/2tJWwcbzTz— Ashok (@imashok1234) January 14, 2025#SankranthikiVasthunam - Family Entertainer!Anil Ravipudi succeeds in entertaining his target audience with a fun film. Bheems music and songs💥Family audience elaago hit ichestharu🫡#SankranthikiVasthunamReview #SankranthikiVasthunnam#VenkyMama #Venkateshdaggubati https://t.co/SHy9jWy6r4 pic.twitter.com/Vokja82Kdi— IndianCinemaLover (@Vishwa0911) January 14, 2025#Bheemsceciroleo music is very good - foot tapping and BGM is 🔥Except some over the top scenes ( as expected ) everything goes according to @AnilRavipudi 's meter and should score a hit for this pongal too.#SankranthikiVasthunam #SankranthikiVasthunamreview— Shiva Kumar Grandhi (@sivakumargrandh) January 13, 2025#SankranthikiVasthunamReview - For Families!Positives:- Venky Mama 👌❤️ - Bheems' Music and Songs ❤️❤️ - Comedy Scenes 😂 Negatives:- Over-the-top Scenes,Especially in the Second Half - Predictable PlotAn Enjoyable Entertainer for Families! Follow 👉…— Movies4u Reviews (@Movies4uReviews) January 13, 2025

Kutami Leaders Neglect On High Court Order Over Kodi Pandalu4
‘బరి’తెగించిన కూటమి నేతలు

సాక్షి, కాకినాడ జిల్లా: సంక్రాంతి (Sankranti) పండగ సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని.. కోడి పందేలకు(Cockfighting), జూద క్రీడలకు దూరంగా ఉండాలని.. లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ పోలీసు యంత్రాంగం కొన్ని రోజులుగా హెచ్చరిస్తూనే ఉంది. అయినప్పటికీ ఆఫ్ట్రాల్‌ అన్నట్టుగా ఆ హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయని పందేలరాయుళ్లు.. అధికార కూటమి నేతల అండతో.. తమకు అడ్డే లేదన్నట్టుగా ‘బరి’ తెగించేశారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరుల్లో షరా మామూలుగానే పందెం కోడి కాలు దువ్వింది.. కత్తి కట్టించుకుని.. తగ్గేదేలే అన్నట్లుగా బరిలో తలపడింది.పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బరులు ఏర్పాటయ్యాయి. మూడు రోజుల సంక్రాంతి పండగల్లో తొలి రోజయిన భోగి నాడే కోడి పందేలు, గుండాట, పేకాట, లాటరీ, జూదం, ఇతర అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో సోమవారం జరిగిన కోడిపందేలు, గుండాటల్లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మొదటి స్థానంలో నిలవగా కాకినాడ జిల్లా రెండో స్థానంలో ఉంది.ఉమ్మడి జిల్లాలో మొత్తం సుమారు 350 బరుల్లో కోడి పందేలు జరిగాయని అంచనా. ఇందులో కోనసీమ జిల్లాలోనే అత్యధికంగా 110 బరుల్లో కోడి పందేలు జరిగాయి. ఈ ప్రాంతంలో తొలి రోజు రూ.110 కోట్లుపైనే పందేలు జరిగాయని లెక్కలేస్తున్నారు. బెల్టు షాపులు ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. కూటమి నేతల. ప్రజలను నిలువునా దోచేస్తున్నారు.పశ్చిమ గోదావరి జిల్లా: జీవహింస వద్దన్న కోర్టు మార్గదర్శకాలను కూటమి నేతలు లెక్కచేయడం లేదు. యథేచ్ఛగా కూటమి నేతల కనుసన్నల్లో పందెం కోళ్లు కత్తులు దూశాయి. రాజ్యాంగబద్ధ పదవిలో కొనసాగుతూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు జూదాలను ప్రోత్సహిస్తున్నారు. కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు పందెం బరులను ప్రారంభించారు. పోలీసుల మైకులు మూగబోయాయి. జిల్లా వ్యాప్తంగా బరుల వద్ద కోడిపందేలు, గుండాట, పేకాట నిర్వహణ యథేచ్ఛగా సాగిపోతోంది. మద్యం స్టాళ్లు ఏర్పాటు చేసి భారీగా అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో మద్యం ఏరులై పారుతోంది. తొలి రోజే రూ.100 కోట్లకు పైగాచేతులు మారింది.ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి

90 Hours Work Row: L and T HR Head Reacts This5
'90 గంటల పని'పై ఎల్‌&టీ హెచ్‌ఆర్‌ టీం స్పందన

ఉద్యోగులు వారంలో 90 గంటలు పనిచేయాలని, ఆదివారాలు కూడా విధులకు హాజరుకావాలంటూ ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ ఎస్‌.ఎన్‌.సుబ్రహ్మణ్యన్‌ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. సోషల్‌ మీడియాలో దీని మీద మామూలు చర్చ జరగడం లేదు. అయితే.. తమ చైర్మన్‌ చేసిన వ్యాఖ్యలపై ఎల్‌ అండ్‌ టీం హెచ్‌ఆర్‌ టీం స్పందించింది. ఆయన వ్యాఖ్యలపై వివరణతో హెచ్‌ఆర్‌ హెడ్‌ సోనికా మురళీధరన్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ ఉంచారు.90 పని గంటల విషయంలో ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌(SN Subrahmanyan) వ్యాఖ్యలు జనాల్లోకి చాలా పొరపాటు వెళ్లాయంటూ లారెన్స్‌ & టూబ్రో(L & T) హెచ్‌ఆర్‌ హెడ్‌ సోనికా అంటున్నారు. ‘మా ఎండీ వ్యాఖ్యలు పొరపాటుగా జనంలోకి వెళ్లాయి. ఆయన చాలా సాధారణంగానే ఆ మాటలు అన్నారు. కానీ, అవి అనవసర విమర్శలు దారితీయడం నిజంగా బాధాకరం. వారానికి 90 గంటలు పని తప్పనిసరనిగానీ.. దానిని అమలు చేయాలనిగానీ ఆయనేం అనలేదు. .. ఆయన ప్రతీ ఉద్యోగిని తన కుటుంబ సభ్యుడిగానే భావిస్తారు. అలాగే తన టీం బాగోగుల గురించి కూడా ఆలోచిస్తారు. ఇప్పుడున్న కార్పొరేట్‌ ప్రపంచంలో ఇది అంత్యంత అరుదైన విషయం’’ అని ఆమె అన్నారు. అలాగే.. ఆయన నాయకత్వాన్ని ఆమె ఆకాశానికెత్తారు. కాబట్టి.. ఆయన మాటల్ని అర్థం చేసుకుని, విమర్శలకు పుల్‌స్టాప్‌ పెట్టాలని ఆమె కోరారు.అంతటితో ఆగలేదు..ఉద్యోగులు వారానికి 90 గంటలు(90 Hours Work) పనిచేయాలని ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ ఎస్‌.ఎన్‌.సుబ్రహ్మణ్యన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. అయితే ఆయన పనిగంటల వరకు మాట్లాడినా ఈ వివాదం అంతగా ముదిరేది కాదేమో. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇంట్లో కూర్చొని ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు? ఇంట్లో తక్కువ, ఆఫీసులో ఎక్కువగా ఉంటామని భార్యలకు చెప్పాలి. అవసరమైతే ఆదివారాలు కూడా పనిచేయాలి’’ అని అన్నారు. దీంతో రచ్చ మొదలైంది.ఉన్నతహోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం చూసి ఆశ్చర్యానికి గురయ్యానంటూ బాలీవుడ్‌ కథానాయిక దీపికా పదుకొణె అసహనం వ్యక్తం చేశారు. వారానికి 90 గంటలు పనిచేయాలనే ఆలోచన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్‌ గోయెంకా సైతం ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. అలాగైతే సండే పేరును ‘సన్‌ డ్యూటీ’గా మార్చాలని వ్యంగ్యంగా రాసుకొచ్చారు. బానిసలాగా కష్టపడటాన్ని కాకుండా తెలివిగా పనిచేయడాన్ని తాను నమ్ముతానని తెలిపారు. పనిని, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడం చాలా అవసరమన్నారు. మరోవైపు.. పలువురు ప్రముఖులు సుబ్రహ్మణ్యన్‌ వ్యాఖ్యలతో ఏకీభవించడం కొసమెరుపు.చర్చ సరైన దిశగా వెళ్లడం లేదు. పని పరిమాణంపైనే కదా ఇదంతా. నా దృష్టిలో అయితే 40 గంటలా.. 70 గంటలా లేదంటే 90 గంటలా అని కాదు. ఎంత నాణ్యమైన పనిని అందించామా అన్నదే ముఖ్యం. 10 గంటల్లో కూడా ప్రపంచాన్ని మార్చవచ్చు. అందుకే పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. ఎంతసేపు పని చేశామన్నది ముఖ్యం కాదు:::మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా

Tirupati Stampede: Yv Subba Reddy Warning To Chandrababu Government6
అలా చేయకుంటే కోర్టుకెళ్తాం.. ‘కూటమి’కి వైవీ సుబ్బారెడ్డి వార్నింగ్‌

సాక్షి, ప్రకాశం జిల్లా: తిరుమల తొక్కిసలాట (Tirupati stampede) దురదృష్టకరమని ఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ (YSRCP) రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) డిమాండ్‌ చేశారు. లేదంటే తమ పార్టీ తరఫున కోర్టుకెళ్తామని హెచ్చరించారు. లడ్డూ విషయంలో హంగామా చేసిన చంద్రబాబు, పవన్‌ ఎందుకు సెలైంట్‌గా ఉన్నారని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.పల్లెల్లో సంక్రాంతి కళ కనిపించడం లేదు. రైతుల మొఖాల్లో ఆనందం లేదు. రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ఏడు నెలలైనా పింఛన్‌ తప్ప ఏం సంక్షేమ పథకం అమలు కాలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పవన్ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. హామీలు అమలు చేసి మాపై ఆరోపణలు చేయండి’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి

Sakshi Special Interview About Spiritualists and movie celebrities7
సంక్రాంతి వచ్చెనట సందడి తెచ్చెనట!

మంచుకు తడిసిన ముద్దబంతులు... ముగ్గులు... పూలు విచ్చుకున్న గుమ్మడి పాదులు... కళ్లాపిలు.... వంట గదుల్లో తీపీ కారాల ఘుమఘుమలు...కొత్త బట్టలు... కొత్త అల్లుళ్ల దర్పాలు...పిల్లల కేరింతలు... ఓపలేని తెంపరితనాలుసంక్రాంతి అంటే సందడే సందడి.మరి మేమేం తక్కువ అంటున్నారు సినిమా తారలు.మా సంక్రాంతిని వినుమా అని ముందుకొచ్చారు.రచయిత్రులు ఊసుల ముత్యాల మాలలు తెచ్చారు.‘ఫ్యామిలీ’ అంతా సరదాగా ఉండే సంబరవేళ ఇది.ప్రతిరోజూ ఇలాగే పండగలా సాగాలని కోరుకుంటూసంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం.ఇన్‌పుట్స్‌ : సాక్షి సినిమా, ఫ్యామిలీ బ్యూరోమన పండుగలను ఎన్నో అంశాలను మిళితం చేసి ప్రయోజనాత్మకంగా రూపొందించారు మన పెద్దలు. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా పండుగ విధులుగా చెప్పి వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక క్షేమాలని కలిగించేవిగా వాటిని రూపొందించారు. మన పండుగల్లో ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక మొదలైన శాస్త్రవిజ్ఞానాలు మిళితమై ఉంటాయి. తెలుగువారి ప్రధానమైన పండుగ సంక్రాంతిలో కూడా అంతే! ప్రధానంగా చాంద్రమానాన్ని పాటించే తెలుగువారు సౌరమానాన్ని పాటించే ముఖ్యమైన సందర్భం ఇది. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం అంటారు. అది డిసెంబరు 15 కాని, 16వ తేదీ కాని అవుతుంది. అప్పటి నుండి మకర సంక్రమణం వరకు అంటే జనవరి 14 కాని, 15 వ తేదీ వరకు కాని ఉంటుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు మకర సంక్రాంతి. ఆ రోజు నుండి సూర్యుడు తన గమన దిశని దక్షిణం నుండి ఉత్తరానికి మార్చుకుంటాడు కనుక మకర సంక్రమణానికిప్రాధాన్యం. ఆ రోజు పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు. బొమ్మల కొలువుపెట్టుకునే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది. అసలు ప్రధానమైనది సంక్రాంతి. ఈ పుణ్యకాలంలో దానాలు, తర్పణాలుప్రాధాన్యం వహిస్తాయి. ఈ సమయంలో చేసే దానాలకి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడురోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలి తనకి ఇష్టమైన దానాలు చేస్తే సంతోషిస్తాడు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయటం మరీ శ్రేష్ఠం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. మకరరాశిలో ఉండే శ్రవణానక్షత్రానికి అధిపతి అయిన శని శాంతించటానికి నువ్వుల దానం చేయటం శ్రేయస్కరం. వస్త్రదానం,పెరుగుదానంతో పాటు, ఏ దానాలు చేసినా మంచిదే. భోగినాడు ఏ కారణంగానైనా పేరంటం చేయనివారు ఈ రోజు చేస్తారు. అసలు మూడురోజులు పేరంటం చేసే వారున్నారు. సంక్రాంతి మరునాడు కనుము. కనుముని పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి,పూలదండలని వేసి, ఊరేగిస్తారు. వాటికి పోటీలు పెడతారు. ఎడ్లకి పరుగు పందాలు, గొర్రె పొట్టేళ్ళ పోటీలు, కోడిపందాలు మొదలైనవి నిర్వహిస్తారు. నాగలి, బండి మొదలైన వాటిని కూడా పూజిస్తారు. ఇప్పుడు ట్రాక్టర్లకి పూజ చేస్తున్నారు. భూదేవికి, రైతులకి, పాలేర్లకి, పశువులకి, వ్యవసాయ పనిముట్లకి కూడా తమ కృతజ్ఞతలని తెలియచేయటం పండుగలోని ప్రతి అంశంలోనూ కనపడుతుంది. మాంసాహారులు ఈరోజు మాంసాహారాన్ని వండుకుంటారు. సాధారణంగా కోడిపందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఉపయోగించటం కనపడుతుంది. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవమర్యాదలని చూపటం అనే సంస్కారం ఇక్కడ కనపడుతుంది. పంటను పాడుచేసే పురుగులని తిని సహాయం చేసినందుకు పక్షులకోసం వరికంకులను తెచ్చి కుచ్చులుగా చేసి, ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కనుమునాడు గుడిలో వరికంకుల గుత్తులను కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ‘కనుము నాడు కాకైనా కదలదు’,‘కనుము నాడు కాకైనా మునుగుతుంది’,‘కనుము నాడు మినుము తినాలి’ అనే సామెతలు కనుముకి పితృదేవతలకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి. మొత్తం నెల రోజులు విస్తరించి, నాలుగు రోజుల ప్రధానంగా ఉన్న పెద్ద పండగ సంక్రాంతి తెలుగువారికి ఎంతో ఇష్టమైన వేడుక. – డా. ఎన్‌.అనంతలక్ష్మిముక్కనుముముక్కనుము నాడు ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు. కానీ, కొంతమంది కనుమునాడు కాక ఈ రోజుని మాంసాహారం తినటానికి కేటాయిస్తారు. సంక్రాంతికి అందరూ తమ గ్రామాలకి చేరుకుంటారు. అల్లుళ్లు, ముఖ్యంగా కొత్త అల్లుళ్లు తప్పనిసరి. నెల రోజులు విస్తరించి, నాలుగు రోజులు ప్రధానంగా ఉండే సంక్రాంతి పెద్దపండుగ. పెద్దల పండుగ కూడా. పెద్ద ఎత్తున చేసుకునే పండుగ కూడా.థీమ్‌తో బొమ్మల కొలువుసంక్రాంతికి ప్రతియేటా ఐదు రోజులు బొమ్మలు కొలువు పెడుతుంటాం. చిన్నప్పటి నుంచి నాకున్న సరదా ఇది. నేను, మా అమ్మాయి, మనవరాలు కలిసి రకరకాల బొమ్మలను, వాటి అలంకరణను స్వయంగా చేస్తాం. ప్రతి ఏటా ఒక థీమ్‌ను ఎంచుకుంటాం. అందకు పేపర్, క్లే, అట్టలు, పూసలు, క్లాత్స్‌.. ఎంచుకుంటాం. ఈ సారి ఉమెన్‌ పవర్‌ అనే థీమ్‌తో నవదుర్గలు పెట్టాం. అమ్మ వార్ల బొమ్మలు ఇప్పటికీ ఇంట్లో ఉన్నాయి. గుడిలాగా అలంకారం చేశాం. గుడికి అమ్మాయిలు వస్తున్నట్టు, పేపర్లతో అమ్మాయిల బొమ్మలను చేశాం. తిరుపతి చందనం బొమ్మల సేకరణ కూడా ఉంది. ఆ బొమ్మలతో కైలాసం అనుకుంటే శివపార్వతులుగా, తిరుపతి అనుకుంటే వెంకటేశ్వరస్వామి, పద్మావతి... ఇలా థీమ్‌కు తగ్గట్టు అలంకరణ కూడా మారుస్తాం. ఈ బొమ్మల కొలువుకు మా బంధువులను, స్నేహితులను పిలుస్తుంటాం. ఎవరైనా అడిగితే వాళ్లు వచ్చేవరకు ఉంచుతాం. – శీలా సుభద్రాదేవి, రచయిత్రిపండగ వైభోగం చూతము రారండి– రోహిణితమిళ, మలయాళ, కన్నడ సినిమాలలో ఎంతో పెద్ద పేరు తెచ్చుకున్న రోహిణి అనకాపల్లి అమ్మాయి అనే విషయం చాలామందికి తెలియదు. అయిదేళ్ల వయసులో చెన్నైకి వెళ్లిపోయినా... అనకాపల్లి ఆమెతోనే ఉంది. అనకాపల్లిలో సంక్రాంతి జ్ఞాపకాలు భద్రంగా ఉన్నాయి. నటి, స్క్రీన్‌ రైటర్, పాటల రచయిత్రి, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ రోహిణి మొల్లెటి... ‘సంక్రాంతి ఇష్టమైన పండగ’ అంటుంది, ఆనాటి పండగ వైభోగాన్ని గుర్తు చేసుకుంటుంది.నా చిన్నప్పుడు .. సంక్రాంతికి స్కూల్‌కి సెలవులు ఇచ్చేవారు. అదో ఆనందం. అలాగే కొత్త బట్టలు కొనిపెట్టేవాళ్లు. ఇంట్లో చక్కగా పిండి వంటలు చేసి పెట్టేవాళ్లు. ఫుల్లుగా తినేవాళ్లం. మాది అనకాపల్లి. నాకు ఐదేళ్లప్పుడు చెన్నై వెళ్లిపోయాం. సో... నాకు ఊహ తెలిశాక జరుపుకున్న పండగలన్నీ చెన్నైకి సంబంధించినవే.సంక్రాంతికి నెల ముందే నెల గంట పడతారు. అప్పట్నుంచి రోజూ ముగ్గులు పెట్టేవాళ్లం. అయితే ఎవరి ముగ్గు వారిది అన్నట్లు కాకుండా మా ముగ్గుకి ఇంకొకరు రంగులు వేయడం, మేం వెళ్లి వాళ్ల ముగ్గులకు రంగులు వేయడం... ఫైనల్లీ ఎవరి ముగ్గు బాగుందో చూసుకోవడం... అవన్నీ బాగుండేది. నేను రథం ముగ్గు వేసేదాన్ని. ఇక సంక్రాంతి అప్పుడు గంగిరెద్దుల సందడి, హరిదాసులను చూడడం భలేగా అనిపించేది. సంక్రాంతి నాకు ఇష్టమైన పండగ. ఎందుకంటే మనకు అన్నం పెట్టే రైతుల పండగ అది. వారికి కృతజ్ఞత తెలపాలనుకుంటాను. రైతుల విలువ పిల్లలకు చెప్పాలి. ఏమీ చెప్పకుండా పండగ చేసుకుంటే ఇది కూడా ఓ వేడుక అనుకుంటారు... అంతే. అసలు ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నామో పిల్లలకి చెప్పాలి. అర్థం తెలిసినప్పుడు ఇంకాస్త ఇన్ వాల్వ్‌ అవుతారు.ఇప్పుడు పండగలు జరుపుకునే తీరు మారింది. వీలైనంత వైభవంగా చేయాలని కొందరు అనుకుంటారు. అయితే ఎంత గ్రాండ్‌గా చేసుకుంటున్నామని కాదు... అర్థం తెలుసుకుని చేసుకుంటున్నామా? లేదా అనేది ముఖ్యం. తాహతుకి మించి ఖర్చుపెట్టి పండగ చేసుకోనక్కర్లేదన్నది నా అభిప్రాయం.సంక్రాంతి అంటే నాకు గుర్తొచ్చే మరో విషయం చెరుకులు. చాలా బాగా తినేవాళ్లం. ఇప్పుడూ తింటుంటాను. అయితే ఒకప్పటి చెరుకులు చాలా టేస్టీగా ఉండేవి. ఇప్పటి జనరేషన్ చెరుకులు తింటున్నారో లేదో తెలియడం లేదు. షుగర్‌ కేన్ జ్యూస్‌ తాగుతున్నారు. అయితే చెరుకు కొరుక్కుని తింటే పళ్లకి కూడా మంచిది. మన పాత వంటకాలు, పాత పద్ధతులన్నీ మంచివే. ఇలా పండగలప్పుడు వాటి గురించి చెప్పడం, ఆ వంటకాలు తినిపించడం చేయాలి.నెల్నాళ్లూ ఊరంతా అరిసెల వాసనపండగ మూడు రోజులు కాదు మాకు నెల రోజులూ ఉండేది. వ్యవసాయం, గోపోషణ సమృద్ధిగా ఉండటం వల్ల నెల ముందు నుంచే ధాన్యం ఇల్లు చేరుతుండేది. నెల గంటు పెట్టగానే పీట ముగ్గులు వేసేవారు. వాటిల్లో గొబ్బిళ్లు పెట్టేవారు. రోజూ గొబ్బిళ్లు పెట్టి, వాటిని పిడకలు కొట్టేవారు. ఆ గొబ్బి పిడకలన్నీ పోగేసి, భోగిరోజున కర్రలు, పిడకలతోనే భోగి మంట వేసేవాళ్లు. మామూలు పిడకల వాసన వేరు, భోగి మంట వాసన వేరు. ప్రధాన సెలబ్రేషన్‌ అంటే ముగ్గు. బొమ్మల కొలువు పెట్టేవాళ్లం. అందరిళ్లకు పేరంటాలకు వెళ్లేవాళ్లం. ఊరంతా అరిసెల వాసన వస్తుండేది. కొత్త అటుకులు కూడా పట్టేవారు. చెరుకు గడలు, రేగుపళ్లు, తేగలు, పిల్లల ఆటలతో సందడిగా ఉండేది. బంతిపూల కోసం అక్టోబర్‌లో మొక్కలు వేసేవాళ్లం. అవి సంక్రాంతికి పూసేవి. కనుమ నాడు గోవులను అలంకరించి, దండం పెట్టుకునే వాళ్లం. చేసుకున్న పిండి వంటలు పంచుకునేవాళ్లం. హరిదాసులకు, గంగిరెద్దుల వాళ్లకు ధాన్యాన్ని ఇచ్చేవాళ్లం. ఇప్పటికీ పండగలను పల్లెలే సజీవంగా ఉంచుతున్నాయి. పట్టణాల్లో మాత్రం కొన్నేళ్లుగా టీవీల్లోనే సంక్రాంతి సంబరాలను చూస్తున్నాం. – రమారావి, కథకురాలు, ఆధ్యాత్మికవేత్తనా జీవితంలో సంక్రాంతి చాలా స్పెషల్‌– మీనాక్షీ చౌదరి‘ఆరు నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారు’ అనేది మన అచ్చ తెలుగు సామెత. తెలుగుతనం ఉట్టిపడే పేరున్న మీనాక్షీ చౌదరి తెలుగు అమ్మాయి కాదు. ఉత్తరాది అమ్మాయి మీనాక్షీ చౌదరి కాస్త బాపు బొమ్మలాంటి తెలుగింటి అమ్మాయిగా మారడానికి మూడు సంవత్సరాల కాలం చాలదా! మీనాక్షీ నటి మాత్రమే కాదు స్విమ్మర్, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి కూడా. ఫెమినా మిస్‌ ఇండియా గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌ (2018) కిరీటాన్ని గెలుచుకుంది. ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమా తో తెలుగు తెరకు సైలెంట్‌గా పరిచయం అయిన చౌదరి ‘హిట్‌: ది సెకండ్‌ కేస్‌’తో హిట్‌ కొట్టింది. సూపర్‌హిట్‌ సినిమా ‘లక్కీభాస్కర్‌’ లో సుమతిగా సుపరిచితురాలైంది. కొందరికి కొన్ని పండగలు ప్రత్యేకమైనవి. సెంటిమెంట్‌తో కూడుకున్నవి. మీనాక్షీ చౌదరికి కూడా సరదాల పండగ సంక్రాంతి ప్రత్యేకమైనది. సెంటిమెంట్‌తో కూడుకున్నది. ఈ హరియాణ అందాల రాశి చెప్పిన సంక్రాంతి ముచ్చట్లు ఇవి.మాది హర్యానా రాష్ట్రంలోని పంచకుల. మూడేళ్లుగా నేను హైదరాబాద్‌లో ఉంటూ తెలుగు సినిమాల్లో పని చేస్తున్నాను కాబట్టి సంక్రాంతి పండగ గురించి నాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి జనవరిలో ఒక సెలబ్రేషన్ (సంక్రాంతి) ఉంది. సంక్రాంతి–సినిమా అనేది ఒక బ్లాక్‌ బస్టర్‌ కాంబినేషన్ . సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి అన్నది సినిమాల రిలీజ్‌కి, సెలబ్రేషన్స్ కి చాలా మంచి సమయం. కుటుంబమంతా కలిసి సందడిగా పూజలు చేసి సెలబ్రేట్‌ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. అది నాక్కూడా చాలా ఎగ్జయిటెడ్‌గా ఉంటుంది. గాలిపటాలంటే నాకు చాలా ఇష్టం. కానీ, ఎగరేయడంలో నేను చాలా బ్యాడ్‌ (నవ్వుతూ). అయినా, మా ఫ్రెండ్స్‌తో కలిసి మా ఊర్లోనూ, హైదరాబాద్‌లోనూ ఎగరేసేందుకు ప్రయత్నిస్తుంటాను. హైదరాబాద్‌లో ప్రతి ఏటా అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌ నిర్వహించడం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే గాలిపటాలు ఎగరేయడం అన్నది కూడా ఒక ఆటే. సంక్రాంతి టు సంక్రాంతి2024 నాకు చాలా సంతోషంగా, గ్రేట్‌ఫుల్‌గా గడిచింది. గత ఏడాది మంచి సినిమాలు, మంచి కథలు, పాత్రలు, మంచి టీమ్‌తో పని చేయడంతో నా కల నిజం అయినట్లు అనిపించింది. 2025 కూడా అలాగే ఉండాలని, ఉంటుందని కోరుకుంటున్నాను. చూస్తుంటే సంక్రాంతి టు సంక్రాంతి వరకు ఓ సర్కిల్‌లా అనిపిస్తోంది. నా జీవితం లో కూడా సంక్రాంతి చాలా స్పెషల్‌. ఎందుకంటే గత ఏడాది నేను నటించిన ‘గుంటూరు కారం’ వచ్చింది.. ఈ ఏడాది కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలవుతోంది! అందుకే చాలా సంతోషంగా... ఎగ్జయిటింగ్‌గా ఉంది.ముగ్గుల లోకంలోకి– దివి వాఢత్యాదివి పదహారు అణాల తెలుగు అమ్మాయి. ఎం.టెక్‌ అమ్మాయి దివి మోడలింగ్‌లోకి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చింది. ‘బిగ్‌బాస్‌4’తో లైమ్‌లైట్‌లోకి వచ్చింది. హీరోయిన్‌గా చేసినా, పెద్ద సినిమాలో చిన్న పాత్ర వేసినా తనదైన మార్కును సొంతం చేసుకుంది. గ్లామర్‌ పాత్రలలో మెరిసినా, నాన్‌–గ్లామరస్‌ పాత్రలలో కనిపించినాతనదైన గ్రామర్‌ ఎక్కడీకి పోదు! మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లుగానే... మహా పండగ సంక్రాంతి కోసం ఎదురు చూడడం దివికి ఇష్టం. సంక్రాంతి వస్తే చాలు... ఆమెకు రెక్కలు వస్తాయి. సరాసరి వెళ్లి విజయవాడలో వాలిపోతుంది. పండగ సంతోషాన్ని సొంతం చేసుకుంటుంది. భోగిమంటల వెలుగు నుంచి గగనసీమలో గాలిపటాల వయ్యారాల వరకు దివి చెప్పే సంక్రాంతి కబుర్లు...మాది హైదరాబాదే అయినా, నేను పుట్టింది విజయవాడలో. ఊహ తెలిసినప్పటి నుంచి సంక్రాంతి వచ్చిందంటే చాలు, విజయవాడలోని మా అమ్మమ్మగారి ఇంట్లో వాలిపోతా. వారం ముందు నుంచే మా ఇంట్లో పండుగ సందడి మొదలయ్యేది. మా మామయ్యలు, పిన్నులు, చుట్టాలందరితో కలసి గారెలు, అరిసెలు ఇలా ఇతర పిండి వంటలు చేసుకుని, ఇరుగు పొరుగు వారికి ఇచ్చుకుంటాం. పండుగ రోజు ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసుకునేవాళ్లం. తర్వాత నలుగు పెట్టుకుని స్నానం చేసి, ముగ్గులు పెడతాం. అమ్మమ్మ పూజ చే స్తే, మేమంతా పక్కనే కూర్చొని, దేవుడికి దండం పెట్టుకునేవాళ్లం. కానీ ఆ రోజుల్ని ఇప్పుడు చాలా మిస్‌ అవుతున్నా. ఏది ఏమైనా సంక్రాంతికి కచ్చితంగా ఊరెళతాను. ఆ మూడు రోజుల పాటు బయటి ప్రపంచాన్ని మర్చిపోయి కుటుంబ సభ్యులతో కలసి పండుగ చేసుకోవటం నాకు చాలా ఇష్టం. సాయంత్రం స్నేహితులతో కలసి సరదాగా గాలిపటాలు ఎగరేస్తా. ఇప్పుడు నటిగా ఎదుగుతున్న సమయంలో సంక్రాంతి జరుపుకోవటం మరింత ఆనందంగా ఉంది. ఊరెళితే చాలు, అందరూ ఇంటికొచ్చి మరీ పలకరిస్తుంటారు. వారందరినీ చూసినప్పుడు నాపై నాకే తెలియని విశ్వాసం వస్తుంది. చివరగా సంక్రాంతికి ప్రత్యేకించి గోల్స్‌ లేవు కాని, అందరినీ సంతోషంగా ఉంచుతూ, నేను సంతోషంగా ఉంటే చాలు. ఇక నన్ను బాధించే వ్యక్తులకు, విషయాలకు చాలా దూరంగా ఉంటా. ఇంటర్వ్యూ: శిరీష చల్లపల్లిమర్చిపోలేని పండుగ– అంజలి‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో సీత ఎవరండీ? అచ్చం మన పక్కింటి అమ్మాయి. మన బంధువుల అమ్మాయి. తన సహజనటనతో ‘సీత’ పాత్రకు నిండుతనం తెచ్చిన అంజలికి... ‘మాది రాజోలండీ’ అని చెప్పుకోవడం అంటే ఇష్టం. మూలాలు మరవని వారికి జ్ఞాపకాల కొరత ఉంటుందా! కోనసీమ పల్లె ఒడిలో పెరిగిన అంజలి జ్ఞాపకాల దారిలో వెళుతుంటే....మనం కూడా ఆ దారిలో వెళుతున్నట్లుగానే, పల్లె సంక్రాంతిని ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగానే ఉంటుంది! ఒకటా ... రెండా... పండగకు సంబంధించిన ఎన్నో విషయాలను నాన్‌స్టాప్‌గా చెబుతుంది. అంజలి చెప్పే కోనసీమ సంక్రాంతి ముచ్చట్లు తెలుసుకుందాం...చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే తెలుగమ్మాయిలందరికీ నటి అంజలి ఓ స్ఫూర్తి. మనందరి అమ్మాయి.. తెలుగమ్మాయి.. ఈ పెద్ద పండుగను ఎలా జరుపుకుంటుందంటే...కోనసీమజిల్లా రాజోలు మా ఊరు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు.. అందరికీ వారం ముందు నుంచి పండుగ మొదలయితే, మాకు నెల ముందు నుంచే ఇంకా చెప్పాలంటే పండుగయిన తర్వాతి రోజే.. వచ్చే సంక్రాంతి కోసం ఏర్పాట్లు చేస్తుంటాం. మా తాతయ్య సుబ్బారావుగారు పండుగలంటే అందరూ కలసి చేసుకోవాలని చెప్పేవారు. అందుకే, చిన్నప్పటి నుంచే నాకు అదే అలవాటు. మా ఫ్యామిలీ చాలా పెద్దది. అందరూ వస్తే ఇల్లు మొత్తం నిండిపోయేది. అయినా సరే, ఏ పండుగైనా అందరం కలసే జరుపుకుంటాం. ఇంట్లోనూ పొలాల్లోనూ ఘనంగా పూజలు నిర్వహిస్తాం. చిన్నప్పుడు కజిన్స్‌ అందరం కలసి ఉదయాన్నే భోగి మంటలు వేయటానికి, అందులో ఏమేం వేయాలో అనే విషయాల గురించి వారం ముందు నుంచే మాట్లాడుకునేవాళ్లం. తాతయ్య పిండివంటలన్నీ చేయించేవారు. అందుకే, ఈ పండుగ కోసం ఎంతో ఎదురు చూసేదాన్ని. కాని, సిటీకి వచ్చాక అంత ఎంజాయ్‌మెంట్‌ లేదు. చిన్నతనంలో మా పెద్దవాళ్లు ముగ్గు వేస్తే, మేము రంగులు వేసి, ఈ ముగ్గు వేసింది మేమే అని గర్వంగా చెప్పుకుని తిరిగేవాళ్లం. అందుకే, ముగ్గుల పోటీల్లో నేనెప్పుడూ పాల్గొనలేదు. గాలిపటాన్ని కూడా ఎవరైనా పైకి ఎగరేసిన తర్వాత ఆ దారాన్ని తీసుకుని నేనే ఎగరేశా అని చెప్పుకుంటా. అందుకే, సంక్రాంతి నాకు మరచిపోలేని పండుగ.నిండుగా పొంగితే అంతటా సమృద్ధిసంక్రాంతి పండగ అనగానే తెల్లవారకుండానే పెద్దలు పిల్లల్ని నిద్రలేపడం, చలికి వణుకుతూ ముసుగుతన్ని మళ్లీ పడుకోవడం ఇప్పటికీ గుర్తు వస్తుంటుంది. సందడంతా ఆడపిల్లలదే. ముగ్గులు వేయడం, వాటిల్లో గొబ్బెమ్మలు పెట్టి, నవధాన్యాలు, రేగుపళ్లు వేసేవాళ్లం. ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, ఆవు పిడకల మీద మట్టి గురిగలు పెట్టి, పాలు పొంగించేవాళ్లం. ఎటువైపు పాలు పొంగితే అటువేపు సస్యశ్యామలం అవుతుందని నమ్మకం. నిండుగా పొంగితే అంతటా సమృద్ధి. మిగిలిన గురుగుల్లోని ప్రసాదాన్ని అలాగే తీసుకెళ్లి లోపలి గదుల్లో మూలకు పెట్టేవారు ఎలుకల కోసం. సాధారణ రోజుల్లో ఎలుకలు గింజలు, బట్టలు కొట్టేస్తున్నాయని వాటిని తరిమేవారు. అలాంటిది సంక్రాంతికి మాత్రం, బయట పక్షులతోపాటు ఇంట్లో ఎలుకలకు కూడా ఇలా ఆహారం పెట్టేవాళ్లు. ముగ్గులు పెట్టడంలో ఇప్పడూ పోటీపడే అమ్మాయిలను చూస్తున్నాను. మేం ఉండేది వనపర్తిలో. అప్పటి మాదిరిగానే ఇప్పడూ జరుపుకుంటున్నాం. – పోల్కంపల్లి శాంతాదేవి, రచయిత్రి

gold and silver rates today on market in telugu states8
పండగ వేళ పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌

సేఫ్డ్‌ అసెట్‌గా భావించే బంగారం(Gold) పెట్టుబడులను ఇటీవల కాలంలో ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్లు(Stock Market) భారీగా తగ్గుతున్న నేపథ్యంలో కొన్ని స్టాక్‌లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దాంతో చాలా మంది బంగారంలోని పెట్టుబడులను ఈక్వీటీలకు మళ్లిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే పండగవేళ(Festive Time) మంగళవారం బంగారం ధర తగ్గిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.73,300 (22 క్యారెట్స్), రూ.79,960 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్స్‌పై రూ.100, 24 క్యారెట్స్‌పై రూ.110 చొప్పున తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.73,300 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.79,960 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.100 తగ్గి రూ.73,450కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.110 దిగజారి రూ.80,110 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు మంగళవారం తగ్గినట్లే వెండి ధరల్లోనూ మార్పులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు కేజీ వెండి(Silver Price) రేటు రూ.2,000 తగ్గి రూ.1,00,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

ILT20 2025: Banton, Pooran Power MI Emirates To Crucial Win Over Dubai Capitals9
పూరన్‌ సిక్సర్ల సునామీ.. బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్‌.. హోప్‌ సెంచరీ వృధా

ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 టోర్నీలో ముంబై ఇండియన్స్‌ ఎమిరేట్స్‌ బోణీ కొట్టింది. దుబాయ్‌ క్యాపిటల్స్‌తో నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ ఎమిరేట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. టామ్‌ బాంటన్‌ (52 బంతుల్లో 74; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), నికోలస్‌ పూరన్‌ (29 బంతుల్లో 59; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ అర డజను సిక్సర్లతో సునామీ సృష్టించాడు. ముంబై ఇన్నింగ్స్‌లో పోలార్డ్‌ (19 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్‌), ముహమ్మద్‌ వసీం (18) రెండంకెల​ స్కోర్లు చేశారు. క్యాపిటల్స్‌ బౌలర్లలో గుల్బదిన్‌ నైబ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. ఓలీ స్టోన్‌ 2, చమీరా ఓ వికెట్‌ దక్కించుకున్నారు.హోప్‌ సెంచరీ వృధాఛేదనలో క్యాపిటల్స్‌ ఓపెనర్‌ షాయ్‌ హోప్‌ (59 బంతుల్లో 101; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేశాడు. హోప్‌కు మరో ఎండ్‌ నుంచి ఎలాంటి సహకారం అందలేదు. బెన్‌ డంక్‌ (10), బ్రాండన్‌ మెక్‌ముల్లెన్‌ (16), గుల్బదిన్‌ నైబ్‌ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సికందర్‌ రజా (6), దుసన్‌ షనక (0) విఫలమయ్యారు. క్యాపిటల్స్‌ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫజల్‌ హక్‌ ఫారూఖీ, అల్జరీ జోసఫ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. వకార్‌ సలామ్‌కిల్‌, అల్లా ఘజన్‌ఫర్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. క్యాపిటల్స్‌ చేసిన స్కోర్‌లో హోప్‌ ఒక్కడే మూడొంతులు చేయడం విశేషం. 161 పరుగుల్లో హోప్‌ 101 పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు, ఎక్స్‌ట్రాల రూపంలో 60 పరుగులు వచ్చాయి.

South Africa Gold Mine at Least 100 Illegal Miners Died10
South Africa: బంగారు గనిలో చిక్కుకుని 100 మంది కార్మికులు మృతి

దక్షిణాఫ్రికాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక గనిలో చిక్కుకుని, 100 మంది కార్మికులు మృతిచెందారని సమాచారం. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం ఈ కార్మికులంతా దక్షిణాఫ్రికాలోని ఒక బంగారు గనిలో అక్రమంగా పనులు చేస్తున్నారు.గనిలో చిక్కుకున్న కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక బృందం మీడియాతో మాట్లాడుతూ ఈ కార్మికులు నెలల తరబడి భూగర్భ గనిలో చిక్కుకున్నారని తెలిపింది. ఈ నేపధ్యంలోనే వారు మరణించారని పేర్కొంది. కాగా గనిలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ, విజయం సాధించలేకపోయారు.మైనింగ్ ప్రభావిత కమ్యూనిటీస్ యునైటెడ్ ఇన్ యాక్షన్ గ్రూప్ ప్రతినిధి సబెలో మ్ంగుని మీడియాతో మాట్లాడుతూ కొందరు గని కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని, వారి దగ్గర రెండు వీడియోలు లభ్యమయ్యాయన్నారు. ఆ వీడియోల్లో డజన్ల కొద్దీ మృతదేహాలు భూగర్భంలో గనిలో కనిపిస్తున్నాయన్నారు.వాయువ్య ప్రావిన్స్‌లోని ఈ గనిలో 100 మంది వరకూ మృతిచెందారని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇప్పటివరకు భూగర్భ గనిలో నుంచి 18 మృతదేహాలను బయటకుతీశారు. వారు ఆకలి, డీహైడ్రేషన్‌ కారణంగా చనిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: మకర సంక్రాంతి వేళ.. అమృత స్నానానికి పోటెత్తిన జనం

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
NRI View all
title
Sankranti 2025 : జపాన్‌లో తెలుగువారి సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి వచ్చిందంటే ఊరా వాడా అంతా సంబరంగా జరుపుకుంటారు.

title
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా

ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్

title
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!

అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్‌ దిగ్గజం యాపిల్‌ 185 మంది ఉద్యోగులను త

title
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి

title
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)

Advertisement

వీడియోలు

Advertisement