Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Reduced poverty 2022-2023 in Andhra Pradesh1
వైఎస్‌ జగన్‌ ఘనత.. 2022–23లో ఏపీలో తగ్గిన పేదరికం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయడం, రైతన్నలకు పెట్టుబడి సాయం అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవనోపాధి మెరుగుపడింది. తద్వారా వారి పేదరికం జాతీయ స్థాయి కన్నా తక్కువగా నమోదైంది. ఈ విషయాన్ని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 2022–23 నాటికి పేదరికం నిష్పత్తిని ఈ నివేదిక విశ్లేషించింది. గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ స్థాయిలో పేదరికం 7.10 శాతం, పట్టణ ప్రాంతాల్లో 4.62 శాతం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఐదు శాతం కన్నా దిగువున ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో 4.40 శాతం ఉన్నట్లు తెలిపింది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గణనీయంగా పేదరికం తగ్గినట్లు ఈ నివేదిక పేర్కొంది. దీనికి ప్రధాన కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను నిర్మించడం, రైతుల ఆదాయాన్ని పెంపొందించడమని స్పష్టం చేసింది. వీటి ద్వారా గ్రామీణ జీవనోపాధిని గణ­నీయంగా మెరుగు పరచిందని నివేదిక తెలి­పిం­ది. ప్రభుత్వాలు అమలు చేసిన కార్య­క్రమాలతో పేదరికం తగ్గడంతో పాటు గ్రామీ­ణ, పట్టణ పేదల జీవనోపాధి మెరుగుపడిందని నివేదిక స్పష్టం చేసింది. అలాగే జాతీయ స్థాయిని మించి ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్‌ రాష్ట్రాల్లో పేదరికం ఉందని పేర్కొంది.

Weekly Horoscope From 25-08-24 To 31-08-24 In Telugu2
Weekly Horoscope: ఈ రాశుల వారికి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది..

మేషం...గతంలో నిలిచిపోయిన కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి సహాయం కోరతారు. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలలో అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు ఉండవచ్చు.. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం చివరిలో మిత్రులతో కలహాలు. కుటుంబంలో ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.వృషభం...వీరికి అన్నింటా విజయాలే. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. కళారంగం వారికి కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. నీలం, లేత గులాబీరంగులు. గణేశాష్టకం పఠించండి.మిథునం...నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల్లోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. కొన్ని సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. ఆస్తిలాభం. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు. సమాజసేవలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మ«ధ్యలో ధనవ్యయం. మానసిక ఆందోళన. ప్రయాణాలు. పసుపు, నేరేడు రంగులు. శివస్తోత్రాలు పఠించండి.కర్కాటకం...అనుకున్న కార్యాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, సన్నిహితులు సహాయపడతారు. కొంతకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు విశేష గుర్తింపు రాగలదు. . పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. అనారోగ్యం. లేత ఎరుపు, బంగారు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.సింహం...మొదట్లో కొద్దిపాటి చికాకులు ఎదురైనా అ«ధిగమిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. కొత్త వ్యక్తులు పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో మిత్రులతో వైరం. ప్రయాణాలలో ఆటంకాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నలుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.కన్య...ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. గతాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలలో జాగ్రత్తపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఉన్నతస్థాయి పిలుపు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వృథా ఖర్చులు.. తెలుపు, లేత ఎరుపు రంగులు,గణేశ్‌ను పూజించండి.తుల...కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. గృహనిర్మాణయత్నాలు సానుకూలం. విద్యార్థులు ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. మీ ఆశయాలు కొన్ని నెరవేరతాయి. పట్టుదలతో వివాదాల నుండి గట్టెక్కుతారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులు సమర్థతను నిరూపించుకుంటారు.. కళాకారులకు ఊరించని అవకాశాలు. వారం మధ్యలో దుబారా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు.. గులాబీ, పసుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.వృశ్చికం...ముఖ్యమైన పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. కోర్టు కేసులు సైతం పరిష్కారమవుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు కొత్త అవకాశాలు రావచ్చు.వారం చివరిలో బంధువులతో మాటపట్టింపులు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబబాధ్యతలు అధికం. . తెలుపు, లేత నీలం రంగులు, దేవీస్తుతి మంచిది.ధనుస్సు...ఆర్థికంగా కొంత అనుకూలస్థితి ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సోదరుల నుంచి పిలుపు అందుతుంది. వాహనయోగం. వ్యాపారాలలో చిక్కులు తొలగి లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో మీకు ఎదురుండదు. కళారంగం వారికి సన్మానాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు.విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.మకరం...ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆసక్తికర సమాచారం అందుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థికంగా కొంత బలం చేకూరి రుణాలు తీరతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో మిత్రులతో కలహాలు. శ్రమ పెరుగుతుంది. గులాబీ, తెలుపు రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.కుంభం...పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. రాజకీయవర్గాలకు యోగదాయకమైన కాలం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. రాఘవేంద్రస్తుతి మంచిది.మీనం...ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఒత్తిడులు, సమస్యలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి, ఆత్మస్థైర్యంతో అడుగువేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు ఏర్పడవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం. కీలక నిర్ణయాలు. ఎరుపు, పసుపు రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.

 CM whose words are out of control3
‘భూత్‌’ బంగ్లా సర్కార్‌!

మాజీ ముఖ్యమంత్రిని భూతంతో పోల్చారు చంద్ర బాబు. ఆ భూతం మళ్లీ వస్తా వస్తా అంటున్నదనీ, దాన్ని భూస్థాపితం చేయాలంటూ చెలరేగిపోయారు. ఇంకా కిందకు జారి మాట్లాడారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాతో ఉన్న వ్యక్తిని భూతంతో పోల్చితే అవే హోదాలు ఇంకా ఎక్కువకాలం అనుభవించిన తాను ఏమవుతారు? భూతమా... దయ్యమా? ఆయనీమధ్య తాను ’95 మోడల్‌ ముఖ్యమంత్రినని పదేపదే చెప్పుకుంటున్నారు. ఆ 95 మోడల్‌ అంటే నిజంగా జనాన్ని పీల్చి పిప్పిచేసిన దయ్యాలమర్రి పాలనే! ప్రజలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదంటూ నీతి శతకాలు రచించిన పాలకుడే నైన్టీ ఫైవ్‌ మోడల్‌. ధర్మాస్పత్రిలో జ్వరం బిళ్లకు సైతం యూజర్‌ ఛార్జీలు వసూలు చేసిన చేటుకాలమే 95 టూ 2004. ఆ తొమ్మిదేళ్ల కాలం ఉమ్మడి రాష్ట్ర రైతాంగ చరిత్రలో ఒక భీతావహ అధ్యాయం. నాగేటి చాళ్లలో క్షుద్ర విత్తనాలు మొలకెత్తిన కాలం. చేలల్లో చావు కంకులు విరగ్గాసిన కాలం. వేలాది రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడిన రోజులు. 95 మోడల్‌కు వ్యవసాయం ఓ దండగమారి పని. అందువల్లనే ఆ మోడల్‌ అమలు చేసిన విధానాలు వ్యవసాయ రంగంలో విధ్వంసాన్ని సృష్టించాయి.’95 మోడల్‌నని చెప్పుకోవడమే కాదు, ఆ దారిలో ఇప్పుడు కూడా పయనిస్తున్నారు! ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు కన్పిస్తు న్నాయి. ‘అమూల్‌’ రంగప్రవేశంతో అధికాదాయం సంపాదించిన పాడి రైతుల నోట్లో అప్పుడే మట్టిపడింది. ‘అమూల్‌’ను రంగం నుంచి తప్పిస్తున్నారు. పోటీ లేక పోవడంతో హెరిటేజ్‌ తదితర సంస్థలు సేకరణ ధరను తగ్గిస్తున్నాయి.దేశంలోని ప్రస్తుత సీనియర్‌ మోస్ట్‌ రాజకీయవేత్తల్లో ఆయన ఒకరు. ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఫోర్‌–ఓ (4.0) వెర్షన్‌. పదిహేనేళ్లపాటు మాజీ ముఖ్యమంత్రి అనే ట్యాగ్‌లైన్‌తో తిరిగారు. ఇంతటి అనుభవశాలి ఎందుకో కలవరపడుతున్నారు. అభద్రతా భావంతో తత్తరపాటుకు గురవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి పేరు వింటేనే ఆయన సర్వేంద్రియాలు సంక్షో భానికి లోనవుతున్నవి. విజ్ఞత విలుప్తమైపోతున్నది. ఆయన జనంలోకి వెళితే ఈయన జ్వరపీడితుడవుతున్నారు. ఆ వేడికి భాష మరిగిపోతున్నది.విశాఖ సమీపంలో జరిగిన ఫార్మా కంపెనీ దుర్ఘటన సంద ర్భాన్నే తీసుకుందాము. బాధిత కుటుంబాలను ఓదార్చడానికి మాజీ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లారు. చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ అనునయించి ధైర్యం చెప్పారు. అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. ఆయన రాకను పురస్కరించుకొని వేలాది జనం అక్కడ గుమిగూడారు. ఈ పరిణామం ముఖ్యమంత్రికి ఆగ్రహం తెప్పించింది. ఆ తర్వాత కాసేపటికి జరిగిన ఒక గ్రామ సభలో ఆయన మాటలు అదుపు తప్పాయి.మాజీ ముఖ్యమంత్రిని భూతంతో పోల్చారు. ఆ భూతం మళ్లీ వస్తా వస్తా అంటున్నదనీ, దాన్ని భూస్థాపితం చేయా లంటూ చెలరేగిపోయారు. ఇంకా కిందకు జారి మాట్లాడారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాతో ఉన్న వ్యక్తిని భూతంతో పోల్చితే అవే హోదాలు ఇంకా ఎక్కువకాలం అనుభవించిన తాను ఏమవు తారు? భూతమా... దయ్యమా? ఆయనీమధ్య తాను ’95 మోడల్‌ ముఖ్యమంత్రినని పదేపదే చెప్పుకుంటున్నారు. ఆ 95 మోడల్‌ అంటే నిజంగా జనాన్ని పీల్చి పిప్పిచేసిన దయ్యాలమర్రి పాలనే!ప్రజలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదంటూ నీతి శతకాలు రచించిన పాలకుడే నైన్టీ ఫైవ్‌ మోడల్‌. ధర్మాస్పత్రిలో జ్వరం బిళ్లకు సైతం యూజర్‌ ఛార్జీలు వసూలు చేసిన చేటుకాలమే 95 టూ 2004. ఆ తొమ్మిదేళ్ల కాలం ఉమ్మడి రాష్ట్ర రైతాంగ చరిత్రలో ఒక భీతావహ అధ్యాయం. నాగేటి చాళ్లలో క్షుద్ర విత్తనాలు మొల కెత్తిన కాలం. చేలల్లో చావు కంకులు విరగ్గాసిన కాలం. వేలాది రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడిన రోజులు. 95 మోడల్‌కు వ్యవసాయం ఓ దండగమారి పని. అందువల్లనే ఆ మోడల్‌ అమలు చేసిన విధానాలు వ్యవసాయ రంగంలో విధ్వంసాన్ని సృష్టించాయి.’95 మోడల్‌నని చెప్పుకోవడమే కాదు, ఆ దారిలో ఇప్పుడు కూడా పయనిస్తున్నారు! ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు కన్పిస్తున్నాయి. ‘అమూల్‌’ రంగప్రవేశంతో అధికాదాయం సంపాదించిన పాడి రైతుల నోట్లో అప్పుడే మట్టిపడింది. ‘అమూల్‌’ను రంగం నుంచి తప్పిస్తున్నారు. పోటీ లేకపోవడంతో హెరిటేజ్‌ తదితర సంస్థలు సేకరణ ధరను తగ్గిస్తున్నాయి. రెండున్నర మాసాల్లోనే ‘95 మోడల్‌’ చూపెట్టిన చిన్న ఝలక్‌ మాత్రమే ఇది. ముందున్నది అసలైన నిజరూప దర్శనం.పేదలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదు, ప్రైవేట్‌ గద్దలకు మాత్రం సమస్త వనరులను దోచిపెట్టాలన్నది ఆ మోడల్‌ నిత్యం జపించే తిరుమంత్రం. అందుకే ‘అమ్మ ఒడి’ ఆగిపోయింది. అందుకే ‘రైతు భరోసా’ ఆగిపోయింది. ‘విద్యా దీవెన’, ‘విద్యా కానుక’లు ఆగిపోయాయి. పంటల బీమా, మత్స్యకార భరోసా వెనక్కు మళ్లాయి. ఇంటి దగ్గర దర్జాగా పెన్షన్లు తీసు కున్న అవ్వాతాతలను నాయకుల ఇళ్ల ముందు నిలబెట్టుకుంటున్నారు. నిరుపేదల బిడ్డలు సైతం సంపన్న శ్రేణితో సమానంగా అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసించడానికి అంది వచ్చిన అవకాశాన్ని ఈ ’95 మోడల్‌ వచ్చీరాగానే తన్ని తగలేసింది. ఐబీ సిలబస్‌ను అటకెక్కించారు. ఇంగ్లిషు మీడియం ఉపసంహరణకు రంగం సిద్ధమైంది.పేదలు, బలహీనవర్గాలు, మహిళల సాధికారత కోసం కార్యక్రమాలు చేపట్టినందుకే మాజీ ముఖ్యమంత్రిని మన ‘95 మోడల్‌’ భూతంగా పరిగణిస్తున్నది. ఈ ధోరణి కొత్త కాదు. పేద ప్రజల పక్షాన నినదించిన ప్రతి గొంతుకనూ దయ్యాలు, భూతాల గొంతుకగా బ్రాండింగ్‌ చేయడం, దుష్ప్రచారానికి ఒడి గట్టడం శతాబ్దాలకు పూర్వమే ప్రారంభమైంది. 1848లో కార్ల్‌ మార్క్స్‌ ప్రచురించిన కమ్యూనిస్టు మేనిఫెస్టో ‘యూరోప్‌ను కమ్యూనిస్టు భూతం వెంటాడుతున్నది’ అనే వాక్యంతో ప్రారంభమైంది. కమ్యూనిస్టు భావజాలాన్ని భూతంగా భావించే నాటి పాలక ప్రతిపక్ష పార్టీలకు హెచ్చరికగా మార్క్స్‌ ఈ వాక్యాన్ని రాశారు.ఇప్పుడూ అంతే! ఐదేళ్ల కాలంలో రెండు లక్షల డెబ్బయ్‌ వేల కోట్ల ప్రజా ధనాన్ని ప్రజల అకౌంట్లలోకే బదిలీ చేసి అణ గారిన జీవితాలనూ, వాటితోపాటు ఆర్థిక వ్యవస్థను కూడా ఉద్దీపింపజేసిన దార్శనిక పాలనను భూతాల పరిపాలనగా ప్రచారం చేస్తున్నారు. వైద్యాన్ని ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ, ప్రజా వైద్య విధానాన్ని రూపొందించిన ప్రభుత్వానిది భూతాల పాలనట! దాన్నిప్పుడు ప్రైవేట్‌ పెట్టు బడికి తాకట్టు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రగతిశీలమట! దయ్యాలు వేదాలు వల్లించడమంటే అచ్చంగా ఇదే కదా! ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు అదే పని చేస్తున్నారు.ఏ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేసిందనే అంశంపై చర్చ జరపడం ఒక భాగం. ఎవరిది ప్రజాస్వామ్య రాజ కీయమో, ఎవరిది దయ్యాలు – భూతాల రాజకీయమో తేల్చడా నికి ఇంకో చర్చ కూడా ఉన్నది. వారు ఏ రకంగా అధికారంలోకి వచ్చారన్నది పరిశీలించడానికి ఈ చర్చ జరగాలి. ఈ ముఖ్యమంత్రి తొలి రౌండ్‌లో ఏవిధంగా అధికారంలోకి వచ్చారన్నది జగమెరిగిన వెన్నుపోటు కథ. పార్టీ ఆయన స్థాపించినది కాదు. ఎమ్మెల్యేలను గెలిపించిందీ ఆయన కాదు. వదంతులను ప్రచారం చేసి, ఎమ్మెల్యేలను ‘వైస్‌రాయ్‌’లో నిర్బంధించి, మీడియాతో కుమ్మక్కయి, రాజ్యాంగ వ్యవస్థలను మచ్చిక చేసు కుని దొడ్డిదారిన అధికార పీఠమెక్కారు. మాజీ ముఖ్యమంత్రి రాజకీయ ప్రస్థానం ఇందుకు పూర్తిగా భిన్నమైన ప్రయాణం. ఆయనే స్వయంగా పార్టీని నిర్మించుకున్నారు. ఇందుకు భారీ మూల్యాన్ని ఆయన చెల్లించుకోవలసి వచ్చింది.అయినా తలొగ్గ కుండా జనంలోకి వెళ్లారు. అలవికాని వాగ్దానాలను చేయడానికి నిరాకరించి కోరి ఓటమిని తెచ్చుకున్నారు. ప్రతిపక్షంలో ఐదేళ్లు గట్టిగా నిలబడి ఒంటరి పోరాటంతోనే ముఖ్యమంత్రి అయ్యారు. భూతం ఎవరు? రాచబాటలో వచ్చినవారా? దొడ్డి దారిన ప్రవేశించిన వారా?ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో నాలుగో దఫా ఎలా అధికారంలోకి వచ్చారు? పెంపుడు మీడియాను ఉసిగొలిపి పాత ప్రభుత్వంపై అవాకులు చెవాకులు ప్రచారం చేశారు. సరిపోలేదు. కాళ్లావేళ్లా పడి ఎన్డీఏ కూటమిలో చేరారు. ఎన్నికల సంఘాన్ని అదుపులో పెట్టుకున్నారు. ఇది కూడా సరిపోలేదని స్వతంత్ర పరిశోధకులు, సంస్థలు బల్లగుద్ది చెబుతున్నాయి. పోలింగ్‌ జరిగిన రోజు రాత్రి 8 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లో 68 శాతానికి పైగా ఓట్లు పోలైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.ఆ తర్వాత తీరిగ్గా నాలుగు రోజుల సమయం తీసుకొని 81 శాతం పోలైనట్టు ప్రకటించింది. ఇది అసాధార ణమని ‘ఓట్‌ ఫర్‌ డెమోక్రసీ’ (వీఎఫ్‌డీ) అనే సంస్థ వాదిస్తున్నది. గతంలో ఎన్నడూ ఈ తేడా ఒక శాతం కన్నా అధికంగా ఉండేది కాదు. ఈసారి ఏపీలో అది 12.5 శాతంగా నమోదైంది. ఈవీ ఎమ్‌ల మాయాజాలమే ఈ అధిక ఓట్ల నమోదుకు ప్రధాన కార ణమని వీఎఫ్‌డీ ఆరోపిస్తున్నది. ఎన్డీఏ మౌత్‌పీస్‌గా పనిచేసే ఓ జాతీయ చానల్‌ కూడా నిన్న ప్రసారం చేసిన ఒక సర్వే వివరాల్లో చంద్రబాబుకు 44 శాతం ప్రజల మద్దతున్నట్టు తేల్చింది. కూటమికి పడిన 56 శాతం ఓట్లలో ఇది 12 శాతం కోత. వీఎఫ్‌డీ చెబుతున్న అక్రమ ఓట్లకు ఈ నంబర్‌ సరిపోతున్నది.వీఎఫ్‌డీ ఈ వ్యవహారంపై ఒక సమగ్రమైన రిపోర్టును విడుదల చేసి, నెలరోజులు దాటినా ఇప్పటివరకూ ఎన్నికలసంఘం స్పందించలేదు. ఈ కృత్రిమ అధిక ఓట్ల నమోదు కార ణంగా కేంద్రంలోనూ, ఏపీ, ఒడిషాల్లోనూ గెలవాల్సిన పక్షాలు ఓడిపోయాయి. పోలింగ్‌ శాతంపై కొన్ని రోజుల తర్వాత చేసిన తుది ప్రకటనకూ, లెక్కించిన ఓట్లకూ కూడా తేడాలున్నాయి. సుమారు 390 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ తేడాలున్నాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) వెల్లడించింది. కొన్ని నియోజకవర్గాల్లో లెక్కించిన ఓట్లు పోలయినట్టు ప్రకటించిన ఓట్ల కంటే తక్కువున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువున్నాయి. ఇదెలా సాధ్యం? ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ మిషన్లలో దయ్యాలు, భూతాలు దూరితేనే సాధ్యమవుతుంది.ఆ దయ్యాలూ, భూతాలు ఎట్లా దూరాయన్న రహస్యం విజేతలకు మాత్రమే తెలుస్తుంది.వారికి అనుబంధంగా పని చేసిన ఎన్నికల సంఘానికి మాత్రమే తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఈ అంశంపై పలువురు మేధావులు గొంతెత్తి మాట్లాడారు. చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయినా ఎన్నికల సంఘం మాత్రం నోరు విప్పలేదు. పైపెచ్చు, అనుమానం ఉన్న నియో జకవర్గాల్లో 5 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయంపై కూడా ఈసీ వక్రభాష్యాలు చెబుతున్నది. ఈవీఎమ్‌లపై అధికారికంగా ఫిర్యాదులు చేసిన అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తేవడం కూడా పలు అను మానాలకు తావిచ్చింది. ఏపీలో ఎన్డీఏ కూటమి కూడా ఈఅంశంపై నోటికి తాళం వేసుకున్నది. కచ్చితంగా ఏదో జరిగిందన్నది అఖిలాంధ్ర ప్రజల నిశ్చితాభిప్రాయం. ఎన్నికల హామీల నుంచి, ఈవీఎమ్‌ల బాగోతం నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నాల్లో కూటమి పెద్దల మాటలూ, చేతలు అదుపు తప్పుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థిని భూస్థాపితం చేసి పైకి రాకుండా కాంక్రీట్‌ పోయాలనే పైశాచిక ఆలోచనలు చెలరేగు తున్నాయి.vardhelli1959@gmail.comవర్దెల్లిమురళి

CBI Reached RG Kar Medical College Sandip Ghosh Residence4
కోల్‌కతా ఘటన: మాట మార్చిన నిందితుడు.. అక్కడ సీబీఐ సోదాలు

కోల్‌కతా: బెంగాల్‌లోని ఆర్జీ కార్‌ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌ హత్యాచార కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక, కేసులో పలు ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈ కేసులో నిందితుడు సంజయ్‌ రాయ్‌.. జైలులో గార్డులతో చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. తనకూ ఈ కేసులో ఎలాంటి సంబంధంలేదని చెప్పడం సంచలనంగా మారింది.కాగా, ఆర్జీ కార్‌ ఆసుపత్రిలో డాక్టర్‌ హత్యచార కేసులో సంజ​య్‌ రాయ్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, విచారణ సందర్భంగా సంజయ్ రాయ్‌ తన నేరాన్ని అంగీకరించాడు. ఆ రోజు ఏం జరిగిందో అంతా వివరించాడు. కానీ, తాజాగా జైలు గార్డులతో మాత్రం మరోలా చెప్పడం గమనార్హం. అసలు ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. పేరు చెప్పడానికి ఇష్టపడని జైల్ అధికారులు ఈ విషయం వెల్లడించారు. అంతకుముందు కూడా.. తనకు ఈ నేరానికి ఎలాంటి సంబంధం లేదని కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను నిర్దోషిని అంటూ అందుకే లై డిటెక్టర్ టెస్ట్‌కి అంగీకరించానని కోర్డులో జడ్జ్ ముందే చెప్పాడు.అయితే, హత్యాచార ఘటన సమయంలో సెమినార్ రూమ్‌ వైపు ఎందుకు వెళ్లావ్ అని పోలీసులు ప్రశ్నించగా.. సంజయ్‌ దానికి సమాధానం చెప్పలేదు. పొంతన లేని సమాధానాలు చెప్పి విచారణ అధికారులను తప్పుదోవ పట్టించాలని చూశాడు. క్రైమ్‌ సీన్‌లో తెల్లవారుజామున 4.03 గంటలకు కనిపించాడుతన ముఖంపై గాయాల గురించి విచారిస్తే సరైన బదులు ఇవ్వడం లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు.CCTV footage shows accused entering hospital!Sanjay Rai is seen wearing jeans & t-shirt with a helmet in hand on August 9 night when he committed the heinous crime.BJP & CPM claimed that Sanjay was a scapegoat framed by @KolkataPolice to shield others.#KolkataDoctorDeathCase pic.twitter.com/TrGz3fWoTV— Nilanjan Das (@NilanjanDasAITC) August 23, 2024ఇదిలా ఉండగా.. ఆగస్టు 24వ తేదీనే(శనివారం) సంజయ్‌కు పాలిగ్రఫీ టెస్ట్ చేయాల్సి ఉండగా..కొన్ని కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో, నేడు ఆదివారం(ఆగస్టు 25) ఈ టెస్ట్ నిర్వహించేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. ప్రస్తుతానికి జైల్‌లో ఉన్న సంజయ్ రాయ్‌ని అక్కడే ఉంచి ఈ టెస్ట్ చేయాలని భావిస్తున్నారు. అతని సెల్‌ వద్దే సీసీ కెమెరాలు పెట్టారు. నిఘా పెంచారు.#WATCH | Kolkata, West Bengal: CBI Anti Corruption Branch reaches the administrative block of RG Kar Medical College and Hospital. CBI started a corruption investigation against former principal Sandeep Ghosh by filing an FIR, yesterday. pic.twitter.com/2KnCsHZXSN— ANI (@ANI) August 25, 2024మరోవైపు.. ఆర్జీ కార్‌ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో భారీగా ఆర్థిక అవకతవకలు భారీగా జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ప్రొ. సందీప్ ఘోష్‌పై సీబీఐ శనివారం కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం సీబీఐ అధికారులు.. సందీప్‌ ఘోష్‌కు సంబంధించిన ఇళ్లు, పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సీబీఐ బృందాలు తనిఖీలు మొదలుపెట్టాయి.

Joe Root overtakes Rahul Dravid And Alan Border to find himself in elite company5
జో రూట్‌ అరుదైన ఘనత.. ద్రవిడ్‌ రికార్డు బద్దలు! సచిన్‌కు చేరువలో

ఇంగ్లండ్ స్టార్ బ్యాట‌ర్ జో రూట్ త‌న అద్భుత ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. మాంచెస్ట‌ర్ వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన తొలి టెస్టులో రూట్ స‌త్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 42 ప‌రుగులు రాణించిన రూట్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఆజేయ హాఫ్ సెంచ‌రీ సాధించాడు.128 బంతుల్లో 2 ఫోర్లు సాయంతో అత‌డు 62 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొద‌టి టెస్టులో ఇంగ్లండ్ ఘ‌న విజ‌యం సాధించ‌డంలో ఈ వెట‌రన్ త‌న వంతు పాత్ర పోషించాడు. 5 వికెట్ల తేడాతో శ్రీలంక‌ను ఇంగ్లండ్ చిత్తుచేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి ఇంగ్లండ్ వెళ్లింది.జో రూట్ అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీతో మెరిసిన జో రూట్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టెస్టుల్లో అత్య‌ధిక హాఫ్ సెంచ‌రీలు చేసిన మూడో ఆట‌గాడిగా రూట్ రికార్డుల‌కెక్కాడు. ఇప్ప‌టివ‌ర‌కు 144 టెస్టులు ఆడిన రూట్‌.. 64 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గ‌జం అలాన్ బోర్డర్(63), భార‌త మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్‌(63)ల పేరిట‌ సంయుక్తంగా ఉండేది. తాజా మ్యాచ్‌తో వీరిద్ద‌రని అధిగ‌మించి మూడో స్ధానానికి రూట్ చేరుకున్నాడు. ఇక అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌(68) అగ్ర‌స్ధానంలో ఉండ‌గా.. విండీస్ లెజెండ్ చంద్ర‌పాల్‌(66) రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రూట్ కెరీర్‌లో 32 టెస్టు సెంచ‌రీలు ఉన్నాయి.

Telegram Chief Pavel Durov Arrested At French Airport6
టెలిగ్రామ్ అధినేత అరెస్ట్‌

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ టెలిగ్రామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పావెల్ దురోవ్‌ అరెస్ట్‌ అ‍య్యారు. యాప్‌కు సంబంధించిన నేరాలకు సంబంధించి దురోవ్‌ను ఫ్రెంచ్ పోలీసులు శనివారం పారిస్ సమీపంలోని విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.ఫ్రెంచ్ రాజధానికి ఉత్తరాన ఉన్న లే బోర్గెట్ విమానాశ్రయంలో ఈ ఫ్రాంకో-రష్యన్ బిలియనీర్‌ను నిర్బంధించినట్లు అధికారి ఒకరు ఏఎఫ్‌పీకి చెప్పారు. ఆయన అజర్‌బైజాన్‌లోని బాకు నుండి వస్తుండగా అరెస్ట్‌ చేసినట్లు కేసుకు దగ్గరగా ఉన్న మరొకరు తెలిపారు. దురోవ్‌ను ఆదివారం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సమాచారం.మైనర్లపై హింసను నిరోధించడంలో కృషి చేసే ఫ్రాన్స్‌కు చెందిన ఆఫ్మిన్‌ సంస్థ మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ బెదిరింపు, వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తులో సమన్వయ ఏజెన్సీగా దురోవ్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కేసుకు దగ్గరగా ఉండే మరో అధికారి ఈ విషయాన్ని తెలిపారు.

Prabhas Spirit Movie May Start In Next Year January7
ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌.. కాస్త ఆలస్యంగా ‘స్పిరిట్‌’?

‘స్పిరిట్‌’ సినిమా సెట్స్‌లోకి కాస్త ఆలస్యంగా అడుగుపెట్టనున్నారట ప్రభాస్‌. ఆయన హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘స్పిరిట్‌’. ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌΄ పాత్రలో నటించనున్నారు ప్రభాస్‌. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదే ప్రారభించాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుందట. ఇక ప్రస్తుతం మారుతి దర్శకత్వంలోని ‘రాజా సాబ్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు ప్రభాస్‌. త్వరలో హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్న ‘ఫౌజీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) షూట్‌లో పాల్గొంటారు ప్రభాస్‌. అర్షద్‌ పిల్లలకు టాయ్స్‌ పంపుతా: నాగ్‌ అశ్విన్‌‘కల్కి 2898 ఏడీ’లోని ప్రభాస్‌ ΄పాత్రను తక్కువ చేస్తూ ఇటీవల బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ చేసిన అభ్యంతరకరమైన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. అర్షద్‌ కామెంట్స్‌పై ఇప్పటికే పలువురు తెలుగు హీరోలు, ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్పందించారు. ‘‘నార్త్‌ వర్సెస్‌ సౌత్, టాలీవుడ్‌ వర్సెస్‌ బాలీవుడ్‌ వంటి అంశాలకు తావు లేదు. అంతా ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీనే. అర్షద్‌ సాబ్‌ మెరుగైన పదాలు వాడి ఉండాల్సింది... అయినా ఫర్వాలేదు. ఆయన పిల్లలకు బుజ్జి టాయ్స్‌ (‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో కనిపిస్తాయి) పంపిస్తాను. నేను మరింత కష్టపడతాను. ‘కె 2’ (కల్కి 2898 ఏడీ సినిమా రెండో భాగాన్ని ఉద్దేశించి) సినిమా అన్ని థియేటర్లలో ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో పూర్తి కాగానే ప్రభాస్‌ పాత్ర చాలా గొప్పగా ఉందంటూ ట్వీట్స్‌ వస్తాయి’’ అని ఓ నెటిజన్‌ పోస్ట్‌కు ‘ఎక్స్‌’ ద్వారా స్పందించారు నాగ్‌ అశ్విన్‌. అలాగే మరో నెటిజన్‌ పోస్ట్‌కు స్పందిస్తూ –‘‘ఆల్రెడీ ప్రపంచంలో ఎంతో నెగిటివిటీ ఉంది. మనం దాన్ని పెంచకూడదు. ప్రభాస్‌గారు అలానే అనుకుంటారని నేను అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు నాగ్‌ అశ్విన్‌. ప్రభాస్‌ హీరోగా అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పటానీ లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సి. అశ్వినీదత్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్‌ 27న విడుదలైంది. ఈ సినిమాకి సీక్వెల్‌ రానుంది.

Moscow Kyiv swap prisoners over ukraine marks Independence Day8
ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధ ఖైదీల మార్పిడి

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతోంది.ఇటీవల ఉక్రెయిన్‌ సైన్యం రష్యాపై దాడిని పెంచింది. ఉక్రెయిన్‌ మిలటరీ.. రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోతోంది. యుద్దం మొదలైన తర్వాత జరుపుకోనున్న ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఇరు దేశాలు సుమారు 100 మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకున్నారు. రష్యా దాడులు ప్రారంభించిని మొదటి నెలలోనే 115 మంది ఉక్రెయిన్‌ సైనికులను క్రెమ్లిన్‌ నిర్బంధించిందని ఉక్రెయిన్‌ అధికారులు పేర్కొన్నారు. వారిలో దాదాపు 50 మంది సైనికులను మారియుపోల్‌లోని అజోవ్‌స్టాల్ స్టీల్‌వర్క్స్ నుంచి రష్యన్ దళాలు తమ అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. రెండువారాల క్రితం ఊహించని రీతిలో ఉక్రెయిన్‌ సైన్యం తమ సరిహద్దుల్లోని భూభాగాల్లోకి చొచ్చుకువచ్చిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ దాడుల్లో కూర్స్క్‌ ప్రాంతంలో 115 మంది రష్యా సైనికులు ఉక్రెయిన్‌కు పట్టుపడ్డారని తెలిపారు. వారంతా ప్రస్తుతం బెలారస్‌లో ఉ‍న్నారని అయితే తాజాగా యుద్ధ ఖైదీలలో మార్పిడిలో భాగంగా వారికి వైద్య చికిత్స, పునరావాసం అందించటంల కోసం రష్యాకు తీసుకువెళ్లనున్నట్ల పేర్కొంది. 22 ఫిబ్రవరి 2022లో యుద్దం మొదలైనప్పటి నుంచి ఇది 55వసారి యుద్ధఖైదీల మార్పిడి అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ అన్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మధ్యవర్తిత్వంతో సైనికుల మార్పిడి జరిగిందని ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘‘మాకు ప్రతిఒక్కరూ గుర్తున్నారు. అందరీని స్వదేశానికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని అన్నారు.

Ksr Comments On Chandrababus Immoral Rule In Andhra Pradesh9
చంద్రబాబూ.. ఈ ప్రశ్నలకు సమాధానం ఏది?

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది అనైతిక ప్రభుత్వం అని, అన్యాయ పాలన చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన ఉదాహరణలు గమనించదగిన అంశాలే. గత రెండున్నర నెలల తన పాలనపై వస్తున్న విమర్శలకు చంద్రబాబు సూటిగా జవాబు ఇవ్వలేకపోతున్నారు. మరో వైపు ఎంత సేపు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారు.ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా? లేదా? అన్న అనుమానం కలిగేలా పరిస్థితి ఏర్పడడం అత్యంత శోచనీయం. చంద్రబాబు పాలన ఏ ఏ రకాలుగా అనైతికంగా ఉందన్నది పరిశీలిస్తే పలు విషయాలు బోధపడతాయి. తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి కాని, ఎన్నికల ప్రణాళికలోని ఇతర వాగ్దానాల గురించి కాని ప్రస్తావించలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు, ఆయన పార్టనర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ఉన్నారు. తమ వాగ్దానాలు తమనే భయపెడుతున్నాయని చంద్రబాబు అంటున్నారు. అదేమంటే గత ప్రభుత్వం చేసిన పాలన అని ప్రచారం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఇప్పుడు కొత్తగా ఆరోపణలు చేయడం లేదు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైతే విమర్శలు చేశారో, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవే అభియోగాలు కొనసాగిస్తున్నారు. దానిని బట్టే చంద్రబాబు అనైతిక పాలన సాగిస్తున్నారన్న విషయం అర్ధం అవుతుంది. ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.14లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించేవారు. అది పచ్చి అబద్దం. అంత అప్పు నిజంగా ఉంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఏమి చేయాలి. దానికి తగ్గటుగా చేయగలిగిన హామీలనే ఇవ్వాలి. అలాకాకుండా టీడీపీ, జనసేనలు ఆకాశమే హద్దుగా ఎన్నికల వరాలు కురిపించాయి. అదేమని అడిగితే, తాము సంపద సృష్టిస్తామని, తద్వారా హామీలు నెరవేర్చుతామని బడాయి కబుర్లు చెప్పేవారు. ఎలాగైతేనేం అధికారంలోకి వచ్చారు. అది ఈవిఎమ్‌ల మహిమా? లేక ప్రజలు నిజంగా ఈ వాగ్దానాలకు ఆకర్షితులయ్యారా అన్నది వేరే సంగతి.. పవర్ చేతికి రాగానే చంద్రబాబు, పవన్‌లు స్వరం మార్చేశారు.హామీలు అమలు చేయాలని ఉంది కాని, డబ్బులు లేవని చెప్పడం ఆరంభించారు. అలాంటప్పుడు చంద్రబాబుది అనైతిక పాలన కాక ఏమవుతుంది? జగన్ చేసిన ఆరోపణ వాస్తవికంగానే ఉందని అనుకోవల్సిందే కదా! టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో హింస, రాజకీయ ప్రత్యర్ధులపై దమనకాండ, హత్యలు గతంలో ఎన్నడూ చూడనివి. ఈ హింసాకాండను చంద్రబాబు నేరుగా ఇంతవరకు ఖండించలేదు. తన కుమారుడి రెడ్‌బుక్ రాజ్యాంగం గురించి ఆయనే మాట్లాడలేకపోతున్నారు. పైగా పోలీసు అధికారుల సమావేశంలో మాత్రం నేరం చేయాలంటే ఎవరైనా సరే భయపడాల్సిందేనని చంద్రబాబు అన్నారట.తెలుగుదేశం అధికార పత్రిక ఈనాడు ఈ హెడింగ్ పెట్టి ఆనందపడింది. చంద్రబాబు వాస్తవంగా అలాంటి ఉద్దేశంతో ఉంటే ఏమి చేయాలి! టీడీపీ కార్యకర్తలు ఎవరూ హింసాకాండకు దిగరాదని పిలుపు ఇవ్వాలి. టీడీపీ వాళ్లు తప్పు చేసినా చర్య తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వాలి. విశేషం ఏమిటంటే ఆయన ఈ కబుర్లు చెప్పిన ముందు రోజే తాడిపత్రిలో టీడీపీ కార్యకర్తలు దారుణమైన హింసకు తెగబడ్డారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వబోమంటూ నానా రచ్చ చేశారు. మాజీ ఎమ్మెల్యేనే ఆయన ఇంటికి ఆయన వెళ్లలేని పరిస్థితి ఉంటే సామాన్యుల గతి ఏమిటి? కేవలం తన అనుకూల మీడియాలో ప్రచారం చేసుకోవడానికి డైలాగులు చెబుతూ, లోపల మాత్రం హింస, దౌర్జన్యాలను ప్రోత్సహించే విధంగా వ్యవహరించడం అనైతికం కాదా! అందువల్ల జగన్ చెప్పినట్లు చంద్రబాబు పాలన అనైతికమే అవుతుంది.గతంలో చంద్రబాబు అనపర్తి వద్ద టూర్‌కు వెళ్లారు. అక్కడి శాంతిభద్రతల రీత్యా పోలీసు అధికారులు ఆయనను వద్దని సూచించారు. కాని చంద్రబాబు వినకుండా, తాను నడిచి వెళతానని అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ వెళ్లారు. పోలీసులు ఆయన భద్రత కల్పించారు తప్ప, అడ్డుకోలేదు. కుప్పం నియోజకవర్గంలో కూడా ఒకసారి ఇలాంటి సమస్య వస్తే పోలీసుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా చంద్రబాబు వ్యవహరించారు. అప్పుడు కూడా పోలీసులు ఆయనకు రక్షణ కల్పించారు. మరి ఇప్పుడేమో మాజీ ఎమ్మెల్యే తన ఇంటికి వెళ్లడానికి వీలు లేదని టీడీపీ వారు అరాచకంగా వ్యవహరించడం, పోలీసులు ఆయనను అక్కడ నుంచి అనంతపురం తరలించడం చేశారు.అల్లర్లు చేసేవారిని కట్టడి చేయడంలో పోలీసులు విఫలం అయ్యారు. అందువల్ల చంద్రబాబుది అనైతిక పాలనే అవుతుంది కదా! సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్టు చూడడం జరిగింది. అందులో పలు విషయాలు గుర్తు చేశారు..'ఈ ఏడాది తల్లికి వందనం ఇవ్వలేం అని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. ఖజానాలో డబ్బు లేదు.. అమరావతి కట్టలేం.. మంత్రి నారాయణ, ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదు - మంత్రి నాదెండ్ల మనోహర్, ఆరోగ్యశ్రీ ఇవ్వలేం.. ఆయుష్మాన్ భారత్ కార్డు తెచ్చుకోండి.. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తమ వద్ద మంత్ర దండం లేదు.. పవన్ కల్యాణ్‌, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చూస్తేనే భయం వేస్తోంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు .. ఇలా ఆయా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు గమనిస్తే ఏపీలో సాగుతున్నది అనైతిక పాలనే అన్న భావన కలుగుతుంది.ఇక ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామన్న హామీ ఊసే లేదు. ఏపీలో ఇటీవలికాలంలో అనేక హత్యలు, అత్యాచారాలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. జగన్ ప్రభుత్వం చేపట్టిన ఓడరేవుల నిర్మాణం ఎలా సాగుతుందో తెలియదు. మెడికల్ కాలేజీల నిర్మాణం ఆగిపోయింది. పైగా వాటిని ప్రైవేటు పరం చేయాలని తలపెట్టారు. గతంలో కొన్ని మెడికల్ సీట్లనే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లుగా మార్చాలని జగన్ ప్రభుత్వం ఆలోచిస్తే విరుచుకుపడ్డ చంద్రబాబు, లోకేష్‌లు ఇప్పుడు ఏకంగా మెడికల్ కాలేజీలనే ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థపై ఎన్నికల ప్రణాళికలో ఏమి చెప్పారు? ఇప్పుడు ఏమి చేస్తున్నారు? పదివేల రూపాయల గౌరవ వేతనం హుష కాకి అయింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలు గందరగోళంలో పడ్డాయి. ఇళ్ల వద్దకు పౌర సేవలను జగన్ ప్రభుత్వం అందిస్తే, ఇప్పుడు మళ్లీ యధాప్రకారం ఆఫీస్‌ల చుట్టూ తిరిగే వాతావరణాన్ని చంద్రబాబు ప్రభుత్వం సృష్టించింది.గతంలో రేషన్ సరుకులను కూడా ఇళ్లకే చేర్చితే, ఆ వాహనాలన్నిటిని తొలగించారు. భారీ ఎత్తున ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు, అదికారంలోకి వచ్చిన తర్వాత లక్షల మంది వలంటీర్లు, రేషన్ వాహనాల యజమానులు, కొన్ని శాఖలలోని చిరుద్యోగులు మొదలైనవారందరిని వీధుల పాలు చేశారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని హోరెత్తించిన కూటమి నేతలు, ఇప్పుడు ఆ ప్రస్తావనే తేకుండా గడుపుతున్నారు. పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడం, అన్నా క్యాంటిన్లు మినహా ఒక్క హామీ అమలు చేయని ప్రభుత్వం అనైతిక ప్రభుత్వం కాక మరేమి అవుతుంది.అన్ని హామీలు ఒక్కసారే అమలు చేయలేకపోవచ్చు. కాని ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా మాట్లాడడం అనైతికమే. కనీసం ఏ హామీ ఎప్పుడు అమలు చేస్తామో చెప్పకపోగా, వాటిని చూస్తేనే భయం వేస్తోందని, గత ప్రభుత్వ వైఫల్యం అంటూ వైఎస్సార్సీపీపై తమ తప్పులను నెట్టివేయడం చూస్తే ఇదేనా చంద్రబాబు అనుభవం అన్నప్రశ్న వస్తుంది. సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా అమరావతి నిర్మిస్తామని, సంపద సృష్టించి సూపర్ సిక్స్ అమలు చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాదించిన చంద్రబాబు ప్రస్తుతం అమరావతి పేరుతో ఏకంగా పదిహేనువేల కోట్ల రూపాయల అప్పు తీసుకురాబోతుండడం అనైతికమా? కాదా? మొత్తం అంత డబ్బు మళ్లీ ఒకే చోట ఖర్చు చేసి, ప్రాంతీయ అసమానలతకు బీజం వేయడం కూడా విమర్శలకు దారి తీస్తోంది.జగన్ 2019లో తాను ఇచ్చిన హామీలకు ఒక ప్రణాళిక రూపొందించి వాటిని అమలు చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అసలు వాగ్దానాలను పట్టించుకోవడం లేదు. పైగా కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ఈ వాగ్దానాలను నెరవేర్చవలసిన అవసరం లేదని బహిరంగంగానే చెబుతున్నారు. ఈ వాగ్దానాలను అమలు చేయకపోయినా, నిత్యం వచ్చే ఆదాయం ఏమవుతోందో తెలియదు కాని, అప్పులు మాత్రం వేల కోట్లు చేస్తున్నారు. ఇవన్ని గమనిస్తే, జగన్ చెప్పినట్లు చంద్రబాబుది అనైతిక పాలనే అన్న భావన ప్రజలలో కూడా ఏర్పడుతోంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Assam molestation case: Father says teen victim wouldnt talk10
అసోం అత్యాచార ఘటన: ‘నా బిడ్డను చూసి తల్లడిల్లిపోయా’

దిస్‌పూర్‌:అసోంలోని నాగావ్‌ జిల్లాలో మైనర్‌ బాలిక అత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. బాధితురాలు ప్రస్తుతం నాగావ్‌ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణం జరిగిన అనంతరం ఆమెను నిందితులు రోడ్డు పక్కన వదిలేశారు. ఆమె స్పృహ కోల్పోయి స్థానికులకు కనిపించగా ఆస్పత్రిలో చేర్చారు. తాజాగా ఈ ఘటనపై బాధితురాలి తండ్రి స్పందించారు. గౌహాతిలో పనిచేస్తున్న ఆయన సమాచారం అందగానే తమ గ్రామానికి వచ్చారు. తన కూతురుకు ఇలా జరగటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.‘‘నేను నా కూతురును చూసినప్పడు ఆమె కనీసం మాట్లాడలేకపోయింది. ఈ దారుణ ఘటనతో మా గ్రామంలోని ప్రజలంతా తీవ్రమై భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి. లేదంటే.. తమ ఆడపిల్లలకు కూడా ఇలాంటివి జరుగుతాయనే భయంతో జనం బతకాల్సి వస్తుంది’’ అని అన్నారు.మరోవైపు.. ఈ ఘటనలో అరెస్టైన ప్రధాన నిందితుడు శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం.. ఈ కేసులో శుక్రవారం పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్‌ చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు క్రైం సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ కోసం ఘటన స్థలానికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకొని ఓ చెరువులో దూకాడు. దీంతో వెంటనే పోలీసులు రెండు గంటల పాటు చెరువులో గాలించి మృతదేహాన్ని బయటకు తీసి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ స్వప్ననీల్ వెల్లడించారు.

Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
NRI View all
title
సౌదీ అరేబియా ఎడారిలో చిక్కుని తెలంగాణ వాసి మృతి

ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన తెలంగాణ యువకుడు మృతి చెందాడు.

title
కమలా హారీస్ ఓ‌ కీలుబొమ్మ: వివేక్‌ రామస్వామి

చికాగో: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ నేతల మధ్య మ

title
అమెరికాలో వ్యభిచారం.. ఏడుగురు భారతీయుల అరెస్ట్‌

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో వ్యభిచారం చేస్తూ ఏడుగురు భారతీ

title
అమెరికాలో తెలుగు తేజం వర్షిణి నాగం భరతనాట్య రంగప్రవేశం

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరమైన శాక్రమెంటో లో హారిస్ సెంటర్ థియేటర్లో ఆగస్టు 18, 2024 న ప్రవాసాంధ్ర వర్ష

title
అమెరికాలో తెలుగు యువకుల అరెస్ట్‌

ఆస్టిన్‌: అమెరికా టెక్సాస్‌ స్టేట్‌లో వ్యభిచార ముఠాను అక్కడి పోలీసులు రహస్య ఆపరేషన్‌ ని

International View all
title
ఈ దేశాల్లో మహిళలకు రక్షణ కరువు.. భారత్‌ ఎక్కడంటే?

కోల్‌కతా దారుణ హత్యాచార ఘటనో లేదంటే..

title
గళానికీ సంకెళ్లు!

మిగతా ప్రపంచమంతా కాలంతో పందెం వేస్తూ దూసుకెళ్తుంటే అఫ్గానిస్తాన్‌ మాత్రం కాలంతో పాటు వెనక్కు పయనిస్తోంది.

title
సునీత రాక ఫిబ్రవరిలోనే!

కేప్‌కనావెరాల్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) ను

title
ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధ ఖైదీల మార్పిడి

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతోంది.ఇటీవల ఉక్రెయిన్‌ సైన్యం రష్యాపై దాడిని పెంచింది. ఉక్రెయిన్‌ మిలటరీ..

title
డిసెంబర్‌ నాటికి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు: జమీల్ అహ్మద్

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడిన పాకిస్తాన్ నెమ్మదిగా కోలుకుంటోంది.

Advertisement
Advertisement