Mumbai Indians
-
ముంబై ఇండియన్స్ మహిళా టీం, యువ ప్రతిభకు ప్రాధాన్యం : నీతా
మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 కోసం రిలయన్స్ఫౌండేన్ చైర్పర్సన్ నీతా అంబానీ యాజమాన్యలోని ముంబై ఇండియన్స్ పటిష్టమైన టీంను సిద్ధం చసింది. WPL 2025 ఆదివారం బెంగుళూరులో జరిగిన వేలంలో కొత్తగా నలుగురు మహిళా క్రికెటర్లను జట్టులో చేర్చుకుంది. దీనిపై నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. తమ ముంబై ఇండియన్స్ మహిళా జట్టులో యువతకు ప్రాధాన్యత ఇచ్చి, వారిలోని ప్రతిభను గుర్తించి, తద్వారా టీం పటిష్టతకు ప్రయత్నిస్తోందని నీతా తెలిపారు.నీతా అంబానీ కొత్తగా ఎంపికైన టీంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పురుషుల జట్టులో ఆటగాళ్లు బుమ్రా, హార్తిక్, తిలక్ ప్రపంచ వేదికపై ప్రతిభతో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్నారు. అలాగే గతేడాది వేలంలో తీసుకున్న సజనకూడా అద్భుతంగా ఆడిందంటూ ప్రశంసించారు నీతా. ముంబై ఇండియన్స కుటుంబంలో భాగమైన అమ్మాయిలందరి గురించి తాను గర్వపడుతున్నానని వ్యాఖానించారు. కొత్తగా టీంలో చేరిన తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల వికెట్ కీపర్ జి. కమలిని, ఆల్ రౌండర్లు సంస్కృతి గుప్తా, అక్షితా మహేశ్వరి, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ నాడిన్ డి క్లర్క్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. “Grooming young talent, and watching them play at the global stage feels wonderful.”Mrs. Nita Ambani encourages new talent joining the 𝗙𝗔𝕄𝕀𝗟𝗬 at the #TATAWPLAuction! 💙#OneFamily #AaliRe #MumbaiIndians pic.twitter.com/VySfK4B6W6— Mumbai Indians (@mipaltan) December 15, 2024 -
మినీ వేలం: యువ క్రికెటర్‌కు కళ్లు చెదిరే ధర.. ఎవరీ కమలిని?
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలం సందర్భంగా తమిళనాడుకు చెందిన ఓ యువ క్రికెటర్‌పై కనక వర్షం కురిసింది. పదహారేళ్ల జి. కమలిని కోసం ముంబై ఇండియన్స్ భారీ మొత్తం ఖర్చు చేసింది. అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో ఉన్న ఈ ఆల్‌రౌండర్‌ను ఏకంగా రూ. 1.60 కోట్లకు కొనుగోలు చేసింది.19 స్థానాల కోసంభారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మినీ వేలంలో మొత్తం 120 మంద మహిళా క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఐదు జట్లలో కలిపి ఖాళీగా ఉన్న 19 స్థానాల కోసం భారత్ నుంచి 91 మంది, విదేశాల నుంచి 29 మంది ఆటగాళ్లు బరిలో నిలిచారు.రూ. 10 లక్షల కనీస ధరఇక బెంగళూరు వేదికగా ఆదివారం మొదలైన ఈ వేలంపాటలో జి. కమలిని రూ. 10 లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఆమె కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు ముంబై ఇండియన్స్ బిడ్ వేసింది. అయితే, ఈ ఆల్‌రౌండర్‌ను ఎలాగైనా తమ జట్టులోకి చేర్చుకోవాలని పట్టుబట్టిన ముంబై యాజమాన్యం.. ఢిల్లీతో పోటీ పడి ఆమె ధరను కోటి దాటించింది.అయినప్పటికీ ఢిల్లీ వెనక్కి తగ్గకపోవడంతో మరో అరవై లక్షలు పెంచి ఏకంగా 1.60 కోట్ల రూపాయలకు ముంబై కమలిని సేవలను సొంతం చేసుకుంది. కాగా అన్క్యాప్డ్ ప్లేయర్ అయినప్పటికీ జి.కమలిని కోసం వేలంలో భారీ డిమాండ్ రావడానికి కారణం.. ఆమె నైపుణ్యాలే.భారీ సిక్సర్లతో విరుచుకుపడే లెఫ్టాండర్ఇటీవల జరిగిన అండర్-19 మహిళల టీ20 ట్రోఫీలో తమిళనాడు టైటిల్ గెలవడంలో జి. కమలినిది కీలక పాత్ర. ఈ టోర్నమెంట్లో ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి ఆమె 311 పరుగులు చేసింది. భారీ సిక్సర్లతో విరుచుకుపడే ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. పార్ట్ టైమ్ స్పిన్నర్‌గానూ సేవలు అందించింది.అంతేకాదు.. ఈ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ వివిధ కేటగిరీల్లో తమిళనాడు తరఫున వికెట్ కీపర్‌గానూ బరిలోకి దిగింది. అందుకే ఈ ఆల్‌రౌండర్ కోసం ముంబై భారీ మొత్తం ఖర్చు చేసింది. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ కోసంకాగా ముంబై ఇండియన్స్ మహిళా జట్టులో నాలుగు ఖాళీలు ఉండగా.. ఒక స్థానం జి. కమలిని భర్తీ చేసింది. ఇక ఈ వేలంలో కమలిని కంటే ముందు సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నదినె డి క్లర్క్‌ను ముంబై కొనుక్కుంది. ఆమె కోసం రూ. 30 లక్షలు వెచ్చించింది.డాటిన్‌కు రూ. 1.70 కోట్లుమరోవైపు.. వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ డియోండ్రా డాటిన్‌ను గుజరాత్ జెయింట్స్ రూ. 1.70 కోట్లకు సొంతం చేసుకుంది. యూపీ వారియర్స్‌తో పోటీపడీ మరీ డాటిన్‌ను దక్కించుకుంది. అదే విధంగా సిమ్రన్ షేక్ కోసం గుజరాత్ అత్యధికంగా రూ. 1.90 కోట్లు ఖర్చు చేసింది.అయితే, తొలి రౌండ్లో పూనమ్ యాదవ్, స్నేహ్ రాణా(కనీస ధర రూ. 30 లక్షలు) వంటి భారత ప్లేయర్లు అమ్ముడుపోకుండా మిగిలిపోయారు. కాగా డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ పేరిట ఐదు జట్లు పాల్గొంటున్నాయి. చదవండి: BGT: మహ్మద్ షమీకి బైబై! -
హార్దిక్ పాండ్యా విధ్వంసం.. ఒకే ఓవర్లో 28 పరుగులు! వీడియో వైరల్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో బరోడాకు ప్రాతినిథ్యం వహిస్తున్న పాండ్యా మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా శుక్రవారం త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.త్రిపుర బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా త్రిపుర స్పిన్నర్ పర్వేజ్ సుల్తాన్‌ను ఈ బరోడా ఆల్‌రౌండర్ ఊతికారేశాడు. బరోడా ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన పర్వేజ్ బౌలింగ్‌లో 4 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో పాండ్యా 28 పరుగులు పిండుకున్నాడు.ఓవరాల్‌గా 23 బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. పాండ్యా విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా బరోడా 110 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 11.2 ఓవర్లలో చేధించింది. బరోడా బ్యాటర్లలో పాండ్యాతో పాటు మితీష్ పటేల్ 37 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన త్రిపుర నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. త్రిపుర బ్యాటర్లలో కెప్టెన్ మన్దీప్ సింగ్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.బరోడా బౌలర్లలో అభిమన్యు సింగ్ మూడు వికెట్లు, కెప్టెన్ కృనాల్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి 115.50 సగటుతో 231 పరుగులు చేశాడు.చదవండి: Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా? Hardik Pandya was on fire again 🔥🔥The Baroda all-rounder went berserk smashing 6⃣,6⃣,6⃣,4⃣,6⃣ in an over on his way to a whirlwind 47(23) against Tripura 🙌🙌#SMAT | @IDFCFIRSTBankScorecard ▶️ https://t.co/1WPFeVRTum pic.twitter.com/xhgWG63y9g— BCCI Domestic (@BCCIdomestic) November 29, 2024 -
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆసక్తికర ఘటన
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలు చెరి ముగ్గురు ఆటగాళ్లను కుండ మార్పిడి చేసుకున్నాయి. 2025 మెగా వేలంలో ఆర్సీబీ సొంతం చేసుకున్న రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్, నువాన్ తుషార 2024 సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఆడారు. 2024 సీజన్లో ఆర్సీబీకి ఆడిన విల్ జాక్స్, రీస్ టాప్లే, కర్ణ్ శర్మ.. 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ వశమయ్యారు. వేలంలో ఓ ఫ్రాంచైజీ నుంచి మరో ఫ్రాంచైజీకి మారడం సాధారణమే అయినప్పటికీ.. ఏకంగా ముగ్గురు ఆటగాళ్ల కుండ మార్పిడి జరగడం సిత్రమే.కాగా, ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో మొత్తం 577 మంది ఆటగాళ్లు పాల్గొనగా ఆయా ఫ్రాంచైజీలు 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వీరిలో 62 మంది విదేశీ ఆటగాళ్లు కాగా.. మిగిలిన వారు దేశీయ ఆటగాళ్లు.వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డు నెలకొల్పాడు. పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్ల భారీ మొత్తం వెచ్చింది సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో కూడా ఇదే భారీ మొత్తం కావడం విశేషం. ఐపీఎల్ 2025 వేలంలో సెకెండ్ హైయ్యెస్ట్ పేమెంట్ శ్రేయస్ అయ్యర్‌కు దక్కింది. శ్రేయస్‌ను పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. వేలంలో మూడో అత్యధిక ధర వెంకటేశ్ అయ్యర్‌కు దక్కింది. వెంకటేశ్‌ను కేకేఆర్ 23.75 కోట్లకు కొనుగోలు చేసింది. -
'నిజంగా నేను ఆశ్చర్యపోయాను.. థాంక్యూ ముంబై ఇండియన్స్'
ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. జెడ్డా వేదికగా జరిగిన ఈ వేలంలో అన్క్యాప్డ్ న్యూజిలాండ్ బ్యాటర్ బెవాన్ జాకబ్స్‌ను కొనుగోలు చేసి ముంబై ఇండియన్స్ అందరిరని ఆశ్చర్యపరిచింది. కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే వంటి కివీస్ స్టార్ క్రికెటర్లు అన్‌సోల్డ్‌గా మిగిలిన చోట.. జాకబ్స్ అమ్ముడుపోవడంతో అందరూ విస్తుతపోయారు. 21 ఏళ్ల జాకబ్‌ను రూ.30 లక్షల కనీస ధరకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. అయితే ముంబై తనను దక్కించుకోవడాన్ని బెవాన్ జాకబ్స్ సైతం నమ్మలేకపోతున్నాడు."ఉదయం మేల్కొన్నవెంటనే వేలంలో నేను అమ్ముడుపోయానన్న వార్త విని నేను ఆశ్చర్యపోయాను. నిజంగా నాకు ఇది చాలా పెద్ద అవకాశం. నన్ను కొనుగోలు చేసినందుకు ముంబై ఇండియన్స్‌కు ధన్యవాదాలు.నాకు అక్కడ ఆడే అవకాశం లభిస్తే ఇంకా ఎక్కువగా సంతోషపడతాను. ముంబై ఇండియన్స్ వంటి అద్బుత ఫ్రాంచైజీలో చేరేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాను. అదేవిధంగా ప్రపంచంలోని అత్యుత్తమమైన ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ నుంచి అన్ని విషయాలను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను" అని ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాకబ్ పేర్కొన్నాడు.ఇప్పటివరకు ఆరు టీ20లు ఆడిన జాకబ్.. 33.50 సగటుతో 134 పరుగులు చేశాడు. సూపర్ స్మాష్ 2024-25 సీజన్‌పై జాకబ్ దృష్టిపెట్టాడు. సూపర్ స్మాష్ సీజన్‌ను ఐపీఎల్‌కు ముందు ప్రాక్టీస్‌గా ఉపయోగించుకోవాలని జాకబ్ భావిస్తున్నాడు.ఈ టోర్నీలో అతడు ఆక్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. కాగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కొత్త ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇప్పటికే డెవాల్డ్ బ్రెవిస్, క్రిష్మార్ సాంటోకీ వంటి విదేశీ ఆటగాళ్లు తమ ఫస్ట్‌క్లాస్ అరంగేట్రానికి ముందే ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించారు.చదవండి: IPL 2025: 'రూ.75 లక్షలకు కూడా ఎవరూ తీసుకులేదు.. ఇప్పటికైనా సిగ్గు పడు' -
వేలం ముగిసింది.. ఇంకా ఎవరి పర్సులో ఎంత? ఎన్ని ఖాళీలు.. పూర్తి వివరాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2025 సీజన్‌కు సంబంధించి మెగా వేలం కార్యక్రమం పూర్తయింది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన వేలంపాటలో.. తాము కోరుకున్న ఆటగాళ్ల కోసం పది ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. ఎట్టకేలకు తమకు కావాల్సిన వారిని దక్కించుకున్నాయి. ఇక వేలం ప్రక్రియ ముగిసింది కాబట్టి... ఇక వచ్చే ఏడాది మార్చిలో జరిగే టోర్నీకి ఎలా సమాయత్తం కావాలో ఫ్రాంచైజీలు ప్రణాళికలు రచించుకుంటాయి.కాగా ఐపీఎల్లో ఇంతవరకూ టైటిల్ నెగ్గలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఈసారి ఎలాగైనా ఆ లోటును తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. మరి వచ్చే సీజన్లోనైనా ఈ జట్లలో ఒకటి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి.ఇక ఆదివారం నాటి తొలిరోజు వేలంలో టీమిండియా స్టార్లు రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ భారీ ధర పలికారు. వికెట్ కీపర్ బ్యాటర్, కెప్టెన్ ఆప్షన్ అయిన పంత్ కోసం లక్నో ఏకంగా రూ. 27 కోట్లు వెచ్చించింది. మరోవైపు.. పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్‌ను రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ తాము రిలీజ్ చేసిన వెంకటేశ్ అయ్యర్‌ను ఏకంగా రూ. 23.75 కోట్లకు కొనుగోలు చేసి మరోసారి జట్టులో చేర్చుకుంది.ఇదిలా ఉంటే.. సోమవారం నాటి రెండో రోజు వేలంలోని విశేషాలను గమనిస్తే.. భువనేశ్వర్ కుమార్ కోసం ముంబై ఇండియన్స్, లక్నో మధ్య తీవ్ర పోటీ సాగింది. ఈ రెండు కలిసి అతడి విలువను రూ.10 కోట్ల 50 లక్షల వరకు తీసుకెళ్లాయి. ఈ స్థితిలో అనూహ్యంగా ముందుకు వచ్చిన బెంగళూరు రూ.10 కోట్ల 75 లక్షలకు అతడిని సొంతం చేసుకుంది. మరోవైపు.. తమ పాత ఆటగాడు దీపక్ చహర్‌ను తీసుకునేందుకు చెన్నై సూపర్‌కింగ్స్ చివరి వరకు ప్రయత్నించింది. ముంబై, పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీలతో పోటీ పడి రూ. 8 కోట్ల వరకు బరిలో నిలిచింది. అయితే వెనక్కి తగ్గని ముంబై రూ.9 కోట్ల 75 లక్షలకు అతడిని దక్కించుకుంది.వీరికి మంచి ధర👉సోమవారం వేలంలో అందరికంటే ముందుగా న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ పేరు రాగా అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. 👉గత ఏడాది వరకు బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌ను ఈసారి అతని కనీస విలువ రూ.2 కోట్లకే ఢిల్లీ క్యాపిటల్స్ ఎంచుకుంది. 👉భారత పేస్ బౌలర్లలో ఆకాశ్‌దీప్ (రూ.8 కోట్లు; లక్నో), ముకేశ్ కుమార్ (రూ. 8 కోట్లు; ఢిల్లీ), తుషార్ దేశ్‌పాండే (రూ. 6 కోట్ల 50 లక్షలు; రాజస్తాన్ రాయల్స్) మంచి ధర పలికారు. 👉అఫ్గానిస్తాన్ మిస్టరీ ఆఫ్‌స్పిన్నర్ అల్లా గజన్ఫర్(రూ. 4.80 కోట్లు) కోసం కోల్‌కతా, బెంగళూరులతో పోటీ పడి ముంబై సొంతం చేసుకుంది. భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని పోలిన బౌలింగ్ శైలిగల గజన్ఫర్ గత ఏడాది కోల్‌కతా టీమ్‌లో ఉన్నా మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. 👉ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఒకే ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అందరి దృష్టిలో పడిన ప్రియాన్ష్ ఆర్య కోసం నాలుగు జట్లు బరిలో నిలవగా, చివరగా పంజాబ్ దక్కించుకుంది. 👉పదేళ్ల క్రితం చివరి టీ20 మ్యాచ్ ఆడి టెస్టుల రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు ఐపీఎల్లో రిజిస్టర్ చేసుకున్న ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ను ఎవరూ పట్టించుకోలేదు.👉రిటెయిన్ చేసుకున్న వారితో కలిపి మొత్తం 25 ఆటగాళ్ల గరిష్ట కోటాను చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ పూర్తి చేసుకోగా... లక్నో సూపర్ జెయింట్స్ (24), ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ (23), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (22), డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (21), రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (20) అంతకంటే తక్కువ మందితో సరిపెట్టాయి. చెన్నై సూపర్ కింగ్స్రుతురాజ్ (రూ. 18 కోట్లు) జడేజా (రూ. 18 కోట్లు) పతిరణ (రూ. 13 కోట్లు) శివమ్ దూబే (రూ. 12 కోట్లు) ధోని (రూ. 4 కోట్లు) నూర్ అహ్మద్ (రూ.10 కోట్లు) ఆర్. అశి్వన్ (రూ. 9.75 కోట్లు) కాన్వే (రూ. 6.25 కోట్లు) ఖలీల్ అహ్మద్ (రూ. 4.80 కోట్లు) రచిన్ రవీంద్ర (రూ. 4 కోట్లు) రాహుల్ త్రిపాఠి (రూ. 3.40 కోట్లు) అన్షుల్ కంబోజ్ (రూ.3.40 కోట్లు) స్యామ్ కరన్ (రూ. 2.40 కోట్లు) గుర్జప్నీత్ సింగ్ (రూ. 2.20 కోట్లు) నాథన్ ఎలిస్ (రూ. 2 కోట్లు) దీపక్ హుడా (రూ.1.70 కోట్లు) జేమీ ఓవర్టన్ (రూ.1.50 కోట్లు) విజయ్ శంకర్ (రూ. 1.20 కోట్లు) వంశ్ బేడీ (రూ. 55 లక్షలు) ముకేశ్ చౌదరీ (రూ. 30 లక్షలు) షేక్ రషీద్ (రూ. 30 లక్షలు) అండ్రి సిద్ధార్థ్ (రూ. 30 లక్షలు) కమలేశ్ నాగర్కోటి (రూ. 30 లక్షలు) రామకృష్ణ ఘోష్ (రూ. 30 లక్షలు) శ్రేయస్ గోపాల్ (రూ.30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 65 కోట్లు; వేలానికి రూ. 54.95 కోట్లు; మిగిలింది: 5 లక్షలుఢిల్లీ క్యాపిటల్స్అక్షర్ పటేల్ (రూ. 16.50 కోట్లు) కుల్దీప్ యాదవ్ (రూ. 13.25 కోట్లు) స్టబ్స్ (రూ. 10 కోట్లు) అభిషేక్ పోరెల్ (రూ. 4 కోట్లు) కేఎల్ రాహుల్ (రూ. 14 కోట్లు) స్టార్క్ (రూ. 11.75 కోట్లు) నటరాజన్ (రూ. 10.75 కోట్లు) జేక్ ఫ్రేజర్ (రూ 9 కోట్లు) ముకేశ్ కుమార్ (రూ. 8 కోట్లు) హ్యారీ బ్రూక్ (రూ. 6.25 కోట్లు) అశుతోష్ శర్మ (రూ. 3.80 కోట్లు) మోహిత్ శర్మ (రూ.2.20 కోట్లు) డుప్లెసిస్ (రూ. 2 కోట్లు) సమీర్ రిజ్వీ (రూ. 95 లక్షలు) దుష్మంత చమిర (రూ. 75 లక్షలు) డోనొవన్ ఫెరీరా (రూ. 75 లక్షలు) విప్రాజ్ నిగమ్ (రూ.50 లక్షలు) కరుణ్ నాయర్ (రూ. 50 లక్షలు) మాధవ్ తివారి (రూ. 40 లక్షలు) అజయ్ జాదవ్ (రూ.30 లక్షలు) దర్శన్ నల్కండే (రూ. 30 లక్షలు) త్రిపురాణ విజయ్ (రూ. 30 లక్షలు) మన్వంత్ కుమార్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 47 కోట్లు; వేలానికి రూ 72.80 కోట్లు; మిగిలింది: రూ. 20 లక్షలు గుజరాత్ టైటాన్స్రషీద్ ఖాన్ (రూ. 18 కోట్లు) శుబ్‌మన్ గిల్ (రూ. 16.50 కోట్లు) సాయి సుదర్శన్ (రూ. 8.5 కోట్లు) రాహుల్ తెవాటియా (రూ. 4 కోట్లు) షారుక్ ఖాన్ (రూ. 4 కోట్లు) బట్లర్ (రూ.15.75 కోట్లు) సిరాజ్ (రూ.12.25 కోట్లు) రబాడ (రూ.10.75 కోట్లు) ప్రసిధ్ కృష్ణ (రూ.9.50 కోట్లు) సుందర్ (రూ. 3.20 కోట్లు) రూథర్‌ఫర్డ్ (రూ. 2.60 కోట్లు) కొయెట్జీ (రూ. 2.40 కోట్లు) ఫిలిప్స్ (రూ. 2 కోట్లు) సాయి కిషోర్ (రూ. 2 కోట్లు) మహిపాల్ లోమ్రోర్ (రూ.1.70 కోట్లు) గుర్నూర్ సింగ్ (రూ. 1.30 కోట్లు) అర్షద్ ఖాన్ (రూ.1.30 కోట్లు), జయంత్ (రూ. 75 లక్షలు) ఇషాంత్ (రూ. 75 లక్షలు) కరీమ్ జనత్ (రూ. 75 లక్షలు) కుమార్ కుశాగ్ర (రూ.65 లక్షలు) మానవ్ సుతార్ (రూ. 30 లక్షలు) అనూజ్ రావత్ (రూ.30 లక్షలు) నిశాంత్ సింధు (రూ. 30 లక్షలు) కుల్వంత్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 51 కోట్లు; వేలానికి రూ. 68.85 కోట్లు; మిగిలింది: 15 లక్షలు పంజాబ్ కింగ్స్శశాంక్ సింగ్ (రూ.5.5 కోట్లు) ప్రభ్‌సిమ్రన్ సంగ్ (రూ.4 కోట్లు) శ్రేయస్ అయ్యర్ (రూ.26.75 కోట్లు) అర్ష్‌దీప్ సింగ్ (రూ.18 కోట్లు) యుజువేంద్ర చహల్ (రూ.18 కోట్లు) స్టొయినిస్ (రూ.11 కోట్లు) మార్కొ జాన్సెన్ (రూ. 7 కోట్లు) నేహల్ వధేరా (రూ.4.20 కోట్లు) మ్యాక్స్‌వెల్ (రూ.4.20 కోట్లు) ప్రియాన్‡్ష ఆర్య (రూ. 3.80 కోట్లు) జోష్ ఇంగ్లిస్ (రూ. 2.60 కోట్లు) అజ్మతుల్లా (రూ. 2.40 కోట్లు) ఫెర్గూసన్ (రూ. 2 కోట్లు) వైశాక్ విజయ్‌కుమార్ (రూ.1.80 కోట్లు) యశ్ ఠాకూర్ (రూ.1.60 కోట్లు) హర్‌ప్రీత్ బ్రార్ (రూ.1.50 కోట్లు) ఆరోన్ హార్డి (రూ. 1.25 కోట్లు) విష్ణు వినోద్ (రూ.95 లక్షలు) జేవియర్ బార్ట్లెట్ (రూ. 80 లక్షలు) కుల్దీప్ సేన్ (రూ. 80 లక్షలు) అవినాశ్ (రూ. 30 లక్షలు) సూర్యాంశ్ షెడ్గే (రూ. 30 లక్షలు) ముషీర్‌ఖాన్ (రూ.30 లక్షలు) హర్నూర్ (రూ.30 లక్షలు) ప్రవీణ్ దూబే (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ.9.50 కోట్లు; వేలానికి రూ. 110.15 కోట్లు; మిగిలింది: రూ. 35 లక్షలు రాజస్తాన్ రాయల్స్యశస్వి జైస్వాల్ (రూ. 18 కోట్లు) సంజూ సామ్సన్ (రూ. 18 కోట్లు) ధ్రువ్ జురేల్ (రూ. 14 కోట్లు) రియాన్ పరాగ్ (రూ. 14 కోట్లు) హెట్‌మైర్ (రూ. 11 కోట్లు) సందీప్‌శర్మ (రూ. 4 కోట్లు) జోఫ్రా ఆర్చర్ (రూ.12.50 కోట్లు) తుషార్ దేశ్‌పాండే (రూ.6.50 కోట్లు) హసరంగ (రూ.5.25 కోట్లు) మహీశ్ తీక్షణ (రూ.4.40 కోట్లు) నితీశ్ రాణా (రూ. 4.20 కోట్లు) ఫజల్హక్ (రూ. 2 కోట్లు) క్వెన మఫాక (రూ. 1.50 కోట్లు) ఆకాశ్ మధ్వాల్ (రూ.1.20 కోట్లు) వైభవ్ సూర్యవంశి (రూ. 1.10 కోట్లు) శుభమ్ దూబే (రూ. 80 లక్షలు) యు«ద్వీర్ చరక్ (రూ. 35 లక్షలు) కుమార్ కార్తికేయ (రూ.30 లక్షలు) అశోక్ శర్మ (రూ. 30 లక్షలు) కునాల్‌సింగ్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 79 కోట్లు; వేలానికి రూ. 40.70 కోట్లు; మిగిలింది: రూ. 30 లక్షలు సన్‌రైజర్స్ హైదరాబాద్క్లాసెన్ (రూ. 23 కోట్లు) కమిన్స్ (రూ. 18 కోట్లు) హెడ్ (రూ. 14 కోట్లు) అభిõÙక్ శర్మ (రూ. 14 కోట్లు) నితీశ్ రెడ్డి (రూ. 6 కోట్లు) ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు) షమీ (రూ.10 కోట్లు) హర్షల్ పటేల్ (రూ.8 కోట్లు) రాహుల్ చహర్ (రూ.3.20 కోట్లు) అభినవ్ మనోహర్ (రూ.3.20 కోట్లు) రాహుల్ చహర్ (రూ. 3.20 కోట్లు) ఆడమ్ జంపా (రూ.2.40 కోట్లు) సిమర్జీత్ సింగ్ (రూ. 1.50 కోట్లు) ఇషాన్ మలింగ (రూ. 1.20 కోట్లు) బ్రైడన్ కార్స్ (రూ. 1 కోటి) ఉనాద్కట్ (రూ. 1 కోటి) కమిండు మెండిస్ (రూ. 75 లక్షలు) జీషాన్ అన్సారి (రూ. 40 లక్షలు) అనికేత్ వర్మ (రూ. 30 లక్షలు) అథర్వ తైడే (రూ.30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 75 కోట్లు; వేలానికి రూ.44.80 కోట్లు; మిగిలింది: రూ.20 లక్షలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకోహ్లి (రూ. 21 కోట్లు) రాజత్ పటిదార్ (రూ.11 కోట్లు) యశ్ దయాళ్ (రూ. 5 కోట్లు) హాజల్‌వుడ్ (రూ.12.50 కోట్లు) ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు) జితేశ్ శర్మ (రూ.11 కోట్లు) భువనేశ్వర్ (రూ.10.75 కోట్లు) లివింగ్‌స్టోన్ (రూ.8.75 కోట్లు) రసిక్ ధార్ (రూ.6 కోట్లు) కృనాల్ పాండ్యా (రూ. 5.75 కోట్లు) టిమ్ డేవిజ్ (రూ. 3 కోట్లు) జాకబ్ బెథెల్ (రూ. 2.60 కోట్లు) సుయాశ్ శర్మ (రూ.2.60 కోట్లు) పడిక్కల్ (రూ. 2 కోట్లు) తుషార (రూ. 1.60 కోట్లు) రొమరియో (రూ. 1.50 కోట్లు ఇన్‌గిడి (రూ. 1 కోటి) స్వప్నిల్ సింగ్ (రూ.50 లక్షలు) మనోజ్ (రూ. 30 లక్షలు) మోహిత్ రాఠి (రూ. 30 లక్షలు) అభినందన్ (రూ. 30 లక్షలు) స్వస్తిక్ చికార (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 37 కోట్లు; వేలానికి రూ. 82.25 కోట్లు; మిగిలింది: రూ. 75 లక్షలు ముంబై ఇండియన్స్బుమ్రా (రూ. 18 కోట్లు) హార్దిక్ పాండ్యా (రూ.16.35 కోట్లు) సూర్యకుమార్ (రూ. 16.35 కోట్లు) రోహిత్ శర్మ (రూ. 16.30 కోట్లు) తిలక్ వర్మ (రూ. 8 కోట్లు) ట్రెంట్ బౌల్ట్ (రూ.12.50 కోట్లు) దీపక్ చహర్ (రూ. 9.25 కోట్లు) నమన్ ధీర్ (రూ.5.25 కోట్లు) విల్ జాక్స్ (రూ.5.25 కోట్లు) ఘజన్ఫర్ (రూ. 4.80 కోట్లు) సాంట్నర్ (రూ. 2 కోట్లు) రికెల్టన్ (రూ. 1 కోటి) రీస్ టోప్లే (రూ. 75 లక్షలు) లిజాద్ విలియమ్స్ (రూ. 75 లక్షలు) రాబిన్ మిన్జ్ (రూ.65 లక్షలు) కరణ్ శర్మ (రూ.50 లక్షలు) అర్జున్ టెండూల్కర్ (రూ.30 లక్షలు) విఘ్నేశ్ (రూ.30 లక్షలు) సత్యనారాయణ (రూ. 30 లక్షలు) రాజ్ అంగద్ (రూ. 30 లక్షలు) శ్రీజిత్ కృష్ణన్ (రూ. 30 లక్షలు) అశ్వని కుమార్ (రూ. 30 లక్షలు) బెవాన్ జాకబ్స్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 75 కోట్లు; వేలానికి రూ. 44.80 లక్షలు; మిగిలింది: రూ. 20 లక్షలులక్నో సూపర్ జెయింట్స్నికోలస్ పూరన్ (రూ.21 కోట్లు) రవి బిష్ణోయ్ (రూ.21 కోట్లు) మయాంక్ యాదవ్ (రూ. 11 కోట్లు) మోసిన్ ఖాన్ (రూ.4 కోట్లు) ఆయుశ్ బదోని (రూ.4 కోట్లు) రిషభ్ పంత్ (రూ.27 కోట్లు) అవేశ్ ఖాన్ (రూ.9.75 కోట్లు) ఆకాశ్‌దీప్ (రూ.8 కోట్లు) మిల్లర్ (రూ.7.50 కోట్లు) అబ్దుల్ సమద్ (రూ.4.20 కోట్లు) మిచెల్ మార్‡్ష (రూ.3.40 కోట్లు) షహబాజ్ అహ్మద్ (రూ. 2.40 కోట్లు) మార్క్రమ్ (రూ.2 కోట్లు) బ్రీట్జ్కే (రూ. 75 లక్షలు) షమర్ జోసెఫ్ (రూ. 75 లక్షలు) సిద్ధార్థ్ (రూ. 75 లక్షలు) యువరాజ్ (రూ. 30 లక్షలు) ప్రిన్స్ యాదవ (రూ. 30 లక్షలు) ఆకాశ్ సింగ్ (రూ. 30 లక్షలు) దిగ్వేశ్ సింగ్ (రూ. 30 లక్షలు) హిమ్మత్ సింగ్ (రూ.30 లక్షలు) ఆర్యన్ జుయల్ (రూ.30 లక్షలు) అర్శిన్ కులకర్ణి (రూ. 30 లక్షలు) హంగార్గేకర్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ.51 కోట్లు; వేలానికి రూ. 68.90 కోట్లు; మిగిలింది: రూ. 10 లక్షలు కోల్‌కతా నైట్ రైడర్స్రింకూ సింగ్ (రూ. 13 కోట్లు) నరైన్ (రూ. 12 కోట్లు) రసెల్ (రూ. 12 కోట్లు) వరుణ్ చక్రవర్తి (రూ. 12 కోట్లు) హర్షిత్ రాణా (రూ. 4 కోట్లు) రమణ్‌దీప్ (రూ.4 కోట్లు) వెంకటేశ్ అయ్యర్ (రూ.23.75 కోట్లు) ఆన్రిచ్ నోర్జే (రూ.6.50 కోట్లు) డికాక్ (రూ.3.60 కోట్లు) అంగ్కృష్ (రూ.3 కోట్లు) జాన్సన్ (రూ. 2.80 కోట్లు) గుర్బాజ్ (రూ.2 కోట్లు) మొయిన్ అలీ (రూ. 2 కోట్లు) వైభవ్ అరోరా (రూ.1.80 కోట్లు) రోవ్‌మన్ పావెల్ (రూ.1.50 కోట్లు) రహానే (రూ. 1.50 కోట్లు) మనీశ్ పాండే (రూ. 75 లక్షలు) ఉమ్రన్ మలిక్ (రూ. 75 లక్షలు) అనుకూల్ రాయ్ (రూ. 40 లక్షలు) మయాంక్ మర్కండే (రూ. 30 లక్షలు) లవ్నిత్ సిసోడియా (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ.69 కోట్లు; వేలానికి రూ. 50.95 కోట్లు; మిగిలింది: రూ.5 లక్షలు. -
IPL Auction 2025 : పేస్ బౌలర్లకు పట్టం
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు... అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానం... టైటిల్ సహా దశాబ్దకాలం పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిన పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేలంలో ఫ్రాంచైజీలను ఆకర్షించడంలో సఫలమయ్యాడు. రెండో రోజు వేలంలో భువీ (రూ.10 కోట్ల 75 లక్షలు) అత్యధిక ధరతో అగ్ర స్థానంలో నిలిచాడు. భువనేశ్వర్లాగే చెన్నై మూడు ట్రోఫీ విజయాల్లో కీలక బౌలర్‌గా నిలిచిన దీపక్ చహర్‌కు (రూ.9 కోట్ల 25 లక్షలు) భారీ మొత్తం దక్కింది. వీరిద్దరిని వరుసగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు దక్కించుకున్నాయి. ప్రతీ జట్టుకూ భారత పేసర్ల అవసరం ఉండటంతో సోమవారం వేలంలో ఆకాశ్‌దీప్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండేలకు మంచి విలువ లభించింది. విదేశీ ఆటగాళ్లలో మార్కో జాన్సెన్, విల్ జాక్స్‌లను ఫ్రాంచైజీలు తగిన మొత్తానికి సొంతం చేసుకున్నాయి. ఆరంభంలో ఆసక్తి చూపించకపోయినా... అజింక్య రహానే, దేవదత్ పడిక్కల్, ఉమ్రాన్ మాలిక్వంటి ఆటగాళ్లను చివర్లో టీమ్‌లు ఎంచుకున్నాయి. రెండో రోజు కూడా ఆస్ట్రేలియా డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు నిరాశ ఎదురవగా... కేన్ విలియమ్సన్, బెయిర్‌స్టో, మిచెల్, శార్దుల్ ఠాకూర్ తదితరులను ఫ్రాంచైజీలు దూరంగా ఉంచాయి. జిద్దా (సౌదీ అరేబియా): ఐపీఎల్–2025 కోసం రెండు రోజుల పాటు సాగిన వేలం సోమవారం ముగిసింది. మొత్తం 577 మంది క్రికెటర్లు వేలంలోకి రాగా... గరిష్టంగా 204 మంది క్రికెటర్లను ఎంచుకునే అవకాశం ఉండగా... 10 ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 182 మంది ఆటగాళ్లనే వేలంలో తీసుకున్నాయి. వీరిలో 62 మంది విదేశీయులు కాగా... అన్ని జట్లూ కలిపి వేలంలో రూ.639.15 కోట్లు వెచ్చించాయి. ఐపీఎల్లో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. వేలంలో రాజస్తాన్ రూ.1 కోటీ 10 లక్షలకు ఎంచుకునే సమయానికి వైభవ్ వయసు 13 ఏళ్ల 243 రోజులు మాత్రమే. వైభవ్ ఇప్పటి వరకు 5 రంజీ మ్యాచ్‌లు, ఒక టి20 మ్యాచ్ ఆడాడు. అయితే ఇటీవల భారత అండర్–19 జట్టు సభ్యుడిగా ఆ్రస్టేలియా అండర్ –19 జట్టుతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. తొలి రోజు వేలం రికార్డులతో హోరెత్తించగా, రెండో రోజు కూడా పేరున్న ఆటగాళ్లకు మంచి మొత్తమే దక్కింది. సోమవారం జాబితాలో పెద్ద సంఖ్యలో యువ ఆటగాళ్లు బరిలో నిలవగా, కొందరిని అదృష్టం తలుపు తట్టింది. జాతీయ జట్టుకు ఆడని అన్క్యాప్డ్ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు చివర్లో కనీస విలువకే తీసుకొని జట్టులో మిగిలిన ఖాళీలను నింపాయి. -
ఐపీఎల్ వేలం 2025 : అదిరే డ్రెస్‌లో నీతా అంబానీ, ధర ఎంతో తెలుసా?
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ ఫ్యాషన్ స్టైల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సమయానికి తగ్గట్టుగా డ్రెస్‌లను ఎంపిక చేసుకోవడంలో, ఫ్యాషన్‌ను, బిజినెస్‌ను మిళితం చేయడంలో నీతా తరువాతే ఎవరైనా అనేది అభిమానుల మాట మాత్రమే కాదు, ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం కూడా. తాజా ఐపీఎల్ -2025 వేలం సందర్భంగా మరోసారి తన స్టైల్‌తో అందర్నీ తనవైపు తిప్పుకుంది. నీతా అంబానీ నేవీ బ్యూ ప్యాంట్‌సూట్ ధరించి అందరినీ ఆకర్షించింది. అంతేకాదు ఆ డ్రెస్ ధర కూడా హాట్ టాపిక్‌గా నిలిచింది. ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ అయిన నీతా అంబానీ వైడ్-లెగ్ ప్యాంట్, బ్లూ సూట్లో హుందాగా కనిపించారు. నీతా ధరించిన ‘మజే’ బ్రాండ్‌కు చెందిన ఈ బ్రేజర్ సూట్ ధర అక్షరాలా 950 డాలర్లు. అంటే దాదాపు రూ.78 వేలు. ఇందులో బ్లేజర్ రూ. 47 వేలు కాగా వైడ్-లెగ్ ట్వీడ్ ట్రౌజర్ ధర సుమారు రూ. 31వేలు, మొత్తంగా ఆమె సూట్ ధర రూ.78 వేలు. అంతేనా వజ్రాలు పొదిగిన ఎంఐ బ్రూచ్, హ్యాండ్‌బ్యాగ్, డైమండ్ రింగ్, డైమండ్ చెవిపోగులు, సన్ గ్లాసెస్, వాచ్, హీల్స్ ఇలా అన్నీ ప్రత్యేకంగా కనిపించడం విశేషం. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)nbsp;ఐపీఎల్ మెగా వేలం-2025 తొలి రౌండ్ విడత ప్రక్రియ దుబాయ్‌లోని జెడ్డాలో ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇందులో ఎంఐ నలుగురు సూపర్ స్టార్లు రోహిత్ శర్మ,హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాతోపాటు టీమిండియా యంగ్ ప్లేయర్ తిలక్ వర్మకూడా ఉన్నాడు. ముఖ్యంగా తిలక్ వర్మను రూ.8 కోట్లకు దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. ఈ వేలంలో నీతా అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ కూడా పాల్గొన్నారు. -
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. తొలి మ్యాచ్‌కు ముందే కెప్టెన్‌పై నిషేధం
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. గత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయిన్‌టెయిన్ చేసినందుకుగానూ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఓ మ్యాచ్ నిషేధం విధించారు. గత సీజన్లో అదే చివరి మ్యాచ్ కావడంతో ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ఐపీఎల్ మేనేజ్మెంట్ తెలిపింది. నిషేధంతో పాటు హార్దిక్‌కు రూ. 30 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ పేర్కొంది. తదుపరి మ్యాచ్‌లో హార్దిక్ ఇంపాక్ట్ ప్లేయర్‌గానూ బరిలోకి దిగకూడదు. హార్దిక్‌తో పాటు నాటి మ్యాచ్‌లోని సభ్యులైన ప్రతి ఆటగాడికి రూ. 12 లక్షలు, లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా వర్తిస్తుంది.కాగా, గత సీజన్లో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన హార్దిక్‌ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం తదుపరి సీజన్‌కు కూడా కెప్టెన్‌గా కొనసాగించింది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. తదుపరి సీజన్ కోసం ముంబై రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ ఉన్నారు. ముంబై ఇండియన్స్‌కు ఆర్టీఎం ద్వారా తాము రిలీజ్ చేసిన ఓ ఆటగాడిని తిరిగి దక్కించుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా నవంబర్ 24, 25 తేదీల్లో జరుగనుంది. కాగా, గత కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ముంబై ఇండియన్స్ గత సీజన్‌ను చివరి స్థానంతో ముగించిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ చివరిసారిగా 2020లో టైటిల్ సాధించింది. -
ఇషాన్ కిషన్‌కు కళ్లు చెదిరే ధర.. రూ. 14.5 కోట్లకు వారి సొంతం!
టీమిండియాకు దూరమైన ఇషాన్ కిషన్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఈ ఏడాది కలిసి రాలేదు. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్-2024లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి 320 పరుగులు చేయగలిగాడు. అయితే, మెగా వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ మాత్రం అతడిని వదిలేసింది.జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలతో పాటు యువ క్రికెటర్ తిలక్ వర్మను రీటైన్ చేసుకున్న ముంబై.. ఇషాన్ పేరును మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. నిజానికి 2018లో ముంబై తరఫునే క్యాచ్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. ఆరంభం నుంచే మెరుగ్గా రాణించిన ఇషాన్ కిషన్ కోసం ఐపీఎల్-2022లో ముంబై భారీ మొత్తం వెచ్చించింది.నాడు రూ. 15.25 కోట్ల ధరకు ముంబై సొంతంనాటి మెగా వేలంలో అతడిని ఏకంగా రూ. 15.25 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. కానీ.. అప్పటి నుంచి నేటి దాకా ఇషాన్ కిషన్ అందుకు తగ్గ పైసా వసూల్ ప్రదర్శన మాత్రం ఇవ్వలేకపోయాడు. అంతేకాదు.. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయి.. జాతీయ జట్టుకూ దూరమయ్యాడు.అయితే, ఇటీవలే రంజీల్లో సెంచరీలు చేయడంతో రీ ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్.. భారత్-‘ఎ’ జట్టుకు సెలక్ట్ అయ్యాడు. కానీ.. ఆస్ట్రేలియా గడ్డపై కంగారూ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఇషాన్ కిషన్ ఐపీఎల్-2025 మెగా వేలంలోకి రాబోతున్నాడు.వికెట్ కీపర్ కోటాలో కళ్లు చెదిరే మొత్తంఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన ‘మాక్ వేలం’లో మాత్రం ఇషాన్ కిషన్ భారీ ధర పలకడం విశేషం. మెగా వేలంలో ఇషాన్ రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. అయితే, అశ్విన్ మాత్రం తన వేలంలో.. వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ కోసం బిడ్ వేసే ఫ్రాంఛైజీలు రూ. 5 కోట్ల నుంచి మొదలుపెట్టాలని సూచించాడు.ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 5 కోట్లకు బిడ్ వేయగా.. క్రమక్రమంగా ఇషాన్ ధర రూ. 10 కోట్లకు పెంచింది. దీంతో పంజాబ్ కింగ్స్ రేసు నుంచి తప్పుకోగా.. లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం వికెట్ కీపర్ కోసం ఏకంగా రూ. 14.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది.ఏకంగా రూ. 21 కోట్ల మొత్తానికి అతడు ఉన్నా కూడాఅయితే, అశ్విన్ నిర్వహించిన ఈ మాక్వేలంలో ఇషాన్ కిషన్‌కు కళ్లు చెదిరే మొత్తం దక్కడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్‌లో లేని ఇషాన్ కోసం.. మెగా వేలంలో ఏ ఫ్రాంఛైజీ అంతగా ఆసక్తి చూపదని.. మహా అయితే, అతడికి రూ. ఐదు కోట్లు దక్కవచ్చని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.అంతేకాదు.. లక్నో ఇప్పటికే వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను ఏకంగా రూ. 21 కోట్ల మొత్తానికి అట్టిపెట్టుకుంది. అలాంటిది.. ఇషాన్‌ను ఆ ఫ్రాంఛైజీ కొనుక్కోవడం ఏమిటంటూ అశూ మాక్ వేలంలో లక్నో తరఫున పాల్గొన్న అభిమానులను ట్రోల్ చేస్తున్నారు. కాగా సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో మెగా వేలం జరుగనుంది.చదవండి: BGT 2024: టీమిండియాకు గుడ్‌న్యూస్ -
హ్యాట్రిక్ తీసిన బౌలర్‌నే వదిలేసిన ముంబై ఇండియన్స్
మహిళల ఐపీఎల్ (WPL) 2025 సీజన్ వేలానికి ముందు ఐదు ఫ్రాంచైజీలు (ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్) ఇవాళ రిటెన్షన్ జాబితాలను విడుదల చేశాయి. దాదాపుగా అన్ని ఫ్రాంచైజీలు నలుగురి నుంచి ఆరుగురిని వేలానికి వదిలేసి మిగతా ప్లేయర్లను అలాగే అట్టిపెట్టుకున్నాయి. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ సైతం నలుగురిని వేలానికి వదిలేసి, 14 మంది ప్లేయర్లను రీటైన్ చేసుకుంది. ముంబై ఇండియన్స్ వదిలేసిన ప్లేయర్స్‌లో ముగ్గురు భారత అన్క్యాప్డ్ ప్లేయర్లు కాగా.. ఓ విదేశీ స్టార్ ప్లేయర్ ఉంది. వచ్చే సీజన్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ఇస్సీ వాంగ్‌ను అనూహ్యంగా వేలానికి వదిలేసింది. 22 ఏళ్ల ఇస్సీ డబ్ల్యూపీఎల్ డెబ్యూ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున హ్యాట్రిక్ తీసింది. మహిళల ఐపీఎల్లో హ్యాట్రిక్ తీసిన తొలి క్రికెటర్ ఇస్సీనే కావడం విశేషం. 2023 సీజన్లో యూపీ వారియర్జ్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇస్సీ ఈ ఘనత సాధించింది. హ్యాట్రిక్ తీయడంతో పాటు తొలి సీజన్లో ఓ వెలుగు వెలిగిన ఇస్సీ 2024 సీజన్లో మరో స్టార్ విదేశీ పేసర్ (షబ్నిమ్ ఇస్మాయిల్) రావడంతో మరుగున పడిపోయింది. షబ్నిమ్ ఎంట్రీతో ఇస్సీకి అవకాశాలు కరువయ్యాయి. షబ్నిమ్ అద్భుతమైన ప్రదర్శనలతో రాణించడంతో ఈ ఏడాది వేలానికి ముందు ఇస్సీని వదిలేసింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. తుది జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లకు మాత్రమే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంఐ మేనేజ్మెంట్ ఇస్సీని వదులుకోక తప్పలేదు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇస్సీతో పాటు స్వదేశీ అన్క్యాప్డ్ ప్లేయర్లు ప్రియాంక బాలా, హుమైరా ఖాజీ, ఫాతిమా జాఫర్లను కూడా వేలానికి వదిలేసింది. ముంబై ఇండియన్స్ ఈసారి కూడా హర్మన్‌ప్రీత్‌ను కెప్టెన్‌గా కొనసాగించింది. ఎంఐ రీటైన్ చేసుకున్న ప్లేయర్స్‌లో యస్తికా భాటియా, అమెలియా కెర్, క్లో టైరాన్, హేలీ మాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్, షబ్నిమ్ ఇస్మాయిల్ లాంటి స్వదేశీ, విదేశీ స్టార్లు ఉన్నారు. వేలంలో పాల్గొనేందుకు ముంబై ఇండియన్స్ పర్స్‌లో ఇంకా 2.65 కోట్ల బ్యాలెన్స్ ఉంది. ఈ మొత్తంతో ముంబై ఇండియన్స్ మరో నలుగురు ప్లేయర్స్‌ను కొనుగోలు చేయవచ్చు. డబ్ల్యూపీఎల్ రూల్స్ ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చన్న విషయం తెలిసిందే. ఇందులో ఆరుగురు విదేశీ ప్లేయర్స్‌కు అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే, తొలి సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్.. రెండో సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైంది. ఈ సీజన్లో ముంబైని ఇంటికి పంపించిన ఆర్సీబీనే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ వీళ్లే..హార్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), యస్తికా భాటియా, అమెలియా కెర్, క్లో టైరాన్, హేలీ మాథ్యూస్, జింటిమణి కలిత, నాట్ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్, సంజీవన్ సంజనా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాఖీ, అమన్‌జోత్ కౌర్, అమన్‌దీప్ కౌర్, కీర్తనముంబై ఇండియన్స్ వదిలేసిన ప్లేయర్స్ వీళ్లే..ప్రియాంక బాలా, హుమైరా ఖాజీ, ఫాతిమా జాఫర్, ఇస్సీ వాంగ్ -
IPL 2025: ఇషాన్ కాదు.. వాళ్లిద్దరికోసం ముంబై పోటీ.. వాషీ కూడా రేసులోనే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 మెగా వేలానికి ముహూర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అందరి కళ్లు టీమిండియా స్టార్లపైనే ఉన్నాయి.రేసులో భారత స్టార్లురిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ సహా రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ తదితర సీనియర్ ప్లేయర్లు కూడా రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ముంబై ఇండియన్స్ భారత స్పిన్నర్లను దక్కించుకునేందుకు ఇతర ఫ్రాంఛైజీలతో కచ్చితంగా పోటీపడుతుందని అభిప్రాయపడ్డాడు.పాలసీ పరిపూర్ణంగా ఉపయోగించుకునికాగా ఈసారి రిటెన్షన్ విధానాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకున్న జట్టు ముంబై ఇండియన్స్ అని చెప్పవచ్చు. నిబంధనలకు అనుగుణంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లను అట్టిపెట్టుకుంది. జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మలను కొనసాగించాలని నిర్ణయించుకుంది.ఇక వీళ్లందరికి ఖర్చు పెట్టింది పోనూ.. ముంబై పర్సులో ఇంకా రూ. 45 కోట్లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ముంబై బ్యాటింగ్ ఆర్డర్ మరోసారి పటిష్టంగానే కనిపిస్తోంది. అయితే, వాళ్ల రిటెన్షన్ లిస్టులో బుమ్రా రూపంలో ఒకే ఒక స్పెషలిస్టు బౌలర్ ఉన్నాడు.కాబట్టి వారికి ఇప్పుడు బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నిజానికి ముంబై 225- 250 పరుగులు స్కోరు చేయగల సామర్థ్యం కలిగిన జట్టు. అయితే, అదే స్థాయిలో పరుగులు కూడా సమర్పించుకున్న సందర్భాలు ఉన్నాయి.బ్యాటింగ్ పైనే ఎక్కువగా ఏదేమైనా వాళ్లు బ్యాటింగ్ పైనే ఎక్కువగా ఆధారపడతారన్నది వాస్తవం. కానీ ప్రతిసారీ ఇదే టెక్నిక్ పనికిరాదు. వాళ్ల జట్టులో ఉంటే ఇండియన్ బ్యాటింగ్ లైనప్.. విదేశీ బౌలింగ్ లైనప్ ఉంటుంది. ఇప్పుడు వారికి ఇద్దరు స్పిన్నర్ల అవసరం కూడా ఉంది. అందుకే కచ్చితంగా వాళ్లు యుజీ చహల్ వెనుకపడటం ఖాయం.ఇషాన్ కాదుఒకవేళ అతడిని దక్కించుకోలేకపోతే.. ముంబై ఇండియన్స్ వాషింగ్టన్ సుందర్నైనా సొంతం చేసుకుంటుంది’’ అని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఇషాన్ కిషన్ పేరును కూడా ప్రస్తావించిన ఆకాశ్ చోప్రా.. అతడిని ముంబై కొనుగోలు చేసే అవకాశం లేదని అభిప్రాయపడ్డాడు. వికెట్ కీపర్ కోటాలో ఇషాన్‌ను పరిగణించినా.. క్వింటన్ డికాక్ లేదంటే జితేశ్ శర్మ వైపు మొగ్గు చూపుతుందని అంచనా వేశాడు. చదవండి: Aus vs Pak: ఆసీస్‌కు కొత్త కెప్టెన్ -
ముంబై టాప్-3 లిస్టులో దక్కని చోటు.. రోహిత్ ఏమన్నాడంటే..!
-
IPL 2025: మన లీడర్.. మన కెప్టెన్.. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరు?
గత మూడేళ్లుగా పేలవ ఆట తీరుతో వెనుకబడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తన అద్భుత కెప్టెన్సీతో ఈసారి టైటిల్ రేసులో నిలిపాడు ప్యాట్ కమిన్స్. ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్‌కప్ అందించిన సారథిగా నీరాజనాలు అందుకున్న ఈ ఫాస్ట్ బౌలర్.. ఫ్రాంఛైజీ తనకు చెల్లించిన రూ. 20.50 కోట్లకు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు.సహచర ఆటగాళ్లతో మమేమకమవుతూ సరైన సమయంలో అవకాశాలు ఇచ్చి జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. తద్వారా ఆరెంజ్ ఆర్మీకి ఇష్టమైన కెప్టెన్‌గా మారిపోయాడు. కానీ.. జాతీయ జట్టు విధుల దృష్ట్యా ఈసారి కమిన్స్ అసలు ఐపీఎల్ ఆడతాడా? కెప్టెన్‌గా కొనసాగుతాడా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, రిటెన్షన్ లిస్టు విడుదల సందర్భంగా సన్‌రైజర్స్ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది.మన లీడర్.. మన కెప్టెన్వచ్చే ఏడాది కూడా ప్యాటీనే రైజర్స్‌ను ముందుకు నడిపించబోతున్నాడని..ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది. ‘‘మన లీడర్.. మన కెప్టెన్... ప్యాటీ కమిన్స్ మిమ్మల్ని ఉప్పల్‌లో మరోసారి కలిసేందుకు సిద్ధంగా ఉన్నాడు’’ అంటూ ఆరెంజ్ ఆర్మీకి శుభవార్త అందించింది. ఇక ఈ ఏడాది పరుగుల విధ్వంసంతో రికార్డులు తిరగరాసిన సన్‌రైజర్స్.. రిటెన్షన్ల విషయంలోనూ దూకుడుగా వ్యవహరించింది. హార్డ్ హిట్టర్ హెన్రిక్ క్లాసెన్ కోసం ఏకంగా రూ. 23 కోట్లు ఖర్చు చేసింది. ఆ జట్లు వదిలేశాయిఇదిలా ఉంటే.. ఇతర ఫ్రాంఛైజీలలో కోల్‌కతా, ఢిల్లీ, లక్నో, పంజాబ్, బెంగళూరు తమ కెప్టెన్లను వేలంలోకి వదిలివేయగా.. చెన్నై, ముంబై, గుజరాత్, రాజస్తాన్ మాత్రం తమ సారథులను కొనసాగించాయి. దీంతో ఈసారి ఈసారి ఐపీఎల్ వేలం ఆసక్తికరంగా సాగడం ఖాయం.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం ఈనెల నెలాఖరున జరగనుండగా... రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు ఆటగాళ్లు అనూహ్యంగా కోట్లు కొల్లగొట్టగా... మరికొందరు స్టార్ ప్లేయర్లు ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అధిక ధర వీరికేఅందరికంటే అత్యధికంగా దక్షిణాఫ్రికా ‘హార్డ్ హిట్టర్’ హెన్రిచ్ క్లాసెన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ. 23 కోట్లు కేటాయించగా... విరాట్ కోహ్లీకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... నికోలస్ పూరన్‌కు లక్నో సూపర్ జెయింట్స్ రూ.21 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకున్నాయి. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుకు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా... ఇక మీదట కూడా నాయకుడిగా కొనసాగడం ఖాయం కాగా... ముంబై మొత్తంగా ఐదుగురు ప్రధాన ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అత్యధికంగా రూ. 18 కోట్లు కేటాయించిన ఫ్రాంచైజీ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు చెరో రూ. 16 కోట్ల 35 లక్షలు వెచ్చించింది.ఇక ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మకు రూ. 16 కోట్ల 30 లక్షలు కేటాయించింది. హైదరాబాద్ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మకు రూ.8 కోట్లు ఇచ్చి ముంబై తమ వద్దే పెట్టుకుంది. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరంటే?ఆటగాళ్ల కొనుగోలు కోసం ఒక్కో జట్టు రూ.120 కోట్లు ఖర్చు చేసుకునే అవకాశం ఉండగా... అందులో రూ. 75 కోట్లు రిటెన్షన్‌కు కేటాయించారు. తాజా జాబితాను చూస్తే ముంబై ఇండియన్స్ జట్టు రీటైన్ను సంపూర్ణంగా వాడుకోగా... అత్యల్పంగా పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం ఇద్దరు ప్లేయర్లనే అట్టి పెట్టుకుంది. పంజాబ్ మరీ ఇద్దరినేపంజాబ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆ్రస్టేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యూహాల్లో భాగంగా... కేవలం ఇద్దరు ‘అన్క్యాప్డ్’ ప్లేయర్లను మాత్రమే రీటైన్ చేసుకున్న పంజాబ్ వద్ద వేలం కోసం అత్యధికంగా రూ. 110.5 కోట్లు మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ వేలానికి వదిలేయగా... తొమ్మిదేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో కొనసాగుతున్న రిషబ్ పంత్‌ను ఫ్రాంచైజీ వదిలేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కేఎల్ రాహుల్‌పై నమ్మకం ఉంచలేదు. రింకూ సింగ్‌కు జాక్‌పాట్.. ధోనీ ‘అన్క్యాప్డ్’ ప్లేయర్చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ సహా మొత్తం ఐదుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకోగా... రాజస్తాన్ రాయల్స్ కూడా ఆరుగురు ప్లేయర్లను రీటైన్ చేసుకుంది. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 16 కోట్ల 50 లక్షలు కేటాయించగా... సిక్సర్ల వీరుడు రింకూ సింగ్‌కు కోల్‌కతా రూ.13 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది. వెస్టిండీస్ ద్వయం రసెల్, నరైన్‌తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి తలా రూ. 12 కోట్లు కేటాయించింది. కోల్‌కతా వదిలేసుకున్న శ్రేయస్ అయ్యర్ కోసం వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడటం ఖాయమే కాగా... సారథి కోసం చూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పంత్‌పై కన్నేసే అవకాశాలు ఉన్నాయి. బేబీ మలింగకు రూ. 13 కోట్లుజాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఐదేళ్లు దాటిపోయిన ధోనీని ఐపీఎల్ నిబంధనల ప్రకారం ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ కోటాలో రీటైన్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ... మాజీ సారథికి రూ.4 కోట్లు కేటాయించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చెరో రూ. 18 కోట్లు వెచ్చించింది. శ్రీలంక పేసర్ పతిరణకు రూ. 13 కోట్లు, పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేను రూ.12 కోట్లకు అట్టిపెట్టుకుంది. రాజస్తాన్ రైట్రైట్రిటైనింగ్లో మొత్తం ఆరు అవకాశాలను వాడుకున్న రాజస్తాన్ రాయల్స్... సంజూ సామ్సన్, యశస్వి జైస్వాల్‌కు చెరో రూ.18 కోట్లు కేటాయించింది. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్‌కు చెరో రూ. 14 కోట్లు వెచ్చించింది.పూరన్ కోసం అంత అవసరమా?కేఎల్ రాహుల్‌ను వేలానికి వదిలేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిలకడగా ఆడతాడో లేదో తెలియని వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ కోసం రూ. 21 కోట్లు కేటాయించింది. గాయాలతో సహవాసం చేసే సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్, స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు రూ. 11 కోట్లు కేటాయించిన లక్నో... మొహసిన్ ఖాన్, ఆయుష్ బదోనీలకు చెరో రూ. 4 కోట్లు వెచ్చించింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు రూ.18 కోట్లు కేటాయించిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ... కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను రూ. 16 కోట్ల 50 లక్షలకు అట్టిపెట్టుకుంది. వేలానికి రానున్న ప్రధాన ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్, చాహల్, అశ్విన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, షమీ (భారత్). వార్నర్, మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, స్టొయినిస్ ఆస్ట్రేలియా). బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, స్యామ్ కరన్, బట్లర్, ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్). డుప్లెసిస్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, నోర్జే (దక్షిణాఫ్రికా). కాన్వే, రచిన్ రవీంద్ర, బౌల్ట్ (న్యూజిలాండ్). చదవండి: Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమి -
IPL 2025: నాకు ఇదే కరెక్ట్.. ముంబై రిటెన్షన్ లిస్టుపై రోహిత్ కామెంట్స్
టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) భవితవ్యం విషయంలో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. మెజారిటీ మంది విశ్లేషకులు, కామెంటేటర్లు చెప్పినట్లుగా ‘హిట్‌మ్యాన్’ ముంబై ఇండియన్స్‌ను వీడలేదు. కెరీర్ ఆరంభం నుంచి తనకు అండగా నిలబడ్డ ఫ్రాంఛైజీతో కొనసాగేందుకే అతడు మొగ్గుచూపాడు. రోహిత్ అభిమానులకు కూడా ఇది ఒకరకంగా షాకిచ్చిందనే చెప్పవచ్చు.కాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ విడుదల చేసిన రిటెన్షన్ జాబితాలో రోహిత్ శర్మకు చోటు దక్కిన విషయం తెలిసిందే. అయితే, టాప్-3లో మాత్రం అతడికి స్థానం ఇవ్వలేదు ముంబై. తమ ప్రాధాన్య ఆటగాళ్లలో రోహిత్‌ను నాలుగో ప్లేయర్‌గా అట్టిపెట్టుకుంది. దీంతో మరోసారి అతడి ఫ్యాన్స్ ఫ్రాంఛైజీపై మండిపడుతున్నారు.అందుకే వారికి పెద్దపీటఈ నేపథ్యంలో తాను నాలుగో ప్లేయర్‌గా ఉండటంపై రోహిత్ శర్మ స్పందించాడు. అంతర్జాతీయ టీ20ల నుంచి తాను రిటైర్ అయిన కారణంగా తనకు అదే సరైన స్థానమంటూ.. ఫ్రాంఛైజీ నిర్ణయాన్ని సమర్థించాడు. జాతీయ జట్టుకు ఆడుతున్న క్రికెటర్లకే మొదటి ప్రాధాన్యం దక్కుతుందని.. అందుకే ఫ్రాంఛైజీ వాళ్లకు పెద్దపీట వేసిందని చెప్పుకొచ్చాడు.ఇది సరైన నిర్ణయమని తానూ నమ్ముతున్నానన్న రోహిత్.. కోరుకున్న ఆటగాళ్లను వేలంలోకి వదిలేసి మళ్లీ కొనుక్కోవడం కష్టమని పేర్కొన్నాడు. ఇక గత రెండు- మూడేళ్లుగా తమ జట్టు స్థాయికి తగ్గట్లుగా రాణించలేకోయిందని.. ఈసారి మాత్రం పొరపాట్లు పునరావృతం కానివ్వమని చెప్పాడు. ముంబై ఇండియన్స్‌కు ఘనమైన చరిత్రముంబై తరఫున తాను చాలా ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నానని.. సహచర ఆటగాళ్లతో సమన్వయం చేసుకుంటూ జట్టును మెరుగైన స్థితిలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపాడు.ట్రోఫీలు గెలవడంలో ముంబై ఇండియన్స్‌కు ఘనమైన చరిత్ర ఉందన్న రోహిత్ శర్మ... క్లిష్ట పరిస్థితుల్లోనూ పోరాటపటిమ కనబరిచి గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నాడు. కాగా అంబానీల సారథ్యంలోని ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ జట్టును ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు.అనూహ్య రీతిలో రోహిత్‌పై వేటుతద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి సారథిగా చరిత్రకెక్కాడు. అయితే, ఈ ఏడాది అనూహ్య రీతిలో ముంబై కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించి.. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను నియమించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్‌ను ట్రేడ్ చేసుకుని మరీ జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ అభిమానులు ఫ్రాంఛైజీతో పాటు హార్దిక్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఈ ఏడాది అట్టడుగున ముంబైరోహిత్ సైతం చాలాసార్లు మైదానంలోనే తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు కనిపించింది. జట్టు రెండు వర్గాలుగా విడిపోయిందన్న వార్తలకు బలం చేకూరుస్తూ ముంబై ఇండియన్స్ ఐపీఎల్-2024లో వరుస ఓటములు చవిచూసింది. పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్ ముంబైని వీడతాడని.. ముంబై సైతం అతడిని విడిచిపెడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ చర్చలకు ఫ్రాంఛైజీ గురువారం చెక్ పెట్టింది. వేలానికి ముందు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో రోహిత్ ఉన్నట్లు ప్రకటించింది. ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు1. జస్ప్రీత్ బుమ్రా(టీమిండియా ప్రధాన పేసర్)- రూ. 18 కోట్లు2. సూర్యకుమార్ యాదవ్(టీమిండియా టీ20 కొత్త కెప్టెన్)- రూ. 16.35 కోట్లు3. హార్దిక్ పాండ్యా(టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్)- రూ. 16.35 కోట్లు4. రోహిత్ శర్మ(టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్)- రూ. రూ. 16.30 కోట్లు5.తిలక్ వర్మ(టీమిండియా రైజింగ్ స్టార్)- రూ. 8 కోట్లు.వరల్డ్‌కప్ జట్టులోటీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024 అందించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ తన పదవి నుంచి వైదొలగడంతో పాటు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఇక ముంబై తాజాగా రిటైన్ చేసుకున్న బుమ్రా, హార్దిక్, సూర్య అతడి సారథ్యంలోని విన్నింగ్ టీమ్‌లో సభ్యులే.చదవండి: ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదల View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) -
ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా వరల్డ్‌కప్ విన్నర్
ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ పేసర్ పరాస్ మాంబ్రే నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఎంఐ యాజమాన్యం ఇవాళ (అక్టోబర్ 16) అధికారికంగా ప్రకటించింది. మాంబ్రే గతంలో ముంబై ఇండియన్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పని చేశాడు. మాంబ్రే ప్రస్తుత ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగతో కలిసి పని చేస్తాడు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం కొద్ది రోజుల కిందటే తమ హెడ్ కోచ్ మార్క్ బౌచర్‌పై వేటు వేసి పాత కోచ్ మహేళ జయవర్దనేను తిరిగి నియమించుకుంది. బౌచర్ ఆథ్వర్యంలో ముంబై ఇండియన్స్ గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శన కనబర్చింది. ఈ కారణంగా ఎంఐ యాజమాన్యం అతన్ని తప్పించింది. మాంబ్రే విషయానికొస్తే.. ఇతను 2024 టీ20 ప్రపంచకప్ సాధించిన భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. మాంబ్రే ఆథ్వర్యంలో (వరల్డ్‌కప్‌లో) భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. మాంబ్రే అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నప్పుడు ముంబై ఇండియన్స్ 2013 సీజన్ టైటిల్‌ను నెగ్గింది. అలాగే 2011, 2013 ఛాంపియన్స్ లీగ్‌ను కూడా కైవసం చేసుకుంది. మాంబ్రే టీమిండియా తరఫున 1996-1998 మధ్యలో రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు ఆడాడు. మాంబ్రే దేశవాలీ క్రికెట్లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ 284 ఫస్ట్ క్లాస్ వికెట్లు, 111 లిస్ట్-ఏ వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్ గత ఐపీఎల్ సీజన్లో చిట్టచివరి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. గత సీజన్లో ఈ జట్టు హార్దిక్ పాండ్యా నేతృత్వంలో 14 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. చదవండి: రెండో స్థానానికి ఎగబాకిన బ్రూక్.. టాప్ ప్లేస్‌ను సుస్థిరం చేసుకున్న రూట్ -
IPL 2025: ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా మహేళ జయవర్దనే
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా మహేళ జయవర్దనే మళ్లీ నియమితుడయ్యాడు. జయవర్దనే 2017 నుంచి 2022 వరకు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా పని చేశాడు. 2017, 2019, 2020 ఎడిషన్లలో టైటిళ్లు అందించాడు. అనంతరం జయవర్దనే ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ద క్రికెట్‌గా నియమితుడయ్యాడు. తిరిగి అతను 2025 ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.జయవర్దనే ప్రస్తుత హెడ్ కోచ్ మార్క్ బౌచర్ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నాడు. బౌచర్ 2023, 2024 ఎడిషన్లలో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా పని చేశాడు. బౌచర్ ఆథ్వర్యంలో ఎంఐ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. నూతన హెడ్ కోచ్‌గా జయవర్దనే నియామకాన్ని ఎంఐ ఫ్రాంచైజీ ఓనర్ ఆకాశ్ అంబానీ స్వాగతించారు. జయవర్దనే నాయకత్వ లక్షణాలు, క్రికెట్ పరిజ్ఞానం ముంబై ఇండియన్స్‌కు లబ్ది చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదే సందర్భంగా ఆకాశ్ మార్క్ బౌచర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. గత రెండు సీజన్లలో అతను అందించిన సేవలకు గాను కృతజ్ఞతలు తెలిపారు. ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో బౌచర్ సభ్యుడిగా కొనసాగుతడని పేర్కొన్నాడు.బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే..టీ20 వరల్డ్ కప్-2024లో టీమిండియాను విజేతగా నిలపడంతో కీలక పాత్ర పోషించిన బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే తిరిగి ముంబై ఇండియన్స్ గూటికి చేరనున్నాడు. మాంబ్రే ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ రాజస్థాన్ రాయల్స్‌తో చేరిన సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ ఇంకా టీమిండియాతోనే కొనసాగుతున్నాడు.చదవండి: ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్ట్‌లు.. సీనియర్లపై వేటు -
ఐపీఎల్లో ఆ జట్టుకు కెప్టెన్‌గా సూర్య?.. స్పందించిన ‘స్కై’
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో విజయాలే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ఆదివారం(అక్టోబరు 6) గ్వాలియర్ వేదికగా తొలి టీ20కి షెడ్యూల్ ఖరారైంది.అది సానుకూలాంశమేఈ నేపథ్యంలో టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ శనివారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. జట్టులో కనీసం రెండు ఓవర్లు బౌలింగ్ చేయగల బ్యాటర్లు ఉండటం సానుకూలాంశమని తెలిపాడు. శ్రీలంక పర్యటనలోనూ ఈ తరహా ప్రయోగం చేశామని.. ఆటగాళ్లలో ఉన్న భిన్న నైపుణ్యాలను ఉపయోగించుకోవడంలో తప్పులేదన్నాడు. అందుకే బ్యాటర్ల చేతికీ బంతిని ఇచ్చేందుకు వెనుకాడమని తెలిపాడు.రోహిత్ భాయ్ కెప్టెన్సీలో ఆడుతున్నపుడు కూడాఈ క్రమంలో సూర్యకుమార్ ఐపీఎల్ భవితవ్యం, ఫ్రాంఛైజీ క్రికెట్ కెప్టెన్సీ గురించి విలేఖరులు ప్రశ్నించారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘మీరు నన్ను ఇరుకున పెట్టేశారు(నవ్వుతూ). ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా ఉండటాన్ని ఆస్వాదిస్తున్నా. ముంబై ఇండియన్స్‌లో రోహిత్ భాయ్ కెప్టెన్సీలో ఆడుతున్నపుడు కూడా.. అవసరమైనపుడు సలహాలు ఇచ్చేవాడిని. మీకే తెలుస్తుందిఇక టీమిండియా విషయానికొస్తే.. ఇటీవల శ్రీలంకతో పాటు.. గతంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో సిరీస్‌లలోనూ నేను కెప్టెన్‌గా వ్యవహరించాను. జట్టును ఎలా ముందుకు నడిపించాలో ఇతర కెప్టెన్లను చూసి నేర్చుకోవడానికి సందేహించను.జీవితం ఇలా ముందుకు సాగుతోంది. కాలం గడుస్తున్న కొద్దీ ఏం జరుగబోతుందో మీకే తెలుస్తుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ తన ఐపీఎల్ కెప్టెన్సీ అంశంపై సంకేతాలు ఇచ్చాడు. కాగా సుదీర్ఘకాలంగా సూర్య ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు.పాండ్యా సారథ్యంలో ముంబైకి ఘోర పరాభవంకాగా ముంబై ఫ్రాంఛైజీ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. అయితే, పాండ్యా సారథ్యంలో ముంబై ఘోర పరాభవం చవిచూసింది. ముంబై ఇండియన్స్ సారథిగా సూర్య?ఈ ఏడాది పాయింట్ల పట్టికలో అట్టడగున పదో స్థానంలో నిలిచింది. ఇక ఇదే జట్టులో ఉన్న సూర్య గతంలో అతడి గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. అంతేకాదు.. టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను రీప్లేస్ చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టులోనూ ఇదే తరహా మార్పు జరుగనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సూర్య వ్యాఖ్యలు కూడా వాటికి కాస్త ఊతమిచ్చేలాగానే ఉన్నాయి.చదవండి: అరంగేట్రంలోనే దుమ్ములేపిన సెహ్వాగ్ కుమారుడు -
రోహిత్, కిషన్‌కు నో ఛాన్స్.. ముంబై రిటెన్షన్ లిస్ట్ ఇదే!
ఐపీఎల్-2025 మెగా వేలానికి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ రూల్స్‌ను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి మొత్తం ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అవకాశం ఇచ్చింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఆప్షన్ ఉంది. అదేవిధంగా ప్రతీ ఫ్రాంచైజీ పర్స్ వాల్యూను రూ.120 కోట్లకు పెంచారు. గతంలో ఈ పర్స్ విలువ రూ.90 కోట్లు ఉండేది. ఇక అట్టిపెట్టుకున్న అయిదుగురి కోసం ఓ ఫ్రాంఛైజీ రూ.75 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అట్టిపెట్టుకున్న మొదటి ఆటగాడికి రూ.18 కోట్లు, రెండో ఆటగాడికి రూ.14 కోట్లు, మూడో ఆటగాడికి రూ.11 కోట్లు ఫ్రాంఛైజీ చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రెండు రిటెన్షన్లకు తిరిగి వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు వెచ్చించాలి. ఇక రిటెన్షన్‌కు సంబంధించి విధి విధానాలు ఖారారు కావడంతో ఆయా ఫ్రాంచైజీలు తమ అంటిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సిద్దం చేసే పనిలో పడ్డాయి.రోహిత్, కిషన్‌కు నో ఛాన్స్!ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ ప్లేయర్ల రిటెన్షన్ లిస్ట్‌ను ఫైనలైజ్ చేసినట్లు చేసినట్లు తెలుస్తోంది. ఆ జట్టు స్టార్ ప్లేయర్, కెప్టెన్‌గా 5 ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను వదులుకోవడానికి ముంబై ఇండియన్స్ సిద్దమైనట్లు తెలుస్తోంది.ఈ ఏడాది సీజన్‌కు ముందు హిట్‌మ్యాన్‌ను తమ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు ముంబై యాజమాన్యం బాధ్యతలు అప్పగించింది. అప్పటినుంచే ముంబైతో రోహిత్ తెగిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రోహిత్ కూడా ఆ ఫ్రాంచైజీని నుంచి బయటకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడంట. అతడితో పాటు స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను కూడా విడిచిపెట్టాలని ముంబై నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత రెండు సీజన్ల నుంచి కిషన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడిని వేలంలోకి విడిచిపెట్టన్నట్లు వినికిడి.రిటెన్షన్ ఆటగాళ్లు వీరే? కెప్టెన్ హార్దిక్ పాండ్యా(రూ.18 కోట్లు), స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(రూ.14 కోట్లు), యువ ఆటగాడు తిలక్ వర్మ(రూ.11 కోట్లు)లను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోవాలని భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. వీరితో పాటు ఆన్క్యాప్డ్ ప్లేయర్లగా నమాన్ ధీర్(రూ. 4 కోట్లు), ఆకాశ్ మధ్వాల్(రూ. 4కోట్లు) అంటిపెట్టుకోవాలని ముంబై యోచిస్తున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ ఏడాది డిసెంబర్లో మెగా వేలం జరిగే అవకాశముంది.చదవండి: అశ్విన్ వారసుడు దొరికినట్లేనా? -
IPL 2025: ‘ఆర్సీబీ రోహిత్ శర్మను కొని.. కెప్టెన్ చేయాలి’
ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గనుక వేలంలోకి వస్తే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అతడిని కొనుగోలు చేయాలని సూచించాడు. అంతేకాదు.. హిట్‌మ్యాన్‌ను ఆర్సీబీ తమ సారథిగా నియమిస్తే.. ట్రోఫీ గెలవాలన్న చిరకాల కల నెరవేరుతుందన్నాడు.కాగా 2008లో ఆరంభమైన ఐపీఎల్లో రోహిత్ శర్మ తొలుత దక్కన్ చార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. రెండో ఎడిషన్‌లో టైటిల్ గెలిచిన చార్జర్స్‌లో అతడు సభ్యుడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ రోహిత్‌ను కొనుగోలు చేసి.. జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో తన కెప్టెన్సీ నైపుణాల్యతో ముంబైని ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు.తొలి కెప్టెన్‌గా రోహిత్ రికార్డుతద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. అయితే, ఈ ఏడాది ముంబై ఇండియన్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రోహిత్ శర్మపై వేటు వేసి.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాను తమ కెప్టెన్‌గా నియమించుకుంది.ఈ క్రమంలో అసంతృప్తికి లోనైన రోహిత్ శర్మ జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడని.. ముంబై ఫ్రాంఛైజీతో అతడి బంధం ముగిసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. ‘‘రోహిత్ వేలంలోకి వస్తే ఆర్సీబీ.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.టైటిల్ కరువు తీరుతుందిఅంతేకాదు.. రోహిత్‌ను ఒప్పించి తమ కెప్టెన్‌గా నియమించుకోవాలి. బ్యాటర్‌గా రోహిత్ మరీ మునుపటిలా పరుగులు రాబట్టలేకపోవచ్చు. ఫార్టీ, ఫిఫ్టీస్ మాత్రం చేయగలడు. అయితే, కెప్టెన్‌గా తుదిజట్టు కూర్పును మాత్రం చక్కగా సెట్ చేస్తాడు. అతడి వల్ల ఆర్సీబీకి లాభం చేకూరుతుంది.టైటిల్ కరువు తీరుతుంది. ఏ ఆటగాడి సేవలను ఎప్పుడు ఎలా వాడుకోవాలో రోహిత్‌కు బాగా తెలుసు. కెప్టెన్‌గా తన ప్రణాళికలు, వ్యూహాలు అమోఘం. ఒకవేళ ఆర్సీబీకి గనుక అవకాశం దొరికితే.. రోహిత్ శర్మను కొని, కెప్టెన్ చేసుకుని తీరాల్సిందే’’ అని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. రోహిత్ ఐపీఎల్లో కొనసాగితే ఏదైనా ఒక జట్టుకు కెప్టెన్‌గా మాత్రమే ఉండాలని పేర్కొన్నాడు.మూడుసార్లు ఫైనల్ చేరిన ఆర్సీబీకాగా ఇప్పటి వరకు మూడుసార్లు ఫైనల్ చేరిన ఆర్సీబీ.. ఆఖరి గండాన్ని మాత్రం దాటలేకపోయింది. 2009లో దక్కన్ చార్జర్స్, 2011లో చెన్నై సూపర్ కింగ్స్, 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడి టైటిల్ మిస్ చేసుకుంది. ఇక టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి చాలాకాలం పాటు ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఆటగాడిగా అతడు బెంగళూరు ఫ్రాంఛైజీతోనే కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం విదితమే.చదవండి: అరంగేట్రం చేసిన నాలుగేళ్లకే పాక్ క్రికెటర్ రిటైర్మెంట్.. కానీ ఓ ట్విస్ట్! -
ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్: భారత స్పిన్ దిగ్గజం
మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్. అతడి సారథ్యంలో భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 గెలిచింది. ఇక ఫ్రాంఛైజీ క్రికెట్లోనూ ఈ జార్ఖండ్ డైనమైట్.. 2008లో మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆది నుంచి చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)కు ఆడుతున్నాడు. సారథిగా సీఎస్కేను ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిపాడు. మరోవైపు.. రోహిత శర్మ.. టీమిండియా ప్రస్తుత కెప్టెన్. ఇటీవలే టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ గెలిచాడు. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు సుదీర్ఘకాలం పాటు కెప్టెన్‌గా ఉండి.. ధోని కంటే ముందుగానే ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన సారథిగా చరిత్రకెక్కాడు.ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్‌కాగా టీమిండియాలో ఇద్దరితో కలిసి, ఐపీఎల్లో ఈ ఇద్దరి కెప్టెన్సీలోనూ ఆడాడు టీమిండియా దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఈ నేపథ్యంలో ఇద్దరి నాయకత్వ శైలిని పోలుస్తూ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్ అని తన మనసులోని మాట బయటపెట్టాడు. అందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ..ధోని ఎవరితో మాట్లాడడు‘‘ఇద్దరిలో ఎవరు బెటర్ అంటే.. నేను ధోనిని కాదని రోహిత్ వైపే మొగ్గుచూపుతాను. ఎందుంకటే రోహిత్ ప్లేయర్స్ కెప్టెన్. ప్రతి ఒక్క ఆటగాడి దగ్గరికి వెళ్లి వాళ్లకు ఏం కావాలో అడిగి తెలుసుకుంటాడు. సహచరులతో అతడికి మంచి అనుబంధం ఉంటుంది.అయితే, ధోని కెప్టెన్సీ స్టైల్ వేరుగా ఉంటుంది. అతడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. తన మౌనం ద్వారానే ఎదుటివారికి తన మనసులోని మాట చేరాలని భావిస్తాడు. ఇతరులతో ధోని సంభాషించే విధానం ఇలాగే ఉంటుంది’’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. రోహిత్ శర్మకు స్నేహితులే తప్ప.. అతడికి విరుద్ధంగా మాట్లాడేవారు ఒక్కరూ ఉండరని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. స్పోర్ట్స్ యారీ ఇంటర్వ్యూలో భజ్జీ ఈ వ్యాఖ్యలు చేశాడు.చదవండి: Babar Azam: బాబర్ ఆజం సంచలన నిర్ణయం..Rohit Sharma is a better captain than MS Dhoni says Harbhajan Singh Full podcast at 9pm tonight, only on Sports Yaari YouTube Channel 🇮🇳pic.twitter.com/6tVAdJh6qx— Sushant Mehta (@SushantNMehta) October 2, 2024 -
శ్రేయస్ అయ్యర్‌కు షాక్.. కేకేఆర్ కెప్టెన్‌గా సూర్యకుమార్!?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు అన్ని ఫ్రాంచైజీలు కీలక మార్పులు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న మెగా వేలం కోసం ఆయా జట్లు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి.ఇప్పటికే ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ గుడ్‌బై చెప్పనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతుండగా.. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కోతా నైట్‌రైడర్స్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఐపీఎల్-2024లో తమ జట్టును ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను కేకేఆర్ యాజమాన్యం విడిచిపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కేకేఆర్ కెప్టెన్‌గా సూర్యకుమార్..?గౌతం గంభీర్ తర్వాత కేకేఆర్‌కు టైటిల్ అందించిన రెండో కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. అయితే మెంటార్‌గా పనిచేసిన గౌతం గంభీర్.. ఇప్పుడు భారత ప్రధాన కోచ్ బాధ్యతలు చేపట్టడంతో తమ కెప్టెన్ కూడా మార్చాలని కేకేఆర్ భావిస్తున్నట్లు వినికిడి.ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకోవాలని కేకేఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. అందుకు బదులుగా కేకేఆర్ అయ్యర్‌ను ముంబైకి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు ఫ్రాంచైజీల మధ్య డీల్ కుదిరినట్లు సమాచారం. సూర్యకు అయ్యర్ స్ధానంలో తమ జట్టు పగ్గాలని అప్పగించాలని కేకేఆర్ ప్లాన్ చేస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అదేవిధంగా గంభీర్ స్ధానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మెంటార్ బాధ్యతలు చేపట్టనున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.చదవండి: AUS vs ENG: లివింగ్ స్టోన్ ఊచకోత.. ఆసీస్‌పై ఇంగ్లండ్‌పై ఘన విజయం -
రోహిత్ ముంబై ఇండియన్స్‌తోనే కొనసాగాలి.. ఎందుకంటే?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి గుడ్‌బై చెప్పనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. కొంతమంది రోహిత్ శర్మ లక్నో సూపర్ జెయింట్స్‌కు వెళ్లనున్నాడని, మరి కొంతమంది ఢిల్లీ ఫ్రాంచైజీతో జతకట్టనున్నాడని చెప్పుకుంటూ వస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై మాజీ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌లోనే కొనసాగాలని ఓజా తెలిపాడు. కాగా హిట్‌మ్యాన్‌తో ఓజా మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్లో ఓజా.. రోహిత్లో కలిసి నాలుగేళ్ల పాటు ముంబై ప్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహించారు."ముంబై ఇండియన్స్‌తో రోహిత్‌కు మంచి అనుబంధం ఉంది. ముంబై ఫ్రాంచైజీలో రోహిత్ చాలా కాలం నుంచి అంతర్భాగంగా ఉన్నాడు. వారికి ఐదు టైటల్స్‌ను అందించాడు. రోహిత్‌ని వదిలివేయడం వారికి సులభమో కాదో నాకు తెలియదు.కానీ రోహిత్‌కి మాత్రం చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. నాకు తెలిసినంతవరకు రోహిత్ కూడా ముంబై ఫ్రాంచైజీని విడిచిపెట్టాలని అనుకోడు. ఒకవేళ అదే జరిగితే కఠిన నిర్ణయమనే చెప్పవచ్చు. నా వరకు అయితే ముంబై ఇండియన్స్‌లో రోహిత్ కొనసాగితేనే బెటర్. అతడు ఈ స్థాయికి ఎదగడంలో ముంబై ఇండియన్స్ పాత్ర కూడా ఉంది. అందుకే అతడు ముంబై ఫ్రాంచైజీలోనే కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఇది ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నమెంట్, కొన్ని సార్లు ఏదైనా జరగవచ్చు" అని ఇన్సైడ్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓజా పేర్కొన్నాడు.చదవండి: టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వనున్న హార్దిక్ పాండ్యా ..? -
’ముంబై ఇండియన్స్‌తో రోహిత్ ప్రయాణం ముగిసినట్టే’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ భవితవ్యం గురించి భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీతో హిట్‌మ్యాన్ ప్రయాణం ముగిసినట్లేనని.. అతడు ఈసారి మెగా వేలంలోకి వచ్చే అవకాశం ఉందన్నాడు. లేనిపక్షంలో.. ట్రేడింగ్ ద్వారానైనా వేరే ఫ్రాంఛైజీకి బదిలీ కావొచ్చని అభిప్రాయపడ్డాడు.ఐదుసార్లు ట్రోఫీ అందించిఐపీఎల్లో ఓ జట్టును అత్యధిక సార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత రోహిత్ శర్మ సొంతం. అతడి సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ గెలిచింది. ఐపీఎల్- 2013, 2015, 2017, 2019, 2020 ఎడిషన్లలో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఒడిదుడుకులు ఎదురైనా గతేడాది ప్లే ఆఫ్స్ చేరి సత్తా చాటింది.రోహిత్‌ను తప్పించి పాండ్యాకు పగ్గాలుఅయినప్పటికీ ఐపీఎల్-2024 సీజన్లో ముంబై ఇండియన్స్ తన కెప్టెన్‌ను మార్చింది. దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మను కాదని.. గుజరాత్ టైటాన్స్‌ను చాంపియన్‌గా నిలిపిన హార్దిక్ పాండ్యాను భారీ మొత్తానికి ట్రేడ్ చేసుకుని సారథిగా నియమించింది. దీంతో రోహిత్‌ను అవమానించిన జట్టుకు మేము మద్దతుగా నిలవబోమంటూ అభిమానులు ముంబై ఫ్రాంఛైజీతో పాటు పాండ్యాను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.దారుణ ఫలితంఈ క్రమంలో ఒత్తిడిలో చిత్తైన పాండ్యా సారథ్యంలో ఐపీఎల్-2024లో ముంబై దారుణ ఫలితం చవిచూసింది. పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇదిలా ఉంటే.. అంబానీల యాజమాన్యంలోని ముంబై జట్టుతో రోహిత్‌కు సుదీర్ఘ అనుబంధం ఉన్నప్పటికీ.. తనను అవమానకరరీతిలో కెప్టెన్సీ తప్పించారని అతడు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.ముంబై జట్టుతో రోహిత్ ప్రయాణం ముగిసిందిఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 మెగా వేలం సందర్భంగా రోహిత్ ముంబైని వీడనున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాల ఆధారంగా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రోహిత్ ముంబై ఇండియన్స్‌లో కొనసాగుతాడా లేదా? అన్నది ప్రశ్నార్థకం. అయితే, నా అభిప్రాయం ప్రకారం అతడు ఇక ఆ ఫ్రాంఛైజీతో ఉండడు.అతడేమీ ధోని కాదుఎందుకంటే.. మహేంద్ర సింగ్ ధోని- చెన్నై సూపర్ కింగ్స్ మాదిరి ముంబై- రోహిత్ మధ్య అలాంటి అనుబంధం లేదనిపిస్తోంది. అందుకే రోహిత్ బయటకు రావడం ఖాయమని చెప్పవచ్చు. ముంబై సైతం అతడిని రిటైన్ చేసుకోకపోవచ్చు. కాబట్టి రోహిత్ ట్రేడ్ విండో ద్వారా లేదంటే మెగా వేలంలోకి రావడం ద్వారా వేరే జట్టుకు మారే అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు ముంబై ఇండియన్స్‌తో రోహిత్ ప్రయాణం ముగిసింది’’ అని పేర్కొన్నాడు. విభేదాలు వచ్చిన తర్వాత కలిసి ప్రయాణించడం కుదరబోదని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.ధోని-చెన్నై అనుబంధం వేరుకాగా రోహిత్ మాదిరే టీమిండియా దిగ్గజ కెప్టెన్ ధోని సైతం చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. 2008 నుంచి అదే ఫ్రాంఛైజీలో కొనసాగుతున్న తలా... ఈ ఏడాది తానే స్వయంగా కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. రుతురాజ్ గైక్వాడ్‌కు చెన్నై జట్టు పగ్గాలు అప్పగించాడు. అంతేకాదు వేలం దగ్గర నుంచి తుదిజట్టు ఎంపిక దాకా చెన్నై ఫ్రాంఛైజీ ధోనికి పూర్తి స్వేచ్ఛనిస్తుందని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ పరిస్థితి ఇందుకు భిన్నమని ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు.చదవండి: DT 2024: భారత ‘ఎ’ జట్టులోషేక్ రషీద్.. టీమిండియాతో చేరని సర్ఫరాజ్ ఖాన్! -
మొదటిరోజు హార్దిక్- రోహిత్ మాట్లాడుకోలేదు.. ఆ తర్వాత
‘‘టీమిండియా ప్రాక్టీస్ చేసిన మొదటిరోజు నేను నెట్స్ వద్దకు వెళ్లాను. అప్పుడు హార్దిక్- రోహిత్ దూరదూరంగా ఉండటం గమనించాను. నిజానికి ఆరోజు వారు మాట్లాడుకోలేదు. అయితే, రెండో రోజు నుంచి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వాళ్లిద్దరు ఒకరికొకరు చేరువగా వచ్చారు.ఓ మూలన కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. నిజానికి అక్కడ కెమెరా కూడా లేదు. వాళ్లిద్దరినీ అలా చూసి నేను నమ్మలేకపోయాను. జట్టు ప్రయోజనాల కోసం ఆటగాళ్లు తమ మధ్య విభేదాలు ఉన్నా వాటిని పక్కనపెట్టి కలిసికట్టుగా ముందుకు సాగుతారని అప్పుడే నాకు కళ్లకు కట్టినట్లయింది.ఆ తర్వాత మూడు రోజుల పాటు రోహిత్, హార్దిక్ కలిసే బ్యాటింగ్ చేశారు. హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్నపుడు రోహిత్ దగ్గరుండి పర్యవేక్షించాడు. వారిని అలా చూస్తే ముచ్చటేసింది’’ అంటూ స్పోర్ట్స్ జర్నలిస్టు విమల్ కుమార్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ- స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అనుబంధం గురించి తెలిపాడు.కారణం అతడేటీ20 ప్రపంచకప్-2024 సమయంలో రోహిత్- హార్దిక్ కలిసిపోయి మునుపటిలా ఉండటానికి హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కారణమని పేర్కొన్నాడు. ఈ విషయంలో ఆయనకే క్రెడిట్ ఇవ్వాలని.. ద్రవిడ్ చొరవ వల్లే డ్రెస్సింగ్ రూం వాతావరణం అంత చక్కగా ఉందన్నాడు. టీమిండియా ఆటగాళ్ల మధ్య విభేదాలంటూ వచ్చే వార్తలు నిజం కావని వారిని దగ్గరగా చూసిన తర్వాతే తనకు అర్థమైందన్నాడు విమల్ కుమార్. టూ స్లాగర్స్ అనే యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.అందుకే విభేదాలు?ఐపీఎల్-2024కు ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన ముంబై ఇండియన్స్.. ఆ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. దీంతో హిట్‌మ్యాన్ అభిమానులు తీవ్రస్థాయిలో హార్దిక్‌పై మండిపడ్డారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. మరోవైపు.. హార్దిక్ సైతం మైదానంలో రోహిత్ ఫీల్డింగ్ పొజిషన్‌ను పదే పదే మారుస్తూ కాస్త అతి చేశాడు. ఈ క్రమంలో రోహిత్ కూడా హార్దిక్ తీరు పట్ల అసంతృప్తికి గురైనట్లు వార్తలు వచ్చాయి.కలిసిపోయారుఈ నేపథ్యంలో తాజా సీజన్లో ముంబై దారుణంగా ఓడిపోవడంతో ఆటగాళ్ల మధ్య సఖ్యత లోపించడమే ఇందుకు కారణమనే విమర్శలు వచ్చాయి. అయితే, టీ20 ప్రపంచకప్-2024లో సీన్ మారింది. రోహిత్ కెప్టెన్‌గా.. హార్దిక్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత మరోసారి ఐసీసీ టైటిల్ సాధించింది. ఇందులో రోహిత్‌తో పాటు ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాత్ర కూడా కీలకం. ఇక అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ ఈవెంట్లో టీమిండియాతో పాటే ఉన్న విమల్ కుమార్ తాజాగా రోహిత్- హార్దిక్ జట్టు కోసం కలిసిపోయారంటూ పాజిటివ్ కామెంట్స్ చేశాడు.