RCB
-
ఆర్సీబీలోకి ఇంగ్లండ్ ఆల్‌రౌండర్
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఛార్లీ డీన్ మహిళల ఆర్సీబీ జట్టుకు ఎంపికైంది. ఆస్ట్రేలియా బౌలింగ్ ఆల్‌రౌండర్ సోఫీ మోలినెక్స్ గాయపడటంతో ఆమె స్థానంలో ఛార్లీ డీన్ ఆర్సీబీలోకి వచ్చింది. డీన్‌ను ఆర్సీబీ 30 లక్షలకు సొంతం చేసుకుంది. మోకాలి గాయం కారణంగా మోలినెక్స్ డబ్ల్యూపీఎల్ తదుపరి ఎడిషన్‌కు (2025) దూరం కానుందని ఆర్సీబీ ప్రకటించింది. డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. గత ఎడిషన్ ఫైనల్లో ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.మోలినెక్స్: లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన మోలినెక్స్ ఆసీస్ తరఫున 3 టెస్ట్‌లు, 13 వన్డేలు, 28 టీ20లు ఆడింది. మోలినెక్స్ తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తం 71 వికెట్లు (టెస్ట్‌ల్లో 7, వన్డేల్లో 23, టీ20ల్లో 41 వికెట్లు) తీసింది.ఛార్లీ డీన్: రైట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన డీన్ ఇంగ్లండ్ తరఫున 3 టెస్ట్‌లు, 39 వన్డేలు, 36 టీ20లు ఆడింది. ఇందులో మొత్తంగా 122 వికెట్లు (టెస్ట్‌ల్లో 7, వన్డేల్లో 69, టీ20ల్లో 46 వికెట్లు) తీసింది.కాగా, మహిళల ఐపీఎల్ ఇప్పటివరకు రెండు ఎడిషన్ల పాటు విజయవంతంగా సాగింది. తొలి ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలువగా.. రెండో ఎడిషన్‌లో ఆర్సీబీ ఛాంపియన్‌గా నిలిచింది. మూడో ఎడిషన్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 2 వరకు జరుగనుంది. 2025 డబ్ల్యూపీఎల్ మొత్తం నాలుగు వేదికల్లో జరుగనుంది. బెంగళూరు, లక్నో, ముంబై, వడోదరాలో డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తదుపరి సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.డబ్ల్యూపీఎల్-2025లో పాల్గొనే జట్లు, ఆటగాళ్ల వివరాలు..ఢిల్లీ క్యాపిటల్స్: జెమీమా రోడ్రిగెజ్, మెగ్ లాన్నింగ్, షఫాలీ వర్మ, స్నేహ దీప్తి, తనియా భాటియా, సారా బ్రైస్, నందిని కశ్యప్, అలైస్ క్యాప్సీ, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, అరుంధతి రెడ్డి, జెస్ జొనాసెన్, మారిజన్ కాప్, మిన్ను మణి, రాధా యాదవ్, శిఖా పాండే, నికీ ప్రసాద్, నల్లపురెడ్డి చరణి, టిటాస్ సాధుగుజరాత్ జెయింట్స్: భారతి ఫుల్మలి, లారా వోల్వార్డ్ట్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ప్రియా మిశ్రా, సిమ్రన్ షేక్, బెత్ మూనీ, ఆష్లే గార్డ్నర్, దయాలన్ హేమలత, హర్లీన్ డియోల్, సయాలి సత్గరే, తనూజా కన్వర్, డేనియల్ గిబ్సన్, డియండ్రా డొట్టిన్, కష్వీ గౌతమ్, మన్నత్ కశ్యప్, మేఘనా సింగ్, షబ్నమ్ షకీల్, ప్రకాశిక నాయక్ముంబై ఇండియన్స్: యస్తికా భాటియా, కమలిని, అమన్‌దీప్ కౌర్, అమన్‌జోత్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయాన్, హర్మన్‌ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, జింటిమణి కలిత, కీర్తన బాలకృష్ణన్, నాట్ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్, సంజీవన్ సజనా, అక్షిత మహేశ్వరి, సంస్కృతి గుప్త, నదినే డి క్లెర్క్, సైకా ఇషాఖీ, షబ్నిమ్ ఇస్మాయిల్ఆర్సీబీ: డేనియల్ వ్యాట్ హాడ్జ్, సబ్బినేని మేఘన, స్మృతి మంధన, రిచా ఘోష్, ఆశా శోభన, ఎల్లిస్ పెర్రీ, జార్జియా వేర్హమ్, కనిక అహుజా, శ్రేయాంక పాటిల్, సోఫీ డివైన్, జోషిత, ప్రేమా రావత్, రాఘవి బిస్త్, ఏక్తా బిస్త్, కేట్ క్రాస్, రేణుకా సింగ్, జాగ్రవి పవార్, ఛార్లీ డీన్యూపీ వారియర్జ్: కిరణ్ నవ్‌గిరే, శ్వేతా సెహ్రావత్, వృందా దినేశ్, ఆరూషి గోయల్, అలైసా హీలీ, చమారీ ఆటపట్టు, దీప్తి శర్మ, గ్రేస్ హ్యారిస్, పూనమ్ ఖేమ్నార్, సోఫీ ఎక్లెస్టోన్, తహిల మెక్‌గ్రాత్, ఉమా ఛెత్రీ, క్రాంతి గౌడ్, అంజలి శర్వాని, గౌహెర్ సుల్తానా, రాజేశ్వరి గైక్వాడ్, సైమా ఠాకోర్, అలానా కింగ్ -
ఆర్సీబీకి గుడ్ న్యూస్.. ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన స్టార్ ప్లేయర్
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీకి గుడ్ న్యూస్ అందింది. బిగ్ బాష్ లీగ్‌లో పేలవ ఫామ్‌లో ఉండిన ఆ జట్టు స్టార్ ప్లేయర్ జేకబ్ బేతెల్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. హోబర్ట్ హరికేన్స్‌తో ఇవాళ (జనవరి 14) జరిగిన మ్యాచ్‌లో బేతెల్ మెరుపు అర్ద సెంచరీ (50 బంతుల్లో 87; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించాడు. ఫలితంగా అతని జట్టు మెల్బోర్న్ రెనెగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. JACOB BETHELL - A SPECIAL PLAYER. 🌟The Highlights of Jacob Bethel's 87(50) in the BBL and all players combined made 61(70) - Bethel, The Future of RCB. 🔥pic.twitter.com/zIyhli7iOi— Tanuj Singh (@ImTanujSingh) January 14, 2025మెల్బోర్న్ ఇన్నింగ్స్‌లో బేతెల్ మినహా ఎవరూ రాణించలేదు. టిమ్ సీఫర్ట్ (24), కెప్టెన్ సదర్‌ల్యాండ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జోష్ బ్రౌన్ 6, మార్కస్ హ్యారిస్ 1, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 7, హ్యారీ డిక్సన్ 1, టామ్ రోజర్స్ 5 (నాటౌట్), ఫెర్గస్ ఓనీల్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. హరికేన్స్ బౌలర్లలో రిలే మెరిడిత్ మూడు వికెట్లు పడగొట్టగా.. నాథన్ ఇల్లిస్, మిచెల్ ఓవెన్ తలో వికెట్ దక్కించుకున్నారు.155 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్ 7 ఓవర్ల అనంతరం రెండు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ ఓవెన్ (24), కాలెబ్ జువెల్ (1) ఔట్ కాగా.. చార్లీ వకీం (12), నిఖిల్ చౌదరీ (4) క్రీజ్‌లో ఉన్నారు. రెనెగేడ్స్ బౌలర్లలో ఫెర్గస్ ఓనీల్కు ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో హరికేన్స్ గెలవాలంటే 78 బంతుల్లో 105 పరుగులు చేయాలి.కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో జేకబ్ బేతెల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ జేకబ్ బేతెల్పై భారీ అంచనాలే పెట్టుకుంది. అయితే బీబీఎల్ తొలి అర్ద భాగంలో బేతెల్ తుస్సుమనిపించాడు.బీబీఎల్-2025లో బేతెల్ ప్రదర్శనలు..87(50) vs హోబర్ట్ హరికేన్స్1(8) vs మెల్బోర్న్ స్టార్స్2(9) vs పెర్త్ స్కార్చర్స్49(36) vs మెల్బోర్న్ స్టార్స్21(21) vs అడిలైడ్ స్ట్రైకర్స్2(4) vs సిడ్నీ థండర్30(22) vs పెర్త్ స్కార్చర్స్3(6) vs హోబర్ట్ హరికేన్స్ -
IPL 2025: ఆర్సీబీ అభిమానులకు అదిరిపోయే వార్త
ఆర్సీబీ అభిమానులకు అదిరిపోయే వార్త. ఇటీవలే ఆ జట్టులోకి వచ్చిన స్టార్ ఆటగాడు టిమ్ డేవిడ్ బిగ్‌బాష్ లీగ్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. టిమ్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. టిమ్ అరివీర భయంకరమైన ఫామ్ చూసి ఆర్సీబీ అభిమానులు సంబురపడిపోతున్నారు. టిమ్ ఇదే ఫామ్‌లో ఉంటే ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ నెగ్గడం ఖాయమని చర్చించుకుంటున్నారు.టిమ్ తాజాగా సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో టిమ్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. గెలవడం కష్టం అనుకున్న మ్యాచ్‌లో టిమ్ విశ్వరూపం ప్రదర్శించి తన జట్టును (హోబర్ట్ హరికేన్స్) ఒంటిచేత్తో గెలిపించాడు. టిమ్ చివరి వరకు క్రీజ్‌లో ఉండి హరికేన్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.- 62*(28) & Won POTM.- 68*(38) & Won POTM.THE DESTRUCTION OF TIM DAVID IN THE BBL - Fantastic news for RCB. 🥶 pic.twitter.com/OSwD9Px6DP— Tanuj Singh (@ImTanujSingh) January 10, 2025దీనికి ముందు అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ టిమ్ ఉగ్రరూపం దాల్చాడు. ఆ మ్యాచ్‌లో టిమ్ 28 బంతులు ఎదర్కొని 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేశాడు. ఛేదనలో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆరో స్థానంలో బరిలోకి దిగిన టిమ్.. జట్టును విజయతీరాలకు చేర్చేంతవరకు ఔట్ కాలేదు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్ట్రయికర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఛేదనలో హరికేన్స్ టాపార్డర్ బ్యాటర్లు పెద్దగా రాణించకపోగా.. టిమ్ పెద్దన్న పాత్రి పోషించి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టిమ్ హరికేన్స్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. థండర్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ (88 నాటౌట్) ఒక్కడే రాణించాడు. సామ్ బిల్లింగ్స్ (28), ఒలివర్ డేవిస్ (17) రెండంకెల స్కోర్లు చేశారు. హరికేన్స్ బౌలర్లలో రిలే మెరిడిత్ రెండు వికెట్లు తీయగా.. స్టాన్లేక్, క్రిస్ జోర్డన్, నిఖిల్ చౌదరీ తలో వికెట్ పడగొట్టారు.165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్.. టిమ్ డేవిడ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో 16.5 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. హరికేన్స్ టాపార్డర్ బ్యాటర్లు మిచెల్ ఓవెన్ (13), మాథ్యూ వేడ్ (13), చార్లీ వకీమ్, నిఖిల్ చౌదరీ (29) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ఐదో స్థానంలో బరిలోకి దిగిన టిమ్ నేనున్నానంటూ తన జట్టును గెలిపించాడు. క్రిస్ జోర్డన్ (18 నాటౌట్) సహకారంతో టిమ్ హరికేన్స్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. థండర్ బౌలర్లలో జార్జ్ గార్టన్ రెండు వికెట్లు పడగొట్టగా... వెస్ అగర్, టామ్ ఆండ్రూస్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, 28 ఏళ్ల టిమ్‌ను ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ సొంతం చేసుకుంది. టిమ్‌ను ఆర్సీబీ 3 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్ వరకు టిమ్ ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నప్పుడు టిమ్ ధర 8.25 కోట్లుగా ఉండేది. -
టిమ్ డేవిడ్ ఊచకోత.. ఆర్సీబీకి మరో గుడ్ న్యూస్
వివిధ టోర్నీలో ఇవాళ (జనవరి 5) ఇద్దరు ఆర్సీబీ ఆటగాళ్లు చెలరేగిపోయారు. బిగ్‌బాష్ లీగ్‌లో టిమ్ డేవిడ్ (Tim David) (హోబర్ట్ హరికేన్స్), విజయ్ హజారే ట్రోఫీలో రజత్ పాటిదార్ (Rajat Patidar) విధ్వంసం సృష్టించారు. అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ వీరవిహారం చేశాడు. ఈ మ్యాచ్‌లో 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డేవిడ్.. ఓవరాల్‌గా 28 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేశాడు. డేవిడ్ విధ్వంసం ధాటికి అడిలైడ్ స్ట్రయికర్స్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని హరికేన్స్ మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రయికర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (49), అలెక్స్ రాస్ (47) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టుకు భారీ స్కోర్‌ను అందించారు. ఓలీ పోప్ (33), జేమీ ఓవర్టన్ (27 నాటౌట్) పర్వాలేదనిపించారు. హరికేన్స్ బౌలర్లలో వకార్ సలామ్‌ఖీల్ 2, క్రిస్ జోర్డన్, స్టాన్లేక్, రిలే మెరిడిత్ తలో వికెట్ పడగొట్టారు.187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. టిమ్ డేవిడ్ అడిలైడ్ స్ట్రయికర్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. మిచెల్ ఓవెన్ (37), మాథ్యూ వేడ్ (27), నిఖిల్ చౌదరీ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్ట్రయికర్స్ బౌలర్లలో లాయిడ్ పోప్, కెమరూన్ బాయ్స్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హెన్రీ థార్న్టన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.శతక్కొట్టిన రజత్ పాటిదార్విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్ కెప్టెన్, ఆర్సీబీ ఆటగాడు రజత్ పాటిదార్ సెంచరీతో కదంతొక్కాడు. బెంగాల్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో పాటిదార్ 137 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో 132 పరుగులు (నాటౌట్) చేశాడు. పాటిదార్ శతక్కొట్టడంతో ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. కెప్టెన్ సుదీప్ ఘరామీ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. సుదీప్ ఛటర్జీ (47) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ ఇన్నింగ్స్ ఆఖర్లో బ్యాట్ ఝులింపించాడు. షమీ 34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 42 పరుగులు చేశాడు.అనంతరం బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ 46.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ అయినప్పటికీ రజత్ పాటిదార్.. శుభమ్ శ్యామ్‌సుందర్ శర్మ (99) సాయంతో మధ్యప్రదేశ్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు 99 పరుగుల వద్ద ఔటయ్యారు.భీకర ఫామ్‌లో పాటిదార్దేశవాలీ క్రికెట్లో రజత్ పాటిదార్ భీకరఫామ్‌లో ఉన్నాడు. రజత్ వరుసగా 76(36), 62(36), 68(40), 4(7), 36(16), 28(18), 66*(29), 82*(40), 55(33), 21*(15), 2(7), 2(3), 14(16), 132*(137) స్కోర్లు చేశాడు. రజత్ గత 14 ఇన్నింగ్స్‌ల్లో 6 అర్ద శతకాలు, ఓ శతకం బాదాడు. -
ఆర్సీబీకి గుడ్ న్యూస్.. భువనేశ్వర్ కుమార్ హ్యాట్రిక్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఉత్తర్ ప్రదేశ్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. జార్ఖండ్‌తో ఇవాళ (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్‌లో భువీ ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్ 17వ ఓవర్లో భువీ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు. ఈ ఓవర్లో భువీ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో భువీ మొత్తంగా 4 ఓవర్లు వేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో ఓ మొయిడిన్ ఉంది. HAT-TRICK FOR BHUVNESHWAR KUMAR IN SYED MUSHTAQ ALI 🦁- Great news for RCB in IPL 2025...!!! pic.twitter.com/mDw13DhRM4— Johns. (@CricCrazyJohns) December 5, 2024ఈ మ్యాచ్‌లో భువీతో పాటు నితీశ్ రాణా (4-0-19-2), మొహిసిన్ ఖాన్ (2.5-0-38-2), వినీత్ పన్వార్ (4-0-39-1), విప్రాజ్ నిగమ్ (2-0-18-1), శివమ్ మావి (3-0-28-1) రాణించడంతో జార్ఖండ్‌పై ఉత్తర్ ప్రదేశ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది.తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రింకూ సింగ్ 28 బంతుల్లో 45 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలువగా.. ప్రియమ్ గార్గ్ 31, సమీర్ రిజ్వి 24, నితీశ్ రాణా 16, శివమ్ మావి 15 పరుగులు చేశారు. జార్ఖండ్ బౌలర్లలో బాల్ కృష్ణ 3 వికెట్లు తీయగా.. వివేకానంద్ తివారి 2, వికాస్ కుమార్, వికాశ్ సింగ్, అనుకుల్ రాయ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జార్ఖండ్.. 19.5 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. అనుకుల్ రాయ్ (44 బంతుల్లో 91) జార్ఖండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. విరాట్ సింగ్ (23), రాబిన్ మింజ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ (8) విఫలమయ్యాడు.ఆర్సీబీలో చేరిన భువీఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో భువనేశ్వర్ కుమార్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. భువీపై ఆర్సీబీ 10.75 కోట్లు వెచ్చించింది. మెగా వేలానికి ముందు భువనేశ్వర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకుంది. భువీ 2014 నుంచి సన్‌రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. భువీకి పవర్ ప్లే మరియు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుంది. భువీ 2016, 2017 ఐపీఎల్ సీజన్లలో పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ 2016లో టైటిల్ సాధించడంలో భువీ కీలకపాత్ర పోషించాడు. -
జాక్‌పాట్ కొట్టిన ఆర్సీబీ ప్లేయర్
ఇంగ్లండ్ యువ ఆటగాడు జాకబ్ బేతెల్ జాక్‌పాట్ కొట్టాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) డెవలప్మెంట్ కాంట్రాక్ట్‌లో ఉన్న బేతెల్.. తాజాగా ఈసీబీ రెండేళ్ల కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నాడు. ఈసీబీ రెండేళ్ల కాంట్రాక్ట్ జాబితాలో జో రూట్,జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. తాజాగా బేతెల్ వీరి సరసన చేరాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ పేస్ త్రయం జోఫ్రా ఆర్చర్, మాథ్యూ పాట్స్, బ్రైడన్ కార్స్ తమ కాంట్రాక్ట్‌ను 2026 వరకు పొడిగించుకున్నారు. దీంతో ఈ ముగ్గురు కూడా రెండేళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చేరిపోయారు.కాగా, 21 ఏళ్ల బేతెల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ల్లో వన్డే, టీ20 అరంగేట్రం చేశాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బేతెల్ టెస్ట్ అరంగేట్రం కూడా చేశాడు. బేతెల్ మూడు ఫార్మాట్లకు తగ్గ ప్లేయర్. అందుకే అతనికి రెండేళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చారు. బేతెల్‌ను ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. న్యూజిలాండ్‌తో తాజాగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బేతెల్ 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. బేతెల్ ఇంగ్లండ్ తరఫున ఒక టెస్ట్, 8 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. ఇందులో 4 అర్ద సెంచరీలు ఉన్నాయి. -
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆసక్తికర ఘటన
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలు చెరి ముగ్గురు ఆటగాళ్లను కుండ మార్పిడి చేసుకున్నాయి. 2025 మెగా వేలంలో ఆర్సీబీ సొంతం చేసుకున్న రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్, నువాన్ తుషార 2024 సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఆడారు. 2024 సీజన్లో ఆర్సీబీకి ఆడిన విల్ జాక్స్, రీస్ టాప్లే, కర్ణ్ శర్మ.. 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ వశమయ్యారు. వేలంలో ఓ ఫ్రాంచైజీ నుంచి మరో ఫ్రాంచైజీకి మారడం సాధారణమే అయినప్పటికీ.. ఏకంగా ముగ్గురు ఆటగాళ్ల కుండ మార్పిడి జరగడం సిత్రమే.కాగా, ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో మొత్తం 577 మంది ఆటగాళ్లు పాల్గొనగా ఆయా ఫ్రాంచైజీలు 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వీరిలో 62 మంది విదేశీ ఆటగాళ్లు కాగా.. మిగిలిన వారు దేశీయ ఆటగాళ్లు.వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డు నెలకొల్పాడు. పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్ల భారీ మొత్తం వెచ్చింది సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో కూడా ఇదే భారీ మొత్తం కావడం విశేషం. ఐపీఎల్ 2025 వేలంలో సెకెండ్ హైయ్యెస్ట్ పేమెంట్ శ్రేయస్ అయ్యర్‌కు దక్కింది. శ్రేయస్‌ను పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. వేలంలో మూడో అత్యధిక ధర వెంకటేశ్ అయ్యర్‌కు దక్కింది. వెంకటేశ్‌ను కేకేఆర్ 23.75 కోట్లకు కొనుగోలు చేసింది. -
ఐపీఎల్ కాంట్రాక్ట్ పట్టాడు.. మరుసటి రోజే..!
ఇంగ్లండ్ యువ ఆటగాడు జేకబ్ బేతెల్ ఈ మధ్యకాలంలో వరుసగా లక్కీ ఛాన్స్‌లు కొట్టేస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో టీ20, వన్డే అరంగేట్రం చేసిన బేతెల్.. నిన్ననే (నవంబర్ 25) ఐపీఎల్ కాంట్రాక్ట్ పట్టాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో బేతెల్‌ను ఆర్సీబీ 2.6 కోట్లకు సొంతం చేసుకున్నాడు. తాజాగా బేతెల్ మరో లక్కీ ఛాన్స్ కొట్టాడు. బేతెల్‌కు ఇంగ్లండ్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. ఈ నెల 28 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌లో బేతెల్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేస్తాడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చెప్పింది. వరుస అవకాశాల నేపథ్యంలో బేతెల్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. 21 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన బేతెల్‌కు దేశవాలీ క్రికెట్లో పెద్దగా ట్రాక్ రికార్డు లేనప్పటికీ వరుస అవకాశాలు వస్తున్నాయి. బేతెల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వార్విక్షైర్ తరఫున 20 మ్యాచ్‌లు ఆడి 25.44 సగటున 738 పరుగులు చేశాడు. 7 వికెట్లు తీశాడు. ఇటీవల జరిగిన హండ్రెడ్ లీగ్‌లో బేతెల్ బర్మింగ్హమ్ ఫీనిక్స్ తరఫున 7 మ్యాచ్‌లు ఆడి 165 పరుగులు చేశాడు. బేతెల్ ఇంగ్లండ్ తరఫున 8 వన్డేలు ఆడి హాఫ్ సెంచరీ సాయంతో 167 పరుగులు చేశాడు. 7 టీ20ల్లో 2 హాఫ్ సెంచరీ సాయంతో 173 పరుగులు చేశాడు. వన్డేల్లో బేతెల్ నాలుగు వికెట్లు తీశాడు.ఇంగ్లండ్ జట్టు ప్రకటనఈ నెల 28 నుంచి క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగబోయే తొలి టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ (నవంబర్ 26) ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో బేతెల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగనుండగా.. రెగ్యులర్‌గా ఆ స్థానంలో బ్యాటింగ్ చేసే ఓలీ పోప్ ఆరో స్థానానికి డిమోట్ అయ్యాడు. వికెట్‌కీపర్ జోర్డన్ కాక్స్ గాయపడటంతో పోప్ వికెట్‌కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఓపెనర్లుగా జాక్ క్రాలే, బెన్ డకెట్ రానుండగా.. బేతెల్ మూడో స్థానంలో, జో రూట్ నాలుగులో, హ్యారీ బ్రూక్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగనున్నారు. అనంతరం ఆరో స్థానంలో ఓలీ పోప్, ఆతర్వాత కెప్టెన్ బెన్ స్టోక్స్ బరిలోకి దిగనున్నారు.ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ ముగ్గురు పేసర్లను, స్పిన్నర్‌ను బరిలోకి దించనుంది. పేసర్లుగా క్రిస్ వోక్స్, గస్ట్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ బరిలోకి దిగనుండగా.. ఏకైక స్పిన్నర్‌గా షోయబ్ బషీర్ ఎంపికయ్యాడు.న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌కు ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: జాక్ క్రాలే, బెన్ డకెట్, జేకబ్ బేతెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, ఓలీ పోప్ (WK), బెన్ స్టోక్స్ (C), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ -
ఆర్సీబీ బ్యాటర్ ఊచకోత
అబుదాబీ టీ10 లీగ్‌లో ఆర్సీబీ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ రెచ్చిపోయాడు. ఈ టోర్నీలో బంగ్లా టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న లివింగ్‌స్టోన్.. ఢిల్లీ బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో అజేయమైన హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. లివింగ్‌స్టోన్ ఊచకోత కారణంగా బంగ్లా టైగర్స్.. ఢిల్లీ బుల్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. నిఖిల్ చౌదరీ 16 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి ఢిల్లీ గౌరవప్రదమైన స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఆడమ్ లిత్ (1), టామ్ బాంటన్ (8), టిమ్ డేవిడ్ (1), ఫేబియన్ అలెన్ (6) విఫలం కాగా.. జేమ్స్ విన్స్ (27), రోవ్‌మన్ పావెల్ (17), షాదాబ్ ఖాన్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లా టైగర్స్ బౌలర్లలో డేవిడ్ పేన్, జాషువ లిటిల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లా టైగర్స్.. లివింగ్‌స్టోన్ విధ్వంసం సృష్టించడంతో 9.4 ఓవర్లలోనే (3 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. లివింగ్‌స్టోన్‌తో పాటు దసున్ షనక (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్ (20 బంతుల్లో 24; ఫోర్, సిక్స్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో షాహిద్ ఇక్బాల్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అబుదాబీ టీ10 లీగ్ ప్రస్తుత ఎడిషన్‌లో బంగ్లా టైగర్స్‌కు ఇది తొలి విజయం. ప్రస్తుతం ఈ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. కాగా, నిన్న (నవంబర్ 25) ముగిసిన ఐపీఎల్ వేలంలో లివింగ్‌స్టోన్‌ను ఆర్సీబీ 8.75 కోట్లకు సొంతం చేసుకుంది. -
IPL 2025: ఆర్సీబీ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా..!
ఐపీఎల్ 2025 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఓంకార్ సాల్వి నియమితుడయ్యాడని తెలుస్తుంది. సాల్వి ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుత (2024-25) రంజీ సీజన్ ముగిసిన అనంతరం సాల్వి ఆర్సీబీ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడని సమాచారం.దేశవాలీ క్రికెట్లో సాల్వికి లో ప్రొఫైల్ మరియు ప్లేయర్ ఫేవరెట్ కోచ్‌గా పేరుంది. సాల్వికి ఐపీఎల్లో ఇది రెండో కమిట్మెంట్. గతంలో సాల్వి కోల్‌కతా నైట్‌రైడర్స్ అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు.కాగా, సాల్వి ఆథ్వర్యంలో ముంబై జట్టు 2023-24 రంజీ సీజన్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇది రంజీల్లో ముంబైకు 42వ టైటిల్. ఈ సీజన్ ఫైనల్లో ముంబై విదర్భపై 102 పరుగుల తేడాతో గెలుపొందింది. ముంబైకు ఎనిమిదేళ్ల తర్వాత లభించిన తొలి రంజీ టైటిల్ ఇది.సాల్వి హెడ్ కోచ్‌గా ఉండగా ముంబై ఈ ఏడాది ఇరానీ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది. ముంబై ఇరానీ కప్ గెలవడం 27 తర్వాత ఇది తొలిసారి. ఇరానీ కప్ ఫైనల్లో ముంబై రెస్ట్ ఆఫ్ ఇండియాపై గెలిచింది. ముంబై ఒకే సీజన్లో రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ గెలవడం చాలాకాలం తర్వాత ఇదే మొదలు.ఓంకార్ సాల్వి సోదరుడు ఆవిష్కార్ సాల్వి భారత్ మహిళల క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆవిష్కార్ సాల్వి హెడ్ కోచ్‌గా ఉండగా పంజాబ్ క్రికెట్ జట్టు గత సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కైవసం చేసుకుంది.ప్రస్తుతం 40ల్లో ఉన్న ఓంకార్ సాల్వి టీమిండియా తరఫున ఎప్పుడూ ఆడలేదు. సాల్వికి దేశవాలీ క్రికెట్లో కూడా అనుభవం తక్కువే. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సాల్వి కేవలం ఒకే ఒక మ్యాచ్ (2005లో రైల్వేస్ తరఫున) ఆడాడు. సాల్వి ఆథ్వర్యంలో ముంబై జట్టు ప్రస్తుత రంజీ సీజన్లో అద్బుత ప్రదర్శన చేస్తుంది. ఈ సీజన్లో ముంబై ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి ఎలైట్ గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. -
ఆర్సీబీ వదిలేసింది.. ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు..!
రంజీ ట్రోఫీలో భాగంగా ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ ఆటగాడు మహిపాల్ లోమ్రార్ అజేయ ట్రిపుల్ సెంచరీతో (360 బంతుల్లో 300; 25 ఫోర్లు, 13 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. రెండో రోజు టీ విరామం సమయానికి రాజస్థాన్ స్కోర్ 660/7గా ఉంది. లోమ్రార్‌తో పాటు కుక్నా అజయ్ సింగ్ (40) క్రీజ్‌లో ఉన్నాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో లోమ్రార్‌కు జతగా మరో ఆటగాడు సెంచరీ చేశాడు. కార్తీక్ శర్మ 115 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేశాడు. టెయిలెండర్లు భరత్ శర్మ 54, దీపక్ చాహర్ 35 పరుగులు చేయగా.. అభిజిత్ తోమర్ 20, రామ్మోహన్ చౌహాన్ 29, జుబైర్ అలీ ఖాన్ 26, దీపక్ హూడా 10 పరుగులు చేశాడు. ఉత్తరాఖండ్ బౌలర్లలో దీపక్ దాపోలా, స్వప్నిల్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అంకిత్ మనోర్, అభయ్ నేగి, అవనీశ్ సుధ తలో వికెట్ దక్కించుకున్నారు.ఆర్సీబీ వదిలేసింది.. ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు..!24 ఏళ్ల మహిపాల్ లోమ్రార్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇటీవల వదిలేసింది. 2025 ఐపీఎల్ సీజన్ కోసం ఆర్సీబీ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో లోమ్రార్‌కు చోటు దక్కలేదు. ఆర్సీబీ వదిలేసిందన్న కసితో చెలరేగిపోయిన లోమ్రార్ ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో లోమ్రార్ మరెన్ని పరుగులు చేస్తాడో వేచి చూడాలి. లోమ్రార్ ఆర్సీబీ వదిలేసిన నాటి నుంచి కసితో రగిలిపోతున్నాడు. తాజా ట్రిపుల్ సెంచరీకి ముందు మ్యాచ్‌లో లోమ్రార్ సెంచరీ చేశాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 111 పరుగులు చేశాడు. ఇదే రంజీ సీజన్లో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ లోమ్రార్ చెలరేగి ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతను ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. లోమ్రార్ అరివీర భయంకర ఫామ్‌ను చూసి ఆర్సీబీ అతన్ని తిరిగి దక్కించుకునే ప్రయత్నం చేస్తుందేమో వేచి చూడాలి. లోమ్రార్‌ను ఆర్సీబీ 2022 సీజన్లో 95 లక్షలకు దక్కించుకుంది. లోమ్రార్ 2018లో ఐపీఎల్ అరంగేట్రం చేసి వివిధ ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. -
ఆర్సీబీకి గుడ్ న్యూస్
మహిళల ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభవార్త. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లిస్ పెర్రీ మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతుంది. బీబీఎల్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతనిథ్యం వహించే పెర్రీ.. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో, బంతితో ఇరగదీసింది.డబ్యూబీబీఎల్ 2024 సీజన్లో పెర్రీ ఇప్పటివరకు చేసిన స్కోర్లు ఇలా ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో 39 బంతుల్లో 81 పరుగులు చేసి రెండు వికెట్లు తీసిన పెర్రీ.. రెండో మ్యాచ్‌లో 28 బంతుల్లో 54 పరుగులు చేసి రెండు వికెట్లు తీసింది. మూడో మ్యాచ్‌లో 25 బంతుల్లో అజేయమైన 31 పరుగులు చేసిన పెర్రీ.. ఓ వికెట్ పడగొట్టింది. నాలుగో మ్యాచ్‌లో 62 బంతుల్లో 86 పరుగులు చేసిన పెర్రీ.. తాజాగా జరిగిన ఐదో మ్యాచ్‌లో 44 బంతుల్లో అజేయమైన 48 పరుగులు చేసి ఓ వికెట్ తీసింది.ఓవరాల్‌గా పెర్రీ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 100 సగటున, 152.28 స్ట్రయిక్‌రేట్‌తో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 300 పరుగులు చేసింది. అలాగే ఆరు వికెట్లు తీసింది. మహిళల ఐపీఎల్ ప్రారంభానికి ముందు పెర్రీ సూపర్ ఫామ్ ఆర్సీబీకి శుభ శకునమని చెప్పాలి. పెర్రీ గత ఐపీఎల్ సీజన్లోనూ బ్యాట్‌తో పాటు బంతితోనూ ఇరగదీసింది. పెర్రీ 2024 సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్‌గా (9 మ్యాచ్‌ల్లో 347 పరుగులు) నిలిచి బౌలింగ్‌లో ఏడు వికెట్లు తీసింది. కాగా, మహిళల ఐపీఎల్ 2025 సీజన్ వచ్చే ఏడాది మార్చిలో జరుగనుంది. ఈ సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. లీగ్‌లోని ఐదు ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాలను వెల్లడించాయి. అలాగే తాము రిలీజ్ చేసిన పేర్లను కూడా ప్రకటించాయి.డబ్ల్యూపీఎల్ 2025 సీజన్ కోసం ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ప్లేయర్లు వీళ్లే..స్మృతి మంధన (కెప్టెన్), సబ్బినేని మేఘన, రిచా ఘోష్, ఎల్లిస్ పెర్రీ, జార్జియా వేర్హమ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, సోఫీ డివైన్, రేణుకా సింగ్, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిస్త్, కేట్ క్రాస్, కనిక అహుజా, డానీ వాట్ (యూపీ నుంచి ట్రేడింగ్)ఆర్సీబీ వదిలేసిన ప్లేయర్లు..దిషా కసత్, ఇంద్రాణి రాయ్, నదినే డి క్లెర్క్, శుభ సతీశ్, శ్రద్దా పోకార్కర్, సిమ్రన్ బహదూర్ -
14 మందిని రిటైన్ చేసుకున్న ఆర్సీబీ.. కెప్టెన్‌గా మళ్లీ..!
మహిళల ఐపీఎల్ 2025 సీజన్ వేలానికి ముందు ఐదు ఫ్రాంచైజీలు (ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్) తమ రిటెన్షన్ జాబితాలను ఇవాళ (నవంబర్ 7) ప్రకటించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ సైతం తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. వచ్చే సీజన్ కోసం ఆర్సీబీ 14 మంది ప్లేయర్లను రిటైన్ చేసుకుని ఆరుగురిని వేలానికి వదిలేసింది. వేలానికి వదిలేసిన వారిలో ఒక ఓవర్సీస్ ప్లేయర్ ఉన్నారు. ఓ జట్టుకు ఆరుగురు ఓవర్సీస్ ప్లేయర్ల రూల్ నేపథ్యంలో ఆర్సీబీ మేనేజ్మెంట్ సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ నదినే డి క్లెర్క్‌కు వేలానికి వదిలేసింది. డి క్లెర్క్ స్థానంలో ఆర్సీబీ గత నెలలో ఇంగ్లండ్ అటాకింగ్ బ్యాటర్ డ్యానీ వాట్‌ను యూపీ వారియర్జ్ నుంచి ట్రేడింగ్ చేసుకుంది. ముంబై యాజమాన్యం వాట్‌ను 30 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ విడుదల చేసిన మరో ఐదుగురు ప్లేయర్లు (దిషా కసత్, ఇంద్రాణి రాయ్, శుభ సతీశ్, శ్రద్దా పోకార్కర్, సిమ్రన్ బహదూర్) భారతీయ ప్లేయర్లే కావడం విశేషం.ఓవరాల్‌గా చూస్తే ఆర్సీబీ టైటిల్ విన్నింగ్ టీమ్‌ను దాదాపుగా కొనసాగించిందనే చెప్పాలి. ఆర్సీబీ మరో సీజన్‌కు స్మృతి మంధననే కెప్టెన్‌గా కొనసాగించింది. గత సీజన్లో ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఎల్లిస్ పెర్రీ, సోఫీ డివైన్, సోఫీ మోలినెక్స్ వచ్చే సీజన్లో కూడా కొనసాగనున్నారు. వీరితో పాటు దేశీయ స్టార్లు రిచా ఘోష్, రేణుక సింగ్ ఠాకూర్ ఆర్సీబీ యాజమాన్యం నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. రిటెన్షన్ల ప్రక్రియ అనంతరం ఆర్సీబీ పర్స్‌లో ఇంకా రూ. 3.25 కోట్ల బ్యాలెన్స్ మిగిలి ఉంది. ఈ మొత్తంతో ఆర్సీబీ మరో నలుగురు లోకల్ ప్లేయర్స్‌ను కొనుగోలు చేయవచ్చు. పేస్ బౌలింగ్ విభాగంలో రేణుకా సింగ్, ఎల్లిస్ పెర్రీ మాత్రమే ఉండటంతో ఈసారి వేలంలో ఆర్సీబీ మేనేజ్మెంట్ లోకల్ పేసర్లపై గురి పెట్టవచ్చు. డబ్ల్యూపీఎల్ రూల్స్ ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చన్న విషయం తెలిసిందే. ఇందులో ఆరుగురు విదేశీ ప్లేయర్స్‌కు అవకాశం ఉంటుంది. కాగా, తొలి సీజన్లో పేలవ ప్రదర్శన కనబర్చిన ఆర్సీబీ గత సీజన్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీళ్లే..స్మృతి మంధన (కెప్టెన్), సబ్బినేని మేఘన, రిచా ఘోష్, ఎల్లిస్ పెర్రీ, జార్జియా వేర్హమ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, సోఫీ డివైన్, రేణుకా సింగ్, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిస్త్, కేట్ క్రాస్, కనిక అహుజా, డానీ వాట్ (యూపీ నుంచి ట్రేడింగ్)ఆర్సీబీ వదిలేసిన ఆటగాళ్లు..దిషా కసత్, ఇంద్రాణి రాయ్, నదినే డి క్లెర్క్, శుభ సతీశ్, శ్రద్దా పోకార్కర్, సిమ్రన్ బహదూర్ -
IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లి..?
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా సమర్పణకు మరి కొద్ది గంటల సమయం (అక్టోబర్ 31 డెడ్‌లైన్) మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాళ్లను అట్టి పెట్టుకోనుందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఉంటుంది. రిటైన్ చేసుకునే క్యాప్డ్ ప్లేయర్లకు ఛాయిస్ ప్రకారం వరుసగా రూ. 18, 14, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, ఐదో ప్లేయర్‌ని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18, 14 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. రిటైన్ చేసుకునే అన్క్యాప్డ్ ప్లేయర్‌కు 4 కోట్లు పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది.ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లి..?రిటెన్షన్ లిస్ట్ సమర్పణ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్ల జాబితాను దాదాపుగా ఖరారు చేసుకున్నాయి. కొన్ని ఫ్రాంచైజీలు ఏకంగా కెప్టెన్లనే వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాయి. ఈ జాబితాలో ఆర్సీబీ కూడా ఉన్నట్లు సమాచారం. ఆర్సీబీ తమ కెప్టెన్ ఫాఫ్ డెప్లెసిస్కు వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. వయసు పైబడిన రిత్యా డుప్లెసిస్‌ను వేలానికి వదిలేయాలని ఆర్సీబీ భావిస్తుందట. ఈ క్రమంలో ఆర్సీబీ మేనేజ్మెంట్ మరోసారి విరాట్ వైపు చూస్తుందని సమాచారం. కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి చేపట్టేందుకు విరాట్ కూడా సుముఖంగా ఉన్నాడని తెలుస్తుంది. విరాట్ 2021 సీజన్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో 2022 సీజన్ నుంచి డుప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. -
కోచ్‌గా దినేశ్ కార్తీక్
టీమిండియా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఐపీఎల్లో కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. డీకే.. తన తాజా మాజీ జట్టైన ఆర్సీబీకి బ్యాటింగ్ కోచ్ కమ్ మెంటార్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విటర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. వచ్చే సీజన్ (2025) నుంచి డీకే కొత్త విధుల్లో చేరతాడని ఆర్సీబీ పేర్కొంది. "సరికొత్త అవతారంలో మరోసారి మాలో భాగమవుతున్న దినేష్ కార్తీక్‌కు స్వాగతం"అని ఆర్సీబీ ట్వీట్లో రాసుకొచ్చింది.39 ఏళ్ల డీకే.. ఈ ఏడాదే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో (2008, 2009, 2010, 2014) ఐపీఎల్ ప్రస్తానాన్ని ప్రారంభించిన కార్తీక్.. గత మూడు సీజన్లలో ఆర్సీబీకి (2024, 2023, 2022) ప్రాతినిథ్యం వహించాడు. ఈ మధ్యలో కార్తీక్.. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (2011), ముంబై ఇండియన్స్ (2012, 2013), ఆర్సీబీ (2015), గుజరాత్ లయన్స్ (2016, 2017), కేకేఆర్ (2018, 2019, 2020, 2021) ఫ్రాంచైజీలకు ఆడాడు.ఐపీఎల్ ఆరంభ ఎడిషన్ (2008) నుంచి ఆడిన అతి కొద్ది మంది క్రికెటర్లలో (ఏడుగురు) కార్తీక్ ఒకడు. ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, సాహా, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్ మాత్రమే ఇనాగురల్ ఎడిషన్ నుంచి ఐపీఎల్ ఆడారు. ఇప్పటివరకు జరిగిన 16 ఎడిషన్లలో పాల్గొన్న కార్తీక్ కేవలం రెండే రెండు మ్యాచ్‌లు మిస్ అయ్యాడు. ఐపీఎల్లో కార్తీక్‌కు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. డీకే.. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. డీకే, రోహిత్ శర్మ ఐపీఎల్లో 257 మ్యాచ్‌లు ఆడారు. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు ధోని (264) పేరిట ఉంది. డీకే తన ఐపీఎల్ కెరీర్లో 135.36 స్ట్రయిక్‌రేట్‌తో 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కార్తీక్ ఖాతాలో 145 క్యాచ్‌లు, 37 స్టంపింగ్‌లు ఉన్నాయి.Dinesh Karthik talking about RCB and he continues to be with this family. ❤️- RCB 🤝 DK...!!!! pic.twitter.com/TiHTs3yjaA— Tanuj Singh (@ImTanujSingh) July 1, 2024కార్తీక్ కెరీర్‌ను 2022 ఐపీఎల్ ఎడిషన్ మలుపు తప్పింది. ఆ సీజన్లో పేట్రేగిపోయిన కార్తీక్ మ్యాచ్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సీజన్ ప్రదర్శన కారణంగా అతనికి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. 2024 సీజన్లోనూ కార్తీక్ చెలరేగి ఆడాడు. ఈ సీజన్లో అతను 187.35 స్ట్రయిక్‌రేట్‌తో 326 పరుగులు చేశాడు. -
బ్యాట్ వదిలి బల్లెం పట్టిన డీకే
టీమిండియా మాజీ వికెట్‌కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ కొద్ది రోజుల కిందటే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికి వార్తల్లో నిలిచాడు. సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం డీకే క్రికెట్ ప్రపంచం మొత్తం నుంచి ఘనంగా సెడాంఫ్ను అందుకున్నాడు.క్రికెట్‌కు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి కమిట్మెంట్స్ లేకపోవడంతో సేద తీరుతున్న డీకే.. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో కలిసి జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. Neeraj Chopra trained Dinesh Karthik to be his partner at 2024 Olympics.#Neerajchopra #Dineshkarthik pic.twitter.com/zOLswEDjW8— scOut Op (@ScOutoppp69) May 29, 2024డీకే జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో బాగా వైరలవుతంది. ఈ వీడియోలో డీకే రెండు ప్రయత్నాల అనంతరం బల్లెంను విజయవంతంగా నిర్దేశిత ప్రాంతం ఆవలికి విసరగలిగాడు. లాస్ట్ ఛాన్స్ అని నీరజ్‌ను అడిగి మరీ జావెలిన్‌ను అందుకున్న డీకే.. ప్రొఫెషన్ అథ్లెట్‌లా రన్ అప్ తీసుకుని జావెలిన్‌ను సంధించాడు. మండే ఎండలో డీకే చేస్తున్న ప్రయత్నానికి ముగ్దుడైన నీరజ్.. నువ్వు చేయగలవు దినేష్ భాయ్ అంటూ ప్రోత్సహించాడు. నీరజ్ ప్రోత్సాహంతో జావెలిన్‌ను విసిరిన డీకే అనుకున్న లక్ష్యాన్ని అధిగమించి సక్సెస్ సాధించాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు డీకేను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నీ ప్రయత్నం అమోఘమని కొనియాడుతున్నారు. తెలీని క్రీడలోనూ సక్సెస్ సాధించావని కితాబునిస్తున్నారు. క్రికెట్లో మ్యాచ్ ఫినిషన్ ఇప్పుడు సక్సెస్ఫుల్ జావెలిన్ త్రోయర్ అంటూ కొనియాడుతున్నారు. మరికొందరేమో నీరజ్‌తో పాటు ఒలింపిక్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోమని సూచిస్తున్నారు. 38 ఏళ్ల డీకే 2004 నుంచి 2022 వరకు మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. డీకే ఐపీఎల్ స్టార్టింగ్ సీజన్ నుంచి తాజాగా ముగిసిన 2024 సీజన్ వరకు వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు.నీరజ్ చోప్రా విషయానికొస్తే.. 26 ఏళ్ల ఈ జావెలిన్ త్రోయర్ 2020 టోక్యో ఓలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించాడు. ఈ ఏడాది జులైలో జరిగే సమ్మర్ ఓలింపిక్స్లో నీరజ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. -
ఎలిమినేట్ అయ్యేదెవరో?
-
ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన సమంత పోస్ట్!
సినిమాలకు గ్యాప్ ఇచ్చినా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది సమంత. నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఫ్యాన్స్ అలరిస్తుంది. తన పర్సనల్ విషయాలను సైతం షేర్ చేసుకుంటుంది. తన పోస్టులతో అప్పుడప్పడు యువతకు ఓ మెసేజ్ కూడా అందిస్తుంది. అలాగే ఒక్కోసారి చిలిపి పోస్ట్‌లు కూడా పెడుతూ.. ఫ్యాన్స్‌ని అయోమయంలో పడేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ పెట్టిన పోస్ట్ ఒకటి ఇటు సామ్ అభిమానులతో పాటు అటు క్రికెట్ లవర్స్‌ని కన్ఫ్యూజన్లో పడేసింది. సమంత పెట్టిన పోస్ట్ ఏంటి?ఐపీఎల్ 2024 క్లైమాక్స్‌కి చేరిన సంగతి తెలిసిందే. మంగళవారం నుంచే ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ప్రారంభం అయ్యాయి. క్యాలిఫయిర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించి ఫైనల్‌కి చేరుకుంది. సన్ రైజర్స్ ఫైనల్‌కు చేరాలంటే.. క్వాలిఫయిర్ 2 తప్పక గెలవాల్సి ఉంటుంది. దీని కంటే ముందు నేడు(మే 22) రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ బెర్త్ కోసం సన్‌రైజర్స్‌లో పోటీ పడాల్సి ఉంటుంది.(చదవండి: ‘కల్కి’ ప్రమోషన్స్‌కి అన్ని కోట్లా..? ఓ పెద్ద సినిమానే తీయొచ్చు!)ఇలా ఐపీఎల్ ఆట చాలా ఆసక్తికరంగా సాగుతున్న వేళ సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 'మీరు విజయం సాధిస్తే చూడాలని ఉంది' ఓ పోస్ట్ పెట్టింది. 'మీ హృదయం ఏది కోరుకున్నా, మీరు ఎలాంటి ఆకాంక్షలు కలిగి ఉన్నా, నేను మీ కోసం మద్దతు ఇస్తాను. మీరు విజయానికి అర్హులు’ అంటూ ఆ పోస్ట్ కింద రాసుకొచ్చింది. దీంతో సమంత ఆర్సీబీ మద్దతుగా ఈ పోస్ట్ పెట్టిందని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఎస్ఆర్హెచ్కు సపోర్ట్ చేస్తూ ఈ పోస్ట్ చేసిందని కామెంట్ చేస్తున్నారు. సామ్ పోస్ట్‌ని షేర్ చేస్తూ మాకంటే మాకు సపోర్ట్ చేస్తుందంటూ ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గొడవపడుతున్నారు. ఇంకొంత మంది నెటిజన్స్ అయితే ఇది క్రికెట్‌కు సంబంధించినది కాదని, తన అభిమానుల కోసమే అలా రాసుకొచ్చిందని అంటున్నారు. సమంత సందిస్తే తప్ప ఆ పోస్ట్ అర్థం ఏంటి? ఎవరునుద్దేశించి చేశారనే విషయాలు తెలియవు. మరి సామ్ క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
RCBని ధోని అవమానించాడా..? ధోనినే ఆర్సీబీ అవమానించిందా..?
-
"సాధించాం” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క..
-
Play Offs లోకి ఆర్సిబీ
-
RCB vs CSK: ప్లే ఆఫ్స్ బెర్తుకై చావో రేవో
-
చిన్నస్వామిలో కురిసేది సిక్సర్ల వర్షమే.. CSKకి ఇక కష్టమే..
-
RCB vs DC: మరో కీలక మ్యాచ్
-
కోహ్లి విజృంభణ.. పంజాబ్‌పై ఆర్సీబీ గెలుపు