aravind Kejriwal
-
పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్?.. భగవంత్ మాన్ క్లారిటీ
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఓటమి పాలయినప్పటి నుంచి ఆయన భవిష్యత్ కార్యాచరణపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కేజ్రీవాల్ త్వరలోనే పంజాబ్ సీఎం కానున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. తాజాగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ ఈ ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చారు.ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ భవిష్యత్ పంజాబ్ సీఎం కానున్నారనే వార్తలకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ చెక్ పెట్టారు. ఇవన్నీ ఊహాగానాలేనని, కేవలం నిరాధార వార్తలేనని, వాటిలో ఎటువంటి నిజం లేదని కొట్టిపడేశారు. ఫిబ్రవరి 8న వెల్లడైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 స్థానాలు దక్కించుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. కాంగ్రెస్ కనీసం ఒక్క సీటును కూడా గెలుచుకోకపోవడం విశేషం. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఢిల్లీలో 27 ఏళ్ల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌తో పాటు ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా కూడా ఓటమిపాలయ్యారు. ఈ నేపధ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ చేత రాజీనామా చేయించి, ఆ రాష్ట్రానికి సీఎం అవుతారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఇది కూడా చదవండి: Wi-Fi.. Slow?.. ఈ ట్రిక్‌తో పరుగు ఖాయం -
కేజ్రీవాల్ ఓటమి
-
బీజేపీపై నిఘాకు కెమెరాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి ఈ నెల 5న జరిగే ఎన్నికల సమయంలో బీజేపీ అక్రమాలకు పాల్పడితే రికార్డు చేసేందుకు వీలుగా స్పై, బాడీ కెమెరాలను మురికివాడల్లోని ప్రజలకు అందజేసినట్లు ఆప్ చీఫ్ కేజ్రీవాల్ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో ఆప్ చారిత్రక విజయం సాధించబోతోందన్నారు. బీజేపీ ఘోర పరాజయం తప్పదన్నారు. ఇది తెలిసే ఆ పార్టీ అనుచిత చర్యలకు దిగుతోందని విమర్శించారు. బీజేపీ గూండాల అక్రమాలను రికార్డు చేసేందుకు మురికివాడల్లోని ప్రజలకు నిఘా కెమెరాలను అందించినట్లు చెప్పారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని పోలీసులకు పట్టించేందుకు వీలుగా సమాచారం అందిన 15 నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకునేలా క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. స్లమ్ ఏరియాల్లోని ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోకుండా చేసే ఉద్దేశంతో వారి వేలికి నల్ల సిరా పూసి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని తెలిపారు. బీజేపీ వాళ్ల నుంచి డబ్బులైతే తీసుకోండి, కానీ, వేలికి సిరా పూయనివ్వకండని ఓటర్లను కేజ్రీవాల్ కోరారు. -
ఢిల్లీ ఎన్నికల వేళ ఆమ్ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ
-
ఢిల్లీ ప్రజలకు ఆప్ మరో 15 గ్యారంటీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా ఎనిమిది రోజులే మిగిలిఉన్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు మరో 15 గ్యారంటీలను ప్రకటించింది. మధ్యతరగతి ప్రజల కోసం ఇప్పటికే ఒక మేనిఫెస్టోను విడుదలచేసిన ఆప్ సోమవారం మరో అదనపు మేనిఫెస్టోను విడుదలచేసింది. యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం, మెట్రో ఛార్జీలో 50 శాతం రాయితీ వంటి పలు హామీలను ఇందులో చేర్చింది. ఆప్ సీనియర్ మహిళా నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశి, మనీశ్ సిసోడియా తదితరుల సమక్షంలో పార్టీ జాతీయ కన్వినర్ కేజ్రీవాల్ రెండో మేనిఫెస్టోను సోమవారం ‘కేజ్రీవాల్ గ్యారంటీ’పేరిట విడుదల చేశారు. ‘‘బీజేపీ నేతలు హామీలు ఇస్తారు కానీ అమలు చేయరు. మేం మాత్రం ఇచ్చిన హామీలన్నీ ఐదేళ్లలోపు కచ్చి-తంగా అమలు చేస్తాం. ఢిల్లీలో ప్రత్యర్థి పార్టీలు అధికారంలోకి వస్తే ఢిల్లీ వాసులపై ఆర్థిక భారం తప్పదు’’అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ 15 గ్యారంటీలు ఇవే.. → వచ్చే ఐదేళ్లలో ప్రతి యువకుడికి ఉపాధి → మహిళా సమ్మాన్ యోజన క్రింద ప్రతి మహిళకు నేరుగా బ్యాంకు ఖాతాకే రూ.2,100 నగదు జమ → సంజీవని యోజన కింద 60 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స → తప్పుడు నీటి బిల్లుల మాఫీ → 24 గంటలు తాగు నీటి సరఫరా → యూరప్తరహాలో ప్రపంచ స్థాయి రోడ్లు → యమునా నదిని శుభ్రం చేయడం → డాక్టర్ అంబేడ్కర్ స్కాలర్షిప్ పథకం → విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం, ఢిల్లీ మెట్రోలో 50 శాతం రాయితీ → పూజారి–గ్రంథి సమ్మాన్ యోజన కింద హిందూ ఆలయాల్లో అర్చకులు, గురుద్వారాల్లో గ్రంథీలకు జీతభత్యాల కింద ఒక్కొక్కరికి రూ.18 వేలు → సొంతిళ్లవారితోపాటే అద్దెకు ఉంటున్న వారికీ ఉచిత విద్యుత్, నీరు → మురుగు నీటిపైపులైన్ల మరమ్మతు, ముగునీటి వ్యవస్థలను మెరుగుపరచటం → అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డుల జారీ → ఆటో, టాక్సీ, ఇ–రిక్షా డ్రైవర్లకు జీవిత బీమా, వారి కుమార్తెల వివాహానికి రూ.లక్ష సాయం, పిల్లలకు ఉచిత కోచింగ్ → రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్‌కు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు -
అద్దెదార్ల ఓట్లపై పార్టీల వల
దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి మూడు కుటుంబాల్లో ఒక కుటుంబం అద్దె ఇంట్లోనే నివసిస్తోంది. మొత్తం ఓటర్లలో అద్దెదార్ల వాటా తక్కువేమీ కాదు. అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించిగల స్థాయిలో ఉన్న ఈ ఓటర్లపై ప్రధాన రాజకీయ పార్టీలు వల విసురుతున్నాయి. వారి ఓట్లపై గురిపెడుతూ హామీల వర్షం కురిపిస్తున్నాయి. అద్దెదార్ల ఓట్లు గంపగుత్తగా పడితే ఎన్నికల్లో గెలుపునకు ఢోకా ఉండదని భావిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే పలు హామీలు ఇచ్చారు. అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారికి ఉచితంగా నీరు, విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. తమ పార్టీని మళ్లీ గెలిపిస్తే వారి సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు. → ఢిల్లీ నివాసితుల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. నగరంలో 66.6 శాతం మంది సొంత ఇళ్లల్లో నివసిస్తుండగా, 32.4 శాతం మంది కిరాయి ఇళ్లల్లోనే బతుకులీడుస్తున్నారు. → అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారిలో 51.9 శాతం మంది న్యూఢిల్లీ జిల్లాలోనే ఉండగా, 41.9 శాతం మంది సౌత్ఈస్ట్ జిల్లాలో ఉన్నారు. → న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో 62.7 శాతం మంది, ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో 46.9 శాతం మంది అద్దెదార్లు ఉన్నారు. → ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఢిల్లీకి ప్రజలు వలస వస్తున్నారు. ప్రధానంగా పూర్వాంచల్‌గా పిలిచే ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్ వాసులు దేశ రాజధాని గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. చిన్నచిన్న ఉద్యోగాలు, కూలీ పనులు చేసుకొనే పూర్వాంచల్ ప్రజల్లో ఎక్కువ మంది అద్దె ఇళ్లల్లోనే నివసిస్తున్నారు. → ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు బీజేపీ, కాంగ్రెస్ సైతం అద్దెదార్ల ఓటర్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. → తాము అధికారంలోకి వస్తే పూర్వాంచల్ ప్రజల అభ్యున్నతి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. → ఆమ్ ఆద్మీ సర్కారు పాలనలో అద్దెదార్లు నిర్లక్ష్యానికి గురయ్యారని, తమ పార్టీ అధికారంలోకి వస్తే వారి సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు తీసుకొస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హస్తినలో ఆప్, బీజేపీ హోరాహోరీ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల సమరం రసకందాయంలో పడింది. కమలం పార్టీ అక్కడ 26 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఏడు సీట్లనూ గెలుస్తూ వస్తున్నా అసెంబ్లీ బరిలో మాత్రం పట్టు చిక్కడమే లేదు. ఈసారి ఎలాగైనా హస్తిన గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు పరివర్తన్ (మార్పు) నినాదాన్ని నమ్ముకుంటోంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీపై అవినీతి ఆరోపణలు ఎక్కుపెడుతూ ఓటర్లకు చేరువ కావడానికి ప్రయత్నిస్తోంది. అవినీతిరహిత పాలన కోసం తమనే గెలిపించాలని బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆప్ అంటే ఆపద అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా అధికార పార్టీపై ఇప్పటికే యుద్ధ భేరీ మోగించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 53.6 శాతం ఓట్లతో 62 సీట్లు కొల్లగొట్టగా బీజేపీ 39 శాతం ఓట్లతో 8 సీట్లకు పరిమితమైంది. ఇక కాంగ్రెస్ సోదిలో కూడా లేకుండాపోయింది. కేవలం 4.3 శాతం ఓట్లకు పరిమితమైంది. సీట్ల ఖాతాయే తెరవలేక కుదేలైంది.ద్విముఖమే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్యే ద్విముఖ పోరు సాగుతోంది. రెండు పార్టీలు నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి. వాటితో పాటు కాంగ్రెస్ కూడా మొత్తం 70 సీట్లలోనూ బరిలో ఉన్నా దాని పోటీ నామమాత్రమే. ఆ పార్టీ 2013లో ఢిల్లీలో అధికారం కోల్పోయింది. ఈసారి బీజేపీ, ఆప్‌లతోపాటు పోటీపడి మరీ హామీలిచ్చినా కాంగ్రెస్‌కు అవి కలిసొచ్చేది అనుమానమే. న్యూఢిల్లీ నియోజకవర్గంలో మాజీ సీఎం కేజ్రీవాల్‌పై ఇద్దరు మాజీ సీఎంల కుమారులు బరిలో ఉండటం విశేషం. బీజేపీ నుంచి మాజీ సీఎం సాహిబ్‌సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్ బరిలోకి దిగారు. ఈసారి తమకు విజయావకాశాలు అధికంగా ఉన్నాయని బీజేపీ నేతలంటున్నారు. కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలు, జనం సొమ్ముతో అద్దాల మేడ కట్టుకోవడం, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో ఆప్ నేతల భాగస్వామ్యం, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తమకు లాభిస్తాయని అంటున్నారు. ఆప్ నేతలు సైతం ఈ ఎన్నికల్లో తమకు విజయం సులభం కాదని అంగీకరిస్తున్నారు. అయితే కేజ్రీవా ల్కు జనాదరణ, విశ్వసనీ యత, సంక్షేమ పథకాల సక్రమ అమలు, కొత్త హామీలు గట్టెక్కిస్తాయని ఆశిస్తున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.– సాక్షి నేషనల్ డెస్క్ -
న్యూఢిల్లీ నుంచి మాత్రమే పోటీ చేస్తా
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానం నుంచి పోటీ చేస్తానని ఆప్ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఓటమి భయంతో తాను న్యూఢిల్లీతోపాటు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై గురువారం మీడియా సమావేశంలో స్పందించారు. గత ఎన్నికల్లో పోటీ చేసినట్లే వచ్చే ఎన్నికల్లో కూడా న్యూఢిల్లీ సీటు నుంచి మాత్రమే మళ్లీ ఉంటానన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రతిపక్ష ఇండియా కూటమితో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈసారి పోటీ ఆప్, బీజేపీల మధ్యే ప్రధానంగా ఉండనుందన్నారు. కేజ్రీవాల్‌కు ఈ దఫా ఓటమి తప్పదు, అందుకే మరో చోటు నుంచి పోటీ చేస్తారంటూ బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ‘ఎక్స్’లో చేసిన వ్యాఖ్యలకు పైవిధంగా బదులిచ్చారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ బీజేపీ నుంచి, మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేస్తుండటం తెలిసిందే. -
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ–కాంగ్రెస్ పొత్తు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ–కాంగ్రెస్‌లు తమ మధ్య పొత్తు ఉందనే విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఆప్ లక్ష్యంగా ఈ రెండు పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ కేజ్రీవాల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. కొందరు మీడియా వ్యక్తులు మినహా మరెవరూ కాంగ్రెస్‌ను సీరియస్‌గా తీసుకోవడం మానేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలు రెండు తెరవెనుక మైత్రిని సాగిస్తున్నాయని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆరోపించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్, ఆప్‌ల మధ్య హరియాణా అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తు పొసగలేదు. అప్పటి నుంచి రెండు పార్టీల నేతలు కత్తులు దూసుకుంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ కేజ్రీవాల్‌ను జాతి వ్యతిరేకి అంటూ విమర్శించడం..ప్రతిగా కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీని ఇండియా కూట మి నుంచి బయటకు పంపించేయాలని ఇతర పార్టీలను కోరుతాననే దాకా వెళ్లింది. శనివారం ఫిరోజ్‌షా మార్గంలోని తన నివాసం ఎదుట పంజాబ్‌కు చెందిన మహిళలు నిరసనకు దిగడంపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘వీరు పంజాబ్ మహిళలు కారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన వారు. పంజాబ్ మహిళలకు ఆప్‌పై నమ్మకముంది. వాళ్లు మమ్మల్ని విశ్వసించారు’అని చెప్పారు. బీజేపీకి ఒక ఎజెండా లేదు. ముఖ్యమంత్రి అభ్యర్థే లేరు. నాపై విమర్శలు చేయడం ద్వారానే బీజేపీ నేతలు ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు’ అని దుయ్యబట్టారు. -
నేను అద్దాల మేడ కట్టుకోలేదు
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘నేను అద్దాల మేడ(శీష్ మహల్) కట్టుకోలేదు. కానీ, పదేళ్లలో నాలుగు కోట్ల మందిపైగా పేదల సొంతింటి కల నెరవేర్చాను. వారికి ఇళ్లు నిర్మించి ఇచ్చాను’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తన కోసం విలాసవంతమైనæభవనం కాకుండా పేదలకు శాశ్వత నివాసం ఉండాలన్నదే తన స్వప్నం అని వివరించారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ కేజ్రీవాల్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అశోక్ విహార్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం నిర్మించిన 1,675 ఇళ్లను ప్రారంభించారు. లబ్దిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. వారితో ముచ్చటించారు. నౌరోజీ నగర్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్, సరోజినీ నగర్లో జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ (జీపీఆర్ఏ)టైప్–2 క్వార్టర్స్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ద్వారకలో రూ.300 కోట్లతో నిర్మించిన సీబీఎస్ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఢిల్లీ యూనివర్సిటీలో రూ.600 కోట్ల విలువైన మూడు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్)పై నిప్పులు చెరిగారు. అది ఆప్ కాదు, ఆపద అంటూ మండిపడ్డారు. ప్రధానమంత్రి ఏం మాట్లాడారంటే... ఢిల్లీని ఆపదలో పడేశారు ‘‘మోదీ ఎప్పుడూ తన కోసం ఇల్లు నిర్మించుకోలేదన్న విషయం దేశానికి తెలుసు. గడచిన పదేళ్లలో నాలుగు కోట్ల కంటే ఎక్కువగా ఇళ్లు నిర్మించి పేదల కలను సాకారం చేశాం. నేను కూడా శీష్ మహల్(అద్దాల మేడ) నిర్మించుకొనేవాడినే. కానీ, అది నాకు ఇష్టం లేదు. నా దేశ ప్రజలకు పక్కా ఇళ్లు ఉండాలన్నదే నా కల. కొందరు వ్యక్తులు(కేజ్రీవాల్) అబద్ధపు ప్రమాణాలు చేసి ప్రజల సొమ్ముతో అద్దాల మేడలు నిర్మించుకున్నారు. గత పదేళ్లలో ఢిల్లీ పెద్ద ఆపదలో పడిపోయింది. అన్నా హజారేను ముందు పెట్టి పోరాటాలు చేసిన కొందరు కరడుగట్టిన అవినీతిపరులు ఢిల్లీని ఆపదలో పడేశారు. మద్యం, పాఠశాలలు, వైద్య చికిత్స, కాలుష్య నియంత్రణ, ఉద్యోగ నియామకాల్లో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. వీళ్లా ఢిల్లీ అభివృద్ధి గురించి మాట్లాడేది? ముంచుకొచ్చిన ఆపదకు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజలు యుద్ధం చేయాలి. ఆపద నుంచి విముక్తి పొందాలని ఢిల్లీ ప్రజలు సంకల్పించారు. ఆదపను సహించం.. మార్చి చూపిస్తాం అని ఢిల్లీలోని ప్రతి గల్లీలో ప్రతి ఒక్కరూ అంటున్నారు. యమునా నది శుద్ధి చేస్తే ఓట్లు పడవని అంటున్నారు. ఓట్ల కోసం యమునను వదిలేస్తామా? యమునను శుద్ధి చేయకపోతే ఢిల్లీ ప్రజలకు తాగునీరు ఎలా వస్తుంది? అవినీతిపరుల కారణంగా ప్రజలకు కలుషితమైన నీరు అందుతోంది. ఈ ఆపద తెచ్చిపెట్టిన వ్యక్తులు ఢిల్లీ ప్రజల జీవితాలను వాటర్ ట్యాంకర్ల మాఫియాకు వదిలేశారు. ఈ ఆపద ఇలాగే కొనసాగితే మరిన్ని కష్టాలు తప్పవు. ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకుండా వాళ్లు అడ్డుకుంటున్నారు. ఈ ప«థకం కింద ప్రజలకు ప్రయోజనం అందకపోవడానికి కారణం ఆ వ్యక్తులే. ప్రజల జీవితాల కంటే తమ స్వార్థం, విజయం, అహంకారమే ప్రధానంగా భావిస్తున్నారు. జాతీయ పథకాల ప్రయోజనాలు ఢిల్లీ ప్రజలకు చేరేలా చేయడమే మా లక్ష్యం. ఆపద నుంచి తప్పించుకోవాంటే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. -
ఓటర్ జాబితా తారుమారుకు బీజేపీ కుట్ర: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ జాబితాను తారుమారు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆరోపించారు. ‘‘ఢిల్లీలో ఒక్క అసెంబ్లీ స్థానంలోనే 11 వేల ఓట్లను తొలగించాలంటూ ఈసీకి బీజేపీ దరఖాస్తులు చేసింది. నేను పోటీ చేసే న్యూఢిల్లీ స్థానంలోనూ 12,500 పేర్లను తొలగించాలంటూ దరఖాస్తు చేసింది. మేం ఈసీ దృష్టికి తీసుకెళ్లడం వల్ల పేర్ల తొలగింపు ఆగిపోయింది’’ అని వివరించారు. బీజేపీ ఆటలను సాగనివ్వబోమన్నారు. -
ఓట్లను తొలగిస్తున్నారు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ కుట్రపూరితంగా ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగిస్తోందని అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఆప్ ప్రతినిధి బృందం బుధవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దళితులు, ఎస్పీలు, పూర్వాంచల్‌కు చెందిన బలహీనవర్గాల ఓట్లను బీజేపీ పనిగట్టుకొని తొలగించేలా చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ‘భారత పౌరులుగా ప్రజలకు ఉన్న ఓటు హక్కును బీజేపీ లాగేసుకుంటోంది. ఓటర్లను తొలగించడానికి బీజేపీ కార్యకర్తలకు దరఖాస్తు ఫారాలను అందించింది. చాలా నియోజకవర్గాల్లో ఇది జరుగుతోంది’ అని కేజ్రీవాల్ అన్నారు. భారత పౌరులుగా ప్రజలకున్న హక్కులను బీజేపీ లాగేస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో చాలా నియోజకవర్గాల్లో ఈ విధంగా ఓట్లను తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్ల తొలగింపునకు సంబంధించి ఈసీకి మూడు వేల పేజీల ఆధారాలను సమర్పించామని కేజ్రీవాల్ తెలిపారు. భారీస్థాయిలో ఓట్ల తొలగింపు జరుగుతోందన్నారు. దీన్ని అడ్డుకోవాలని, ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. షాహ్దారా నియోజకవర్గంలో ఒక బీజేపీ నాయకుడు ఏకంగా 11,008 ఓట్లను తొలగించాలని ఈసీకి ఒక జాబితాను సమర్పించారని, ఈసీ రహస్యంగా వీటిని తొలగించే పనిలో ఉందని ఆరోపించారు. పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు ఉండదని ఈసీ తమకు హామీ ఇచ్చిందని వెల్లడించారు. ఇప్పటివరకు తొలగించిన ఓట్లపై దృష్టి పెడతామని, బూత్‌స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని తెలిపిందన్నారు. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
కేజ్రీవాల్ చేతిలో మొహల్లా బస్సుల బ్రహ్మాస్త్రం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఈ విషయంలో అధికారంలో ఉన్న ఆప్ మరోమారు అధికారం సొంతం చేసుకునేందుకు తన దగ్గరున్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. వాటిలో ఒకటే ‘మొహల్లా’.. మొహల్లా క్లీనిక్‌ల తరువాత మొహల్లా బస్సులను రాబోయే ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ భావిస్తున్నారు.మొహల్లా క్లినిక్‌లకు అమితమైన ఆదరణకేజ్రీవాల్ సారధ్యంలో ఢిల్లీలో ఏర్పాటైన 300కు పైగా మొహల్లా క్లినిక్‌లు అమితమైన ప్రజాదరణ పొందాయి. 1.6 కోట్ల మంది మొహల్లా క్లీనిక్‌ల ద్వారా ఉచితంగా ఆరోగ్య సేవలను అందుకున్నారు. ఇప్పుడు త్వరలోనే ఢిల్లీ రోడ్లపైకి ఎక్కనున్న మొహల్లా బస్సులు రవాణా రంగంలో మరో విప్లవానికి నాంది పలకబోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మొహల్లా బస్సులు బ్రహ్మాస్త్రంగా మారనున్నాయనే మాట కూడా వినిపిస్తోందిమహిళల భద్రతే ధ్యేయంగా..మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని మొహల్లా బస్సులను విరివిగా అందుబాటులోకి తీసుకురావాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. శాంతిభద్రతల అంశాన్ని ఎన్నికల్లో ఆయుధంగా మలచుకునే ఉద్దేశంలోనే అరవింద్ కేజ్రీవాల్ మొహల్లా బస్సులను తీసుకువస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఢిల్లీలో ప్రతిరోజు మూడు అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఢిల్లీ ఎంత అభద్రతలో ఉందో తెలియజేస్తుంది. కార్యాలయాల్లో పనిచేసే మహిళలు సురక్షితంగా ఇంటికి చేరుకుంటామో లేదో అనే అభద్రతా భావంతో ఉంటున్నారు. ఈ నేపధ్యంలో వారి కోసం మొహల్లా బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం ఎప్పటి నుంచో యోచిస్తోంది. గల్లీల్లోనూ సులభంగా తిరిగేలా..మొహల్లా బస్సులు 9 మీటర్ల పొడవు కలిగివుంటాయి. ఇవి చిన్నపాటి గల్లీల్లోనూ సులభంగా కదిలే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కేజ్రీవాల్-అతిషి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా మొహల్లా బస్సుల కోసం ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నేపధ్యంలో మరో రెండు వారాల్లో ఢిల్లీ రోడ్లపై మొహల్లా బస్సులు పరుగులు పెట్టనున్నాయి. ఈ బస్సులో 23 సీట్లు ఉండనున్నాయి. అలాగే 13 మంది నిలుచునేందుకు అవకాశం ఉంటుంది. మొత్తంగా 36 మంది ప్రయాణికులు ఈ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఈ బస్సుల్లో ఆరు సీట్లు మహిళలకు కేటాయించారు.రాత్రి 10 గంటల వరకూ అందుబాటులో..తొలిదశలో 140 మొహల్లా బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ బస్సులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు.. మొత్తం 16 గంటల్లో 12 ట్రిప్పులు తిరుగుతాయి. ఈ విధంగా ఒక్కరోజులో లక్షా 20 వేల 960 మంది ప్రయాణికులు ఒక రోజులో ప్రయాణించవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మొహల్లా బస్సులు ప్రారంభం కావడం విశేషం. మొహల్లా బస్సుల వినియోగం ఢిల్లీ రవాణా రంగంలో ఒక మైలురాయిగా మారనుందనే మాట వినిపిస్తోంది. మొహల్లా బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు. ఫలితంగా వీటి నుంచి కాలుష్యం ఏర్పడదు. ఇది కూడా చదవండి: మరోమారు తెరపైకి అమృత్సర్.. -
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: వారికే ‘ఆప్’ టిక్కెట్లు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశంలోని మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో నేడు (బుధవారం) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇదే తరుణంలో ఢిల్లీలోనూ అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలయ్యింది. 2025 ఫిబ్రవరిలో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, బీజేపీతో సహా వివిధ పార్టీలు ఇప్పటికే తమ సన్నాహాలు మొదలుపెట్టాయి.తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెవరికి టిక్కెట్లు ఇవ్వాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీలోని నేతల పనితీరు, విజయావకాశాలను పరిగణలోకి తీసుకుని వారికి టిక్కెట్లు కేటాయించనున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. బంధువులు, పరిచయస్తులు, స్నేహితులు అనే భావనతో ఎవరికీ టిక్కెట్లు కేటాయించేది లేదని ఆయన స్పష్టం చేశారు.అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని కేజ్రీవాల్ ఈ సమావేశంలో పేర్కొన్నారు. తమ పార్టీ సత్య మార్గాన్ని అనుసరించిందని, పార్టీకి దేవునితో పాటు ప్రజల ఆశీస్సులు ఉన్నాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: UP By Election 2024: సెమీ ఫైనల్లో యూపీ ఓటర్లు ఎటువైపు? -
కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర: ఆప్
న్యూఢిల్లీ: తమ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపించింది. జరగరానిదేదైనా ఆయనకు జరిగితే బీజేపీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురిలో ప్రచార పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్‌పై శుక్రవారం బీజేపీ గూండాలు దాడికి దిగారని పేర్కొంది. ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ శనివారం మీడియాతో మాట్లాడారు. ‘దాడి ఘటనపై పోలీసుల వైఖరిని బట్టి చూస్తే దీని వెనుక కేజ్రీవాల్‌ను చంపేందుకు పెద్ద కుట్రే ఉందని స్పష్టమవుతోంది. ఆయనకు బీజేపీ శత్రువుగా మారింది’అని పేర్కొన్నారు. ఆయనకు హాని తలపెట్టాలనుకుంటే ప్రజలు ఊరుకోరన్నారు. ఇటువంటి వాటికి కేజ్రీవాల్ వెనుకడుగు వేయర న్నారు. వికాస్పురిలో ముందుగా ప్రకటించిన విధంగానే కేజ్రీవాల్ పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌పై మొదటిగా దాడి చేసింది బీజేపీ ఢిల్లీ యువ మోర్చా ఉపాధ్యక్షుడు కాగా, రెండో వ్యక్తి ఢిల్లీ యువ మోర్చా ప్రధాన కార్యదర్శి అని ఆప్కే చెందిన ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. దాడి అనంతరం వీరిద్దరూ అక్కడ డ్యాన్స్ చేశారన్నారు. ఘటనపై చట్ట పరంగా ముందుకెళ్లే విషయమై నిపుణుల సలహాలను తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. అటువంటిదేమీ జరగలేదంది. -
నేను ఎందుకు అరెస్ట్ అయ్యానో మీకు తెలుసా?: కేజ్రీవాల్
ఢిల్లీ : మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. మేం అందిస్తున్న ప్రజా సంక్షేమాన్ని అడ్డుకునేందుకే తనని అరెస్ట్ చేయించిందని మండిపడ్డారు.వచ్చేడాది ప్రారంభంలో ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 'జన్ సంపర్క్' పేరిట కేజ్రీవాల్ తన ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో తమ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమాన్ని అడ్డుకునేందుకు బీజేపీ పన్నిన రాజకీయ కుట్రలో భాగంగా తన అరెస్ట్ జరిగిందన్నారు. పనిలో పనిగా తన అరెస్ట్,ఐదునెలల జైలు జీవితంపై గురించి ప్రజల్లోకి వెళ్లేలా ఓ లేఖను సిద్ధం చేసినట్లు చెప్పారు. ‘నేను ఒక లేఖను సిద్ధం చేశాను. మా కార్యకర్తలు ఆ లేఖతో ఢిల్లీలో ప్రతి ఇంటికీ వెళతారు. నన్ను ఎందుకు అరెస్టు చేశారనేది ఈ లేఖ చెబుతుంది. కొందరు చెప్పినట్లు అవినీతి వల్ల కాదు, ఢిల్లీ ప్రజల కోసం మేము చేస్తున్న పనిని ఆపడానికి’ బీజేపీ చేసిన ప్రయత్నమేనని అన్నారు.ఆప్ కార్యకర్తలు ఈ లేఖతో ఢిల్లీ అంతటా ఇంటింటా ప్రచారం చేస్తారు. తన ఐదు నెలల జైలు జీవితం వెనుక అసలైన కారణాల్ని వివరించి వారికి లేఖను అందిస్తాం. మరోసారి ఆప్ కొనసాగేలా ఓటర్లను కోరనున్నట్లు తెలిపారు. ఈ ప్రచారం అక్టోబర్ 29 వరకు కొనసాగుతుందని చెప్పారు. ఢిల్లీలో గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ని విజయపథంలో నడిపించిన తాను ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని పునరుద్ఘాటించారు. ‘కేజ్రీవాల్ అవినీతి చేయలేరని అందరికీ తెలుసు. ఢిల్లీవాసుల కోసం ఉచిత విద్యుత్, ఉచిత నీరు, మొహల్లా క్లినిక్‌లు, నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలల కోసం మేం చేస్తున్న అభివృద్ధిని ఆపాలని కోరుకున్నారు కాబట్టే అరెస్ట్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే, వారు చేసే మొదటి పని ఏంటో తెలుసా? మీకు అందించే ఉచిత విద్యుత్తును నిలిపివేయడం. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను నాశనం చేయడం, దీర్ఘకాలిక కరెంట్ కోతలతో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు’ అంటూ ఢిల్లీ ప్రజలను ఉద్దేశిస్తూ కేజ్రీవాల్ ప్రసంగం చేశారు. -
అమెరికాలోనూ ఉచిత తాయిలాలు..!
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఉచితాలు అమెరికా వరకూ వెళ్లాయి’అంటూ ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే విద్యుత్తు చార్జీలను సగానికి తగ్గిస్తానంటూ అక్కడి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీని శుక్రవారం ఆయన ‘ఎక్స్’లో ప్రస్తావించారు. ట్రంప్ ట్వీట్‌ను ఆయన రీ ట్వీట్ చేస్తూ.. ‘విద్యుత్తు బిల్లులు సగానికి తగ్గిస్తానంటూ ట్రంప్ ప్రకటించారు. ఉచిత తాయిలాలు అమెరికా వరకూ వెళ్లాయి’అంటూ పేర్కొన్నారు. కేజ్రీవాల్ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. విద్యుత్, వైద్యం, విద్య ఉచితమంటూ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ పక్షాలు కేజ్రీవాల్‌పై మండిపడుతుండటం తెలిసిందే. కాగా, అధ్యక్షుడిగా ఎన్నికైతే 12 నెలల్లో కరెంట్ బిల్లులతో పాటు ఇంధన బిల్లులను 50 శాతానికి తగ్గిస్తానని, దీనివల్ల అమెరికాలో వ్యాపారావకాశాలు పెరుగుతాయని ట్రంప్ ట్వీట్ చేశారు. విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు పర్యావరణ అనుమతులను వేగవంతం చేస్తానని కూడా ట్రంప్ ప్రకటించారు. -
ఢిల్లీ సీఎం ఆతిశి
సాక్షి, న్యూఢిల్లీ: సస్పెన్స్ వీడింది. ఢిల్లీ సీఎం పీఠం ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు ఆతిశీ మార్లీనాకు దక్కింది. పార్టీ శాసనసభాపక్షం మంగళవారం ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. అనంతరం కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఆయన రాజీనామా లేఖ అందజేయడం, ఆ వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఎల్జేకు ఆతిశి లేఖ సమరి్పంచడం వెంటవెంటనే జరిగిపోయాయి. వారంలోగా ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం 26, 27 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో లాంఛనంగా మెజారిటీ నిరూపించుకుంటారు. కేజ్రీవాల్ కేబినెట్లో ఆరి్ధకం, విద్య, సాగు నీరు సహా 14 శాఖల బాధ్యతలను మోస్తూ వచి్చన ఆతిశి త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల దాకా సీఎంగా ప్రభుత్వాన్ని నడపనున్నారు. ఢిల్లీకి ఆమె మూడో మహిళా సీఎం. గతంలో బీజేపీ దిగ్గజం సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ సీఎంలుగా చేశారు. మమతా బెనర్జీ (పశి్చమ బెంగాల్) తర్వాత ప్రస్తుతం దేశంలో రెండో మహిళా సీఎం కూడా ఆతిశే కానున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఐదు నెలల పై చిలుకు కారాగారవాసం నుంచి కేజ్రీవాల్ వారం క్రితం బెయిల్‌పై బయటికి రావడం, సీఎం పదవికి రాజీనామా చేస్తానంటూ ఆదివారం సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. దాంతో తదుపరి సీఎంగా ఆతిశితో పాటు కేజ్రీవాల్ భార్య సునీత తదితర పేర్లు రెండు రోజులుగా తెరపైకొచ్చాయి. మంగళవారం ఆప్ ఎల్పీ భేటీలో కేజ్రీవాల్ సూచన మేరకు ఆతిశి పేరును పార్టీ సీనియర్ నేత దిలీప్ పాండే ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలంతా నిలబడి ఆమోదం తెలిపారు. 2013లో ఆప్ ఆవిర్భావం నుంచి పారీ్టలో ఆతిశి క్రియాశీలంగా ఉన్నారు. 2015 నుంచి కేజ్రీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2018 దాకా నాటి ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చూసిన విద్యా శాఖకు సలహాదారుగా ఉన్నారు. 2020లో కాల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి గెలుపొందారు. మద్యం కుంభకోణంలో మంత్రి పదవులకు సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా తర్వాత ఆమె మంత్రి అయ్యారు. కీలకమైన ఆర్ధిక, విద్య, తాగునీరు సహా 14 శాఖలు చూస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అటు పారీ్టని, ఇటు ప్రభుత్వాన్ని సర్వం తానై నడిపించారు. కేజ్రీవాల్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే మా ఏకైక లక్ష్యం: అతిశిఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యాక ఆతిశి మీడియాతో మాట్లాడారు. తన గురువు కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తున్నందుకు ఎంతో బాధగా ఉంది. నన్ను నమ్మి ఇంతటి బాధ్యత కట్టబెట్టారు. ఎమ్మెల్యేను చేశారు. మంత్రిని చేశారు. ఇప్పుడిలా సీఎంనూ చేశారు. ఇది ఆప్‌లో మాత్రమే సాధ్యం. సామాన్య కుటుంబం నుంచి వచి్చన నా వంటివారికి మరో పారీ్టలో అయితే కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కదు. ఢిల్లీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో సాగుతా. ఆయన్ను తిరిగి సీఎం చేయడమే లక్ష్యంగా పని చేస్తాం’’ అన్నారు. నిజాయితీపరుడైన కేజ్రీవాల్‌పై తప్పుడు అభియోగాలు మోపారన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించి ఆయన్ను మళ్లీ సీఎం చేయాలని ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ ప్రకారం అవి వచ్చే ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. మహారాష్ట్రతో పాటే నవంబర్లోనే జరపాలని కేజ్రీవాల్ డిమాండ్ చేయడం తెలిసిందే. ఆ అవకాశం లేదని ఈసీ వర్గాలంటున్నాయి.మారింది ముఖమే: బీజేపీ సీఎంగా ఆతిశి ఎంపికపై బీజేపీ పెదవి విరిచింది. కేవలం ముఖాన్ని మార్చినంత మాత్రాన పార్టీ స్వభావం మారబోదని పార్టీ ఢిల్లీ విభాగం చీఫ్ వీరేందర్ సచ్దేవ అన్నారు. ఈ రాజకీయ జూదంతో కేజ్రీవాల్‌కు లాభించేదేమీ ఉండబోదని ఆయన జోస్యం చెప్పారు. -
కేంద్రానికి చెంపపెట్టు
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ విడుదలను సీబీఐకి, అమిత్ షాకు, కేంద్రానికి చెంపపెట్టుగా ఆప్ అభివరి్ణంచింది. ‘‘సీబీఐ పంజరంలో చిలుకేనని సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు మరోసారి రుజువు చేశాయి. అవి నేరుగా కేంద్రంపై చేసిన వ్యాఖ్యలు. కనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలి’’ అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలు ఇప్పటిదాకా ఏ సాక్ష్యాన్నీ సంపాదించలేకపోయాయని ఢిల్లీ మంత్రి ఆతిషి ఎద్దేవా చేశారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తారని ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ సుశీల్ గుప్తా అన్నారు. కేజ్రీవాల్ విడుదలను ప్రజాస్వామ్య విజయంగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అభివరి్ణంచారు. ఆప్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ‘‘కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్ మాత్రమే వచి్చందని మర్చిపోవద్దు. మద్యం కేసులో ప్రధాన నిందితుడైన ఆయన తక్షణం రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేసింది. లేదంటే ఢిల్లీ ప్రజలే ఆయన రాజీనామాకు పట్టుబట్టే రోజు ఎంతో దూరం లేదంది. -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్
-
హర్యానా: ఆప్ మరో జాబితా.. వినేశ్‌పై కవితా దళాల్ పోటీ
చంఢీఘడ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా మరో అభ్యర్థులు జాబితా విడుదల చేసింది. 21 మందితో నాలుగో జాబితా బుధవారం విడుదల చేసింది. కీలకమైన జులానా అసెంబ్లీ స్థానం నుంచి స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై కవితా దళాల్‌ను ఆప్ బరిలోకి దింపింది. ఇక.. ఇప్పటికే 20 మందితో తొలి జాబితాను ఆప్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజా జాబితాతో కలిపి ఇప్పటివరకు ఆప్ మొత్తం ఆప్ 61 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. హర్యానాలో ఉన్న 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబరు 5న పోలింగ్ జరగనుంది. 8న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడికానున్నాయి.కవితా దళాల్ కూడా ప్రొఫెషనల్ రెజ్లర్, గతంలో ఈమె WWE లాంటి ప్రపంచ ప్రఖ్యాత ప్రొఫెషనల్ పోటీల్లో పాల్గొన్నారు. 2021లో కవితా దళాల్ WWE నుంచి వైదొలిగినట్లు ప్రకటించారు. Aam Aadmi Party (AAP) released the fourth list of 21 candidates for Haryana Assembly electionsSo far, AAP has announced the names of 61 candidates pic.twitter.com/9YmkzmLMKe— ANI (@ANI) September 11, 2024చదవండి: హర్యానా బీజేపీ రెండో జాబితా: వినేశ్‌పై పోటీ ఎవరంటే.. -
హర్యానా ఎన్నికలు.. ఆప్ తొలి జాబితా
చంఢిఘడ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ షాక్ ఇచ్చింది. ఓవైపు.. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో 20 మంది అభ్యర్థులతో ఆప్ తొలి జాబితా విడుదల చేసింది. కలయత్ నుంచి అనురాగ్ ధండా, మెహమ్ నుంచి వికాస్ నెహ్రా, రోహ్ తక్ నుంచి బిజేందర్ హుడాను ఆప్ బరిలోకి దించించింది. కాంగ్రెస్‌తో చర్చలవేళ ఆప్ తీసుకున్న ఈ నిర్ణయం తాజాగా చర్చనీయాంశంగా మారింది. 📢Announcement 📢 The Party hereby announces the following candidates for the state elections for Haryana Assembly.Congratulations to all 💐 pic.twitter.com/Ulca3eVppu— AAP (@AamAadmiParty) September 9, 2024పొత్తుపై కాంగ్రెస్, ఆప్ నేతలు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా సీట్ల పంపకాలపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఆప్ చీఫ్ సుశీల్ గుప్తా సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.నేటి సాయంత్రంలోగా కాంగ్రెస్ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాకుంటే మొత్తం 90 స్ధానాల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తుపై తమకు పార్టీ అధిష్టానం నుంచి తమకు ఇప్పటివరకూ ఎలాంటి సందేశం రాలేదన్న ఆయన.. సోమవారం 90 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు హర్యానా ఆప్ యూనిట్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.చదవండి: 90 స్థానాల్లో పోటీ చేస్తాం.. కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం! -
స్వాతి మలివాల్‌పై దాడి కేసు: బిభవ్ కుమార్‌కు బెయిల్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ( ఆప్) ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎంపీపై దాడి కేసులో బెయిల్, అరెస్ట్‌ను సవాల్ చేస్తూ బిభవ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితుడు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీలో 100 రోజులు ఉన్నారని, ఛార్జ్‌షీట్ నమోదైనట్లు సుప్రీం కోర్టు తెలిపింది. ‘స్వాతి మలివాల్‌కు గాయాలు అయ్యాయి. కానీ ఈ కేసులో బెయిల్ ఇవ్వడాన్ని అడ్డుకోలేం. బెయిల్ నిరాకరిస్తూ జైలులోనే ఉంచేలా చేయలేం’ అని న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. ఢిల్లీ పోలీసుల తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఈ కేసులో కొందరు ముఖ్యమైన సాక్షులపై నిందితుడు బిభవ్ కుమార్ ప్రభావం ఉంది. వారిని విచారించడానికి అనుమతి ఇవ్వండి. అప్పుడు తాము బెయిల్‌ను వ్యతిరేకించమని కోర్టుకు తెలిపారు. అలా అయితే.. సొలిసిటర్ జనరల్ చెప్పిన విధంగా తాము ఎవరికీ బెయిల్ మంజూరు చేయలేమని జస్టిస్ భుయాన్ అన్నారు. బెయిల్ మంజూరు చేయకుండా ఉంచటం ఆందోళన కలిగించే విషయమని సుప్రీకోర్టు పేర్కొంది. ఈ దాడి కేసులో సాక్షులందరినీ విచారించే వరకు నిందితుడు బిభవ్ కుమార్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోకి ప్రవేశించవద్దని సుప్రీం కోర్టు షరుతు విధించింది.మే 13న స్వాతి మలివాల్‌పై బిభవ్ కుమార్ తనపై దాడి చేసినట్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. స్వాతి మలివాల్ ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్‌పై పోలీసులు మే 18న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
ఢిల్లీ పంద్రాగస్టు పంచాయతీ.. జెండా ఎగరేసేది ఆయనే
ఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15) రోజున ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండాను ఎవరు ఎగరవేస్తారనే అనిశ్చితికి తెరపడింది. తాజాగా జెండా ఆవిష్కరణకు ఢిల్లీ హోంమంత్రి కైలాశ్ గహ్లోత్ పేరును గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేసినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్.. హోమ్ మంత్రి కైలాశ్ గహ్లోత్‌ను నామినేట్ చేయడం సంతోషంగా ఉంది. దానికోసం అవసరమైన ఏర్పాట్లు చేయండి’’ అని ఎల్జీ కార్యదర్శి ఆశిష్ కుంద్రా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్‌కు లేఖలో పేర్కొన్నారు. అంతకు ముందు.. జాతీయ జెండాను ఎగరవేసే అవకాశం మంత్రి అతిశీకి ఇవ్వాలనే సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తిపై పరిపాలన శాఖ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయజెండా ఎగరవేసే అధికారాన్ని ఢిల్లీ మంత్రి అతిశీకి ఇవ్వలేం. ఈ వేడుక నిర్వహించేందుకు నిర్దేశిత విధానం ఉంటుంది. ఆ నిబంధనలు పాటించకుండా అతిశీకి జెండా ఎగరవేసే బాధ్యత అప్పగిస్తే కార్యక్రమం పవిత్రత దెబ్బతింటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని పేర్కొంది.కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఆయనకు స్వాతంత్రవ దినోత్సవం రోజు జాతీయ జెండాను మంత్రి అతిశీ ఎగురవేస్తారని ఎల్జీకి లేఖ రాశారు. ఈ విషయం ప్రస్తుతం ఎల్జీ వర్సెస్ ఆప్‌గా మారింది. తాజాగా రాజ్‌భవన్ విడుదల చేసిన ప్రకటనపై మంత్రి అతిశీ స్పందించలేదు. -
‘మంత్రి అతిషి జెండా ఎగరవేయలేరు’
ఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15) రోజున ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండాను ఎవరు ఎగరవేస్తారనే అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైలులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ తరఫున మంత్రి అతిశీ జాతీయ జెండాను ఎగరవేయడానికి అనుమతి లేదని తెలిపింది. ఇక.. సోమవారం సాధారణ పరిపాలన శాఖ మంత్రి గోపాల్ రాయ్ కేజ్రీవాల్ కోరిక మేరకు రాష్ట్ర మంత్రి అతిశీ జెండా ఎగరవేయుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే తాజాగా జీఏడీ అదనపు ముఖ్యకార్యదర్శి నవీన్ కుమార్ చౌదరీ స్పందిస్తూ.. జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ ఆదేశాలు చట్టపరంగా చెల్లుబాటు కాదని అన్నారు. ఆ ఆదేశాలము తాము పాటించలేమని స్పష్టం చేశారు. ఈ విషయంపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు. జైలు నిబంధనల ప్రకారం ఇలా చేయటం అనుతించబడదని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఛత్రసల్ స్టేడియం వేదికగా సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. సీఎం జ్యుడీషియల్ కస్టడీలో ఉండటంతో జెండా ఎగరవేసే విషయంపై అత్యున్నత అధికారులకు తెలియజేశామని తెలిపారు. వారి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. -
ఢిల్లీ లిక్కర్ కేసు: కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. సీబీఐ కస్టడీ నేటితో ముగియటంతో తీహార్ జైలు అధికారులు ఆయన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు కేజ్రీవాల్ సీబీఐ జ్యుడీషియల్ కస్టడీని మరోసారి ఆగస్ట్ 20వరకు పొడిగించింది. ఈ కేసులో సీబీఐ అరెస్ట్ చేయడాన్ని కేజ్రీవాల్ సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. లిక్కర్ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ సరైన కారణాలు లేకుండా అరెస్ట్ చేసిందని చెప్పలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.చదవండి: కేజ్రీవాల్‌ను మళ్లీ అరెస్ట్ చేస్తారా?.. ఈడీని ప్రశ్నించిన కోర్టు -
సుప్రీం కోర్టులో ఆప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
ఢిల్లీ: సుప్రీం కోర్టులో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులను నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు(ఎల్జీ) ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం ఎల్జీకి నామినేట్ చేసే అధికారం వచ్చిందని తెలిపింది. ఎంసీడీలో 10 మంది కౌన్సిలర్లను మంత్రి మండలి సలహా మేరకు నామినేట్ చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ ప్రభుత్వ సలహాను పాటించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇది చట్టబద్ధమైన అధికారమని, కార్యనిర్వాహక అధికారం కాదని స్పష్టం చేసింది. కార్పొరేషన్ సభ్యుల నామినేషన్‌కు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సలహా తీసుకోవాల్సిన అవసరం ఎల్జీకి లేదని పేర్కొంది.2022 డిసెంబర్లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ గెలుపొందింది. కాగా, మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ మార్క్(126)ను దాటి ఆప్ 134 స్థానానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన 10 మంది నామినేటెడ్ కౌన్సిలర్స్ చేత ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ఎల్జీకి కౌన్సిర్లను నియమించే అధికారం లేదని ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అనంతరం ఈ వ్యవహారంపై ఆప్ సుప్రీం కోర్టును అశ్రయించింది. -
ఢిల్లీ లిక్కర్ కేసు: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు నేడే
ఢిల్లీ:ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు రిజర్వులో పెట్టిన తీర్పును ఇవాళ(సోమవారం) ఇవ్వంది. లిక్కర్ ఈడీ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో కేజ్రీవాల్ ఇంకా తీహార్ జైల్లోనే ఉన్నారు. గతవారం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై వాదానులు ముగియడంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. ‘‘ఎక్సైజ్ కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్. ఆయన్ను విడుదల చేస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారు. ఆయన అరెస్టయితేనే ఈ కేసు విచారణ ముగింపునకు వస్తుంది. నెలలోగా చార్జిషిటు వేస్తాం’అని సీబీఐ లాయర్ డీపీ సింగ్ తెలిపారు. కేజ్రీవాల్‌ను జైలు నుంచి బయటకు రాకుండా చేసేందుకే సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని ఆయన తరఫు సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదించారు. ఊహాకల్పనలతోనే కేజ్రీవాల్‌కు అరెస్ట్ చేశారే తప్ప, ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యక్షంగా ఎటువంటి ఆధారాలు లేవన్నారు. వాదనలు విన్న అనంతరం జస్టిస్ నీనా బన్సన్ కృష్ణ తీర్పును రిజర్వులో ఉంచుతూ ఆదేశాలిచ్చారు. -
స్వాతి మలివాల్‌పై దాడి కేసు: బిభవ్ కుమార్‌పై సుప్రీం ఆగ్రహం
ఢిల్లీ: రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాఖలుచేసిన పటిషన్‌పై సుప్రీం కోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బీభవ్ కుమార్‌పైనే సుప్రీం కోర్టు ధర్మాసనం మండిపడింది. ఈ ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని, నివాసంలోకి ప్రవేశించిన ఓ గూండా స్వాతి మలివాల్‌పై దాడి చేసినట్లు అనిపించిందని కోర్టు పేర్కొంది. ఈ కేసులో బిభవ్ కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ఢిల్లీలోని మెజిస్టీరియల్ కోర్టు కొట్టివేసింది. అయితే మెజిస్టీరియల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. బిభవ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలుచేసిన బెయిల్ పిటిషన్‌పై న్యాయమూర్తులు సూర్యకాంత్, దీపాంకర్ దత్తా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది.‘ముఖ్యమంత్రి బంగ్లా ఏమైనా వ్యక్తిగత నివాసమా? సీఎం కార్యాలయం అటువంటి గూండాలను ఉంచుకోవటం అవసరమా? ఇది సరైనా పద్దతేనా? మేము చాలా ఆశ్చర్యపోయాం. అసలు ఇది ఎలా జరిగింది’అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘బిభవ్ కుమార్ అసలు ఏమనుకుంటున్నాడు? అతని ఏం అధికారం ఉంది? ఒక గూండాలా అతన్ని తయారు చేశారు. ఓ యువతి అయిన స్వాతి మలివాల్‌పై దాడి చేయడానికి బిభవ్ కుమార్‌కు సిగ్గు ఉండాలి?’ కోర్డు అసహనం వ్యక్తం చేసింది. స్వాతి మలివాల్ తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పినా ఆమెపై దాడి చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కేసు పరిశీలన కోసం ఛార్జిషీట్‌ను తమ ముందు ఉంచాలని చెప్పి సుప్రీంకోర్టు విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసింది. సీఎం కేజ్రీవాల్ నివాసంలో బిభవ్‌కుమార్ తనపై దాడి చేశారని స్వాతి మలివాల్ మే 13న ఆరోపణలు చేశారు. మే 16 ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా బిభవ్‌కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. -
లిక్కర్ కేసు: కేజ్రీవాల్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాత్రపై రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో సెంట్రల్ బ్యూరో ఇన్వేస్టిగేషన్ (సీబీఐ) చార్జ్‌షీట్ దాఖలు చేసింది. కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వటాన్ని సీబీఐ వ్యతిరేకిస్తోంది. ఇవాళ సీబీఐ కేసులో హైకోర్టు విచారణ జరపనుంది. జస్టిస్ నీనా బన్సల్ కృష్ విచారణ చేపట్టనున్నారు.ఈ కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. జూన్ 26న సీబీఐ అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు ఆగస్టు 8 వరకు కేజ్రీవాల్‌ను సీబీఐ కస్టడీకీ అప్పగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.కోర్టు అనుమతితో అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక.. ఈ కేసులో ప్రధాన కుట్రదారుల్లో కేజ్రీవాల్ ఒకరని సీబీఐ అభియోగాలు మోపింది. కేజ్రీవాల్ సన్నిహితుడు విజయ్ నాయర్ అనేక మంది మద్యం ఉత్పత్తిదారులు, వ్యాపారులతో టచ్‌లో ఉన్నారని ఆరోపణలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. అయితే ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా.. అనంతరం ఇదే కేసులో సీబీఐ అరెస్ట్ చేయటంతో తిహార్ జైలులోనే ఉన్నారు. -
ఢిల్లీ లిక్కర్ కేసు: మరోసారి కేజ్రీవాల్ సీబీఐ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ కస్టడీని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పొడిగించింది. కేజ్రీవాల్ సీబీఐ కస్టడీ నేటితో ముగియగా.. తిహార్ జైలులో ఉన్న ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. విచారణ జరిపిన కోర్టు కేజ్రీవాల్ సీబీఐ కస్టడీ పొడిగించింది. ఆగస్టు 8 వరకు కేజ్రీవాల్‌ను సీబీఐ కస్టడీకీ అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున ఆయన కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించాలని అధికారులు కోర్టును కోరారు. దీంతో కోర్టు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మరో రెండు వారాలు పొడిగించింది. అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కేజ్రీవాల్ మే 10న మధ్యంత బెయిల్ పొందారు. బెయిల్ గడువు ముగిసిన అనంతరం జూన్ 2ను ఆయన మళ్లీ తిహార్ జైలుకు చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను జూన్ 26న సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఎల్జీ ఆరోపణలు.. ఖండించిన ఆప్
ఢిల్లీ: లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి రాజకీయ మలుపు తీసుకుంది. సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఢిల్లీ లెఫ్ట్నెట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా, ఆప్ పార్టీ నేతల మధ్య విమర్శలు తీవ్రం అయ్యాయి.సీఎం కేజ్రీవాల్ ఉద్దేశ పూర్వకంగానే బరువు తగ్గుతున్నారని, అందుకు తగ్గట్టుగా తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకుంటున్నారని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా తాజాగా ఆరోపించడంతో వివాదం ముదిరింది. తక్కువ కేలరీల ఆహారం తీసుకుంటున్నారని ఎల్జీ ఆరోపణలు మాత్రమే చేయలేదు. ఈ మేరకు ఆయన ఢిల్లీ ఛీఫ్ సెక్రటరీకి ఒక లేఖ కూడా రాశారు. ‘సీఎం అరవింద్ కేజ్రీవాల్ మెడికల్ రిపోర్టుల్లో గ్లూకోమీటర్, సీజీఎంఎస్ ( రక్తంలో చక్కెర మోతాదులు నిరంతరం గుర్తించి నమోదు చేసే పరికరం. కంటిన్యుయస్ గ్లూకోజ్ మానిటరింగ్) వివరాల్లో తేడాలు ఉన్నాయి. జూన్ 2న తిహార్ జైలుకు వెళ్లినప్పటి నుంచి సీఎం కేజ్రీవాల్ కేజీల బరువు తగ్గారు. ఉద్దేశపూర్వకంగా తక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటున్నారు. జూన్ 2 కంటే ముందు ఆయన 63. 5 కేజీల బరువు ఉండగా... ఇప్పుడు రెండు కేజీలు తగ్గి 61.5 కిలోలకు చేరింది.’ అని ఎల్జీ లేఖలో ఆరోపణలు చేశారు. ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయన బరువు, బ్లడ్ షుగర్ తగ్గుతోందని ఇటీవలే ఆప్ మంత్రి అతిశీ ఆందోళన వ్యక్తం చేసిన విషయం ఇక్కడ చెప్పుకోల్సిన అంశం. అయితే...ఎల్జీ వీకే సక్సెనా చేసిన ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీవ్రస్థాయిలో మండిపడింది. ఎల్జీ ఆరోపణలను ఖండించింది. ‘ఎల్జీ సార్.. మీరు ఎలాంటి జోక్ వేస్తున్నారు?. ఎవరైనా రాత్రికి రాత్రి తమ షుగర్ వెవల్స్ తగ్గించుకుంటారా? ఇది చాలా ప్రమాదకరం. మీకు ( ఎల్జీ) ఈ వ్యాధి గురించి ఏమి తెలియదు. మీలాంటి వారు ఇలాంటి లేటర్ రాయటం సరికాదు. ఇటువంటి పరిస్థితి మీకు రావొద్దని దేవుడ్ని కోరుకుంటున్నా’ అని ఎల్జీపై విమర్శలు చేశారు. ‘ఎల్జీ సిమెంట్ పరిశ్రమలో పనిచేస్తారన్న విషయం నాకు తెలుసు. కానీ, ఆయన డయాబెటిస్‌లో స్పెషలైజ్ ఎప్పుడు అయ్యాడో నాకు తెలియదు’ అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఎల్జీపై సెటైర్లు వేశారు. -
కేజ్రీవాల్ ప్రాణాలతో బీజేపీ చెలగాటం: ఆప్ ఎంపీ సంజయ్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తిహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ బరువు 8. 5 కేజీలు తగ్గారని, అదేవిధంగా ఆయన షుగర్ లెవల్స్ 5 సార్లు 50 ఎంజీ/డీఎల్ కిందికి పడిపోయాయని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేజ్రీవాల్ జైలులో తీవ్రమైన అనారోగ్యంతో బాధపెట్టాలని కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఇలా చేయటం అత్యంత ఆందోళనకరమైన విషయమని అన్నారు.‘‘మార్చి 21 తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ మద్యం స్కాంలో అరెస్ట్ చేసేనాటికి ఆయన బరువు 70 కేజీలు, కానీ, ప్రస్తుతం కేజ్రీవాల్ బరువు 61. 5 కేజీలకు పడిపోయింది. అంటే 8. 5 కేజీల బరువు తగ్గారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, బీజేపీ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్‌ను చిత్రహింసలకు గురిచేసి.. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలా కేజ్రీవాల్‌ను బాధ పెట్టడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా బరువు తగ్గటంపై ఎటువంటి పరీక్షలు నిర్వహించటం లేదు. బరువు తగ్గటం, షుగర్ లేవల్స్ పడిపోవటం కేజ్రీవాల్ తీవ్ర అనారోగ్యానికి సంకేతాలు. ఇప్పటికే ఐదుసార్లు షుగర్ లేవల్స్ లెవల్స్ పడిపోయాయి. 50 ఎంజీ/డీఎల్ కంటే కిందికి పడిపోతే ఆరోగ్యం క్షీణించి కోమాకు వెళ్తారు. కేజ్రీవాల్‌పైనే ఎందుకు ఇలా చేస్తున్నారు?’అని సంజయ్ సింగ్ మండిపడ్డారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ, సీబీఐ అరెస్ట్ చేయటంతో కేజ్రీవాల్ ఏప్రిల్1 నుంచి తిహార్ జైలులో ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం ఈడీ అరెస్ట్ కేసులో శుక్రవారం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజారు చేసింది. అయినా కూడా కేజ్రీవాల్ తిహార్ జైలులోనే ఉండాల్సి వచ్చింది. లిక్కర్ కేసులో ఆయన్ను దర్యాప్తు కోసం సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
లిక్కర్ కేసు: కేజ్రీవాల్‌కు జడ్జిమెంట్ డే
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు రేపు (శుక్రవారం) తీర్పు ఇవ్వనుంది. లిక్కర్ కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేయడాన్ని సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం మే 17న తీర్పును రిజర్వ్ చేసింది.మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. ఈడీ కేసులో జూన్ 20న ట్రయల్ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ట్రయల్ కోర్టు ఉత్తర్వులను ఈడీ హైకోర్టులో సవాల్ చేయాగా.. జూన్ 25న ఢిల్లీ హైకోర్టు ట్రాయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే విధించింది. -
ఢిల్లీ లిక్కర్ కేసు: కేజ్రీవాల్‌పై ఈడీ సప్లిమెంటరీ చార్జిషీట్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టైన ముఖ్యంమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్‌ను ఢిల్లీ ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. లిక్కర్ కేసులో ఈడీ 7వ సప్లిమెంటరీ చార్జి షీట్ దాఖలు చేసింది. తాజా ఛార్జ్ షీట్లో కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీలపై ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా జూలై 12వ తేదీకి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది.మరోవైపు.. తనను సీబీఐ అరెస్ట్ చేయటం, మూడు రోజుల కస్టడీకి తీసుకోవటంపై అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసింది. దీంతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇక.. ఈ రెండు పిటిషన్లపై జూలై 17న విచారణ జరగనుంది. -
లిక్కర్ స్కామ్ కేసు: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సీబీఐ రిమాండ్, కస్టడీని సవాల్ చేస్తూ.. సీఎం కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 26న ట్రయల్ కోర్టు ఇచ్చిన మూడు రోజుల సీబీఐ రిమాండ్‌ను సీఎం కేజ్రీవాల్ సవాల్ చేశారు. అదే విధంగా శనివారం (జూన్ 29) రౌస్ అవెన్యూ కోర్టు.. జూలై 12 వరకు విధించిన జ్యుడీషియల్ కస్టడీని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.సీబీఐ అభ్యర్థన మేరకు వెకేషన్ జడ్జి సునేనా శర్మ శనివారం సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు 14 రోజుల సీబీఐ కస్టడీ విధించారు. మూడు రోజుల సీబీఐ రిమాండ్ విచారణ ముగిసిన తర్వాత ట్రయల్ కోర్టు హాజరైన క్రేజ్రీవాల్ను 14 రోజుల సీబీఐ కస్టడీ విధించారు. ఈ క్రమంలో సోమవారం అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ రిమాండ్, కస్టడీపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
సీబీఐ కస్టడీలో కేజ్రీవాల్: ప్యాంట్ బెల్ట్‌కు అనుమతి
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ మూడు రోజుల కస్టడీలోకి తీసుకుంది. ఈ కేసులో అవినీతి వ్యవహారం జరిగిందని, ఆయన్ని విచారించాల్సిన అవసరం ఉందని దర్యాప్తు సంస్థ అంటోంది. అయితే.. సీబీఐ కస్టడీలో తనకు కొన్ని ప్రత్యేక వసతులు కావాలని ఆయన విజ్ఞప్తి చేయగా.. అందుకు కోర్టు అనుమతి లభించింది.ఇంటి భోజనానికి అనుమతించాలని, అలాగే.. కళ్లద్దాలు, డాక్టర్లు సూచించిన మందులు, చదువుకోవడానికి భగవద్గీత కావాలని కోరారు. అలాగే.. ప్యాంట్ బెల్ట్ లేకపోవడంతో తాను ఇబ్బంది పడుతున్నానని, జైలు నుంచి కోర్టుకు తిరిగే టైంలో ప్యాంట్‌ను చేత్తో పట్టుకుని ఉండాల్సి వస్తోందని, కాబట్టి దానిని కూడా అనుమతించాలని కోరారాయన. వీటన్నింటికి కోర్టు అనుమతించింది. ఈ విజ్ఞప్తులతో పాటు సీబీఐ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను.. ఆయన భార్య సునీత, బంధువులను ప్రతిరోజు ఒక గంటపాటు కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. మూడు రోజుల సీబీఐ కస్టడి ముగిసన అనంతరం కేజ్రీవాల్‌ను జూన్ 29 సాయంత్రం 7 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపచనున్నారు. ఇప్పటికే మనీలాండరింగ్‌లో కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను.. విచారణ జరిపి మరీ బుధవారం సీబీఐ అరెస్ట్ చేసింది. సీబీఐ అరెస్ట్ నేపథ్యంలో సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు.. కొత్త పిటిషన్ వేసే యోచనలో ఉన్నారు. -
నేడే తీర్పు: సీఎం కేజ్రీవాల్ ఊరట దక్కేనా?
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్ బెయిల్ వ్యవహారంపై ఉత్కంఠ నెలకొంది. మనీ లాండరింగ్ కేసులో రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చినా కేజ్రీవాల్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పుపై ఈడీ పిటిషన్ వేయటంతో ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. దీనిపై ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ హైకోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే ట్రయిల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు విధించిన స్టేపై సీఎం కేజ్రీవాల్ ఆదివారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టి.. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టేపై తాము జోక్యం చేసుకోబోమని, హైకోర్టు తుది తీర్పు ఇచ్చిన తర్వాతే విచారిస్తామని సుప్రీం స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 26కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని ఆప్ నేతల్లో టెన్షన్ నెలకొంది. -
ఢిల్లీ లిక్కర్ కేసు: సుప్రీం కోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. ఇటీవల రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే ఇవ్వడాన్ని కేజ్రీవాల్లో సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. అయితే ఈ పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టు విచారణ జరిపి.. ఢిల్లీ హైకోర్టు సంపూర్ణ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాతే దానిపై పరిశీలన చేస్తామని పేర్కొంది. తీర్పు కాపీ చూడకుండా ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక.. తదుపరి విచారణను జూన్ 26కు వాయిదా వేసింది.ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టు.. సాధారణ బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తు బాండ్ సమర్పించాలని కోర్టు షరతు విధించింది. అయితే అప్పీల్‌కు వెళ్లేంత వరకు తీర్పును 48 గంటలపాటు సస్పెండ్ చేయాలని ఈడీ కోరిన్పటికీ కోర్టు తిరస్కరించింది. ఇక.. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై దర్యాప్తు సంస్థ ఈడీ స్టే విధించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు స్టేపై నిన్న(ఆదివారం) సీఎం కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. -
‘కేజ్రీవాల్ బరువు 8 కేజీల తగ్గి.. ఆరోగ్యం క్షీణిస్తోంది’
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలులో ఉన్నారు. అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిన మార్చి 21 నుంచి సుమారు 8 కేజీల బరువు తగ్గినట్లు ఆప్ చెబుతోంది. అరెస్ట్‌కు ముందు ఆయన బరువు 70 కేజీలు ఉండగా.. అనంతరం ఆయన బరువు జూన్ 22 వరకు 8 కేజీలు తగ్గి 62 కేజీలకు పడిపోయిందని ఆప్ నేతలు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల్లో అరవింద్ కేజ్రీవాల్ 8 కేజీల బరువు తగ్గారని తెలిపారు. ఇలా బరువు తగ్గటంపై అసలైన కారణం తెలుసుకోవటం కోసం వెంటనే ఆయన డాక్టర్లను సంప్రదించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరోవైపు.. అరవింద్ కేజ్రీవాల్ బరువు తగ్గటంపై ఎయిమ్స్ వైద్యులు ఆయనకు ఇచ్చే ఆహారంలో పూరీలు, పరాటాలు చేర్చాలని సూచింనట్లు ఆప్ పేర్కొంది.ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్‌కు వారం రోజులు పాటు మధ్యంత బెయిల్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మాక్స్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు పలు పరీక్షలు చేసీ.. బరువు తగ్గడానికి గల కారణాలను తెలుసుకోవాలన్నారని ఆప్ తెలిపింది. ఇటీవల సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌజ్ అవెన్యూ ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ట్రయిల్ కోర్టు తీర్పుపై మధ్యంతర స్టే విధించింది. -
కేజ్రీవాల్ కోర్టు వీడియో తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం
ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్.. కోర్టులో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి వెంటనే తొలగించాలని సునీతా కేజ్రీవాల్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టినప్పడు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్.. కోర్టు ప్రొసిడింగ్స్ జరిగిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయంలో న్యాయవాది వైభవ్ సింగ్ వేసిన పిల్‌పై శనివారం ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో రికార్డింగ్.. కోర్టు ప్రొసిడింగ్స్‌ను ఉల్లంఘించనట్లు అవుతుందని కోర్టు పేర్కొంది. సునితా కేజ్రీవాల్ సంబంధిత వీడియోను డిలీట్ చేయాలని, అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ సైతం రీపోస్ట్ అయిన ఆ వీడియోను వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సునితా కేజ్రీవాల్‌తో పాటు వీడియో పోస్ట్ చేసిన మరో ఐదుగురికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ పిల్‌పై జూలై 9న విచారణ చేపడతామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 28 ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టారు. వీడియో కాన్ఫరెన్స్‌ను రికార్డ్ చేసిన సునితా కేజ్రీవాల్ ఆ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌చేశారు. అయితే ఇలా చేయటం కోర్టు ప్రొసిడింగ్స్‌ను ఉల్లంగిండమవుతుందని ఢిల్లీ హైకోర్టు తప్పు పట్టింది. -
స్వాతి మలివాల్ కేసు: బిభవ్‌పై 201 సెక్షన్ నమోదు
ఢిలీ: తనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కుమార్ దాడి చేశారని గత నెలలో ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ కేసులో బిభవ్ కుమార్‌పై కేసు నమోదు కాగా.. పోలీసులు మే 18 అరెస్ట్ చేశారు. అయితే తాజాగా బిభవ్‌కుమార్ నమోదైన కేసులో 201 సెక్షన్‌ను చేర్చారు. 201 సెక్షన్ అంటే.. ఆధారాలు మాయం చేసి.. తప్పుడు సమాచారం ఇవ్వటం. బిభవ్ కుమార్ ఈ కేసుకు సంబంధించి ఆధారాలు మాయం చేసి.. తప్పుడు సమాచారం అందించిస్తున్నట్లు మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.బిభవ్ కుమార్‌ను దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆయన తన ఫోన్‌ను ఫార్మాట్ చేసినట్లు గుర్తించారు. ఆయన ముంబైలో ఫోన్ ఫార్మాట్ చేసినట్లు అనుమానం రావటంతో ఇప్పటికే పోలీసులు రెండుసార్లు ముంబైకి తీసుకువెళ్లి దర్యాప్తు చేశారు. ముంబైలో ఏ ప్రాంతంలో ఫార్మాట్ చేశారు?. ఫోన్లోని డేటాను ఎవరికి షేర్ చేశారు? అన్న విషయాలు మాత్రం బిభవ్ వెల్లడించలేదని పోలీసులు తెలిపారు. ఇక.. కస్టడీలో ఉన్న ఆయన దర్యాప్తు సమయంలో అస్సలు సహకరించలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు.సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి నుంచి మూడు సీసీటీవీ కెమెరాల డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. బిభవ్ సీసీటీవీ కెమెరాలను ట్యాంపర్ చేశారని పోలీసుల అనుమానం వ్యకం చేశారు. దీంతో డీవీఆర్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. వీటికి సంబంధించిన రిపోర్టులు ఇంకా వెల్లడికాలేదని తెలిపారు. మే 18 అరెస్ట్ అయిన బిభవ్ కుమార్ ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు.మే 13న ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లితే.. అక్కడ కేజ్రీవాల్ సహాయకుడు తనపై దారుణంగా దాడి చేశారని బయటపెట్టారు. అయితే వాటిని ఆప్.. బీజేపీ కుట్రలో భాగంగానే స్వాతి మలివాల్ బిభవ్‌పై దాడి ఆరోపణలను చేస్తోందని విమర్శలు చేసింది. -
ఎల్లుండి లొంగిపోతున్నా.. మీరంతా జాగ్రత్త: సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంత బెయిల్ గడువు ఎల్లుండి (ఆదివారం)తో ముగుస్తుంది. ఆరోజే కేజ్రీవాల్ తిరిగి తీహార్ జైలులో లొంగిపోనున్నారు.సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో తాను లొంగిపోతున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రజలకు తెలియజేశారు.ఈ క్రమంలో తన కుటుంబానికి మద్దతుగా నిలవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొగసాగుతుందని కేజ్రీవాల్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘ లోక్ సభ ఎన్నికల కోసం సుప్రీంకోర్టు నాకు 21 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రేపటికి 21 రోజులు పూర్తవుతుంది. ఎల్లుండి నేను తీహార్ జైలులో లొంగిపోతున్నా. ఈసారి నన్ను ఎన్ని రోజులు ఎప్పటి వరకు జైల్లో ఉంచుతారో తెలీదు. దేశాన్ని నిరకుశత్వం నుంచి బయటకు తీసుకెళ్ళేందుకు జైలుకి వెళ్తున్నాను. నన్ను మాట్లాడనియకుండా భయపెట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు. నేను జైలులో ఉన్నప్పుడు నాకు మందులు ఇవ్వలేదు.मुझे परसों सरेंडर करना है। माननीय सुप्रीम कोर्ट का बहुत-बहुत शुक्रिया। https://t.co/1uaCMKWFhV— Arvind Kejriwal (@ArvindKejriwal) May 31, 2024 నేను 20 ఏళ్లుగా డయాబెటిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాను. గడిచిన 10 ఏళ్లుగా నేను ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకుంటున్నా. రోజు నా పొట్ట భాగంలో 4 సార్లు ఇంజక్షన్ తీసుకుంటాను. జైల్లో నాకు ఇన్సులిన్ ఇంజక్షన్ ఇవ్వలేదు. నా షుగర్ లెవల్స్ 300-325 వరకు వెళ్లాయి. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే కిడ్నీ, లివర్ దెబ్బతింటాయి. వీళ్లు ఏం కోరుకుంటున్నారో నాకు అర్ధం కావడం లేదు. జైల్లో 50 రోజులు ఉన్నాను. ఆరు కేజీల బరువు తగ్గాను. జైలుకు వెళ్ళినపుడు 70 కేజీల ఉన్నాను. ఇప్పుడు 64 కేజీలు ఉన్నాను. మళ్ళీ బరువు పెరగడం లేదు. శరీరంలో ఇతర వైద్య సమస్యలు ఉండొచ్చు. పరీక్షలు చేయాలని వైద్యులు చెబుతున్నారు. యూరిన్‌లో కీటోన్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎల్లుండి మూడు గంటలకు నేను తీహార్ జైలులో లొంగిపోతాను. నేను దేనికి వెనక్కి తగ్గను. ఢిల్లీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. జైలులో నా చింత అంతా ఢిల్లీ ప్రజల గురించే. ఢిల్లీ ప్రజలు సంతోషంగా ఉంటే కేజ్రీవాల్ సంతోషంగా ఉంటాడు. నేను మీ మధ్య లేకపోయినా ఢిల్లీ ప్రజల అన్ని పనులు జరుగుతాయి. జైలులో లోపల ఉన్నా బయట ఉన్నా ఢిల్లీ ప్రజల పనులు ఆగవు. ఉచిత విద్యుత్, మోహల్లా క్లినిక్, హాస్పిటళ్లలో వైద్యం, ఉచితంగా మందులు, మహిళలకు ఉచిత బస్సు సర్వీస్, 24 గంటల కరెంట్ సహా త్వరలో మహిళలకు రూ. వెయ్యి ఆర్థిక సహకారం కొసాగుతుంది. ఢిల్లీ ప్రజల కుటుంబ సభ్యుడిలా నా బాధ్యత నెరవేర్చా. నా తల్లిదండ్రుల కోసం దేవుడిని ప్రార్ధించండి. వారి ఆరోగ్యం బాగాలేదు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడాలి ’’ అని కేజ్రీవాల్ అన్నారు. -
Delhi water crisis: చేతులు జోడించి కోరుతున్నా.. సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీలో నెలకొన్న నీటి సంక్షోభంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో నెలకొన్న తీవ్రమై నీటి సంక్షోభాన్ని కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ నీటి సమస్యపై శుక్రవారం కేజ్రీవాల్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘దేశవ్యాప్తంగా ఎండలు విపరీంతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కరెంట్, తాగు నీటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఢిల్లీలో కరెంట్ వినియోగం 7,438 మెగావాట్లు ఉండగా.. ఈసారి గరిష్టంగా 8,302 మెగావాట్లకు పెరిగింది. ఢిల్లీలో ప్రస్తుతం పవర్ కట్ సమస్యలు లేవు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే కరెంట్ విషయంలో ఢిల్లీ మెరుగ్గా ఉంది. మరోవైపు.. అధిక ఎండల కారణంగా నీటి వినియోగం పెరిగింది. సరిహద్దు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి నీటి సరాఫరా తగ్గిపోయింది. అక్కడ కూడా నీటి డిమాండ్ చాలా పెరిగిపోయింది.इस बार पूरे देश में अभूतपूर्व गर्मी पड़ रही है जिसकी वजह से देश भर में पानी और बिजली का संकट हो गया है। पिछले वर्ष, दिल्ली में बिजली की पीक डिमांड 7438 MW थी। इसके मुक़ाबले इस साल पीक डिमांड 8302 MW तक पहुँच गयी है। पर इसके बावजूद दिल्ली में बिजली की स्थिति नियंत्रण में है, अन्य…— Arvind Kejriwal (@ArvindKejriwal) May 31, 2024 అందరం కలిసి నీటి సమస్యను పరిష్కరించాలని మేము ముందుకు వస్తే.. బీజేపీ మాత్రం మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతోంది. ఇలా అయితే నీటి సమస్యకు పరిష్కారం లభించదు. రాజకీయాలు పక్కన పెట్టి అందరం ముందుకు వచ్చి నీటి సమస్య నుంచి ఢిల్లీ ప్రజలకు ఉపశమనం కలిగించాలని చేతులు జోడించి కోరుతున్నారు. రాజకీయాలను పక్కనపెట్టి ఒక నెల పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు హర్యానా, ఉత్తర పదేశ్ రాష్ట్రాల నుంచి నీటి సరాఫరా చేయిస్తే.. ఢిల్లీ ప్రజలు బీజేపీ చొరవను మెచ్చుకుంటారు. మనమంతా కలిసి పని చేస్తే ఢిల్లీ వాసులకు నీటి సమస్య తగ్గుతుంది’’ అని కేజ్రీవాల్ అన్నారు.నీటీ సంక్షోభం నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం.. నీటి వాడకంపై అత్వవసర మార్గదర్శకాలు విడుదల చేసింది. తాగు నీటితో కారు వాషింగ్ చేయోద్దని, నిర్మాణ రంగ సైట్లలో కూడా తాగు నీటిని వాడవద్దని ఆదేశాలు జారీ చేసింది. -
ఢిల్లీ లిక్కర్ కేసు: రౌస్ అవెన్యూ కోర్టుకు సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. గురువారం కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్, మధ్యంతర బెయిల్ పొడిగింపుపై రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ పరిగణనలోకి తీసుకునే అంశంపై మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి భవేజా విచారణ జరపనున్నారు.మధ్యంతర బెయిల్‌ను మరో వారం రోజులు పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను విచారించే అవకాశం లేదని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ లిస్టింగ్‌కు సుప్రీం రిజిస్ట్రీ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లేందుకు ఆయనకు స్వేచ్ఛ ఉందని తెలిపింది. అందుకే ఈ పిటిషన్ విచారణార్హమైనది కాదని పేర్కొంది.ఈ నెల మొదట్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం కోసం షరతులతో కూడిన 21 రోజుల మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. జూన్ 2న మళ్లీ తిరిగి తిహార్ జైలులో లొంగిపోవాలని పేర్కొన్న విషయం తెలిసిందే. గడవు దగ్గర పడుతున్న సమయంలో అనారోగ్యానికి సంబంధించి మరో ఏడు రోజులు బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ కోరుతూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణార్హమైనది కాదని సుప్రీం కోర్టు బుధవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. -
స్వాతి మలివాల్ కేసు: హైకోర్టుకు సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ భివవ్ కుమార్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మే 13న స్వాతి మలివాల్‌పై బిభవ్ కుమార్ దాడి చేసినట్లు ఆరోపించిన విషయం తెలిసిందే. స్వాతి మలివాల్ ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్ మే 18న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే.. తనను స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అక్రమగా అరెస్ట్ చేశారని హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్లో బిభవ్ పేర్కొన్నారు. అదే విధంగా ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని బిభవ్ తరఫున న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.ఈ దాడి కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బిభవ్ కుమార్ సీఎం కేజ్రీవాల్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజీని తారుమారు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. స్వాతి మలివాల్‌పై సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ దాడి చేశారన్న ఆరోపణలు ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాశం అయింది. బీజేపీ కుట్రంలో భాగంగా స్వాతి మలివాల్ బిభవ్‌పై దాడి ఆరోపణులు చేశారని ఆప్ నేతలు ఆరోపించారు. -
బెయిల్ పొడిగింపు.. కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ
ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బెయిల్‌పై ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తన బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించటాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్.. చీఫ్ జస్టిస్‌కు డీవై చంద్రచూడ్‌కు పంపించింది. తదుపరి ఈ పిటిషన్ లిస్ట్‌కు రావటం అనేది చీఫ్ జస్టిస్ నిర్ణయంపై ఆధారపడి ఉండనుంది.అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం మధ్యంత బెయిల్‌పై ఉన్నారు. ఆయన బెయిల్ జూన్ 2తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తన బెయిల్‌ను మరో 7 రోజులు పొడిగించాలని సుప్రీం కోర్టును కోరాను. తన అనారోగ్యం రీత్యా వైద్య పరీక్ష చేయించుకోవటం కోసం బెయిల్ పొడగించాలని కోరారు. ఈ మేరకు తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సుప్రీం కోర్టును కోరారు.‘‘ఇది అరవింద్ కేజ్రీవాల్ విషయం. ఆయనకు మరో ఏడు రోజులు బెయిల్ పొడగించాలి’’ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ‘‘ బెయిల్ పొడగింపు పిటిషన్ ఇప్పుడు అత్యవసరంగా విచారించటం వీలు కాదు. అందుకే ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ముందుకు పంపుతున్నాం. ఆయన ఈ పిటిషన్ లిస్ట్ చేయటంపై నిర్ణయం తీసుకుంటారు’’ అని జస్టిస్ జేకే మహేశ్వరి, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ పేర్కొంది. -
మోదీ, బీజేపీని ఇరుకున పెట్టే వాళ్లు అయినందుకేనా?
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ మే 25 (శనివారం) ముగిసింది. నిన్న జరిగిన పోలింగ్‌లో గాంధీ కుటుంబం, సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే దేశంలో బలమైన ప్రతిపక్ష గొంతును వినిపిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రధాని మోదీ, బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్య సమతి హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ ఆందోళన వ్యక్తం చేశారు.రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వం.. అన్యాయమైన కేసుల్లో ఇరికించి నేర దర్యాప్తు పేరుతో టార్గెట్ చేసిందని తెలిపారు. దశాబ్దాలుగా ఏలిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై గతేడాది బీజేపీ పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో సూరత్ కోర్టు దోషి తేల్చి.. రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. అనంతరం ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. రెండేళ్ల జైలు శిక్షపై అత్యున్నత న్యాయ స్థానం స్టే విధించింది.మరోవైపు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. తిరిగి జూన్‌లో తీహర్ జైలుకు వెళ్లాల్సి ఉంది. ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఇన్‌కం టాక్స్ విభాగం స్తంభింపచేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింపచేయటం వల్ల రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఇబ్బందులు కలుగుతాయని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.ఇలా.. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకోని ప్రధాని మోదీ, బీజేపీ.. ప్రతిపక్ష పార్టీలు, నేతలను బలహీనపరుస్తున్నాయని తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని మోదీ, బీజేపీ వ్యవహరిస్తున్న తీరుతో దేశంలోని ప్రజాస్వామ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌లో అధికార బీజేపీ ప్రతిపక్షాలను బలహీన పర్చడానికి ప్రభుత్వ సంస్థలను వాడుకుంటోందని ఐక్యరాజ్య సమతి హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ ఆందోళన వ్యక్తం చేశారు. -
మరో ఎంపీ లండన్‌లో ఉన్నా.. నన్ను టార్గెట్ చేశారు: స్వాతి మలివాల్
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన సమయంలో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఇండియాలో లేరని విమర్శలు వస్తున్నాయి. అయితే వాటిపై స్వాతి మలివాల్ స్పందించారు.‘‘ హార్వార్డ్ యూనివర్సిటీలో ఓ సెమినార్ పాల్గొనడానికి నేను మార్చిలో అమెరికా వెళ్లాను. ఆప్ వలంటీర్లు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నా. నా సోదరికి కోవిడ్ సోకటం కారణంగా నేను ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. అమెరికాలో ఉన్న భారత్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో టచ్ ఉన్నాను. ...ఆప్ నేతలతో ఎప్పటికప్పుడు మాట్లడుతూ.. ట్వీట్లు చేస్తూ వచ్చాను. ఆ సమయంలో నేను చేయగలిగింది చేశాను. ఆ సమయంలో పార్టీ కోసం నేను పని చేయలేదనటం చాలా దురదృష్టకరం. మరో రాజ్యసభ ఎంపీ లండన్‌లో ఉన్నా.. నన్ను మాత్రమే ఎందుకు ఇలా ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కావటం లేదు’’ అని పేర్కొన్నారు.ఇక కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమయంలో రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా భారత్‌లో లేకపోటంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన కంటి శస్త్రచికిత్సకు లండన్ వెళ్లి ఇటీవల భారత్ తిరిగి వచ్చారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల ర్యాలీల్లో రాఘవ్ పాల్గొంటున్నారు. ఇటీవల (మే 13) సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని స్వాతి మలివాల్ కేసు నమోదు చేసిన విషయంలో తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కోనసాగుతోంది. ఆమెపై దాడి జరిగినట్లు చేస్తున్న ఆరోపణల వెనక బీజేపీ కుట్ర ఉందని ఆప్ నేతలు విమర్శలు చేస్తున్నారు. -
‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
ఢిల్లీ: తనపై దాడి జరిగిన సమయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ అన్నారు. ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. దాడికి సంబంధిచి పలు విషయాలు పంచుకున్నారు.‘‘ మే 13న సీఎం ఆరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ నాపై దాడి చేస్తున్నప్పుడు నేను అరుస్తునే ఉన్నారు. కానీ, నన్న రక్షించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాడి జరిగిన సమయంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఇంట్లోనే ఉన్నారు. ఈ దాడి విషయలో నేను ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేను. నేను 9 గంటలకు సీఎం నివాసానికి వెళ్లితే డ్రాయింగ్ రూంలో నన్ను వేచి ఉండాలని ఇంటి సిబ్బంది తెలిపింది. కేజ్రీవాల్ ఇంట్లోనే కూర్చొని ఉన్నారు. సీఎం నన్ను కలవడానికి వస్తారని సిబ్బంది చెప్పింది. ఒక్కసారిగా బిభవ్ నేను ఉన్న గదిలోకి దూసుకువచ్చారు. ఏం అయింది? కేజ్రీవాల్ వస్తున్నారు. ఏం అయింది? అని ఆయన్ను అడిగాను. అంతలోనే ఆయన నాపై దాడి చేయటం మొదలు పెట్టాడు. ఏడెనిమిది సార్లు నా చెంప మీద కొట్టారు. నేను ఆయన్ను వెనక్కి నెట్టేయాలని ప్రయత్నం చేశాను. తన కాలుతో నన్ను లాగి మధ్యలో ఉన్న టెబుల్‌కు నా తలను బాదారు’’ అని స్వాతి మలివాల్ తెలిపారు.‘‘బిభవ్ కుమార్ వేరే వాళ్ల సూచన మేరకే నాపై దాడి చేశారు. దాడి కేసులో నేను ఢిల్లీ పోలీసులకు సంపూర్ణంగా సహకరిస్తా. ఈ విషయంలో నేను ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వను. నాపై దాడి జరుగుతున్న సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు. నేను బాధతో ఎంత అరిచినా నన్ను ఎవరూ పట్టించుకోలేదు. నాపై జరిగిన దాడిలో విషయంలో నేను గళం ఎత్తుతాను.దాని వల్ల నా కెరీర్‌కు ఇబ్బందైనా వదిలిపెట్టను. సత్యానికి, నిజమైన ఫిర్యాదులకు మద్దతుగా ఉండాలని చెప్పే నేను నా విషయంలో అంతే ధైర్యంగా ఉండి పోరాడుతాను’’ అని స్వాతి మలివాల్ అన్నారు. ఈ కేసులో అరెస్టైన బిభవ్ కుమార్ ఫోన్ ఫార్మాట్, సీఎం నివాసం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ దాడికి సంబంధించి స్వాతి మలివాల్ వెనక బీజేపీ కుట్ర ఉందని ఆప్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ క్లీన్ స్వీప్: సాక్షితో ఎంపీ సంజయ్ సింగ్
సాక్షి, ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలో ఆమ్ ఆద్మీ పార్టీ మంచి ఫలితాలు సాధించబోతోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆయన బుధవారం సాక్షి టీవీతో మాట్లాడారు.‘‘ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టి బీజేపీ హింసిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మేము జైలు అంశాన్ని ప్రచారం చేస్తున్నాం. ‘జైలు కా జవాబ్ ఓటు సే’అనే నినాదంతో ఎన్నికల్లో దిగాం. ఆప్‌కు ఓటేస్తే దేశవ్యాప్తంగా 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తాం. రైతులకు స్వామినాథన్ సిఫారసుల ప్రకారం గిట్టుబాటు ధర ఇస్తాం. పంజాబ్‌కు బీజేపీలో అవకాశం ఇవ్వకూడదని వ్యూహాత్మకంగా ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తుంది.ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి బయటపడతాం. బీజేపీకి చందాలు ఇచ్చిన వ్యక్తులు ఈ కేసు నుంచి బయటపడ్డారు. ఈడీ బీజేపీ నాయకులపై ఎందుకు సోదాలు చేయడం లేదు. మమ్మల్ని బలవంతంగా జైల్లో పెట్టారు. ఇదే అంశాన్ని ప్రజల్లో ప్రచారం చేస్తే, సానుభూతి కోసమని ఎలా అంటారు?. కేజ్రీవాల్ దేశం కోసం పని చేస్తే, మోదీ తన దోస్తుల కోసం పనిచేస్తున్నారు. దేశంలో ఉన్న ఎయిర్‌పోర్టులు, పోర్టులు తన దోస్తులకు కట్టబెట్టారు’’ అని సంజయ సింగ్ మడ్డారు. ఇక.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో తీహర్ జైలులో కస్టడీలో ఉన్న సంజయ్ సింగ్ ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. -
స్వాతి మలివాల్ కేసు: సీఎం నివాసంలో సీసీటీవీ ఫుటేజీ స్వాధీనం
ఢిల్లీ: ఆప్ రాజ్యసభ స్వాతి మలివాల్‌పై దాడి జరిగిన కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోని సీసీటీవీ కెమెరాలకు సంబంధించి డిజిటల్ వీడియో రికార్డ్ (డీవీఆర్)లను పోలీసులు స్వాధీనం చేసకున్నారు. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం వెల్లడించింది. కాగా.. లోక్‌సభ ఎన్నికల ముందు పార్టీ ప్రతిష్టను దెబ్బతీయాలని పోలిసులు ప్రయత్నం చేస్తున్నారని ఆప్ ఆరోపించింది. దర్యాప్తుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు కట్టకథలు అల్లుతోందని ఆప్ ఆరోపణుల చేసింది. ఇక.. ఢిల్లీ పోలీసులు నుంచి ఎటువంటి సత్వరమైన స్పందన లేదని పేర్కొంది. ‘‘పోలీసులు శనివారమే కేజ్రీవాల్ నివాసంలోని సీసీటీవీ కెమెరాల డీవీఆర్‌లను స్వాధీనం చేసుకున్నారు. మళ్ల ఆదివారం కూడా సీఎం నివాసంలోని మిగతా చోట్ల ఉన్న సీసీటీవీ కెమెరాల డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ తొలగించారని పోలీసులు చెబుతున్నారు. కానీ, అప్పటికే పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కావాలనే వాటిపై కట్టుకథలు అల్లుతున్నారు’’ అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు. అదే విధంగా సీఎం నివాసంలోని సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణను పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ ఆధీనంలో ఉంటుందని సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.ఈ కేసుకు సంబంధించిన ఆయలు పలు ప్రశ్నలు సంధించారు. ‘‘మే 13న స్వాతి మలివాల్ నుంచి పోలీసులకు కాల్ వచ్చింది. అయితే కొద్దిసేటికే ఈ విషయం మీడియాకు వ్యాపించింది. సెక్షన్ 354(బీ)కి కేసు నమోదైంది. ఓ మహిళకు సంబంధించిన సున్నితమైన విషయం. కానీ, కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది. బిభవ్‌కుమార్ నిందితుడు అయితే ఆప్ వద్ద ఎఫ్ఐఆర్ కాపీ లేదు’ అని సౌరభ్ భరద్వాజ్ అన్నారు. -
ఆప్‌ను అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది: సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ముట్టడికి ప్రయత్నం చేసిన ఆప్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆప్ విఫల యత్నం చేసింది. బీజేపీ కార్యాలయం వైపు వెళ్లకుండా సీఎం కేజ్రీవాల్‌తో పాటు ఇతర నేతలను ఆప్ కార్యాలయం వద్దనే పోలీసులు నిలువరించారు. దీంతో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు అడ్డుకోవటంతో నేతలంతా ఆప్ కార్యాలయం వద్దే బైఠాయించారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడారు. ‘‘ఆప్‌ను అంతం చేయాలని బీజేపీ ఆపరేషన్ ఝాడు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ప్రధాని మోదీ ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలనుకుంటున్నారు. ఆప్ నేతల అరెస్టుకు ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయాలని చూస్తున్నారు.నాకు బెయిల్ వచ్చిన దగ్గరి నుంచి మోదీ.. ఆప్‌పై విమర్శలు చేస్తున్నారు. ఆప్ దేశానికి మంచి పనులు చేస్తోంది. ఆప్ మంచి పనులపై దేశం మొత్తం చర్చించుకుటుంది. అయితే ఆప్‌కి బీజేపీ నుంచి ముప్పు పొంచి ఉంది’’ అని కేజ్రీవాల్ మోదీ, బీజేపీపై మండిపడ్డారు.తమ పార్టీ నేతలను అరెస్ట్‌లతో బీజేపీ టార్గెట్ చేయడాన్ని తప్పుపట్టిన కేజ్రీవాల్ ఆదివారం తన పార్టీ నేతలతో బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తామని కావాలనుకుంటే అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయాలని ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి చేసిన కేసులో తన పీఏ బిభవ్ కుమార్ అరెస్టయిన నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ వీడియోలో సందేశం ద్వారా పార్టీ నేతలకు నిరసన, మార్చ్‌కు పిలుపు నిచ్చారు. -
స్వాతి మలివాల్ కేసులో సాక్ష్యాలు మాయం?!
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై జరిగిన దాడి కేసులో ఢిల్లీ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నిందితుడు బిభవ్ కుమార్ రిమాండ్ నోట్‌ను విడుదల చేశారు. ఈ కేసులో సాక్షాలు మాయమైట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. దాడి జరిగిన రోజు (మే13)న సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సీసీటీవీ ఫుటేజీని నిందితుడు బిభవ్‌కుమార్ ట్యాంపర్ చేశారని వెల్లడించారు. ‘‘విచారణకు సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ సహకరించడం లేదు. బిభవ్ కుమార్ తన ఫోన్ పాస్ వర్డ్ చెప్పడం లేదు. ఆయన ఫోన్‌ను ముంబైలో ఫార్మాట్ చేశారు. కేజ్రీవాల్ నివాసంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజీ బ్లాంక్‌గా ఉంది. దాడి జరిగిన వీడియోను తొలగించారు. సీసీటీవీ పుటేజీకి సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డర్‌ను ఇచ్చేందుకు కేజ్రీవాల్ నిరాకరిస్తున్నారు’’ అని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.‘‘ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు బ్లాంక్‌గా ఉన్నాయి. మే 23( సోమవారం) రోజు సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేసేందుకు వీలుగా డిజిటిల్ వీడియో రికార్డర్‌ను మాకు అందజేయలేదు.ముఖ్యమంత్రి నివాసంలో ఉన్న సీసీటీవీ కెమెరాల నిర్వహణ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది. ఆ విభాగానికి చెందని ఓ జూనియర్ ఇంజనీర్ ఇచ్చిన పెన్ డ్రైవ్‌ను పరిశీలించాము. కానీ అందులో ఒక వీడియో బ్లాంక్‌గా వస్తోంది. జూనియర్ ఇంజనీర్ వద్ద డీవీఆర్ యాక్సెస్ లేదు’ అని దర్యాపు చేసిన ఢిల్లీపోలీసులు రిమాండ్ నోట్లో వెల్లడించారు. ఇక.. స్వాతి మలివాల్‌పై దాడి కేసులో సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి.. ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. -
Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్‌క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ నేతలను అందరినీ ఒకేసారి అరెస్ట్ చేసి జైలుకు పంపాలని సవాల్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం పార్టీ నేతలతో కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయానికి నిరసన మార్చ్ చేపట్టనున్నారు సీఎం కేజ్రీవాల్. దీంతో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. తమ పార్టీ నేతలను అరెస్ట్‌లతో బీజేపీ టార్గెట్ చేయడాన్ని తప్పుపట్టిన కేజ్రీవాల్ ఆదివారం తన పార్టీ నేతలతో బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తామని కావాలనుకుంటే అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయాలని ఛాలెంజ్ చేశారు. ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి చేసిన కేసులో తన పీఏ బిభవ్ కుమార్ అరెస్టయిన నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ వీడియోలో సందేశం ద్వారా పార్టీ నేతలకు నిరసన, మార్చ్‌కు పిలుపు నిచ్చారు.प्रधानमंत्री जी, ये एक-एक करके क्या आप हम लोगों को गिरफ़्तार कर रहे हैं? एक साथ सभी को गिरफ़्तार कर लीजिए - CM @ArvindKejriwal l LIVE https://t.co/0LIUQdK9PZ— AAP (@AamAadmiParty) May 18, 2024‘‘మా నేతలను ఒకరి తర్వాత ఒకరిని జైలులో పెడుతున్నారు. ప్రధాని మోదీకి నేను ఒకటి చెప్పదల్చుకున్నా. అరెస్ట్‌లను ఒక క్రీడా భావిస్తున్నారు. మా నేతలనంతా ఒకేసారి అరెస్ట్ చేయండి. అందుకే నేను, మా పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలను తీసుకొని ఆదివారం బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తాం. అప్పుడు మమల్ని ఒకేసారి జైలులో వేయండి’’ అని కేజ్రీవాల్ శనివారం ఓ వీడియో విడుదల చేశారు.తమ పార్టీలో కీలకమైన నేతలను బీజేపీ టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు. వారిలో రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, మంత్రులు సౌరభ్ భరద్వాజ్, అతిశీ ఉన్నారని కేజ్రీవాల్ తెలిపారు.లోక్‌సభ ఎన్నికల వేళ ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఎ బిభవ్ కుమార్ తనపై ముఖ్యమంత్రి నివాసంలో దాడి చేశారని ఆరోపణలు చేయటం ఢిల్లీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. బిభవ్‌కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. శనివారం బిభవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఐదు రోజుల పోలీసు కస్టడీలో ఉన్నారు. సీఎం కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మలివాల్ తనతో అమర్యాదగా ప్రవర్తించారని బిభవ్ కుమార్ సైతం ఆమెపై కేసు నమోదు చేశారు.స్వాతి మలివాల్‌పై అవినీతి అరోపణ కేసు ఉండటంలో బీజేపీ కుట్రతోనే తనపై దాడి జరిగినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఆప్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.మరోవైపు.. స్వాతి మలివాల్ ఘటన విషయంలో బీజేపీ నేతలు సీఎం కేజ్రీవాల్‌పై విమర్శలు చేస్తున్నారు. దాడి జరిగి రోజులు గడుస్తున్నా.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ మౌనంగా ఉంటున్నారని మండిపడుతున్నారు. సీఎం కేజ్రీవాల్ పెదవి విప్పకపోవటంపై ఈ దాడి వెనక ఆయన హస్తం ఉందంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోంది. -
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్‌పై రాష్ట్ర మంత్రి అతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెపై అవినీతి కేసు ఆరోపణలు ఉన్నాయని వాటి నుంచి తప్పించుకోవడానికి స్వాతీ మలివాల్ బీజేపీతో కుమ్మక్కై దాడి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్ తనపై దాడి చేశాడని స్వాతి మలివాల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు కూడా నమోదైంది. అయితే తాజాగా ఆమెపై దాడి జరిగినట్లు చెబుతున్న సోమవారం రోజు.. సీఎం ఇంట్లో రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజ్ వీడియోను శనివారం ఆప్ బయటపెట్టగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Footage of Swati Maliwal being escorted out of Kejriwal's residence by lady security officer.She seems fine and cooperative. pic.twitter.com/xwnfJtBCDS— Nehr_who? (@Nher_who) May 18, 2024 ఈ వీడియోలో స్వాతీ మలివాల్ లేడీ పోలీసు భద్రత, పర్యవేక్షణలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోకి వెళ్లి.. బయటకు రావటం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంట్లో వెళ్లినప్పుడు.. మళ్లీ తిరిగి వచ్చినప్పుడు కూడా లేడీ పోలీసు వెంటనే ఉంటూ చేయ్యి పట్టుకొని ఉన్నారు. ఆమె తనను పట్టుకొవద్దంటూ వారిని విడిపించుకోవడానికి వారిస్తున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి అతిశీ శనివారం మీడియాతో మాట్లాడారు.‘స్వాతీ మలివాల్‌పై అవినీతి కేసు ఆరోపణలు ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవడానినే ఆమె బీజేపీతో కుమ్మక్కై దాడి ఆరోపణుల చేశారు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. స్వాతీ మలివాల్ ఎఫ్ఐఆర్లో చేర్చిన ఆరోపణలు అన్నీ అసత్యాలే. ఇంకా.. పోలీసులనే ఆమె బెదిరించటం వీడియోలో కనిపిస్తోంది. బిభవ్ కుమార్‌ను సైతం ఆమె తీవ్రంగా దూషించారు. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి ఆమె ఎటువంటి గాయాలు లేకుండా బయటకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది’ అని అతిశీ స్వాతీ మలివాల్‌పై మండిపడ్డారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్ తనపై దాడి చేశారని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ఆరోపణలు సంచలన సృష్టించాయి. తపై బిభవ్ కుమార్ దారుణంగా దాడి చేశాడని, గాయాలు కూడా అయినట్లు స్వాతీ మలివాల్ ఆరోణలు చేశారు. ఆమె చేసిన ఆరోపణలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ మౌనంగా ఉండటంపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. ఆమెపై దాడి వెనక సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. -
స్వాతి మాలీవాల్ ఎపిసోడ్: బిభవ్ కుమార్‌కు ఎన్డబ్ల్యూసీ సమన్లు
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్ తనపై దాడి చేశారని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఆమె చేసిన ఆరోపణలను ఆ పార్టీ సీనియర్ ఎంపీ సంజయ్ సింగ్ నిజమేనని ధృవీకరించారు. దీంతో ఈ వ్యవహారంపై గురువారం జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్కుమార్కు సమన్లు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరై.. స్వాతి మాలీవాల్‌పై దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సమన్లలో ర్కొంది. ఈ నోటీసులను జాతీయ మహిళా కమిషన్.. సీఎం కేజ్రీవాల్ కార్యాలయానికి పంపించటం గమనార్హం.సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ తనపై తీవ్రంగా దాడి చేశారని ఎంపీ స్వాతిమాలీవాల్ సోషల్ మీడియా పోస్ట్ చేసింది. అయితే ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా సుమోటోగా తీసుకున్నామని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. తనపై దాడి జరిగినట్లు ఎంపీ స్వాతి మాలీవాల్ సోమవారం బయటపెట్టారు. ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. -
‘75 ఏళ్లకు రిటైర్ కానని మోదీ చెప్పలేదు’.. కేజ్రీవాల్ విమర్శలు
లక్నో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వయస్సు, రిటైర్మెంట్పై విమర్శలు సంధించారు. ఇప్పటి వరకు పీఎం మోదీ.. తాను 75 ఏళ్ల వయస్సు దాటాక రిటైర్ కానని, ఎక్కడా స్పష్టం చేయలేని కేజ్రీవాల్ గుర్తుచేశారు. ఆప్, సమాజ్‌వాదీ పార్టీ సంయుక్తంగా బుధవారం నిర్వహించిన మీడియాలో సమావేశంలో ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్‌తో పాటు కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడారు.‘ప్రధాని మోదీ తనకు 75 ఏళ్లు దాటాక, తాను పదవీ విరమణ చేయనని.. ఎప్పుడూ స్పష్టం చేయలేదు. 75 ఏళ్ల తర్వాత రిటైర్ కావాలనే నిబంధనను మోదీ ఉల్లంఘించరని దేశం మొత్తం నమ్మకంతో ఎదురుచూస్తోంది’ అని సీఎం కేజ్రీవాల్ అన్నారు.‘బీజేపీ అమిత్ షాను ప్రధాని చేయటం కోసం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం.. సీనియర్ నేతలైన శివరాజ్ సింగ్ చౌహాన్, డాక్టర్ రమణ్ సింగ్, వసుంధర రాజే, మనోహర్ లాల్ ఖట్టర్, దేవేంద్ర ఫడ్నవీస్ వంటి వారిని పక్కకు పెట్టింది. దీనికి అడ్డుగా ఉన్న యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ను కూడా మరో 2-3 నెలల్లో బీజేపీ పక్కకు పెడుతుంది’ అని అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు చేశారు.ఇక.. ఇటీవల తిహార్ జైల్ నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ ఓర్యాలీలో పాల్గొని ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.‘ ఈసారి బీజేపీ గెలిస్తే.. అమిత్ షాను ప్రధానిగా చేయాలని బీజేపీ ప్రణాళిక వేస్తుంది. ఎందుకుంటే 2025 వరకు మోదీకి 75 ఏళ్లు నిండుతాయి. దీంతో బీజేపీ పార్టీ నిబంధనల ప్రకారం మోదీ.. ఏ పదవీ చేపట్టకుండా రిటైర్ అయిపోతారు. తర్వాత అమిత్ షా పీఎం అవుతారు’అని అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ‘నరేంద్ర మోదీ 2029 వరకు అంటే.. పూర్తి ఐదేళ్ల పాటు ప్రధానిగా కొనసాగుతారు. ఆ తర్వాత కూడా బీజేపీ పార్టీకి ఆయన నాయకత్వం వహిస్తారు. అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మోదీ వయస్సుపై ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు’ అని అమిత్ షా స్పష్టం చేశారు. -
‘ఉగ్రవాదిని కాదు.. నేను అరవింద్ కేజ్రీవాల్‌ని’
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశానికి, ఢిల్లీ ప్రజలకు కోసం ఒక కుమారుడుగా, సోదరుడుగా పనిచేశారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. తీహార్ జైలు నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని మీడియాకు సంజయ్ సింగ్ వెల్లడించారు. ‘నా పేరు అరవింద్ కేజ్రీవాల్. నేను ఉగ్రవాదిని కాదు. మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నేను పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్‌ను తీహార్ జైల్లో గ్లాస్ గోడ ద్వారా కలిశాను. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆప్‌పై ఎంత ద్వేషం పెంచుకున్నారో తెలుసుకోవడానికి ఇదే నిదర్శనం’ అని సీఎం కేజ్రీవాల్ తెలిపారన్నారు. 24 గంటలు సీఎం అరవింద్ కేజ్రీవాల్ మనోభావాలను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ సింగ్ మండిపడ్డారు. ‘జైలులో ఉన్నది సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆయన ఓ మట్టి మనిషి.. అయన్ను ఎంత విచ్ఛినం చేయాలని చూసినా అంతే బలంగా తిరిగి వస్తారు. తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్ కలసిన పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ భావోద్వేగానికి గురయ్యారు. ఇది మనందరికీ చాలా ఉద్వేగభరితమైన విషయం. ప్రధాని మోదీ, బీజేపీకి సిగ్గు చేటు’ అని సంజయ్ సింగ్ అన్నారు. ‘ప్రధాని మోదీ సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలక్టోరల్ బాండ్ల పథకం ఉత్తమమైనది అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ, చట్ట వ్యతిరేకమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మోదీ సుప్రీ కోర్టు తీర్పును అవమానించారు. మోదీ సుప్రీం కోర్టుక, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. -
కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. మరో 2 వారాలు జైల్లోనే
ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన అరెస్టును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లో ఆయనకు ఊరట లభించలేదు. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇవాళ విచారణ జరిపింది. విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపంకర్ దత్త ధర్మాసనం.. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఈడీకి నోటిసులు జారీ చేసింది. ఏప్రిల్ 24 వరకు సమాధానం ఇవ్వాలని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈడీ సమాధానంపై ఏప్రిల్ 27 వరకు రిజాయిన్డెర్ దాఖలు చేయాలని కేజ్రీవాల్‌కు తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. ఈడీ అరెస్ట్ చట్ట విరుద్ధం అని ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టును కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోరారు. ఈ కేసులో ఏం జరిగిందో తమకు తెలుసని సుప్రీంకోర్టు పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చట్ట బద్దంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగిందని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏప్రిల్ 10న సుప్రీంకోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. లిక్కర్ పాలసీ స్కాం కేసులో ఈడీ సమన్లను సీఎం కేజ్రీవాల్ పదేపదే నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఈడీ మార్చి 21వ తేదీన ఆయన్ని అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. 15వ తేదీ వరకు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. నేటితో ఆయన జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది. అదే సమయంలో లిక్కర్ కేసులో మరో నిందితుడు, ఆప్ మాజీ మంత్రి మనీష్ సిసోడియా బెయిల్ విచారణ కూడా నేడు జరగనుంది. రౌస్ అవెన్యూ కోర్టులో మనీష్ సిసోడియా దాఖలు చేసిన రెండో పిటిషన్ ఇది. -
Delhi Liquor Scam: సంక్షోభం వేళ ఎంపీల మౌనం!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఆ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఆ పార్టీ ఎంపీలు మాత్రం మౌనవ్రతం పాటిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. పారీ్టకి చెందిన 10 మంది రాజ్యసభ ఎంపీల్లో కేవలం ఇద్దరే కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఖండిస్తూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మిగతా వారి వ్యవహారంపై పార్టీ సమావేశంలో చర్చించాలనే డిమాండ్లు అంతర్గతంగా ఊపందుకున్నాయి. ఎనిమిది మంది గాయబ్.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ గత నెల 21న అరెస్టయ్యారు. అప్పటి నుంచి ఆ పార్టీ ఢిల్లీసహా పలు రాష్ట్రాల్లో నిరసనలు, ర్యాలీలు చేపట్టింది. ఈ కార్యక్రమాల్లో ఇద్దరు ఆప్ రాజ్యసభ సభ్యులు సంజయ్‌సింగ్, సందీప్ పాఠక్‌లు మాత్రమే చురుగ్గా ఉంటున్నారు. మిగతా 8 మంది సభ్యులు అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. సంజయ్ సింగ్ ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచి్చన మరునాటి నుంచే బీజేపీని, దర్యాప్తు సంస్థల పనితీరును తప్పుపడుతూ ప్రకటనలు చేస్తున్నారు. సందీప్ పాఠక్ సైతం సోషల్ మీడియాతో పాటు జాతీయ మీడియాలో ఆప్ గొంతుక వినిపిస్తున్నారు. పార్టీ కోశాధికారి, ఎంపీ ఎన్డీ గుప్తా అడపాదడపా మాత్రమే నిరసనల కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. పూర్తి స్థాయి కార్యక్రమాలకు మాత్రం ఆయన దూరంగానే ఉంటున్నారు. మీడియా భేటీల్లో, సభల్లో మోదీ ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొంటున్న ఎంపీ రాఘవ్ చద్దా ఆచూకీ కనిపించడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆయన ఢిల్లీలో లేరు. గత నెల మొదటి వారంలో లండన్ వెళ్లి కంటికి చికిత్స చేసుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు. మార్చి చివరి వారంలోనే ఆయన ఢిల్లీ రావాల్సి ఉన్నా, వైద్యుల సూచన మేరకు అక్కడే ఉండిపోయారంటున్నారు. మరో కీలక నేత స్వాతి మలివాల్ సైతం అమెరికాలో ఉన్నారు. అక్కడి నుంచి కేజ్రీవాల్ అరెస్ట్‌ను సామాజిక వేదికలపై ఖండిస్తున్నారు. ప్రత్యక్ష నిరసల్లో ఇంతవరకూ పాల్గొనలేదు. తన సోదరి అనారోగ్యం దృష్ట్యా అమెరికాలో ఉండాల్సి వస్తోందని, తిరిగి వచ్చాక ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా పోరాడుతానని అంటున్నారు. పంజాబ్‌కు చెందిన పార్టీ ఎంపీ సంజీవ్ అరోరా కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆయన భార్య సునీతతో భేటీ అయ్యారు. అది మినహా రాంలీలా మైదానంలో జరిగిన ర్యాలీ, జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమాల్లోగానీ పాల్గొనలేదు. మరో ఇద్దరు ఎంపీలు అశోక్‌కుమార్ మిట్టల్, క్రికెటర్ హర్బజన్‌సింగ్‌లు కేజ్రీ అరెస్ట్ మినహా ఇతర అంశాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పర్యావరణ వేత అయిన ఎంపీ బల్బీర్‌సింగ్ సీచేవాల్, మరో ఎంపీ విక్రమ్‌జీత్ సింగ్ చాహ్నీలు సైతం తమ వ్యక్తిగత వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. ఇలా..పార్టీ ఎంపీలు మౌనవత్రం దాల్చడంపై సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఒకట్రెండు రోజుల్లో జరిగే కీలక భేటీలో ఎంపీల తీరుపైచర్చిస్తామని సంజయ్ సింగ్ చెప్పారు. -
కేజ్రీవాల్‌ను సునీత కలిస్తే తప్పేంటి?: సంజయ్ సింగ్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మానీలాండరింగ్ అభియోగాల కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన భార్య సునితా కేజ్రీవాల్ వ్యక్తిగతంగా సమావేశం కావడానికి అనుమతి ఇవ్వకపోవటంపై ఆప్ నేత సింజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం జైలు కిటికీ వద్దనే కలవడాకి అనుమతించటం చాలా అమానవీయమని అన్నారు. సంజయ్ సింగ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘భయంకరమైన నేరాలకు పాల్పడినవారిని సైతం తమ బ్యారక్‌లలో సమావేశాలు చేసుకోవడానికి అనుమతి ఇస్తారు. మూడుసార్లు సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన భార్య సునితా కేజ్రీవాల్‌ను మాత్రం జైలు రూం గ్లాస్ కిటికీ వద్ద కలవమనటం సరికాదు. ఎందుకు ఇంత అమానవీయం?. సునితా కేజ్రీవాల్.. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను వ్యక్తిగతంగా సమావేశం అవుతానని అప్పీల్ కూడా చేసుకున్నారు. తీహార్ జైలు అధికారులు రూంలో వ్యక్తిగతంగా సమావేశం కావడానికి అనుమతి ఇవ్వలేదు. కేవలం జైలు రూం కిటికీ వద్ద కలవడానికే మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇది సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అవమానించటమే కాకుండా నైతిక విలువలను ఉల్లంఘించటం’ అని తీహార్ జైలు అధికారులపై సంజయ్ సింగ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసి సమావేశం కావడాన్ని సంజయ్ సింగ్‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రద్దు చేసుకున్నారు. ఇక.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ ఆరోపణలపై సంజయ్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీ నుంచి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. -
సీఎం కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీపై వేటు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ కేసులో అరెస్టై.. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రైవేట్ పర్సనల్ సెక్రటరీ భిభవ్ కుమారుపై వేటు పడింది. ఢిల్లీ డైరెక్టరేట్ ఆప్ విజిలెన్స్ గురువారం ఆయన్ను విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు విజిలెన్స్ స్పెషల్ సెక్రటరీ వైవీవీజే రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. భిభవ్ కుమార్‌పై నమోదైన కేసు, తాత్కాలిక నియామకానికి సంబంధించి సెంట్రల్ సివిల్ సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించి నియమించినందకు ఆయన విధులను రద్దు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2007లో తన విధలు నిర్వమించకుండా అడ్డుకుని, బెదిరింపులకు పాల్పడటంతో భిభివ్ కుమార్‌తో పాటు మరో ముగ్గురిపై నోయిడా డెవలప్మెంట్ అథారిటీలో పని చేసే మహేష్ పాల్ అనే ప్రభుత్వ అధికారి కేసు నమోదు చేశాఉ. దీంతో పోలీసులు వారిపై ఎఫ్‌ఐఆర్‌బుక్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో పరిపాలనపరమైన చర్యలో భాగంగా భిభవ్ కుమార్‌ను సీఎం కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీగా తొలగించారు. మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సోమవారం భిభవ్ కుమార్‌ను ఈడీ ప్రశ్నించింది. అదే విధంగా మనీలాండరింగ్ యాక్ట్ కింద భిభవ్ కుమార్ వద్ద స్టేట్మెంట్ రికార్డు చేసినట్లుగా ఈడీ పేర్కొంది. కేజ్రీవాల్ తన అరెస్ట్ అక్రమమని, ఈడీ అరెస్ట్‌ను రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అనంతరం ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఈ పిటిషన్‌పై విచారణను పరిశీలిస్తామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. -
‘కేజ్రీవాల్‌ది సిగ్గులేనితనం’.. సీఎంగా రాజీనామా చేయాలి
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండ్‌రింగ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ పట్టుపడుతోంది. అరెస్ట్ అయిన మొదటి నుంచి కేజ్రీవాల్ సీఎంగా కొనసాగడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ రాజీనామా వ్యవహారంపై మంగళవారం కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరి కూడా స్పందించారు. ‘నేను రాజ్యాంగ నిబంధనలు అధికంగా తెలిసిన నిష్ణాతున్ని కాదు. అయితే, కేజ్రీవాల్ సీఎంగా కొనసాగాలా? వద్దా? అనే విషయాన్ని నేను చెప్పలేను. కానీ, 50 ఏళ్ల ప్రజా జీవితంలో ఉన్న నేను.. కేజ్రీవాల్ ఇంకా సీఎం కోనసాగటం చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నా. అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్నాక కూడా సీఎం పదవికీ రాజీనామా చేయకపోవటం సిగ్గులేనితనం. రాజకీయ విలువలు తెలిసిన వారు.. జైలులో వెళ్లిన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేస్తారు. పార్టీలో ఒకరికీ ఢిల్లీ సీఎం బాధ్యతలు అప్పగిస్తారు. జైలులో ఉండి ప్రభుత్వాన్ని నడపటం సరికాదు’ అని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. మరోవైపు.. ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా వెంటనే రాజీనామా చేయాలని మరో బీజేపీ నేత బాన్సూరి స్వరాజ్ డిమాండ్ చేశారు. ‘ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ చాలా కీలకమైన వ్యక్తి అని హైకోర్టు తేల్చిచెప్పింది. కేజ్రీవాల్ సీఎంగా ఉంటూ మనీలాండరింగ్ చేశారు. ఈడీ చెప్పిన విషయాలను హైకోర్టు నిజాలుగా చెప్పింది. కేజ్రీవాల్ అరెస్ట్ సైతం చట్టవ్యతిరేకం కాదని హైకోర్టు వెల్లడించింది. నైతిక బాధ్యత వహిస్తూ.. కేజీవాల్ సీఎం పదవికి వెంటనే రాజీనామా చేయాలి. లిక్కర్ స్కామ్‌లో సుమారు రూ. 100 కోట్లను పార్టీ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారు. ఈడీ పేర్కొన్న దర్యాప్తు విషయాలను హైకోర్టు పరిశీలించింది’ అని బాన్సూరి స్వరాజ్ తెలిపారు. ఇక.. ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టు మంగళవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్ట్‌కు ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నయని, హవావలా ద్వారా డబ్బు తరలింపుకు సంబంధించి ఈడీ ఆధారాలు చూపించిందని పేర్కొంది. గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్ చెప్పారని కోర్టు తెలిపింది. కేజ్రీవాల్ అరెస్ట్, రిమాండ్ చట్ట విరుద్ధం కాని కోర్టు పేర్కొంది. -
వివాదంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునితా కేజ్రీవాల్ వివాదంలో చిక్కుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్, బీఆర్ అంబేద్కర్ మధ్యలో ఆమె భర్త, మద్యం కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ ఫోటో పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ఫోటోపై భగత్ సింగ్ మునిమనవడు యాదవేంద్ర సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘నేటి రాజకీయాలు వ్యక్తిగతంగా మారుతున్నాయి. ప్రజలకన్న వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రాజకీయాలు జరుగుతున్నాయి. ఏ నాయకుడిని ఆయనతో (భగత్‌సింగ్) పోల్చకూడదు. ఆయన దేశం, సమాజం కోసం కృషి చేశారు. సొంత ప్రయోజనాలు చూసుకోలేదు’ అని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పొరపాటున ఇలా చేసి ఉంటే, దానిని సరిదిద్దాలని, అంబేద్కర్, భగత్ సింగ్ చిత్రపటాల మధ్య ఉంచిన కేజ్రీవాల్ ఫోటోను తొలగించాలని యాదవేంద్ర సింగ్ డిమాండ్ చేశారు. అంతకుముందు, ఈ చిత్రంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపించింది. కేజ్రీవాల్ నిందితుడని, భగత్ సింగ్ డాక్టర్ అంబేద్కర్ లాంటి దేశభక్తుల మధ్య అతని ఫోటోను ఉంచడం ఆప్ వారి గౌరవాన్ని కించపరిచిందని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. -
తీహార్ జైలు నుంచి ఆప్ ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ సందేశం
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై.. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈడీ లాకప్ ఉండి పారిపాలన కొనసాగించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు ఆదేశాలు కూడా జారీ చేశారు. తాజాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి పంపిన సందేశాన్ని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ మీడియాకు చదవి వినిపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లోని ప్రాంతాలను ప్రతిరోజూ సందర్శించాలని కేజ్రీవాల్ సూచించినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నాట్లు వివరించారు. ‘నేను జైలులో ఉన్నందున ఢిల్లీ ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులకు గురికావొద్దు. ప్రతిరోజూ ఎమ్మెల్యేలంతా వారి నియోజకవర్గాలోని ప్రాంతాలను సందర్శించాలి. అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలి’ అని కేజ్రీవాల్ సందేశం పంపినట్లు సునీతా కేజ్రీవాల్ మీడియకు తెలిపారు. అంతకు ముందు లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో బెయిల్ లభించిన ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సునీతా కేజ్రీవాల్ కలిశారు. ఇక.. ఇటీవల అరవింద్ కేజ్రీవాల్‌ను ఆశీర్వదిస్తూ..వాట్సప్‌లో సందేశాలు పంపి మద్దతు పలకాలని సునీతా కేజ్రీవాల్ ఒక వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 15 వరకు కొనసాగనుంది. -
అవమానించేందుకే అరెస్ట్ చేశారు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్, ట్రయల్ కోర్టు కస్టడీ తీర్పును సవాల్ చేస్తూ మార్చి 23న అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సీఎం కేజ్రీవాల్ పిటీషన్‌పై జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన ఏకసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వీ వాదనలు వినిపిస్తున్నారు. తన క్లైంట్ అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవని తెలిపారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేముందు ఆయన నివాసం వద్ద ఎటువంటి స్టేట్మెంట్ తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. అరెస్టకు ముందు ఈడీ అసలు అటువంటి ప్రయత్నమే చేయలేదని కోర్టుకు తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ పారిపోయే అవకాశం ఉందా?. ఆయన ఒకటిన్నర ఏళ్లలో ఎవరైనా సాక్షిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారా?. ప్రశ్నించడానికి నిరాకరించారా? అని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వీ ఈడీని ప్రశ్నించారు. అంతకుముందు హైకోర్టులో హాజరుపరిచే క్రమంలో సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో నన్ను అవమానపరిచేందుకు అరెస్టు చేశారు. ఎన్నికల ప్రచారాన్ని ఆపేందుకు అరెస్టు చేశారు. ఈడీ నా నుంచి ఎలాంటి స్టెట్మెంట్ రికార్డ్ చేయలేదు’ అని అన్నారు. ఇక.. ఈడీ కస్టడీ ముగిసిన అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు సోమవారం జ్యుడీషియల్ కస్టడీ విధించగా.. అయన్ను తీహార్ జైల్క తరలించారు. కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుంది. మార్చి 21 తేదీన సాయంత్రం ఈడీ రెండున్నర గంటల పాటు విచారించి.. అనంతరం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
‘కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోంది.. జైలులో 4.5 కేజీల బరువు తగ్గారు’
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ (రిమాండ్ ఖైదీ)లో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో తిహార్ జైల్లో ఉన్న సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యం సరిగా లేదని జలవనరుల శాఖ మంత్రి ఆతీశీ అన్నారు. ఆయన అస్వస్థతకు గురయ్యారని.. మార్చి 21న సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు 4.5 కిలోల బరువు తగ్గారని ‘ఎక్స్ ’వేదికగా ఆమె తెలిపారు. ‘సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహం (డయాబెటిక్స్) కలిగి ఉన్నారు. ఆరోగ్య సమ్యలు ఉన్నపటికీ ఆయన దేశం కోసం రోజంతా పని చేస్తున్నారు. అరెస్ట్ అయిన దగ్గరి నుంచి కేజ్రీవాల్ 4.5 కిలోల బరువు తగ్గారు. ఇది చాలా బాధ కలిగించే విషయం. బీజేపీ కావాలని కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోంది. కేజ్రీవాల్‌కు ఏమైనా అయితే దేశమే కాదు.. భగవంతుడు కూడా క్షమించడు’అని మంత్రి ఆతీశీ ఆవేదన వ్యక్తం చేశారు. अरविंद केजरीवाल एक severe diabetic हैं। स्वास्थ की समस्याओं के बावजूद, वे देश की सेवा में 24 घण्टे लगे रहते थे। गिरफ़्तारी के बाद से अब तक, अरविंद केजरीवाल का वज़न 4.5 किलो घट गया है। यह बहुत चिंताजनक है। आज भाजपा उन्हें जेल में डाल कर उनके स्वास्थ को ख़तरे में डाल रही है। अगर… — Atishi (@AtishiAAP) April 3, 2024 అయితే తీహార్ జైలు అధికారు ఆతీశీ మాటలపై స్పందిస్తూ.. కేజ్రీవాల్ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. రెండు రోజు క్రితం ఆయన తీహార్ జైలుకు వచ్చినప్పటి నుంచి కేజ్రీవాల్ బరువు తగ్గలేదని చెప్పారు. అత్యంత భద్రత గల జైలు గదిలో ఆయన్ను ఉంచినట్లు తెలిపారు. అదేవిధంగా కేజ్రీవాల్ 55 కేజీల బరువు ఉన్నారు. ఆయన బరువులో ఎలాంటి మార్పు లేదు. ఆయన షుగర్ లెవల్స్ కుడా నార్మల్‌గానే ఉన్నాయని జైలు అధికారులు తెలిపారు. ఉదయం కేజ్రీవాల్ యోగా, మెడిటేషన్ చేస్తున్నారని అన్నారు. ఆయకు కేటాయించిన సెల్లో కేజ్రీవాల్ నడుస్తున్నారని చెప్పారు. ఇక..ఈడీ కస్టీడీ ముగిసిన అనంతరం అరవింద్ కేజీవాల్ను సోమవారం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలు పంపిన విషయం తెలిసిందే. ఆయన జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 15ను వరకు కొనసాగనుంది. -
సునీతా కేజ్రీవాల్ ‘నియంతృత్వం’ విమర్శలపై బీజేపీ కౌంటర్
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు.. తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. కోర్టు ఆయనకు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అలాగే తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘సీఎం కేజ్రీవాల్‌ను జైలుకు ఎందుకు పంపారు?. వారికి( బీజేపీ) ఒక్కటే లక్ష్యం ఉంది..లోక్‌సభ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్లో జైలులోనే ఉంచటం. దేశ ప్రజలు ఇలాంటి నియంతృత్వానికి గట్టి సమాధానం చెబుతారు’ అని సునీతా కేజ్రీవాల్ అన్నారు. సునీతా కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజీపీ కౌంటర్ ఇచ్చింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సునీతా కేజ్రీవాల్‌ను రబ్రీదేవీతో పోల్చారు. ‘రబ్రీదేవి సిద్ధమవుతోంది. గత వారం, పది రోజుల్లో ఇప్పటికే మూడు, నాలుగు సార్లు చెప్పాను. రబ్రీ త్వరలో మనముందుకు వస్తుంది. అంటే నేను అనేది..సునీతా కేజ్రీవాల్ సీఎంగా రాబోతుంది. అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఇద్దరు నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌తో కేబినెట్ చర్చలు జరుపుతున్నారు. ఏ ప్రభుత్వమైనా జైలు నుంచి నడపుతారా? ఇక్కడి ప్రభుత్వంలో మాత్రం ముగ్గురు మంత్రులు జైలులో ఉన్నారు. వారు అక్కడే కేబినెట్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు’ అని హర్దీప్ సింగ్ పూరి ఎద్దేవా చేశారు. ఇక.. అవినీతి కేసులో ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ జైలు వెళ్లినప్పుడు ఆయన భార్య రబ్రీదేవి సీఎం అయిన విషయం తెలిసిందే. -
మోదీది ‘మ్యాచ్ ఫిక్సింగ్ ’.. రాహుల్ గాంధీ విమర్శలు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ చేస్తున్న 400 లోక్‌సభ సీట్ల గెలుపు నినాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి లోక్‌తత్ర బచావో (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) పేరుతో చేపట్టిన ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈవీఎంలు, మ్యాచ్ ఫిక్సింగ్, సోషల్ మీడియా, మీడియాపకై ఒత్తిడి పెంచటల చేయకుండా బీజేపీ కనీసం 400 సీట్లు గెలవలేదని అన్నారు. అలా చేయకుండా ఉంటే బీజేపీ కనీసం 180 సీట్లు కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు. ‘ఐపీల్ మ్యాచ్‌ల్లో అంపైర్లపై ఒత్తిడి పెంచి, ప్లేయర్లను కొనుగోలు చేసి.. కెప్టెన్లు మ్యాచ్ గెలుస్తారు. దీన్ని క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. రాజకీయాల్లోకూడా అలాగే.. లోక్ సభ ఎన్నికల్లో ముందు మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది. అంపైర్లు ప్రధాని మోదీని ఎంచుకుంటారు. ఇద్దరు ప్లేయర్లను మా టీం నుంచి అరెస్ట్ చేస్తారు. పేదల నుంచి రాజ్యాంగాన్ని లాక్కోవడానికి ప్రధాని మోదీ, కొంతమంది ధనవంతులు కుట్రతో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు’ అని రాహుల్ గాంధీ సెటైర్లు చేశారు. ‘ఇవి సాధారణ ఎన్నికలు కావు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే ఎన్నికలు. భారీ మద్దతు ఓట్లు వేయకపోతే... వాళ్లు(బీజేపీ) మ్యాచ్ ఫిక్సింగ్ చేసి మరీ గెలుస్తారు. అప్పడు రాజ్యాంగాన్ని నాశనం చేస్తారు. రాజ్యాంగం అనేది ప్రజల గొంతుక. ఏదోరోజు ఆ రాజ్యాంగం కనుమరుగు చేస్తారు. అప్పడు దేశం కూడా నాశనం అవుతుంది’ అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్‌నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఎన్సీపీ( శరద్ చంద్ర పవార్) అధినేత శరద్ పవార్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ పాల్గొన్నారు. -
‘రాఘవ్ చద్దా ఎక్కడ?’.. పోస్ట్ డిలీట్ చేసిన ఎన్సీపీ నేత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై.. ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆయన అరెస్ట్‌ను ఆప్ మంత్రులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఇకప్పటికీ స్పందించకపోవటంపై ఎన్సీపీ (శరద్ పవార్) నేత జితేంద్ర అవధ్ ‘ఎక్స్’ వేదికగా విమర్శలు చేశారు. అయితే ప్రతిపక్షాల కూటమిలో భాగంగా.. ఎన్సీపీ, ఆప్ భాగస్వామ్య పార్టీలు ఉన్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఎంపీ రఘవ్ చద్దా స్పందించలేదని ఎన్సీపీ నేత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. ‘రఘవ్ చద్దా ఎక్కడ?’ అని ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టిన ఎన్సీపీ నేత జితేంద్ర అవధ్ తర్వాత దాన్ని డిలీట్ చేయటం గమనార్హం. శనివారం జితేంద్ర అవధ్ మాట్లాడుతూ.. ‘ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి రాజ్యసభ ఎంపీ రఘవ్ చద్దా కనిపించటం లేదు. ఆ పార్టీ నేతలు కేజ్రీవాల్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. కానీ, ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎంపీ రాఘవ్ చద్దా మాత్రం కనిపించటం లేదు. ఆప్‌కు రాఘవ్ చద్దా కీలకమైన నేత.. ఆయన ఇక్కడ లేకపోవటం, అరెస్ట్‌పై స్పందించకపోవటం కార్యకర్తలను అవనించినట్లే’ అని జితేంద్ర అన్నారు. దూరంగా వేరే దేశంలో ఉన్నంత మాత్రనా ప్రజలతో కనెక్ట్కాలేని రోజుల కాలం కాదు. ఆయన లండన్‌లో ఉన్పటికీ కనీసం స్పందిచకపోవటం చాలా విచిత్రం. ఒక వీడియో సందేశమైనా పార్టీకి, కార్యకర్తలకు పంపాలి. రఘవ్ చద్దా పూర్తిగా కనిపించకుండా, పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటాన్ని ప్రశ్నిస్తున్నా’ అని ఎనన్సీపీ నేత జితేంద్ర అవధ్ అన్నారు. ఇక.. రఘవ్ చద్దా, ఆయన భార్య పరిణితి చోప్రాతో కలిసి లండన్ వెళ్లారు. కంటికి సంబంధించిన చికిత్స కోసం అక్కడికి వెళ్లినట్లు తెలుసస్తోంది. ఢల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 1తో ఈడీ కస్టడీ ముగియనుంది. -
‘కేజ్రీవాల్‌కు సంఘీభావం తెలపండి’.. ఇదే హెల్ప్‌లైన్ నంబర్
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ అభియోగాలపై అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్‌కు గురువారం కోర్టు మరో నాలుగు రోజుల ఈడీ కస్టడీ విధించింది. అయితే.. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్(8297324624)ను ప్రారంభించారు. లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌కు తమ సందేశం తెలియజేయాలనుకునే కార్యకర్తలు, అభిమానుల కోసం ఈ హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని శుక్రవారం తెలిపారు. ఇప్పటికే సీఎం కేజ్రీవాల్ త్వరగా విడుదల కావాలని ప్రార్థనలు చేస్తున్నారని చెప్పారు. అదే విధంగా వందల సంఖ్యలో అభిమానాలు కేజ్రీవాల్ కోసం సందేశాలు పంపుతున్నారని అన్నారు. ‘సీఎం కేజ్రీవాల్‌ను ఎంత ప్రేమిస్తున్నారో మాకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ సంఘీభావ సందేశం సీఎం కేజ్రీవాల్ వరకు చేరుతుంది. ఆయన వాటన్నింటిని ప్రేమతో చదువుతారు. మీరు ఆప్ పార్టీకి చెందినవారే కానవసరం లేదు. మీరంతా ఆయన త్వరగా బయటకు రావాలని ఆశీర్వదించండి’ అని సునీతా కేజ్రీవాల్ ఓ వీడియోను విడుదల చేశారు. గురువారం వరకు సీఎం కేజ్రీవాల్ ఆరురోజుల కస్టడీ ముగియగా.. రౌస్ అవెన్యూ కోర్టు మరో నాలుగు రోజులు పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ సమయంలో కోర్టు ప్రాంగణంలో అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. తనను రాజకీయ కుట్రలో భాగంగా అరెస్ట్ చేశారన్నారు. వారికి ఢిల్లీ ప్రజలే సమాధానం చెబుతారని చెప్పారు. కోర్టు కస్టడీ పొడగించిన అనంతరం.. ‘సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరోగ్యం సరిగా ఉండటం లేదు. మీ సీఎం అక్కడ వేధింపులకు గురవుతున్నారు. ఢిల్లీ ప్రజలు తగిన సమాధానం ఇవ్వాలి’అని సునీతా కేజ్రీవాల్ తెలిపారు. ఇక.. మర్చి 21న అరెస్టైన సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ.. ఏప్రిల్ 1 వరకు కొనసాగనుంది. -
భారత అంతర్గత వ్యవహరాలపై స్పందించిన యూఎన్ఓ
న్యూయార్క్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లోక్ సభ ఎన్నికలకు ముందు ఐటీ విభాగం కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఫ్రీజ్ చేయటం వంటి అంశాలపై తాజాగా ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ)స్పందించింది. అయితే ఇటీవల ఈ విషయాలపై అమెరికా స్పందించగా.. భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు కూడా జరీ చేసింది. ఒక్కరోజు వ్యవధిలో ఐక్యరాజ్య సమితి స్పందించటం గమనార్హం. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల ముందు విపక్ష సీఎం అరెస్ట్, ప్రతిపక్షపార్టీ ఖాతాల స్తంభనతో నెలకొన్న రాజకీయ అనిశ్చిత్తిపై ఓ విలేకరి ప్రస్తావించగా.. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ స్పందించారు. ‘ఇండియా, ఎన్నికలు జరిగే ప్రతి దేశంలోను ప్రజల రాజకీయ, పౌరహక్కులు రక్షించబడతాయని ఆశిస్తున్నాం. స్వేచ్ఛ, న్యాయమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారని నమ్ముతున్నాం’ అని అన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఇప్పటికే జర్మనీ, అమెరికా స్పందించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అకౌంట్లపై అమెరికా రెండోసారి స్పందించటం గమనార్హం. అయితే దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇవి పూర్తిగా తమ దేశ అంతర్గత విషయాన్ని స్పష్టం చేసింది. ఆయా తమ దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని పేర్కొన్న విషయం తెలిసిందే. -
‘ICEతో బీజేపీకి సంబంధం లేదు’
న్యూఢిల్లీ: ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్టుమెంట్, ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ),సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్న్(సీబీఐ) స్వతంత్ర దర్యాప్తు సంస్థలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ పదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవినీతిపరుడని దేశంలో ఒక్కరు కూడా ఆరోపణలు చేయాలేరన్నారు. ‘2013లో ఢిల్లీ సీఎం అసలు రాజకీయాల్లోకి అడుగుపెట్టనన్నారు. కాంగ్రెస్‌తో ఎట్టిపరిస్థితుల్లో జత కట్టనని అన్నారు. ఆప్, కాంగ్రెస్ పార్టీ వారి సొంతంగా ఏం సాధించలేదు. రోజూ కాంగ్రెస్, ఆప్ ప్రధాని మోదీని దూషిస్తారు వాళ్లు మోదీని ఎంత దూషిస్తే.. బీజేపీ అభ్యర్థులను ప్రజలు అంత ఎక్కువ మెజార్టీతో గెలిపించుకుంటారు’ అని అన్నారు. ‘ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు దర్యాప్తు సంస్థ ఈడీ తొమ్మిదిసార్లు సమన్లు జారీచేసింది. ఎందుకు హాజరు కాలేదు. మళ్లీ విలువల గురించి మాట్లాడతారు. ఆయన ఈడీ ఆఫీసుకు హాజరకాకపోతే.. ఈడీనే ఆయన ఇంటికి వెళ్లింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ ఒక్కసీటు కూడా గెలవలేదు. మళ్లీ 2024 ఎన్నికలో సైతం ఆప్ ఒక్కసీటు గెలవదు. ఈ రోజుకీ జైలులో ఉండి కూడా కేజ్రీవాల్ విలువల గురించి మాట్లాడుతున్నారు’ అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శలు చేశారు. ఇక.. ‘ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సీబీఐ’(ఐసీఈ) స్వతంత్ర సంస్థలని వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో బీజేపీకి ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఇండియా కూటమిపై కూడా కేంద్ర మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షాల కూటమి నిజాయితీగా ఉంటే కూటమి పేరు ఎందుకు మార్చారు? అని ప్రశ్నించారు. వాళ్లు(కాంగ్రెస్) 2జీ, సబ్‌మెరైన్, బోగ్గు కుంభకోణాలు చేశారు. వారు ప్రజలకు ముఖం చూపించలేరు. ఆ తర్వాత దాణా కుంభకోణం చేసిన లాలు ప్రసాద్ యాదవ్‌ను కూటమిలోకి చేర్చుకున్నారు. జైలుకెల్లిన మంత్రులు, ప్రజాప్రతినిధులు కూటమిలో ఉన్నారు’ అని అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
Updates ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు మరో నాలుగు రోజులు ఈడీ కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు ఏడు రోజులు ఈడీ కోరినా నాలుగు రోజులే కస్టడీ పొడిగింపు. ఏప్రిల్ 1 వరకు కస్టడీలోనే కేజ్రీవాల్ సీబీఐ స్పెషల్ కోర్టులో ముగిసిన వాదనలు. కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై తీర్పు రిజర్వు. తీర్పును రిజర్వు చేసిన రౌస్ ఎవెన్యూ కోర్టు. మరో ఏడు రోజులపాటు కస్టడీ పొడిగించాలని కోరిన ఈడీ గోవా ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లతో కలిపి కేజ్రీవాల్‌ను విచారించాలన్న దర్యాప్తు సంస్థ నన్ను అరెస్టు చేయడమే ఈడీ లక్ష్యం : కేజ్రీవాల్ నిందితుడితో బలవంతంగా నా పేరు చెప్పించారు. నిందితుడు 55 కోట్ల రూపాయల ఎలక్ట్రోరల్ బాండ్స్ బీజేపీకి ఇచ్చారు. ఏ కోర్టు నన్ను దోషిగా పరిగణించలేదు. నా అరెస్టుకు తగిన ఆధారాలు లేవు. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి పార్టీ అని చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. నా పార్టీని నిర్మూలించాలనుకుంటున్నారు. నా పేరు కేవలం నాలుగు సార్లు ప్రస్తావనకు వచ్చింది. ఈడీ వాదనలు: ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ 100 కోట్ల లంచం తీసుకున్నారు. ఆయన విచారణకు సహకరించడం లేదు. ఈడీకి అరెస్టు చేసే హక్కు ఉంది. శరత్ చంద్రారెడ్డి 50 కోట్ల రూపాయలు ఎలక్ట్రోలు బాండ్స్ రూపంలో బీజేపీకి ఇచ్చిన నిధులకు ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధం లేదు. ఇది క్విడ్ ప్రోకో కిందికి రాదు. ఆమ్ ఆద్మీ పార్టీ హవాలా డబ్బు ద్వారా గోవా ఎన్నికల్లో ఖర్చు చేసిన వివరాలు మా దగ్గర ఉన్నాయి. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మా వద్ద ఉన్నాయి కోర్టుకు తీసుకు వెళ్లే సమయంలో కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు నా అరెస్ట్ రాజకీయ కుట్ర ఢిల్లీ ప్రజలే గట్టిగా సమాధానం చెబుతారు రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను హాజరుపర్చిన ఈడీ ఢిల్లీ: సీబీఐ స్పెషల్ కోర్టు ముందు కేజ్రీవాల్‌ను ప్రవేశపెట్టిన ఈడీ మరో వారం రోజులపాటు కస్టడీ పొడిగించాలని కోరే అవకాశం కోర్టుకు చేరుకున్న కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు విధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో గురువారం కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపర్చనుంది. ఈడీ కస్టడీ పొడిగింపు కోరుతుందా? లేదంటే రిమాండ్‌కు తరలించాలని కోర్టు ఆదేశిస్తుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ అభియోగాలపై కేజ్రీవాల్‌ను మార్చి 21 ఆయన నివాసంలో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరుసటి రోజు ఆయన్ను ఈడీ రౌస్ అవెన్యూ కోర్టుకు హజరుపరిచి కస్టడీకి కోరింది. దీంతో కోర్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. కస్టడీ ముగియడంతో ఇవాళ కోర్టులో హాజరుపర్చనుంది ఈడీ. ఒకవేళ కస్టడీ పొడగింపునకు కోర్టు అంగీకరించకపోతే మాత్రం ఆయన్ని తీహార్ జైలుకు తరలిస్తారు మరోవైపు తనను ఈడీ చేసిన అరెస్ట్ అక్రమమంటూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఆయనకు ఊరట లభించలేదు. కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కోరుతూ ఈడీకీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఏప్రిల్ 2లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా తీహార్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. -
మరోసారి అమెరికా జోక్యం.. ఈసారి కాంగ్రెస్ ఖాతాలపై
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ వ్యవహరంపై అమెరికా స్పందన మరవకముందే.. అగ్రరాజ్యం భారత్‌కు సంబంధించిన మరో అంశంపై స్పందించింది. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహరంపై అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో భారత్‌లోని అమెరికా దౌత్యవేత్తకు బుధవారం సమన్లు కూడా జారీ చేయటం తెలిసిందే. అయితే ఘటన మరవకముందే అమెరికా భారత్‌కు సంబంధించిన మరో అంశంపై స్పందించటం గమనార్హం. తాజాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలు బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసినట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించిన అంశంపై మరోసారి అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ‘లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా ప్రచారం చేయకుండా ఆ పార్టీకి సంబంధించిన పలు బ్యాంక్ ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలు మాకు తెలుసు. ఈ విషయంలో కూడా మేము పారదర్శకత, సమయానుకూల న్యాయ ప్రక్రియను ప్రోత్సహిస్తాం’ అని అమెరికా విదేశాంగ ప్రతినిధి మాత్యు మిల్లర్ అన్నారు. అయితే సీఎం కేజ్రీవాల్ విషయంలో స్పందించిన అమెరికా రాయబారికి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ.. ఆదేశ దౌత్యవేతకు భారత్ ఇచ్చిన సమన్లపై స్పందింస్తూ.. ‘నేను ప్రైవేట్ దౌత్యపరమైన వ్యాఖ్యలు చేయదలుచుకోలేను. కానీ, సీఎం కేజ్రీవాల్ విషయంలో నేను ఇక్కడి నుంచే బహిరంగంగా మేము పారదర్శకత, సమయానుకూల న్యాయప్రక్రియను ప్రోత్సహిస్తాం అని. మా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తే మేం పట్టించుకోం. ఇదే విషయాన్ని మేము ప్రైవేట్‌గా కూడా ఇలాగే స్పష్టం చేస్తాం’అని మాత్యు మిల్లర్ స్పష్టం చేశారు. గత లోక్‌సభ ఎన్నికలు జరిగిన 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 210 కోట్ల ఆదాయపన్ను కట్టాలంటూ తమ పార్టీకి చెందిన నాలుగు ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసిందని, వాటిలో యూత్ కాంగ్రెస్ ఖాతా కూడా ఉందని ఇటీవల కాంగ్రెస్ పార్టీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా అమెరికా స్పందించటం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. దీనికి భారత్ ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో చూడాలి. -
కేజ్రీవాల్‌పై స్పందన.. అమెరికా దౌత్యవేత్తకు సమన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై అమెరికా విదేశాంగ శాఖ చేసిన వ్యాఖ్యలకు భారత్.. ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు పంపింది. బుధవారం అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాను.. భారత విదేశి వ్యవహారాల కార్యాలయానికి పిలిపించుకొని సుమారు 40 నిమిషాల పాటు చర్చించినట్లు తెలుస్తోంది. మంగళవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్‌పై అమెరికా స్పందించిన విషయం తెలిసిందే కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన నివేదికలను ఆమెరికా ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందని తెలిపింది. ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సాహిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. ‘ఈ కేసులో సమయానుకూల, పారదర్శక న్యాయ ప్రక్రియ జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌పై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అంతకు ముందు కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటన కూడా దుమారం రేపింది. కేజ్రీవాల్ విచారణ పారదర్శకంగా జరగాలంటూ అనవసర వ్యాఖ్యలు చేసింది జర్మనీ. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని జర్మనీ దేశ రాయబారికి కూడా సమన్లు పంపిన విషయం తెలిసిందే. -
ఢిల్లీని నాశనం చేస్తారా?.. సునీతా కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలను నీటి కష్టాల పాలు చేస్తారా? ఢిల్లీని నాశనం చేస్తారా? అని సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ అన్నారు. తాగునీటి సమస్యలపై సంబంధిత మంత్రికి సీఎం కేజ్రీవాల్ లేఖ రాస్తే దానిపై కేసులు వేశారని మండపడ్డారామె. బుధావారం సునీతా కేజ్రీవాల్ ప్రెస్మీట్లో మాట్లాడారు. ‘రెండు రోజుల క్రితం సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాగునీటి సమస్యలకు సంబంధించి మంత్రి అతిశీకి ఆదేశాల లేఖ పంపారు. వాటి మీద కేంద్ర ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఢిల్లీని నాశనం చేస్తారా? ఢిల్లీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తారా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా బాధపడుతున్నారు. ఇప్పటి వరకు ఈడీ 250 సోదాలు జరిపింది. ఈడీ అధికారులు లిక్కర్ స్కామ్ డబ్బు కోసం సోదాలు చేశారు. కానీ వారికి తమ వద్ద ఎటువంటి డబ్బు లభించలేదు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ మార్చి 28(గురువారం) అన్ని విషయాలు బయటపెడతారు. లిక్కర్ స్కామ్ డబ్బు ఎక్కడ ఉందో కూడా చెబుతారు. వాటికి సంబంధించి కేజ్రీవాల్ ఆధారాలు కూడా సమర్పిస్తారు’ అని సునిత కేజ్రీవాల్ తెలిపారు. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత రెండోసారి ఆమె ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు. ఇక.. మర్చి 21న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ను ఈడీ.. కోర్టు ముందు హాజరుపరిచి కస్టడీకి కోరింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు కోర్టు.. ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇక..ఈడీ లాకప్ నుంచి అరవింద్ కేజ్రీవాల్ పరిపాలన కొనసాగిస్తూ.. ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీనిపై బీజేపీ మండిపడుతూ.. సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది -
జైలులో కేజ్రీవాల్.. నేడు ఢిల్లీ అసెంబ్లీ సమావేశం!
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై.. ఈడీ కస్టడీలో ఉన్నారు. కోర్టు ఆయనకు మర్చి 28 వరకు ఈడీ కస్టడీ విధించింది. సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో మొదటిసారి ఇవాళ (బుధవారం) ఢిల్లీ అసెంబ్లీ సమావేశం జరగనుంది. సీఎం కేజ్రీవాల్ లేకుండా జరిగే ఈ అసెంబ్లీ సమావేశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. అయితే.. అసెంబ్లీలో వైద్య సదుపాయాలకు సంబంధించి అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈడీ లాకప్ నుంచే సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిన్న (మంగళవారం) పరిపాలనకు సంబంధించి రెండో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మొహల్లా క్లినిక్‌లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రులు, మొహల్లా క్లినిక్‌లతో ఉచిత మందులు, వైద్య పరీక్షకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని మంత్రి సౌరభ్ భరద్వాజ్ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్‌ను కోరారు. అయితే ఇవాళ ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశంలో ప్రధానంగా వైద్యానికి సంబంధించిన అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక.. ఈడీ లాకప్ నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ పారిపాలన సాగించటంపై బీజేపీ మండిపడుతోంది. సీఎంగా కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు తమ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కాగితం, కంప్యూటర్ వంటి వాటిని సమకూర్చలేదని ఈడీ పేర్కొంది. అయితే సీఎం కేజ్రీవాల్ జారీ చేస్తున్న ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తున్నయన్న కోణంలో తాము దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.ఇక.. మొదటి పరిపాలన ఆదేశాలు అందుకున్న ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రిని అతిశీని ఈ విషయంపై ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. మరోవైపు.. ఈడీ అరెస్ట్ చేయటం అక్రమమంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. -
కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆప్ కార్యకర్తల నిరసనలు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై.. ఈడీ కస్టడీలో ఉన్నారు. అక్రమంగా ఆయన్ను అరెస్ట్ చేశారంటూ ఆప్ కార్యకర్తలు నిరసనకు దిగారు. మరోవైపు.. అరవింద్ కేజీవ్రాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. Delhi Police allows BJP's Protest, yet the same Delhi Police is pulling apart the turban of AAP Cabinet Minister @harjotbains@ECISVEEP, Delhi Police is under your supervision after declaration of Model Code of Conduct for General Elections. Free & Fair Elections...!? 🤡🤡🤡 pic.twitter.com/bI5mNPFPcP — Dr Ranjan (@AAPforNewIndia) March 26, 2024 అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన ఆప్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని పలు పోలీసు స్టేషన్లకు తరలించారు. ప్రధానిమోదీ నివాసం ముందు ఆమ్ ఆద్మీ పార్టీ గేరావ్ చేపట్టగా.. బీజేపీ కేజ్రీవాల్ రాజీనామాను డిమాండ్ చేస్తూ.. మెగా మార్చ్‌ను చేపట్టింది. జైలు నుంచి పాలన కొనసాగిస్తాననటం సిగ్గుచేటని బీజేపీ మండిపడుతోంది. బీజేపీ ఫిరోజ్ షా కోట్ల స్టేడియం నుంచి ఢిల్లీ సెక్రటేరియట్ వైపు మార్చ్ చేపట్టింది. కేజ్రీవాల్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. Massive protest at Patel chowk metro station by AAP Volunteers pic.twitter.com/4RndrfoRhM — Jitender Singh (@jitenderkhalsa) March 26, 2024 చదవండి: కేజ్రీవాల్ రెండో ఆదేశం.. ఈడీ సీరియస్ ఆప్ కార్యకర్తలకు నిరసన తెలపడానికి అనుమతి లేదని పోలీసులు ఎక్కడికక్కడ నిరసనకారులను అడ్డుకుంటున్నారు. ‘ఆప్ కార్యకర్తలు నిరసనలు చేయటానికి అనుమతి లేదు. పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద నిరసనకారులు పెద్ద ఎత్తున తరలివస్తారని మాకు సమాచారం ఉంది. అందుకే మేము భద్రతా చర్యలు చేపట్టాము’ అని ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ దేవేశ్ కుమార్ తెలిపారు. BJP can protest when section 144 is imposed. Delhi police have no problem with it. But AAP cannot protest. Dictatorship 101pic.twitter.com/xFlcdGl40F — Analyst 🕵🏽 (@bharat_builder) March 26, 2024 -
కేజ్రీవాల్ రెండో ఆదేశం.. ఈడీ సీరియస్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. అయితే, లాకప్ నుంచే ఆయన పాలన సాగిస్తుండటం చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో ఆయన రెండో ఆదేశం జారీ చేయగా.. కస్టడీ నుంచి ఆయన ఇస్తున్న ఆదేశాలపై ఈడీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం లాకప్ నుంచి కేజ్రీవాల్ రెండో ఆదేశాలు జారీ చేసినట్లు ఆప్ నేత, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. మొహల్లా క్లినిక్‌లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. ‘‘కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు’’ అని సౌరభ్ పేర్కొన్నారు. చదవండి: ఈడీ కస్టడీలో కేజ్రీవాల్: లాకప్ నుంచే తొలి ఆదేశం అంతా ఉత్తదేనా? ఇటీవల ఆయన నీటి సమస్య నివారణ కోసం సహచర మంత్రి ఆతిశీకి నోట్ ద్వారా ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని ఈడీ తీవ్రంగా పరిగణించింది. కస్టడీ సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్‌కు కంప్యూటర్ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని దర్యాప్తు సంస్థ చెబుతోంది. ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో తెలుసుకొనేందుకు చర్యలు చేపట్టింది. దీనిపై ఆతిశీని ప్రశ్నించే అవకాశముంది. అయితే ఇప్పటికే కేజ్రీవాల్ ఇచ్చిన తొలి ఆదేశాలపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అదే సమయంలో కంప్యూటర్, పేపర్ అందుబాటులో లేని కేజ్రీవాల్ ఆదేశాలు ఎలా జారీ చేశారా? అనే అంశంపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఇంతలోనే మరో ఆదేశం విడుదల కావడం.. దాన్ని ఆప్ గర్వంగా ప్రకటించుకోవడాన్ని ఈడీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఆమె బాధకు కేజ్రీవాలే కారణం: బీజేపీ
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆప్ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. అయితే మరోవైపు.. అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. శనివారం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి పంపిన సందేశాన్ని ఆయన భార్య సునితా కేజ్రీవాల్ ఆప్ కార్యకర్తలకు చదివి వినిపించారు. ఈ వీడియో సందేశంపై కూడా బీజేపీ విమర్శలు చేసింది బీజేపీ. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన సందేశాన్ని చదివే క్రమంలో ఆయన భార్య సునితా కేజ్రీవాల్ ఎంతో బాధపడ్డారని ఆ బాధకు కేజ్రీవాల్ బాధ్యత వహించాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. ‘సునితా కేజ్రీవాల్ ఎంతో బాధతో మాట్లాడారు. దానికి సీఎం కేజ్రీవాల్ బాధ్యత వహించాలి. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ సౌకర్యాలు, ఇల్లు, కారు, భద్రత తీసుకుంటున్నప్పుడు ఇలా మీడియా ముందుకు వస్తే బాగుండేది. కేజ్రీవాల్ గ్రాండ్ బంగ్లాలోకి వెళ్లినప్పుడు, ఢిల్లీ పన్ను చెల్లింపుదారుల డబ్బు వృధా అయినప్పుడు. ఢిల్లీ యువతకు మద్యం ఉచితంగా ఇచ్చినప్పుడు, కేజ్రీవాల్ ద్వారా రూ. 100 కోట్ల లావాదేవీలు జరిగినప్పుడే సునితా కేజ్రీవాల్ ఇలా మీడియా ముందుకు రావాల్సింది’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలతో కాంగ్రెస్ ఇబ్బంది పడి.. ప్రస్తుతం మాత్రం ఆప్‌కు కాంగ్రెస్‌కు మద్దతు నిలుస్తోంది. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఈ లిక్కర్ స్కామ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ సైతం.. షిలా దీక్షిత్, సోనియా గాంధీలపై విమర్శలు గుప్పించారు. ఆప్, కాంగ్రెస్ అవినీతి పార్టీలు.. వారి మధ్యే ఎన్నికల పోటీ ఉండాలనుకుంటున్నారు’ అని వీరేంద్ర సచ్‌దేవా మండిపడ్డారు. సునితా కేజ్రీవాల్ శనివారం ఈడీ కార్యాలయంలో అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. ఇక..అరవింద్ కేజ్రీవాల్‌ను మర్చి 28 వరకు ఢిల్లీ కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ తన అరెస్ట్ రిమాండ్‌పై ఢిల్లీ హైకోర్టును శనివారం ఆశ్రయించగా అత్యవసరంగా విచారించటం వీలుకాదని పేర్కొంది. మరోవైపు.. అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. -
సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టై.. ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి అరెస్ట్, ఈడీ రిమాండ్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు శనివారం ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించారు. రిమాండ్‌ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపడతామని పేర్కొంది. కాగా.. ఈడీ మార్చి 28 వరకు తమ క్లైంట్కు ఈడీ కస్టడీ విధించటం చట్టవిరుద్ధమని సీఎం కేజ్రీవాల్ న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తెలిసిందే. మార్చి 24 ఆదివారంలోపు తను దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని పిటిషన్లో కోరారు. అత్యవసర విచారణ కోసం కేజ్రివాల్ తరపు అడ్వకేట్ ప్రయత్నం చేశారు. కాగా.. ఢిల్లీ హైకోర్టు అత్యవసరణ విచారణకు అనుమతించకపోవటం గమనార్హం. ఇక.. గురువారం ఈడీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. నిన్న శుక్రవారం అరవింద్ కేజ్రీవాల్‌ను కోర్టుకు హాజరుపరిచి.. ఈడీ పదిరోజుల కస్టడీకి కోరింది. దీంతో కోర్టు ఆరు రోజుల పాటు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. చదవండి: కేజ్రీవాలే అసలు కుట్రదారు -
‘సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సిందే’
ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్‌ను ఆరు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ను ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’, కాంగెస్ తీవ్రంగా ఖండించాయి. అయితే మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ నిరూపమ్ మాత్రం కేజ్రీవాల్‌కు మద్దతు తెలుపుతునే ఆయన సీఎం పదవిపై ‘ఎక్స్’(ట్విటర్) వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ వెంటనే తన సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. ‘ఎల్కే అద్వానీ, మాధవరావు సింధియా, కమాల్నాథ్లపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు.. వారు తమ పదవులకు రాజీనామా చేశారు. రైలు ప్రమాదానికి బాధ్యత వహింస్తూ.. దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ సైతం తన పదవికి రాజీనామా చేశారు. భారత దేశం అంతటి గొప్ప సంప్రదాయాన్ని కలిగి ఉంది. జనవరిలో అరెస్ట్ అయిన హేమంత్సోరెన్సై కూడా అరెస్ట్‌కు ముందే తన సీఎం పదవి రాజీనామా చేశారు’ అని సంజయ్ నిరూపమ్ అన్నారు. दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल अपने जीवन के सबसे बड़े संकट से गुजर रहे हैं। इंसानियत के नाते उनके प्रति सहानुभूति है। कॉंग्रेस पार्टी ने भी उन्हें सार्वजनिक रूप से समर्थन दिया है। लेकिन वे भारतीय राजनीति में नैतिकता की जो नई परिभाषा लिख रहे हैं,उसने मुझे यह पोस्ट लिखने के… — Sanjay Nirupam (@sanjaynirupam) March 23, 2024 ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిజం ఏంటో కోర్టు తేల్చుతుందని అన్నారు. ఒక సీఎంగా అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేయబడ్డారని.. అయినా తన పదవికి రాజీనామా చేయకపోవటం సరికాదన్నారు. ఇది ఎటువంటి నైతికత? అని ప్రశ్నించారు. పార్టీ స్థాపించబడి 11ఏళ్లు అవుతున్నా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వ్యవహరిస్తున్న తీరు చాలా అనైతికమని విమర్శించారు. అవినీతి కేసులో ఇలా.. ఒక సీఎంగా అరెస్ట్ అయిన వ్యక్తి దేశంలో అరవింద్ కేజ్రీవాల్ మొదటివారు. అరెస్ట్ అయినా కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతారని, కావాలంటే జైలు నుంచే ఆయన పారిపాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత సంజయ్ నిరూపమ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో గురువారం ఈడీ... సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో సుమారు రెండున్న గంటల పాటు విచారించి అనంతరం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా ఆరు రోజులు ఈడీ కస్టడీకి అప్పగించింది. -
ఎవరు నిజమైన రాహుల్ గాంధీ?: స్మృతి ఇరానీ
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ద్వంద వైఖరిపై మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై సంఘీభావం తెలుపుతారు. అదేవిధంగా తెలంగాణలో మాట్లాడినప్పుడు మాత్రం కేజ్రీవాల్ అవినితీ పరుడని అంటారని స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. ‘రాహుల్ గాంధీ ద్వంద వైఖరిలో మాట్లాడానికి సంబంధించి నేను ఆధారాలు ఇవ్వగలను. కేజ్రీవాల్‌తో పాటు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అవినీతిపరుడని 2, జూలై, 2023లో తెలంగాణ రాహుల్ మాట్లాడుతూ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి అన్ని విషయాలు దర్యాప్తు సంస్థలకు తెలుసన్నారు. అవినీతి సొమ్మును ఆప్ గోవా ఎన్నికలకు వినియోగించిందని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ అన్నారు. వీరిలో ఎవరు నిజం చెబుతున్నారు?’ అని స్మృతి ఇరానీ నిలదీశారు. Smt. @smritiirani addresses a press conference at party headquarters in New Delhi. https://t.co/jITZyxd3dL — BJP (@BJP4India) March 22, 2024 ఎవరు నిజమైన రాహుల్ గాంధీ? తెలంగాణలో మాట్లాడే రాహుల్ గాంధీ? లేదా ఢిల్లీలో మాట్లాడే రాహుల్ గాంధీ? అని ఆమె ప్రశ్నించారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి, అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఎంతటి అవినీతికి పాల్పడతారో అరవింద్ కేజ్రీవాల్‌ను చూస్తే తెలుస్తోందని స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావటంతో రాహుల్ శుక్రవారం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఆయన్ను అరెస్ట్ చేశారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్ ఈడీ రిమాండ్‌లో ఉన్నారు. అదేవిధంగా ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏడురోజుల రిమాండ్ పూర్తి చేసుకోగా... తాజాగా (శనివారం) రౌస్ అవెన్యూ కోర్టు మరో మూడురోజులు ఈడీ కస్టడీకి అప్పగించింది. -
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అసలు కుట్రదారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలేనని ఈడీ స్పష్టీకరణ.. కేజ్రీవాల్‌ను ఆరు రోజులపాటు ఈడీ కస్టడీకి అనుమతించిన ఢిల్లీ కోర్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
కేజ్రీవాల్ అరెస్టుకు నిరసన.. హోలీకి దూరం
అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసినందుకు నిరసనగా 'హోలీ' జరుపుకోమని పార్టీ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను కలవకుండా అడ్డుకున్నారని విలేకరుల సమావేశంలో రాయ్ పేర్కొన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు.. ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, ఆఫీస్ బేరర్లు, ఇండియా బ్లాక్ ప్రతినిధులందరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేస్తారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల అమరవీరుల దినోత్సవమైన శనివారం షాహీదీ పార్క్‌లో సమావేశమవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా హాజరవుతారని ఆయన తెలిపారు. మార్చి 24న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని, మార్చి 25న హోలీ రోజున ఎలాంటి కార్యక్రమం నిర్వహించబోమని, మార్చి 26న ప్రధాని నివాసాన్ని చుట్టుముడతామని రాయ్ తెలిపారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరెస్టుకు వ్యతిరేకంగా భారత కూటమి సభ్యుల మధ్య చర్చల అనంతరం త్వరలో ఉమ్మడి ఉద్యమం ప్రకటిస్తామని కూడా ఆయన చెప్పారు. -
అరెస్టు తర్వాత 'కేజ్రీవాల్' ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ 'అరవింద్ కేజ్రీవాల్'ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం రాత్రి అరెస్టు చేసింది. కేజ్రీవాల్ అరెస్టును పార్టీ నేతలు మాత్రమే కాకుండా.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్చంద్ర పవార్, టీఎంసీ వంటి పార్టీలు ఖండిస్తున్నాయి. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ మొదటిసారి స్పందిస్తూ.. నేను ఎక్కడ ఉన్నా దేశం కోసం పనిచేస్తానని ''నా జీవితం జాతికి అంకితం'' అని అన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్.. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు జరిగిన రాజకీయ కుట్రగా ఆమ్ ఆద్మీ పార్టీ అభివర్ణించింది. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనకు పార్టీ పిలుపునిచ్చింది. నిరసనలో పాల్గొన్న ఢిల్లీ కేబినెట్ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్, తూర్పు ఢిల్లీ లోక్‌సభ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌తో సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిన్న అరెస్ట్ చేసిన తర్వాత ఈడీ రూస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను హాజరుపరిచింది. #WATCH | "Whether I am inside or outside, my life is dedicated to the country," said arrested Delhi CM Arvind Kejriwal as he was produced before Rouse Avenue court by ED following his arrest yesterday. (Video source: AAP) pic.twitter.com/A9YGNlxIGy — ANI (@ANI) March 22, 2024 -
అందుకే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు: శరద్ పవార్
ఢిల్లీ ముఖ్యమంత్రి 'అరవింద్ కేజ్రీవాల్'ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేయడాన్ని 'నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్చంద్ర పవార్' అధినేత శరద్ పవార్ ఖండించారు. అధికార దుర్వినియోగానికి బీజేపీ తప్పకుండా మూల్యం చెల్లించవలసి ఉంటుందని అన్నారు. మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని బారామతి వద్ద విలేకరులతో మాట్లాడిన పవార్.. కేజ్రీవాల్ అరెస్టును ప్రస్తావిస్తూ, ప్రతిపక్షాల గొంతును అణిచివేసేందుకు బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తోందని అన్నారు. గతంలో మైనింగ్ కేసులో గిరిజన వర్గానికి చెందిన హేమంత్ సోరెన్ (జార్ఖండ్ మాజీ సీఎం)ని, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ) మద్యం పాలసీకి సంబంధించిన కేసులో అరెస్ట్ చేశారు. అధికారం దుర్వినియోగం చేసి ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేసే స్థాయికి నేడు బీజేపీ వెళ్లిందని పవార్ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ అరెస్టు కారణంగానే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందా అనే ప్రశ్నకు, పవార్ సమాధానం ఇస్తూ.. తప్పకుండా బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుంది. కేజ్రీవాల్ మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయనకు ప్రజల మద్దతు ఎక్కువగా ఉందని అన్నారు. లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ కొనసాగుతారని పార్టీ పేర్కొంది. అవసరమైతే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తానన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఖండిస్తూ, రాబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాల గురించి బీజేపీ భయపడుతోందని, ప్రతిపక్షాలకు సమస్యలు సృష్టించేలా భయాందోళనలకు గురిచేస్తోందని శరద్ పవార్ వెల్లడించారు. -
కేజ్రీవాల్ అరెస్టుపై 'శర్మిష్ట ముఖర్జీ' కీలక వ్యాఖ్యలు
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి 'అరవింద్ కేజ్రీవాల్'ను అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె 'శర్మిష్ట ముఖర్జీ' స్పందించారు. గతంలో కేజ్రీవాల్, అన్నా హజారే బృందం ఢిల్లీ మాజీ సీఎం కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్‌పై బాధ్యతారహితమైన, నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆరోపించారు. దీక్షిత్‌కు వ్యతిరేకంగా ట్రంక్ లోడ్ సాక్ష్యాలు ఉన్నాయని తమ వాదనలు వినిపించారు. అయితే అలాంటి సాక్ష్యాలను ప్రజలకు అందించలేదని ఆమె తెలిపారు. గతంలో వారు చేసిన విపరీత చర్యలే వారిని కర్మగా వెంటాడుతోందని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. He & Anna Hazare gang were responsible for making most irresponsible, baseless & wild allegations against Congress including Sheila Dikshit ji saying he had ‘trunk loads’ of evidence against her. No one has seen the ‘trunk’ so far. Karma catches up! #KejriwalArrested https://t.co/9W1sbFlEDo — Sharmistha Mukherjee (@Sharmistha_GK) March 21, 2024 -
Liquor Scam: ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు షాక్..!
-
ED: కవిత అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రెస్‌నోట్ విడుదల
ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై ఎన్ఫోర్స్మెంట్ డైరేక్టరేట్ (ఈడీ) కీలక విషయాలు వెల్లడించింది. ఈ మేరకు ఈడీ సోమవారం కవిత అరెస్ట్‌పై అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ నెల15న కవితను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చిందని పేర్కొంది. ఈ నెల 23 తేదీ వరకు కవిత కస్టడికి తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపింది. ‘ఢిల్లీ లిక్కర్ కేసులో 128.79 కోట్ల రూపాయల ఆస్తుల జప్తు చేశాం. ఆస్తుల జప్తును అడ్జుడికేటింగ్ అథారిటీ ఆమోదించింది. మద్యం విధానం రూపకల్పనలో కవిత ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు సీఎం అరవింద్ కేజ్రీవాల్,మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి కుట్ర చేశారు. ఈ వ్యవహారంలో ఆప్ పార్టీ నేతలకు 100 కోట్ల రూపాయలు ముడుపులు అప్పజెప్పడంలో కవిత క్రియాశీల పాత్ర పోషించారు. ఈ మొత్తాన్ని హోల్‌సేల్ వ్యాపారుల నుంచి ఇప్పించారు. తిరిగి ఆ డబ్బును లాభాలను రాబట్టుకునేందుకు మరిన్ని కుట్రలు పన్నారు. ఈ కేసులో మనిష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ సహా ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశాం. 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాం. ఒక ప్రాసిక్యూషన్ కంప్లైంట్ ఐదు సప్లిమెంటరీ కంప్లైంట్స్ ఫైల్ చేశాం. కవిత ఏడు రోజుల ఈడి కస్టడీలో ఉంది. ఆమెను అరెస్టు చేసే సమయంలో బంధువులు మాకు ఆటంకం కలిగించారు. నిలకడగా కవిత ఆరోగ్యం: వైద్యులు ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితకు డాక్టర్లు వైద్యపరీక్షలు చేశారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కవిత బీపీ సాధారణంగా ఉందన్న పేర్కొన్నారు. 24 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
Delhi excise policy case: కేజ్రీవాల్‌కు ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. మద్యం విధానం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణకు రావాలంటూ పంపిన సమన్లకు కేజ్రీవాల్ స్పందించనందున ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు అనుమతివ్వాలంటూ ఈడీ కోర్టులో రెండుసార్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, మొదటి ఫిర్యాదుపై విచారణ సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కేజ్రీవాల్ శనివారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈడీ రెండో ఫిర్యాదుపై మేజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపింది. ఫిర్యాదు పత్రాలను కేజ్రీవాల్‌కు అందజేయాలని ఈడీని ఆదేశించింది. -
'ధర్మం - అధర్మం' మధ్య యుద్ధం: కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ 'అరవింద్ కేజ్రీవాల్' లోక్‌సభ 2024 ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు కేజ్రీవాల్ హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మొద్దని వ్యాఖ్యానించారు. సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. హిందూ ఇతిహాసమైన మహాభారతాన్ని ఉదాహరణగా వెల్లడిస్తూ.. రాబోయే ఎన్నికలు 'ధర్మం - అధర్మం' మధ్య జరిగే పోరు అని వ్యాఖ్యానించారు. ఈ సారి పొరపాటున కూడా బీజేపీకి ఓటేయొద్దని ఓటర్లను కేజ్రీవాల్ కోరారు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల దగ్గర అన్నీ ఉన్నా.. యుద్ధంలో గెలువలేకపోయారు. కానీ పాండవుల దగ్గర ఏమీ లేదు, కానీ శ్రీకృష్ణుడు మాత్రమే ఉన్నారు. యుద్ధంలో గెలిచారు. మేము చిన్న వాళ్ళమే కావొచ్చు. మాతో శ్రీకృష్ణుని ధర్మం ఉందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఓటేయొద్దని, ప్రజలు బాగా ఆలోచించి మీ నియోజక వర్గంలో మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని సూచించారు. కష్ట సమయంలో మీ కోసం పనిచేసే నాయకుడు మీకు ప్రజా ప్రతినిధిగా ఎన్నికైతే అవసరాలకు ఉపయోగపడతారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
‘మోదీ’ నినాదాలు చేస్తే.. భోజనం పెట్టమని చెప్పండి: సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ విమర్శలు, ప్రతివిమర్శలు.. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మహిళా సమ్మాన్ సమారోహ్’ పేరుతో నిర్వహించిన మహిళల సభలో సీఎం కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు. ‘చాలా మంది పురుషులు ప్రధాని మోదీ పేరుతో నినాదాలు చేస్తున్నారు. మహిళలు వారి ఆలోచనలు మార్చాలి. మీ(మహిళలు) భర్తలు మోదీ నినాదాలు చేస్తే.. తమకు భోజనం పెట్టమని చెప్పండి’ అని కేజ్రీవాల్ అన్నారు. మహిళలు తమ కుటుంబ సభ్యులతో చర్చించి.. ఆప్‌కు తమ మద్దతు ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా బీజేపీకి మద్దతుగా ఉన్న మహిళలకు చెప్పండి.. తమ సోదరుడు(కేజ్రీవాల్) మహిళలందరికీ అండగా ఉంటాడని చెప్పాలన్నారు. ‘వారికి (బీజేపీకి మద్దతు పలికే మహిళలు) చెప్పండి మా ప్రభుత్వం విద్యుత్ ఉచితంగా అందజేస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. ఇకనుంచి మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వనున్నాం. మహిళకు బీజేపీ ఏం చేసింది. అలాంటప్పుడు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? మహిళలంతా ఈసారి కేజ్రీవాల్‌కే ఓటు వేయండి’ అని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ‘కొన్ని పార్టీలు మహిళలకు కొన్ని పదవలు ఇచ్చి.. మహిళా సాధికారత కల్పిస్తున్నామని చెబుతున్నాయి. నేను అలా చెప్పను. మహిళలకు పదవుల ఆశ చూపటం సరికాదు. వాళ్లకు అన్ని అవకాశాలు ఇవ్వాలి. కేవలం ఇద్దరూ లేదా నలుగురు మహిళలకు లబ్ధి కలిగించిటం సరికాదు. మరీ మిగతా మహిళలు పరిస్థితి ఏంటి?’ అని కేజ్రీవాల్ విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం అందించనున్న ప్రతి మహిళకు నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చే పథకమే నిజమైన మహిళా సాధికారతకు నిదర్శనం అన్నారు. ఇక.. ఇటీవల కేజ్రీవాల్ ప్రభుత్వం 2024-25 వార్షిక బడ్జెట్లో మహిళలకు నెలకు వెయ్యి రూపాయాలు అందజేస్తామని కేటాయింపులు ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: లోక్‌సభ ఎన్నికల బరిలో టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ -
ఎన్నికల ముందు బిగ్ షాకిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ!
లోక్‌సభ ఎన్నికల ముందు ప్రముఖ నటి సంభవనా సేథ్ బిగ్ షాకిచ్చింది. గతేడాది అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన నటి సంభవనా సేథ్ తాజాగా ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఆమె తన తప్పును గ్రహించానని.. అందువల్ల ఇకపై ఆప్‌లో భాగం కాలేనని పేర్కొంది. దీంతో లోక్ సభ ఎన్నికల ముందు ఆప్‌కు గట్టి షాక్ తగిలింది. సంభావన సేత్.. "నా దేశం కోసం సేవ చేయాలనే ఉత్సాహంతో సంవత్సరం క్రితం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాను. మనం ఎంత తెలివిగా నిర్ణయం తీసుకున్నా సరే. మనుషులం కాబట్టి చివరికీ ఏదో ఒక తప్పు చేస్తాం. నా తప్పు తెలుసుకుని ఆప్ పార్చీ నుంచి నిష్క్రమిస్తున్నా' అని ట్వీట్లో రాస్తూ అరవింద్ కేజ్రీవాల్‌ను ట్యాగ్ చేసింది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ గుడ్ డెసిషన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. సంభావన సేత్ బాలీవుడ్లో పలు చిత్రాలతో పాటు రియాలిటీ షోలలో కూడా కనిపించింది. బిగ్‌బాస్ సీజన్-8లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. 2006లో '36 చైనా టౌన్'లో అనే సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో కరీనా కపూర్, షాహిద్ కపూర్ జంటగా నటించారు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాల్లో ఐటమ్ సాంగ్‌లతో పేరు సంపాదించుకుంది. Joined @AamAadmiParty a year back wid a lot of enthusiasm to serve for my country bt no matter hw wisely U take a decision U can still go wrong bcz at the end of the day we r humans. Realising my mistake I officially declare my exit from AAP. @ArvindKejriwal @SandeepPathak04 — Sambhavna Seth (@sambhavnaseth) March 10, 2024 -
వినాశనాన్ని అనుసరిస్తోంది.. బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం 'వికాస్' లేదా అభివృద్ధి నమూనాను అనుసరిస్తుంటే.. బీజేపీ ప్రభుత్వం 'వినాశ్' లేదా విధ్వంసం నమూనాను అనుసరిస్తోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇటీవల ఆప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలను ఆప్-కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని విశ్వసిస్తున్నామని, ప్రజలు కూడా పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద కుటుంబంలోని ప్రతి మహిళకు రూ.1000 అందజేస్తామని కేజ్రీవాల్ తెలియజేసారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను గుర్తు చేసుకుంటూ.. వచ్చే ఏడాది ఆయన అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారని ఆశిస్తున్నాను అని అన్నారు. సొసైటీలోని ప్రతి విభాగాన్ని జాగ్రత్తగా గమనించి అద్భుతమైన బడ్జెట్‌ను సమర్పించినందుకు ఆర్థిక మంత్రి 'అతిషి మర్లెనా'ను కేజ్రీవాల్ ప్రశంసించారు. అంతే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీని అంతమొందించాలని బీజేపీ భావిస్తోందని, తనను జైలుకు పంపేందుకు ప్లాన్ సిద్ధం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. -
Delhi Excise Policy Scam Case: 12 తర్వాత వర్చువల్‌గా హాజరవుతా: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వరుసగా ఎనిమిదోసారి పంపిన సమన్లకు కూడా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించలేదు. మార్చి 4వ తేదీన తమ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నందున సోమవారం విచారణకు హాజరు కాలేకపోయినట్లు తెలిపారు. ఈడీ తనకు సమన్లు ఇవ్వడం చట్టవిరుద్ధమే అయినా ఈనెల 12వ తేదీ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వర్చువల్‌గా హాజరయ్యేందుకు చట్టం హక్కు కలి్పంచింది. అందుకు ఈడీ అధికారులు అనుమతిస్తారని భావిస్తున్నా. ఈడీ విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నేను డిమాండ్ చేయలేదు. ఒకవేళ ప్రత్యక్ష ప్రసారం చేసినా అభ్యంతరం లేదు’అని కేజ్రీవాల్ అన్నారు. అయితే, కేజ్రీవాల్ పంపిన సమాధానాన్ని పరిశీలిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. అయితే, కేజ్రీవాల్‌ను వర్చువల్‌గా విచారించేందుకు సిద్ధంగా లేని ఈడీ..తొమ్మిదో విడత సమన్లు పంపే అవకాశాలున్నాయంటున్నారు. ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించడం.. కేజ్రీవాల్ వినతి మేరకు మార్చి 16న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు ప్రకటించడం తెలిసిందే. బీజేపీ ‘మోదీ కా పరివార్’ ప్రచారాన్ని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. కేవలం కేంద్ర మంత్రులే మోదీ కుటుంబమన్నారు. -
Delhi: ఈడీకి కేజ్రీవాల్ ఎనిమిదో ‘సారీ’
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరయ్యే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వరుసగా ఎనిమిదోసారి హ్యాండిచ్చారు. ఈ కేసులో తమ ఎదుట విచారణకు హాజరవ్వాల్సిందిగా ఇటీవలే ఎనిమిదవసారి ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది. ఈ విచారణకు సోమవారం ఈడీ ఎదుటకు రావాల్సి ఉండగా కేజ్రీవాల్ రాలేదు. సోమవారం(మార్చి 4) తాను ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నందునే విచారణకు హాజరవడం లేదని కేజ్రీవాల్ తెలిపారు. అయితే ఈసారి మాత్రం ఈడీకి ఆయన ఒక ట్విస్ట్ ఇచ్చారు. మార్చ్ 12వ తేదీన ప్రత్యక్షంగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని సమాచారమిచ్చారు. కాగా, లిక్కర్ పాలసీ కేసులో గత ఏడాది నవంబర్ 2, డిసెంబర్ 22, జనవరి 3, 2024, జనవరి 18, ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 26, మార్చ్ 4వ తేదీల్లో ఇప్పటికి ఎనిమిదిసార్లు ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. ఇదీ చదవండి.. బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. కేంద్రం కీలక నిర్ణయం -
కేంద్రానికి ‘యాంటీ పంజాబ్’ సిండ్రోమ్
లూధియానా: పంజాబ్ వ్యతిరేకత అనే రుగ్మతతో బాధపడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో శిక్షించాలని ఆప్ అగ్రనేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీకి విజయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గణతంత్ర వేడుకల సందర్భంగా పంజాబ్ శకటాన్ని కేంద్రం నిరాకరించడం పంజాబీలను అవమానించడమేనన్నారు. దేశం కోసం అత్యున్నత త్యాగాలు చేసిన పంజాబ్ అమరులకు కేంద్రం నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ అవసరం లేదని వ్యాఖ్యానించారు. బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో కేంద్రం మితిమీరి జోక్యం చేసుకుంటూ పాలన సజావుగా సాగకుండా ఆటంకాలు కలిగిస్తోందని విమర్శించారు. ఆదివారం ఆయన లూధియానాలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీలో తనను ఇబ్బందులు పెడుతున్న కేంద్రాన్ని అడ్డుకోగలిగానన్నారు. ఇక్కడ సీఎం మాన్ కేంద్రం, బీజేపీ, గవర్నర్ల వైఖరితో పోరాటం సాగిస్తున్నారని చెప్పారు. -
AAP: రెండు రాష్ట్రాల్లో అభ్యర్థుల ప్రకటన.. ఢిల్లీలో తొలిసారి ఇలా!
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో భాగంగా కాంగ్రెస్ పార్టీతో ఆప్ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆప్ మంగళవారం.. ఢిల్లీ, హర్యానాలో తమ పారటఈ నుంచి పోటీ చేసే లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించింది. సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ మూడు సీట్లలో పోటీ చేయగా.. ఆప్ నలుగురు అభ్యర్థుల పేర్లను రిలీజ్ చేసింది. ఆప్ సీనియర్ నేత సోమనాథ్ భారతీకి న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం, సహిరామ్ పెహల్వాన్ (దక్షిణ ఢిల్లీ), మహాబల్ మిశ్రా (పశ్చిమ ఢిల్లీ) మరియు కుల్దీప్ కుమార్ (తూర్పు ఢిల్లీ) సెగ్మెంట్లను ఆప్ ప్రకటించింది.పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 3 స్థానాల్లో పోటికి దిగనుంది. ఇక.. హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర నియోజకవర్గంలో ఆప్ లోక్ సభ అభ్యర్థి సుశీల్ గుప్తాను బరిలోకి దింపుతున్నట్లు పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లో ఆప్ అభ్యర్థులు పోటీ చేస్తామని.. మొత్తం 29 మంది అభ్యర్థులు బరిలోకి దింపుతున్నట్లు ఆప్ సీనియర్ నేత సందీప్ పాఠక్ వెల్లడించారు. ప్రకటించిన అభ్యర్థుల ఎంపిక తీవ్రంగా కసరత్తు చేశామని, పలుసార్లు చర్చించి పార్టీ లెక్కల ప్రకారమే బరిలో నిలుపుతున్నామని ఆప్ సీనియర్ నేత గోపాల్ రాయ్ పేర్కొన్నారు. తాము పోటీ చేసే ప్రతి సీట్లలో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆప్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. జనరల్ స్థానం అయిన తూర్పు ఢిల్లీ లోక్ సభ స్థానంలో ఎస్సీ అభ్యర్థిని పోటీ నిలుపుతున్నామని చెప్పారు. కుల్దీప్ కుమార్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. లోక్‌సభ ఎన్నికల్లో జనరల్ స్థానంలో ఎస్సీ అభ్యర్థిని పోటీనికి నిలపటం ఢిల్లీ ఇదే తొలిసారి అని తెలిపారు. కుల సమీకరణాలను దృష్టిలో పెట్టుకోకుండా ఆప్ మొదటి నుంచి ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడేవారికే టికెట్లు ఇస్తూ వస్తోందని పేర్కొన్నారు. -
నాకు నోబెల్ ప్రైజ్ రావాలి!: సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. కేంద్రంతో ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న విభేదాల నేపథ్యంలో తాను ఢిల్లీలో పరిపాలన కొనసాగిస్తున్నందుకు ‘నోబెల్ ప్రైజ్’ రావాలని అన్నారు. నీటి బిల్లులపై ఆప్ కార్యకర్తలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. ‘ఢిల్లీలో పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మించకుండా బీజేపీ అడ్డుపడుతోంది. వాళ్ల(బీజేపీ)పిల్లలు స్థాయిలో పేద పిల్లలు విద్య ద్వారా మంచి స్థానంలోకి ఇష్టం లేదు. నాకు తెలుసు.. నేను ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నానో. దానికి నాకు నోబుల్ ప్రైజ్ రావాలి’ అని సీఎం కేజ్రీవాల్ అన్నారు. పెండింగ్‌లో ఉన్న నీటి బిల్లుల విషయంలో ఆప్ ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ అమలను కేంద్రం ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారులు.. కేంద్ర ప్రభుత్వానికి భయపడి తమ ఆదేశాలను పట్టించుకోవటం లేదన్నారు. ‘ఢిల్లీ వాటర్ బోర్డు పథకానికి ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఈ పథకానికి కేబినెట్ ఆమోదం పొందాలి. ఈ పథకాన్ని ఆపేయాలని బీజేపీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరుతోంది. అధికారులు భయపడుతున్నారు. రాష్ట్ర మంత్రులు బిల్లు ఎందుకు తీసుకురావటం లేదని అడిగితే.. ఈ పథకాన్ని కేబినెట్ ఆమోదిస్తే మమ్మల్ని సస్పెండ్ చేస్తారని అధికారులు తెలిపారు. నకిలీ కేసుల బనాయించి తమపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అధికారులు చెబుతున్నారు’ అని సీఎం కేజ్రీవాల్ బీజేపీపై మండిపడ్డారు. #WATCH | Delhi CM Arvind Kejriwal says "...They (BJP) tried to stop the construction of schools and hospitals in Delhi. They do not want the poor to get the same level of education as their children...Only I know, how am I running the government in Delhi, I should get a Nobel… pic.twitter.com/8AduBk30tw — ANI (@ANI) February 25, 2024 చదవండి: ‘బీజేపీకి ఒమర్ అబ్దుల్లా సవాల్.. ఎన్నికలు నిర్వహించండి’ -
బీజేపీ దొంగిలిస్తే.. మేం తిరిగి గెలిచాం: సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గత నెలలో జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాలు చెల్లవని సుప్రీంకోర్టు ప్రకటించింది. రిట్ర్నింగ్ అధికారి చట్ట విరుద్దంగా వ్యహరించారన్న సర్వోన్నత న్యాయస్థానం.. ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్‌ను చండీగఢ్ మేయర్‌గా ప్రకటించింది. సుప్రీం కోర్టు మంగళవారం వెల్లడించిన తీర్పును ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’(ట్విటర్ ) వేదికగా సుప్రీం కోర్టు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇటువంటి కఠిన సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిన దేశ అత్యున్నత న్యాయస్థానానికి ధన్యవాదాలు’అని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ప్రతిపక్షాల ‘ఇండియా ఇండియా’తొలి విజయమని అన్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ నిరంకుశత్వంతో దొడ్డిదారిలో గెలుపొందాలని ప్రయత్నించిందని మండిపడ్డారు. Thank you SC for saving democracy in these difficult times! #ChandigarhMayorPolls — Arvind Kejriwal (@ArvindKejriwal) February 20, 2024 ఎన్నికల్లో ముందు బీజేపీ దొంగమార్గంలో గెలిచింది.. కానీ మేము మళ్లీ గెలిచి మేయర్ స్థానాన్ని నిలబెట్టుకున్నాం. ఇది ఇండియా కూటమికి అతిపెద్ద విజయం. బీజేపీని ఓడించలేమనేవారు.. తెలుసుకోవాలి ఓడిస్తామని. ఇండియా కూటమి భాగస్వామ్య నేతలకు ధన్యవాదాలు. ఇది చండీగడ్ ప్రజల విజయం’అని సీఎం కేజ్రీవాల్ అన్నారు. చదవండి: చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
పంజాబ్‌లో ఒంటరి పోరు.. కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ, ఆప్ వేర్వేరుగా.. ఒంటరిగానే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగాలని ఓ ఒప్పదం చేసుకున్నట్లు వెల్లడించారు. పంజాబ్‌లో ఇరు పార్టీలు ఒంటరిగా పోటీ చేయటంపై ఎటువంటి అభిప్రాయ బేధాలు లేవని స్పష్ట చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేఖ్ సింఘ్వీ నివాసంలో ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ‘ఇరు పార్టీల ఒప్పందం ప్రకారమే పంజాబ్‌లో ఒంటగా పోటీ చేస్తున్నాం. ఈ విషయంలో ఎటువంటి బేధాభిప్రాయాలు, వివాదం కానీ లేవు’ అని కేజ్రీవాల్ తెలిపారు. ఇండియా కూటమిలో భాగంగా ఢిల్లీలో సీట్లపంపకంపై చర్చలు చివరికి వచ్చాయని తెలిపారు. ‘ఢిల్లీలో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నాం. ఢిల్లీలో ఇరుపార్టీల మధ్య సీట్ల పంపిణీ కసరత్తు జరుగోతోంది. ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తులేకపోతే బీజేపీకి తేలిక అవుతుంది’ అని కేజ్రీవాల్ అన్నారు. ఇక.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏడు సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఏడు స్థానాల్లో బీజేపీ గెలుపొందిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని 13 సీట్లలో తాము ఒంటరిగా పోటీ చేస్తామని రాష్ట్ర సీఎం భగవంత్‌సింగ్ మాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆప్ నిర్ణయాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీ కూడా పంజాబ్‌లో ఒంటరిగానే బరిలోకి దిగాలనుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. -
కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 17న హాజరు కావాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఐదుసార్లు సమన్లు జారీ చేయగా.. ఆయన డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది. లిక్కర్ స్కామ్ కేసులో విచారణ నిమిత్తం ఈడీ ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ విచారణకు హాజరవడం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం విచారణ జరిపిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.. ఈ నెల 17న కేజ్రీవాల్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. లిక్కర్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌లు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇక.. తనకు పంపిన సమన్లు చట్టవిరుద్ధమైనవంటూ తొలి నుంచి అరవిండ్ కేజ్రీవాల్ విచారణకు హజరు కావడం లేదు. ఇది రాజకీయ ప్రతీకార చర్యగా.. ఢిల్లీ ప్రభుత్వానికి కూలదోసేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యత్నంగా ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ విచారణకు ప్రతిగా.. పార్టీ కార్యక్రమాలకు, వ్యక్తిగత కార్యక్రమాలకు కేజ్రీవాల్ హజరవుతూ వచ్చారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. కేజ్రీవాల్‌కు కిందటి ఏడాది నవంబర్ 2వ తేదీన తొలిసారి సమన్లు పంపింది ఈడీ. అప్పటి నుంచి సమన్లు పంపిన ప్రతీసారి(నవంబర్ 2, డిసెంబర్ 21, జనవరి 3, జనవరి 19, ఫిబ్రవరి 2) ఆయన అరెస్ట్ అవుతారంటూ చర్చ తీవ్రంగా నడిచింది. చదవండి: యూసీసీపై ఎంఐఎం చీఫ్ కీలక వ్యాఖ్యలు -
కేజ్రీవాల్ జైలుకెళ్తే.. ‘ఆప్’ ఏం చేయనుంది?
ఢిల్లీలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో విచారణ కోసం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)మరోసారి సమన్లు పంపింది. ఫిబ్రవరి 2న విచారణకు హాజరు కావాల్సిందిగా కేజ్రీవాల్‌ను పిలిచారు. అయితే గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. దేశంలో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలను పరిశీలిస్తే.. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను కూడా మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసింది. ఈ నేపధ్యంలో ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా అరెస్టు చేయనున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా కేజ్రీవాల్ తీరు చూస్తుంటే హేమంత్ సోరెన్‌ను కాపీ కొడుతున్నారేమోననే అనుమానాలు పలువురిలో కలుగుతున్నాయి. మనీలాండరింగ్ కేసులో సోరెన్‌కు ఈడీ తొమ్మిది సమన్లు పంపింది. వీటిని సోరెన్ విస్మరిస్తూనే వచ్చారు. దీంతో ఆయనపై ఉచ్చు మరింత బిగుసుకుంది. 10వ సమన్లను కూడా పట్టించుకోకుండా మాయమైన హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఇక కేజ్రీవాల్ విషయానికివస్తే, ఆయన ఇప్పటివరకు ఐదు సమన్లను తిరస్కరించారు. దీనిని చూస్తుంటే కేజ్రీవాల్ ఈ సమన్లను ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాలు ఎప్పుడూ ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలిగినవిగా కనిపిస్తుంటాయని, ప్రజల్లో సానుభూతి పొందేందుకు ఆయన ప్రయత్నిస్తుంటారని పలువురు విశ్లేషిస్తుంటారు. ఒకవేళ ఈడీ బృందం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు వస్తే, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల్లో సానుభూతి కార్డ్ ప్లే చేస్తుందనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇది పార్టీకి ప్లస్ పాయింట్ అయ్యేలా కనిపిస్తోంది. బీజేపీ ఆదేశాల మేరకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయనుందని ‘ఆప్’ నేతలు తరచూ ఆరోపిస్తున్నారు. దీనికితోడు తనను ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చని అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ప్రకటించడం విశేషం. మద్యం కుంభకోణానికి సంబంధించిన ఈ కేసులో గత రెండేళ్లుగా దర్యాప్తు జరుగుతోందని, అయితే ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈడీ తనను ఎందుకు పిలుస్తున్నదని అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఇది బీజేపీ రాజకీయ ప్రేరేపిత చర్య అని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాను ప్రధాని నరేంద్ర మోదీతో పోటీ పడగలనని నిరూపించడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. అందుకే లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే, ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. అప్పుడు అది పార్టీకి కలివచ్చే అంశంగా మారుతుంది. మరోవైపు ఈ ఘటనతో ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లో కేజ్రీవాల్ తన సత్తాను నిరూపించుకోగలుగుతారు. అప్పుడు ఢిల్లీలో లోక్‌సభ సీట్ల పంపకానికి సంబంధించి కాంగ్రెస్‌తో ‘ఆప్’ మరింతగా చర్చలు జరిపేందుకు అవకాశం ఏర్పడుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
కేజ్రీవాల్‌కు ఐదోసారి ఈడీ సమన్లు
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి సమన్లు జారీచేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇవాళ ఈడీ ఐదోసారీ సమన్లు ఇచ్చింది. ఇప్పటివరకూ ఆయన ఈడీ ఎదుట విచారణకు హాజరుకాని విషయం తెలిసిందే. లిక్కర్ కేసులో మొదటిసారి ఆయన నవంబర్ 2వ తేదీన సమన్లు ఇచ్చింది ఈడీ. ఆపై డిసెంబర్ 21న రెండోసారి, జనవరి 3వ తేదీన మూడోసారి, జనవరి 13వ తేదీన నాలుగోసారి సమన్లు జారీ చేసింది. అయితే పార్టీ వ్యవహారాల పేరిట ఆయన విచారణకు డుమ్మా కొడుతూ వస్తున్నారు. తాజాగా ఐదోసారి నేడు జారీ చేసిన సమన్లలో ఫిబ్రవరి 2వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడీ కోరింది. ఈసారి గనుక ఆయన హాజరు కాకుంటే.. అరెస్ట్ వారెంట్ కోసం ఈడీ కోర్టును ఆశ్రయించవచ్చు. మరోవైపు తొలి నుంచి ఆయన ఈడీ నోటీసులను బీజేపీ ప్రతీకార రాజకీయ చర్యగా.. సార్వత్రిక ఎన్నికల ముందు జరుపుతున్న కుట్రగా అభివర్ణిస్తూ వస్తున్నారు. అయితే ఇందులో ప్రతీకార రాజకీయాలాంటిదేం లేదని.. మాత్రం దర్యాప్తు సంస్థలు స్వేచ్ఛగా తమ పని తాము చేసుకుంటున్నాయని బీజేపీ చెబుతోంది. -
హర్యాణలో ఒంటరిగా పోటీ చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్
రాబోయే సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో పంజాబ్‌ల సొంతంగా బరిలోకి దిగుతామని ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో భాగస్వామ్య పార్టీగా కాకుండా తాము సొంతంగా పోటీ చేస్తామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వెల్లడించిన సంగతి విదితమే. ఇక.. తాజాగా హర్యాణ రాష్ట్రంలో ఆప్ మరో నిర్ణయం తీసుకుంది. హర్యాణ అసెంబ్లీలో తాము ఎవరితో పొత్తు పెట్టుకొమని.. అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం తెలిపారు. జింద్ పట్టణంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. హర్యాణలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 90 కాగా... పార్లమెంట్ ఎన్నికల అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికలో మాత్రం హర్యాణలో ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో భాగస్వామ్య పక్షంగా పోటీ చేస్తామని చెప్పారు. ‘ప్రస్తుతం ప్రజలంతా ఒకే పార్టీపై నమ్మకం పెట్టుకున్నారు.. అదే ఆమ్ ఆద్మీ పార్టీ. ఒకవైపు పంజాబ్.. మరోవైపు ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఉంది. ఢిల్లీ, పంజాబ్ ప్రజలు పాలనలో మార్పు కోరి చాలా సంతోషంగా ఉన్నారు’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. హర్యాణలో కూడా ఆప్ పార్టీ గెలిస్తే.. ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. అందుకే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఆప్ ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. చదవండి: బిహార్‌లో ఇప్పుడే అసలైన ఆట మొదలైంది: తేజస్వీ యాదవ్ -
ఈడీ విచారణ... కేజ్రీవాల్ హాజరుపై సస్పెన్స్
ఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి డుమ్మా కొట్టనున్నారా?.. అవుననే అంటున్నాయి అప్ వర్గాలు. లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను పరిశీలించేందుకు ఆయన గోవాకు వెళ్లనున్న నేపథ్యంలో ఈడీ సమన్లను మరోసారి దాటవేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కేజ్రీవాల్‌కి గత వారం నాల్గవసారి ఈడీ సమన్లు జారీ చేసింది. జనవరి 18న ఈడీ ముందు హాజరు కావాలని కోరింది. మూడు రోజుల పర్యటన నిమిత్తం గోవాకు వెళ్లాల్సి ఉన్నందున ఈడీ ముందు ఆయన హాజరుకావడానికి అవకాశం లేదని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అరవింద్ కేజ్రీవాల్ జనవరి 11న గోవాకు వెళ్లాల్సి ఉండగా, గణతంత్ర దినోత్సవం కోసం ఢిల్లీలో సన్నాహాలను పర్యవేక్షించేందుకు వాయిదా వేశారని వెల్లడించాయి. రాజ్యసభ ఎన్నికలు, రిపబ్లిక్ డే సన్నాహాలను ఉటంకిస్తూ జనవరి 3న ఈడీ సమన్లను అరవింద్ కేజ్రీవాల్ దాటవేశారు. అంతకుముందు నవంబర్ 2, డిసెంబర్ 21న ఈడీ ముందు హాజరు కావాలని అధికారులు కోరారు. కానీ మూడుసార్లు ఈడీ సమన్లను దాటవేశారు. ఈడీ సమన్లను కేజ్రీవాల్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఈడీ చర్యల వెనక రాజకీయ ప్రేరణ ఉందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. చట్టం ప్రకారమే ఈడీని ఎదుర్కొంటామని అన్నారు. ఇదీ చదవండి: ఆ రోజు కోర్టులకు సెలవు ఇవ్వండి.. సీజేఐకి లేఖ -
సీఎం కేజ్రీవాల్‌కు నాలుగోసారి ఈడీ సమన్లు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ED) తాజాగా నాలుగోసారి సమన్లు జారీ చేసింది. జనవరి 18 విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లలో పేర్కొంది. జనవరి 3న మూడోసారి ఈడీ ఇచ్చిన సమన్ల విచారణకు సీఎం కేజ్రీవాల్ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈడీ పంపిన సమన్లు చట్టపరమైనవి కావని, కేవలం తనను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా జారీ చేసినవి కేజ్రీవాల్ మండిపడ్డ విషయం తెలిసిందే. ఇక గతంలో ఈడీ నవంబర్2, డిసెంబర్ 21న సీఎం కేజ్రీవాల్‌కు.. రెండుసార్లు సమన్లు పంపించిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంకి సంబంధించి మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా 2023 ఫిబ్రవరి నుంచి జైల్లోనే ఉన్నారు. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను అక్టోబర్‌లో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక.. ఈసారైనా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ సమన్లకు స్పందించి విచారణ వెళ్లుతారో? లేదో? అని ఆప్ పార్టీలో చర్చజరుగుతోంది. చదవండి: తిరస్కరణ సీఎంను కాదు.. మాజీ సీఎంను: శివరాజ్ సింగ్ చౌహన్ -
‘సీఎం కేజ్రీవాల్ ఈడీ నుంచి తప్పించుకోలేరు’
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానంలో అవకతవకలకు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జారీ చేసిన సమన్ల నుంచి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తప్పించుకోలేరని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మండిపడ్డారు. అయితే ఈడీ ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్‌కు వరుసగా మూడుసార్లు సమన్లు జారీ చేసిన విసయం తెలిసిందే. కాగా.. మూడోసారి జారీ చేసిన మమన్ల ప్రకారం కేజ్రీవాల్ 2024 జనవరి 3వ తేదీ ఈడీ ముందు హాజరుకావల్సి ఉంది. అరవింద్ కేజజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే ఈడీ ముందుకు రావటంలేదని వీరేంద్ర సచ్‌దేవా మండిపడ్డారు. ముడోసారి జారీ చేసిన సమన్ల నుంచి మాత్రం కేజ్రీవాల్ ఎట్టిపరిస్థితుల్లో తప్పించుకోలేరని అన్నారు. VIDEO | "Initially, he used the excuse of elections and then Vipassana, and now let's see what explanation he gives on January 3. He can't evade this for long, he has to appear before the agency," says BJP leader @Virend_Sachdeva on ED's summon to CM Arvind Kejriwal. pic.twitter.com/GObqIb6fL7 — Press Trust of India (@PTI_News) December 30, 2023 మొదటిసారి ఎన్నికలు, రెండోసారి విపాశన ధ్యానం పేరుతో కేజ్రీవాల్ దూరంగా ఉన్నారని దుయ్యబట్టారు. జనవరి 3న హాజరుకావాలన్న ఈడీ సమన్లపై ఎలాంటి వివరణ ఇస్తారో చూస్తామని తెలిపారు. అయితే సుదీర్ఘం కాలం మాత్రం ఈడీ సమన్ల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని అన్నారు. కచ్చితంగా కేజ్రీవాల్ ఈడీ ముందుకు హాజరు కావాల్సిందేనని తెలిపారు. ఇక సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ మొదటిసారి నవంబర్ 2న, రెండోసారి డిసెంబర్18న, మూడోసారి డిసెంబర్ 21న సమన్లను జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు సార్లు ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన సీఎం కేజ్రీవాల్ జనవరి 3న ఈడీ ముందుకు హాజరవుతారో? లేదో? అని పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. చదవండి: ‘రాముడు హిందువులకే దేవుడు కాదు.. అందరివాడు’ -
ఢిల్లీ సీఎం ప్రతి ఏడాది చేసే విపాసన ధ్యానం అంటే ఏంటీ..?
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం విపాసన ధ్యానం కోర్సుకు బయల్దేరారు. నేటి నుంచి పది రోజులపాటు ఆయన ధ్యానం కోర్సులో పాల్గొననున్నారు. డిసెంబర్ 30 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. కేజ్రీవాల్ ప్రతి ఏడాది చలికాలంలో ఈ విపాసన ధ్యానం చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో బెంగళూరు, జైపుర్ వంటి నగరాల్లో ఆయన ఈ శిక్షణకు హాజరయ్యారు కూడా. అసలేంటి విపాసనా ధ్యానం? ఎందుకు చేస్తారు తదితరాల గురించే ఈ కథనం!. విపాసనా ధ్యానం అంటే.. విపసనా ధ్యానం అనేది మీ మనస్సును లోతుగా కేంద్రీకరించడానికి సహాయపడే ఒక ప్రత్యేకమైన అభ్యాసం. విపాసన అంటే 'అంతర్దృష్టి' అనే అర్థం వస్తుంది. అంటే విపాసన అభ్యాసం ద్వారా విషయాన్ని సంపూర్ణ ఏకాగ్రతతో లోతుగా అర్థం చేసుకొని, మనశ్శాంతిని సాధించడం. ఇది చంచలమైన మనస్సును నియంత్రించి, ప్రశాంతత చేకూరుస్తుంది. తద్వారా ఒకే అంశంపై దృష్టి కేంద్రీకరించేలా చేసే స్థితిని కల్పిస్తుంది. వివిధ రకాల ఆలోచనలు చుట్టుముట్టకుండా, మీ అంతరంగాన్ని ఏకాగ్రం చేసి, స్వీయ పరిశీలనను అభ్యసించడానికి మిమ్మల్ని ఈ మెడిటేషన్ టెక్నిక్ అనుమతిస్తుంది. విపసనా ధ్యానం అనేది బౌద్ధమతంలో ఆచరించే పురాతన ధ్యాన పద్ధతి. సుమారు 2,400 సంవత్సరాల క్రితం బుద్ధుడు సృష్టించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ ధ్యాన అభ్యాసం ఆగ్నేయాసియా, శ్రీలంకలో చాలా ఎక్కువగా ఆచరిస్తారు. భారతదేశంలో కూడా చాలా చోట్ల విపాసన ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. ఇది మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. మానసిక ప్రశాంతతను ఇవ్వడమే గాక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ధ్యానంతో కలిగే ప్రయోజనాలు.. విపసనా ధ్యానంతో వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్లే దీనికి విశేష జనాదరణ ఉంది. ఇది చేస్తే మెరుగైన ఏకాగ్రత, మానసిక ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది ఆందోళన తగ్గిస్తుంది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మాదక ద్రవ్యాల అడిక్షన్ నుంచి బయటపడేలా చేస్తుంది అధ్యయనంలో 40 రోజులు ఈ మైండ్‌ఫుల్‌నెస్ టెక్కిక్ తీసుకున్న వారిలో ఈ మార్పులన్ని గమనించారు పరిశోధకులు. వారిలో ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గి ప్రశాంత చిత్తంతో కనిపించారని చెబుతున్నారు. ఎలా చేయాలంటే.. ముందుగా సుఖాసంనలో కూర్చొని నడుం నిటారుగా ఉంచి శ్వాస పీలుస్తూ వదులుతూ ఉండాలి. మీ మనో చిత్తంపై దృష్టిని కేంద్రీకరిస్తూ ఎలాంటి ఆలోచనలు రాకుండా చేసుకోవాలి. మొదట్లో ఐదు నుంచి 10 నిమిషాలు చేయండి. క్రమేణ పెంచుతూ 15 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సేపు ధ్యానం చేయండి. (చదవండి: పొడవాటి జుట్టు లేకపోయినా మిస్ ఫ్రాన్స్‌గా కిరీటం దక్కించుకుంది! అందానికి..) -
అరెస్టు కానున్న నేతలు వీరే: ఆప్
కోల్‌కతా: మమత ఆరోపణలు వాస్తవమేనని ఆప్ పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల్లోపు విపక్ష ఇండియా కూటమి నేతలందరినీ ఏదోలా జైలుపాలు చేయాలని మోదీ సర్కారు కుట్ర చేస్తోందని ఆ పార్టీ నేత రాఘవ్ ఛద్దా ఆరోపించారు. తొలుత తమ అధినేత కేజ్రీవాల్‌ను అరెస్టు చేయజూస్తోందన్నారు. 2014 నుంచి దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసుల్లో ఏకంగా 95 శాతం విపక్ష నేతలపైనే కావడం మోదీ సర్కారు కక్షపూరిత వైఖరిని అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. ‘‘ఇండియా కూటమి ఆవిర్భావంతో బీజేపీ వణికిపోతోంది. అందుకే విపక్ష కూటమిలోని అగ్ర నేతలందరినీ లక్ష్యంగా చేసుకుందని మాకు విశ్వసనీయ వర్గాల నుంచి ఇప్పటికే సమాచారం అందింది. ‘‘కేజ్రీవాల్ తర్వాత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీలను అరెస్టు చేయడం మోదీ సర్కారు లక్ష్యం. వారి తర్వాత జాబితాలో కేరళ సీఎం పినరయ్ విజయన్, తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్, శివసేన, ఎన్సీపీల అగ్ర నేతలున్నారు’’ అని ఆరోపించారు. -
విపక్ష నేతలందరి అరెస్టుకు కుట్ర: మమతా బెనర్జీ
కోల్‌కతా: బీజేపీపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నాటికి ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు సీనియర్ ప్రతిపక్ష నాయకులను బీజేపీ అరెస్టు చేయడానికి కుట్ర పన్నిందని ఆరోపించారు. ఆ తర్వాత ఖాళీ దేశంలో వాళ్లకు వాళ్లే ఓట్లు వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రతిపక్ష నాయకుల ఫోన్లను కూడా బీజేపీ హ్యాక్ చేసిందని దీదీ ఆరోపించారు. “వచ్చే ఏడాది ఎన్నికలకు ముందే బీజేపీ ప్రతిపక్ష పార్టీల నోరు మూయడానికి ప్రయత్నిస్తోంది. బీజేపీ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్టు చేయాలని ప్రణాళిక చేస్తున్నారు. ఈ విధంగా ఎన్నికల్లో లాభపడాలని చూస్తున్నారు" అని కోల్‌కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో మమతా బెనర్జీ ఆరోపించారు. దేశ రాజధానిలో మద్యం పాలసీ కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత గురువారం కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను, మంత్రి అతిషిని నవంబర్ 2న అరెస్టు చేయనున్నారని ఆప్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ స్పందించారు. అటు.. టీఎంసీ నాయకుల చుట్టూ కూడా ఈడీ ఉచ్చు బిగుస్తోంది. రేషన్ పంపిణీ కుంభకోణంలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ గత వారం అరెస్టయ్యారు. ఇండియా కూటమి నేతలే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయని దీదీ ఆరోపించారు. ఇదీ చదవండి: మరాఠా రిజర్వేషన్‌కు అనుకూలమే: ఏక్నాథ్ షిండే -
కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: ప్రధాని డిగ్రీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు షాకిచ్చింది సుప్రీంకోర్టు. ప్రధాని డిగ్రీకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ హైకోర్టు పరువు నష్టం చర్యలు తీసుకోకుండా స్టే విధించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ప్రధాని డిగ్రీకి సంబంధించి తమ యూనివర్సిటీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తోపాటు మరో ఆప్ నేత సంజయ్ సింగ్‌లపై గుజరాత్ యూనివర్సిటీ రిజిష్ట్రార్ పీయూష్ పటేల్ పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మధ్యంతర స్టే విధించాల్సిందిగా మొదట గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించగా ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు గుజరాత్ హైకోర్టులో విచారణ దశలో ఉన్నందున దీనిపై తాము ఎటువంటి నోటీసులు ఇవ్వలేమని చెబుతూ సంజీవ్ ఖన్నా, ఎస్విఎన్ భట్టిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అరవింద్ కేజ్రీవాల్, గుజరాత్ యూనివర్సిటీ హైకోర్టుకు వివరణ ఇవ్వాలని తెలిపింది. అంతకు ముందు ప్రధాని డిగ్రీపై వ్యంగ్యంగానూ అవమానకరంగానూ వ్యాఖానించినందుకు వీరిరువురికీ గుజరాత్ మెట్రోపాలిటన్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను సవాల్ చేస్తూ సెషన్స్ కోర్టును ఆశ్రయించగా కేజ్రీవాల్‌కు అక్కడ కూడా చుక్కెదురైంది. పరువు నష్టం కేసు ట్రయల్‌పై మధ్యంతర స్టే విధించాలన్న వారి రివిజన్ అప్లికేషన్‌ను సెషన్స్ కోర్టు కూడా తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. గుజరాత్ హైకోర్టులో ఆగస్టు 29న ఈ కేసు విచారణకు రానుంది. Supreme Court refuses to grant relief to Delhi’s Chief Minister Arvind Kejriwal in the criminal defamation case filed by the Gujarat University over his comments in connection with the Prime Minister’s degree. Supreme Court notes that Kejriwal’s plea to stay the trial is pending… pic.twitter.com/oPUFC3pR2J — ANI (@ANI) August 25, 2023 ఇది కూడా చదవండి: G20 Summit: ఢిల్లీలో మూడ్రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు -
కాంగ్రెస్‌పై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
భోపాల్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో తనవైన రాజకీయాలకు తెరతీశారు. సాట్నాలో ఓ కార్యక్రమానికి అతిధిగా హాజరైన ఢిల్లీ సీఎం INDIA కూటమిలో భాగస్వామిగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో తమకు అవకాశమిస్తే INDIA కూటమిలో తమ భాగస్వామి కాంగ్రెస్ పార్టీని బీజేపీని కూడా మర్చిపోతారని అన్నారు. మధ్యప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు అప్పుడే ఎన్నికలకు శంఖారావాన్ని పూరించాయి. ఇదిలా ఉండగా మేమేమీ తక్కువ తినలేదంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా మధ్యప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మధ్యప్రదేశ్‌లోని సాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రస్తావన తీసుకొస్తూ తమ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో తమను మరో 50 ఏళ్ల వరకు ఏ పార్టీ కదపలేదని అన్నారు. మధ్యప్రదేశ్‌లో కూడా ఒకసారి అవకాశమిచ్చి చూడండి.. కాంగ్రెస్, బీజేపీల కంటే గొప్ప పరిపాలన అందిస్తామని అన్నారు. కాంగ్రెస్ బీజేపీని విమర్శిస్తుంది.. బీజేపీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది.. మాకు విమర్శించడం తెలియదు. జాతిని నిర్మించడం ఒక్కటే మా ప్రధాన లక్ష్యం. జాతి నిర్మాణం కోసమే మేము అన్నా ఆందోళన నుండి విడిపోయామని అన్నారు. ఇన్కమ్ టాక్స్ కమీషనర్‌గా పని చేస్తోన్న నేను జాతిని నిర్మించాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో ఉద్యోగాన్ని విడిచిపెట్టేశానని అన్నారు. మేము రాజకీయ నాయకులం కాదు. జాతి నిర్మాణమే మా ప్రధాన ఎజెండా. మధ్యప్రదేశ్‌లో మమ్మల్ని గెలిపిస్తే బీజేపీ తోపాటు కాంగ్రెస్ పార్టీని కూడా మర్చిపోయేలా పరిపాలిస్తామని అన్నారు. VIDEO | "We are not politicians, we are here to build the nation. I request you to give us one chance, and I promise you will forget BJP and Congress," says Delhi CM @ArvindKejriwal at AAP's town hall programme in Satna, Madhya Pradesh. pic.twitter.com/xzIkfJgXc7 — Press Trust of India (@PTI_News) August 20, 2023 ఇది కూడా చదవండి: ధైర్యముంటే రిపోర్టు కార్డు విడుదల చెయ్యండి.. అమిత్ షా -
చదువురానివారు నాయకులైతే దేశం బాగుపడదు.. అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: అనకాడమీ సంస్థకు చెందిన ఒక లెక్చరర్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన విద్యార్థులతో వచ్చే ఎన్నికల్లో చదువుకున్న వారికి ఓటు వేయమని అభ్యర్ధించాడు. దీంతో ఆ సంస్థ క్లాస్రూమ్ వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకునే వేదిక కాదని చెబుతూ అతడిపై వేటు వేసింది. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందిస్తూ లెక్చరర్ చెప్పిన దాంట్లో తప్పేముందన్నారు. కరణ్ సంగ్వాన్ అనకాడమీలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్ ద్వారా ఆయన తన విద్యార్థులకు ఎన్నికల్లో విద్యావంతులైన అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయాలని ఓ వీడియోలో కోరారు. దీంతో ఆగ్రహించిన ఆ సంస్థ సహ యజమాని రోమన్ సైనీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనపై వేటు వేస్తున్నట్లు ప్రకటిస్తూ X వేదికగా ట్వీట్ చేశారు. దీనిపై సంగ్వాన్ స్పందిస్తూ.. గత కొద్ది రోజులుగా నాకు సంబంధించిన ఒక వీడియో వివాదాస్పదంగా మారింది. నా తోపాటు జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధపడుతున్న నా విద్యార్థులు కూడా ఆ వీడియో వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 19న దానిపై వివరణ ఇస్తానని వెల్లడించారు. సంస్థ సహ యజమాని రోమా సైనీ X వేదికగా ఏమని రాశారంటే.. మా సంస్థకు చాలా కచ్చితమైన నియమ నిబంధనలున్నాయి. విద్యార్ధులకు నిశ్పాక్షిక జ్ఞానాన్ని అందించడమే మా కర్తవ్యం. క్లాస్రూమ్ అనేది వ్యక్తిగత అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకునే వేదిక కాదు. అవి విద్యార్ధులపై తప్పుడు ప్రభావం చూపుతాయి. సంస్థ నిబంధనలను ఉల్లంఘించినందుకు కారం సంగ్వాన్ ను విధుల నుండి తొలగించామని తెలియజేశారు. ఈ ఉదంతంపై సాక్షాత్తు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందిస్తూ.. చదువుకున్న వ్యక్తికి ఓటు వేయమని అడగడం కూడా తప్పేనా? ఎవరైనా నిరక్షరాస్యులు ఉంటే వారిని నేను వ్యక్తిగతంగా గౌరవిస్తాను. కానీ ప్రజాప్రతినిధులు నిరక్షరాస్యులు కాకూడదు. ఇసి సైన్స్ అండ్ టెక్నాలజీ దూసుకెళ్తోన్న తరం. చదువురాని వారి ఆధునిక భారత దేశాన్ని నిర్మించలేరని అన్నారు. क्या पढ़े लिखे लोगों को वोट देने की अपील करना अपराध है? यदि कोई अनपढ़ है, व्यक्तिगत तौर पर मैं उसका सम्मान करता हूँ। लेकिन जनप्रतिनिधि अनपढ़ नहीं हो सकते। ये साइंस और टेक्नोलॉजी का ज़माना है। 21वीं सदी के आधुनिक भारत का निर्माण अनपढ़ जनप्रतिनिधि कभी नहीं कर सकते। https://t.co/YPX4OCoRoZ — Arvind Kejriwal (@ArvindKejriwal) August 17, 2023 ఇది కూడా చదవండి: నెహ్రూ గొప్పదనం ఆయన పేరులో లేదు.. రాహుల్ గాంధీ -
నీట మునిగిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం
-
ఢిల్లీలో జల ప్రళయం.. యమునా ఉధృతరూపం.. ఆల్‌టైమ్ రికార్డు
న్యూఢిల్లీ: ఢిల్లీలో జల ప్రళయం కొనసాగుతూనే ఉంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో యమునా నది మరింత ఉధృతరూపం దాల్చింది. నదిలో నీటిమట్టం గురువారం ఉదయం నాటికి 208.46 మీటర్లకు చేరింది. ఢిల్లీ చరిత్రలో ఇదే ఆల్‌టైమ్ రికార్డు. 1978లో 207.49 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ఉదయం 10 గంటల తర్వాత యమునా నీటి ప్రవాహం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని, దీనిని ‘తీవ్ర పరిస్థితి’గా కేంద్ర జల సంఘం పేర్కొంది. ఇక నది నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ నీటిపారుదల, వరద నియంత్రణ విభాగం సూచించింది. బుధవారం నది సమీపంలోని ప్రాంతాలు నీటమునిగాయి. ప్రభుత్వ అధికారులు వేలాది మందిని సురక్షిత ప్రాతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. #WATCH | Delhi: Low-lying areas near Kashmiri gate flooded due to the rise in the water level of river Yamuna. pic.twitter.com/wgSNhB669c — ANI (@ANI) July 13, 2023 అమిత్ షాకు కేజ్రివాల్ లేఖ ఢిల్లీలో వరద ఉధృతి పెరుగుతోందని, యమునలో నీటిమట్టం మరింత పెరగకుండా చర్యలు తీసుకొనే విషయంలో సహకారం అందించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశ రాజధానిలో భీకర వరదలు రావడం ప్రపంచానికి మంచి సందేశం కాదని చెప్పారు. జి–20 సదస్సుకు త్వరలో ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వబోతోందని గుర్తుచేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర హోంశామంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. హరియాణాలోని హత్రీకుండ్ బ్యారేజీ నుంచి నీటి విడుదలను తగ్గిస్తే ఢిల్లీలో వరదలు తగ్గుముఖం పడతాయని సూచించారు. ఢిల్లీ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. యుమునా నదిలో నీటిమట్టం 207.72 మీటర్లకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అంచనా వేసిందని తెలిపారు. అదే జరిగితే భారీ నష్టం వాటిల్లుతుందని కేజ్రివాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న జల ప్రవాహమే ఇందుకు కారణమని ఆయన ట్వీట్ చేశారు. #WATCH | Delhi: Low-lying areas near Kashmiri gate flooded due to the rise in the water level of river Yamuna. pic.twitter.com/wgSNhB669c — ANI (@ANI) July 13, 2023 హిమాచల్‌లో 88 మంది మృతి హిమాచల్ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నంకల్లా రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల మృతి చెందినవారి సంఖ్య 88కి చేరింది. మరో 16 మంది గల్లంతయ్యారు. 100 మంది క్షతగాత్రులయ్యారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. పశువుల కొట్టాలు కూలిపోయాయి. #WATCH | Traffic affected after GT Karnal road in Delhi gets flooded after rise in water level of Yamuna River pic.twitter.com/hoaKTR2ZCr — ANI (@ANI) July 13, 2023 మరోవైపు పంజాబ్, హరియాణాలో మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలు కొంత తగ్గుముఖం పట్టాయి. రెండు రాష్ట్రాల్లో మృతుల సంఖ్య 18కు చేరుకుంది. హరియాణాలో చాలా ప్రాంతాలు జలమయంగా మారాయి. పంజాబ్‌లో 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో వర్షాల కారణంగా గత 24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) హిమాచల్‌లోని మండీలో పూర్తిగా ధ్వంసమైన వంతెన -
విపక్షాల ఐక్యత చెడగొట్టడమే అతని పని
న్యూఢిల్లీ: జూన్ 23న బీహార్ వేదికగా జరిగిన విపక్షాల ఐక్య సమావేశం తరవాత నుండి కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా ఈ రెండు పార్టీల ప్రతినిధులు ఒకరిపై ఒకరు మాటలతో దాడి చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మార్కెట్ అంతా విద్వేషాలుంటే అందులో రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం తెరిచారని ఎద్దేవా చేస్తే.. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ విపక్షాల ఐక్యతను దెబ్బ తీయడమే అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యమని అన్నారు. ఢిల్లీ ఆర్దనెన్స్ కు వ్యతిరేకంగా బలాన్ని కూడగడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ మద్దతును కూడా కోరింది. కానీ కాంగ్రెస్ పార్టీ నుండి ఎటువంటి సానుకూల సంకేతాలు అందకపోవడంతో ఆ పార్టీ నేతలు మాటల యుద్ధానికి తెరతీశారు. ఈ సందర్బంగా ఆప్ నేత ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తరచుగా ప్రేమ గురించి మాట్లాడుతూ బీజేపీ ద్వేషాన్ని రెచ్చగొడుతోందని అంటున్నారు. మరి మొహబ్బత్ కి దుకాన్ పేరిట ప్రేమ దుకాణాన్ని తెరచిన ఆయన ఎవరు ఏమి కోరినా ప్రేమతో అంగీకరించాలి కదా? ఇప్పుడు అయన అధికారంలో లేరు కాబట్టి ఆయనలో ఇగో లేదు. రేపు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇగో వస్తే ఏమిటి పరిస్థితి? ఆయన సంయమనంతో వ్యవహరించి ప్రేమతత్వాన్ని చాటుకోవాలని అన్నారు. #WATCH | "I always see that Rahul Gandhi talks about love and says that BJP spreads hate. So if Rahul Gandhi is running 'Mohabbat ki Dukan' then whosoever will come to him can buy that love. When he said that his party spread love then he has to show this also. Right now he… pic.twitter.com/XTDmQtTsOP — ANI (@ANI) June 25, 2023 ఇక కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ మాత్రం ఆప్ నేతలపైనా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైనా తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. ఒకపక్క ఢిల్లీ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మా మద్దతు కోరతారు.. మరోపక్క మాపైనే విచక్షణారహితంగా విమర్శలు చేస్తారు. ఢిల్లీ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పంతం నెగ్గించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన 31 మంది రాజ్యసభ సభ్యుల మద్దతు తప్పనిసరి. మరి అలాంటప్పుడు కాళ్లబేరానికి వెళ్ళకుండా కయ్యానికి కాలు దువ్వుతుండడం ఆశ్చర్యకరమే మరి. ఈ రెండు నాలుకల ధోరణి వలన ఎవరికి ప్రయోజనం? నాకైతే ఒక్కటే ప్రయోజనం కనిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు బీజేపీ పక్కలో చేరారు. విపక్షాలు ఐక్యత చెడగొట్టడమే ప్రస్తుతం కేజ్రీవాల్ ముఖ్య లక్ష్యమని అన్నారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో భారీ వర్షాలు.. కరెంటు షాక్ కొట్టడంతో యువతి మృతి -
కేసీఆర్ దారిలో కేజ్రీవాల్?.. ఇది కాంగ్రెస్‌కు రిక్వెస్ట్ కాదు అల్టిమేటం!
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఇందులో భాగంగా శుక్రవారం బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ నివాసంలో కాంగ్రెస్‌తోపాటు వివిధ ప్రతిపక్షాలు హాజరు అయ్యారు. గతంలోనే ఈ భేటీలో ప్రధాని అభ్యర్థిపై ఎలాంటి చర్చ జరగదని ఈ పార్టీలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ తరుణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతి పక్షాలకు సడన్‌గా షాక్ ఇచ్చారు. కాంగ్రెస్‌కు కేజ్రీవాల్ అల్టిమేటం శుక్రవారం విపక్షాల సమావేశం నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్‌కు అల్టిమేటం ఇచ్చారు. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించాలని, లేనిపక్షంలో తాను భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు సంబంధించిన అన్ని సమావేశాలకు దూరంగా ఉండనున్నట్లు తెలిపారు. ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ తన వైఖరిని వెల్లడించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఈ సమావేశానికి సీఎం కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రతి పక్షాలన్నీ సమావేశమైన ఈ సమయంలో రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆప్ పార్టీ విషయంలో కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. కాగా ఇప్పటికే కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు అరవింద్ కేజ్రీవాల్ పలువురు ఆప్ నేతలను కలిశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీని కూడా కలిసేందుకు ప్రయత్నించాగా.. అది కుదరలేదు. కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోతే.. కేసీఆర్ దారిలో కేజ్రీవాల్? ఒక వేళ ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ ఆప్‌కు మద్దతు తెలపకపోతే.. కేజ్రీవాల్ కూడా సీఎం కేసీఆర్ దారిలో నడిచే అవకాశం ఉంది. ఇటీవల టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించిన కేసీఆర్.. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండింటిపై దాడి చేస్తూ వివిధ రాష్ట్రాల్లో తన సంస్థాగత బలాన్ని చాటుకుంటూ రానున్న ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నారన్న సంగతి తెలిసిందే. చదవండి: 'భేటీకి హాజరైన ప్రతిపక్ష నాయకుల ట్రాక్ రికార్డ్ ఎలాంటిదో..?' -
నా లివర్ ఇనుముతో తయారుకాలేదు..
న్యూఢిల్లీ: ప్రఖ్యాత టెలివిజన్ షో ఆప్ కీ అదాలత్ కార్యక్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ ను మీరు గత 10-12 సంవత్సరాలుగా రాత్రి పగలు తేడా లేకుండా బాగా మద్యం సేవిస్తుంటారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నిజమేనా? అని ప్రశ్నించగా పంజాబ్ ముఖ్యమంత్రి.. నా లివర్ ఇనుముతో తయారైందనుకున్నారా ఏంటని చమత్కరించారు సీఎం. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ పెద్ద తాగుబోతు అని ప్రతిపక్షాలు గత కొన్నేళ్లుగా విమర్శిస్తూ ఉన్నాయి. కానీ ఆ విషయాన్ని ఆయనెప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇటీవల ఆప్ కీ అదాలత్ టీవీ కార్యక్రమానికి అతిధిగా హాజరైన ఆయనను ఇదే విషయం గురించి ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ.. నా లివర్ ఇనుముతో తయారయ్యిందనుకున్నారా? ఏంటి? 10-12 ఏళ్లపాటు పగలు రాత్రి తేడా లేకుండా మద్యం తాగుతూ కూర్చుంటే అసలు బ్రతికేవాడినా? ప్రతిపక్షాలకు నా గురించి మాట్లాడటానికి ఏమీ లేనప్పుడు ఇలాంటి చెత్త విమర్శలే చేస్తుంటారన్నారు సీఎం. నేను పొద్దున్న లేస్తూనే మొదటి ఫైల్ తెప్పించుకుని దాని గురించే ఆలోచిస్తాను. ఇలా పనిచేసే పంజాబ్‌లో గత 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఏడాదిన్నరలోనే చేసి చూపించా. చిత్తశుద్ధితో పని చేశాను కాబట్టే ఈరోజు 88% ఇళ్లలో విద్యుత్తు ఇవ్వగలిగాము. 2019లో జరిగిన ఒక పబ్లిక్ ర్యాలీలో భగవంత్ మన్ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, తన తల్లి సమక్షంలో మద్యం మానేస్తున్నట్టు బాహాటంగానే మాటిచ్చారు. ఆయన ఆ అలవాటు మానుకున్నా కూడా ఆయనకు ఆ ట్యాగ్ మాత్రం అలా ఉండిపోయింది. ప్రతిపక్షాలు విమర్శించడానికి ఈ కారణమే ఇప్పుడు అదనుగా మారింది. मेरा Liver क्या लोहे का है जो 10–12 साल से सुबह शाम पी रहा हूं, फिर भी जिंदा हूं? जितना काम 75 साल में नहीं हुआ, पिछले सवा साल में किया है 88% घरों में मुफ़्त बिजली जाती है Punjab में! इतना कोयला कभी नहीं था जितना आज है। नीयत होनी चाहिए काम करने की। —CM @BhagwantMann… pic.twitter.com/u9YcIxgHk4 — AAP (@AamAadmiParty) June 18, 2023 ఇది కూడా చదవండి: "మన్ కీ బాత్"లో "మణిపూర్ కీ బాత్" లేదా? -
బీజేపీ సూపర్ స్ట్రోక్.. అరవింద్ కేజ్రీవాల్ షాక్..
న్యూఢిల్లీ: వచ్చే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు రామ్ లీలా మైదానం వరకు భారీ ర్యాలీగా కదిలి అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే. ఆదివారం ర్యాలీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రిలాక్స్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులకు ఆదివారం ఉదయాన్నే సూపర్ స్ట్రోక్ ఇచ్చింది బీజేపీ పార్టీ. వారు ఢిల్లీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాత్రికి రాత్రే దారి పొడవునా బ్యానర్లు, ప్లకార్డులు తగిలించేశారు. బీజేపీ సూపర్ స్ట్రోక్.. అరవింద్ కేజ్రీవాల్ బహిరంగ సభకు సంబంధించిన ప్రచార బ్యానర్ల కంటే కూడా బీజేపీ తగిలించిన ఈ పోస్టర్లే జనాలను బాగా ఆకర్షిస్తుండటం విశేషం. ఆమ్ ఆద్మీ పార్ట్ బ్యానర్లలో కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ అని ఉంటే .. బీజేపీ రాసిన బ్యానర్లలో ఢిల్లీ సీఎం నిర్మించుకున్న సొంత ఇంటి భవనం గురించి మాత్రమే ప్రస్తావించారు.. "ఇంటి పునర్నిర్మాణానికి రూ. 45 కోట్లా.. ప్రజల వద్ద టాక్స్ రూపంలో వసూలు చేసిందేగా..?" "మాక్కూడా రూ. 45 కోట్ల భవనాన్ని చూడాలని ఉంది.." అని రాసిన బ్యానర్లు ఢిల్లీ వీధుల్లో ఎక్కడ పెడితే అక్కడ దర్శనమిచ్చాయి. ग़रीबों की कमाई के 45 करोड़ खर्च कर राजमहल सजाया केजरीवाल जवाब दो?? pic.twitter.com/BOuT2RCQhW — BJP Delhi (@BJP4Delhi) June 11, 2023 కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందకుండా ఉండడానికి ఢిల్లీ సీఎం దేశవ్యాప్తంగా విపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నియంతృత్వ పాలనను తలపిస్తున్నాయని ఆరోపిస్తూ అందుకు వ్యతిరేకంగా ఈ భారీ ర్యాలీ, బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు కేజ్రీవాల్. కానీ ర్యాలీ రోజు ఉదయాన్నే బీజేపీ కౌంటర్ పోస్టర్లతో ఎన్ కౌంటర్ చేస్తుందని ఆయన అస్సలు ఊహించలేదు. అంతేకాదు బీజేపీ ఢిల్లీ తన ట్విట్టర్ అకౌంట్లో "ఢిల్లీని నాశనం చేయడానికి ఒక్కడు చాలు.. అతని పేరు అరవింద్ కేజ్రీవాల్" అని రాసి సీఎం ఫోటో ఉన్న ఒక సినిమా పోస్టర్ కూడా పోస్ట్ చేసింది. सिर्फ एक बंदा काफ़ी है, दिल्ली को तबाह करने के लिए - नाम है केजरीवाल pic.twitter.com/EwwFDBnmV5 — BJP Delhi (@BJP4Delhi) June 11, 2023 ఇది కూడా చదవండి: జపాన్ జంట మెచ్చిన వంట.. ప్రధాని ట్వీట్ వైరల్ -
ఎట్టి పరిస్థితుల్లో బిల్లును అడ్డుకుంటాం... అరవింద్ కేజ్రీవాల్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా బలాన్ని కూడగట్టే పనిలో విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ క్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిసి మద్దతు కోరగా అయన సానుకూలంగా స్పందించినందుకు కేజ్రీవాల్ కృతఙ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం... ఢిల్లీలో ఆధిపత్యం కోసం ప్రయత్నించిన కేంద్రానికి సుప్రీం కోర్టులో చుక్కెదురవడంతో ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని చూస్తోన్న కేంద్రానికి లోక్ సభలో బిల్లు ఆమోదింప చేయడం పెద్ద కష్టం కాదు. కానీ రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదించబడాలంటే మాత్రం 93గా ఉన్న వారి బలం సరిపోదు. ప్రతిపక్షాల మద్దతు కూడా కావాలి. కానీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎలాగైనా కేంద్రానికి అడ్డుకట్ట వేయాలని కృతనిశ్చయంతో ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరినీ కలుపుకుంటూ... ఇప్పటికే ఈ బిల్లుకు వ్యతిరేకంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ల మద్దతును కూడగట్టిన కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మన్ తో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో భేటీ అయ్యి మద్దతివ్వాలని కోరారు. అందుకు స్టాలిన్ కూడా సుముఖంగా స్పందించడంతో కేజ్రీవాల్ ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు. తర్వాతి ప్రయత్నంలో ఢిల్లీ సీఎం జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ను కూడా కలిసి మద్దతు కోరనున్నారు. చదవండి: కర్ణాటక ఫలితాలు ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది.. -
దేశంలో కేంద్రం అరాచకాలు, ఆగడాలు మితిమీరాయి
-
నేడు కేసిఆర్ ని కలవనున్న కేజ్రీవాల్
-
ఆ విషయమై రాహుల్ గాంధీని కలవనున్న అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ బ్యూరోక్రాట్ల నియంత్రణ అంశమై కేంద్రంపై జరుగుతున్న పోరు విషయమై మద్దతును అభ్యర్థించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను కలిసిందుకు అవకాశం ఇవ్వాలని ఢ్లిల్ల సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థించారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ నేత(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఈ అంశంపై కేంద్ర ప్రవేశ పెట్టిన బిల్లు వీడిపోయేలా తగినంత మద్దతు పొందడం కోసం వివిధ నాయకులతో ఇప్పటికే సమావేశమయ్యారు. ఇటీవల సుప్రీం కోర్టు బ్యూరోక్రాట్ బదిలీల నియామకాలపై కేంద్రం కాదు, ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వమే నియంత్రణ కలిగి ఉంటుందని ఆదేశాలిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఐతే ఈ తీర్పును పూర్వపక్షం చేసేలా ఆర్డినెన్స్‌ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ శీతకాల సమావేశంలో ఆమెదించిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును తీసుకురావాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీని, మల్లిఖార్జున్ ఖర్గేని కలిసి, సమావేశమయ్యేందుకు సమయం కావాలని కోరినట్లు ట్వీట్ చేశారు. ఆ సమావేశంలో.. బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన అప్రజాస్వామిక రాజ్యంగ విరుద్ధమైన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పార్లమెంటులో కాంగ్రెస్ మద్దతు కోరడానికి, అలాగే సమాఖ్య నిర్మాణంపై సాధారణ దాడి, ప్రస్తుతం రాజకీయ పరిస్థితులె తదితరాలపై చర్చించనున్నట్లు తెలిపారు అరవింద్ కేజ్రీవాల్. కాగా, ఈ అంశంపై ఆప్‌కి మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై తమ ప్రాంతీయ నేతలతో సంప్రదింపులు జరుపుతామని కాంగ్రెస్ తెలిపింది. Sought time this morning to meet Cong President Sh Kharge ji and Sh Rahul Gandhi ji to seek Cong support in Parl against undemocratic n unconstitutional ordinance passed by BJP govt and also to discuss general assault on federal structure and prevailing political situation — Arvind Kejriwal (@ArvindKejriwal) May 26, 2023 (చదవండి: తీవ్ర అనారోగ్యం.. ఆప్ సత్యేందర్ జైన్‌కు మధ్యంతర బెయిల్) -
నరేంద్ర మోదీ పాత ట్వీట్‌ను జత చేసి.. విరుచుకుపడ్డ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారాలకు సంబంధించి కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్చునిచ్చింది. ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారి అని, నిజమైన అధికారాలు అసెంబ్లీకే ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆఖరికి అధికారుల నియామకం సహా ఢిల్లీ ప్రభుత్వానికే అన్ని అధికారాలు ఉంటాయని పేర్కొంది సుప్రీం కోర్టు. కాగా, ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్‌తో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది. 2013లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా, ఒక సమస్యపై కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ మీద ఫైర్ అవుతూ ఒక ట్వీట్ చేశారు. అందులో “పార్లమెంట్ ఏమైనప్పటికీ సమావేశమవుతుంది. కేంద్రం పార్లమెంటును ఎందుకు విశ్వాసంలోకి తీసుకుని మంచి బిల్లు ఇవ్వలేకపోయింది? ఆర్డినెన్స్ ఎందుకు? అని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ని ఉద్దేశించి ఆర్డినెన్స్ ఎందుకు సార్ అని మోదీ పాత ట్వీట్‌ని జత చేశారు ఢిల్లీ సీఎం . ‘సేవల’పై ఢిల్లీ ప్రభుత్వానికి నియంత్రణ కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పును నేరుగా సవాల్ చేసే విధంగా ఉన్న ఆర్డినెన్స్‌ను కేంద్రం తీసుకొచ్చిన నేపథ్యంలో ఢిల్లీ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వం తన అధికారులపై నియంత్రణ కలిగి ఉండాలని తెలిపింది. తాజా తీర్పు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వానిదే పైచేయి తప్ప ఎల్జీది కాదని తేల్చింది. ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారి అని, నిజమైన అధికారాలు అసెంబ్లీకే ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆఖరికి అధికారుల నియామకం సహా ఢిల్లీ ప్రభుత్వానికే అన్ని అధికారాలు ఉంటాయని పేర్కొంది సుప్రీం కోర్టు. మూడు అంశాలు మినహా ఇతర విషయాల్లో ఢిల్లీ సర్కారుకు వేరే రాష్ట్రాలతో సమానంగా అధికారాలుంటాయని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఢిల్లీ పరిపాలన, అధికారుల బదిలీలపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన 10 రోజుల్లోనే.. తాజాగా, శుక్రవారం కేంద్ర ప్రభుత్వం బదిలీ, విజిలెన్స్ వంటి అంశాల్లో ఆర్డినెన్స్ జారీ చేసి చట్ట సవరణ చేసింది. అయితే తాజాగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కేంద్రం ఈ ఆర్డినెన్స్ తీసుకురావడంతో ఈ వివాదం ఎప్పటికి ముగుస్తుందో వేచి చూడాల్సిందే. Why ordinance Sir? https://t.co/C9otuhtY4X — Arvind Kejriwal (@ArvindKejriwal) May 21, 2023 -
కొనసాగుతున్న రెజ్లర్ల నిరసన.. ప్రియాంక గాంధీ సంఘీభావం
న్యూఢిల్లీ: భారత్ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా... తమ నిరసనను ముగించేందుకు రెజ్లర్లు ఇష్టపడటం లేదు. జంతర్‌మంతర్ వద్ద శనివారం కూడా ఈ నిరసన కొనసాగింది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు రాజకీయ నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆటగాళ్లకు తమ సంఘీభావం ప్రకటించారు. అయితే కొందరు బయటి వ్యక్తులు నిరసన వేదిక వద్ద వచ్చి దుష్ప్రచారం చేస్తున్నారని రెజ్లర్ బజరంగ్ పూనియా ఆరోపించాడు. తమ ఉద్యమం రెజ్లర్ల సమస్యలకే పరిమితమని, ఇతర రాజకీయ అంశాల జోలికి తాము వెళ్లడం లేదని అతను అన్నాడు. మరో వైపు తాజా అంశంపై ‘ఫొగాట్’ సోదరీమణుల మధ్య విభేదాలు తలెత్తాయి. నిరసనలోకి రాజకీయ నాయకులను రానివ్వొద్దంటూ బబిత ఫొగాట్ విమర్శించగా... మహిళా రెజ్లర్ల తరఫున నిలవడం ఇష్టం లేకపోతే, కనీసం నిరసనను బలహీనపర్చవద్దని వినేశ్ జవాబిచ్చింది. -
ప్రధాని మోదీపై పోస్టర్లు.. 8 మంది అరెస్ట్
న్యూఢిల్లీ: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేసినందుకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు అహ్మదాబాద్(గుజరాత్) పోలీసులు. మోదీ హఠావో.. దేశ్ బచావో అంటూ రాతలు ఉన్న ఆ పోస్టర్లను ఆ వ్యక్తులు అహ్మదాబాద్‌లోని పలు చోట్ల అంటించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఉదంతంపై అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో.. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇక.. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోస్టర్ల ప్రచారం చేపట్టగా.. ఆ మరుసటిరోజే ఈ అరెస్టుల పర్వం మొదలవ్వడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ హఠావో.. దేశ బచావక్ష పేరుతో మొత్తం పదకొండు భాషల్లో(గుజరాతీ, పంజాబీ, తెలుగు, పంజాబీ, ఒడియా, కన్నడ, మలయాళం, మరాఠీ)లో ఈ పోస్టర్ల ప్రచారం చేపట్టింది ఆప్. ఇదిలాఉంటే.. గతవారం దేశరాజధానిలో మోదీ వ్యతిరేక పోస్టర్లు దర్శనమిచ్చాయి. దీనిపై 49 ఎఫ్ఐఆర్లు నమోదు కావడంతో పోలీసులు.. ఆరుగురిని అరెస్ట్ చేశారు. ప్రింటింగ్ ప్రెస్‌లకు చెందిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారట. మొత్తంగా బుధవారం ఒక్కరోజే మోదీ వ్యతిరేక పోస్టర్ల వ్యవహారంపై 138కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఓవైపు పోలీసులు ఈ అరెస్టులపై స్పందించారు. పబ్లిక్ ప్రాపర్టీలను పాడు చేయడంతోపాటు సదరు పోస్టర్లపై ప్రింటింగ్ ప్రెస్‌కు సంబంధించిన పేరు, అడ్రస్, ఇతర వివరాలను పొందుపర్చలేదని.. అందుకే చట్టం ప్రకారం వాళ్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మరోవైపు ఈ పరిణామంపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బ్రిటిష్ కాలంలో ఇలాంటి నిరసనలు తెలిపినా.. వాళ్లు స్వాతంత్ర ఉద్యమకారులపై కేసులు పెట్టలేదని అన్నారు. భగత్ సింగ్ నాడు స్వయంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు. కానీ, ఏనాడూ ఆయనపై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. వందేళ్ల కిందట వ్యతిరేక పోస్టర్ల వ్యవహారంలో బ్రిటిషర్లు కూడా ఎవరినీ అరెస్ట్ చేయలేదు. కానీ, ఇవాళ ఒక్కరాత్రిలో ప్రధానిపై పోస్టర్లు వేశారని 138 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అమాయకుల్ని అరెస్ట్ చేశారు. దేశంలో అసలేం జరుగుతోంది. ప్రధాని ఆరోగ్యం సక్రమంగానే ఉందా?. మోదీ హఠావో.. దేశ్ బచావో అనే పోస్టర్ల క్యాంపెయిన్ అసలు పెద్ద అంశమేనా?. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఆయన(ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) అభద్రతా భావంలోకి కూరుకుపోతున్నారు. బహుశా సరిగ్గా నిద్ర కూడా పోవట్లేదేమో. అదే నిజమైతే మంచి డాక్టర్‌కు చూపించుకోమని ఆయనకు చెప్పండి. చిరాకులో ఆయన ప్రతీ ఒక్కరినీ జైలులో వేసుకుంటూ పోతున్నారేమో. ప్రధాని ఆరోగ్యం బాగుండాలని నేను ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నా అంటూ కేజ్రీవాల్ ప్రసంగించారు. -
manish sisodia: సిసోడియాపై మరో కేసు
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మనీష్ సిసోడియాకు మరో షాక్ తగిలింది. ఢిల్లీ ప్రభుత్వ ఫీడ్‌బ్యాక్ విభాగంలో(FBU) అవినీతి ఆరోపణలకుగానూ ఆయనపై తాజాగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మరో కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఆయన లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయ్యారు. ఫీడ్‌బ్యాక్ యూనిట్‌ను ఢిల్లీలో అధికారంలోకి వచ్చాక ఆప్ ప్రభుత్వం 2015లో ఏర్పాటు చేసింది. అయితే ఈ విభాగం ఏర్పాటు, నిర్వాహణ అంతా చట్టానికి విరుద్ధంగా నడిచిందని, సుమారు రూ.36 లక్షల నష్టంతో అవకతవకలు జరిగాయని సీబీఐ పేర్కొంది. ఈ అవినీతి ఆరోపణలకుగానూ సిసోడియాపై కేసు నమోదు చేస్తున్నట్లు సీబీఐ వెల్లడించింది. ఈ పరిణామంపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఇదంతా ప్రధాని ప్లాన్ అని, సుదీర్ఘకాలం మనీష్ సిసోడియాను జైల్లో ఉంచేందుకు తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ ట్వీట్ చేశారాయన. PM’s plan is to slap several false cases against Manish and keep him in custody for a long period. Sad for the country! https://t.co/G48JtXeTIc — Arvind Kejriwal (@ArvindKejriwal) March 16, 2023 ఎఫ్‌బీయూను తప్పుడు దోవలో రాజకీయ అవసరాల కోసం సిసోడియా ఉపయోగించారని, ఇతరుల వ్యక్తిగత సమాచార సేకరణ యత్నం జరిగిందని(Snooping Case) సీబీఐ తన నివేదికలో పొందుపరిచింది. ఈ మేరకు ఫిబ్రవరి నెలలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. అవినీతి నిరోధక చట్టం కింద సిసోడియాను విచారించేందుకు సీబీఐను అనుమతించింది కూడా. ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి అయిన సిసోడియాను సీబీఐ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 రూపకల్పనలో జరిగిన అవినీతి కుంభకోణానికిగానూ ఫిబ్రవరి 26వ తేదీన అరెస్ట్ చేసింది. -
‘ఢిల్లీ లిక్కర్ స్కాం.. నెక్ట్స్ అరెస్ట్ అరవింద్ కేజ్రీవాల్’
మనీలాండరింగ్ కేసులో శుక్రవారం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో సుకేశ్ చంద్రశేఖర్ హాజరుపరిచారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సుకేశ్.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తదుపరి అరెస్ట్ అరవింద్ కేజ్రీవాల్‌దే నంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చంద్రశేఖర్ గతంలో కేజ్రీవాల్, సిసోడియా, ఇతర ఆప్ నేతలపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈడీ ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో దూకుడు పెంచింది. ఈ క్రమంలో ఆప్ నేత, మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ కూడా చేసింది. ఈ కేసుకు సంబంధించి తరువాత అరెస్ట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అని పేర్కొన్న చంద్రశేఖర్.. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ పాత్ర ఉందని, త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయని తెలిపాడు. క్రిమినల్ కేసులో అరెస్టయిన తన భర్తకు బెయిల్ ఇప్పించేందుకు మల్వీందర్ సింగ్ భార్య జప్నా సింగ్‌ను రూ. 3.5 కోట్లకు మోసం చేశాడని ఆరోపిస్తూ సుకేష్ చంద్రశేఖర్ గతేడాది అరెస్టయ్యాడు. సింగ్ ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్. తాజాగా మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యాడు. శుక్రవారం చంద్రశేఖర్ కోర్టుకు హాజరు కాగా.. న్యాయస్థానం అతనికి మార్చి 18 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. కాగా చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం, ఈడీ దర్యాప్తులో బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీ, మరికొంత మంది పేర్లు బయటపడిన సంగతి తెలిసిందే. -
ప్రధాని మోదీకి కేసీఆర్ సహా విపక్ష నేతల లేఖ.. ఏమన్నారంటే?
గత కొన్ని నెలలుగా దేశంలో ప్రతిపక్ష నేతలే టార్గెట్‌గా ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్), సీబీఐ, ఐటీ దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో, ప్రతిపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి తాజాగా విపక్షాలు లేఖ రాశాయి. సీఎం కేసీఆర్ సహా 9 మంది విపక్ష నేతలు ప్రధానికి లేఖ రాశారు. ఇక, లేఖలో భాగంగా మనీష్ సిసోడియా అరెస్ట్‌ను ఖండించారు విపక్ష నేతలు. అలాగే, కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. 2014 నుంచి దేశంలో ఇదే పరిస్థితి ఉందన్నారు. ఇక, గవర్నర్ వ్యవస్థను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. ప్రజా తీర్పును గౌరవించాలని కోరారు. భారత్ ఇంకా ప్రజాస్వామ్య దేశమే అని నమ్ముతున్నామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విపక్ష సభ్యులపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని అన్నారు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఉన్న వాళ్లు బీజేపీలో చేరితే క్లీన్చిట్ ఇస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై శారదా చిట్‌ఫండ్‌పై 2014, 2015లో సీబీఐ, ఈడీ విచారణ జరిపాయి. ఆయన బీజేపీలో చేరిన తర్వాత కేసు పురోగతి లేదన్నారు. అలాగే, బీజేపీలో చేరిన సువేందు అధికారి, ముకుల్ రాయ్, నారాయణ్ రాణే వంటి మరికొందరిపై కూడా కేసులు నమోదు చేసినప్పటికీ విచారణలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ఇదే క్రమంలో సిసోడియా అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర ఉంది. దేశంలోనే విద్యావ్యవస్థలో మంచి సంస్కరణలు తీసుకువచ్చారన్న మంచి పేరుంది. ఎటువంటి ఆధారాలు లేకుండా సిసోడియాను అరెస్ట్ చేశారు. సిసోడియాపై ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి అని లేఖలో పేర్కొన్నారు. ఇక లేఖ రాసిన వారిలో సీఎం కేసీఆర్, మమతా బెనర్జీ, స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, శరద్ పవార్, ఫరుఖ్ అబ్దుల్లా, తేజస్వీ యాదవ్, ఉద్ధవ్ థాక్రే, అఖిలేష్ యాదవ్ ఉన్నారు. -
Manish Sisodias Arrest: డర్టీ పాలిటిక్స్ అంటూ ఢిల్లీ సీఎం ఫైర్
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇదంతా డర్టీ పాలిటిక్స్ అంటూ కేంద్రంపై మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రజలు గట్టిగా స్పందిస్తారంటూ బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ప్రజలకు కూడా తెలుసు ఇక్కడ ఏ జరంగుతుందో అంటూ విరుచుకుపడ్డారు. ఏదో ఒక రోజు ప్రజలు దీని గురించి కచ్చితంగా నిలదీస్తారన్నారు. ఈ అరెస్టులు మా పోరాటానికి మరింత బలం చేకూర్చి మమ్మల్ని మరింత స్ట్రాంగ్‌గా మారుస్తుందన్నారు. ఈ అరెస్టులకు కారణం ఆప్‌కి పెరుగుతున్న ఆదరణనే అని చెప్పారు. ఇది కావాలని పెట్టిన తప్పుడు కేసు అన్నారు. ఆప్‌ని అంతం చేయాలనే బిజేపీ ఇలాంటి కుట్రలు చేస్తోందన్నారు. కాగా, సీబీఐ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను సుమారు ఎనిమిది గంటలు ప్రశ్నించి, తదనంతరం అనుహ్యంగా అరెస్టు ప్రకటించింది. పైగా విచారణలో సిసోడియా పొంతనలేని సమాధాలు ఇవ్వడంతోనే అరెస్టు చేసినట్లు పేర్కొంది. (చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు.. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్) -
Manish Sisodia: సీబీఐ ఆఫీసులో సిసోడియా
సాక్షి, ఢిల్లీ: రాబోయే కొన్నినెలలు జైల్లో గడపాల్సి వచ్చినా పట్టించుకోను. ఎందుకంటే.. నేను భగత్ సింగ్ మార్గాన్ని అనుసరించే వ్యక్తి. తెలుసు కదా.. దేశం కోసం ఆయన తన ప్రాణాలను అర్పించాడు!. లిక్కర్ పాలసీ కేసులో.. సీబీఐ విచారణకు వెళ్లబోయే ముందు మనీశ్ సిసోడియా చేసిన ట్వీట్ ఇది. ఆమ్ఆద్మీ పార్టీలో నెంబర్ 2 నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా లిక్కర్ స్కాంలో విచారణ కోసం ఆదివారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ఆయన కార్యాలయంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి సీబీఐ ఆయన్ని ప్రశ్నిస్తోంది. ఆప్ కార్యకర్తలు, తన మద్దతుదారులతో భారీ ర్యాలీగా సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకున్నారు. దారిపొడవునా సిసోడియా మద్దతు నినాదాలు, బీజేపీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారంతా. ఇక మార్గమధ్యంలో ఆయన రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అక్కడే ఆయన ప్రసంగించారు. జైలుకు వెళ్లేందుకు నేను భయపడను. ప్రధాని మోదీనే కేజ్రీవాల్‌కు భయపడుతున్నారు. మేం మోదీకి, బీజేపీకి భయపడం. నిజాయితీగా పని చేశా. ఆరోపణలన్నీ అవాస్తవాలే. ఇది సవాళ్లు ఎదుర్కొనే సమయం. బీజేపీ నుంచి దేశాన్ని రక్షించేది ఆప్ మాత్రమే అని సిసోడియా ప్రసంగించారు. ఒకవేళ ఏడు, ఎనిమిది నెలలపాటు నేను జైల్లో గడపాల్సి వస్తే.. గర్వంగా భావించండి. కేజ్రీవాల్‌కు ప్రధాని మోదీ బయపడతున్నారు. అందుకే నన్ను తప్పుడు కేసులో ఇరికిస్తున్నారు. నా భార్య ఇంటి వద్ద అనారోగ్యంతో ఉంది. ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. ఢిల్లీ చిన్నారులకు నేను చెప్పేది ఒక్కటే.. తల్లిదండ్రుల మాట వినండి.. బాగా చదువుకోండి అని ప్రసంగించారు. మరోవైపు సిసోడియాను విచారణ పేరిటి పిలిపించి.. సీబీఐ అరెస్ట్ చేయబోతుందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. సీబీఐ హెడ్ క్వార్టర్‌తో పాటు పలు చోట్ల సిబ్బందిని మోహరించి.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు ఆప్ నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు కూడా. ఇదిలా ఉంటే.. సిసోడియాను ఉద్దేశించి ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. దేవుడు మీతోనే ఉంటాడని, ఢిల్లీలోని లక్షల మంది తల్లిదండ్రులు ఆశీర్వాదాలు ఉంటాయని పేర్కొన్నారు. ఒకవేళ దేశం కోసం, సమాజం కోసం జైలుకు వెళ్లడం ఎంత మాత్రం శాపం కాదని పేర్కన్నారాయన. అదొక ఘనతగా అభివర్ణించారు. జైలుకు వెళ్లినా వెంటనే తిరిగి రావాలని తనతో పాటు యావత్ ఢిల్లీ ఆకాంక్షిస్తోందని చెప్పారాయన. లిక్కర్ స్కాంలో ఫిబ్రవరి 19వ తేదీనే సిసోడియాను సీబీఐ ప్రశ్నించేందుకు పిలిచింది. అయితే.. సిసోడియా విద్యాశాఖతో పాటు ఆర్థిక మంత్రి కూడా(ఇంకా పలు శాఖలను పర్యేవేక్షిస్తున్నారు). దీంతో ఢిల్లీ బడ్జెట్ తయారీకి వారం గడువు కావాలని ఆయన దర్యాప్తు సంస్థను కోరారు. దీంతో ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని.. అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉంటే.. దేశ రాజధానిలో తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీ విధానం అవినీతి మరక అంటించుకుంది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కిందటి ఏడాది సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. ఆ వెంటనే ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ పాత మద్యం పాలసీని తెరపైకి తెచ్చి.. కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయిందని లెఫ్టినెంట్ గవర్నర్ నిందించింది. ఇదిలా ఉంటే.. లిక్కర్ పాలసీ కేసు ఛార్జిషీట్లో ఏడుగురు నిందితుల పేర్లను పేర్కొన్న సీబీఐ.. సిసోడియా పేరు మాత్రం పేర్కొనలేదు. -
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బిగుస్తున్న ఉచ్చు
-
ఢిల్లీ మేయర్ పీఠం ఆప్‌దే..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మేయర్ పదవిని ఆప్ చేజిక్కించుకుంది. మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. బీజేపీపై ఆప్ 34 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో, బీజేపీకి ఊహించని షాక్ తగిలినట్టు అయ్యింది. కాగా, ఢిల్లీ మేయర్‌గా ఆప్ నేత షేల్లీ ఒబెరాయ్(39) ఎన్నికయ్యారు. ఇక, మేయర్ ఎన్నికల్లో షెల్లీ ఒబెరాయ్‌కి 150 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి. దీంతో, బీజేపీపై 34 ఓట్ల ఆధిక్యంతో ఆప్ అభ్యర్థి విజయం సాధించారు. అనంతరం, ఆప్ నేతలు ఒబెరాయ్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యమే గెలిచిందన్నారు. గెలుపు అనంతరం షెల్లీ ఒబెరాయ్ మాట్లాడుతూ.. ఈ సభను రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీరందరూ సభ గౌరవాన్ని కాపాడుతారని, సజావుగా జరిగేందుకు సహకరిస్తారని ఆశిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. ఇక, ఆప్ గెలుపుపై ఆ పార్టీ నేతలు స్పందించారు. ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం గెలిచింది. గూండాయిజం ఓడిపోయింది. ఢిల్లీ మేయర్‌గా ఎన్నికైనా షెల్లీ ఒబెరాయ్‌కు అభినందనలు. తర్వాత, అలె ఇక్బాల్ డిప్యూటీ మేయర్ అవుతారు. మోసపూరితంగా వ్వహరించి బీజేపీ మేయర్ పదవిని దక్కించుకోవాలని రాజకీయం చేసింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, ఆప్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 250 స్థానాలకుగానూ ఆప్ 134, బీజేపీ 104, కాంగ్రెస్ 9 వార్డులను దక్కించుకున్నాయి. షెల్లీ ఒబెరాయ్ వివరాలు ఇవే.. షెల్లీ ఒబెరాయ్(39).. గతంలో ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఆమె కౌన్సిలర్‌గా నెగ్గారు. ఈ క్రమంలోనే మేయర్‌గా ఎన్నికవడం విశేషం. ఇక ఆలె మొహమ్మద్ ఆరుసార్లు ఎమ్మెల్యే, ఆప్ నేత అయిన షోయబ్ ఇక్బాల్ తనయుడు. పదిహేడు వేల ఓట్ల మెజార్టీతో ఈ ఎన్నికల్లో నెగ్గారు. #WATCH | Aam Aadmi Party's Shelly Oberoi elected as the new mayor of Delhi. pic.twitter.com/wAd8WNUFwx — ANI (@ANI) February 22, 2023 -
ఎన్నికల ఏడాది 2023.. త్రిపుర నుంచి తెలంగాణ దాకా...
కోటి ఆశలతో కొత్త ఆకాంక్షలతో సరికొత్త ఏడాదిలోకి అడుగు పెట్టాం. ఈ ఏడాది ఎలా ఉంటుంది ? గతేడాదితో పోలిస్తే ఏం మార్పులొస్తాయి? సామాన్యుల దగ్గర్నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరి మదిలో ఇవే ఆలోచనలు సుళ్లు తిరుగుతున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ పీఠాన్ని కొల్లగొట్టాలంటే మోదీ చరిష్మా, రాహుల్ గాంధీ పాదయాత్ర, కేజ్రివాల్ క్రేజ్ కీలకంగా మారాయి... ఇది ఎన్నికల ఏడాది. ఈ ఏడాది మొత్తం తొమ్మిది రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు ఫైనల్ అనుకుంటే ఇవి సెమీఫైనల్స్‌గా భావించవచ్చు. 2022లో ఏడు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే బీజేపీ అత్యంత కీలకమైన యూపీ, గుజరాత్‌తో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో తిరుగులేని విజయం సాధించి ఆధిక్యం ప్రదర్శించింది. కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్‌తో సరిపెట్టుకుంటే, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ పంజాబ్‌లో ఘన విజయం సాధించడంతో పాటు గోవా (2 స్థానాలు), గుజరాత్ (5 సీట్లు)లో ఖాతా ప్రారంభించి జాతీయ స్థాయిలో ఒక కొత్త శక్తిగా ఎదిగింది. దీంతో రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ ఆధిక్యం ప్రదర్శిస్తుంది ? వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి రాజకీయాలు ఎలా మారుతాయన్న చర్చ వేడెక్కిస్తోంది. త్రిపుర నుంచి తెలంగాణ వరకు మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు 116 లోక్‌సభ స్థానాల పరిధిలో జరుగుతూ ఉండడంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ సారి త్రిపుర, మేఘాలయాలో తృణమూల్ కాంగ్రెస్ పోటీకి దిగుతూ ఉండడంతో మమతా బెనర్జీ కూడా జాతీయ స్థాయిలో చక్రం తిప్పడానికి సిద్ధమవుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా దేశంలో నెలకొన్న ఆర్థిక అసమానతలు, పెరిగిపోతున్న ధరలు, సైద్ధాంతికపరమైన విభేదాలు, మత పరమైన విభజనలు,, సామాజిక అస్థిరతలు, రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఎన్నికల్ని ఎలాంటి మలుపు తిప్పుతాయో చెప్పలేని పరిస్థితులున్నాయి. బీజేపీ వ్యూహాలు ఇలా..! కేంద్రంలో అధికార బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకున్న వ్యక్తిగత చరిష్మానే నమ్ముకుంది. వివిధ రాష్ట్రాల్లో స్థానిక అంశాలే కీలకంగా మారినప్పటికీ కమలనాథులు మరోసారి మోదీ మ్యాజిక్‌నే పరీక్షకు నిలబెడుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే కేంద్రం ప్రతీ నిర్ణయం తీసుకోనుంది. అన్నింటికి మించి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్రబడ్జెట్ ఈ ఎలక్షన్ ఏడాదిలో సలక్షణంగా ఉండే అవకాశాలే ఉన్నాయి. విదేశీ వ్యవహారాలను సమర్థంగా నడిపిస్తున్న మోదీ సర్కార్ వచ్చే సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగే జీ–20 సదస్సు ద్వారా భారత్ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టామన్న నినాదంతో వచ్చే ఎన్నికల్ని ఎదుర్కోవచ్చంటున్నారు. సదస్సుకు ముందే జమ్ము కశ్మీర్లో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని మోదీ, అమిత్ షా ద్వయం భావిస్తోంది. డిసెంబర్ నాటికి అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేస్తే మతపరంగా ఓట్లను ఏకీకృతం చేసే వ్యూహం ఫలించి ఢిల్లీ పీఠం మరోసారి తమకే దక్కుతుందన్న ఆత్మవిశ్వాసం అధికార పార్టీలో కనిపిస్తోంది. కాంగ్రెస్‌కి పూర్వ వైభవం వస్తుందా ? కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు కల్పించే రెండు ఘటనలు 2022లో జరిగాయి. గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి మల్లిఖార్జున్ ఖర్గేకి పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించడం ద్వారా ఒక కొత్త చరిత్ర నెలకొల్పితే, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మరో చరిత్రగా మారుతోంది. రాహుల్ పాదయాత్రకి వస్తున్న ప్రజాదరణని చూస్తుంటే తనపైనున్న పప్పు ముద్రను తొలగించుకొని రాహుల్ సరికొత్త రాజకీయ నాయకుడిగా ఎదిగే రోజు ఎంతో దూరం లేదనే అనిపిస్తోంది. పార్లమెంటు వేదికగా బీజేపీని ఇరుకున పెట్టేలా మాటల తూటాలు విసురుతూ, వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అంతర్గత పోరుల్ని చక్కదిద్దుతూ మల్లికార్జున ఖర్గే తన కొత్త బాధ్యతల్ని సమర్థంగా నిర్వహిస్తూ ఉండడం కాంగ్రెస్‌కి కలిసొచ్చే అంశం. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాటిని నిలబెట్టుకుంటూనే, తమకు అనుకూలంగా ఉన్న కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో విజయం సాధిస్తే లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రధాని మోదీని ఎదుర్కొనే నాయకుడిగా రాహుల్ అవతరిస్తారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ప్రతిపక్షాల ఐక్యత సాధ్యమా? ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి 2022 తీపి జ్ఞాపకాలనే అందించి వెళ్లింది. జాతీయ పార్టీగా కొత్త హోదా రావడంతో ప్రధాని మోదీ చరిష్మాకు దీటుగా నిలబడే వ్యక్తిగా కేజ్రీవాల్ నిలబడతారని ఆ పార్టీలో కొత్త ఆశలు చిగురించాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2025లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు తేజస్వి యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతాయని ప్రకటించడం ద్వారా తాను పూర్తిగా రేసు నుంచి తప్పుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మరిన్ని రాష్ట్రాలకు తమ పార్టీలని విస్తరించి జాతీయ స్థాయిలో పట్టు బిగించాలని చూస్తున్నారు. ప్రాంతీయ పార్టీల నాయకులందరూ ఢిల్లీ పీఠంపైనే గురి పెట్టడంతో అధికార బీజేపీని ఎదుర్కోవడానికి వీరంతా కలసికట్టుగా ఉండే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో కాంగ్రెస్‌ని కలుపుకుంటూ పోతూ విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వస్తేనే ప్రధాని మోదీని ఎదుర్కొని నిలబడగలరు. ప్రతిపక్షాలు చేతులు కలిపి బీజేపీకి సవాల్ విసురుతారో లేదో ఈ ఏడాదిలోనే తేలిపోనుంది. 2023 కేలండర్ ► ఫిబ్రవరి–మార్చి: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు ► మే: కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు ► జూలై– ఆగస్టు: 10 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ నుంచి అత్యధిక సీట్లు ► నవంబర్–డిసెంబర్: హిందీ బెల్ట్ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంతో పాటుగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎగ్జిట్ పోల్స్ పై స్పందించిన అరవింద్ కేజ్రీవాల్
-
ప్రచారంలో కేజ్రీవాల్‌కు వింత ప్రశ్న.. ఆయన సమాధానమిదే..!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల ప్రచారంలో వింత ప్రశ్న ఎదురైంది. పార్టీని స్థాపించిన తొలినాళ్లలో తలపై టోపీ, మెడలో మఫ్లర్‌తో ఆయన మఫ్లర్ మ్యాన్‌గా పాపులర్ అవటమే అందుకు కారణం. ఎప్పుడూ మెడలో మఫ్లర్, తలపై టోపీతో కనిపించే ఆయన.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో అవి లేకుండా కనిపించారు. ఈ క్రమంలో చిరాగ్ ఢిల్లీ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తుండగా.. కేజ్రీవాల్ సర్ మీరు మఫ్లర్ ఎందుకు ధరించలేదు? అని ఓ మహిళ ప్రశ్నించింది. అయితే, ప్రస్తుతం వాతావరణం అంత చలిగా లేదు కదా అంటూ కేజ్రీవాల్ బదులిచ్చారు. ఈ ఆసక్తికర సంభాషణకు సంబంధించిన వీడియోను ఆమ్ ఆద్మీపార్టీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. మఫ్లర్ లేకుండా కేజ్రీవాల్ కనిపించటంపై ప్రశ్నలు ఎదురవటం ఇదేం తొలిసారి కాదు. 2019లో ఓ ట్విటర్ యూజర్ మఫ్లర్ కనిపించకపోవటంపై ఆయన్ను ప్రశ్నించారు. చాలా రోజులుగా మఫ్లర్ కనిపించటం లేదని, కానీ, దానిని ప్రజలు గుర్తించటం లేదని గుర్తు చేశారు. డిసెంబర్ 4న జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలనే లక్ష్యంతో ఆమ్ ఆద్మీ పార్టీ ముమ్మర ప్రచారం చేస్తోంది. అందులో భాగంగానే కేజ్రీవాల్ ఆప్ అభ్యర్థి తరఫున బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే మఫ్లర్ అంశంపై ప్రశ్న ఎదురైంది. “सर, आपने Muffler नहीं पहना?”🧣 जनता का CM @ArvindKejriwal: अभी तक उतनी ठंड नहीं आई। 😊 pic.twitter.com/2LSjN25Y69 — AAP (@AamAadmiParty) November 29, 2022 ఇదీ చదవండి: ఆప్ ఎన్నికల అభ్యర్ధి తుపాకీతో డ్యాన్సులు.. వీడియో వైరల్ -
గుజరాత్లో సోషల్ శరణం గచ్ఛామి! ఏ పార్టీ ప్రచారంలో ముందుంది అంటే?
గుజరాత్ ఎన్నికలు దగ్గరకొచ్చేశాయి. ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగ సభలతో ప్రధాని మోదీ, ఆప్ నేత కేజ్రీవాల్ ప్రచారంలో దూసుకుపోతూంటే కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ మాత్రం ఒక్క రోజు ప్రచారంతో సరిపెట్టారు. మరోవైపు మూడు పార్టీలు డిజిటల్ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. సోషల్ మీడియా ప్రచారానికి తొలుత శ్రీకారం చుట్టిన బీజేపీ ఈ ప్రచారంలోనూ తానే ముందుంది. కాంగ్రెస్ పార్టీ కాలేజీ విద్యార్థులనే సోషల్ మీడియా ప్రచారంలో భాగస్వామ్యుల్ని చేసింది. కాంగ్రెస్‌లో గాంధీ కుటుంబానికి చెందిన వారెవరూ ప్రచారానికి రాకపోవడంతో ఆ లోటు పూరించేలా క్షేత్ర స్థాయిలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఓటర్లకు దగ్గరయ్యే ప్రయ త్నం చేస్తోంది. ఇక ఆప్ సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడం దగ్గర్నుంచి ప్రచారం దాకా సోషల్ మీడియా మీదే ఆధారపడింది. కాంగ్రెస్ ► వాట్సాప్ ద్వారా బాగా ప్రచారం చేస్తోంది. 27 ఏళ్లుగా బీజేపీ ఏమేం చెయ్యలేదో , తమ హయాంలో ఏం చేశామో చెబుతోంది. ► అసెంబ్లీ స్థానాల వారీగా ఫేస్బుక్ పేజీలు ఏర్పాటు చేసి సమస్యలపై, తాము చేయబోయే పరిష్కారంపై ప్రచారం చేస్తోంది. ► 50 వేల వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసింది. ► ఠాకూర్లు, పటీదార్లు, ఆదివాసీలు ఇలా.. కులాలు, వర్గాల వారీగా కూడా వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ► కాంగ్రెస్ పార్టీకి ఫేస్బుక్లో 7 లక్షల మందికి పైగా ఫాలోవర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 64 లక్షలు, ట్విటర్లో 2 లక్షలు, యూ ట్యూబ్‌లో 9 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ► కొన్ని టెక్కీ సంస్థల్ని అద్దెకు తీసుకొని ప్రచారానికి అవసరమైన కంటెంట్ తయారు చేస్తోంది. ► పార్టీలో అధికారులు కాకుండా, క్షేత్ర స్థాయిలో 10 వేల నుంచి 12 వేల మంది వాలంటీర్లు పని చేస్తున్నారు. ఆప్ ► ఢిల్లీ మోడల్, మేనిఫెస్టో హామీలు ఓటర్లకు చేరేలా వాట్సాప్‌ను అధికంగా వినియోగిస్తోంది. ► ఆప్‌కు ఫేస్బుక్లో 6 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు. నేషనల్ యూ ట్యూబ్‌లోనూ ప్రచారం చేస్తోంది. దీనికి 43 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ► ఆప్ సోషల్ మీడియా ప్రచార బాధ్యతల్ని 25 మంది యువ ఇంజనీర్లు తమ భజస్కంధాల మీద మోస్తున్నారు. 20 వేలమంది సోషల్ మీడియా వారియర్లను కూడా నియమించింది. ► ఆప్ మద్దతుదారుల ద్వారా కూడా అన్ని యాప్‌లలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ► ప్రతీ గ్రామానికి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి ప్రచారం నిర్వహిస్తోంది. ► సీఎం అభ్యర్థి ఇసుదాన్ గధ్వీ ఎంపిక కూడా సోషల్ మీడియా ఓటింగ్ ద్వారా నిర్వహించి కొత్త ట్రెండ్ సృష్టించింది. బీజేపీ ► గుజరాత్ ఆత్మ గౌరవ ప్రచారానికి ప్రాధాన్యమిస్తోంది. 15 యాప్‌లు వినియోగిస్తోంది. ► సోషల్ మీడియాలో ఆర్నెల్లుగా వారానికో హ్యాష్ ట్యాగ్‌తో ప్రచారం చేస్తోంది. ► మోదీ 20 ఏళ్ల పాలన, వందే భారత్, ఈ గుజరాత్ నేనే నిర్మించాను వంటి ట్యాగ్ లైన్లతో విస్తృతంగా ప్రచారం. ► సోషల్ మీడియా ప్రచారానికి ఎక్కువగా ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ వినియోగిస్తోంది. ► బీజేపీకి ఫేస్బుక్లో 35 లక్షల పైగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 58 లక్షలు, ట్విటర్లో 15 లక్షలు, యూ ట్యూబ్‌లో 50 వేల ఫాలోవర్లున్నారు. ► 20 వేల మంది వర్కర్లు, 60 వేల మంది వాలంటీర్లు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ► బీజేపీ డిజిటిల్ వార్ రూమ్‌లో కంటెంట్ ఇస్తున్న వారంతా 20 నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న యువ టెక్కీలే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కేజ్రీవాల్‌కు దిమ్మతిరిగే షాకులిస్తున్న బీజేపీ.. ఎన్నికలపై ఎఫెక్ట్ ఎంత?
ఢిల్లీ, పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయాలతో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెంచింది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. పలు రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు వినూత్న ప్లాన్స్‌తో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు గుజరాతీలకు కీలక హామీలు సైతం ఇస్తున్నారు. మరోవైపు.. ఇదే సమయంలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలపై కూడా ఆప్ సర్కార్ ఫోకస్ పెంచింది. కానీ.. కేజ్రీవాల్‌కు అనుకోని రీతిలో కొన్ని షాక్‌లు తగులుతున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్.. ఆప్ నేతలను టార్గెట్ చేయడంతో కేజ్రీవాల్ ఢిల్లీ డిఫెన్స్‌లో పడినట్టు తెలుస్తోంది. కాగా, లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎంను సీబీఐ అరెస్ట్ చేయడం, తీహార్ జైలులో మంత్రి సత్యేంద్ర జైన్‌కు అధికారులు సపర్యలు చేయడం వంటి వీడియోలు బయటకు రావడంతో అనుకోని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎన్నికల సమీపిస్తున్న కొద్ది ఆప్‌పై బీజేపీ ముప్పెట దాడి చేస్తోంది. #WATCH | Latest CCTV footage sourced from Tihar jail sources show Delhi Minister Satyendar Jain getting proper food in the jail. Tihar Jail sources said that Satyendar Jain has gained 8 kg of weight while being in jail, contrary to his lawyer's claims of him having lost 28 kgs. pic.twitter.com/cGEioHh5NM — ANI (@ANI) November 23, 2022 కాగా, ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ఆప్ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ప్రజల దృష్టికి ఇటీవల జరిగిన ఘటనలపై ప్రచారం మొదలుపెట్టింది. ఇక, మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కేజ్రీవాల్.. నవంబర్ 25వ తేదీ నుంచి ప్రచారంలోకి దిగనున్నారు. రోడ్ షోలు, ఢిల్లీలో పలు చోట్ల బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మరోవైపు.. తాము ఢిల్లీలో చేసిన అభివృద్ధే తమకు విజయాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆప్ గెలుపే టార్గెట్‌గా పౌర సమస్యలపై దృష్టిపెట్టింది. Delhi minister & AAP leader Satyendar Jain getting a massage inside Tihar jail. Tihar Jail is run by the Department of Delhi Prisons under the Government of Delhi. pic.twitter.com/xKjTay434L — Anshul Saxena (@AskAnshul) November 19, 2022 ఇదిలా ఉండగా.. గుజరాత్ ఎన్నికల్లో కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పీడ్ పెంచారు. ఇక, గుజరాత్లో ఎన్నికలపై పలు సర్వేలు సైతం ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ఆప్‌కు గుజరాత్లో మంచి ఆదరణ ఉందని సర్వేలు చెప్పుకొచ్చాయి. మరోవైపు.. గుజరాత్లో బీజేపీలో చేరిన పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌కు షాక్ తగిలే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హార్దిక్ పటేల్.. 2015లో పాటిదార్ల రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేశారు. ఈ పోరాటం బీజేపీకి వ్యతిరేకంగానే కొనసాగింది. కానీ, ఇటీవల హార్దిక్.. కాషాయతీర్థం పుచ్చుకోవడంతో ఆయనపై పాటిదార్లు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఇక, గుజరాత్‌లోని విర్మగం అసెంబ్లీ స్థానం నుంచి హార్దిక్ పటేల్ పోటీలో నిలిచారు. Good Days ahead for @HardikPatel_ 'Will slap him': Patidars upset with Hardik Patel for fighting on BJP tickethttps://t.co/EE4r2nuXdS — Sanjay Karan (@SanjayK53544321) November 23, 2022 -
గుజరాత్లో ట్విస్ట్.. నామినేషన్ వేసేందుకు వెళ్లిన అభ్యర్థి కిడ్నాప్.. ఆ తర్వాత..
అసెంబ్లీ ఎన్నికల వేళ గుజరాత్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అభ్యర్థి కనిపించకపోవడం కలకలం సృష్టించింది. ఈ విషయంలో అధికార బీజేపీ సర్కారే తమ అభ్యర్థిని కిడ్నాప్ చేశారంటూ ఆప్ నేతలు కామెంట్స్ చేశారు. ఈ తరుణంలో సడెన్ ఆప్ నేత ప్రత్యక్షమై తన నామినేషన్ విత్ డ్రా చేసుకోవడం చర్చనీయాశంగా మారింది. వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఆప్ అభ్యర్థి కంచన్ జరీవాలా మంగళవారం నుంచి కనిపించడంలేదని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. కంచన్ జరీవాలాను బీజేపీ కిడ్నాప్ చేసినట్లు ఆప్ నేత మనీశ్ సిసోడియా ఆరోపించారు. సూరత్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి కంచన్ జరీవాలా ఆప్ తరపున పోటీ చేయనున్నారు. నిన్నటి నుంచి కంచన్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు కనిపించడం లేదన్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు ఆఫీసు నుంచి బయటకు వచ్చిన కంచన్‌ను బీజేపీ గుండాలు ఎత్తుకెళ్లినట్లు సిసోడియా ఆరోపించారు. కాగా, బుధవారం కంచన్ జరీవాలాను పోలీసులు పట్టుకుని ఎన్నికల కార్యాలయానికి తీసుకువచ్చారు. ఈ సందర్బంగా అనూహ్యం జరీవాలా తన నామినేషన్‌ను విత్ డ్రా చేసుకుంటున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. కాగా, ఘటనపై ఆప్ నేతలు స్పందించారు. ఇదంతా బీజేపీ కుట్ర.. ఆప్ నేత కంచన్ జరీవాలాను కిడ్నాప్ చేసి బెదిరింపులకు గురిచేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే, బీజేపీ ఒత్తిడి వల్లే జరీవాల్ అభ్యర్థిత్వం నుంచి తప్పుకున్నారని అన్నారు. ఈ తరహా గూండాయిజం భారతదేశంలో ఎప్పుడూ చూడలేదు. అలాంటప్పుడు ఎన్నికల వల్ల ప్రయోజనం ఏముంది? అని కేజ్రీవాల్ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. Watch how police and BJP goons together - dragged our Surat East candidate Kanchan Jariwala to the RO office, forcing him to withdraw his nomination The term ‘free and fair election’ has become a joke! pic.twitter.com/CY32TrUZx8 — Raghav Chadha (@raghav_chadha) November 16, 2022 -
‘నేను పెద్ద దొంగనైతే.. కేజ్రీవాల్ మహా దొంగ’
న్యూఢిల్లీ: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ మరోమారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ మరో లేఖ రాశాడు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన అంశం బయటకు రావడంతో ఆప్ లీడర్ సత్యేంద్ర జైన్, మాజీ డీజీ( తిహార్ జైళ్ల శాఖ)తనను బెదిరించినట్లు లేఖలో పేర్కొన్నాడు. తాను అతిపెద్ద క్రిమినల్ అయితే.. కేజ్రీవాల్ మహా క్రిమినల్ అంటూ ఆరోపించాడు సుకేశ్. ‘కేజ్రీవాల్ జీ నీ ప్రకారం నేను దేశంలోనే అతిపెద్ద నేరస్థుడిని. అప్పుడు నా దగ్గర నుంచి రూ.50 కోట్లు ఎందుకు తీసుకున్నావు, రాజ్యసభ సీటు ఎందుకు ఇస్తానని చెప్పావు? అది నిన్ను ఎలా చూపుతుంది.. మహా నేరస్థుడిగా?’అని లేఖలో పేర్కొన్నాడు సుకేశ్ చంద్రశేఖర్. మరోవైపు.. సీట్ల పంపిణీ విషయంలో 20-30 మంది నుంచి పార్టీకి రూ.500 కోట్లు విరాళం ఇచ్చేలా తనపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించాడు. అంతకు ముందు ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌పై ఆరోపణలు చేశాడు సుకేశ్. జైలులో భద్రంగా ఉండేందుకని సత్యేంద్ర జైన్‌కు రూ.50 కోట్లు ఇచ్చానని పేర్కొంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు లేఖ రాశాడు. కొద్ది రోజుల క్రితం ఈ అంశం ఢిల్లీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే, ఈ ఆరోపణలను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొట్టిపారేశారు. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో కేబుల్ బ్రిడ్జి విషాదం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు కేజ్రీవాల్. ఇదీ చదవండి: గుజరాత్ నుంచి వైదొలగమని బీజేపీ ఆఫర్ ఇచ్చింది: కేజ్రీవాల్ -
గుజరాత్ నుంచి తప్పుకోవాలని బీజేపీ ఆఫర్: కేజ్రీవాల్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన రోజుల వ్యవధిలోనే బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నుంచి వైదొలగాలని బీజేపీ ఆఫర్ ఇచ్చినట్లు ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలా చేస్తే విచారణ ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రులు సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియాలకు ఉపశమనం కల్పిస్తామని ఆఫర్ చేసినట్లు తెలిపారు. గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకుంటే సత్యేంద్ర జైన్‌ను జైలు నుంచి విడుదల చేస్తామని చెప్పిందని పేర్కొన్నారు. ‘ఢిల్లీలో ఎంసీడీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించటం ద్వారా కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నట్లు కనిపించటం లేదు. బీజేపీ భయపడుతున్నట్లు స్పష్టమవుతోంది. వారు రెండు ప్రాంతాల్లో గెలుస్తామనే ధీమాలో ఉంటే అలాంటి ఆలోచన అవసరం లేదు. నిజానికి గుజరాత్‌తో పాటు ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో రెండు చోట్లా ఓడపోతామని బీజేపీ భయపడుతోంది. అందుకే రెండు ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలనుకుంటున్నారు. ఆప్‌ను వీడితే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్న ఆఫర్‌ను మనీశ్ సిసోడియా తిరస్కరించిన తర్వాత వారు నన్ను సంప్రదించారు. గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకుంటే.. సత్యేంద్ర జైన్, సిసోడియాలపై ఉన్న అన్ని కేసులను తొలగిస్తామని ఆఫర్ చేశారు.’ అని సంచలన ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. అయితే, ఎవరు ఆఫర్ చేసారనే ప్రశ్నకు.. బీజేపీ నేరుగా ఎప్పుడూ సంప్రదించదని, సొంత పార్టీ నేతల ద్వారానే వచ్చినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం -
ఒకే దేశం, ఒకే చట్టం... సాధ్యమయ్యేనా?
ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్–యూసీసీ) మరోసారి తెరపైకి వచ్చింది. ఒకే దేశం ఒకే చట్టం ఎజెండాతో గతంలో ఉత్తరాఖండ్ ఎన్నికలప్పుడు యూసీసీ అమలుకు బీజేపీ సర్కారు కమిటీ వేయడం తెలిసిందే. తాజాగా గుజరాత్ కూడా అదే బాట పట్టింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇలా వరసగా యూసీసీ అమలుకు సై అంటూ ఉండడంపై చర్చ మొదలైంది. విభిన్న పరిస్థితులున్న దేశంలో ఒకే చట్టం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి... కుల, మత, జాతి, ప్రాంత, లింగ భేదాలు లేకుండా దేశ పౌరులందరికీ ఒకే విధమైన చట్టాలను అమలు చేయడమే ఉమ్మడి పౌరస్మృతి. ఇది అమల్లోకి వస్తే పెళ్లిళ్లు, విడాకులు, వారసత్వ హక్కులు, జనన మరణాలు, దత్తత ప్రక్రియకు సంబంధించి పౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. పౌరులందరికీ ఒకే చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని, అప్పుడే సమానత్వ హోదా దక్కుతుందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 కూడా చెబుతోంది. హిందూత్వ ఎజెండాతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఉమ్మడి పౌరస్మృతిని ఎన్నడో తన మేనిఫెస్టోలో చేర్చింది. తన రాజకీయ ఎజెండాలో ఆగ్రభాగాన ఉన్న అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టింది. కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ను రద్దు చేసింది. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతిపై దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ఒకేసారి అమలు చేయకుండా ముందు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి మొదలు పెట్టే వ్యూహంతో ముందుకు వెళ్తోంది. బీజేపీ పాలిత యూపీ, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ యూసీసీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అనుమానాలూ లేకపోలేదు... అయితే యూసీసీపై హిందువుల్లోనే కాస్త వ్యతిరేకత వచ్చే ఆస్కారముందా అన్న అనుమానాలూ లేకపోలేదు. ‘‘భిన్న మతాలకు చెందిన వారికి వేర్వేరు లా బోర్డులున్నాయి. హిందూ మతానికి చెందినవారు కూడా వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు ఆచారాలు పాటిస్తున్నారు. వాటన్నింటికీ ఏకరూపత ఎలా సాధ్యం?’’ అన్నది ఒక వాదన. కేవలం మెజార్టీ ఓటు బ్యాంకును ఏకమొత్తంగా కొల్లగొట్టేందుకేనని ఒక వర్గం ఆరోపిస్తోంది. ఇది బీజేపీ ఎన్నికల స్టంటని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితర నేతలు అంటున్నారు. అందరికీ ఒకే చట్టాల్లేవా...? ప్రస్తుతం దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు, పార్సీలకు వారి మత సంప్రదాయాలకు అనుగుణంగా వ్యక్తిగత చట్టాలున్నాయి. ముస్లింలకు షరియా చట్టాలకు అనుగుణంగా ముస్లిం పర్సనల్ లా అమలవుతోంది. దాని ప్రకారం ముస్లిం పురుషులకు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుమతి ఉంది. వేరే మతస్తులకు మాత్రం చట్టప్రకారం ఒక్క భార్యే ఉండాలి. సివిల్ అంశాల్లో కాంట్రాక్ట్ చట్టం, సివిల్ ప్రొసీజర్ కోడ్ వంటి అనేకానేక ఉమ్మడి చట్టాలనూ పలు రాష్ట్రాల్లో భారీగా సవరించారు. గోవాలో 1867 నాటి కామన్ సివిల్ కోడ్ అమల్లో ఉన్నా అక్కడా కేథలిక్కులకు, ఇతర మతాలకు భిన్నమైన నియమాలు పాటిస్తున్నారు. నాగాలాండ్, మిజోర, మేఘాలయాల్లోనైతే హిందూ చట్టాల్లో కూడా భిన్నత్వం ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘డంపింగ్ యార్డ్’కు ఢిల్లీ పాలిటిక్స్.. ఆప్, బీజేపీ పరస్పర విమర్శలు
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ)ఎన్నికలు ఈ ఏడాది చివర్లో లేదా 2023 తొలినాళ్లలో జరగనున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. అధికార ఆప్, భాజపా మధ్య తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి ఈ ఎన్నికలు. తాజాగా గాజీపూర్‌లోని డంపింగ్ యార్డ్ ఇరు పార్టీల మధ్య వివాదానికి తెరతీసింది. అక్కడి చెత్త డంపింగ్ యార్డ్ వద్దకు గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెళ్లగా.. భాజపా కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆయనొక అబద్ధాలకోరు అంటూ నినాదాలు చేశారు. అందుకు కౌంటర్‌గా ఆప్ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడు స్థానిక సంస్థల విలీనానికి ముందు పదేళ్లకు పైగా ఎంసీడీ అధికారం భాజపా చేతిలోనే ఉంది. ఆ అంశాన్ని లేవనెత్తుతూ.. విమర్శలు గుప్పించారు కేజ్రీవాల్. ‘భాజపా విమర్శల్లో ఎలాంటి లాజిక్ లేదు. భాజపా నేతృత్వంలోని స్థానిక సంస్థలు ఏం చేశాయో తెలుసుకునేందుకే ఇక్కడకు వచ్చాను. ఢిల్లీని శుభ్రంగా ఉంచే పనిలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. మేం నిర్మించిన పాఠశాలలు, మొహల్లా క్లినిక్‌లను చూసేందుకు భాజపా వస్తే.. మేం ఇలా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేయం. మేం అధికారంలోకి వస్తే.. ఢిల్లీని శుభ్రం చేస్తాం. మిమ్మల్ని ఉచితంగా తీర్థయాత్రలకు తీసుకెళ్లిన కుమారుడికి ఓటు వేయాలని ఢిల్లీలోని మాతృమూర్తులకు చెప్పాలనుకుంటున్నాను.’ అని వెల్లడించారు కేజ్రీవాల్. ఈ సందర్భంగా రామాయణంలోని శ్రవణ కుమారుడి పాత్రతో తనను తాను పోల్చుకున్నారు. మరోవైపు.. కేజ్రీవాల్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. స్థానిక సంస్థలకు ఢిల్లీ సర్కార్ తగిన నిధులు ఇవ్వలేదని నిందించింది. ఇప్పుడు స్థానిక ఎన్నికల ముందు ప్రతిజ్ఞలు చేస్తోందని మండిపడింది. స్థానిక సంస్థల ఎన్నికలకు పారిశుద్ధ్య అంశాన్ని కేంద్ర సమస్యగా ఆప్ మార్చిందని, ఇతర ప్రాంతాలను చూపిస్తూ డంపింగ్ పర్వతాలను కప్పిపుచ్చుతోందని ఆరోపించింది. మరోవైపు.. ఎన్నికల తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ గణాంకాల ప్రకారం.. నగరంలో నిత్యం 11వేల టన్నుల ఘన వ్యర్థాలు వస్తున్నాయి. వాటిల్లో 5 వేల టన్నులు ప్రాసెస్‌కు పంపగా.. మరో ఆరు వేల టన్నులు అక్కడి మూడు డంపింగ్‌యార్డులకు చేరుకుంటున్నాయి. ఇదీ చదవండి: ‘అదే మా లక్ష్యం’.. పీఓకేపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు! -
‘సూపర్ హీరో’ సిసోడియా.. విద్యాశాఖ ముసుగులో లిక్కర్ మంత్రి!
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణకు సోమవారం హాజరయ్యారు ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. ఈ క్రమంలో ఆయనకు మద్దతు తెలుపుతూ సిసోడియాను సూపర్ హీరోగా గ్రాఫిక్ చిత్రాన్ని ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఎలాంటి క్యాప్షన్ లేనప్పటికీ.. తాను చెప్పాలనుకున్న అంశాన్ని గ్రాఫిక్ చిత్రంలో వివరించే ప్రయత్నం చేశారు. ఈ ఫోటోలో ‘ఢిల్లీ ఎడ్యుకేషనల్ మోడల్’ పేరుతో ఉన్న షీల్డ్‌ను పట్టుకున్నారు సిసోడియా. ఈడీ, సీబీఐ పేరుతో వచ్చే బాణాల నుంచి చదవుకుంటున్న ఓ చిన్నారిని రక్షిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం కేజ్రీవాల్ ట్వీట్ వైరల్‌గా మారింది. pic.twitter.com/sPA4PwMllK — Arvind Kejriwal (@ArvindKejriwal) October 17, 2022 మరోవైపు.. కేజ్రీవాల్ ట్వీట్‌పై అదే స్టైల్లో గ్రాఫిక్ చిత్రంతో విమర్శలు గుప్పించింది బీజేపీ. మద్యం బాటిళ్లు, నగదు కట్టలను కాపాడేందుకు సిసోడియా తెరిచిన పుస్తకాన్ని షీల్డ్‌లా పట్టుకున్నట్లు అందులో చూపించింది బీజేపీ. ఈ ఫోటోను ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షుడు సునీల్ యాదవ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో కేజ్రీవాల్ సైతం ఓ చేతిలో మద్యం బాటిల్, మరో చేతిలో ఎన్నికల గుర్తు చీపురు పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ‘విద్యాశాఖ ముసుగులో ఉన్న లిక్కర్ మంత్రి’ అంటూ రాసుకొచ్చారు సునీల్ యాదవ్. शराब मंत्री शिक्षा मंत्री की आड़ में https://t.co/pGDScU64zz pic.twitter.com/8CTOFvuU5S — Sunil Yadav (@SunilYadavBJP) October 17, 2022 ఇదీ చదవండి: తల్లి పాదాలను తాకి...సీబీఐ కార్యాలయానికి సిసోడియా! -
‘డబుల్ ఇంజినా? అది పాతదైపోయింది’.. బీజేపీపై కేజ్రీవాల్ సెటైర్
గాంధీనగర్: ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. డబుల్ ఇంజిన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటుంది బీజేపీ. డబుల్ ఇంజిన్ ద్వారా అభివృద్ధి రెండింతలు వేగవంతమవుతుందని ప్రచారం చేస్తుంది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ‘డబుల్ ఇంజిన్’ నినాదంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. గుజరాత్‌కు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరం లేదని, ఇప్పుడు కొత్త ఇంజిన్ కలిగిన ప్రభుత్వం కావాలని పేర్కొన్నారు. గుజరాత్‌లోని భవ్నగర్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘వారు డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలంటూ మాట్లాడారు. కానీ, ఈసారి గుజరాత్‌కు డబుల్ ఇంజిన్ అవసరం లేదు. కొత్త ఇంజిన్ కావాలి. డబుల్ ఇంజిన్ చాలా పాతది. రెండు ఇంజిన్లు 40-50 ఏళ్ల నాటివి. ఒక కొత్త పార్టీ, కొత్త ముఖాలు, కొత్త భావజాలం, కొత్త శక్తి, కొత్త పాలన కావాలి. కొత్త పార్టీ కోసం పాటుపడండి. మీరు ఏదీ కోల్పోరు.’ అని పేర్కొన్నారు కేజ్రీవాల్. రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ వెళ్లిన కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఒకసారి తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడి వారికి 70 ఏళ్లుగా అవకాశం ఇస్తున్నారని, తనకు ఓ ఛాన్స్ ఇచ్చి చూడాలని విన్నవించారు. అనుకున్న రాతిలో పని చేయకపోతే.. మరోమారు ఓట్ల కోసం రానని ప్రతిజ్ఞ చేశారు. తమ ప్రభుత్వం అధికారం లోకి వస్తే తప్పుడు కేసులను కొట్టివేస్తామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: నరబలి కేసు: పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్న ‘మిస్సింగ్’ మహిళల బంధువులు! -
నా భార్య సైతం ఇన్ని ‘లవ్ లెటర్స్’ రాయలేదు: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాల మధ్య కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గవర్నర్ వివిధ అంశాలపై లేఖలు రాయటాన్ని సూచిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గడిచిన ఆరు నెలల్లో గవర్నర్ రాసినన్ని లవ్ లెటర్లు.. తన భార్య కూడా రాయలేదంటూ ట్వీట్ చేశారు. తనను తిట్టటం, లేఖలు రాయటానికి కాస్త విరామం ఇచ్చి కాస్త సేదతీరండీ అంటూ సూచించారు. ‘ప్రతి రోజు ఎల్జీ సాబ్ తిట్టినన్ని తిట్లు నా భార్య కూడా తిట్టలేదు. గడిచిన ఆరు నెలల్లో ఎల్జీ సాబ్ రాసినన్ని లవ్ లెటర్లు నా భార్య సైతం రాయలేదు. ఎల్జీ సాబ్ కొద్దిగా చల్లబడండి. అలాగే.. కొద్దిగా సేదతీరమని మీ సూపర్ బాస్‌కి సైతం చెప్పండి.’ అని హిందీలో ట్వీట్ చేశారు కేజ్రీవాల్. ఢిల్లీలోని బీజేపీ పాలిత మున్సిపల్ బాడీల్లో రూ.6000 కోట్ల స్కాం జరిగిందని, దానిపై దృష్టి పెట్టండంటూ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా లేఖ రాసిన మరుసటి రోజునే కేజ్రీవాల్ ఈ మేరకు ట్వీట్ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. సిసోడియా లేఖకు ఎల్జీ సక్సేనా ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కానీ, బీజేపీ ఆ ఆరోపణలను ఖండించింది. LG साहिब रोज़ मुझे जितना डाँटते हैं, उतना तो मेरी पत्नी भी मुझे नहीं डाँटतीं। पिछले छः महीनों में LG साहिब ने मुझे जितने लव लेटर लिखे हैं, उतने पूरी ज़िंदगी में मेरी पत्नी ने मुझे नहीं लिखे। LG साहिब, थोड़ा chill करो। और अपने सुपर बॉस को भी बोलो, थोड़ा chill करें। — Arvind Kejriwal (@ArvindKejriwal) October 6, 2022 ఇదీ చదవండి: వందేభారత్ ట్రైన్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. గేదెలను ఢీకొట్టడంతో..!