Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Notice Once Again Issued To Perni Nani Wife Jayasudha1
కూటమి సర్కార్‌ ‘రాజకీయ’ కక్ష.. మహిళను అవమానించేలా..

సాక్షి, కృష్ణా జిల్లా: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై చంద్రబాబు సర్కార్‌ కక్ష సాధింపు కొనసాగిస్తూనే ఉంది. మరోసారి పేర్ని నాని సతీమణి జయసుధకు పోలీసులు నోటీసులిచ్చారు. రాజకీయ కక్ష సాధింపు కోసం మహిళలను అవమానించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పదే పదే విచారణకు పిలిచి పేర్ని నాని కుటుంబాన్ని అవమానించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ నాడు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు.మధ్యాహ్నం రెండు గంటల్లోగా విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బందరు తాలుకా పీఎస్‌కు పేర్ని నాని సతీమణి జయసుధ విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదులతో కలిసి పేర్ని జయసుధ పీఎస్‌కు వెళ్లారు. ఆమెను సుమారు రెండు గంటల పాటు విచారించారు.ఆరోగ్యం బాగోలేకపోయినా విచారణకు రావాల్సిందే..స్పైనల్ కార్డ్ సమస్యతో బాధపడుతూ జయసుధ విచారణకు హాజరయ్యారు. ఆరోగ్యం బాగోలేకపోయినా విచారణకు రావాల్సిందేనని పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణ సమయంలో జయసుధతో పాటు లాయర్లను పోలీసులు అనుమతించలేదు. జయసుధతో పాటు వచ్చిన వైఎస్సార్‌సీపీ మహిళా నేతలను సైతం పోలీసులు బయటికి పంపించేశారు. పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.అనారోగ్యంతో ఉన్నప్పటికీ జయసుధ విచారణకు హాజరయ్యారు. పేర్ని జయసుధ తరఫు న్యాయవాది వరద రాజులు మీడియాతో మాట్లాడుతూ, న్యాయస్థానం విధించిన షరతులకు లోబడి పోలీసుల విచారణకు జయసుధ హాజరయ్యారయ్యారని.. జయసుధ స్పైనల్ కార్డ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ విచారణకు హాజరయ్యారన్నారు. గంట నుంచి పోలీసులు విచారిస్తున్నారని.. ఆనారోగ్యంతో ఉన్నప్పటికీ పోలీసుల విచారణకు జయసుధ సహకరిస్తున్నారని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇద్దరి ష్యూరిటీ సర్టిఫికెట్లను పోలీసులకు అందజేశామని వరద రాజులు తెలిపారు.అక్రమ కేసులతో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో అంతకంతకూ పెట్రేగిపోతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో అణచివేసే కుట్రలకు మరింతగా పదనుపెడుతోంది. పేర్ని నాని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసుల మీద అక్రమ కేసులు నమోదు చేస్తుండటం రాష్ట్రంలో హక్కుల హననానికి తాజా నిదర్శనం. ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తడవుగా అధికార యంత్రాంగం ఈ కుట్రలకు వత్తాసు పలుకుతోంది. ఇదీ చదవండి: ఇదీ పన్నాగం.. చంద్రబాబు సర్కార్‌ బరితెగింపు..

Karakatta Residence As Cm Chandrababu Official Residence2
చంద్రబాబు అధికార నివాసంగా కరకట్ట..

సాక్షి, విజయవాడ: కరకట్ట నివాసాన్ని సీఎం చంద్రబాబు అధికార నివాసంగా ప్రభుత్వం ప్రకటించింది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు గృహాన్ని సీఎం అధికారిక నివాసంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జూన్ 12 నుంచి సీఎం అధికారిక నివాసంగా గుర్తిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇదే కరకట్ట నివాసంపై అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.ఇది అక్రమ నిర్మాణం అంటూ గతంలో మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రకటించారు. అదే అక్రమ నివాసాన్ని అధికారిక నివాసంగా ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణ నది కరకట్ట లోపల ఈ నివాసాన్ని లింగమనేని రమేష్ నుంచి చంద్రబాబు తీసుకున్నారు.ఇదీ చదవండి: కూటమి సర్కార్‌ ‘రాజకీయ’ కక్ష.. మహిళను అవమానించేలా..కాగా, చంద్రబాబు ఉంటున్న కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మించారనే ఆరోపణలున్నాయి. లింగమనేని రమేశ్‌ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ నివాసంలో గత కొన్నేళ్లుగా నివసిస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదాలోనూ, సీఎం హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు నివసిస్తున్నారు.ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్‌.. చంద్రబాబుకు వ్యక్తిగతంగానే ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజధాని మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లలో కుంభకోణం ద్వారా భారీగా ప్రయోజనం కల్పించినందున క్విడ్‌ ప్రోకోలో భాగంగానే కరకట్ట నివాసాన్ని చంద్రబాబుకు ఇచ్చేరనే విమర్శలు ఉన్నాయి.

Special Trains For Sankranti: Bookings From January 23
సంక్రాంతికి స్పెషల్‌ ట్రైన్స్‌.. జనవరి 2 నుంచి బుకింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతికి హైదరాబాద్‌ నుంచి కాకినాడ వెళ్లాలనుకొనే ప్రయాణికులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. పండగ రద్దీ దృష్ట్యా ఆరు ప్రత్యేక రైళ్లను నడపనుంది. కాచిగూడ -కాకినాడ టౌన్‌, హైదరాబాద్‌- కాకినాడ టౌన్‌ మధ్య ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 9, 10, 11, 12 తేదీల్లో రాకపోకలు సాగించనున్నాయి. ఈ రైళ్లకు టికెట్‌ రిజర్వేషన్ల బుకింగ్‌ సదుపాయం జనవరి 2వ తేదీ ఉదయం 8గంటల నుంచి అందుబాటులో ఉంటుందని సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ వెల్లడించారు.కాచిగూడ - కాకినాడ టౌన్‌ రైలు (07653) జనవరి 9, 11 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడకు చేరుకోనుంది. అలాగే, కాకినాడ టౌన్‌ -కాచిగూడ రైలు (07654) ఈ నెల 10, 12 తేదీల్లో కాకినాడలో సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు కాచిగూడకు చేరుకోనుంది.హైదరాబాద్‌ -కాకినాడ టౌన్‌ రైలు (07023) జనవరి 10వ తేదీన సాయంత్రం 6.30గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు పయనంలో ఈ రైలు (07024) జనవరి 11వ తేదీన రాత్రి 8గంటలకు కాకినాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. ఈ రైలు సికింద్రాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్‌, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయని రైల్వే శాఖ తెలిపింది.ఇదీ చదవండి: బంగారం ఎంత కొనచ్చు? పెళ్లికానివారికైతే అంతే!

Cm Revanth Reddy Meets Ministers And Mlas4
నేను మారాను.. మీరూ మారండి: సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని.. వర్గాలను దూరం పెట్టి కార్యకర్తలకు సమయం ఇవ్వండంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో గెలవాలని పిలుపునిచ్చారు. ‘‘మీ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌లు నా దగ్గర ఉన్నాయి. నేను మారాను.. మీరూ మారండి’’ అంటూ సీఎం సూచించారు.కొందరు ఎమ్మెల్యేలు అతి ఉత్సాహం చూపిస్తున్నారు. అతి చేస్తే సహించేది లేదని రేవంత్‌ స్పష్టం చేశారు. ప్రతి పక్షాలకు ధీటుగా కౌంటర్ ఇవ్వండి. కాంగ్రెస్ సంక్షేమంపై విస్తృత ప్రచారం జరగాలి’’ అని రేవంత్‌ చెప్పారు.సీఎం రేవంత్‌రెడ్డి బృందం జనవరి 21 నుంచి 23 వరకూ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించనున్నారు. దావోస్‌లో 20 నుంచి 24వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ వార్షిక సదస్సు జరగనుంది. ప్రస్తుత పర్యటనలోనూ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌ బృందం కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసినట్లు సమాచారం.ఇదీ చదవండి: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్‌..

Mumbai Police penalise 23,470 motorists for violating norms on New Year eve5
న్యూఇయర్‌ వేళ.. 18 వేల ట్రాఫిక్‌ ఉల్లంఘనలు.. ఎక్కడంటే?

ముంబై : న్యూఇయర్‌ వేడుకల్లో ట్రాఫిక్‌ ఉల్లంఘనలు భారీ మొత్తంలో నమోదైనట్లు ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. దేశంలో అత్యధికంగా ముంబైలో ఈ ట్రాఫిక్‌ ఉల్లంఘనలు జరిగినట్లు తెలుస్తోంది. ఫలితంగా మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లలో వాహనదారుల నుంచి రూ.89లక్షల ఫైన్‌ల రూపంలో వసూలు చేశారు. ముంబై పోలీసుల సమాచారం మేరకు..న్యూఇయర్‌లో మొత్తం 17,800 ఇ-చలాన్‌లను జారీ చేశారు. అందులో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 2,893 కేసులు, హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వ్యక్తులపై 1,923 కేసులు, ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్ చేసిన 1,731 కేసులు, ప్రజా రవాణాకు అర్హతలేని వాహనాల్ని డ్రైవ్‌ చేసినందుకు 1,976 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు నగరంలో మితిమీరిన వేగానికి 842 చలాన్, సీటు బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడంపై 432 చలాన్లు వేసినట్లు పోలీసులు వెల్లడించారు. న్యూఇయర్‌ సందర్భంగా మద్యం తాగి డ్రైవ్‌ చేసిన వారికి 153 చలాన్‌లు, డ్రైవ్‌ చేస్తూ ఫోన్‌ మాట్లాడినందుకు 109 చలాన్‌లు, ట్రిపుల్‌ రైడింగ్ 123 చలాన్‌లను, రాంగ్ రూట్‌లో డ్రైవింగ్‌ చేసినందుకు 40 చలాన్‌లు విధించారు. అలా మొత్తంగా విధించిన చలాన్లతో రూ.89,19,750 వసూలు చేసినట్లు ముంబై పోలీసులు పేర్కొన్నారు. మీడియా కథనాల ప్రకారం 2025 నూతన సంవత్సర వేడుకల్లో ఎనిమిది మంది అదనపు కమిషనర్లు, 29 మంది డిప్యూటీ కమిషనర్లు, 53 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 2184 మంది ఇన్‌స్పెక్టర్‌లు, 12,000 మందికి పైగా కానిస్టేబుళ్లు ముంబై వీధుల్లో విధులు నిర్వహించారు.

Fans Fire On Rishab Shetty leaves out Rashmika Mandanna in Kirik Party post6
రిషబ్ శెట్టి పోస్ట్‌.. రష్మిక ఫ్యాన్స్ ఆగ్రహం!

శాండల్‌వుడ్ స్టార్‌ రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. గతంలో వచ్చిన కాంతార బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్-2 పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో రిషబ్‌ శెట్టి చేతిలో త్రిశూలం పట్టి ఉగ్రరూపం దాల్చిన శివుడిలా కనిపించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం దాదాపు 7 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.అయితే రిషబ్ శెట్టి తాజాగా చేసిన ట్వీట్‌ సరికొత్త వివాదానికి దారితీసింది. ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన కిరిక్ పార్టీ సినిమాను ఉద్దేశించి రిషబ్ పోస్ట్ పెట్టారు. 8 ఏళ్ల కిందట మొదలైన ఈ ప్రయాణం హృదయాలను హత్తుకునే ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చిందన్నారు. కిరిక్ పార్టీని చాలా ప్రత్యేకంగా మార్చిన మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి డైరెక్షన్‌లోనే తెరకెక్కించారు.అయితే ఈ సినిమాతో పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజా పోస్ట్‌లో రిషబ్ ఆమె పేరును ప్రస్తావించలేదు. ఇది చూసిన నెటిజన్స్‌ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాలో రష్మిక లేకపోతే చెత్త సినిమాగా మారేదని ఓ నెటిజన్ విమర్శించాడు. అంతేకాకుండా రిషబ్ షేర్ చేసిన ఫోటోలు రష్మిక లేకపోవడం ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్‌కు విపరీతమైన కోపం తెప్పించింది. కావాలనే ఆమె పేరును, ఫోటోను పెట్టలేదని కొందరు అభిమానులు మండిపడ్డారు. రిషబ్ పోస్ట్‌లో తన సోదరుడు రక్షిత్‌ పేరును మాత్రమే ప్రస్తావించడంపై నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. కాగా.. 2016లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ಕಿರಿಕ್ ಪಾರ್ಟಿ ನಮ್ಮ ಜೀವನದ ಭಾಗವಾಗಿ 8 ವರ್ಷಗಳು ಕಳೆದಿವೆ, ಅನೇಕ ಸುಂದರ ನೆನಪುಗಳು ಮತ್ತು ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ಈ ಪಯಣವನ್ನು ಅರ್ಥಪೂರ್ಣವನ್ನಾಗಿಸಿವೆ.ನಿಮ್ಮ ಬೆಂಬಲಕ್ಕೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. 8 years ago, a journey began that touched hearts and created countless memories.Here’s to your love and support… pic.twitter.com/67ehO9dnOz— Rishab Shetty (@shetty_rishab) December 30, 2024

10 dead, 30 injured after vehicle rams crowd in US7
న్యూఇయర్‌ వేడుకల్లో విషాదం.. జనంపైకి దూసుకెళ్లిన కారు

వాషింగ్టన్‌ : న్యూ ఇయర్‌ వేళ అమెరికా(usa)లో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్‌ చేసుకుంటున్న జనాలపై ఓ వాహనం దూకెళ్లింది. ఈ దుర్ఘటనలో పదిమంది మరణించారు. 30మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అమెరికా మీడియా కథనాల ప్రకారం.. న్యూ ఆర్లీన్స్‌లో ఉన్న కెనాల్‌ అండ్‌ బోర్బన్‌ స్ట్రీట్‌లో న్యూఇయర్‌ వేడుకులు (new year 2025) జరుగుతున్నాయి. ఆ వేడుకల్లో పాల్గొనేందుకు జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. సరిగ్గా అమెరికాలో బుధవారం ఉదయం 3:47 (భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2.17 నిమిషాల) నిమిషాల సమయంలో ఓ అగంతకుడు తన వాహనంతో జనంపైకి దూసుకెళ్లాడు. అనంతరం, వాహనం దిగి తన వెంట తెచ్చుకున్న తుపాకీతో బహిరంగంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పలువురు మృతి చెందగా.. 30 మంది గాయపడినట్లు స్థానికులు తెలిపారు. దుర్ఘటనపై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగంతకుడిపై కాల్పులు జరిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ప్రమాదంలో గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఐదు స్థానిక ఆస్పత్రులకు తరలించారు. An SUV crashed into a crowd in New Orleans, USA.At least 10 people were killed and 30 more were injured. After the collision, the driver got out of the car and started shooting.The perpetrator has not yet been arrested. pic.twitter.com/pOiHhIQu00— S p r i n t e r (@SprinterFamily) January 1, 2025

Do not do these transactions with Credit cards even by mistake otherwise8
క్రెడిట్‌కార్డుతో పొరపాటున కూడా ఈ లావాదేవీలు చేయొద్దు..

ఆదాయపన్ను శాఖ (Income tax) ప్రతిఒక్కరినీ ఓ కంట కనిపెడుతూ ఉంటుంది. అన్ని లావాదేవీలపైనా నిఘా ఉంచుతుంది. ప్రస్తుతం క్రెడిట్‌కార్డుల వినియోగం పెరిగింది. అన్ని రకాల చెల్లింపులకూ క్రెడిట్‌ కార్డులే (Credit cards) వినియోగిస్తున్నారు. అయితే ఆదాయపు పన్ను నోటీసు రాకుండా నివారించాలనుకుంటే పొరపాటున కూడా చేయని లావాదేవీలు కొన్ని ఉన్నాయి.క్రెడిట్‌ కార్డులతో చేసే కొన్ని లావాదేవీలు నేరుగా ఆదాయపు పన్ను శాఖ దృష్టికి రావచ్చు. మీకు నోటీసు పంపవచ్చు. ఇవి అలాంటి లావాదేవీలైతే, సీఏలు కూడా మిమ్మల్ని రక్షించలేరు. అందుకే ఈ సమాచారం క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు చాలా ముఖ్యమైనది. ఎటాంటి లావాదేవీలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయో ఇక్కడ తెలుసుకోండి.ఒక సంవత్సరంలో విదేశీ ప్రయాణాలకు రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లయితే దాని డేటా ఆదాయపు పన్ను శాఖకు వెళుతుంది.క్రెడిట్ కార్డ్‌పై సంవత్సరానికి రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే, ఆదాయపు పన్ను శాఖ మీపై నిఘా ఉంచుతుంది. రూ. 1 లక్ష కంటే ఎక్కువ నగదు రూపంలో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు వంటి పెద్ద లావాదేవీలు శాఖ దృష్టిని ఆకర్షించవచ్చు.ఒక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్, షేర్లు లేదా బాండ్లలో రూ.10 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినట్లయితే, ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపవచ్చు.రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తిని కొనుగోలు చేసినట్లయితే, దాని సమాచారం ఆటోమేటిక్‌గా ఆదాయపు పన్ను శాఖకు చేరుతుంది.బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు జమ చేయడం ఆదాయపు పన్ను శాఖ దృష్టిని ఆకర్షిస్తుంది. రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే నోటీసు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.నగదు రూపంలో జరిగే వ్యాపార లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ నిఘా ఉంచుతుంది. రూ.50,000 కంటే ఎక్కువ వ్యాపార లావాదేవీల సమాచారం కోసం డిపార్ట్‌మెంట్ మిమ్మల్ని అడగవచ్చు.

3-Year-Old Rescued After 10 Days in Borewell, Passes Away Hours Later9
10 రోజుల తర్వాత బోరుబావి నుంచి చేతన వెలికితీత

జైపూర్‌ : రాజస్థాన్‌లోని కోట్‌పుత్లీ జిల్లాలో 10 రోజుల క్రితం బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి చేతనను రెస్క్యూ బృందాలు వెలికి తీశాయి. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.గత డిసెంబర్‌ 23న మధ్యాహ్నం కోట్‌పుత్లీ జిల్లా కిరాత్‌పురా గ్రామానికి చెందిన చేతన ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తూ 700 అడుగుల బోరుబావిలో పడిపోయింది. 10 నిమిషాల తర్వాత బాలిక ఏడుపు విన్న కుటుంబ సభ్యులు బోరుబావిలో పరిశీలించారు. చేతన అందులో పడిపోయినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు చిన్నారిని వెలికి తీసేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేశాయి. ఓవైపు పైపు ద్వారా ఆక్సిజన్‌ అందిస్తూనే.. మరోవైపు తవ్వకాలు ప్రారంభించారు. ఇలా ఆరుసార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఏడు సారి బుధవారం రెస్య్క్యూ సిబ్బంది చిన్నారిని బోరుబావి నుంచి సురక్షితంగా బయటకు తీశారు.ఈ సందర్భంగా చేతన తాత దయారామ్ మాట్లాడుతూ.. చిన్నారిని వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు అవిశ్రాంత కృషిని కొనియాడారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఓపెన్‌ బోర్‌వెల్‌లను కవర్‌ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. बोरवेल में फंसी बच्ची के हाथों में हलचल कैमरे में दिख रही है. #Jaipur https://t.co/7BBzFMGzHk pic.twitter.com/RD66L65NAY— Avdhesh Pareek (@Zinda_Avdhesh) December 23, 2024

Best Catch In History, Glenn Maxwell Takes A Screamer Vs Brisbane Heat In BBL10
Viral Video: మ్యాక్స్‌వెల్‌ అద్భుత విన్యాసం.. క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్‌

బిగ్‌బాష్‌ లీగ్‌ 2024-25లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ అద్భుతమైన విన్యాసం చేశాడు. బ్రిస్బేన్‌ హీట్‌తో ఇవాళ (జనవరి 1) జరుగుతున్న మ్యాచ్‌లో మ్యాక్సీ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టాడు. ఈ క్యాచ్‌ను క్రికెట్‌ చరిత్రలోనే అద్బుతమైన క్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ క్యాచ్‌ను చూసి అభిమానులు ఔరా అంటున్నారు.GLENN MAXWELL!CATCH OF THE SEASON. #BBL14 pic.twitter.com/3qB9RaxHNb— KFC Big Bash League (@BBL) January 1, 2025పూర్తి వివరాల్లోకి వెళితే.. మెల్‌బోర్న్‌ స్టార్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బ్రిస్బేన్‌ హీట్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. మ్యాక్స్‌ బ్రయాంట్‌ (77 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. బ్రిస్బేన్‌ ఇన్నింగ్స్‌లో బ్రయాంట్‌తో పాటు పాల్‌ వాల్టర్‌ (21), టామ్‌ బాంటన్‌ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మెల్‌బోర్న్‌ బౌలర్లలో స్టీకిటీ రెండు వికెట్లు పడగొట్టగా.. జోయల్‌ పారిస్‌, పీటర్‌ సిడిల్‌, ఉసామా మిర్‌, డాన్‌ లారెన్స్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ను డాన్‌ లారెన్స్‌ బౌల్‌ చేశాడు. తొలి బంతిని ఎదుర్కొన్న విల్‌ ప్రెస్ట్‌విడ్జ్‌ భారీ షాట్‌ ఆడాడు. ప్రెస్ట్‌విడ్జ్‌ ఈ షాట్‌ ఆడిన విధానం చూస్తే సిక్సర్‌ తప్పదని అంతా అనుకున్నారు. ఇక్కడే మ్యాక్స్‌వెల్‌ మ్యాజిక్‌ చేశాడు. సెకెన్ల వ్యవధిలో సిక్సర్‌ వెళ్తున్న బంతిని అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు. బౌండరీ లైన్‌ వద్ద మ్యాక్స్‌వెల్‌ చేసిన ఈ విన్యాసం చూసి ప్రేక్షకులంతా అవాక్కయ్యారు. సిక్సర్‌కు వెళ్తున్న బంతిని మ్యాక్సీ గాల్లోకి ఎగిరి లోపలికి తోశాడు. ఆతర్వాత క్షణాల్లో బౌండరీ లోపలికి వచ్చి క్యాచ్‌ పట్టుకున్నాడు. ఈ క్యాచ్‌ మాటల్లో వర్ణించలేనిది. కాగా, ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ ఈ క్యాచ్‌తో పాటు మరో మూడు క్యాచ్‌లు పట్టాడు.మ్యాచ్‌ విషయానికొస్తే.. 150 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో డాన్‌ లారెన్స్‌, మార్కస్‌ స్టోయినిస్‌ (62) తమ జట్టును గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లారు. మరో నాలుగు పరుగులు చేస్తే మెల్‌బోర్న్‌ విజయం సాధిస్తుందనగా బార్ట్‌లెట్‌ విజృంభించాడు. వరుస బంతుల్లో స్టోయినిస్‌, మ్యాక్స్‌వెల్‌లను (0) ఔట్‌ చేశాడు. మొత్తానికి లారెన్స్‌ (64 నాటౌట్‌) బాధ్యతగా ఆడి మెల్‌బోర్న్‌ను విజయతీరాలకు చేర్చాడు. మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఇన్నింగ్స్‌లో బెన్‌ డకెట్‌ డకౌట్‌ కాగా.. థామస్‌ రోజర్స్‌ 6, సామ్‌ హార్పర్‌ 8 పరుగులు చేశారు. బ్రిస్బేన్‌ హీట్‌ బౌలర్లలో​ బార్ట్‌లెట్‌ నాలుగు, స్పెన్సర్‌ జాన్సన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
10 రోజుల తర్వాత బోరుబావి నుంచి చేతన వెలికితీత

జైపూర్‌ : రాజస్థాన్‌లోని కోట్‌పుత్లీ జిల్లాలో 10 రోజుల క్రిత

title
అందుకే చంపేశా.. సంచలన విషయాలు వెల్లడించిన అర్షద్‌

‘మాకు సహాయం చేయమని చాలా మందిని అడిగాం, కానీ మాకు సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

title
న్యూఇయర్‌ వేళ.. 18 వేల ట్రాఫిక్‌ ఉల్లంఘనలు.. ఎక్కడంటే?

ముంబై : న్యూఇయర్‌ వేడుకల్లో ట్రాఫిక్‌ ఉల్లంఘనలు భారీ మొత్తంల

title
ఫోన్‌లో భార్య సతాయింపులు.. భరించలేక భర్త బలవన్మరణం!

కట్టుకున్న భార్య రాచిరంపాన పెడుతుందని ఓ భర్త వాపోతే ఎలా ఉంటుంది?. నవ్వి ఊరుకుంటుంది ఈ సమాజం.

title
ఎంజాయ్ చేద్దామని గోవా వెళ్లి.. శవమై తిరిగొచ్చిన ఏపీ యువకుడు

గోవా: న్యూఇయర్‌లో విషాదం చోటు చేసుకుంది.

NRI View all
title
మహిళా క్యాషియర్‌పై దాడి, అనుచిత వ్యాఖ్యలు, ఎన్‌ఆర్‌ఐకు జైలు, జరిమానా

మహిళా క్యాషియర్‌పై అనుచితంగా ప్రవర్థించిన భారత సంతతికి చెందిన  27 ఏళ్ల వ్యక్తికి  సింగపూర్‌  కోర్టు జైలు

title
సుచీర్‌ బాలాజీ కేసులో షాకింగ్ ‌ట్విస్ట్‌!

ఓపెన్‌ఏఐ విజిల్‌బ్లోయర్‌

title
యూకే స్టూడెంట్ వీసా.. మ‌రింత భారం!

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక కావడంతో భారత విద్యార్థులకు యూఎస్‌ వీసాలు కష్టమేనన్న ప్రచారం జోరందుకుంది.

title
ఖతార్‌లో తెలుగు ప్రవాసికి ప్రతిష్ఠాత్మక 'సౌత్ ఐకాన్ (ఆంధ్రప్రదేశ్)' పురస్కారం

ఖతార్‌లో జరిగిన ప్రతిష్టాత్మక "సౌత్ ఇండియన్ గ్లోబల్ టాలెంట్ అచీవర్స్ (SIGTA) అవార్డ్స్ 2024" వేడుకలో ప్రపంచవ్యాప్తంగా సు

title
హెచ్‌1బీ వీసా రగడలో అనూహ్య పరిణామాలు!

హెచ్‌–1బీ వీసాలపై రగడలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

Advertisement

వీడియోలు

Advertisement