Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ktr Pressmeet On Formula E Car Race Case1
ఫార్ములా-ఈ కేసు.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

సాక్షి,హైదరాబాద్‌:సీఎం రేవంత్‌ లీకుల వీరుడని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. గురువారం(డిసెంబర్‌19) సాయంత్రం తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. ఫార్ములా ఈ కార్‌ రేసులపై లీకులు కాదు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తప్పు జరిగిందని నిరూపించే సత్తా సీఎం రేవంత్‌కు లేదన్నారు. ఈ కార్‌ రేసు కేసులో ఏమీ లేదని కేటీఆర్‌ కొట్టి పారేశారు.ఈ కేసులో ఏమీ లేదని ప్రభుత్వానికి కూడా తెలుసన్నారు. సీఎం రేవంత్‌ది అరెస్టులు చేసే శాడిస్టు మెంటాలిటీ అని దుయ్యబట్టారు కేటీఆర్‌. హైదరాబాద్‌కు ఫార్ములా ఈ రేసులు తేవాలన్న ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి. రెండు కంపెనీలు ఈ కార్‌ రేసులు నిర్వహిస్తాయన్నారు. రేసుల నిర్వహణ ట్రాక్‌ కోసం గతంలో గోపనపల్లిలో భూ సేకరణ కూడా చేశారని చెప్పారు. గోపనపల్లిలో సీఎం రేవంత్‌కు 15 ఎకరాల భూమి ఉందన్నారు. ఫార్ములా ఈ రేసుల కోసం ప్రపంచ వ్యాప్తంగా పోటీ ఉంటుందన్నారు. లగచర్ల పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది: కేటీఆర్‌లగచర్ల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని, ఇది రైతులు, బీఆర్‌ఎస్‌ విజయమని కేటీఆర్‌ అన్నారు. లగచర్ల రైతుల కోసం పట్నం నరేందర్‌రెడ్డి విరోచిత పోరాటం చేశారన్నారు. లగచర్ల కేసులో గురువారం సాయంత్రం పట్నం నరేందర్‌రెడ్డి జైలు నుంచి విడుదలైన తర్వాత కేటీఆర్‌ ఆయనతో కలిసి మీడియాతో మాట్లాడారు. రేవంత్‌ ఎన్ని కుట్రలు చేసిన భయపడం: పట్నం నరేందర్‌రెడ్డిసీఎం రేవంత్‌ ఎన్ని కుట్రలు చేసినా తాము భయపడమని కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. రేవంత్‌ కుట్ర పన్ని తనను నెల రోజుల పాటు జైలుపాలు చేశాడని విమర్శించారు. తప్పుడు కేసులతో జైలులో పెట్టారన్నారు.హామీలు అమలు చేయలేక తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు.ప్రజలను డైవర్ట్‌ చేసేందుకే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు.రేవంత్‌ సోదురుడే గూండాలపై అధికారులతో దాడి చేశాడన్నారు.

Ysrcp Leader Gadikota Srikanthreddy Pressmeet 2
చంద్రబాబు దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావు: గడికోట

సాక్షి,తాడేపల్లి:ప్రపంచంలో ఏ నియంత చేయని దుర్మార్గాలను చంద్రబాబు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.గురువారం(డిసెంబర్‌19) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘చంద్రబాబు తనపై ఉన్న కేసులన్నిటిలో తనకుతానే క్లీన్ చిట్ ఇచ్చుకోవటం హాస్యాస్పదంగా ఉంది.జడ్జిల మీద నిఘా పెట్టటం ఎంతవరకు సమంజసం? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? నలుగురు ఐపీఎస్‌లను కూడా సస్పెండ్ చేశారంటే ఇది నియంత పోకడ కాదా? ఈ తప్పులను ప్రశ్నిస్తే సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు.అరెస్టు చేయడానికి వచ్చే పోలీసులు కనీసం ఐడీ కార్డులు కూడా చూపడం లేదు.రాష్ట్ర అప్పుల విషయంలో చంద్రబాబు విష ప్రచారం చేశారు.పార్లమెంటు చెప్పిన మాటలను కూడా తప్పుదారి పట్టించారు.అప్పులేకాదు ప్రతి విషయంలోనూ దుష్ప్రచారం చేశారు.వైఎస్‌ జగన్‌ తన హయాంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు.చేసిన మంచిని కూడా వైఎస్‌ జగన్ చెప్పుకోలేకపోయారు.ఇప్పుడు ఈ విషయాన్ని జనం గుర్తించి సొంతంగా ప్లెక్సీలు పెడుతున్నారు.చంద్రబాబు చేసిందంతా విధ్వంస పాలన.రూ.50 వేల కోట్లు రాజధానికి ఖర్చు చేస్తున్న చంద్రబాబు మిగతా ప్రాంతాల సంగతేంటో చెప్పాలి.రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు భాగం కాదా? వైఎస్‌ జగన్ కంటే గొప్పగా అభివృద్ధి చేస్తే చంద్రబాబు ఆ రికార్డులు చూపించాలి.చంద్రబాబు ష్యూరిటీ,వీరబాదుడు గ్యారెంటీ అన్నట్టుగా పరిస్థితి మారింది’అని శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Kohli to be leaving India Shifting Soon: Virat Childhood Coach on cricketer Plans3
‘త్వరలోనే భారత్‌కు కోహ్లి గుడ్‌బై... లండన్‌లో స్థిరనివాసం’

‘టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి త్వరలోనే శాశ్వతంగా భారత్‌ను వీడనున్నాడు. కుటుంబంతో కలిసి లండన్‌లో నివాసం ఉండబోతున్నాడు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి’... ఈ మాటలు అంటున్నది మరెవరో కాదు.. కోహ్లి చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ.క్రికెట్‌ కింగ్‌గా పేరొందిన విరాట్‌ కోహ్లి.. 2017లో బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మను వివాహమాడిన విషయం తెలిసిందే. ఈ జంటకు 2021లో కుమార్తె వామిక జన్మించింది. పాప పుట్టిన దాదాపు మూడేళ్ల అనంతరం ఇటీవలే అనుష్క- కోహ్లి మగబిడ్డకు జన్మనిచ్చారు.అప్పటి నుంచి ఎక్కువగా లండన్‌లోనేఇక వామిక భారత్‌లోనే జన్మించగా.. రెండోసారి ప్రసవం కోసం భర్త విరాట్‌తో కలిసి అనుష్క లండన్‌కు వెళ్లింది. అక్కడే ఆమె తమ కుమారుడు అకాయ్‌కు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కోహ్లి కుటుంబం ఎక్కువగా లండన్‌లోనే నివసిస్తోంది. విరాట్‌ కూడా సొంతగడ్డపై మ్యాచ్‌లు ఉన్నపుడు మాత్రమే స్వదేశానికి తిరిగి వస్తున్నాడు. విదేశాల్లో సిరీస్‌లు ఉన్న సమయంలో లండన్‌ నుంచి నేరుగా అక్కడికి చేరుకుంటున్నాడు.లండన్‌లో స్థిర నివాసంఅదే విధంగా.. అనుష్క శర్మ సైతం ముఖ్యమైన పనుల కోసం మాత్రమే ముంబైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో విరుష్క జోడీ లండన్‌లో స్థిరనివాసం ఏర్పరచుకోబోతున్నారని వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లి చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ.. దైనిక్‌ జాగరణ్‌తో మాట్లాడుతూ ఈ వదంతులు నిజమేనని పేర్కొన్నాడు.‘‘అవును.. విరాట్‌ కోహ్లి లండన్‌కు పూర్తిగా మకాం మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. త్వరలోనే అతడు ఇండియాను శాశ్వతంగా వదిలివెళ్తాడు’’ అని రాజ్‌కుమార్‌ శర్మ తెలిపాడు. కాగా విరాట్‌ కోహ్లికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా.. అనుష్కకు కూడా భారీగానే అభిమానగణం ఉంది.కారణం ఇదేకాబట్టి ఈ సెలబ్రిటీ జంటకు సంబంధించిన చిన్న విషయమైనా అభిమానులకు పెద్ద వార్తే. అదే విధంగా.. మీడియా, సోషల్‌ మీడియాలోనూ వీరి గురించి ఎన్నో కథనాలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి కామెంట్లు శ్రుతిమించుతాయి కూడా! అప్పట్లో ఓ మ్యాచ్‌లో కోహ్లి భారత పేసర్‌ మహ్మద్‌ షమీకి మద్దతుగా నిలిచాడన్న కారణంతో అతడి కుమార్తెను ఉద్దేశించి నీచంగా మాట్లాడటంతో పాటు బెదిరింపులకు దిగారు కొందరు దుండగులు.ఈ పరిణామాల నేపథ్యంలో తమ సంతానాన్ని లైమ్‌లైట్‌కు దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్న విరుష్క జోడీ.. ఇప్పటి వరకు వారి ఫొటోలను కూడా ప్రపంచానికి చూపించలేదు. తమ పిల్లల గోప్యతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారు శాశ్వతంగా లండన్‌లో స్థిరపడాలని భావిస్తున్నట్లు సమాచారం.ఆ తర్వాత శాశ్వతంగా లండన్‌లోఇటు కుటుంబ గోప్యతతో పాటు.. లండన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలోనే విరాట్‌ కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన ఈ రికార్డుల రారాజు.. వన్డే, టెస్టుల నుంచి తప్పుకొన్న తర్వాత మకాం మొత్తంగా లండన్‌కు మార్చబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ప్రస్తుతం కోహ్లి బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. భార్య అనుష్కతో పాటు పిల్లలు వామిక, అకాయ్‌లను కూడా తన వెంట తీసుకువెళ్లాడు. కాగా కోహ్లి ఖాతాలో ఇప్పటికే 81(టెస్టు 30, వన్డే 50, టీ20 1) అంతర్జాతీయ శతకాలు ఉన్నాయి.చదవండి: సంజూ శాంసన్‌కు షాక్‌

Bjp Filed Case On Loksabha Lop Rahulgandhi4
రాహుల్‌గాంధీపై హత్యాయత్నం కేసు

న్యూఢిల్లీ:లోక్‌సభలో ప్రతిపక్షనేత,కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ హత్యాయత్నం కేసు పెట్టింది. గురువారం(డిసెంబర్‌19) పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన తోపులాటలో రాహుల్‌ గాంధీ తోయడం వల్లే తమ ఇద్దరు ఎంపీలు గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాహుల్‌గాంధీపై కేసు పెట్టింది.‘మా పార్టీ రాహుల్‌ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.దాడి చేయడంతో పాటు దాడికి ప్రేరేపించారని ఫిర్యాదు చేశాం. నిరసన సమయంలో ఏం జరిగిందో ఎంపీలు ఇప్పటికే చెప్పారు’ అని బీజేపీ నేత అనురాగ్‌ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.BJP files police complaint against Rahul Gandhi for assault, incitementRead @ANI Story | https://t.co/ls6lEzdYdB#BJP #AnuragThakur #RahulGandhi #policecomplaint pic.twitter.com/sMqjgPbEvL— ANI Digital (@ani_digital) December 19, 2024 ‘రాహుల్‌ వైఖరి ఆమోదయోగ్యమైందికాదు.అలాగే నేరపూరితమైంది కూడా. అందుకే ఈ రోజు మేమంతా ఆయనపై ఫిర్యాదు చేశాం.పార్లమెంట్‌లోకి శాంతియుతంగా వెళ్లేందుకు భద్రతా సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించారు. ఆ దారిలో వెళ్లాలని పదేపదే అభ్యర్థించారు. కానీ రాహుల్ మాత్రం ఆ అభ్యర్థనను తిరస్కరించారు’ అని మరో ఎంపీ బన్సూరీ స్వరాజ్ చెప్పారు.అమిత్‌ షా వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చేందుకే: రాహుల్‌గాంధీ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చేందుకే బీజేపీ రాహుల్‌గాంధీపై ఈ ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ‘అంబేడ్కర్‌పై అమిత్‌ షా వ్యాఖ్యలు చేశారు. అలాగే అదానీ అంశంపై చర్చ వారికి ఇష్టం లేదు’ అని రాహుల్ గాంధీ అన్నారు. ఖర్గే,రాహుల్‌గాంధీ గురువారం సాయంత్రం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

Saudi Arabia Finds White Gold In Oil Fields Check What It Is5
అక్కడ భారీగా బయటపడ్డ తెల్ల బంగారం

చమురు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్న సౌదీ అరేబియాలో లిథియం నిక్షేపాలను గుర్తించారు. దీంతో లిథియం ప్రత్యక్ష మైనింగ్‌ను ప్రోత్సహించడానికి త్వరలోనే కమర్షియల్ పైలెట్ ప్రోగ్రామ్ ప్రారంభించనున్నట్లు సౌదీ అరేబియా మైనింగ్ వ్యవహారాల డిప్యూటీ మినిష్టర్ 'ఖలీద్ బిన్ సలేహ్ అల్ ముదైఫర్' వెల్లడించారు.ఇప్పటికే ఆర్థికంగా బలమైన దేశంగా ఉన్న సౌదీ అరేబియా.. లిథియం నిక్షేపాలు బయటపడంతో మరింత బలపడనుంది. ప్రభుత్వ యాజమాన్యంలోని పెట్రోలియం, నేచురల్ గ్యాస్ కంపెనీ 'సౌదీ అరామ్‌కో అకా అరమ్‌కో' (Saudi Aramco aka Aramco) లిథియంను వెలికి తీయనున్నట్లు.. దీనికోసం కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన కొత్త టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు సమాచారం.లిథియం నిక్షేపాలు బయటపడిన సందర్భంగా అల్ ముదైఫర్ మాట్లాడుతూ.. చమురు క్షేత్రాలు, ఉప్పునీటి ప్రవాహాల నుంచి లిథియం తీయడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. అయితే లిథియం ధరలు పెరిగితే కొత్త ప్రాజెక్ట్ త్వరలో వాణిజ్యపరంగా లాభదాయకంగా ఉంటుందని అన్నారు.నిజానికి సౌదీ అరేబియా, దశాబ్దాలుగా చమురుపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు దీనికి లిథియం కూడా తోడైంది. చమురు మాత్రమే కాకుండా.. ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను కనుగొనే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రయత్నాలలో భాగంగా ఈ నిక్షేపాలను గుర్తించారు.లిథియం ఉపయోగాలుఈ రోజు మనం రోజూ ఉపయోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్ బైకులు, కార్లు, సోలార్ పవర్ యూనిట్లు, ఎమర్జెన్సీ లైట్లు, బొమ్మలు వంటి ప్రతి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లో లిథియం ఉపయోగిస్తారు. నేడు ప్రతి రంగంలోనూ లిథియం అవసరం ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే దీనిని తెల్ల బంగారం అని పిలుస్తారు.

Telangana Acb Named Ktr As A1 In Formula E Case6
ఫార్ములా-ఈ కేసులో ఏ1గా కేటీఆర్‌.. ఏసీబీ కేసు నమోదు

సాక్షి,హైదరాబాద్‌: ఫార్ములా ఈ-కార్‌ రేసు నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఏసీబీకి ఇప్పటికే లేఖ రాశారు.ఈ క్రమంలో తాజాగా గురువారం(డిసెంబర్‌ 19) ఈ-కార్‌ రేసు వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఏ1గా, అప్పటి మునిసిపల్‌ శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను ఏ2గా చేరుస్తూ ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కేసులో ఏ3గా అప్పటి హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బిఎల్‌ఎన్‌రెడ్డిని ఏసీబీ చేర్చింది. కేటీఆర్‌పై అవినీతి నిరోధక చట్టం(పీసీ యాక్టు) 13(1)ఏ, 13(2)తో పాటు బీఎన్‌ఎస్‌ చట్టంలోని పలు నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.ఫార్ములా ఈ-కార్‌ రేసుల కోసం ఓ విదేశీ కంపెనీకి అప్పటి మునిసిపల్‌ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌ ఆదేశాలతో కేబినెట్‌ అనుమతి లేకుండానే రూ.45 కోట్ల ఇండియన్‌ కరెన్సీ చెల్లించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇందుకు ఆర్బీఐ రూ.8 కోట్లు ఫైన్‌ వేయగా తమ ప్రభుత్వం జరిమానా చెల్లించిందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద ఫార్ములా ఈ కార్‌ రేసులు నిర్వహించారు. ఈ రేసులకు అప్పటి మునిసిపల్‌ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌ నిబంధనలు పాటించకుండా ప్రైవేటు సంస్థలకు నేరుగా నిధులు మంజూరు చేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. మాజీ మంత్రి అయిన కేటీఆర్‌పై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్‌ అనుమతి కూడా తీసుకోవడం గమనార్హం. ‌హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేసే యోచనలో కేటీఆర్‌తనపై నమోదైన ఫార్ములా ఈ కార్ల కేసులో క్వాష్‌ పిటిషన్‌ వేసే యోచనలో కేటీఆర్‌ రేపు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేసే అవకాశం ఎఫ్‌ఐఆర్‌ నమోదైనందున క్వాష్‌ పిటిషన్‌ వేసేందుకు అవకాశం న్యాయ నిపుణులతో ఇప్పటికే కేటీఆర్‌ చర్చలు ప్రభుత్వం అబద్ధాలు చెప్తూ కేసు పెట్టింది: హరీశ్‌రావు రాష్ట్రం కోసం పనిచేసిన కేటీఆర్‌పై కేసు పెట్టారుప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలు ఫార్ములా ఈ కేసుపై అసెంబ్లీలో చర్చించండి

Srikakulam SherlockHolmes: Vennela Kishore Not Attending for Promotion7
ప్రమోషన్స్‌కు దూరంగా వెన్నెల కిశోర్‌.. 'ఇక మీరెందుకు పాకులాడటం?'

సినిమా తీయడమే కాదు దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యం. పుష్ప 2 రిలీజ్‌కు ముందు అల్లు అర్జున్‌ క్షణం ఖాళీ లేకుండా నార్త్‌ టు సౌత్‌ మొత్తం చుట్టేశాడు. ప్రమోషన్స్‌ ఆ రేంజ్‌లో ఉన్నాయి కాబట్టే ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ కూడా నెక్స్ట్‌ లెవల్‌లో వచ్చాయి. సినిమా ప్రమోషన్స్‌కు కూడా ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిస్తున్నారు. జనాల్లో తమ సినిమా గురించి మాట్లాడుకునేందుకు ఇదే బెస్ట్‌ ఆప్షన్‌ అని భావిస్తున్నారు.వరుసగా డుమ్మాఅయితే వెన్నెల కిశోర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌ సినిమా ఈవెంట్స్‌కు వరుసగా డుమ్మా కొడుతున్నాడు. గురువారం నాడు ట్రైలర్‌ సక్సెస్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్‌ అనన్య నాగళ్లతో పాటు దర్శకనిర్మాతలు వచ్చారు. దీంతో ఓ జర్నలిస్ట్‌.. వెన్నెల కిశోర్‌ ఈ సినిమాకు పబ్లిసిటీ అక్కర్లేదనుకుంటున్నాడు. ఆయన సినిమాకు ఆయనే రావట్లేదు. ఆయన రానప్పుడు మీరెందుకు పాకులాడటం? అని ప్రశ్నించాడు.కథే హీరోఅందుకు నిర్మాత వంశీ ఈ సినిమాలో కథే హీరో. మేము కథనే నమ్మాం. కథలో ఆయన ప్రధాన పాత్ర పోషించాడు అని చెప్పాడు. అప్పటికీ సదరు జర్నలిస్ట్‌.. హీరో మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటున్నారు అని వ్యాఖ్యానించాడు. అందుకు నిర్మాత.. మరి ముందుకువెళ్లాలి కదా.. డబ్బులు పెడుతోంది మేము.. ఆయన కాదు కదా! అని బదులిచ్చాడు.ప్రమోషన్స్‌కు ఎందుకు రావట్లేదంటే?ఇంతలో మరొకరు వెన్నెల కిశోర్‌ ఎందుకు ప్రమోషన్స్‌కు రారు? అని ప్రశ్నించాడు. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. తనకున్న బిజీ షెడ్యూల్‌ వల్ల రాలేకపోతున్నారు. పలుమార్లు ప్రమోషన్స్‌కు రమ్మని బతిమాలాం.. కానీ రాలేకపోయారు. ఆయన ఇంట్రోవర్ట్‌.. ఇలాంటివాటికి నేను రాలేనని సున్నితంగా తిరస్కరించాడు అని నిర్మాత వివరించాడు. కాగా ‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’ సినిమా డిసెంబర్‌ 25న విడుదల కానుంది.చదవండి: 'ప్రియాంక.. నీ భర్తను అదుపులో పెట్టుకో!' నిక్‌పై ట్రోలింగ్‌

Does India Need a 70 Hour Workweek?8
జీవితాంతం ఉద్యోగం చేయడానికే మనం పుడుతున్నట్లా?

రోజుకు ఎన్ని గంటలు పని చేయాలి? వారానికి ఎన్ని రోజులు పని చేయాలి..? ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి తరచుగా సూచించే వారానికి 70గంటల పని విధానాన్ని మీరు సమర్థిస్తారా? ముందు ఈ స్టోరీ క్లియర్‌గా పాయింట్‌ టు పాయింట్‌ చదవండి.. చివరికి సమాధానం మీకే దొరుకుతుంది!గుజరాత్‌లోని సూరత్‌లో ఓ 32ఏళ్ల వ్యక్తి తన రైట్‌ హ్యాండ్‌కి ఉన్న 5 వేళ్లలో నాలుగు వేళ్లను నరుక్కున్నాడు. కారణం ఏంటో తెలుసా? పని ఒత్తిడి..! అవును..! అతనికి నెలకు 50 వేల రూపాయల జీతం.. ఓ కంపెనీలో కంప్యూటర్‌ అపరేటర్‌గా పని చేస్తున్నాడు.. రోజుకు 12గంటలకు మించి అతనితో కంపెనీ మేనేజర్ పని చేయించుకుంటున్నాడు. జాబ్‌ మానేద్దామంటే అతని తండ్రి ఏమో మేనేజర్‌కు మంచి ఫ్రెండట..! ఉద్యోగం మానేస్తా అంటే తన తండ్రి ఒప్పుకోడు.. అందుకే ఫోర్‌ ఫింగర్స్‌ను స్టెయిన్‌లెస్ స్టీల్ కత్తితో కసాకసా కోసుకున్నాడు. ఇది రీసెంట్‌గా జరిగిన ఇన్సిడెంట్‌. ఒకసారి ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్దాం.. ఎర్నెస్ట్ అండ్‌ యంగ్‌ ఇండియా పూణే బ్రాంచ్‌ ఉద్యోగి అన్నా సెబాస్టియన్ ఎలా చనిపోయిందో గుర్తుంది కదా? రాత్రి-పగలు తేడా లేకుండా, కనీసం వీకాఫ్‌ కూడా ఇవ్వకుండా ఆమెతో కంపెనీ వెట్టిచాకిరి చేయించుకుంది.. చివరకు ఆమె ప్రాణాలు పోవడానికి కారణమైంది. మరో ఘటనలో వరుసగా 45 రోజులుగా సరైన నిద్రలేని 40 ఏళ్ల బ్యాంక్ మేనేజర్ సుశాంత్ చక్రవర్తి ముంబైలోని అటల్ సేతుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ప్రభుత్వ రంగ బ్యాంకులో పని చేస్తున్న సుశాంత్‌ ఎన్నో నెలలగా తీవ్రమైన పని ఒత్తిడితో బాధపడుతున్నాడని ఆయన భార్య కన్నీటిపర్యంతమైంది. ఇవన్నీ ఇండియాలో నిత్యం జరిగే కొన్ని ఘటనలు మాత్రమే..! మీడియా దృష్టికి, పోలీసు స్టేషన్‌ వరకు రాని కేసుల సంఖ్యకు లెక్కే ఉండదు..!'వారానికి 70గంటలు పనిచేయాలి...' ఇది నారాయణమూర్తి పదేపదే చెబుతున్న మాట.. మరోసారి కూడా అదే చెప్పారాయన..! దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపేందుకు భారతీయ యువత వారానికి 70 గంటలు పనిచేయాలన్నది ఆయన వాదన. ఇండియాలో పేదరికాన్ని పోగొట్టాలంటే ఇలా కష్టపడాలట..! కేవలం వ్యాపారవేత్తలే ఉద్యోగాలను సృష్టించగలరని.. దేశానికి ఆదాయాన్ని తీసుకురాగలిగేది కూడా వారేనని నారాయణమూర్తి చాలా స్పీచ్‌ల్లో చెబుతున్నారు. అంతేకాదు.. పెట్టుబడిదారి విధానంతో మంచి రోడ్లు, మంచి ఉద్యోగాలు వస్తాయని..దేశాన్ని ముందుకు నడిపేది క్యాపిటలిజమేనని ఆయన అంటున్నారు.పనిలోపనిగా సోషలిస్ట్‌ సిద్ధాంతాలను నమ్మిన భారత్ తొలి ప్రధాని నెహ్రూని ఆయన విమర్శిస్తున్నారు. నెహ్రూ సోషలిస్టిక్‌ విధానాల వల్ల ఇండియా చాలా నష్టపోయిందని ఆరోపిస్తున్నారు.70వ దశకం ప్రారంభంలో తనకు పారిస్‌లో పని చేసే అవకాశం వచ్చిందని.. అక్కడున్నవారంతా ఇండియాను మురికి దేశంగా భావించేవారని చెప్పుకొచ్చారు నారాయణమూర్తి. అప్పటికి దేశంలో పేదరికం ఉందని.. రోడ్లన్నీ గుంతలమయంగా ఉండేవని.. ఆ తర్వాత పెట్టుబడిదారి విధానాల కారణంగా ఆ పరిస్థితి మారిందని చెప్పారు. వ్యాపారాల్లో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర ఉండకూడదని.. పెట్టుబడిదారులు ఉద్యోగాలు సృష్టించడం ద్వారా దేశాన్ని నిర్మిస్తారని, వారు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారని.. ఇదే దేశం ఎదుగుదలకు కారణం అవుతుందని నారాయణమూర్తి అప్పట్లోనే భావించారట..!వారానికి 70 గంటల పని విధానం కారణంగా గుండెపోటు ముప్పు 33శాతం పెరుగుతుందని కెంబ్రిడ్జ్ యూనివర్సిటీ అధ్యయనం చెబుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. అధిక పని ఒత్తిడితో 2016లో 7 లక్షల 45 వేల మంది ప్రపంచవ్యాప్తంగా మరణించారు. 2010 - 2019 మధ్య 350 మంది ఇండియన్ డాక్టర్స్‌ కేవలం ఓవర్‌ టైమ్‌ వర్క్‌ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. అటు అమెరికాలో వృత్తిపరమైన ఒత్తిడి ఆరోగ్య సమస్యలను విపరీతంగా పెంచుతుందని నివేదికలు చెబుతున్నాయి. పని-సంబంధిత ఒత్తిడి కారణంగా అమెరికాలో సంవత్సరానికి 20,231 మంది మరణిస్తున్నారు.అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ నివేదిక ప్రకారం అధిక పని ఒత్తిడితో ఆత్మహత్యలు 27శాతం పెరిగాయి. ఇక WHO స్టడి ప్రకారం వారానికి 55గంటలకు మించి పని చేస్తే హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశం 1.3రెట్లు పెరుగుతుంది. మెడిబడ్డి రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 62శాతం మంది తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు..! అటు 160 దేశాల్లోని 1,28,278 మంది ఉద్యోగులను సర్వే చేసిన గాలప్.. ప్రతీ 1,000 మంది భారతీయ ఉద్యోగులలో 350 మంది విపరీతమైన కోపాన్ని కలిగి ఉన్నారని తేల్చింది. అటు తీవ్రమైన పని వేళల కారణంగా డిప్రెషన్ బారిన పడేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఓవర్‌ టైమ్‌ వర్క్‌ కారణంగా తీవ్రమైన మానసిక సమస్యలతో పాటు గుండె జబ్బులు, అధిక రక్తపోటు లాంటి సమస్యలు పెరుగుతాయి. ఇది డాక్టర్లు చెబుతున్న పచ్చి నిజాలు..!సరే.. ఓసారి ఆరోగ్యం విషయాలను పక్కనపెడదాం..! పోని నారాయణమూర్తి చెప్పినట్టు కేవలం క్యాపిటలిజం మాత్రమే దేశాలను ముందుకు నడిపిస్తున్నాయా అంటే కాదనే చెప్పాలి.! చైనా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిలో ఒకటిగా ఎదగడానికి ఉపయోగపడింది ఆ దేశం నమ్మిన సోషలిస్ట్‌ సిద్ధాంతాలు. అటు నాటి సోవియట్‌ రష్యాతో పాటు క్యూబా లాంటి దేశాలు సోషలిస్ట్‌ ప్రిన్సిపల్స్‌ ద్వారానే అభివృద్ధి చెందాయి. సరే ఈ సోషలిజాన్ని కూడా పక్కన పెడదాం..! మరి స్వీడన్, నార్వే దేశాల్లో వారానికి 35-40 పని గంటల విధానమే ఉంది కదా.. మరి అక్కడ ఉచిత ఆరోగ్యసేవలు, మెరుగైన ఉద్యోగ భద్రత ఎందుకున్నట్టు? గొడ్డుచాకిరి చేస్తేనే ప్రొడక్టవిటీ ఉంటుందని నారాయణమూర్తి చెప్పిన మాటలకు యూరప్‌లోని అభివృద్ధి చెందిన దేశాల ఉద్యోగ విధానాలకు ఏమాత్రం పొంతన లేదు.ఇవి కళ్లకు కనిపిస్తున్న నిజాలు..! వీటి అన్నిటిని సమ్‌ అప్ చేసి ఒక మాట చెప్పనా.. 'A worker chained by exploitation may produce results, but never innovation.. true productivity thrives in freedom, not fear...' టార్గెట్లు పెట్టి డెడ్‌లైన్లు విధించి ఓవర్‌టైమ్ చేస్తే ఏదో ఒక ప్రొడక్టివిటీ కనిపిస్తుంది కానీ బెటర్‌ అవుట్‌పుట్ అయితే రాదు..! ఇండియాలో ఇప్పటికి చాలా కంపెనీల్లో వారానికి 48గంటల పని విధానం ఉంది. వారానికి ఆరు రోజుల వర్క్‌ ఉంటే రోజుకు 8 గంటలు పని చేస్తున్నట్టు లెక్కా! ఇక 48గంటలకే ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉద్యోగులను వేధిస్తున్నాయి. మరి వారానికి 70 గంటల పని అంటే రోజుకు దాదాపు 12గంటలు పనిచేయాలి..! మరి పర్శనల్‌ లైఫ్ ఏది? అంటే జీవితాంతం ఉద్యోగం చేయడానికి మనుషులు పుడుతున్నట్టా? మనుషులా.. మెషీన్లా? ఓ యాంత్రానికి కూడా రెస్ట్‌ లేకపోతే అది సరిగ్గా పనిచేయదు.. మరి బాడీకి, మైండ్‌కి విశ్రాంతి అవసరం లేదా?-త్రినాథ్‌ బండారు

Telangana Tenth Exams Schedule Released9
TG: టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

సాక్షి,హైదరాబాద్‌:తెలంగాణలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ శాఖ గురువారం(డిసెంబర్‌ 19) ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఏడాది(2025) మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 2 వరకు టెన్త్‌ పరీక్షలు జరగనున్నాయి.మార్చి 21న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, మార్చి 22న సెకండ్‌ లాంగ్వేజ్‌, మార్చి 24న ఇంగ్లీష్‌, 26న గణితం, 28న ఫిజిక్స్‌, 29న బయోలజి, ఏప్రిల్‌ 2న సోషల్‌ స్టడీస్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే.

YS jagan Key Meeting With Anantapur YSRCP Party Leaders10
పూర్తిగా చంద్రముఖిలా మారిన చంద్రబాబు.. వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: ఏపీలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. రాష్ట్రంలో కుంభకోణాల మీద కుంభకోణాలు జరుగుతున్నాయి. చంద్రబాబు పూర్తిగా చంద్రముఖిగా మారిపోయారు.. ఇసుక మాఫియా, లిక్కర్‌ మాఫియా.. ఇలా మాఫియాలు చేస్తున్నారన్నారని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఇలాంటి సమయంలోనే మనం గొంతు విప్పాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. నాయకులుగా ఎదగడానికి ఇదొక అవకాశమని వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు.ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వైఎస్‌ మాట్లాడుతూ.. ‘ఆరు నెలలు తిరక్కముందే చంద్రబాబు ప్రభుత్వంమీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీదా లేదు. ప్రతి కుటుంబానికి మనం మంచి చేశాం. కానీ, చంద్రబాబు అంతకంటే ఎక్కడు చేస్తానంటూ, ప్రతీ ఇంట్లో ప్రతీ ఒక్కరికీ ఒక హామీ ఇచ్చాడు. మనం కూడా అలాంటి హామీలు ఇద్దామని చాలామంది నాతో అన్నారు. గడచిన ఐదేళ్లలో చరిత్రలో ఎప్పుడూ చూడని మార్పులు మనం తీసుకువచ్చాం. ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశాం. మేనిఫెస్టోకు పవిత్రత తీసుకువచ్చాం, ప్రతీ హామీని తూచా తప్పకుండా అమలు చేశాం.చరిత్రలో వైఎస్సార్‌సీపీ ఒక్కటే..కోవిడ్‌ లాంటి సమస్యలు వచ్చినా, ప్రభుత్వ ఆదాయాలు తగ్గినా, ఖర్చు పెరిగినా, సాకులు చూపకుండా, కారణాలు చెప్పకుండా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేశాం. బడ్జెట్లోనే సంక్షేమ క్యాలెండర్‌ ప్రకటించాం. క్యాలెండర్‌ ప్రకారం ప్రతీ పథకాన్ని అమలు చేశాం. దేశ చరిత్రలో అమలు చేసిన పార్టీ ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమే. చంద్రబాబు మాటలను పదిశాతం ప్రజలు నమ్మారు, నమ్మించగలిగారు. అందుకనే పరాజయం పాలయ్యాం. జగన్‌ చేశాడు కదా.. చంద్రబాబు కూడా చేస్తాడేమోనని కొంతమంది అనుకున్నారు. ఆరు నెలలు కూడా గడవకముందే చంద్రబాబు మోసాలు, అబద్ధాలు మన అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని లేపడమే, పులినోట్లో తలపెట్టడమే అని ఆరోజు చెప్పాను. దాన్ని ఇవాళ చంద్రబాబు నిజం చేస్తున్నారు. జగన్‌ పలావు పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు పలావు పోయిందీ, బిర్యానీ పోయిందీ. ఉన్న పథకాలు పోయాయి.. ఇస్తానన్న పథకాలు రావడంలేదు. ఇప్పుడు ప్రజలపై బాదుడే బాదుడు మొదలైంది. ఆరు నెలల్లోనే ప్రజలపై కరెంటు ఛార్జీల రూపంలో భారం వేశాడు.అంతా మాఫియానే.. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. స్కామ్‌ల మీద స్కాంలు నడుస్తున్నాయి. శాండ్ మాఫియా, లిక్కర్‌ మాఫియా.. ఇలా మాఫియాలు నడుస్తున్నాయి. మైనింగ్‌ జరగాలన్నా, ఏ కాంట్రాక్టు చేయాలన్నా ప్రతీ ఎమ్మెల్యే నుంచి మొదలుకుని ముఖ్యమంత్రి వరకూ నాకింత.. నీకింత అనే కార్యక్రమం నడుస్తోంది. మనం అంతా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ దిశగా పార్టీ అడుగులు వేయాలి. ప్రభుత్వం మీద వ్యతిరేకత పార్టీకి సానుకూలంగా మారాలంటే ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేయాలి. దీనిపై పార్టీ నాయకత్వాన్ని అంతా చైతన్యం చేస్తున్నాం. ఆరు నెలలకే మనం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు పాలన అలా నడుస్తోంది.రైతులు ఆగం..రైతులకు మనం ఏడాదికి ఇచ్చే రూ.13,500 ఎగిరిపోయింది.. చంద్రబాబు ఇస్తానన్న రూ.20వేలు ఇవ్వని పరిస్థితి ఉంది. ఉచిత పంటల బీమాను ఎత్తివేశారు. ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. పంటలకు ఎక్కడా గిట్టుబాటు ధరలు దొరకడం లేదు. ధాన్యం కొనుగోలు సమయంలోనే రైతులకు ఎఫ్‌టీవో ఇచ్చే వాళ్లం. రూ.300-400 తక్కువ రేటుకు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోంది. దీనిపై ఇది వరకే మనం కార్యక్రమం చేశాం. ఈనెల 27న కరెంటు ఛార్జీల మీద నిరసన వ్యక్తం చేస్తూ మరో కార్యక్రమం చేస్తున్నాం. పెరిగిన బిల్లులు చూపిస్తూ వాటిని కాల్చివేస్తున్న పరిస్థితులు చేస్తున్నాం. కరెంటు ఛార్జీల పెంపు మీద నిరసన కార్యక్రమాన్ని నియోజకవర్గాల స్థాయిలో చేపడుతున్నాం. మళ్లీ జనవరి 2న ఫీజు రియింబర్స్‌మెంట్‌, వసతి దీవెనమీద నిరసనలకు ప్లాన్‌ చేశాం.మన ప్రభుత్వ హయాంలో ప్రతీ త్రైమాసికానికి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పంపాం. జనవరి ఒకటో తేదీ నాటికి నాలుగు త్రైమాసికాలుగా ఫీజులు చెల్లించడం లేదు. అలాగే వసతి దీవెన బిల్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా రూ.3,900 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో చదువులకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. డబ్బులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు. వీరికి అండగా జనవరి 3న జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమం చేస్తుంది:కష్టం ఎల్ల కాలం ఉండదు..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు, నష్టాలు ఉంటాయి. కేసులు కూడా పెడతారు, జైల్లో కూడా పెడతారు. ప్రతీ కష్టానికి ఫలితం ఉంటుంది. చీకటి తర్వాత వెలుగు కూడా వస్తుంది. ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా.. నావైపు చూడండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. నా భార్య బెయిల్‌ పిటిషన్‌ కనీసంగా 20 సార్లు పెట్టి ఉంటుంది. కింద కాంగ్రెస్‌, పైన కాంగ్రెస్‌. ఎన్ని కష్టాలు పెట్టినా.. నేను ముఖ్యమంత్రిని కాలేదా?. ఇది ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎల్లకాలం కష్టాలు ఉండవు. ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితులనైనా ఢీకొనేలా ఉందాం. మీ అందరికీ జగనన్న, పార్టీ తోడుగా ఉంటుంది.సాగునీటి సంఘాల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా చేశారు. వీఆర్వోలను మండల కేంద్రాలకు రప్పించి, పోలీసులను కాపలాగా పెట్టించి ఎన్నికలు జరిపారు. అలాంటప్పుడు ఎన్నికలు జరపడం ఎందుకు. రాజీనామాలు చేసి బయటకు వస్తే, రైతులు సంతోషంగా ఉన్నారా? లేదా? తెలుస్తుంది.విజన్‌ పేరిట మరో డ్రామా..విజన్‌ 2047 పేరిట మరో డ్రామా జరుగుతోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు, ఎల్లో మీడియా వారి మేనిఫెస్టోపై ఊదరగొట్టారు. ఈ మేనిఫెస్టోకు దిక్కులేదు, ఇప్పుడు 2047కు అర్థం ఏముంటుంది?. ఇప్పుడు చంద్రబాబు వయస్సు దాదాపు 80 ఏళ్లు. ఒక మనిషిని అభివృద్ధి బాటలో పట్టించడమే విజన్‌ అని నేను నమ్ముతాను. ఇప్పటి పిల్లాడు 20 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలన్నదానిపై మనం ఆలోచనలు చేస్తే అది విజన్‌ అవుతుంది. అలాంటి ఆలోచనలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసింది. ప్రైవేటు స్కూల్స్‌.. గవర్నమెంటు స్కూల్స్‌తో పోటీపడే పరిస్థితిని తీసుకు వచ్చాం. ఉన్నత విద్యలో విద్యార్థులు అత్యాధునిక కోర్సులు చదువుకునేలా ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్శిటీల కోర్సులను నేర్చుకునే అవకాశం కల్పించాం.విజన్‌ మనది.. ఆరోగ్య రంగంలో కూడా విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చాం. ఫ్యామిలీ డాక్టర్‌, విలేజ్‌ క్లినిక్‌ వ్యవస్థను తీసుకువచ్చాం. ప్రివెంటివ్‌ కేర్‌ విషయంలో అనేక చర్యలు తీసుకున్నాం. ఆర్బీకే వ్యవస్థ ఒక విజన్‌. ప్రతీ ఎకరాకు ఈ-క్రాప్‌ చేయడం విజన్‌. ప్రతీ ఎకరాకు ఉచిత పంటల బీమా తీసుకురావడం ఒక విజన్‌.రైతులకు కనీస మద్దతు ధర వచ్చేలా చేయడం ఒక విజన్‌. ఈ మార్పులన్నీ వచ్చింది వైయస్సార్‌సీపీ హయాంలోనే..మన ప్రభుత్వం రాక ముందు ఒక రూపాయి ప్రజలకు ఇస్తే.. అది నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి ఉండేదా?. హయంలో ఎక్కడా దళారీ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేర్చగలిగాం. గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి వద్దకే సేవలు అందించి గొప్ప విజన్‌ను తీసకురాగలిగాం. కానీ, రంగ రంగుల కథలు చెప్తున్నారు. దానికి విజన్‌ అని పేరుపెడుతున్నారు. దాన్ని విజన్‌ చేయడం అనరు.. దగా చేయడం అంటారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పెన్షన్లు కట్‌ చేశారు. కొత్త పెన్షన్లు ఒకరికి ఇవ్వకపోగా.. ఉన్న పెన్షన్లు కట్‌ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం పోరుబాటకు సిద్ధం కావాలి అని సూచనలు చేశారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
ఆమె నెగ్గింది.. అమ్మ గెలిచింది

‘మా అమ్మాయి దీక్ష అస్సాం సివిల్‌ సర్వీసెస్‌కు సెలెక్ట్‌ అయింది తెలుసా!’ అంట

title
కొబ్బరి నూనె.. హెయిర్‌ ఆయిలా? వంటనూనా?

కొబ్బరి నూనె ఎందుకు వాడతారు? తలకు పెట్టుకుంటారు, కేరళలో వంటల్లో కూడా వినియోగిస్తారు. అయితే మరి కొబ్బరినూనె..

title
రాహుల్‌గాంధీపై హత్యాయత్నం కేసు

న్యూఢిల్లీ:లోక్‌సభలో ప్రతిపక్షనేత,కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్

title
జీవితాంతం ఉద్యోగం చేయడానికే మనం పుడుతున్నట్లా?

రోజుకు ఎన్ని గంటలు పని చేయాలి? వారానికి ఎన్ని రోజులు పని చేయాలి..?

title
రాహుల్‌ అనుచితంగా ప్రవర్తించారు: మహిళా ఎంపీ ఫిర్యాదు

న్యూఢిల్లీ: ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీపై నాగాలాండ్‌కు చెందిన

NRI View all
title
టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'' 209 వ సాహిత్య సదస్సు

డాలస్‌లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక 'నెల నెలా తెలుగు వెన్నెల' 209వ సాహిత్య సదస్సు ఘనంగా జరిగిం

title
లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆవిర్భవించినప్పటి నుండి “భాషే రమ్యం, సేవే గమ్యం” దిశగా పయనిస్తూ...

title
ఫిలడెల్ఫియాలో నాట్స్ బాలల సంబరాలకు అద్భుత స్పందన

అమెరికాలో తెలుగు జాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఫిలడెల్ఫియాలో బాలల సంబరా

title
హెచ్-1బీ వీసా : భారతీయ టెకీలకు గుడ్‌ న్యూస్

డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా విజయం సాధించిన తరువాత  ఆమెరిక

title
NRI: జాకీర్ హుస్సేన్ మృతిపై ఐఎఎఫ్ సంతాపం

డాలస్, టెక్సస్: తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ మృతి పట్ల ఇ

Advertisement

వీడియోలు

Advertisement