Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Pawan Kalyan Comments On CM Revanth Reddy Over Allu Arjun Arrest1
బాబు.. పవన్‌.. ఊసరవెల్లి.. సిగ్గు సిగ్గు!

అందితే జుట్టకు.. అందకుంటే కాళ్లు అని సామెత. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ విద్య వెన్నతో పెట్టిందేనని చాలాకాలంగా అందరికీ తెలుసు. అయితే ఈమధ్యకాలంలో ఆయనకు పవన్‌కళ్యాణ్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి రాజకీయాలకు సినిమాలను వాడుకోవడమే కాదు.. రాజకీయాలకు సినిమాలను వాడుకోవడమెలాగో కూడా ప్రత్యక్షంగా చూపిస్తున్నారు మరి! అల్లూ అర్జున్‌ అరెస్ట్‌ విషయంలో పవన్‌ వ్యాఖ్యలు, వ్యవహారం మొత్తం ఈ ద్వంద్వ వైఖరినే సూచిస్తోంది. గతంలో సినిమా టిక్కెట్ల నియంత్రణకు జగన్‌ సీఎం హోదాలో నడుం బిగిస్తే అంతెత్తున ఎగిరిన వ్యక్తి ఈ పవన్‌ కళ్యాణ్‌! జగన్‌ సినిమా వాళ్లను అగౌరవ పరిచారని, టిక్కెట్‌ ధరలకూ.. ప్రభుత్వానికి సంబంధం ఏమిటని గగ్గోలుపెట్టారు. అసత్య ప్రచారం కొనసాగించారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా బెనిఫిట్‌ షోలు, టిక్కెట్ ధరల గురించి మాట్లాడితే మాత్రం పవన్‌ ఆయన చాలా గొప్ప అని పొగిడేస్తున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గతంలో ఇదే కాంగ్రెస్‌ పార్టీ వారిని పవన్‌ పంచెలూడదీసి కొడతానని బహిరంగంగా ప్రకటించడం!!! పవన్‌ ద్వంద్వ వైఖరి మొత్తం తన సినిమా వ్యాపారాన్ని కాపాడుకునేందుకే అన్నది బహిరంగ రహస్యమే. కాకపోతే ఈ విషయం అక్కడితోనే ఆగిపోలేదు. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఆయన అల్లూ అర్జున్‌ అరెస్ట్‌ను కూడా తప్పు పట్టలేకపోయారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని సుద్దులు కూడా వల్లెవేశారు. చట్టంపై అంత గౌరవమున్న మనిషే అయితే.. గతంలో చంద్రబాబుపై అవినీతి కేసులు వచ్చినప్పుడు అస్సలు మాట్లాడలేదేం? పైగా ఎందుకు రోడ్లపై పడి దొర్లారు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు ప్రచారం యావకు 29 మంది నిండు ప్రాణాలు బలైతే.. నోరెత్తని పవన్‌ అల్లూ అర్జున్‌ విషయంలో మాత్రం ముందు వరుసలోకి వచ్చారే? ఇక్కడ మరణించిన వ్యక్తుల సంఖ్య కాదు ముఖ్యం. మానవత్వం. ఒకసారి ఒకలా.. ఇంకోసారి ఇంకోలా వ్యవహరించడాన్నే ప్రశ్నించాలి. చంద్రబాబు సభలు జరిగినప్పుడు నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరులలో తొక్కిసలాటల వల్ల 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే పవన్ కళ్యాణ్ సినిమా విడుదల లేదా పుట్టిన రోజుకో ఫ్లెక్సీలు కడుతూ కరెంటు షాక్‌కు అభిమానులు మరణించిన ఘటనలున్నాయి. మానవత్వం ఉన్న వారైతే అలా ఫ్లెక్సీలు కట్టవద్దని ప్రకటన చేసుండేవారు. బిజెపి మిత్రపక్షంగా, ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంటూ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పవన్ పొగడడం తెలంగాణ బీజేపీ నేతలకు కాస్త చికాకు కలిగించినట్లుగానే ఉంది. బీజేపీ నేతలు ఒకపక్క అల్లు అర్జున్‌ను సమర్థిస్తూంటే పవన్ దీనికి భిన్నమైన వైఖరి తీసుకోవడం వారికి అసంతృప్తి కలిగించింది. అందుకే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ అంశం గురించి ప్రస్తావించి రేవంత్ ఎందులో గొప్పవాడిగా కనిపించారని అడిగారు. రేవంత్ సినిమా వారి పట్ల కర్కశంగా వ్యవహరించినా, వారికి బెనిఫిట్ షో లు ఇచ్చే ప్రసక్తి లేదని, రేట్లు పెంచబోమని ప్రకటించినా పవన్ నోరు విప్పి స్పందించలేకపోతున్నారు. ఏపీలో గతంలో వేసిన రంకెలు తెలంగాణలో ఏమయ్యాయని పవన్ ప్రత్యర్థులు ఎద్దేవ చేస్తున్నారు. తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజును ఉద్దేశించి గతంలో పవన్ కళ్యాణ్ ఏమన్నారు.. ‘‘నువ్వూ రెడ్డివే..జగన్ రెడ్డే.. మీరు, మీరు మాట్లాడండి’’ అని పెద్ద గొంతుకతో చెప్పారు. కాని ఇప్పుడు అదే దిల్ రాజు ఈయనతో మాట్లాడగానే రేవంత్ ను పొగిడేసి తెల్ల జెండా ఎత్తేశారన్నమాట. అంటే తన అన్న కుమారుడు రామ్ చరణ్ తేజ సినిమాతో పాటు తన సినిమాలు, బాలకృష్ణ వంటివారు నటించిన సినిమాలు విడుదలకు సిద్దం అవుతుండడంతో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం పవన్ చేయలేకపోయారు. ఎలాగొలా రేవంత్ ను ప్రసన్నం చేసుకుని మళ్లీ బెనిఫిట్ షోలు, టిక్కెట్ ధరల విషయాలలో సానుకూల నిర్ణయం కోసం ఈ పాట్లు పడుతున్నట్లు అనిపిస్తుంది. సినిమా నటుడుగా ఉన్న ఆయన జనసేన పార్టీ పెట్టుకుని రాజకీయాలలోకి వచ్చి బాగానే లబ్ది పొందారని చెప్పాలి. కేంద్రస్థాయిలో బీజేపీతో జత కట్టడం, ఆ తర్వాత విడిపోయి పాచిపోయిన లడ్లు ఇచ్చిందని చెప్పినా, తదుపరి మళ్లీ వారిని బతిమలాడుకుని పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు, లోకేష్‌లను అవినీతిపరులుగా ఆరోపించి, ఆ తర్వాత మళ్లీ వారితోనే స్నేహం చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతికి పాదాభివందనం చేసి, వామపక్షాలతో కలిసి పోటీచేసి పరాజయం తర్వాత వారిని గాలికి వదలివేశారు. ఇలా అవకాశవాద రాజకీయాలు చేయడంలో పవన్‌ ఘనాపాటినే అనిపించుకున్నారు. చెగువేరా అభిమానిని ప్రచారం చేసుకుని, అనంతర దశలో మోడీ అంటే చాలా అభిమానం అని చెప్పుకున్నారు. వామపక్ష భావజాలం నుంచి సనాతన హిందూవాదినని పోజు పెట్టగలిగారు. ఒకసారి ఓటమి పాలైనా, సినిమాల పాత్రల ద్వారా తన అభిమానులను ఆకట్టుకుని, ఒక సామాజికవర్గాన్ని ఆకర్షించి తద్వారా రాజకీయ అవసరాలను తీర్చుకున్న పవన్ కళ్యాణ్, ప్రస్తుతం తన రాజకీయ పదవిని అడ్డం పెట్టుకుని సినిమా వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. అందుకే కాంగ్రెస్ నేత అని తెలిసినా రేవంత్ ను అంతగా పొగిడారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. సినీ ప్రముఖుల మాదిరే ఆయనకు కూడా హైదరాబాద్ లోనే ఆస్తిపాస్తులు ఉండడం వల్లే భయపడ్డారన్న వాదన ఉంది. గతంలో కెసిఆర్ ను రాజకీయంగా ఒక సందర్భంలో విమర్శించినా, ఆయన ముఖ్యమంత్రి కాగానే పవన్ కళ్యాణ్ కలిసి ప్రశంసించి వచ్చారు. ఆ తర్వాత ఆయన సినిమాకు ఇబ్బంది లేకుండా చేసుకున్నారని చెబుతారు. ఇలా రాజకీయాలను ,సినిమాలను కలిపి వాడుకోగలగడంలో పవన్ సఫలం అయ్యారని చెప్పాలి. ఇది రాజకీయ అవకాశవాదం కావచ్చు. విలువలు లేని రాజకీయం కావచ్చు..ఏమైతేనేం .. అంతిమంగా అటు రాజకీయంలో పదవులు పొందాలి. ఇటు సినిమాలలో వ్యాపారం పండాలి..ఈ వైఖరి తోనే పవన్ నడక సాగిస్తున్నట్లు కనిపిస్తుంది.ఇక తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇప్పించడాన్ని సమర్దించుకున్న తీరు విడ్డూరమే .గతంలో వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అని,తన ఇంటిలోని వారికెవరికి పదవులు తీసుకోవడం లేదని చెప్పిన ఆయన ఇప్పుడు స్వరం మార్చారు. నాగబాబు జనసేన కోసం కష్టపడ్డారని చెబుతున్నారు.నాగబాబు మాదిరికాని, మంత్రి నాదెండ్ల మనోహర్ లాగా కాని బిసి,ఎస్సి,ఎస్టి నేతలెవరైనా కష్టపడి ఉంటే వారికి పదవులు ఇచ్చేవారట.అంటే వారికి అవకాశాలు ఇవ్వకుండా, వారు శ్రమపడలేదని చెప్పడం పవన్ కే చెల్లింది. అన్నిటికి మించి తన పార్టీ మంత్రి కందుల దుర్గేష్ , ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఏ కులమో తెలియదని చెప్పడం ఈయన అబద్దాలు ఏ లెవెల్లో ఆడగలరో చెప్పకనే చెబుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకాలం చంద్రబాబు నాయుడే అవకాశవాద రాజకీయాలలో దిట్ట అని, అబద్దాలు ఆడడంలో బహు నేర్పరి అని అంతా అంటుంటారు. ఇప్పుడు పవన్ ఆయనను దాటి పోతున్నట్లుగా ఉంది.ఏది ఏమైనా వ్యక్తిగత జీవితంలోకాని, రాజకీయాలలో కాని, సినిమాలలో కాని విలువల గురించి ఆలోచించకూడదన్న తత్వాన్ని ఈ ఉదంతాలు తెలియచేస్తున్నాయి.ఎవరితో అంటకాగితే ప్రయోజనమో తెలుసుకోవాలి. ఎప్పుడు ఎవరిని పొగిడితే వ్యాపార పరంగా లాభమో ఆలోచించాలి. ఈ విషయాలలో పవన్ కళ్యాణ్ మాస్టర్ డిగ్రీ చేసినట్లే అనుకోవచ్చేమో! కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Shocking Twist In OpenAI Whistleblower Suchir Balaji Case2
సుచీర్‌ బాలాజీ కేసులో షాకింగ్ ‌ట్విస్ట్‌!

ఓపెన్‌ఏఐ విజిల్‌బ్లోయర్‌ సుచీర్‌ బాలాజీ కేసులో అనూహ్యపరిణామం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన ఈ యువ టెక్‌ పరిశోధకుడి‌ మృతిపై మిస్టరీ వీడడం లేదు. ఓపక్క అతను బలవన్మరణానికి పాల్పడ్డాడని అధికారులు ప్రకటించగా.. మరోవైపు తల్లిదండ్రులు బాలాజీ రమణమూర్తి, పూర్ణిమరావ్‌ మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. అది హత్యేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘రెండో అటాప్సీ రిపోర్ట్‌ను మేం చదివాం. తలకు గాయంతో మా అబ్బాయి విలవిలలాడిపోయినట్లు సంకేతాలున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. అందులో మరిన్ని వివరాలు అది హత్య అనే చెప్తున్నాయి’’ అని తల్లి పూర్ణిమరావ్‌ అంటున్నారు... ‘‘ఏఐ ఇండస్ట్రీలో టాప్‌-10 వ్యక్తుల్లో నా బిడ్డ ఉంటాడు. అలాంటివాడు ఓపెన్‌ఏఐ(OpenAI) కంపెనీని.. ఉన్నపళంగా ఎందుకు ఏఐ ఇండస్ట్రీని వదిలేస్తాడు. న్యూరా సైన్స్‌, మెషిన్‌లెర్నింగ్‌ వైపు ఎందుకు మళ్లాలనుకుంటాడు?. ఓపెన్‌ఏఐ మా అబ్బాయిని అణచివేసి ఉండొచ్చు.. బెదిరించి ఉండొచ్చు.. అనేదే మా అనుమానం’’ అని పూర్ణిమ చెబుతున్నారు . ‘‘లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన మిత్రుడి పుట్టినరోజు పార్టీ నుంచి తిరిగి వచ్చినట్లు మా వాడు చెప్పాడు. వచ్చే నెలలో లాస్‌ వెగాస్ టెక్‌ షోలో పాల్గొనబోతున్నట్లు చెప్పాడు అని తండ్రి రమణమూర్తి బాలాజీతో జరిగిన చివరి సంభాషణను వివరించారు. వాడెంతో సంతోషంగా ఉన్నాడు. అలాంటివాడెందుకు ఆత్మహత్య చేసుకుంటాడు అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.సుచీర్‌ కెరీర్ ఎంపిక విషయంలో‌ ఏనాడూ మేం అడ్డు చెప్పలేదు. వాడి పరిశోధనలకు ఏఐ ఇండస్ట్రీకే టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందని భావించాం. ఏఐ మానవాళికి మేలు చేస్తుందనుకుంటే.. అది మరింత ప్రమాదకారిగా మారబోతుందని సుచీర్‌ గుర్తించాడు. చాట్‌జీపీటీ లోపాలను ఎత్తి చూపాడు. కళాకారుల, జర్నలిస్టుల శ్రమను దోపిడీ చేయడం అనైతిక చర్యగా భావించాడు. వాడి పోరాటం ఓపెన్‌ఏఐకి వ్యతిరేకంగా జరిగింది కాదు. కేవలం మానవత్వానికి మద్దతుగా నిలిచాడు. అందుకే వాడి అభిప్రాయంతో మేం ఏకీభవించాం... కానీ, ఏదో జరిగింది. మా దగ్గర శవపరీక్ష నివేదిక ఉంది. అందులో బలవనర్మణం కాదని స్పష్టంగా ఉంది. ఇక తెలుసుకోవాల్సింది.. దీనికి కారకులెవరు? ఎందుకు చేశారనే?.. మా అబ్బాయి మృతిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు జరగాలి. ఇప్పటికే ఇక్కడి భారత అధికారులను కలిశాం. ఈ విషయంలో భారత ప్రభుత్వ మద్దతు కోరుతున్నాం. ఇక్కడ బలైంది నా బిడ్డ మాత్రమే కాదు. ఓ మేధావి జీవితం అర్ధాంతంగా ముగిసింది. టెక్‌ ఇండస్ట్రీ ఓ విలువైన జీవితం పొగొట్టుకుంది. ఓపెన్‌ ఏఐ ఇప్పుడు మాకు మద్దతుగా నిలుస్తాని ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది’’ అని సుచీర్‌ పేరెంట్స్‌ ప్రకటించారు.కార్నిఫోలియా ఎన్నారై దంపతులు బాలాజీ రమణమూర్తి-పూర్ణిమలకు సుచీర్‌ బాలాజీ(Suchir Balaji) జన్మించాడు. బర్కేలీ కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చేశాడు. ఏఐ రీసెర్చర్‌ అయిన బాలాజీ ఓపెన్‌ఏఐ కంపెనీ కోసం నాలుగేళ్లుగా(2020-2024) పని చేశాడు. అయితే కిందటి ఏడాది ఆగష్టులో కంపెనీని వీడిన ఈ యువ రీసెర్చర్‌.. అక్టోబర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఓపెన్‌ఏఐని వీడడానికి గల కారణం తెలిస్తే.. ఎవరూ తట్టుకోలేరంటూ.. న్యూయార్క్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుచీర్‌ బాలాజీ షాకింగ్‌ కామెంట్లు చేశాడు. డాటా కలెక్షన్‌ కోసం ఓపెన్‌ఏఐ కంపెనీ అనుసరిస్తున్న విధానం ఎంతో ప్రమాదకరమైందని.. దీనివల్ల వ్యాపారాలు, వ్యాపారవేత్తలకు మంచిది కాదని పేర్కొన్నాడతను. అలాగే ఛాట్‌జీపీటీలాంటి సాంకేతికతలు ఇంటర్నెట్‌ను నాశనం చేస్తున్నాయని, చాట్‌జీపీటీని అభివృద్ధి చేయడంలో ఓపెన్‌ఏఐ అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించాడు. అయితే సుచీర్‌ ఎత్తిచూపిన లోపాలను తాము ఇదివరకే సవరించామని ఓపెన్‌ఏఐ ప్రకటించుకుంది. మరోవైపు.. శాన్‌ ఫ్రాన్సిస్కోలోని బుచానన్‌ స్ట్రీట్‌ అపార్ట్‌మెంట్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో నవంబర్‌ 26వ తేదీన సుచీర్‌ శవమై కనిపించాడు. అతనిది ఆత్మహత్యే అయి ఉండొచ్చని.. తమ ప్రాథమిక విచారణలో మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు ప్రకటించారు. అయినప్పటికీ అతని పేరెంట్స్‌తో పాటు పలువురు బాలాజీ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే ఇంతకు ముందు.. ఇలాన్‌ మస్క్‌(Elon Musk)కు సైతంసుచీర్‌ బాలాజీ మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొసమెరుపు ఏంటంటే.. ఓపెన్‌ఏఐను 2015లో మస్క్‌-శామ్‌ అల్ట్‌మన్‌ కలిసి ప్రారంభించారు. అయితే మూడేళ్ల తర్వాత మనస్పర్థలతో ఇద్దరూ విడిపోయారు. ఓపెన్‌ఏఐకు పోటీగా X ఏఐను మస్క్‌ స్థాపించాడు. అప్పటి నుంచి ఇలాన్‌ మస్క్‌కు ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ అల్ట్‌మన్‌కు వైరం కొనసాగుతోంది.చదవండి👉🏾 బాలాజీ తల్లి ట్వీట్‌, మస్క్‌ ఏమన్నారంటే..

Thank you: Rohit Sharma Emotional Goodbye to rollercoaster 2024 Video3
భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రోహిత్‌ శర్మ

కొత్త సంవత్సరం వచ్చేసింది. నవ వసంతాన్ని తెచ్చింది. చేదు జ్ఞాపకాలను వదిలేసి.. మధురానుభూతులను పదిలం చేసుకుంటూ ముందుకు సాగిపొమ్మంటోంది. ఇక నూతన సంవత్సరం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.ఇక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(Border Gavaskar Trophy) 2024-25 కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత క్రికెట్‌ జట్టు అక్కడే కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. ఐదో టెస్టు కోసం మంగళవారమే సిడ్నీకి చేరుకుని న్యూ ఇయర్‌కి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పింది.అనుష్కతో విరాట్‌ఇక భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మ(Viat Kohli- Anushka Sharma)తో పాటు దేవ్‌దత్‌ పడిక్కల్‌, ప్రసిద్‌ కృష్ణతో కలిసి కొత్త సంవత్సర వేడులకు హాజరయ్యాడు. మరోవైపు.. యువ ఆటగాళ్లు రిషభ్‌ పంత్‌, శుబ్‌మన్‌ గిల్‌, మహ్మద్‌ సిరాజ్‌ తదితరులు కూడా ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రోహిత్‌ శర్మఇదిలా ఉంటే.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) 2024కు భావోద్వేగ వీడ్కోలు పలికాడు. ‘‘ఎన్నో ఎత్తు-పళ్లాలు.. అయినప్పటికీ ప్రతి ఒక్కటి గుర్తుండిపోతుంది. థాంక్యూ 2024’’ అంటూ గతేడాదికి సంబంధించిన జ్ఞాపకాలను వీడియో రూపంలో షేర్‌ చేశాడు.టీ20 ప్రపంచకప్‌ గెలిచిన సారథిగాకాగా 2024 రోహిత్‌ శర్మకు ఎన్నో ఆనందాలతో పాటు కొన్ని చేదు జ్ఞాపకాలను ఇచ్చింది. కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్‌-2024 గెలవడం రోహిత్‌ కెరీర్‌లోనే అత్యంత గొప్ప విషయం. అయితే, ఈ మెగా టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలవగానే హిట్‌మ్యాన్‌ అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్‌ అయ్యాడు.ఐపీఎల్‌లో మాత్రం పరాభవంఇక అంతకంటే ముందే.. అంటే ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను తొలగించారు. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో ఆడిన రోహిత్‌ బ్యాటర్‌గా ఆకట్టుకోలేకపోయాడు. జట్టు కూడా పాయింట్ల పట్టికలో అట్టడుగన పదో స్థానంలో నిలిచి ఘోర పరాభవం చవిచూసింది. అయితే, ఆ తర్వాత ప్రపంచ కప్‌ గెలుపు రూపంలో రోహిత్‌కు ఊరట దక్కింది.అదొక మాయని మచ్చగాఅనంతరం.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌లో టీమిండియా క్లీన్‌స్వీప్‌ కావడం రోహిత్‌ శర్మ కెప్టెన్సీ కెరీర్‌లోనే ఓ మాయని మచ్చగా మిగిలింది. సొంతగడ్డపై ఇంతకు మునుపెన్నడూ భారత టెస్టు జట్టు ప్రత్యర్థి చేతిలో ఇలా 3-0తో వైట్‌వాష్‌ కాలేదు. అలా అత్యంత చెత్త కెప్టెన్సీ రికార్డు 2024లో రోహిత్‌ పేరిట నమోదైంది.కుమారుడి రాకఇదిలా ఉంటే.. వ్యక్తిగత జీవితంలోనూ రోహిత్‌ శర్మకు 2024 మరుపురానిదిగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. గతేడాదే రోహిత్‌- రితికా జంట తమ రెండో సంతానం కుమారుడు అహాన్‌ శర్మకు జన్మనిచ్చారు. ఇక ఈ శుభవార్త తర్వాత ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన రోహిత్‌ శర్మకు అక్కడ మాత్రం గడ్డు పరిస్థితులే ఎదురయ్యాయి. బ్యాటర్‌గా, సారథిగానూ అతడు విఫలమయ్యాడు.అడిలైడ్‌ పింక్‌బాల్‌ టెస్టులో రోహిత్‌ సేన 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం.. బ్రిస్బేన్‌ టెస్టును డ్రా చేసుకున్నా.. మెల్‌బోర్న్‌లో నాలుగో టెస్టులో మాత్రం 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.ఇక ఆఖరిదైన సిడ్నీ టెస్టు(జనవరి 3-7)లో గెలిస్తేనే బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-2తో డ్రా చేసుకోగలుగుతుంది. అదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025 ఫైనల్‌ అవకాశాలను సజీవం చేసుకుంటుంది. చదవండి: అతడి కోసం పట్టుబట్టిన గంభీర్‌.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు? View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45)

Natural Gas Transit Stopped From Russia To Europe Via Ukraine4
రష్యాకు ఉక్రెయిన్‌ షాక్‌.. ఆగిన గ్యాస్‌ ఎగుమతులు

మాస్కో:రష్యా నుంచి ఉక్రెయిన్‌ మీదుగా యూరప్‌కు పైప్‌లైన్‌ ద్వారా జరిగే సహజవాయువు(Natural Gas) ఎగుమతులు కొత్త సంవత్సరం వేళ నిలిచిపోయాయి. రష్యా,ఉక్రెయిన్‌ల మధ్య ప్రస్తుతం యుద్ధం జరుగుతుండడంతో రెండు దేశాల మధ్య కొత్త ఒప్పందం కుదరలేదు. ఐదు సంవత్సరాల గ్యాస్‌ సరఫరా ఒప్పంద కాలపరిమితి బుధవారం(జనవరి1) ఉదయంతో ముగిసింది. దీంతో రష్యా-ఉక్రెయిన్‌ రూట్‌లో గ్యాస్‌ ఎగుమతులు నిలిచిపోయాయి.‘రష్యా నుంచి మా దేశం ద్వారా యూరప్‌కు సహజవాయువు సరఫరాను ఆపివేశాం. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. దీంతో రష్యాకు భారీ నష్టం రావచ్చు. అయినా రష్యా గ్యాస్‌ వాడకాన్ని చాలా వరకు యూరప్‌ దేశాలు తగ్గించాయి’అని ఉక్రెయిన్‌ ఇంధన శాఖ మంత్రి తెలిపారు.అయితే రష్యా యూరప్‌లోని తన మిగిలిన కస్టమర్లకు టర్కీ మీదుగా పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ ఎగుమతులు కొనసాగిస్తోంది. గ్యాస్‌ సరఫరా నిలిపివేయడం వల్ల ఉక్రెయిన్‌కు ఏడాదికి రూ.7వేల కోట్ల దాకా పైప్‌లైన్‌ ఫీజు నష్టం రానుండగా రష్యాకు రూ.45వేల కోట్ల దాకా నష్టం రావచ్చనే అంచనాలున్నాయి. 2022 ఫిబ్రవరి నుంచి రష్యా,ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇదీ చదవండి: ఉక్రెయిన్‌ ప్రజలకు జెలెన్‌స్కీ కీలక సందేశం

Kejriwal Letter To RSS Chief Mohan Bhagwat5
ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌కు కేజ్రీవాల్‌ లేఖ..బీజేపీపై సంచలన ఆరోపణలు

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ డబ్బులు పంచుతోందని ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌(Kejriwal)ఆరోపించారు. ఎన్నికల ముందు డబ్బులు పంచుతున్న బీజేపీ విధానాన్ని సమర్థిస్తున్నారా అని ఆర్‌ఎస్‌ఎస్‌‌(RSS) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌(Mohan Bhagwat)ను కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. ఈ మేరకు భాగవత్‌కు కేజ్రీవాల్‌ ఒక లేఖ రాశారు. బీజేపీ ఎన్నికల గెలుపు కోసం ఎన్నో తప్పులు చేస్తోందని లేఖలో కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఢిల్లీలో దళితుల ఓట్లను బీజేపీ తొలగిస్తోందని కేజ్రీవాల్‌ విమర్శించారు. వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో ఆప్‌, బీజేపీ మధ్య ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. రెండు పార్టీల అగ్రనేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఎన్నికల కోసమే కేజ్రీవాల్‌ నకిలీ పథకాలను ప్రచారం చేస్తూ వాటిని ప్రవేశపెట్టినట్లుగా నటిస్తున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. తమ స్కీమ్‌లు చూసి బీజేపీ నేతలకు వణుకు పుడుతోందని ఆప్‌ నేతలు కౌంటర్‌ ఇస్తున్నారు.మరోవైపు ఆప్‌ నేతలు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) సక్సేనాను కూడా టార్గెట్‌ చేస్తున్నారు. సీఎం అతిషి, ఎల్జీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎల్జీ ఢిల్లీలో పలు గుడులను కూల్చేందుకు ఆదేశాలిచ్చారని అతిషి విమర్శించగా ఆమెవి చిల్లర రాజకీయాలని ఎల్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇదీ చదవండి: ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం..సీఎం వర్సెస్‌ ఎల్జీ‌

Charge cards are a type of payment card that allows you to make purchases and pay the balance in full each billing cycle6
క్రెడిట్‌ కార్డు Vs ఛార్జ్‌ కార్డు.. ఏంటీ ఛార్జ్‌ కార్డు..

నెలవారీ వేతన జీవులతోపాటు చాలామంది వద్ద సాధారణంగా క్రెడిట్‌ కార్డు ఉండడం గమనిస్తుంటారు. అత్యవసర సమయాల్లో ఆర్థికంగా ఆదుకుంటుందనే ధీమాతో ఈ కార్డును తీసుకుంటారు. బిల్లు జనరేట్‌ అయ్యాక పూర్తి పేమెంట్‌ లేదా అత్యవసర సమయాల్లో మినియం బిల్లును చెల్లిస్తుంటారు. క్రెడిట్‌ కార్డు(Credit Card)లాగే కొన్ని బ్యాంకులు ఛార్జ్‌ కార్డు(Charge Card)లను జారీ చేస్తాయి. అయితే ఈ రెండింటి వినియోగంలో కొన్ని తేడాలున్నాయి. అసలు ఛార్జ్‌ కార్డులు ఎవరికి జారీ చేస్తారు.. పేమెంట్‌ నియమాలు ఎలా ఉంటాయి..ఛార్జ్‌ కార్డు నిజంగా ఎవరికి అవసరమో తెలుసుకుందాం.ఛార్జ్ కార్డులుఛార్జ్ కార్డు అనేది ఒక రకమైన చెల్లింపు కార్డు. ఎలాంటి ముందస్తు లిమిట్‌ పరిమితులు లేకుండా దీన్ని జారీ చేస్తారు. ప్రతి బిల్లింగ్ సైకిల్‌లో కొనుగోళ్లు చేయడానికి క్రెడిట్‌ కార్డులాగే దీన్ని వినియోగించవచ్చు. అయితే దీని వినియోగంలో పరిమితి ఉండదు కాబట్టి ఎంతైనా వాడుకోవచ్చు. కానీ బిల్లు సైకిల్‌ పూర్తి అయ్యేలోపు మొత్తం పేమెంట్‌ చేయాల్సి ఉంటుంది. సకాలంలో పూర్తి బ్యాలెన్స్ చెల్లించడంలో విఫలమైతే మాత్రం భారీ మొత్తంలో ఫీజులు చెల్లించాలి. క్రెడిట్‌ కార్డుల మాదిరిగానే ఛార్జ్‌ కార్డుల వినియోగంపై ట్రావెల్‌ పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌, వివిధ రివార్డు పాయింట్లు ఇతర ప్రయోజనాలు అందిస్తారు.క్రెడిట్‌ కార్డు, ఛార్జ్‌ కార్డు మధ్య ప్రధాన తేడాలుక్రెడిట్‌ లిమిట్‌క్రెడిట్‌ కార్డులో ముందుగా సెట్ చేసిన లిమిట్‌ ఉంటుంది. ఆ లిమిట్‌ కంటే తక్కువే వాడుకోవాలి. కానీ ఛార్జ్‌ కార్డులో వ్యయ పరిమితి ఉండదు. ఎంతైనా వాడుకోవచ్చు. కానీ బిల్లు జనరేట్‌ అయ్యాక మాత్రం పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పేమెంట్‌ చేయడంలో విఫలమైతే మాత్రం భారీగా ఛార్జీలు విధిస్తారు.బ్యాలెన్స్ పేమెంట్కనీస నెలవారీ చెల్లింపులకు క్రెడిట్‌ కార్డులో అవకాశం ఉంటుంది. కానీ ఛార్జ్‌ కార్డులో ఈ సదుపాయం ఉండదు. ప్రతి బిల్లింగ్ సైకిల్‌(Billing Cycle)లో పూర్తి బ్యాలెన్స్ చెల్లించాలి.వడ్డీ(Interest)మినిమం బ్యాలెన్స్‌ చెల్లించిన తర్వాత మిగతా చెల్లించాల్సిన దానికి క్రెడిట్‌ కార్డులో వడ్డీ విధిస్తారు. ఛార్జ్‌ కార్డులో అసలు ఆ సదుపాయమే ఉండదు.వార్షిక ఫీజులువార్షిక రుసుములు, ఆలస్య రుసుములు, వడ్డీ రేట్లు క్రెడిట్‌ కార్డులకు ఉంటాయి. ఛార్జ్‌ కార్డులకు కూడా వార్షిక రుసుము ఉంటుంది. అది క్రెడిట్‌ కార్డు రుసుముతో పోలిస్తే భారీగా ఉంటుంది. ఆలస్య రుసుము కూడా అధికంగానే విధిస్తారు.రివార్డులుక్రెడిట్‌ కార్డులు, ఛార్జ్‌ కార్డులు రెండింటిలోనూ క్యాష్ బ్యాక్, ట్రావెల్ పాయింట్స్(Travel Points), రివార్డు ప్రోగ్రామ్‌లు ఉంటాయి. ఛార్జ్‌ కార్డుల్లో ఇవి కొంత అధికంగా ఉంటాయి. బ్యాంకును అనుసరించి ఈ పాయింట్లు మారుతుంటాయి.ఛార్జ్‌ కార్డుకు అర్హులెవరు..అద్భుతమైన క్రెడిట్ స్కోర్: ఛార్జ్ కార్డ్ జారీ చేసేవారు సాధారణంగా అద్భుతమైన క్రెడిట్ స్కోర్ ఉన్న దరఖాస్తుదారుల కోసం చూస్తారు. సాధారణంగా 700 లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే దీన్ని జారీ చేసే అవకాశం ఉంటుంది.స్థిరమైన ఆదాయం: ప్రతి నెలా బ్యాలెన్స్ పూర్తిగా చెల్లించగలరని నిరూపించడానికి స్థిరమైన, గణనీయమైన ఆదాయాన్ని చూపించాల్సి ఉంటుంది.స్ట్రాంగ్ క్రెడిట్ హిస్టరీ: సకాలంలో చెల్లింపులు జరిపే ట్రాక్ రికార్డ్ ఉన్న క్రెడిట్ హిస్టరీ చాలా ముఖ్యం.తక్కువ రుణ-ఆదాయ నిష్పత్తి: రుణదాతలు తక్కువ రుణ-ఆదాయ నిష్పత్తి(ఆదాయం ఎక్కువ ఉండి రుణాలపై తక్కువగా ఆధారపడడం) ఉన్న దరఖాస్తుదారులకు ప్రాధాన్యం ఇస్తారు.రెసిడెన్సీ స్టేటస్: ఛార్జ్‌ కార్డు కోసం దరఖాస్తు చేయాలనుకుంటే మీరు ఏ దేశంలో అప్లై చేస్తున్నారో ఆ దేశ పౌరసత్వాన్ని కలిగి ఉండాలి.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పులు ఇవే..ఇస్తున్నారు కదా అని..క్రెడిట్‌ కార్డు, ఛార్జ్‌ కార్డు.. ఏ కార్డు తీసుకున్నా అప్పు ఎప్పుటికీ మంచిదికాదు. తప్పని పరిస్థితుల్లో అప్పు చేసినా బిల్లు సైకిల్‌లోపు దాన్ని తిరిగి పూర్తిగా చెల్లించే ఆర్థిక సత్తా సంపాదించాలి. బ్యాంకువారు లేదా వేరొకరు ఇస్తున్నారు కదా అని అప్పు చేస్తే తిరిగి అది చెల్లించలేకపోతే తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Jan 1st 2025 Modi Cabinet Meeting Live Updates Highlights7
ముగిసిన కేంద్ర కేబినెట్‌ సమావేశం

న్యూఢిల్లీ, సాక్షి: కొత్త ఏడాది మొదటిరోజే జరిగిన కేంద్ర మంత్రి మండలి(Union Cabinet) సమావేశం ముగిసింది. పలు ప్రాజెక్టులు, కొత్త పథకాలపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన చర్చించిట్లు సమాచారం. మధ్యాహ్నాం 2.30 తర్వాత కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.బుధవారం కేంద్ర కేబినెట్‌ సమావేశం నిర్వహించాలన్న సంప్రదాయాన్ని ప్రధాని మోదీ(Modi) కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే 7 లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో మంత్రి మండలి సమావేశం జరిగింది.

Nassar Reveals His Son First Word After 14 Days in Coma Was8
కోమాలో కుమారుడు.. కోలుకోగానే ఆ హీరో పేరే తలిచాడు: నాజర్‌

పెద్ద యాక్సిడెంట్‌ జరిగి కోమా నుంచి బయటకు రాగా ఎవరైనా అమ్మ, నాన్న అంటారు. కానీ తన కుమారుడు మాత్రం ఓ స్టార్‌ హీరో పేరు తలిచాడంటున్నాడు నాజర్‌ (Nassar). తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా కుమారుడు నూరుల్‌ హసన్‌ ఫైజల్‌ రోడ్డు ప్రమాదానికి గురై 14 రోజులు కోమాలోనే ఉన్నాడు. మెరుగైన చికిత్స కోసం సింపూర్‌కు తీసుకెళ్లాం. అతడు కోమాలో నుంచి బయటకు రాగానే అమ్మ అనో నాన్న అనో పిలవలేదు. హీరో పేరు కలవరించాడువిజయ్‌ (Vijay) పేరు తలిచాడు. యాక్సిడెంట్‌ అయినప్పుడు నా కుమారుడితో పాటు అతడి స్నేహితుడు విజయ్‌ కుమార్‌ కూడా ఉన్నాడు. బహుశా అతడిని తలుచుకుంటున్నాడేమో, హమ్మయ్య అన్నీ గుర్తొస్తున్నాయిలేనని కాస్త ఊరట చెందాం. కానీ అది నిజం కాదని త్వరగానే తెలిసిపోయింది. విజయ్‌ కుమార్‌ను తీసుకొచ్చినప్పుడు అతడిని గుర్తుపట్టలేకపోయాడు. ఇతడెవరన్నట్లు చూశాడు. నా భార్య ఒక సైకాలజిస్ట్‌.ఆయన సినిమాలే చూపించాంతనకు విషయం అర్థమైంది. వాడు తన స్నేహితుడిని కాకుండా హీరో విజయ్‌ను కలవరిస్తున్నాడని తెలిసింది. అందుకని అతడు కోలుకునేవరకు విజయ్‌ పాటలు, సినిమాలు చూపించాం. ఈ విషయం తెలిసి హీరో విజయ్‌ కూడా ఆస్పత్రికి వచ్చి పలుమార్లు ఫైజల్‌ను చూశాడు. వాడికి సంగీతం అంటే ఇష్టమని ఓ గిటార్‌ కూడా బహుమతిగా ఇచ్చాడు. మా మనసుల్లో అతడికి ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది అని నాజర్‌ చెప్పుకొచ్చాడు.చదవండి: తెలుగు హీరోతో రష్మిక పెళ్లి.. నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు

Can cold weather cause joint pains what is the fact9
చలికాలంలో కీళ్ల నొప్పులా? ఇవిగో ది బెస్ట్‌ టిప్స్‌!

చలికాలం రాగానే ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయి. దీంతో జలుబు, గొంతునొప్పి, జ్వరం లాంటి వివిధ వ్యాధుల బారిన పడటం సాధారణంగా. అలాగే చల్లని వాతావరణం వల్ల కీళ్ల నొప్పులు పెరుగుతాయని, ఆర్థరైటిస్ లక్షణాలు మరింత తీవ్రమవుతాయని కూడా నమ్ముతారు. అయితే ఇందులో నిజమెంత? చలికాలానికి, మోకాళ్ల నొప్పులకు సంబంధం; మరి ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం.పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లో మన జీవన పరిస్థతులకనుగుణంగానే శారీరక మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. జర్నల్ సెమినార్స్ ఇన్ ఆర్థరైటిస్ , అండ్‌ రుమాటిజంలో ప్రచురించిన 2024 అధ్యయనం ప్రకారం వాతావరణ మార్పులు నేరుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా ఆస్టియో ఆర్థరైటిస్ , ఇతక కీళ్ల నొప్పులను పెద్దగా ప్రభావితం చేయవని వెల్లడించింది.అయితే చల్లని వాతావరణం కీళ్లను గట్టిపరుస్తుంది ,రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది, చిన్న కదలికలను కూడా కష్టతరం చేస్తుంది. తక్కువ తేమతో కూడిన అధిక ఉష్ణోగ్రతలు గౌట్ మంట ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయని అధ్యయనం కనుగొంది. ఆర్థరైటిస్‌తో బాధపడే వ్యక్తులు శీతాకాలంలో వాతావరణ ఒత్తిడి మార్పు వల్ల కీళ్ళు సాధారణం కంటే ఎక్కువగా ఉబ్బి, నొప్పి పెరగడానికి దారితీస్తుందని తేలింది.తక్కువ బారోమెట్రిక్ పీడనం శరీరంలోని కణజాలాలు నరాలపై ఒత్తిడిని పెంచుతుంది.మరి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి?వింటర్‌ సీజన్‌లో శారీరక శ్రమ తగ్గడం వల్ల ఎముకల మధ్య కదలిక తగ్గిపోతుంది. దీంతోపాటు విటమిన్ డి లోపం కూడా కీళ్ల నొప్పులకు మరో కారణం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కండరాలు దృఢంగా ఉండే వ్యాయామాలను ఎంచుకోవాలి.వేడి నీటి కొలనులో ఈత కొట్టడం లేదా ఇంట్లోనే సైక్లింగ్ చేయడం వంటి తక్కువ-ప్రభావ వ్యాయామాలు ఉత్తమం.ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండకుండా, కదలిక ఉండేలా చూసుకోండి. .యోగ, ధ్యానం లాంటివి చేయాలి. కీళ్లలో నొప్పినుంచం ఉపశమనం కలిగే , దృఢత్వాన్ని పెంచే ఆసనాలు తెలుసుకొని ఆచరించాలి. చలికాలం కదా అశ్రద్ధ చేయకుండా, తగినంత నీరును తాగాలి. చలికాలం వచ్చిందంటే వృద్ధులకే కాదు, యుక్తవయస్సులో ఉన్నవారిలో కూడా కొంతమందికి మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి రక్త ప్రసరణ మెరుగుపరచడానికి , దృఢత్వాన్ని తగ్గించడానికి వెచ్చని బట్టని ధరించాలి. వేడి నీటి స్నానం మంచిది.నొప్పి ఉన్న ప్రదేశంలో ఉపశమనం కోసం హీట్‌ ప్యాడ్‌లను వాడవచ్చు.కీళ్ల నొప్పులకు మరో చక్కటి ఉపశమన ప్రక్రియ మసాజ్. ఇది చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.నువ్వుల నూనె, కొబ్బరి నూనె, లేదా కొన్ని ఆయుర్వేద తైలాలతో పది నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. నోట్‌: శారీరకంగా చురుకుగా ఉండటం, హీట్‌ థెరపీ, చక్కటి ఆహారం ద్వారా చాలావరకు సమస్యలనుంచి తప్పించుకోవచ్చు. దీంతో పాటు సమస్య తీవ్రతను గుర్తించి, సంబంధిత వైద్యులను సంప్రదించి, చికిత్స తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు

Shivsena UBT Supporters Clash with Sanjay Raut10
మహారాష్ట్ర: సంజయ్‌ రౌత్‌పై కార్యకర్తల దాడి?

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. శివసేన యూబీటీ నేత సంజయ్‌ రౌత్‌పై కార్యకర్తలు దాడి చేసినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రే నివాసంలోనే ఆయనపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై సోషల్‌ మీడియా కథనాలు చర్చనీయాంశంగా మారాయి.ముంబైలోని బాంద్రాలో ఉన్న మాతోశ్రీలో ఉద్దవ్‌ థాక్రేతో సంజయ్‌ రౌత్‌ సమావేశమాయ్యారు. ఈ సమావేశం సందర్భంగా కొంత మంది పార్టీ కార్యకర్తలు సంజయ్‌తో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో రౌత్‌.. వైఖరి, ఆయన వ్యాఖ్యల వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయినట్టు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి చెందినట్టు కార్యకర్తలు చెప్పారు. దీంతో, వాగ్వాదం తలెత్తింది. ఇందులో భాగంగానే సంజయ్‌ రౌత్‌పై థాక్రే మద్దతుదారులు దాడి చేసినట్టు సమాచారం. అంతేకాకుండా, సంజయ్‌ రౌత్‌ను కొన్ని గంటల పాటు ఓ గదిలో ఉంచి తాళం వేసినట్టు తెలుస్తోంది.ఇక, సంజయ్‌ రౌత్‌పై దాడికి సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దాడి ఘటన వార్తలపై ఉద్దవ్‌ థాక్రే కానీ, సంజయ్‌ రౌత్‌ గానీ ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో, ఈ ఘటనపై మహారాష్ట్రలో మరింత చర్చ జరుగుతోంది.ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో జరగబోయే బీఎంసీ ఎన్నికలపై ఉద్దవ్‌ థాక్రే కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ నేత ఆనంద్‌ దూబే చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌, శరద్‌ పవార్‌ ఎన్సీపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.There are multiple reports that Shiv Sena (UBT) workers have beaten Sanjay Raut by locking him in a room in Matoshree.Do you support this action of Shiv Sena workers ? pic.twitter.com/deVAEWRuCj— Megh Updates 🚨™ (@MeghUpdates) January 1, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
పాకిస్తాన్‌ ప్రేమికురాలి కోసంసరిహద్దులు దాటిన యూపీ వాసి

లక్నో: సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమయ్యారు. ఆపైన ఇద్దరూ ప్రేమలో పడ్డారు.

title
మహారాష్ట్ర: సంజయ్‌ రౌత్‌పై కార్యకర్తల దాడి?

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం చోటుచేసుకుంది.

title
New Year 2025: ప్రారంభంలోనే ‘పరీక్షా కాలం’

నేటి (2025, జనవరి ఒకటి)నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమైంది.

title
ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌కు కేజ్రీవాల్‌ లేఖ..బీజేపీపై సంచలన ఆరోపణలు

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ డబ

title
మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి..భయంతో జనం పరుగులు

ఇంఫాల్‌:మణిపూర్‌లో ఇప్పట్లో శాంతి నెలకొనే పరిస్థితులు కనిపిం

NRI View all
title
సుచీర్‌ బాలాజీ కేసులో షాకింగ్ ‌ట్విస్ట్‌!

ఓపెన్‌ఏఐ విజిల్‌బ్లోయర్‌

title
యూకే స్టూడెంట్ వీసా.. మ‌రింత భారం!

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక కావడంతో భారత విద్యార్థులకు యూఎస్‌ వీసాలు కష్టమేనన్న ప్రచారం జోరందుకుంది.

title
ఖతార్‌లో తెలుగు ప్రవాసికి ప్రతిష్ఠాత్మక 'సౌత్ ఐకాన్ (ఆంధ్రప్రదేశ్)' పురస్కారం

ఖతార్‌లో జరిగిన ప్రతిష్టాత్మక "సౌత్ ఇండియన్ గ్లోబల్ టాలెంట్ అచీవర్స్ (SIGTA) అవార్డ్స్ 2024" వేడుకలో ప్రపంచవ్యాప్తంగా సు

title
హెచ్‌1బీ వీసా రగడలో అనూహ్య పరిణామాలు!

హెచ్‌–1బీ వీసాలపై రగడలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

title
సామాజిక చైతన్య సాహిత్యంపై తానా సదస్సు

ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత 5 సంవత

Advertisement

వీడియోలు

Advertisement