Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

MLC Kavitha slams CM Revanth1
’రేవంత్‌ సర్కార్‌ మహిళల్ని నమ్మించి మోసం చేసింది‘

సాక్షి,హైద‌రాబాద్ : రేవంత్ రెడ్డి స‌ర్కార్ మ‌హిళ‌ల‌ను న‌మ్మించి మోసం చేసింద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ధ్వ‌జ‌మెత్తారు. కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయని ఆమె ఎద్దెవా చేశారు.మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని సీఎం ప్రకటిస్తారని మహిళలకు ఆశించారు. కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటన చేస్తారని ఊహించారు. కానీ ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేయడం లేదు. రాష్ట్రంలోని ఒక్కో ఆడబిడ్డకు ప్రభుత్వం రూ. 30 వేలు బాకీ పడింది. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీ ఇవ్వలేదు. తక్షణమే స్కూటీల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని క‌విత డిమాండ్ చేశారు.రాష్ట్రంలో 40 శాతం నేరాలు పెరిగాయి. నేరాల పెరుగుద‌ల‌.. ప్రభుత్వం మహిళల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిదర్శనం. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేసే సోయి ప్రభుత్వానికి లేదు. మహిళలు చూస్తూ ఊరుకోబోరు.. కచ్చితంగా ప్రశ్నిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును ఎగ్గొట్టింది. తక్షణమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలి. రైతు భరోసా కింద అర్హులను తగ్గించే ప్రయత్నం చేయవద్దు. కేంద్ర ప్రభుత్వపు నిబంధలను అమలు చేస్తే 30 శాతం రైతులకు కూడా రైతు భరోసా రాదని క‌విత పేర్కొన్నారు.

20 Years For Indian Ocean Tsunami Became A Wake-up Call2
సునామీ @20 ఏళ్లు: అలా జరిగి ఉంటే పెను విధ్వంసం తప్పేది!

ప్రశాంత సాగర తీరంలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి.. హహాకారాలతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు పెడుతూ చెల్లాచెదురైన జనం.. రెప్పపాటులో వాళ్లను ముంచేసిన రాకాసి అలలు.. నేలకూలిన భవనాలు-ముక్కలైన జీవనాధారాలు.. వెతికేకొద్దీ బయటపడ్డ శవాలు.. వెరసి ఎటుచూసినా కన్నీళ్లే!. సరిగ్గా.. 20 ఏళ్ల క్రితం సునామీ(Tsunami) సృష్టించిన విధ్వంసపు జ్ఞాపకాలివి. అప్పటిదాకా సాగర ఆటుపోట్లను ఆహ్లాదంగా భావించిన తీర ప్రాంత ప్రజలు.. ఘోర విపత్తును చూసింది మాత్రం అదే తొలిసారి!. ఇంతకీ ఆరోజు అసలేం జరిగింది? వేలు, లక్షల సంఖ్యలో ప్రాణాలను బలిగొనే విలయాన్ని పసిగట్టడంలో శాస్త్రవేత్తలు, అధికారుల అంచనాలు ఎక్కడ తప్పాయి?.డిసెంబర్‌ 26, 2004.. సమయం ఉదయం 7.58నిమిషాలు. ఇండోనేషియాలోని సుమత్రా ఉత్తర వైపున్న సముద్రంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించే.. ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’(పసిఫిక్‌ మహాసముద్రం) ప్రాంతమది. దీంతో అగ్నిపర్వతాలు బద్దలవడం, భూకంపాలు, వరదలు షరామాములుగా మారిందక్కడ. ఆ పూట సంభవించిన వాటిని కూడా తేలికపాటి ప్రకంపనలుగానే అధికారులు భావించి తేలికగా తీసుకున్నారు. కానీ, ఆ ప్రకంపనలు ఒక ప్రళయాన్నే తీసుకొచ్చాయి. 🌊తీవ్ర భూకంప ప్రభావంతో.. సముద్రంలో 50 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి అలలు. ఆ అలలు తీర ప్రాంతం నుంచి ఐదు కి.మీ పాటు భూభాగంలోకి చొచ్చుకొచ్చేశాయి.ఇండోనేషియా.. అచె ప్రాంతంలోనే లక్షా యాభై వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.శ్రీలంక.. సుమత్రాకు 1,700 కిలోమీటర్ల దూరంలోని శ్రీలంక తీర ప్రాంతాల్లో ఊహకందని నష్టం వాటిల్లింది. వివిధ తీర ప్రాంతాల్లో రాకాసి అలల ధాటికి 35 వేల మంది మరణించారు.భారత్‌.. తమిళనాడు తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్‌, అండమాన్‌ నికోబార్‌లోనూ నష్టం జరిగింది. కేరళకు స్వల్ప నష్టం వాటిల్లింది. మొత్తంగా 16, 389 మంది మరణించారు.థాయ్‌లాండ్‌.. భూకంప కేంద్రానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖావో లాక్‌లో తీవ్ర నష్టం వాటిల్లింది. 8 వేలమంది మరణించారు. వీళ్లలో క్రిస్మస్‌, న్యూఇయర్‌ సెలవులకు వచ్చిన టూరిస్టులే అధికంగా ఉన్నారు.🌊2004 హిందూ మహాసముద్రంలో ఏర్పడిన సునామీ కారణంగా.. మొత్తంగా రెండున్నర లక్షల మంది ప్రాణాలు విడిచారు. చెల్లాచెదురైనవాళ్లు లెక్కలేనంత మంది. నిరాశ్రయులైనవాళ్లు ఇంకొందరైతే.. జీవనాధారాలను కోల్పోయారు మరికొందరు. ప్రాణ నష్టంతో పాటు తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. ఆయా దేశాల పర్యాటక రంగం కుదేలు కావడమే కాకుండా.. ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపెట్టింది. ఏకంగా 10 బిలియన్‌ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. మానవతా ధృక్పథంతో ప్రపంచవ్యాప్తంగా అందించిన సాయం.. చరిత్రలోనే అతిపెద్ద సాయంగా నిలిచిపోయింది. అయినప్పటికీ.. తీర ప్రాంతాలు, మానసికంగా అక్కడి ప్రజలు కోలుకోవడానికి ఏళ్ల సమయం పట్టింది.10 నిమిషాల భూకంపం!రిక్టర్‌ స్కేల్‌పై 9.1-9.3 మధ్య తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. సముద్ర గర్భంలో భూమి పది నిమిషాలపాటు కంపిస్తూనే ఉంది. ఆ కారణంతోనే సముద్రపు అలలు రాకాసి రూపం సంతరించుకున్నాయి. తీర ప్రాంతాలను క్షణాల్లో చుట్టుముట్టాయి. ఇండోనేషియా, శ్రీలంక, భారత్‌, థాయ్‌లాండ్‌, మాల్దీవులు.. ఇలా 14 దేశాలను సముద్రపు అలలు ముంచెత్తాయి. అమెరికా, యూకే, అంటార్కిటికా తదితర ప్రాంతాల్లో కూడా అలలు ఎగిసిపడ్డాయి. ఎక్కడో 9వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా స్టేట్‌ ఓక్లాహామాలోనూ దీని ప్రభావం కనిపించిందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. సునామీ అనే పేరు మనవాళ్లు విన్నది అప్పుడే తొలిసారి!.ఆసియాలో అత్యంత శక్తివంతమైన భూకంపంగా రికార్డు21వ శతాబ్దంలో అత్యంత శక్తివంతమైన భూకంపంప్రపంచంలో ఇప్పటిదాకా సంభవించిన భూకంపాల్లో మూడో శక్తివంతమైందిఈ భూకంపం 23 వేల ఆటంబాంబుల పేలుళ్లతో సమానం!2004 సునామీ 21వ శతాబ్దంలో సంభవించిన అత్యంత ఘోరమైన విపత్తుగా చరిత్రకెక్కింది*భూకంపాల కొలమానం.. సిస్మోగ్రఫీ అనేది 1900 సంవత్సరం నుంచి ప్రారంభమైంది. చదవండి: ఆధునిక చరిత్రలోనే అత్యంత భీకర సునామీ ఏదో తెలుసా?. 🌊సునామీ.. మనిషి నిలువరించలేని ఓ ప్రకృతి విపత్తు!. తక్షణ స్పందన, సహాయక చర్యలతో ఈ విపత్తుల వల్ల కలిగే నష్టాలను, పర్యవసాలను కొంతవరకు తగ్గించవచ్చు. అలాగే సునామీని ముందుగానే గుర్తించగలిగే గ్లోబల్‌ వార్నింగ్‌ వ్యవస్థ మాత్రం ఒకటి ఉంది. సముద్ర భూగర్భంలో చెలరేగే అలజడులు.. అలల తీవ్రత ఆధారంగా సునామీ హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఇందుకోసం ‘సునామీ వార్నింగ్‌ సిస్టమ్‌’(TWS) పని చేస్తుంది. 🌊ప్రపంచంలోనే తొలి సునామీ హెచ్చరికల వ్యవస్థ.. 1920లో హవాయ్‌లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సంభవించిన విపత్తుల ఆధారంగా దానిని ఆధునీకరించుకుంటూ వచ్చారు. ఫసిఫిక్‌ సముద్రం, నార్త్‌ అమెరికా సంబంధిత వ్యవస్థలు తర్వాతి కాలంలో ఏర్పాటయ్యాయి. కానీ.. 2004 దాకా హిందూ మహాసముద్రంలో సునామీల హెచ్చరికలకు సంబంధించి ఇలాంటి వ్యవస్థ లేదు. అలాంటి వ్యవస్థ లేకపోవడం.. ఇంతటి విషాదానికి కారణమైందన్న వాదన ఇప్పటికీ వినిపిస్తుంటుంది.🌊2004 బాక్సింగ్‌ డే సునామీ తర్వాత.. ఆ మరుసటి ఏడాది IOTWMSను యునెస్కో ఏర్పాటు చేసింది. భారత్‌ తరఫున Indian Tsunami Early Warning Centre (ITEWC), ఈ IOTWMSతో సమన్వయం జరుపుతోంది. హైదరాబాద్‌లోని ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌లో ITEWCను 2007లో ఏర్పాటు చేశారు. సముద్ర గర్భంలో చోటు చేసుకునే మార్పులు, సునామీల మీద అధ్యయనాలు.. పరిశోధనలు జరుగుతున్నాయి ఇక్కడ. 🌊ప్రపంచంలో.. దాదాపు అన్ని సముద్ర రీజియన్లలో ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అయితే ఇలాంటి వ్యవస్థలు కచ్చితత్వం విషయంలోనూ కొన్ని లోపాలు బయటపడ్డాయి. దీంతో విపత్తులకు తగ్గట్లుగా మార్పులు చేస్తూ వస్తున్నారు. 2018 డిసెంబర్‌లో అగ్నిపర‍్వతం బద్ధలై సునామీ ముంచెత్తింది. దీంతో.. ఆ గ్యాప్‌ను భర్తీ చేయడానికి సముద్ర మట్టం స్థాయికి సెన్సార్‌లను ఏర్పాటు చేశారు. అలా.. అప్పటినుంచి సునామీ హెచ్చరికలు తరచూ జారీ అవుతుండడం చూస్తున్నాం. అయితే ఇలాంటి వ్యవస్థ 20 ఏళ్ల కిందట ఉండి ఉంటే.. ఆనాడు అంతటి విధ్వంసం తప్పేది ఏమో!.🌊సునామీ అంటే?.. Tsunami అనే పదం Tsu(Harbour), nami(waves) అనే జపాన్ పదాల కలయిక. తీరపు అల(రాకాసి అల) అని దీనర్థం. సముద్రపు అడుగు భాగంలో భూకంపాలు సంభవించడం, అగ్ని పర్వతాల ఉద్భేదనం, భూతాపాల వల్ల ఏర్పడిన అధిక శక్తి కలిగిన సముద్ర కెరటాలు తీరాన్ని చేరడాన్ని 'సునామీ'అంటారు. ఈ కెరటాలకు తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల అధిక మొత్తంలో నీరు తీరాన్ని తాకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. సాధారణంగా.. భూకంప తీవ్రత 6.5 కంటే అధికంగా ఉంటే సునామీ వచ్చే ప్రమాదం ఉంది. సునామీ వేగం నీటి లోతును బట్టి ఉంటుంది. 4 వేల మీటర్ల లోతులో అయితే దీని వేగం గంటకు 500- 700 కి.మీ ఉంటుంది. అదే 10 మీటర్ల నీటి లోతులో దీని వేగం గంటకు 36 కి.మీ.కు తగ్గుతుంది. సాధారణంగా సునామీలు అలల లాగే కన్పిస్తాయి. కానీ సునామీకి సాధారణ కెరటాలకు చాలా తేడా ఉంది. కెరటాలు గాలి వల్ల లేచి 5 నుంచి 20 సెకన్లలో పూర్తవుతాయి. అయితే సునామీ అలా కాదు. 5 నిమిషాల నుంచి దాదాపు గంటన్నర వరకు ఉంటుంది. ఈ రాకాసి అలలు కలిగించే నష్టం కూడా తీవ్రస్థాయిలో ఉంటాయి.. 2004, 2011లో వచ్చిన సునామీల వల్ల వాటిల్లిన విధ్వంసమే ఇందుకు ఉదాహరణ.:::సాక్షి వెబ్‌డెస్క్‌

Allu Arjun, Sukumar And Mythri Movie Makers Donates Rs 2 Cr To Revathi Family3
రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం

హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను చూసేందుకు అల్లు అరవింద్‌, దిల్‌ రాజు, సుకుమార్‌ వెళ్లారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి వారు తెలుసుకున్నారు. ఈ నెల 4న హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప–2 ప్రీమియర్‌ షోకు అల్లు అర్జున్‌ రావడం, ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం, ఆమె కుమారు శ్రీతేజ్‌ తీవ్రంగా గాయపడటం తెలిసిందే. ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మైత్రీ మూవీ మేకర్స్‌, అల్లు అర్జున్‌ సాయం చేసేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రేవతి కుటుంబానికి అల్లు అ‍ర్జున్‌ పేరుతో అల్లు అరవింద్‌ భారీ సాయం ప్రకటించారు. శ్రీతేజ ఆరోగ్య పరంగా త్వరగా కోలుకోవాలని రూ. 1 కోటి అరవింద్‌ ప్రకటించారు. డైరెక్టర్‌ సుకుమార్‌ రూ. 50 లక్షలు అందించారు. అయితే, మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే రూ. 50 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం రూ. 2 కోట్ల రూపాయలు చెక్కులను తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా దిల్‌ రాజుకు అందించారు. రేవతి భర్త భాస్కర్‌తో అల్లు అరవింద్‌ మాట్లాడారు. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన తెలుసుకున్నారు. కిమ్స్‌ ఆస్పత్రిలో శ్రీతేజను పరామర్శించిన అనంతరం అల్లు అరవింద్‌ ఇలా అన్నారు. ' ఈ విపత్తు అనంతరం అబ్బాయి కోలుకుంటున్నాడు. త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నాను. శ్రీతేజ కుటుంబానికి మైత్రీ మూవీస్‌ నిర్మాతలు నవీన్, రవిశంకర్‌తో పాటు దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ తరపున మొత్తం రూ.2 కోట్లు ఇస్తున్నాం. ఈ చెక్‌లను ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న దిల్ రాజుకి ఇస్తున్నాం.' అని అల్లు అరవింద్‌ పేర్కొన్నారు.

YS Jagan Participated In Christmas Celebrations At CSI Church4
క్రిస్టమస్‌ వేడుకల్లో పాల్గొన్న వైఎస్‌ జగన్‌

సాక్షి, పులివెందుల: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి క్రిస్టమస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో వైఎస్‌ జగన్‌ సహా కుటుంబ సభ్యులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటనలో ఉన్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా నేడు క్రిస్టమస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎస్‌ఐ చర్చిల్లో ​ప్రార్థనలు చేశారు.

Police Filed Charge Sheet On Tollywood choreographer Jani Master 5
జానీ మాస్టర్‌ లైంగిక వేధింపుల కేసు.. పోలీసుల ఛార్జ్‌ షీట్‌లో కీలక అంశాలు!

జానీ మాస్టర్ (Jani Master) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ మహిళ కొరియోగ్రాఫర్(choreographer) ఫిర్యాదుతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల కేసులో ఆయనను అరెస్ట్‌ చేసిన నార్సింగి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత బెయిల్ మంజూరు కావడంతో జానీ విడుదలయ్యారు. తాజాగా ఈ కేసులో పోలీసులు ఛార్జ్‌ షీట్ దాఖలు చేశారు.లైంగిక వేధింపులకు పాల్పడ్డారు: ఛార్జ్‌ షీట్‌లో పోలీసులుపలు ఈవెంట్స్‌ పేరుతో మహిళ కొరియోగ్రాఫర్‌ను లైంగిక వేధింపులకు గురి చేశాడని పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఆమెను పలు ప్రాంతాలకు తీసుకెళ్లి వేధింపులకు గురి చేసినట్లు అందులో ప్రస్తావించారు. కాగా.. తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ ఓ మహిళ కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.(ఇది చదవండి: పెళ్లి చేసుకోమని ఆమె నన్ను వేధించేది: జానీ మాస్టర్‌)అసలేం జరిగిందంటే..టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై 21 ఏళ్ల అమ్మాయి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనని అత్యాచారం చేయడంతో పాటు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది. మధ్యప్రదేశ్‌కి చెందిన బాధితురాలు 2017లో జానీ మాస్టర్‌కి పరిచయమైంది. 2019లో అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఓ షో కోసం ముంబయికి వెళ్లిన టైంలో తనని లైంగికంగా వేధించాడని బాధితురాలు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపివేస్తానని తనని బెదిరించే వాడని, షూటింగ్‌కు సంబంధించిన వాహనంలో కూడా తనని వేధించాడని బాధితురాలు వాపోయింది. దీంతో జానీపై లైంగిక వేధింపుల కేసుతో పాటు పోక్సో కేసు కూడా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Aus Vs Ind World Test Championship: Boxing Day Test Match6
ఆసీస్‌తో మ్యాచ్‌: టీమిండియాకు ఆఖరి అవకాశం

ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న గవాస్కర్-బోర్డర్ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో గురువారం నుంచి జరగనున్న బాక్సింగ్ డే టెస్ట్(Boxing Day Test) కోసం రెండు దిగ్గజ జట్లు సంసిద్ధంగా ఉన్నాయి. ఈ సిరీస్ లో మూడు టెస్ట్ ల అనంతరం రెండు జట్లు చెరో టెస్ట్ మ్యాచ్ గెలిచి 1-1తో సమఉజ్జీలుగా ఉండగా, ఈ సిరీస్ ఫలితం పై రెండు జట్ల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ భవితవ్యం కూడా ఆధారపడి ఉండటం ఈ సిరీస్ మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.ఆస్ట్రేలియా ఆశలన్నీ ఈ సిరీస్ పైనేరెండేళ్లకి ఒకమారు తొమ్మిది టెస్ట్ లు ఆడే దేశాల మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌(World Test Championship:) ఫైనల్ ఈ కాలంలో వివిధ జట్లు కనబరిచిన ప్రతిభ ఆధారంగా రెండు ఫైనల్ కి అర్హత సాధించే జట్లను నిర్ణయిస్తారు. ప్రస్తుత 2023-25 సీజన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టిక లో దక్షిణాఫ్రికా ప్రధమ స్థానంలో ఉంది.శ్రీలంక తో సొంత గడ్డపై జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో 2-౦ తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా, పాయింట్ల పట్టిక లో 63.33 సగటు తో ప్రధమ స్థానానికి దూసుకుపోయింది. ఆస్ట్రేలియా ప్రస్తుతం 58.89 సగటు తో రెండో స్థానం లో ఉంది.అయితే ఆస్ట్రేలియా ప్రస్తుతం భారత్ తో జరుగుతున్న గవాస్కర్-బోర్డర్ ట్రోఫీ లోని మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్ ల తోపాటు శ్రీ లంక తో ఆ దేశంలో జరిగే మరో రెండు టెస్ట్ మ్యాచ్ ల్లో ఆడాల్సి ఉంది. అయితే ఆస్ట్రేలియా కి శ్రీ లంక ని స్పిన్ కి అనుకూలంగా ఉండే అక్కడ పిచ్ ల పై శ్రీ లంక ని ఓడించడం అంత సులువైన పని కాదు. అందుకే ఆస్ట్రేలియా కూడా ఈ రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి తన అవకాశాలని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. అందుకే ప్రస్తుత సిరీస్‌పైనే ఆస్ట్రేలియా ఆశలు పెట్టుకుంది.టీమిండియాకు ఆఖరి అవకాశం ఈ సిరీస్ ఆరంభానికి ముందు న్యూజిలాండ్ తో సొంత గడ్డపై జరిగిన రెండు మ్యాచ్ ల సిరీస్ లో 0-2 తో ఘోర పరాభవం పొందిన భారత్(Team India) తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ స్థానాన్ని జారవిడుచుకునే ప్రమాదంలో పడింది. వరుసగా రెండు సార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ కి అర్హత సాధించి, రెండింటిలో పరాభవాన్ని మూటగట్టుకున్న భారత్ కి ఈ రెండు టెస్టులలో విజయం సాధిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టిక లో భారత్ 55.88 సగటుతో మూడో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ సిరీస్ కి ముందు పాయింట్ల పట్టిక లో ప్రథమ స్థానంలో ఉన్న భారత్ కి ఇది ఎదురుదెబ్బే .రెండు సార్లు పరాభవం ఇంతకుముందు 2019-21 లో కరోనా అనంతరం ఇంగ్లాండ్ లోని సౌతాంఫ్టన్ లోని రైస్ బౌల్ స్టేడియంలో జరిగిన ప్రథమ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో భారత్ న్యూజిలాండ్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. తర్వాత 2021- 23 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి ఇంగ్లాండ్ లోన్ ఓవల్ స్టేడియం ఆతిధ్యాన్నిచ్చింది. ఈ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడిన భారత్ 209 పరుగుల తేడాతో వరుసగా రెండోసారి పరాజయంచవిచూసింది .ఈ నేపథ్యంలో ఈ సారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి అర్హత సాధించాలని భారత్ చాలా గట్టి పట్టుదలతో ఉంది. ఇందుకు ఈ రెండు టెస్ట్ ల లో విజయం సాధించడం ఒక్కటే భారత్ ముందున్న అవకాశం. లేని పక్షంలో వరుసగా రెండు టెస్ట్ ఛాంపియన్షియప్ ఫైనల్స్ లో పాల్గొన్న వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుత భారత జట్టు సారధి రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీలు కూడా అదే బాటలో పయనించి భారత్ టెస్ట్ జట్టు నుంచి తప్పుకున్నా ఆశ్చర్యం లేదు.

Plane Crashes Near Aktau City In Kazakhstan7
కజకిస్థాన్‌లో కూలిన విమానం.. 42 మంది మృతి

అజర్‌బైజాన్‌: కజకిస్థాన్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. 67 మంది ప్రయాణిస్తున్న ప్యాసింజర్‌ విమానం కూలింది. ఈ దుర్ఘటనలో 42 మంది మరణించినట్లు కజకిస్థాన్‌ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటనలో 11 ఏళ్ల బాలికతో సహా 28 మంది ప్రాణాలతో బయటపడ్డారు.వివరాల ప్రకారం.. కజకిస్థాన్‌లోని అక్తౌ నగరానికి సమీపంలో విమాన ప్రమాదం జరిగింది. అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం(J2-8243) బాకూ నుంచి రష్యా వెళ్లున్న విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పలువురు మృతిచెందినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గురికాక ముందు విమానం విమానాశ్రయం చుట్టూ చక్కర్లు కొట్టినట్లు సమాచారం.అక్తౌ నగరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. విమానం భూమి ఢీకొనడంతో వెంటనే మంటలు వ్యాపించాయి. విమాన ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన స్థలంలో 52 ఫైర్‌ టెండర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. What just happened to Azerbaijan Airlines Flight 8243?? Flight Radar showed it having an emergency squawk 7700. The flight was erratic in altitude. #azerbaijan #planewatchers #avgeek #flightemergency pic.twitter.com/K6ApRsaPvK— Zach Shapiro (@zrs70) December 25, 2024మరోవైపు.. ప్రయాణికుల గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ప్రమాదానికి ముందు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కోసం పైలట్‌.. ఏటీసీకి రిక్వెస్ట్‌ పంపినట్టు సమాచారం. ఇక, ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ⚠️#BREAKING: #Azerbaijan Airlines E190 Crashes in #Kazakhstan, Survivors ReportedA tragic aviation incident unfolded today as Azerbaijan Airlines Flight #J28243, an Embraer E190AR registered (4K-AZ65)carrying 72 people, crashed near Aktau, Kazakhstan. The flight was en route… pic.twitter.com/QZG3yBcSBh— Abdul khabir jamily (@JamilKhabir396) December 25, 2024Emergency services work on the scene of the Azerbaijan Airlines plane crash in #Kazakhstan#Aktau pic.twitter.com/1ruCG6mlQL— ℂ𝕙𝕖 𝔾𝕦𝕖𝕧𝕒𝕣𝕒 ★ (@cheguwera) December 25, 2024

Razorpay extending Esops of Rs 1 lakh each to all employees8
లక్కీ ఉద్యోగులు.. ఒక్కొక్కరికి రూ.లక్ష..

ఫిన్‌టెక్ యునికార్న్ రేజర్‌పే (Razorpay) తన 3,000 మంది సిబ్బందికి రూ. 1 లక్ష విలువైన ఎంప్లాయీస్‌ స్టాక్ ఆప్షన్‌లను (ESOP) అందిస్తున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ ఇంత భారీ మొత్తంలో ప్రతీ ఉ‍ద్యోగికీ స్టాక్ ఆప్షన్‌లను అందిచడం ఇదే మొదటిసారి. ఉద్యోగుల అంకితభావం, కృషిని గుర్తిస్తూ ఈ చొరవ తీసుకున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.గతంలో పనితీరు ఆధారంగా ఎంపిక చేసిన ఉద్యోగులకు మాత్రమే స్టాక్ ఆప్షన్‌లను అందించామని, కానీ ఈ సారి మొత్తం సిబ్బందికి స్టాక్ ఆప్షన్‌లను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. రేజర్‌పేతోపాటు ఇటీవల ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్‌లను మంజూరు చేసిన ఇతర కొత్త తరం కంపెనీలలో లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ ఢిల్లీవేరీ, ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato), చెల్లింపు సేవల సంస్థ పేటీఎం (Paytm), ట్రావెల్ టెక్ సంస్థ ఇక్సిగో ఉన్నాయి.గత నెలలో ఢిల్లీవేరీ 4.9 లక్షల స్టాక్ ఆప్షన్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. అదే నెలలో, పేటీఎం​ 4.05 లక్షల ఈక్విటీ షేర్లను మంజూరు చేసింది. ఇక్సిగో 17.6 లక్షల స్టాక్ ఆప్షన్లను మంజూరు చేసింది. నెల క్రితం జొమాటో సుమారు 12 మిలియన్ స్టాక్ ఆప్షన్లను జారీ చేసింది. రేజర్‌పే ఇప్పటి వరకు 1,940 మంది ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్‌లను అందించింది.రేజర్‌పేకి సంబంధించి గతంలో స్టాక్ ఆప్షన్‌లను అందుకున్న ఉ‍ద్యోగులు పలు రౌండ్ల బైబ్యాక్‌ల ద్వారా ప్రయోజనం పొందారు. కంపెనీ తన మొదటి ఎంప్లాయీస్‌ స్టాక్ ఆప్షన్‌ల బైబ్యాక్‌ను 2018లో ప్రారంభించింది. అప్పుడు 140 మంది ఉద్యోగులను వారి వెస్టెడ్ షేర్లను లిక్విడేట్ చేసుకున్నారు. 2019, 2021లో రెండవ, మూడవ బైబ్యాక్‌లలో వరుసగా 400, 750 మంది ఉద్యోగులు ప్రయోజనం పొందారు. ఇ​క 2022లో 75 మిలియన్‌ డాలర్ల విలువతో నాల్గవ బైబ్యాక్ 650 మంది ఉద్యోగులకు (మాజీ ఉద్యోగులతో సహా) ప్రయోజనం చేకూర్చింది.

Russia Launches Massive Missile Attack At Ukraine9
ఉక్రెయిన్‌పై 70 మిసైళ్లు, 100 డ్రోన్లతో రష్యా దాడి

కీవ్‌ : ఈ వారం ప్రారంభంలో రష్యా వెన్నులో భయం పుట్టించేలా 9/11 దాడుల తరహాలో ఉక్రెయిన్‌ దాడి చేసింది. కజాన్‌ నగరంలోని బహుళ అంతస్తుల భవనాలపై మొత్తం 8 డ్రోన్లు చొచ్చుకెళ్లాయి. ఈ దాడికి రష్యా తాజాగా ప్రతీకారం తీర్చుకుంది. ఉక్రెయిన్‌పై 70మిసైళ్లు,100 డ్రోన్లతో విరుచుకుపడింది.క్రిస్టమస్‌ పర్వదినాన రష్యా చేసిన దాడిని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ ఖండించారు. తమ దేశ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై అమానవీయంగా దాడి చేసిందని ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు.‘ప్రపంచం మొత్తం క్రిస్టమస్‌ వేడుకల్లో ఉంటే ఉక్రెయిన్‌పై రష్యా భారీ ఎత్తున దాడికి దిగింది. దాడి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ముందస్తు ప్రణాళికలో భాగంగా వ్యూహాత్మకంగా జరిగింది. దాడి మాత్రమే కాదు. దాడి ఎప్పుడు చేయాలనేది ముందే నిర్ణయించుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉద్దేశ్యపూర్వకంగా ఈ విధ్వంసానికి తెరలేపారు. ఇంతకంటే అమానుషం ఏముంటుంది?’ అని జెలెన్‌స్కీ ప్రశ్నించారు. Every massive Russian strike requires time for preparation. It is never a spontaneous decision. It is a deliberate choice – not only of targets but also of timing and date.Today, Putin deliberately chose Christmas for an attack. What could be more inhumane? Over 70 missiles,… pic.twitter.com/GMD8rTomoX— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) December 25, 2024ఉక్రెయిన్ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై రష్యా భారీ దాడి చేసిందని ఉక్రెయిన్ ఇంధన మంత్రి జర్మన్ గలుష్చెంకో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శత్రువు(రష్యా) మళ్లీ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై భారీగా దాడి చేస్తోంది. శత్రు దాడి నుంచి ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ప్రతికూల ప్రభావం పడకుండా రక్షణ చర్యలు తీసుకుంటునట్లు చెప్పారు. నగరాలపై దాడులుఒక బాలిస్టిక్ క్షిపణి మంగళవారం సెంట్రల్ ఉక్రెయిన్ నగరమైన క్రివీ రిహ్‌లోని అపార్ట్‌మెంట్ భవనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. 15మంది గాయపడ్డారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 32 అపార్ట్‌మెంట్‌లతో కూడిన నాలుగు అంతస్తుల రెసిడెన్షియల్ బ్లాక్‌పై దాడి జరిగినట్లు మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఒలెక్సాండర్ విల్కుల్ టెలిగ్రామ్‌లో వెల్లడించారు.అదే సమయంలో రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. తమ బలగాలు 59 ఉక్రేనియన్ డ్రోన్‌లను రాత్రిపూట కూల్చివేసాయని, ఉక్రేనియన్ వైమానిక దళం నల్ల సముద్రం నుండి కాలిబర్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని, అయితే వాటిని వేటిపై ప్రయోగించారనే విషయంపై స్పష్టత లేదని పేర్కొంది.

Srikakulam Sherlockholmes Movie Review And Rating In Telugu10
‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ రివ్యూ

టైటిల్‌: శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్నటీనటులు: వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, అనీష్ కురివెళ్ల, నాగ్ మహేష్, మచ్చ రవి తదితరులునిర్మాణ సంస్థ: శ్రీగణపతి సినిమాస్‌నిర్మాత: వెన్నపూస రమణారెడ్డిదర్శకత్వం: రైటర్‌ మోహన్‌సంగీతం: సునీల్‌ కశ్యప్‌సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్‌ ఎన్‌ఎడిటర్‌: అవినాష్‌ గుర్లింక్‌విడుదల తేది: డిసెంబర్‌ 25, 2024కథేంటంటే..ఈ సినిమా కథ 1991లో సాగుతుంది. రాజీవ్‌ గాంధీ హత్య(1991 మే 21)జరిగిన రోజు శ్రీకాకుళం బీచ్‌లో మేరీ అనే యువతి కూడా దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును సీఐ భాస్కర్‌(అనీష్‌ కురివెళ్ల) సీరియస్‌గా తీసుకుంటాడు. వారం రోజుల్లో హంతకులను పట్టుకుంటానని, లేదంటే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని మీడియా ముఖంగా శపథం చేస్తాడు. అదే సమయంలో రాజీవ్‌ గాంధీ హత్య కేసు విషయంలో ఢిల్లీ నుంచి అధికారులు రావడంతో సీఐ భాస్కర్‌ స్టేషన్‌లోనే ఉండాల్సి వస్తోంది. వారంలో హంతకుడిని పట్టుకోకపోతే పరువు పోతుందని.. ఈ కేసు విచారణను ప్రైవేట్‌ డిటెక్టివ్‌ షెర్లాక్‌ హోమ్స్‌(వెన్నెల కిశోర్‌)కి అప్పగిస్తాడు. ఈ హత్య వెనుక మేరి స్నేహితురాలు భ్రమరాంభ(అనన్య నాగళ్ల), ఆమె ప్రియుడు బాలు(రవితేజ మహద్యం), మేరిపై మోజు పడ్డ ఝాన్సీ, సస్పెండ్‌ అయిన పోలీసు అధికారి పట్నాయక్‌(బాహుబలి ప్రభాకర్‌)తో పాటు ముగ్గురు జాలర్లు ఉన్నట్లు డిటెక్టివ్‌ షెర్లాక్‌ అనుమానిస్తాడు. వీరందరిని పిలిపించి తనదైన శైలీలో విచారణ ప్రారంభిస్తాడు. ఒక్కొక్కరు ఒక్కో స్టోరీ చెబుతారు. వీరిలో మేరిని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? అసలు డిటెక్టివ్‌ షెర్లాక్‌ నేపథ్యం ఏంటి? అతను డిటెక్టివ్‌ వృత్తినే ఎందుకు ఎంచుకున్నాడు? మేరి హత్య కేసుతో షెర్లాక్‌కి ఉన్న సంబంధం ఏంటి? చివరకు హంతకులను ఎలా పట్టుకున్నారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..డిటెక్టివ్‌ కథలు టాలీవుడ్‌కి కొత్తేమి కాదు. చిరంజీవి ‘చంటబ్బాయ్‌’ మొదలు నవీన్‌ పొలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ వరకు చాలా సినిమాలు ఈ కాన్సెప్ట్‌తో వచ్చాయి. కొన్ని కథలు సీరియస్‌గా సాగితే..మరికొన్ని కామెడీగా సాగుతూనే థ్రిల్లింగ్‌ గురి చేస్తాయి. కానీ అలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన వచ్చిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ చిత్రం మాత్రం అటు కామెడీ పండించలేదు..ఇటు థ్రిల్లింగ్‌కు గురి చేయలేదు. హాలీవుడ్ రేంజ్‌ టైటిల్‌..దానికి జస్టిఫికేషన్‌ ఇచ్చే కథ ఎంచుకున్న దర్శకుడు మోహన్‌.. ఆసక్తికరంగా కథనాన్ని నడిపించడం మాత్రం విఫలం అయ్యాడు. డిటెక్టివ్‌ చేసే ఇన్వెస్టిగేషన్‌ మొదలు.. హత్య జరిగిన తీరు వరకు ఏది ఆసక్తికరంగా ఉండదు. రాజీవ్‌ గాంధీ హత్య జరిగిన రోజే ఈ హత్య జరిగినట్లు చూపించడానికి సరైన కారణం కూడా ఉండదు. సీఐ భాస్కర్‌ బిజీ కావడంతోనే ఈ కేసును ప్రైవేట్‌ డిటెక్టివ్‌కి ఇచ్చినట్లుగా మొదట్లో చూపిస్తారు. కానీ సినిమా చూస్తున్నంత సేపు సీఐ భాస్కర్‌ ఇంత ఖాలీగా ఉన్నాడేంటి అనిపిస్తుంది. ఇక డిటెక్టివ్‌ చేసే ఇన్వెస్టిగేషన్‌ ఆసక్తికరంగా లేకపోయినా.. కనీసం నవ్వుకునే విధంగా కూడా ఉండదు. మధ్యలో వచ్చే ఉప కథలు కూడా చాలా రొటీన్‌గా ఉంటాయి. రాజీవ్‌ గాంధీ హత్యకు గురైన విషయం తెలిసి శ్రీకాకుళం సీఐ అలర్ట్‌ అవ్వడంతో సినిమా ప్రారంభం అవుతుంది. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా అర్థరాత్రంతా పోలీసులు పెట్రోలింగ్‌ చేయడం, ఘర్షనకు దిగిన ఇద్దరిని అరెస్ట్‌ చేయడం.. పోలీసులను చూసి ఓ కారు వెనక్కి వెళ్లడంతో ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక హత్య జరగడం.. విచారణ కోసం డిటెక్టివ్‌ షేర్లక్‌ రంగంలోకి దిగడం వరకు కథపై ఆసక్తి పెరుగుతుంది. ఆ తర్వాత విచారణ భాగంగా వచ్చే ఉప కథలు బోరింగ్‌గా సాగుతాయి. ఒక్కోక్కరు చెప్పే స్టోరీ.. తెరపై చూడడం భారంగా ఉంటుంది. అలాగే ఝాన్సీ అనే పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా అంతగా ఆకట్టుకోదు. అయితే హంతకులు ఎవరనే విషయం చివరి వరకు ప్రేక్షకుడు కనిపెట్టకుండా చేయడం దర్శకుడు కొంతవరకు సఫలం అయ్యాడు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ కాస్త బెటర్‌. మేరిని ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారనేది ఆసక్తికరంగా ఉంటుంది. షెర్లాక్‌ ఫ్లాష్‌బ్యాక్‌ స్టోరీ కాస్త ఎమోషనల్‌గా ఉంటుంది. అయితే అప్పటికే విసిగిపోయిన ప్రేక్షకుడు.. ఆ ఎమోషనల్‌ సీన్‌కి కూడా అంతగా కనెక్ట్‌ కాలేకపోతాడు. ఎవరెలా చేశారంటే.. డిటెక్టివ్‌ షెర్లాక్‌ హోమ్స్‌ పాత్రకు వెన్నెల కిశోర్‌ కొంతవరకు న్యాయం చేశాడు. అయితే శ్రీకాకుళం యాసలో ఆయన పలికే సంభాషణలలో సహజత్వం కలిపించదు. కామెడీ కూడా అంతగా పండించలేకపోయాడు. అనన్య నాగళ్లకు ఓ మంచి పాత్ర లభించింది. భ్రమరాంభ పాత్రలో ఆమె చక్కగా నటించింది. ఆ పాత్రలోని వేరియేషన్స్‌ ఆకట్టుకుంటాయి. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టునే తిరుగుతుంది. అనీష్ కురివెళ్ల పాత్రకి వేరే వాళ్లతో డబ్బింగ్‌ చెప్పించడం ఆ క్యారెక్టర్‌ స్థాయిని తగ్గించింది. రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, నాగ్ మహేష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సునీల్‌ కశ్యప్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ అవినాష్‌ గుర్లింక్‌ తన కత్తెరకు ఇకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
‘ఎన్నారై’ కుటుంబం వేధింపులకు ఒకరి బలి

అల్వాల్‌ (సికింద్రాబాద్‌): ఎన్నారై అల్లుడు, అతని కుటుంబీకుల

title
సింగపూర్‌లో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి  జన్మదిన వేడుకలు సింగపూర్ లో ఘనంగా జరిగాయి.

title
ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2025-28 ఎన్నికల ఫలితాలు : సరికొత్త చరిత్ర

అమెరికన్ తెలుగు అసోసియేషన్ -బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2025-2028 పదవీ కాలానికి సంబంధించి ఎన్నికల ఫలితాలు  రికార్డ్‌ సృష్ట

title
అట్లాంటాలో వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా

అమెరికాలోని అట్లాంటాలో వైయస్సార్‌సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి

title
మెల్‌బోర్న్‌లో ఘనంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు

 వైయస్సార్‌ సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం  వై.ఎస్.

Advertisement

వీడియోలు

Advertisement