Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

TDP Yellow gangs rigged by threatening voters at Palwai Gate
‘గేటు’లో గూండాగిరి.. ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్‌

సాక్షి, నరసరావుపేట / రెంటచింతల: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేటులోని పోలింగ్‌ బూత్‌లో ఆ రోజు అసలు ఏం జరిగిందన్నది కీలకంగా మారింది. మే 13న రెంటచింతల మండలం పాల్వాయిగేటు 201, 202 పోలింగ్‌ బూత్‌లలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలను బెదిరించి టీడీపీ గూండాలు భయానక వాతావరణం సృష్టించారు. పోలింగ్‌ సజావుగా జరగకుండా అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ రిటర్నింగ్‌ అధి­కారితోపాటు పల్నాడు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసేందుకు పిన్నెల్లి పలుసార్లు ఫోన్‌ చేసినా వారు స్పందించలేదు. తమ పార్టీ పోలింగ్‌ ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకు లాక్కొచ్చి దాడు­లు చేయడంతోపాటు టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేస్తు­న్నారనే సమాచారం అందడంతో పిన్నెల్లి అక్కడకు చేరుకున్నట్లు చెబుతున్నారు. యథేచ్ఛగా జరుగుతున్న రిగ్గింగ్‌ను ఆయన ప్రతిఘటించారు. ఈ క్ర­మం­లో వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పచ్చ ముఠాలు పల్నాడు ప్రాంతంలో దాదాపు ఏడు చోట్ల ఈవీఎంల విధ్వంసాలకు తెగబడగా దీన్ని అడ్డుకున్న పిన్నెల్లి వీడియోను మాత్రమే బహిర్గతం చేయడం వెనుక కుట్రకోణం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈసీకి మొర పెట్టుకున్నా... పాల్వాయిగేట్, తుమృకోట, ఒప్పిచర్ల, చింతలపల్లి పోలింగ్‌ కేంద్రాలలో గతంలో పలుమార్లు టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఆయా కేంద్రాలలో పటిష్ట బందోబస్తు కల్పించి ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని పిన్నెల్లి పలు దఫాలు ఈసీ, కలెక్టర్, ఎస్పీలను అభ్యరి్థంచినా స్పందించలేదు. పోలింగ్‌ రోజు కూడా రెండుసార్లు ఈసీకి మొర పెట్టుకున్నా ఫలితం శూన్యం. పాల్వాయి గేట్‌ పోలింగ్‌ కేంద్రంలో టీడీపీ అరాచకాలకు సహకరించేందుకు 50 ఏళ్లకు పైగా వయసున్న పోలీసు కానిస్టేబుల్‌కే విధులు కేటాయించారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను చితకబాది.. పాల్వాయి గేట్‌ కేంద్రంలో వైఎస్సార్‌ సీపీ పోలింగ్‌ ఏజెంట్లుగా ఉన్న చింతా సుబ్బారావు, డేరంగుల శ్రీను, చల్లా సుబ్బయ్యలను టీడీపీ నేతలు కొట్టి బయటకు ఈడ్చేశారు. ఓటు వేయడానికి క్యూలో నిలబడ్డ మహిళలను భయకంపితుల్ని చేసి తరిమేశారు. అనంతరం అక్కడ టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. స్థానికులతో కలసి మరోసారి దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలింగ్‌ ఏజెంట్లపై విచక్షణారహితంగా దాడి చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పిన్నెల్లి రిగ్గింగ్‌ను ప్రతిఘటించారు. దీన్ని అడ్డుకోవాలని పోలింగ్‌ అధికారులను అభ్యరి్థంచారు. టీడీపీ మూకల అరాచకాలను ఎన్నికల అధికారుల దృష్టికి తెచి్చనా స్పందించలేదు. పిన్నెల్లి కుమారుడు గౌతమ్‌రెడ్డి, డ్రైవర్‌ అంజిరెడ్డి, మరికొందరిపై టీడీపీ నేతలు దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. పిన్నెల్లి కాన్వాయ్‌లోని వాహనాలను ధ్వంసం చేశారు. ఓటర్లు, ఏజెంట్లను భయపెట్టి రిగ్గింగ్‌ చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఆ వీడియో ఒక్కటే.. వారం తరువాత మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్‌ రోజు మొత్తం ఏడు ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. ఒక్క పాల్వాయి గేటు వీడియో మినహా మిగతావి ఏవీ బయటకు రాలేదు. అది కూడా వారం తరువాత తాపీగా విడుదల చేయడంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈవీఎంలు ధ్వంసమైన మిగిలిన ఆరు వీడియోలను ఎన్నికల సంఘం ఇప్పటికీ బయట పెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియోను తాము రిలీజ్‌ చేయలేదని పోలీసులు, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పలువురు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడిన తరువాత విదేశాల్లో గడుపుతున్న నారా లోకేష్‌ ‘ఎక్స్‌’ ఖాతా నుంచి వీడియో పోస్టు కావడం గమనార్హం. ఈసీ ఆదీనంలో ఉండాల్సిన వీడియో లోకేష్‌ చేతికి ఎలా వచి్చందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈసీ వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది. పాల్వాయి గేట్‌ పోలింగ్‌ బూత్‌లో టీడీపీ మూకలు రిగ్గింగ్‌ చేస్తుంటే ఎందుకు స్పందించలేదు? ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నా ఏమి పట్టనట్లు వ్యవహరించడం ఏమిటి? ఫిర్యాదులు అందినా ఎందుకు పట్టించుకోలేదు? అనే ప్రశ్నలకు ఈసీ జవాబు చెపాల్సి ఉంది. మాచర్ల నియోజకవర్గంలో వంద శాతం వెబ్‌ కాస్టింగ్‌ జరుగుతోంది. 202 పోలింగ్‌ బూత్‌లో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలిసినా ఉదాశీనంగా ఉండటంపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. తుమృకోటలో దాడులు.. ఈవీఎంలు ధ్వంసం రెంటచింతల మండలం తుమృకోటలో వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులైన ఎస్సీ, ముస్లిం మైనార్టీలపై టీడీపీ నేతలు దాడి చేశారు. 203, 204, 205 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. రీపోలింగ్‌ జరపకుండా సాయంత్రం 4 గంటల సమయంలో కొత్త ఈవీంఎలతో తిరిగి పోలింగ్‌ కొనసాగించారు. ఆ సమయంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా రిగ్గింగ్‌ చేశారు. ఈ వీడియోలను ఎన్నికల సంఘం బయటపెట్టలేదు. కారంపూడి మండలం ఒప్పిచర్లలో వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్‌ పాలకిర్తి శ్రీనివాసరావుపై టీడీపీ అగ్రవర్ణ నేతలు దాడి చేసి పోలింగ్‌ కేంద్రం నుంచి ఈడ్చేసి అక్రమ కేసు బనాయించారు. ఈసీ డేటా భద్రమేనా?సాక్షి, నరసరావుపేట: పాల్వాయి గేట్‌ పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం «ధ్వంసం వీడియోపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా అది సీసీ ఫుటేజేనా? లేక మార్ఫింగ్‌ చేసిన వీడియోనా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వీడియో కుడివైపు పైభాగంలో మొబైల్‌ 5జీ సిగ్నల్, 65 శాతం బ్యాటరీ పర్సంటేజ్, అలారం ఇండికేషన్స్‌ కనిపించడం గమనార్హం. వీడియోలో మొత్తం నిడివి 23.52 గంటలు ఉండగా 12.06 గంటల వద్ద తమకు అవసరమైన మేరకు రెండు నిమిషాల పాటు మొబైల్‌లో రికార్డు చేసినట్టు స్పష్టమవుతోంది. ఎంతో భద్రంగా ఉండాల్సిన పోలింగ్‌ వెబ్‌ కాస్టింగ్‌ సమాచారం బయటకు వెళ్లడంపై సందేహాలు అలుముకుంటున్నాయి. ఈ వీడియో తొలుత నారా లోకేష్‌ ఎక్స్‌ ఖాతా, టీడీపీ సోషల్‌ మీడియా గ్రూప్‌లలో కనిపించింది. అంటే వారి ద్వారానే బయటకు వచి్చనట్టు తేలిపోతోంది. గ్రాఫిక్స్‌కు పెట్టింది పేరైన పచ్చ ముఠాల వీడియోను నిర్థారించుకోకుండా, ఎలా బయటకు వచి్చందనే విషయాన్ని పట్టించుకోకుండా ఈసీ కేసు నమోదుకు ఆదేశించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. 53 గ్రామాల్లో దాడులుసాక్షి, ప్రత్యేక ప్రతినిధి / సాక్షి, నరసరావుపేట: పల్నాడులోని 53 గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై, ఇళ్లపై టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయి. ఆస్తులను ధ్వంసం చేశాయి. పోలింగ్‌ నాడు టీడీపీ నాయకులు హింసాకాండకు పథకం రూపొందించినట్లు మంత్రి అంబటి, పిన్నెల్లి తదితరులు ఎన్నికల యంత్రాంగానికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా స్పందించలేదు. వీడియోను మొబైల్‌లో రికార్డు చేశారని చెప్పడానికి గల ఆధారాలు.. ఆ వీడియో వెనుక అసలు నిజాలు..⇒ మే 13న పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా ఓటర్లను టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. ⇒ పాల్వాయి గేట్‌లోని అన్ని బూత్‌లను ఆక్రమించి పచ్చ ముఠాలు రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి. ⇒ బ్రహా్మరెడ్డి కుట్రలను ముందే పసిగట్టి మే 11న పిన్నెల్లి ఈసీకి లేఖ రాశారు. ⇒ సమస్యాత్మక ప్రాంతమైన మాచర్లలో భారీగా పోలీసులను మోహరించాలని పిన్నెల్లి కోరారు. ⇒ టీడీపీ అరాచకాలకు పాల్పడినందున రీ పోలింగ్‌ నిర్వహించాలని లేఖలో పిన్నెల్లి కోరారు.⇒ ప్రజాస్వామ్యాన్ని టీడీపీ ఖూనీ చేసినందున రీ పోలింగ్‌ జరపాల్సిందేనని అభ్యరి్థస్తూ పిన్నెల్లి మరో లేఖ రాశారు. ⇒ టీడీపీ కుట్రలపై మే 11న ఒక లేఖ, పోలింగ్‌ జరిగిన మే 13న రెండు లేఖలను పిన్నెల్లి ఈసీకి రాశారు. ⇒ 11 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయినట్లు ఎన్నికల అధికారి ప్రెస్‌ మీట్‌ నిర్వహించి మరీ చెప్పారు. ⇒ టీడీపీ గూండాలు 10 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసే ఆ వీడియోలను ఎందుకు బయట పెట్టలేదు?⇒ నారా లోకేష్‌ ఫిర్యాదుతో 8 రోజుల తరువాత ఒక వీడియో విడుదల చేసి అరెస్టుకు ఆదేశాలిచ్చారు.దాడి చేసి.. రిగ్గింగ్‌202 పోలింగ్‌ బూత్‌లోకి టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో ప్రవేశించి నాతో పాటు డేరంగులు శ్రీను, చల్లా సుబ్బయ్యలపై దాడి చేశారు. చితకబాది పోలింగ్‌ బూత్‌ బయటకు లాక్కొచ్చారు. అనంతరం టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారు. అక్కడున్న పోలీసులు, పోలింగ్‌ అధికారులు ఏమాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో మేం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చాం. అక్కడకు వచి్చన పిన్నెల్లి, ఆయన అనుచరులపై పచ్చమూకలు దాడులకు పాల్పడ్డాయి. –చింతా సుబ్బారావు, ఇన్‌చార్జి సర్పంచి,వైఎస్సార్‌సీపీ ఏజెంట్, పాల్వాయి గేట్‌పల్నాడు గ్రామాల్లో టీడీపీ దురాగతాలు..⇒ మాచర్ల రూరల్‌ మండలం: కొత్తూరు, కంభంపాడు, భైరవునిపాడు ⇒ రెంటచింతల: రెంటాల, జెట్టిపాలెం, పాలవాయిగేటు, గోలి, మిట్టగుడిపాడు ⇒ కారంపూడి: ఒప్పిచర్ల, కారంపూడి, పేటసన్నెగండ్ల, చింతపల్లి ⇒ దుర్గి: ముటుకూరు, అడిగొప్పల, పోలేపల్లి ⇒ వెల్దుర్తి: లోయపల్లి, వెల్దుర్తి, వజ్రాలపాడు, గొట్టిపాడు, నర్సపెంట ⇒ గురజాల: కేసానుపల్లి, మాదినపాడు, ఇరిగేపల్లి, తంగెడ, కొత్తగణేశునిపాడు, మాచవరం, బ్రాహ్మణపల్లి, పెదఅగ్రహారం, జానపాడు. ⇒ నరసరావుపేట: నరసరావుపేట పట్టణం, దొండపాడు, పమిడిపాడు. ⇒ సత్తెనపల్లి: పాకాలపాడు, మాదల, తొండపి, చాగంటివారిపాలెం, నార్నెపాడు, గణపవరం, చీమలమర్రి, రూపెనగుండ్ల, గుండ్లపల్లి, కుంకలగుంట, చేజర్ల. ⇒ వినుకొండ: నూజెండ్ల, రెడ్డికొత్తూరు, బొల్లాపల్లి, కొచ్చర్ల, గంటావారిపాలెం. ⇒ పెదకూరపాడు: ఎర్రబాలెం, లగడపాడు, చండ్రాజుపాలెం, మాదిపాడు. ⇒ చిలకలూరిపేట: అప్పాపురం

AP Police Who Favour TDP Tension With SIT Report
సిట్‌ నివేదిక: టీడీపీకి కొమ్ముకాసిన అధికారుల్లో టెన్షన్‌

సిట్ ప్రాధమిక నివేదికపై కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు ఎలా ఉంటాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల వెనుక పోలీసు వైఫల్యాన్ని సిట్ బట్టబయలు చేసింది. విధి నిర్వహణలో కొందరు పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిట్ తన ప్రాధమిక నివేదికలో పేర్కొంది. ఈ నేపధ్యంలో సిట్ నివేదిక ఆధారంగా పోలీసులపైనా కేసులు నమోదు చేసి విచారణ జరపాలని ఎన్నికల సంఘం ఆదేశించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికల అనంతర ఘర్షణలపై సిట్ ప్రాధమిక నివేదిక.. ఇపుడు పోలీసుల మెడకు చుట్టుకోబోతోంది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్ రెండు రోజుల పాటు విచారణ జరిపి డీజీపీ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రాధమిక నివేదిక పంపారు. ఈ మూడు జిల్లాలలో 33 ప్రధాన సంఘటనలపై క్షేత్రస్ధాయిలో విచారణ జరిపారు. పల్నాడు జిల్లాలోని గురజాల, నరసారావుపేట, మాచర్ల నియోజకవర్గాలలో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక పోలీసు అధికారుల వైఫల్యాన్ని సిట్ గుర్తించింది. ముఖ్యంగా నరసారావుపేట, మాచర్ల నియోజకవర్గాలలోని 18 కేసులలో 474 మంది నిందితులుంటే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడాన్ని సిట్ తీవ్రంగా పరిగణించింది. ఇందులో 307 మంది నిందితులను గుర్తించాల్సి ఉందని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారుల స్టేట్ మెంట్ ని కూడా సిట్ సీరియస్ గా తీసుకుంది. ఇక తాడిపత్రిలో ఏకంగా పోలీసులు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి సీసీ కెమెరాలను ద్వంసం చేయడం వెనుక కారణాలను సిట్ విశ్లేసించింది. ఈ మూడు జిల్లాలలో జరిగిన 33 హింసాత్మక ఘటనల్లో దాదాపు 1370 మంది నిందితులుంటే కేవలం 124 మందినే అరెస్ట్ చేయడంపై పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిట్ అభిప్రాయపడింది. ఇదే సమయంలో పల్నాడు లాంటి జిల్లాలలో కొందరు పోలీసు అధికారులు టీడీపీ నేతల దగ్గర లంచాలు తీసుకుని తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాశారని.. కొన్ని చోట్ల పోలింగ్ బూత్ లలో ఓటర్లని రానివ్వకుండా టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని వైఎస్సార్సీపీ ఇప్పటికే ఈసీకి, డీజీపీ, సిట్ కు కూడా ఫిర్యాదులు చేసింది. పల్నాడు జిల్లాలోని మాచవరం మండలం కొత్తగణేషునిపాడులో ఎస్సీ, ఎస్టీలపై ఎన్నికల తర్వాత టీడీపీ నేతలు దాడులు చేయడంతో వారంతా ఊళ్లు వదిలి వెళ్లిపోయారు. ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో కూడా మైనార్టీలు టీడీపీ దాడులతో గ్రామం విడిచి కుటుంబాలతో సహా వెళ్లిపోయారు. ఇంత జరిగినా ఆయా గ్రామాలలో జరిగిన ఘటనలపై పోలీసులు పూర్తిస్ధాయిలో కేసులు నమోదు చేయలేదు. అరెస్ట్ లు కూడా చేయలేదు. పైగా టీడీపీ దాడులతో భీతిల్లి గ్రామాలు విడిచివెళ్లిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలైన ఆ బాదితులపైనే పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని సిట్ గుర్తించింది. మరోవైపు నరసారావుపేట టీడీపీ అభ్యర్ధి చదలవాడ అరవిందబాబు పోలింగ్ రోజు ఇతర ప్రాంతాల నుంచి గూండాలని రప్పించి వైఎస్సార్సీపీ అభ్యర్ధి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై దాడులు చేయడం, అక్కడున్న కార్లపై కర్రలు, రాళ్ల దాడిచేయడం, ఇంటిని ద్వంస చేసారు.అడ్డుకునే ప్రయత్నం చేసిన గోపిరెడ్డి మామ కంజుల కోటిరెడ్డిపైనా హత్యాయత్నానికి పాల్పడ్డారు.ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు టీడీపీ అభ్యర్ధి అరవిందబాబుని అరెస్ట్ చేయలేదు. పోలింగ్ తర్వాత పెట్రో బాంబులు, రాడ్లు, కర్రలు, గాజుసీసాలు వంటి మారణాయుదాలతో టీడీపీ నేతలు దొరికినా కూడా పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని పోలీసులని సిట్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.ఈ నేపధ్యంలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలలో పోలీసులు దర్యాప్తు సరిగ్గా చేయలేదని సిట్ ప్రాధమిక నివేదికలో పేర్కొంది. సీరియస్ ఘటనలలో సైతం కొందరు పోలీసులు తూతూ మంత్రంగా దర్యాప్తు చేసి బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేశారని...కోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్షన్లు నమోదు చేయాలని సిట్ ప్రాధమిక నివేదికలో పేర్కొంది.రాళ్లు, కర్రలు, పెట్రో బాంబులు వంటి వాటితో దాడుల జరగాలంటే ముందుగానే వాటిని సేకరించి ఉంటారని...ఇందుకోసం ముందస్తుగానే ప్రిపేర్ అయ్యారని..ప్రీ ప్లాన్ గానే ఈ దాడులు జరిగాయని సిట్ భావించింది. ఈ ఘటనలలో పోలీసుల వైఫల్యాలని సిట్ సీరియస్ గానే తీసుకున్నట్లు కన్పిస్తోంది.వైఎస్సార్‌సీపీ ఆరోపణలకి తగ్గట్లుగా పోలీసులు టీడీపీకి కొమ్ముకాయడాన్ని సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత జరిగిన ఘటనలపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్, పల్నాడు ఎస్పీ బిందుమాధవ్ తో పాటు సంఘటనలు జరిగిన మూడు జిల్లాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 12 మంది పోలీసులని సస్పెన్షన్ చేయడంతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇద్దరు ఎస్పీలతో పాటు 12 మంది పోలీసు అధికారులకు 15 రోజులలో సమాధానం ఇవ్వాలని నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో పాటు శాఖాపరంగానూ విచారణ ప్రారంభం కానుంది.మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘానికి సిట్ ప్రాధమిక నివేదిక చేరడంతో తదుపరి చర్యలు ఎలా ఉంటాయోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల రోజు.. ఆ తర్వాత ఘటన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే ఇప్పటకే ప్రాధమిక చర్యలు తీసుకోవడంతో సిట్ పూర్తి స్ధాయి నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయనే మరో వాదన కూడా ఉంది. రెండు రోజుల పాటు విచారణ జరిపి ప్రాథమిక నివేదిక ఇచ్చిన సిట్ ఇపుడు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది. సిట్ ఆదేశాల మేరకు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఇప్పటికే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆయా జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. ఈ నేపధ్యంలో ఇంకా అరెస్ట్ కాకుండా ఉన్న దాదాపు 1,200 మందికి పైగా నిందితులకు సంకెళ్లు వేసే పనిలో పోలీసులు పడ్డారు. నిందితుల అరెస్ట్ తో పాటు దర్యాప్తు కూడా వేగవంతంగా కొనసాగాల్సి ఉండటంతో ప్రస్తుతానికి ఈసి కూడా సిట్ పూర్తిస్ధాయి నివేదిక కోసం వేచిచూడవచ్చంటున్నారు.ఒకవేళ ప్రాధమిక నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకోవాలని భావిస్తే మాత్రం సస్పెండ్ అయిన ఇద్దరు ఎస్పీలు, 12 మంది పోలీసు అధికారులతో కొందరిపై కేసులు నమోదుకు ఆదేశించవచ్చంటున్నారు.కేసులు నిరూపణ జరిగితే సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం లేదా జైలు శిక్ష లేదంటే రిటైర్ తర్వాత పెన్షన్ రాని పరిస్ధితులు ఉంటాయని చెబుతున్నారు. అదే జరిగితే పోలీసులపై కేసు సంచలనంగా మారే అవకాశాలున్నాయి. మొత్తంగా టీడీపీకి కొమ్ముకాసిన పోలీసులకి ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో కంటిమీద కునుకు లేకుండా పోయింది.

ktr Comments At Warangal Graduate Mlc Campaign Meeting
తీన్మార్‌మల్లన్నపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్‌

సాక్షి,వరంగల్‌: మహిళల మెడలో తాళిబొట్టు కొట్టేసే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని కేటీఆర్‌ విమర్శించారు. వరంగల్‌లో బుధవారం(మే22) జరిగిన వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులు ఉప ఎన్నిక ప్రచార సభలో కేటీఆర్‌ మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలైనవి.మంగళవారం ఎంజీఎం ఆసుపత్రిలో 5గంటల విద్యుత్ నిలిపోయింది. రూ.2లక్షల రుణమాఫీ కాలేదు. రైతులకు రైతుబంధు రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. వరికి రూ. 500 బోనస్ దక్కలేదు. రాష్ట్రంలో మోసాల పరంపర సాగుతోంది. కాంగ్రెస్ నాయకులు పచ్చి మోసగాళ్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలంటే... పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాకేష్‌రెడ్డిని గెలిపించాలి.420 హామీలతో అధికారంలోకి వచ్చారు. కొత్త పరిశ్రమలను తీసుకువచ్చే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు. ఉన్న కంపెనీలను కాపాడుకునే సత్తా లేని నాయకులు కాంగ్రెస్ నాయకులు. తీన్మార్ మల్లన్న లాంటి నాయకులు గెలిస్తే చట్టసభలు బూతు మాటలకు వేదిక అవుతుంది’అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

TDP Silence Over Chandrababu Foreign Tour
టీడీపీ సైలెన్స్‌.. దేనికి సంకేతం?

ఎన్టీఆర్‌, సాక్షి: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడ?. విదేశీ పర్యటన పేరుతో ఆయన ఎ‍క్కడికి వెళ్లారసలు?. ఎన్నికల ఫలితాల వేళ ఉన్నపళంగా ఎక్కడికి వెళ్లారు?. ఏపీ రాజకీయ వర్గాల్లో.. ఆఖరికి టీడీపీ శ్రేణుల్లోనూ దీనిపైనే చర్చ నడుస్తోంది.నారా చంద్రబాబు నాయుడు.. విదేశీ యాత్రకు విశ్రాంతి కోసం వెళ్లారు!. కాదు కాదు.. 74 ఏళ్ల చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లారు. ఎన్నికల ఫలితాల ముందర కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకే ఆయన విదేశాలకు వెళ్లారు. ఇలా.. ఎవరికి తోచిన ప్రకటనలు వాళ్లు చేస్తున్నారే తప్ప ఆయన ఎక్కడికి వెళ్లారు అనేదానిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఆఖరికి ఆయన పార్టీ కూడా!. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత విదేశీ పర్యటన కోసం హైదరాబాద్‌ నుంచి తొలుత దుబాయ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు అనేదానిపై గోప్యతను ప్రదర్శిస్తోంది తెలుగు దేశం పార్టీ. ఇక.. చంద్రబాబు ఏం చేసినా బాకా ఊదే ఎల్లో పత్రికలు సైతం ఆయన ఫారిన్‌ టూర్‌పై వేర్వేరు కథనాలు ఇవ్వడం గమనార్హం. చంద్రబాబు పర్యటనకు వెళ్లే ముందే ఆయన తనయుడు నారా లోకేష్‌ విదేశాలకు వెళ్లారు. ఆయన కూడా ఎక్కడికి వెళ్లారనేదానిపై స్పష్టత కొరవడింది. ఇక చంద్రబాబు విశ్రాంతి కోసం అమెరికా వెళ్తున్నారంటూ లీకులు ఇచ్చాయి టీడీపీ శ్రేణులు. అయితే.. చంద్రబాబు అసలు అమెరికాకే రాలేదంటూ టీడీపీ ఎన్నారై నేత కోమటి జయరాం ప్రకటన చేయడంతో ఒక్కసారిగా గాలి తీసేసినట్లయ్యింది.చెప్పాల్సిన అవసరం ఉందిఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష ప్రధాన నేతలుగా బాధ్యతాయుతమైన పదవుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి,నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. వాళ్లిద్దరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పార్టీలు ప్రకటనలు చేస్తుంటాయి. అలాగే ఏ పర్యటనలకు వెళ్లినా.. అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం ఆ పార్టీల బాధ్యత కూడా. అందుకే వైఎస్సార్‌సీపీ సీఎం జగన్‌ కుటుంబ సమేతంగా లండన్‌ పర్యటనకు వెళ్లగానే.. అక్కడ ల్యాండ్‌ అయిన దృశ్యాలను మీడియా, సోషల్‌ మీడియా మాధ్యమంగా విడుదల చేసింది. మరి ఇదే పని చంద్రబాబు విషయంలో టీడీపీ ఎందుకు చేయలేకపోతోంది. సాధారణంగానే చంద్రబాబు విదేశీ పర్యటనను ఏదో రాష్ట్రానికి ఉద్దరించే పనిగా చూపించే ఎల్లో మీడియా.. ఈసారి ఆ బిల్డప్‌లను ఎందుకు ఇవ్వలేకపోతోంది. ఈ లెక్కన.. చంద్రబాబు విదేశీ పర్యటనపై వైఎస్సార్‌సీపీ ఆరా తీయడంలో.. సారీ నిలదీయడంలో తప్పేముంది?.

Rajasthan win in eliminator
రాయల్స్‌ ముందుకు...చాలెంజర్స్‌ ఇంటికి...

అసాధారణ రీతిలో ఆరు వరుస విజయాలతో ‘ప్లే ఆఫ్స్‌’ వరకు దూసుకొచ్చిన బెంగళూరు ప్రస్థానం ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముగిసింది. ‘కప్‌ నమ్‌దే’ అంటూ కొత్త ఆశలు రేపిన టీమ్‌ నాకౌట్‌ సమరంలో కుప్పకూలి మరోసారి అభిమానులను నిరాశకు గురి చేసింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత ఎట్టకేలకు అసలు పోరులో తమ స్థాయిని ప్రదర్శించిన రాజస్తాన్‌ రాయల్స్‌ మరో అడుగు ముందుకేసి రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్‌తో సమరానికి సిద్ధమైంది. ముందుగా పదునైన బౌలింగ్‌తో బెంగళూరును కట్టిపడేసిన రాజస్తాన్‌ ఆ తర్వాత సాధారణ లక్ష్యాన్ని ఆరు బంతుల ముందే అందుకుంది. అక్కడక్కడా కాస్త తడబాటు కనిపించినా...ఆఖరికి గెలుపు తీరం చేరింది. 700కుపైగా పరుగులు చేసిన తర్వాత కూడా ఇక్కడే ఆగిపోయిన విరాట్‌ కోహ్లి చిత్రం చూస్తే చాలు ఆర్‌సీబీ దురదృష్టం ఎలాంటిదో చెప్పేందుకు! అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ ఫైనల్లో స్థానం కోసం రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడనుంది. బుధవారం జరిగిన ‘ఎలిమినేటర్‌’ మ్యాచ్‌లో రాజస్తాన్‌ 4 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రజత్‌ పటిదార్‌ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి (24 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్‌), మహిపాల్‌ లోమ్రోర్‌ (17 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం రాజస్తాన్‌ 19 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు సాధించి గెలిచింది. యశస్వి జైస్వాల్‌ (30 బంతుల్లో 45; 8 ఫోర్లు), రియాన్‌ పరాగ్‌ (26 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. కీలకమైన రెండు వికెట్లు తీసిన అశ్విన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. దూకుడు లేకుండా... బెంగళూరు ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి తడబడుతూనే సాగింది. కోహ్లి, డుప్లెసిస్‌ ఆశించిన మెరుపు ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. బౌల్ట్‌ తన 3 ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి ప్రత్యర్థిని కట్టిపడేశాడు. డుప్లెసిస్, కోహ్లి తక్కువ వ్యవధిలో వెనుదిరిగిన తర్వాత కామెరాన్‌ గ్రీన్‌ (21 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కొన్ని పరుగులు జోడించాడు. అయితే గ్రీన్, మ్యాక్స్‌వెల్‌ (0)లను వరుస బంతులకు అవుట్‌ చేసి అశ్విన్‌ దెబ్బ కొట్టాడు. ఈ దశలో పటిదార్‌ ఇన్నింగ్స్‌ ఆర్‌సీబీని ముందుకు నడిపించింది. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జురేల్‌ సునాయాస క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన పటిదార్‌ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. చహల్‌ ఓవర్లో అతను 2 సిక్స్‌లు, ఫోర్‌ బాదడంతో స్కోరు వంద పరుగులు దాటింది. తన చివరి ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లో దినేశ్‌ కార్తీక్‌ (11) విఫలం కాగా, చివర్లో లోమ్రోర్‌ ధాటిగా ఆడాడు. రాణించిన జైస్వాల్‌... ఛేదనను జైస్వాల్, టామ్‌ కోలర్‌ (20) జాగ్రత్తగా మొదలు పెడుతూ తొలి 2 ఓవర్లలో 6 పరుగులే చేశారు. అయితే యశ్‌ దయాళ్‌ వేసిన మూడో ఓవర్లో జైస్వాల్‌ 4 ఫోర్లు బాది జోరు మొదలు పెట్టగా, సిరాజ్‌ వేసిన తర్వాతి ఓవర్లో కూడా 3 ఫోర్లు వచ్చాయి. కోలర్‌ వెనుదిరిగిన తర్వాత జైస్వాల్, స్యామ్సన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించారు.అయితే వీరిద్దరు ఐదు పరుగుల వ్యవధిలో వెనుదిరగడం, జురేల్‌ (8) రనౌట్‌ కావడంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే మరో ఎండ్‌లో పరాగ్‌ ఆకట్టుకునే ఆటతో గెలుపు భారాన్ని తీసుకున్నాడు. పరాగ్, హెట్‌మైర్‌ (14 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మధ్య 45 పరుగుల భాగస్వామ్యం (25 బంతుల్లో) రాజస్తాన్‌ను విజయం దిశగా తీసుకెళ్లింది. విజయానికి చేరువైన దశలో వీరిద్దరు నిష్క్రమించినా రావ్‌మన్‌ పావెల్‌ (8 బంతుల్లో 16 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) పని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) (సబ్‌) ఫెరీరా (బి) చహల్‌ 33; డుప్లెసిస్‌ (సి) పావెల్‌ (బి) బౌల్ట్‌ 17; గ్రీన్‌ (సి) పావెల్‌ (బి) అశ్విన్‌ 27; పటిదార్‌ (సి) పరాగ్‌ (బి) అవేశ్‌ 34; మ్యాక్స్‌వెల్‌ (సి) జురేల్‌ (బి) అశ్విన్‌ 0; లోమ్రోర్‌ (సి) పావెల్‌ (బి) అశ్విన్‌ 32; కార్తీక్‌ (సి) జైస్వాల్‌ (బి) అవేశ్‌ 11; స్వప్నిల్‌ (నాటౌట్‌) 9; కరణ్‌ (సి) పావెల్‌ (బి) సందీప్‌ 5; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–37, 2–56, 3–97, 4–97, 5–122, 6–154, 7–159, 8–172. బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–16–1, సందీప్‌ శర్మ 4–0–48–1, అవేశ్‌ ఖాన్‌ 4–0–44–3, అశ్విన్‌ 4–0–19–2, చహల్‌ 4–0–43–1. రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) కార్తీక్‌ (బి) గ్రీన్‌ 45; టామ్‌ కోలర్‌ (బి) ఫెర్గూసన్‌ 20; సామ్సన్‌ (స్టంప్డ్‌) కార్తీక్‌ (బి) కరణ్‌ 17; పరాగ్‌ (సి) సిరాజ్‌ 36; జురేల్‌ (రనౌట్‌) 8; హెట్‌మైర్‌ (సి) డుప్లెసిస్‌ (బి) సిరాజ్‌ 26; పావెల్‌ (నాటౌట్‌) 16; అశ్విన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో 6 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–46, 2–81, 3–86, 4–112, 5–157, 6–160. బౌలింగ్‌: స్వప్నిల్‌ 2–0–19–0, సిరాజ్‌ 4–0–33–2, దయాళ్‌ 3–0–37–0, ఫెర్గూసన్‌ 4–0–37–1, కరణ్‌ శర్మ 2–0–19–1, గ్రీన్‌ 4–0–28–1.

3 thousand crores for crop insurance
‘పంటల బీమా’కి రూ.3 వేల కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం రూ.3 వేల కోట్లు ఖర్చు చేయనుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వెల్లడించారు. ప్రభుత్వమే రైతుల ప్రీమియాన్ని చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ వానాకాలం పంటల సీజన్‌ నుంచే అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ మేరకు బుధవారం మంత్రి తుమ్మల ఒక ప్రకటన జారీచేశారు. తడిచిన ధాన్యాన్ని సైతం తమ ప్రభుత్వం సేకరిస్తుందని వివరించారు. గతంతో పోలిస్తే ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు జిల్లాకొక ఐఏఎస్‌ను నియమించి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని వివరించారు. తరుగు, తాలు పేరుతో కోతలు లేవని స్పష్టం చేశారు. గతంలో ప్రతి క్వింటాకు 7 నుంచి 10 కేజీల వరకు తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ జరిగిందనీ, ఈ దఫా మిల్లర్ల దోపిడీపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో కోతలకు మిల్లర్లు స్వస్తి చెప్పారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ప్రతి కింటాపై రైతుకు రూ.150 నుంచి రూ.200 రూపాయల వరకు అదనపు లబ్ధి చేకూర్చామని తెలిపారు. పంట అమ్ముకున్న ఐదు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు చేరుతుందని మంత్రి స్పష్టం చేశారు. గతంలో 45 రోజులు పట్టేదని, దాంతో రైతు ఎంతో వడ్డీ నష్ట పోయేవాడని గుర్తు చేశారు. భవిష్యత్‌లో దొడ్డు వడ్లకు కూడా రూ.500 బోనస్‌ తెలంగాణలో సన్న వడ్ల సాగును పెంచేందుకు ప్రభుత్వం రూ.500 బోనస్‌ ప్రకటించిందని మంత్రి తుమ్మల పునరుద్ఘాటించారు. రైతులు నాట్లేసుకునే సమయం దగ్గర పడిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన ఈ స్కీంను ప్రవేశపెట్టామని తెలిపారు. భవిష్యత్‌లో దొడ్డు వడ్లకు కూడా ఈ స్కీం వర్తింపచేస్తామని హామీనిచ్చారు. రాష్ట్రంలో దొడ్డు వడ్లు తినడం చాలా తగ్గిపోయిందనీ, పేదలు కూడా పెద్దోళ్లు తినే సన్న బియ్యం తినాలనే సంకల్పంతో రేషన్‌ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి అన్ని హామీలను పూర్తి చేసి తీరుతామనీ, లేకుంటే ఓట్లే అడగబోమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

Calcutta High Court Sensational Decision On Obc Reservations
మమత సర్కారుకు షాక్‌.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కారుకు కలకత్తా హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం(మే22)న కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓబీసీ కోటాలోని పలు క్లాసులు చట్ట విరుద్ధమని పేర్కొంటూ కొట్టివేసింది. 2010 తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్‌లను రద్దు చేసింది.2012 పశ్చిమబెంగాల్‌ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలో పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్లు డివిజన్‌ బెంచ్‌ తెలిపింది. ఓబీసీ వర్గీకరణ చట్టవిరుద్ధంగా ఉందని స్పష్టంచేసింది.అయితే, ఈ తీర్పును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఇది కచ్చితంగా బీజేపీ కుట్రేనని ఆరోపించారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు ఎప్పటిలాగే అమలవుతాయన్నారు.

Prabhas Nag Ashwin Kalki 2898 AD Bujji Look Revealed
ప్రభాస్‌- నాగ్‌ అశ్విన్‌ 'కల్కి 2898 ఏడీ'.. బుజ్జి లుక్ చూశారా?

యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్- నాగ్‌ అశ్విన్ ‍కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్‌‌ ‌ చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ సినిమాను వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌ , కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ను మేకర్స్ రివీల్‌ చేయనున్నారు.ఈ సినిమాలోని బుజ్జి పేరుతో ఉన్న కారును ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన భారీ ఈవెంట్‌లో బుజ్జి లుక్‌ను రివీల్‌ చేశారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభాస్‌ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సినిమాను జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Darlings... In life, you meet people for the first time only once. World, meet #Bujji...- https://t.co/8XhJordNtn#Kalki2898AD #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @BelikeBujji @saregamaglobal… pic.twitter.com/SvwwuXpzBa— Kalki 2898 AD (@Kalki2898AD) May 22, 2024

Vande Bharat Services running late for hours
‘వందేభారత్‌’ నత్తనడక..

హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్‌ విజయవాడకు అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చి వందేభారత్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. కానీ, ఆ రోజు రైలు దాదాపు మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. తక్కువ టికెట్‌ ధర ఉన్న రైళ్ల కంటే ఆలస్యంగా అది విజయవాడకు చేరింది. వందేభారత్‌ సర్విసు మొదలైన 16 నెలల కాలంలో ఈ తరహా సమస్యలు తక్కువే, కానీ, ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్నాయి. వెంటవెంటనే ఏర్పడుతుండటం ఇటు ప్రయాణికులకు చికాకు తెప్పిస్తుండగా, రైల్వే అధికారులను కలవరపెడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్‌: భారతీయ రైల్వే ఆధునికతకు అద్దంపడుతూ దూసుకొచ్చిన ‘వందేభారత్‌’కూ సాంకేతిక సమస్యలు తప్పడం లేదు. రైళ్లలో సాంకేతిక సమస్యలు సాధారణమే అయినా, క్రమంగా ఆ సమస్య పెరుగుతోంది. దూర ప్రాంతాల మధ్య తిరిగే సాధారణ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లకు మూడు జతల రేకు(ఓ రైలు సెట్‌) ఉంటుంది.ప్రయాణ సమయం దాదాపు 26 గంటలు తీసుకునే హైదరాబాద్‌–ఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను తీసుకుంటే.. హైదరాబాద్‌లో ఉదయం ఒక రైలు బయలు దేరగా, దాని ఒక జత రైలు అదే రోజు ఢిల్లీలో బయలుదేరుతుంది. మరో జత రైలు దారిలో ఉంటుంది. తక్కువ దూరం తిరిగే వాటికి రెండు జతలుంటాయి. » హైదరాబాద్‌–విశాఖపట్నంలాంటి సాధారణ దూరం తిరిగే (సగం రోజు ప్రయాణ సమయం) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తీసుకుంటే.. ఒక రైలు హైదరాబాద్‌లో బయలుదేరుతుంటే, అదే సమయానికి దాని జత రైలు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. » హైదరాబాద్‌లో ఉదయం బయలుదేరే తిరుపతి వందేభారత్‌ రైలు, అదే రోజు మధ్యాహ్నం తిరుపతి చేరుకొని, కాసేపటికే అక్కడ బయలుదేరి రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంటుంది. దేశంలోని అన్ని వందేభారత్‌ రైళ్లది ఇదే తీరు. ఇక్కడే ఇప్పుడు సమస్య ఏర్పడుతోంది. ఒక చోట రైలు బయలుదేరేప్పుడు సాంకేతిక సమస్య ఏర్పడి ఆలస్యంగా బయలుదేరితే, గమ్యస్థానం చేరి, తిరిగి అక్కడ బయలుదేరేందుకు జాప్యం తప్పటం లేదు. » ఈనెల 16న విశాఖపట్నంలో హైదరాబాద్‌ వచ్చే వందేభారత్‌ రైలు మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. విజయవాడలో మరో రెండు గంటలు ఆలస్యమైంది. వెరసి ఐదు గంటలు ఆలస్యంగా హైదరాబాద్‌ చేరుకుంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు తిరుగుప్రయాణం ఉండాల్సి ఉండగా, ఐదు గంటలు ఆలస్యంగా రాత్రి 8 గంటలకు ఆ రైలు బయలుదేరాల్సి వచ్చింది. ఒక కోచ్‌లో సాంకేతిక సమస్య తలెత్తితే రైలు ఆగిపోవాల్సిందే.. ఇక వందేభారత్‌ డిజైన్‌ కూడా ఈ జాప్యానికి మరో కారణమవుతోంది. ఇది సంప్రదాయ ఎక్స్‌ప్రెస్‌ రెళ్లకు భిన్నంగా ఉంటుంది. డెమూ, మెమూ తరహాలో రెండు ఇంజిన్లు రైలులో అంతర్భాగంగా ఉంటాయి. మూడునాలుగు కోచ్‌లు కలిపి ఒక సెట్‌గా ఉంటుంది. దీనికి పవర్‌కార్‌ జత కలిసి ఉంటుంది. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రైళ్లు కూడా ఇదే డిజైన్‌తో ఉంటాయి. ఓ కోచ్‌లో సాంకేతిక సమస్య తలెత్తితే, ఆ కోచ్‌ ఉండే సెట్‌ మొత్తాన్ని తొలగించి దాని స్థానంలో మరో సెట్‌ చేర్చి రైలును పంపేస్తారు. తర్వాత.. సాంకేతిక సమస్య తలెత్తిన కోచ్‌ను డిపోనకు తీసుకెళ్లి మరమ్మతు చేస్తారు. ఇందుకోసం స్పేర్‌ కోచ్‌లను అందుబాటులో ఉంచుతారు. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ సర్విసుకు 12 కోచ్‌లతో కూడిన రెండు రేక్‌లు స్పేర్‌ విధుల్లో ఉన్నాయి. కానీ వందేభారత్‌కు స్పేర్‌ చోక్‌ సెట్‌లు లేవు. ఓ కోచ్‌లో సమస్య తలెత్తితే దానికి మరమ్మతు చేసేవరకు మొత్తం రైలును నిలిపివేయాల్సిందే. వారంరోజుల క్రితం విశాఖపట్నం నుంచి ఐదు గంటలు ఆలస్యంగా రావటానికి ఇదే కారణమైంది.

Arogyasree services as usual
యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు

సాక్షి, అమరావతి: డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద పేద, మధ్య తరగతి రోగులకు యథావిధిగా ఉచిత చికిత్సలు అందుతున్నాయి. పథకం సేవలు నిలిపివేసినట్టు కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటనలు చేశాయి. కాగా, ఎక్కడా పథకం సేవలు నిలిచిపోలేదని ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈవో) డాక్టర్‌ లక్ష్మీషా బుధవారం తెలిపా­రు.ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం కింద 3,257 ప్రొసీజర్‌లలో నగదు రహిత చికిత్సను అందిస్తున్నట్టు తెలిపారు. ఇలా ప్రతి కుటుంబానికీ వా­ర్షి­క చికి­త్స పరిమితి రూ.25 ల„ý­ ల వరకూ ఉందన్నారు. గత ఆరి్థక సంవత్సరం(2023–24)లో ఆరో­గ్యశ్రీ ట్రస్ట్‌ నుంచి రూ.3,566.­22 కోట్లు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు జమ చేశారు. బుధవారం ఆరోగ్యశ్రీ ట్ర­స్ట్‌ నుంచి అన్ని ఆస్పత్రులకు రూ.203 కోట్ల బిల్లులు చెల్లించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మొదటి రెండు నెలల్లోనే రూ.366 కోట్లు చెల్లించినట్లయింది. మిగిలిన బకా­యిలనూ త్వరలోనే విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఐదేళ్లలో వైద్య శాఖలో 54 వేల పోస్టుల భర్తీ కొన్ని ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటనలిస్తున్న క్రమంలో పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌లకు వైద్య శాఖ ఆదే­శాలిచ్చింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలంది. ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల వైద్య సేవలకు అంతరాయం కలిగించే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సూపరింటెండెంట్లకు సూ­చించింది. గత ఐదేళ్లలో 54 వేల మేర వైద్య శాఖలో పోస్టులు భర్తీ చేశారు. దీంతో ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్యులు ఉన్నారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement