Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

AP Chandrababu Govt Debt 30000 crs Over Amaravathi1
అప్పులతోనే అమరావతి.. పెండింగ్‌ పనులకు 30వేల కోట్లు!

సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్‌ అప్పులు చేయడంలో ఫుల్‌ బిజీ అయిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పులతోనే అమరావతిలో నిర్మాణాలకు ప్లాన్‌ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఏడీబీ, ప్రపంచ బ్యాంక్‌ ద్వారా కేంద్రం అప్పులు ఇప్పిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి కోసం బాబు సర్కార్‌ 30వేల కోట్ల అప్పులు చేస్తోంది.అప్పులతోనే అమరావతి చేస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు నుండి రూ.6,800 కోట్ల అప్పు తీసుకునేందుకు నిన్న బోర్డు మీటింగ్‌లో ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే, ఏడీబీ ద్వారా అమరావతి కోసం ప్రభుత్వం రూ.6700 కోట్లు అప్పు తెస్తోంది. ప్రపంచబ్యాంకు, ఏడీబీ అప్పులు కలుపుకుంటే అమరావతి కోసమే బాబు సర్కార్‌ రూ.13,500 కోట్లు అప్పులు చేస్తోంది.ఈ నేపథ్యంలో అమరావతికి కేంద్రం ఇచ్చేది గ్రాంట్ కాదు అప్పు మాత్రమేనని మరోసారి తేలింది. కేంద్రం నిధులు ఇస్తోందంటూ ఇన్నాళ్లూ చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. కానీ, కేంద్రం కేవలం.. ఏడీబీ, ప్రపంచ బ్యాంక్‌ నుంచి అప్పులు మాత్రమే ఇప్పిస్తోంది. ఈ అప్పులన్నింటీనీ కూటమి సర్కార్‌.. అమరావతి కోసం మళ్లిస్తోంది. మరోవైపు.. హడ్కో ద్వారా 11వేల కోట్లు, కేఎఫ్‌డబ్ల్యూ ద్వారా 5 వేల కోట్లను బాబు సర్కార్‌ అప్పుగా తీసుకుంది. ఈ క్రమంలో​ కూటమి ప్రభుత్వం అమరావతి కోసం సుమారు 30 వేల కోట్ల అప్పు చేస్తోంది. అమరావతిలో పెండింగ్ భవనాల కోసం అప్పులు చేస్తూ.. ప్రభుత్వం అన్ని జిల్లాల్లో అభివృద్ధి పనులను నిలిపి వేసింది. ప్రస్తుతం అప్పులన్నీ అమరావతికే కేటాయిస్తోంది.

UI Movie Review And Rating Telugu2
ఉపేంద్ర 'యూఐ' సినిమా రివ్యూ

హీరో ఉపేంద్ర స్వతహాగా కన్నడ హీరో. కానీ తెలుగులో సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఈయన సినిమాలు అలా ఉంటాయి మరి! 25 ఏళ్ల క్రితమే 'ఏ', 'ఉపేంద్ర' లాంటి విచిత్రమైన మూవీస్ తీశారు. అప్పట్లో ఇవి జనాలకు అర్థం కాలేదు కానీ ఈ మధ్య కాలంలో మాత్రం సూపర్ బంపర్ అని తెగ పొగిడేస్తున్నారు. అలాంటి ఉపేంద్ర చాన్నాళ్ల తర్వాత ఓ మూవీకి దర్శకత్వం వహించాడు. దీంతో మూవీ లవర్స్‌ ఎగ్జైట్ అయ్యారు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం!(ఇదీ చదవండి: Mufasa Review: ముఫాసా మూవీ రివ్యూ)కథేంటి?ఉపేంద్ర దర్శకత్వం వహించిన 'యూఐ' సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇది చూసి జనాలు మెంటలెక్కిపోతుంటారు. మూవీ చూస్తున్నప్పుడు ఫోకస్ కుదిరినోళ్లు.. వింతగా ప్రవర్తిస్తుంటారు. ఫోకస్ కుదరనోళ్లు మళ్లీ మళ్లీ మూవీ చూస్తుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ కిరణ్ ఆదర్శ్ (మురళీశర్మ).. థియేటర్లలో ఈ మూవీ పదే పదే చూసినా సరే రివ్యూ రాయలేకపోతుంటాడు. దీంతో ఈ స్టోరీ సంగతేంటో తేలుద్దామని ఏకంగా డైరెక్టర్ ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అయితే రాసిన కథ, సినిమాలో చూపించిన కథ వేర్వేరు అని తెలుసుకుంటాడు. ఇంతకీ ఉపేంద్ర రాసిన కథేంటి? ఈ స్టోరీలో సత్య (ఉపేంద్ర), కల్కి భగవాన్ ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.ఎలా ఉందంటే?సినిమా అంటే హీరోహీరోయిన్, పాటలు, ఫైట్స్, ట్విస్టులు, టర్న్‌లు.. ఇలా ఆయా జానర్ బట్టి ఓ ఫార్మాట్ ఉంటుంది. కానీ అలాంటివేం లేకుండా ఎవరైనా మూవీ తీస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఉపేంద్ర అదే ఆలోచించాడు. 'యూఐ' చూస్తున్నంతసేపు అబ్బురపరిచే విజువల్స్, డిఫరెంట్ యాక్టింగ్, వింత వింత గెటప్స్.. ఇలా కొందరికి నచ్చే బోలెడన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. నాణెనికి మరోవైపు అన్నట్లు మరికొందరికి సహనానికి రెండున్నర గంటల పాటు పరీక్ష పెడుతుంది.సినిమా మొదలవడమే వింత టైటిల్ కార్డ్ పడుతుంది. 'మీరు తెలివైనవాళ్లు అయితే థియేటర్ నుంచి వెళ్లిపోండి. మూర్ఖులైతేనే చూడండి' అని ఉంటుంది. దీనిబట్టే మూవీ ఎలా ఉండబోతుందనేది హింట్ ఇచ్చారు. ఈ సినిమాలో కూడా 'యూఐ' సినిమానే ఉంటుంది. దీన్ని చూసి ప్రతి ఒక్కరూ మెంటల్ అయిపోతుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ తరణ్ ఆదర్శ్‌ని గుర్తుచేసేలా కిరణ్ ఆదర్శ్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతడు 'యూఐ' సినిమాని చూసి రివ్యూ రాయలేకపోతుంటాడు. అసలు ఈ సినిమా గురించి మరింత లోతుగా తెలుసుకుందామని.. నేరుగా ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అక్కడ అతడి రాసి, మంటల్లో పడేసిన మరో స్టోరీ దొరుకుతుంది. అయితే అది అప్పటికే సగం కాలిపోయిన పేపర్లలో ఉంటుంది. కిరణ్ ఆదర్శ్ అది చదవడంతో అసలు కథ మొదలవుతుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)అక్కడ నుంచి సత్య పాత్ర, ప్రపంచంలోని అన్ని మతాల వాళ్లు ఒకేచోట ఉండటం, దేవుడిని నమ్మకపోవడం.. ఇలా విచిత్రమైన సీన్స్ వస్తుంటాయి. సాధారణంగా హీరో ఇంట్రో అనగానే విలన్స్‌ని అతడు చితక్కొట్టేయడం చూస్తుంటాం. కానీ ఇందులో హీరో పరిచయ సన్నివేశంలో విలన్లు ఇతడిని రక్తలొచ్చేలా కొడతారు. అక్కడి నుంచి సినిమా తీరుతెన్ను లేకుండా ఎటెటో పోతూ ఉంటుంది. మధ్యమధ్యలో జనాలు ప్రస్తుతం చేస్తున్న కొన్ని పనుల వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయోనని మెసేజులు ఇస్తూ పోతుంటారు.భూమ్మీద తొలి జంట ఆడమ్-ఈవ్ దగ్గర నుంచి మొదలుపెట్టి.. భూమిని మనుషులు దోచుకోవడం.. జాతి, ధర్మం పేరు చెప్పి మనుషులతో నాయకులు చేసే రాజకీయం.. ఇలా ఒకటేమిటి చాలానే వస్తుంటాయి. అక్కడక్కడ కాస్త నవ్వు తెప్పించే సీన్స్ ఉన్నప్పటికీ.. ప్రారంభంలోనే చెప్పినట్లు చాలా ఓపిగ్గా చూస్తే తప్పితే ఈ మూవీ అర్థం కాదు. ఇంటర్వెల్, క్లైమాక్స్ కూడా మీరు అనుకున్న టైమ్‌కి రావు. అవి ఎప్పుడు వస్తాయో కూడా ఊహించడం కష్టం. 'మీ కామం వల్ల పుట్టాడు. కానీ మీ కొడుక్కి కామం తప్పు అని చెబుతారా?' లాంటి సెటైరికల్ సీన్స్ నవ్విస్తూనే ఆలోచింపజేస్తాయి.ఎవరెలా చేశారు?ఉపేంద్ర అంటేనే కాస్త డిఫరెంట్. ఇందులో నటుడిగా ఆకట్టుకున్నాడు. దర్శకుడిగా ఆకట్టుకున్నాడా అంటే సందేహమే! హీరోయిన్ పాత్ర అసలెందుకో కూడా తెలీదు. మూడు నాలుగు సీన్లు ఉంటాయంతే! ఇతర పాత్రల్లో రవిశంకర్, అచ్యుత్, సాధు కోకిల లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్నప్పటికీ.. ఒక్కర్ని కూడా సరిగా ఉపయోగించుకోలేదు. మిగిలిన యాక్టర్స్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు.టెక్నికల్ విషయాలకొస్తే రైటర్ అండ్ డైరెక్టర్ ఉపేంద్ర గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న చాలా సమస్యలపై సెటైరికల్‌గా ఓ మూవీ తీద్దామనుకున్నాడు. దాన్ని సైకలాజికల్ కాన్సెప్ట్‌కి ముడిపెట్టి.. వైవిధ్యంగా ప్రేక్షకులకు చూపిద్దామనుకున్నాడు. తీసి చూపించాడు కూడా. కాకపోతే అది జనాలకు నచ్చుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్!బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు బాగుంది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ చాలా కష్టపడింది. అసలు ఎప్పుడు చూడని ఓ వింత ప్రపంచాన్ని సృష్టించారు. టైటిల్స్ పడిన దగ్గర నుంచి చివరివరకు సినిమాటోగ్రఫీ వైవిధ్యంగా ఉంది. గ్రాఫిక్స్ మాత్రం అక్కడక్కడ తేలిపోయింది. ఓవరాల్‌గా చూస్తే ఈ సినిమా కొంచెం కొత్తగా.. కొంచెం వింతగా ఉంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'పుష్ప 2' ఓటీటీ రిలీజ్ ప్లాన్ మారిందా?)

BRS KTR Filed Quash Petition In Telangana High Court3
ఫార్ములా ఈ-కార్‌ కేసు..కేటీఆర్‌ పిటిషన్‌పై హోరాహోరీ వాదనలు

సాక్షి, హైదరాబాద్‌: ఫార్ములా ఈ-రేసుల కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఏసీబీ కేసుపై కేటీఆర్‌ కోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్‌లో కేటీఆర్‌ కోరారు. జస్టిస్‌ శ్రవణ్‌కుమార్‌ బెంచ్‌ ముందు కొనసాగుతున్న హోరాహోరీ వాదనలుకేటీఆర్‌ తరపున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది‌ సుందరం ఏసీబీ తరపున వాదిస్తున్న ఏజీ సుదర్శన్‌రెడ్డి కేటీఆర్‌ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం వాదనలు..ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనతో ఏసీబీకి ఏం సంబంధం కోడ్‌ ఉల్లంఘన జరిగితే ఏసీబీ చూసుకుంటుందినిధుల చెల్లింపునకు పీసీ యాక్ట్‌ వర్తించదు కేటీఆర్‌కు లబ్ధి జరిగిందని ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా లేదురాజకీయ దురుద్దేశంతోనే తప్పుడు కేసులు పెట్టారు సీజన్‌ 9లోనే అగ్రిమెంట్‌ జరిగిందిసీజన్‌ 10కి అగ్రిమెంట్‌ అవసరం లేదురేస్‌ కోసం నిధులు చెల్లిస్తే కేటీఆర్‌పై కేసు ఎందుకు పెట్టారు కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు పెట్టారో తెలియదు ప్రాథమికంగా ఎలాంటి దర్యాప్తు చేయకుండా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం చట్ట విరుద్ధంనేరం జరిగిందని తెలిసిన మూడు నెలల్లోనే కేసు రిజిస్టర్‌ చేయాలి 11 నెలల తర్వాత కేసు నమోదు చేశారు లలిత్‌ కుమార్‌ వర్సెస్‌ యూపీ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ను ప్రస్తావించిన న్యాయవాది అగ్రిమెంట్‌ జరిగిన 14 నెలలకు కేసు పెట్టారు ఎలాంటి ఆలస్యం జరగలేదని ఎఫ్‌ఐఆర్‌లో రాశారు18న ఎంఏయూడీ సెక్రటరీ దాన కిషోర్‌ ఫిర్యాదు చేస్తే 19న కేసు పెట్టారుమూడో విడత నిధులు చెల్లించాలని గత ఏడాది డిసెంబర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రేసులు నిర్వహించే ఎఫ్‌ఈవో సంస్థ లేఖ రాసిందిప్రభుత్వం నిధులు చెల్లించేందుకు నిరాకరించడంతో ఫార్ములా ఈ ఒప్పందం రద్దైందిప్రభుత్వానికి ఇష్టం లేకపోతే అవినీతి ఉన్నట్టా ఫార్ములా ఈ రేసుల వల్ల తెలంగాణకు రూ.700 కోట్ల లాభం జరిగింది పీసీ యాక్ట్‌లో డబ్బులు ఎవరికి వెళ్లాయో వాళ్లని నిందితులుగా చేర్చాలి కానీ ఇక్కడ డబ్బులు చేరింది ఎఫ్‌ఈవో సంస్థకుఎఫ్‌ఈవో సంస్థను ముందు నిందితుడిగా చేర్చాలి ఇది కరప్షన్‌ కేసు ఎలా అవుతుంది..పీసీ యాక్ట్‌ ఎందుకు వర్తిస్తుంది ముగిసిన కేటీఆర్‌ తరపు న్యాయవాది వాదనలు ఏసీబీ తరపున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలివే..ప్రాథమిక విచారణ జరిగాకే కేసు నమోదైందిరెండు నెలల క్రితం ఎంఏయూడీ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ ఫిర్యాదు చేశారువిచారణకు గవర్నర్ కూడా అనుమతించారుఎఫ్‌ఐఆర్‌ ద్వారానే దర్యాప్తు జరుగుతుందిప్రతి విషయం ఎఫ్‌ఐఆర్‌లో ఉండదుదర్యాప్తులో అనేక విషయాలు బహిర్గత మవుతాయి అంతకుముందు తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌ న్యాయవాది లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ మెన్షన్‌ చేశారు. జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్‌లో మెన్షన్ చేశారు కేటీఆర్ న్యాయవాది. దీనిలో భాగంగా ముందుగా సింగిల్ బెంఛ్‌ జస్టిస్ శ్రవణ్ దగ్గరకు కేటీఆర్‌ న్యాయవాది వెళ్లగా, ఈ బెంచ్‌లో క్వాష్ పిటిషన్ విచారించడానికి అనుమతి లేదని ఏసీబీ కౌన్సిల్ తెలిపారు. దీంతో కేటీఆర్ న్యాయవాదులు.. సీజే కోర్టులో లoచ్ మోషన్ మెన్షన్ చేశారు. పిటిషన్‌పై విచారణను హైకోర్టు స్వీకరించింది. కాసేపట్లో విచారణ జరగనుంది. ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే విదేశీ కంపెనీకి రూ. 55 కోట్ల నిధులు చెల్లించారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి, విచారణకు పిలిచే అవకాశం ఉంది. మరొకవైపు తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారుల లేఖ రాశారు. కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని ఈడీ లేఖలో కోరింది. ఎఫ్‌ఐఆర్ కాపీతోపాటు హెచ్‌ఎండీఏ అకౌంట్‌ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలను ఈడీ ఇవ్వాలని పేర్కొంది. అలాగే, దాన కిషోర్‌ ఫిర్యాదు కాపీ కూడా పంపించాలని కోరింది. ఇదే సమయంలో డబ్బు బదిలీలకు సంబంధించి ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీల వివరాలను సైతం ఇవ్వాలని ఈడీ లేఖలో పేర్కొంది మరోవైపు.. తాజాగా కేటీఆర్‌ మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ఈ కేసు విషయంలో నేనేమీ భయపడటం లేదు. అవినీతి జరగలేదని నిన్న మంత్రి పొన్నం చెప్పారు. ప్రొసీజర్‌ కరెక్ట్‌గా లేదని మాత్రమే పొన్నం అన్నారు. ముఖ్యమంత్రే అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారా?. మేము లీగల్‌గానే ముందుకు వెళ్తాం. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ గురించి కూడా చెప్పాలి. ఓఆర్‌ఆర్‌పై సిట్టింగ్‌ జడ్జీతో విచారణ జరిపించాలి. సిటిలో ఉండే అధికారులు ప్రభుత్వం చెప్పినట్టు వింటారు అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం కేసులు పెట్టాలని ముందుకుపోతే అది వాళ్ల ఇష్టం.. మేము లీగల్‌గా ఎదుర్కొంటామన్నారు.

Telangana Assembly Sessions Dec 20th Live Updates
ఫార్ములా ఈ- కార్‌ కేసుపై చర్చకు సిద్ధం: సీఎం రేవంత్‌

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య..

Couples Journey Ends As Bibek Loses Battle With Cancer Goes Viral5
సినిమాని తలపించే ప్రేమకథ..వింటే కన్నీళ్లు ఆగవు..!

ఎన్నో ప్రేమ కథలు చూశాం. వాటిలో కొన్ని మాత్రం విషాదంగా ముగిసిపోతే..మరికొన్ని కన్నీళ్లు తెప్పించేస్తాయి. అలాంటి భావోద్వేగపు గాథే ఈ ప్రేమ జంట కథ. సుఖాల్లో ఉన్నప్పుడు ఉండే ప్రేమ.. కష్టాల్లో కనుమరుగైపోతుందంటారు పెద్దలు. కానీ ఈ జంట మాత్రం కష్టాల్లో అంతకు మించి..ప్రేమ ఉందని ప్రూవ్‌ చేసింది. విధికే కన్నుకుట్టి వారి ప్రేమను పరీక్షించాలనుకుందో, కబళించాలనుకుందో గానీ కేన్సర్‌ మహమ్మారి వారి ప్రేమను దూరం చేయాలనుకుంది. కానీ ఈ నేపాలీ జంట తమ ప్రేమ అత్యంత గొప్పదని నిరూపించుకుని కష్టమే కుంగిపోయేలా చేశారు.సృజన, బిబేక్‌ సుబేదిలు తమ జీవితాన్ని డాక్యుమెంట్‌ రూపంలో ఇన్‌స్టాలో షేర్‌ చేయడంతో ఒక్కసారిగా ఆ జంట ప్రేమకథ అందరి దృష్టిని ఆకర్షించింది. బిబేక్‌ కేన్సర్‌తో భాదపడుతున్నాడు. కేన్సర్‌ ఫస్ట్‌ స్టేజ్‌ నుంచి ఫోర్త్‌స్టేజ్‌ వరకు తామెలా కష్టాలు పడుతుంది తెలియజేసింది. చెప్పాలంటే నెటిజన్లంతా సృజన కోసమైనా.. అతడు మృత్యవుని జయిస్తే బావుండనని కోరుకున్నారు. కానీ అలా జరగలేదు. బిబేక్‌ ఆ మహమ్మారి కారణంగా తనకెంతో ఇష్టమైన భార్యను కూడా గుర్తించలేని స్థాయికి వచ్చేశాడు సృజన పోస్ట్‌ చేసిన చివరి రీల్‌లో. అంతేగాదు ఇన్‌స్టాలో బిబెక్‌ 32వ పుట్టిన రోజుని సెలబ్రెట్‌ చేసిన విధానం అందర్నీ కంటతడి పెట్టిస్తుంది. ఎందుకంటే అప్పటికే అతడి పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉంది. ఏ పరిస్థితిలోనూ అతడి చేతిని వీడక ఎంతో ప్రేమగా చూసుకున్న సృజన తీరు అందరి మనసులను తాకింది. సృజన అధికారికంగా అతడు చనిపోయాడని ప్రకటించనప్పటికీ..నిశబ్ద వాతావరణంతో పరోక్షంగా బిబేక్‌ ఇక లేరనే విషయం వెల్లడించింది. డిసెంబర్‌ 1 నుంచి సృజన నుంచి ఎలాంటి వీడియో పోస్ట్‌ కాకపోయినా.. నెటిజన్లంతా సృజనకు ధైర్యం చెప్పడమేగాక, బిబేక్‌ లేకపోయినా.. మీప్రేమ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఇలాంటి కాలంలో ఇంత గొప్ప ప్రేమలు కూడా ఉన్నాయని చూపించారంటూ సృజనను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Crzana Subedi (@crzana_subedi_) (చదవండి: చిట్టి రచయితలు.. అందమైన కథలతో అలరిస్తున్నారు..)

Indian Post Office Best Accident Insurance Policy To Get 10 Lakh Need To Pay Rs 399 Yearly6
రూ.399 కడితే.. ₹10 లక్షల బీమా: ఇదిగో ఫుల్ డీటెయిల్స్

జీవితంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో.. ఎవ్వరూ ఊహించలేరు. కానీ ఊహకందని ప్రమాదం జరిగినప్పుడు ఆర్థికంగా కొంత నిలదొక్కుకోవడానికి ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కార్పొరేట్ సంస్థలు, ఐపీపీబీ (ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్).. 'గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్' ప్లాన్స్ ప్రవేశపెట్టింది. వీటికి సంబందించిన పూర్తి వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఐపీపీబీ రూ.399 ప్లాన్ఈ ప్లాన్ కింది మీరు ఏడాదికి రూ.399 చెల్లిస్తే.. ప్రమాదవశాత్తు మరణించినా లేదా వైకల్యం ఏర్పడినా, ప్రమాదంలో కాళ్ళు, చేతులు పనిచేయకుండా పోయినా.. రూ.10 లక్షల భీమా సౌకర్యం పొందవచ్చు.ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదం వల్ల హాస్పిటల్లో చేరితే యాక్సిడెంటల్ మెడికల్ ఖర్చులు కోసం రూ.60,000 లేదా ప్రమాదవశాత్తు వైద్య ఖర్చుల కోసం రూ.30,000 అందిస్తారు. అంతే కాకుండా హాస్పిటల్లో 10 రోజులు ఉంటే రోజుకు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి కుటుంబ ప్రయోజనం కింద రవాణా ఖర్చుల కోసం రూ.25,000 లభిస్తుంది. ఒకవేళ పాలసీదారు మరణిస్తే అంత్యక్రియల కోసం మరో రూ.5,000 అందుతాయి. ఈ ప్లాన్ కింద ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ప్రయోజనాలు లభిస్తాయి.ఐపీపీబీ రూ.299 ప్లాన్ఈ ప్లాన్ ఎంచుకునే పాలసీదారు సంవత్సరానికి రూ.299 చెల్లించి.. 10 లక్షల రూపాయల ప్రమాద భీమా పొందవచ్చు. ప్రమాదవశాత్తు మరణించినా లేదా వైకల్యం ఏర్పడినా, ప్రమాదంలో కాళ్ళు, చేతులు పనిచేయకుండా పోయినా.. రూ.10 లక్షల భీమా లభిస్తుంది.ఈ ప్లాన్ ఎంచుకునే పాలసీదారుకు రూ.399 ప్లాన్‌లో లభించే దాదాపు అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. కానీ ఎడ్యుకేషన్ బెనిఫీట్స్.. హాస్పిటల్లో 10 రోజులు ఉంటే రోజుకు రూ.1,000 చొప్పున లభించే ప్రయోజనాలు అందవు.ఇదీ చదవండి: బ్యాంకులకు ఆరు రోజులు వరుస సెలవులుదీనికి అర్హులు ఎవరంటే..18 నుంచి 65 సంవత్సరాల వయసున్న ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు.గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ దేనిని కవర్ చేయదంటే..ఆత్మహత్య చేసుకున్నా, మిలటరీ సర్విసెస్‌లో ఉంటూ మరణించినా, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినా, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడి కన్నుమూసినా, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఎయిడ్స్ వంటి వాటివల్ల చనిపోయినా.. ప్రమాదకరమైన క్రీడల్లో మృత్యువాత పడినా ఈ ఇన్సూరెన్స్ లభించదు.

Pakistan Create History With Series Win In South Africa, Becomes 1st Team In World7
చ‌రిత్ర సృష్టించిన పాకిస్తాన్‌.. ప్రపంచం‍లోనే తొలి జట్టుగా

వన్డే క్రికెట్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. గత నెలలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న పాకిస్తాన్‌.. ఇప్పుడు సౌతాఫ్రికా గడ్డపై అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. గురువారం కేప్‌టౌన్ వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డేలో ద‌క్షిణాఫ్రికాపై 81 ప‌రుగుల తేడాతో పాక్ ఘ‌న విజ‌యం సాధించింది.త‌ద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలూండ‌గానే 2-0 తేడాతో రిజ్వాన్ సేన సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలో పాకిస్తాన్ ఓ వ‌ర‌ల్డ్ రికార్డును త‌మ పేరిట లిఖించుకుంది. 21వ శతాబ్దంలో సౌతాఫ్రికా గడ్డపై వరుసగా మూడు వన్డేల సిరీస్‌ను గెలుచుకున్న తొలి జట్టుగా పాక్ చ‌రిత్ర సృష్టించింది.దక్షిణాఫ్రికాలో పాక్‌కు ఇది వరుసగా మూడో వన్డే సిరీస్ విజయం. ఇంతకుముందు 2013, 2021లో పాక్ వన్డే సిరీస్‌లను పాక్ సొంతం చేసుకుంది. మళ్లీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన మెన్ ఇన్‌​ గ్రీన్‌.. మరో వన్డే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది.ఓవరాల్‌గా 7 సార్లు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన పాక్ జట్టు.. మూడు సార్లు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. పాక్ తర్వాత ఆస్ట్రేలియా 10 పర్యటనల్లో మూడు సార్లు సఫారీ గడ్డపై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. కానీ ఆసీస్ మాత్రం వరుసగా సిరీస్ విజయాలు సాధించలేకపోయింది. ఇకు ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే డిసెంబర్‌ 22న జోహాన్స్‌బర్గ్‌ వేదికగా జరగనుంది.చదవండి: జాకెర్‌ అలీ మెరుపు ఇన్నింగ్స్‌.. వెస్టిండీస్‌ క్లీన్‌స్వీప్‌

Former Haryana Chief Minister Om Prakash Chautala dies at 898
హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్‌ చౌతాలా కన్నుమూత

చండీగఢ్ : హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) నేత ఓం ప్రకాష్ చౌతాలా (89) శుక్రవారం గురుగ్రామ్‌లోని తన నివాసంలో మరణించారు.దేశానికి 6వ ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన చౌదరి దేవి లాల్ కుమారుడే ఈ ఓం ప్రకాష్ చౌతాలా. 1935లో చౌతాలాలో జన్మించారు. 1989లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. రికార్డు స్థాయిలో నాలుగు పర్యాయాలు హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన చివరి పదవీకాలం 1999 నుండి 2005 వరకు కొనసాగింది.ఆరురోజుల సీఎంఓం ప్రకాశ్‌ చౌతాలా... 1989- 2004 మధ్య 4సార్లు హర్యానా సీఎంగా పనిచేశారు. అయితే, అనివార్య కారణాల వల్ల 1990 జూలై 12 నుంచి జూలై 17 వరకు కేవలం ఆరు రోజుల పాటు మాత్రమే సీఎంగా ఉన్నారు. అదే విధంగా... మూడోసారి పదవి చేపట్టిన ఆయన 17 రోజుల పాటు సీఎంగా ఉన్నారు.టీచర్ల నియామకాల్లో అవినీతి.. పదేళ్లు జైలు శిక్షహర్యానా సీఎంగా ఎనలేని కీర్త ప్రతిష్టలు సంపాదించుకున్న ఓం ప్రకాష్‌ చౌతాలా రిక్రూట్‌మెంట్ స్కామ్‌తో సహా పలు కేసుల్లో జైలు జీవితాన్ని గడిపారు. ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో చౌతాలా పదేళ్లు జైలు శిక్ష అనుభవించారు. 2000 సంవత్సరంలో 3,206 మంది జూనియర్ ఉపాధ్యాయులను అక్రమంగా నియమించిన కేసులో చౌతాలా, అతని కుమారుడు అజయ్ చౌతాలా, ఐఏఎస్ అధికారి సంజీవ్ కుమార్ సహా 53 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో 2013లో చౌతాలా అరెస్టయ్యారు.అయితే కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ ప్రభుత్వం జైళ్లలో రద్దీని తగ్గించే ప్రయత్నంలో పదేళ్ల జైలు శిక్షలో కనీసం తొమ్మిదిన్నర సంవత్సరాల శిక్ష కాలం పూర్తి చేసిన వారికి 6నెలలు మినహాయింపును ఇచ్చింది. ప్రభుత్వం నిర్ణయంతో ఓం ప్రకాశ్‌ చౌతాలాకు ఆరు నెలల మినహాయింపు లభించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. इंडियन नैशनल लोकदल के प्रमुख चौधरी #OmPrakashChautala का निधन।pic.twitter.com/5rXmDjJaSR— कटाक्ष (@Kataksh__) December 20, 2024అక్రమ ఆస్తుల కేసులోఅక్రమ ఆస్తుల కేసులో హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్‌ చౌతాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు. 1993–2006 మధ్య కాలంలో ఆయన ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని ఆరోపణలు వచ్చాయి. 2005లో చౌతాలాపై కేసు నమోదు చేసిన సీబీఐ 2010 మార్చి 26న చార్జిషీటు దాఖలు చేసింది.హర్యానా సీఎంగా ఉన్న కాలంలో చౌతాలా తన పేరుతో, కుటుంబ సభ్యుల పేర్లతో భారీగా స్థిర, చరాస్తులెన్నిటినో కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఆయన వాస్తవంగా చూపిన ఆదాయం కంటే 189.11% ఎక్కువగా, అంటే రూ.6.09 కోట్ల ఆస్తుల్ని సమకూర్చుకున్నారని, ఇందుకు తగిన ఆధారాలను చూపలేకపోయారని సీబీఐ పేర్కొంది.పదో తరగతి ఫెయిల్‌చౌతాలా పదో తరగతిలో ఇంగ్లీష్‌ సబ్జెట్‌లో ఫెయిలయ్యారు. దీంతో చదువుకు పులిస్టాప్‌ పెట్టారు. అయితే లేటు వయస్సులో పదో తరగతి పరీక్ష రాసి పాసయ్యారు. 2021లో పదోతరగతి పరీక్షలు రాసి పాసయ్యారు. విచిత్రం ఏంటంటే? చౌతాలా అక్రమాస్తుల కేసులో తీహార్‌ జైలులో శిక్షను అనుభవించారు. ఆ సమయంలో పదోతరగతి పాస్‌ అవ్వకుండానే కరోనా తొలి దశలో ఓపెన్‌ స్కూల్‌లో చౌతలా ఇంటర్మీడియట్‌లో చేరారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు రాయకుండానే ఓపెన్‌ విద్యార్థులంతా పాసయ్యారు. ఆ క్రమంలో చౌతలా కూడా పాసయ్యాడు. అయితే పది పూర్తి చేయకుండానే ఇంటర్‌కు ఉత్తీర్ణత ఇవ్వడం కుదరకపోవడంతో అధికారులు ఫలితాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత జరిగిన పదో తరగతి ఇంగీష్‌ పరీక్ష రాశారు. విడుదలైన ఫలితాల్లో 100కు 88 మార్కులు సాధించి పదో తరగతి గండాన్ని దాటేశాడు.తీహార్‌ జైల్లో.. ఫస్ట్‌ క్లాస్‌లో ఇంటర్‌ పాస్‌సుప్రీం కోర్టు తీర్పుతో తీహార్‌ జైలులో శిక్ష అనుభవించే చౌతాలా డిగ్రీ చదవాలని నిర్ణయించుకున్నారు. అందుకే 82 ఏళ్ల వయసులో చౌతాలా ఇంటర్ చదివారు. తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల చదువు కోసం ఏర్పాటు చేసిన కేంద్రంలో నేషనల్ ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్) ఇంటర్‌లో పరీక్షల్లో ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు.

Congress Jagga Reddy Satirical Comments On Modi And Amit Shah9
అంబేద్కర్‌ వల్లే మోదీ, అమిత్‌ షాకు పదవులు: జగ్గారెడ్డి

సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి తెలిపారు. ఇదే సమయంలో అంబేద్కర్ రాజ్యాంగం వేరు.. భగవంతుడు వేరు అన్న విషయం అమిత్ షా గుర్తించాలి అంటూ కామెంట్స్‌ చేశారు.తాజాగా కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించిన విధానంపై రాహుల్ గాంధీ గళం విప్పారు. పార్లమెంట్ నిండు సభలో అంబేద్కర్‌ను అవమానించేలా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొనే వరకు రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. చట్టాలు, న్యాయాలు అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఉన్నాయి. బీసీలుగా చెప్పుకొనే మోదీ, అమిత్ షా కూడా అంబేద్కర్ రాజ్యాంగం వల్లే పదవులు పొందారు.అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశ ప్రజల భావాలు దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. రాహుల్ గాంధీ బాధ్యత.. గాంధీ, నెహ్రూ అడుగుజాడల్లో నడవటం. అంబేద్కర్ రాజ్యాంగం వేరు భగవంతుడు వేరు అనే విషయం అమిత్ షా గుర్తించాలి. అమిత్ షా, రాహుల్ గాంధీకి తేడా.. రాహుల్ గాంధీ దేవుని మొక్కుతాడు కానీ పబ్లిసిటీ చేయరు. బీజేపీ నేతలు కూడా దేవుడ్ని మొక్కతారు కానీ, పబ్లిసిటీ చేసుకుంటారు. దేవుడు అనేది నమ్మకం ధైర్యం.. భగవంతుడు అనేది వ్యక్తిగత విషయం. కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ పిలుపునకు సిద్ధంగా ఉంటారు’ అని కామెంట్స్‌ చేశారు.

speaker ayyanna patrudu Sensational Comments On Pensions10
పెన్షన్‌దారులు దొంగలతో సమానం.. అయ్యన్న సంచలన వ్యాఖ్యలు

సాక్షి, అనకాపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో పెన్షన్లను తొలగించే కుట్ర జరుగుతోంది. ఈ క్రమంలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు పెన్షన్‌దారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెన్షన్‌దారులను దొంగలతో పోల్చడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కుట్రకు తెర లేపింది. పెన్షన్లను తొలగించేందుకు ప్లాన్‌ చేస్తో​ంది. ఈ క్రమంలోనే స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా అయ్యన్న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పెన్షన్‌దారులను దొంగలతో పోల్చారు. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 20 వేల మంది తప్పుడు ధ్రువపత్రాలు చూపించి దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారు. వారంతా దొంగలతోనే సమానం అని కామెంట్స్‌ చేశారు.ఇదే సమయంలో పెన్షన్‌దారుల కారణంగానే ప్రభుత్వానికి నష్టం వస్తోందన్నారు. పెన్షన్ల వలన నెలకు రూ.120 కోట్ల నష్టం వస్తోంది. సంవత్సరానికి రూ.1440 కోట్ల నిధులు పక్కదారి పడుతున్నాయి. ఎవరు.. ఏం అనుకున్నా నాకు అనవసరం. ఈ పెన్షన్లను తొలగించాల్సిందే అంటూ కామెంట్స్‌ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో అయ్యన్నపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
సింగపూర్‌లో కిరణ్ ప్రభ-కాంతి కిరణ్ దంపతులతో ముఖాముఖీ

శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూరు ఆద్వర్యంలో "కిరణ్ ప్రభ, కాంతి కిరణ్ దంపతులతో" ఇష్టాగోష్టి కార్యక్రమం ఉత్సాహంగా  

title
అమెరికాలో వలసదారులు

అభివృద్ధి చెందిన అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడేందుకు ప్రపంచ దేశాల్లోని ప్రజలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

title
టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'' 209 వ సాహిత్య సదస్సు

డాలస్‌లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక 'నెల నెలా తెలుగు వెన్నెల' 209వ సాహిత్య సదస్సు ఘనంగా జరిగిం

title
లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆవిర్భవించినప్పటి నుండి “భాషే రమ్యం, సేవే గమ్యం” దిశగా పయనిస్తూ...

title
ఫిలడెల్ఫియాలో నాట్స్ బాలల సంబరాలకు అద్భుత స్పందన

అమెరికాలో తెలుగు జాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఫిలడెల్ఫియాలో బాలల సంబరా

Advertisement
Advertisement