Benjamin Netanyahu
-
అమెరికాపై సుంకాలు ఎత్తేసిన ఇజ్రాయెల్
జెరూసలేం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల హెచ్చరికలు పని చేస్తున్నాయి. అమెరికా దిగుమతులపై అన్ని సుంకాలను ఇజ్రాయెల్ ఎత్తేసింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బుధవారం ఈ మేరకు ప్రకటించారు. ‘‘అమెరికా వస్తువులపై కస్టమ్స్ సుంకాలను రద్దు చేయడమంటే మార్కెట్‌ను ఒక దశాబ్దం పాటు పోటీకి తెరవడం. ఆర్థిక వ్యవస్థకు వైవిధ్యాన్ని పరిచయం చేయడం. జీవన వ్యయాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం ఎంచుకున్న విధానాల్లో ఇది అదనపు దశ. మార్కెట్‌కు, ఇజ్రాయెల్ పౌరులకు ప్రయోజనం చేకూర్చేది. ఇజ్రాయెల్, అమెరికాల సంబంధాలను ఈ చర్య మరింత బలోపేతం చేస్తుంది’’ అని ‘ఎక్స్’లో నెతన్యాహు ప్రకటించారు.40 ఏళ్ల స్వేచ్ఛా వాణిజ్యంఇజ్రాయెల్, అమెరికా మధ్య 40 ఏళ్లుగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లో ఉంది. 99 శాతం అమెరికా దిగుమతులను ఇజ్రాయెల్ ఇప్పటికే సుంకాల నుంచి మినహాయించింది. ఈ నేపథ్యంలో తాజా చర్యను ఆర్థిక చర్యగా కంటే దౌత్య, రాజకీయ చర్యగా భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా వ్యవసాయోత్పత్తులపై ఇజ్రాయెల్ ఏటా 42 మిలియన్ షెకెల్స్ (సుమారు 1.15 కోట్ల డాలర్ల) సుంకాలు వసూలు చేస్తోంది. ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం 2024లో ఆ దేశం మొత్తం ఎగుమతుల విలువ 172 కోట్ల డాలర్లు. అమెరికా నుంచి దిగుమతుల విలువ 92 కోట్ల డాలర్లు. -
విడుదల చేయకుంటే నరకమే
జెరూసలెం: గాజాలో బందీలుగా ఉన్న వారందరినీ హమాస్ విడుదల చేయకపోతే నరక ద్వారాలు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. ‘‘గాజా విషయంలో ఇజ్రాయెల్, అమెరికాలకు ఉమ్మడి వ్యూహం ఉంది. ఈ వ్యూహం వివరాలను ప్రజలతో పంచుకోలేం. హమాస్ సైనిక, రాజకీయ ఉనికిని నిర్మూలించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నరకం గేట్లు ఎప్పుడు తెరుచుకుంటాయో వివరాలను తాము చెప్పలేం. బందీలందరినీ విడుదల చేయకపోతే మాత్రం అవి ఖచ్చితంగా తెరుచుకుంటాయి. గాజాలో హమాస్ సైనిక సామర్థ్యాన్ని, దాని రాజకీయ పాలనను అంతమొందిస్తాం. బందీలందరినీ స్వదేశానికి తీసుకొస్తాం. గాజా నుంచి మరోసారి ఇజ్రాయెల్‌కు ముప్పు వాటిల్లకుండా చూస్తాం’’అని నెతన్యాహూ వ్యాఖ్యానించారు. పశ్చిమాసియా పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆదివారం జెరూసలెం నగరానికి చేరుకుని అక్కడ నెతన్యాహుతో సమావేశమయ్యారు. అధ్యక్షుడు ట్రంప్ గాజా స్వా«దీన ప్రతిపాదనపై అరబ్ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు కొనసాగుతుందని రూబియో పునరుద్ఘాటించారు. ‘‘హమాస్ సైనిక లేదా ప్రభుత్వ శక్తిగా కొనసాగదు. హమాస్ అధికారంలో ఉన్నంత కాలం శాంతి అసాధ్యం. దానిని నిర్మూలించలేదు’’అని ఆయన ఉద్ఘాటించారు. రూబియో గానీ, నెతన్యాహు గానీ గాజా కాల్పుల విరమణ నిబంధనలను ప్రస్తావించలేదు. ఇరాన్‌పై ప్రత్యేక దృష్టి.. గాజా పరిస్థితితోపాటు ఇరాన్ గురించి నెతన్యాహు, రూబియో ప్రత్యేకంగా చర్చించారు. పశ్చిమాసియా మొత్తం సంక్షోభానికి ఇరాన్ కారణమని రూబియో, నెతన్యాహు ఆరోపించారు. టెహ్రాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా ఆపాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. పశ్చిమాసియాలోని ప్రతి ఉగ్రవాద సంస్థ వెనుక, ప్రతి హింసాత్మక చర్య వెనుక, ఈ ప్రాంతంలో లక్షలాదిమంది ప్రజల శాంతి, సుస్థిరతకు ముప్పు కలిగించే ప్రతి ఘటన వెనుక ఇరాన్ ఉంది’’అని రూబియో వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పటికే ఇరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ మద్దతుతో మిగిలిన పనిని పూర్తి చేస్తాం’’అని నెతన్యాహు అన్నారు. ఇజ్రాయెల్ దాడి బందీల మార్పిడి కొనసాగుతుండగా ఆదివారం ఈజిప్టు సరిహద్దులోని రఫా సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపింది. దాడిలో ముగ్గురు హమాస్ సాయుధులు మరణించారు. ఈ దాడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, ఒప్పందాన్ని విచ్చిన్నం చేసేందుకు నెతన్యాహు ప్రయత్నిస్తున్నారని హమాస్ ఆరోపించింది. కాల్పుల విరమణ మొదటి దశ మరో రెండు వారాల్లో ముగియనుంది. రెండవ దశ కోసం చర్చలు ప్రారంభం కావాల్సి ఉంది.త్వరలో పాలస్తీనియన్ల తరలింపు: ఇజ్రాయెల్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా నుంచి పాలస్తీనియన్ల సామూహిక తరలింపు త్వరలో ప్రారంభమవుతుందని తాను ఆశిస్తున్నట్లు ఇజ్రాయెల్ అతివాద ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మోట్రిచ్ శనివారం రాత్రి చెప్పారు. రాబోయే వారాల్లో ఇది ప్రారంభమవుతుందని ఆశిస్తున్నానన్నారు. ‘‘వచ్చే 10 నుంచి 15 ఏళ్ల వరకు గాజాలో పాలస్తీనియన్లకు ఏమీ ఉండదు. హమాస్ తిరిగి యుద్ధానికి ప్రయతి్నస్తే గాజా అంతా జబాలియా లాగా మరుభూమిగా మారడం ఖాయం’’అని మంత్రి బజాలెల వ్యాఖ్యానించారు. గాజా నుంచి పాలస్తీనియన్లను ఉద్దేశపూర్వకంగా తరలించడం మానవాళికి వ్యతిరేకంగా జరిగే నేరమని పలు అంతర్జాతీయ సంస్థలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్‌పై మారణహోమం ఆరోపణలను అంతర్జాతీయ న్యాయస్థానం ఇప్పటికే పరిశీలిస్తోంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు గాజాలో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్పై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. కాగా, రెండు అంతర్జాతీయ ట్రిబ్యునళ్లను నెతన్యాహు తప్పుబట్టారు. అంతర్జాతీయ న్యాయస్థానంపై ఆంక్షలు విధించినందుకు ట్రంప్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన అంతర్జాతీయ న్యాయ సంస్థలపై మరిన్ని సంయుక్త చర్యలు తీసుకోవాలని సూచించారు. -
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఈ సారి ఏకంగా!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)పై ఆంక్షలు విధించారు. ఐసీసీ అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు కోర్టు దర్యాప్తులకు సహకరించారని తేలితే వారి ఆస్తుల్ని స్తంభింప చేయడంతో పాటు వారి ప్రయాణాలపై నిషేధం విధించారు. అమెరికా, తన మిత్రదేశమైన ఇజ్రాయెల్ లక్ష్యంగా ఐసీసీ నిరాధారమైన దర్యాప్తులు చేస్తున్నందుకు గాను ట్రంప్ చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా గురువారం ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ట్రంప్‌తో నెతన్యాహు భేటీమంగళవారం ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ట్రంప్ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ జారీ చేశారు. ఆ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్లో నెదర్లాండ్‌లోని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. అందుకే చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సర్వీస్ సభ్యులపై, గాజాలో ఇజ్రాయెల్ దళాలు చేసిన యుద్ధ నేరాలపై ఐసీసీ దర్యాప్తుల్ని ప్రస్తావించారు. మాపై, మా మిత్రదేశం ఇజ్రాయెల్‌పై ఐసీసీ చట్టవిరుద్ధమైన, నిరాధారమైన చర్యలకు పాల్పడిందని ఆ ఉత్తర్వుల్లో వెల్లడించారు.నెతన్యాహుపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) గతేడాది అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అలాగే ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్ గల్లాంట్‌తోపాటు పలువురు హమాస్ నేతలపైనా వారెంట్లు జారీ చేసింది. బెంజమిన్, గల్లాంట్ గాజాలో మారణహోమం సాగించారని, మానవత్వంతో దాడి చేశారని ఐసీసీ ఆక్షేపించింది. హత్యలు చేయడం, సాధారణ ప్రజలను వేధించడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించింది.గాజాలో ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, విద్యుత్, ఇంధనం, ఇతర నిత్యావసరాలు అందకుండా ఆంక్షలు విధించారని, అమాయకుల మరణానికి కారకులయ్యారని మండిపడింది. నెతన్యాహు, గల్లాంట్ చర్యల వల్ల ఎంతోమంది మహిళలు, చిన్నారులు బలయ్యారని ఉద్ఘాటించింది. పౌష్టికాహారం, నీరు అందక, డీహైడ్రేషన్‌తో పసిబిడ్డలు మరణించారని పేర్కొంది.నెతన్యాహు, గల్లాంట్ ఉద్దేశపూర్వకంగానే సామాన్య ప్రజలపై వైమానిక దాడులు చేసినట్లు చెప్పడానికి సహేతుకమైన ఆధారాలను గుర్తించామని వివరించింది. గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభానికి నెతన్యాహు, గల్లాంట్ బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది. యుద్ధ నేరాల్లో నెతన్యాహు నిందితుడని స్పష్టం చేసింది. -
గాజాపై ట్రంప్ కన్ను
వాషింగ్టన్: సంచలనాల ట్రంప్ మరో అంతర్జాతీయ సమాజంపై మరో బాంబు విసిరారు. గాజాను అమెరికా పూర్తిగా స్వా«దీనం చేసుకుంటుందని ప్రకటించారు. ‘‘ఇజ్రాయెల్‌తో యుద్ధంలో శ్మశానసదృశంగా మారిన గాజాను అత్యంత సుందర పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. ఆర్థికాభివృద్ధి కార్యకలాపాలు చేపడతాం. భారీగా ఆవాస, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’’ అని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. గాజాలో ఉంటున్న దాదాపు 20 లక్షల మంది పాలస్తీనావాసులు ఆ ప్రాంతాన్ని వీడాల్సిందేనని స్పష్టం చేశారు. వారిని గాజా నుంచి శాశ్వతంగా తరలించి పునరావాసం కల్పిస్తామన్నారు. అయితే, పశ్చిమాసియాలోని పొరుగు దేశాలే వారిని అక్కున చేర్చుకోవాలని తేల్చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సమక్షంలోనే ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేయడం విశేషం. పాలస్తీనావాసులను గాజా నుంచి తరలించేందుకు, ఆ ప్రాంతాన్ని స్వా«దీనం చేసుకునేందుకు అమెరికాకు ఏం అధికారముందని ప్రశ్నించగా తన చర్య గాజా, ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియా అంతటికీ గొప్ప స్థిరత్వాన్ని తెస్తుందని ఆయన బదులిచ్చారు. గాజా స్వా«దీనానికి సైన్యాన్ని రంగంలోకి దించుతారా అని ప్రశ్నించగా, అన్ని అవకాశాలనూ పరిశీలిస్తామని బదులిచ్చారు. ఈ సందర్భంగా నెతన్యాహూ పదేపదే చిరునవ్వులు చిందిస్తూ కన్పించారు. ట్రంప్ ప్రకటనకు పూర్తి మద్దతు తెలిపారు. ‘‘ఈ నిర్ణయం చరిత్రను మార్చేస్తుంది. గాజాకు అద్భుతమైన భవిష్యత్తు అందిస్తుంది. ఇజ్రాయెల్‌కు ముప్పును శాశ్వతంగా తొలగిస్తుంది’’ అని ప్రకటించారు. ట్రంప్ ప్రకటన అంతర్జాతీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. పశ్చిమాసియా భౌగోళిక, రాజకీయ పరిస్థితులను అల్లకల్లోలం చేసేలా కనిపిస్తున్న ఈ ప్రతిపాదనను అక్కడి దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. పాలస్తీనా, సౌదీ అరేబియా, ఈజిప్‌్ట, తుర్కియేతో పాటు చైనా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ కూడా దీన్ని ఖండించాయి. అమెరికాలో విపక్ష నేతలు కూడా ట్రంప్ ప్రకటనను దుయ్యబడుతున్నారు. గాజావాసులకు తమ దేశంలో ఆశ్రయం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదనను ఈజిప్‌్ట, జోర్డాన్, తుర్కియే తదితర అమెరికా మిత్ర దేశాలన్నీ ఇప్పటికే ముక్త కంఠంతో తిరస్కరించడం తెలిసిందే. గ్రీన్‌లాండ్‌ను, పనామా కాల్వను స్వా«దీనం చేసుకుంటానని, కెనడాను అమెరికాలో కలిపేస్తానని ట్రంప్ ఇప్పటికే పలు వివాదాస్పద ప్రకటనలు చేశారు. అంతర్జాతీయ ప్రాంతంగా గాజా అమెరికా పర్యటనలో ఉన్న నెతన్యాహూతో ట్రంప్ మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ఆకస్మికంగా గాజా స్వా«దీన ప్రకటన చేశారు. దీన్ని పశ్చిమాసియా గర్వించదగ్గ విషయంగా అభివరి్ణంచారు. ‘‘పశ్చిమాసియా నమ్మశక్యం కానంత గొప్ప ప్రదేశం. అద్భుతమైన తీర ప్రాంతం. గొప్ప వ్యక్తులతో నిండిన అందమైన ప్రదేశాల్లో ఒకటి. గాజాలో త్వరలో పర్యటిస్తా. ఇజ్రాయెల్ అంటే నాకిష్టం. అక్కడ, సౌదీ అరేబియాలో, పశ్చిమాసియా అంతటా పర్యటిస్తా. గాజాలో ఇప్పుడేమీ మిగల్లేదు. ఆ ప్రాంతమంతా మృత్యువుకు, విధ్వంసానికి చిరునామాగా, నరకకూపంగా మారింది. ప్రతి భవనమూ నేలమట్టమైంది. చిరకాలంగా శప్తభూమిగా ఉన్న గాజాను పూర్తిగా పునరి్నరి్మస్తాం. పేలని బాంబులు, ఆయుధాలను తొలగిస్తాం. ధ్వంసమైన భవనాలను తొలగించి ఆ ప్రాంతాన్నంతా చదును చేస్తాం. అక్కడ అపరిమితమైన ఉద్యోగాలందించేలా అద్భుతమైన ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తాం. గాజావాసుల జీవన స్థితిగతులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. ఏ ఒక్క సమూహానికో కాకుండా అందరికీ అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పాలస్తీనావాసులతో పాటు ప్రపంచం నలుమూలలకు చెందిన ప్రజలు అక్కడ నివసిస్తారు. లేదంటే ఆ ప్రాంతం వందల ఏళ్లుగా ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఏదైనా డిఫరెంట్‌గా చేయాలి. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అది పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఏదైనా అద్భుతం చేయడానికి మాకు అవకాశముంది’’ అని చెప్పుకొచ్చారు. ‘‘ఇదేమీ అల్లాటప్పగా తీసుకున్న నిర్ణయం కాదు. దీనిపై చాలా ప్రముఖులు, ముఖ్యులతో లోతుగా చర్చించా. వారంతా నా ప్రతిపాదనను అమితంగా ఇష్టపడ్డారు. గాజాను సొంతం చేసుకుని అభివృద్ధి చేసి అపారమైన ఉపాధి అవకాశాలు సృష్టించాలన్న అమెరికా ఆలోచనలను ఇష్టపడుతున్నారు’’ అని చెప్పారు. ‘‘గాజాలో దశాబ్దాలుగా మరణమృదంగం కొనసాగుతోంది. చంపుకోవడాలు లేకుండా ఆనందంగా ఉండగలిగే అందమైన ప్రదేశంలో వారికి శాశ్వతంగా పునరావాసం కల్పించగలిగితే చాలు. మరో దారి లేకే వారు గాజాకు తిరిగి వెళ్తున్నారు. ఎప్పుడు కూలతాయో తెలియని పై కప్పుల కింద బతుకీడుస్తున్నారు. దానికి బదులుగా అందమైన ఇళ్లలో సురక్షితంగా, స్వేచ్ఛగా, శాంతియుతంగా జీవించే అవకాశం వారి ముందుంది. ఆ మేరకు చక్కని పునరావాసం పొందగలరని, ఇప్పుడు వద్దంటున్న దేశాల్లోనే వారికి ఆ సదుపాయం ఏర్పాటు చేయగలనని నమ్ముతున్నా’’ అని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనుసరించదగ్గ మార్గం ఇదేనని నెతన్యాహూ అభిప్రాయపడ్డారు. ‘‘హమాస్‌ను నిర్మూలించాలన్న మా లక్ష్యాలను సాధించడానికి ట్రంప్ కొత్త ఆలోచనలతో ముందుకొచ్చారు. ఇది యూదు జాతికి సాయపడుతుంది’’ అని చెప్పారు. ‘‘ఉగ్రవాదానికి కేంద్రబిందువుగా ఉన్న గాజాకు భిన్నమైన భవిష్యత్తును ట్రంప్ కాంక్షిస్తున్నారు. హంతక సంస్థ (హమాస్)ను నిర్మూలిస్తే అక్కడ శాంతి సాధ్యమే’’ అన్నారు. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందో లేదో చెప్పలేనన్నారు. బైడెన్ ప్రభుత్వం తమకు పెద్దగా సాయం చేయలేదని నెతన్యాహూ ఆక్షేపించారు. గాజాను వీడబోం: స్థానికులు ట్రంప్ ప్రతిపాదనపై గాజా పౌరులు మండిపడుతున్నారు. ‘‘ఇన్నాళ్లకు కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత సొంత గూటికి తిరిగి వెళ్తున్నాం. మా ఇళ్లను విడిచిపెట్టబోం. గౌరవప్రదమైన జీవితం కోరుకుంటున్నాం. మా నేతలను వీడాలనుకోవడం లేదు’’ అని చెబుతున్నారు. ట్రంప్ ప్రతిపాదన గాజాతో పాటు పరిసర దేశాల్లో మరింత విధ్వంసానికి, ఘర్షణకు కారణమవుతుందని వారంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయకుండా ఇజ్రాయెల్‌తో ఎలాంటి సంబంధాలను కొనసాగించబోమని స్పష్టం చేసింది. గాజన్లు తమ ఇళ్లకు తిరిగి వచ్చి పునరి్నరి్మంచాలని కోరుకుంటున్నారని ఐరాసలో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ అన్నారు. వారి ఆకాంక్షలను గౌరవించాలన్నారు. ట్రంప్‌ది హాస్యాస్పద, అసంబద్ధ ప్రకటన అని హమాస్ దుయ్యబట్టింది. ‘‘ఈ తరహా ఆలోచనలు పశ్చిమాసియాలో మరిన్ని ఘర్షణలకు దారితీస్తాయి. గాజావాసులకు సమీప దేశాల్లో పునరావాసం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదన మరింత గందరగోళం, ఉద్రిక్తతలకు కారణమవుతుంది. గాజావాసులు దీనికి ఒప్పుకోరు’’ అని హమాస్ అధికారి సమీ అబు స్పష్టం చేశారు.అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగాట్రంప్ గాజా ప్రణాళిక గాజాను పునరి్నర్మించాలంటూ పది రోజుల క్రితమే పిలుపునిచ్చిన ట్రంప్ ఆ విషయమై ఎంత సీరియస్‌గా ఉన్నారో తాజా ప్రకటనతో ప్రపంచానికి తెలిసొచి్చంది. కానీ అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా విరుద్ధమైన ఆయన గాజా ప్రణాళిక పశ్చిమాసియాను అతలాకుతలం చేయడమే గాక ప్రపంచ శాంతికి గొడ్డలిపెట్టుగా మారేలా కనిపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం, ఇజ్రాయెల్–హమాస్ పరస్పర బందీల విడుదల ప్రక్రియపైనా ప్రభావం చూపేలా ఉంది. ఒక దేశ జనాభాను బలవంతంగా నిరాశ్రయులను చేయడం అంతర్జాతీయ చట్టం ప్రకారం నిషేధం. ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనియన్లను తరిమేసి గాజాను యూదు స్థావరంగా మార్చుకోవాలని ఆశపడుతోంది. ట్రంప్ ప్రకటన కార్యరూపం దాలిస్తే 20 లక్షల మంది పాలస్తీనావాసులు శాశ్వత శరణార్థులుగా మారిపోతారు. -
గాజాపై ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: గాజాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తాజాగా ట్రంప్.. ఇజ్రాయెల్, గాజా యుద్ధం తాజా పరిస్థితిపై చర్చించారు. అనంతరం, గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. ఇక, ఇప్పటికే ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. యుద్ధం ముగింపు దిశగా వెళ్లాలని చెప్పారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఇజ్రాయెల్, గాజా యుద్ధం తాజా పరిస్థితిపై నెతన్యాహూతో ట్రంప్ చర్చించారు. అనంతరం ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. యుద్ధంతో దెబ్బతిన్న పాలస్తీనాలో భూభాగమైన గాజాను అమెరికా స్వాధీనం చేసుకోవాలని భావిస్తుందని తెలిపారు. అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తాం. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే.. అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు, ఇళ్లు కల్పించవచ్చు అని తెలిపారు. ఇదే సమయంలో భవిష్యత్తులో మిడిల్ ఈస్ట్ పర్యటన సందర్భంగా గాజా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియాను సందర్శించాలని తాను భావిస్తున్నట్టు తెలిపారు.మరోవైపు.. ట్రంప్ నిర్ణయంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. గాజాపై ట్రంప్ ప్రకటన చరిత్రను మారస్తుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో, ఇరువురి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.Donald Trump just announced that the United States will be “taking over” Gaza and will “level” it to the ground.He said Palestinians should not live there anymore.This is GENOCIDE!!!! pic.twitter.com/dR1UcmhiTe— Morgan J. Freeman (@mjfree) February 5, 2025ఇదిలా ఉండగా.. గాజాలో ఉద్రిక్తతల కారణంగా నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ఇటీవల ట్రంప్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రతిపాదనను ఆయా దేశాలు తీవ్రంగా ఖండించాయి. అలా చేస్తే తమ ప్రాంతంలోని స్థిరత్వం దెబ్బతింటుందని ఈజిప్టు, జోర్డాన్, సౌదీఅరేబియా, యూఏఈ, ఖతార్, పాలస్తీనా అథారిటీ, అరబ్ లీగ్‌లు సంయుక్తంగా ప్రకటన చేశాయి. ఈక్రమంలోనే గాజాను స్వాధీనం చేసుకొని, అభివృద్ధి చేస్తామని ట్రంప్ ప్రకటించడం గమనార్హం. -
జెనిన్లో ఇజ్రాయెల్ సైన్యం ఆపరేషన్
జెనిన్: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్లో ఇజ్రాయెల్ దళాలు జరిపిన భారీ ఆపరేషన్‌లో తొమ్మిది మంది పాలస్తీనియన్లు మరణించారు. 35 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సాయుధ సంస్థలకు కంచుకోటగా ఉన్న జెనిన్లో ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు విస్తృతమైన ఆపరేషన్‌ను ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ఇజ్రాయెల్ కాల్పుల్లో గాయపడిన వారిలో ముగ్గురు వైద్యులు, ఇద్దరు నర్సులు ఉన్నారని జెనిన్ ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ విస్సామ్ బకర్ తెలిపారు. మంగళవారం ఉదయం ఇజ్రాయెల్ దళాలు వెళ్లడానికి ముందే జెనిన్ శరణార్థి శిబిరం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి స్థానిక భద్రతా సిబ్బంది వైదొలిగారు. ఇజ్రాయెల్ దళాలు పౌరులపై కాల్పులు జరిపాయని, దీంతో పలువురు గాయపడ్డారని పాలస్తీనా భద్రతా దళాల ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ అన్వర్ రజాబ్ తెలిపారు. జెనిన్లో ఒక టీనేజర్సహా 9 మందిని ఇజ్రాయెల్ బలగాలు అన్యాయంగా పొట్టనబెట్టుకున్నాయని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. టియానిక్ గ్రామంలోనూ ఇజ్రాయెల్ దళాలు ఒక వ్యక్తిని కాల్చి చంపాయి. గాజాలో కాల్పుల విరమణ ప్రారంభమైన మూడు రోజుల తర్వాత, వెస్ట్‌బ్యాంక్‌లో దాడులు జరగడం గమనార్హం. ‘‘వెస్ట్ బ్యాంక్‌లో భద్రతను బలోపేతానికి, మా లక్ష్యాలను సాధించడానికి మరో ముందడుగుగా జెనిన్ ఆపరేషన్ చేపట్టాం. లెబనాన్, సిరియా, యెమెన్, వెస్ట్ బ్యాంక్‌లలో ఇరాన్ ఏ ప్రాంతంపై ప్రభావం చూపించాలనుకున్నా మేం దానిని అడ్డుకుంటాం’’ అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. వెస్ట్‌బ్యాంక్‌లోని హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్, ఇతర సాయుధ గ్రూపులకు ఇరాన్ ఆయుధాలు, నిధులను అందిస్తోందని ఆరోపించారు. ‘‘ ఈ ప్రాంతాల్లో సాయుధ బృందాల మౌలిక సదుపాయాలను విచ్ఛిన్నం చేయడం ఈ ఆపరేషన్ ముఖ్య లక్ష్యం’’ అని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. -
అమల్లోకి కాల్పుల విరమణ
డెయిర్ అల్ బాలాహ్ (గాజా): పదిహేను నెలల భీకర యుద్ధానికి తాత్కాలికంగా తెర పడింది. శ్మశాన సదృశంగా కన్పిస్తున్న గాజా వీధుల్లో ఎట్టకేలకు శాంతిపవనాలు వీచాయి. (Israel),ఇజ్రాయెల్, (Hamas)హమాస్ మధ్య విరమణ ఒప్పందం మూడు గంటలు ఆలస్యంగా ఆదివారం ఉదయం 11.30కు అమల్లోకి వచ్చింది. విడుదల చేయబోయే తమ బందీల జాబితాను హమాస్ వెల్లడించేదాకా (ceasefire agreement)కాల్పుల విరమణ అమల్లోకి రాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కుండబద్దలు కొట్టడంతో తొలుత ఆందోళన నెలకొంది. జాబితా విడుదలను హమాస్ ఆలస్యం చేయడం ఉత్కంఠకు దారితీసింది. ఉదయం 11.15కు రోమీ గోనెన్ (24), ఎమిలీ దమారీ (28), డోరోన్ స్టెయిన్బ్రీచర్ (31) అనే ముగ్గురు మహిళలను హమాస్ వదిలేస్తున్నట్టు హమాస్ ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇజ్రాయెల్ బలగాలు వారిని సురక్షితంగా స్వదేశానికి తరలించాయి. బదులుగా ఇజ్రాయెల్ కూడా తొలి దఫాలో 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. వారిని సురక్షితంగా గాజా చేర్చేందుకు రెడ్‌క్రాస్ వాహనశ్రేణి ఇజ్రాయెల్‌లోని ఓఫెర్ కారాగానికి చేరుకుంది. ఆరువారాల్లో హమాస్ 33 మంది, ఇజ్రాయెల్ దాదాపు 2,000 మంది ఖైదీలను విడుదల చేయనున్నాయి. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని నెతన్యాహూ ప్రభుత్వ భాగస్వామి ఓజ్మా యేహూదిత్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం నుంచి వైదొలగింది. ఆ పారీ్టకి చెందిన ముగ్గురు నేతలు మంత్రి పదవులకు రాజీనామా చేశారు.గాజాలో ఆనందోత్సాహాలు కాల్పుల విరమణతో గాజా స్ట్రిప్‌లో ఆనందం వెల్లివిరిసింది. వలస వెళ్లిన పాలస్తీనియన్లు భారీగా గాజాకు తిరిగొస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం దాకా ఇజ్రాయెల్ సైన్యం గాజాపై దాడులు కొనసాగింది. దాంతో ఆదివారం ఒక్క రోజే 26 మంది మరణించారు. -
గాజా ఒప్పందం ఆలస్యం!.. హమాస్‌కు ఇజ్రాయెల్ వార్నింగ్!
జెరుసలేం : గాజాలో శాంతి ఒప్పందం వేళ ఇజ్రాయెల్ సైన్యం హమాస్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ఇచ్చిన మాటకు కట్టుబడడం లేదని, అందుకే తాము గాజాపై దాడుల్ని కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి, రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ..హమాస్ చెరలో బంధీలుగా ఉన్న 33 మంది బంధీల జాబితా విడుదల కాలేదు. బంధీల జాబితా మాకు చేరే వరకు కాల్పులు కొనసాగుతాయని చెప్పారు.ఆదివారం ఉదయం నాటికి కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తన వద్ద ఉన్న బంధీల జాబితాను విడుదల చేయాలి. కానీ అలా చేయలేదు. ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. హమాస్ ఇచ్చిన మాటకు కట్టుబడే వరకు కాల్పుల విరమణ అమలులోకి రాదు అని’ హగరీ చెప్పారంటూ ఓ ఇజ్రాయెల్ సైన్య అధికారి వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అంతకు ముందు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైతం కాల్పుల విరమణపై కీలక వ్యాఖ్యలు చేశారు. బంధీల జాబితా విడుదల చేయనంత వరకు సైనిక దాడులు కొనసాగుతాయని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు తాము బాధ్యులం కాదని సూచించారు. గాజాలో శాంతిపదిహేను నెలలుగా రక్తమోడుతున్న గాజాలో శాంతి నెలకొంది. గత బుధవారం అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్య వర్తిత్వంతో ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరింది. ఒప్పందంలో భాగంగా.. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8.30 గంటలకు కాల్పుల విమరణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. కానీ సాంకేతిక అంశాల్ని కారణంగా చూపిస్తూ బంధీల జాబితాను విడుదల చేయడంలో జాప్యం చేసింది. కాగా, కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ చెరలో ఉన్న 33 మంది బంధీలను విడుదల చేయాలి. ప్రతిఫలంగా ప్రస్తుతం జైళ్లలో మగ్గుతున్న దాదాపు 2,000 మంది పాలస్తీనియన్లను కూడా ఇజ్రాయెల్ విడుదల చేయనుంది. -
గాజా ఒప్పందం వేళ ట్విస్ట్!.. నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు
గాజా శాంతి ఒప్పందం వేళ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన ఫ్రేమ్‌వర్క్ లేకుండా ఒప్పందం ముందుకు సాగదని.. అవసరమైతే మళ్లీ యుద్ధానికి దిగుతామని సంచలన వ్యాఖ్యలు అన్నారాయన. కాల్పుల విరమణ ఒప్పందం తొలి దశ ఇవాళ్టి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అంతకంటే కొన్ని గంటల ముందు.. నెతన్యాహూ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.‘‘సరైన ఫ్రేమ్ వర్క్ లేకుండా ఒప్పందంలో ముందుకు వెళ్లలేం. తమ దగ్గర ఉన్న బంధీల జాబితాను హమాస్ విడుదల చేయాలి. వాళ్లలో ఎవరెవరిని ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారో స్పష్టత ఇవ్వాలి. అప్పుడే మేం ఒప్పందం ప్రకారం ముందుకు వెళ్తాం. ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా.. మేం సహించబోం. తదుపరి పరిణామాలకు హమాసే బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Benjamin Netanyahu) తెలియజేశారు. హమాస్‌పై పూర్తిస్థాయి విజయం సాధిస్తేనే గాజా యుద్ధాన్ని(Gaza War) విరమిస్తామని.. అప్పటి వరకు పోరు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గతంలో అనేక సందర్భాల్లో బహిరంగంగా ప్రకటిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు.. తాజాగా బంధీల జాబితా ఇవ్వాలంటూ ఆయన మెలిక పెట్టారు. దీంతో ఇవాళ్టి నుంచి ఒప్పందం అమలు అవుతుందా? అనే అనుమానాలు నెలకొంటున్నాయి.స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఆరు వారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావాల్సి ఉంది. ఇజ్రాయెల్ కారాగారాల్లో మగ్గిపోతున్న పాలస్తీనియన్లు, పాలస్తీనా రాజకీయ పార్టీల నేతలను ఈ 42 రోజుల్లోపు ఇజ్రాయెల్ అధికారులు విడిచిపెట్టనున్నారు. మరోవైపు 2023 అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ శివారు గ్రామాలపై దాడిచేసి కిడ్నాప్ చేసి బందీలుగా ఎత్తుకెళ్లిన వారిలో కొందరిని హమాస్ విడిచి పెట్టాల్సి ఉంది. హమాస్ చెరలోని 460 రోజులకు పైగా బందీలుగా ఉన్నారన్నమాట!.హమాస్ చెరలో ఉన్న 98 బంధీల్లో.. 33 మందిని విడిచి పెట్టడంప్రతిగా.. తమ జైళ్లలో మగ్గుతున్న 2000 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడిచిపెట్టడంపదిహేను నెలలుగా రక్తమోడుతున్న గాజాలో బాంబుల మోత.. క్షిపణుల విధ్వంసం.. తుపాకుల అలజడి ఈ శాంతి ఒప్పందంతో ఆగనుంది. దోహా వేదికగా.. అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్హమాస్ మధ్య గత బుధవారం కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో గాజా ఊపిరి పీల్చుకుంది. వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రధాని ఎన్నడూ కాల్పుల విరమణ ఒప్పందానికి అంతగా ఆసక్తి చూపలేదు. యుద్ధం కొనసాగించడానికి మొగ్గు చూపుతూ.. ఏదో కారణంతో చర్చల ప్రక్రియను పక్కదోవ పట్టించే ప్రయత్నాలే చేస్తూ వచ్చారు. అయితే.. గతేడాది మే నెలలో బైడెన్ ప్రభుత్వం కాల్పుల విరమణకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేసింది. వాటికి హమాస్ సానుకూలంగా స్పందించింది. దీంతో అప్పుడే గాజాలో శాంతి నెలకొంటుందని అంతా భావించారు. కానీ, నెతన్యాహు మాత్రం ఆ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలను పూర్తిగా ఉపసంహరించడానికి అంగీకరించలేదు. కానీ, ఇప్పుడు కుదిరిన ఒప్పందంలోనూ రెండో దశలో గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ నిబంధన ఉంది. అందుకే ఒప్పందంలో తొలి దశ అమలైనా, రెండో దశకు ఇజ్రాయెల్ అంగీకారం తెలుపుతుందా? లేదా? అన్నది కీలకం కానుంది.ఇదీ చదవండి: కెనడా ప్రధాని రేసులో చంద్ర ఆర్య -
Israel-Hamas: గాజా ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం
జెరూసలెం: ఇజ్రాయెల్-హమాస్(Hamas) మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో, గాజా(Gaza)లో శాంతి నెలకొనే అవకాశం ఉంది. ఇక, ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి రానుంది. ఒప్పందానికి మార్గం సుగమం చేయాలని కేబినెట్‌కు ప్రభుత్వం సిఫార్సు చేసినట్లు ప్రధాని నెతన్యాహు(Benjamin Netanyahu) కార్యాలయం వెల్లడించింది. ఈ క్రమంలో కాల్పుల విరమణకు సంబంధించి ఎదురైన ఆటంకాలు తొలగిపోయాయని హమాస్ పేర్కొంది.ఇజ్రాయెల్-హమాస్(Israel) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వంతో బుధవారం కుదిరిన మూడు దశల కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో, ఆదివారం నుంచి ఒప్పందం అమలులోకి రానుంది. ఈ మేరకు బందీలను విడుదల చేసే ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించిందని మంత్రివర్గం ఓటింగ్ నిర్వహించిన తర్వాత నెతన్యాహు కార్యాలయం శనివారం తెల్లవారుజామున తెలిపింది.ఇదే సమయంలో అన్ని రాజకీయ, భద్రతాపరమైన, మానవతా అంశాలను సమీక్షించి, యుద్ధం లక్ష్యాలను సాధించడానికి ఇది ప్రయోజనకరమని అర్థం చేసుకున్నామని పేర్కొంది. బందీల కుటుంబాలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఆదివారం నుండి విడుదల చేయబోయే 95 మంది పాలస్తీనియన్ల జాబితాను న్యాయ మంత్రిత్వ శాఖ ప్రచురించింది. వారిలో 69 మంది మహిళలు, 16 మంది పురుషులు మరియు 10 మంది మైనర్లు ఉన్నారు. తర్వాత పూర్తిస్థాయిలో యుద్ధాన్ని ముగించే దిశగా చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు.. కాల్పుల విరమణ ప్రారంభం కాకముందే గాజా ప్రజలు స్వదేశానికి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు.Israel’s security cabinet has accepted the ceasefire deal with Hamas which is due to come into force on Sunday. The approval comes after an unexpected delay because pf far-right members of the Israeli government. pic.twitter.com/ZgWNmQRAKU— Channel 4 News (@Channel4News) January 17, 2025 -
హమాస్‌తో డీల్.. నెతన్యాహు వ్యాఖ్యల అర్థమేంటి?
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. అనూహ్యంగా గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్-హమాస్‌లు ఓ అంగీకారానికి వచ్చాయి. కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించినట్లు హమాస్ తెలిపింది.ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందన్నారు. ఈ సమయంలో ఏదైనా జరిగే అవకాశం ఉందన్నారు. మరోవైపు తాజా ఒడంబడికకు నెతన్యాహు క్యాబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. కొద్ది రోజుల్లోనే ఇది పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గాజాలో నిర్బంధించబడిన ఇజ్రాయెల్ బందీల విడుదలకు ఒప్పందం కుదుర్చుకోవడంలో సహాయం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారని ఆయన కార్యాలయం తెలిపింది.ఇదిలా ఉండగా.. కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో గాజాలో నిరాశ్రయులైన వేలమంది తిరిగి కోలుకోవడానికి, ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున మానవతా సహాయం అందడానికి వీలు కలుగుతుంది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందానికి ఖతార్ మధ్యవర్తిత్వం వహించింది. కొన్నినెలలుగా కాల్పుల విరమణ కోసం ఈజిప్టు, ఖతార్ ఇరు పక్షాలతో చర్చలు జరుపుతూ వచ్చాయి. ఈ ఒప్పందానికి అమెరికా మొదటి నుంచి మద్దతుగా ఉంది. ఒప్పందం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ ప్రకటించారు.ఇక, అక్టోబరు 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లో ప్రవేశించి 1200 మంది ఆ దేశ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలో హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 46 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయలయ్యారు. -
ట్రంప్‌కు నెతన్యాహూ ఫోన్
జెరుసలేం: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్లో మాట్లాడారు. హమాస్‌పై యుద్ధంలో విజయం సాధించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. సిరియా పరిస్థితులపై తన వైఖరిని ట్రంప్‌తో పంచుకున్నారు. సంభాషణలోని కీలకాంశాలను వివరిస్తూ నెతన్యాహు ఓ వీడియో ప్రకటన షేర్ చేశారు. ‘‘శనివారం సాయంత్రం జరిగిన సంభాషణలో ఇరువురం పలు అంశాలపై చర్చించాం. సంభాషణ చాలా స్నేహపూర్వకంగా సాగింది. ఇజ్రాయెల్ విజయాన్ని పూర్తి చేయాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడుకున్నాం. బందీల విడుదలకు మేం చేస్తున్న ప్రయత్నాల గురించి సుదీర్ఘంగా చర్చించాం. బందీలతో పాటు మృతులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఇజ్రాయెల్ అహర్నిశలు కృషి చేస్తుంది’’ అని చెప్పారు. אמרתי שנשנה את המזרח התיכון וזה מה שקורה. סוריה היא לא אותה סוריה. לבנון היא לא אותה לבנון. עזה היא לא אותה עזה. איראן היא לא אותה איראן. pic.twitter.com/IFVso1czkH— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) December 15, 2024సిరియాతో ఘర్షణ ఇప్పట్లో లేదుసిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని తిరుగుబాటు దళాలు కూలదోశాక అక్కడి పరిస్థితిని నెతన్యాహు ప్రస్తావించారు. ‘‘సిరియాతో ఘర్షణపై మా దేశానికి ఏ ఆసక్తీ లేదు. పరిస్థితులను బట్టి స్పందిస్తాం’’ అన్నారు. హెజ్బొల్లాకు సిరియా గుండా ఆయుధాల రవాణాకు అనుమతించడాన్ని ఖండించారు. -
మా ప్రధాని అరెస్టు వారెంట్‌ను రద్దు చేయండి
టెల్ అవీవ్: యుద్ధ నేరాల కేసులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును అరెస్టు చేయాలంటూ జారీ అయిన అరెస్ట్వారెంట్పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును ఇజ్రాయెల్ ఆశ్రయించింది. తీర్పు వచ్చే వరకు ప్రధాని నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గాలెంట్పై అరెస్టు వారెంట్లను నిలిపివేయాలని గురువారం న్యాయస్థానాన్ని ఇజ్రాయెల్ కోరింది. తమ అభ్యర్థనపై నిర్ణయం వెలువడేదాకా వారెంట్ అమలును నిలుపుదల చేయాలని వేడుకుంది. గాజా స్ట్రిప్‌లో యుద్ధం చేస్తూ వేలాది మంది అమాయక పాలస్తీనియన్ల మరణానికి కారణమవుతూ ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, అందుకే నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గాలెంట్పై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నట్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ప్రకటించడం తెల్సిందే. హమాస్ సైనిక విభాగ సారథి మొహహ్మద్ డెయిఫ్పైనా ఇదే తరహాలో అరెస్టు వారెంట్ జారీ చేసింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అధికార పరిధి, అరెస్టు వారెంట్ల చట్టబద్ధతను తాము సవాలు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరిస్తే, ఇజ్రాయెల్ ప్రభుత్వం పట్ల అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు, ఐక్యరాజ్య సమితి ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్ మిత్రదేశాలకు అర్థమవుతుందని వ్యాఖ్యానించింది. 2023 అక్టోబర్ 8 నుంచి 2024 మే 20 వరకు మానవాళికి వ్యతిరేకంగా చేసిన యుద్ధ నేరాలకు సంబంధించి బెంజమిన్ నెతన్యాహు, యోవ్ గాలెంట్లపై అరెస్టు వారెంట్లు జారీచేశారు. ఈ చర్యను నెతన్యాహు, ఇతర ఇజ్రాయెల్ రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండించారు. అమెరికా, ఫ్రాన్స్‌లు నెతన్యాహుకు మద్దతు పలికాయి. వారెంట్ల జారీని తప్పుబట్టాయి. మిత్రదేశాలైన బ్రిటన్, కెనడా మాత్రం కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించడం విశేషం. ఈ నేపథ్యంలో హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం యూదుల పట్ల వివక్ష చూపిస్తోందని నెతన్యాహు ఆరోపించారు. -
ఒకవైపు లెబనాన్‌లో సంబురాలు.. మరొకవైపు గాజాపై ఇజ్రాయిల్ దాడులు
జెరూసలేం: ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో లెబనాన్ ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ బాంబు దాడులు నిలిచిపోవడంతో లెబనాన్ వాసులు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబ సభ్యులను కలుసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాడుల కారణంగా దాదాపు 12 లఓల మంది తమ ఇళ్లను వదిలిపెట్టి వెళ్లినట్టు సమాచారం.అగ్ర రాజ్యం అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో లెబనాన్ రాజధాని బీరుట్ సహా పలు ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం కనపిస్తోంది. దాడులు నిలిచిపోవడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబురాలు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్ ను విడిచి వెళ్లిపోయిన వారంతా ఇప్పుడు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా దఓిణ లెబనాన్ కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.ఇదిలా ఉండగా.. దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ తాము గతంలో జారీ చేసిన ఆదేశాలు ఇప్పటికీ అమలులోనే ఉన్నాయని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరిస్తోంది. దీంతో, కొంత మంది భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. గాజాలో మాత్రం ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 11 మంది పౌరులు చనిపోయారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఓ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న వారిపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో వారు చనిపోయారు. గాజాపై 14 నెలలుగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 44వేల మంది చనిపోయారు. -
ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం!
బీరూట్: ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దుల వెంట కాల్పుల మోత ఆగే సూచనలు కనిపిస్తున్నాయి. హమాస్‌కు అండగా ఇజ్రాయెల్‌తో పోరు జరుపుతున్న హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ వెనక్కి తగ్గే వీలుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో హెజ్బొల్లాకు కుదరబోతున్న కాల్పుల విరమణ ఒప్పందమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాల్పుల విరమణకు నెతన్యాహూ సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇంకొన్ని కీలక అంశాలపై సంప్రదింపులు జరుగుతున్నాయని, అవి కొలిక్కి వచ్చాక అంగీకారం కుదురుతుందని తెలుస్తోందని సీఎన్ఎన్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. సూత్రప్రాయ అంగీకారం త్వరలో కుదరబోతోందని ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి డేవిడ్ మెన్సర్ సోమవారం చెప్పారు. -
‘ఇది సరిపోదు.. నెతన్యాహును ఉరితీయాలి’ : ఖమేనీ
టెహ్రాన్ : ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును అరెస్ట్ చేస్తే సరిపోదని ఉరితీయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) సూచించారు. అలీ ఖమేనీ వ్యాఖ్యలతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని పశ్చిమా దేశాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. -
ఐసీసీ నోటీసులపై నెతన్యాహు సీరియస్.. తప్పుడు సంకేతమే..
జెరూసలేం: గాజాలో యుద్ధం నేరాలు, మానవాళికి వ్యతిరేకంగా జరిగిన నేరాలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) గురువారం అరెస్టు వారెంట్లు జారీ చేసింది. ఈ క్రమంలో వారెంట్‌పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది యూదుల వ్యతిరేక నిర్ణయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఐసీసీ అరెస్ట్ వారెంట్‌పై నెతన్యాహు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘కోర్టు నిర్ణయం ఇజ్రాయెల్ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తుంది. నేను ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన వ్యక్తిని. నేను, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ ఉద్దేశపూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకున్నారని కోర్టు తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఇజ్రాయెల్ దేశ పౌరుల ప్రాణాలను కాపాడేందుకు మా శక్తి మేరకు మేము పనిచేశాం. కోర్టు తీర్పు యూదులకు వ్యతిరేకంగా ఉంది’ అంటూ విమర్శలు చేశారు.అంతకుముందు.. నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అలాగే ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్ గల్లాంట్‌తోపాటు పలువురు హమాస్ నేతలపైనా వారెంట్లు జారీ చేసింది. బెంజమిన్, గల్లాంట్ గాజాలో మారణహోమం సాగించారని, మానవత్వంతో దాడి చేశారని ఐసీసీ ఆక్షేపించింది. హత్యలు చేయడం, సాధారణ ప్రజలను వేధించడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించింది. గాజాలో ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, విద్యుత్, ఇంధనం, ఇతర నిత్యావసరాలు అందకుండా ఆంక్షలు విధించారని, అమాయకుల మరణానికి కారకులయ్యారని మండిపడింది. నెతన్యాహు, గల్లాంట్ చర్యల వల్ల ఎంతోమంది మహిళలు, చిన్నారులు బలయ్యారని ఉద్ఘాటించింది. పౌష్టికాహారం, నీరు అందక, డీహైడ్రేషన్‌తో పసిబిడ్డలు మరణించారని పేర్కొంది.The antisemitic decision of the international court in The Hague is a modern Dreyfus trial, and it will end the same way. pic.twitter.com/e1l8PMghrB— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) November 21, 2024 ఒంటరైన నెతన్యాహు? ఇజ్రాయెల్ ప్రధానమంత్రి, రక్షణ శాఖ మాజీ మంత్రిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో ఇప్పుడేం జరుగుతుందన్న చర్చ మొదలైంది. ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో నెతన్యాహు, గల్లాంట్ ఇప్పుడు అంతర్జాతీయంగా వాంటెడ్ నిందితులుగా మారారు. ప్రపంచ దేశాల అధినేతలు వారికి మద్దతు ఇవ్వడానికి వీల్లేదు. అదే జరిగితే అంతర్జాతీయంగా నెతన్యాహు, గల్లాంట్ ఒంటరవుతారు. చివరకు గాజాలో కాల్పుల విరమణ ప్రక్రియ ప్రారంభించే ప్రయత్నాలు మరింత సంక్లిష్టంగా మారుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
నెతన్యాహుపై అరెస్టు వారెంట్
ద హేగ్: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) గురువారం అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అలాగే ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్ గల్లాంట్‌తోపాటు పలువురు హమాస్ నేతలపైనా వారెంట్లు జారీ చేసింది. బెంజమిన్, గల్లాంట్ గాజాలో మారణహోమం సాగించారని, మానవత్వంతో దాడి చేశారని ఐసీసీ ఆక్షేపించింది. హత్యలు చేయడం, సాధారణ ప్రజలను వేధించడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించింది. గాజాలో ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, విద్యుత్, ఇంధనం, ఇతర నిత్యావసరాలు అందకుండా ఆంక్షలు విధించారని, అమాయకుల మరణానికి కారకులయ్యారని మండిపడింది. నెతన్యాహు, గల్లాంట్ చర్యల వల్ల ఎంతోమంది మహిళలు, చిన్నారులు బలయ్యారని ఉద్ఘాటించింది. పౌష్టికాహారం, నీరు అందక, డీహైడ్రేషన్‌తో పసిబిడ్డలు మరణించారని పేర్కొంది. నెతన్యాహు, గల్లాంట్ ఉద్దేశపూర్వకంగానే సామాన్య ప్రజలపై వైమానిక దాడులు చేసినట్లు చెప్పడానికి సహేతుకమైన ఆధారాలను గుర్తించామని వివరించింది. గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభానికి నెతన్యాహు, గల్లాంట్ బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది. యుద్ధ నేరాల్లో నెతన్యాహు నిందితుడని స్పష్టం చేసింది. గాజాలో 2023 అక్టోబర్ 8 నుంచి 2024 మే 20వ తేదీ దాకా నెలకొన్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నెతన్యాహు, గల్లాంట్‌పై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అలాగే గాజాలో భీకర యుద్ధానికి, సంక్షోభానికి కారణమయ్యారంటూ హమాస్ నేతలపైనా అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. హమాస్ అగ్రనేతలు మొహమ్మద్ డెయిఫ్, యహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియేను అరెస్టు చేయాలని ఐసీసీ స్పష్టంచేసింది. అయితే, యహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియే ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడేం జరగొచ్చు? ఇజ్రాయెల్ ప్రధానమంత్రి, రక్షణ శాఖ మాజీ మంత్రిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో ఇప్పుడేం జరుగుతుందన్న చర్చ మొదలైంది. ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో నెతన్యాహు, గల్లాంట్ ఇప్పుడు అంతర్జాతీయంగా వాంటెడ్ నిందితులుగా మారారు. ప్రపంచ దేశాల అధినేతలు వారికి మద్దతు ఇవ్వడానికి వీల్లేదు. అదే జరిగితే అంతర్జాతీయంగా నెతన్యాహు, గల్లాంట్ ఒంటరవుతారు. చివరకు గాజాలో కాల్పుల విరమణ ప్రక్రియ ప్రారంభించే ప్రయత్నాలు మరింత సంక్లిష్టంగా మారుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఇంటిపై బాంబు దాడి.. సంచలన వీడియో
జెరూసలేం: గాజా, హిజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ సంచలన ఘటన చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి సమీపంలో మరోసారి బాంబు దాడి జరిగింది. ఫ్లాష్ బాంబ్ దాడి కారణంగా పేలుడు ధాటికి భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. బాంబు దాడి సమయంలో నెతన్యాహు ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది.వివరాల ప్రకారం.. ఉత్తర ఇజ్రాయెల్‌లోని సిజేరియా నగరంలో ప్రధాని నెతన్యాహు ఇంటి గార్డెన్లో ఆదివారం తెల్లవారుజామున ఫ్లాష్ బాంబు దాడి జరిగింది. బాంబు దాడి సందర్బంగా గార్డెన్లో మంటలు చెలరేగాయి. ఇక, దాడి జరిగిన సమయంలో ప్రధాని నెతన్యాహు, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బాంబు దాడితో అక్కడ ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, నెతన్యాహు ఇంటిపై దాడి జరగడం ఇది రెండోసారి.మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రధాని ఇంటిపై బాంబు దాడిని ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ త్రీవంగా ఖండించారు. నెతన్యాహు ఇంటిపై దాడికి సంబంధించి త్వరితగతిన దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నెతన్యాహును రెచ్చగొట్టడం మంచిది కాదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఇజ్రాయెల్ భద్రతా మంత్రి ఇతామర్ బెన్-గ్విర్ మాట్లాడుతూ.. ప్రధాని ఇంటిపై ఫ్లాష్ బాంబ్ విసరడం వల్ల రెడ్ లైన్ క్రాస్ చేసినట్లైంది.. దానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. బాంబు దాడికి పాల్పడిన వారిపై ప్రతి దాడి తప్పదని కామెంట్స్ చేశారు. Two Flares were fired earlier tonight at a Guard Shack outside the Home of Israeli Prime Minister Benjamin Netanyahu, in the Northern Town of Caesarea, the same Home that a Hezbollah Drone struck in October. Both Israeli Police and Shin Bet are Investigating. pic.twitter.com/0BfYEaN4Bq— OSINTdefender (@sentdefender) November 16, 2024 -
ఇజ్రాయెల్‌లో నిరసనలు
జెరుసలేం: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్‌ను తొలగించడంతో అక్కడ నిరసనలు వెల్లువెత్తా యి. వీధుల్లోకొచ్చిన నిరసనకారులు ప్రధాని నెతన్యాహు రాజీనామా చేయాలని, కొత్త రక్షణ మంత్రి బందీ ఒప్పందానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెతన్యాహు దేశం మొత్తాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని మండిపడ్డారు. కొందరు ఆందోళనకారులు అయలోన్ హైవేపై నిప్పు పెట్టడంతో ఇరువైపులా రాకపోకలకు అంతరాయం కలిగింది. అక్టోబర్ 7న హమాస్ బందీలుగా తీసుకున్న వ్యక్తుల కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక బృందం కూడా గెలాంట్ను తొలగించడాన్ని ఖండించింది. తొలగింపును.. విడుదల ఒప్పందాన్ని పక్కకుపెట్టే ప్రయత్నాలకు కొనసాగింపుగా పేర్కొంది. రాబోయే రక్షణ మంత్రి యుద్ధం ముగింపుపై స్పష్టమైన ప్రకటన చేయాలని, అపహరణకు గురైన వారందరినీ తక్షణమే తిరిగి తీసుకురావడానికి సమగ్ర ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది. రాజకీయ విభేదాలు... ప్రధాని నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గాలెంట్ మధ్య చాలాకాలంగా విభేదాలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థను సమూలంగా మార్చే వివాదాస్పద ప్రణాళికలపై విభేదాలు రావడంతో నెతన్యాహు 2023 మార్చిలో తొలిసారిగా గాలెంట్‌ను తొలగించారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన రావడంతో తిరి గి నియమించారు. ఈ సంఘటన ‘గాలెంట్ నైట్’ గా ప్రసిద్ధి చెందింది. అయితే గాజాకు యుద్ధానంత ర ప్రణాళిక సమస్యను పరిష్కరించడంలో ప్రభు త్వం విఫలమైందని ఈ ఏడాది మేలో గాలెంట్ బ హిరంగ అసహనం వ్యక్తం చేశారు. గాజాలో పౌర, సైనిక పాలనను చేపట్టే యోచన ఇజ్రాయెల్‌కు లేదని నెతన్యాహు బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఇజ్రాయెల్ అల్ట్రా ఆర్థోడాక్స్ పౌరులను సైన్యంలో పనిచేయడం నుంచి మినహాయించే ప్రణాళికలపై గాలెంట్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి నెతన్యాహు స్పందిస్తూ ప్రత్యర్థి పాలస్తీనా గ్రూపులు హమాస్, ఫతాహ్లను ప్రస్తావిస్తూ.. హమస్తాన్ను ఫతాస్తాన్గా మార్చడానికి తాను సిద్ధంగా లేనని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నేతల మధ్య విశ్వాస సంక్షోభం తొలగింపు దాకా దారితీసిందని నెతన్యాహు చెప్పారు. ఇటీవలి నెలల్లో ఆయనపై తన విశ్వాసం క్షీణించిందని, అతని స్థానంలో విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ బాధ్యతలు తీసుకుంటారని వెల్లడించారు. ఇజ్రాయెల్ భద్రత నా జీవిత లక్ష్యం– గాలెంట్ కాగా, తొలగింపు అనంతరం గాలెంట్ స్పందించా రు. ఇజ్రాయెల్ భద్రత ఎప్పటికీ తన జీవిత లక్ష్యమ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మూడు అంశాలపై విభేదాల కారణంగానే తనను పదవి నుంచి తొలగించినట్లు మంగళవారం రాత్రి పూర్తి ప్రకటన విడుదల చేశారు. సైనిక సేవకు మినహాయింపులు ఉండకూడదని, పాఠాలు నేర్చుకోవాలంటే జాతీయ విచారణ అవసరమని, బందీలను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా.. గాజాపై యుద్ధంలో ఇజ్రా యెల్‌కు ప్రధాన మద్దతుదారు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల రోజునే గాలెంట్‌ను తొలగిచండం చర్చనీయాంశమైంది. నెతన్యాహు కంటే గాలెంట్కు వైట్ హౌస్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ రక్షణకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ మంత్రి గాలెంట్ కీలక భాగస్వామిగా ఉన్నారని వైట్‌హౌ స్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి ఒకరు తెలిపా రు. సన్నిహిత భాగస్వాములుగా ఇజ్రాయెల్ తదుప రి రక్షణ మంత్రితో కలిసి పనిచేస్తామని చెప్పారు. -
యుద్ధం వేళ ఇజ్రాయెల్ నెతన్యాహు సంచలన నిర్ణయం
జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ బెంజిమెన్ నెతన్యాహు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి యోవ్ గాలంట్‌ను పదవి నుంచి తొలగించడం ఆసక్తికరంగా మారింది. గాజాలో యుద్ధం మొదలు ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్న కారణంగా ఆయనను విధుల నుంచి తొలగించినట్టు తెలుస్తోంది.గాజాలోని హమాస్, లెబనాన్‌లోని హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ బెంజమిన్ నెతన్యాహు అనూహ్య ప్రకటన చేశారు. రక్షణశాఖ మంత్రి యోవ్ గాలంట్‌ను పదవి నుంచి తొలగించారు. ఈ సందర్భంగా ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ..‘యుద్ధం సమయంలో ప్రధానికి, రక్షణశాఖ మంత్రికి మధ్య పూర్తి నమ్మకం అవసరం. మొదట్లో అలాంటి నమ్మకమే ఉండేది. దాడుల్లో సందర్బంగా ఎన్నో సానుకూల ఫలితాలు సాధించాం. దురదృష్టవశాత్తు ప్రస్తుతం అలాంటిది జరగడం లేదు. ఇద్దరి మధ్య అంతరాలు పెరిగాయి. విశ్వాసం సన్నగిల్లింది అని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో గాలంట్ స్థానంలో తన విశ్వాసపాత్రుడు, విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్‌ను నియమించనున్నారు. విదేశాంగశాఖను గిడియాన్ సార్‌కు అప్పగించారు. తన మాజీ ప్రత్యర్థి అయిన గిడియాన్‌కు నెతన్యాహు ఇటీవలే తన కేబినెట్లో చోటిచ్చారు. అయితే, గాలంట్‌పై నెతన్యాహు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.ఇదిలా ఉండగా.. గత ఏడాది మార్చిలోనూ ఒకసారి గాలంట్‌ను తొలగించేందుకు యత్నించగా.. నెతన్యాహుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విస్తృత నిరసనలు జరిగాయి. ఇజ్రాయెల్ న్యాయవ్యవస్థలో మార్పుల కోసం నెతన్యాహు ప్రవేశపెట్టిన కొత్త న్యాయ చట్టాన్ని యోవ్ గాలంట్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కారణంగా వారి మధ్య వైరం మొదలైనట్టు సమాచారం. -
సంధి దిశగా ఇజ్రాయెల్, హమాస్.. యుద్ధానికి ముగిసినట్టేనా?
జెరూసలేం: ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సెంట్రల్ గాజాలో పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 17 మంది మరణించారు. మృతిచెందిన వారిలో హమాస్ కమాండర్ ఉన్నట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. గత ఏడాది అక్టోబర్ 7న జరిగిన దాడుల వెనక అతడి ప్రమేయం ఉందని ఇజ్రాయెల్ తెలిపింది. మరోవైపు.. ఇజ్రాయెల్, హమాస్ సంధి దిశగా కదులుతున్నట్టు తెలుస్తోంది.ఇజ్రాయెల్, హమాస్ సంధి దిశగా కదులుతున్నాయి. గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో తమ స్పై చీఫ్ పాల్గొంటారని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. మరోవైపు.. ఒప్పందం జరిగే సూచనలు కన్పిస్తే పోరాటం ఆపేస్తామని హమాస్ వర్గాలు వెల్లడించాయి. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ మృతి ఒక ఒప్పందానికి దారి తీయగలదని అమెరికా కొద్ది రోజుల క్రితమే ఆశాభావం వ్యక్తం చేసింది.దోహాకు చెందిన ఓ అధికార ప్రతినిధి బృందం కైరోలో ఈజిప్టు అధికారులతో గాజా సంధికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించినట్లు హమాస్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. హమాస్ పోరాటాన్ని ఆపడానికి సంసిద్ధత వ్యక్తంచేసింది. అయితే, ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలి. యుద్ధం నేపథ్యంలో గాజా నుంచి వెళ్లిపోయిన ప్రజలను తిరిగి అనుమతించాలి. ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని అంగీకరించడంతో పాటు గాజాకు అందే మానవతా సాయం అందాలి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆయన వెల్లడించారు.ఇక, బంధీలను విడుదల చేయడానికి ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోవడాన్ని స్వాగతిస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. కైరో సమావేశం అనంతరం ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్ గూఢాచార సంస్థ అధిపతిని అజెండాలోని ముఖ్యమైన కార్యక్రమాలను ముందుకుతీసుకెళ్లేందుకు ఖతార్‌కు వెళ్లాలని ఆదేశించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.ఇదిలా ఉండగా.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. పాలస్తీనా పౌరులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతోంది. తాజాగా ఓ పాఠశాలపై జరిగిన దాడిలో 17 మంది మృతిచెందారు. నుసిరత్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో 11 నెలల శిశువుతో సహా ఎక్కువగా మహిళలు, పిల్లలు మరణించారని 42 మంది గాయపడ్డారని పాలస్తీనా వైద్య అధికారులు తెలిపారు. మృతుల్లో 13 మంది 18 ఏళ్లలోపు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నట్టు పేర్కొంది.గాజాపై దాడుల్లో మరో హమాస్ కమాండర్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. గత ఏడాది అక్టోబర్ 7న జరిగిన దాడుల వెనక అతడి ప్రమేయం ఉందని ఇజ్రాయెల్ వెల్లడించింది. చనిపోయిన కమాండర్ ఐక్యరాజ్యసమితి సహాయ ఏజెన్సీ కోసం కూడా పని చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. యూఎన్ ఏజెన్సీలోని సభ్యులు హమాస్, ఇతర సాయుధ బృందాల్లో పనిచేస్తున్నారని ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో అక్టోబర్ 7 దాడుల్లో పాల్గొన్న 9 మందిని గతంలోనే యూఎన్ తొలగించింది. -
హెజ్బొల్లా పెద్ద తప్పు చేసింది: ఇజ్రాయెల్ ప్రధాని
జెరూసలేం: హెజ్బొల్లా తీరుపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇరాన్ మద్దతు కలిన హెజ్బొల్లా తనను, తన భార్యను హత్య చేయడానికి ప్రయత్నించి ఘోరమైన తప్పు చేసిందని’ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇటువటి ఘటనలు శత్రువులపై తాము సాగిస్తున్న న్యాయపరమైన యుద్ధాన్ని నిలువరించలేవని, ఈ విషయంలో ఇజ్రాయెల్‌ను ఎవరూ ఆపలేరని నెతన్యాహు పేర్కొన్నారు.నెతన్యాహు తన ట్విట్టర్ ఖాతాలో ‘ఇరాన్‌తో పాటు దాని ప్రతినిధులకు నేను ఒకటే చెబుతున్నాను.. ఎవరైనా సరే ఇజ్రాయెల్ పౌరులకు హాని కలిగించాలని ప్రయత్నిస్తే, వారు భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. మేము ఉగ్రవాదులను, వారిని పంపేవారిని అంతమొందించడాన్ని కొనసాగిస్తాం. మేము మా దేశ బందీలను గాజా నుండి స్వదేశానికి తీసుకువస్తాం. మా ఉత్తర సరిహద్దుల్లో నివసిస్తున్న మా పౌరులను సురక్షితంగా వారి ఇళ్లకు తిరిగి చేరుస్తాం. ఇజ్రాయెల్ తన యుద్ధ లక్ష్యాలన్నింటినీ సాధించడానికి, రాబోయే తరాలకు ఈ ప్రాంతంలో భద్రతను కల్పించడానికి కట్టుబడి ఉంది’ అని పేర్కొన్నారు. Israel PM Benjamin Netanyahu tweets, "The attempt by Iran’s proxy Hezbollah to assassinate me and my wife today was a grave mistake. This will not deter me or the State of Israel from continuing our just war against our enemies in order to secure our future. I say to Iran and its… pic.twitter.com/uX2MJvPcJe— ANI (@ANI) October 19, 2024హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతి తరువాత గాజాలో ఇజ్రాయెల్ తన ఆర్మీ దాడులు ముమ్మరం చేసింది. గాజాలో గత 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 93 మంది మృతి చెందారు. గాజాలోని ఎనిమిది శరణార్థుల శిబిరాలపై ఇజ్రాయెల్ భారీ దాడి చేసింది. ఈ దాడుల్లో రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య చాలా కాలంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల దాడుల్లో ఇప్పటి వరకు వందలమంది మృతిచెందారు. ఇది కూడా చదవండి: నోకియాలో ఉద్యోగాల కోత.. ఈ సారి ఎంతమందంటే? -
టార్గెట్ నెతన్యాహూ!
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ లక్ష్యంగా డ్రోన్ల దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. మధ్యధర సముద్ర తీర ప్రాంతంలోని కెసారియా పట్టణంలో ఉన్న నెతన్యాహూ ఇంటిని లక్ష్యంగా చేసుకొని శనివారం ఉదయం లెబనాన్ భూభాగం నుంచి డ్రోన్లు దూసుకొచ్చినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. వాటిని తమ సైన్యం కూల్చేసినట్లు ప్రకటించింది. ఆ సమయంలో నెతన్యాహూ, ఆయన భార్య ఇంట్లో లేరని పేర్కొంది. లెబనాన్ సరిహద్దు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెతన్యాహూ నివాసంపైకి డ్రోన్లు దూసుకొస్తుండగా ఇజ్రాయెల్‌లో సైరన్లు మోగాయి. దాంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. పదుల సంఖ్యలో డ్రోన్లను కూల్చేసినట్టు సైన్యం తెలియజేసింది. డ్రోన్ల శకలాలు తగిలి 50 ఏళ్ల వ్యక్తి మరణించాడని, 13 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ మెడికల్ సరీ్వసు అధికారులు చెప్పారు. అయితే ఇజ్రాయెల్ రాడార్ వ్యవస్థకు అందకుండా అతి తక్కువ ఎత్తులో వచ్చిన ఒక డ్రోన్ నెతన్యాహూ నివాసాన్ని ఢీకొన్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలో అది ఇజ్రాయెల్ హెలికాప్టర్‌కు అతి సమీపం నుంచి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇటీవల హెజ్బొల్లా, హమాస్ అధినేతలు మరణించడం తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా మిలిటెంట్లు నెతన్యాహూను లక్ష్యం చేసుకొని డ్రోన్ దాడులకు ప్రయతి్నంచినట్లు తెలుస్తోంది. మాది ఉనికి పోరు: నెతన్యాహు హమాస్‌తో యుద్ధాన్ని గెలిచి తీరతామని నెతన్యాహూ ప్రకటించారు. తన నివాసంపై దాడి అనంతరం ఆయన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇజ్రాయెలీలను ఉద్దేశించి ఇంగ్లిష్, హీబ్రూ భాషల్లో మాట్లాడారు. ‘‘ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా హమాస్‌ను తుడిచిపెట్టకుండా నన్ను ఆపలేరు’’ అని తన నివాసంపై దాడులనుద్దేశించి స్పష్టం చేశారు. లక్ష్యసాధనలో ఇజ్రాయెల్ సైనిక దళాలు అద్భుత ప్రగతి కనబరుస్తున్నాయంటూ ప్రస్తుతించారు. వారిని చూసి గరి్వస్తున్నట్టు చెప్పారు. ‘‘మా వాళ్లను కిరాతకంగా పొట్టన పెట్టుకోవడం, మా మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం, మా చిన్నారులను సజీవంగా బుగ్గి చేయడం వంటి దారుణ అకృత్యాల్లో యాహ్యా సిన్వర్ (హమాస్ చీఫ్)ది కీలకపాత్ర. రెండ్రోజుల క్రితమే అతన్ని మట్టుబెట్టాం. మాది ఉనికి పోరాటం. దీన్ని తుదకంటా కొనసాగిస్తాం. ఇరాన్ దన్నుతో చెలరేగుతున్న ఇతర ఉగ్ర సంస్థలపైనా రాజీలేని పోరు సాగిస్తాం’’ అని ప్రకటించారు. హెజ్బొల్లా అగ్రనేత హతం హెజ్బొల్లా మరో అగ్రనేతను కోల్పోయింది. సంస్థ డిప్యూటీ కమాండర్ నాసర్ రషీద్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. దక్షిణ లెబనాన్‌లోని బింట్ బెయిల్ పట్టణంలో శనివారం జరిపిన బాంబు దాడుల్లో అతను మరణించినట్టు వెల్లడించింది.సిన్వర్ లేకపోయినా హమాస్ సజీవం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్పష్టికరణ టెహ్రాన్: హమాస్ అధినేత యాహ్వా సిన్వర్ ప్రాణత్యాగం ప్రశంసనీయమని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. సిన్వర్ భౌతికంగా లేకపోయినా హమాస్ ఎప్పటికీ ఉంటుందని తేలి్చచెప్పారు. పాలస్తీనా ప్రజల కోసం ఆ సంస్థ పోరాటం సాగిస్తూనే ఉంటుందని తెలిపారు. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో బుధవారం సిన్వర్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఖమేనీ తాజాగా స్పందించారు. ఒక ప్రకటన విడుదల చేశారు. సిన్వర్‌ను కోల్పోవడం హమాస్‌కు కొంత నష్టమే అయినప్పటికీ ఆ సంస్థ మనుగడకు ముప్పేమీ లేదని వెల్లడించారు. హమాస్ సజీవంగా ఉందని, ఇకపైనా ఉంటుందన్నారు. పోరాటంలో సిన్వర్ ఒక ధ్రువతార అని ఖమేనీ కొనియాడారు. క్రూరమైన శత్రువుపై అలుపెరుగని పోరాటం సాగించారని, అంకితభావంతో పని చేశారని చెప్పారు. పలు సందర్భాల్లో శత్రువుకు గుణపాఠం చెప్పారని వివరించారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై చేసిన దాడి ద్వారా సిన్వర్ చరిత్ర సృష్టించారని, ఘనమైన వారసత్వాన్ని వదిలివెళ్లారని ఉద్ఘాటించారు. -
ఇజ్రాయెల్ ప్రధాని ఇంటిపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రమాదం
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణవాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ దళాలు తమ వరుస దాడులతో హమాస్,హెజ్బొల్లా అగ్ర నేతలను ఒక్కొక్కరిగా హతమార్చుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల హమాస్ చీఫ్, అక్టోబర్ 7 దాడుల సూత్రదారి యాహ్యా సిన్వర్ మృతిచెందిన విషయం తెలిసిందే. గాజాలోని ఓ ఇంటిపై చేసిన దాడిలో సిన్వర్ మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన రెండు రోజులకే ఓ ఆందోళనకర ఘటన చోటుచేసకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి సమీపంలో డ్రోన్ దాడి జరిగినట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి.లెబనాన్ నుంచి ప్రయోగించిన ఓ డ్రోన్ శనివారం దక్షిణ హైఫాలోని సిజేరియాలోని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నివాసం సమీపంలో పేలిపోయిందని రాయిటర్స్ నివేదించింది. ఈ డ్రోన్ దాడిలో భవనం కొంత భాగం దెబ్బతింది. అయితే ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దాడి జరిగిన సమయంలో నెతన్యాహు, అతని భార్య అక్కడ లేరని ప్రధాని ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.కాగా లెబనాన్ నుంచి ప్రయోగించిన మరో రెండు డ్రోన్లను ఇజ్రాయెల్ వాయు దళాలు టెల్ అవీవ్ ప్రాంతంలో కూల్చివేశాయి. అయితే మూడోది మాత్రం సిజేరియాలోని ఓ భవనాన్ని ఢీకొట్టడంతో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. సిజేరియాలోని భవనాన్ని ఢీకొనడానికి ముందు డ్రోన్ లెబనాన్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఎగిరిందని ఇజ్రాయెల్ మీడియా నివేదించింది. -
హమాస్ సిన్వర్ పోస్టుమార్టం రిపోర్టు.. తలలో బుల్లెట్, చేతి వేలు కత్తిరించి..
జెరూసలేం: ఇజ్రాయెల్ సైన్యం చేతిలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతిచెందాడు. ఈ క్రమంలో సిన్వర్ పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సిన్వర్ తలపై బుల్లెట్ గాయం, ఎడమ చేతికి ఒక వేలును కట్ చేసినట్టు రిపోర్టులో వెల్లడించారు. బుల్లెట్ గాయంతోనే సిన్వర్ చనిపోయినట్టు నిర్ధారించారు.ఇజ్రాయెల్ దాడుల్లో సిన్వర్ మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా హమాస్ అధినేత సిన్వర్ మృతదేహానికి డాకట్ర్ చెన్ కుగేల్ పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ క్రమంలో తలపై బుల్లెట్ గాయం ఉందని, దాని కారణంగానే అతడు మరణించి ఉంటాడని పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. అంతేకాకుండా సిన్వర్ ఎడమ చేతికి ఐదు వేళ్లలో ఒక వేలు లేదని తెలిపారు. దీంతో, రిపోర్టు సంచలనంగా మారింది.అయితే, దాడుల్లో చనిపోయిన వ్యక్తి సిన్వర్ అవునా.. కాదా? అని నిర్ధారించుకునేందుకే అతడి వేలిని ఇజ్రాయెల్ సైన్యం కత్తిరించినట్టు కథనాలు వెలువడ్డాయి. ఖైదీల మార్పిడి ఒప్పందంలో 2011లో విడుదలయ్యే వరకు సిన్వర్ రెండు దశాబ్దాల పాటు ఇజ్రాయెల్ జైలులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆనాటి ప్రొఫైల్‌తో డీఎన్ఏ నిర్ధారణ కోసం అతని వేలును కత్తిరించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. అతడి దంతాలను కూడా కత్తిరించినట్టు వార్తలు బయటకు వస్తున్నాయి. Live Updates: Autopsy Shows Hamas Leader Was Killed by a Gunshot to the HeadYahya Sinwar was earlier hit in the arm during a firefight with Israeli soldiers, according to the Israeli doctor who oversaw the autopsy.The leader of Hamas, Yahya Sinwar, was killed by a gunshot wound…— Brent Erickson (@BErickson_BIO) October 18, 2024 ఇదిలా ఉండగా.. హమాస్ చీఫ్ సిన్వర్ చనిపోవడానికి ముందు అతడు ఉన్న పరిస్థితిని ఇజ్రాయెల్ సైన్యం ఓ డ్రోన్ ద్వారా రికార్డు చేసింది. మరణానికి ముందు సిన్వర్ ఓ శిథిల భవనంలో సోఫా కుర్చీలో కూర్చొని ఉన్నాడు. అప్పటికే అతడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయాల నుంచి రక్తం కారుతోంది. కూర్చున్న చోటు నుంచి లేవలేని నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తోంది. శరీరమంతా దుమ్ము కప్పేసి ఉంది. అలాంటి పరిస్థితిలో.. తనవైపుగా వస్తున్న డ్రోన్‌పైకి కర్రలాంటి ఓ వస్తువును విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.🇵🇸 Incredible footage: Yahya Sinwar, covered in dust, all his comrades just killed, arm amputated and close to death, hurls a projectile at an Israeli drone in a final act of defianceIsraelis are ridiculing this as a pathetic end, but I'm not sure the world will see it that way pic.twitter.com/I0gdAQhQ0L— Keith Woods (@KeithWoodsYT) October 17, 2024 -
యుద్ధం రేపే ముగియవచ్చు.. ఇజ్రాయెల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో ఉగ్రవాద సంస్ధ హమాస్ చీఫ్, అక్టోబర్ 7 దాడుల సూత్రధారి యహ్యా సిన్వార్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. హమాస్ అగ్రనేతను ఎట్టకేలకు హతమార్చడంతో.. ఏడాది కాలంగా సదరు మిలిటెంట్ సంస్థతో పోరాడుతున్న ఇజ్రాయెల్‌కు భారీ విజయం లభించినట్లైంది..యహ్య సిన్వార్ మృతి అనంతరం గాజా ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఉగ్రవాదులు ఆయుధాలను వదిలి, బంధీలను విడిచిపెట్టినట్లైతే రేపటిలోగా యుద్ధం ముగుస్తుందని ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో వీడియో విడుదల చేశారు.చదవండి: ఇజ్రాయెల్ డ్రోన్ వీడియో.. హమాస్ సిన్వర్ ఆఖరి క్షణాలు ఇలాయహ్యా సిన్వార్ మరణించాడు. ఇజ్రాయెల్ రక్షణ దళాల ధైర్య సైనికులు అన్ని రఫాలో మట్టుబెట్టారు. ఇది గాజాలో యుద్ధం ముగింపు కాదు. ఇప్పుడే ముగింపు దశ ప్రారంభమైంది. గాజా ప్రజలకు నాదొక చిన్న సందేశం.. హమాస్ తన ఆయుధాలను వదిలి ఇజ్రాయెల్ బందీలను తిరిగి అప్పగిస్తే ఈ యుద్ధం ముగియవచ్చు. మా పౌరులను వదిలిన హమాస్ తీవ్రవాదులకు బయటకు వచ్చి జీవించే అవకాశం కల్పిస్తాం. లేదంటే వేటాడి మరీ హతమరుస్తాం’ అని హెచ్చరించారు. కాగా హమాస్ మిలిటెంట్ సంస్థ అధినేత యహ్యా సిన్వర్‌ను ఐడీఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. గాజాపై తాము జరిపిన దాడుల్లో ముగ్గురు మృతి చెందాని ఇజ్రాయెల్ తెలిపింది. వీరిలో ఒకరు యాహ్యా సిన్వర్ అని డీఎన్ఏ టెస్టు తర్వాత ఇజ్రాయెల్ ప్రకటించింది. Yahya Sinwar is dead.He was killed in Rafah by the brave soldiers of the Israel Defense Forces. While this is not the end of the war in Gaza, it's the beginning of the end. pic.twitter.com/C6wAaLH1YW— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) October 17, 2024 గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మారణకాండకు యహ్యా సిన్వర్నే మాస్టర్‌మైండ్. ఈ ఘటనలో 1200 మంది ఇజ్రాయెల్ వాసులు చనిపోయారు. సుమారు 250 మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో దక్షిణ గాజాలో బుధవారం ముగ్గురు హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ హతమార్చింది. అందులో సిన్వర్ ఉన్నట్లు డీఎన్ఏ ద్వారా ధ్రువీకరించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే దీనిపై హమాస్ ఎటువంటి ప్రకటనా చేయలేదు. -
ఇజ్రాయెల్ డ్రోన్ వీడియో.. హమాస్ సిన్వర్ ఆఖరి క్షణాలు ఇలా..
జెరూసలేం: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ మిలిటెంట్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్ మృతి చెందాడు. ఈ క్రమంలో చనిపోయే ముందు సిన్వర్ చివరి కదలికలకు సంబంధించిన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన డ్రోన్.. సిన్వర్ కదలికలను వీడియో తీసింది.ఇజ్రాయెల్ దాడులు జరుగుతున్న సమయంలో సిన్వర్ ఓ భవనంలో కూర్చుని ఉన్నాడు. బాంబు దాడుల తర్వాత భవనం పూర్తిగా శిథిలమైపోయింది. ఇజ్రాయెల్ బాంబుల దాడిలో సిన్వర్ తుదిశ్వాస విడిచే ముందు ఓ కూర్చిలో అచేతనంగా కూర్చుండిపోయాడు. సిన్వర్ కూర్చుని ఉండగా.. ఇజ్రాయెల్ డ్రోన్ అతడి వద్దకు వెళ్లింది. దాన్ని గమనించిన అతడు ఓ కర్రలాంటి వస్తువును దానిపైకి విసిరినట్లుగా వీడియోలో ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇదిలా ఉండగా.. సిన్వర్ మృతిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా నెతన్యాహు మాట్లాడుతూ.. సిన్వర్‌ను హతమార్చి, లెక్కను సరిచేశాం. ఇది అతిపెద్ద విజయంగా నేను భావిస్తున్నా. ఇజ్రాయెల్‌కు చెందిన బంధీలను సురక్షితంగా తరలించే వరకు యుద్ధం మాత్రం ఆగదు. హమాస్ ఆయుధాలను వదిలి.. బందీలను తిరిగి పంపిస్తే ఈ యుద్ధం రేపే ముగిస్తుంది. ఇజ్రాయెల్ పౌరులను వదిలిన హమాస్ తీవ్రవాదులకు బయటకు వచ్చి జీవించే అవకాశం కల్పిస్తాం. లేదంటే వేటాడి మరీ హతమరుస్తామని హెచ్చరించారు.🇵🇸The final moments of the resistance leader Yahya Sinwar who fought bravely on the front lines, refusing to surrender even after sustaining severe injuries from heavy attacks. He continued to fight with honor until he was ultimately martyred defending his land and people. pic.twitter.com/4Bn4Jnprbo— Syria Truths (@TruthsSyria) October 18, 2024 ఇది కూడా చదవండి: హమాస్ చీఫ్ సిన్వర్ మృతి.. బైడెన్ స్పందన ఇదే.. -
హమాస్ చీఫ్ సిన్వర్ మృతి.. బైడెన్ స్పందన ఇదే..
వాషింగ్టన్: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ మిలిటెంట్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్ మృతి చెందాడు. ఈ క్రమంలో సిన్వర్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి ఇది ఎంతో శుభసూచకం. సిన్వర్ అంతంతో గాజా యుద్ధం ముగింపునకు మార్గం సుగమమైంది అంటూ కామెంట్స్ చేశారు.ఇజ్రాయెల్, గాజా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అక్టోబరు 7 దాడుల సూత్రధారి హమాస్ మిలిటెంట్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. సిన్వర్‌ను హతమార్చి, లెక్కను సరిచేశాం. బంధీలను సురక్షితంగా తరలించే వరకు యుద్ధం మాత్రం ఆగదు అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో విదేశాంగమంత్రి కాంట్జ్ మాట్లాడుతూ.. ఇది ఇజ్రాయెల్‌కు సైనికంగా, నైతికంగా ఘనవిజయం. ఇరాన్ నేతృత్వంలో రాడికల్ ఇస్లాం దుష్టశక్తులకు వ్యతిరేకంగా స్వేచ్ఛా ప్రపంచం సాధించిన విజయం ఇది. సిన్వర్ మృతిలో తక్షణ కాల్పుల విరమణకు, బందీల విడుదలకు మార్గం సుగమం కానుంది అని చెప్పుకొచ్చారు.Yahya Sinwar is dead.He was killed in Rafah by the brave soldiers of the Israel Defense Forces. While this is not the end of the war in Gaza, it's the beginning of the end. pic.twitter.com/C6wAaLH1YW— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) October 17, 2024మరోవైపు, సిన్వర్ మృతిపై జో బైడెన్ స్పందిస్తూ.. హమాస్ అగ్రనేత సిన్వర్‌ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టడం యావత్ ప్రపంచానికి శుభదినం. ఈ ఘటన హమాస్ చెరలో ఉన్న బందీల విడుదలకు, ఏడాదిగా సాగుతున్న గాజా యుద్ధం ముగింపునకు దోహదపడుతుంది అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. దక్షిణ గాజాలో బుధవారం ముగ్గురు హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది. ఇందులో ఓ వ్యక్తికి సిన్వర్ పోలికలు ఉన్నాయని గుర్తించిన ఐడీఎఫ్, డీఎన్ఏ, దంత నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి హమాస్ నేత మరణాన్ని ధ్రువీకరించింది. గాజా యుద్ధానికి కారణమైన అక్టోబరు 7 దాడుల సూత్రధారి సిన్వరేనని తొలి నుంచి ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది. గతేడాది ఇజ్రాయెల్ సరిహద్దులపై హమాస్ జరిపిన దాడిలో 1200 మంది మృతి చెందారు. 250 మందిని బందీలుగా గాజాకు తీసుకువెళ్లింది. ఇంకా హమాస్ దగ్గర 100 మంది బందీలు ఉన్నారు.ఇది కూడా చదవండి: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హాసీనాపై అరెస్ట్ వారెంట్ -
ఇజ్రాయెల్‌కు కొత్త టెన్షన్!.. హెజ్బొల్లా వద్ద రష్యా ఆయుధాలు
జెరూసలేం: ఇజ్రాయెల్-హెజ్బొల్లాల మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు వర్గాలు దాడులతో చెలరేగిపోతున్నాయి. ఈ క్రమంలో హెజ్బొల్లా వద్ద రష్యాకు చెందిన ఆయుధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు చెప్పడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, హెజ్బొల్లాకు రష్యా సహకరిస్తోందన్న అనుమానాలను నెతన్యాహు వ్యక్తం చేశారు.హెజ్బొల్లాపై యుద్ధం సందర్భంగా ఇజ్రాయెల్ దళాలు వారి సొరంగాలను కనుగొన్నారు. ఇజ్రాయెల్ బాంబు దాడులతో సొరంగాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే ఆ సొరంగాల్లో రష్యాకు చెందిన ఆయుధాలను ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. ఈ నేపథ్యంలో హెజ్బొల్లా ఆయుధాలపై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజాగా మాట్లాడుతూ..‘దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన సోదాల్లో రష్యాకు చెందిన అత్యాధునిక ఆయుధాలు కనుగొన్నాం. లిటాని నదికి దక్షిణాన లెబనాన్ ఆర్మీకి మాత్రమే ఆయుధాలు కలిగి ఉండే అనుమతి ఉందని 2006లో యూఎన్ భద్రతామండలి తీర్మానించింది. అయినప్పటికీ హెజ్బొల్లా ఆ ప్రాంతాల్లో వందలాది సొరంగాలను తవ్వి.. స్థావరాలుగా మార్చుకుంది. అక్కడే రష్యాకు చెందిన ఆయుధాలు లభించాయి. ఒకరిని రెచ్చగొట్టడం మా లక్ష్యం కాదు. లెబనాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే ఉద్దేశం మాకు లేదు. లెబనాన్ సరిహద్దుల్లో నివసిస్తున్న మా పౌరులు సురక్షితంగా తమ ఇళ్లకు చేరడమే మా లక్ష్యం’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. గత నెలలో ఇరాన్ మద్దతుతో లెబనాన్‌లోని హెజ్బొల్లాలో ఇజ్రాయెల్ దళాలు జరిపిన సోదాల్లో రష్యా, చైనాకు సంబంధించిన ఆయుధాలు కనుగొన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనాలు వెల్లడించింది. ఈ నేపథ్యంలో హెజ్బొల్లా వద్ద రష్యా ఆయుధాలు ఉన్నాయని నిరూపితమైంది. 🔴 Netanyahu has said that the Israeli military found "state-of-the-art" Russian weapons during a search of Hezbollah bases in Lebanon.- The Times of Israel pic.twitter.com/ohuvH48zLr— war observer (@drmubashir599) October 17, 2024 -
మీకూ గాజా గతే!
బీరుట్: లెబనాన్‌కూ గాజా గతి పట్టిస్తామని, మునుపెన్నడూ లేనంతగా పెనుదాడులకు పాల్పడతామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం లెబనాన్ పౌరులనుద్దేశిస్తూ ఆయన ఒక వీడియో సందేశం వినిపించారు. ‘‘ హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను అంతంచేశాం. అతని స్థానంలో హెజ్బొల్లా కాబోయే చీఫ్‌ను, ఆ తర్వాతి వారసుడు, తదుపరి నేతనూ చంపేశాం.గతంలో ఎన్నడూలేనంతగా హెజ్బొల్లా ఇప్పుడు బలహీనపడింది’ అని నెతన్యాహూ అన్నారు. నెతన్యాహూ వ్యాఖ్యలపై లెబనాన్ ఇంకా స్పందించలేదు. మరోవైపు దక్షిణ లెబనాన్‌లోని కుగ్రామంలో రెసిడెన్షియల్ భవంతి భూగర్భంలో హెజ్బొల్లా స్థావరాన్ని ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. అక్కడి భారీ స్థాయిలో ఆయుధాలను స్వా«దీనం చేసుకుంది.ఈ క్రమంలో హెజ్బొల్లా మిలిటెంట్లతో జరిగిన పరస్పర కాల్పుల్లో ఇజ్రాయెల్ సైన్యాధికారి కెప్టెన్ బెంజిన్ ఫాలక్ చనిపోయాడు. కాగా, లెబనాన్‌లోని పావువంతు భాగం ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం అధీనంలోకి వెళ్లిపోయిందని ఐక్యరాజ్యసమితి మానవతా సంబంధాల విభాగం తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో 1,400 మంది పౌరులు మరణించగా, 12 లక్షల మంది వలసపోయారని పేర్కొంది. -
హమాస్‌పై యుద్ధం ముగిస్తాం: నెతన్యాహు
గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ చేసినటువంటి మెరుపు దాడి మళ్లీ జరగకుండా చూసేందుకు దేశంలో భద్రతను మారుస్తున్నట్లు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్‌పై హమాస్ బలగాలు మెరుపుదాడి చేసిన ఘటనకు నేటితో ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా ఆనాటి దాడి జరగకుండా చూస్తామని ప్రధాని నెతన్యాహు సోమవారం కేబినెట్ ప్రసంగంలో పేర్కొన్నట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.‘‘మేము మా ప్రాంతంలో భద్రతా మారుస్తున్నాం. మా పిల్లల, భవిష్యత్తు కోసం. గతేడాది అక్టోబర్ ఏడో తేదీన జరిగినవి దాడి మళ్లీ ఇంకెప్పడూ జరగకుండా చూస్తాం. అందు కోసం దేశ భద్రతలో సైతం వాస్తవ మార్పులు తీసుకువస్తాం’’ అని అన్నారు.ఇజ్రాయెల్‌పై జరిగిన దాడుల మొదటి వార్షికోత్సవం సందర్భంగా 1200 మందికిపైగా అమాయకుల మృతికి ప్రత్యేక సంతాప సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్), భద్రతా సిబ్బంది , రెగ్యులర్, రిజర్వ్, ఆర్మీ , పోలీసు, మొస్సాద్లోని సైనిక యోధుల వీరత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మీరు నిర్వహిస్తున్న పనిని పూర్తి చేయాలని తెలిపారు. హమాస్ చేతిలో మిగిలిన బందీలను గాజా నుంచి విడిపించాలని కోరారు.‘‘మేము నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలను పూర్తి చేసినప్పుడే హమాస్‌పై యుద్ధాన్ని ముగిస్తాం. గాజా హమాస్ పాలనను పడగొడుతాం. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బంధీలను సురక్షితంగా తీసుకువస్తాం. గాజా నుంచి ఇజ్రాయెల్‌కు భవిష్యత్తులో వచ్చే ముప్పును అడ్డుకుంటాం’’ అని అన్నారు.చదవండి: ఏడు వైపులా శత్రువులతో పోరాడుతున్నాం -
ఏడు వైపులా శత్రువులతో పోరాడుతున్నాం
జెరూసలేం: ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరాను నిలిపివేస్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ తీసుకున్న నిర్ణయంపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాçహు మండిపడ్డారు. ‘‘మాక్రాన్ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. ఇరాన్ అండదండలు అందిస్తున్న అరాచకశక్తులపై ఇజ్రాయెల్ పోరాడుతోంది. ఇందుకు నాగరిక దేశాలన్నీ మద్దతు ఇవ్వాలి. కానీ ఫ్రాన్స్, ఇతర పశి్చమ దేశాలు మాకు ఆయుధాలివ్వొద్దని నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇది నిజంగా సిగ్గుచేటు’’ అంటూ ఆదివారం దుయ్యబట్టారు. ‘‘మేం ఏడు దిక్కులా శత్రువులతో పోరాడుతున్నాం. గాజాలో హమాస్‌పై, లెబనాన్‌లో హెజ్»ొల్లాపై, యెమెన్‌లో హౌతీలపై, ఇరాక్, సిరియాల్లో షియా మిలిటెంట్లపై పోరాడుతున్నాం. ఇరాన్ ప్రభుత్వం మిలిటెంట్లకు ఆయుధ సరఫరా ఆపడం లేదు. మిలిటెంట్ శక్తులు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. వాటిని వ్యతిరేకిస్తున్న పశి్చమ దేశాలు ఇజ్రాయెల్‌కు ఆయుధాలివ్వడం మాత్రం నిలిపివేస్తున్నాయి’’ అని ఆక్షేపించారు. ఎవరి సహకారమున్నా, లేకపోయినా యుద్ధంలో గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. -
మీరెన్ని చెప్పినా.. ఇరాన్‌పై మా యుద్ధం ఆగదు : ఇజ్రాయెల్ ప్రధాని
జెరూసలేం: ఎవరెన్ని ఏం చెప్పినా, ఏ దేశం తమకు మద్దతు ఇవ్వకపోయినా తాము ఇరాన్‌పై చేస్తున్న యుద్ధాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంలో తమదే విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.దాదాపు 200 క్షిపణులతో (మిసైల్స్) ఇరాన్లో బీభత్సం సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నామని, దాడుల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు శుక్రవారం ఇజ్రాయెల్ సైన్యం(ఐడీఎఫ్)ప్రకటించింది. ఆ ప్రతిపాదనలను ప్రధాని నెతన్యాహుకి పంపినట్లు వెల్లడించింది. నెతన్యాహు నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే తమ పనిని మొదలుపెడతామని ఐడీఎఫ్ తెలిపింది.ఈ ప్రకటన అనంతరం, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్ మాట్లాడుతూ..ఇజ్రాయెల్‌కు తాము సరఫరా చేస్తున్న అణ్వాయుధాలను నిలిపి వేస్తున్నట్లు అధికారంగా వెల్లడించారు. ఆ దిశగా ఆదేశాలు జారీ చేశారు. అయితే మాక్రాన్ నిర్ణయాన్ని నెతన్యాహు ఖండించారు. ఫాన్స్ అధ్యక్షుడి నిర్ణయాన్ని తాము అవమానకరంగా భావిస్తున్నట్లు ఓ వీడియోని విడుదల చేశారు. ఇరాన్ నేతృత్వంలోని అనాగరిక శక్తులతో ఇజ్రాయెల్ పోరాడుతున్నప్పుడు, నాగరిక దేశాలన్నీ ఇజ్రాయెల్ వైపు నిలబడాలి’ అని నెతన్యాహు కోరారు. అయినా మాక్రాన్, ఇతర పాశ్చాత్య నాయకులు ఇప్పుడు ఇజ్రాయెల్‌పై ఆయుధాల ఆంక్షలు విధించాలని పిలుపునివ్వడం సిగ్గుచేటుగా అభివర్ణించారు.గాజాలో హమాస్, లెబనాన్‌లోని హెజ్బొల్లా, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్ ,సిరియాలోని షియా మిలీషియా, వెస్ట్ బ్యాంక్‌లోని ఉగ్రవాదులతో చేస్తున్న ఇజ్రాయెల్ పోరాటాలను ఎత్తి చూపారు. ఇరాన్ తన మిత్రదేశాలకు ఆయుధాలను పరిమితం చేసిందా అని ప్రశ్నిస్తూ.. కాదు.. ఇరాన్‌ను వ్యతిరేకించే దేశాలు.. ఇప్పుడు ఇజ్రాయెల్‌కు అణ్వాయుధాల్ని పంపడాన్ని ఆపేయడం ఎంత అవమానకరం అని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ, నెతన్యాహు వారి మద్దతు ఉన్నా,లేకుండానే ఇజ్రాయెల్ గెలుస్తుందని పునరుద్ఘాటించారు. కాగా,ఇజ్రాయెల్‌కు అణ్వాయుధాలు పంపడాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఫ్రాన్స్‌కు పలుదేశాలు మద్దతు పలుకుతున్నాయి. -
ఇరాన్ హిట్ లిస్ట్‌లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు?
ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు, ప్రతీకార దాడులతో పశ్చిమాసియాపై నానాటికీ యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి.లెబనాన్‌ను వైమానిక దాడులతో వణికించి హెజ్బొల్లా అగ్రనేతలను వరుసబెట్టి మట్టుపెట్టిన ఇజ్రాయెల్.. ఇటు గాజాపై క్షిపణుల వర్షం కురిపిస్తూ హమాస్‌ను అంతమొందించే దిశగా దూకుడుగా వ్యవహరిస్తోంది.అటు ఇరాన్ సైతం వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్‌పై క్షిపణులు వర్షం కురిపిస్తూ ప్రతీకార దాడులుకు పాల్పడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ అగ్రనేతలతో కూడిన ఇరాన్ హిట్ లిస్ట్ జాబితా ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లిస్ట్‌లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతోసహా రక్షణమంత్రి యోవ్ గాలంట్, ఇజ్రాయెల్ ఆర్మీ, నేవీ, వైమానిక దళ కమాండర్లు కూడా ఉన్నట్లు రూమర్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే వీటిపై అటు ఇజ్రాయెల్ కానీ ఇటు ఇరాన్ కానీ స్పందించలేదు. ఒకవేళ నెతన్యాహు ఈ జాబితాలో లేకపోయినా..సీనియర్ ఇజ్రాయెల్ నాయకులను లక్ష్యంగా చేసుకొని ఉండవచ్చనే అనుమానాలే ఇరాన్ మిలటరీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఉన్నత స్థాయి సైనిక నాయకులైన జనరల్ స్టాఫ్ హెర్జి హలేవి, డిప్యూటీ అమీర్ బారం,ఉత్తర, దక్షిణ, సెంట్రల్ కమాండ్ అధిపతులు మేజర్ జనరల్స్ ఒరి గోర్డిన్, యెహుదా ఫాక్స్, ఎలియేజర్ తోలెడాని. మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ అహరోన్ హలీవా పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోందిఇక జాబితా నిజమే అయితే.. ఇరాన్ మద్దతుగల హెజ్బొల్ల చీఫ్‌ను అంతం చేసిన ఇజ్రాయెల్, తమ తదుపరి టార్గెట్ ఆదేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనని మట్టుబెట్టడమేనని వస్తున్న వార్తలకు ప్రతిచర్యగా బెంజమిన్ నెన్యాహును ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. -
ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్.. ఏ దేశం ఎటువైపు!
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి.. ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా గాజాకు తీసుకువెళ్లటంతో గతేడాది అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైంది. హమాస్‌కు మద్దతుగా ఉండే లెబనాన్ దేశంలోని హెజ్బొల్లా గ్రూప్, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో ఈ యుద్ధం కాస్త.. ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాన్ దేశాలకు విస్తరించింది. ఇక.. మంగళవారం ఇరాన్.. ఇజ్రాయెల్‌పై చేసిన భీకర మిసైల్స్ దాడితో ఒక్కసారిగా పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకొని ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.ఇజ్రాయెల్, ఇరాన్ మిత్రదేశాల మధ్య ఇటీవల కాలంలో దాడుల తీవ్రత విస్తరిస్తూ వస్తోంది. ఇలాగే కొనసాగితే.. ఈ దాడులు అరబ్ దేశాలు, అమెరికాకు విస్తరించే అవకాశం ఉన్నట్లు యుద్ధ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్‌లో ఇరాన్ ఇజ్రాయెల్‌పై మిసైల్స్‌తో మెరుపు దాడిని చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇరాన్‌కు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు, లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూప్, సిరియన్ సైన్యం నుంచి కూడా మద్దతు లభించింది. మరోవైపు.. ఇజ్రాయెల్ రక్షణకు దాని మిత్రదేశాలు (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్), అరబ్ దేశాలైన జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ మద్దతుగా నిలిచి సహాయం అందించాయి.అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడుల నేపథ్యంలో ఏయే దేశాలు ఎవరికి మద్దతుగా నిలుస్తున్నాయనే చర్చ జరుగుతోంది.ఇజ్రాయెల్మిత్ర దేశం అమెరికా సాయం, ఐరన్ డోమ్ రక్షణతో ఇజ్రాయెల్ అక్టోబరు 2023 నుంచి గాజా స్ట్రిప్‌లోని హమాస్, లెబనాన్‌లోని హెజ్బొల్లా, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులతో పోరాడుతోంది. ఇరాన్, ఇరాన్ మద్దతు మిలిటెంట్ గ్రూప్‌లను దాడులకు ప్రతిదాడులతో హెచ్చరిస్తూ.. గాజాలో హమాస్‌ను తుడిచిపెట్టేవరకు తమ దాడులను ఆపబోమని తేల్చిచెబుతోంది.ఇజ్రాయెల్ మిత్రదేశాలు: అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్, సౌదీ అరేబియాప్రత్యర్థులు: హౌతీలు, హమాస్, ఇరాన్, హెజ్బొల్లాఇరాన్గతంలో ప్రాక్సీ మిటిటెంట్ల గ్రూప్‌ల ద్వారా ఇరాన్.. ఇజ్రాయెల్‌పై ఎక్కువగా దాడి చేసింది. అనూహ్యంగా ఇటీవల ఏప్రిల్‌లో, మంగళవారం ఇరాన్ ఇజ్రాయెల్పకై ప్రత్యక్ష దాడులను ప్రారంభించింది. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్య , టెహ్రాన్‌లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే హత్యకు ప్రతీకారంగా ఇరాన్ అక్టోబర్ 1(మంగళవారం) ఇజ్రాయెల్‌పై 200లకుపైగా మిసైల్స్‌తో భీకర దాడులు చేసింది. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. అనంతరం ఇరాన్ ప్రతీకార చర్యలు భాగంగా ఇజ్రాయెల్‌పై 17 డ్రోన్లు, 120 బాలిస్టిక్ క్షిపణులను మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ కూడా క్రమంగా ఇజ్రాయెల్‌ను ఇరుకున పెట్టేందుకు పశ్చిమాసియా ప్రాంతంతో తన మిత్రదేశాలను సాయాన్ని మరింతగా సమీకరించుకుంటోంది.ఇరాన్ మిత్రపక్షాలు: యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, హమాస్ప్రత్యర్థులు: ఇజ్రాయెల్, అమెరికా, సౌదీ అరేబియాసౌదీ అరేబియాఇజ్రాయెల్తో దృఢమైన భద్రతా సంబంధాలను కలిగి ఉంది. కానీ దౌత్యపరంగా మాత్రం కఠినంగా వ్యవహరిస్తుంది. ఒక వైపు ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తూ.. గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇజ్రాయెల్‌పై దాడి చేయాలనే ఇరాన్ ప్రణాళికలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇజ్రాయెల్‌కు పంపిన దేశాలలో సౌదీ అరెబీయా ఒకటి.ఖతార్ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో ఖతార్ కీలక పాత్ర పోషిస్తోంది. అయినప్పటికీ, ఖతార్ హమాస్ నేత ఇస్మాయిల్ హనియెహ్కు ఆశ్రయం ఇచ్చింది. అదేవిధంగా ఇరాన్‌తో సత్సంబంధాలను కలిగి ఉంది. ఈ విషయంలో ఇజ్రాయెల్‌కు చాలా ఇష్టం లేకపోవటం గమనార్హం.జోర్డాన్ఈ ఏడాది జనవరిలో దేశంలోని అమెరికా ఆర్మీ స్థావరంపై ఇరాన్ మద్దతుగల మిలిటెంట్లు దాడి చేసి ముగ్గురు సైనికులను అంతం చేశారు. అనంతరం జోర్డాన్ కూడా తీవ్ర సంఘర్షణలో చిక్కుకుంది. జోర్డాన్ గాజాకు సహాయాన్ని పంపినప్పటికీ.. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను కూడా కొనసాగించింది. -
ఇరాన్ దాడులు.. బంకర్లోకి ఇజ్రాయెల్ ప్రధాని పరిగెత్తారా?
ఇరాన్ మిసైల్స్‌తో ఇజ్రాయెల్‌పై భీకర దాడి చేసింది. సుమారు 400లకుపైగా బాలిస్టిక్ మిసైల్స్‌ను మంగళవారం ఇజ్రాయెల్‌పై ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. మరోవైపు.. తాము వెంటనే అప్రమత్తమై ఇరాన్ మిసైల్స్‌ను తిప్పికొట్టినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ఇక.. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.అయితే.. మంగళవారం ఇరాన్ ఇజ్రాయెల్‌పై మిసైల్స్ దాడులు చేసిన సమయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు బంకర్లో తలదాచుకోవడానికి పరిగెత్తినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో ముఖ్యంగా ఇరాన్ అనుకూల సోషల్‌మీడియా ఖాతాల్లో వైరల్‌గా మారటం గమనార్హం.La carrera de Netanyahu hacia el búnker tras el lanzamiento de misiles iraníes. Lástima que no le cayera uno en toda la cabeza y lo pulverizara, a él y a toda su estirpe de hdp. pic.twitter.com/DGkRywBNbj— Jaime 🏳️🌈 (@Elpieizquierdo) October 2, 2024 ఇరాన్ మంగళవారం చేసిన దాడులకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పరుగులు పెట్టారని సదరు వీడియోకు కామెంట్లు చేస్తున్నారు ఇరాన్ అనుకూల నెటిజన్లు. అయితే ఆ వీడియో.. ప్రస్తుత వీడియో కాదని.. 2021 నాటికి సంబంధించిన వీడియో అని నిపుణులు తేల్చారు. నెస్సెట్ సెషన్ (చట్టసభకు) హాజరయ్యే క్రమంలో ప్రధాని నెతన్యాహు అలా పరుగులు తీశారని.. అప్పడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోందని వివరణ ఇచ్చారు.చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ వార్.. చిన్నపిల్లల కొట్లాటలా ఉంది: ట్రంప్ -
నెతన్యాహుతో మాట్లాడిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఫోన్లో సంభాషించారు. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై ఆయన చర్చించారు. ప్రస్తుత ప్రపంచంలోనే ఉగ్రవాదానికి చోటులేదని తేల్చిచెప్పారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను నివారించడం ఎంతో అవసరమని నొక్కిచెప్పారు. అదే సమయంలో బందీలందరినీ సురక్షితంగా విడుదలయ్యేలా చూడాలన్నారు. పశ్చిమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతి, సుస్థిరతలను నెలకొల్పే ప్రయత్నాలకు భారత్ మద్దతుగా నిలుస్తుందని నెతన్యాహూకు హామీ ఇచ్చినట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. అయితే, ప్రత్యేకంగా ఏ సంఘటననూ ప్రధాని మోదీ ప్రస్తావించలేదు. -
ఉగ్రవాదానికి చోటు లేదు: నెతన్యాహుతో ఫోన్లో ప్రధాని మోదీ
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో ఇటీవల పరిణామాలతో నెలకొన్న ఉద్రిక్త వాతావరణంపై నెతన్యాహుతో చర్చించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.‘పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఇటీవలి పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడాను. ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటులేదు. స్థానికంగా ఉద్రిక్తతలు తీవ్రతరం కాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు బందీలందరిని సురక్షితంగా విడుదల చేయడం చాలా ముఖ్యం. వీలైనంత త్వరగా శాంతి, స్థిరత్వాల పునరుద్ధరణ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి భారత్ కట్టుబడి ఉంది.’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.Spoke to Prime Minister @netanyahu about recent developments in West Asia. Terrorism has no place in our world. It is crucial to prevent regional escalation and ensure the safe release of all hostages. India is committed to supporting efforts for an early restoration of peace and…— Narendra Modi (@narendramodi) September 30, 2024ఇటీవల ఇజ్రాయెల్ లెబనాన్, హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా దాడులు తీవ్రతరం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లెబనాన్ రాజధాని బీరూట్‌పై జరిపిన దాడిలో హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా సహా కీలక కమాండర్లను హతమార్చింది.దాంతో హెజ్బొల్లాలో నాయకత్వ సంక్షోభం తలెత్తింది. మూడు దశాబ్దాల పైచిలుకు సారథ్యంలో సంస్థను తిరుగులేని సాయుధ శక్తిగా మార్చిన ఘనత నస్రల్లాది. ఆయన మృతితో ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఎదురవుతున్న పెను దాడులను కాచుకుంటూ కష్టకాలంలో సంస్థను ముందుండి నడిపేది ఎవరన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కొత్త సారథిగా నస్రల్లాకు వరుసకు సోదరుడయ్యే హషీం సైఫుద్దీన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. -
నస్రల్లా మృతిపై బైడెన్ సంచలన కామెంట్స్
బీరుట్: ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ దాడులు, నస్రల్లా మృతిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం కావాలని ఇరాన్‌ను కోరింది. దీంతో, భదత్రా మండలిలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.మరోవైపు.. హిజ్బులా చీఫ్ హనస్ నస్రల్లా హత్యపై తాజాగా అమెరికా స్పందించింది. నస్రల్లా మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ..‘గతేడాది మొదలైన యుద్ధ ప్రారంభంలోనే నస్రల్లా హత్యకు ఆపరేషన్ రెడీ అయ్యింది. హిజ్బుల్లా, హమాస్ వంటి ఇరానియన్ మద్దతు గల ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు తప్పకుండా ఉంటుంది. నస్రల్లా కారణంగా హిజ్బుల్లాలో వేలాది మంది అమెరికన్లు మృతిచెందారు అని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో బీరుట్లో తలెత్తిన భద్రతా పరిస్థితుల కారణంగా దౌత్యవేత్తల కుటుంబసభ్యులు, అమెరికన్ పౌరులు జాగ్రత్తగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. అలాగే, బీరుట్ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని విదేశాంగ శాఖ కోరింది. దీంతో, బీరుట్‌లోని అమెరికన్లు కొందరు స్వదేశం బాటపట్టినట్టు సమాచారం.మరోవైపు.. రాబోయే రోజుల్లో తమ శత్రువులపై దాడులు మరింత పెరుగుతాయని ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా 33 మంది మరణించారు. అలాగే, 195 మంది పౌరులు గాయపడినట్టు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్ కారణంగా గత రెండు వారాల్లో దాదాపు 1000 మంది మరణించగా.. 6000 మంది గాయపడ్డారు.ఇది కూడా చదవండి: హిజ్బుల్లాపై యుద్ధంలో మా టార్గెట్ అతడే: నెతన్యాహు -
హిజ్బుల్లాపై యుద్ధంలో మా టార్గెట్ అతడే: నెతన్యాహు
బీరుట్: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను పక్కా ప్లాన్ ప్రకారం ఇజ్రాయెల్ హత్య మార్చింది. ఈ నేపథ్యంలో నస్రల్లా మృతిపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. నస్రల్లాను అంతమొందించడం తమ యుద్ధ లక్ష్యాలను సాధించడంలో అతి ముఖ్యమైన విషయం అని చెప్పుకొచ్చారు.న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి పర్యటన తర్వాత నెతన్యాహు ఇజ్రాయెల్‌కు వెళ్లారు. హసన్ నస్రల్లా హత్యానంతరం ఈ ఘటనపై నెతన్యాహు మొదటిసారిగా బహిరంగంగా స్పందించారు. ఇజ్రాయెల్‌లో నెతన్యాహు మాట్లాడుతూ.. నస్రల్లాను హతమార్చడం మాతో అతి ముఖ్యమైన విషయం. హిజ్బుల్లాకు చెందిన ఇతర టాప్ కమాండర్లను తాము చంపినా, నస్రల్లాయే మాకు అసలు టార్గెట్. ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలన్న ప్రణాళికకు సూత్రధారిగా అతడు వ్యవహరించాడు. అందుకే అతడినే మేము టార్గెట్‌గా పెట్టుకున్నాము. యుద్ధంలో నస్రల్లా హత్య చారిత్రక మలుపు. తన శత్రవులపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. లెబనాన్ తీవ్రవాద సంస్థ హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాను ఐడీఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. ఈ నేపథ్యంలో హిజ్బుల్లాలకు కొత్త చీఫ్ ఎవరు అనే చర్చ మొదలైంది. అయితే, ఇరాన్ ఆమోదం ఉన్న వ్యక్తికే పగ్గాలు దక్కే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హిజ్బులా రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే హషీమ్ సఫీ అల్ దిన్ ప్రస్తుతం రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. నస్రల్లాకు హషీమ్ సఫీ అల్ దిన్ బంధువు. అలాగే, హిజ్బుల్లా జిహాద్ కౌన్సిల్లోనూ సభ్యుడుగా ఉన్నాడు.మరోవైపు.. ఇజ్రాయెల్ వైమానిక దాడులు బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలను తాకాయి. ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లా బలమైన కోట అయిన దహియేహ్‌లో దాడులు కొనసాగిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో తొమ్మిది మంది పౌరులు మృతిచెందారు. అలాగే, 90 మందికి పైగా గాయపడినట్టు లెబనాన్ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇది కూడా చదవండి: Hassan Nasrallah: అరబ్బుల హీరో -
రెండు మ్యాప్‌లతో ఐరాస వేదికపై నెతన్యాహు.. భారత్ ఎటువైపు అంటే
హెజ్బొల్లాను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో దాడులు జరుపుతోంది. అటు ఐక్యరాజ్యసమితి సమావేశాల్లోనూ.. లెబనాన్ సరిహద్దులో తమ లక్ష్యాలను సాధించే వరకు హెజ్బొల్లాపై పోరాటం ఆగదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఇప్పటికే హమాస్ సగం బలగాలను అంతం చేశామన్నారు. వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతామన్నారు.శుక్రవారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమతి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మాట్లాడుతూ.. తన చేతుల్లో రెండు మ్యాప్‌లను ప్రదర్శించారు. అతని కుడి చేతిలోఉన్న మ్యాప్‌లో మిడిల్ ఈస్ట్‌తో పాటు ఇరాన్, ఇరాక్, సిరియా, యెమెన్ దేశాలకు నలుపు రంగు పెయింట్ వేశారు. ఆ మ్యాప్‌పై ద కర్స్(శాపం) అని రాసి ఉన్నది.ఇక ఒక ఎడమ చేతిలో ఉన్న మ్యాప్‌లో ఈజిప్ట్, సుడాన్, సౌదీ అరేబియా, ఇండియా దేశాలు ఉన్నాయి. ఈ దేశాలను హైలెట్ చేస్తూ గ్రీన్ కలర్ పెయింట్ వేశారు. ఆ మ్యాప్‌పై ద బ్లెస్సింగ్(దీవెన) అని రాసి ఉన్నది అయితే ఆ రెండు మ్యాపుల్లోనూ .. పాలస్తీనా కనిపిస్తున్న ఆనవాళ్లు లేవు. గ్రీన్ మ్యాప్ లేదా బ్లాక్ కలర్ మ్యాపుల్లో .. పాలస్తీనాను చూపించకపోవడం గమనార్హం.ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణకు ఇరాన్ కారణమని నెతన్యాహు ఆరోపించారు. ఇరాన్‌తో పాటు దాని మిత్రదేశాలు యుద్ధానికి ఆజ్యం పోస్తున్నట్లు పేర్కొన్నారు. . ఇక గ్రీన్ మ్యాప్‌లో ఉన్న దేశాలు ఇజ్రాయిల్‌తో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని ఉన్నట్లు తెలిపారు. లెబనాన్, సిరియా, యెమెన్ దేశాల్లో జరుగుతున్న హింసకు ఇరాన్ ప్రధాన కారణమని తెలిపారు. లెబనాన్‌లోని హిజ్బొల్లాకు, గాజాలోని హమాస్‌కు, యెమెన్‌లోని హౌతీలకు ఆర్థిక, సైనిక సహకారాన్ని ఇరాన్ అందిస్తున్నట్లు ఆరోపించారు. ఇరాన్ మిత్రదేశాల నుంచి తమ భూభాగాన్ని రక్షించుకుంటున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని పేర్కొన్నారు.ఒకవేళ మీరు దాడి చేస్తే, అప్పుడు మేం తిరిగి దాడి చేస్తామని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. యూఎన్ జనరల్ అసెంబ్లీలో నెతాన్యహూ మాట్లాడుతున్న సమయంలో కొందరు దౌత్యవేత్తలు నిరసనతో వాకౌట్ చేశారు. ఇరాన్ దూకుడు వల్లే లెబనాన్, గాజాలపై దాడి చేయాల్సి వచ్చిందని చెప్పారు. హిజ్బొల్లా యుద్ధ మార్గాన్ని ఎంచుకున్నంత కాలం.. వారిని అంతం చేయడం తప్ప ఇజ్రాయెల్‌కు వేరే మార్గం లేదని స్పష్టం చేశారునెతాన్యహూ పట్టుకున్న గ్రీన్ మ్యాప్‌లో ఇండియా ఉండడం గమనార్హం. ఇండియాతో తమకు మంచి రిలేషన్స్ ఉన్నాయని చెప్పేందుకు ఆ మ్యాప్‌లో ఇండియాను చూపించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇండియా, ఇజ్రాయిల్ మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయి. డిఫెన్స్, టెక్నాలజీ రంగంలో రెండు దేశాలు వాణిజ్యం పెంచుకున్నాయి. పాలస్తీనా స్వయంప్రతిపత్తికి ఇండియా సపోర్టు ఇస్తున్నది. అయితే అదే సమయంలో ఇజ్రాయిల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నది. -
దాడులు కొనసాగించండి!
టెల్ అవీవ్: ఇజ్రాయెల్–హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోంది. లెబనాన్‌లో హెజ్బొల్లా స్థావరాలపై దాడులు కొనసాగించాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. శత్రువుల భరతం పట్టాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఆయన తాజాగా అమెరికాకు పయనమయ్యారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ప్రసంగిస్తారు. హెజ్బొల్లా్లతో చర్చల ప్రతిపాదన వచి్చన మాట వాస్తమేనని, అయితే దానిపై తాము ఇంకా స్పందించలేదని చెప్పారు. మరోవైపు హెజ్బొల్లా్లకు గట్టిగా బుద్ధి చెప్పాలన్న డిమాండ్లు ఇజ్రాయెల్‌లో వినిపిస్తున్నాయి. చర్చలు అవసరం లేదని నెతన్యాహూ మద్దతుదారులు తేల్చిచెబుతున్నారు. ఇదిలా ఉండగా, దక్షిణ లెబనాన్‌లోని బెకా లోయ రక్తసిక్తంగా మారుతోంది. హెజ్బొల్లా ఆయుధ నిల్వలతోపాటు పలు స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం బుధవారం అర్ధరాత్రి తర్వాత నిప్పుల వర్షం కురిపించింది. భారీగా క్షిపణులు ప్రయోగించింది. 75 హెజ్బొల్లా లక్ష్యాలపై దాడుల చేశామని ఇజ్రాయెల్ సైన్యం గురువారం వెల్లడించింది. 23 మంది సిరియన్లు మృతి లెబనాన్‌లోని యూనైన్ పట్టణంలో మూడంతస్థుల భవనంపై బుధవారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 23 మంది సిరియన్లు మరణించారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు తెలిసింది. లెబనాన్‌లో ప్రస్తుతం 15 లక్షల మంది సిరియన్లు తలదాచుకుంటున్నారు. సిరియాలో అంతర్యుద్ధం మొదలైన తర్వాత వీరంతా ప్రాణరక్షణ కోసం లెబనాన్‌కు చేరుకున్నారు. హెజ్బొల్లా విషయంలో కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ గురువారం స్పష్టంచేశారు. హెజ్బొల్లా డ్రోన్ కమాండర్ మృతి?హెజ్బొల్లా డ్రోన్ విభాగం కమాండర్ లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దళం గురువారం సాయంత్రం లెబనాన్ రాజధాని బీరుట్‌పై మళ్లీ దాడులకు దిగింది. దహియెలోని అపార్టుమెంట్‌పై జరిగిన దాడిలో ఇద్దరు మృతి చెందగా 15 మంది వరకు గాయ పడ్డారని లెబనాన్ వార్తా సంస్థలు తెలిపాయి. ఈ దాడిలో హెజ్బొల్లా డ్రోన్ కమాండర్ మహ్మద్ హుస్సేన్ సరౌర్ చనిపోయినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించుకోగా హెజ్బొల్లా స్పందించలేదు.లెబనాన్ నుంచి వెంటనే వెళ్లిపోండిజెరూసలేం: యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నందున లెబనాన్‌కు భారత పౌరులెవరూ రావొద్దని బీరుట్‌లోని భారత రాయబార కార్యాలయం కోరింది. లెబనాన్‌లో ఉండే భారతీయులు సాధ్యమైనంత త్వరగా దేశాన్ని వీడాలని, ఉండాలనుకునే వారు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో అడ్వైజరీ జారీ చేసింది. -
హిజ్బుల్లాపై దాడుల్ని ఆపలేం.. ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరిక
జెరూసలేం: ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య 21 రోజుల కాల్పుల విరమణపై తమ ప్రభుత్వం అంగీకరించడం లేదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. ఈ వ్యాఖ్యలతో నేతన్యాహు పరోక్షంగా 21 రోజుల కాల్పుల విరమణకు తాము ఒప్పుకోవడం లేదనే సంకేతాలిచ్చినట్లయ్యింది.హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ భీకర దాడి చేస్తోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో హిజ్బుల్లా స్థావరాలపై విరుచుకు పడుతుండడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.ఈ తరుణంలో ఇజ్రాయెల్ - హిజ్బుల్లా కాల్పులు విరమించాలని అమెరికా,ఫ్రాన్స్‌తో పాటు యురోపియన్ యూనియన్ దేశాలు విజ్ఞప్తి చేశాయి. అయితే ఆ విజ్ఞప్తిని తిరస్కరించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు కార్యాలయం అధికారింగా ప్రకటించినట్లు జాతీయ మీడియా కథనానలు చెబుతున్ననాయి.కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రధాని నేతన్యాహు అంగీకరించడం లేదు. మొత్తం సైన్యాన్ని మోహరించి దాడులు విస్తృతం చేయాలని నేతన్యాహు ఆదేశాలు జారీ చేశారని ప్రధాని కార్యాలయం నుంచి ప్రకటన వచ్చినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.భూతల దాడులకు సిద్దమైన ఇజ్రాయెల్బుధవారం ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి సైనికులకు కీలక ఆదేశాలు జారీచేశారు. హిజ్బుల్లాపై సాధ్యమైనంత మేరకు భూతల దాడులు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల్లో అగ్రరాజ్యం అమెరికా తోపాటు, ఫ్రాన్స్‌తో పాటు ఇతర దేశాలు ఇజ్రాయెల్-హిజ్బుల్లాల మధ్య 21 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తెచ్చాయి. ఆ ప్రతిపాదనని ఇజ్రాయెల్ తిరస్కరించింది. -
బైడెన్ హెచ్చరిక.. ఇజ్రాయెల్ కవ్వింపు చర్యలు!
టెల్ అవీవ్: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ అనూహ్య దాడులతో హిజ్బుల్లా సైనిక బలం సగానికి తగ్గింది. ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరికలు జారీ చేశారు. ఆల్ అవుట్ వార్(అంతటా యుద్ధం సాధ్యమే) అంటూ ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి బైడెన్ కామెంట్స్ చేయడంతో.. కవ్వింపు చర్యలకు దిగిన నెతన్యాహు మరిన్ని దాడులకు సన్నద్ధమవుతున్నారు. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం విధ్వంసం సృష్టిస్తోంది. ప్రస్తుతం హిజ్బుల్లా పరిస్థితి గాజాలోని హమాస్ మాదిరిగానే తయారైంది. కేవలం నాలుగు రోజుల ఆపరేషన్ సమయంలో ఇజ్రాయెల్.. హిజ్బుల్లా 90 శాతం నాయకత్వాన్ని హతమార్చింది. హిజ్బుల్లా సైనిక బలాన్ని సగం నాశనం చేసింది. ఆపరేషన్ నార్తర్న్ యారో కారణంగా.. హిజ్బుల్లా సైనిక మౌలిక సదుపాయాలలో సగం ధ్వంసమైందని ఇజ్రాయెల్, అమెరికా చెబుతున్నాయి. ఐడీఎఫ్ తన నివేదికలో హిజ్బుల్లా అగ్ర నాయకత్వంలో ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు మాత్రమే మిగిలి ఉన్నారని చెబుతోంది. వీరు చీఫ్ హసన్ నస్రల్లా, హిజ్బుల్లా దక్షిణ ఫ్రంట్ కమాండర్ అలీ కరాకి, బదర్ యూనిట్ హెడ్ అబూ అలీ. వీరికి కూడా త్వరలోని అంతం చేస్తామని తెలిపింది.ఆర్మీ చీఫ్ సూచన..మరోవైపు ఇజ్రాయెల్ లెబనాన్‌లో భూతల దాడులకు సిద్ధవుతోంది. ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ ఈ మేరకు సన్నద్ధం కావాలని తమ బలగాలకు సూచించారు. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో ప్రాంతాల్లో పర్యటించిన ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ సరిహద్దుల్లో వైమానిక దాడులు చేసి ఐడీఎఫ్ బలగాలు లెబనాన్‌లోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేస్తామన్నారు. హిజ్బుల్లా లక్ష్యంగా భూతల దాడులకు సిద్ధంగా ఉండాలని సేనలకు సూచించారు.⚡🚨Breaking; Last night on Hezbollah in the attacks of the Israeli Air Forcewas difficult The mistake of the organization was the thought ⚡that he could use the citizens' homes as a human shield to prevent Israel from defending itself. pic.twitter.com/FFmPFJFGfj— tzachi dado צחי דדו 🎗️ (@UsBnnxVURfS4lPJ) September 26, 2024ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ తక్షణమే కాల్పులు విరమణ పాటించాలని పలు దేశాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కొన్ని ఇతర భాగస్వామ్య దేశాలు ఇజ్రాయెల్ తక్షణమే 21 రోజుల కాల్పుల విరమణ చేపట్టాలని పిలుపునిచ్చాయి. ఇక, హిజ్బుల్లాకు ప్రధాన మద్దతు దేశమైన ఇరాన్.. ఇజ్రాయెల్ దాడులను ఖండించింది. వెంటనే కాల్పులను ఆపివేయాలని డిమాండ్ చేసింది. 51 మంది మృతిఇదిలా ఉండగా బుధవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగించింది. ఈ ఘనటలో 51 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 223 మందికి తీవ్రంగా గాయాలైనట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. గత రెండు రోజులతో కలిపి మొత్తంగా 564 మంది ప్రాణాలు కోల్పోగా, 1800 మందికి గాయాలైనట్లు వెల్లడించింది. మృతుల్లో 150 మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు పేర్కొంది.భారత్ అలర్ట్..ఈ పరిణామాల నేపథ్యంలో లెబనాన్‌లో ఉంటున్న తమ పౌరులను భారత్ అప్రమత్తం చేసింది. తక్షణం అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. లెబనాన్‌కు ఇపుడు ఎవరూ రాకూడదని స్పష్టంచేసింది. Embassy of India in Beirut tweets, "As a reiteration of the Advisory issued on 1 August 2024 and in view of the recent developments and escalations in the region, Indian nationals are strongly advised against travelling to Lebanon till further notice. All Indian nationals already… pic.twitter.com/kpvhiuGN3N— ANI (@ANI) September 25, 2024 ఇది కూడా చదవండి: న్యూక్లియర్ వార్‌కు సిద్ధం.. పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ -
మా యుద్ధం హెజ్బొల్లాతోనే.. మీతో కాదు!
Israel–Hezbollah Conflict Latest News: ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్ రక్తమోడుతోంది. సోమవారం అర్ధరాత్రి దాకా జరిగిన దాడిలో.. వంద మందికి పైగా చిన్నారులు, మహిళలు సహా మొత్తం 500 మంది మరణించారు. రెండు వేల మంది దాకా గాయాలపాలయ్యారు. అక్టోబర్ 7న గాజా సంక్షోభం మొదలయ్యాక.. ఇజ్రాయెల్ జరిపిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం.ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా సంస్థ లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. లెబనాన్‌లోని 300కు పైగా లక్ష్యాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ(IDF) ప్రకటించుకుంది. పైగా ఈ దాడుల గురించి దక్షిణ లెబనాన్ వాసులను ఆర్మీ ముందుగానే హెచ్చరించడం గమనార్హం.‘‘ముప్పు మాదాకా(ఇజ్రాయెల్) చేరడాని కంటే ముందు.. మా సత్తా ఏంటో చూపిస్తాం’’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. లెబనాన్ ప్రజలను ఉద్దేశించి ఈ మేరకు ఆయన ఓ సందేశం విడుదల చేశారు. ‘‘లెబనాన్ ప్రజల్లారా.. మా యుద్ధం మీతో కాదు. మా యుద్ధం హెజ్బొల్లాతో. ఆ సంస్థ చాలాకాలంగా మిమ్మల్ని రక్షణ కవచంలా ఉపయోగించుకుంటోంది. మీరు ఉండే ఆవాసాల్లోనే ఆయుధాలను దాస్తోంది. హెజ్బొల్లా మా నగరాలను, ప్రజలనే లక్షంగా చేసుకుని దాడులు చేస్తోంది. దీనికి ప్రతిగానే మేం వాళ్లపై దాడులు చేస్తూ.. ఆ ఆయుధాలను స్వాధీనం చేసుకుంటున్నాం’’ అని ఓ సందేశం విడుదల చేశారు. Message for the people of Lebanon: pic.twitter.com/gNVNLUlvjm— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) September 23, 2024హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధ డిపోలు, ఇతర మౌలిక వసతులకు, భవనాలకు సమీపంలో ఉండే పౌరులు తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా నెతన్యాహు కోరారు. ‘‘వచ్చే రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టతరం కానున్నాయి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి మీరు మీ ప్రాణాలను రక్షించుకోండి. మా ఆపరేషన్ ముగిశాక.. మళ్లీ మీ నివాసాలకు తిరిగి వెళ్లొచ్చు’’ అని లెబనాన్ ప్రజలను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారుఇక.. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేశారు. మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని యుద్ధంలోకి లాగొద్దని ఆయన నెతన్యాహూను ఉద్దేశించి హితవు పలికారు.ఇజ్రాయెల్ ఆర్మీ, హెజ్బొల్లా మిలిటెంట్ల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇవి మరింత ముదిరి తీవ్ర యుద్ధానికి దారి తీసే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణ లెబనాన్ మరో గాజా అయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ హెచ్చరిస్తున్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల జోక్యంతోనైనా పరిస్థితులు చల్లబడాలని ఆయన కోరుకుంటున్నారు. గతేడాదే మొదలైంది..కిందటి ఏడాది జులైలో హెజ్బొల్లా టాప్ కమాండర్ ఫౌద్ షుక్రును ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. దానికి ప్రతీకారంగా ఆగష్టు నుంచి వీలు చిక్కినప్పుడల్లా రాకెట్లు, డ్రోన్లతో ఇజ్రాయెల్ సరిహద్దులో హెజ్బొల్లా విరుచుకుపడుతోంది. తాజాగా.. లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీలు పేలిపోయి 37 మంది చనిపోగా.. వేల మంది గాయపడ్డారు. శుక్రవారం లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో హెజ్బొల్లా టాప్ కమాండర్లు సహా 45 మంది చనిపోయారు. తమ పౌరులను లక్ష్యంగా చేసుకునే ఇజ్రాయెల్.. ఆ దేశ భద్రతా ఏజెన్సీ మోస్సాద్ ఈ దాడులకు దిగాయని లెబనాన్ ఆరోపించింది. ఈ పరిణామం ప్రతీకారంగా ఆదివారం హెజ్బొల్లా సరిహద్దులకు సుదూరంగా ఉన్న హైఫాలోని రఫేల్ డిఫెన్స్ సంస్థతోపాటు వివిధ లక్ష్యాలపైకి 150 వరకు రాకెట్లను ప్రయోగించింది. కిందటి ఏడాది నుంచి ఇప్పటిదాకా.. హెజ్బొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య జరుగుతున్న పోరులో కనీసం 600 మంది చనిపోయారు.హెజ్బొల్లా లక్ష్యంగా ఐడీఎఫ్ ‘ఆపరేషన్ నార్తన్ ఆరోస్’ కొనసాగిస్తోంది. తీవ్ర దాడుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో మూటాముల్లె సర్దుకుని అందుబాటులో ఉన్న వాహనాల్లో బీరుట్ దిశగా బయలుదేరారు. దీంతో, తీరప్రాంత సిడొన్ నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. 2006లో ఇజ్రాయెల్– హెజ్బొల్లా మధ్య యుద్ధంగా జరిగాక ఇంత భారీగా జనం వలసబాట పట్టడం ఇదే మొదటిసారని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కళాశాలలు, పాఠశాలలను తెరిచి ఉంచాల్సిందిగా లెబనాన్ హోం శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇళ్లు వదిలేసి భారీగా వలస వస్తున్న ప్రజలకు పాఠశాల భవనాల్లో ఆశ్రయం కల్పించాలని కోరింది.దాడులు మరింత తీవ్రంరాకెట్ లాంఛర్లు తదితరాలతో సరిహద్దులకు దగ్గర్లోని దక్షిణ ప్రాంతాన్ని మిలిటరీ స్థావరాలుగా హెజ్బొల్లా మార్చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అందుకే భారీగా బాంబు దాడులు చేయక తప్పడం లేదంది. హెజ్బొల్లాను నిలువరించేందుకు వైమానిక దాడులపై తమ దృష్టంతా ఉందని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లోని 17 గ్రామాలు, పట్టణాల మ్యాప్‌ను విడుదల చేసింది. ఆపరేషన్లను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇదీ చదవండి: వీళ్ల వైరం ఏనాటిదంటే..! -
హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరిక
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హిజ్బుల్లాకు హెచ్చరించారు. హిజ్బుల్లాకు పట్టున్న ప్రాంతాలుగా పరిగణించే బీకా వ్యాలీ, దక్షిణ లెబనాన్, బీరూట్ దక్షిణ శివారు ప్రాంతాల్లో హిజ్బుల్లా గ్రూప్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది.ఈ దాడిపై నెతన్యాహు మాట్లాడుతూ.. హిజ్బుల్లాను ఊహించలేని విధంగా దెబ్బ కొట్టాం. హిజ్బుల్లాకి ఇప్పటికీ అర్థం గాకపోతే.. త్వరలోనే అర్థం చేసుకుంటుందని అని అన్నారు. శనివారం ఇజ్రాయెల్ 290 హిజ్బుల్లా లక్ష్యాలపై దాడులు చేసింది. అంతకు ముందు శుక్రవారం బీరుట్ శివారులో చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో హిజ్బుల్లా కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. కాగా, హిజ్బుల్లా దళాలు వినియోగించే పేజర్లు, వాకీటాకీలు పేలడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. తమ కమ్యూనికేషన్ కోసం వినియోగించే పేజర్లు, వాకీటాకీలను ఇజ్రాయెల్ పేల్చిందని హిజ్బుల్లా ఆరోపిస్తుంది. చదవండి : కిమ్ కర్కశత్వం.. ఇద్దరు మహిళలకు ఉరిశిక్ష -
భగ్గుమన్న ఇజ్రాయెల్.. ప్రధాని నెతన్యాహూ క్షమాపణలు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. గాజాలోని సొరంగంలో లభ్యమైన ఆరుగురు ఇజ్రాయెల్ బందీలను సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో విఫలమైనందుకు బెంజమిన్ సోమవారం క్షమాపణలు కోరారు. ‘బందీలను సజీవంగా తిరిగి తీసుకురానందుకు నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. మేము ప్రయత్నించాం కానీవిజయం సాధించలేదు. దీనికి హమాస్ చాలా భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది.’ అని నెతన్యాహు విలేకరుల సమావేశంలో చెప్పారు.కాగా శనివారం గాజాలోని రఫా ప్రాతంలోని భూగర్భ సొరంగంలో ఆరుగురు ఇజ్రాయిల్ బందీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు ఆదేశ సైన్యం ప్రకటించిన విషయం తెలిసిందే.మృతదేహాలు గాజా సరిహద్దు సమీపంలోని కిబ్బట్జ్ కమ్యూనిటీకి చెందిన కార్మెల్ గాట్, ఈడెన్ యెరుషల్మి, అల్మోగ్ సరుసి, ఒరి డానినో, యుఎస్-ఇజ్రాయెలీ హెర్ష్ గోల్డ్బెర్గ్-పోలిన్, రష్యన్-ఇజ్రాయెలీ అలెగ్జాండర్ లోబనోవ్గా గుర్తించారు. వీరిని అక్టోబర్ 7న మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి కిడ్నాప్ చేసిన హమాస్ ఉగ్రవాదులు బందీలుగా చేశారు.హమాస్ చెరలోని ఆరుగురు బందీల మృతదేహాలు రఫాలోని ఓ సొరంగంలో లభ్యం కావడంతో నెతన్యాహు ప్రభుత్వంపై ఇజ్రాయెల్ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. ప్రధానికి వ్యతిరేకంగా సోమవారం ఇజ్రాయెల్‌లో భారీ ప్రదర్శనలు జరిగాయి. కాల్పుల విరమణకు అంగీకరించాలని, హమాస్ చెరలోని బందీలను సురక్షితంగా రప్పించాలని డిమాండ్ చేస్తూ టెల్ అవీవ్ వీధుల్లో ఆందోళనకారులు కదం తొక్కారు. తమ ఆప్తులు 11నెలల నుంచి బందీలుగా ఉన్నప్పటికీ వారిని వెనక్కు తేవడంలో నెతన్యాహు విఫలమయ్యారంటూ ఆరోపించారు.ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలకు బదులుగా హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని విడుదల చేసేలా కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్ట్, ఖతార్‌కు చెందిన మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోవడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుయే కారణమన్న కోణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ.. హమాస్‌తో బందీల విడుదల ఒప్పందం, కాల్పుల విరమణ కోసం నెతన్యాహు తగినంతగా పనిచేయడం లేదని అన్నారు. -
ఇజ్రాయెల్‌లో సార్వత్రిక సమ్మె
టెల్ అవీవ్: హమాస్ చెరలో ఉన్న ఆరుగురు బందీల దారుణ హత్యపై ఇజ్రాయెలీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బందీలను సురక్షితంగా విడిపించడంలో బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం విఫలమైందంటూ సోమవారం ఇజ్రాయెల్ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరిగింది. కారి్మక సంఘాల పిలుపు మేరకు బ్యాంకులు, ఆరోగ్య విభాగాలు, రవాణా సంస్థలు సహా చాలా వరకు మూతబడ్డాయి. కొన్ని ప్రాంతాల్లోని స్కూళ్లు కొద్దిసేపు మాత్రమే పనిచేశాయి. ప్రధానమైన బెన్ గురియెన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 8–10 గంటల మధ్య టేకాఫ్ సేవలు నిలిచిపోయాయి. వేలాదిగా పౌరులు వీధుల్లోకి వచ్చారు. టెల్అవీవ్తోపాటు దేశవ్యాప్తంగా జరిగిన ర్యాలీల్లో కనీసం 5 లక్షల మంది పాలుపంచుకున్నారు. హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న పక్షంలో వారంతా సురక్షితంగా వెనక్కి వచ్చి ఉండేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ బందీలుగా ఉన్న 100 మందిని వెనక్కి తీసుకువచ్చేందుకు వెంటనే హమాస్‌తో ఒప్పందం చేసుకోవాలన్నారు. అయితే, సమ్మె రాజకీయ ప్రేరేపితమంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై కారి్మక న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. సమ్మెను మధ్యాహ్నం 2.30 గంటలకల్లా ముగించాలని స్పష్టం చేసింది. కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తామని దేశంలోని అతిపెద్ద కారి్మక సంఘం హిస్ట్రాదుట్ నేత అర్నాన్ బ్రార్ డేవిడ్ తెలిపారు. తమ వారిని వెంటనే విధుల్లోకి చేరాలని కోరారు. సమ్మె కారణంగా ప్రధాన సేవలకు అంతరాయం ఏర్పడలేదని వివరించారు. ఒప్పందానికి నెతన్యాహు సానుకూలంగా లేరు: బైడెన్ ఇజ్రాయెల్‌లో పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకుని, బందీలను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆసక్తి చూపడం లేదన్నారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై సలహాదారులతో వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశానికి హాజరైన అధ్యక్షుడు బైడెన్ మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందానికి అతి చేరువలో ఉన్నామన్నారు. -
నెతన్యాహు తగినంత కృషి చేయటం లేదు: బైడెన్
న్యూయార్క్: ఆరుగరు బంధీలను మిలిటెంట్ సంస్థ హమాస్ హత్య చేయటంపై ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఎయిర్‌పోర్టులు, ఆస్పత్రులు, బ్యాంకుల్లో సిబ్బంది సమ్మె చేస్తున్నారు. కాల్పులు విరమణకు ప్రధాని నెతన్యాహు ఒప్పుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షడు జో బైడెన్ సైతం నెతన్యాహు వ్యవహిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. గాజాలో హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి తుది ఒప్పందం చాలా దగ్గరలో ఉందని అన్నారు. అయితే ఈ ఒప్పందంలో విషయంలో నెతన్యాహు మాత్రం తగినంత కృషి చేయటం లేదని బైడెన్ ఆరోపణలు చేశారు.చదవండి: గాజా సొరంగంలో ఇజ్రాయెల్ బంధీల మృతదేహాలు -
హెజ్బొల్లా Vs ఇజ్రాయెల్.. తెరపైకి డేంజరస్ ‘కత్యూషా’
జెరూసలేం: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్, లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపు మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇక, తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో 48 గంటల పాటు దేశవ్యాప్త ఎమర్జెన్సీ విధించారు. దాదాపు వందల సంఖ్యలో రాకెట్లు ఇజ్రాయెల్‌వైపు దూసుకెళ్లాయి.కాగా, గత నెలలో తమ టాప్ కమాండర్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ భూభాగంపైకి వందలాది సంఖ్యలో రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించినట్టు హెజ్బొల్లా గ్రూపు ప్రకటించింది. ఉత్తర ఇజ్రాయెల్, గోలన్ హైట్స్‌లోని ఆ దేశ సైనిక స్థావరాలు, ఐరన్ డోమ్ లక్ష్యంగా చేసుకొని 320 కత్యూషా రాకెట్లు, భారీ సంఖ్యలో డ్రోన్లను హిజ్బొల్లా ప్రయోగించింది. ఈ సందర్భంగా తమ నేత హత్యకు ప్రతీకారంగా మొదటి దశ దాడులను ముగించినట్టు హిజ్బొల్లా చెప్పుకొచ్చింది. అలాగే, భవిష్యత్ కాలంలో మరిన్ని తీవ్రమైన దాడులు ఉంటాయని హెచ్చరించింది. Today in Tel Aviv we were supposed to wake up to thousands of murdered children in blood soaked sheets. 7.10 Again. Satellite images showed rocket launchers moving into place. So we struck first. 100 IAF planes took to the sky and destroyed the missiles.Never Again is Now. pic.twitter.com/Vq4A3xxwWl— Rachel Gur (@RachelGur) August 25, 2024 మరోవైపు.. హెజ్బొల్లా దాడులను అడ్డుకొనేందుకు దక్షిణ లెబనాన్‌లోని వేలాది రాకెట్ లాంచర్లను లక్ష్యంగా చేసుకొని దాదాపు 100 యుద్ధ విమానాలు వైమానిక దాడులు చేశాయని ఇజ్రాయెల్ పేర్కొన్నది. ఇక, కేవలం సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్టు హెజ్బొల్లా గ్రూపు, ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు మరణించారని, ఇద్దరికి గాయాలయ్యాయని లెబనాన్ అధికారులు పేర్కొనగా, స్వల్ప నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నామని ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. కాగా, హెజ్బొల్లా వద్ద దాదాపు 1,50,000 రాకెట్లు ఉన్నాయని, ఇజ్రాయెల్‌లోని అన్ని ప్రాంతాలపై దాడులు చేయగల సామర్థ్యం ఆ గ్రూపునకు ఉన్నదని ఒక అంచనా. The Iron Dome in Action — Saving Countless LivesIn parallel, the IDF has launched a series of calculated preemptive strikes, targeting Hezbollah’s long-range missile sites deep within Lebanon. These strikes are not just military maneuvers but a strategic effort to prevent a… pic.twitter.com/6U7zPKVTJC— Ian Ségal ✍🏻 (@segalian) August 25, 2024 హిజ్బొల్లా దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా నెతన్యాహు మాట్లాడుతూ.. మా దేశాన్ని రక్షించుకొనేందుకు అన్ని చర్యలు తీసుకొంటాం. మాపై ఎవరు దాడి చేస్తారో, వారిపై మేం దాడి చేస్తాం. ఉత్తర ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించిన వేలాది రాకెట్లను సైన్యం అడ్డుకొన్నదని ఆయన పేర్కొన్నారు. సైన్యం సూచనలను పాటించాలని పౌరులను కోరారు. హెజ్బొల్లా వద్ద డేంజరస్ ‘కత్యూషా’హెజ్బొల్లా వద్ద రాద్, ఫజర్, జిల్జాల్ మోడల్ రాకెట్లు ఉన్నాయి. వీటిలో శక్తిమంతమైన పేలోడ్లు ఉన్నాయి. ఇవి కత్యూషా క్షిపణుల కన్నా ఎక్కువ దూరం ప్రయాణించగలవు. ఇక, హెజ్బొల్లా గ్రూపు అమ్ములపొదిలో ‘కత్యూషా’ అనేది ప్రధాన ఆయుధంగా ఉన్నది. ఆదివారం నాటి ఘర్షణల్లో వీటికి చెందిన 300 రాకెట్లను ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించినట్లు అంచనా.రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్లు దీన్ని తయారు చేశారు. కత్యూషా రాకెట్లు భారీ వార్హెడ్లను సుదూర లక్ష్యాలపైకి ప్రయోగించగలవు. ఏకకాలంలో వందల సంఖ్యలో వీటిని ప్రయోగించే అవకాశం ఉండటంతో శత్రు లక్ష్యాలను నాశనం చేయగలవు. వీటిని కొన్ని రకాల రహస్య లాంచర్లపై ఉంచి గుర్తు తెలియని ప్రదేశాల నుంచి హెజ్బొల్లా ప్రయోగిస్తుంది. 2006లో లెబనాన్ యుద్ధంలో వీటిని భారీ ఎత్తున వినియోగించారు. -
కాల్పుల విరమణ: బైడెన్ వ్యాఖ్యలను ఖండించిన హమాస్
న్యూయార్క్: ఇజ్రాయెల్-గాజా కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను హమాస్ తీవ్రంగా ఖండించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. సోమవారం చికాగోలో జరిగిన డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ సమావేశం అనంతరం ఎయిర్‌పోర్టులో బైడెన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇజ్రాయెల్-గాజా కాల్పుల విరమణ ఒప్పందం నుంచి పాలస్తీనా( హమాస్) ఎనక్కి తగ్గుతోంది.కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఒప్పుకుంది. ఒప్పందం కోసం సిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఒప్పందంపై హమాస్ వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఏం జరగుతుందో చూద్దాం. ఈ కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని అన్నారు. అయితే బైడెన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించటం లేదని హమాస్ తెలిపింది. అదేవిధంగా తమకు జూలై 2న సమర్పించిన ఒప్పంద ప్రతిపాదన ఇటీవలి కొత్త ప్రతిపాదనకు చాలా విరుద్దంగా ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొత్త షరతులు, గాజా పట్ల నేర ప్రణాళికకు అమెరికా అంగీకరిస్తున్నట్లు తెలుస్తోందని పేర్కొంది. బైడెన్ చేసిన వ్యాఖ్యలు తప్పుదారి పెట్టించేలా ఉన్నాయని తెలిపింది. మరోవైపు.. కాల్పుల విరమణ, బంధీల విడుదలకు సంబంధించి విభేదాలు తలెత్తకుండా అమెరికా విదేశాంగ మంత్రి అంటోని బ్లింకెన్ చర్చల కోసం కసరత్తు చేస్తున్నారు. -
ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా ఇరాన్ దాడి!
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య అనంతరం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరుకున్నాయి. లెబనాన్‌కు చెందిన షియా ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ‘హెజ్బొల్లా’ ఆదివారం ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించింది. దీంతో మొషావ్ బీట్ హిల్లెల్ ప్రాంతంలో పలువురు పౌరులు గాయపడ్డారు. మరోవైపు ఇరాన్ కూడా ఇవాళ ఇజ్రాయెల్‌పై భీకర దాడులకు దిగొచ్చని అక్కడి స్థానిక మీడియా ఓ నివేదికలో వెల్లడించింది. ఇజ్రాయెల్‌పై ఏ సమయంలోనైనా ఇరాన్ దాడికి దిగనుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ జీ-7 దేశాలకు ముందస్తు హెచ్చరికలు ఇచ్చారని పేర్కొంది. ఇక.. ఇజ్రాయెల్‌కు అండగా నిలిచేందుకు అమెరికా సైన్యం ఇప్పటికే రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్‌పై దాడిని ఎదుర్కొవడానికి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్‌పై ముందస్తు దాడికి సైతం సిద్ధమైనట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మొస్సాద్ చిఫ్ డేవిడ్ బర్నియా, రక్షణ మంత్రి యోవ్ గల్లంట్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ( ఐడీఎఫ్) హెర్జి హలేవిలతో ప్రధాని నెతన్యాహు ఆదివారం సమావేశమై చర్చించినట్లు తెలిపింది. మరోవైపు.. ఇరాన్ చేసే దాడిని ఎదుర్కొవడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని, తాము తిరిగి గట్టి సమాధానం ఇస్తామని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం ప్రకటించారు. జెరూసలేంలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో నిర్వహించిన వార్ కేబినెట్ ఆయన మాట్లాడారు. ‘ఇరాన్ దాడికి దిగితే ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నాం. ఇరాన్ దాడులకు గట్టిగా బదులు ఇస్తాం. మాపై దాడులు చేసే వారు భారీ మూల్యం చెల్లించుకుంటారు’అని హెచ్చరించారు. -
ఇజ్రాయెల్ ప్రధానికి జో బైడెన్ వార్నింగ్!
హమాస్ మిలిటెంట్ గ్రూప్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను వైమానిక దాడితో హత్య చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గురువారం జరిగిన ఇరువురి నేతల ఫోన్ సంభాషణలో జో బైడెన్ మాట్లాడుతూ.. ఘాటుగా హెచ్చరించినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన స్థానిక ‘చానెల్ 12’వెల్లడించింది. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ చర్చలు జరుపుతోందని, చర్చలను పునఃప్రారంభించడానికి త్వరలో ప్రతినిధి బృందాన్ని పంపుతామని నెతన్యాహు అధ్యక్షుడు బైడెన్‌కు తెలియజేసే సందర్భంలో ఆయన ఘటుగా స్పందించినట్లు సమాచారం. ఇరాన్, హమాస్ విషయంలో దాడులకు తెగబడి తర్వాత తనను అందులో జోక్యం చేయవద్దని బైడెన్ నెతన్యాహును హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడిని తేలికగా తీసుకోవద్దని వార్నింగ్ ఇచ్చినట్లు ‘చానెల్ 12’ నివేదిక పేర్కొంది.అయతే ఈ నివేదికలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. ‘ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా రాజకీయాల్లో జోక్యం చేసుకోరు. అమెరికాలో ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికైన వారితో కలిసి పని చేస్తారు. అలాగే ఇజ్రాయెల్ రాజకీయాలలో అమెరికన్లు జోక్యం చేసుకోకూడదని ఆయన ఆశిస్తున్నారు’అని ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జోబైడెన్ వైదొలగుతున్నట్లు తీసుకున్న నిర్ణయం అనంతరం ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్‌పై కఠినమైన చర్యలు తీసుకోవడానికి ధైర్యం చూపిస్త్ననారని ఇజ్రాయెల్ సీనియర్ అధికారి తెలిపారు. మరోవైపు.. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియె హత్య, అందుకు దీటైన ప్రతీకారం తప్పదన్న ఇరాన్ హెచ్చరికలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ దూకుడు చర్యలకు దిగితే అడ్డుకునేందుకు అమెరికా అదనపు యుద్ధ నౌకలు, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ క్రూయిజర్లు, డిస్ట్రాయర్లు, ఎఫ్–22 ఫైటర్ జెట్ స్క్వాడ్రన్‌ను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. పసిఫిక్ సముద్రంలో ఉన్న విమానవాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌ను కూడా తరలించాల్సిందిగా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆదేశించారు. -
హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ ప్రధాని వార్నింగ్
ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న గోలన్ హైట్స్ ప్రాంతంలో హిజ్బుల్లా మిలిటెంట్లు చేసిన రాకెట్ దాడిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందిచారు. దాడులు తెగపడినందకు భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని హిజ్బుల్లా మిలిటెంట్లను హెచ్చరించారు. శనివారం హిజ్బుల్లా చేసిన రాకెట్ దాడిలో 11 మంది యువకులను మృతి చెందారు.‘‘ హిజ్బుల్లా చేసిన ఈ దాడిని ఇజ్రాయెల్ తగిన సమాధానం ఇవ్వకుండా ఉండదు. హిజ్బుల్లా కచ్చితంగా భారీ మూల్యం చెల్లిచుకోక తప్పదు’’ అని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. అదేవిధంగా ఇజ్రాయెల్ సైన్యం ప్రతిస్పందనకు సిద్ధంగా ఉండాలని ప్రధాని నెతన్యాహు పేర్కొన్నట్లు తెలుస్తోంది.‘‘ శనివారం సాయంత్రం జరిగిన దాడితో హిజ్బుల్లా అసలు రూపం బయటపడింది. హిజ్బుల్లా ఫుడ్‌బాల్ ఆడుతున్న పిల్లలను టార్గెట్ చేసి దారుణంగా దాడి చేశారు’’ అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్( ఐడీఎఫ్) అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి అన్నారు. ‘‘ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పోటీ పడుతుండగా.. హిజ్బుల్లా మాత్రం ఇజ్రాయెల్ భవిష్యత్తు తరాల అథ్లెట్లపై దాడులు చేస్తోంది. గోలన్ హైట్స్‌లోని డ్రూజ్ గ్రామంలోని మజ్దాల్ షామ్స్‌లోని మైదానంలో ఫుట్‌బాల్ ఆడుతున్న యువకులపై హిజ్బుల్లా రాకెట్ దాడి చేసింది’ అని ఐడీఎఫ్ ‘ఎక్స్’లో ఆగ్రహం వ్యక్తం చేసింది. -
గాజాపై ఇజ్రాయెల్ దాడులు అనాగరికం: ప్రియాంకా గాంధీ
ఢిల్లీ: గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మండిపడ్డారు. గాజా విషయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వ తీరును ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాలని ఆమె ఎక్స్ వేదికగా శుక్రవారం పిలుపునిచ్చారు.‘ఇజ్రాయెల్ పౌరులు కూడా హింస, ద్వేషాన్ని నమ్మరు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలు తీవ్రంగా ఖండించాలి. ఇది ప్రపంచంలోని ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. ఇజ్రాయెల్ చర్యలు ఆమోదించదగినవి కావు. గాజాలో జరుగుతున్న భయంకరమైన మారణహోమం అందరూ ఖండించాలి. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు అనాగరికం. గాజాపై దాడులను ఇజ్రాయెల్ ప్రధాని అనాగారికత, నాగరికత మధ్య ఘర్షణ అని అంటున్నారు. కానీ, ఆయన, ఆయన ప్రభుత్వమే చాలా అనాగరికమైంది’అని ప్రియాంకా గాంధీ అన్నారు.గత పది నెలల నుంచి హమాస్ మిలిటెంట్లను ఏరివేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై యుద్దం చేస్తోంది. ఇప్పటివరకు 40 వేల మంది గాజా పౌరులు మృతి చెందారు. ప్రపంచంలోని పలు దేశాలు కాల్పుల విరమణ చేపట్టలాని కోరుతున్నా.. అమెరికా పర్యటనలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం గాజాపై యుద్ధాన్ని సమర్ధించుకోవటం గమనార్హం. -
దాడులపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుకు కమలా హారీస్ హెచ్చరిక!
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. నెతన్యాహు గాజాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని కమలా హారీస్ కోరారు. యుద్ధం కారణంగా సాధారణ ప్రజలు మృతిచెందుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, ఇజ్రాయెల్ ప్రధాని నిన్న అమెరికాలో పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి క్యాపిటల్ హౌస్‌లో ప్రసంగించారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్, అమెరికా మధ్య పరస్పర సహకారం ఉండాలని కోరారు. ఈ నేపథ్యంలో నెతన్యాహుతో కమలా హారీస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కమలా హారీస్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ దాడుల్లో భాగంగా గాజాలో జరిగిన ప్రాణనష్టంపై తనకు తీవ్ర ఆందోళన కలుగుతోందన్నారు. ఇదే సమయంలో గాజాతో శాంతి ఒప్పందాన్ని కుదర్చుకోవాలని కోరారు. గత తొమ్మిది నెలలుగా గాజాలో విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతో మంది చిన్న పిల్లలు సైతం మృతిచెందారు. సాధారణ పౌరులు ఆకలితో అలమటించిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక ప్రజలపై దాడులను తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని చెప్పారు. దారుణాలకు చూస్తూ సైలెంట్‌గా ఉండబోమని హెచ్చరించారు. ఇక, గాజాకు మానవతాసాయం అందించేందుకు అనుమతించాలని నెతన్యాహును కోరారు. ఇక, అంతుకుముందు.. అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి మాట్లాడిన నెతన్యాహు.. హమాస్‌పై పోరు కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. తుది విజయం లభించే వరకు పోరు తప్పదంటూ ఆవేశంతో ప్రసంగించారు. ఈ తరుణంలో తాజా కమలా హారిస్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. Today, I had a frank and constructive meeting with Prime Minister Netanyahu about a wide range of issues, including my commitment to Israel’s security, the importance of addressing the humanitarian crisis in Gaza, and the urgent need to get the ceasefire and hostage deal done. pic.twitter.com/tgiSTPQJdL— Vice President Kamala Harris (@VP) July 26, 2024 అయితే, నెతన్యాహు అమెరికాలో పర్యటిస్తున్న సందర్భంగా పాలస్తీనా మద్దతుదారులు ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. క్యాపిటల్ హౌస్ వద్ద ధర్నాలు చేశారు. క్రిమినల్ నెతన్యాహు అంటూ నినాదాలు చేశారు. గాజాపై దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. దీంతో, క్యాపిటల్ హౌస్ వద్ద టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. -
అమెరికాలో నెతన్యాహు పర్యటన.. క్యాపిటల్ హౌస్ వద్ద టెన్షన్!
వాషింగ్టన్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు.. అమెరికాలో పర్యటిస్తున్న వేళ నిరసనలు మిన్నంటాయి. నెతన్యాహుకు వ్యతిరేకంగా పాలస్తీనా మద్దతుదారులు నిరసనలకు దిగారు. దీంతో, పలుచోట్ల ఉద్రికత్తలు చోటుచేసుకున్నాయి.కాగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సభలో నెతన్యాహు మాట్లాడుతూ.. ‘మనం కలిసి పనిచేస్తే గెలుస్తాం. వారు ఓడిపోతారు. ఇది జాతుల మధ్య యుద్ధం కాదు. మనం ప్రస్తుతం చరిత్ర నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నాం. మన ప్రపంచం ఉపద్రవంలో ఉంది. అందుకే ఇజ్రాయెల్‌వైపు అమెరికా నిలవాలి. పశ్చిమాసియాలో ఇరాన్ ఉగ్రవాద చర్యలు అమెరికా, ఇజ్రాయెల్, అరబ్ స్నేహదేశాలకు ఇబ్బందికరంగా మారాయి. నా దేశాన్ని రక్షించుకునేందుకు, నా దేశ ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చా’ అని నెతన్యాహు పేర్కొన్నారు. ఇదే సమయంలో నెతన్యాహు పసుపు రంగు పిన్ ధరించి హమాస్ చేతిలో ఉన్న ఇజ్రాయెల్ బంధీలకు సంఘీభావం తెలిపాడు.అయితే, సభలో ఆయనకు తొలుత స్పీకర్ మైక్ జాన్సన్‌తోపాటు రిపబ్లికన్ సభ్యులు స్వాగతం పలికారు. ఆయన ప్రసంగం ప్రారంభించగానే లేచి నిల్చుని చప్పట్లతో అభినందించారు. 50 మంది డెమోక్రాట్లు, స్వత్రంత్ర సభ్యుడు బెర్నీ శాండర్స్.. నెతన్యాహు ప్రసంగాన్ని బహిష్కరించారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈ సమావేశానికి రాలేదు. కొంత మంది సభ్యులు గైర్హాజరయ్యారు. A man bravely removed the American flag from being set aflame by pro-Palestinian protestors. The crowd proceeded to yell “chase him.” pic.twitter.com/3QE4zMKYEy— Eyal Yakoby (@EYakoby) July 24, 2024ఇక, అమెరికాలో నెతన్యాహు పర్యటన సందర్భంగా పాలస్తీనా మద్దతుదారులు నిరసనలు తెలిపారు. క్యాపిటల్ హౌస్ వద్ద నెతన్యాహుకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెతన్యాహు ఓ క్రిమినల్ అంటూ నినదించారు. మరోవైపు.. వాషింగ్టన్ డీసీలోని వాటర్‌గేట్ హోటల్లో నెతన్యాహు, అతడి భార్య, ప్రతినిధి బృందంతో కలిసి బస చేశారు. ఈ సందర్భంగా ఆ హోటల్ వద్దకు పలువురు పాలస్తీనా మద్దతుదారులు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. పలువురు ఎరుపు రంగు టీషర్టులు ధరించి నిరసనలో పాల్గొన్నారు.🚨🇮🇱🇺🇸 Protesters in Washington DC are now BURNING an effigy of Benjamin Netanyahu! pic.twitter.com/0RE8oYYqEm— The Saviour (@stairwayto3dom) July 24, 2024pic.twitter.com/3cOYomr7sj wow pro Palestine anti Americans stormed the capital today. This is why we need trump in the white house so things like this never happen again. Democrats hate us they proved that for 4 years when they helped illegals and Ukraine but never helped us at all— Trump 2024 MAGA 🇺🇲 (@VinnyPhilly) July 23, 2024ఇదే సమయంలో నెతన్యాహుపై కోపంతో వాటర్ గేట్ హోటల్లోని బ్యాంకెట్ టేబుల్, ఇతర అంతస్తుల్లో పాలస్తీనా యూత్ మూమెంట్‌కు చెందిన కొందరు వ్యక్తులు.. పురుగులు, మిడతలు వదిలినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. పురుగులు వదిలిన టేబుల్‌పై ఇజ్రాయెల్, అమెరికా జాతీయ జెండాలు కనిపిస్తున్నాయి. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Gaza protesters have removed the American flags from Union Station, lit then on fire with a Netanyahu effigy and replaced them with Palestine flags. pic.twitter.com/c8hz90phqL— Andrew Leyden (@PenguinSix) July 24, 2024 The DC Palestinian Youth Movement released maggots and crickets were released throughout the Watergate Hotel where Netanyahu is staying. The protestors also pulled multiple fire alarms throughout the night. This is an utter security failure. pic.twitter.com/3O0XbOvoGx— Eyal Yakoby (@EYakoby) July 24, 2024 -
వెస్ట్ బ్యాంక్ జెనీన్పై ఇజ్రాయెల్ మెరుపు దాడులు..
జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా వెస్ట్ బ్యాంక్ నగరం జెనిన్ ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఏడుగురు పాలస్తీనియన్లు మరణించారు. ఇక, చనిపోయిన వారిలో ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారే నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది.కాగా, హమాస్ నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ జరిగిన వైమానిక దాడుల్లో ఏడుగురు పాలస్తీనియన్లు మృతిచెందినట్టు పాలస్తీనా అధికారులు వెల్లడించారు. అయితే, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని సెటిల్మెంట్లలో దాదాపు 5,300 భవానాలను నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఇజ్రాయెల్ యాంటీ సెటిల్మెంట్ మానిటరింగ్ గ్రూప్ తెలిపిన మరుసటి రోజే ఇలా వైమానిక దాడులు జరిగాయని పాలస్తీనా పేర్కొంది. When one of the injured victims was taken from inside a house in the Al-Zahra`a neighborhood in the city of Jenin after he was shot by a zionist occupation sniper. pic.twitter.com/tfmUig7kc2— Jordan 🇮🇩🇵🇸 (@Mhmmd_Jordan) July 5, 2024ఇదిలా ఉండగా.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన నాటి నుంచి వెస్ట్ బ్యాంక్ సిటీలో హింస చెలరేగింది. వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ కాల్పుల్లో 500 మంది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ దాడులు, హింసాత్మక ఘటనల సమయంలో చాలా మంది మరణించారు. చనిపోయిన వారిలో యూదు వలసదారులే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. -
ఖాన్ యూనిస్‌ను వెంటనే ఖాళీ చేయండి.. ఇజ్రాయెల్ ఆర్మీ ఆదేశం
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం భారీగా దాడులకు పాల్పడటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణ గాజాలోని రెండో అతిపెద్ద నగం అయిన ఖాన్ యూనిస్‌లో దాడుల స్థాయిని పెంచనున్నట్ల సమాచారం. ఈ మేరకు ఖాన్ యూనిస్‌లో ఉండే పాలస్తీనియన్లు వెంటనే ఖాళీ చేయాలని సోమవారం ఇజ్రాయెల్ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది పాస్తీనియన్లు ఇతర ప్రాంతాకు తరలివెళ్తుతున్నారు. దీంతో ఖాన్ యూనిస్‌లోని యూరోపియన్ ఆస్పత్రిలోని పేషెంట్లను సైతం ఇతర ప్రాంతాలకు బలవంతంగా తరలిస్తున్నారు. గతవారం ఉత్తర గాజాలోని షెజాయా నగరంలో ప్రజలకును ఖాళీ చేయమన్న ఇజ్రాయెల్ ఆర్మీ.. ఐదో రోజు కూడా దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు.. దక్షిణ రఫా ప్రాంతంలో జరిగన దాడుల్లో ఇజ్రాయెల్ సైనికుడు ఒకరు మృతి చెందాడు.హమాస్‌ను అంతం చేసే దశలో ఇజ్రాయెల్ పురోగతి సాధింస్తోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నాడు. అయితే ఇతర ప్రాంతాల్లో కూడా దాడుల తీవ్రత పెంచాలని ఆర్మీకి సూచించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఖాన్ యూనిస్‌లో మళ్లీ దాడులకు ఇజ్రాయెల్ ఆర్మీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఆర్మీ హమాస్ మిలిటెంట్లను అంతం చేయటంలో భాగంగా ఈ ఏడాది మొదట్లో ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ ఆర్మీ భీకర దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ ఉండే పాలస్తీనా ప్రజలు దక్షిణ గాజా నగరమైన రఫాకు తరలివెళ్లారు.అక్టోబర్ 7న హమాస్ బలగాలు ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపు దాడిలో 1200 మృతి చెందగా.. 251 మందిని బంధీలుగా తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ హామాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాపై విరచుకుపడుతూనే ఉంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పవరకు 37,900 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు.చదవండి: ట్రంప్ విషయంలో కోర్టు తీర్పు ఎంతో ప్రమాదకరం: బైడెన్ -
ఇజ్రాయెల్ Vs హమాస్.. నెతన్యాహు సంచలన ప్రకటన!
టెల్ అవీవ్: హమాస్ అంతమయ్యే వరకు గాజాలో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే గాజాలో పాక్షిక కాల్పుల విరమణ ఒప్పందానికి మాత్రమే తాము అనుకూలంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. గాజాలో యుద్ధం దాదాపుగా ముగింపు దశలో ఉందన్నారు.కాగా, నెతన్యాహు తాజాగా ఇజ్రాయెల్ ఓ మీడియా ఛానెల్లో మాట్లాడుతూ.. గాజాలో శాశ్వత యుద్ధాన్ని నివారించే ఏ ప్రతిపాదనను తాము అంగీకరించబోము. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదనలో భాగంగా బందీలు విడుదలకు ప్రతిగా పాక్షిక కాల్పులు విరమణ ఒప్పందానికి మాత్రమే కట్టుబడి ఉన్నాం. During a speech at the Knesset, Prime Minister Benjamin Netanyahu said that Israel is “committed to the Israeli proposal that President Biden endorsed” on Monday. pic.twitter.com/NGoVdercZw— Middle East Eye (@MiddleEastEye) June 25, 2024 హమాస్ అంతమయ్యే వరకు గాజాలో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదు. గాజాలో హమాస్‌పై యుద్ధం దాదాపు ముగింపునకు చేరుకుంది. త్వరలోనే ఇజ్రాయెల్ విజయం సాధిస్తుందన్నారు. హమాస్ వద్ద బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్‌వాసులు సురక్షితంగా తిరిగి వచ్చే వరకు దాడులు జరుగుతూనే ఉంటాయన్నారు. అలాగే, గాజాలో పరిపాలనను కూడా పాలస్తీనా అథారిటీకి అప్పగించబోయేది లేదు. ప్రాంతీయంగా ఉన్న కొన్ని దేశాల సహకారంతో గాజాలో పాలన కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో మరో కీలక ప్రకటన కూడా చేశారు. ఇకపై తాము ఉత్తర సరిహద్దుల్లో లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాపై దృష్టి పెడతామని చెప్పారు. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హమాస్‌కు మద్దతుగా లెబనాన్ సరిహద్దుల నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఆ మిలిటెంట్ సంస్థ దాడులు ఎక్కువయ్యాయి. వాణిజ్యనౌకలపై హూతీల దాడులు ఆగడం లేదు. దీంతో వారిపై ఫోకస్ పెట్టినట్టు చెప్పుకొచ్చారు. -
వీడియో: ఇజ్రాయెల్ టార్గెట్ సక్సెస్.. హమాస్ కమాండర్ మృతి
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. హమాస్ నేతలను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు దాడులు జరుపుతున్నాయి. ఇక, తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ జరిపిన దాడుల్లో హమాస్ కీలక కమాండర్, స్నిపర్ అహ్మద్ అల్ సౌర్కాను అంతమొందించింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. హమాస్‌పై దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మరోసారి పైచేయి సాధించింది. హమాస్ నుఖ్బా ఫోర్సెస్‌లో సీనియర్ నాయకుడు, కమాండర్ అహ్మద్ అల్ సౌర్కా టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో అల్ సౌర్కా మరిణించాడు. ఈ మేరకు ఐడీఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే, అతడిపై దాడికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. ఇక, ఐడీఎఫ్‌కు ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ(ఐఎస్ఏ) నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ ఆధారంగా ఆ ఆపరేషన్ జరిపినట్టు వెల్లడించింది.ఇక, ఈ ఆపరేషన్ సమయంలో పౌరులకు హాని కలుగకుండా ఇజ్రాయెల్ సైన్యం తగు జాగ్రత్తలు తీసుకుంది. ఈ ఆపరేషన్‌లో పాలస్తీనా పౌరులు ఎవరూ మృతిచెందకుండా దాడులు చేసినట్టు చెప్పుకొచ్చింది. మరోవైపు.. ఇజ్రాయెల్ సైన్యం సెంట్రల్ గాజాలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా.. గతేడాది అక్టోబర్ ఏడో తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు చేయడంలో అహ్మద్ అల్ సౌర్కాదే కీలక పాత్ర అని తెలుస్తోంది. దాడులకు అహ్మదే ప్లాన్ చేసినట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. Eliminated: Ahmed Hassan Salame Al-Sauarka, a #Hamas terrorist, in the area of Beit Hanoun in northern #Gaza. Alsauarka, a squad commander in the Nukhba Forces, infiltrated Israeli communities and participated in attacks during the #October7Massacre. He led sniper activity in… https://t.co/CUIkhTJQg0 pic.twitter.com/kojwx9uZGW— (((🇺🇸Zemmel🇮🇱))) (@jshayevitz) June 20, 2024 -
వార్ కేబినెట్‌ను రద్దు చేసిన నెతన్యాహూ
టెల్ అవీవ్: యుద్ధక్షేత్రంలో ముందుకు దూసుకెళ్తున్న ఇజ్రాయెల్ సైనిక బలగాలకు సూచనలు చేసే కీలకమైన వార్ కేబినెట్‌ను సోమవారం ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అనూహ్యంగా రద్దుచేశారు. దీంతో గాజాస్ట్రిప్‌లో సైనికులు అనుసరించాల్సిన వ్యూహాలు, వారికి పూర్తి స్వేచ్ఛనిస్తూ తుది నిర్ణయాలను ఇకపై ఎవరు తీసుకుంటారన్న దానిపై సర్వత్రా చర్చ నెలకొంది. విపక్ష నేతలు ఈ యుద్ధ మండలి నుంచి వైదొలగడమే వార్ కేబినెట్ నిర్వీర్యానికి అసలుకారణమని తెలుస్తోంది. హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడి చేసి 1,200 మంది ఇజ్రాయెలీలను పొట్టనబెట్టుకోవడంతో ఇజ్రాయెల్‌లోని విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. గాజా స్ట్రిప్‌పై దురాక్రమణకు తెగబడిన ఇజ్రాయెల్ సేనలకు బాసటా నిలిచాయి. దేశంపై దాడి నేపథ్యంలో రాజకీయపక్షాల మధ్య ఐక్యత ఉందని చాటుతూ ప్రభుత్వానికి మద్దతుపలుకుతూ నెతన్యాహూ ఏర్పాటుచేసిన వార్ కేబినెట్లో సభ్యులుగా నెతన్యాహూకు బద్దశత్రువులైన విపక్ష నేతలు బెన్నీ గాంట్జ్ తదితరులు చేరారు. గాంట్జ్, నెతన్యాహూ, రక్షణ మంత్రి మొఆవ్ గాలంట్‌లు వార్ కేబినెట్లో కీలక సభ్యులుగా ఉండేవారు. అయితే ఇటీవలి కాలంలో యుద్ధంలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందని వేలాది మంది అమాయక పాలస్తీనియన్లను చంపేస్తోందని ప్రపంచదేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా సైతం పౌరనష్టంలేని సైనిక చర్యకే మొగ్గుచూపింది. బందీలను విడిపించడంపై దృష్టి సారించాల్సింది పోయి హమాస్ అంతం తమ లక్ష్యమన్నట్లు ఇజ్రాయెల్ సేనలు వ్యవహరిస్తున్నారని విపక్ష నేతలు బెన్నీ గాంట్జ్ తదితరులు నెతన్యాహూ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. కాల్పుల విరమణకు నెతన్యాహూ ససేమిరా అనడంతో యుద్ధరీతులు మారిపోయాయని భావించి బెన్నీ తదితరులు కేబినెట్ నుంచి వైదొలిగారు. -
ఇజ్రాయెల్ ప్రధానికి షాక్.. వార్ కేబినెట్ మంత్రి రాజీనామా
హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులను తీవ్రం చేస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహకు రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ వార్ కేబినెట్ మంత్రి బెన్నీ గాంట్జ్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. గాజాపై యుద్ధం చేయాలని దేశీయంగా వస్తున్న ఒత్తిడి కారణంగానే ఆయన నెతన్యాహు ప్రభుత్వం నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. యుద్ధం అనంతర ప్రణాళికను ప్రధాని నెతన్యాహు ఆమెదించపోవటం వల్లనే తాను రాజీనామా చేసినట్ల బెన్నీ గాంట్జ్ తెలిపారు. అయితే గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న 8 నెలల యుద్ధ కాలంలో బెన్నీ గాంట్జ్ రాజీనామా ద్వారా నెతన్యాహుకు రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. దీంతో నెతన్యాహు రైట్ వింగ్ పార్టీలపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుందని రాజకీయ ప్రముఖులు పేర్కొంటున్నారు.గాంట్జ్‌కు చెందిన ఇజ్రాయెల్ రెసిలెన్స్ పార్టీలోని మరో నేత గాడి ఐసెన్‌కోట్ వార్ కేబినెట్ నుంచి వైదోలిగారు. దీంలో కీలకమైన వార్ కేబినెట్లో ముగ్గురు సభ్యులు మాత్రమే మిగిలారు. వార్ కేబినెట్.. హమాస్‌పై చేస్తున్న యుద్ధంలో ఇజ్రాయెల్ సైన్యానికి ఆదేశాలు ఇవ్వటంలో కీలకమైన నిర్ణయలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.‘ప్రధాని నెతన్యాహు మమ్మల్ని నిజమైన విజయం వైపు వెళ్లనివ్వకుండా అడ్డకుంటున్నారు. అందుకే భరమైన హృదయంలో ఎమర్జెన్సీ కేబినెట్ నుంచి వైదొలుగుతున్నాం’ అని గాంట్జ్ అన్నారు. గాంట్జ్ రాజీనామా చేసిన నిమిషాల వ్యవధిలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు.‘బెన్ని..యుద్ధాన్ని విడిచిపెట్టడానికి ఇది సరైన సమయం కాదు. ఇది బలగాలను ముందుడి నడిపించే సమయం. రాజీనామా చేయోద్దని కోరుతున్నా’అని అన్నారు. కీలకమైన సమయంలో ఇంకా బంధీలను హమాస్ చెరనుంచి విడుదల కాకముందే ఇలా గాంట్జ్ రాజీనామా చేయటంపై నెతన్యాహు రైట్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. -
అవును.. తప్పు చేశాం: ఇజ్రాయెల్ ప్రధాని
టెల్ అవీవ్: రఫాపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన మారణహోమం.. అమాయక పాలస్తీనియన్లు చనిపోవడం ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తప్పు చేశామని పార్లమెంటులో ప్రకటన చేశారు.‘‘సాధారణ పౌరులకు ఎలాంటి హాని చేయకూడదని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ ఈ విషాదకర ఘటన జరిగింది. దీనిపై దర్యాప్తు చేస్తాం’’ అని పేర్కొన్నారు. అలాగని అంతర్జాతీయ ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతిమ విజయం సాధించేవరకు యుద్ధం ఆపబోమని తెలిపారు.మరోవైపు హమాస్ కమాండర్లు ఉన్నారన్న సమాచారంతోనే దాడి చేశామని.. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.రఫాపై దాడిని తక్షణం నిలిపివేయాలని ఒకవైపు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలిచ్చినా, మరోవైపు అమెరికా సహా ప్రపంచమంతా కోరుకుంటున్నా ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో.. సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెలే ప్రకటించిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతంలో దాడులు జరిపింది. అప్పటికే అక్కడ గుడారాలు వేసుకుని ఉన్న పాలస్తీనా ప్రజలు మృతి చెందారు. ఆదివారం రాత్రి రఫాపై జరిగిన ఈ భీకర వైమానిక దాడిలో 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి గాయాలయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో సగం మంది మహిళలు, చిన్నారులే. ఇప్పటివరకు గాజా పోరులో అత్యంత పాశవికమైన దాడుల్లో ఒకటిగా దీన్ని పేర్కొంటున్నారు. ఈ దాడికి సంబంధించి హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.మిత్రదేశాల ఖండనఇజ్రాయెల్కు అత్యంత సన్నిహిత దేశాలైన అమెరికా, ఫ్రాన్స్ సహా స్పెయిన్, ఇటలీ, ఐర్లాండ్, నార్వే, ఈజిప్టు, ఖతార్, తుర్కీయేలు తీవ్ర స్వరంతో ఖండించాయి. ‘‘ఈ ఆపరేషన్లను ఆపాలి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి. తక్షణం కాల్పుల విరమణ పాటించాలి’’ అని ‘ఎక్స్’ వేదికగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ పేర్కొన్నారు. Outraged by the Israeli strikes that have killed many displaced persons in Rafah.These operations must stop. There are no safe areas in Rafah for Palestinian civilians.I call for full respect for international law and an immediate ceasefire.— Emmanuel Macron (@EmmanuelMacron) May 27, 2024 మరోవైపు.. ‘‘భూమి మీద ఉన్న నరకం గాజా, గత రాత్రి జరిగిన దాడి ఇందుకు మరో సాక్ష్యం’’ అని పాలస్తీనా శరణార్థులకు సంబంధించిన ఐక్యరాజ్యసమితి సంస్థ యూఎన్ఆర్డబ్ల్యూఏ పేర్కొంది. -
ఇజ్రాయెల్ ప్రధానికి షాక్.. అల్టిమేటం జారీ చేసిన మంత్రి
హమాస్ మిలిటెంట్లను అంతం చేసేవరకు గాజాలో దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ పేర్కొంటోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చి పడింది. ఇజ్రాయెల్ వార్ కెబినెట్ మంత్రి బెన్నీ గాంట్జ్ మీడియాతో మాట్లాడుతూ.. కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు.హమాస్‌తో యుద్ధం ముగిసిన అనంతరం పాలస్తీనాను ఎవరు పాలిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. దాని కోసం ప్రధాన మంత్రి నెతన్యాహుకు ఇజ్రాయెల్ రెసిలెన్స్ పార్టీ చెందిన బెన్నీ గాంట్జ్.. జూన్ 8 వరకు యుద్ధం అనంతరం చేపట్టే 6 అంశాలతో కూడిన ప్రణాళిక రూపొందించాలని అల్టిమెటం జారీ చేశారు. అప్పటివరకు నెతన్యాహు ఏం తేల్చకపోతే.. రాజీనామా చేయటంతో పాటు, ప్రస్తుత ప్రభుత్వానికి తమ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు.‘‘ఇజ్రాయల్ సైనికులు యుద్ధంలో ధైర్య సాహసాలు ప్రదర్శిస్తుంటే.. యుద్ధానికి సైన్యాన్ని పంపిన కొందరు మాత్రం పిరికితనంతో, చాలా బాధ్యతరాహిత్యంగా వ్యవస్తున్నారు’’ అని ప్రరోక్షంగా ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై విమర్శలు చేశారు.ఇక.. ఆక్టోబర్ 7 నుంచి హమాస్ మిలిటెంట్లు దాడి చేసి ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా తీసుకువెళ్లినందుకు ప్రతీకారంగా గాజాపై విరుచుకుపడుతన్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఇప్పటివరకు 34,900 మంది పాలస్తీయన్లు ప్రాణాలు కోల్పోయారు. -
ఇజ్రాయెల్‌కు ఇరాన్ అణుబాంబు హెచ్చరికలు!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్‌కు కీలక హెచ్చరికలు చేసింది. తమ దేశానికి ముప్పు ఉందంటే అణుబాంబలు తయారుచేయడానికైనా తాము వెనకాడబోమని ఇరాన్ పేర్కొంది.‘మేము అణుబాంబులు తయారు చేసేందుకు ఇప్పటికైతే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇజ్రాయెల్ వంటి దేశంతో.. మా దేశ ఉనికి ముప్పు వాటిల్లే పరిస్థితుల్లో మాత్రం తప్పకుండా మిలిటరీ సిద్ధాంతాలను మార్చుకుంటాం. మా అణు కేంద్రాలపై ఇజ్రయెల్ దాడికి పాల్పడితే.. మా అణు సిద్ధాంతలను కూడా మార్చుకుంటాం’ అని ఇరాన్ సుప్రీ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు కమల్ ఖరాజీ తెలిపారు.ఏప్రిల్‌లో సిరియా రాజధాని నగరంలో ఇరాన్ ఎంబసీ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఇజ్రాయెల్ సైతం ఇరాన్‌పై దాడులకు తెగపడినట్లు అంతర్జాతీయా మీడియా కథనలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇరు ఇరాన్- ఇజ్రయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గాజాలో పాలస్తీన్లపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఇరాన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.ఇక.. ఇరాన్‌కు సాంకేతికంగా అణు బాంబులను తయారు చేసే సామర్థ్యం ఇప్పటికే ఉంది. కావాలనుకుంటే అణ్వస్త్రాలను తయారు చేయగలం. అయితే ప్రస్తుతానికి అణు బాంబు తయారు చేయాలన్న అంశం మా ఎజెండాలో లేదని గతంలో ఇరాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇరాన్ 60 శాతం స్వచ్ఛతతో యురేనియంను శుద్ధి చేసే సామర్థ్యాన్ని సాధించిందని తెలుస్తోంది. కాగా, 90శాతం వరకు స్వచ్ఛతను సాధిస్తే అణు బాంబులను తయారు చేయడానికి వీలుంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. -
Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
టెల్ అవీవ్: ఒకవైపు కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపితే.. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం దాడుల్ని కొనసాగించాలనే నిర్ణయించింది. మంగళవారం ఉదయం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) యుద్ధ ట్యాంకులు గాజావైపున ఉన్న రఫా క్రాసింగ్‌ను ఆక్రమించాయి. గాజా పోరులో ఈ ఆక్రమణ కీలక ఘట్టమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్న సంగతి తెలిసిందే.ఈ రఫా క్రాసింగ్ నుంచే ఆదివారం రాత్రి హమాస్ దళాలు దక్షిణ ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగించాయి. ఈ ఘటనలో నలుగురు సైనికులు మృతి చెందడంతో ఐడీఎఫ్ తన ఆపరేషన్‌ను ప్రారంభించింది. రఫా క్రాసింగ్ ఆక్రమణ విషయాన్ని ఇజ్రాయెల్ తమకు తెలియజేసిందని ఈజిప్టు అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. అంతకు ముందు..రఫాపై సోమవారం ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్న వేళ.. హమాస్ సంస్థ కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విరమణ ఒప్పందం.. తమ కీలక డిమాండ్లకు అనుగుణంగా లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. మరోవైపు కాల్పుల విరమణ కోసం కైరోలో జరుగుతున్న చర్చల్లో ఇజ్రాయెల్ యథావిధిగా పాల్గొంటోంది. కొసమెరుపు ఏంటంటే.. ఆ చర్చలు కొనసాగుతున్న వేళలోనే ఇజ్రాయెల్ యుద్ధ కేబినెట్ సమావేశమై రఫాపై మిలిటరీ ఆపరేషన్‌కు పచ్చజెండా ఊపింది. మరోవైపు ఇజ్రాయెల్ ఆక్రమణతో రఫా క్రాసింగ్ మీదుగా ఈజిప్టు నుంచి గాజాకు చేరుకుంటున్న మానవతా సాయం ఆగిపోయిందని పాలస్తీనా క్రాసింగ్స్ అథారిటీ ప్రతినిధి వేల్ అబు ఒమర్ తెలిపారు. ఈ పరిణామంపై ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అయితే అమెరికా మాత్రం ఇజ్రాయెల్ చర్యను పరిమితమైన ఆక్రమణగానే పేర్కొంటోంది. -
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
హమాస్‌పై దాడులకు తెగపడుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖతర్‌కు చెందిన న్యూస్ నెటవర్క్ అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం విధించారు. ఇజ్రాయెల్‌లో అల్ జజీరా ఛానెల్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఖతర్‌కు దేశానికి చెందిన న్యూస్ నెట్వర్క్ అల్ జజీరా ఛానెల్ ప్రసారాలను ఇజ్రాయెల్‌లో నిషేదిస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రేరేపించే విధంగా ఉన్న అల్ జజీరా ఛానెల్‌ను ఇజ్రాయెల్‌లో మూసివేస్తాం’ అని ప్రధాని బెంజమిన్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. అయితే ఈ నిషేధం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందన్న విషయంపై స్పస్టత లేదు.గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి హమాస్ డిమాండ్‌ను ప్రధాని బెంజమిన్ తిరస్కరించారు. హమాస్ తమకు ఎప్పుడూ ప్రమాదకరమైనదేనని అన్నారు. ఇజ్రాయెల్ లొంగిపోదని.. గాజాలో హమాస్‌ను అంతం చేసేవరకు దాడులు కొనసాగిస్తాని తేల్చిచెప్పారు. మరోవైపు.. హమాస్, ఇజ్రాయెల్ మధ్య శాంతి నెలకొల్పడం కోసం ఖతర్, ఈజిప్ట్, అమెరికా ప్రయత్నాలు చేస్తున్నా.. బెంజమిన్ ససేమిరా అంటున్నారు. ఇక.. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 34,683 మంది పాలస్తీనా ప్రజలు మృతి చెందారు. -
ఇజ్రాయెల్ నెతన్యాహుకు ఊహించని షాక్!
టెల్ అవీవ్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. యుద్ధ నేరాలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇతర అగ్రనేతలకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ త్వరలో అరెస్ట్ వారెంట్లు జారీ చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. దీంతో, ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. నెతన్యాహు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. హమాస్‌తో కాల్పుల విరమణ చర్చలు కొనసాగుతున్నాయి. చర్చల్లో భాగంగా ఒప్పందం కుదరినా, కుదరకపోయినా.. హమాస్‌లను అంతం చేయడానికి ఇజ్రాయెల్ దళాలు రఫాలోకి ప్రవేశిస్తాయన్నారు. మా లక్ష్యాలను సాధించకుండా యుద్ధం నిలిపివేసే సమస్యే లేదు. హమాస్ దళాలను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ తప్పకుండా విజయం సాధిస్తుందని కామెంట్స్ చేశారు.The International Criminal Court may soon issue arrest warrants for Israeli Prime Minister Benjamin Netanyahu and other top leaders for war crimes. That's according to press reports out of Israel. Capitol Hill Correspondent @ErikRosalesNews reports. pic.twitter.com/lFuboZN6oK— EWTN News Nightly (@EWTNNewsNightly) May 1, 2024 మరోవైపు.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా వేలాది మంది పాలస్తీనియన్లు రఫా నగరంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో బందీల విడుదలకు, కొంత ఉపశమనం పొందడానికి రెండు దేశాల మధ్య కాల్పుల ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇక.. రఫా నగరంపైకి ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి జరిపిన దాడుల్లో మూడు కుటుంబాల్లోని ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదు రోజుల వయసున్న పసికందు ఉందని పాలస్తీనా అధికారులు తెలిపారు. -
ఇరాన్‌కు ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్‌కు బైడెన్ వార్నింగ్!
టెల్ అవీవ్: ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్‌పైకి వందల సంఖ్యలో మిస్సైల్స్, డ్రోన్స్ దూసుకెళ్లాయి. ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్’ పేరుతో విడతల వారీగా డ్రోన్లను ప్రయోగించింది. తర్వాత సైనిక స్థావరాలే లక్ష్యంగా క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. కానీ, ఇజ్రాయెల్ రక్షణ కవచం ముందు ఇరాన్ పాచిక పారలేదు. దీంతో, ఇరాన్ దాడులు దాదాపు ఫెయిల్ అయ్యాయి. ఇక, దాడుల అనంతరం ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచ శాంతి కోసం ఇరాన్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగించే ఉద్దేశ్యమేమీ లేదు. ఇజ్రాయెల్ కవ్విస్తే మాత్రం కచ్చితం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడమని హెచ్చరించింది. దీంతో, ఇరాన్ ప్రకటనపై ఇజ్రాయెల్ ఘాటుగా స్పందించింది. తాజాగా ఇజ్రాయెల్ మంత్రి బెన్నీ గాంట్జ్ మాట్లాడుతూ.. ఇరాన్‌పై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము. దీని కోసం తగిన సమయం, పద్దతిని ఎంచుకుంటామని సంచలన కామెంట్స్ చేశారు. 3 super power ( USA +UK +France ) helped Isreal to repel 300 drones and missiles attack by Iran. By doing so they sided with the Israeli act of bombing Embassy bldg of Iran in Syria !! Does it means no Embassy is safe in any country and it can be bombed just like that ? 🤔 pic.twitter.com/U5YUaSm7Fh — S K Mehta (@kooky_skm) April 15, 2024 ఇదిలా ఉండగా.. ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనను విరమించుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూచించారు. ఈ క్రమంలో ఇరాన్‌పై ఇజ్రాయెల్ నేరుగా దాడులు చేస్తే అమెరికా సహకరించబోదని బైడెన్ స్పష్టం చేసినట్టు సమాచారం. ఇజ్రాయెల్ ప్రతిదాడికి పాల్పడితే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయని అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది. మరోవైపు.. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్‌కు పెద్దగా నష్టమేమీ సంభవించలేదు. ఇరాన్ ప్రయోగించిన వాటిలో 99శాతం డ్రోన్లు, క్షిపణులను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ల సాయంతో ఆ దేశం సమర్థంగా నేలకూల్చింది. తాజా పరిణామంతో ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ ఎదురుదాడులకు దిగితే ప్రాంతీయంగా పరిస్థితులు చేయిదాటేపోయే ముప్పు మాత్రం ఉంది. More and more videos coming out of Iran revealing that a lot of drones and missiles malfunctioned and fell down on Iranian towns and villages. The Islamic regime is a risk to the lives of all decent Iranians who don’t want the Mullahs to rule their lives pic.twitter.com/sU6BREHfyA — Visegrád 24 (@visegrad24) April 14, 2024 ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఇలా.. పేట్రియాట్: చాలా కాలం నుంచి ఇజ్రాయెల్ ఈ క్షిపణి రక్షణ వ్యవస్థను వినియోగిస్తోంది. 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధంలో వీటి పేరు ప్రముఖంగా వినిపించింది. ఇరాక్ ప్రయోగించిన స్కడ్ క్షిపణులను ఇవి విజయవంతంగా అడ్డుకున్నాయి. ఇప్పుడు వీటిని విమానాలను, డ్రోన్లు కూల్చడానికి ఇజ్రాయెల్ వినియోగిస్తోంది. ది యారో: దీన్ని అమెరికా రూపొందించింది. ఇది గగనతల రక్షణ వ్యవస్థ. బాలిస్టిక్ సహా ఏ తరహా దీర్ఘ శ్రేణి క్షిపణులనైనా అడ్డుకోగలదు. భూవాతావరణం వెలుపలా పనిచేసే సామర్థ్యం దీనికి ఉంది. హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో యెమెన్ నుంచి హూతీ వేర్పాటువాదులు ప్రయోగించిన క్షిపణులను ఈ యారో వ్యవస్థతోనే ఇజ్రాయెల్ అడ్డుకుంటోంది. డేవిడ్ స్లింగ్: ఇది కూడా అమెరికా తయారుచేసిందే. మధ్య శ్రేణి క్షిపణులను అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది. లెబనాన్ నుంచి హెజ్బొల్లా ప్రయోగించే మిసైళ్లను అడ్డుకోవడానికి ఈ వ్యవస్థనే ఇజ్రాయెల్ ఎక్కువగా వినియోగిస్తోంది. ఐరన్ బీమ్: ఇజ్రాయెల్ కొత్తగా దీన్ని అభివృద్ధి చేసింది. లేజర్ సాంకేతికతతో పనిచేస్తుంది. మిగతా గగన రక్షణ వ్యవస్థలతో పోలిస్తే దీనికి తక్కువ ధర ఉంటుంది. ఇరాన్ శనివారం చేసిన దాడిలోనూ ఈ లేజర్ వ్యవస్థను వాడినట్లు తెలుస్తోంది. ఐరన్ డోమ్: అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ తయారుచేసిన వ్యవస్థ. తక్కువ దూరం నుంచి ప్రయోగించే రాకెట్లను ఇది అడ్డుకుంటుంది. లెబనాన్ హెజ్బొల్లా, గాజా నుంచి హమాస్ ప్రయోగించే రాకెట్లను గత కొన్ని సంవత్సరాలుగా ఐరన్ డోమ్ వ్యవస్థ అడ్డుకుంటోంది. ఏ దేశమైనా రాకెట్లను ప్రయోగించగానే ఆటోమెటిక్‌గా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. క్షిపణులను అడ్డుకుంటుంది. Who are you supporting in this war? RT for Iran 🇮🇷 LIKE for Israel 🇮🇱 Israel-Iran might spark World War III USA, NATO, UK, ISRAEL Vs IRAN, RUSSIA, CHINA, NORTH KOREA#WorldWar3 #IranAttack #Israel #IranAttackIsrael #WWIII#IsraelUnderAttack pic.twitter.com/j9oStfqh2n — 𝓶𝓮𝓜𝓮𝓻𝓪𝓳 (@_meMeraj) April 15, 2024 -
ఇజ్రాయెల్‌కు టెన్షన్.. ఇరాన్ సంచలన ప్రకటన!
జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందనే వార్తలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ మేరకు అమెరికా కూడా ఇజ్రాయెల్‌ను హెచ్చరిండంతో ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అలర్ట్ అయ్యారు. కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుత పరిస్థితిల్లో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తప్పదేమోనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌ను శిక్షించే సమయం ఆసన్నమైందంటూ గురువారం ఇరాన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ ఐఆర్ఎన్ఏ పేర్కొంది. దాడి ఎలా చేయాలన్న విషయంలోనే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. దీంతో, ఇజ్రాయెల్‌పై ఏ క్షణంలోనైనా ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇరాన్ దాడులు గురించి అమెరికా కూడా హెచ్చరించింది. అయితే, ఏప్రిల్ ఒకటో తేదీన సిరియాలోని కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ వాయుసేన దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన టాప్ మిలటరీ జనరల్‌తో పాటు ఆరుగురు అధికారులు మరణించారు. దీంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం, ఇరాన్ సుప్రీం అధినేత అయతుల్లా అలీ ఖొమేనీ సహా సైనిక జనరళ్లు కూడా ఇజ్రాయెల్‌ను శిక్షిస్తామని బహిరంగ ప్రకటనలిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సమయం కోసం ఇరాన్ వేచిచూస్తున్నట్టు సమాచారం. అయితే, ఇజ్రాయల్‌పై నేరుగా ఇరాన్ దాడి చేయకపోవచ్చని, లెబనాన్ లేదా సిరియా నుంచి తన మద్దతుదారులైన హెజ్బొల్లా, ఇతర మిలిటెంట్ సంస్థలతో దాడులు చేయించొచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, ఈ యుద్ధ భయంతో టెహ్రాన్‌కు ఈ నెల 13 వరకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్టు జర్మనీ ఎయిర్‌లైన్స్ లుఫ్తాన్సా ప్రకటించింది. ఇజ్రాయెల్, లెబనాన్, పాలస్తీనియన్ వంటి పశ్చిమాసియా ప్రాంతాలకు ప్రయాణించవద్దంటూ రష్యా విదేశాంగ శాఖ తన పౌరులకు సూచించింది. బైడెన్ కీలక ప్రకటన.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేసే అవకాశమున్న నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఇజ్రాయెల్‌కు తాము పూర్తిస్థాయిలో అండగా నిలుస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు. ఆ దేశ రక్షణకు, భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌తో యుద్ధంలో అమెరికా భాగస్వామ్యమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. -
నెతన్యాహు పెద్ద తప్పు చేస్తున్నావ్.. బైడెన్ సీరియస్ వార్నింగ్
గాజాగాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న వేళ ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సీరియస్ అయ్యారు. నెతన్యాహు తప్పు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వైఖరి మారకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. గాజాలో గత వారం జరిగిన డ్రోన్ దాడిలో వరల్డ్ కిచెన్ సెంటర్ (డబ్ల్యూకేసీ) స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న ఏడుగురు మరణించారు. ఈ ఘటనపై అగ్రరాజ్యం తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన నేపథ్యంలోనే బైడెన్ స్పందించారు. తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ.. గాజాలో నెతన్యాహు తప్పు చేస్తున్నారు. ఆయన వైఖరిని అంగీకరించను. ఆరు లేదా ఎనిమిది వారాలపాటు తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని నేను ఇజ్రాయెల్ సైన్యాన్ని కోరుతున్నాను. ఈ సమయంలో శరణార్థులకు ఆహారం, ఔషధాలను సరఫరా చేయవచ్చు అని అన్నారు. ఇదే సమయంలో బైడెన్.. జోర్డాన్, సౌదీ, ఈజిప్ట్ దేశాలు కూడా సహాయం, ఆహారం పంపేలా నిత్యం వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు. వారు కూడా దీనికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. గాజాలోని ప్రజలకు ఔషధాలు, ఆహార సరఫరాలో ఎటువంటి రాజీ ఉండదని చెప్పారు. మరోవైపు శ్వేతసౌధం స్పందిస్తూ సంధి కోసం ఇజ్రాయెల్ కొన్ని చర్యలు తీసుకొందని వెల్లడించింది. కానీ, హమాస్ వైపు స్పందన మాత్రం అంత ప్రోత్సాహకరంగా లేదని పేర్కొంది. ఇక, ఇజ్రాయెల్ ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ అమెరికా, ఐరాస డిమాండ్ చేసిన విధంగానే గాజాలోకి సరఫరాలను పెంచామని వివరించింది. తాము వీటికి ఎటువంటి ఆటంకాలను సృష్టించడం లేదని తెలిపింది. సోమవారం 468 ట్రక్కులు, మంగళవారం 419 ట్రక్కుల సామగ్రిని తరలించినట్లు చెప్పింది. యుద్ధం మొదలైన నాటికి ఇదే అత్యధికమని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్ ముఖ్యనేత ఇస్మాయిల్ హనియేహ్ కుమారులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఖతర్ వంటి దేశాలు సంధి ప్రయత్నాలు చేస్తున్న వేళ హమాస్ కీలక నేత కుమారులు మరణించడంతో సయోధ్యపై మరోమారు నీలినీడలు కమ్ముకున్నాయి. ‘జెరూసలేం, అల్–అఖ్సా మసీదుకు విముక్తి కల్పించే పోరాటంలో నా కుమారులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు’ అని ఇస్మాయిల్ వెల్లడించారు. ఇస్మాయిల్ ప్రస్తుతం ఖతార్‌లో ప్రవాసజీవితం గడుపుతున్నారు. కుమారులు మాత్రం గాజాలోని శరణార్థి శిబిరంలో ఉంటున్నారు. షాటీ శరణార్ధి శిబిరంపై జరిపిన దాడిలోనే ఆయన కుమారులు హజీమ్, అమీర్, మొహమ్మద్‌లు మరణించారని అల్–అఖ్సా టీవీ ప్రకటించింది. ముగ్గురూ తమ కుటుంబసభ్యులతో కలిసి ఒకే వాహనంలో వెళ్తుండగా ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురితోపాటు హజీమ్ కుమారులు, కుమార్తె, అమీర్ కుమార్తె సైతం ప్రాణాలు కోల్పోయారు. -
అడుగు దూరంలో ఉన్నాం.. ఇజ్రాయెల్ ప్రధాని వార్నింగ్
జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ ఆ దేశ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. గాజాతో జరుగుతున్న పోరులో తాము విజయం సాధించడానికి అడుగు దూరంలో ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో హమాస్ వద్ద ఉన్న బంధీలను విడిచిపెట్టే వరకు సంధి ప్రసక్తే ఉండదని కుండబద్దలు కొట్టారు. కాగా, గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం మొదలై ఆరు నెలలు పూర్తైన నేపథ్యంలో ప్రధాని నెతన్యాహు నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా నెతన్యాహు మాట్లాడుతూ.. గాజాతో యుద్ధంలో విజయానికి అడుగు దూరంలోనే ఉన్నాం. ఇప్పటివరకు మనం చెల్లించిన మూల్యం ఎంతో బాధాకరమైంది, విచారకరం. ఒప్పందానికి సిద్ధమే, లొంగిపోవడానికి కాదు. అంతర్జాతీయంగా వస్తోన్న ఈ ఒత్తిడి ఇజ్రాయెల్‌పై చేసే బదులు.. దీనిని హమాస్ వైపు మళ్లించాలి. తద్వారా బందీలు త్వరగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. తమపై ఎవరు దాడి చేసినా, చేయాలని ప్రయత్నించినా.. వారిపై ప్రతిదాడులు తప్పవన్నారు. ప్రస్తుతం ఇదే కొనసాగుతోందని.. అన్ని వేళలా ఇదే సూత్రాన్ని ఆచరణలో పెడతామని అన్నారు. ఇదిలాఉంటే, హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో ఇప్పటికే వరకు దాదాపు 33వేల మంది మరణించినట్టు సమాచారం. యుద్ధం కారణంగా గాజాలో విపత్కర పరిస్థితుల నెలకొన్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ వరకు పరిమితమైన ఈ యుద్ధం.. ఇరాన్ జోక్యంతో మొత్తం పశ్చిమాసియాకు విస్తరించే ప్రమాదం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు.. కాల్పుల విమరణ ఒప్పందానికి సంబంధించిన చర్చలు అంతర్జాతీయ మధ్యవర్తుల సహకారంతో కైరోలో తిరిగి మొదలవుతాయని భావిస్తోన్న తరుణంలో నెతన్యాహు ఇలా కామెంట్స్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. -
పద్దతి మార్చుకో.. ఇజ్రాయెల్ నెతన్యాహును హెచ్చరించిన బైడెన్
వాషింగ్టన్:గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజాలో సాధారణ పౌరులే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని హెచ్చరించారు. కాగా, గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో జో బైడెన్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా బైడెన్.. ఇజ్రాయెల్‌పై అమెరికా విధానం గాజాలోని పౌరుల రక్షణపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పౌరులే లక్ష్యంగా జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము. గాజాలో వెంటనే కాల్పుల విరమణను పాటించాలి. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. స్వచ్ఛంద సంస్థ ‘వరల్డ్ సెంట్రల్ కిచెన్’కు చెందిన ఏడుగురు సహాయకులను తాజాగా ఇజ్రాయెల్ చంపివేయడంపై అమెరికా సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో యుద్ధం అన్నాక ఇటువంటివి సహజమేనని నెతన్యాహూ కామెంట్స్ చేయడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) తమ వాహనం మీద దాడిచేశాయని ఈ చారిటీ సంస్థ అధినేత ఆరోపిస్తున్నారు. ఆ వాహనం ఒక సహాయక సంస్థదని తెలియచెప్పే గుర్తులు దాని మీద స్పష్టంగా ఉన్నాయి. పైగా ఐడీఎఫ్తో సమన్వయం చేసుకుంటూ ఘర్షణలేని ప్రాంతం గుండా అది ప్రయాణిస్తున్నప్పుడు ఈ దాడి జరిగింది. మూడుసార్లు కాల్పులు జరపడం, కొందరు చనిపోగా, పారిపోతున్న మిగతా సహాయకసిబ్బందిని కూడా వదిలిపెట్టకుండా హతమార్చడం త్రీవ పరిణామంగా మారింది. JUST IN: President Biden warns PM Netanyahu that future U.S. support for Israel depends on actions taken to shield civilians in Gaza. #Israel #Gaza #USA — The Reportify (@TheReportify) April 4, 2024 ఇక, హమాస్‌తో పోరులో ఇజ్రాయెల్ అనేక విధాలుగా అతిక్రమణలకు పాల్పడుతోంది. అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోంది. గాజాలో ఆపన్నులకు కాస్తంత సాయాన్ని అందిస్తున్న ఏడుగురు వర్కర్లను ఇజ్రాయెల్ దళాలు కాల్చివేయడం, మిగిలివున్న ఆ ఒక్క ప్రధాన ఆస్పత్రిని కుప్పకూల్చడం, పొరుగుదేశంలోని మరోదేశం కాన్సులేట్ మీద దాడిచేసి కీలకమైన వ్యక్తులను చంపివేయడం వంటి చర్యలకు ఇజ్రాయెల్ పాల్పడుతోంది. -
‘వెనక్కి తగ్గేది లేదు.. గాజాపై దాడులు కొనసాగిస్తాం’
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడులకు సంబంధించి ప్రపంచ దేశాల ఒత్తిడిని ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యహు తోసిపుచ్చారు. ఆదివారం ఆయన కేబినెట్ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎలాంటి అంతర్జాతీయ ఒత్తిళ్లు తలొగ్గి మేము యుద్ధంలో మా లక్ష్యాన్ని మధ్యలో ఆపలేము. హమాస్‌ను అంతం చేయటం, బంధీలను విడిపించుకోవటం, గాజాలోని హమాస్‌కు వ్యతిరేకంగా పోరాటం విషయంలో ప్రపంచ దేశాల ఒత్తిడిని పట్టించుకోం. రఫా నుంచి దాడులు కొనసాగిస్తాం. మరికొన్ని వారాల పాటు దాడులు జరుపుతాం’ అని అన్నారు. ప్రపంచ దేశాల ఒత్తిడిపై కూడా బెంజమిన్ నెతాన్యహు స్పందించారు. ‘మీకు జ్ఞపకశక్తి తక్కువగా ఉందా? అక్టోబర్7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన భీకరమైన దాడులు అంత త్వరగా మర్చిపోయారా? హమాస్ వ్యతిరేకంగా పోరాడుతున్న ఇజ్రాయెల్‌ను ఇంత త్వరగా వ్యతిరేకిస్తారా?’ అని తీవ్రంగా మండిపడ్డారు. దాడుల సమయంలో రఫా నగరం నుంచి పౌరులను ఖాళీ చేయాలనే ప్రణాళికతో ఉన్నామని తెలిపారు. అయితే ఈ విషయంలో మిత్రదేశాలు ఇజ్రాయెల్‌పై సందేహం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడిలో 31,600 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. అక్టోబర్ 7న హమాస్ చేసిన మెరుపుదాడిలో 1200 మంది ఇజ్రాయెల్పౌరులు మృతి చెందారు. 253 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ బలగాలు బంధీలుగా తరలించుకుపోయిన విషయం తెలిసిందే. -
నెతన్యాహూతో ఇజ్రాయెల్‌కు నష్టమే: బైడెన్
విలి్మంగ్టన్: గాజాలో హమాస్‌పై యుద్ధం పేరిట ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తన సొంత దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. నెతన్యాహూ అనాలోచిత చర్యల వల్ల ఇజ్రాయెల్‌కు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోందని అన్నారు. గాజాలో సాధారణ పౌరుల మరణాలను నియంత్రించడంలో నెతన్యాహూ దారుణంగా విఫలమవుతున్నారని ఆక్షేపించారు. బైడెన్ శనివారం మీడియాతో మాట్లాడారు. తిరుగుబాటుతో సంబంధం లేని పాలస్తీనియన్ల ప్రాణాలు కాపాడాలని, ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్‌కు సూచించారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు చేసిన దాడిని తాము ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. హమాస్‌ను వేటాడే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని వెల్లడించారు. కానీ, సాధారణ ప్రజలపై దాడి చేయడం సరైంది కాదని తేల్చిచెప్పారు. గాజాలో మరణాల సంఖ్య ఇజ్రాయెల్ చెబుతున్నదానికంటే ఎక్కువగానే ఉన్నట్లు తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. గాజాలో అమాయకుల మరణాలు ఇంకా పెరిగితే ఇజ్రాయెల్ అంతర్జాతీయ మద్దతును కోల్పోతుందని బైడెన్ కొన్ని రోజుల క్రితం హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
ఇజ్రాయెల్ అమానుషం.. నెతన్యాహుపై జో బైడెన్ సీరియస్
వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వైఖరిపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజాలో విషయంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు తీరుపై బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, గాజాలో కాల్పుల విరమణ విషయంలో ఇజ్రాయెల్ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న జో బైడెన్.. బెంజమిన్ నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన వార్షిక ప్రసంగం తర్వాత సెనెటర్ మైకెల్ బెన్నెట్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తదితరులతో బైడెన్ మాట్లాడారు. ఈ సందర్భంగా గాజాలో మానవ సంక్షోభంపై బెన్నెట్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు బైడెన్ సమాధానమిస్తూ.. గాజా విషయంలో నెతన్యాహుతో ముందుగానే చెప్పినట్టు తెలిపారు. అలాగే, గాజాలో మానవ సంక్షోభాన్ని నివారించడానికి నెతన్యాహు చేయాల్సినంత చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నెతన్యాహు తీరు ఇజ్రాయెల్‌కు సహాయం చేసే దాని కన్నా ఆదేశ ప్రజలను బాధపెట్టేలా ఉందన్నారు. నెతన్యాహుకు ఇజ్రాయెల్‌ను కాపాడే హక్కు ఉంది. ఇదే సమయంలో ఆయన తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రజలకు ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. Latest: Benjamin Netanyahu 'hurting Israel more than helping Israel' with Gaza war approach - Joe Biden — Totlani Krishan🇮🇳 (Modi Ka Parivar) (@kktotlani) March 10, 2024 ఇదిలాఉండగా.. కొన్ని నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ దాడుల్లో అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 30వేలకుపైగా ప్రజలు మరణించారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. మరోవైపు.. హమాస్ దాడుల కారణంగా ఇజ్రాయెల్‌లో 1200 మంది చనిపోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నారు. ఇక, ఇజ్రాయెల్ నుంచి హమాస్ దాదాపు 250 మందిని బందీలుగా చేసుకుంది. వీరిలో 99 మంది గాజాలో సజీవంగా ఉన్నట్టు ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. -
జో బైడెన్ వ్యాఖ్యలపై మండిపడ్డ హమాస్
Israel-Hamas War: హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తునే ఉంది. గాజాపై దాడులును నిలిపివేసి పాలస్తీనాను స్వతంత్ర దేశంగా అంగీకరించాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహును కోరిన విషయం తెలిసిందే. బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధానితో ఫొన్లో మాట్లాడారు. బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధానితో ఫోన్ సంభాషణ అనంతరం నెతాన్యహు పాలస్తీనాను స్వంతత్ర దేశంగా అంగీకరించడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. బైడెన్ వ్యాఖ్యలపై హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు ఇజ్జత్ అల్-రిష్క్ స్పందించారు. పాలస్తీనా విషయంలో ఇజ్రాయల్ ప్రధానిపై బైడెన్ చేసిన వ్యాఖ్యలను ఇజ్జత్ తోసిపుచ్చారు. గాజాలో జరుగుతున్న మారణహోమం వెనుక ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాత్ర ఉందని మండిపడ్డారు. ఇక పాలస్తీనా ప్రజలకు ఎప్పటికీ ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన బైడెన్‌పై సదభిప్రాయం కలిగి ఉండరని చెప్పారు. బైడెన్ మాటలతో తమకు మంచి జరుగుతుందన్న నమ్మకం పాలస్తీనా ప్రజల్లో లేదని పేర్కొన్నారు. బైడెన్.. నెతన్యహుతో ఫోన్లో మాట్లాడిన తర్వాత మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలకు ముగింపు పలకడానికి రెండు దేశాల విధానాన్ని ఇజ్రాయెల్ ప్రధాని తీసుకువచ్చే అవకాశం ఉందని అన్నారు. రెండు దేశాల విధానం ద్వారా చాలా దేశాలు ఉన్నాయని.. అటువంటి దేశాలు కూడా యూఎన్‌ఏలో భాగమై ఉన్నాయని తెలిపారు. ఇక.. ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం పాలస్తీనాను స్వతంత్ర దేశంగా అంగీకరించమని తేల్చి చెప్పారు. పాలస్తీనాకు స్వతంత్ర దేశ హోదా ఇచ్చినా హమాస్ వల్ల ఇజ్రాయెల్‌కు ముప్పు తప్పదని అన్నారు. ఇక హమాస్‌ను అంతం చేసేవరకు దాడులు ఆపమని తెలిపారు. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 24, 927 మంది పాలస్తీనా ప్రజలు మృతిచెందారు. చదవండి: న్యూ జెర్సీలో మంచు తుఫాను బీభత్సం -
Israel: మమ్మల్ని ఎవరూ ఆపలేరు.. నెతన్యాహు సంచలన కామెంట్స్
టెల్ అవీవ్: గాజా సిటీలపై ఇజ్రాయెల్ సేనల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక, ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం నేటికి 100 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. యుద్థం గెలిచే వరకు ఆగే ప్రసక్తేలేదని వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ హమాస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధంలో విజయం సాధించే వరకు తమను ఎవరూ ఆపలేరని అన్నారు. యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదు. అదే మా లక్ష్యం. హేగ్, ఈవిల్ మమ్మల్ని ఏం చేయలేవు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే, గాజా భూభాగంలో ఇప్పటికే అనేక హమాస్ బెటాలియన్లను అంతమొందించామని చెప్పారు. ఉత్తర గాజాలో నిర్వాసితులైన వారు తమ ఇళ్లకు తిరిగి రాలేరని తెలిపారు. అయితే, ఐక్యరాజ్యసమితిలోని అత్యున్నత న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో.. ఇజ్రాయెల్ దాడి యూఎన్ఓ జెనోసైడ్ కన్వెన్షన్‌ను ఉల్లంఘిస్తోందని ఇరాన్ మద్దతుగల సాయుధ గ్రూపుల కూటమి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నెతన్యాహు ఇలా కామెంట్స్ చేశారు. Israeli Prime Minister Benjamin Netanyahu announced that the Israeli army will continue its massacres in Gaza despite the genocide case at the International Court of Justice (ICJ). Netanyahu: We will continue the war in Gaza until all our goals are achieved. Neither the ICJ nor… pic.twitter.com/zcCzamWeFC — Readean (@readeancom) January 14, 2024 మరోవైపు, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో భారీగా ప్రాణనష్టం జరుగుతున్న విషయం తెలిసిందే. యుద్ధంలో భీకర దాడుల కారణంగా ఆకలి కేకలు.. 23వేలకుపైగా మరణాలు.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వీటన్నింటికీ ఎప్పుడు తెరపడుతుందో తెలియని దుస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా.. టెల్ అవీవ్‌లో వందలాది మంది యుద్ధ బాధితులను గుర్తుచేసుకోవడానికి ప్రజలు శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మరణించిన వారి కోసం కొవ్వొత్తులను వెలిగించారు. ఇక, బంధీలను విడుదల చేయాలని కోరుతూ బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. On the 100th day of the #Israel-Hamas conflict, hundreds in Tel Aviv lit candles to remember the war's victims. They protested against Prime Minister Benjamin Netanyahu and the current Israeli government, urging the release of hostages. 📸: AA pic.twitter.com/195vs1n2Ka — Zoom News (@zoomnewskrd) January 14, 2024 -
పార్లమెంట్లో నెతన్యాహుకి చేదు అనుభవం!
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమన్ నెతన్యాహూకి పార్లమెంట్ సాక్షిగా చేదు అనుభవం ఎదురైంది. నెతన్యాహూ ప్రసంగిస్తున్న వేళ.. గాజాలో హమాస్ బందీలుగా ఉన్న వాళ్ల కుటుంబీకులు తమ నిరసన గళాలతో పార్లమెంట్‌ను హోరెత్తించారు. తమ వాళ్లను భద్రంగా తీసుకొస్తామని ఇచ్చిన వాగ్దానం ఏమైందని నిలదీశారు వాళ్లు. సోమవారం ఇజ్రాయెల్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరిగింది. ప్రధాని నెతన్యాహు ప్రసంగం జరుగుతున్న టైంలో.. కుటుంబ సభ్యులు ఫ్లకార్డులపై బందీల ఫొటోలు, పేర్లను చూపిస్తూ నినాదాలు చేశారు. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను వెనక్కి రప్పించిన నెతన్యాహూ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు వాళ్లు. నెతన్యాహు ప్రసంగిస్తూ సమయంలో నెస్సెట్ గ్యాలరీలో కూర్చున్న బందీల కుటుంబీకులు లేని నిలబడ్డారు .. ‘‘ సమయం లేదు.. ఇప్పుడే, ఇప్పుడే.. అంటూ గట్టిగా గట్టిగా నినాదాలు చేశారు. అయితే నెతన్యాహూ వాళ్లకు సున్నితంగా సర్దిచెప్పే యత్నం చేశారు. మన బిడ్డలు ఊరికనే చనిపోవడం లేదు. మన దేశ నాశనం కోరుకుంటున్న శత్రువులపై విజయం సాధించేంతవరకు ఈ ప్రయత్నం ఆపకూడదంటూ వ్యాఖ్యానించారు. الأمور مولعة خالص داخل كيان العدو الصهيوني.. - عائلات الأسرى الإسرائيليين تقاطع نتنياهو خلال جلسة الكنيست صارخة "لا وقت.. الآن الآن" - إقالة قائد الكتيبة 51 من لواء غولاني بعد تعريضه جنودا للخطر في الشجاعية. - وأخر شي وأسخن شي.. نتنياهو يمنع غالانت من إجراء مباحثات فردية مع… pic.twitter.com/MeQoH3d8Xt — أجيج (@1b2_r) December 25, 2023 అయితే అప్పటికీ బందీల కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఇంకా గట్టిగా నినాదాలు చేశారు. మా వాళ్లను సురక్షితంగా వెనక్కి మీరు తీసుకొస్తారని నమ్మాం. 80 రోజులు.. ప్రతీ క్షణం నరకంగా గడిపాం. ఇదే మీ కూతురో, కొడుకుకో అయి ఉంటే ఇలాగే ఉంటారా? అంటూ ప్రశ్నించారు. దానికి ప్రధాని నెతన్యాహూ స్పందిస్తూ.. బందీల విడుదల కోసమంటూ చేయని ప్రయత్నమేదీ లేదని వివరించే యత్నం చేశారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి బందీల కుటుంబాలతో తాను వ్యక్తిగతంగా మాట్లాడనంటూ గుర్తు చేశారాయన. అందరినీ సురక్షితంగా విడిపించేంతవరకు సంయమనం పాటించాలని కోరారాయన. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం గాజాలో హమాస్ చెరలో 129 మంది బందీలుగా ఉన్నారు. ఇందులో 22 మంది మరణించగా.. వాళ్ల మృతదేహాలు కూడా బంధువుల్ని చేరలేదు. అక్టోబర్ 7వ తేదీన ఇరు దేశాల మధ్య మొదలైన యుద్ధం.. వేల మందిని బలి తీసుకుంది. ఇజ్రాయెల్ తరఫున 1,200 మంది మరణించగా, హమాస్ ఆధీనంలో ఉన్న గాజాలో 20 వేల మంది దాకా మరణించినట్లు తెలుస్తోంది. -
హమాస్‌కు ఇజ్రాయెల్ ప్రధాని అల్టిమేటం
టెల్ అవీవ్: గాజాపై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతున్నాయి. హమాస్‌ను అంతం చేయడమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నాయి. కాల్పుల విరమణకు అంగీకరించడం లేదు. బందీల విడుదలపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఉగ్రవాదులకు లొంగిపోవడం లేదా చనిపోవడం మాత్రమే దారి ఉందని హెచ్చరికలు జారీ చేశారు. హమాస్‌ను అంతం చేయడానికి వారు తలదాచుకున్న సొరంగాలను సముద్ర నీటితో నింపుతున్న విషయం తెలిసిందే. యుద్ధంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు. హమాస్‌ను అంతం చేసిన తర్వాతే కాల్పుల విరమణ ఉంటుందని తెలిపారు. బందీలను సురక్షితంగా పరిరక్షిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌కు గాజా నుంచి ఎప్పటికీ ముప్పు లేకుండా అయ్యే వరకు పోరాటం సాగుతుందని చెప్పారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఇటీవల కాల్పుల విరమణ వారంపాటు కొనసాగింది. ఈ క్రమంలో హమాస్ 105 మంది ఇజ్రాయెలీ బందీలను విడుదల చేసింది. ఇజ్రాయెల్ కూడా 240 మంది పాలస్తీనా బందీలను బయటకు వదిలివేసింది. ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ శాశ్వతంగా కొనసాగుతుందని ప్రపంచ దేశాలు అభ్యర్థించాయి. కానీ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసింది. ఆకస్మిక దాడి నుంచి తేరుకున్న ఇజ్రాయెల్ ప్రతిదాడిని ప్రారంభించింది. అధునాతన ఆయుధాలతో గాజాపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం గాజాలో కొంత భాగాన్ని ఆక్రమించింది. హమాస్ వైపు దాదాపు 18వేల పైగా మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: చెక్ రిపబ్లిక్లో కాల్పులు.. 15 మంది మృతి -
Israel-Hamas war: ఇజ్రాయెల్‌పై బైడెన్ అసంతృప్తి!
వాషింగ్టన్: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దండయాత్రను అమెరికా అధ్యక్షుడు బైడెన్ తొలిసారిగా తప్పుబట్టారు. బుధవారం వాషింగ్టన్లో నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఇజ్రాయెల్ యుద్ధరీతిపై బైడెన్ మాట్లాడారు. ‘‘ ఇజ్రాయెల్ భద్రత అనేది అమెరికాతో ముడిపడి ఉంది. ఇన్నాళ్లూ ఐరోపా సమాఖ్య, యూరప్ దేశాలూ ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలబడ్డాయి. కానీ ఇప్పుడా పరిస్థితి నెమ్మదిగా మారుతోంది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న విచక్షణారహిత బాంబుదాడులే ఇందుకు ప్రధాన కారణం. మరి ఈ విషయం ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు తెలుసో తెలీదో. గాజావ్యాప్తంగా ఇళ్లలో ఉన్న సాధారణ ప్రజానీకాన్ని చిదిమేస్తూ భవనాలపై దారుణ బాంబింగ్ కొనసాగుతోంది. ఈ దాడుల పర్వం మరికొన్ని వారాలు, నెలలపాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ సైన్యాధికారులే చెబుతున్నారు. అమా యక పాలస్తీనియన్ల భద్రత ఇప్పుడు ప్రమాదంలో పడింది’’ అని ఇజ్రాయెల్ భీకర గగనతల, భూతల దాడులను బైడెన్ ఆక్షేపించారు. ఈ విషయమై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ ఈ వారమే ఇజ్రాయెల్‌లో పర్యటించి భారీ దాడులకు ఎప్పుడు చరమగీతం పాడుతారనే దానిపై ఒక హామీ తీసుకోనున్నారు. ‘‘ 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా అఫ్గాని స్తాన్‌లో యుద్ధానికి దిగింది. అమెరికా చేసిన ఇలాంటి అతి ‘స్పందన’ తప్పిదాల నుంచి ఇజ్రాయెల్ ఏమీ నేర్చుకున్నట్లు కనిపించట్లేదు. ఇది ఇలాగే కొనసాగితే అంతర్జాతీయ మద్దతును ఇజ్రాయెల్ కోల్పోతుంది’’ అని బైడెన్ హెచ్చరించారు. బైడెన్ వ్యాఖ్యలపై హమాస్ సాయుధసంస్థ ప్రతినిధి బీరుట్ నగరంలో మాట్లాడారు. ‘‘ఈ యుద్ధ విపరి ణామాలు ఇజ్రాయెల్‌లో త్వరలోనే కనిపిస్తాయి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తర్వాత శ్వేతసౌధంలో బైడెన్ సీటు గల్లంతవుతుంది’’ అని హమాస్ రాజకీయవిభాగం నేత ఒసామా హమ్దాన్ వ్యాఖ్యానించారు. -
దాడులతో చెలరేగిన ఇజ్రాయెల్
డెయిర్ అల్–బాలాహ్(గాజా స్ట్రిప్): హమాస్ మెరుపుదాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ మొదలుపెట్టిన దాడులు భీకర రూపం దాలుస్తున్నాయి. గాజాలో కాల్పుల విరమణ కోరుతూ ఐక్యరాజ్యసమితి తెచ్చిన తీర్మానాన్ని అమెరికా తన వీటో అధికారంతో కాలదన్నిన దరిమిలా ఇజ్రాయెల్ ఆదివారం మరింత రెచ్చిపోయింది. అమెరికా నుంచి తాజాగా మరింతగా ఆయుధ సంపత్తి అందుతుండటంతో ఇజ్రాయెల్ భీకర గగనతల దాడులతో చెలరేగిపోతోంది. 23 లక్షల గాజా జనాభాలో దాదాపు 85 శాతం మంది బతుకుజీవుడా అంటూ స్వస్థలాలను వదిలిపోయినా సరే ఆదివారం ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను తగ్గించకపోవడం గమనార్హం. దాదాపు రూ.834 కోట్ల విలువైన యుద్ధట్యాంక్ ఆయుధాలను ఇజ్రాయెల్‌కు అమ్మేందుకు అమెరికా అంగీకరించడం చూస్తుంటే ఇజ్రాయెల్ సేనల దూకుడు ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు. ‘ఐరాస భద్రతా మండలిలో మాకు బాసటగా అమెరికా నిర్ణయాలు తీసుకుంటోంది. యుద్ధం కొనసాగింపునకు వీలుగా కీలక ఆయుధాలు అందేందుకు సహకరిస్తున్న అమెరికాకు నా కృతజ్ఞతలు’ అని ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. యుద్ధం ఆగదు: ఇజ్రాయెల్ ‘హమాస్‌ను ఈలోపే అంతంచేయాలని అమెరికా మాకు ఎలాంటి గడువు విధించలేదు. హమాస్ నిర్మూలన దాకా యుద్ధం కొనసాగుతుంది. హమాస్ అంతానికి వారాలు కాదు నెలలు పట్టొచ్చు. బం«దీలందర్నీ విడిపిస్తాం’’ అని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా సలహాదారు టజాచీ హెనెగ్బీ శనివారం అర్ధరాత్రి తేలి్చచెప్పారు. ‘‘ గాజాలో సరైన సాయం అందక సరిదిద్దుకోలేని స్థాయిలో అక్కడ మానవ విపత్తు తీవ్రతరమవుతోంది. ఇది పశ్చిమాసియా శాంతికి విఘాతకరం’’ అని ఖతార్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తంచేశారు. షిజాయాహ్, జబాలియా శరణార్థి శిబిరాల వద్ద నిరంతరం దాడుల కొనసాగుతున్నాయి. ‘‘కదిలే ప్రతి వాహనంపైనా దాడి జరుగుతోంది. శిథిలాలతో నిండిన మా ప్రాంతాలకు అంబులెన్స్‌లు రాలేకపోతున్నాయి’’ అని జబాలియా ప్రాంత స్థానికురాలు ఒకరు ఏడుస్తూ చెప్పారు. ఖాన్ యూనిస్ పట్టణ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ హమాస్, ఇజ్రాయెల్ సేనల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. గంటలు నిలబడినా పిండి దొరకట్లేదు సెంట్రల్ గాజాలో ఆహార సంక్షోభం నెలకొంది. ‘‘ ఇంట్లో ఏడుగురం ఉన్నాం. ఐరాస ఆహార కేంద్రానికి రోజూ వస్తున్నా. ఆరేడు గంటలు నిలబడ్డా రొట్టెల పిండి దొరకట్లేదు. రెండు వారాలుగా ఇదే పరిస్థితి. పిండి కరువై ఉట్టిచేతుల్తో ఇంటికెళ్తున్నా’’ అని అబ్దుల్లాసలాం అల్–మజ్దాలా వాలా చెప్పారు. ఇప్పటిదాకా 17,700 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. -
హమాస్ నుంచి బందీల విడుదల.. నెతన్యాహు షాకింగ్ కామెంట్స్
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య బందీల విడుదల కొనసాగుతోంది. రెండు వర్గాల మధ్య ఈ కార్యక్రమం శని, ఆదివారాల్లో సాఫీగా సాగింది. ఇక, తాజాగా 17 మంది బంధీలను విడుదల చేసింది. దానికి ప్రతీగా ఇజ్రాయెల్.. దాదాపు 75 మంది పాలస్తీనా ఖైదీలను వదిలిపెట్టింది. వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య రెండు, మూడు విడతల బందీల విడుదల కొనసాగింది. మూడో విడతలో భాగంగా ఆదివారం 14 మంది ఇజ్రాయెలీలతోపాటు ముగ్గురు విదేశీయులను హమాస్ విడిచిపెట్టింది. వీరిలోనూ కొంత మంది ఈజిప్టునకు వెళ్లిపోయారు. మిగిలిన వారిని ఇజ్రాయెల్‌కు రెడ్‌క్రాస్ అప్పగించింది. ప్రతిగా 39 మంది పాలస్తీనీయులను ఇజ్రాయెల్ విడుదల చేస్తోంది. ఆదివారం నాటికి మొత్తం 63 మందిని హమాస్, 114 మందిని ఇజ్రాయెల్ విడిచిపెట్టినట్లయింది. ఇక, బంధీల తరలింపు ప్రకియ నాలుగు రోజలు పాటు కొనసాగనుంది. İsrail'in Serbest Bıraktığı, Filistinli Mahkumlar, Aileleri İle Buluşmaya Devam Ediyor. Gazze Bursa Tevfik Göksu Osman Gökçek Ankara Yeşim #ikizlerdolunayı Deniz Binali Yıldırım Murat Kurum Hamas #koraypehlivanoğlututuklansın Filistin pic.twitter.com/aC7mevApCx — 🇹🇷 Abdulhamid Denge 🇹🇷 (@AbdulhamidDenge) November 27, 2023 More and more children are being released from Israeli prisons Yes, you read that right, KIDS. For years, Israel has kept children in prisons as adults. 8, 10, 16 years doesn't matter. They are imprisoned, mistreated and beaten for years. Why are they accused? As… pic.twitter.com/s8df6SStes — Megatron (@Megatron_ron) November 26, 2023 ఇదిలా ఉండగా.. గాజా స్ట్రిప్‌పై పట్టుబిగించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందన్న వాదనకు బలం చేకూరుస్తూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం గాజాలో అడుగుపెట్టారు. యుద్ధంలో మునిగి తేలుతున్న తమ సైనికుల్లో నైతిక స్థైర్యం పెంచేందుకే వచ్చానని చెప్పారు. ఇజ్రాయెల్ బయట పెట్టిన హమాస్ సొరంగం వద్ద తమ కమాండర్లు, సైనికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నెతన్యాహు..‘మనవి మూడే లక్ష్యాలు. హమాస్ అంతం. బందీలందరినీ క్షేమంగా విడిపించడం. భవిష్యత్తులో మరెన్నడూ ఇజ్రాయెల్‌కు ముప్పుగా మారకుండా గాజాను సరిచేయడం’ అని అన్నారు. మరోవైపు.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉత్తర గాజాలో పర్యటించారు. היום בסיור בעזה: נמשיך עד הסוף - עד לניצחון. pic.twitter.com/e2aEA7Gfa4 — Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) November 26, 2023 -
Israel-Hamas war: గాజాలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
జెరూసలేం: గాజా స్ట్రిప్‌పై పట్టుబిగించేందుకు ఇజ్రాయెల్ ప్రయతి్నస్తోందన్న వాదనకు బలం చేకూరుస్తూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం అక్కడ అడుగుపెట్టారు. యుద్ధంలో మునిగి తేలుతున్న తమ సైనికుల్లో నైతిక స్థైర్యం పెంచేందుకే వచ్చానని చెప్పారు. ఇజ్రాయెల్ బయట పెట్టిన హమాస్ సొరంగం వద్ద తమ కమాండర్లు, సైనికులతో మాట్లాడారు. ‘‘మనవి మూడే లక్ష్యాలు. హమాస్ అంతం. బందీలందరినీ క్షేమంగా విడిపించడం. భవిష్యత్తులో మరెన్నడూ ఇజ్రాయెల్‌కు ముప్పుగా మారకుండా గాజాను ‘సరిచేయడం’’ అని అన్నారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉత్తర గాజాలో పర్యటించారు. -
జస్టిన్ ట్రూడో Vs నెతన్యాహు.. ఇజ్రాయెల్ దాడులపై కౌంటర్లు..
జెరూసలేం: ఇజ్రాయెల్ సేనల దాటికి గాజా విలవిల్లాడుతోంది. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా సైన్యం జరుపుతున్న దాడుల్లో ఎన్నో అమానవీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ దాడులో పిల్లలు, మహిళలు భారీగా సంఖ్యలో చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ కార్యక్రమంలో ట్రూడో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ ప్రభుత్వం సంయమనం పాటించాలని నేను కోరుతున్నాను. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ప్రపంచమంతా చూస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో మృతిచెందిన వైద్యులు, కుటుంబాలను కోల్పోయిన వారిని, ప్రాణాలతో బయటపడినవారిని, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను చూస్తున్నాము. మహిళలు, పిల్లలను టార్గెట్ చేస్తూ కూడా ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతోంది. ఇప్పటికైనా వారి విషయంలో మానవత్వం చూపించాలని కోరారు. ఇదే సమయంలో హమాస్‌ను ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో సామాన్య పాలస్తీనియన్లను అడ్డుపెట్టుకోవడం సరికాదన్నారు. హమాస్ వద్ద బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను వెంటనే విడిచిపెట్టారని కామెంట్స్ చేశారు. ఇక, కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ పీఎం బెంజిమిన్ నెతన్యాహు కౌంటరిచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన నెతన్యాహు.. అక్టోబర్ ఏడో తేదీన హమాస్ దాడుల గురించి ప్రస్తావించారు. వారి దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మృత్యవాపడ్డారని అన్నారు. ఉద్దేశపూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకున్నది ఇజ్రాయెల్ కాదు. హోలోకాస్ట్ నుండి యూదులపై జరిగిన దాడుల్లో హమాస్ ఎంతో దారుణంగా వ్యవహరించింది. సామాన్య పౌరులను ఊచకోత కోసింది. ఇజ్రాయెల్.. గాజా పౌరుల కోసం సేఫ్ జోన్లు, మానవతా కారిడార్లను అందిస్తోంది. కానీ, హమాస్ వాటిని కూడా అడ్డుపెట్టుకుని నేరాలకే పాల్పడుతోంది. వారి వెనుక దాక్కోని కాల్పులకు తెగబడుతోందన్నారు. హమాస్ అనాగరిక చర్యలను ఓడించేందుకు అన్ని దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతివ్వాలని కోరారు. .@JustinTrudeau It is not Israel that is deliberately targeting civilians but Hamas that beheaded, burned and massacred civilians in the worst horrors perpetrated on Jews since the Holocaust. While Israel is doing everything to keep civilians out of harm’s way, Hamas is doing… — Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) November 15, 2023 -
గాజాలో కాల్పుల విరమణ పిలుపుపై ఇజ్రాయెల్ స్పందన
టెల్ అవీవ్: గాజాలో కాల్పుల విరమణ పిలుపుపై ఇజ్రాయెల్ స్పందించింది. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ప్రకటించారు. కాల్పుల విరమణ పాటిస్తేనే.. మానవతా సాయం గాజాకు అందుతుందని, లేకుంటే అక్కడి పరిస్థితులు మానవతా సంక్షోభానికి దారి తీస్తాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే నెతన్యాహూ స్పందించారు. ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో కాల్పలు విరమణ ఉండదు. ఎందుకంటే అది హమాస్‌కు లొంగిపోవడమే అవుతుంది గనుక అని అన్నారాయన. ‘‘కాల్పుల విరమణ కోసం ఇస్తున్న పిలుపు.. ఇజ్రాయెల్ హమాస్‌కు లొంగిపోవాలని, ఉగ్రవాదానికి లొంగిపోవాలని పిలుపు ఇవ్వడమే అవుతుంది. కాబట్టి అది జరగదు. యుద్ధంలో గెలిచే వరకు ఇజ్రాయెల్ పోరాడుతుంది అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సోమవారం ప్రకటించారు. మరోవైపు ఇజ్రాయెల్ మిత్రదేశమైన అమెరికా కూడా కాల్పుల విరమణపై అభ్యంతరం వ్యక్తం చేసింది.‘‘ప్రస్తుత ఉద్రిక్తతలకు కాల్పుల విరమణ సరైన సమాధానం అని మేము భావించం అని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు. అయితే గాజాలో సాయం అందాలంటే.. యుద్ధ విరమణల సమయం కేటాయిస్తే సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
మేం యుద్ధ భూమిలో.. ఆయన కొడుకు అలానా?
‘మేం కుటుంబాన్ని వదిలేశాం. యుద్ధ భూమిలో ముందు నిలబడ్డాం. కానీ, ఆయన దేశ ప్రధానికి కొడుకు. ఆయన మాత్రం మియామీ బీచ్‌లో జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు’ అని ఒకరు.. ‘నేను నా జీవితనం, నా కుటుంబం, ఉన్న ఊరిని వదిలేసి వచ్చా.. క్లిష్ట సమయంలో నా దేశాన్ని వదిలేయలేదు. మరి ప్రధాని తనయుడు ఎక్కడ?’.. ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ 32 ఏళ్ల తనయుడు ఎక్కడ? అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమన్ నెతన్యాహూ తీరుపై సొంత దేశాల ప్రజలే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఆడామగా, యువకులు, ముసలి తేడా లేకుండా హమాస్‌తో జరుగుతున్న పోరులో ఇజ్రాయెల్ పౌరులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన వలంటీర్లు సైతం కదన రంగంలోకి దిగారు. కానీ, ప్రధాని తనయుడు మాత్రం అమెరికాలో సెలవుల్ని ఆస్వాదిస్తున్నాడు. నెతన్యాహూ తనయుడు యైర్(32) ఈ ఏడాది ఆరంభంలో ఫ్లోరిడాకు వెళ్లారు. అక్కడ బీచ్‌లో యైర్ రిలాక్స్‌గా గడుపుతున్న ఫొటోలు నెట్లో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యే 32వ పుట్టినరోజు వేడుకగా చేసుకున్నాడు. ఆ ఫొటోలు స్వయంగా యైర్ పోస్ట్ చేయడంతో విమర్శలు ఉవ్వెత్తున వచ్చిపడుతున్నాయి. యైర్.. బెంజిమిన్ నెతన్యాహూ మూడో భార్య కొడుకు. ఇస్లామిక్ వ్యతిరేక పోస్టులతో గతంలో వార్తల్లోకి ఎక్కాడు. ఇజ్రాయెల్ నుంచి ముస్లింలంతా వెళ్లిపోతేనే శాంతి అంటూ పోస్ట్ చేసి.. తాత్కాలికంగా బ్యాన్‌ను ఎదుర్కొన్నాడు. Israeli PM #BenjaminNetanyahu’s son, Yair Netanyahu’s is facing fire from Israeli soldiers. #Watch to know why pic.twitter.com/I5VFC2hhMO — Hindustan Times (@HindustanTimes) October 25, 2023 Video Credits: Hindustan Times -
ఇజ్రాయెల్‌కు పూర్తి మద్ధతు: రిషి సునాక్
టెల్ అవివ్: బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ గురువారం యుద్ధ ప్రభావిత ప్రాంతం ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. హమాస్‌తో పోరాడుతున్న ఇజ్రాయెల్‌కు తాము పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడూ, ఎప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ దేశం పక్షాన నిలబడతామని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టిన రిషి సునాక్‌కు.. ఆ దేశ అధ్యక్షుడు బెంజమిన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాల అగ్రనేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిషి సునాక్ మీడియాతో మాట్లాడారు. హమాస్లా కాకుండా తమ పౌరులకు ఏ హానీ జరగకుండా ఇజ్రాయెల్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తమకు తెలుసన్నారు. యుద్ధ ప్రాంతం నుంచి బ్రిటిష్ పౌరులను తరలించినందుకు నెతన్యాహుకి ధన్యవాదాలు తెలిపారు. ఇజ్రాయెల్ పౌరులే కాక పాలస్తీనియన్లు కూడా హమాస్ బాధితులని తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. To have a child taken from you is a parent’s worst nightmare. This morning I heard from families going through this unbearable agony. Working with our partners, we’re determined to secure the release of the hostages taken by Hamas terrorists. pic.twitter.com/F7AV021o9x— Rishi Sunak (@RishiSunak) October 19, 2023 మానవతా సహాయం కోసం సరిహద్దులను తెరిచినందుకు సంతోషంగా ఉందన్నారు. అన్నింటికంటే మించి ఇజ్రాయెల్ ప్రజలకు సంఘీభావాన్ని తెలియజేయడానికి ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ మాటల్లో చెప్పలేని భయంకరమైన తీవ్రవాద చర్యను ఎదుర్కొంటుందని, యునైటెడ్ కింగ్డమ్, తాను ఆ దేశానికి అండగా ఉన్నామని భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. చదవండి: పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో ఆందోళనలు British PM Rishi Sunak arrives in Tel Aviv, Israel, according to Reuters. (Photo source: Reuters) pic.twitter.com/V2plUYLe2p — ANI (@ANI) October 19, 2023 కాగా పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్రతిదాడులతో మిడిల్ ఈస్ట్ అట్టుడుకుతోంది. మరింత ప్రాంతాలకు వ్యాపించకుండా యుద్ధంవెంటనే ఆపాలని ప్రపంచ నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడితో సమావేశమై యుద్ధ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. హమాస్‌కు వ్యతిరేకంగా చేస్తోన్న పోరులో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. యుద్ధం నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ వెంటనే నేడు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ యుద్ధ భూమిలో అడుగుపెట్టారు. -
ఇజ్రాయెల్‌కు ఊహించని షాక్.. సౌదీ అరేబియా కీలక నిర్ణయం!
రియాద్: ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. యుద్ధం కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. ఇదే సమయంలో ప్రపంచంలోని చాలా దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అరబ్ దేశమైన సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్(అరబ్ లీగ్‌లో భాగంగా)తో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడానికి ఉద్దేశించిన ఒప్పంద చర్చలకు సౌదీ బ్రేక్ వేసినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్‌తో ఒప్పంద చర్చలను నిలిపివేయాలని సౌదీ నిర్ణయించిందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని అమెరికా అధికారులకు సౌదీ తెలియజేసినట్లు సమాచారం. అయితే, కొన్నేళ్లుగా అరబ్‌లీగ్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇజ్రాయెల్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే 1979లో ఇజ్రాయెల్.. ఈజిప్టుతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంది. ఇదే సమయంలో యూఏఈ, బహ్రెయిన్ వంటి దేశాలు ఇజ్రాయెల్‌తో కొన్ని ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. ఇందుకు అమెరికా ఇజ్రాయెల్ కు అండగా నిలిచింది. తాజాగా సౌదీ అరేబియాను ఆ జాబితాలోకి చేర్చే ప్రయత్నం అగ్రరాజ్యం అమెరికా ప్రయత్నాలు చేసింది. తాజా యుద్ధంతో అమెరికా ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. కాగా, ఇలాంటి పరిస్థితుల్లో ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లడం కరెక్ట్ కాదనే ఆలోచన సౌదీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. దీంతో, ఇజ్రాయెల్ అరబ్ దేశాల్లో బలమైన దేశంగా ఉన్న సౌదీ అరేబియాతో సంబంధాలు చేసుకోవాలన్న ప్రయత్నాలు బెడిసికొట్టాయని చెప్పుకోవచ్చు. Saudi Arabia switches focus from Israel to Iran to cool tensions following Hamas terrorist attack: reporthttps://t.co/2RMro1ZLgm — deborah green (@NewaiGreen) October 14, 2023 పాలస్తీనానే సమస్య.. అరబ్‌లీగ్‌లో కీలకంగా సౌదీ అరేబియా కొనసాగుతోంది. ఈ తరుణంలో ఇజ్రాయెల్‌తో సౌదీ సంబంధాలు ఏర్పరచుకుంటే మిగతా ముస్లిం దేశాలకు అది బలమైన సంకేతాన్ని పంపుతుంది. ఇతర దేశాలు సైతం సౌదీ బాట పట్టే అవకాశం ఉంది. సాధారణంగా పాలస్తీనా సమస్య.. అరబ్ దేశాలకు ఓ భావోద్వేగపరమైన అంశం. అందుకే మెజారిటీ ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ విషయంలో ఇన్నాళ్లూ కఠిన వైఖరినే అవలంబిస్తూ వచ్చాయి. ఆ దేశ సార్వభౌమత్వాన్ని అధికారికంగా గుర్తించడానికి తిరస్కరిస్తూ వచ్చాయి. కాగా, ఇజ్రాయెల్‌తో సంబంధాల కారణంగా పాలస్తీనీయుల హక్కులకు వెన్నుపోటు పొడవడమే అవుతుందని ఇరాన్ కూడా పేర్కొంది. దీంతో, మరిన్ని దేశాలు కూడా ఇజ్రాయెల్‌లో సంబంధాలపై ఆలోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. చర్చల విషయంలో సౌదీకి ఇరాన్‌కు కూడా కీలక ప్రతిపాదన చేసినట్టు సమాచారం. -
ఇజ్రాయెల్ ఆదేశాలు.. గాజా నుంచి తరలివెళ్తున్న వేలాది పాలస్తీనియన్లు
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఉధృతంగా సాగుతున్న ఈ ఆధిపత్య పోరులో ఇరువర్గాలకు చెందిన 3,200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో 600 చిన్నారులతో 1,900 పాలస్తీన్లు, సహా మరణించినట్లు గాజా అధికారులు వెల్లడించారు. మరోవైపు హమాస్ ఉగ్రవాదుల ఊచకోతలో 1300 మంది ఇజ్రాయెల్ పౌరులు మృత్యువాతపడ్డారు. తాజాగా ఉత్తర గాజాను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించడంతో ఇక్కడి పాలస్తీనియన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గాజాలో కరెంట్, మంచి నీళ్లు, ఆహారం, ఇంధన కొరతతో అల్లాడుతున్న అక్కడి పౌరులు ఇజ్రాయెల్ ఆదేశాలతో మరింత భయాందోళన చెందుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని వేలాది మంది పాలస్తీనియన్లు ఖాళీ నడకన సౌత్ గాజాకు తరలివెళ్తున్నారు. ఆరంభం మాత్రమే.. మరోవైపు హమాస్ ఉగ్రవాదులను నిర్మూలించడమే లక్ష్యంగా గాజాపై పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమవుతోంది. గాజాను ఆక్రమించుకునేందుకు దాని సరిహద్దుల్లో 3.60 లక్షలమంది రిజర్వ్ సైనికులు సిద్ధం చేసింది. గత ఏడు రోజులుగా గాజాలోని హమాస్ స్థావరాలపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సేనలు తాజాగా గ్రౌండ్ ఆపరేషన్ దాడులను ప్రారంభించింది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజామిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. తమ దేశం ఇప్పుడే ప్రతీకారం తీర్చుకోవడం మొదలు పెట్టిందని తెలిపారు. ఇజ్రాయెల్ సేనలు సింహాల్లా పోరాడుతున్నాయని, ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని పేర్కొన్నారు. ఉత్తర గాజాలోనే హమాస్ మిలిటెంట్ల మకాం ఉత్తర గాజాపై హమాస్‌కు గట్టి పట్టుంది. అగ్రనాయకులంతా అక్కడే మకాం వేశారు. అందుకే తొలి టార్గెట్‌గా అదే ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర గాజాను వదిలి దక్షిణ గాజాకు వెళ్లాలని పాలస్తీనా ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సామాన్య ప్రజలకు నష్టం కలిగించే ఉద్దేశం లేదని, యుద్ధం ముగిసిన తర్వాత వారంతా తిరిగిరావొచ్చని సూచించింది. హమాస్ మిలిటెంట్లు జనావాస ప్రాంతాల్లో మకాం వేసి, కార్యకలాపాలు సాగిస్తున్నారు. సాధారణ ప్రజలను కవచంగా వాడుకుంటూ ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగిస్తున్నారు. ప్రజలను అక్కడి తరలిస్తే మిలిటెంట్ల ముసుగు తొలగిపోతుందని ఇజ్రాయెల్ చెబుతోంది. కాగా గాజా మొత్తం జనాభా 20 లక్షలు కాగా ఉత్తర గాజాలో 10 లక్షల మంది నివాసం ఉంటున్నారు. ఇజ్రాయెల్ ఆదేశాల మేరకు జనాలు దక్షిణ గాజాకు పయనవతున్నారు.అయితే ఇప్పటికే జనంతో కిక్కిరిపోయిన దక్షిణ గాజాపై మరింత ఒత్తిడిపెరగనుంది. చదవండి: అమేయ సైనిక శక్తి.. అతి శక్తిమంతమైన సైన్యం ఇజ్రాయెల్ సొంతం దారుణంగా గాజా పరిస్థితి గాజాలో పరిస్థితిలు మరి దారుణంగా మారాయి. ఎటు చూసిన శిథిలాలు.. వాటి కింది చిక్కుకున్న మృతదేహాలే కనిపిస్తున్నాయి. కరెంట్, తాగునీరు, నిత్యవసరాల కొరతతో పాలస్తీనియన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాజా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో లక్ష మందికిపైగా జనం ఆశ్రయం పొందుతున్నారు. ఆకలి తీర్చుకోవడం, ప్రాణాలు కాపాడుకోవడమే ప్రథమ కర్తవ్యంగా మారిపోయింది. మరోవైపు మృత్యువు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో, రాకెట్లు, డ్రోన్లు ఎప్పుడు వచ్చిపడతాయో, ఎవరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయోనన్న భయాందోళనతో ప్రాణాలను అరచేతిలో పట్టుకొని గడుతున్నారు. ఖాళీ చేయించే ఆలోచన మానుకోండి: ఐరాస ఉత్తర గాజాను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ సైన్యం జారీ చేసిన ఉత్తర్వులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. లక్షలాది మందిని బలవంతంగా తరలించడం మానవ విపత్తు అవుతుందని పేర్కొంది. సామూహికంగా జనమంతా ఒకేసారి తరలివెళ్లడం సంక్షోభానికి దారితీస్తుందని స్పష్టం చేసింది. జనాన్ని ఖాళీ చేయించే ఆలోచన మానుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టెఫానీ డుజారిక్ ఇజ్రాయెల్‌కు సూచించారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు గాజా స్ట్రిప్‌లో మొత్తం 150 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని, విదేశీయుల్ని తమ బంధీలుగా ఉంచుకోడంతో ఇజ్రాయెల్ సైన్యం గాజాపై శక్తివంతమైన రాకెట్లు ప్రయోగిస్తోంది. ఇటు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతున్నారు. గాజా నుంచి రాకెట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను దక్షిణ ప్రాచ్చంలోని దేశాలు ఖండిస్తున్నాయి. బీరూట్, ఇరాక్, ఇరాన్, జోర్డాన్ బహ్రెయిన్‌లో పాలస్తీనియన్లకు భారీగా మద్దతు లభిస్తోంది. ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా నిరసలను వ్యక్తం చేస్తున్నారు. -
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం.. మా మద్దతు వారికే: ప్రధాని మోదీ
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భారత్ తన వైఖరిని వెల్లడించింది. హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర పోరులో తాము ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలబడుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రస్తుత యుద్ధ పరిస్థితిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజామిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడినట్లు పేర్కొన్నారు . భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకమని, అదే ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని తెలిపారు. ‘ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడాను. ఇజ్రయెల్లో యుద్ధానికి సంబంధించి తాజా పరిణామాలపై ఆయన వివరించారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయ ప్రజలు ఇజ్రాయెల్‌కు అండగా ఉంటారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న దానిని భారత్ తీవ్రంగా ఖండిస్తుంది.’ అని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా ఇంతకముందు కూడా ప్రధానిమోదీ ఇజ్రాయెల్ యుద్ధంపై స్పందించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌లో ఉగ్రవాదుల దాడుల వార్తలు విని దిగ్బ్రాంతికి గురైనట్లు తెలిపారు ఈ విపత్కర పరిస్థితుల్లో తాము ఇజ్రాయెల్‌కు అండగా నిలబడతామని పేర్కొన్నారు. చదవండి: గాజా సరిహద్దుల్లో 1500 హమాస్ మిలిటెంట్ల మృతదేహాలు: ఇజ్రాయెల్ అదే విధంగా అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా ఇప్పటికే ఇజ్రాయెల్‌కు మద్దతుగా ప్రకటన విడుదల చేశాయి. ఇజ్రాయెల్‌కు సాయం చేసేందుకు అమెరికా స్వయంగా రంగంలోకి దిగింది. ఎయిర్‌క్రాఫ్ట్ కేరియర్‌తోపాటు యుద్ధ విమానాలు, నౌకలను మధ్యదరా సముద్రం ద్వారా ఇజ్రాయెల్‌కు పంపింది. మరోవైపు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో నెత్తుటేర్లు పారుతున్నాయి. అక్టోబర్ 7న పాలస్తీనా మిలిటెంట్లు హమాస్ ఇజ్రాయెల్‌పై మొదలెట్టినప్పటి నుంచి ఈ దాడిలో ఇప్పటి వరకు ఇరువర్గాలకు చెందిన 1600 వందల మంది ప్రాణాలు కోల్పోగా 6 వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక్క ఇజ్రాయెల్‌లోనే 900 మంది మరణించగా.. 2,600 మంది గాయపడ్డారు. ఇక గాజాలో 704 మంది మృత్యువాతపడగా.. వీరిలో 143 మంది చిన్నారులు, 105 మంది మహిళలు ఉన్నారు. అదే విధంగా మరో 4000 మంది ఇజ్రాయెల్ వైమానిక దాడిలో గాయపడ్డారు. -
'యుద్ధాన్ని మేము మొదలెట్టలేదు.. కానీ ముగిస్తాం'
జెరూసలేం: హమాస్ దళాలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. యుద్ధాన్ని తాము మొదలెట్టలేదు.. కానీ తప్పకుండా ముగిస్తామని అన్నారు. హమాస్ తిరుగుబాటుదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. యుద్ధం మొదలెట్టి చారిత్రాత్మక తప్పిదం చేశారని అన్నారు. 'ఇజ్రాయెల్ ప్రస్తుతం యుద్ధం చేస్తుంది. యుద్ధం చేయాలని మేము కోరుకోలేదు. మాపై అతి కిరాతకంగా దారుణమైన దాడులకు పాల్పడ్డారు. ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించలేదు.. కానీ తప్పకుండా ముగిస్తుంది. హమాస్‌తో పాటు ఇజ్రాయెల్ శత్రుదేశాలకు గుర్తుండిపోయేలా బదులిస్తాం. హమాస్ కూడా ఐఎస్ఐఎస్ లాగే తీవ్రవాద సంస్థ. వీరిని ఓడించడానికి అందరూ కలిసికట్టుగా పోరాడాలి. ' అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. 'అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో నిరంతరం టచ్‌లోనే ఉన్నా. ఇజ్రాయెల్ ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి ఒక్కరి తరుపున ఇజ్రాయెల్ పోరాడుతోంది. అనాగరిక వ్యక్తులపై నాగరిక ప్రపంచమే విజయం సాధిస్తుంది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తున్న ప్రపంచ నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు.' అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. హమాస్ తిరుగుబాటుదారులపై పోరాడటానికి ఇజ్రాయెల్ ఇప్పటికే 3,00,000 సైనికులను రంగంలోకి దింపింది. 1973లో జరిగిన యోమ్ కిప్పూర్ యుద్ధంలో అత్యధికంగా 4,00,000 మంది సైనికులు పోరాడారు. ఇంతకాలం తర్వాత ఇంతటి భారీ స్థాయిలో యుద్ధం జరగడం ఇదే ప్రథమం. ఈ యుద్ధంలో దాదాపు 2300 మంది ఇజ్రాయెల్ ప్రజలు గాయపడ్డారు. 700 మంది మృతి చెందారు. హమాస్ మిలిటెంట్ల పీచమణచడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం సోమవారం గాజాపై వైమానిక దాడులు ఉధృతం చేసింది. మిలిటెంట్ల చొరబాట్లను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు, డ్రోన్లను మోహరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలోనూ వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. ఇదీ చదవండి Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం Follow the Sakshi Telugu News channel on WhatsApp -
ఇజ్రాయెల్ ప్రధానితో మస్క్: సైబర్‌ట్రక్ రైడ్ వీడియో వైరల్
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం తన అమెరికా పర్యటనలో టెస్లా సీఈవో బిలియనీర్ ఎలాన్ మస్క్‌ను కలిశారు. ఈ సందర్భంగా భార్య సారాతో కలిసి నెతన్యాహు నెతన్యాహుని కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లోని టెస్లా ఫ్యాక్టరీ పర్యటనకు తీసుకువెళ్లారు. అక్కడ ఇద్దరూ కలిసి మస్క్ ఎలక్ట్రిక్ వాహన కంపెనీ టెస్లాకు చెందిన 'సైబర్‌ట్రక్' (ఇంకా లాంచ్ కాలేదు) లో సంచరించారు. ముగ్గురూ ఫ్యాక్టరీ చుట్టూ బ్యాటరీ-ఎలక్ట్రిక్ ఫుల్-సైజ్ పికప్ ట్రక్‌లో ప్రయాణించిన వీడియోను పీఎం ఆఫీసు అధికారిక (ఎక్స్)లో పోస్ట్ చేశారు. Prime Minister Benjamin Netanyahu and his wife Sara toured the @Tesla Motors plant in Fremont, California, together with Tesla CEO, entrepreneur @ElonMusk. pic.twitter.com/GPCx5tBSUm — Prime Minister of Israel (@IsraeliPM) September 18, 2023 ప్రధానమంత్రి, ఆయన భార్యకు టెస్లా అభివృద్ది చేస్తున్న వివిధ మోడళ్లపై ఎలోన్ మస్క్ వివరించారు.అలాగే అధునాతనఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, అసెంబ్లింగ్ లైన్‌ను పరిశీలించారని ఆ ట్వీట్లో పేర్కొన్నారు.అంతేకాదు ఏఐ వినియోగం, దాని మంచిచెడులను, ఏఐ నష్టాలను ఎలా తగ్గించవచ్చు అనే దాని గురించిచర్చించామంటూ నెతన్యాహూ ట్వీట్ చేశారు. -
న్యాయ వ్యవస్థ సంస్కరణల బిల్లుకు ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదం
జెరూసలేం: వివాదాస్పద న్యాయ వ్యవస్థ సంస్కరణల బిల్లును ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదించింది. సోమవారం తుది ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌ను ప్రతిపక్షం బహిష్కరించింది. బిల్లుకు అనుకూలంగా 64 ఓట్లు లభించగా, వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. ఈ బిల్లుపై ఏకంగా 30 గంటలపాటు పార్లమెంట్లో చర్చ జరిగింది. ఒకవైపు చర్చ జరుగుతుండగానే, మరోవైపు దేశవ్యాప్తంగా బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి. జనం వీధుల్లోకి వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థలో మార్పులు తలపెట్టడాన్ని అమెరికాతోపాటు పశి్చమ దేశాలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. న్యాయ వ్యవస్థను సంస్కరిస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చామని, ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ చెబుతున్నారు. ఈ కొత్త బిల్లు ప్రకారం.. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలను కోర్టులు అడ్డుకోరాదు. అంటే న్యాయ వ్యవస్థపై ప్రభుత్వానిదే పైచేయి అవుతుంది. -
సొమ్మసిల్లి పడిపోయిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ఆస్పత్రిలో చేరిక
జెరుసలేం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు(73) శనివారం అకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరారు. టెల్‌అవీవ్‌లోని షెబా ఆస్పత్రిలో నెతన్యాహుకు చికిత్స అందిస్తున్నారని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, వైద్య పరీక్షలు జరుగుతున్నాయని తెలిపింది. ఇంతకు మించి వివరాలు వెల్లడించలేదు. ఇంటి దగ్గర ఉండగా సొమ్మసిల్లి పడిపోవడంతో నెతన్యాహును ఆస్పత్రికి తీసుకెళ్లారంటూ ఇజ్రాయెల్ వార్తా వెబ్సైట్ ఒకటి పేర్కొంది. ఆయన బాగానే ఉన్నారని, ఆస్పత్రిలో నడుస్తున్నారని కూడా తెలిపింది. అయితే, ఈ వార్తలు అధికారికంగా ధ్రువీకరణ కాలేదు. ఇజ్రాయెల్‌లో సుదీర్ఘకాలం దాదాపు 15 ఏళ్లుగా నెతన్యాహు అధికారంలో కొనసాగుతున్నారు. -
ప్రజల ఇష్టానుసారమే నిర్ణయం తీసుకుంటాం! : నెతాన్యాహు
నిరసనలు, ఆందోళనలు సమ్మెలతో ఇజ్రాయెల్ అట్టుడుకుపోయిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రభుత్వం న్యాయ వ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులు పట్ల ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షడు జో బైడెన్ సైతం మరింత ఆజ్యం పోసేలా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో బైడెన్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు ఘాటుగా స్పందించారు. ఈ మేరకు నెతాన్యాహు బైడెన్ వ్యాఖ్యలకు బదులిస్తూ..ఇజ్రాయెల్ సార్వభౌమాధికారం కలిగిన దేశం. విదేశాల నుంచి వచ్చే ఒత్తిళ్లపై ఆధారపడి ఇజ్రాయెల్ నిర్ణయాలు తీసుకోదని సూటిగా కౌంటరిచ్చారు. తన ప్రజల ఇష్టానుసారమే ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంటుందని కరాఖండీగా చెప్పారు. కాగా బైడెన్ ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయపరమైన సంస్కరణలు రాజకీయ సంక్షోభానికి దారితీసింది కాబట్టి నెతాన్యాహుల వాటిని వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నా అని అన్నారు. (చదవండి: డోక్లామ్‌పై భూటాన్ ప్రధాని షాకింగ్ వ్యాఖ్యలు! టెన్షన్లో భారత్) -
ఈ మార్పు మంచికేనా?
ప్రజాందోళన పెరిగితే దాన్ని నీరుగార్చడానికైనా పాలకులు ఒక అడుగు వెనక్కి వేస్తారు. కనీసం వేసినట్టు కనిపిస్తారు. మూడు నెలలుగా సాగుతున్న ప్రజా ఉద్యమం ఉద్ధృతరూపం దాల్చడంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతెన్యాహూ ఆ పనే చేశారు. ప్రభుత్వమే జవాబుదారీ అంటూ ఆ దేశ న్యాయమూర్తులకు ఇప్పటి దాకా అనేక అధికారాలున్నాయి. వాటిని నిర్వీర్యపరిచేలా న్యాయ వ్యవస్థలో మార్పులకు దిగిన ఆయన, చివరకు ప్రజాగ్రహంతో ఆగాల్సి వచ్చింది. రక్షణమంత్రిపై వేటు ప్రకటన గత వారాంతంలో కథలో ఈ కొత్తమలుపునకు దారి తీసింది. ప్రధాని చర్యలకు వ్యతిరేకంగా దేశంలోని అతి పెద్ద కార్మిక సంఘం సమ్మెకు దిగేసరికి, ఆస్పత్రులు, విద్యాలయాలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, విదేశాల్లో ఇజ్రాయెలీ దౌత్యకార్యాలయాలు – అన్నీ సోమవారం మూతబడ్డాయి. ఆర్థిక వ్యవస్థ స్తంభించడం, సొంత దేశాధ్యక్షుడితో పాటు అమెరికా సహా అంత ర్జాతీయ సమాజదృష్టి పడడంతో ఒత్తిడి పెరిగి నెతెన్యాహూ మనసు మార్చుకున్నట్టు కనిపించారు. మిత్రదేశమైన అమెరికా సైతం నెతెన్యాహూకు సుద్దులు చెప్పాల్సి వచ్చింది. రక్షణమంత్రి ఉద్వాసన వార్తలందాక కలవరపడి, ప్రజాస్వామ్యానికి అప్రతిష్ఠ తీసుకురావద్దని ఇజ్రాయెల్‌ను పదే పదే హెచ్చరించింది. మార్పులకు విరామమిచ్చినట్టు నెతెన్యాహూ ప్రకటించగానే, ఆయనను అమెరికా అధ్యక్షుడితో భేటీకి ఆహ్వానిస్తున్నట్టు అమెరికన్ రాయబారి వెల్లడించడం గమనార్హం. ప్రధానిగా నెతెన్యాహూ పదవి చేపట్టి 3 నెలలు దాటినా, ఇంతవరకూ కలవని అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు హుటాహుటిన భేటీ జరపనుండడం ఆసక్తికర పరిణామమే. మధ్యప్రాచ్యంలో అమెరికాకు అనేక ప్రయోజనాలున్నాయి. వాషింగ్టన్, జెరూసలేమ్‌ల సైనిక భాగస్వామ్యంపైనే దాని దృష్టి. నిజానికి మార్పుల్ని వ్యతిరేకించిన రక్షణమంత్రిని ఇంటికి పంపి, తన పంతం నెగ్గించుకోవచ్చని నెతెన్యాహూ తప్పుగా అంచనా వేశారు. ఇజ్రాయెలీ సైనికదళాలకు వెన్నెముక లాంటి సైనిక రిజర్వి స్టులు సైతం విధులకు హాజరయ్యేందుకు నిరాకరించడంతో దేశ భద్రతకే ముప్పొచ్చింది. ఎగసిన వ్యతిరేకతకు తలొగ్గి, మార్పులకు సర్కార్ బ్రేకులు వేయాల్సి వచ్చింది. 73 ఏళ్ళ నెతన్యాహూ మాట నమ్మి, కార్మిక సంఘం సమ్మె విరమించింది. అలా మంగళవారం ఇజ్రాయెలీ వీధులు పైకి ప్రశాంతంగా కనిపించాయి. కానీ, సంక్షోభం పరిష్కారమైందనుకోలేం. అవినీతి ఆరోపణల్ని ఎదుర్కొంటున్న నెతెన్యాహూ జడ్జీల ఎంపిక వ్యవస్థపై పట్టు బిగించే ప్రతిపాదిత బిల్లుకు పూర్తిగా స్వస్తి పలికారనుకోలేం. మిత జాతీయవాదులు, ఛాందసులు, అతి మితవాదుల కలగాపులగమైన సంకీర్ణ సర్కారు ఆ బిల్లు తుది రూపాన్ని మంగళవారం పరిశీలనకు చేపట్టడమే అందుకు ఉదాహరణ. జనం ఎన్నుకొనని శిష్టవర్గీయుల చేతిలో, వామపక్షం వైపు మొగ్గే వ్యవస్థగా జ్యుడీషియరీ మారిందనేది ప్రభుత్వ ఆరోపణ. సుప్రీం కోర్ట్ నిర్ణయాల్ని సైతం సాధారణ మెజారిటీతో పార్లమెంట్ కొట్టిపారేసే వీలు కల్పించాలనీ, జడ్జీల నియామక సంఘంలో ప్రభుత్వ ప్రతినిధుల ప్రాతినిధ్యం పెంచాలనీ, న్యాయ సలహాదారుల సలహాను మంత్రులు శిరసావహించాలనే చట్టాన్ని ఎత్తేయా లనీ... ఇలా పలు మార్పులు చేద్దామని ప్రభుత్వ యోచన. కానీ, ఈ మార్పులు చివరకు న్యాయ వ్యవస్థను నీరుగార్చి, పాలకుల వైపే మొగ్గుతో ప్రజాస్వామ్యానికి హాని చేస్తాయని ప్రజలు, ప్రతిపక్షాల ఆందోళన. ప్రభుత్వం మాత్రం పాలకులకు మరింత జవాబుదారీగా ఉండేలా న్యాయ వ్యవస్థలో మార్పులు తేవాలనే తమ ప్రయత్నం అంటోంది. దాన్ని అడ్డుకోవడం అప్రజాస్వామిక మని నెతెన్యాహూ బృందం వాదిస్తోంది. వెరసి, పార్లమెంట్ తదుపరి సమావేశాల్లో ఈ బిల్లు కథ మళ్ళీ పైకి రావచ్చు. ఈ 2 నెలల జాప్యంతో భారీ పౌర నిరసనపై నీళ్ళు జల్లి, ఏకాభిప్రాయం పేర ఏదో ఒక రూపంలో బిల్లుకు ముద్ర వేయాలనేది పాలకుల ప్రస్తుత వ్యూహం. అబద్ధాలు చెప్పడం, తిమ్మిని బమ్మిని చేయడం నెతెన్యాహూ స్వభావం కాబట్టి, కుట్రలకు ఆయన తెర దించేవరకూ ప్రజా ఉద్యమంతో ఒత్తిడి పెట్టాల్సిందేనని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. తాజా పరిణామాలతో నెతెన్యాహూకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆయన రాజకీయ బుద్ధి సూక్ష్మతకూ, అవసరమైతే రాజీపడే నేర్పుకూ గట్టి దెబ్బే తగిలింది. పరస్పర విరుద్ధ ఎన్నికల హామీ లిచ్చిన పార్టీల్ని సైతం కలుపుకొని, పంచకూట కషాయమైన సంకీర్ణ సర్కార్‌ను ఆయన ఏర్పాటుచేసి నిండా 4 నెలలైనా కాలేదు. న్యాయవ్యవస్థను తిరగదోడే పని ఆయన కొనసాగిస్తే ప్రజాగ్రహం తప్పదు. ఆపేస్తే సంకీర్ణంలో అతి మితవాద పక్షాలు వైదొలగుతాయి. ముందు నుయ్యి, వెనుక గొయ్యి. దీన్నెలా దాటతారన్న దాన్నిబట్టి ఆయన ఎంతకాలం పదవిలో ఉంటారో తేలుతుంది. వరుస సంక్షోభాలతో, గత నాలుగేళ్ళలో 5 సార్లు ఎన్నికలతో ఇజ్రాయెల్ రాజకీయ అని శ్చితితో సతమతమవుతోంది. మళ్ళీ వెంటనే మరో ఎన్నికను భరించలేని ఇజ్రాయెల్‌కూ, అక్కడి ప్రజాస్వా మ్యానికీ తాజా సంక్షోభం మరో అగ్నిపరీక్ష. కాకపోతే మూడు నెలలుగా లక్షలాది ప్రజలు వీధికెక్కి, తెలుపు – నీలం రంగుల జాతీయ పతకాన్ని చేబూని, నిరసన ప్రదర్శనలు చేస్తున్నా హింసాకాండ చెలరేగకపోవడం, చుక్క రక్తం చిందకపోవడం చెప్పుకోవాల్సిన విశేషం. జీవం తొణికిస లాడుతున్న ప్రజాస్వామ్యానికి సంకేతం. ఇప్పటికైతే ఇజ్రాయెల్ ప్రజలకు దక్కింది తాత్కాలిక విజయమే కావచ్చు. లక్షలాది జనం పార్లమెంట్ ముంగిట చేస్తున్న ‘డెమోక్రాషియా’ (ప్రజాస్వామ్యం) నినాదాలు, ప్రతిధ్వనిస్తున్న జెరూసలేమ్ వీధుల ప్రజాచేతన... ప్రపంచానికి ఆశాకిరణాలు. -
ఇజ్రాయెల్.. ‘సంస్కరణం’
నిరసనలు, ఆందోళనలు, సమ్మెలతో గత మూడు నెలలుగా ఇజ్రాయెల్ అట్టుడికిపోతోంది. దేశవ్యాప్తంగా వేలాది మంది జనం నిత్యం వీధుల్లోకి వస్తున్నారు. బెంజమిన్ నెతన్యాహూ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. కార్మికులు సమ్మె ప్రారంభించారు. న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడమే ఇందుకు కారణం. ఇవి గొప్ప సంస్కరణలని నెతన్యాహూ అనుకూల వర్గాలు ఊదరగొడుతున్నప్పటికీ ప్రజలు విశ్వసించడం లేదు. న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం తలపెట్టిన మార్పులు దేశ ప్రజాస్వామ్య పునాదులను కదిలిస్తాయని, తాము హక్కులు కోల్పోతామని వారు ఆరోపిస్తున్నారు. మార్పులకు వ్యతిరేకంగా గళమెత్తిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోయావ్ గల్లాంట్ను ఆదివారం హఠాత్తుగా పదవి నుంచి తొలగించడం మరింత అగ్గి రాజేస్తోంది. నెతన్యాహూ సర్కారు నియంతృత్వ ధోరణిపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం తలపెట్టిన మార్పులు, వాటిపై ప్రజల భయాందోళన వెనుక ఉన్న కారణాలు ఏమిటో తెలుసుకుందాం.. ఏమిటీ సంస్కరణలు ► 1948లో ఆవిర్భవించిన ఇజ్రాయెల్‌లో లిఖిత రాజ్యాంగం లేదు. ► నోటిమాటగా కొన్ని రాజ్యాంగ ప్రాథమిక చట్టాలు అమలవుతూ వస్తున్నాయి. ఈ చట్టాల ప్రకారం ఇజ్రాయెల్‌లో సుప్రీంకోర్టే శక్తివంతం. ► ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన ‘నేస్సెట్’పై నియంత్రణ అధికారం సుప్రీంకోర్టుకే ఉంది. ► నెతన్యాహూ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నకొత్త సంస్కరణల ప్రకారం మొత్తం న్యాయ వ్యవస్థపై పార్లమెంట్‌కే అధికారాలు ఉంటాయి. అంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలదే అసలు పెత్తనం. ► న్యాయమూర్తులను ఎలా నియమించాలి? ఎలాంటి చట్టాలు తీసుకురావాలి? అనేది పార్లమెంటే నిర్ణయిస్తుంది. అంతేకాదు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలల్లో మార్పులు చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంటుంది. ► ఇజ్రాయెల్ జ్యుడీషియరీలో ఇలాంటి భారీ మార్పులను ప్రతిపాదిస్తుండడం ఇదే మొదటిసారి. ► సుప్రీంకోర్టు అనేది ఇజ్రాయెల్ ప్రజలకు సంబంధం లేని గ్రూప్‌గా మారిపోయిందని నెతన్యాహూ మద్దతుదారులు వాదిస్తున్నారు. న్యాయస్థానం పరి ధి మీరి వ్యవహరిస్తోందని, సంబంధం లేని వ్యవహారాల్లో తలదూరుస్తోందని విమర్శిస్తున్నారు. ► ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రభుత్వంలో న్యాయస్థానం జోక్యం ఏమిటని వారు మండిపడుతున్నారు. ► అమెరికా లాంటి దేశాల్లో జడ్జీల నియామక వ్యవస్థను రాజకీయ నాయకులే నియంత్రిస్తారని నెతన్యాహూ గుర్తుచేస్తున్నారు. తద్వారా తన చర్యలను సమర్థించుకుంటున్నారు. ► ఇజ్రాయెల్‌లో జడ్జీలను నియమించే తొమ్మిది మంది సభ్యుల కమిటీలో మెజార్టీ సభ్యులు ప్రభుత్వ ప్రతినిధులే ఉండేలా ఆయన ఒక బిల్లును తీసుకొచ్చారు. ► పార్లమెంట్ చేసిన కొన్ని చట్టాలు చెల్లవంటూ సుప్రీంకోర్టు గతంలో తీర్పులు వెలువరించింది. అలాంటి చట్టాలను మళ్లీ ఆమోదించే అధికారం పార్లమెంట్‌కు ఉండాలని(ఓవర్‌రైడ్ క్లాజ్) నెతన్యాహూ ప్రతిపాదిస్తున్నారు. ► పదవిలో ఉన్న ప్రధానమంత్రిని కుర్చీ నుంచి దించేయాలంటే మంత్రివర్గంలో మూడింట రెండొంతుల మంది మద్దతు తప్పనిసరిగా ఉండాలన్నది మరో కీలక ప్రతిపాదన. ► శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా లేకపోతేనే ప్రధానమంత్రిని తొలగించాలని, ఇతర కారణాలతో కాదని ఇంకో ప్రతిపాదన చేశారు. నెతన్యాహూకు ప్రయోజనమేంటి? ► ప్రధానమంత్రి నెతన్యాహూపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. వాటిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆయనపై మోసం, లంచం తీసుకోవడం, విశ్వాస ఘాతుకానికి పాల్పడడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ► తాను ఏ తప్పూ చేయలేదని నెతన్యాహూ చెబుతున్నప్ప టికీ ఆయన పదవి నుంచి దిగిపోవాల్సిందేనని ప్రత్య ర్థులు డిమాండ్ చేస్తున్నారు. ► పదవిని కాపాడుకోవడానికే న్యాయ వ్యవస్థలో సంస్కరణల పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని ఆరోపిస్తున్నారు. ► అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న నెతన్యాహూ సుప్రీంకోర్టుతో ఓ ఒప్పందానికి వచ్చి ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఆయన ప్రభుత్వం తీసుకొనే విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి కాకూడదు. కానీ, న్యాయ వ్యవస్థలో సంస్కరణలంటూ విధానపరమైన నిర్ణయంతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందున ప్రధానిగా ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలంటూ ఇజ్రాయెల్ అటార్నీ జనరల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి ఏం జరగొచ్చు? జ్యుడీషియరీలో మార్పుల ప్రతిపాదనలను ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తీసుకొనేదాకా పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రజలు తేల్చిచెబుతున్నారు. పోరాటం మరింత ఉధృతం చేస్తామని అంటున్నారు. ప్రజలు తమను ఎన్నుకున్నది చట్టాలు చేయడానికేనని ప్రభుత్వం చెబుతుండడం ఆసక్తికరంగా మారింది. న్యాయ వ్యవస్థలో సంస్కరణలకు ప్రజామోదం లభించిందని నెతన్యాహూ అనుచరులు పేర్కొంటున్నారు. అయితే జనాందోళనకు తలొగ్గి, సంస్కరణలను నెలపాటు వాయిదా వేస్తున్నట్టు నెతన్యాహూ తాజాగా ప్రకటించారు. మరోవైపు ఈ ఉదంతంతో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోందని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు. అంతర్గత సంఘర్షణ నెలకొనే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు. ప్రత్యర్థుల అభ్యంతరాలు జడ్జీలను నియమించే అధికారం నెతన్యాహూ, ఆయన మిత్రుల చేతుల్లో ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు తప్పదని ప్రత్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుకూలంగా పనిచేసే జడ్జీలను నియమించుకొని, అవినీతికి సంబంధించిన కేసుల నుంచి బయటపడి, అధికారంలో సుదీర్ఘ కాలం కొనసాగాలన్నదే నెతన్యాహూ ఎత్తుగడ అని ఆరోపిస్తున్నారు. న్యాయ వ్యవస్థ సర్వ స్వతంత్రంగా పనిచేయాలని, అందులో ఇతరుల పాత్ర ఉండరాదని నెతన్యాహూ గతంలో గట్టిగా వాదించారు. ఇండిపెండెంట్ జ్యుడీషియరీకి మద్దతు పలికారు. ఇప్పుడు స్వప్రయోజనాల కోసం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రత్యర్థులు ఆక్షేపిస్తున్నారు. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే హద్దుల్లేని, నియంత్రణ లేని న్యాయ వ్యవస్థ కాదని నెతన్యాహూ తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రజలకు నష్టమే! ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థ బలహీనపడితే కేవలం ఇజ్రాయెల్ పౌరులకే కాదు, పాలస్తీనా ప్రజలకు సైతం నష్టమేనని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న వెస్ట్‌బ్యాంక్‌లో పెద్ద సంఖ్యలో పాలస్తీనా పౌరులు ఉన్నారు. వారికి రెసిడెన్సీ కార్డులు ఉన్నాయి. హక్కులకు విఘాతం కలిగినప్పుడు, ప్రభుత్వం నుంచి వేధింపులు పెరిగినప్పుడు, ప్రమాదంలో ఉన్నామని భావించినప్పుడు ప్రజలు ఇకపై కోర్టులను ఆశ్రయించలేరని, ఒకవేళ కోర్టుకెళ్లినా న్యాయం జరుగుతుందన్న భరోసా ఉండదని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం చెప్పినట్లే కోర్టులు ఆడాల్సి ఉంటుందని, అవి ప్రజలకు రక్షణ కల్పించలేవని అభిప్రాయపడుతున్నారు. కోర్టులపై రాజకీయ నాయకుల పెత్తనం మొదలైతే ఇజ్రాయెల్‌లోని మైనార్టీల హక్కులకు, జీవితాలకు రక్షణ ఉండదని అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇజ్రాయెల్‌లో నిరసన జ్వాల.. ప్రధాని నెతన్యాహూ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో వేలాది మంది ప్రజలు నిరసనబాట పట్టారు. న్యాయవ్యవస్థలో సంస్కరణల పేరుతో తనను తాను కాపాడుకోవాలని చూస్తున్న ప్రధాని బెంజిమన్ నేతన్యాహూకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. సంస్కరణలు ఆపాలని కోరిన రక్షణమంత్రి యోవ్ గ్యాలంట్ను నెతన్యాహు పదవి నుంచి తప్పించిన మరునాడే జనం రోడ్లెక్కి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ జెండాలు పట్టుకుని అనేక మంది భారీ ర్యాలీగా ఆందోళనల్లో పాల్గొని తమ గళం వినిపించారు. జెరూసలేంలోని నెతన్యాహు నివాసం సమీపానికి చేరుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, సైనికులు వారిపై భాష్పవాయువు గోళాలు ప్రయోగించి చెదరగొట్టారు. Massive protests in Israel against PM Netanyahu’s judicial reforms ie; 1. Method of appointment of judges 2. Restrict court's ability to cancel laws passed by Israel govt. White House however urges a compromise as Israeli consul general in NY quits. pic.twitter.com/xNVILEYhbD — The Poll Lady (@ThePollLady) March 27, 2023 ఇజ్రాయెల్ ప్రభుత్వానికి, న్యాయమూర్తులకు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. దీంతో ఓ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నెతన్యాహూ జైలు శిక్ష పడకుండా తనను తాను కాపాడుకునేందుకు న్యాయవ్యవస్థలో సంస్కరణల పేరుతో మార్పులు చేయాలనుకుంటున్నారు. జడ్జీల నియామకం, ప్రభుత్వం ఆమోదించిన చట్టాలను రద్దు చేసే అధికారాన్ని కోర్టులకు తొలగించడం వంటి వివాదాస్పద నిర్ణయాలు ఈసంస్కరణల్లో ఉన్నాయి. వీటిని అమలు చేయొద్దని చెప్పిన రక్షణమంత్రిని కూడా నెతన్యాహూ పదవి నుంచి తొలగించారు. దీంతో రక్షణమంత్రికి మద్దతుగా, న్యాయవ్యవస్థలో సంస్కరణలకు వ్యతిరేకంగా లక్షలాది మంది పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. రోడ్లు, వీధుల్లో జెండాలు పట్టుకుని నిరసన తెలియజేశారు. Protest in Tel Aviv - Israel has moved to an intense stage of protests after Netanyahu’s sacking of the defense minister. pic.twitter.com/z6P45VlmV4 — Ashok Swain (@ashoswai) March 26, 2023 విమాన సేవలు నిలిపివేత.. ఆందోళనలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాన ఎయిర్‌పోర్టులో విమాన సేవలు నిలిపివేశారు అధికారులు. ఎయిర్ పోర్టు వర్కర్క్ యూనియన్ సోమవారం సమ్మెకు పిలుపునివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ అతిపెద్ద ట్రేడ్ యూనియన్ సమ్మెకు దిగడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. చదవండి: జనాభా పెరుగుదల కోసం ఆ దేశం పాట్లు.. నిబంధనను బ్రేక్ చేసి మరీ.. -
ఐటీ ఉద్యోగుల్లో కొత్త భయాలు..ఇంతకీ ఐటీ రంగంలో ఏం జరుగుతోంది?
ఉక్రెయిన్ యుద్ధం, ధరల మంట, ఆర్ధిక మాంద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ కంపెనీల్లో సంక్షోభం నెలకొంది. ఆ సంక్షోభం సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (svb) మూసివేతతో మరింత తీవ్రతరమైనట్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలో ఎస్వీబీని షట్‌డౌన్ చేస్తున్నట్లు రెగ్యులేటరీ ప్రకటించిన నాటి నుంచి ఇజ్రాయిల్‌కు చెందిన టెక్ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపిన బెంజిమన్.. టెక్నాలజీ రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు.‘మేం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నాం. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూసి వేత..టెక్నాలజీ వరల్డ్‌ను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుంది’ అని ట్వీట్ చేశారు. అవసరం అయితే తమ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెక్ కంపెనీలకు, ఉద్యోగులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. ఇజ్రాయిల్ కేంద్రంగా ప్రధాన టెక్ కంపెనీలపై ఎస్వీబీ ప్రభావం పడితే.. ఆ అలజడిని నుంచి రక్షించేందుకు సిద్ధమని అన్నారు. మరోవైపు ప్రపంచ దేశాల్లో టెక్ కంపెనీలను ఎస్వీబీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నేపథ్యంలో బెంజిన్ రోమ్‌లో పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచే తాజా పరిస్థితులపై టెక్నాలజీ నిపుణులతో మాట్లాడారు. రోమ్ నుంచి స్వదేశానికి వచ్చిన వెంటనే అమెరికన్ దిగ్గజ బ్యాంక్ దివాళాతో దేశీయ టెక్ కంపెనీలపై ఎంత మేరకు ప్రభావం చూపనుందనే విషయంపై ఫైనాన్స్, ఆర్ధిక మంత్రిత్వ శాఖలు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌తో చర్చిస్తామని ఇజ్రాయిల్ ప్రధాని ట్వీట్లో చెప్పారు. కొంపముంచుతున్న ఎస్వీబీ బాగోతం ఇక మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు ఇప్పటికే ఆర్ధిక మాంద్యం దెబ్బకు కుదేలైన ఐటీ రంగం ఉక్కిరి బిక్కిరి అవుతుంటే.. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూసివేత ఆయా దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా అమెరికన్ దిగ్గజ బ్యాంక్‌తో లావాదేవీలు నిర్వహిస్తున్న అమెరికా, యూకే, ఇజ్రాయిల్‌తో పాటు మరిన్ని దేశాలకు చెందిన టెక్ కంపెనీలు ఈ విపత్తు నుంచి బయటపడేందుకు ముందస్తు చర్యలకు ఉపక్రమించగా.. ఐటీ రంగంలో అసలేం జరుగుతోంది అంటూ ప్రపంచవ్యాప్తంగా మరో సారి చర్చ మొదలైంది ఐటీ రంగంలో ఏం జరుగుతోంది ఇప్పటికే ఖర్చుల్ని తగ్గించుకునేందుకు దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని బలవంతంగా ఇంటికి సాగనంపుతున్నాయి. ఏ మాత్రం లాభదాయకం లేదని అనిపిస్తే మూసేస్తున్నాయి. ట్విటర్లాంటి సంస్థల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కార్యాలయాల్లో నిరుపయోగంగా ఉన్న ఫర్నీచర్ తో పాటు ఇతర వస్తువుల్ని అమ్మి పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. తాజాగా ఎస్వీబీ బ్యాంక్ మూసివేతతో ఐటి రంగం మరింత సంక్షోభం తప్పదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
న్యాయం’పై నెతన్యాహూ కక్ష
అంతా అనుకున్నట్టే అయింది. గత నవంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించి డిసెంబర్లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ న్యాయవ్యవస్థపై కత్తిగట్టారు. ఆ వ్యవస్థలో సంస్కరణల పేరిట దాని అధికారాలు తెగ్గోసేందుకు సిద్ధపడ్డారు. కొన్ని నెలలక్రితం నెతన్యాహూ నాయకత్వంలోని లికుడ్ పార్టీకి ఎగబడి ఓట్లేసిన జనమే ఇప్పుడు న్యాయవ్యవస్థ రక్షణ కోసం వీధుల్లోకొచ్చారు. పార్లమెంటు వెలుపల అయి దారు రోజులుగా ఎడతెగకుండా నిరసన ప్రదర్శనలు సాగుతున్నాయి. వీటన్నిటినీ బేఖాతరు చేస్తూ చట్టసభలో న్యాయసంస్కరణల బిల్లు ప్రాథమిక స్థాయిలో విజయం సాధించింది. సోమవారం రాత్రి జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 63 ఓట్లు, వ్యతిరేకంగా 47 వచ్చాయి. నెతన్యాహూ నేతృత్వంలోని అతి మితవాద, మత, ఛాందసవాద కూటమి ప్రభుత్వం పార్లమెంటులోని 120 స్థానాల్లో 64 గెల్చుకుంది. రాగల నెలల్లో న్యాయ సంస్కరణల బిల్లు మరో రెండు దశలు దాటాలి గనుక ఇప్పటికిప్పుడే అంతా అయిపోయినట్టు కాదు. అయితే అధికార కూటమి వరస చూస్తుంటే ఏదేమైనా చట్టం చేసితీరాలన్న పట్టుదల కనిపిస్తోంది. ప్రచార సమయంలోనే నెతన్యాహూ తాము అధికారంలోకొస్తే న్యాయవ్యవస్థను సమూల ప్రక్షాళన చేస్తామని ఒకటికి పదిసార్లు ప్రకటించారు. దేశ శ్రేయస్సు కోసం చట్టాలు చేస్తుంటే సుప్రీంకోర్టు కొట్టివేస్తున్నదని, ఇందువల్ల దేశ భద్రత ప్రమాదంలో పడుతోందని ఆయన భావన. అంతే కాదు... న్యాయవ్యవస్థ నియామకాల్లో ప్రభుత్వా నిది పైచేయిగా ఉండాలన్నది ఆయన కోరిక. నెతన్యాహూ సుభాషితాల వెనకున్న అంతరార్థం వేరు. ఆ వ్యవస్థ తమకు సాగిలపడివుండాలన్నదే ఆయన మాటల్లోని సారాంశం. తాజా బిల్లు చట్టమైతే సుప్రీంకోర్టు కొట్టేసిన నిర్ణయాన్ని పార్లమెంటు తిరగదోడొచ్చు. కనీస మెజారిటీతో...అంటే పార్లమెంటులోని 120 మంది సభ్యుల్లో 61 మంది కాదంటే సుప్రీంకోర్టు తీర్పును రద్దుచేయొచ్చు. దేశ రాజ్యాంగంగా ఉండే మౌలిక చట్టంలోని అంశాలను సమీక్షించే అధికారాన్ని సుప్రీంకోర్టునుంచి తొలగించటం మరో ప్రతిపాదన. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో రాజకీయ వర్గానిదే పైచేయి కావడం మూడో ప్రతిపాదన. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు సభ్యులుగా ఉండే నియామకాల కమి షన్ పనిచేస్తోంది. ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించటం ఆనవాయితీగా వస్తున్నా న్యాయవ్యవస్థ ప్రతినిధుల ఆధిక్యత ఉన్నందువల్ల చాలాసార్లు ఆ వ్యవస్థ నిర్ణయమే అంతిమంగా అమలవుతోంది. ఇప్పుడు చేసిన ప్రతిపాదన దాన్ని తారుమారు చేస్తుంది. అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న అతి ఛాందసవాద యూదు పార్టీలు తమ మతంలోని యువకులను నిర్బంధ సైనిక శిక్షణనుంచి తప్పించాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఆ చట్టం తీసుకొస్తే సమాన న్యాయం పేరిట సుప్రీంకోర్టు కొట్టేస్తుందన్న భయాందోళనలు ఆ పార్టీలకున్నాయి. అందుకే ఆ పార్టీలు గట్టిగా మద్దతునిస్తున్నాయి. మరో కీలకమైనది పాలస్తీనా సమస్య. పాలస్తీనా పౌరులను ఎంతగా ఇబ్బంది పెడితే అంతగా యూదుల్లో తమకు మద్దతు పెరుగుతుందని దాదాపు అన్ని పార్టీలూ భావిస్తాయి. యూదుల్లో జాతీయ భావాల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటం వాటికి అలవాటుగా మారింది. ఒకపక్క ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ వైదొలగాలన్న డిమాండ్ ప్రపంచ దేశాలన్నిటి నుంచీ వస్తుంటే ఆ ఆక్రమణలను మరింత పెంచుకోవటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పాలక పక్షాలు పని చేస్తున్నాయి. అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారం ఈ ఆక్రమణలు చట్టవిరుద్ధమైనవి. అయినా అవి ఉన్నకొద్దీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం వెస్ట్‌బ్యాంకు, తూర్పు జెరూసలెంలలో ఆక్రమిత భూభాగాల్లో దాదాపు ఏడున్నర లక్షలమంది ఇజ్రాయెల్ పౌరుల ఆవాసాలున్నాయి. వీటిని మరింత పెంచుకోవాలంటే సుప్రీంకోర్టు అడ్డంకిని తొలగించుకోవాలని నెతన్యాహూ కోరుకుంటున్నారు. న్యాయసంస్కరణల బిల్లుకు జనంలో పెద్దయెత్తున వ్యతిరేకత రావటం చూసి దేశాధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ ఈ బిల్లుపై విపక్షాలతో చర్చించాకే తదుపరి చర్యలుండాలని హితవు పలికారు. అయితే నెతన్యాహూకు ఇది రుచించలేదు. విపక్షాలతో చర్చలకు సిద్ధమే అయినా చట్టం తీసుకురావటం ఖాయమని న్యాయశాఖ మంత్రి చెప్పారంటేనే ప్రభుత్వ సంకల్పం ఏమిటో అర్ధమవుతోంది. ఇప్ప టికే మూడు అవినీతి ఆరోపణల్లో విచారణ ఎదుర్కొంటున్న నెతన్యాహూ శిక్షపడే ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి ఈ బిల్లును తెచ్చారన్నది విపక్షాల ప్రధాన ఆరోపణఇజ్రాయెల్కు నిర్దిష్టమైన రాజ్యాంగం లేదు. ఫెడరల్ వ్యవస్థ లేదు. దేశానికంతకూ ప్రాతినిధ్యంవహించే పార్లమెంటు నిర్ణయమే అంతిమం. ఇందువల్ల పార్లమెంటులో బలాబలాలే అన్నిటినీ నిర్ణయిస్తాయి. ఈ స్థితిలో కార్యనిర్వాహక వ్యవస్థ నిర్ణయాలను సమీక్షించి సమతుల్యత సాధించే మరో వ్యవస్థ ఎంతో అవసరం. ఆ పాత్రను సుప్రీంకోర్టు సమర్థవంతంగా పోషిస్తోంది. దేశ జనాభా 90 లక్షలమందిలో అయిదోవంతుమంది అరబ్బులు. మరో 30 లక్షలమంది పాలస్తీనా పౌరులు వెస్ట్‌బ్యాంక్‌లో నివసిస్తున్నారు. వీరందరి ప్రయోజనాలనూ, శ్రేయస్సునూ దృష్టిలో ఉంచుకుని నిర్ణ యాలు చేయాల్సిన నేపథ్యంలో మెజారిటీవాదమే చెల్లుబాటు కావాలనుకోవటం ఆత్మహత్యాసదృశమవుతుంది. స్వప్రయోజనాల కోసం దేశాన్నే పణంగా పెట్టిన నేతగా చరిత్రలో నిలుస్తారో, జనాభి ప్రాయానికి తలొగ్గుతారో నెతన్యాహూ తేల్చుకోక తప్పదు. -
యూదుల ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి..
జెరూసలెం: ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెంలోని యూదుల ప్రార్థనా మందిరంపై ఉగ్రవాది దాడికి తెగబడ్డాడు. కన్పించిన వారిపై బుల్లెట్లు వర్షం కురిపించాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. తూటాలు తగిలి మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. నివె యాకోవ్ బోలెవార్డ్‌లో జరిగిన ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తుపాకీతో ఉన్న ఉగ్రవాదిని కాల్చి చంపారు. అతను తీసుకొచ్చిన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇది అత్యంత తీవ్రమైన ఉగ్రచర్య అని అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో ఇలాంటి భయానక ఘటన జరగలేదన్నారు. నిందితుడ్ని పాలస్తీనాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంబరాలు.. మరోవైపు ఈ దాడిని పాలస్తీనా ఉగ్రసంస్థలు ప్రశంసించాయి. కానీ ఇది తమ పని కాదని పేర్కొన్నాయి. కొన్ని చోట్ల పాలస్తీనా ప్రజలు ఈ ఘటనను సంబరంగా జరుపుకొన్నారు. మిఠాయిలు పంచి, ర్యాలీలు చేశారు. చదవండి: నన్ను చంపించేందుకు జర్దారీ కుట్ర: ఇమ్రాన్ -
నెతన్యాహుకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దంపతులను కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్‌కు ఎంపికచేసింది. ఇజ్రాయెల్‌లో నెతన్యాహు స్నేహితురాలు, భారతీయ మూలాలున్న మహిళా పారిశ్రామికవేత్త రీనా వినోద్ పుష్కామాతోపాటు మరికొందరిని ఈ అవార్డ్‌కు ఎంపికచేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈనెల 8 నుంచి జరిగే ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్లో వీరికి అవార్డులను ప్రదానంచేస్తారు. సంగీత విభావరి నిర్వాహకులు జుబెన్ మెహతా, నటి సోఫియా లోరెన్, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఐజాక్ రాబిన్, మాజీ అధ్యక్షుడు, ప్రధాని షిమోన్ పెరీస్‌సహా ఈ ఏడాది 21 మందిని ఈ అవార్డుతో సత్కరించనున్నారు. ఇదీ చదవండి: ఢిల్లీ దారుణం: వెలుగులోకి మరిన్ని నివ్వెరపరిచే నిజాలు -
ఇజ్రాయెల్ ప్రధానిగా నెతన్యాహూ
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (73)కు చెందిన లికడ్ పార్టీ ఆధ్వర్యంలోని సంకీర్ణ కూటమి విజయం సాధించింది. దాంతో, రికార్డు స్థాయిలో 15 ఏళ్లకుగా పైగా ప్రధానిగా చేసిన ఆయన మరోసారి పగ్గాలు చేపట్టనున్నారు. 120 స్థానాలున్న పార్లమెంటులో 64 స్థానాలతో లికడ్ కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఫలితాలను నవంబర్ 9న ధ్రువీకరిస్తారు. ప్రధాని లపిడ్ ఓటమి అంగీకరించారు. నెతన్యాహూకు ఫోన్ చేసి అభినందించారు. ఇజ్రాయెల్, పాలస్తీనా రాకెట్ దాడులు ఎన్నికల ఫలితాల వేళ పాలస్తీనాలోని గాజా నుంచి ఇజ్రాయెల్‌పైకి నాలుగు రాకెట్లను ప్రయోగించారు. మూడు లక్ష్యం చేరలేదు. ఒకదాన్ని ఇజ్రాయెల్ గాల్లోనే పేల్చేసింది. అంతేగాక ప్రతిదాడులతో గట్టిగా బదులిచ్చింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గాజాలో హమాస్ గ్రూప్ రహస్యంగా నిర్వహిస్తున్న రాకెట్ ఫ్యాక్టరీని ధ్వంసం చేశాయి. -
ఇజ్రాయెల్ పయనం ఎటు?
సర్వేల జోస్యాన్ని నిజం చేస్తూ ఇజ్రాయెల్ ఎన్నికల్లో లికుడ్ పార్టీ నేతృత్వంలోని అతి మితవాద, మత, ఛాందసవాద పార్టీల కూటమి ఘనవిజయం సాధించింది. ఆ కూటమి 120 స్థానాలున్న పార్లమెంటులో 64 గెల్చుకుని సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు మొదలెట్టింది. ఈ నెల 1న జరిగిన ఈ ఎన్నికలు మితవాద పక్షాలకు దేశ చరిత్రలో తొలిసారి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకామిచ్చాయి. అవినీతి ఆరోపణల్లో విచారణ నెదుర్కుంటూ రాజకీయంగా మసకబారుతున్న విపక్ష లికుడ్ పార్టీ అధినేత, మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను ఈ ఫలితాలు తిరుగులేని నేతగా స్థిరపరిచాయి. నాలుగేళ్లకోసారి జరగాల్సిన పార్లమెంటు ఎన్నికలు అస్థిర రాజకీయాల కార ణంగా మూడున్నరేళ్లలో అయిదోసారి వచ్చిపడటంతో దేశ పౌరులు విసుగుచెందారనీ, పరస్పరం పొసగని పక్షాలున్న కూటమిని నమ్ముకోవటం కంటే పక్కా మితవాదంవైపు పోవటమే సరైందన్న నిర్ణయానికొచ్చారనీ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు గద్దె దిగబోతున్న మధ్యేవాద కుడి, ఎడమ పక్షాలు, అరబ్‌ల పార్టీల కూటమి ప్రభుత్వం దేశంలో సామరస్యత నెలకొల్పడం మాట అటుంచి మెరుగైన ఆర్థికాభివృద్ధికి దోహదపడే చర్యలు తీసుకోలేకపోయింది. ద్రవ్యోల్బణాన్ని, నిరుద్యోగాన్ని అరికట్టలేకపోయింది. అందుకే ఆ కూటమి 51 సీట్లకు పరిమితమైంది. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో పదవీభ్రష్టుడైన నెతన్యాహూ ఆ కూటమి వైఫల్యాలను పూర్తిగా తనకనుకూలంగా మార్చు కోగలిగారు. జియోనిస్టు పార్టీ, మరో రెండు తీవ్ర ఛాందసవాద పక్షాలనూ కలుపుకొని కూటమి కట్టారు. మూడు దశాబ్దాలుగా పార్లమెంటులో చెప్పుకోదగ్గ స్థానాలతో వెలిగిన వామపక్షం మెరెట్జ్ ఈసారి కొన్ని వేల ఓట్లకే పరిమితమై చట్టసభకు వెలుపలే ఉండిపోయింది. సమస్యల మాటెలా ఉన్నా మితవాద కూటమి అధికారం మెట్లెక్కడంలో మీడియా ప్రధాన పాత్ర పోషించింది. జియోనిస్టు పార్టీ నేత బెన్ గవీర్కు అపరిమితమైన ప్రచారమిచ్చి ఆయన పార్టీ దూసుకుపోయేందుకు దోహదపడింది. ఈ ప్రచారం ఏ స్థాయిలో సాగిందంటే ఆయనతో కూటమి కట్టి లాభపడిన నెతన్యాహూ సైతం అది మోతాదు మించిందని అంగీకరించాల్సి వచ్చింది. ఇదిగాక వాట్సాప్, టెలిగ్రాం యాప్‌లలో వందకుపైగా గ్రూపులు ఏర్పాటుచేసి బెన్ గవీర్ స్వీయ ప్రచారంతో హోరెత్తించారు. ఎప్పటికైనా ప్రజా భద్రతా మంత్రినవుతానని బెన్ గవీర్ నిరుడు జోస్యం చెప్పిన ప్పుడు ఆ పదవికి ఆయన పనికిరాడని నెతన్యాహూ అభిప్రాయపడ్డారు. తీరా రాజకీయ అవసరాల రీత్యా అదే పార్టీతో కూటమి కట్టక తప్పలేదు. ఇప్పుడాయనను మంత్రిని చేసి, ప్రజా భద్రత శాఖ అప్పగించినా ఆశ్చర్యం లేదు. స్వదేశంలోనే యూదులకు రక్షణ కరువైందనీ, ఉగ్రవాదులు ఏ నిబంధనలకూ లోబడకుండా దాడులు చేస్తుంటే వారిపై పోరాడే సైనికులకు నిబంధనలు సంకెళ్లుగా మారుతున్నాయనీ బెన్ గవీర్ తరచు వాపోయేవారు. ఈ మాదిరి ఉపన్యాసాలు యూదుల్ని బాగా ఆకట్టుకున్నాయి. పైగా 1994లో ఒక మసీదులో తలదాచుకున్న 29 మంది పాలస్తీనా పౌరులను ఊచకోత కోసిన బరూక్ గోల్డ్స్టీన్ను ఆయన తన ఆరాధ్యదైవంగా చెప్పుకుంటారు. సంక్షోభం ఆవరించిన సమాజంలో ఉద్రేకపూరిత ఉపన్యాసాలు జనాన్ని ప్రభావితం చేస్తాయి. బెన్ గవీర్ ఆ పని సమర్థవంతంగా చేయగలిగారు. మధ్యేవాద మితవాద పక్షం యామినా పార్టీ అరబ్పార్టీలున్న కూటమికి నేతృత్వం వహించటం యూదులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో మెజారిటీ యూదులు అతి మితవాద పక్షమైన లికుడ్ పార్టీకి, ఛాందసవాద జియోనిస్టు పార్టీకి వలస పోయారు. విభేదాలున్నా కలిసి పనిచేద్దామని, దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు మెరుగైన పరి ష్కారం చూపుదామని జతకట్టిన ఎనిమిది పక్షాల కూటమి ప్రభుత్వం నడపటంలో, ఆర్థిక సమస్య లను అరికట్టడంలో వైఫల్యాలే చవిచూసింది. అంతర్గత పోరుతో సతమతమైంది. ఇప్పుడు గద్దెనెక్కబోతున్న కూటమిలోని జియోనిస్టు పార్టీ ప్రతిపాదనలు సామాన్యమైనవి కాదు. న్యాయవ్యవస్థను సమూల ప్రక్షాళన చేయాలన్నది దాని ప్రధాన డిమాండ్. పార్లమెంటు చేస్తున్న చట్టాలను సుప్రీంకోర్టు ఇష్టానుసారం కొట్టివేస్తున్నదనీ, ఇది దేశ భద్రతకు చేటు తెస్తున్నదనీ ఆ పార్టీ చాన్నాళ్లుగా ఆరోపిస్తోంది. దీన్ని నిజంగా అమలు చేయటం మొదలుపెడితే న్యాయవ్యవస్థ బలహీనపడుతుందనీ, న్యాయమూర్తుల నియామకంలో రాజకీయ పక్షాలదే పైచేయి అవుతుందనీ చాలామంది కలవరపడుతున్నారు. ఇప్పటికే మూడు అవినీతి ఆరోపణల్లో విచారణను ఎదుర్కో బోతున్న నెతన్యాహూకు ఇది తోడ్పడుతుందని వారి భావన. అన్ని స్థాయుల్లోనూ ఎక్కడికక్కడ వ్యవస్థాగతమైన నిఘా ఉన్నప్పుడే, దిద్దుబాటు చర్యలు తీసుకున్నప్పుడే వ్యవస్థ సక్రమంగా కొనసాగుతుంది. తిరుగులేని అధికారం చలాయించే నేతకు అది సాగిలపడితే సర్వం అస్తవ్యస్థ మవుతుంది. పరోక్షంగా తనకు లాభదాయకమైన ప్రతిపాదన చేస్తున్నారన్న ఉబలాటంతో బెన్ గవీర్ను రాజకీయంగా అదుపు చేయటంలో నెతన్యాహూ విఫలమైతే... పాలస్తీనాపై తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే దీర్ఘకాలంగా అండదండలందిస్తున్న అమెరికా సైతం వర్తమాన అంత ర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇరకాటంలో పడుతుంది. దాన్నుంచి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు లభించవు. అంతిమంగా ఏ దేశ పౌరులైనా సామరస్యతనూ, ప్రశాంతతనూ, ఆర్థిక సుస్థిరతనూ కోరుకుంటారు. ఇవన్నీ సుసాధ్యం చేసినప్పుడే నెతన్యాహూకు యూదుల నిజమైన ఆదరణ దొరకుతుంది. -
చారిత్రక విజయం దిశగా నెతన్యాహు పార్టీ
జెరుసలేం: ఇజ్రాయెల్‌లో తాజా ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(73) సారథ్యంలోని సంకీర్ణ కూటమి చరిత్రాత్మక విజయం దిశగా సాగుతోంది. వామపక్ష మెరెట్జ్ పార్టీ గట్టి పోటీ ఇస్తున్నా 85 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికే 120 మంది సభ్యుల పార్లమెంట్లో 65 సీట్లు నెతన్యాహు కూటమికి దక్కేలా కనిపిస్తున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాక గత నాలుగేళ్లలో దేశంలో ఏకంగా ఐదుసార్లు ఎన్నికలు జరిగాయి. తాజా ఫలితాలతో రాజకీయ సందిగ్ధానికి తెరపడనుంది. నెతన్యాహు కూటమికి 65 వరకు సీట్లు దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్‌లోనూ వెల్లడైంది. ఈ కూటమిలో నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ, యూదు మతవాద పార్టీలు ఉన్నాయి. -
ఇజ్రాయెల్‌లో మళ్లీ ఎన్నికలు!
గాల్లో దీపం మాదిరి మినుకు మినుకుమంటూ ఎప్పుడేమవుతుందోనన్న సంశయాల మధ్యే నెట్టుకొస్తున్న ఇజ్రాయెల్ ప్రభుత్వం చిట్టచివరకు కుప్పకూలింది. పార్లమెంటు కెన్సెట్ను రద్దు చేయాలని ఆ చట్టసభ గురువారం ఏకగ్రీవంగా తీర్మానించడంతో దాదాపు నాలుగేళ్ల వ్యవధిలో అయిదోసారి ఆ దేశంలో సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. వచ్చే నవంబర్ 1న ఈ ఎన్నికలుంటాయి. చట్టసభల్లో బలాబలాలతో నిమిత్తం లేకుండానే, ఎన్నికల బెడద రాకుండానే రాష్ట్ర ప్రభుత్వాల ఉత్థానపతనాలు రివాజైపోయిన మన దేశంలో ఇజ్రాయెల్ పరిణామాలు సహజంగానే ఆసక్తి రేకెత్తిస్తాయి. నిబంధనల ప్రకారమైతే పార్లమెంటు కాల వ్యవధి నాలుగేళ్లు. లికుడ్ పార్టీ అధినేత, మితవాది అయిన బెంజమిన్ నెతన్యాహూ వరసగా మూడు దఫాలు ఎన్నికై, ఇతర పార్టీల సహకారంతో పన్నెండేళ్లపాటు అధికారం నిలబెట్టుకుని రికార్డు సృష్టించారు. అయితే 2019 ఏప్రిల్ ఎన్నికల నాటినుంచీ దేశంలో అస్థిరత తప్పడం లేదు. 120 మంది సభ్యులుండే పార్లమెంటులో కనీస మెజారిటీ 61 ఎవరికీ రాలేదు. దాంతో పొసగని పార్టీలు కూటములుగా ఏర్పడి ప్రభుత్వాలు ఏర్పాటు చేయక తప్పలేదు. 2018 నుంచి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని స్థితి ఏర్పడింది. నెతన్యాహూ ఎప్పటికప్పుడు అనామతు ఖాతాలతో నెట్టుకొచ్చారు. చివరకు ఆయనపై అవినీతి ఆరోపణలు రావడం, వాటికి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించడంతో నెతన్యాహూ అధికారం నుంచి వైదొలిగారు. నిరుడు జూన్‌లో ఎన్నికల అనంతరం ప్రధానిగా ప్రమాణం చేసిన నఫ్తాలీ బెనెట్ పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పించారు. అయితే కూటమిలోని వివిధ పక్షాలను సంతృప్తి పరిచేందుకు రాజీపడటం స్వపక్షమైన యామినా పార్టీలో ముసలం పుట్టించింది. ఆ పార్టీ ఎంపీ గత ఏప్రిల్‌లో రాజీనామా చేశారు. పర్యవసానంగా బెనెట్ ప్రభుత్వం కొన ఊపిరితో సాగుతోంది. సైద్ధాంతిక సారూప్యతలేని పార్టీలు అధికారం కోసమే దగ్గరైనప్పుడు విభేదాలు తప్పవు. కలిసి పనిచేసే క్రమంలో కొన్నిసార్లు పరస్పర అవగాహన ఏర్పడుతుందనీ, ఆ పార్టీల వైఖరుల్లో మార్పు వస్తుందనీ కొందరి వాదన. కానీ నిలువునా చీలిన ఇజ్రాయెల్ సమాజంలో అది సాధ్యపడలేదు. అధికార కూటమిలో ఎనిమిది పార్టీలుండగా అందులో మధ్యేవాద, కుడి, ఎడమ పక్షాలతోపాటు స్వతంత్ర అరబ్ పక్షం రాహంబా పార్టీ కూడా ఉంది. అరబ్బులకు ప్రాతినిధ్యం వహించే పార్టీల్లో ఒకటి పాలనలో భాగస్వామ్యం తీసుకోవడం ఇజ్రాయెల్ చరిత్రలో అదే తొలిసారి. అందువల్లే ఈ కూటమిపై మొదట్లో అందరూ ఆశలు పెట్టుకున్నారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలకు పరి ష్కారం దొరుకుతుందనుకున్నారు. కానీ యూదులకూ, పాలస్తీనా ప్రాంత ప్రజలకూ మధ్య విద్వే షాలు రేకెత్తించడంలోనే దశాబ్దాలుగా మనుగడ వెదుక్కునే పార్టీల పుణ్యమా అని ఈ ప్రయోగం బెడిసికొట్టింది. నెతన్యాహూపై అవినీతిపరుడన్న ముద్ర ఉన్నా ఆయన్ను పదవీచ్యుతుణ్ణి చేయ డానికి ఒక అరబ్ పక్షం ప్రయత్నించి విజయం సాధించిందన్న వాస్తవాన్ని ఇజ్రాయెల్ సమాజం జీర్ణించుకోలేకపోయింది. అందుకే వారితో చేతులు కలిపి అధికారంలో కొనసాగిన మితవాద పక్షం యామినా పార్టీకి పౌరుల్లో పరపతి అడుగంటింది. రాబోయే ఎన్నికల్లో నెతన్యాహూను సమర్థించే మితవాద పక్షాలకు అధిక స్థానాలు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. అంతో ఇంతో వామపక్షాల వైపు సానుభూతిగా ఉండేవారు సైతం ఈసారి మితవాదంవైపు మొగ్గుచూపుతున్నారని సర్వేలంటు న్నాయి. ఈ సర్వేల విశ్వసనీయత సంగతలావుంచి ఇజ్రాయెల్ దురాక్రమణలో ఉన్న వెస్ట్‌బ్యాంక్‌లో అయిదు లక్షలమంది యూదులకు 120 ఆవాసాలు ఏర్పరిచారు. అక్కడున్న 30 లక్షలమంది పాల స్తీనా పౌరులు ఈ విషయంలో ఆగ్రహంతో ఉన్నారు. ఆ కాలనీలను ఇజ్రాయెల్‌లో విలీనం చేసేం దుకు మొన్న ఏప్రిల్‌లో అధికార కూటమి ప్రయత్నించినప్పుడు పాలస్తీనా వాసులకు ప్రాతినిధ్యం వహించే రహంబా పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. తాత్కాలికంగా ప్రభుత్వం నుంచి తప్పు కుంది. దాంతో ప్రధాని బెనెట్ రాజీపడక తప్పలేదు. యూదు కాలనీలపై చట్టం వస్తే ఆ ప్రాంతం ఇజ్రాయెల్‌లో భాగంగా మారుతుందన్నది పాలస్తీనా వాసుల వాదన. ఇప్పటికే యూదులకూ, పాల స్తీనా వాసులకూ అక్కడ వేర్వేరు చట్టాలు అమలవుతున్నాయి. అటు యూదులకు సైతం ఇదొక సంకటంగా మారింది. ప్రస్తుతం ఆ కాలనీల్లో సైనిక పాలన ఉన్నందువల్ల ఇతర ఇజ్రాయెల్ పౌరుల మాదిరి వారు పూర్తి స్థాయి హక్కులు పొందలేకపోతున్నారు. ఈనెల 1వ తేదీతో గడువు ముగు స్తున్న దశలో ఈ చట్టం కోసం రూపొందించిన బిల్లు గత నెల 10న పార్లమెంటులో వీగిపోయింది. ఇలా పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్నచోట ‘అందరి ప్రభుత్వం’ ఏర్పాటు చేయడం, అది నాలుగేళ్లూ మనుగడ సాగించటం సహజంగానే అసాధ్యం. నెతన్యాహూ అధికారంలో ఉండగా ఈ వైషమ్యాలను మరింత పెంచి, భవిష్యత్తులో మళ్లీ అందరూ విధిగా తనవైపే చూడకతప్పని స్థితి కల్పించారు. ఆర్థికాభివృద్ధికి పాటుపడటం, శాంతి సాధనకు ప్రయత్నించడం వంటి ఆదర్శాలకు కాలం చెల్లి, వైషమ్యాలే ఎన్నికల ఫలితాలను నిర్దేశించే స్థాయికి చేరుకోవడం ఆందోళనకరమే. ఈసారి ఎన్నికైతే యూదులకు ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తాననడంతోపాటు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసి, నిత్యావసరాల ధరలను తగ్గిస్తానని నెతన్యాహూ వాగ్దానం చేస్తున్నారు. తదుపరి ఏర్పడ బోయేది ‘పటిష్టమైన’ జాతీయవాద ప్రభుత్వమా... అరబ్ పార్టీల పలుకుబడి కొనసాగే ‘యూదు వ్యతిరేక’ ప్రభుత్వమా అన్నది నవంబర్ 1 తర్వాత తేలుతుంది. -
మోదీ ఇజ్రాయెల్ పర్యటనతో సీన్ మారింది
‘‘ది బ్యాటిల్ ఫర్ ది వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ సైబర్‌వెపన్’’ అనే టైటిల్‌తో న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఆ కథనంలో వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘ఇజ్రాయెల్‌కు చెందిన భద్రతా సంస్థ ఎన్‌ఎస్‌ఒఓ గ్రూప్ గత దశాబ్దాకాలంగా పెగసస్ స్పైవేర్ నిఘా వ్యవస్థని ప్రపంచ దేశాలకు విక్రయిస్తోంది. ఇది పని చేసినట్టు మరేది చేయలేదని వివిధ దేశాల పోలీసు, ఇంటెలిజెన్స్ వ్యవస్థలకు ఆ సంస్థ హామీలు గుప్పించింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ప్రైవేటు డిటెక్టివ్ కంపెనీలు కూడా చేయలేని పని ఈ పెగసస్ చేస్తుంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లను కూడా కనిపెట్టగలదు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2017 జులైలో ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లినప్పుడు పెగసస్ స్పైవేర్‌పై ఒప్పందం కుదిరింది. ఒక భారత ప్రధాని ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లడం అదే తొలిసారి. అంతకు ముందు దశాబ్దాలుగా పాలస్తీనాకు మద్దతుగానే భారత్ వ్యవహరించింది. కానీ మోదీ పర్యటనలో అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో అత్యంత సుహృద్భావ వాతావరణం మధ్య చర్చలు జరిగాయి. నెతన్యాహూతో కలిసి మోదీ చెప్పులు లేకుండా మరీ స్థానిక బీచ్‌లో విహరించారు. ఆ పర్యటనలో ఇరు దేశాల మధ్య 200 కోట్ల డాలర్ల ఒప్పందం కుదిరింది. అత్యంత ఆధునిక ఆయుధాలు, క్షిపణి వ్యవస్థ, పెగసస్ స్పైవేర్ అన్నీ కలిసి ఒక ప్యాకేజీలా కొనుగోలు ఒప్పందం జరిగింది. ఆ తర్వాత కొద్ది నెలలకే నెతన్యాహూ ఆకస్మికంగా భారత్‌కు పర్యటించారు. 2019 జూన్‌లో ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక మండలి పాలస్తీనాకు చెందిన మానవ హక్కుల సంస్థకు అబ్జర్వర్ స్టేటస్‌కు ఇవ్వడానికి నిరాకరించినప్పుడు జరిగిన ఓటింగ్‌లో భారత్ ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఓటు వేసింది. అంతర్జాతీయ వేదికపై ఇజ్రాయెల్‌కు భారత్ మద్దతునివ్వడం అదే తొలిసారి. అమెరికాకు చెందిన ఎఫ్బిఐ కూడా పెగసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసినప్పటికీ దానిని ఎవరి మీద వినియోగించకూడదని నిర్ణయించింది. 2011లో ఇజ్రాయెల్ ప్రపంచ మార్కెట్లో పెగసస్‌ని ప్రవేశపెట్టిన తర్వాత పలు యూరప్ దేశాలు ఉగ్రవాదుల ఉనికి కనిపెట్టడానికి దీనిని వినియోగించాయి. ఉగ్రవాదులు, కరడుగట్టిన నేరస్తులు దగ్గర అత్యంత ఆధునికమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్నాయి. వాటిని డీక్రిప్ట్ (డీకోడ్) చేయగలిగే సామర్థ్యం పెగసస్‌కి ఉండటంతో విధ్వంసకారుల గుట్లు తెలిసేవి. కానీ దీనిని కొనుగోలు చేసిన దేశాలు హక్కుల సంఘాలపై కూడా ప్రయోగించాయి. జర్నలిస్టులు, రాజకీయ అసమ్మతివాదులపైనా మెక్సికో ప్రయోగిస్తే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పౌర హక్కుల కార్యకర్తలపైనా, సౌదీ అరేబియా మహిళా హక్కుల కార్యకర్తలపైనా నిఘాను ఉంచాయి. ఈ స్పైవేర్ ఇలా దుర్వినియోగమడం వివాదాస్పదం కావడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం దీనిపై గత ఏడాది జులైలో విచారణకు ఒక కమిటీ వేసింది. దీనిపై ఎన్ఎస్ఒ ఆనాటి చీఫ్ షాలెవ్ హులియో ఇజ్రాయెల్ సైబర్ పరిశ్రమపైనే బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత ఏడాది నవంబర్‌లో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ వివాదం నుంచి దూరంగా జరిగింది. స్పైవేర్‌ని రూపొందించిన ఎన్ఎస్ఒ ప్రైవేటు సంస్థ కాబట్టి ఇజ్రాయెల్ ప్రభుత్వ విధానాలు ఆ సంస్థకి వర్తించవని తప్పించుకుంది. దీంతో అమెరికా ప్రభుత్వం ఆ సంస్థపై ఆంక్షలు విధించింది’’ అని న్యూయార్క్ టైమ్స్ ఆ కథనాన్ని ముగించింది. -
ఇజ్రాయెల్ ప్రధాని భేటీలో బైడెన్ కునికి పాట్లు!
జెరూసలేం: ఇజ్రాయెల్ మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం ఫేస్బుక్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఇజ్రాయెల్ నూతన అధ్యక్షుడు నఫ్టాలి బెన్నెట్‌తో జరిగిన సమావేశంలో బైడెన్ నిద్రపోయారు. ఈ మేరకు ఆ వీడియోలో వెనుక నుంచి నెతాన్యాహు వాయిస్ ఆడియోలో వస్తుంటుంది. (చదవండి: చైనాలో పడవ బోల్తా.. 10 మంది మృతి) ఆ ఆడియోలో నెతాన్యాహు మాట్లాడుతూ... "మీకు తెలుసా బెన్నెట్ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బైడెన్ శ్రద్ధగా వినడమే కాక తన అంగీకారాన్ని తెలుపడంలో ఊ కొడుతూ తల వాల్చినట్లున్నారు". అని సెటైర్ వేశారు. అమెరికా, దాని మిత్రదేశాలు తీసుకొచ్చిన రెండు(ఇజ్రాయెల్ , పాలస్తీనా) దేశాల పరిష్కార దిశగా చేసిన ప్రతిపాదనల నేపథ్యంలో ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా బెన్నెట్ ఎంపికైన సంగతి తెలిసిందే. దీంతో కొత్త సంకీర్ణం ప్రభుత్వ ఏర్పాటుతోపాటు 12 ఏళ్ల కాలంపాటు ఇజ్రాయెల్ ప్రధానిగా కొనసాగిన నెతన్యాహు పదవీచ్యుతుడు కావడంతోనే బైడన్ పై తన అక్కసును వెళ్లగక్కారు. అంతేకాదు ఈ ప్రమాదకరమైన ప్రభుత్వాన్ని పడగొట్టి.. మళ్లీ అధికారంలోకి రావడమే ధ్యేయంగా పనిచేస్తానని నెతన్యాహు గతంలో శపథం చేసిన సంగతి విదితమే. (చదవండి: ఫిలిప్పీన్స్ అధ్యక్ష బరిలో బాక్సర్ పకియావ్) -
రెండు రాజ్యాల ఏర్పాటే ఏకైక పరిష్కారం: జో బైడెన్
వాషింగ్టన్: మిత్రదేశం ఇజ్రాయెల్ భద్రత విషయంలో తమ అంకితభావంలో ఎలాంటి మార్పు లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉద్ఘాటించారు. ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదానికి రెండు రాజ్యాల ఏర్పాటే ఏకైక పరిష్కార మార్గమని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్– హమాస్ సంస్థల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన మరుసటి రోజు జో బైడెన్ ఈ వ్యవహారంపై స్పందించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇజ్రాయెల్ రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వివాదాస్పద వెస్టు బ్యాంక్‌కు కూడా రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. వెస్టుబ్యాంక్ ప్రజల రక్షణే కాదు, ప్రజల ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో జో బైడెన్ ఫోన్లో మాట్లాడారు. వివాదాలకు ముగింపు పలకాలని సూచించారు. రాకెట్ల దాడులు, వైమానిక దాడుల్లో కూలిపోయిన ఇళ్లను పునర్నిర్మించాలని చెప్పారు. ఆయుధ వ్యవస్థను పునర్నిర్మించుకొనే అవకాశాన్ని హమాస్‌కు ఇవ్వొద్దన్నారు. ఇప్పుడు గాజా ప్రజలకు చేయూత అవసరమని తెలిపారు. వారిని ఆదుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. కాల్పుల విరమణ ఇలాగే కొనసాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఇజ్రాయెల్ ఒక యూదు దేశంగా మనుగడలో ఉంటుందని, దాన్ని తాము ఎప్పటికీ గుర్తిస్తామని తేల్చిచెప్పారు. -
Israel: కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఓకే
గాజా సిటీ: పదకొండు రోజులుగా గాజా స్ట్రిప్‌పై కొనసాగిస్తున్న వైమానిక దాడులకు ఇజ్రాయెల్ ముగింపు పలుకనుంది. ఏకపక్ష కాల్పుల విరమణకు, వైమానిక దాడుల నిలిపివేతకు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ నేతృత్వంలో గురువారం జరిగిన భద్రతా కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపిందని ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. గాజాలో పాలస్తీనియన్లపై దాడుల్లో చిన్నారులు, మహిళలతో సహా సాధారణ పౌరులు మృతి చెందడంతో అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ధోరణిపై విమర్శలు వచ్చాయి. సంయమనం పాటించాలని పలుదేశాలు విజ్ఞప్తి చేశాయి. శాంతిస్థాపన కోసం ఈజిప్టు సహా పలు దేశాలు మధ్యవర్తిత్వం నెరిపాయి. మరోవైపు ఇజ్రాయెల్‌కు గట్టి మద్దతుదారైన అమెరికా ఒత్తిడి పెంచింది. దాడులు ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేసి కోరారు. తమ లక్ష్యం నెరవేరేదాకా ఆపబోమని భీష్మించిన ఇజ్రాయెల్ చివరకు అమెరికా నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో కాల్పుల విరమణకు అంగీకరించింది. కాల్పుల విరమణ ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనేది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. అధికారిక వార్తా ఛానల్ కాన్ మాత్రం ఇది తక్షణం అమలులోకి వస్తుందని తెలిపింది. ఇజ్రాయెల్ నిర్ణయంపై హమాస్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా కనీసం 230 మంది పాలస్తీనియన్లు మరణించారు. హమాస్ రాకెట్ల దాడిలో 12 మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. -
అదే ఉద్రిక్తత.. నెతన్యాహుకు బైడెన్ ఫోన్
గాజా సిటీ/వాషింగ్టన్: ఇజ్రాయెల్ వైమానిక దాడులకు హమాస్ మిలటరీ కూడా దీటుగా బదులిస్తోంది. మంగళవారం గాజా నుంచి హమాస్ ప్రయోగించిన రాకెట్లు దక్షిణ ఇజ్రాయెల్‌ను బెంబేలెత్తించాయి. ఓ ప్యాకేజింగ్ పరిశ్రమ ధ్వంసమయ్యింది. అందులో పనిచేసే ఇద్దరు థాయ్‌లాండ్ కార్మికులు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. మరో ఏడుగురు గాయపడ్డారని తెలిపారు. అంతకుముందు ఇజ్రాయెల్ సైన్యం గాజాపై బాంబుల వర్షం కురిపించింది. వైమానిక దాడులు కొనసాగించింది. ఈ ఘటనలో గాజాలోని ఆరు అంతస్తుల భవనం నేటమట్టమయ్యింది. ఇందులో విద్యా సంస్థలు, పుస్తక విక్రయ దుకాణాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ ముందస్తుగా హెచ్చరించడంతో వేకువజామునే ఈ భవనంలో ఉంటున్న వారంతా బయటికి పరుగులు తీశారు. ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య ఇప్పటికిప్పుడు శాంతి ఒప్పందం కుదిరే అవకాశం కనిపించడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు శాంతి యత్నాలు నిలిచిపోయాయి. అంతర్జాతీయ మధ్యవర్తులు చెతులేత్తేసినట్లు తెలుస్తోంది. సమ్మెకు దిగిన పాలస్తీనియన్లు తాజా దాడుల వల్ల గాజాలో విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అత్యవసర ఔషధాలు, ఇంధనం, నీటి కొరత వేధిస్తోంది. దీంతో జనం అల్లాడిపోతున్నారు. ఇజ్రాయెల్, తూర్పు జెరూసలేం, ఆక్రమిత వెస్టుబ్యాంకులో ఉన్న పాలస్తీనియన్లు మంగళవారం ఆకస్మాత్తుగా సమ్మెకు దిగారు. నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఇజ్రాయెల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రమల్లాలో ఇజ్రాయెల్ సైనికులపై రాళ్లు విసిరారు. రోడ్లపై టైర్లు దహనం చేశారు. నిరసనకారులు చెదరగొట్టడానికి సైనికులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ సందర్భంగా పాలస్తీనా పౌరుడొకరు మరణించారు. 46 మంది గాయపడ్డారు. నెతన్యాహుకు బైడెన్ ఫోన్ ఇజ్రాయెల్‌కు తనను తాను రక్షించుకొనే హక్కు ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. ఆయన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ ఆత్మరక్షణ హక్కుకు తాము మద్దతునిస్తామని పేర్కొన్నారు. సాధారణ పౌరుల రక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. మతపరమైన ఘర్షణలను నివారించేందుకు, జెరూసలేంలో శాంతి కోసం సాగుతున్న ప్రయత్నాలను బైడెన్ స్వాగతించారు. -
ఇజ్రాయెల్‌లో మళ్లీ ఎన్నికలు
గత రెండేళ్లుగా... ప్రత్యేకించి మొన్న ఫిబ్రవరి మొదలుకొని రాజకీయంగా వరస సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చివరికి మరోసారి జనం తీర్పు కోరడానికి సిద్ధపడ్డారు. బడ్జెట్ ఆమోదంపై రాజకీయ పక్షాల మధ్య అంగీకారం కుదరకపోవడంతో ఇజ్రాయెల్ పార్లమెంట్ కెన్సెట్ ఆ దేశ రాజ్యాంగ నిబంధన ప్రకారం రద్దయింది. నాలుగేళ్లకోసారి జరగాల్సిన ఎన్నికలు కాస్తా మొదటి రెండేళ్ల వ్యవధిలోనే నాలుగో దఫా నిర్వహించక తప్పడంలేదు. కొత్త సంవత్సరం మార్చిలో జరిగే ఈ ఎన్నికలు ఆయనకు అన్నివిధాలా అగ్నిపరీక్షే. నెతన్యాహూ సాధారణ రాజకీయవేత్త కాదు. వ్యూహరచనా నిపుణుడు. ఎత్తుగడల్లో ఆరితేరినవాడు. మొన్న మార్చిలో పార్లమెంటుకు మూడోసారి జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఎవరికీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. 120 మంది సభ్యులుండే పార్లమెంటులో నెతన్యాహూ నేతృత్వంలోని మితవాద లికుడ్ పార్టీకి కేవలం 36 స్థానాలు మాత్రమే వచ్చాయి. మధ్యేవాద పక్షమైన బ్లూ అండ్ వైట్ పార్టీకి 33 స్థానాలు లభించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన కనీస మెజారిటీ 61. ఇతర పార్టీలకు చెప్పుకోదగ్గ రీతిలో సీట్లు రాలేదు. ఈ పరిస్థితుల్లో చివరికి తాను గట్టిగా వ్యతిరేకించే బ్లూ అండ్ వైట్ పార్టీతో చేతులు కలిపి నెతన్యాహూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో బ్లూ అండ్ వైట్ పార్టీ నేత బెన్నీ గాంట్జ్కూ, నెతన్యాహూకు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 18 నెలలు నెతన్యాహూ, మిగిలిన నెలలు గాంట్జ్ పాలించాలి. కానీ దాన్ని కాస్తా నెతన్యాహూ బేఖాతరు చేయదల్చుకున్నారు. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన తాను ప్రధాని స్థానంలో వుండి ఆ కేసుల్ని ఎదుర్కొనాలి తప్ప మాజీగా మిగలకూడదని ఆయన గట్టిగా కోరుకున్నారు. అందుకే బడ్జెట్ ఆమోదానికి ప్రయత్నించి, ప్రధాని కావాలని ఆరాటపడిన గాంట్జ్ ఆశలకు ఆయన గండికొట్టారు. కెన్సెట్ రద్దుకు పరోక్షంగా కారకులయ్యారు. అయితే ఇద్దరికీ రెండు పార్టీల్లోనూ ప్రత్యర్థుల బెడద ఎక్కువే. నెతన్యాహూకు ఒకప్పుడు శిష్యుడిగా వుండి పార్టీలో గట్టి ప్రత్యర్థిగా ఎదిగిన గిడియన్ జార్ ఇటీవలే ఆ పార్టీనుంచి నిష్క్రమించి న్యూహోప్ పేరిట కొత్త పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. జార్ వెళ్లిపోయినా నెతన్యాహూకు పార్టీలో ప్రత్యర్థులు తక్కువేమీ లేరు. గాంట్జ్ పరిస్థితి కూడా అంతే. నెతన్యాహూతో చేరొద్దని, దానికి బదులు పార్లమెంటుకు మరోసారి ఎన్నికలు రావడమే మేలని నచ్చజెప్పారు. కానీ ఆయన వినలేదు. చివరకు ఈ చెలిమివల్ల రెండూ తీవ్రంగానే నష్టపోయాయి. అయితే నెతన్యాహూ పార్టీయే ఈసారి ఎన్నికల్లో కూడా అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని మీడియా సర్వేలు చెబుతున్నాయి. దానికి 27 సీట్లు రావొచ్చునని సర్వేలు చెబుతున్న మాట. గత ఎన్నికల్లో 33 స్థానాలు గెల్చుకున్న బ్లూ అండ్ వైట్ పార్టీ మాత్రం ఈసారి ఆరు స్థానాలకు పరిమితమవుతుందని అంటున్నాయి. ఏడు దశాబ్దాల ఇజ్రాయెల్ చరిత్రంతా అరబ్ వ్యతిరేకతతో, ముఖ్యంగా పాలస్తీనాపై కత్తులు నూరడంతో ముడిపడి వుంటుంది. అందుకే ప్రతి ఎన్నికలకూ ముందు పాలస్తీనాపై నిప్పులు కక్కడం లేదా దానిపై దాడులు చేయడం ఇజ్రాయెల్‌లో ఎవరు అధికారంలో వున్నా రివాజు. గత ఎన్నికల సమయంలో అయితే నెతన్యాహూ పాలస్తీనా అధీనంలో వున్న వెస్ట్‌బ్యాంకు ప్రాంతాలన్నిటినీ స్వాధీనం చేసుకుంటానని వాగ్దానం చేశారు. దేశంలో అరబ్ పార్టీల కూటమి జాయింట్ లిస్టును ఎలాగైనా అధికారంలోకి రానీకుండా చేయాలని ఇజ్రాయెల్ పార్టీలు శాయశక్తులా ప్రయత్నిస్తుంటాయి. వాస్తవానికి 2019 ఎన్నికల్లో జాయింట్ లిస్టు కింగ్ మేకర్‌గా ఆవిర్భవించింది. తమతో చేతులు కలిపితే ప్రధాని పదవి దక్కుతుందని, అవినీతిపరుడైన నెతన్యాహూను అధికారానికి దూరం పెట్టొచ్చునని జాయింట్ లిస్టు గాంట్జ్‌కు ప్రతిపాదన పంపినా అంగీకరించలేదు. జాయింట్ లిస్టుతో కలవొద్దన్న నిర్ణయాన్ని సమర్థిస్తూనే నెతన్యాహూను కూడా అంగీకరించొద్దని అనుచరులు సూచించినా గాంట్జ్ వినలేదు. ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు ముందు ఎప్పుడూ రాజకీయాలు వ్యక్తి కేంద్రంగా లేవు. తీవ్ర అరబ్ వ్యతిరేకతే అన్ని పార్టీలకూ ఊపిరి. అదే సమయంలో అరబ్ పార్టీల కూటమి చెప్పుకోదగ్గ స్థానాలు గెల్చుకుంటూ వుంటుంది. కానీ నెతన్యాహూ నాయకత్వ స్థానంలోకొచ్చాక అది మారింది. ఆయనకు వ్యతిరేకంగా కొత్త పార్టీలు పుట్టుకురావడం, ఆయన్ను వ్యతిరేకించడం మినహా వాటికి మరో రాజకీయ కార్యక్రమం లేకపోవడం రివాజైంది. ఇజ్రాయెల్‌కు లిఖితపూర్వక రాజ్యాంగం లేదు. అక్కడి పార్టీలకు నిర్దిష్టమైన రాజకీయ సిద్ధాంతం లేదు. పాలస్తీనా వ్యతిరేకత, యూదు జాత్యహంకారం, రాజకీయ నాయకుల స్వప్రయోజనాలు మాత్రమే మిగిలాయి. వీటికి గత రెండేళ్లుగా దేశాన్ని పీడిస్తున్న రాజకీయ అనిశ్చితి తోడైంది. దీనికి మూలాలు ఇజ్రాయెల్ ఆవిర్భావంలోనే వున్నాయి. వెస్ట్‌బ్యాంకు ప్రాంతంలోని యూదు కాలనీలను క్రమేపీ పెంచుకుంటూ పోవడం, అలా పెంచుతామని హామీ ఇవ్వడమే అన్ని పార్టీలకూ రివాజైంది. ఇదంతా క్రమేపీ దేశంలో మితవాద పక్షం బలపడటానికి దారితీసింది. అంతవరకూ పెద్దగా ప్రజాభిమానంలేని మితవాద పక్షం లికుడ్ పార్టీ 1977లో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికొచ్చింది. వామపక్ష ప్రాభవం అంతరించడం మొదలైంది. 1995లో లేబర్ పార్టీ నేత ఇట్జాక్ రాబిన్‌ను మితవాద తీవ్రవాద పక్షం హత్య చేయడంతో దేశ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అన్ని పరిణామాల్లోనూ నెతన్యాహూ కీలక భూమిక పోషించి, లికుడ్ పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు తగిన ఆధారాలున్నాయని ఇప్పటికీ ఇజ్రాయెల్ సమాజం విశ్వసిస్తోంది. అదే సమయంలో ఆయన తప్ప గత్యంతరం లేదనుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే మార్చిలో జరగబోయే ఎన్నికల అనంతరం మళ్లీ నెతన్యాహూయే అధికారానికొస్తారా లేక ఈ అనిశ్చితి మరింత తీవ్రమవుతుందా అన్నది చూడాల్సివుంది. -
మహిళలపై ప్రధాని అభ్యంతరకర వ్యాఖ్యలు
జెరూసలేం: సామాన్య వ్యక్తి ఎలా మాట్లాడినా చెల్లుతుంది. కానీ అధికారంలో ఉన్నవారు.. మరీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మైనారిటీలు, బాధితుల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ఇదిగో ఇలా సోషల్ మీడియా వేదికగా వేపుకుతింటారు.. వేటాడేస్తారు నెటిజనులు. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. వివరాలు.. రెండు రోజుల క్రితం ‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయోలెన్స్ ఎగెనెస్ట్ వుమెన్’ అనే కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. బెంజమిన్ మహిళలను జంతువులతో పోల్చి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘నీవు కొట్టడానికి మహిళ జంతువు కాదు. మనందరం జంతుహింస తగదని చెప్తాం. వాటి మీద ఆప్యాయత కురిపిస్తాం.. జాలి చూపిస్తాం. మహిళలు పిల్లలు కూడా జంతువులే. అందులోనూ హక్కులున్న జంతువులు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బెంజమిన్. (చదవండి: దుర్గమ్మతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది..!) Netanyahu at event marking International Day for the Elimination of Violence against Women: “A woman isn't an animal you can beat, & nowadays we say don’t hit animals. We have compassion for animals, women are animals, children are animals, with rights.” pic.twitter.com/jwfLH6aYqU — Noga Tarnopolsky (@NTarnopolsky) November 23, 2020 ఇక్కడ బెంజమిన్ నోరు లేని మూగ జీవుల పట్ల ఆప్యాయత, జాలి చూపిస్తాం.. అలాంటిది మానవజాతి మనుగడకు మూలమైన మహిళల్ని ఇంకెంతో గౌరవించాలనే ఉద్దేశంతో మాట్లాడారు. కానీ ఆయన తన భావాలను సరిగా వ్యక్తం చేయకపోవడంతో నెటిజనులు విరుచుకుపడుతున్నారు. మహిళల్ని జంతువులతో పోలుస్తావా అంటూ మండి పడుతున్నారు. గృహ హింస అంటే మీ దృష్టిలో జంతువులను తిట్టడం లాంటిదేనా.. అంటే మహిళలు కూడా మౌనంగా భరించాలని మీ ఉద్దేశమా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. -
ఇజ్రాయెల్, యూఏఈ శాంతి ఒప్పందం
వాషింగ్టన్: నిత్యం రావణకాష్టంలా రగిలి పోయే మధ్యప్రాచ్యంలో దౌత్యపరంగా భారీ ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం ఫలించి గురువారం ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లు శాంతి స్థాపన దిశగా అడుగులు వేశాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పటిష్టతకు చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్‌కు స్నేహహస్తం చాచిన మొట్టమొదటి గల్ఫ్ దేశంగా, అరబ్ ప్రపంచంలో మూడో దేశంగా యూఏఈ నిలిచింది. పాలస్తీనా ఆక్రమణపై ఇరు దేశాల మధ్య పాతికేళ్లుగా కొనసాగుతున్న వైరానికి ట్రంప్ చొరవతో తెరపడింది. ‘‘మాకు అత్యంత మిత్రదేశాలైన ఇజ్రాయెల్, యూఏఈల మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది’’అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ చారిత్రక దినం అంటూ ట్వీట్ చేశారు. అరబ్ ప్రపంచంతో కొత్త శకం ఏర్పాటవుతోందని పేర్కొన్నారు. పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించకూడదన్న షరతు మీదే ఒప్పందం కుదుర్చుకున్నామని యూఏఈ యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ ట్వీట్ చేశారు. -
దుర్గమ్మతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది..!
జెరూసలెం: సోషల్ మీడియాలో దేని గురించి అయినా పోస్ట్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పు చేస్తే.. నెటిజనులు ఓ రేంజ్లో ఆడుకుంటారు. సామాన్యుల సంగతి పక్కన పెడితే.. సెలబ్రిటీలు, రాజకీయ నాయుకులు.. ఉన్నత స్థానాల్లో ఉన్న వారు సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుంది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పెద్ద కుమారుడు యాయిర్ (29) కూడా అలాంటి అత్యత్సాహమే ప్రదర్శించి చివరికి భారతీయులకు క్షమాపణలు చెప్పాడు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే యాయిర్ ఇటీవల భారతీయుల ఇష్ట దైవం దుర్గామాత ముఖం స్థానంలో.. నెతన్యాహు అవినీతి కేసుల్లో ప్రాసిక్యూటర్‌గా వ్యవహరిస్తున్న లియత్ బెన్ ఆరి ముఖాన్ని మార్ఫ్ చేసిన ఫోటోను షేర్ చేశాడు. అయితే ఇది కాస్తా వివాదానికి దారితీసింది. (ఇజ్రాయెల్ ప్రధానిపై సంచలన ఆరోపణలు.. చార్జిషీట్!) దీనిపై భారత్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో.. వెంటనే తన తప్పు తెలుసుకున్నాడు యాయిర్. ఆ ట్వీట్‌ను డిలీట్ చేయడమే కాక.. భారతీయులను క్షమాపణలు కోరుతూ మరో ట్వీట్ చేశాడు. ‘నేను ఇది కావాలని చేసింది కాదు. ఇజ్రాయెల్ రాజకీయ నేతలను ఉద్దేశించి ఓ సెటైరికల్ పేజీలో మీమ్‌ను పంచుకున్నాను. ఆ మీమ్‌లో ఉన్నది భారతీయులకు ఎంతో ఆరాధ్య దైవమయిన దుర్గా మాతా అని నాకు తెలియదు. దీని గురించి భారత మిత్రుల నుంచి వచ్చిన సందేశాలతో నిజం తెలుసుకున్నాను. వెంటనే ఆ ట్వీట్ తొలగించాను. నన్ను క్షమించండి’ అని ట్వీట్లో పేర్కొన్నాడు యాయిర్. దీంతో వివాదం సద్దుమణిగింది. కాగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. వాటిపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో విపక్షాలు నెతన్యాహుపై విరుచుకుపడుతున్నాయి. యాయిర్ కూడా అదే మూడ్‌లో దుర్గామాత ఫోటోను మార్ఫింగ్ చేసి షేర్ చేశాడు. (కరోనా వ్యాప్తికి విరుగుడు కనిపెట్టిన ప్రధాని) -
మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని థాంక్స్.. మీరు బాగుండాలి
న్యూఢిల్లీ: మానవాళి మనుగడకు ముప్పుగా పరిణమించిన కరోనా వైరస్‌పై పోరులో ప్రపంచ దేశాలకు అండగా ఉంటున్న భారత్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. కోవిడ్-19ను కట్టడి చేసేందుకు మలేరియా యాంటీ డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకం సత్ఫలితాలను ఇస్తుందని భావిస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికా సహా ఇతర దేశాలు భారత్ సాయం కోరిన విషయం తెలిసిందే. అత్యవసర మందులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసి.. తమకు అండగా నిలవాలని అభ్యర్థించాయి. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ సర్కారు ఇప్పటికే అమెరికాకు మాత్రలు సరఫరా చేసిన భారత్.. బ్రెజిల్‌కు అండగా ఉంటామని భరోసానిచ్చింది. (ఈ మేలు మర్చిపోము: ట్రంప్) ఈ క్రమంలో ఆయా దేశాధినేతలు భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 29 మిలియన్ల డోసుల డ్రగ్స్ ఎగుమతి చేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కరోనాపై పోరులో సహకారం అందిస్తామన్నందుకు బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సైతం ఇదే బాటలో నడిచారు. దాదాపు ఐదు టన్నుల మెడిసన్ ఇజ్రాయెల్‌కు పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. (మోదీకి కృతజ్ఞతలు తెలిపిన బ్రెజిల్ అధ్యక్షుడు) ఈ మేరకు.. ‘‘ ఇజ్రాయెల్‌కు క్లోరోక్విన్ పంపినందుకు నా స్నేహితుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. ఇజ్రాయెల్ పౌరులందరూ మీకు ధన్యవాదాలు చెబుతున్నారు’’ అని నెతన్యాహు గురువారం ట్వీట్ చేశారు. ఇందుకు స్పందించిన మోదీ.. ‘‘ మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడుతాం. స్నేహితులకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని పార్థిస్తున్నాం’’ అని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా కరోనా ధాటికి ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 86 మంది మృతి చెందగా... దాదాపు 10 వేల మంది దీని బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో తమకు మాస్కులు సరఫరా చేయాలని ప్రధాని మోదీకి మార్చి 13న విజ్ఞప్తి చేసిన నెతన్యాహు.. ఏప్రిల్ 3న క్లోరోక్విన్ సరఫరా చేయాల్సిందిగా అభ్యర్థించారు. ప్రధాని మోదీ ఇందుకు సానుకూలంగా స్పందించి ఇజ్రాయెల్‌కు అండగా నిలిచారు. Thank you, my dear friend @narendramodi, Prime Minister of India, for sending Chloroquine to Israel. All the citizens of Israel thank you! 🇮🇱🇮🇳 pic.twitter.com/HdASKYzcK4 — PM of Israel (@IsraeliPM) April 9, 2020 -
సైబర్ టెక్నాలజీతో కరోనా నిర్మూలన!
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను(కోవిడ్) ఎదుర్కోనేందుకు ప్రపంచ దేశాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఇజ్రాయిల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఉగ్రవాదులను పసిగట్టేందుకు వాడే సాంకేతికను కరోనా నిర్మూలనకు ఉపయోగించనున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజిమన్ నెతన్యాహూ పేర్కొన్నారు. బెంజిమన్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి తగ్గే వరకు ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజలలో కరోనా లక్షణాలను గుర్తించేందుకు సైబర్ టెక్నాలజీని ఉపయోగిస్తామని పేర్కొన్నారు. కరోనా నిర్మూలనలో భాగంగా ఆదివారం నుంచి అన్ని మాల్స్, రెస్టారెంట్లు, థియేటర్స్ మూసివేయనున్నట్లు తెలిపారు. అవసరమనుకుంటే తప్ప ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లవద్దని కోరారు. అయితే ప్రజలకు అత్యవసరంగా ఉపయోగపడే పార్మసీ, సూపర్‌మార్కెట్, బ్యాంక్‌లు ఎదావిదిగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తాయని అన్నారు. కాగా, ప్రజలెవరూ గుంపులుగా ఉండొద్దని, ఒక రూంలో కేవలం పది మంది వరకే ఉండాలని అక్కడి వైద్య అధికారులు సూచిస్తున్నారు. చదవండి: ‘యే దోస్తీ హమ్ నహీ తోడేంగే’.. మోదీ..! -
కరోనా వ్యాప్తికి విరుగుడు కనిపెట్టిన ప్రధాని
జెరూసలేం: కోవిడ్-19(కరోనా వైరస్) రక్కసి ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది. మనుషుల ప్రాణాలను హరించుకుపోతున్న దీని నివారణకు మందు కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు తలమునకలయ్యారు. ఇదిలా ఉండగా ‘చికిత్స కన్నా నివారణ మేలు’ అన్న విధానాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమీన్ నెతన్యాహు అవలంభిస్తున్నారు. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దేశప్రజలకు సూచనలిచ్చారు. ఆయన తాజాగా కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి, వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాముఖంగా మాట్లాడుతూ దేశ ప్రజలు షేక్‌హ్యాండ్ ఇవ్వడం మానుకోవాలని కోరారు. దానికి బదులుగా భారతీయ సంప్రదాయ పద్ధతిలో నమస్తే చెప్పుకోవాలని కోరారు. (అప్పుట్లోనే ‘కరోనా’ను ఊహించారా?) రెండు చేతులను జోడించి నమస్కారం ఎలా పెట్టాలో కూడా చూపించారు. భారతీయ విధానంలోనే ఇతరులను పలకరించాలని, లేకపోతే షాలోమ్(హాయ్) చెప్పినా సరిపోతుందన్నారు. కానీ షేక్‌హ్యాండ్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వకండని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 15 మంది కరోనా బారిన పడగా, భారత్‌లో 28 కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మూడువేల మంది దీనివల్ల ప్రాణాలు కోల్పోగా 90వేల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కాగా కరోనా మహమ్మారి గాలి ద్వారా సులువుగా ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించి వెళ్లాలని, అలాగే వ్యక్తిగత శుభ్రతతోపాటు, తరచూ చేతులు సబ్బుతో కడుక్కోవాలని సూచిస్తున్నారు. (దేశం కోసం గాయపడ్డాను: నెతన్యాహు భావోద్వేగం) -
ఇజ్రాయెల్ ప్రధానిపై సంచలన ఆరోపణలు.. చార్జిషీట్!
జెరూసలేం : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై లంచగొండితనం, మోసం, నమ్మకద్రోహం తదితర నేరాల కింద కేసులు నమోదయ్యాయి. నెతన్యాహు, ఆయన భార్య కొంతమంది బడా వ్యక్తులకు రాజకీయ ప్రయోజనాలు చేకూర్చినందుకు గానూ దాదాపు 2 లక్షల అరవై వేల డాలర్లను విలాస వస్తువుల రూపంలో స్వీకరించినట్లుగా అభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు ఇజ్రాయెల్ అటార్నీ జనరల్ అవిచాయ్ మాండెల్బ్లిట్ 63 పేజీల అభియోగ పత్రాన్ని కోర్టుకు సమర్పించారు. మూడేళ్ల దర్యాప్తులో భాగంగా నెతన్యాహు, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం లంచాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ‘ వ్యక్తిగతంగా ఈ విషయం నన్నెంతగానో బాధిస్తుంది. అయితే న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడానికే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రధానికి వ్యతిరేకంగా మూడు కేసులు నమోదయ్యాయి. చట్టం ముందు అందరూ సమానులే. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసేందుకు.. న్యాయ వ్యవస్థపై ఇజ్రాయెల్ ప్రజల నమ్మకాన్ని మరింతగా ఇనుమడింపజేసేందుకు.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని చాటిచెప్పేందుకే మీ అందరి ముందుకు వచ్చాను అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఆరోపణలను బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. తనపై అభియోగాలను లంచగొండులైన న్యాయవాదుల తిరుగుబాటుగా ఆయన అభివర్ణించారు. ‘విచారణ జరిపిన వారి గురించి విచారణ జరపాల్సిన సమయం వచ్చింది. స్వయంప్రతిపత్తి గల సంస్థ చేత ఇలాంటి వాళ్లపై విచారణకు కోర్టు ఆదేశించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా... ‘ ఈ దేశం కోసం నా జీవితాన్ని ధారబోశాను. యుద్ధం చేశాను. గాయపడ్డాను. అంతర్జాతీయ వేదికపైన ఇజ్రాయెల్‌ను ఓ బలమైన శక్తిగా నిలిపేందుకు ఎల్లవేళలా కృషి చేశాను. దేశ శ్రేయస్సుకై పోరాడి సాధించిన విజయాల పట్ల ఎంతో గర్విస్తున్నాను. అయితే ప్రస్తుత సంఘటనలు నన్ను, నాకు అండగా నిలిచిన వారిని అగాథంలోకి నెట్టేశాయి’ అని ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇక ఇజ్రాయెల్ దేశ చరిత్రలోనే ఇలాంటి ఆరోపణలు చేయబడిన మొదటి ప్రధానిగా నెతన్యాహు నిలిచారు. అదే విధంగా ఈ ఆరోపణలు రుజువు అయినట్లయితే తన పదవికి రాజీనామా చేయడంతో పాటుగా... కొన్ని నెలల పాటు జైలు శిక్ష పడే అనుభవించాల్సి ఉంటుంది. కాగా ఇజ్రాయెల్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలోనూ నెతన్యాహు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టి వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి ఖరీదైన నగలు, సిగరెట్లు తదితర వస్తువులు లంచంగా స్వీకరించారంటూ ప్రస్తుతం ఆయనపై చార్జిషీట్ నమోదైంది. ఈ క్రమంలో నెతన్యాహు రాజీనామా చేయాలంటూ ఆయన నివాసం ఎదుట నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఇక సుదీర్ఘకాలంగా ప్రధానిగా సేవలు అందించిన నెతన్యాహు లికుడ్ పార్టీ నుంచి తొలిసారిగా పోటీ చేసి.. ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 1993లో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వివిధ పదవులు అలకరించారు. -
‘క్షమించేది లేదు.. ప్రతీకారం తీర్చుకుంటాం’
గాజా: పాలస్తీనియన్ ఉగ్రసంస్థ ఇస్లామిక్ జీహాద్ అగ్ర నాయకుడు బాహా అబు అల్ అట్టాను అంతమొందించేందుకు ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపించింది. మంగళవారం జరిపిన ఈ మెరుపు దాడిలో అబుతో పాటు అతడి భార్య, ఇద్దరు కుమారులు కూడా మృతిచెందారు. వీరితో పాటు పది మంది పాలస్తీనియన్లు మృత్యువాత పడగా.. మరో 25 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఇందుకు స్పందనగా ఇరాన్ సహాయంతో ఇస్లామిక్ జీహాద్ సైతం ఇజ్రాయెల్‌పై క్షిపణులతో దాడి చేసింది. ఈ క్రమంలో గాజాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మిడిల్ ఈస్ట్ రాయబారి పరిస్థితులను పర్యవేక్షించేందుకు కైరో(ఈజిప్టు రాజధాని)కు పయమైనట్లు సిరియా మీడియా కథనం వెలువరించింది. కాగా ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పరోక్షంగా స్పందించారు. అల్ అట్టాను అతిపెద్ద బాంబుగా అభివర్ణించిన ఆయన.. గాజా- ఇజ్రాయెల్ సరిహద్దులో రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించాడని పేర్కొన్నారు. తమకు ఎవరితోనై శత్రుత్వం పెంచుకునే ఉద్దేశం లేదని... అయితే స్వీయ రక్షణకై ఎంతదూరం వరకైనా వెళ్తామని చెప్పుకొచ్చారు. అయితే అల్ అట్టా హతం గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. మరోవైపు... ఇస్లామిక్ జీహాద్ గాజాలో తమ నాయకుడి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ సందర్భంగా గాల్లోకి తుపాకులు పేల్చిన ఉగ్రవాదులు... ఆలస్యమైదే కావొచ్చు గానీ.. తప్పక ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ‘ఇజ్రాయెల్ రెండుసార్లు దాడులు చేసింది. సిరియా, గాజాలో యుద్ధాన్ని ప్రకటించింది’ అని ఇస్లామిక్ జీహాద్ నాయకుడు అల్- బాటిష్ పేర్కొన్నాడు. అనంతరం బాంబులతో ఇజ్రాయెల్‌పై దాడికి తెగబడ్డారు. ఇక పాలస్తీనియన్ మరో ఉగ్ర సంస్థ ‘హమాస్’ సైతం అట్టా మృతిని తీవ్రంగా పరిగణించింది. ‘క్షమించేది లేదు. ఇజ్రాయెల్‌కు మేమేంటో చూపిస్తాం. యుద్ధం అనేది వస్తే దానికి పూర్తి బాధ్యత వాళ్లదే అని హెచ్చరికలు జారీ చేసింది. కాగా గాజాను పాలిస్తున్న హమాస్.. ఒకప్పుడు ఇస్లామిక్ జీహాదీని తీవ్రంగా వ్యతిరేకించేది. అయితే ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఈ రెండు సంస్థలు ఒక్కటైనప్పటికీ... వాటి మధ్య బంధం నేటికీ బలపడలేదు. ఇక స్వతంత్ర ప్రాంతంగా ఉన్న పాలస్తీనియన్ రాజ్యం గాజాపై ఆధిపత్యం కోసం అటు ఉగ్రసంస్థలు, ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ ఎన్నో ఏళ్లుగా పరస్పరం దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. బాంబు దాడులు, సైనికుల కాల్పులు, నిరసనలతో ఎల్లప్పుడూ గాజా రణరంగాన్ని తలపిస్తుంది. మధ్యధరా సముద్ర తూర్పు తీరంలో ఉన్న ఈ ప్రాంతం ఈజిప్టు వాయువ్య ప్రాంతంతో 11 కిలోమీటర్ల మేర.. ఇజ్రాయెల్‌తో 51 కిలోమీటర్ల మేర సరిహద్దు కలిగి ఉంది. -
నిర్మాణ రంగంలోనూ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇండియా – ఇజ్రాయెల్ దేశాల మధ్య ఇన్నాళ్లుగా రక్షణ, వ్యవసాయ రంగాల్లో మాత్రమే ద్వైపాక్షిక వాణిజ్యం జరిగిందని, ఇక నుంచి సాంకేతికత, మౌలిక, నిర్మాణ రంగాల్లో బలపడాల్సిన అవసరముందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో మాదిరిగా మౌలిక, నిర్మాణ రంగంలోనూ సాంకేతికత, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సీ (ఏఐ), రోబోటిక్స్ వంటి ఆధునిక టెక్నాలజీ వినియోగం పెరగాలని చెప్పారాయన. అప్పుడే నిర్మాణాలు వేగవంతం కావటంతో పాటూ ఉత్పాదక వ్యయం తగ్గుతుందని, దీంతో ధరలు కూడా తగ్గే అవకాశముంటుందని తెలియజేశారు. ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ నగరంలో కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) న్యాట్‌కాన్ సదస్సు– 2019 మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి నెతన్యాహు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 102 మిలియన్ డాలర్ల రియల్టీ... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇజ్రాయిల్ గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇఫత్ షాషా బిటోన్ మాట్లాడుతూ.. ‘‘1992లో ఇండియా– ఇజ్రాయిల్ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రారంభమైంది. మొదట్లో 200 మిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం.. ప్రస్తుతం 5.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో రియల్ ఎస్టేట్ వాటా 102 మిలియన్ డాలర్లుగా ఉంది’’ అని తెలియజేశారు. మౌలిక, నిర్మాణ రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షి వాణిజ్యం మరింత బలపడాలని సూచించారు. ఇప్పటికే నరేంద్ర మోదీ ఇజ్రాయిల్‌ను రెండు సార్లు సందర్శించారని, వచ్చే నెలలో మరోసారి పర్యటించనున్నారని తెలియజేశారు. ప్రతికూలంలో రియల్టీ... రెరా, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ వంటి కొత్త చట్టాల్ని రియల్ ఎస్టేట్ రంగంలో అమలు చేయటం అంత సులువైన విషయం కాదని, దీనికి కొంత సమయం పడుతుందని అప్పటివరకు ప్రతికూల పరిస్థితులు తప్పవని హెచ్డీఎఫ్సీ ఎండీ రేణు సూద్ కర్నాడ్ చెప్పారు. స్వల్పకాలంలో రియల్టీలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో శాశ్వత ప్రయోజనాలు దక్కుతాయని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా బ్యాంకింగ్, మార్కెట్ వ్యవస్థలో నిధుల సమస్య ఉందని, అందుకే ప్రాజెక్ట్ ఫండింగ్ పూర్తి స్థాయిలో జరగట్లేదని తెలియజేశారు. అంతిమ కొనుగోలుదారుడిని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్, కన్స్ట్రక్షన్, ఫండింగ్ ప్లాన్ చేసుకోవాలని కర్నాడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో టెల్ అవీవ్ డెప్యూటీ మేయర్ అసఫ్ హరెల్, ఇండియా ఇజ్రాయిల్ అంబాసిడర్ పవన్ కపూర్, సీబీఆర్ఈ ఇండియా చైర్మన్ అండ్ సీఈఓ అన్షుమన్ మేగజైన్, క్రెడాయ్ చైర్మన్ జక్షయ్ షా, నేషనల్ ప్రెసిడెంట్ సతీష్ మగర్, న్యాట్‌క్యాన్ కన్వినర్ గుమ్మి రాంరెడ్డి, కో–కన్వినర్ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశంలోని 200కు పైగా క్రెడాయ్ చాప్టర్ల నుంచి 1,200 మందికి పైగా డెవలపర్లు పాల్గొన్నారు. -
విడిపోని స్నేహం మనది
న్యూఢిల్లీ: స్నేహితుల దినోత్సవం సందర్భంగా భారత్‌కు ఇజ్రాయెల్ వినూత్నంగా సందేశం పంపింది. బ్లాక్‌బస్టర్ హిందీ సినిమా ‘షోలే’లోని ఏ దోస్తీ హమ్ నహీ తోడేంగే.. పాటను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘భారత్‌కు ఫ్రెండ్‌షిప్‌డే శుభాకాంక్షలు! మన స్నేహం మరింత బలపడాలి, భాగస్వామ్యం ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి’ అంటూ ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ట్విట్టర్లో పేర్కొంది. దీంతోపాటు ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుల సమావేశాల దృశ్యాలను, 1975 నాటి హిందీ హిట్ సినిమా ‘షోలే’లోని ఏ దోస్తీ హమ్ నహీ తోడేంగే(మన స్నేహాన్ని వదులుకోం)పాటను నేపథ్యంగా జత చేసింది. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య స్నేహ భావం కలకాలం నిలిచి ఉంటుందంటూ హీబ్రూ భాషలో ట్వీట్ చేశారు. ‘కృతజ్ఞతలు. అద్భుతమైన ఇజ్రాయెల్ ప్రజలకు, మంచి స్నేహితుడు నెతన్యాహుకు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. రెండు దేశాల మైత్రి బలమైంది, శాశ్వతమైంది. ఈ స్నేహం మరింత వర్థిల్లాలి’ అని పేర్కొన్నారు. -
మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని ట్వీట్; నెటిజన్లు ఫిదా..!
న్యూఢిలీ : చిన్నా పెద్దా తేడాలేకుండా ‘ఫ్రెండ్షిప్ డే’ రోజున స్నేహితులందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఇక గత 25 ఏళ్లుగా ఇజ్రాయెల్, భారత్ మధ్య కొనసాగుతున్న మెరుగైన ద్వైపాక్షిక సంబంధాలకు తోడు ఇరుదేశాల ప్రధానులు బెంజమిన్ నెతన్యాహు, నరేంద్ర మోదీ మధ్య స్నేహబంధం కూడా ఉంది. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా నెతన్యాహు ప్రధాని మోదీకి ‘స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు’ తెలిపారు. (చదవండి : ఇజ్రాయెల్ ఎన్నికల్లో ‘మోదీ’ ప్రచారం) ఈ మేరకు ఆయన 1975లో వచ్చిన బాలీవుడ్ ఎవర్గ్రీన్ సూపర్‌హిట్ ‘షోలే’ చిత్రంలోని ‘యే దోస్తీ హమ్ నహీ తోడేంగే’ పాటను కోట్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘మన స్నేహం మరింత బలపడాలి. ఉన్నత శిఖరాలకు చేరాలి’ అని ఆకాక్షించారు. 2017లో మోదీ పర్యటన సందర్భంగా దిగిన ఫొటోలను షేర్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని ట్వీట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలాఉండగా.. ఇజ్రాయెల్ పార్లమెంటుకు సెప్టెంబర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, ఎన్నికలకు 8 రోజుల ముందు నెతన్యాహు భారత్‌లో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ-నెతన్యాహు చేతులు కలిపిన ఫొటోను ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్‌లో ప్రదర్శించడం విశేషం. Happy #FriendshipDay2019 India! May our ever strengthening friendship & #growingpartnership touch greater heights. 🔊🎧🎶 ये दोस्ती हम नहीं तोड़ेंगे..... 🇮🇱❤🇮🇳 pic.twitter.com/BQDv8QnFVj — Israel in India (@IsraelinIndia) August 4, 2019 -
ఇజ్రాయెల్ ఎన్నికల్లో ‘మోదీ’ ప్రచారం
టెల్అవీవ్: ఇజ్రాయెల్ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లతో దిగిన ఫొటోలతో భారీ బ్యానర్లు రూపొందించి ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాను ప్రపంచస్థాయి నేతననీ, ప్రతిపక్షాలు తనకు పోటీయేకాదని నెతన్యాహూ చెబుతున్నారు. అంతేకాకుండా ఇజ్రాయెల్ భద్రత తనతోనే సాధ్యమని అంటున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నెతన్యాహూ గెలవడం కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. పార్లమెంటుకు ఏప్రిల్ 9న జరిగిన ఎన్నికల్లో నెతన్యాహూ నేతృత్వంలోని లికుడ్ పార్టీ 35 సీట్లు సాధించినా ప్రభుత్వ ఏర్పాటులో విఫలమైంది. దీంతో సెప్టెంబర్ 17న మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
కార్టూన్లకు న్యూయార్క్ టైమ్స్ గుడ్‌బై
సాక్షి, న్యూఢిల్లీ : ఇక అంతర్జాతీయ ఎడిషన్‌లో కూడా రోజువారి రాజకీయ కార్టూన్ల ప్రచురణను నిలిపివేస్తున్నట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రకటించింది. కొన్నేళ్ల క్రితమే దేశీయ ఎడిషన్లలో రాజకీయ కార్టూన్ల ప్రచురణను ఈ పత్రిక నిలిపివేసింది. తమ అంతర్జాతీయ ఎడిషన్‌లో కొన్ని పేజీల్లోని కార్టూన్లు జాతి విద్వేష పూరితంగా ఉంటున్నాయని, ఇటీవల ప్రచురించిన ఓ కార్టూన్ కూడా అదే తరహాలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పత్రికా యాజమాన్యం ప్రకటించింది. గత ఏప్రిల్ 25వ తేదీన ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజామిన్ నెతాన్యూహు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై పత్రిక ప్రచురించిన రాజకీయ కార్టూన్ జాతి విద్వేషాన్ని ప్రతిబింబించినట్లు ఉందని ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. బెంజామిన్ అనే కుక్క మెడకు తాడువేసి ట్రంప్ లాగుతున్నట్లు ఆ రాజకీయ వ్యంగ్య చిత్రం ఉంది. ఈ కార్టూన్‌ను ఉద్దేశపూర్వకంగా వేయలేదని, తమ దష్టికి రాకుండానే ప్రచురణకు నోచుకుందని ఆ పత్రిక వివరణ కూడా ఇచ్చుకుంది. చూసినా, చూడకపోయిన ప్రచురించిన వార్తలకు, కార్టూన్లకు పత్రికా యాజమాన్యం బాధ్యత వహించాల్సిందే. చూడలేదనడం అర్థరహితం. అలాగే వివాదాస్పదం అయినందున మొత్తానికి రాజకీయ కార్టూన్లనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం కూడా అర్థరహితమే అవుతుంది. జాతి విద్వేషాలను రెచ్చగొట్టకుండా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూనే భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించుకోవాల్సిన కర్తవ్యం కూడా పత్రికా యాజమాన్యంకు ఉండాల్సిందే. న్యూయార్క్ టైమ్స్ యాజమాన్యం భావిస్తున్నట్లుగా కార్టూన్లు దేశాల సరిహద్దులు దాటి వెళుతున్నప్పటికీ వాటికి సరిహద్దులంటూ ఉండవు. వివిధ దేశాల్లో కార్టూన్లపై వివాదం చెలరేగడం కొత్త కాదు. దానిష్ పత్రిక ‘ఐలాండ్స్ పోస్టెన్’ ప్రవక్త మొహమ్మద్ కార్టూన్‌ను ప్రచురించినందుకు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఆ కార్టూన్‌ను పునర్ ముద్రించడమే కాకుండా, ఉద్దేశపూర్వకంగా ఇస్లాం మత విశ్వాసాలకు వ్యతిరేకంగా పలుసార్లు కార్టూన్లను ప్రచురించినందుకు ఫ్రెంచ్ వ్యంగ్య వార పత్రిక ‘చార్లీ హెబ్డో’పై పలుసార్లు దాడులు జరిగాయి. 2011లో ఆ పత్రికా కార్యాలయంపై బాంబు దాడి జరగ్గా, 2015, జనవరిలో ఆ పత్రిక కార్యాలయంపై కాల్పులు జరిగాయి. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సెరినా విలయమ్స్‌పై మార్క్‌నైట్స్ వేసిన కారికేచర్ కూడా వివాదాస్పదం అయింది. జాతి, మత విశ్వాసాలకు సంబంధించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలిగానీ వివాదాస్పదం అవుతున్నాయన్న కారణంగా కార్టూన్లను నిలిపివేయడం అర్థరహితమే కాదు, మూర్ఖత్వమే అవుతుంది. -
ఇజ్రాయెల్ ప్రధాని భార్యకు జరిమానా
జెరుసలేం: ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసిన కేసులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భార్య సారాకు ఓ న్యాయస్థానం జరిమానా విధించింది. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన కేసులో సారా రూ.10 లక్షల (15,000 డాలర్లు) జరిమానా చెల్లించాలని తీర్పు వెలువరించింది. ప్రధాని కుటుంబంపై కోర్టుల్లో ఏళ్లుగా నడుస్తున్న అవినీతి కేసుల్లో ఇది ఒకటి. 2010–2013 సంవత్సరాల్లో ప్రధాని అధికార నివాసంలో పూర్తి స్థాయి చెఫ్ ఉన్నప్పటికీ విలాసవంతమైన హోటళ్లలో తినేవారని, ఇందుకోసం లక్ష డాలర్ల వరకు వెచ్చించారని సారాపై ఆరోపణలున్నాయి. వాదనలు విన్న కోర్టు రూ.10 లక్షలు (15వేల డాలర్లు) చెల్లించాలని సారాను ఆదేశించింది. విలాసవంతమైన జీవనం, సిబ్బందితో అనుచిత ప్రవర్తన వంటి ఆరోపణలతో సారా(60) ఇజ్రాయెల్ ఇమెల్డా మార్కోస్‌గా పేరుతెచ్చుకున్నారు. ఫిలప్పీన్స్ ఒకప్పుటి నియంత ఫెర్డినాండ్ మార్కోస్ భార్యే ఇమెల్డా. ప్రజాధనంతో విలాసవంతమైన జీవితం గడిపిన ఆమె ఒకప్పుడు వార్తల్లోకి ఎక్కారు. -
దేశాధ్యక్షుడు ‘చికెన్ డాన్స్’ స్టెప్పులు
-
ప్రధాని ‘చికెన్ డ్యాన్స్’.. వీడియో వైరల్
టెల్ అవీవ్, ఇజ్రాయెల్ : సంగీతానికి రాళ్లయినా కరగాల్సిందే..! అనే సామెత మనందరికి తెలుసు. మనసుని ఉర్రూతలూగించే పాటకు ఎవరి పాదమైనా కదలక మానదు. ఇజ్రాయెల్ దేశాధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహుకి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. యూరో విజన్ పాటల పోటీలో విజేతగా నిలిచిన నెటా బార్జీలాల్ పాటకు నెతన్యాహు స్టెప్పులు వేశారు. ఓ వైపు ప్రేక్షకుల్ని కట్టిపడేసే బార్జీ పాట.. మరోవైపు నెతాన్యాహు ‘చికెన్ డాన్స్’తో అక్కడున్న వారంతా గుక్క తిప్పుకోలేకపోయారు. బుధవారం ప్రధాని అధికార నివాసంలో జరిగిన యూరో విజన్ పాటల పోటీ విజేత బార్జీలాల్ సన్మాన కార్యక్రమంలో ఈ విశేషం చోటు చేసుకుంది. ప్రధాని భార్య సారా కూడా పాల్గొన్న ఈ కార్యక్రమ విశేషాలను నెతన్యాహు ట్విటర్లో పంచుకున్నారు. ‘నిజంగా ఇది మర్చిపోలేని రోజు. మీతో ఆడి పాడడం గొప్ప అనుభూతి. దేశం ఖ్యాతి పెంచిన మీకు అభినందనలు’ అంటూ నెతన్యాహు ఆనందం వ్యక్తం చేశారు. యూరో విజన్ విజేత నెటా బార్జీలాల్పై ప్రశంసల వర్షం కురిపించారు. లిస్బన్లో శనివారం జరిగిన యూరోవిజన్ పోటీలో బార్జీలాల్ పాల్గొన్నారు. జపనీస్ వస్త్రధారణతో ఆడిపాడిన 25 ఏళ్ల బార్జీ తన అద్భుత ప్రదర్శనతో ప్రతిష్టాత్మక పోటీలో విజేతగా అవతరించారు. ‘ఐ యామ్ నాట్ యువర్ టాయ్’అంటూ స్త్రీ సాధికారత ప్రధానంగా సాగిన బార్జీ పాటను ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మంది వీక్షించారు. కాగా, వచ్చే ఏడు యూరో విజన్ పోటీలకు ఇజ్రాయెల్ ఆతిథ్యం ఇవ్వనుంది. -
సంస్కరణల చుట్టూ మోదీ చక్కర్లు
♦ అవలోకనం చెత్త పారేయడం అనేది వికారమైనది, చికాకు పరిచేది. అయితే ప్రజారోగ్య సమస్య వలే ఇది జాతీయ సమస్యేమీ కాదు. ప్రజారోగ్య లోపంతో మన పిల్లల్లో 38 శాతంమందికి రెండేళ్ల వయసులోనే ఎదుగుదల ఆగిపోతోంది. కానీ మోదీ దృష్టి, ఆయనిచ్చిన సందేశం పూర్తిగా చెత్త వేయడం వల్ల కలిగే అనర్ధాలపైనే కేంద్రీకరించి ఉంది. దేశ పౌరుల వ్యక్తిత్వంలో మార్పు తీసుకురావాలన్నదే ఆయన ఉద్దేశం. అందుకు ప్రవర్తనాపరమైన మార్పు...అంతర్గతమైన పరివర్తన అవసరమన్నది ఆయన భావన. ‘మీరు విప్లవ నాయకుడు. భారతదేశంలో విప్లవాత్మక మార్పు తెస్తున్నారు. ఈ మహత్తరమైన దేశాన్ని భవిష్యత్కాలానికి తీసుకెళ్తున్నారు’. ఈ వారం మన దేశా నికొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మన ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి మాట్లాడిన మాటలివి. ఆయన మాటల్లోని అంతరార్ధం ఏమై ఉంటుంది? నా దగ్గరున్న నిఘంటువు ‘ఒక సంపూర్ణమైన, ఆకస్మికమైన పరివర్తన ఇమిడి ఉండేదానినే’ విప్లవంగా చెబుతోంది. సుస్థాపితమైన వ్యవస్థకు, ప్రత్యేకించి ఒక రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటువంటి చర్యను ఈ విప్లవ నాయకులు కోరుకుంటారు. భారత రాజ్యాన్ని నెతన్యాహు ‘మహత్తరమైనద’ంటున్నారు గనుక (ఆయన ఎందుకలా అనుకుంటున్నారన్నది నాకు ఆసక్తికరం) మోదీ ఆ వ్యవస్థను «కూలదోస్తున్నారని నెతన్యాహు అనుకోవడం లేదని మనం అర్ధం చేసుకోవచ్చు. మరి ఆయన చెప్పదల్చుకున్నదేమిటి? ఆ సంగతి నిజంగా తెలియదు, ఊహించే ప్రయత్నం కూడా చేయను. ప్రశంసలకు సులభంగా పడిపోయే ఒక కొనుగోలు దారుకు ఆయుధాలు అమ్మేందుకు నెతన్యాహు వచ్చారనే వాస్తవాన్ని కాసేపు పక్కన పెడదాం. ఒక రకంగా వ్యవస్థలో విప్లవాత్మక మార్పును మోదీ తీసుకు రాదల్చుకున్నారన్నది వాస్తవం. ఏమిటా మార్పు? నేను దీన్ని సంస్కరణ అంటాను... అలాగని దాన్ని వాడుకలో ఉన్న అర్ధంతో నేను ఉపయోగించడం లేదు. ఉదాహరణకు మోదీ పథకాల్లో ఒకటైన స్వచ్ఛభారత్ అభియాన్ తీసు కుందాం. అది ఎంత ఆర్భాటంగా ప్రారంభమైందో అందరికీ గుర్తుండే ఉంటుంది. మోదీ స్వయంగా చీపురు పట్టుకుని రోడ్డును పరిశుభ్రపరిచారు. ఇతరుల్ని కూడా అలా చేయమని ప్రోత్సహించారు. వాటిపై ట్వీట్లు చేశారు. స్వచ్ఛ భారత్ పర మార్ధమేమిటో, అది ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నదో ఆయన వెబ్సైట్ వివరిం చింది. ‘2019లో జరగబోయే మహాత్మా గాంధీ 150వ జయంతికి మనం అర్పించ గల అత్యుత్తమ నివాళి స్వచ్ఛ భారత్... మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన భారతదేశాన్ని సాకారం చేయడానికి ముందుకు రావాలని ప్రజ లకు ప్రధాని ఉద్బోధించారు. మందిర్ మార్గ్ పోలీస్‌స్టేషన్ వద్ద నరేంద్ర మోదీయే స్వయంగా ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. చెత్తను ఊడ్చడానికి చీపురు పట్టుకుని ఈ దేశవ్యాప్త ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించారు. చెత్తాచెదారాన్ని వేయొద్దు, ఎవరినీ వేయనీయొద్దు అని ఆయన పిలుపునిచ్చారు. ‘చెత్తవేయను, ఎవరినీ వేయనీయను’ అనే మంత్రోపదేశం చేశారు’ అని ఆ వెబ్సైట్ చెబుతోంది. పీఠికలో ఆయన పరిశుభ్రత, స్వచ్ఛత, చెత్త, చెత్త పారేయడం అనే పదాలను 21 సార్లు ఉపయోగించారు. మరుగుదొడ్డి, ప్రజారోగ్య పరిరక్షణ పదాలు మాత్రం ‘భారతీయ కుటుంబాల్లో దాదాపు సగభాగం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య లకు కారణం వారి ఇళ్లలో మరుగుదొడ్లు లేకపోవడమే...’ అని చెప్పిన సందర్భంలో ఒక్కసారి వచ్చాయి. తొలుత నిర్ణయించుకున్న కార్యక్రమాలకు కొన సాగింపుగా దీన్ని చేర్చాలని తర్వాత అనుకోవడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చు. చెత్త పారేయడం అనేది వికారమైనది, చికాకు పరిచేది. ప్రజారోగ్య పరిరక్షణ వలే ఇది జాతీయ సమస్యేమీ కాదు. ప్రజారోగ్య లోపంవల్ల మన పిల్లల్లో 38 శాతం మందికి రెండేళ్ల వయసులోనే ఎదుగుదల ఆగిపోతోంది. కానీ మోదీ దృష్టి, ఆయని చ్చిన సందేశం పూర్తిగా చెత్తపైనే కేంద్రీకరించి ఉంది. దేశ పౌరుల వ్యక్తిత్వంలో మార్పు తీసుకురావాలన్నదే ఆయన ఉద్దేశం. అందుకు ప్రవర్తనాపరమైన మార్పు.. అంతర్గతమైన పరివర్తన అవసరమన్నది ఆయన భావన. ఇది ఆధ్యాత్మికవేత్తలు, మత నాయకులు చెప్పే సంస్కారం లాంటిది. ఇది అందరికీ తెలిసిన రాజకీయా లకు సంబంధించింది కాదు. పెద్ద నోట్ల రద్దు వంటి విపరీత నిర్ణయాలకు స్ఫూర్తి ఇలాంటి సంఘ సంస్కరణ కోణం నుంచే ఎవరైనా చూడాల్సి ఉంటుంది. భారతీ యులను నల్లడబ్బుకు దూరం చేసితీరాలి. ఇది చేయాలంటే బలవంతంగానైనా వారి ప్రవర్తనను మార్చడం, వారి దగ్గరున్న డబ్బు గుంజుకోవడమే మార్గం. ఇది అంతిమంగా ప్రభావశీలమైనదైనా, కాకపోయినా... ఇది లక్షలాదిమందిపై వ్యతి రేక ప్రభావం చూపినా, చూపకపోయినా... ఈ కఠినమైన విధానంవల్ల జనం ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడినా–వాటన్నిటినీ ఆ తర్వాత నిపుణులు చర్చించుకుంటారు. ఆయన చేసి తీరాలనుకున్నారు. తాను సరైనదని అనుకున్నదా నిని ప్రజలతో బలవంతంగా చేయించారు. జనాదరణ ఉన్న మోదీ లాంటి నేత అమలుచేసిన సంస్కరణ ఇది. బాలీవుడ్ దర్శకుడు మాధుర్ భండార్కర్ ఈమధ్య ‘ఒక ప్రధాని సంఘ సంస్కర్తగా మారినప్పుడు’ అనే శీర్షికతో ఒక పత్రికలో వ్యాసం రాస్తూ ఇలాంటి కోణాలనే స్పృశించారు. ‘మన సమాజం ఎంత గొప్ప పరివర్తనకు లోనవుతున్నదో చెప్పడానికి అనేక ఉదాహరణలున్నాయి. యోగాను ప్రజల వద్దకు తీసుకెళ్లడం, వీఐపీ సంస్కృతిని అంతం చేయడం కోసం కార్లపై ఎర్రరంగు లైట్లను నిషేధిం చడం, దివ్యాంగులకు ప్రత్యేక పథకాలు తీసుకురావడం, వారి అవసరాల గురించి ప్రజల్లో అవగాహన ఏర్పర్చడం, గెజిటెడ్ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందడానికి వారి సంతకాల కోసం తిరిగే స్థితి లేకుండా చేయడం, కంపోస్టింగ్ ద్వారా సొంతంగా ఎరువు తయారుచేసుకోమని ప్రజలకు ఉద్బోధించడం– ఇలాంటి పథకాలన్నీ చిన్నవిగానే కనబడొచ్చు. కానీ అవి కలగజేసే ప్రభావం తీవ్రమైనది’ అని భండార్కర్ రాశారు. ఇవి దేశ ప్రధాని స్థాయిలోనివారు పట్టించు కోవాల్సినవా అన్న కోణంలో నేను దీన్ని చూడటం లేదు. మోదీ ఇలాంటి సామా జిక మార్పుపై ఆరాటపడుతున్నారన్నదే నా వాదన. ఏదైనా అంశం విషయంలో పొరబడి ఉండొచ్చు లేదా తొందరపాటుతో చేసి ఉండొచ్చని కొన్నిసార్లు ఆయనకు అనిపించవచ్చు. ఇవ్వాళ్టి స్వచ్ఛభారత్ వెబ్సైట్లలో మరుగుదొడ్లు, ప్రజారోగ్య పరి రక్షణ ప్రాధాన్యతా స్థానంలో ఉన్నాయి. చెత్త పారేయడం గురించి చెప్పడం చాలా స్వల్పంగా ఉంటుంది. నెతన్యాహు ప్రశంసకు మోదీ జవాబిస్తూ ‘ఫలితాల సాధన విషయంలో చాలా అసహనంతో ఉంటానని నాకు పేరొచ్చింది. మీరు కూడా అంతే’ అన్నారు. మనల్ని సంస్కరించాలన్న ఆయన ప్రయత్నాలు ఇకపై కూడా కొనసాగుతాయని మనం భావించాలి. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
వివాదాస్పద పాటతో ఇజ్రాయెల్ ప్రధానికి ఆహ్వానం!
అహ్మదాబాద్ : పద్మావత్ చిత్రంపై వివాదం కొనసాగిన వేళ.. గూమర్ పాటపై కూడా రాజ్‌పుత్ కర్ణిసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. రాణి పద్మిణి పాత్రతో గంతులేయించటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మొన్నీ మధ్యే మధ్య ప్రదేశ్‌లో ఓ స్కూల్ కార్యక్రమంలో ఆ పాటపై పిల్లలు నృత్యాలు చేయగా.. రంగ ప్రవేశం చేసిన కర్ణిసేన.. కుర్చీలు విరిచేసి కార్యక్రమాన్ని రసాభాస చేసిపడేసింది. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర హోంశాఖా మంత్రి భూపేంద్ర సింగ్ ‘‘చిత్రాన్ని నిషేధించినప్పుడు.. అందులో పాటను ప్రదర్శించటం సరికాదంటూ’’ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే అదే పాటను ఇప్పుడు గుజరాత్లో ఓ అధికారిక కార్యక్రమానికి వినియోగించటం విశేషం. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లో ఇరు దేశాల సంయుక్త కళా ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నెతన్యాహు-మోదీ రాక సందర్భంగా నిర్వాహకులు స్కూల్ చిన్నారులతో గూమర్ పాటకు నృత్యాలు చేయించారు . ఇరు దేశాల ప్రధానులిద్దరూ నడుచుకుంటూ వస్తుండగా.. ఈ పాటకు ఓ చిన్నారి ప్రదర్శన ఇవ్వటం విశేషం. స్థానిక బీజేపీ నేతలు దగ్గరుండి మరీ ఈ వేడుకలు నిర్వహించటం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఇదిలా ఉంటే పద్మావత్‌ను బ్యాన్ చేసిన రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఒకటి. #Ghoomar song of @filmpadmaavat played and dance performed on it in #Ahmedabad. This program is to welcome PM @narendramodi & Isreal PM #Netanyahu. 👏👏👏 pic.twitter.com/layjWd0t5R — Kirandeep (@raydeep) 17 January 2018 -
ఐ ఫోన్, ఐ ప్యాడ్ తర్వాత ప్రపంచం దృష్టి దీనిపైనే...
అహ్మదాబాద్ : ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యుర్షిప్ అండ్ టెక్నాలజీ.. సింపుల్‌గా చెప్పాలంటే ‘ఐ క్రియేట్’ ! దేశప్రజల అవసరాలకు తగ్గట్లు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అంకురించే సంస్థలకు చేదోడుగా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటయిందే.. ‘ఐ క్రియేట్’ ఇంక్యుబేషన్ సెంటర్. గుజరాత్‌లోని అహ్మదాబాద్ శివారు డియోధోలెరా గ్రామంలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కేంద్రాన్ని భారత-ఇజ్రాయెలీ ప్రధానులు సంయుక్తంగా బుధవారం ప్రారంభించారు. తొలిరోజే ఇరు దేశాలకు చెందిన 38 ప్రాజెక్టులకు ఆమోదం పొందాయి. వీటిలో 18 భారత్‌కు చెందిన ప్రాజెక్టులుకాగా, 20 ఇజ్రాయెల్ ఎంటర్ప్రెన్యూర్లు రూపొందించినవి. జై భారత్, జై ఇజ్రాయెల్ : ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. ‘‘ఐ ఫోన్, ఐ ప్యాడ్ల తర్వాత ప్రపంచమంతా దృష్టిసారించబోయేది ‘ఐ క్రియేట్’ సెంటర్‌పైనే! ఇండియా-ఇజ్రాయెల్‌ల సహకారాత్మక ప్రయాణంలో ఐ క్రియేట్ ఏర్పాటు ఒక కీలక ముందడుగు. జైహింద్, జై భారత్, జై ఇజ్రాయెల్!’’ అని అన్నారు. ఐ.. చాలా కీలకం : ‘‘ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యుర్షిప్ అండ్ టెక్నాలజీని షార్ట్‌గా i-CREAT అని వ్యవహరిస్తున్నాం. ఇందులో ‘ఐ’ చిన్న అక్షరంగా ఉంచడానికి కారణం ఉంది. ఇంగ్లీష్‌లో ఐ అంటే నేను. ఈ నేను అనే అహాన్ని వీడటం చాలా కష్టమైనపని. ఒక్కసారి దాన్ని అధిగమించామా ఇక తిరుగుండదు. అప్పుడు ఐ అంటే మనం అనే భావన వస్తుంది. తక్కువ ఖర్చుతో పేదల జీవితాల్లో మార్పులు తీసుకురాగల ఎన్నో ఆవిష్కరణకు ఐ క్రియేట్ కేంద్రంగా నిలవనుంది’’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యువ ఆవిష్కర్తలతో మోదీ-నెతన్యాహు -
భారత్‌పై మరోమారు విషం కక్కిన పాక్
ఇస్లామాబాద్ : ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ.. భారత పర్యటనపై పాకిస్తాన్ మరోసారి విషం చిమ్మింది. ఇస్లాంకు భారత్-ఇజ్రాయిల్ దేశాలు వ్యతిరేకమని.. పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తప్పుడు ఆరోపణలు చేశారు. నెతన్యాహూ భారత పర్యటనపైనా ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. భారత్, ఇజ్రాయిల్ దేశాలు.. నిరంతరం ముస్లిం భూభాగాన్ని ఆక్రమించేందుకు కుట్రలు పన్నుతుంటాయని అన్నారు. భారత్ కశ్మీర్‌ను ఆక్రమిస్తే, ఇజ్రయిల్ పాలస్తీనా భూభాగాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకుందని ఆసిఫ్ ఖ్వాజా విమర్శించారు. ఇదిలావుంగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ, నెతన్యాహూ.. అహ్మదాబాద్‌లో రోడ్ షోలో పాల్గొంటున్న సమయంలో పాక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహ్యూ భారత్‌లో ఆరురోజుల పాటు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. -
మోదీ.. మీరు గొప్ప విప్లవనాయకులండీ!
సాక్షి, న్యూఢిల్లీ : ఆరురోజుల భారత పర్యటన కోసం సతీసమేతంగా విచ్చేసిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆదివారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, వ్యవసాయ, విద్యుత్, సినిమా తదితర రంగాలకు సంబంధించి మొత్తం 9 కీలక ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. భేటీ అనంతరం ఇద్దరు అధినేతలు ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. మోదీ.. విప్లవనాయకుడు : ఉమ్మడి ప్రకటన చేస్తూ భారత్, ఇజ్రాయెల్ ప్రధానులు ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. ‘మోదీ అసలైన అర్ధంలో గొప్ప విప్లవనాయకుడు’ అని నెతన్యాహు వ్యాఖ్యానించగా, ‘ఉదార ప్రేమకు ధన్యవాదాలు బిబి..’ అని మోదీ అన్నారు. బెంజిమెన్ నెతన్యాహును ఇజ్రాయెలీలు ‘బిబి’ గానూ వ్యవహరిస్తారన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్-ఇండియాల మైత్రి మునుపటికంటే బలపడుతూ, ఫలవంతంగా ముదుకు సాగుతున్నదని, ఇరుదేశాలూ ఉగ్రబాధితులే కావడంవల్ల రక్షణ రంగంలో పరస్పర సహకారం అనివార్యమైందని నెతన్యాహు చెప్పుకొచ్చారు. ‘అవకాశం చిక్కితే మీతో కలిసి యోగా చేయడానికి ఉవ్విళ్లూరుతున్నా’నని ఆయన చమత్కరించారు. గతేడాది ఇజ్రాయెల్ పర్యటనలో నెతన్యాహు చెప్పిన మాటలను గుర్తుచేస్తూ భారత ప్రధాని మోదీ.. ‘‘రెండు దేశాల మధ్య బంధాలకు అవరోధాలుగా నిలిచే కొన్ని అధికారిక బంధనాలను తెంచుకొని, మరింతగా బలపడదామని గతంలో మీరు అన్నారు. ఆ మాట ప్రకారం భారత్‌లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సిద్ధం చేసిఉంచాం’’ అని అన్నారు. గాజా విషయంలో భారత్ నిర్ణయం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకమైనదే అయినా ఇతరత్రా అంశాలపై ఆ ప్రభావం ఉండబోదని నెతన్యాహు తెలిపారు. ఇక అమెరికా సహా 128 దేశాలు చేసినట్లుగా ‘జెరుసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించే’ విషయంలోనూ భారత్ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడం గమనార్హం. వావ్.. బాలీవుడ్‌లోకి వస్తున్నాం : సినిమా రంగానికి సంబంధించి ఇజ్రాయెల్-భారత్‌ల మధ్య ఒప్పందాలు కుదరడాన్ని ఉటంకిస్తూ.. ‘వావ్.. మేము బాలీవుడ్‌లోకి వస్తుండటం చాలా సంతోషంగా ఉంద’ని నెతన్యాహు అన్నారు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా నెతన్యాహు, ఆయన సతీమణి సారా ముంబైలో బాలీవుడ్ తారలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అటు అందాల తాజ్‌మహల్‌ను కూడా సందర్శించనున్నారు. ఆదివారం ఢిల్లీలో విమానం దిగిన నెతన్యాహుకు.. ప్రోటోకాల్ పక్కనపెట్టిమరీ మోదీ స్వయంగా వెళ్లి స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. -
తప్ప తాగి.. అధ్యక్షుడి కొడుకు చీప్ మాటలు
టెల్ అవీవ్ : ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ తనయుడు యెర్ నెతన్యాహూ తన స్నేహితుడితో జరిపిన సంభాషణ ‘ఆడియో టేపు’ ప్రస్తుతం ఇజ్రాయెల్ రాజకీయాలను కుదిపేస్తోంది. టేపులో గ్యాస్ దిగ్గజం మొఘల్ కొబి మైమన్ తనయుడు ఒరి మైమన్తో యెర్ నెతన్యాహూ సంభాషించినట్లు తెలుస్తోంది. అప్పటికే తప్పతాగిన ఇరువురూ స్త్రీల గురించి, తండ్రుల గురించి చర్చించినట్లు టేపులో ఉంది. 2015లో ఒరి మైమన్తో కలసి యెర్ తరచుగా ప్రభుత్వ వాహనంలో స్ట్రిప్ క్లబ్స్‌కు వెళ్లారు. ఈ ఆడియో టేపు కూడా అప్పట్లో రికార్డు చేసిందే. ఆడియో టేపును ఇజ్రాయెల్ మీడియా దిగ్గజం చానెల్ 2 మంగళవారం ప్రసారం చేసింది. టేపులో ఏముందంటే.. యెర్ నెతన్యాహు (ఒరి మైమన్‌ను ఉద్దేశించి) : బ్రో.. నువ్వు నాకు ట్రీట్ ఇవ్వాలి. మీ డాడ్‌కు అనుకూలంగా మా నాన్న మంచి డీల్ కుదిర్చారు. పార్లమెంట్లో చట్టం పాస్ కాకుండా చూశారు. ఇందుకు ఆయన చాలా కష్టించారు. దానికి అదనంగా మీ కంపెనీకి 20 బిలియన్ డాలర్ల ఒప్పందం కూడా ఇచ్చారు. నేను వేశ్య కోసం ఆన్లైన్ వెతుకుతున్నాను. నువ్వు నా కోసం కనీసం 400 డాలర్లు కూడా ఖర్చు చేయలేవా?. తీవ్ర వ్యతిరేకత యెర్ నెతన్యాహు ఆడియో టేపులో చేసిన వ్యాఖ్యలు ఇజ్రాయెల్‌నే కాక ప్రపంచ దేశాలను కూడా విస్తుపోయేలా చేసింది. మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన యెర్పై ఇజ్రాయెల్ ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో ఆడియో టేపులో తన వ్యాఖ్యలపై స్పందించిన యెర్ నెతన్యాహూ ఇజ్రాయెల్ ప్రజలకు క్షమాపణలు తెలిపారు. మహిళలను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడేలా ఉన్నాయని చెప్పారు. మద్యం మత్తులో చెప్పుకోలేని వ్యాఖ్యలు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని తనను చూడొద్దని కోరారు. తమ కుటుంబంపై బురద జల్లేందుకే మీడియా 2015లోని ఆడియో టేపును ఇప్పుడు బయటపెట్టిందని ఆరోపించారు. కాగా, బెంజిమన్ నెతన్యాహు భార్య సారాపై ఇప్పటికే పలు అవినీతి కేసులు ఉన్నాయి. లక్షా పదివేల డాలర్ల చీటింగ్ కేసుతో పాటు, ప్రభుత్వ నిధులను విలాసవంతమైన విందులకు వినియోగించారనే ఆరోపణలను ఆమె ఎదుర్కొంటున్నారు. -
తన ఫ్రెండ్ మోదీకి స్పెషల్ గిఫ్ట్
జెరూసలేం : తన స్నేహితుడు ప్రధాని నరేంద్రమోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రత్యేకమైన బహుమతి ఇవ్వనున్నారు. త్వరలో ఆయన భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆ విలువైన గిఫ్ట్‌ను మోదీకి అందించనున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల (జనవరి) 14న నెతన్యాహు పర్యటన ప్రారంభం కానుంది. ఆ రోజే మోదీకి గాల్ మొబైల్ వాటర్ డిసాలినైజేషన్-ప్యూరిపైడ్ జీప్‌ను అందిస్తారు. ఈ జీప్‌నకు ఓ ప్రత్యేకత ఉంది. గత ఏడాది (2017) జులై నెలలో మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లినప్పుడు వారిద్దరు కలిసి ఈ జీపులోనే సముద్రపు తీరంలో షికారు చేశారు. దీంతో వారి స్నేహానికి గుర్తుగా ఆయన మోదీకి ఆ జీపునే బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ జీపు ఖరీదు దాదాపు లక్షా పదకొండువేల డాలర్లు ఉంటుందని అంచనా. సముద్రపు నీటిని శుద్ధిపరిచే సాంకేతిక పరిజ్ఞానం భారత్‌కు ఇజ్రాయెల్ అందించేలా ఒప్పందం అయిన విషయం తెలిసిందే. దీనికి గుర్తుగానే ఓల్గా బీచ్‌లో మోదీ, నెతన్యాహు కలిసి సముద్రపు నీటిని శుద్ధి పరిచే జీపులో కాసేపు సరదాగా గడిపారు. -
‘మా జోలికొస్తే.. ఎవరినీ వదిలిపెట్టం’
జెరూసలేం : ఇరాన్ దుందుడుకు చర్యలకు దిగితే.. ప్రతిఘటించేందుకు ఇజ్రాయల్ సిద్ధంగానే ఉందని ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎయిర్ ఫోర్స్ కలిగిన దేశాల్లో ఇజ్రాయిల్ ఒకటి ఆయన చెప్పారు. ప్రపంచంలోని ఏ ప్రాంతాన్ని అయినా.. ఎంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేధించగల సత్తా ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్‌కు ఉందని ఆయన ఇరాన్‌ను పరోక్షంగా హెచ్చరించారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం, శక్తివంతమైన ఎయిర్‌క్రాఫ్టులు, దాడులు చేయడం, స్వీయరక్షనలో ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్‌కు తిరుగులేని సామర్థ్యమందున్న విషయాన్ని ప్రపంచదేశాలు గుర్తించాలని ఆయన అన్నారు. ఇరాన్ సాయుధ దళాలు సిరియాలోని ఇజ్రాయీలీలపై దాడులుకు దిగితే.. పరిస్థితులు తీవ్రంగా మారతాయన్నారు. గతంలో కూడా సిరియాలో ఇరాన్ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసింది.. ఇటువంటి ప్రయత్నాలను ఇజ్రాయిల్ ఏ మాత్రం అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు. గాజాలోని స్థానిక ప్రజలు శాంతియుత జీవనానికి ఇజ్రాయిల్ ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. అయితే బయటి శక్తులు.. గాజా శాంతియుత జీవనంపై ప్రభావం చూపితే.. ఇజ్రాయిల్ సైనికచర్యతోనే సమాధానం చెబుతుందని నెతన్యాహూ పేర్కొన్నారు. -
బ్రిటన్ కేబినెట్ మంత్రి ప్రీతి రాజీనామా
లండన్: బ్రిటన్‌లో భారత సంతతి కేబినెట్ మంత్రి, బ్రెగ్జిట్‌కు గట్టి మద్దతుదారు ప్రీతి పటేల్ (45) పదవికి రాజీనామా చేశారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా అనుమతి లేకుండా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో పాటు పలువురు నేతలతో రహస్యంగా భేటీ కావడంతో పాటు ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలపకపోవడంతో అంతర్జాతీయ అభివృద్ధి మంత్రిగా పనిచేస్తున్న ప్రీతిపై వేటు పడింది. ఇజ్రాయెల్ నేతలతో భేటీ విషయం వివాదాస్పదంగా మారడంతో ఆఫ్రికా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని రావాలని ప్రధాని థెరిసా మే ప్రీతిని ఆదేశించారు. దీంతో బుధవారం ప్రధాని కార్యాలయానికి చేరుకున్న ఆమె థెరిసాకు రాజీనామా సమర్పించారు. రాజీనామా లేఖలో తొలుత క్షమాపణలు తెలిపిన ప్రీతి.. తాను బలంగా ప్రతిపాదించే నిజాయితీ ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యానని అంగీకరించారు. ఇజ్రాయెల్ నేతలతో కేవలం ఉత్సుకతతోనే భేటీ అయినట్లు చెప్పారు. సాధారణంగా విదేశీ పర్యటనలు జరిపే బ్రిటిష్ మంత్రులు ఆ వివరాలను తమ విదేశాంగ శాఖకు తప్పనిసరిగా తెలపాల్సి ఉంటుంది. -
ప్రధాని భార్యపై ఫ్రాడ్ కేసు!
ఇజ్రాయల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భార్య సరా నెతన్యాహు చిక్కుల్లో పడ్డారు. ఆమెపై ఫ్రాడ్ కేసు నమోదు చేయాలని భావిస్తున్నట్టు తాజాగా ఇజ్రాయెల్ టాప్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. క్యాటరింగ్ కోసం ప్రభుత్వ నిధులు 3.59 లక్షల షెకెల్స్ (రూ. 63.94లక్షలు) అక్రమంగా ఖర్చు చేసినట్టు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ ఆరోపణలను ప్రధాని బెంజమిన్ కొట్టిపారేస్తున్నారు. తన భార్యపై అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారని వాదిస్తున్నారు. ఇజ్రాయెల్ న్యాయశాఖ మాత్రం ఈ విషయంలో బెంజమిన్ భార్యపై అభియోగాలు నమోదుచేసే అవకాశముందని సంకేతాలు ఇచ్చింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే సుదీర్ఘంగా విచారణ జరిగిన నేపథ్యంలో త్వరలోనే సరా నెతన్యాహుపై ఫ్రాడ్ కేసు నమోదుచేయవచ్చునని మీడియా ఊహాగానాలు చేస్తోంది. సెప్టెంబర్ 2010, మార్చి 2013 మధ్యకాలంలో ప్రధాని నివాసంలో ఇచ్చిన విందుల కోసం విచ్చలవిడిగా ఖర్చుచేసినట్టు సరా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధాని నివాసంలో ప్రభుత్వం నియమించిన చెఫ్ ఉన్నప్పటికీ, ప్రైవేటు చెఫ్‌లతో వంటకాలు చేయించి ఆమె విందులు ఇచ్చారని, ప్రైవేటు చెఫ్‌లకు ప్రభుత్వ నిధుల కేటాయింపు చట్టవిరుద్ధమని న్యాయనిపుణులు చెప్తున్నారు. ప్రైవేట రెస్టారెంట్ల నుంచి ఆహారం తెప్పించడం, ప్రైవేటు చెఫ్‌లకు చెల్లింపులు చేయడం కోసం అక్రమంగా 359,000 షెకెల్స్‌ను ఖర్చుచేసినట్టు ప్రభుత్వ అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. అయితే, తమ కుటుంబాన్ని రాజకీయంగా వేధించడం కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారని నెతన్యాహు అంటున్నారు. -
ఇజ్రాయెల్ ప్రధాని సతీమణికి కష్టాలు!
జెరుసలేం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భార్య చిక్కుల్లో పడనున్నారు. అక్రమంగా భారీ మొత్తంలో ప్రభుత్వ సొమ్ము వెనుకేసుకున్నారనే పేరిట ఆమె ఆరోపణలు ఎదుర్కోనున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన నిధులను వ్యక్తిగత ఖర్చులకు ఉపయోగించుకోవడమే కాకుండా అక్రమంగా దాదాపు లక్ష డాలర్లను వెనుకేసుకున్నారనే పేరిట నెతన్యాహు భార్య సారా విచారణ ఎదుర్కోనున్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్ న్యాయ శాఖ ఒక ప్రకటన చేసింది. అటార్నీ జనరల్ సారా నెతన్యాహు చేసిన తప్పిదాలకు సంబంధించిన విచారణను చూస్తున్నారని ఈ మేరకు ఆ శాఖ ప్రకటించింది. వ్యక్తిగత డైనింగ్ కార్యకలాపాలకు, క్యాటరింగ్ వంటి సర్వీసులకు ప్రభుత్వ ఖజానాను ఖర్చు చేశారని, విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. అయితే, ఇవన్నీ వాస్తవాలు కావని త్వరలోనే సారా నిరూపించుకుంటారని ప్రధాని నెతన్యాహుకు చెందిన ఫేస్బుక్ పేజీలో వివరణలాంటి పోస్టింగ్ రిప్లైగా పెట్టారు. అయితే, ఈ అంశం రాజకీయపరమైన ప్రభావాన్ని ఏ మేరకు చూపుతుందనేది తెలియాల్సి ఉంది. -
‘ఆప్ కా స్వాగత్ హై మేరా దోస్త్’
జెరూసలెం: తమ దేశానికి భారత ప్రధాని రావడం ఇదే మొదటిసారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. భారత ప్రధాని రాక కోసం 70 ఏళ్లు ఎదురు చూస్తున్నామని చెప్పారు. మూడు రోజుల పర్యటన కోసం తమ దేశానికి విచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన స్వయంగా ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నెతన్యాహు మాట్లాడుతూ.. ‘ఆప్ కా స్వాగత్ హై మేరా దోస్త్’ అంటూ హిందీలో మోదీకి ఆహ్వానం పలికారు. భారత దేశం అంటే తమకెంతో ఇష్టమని.. ఇండియా సంప్రదాయాలు, చరిత్ర, ప్రజాస్వామ్యం, ప్రగతి పట్ల అంకితభావం తామెంతో గౌరవిస్తామని చెప్పారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం విజయవంతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇరు దేశాల స్నేహ సంబంధాలకు ఆకాశమే హద్దు అని వ్యాఖ్యానించారు. మేకిన్ ఇండియాకు సహకరిస్తామని హామీయిచ్చారు. భారత్ ప్రధానిగా ఇక్కడకు రావడం గర్వంగా ఉందని నరేంద్ర మోదీ అన్నారు. సవాళ్లను ఇజ్రాయెల్ అవకాశాలుగా మార్చుకుందని, తమకు వ్యుహాత్మక భాగస్వామి మాత్రమే కాదు, స్ఫూర్తి అని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య స్నేహం మరింత బలపడాలని, ఉగ్రవాదాన్ని కలసికట్టుగా ఎదుర్కొవాలని ఆకాంక్షించారు. -
ఇజ్రాయెల్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు
-
సాంకేతికతలో తిరుగులేని శక్తి
► ఇజ్రాయెల్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు ► ఆ దేశ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ జెరూసలేం: ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఎంతో ప్రత్యేకమని, భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే సత్తా ఆ దేశ టెక్నాలజీకి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ పర్యటన నేపథ్యంలో ఆ దేశ పత్రిక ‘ఇజ్రాయెల్ హయమ్’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు.. ఉగ్రవాద వ్యతిరేక పోరులో సహకారానికి ఈ పర్యటన తోడ్పడుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు నెలకొని 25 ఏళ్లవుతున్న ప్రత్యేక సమయంలో ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నాను. ఇజ్రాయెల్ టెక్నాలజీ దిగ్గజమనే అభిప్రాయాన్ని గతంలో అనేక మంది భారతీయులతో పంచుకున్నాను. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుర్కొని విజయవంతంగా ఇజ్రాయెల్ ముందుకు సాగింది. దశాబ్దం అనంతరం మళ్లీ ఆ దేశంలో పర్యటించడం ఆనందంగా ఉంది. (గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించారు). నీటి కొరత నుంచి మిగులు జలాల దిశగా ఆ దేశ పురోగమనం ప్రశంసనీయం. ఎన్నో రంగాల్లో అద్భుత విజయాలు సాధిం చింది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంతో పాటు.. కొత్త రంగాల్లో సహకారానికి బాటలు వేస్తుందనే నమ్మకంతో ఉన్నాను. సాంకేతికత భాగస్వామ్యంపై: గంగా నదీ ప్రక్షాళన, స్మార్ట్ సిటీస్ వంటి పథకాల అమలులో ఇజ్రాయెల్ సాంకేతికత కీలకపాత్ర పోషించగలదు. ఇజ్రాయెల్ ఆవిష్కర్తలు కొన్ని మార్పులు చేస్తే.. ఆ దేశ టెక్నాలజీ భారత్‌లోని వేలాది మంది ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చేందుకు చేయూతనిస్తుంది. ఇజ్రాయెల్‌తో ఎగుమతులు, దిగుమతుల సంబంధాన్ని మేం కోరుకోవడం లేదు. టెక్నాలజీ ఆధారిత భాగస్వామ్యంపై మేం ఆసక్తిగా ఉన్నాం. ఇరు దేశాలు ఉగ్ర బాధితులే.. ఉగ్ర భూతానికి ఇరు దేశాలు బాధితులే. అమాయక ప్రజల్ని బలితీసుకునే శక్తులు వర్ధిల్లకూడదని రెండు దేశాలు బలంగా నమ్ముతున్నాయి. భారత్‌కు సీమాంతర ఉగ్రవాదం ప్రధాన అడ్డంకి. దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు వేర్పాటువాద శక్తులు యత్నిస్తున్నాయి. ఈ సమయంలో ఉగ్రపోరుకు ఇరు దేశాలు మరింత సహకారం కొనసాగించాలి. ‘రెండు రాజ్యాలే’ పరిష్కారం ఇజ్రాయెల్, భావి పాలస్తీనా రాజ్యం.. రెండూ పక్కపక్కనే శాంతియుతంగా కొనసాగేందుకు వీలుకల్పించే ‘రెండు రాజ్యాల’ ఏర్పాటే వాటి మధ్య వివాదానికి పరిష్కారమని భారత్ విశ్వసిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌కు తొలిసారి భారత ప్రధాని జెరూసలేం: నేటి నుంచి ప్రధాని మోదీ మూడ్రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కీలక రంగాల్లో సహకారంపై మోదీ చర్చలు జరుపుతారు. భారత ప్రధాని ఒకరు ఇజ్రాయెల్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కాగా.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 25 ఏళ్లు కావడంతో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. జెరూసలేం విమానాశ్రయంలో నెతన్యాహు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. ఇప్పటివరకూ పోప్, అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ఆ స్థాయి గౌరవం దక్కింది. మంగళవారం ప్రధానికి మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని విందు ఇస్తారు. పర్యటనలో మోదీ పాల్గొనే దాదాపు అన్ని కార్యక్రమాల్లో నెతన్యాహు పాల్గొంటారు. జూలై 5న ఇజ్రాయెల్ రాష్ట్రపతి రెవెన్ రివ్లిన్‌తో పాటు ప్రతిపక్ష పార్టీల నేతల్ని కలుసుకుంటారు. భారత సంతతి ప్రజలతో మోదీ సంభాషిస్తారు. 2008 ముంబై పేలుళ్ల నుంచి ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి హోల్జ్‌బెర్గ్ మోషేను, ఆ బాలుడిని కాపాడిన భారతీయ సంరక్షకురాలు శాండ్రా సామ్యూల్‌ను మోదీ కలుసుకుంటారు. అనంతరం జర్మనీలో 6, 7 తేదీల్లో జరిగే జీ–20 దేశాల సదస్సులో మోదీ పాల్గొంటారు. -
మిత్రమా మోదీ.. నీ రాకకు ఎదురుచూస్తున్నాం!
-
మిత్రమా మోదీ.. నీ రాకకు ఎదురుచూస్తున్నాం!
న్యూఢిల్లీ: త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీని పురస్కరించుకొని ఆయనతో ఉన్న స్నేహబంధాన్ని చాటుతూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్వీట్ చేశారు. ప్రధాని మోదీని స్నేహితుడిగా సంబోధిస్తూ.. ఆయన చేపట్టనున్న ఇజ్రాయిల్ పర్యటనను చరిత్రాత్మకంగా ఆయన అభివర్ణించారు. ఆయన రాక కోసం ఇజ్రాయిల్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు. యూదుల పండుగ పాస్ఓవర్ను పురస్కరించుకొని నెతన్యాహుకు ప్రధాని మోదీ మంగళవారం ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభాకాంక్షలపై స్పందిస్తూ.. ‘ పండుగ శుభాకాంక్షలు తెలిపినందుకు కృతజ్ఞతలు మిత్రమా.. మీ చరిత్మాత్మక పర్యటన కోసం ఇజ్రాయిల్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు’ అని నెతన్యాహు పీఎంవో ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ పేర్కొన్నారు. 1992లో భారత్-ఇజ్రాయిల్ మధ్య దౌత్యసంబంధాలు ఏర్పడిన తర్వాత ఆ దేశ పర్యటనకు వెళుతున్న తొలి భారత ప్రధానిగా నరేంద్రమోదీ నిలువబోతున్నారు. 2014 సెప్టెంబర్‌లో ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మోదీ ఇప్పటికే నెతన్యాహుతో భేటీ అయి చర్చించారు. గత దశాబ్దకాలంలో ఇరుదేశాల ప్రధానులు భేటీ కావడం ఇదే మొదటిసారి. -
అటు షూటింగ్...
ఇటు అసలుసిసలు హైజాక్! నలభయ్యేళ్ల కిందట... 1976లో ఎయిర్‌ఫ్రాన్స్‌కు చెందిన విమానం ఒకటి టెల్ అవీవ్ నుంచి పారిస్‌కు బయలుదేరింది. 250 మంది ప్రయాణికుల్లో అత్యధికులు ఇజ్రాయిల్ దేశస్థులు. పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు. ఈ విమానాన్ని పాలస్తీనా హైజాకర్లు ఉగాండాలోని ఎంటెబేకు మళ్లించారు. ప్రయాణికులను, సిబ్బందిని బందీలుగా చేసుకుని... ఇజ్రాయిల్ సహా మరో నాలుగు దేశాల్లో బందీలుగా ఉన్న 54 మంది పాలస్తీనా మిలిటెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐదు మిలియన్ డాలర్ల నగదు కూడా ఇవ్వాలని షరతు పెట్టారు. వారం రోజులు హైడ్రామా నడిచింది. శత్రు దేశాల రాడార్లకు అందకుండా... ప్రతికూల వాతావరణంలో ఇజ్రాయిల్ కమెండోల బృందం ఏకబిగిన ఎనిమిదిన్నర గంటలు... నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ బృందానికి ప్రస్తుత ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోదరుడు యోనాథన్ నెతన్యాహు నేతృత్వం వహించారు. ఉగాండాలోని ఎంటెబేలో దిగిన ఈ కమెండో బృందం మెరుపుదాడి చేసి ఎనిమిది మంది హైజాకర్లను మట్టుబెట్టింది. 20 మంది ఉగాండా సైనిక సిబ్బందిని కూడా చంపింది. బందీలుగా ఉన్న ప్రయాణికుల్లో ముగ్గురు ఈ ఆపరేషన్‌లో చనిపోగా... మిగతా అందరినీ సురక్షితంగా విడిపించారు. అయితే ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన యోనాథన్ అమరుడయ్యాడు. కట్ చేస్తే... సస్పెన్స్ థ్రిల్లర్‌ను మరిపించే ఈ హైజాక్ ఉదంతం ఆధారంగా ‘ఎంటెబే’పేరుతో సినిమా తెరకెక్కుతోంది. ఈ నెల 23న (శుక్రవారం) మాల్టా ఎయిర్‌పోర్టులో దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఇంతలో హైజాక్‌కు గురైన లిబియా విమానం మాల్టా ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. తాము హైజాక్‌పై షూటింగ్ చేస్తుండగా... నిజంగానే హైజాక్‌కు గురైన లిబియా విమానం సీన్లోకి రావడంతో సినిమా బృందం విస్తుపోయింది. వెంటనే షూటింగ్‌ను నిలిపివేసిందని లిజా నగర మేయర్ మాగ్దా మాగ్రి వెల్లడించారు. కాగా, లిబియా విమాన హైజాక్ కథ సుఖాంతమైన విషయం తెలిసిందే. 118 మందిని విడుదల చేసిన ఇద్దరు హైజాకర్లు... తర్వాత లొంగిపోయారు. -
హెయిర్ కటింగ్ కు లక్ష రూపాయలా?
జెరూసలెం: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ క్షవరం కోసం అక్షరాలా లక్ష రూపాయలు ఖర్చు చేశారు. బట్టల ఇస్త్రీకి రూ. 15 వేలు, భోజనానికి రూ. 1.25 లక్షలు, ఫర్నీచర్ కోసం రూ. 13 లక్షలు వెచ్చించారు. ఇదంతా ఆయన సొంత సొమ్మనుకుంటే పొరబడినట్టే. ఐక్యరాజ్యసమతి సమావేశాలకు హాజరయ్యేందుకు ఆరు రోజుల పాటు న్యూయార్క్ లో ఉన్న నెతన్యాహూకు అయిన ఖర్చు రూ. 4 కోట్లు. ఆర్టీఐ పిటిషన్ లో ఈ వివరాలు వెలుగు చూశాయి. సచార్ బెన్ మీర్ అనే న్యాయవాది.. నెతన్యాహూ కార్యాలయం, విదేశాంగ శాఖ నుంచి ఈ వివరాలు సేకరించారు. ప్రధాని అమెరికా పర్యటన వ్యయం వివరాల గురించి గత అక్టోబర్ లో నెతన్యాహూ కార్యాలయంను కోరాగా, విదేశాంగ శాఖకు రిఫర్ చేసిందని సచార్ తెలిపారు. మూడు నెలలు వేచి చూడాలని చెప్పడంతో జెరూసలెం కోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. 'ఇది ప్రజాధనం.. అంటే నా డబ్బు. దీన్ని ఎలా ఖర్చు పెడుతున్నారో తెలుసుకునే హక్కు నాకు ఉంది. సామాన్యుల గురించి పట్టించుకోకుండా నెతన్యాహూ, ఆయన భార్య సారా విలాస జీవితం గడుపుతున్నార'ని సచార్ పేర్కొన్నారు. దీనిపై మాట్లాడేందుకు నెతన్యాహూ ప్రతినిధి నిరాకరించారు. -
ప్రధాని సతీమణికి భారీ జరిమానా
జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సతీమణికి లేబర్ కోర్టు భారత కరెన్సీలో సుమారు 30 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. గతంలో నమోదైన కేసును విచారించి తమ తీర్పును వెల్లడించింది. నెతన్యాహు భార్య సారా నెతన్యాహు తమ ఇంట్లో పనిచేసే స్టాఫ్ పై వ్యక్తిగత దూషణకు దిగిందని గతంలో ఫిర్యాదులు అందాయి. మెని నఫ్టాలి అనే వ్యక్తి గతంలో సారా ఇంట్లో ఉంటూ ఆమె కెర్ టేకర్ గా ఉండేవాడు. అయితే ఆవేశానికి లోనైన సారా తనను అవమానించడంతో పాటు దూషించిందని తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా ఈ కేసు విచారణ చేపట్టిన లేబర్ న్యాయస్థానం నఫ్టాలి చెప్పిన వివరాలపై స్పందించి ప్రధాని సతీమణికి జరిమానా విధించింది. ఈ పరిహారాన్ని నఫ్టాలికి చెల్లించాలని తీర్పునిచ్చింది. తనపై చేసినవన్నీ అసత్యాలంటూ సారా కొట్టిపారేశారు. ఇంట్లో పనిచేసే వారితో పద్ధతిగానే వ్యవహరించానని పేర్కొన్నారు. ప్రధాని కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. గతంలోనూ హౌస్ కీపర్ పై ఆమె దురుసుగా ప్రవర్తించిందంటూ కేసు నమోదు కాగా, ఆ వ్యవహారం కోర్టు వరకు వెళ్లకుండానే సెటిల్ చేసుకున్న విషయం విదితమే.