Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Sakshi Editorial On Chandrababu Govt By Vardhelli Murali1
ఏడు చేపల కథ!

‘‘చేపా చేపా ఎందుకు ఎండలేదు? గడ్డిమోపు అడ్డమొచ్చింది. మోపూ మోపూ ఎందుకు అడ్డమొచ్చావ్‌? ఆవు మేయలేదు’’. ఈ చేప సాకుల కథ తెలుగు వారందరికీ సుపరిచితమే. ఏడు మాసాల కింద ఏపీలో ఏర్పడిన కిచిడీ సర్కార్‌ పరిపాలనకూ, ఈ సాకుల కథకూ కొంత సాపత్యం కుదురుతుంది. ఒకపక్క జనానికి షాకుల మీద షాకులిస్తూనే మరోపక్క తన వైఫల్యాలకు సాకుల మీద సాకులు వెతుకుతున్న తీరు న భూతో న భవిష్యతి! పరిపాలన చేతగానితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు. రూల్‌ ఆఫ్‌ లా స్థానాన్ని రూళ్లకర్ర పెత్తనం ఆక్రమించింది. విద్యారంగం గుండెల మీద విధ్వంసపు గునపాలు దిగు తున్నాయి. ప్రజా వైద్యరంగాన్ని ప్రైవేట్‌ బేహారుల జేబులో పెట్టబోతున్నారు. సాగునీటి గేట్ల తాళాలు కంట్రాక్టర్ల చేతుల్లో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ అప్పులు చింపిన విస్తరిలా తయారైంది. ఇదీ కిచిడీ సర్కార్‌ ఏడు మాసాల సప్తపది.ప్రభుత్వ వైఫల్యాలు బట్టబయలైన ప్రతి సందర్భంలో దాన్నుంచి జనం దృష్టిని మళ్లించడం కోసం గోబెల్స్‌ ప్రచారాలను చేపట్టడం నిత్యకృత్యంగా మారిపోయింది. అవినీతికీ, అసమర్థతకూ ఏపీ కిచిడీ సర్కార్‌ను కేరాఫ్‌ అడ్రస్‌ అనుకోవచ్చు. కొద్దిపాటి సమీక్షా ప్రణాళికలతో నివారించగలిగిన విజయవాడ వరద ముంపును ముందుచూపు లేక పెను ప్రమాదంగా మార్చారు. సాకును మాత్రం పాత ప్రభుత్వం మీదకు నెట్టేందుకు శతవిధాల ప్రయత్నించారు. తిరుపతిలో జరిగిన తాజా విషాదంలోనూ అధినేతది అదే ధోరణి. కనీస ముందస్తు సమీక్షలు చేయకపోవడం, ఏర్పాట్లు లేకపోవడం, వ్యూహ రాహిత్యం, సమన్వయ లోపం, పోలీసు యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి సేవలోనే తరించడం... ఈ దుర్ఘటనకు ప్రధాన కారణాలు.తమది రియల్‌టైమ్‌ గవర్నెన్సనీ, ఎక్కడేమి జరుగుతున్నదో ఎప్పటికప్పుడు తన కంప్యూటర్‌ దుర్భిణి ద్వారా తెలిసిపోతుందనీ చంద్రబాబు చెప్పుకుంటారు. లక్షలాదిమంది తరలివచ్చే వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమానికి ఏర్పాట్లు సరిగ్గా జరగ లేదని ఎందుకు కనిపెట్టలేకపోయారో మరి! తీరా దుర్ఘటన జరిగిన తర్వాత సాకు వెతుక్కోవడానికి ఆయనకు జగన్‌ సర్కారే కనిపించింది. కాంగ్రెస్‌ పార్టీకి దేశంలో ఎదురులేని రోజుల్లో ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా, ప్రభుత్వ వైఫల్యం బయటపడ్డా వెంటనే ‘విదేశీ హస్తం’ మీదకు నెట్టేసేవారు. ఇప్పుడు చంద్ర బాబుకు జగన్‌ సర్కార్‌లో ఆ విదేశీ హస్తం కనిపిస్తున్నది.వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లను తిరుమలకు బదులుగా తిరుపతిలోనే అందజేసే కార్యక్రమాన్ని వైసీపీ సర్కార్‌ ప్రారంభించిందనీ, అందువల్లనే తొక్కిసలాట జరిగిందనేది ఆయన ఉవాచ. తిరుపతిలోనే టిక్కెట్లివ్వడమనేది పనికిమాలిన కార్య క్రమం అయితే, దివ్యదృష్టీ – దూరదృష్టీ... రెండూ కలిగిన చంద్రబాబు సర్కార్‌ ఎందుకు దాన్ని రద్దు చేయలేదనేది సహ జంగా ఉద్భవించే ప్రశ్న. రద్దు చేయకపోగా, గతంలో ఎన్నడూ లేనివిధంగా అస్మదీయ పత్రికల్లో భారీ ప్రకటనలు గుప్పించి భక్తకోటిని ఎందుకు ఆహ్వానించినట్టు? పైగా మూడు రోజుల టిక్కెట్లు ఒకేసారి ఇస్తామని ఏపీతోపాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఎందుకు దండోరా వేయించినట్టు?వైసీపీ ప్రభుత్వం ఉన్న రోజుల్లోనే తిరుమలలోని ఒక కేంద్రంతోపాటు తిరుపతిలో తొమ్మిది సెంటర్లు ఏర్పాటు చేసి, వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లు అందజేసిన మాట వాస్తవం. కానీ అప్పుడెటువంటి తొక్కిసలాటలూ, దుర్ఘటనలూ జరగ లేదు. సాఫీగా జరిగిపోయింది. ఎందుకని? వైకుంఠ ద్వార దర్శనం సదవకాశాన్ని స్థానిక ప్రజలను దృష్టిలో ఉంచుకొని పది రోజులపాటు ఏర్పాటు చేశారు. తిరుపతికి వెలుపల ఎక్కడా ఎటువంటి ప్రకటనలూ ఇవ్వలేదు. స్థానికులు తీసుకోగా మిగిలితేనే ఇతర ప్రాంత ప్రజలు అడిగితే ఇచ్చే ఏర్పాట్లను చేశారు. ఇతర ప్రాంతాల వారికి ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని వచ్చే సౌకర్యం ఉండేది.ఈసారి రాష్ట్రంతో పాటు వెలుపల కూడా ‘రండహో’ అంటూ దండోరా వేయించిన పెద్దమనుషులు... చేయాల్సిన ఏర్పాట్లను మాత్రం గాలికొదిలేశారు. ఎనిమిది కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఎనిమిదో తేదీ మధ్యాహ్నానికే లక్షల సంఖ్యలో భక్తులు కౌంటర్ల దగ్గరకు చేరుకున్నారు. వాళ్లకు ఏ రకమైన వసతులూ కల్పించలేదు. మంచినీళ్లిచ్చే దిక్కు కూడా లేదు. ఎని మిది కేంద్రాలకు గాను బైరాగిపట్టెడ, శ్రీనివాసం, రామచంద్ర పుష్కరిణి, విష్ణు నివాసం అనే నాలుగు కేంద్రాల దగ్గర భక్తుల సంఖ్య పెరిగిపోయి తొక్కిసలాట జరిగింది. బైరాగిపట్టెడ పరిస్థితి మరీ ఘోరం.అంతకంతకూ భక్తుల సంఖ్య పెరగడంతో కౌంటర్‌కు ఎదురుగా ఉన్న పార్కులోకి వారిని మళ్లించి తాళాలు వేశారు. అన్నపానీయాలు లేకుండా, కనీస వసతులు లేకుండా దాదాపు పది గంటలు ఉగ్గబట్టుకొని ఉండాల్సి వచ్చింది. మహిళలూ,వృద్ధుల పరిస్థితి వర్ణనాతీతం. శత్రు దేశాల ప్రజల్ని, సైనికుల్ని నిర్బంధించడానికి నాజీలు ఏర్పాటుచేసిన కాన్సంట్రేషన్‌ క్యాంపులకు ఈ పార్కు జైలు భిన్నమైనదేమీ కాదు. ఇన్ని లక్షల మందిని నిర్బంధ శిబిరాల్లో కుక్కి మానవ హక్కులను హరించి నందుకు టీటీడీ అధికారులే కాదు ప్రభుత్వ పెద్దలు కూడా శిక్షార్హులే!ప్రజలను గంటల తరబడి నిర్బంధంగా అన్న పానీయాలకూ, కనీస అవసరాలకూ దూరం చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఇటువంటి నిర్బంధ శిబిరాల గేట్లను హఠాత్తుగా తెరిచినప్పుడు తొక్కిసలాటలు జరుగుతాయని, ప్రమాదాలు జరుగుతాయని ఊహించడానికి ‘డీప్‌ టెక్‌’ పరి జ్ఞానం అవసరం లేదు కదా! కామన్‌సెన్స్‌ చాలు. ప్రజల ప్రాణా లకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తెలిసి కూడా ఎటువంటి ప్రకటనలూ చేయకుండా, అప్రమత్తం చేయకుండా అకస్మాత్తు చర్య ద్వారా తొక్కిసలాటకు దారితీయడం కూడా మానవ హక్కుల ఉల్లంఘనే!ఈ నేరానికి పెద్ద తలలే బాధ్యత వహించవలసి ఉంటుంది. మొక్కుబడిగా ఎవరో ఇద్దర్ని సస్పెండ్‌ చేసి, మరో ముగ్గుర్ని బదిలీ చేసి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? అందు లోనూ వివక్ష. ఘటనకు సంబంధించి ప్రత్యక్షంగా బాధ్యత లేని వారిపై చర్యలు తీసుకొని, కీలక బాధ్యుల్ని వదిలేశారన్న విమ ర్శలు వెంటనే వెలువడ్డాయి. కీలక బాధ్యులు ప్రభుత్వ పెద్దలకు బాగా కావలసినవారు. వెంటనే తరుణోపాయాన్ని ఆలోచించిన చంద్రబాబు బంతిని పవన్‌ కల్యాణ్‌ కోర్టులోకి నెట్టారు. అధినేత మనసెరిగిన పవన్‌ ఓ గంభీరమైన సూచన చేశారు.జరిగిన ఘటన విషాదకరమైనదనీ, తనకు బాధ్యత లేకపోయినా క్షమాపణలు చెబుతున్నాననీ, అలాగే టీటీడీ చైర్మన్, ఈవో, తిరుమల జేఈవోలు కూడా క్షమాపణలు చెప్పాలనీ సూచించారు. అంటే ఇంత తీవ్రమైన నేరానికి క్షమాపణలు చెబితే సరిపోతుందన్న సూచన. బారా ఖూన్‌ మాఫ్‌! వారిపైన ఎటువంటి చర్యలూ లేకుండా క్షమాపణలతో సరిపెడతారన్నమాట! వారి శిరస్సుల మీద పవన్‌ కల్యాణ్‌ చేత మంత్ర జలం చల్లించి పాప ప్రక్షాళనం చేయించారనుకోవాలి. ఈ ఘటనతో ఏ సంబంధం లేని, కేవలం అడ్మినిస్ట్రేషన్‌ పనులకు మాత్రమే పరిమితమయ్యే తిరుపతి జేఈవో ఎందుకు బదిలీ అయ్యారో, ప్రధాన బాధ్యత తీసుకోవలసిన తిరుమల జేఈవో, ఈవో, టీటీడీ ఛైర్మన్‌లకు పాప విమో చనం ఎందుకు లభించిందో ఆ దేవదేవుడికే తెలియాలి.పాప విమోచనం దొరికిన ముగ్గురిలో కూడా ఇద్దరు మాత్రమే ప్రభుత్వాధినేతకు కావలసిన వారట! ఈవో శ్యామల రావుపై మాత్రం కత్తి వేలాడుతున్నదనీ, త్వరలోనే ఆయనను తప్పించడం ఖాయమనీ సమాచారం. ఇప్పుడే చర్య తీసుకుంటే తమకు కావలసిన వారిపై కూడా తీసుకోవలసి ఉంటుంది. కనుక కొంతకాలం తర్వాత ఆయనకు స్థానచలనం తప్పదంటున్నారు. తిరుపతి లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందనీ, దీనికి జగన్‌ సర్కారే బాధ్యత వహించాలనీ ఆమధ్య చంద్ర బాబు ఒక ప్రహసనాన్ని నడిపిన సంగతి తెలిసిందే. ఆ నాట కాన్ని రక్తి కట్టించడంలో ఈవో శ్యామలరావు విఫలమయ్యారనీ, ఫలితంగానే నాటకం రసాభాసగా మారిందనే అభిప్రాయం అధినేతకు ఉన్నదట!గత సెప్టెంబర్‌ మాసంలో విజయవాడ వరదల సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం దారుణ వైఫల్యం దరిమిలా ప్రజల దృష్టిని మళ్లించేందుకు తిరుపతి లడ్డుకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనీ, ఇందుకు జగన్‌ పాలనలోనే బీజం పడిందనే ప్రచారాన్ని కిచిడీ సర్కార్‌తోపాటు యెల్లో మీడియా కూడా పెద్ద ఎత్తున చేపట్టిన సంగతి తెలిసిందే. చివరకు అదంతా బోగస్‌ ప్రచారంగా తేలడానికి రెండు మాసాలు కూడా పట్టలేదు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరు మల దేవస్థానం ప్రతిష్ఠ జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ఇనుమడించింది. టీటీడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వందలాది దేవాలయాల నిర్మాణం జరిగింది. స్వల్పకాలంలో ఇన్ని ఆలయాల నిర్మాణాన్ని ఇంకెవరి హయాంలోనూ టీటీడీ చేపట్టలేదు. హిందువులకు పవిత్రమైన గోమాత సంరక్షణ కోసం వందల సంఖ్యలో గోశాలల నిర్మాణం కూడా జరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాలు దేశదేశాల్లో వైభవంగా జరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద జాబితానే ఉన్నది.తిరుమలను అపవిత్రం చేస్తున్నారనే ప్రచారాన్ని ఈ కిచిడీ గ్యాంగ్‌ ఆ రోజుల్లోనే ప్రారంభించింది. కానీ, ఎవరూ దాన్ని విశ్వసించలేదు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డూ కల్తీ పేరుతో మరోసారి బురద చల్లాలని ప్రయత్నించి భంగ పడ్డారు. ఇప్పుడు తమ బాధ్యతా రాహిత్యానికి ఆరుగురు భక్తులు బలైతే... దాన్ని వైసీపీ ప్రభుత్వానికి చుట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించడం, ప్రజల విజ్ఞతపై ఆయనకున్న చిన్న చూపుకు నిదర్శనం. అధికారంలోకి వచ్చిన ఏడు మాసాల్లో ఆయన ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదు. పైగా అన్ని రంగాల్లో వైఫల్యం! వాటినుంచి దృష్టి మళ్లించేందుకు నెలకోసారైనా ఒక పెద్ద డైవర్షన్‌ స్కీమ్‌ను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటివరకు ఏడు మాసాల్లో ఎండబెట్టిన ఏడు డైవర్షన్‌ చేపల్లో ఒక్కటీ ఎండలేదు. చీమ కుట్టడంతోనే చేపల కథ ముగుస్తుంది. ఈ డైవర్షన్‌ చేపల కథ ముగింపు కూడా అలాగే ఉండనుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Ind vs Eng T20Is: India Squad Announced Shami Comeback Superstar Ignored2
Ind vs Eng: భారత జట్టు ప్రకటన.. షమీ రీఎంట్రీ, సూపర్‌స్టార్‌పై వేటు!

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌(India vs England)కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలోని ఈ జట్టులో పదిహేను మందికి స్థానం కల్పించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఎట్టకేలకు షమీ పునరాగమనంఇక ఈ సిరీస్‌తో టీమిండియా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ ఎట్టకేలకు పునరాగమనం చేయనున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023 తర్వాత చీలమండ నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ బెంగాల్‌ బౌలర్‌.. దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ బరిలో దిగిన షమీ.. తొమ్మిది మ్యాచ్‌లు ఆడి పదకొండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలోనూ బెంగాల్‌ తరఫున బరిలోకి దిగి.. ఎటువంటి ఇబ్బంది లేకుండా పది ఓవర్ల కోటా పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఫిట్‌నెస్‌ నిరూపించుకున్న షమీకి టీమిండియా సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఇక పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు, మరో స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ విశ్రాంతి పేరిట జట్టుకు దూరమయ్యారు.వైస్‌ కెప్టెన్‌గా అతడేఈ క్రమంలో షమీ సారథ్యంలోని పేస్‌ విభాగంలో అర్ష్‌దీప్‌ సింగ్‌తో పాటు హర్షిత్‌ రాణా చోటు దక్కించుకున్నారు. ఇక స్పిన్నర్ల కోటాలో వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్షోయి స్థానం సంపాదించగా.. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్‌ పాండ్యా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అక్షర్‌ పటేల్‌(Axar Patel), వాషింగ్టన్‌ సుందర్‌ ఎంపికయ్యారు. ఇక ఈ సిరీస్‌ ద్వారా.. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.సూపర్‌స్టార్‌పై వేటు!మరోవైపు.. సూపర్‌స్టార్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌(Rishabh Pant)ను మాత్రం సెలక్టర్లు ఇంగ్లండ్‌తో టీ20లకు ఎంపిక చేయలేదు. వికెట్‌ కీపర్ల కోటాలో సంజూ శాంసన్‌తో పాటు ధ్రువ్‌ జురెల్‌ చోటు దక్కించుకున్నాడు. అయితే, ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ కారణంగా బిజీగా గడిపిన పంత్‌కు విశ్రాంతినిచ్చారా? లేదంటే అతడిపై వేటు వేశారా అన్నది మాత్రం తెలియరాలేదు.ఇక సౌతాఫ్రికాలో మాదిరి ఈసారి కూడా అభిషేక్‌ శర్మతో కలిసి సంజూ శాంసన్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగనుండగా.. లెఫ్టాండర్లు తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌ కూడా ఈ జట్టులో ఉన్నారు. సౌతాఫ్రికా పర్యటనలో అదరగొట్టిన టీమిండియాకాగా సూర్య సేన చివరగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌ ఆడింది. ఆ టూర్‌లో సంజూ శాంసన్‌, తిలక్‌ వర్మ రెండేసి శతకాలతో దుమ్ములేపారు. వీళ్లిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్‌ కారణంగా టీమిండియా ప్రొటిస్‌ జట్టును 3-1తో ఓడించి సిరీస్‌ కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌తో ఐదు టీ20లుకోల్‌కతా వేదికగా జనవరి 22న మొదటి టీ20 జరుగనుండగా.. జనవరి 25న చెన్నై రెండో టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. అనంతరం.. జనవరి 28న రాజ్‌కోట్‌లో మూడో టీ20.. జనవరి 31న పుణె వేదికగా నాలుగో టీ20, ఫిబ్రవరి 2న ముంబైలో ఐదో టీ20 జరుగనుంది. అయితే, ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు మాత్రం బీసీసీఐ జట్టును ప్రకటించలేదు.ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టుసూర్యకుమార్‌ యాదవ్‌(కెప్టెన్‌), సంజూ శాంసన్‌(వికెట్‌ కీపర్‌), అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, రింకూ సింగ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అక్షర్‌ పటేల్‌(వైస్‌ కెప్టెన్‌), హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్‌, మహ్మద్‌ షమీ, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయి, వాషింగ్టన్‌ సుందర్‌, ధ్రువ్‌ జురెల్‌(వికెట్‌ కీపర్‌). చదవండి: స్టీవ్‌ స్మిత్‌ ఊచకోత.. విధ్వంసకర శతకం.. ‘బిగ్‌’ రికార్డ్‌!

Arvind Kejriwal congratulates 'BJP's CM face Ramesh Bidhuri3
మీకు కంగ్రాట్స్‌.. మీరే బీజేపీ సీఎం అభ్యర్థి..!

న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర అధికార పార్టీ ఆప్‌-ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సవాల్‌ మీది ప్రతి సవాల్‌ విసురుకుంటూ ఇరు పార్టీలు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ మేరకు న్యూఢిల్లీలోని ఆప్‌ కార్యాలయంలో నిర్వహించిన ఒక ప్రెస్‌మీట్‌లో బీజేపీపై విరుచుకుపడ్డారు అరవింద్‌ కేజ్రీవాల్‌.‘ ముందుగా బీజేపీ సీఎం అభ్యర్థి రమేశ్‌ బిధురికి కంగ్రాట్స్‌. మీరే బీజేపీ సీఎం అభ్యర్థి త్వరలో ఒక ప్రకటన వస్తుంది. అందుకు నేను మీకు ముందుగా కంగ్రాట్స్‌ చెబుతున్నా మీరు బీజేపీ సీఎం అభ్యర్థి అని మాకు పక్కా సమాచారం ఉంది. దీనిపై మరో ఒకటి-రెండు రోజుల్లో మీ అధిష్టానం నుంచి ప్రకటన రావొచ్చు ’ అని అన్నారు.ఇంతకీ ఢిల్లీ ఎంపీగా మీరు ఏం చేశారో కాస్త చెప్పండిమీరు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీకి దిగుతున్నారు. మీ పార్టీ సీఎం అభ్యర్థి కూడా మీరే. ఇంతకీ మీరు ఎంపీగా ఢిల్లీకి ఏం చేశారో కాస్త చెప్పండి. నేను అడుగుతున్నాను.. ఢిల్లీ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఎంత. మీరు ఎంపీగా ఉన్న కాలంలో ఢిల్లీకి ఏం చేశారు. ఢిల్లీ కోసం మీ విజన్‌ ఏమిటి?’ అని అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.బహిరంగ చర్చకు సిద్ధమా సీఎం అభ్యర్థి గారూ..?బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా నిలవబోతున్న మీరు.. ఢిల్లీ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?, సీఎం అభ్యర్థిగా మీ పేరు అధికారంగా ప్రకటించిన తర్వాత బహిరంగ చర్చ ఏర్పాటు చేద్దాం. మాతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారా?, ఈ బహిరంగ చర్చ కూడా ఢిల్లీ ప్రజల సమక్షంలోనే ఉంటుంది’ అని సెటైరికల్‌గా మాట్లాడారు కేజ్రీవాల్‌.బీజేపీపై పదే పదే విమర్శలు గుప్పిస్తున్న కేజ్రీవాల్‌ఎన్నికల ప్రచారం మొదలైందో లేదో బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు కేజ్రీవాల్‌,. తమ పార్టీని అస్థిర పరిచేందుకు బీజేపీ-కాంగ్రెస్‌ పార్టీలు రెండూ కలిసి నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఇటీవల మండిపడ్డారు. ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కాంగ్రెస్‌ నేత సందీప్‌ దీక్షిత్‌ ఇచ్చిన ఫిర్యాదే ఇందుకు నిదర్శమన్నారు కేజ్రీవాల్‌. ఇది రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా కాకపోతే ఏంటని ప్రశ్నించారు కేజ్రీవాల్‌. సంక్షేమ పథకాలపై ఫిర్యాదు చేస్తారా? అంటూ విమర్శించారు.సంక్షేమ పథకాలు(Welfare Schemes) అమలు చేస్తే అందులో దర్యాప్తు ఏమిటో తనకు అర్థం కావడం లేదన్నారు.కాగా, ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత రెండు పర్యాయాలుగా ఢిల్లీలో అధికారాన్ని చేపడుతూ వచ్చింది ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌).. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తోంది. అయితే ఆప్‌కు బీజేపీ నుంచి తీవ్ర పోటీ ఉండబోతుందని విశ్లేకులు అంచనా వేస్తున్నారు. ఈసారి ఎలాగైనా ఢిల్లీ రాష్ట్ర పగ్గాలను తమ చేతుల్లోకి తెచ్చుకోవాలని బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది.ఇదీ చదవండి: కేజ్రీవాల్‌పై పర్వేశ్‌ వర్మ.. సీఎం అతిశీ వర్సెస్‌ రమేష్‌ బిదూరి

You Can Change The World in 10 Hours Says Anand Mahindra4
'సరిగ్గా 10 గంటలు.. ప్రపంచాన్ని మార్చేయొచ్చు'

పని గంటలపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి (Narayana Murthy), ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రమణ్యన్ (Subrahmanyan) వివిధ రకాలుగా స్పందించారు. ప్రస్తుతం పనిగంటలపై సర్వత్రా చర్చ మొదలైపోయింది. తాజాగా దీనిపై ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) కూడా స్పందించారు.ఢిల్లీలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ యాంగ్ లీడర్స్ డైలాగ్ 2025 సదస్సులో, పని గంటల పొడిగింపుపై ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ తన అసమ్మతిని వ్యక్తం చేశారు. నారాయణ మూర్తి.. ఇతర కార్పొరేట్ నాయకుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. అయితే నా ఉద్దేశ్యం ఏమిటంటే, మనం పని గంటలపై కాకుండా.. పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. కాబట్టి 70 గంటలు & 90 గంటలు కాదు. నాణ్యమైన పని 10 గంటలు చేస్తే చాలు. ప్రపంచాన్నే మార్చేయొచ్చని ఆయన అన్నారు.వారానికి 70 గంటల పనిఎన్ఆర్ నారాయణ మూర్తి 3వన్4 (3one4) క్యాపిటల్ పాడ్‌కాస్ట్ 'ది రికార్డ్' ఫస్ట్ ఎపిసోడ్‌లో యువతను ఉద్దేశించి.. భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడాలంటే, ఇతర దేశాలతో పోటీ పడాలంటే వారానికి 70 గంటలు పని చేయాలని పేర్కొన్నారు. ఇండియాలో పని ఉత్పాదకత.. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ చేసినట్లు భారతీయ యువకులు ఎక్కువ గంటలు పనిచేయాలని వెల్లడించారు.వారానికి 90 గంటల పనిఇంట్లో కూర్చుని.. భార్యను ఎంత సేపు చూస్తారు. ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి. ఆదివారాలు కూడా ఆఫీసుకురండి.. అంటూ వారానికి 90 గంటలు పనిచేయాలని లార్సన్‌ అండ్‌ టుబ్రో చైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రమణ్యన్‌ అన్నారు. ఈ వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు తీవ్రంగా మండిపడ్డారు.వారానికి 70 గంటల పనిపై అదానీ స్పందనభారతదేశంలో వర్క్ - లైఫ్ బ్యాలెన్స్ డిబేట్‌పై గౌతమ్ అదానీ (Gautam Adani) మాట్లాడుతూ.. పని & జీవితం మధ్య సమతుల్యతను సాధించడంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగానే 'ఒక వ్యక్తి ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం పనిలోనే నిమగ్నమైపోతే.. భార్య అతన్ని విడిచి పారిపోతుంది' అని అన్నారు.ఇదీ చదవండి: భారీగా పెరిగిన టిమ్ కుక్ జీతం: ఇప్పుడు వార్షిక వేతనం ఎంతంటే..70 గంటల పనిపై నిమితా థాపర్ వ్యాఖ్యలుహ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ 'నిమితా థాపర్' (Namita Thapar) మాట్లాడుతూ.. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల లాభం పొందేది యజమానులే.. కానీ ఉద్యోగులు కాదని వెల్లడించారు. ఎక్కువ డబ్బు సంపాదించాలనుకునే యజమానులు.. ఎక్కువ గంటలు పనిచేయండని వివరించారు. అయితే అభివృద్ధి పేరుతో ఉద్యోగులపైన పనిభారాన్ని మోపకూడని అన్నారు.పని గంటల పెంపు.. ఉద్యోగులపై తీవ్రమైన పని భారాన్ని, ఒత్తిడిని కలిగిస్తుందని కొందరు తీవ్రంగా ఖండిస్తే.. మరికొందరు పని గంటలు పెంచడం సరైనదే అని సమర్ధించారు. ఏది ఏమైనా పనిగంటలు వ్యవహారం రోజు రోజుకి తీవ్రమైన చర్చలకు దారితీస్తోంది.

Tdp Mla Kolikapudi Srinivas Attacks Ysrcp Leader House5
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ దౌర్జన్యం

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ దౌర్జన్యానికి దిగారు. ఏ.కొండూరు మండలం గోపాలపురంలో వైఎస్సార్‌సీపీ నేత భూక్య కృష్ణ ఇంటిపై దాడి చేశారు. దాడిని చిత్రీకరిస్తున్న కృష్ణ కుమారుడిపైనా దాడికి పాల్పడ్డారు. కృష్ణ కుమారుడు గోపిచంద్‌ ఫోన్‌ను ఎమ్మెల్యే కొలికపూడి ధ్వంసం చేశారు. భూక్య కృష్ణ భార్యను కూడా కొలికపూడి దుర్భాషలాడారు. దీంతో మనస్తాపంతో కృష్ణ భార్య పురుగుల మందు తాగారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు వైద్యులు రిఫ్‌ చేశారు. కొలికపూడి దౌర్జన్యాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.భూక్యా కృష్ణ- భూక్యా నాగేశ్వరరావు, భూక్యా భీమ్లా ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా ఉండగా, ఆస్తి పంపకాలు సవ్యంగా చేస్తామని గతంలో పెద్ద మనుషులు ఒప్పించారు. భూక్యా కృష్ణ ఆమోదంతో అతని స్థలంలో నుంచి నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది. స్థలం వివాదం తేలకపోవడంతో తన స్థలంలో నిర్మించిన సీసీ రోడ్డుకు అడ్డంగా భూక్యా కృష్ణ తీగ వేశారు.ఇదిలా ఉండగా, గోపాలపురం గ్రామంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొలికపూడి హాజరయ్యారు. గోపాలపురం 5వ వార్డు వైఎస్సార్‌సీపీ సభ్యుడిగా ఉన్న భూక్యా కృష్ణపై ఎమ్మెల్యేకు స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా భూక్యా కృష్ణ ఇంటికెళ్లిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్.. వారిపై దాడి చేశారు. సంఘటనను ఫోన్‌లో చిత్రీకరిస్తున్న భూక్యా కృష్ణ కుమారుడు గోపీచంద్‌పైనా దౌర్జన్యం చేశారు.

Naga Shourya Mother Usha Mulpuri Gets Emotional over Grandchild6
నాగశౌర్యకు ఆస్తమా! వాడి కూతుర్ని వీడియో కాల్‌లో చూస్తున్నా: హీరో తల్లి భావోద్వేగం

రోజూ ఇంట్లో ఉండి ఏదో ఒకటి అనుకునే బదులు వారానికి ఒకసారి కలుసుకుని హ్యాపీగా ఉందాం.. సంసారం ఒక చదరంగం సినిమాలో ఈ మాట నా మనసుకు కనెక్ట్‌ అయిందంటోంది హీరో నాగశౌర్య తల్లి ఉషా ముల్పురి. నాగశౌర్య పెళ్లి తర్వాత వేరే కాపురం పెట్టాడు. పెళ్లవగానే కొడుకు, కోడలు వేరుగా ఉండటం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైంది ఉషా.చిన్నప్పుడే అన్నాడుతాజాగా ఉషా (Usha Mulpuri) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాగశౌర్య (Naga Shourya) చిన్నప్పుడే.. పెళ్లయ్యాక మాత్రం నేను కలిసుండను అనేవాడు. ఎందుకురా అంటే ఇద్దరు మంచివాళ్లు ఒక్క దగ్గర ఉండకూడదని చెప్పేవాడు. మొదటి నుంచి అదే అనుకున్నాం కాబట్టి పెళ్లయ్యాక కొడుకు-కోడలు వేరే ఇంట్లో ఉంటున్నారు. నాగశౌర్యకు గతేడాది పాప పుట్టింది. గత నవంబర్‌లోనే మనవరాలి ఫస్ట్‌ బర్త్‌డే సెలబ్రేట్‌ చేశాం. తనను చాలా మిస్‌ అవుతున్నాను. వీడియో కాల్‌లో చూస్తుంటాను. బాధగా ఉంటుందిఅదొక్కటే బాధేస్తుంది. ఇటీవల తను నాతో పాటు నెలన్నర రోజులుంది. రెస్టారెంట్‌ పనుల వల్ల బిజీగా ఉండటంతో తన దగ్గరకు తరచూ వెళ్లలేకపోతున్నాను. చాలామంది పిల్లలే ప్రపంచంగా బతుకుతారు. వాళ్లు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయాక జీవితం శూన్యంగా మారుతుంది. పిల్లల పెళ్లయ్యాక మనమెలా ఉండాలనేది కూడా యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాను. ఎక్కువ మాట్లాడకూడదు, ఎవరికీ ఏ సలహా ఇవ్వకూడదు, వాళ్లేం చెప్పినా మనం ఓకే చెప్పాలి.. ఇవన్నీ తెలుసుకుని అలవాటు చేసుకున్నాను.చదవండి: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్‌ రాజుశౌర్య కంటే పెద్దోడే నచ్చుతాడుఅలాగే మనం వద్దని చెప్పినంత మాత్రాన పిల్లలు వాళ్లు చేసే పనిని ఆపేయరు. కాబట్టి మనం.. సరేనని తలూపితే మన గౌరవం నిలబడుతుంది. నేను అదే పాటిస్తున్నాను. శౌర్య.. ఎప్పుడు కూడా తన మనసులో మాట చెప్పడు. చిన్నప్పటి నుంచి వాడు అలాగే ఉన్నాడు. సంతోషంగా ఉన్నప్పుడు ఏదీ చెప్పకపోయినా పర్లేదు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పాలి. అప్పుడే కదా మనం ఏదో ఒకటి చేయగలుగుతాం. నా పెద్దబ్బాయి చిన్న విషయమైనా నాతో పంచుకుంటాడు. అందుకనే నాకు శౌర్య కంటే పెద్ద కుమారుడే నచ్చుతాడు.ఇలాంటి రోజు వస్తుందని తెలుసుచిన్నప్పుడు ఇద్దరికీ ఆస్తమా ఉండేది. ఆ కారణంగా ఎక్కువగా స్కూలుకు వెళ్లేవారు కాదు. ఇంట్లోనే చదివించేదాన్ని. రోజంతా వారితోనే ఉండేదాన్ని. అలాంటిది పిల్లల పెళ్లయ్యాక ఇల్లంతా బోసిపోయినట్లనిపించింది. ఇలాంటి రోజొకటి వస్తుందని తెలుసు. దాన్నుంచి బయటపడటానికి కొంత సమయం పట్టింది అని ఉషా చెప్పుకొచ్చింది.చదవండి: గేమ్‌ ఛేంజర్‌ సినిమాకు షాక్‌.. ఇకపై అది లేనట్లే!

Can You Pay House Rent With A Credit Card Check Pros And Cons7
క్రెడిట్​ కార్డుతో అద్దె​ కడుతున్నారా.. ఈ విషయాలు తెలుసా?

షాపింగ్ చేయాలన్నా..నిత్యావసరాలు కొనుగోలు చేయాలన్నా.. టికెట్ బుకింగ్స్ కోసం, ఇంటి అద్దె చెల్లించడం కోసం, ఇలా అవీ ఇవీ అని తేడా లేకుండా క్రెడిట్ కార్డును విచ్చలవిడిగా వాడేస్తున్నారు. వాడకం మంచిదే కానీ.. కొన్నిసార్లు ఆర్ధిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే క్రెడిట్ కార్డును ఉపయోగించి రెంట్ (అద్దె) కట్టడం మంచిదేనా? దీని వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.అద్దె చెల్లించడానికి క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం.. రివార్డ్ పాయింట్లను కూడబెట్టుకోవడానికి లేదా క్రెడిట్‌ స్కోర్ పెంచుకోవడానికి మంచి వ్యూహం కావచ్చు. కానీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లింపుప్రాసెసింగ్ ఛార్జీలు: మీరు క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లించినప్పుడు, కొంతమంది ఓనర్స్ లేదా ఏజెన్సీలు ప్రాసెసింగ్ ఛార్జీలను సైతం వసూలు చేస్తారు. ఈ ఛార్జి మీరు చెల్లించే అద్దెలో రెండు నుంచి మూడు శాతం వరకు ఉంటుంది.క్యాష్ అడ్వాన్స్ ఫీజు: అద్దె చెల్లింపులను సాధారణ లావాదేవీలుగా పరిగణించడానికి బదులు.. కొంతమంది క్రెడిట్ కార్డ్ జారీ చేసేవారు వాటిని క్యాష్ అడ్వాన్స్‌లుగా పరిగణిస్తారు. దీనికి సాధారణ వడ్డీ కంటే కూడా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.గత బకాయి చెల్లింపులపై వడ్డీ: మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లును ఎప్పటికప్పుడు చెల్లించకపోతే.. అది తప్పకుండా మీ మీద ఆర్ధిక భారం పెంచుతుంది. కాబట్టి అలాంటి సమయంలో అద్దె చెల్లిస్తే.. వడ్డీ మరింత ఎక్కువవుతుంది.క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లించే ముందు తెలుసుకోవసిన అంశాలుఫీజులు: అద్దె చెల్లించడానికి క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం వల్ల.. ప్రాసెసింగ్ ఫీజు కొంత ఎక్కువగా ఉంటుంది.వడ్డీ ఆధారిత ఫీజులు: మీరు మీ క్రెడిట్ కార్డ్‌ బిల్లును సకాలంలో చెల్లించకపోతే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఇది మీ క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది.ఇదీ చదవండి: ఫిక్స్‌డ్ డిపాజిట్​పై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఇదే!క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లించడాం వల్ల లాభాలురివార్డ్‌లను సంపాదించవచ్చు: క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లిస్తే.. క్యాష్ బ్యాక్ లేదా క్రెడిట్ కార్డ్ రివార్డ్‌లను పొందవచ్చు. ఇది షాపింగ్ వంటి వాటికి ఉపయోగపడతాయి. కాబట్టి షాపింగ్ సమయంలో కొంత డబ్బు ఆదా అవుతుంది.క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చు: క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లింపులు చేయడం వల్ల.. క్రెడిట్ స్కోరును పెంచుకోవచ్చు. ఇది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.అద్దె చెల్లించడంలో ఆలస్యం నివారించవచ్చు: చేతిలో డబ్బు లేకపోయినా.. మీరు క్రెడిట్ కార్డు ద్వారా సకాలంలో అద్దె చెల్లించవచ్చు. ఒకవేళా ఇంటి ఓనర్.. అద్దె ఆలస్యం చేస్తే విధించే ఫెనాల్టీ నుంచి తప్పించుకోవచ్చు.పేమెంట్ సెక్యూరిటీ: క్రెడిట్ కార్డు హిస్టరీ వల్ల మిమ్మల్ని ఎవరూ మోసం చేసే అవకాశం లేదు. కాబట్టి మీ చెల్లింపులకు ఇక్కడ భద్రత లభిస్తుంది.

Ram Charan Game Changer Special Shows Cancelled By Telangana Government8
గేమ్‌ ఛేంజర్‌ సినిమాకు షాక్‌.. ఇకపై అది లేనట్లే!

సాక్షి, హైదరాబాద్‌: గేమ్‌ ఛేంజర్‌ సినిమా (Game Changer Movie) స్పెషల్‌ షోలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేపటి నుంచి మార్నింగ్‌ స్పెషల్‌ షోలు నిలిచిపోనున్నాయి. టికెట్‌ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా బెనిఫిట్‌ షోలను రద్దు చేసి స్పెషల్‌ షోలకు మాత్రం అనుమతి ఇవ్వడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. దీనిపై పునరాలోచించాలని సూచించింది. దీంతో ప్రభుత్వం స్పెషల్‌ షోలను రద్దు చేసింది.బెనిఫిట్‌ షోకు నిరాకరణరామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న గేమ్‌ ఛేంజర్‌ సినిమా టికెట్‌ ధరల పెంపునకు, ప్రత్యేక షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. కాకపోతే అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్‌ షోకు మాత్రం అనుమతి నిరాకరించింది. జనవరి 10న తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆరు షోలు వేసుకోవచ్చని పేర్కొంటూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జనవరి 8న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కూరగాయల వ్యాపారి గొర్ల భరత్‌రాజ్‌తోపాటు సతీశ్‌కమాల్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.స్పెషల్‌ షో కూడా బెనిఫిట్‌ షోలాంటిదే!దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. గేమ్‌ఛేంజర్‌ సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు ప్రభుత్వం అనుమతివ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకపక్క బెనిఫిట్‌ షోలు రద్దు చేశామంటూ, మరోపక్క ప్రత్యేక షోలకు అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించింది. ప్రత్యేక షో కూడా ఒకరకంగా బెనిఫిట్‌ షో లాంటిదే అని వ్యాఖ్యానించింది. వేకువజాము షోలకు అనుమతి, టికెట్‌ ధరల పెంపును పునఃసమీక్షించాలని స్పష్టం చేసింది. భవిష్యత్తులో వేకువజాము షోలకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని చెబుతూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మార్నింగ్‌ స్పెషల్‌ షోలను రద్దు చేసింది.చదవండి: హీరోల బాడీగార్డులు కోట్లల్లో సంపాదిస్తారా? ఎట్టకేలకు క్లారిటీ

Clash Between Brs And Congress Workers In Bhuvanagiri9
భువనగిరి బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడి

సాక్షి, భువనగిరి: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. భువనగిరి బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సీఎంపై బీఆర్‌ఎస్‌ నేత కంచర్ల వ్యాఖ్యలకు నిరసనగా దాడికి దిగారు. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తల దాడిలో ఫర్నీచర్‌ ధ్వంసమైంది.కాగా, సీఎం రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి భువనగిరిలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు మండిపడుతున్నారు. సీఎం పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై దాడి చేసి కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు కార్యాలయం భారీగా చేరుకున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తామంటున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. భువనగిరి పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళనకు దిగారు.బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై దాడిని ఖండించిన కేటీఆర్‌బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపైన కాంగ్రెస్ శ్రేణుల దాడిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటుగా మారిందన్నారు. ఇందిర రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండా రాజ్యం చెలాయిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ గుండాలను పంపి దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అని కేటీఆర్‌ పేర్కొన్నారు.ఎన్నుకున్న ప్రజలతో పాటు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. పదేళ్లపాటు ప్రశాంతంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం, ఈ రోజు అరాచకాలకు చిరునామాగా మారిందని, దాడులు, గుండాగిరి తమ మార్కు పాలన అని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించుకుంటుందన్నారు. మా పార్టీ కార్యకర్తల జోలికి, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. వెంటనే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు, వారి వెనుక ఉన్న నలగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ఎటు చూసినా సంక్రాంతి రద్దీ.. ప్రత్యేక రైళ్లతో ప్రయాణికులకు చుక్కలే

Bhumana Karunakar Reddy Challenges Minister Anam Ramanarayana Reddy10
నిజమైతే నిరూపించండి.. మంత్రి ఆనంకు భూమన సవాల్‌

సాక్షి, తిరుపతి: తిరుపతి తొక్కిసలాట(tirupati stampede)లో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించిన సందర్భంగా.. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy) చేసిన అర్థం లేని ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) వీడియో ద్వారా ధీటుగా బదులిచ్చారు.భూమన కరుణాకర్‌రెడ్డి ఏమన్నారంటే..:‘మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాపై చేసిన ఆరోపణలు దారుణంగా ఉన్నాయి. నిజానికి మీ నిర్వాకం వల్ల ఆరుగురు మరణిస్తే, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సింది పోయి, జగన్‌పై ఆరోపణలు చేశారు. ఇది కచ్చితంగా మీరు స్థాయి దిగజారి మాట్లాడటమే. ఇంత హీనంగా మాట్లాడగలనని మీకు మీరు నిరూపించుకున్నారు. మీ మాటలతో తొక్కిసలాటలో మరణించిన వారి బంధువులు, క్షతగాత్రులను దారుణంగా అవమానించారు’.‘తొక్కిసలాట బాధితులపై సానుభూతి చూపాల్సింది పోయి, పరామర్శించి ఆర్థిక సాయం చేయాల్సింది పోయి.. మేం డబ్బులిచ్చి మిమ్మల్ని తిట్టించడానికి వాడుకున్నామనడం రాజకీయం కాదా?. దీన్ని బట్టే ఎవరు రాజకీయం చేస్తున్నారో తేటతెల్లం అవుతోంది. మీకు క్షతగ్రాత్రుల మీద కూడా సదభిప్రాయం లేదని అర్థమవుతోంది. వారు మీ గురించి మాట్లాడలేదని మీరు ఇలా మాట్లాడుతారా? మీ అస్తిత్వానికి ఇబ్బంది వస్తుందని ఇలా ఆరోపణలు చేస్తారా?’.‘మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే ట్రాక్టర్లు అడ్డుపెట్టి అడ్డుకోవాలనుకోవడం దారుణం కాదా?. కనీస భధ్రత ఇవ్వాలని కూడా తెలియదా?. జగన్‌ ఆస్పత్రికి వస్తున్నారని తెలిసి కూడా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అంతసేపు అక్కడెందుకు ఉన్నారు?. అది కావాలనే ఉద్దేశపూర్వకంగా చేసింది కాదా?. జగన్‌ ఆసుపత్రికి రాకుండా కుట్ర చేసిన మాట నిజం కాదా?’.ఇదీ చదవండి: బాబు డ్రామాలో పవన్‌ బకరా!‘మిమ్మల్ని తిట్టించడం కోసం మేం ఆస్పత్రిలో డబ్బులిచ్చామన్నది సీసీ కెమెరాలో రికార్డయిందని అంటున్నారు కదా?. ఆనం రామనారాయణ రెడ్డికి సవాల్‌ చేస్తున్నాం. తొక్కిసలాట క్షతగాత్రులతో మిమ్మల్ని తిట్టించడం కోసమే మేము వారికి డబ్బులు ఇచ్చామంటున్నారు కదా!. ఒకవేళ అది నిజమైతే, మీకు నిజంగా దేవుడిపై భక్తి కలిగి ఉంటే మేం కేవలం మిమ్మల్ని తిట్టించడం కోసమే తొక్కిసలాట క్షతగాత్రులకు డబ్బులిచ్చినట్లు మీరు నిరూపించాలి. ఆ పని చేయలేకపోతే వెంటనే మీ పదవికి రాజీనామా చేయాలి’.‘నిజానికి జగన్‌ వచ్చేవరకు మమ్మల్ని ఆసుపత్రి వైపు మీ పోలీసులు, అధికార గణం వెళ్లనీయలేదు. ఆ విషయం గుర్తుంచుకొండి. చంద్రబాబు పాలనపై ప్రజలకు ఏ అభిప్రాయం ఉందో ఇప్పటికే అందరికీ అర్థమవుతోంది. మీరు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నా.. మీ పార్టీలో ఎవరూ గుర్తించడం లేదనే మీరు, ఇలా ఆరోపణలు చేశారనేది స్పష్టంగా అర్థమవుతోంది’’ అని భూమన పేర్కొన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
గవర్నర్‌వి చిన్న పిల్లల చేష్టలు: సీఎం స్టాలిన్‌

చెన్నై:  తమిళనాట అటు ప్రభుత్వానికి ఇటు గవర్నర్‌కు ఏమాత్

title
మీకు కంగ్రాట్స్‌.. మీరే బీజేపీ సీఎం అభ్యర్థి..!

న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నే

title
Kannauj: రైల్వే స్టేషన్‌లో కూలిన నిర్మాణం.. శిథిలాల కింద పలువురు!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ప్రమాదం జరిగింది.

title
రూ.2026 కోట్ల నష్టం.. ఢిల్లీ మద్యం పాలసీపై కాగ్ తాజా రిపోర్టు

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

title
ప్రియురాలి మృతదేహాన్ని 9 నెలలుగా ఫ్రిడ్జ్‌లో దాచి..

దేశంలోని పలు ప్రాంతాల్లో హృదయవిదారక దారుణాలు చోటుచేసుకుంటున్నాయి.

NRI View all
title
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా

ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్

title
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!

అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్‌ దిగ్గజం యాపిల్‌ 185 మంది ఉద్యోగులను త

title
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి

title
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)

title
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్‌..!అచ్చం భారత్‌లో..

ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్‌ బిజినెస్‌లు.

Advertisement

వీడియోలు

Advertisement