Irrigation Department
-
అడుగంటిన జలం.. అందని భూగర్భ జలాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నీళ్లందక ‘బోరు’మంటున్న పొలాలు.. చేతికందిన పంట కళ్ల ముందే ఎండిపోతుంటే రైతులు తల్లడిల్లిపోతున్నారు. అప్పులు చేసి, బోర్లు వేయించి అయినా పంటలను కాపాడుకుందామంటే.. నీళ్లు పడక కన్నీళ్లు పెడుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాల్లో వరి ఎండిపోయినట్టు వ్యవసాయ శాఖ అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. వేసవి మరింత ముదురుతుండటం, భూగర్భ జలాలు మరింతగా తగ్గిపోతుండటంతో మరింతగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు. వేలకొద్దీ బోర్లు వేస్తున్నా... వేసవి తీవ్రత పెరుగుతుండటం, భూగర్భ జలాలు తగ్గి బోర్లు వట్టిపోతుండటంతో.. పంటలను కాపాడుకునేందుకు రైతులు పెద్ద సంఖ్యలో బోర్లు వేయిస్తున్నారు. ముఖ్యంగా నల్లగొండ, యాదాద్రి, సిద్ధిపేట, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, వరంగల్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బోర్లు వేయిస్తున్న రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒక్కో ఉమ్మడి జిల్లా పరిధిలో గత రెండు నెలల్లో.. కనీసం వెయ్యి వరకు బోర్లు వేయించినట్టు అంచనా. పెరుగుతున్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తీసుకుంటున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. ఇందులో కొంత మంది కాలువల కింద సాగు చేస్తుండగా.. ఎక్కువ మంది కొత్తగా బోర్లు వేసి పంటలు కాపాడుకునేందుకు ప్రయతి్నస్తున్నవారే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత రెండున్నర నెలల్లో 1,969 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తీసుకోగా.. మహబూబ్‌నగర్‌లో 1,334 కనెక్షన్లు, వరంగల్ జిల్లాలో 1,706 కనెక్షన్లు, ఖమ్మం జిల్లాలో 850 కనెక్షన్లు తీసుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అప్పుల ఊబిలోకి రైతులు పంటను కాపాడుకునేందుకు పెద్ద సంఖ్యలో బోర్లు వేయిస్తున్న రైతులు.. ఇందుకోసం లక్షల రూపాయలు అప్పులు చేస్తున్నారు. అటు బోర్లలో నీరూ పడక, ఇటు అప్పులూ పెరిగిపోయి తలపట్టుకుంటున్నారు. – యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం ఉప్పలపహడ్ గ్రామానికి చెందిన సైరెడ్డి చంద్రారెడ్డి బావి ఎండిపోవడంతో రెండు నెలల కిందట బోరు వేశారు. నీళ్లు పడలేదు. వారం కింద మరో బోరు 450 ఫీట్లు వేయించగా.. అదీ ఫెయిల్ అయింది. వాటికోసం చేసిన అప్పు రూ.లక్షన్నర, పంట పెట్టుబడి రూ.లక్ష మొత్తం రూ.2.5 లక్షల అప్పులపాలయ్యారు. – నారాయణపేట జిల్లా మరికల్ మండలం పల్లెగడ్డకు చెందిన గుర్రం శ్రీనివాస్ 4 ఎకరాల్లో వరి సాగు చేశారు. మూడెకరాల్లో పంట ఎండిపోతుండటంతో పది రోజుల కింద 3 బోర్లు వేశారు. వాటిల్లో చుక్క నీరు కూడా పడలేదు. చేసేదేమీ లేక పొలాన్ని పశువుల మేతకు వదిలేశారు. బోర్లు వేసేందుకు చేసిన రూ. 2 లక్షల అప్పు భారంగా మారింది. – కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కన్నాపూర్ తండాకు చెందిన కాట్రోత్ రవినాయక్ నాలుగెకరాల్లో వరి సాగు చేశారు. పంట ఎండిపోతుండటంతో మూడు బోర్లు వేయించినా.. ఒక్కదానిలోనూ నీళ్లు పడలేదు. రూ.3.5 లక్షలు అప్పు మీదపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్పల్లికి చెందిన చింతాకుల రవి రెండెకరాల్లో వరి వేశారు. బోరు ఎండిపోవడంతో.. 20 రోజుల కింద 600 ఫీట్ల వరకు మరో బోరు వేసినా నీరు పడలేదు. రూ.లక్షన్నర అప్పు అయిందని వాపోతున్నారు. మూడు బోర్లు ఫెయిల్ అయ్యాయి..ఈ చిత్రంలోని రైతు పేరు గోగు హరిప్రసాద్. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన ఈయన ఆరు ఎకరాల్లో వరి సాగు చేశారు. అందుకోసం రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ప్రసాద్‌కు మూడు బోర్లు ఉండగా, భూగర్భ జలాలు అడుగంటి రెండు ఎండిపోయాయి. పంటను కాపాడుకునేందుకు అప్పులు చేసి మరో మూడు బోర్లు వేయించారు. ఒక్కదాంట్లోనూ నీరు పడలేదు. లక్షన్నర రూపాయల వరకు ఖర్చయినా.. పంటకు చుక్క నీరు అందలేదు. కళ్లెదుటే పంట ఎండిపోతోందని వాపోతున్నారు. అప్పులు తీర్చేదెలా? ఐదెకరాల్లో వరి సాగు చేశా. భూగర్భ జలాలు తగ్గి బోరు ఎత్తిపోయింది. పంటను కాపాడుకునేందుకు రూ.1.5 లక్షలు అప్పు చేసి రెండు బోర్లు వేయించినా చుక్క నీరు రాలేదు. పొట్టదశలో ఉన్న వరి ఎండిపోతోంది. ఏం చేయాలో, అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. – పెరుగు కొమురయ్య, ఆరేపల్లి, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా 600 ఫీట్లు వేసినా నీళ్లు పడలే.. నాకు ఆరెకరాలు పొలం ఉంది. భూగర్భ జలాలు అడుగంటడంతో రెండు బోర్లు 600 ఫీట్ల వరకు వేయించా. అయినా నీళ్లు పడలేదు. రూ. లక్ష ఖర్చయింది. మళ్లీ బోరు వేయాలంటే భయంగా ఉంది. – బుర్ర వినయ్‌కుమార్, లక్ష్మిపూర్, తంగళ్లపల్లి, సిరిసిల్ల ఈయన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరామన్చర్లకు చెందిన రైతు మల్గ బీరయ్య. ఒకటిన్నర ఎకరాల్లో మామిడి తోట వేశారు. పదెకరాల్లో వరి సాగు చేశారు. భూగర్భ జలాలు పడిపోవడంతో ఉన్న మూడు బోర్లు వట్టిపోయాయి. పొట్ట దశలో ఉన్న వరిని కాపాడుకునేందుకు వారం రోజుల్లో ఏడు బోర్లు వేశారు. ఒక్కొక్కటి 600 ఫీట్ల లోతు వరకు వేసినా చుక్క నీరు కూడా పడలేదు. సుమారు రూ.4.50 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయిందని, 8 ఎకరాల వరి పూర్తిగా ఎండిపోయిందని ఆయన వాపోతున్నారు. సాగునీరు లేక పాడి గేదెలకు తాగునీరు అందించలేక మూడు పశువులను అమ్మేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం కర్నాల్ తండాకు చెందిన ఈ రైతుపేరు మహిపాల్. భూగర్భ జలాలు అడుగంటి పొలంలోని బోరు వట్టిపోయింది. ఎండిపోతున్న పంటను కాపాడుకునేందుకు మరో బోరు వేయించారు. 800 ఫీట్ల లోతు వేసినా నీళ్లు పడలేదు. రూ.1.60 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేదని ఆయన వాపోయారు. ఈ చిత్రంలోని రైతు యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం రాగిబావికి చెందిన ఏలకంటి సత్తిరెడ్డి. 4 ఎకరాల్లో వరి సాగు చేశారు. పాత బోర్లు వట్టిపోవడంతో.. 20 రోజుల కింద వరుసగా నాలుగు బోర్లు వేయించారు. దేనిలోనూ నీళ్లు పడలేదు. రూ.3 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండాపోయిందని, పొలమంతా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
లక్ష ఎకరాల్లో ఎండిన వరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, నిజామాబాద్, కామారెడ్డి, వనపర్తి, యాదాద్రి, మెదక్, సిద్దిపేట, భద్రాద్రి, ఖమ్మం, సిరిసిల్ల జిల్లాల్లో వరిమళ్లు ఎండుతున్నాయి. ప్రాజెక్టుల నీటి మీది ఆశతో వరి సాగు చేసిన రైతులతో పాటు బోర్లు, బావుల కింద పంట వేసిన లక్షలాది మంది రైతులు పొట్ట కొచ్చే దశలో ఉన్న వరిని చూసి తల్లడిల్లుతున్నారు. ప్రాజెక్టుల కింద ఉన్న పొలాలకు వారబందీ ప్రాతిపదికన నీటిని విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, దేవాదుల,ఎల్ఎండీ, మిడ్‌మానేరు, మల్లన్నసాగర్, సీతారామసాగర్ మొదలైన ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని పొదుపుగా కిందకు వదులుతుండడంతో ఆయకట్టు చివర ఉన్న పొలాలకు నీరు అందడం లేదు. దీంతో పలు జిల్లాల్లో వరిమళ్లు ఎండుతున్నాయి. ఇప్పటికే సుమారు లక్ష ఎకరాల్లో వరి పంట ఎండిపోయినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిసింది. పడిపోతున్న భూగర్భ జలాలు: ఈ ఏడాది మార్చిలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. చాలాచోట్ల ఏప్రిల్‌లో ఉండే ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. గత సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో నమోదైన భూగర్భ నీటి మట్టాలు ఈసారి మార్చి నెలలోనే ఆ స్థాయికి వెళ్లాయి. గత నెలాఖరు నాటికే వికారాబాద్ జిల్లాలో 13.67 మీటర్ల లోతుకు వెళ్లగా, ప్రస్తుతం 14 మీటర్లు దాటింది. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, సిరిసిల్ల, మహబూబ్‌నగర్, భద్రాద్రి, భూపాలపల్లి జిల్లాల్లో.. ఫిబ్రవరిలో రాష్ట్ర సగటు భూగర్భ జల మట్టం 8.32 మీటర్లను మించి 9 మీటర్ల నుంచి ఏకంగా 13 మీటర్ల వరకు వెళ్లింది. ఇక మార్చి రెండో వారం దాటే నాటికి కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో భూగర్భ మట్టాలు మరింత అడుగంటినట్లు అధికారులు చెపుతున్నారు. రికార్డు స్థాయిలో పంటల సాగు రాష్ట్రంలో ఈ యాసంగిలో అత్యధికంగా 73.65 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో వరే 56.13 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ప్రభుత్వం సన్న ధాన్యానికి బోనస్ కింద క్వింటాలుకు రూ.500 ఇస్తుండడంతో సాగు గణనీయంగా పెరిగింది. సన్నాల సాగు పెరగడంతో సాగునీటి అవసరం మరింత పెరిగింది. పంట కాలం ఎక్కువ కావడంతో నీటి తడులు కూడా ఎక్కువ కావలసి ఉంది. అయితే ఎస్ఆర్ఎస్పీ, దేవాదుల వంటి ప్రాజక్టుల కింద పొలాలకు వారబందీ కింద ఒక వారం నీరిచ్చి, మరో వారం బంద్ చేస్తుండడంతో వారం పాటు పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. భూగర్భ జలాలపై ఆధారపడి పంటలు వేసిన చాలా గ్రామాల్లో పంటను పశువులకు వదిలేశారు. మొక్కజొన్న పంట కూడా సాధారణ సాగుతో పోలిస్తే ఈసారి ఏకంగా మూడున్నర లక్షల ఎకరాలు అధికంగా సాగైంది. గిట్టుబాటు ధర ఉండడంతో రైతులు 8.09 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఆరు తడి పంటగా సాగయ్యే మొక్క జొన్నకు వారం, పదిరోజులకు కూడా ఒక తడి నీరు ఇవ్వని పరిస్థితుల్లో నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో మొక్కజొన్న ఎండిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. మొక్కజొన్న, వేరుశనగ కూడా..నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, మెదక్ మొదలైన జిల్లాల్లో మొక్కజొన్న, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, వికారాబాద్ తదితర జిల్లాల్లో వేరుశనగ పంటలు కూడా నీళ్లు లేక ఎండిపోతున్నట్లు రైతులు వాపోతున్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు వరి పంట కోతకు వచ్చే అవకాశం ఉండడంతో అప్పటి వరకు ఆయకట్టుకు నీరు ఎలా ఇవ్వాలో తెలియక నీటిపారుదల శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల బాధలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ నీరు పెద్దపల్లి జిల్లా గుండా మంథని వరకు నిరాటంకంగా వెళ్లేలా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రయతి్నస్తున్నప్పటికీ, వచ్చే నెలలో ఎలా ఉంటుందో చెప్పలేమని ఓ అధికారి పేర్కొన్నారు. -
గుండ్రేవుల.. ఎండమావిలా ఎన్నాళ్లిలా!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తుంగభద్ర నదిపై ఉన్న సుంకేసుల రిజర్వాయర్ నుంచి ఏటా సగటున 200 టీఎంసీలకుపైగా నీరు కృష్ణాలో కలుస్తోంది. ఆ జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయి. గతేడాది 341.99 టీఎంసీలకుపైగా నీరు దిగువకు వదిలారు. కళ్లెదుటే ఇంత నీరు వృథాగా పోతుంటే.. కర్నూలు, వైఎస్సార్ జిల్లాలను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. రాష్టంలో అన్ని ప్రాంతాల కంటే దుర్భిక్ష ప్రాంతం రాయలసీమ. సాగునీటి వనరులు అత్యల్పంగా ఉన్న ప్రాంతం. వర్షాధారంపై సాగు చేసే పంటలే అధికం. ప్రతి పదేళ్లలో ఎనిమిదేళ్లు ఈ ప్రాంతంలో కరువే ఉంటుంది. అరకొరగా ఉన్న సాగునీటి వనరులు కూడా మృగ్యమవుతున్నాయి. దీంతో ‘సీమ’లో వ్యవసాయం ప్రమాదంలో పడే పరిస్థితులు నెలకొన్నాయి. సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో తుంగభద్ర నదిపై గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తే కరువుతో అల్లాడిపోతున్న కర్నూలుతో పాటు వైఎస్సార్ జిల్లాకు మేలు జరుగుతుంది. వైఎస్ హయాంలో బీజం పడినా... కోడుమూరు నియోజకవర్గంలో సుంకేసుల రిజర్వాయర్‌కు 15 కిలోమీటర్ల ఎగువన సీ.బెళగల్ మండలంలో గుండ్రేవుల, రంగాపురం పరిధిలో 20.15 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అప్పటి ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు విన్నవించారు. దీంతో ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని వైఎస్ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మృతి చెందారు. కాగా.. 2011 ఏప్రిల్ 30న గుండ్రేవుల ప్రాజెక్టు డీపీఆర్‌ను అప్పటి ఈఈ సుబ్బరాయుడు ప్రభుత్వానికి నివేదించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వాలు గుండ్రేవుల నిర్మాణాన్ని విస్మరించాయి. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రభుత్వం హడావుడిగా 2019 ఫిబ్రవరి 21న జీవో154 జారీ చేసింది. గుండ్రేవుల ప్రాజెక్టుకు రూ. 2,890 కోట్ల నిధులతో చేపట్టేలా పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని ప్రాంతాలతో పాటు పశ్చిమ ప్రాంతాల్లో పూర్తిగా సాగు, తాగునీటి సమస్య పరిష్కారమవుతుంది. కర్నూలు నగరపాలక సంస్థకు కూడా తాగునీటి కష్టాలు తీరుతాయి. అలాగే ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నుంచి లిప్ట్ ఇరిగేషన్ ద్వారా కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం కూడా ఉంది.ఇప్పటికే కొన్ని గ్రామాలకు పరిహారంవైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 2007లో తుంగభద్రకు వరదలు వచ్చాయి. అప్పట్లో తుంగభద్ర పరీవాహక గ్రామాలు మునిగిపోయాయి. అప్పట్లో వైఎస్ ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద కొన్ని గ్రామాలకు పరిహారం కూడా చెల్లించింది. గ్రామాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. కాబట్టి ముంపు పరిహారం కూడా కొన్ని గ్రామాలకు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అంశాలను బేరీజు వేస్తే ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా సానుకూల పరిస్థితులు ఉన్నట్టు స్పష్టమవుతోంది.గుండ్రేవుల నిర్మించకపోతే ‘ సీమ’కు ఇబ్బందే! తుంగభద్రలో నీటి లభ్యత ఎక్కువ. దీనిపై ఆధారపడే వైఎస్సార్, కర్నూలు జిల్లాల ఆయకట్టు ఆధారపడి ఉంది. భవిష్యత్‌లో కేసీ కెనాల్‌కు సమృద్ధిగా నీటిని అందించాలంటే గుండ్రేవుల ప్రాజెక్ట్ నిర్మించాలి. 2009లో అప్పటి ప్రభుత్వం డీపీఆర్‌కు రూ.53 లక్షలు మంజూరు చేసింది. ప్రభుత్వానికి డీపీఆర్ కూడా అందింది. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను పక్కనపడేశారు. సుంకేసుల బ్యారేజీ 1.2 టీఎంసీల సామర్థ్యమే. దీంతో పెద్దగా ఉపయోగం లేదు. ఆ నీటిని కూడా తుమ్మిల ఎత్తిపోతల ద్వారా తెలంగాణ తోడేస్తోంది. విభజన తర్వాత ఆ ప్రాజెక్టు అంతరాష్ట్ర ప్రాజెక్టుగా మారింది. గుండ్రేవుల నిరి్మస్తే 20 టీఎంసీలకు పైగా నిల్వ చేసుకోవడంతో పాటు కర్నూలు పశి్చమ ప్రాంతం ఆయకట్టుతోపాటు వైఎస్సార్ జిల్లాకు మేలు జరుగుతుంది. – శ్రీనివాసరెడ్డి, రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ -
పాత ప్రాజెక్టుల బాగోగులు పట్టవా?
సాక్షి, హైదరాబాద్: కొత్త సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఏటా రూ.వేల కోట్లు ఖర్చుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. నిర్మాణం పూర్తైన ప్రాజెక్టుల బాగోగులకు మాత్రం నయాపైసా విదల్చడం లేదు. దీంతో రూ.లక్షల కోట్లు విలువ చేసే ప్రాజెక్టులు గాలిలో దీపంలా మారాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ (ఓ అండ్ ఎం)కు 2024–25 బడ్జెట్లో రూ.480 కోట్లు కేటాయించగా, మరో 26 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయలేదు. సాగునీటి ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల విలువ రూ.160 కోట్లకు ఎగబాకింది. మొత్తం 170 పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నీటిపారుదల శాఖ టోకెన్లు జారీ చేసినా, ఆర్థిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు (బీఆర్ఓ) జారీ చేయకపోవడంతో వాటికి మోక్షం లభించడం లేదు. దయనీయంగా దేవాదులకాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు మినహా రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణను ప్రభుత్వం.. ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించింది. దేవాదుల ప్రాజెక్టు నిర్వహణ, పర్యవేక్షణ చూస్తున్న కాంట్రాక్టర్ ఏడాదికాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో సిబ్బందికి జీతాలు చెల్లించలేక చేతులెత్తేశారు. దీంతో కార్మికులు ఇటీవల పంప్‌హౌస్‌కు తాళం వేసి నిరసన తెలిపారు. తక్షణమే బిల్లులు చెల్లించకపోతే మోటార్లను బంద్ చేసి నీటి పంపింగ్‌ను నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. రెండేళ్ల పాటు ఓ అండ్ ఎం పనులు నిర్వహించేందుకు రూ.22 కోట్ల అంచనాలతో కాంట్రాక్టు అప్పగించగా, సదరు కాంట్రాక్టర్‌కు రూ.9 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే యాసంగి సాగు చివరి దశలో ఉండడంతో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కాంట్రాక్టర్‌కు సర్దిచెప్పి నీటి పంపింగ్ కొనసాగేలా చర్యలు తీసుకున్నారు.ఓ అండ్ ఎం లోపాలే శాపం!గతేడాది గోదావరికి వచ్చిన వరదల్లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు కొట్టుకుపోగా, నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. 500కి పైగా చెరువులకు కూడా గండ్లు పడ్డాయి. వీటికి నిర్వహణ లోపాలే కారణమనే ఆరోపణలొచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వైఫల్యాలకు కూడా నిర్వహణ, పర్యవేక్షణ లోపాలు ఓ కారణమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) తన మధ్యంతర నివేదికలో స్పష్టం చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణపై నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక గత 11 ఏళ్లలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.1.9 లక్షల కోట్లు ఖర్చు చేయగా, ప్రాజెక్టుల నిర్వహణకు మాత్రం ఏటా రూ.100 కోట్లను కూడా ఖర్చు చేయడం లేదు. నెలకు కనీసం రూ.20 కోట్లు ఇచ్చినా ప్రాజెక్టుల నిర్వహణ సజావుగా సాగుతుందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. పనులు చిన్నవే.. కాని అత్యంత కీలకం!రాష్ట్రంలో 40 వరకు భారీ, మధ్యతరహా జలాశయాలుండగా, వాటికి 1,884 గేట్లున్నాయి. 42 వేల కి.మీ. మేర ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, 900 కి.మీ. మేర పైప్డ్ కాల్వలు, 138 పంప్‌హౌస్‌లు, 115 సబ్స్టేషన్లతో పాటు కాల్వలపై బ్రిడ్జీలు, అక్విడక్ట్‌లు వంటి 1.3 లక్షల ఇతర నిర్మాణాలున్నాయి. జలాశయాల గేట్లకు గ్రీజింగ్, గేట్లు ఎత్తే క్రేన్లు, జనరేటర్లు, రోప్వైర్లకు మరమ్మతులు, కాల్వల్లో కలుపు మొక్కల తొలగింపు, దెబ్బతిన్న కాల్వలకు మరమ్మతులు, ఎలక్ట్రికల్ పనులు, డిస్ట్రిబ్యూటరీల నిర్వహణ వంటి పనులు నీటిపారుదల శాఖలోని ఓ అండ్ ఎం విభాగం పరిధిలోకి వస్తాయి. స్థానిక చిన్నస్థాయి కాంట్రాక్టర్లే వీటిని చూస్తుండగా, బిల్లులు చెల్లించకపోవడంతో పనులు చేపట్టేందుకు వారు ముందుకు రావడం లేదు. ఏదైనా జలాశయం గేట్లకు గ్రీజింగ్కు ఏటా రూ.10 లక్షల లోపే వ్యయం కానుండగా, ఈ పనులు చేయకపోతే వరదల సమయంలో గేట్లు మొరాయించే ప్రమాదం ఉంటుంది. కాల్వల్లో కలుపు మొక్కలు, పూడిక పేరుకుపోవడంతో ప్రస్తుత యాసంగి సీజన్లో చాలా ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదని పెద్దసంఖ్యలో ఫిర్యాదులొస్తున్నాయి. -
ఏపీపై కృష్ణా బోర్డు ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ కుడి ప్రధాన కాల్వ ద్వారా ఏపీ తీసుకుంటున్న జలాలను తక్షణమే 7 వేల క్యూసెక్కులకు తగ్గించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశించింది. అలాగే శ్రీశైలం జలాశయం నుంచి తీసుకుంటున్న జలాలను కూడా ఆ రాష్ట్రం తక్షణమే తగ్గించాలని, కేవలం తాగునీటికి అవసరమైన కనీస జలాలను మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుత సంవత్సరంలో ఏపీ తన వాటాకు మించి కృష్ణా జలాలు వాడుకుందని, ఇకపై శ్రీశైలం, సాగర్ నుంచి ఆ రాష్ట్రం నీళ్లు తీసుకోకుండా నిలువరించాలని తెలంగాణ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. బోర్డు ఈ మేరకు ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, సాగర్ నీటి వినియోగానికి సంబంధించి ఓ రాష్ట్రంపై కృష్ణా బోర్డు ఆంక్షలు విధించడం ఇదే తొలిసారి అని అధికారవర్గాలు తెలిపాయి. గతంలో కేవలం జల విద్యుత్‌ను నియంత్రించాలని కోరుతూ మాత్రమే కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు లేఖలు రాసిందని వెల్లడించాయి. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న నిల్వలను రెండు రాష్ట్రాలకు కేటాయించే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు. ఈ నెల 24న జలసౌధలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో పై ఆదేశాలకు సంబంధించి కేఆర్ఎంబీ కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్, ఏపీ తరఫున ఈఎన్సీ ఎం.వెంకటేశ్వర రావు పాల్గొన్నారు. తాగునీటి అవసరాలు తీరిన తర్వాతే.. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో కనీస నీటిమట్టం (ఎండీడీఎల్) 834 అడుగులకు ఎగువన కేవలం 24 టీఎంసీల నీటి లభ్యత ఉండగా, సాగర్ ఎండీడీఎల్ 510 అడుగులకు ఎగువన 42.3 టీఎంసీలే లభ్యతగా ఉన్నాయని కృష్ణా బోర్డు తెలిపింది. ప్రస్తుతం తీవ్ర నీటి కొరత ఉన్న నేపథ్యంలో తాగునీటి అవసరాల కోసం రెండు జలాశయాల్లో నిల్వలను వచ్చే వేసవి ముగిసే వరకు లేదా జూలై 31 వరకు సంరక్షించాలని నిర్ణయించింది. తాగునీటి అవసరాలు తీరిన తర్వాతే మిగిలే జలాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సాగునీటి అవసరాలకు కేటాయిస్తామని స్పష్టం చేసింది. నేడు కేటాయింపులపై కీలక సమావేశం తెలంగాణ నీటిపారుదల శాఖ నల్లగొండ సీఈ, ఏపీ జలవనరుల శాఖ ఒంగోలు సీఈలు.. శ్రీశైలం, సాగర్ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసి ఈ నెల 25లోగా సమర్పించాలని కృష్ణా బోర్డు ఆదేశించింది. ప్రస్తుత ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఉండనున్న సాగునీటి, జూలై 31 వరకు ఉండనున్న తాగునీటి అవసరాల వివరాలు ఈ ప్రణాళికలో ఉండాలని కోరింది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జలసౌధలో సమావేశమై, సదరు ప్రణాళిక ఆధారంగా శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. -
బీఆర్ఎస్ పాలనలోనే ‘కృష్ణా’లో అన్యాయం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది ముమ్మాటికీ గత బీఆర్ఎస్ పాలనలోనే అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాలను ఏపీ పాలకులు దోచుకుపోతుంటే అందుకు సహకరించిన బీఆర్ఎస్ పాలకులు.. ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల వాటాలను ఏపీ, తెలంగాణకు పంపిణీ చేసేందుకు 2015 జూన్ 18, 19 తేదీల్లో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం నిర్వహించగా, ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులను అంగీకరిస్తూ సంతకాలు చేశారని ఆయన గత బీఆర్ఎస్ పాలకులపై మండిపడ్డారు. 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సైతం ఈ అన్యాయానికి సమ్మతి తెలిపారని ఆరోపించారు. కేంద్ర జలశక్తి శాఖ, అపెక్స్ కౌన్సిల్, కృష్ణా బోర్డు 2020 వరకు నిర్వహించిన అన్ని సమావేశాల్లో గత ప్రభుత్వం ఈ కేటాయింపులను అంగీకరించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలసి గురువారం జలసౌధలో విలేకరుల సమావేశం నిర్వహించి కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు చేసిన ఆరోపణలను ఉత్తమ్ తిప్పికొట్టారు. బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాల విషయంలో జరిగిన వరుస అన్యాయాల క్రమాన్ని తేదీలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 2019–22 మధ్యలో ఏపీ ఏటా వరుసగా 653 టీఎంసీలు, 629 టీఎంసీలు, 621 టీఎంసీలను తరలించుకుపోయినా, గత పాలకులు చూస్తుండిపోయారన్నారు. ఏపీని అడ్డుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది.. ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోవడంపై తాను ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి ఫిర్యాదు చేయగా, ఏపీని అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. సీతారామ ప్రాజెక్టుకి ఇప్పటికే తాము 67 టీఎంసీల కేటాయింపులను సాధించామని, నెలాఖరులోగా ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులిస్తామని కేంద్ర మంత్రి మరో హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జీరో వడ్డీ, 50 ఏళ్ల కాలపరిమితితో రుణాలు ఇచ్చేందుకు సంసిద్ధత తెలిపారని వివరించారు. సాగర్‌ను ఏపీకి అప్పగించారు.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని ఏపీ ప్రభుత్వం 2023లో 44 వేల క్యూసెక్కుల నుంచి 92,600 క్యూసెక్కులకు పెంచుకోగా, బీఆర్ఎస్ పాలకులు దానికి సహకరించారని ఉత్తమ్ ఆరోపించారు. అలాగే వెలిగొండ, ఇతర ప్రాజెక్టులను ఏపీ పూర్తిచేసుకునేందుకు కూడా సహకరించారన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాత్రి 2023 నవంబర్ 29న ఏపీ ప్రభుత్వం 400–500 మంది సాయుధ పోలీసులతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు సగభాగాన్ని ఆక్రమించుకోగా, కృష్ణా బోర్డు అనుమతి లేకుండా 5,000 క్యూసెక్కులను విడుదల చేసుకున్నారని, అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు దీనిని చేష్టలుడిగి చూశారని ధ్వజమెత్తారు. అన్యాయం చేసింది వారే.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది హరీశ్‌రావు, కేసీఆర్, మాజీ ఈఎన్సీ మురళీధర్రావే అని, వారికి ఉరేసినా తప్పులేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. వారిది దొంగల తెలివి అని, ప్రశ్నించిన వారిని హత్యలు చేశారని ఆరోపించారు. -
ప్రమాదంలో ‘శ్రీశైలం’
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో ఉందని... తక్షణమే జోక్యం చేసుకోవాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కి తెలంగాణ రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆనకట్టల భద్రత కమిటీ చైర్మన్ హోదాలో రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) ఎన్.అనిల్‌కుమార్ బుధవారం ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు లేఖ రాశారు. 1981లో నిర్మించిన శ్రీశైలం జలాశయానికి 2009లో వచ్చిన భీకర వరదలతో స్పిల్ వే దిగువన నీళ్లుపడే ప్రాంతంలో భారీ గుంత (ప్లంజ్ పూల్) ఏర్పడిందని గుర్తు చేశారు. ఇప్పటివరకు మరమ్మతులు చేయకపోవడంతో.. క్రమంగా ప్లంజ్ పూల్ విస్తరిస్తూ, జలాశయానికి ముప్పుగా పరిణమించిందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం జలాశయాన్ని 14 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా డిజైన్ చేయగా.. 2009లో ఏకంగా 25లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని వివరించారు. భారీగా నీటి విడుదలతో.. స్పిల్ వేకు దిగువన భూమి కోతకు గురై భారీ గుంత ఏర్పడిందని తెలిపారు. ఈ గుంతను పూడ్చకపోతే 143.23 మీటర్ల ఎత్తున్న జలాశయం పునాదులను బలహీనపరిచి, డ్యామ్‌కు ప్రమాదకరంగా మారుతుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీ వంటి సంస్థలు అధ్యయనంలో తేల్చాయని వివరించారు. జలాశయానికి ప్రమాదం జరిగితే భారీ నష్టం శ్రీశైలం జలాశయానికి ప్రమాదం జరిగితే దిగువ ప్రాంతాలను భారీ వరద ముంచేస్తుందని.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర విపత్తును సృష్టిస్తుందని లేఖలో అనిల్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కింద ఆయకట్టుకు సాగునీటి సరఫరా, జల విద్యుదుత్పత్తి నిలిచిపోతాయని పేర్కొన్నారు. జలాశయం పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై తక్షణమే నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఎన్డీఎస్ఏను కోరారు. వచ్చే వానాకాలంలో గుంత మరింత విస్తరించకుండా తాత్కాలిక మరమ్మతులు చేపట్టే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం జలాశయం రక్షణకు చర్యలు తీసుకోకపోతే దిగువన ఉన్న నాగార్జునసాగర్, ప్రకాశం బరాజ్‌లు సైతం ప్రమాదాన్ని ఎదుర్కొంటాయన్నారు. అదే జరిగితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తాగు, సాగునీటితోపాటు చెన్నైకి తాగునీటి సరఫరా సైతం నిలిచిపోతుందని వివరించారు. -
ఏపీ అక్రమ నీటి తరలింపును అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో తెలంగా ణకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించడానికి ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని రాష్ట్ర నీటి పా రుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన 2వ అఖిలభారత నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం జలాశయం, నాగార్జునసాగర్ కుడి కాల్వ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించటాన్ని ఆపాలని కోరారు. ఏపీ వాడుకుంటున్న నీటిని కచ్చితంగా లెక్కించడానికి టెలిమెట్రీ కేంద్రాలను ఏర్పాటు చేసి కృష్ణా బోర్డు పర్యవేక్షించాలని విన్నవించారు. కృష్ణా జలా ల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి పై కృష్ణా ట్రిబ్యునల్–2 నిర్ణయం వెంటనే వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పాల మూరు–రంగారెడ్డి, సమ్మక్క–సారక్క, సీతా రామ ప్రాజెక్టులకు సత్వరంగా నీటి కేటాయింపులు జరపాలని కోరారు. సత్వరంగా ఎన్డీఎస్ఏ నివేదిక ఇవ్వండికాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, ఇతర బరాజ్‌ల పునరుద్ధరణకు తీసుకోవా ల్సిన శాశ్వత చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సత్వరంగా నివేదిక ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని మంత్రి ఉత్తమ్ కోరారు. ప్రాజెక్టుల్లో పూడిక తీతకు కేంద్రం నిధులు ఇవ్వాలని కోరారు.గంగా, యమున నదుల శుద్ధికి సహకరించిన తరహాలోనే మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టుకు కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు రూ.4 వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు గోదావరి నీళ్లను తరలించడానికి మరో రూ.6 వేల కోట్లను కేటాయించాలని కోరారు. -
ఇరిగేషన్ అధికారులపై మంత్రి ఉత్తమ్ అసహనం.. సీరియస్ వార్నింగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇరిగేషన్ శాఖ అధికారులపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గంలోనే పనులు కాకపోతే రాష్ట్రంలో పరిస్థితి ఏంటని అధికారులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడ సమస్య వస్తుందో తెలుసుకొని వెంటనే పనులను మొదలు పెట్టాలని ఉన్నతాధికారులకు ఉకుం జారీ చేశారు ఉత్తమ్.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులపై మండిపడ్డారు. ఆయన సొంత నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టకపోవడంతో ఇంజనీర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అధికారులకు ఫోన్ చేసిన ఉత్తమ్.. వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. అలాగే, ఎక్కడ సమస్య వస్తుందో తెలుసుకొని పనులను మొదలు పెట్టాలని ఉన్నతాధికారులకు ఉకుం జారీ చేశారు. అయితే, పనులు మొదలు కాకపోవడం గురించి ఒకరిపై ఒకరు తోసిపుచ్చుకున్నారు జిల్లా అధికారులు. దీంతో, అధికారులపై మంత్రి ఫైరయ్యారు. సూర్యాపేట సీఈతో పాటు జిల్లా ఇరిగేషన్ అధికారులను వెంటనే హైదరాబాద్ ఆఫీస్‌కు రావాలని ఈఎన్సీకి ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో తన సొంత నియోజకవర్గంలోనే పనులు జరగకపోతే రాష్ట్రంలో పరిస్థితి ఏంటని అసహనం వ్యక్తం చేశారు.మరోవైపు.. మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ పథకాల్లో వేగం పెంచడమే కాకుండా.. పంచాయతీ ఎన్నికలను అతి త్వరలో నిర్వహిస్తాం. బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజలందరికీ అన్ని పథకాలు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. రాజకీయంగా నాకు ఒక క్రెడిబిలిటీ ఉంది. వరుసగా ఏడుసార్లు గెలిచిన వ్యక్తిని నేను. కేబినెట్ విస్తరణ సీక్రెట్.. ఇప్పుడే చెప్పలేం. ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభమని అన్నారు. ఇదే సమయంలో కేటీఆర్ అరెస్ట్‌పై మంత్రి ఉత్తమ్ స్పందించకపోవడం గమనార్హం.ఇదిలా ఉండగా.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మహిపాల్ రెడ్డి సెక్రటేరియట్‌గా వరుసగా మంత్రులను కలవడం ఆసక్తికరంగా మారింది. -
ఓఅండ్ఎం ఒప్పందం చేసుకోలేదు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల బరాజ్ నిర్మాణం 2021లో పూర్తయిందని, ఆ వెంటనే బరాజ్ పర్యవేక్షణ, నిర్వహణ (ఓ అండ్ ఎం) కోసం నీటిపారుదల శాఖ తమతో ప్రత్యేక ఒప్పందం చేసుకోవాల్సి ఉండగా చేసుకోలేదని బరాజ్ నిర్మాణ సంస్థ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ డైరెక్టర్ వై.రమేశ్ చెప్పారు. బరాజ్ వద్ద తమ కంపెనీ సిబ్బందితో పాటు నీటిపారుదల శాఖ సిబ్బంది ఉన్నారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలు ఆరోపణలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గురువారం రమేశ్‌కు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. బరాజ్ నిర్వహణ, పర్యవేక్షణలో నిర్మాణ సంస్థ బాధ్యతల గురించి ప్రశ్నించింది. నీటిపారుదల శాఖ రూపొందించిన డిజైన్లతో పోల్చితే సుందిళ్ల బరాజ్ వాస్తవ షూటింగ్ వెలాసిటీ అధికంగా ఉండడంతోనే బరాజ్ దిగువన సీసీ బ్లాకులు కొట్టుకుపోయి బుంగలు ఏర్పడ్డాయని గతంలో సమర్పించిన అఫిడవిట్లో రమేశ్ పేర్కొనడాన్ని గుర్తు చేసింది. రెండు పర్యాయాలు బరాజ్‌కు బుంగలు ఏర్పడితే ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. చివరి బిల్లు చెల్లించడం లేదుతొలిసారి బుంగలు ఏర్పడినప్పుడు గ్రౌటింగ్ ద్వారా పూడ్చివేశామని రమేశ్ బదులిచ్చారు. 2022 వరదల్లో బరాజ్‌కి తీవ్ర నష్టం జరగగా, పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి పునరుద్ధరించామన్నారు. వర్క్ కంప్లిషన్ సర్టిఫికెట్‌ను శాఖ నుంచి తీసుకున్నట్టు ధ్రువీకరించారు. సుందిళ్ల బరాజ్‌లో లోపాలను గుర్తించడానికి పలు రకాల పరీక్షలను నిర్వహించాలన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనలతో.. నీటిపారుదల శాఖ అధికారుల సంతృప్తి మేరకు ఆ పరీక్షలన్నీ పూర్తి చేశామని వివరించారు. కాగా బరాజ్ నిర్మాణానికి సంబంధించిన చివరి బిల్లును ప్రభుత్వం తమకు చెల్లించడం లేదని కమిషన్‌కు రమేశ్ ఫిర్యాదు చేశారు.అనుబంధ ఒప్పందంతో కాంట్రాక్టు పునరుద్ధరణ జరగదుసుందిళ్ల నిర్మాణం 2021 డిసెంబర్లో పూర్తికాగా, 2023లో అదనపు పనులు చేసేందుకు నీటిపారుదల శాఖతో అనుబంధ ఒప్పందం చేసుకున్నామని నవయుగ ప్రాజెక్టు ఇన్చార్జి కె.ఈశ్వర్రావు తెలిపారు. అనుబంధ ఒప్పందంతో పాత కాంట్రాక్టు పునరుద్ధరణ జరగదని స్పష్టం చేశారు. సుందిళ్ల బరాజ్ దిగువన కొట్టుకుపోయిన సీసీ బ్లాకుల పునరుద్ధరణ పనులు పూర్తి చేశామని చెప్పారు. నవయుగ కంపెనీ మరో ప్రాజెక్టు ఇన్చార్జి చింతా మాధవ్ సైతం విచారణకు హాజరు కాగా, ఆయనకు కేవలం మెటీరియల్ కొనుగోళ్లతో మాత్రమే సంబంధం ఉండడంతో కమిషన్ ఆయన్ను ప్రశ్నించలేదు.కాపీ పేస్ట్‌లా అఫిడవిట్లునవయువ కంపెనీ డైరెక్టర్‌తో పాటు ఇద్దరు ప్రాజెక్టు ఇన్చార్జిలు దాఖలు చేసిన అఫిడవిట్లు కాపీ.. పేస్ట్ తరహాలో ఉన్నాయని కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. డైరెక్టర్ అఫిడవిట్‌కు కార్బన్ కాపీలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. -
Krishna River Water: మళ్లీ త్రిసభ్య కమిటీకే..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల తాత్కాలిక సర్దుబాటు బాధ్యతను మళ్లీ త్రిసభ్య కమిటీకే అప్పగిస్తూ కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయం తీసుకుంది. దీనికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో బోర్డు చైర్మన్ అతుల్‌జైన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ తరఫున నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ఈఎన్సీ జి.అనిల్‌కుమార్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఎస్ఈ విజయ్‌కుమార్, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, బోర్డుసభ్యకార్యదర్శి డీఎం రాయ్‌పురే పాల్గొన్నారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల వాటా ఉండగా, 66:34 నిష్పత్తిలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను తాత్కాలిక సర్దుబాటు పేరుతో 2015 జూన్‌లో కేంద్ర జలశక్తి శాఖ జరిపిన కేటాయింపులను ఇకపై కొనసాగించడానికి అంగీకరించమని రాహుల్ బొజ్జా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే త్రిసభ్య కమిటీ ఈసారి తెలంగాణకు కొంత వరకు కేటాయింపులు పెంచుతుందని బోర్డు చైర్మన్ హామీ ఇచ్చారని రాహుల్»ొజ్జా తెలిపారు. సమావేశానంతరం ఈఎన్సీ జి.అనిల్‌కుమార్‌తో కలిసి ఆయన మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు. కృష్ణానది 71శాతం తెలంగాణలో విస్తరించి ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి 71శాతం, ఏపీకి 29 శాతం జలాలను కేటాయించాలని తాము కృష్ణా ట్రిబ్యునల్–2లో వాదనలు వినిపించిన అంశాన్ని బోర్డుకు వివరించామన్నారు. ట్రిబ్యునల్ నిర్ణయం వచ్చే వరకు 50:50 నిష్పత్తిలో తాత్కాలిక పంపిణీ జరపాలని డిమాండ్ చేశామని చెప్పారు. ఏపీ కొత్తగా ప్రతిపాదించిన గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు వివరాలను అందించాలని కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు కోరామన్నారు. ప్రతి చుక్కను లెక్కించాల్సిందే.. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను ఇతర బేసిన్లకు తరలించడాన్ని అడ్డుకోవాలని బోర్డును కోరామని రాహుల్‌బొజ్జా తెలిపారు. చెన్నైకి తాగునీరు మాత్రమే సరఫరా చేయాలని, సాగునీటి అవసరాలకు తరలించడం అక్రమమని వాదించామన్నారు. ఏటా 200 టీఎంసీలకు పైగా కృష్ణా జలాలను ఏపీ బేసిన్ వెలపలి ప్రాంతాలకు తరలిస్తోందని అభ్యంతరం తెలిపారు. పోతిరెడ్డిపాడు, బనకచర్లతోపాటు ఏపీలోని మొత్తం 11 అవుట్ లెట్ల ద్వారా తరలిస్తున్న ప్రతీ చుక్కను పక్కాగా లెక్కించడానికి 11 టెలీమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కోరామని రాహుల్ బొజ్జా తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి వంటి అనుమతి లేని ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేయగా, ప్రస్తుతం వీటికి నీటి కేటాయింపులు ట్రిబ్యునల్ పరిధిలో ఉందని బదులిచ్చామన్నారు. కృష్ణా ట్రిబ్యునల్–1 ప్రాజెక్టుల వారీగా కాకుండా గంపగుత్తగా నీళ్లు కేటాయించిందని, దీంతో తెలంగాణలోని ప్రాజెక్టులకు అవసరమైన నీళ్లను కేటాయించుకునే హక్కు తమకు ఉంటుందన్నారు. సాగర్‌పై సీఆర్పీఎఫ్ బలగాల ఉపసంహరణ నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించాలని తాము కోరగా, ఏపీ సైతం అంగీకరించిందని రాహుల్‌బొజ్జా తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పరిశీలించాక 2 నెలల తర్వాత ఉపసంహరిస్తామని బోర్డు చైర్మన్ హామీ ఇచ్చారన్నారు. కృష్ణా జలాల్లో వాటాలు తేలే వరకు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోని తమ కాంపోనెంట్లతోపాటు హైడల్ పవర్ ప్రాజెక్టులను ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. ప్రమాదంలో శ్రీశైలం జలాశయం : తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్ శ్రీశైలం జలాశయ ప్లంజ్‌పూల్ (నీళ్లు స్పిల్‌వే గేట్ల నుంచి దూకి కిందకు పడే ప్రాంతం) వద్ద 300–400 మీటర్ల లోతు వరకు భారీ గుంతలు ఏర్పడ్డాయని తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే మరమ్మతులు చేయాలని ఏపీని కోరామన్నారు. టెలీమెట్రీల ఏర్పాటుకు రూ.6 కోట్లను భరిస్తామని తెలియజేశామన్నారు. ఈ ఏడాది 780 టీఎంసీల కృష్ణా జలాల లభ్యత ఉండగా, ఇప్పటికే ఏపీ 500 టీఎంసీలు(76శాతం) వాడుకోగా, తెలంగాణ కేవలం 180 టీఎంసీలు మాత్రమే వాడిందన్నారు. ఏపీ అధిక వినియోగానికి తగ్గట్టూ తెలంగాణకు వాటాలు పెంచాలని కోరామని చెప్పారు. బచావత్ కేటాయింపులకు రక్షణ కల్పించాలి : ఏపీ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వర్లు బచావత్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్–1) కేటాయింపుల ఆధారంగా ఏపీకి 66 శాతం, తెలంగాణకి 34 శాతం కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కోరామని ఏపీ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. కృష్ణా ట్రిబ్యునల్–2లో వాటాలు తేలే వరకు ఈ మేరకు కేటాయింపులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ట్రిబ్యునల్ నిర్ణయం వచ్చేవరకు త్రిసభ్య కమిటీ పరస్పర అంగీకారంతో నీళ్లను పంచుకుంటామన్నారు. టెలీమెట్రీల ఏర్పాటుపై తమ ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శ్రీశైలం జలాశయ ప్లంజ్‌పూల్‌కు మరమ్మతుల కోసం సీఎస్ఎంఆర్ఎస్ఈతో అధ్యయనం చేయిస్తున్నామని, కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) అధికారులతో చర్చించి మరమ్మతులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించాలని డిమాండ్ చేశారు. -
Telangana: సెక్షన్–3 ప్రకారమే.. కృష్ణా జలాల పునఃపంపిణీ!
సాక్షి, హైదరాబాద్: అందుబాటులో ఉన్న కృష్ణా జలాలు మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య పునఃపంపిణీకి మార్గం ఏర్పడింది. అలాగే తెలంగాణ కోరుతున్న విధంగా ఇప్పటికే వాడకంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదనల దశలో ఉన్న ప్రాజెక్టులకు సైతం నీటి కేటాయింపులను కృష్ణా ట్రిబ్యునల్ పరిశీలించేందుకు అవకా శం చిక్కింది. తొలుత అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం (ఐఎస్‌డబ్ల్యూడీఏ) 1956లోని సెక్షన్–3 కింద.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి 2023 అక్టోబర్ 6న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అదనపు రెఫరెన్స్ ప్రకారమే విచారణ నిర్వహించాలని జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాతే ఏపీ కోరిన విధంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 కింద విచారణ నిర్వహిస్తామని తెలిపింది. తెలంగాణ దాఖలు చేసిన ఇంటర్‌లొక్యూటరీ అప్లికేషన్ (ఐఏ)పై గురువారం ఢిల్లీలో విచారణ నిర్వహించిన ట్రిబ్యునల్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ట్రిబ్యునల్ విచా రణకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ట్రిబ్యు నల్ నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సమాంతర విచారణ జరపలేం ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్– 89 కింద రెండు రాష్ట్రాల సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ ముగియడంతో ట్రిబ్యునల్‌లో ఇకవిచారణను ప్రారంభించాల్సి ఉండగా, ఐఎస్‌డబ్ల్యూడీఏ చట్టంలోని సెక్షన్–3 కింద కేంద్రం అదనపు రెఫరెన్స్ జారీ చేసింది. దీంతో పాటు సెక్షన్–89 కింద కేంద్రం చేసిన రిఫరెన్స్ కూడా విచారణకు సిద్ధంగా ఉండగా, రెండింటినీ కలిపి విచారణ జరపాలని కోరుతూ తెలంగాణ ఐఏ దాఖలు చేసింది. దీనిపై ఏపీ అభ్యంతరం తెలిపింది. మరోవైపు సెక్షన్–3 కింద కేంద్రం జారీ చేసిన అదనపు రెఫరెన్స్‌ను సవాలు చేస్తూ ఏపీ సుప్రీం కోర్టులో వేసిన రిట్ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. అదనపు రెఫరెన్స్‌పై స్టే విధించాలని ఏపీ కోరగా, తమ తుది తీర్పునకు లోబడి ట్రిబ్యునల్ విచారణలో పాల్గొనవచ్చని ఆ రాష్ట్రానికి సుప్రీంకోర్టు సూచించింది. కాగా కేంద్రం జారీ చేసిన రెండు రెఫరెన్స్‌ల్లో కొన్ని అంశాలు ఒకేలా ఉండగా, మరికొన్ని అంశాలు లేవు. రెండు రిఫరెన్స్‌లను కలిపి విచారించి తాము ఒకే తీర్పు జారీ చేస్తే భవిష్యత్తులో సుప్రీంకోర్టులో ఏపీకి అనుకూలంగా తుది తీర్పు వస్తే ఇబ్బందులొస్తాయని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తాజాగా అభిప్రాయపడింది. అదే జరిగితే తమ తీర్పులోని నిర్ణయాలు, నిర్థారణకు వచ్చిన అంశాలను రెండు రెఫరెన్స్‌ల వారీగా విభజించడం ఇబ్బందికరంగా మారుతుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే రెండు రెఫరెన్స్‌లను కలిపి విచారించడం కంటే వేర్వేరుగా విచారించడమే మేలని తేల్చి చెప్పింది. తొలుత రెండో రిఫరెన్స్‌పై విచారణే సమంజసం అయితే తొలుత ఏ రెఫరెన్స్‌పై విచారణ జరపాలన్న ప్రశ్న తలెత్తింది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి జారీ చేసిన రెండో రెఫరెన్స్‌పై తొలుత విచారణ నిర్వహించడమే సమంజసమని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ‘ప్రాజెక్టుల వారీ’గా నీటి కేటాయింపులు జరపాలంటూ మొదటి రెఫరెన్స్‌లో ఉన్న అంశంతో పాటు మరికొన్ని ఇతర అంశాలతో రెండో రెఫరెన్స్‌కు సంబంధం ఉండడమే దీనికి కారణమని స్పష్టం చేసింది. అయితే మొదటి రెఫరెన్స్ కింద నిర్వహించిన సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్‌ను రెండో రెఫరెన్స్‌పై విచారణ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవడానికి ట్రిబ్యునల్ అంగీకరించింది. అయితే, రెండో రెఫరెన్స్ కింద నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌ను మొదటి రెఫరెన్స్ కింద పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. ఇక ఆయా డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై విచారణ సమయంలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. రెండు రెఫరెన్స్‌ల కింద ఏపీ, తెలంగాణ దాఖలు చేసిన అభ్యర్థనలు, సాక్ష్యాలు, డాక్యుమెంట్లను రెండు రెఫరెన్స్‌లకు ఉమ్మడి రికార్డులుగా పరిగణించాలని తెలంగాణ తన ఐఏలో కోరడంతో ట్రిబ్యునల్ ఈ మిశ్రమ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 19 నుంచి 21 మధ్య నిర్వహిస్తామని తెలిపింది. సెక్షన్– 89 ఏమిటి? ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్–89లోని క్లాజు(ఏ) కింద బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గడువును కేంద్రం పొడిగించింది. గతంలో రాష్ట్రాల్లోని ‘ప్రాజెక్టుల వారీ’గా నిర్దిష్ట కేటాయింపులు జరిగి ఉండకపోతే ఇప్పుడు జరపాలని ఇందులో (తొలి రెఫరెన్స్) ట్రిబ్యునల్‌ను కోరింది. నీటి లభ్యత లేని సమయాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి విడుదల విషయంలో అమలు చేయాల్సిన అపరేషన్స్ ప్రోటోకాల్స్‌ను సిద్ధం చేయాలని క్లాజు(బీ) కింద సూచించింది. ‘ప్రాజెక్టుల వారీ’గా అని సెక్షన్ 89 ఉండగా, అందులో ఏ ప్రాజెక్టు లొస్తాయన్న అంశంపై స్పష్టత కొరవడింది. సెక్షన్ –3 ఏమిటి ? తెలంగాణ విజ్ఞప్తి మేరకు ఐఎస్‌డబ్ల్యూడీఏ–1956లోని సెక్షన్–3 కింద జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్‌కు అదనపు రెఫరెన్స్ (మరిన్ని విధివిధానాలను) జారీ చేస్తూ 2023 అక్టోబర్ 6న కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్మాణం పూర్తైన ప్రాజెక్టులతో పాటు నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశలోని ప్రాజెక్టులకు సైతం ప్రాజెక్టుల వారీగా కృష్ణా జలాలను పంపిణీ చేయాలని ఇందులో కేంద్రం ఆదేశించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్–89లోని క్లాజులు 89(ఏ), 89(బీ)లోని ‘ప్రాజెక్టుల వారీగా’ అనే పదానికి ఈ మేరకు విస్తృత అర్థాన్నిస్తూ గజిట్ నోటిఫికేషన్లో నిబంధన చేర్చింది. ఉమ్మడి ఏపీకి 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కృష్ణా ట్రిబ్యునల్–1 గంపగుత్తగా 811 టీఎంసీలను కేటాయించగా, 65 శాతం లభ్యతతో 1005 టీఎంసీలను కృష్ణా ట్రిబ్యునల్–2 కేటాయించింది. ట్రిబ్యునల్ కేటాయించిన నీళ్లతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో నాగార్జునసాగర్ ఎగువన లభ్యతలోకి వచ్చిన కృష్ణా జలాలను కలిపి రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని అదనపు రిఫరెన్స్‌లో కేంద్రం ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలిస్తే, దానికి ప్రతిగా నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోవడానికి గతంలో బచావత్ ట్రిబ్యునల్ వెసులుబాటు కల్పించింది. ఈ 80 టీఎంసీల్లో ఏ రాష్ట్రం వాడుకోని 45 టీఎంసీలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సి ఉంది. ఈ 45 టీఎంసీలకు 1005 టీంఎసీలను కలిపి మొత్తం 1050 టీఎంసీలను సెక్షన్–3 కింద కృష్ణా ట్రిబ్యునల్–2 రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంది. తాజాగా సెక్షన్–3 కిందే తొలుత విచారణ జరపాలని ట్రిబ్యునల్ భావించడంతో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వచ్చినట్టైంది. తెలంగాణలో ప్రతిపాదన/నిర్మాణం దశలోని పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్ఎల్బీసీ, నారాయణపేట–కొడంగల్ వంటి ప్రాజెక్టులకు సైతం నీళ్లు కేటాయించే అంశాన్ని ట్రిబ్యునల్ పరిశీలించడానికి వీలు కలిగింది. -
సాగర్‌కు ‘బొల్లపల్లి’ గండి!
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వరద జలాలను కుడికాల్వ ద్వారా తరలించి గుంటూరు జిల్లాలో నిర్మించబోయే బొల్లపల్లి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తామని తాజాగా ఏపీ ప్రతిపాదించింది. ఇందుకోసం కుడికాల్వ(జవహర్ కాల్వ)ను 96.5 కి.మీ.ల వరకు వెడల్పు పెంచి అక్కడి నుంచి వరద జలాలను లిఫ్ట్ చేస్తామని ఏపీ చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తక్షణమే తమ వ్యతిరేకతను తెలపడంతోపాటు ఈ ప్రాజెక్టు చేపట్టే ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, గోదావరి, కృష్ణా బోర్డులకు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి లేఖలు రాయనున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని గోదావరి బోర్డుకు ఇప్పటికే ప్రభుత్వం లేఖ రాసింది. కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్ ద్వారా తరలింపు నాగార్జునసాగర్ కుడికాల్వ కింద ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11.18 లక్షల ఎకరాలు, ఎడమ కాల్వ కింద ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 10.39 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్‌కు 9 స్లూయిస్ గేట్లు ఉండగా, గేట్లన్నింటినీ 520 అడుగుల మేర పైకి లేపితే గరిష్టంగా 33,147 క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకోవచ్చు. ప్రస్తుతం కుడి కాల్వ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు మాత్రమే ఉంది. హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం పెంచకుండానే కుడికాల్వ సామర్థ్యాన్ని 33 వేల క్యూసెక్కులకు పెంచుకున్నా, 11 వేల క్యూసెక్కులను యథాతథంగా ఆయకట్టుకు సరఫరా చేసి మిగిలిన 22 వేల క్యూసెక్కులను బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలించవచ్చని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 2019 నుంచి 2024 వరకు గడిచిన ఆరేళ్లలో ఏకంగా ఐదేళ్లు కృష్ణానదిలో మిగులు జలాల లభ్యత ఉందని, ప్రకాశం బరాజ్ నుంచి సముద్రంలోకి నీరు వృథాగా పోయిందని కేంద్రానికి తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నుంచి బొల్లపల్లి రిజర్వాయర్‌కు నీటి తరలింపుతో పోల్చితే నాగార్జునసాగర్ నుంచి తరలిస్తేనే తక్కువ వ్యయం అవుతుందని స్పష్టం చేసింది. నీటి లభ్యత బాగా ఉన్న సమయాల్లో సాగర్ నుంచి (తమ వాటా) జలాలను తరలించి బొల్లపల్లి రిజర్వాయర్‌లో నిల్వ చేసుకుంటే వర్షాభావ సీజన్లలో క్యారీ ఓవర్ జలాలుగా వాడుకోగలమని తెలిపింది. కృష్ణా, గోదావరి పరీవాహకంలో చిట్టచివరి రాష్ట్రం కావడంతో తమకు రెండింటి మిగులు జలాలను వాడుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. రెండు నదుల మిగులు జలాలను నిల్వ చేసే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉంటుందని తెలియజేసింది. నికర జలాల తరలింపునకే ! వరదల సమయంలో నాగార్జునసాగర్ నుంచి మిగులు జలాలను బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలించడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును ప్రతిపాదించినట్టు ఏపీ పేర్కొంటున్నా, నికర జలాలను సైతం తరలించుకుంటుందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భవిష్యత్‌లో సాగర్ కుడికాల్వ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తోంది. నాగార్జునసాగర్ నిర్వహణ తెలంగాణ పరిధిలో ఉండగా, ఏడాది కింద ఏపీ సగం ప్రాజెక్టును తన అధీనంలోకి తీసుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా సాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకుంటామని కేంద్రం ప్రతిపాదించగా, తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. మళ్లీ తాజాగా సాగర్‌ను బొల్లపల్లి రిజర్వాయర్‌తో అనుసంధానం చేయాలని ఏపీ ప్రతిపాదించడంతో భవిష్యత్‌లో సాగర్ కింద ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని 8.1 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రమాదంలో పడుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కృష్ణా, గోదావరి నుంచి ఏకకాలంలో తరలింపు గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును మూడు విభాగాల్లో (సెగ్మెంట్స్) వి భజించి ఏపీ ప్రతిపాదించింది. తొలి విభా గం కింద పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వ సామర్థ్యాన్ని 17,500 నుంచి 38,000 క్యూసెక్కులకు, తాడిçపూడి ఎత్తిపోతల పథకం కాల్వ సామర్థ్యాన్ని 1,400 నుంచి 10,000 క్యూసెక్కులకు పెంచనుంది. అనంతరం పోలవరం ప్రాజెక్టు నుంచి ఈ రెండు కాల్వల ద్వారా నీటిని సమాంతరంగా తరలించి బుడమేరు డైవర్షన్ కెనాల్లోకి వేసి అక్కడి నుంచి కృష్ణా నదిలోకి విడుదల చేస్తామని ఏపీ తెలిపింది.రెండో సెగ్మెంట్ కింద కృష్ణాన ది నుంచి 28,000 క్యూసెక్కులను ఆరు దశల్లో మొత్తం 127 మీటర్లు లిప్ట్ చేసి బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలించనుంది. ఇందుకోసం 150 టీఎంసీల భారీ సామర్థ్యంతో బొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని ఏపీ ప్రతిపాదించింది. భవిష్యత్ అవసరాల ను తీర్చడానికి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 400 టీఎంసీలకు పెంచే వీలుందని తెలిపింది. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా నా గార్జునసాగర్ కుడికాల్వ నుంచి బొల్లపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తామని మరో లింక్‌ను ప్రతిపాదించింది. ఇక మూడో సెగ్మెంట్ కింద బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి 3 దశల్లో లిఫ్ట్ చేసి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలిస్తామని పేర్కొంది.ప్రాజెక్టు వ్యయం రూ.80 వేల కోట్లురోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల్లో 200 టీఎంసీలను తరలించడానికి ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 40,500 ఎకరాల భూసేకరణ, 17,000 ఎకరాల అటవీ భూములు కావాలి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80,112 కోట్లు కాగా, లిఫ్టుల నిర్వహణకు 4,125 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. -
సాగర్ ఆయకట్టు పెంచుతాం
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ డ్యామ్ స్పిల్‌వేకి పడిన గుంతలను పూడ్చివేసి ప్రాజెక్టును పటిష్టపరిచి.. దాని కింద ఆయకట్టు పెంపుదలకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. డ్యామ్ మరమ్మతులపై ఐఐటీ రూర్కీ నిపుణులతో అధ్యయనం జరిపించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. సాగర్ కెనాల్ నెట్‌వర్క్‌కు సైతం మరమ్మతులు నిర్వహించాలని సూచించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని ప్రాజెక్టుల పనుల పురోగతిపై మంగళవారం ఆయన జలసౌధలో కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. చిన్న లిఫ్టులతోనే అధిక ప్రయోజనం రాష్ట్రంలో ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ) పరిధిలోని 334 చిన్న ఎత్తిపోతల పథకాలు కింద 4,69,138 ఎకరాల ఆయకట్టు ఉండగా.. కొన్ని లిఫ్టులు పూర్తిగా, మరి కొన్ని పాక్షికంగా పనిచేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపా రు. పూర్తి సామర్థ్యంతో సాగునీటి సరఫరా చేసేలా ఈ లిఫ్టులను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. చిన్న ఎత్తిపోతల పథకాలే రైతులకు ప్రయోజనం చేకూర్చుతాయని, వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నెల్లికల్లు ఎత్తిపోతల పథకం తొలి దశ పనులను సత్వరం పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీళ్లు అందించాలని ఆదేశించారు. రూ.664.8 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే 24,624 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభిస్తుందని తెలిపారు. ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు తొలి దశ పనులు పూర్తి చేసి 7,600 ఎకరాలకు నీరందించాలని ఆదేశించారు. లోలెవల్ కాల్వకు మహర్దశ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగమైన హైలెవల్, లోలెవల్ కాల్వల మధ్య 15 కి.మీల లింక్ కాల్వ నిర్మాణం విషయంలో ముందుకు వెళ్లాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయించారు. మేడవార్మ్, పోతునూరు, సంగారం, పెద్దవూర, తుంగతుర్తి చెరువులను అనుసంధానం చేస్తూ లింక్ కాల్వను నిర్మిస్తామని చెప్పారు. రూ.62.26 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న లింక్ కాల్వ నిర్మాణానికి 65.02 ఎకరాల భూసేకరణ జరపాల్సి ఉండగా, ఇప్పటికే 43.31 ఎకరాల సేకరణ పూర్తయ్యిందని, తక్షణమే టెండర్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రూ.125 కోట్ల అంచనా వ్యయంతో 0–63 కి.మీల లోలెవల్ కాల్వ లైనింగ్ పనులను చేపడుతామని తెలిపారు. అదనంగా లోలెవల్ కాల్వకు సంబంధించిన డీ–1 నుంచి డీ–27 వరకు డిస్ట్రిబ్యూటరీలకు 60 మి.మీల మందంతో కాంక్రీట్ లైనింగ్ వేసి కాల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. 90.43 కి.మీల పొడవైన ఈ డిస్ట్రిబ్యూటరీల లైనింగ్‌కు రూ.42.26 కోట్లతో అంచనాలు సిద్ధం చేశామని వెల్లడించారు. ఫ్లడ్ ఫ్లో కాల్వగా పేరొందిన లోలెవల్ కెనాల్ 80 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోందని చెప్పారు. నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్లగొండ నియోజకవర్గాల్లోనే 50 వేల ఎకరాలకు నీరందిస్తోందని తెలిపారు. 19 చిన్న ఎత్తిపోతల పథకాల ద్వారా మరో 30 వేల ఎకరాలను స్థిరీకరిస్తుందని వివరించారు. అనుమలవారిగూడెం వద్ద శశిలేరు వాగుపై చెక్ డ్యామ్ నిర్మాణానికి మంత్రి అనుమతిచ్చారు. సాగర్ పరిధిలోని 39 ఐడీసీ లిఫ్టులకు మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని ఆదేశించారు. సమీక్షలో నల్లగొండ ఎంపీ కె.రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జయవీర్ రెడ్డి, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు. -
పోలవరం ముంపుపై అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ట నీటిమట్టం (ఎఫ్ఆర్ఎల్) మేరకు నీళ్లను నిల్వ చేస్తే తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందంతో సర్వే చేయించి నెల రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పోలవరం ముంపు అంశంపై శనివారం సీఎం రేవంత్ సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. గోదావరికి 2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైందని అధికారులు సీఎంకు వివరించారు. పోలవరం వల్ల భద్రాచలం ఆలయానికి ఏర్పడే ముప్పుపైనా అధ్యయనం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం కేంద్ర అనుమతుల్లేకుండానే కొత్తగా గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ సీఎస్‌కు అభ్యంతరం తెలపాని సీఎం రేవంత్ ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే గోదావరి బోర్డుతోపాటు కేంద్ర జలశక్తి శాఖకు సైతం లేఖలు రాయాలని కోరారు. సమావేశంలో నీటిపారుదల శాఖ సలహాదారులు ఆదిత్యనాథ్‌దాస్, కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ(జనరల్) జి.అనీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పరిమితంగానే ఉమ్మడి సర్వే అంటున్న ఏపీ పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలో 950 ఎకరాలు ముంపునకు గురవుతాయని, దీనిపై సైతం జాయింట్ సర్వే చేయాల్సిందేనని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. కిన్నెరసాని, ముర్రెడువాగులతో పాటే మరో ఐదు వాగులకు ఉండనున్న ప్రభావంపై సైతం సర్వే నిర్వహించాలని కోరుతుండగా ఏపీ అంగీకరించడం లేదు. ఎన్జీటీ ఆదేశాల మేరకు ముర్రెడువాగు, కిన్నెరసానిలకే సర్వేను పరిమితం చేస్తామని ఏపీ అంటోంది. ఏపీ వాదనను తెలంగాణ అంగీకరించి కేవలం రెండు వాగులకే జాయింట్ సర్వే నిర్వహిస్తే మిగిలిన 5 వాగులకు ఉండనున్న ముంపుతో తెలంగాణ నష్టపోవాల్సి వస్తుందని విమర్శలు వచ్చాయి. సీఎం రేవంత్ శనివారం అధికారులతో సమీక్షలో ఈ అంశంపై వివరణ కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం రెండు వాగులకు ముంపుపై సర్వే నిర్వహించాలని, మిగిలిన వాగులకు ముంపుపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల సంఘం గతేడాది సాంకేతిక కమిటీ సమావేశంలో ఇరు రాష్ట్రాలను చెప్పిందని అధికారులు సీఎంకు వివరించినట్లు తెలిసింది. 18 తర్వాత ఉమ్మడి సర్వేకు సిద్ధం పోలవరంలో గరిష్ట నీటిమట్టం దాకా నీటిని నిల్వ చేస్తే కిన్నెరసాని, ముర్రేడువాగులు ఉప్పొంగి తెలంగాణ భూభాగంలో ముంపునకు గురికానున్న ప్రాంతాలను గుర్తించి డీమార్కింగ్ చేసేందుకు వీలుగా ఈ నెల 18 తర్వాత ఉమ్మడి సర్వేకు ఏపీ ప్రభుత్వం సంసిద్ధత తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు ఇప్పటికే ఉమ్మడి సర్వే నిర్వహించగా తదుపరి క్షేత్రస్థాయిలో ముంపు ప్రాంతాన్ని గుర్తిస్తూ డీమార్కింగ్ చేయాల్సి ఉంది. -
పోలవరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో తెలంగాణపై పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ టీంతో నివేదిక తయారు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. శనివారం.. సీఎంతో నీటిపారుదల శాఖ అధికారులు భేటీ కాగా, నెల రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని తెలిపారు. పోలవరం నిర్మాణంతో భద్రాచలం ఆలయానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలంటూ సీఎం రేవంత్ ఆదేశించారు.2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైనట్లు సీఎంకి అధికారులు వివరించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్‌ను సీఎం రేవంత్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఆ ప్రాజెక్టుకు అనుమతులు లేవని తెలిపారు.వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్‌పైన ఇటీవల ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు. తమ అభ్యంతరాలను ఏపీ సీఎస్‌కు తెలియజేయాలన్న రేవంత్.. అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుతో పాటు కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖలు రాయాలంటూ ఆదేశించారు.ఇదీ చదవండి: చిట్టినాయుడు కేసులకు భయపడం: కేటీఆర్ -
నీటి శాఖ ఇక పటిష్టం!
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖను పటిష్టపరచడంతో పాటు ఇంజనీర్ల పనితీరు, సామర్థ్యం పెంపుదలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఓ వైపు ఇంజనీర్ల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూనే మరోవైపు బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పలు కీలక చర్యలకు శ్రీకారం చుట్టబోతోంది. ముఖ్యంగా గత పదేళ్లుగా తాత్కాలిక (అడ్‌హక్) పదోన్నతులే కల్పిస్తుండగా, ఇకపై ఈ విధానానికి శాశ్వతంగా ఫుల్స్టాప్ పెట్టనుంది. వచ్చే 10–15 రోజుల్లోగా అర్హులైన ఇంజనీర్లందరికీ సాధారణ పదోన్నతులు ఇవ్వడంతో పాటు బదిలీల ప్రక్రియ చేపట్టనుంది.తమ తుది తీర్పునకు లోబడి పదోన్నతులు కల్పించుకోవాలని ఇటీవల రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పదోన్నతులు, బదిలీలపై కసరత్తు ప్రారంభించింది. కమిటీ సిఫారసుల మేరకు.. ఏఈ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు అందరికీ ప్రమోషన్లు కల్పించబోతోంది. పదోన్నతుల విషయంలో జోన్–5, జోన్–6 ఇంజనీర్లతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈ), అదనపు అసిస్టెంట్ ఇంజనీర్ల మధ్య సుదీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. ఒక జోన్ వారికే పదోన్నతుల్లో ప్రాధాన్యత కల్పించడంతో తమకు అన్యాయం జరిగిందని మరో జోన్ ఇంజనీర్లు కోర్టును ఆశ్రయించారు. ఉద్యోగంలో చేరాక డిప్లమా చేసిన వారికి ఏఈలుగా పదోన్నతి కల్పిస్తుండడంతో ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో నియమితులైన ఏఈఈలు తమ పోస్టులను కోల్పోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదాల నేపథ్యంలో పదోన్నతులపై అధ్యయనం కోసం నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్, ఈఎన్సీ (ఓ అండ్ ఎం) విజయభాస్కర్ రెడ్డితో ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇవ్వనున్న సిఫారసుల ఆధారంగా ఈ నెలాఖరులోగా మెరిట్ కమ్ సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు, బదిలీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న ఈఎన్సీ (జనరల్), ఈఎన్సీ (రామగుండం), ఈఎన్సీ (ఓ అండ్ ఎం) పోస్టులతో పాటు 9 సీఈ, 27 ఎస్ఈ, 26 ఈఈ పోస్టులను పదోన్నతులు, బదిలీల ద్వారా ప్రభుత్వం భర్తీ చేయనుంది. సీఈలు క్షేత్ర స్థాయిలోనే ఉండాలి నీటిపారుదల శాఖలో టెరిటోరియల్ చీఫ్ ఇంజనీర్లుగా కీలక పోస్టుల్లో ఉన్న కొందరు అధికారులు తమ పని ప్రదేశంలో ఉండకుండా హైదరాబాద్‌లో ఉంటున్నారని ప్రభుత్వ దృష్టికి వచ్చిoది. ఇంకొందరు సీఈలకు హైదరాబాద్‌లోని జలసౌధలో ప్రత్యేక క్యాంపు కార్యాలయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఈలందరూ ఇకపై క్షేత్ర స్థాయిలోనే తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే మిర్యాలగూడ ఈఈని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇదే క్రమంలో ఇటీవల నియమితులైన కొత్త ఏఈఈలు కొంత కాలం పాటు క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సిందేనని, బదిలీల్లో వీరికి స్థానచలనం కల్పించరాదని నిర్ణయం తీసుకుంది. వీరిలో బాగా పనిచేసే ఇంజనీర్లకు ప్రోత్సాహకంగా ప్రత్యేక పదోన్నతులు కల్పించే అంశాన్ని పరిశీలిస్తోంది. రిటైర్ అయితే ఇంటికే.. ఇకపై రిటైరైన ఇంజనీర్ల పదవీ కాలం పొడిగించరాదని ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత పదేళ్లలో కీలకమైన ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లుగా రిటైరైన ఇంజనీర్లే కొనసాగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలామంది రిటైర్డ్ ఇంజనీర్లను తొలగించింది. ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ఓ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక ఎక్స్టెన్షన్లో ఉన్న ఓ కీలక ఇంజనీర్ నీళ్లు నమిలారు. దీంతో మళ్లీ ఆయన పదవీకాలాన్ని పొడిగించరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ పోస్టులో మరో ఇంజనీర్‌ను అదనపు బాధ్యతల కింద నియమించింది. ఇదే సమయంలో మరో ఇంజనీర్ సైతం తన పదవీకాలం పొడిగింపునకు తీవ్ర ప్రయత్నాలు చేసుకున్నా ఫలించలేదు. -
ఏదుల నుంచే ‘డిండి’కి నీళ్లు!
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఏదుల (వీరాంజనేయ) రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీళ్లను తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏదుల రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపల్లి చెక్‌డ్యామ్‌కు నీళ్లను తరలించే అలైన్మెంట్ పనులకు రూ.1,788.89 కోట్ల అంచనా వ్యయంతో నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ నెల 4న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు ఈ ప్రతిపాదనలు రానున్నాయి. మంత్రివర్గం ఆమోదించిన వెంటనే పనులకు పరిపాలనా అనుమతులు జారీచేసి, ఆ వెంటనే టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 27 కి.మీ.ల అనుసంధానం ఏదుల రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపల్లి చెక్‌డ్యామ్ కు గ్రావిటీ ద్వారా నీళ్లను తరలించేందుకు 800 మీటర్ల అప్రోచ్ కాల్వను.. ఆ తర్వాత వరుసగా 2.525 కి.మీ.ల ఓపెన్ కెనాల్, 16 కి.మీ.ల సొరంగం, 3.05 కి.మీల ఓపెన్ కెనాల్, 6.325 కి.మీల వాగు నిర్మాణం కలిపి మొత్తం 27.9 కి.మీ.ల పొడవున కాల్వలు, సొరంగం పనులు చేపడతారు.వనపర్తి జిల్లాలోని ఏదుల రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపల్లి చెక్‌డ్యామ్‌కు.. అక్కడి నుంచి ఉల్పర బరాజ్, డిండి, సింగరాజుపల్లి, ఎర్రపల్లి–గోకవరం, ఇర్వేన్, గొట్టిముక్కల, చింతపల్లి, కిస్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్లకు నీళ్లను తరలిస్తారు. 55 శాతం పనులు పూర్తి శ్రీశైలం జలాశయం ఫోర్‌షోర్ నుంచి రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 60 రోజులపాటు మొత్తం 30 టీఎంసీల నీటిని తరలించి ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని దేవరకొండ, మునుగోడు, నాగార్జునసాగర్, నకిరేకల్, నల్లగొండ, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లో 3.61 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు డిండి ఎత్తిపోతల పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. రూ.6,190 కోట్ల అంచనాలతో 2015 జూన్ 11న ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి. ప్రాజెక్టు మొత్తంలో ఇప్పటివరకు రూ.3,441.89 కోట్ల విలువైన పనులు పూర్తి కాగా, మరో రూ.2,748.11 కోట్ల విలువైన పనులు చేపట్టాల్సి ఉంది. ఈ లెక్కన ఇప్పటివరకు 55 శాతం పనులు పూర్తయినట్టే. గతంలో రూ.3,929.66 కోట్లతో 7 ప్యాకేజీల పనులకు టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకున్నారు. మిగిలినపనులకు ఇంకా టెండర్లు నిర్వహించలేదు. ఇప్పటివరకు 12,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి రాగా, ఇంకా 3,49,000 ఎకరాల ఆయకట్టుకు రావాల్సి ఉంది. మిగిలిన 45 శాతం పనులు పూర్తయితే మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. రిజర్వాయర్లకు భూసేకరణ సమస్య ఈ ప్రాజెక్టులో భూసేకరణ సమస్యలతో రిజర్వాయర్ల పనులు ముందుకు సాగడం లేదు. సింగరాజుపల్లి (85 శాతం), గొట్టిముక్కల (98 శాతం) రిజ ర్వాయర్ల పనులు దాదాపుగా చివరి దశలో ఉన్నాయి. కిస్టరాంపల్లి (70 శాతం), శివన్నగూడెం (70 శాతం) రిజర్వాయర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. భూసే కరణ సమస్యలతో చింతపల్లి (0 శాతం), ఎర్రపల్లి–గోకవరం (26 శాతం) రిజర్వాయర్ల పనులు ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి. ఇదే సమస్యతో ఇర్వేన్ రిజర్వాయర్ పనులు మొదలే కాలేదు. ప్రాజెక్టు అవసరాలకు 16,030 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 12,052 ఎకరాలు సేకరించగా, మిగిలిన 3,977 ఎకరాలు సేకరించాల్సి ఉంది. వీడని పర్యావరణ చిక్కులు పర్యావరణ అనుమతులు లేకుండానే డిండి ప్రాజెక్టు పనులను చేపట్టినందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) 2022 డిసెంబర్ 12న రాష్ట్ర ప్రభుత్వానికి రూ.92.85 కోట్ల జరిమానా విధించడంతో పాటు పనులపై స్టే విధించింది. ఎన్జీటీ స్టే ఎత్తేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉంది. మరోవైపు పర్యావరణ అనుమతులు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. పర్యావరణ అనుమతులు సాధించే పనులను రూ.87.75 లక్షలతో ఎని్వరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ)కు 2022 ఫిబ్రవరిలో ప్రభుత్వం అప్పగించినా, ఆశించిన ఫలితం కనిపించలేదు. -
పోలవరం అనుమతీ చెల్లదు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని సీతారామ– సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే అంశంపై నిర్వహించనున్న టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) సమావేశానికి తమను పిలవలేదని, సీడబ్ల్యూసీ అంతర్గతంగా తీసుకునే నిర్ణయాలకు తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనను తెలంగాణ ప్రభుత్వం తిప్పికొట్టింది. అలా అయితే, గోదావరి పరీవాహక ప్రాంతంలోని మిగతా రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలను ఆహ్వానించకుండానే.. 2009లో టీఏసీ నిర్వహించి పోలవరం ప్రాజెక్టుకు ఇచి్చన అనుమతులూ చెల్లుబాటు కావు అని స్పష్టం చేసింది. సీతారామ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీలోని టీఏసీ అనుమతులకు సిఫార్సు చేస్తూ గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశంలో చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బోర్డుకు ఇటీవల ఏపీ లేఖ రాసింది. ‘ప్రస్తుతం 2017 మార్గదర్శకాలు అమల్లో ఉండగా, 1996 మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులివ్వడం సరికాదు’అని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ జి.అనిల్‌కుమార్ సోమవారం గోదావరి బోర్డుకు లేఖ రాశారు. ‘పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ 2009, 2011లో అనుమతులను 1996 మార్గదర్శకాల ప్రకారమే ఇచి్చంది. వీటి ఆధారంగానే తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వ్యవహరిస్తోంది’అని బదులిచ్చారు. న్యాయస్థానానికి వెళ్లక తప్పని పరిస్థితి కల్పించారని ఏపీ పేర్కొనగా, తప్పుడు ఉద్దేశాలతో కేసులేసినా నిలబడవని తెలంగాణ కౌంటర్ ఇచి్చంది. గోదావరి ట్రిబ్యునల్ అవసరం లేదు అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టంలోని సెక్షన్ 3 కింద ఏపీ, తెలంగాణ మధ్య గోదావరి జలాల పంపకానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ఏపీ కోరగా, అది ఏమాత్రం అవసరం లేదని తెలంగాణ స్పష్టం చేసింది. తాము 531.908 టీఎంసీల గోదావరి జలాల వినియోగం కలిగి ఉన్నట్టు సీడబ్ల్యూసీ నిర్ణయించడం ఏకపక్షమన్న ఏపీ వాదనను కూడా తెలంగాణ తోసిపుచ్చింది. ‘రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఉమ్మడి ఏపీకి ఉన్న 1,486 టీఎంసీల నీటి వాటా నుంచి తెలంగాణకు 967.94 టీఎంసీలు, ఏపీకి 518.215 టీఎంసీలను కేటాయిస్తూ ఉమ్మడి రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ 2014 జనవరి 2న రాష్ట్ర ప్రణాళిక సంఘం కార్యదర్శికి లేఖ రాశారు. దానినే నాటి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వరద జలాలు/మిగులు జలాల ఆధారంగా చేపట్టిన పురుషోత్తపట్నం లిఫ్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, చింతలపూడి లిఫ్టు, గోదావరి–పెన్నా అనుసంధానం తదిత ర ప్రాజెక్టులకు నీటి హక్కులు సాధించుకునేందుకే ఏపీ తప్పుడు ఉద్దేశాలతో ట్రిబ్యునల్ ఏర్పాటును కోరుకుంటోంది. ఈ ప్రాజెక్టులకు నేటికీ సీడబ్ల్యూసీ నుంచి టెక్నో ఎకనామికల్ క్లియరెన్స్, టీఏసీ అనుమతి లేదు. దీంతో వీటిని రాష్ట్ర విభజన తర్వాత చేపట్టిన కొత్త ప్రాజెక్టులుగానే పరిగణించాల్సి ఉంటుంది. గోదావరి జలాల్లో ఏపీకి 531.908 టీఎంసీల న్యాయబద్ధమైన వినియోగం ఉన్నట్టు నిరూపించడంలో ఆ రాష్ట్రం విఫలమైంది’అని తెలంగాణ స్పష్టం చేసింది. ఏపీ అభ్యంతరాలను సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకుంది సీతారామ ప్రాజెక్టు వల్ల ఏపీ హక్కులకు ఎలాంటి నష్టం ఉండదని సీడబ్ల్యూసీ చెప్పడం సరికాదని ఆ రాష్ట్రం పేర్కొనగా.. ఏపీ అభ్యంతరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సీడబ్ల్యూసీ ఈ మేరకు తేల్చిందని తెలంగాణ వివరణ ఇచి్చంది. ఇచ్చంపల్లి ప్రాజెక్టు ద్వారా 85 టీఎంసీల వినియోగంపై గోదావరి ట్రిబ్యునల్ విధించిన ఆంక్షలు ఆ ప్రాజెక్టుకే పరిమితమని, సీతారామ ప్రాజెక్టుకు వర్తించవని తెలిపింది. 35 టీఎంసీలతో దేవాదుల, 195 టీఎంసీలతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడంతో ఆ 85 టీఎంసీలను తెలంగాణ వాడుకున్నట్టేనని, దీంతో సీతారామ ప్రాజెక్టుకు నీటి లభ్యత లేదన్న ఏపీ వాదనను తోసిపుచి్చంది. ట్రిబ్యునల్ మార్గదర్శకాలకు కట్టుబడే దేవాదుల, కాళేశ్వరంతో పాటు పోలవరం ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ అనుమతిలిచి్చందని తెలిపింది.పోలవరం ప్రాజెక్టుపై ప్రభావం ఉండదు‘పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే సమయంలో అక్కడ 991 టీఎంసీల నీటి లభ్యత ఉందని వ్యాప్కోస్ నిర్ధారించగా, 861 టీఎంసీలేనని సీడబ్ల్యూసీ కుదించింది. 2018 నాటి సీతారామ ప్రాజెక్టు డీపీఆర్ ప్రకారం పోలవరం వద్ద నీటి లభ్యత 460.7 టీఎంసీలకు తగ్గింది. సీతారామ డీపీఆర్ ప్రకారం అక్కడ నికర లోటు 13.64 టీఎంసీల నుంచి 151 టీఎంసీలకు పెరి గింది. గోదావరిలో మిగులు జలాల లభ్యత లేదని న దుల అనుసంధానం సందర్భంగా సీడబ్ల్యూసీ తేల్చింది. ఎగువ నుంచి ప్రవాహాలు తగ్గిన నేపథ్యంలో పోలవరం వద్ద నీటి లభ్యతపై తాజా అధ్యయనం జరపాలి’అని ఏపీ కోరింది. సీడబ్ల్యూసీలోని హైడ్రాలజీ డైరెక్టరేట్ పరీ వాహకంలోని అన్ని రాష్ట్రాల ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకుని పోలవరం ప్రాజెక్టుపై ఎలాంటి ప్రభా వం ఉండదని నిర్ధారించిందని తెలంగాణ బదులిచ్చింది. -
మళ్లీ సాగునీటి సంఘాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ సాగునీటి వినియోగదారుల సంఘాల వ్యవస్థను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సిఫార్సు చేసింది. ప్రతి చెరువుకు ఒక సాగునీటి సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. గతంలో సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించి కమిటీని ఎన్నుకునేవారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేసింది. ఇప్పుడు ఎన్నికలకు బదులు ప్రభుత్వమే చెరువు కింద సాగుచేసే రైతులతో సాగునీటి వినియోగదారుల సంఘాన్ని ఏర్పాటు చేయాలని రైతు కమిషన్ సూచించింది. ఈ మేరకు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. చిన్న నీటిపారుదల శాఖను ఏర్పాటు చేయండి నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న నీటిపారుదల శాఖను నీటిపారుదల శాఖలో విలీనం చేసింది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్వహణకే నీటిపారుదల శాఖలోని యంత్రాంగం పరిమితం కావడంతో గత 10 ఏళ్లలో చెరువుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని రైతు కమిషన్ అభిప్రాయపడింది. రాష్ట్రంలో 46,531 చెరువులుండగా, వాటికింద 25.11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గత ప్రభుత్వం భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు చెరువులను అనుసంధానం చేసి.. వాటిని నింపినప్పటికీ, నిర్వహణను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్ధరణ చేపట్టినా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దీంతో మళ్లీ చెరువుల ఆక్రమణలు జరుగుతున్నాయని రైతు కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ నుంచి చిన్న నీటిపారుదల శాఖను విభజించి పాత విధానంలో చెరువుల నిర్వహణను పునరుద్ధరించాలని ప్రభుత్వానికి సూచించింది. చెరువుల సంవత్సరంగా 2025! 2025 ఏడాదిని చెరువుల సంవత్సరంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా రైతు కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. చెరువుల తూములు, కట్టలు, కాల్వలకు మరమ్మతులు చేపట్టాలని సూచించింది. కాకతీయులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల కాలంలో రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ఉండేది.ఒక చెరువు నిండితే దాని కింద ఉన్న చెరువులను నింపుకుంటూ నీళ్లు ప్రవహించేవి. చెరువులు ఆక్రమణకు గురికావడం, లేఅవుట్లు రావడంతో గొలుసుకట్ట వ్యవస్థ దెబ్బతిన్నదని రైతు సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరంలో చెరువుల పునరుద్ధరణ, మరమ్మతులకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, వాటి కింద చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సిఫార్సు చేసింది. -
కృష్ణాలో తెలంగాణకు 70% వాటా దక్కాలి
సాక్షి, హైదరాబాద్: నది పరీవాహక ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుని నీటి కేటాయింపులు జరపాలని అంతర్జాతీయ నీటి సూత్రాలు స్పష్టం చేస్తున్నాయని.. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 70 శాతం ఉంటే.. ఏపీలో 30 శాతమే ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దీని ప్రకారం కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 1,005 టీఎంసీల వాటాలో 70 శాతం వాటా తెలంగాణకు దక్కేలా జస్టిస్ బ్రజేశ్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ శనివారం నీటి పారుదల శాఖపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలసి సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలిస్తే.. బదులుగా నాగార్జునసాగర్ ఎగువన 80 టీఎంసీల కృష్ణా జలాలను పరీవాహక రాష్ట్రాలు వినియోగించుకోవచ్చంటూ గతంలో జరిగిన ఒప్పందాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ 80 టీఎంసీల్లో మహారాష్ట్ర, కర్ణాటక 35 టీఎంసీలను వాడుకుంటుండగా.. మిగతా 45 టీఎంసీలపై సంపూర్ణ హక్కు తెలంగాణకే ఉందని చెప్పారు. సాగర్ ఎగువన తెలంగాణలోని ప్రాజెక్టుల ద్వారా ఈ నీటిని వినియోగించుకోవడానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరగొద్దు కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన వాటాలను సాధించుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం వాటిల్లకుండా కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట సమర్థవంతంగా వాదనలు వినిపించాలన్నారు. ఈ వాదనలను బలపరిచే సాక్ష్యాలు, రికార్డులు, ఉత్తర్వులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. త్వరలో ట్రిబ్యునల్‌లో వాదనలు.. కృష్ణా ట్రిబ్యునల్–2 ఇప్పటివరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అభిప్రాయాలు, ఆధారాలను సేకరించిందని... త్వరలోనే ఇరు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ఆ తర్వాత ట్రిబ్యునల్ నిర్ణయం వెలువడుతుందని తెలిపారు. అయితే కేంద్ర జలశక్తి శాఖకు ఇచి్చన నివేదికలన్నింటినీ వరుస క్రమంలో సిద్ధంగా ఉంచుకోవాలని, వాటి ఆధారంగా ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించాలని సీఎం సూచించారు. కృష్ణా బోర్డును ఎందుకు పట్టించుకోవాలి? తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీని కృష్ణా ట్రిబ్యునల్–2 పూర్తి చేయలేదని.. ఇక కృష్ణా బోర్డు నిర్ణయాలను తెలంగాణ ఎందుకు పట్టించుకోవాలని సీఎం రేవంత్ ప్రశ్నించారు. నీటి వాటాల పంపిణీ పూర్తయ్యే వరకు కృష్ణా బోర్డు జోక్యం ఉండకూడదంటూ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని అధికారులకు సూచించారు.ఇక ఏపీ కోటాకు మించి నీటిని తరలించుకుపోతోందన్న అంశం ప్రస్తావనకురాగా.. టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుతో దీనికి అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ, బానకచర్ల క్రాస్ రెగ్యులేటరీ, తెలుగు గంగ, కేసీ కాల్వ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలుగోడు ప్రాజెక్టుల ద్వారా ఏపీ తరలిస్తున్న నీటి వివరాలను సేకరించి రికార్డు చేయాలని సీఎం సూచించినట్టు సమాచారం. నీటి వాటాల్లో అన్యాయంపై నివేదిక తయారు చేయాలిసీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీకి అవసరమైన అనుమతులను సాధించాలని.. మొత్తం ఆయకట్టుకు నీరందేలా పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులు, నీటి వాటాలకు సంబంధించి సమర్థంగా వాదనలు వినిపించేందుకు 2014 నుంచి ఇప్పటి వరకు ఉన్న జీవోలు, తీర్పులతోపాటు ఉమ్మడి రాష్ట్రంలోని జీవోలు, మెమోలు, డీపీఆర్‌లు, నాటి నుంచి నీటి వాటాల్లో తెలంగాణకు జరిగిన నష్టాలపై సమగ్రంగా నివేదిక తయారు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట తెలంగాణ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, అదనపు ఏజీ రజనీకాంత్‌రెడ్డి, ప్రభుత్వం తరఫు న్యాయవాది ఖుష్ వోరా, అధికారులు పాల్గొన్నారు. -
HYD: ఇరిగేషన్లో 300 కోట్ల అవినీతి తిమింగలం.. మూడు ఫామ్ హౌస్‌లు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఏసీబీ అధికారుల సోదాల అంశం చర్చనీయాంశంగా మారింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ ఏఈ నికేష్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.వివరాల ప్రకారం.. నీటి పారుదల శాఖ ఏఈ నికేష్ కుమార్‌పై గత కొంత కాలంగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు ఆరోపణలు వస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. శనివారం ఉదయం నుంచి ఏక కాలంలో 30 చోట్ల తనిఖీలు చేపట్టారు. ఆయనతో పాటుగా బంధువుల ఇళ్లలో కూడా దాడులు కొనసాగుతున్నాయి. గతంలోనూ లంచం తీసుకుంటూ నికేష్ కుమార్ పట్టుబడ్డారు. ఇక, సోదాల్లో భాగంగా రూ.300 కోట్లకు పైగా ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. గండిపేట బఫర్ జోన్, ఎఫ్టీఎల్లో నిబంధనకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చినట్టు ఏసీబీ గుర్తించింది. ఇదే సమయంలో గండిపేట, హిమాయత్ సాగర్, నార్సింగి, మణికొండ, రాజేంద్రనగర్ పరిధిలో భారీగా అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. ఇక, నికేష్ పేరిట మూడు ఇల్లులు ఉండగా.. ఫామ్ హౌస్‌లు కూడా ఉన్నాయి. ఫామ్ హౌస్‌ల విలువ రూ.80 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇక, కొల్లూరులో ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మొయినాబాద్‌లో మూడు ఫామ్‌హౌస్‌లు ఉన్నట్టు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. నికేష్ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. గతంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ నికేష్ ఏసీబీకి దొరికారు. -
మేడిగడ్డలో సాక్ష్యాధారాలు ధ్వంసం!
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి ఏర్పడిన బుంగలను పూడ్చడానికి ముందు, అక్కడి స్థితిగతులు తెలుసుకోవడానికి వరుస క్రమంలో నిర్వ హించాల్సిన పరీక్షలపై నిపుణుల కమిటీ చేసిన సి ఫారసులను రాష్ట్ర నీటిపారుదల శాఖ అమలు చే యకుండా నీరుగార్చింది..’అంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇరిగేషన్ శాఖ నిర్వాకంతో బరాజ్‌లు దెబ్బతినడానికి దారితీసిన కారణాల విశ్లేషణకు అవసరమైన కీలక సమాచారం, సాక్ష్యాధారాలు ధ్వంసమయ్యాయి..’అని తెలిపింది. నీటిపారుదల శాఖ సొంతంగా ఏర్పాటు చేసుకున్న మరో సాంకేతిక కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా ఆ శాఖ నిర్వహించిన మరమ్మతులు.. ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసుల్లో జోక్యం చేసుకునేలా ఉన్నాయి..’అని పేర్కొంది. ఈ మేరకు ఎన్డీఎస్ఏ డైరెక్టర్ (టెక్నికల్) గత నెల 11న ఇరిగేషన్ కార్యదర్శికి లేఖ రాశారు. కేంద్ర జలశక్తి శాఖ సల హాదారు వెదిరే శ్రీరామ్ బుధవారం కాళేశ్వరం బరాజ్‌లపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు అఫిడవిట్ సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్డీఎస్ఏ లేఖను మీడియాకు విడుదల చేశారు. బుంగల పూడ్చివేతతో స్థితిగతుల్లో మార్పులు ‘మేడిగడ్డ బరాజ్ ప్లింత్ శ్లాబుకి ఎగువ, దిగువన గ్రౌటింగ్ చేసి భూగర్భంలో ఏర్పడిన బుంగలను పూడ్చి వేయడంతో సికెంట్ పైల్స్, పారామెట్రిక్ జాయింట్స్ వద్ద స్థితిగతుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. బరాజ్ కుంగిన తర్వాత భూగర్భంలో ఉన్న వాస్తవ స్థితిగతులను అధ్యయనం చేయాల్సి ఉండగా, స్థితిగతుల్లో మార్పులతో ఆ అవకాశం లేకుండా పోయింది..’అని ఎన్డీఎస్ఏ లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ గతేడాది అక్టోబర్‌లో కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో బుంగలు ఏర్పడి నీళ్లు లీకైన విషయం తెలిసిందే. బరాజ్‌లలో లోపాలపై అధ్యయనం చేసి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత మే 1న మధ్యంతర నివేదికను సమర్పించింది. బరాజ్‌లకు మరింత నష్టం జరగకుండా వర్షాకాలం ప్రారంభానికి ముందే తీసుకోవాల్సిన అత్యవసర మరమ్మతులతో పాటు బరాజ్‌లలో లోపాలను నిర్ధారించడానికి నిర్వహించాల్సిన జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు ఇందులో ఉన్నాయి. ఈ పరీక్షలు నిర్వహించక పోవడాన్ని ఎన్డీఎస్ఏ తప్పుబట్టింది. ఈ అధ్యయనాలు/పరీక్షలు ప్రారంభించడంలో జాప్యం చేయడం ద్వారా నీటిపారుదల శాఖ విలువైన సమయాన్ని కోల్పోయిందంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో కూడా..‘అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునాదుల కింద ఏర్పాటు చేసిన సికెంట్ పైల్స్ వాస్తవ స్థితిగతులను అధ్యయనం చేయడానికి ముందే కరై్టన్ గ్రౌటింగ్ చేసి భూగర్భంలో బుంగలను పూడ్చివేశారు. పునాదుల (ర్యాఫ్ట్‌లు) కింద బుంగలను పూడ్చడానికి సిమెంట్ మిశ్రమంతో గ్రౌటింగ్ చేశారు. గ్రౌటింగ్‌కు ముందే జియో టెక్నికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, అలా చేయలేదు. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తే ఎన్డీఎస్ఏ కమిటీకి అవసరమైన వాస్తవ సమాచారం లభించదు. దీనివల్ల ఎన్డీఎస్ఏ కమిటీ పని ప్రణాళికకు విఘాతం కలిగింది..’అని ఎన్డీఎస్ఏ లేఖలో స్పష్టం చేసింది. నీటిపారుదల శాఖ తాజాగా తీసుకోవాల్సిన చర్యలను, చేయాల్సిన పరీక్షలను సిఫారసు చేసింది. 160 టీఎంసీల లభ్యత లేదనడం అవాస్తవం: వెదిరే శ్రీరామ్ ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి వద్ద 75 డిపెండబిలిటీ ఆధారంగా 160 టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ నిర్ధారించిందని వెదిరే శ్రీరామ్ చెప్పారు. నీటి లభ్యత లేదని చెప్పి ప్రాజెక్టు రీఇంజనీరింగ్‌ను చేపట్టారని విమర్శించారు. వ్యాస్కోస్ వ్యాపార సంస్థ అని, ఎవరు పని అప్పగిస్తే వారి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తుందని అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ కట్టి రూ.32 వేల కోట్లతో మొత్తం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేసి 16.4 లక్షల ఎకరాలకు నీరందించడానికి వీలుండగా, కేవలం రూ.2 లక్షల అదనపు ఆయకట్టు కోసం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు. ప్రస్తుతం దీని అంచనాలు రూ.1.27 లక్షల కోట్లకు ఎగబాకాయన్నారు. -
‘సీతారామ’ అంచనాలు మోపెడు!
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం మరింతగా పెంచేందుకు రంగం సిద్ధమైంది. 2016 ఫిబ్రవరి 18న రూ.7,926.14 కోట్ల అంచనా వ్యయంతో గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు నిర్మాణా నికి అనుమతులు జారీ చేసింది. ఆ తర్వాత 2018 ఆగస్టు 2న రూ.13,057.98 కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచింది. తాజాగా అంచనా వ్యయాన్ని రూ.19,800 కోట్లకు సవరిస్తూ పాలనాపర అనుమతులు జారీ చేయాలని ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ ఎ.శ్రీనివాస్ రెడ్డి నీటిపారుదల శాఖకు ప్రతిపాదనలు సమర్పించారు. సరైన అనుమతులు లేకుండానే ప్రాజెక్టు డిస్ట్రి బ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు నీటిపారుదల శాఖ ఇటీవల రూ.1,842 కోట్ల అంచనాతో టెండర్లను ఆహ్వానించడంపై ఇటీవల అధికారుల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెండర్లను ఆహ్వానించిన అనంతరం పాలనాపర అనుమతులు కోరుతూ ప్రతిపాదనలను సమర్పించడం గమనార్హం. 16 ప్యాకేజీలుగా కాల్వల పనులు 3,28,853 ఎకరాల కొత్త ఆయకట్టు, 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడానికి సీతారామ ప్రాజెక్టును చేపట్టారు. ప్రాజెక్టులో భాగమైన పంప్‌హౌస్‌ల నిర్మాణం, ఇతర ప్రధాన పనులు పూర్తికాగా, డి్రస్టిబ్యూటరీ కాల్వల నిర్మాణం జరగాల్సి ఉంది. ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో సీతారామను చేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సత్వరంగా డి్రస్టిబ్యూటరీల పనుల పూర్తికి ఆదేశించింది. ప్రాజెక్టు కాల్వల పనులను 16 ప్యాకేజీలుగా విభజించగా, 1–8 ప్యాకేజీల కింద ప్రధాన కాల్వ, 9–12 ప్యాకేజీలుగా సత్తుపల్లి ట్రంక్ కాల్వ, 13–16 ప్యాకేజీలుగా పాలేరు లింక్ కాల్వ పనులను చేర్చారు. ఇక డిస్ట్రిబ్యూటరీల పనులను మరో 8 ప్యాకేజీలుగా విభజించి రూ.3,858.93 కోట్ల అంచనాలతో అనుమతుల కోసం ప్రతిపాదనలను సమర్పించారు. గతంలో నిర్వహించిన ఓ సమీక్షలో డిస్ట్రిబ్యూటరీల పనులకు తక్షణమే టెండర్లను జరపాలని ప్రభుత్వం ఆదేశించడంతో రూ.1,842 కోట్ల అంచనాలతో కొత్తగూడెం సీఈ టెండర్లను ఆహ్వానించారు. అందులో కేవలం రూ.768 కోట్లకే పరిపాలన అనుమతి ఉండగా, రూ.1,074 కోట్ల పనులకు అనుమతి లేకపోవడం వివాదంగా మారింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన ఓ సమీక్షలో ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్, సీఈ ఎ.శ్రీనివాస్ రెడ్డి ఘర్షణకు దిగి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ప్రభుత్వం వారిద్దరిని మందలించి సంజాయిషీ కోరింది. దీంతో కొత్తగూడెం సీఈ శ్రీనివాస్ రెడ్డి ఎట్టకేలకు పాలనాపర అనుమతుల కోసం తాజాగా ప్రతిపాదనలు సమర్పించడం గమనార్హం. ప్రామాణిక ధరల పట్టిక 2024–25 ఆధారంగా అంచనాలను రూ.19,800 కోట్లకు పెంచాలని ఆయన కోరారు. స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ ఈ ప్రతిపాదనలను పరిశీలించి అనుమతుల కోసం సిఫారసు చేయాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోనుంది. -
తక్షణమే సెలవుపై వెళ్లండి!
సాక్షి, హైదరాబాద్: పరిపాలనపరమైన అనుమతుల్లే కుండానే సీతారామ ఎత్తిపోతల పథకం డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, అనుబంధ పనులకు టెండర్ల నిర్వహణలో జరిగిన తప్పిదాలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీతారామ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ ఎ.శ్రీనివాస్‌రెడ్డిని తక్షణమే సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం. అలాగే నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి. అనిల్‌కుమార్‌కు సంజాయిషీ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆ శాఖ కార్యదర్శిని కోరినట్టు తెలిసింది. సీతారామ ప్రాజెక్టుపై ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి శనివారం జలసౌధలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా మంత్రి వారిపై మండిపడినట్టు తెలిసింది. డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులకు పరిపాలనపరమైన అనుమతుల కోసం ప్రతిపాదనలు సమర్పించినా సహకరించడం లేదని ఈఎన్సీపై సీఈ శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించగా, అసలు ఇప్పటివరకు తనకు డిటైల్డ్ ఎస్టిమేట్లు (సవివర అంచనాలు) సమర్పించలేదని ఈఎన్సీ అనిల్‌కుమార్ బదులిచ్చినట్టు తెలిసింది. డిటైల్డ్ ఎస్టిమేట్లు లేకుండా అనుమతులిచ్చేస్తే తర్వాత పనుల అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇద్దరు అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రుల ఆదేశాల మేరకే..!వాస్తవానికి డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు పాలనాపరమైన అనుమతులు జారీ చేయాలని కోరుతూ కొత్తగూడెం సీఈ గత నెలలో నీటిపారుదల శాఖకు ప్రతిపాదనలు పంపించారు. అయితే డిటైల్డ్ ఎస్టిమేట్లతో పాటు డిజైన్లు, డ్రాయింగ్లు కూడా లేకపోవడంతో వాటిని సమర్పించాలని కోరుతూ ఈఎన్సీ ఆ ప్రతిపాదనలను తిప్పి పంపించారు. ఇప్పటివరకు డిటైల్డ్ ఎస్టిమేట్లతో పాటు డిజైన్లు, డ్రాయింగ్స్‌ను సమర్పించలేదు. మరోవైపు గత నెలలో నిర్వహించిన ఓ సమీక్షలో మంత్రులు ఆదేశించడంతో ప్రాజెక్టు అధికారులు తొందరపడి టెండర్లను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అయితే తక్షణమే టెండర్లు నిర్వహించాలని మంత్రులు ఆదేశించిట్టు మీటింగ్ మినట్స్‌లో సైతం ఉందని, అందుకే ఆహ్వానించట్టు బాధ్యులైన అధికారులు పేర్కొంటున్నారని సమాచారం. కాగా పాలనాపరమైన అనుమతులే కాకుండా ఆర్థిక శాఖ ఆమోదం కూడా లేకుండా టెండర్లను ఆహ్వానించడం నిబంధనల తీవ్ర ఉల్లంఘనే అని నీటిపారుదల శాఖలో చర్చ జరుగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నాగార్జునసాగర్ కాల్వకు గండ్లుపడగా, పాలనాపరమైన అనుమతుల జారీ తర్వాతే అత్యవసర మరమ్మతులు చేపట్టారని, అనుమతుల విషయంలో మినహాయింపు ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. అనుమతుల్లేకుండా బిడ్లను ఎలా తెరుస్తారు ?డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు సంబంధించిన ఆరు టెండర్లకు ఈ నెల 8తో, ఒక టెండర్‌కు ఈ నెల 4తో బిడ్ల దాఖలు గడువు ముగియనుంది. కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ)లోని చీఫ్ ఇంజనీర్ల కమిటీ బిడ్లను పరిశీలించి ఎల్–1 బిడ్డర్‌ను ఖరారు చేయాల్సి ఉంటుంది. అయితే సంబంధిత పనులకు పాలనాపరమైన అనుమతులు, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా బిడ్లను తెరిచి పరిశీలించడానికి నిబంధనలు ఒప్పుకోవని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారో పరిశీలించి ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.టెండర్లపై రాజకీయ రగడ– ఇప్పుడు మీపై ఏ కమిషన్ వేయాలి?: కేటీఆర్పాలనాపరమైన అనుమతుల్లేండానే సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులకు అధికారులు టెండర్లను ఆహ్వానించినట్టు వెలుగులోకి రావడంతో రాజకీయ రగడ ప్రారంభమైంది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 మధ్య ఏడు పనులకు రూ. 1,842 కోట్ల అంచనాతో నీటిపారుదల శాఖ టెండర్లను ఆహ్వానించగా, అందులో రూ. 1,074 కోట్ల పనులకు పాలనాపరమైన అనుమతుల్లేవంటూ ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. వార్తా కథనాన్ని షేర్ చేస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల మీద పగబట్టి హాహాకారాలు చేస్తూ బురదజల్లిన వారు..అనుమతి లేకుండానే రూ.1,074 కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలుస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజాపాలన అని రోజుకు పదిమార్లు ప్రగల్భాలు పలికేటోళ్లు ఇలా ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఒక సమావేశంలో త్వరగా టెండర్లు పిలవాలని ఆదేశించి, మరో సమావేశంలో ఇదేంటి అంటూ నంగనాచి మాటలు మాట్లాడడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు పూర్తయ్యి కోటి ఎకరాలకు జీవం పోస్తున్న కాళేశ్వరంపై కమిషన్ వేసి విచారణ జరిపిస్తున్న మీపై.. ఇప్పుడు ఏ కమిషన్ వేయాలని ప్రశ్నించారు. ఢిల్లీ నేస్తం..అవినీతి హస్తంకాళేశ్వరంపై కక్షగట్టి రైతుల పొట్టగొట్టారని, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల మీద పగబట్టి మళ్లీ వలసలకు పచ్చజెండా ఊపారని కేటీఆర్ మండిపడ్డారు. ఢిల్లీ నేస్తం–అవినీతి హస్తం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.7,926.14 కోట్ల అంచనాతో 2016 ఫిబ్రవరి 18న పాలనాపరమైన అనుమతులివ్వగా, ఆ తర్వాత 2018 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం రూ.13,057 కోట్లకు అంచనాలను సవరించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దీనిని తప్పుబడుతూ రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని ఇప్పుడు గుర్తుచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. -
అనుమతి లేకున్నా రూ. వెయ్యి కోట్ల ‘సీతారామ’ టెండర్లు!
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పరిపాలనా అనుమతుల్లేకుండానే సుమారు రూ. 1,074 కోట్ల అంచనా వ్యయంతో డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు ప్రాజెక్టు అధికారులు టెండర్లను ఆహ్వానించడం నీటిపారుదల శాఖలో వివాదస్పదంగా మారింది. సెపె్టంబర్ 28 నుంచి అక్టోబర్ 5 మధ్య ఏడు పనులకు రూ. 1,842 కోట్ల అంచనాతో నీటిపారుదల శాఖ టెండర్లను ఆహ్వానించింది. అయితే వాటిలో సుమారు రూ. 768 కోట్లు విలువ చేసే పనులకే ఆర్థిక శాఖ ఆమోదం తెలపగా ఆ మేరకు నీటిపారుదల శాఖ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. మిగిలిన రూ. 1,074 కోట్ల పనులకు ఆమోదం తెలపడంపై నిర్ణయాన్ని ఆర్థిక శాఖ పెండింగ్‌లో ఉంచింది. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఈ పనులకు ప్రాజెక్టు అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం చేపట్టిన సమీక్షలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. పరిపాలనా అనుమతుల్లేకుండానే టెండర్లు పిలిచి ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టించారని సంబంధిత చీఫ్ ఇంజనీర్‌పై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో మంత్రులు నిర్వహించిన ఓ సమీక్షలో వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించగా.. ప్రాజెక్టు అధికారులు అనుమతులు పొందకుండానే తొందరపాటుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ప్రభుత్వం సత్వరమే టెండర్లు పిలవాలని ఆదేశిస్తే దానర్థం అనుమతుల్లేకుండానే టెండర్లు ఆహ్వానించాలని కాదని, అనుమతులన్నీ తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనని ఉన్నతాధికారులు అంటున్నారు. అనుమతులు రాకుంటే ఏం చేస్తారు? అన్ని ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖల ఈఎన్సీలు/చీఫ్ ఇంజనీర్లతో కూడిన కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ) కమిటీ ఆమోదించాకే రూ. 10 కోట్లు, ఆపై విలువగల పనుల టెండర్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. పనులకు అన్ని రకాల అనుమతులు ఉంటేనే సీఓటీ కమిటీ టెండర్లను ఆమోదిస్తుంది. అనుమతుల ఉత్తర్వుల్లో పేర్కొన్న పదాల్లో స్వల్ప తేడాలున్నా మళ్లీ కొత్త ఉత్తర్వులతో వస్తేనే ఆమోదముద్ర వేస్తుంది. ప్రస్తుతం సీతారామ ప్రాజెక్టు డి్రస్టిబ్యూటరీలకు సంబంధించిన ఆరు టెండర్లకు బిడ్ల దాఖలు గడువు ఈ నెల 8తో ముగియనుండగా మరో టెండర్ గడువు 4తో ముగియనుంది. ఆ తర్వాత ఈ బిడ్లను సీఓటీ కమిటీ పరిశీలించి ఆమోదించాల్సి ఉంది. అయితే అనుమతుల్లేకుండానే టెండర్లు జారీ కావడంతో సీఓటీ కమిటీ నుంచి వాటికి ఆమోదం లభించే అవకాశం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ అనుమతులు లభించకపోతే టెండర్లను రద్దు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. కాగా, టెండర్లను ఆహ్వానించిన తర్వాత అనుమతుల్లేని పనులకు ర్యాటిఫికేషన్ (క్రమబద్ధీకరణ అనుమతులు) జారీ చేయాలని కోరుతూ నీటిపారుదల శాఖకు ప్రాజెక్టు అధికారులు విజ్ఞప్తి చేయగా అంచనాలను సమర్పించాలని నీటిపారుదల శాఖ ఆదేశించింది. ఇప్పటికే సీతారామపై వివాదాలు... సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ. 7,926.14 కోట్ల అంచనాతో 2016 ఫిబ్రవరి 18న ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చిoది. ఆ తర్వాత 2018 ఆగస్టులో రూ. 13,057 కోట్లకు అంచనాలను పెంచింది. ఈ ప్రాజెక్టు కింద 3,28,853 ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పంప్‌హౌస్‌ల పనులు పూర్తవగా డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులు జరగాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఈ పనుల అంచనాలను భారీగా పెంచారని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇదే సమయంలో పరిపాలనా అనుమతుల్లేకుండానే అధికారులు టెండర్లను నిర్వహిస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ అంశంపై ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. -
‘కొడంగల్’ లిఫ్టుపై మీమాంస
సాక్షి,హైదరాబాద్: నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం టెండర్లకు కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీఓటీ) ఆమోదముద్ర లభించలేదు. పలు ఇంజనీరింగ్ శాఖల పనులకు సంబంధించిన టెండర్లపై శనివారం నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) జి.అనిల్‌కుమార్ నేతృత్వంలోని సీఓటీ సమావేశమై చర్చించింది. ఈ సమావేశంలో నారాయణపేట–కొడంగల్ టెండర్లపై ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌తోపాటు నారాయణపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి రూ.4,350కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది.టెండర్ల ఆమోదంపై నిర్ణయం తీసుకోని సీఓటీప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా విభజించి గత నెల లో టెండర్లను ఆహ్వానించారు. ప్యాకేజీ–1 కింద రూ.1,134.62 కోట్ల అంచనాలతో టెండర్లను పిల వగా, 3.9% అధిక ధరను కోట్ చేసి రాఘవ–జ్యోతి జాయింట్ వెంచర్ ఎల్–1గా నిలిచింది. 4.85% అధిక ధరను కోట్ చేసి ఎల్–2గా మేఘా ఇంజనీ రింగ్ నిలిచింది. రూ.1,126.85 కోట్ల అంచనాలతో రెండో ప్యాకేజీ పనులకు టెండర్లను పిలవగా 3.95% అధిక ధరను కోట్ చేసి ఎల్–1గా మేఘా ఇంజనీరింగ్, 4.8% అధిక ధరను కోట్ చేసిన ఎల్–2గా రాఘవ కన్స్ట్రక్షన్స్ నిలిచాయి. ఈ టెండర్లను సీఓటీ ఆమోదించాల్సి ఉండగా, ఇప్పటికే పలుమార్లు సమావేశమైన సీఓటీ ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. 21న జరిగే సమావేశంలోనైనా...ప్యాకేజీ–1 టెండర్ల విషయంలో సీఓటీలోని కొందరు చీఫ్ ఇంజనీర్లు కొన్ని అంశాలపై కొర్రీలు వేసినట్లు సమాచారం. ఈ నెల 21న జరగనున్న సీఓటీ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సూర్యాపేట జిల్లా నాగార్జునసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు రూ.360 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులకు సీఓటీ ఆమోదముద్ర వేసింది. రూ.14 కోట్లతో చేపట్టిన సదర్మట్ బరాజ్ విద్యుదీకరణ పనులకు సైతం అనుమతిచ్చింది. -
Telangana: బుల్డోజర్లకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: వరుసగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో కలకలం రేపిన ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)’కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇటీవలి పరిణామాలు, సంస్థాగత లోపాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. కనీసం 3 నెలలపాటు కూల్చివేతల జోలికి వెళ్లవద్దని సూచించింది. దీనితో హైడ్రా తమ విభాగం అంతర్గత నిర్మాణంపై దృష్టి పెట్టనుంది. మరోవైపు హెచ్ఎండీఏ, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు చెరువులు, కుంటలపై విస్తృత సర్వే చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఏర్పడటానికి ముందు నుంచే కూల్చివేతలతో..చెరువుల ఆక్రమణల తొలగింపు కోసం హైడ్రా ఏర్పడటానికి ముందే.. జీహెచ్ఎంసీ అధీనంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ‘విజిలెన్స్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం)’రూపంలో కూల్చివేతలు ప్రారంభించారు. జూన్ 27న ఫిల్మ్‌నగర్ కో–ఆపరేటివ్ సొసైటీలో తొలి ఆపరేషన్ చేపట్టారు. నార్నే గోకుల్ ఆక్రమించిన లోటస్ పాండ్‌లోని 0.16 ఎకరాలకు విముక్తి కల్పించారు. తర్వాత ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి, ఓఆర్ఆర్ వరకు పరిధిని కల్పిస్తూ జూలై 19న ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి దాదాపు 20 చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగించారు. 50 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి, చెరువులను పరిరక్షించారు.విరామానికి కారణాలెన్నో..హైడ్రా ప్రభావంతో రాష్ట్రంలో, ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింది. ఇళ్లు, స్థలాల క్రయవిక్రయాలు పడిపోయాయి. మరో వైపు అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతల వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. నది వెంట ఇళ్ల సర్వే, ఖాళీ చేయించడం, కూల్చివేయడం వంటి చర్యలు చేపట్టింది. మూసీ ప్రాజెక్టుతో హైడ్రాకు సంబంధం లేకపోయినా.. రెండింటి కూల్చివేతలపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ కారణాల నేపథ్యంలో ప్రభుత్వం హైడ్రా కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది.‘హైడ్రా’వ్యవస్థ నిర్మాణంపై ఫోకస్కనీసం మూడు నెలల పాటు హైడ్రా ఆపరేషన్లు నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సమయంలో హైడ్రాకు సంబంధించిన పలు అంశాలను చక్కదిద్దనున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైడ్రాకు పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. ఇటీవలే వివిధ విభాగాల నుంచి 169 మందిని డిప్యూటేషన్‌పై నియమించారు. కానీ పోలీసు విభాగం నుంచి వచ్చిన 20 మంది మినహా మరే ఇతర విభాగాల సిబ్బంది హైడ్రా విధుల్లో చేరలేదు. మరోవైపు హైడ్రాలో చేరేందుకు ఆసక్తి చూపుతూ కొందరు ఉద్యోగులు దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే వారిని రిలీవ్ చేయడానికి పలువురు శాఖాధిపతులు విముఖత చూపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం హైడ్రా వినియోగిస్తున్న కార్యాలయంతోపాటు సిబ్బందిలో దాదాపు అంతా జీహెచ్ఎంసీకి సంబంధించిన వారే. ఈ విషయంలో అటు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు, ఇటు హైడ్రాకు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సంస్థాగత అంశాలు, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టనున్నారు.జల వనరుల ‘లెక్క’తేల్చేలా..జల వనరుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా హైడ్రాను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. తొలిదశలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలకు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్)లో ఉన్న ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ చేపట్టడానికి ముందు ఆయా చెరువులు, వాటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తికాకపోవడాన్ని ఇటీవల న్యాయస్థానం సైతం ప్రశ్నించింది. దీనికోసం రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాలతోపాటు హెచ్ఎండీఏ ఉమ్మడిగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. తొలుత ప్రాథమిక, ఆపై తుది నోటిఫికేషన్లు జారీ చేయాలి. హెచ్ఎండీఏ లెక్కల ప్రకారం హైదరాబాద్‌తోపాటు శివారు జిల్లాల్లో కలిపి 2,688 జలవనరులు ఉన్నాయి. వీటిలో 2,364 ప్రిలిమినరీ నోటిఫికేషన్ స్థితి దాటగా, 324 మాత్రమే తుది నోటిఫికేషన్ దాకా వెళ్లాయి. 95 చెరువులకు హైడ్రా ఏర్పడిన తర్వాతే ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో వచ్చే మూడు నెలల్లో అన్ని చెరువుల సర్వే పూర్తి చేసి, తుది నోటిఫికేషన్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
తప్పు చేయకూడదనే దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటి పారుదల శాఖ లో కొత్తగా నియమకమైన 700 మంది ఏఈఈలకులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. ఎర్రమంజిల్‌లో జలసౌధలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ఇరిగేషన్‌ను ప్రపంచానికి చాటేలాగా అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. జలవివాదాలు కారణంగా ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. తెలంగాణలో ప్రాజెక్టులు ఎందుకు ఆలస్యం అయ్యాయో గత పది ఏళ్లలో చేశామని, ఆ పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రూపాయలు ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశామని తెలిపారు.‘నీళ్లు, నియామకాల ఆకాంక్షల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నీళ్లు మన సంస్కృతిలో భాగస్వామ్యం.. అలాంటి శాఖకు మీరు ప్రతినిధులుగా నియామకమవుతున్నారు. తెలంగాణ ఏర్పడిన దశాబ్దం తరువాత నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇది మీకు ఉద్యోగం కాదు.. ఇది మీకు ఒక భావోద్వేగం. తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉంది. వారి భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఏ వృత్తిలోనైనా క్షేత్ర స్థాయిలో అనుభవం ఉన్నవాళ్లే రాణిస్తారు. రాజకీయాల్లోనూ క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన వారే ఎక్కువ రాణిస్తారు.పీవీ నరసింహారావు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నీలం సంజీవ రెడ్డి లాంటి వారు సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానులుగా ఎదిగారు. నేను కూడా జిల్లా పరిషత్ మెంబర్ స్థాయి నుంచే సీఎం స్థాయికి వచ్చా. గతంలో ఇంజనీర్లు ఉదయం 5 గంటలకే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేవారు. ఫీల్డ్ విజిట్ చేసాకే రిపోర్టులు రాసే వారు. కానీ ఈ మధ్య క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లే వారు తగ్గిపోయారు. మేం అధికారంలోకి వచ్చాక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ఆదేశించాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. కట్టడం కూలడం రెండూ జరిగాయి. అధికారులు జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదో దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు. దీనికి ఎవరిని బాధ్యులను చేయాలో మీరే చెప్పాలి. అధికారులనా? రాజకీయ నాయకులనా?.మీ మోడల్ స్టడీకి కాళేశ్వరమే సరైన ఉదాహరణ. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోండి. కాళేశ్వరం విషయంలో అందరిపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంటే ఉండదు. చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈఈ చెప్పారని ఒకరు, ఎస్ఈ చెప్పారని ఇంకొకరు.. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు తీసుకునే తప్పుడు నిర్ణయాలను అమలు చేయకుండా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కాదు. లక్ష కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు.పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఏమిటో గమనించండి. 2లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కావొద్దు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్లు అత్యంత కీలకం.ప్రాజెక్టుల పూర్తికి క్షేత్ర స్థాయిలో పని చేయాలి. రికమెండేషన్‌తో వచ్చే వారికి సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చి పనిష్మెంట్ ఇవ్వండి. పని మీద శ్రద్ధ పెట్టండి.. పోస్టింగ్‌ల మీద కాదు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలబడుతుంది. క్షేత్రస్థాయిలో పని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి.’ అని పేర్కొన్నారు. -
కాంట్రాక్టర్లకు బిల్లుల కోసమే ‘కాళేశ్వరం’ కార్పొరేషన్!
సాక్షి, హైదరాబాద్: బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొంది కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం కోసమే కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటైందని నీటిపారుదల శాఖ చీఫ్ అకౌంట్స్ అధికారి పద్మావతి, కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ అధికారి కొమర్రాజు వెంకట అప్పారావు వెల్లడించారు. కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. బుధవారం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ముగ్గురు అధికారులను వేర్వేరుగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. నాటి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ఆదేశాలతో కార్పొరేషన్ రుణాలను సమీకరించిందని ఓ ప్రశ్నకు సమాధానంగా కొమర్రాజు వెంకట అప్పారావు తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కు స్వతహాగా ఆదాయం ఏమీ లేదన్నారు. రుణా లు మంజూరైన వెంటనే కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరపకుండా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని.. వాటిపై వచ్చే వడ్డీలతో కార్పొరేషన్ నిర్వహణ జరుగుతోందని చెప్పారు. కాంట్రాక్టర్ల బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీలను సైతం కార్పొరేషన్ అవసరాలకు వాడుకుంటున్నామని వివరించారు. పూర్తయిన పనులన్నింటినీ కార్పొరేషన్ ఆస్తులుగానే పరిగణిస్తామని తెలిపారు. రామగుండం ఫెర్టిలైజర్, ఎనీ్టపీసీ నుంచి నీటి విడుదలకు సంబంధించిన బిల్లులు 2023 నుంచి వస్తున్నాయని వివరించారు. కొలతలు చూశాకే బిల్లులు ఇస్తారా? అని కమిషన్ ప్రశ్నించగా.. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సిద్ధం చేసిన బిల్లులను పేఅండ్‌అకౌంట్స్ విభాగం పరిశీలించి కార్పొరేషన్‌కు పంపిస్తుందని, తర్వాత చెల్లింపులు చేస్తామని బదులిచ్చారు. కాగ్ అభ్యంతరాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు.మిమ్మల్ని మీరే రక్షించుకోవాలినీటి పారుదల శాఖ బడ్జెట్ రూపకల్పనలో మీ పాత్ర ఏమిటని ఆ శాఖ చీఫ్ అకౌంట్స్ అదికారి పద్మావతిని కమిషన్ ప్రశ్నించగా.. చీఫ్ ఇంజనీర్ల నుంచి వివరాలను సేకరించి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపిస్తానని ఆమె బదులిచ్చారు. కార్పొరేషన్ రుణాల తిరిగి చెల్లింపు కోసం ప్రభు త్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తోందని తెలిపారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ అభ్యంతరాల విషయంలో మీ అభిప్రాయమేంటి? రుణాలపై నిర్వహించిన సమావేశాల్లో గత ప్రభుత్వంలోని సీఎంఓ అధికారులు పాల్గొన్నారా? ప్రాజెక్టుతో ఆర్థికభారం పడే అవకాశం ఉండటంతో ఆర్థిక క్రమశిక్షణ కోసం సలహాలు ఏమైనా ఇచ్చారా?’ కమిషన్ ప్రశ్నించగా.. ఆమె సమాధానం దాటవేసినట్టు తెలిసింది. ‘కాళేశ్వరం ప్రాజెక్టుతో పడే ఆర్థిక భారం? దీనికి మీ సమర్థన ఉందా? రాష్ట్రంపై ఈ భారం రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది? మీ బాధ్యతగా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారా?’ అన్న ప్రశ్నలకు తాను జవాబు చెప్పలేనని పేర్కొన్నట్టు సమాచారం. ఇక ఆర్థిక క్రమశిక్షణ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకున్నదెవరని ప్రశ్నించగా.. అది చాలా విస్తృతమైన అంశమని, దానిపై తానేమీ చెప్పలేనని చెప్పినట్టు తెలిసింది. దీంతో కమిషన్ కొంత ఘాటుగా స్పందిస్తూ.. ‘‘విచారణ సందర్భంగా ఎవరినో రక్షించే ప్రయత్నం చేయవద్దు. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. విచారణలో వాస్తవాలనే తెలపాలి. దాపరికాలు వద్దు’’ అని పేర్కొన్నట్టు సమాచారం. మరోవైపు బిల్లులను పరిశీలించి చెల్లింపులకు సిఫారసు చేయడమే తన బాధ్యత అని వర్క్ అకౌంట్స్ డైరెక్టర్ ఫణిభూషణ్ శర్మ కమిషన్‌కు వివరించారు. కాగ్ నివేదికలోని ఒకటి రెండు విషయాలు మాత్రమే వాస్తవాలని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచి్చందని తెలిపారు. -
‘దుర్గం చెరువు’ దోషులు అధికారులే!
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: ‘‘హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హుడా) అనుమతులు ఇచ్చిందంటే ప్రభుత్వం ఇచ్చినట్టే కదా! నీటి పారుదల శాఖ ఇచ్చిన నిరభ్యంతర పత్రాల(ఎన్వోసీ) మేరకే ఇళ్లు, భవనాలు నిర్మించాం. 30 ఏళ్లు దాటింది. ఇప్పుడు ఏకంగా 204 నిర్మాణాలు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయంటూ నోటీసులు ఇచ్చారు. ఇక్కడ దోషులెవరు? ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఈ లేఅవుట్లు ఉన్నట్టు అప్పుడే నిర్ధారిస్తే.. ఇప్పుడు కూల్చివేతలు ఉండేవి కాదు కదా’’.. .. దుర్గం చెరువు సమీపంలోని నెక్టార్ గార్డెన్‌కు చెందిన ఓ ఇంటి యజమాని ఆందోళన ఇది. ఆయనే కాదు.. గత 30 ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న చాలా మంది తమ ఇళ్లు, భవనాలు చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉన్నాయంటూ నోటీసులు ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క దుర్గం చెరువు ప్రాంతంలోనే కాదు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, నాలాలను ఆనుకొని నిర్మించిన విల్లాలు, అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలకు ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, తదితర ప్రభుత్వ విభాగాలు అనుమతులు ఇచ్చాయి. ఇప్పుడేమో అధికారులు ఆ ఇళ్లు ఎఫ్టీఎల్ పరిధిలో, బఫర్‌జోన్‌లో ఉన్నట్టు నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. నోటీసులు ఇచ్చిన తహసీల్దార్ దుర్గం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఇళ్లు నిర్మించారంటూ.. శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డి ఈ నెల 5న వాల్టా చట్టం కింద అమర్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, కావూరిహిల్స్, నెక్టార్ గార్డెన్లలో ఉన్న 204 నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు. 30 రోజుల్లో నిర్మాణాలను తొలగించుకోవాలని పేర్కొన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే నిర్మాణాలకు ‘ఎఫ్’అని.. కొంతభాగం ఎఫ్టీఎల్లోకి వస్తే ‘ఎఫ్/పీ’అని.. బఫర్‌జోన్‌లోకి వచ్చే నిర్మాణాలపై ‘బీ’అని గోడలపైన రాశారు. రాజకీయ, సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా ఈ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. ఓ పర్యావరణవేత్తకు చెందిన ఇల్లు కూడా ఉన్నట్టు సమాచారం. అమర్ సొసైటీలో సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు కూడా ఉంది. ఎకరా రూ.వంద కోట్లపైనే..! దుర్గం చెరువు ప్రాంతంలో ఆక్రమణకు గురైన భూముల ప్రస్తుత మార్కెట్ విలువ ఎకరానికి రూ.వంద కోట్లపైనే ఉంటుందని అంచనా. చదరపు గజం విలువే రూ.2 లక్షలపైన ఉంటుంది. హైటెక్‌సిటీని ఆనుకొని ఉన్న దుర్గం చెరువు ప్రాంతం రియల్టర్లకు, బిల్డర్లకు హాట్‌కేక్‌లా మారింది. దాంతో రెండు, మూడు దశాబ్దాల క్రితం నుంచే కబ్జాల పర్వం మొదలైంది. ఈ అక్రమ నిర్మాణాలకు అందరూ బాధ్యులే. అప్పటి ప్రభుత్వ పెద్దలు, రాజకీయ ప్రముఖుల నుంచి అక్రమ లేఅవుట్లకు అడ్డగోలుగా అనుమతులిచ్చిన హుడా అధికారులు.. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు ఆక్రమణకు గురవుతున్నట్టు తెలిసినా ఎన్వోసీలు ఇచ్చిన నీటిపారుదల, రెవెన్యూ అధికారులు కూడా బాధ్యులే. నిజాం కాలంలో నిర్మించిన దుర్గం చెరువు రెండు గుట్టల మధ్య సుమారు 160.7 ఎకరాలకుపైగా విస్తరించి ఉండేది. రాయదుర్గం పాయెగాలో 62ఎకరాలు, మాదాపూర్ సర్వే నం.63, 64లలో 28 ఎకరాలు, గుట్టల బేగంపేట్ సర్వే నంబర్లు 42 నుంచి 61 వరకు 70.7 ఎకరాల విస్తీర్ణంలో దుర్గంచెరువు ఉండేది.హుడా ఆమోదంతో నిర్మాణాలు.. ఈ ప్రాంతంలో 1991లో మొదట అమర్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీ 15 ఎకరాల విస్తీర్ణంలో 150 ప్లాట్లతో లేఅవుట్ చేసింది. అయితే చెరువు చుట్టూ 30 అడుగుల పరిధిలో స్థలాన్ని గ్రీన్‌బెల్ట్ కోసం కేటాయించిన హుడా.. 130 ప్లాట్లకు 1995లో తుది ఆమోదం ఇచ్చింది. ఈ క్రమంలోనే వరుసగా కావూరి హిల్స్, నెక్టార్ గార్డెన్ గేటెడ్ కమ్యూనిటీలకు కూడా హుడా ఆమోదం లభించింది. నెక్టార్ గార్డెన్ పూర్తిగా, కావూరి హిల్స్‌లోని కొంత భాగం దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉంది. గతంలో భారీ వర్షాలు వచ్చినప్పుడు కావూరి హిల్స్, నెక్టార్ గార్డెన్, అమర్ సొసైటీలలోకి వరద నీరు చేరేది. దీనితో దుర్గంచెరువు పూర్తిగా నిండకుండా, ఎప్పటికప్పుడు నీటిని కిందికి వదిలేస్తూ.. ఎఫ్‌టీఎల్‌పై ఫోకస్ పడకుండా చేశారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఒత్తిడి తీసుకొచ్చి వర్షాకాలంలో దుర్గం చెరువు గేట్లు మూసివేయ కుండా చూసుకుంటూ వస్తున్నారు. అయితే చెరువు సుందరీకరణ పేరిట చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయడంతో.. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వారికి అదో రక్షణ గోడగా మారిపోయింది.అధికారులు ఏమంటున్నారు? 2013లో సుమారు 160.7 ఎకరాల్లో దుర్గం చెరువు విస్తీర్ణాన్ని గుర్తిస్తూ ఎఫ్టీఎల్ను నిర్ధారించామని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. నీటిపారుదల, రెవెన్యూ శాఖల నుంచి వచ్చిన ఎన్వోసీల మేరకు అనుమతులను ఇచ్చినట్లు హెచ్ఎండీఏ అధికారులు అంటున్నారు. ఇక ‘‘ప్రభుత్వం ఆమోదించిన మాస్టర్ ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకుంటాం. చాలా చోట్ల కాలువలను పూర్తిగా మూసివేయడం వల్ల బ్యాక్ వాటర్ వచ్చి చేరుతుంది. దీంతో ఎఫ్టీఎల్ నిర్ధారణలో శాస్త్రీయత లోపిస్తోంది’’అని హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం.అక్రమమైతే కూల్చేయండి.. వాల్టా చట్టం రాకముందే 1995లో లేఅవుట్‌కు ఆమో దం లభించింది. హుడా అనుమతితోనే ఇళ్లు నిర్మించారు. 2016లో 600 చదరపు గజాల స్థలంలో ఇల్లు కొనుగోలు చేశాం. ఈ ప్రాంతం చెరువు పరిధిలోకి వస్తుందన్న సమాచారమేదీ లేదు. ఇప్పుడు బఫర్ జోన్లోకి వస్తుందంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్రమ మైతే కూల్చేయండి, ముఖ్యమంత్రి నా ఒక్కడి కోసం పనిచేయడం లేదు కదా! బీఆర్ఎస్ నాయకులు నా ఇంటి విషయంలో రాజకీయం చేస్తున్నారు. – సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిభయభ్రాంతులకు గురిచేయొద్దు 1995లో హుడా అనుమతి ఇవ్వడంతోనే ప్లాట్లు కొనుగోలు చేసి ఇ ళ్లు కట్టుకున్నాం. ఇప్పటికీ ఈఎంఐలు కట్టేవారు ఉన్నారు. 2023 లో జీహెచ్ఎంసీ హైపవర్ కమిటీ ఈ ప్రాంతం ఎఫ్టీఎల్లోకి రాదని తేల్చింది. ప్రభుత్వాలు మారితే ఎఫ్టీఎల్ మారుతుందా? – అమర్ కో–ఆపరేటివ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణారెడ్డిఇళ్లు కట్టాలంటే ఏ అనుమతులు ఉండాలిగ్రీన్బెల్ట్ను వదిలి అమర్ సొసైటీ లేఅవుట్‌కు హుడా అధికారులు ఆమోదం తెలిపారు. అనుమతి ఉన్న లేఅవుట్లో ప్లాట్ తీసుకొని, ఇంటి నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ అనుమతి తీసుకున్నాం. హైదరాబాద్‌లో ఇళ్లు కట్టుకోవాలంటే ఇంకా ఏమేం అనుమతులు తీసుకోవాలో చెప్పండి. – పోలవరపు శ్రీనివాస్, అమర్ సొసైటీ వాసి -
‘కృష్ణా’లో సిరుల పంట
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ప్రాజెక్టుల కింద ఈ ఏడాది సిరుల పంట పండనుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కృష్ణా నది పరీవాహకంలోని చిన్నా, పెద్దా అన్ని ప్రాజెక్టుల కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ సిద్ధమైంది. కృష్ణా ప్రాజెక్టుల కింద ఉన్న 14.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు 125 టీఎంసీలు.. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల కింద 17.95లక్షల ఎకరాల ఆయకట్టుకు 188 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. శనివారం జలసౌధలో నీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్ నేతృత్వంలో రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) సమావేశమైంది. కృష్ణా, గోదావరి బేసిన్ల లోని జలాశయాల్లో ప్రస్తుత నీటి లభ్యత, సమీప భవిష్యత్తులో రానున్న వరద ప్రవాహాల అంచనాపై విస్తృతంగా చర్చించింది. రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల కింద.. ప్రస్తుత ఖరీ ఫ్లో మొత్తం 33లక్షల ఎకరాలకు 314 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని తీర్మానించింది. ఈ ప్రతిపాదనలను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించి ఆమోదం పొందనుంది. సమావేశంలో ఈఎన్సీ (ఓఅండ్ఎం) బి.నాగేందర్రావుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చీఫ్ ఇంజనీర్లు పాల్గొని తమ పరిధిలోని ప్రాజెక్టుల పరిస్థితి, ఆయకట్టుకు సాగునీటి సరఫరా కోసం ప్రతిపాదనలు సమరి్పంచారు. కృష్ణాలో ముగిసిన క్రాప్ హాలిడే.. గత ఏడాది కృష్ణా బేసిన్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నీళ్లు లేక వెలవెలబోయాయి. దీనితో గత రబీలో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చింది. ప్రస్తుతం బేసిన్ పరిధిలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, మూసీ తదితర ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీటి లభ్యత ఉండటంతో.. అన్ని ప్రాజెక్టుల కింద పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందనుంది. జూన్‌లో వర్షాకాలం మొదలవగా.. రెండు నెలల్లోనే శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండిపోయాయి. ఎగువ నుంచి కృష్ణాలో భారీ వరద కొనసాగుతోంది. దీనితో పరీవాహక ప్రాంతంలో ఆయకట్టుకు ఈ ఏడాది ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారమే నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు సాగునీటి విడుదలను ప్రారంభించడం గమనార్హం. సాగర్ నుంచి ఇంత ముందే నీళ్లు విడుదల చేయడం గత పదేళ్లలో ఇది రెండోసారి. 2021లో సైతం ఆగస్టు 2వ తేదీనే సాగర్ నుంచి సాగునీటి విడుదల ప్రారంభించారు. గోదావరిలో లోయర్ మానేరు దిగువన కష్టమే..! గోదావరి నదిలో పైనుంచి వరదలు పెద్దగా రాక.. ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఆశించిన మేరకు లేకుండా పోయింది. ఈ క్రమంలో లోయర్ మానేరు ప్రాజెక్టు వరకు ఉన్న ఆయకట్టు వరకే నీటి సరఫరాపై స్కివం కమిటీ నిర్ణయం తీసుకుంది. దాని దిగువన ఉన్న ప్రాజెక్టులతోపాటు సింగూరు ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటి సరఫరాపై మరో 15 రోజుల తర్వాత సమావేశమై.. అప్పటి నీటి లభ్యత ఆధారంగా నిర్ణయాలు తీసుకోనున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 42.81 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఎగువ నుంచి కాస్త వరద కొనసాగుతోంది. దీనితో ఈ ప్రాజెక్టు కింద మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆనికట్‌కు నీళ్లను తరలించి దాని కింద ఉన్న 21వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. -
పంపింగ్ ప్రారంభం.. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు షురూ
సాక్షి, హైదరాబాద్/రామగుండం/ధర్మారం: అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన పంప్‌హౌస్‌ల ద్వారా నీటి పంపింగ్ ప్రక్రియను శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోని నీళ్లను నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా నందిమేడారం, మిడ్‌మానేరు జలాశయాల్లోకి ఎత్తిపోస్తున్నారు. ఆగస్టు 2లోగా కాళేశ్వరం పంప్‌హౌస్‌లను ఆన్ చేయకుంటే 50వేల మంది రైతులతో కలిసి తామే ఆన్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో పంపింగ్ ప్రారంభం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు దెబ్బతిని ఉండడంతో వాటిలో నీటి నిల్వలు చేయరాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ కోరిందని, దీంతో ఈ మూడు జలాశయాల నుంచి నీళ్లను పంపింగ్ చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించడం సాధ్యం కాదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బదులిచి్చన విషయం తెలిసిందే. అయితే, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్‌మానేరుకు, అక్కడి నుంచి అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌కు నీటిని తరలిస్తామని ప్రకటించారు. మంత్రి ప్రకటన మేరకు నీటిపారుదల శాఖ శనివారం నుంచే పంపింగ్ ప్రారంభించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా భారీ వర్షాలతో వస్తువన్న వరదలతో శనివారం 17.34 టీఎంసీలకు నిల్వలు చేరాయి. 14,358 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. నంది, గాయత్రి పంపుహౌస్‌ల ద్వారా శనివారం ఎత్తిపోతలు ప్రారంభించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గ్రావిటీ కాలువ ద్వారా తరలివస్తున్న నీటిని ధర్మారం మండలం నందిమేడారం వద్ద ఉన్న నంది పంప్‌హౌస్ ద్వారా నందిమేడారం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. మొత్తం 7 పంపులు ఉండగా, 4 పంప్‌లను ఆపరేట్ చేస్తూ 13,076 క్యూసెక్కులను తరలిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఒక మోటారును ఆన్‌చేసిన అధికారులు.. సాయంత్రం 6గంటల వరకు మరో మూడు విద్యుత్ మోటార్లు రన్ చేశారు. నందిమేడారం రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తి రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద గల గాయత్రి పంప్‌హౌస్‌లోకి అంతే స్థాయిలో 13,076 క్యూసెక్కులను తరలిస్తున్నారు. గాయత్రి పంప్‌హౌస్‌లోని నాలుగు బాహుబలి పంపుల ద్వారా నీళ్లను గ్రావిటీ కాల్వలోకి ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి ఆ నీళ్లు మిడ్‌మానేరుకు తరలిపోతున్నాయి. నీటి పంపింగ్ ప్రారంభం కావడంతో మడుగు, గంగాధర, బోయినపల్లి మండలాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మంత్రి ఉత్తమ్ ఆదేశాలతో మధ్యమానేరుకు నీటిని ఎత్తిపోస్తున్నామని, దీనిని రైతులు సది్వనియోగం చేసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. -
సాగునీటికి కటకటే
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖకు నిధుల కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం కోత పెట్టింది. 2023–24 బడ్జెట్లో రూ.26,885 కోట్లు ఇవ్వగా, 2024–25 బడ్జెట్లో రూ.22,301 కోట్లే కేటాయించారు. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి చేసిన రుణాల తిరిగి చెల్లింపులకు కేటాయింపులను ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. మరోవైపు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.10,829 కోట్లు కేటాయించింది. గతేడాది వీటికి రూ.9381 కోట్లు మాత్రమే ఇచ్చారు.ప్రాథమ్యాలకు నిధుల కరువే..రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమ్యాలకు అనుగుణంగా వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులపై 2024–25లో రూ.19,287 కోట్లు ఖర్చు చేయాలని నీటిపారుదల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసు కోగా, బడ్జెట్లో మాత్రం ప్రభుత్వం ఆశించిన మేరకు కేటాయింపులు జర పలేదు. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులకు రూ.10,829 కోట్లు కేటాయించగా, మిగిలిన నిధులు కాళేశ్వరం, పాలమూరు –రంగారెడ్డి తదితర ప్రాజెక్టుల నిర్మాణం కోసం చేసిన రుణాల చెల్లింపులు, ఉద్యోగుల జీతభత్యాలకు వెళ్లనున్నాయి.రుణాల చెల్లింపులకు నిధుల కోత..కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తెలంగాణ రాష్ట్ర జల వనరుల సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ డబ్ల్యూఆర్ఐడీసీ)తో పాటు ఇతర మార్గాల ద్వారా రుణా లను సమీకరించింది. ఈ రుణాలను తిరిగి చెల్లించడానికి 2023–24 బడ్జెట్లో రూ.15,773 కోట్లు ప్రతి పాదించగా, తాజా బడ్జెట్లో రూ.9951 కోట్లకు కేటాయింపులను ప్రభుత్వం తగ్గించింది.కాళేశ్వరం కార్పొరేషన్‌కు రూ.12, 500 కోట్లు కేటాయించగా, తాజాగా రూ.6914.54 కోట్లకు కేటాయింపులు తగ్గాయి. ఇక టీఎస్ డబ్ల్యూఆర్ ఐడీసీకి కేటాయింపులు రూ.3200కోట్ల నుంచి రూ.2962. 47 కోట్లకు తగ్గాయి. ఈ రుణాల తిరిగి చెల్లింపుల గడువును పొడిగించి వాటి కిస్తీల సంఖ్యను సైతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రుణా ల తిరిగి చెల్లింపులకు కేటాయింపులను కోత పెట్టింది.కేటగిరీల వారీగా ప్రాజెక్టులకు కేటాయింపులు ఇలా ఉన్నాయి..భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.8476.48 కోట్లుమధ్య తరహా ప్రాజెక్టులకు రూ.953.21మైనర్ ఇరిగేషన్‌కు రూ.857.73వరదల నియంత్రణ, డ్రైనేజీ రూ.282.24 -
నిరంతర గరిష్ట నిల్వలతోనే నష్టం!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణం పూర్తయిన నాటి నుంచీ నిరంతరం గరిష్ట నిల్వలను కొనసాగించారని.. దాంతో ఒత్తిడి పెరిగి వాటికి తీవ్ర నష్టం కలిగిందని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు నిపుణుల కమిటీ నివేదించింది. నీటి పారుదల శాఖలోని హైడ్రాలజీ విభాగం ఇంజనీర్లు, విచారణ కమిషన్‌కు సహకరించేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీ సభ్యులను జస్టిస్ పినాకి చంద్రఘోష్ గురువారం బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో విచారించారు. ప్రాథమిక పరిశీలన అంశాలతో.. ఎన్ఐటీ వరంగల్ రిటైర్డ్ ప్రొఫెసర్ సీబీ కామేశ్వర్రావు, రిటైర్డ్ సీఈ కె.సత్యనారాయణ, ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్ ఎన్.రమణమూర్తి, ఉస్మానియా వర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం హెచ్ఓడీ పి.రాజశేఖర్, రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్‌తో ఏర్పాటైన నిపుణుల కమిటీ ఇటీవల బరాజ్‌లను పరిశీలించి ప్రాథమిక నివేదిక సమర్పించింది. తమ దృష్టికి వచి్చన లోపాలను తాజాగా జస్టిస్ చంద్రఘోష్‌కు వివరించింది. బరాజ్‌లను సుదీర్ఘకాలం పూర్తిస్థాయిలో నీటితో నింపి ఉంచడంతో.. బరాజ్‌లపై ఒత్తిడి పెరిగి బుంగలు ఏర్పడ్డాయని కమిటీ సభ్యులు పేర్కొన్నట్టు తెలిసింది. బుంగలను వెంటనే పూడ్చయకపోవడంతో వాటి తీవ్రత పెరిగి బరాజ్‌లకు తీవ్ర నష్టం కలిగించిందని వెల్లడించినట్టు సమాచారం. బరాజ్‌ల వైఫల్యంపై రెండు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని.. సాధ్యమైనంత త్వరగా పూర్తిస్థాయి నివేదికను అఫిడవిట్ రూపంలో సమరి్పంచాలని నిపుణుల కమిటీకి ఈ సందర్భంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆదేశించారు. నేడు ఈఎన్సీల ఆఫీసుల సిబ్బంది విచారణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్), ఈఎన్సీ (ఓ అండ్ ఎం) కార్యాలయాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లను జస్టిస్ చంద్రఘోష్ శుక్రవారం విచారించనున్నారు. చీఫ్ ఇంజనీర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు అధికారులను విచారణకు రావాలని కోరారు. త్వరలో బహిరంగ విచారణ కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ త్వరలో బహిరంగ విచారణ నిర్వహించాలని నిర్ణయించింది. అఫిడవిట్ల రూపంలో విచారణ కమిషన్‌కు సమాచారాన్ని సమరి్పంచిన వారందరినీ బహిరంగ విచారణలో ప్రశ్నించనుంది. అఫిడవిట్ల పరిశీలన పూర్తయిన తర్వాత ఎవరెవరిని పిలవాలనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది. బ్యారేజీలపై విజిలెన్స్ విభాగం నిర్వహించిన దర్యాప్తునకు సంబంధించిన తుది నివేదికను సత్వరం సమర్పించాలని కమిషన్ కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సమరి్పంచలేదు. విజిలెన్స్ తుది నివేదిక కోరుతూ మరోసారి లేఖ రాయనుంది. బరాజ్‌ల నిర్మాణంతో సంబంధమున్న ప్రభుత్వ కార్యాలయాలు, మోడల్ స్టడీస్ ల్యాబ్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సంబంధిత రికార్డులను పరిశీలించాలని జస్టిస్ చంద్రఘోష్ నిర్ణయం తీసుకున్నారు. పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)ను సైతం ఆయన సందర్శించనున్నట్టు తెలిసింది. కాళేశ్వరం బరాజ్‌లకు సంబంధించిన సాంకేతిక అంశాలపై విచారణ ముగించిన తర్వాత.. ఆర్థిక అవకతవకతలపై జస్టిస్ చంద్రఘోష్ దృష్టిసారించనున్నారు. అంచనా వ్యయం, ఖర్చులు, రుణాలు, వడ్డీ రేట్లు తదితర అంశాలపై విచారణ నిర్వహించనున్నారు. అఫిడవిట్ల పరిశీలన తర్వాత నిర్ణయం గురువారం విచారణ ముగిసిన తర్వాత జస్టిస్ పినాకి చంద్రఘోష్ మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. బరాజ్‌ల వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులకు నోటీసులేమైనా జారీ చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. అధికారులు సమరి్పంచిన అఫిడవిట్లను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. -
‘టైమ్‌బౌండ్’ ఒత్తిడే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ ల నిర్మాణ పనులను నిర్ణీత గడువు (టైమ్ బౌండ్)లోగా పూర్తి చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడి చేసిందని జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్‌కు బరాజ్‌ల నిర్మాణ సంస్థలు తెలిపాయి. పనులు సత్వరంగా పూర్తి చేయాలంటూ పరుగులు పెట్టించిందని పేర్కొన్నా యి. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసి బరాజ్‌లను అప్పగించామని వివరించాయి. ఈ అంశాలను నెలాఖరు లోగా అఫిడవిట్ రూపంలో సమర్పించాలని నిర్మాణ సంస్థలను జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై న్యాయవిచారణలో భాగంగా బుధవారం బీఆర్కేఆర్ భవన్‌లోని కార్యాలయంలో నిర్మాణ సంస్థల ఉన్నతాధికారులను ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ‘ఎల్అండ్టీ’ తరఫున ఉపాధ్యక్షులు ఎంవీ కృష్ణరాజు, సురేశ్‌కుమార్, సీనియర్ డీజీఎం రంజీష్ చౌహాన్, అన్నారం బరాజ్ నిర్మాణ సంస్థ ‘అఫ్కాన్స్–విజేత జేవీ’ తరఫున హైడ్రో ప్రాజెక్టుల విభాగాధిపతి కె.మల్లికార్జునరావు, జీఎం శేఖర్‌దాస్, సుందిళ్ల బరాజ్ నిర్మాణ సంస్థ ‘నవయుగ’ తరఫున డైరెక్టర్ రామేశ్ యెద్దూరి, ప్రాజెక్టు మేనేజర్ కె.ఈశ్వర్రావు, జీఎం సి.మాధవ్ తదితరులు కమిషన్ ఎదుట హాజరై సమాధానాలు ఇచ్చారు. డిజైన్లు, హైడ్రాలజీ విభాగం ఇంజనీర్లు కూడా.. బరాజ్‌ల డిజైన్లను రూపొందించిన నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ)లో పనిచేస్తున్న చీఫ్ ఇంజనీర్లు టి.శ్రీనివాస్, వి.మోహన్‌కుమార్ సహా మొత్తం 13 మంది ఇంజనీర్లను కూడా జస్టిస్ పినాకి చంద్రఘోష్ బుధవారం తన కార్యాలయం విచారించారు. డిజైన్ల తయారీలో ఒక్కొక్కరి పాత్రను అడిగి తెలుసుకున్నారు. డిజైన్ల ప్రకారమే పనులు జరిగాయా? తర్వాత డిజైన్లను ఏమైనా మార్చారా? ఎవరి ఆదేశాలతో మార్పులు చేశారు? షీట్‌పైల్స్‌కు బదులు సెకెంట్ పైల్స్‌ను ఎందుకు డిజైన్లలో సిఫారసు చేశారు? వంటి అంశాలపై ప్రశ్నలు గుప్పించినట్టు సమాచారం. ఇక బరాజ్‌ల వద్ద నీటి లభ్యతను నిర్ధారించిన హైడ్రాలజీ విభాగంలో పనిచేస్తున్న చీఫ్ ఇంజనీర్ శంకర్‌నాయక్, మరో ఐదుగురు ఇంజనీర్లను సైతం జస్టిస్ చంద్రఘోష్ ప్రశ్నించారు.ఆదేశించిన వారినీ పిలిచి విచారిస్తాం: జస్టిస్ చంద్రఘోష్ బ్యారేజీల డిజైన్లు, నిర్మాణం, నిర్వహణలో లోపం ఎక్కడ జరిగింది? ఎవరు చేశారో తేలుస్తామని జస్టిస్ చంద్రఘోష్ వెల్లడించారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరి ఆదేశాలతో బరాజ్‌ల నిర్మాణ పనులు జరిగాయో రికార్డు రూపంలో సమాచారం అందిన తర్వాత వారిని సైతం విచారణకు పిలుస్తామన్నారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలు సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించాక అవసరమైన వారిని మళ్లీ పిలిపించి విచారిస్తామని తెలిపారు. క్షేత్రస్థాయిలోని వాస్తవాలను తెలుసుకోవడానికే అఫిడవిట్లను దాఖలు చేయాలని కోరినట్టు చెప్పారు. బరాజ్‌ల డిజైన్లు, నిర్మాణం, నిర్వహణపై సమగ్ర వివరాలు అఫిడవిట్లలో ఉండాలని నిర్మాణ సంస్థలను కోరినట్టు తెలిపారు. ఎలాంటి సమాచారమైనా అఫిడవిట్ రూపంలో దాఖలు చేస్తేనే కమిషన్ స్వీకరిస్తుందన్నారు. తప్పుడు సమాచారంతో అఫిడవిట్లు దాఖలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్, కాగ్ నివేదికలు అందాయని.. వాటిని పరిశీలిస్తున్నామని తెలిపారు. న్యాయ విచారణలో భాగంగా విజిలెన్స్, కాగ్ అధికారులను సైతం ప్రశ్నిస్తామన్నారు. నేడు నిపుణుల కమిటీ సభ్యుల విచారణజస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గురువారం నీటిపారుదల శాఖలోని హైడ్రాలజీ విభాగం ఇంజనీర్లతోపాటు కమిషన్‌కు సహకరించేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీ సభ్యులను విచారించనుంది. నిపుణుల కమిటీలో ఎన్ఐటీ వరంగల్ రిటైర్డ్ ప్రొఫెసర్ సీబీ కామేశ్వర్రావు, రిటైర్డ్ సీఈ కె.సత్యనారాయణ, ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్ ఎన్.రమణమూర్తి, ఉస్మానియా వర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం హెచ్ఓడీ పి.రాజశేఖర్, రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్ ఉన్నారు. నిపుణుల కమిటీ ఇప్పటికే బరాజ్‌లకు చేసిన తనిఖీ నివేదికను కమిషన్‌కు సమర్పించింది. -
బరాజ్‌లపై విచారణ స్పీడప్!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై న్యాయ విచారణ ప్రక్రియను జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ వేగిరం చేసింది. బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన నీటి పారుదల శాఖ మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, బరాజ్‌ల డిజైన్లను రూపొందించిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) మాజీ చీఫ్ ఇంజనీర్/రిటైర్డ్ ఈఎన్సీ నరేందర్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్, ఎస్ఈ బస్వరాజ్.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా వాటి నిర్మాణాన్ని పర్యవేక్షించిన యాదగిరి, ఓంకార్ సింగ్‌లను సోమవారం జస్టిస్ చంద్రఘోష్ బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయానికి పిలిపించి విడివిడిగా విచారించారు. బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై ప్రశ్నించారు. ‘బరాజ్‌ల నిర్మాణ స్థలాలను ఎవరు నిర్ణయించారు? స్థలాల ఎంపికకు ముందు భూ¿ౌతిక పరీక్షలు నిర్వహించారా? బరాజ్‌లకు డిజైన్లు, డ్రాయింగ్స్ ఎవరు రూపొందించారు? తర్వాత డిజైన్లలో ఏమైనా మార్పులు చేశారా? నిర్మాణ సమయంలో నాణ్యత పర్యవేక్షణ చేశారా? ఆ బాధ్యతను ఎవరు చూశారు? నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్వహణ, పర్యవేక్షణ ఎవరు చూశారు? బరాజ్‌ల వైఫల్యానికి కారణాలేమిటి? డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తికాక ముందే నిర్మాణ సంస్థలకు వర్క్ కంప్లీషన్ సరి్టఫికెట్లు ఎందుకు జారీ చేశారు?’ వంటి అంశాలపై ఆయన వివరణ కోరినట్టు తెలిసింది. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జాయింట్ సెక్రెటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) అనిల్‌కుమార్, డిప్యూటీ ఈఎన్సీ కె.శ్రీనివాస్ తదితరులు విచారణకు హాజరై కమిషన్‌కు సహకరించారు. నేడు 18 మంది ఇంజనీర్ల విచారణ.. నీటిపారుదల శాఖలోని సీడీఓ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్, కన్స్ట్రక్షన్ విభాగాల్లో గతంలో పనిచేసిన/ప్రస్తుతం పనిచేస్తున్న మొత్తం 18 మంది ఇంజనీర్లను మంగళవారం జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారించనున్నారు. ఈఎన్సీ (ఓ అండ్ ఎం) బి.నాగేంద్రరావు, సీడీఓ చీఫ్ ఇంజనీర్ మోహన్‌కుమార్, మేడిగడ్డ బరాజ్ నిర్మాణాన్ని పర్యవేక్షించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతితోపాటు ఇతర కీలక ఇంజనీర్లు ఈ విచారణకు హాజరుకావాలంటూ కమిషన్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఇక బుధవారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణ సంస్థలైన ఎల్అండ్టీ, అఫ్కాన్స్, నవయుగ కంపెనీల ప్రతినిధులను కమిషన్ విచారించనుంది. త్వరలోఅసలు విషయాలు బయటికి..: జస్టిస్ చంద్రఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణం విషయంలో అసలు విషయాలు రానున్న రోజుల్లో బయటికి వస్తాయని జస్టిస్ పినాకి చంద్రఘోష్ తెలిపారు. సోమవారం బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో తనను కలిసిన మీడియాతో ఆయన క్లుప్తంగా మాట్లాడారు. బరాజ్‌ల నిర్మాణంపై ఇప్పటివరకు కమిషన్‌కు 54 ఫిర్యాదులొచ్చాయని, వాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. విచారణ కమిషన్‌కు సమాచారం ఇవ్వడానికి వచ్చే ప్రతి ఒక్కరికి తనను కలిసే అవకాశం ఇస్తానని, వారి వాదన వింటానని తెలిపారు. ప్రస్తుతం సాంకేతిక లోపాలపై విచారణ సాగుతోందని.. తర్వాత ఆర్థిక, ఇతర అవకతవకలపై విచారణ ప్రారంభిస్తామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు మేరకు జూన్ 30లోగా విచారణ పూర్తికాదని.. గడువు పొడిగింపుపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. సమగ్రంగా అన్ని విషయాలు, వాస్తవాలు తెలుసుకోకుండా నివేదిక ఇవ్వడం సాధ్యం కాదన్నారు. తమకు నష్టపరిహారం చెల్లించలేదంటూ కొందరు భూనిర్వాసితులు తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. బరాజ్‌లకు సంబంధించిన అన్ని ఫైళ్లను ప్రభుత్వం సమరి్పంచిందని, వాటిని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. బరాజ్‌లపై విజిలెన్స్ జరిపిన విచారణ నివేదికను తమకు అందజేయాలని ఆ విభాగానికి లేఖ రాశామన్నారు. -
ఆ పదవి నుంచి ఆదిత్యనాథ్ దాస్‌ను తొలగించండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు పదవి నుంచి ఆదిత్యనాథ్ దాస్‌ను తొలగించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన నియామకం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాలను శిష్యుడు రేవంత్‌రెడ్డి పాటిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు కర్రపెత్తనం ప్రారంభమైందనడానికి ఇదే నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు.జలయజ్ఞం ప్రాజెక్టుల నుంచి నిన్నటి పాలమూరు రంగారెడ్డిపై కేసులు వేసి పనులు ఆపిన వ్యవహారంలో ఆదిత్యనాథ్ దాస్ది కీలకపాత్ర అని ఆయన శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిని ఏ విధంగా సలహాదారుగా నియమించుకున్నారని ఆయన ప్రశ్నించారు.అధికారిగా ఆయన పట్ల తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, కానీ ఆంధ్రలోని కృష్ణ ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించడంతో ఆయనది కీలకపాత్ర అని అన్నారు. కేఆర్ఎంబీలో తెలంగాణ వాదనను తొక్కిపట్టి ప్రాజెక్టుల మీద హక్కులు కోల్పోయేలా చేసిన వ్యక్తిని నియమించడం వెనుక కాంగ్రెస్ ఆలోచన ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరు మరోసారి ఎడారి అయ్యేలా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
మేడిగడ్డ వద్ద మళ్లీ శబ్దాలు
-
మేడిగడ్డ వద్ద మళ్లీ శబ్దాలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం బ్యారేజీలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద మళ్లీ ధ్వనులు, ప్రకంపనలు వచ్చాయి. కుంగిన ఏడో బ్లాకులోని 16వ నంబర్ గేటును పైకి ఎత్తడానికి నీటిపారుదల శాఖ ప్రయత్నించగా.. బ్యారేజీ కింద భూగర్భంలో నుంచి భారీగా బోలు శబ్దాలు (Hallow Sounds), ప్రకంపనలు రావడంతో వెంటనే ఆ పనులను నిలిపేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సెన్సర్లు సైతం శబ్దాలు, ప్రకంపనలను గుర్తించి అలర్ట్ చేశాయి. దీంతో బ్యారేజీ పెను ప్రమాదానికి లోనయ్యే అవకాశం కనిపిస్తోందంటూ నీటిపారుదల శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి.. గతంలో వరదల సమయంలో బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి, 12 వేల నుంచి 15 వేల క్యూబిక్ మీటర్ల పరిమాణంలో భారీ బొరియ ఏర్పడి ఉండవచ్చని ఇప్పటికే నిర్వహించిన జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షల ద్వారా ఓ అంచనాకు వచ్చినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు చెప్తున్నాయి. టన్నుల కొద్దీ బరువుండే గేటును పైకి ఎత్తే క్రమంలో పునాదులపై ఒత్తిడి పెరుగుతుందని.. పునాదుల కింద భూగర్భంలో బొరియ ఉండటంతో ఆ ఒత్తిడికి బ్యారేజీ మరింత కుంగిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గ్రౌటింగ్ ద్వారా భూగర్భంలోని ఖాళీలను పూడ్చివేశాకే గేట్లను పైకెత్తే పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. నిజానికి 7వ బ్లాకు కుంగిన తర్వాత అక్కడి నుంచి నీటి లీకేజీని ఆపడానికి.. ఏకంగా 40వేల ఇసుక బస్తాలు వేశారు. అయినా బ్యారేజీ కింద భారీగా ఖాళీ ఉందని అంచనాకు రావడం గమనార్హం. ఇప్పటికే హెచ్చరించిన ఎన్డీఎస్ఏ.. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 8 బ్లాకులు, 85 గేట్లు ఉండగా.. గతేడాది అక్టోబర్ 21న ఏడో బ్లాకు కుంగిన వెంటనే 77 గేట్లను ఎత్తి నీటిని వదిలేశారు. 7వ బ్లాకులోని 15 నుంచి 22 నంబర్ వరకు గేట్లు మొరాయించాయి. కాళేశ్వరం బ్యారేజీల్లోని లోపాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ.. బ్యారేజీలను పలుమార్లు పరిశీలించి ఇటీవల మధ్యంతర నివేదిక సమర్పించింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం 2019 జూలైలో పూర్తవగా.. అదే ఏడాది వచ్చిన వరదల సమయంలో బ్యారేజీ ప్రమాద సంకేతాలను వెలువరించిందని పేర్కొంది. బ్యారేజీలకు వానాకాలంలోగా నిర్వహించాల్సిన అత్యవసర మరమ్మతులు, చర్యలను సిఫారసు చేసింది. అయితే వానాకాలానికి ముందే మేడిగడ్డ బ్యారేజీలో మొరాయించిన గేట్లను పైకి ఎత్తేయాలని సూచించింది. అందులోనూ పగుళ్లు వచ్చిన 19, 20, 21 పియర్ల మధ్య ఉన్న గేట్లను అత్యంత జాగ్రత్తగా పైకి ఎత్తాలని స్పష్టం చేసింది. నీటి పారుదల శాఖ అధికారులు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ సిబ్బందితో కలసి ఈ నెల 17న 15వ నంబర్ గేటును విజయవంతంగా పైకి ఎత్తారు. తర్వాత 16వ నంబర్ గేటును ఎత్తడానికి ప్రయత్నించగా.. శబ్దాలు, ప్రకంపనలు వచ్చినట్టు అధికారవర్గాలు తెలిపాయి. పరీక్షలన్నీ చేయించడంపై దృష్టి మేడిగడ్డ బ్యారేజీ దిగువన ఇసుక కొట్టుకుపోవడంతో ఏర్పడిన ఖాళీ ప్రదేశం.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. కుంగిన ఏడో నంబర్ బ్లాకు దిగువకే ఈ బొరియ పరిమితమై లేదని.. మొత్తం బ్యారేజీ కింద ఓ చివరి నుంచి మరో చివరి వరకు ఖాళీ ప్రదేశం ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. దీనిపై స్పష్టత వచ్చాక.. నిపుణుల కమిటీ సూచనల మేరకు ఇసుక, సిమెంట్ మిశ్రమాన్ని పంపించి పూడ్చివేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. తొలుత ఆ ఖాళీ ప్రదేశాన్ని గుర్తించడానికి సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్), సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్), నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)లతో జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు నిర్వహించడానికి నీటిపారుదల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
Medigadda Barrage: గత సర్కారే కారణం!
సాక్షి,హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ 2019 వరదల సమయంలోనే ప్రమాద సంకేతాలిచ్చింది. బ్యారేజీ దిగువన దెబ్బతిన్న భాగానికి మరమ్మతులు నిర్వహించాలని సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పలుమార్లు నిర్మాణ సంస్థను కోరారు. స్పందించిన నిర్మాణ సంస్థ మరమ్మతులు నిర్వహణ కోసం బ్యారేజీని ఖాళీ చేయాలని కోరింది. ఖాళీ చేయడానికి (గత)రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడంతోనే బ్యారేజీ పరిస్థితి నానాటికి క్షీణిస్తూ వచ్చింది.’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు 2019 వర్షాకాలంలో ప్రమాద సంకేతాలిచ్చినా, నిర్లక్ష్యం చేయడంతోనే వాటి పరిస్థితి రోజురోజుకు క్షీణించడంతో పాటు బ్యారేజీల్లోని స్ట్రక్చర్లకు నష్టం పెరిగిందా? అని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ అడిగిన ఓ కీలక ప్రశ్నకు నీటిపారుదల శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది.2019లో మేడిగడ్డ బ్యారేజీ ప్రమాద సంకేతాలిచ్చినా, ప్రాజెక్టు యంత్రాంగం సకాలంలో మరమ్మతులు, నిర్వహణ, పర్యవేక్షణ(ఓ అండ్ ఎం) చేపట్టకపోవడంతోనే బ్యారేజీ పియర్లు, ర్యాఫ్ట్ కుంగిపోయాయని మరో ప్రశ్నకు సమాధానమిచ్చింది. సుందిళ్ల బ్యారేజీ 2019లో ప్రమాద సంకేతాలిచ్చినా, మరమ్మతులు నిర్వహించడంతో ఆ తర్వాతికాలంలో పరిస్థితి క్షీణించలేదని వెల్లడించింది. బ్యారేజీలోని 46, 52, 50, 33 గేట్ల వద్ద సీపేజీ ఏర్పడగా, పీయూ గ్రౌంటింగ్ ద్వారా పూడ్చివేశారని, బ్యారేజీ దిగువన చెల్లాచెదురైన సీసీ బ్లాకులను మళ్లీ పూర్వ స్థితికి తెచ్చినట్టు నిపుణుల కమిటీకి తెలియజేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి, పరిష్కారాలను సూచించడానికి చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత మార్చిలో రాష్ట్రంలో రెండోసారి పర్యటించిన కమిటీ .. నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) జి.అనీల్కుమార్కి 25 ప్రశ్నలను అందించగా, ఆయన ఈ మేరకు రాతపూర్వకంగా బదులిచ్చారు.బ్యారేజీలు తాత్కాలిక నిల్వకే ! వరదల సమయంలో తాత్కాలికంగా నీళ్లను నిల్వ చేసి మళ్లించడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించినట్టు అయ్యర్ కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ తెలిపింది. గోదావరి నుంచి మళ్లించి త్కాలికంగా నిల్వ చేసిన నీళ్లను..మేడిగడ్డ బ్యారేజీ నుంచి అన్నారం బ్యారేజీకి...అక్కడి నుంచి సుందిళ్ల బ్యారేజీ.. అక్కడి నుంచి ఎల్లంపల్లి బ్యారెజీకి.. అక్కడ నుంచి మిడ్‌మానేరు జలాశయానికి తరలించి కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు సరఫరా చేయడమే బ్యారేజీల ముఖ్య ఉద్దేశమని వెల్లడించింది.కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి ముఖ్య ఉద్దేశాలను తెలపాలని కమిటీ కోరగా, ఈ మేరకు బదులిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలను నిర్మాణం పూర్తైన నాటి నుంచి గతేడాది అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ కుంగే వరకు.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిరంతరం పూర్తిగా నీటితో నింపిపెట్టారు. దీనికి విరుద్ధంగా కేవలం వరదల సమయంలో తాత్కాలికంగా నీళ్లను నిల్వ చేయడానికే బ్యారేజీలను నిర్మించినట్టు ఇప్పుడు నీటిపారుదల నిపుణుల కమిటీకి బదులివ్వడం ఆశ్చర్యకరంగా మారింది.గత ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ లోని నిలువలను ఖాళీ చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో సకాలంలో మరమ్మతులు నిర్వహించక పోయామని, బ్యారేజీ పరిస్థితి నానాటికి క్షీణించడానికి ఇదే కారణమని చంద్రశేఖర్ అయ్యర్ కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ తెలిపిన అంశాన్ని లేఖలో చూడవచ్చు -
కాళేశ్వరానికి ‘అత్యవసర’ గడువు మించిపోతోంది!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా వానాకాలానికి ముందే తీసుకోవాల్సిన నివారణ చర్యలపై సత్వరమే సిఫారసు చేయాలని చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ విజ్ఞప్తి చేసింది. వర్షాకాలం ప్రారంభానికి ముందు చేపట్టాల్సిన పనులకు చాలా తక్కువ సమయం మిగిలి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ జి.అనీల్‌కుమార్ ఇటీవల అయ్యర్ కమిటీకి లేఖ రాశారు. ఈ నెల ముగిశాక ఎప్పుడైనా వానాకాలం ప్రారంభం కావచ్చని, ఆలోగా అత్యవసర మరమ్మతులు నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ విజ్ఞప్తి మేరకు ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబందించిన ప్రాథమిక సమాచారంతోపాటు మేడిగడ్డ బ్యారేజీలోని 6, 7, 8వ బ్లాకులకు నిర్వహించిన ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ఈఆర్టీ), గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) పరీక్షల నివేదికలను సమరి్పంచామని ఈ ఖలో గుర్తుచేశారు. బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంలో లోపాలపై అధ్యయనం చేసి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఒక కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆ కమిటీ ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రంలో పర్యటించి వివరాలు సేకరించింది. కమిటీ మధ్యంతర నివేదిక కోసం గత నెల రోజులుగా నీటిపారుదల శాఖ నిరీక్షిస్తోంది. ఎన్నికల ఫలితాలొచ్చాకే మధ్యంతర నివేదిక? సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాకే అయ్యర్ కమిటీ మరమ్మతులపై మధ్యంతర నివేదిక ఇచ్చే అవకాశముందని నీటిపారుదల శాఖలో ఉన్నత స్థాయి అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఆలోగా వర్షాకాలం మొదలవుతుందని.. దీనివల్ల బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులు చేపట్టడానికి వీలుండదని ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే బ్యారేజీలకు అత్యవసరంగా గ్రౌంటింగ్ వంటి పనులను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు అయ్యర్ సిఫారసులు వచ్చాకే మరమ్మతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నీటిపారుదల శాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది. -
కాళేశ్వరంపై న్యాయ విచారణ షురూ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ న్యాయ విచారణ ప్రక్రియను ప్రారంభించారు. బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన బీఆర్కేఆర్ భవన్లో తనకు కేటాయించిన కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.నీటిపారుదల శాఖపై ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం, మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ నిర్వహించిన దర్యాప్తు నివేదిక, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ సమర్పించిన ఆడిట్ నివేదికలతో పాటు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన కీలక ఫైళ్లను జస్టిస్ చంద్రఘోష్ కు ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు అందజేసినట్టు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణంలో నిర్లక్ష్యం, అక్రమాలు, లోపాలపై న్యాయ విచారణ కోసం ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించడం తెలిసిందే. కాగా, 26 లేదా 27 తేదీల్లో బ్యారేజీల సందర్శనకు ఆయన వెళ్లే అవకాశముందని అధికారవర్గాలు వెల్లడించాయి. నేడు అధికారులతో మళ్లీ భేటీ గురువారం ఉదయం 10 గంటలకు నీటిపారుదల శాఖ అధికారులతో మరోసారి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై వివిధ సందర్భాల్లో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రత్యేక నివేదికను ప్రభుత్వం ఆయనకు అందజేయనున్నట్టు తెలిసింది. కాగా, ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంజనీర్లకు నోటీసుల జారీపై గురువారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. -
ప్రమాద సంకేతాల విస్మరణతోనే నష్టమా?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు 2019 వానాకాలం తర్వాత ప్రమాద సంకేతాలు ఇచ్చినా.. నివారణ చర్యలు తీసుకోకపోవడంతోనే నష్టాన్ని పెంచిందా? అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నీటి పారుదల శాఖను ప్రశ్నించింది. మూడు బ్యారేజీలను ప్రారంభించిన కొద్దిరోజులకే వాటి దిగువన రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్లింత్ శ్లాబు, సీసీ బ్లాకులు, టోయ్ వాల్, లాంచింగ్ అప్రాన్ వంటివి ఎందుకు కొట్టుకుపోయాయని నిలదీసింది. ఇటీవల మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన అయ్యర్ కమిటీ.. నీటి పారుదలశాఖలోని అన్ని విభాగాలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించింది. తిరిగి వెళ్లేప్పుడు ఒక ప్రశ్నావళిని అందించి, సీల్డ్ కవర్లో సమాధానాలు అందజేయాలని కోరింది. ప్రమాదం పొంచి ఉంటే ఏం చేశారు? బ్యారేజీలకు ప్రమాదాలు పొంచి ఉన్నట్టు/నష్టాలు జరిగినట్టు గుర్తించిన సమాచారాన్ని వరుస క్రమంలో తెలుపుతూ సమగ్ర నివేదిక సమర్పించాలని అయ్యర్ కమిటీ కోరింది. ‘‘ప్రమాదాలు పొంచి ఉన్నట్టు గుర్తించినప్పుడు తీసుకున్న చర్యలేమిటి? నిర్మాణ సంస్థలకు జారీచేసిన ఆదేశాలేమిటి? తక్షణమే నిర్మాణ సంస్థలు మరమ్మతులు నిర్వహించాయా? వంటి వివరాలు నివేదికలో ఉండాలి. ముందు జాగ్రత్త చర్యలేమైనా తీసుకుని ఉంటే తెలపాలి. తీసుకోకపోతే కారణాలు వెల్లడించాలి. బ్యారేజీలలో ఏదైనా అసాధారణ మార్పును గుర్తించిన సందర్భాల్లో పరికరాల డేటా నమోదు, విశ్లేషణ, అన్వయింపు(డేటా ఇంటర్‌ప్రిటేషన్), వాటి ఆధారంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసే విభాగం ఏదీ? దీనికోసం ఎలాంటి ప్రొటోకాల్స్‌ను అనుసరిస్తున్నారు?’’ అని ప్రశ్నించింది. జరిగిన తప్పులేమిటి? చేసింది ఎవరు? నీటి పారుదల శాఖలోని వివిధ విభాగాల పనితీరు, సమన్వయా న్ని అర్థం చేసుకోవడానికి శాఖ మౌలిక స్వరూపం వివరాలును అయ్యర్ కమిటీ కోరింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోటుపాట్లకు బాధ్యులను తేల్చడానికి ఈ సమాచారం కీలకమని పే ర్కొంది. శాఖలోని అన్ని విభాగాల ఈఎన్సీల నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు ఉన్న అధికారుల క్రమాన్ని తెలిపేలా శాఖ ఆర్గనైజేషన్ చార్ట్‌ను సమరి్పంచాలని కమిటీ కోరింది. ‘‘ఈఎన్సీ (జనరల్), హైడ్రాలజీ అండ్ ఇన్వెస్టిగేషన్, సీడీఓ, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్, ఓ అండ్ ఎం, ఇతర విభాగాల బాధ్యతలు, విధులు వివరించండి. బ్యారేజీల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్, రామగుండం చీఫ్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ విభాగం చీఫ్ ఇంజనీర్, ఈఎన్సీ (ఓఅండ్ఎం)లు తమపై అధికారిగా ఎవరికి రిపోర్ట్ చేస్తారు?’’ అని ప్రశ్నించింది. సీడీఓ, క్వాలిటీ సలహాలను పాటించారా? ‘‘సీడీఓ, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ విభాగాలు ఇచ్చే సలహాలు/ఆదేశాలకు ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్ విభాగం కట్టుబడి ఉంటుందా? బ్యారేజీల గేట్లను ఎత్తే సమయం (ఆపరేషన్ షెడ్యూలింగ్)ను నిర్ణయించడంలో బాధ్యులు ఎవరు? ఈ విషయంలో సీడీఓ/ తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్(టీఎస్ఈఆర్ఎల్)ల సలహాను ఏమైనా ఉల్లంఘించారా?’’ అని కమిటీ ప్రశ్నించింది. ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి సమరి్పంచడానికి ముందు దాని రూపకల్పన సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగేలా పర్యవేక్షణ చేసే విభాగం ఏది? దానికోసం నీటిపారుదల శాఖలో ఎలాంటి ప్రొటోకాల్స్ ఉన్నాయో తెలపాలని కోరింది. బ్యారేజీలు నీటి మళ్లింపు కోసమా? నిల్వ కోసమా? మూడు బ్యారేజీలను నీటి నిల్వ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్, నిర్మాణం చేశారా? లేక నీటి మళ్లింపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జరిపారా? అని అయ్యర్ కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీలను ప్రారంభించిన నాటి నుంచి నిల్వ స్థాయిలను నెలవారీగా తెలియజేసే నివేదికను సమరి్పంచాలని కోరింది. బ్యారేజీలకు తనిఖీలు, మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం ఎప్పుడైనా నిల్వలను తగ్గించారా? చేస్తే వివరాలు అందించాలని సూచించింది. బ్యారేజీల నిర్మాణ ప్రారంభం, ముగింపు తేదీలను అందించాలని.. డీపీఆర్‌ల ప్రకారం బ్యారేజీల విశిష్టతల(సేలియంట్ ఫీచర్స్)ను తెలిపాలని పేర్కొంది. నిర్మాణంలో ఈ విశిష్టతలను పాటించారా? అని ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సమరి్పంచాలని కోరింది. సీడబ్ల్యూసీ అభ్యంతరాలను పరిష్కరించారా? డీపీఆర్ మదింపు సందర్భంగా సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఏమిటి? సీఎస్ఎంఆర్ఎస్, జీఎస్ఐ, సీజీడబ్ల్యూబీ వంటి ఇతర సంస్థల కామెంట్లు/ అబ్జర్వేషన్లు ఏమిటి? వాటిని తగిన రీతిలో పరిష్కరించారా? అని అయ్యర్ కమిటీ కోరింది. నిర్మాణ దశ డిజైన్లు ఎవరివి? నిర్మాణ దశలో మూడు బ్యారేజీల డిజైన్లు, బ్యారేజీల వివిధ విభాగాల డ్రాయింగ్స్‌ను రూపొందించింది ఎవరని కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి ప్రత్యామ్నాయ ప్రాంతాల ఎంపిక కోసం జరిపిన అధ్యయనాలు, ప్రస్తుత ప్రాంతాల ఎంపికను సమర్థించే కారణాలు, బ్యా రేజీల కింద భూగర్భంలో నీటి ప్ర వాహంపై చేసిన అంచనాల వివరాలను ఇవ్వాలని కోరింది. లోపాలు బహిర్గతమైన తర్వాత బ్యారేజీలకు ని ర్వహించిన సబ్‌సర్ఫేస్ జియోలాజికల్ పరీక్షల నివేదికలు సమరి్పంచాలని సూచించింది. లోపాలు, పునరుద్ధరణ పనులపై మీ అభిప్రాయమేంటి? ‘‘మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్, పియర్లు కుంగిపోవడానికి కారణాలేమిటి? బ్యారేజీల పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి సీపేజీ జరగడానికి కారణాలేమిటి? వచ్చే వర్షాకాలంలో బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటో వివరించండి’’ అని నీటి పారుదల శాఖను అయ్యర్ కమిటీ కోరింది. ఈ ప్రశ్నావళి మేరకు తగిన సమాధానాలను సిద్ధం చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
అన్నారం డ్యామేజీలకు మేము బాధ్యులం కాదు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బ్యారేజీకి డిజైన్ లోపాలతో తీవ్ర ముప్పు పొంచి ఉందని నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్–విజేత–పీఈఎస్ జాయింట్ వెంచర్ తెలిపింది. ఎలాంటి డ్యామేజీలకైనా తాము బాధ్యులం కాదని స్పష్టం చేసింది. బ్యారేజీలో లోపాలు తెలుసుకోవడానికి పుణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్లో ఫిబ్రవరి 7న నిర్వహించిన మోడల్ స్టడీలో డిజైన్‌లో లోపాలున్నట్టుగా తేలిందని పేర్కొంది. వచ్చే వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే బ్యారేజీకి అత్యవసర రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. ఈ మేరకు గత ఫిబ్రవరి 10న నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. నీళ్లు నిల్వ ఉండేలా డిజైన్ చేయలేదు బ్యారేజీలు, డ్యామ్‌ల గేట్లు ఎత్తినప్పుడు వరద భీకర వేగంతో కిందికి దూకినట్టుగా ప్రవహిస్తుంది. ఆ వరద నేరుగా దిగువన (అప్రాన్ ఏరియా) ఉన్న కాంక్రీట్ బ్లాకులపై పడడంతో అవి కొట్టుకుపోయి భారీగా లోతైన గుంతలు పడే ప్రమాదం ఉంటుంది. దీనిని నివారించడానికే బ్యారేజీ దిగువ ప్రాంతంలో తగిన స్థాయిలో నీళ్లు నిల్వ (టెయిల్ వాటర్ లెవల్) చేస్తారు. పైనుంచి పడే వరద ఆ నీటిలో పడటం వల్ల ఉధృతి తగ్గి కాంక్రీట్ బ్లాకులకు నష్టం జరగదు. అయితే అన్నారం బ్యారేజీకి దిగువన తగిన రీతిలో నీళ్లు నిల్వ ఉండేలా డిజైన్ చేయలేదు. దీంతో గతంలో వచ్చిన వరదలతో దిగువన ఉన్న కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయి ఆ ప్రాంతంలో లోతైన గుంతలు ఏర్పడ్డాయి. నిరంతర వరదలతో బ్యారేజీ ర్యాఫ్ట్(పునాది) కింద రక్షణగా ఉండే సెకెంట్ పైల్స్ వరకు ఈ గుంతలు విస్తరించాయి. వీటివల్ల సెకెంట్ పైల్స్ దెబ్బతిని వాటికి, ర్యాఫ్ట్‌కు మధ్య అగాధం ఏర్పడి ఉండడానికి అవకాశం ఉంది. దీని వల్లనే బ్యారేజీలో బుంగలు పడి నీళ్లు లీక్ అవుతున్నాయని ఆఫ్కాన్స్–విజేత– పీఈఎస్ జాయింట్ వెంచర్ స్పష్టం చేసింది. కాగా స్టేట్ డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ చైర్మన్ ఏబీ పాండ్య, రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు మోడల్ స్టడీలో పాల్గొన్నారు. సెకనుకు 15–30 మీటర్ల వేగంతో వరద వరదలు తగ్గుముఖం పట్టాక తక్కువ మొత్తంలో నీళ్లను కిందికి విడుదల చేసేందుకు వీలుగా బ్యారేజీ గేట్లను తక్కువ ఎత్తులో పైకి లేపుతారు. అయితే బ్యారేజీ పూర్తిగా నిండి ఉండడంతో పీడనం పెరిగి వరద భీకర ఉధృతితో గేట్ల కింద నుంచి దూసుకు వస్తుంది. అన్నారం గేట్లను 10–30 సెంటిమీటర్లు మాత్రమే పైకి ఎత్తినా, సెకనుకు 15–30 మీటర్ల భీకర వేగంతో వరద బయటికి వస్తోందని మోడల్ స్టడీలో తేలింది. ఈ నేపథ్యంలోనే బ్యారేజీ రక్షణకు ల్యాబ్ సూచనల మేరకు అత్యవసర చర్యలు తీసుకోవాలని నిర్మాణ సంస్థ లేఖలో కోరింది. మూడేళ్ల కిందే ముగిసిన డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అన్నారం బ్యారేజీ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2021 డిసెంబర్ 17లోనే ముగిసింది. నాటి నుంచి మూడేళ్ల పాటు కేవలం బ్యారేజీ నిర్వహణ కోసం రూ.6.42 కోట్ల అంచనాలతో అఫ్కాన్స్ –విజేత–పీఈఎస్ జేవీతో నీటిపారుదల శాఖ ‘ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్’ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం కూడా ఈ ఏడాది డిసెంబర్ 16తో ముగియనుంది. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌లో బ్యారేజీకి జరిగే నష్టాలకు నిర్మాణ సంస్థే పూర్తి బాధ్యత తీసుకుని పునరుద్ధరిస్తుంది. -
నాటి సీఎం స్థాయిలోనే నిర్ణయాలు!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై 2016లో నిర్వహించిన సమావేశాల్లో నాటి ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేత్వంలోని నిపుణుల కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ నివేదించింది. ఆ నిర్ణయాలకు అనుగుణంగానే సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను రూపొందించి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం కోసం పంపించామని తెలిపింది. అయితే ఆమోదం లభించకముందే నిర్మాణ పనులు ప్రారంభించామని వివరించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల డిజైన్, నిర్మాణాలపై అధ్యయనం కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇటీవల చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రెండో విడత రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆ కమిటీ.. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, మాజీ అధికారులతో సుదీర్ఘంగా సమావేశమైంది. నీటి పారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) అనిల్‌కుమార్, ఈఎన్సీ (ఓ అండ్ ఎం) బి.నాగేందర్రావు, మాజీ ఈఎన్సీలు సి.మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు తదితరులు ఈ సమావేశంలో పాల్గొని వివరాలు అందించారు. ‘నీటిపారుదల శాఖలో జనరల్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్, హైడ్రాలజీ విభాగాల పనితీరు, బాధ్యతలు ఏమిటి? ప్రభుత్వం–నీటిపారుదలశాఖకు మధ్య ఫైళ్ల రాకపోకలు ఎలా సాగుతాయి?’వంటి అంశాలను నిపుణుల కమిటీ అడిగి తెలుసుకుంది. నాణ్యత పర్యవేక్షణ ఎలా? ‘కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి మూడేళ్ల గడువు ఉండగా.. రెండేళ్లలో ఎందుకు పూర్తి చేశారు? అంత వేగంతో పనులు చేస్తే నాణ్యతను ఎలా పర్యవేక్షించారు? బ్యారేజీల పునాదులు (ర్యాఫ్ట్)కు రక్షణగా తొలుత షీట్ పైల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. తర్వాత సెకెంట్ పైల్స్‌కు ఎందుకు మారారు? ఈ డిజైన్ మార్పులకు అప్రూవల్స్ తీసుకున్నారా?’అని బ్యారేజీ నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లను అయ్యర్ కమిటీ ప్రశ్నించింది. ఎక్కడో తప్పిదం జరిగింది: మాజీ ఈఎన్సీ మురళీధర్ మేడిగడ్డ బ్యారేజీ పునాదుల(ర్యాఫ్ట్)కు దిగువన ఏర్పాటు చేసిన సెకెంట్ పైల్స్ (నిలువు స్తంభాలు) దిగువ నుంచి, లేదా వాటి మధ్య నుంచి ఇసుక కొట్టుకుపోవడంతోనే బ్యారేజీ కుంగిందని భావిస్తున్నానని అయ్యర్ కమిటీకి మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్ వివరించారు. కావాలని ఎవరూ అలా చేయలేదని, అనుకోని రీతిలో ఎక్కడో తప్పిదం జరిగి ఉండవచ్చని కూడా ఆయన పేర్కొన్నట్టు సమాచారం. రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుతో నిపుణుల కమిటీ విడిగా సమావేశమై బ్యారేజీల నిర్మాణంలో ఆయన అనుసరించిన విధానాన్ని అడిగి తెలుసుకుంది. తప్పులు ఎక్కడ జరిగి ఉంటాయి.. చెప్పండి! ‘బ్యారేజీల నిర్మాణంలో ఎక్కడ తప్పులు జరిగి ఉంటాయి? మీ అభిప్రాయం ఏమిటి?’అని నీటి పారుదల శాఖలోని వివిధ విభాగాల ఇంజనీర్లను అయ్యర్ కమిటీ ప్రశ్నించింది. ‘బ్యారేజీల గేట్లను ఎవరు ఆపరేట్ చేశారు? ఈఎన్సీల నుంచి ఏఈ వరకు వివిధ స్థాయిల్లోని ఇంజనీర్ల జాబ్ చార్ట్ ఏమిటి? నీటిపారుదల శాఖ హైపవర్ కమిటీ నిర్ణయాలు ఎలా తీసుకుంటుంది? డిజైన్లను ఎవరు సిఫారసు చేస్తారు? ఎవరు ఆమోదిస్తారు? బ్యారేజీల నిర్మాణానికి ముందు ఇన్వెస్టిగేషన్ జరిపిన వ్యాప్కోస్ వద్ద ఉన్న సాంకేతికత ఏమిటి? మోడల్ స్టడీస్ చేశారా? క్వాలిటీ కంట్రోల్ ఈఎన్సీ(ఓఅండ్ ఎం) పరిధిలోకి వస్తుందా? లేక ఈఎన్సీ (జనరల్) పరిధిలోకి వస్తుందా?’వంటి అంశాలనూ ఆరా తీసింది. బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి ప్రతి అంశంపై ప్రశ్నలు సంధించి ఎక్కడ లోపాలు జరిగి ఉంటాయనేది గుర్తించేందుకు ప్రయత్నించింది. ఈ పర్యటనలో భాగంగా గురు, శుక్రవారాల్లో సైతం నిపుణుల కమిటీ నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశం కానుంది. అత్యవసర మరమ్మతులపై ఇప్పుడే చెప్పలేం.. బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులను సూచించాలని ఈఎన్సీ(జనరల్) అనిల్‌కుమార్ విజ్ఞప్తి చేయగా.. ఈ అంశంపై సిఫారసులతో మధ్యంతర నివేదిక ఇవ్వడంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశారు. బ్యారేజీలపై అధ్యయనం జరిపి, లోపాలను తెలుసుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. -
20 రకాల సమాచారం ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తమకు అందజేయాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరింది. మొత్తం 20 రకాల సమాచారం కావాలని అడిగింది. మూడు బ్యారేజీల డిజైన్లు, వాటి నిర్మాణంపై అధ్యయనం జరిపి లోపాలను గుర్తించి పరిష్కారాలను సిఫారసు చేయడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డతో పాటు అన్నారం బ్యారేజీలను సందర్శించి పరీశీలన జరిపింది. గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ కుంగిపోవడంతో అప్పట్లో ఎన్డీఎస్ఏ నియమించిన మరో నిపుణుల కమిటీ, ఆ బ్లాక్‌కి సంబంధించిన 20 రకాల సమాచారాన్ని సమర్పించాలని అప్పట్లో రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరింది. తాజాగా చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ కూడా మూడు బ్యారేజీల్లోని అన్ని బ్లాకులకు సంబంధించిన అదే విధమైన 20 రకాల సమాచారాన్ని తమకు అందజేయాలని విజ్ఞప్తి చేసింది. పగుళ్లు, పునాది పరిశీలన అయ్యర్ నేతృత్వంలో సైంటిస్టులు యూసీ విద్యార్థి, ఆర్.పాటిల్, డైరెక్టర్లు శివకుమార్‌శర్మ, రాహుల్‌కుమార్, అమితాబ్ మీనాలతో కూడిన బృందం మేడిగడ్డను తనిఖీ చేసింది. బ్యారేజీ అప్ స్ట్రీమ్‌లోకి దిగి 6, 7, 8 బ్లాక్‌లను నిశితంగా పరిశీలించింది. డౌన్ స్ట్రీమ్‌లోకి కూడా కాలినడకన వెళ్లి బ్యారేజీ కుంగిన తీరు, పగుళ్లు, పునాది ఎలా ఉందీ చూసింది. కుంగినప్పటి నుంచి ఎలాంటి పరీక్షలు జరిపారు, ఇప్పటివరకు చేపట్టిన చర్యలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి సాయత్రం 6.30 గంటల వరకు జరిగిన తనిఖీల్లో సీఈ సుధాకర్‌రెడ్డి, ఇతర ఇంజినీర్లు, ఎల్అండ్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే మీడియా ప్రతినిధులను బ్యారేజీ లోపలికి అనుమతించ లేదు. కాగా నేడు సుందిళ్ల బ్యారేజీని కమిటీ సందర్శించనుంది. ఎట్టకేలకు ‘జియో’ సెక్షనల్ డ్రాయింగ్స్ మేడిగడ్డ బ్యారేజీ కింద భూగర్భంలో రాతి పొరల నిర్మాణ క్రమాన్ని తెలియజేసే ‘జియోలాజికల్ సెక్షన్’ డేటాను, ప్రత్యేకించి బ్యారేజీకి సంబంధించిన ఒక్కో విభాగానికి సంబంధించిన ‘సెక్షనల్ డ్రాయింగ్స్’ను వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించడంపై గతంలో ఎన్డీఎస్ఏ తీవ్ర అభ్యంతరం తెలిపింది. లోతైన పరిశీలన కోసం జియోలాజికల్ వివరాలతో కూడిన బ్యారేజీ విభాగాల డ్రాయింగ్స్ (సెక్షనల్ డ్రాయింగ్స్)ను సమర్పించాలని కోరింది. అయితే ఇలాంటి డ్రాయింగ్స్‌ను తయారు చేయకుండానే బ్యారేజీని నిర్మించడంతో అప్పట్లో అధికారులు వాటిని సమర్పించలేకపోయారు. కానీ ఎన్డీఎస్ఏ పదేపదే కోరుతుండడంతో ఇటీవల జియోలాజికల్ వివరాలతో కూడిన సెక్షనల్ డ్రాయింగ్స్‌ను రూపొందించి ఎన్డీఎస్ఏకు నీటిపారుదల శాఖ పంపించింది. -
మేడిగడ్డ ఇంజనీర్లపై త్వరలో వేటు
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని ధ్రువీకరిస్తూ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి తప్పుడు మార్గంలో వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ), సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ)లపై చర్యలకు నీటిపారుదల శాఖ సిద్ధమైంది. తొలుత షోకాజ్ నోటీసులు జారీ చేసి సంజాయిషీ కోరాలని, ఆ తర్వాత సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయం తీసుకుంది. ఒప్పందంలోని నిబంధనల మేరకు నాణ్యత, రక్షణా ప్రమాణాలు పాటిస్తూ బ్యారేజీ నిర్మాణ పనులను పూర్తి చేసినట్లు ధ్రువీకరిస్తూ 2019 సెప్టెంబర్ 10న మహదేవపూర్ డివిజన్–1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు ఎల్ అండ్ టీకి ‘సబ్‌స్టాన్షియల్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికెట్’ను జారీచేశారు. దానిపై నాటి సూపరింటెండింగ్ ఇంజనీర్, ప్రస్తుత మహబూబ్‌నగర్ జిల్లా చీఫ్ ఇంజనీర్ రమణారెడ్డి కౌంటర్ సంతకం చేశారు. నిర్మాణ సంస్థ విజ్ఞప్తి మేరకు 2021 మార్చి 15న పనులు పూర్తయినట్లు ధ్రువీకరిస్తూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు మళ్లీ సర్టిఫికెట్ జారీ చేశారు. మరోవైపు ఒప్పందం గడువును 2022 మార్చి 31 వరకు పొడగిస్తూ ఈఎన్సీ ఆరోసారి పొడిగింపు ఉత్తర్వులు జారీచేశారు. పలు అంశాల్లో నిబంధనలకు అనుగుణంగా పనులు చేయనందుకుగాను నిర్మాణ సంస్థకు జారీ చేసిన నోటిసులను పట్టించుకోకుండా రూ. 159.72 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌ను సైతం విడుదల చేశారు. 2020 ఫిబ్రవరి 29 నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ వర్తిస్తుందని నాటి ఈఎన్సీ రామగుండం నల్లా వెంకటేశ్వర్లు జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా సెక్యూరిటీ డిపాజిట్‌ను ని ర్మాణ సంస్థకు తిరిగి ఇచ్చేశారు. విజిలెన్స్ దర్యాప్తు ఆధారంగా నాటి ఈఎన్సీ సి.మురళీధర్, రా మగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ను ప్రభు త్వం తొలగించడం తెలిసిందే. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ వెనక మతలబు ఉందని విజిలెన్స్ విభాగం తేల్చినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఈ సర్టిఫికెట్లను ఆధారంగా చూపి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసిందంటూ మేడిగడ్డ పునరుద్ధరణను సొంత ఖర్చులతో చేపట్టేందుకు ఎల్ అండ్ టీ నిరాకరిస్తోంది. ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్‌కు తుది బిల్లు జారీ కాకపోయినా ఈ సర్టిఫికెట్లను జారీ చేసినట్లు ఆరోపణలు రావడం నీటిపారుదల శాఖకు అప్రతిష్టగా మారింది. ఇద్దరు అధికారులు చేసిన తప్పులకు మొత్తం శాఖ బద్నాం అయిందని, వారిపై చర్య లు తీసు కోవాల్సిందేనని ఉన్నతస్థాయి అధికార వర్గాలు ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. -
ఎల్ అండ్ టీ ససేమిరా!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణాలు తెలుసుకునేందుకు నిర్వహించిన ఎలక్ట్రో రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ఈఆర్టీ) పరీక్షల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ చేస్తున్న విజ్ఞప్తులను నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’బేఖాతరు చేస్తోంది. నివేదికను అధికారికంగా సమర్పించేందుకు నిరాకరిస్తోంది. గత రెండు వారాలుగా నీటిపారుదల ఇంజనీర్లు చేస్తున్న విజ్ఞప్తులను ఎల్ అండ్ టీ పట్టించుకోవడం లేదని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. కాగా ఈఆర్టీ నివేదికను తక్షణమే ప్రభుత్వానికి సమర్పించాలని ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా నీటిపారుదల శాఖను ఆదేశించింది. దీనిపై త్వరలోనే మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎల్ అండ్ టీ ప్రతినిధులను పిలిపించి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. నెలరోజుల విశ్లేషణతో నివేదిక సిద్ధం! గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన 7వ బ్లాక్ కుంగిపోయిన విషయం తెలిసిందే. కాగా నిపుణులు బ్యారేజీని పరిశీలించి కుంగిపోవడానికి కారణమైన సాంకేతిక లోపాలను గుర్తించడానికి ఈఆర్టీ, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) వంటి జియోఫిజికల్, జియోలాజికల్ పరీక్షలు నిర్వహించాలని సిఫారసు చేశారు. ఈ పరీక్షల ద్వారా లోపాలు, అలాగే బ్యారేజీలోని అన్ని విభాగాల పటిష్టతను పరిశీలించిన తర్వాతే మరమ్మతులు, పునరుద్ధరణ, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో నవీ ముంబైకి చెందిన ‘డైనసోర్ కాంక్రీట్ ట్రీట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’అనే సంస్థ ఆధ్వర్యంలో 7వ బ్లాక్ ర్యాఫ్ట్ (పునాది)తో పాటు దాని దిగువన ఉన్న సెకెంట్ పైల్స్ (పునాది కింద స్తంభాలు) స్థితిగతులను తెలుసుకోవడానికి జనవరి 4 నుంచి 9 వరకు ఈఆర్టీ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా వచ్చిన సమాచారాన్ని దాదాపు నెల రోజుల పాటు విశ్లేషించి గత నెల రెండో వారం నాటికి నివేదికను సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈఆర్టీ టెస్ట్ అంటే భూగర్భంలోని కాంక్రీట్ నిర్మాణాలను ‘ఎక్స్‌రే’తీసి ఆ చిత్రాలను విశ్లేషించడమేనని నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. కొంప ముంచిన సెకెంట్ పైల్స్ లోపాలు? వాస్తవానికి శాఖలోని కొందరు కీలక అధికారులకు అనధికారికంగా ముసాయిదా ఈఆర్టీ నివేదిక అందింది. నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ అధికారికంగా ఇవ్వనందున రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించలేదని సమాచారం. కాగా నిర్మాణ లోపంతో సెకెంట్ పైల్స్ మధ్య ఏర్పడిన ఖాళీలతోనే బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి భారీ బుంగ ఏర్పడి 7వ బ్లాక్ కుంగినట్టుగా నిర్థారణకు వచ్చారనే చర్చ జరుగుతోంది. భూగర్భంలో సెకెంట్ పైల్స్‌ను నిటారుగా ఏర్పాటు చేయాల్సి ఉండగా, వక్రంగా పాతిపెట్టడంతో వాటి జాయింట్ల వద్ద ఖాళీలు ఏర్పడినట్లు కొందరు అధికారులు తెలిపారు. ఇతర బ్లాకులకు ఆగిన టెస్టులు మేడిగడ్డ బ్యారేజీకి ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని దారి మళ్లించడం కోసం కాఫర్ డ్యామ్ నిర్మిస్తున్నారు. దీని ద్వారా బ్యారేజీలోని 6, 7, 8 బ్లాకులకు వరద ప్రవాహం చేరకుండా ఏర్పాట్లు చేశారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం కొలిక్కి వచ్చాక బ్యారేజీలోని 1–8 బ్లాకులకు ఈఆర్టీ, జీపీఆర్ టెస్టులు నిర్వహించేందుకు ఎల్ అండ్ టీ కసరత్తు చేసింది. జీపీఆర్ టెస్ట్‌ల నిర్వహణను న్యూఢిల్లీలోని పార్సన్ ఓవర్సీస్కు అప్పగించింది. అయితే ఎగువన ఉన్న అన్నారం బ్యారేజీకి మళ్లీ బుంగలు ఏర్పడడంతో బ్యారేజీని ఖాళీ చేసేందుకు కిందికి నీటిని విడుదల చేశారు. 20 వేల క్యూసెక్కుల వరద రావడంతో మేడిగడ్డ కాఫర్ డ్యామ్‌తో పాటు 6, 7, 8 బ్లాకుల పునాదుల వద్దకు భారీగా నీళ్లు వచ్చి చేరాయి. తమకు చెప్పకుండా వరదను విడుదల చేయడంతో 15 రోజుల పాటు చేసిన పనులు వృధా అయ్యాయని ఎల్ అండ్ టీ ఆరోపించింది. టెస్టులను ప్రస్తుతానికి నిలిపి వేశామని, దీనికి తాము బాధ్యులం కామని పేర్కొంటూ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. మరోవైపు తాము సొంత డబ్బులతో ఎలాంటి పనులూ చేపట్టబోమని సంస్థ పలు లేఖల ద్వారా స్పష్టం చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ఒప్పందం చేసుకోవాలని అంటోంది. అలాగే బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ పనులు పూర్తయ్యాయని ధ్రువీకరిస్తూ సర్టీఫికెట్ జారీ చేయాలని, చివరి బిల్లుతో పాటు డిపాజిట్లు కలిపి మొత్తం రూ.456.07 కోట్లు విడుదల చేయాలని కూడా కోరుతూ మరో లేఖ రాసింది. -
వరదలతో బ్యారేజీలకు ముప్పు!
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం: వచ్చే వానాకాలంలో గోదావరికి వచ్చే వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు మరింత నష్టం వాటిల్లకుండా పరిరక్షించడంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ దృష్టిసారించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ చట్టం కింద ఏర్పాటైన ‘డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్’మంగళవారం రెండు బ్యారేజీలను సందర్శించింది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ(అడ్మిన్) అనిల్ కుమార్ నేతృత్వంలో డిజైన్ ఎక్స్పర్ట్ టి.రాజశేఖర్, సీఈ సీడీఓ, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ) ఇంజనీర్ల బృందం రెండు బ్యారేజీలను పరిశీలించిన అనంతరం సత్వరంగా తీసుకోవాల్సి న నష్టనివారణ చర్యలపై చర్చించింది. గోదావరిలో మళ్లీ 20 లక్షల క్యూసెక్కులకు పైగా వరద పోటెత్తితే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందనే అనుమానాలు ఉండటంతో ఈ బృందం అక్కడ పర్యటించింది. నష్టనివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచనుంది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవ కాశం ఉంది. అన్నారం బ్యారేజీకి శాశ్వత మరమ్మతులు నిర్వహించిన తర్వాతే నీళ్లు నింపాలని గతంలోనే ఎన్డీఎస్ఏ సూచించింది. మరమ్మతులు జరిగే వరకు బ్యారేజీలో నీళ్లు నిల్వ చేసే అవకాశం లేదు. మళ్లీ అన్నారం బ్యారేజీకి ఎన్డీఎస్ఏ ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకు కుంగిపోగా, మళ్లీ భారీ వరదలొస్తే ఇతర బ్లాకులు సైతం ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉన్నట్టు నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు నెలల్లో అన్నారం బ్యారేజీకి రెండు పర్యాయాలు బుంగలు ఏర్పడి పెద్ద మొత్తంలో నీళ్లు లీకయ్యాయి. అన్నారంబ్యారేజీ పునాదుల (రాఫ్ట్) కింద నిర్మించిన కటాఫ్ వాల్స్కి పగుళ్లు వచ్చి ఉంటాయనడంలో అనుమానాలు లేవని.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ గత అక్టోబర్‌లో బ్యారేజీని పరిశీలించిన అనంతరం తన నివేదికలో చెప్పింది. బ్యారేజీకి నిర్దిష్టంగా లీకేజీలు పునరావృతం కావడాన్ని చూస్తే ఎగువ, దిగువ కటాఫ్ వాల్స్‌లో ఏదో ఒకదానికి లేదా రెండింటికీ పగుళ్లు వచ్చి ఉంటాయని స్పష్టం చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ దక్షిణాది ప్రాంతీయ డైరెక్టర్ ఆర్.తంగమణి, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హైదరాబాద్ డైరెక్టర్లు ఎం.రమేశ్‌కుమార్, పి.దేవేందర్ రావు కమిటీ అప్పట్లో ఈ నివేదిక ఇచ్చింది. గత శుక్రవారం అన్నారం బ్యారేజీకి మళ్లీ బుంగలు పడటంతో ఎన్డీఎస్ఏ సూచన మేరకు బ్యారేజీని పూర్తిగా ఖాళీ చేశారు. ఈ వారం చివరిలోగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ బృందం రెండోసారి అన్నారం పరిశీలనకు రానుంది. కటాఫ్వాల్స్కి లేదా కటాఫ్‌వాల్స్–ర్యాఫ్ట్ మధ్య పగుళ్లు ఎక్కడ వచ్చాయో నిర్ధారించడానికి గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్స్(జీపీఆర్) వంటి సాంకేతిక పద్ధతులను వినియోగించాలని గతంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ సిఫారసు చేయగా, ఇప్పటివరకు అలాంటి చర్యలేమీ తీసుకోలేదు. -
ఇంత అవినీతి ఎక్కడా లేదు
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి స్వాతంత్య్ర భారత చరిత్రలో మరెక్కడా జరిగి ఉండదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి దేశ సాగునీటి రంగంలో మరెక్కడా జరగకూడదని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బ్యారేజీని రూ.1,800 కోట్ల అంచనాతో ప్రారంభించి ఏటా రూ.వెయ్యి కోట్లు చొప్పున పెంచుతూపోయి... చివరికి రూ.4,500 కోట్లకు చేర్చారని చెప్పారు. వందేళ్లు నిలవాల్సిన బ్యారేజీ.. అవినీతి, లోపభూయిష్టమైన డిజైన్లు, నిర్వహణ–పర్యవేక్షణ లోపాలతో మూడేళ్లకే కుంగిపోయిందని ఆరోపించారు. అధికారం అప్పజెప్తే మరమ్మతులు చేయిస్తామనే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని మండిపడ్డారు. ఉత్తమ్ శనివారం రాష్ట్ర సాగునీటి రంగంపై శాసనసభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ), విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఇచ్చిన నివేదికలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ సమర్పించిన ఆడిట్ నివేదికలోని ముఖ్యాంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పలువురు సభ్యులు వ్యక్తం చేసిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. సభలో ఉత్తమ్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘మేడిగడ్డ బ్యారేజీ గత ఏడాది అక్టోబర్ 21న కుంగిపోతే డిసెంబర్ 7 వరకు కూడా నాటి సీఎం కేసీఆర్ ఒక్కమాట మాట్లాడలేదు. బ్యారేజీ నిర్మాణానికి పెద్ద మనుషులు వాళ్లే.. చీఫ్ ఇంజనీర్లు వాళ్లే.. చీఫ్ డిజైనర్లు వాళ్లే. ప్రస్తుత పరిస్థితిలో మేడిగడ్డ బ్యారేజీ నిరుపయోగమని (యూజ్లెస్) ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. మేడిగడ్డ తరహా డిజైన్లతోనే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా నిర్మించారని.. వాటిలో కూడా నీళ్లు నింపవద్దని ఎన్డీఎస్ఏ సూచించింది. అన్నారం బ్యారేజీలో బుంగ ఏర్పడి శుక్రవారం నుంచి పెద్ద ఎత్తున నీళ్లు లీక్ అవుతున్నాయి. దీన్ని పరిశీలించేందుకు ఎన్డీఎస్ఏ నిపుణులను రమ్మని కబురు పంపాం. రెండు రోజుల్లో వస్తామన్నారు. సత్వరమే బ్యారేజీలోని నీటిని ఖాళీ చేయాలని సూచించారు. ఈ బ్యారేజీలను కట్టినవారు సిగ్గుతో తలవంచుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. కాగ్ నివేదికలో దిగ్భ్రాంతికర విషయాలు కాళేశ్వరంపై కాగ్ ఇచ్చిన నివేదికలో యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే అంశాలున్నాయి. మా ప్రభుత్వం ఎన్డీఎస్ఏ, కాగ్, విజిలెన్స్ నివేదికల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటుంది. రూ.35,800 కోట్ల అంచనాతో 16.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరిచ్చే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి గత ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1.47 లక్షల కోట్లకు చేరిందని కాగ్ తప్పుబట్టింది. ఆ ప్రాజెక్టు డీపీఆర్‌కు సీడబ్ల్యూసీ అనుమతివ్వడానికి ముందే కాంట్రాక్టర్లకు తొందరపడి పనులు అప్పగించారని ఆక్షేపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండగా మారుతుందని చెప్పింది. తెలంగాణ మొత్తం రాష్ట్ర రోజువారీ విద్యుత్ వినియోగం 196 మిలియన్ యూనిట్లుకాగా.. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని పంపులను నడిపితే రోజుకు గరిష్టంగా 203 మిలియన్ యూనిట్ల విద్యుత్ కావాల్సి ఉంటుందని తేలి్చంది. మల్లన్నసాగర్ బ్యారేజీ కింద భూగర్భంలో చీలిక ఉందని, చిన్న భూకంపం వచ్చినా బ్యారేజీ దిగువన ఉండే ప్రజలకు ప్రమాదకరమని హెచ్చరించింది. కాళేశ్వరం అప్పులు చెల్లించడానికి రూ.15వేల కోట్లు, కరెంట్ బిల్లులకు రూ.10వేల కోట్లు కలిపి ఏటా రూ.25 వేల కోట్లను ఈ ప్రాజెక్టు కోసమే కేటాయించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి శాపంగా, గుదిబండగా మారింది. బ్యారేజీలను పునరుద్ధరిస్తాం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు జరిగిన నష్టం చాలా తీవ్రమైనది. మా ప్రభుత్వం తాత్కాలిక చర్యలతో సరిపెట్టబోదు. వాటిలోని లోపాలను గుర్తించి, మరమ్మతుల కోసం తీసుకోవాల్సిన చర్యలను సూచించే బాధ్యతను ఎన్డీఎన్ఏకు అప్పగించాం. ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చాకే మరమ్మతులపై ముందుకు వెళ్తాం. బ్యారేజీలను పునరుద్ధరించి రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటాం. కాంగ్రెస్‌కు మంచిపేరు రావొద్దనే రీఇంజనీరింగ్.. కాంగ్రెస్ పార్టీకి మంచిపేరు రావొద్దని, తమ సొంత ముద్ర ఉండాలనే ఉద్దేశంతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల, పాలమూరు–రంగారెడ్డి, రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రీఇంజనీరింగ్ చేసింది. వాటి అంచనా వ్యయాన్ని అనేక రెట్లు పెంచింది. కాళేశ్వరం నిర్మించాలనేది తప్పుడు నిర్ణయం. ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు రూ.41వేల కోట్లతో పూర్తయ్యేది. పైగా ఆ డ్యామ్ కూలింది.. ఈ డ్యామ్ కూలిందంటూ మేడిగడ్డ కుంగిపోవడాన్ని బీఆర్ఎస్ నేతలు సమర్థించుకుంటున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించే ప్రసక్తే లేదు. నీటిపారుదల ప్రాజెక్టులపై ఎలా ముందుకు సాగాలన్న అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, చర్చించి ముందుకు సాగుతాం. ఫాస్ట్‌ట్రాక్ కింద కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కొడంగల్–నారాయణపేట, చిన్న కాళేశ్వరం, ఎస్ఎల్బీసీ, డిండి, ఎల్లంపల్లి, ఇందిరమ్మ వరద కాల్వ, మిడ్‌మానేరు, కొమురంభీం, దేవాదుల ప్రాజెక్టులను పూర్తిచేసి ఏడాదిలోగా 7లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. రాయలసీమ లిఫ్టుకు కేసీఆర్ సహకారం ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించుకోవడానికి నాటి సీఎం కేసీఆర్ సహకరించారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. కేసీఆర్, ఏపీ సీఎం జగన్ అనేక సందర్భాల్లో కలిసి నీటివాటాల గురించి చర్చించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు జరుగుతున్న సమయంలో కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశం తలపెడితే.. వాయిదా వేయాలని కేసీఆర్ కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేవలం అర గంట జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని కేంద్రానికి ఫిర్యాదు చేస్తే రాయలసీమ లిఫ్టు టెండర్లు ఆగిపోయేవి. కానీ ఆ టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాకే కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు..’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. -
హరీష్ రావు Vs మంత్రులు.. దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నీటిపారుదల రంగంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ క్రమంలో ఇరిగేషన్ శాఖపై అధికార కాంగ్రెస్ నేతలు వర్సెస్ మాజీ మంత్రి హరీష్‌రావు అన్నట్టుగా వాడీవేడి చర్చ నడుస్తోంది. మంత్రులు, హరీష్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సభలో మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..‘ఇంజనీరింగ్ అధికారులు చెప్పడం వల్లే రీడిజైన్ చేశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భూగర్భ జలాలు పెరిగాయి. ప్రాణహితకు జాతీయహోదా ఇవ్వాలని కేంద్రానికి కేసీఆర్ లేఖ రాశారు. బీఆర్ఎస్ హయాంలోనే వలసలు తగ్గాయి. ఎస్ఆర్ఎస్పీ-2కు నీళ్లిచ్చిన ఘనత మాది. కేసీఆర్ వచ్చాకే రెండు పంటలకు నీరిచ్చాం. కాంగ్రెస్ పాలనలో నీరు రాలేదు ఎందుకు.. కేసీఆర్ వచ్చాకే ఎలా నీళ్లు వచ్చాయి. ►బీఆర్ఎస్ హయాంలోనే వలసలు తగ్గాయి. అవినీతి ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని కవులు, కళాకారులు గొంతెత్తి పాడారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలసలు వస్తున్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రతీసారి అబద్ధాలే చెబుతున్నారు. గోబెల్స్ అవార్డు ఉత్తమ్‌కే ఇవ్వాలి. ►30 ఏళ్ల తర్వాత నాగార్జునసాగర్ కింద పూర్తిస్థాయిలో ఆయకట్టు వచ్చింది. కల్వకుర్తి ప్రాజెక్ట్ కట్టడానికి 30 ఏళ్లు పట్టింది. కాగ్ రిపోర్టుపై కాంగ్రెస్‌ది సెల్ఫ్‌గోల్. కాగ్ నివేదికకు ప్రమాణికం లేదని గతంలో కాంగ్రెస్ చెప్పింది. కాగ్ రిపోర్ట్‌ను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు తప్పుపట్టాయి. కాగ్ నివేదిక తప్పులతడక అని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. కాగ్ నివేదికల్లో ప్రమాణికం లేదని గతంలో కాంగ్రెస్ చెప్పింది. ►రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో నాలుగు అంశాలు అబద్ధాలే. గత ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఈ నివేదిక తీసుకొచ్చారు. ఇందులో అబద్ధాలు ఉన్నాయని నేను రుజువు చేస్తాను. మిడ్‌మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు. అయితే, 2014 నాటికి నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మిడ్‌మానేరు ప్రాజెక్టుకు సంబంధించి రూ.106 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రూ.775 కోట్లు ఖర్చు చేసి మూడేళ్ల తర్వాత ప్రాజెక్టును పూర్తి చేశాం. ►ఖర్చులు వర్సెస్ ఆయకట్టు విషయంలో శ్వేతపత్రంలో రెండు చోట్ల వేర్వేరుగా ప్రస్తావించారు. 2014కు 57.79 లక్షల ఎకరాలకు నీరిస్తే.. రూ. 54,234 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఇదే నివేదికలో మరో చోట 1956-2014 మధ్య కాలంలో ఉమ్మడి ఏపీలోని తెలంగాణలో రూ.54,234 కోట్లు ఖర్చు పెట్టి 41.76 లక్షల ఎకరాలను నీరిచ్చాం అని చెప్పారు. ఒకే అంశంపై భిన్నమైన సమాచారాన్ని నివేదికలో పొందుపర్చారు. ఖర్చులో ఎలాంటి మార్పు లేదు. నీరందించిన ఆయకట్టు విస్తీర్ణంలో మాత్రం తేడా ఉంది. ►రాయలసీమ ఎత్తిపోతలపై మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు అప్పటి ప్రభుత్వం (బీఆర్ఎస్) కేంద్రానికి ఫిర్యాదు చేయలేదని అన్నారు. ఈ అంశానికి సంబంధించి గతంలోనే పూర్తి ఆధారాలతో సహా నేను పూర్తి వివరణ ఇచ్చాను. అయినా సరే మళ్లీ అబద్ధాలు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు జీవో వచ్చింది 5/5/2020లో ఈ జీవో రాకముందే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం. మే 5న జీవో వస్తే వారం రోజుల వ్యవధిలోనే మరోసారి కేంద్రానికి, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశాం. ఆ లెటర్లు కావాలంటే సభలో ప్రవేశపెడతాం. మేం అసలు ఫిర్యాదే చేయలేదనే అబద్ధాలను పదేపదే చెబుతున్నారు. ఇది పద్ధతి కాదు అంటూ కామెంట్స్ చేశారు. -
‘రాష్ట్రానికి అవసరమయ్యే కరెంట్.. ఒక్కరోజే కాళేశ్వరానికి..’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై వాడీవేడి చర్చ నడుస్తోంది. ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా గత బీఆర్ఎస్ సర్కార్ పాలన, నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి ఉత్తమ్ కుమార్ సభలో నీటి పారుదల శాఖపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో విస్తరుపోయే విషయాలను కాగ్ చెప్పింది. కాగ్ సూచించిన అంశాలపై ఖచ్చితంగా విచారణ చేస్తాం. గతంలో జరిగిన వేల కోట్ల పనులను పక్కన పెట్టి రీ-డిజైన్ పేరుతో ప్రాజెక్ట్‌లను కొనసాగించారు. 81వేల కోట్ల ప్రాజెక్టుకు CWC అనుమతి ఇస్తే ఒక లక్ష 47వేల కోట్ల అంచనాలకు పెంచారు. 2014 వరకు నీటి పారుదల సామర్థ్యం 57.79 లక్షల ఎకరాలు. మొత్తం ఖర్చు 54,234కోట్లు. 2014 వరకు ఒక్కో ఎకరానికి 93 వేల కోట్ల ఖర్చు. 2014-23 వరకు ఇరిగేషన్ ఖర్చు 1.81లక్షల కోట్లు. కొత్త ఆయకట్టు 15.81లక్షల ఎకరాలు. ఒక్కో ఎకరం ఖర్చు 14.45లక్షలు. పీక్ ఎనర్జీ డిమాండ్ ఉన్న రోజు 203 మిలియన్ యూనిట్లు విద్యుత్ అవసరం. ►కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం పరిస్థితి చుస్తే ఖర్చు రెండు లక్షలకు పోయే ప్రమాదం ఉంది. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అవసరమయ్యే కరెంట్.. ఒక్క కాలేశ్వరం ప్రాజెక్టుకు ఒక్కరోజుకే అవసరమవుతుంది. ఏడాదికి పదివేల ఐదు వందల కోట్లు కరెంట్ బిల్లులు కాళేశ్వరానికి అవసరం అవుతుంది. ►మల్లన్న సాగర్ విషయంలో గత ప్రభుత్వం గొప్పలు చెప్పింది. మల్లన్న సాగర్ కూడా ప్రమాదంలో ఉందని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. మల్లన్న సాగర్ కింద గ్రామాలు ప్రమాదంలో ఉన్నాయని CAG స్పష్టం చేసింది. ►అన్నారం బ్యారేజ్‌లో నిన్నటి నుంచి లీక్ మొదలైంది. NDSAకు సమాచారం ఇస్తే నీళ్లను వదిలిపెట్టాలని వాళ్ళు సూచించారు. మేడిగడ్డ తరహాలో అన్నారం కుంగిపోయే ప్రమాదం ఉందని NDSA రిపోర్ట్ ఇచ్చింది. ప్రాజెక్టు ఆపరేషన్ చేయలేదు. ►1800 కోట్లకు మేడిగడ్డ టెండర్ పిలిచి నాలుగు వేలకోట్లు చెల్లించారు. మేడిగడ్డ పనికి రాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేర్కొంది. డిజైన్, క్వాలిటీ లోపం స్పష్టంగా ఉంది. ►అక్టోబర్‌లో డ్యామ్ డ్యామేజ్ అయిన సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ►మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్‌ల నిర్మాణంలోనూ క్వాలిటీ లేదు. కాళేశ్వరం నిర్మాణంలో అలసత్వం వహించిన అధికారులను ఇప్పటికే కొందరిని తొలగించాం. ►ప్రాజెక్ట్‌ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. శ్రీశైలం నుంచి అదనపు నీటిని ఏపీ వాడుకుంటున్నా బీఆర్ఎస్ పట్టించుకోలేదు. కృష్ణా జలాలను ఏపీ ప్రబుత్వం యథేచ్చగా మళ్లించుకుంది. ►కృష్ణా నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాట 68 శాతం ఉంటే గత ప్రభుత్వం 50 శాతం మాత్రమే అడిగింది. పోలింగ్ రోజు ఏపీ ప్రభుత్వం సాగర్ నుంచి అదనపు నీటిని తీసుకుంది. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు కడుతుంటే బీఆర్ఎస్ మాత్రం ప్రేక్షక పాత్ర పోషించింది. కాంట్రాక్టర్లకు వేల కోట్లును కట్టబెట్టారు. ►గత ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్ట్‌లు అప్పగిస్తూ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పుకున్న కాళేశ్వరం మూడేళ్లలోనే కుంగిపోయింది. ఇలా కావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వమే నీళ్లను నింపే ప్రక్రియను ఆపేసింది. ►కడెం ప్రాజెక్ట్‌ను పట్టించుకోకపోవడంతో గేటు కొట్టుకుపోయింది. దీంతో, ఈ ఏడాది యాసంగిలో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. మూసీ ప్రాజెక్ట్ గేటు కూడా కొట్టుకుపోయింది. ►మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఒకే టెక్నాలజీతో కట్టారు. ►ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తి అయ్యింది. ఉమ్మడి ఏపీలో పలు ప్రాజెక్ట్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది. గత పదేళ్లలో ప్రాజెక్ట్‌లకు అనాలోచితంగా ఖర్చు చేశారు. ఆర్థిక క్రమశిక్షణతో ప్రాజెక్ట్‌లను నిర్మించాలి. ఐదేళ్లలోనే కాళేశ్వరం మూలకు పడింది. ►తెలంగాణ రైతుల ప్రయోజనాలకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మూడు బ్యారేజ్‌లను NDSAకు అప్పగించి విచారణ చేయిస్తాం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లపై విచారణ NDSA రిపోర్ట్‌తో చర్యలు తీసుకుంటాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు లక్షల ఆయకట్టు ఏర్పాటు చేస్తాము. కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక.. ప్రాజెక్టు ప్రారంభమైన మొదటి సంవత్సరంలోనే మేడిగడ్డ బ్యారేజీకి పగుళ్లను గుర్తించారు. రిపేర్ చేయాలని 18-05-2020న ఇరిగేషన్ శాఖ ఎల్ అండ్ టీకీ నోటీసులు జారీ చేసింది. 28-04-2023న మరోసారి సీసీ-బ్లాకులు కొట్టుకుపోయాయి. ఇరిగేషన్ శాఖ సూచనల మేరకు పనులు జరగలేదు. తనిఖీ నివేదికలు లేకుండా డీవియేషన్లకు ఆమోదం తెలిపారు. 2019 నుంచి బ్యారేజ్ నిర్వాహణ చేయలేదు. బ్యారేజ్ నిర్మాణం తర్వాత షీట్ ఫైల్స్, కాఫర్ డ్యామ్‌ను తొలగించలేదు. పనులు పూర్తి చేయకముందే ఏజెన్సీకి బ్యాంకు గ్యారెంటీలు విడుదల చేయాలని ఈఎన్సీ సిఫారసు చేసింది. -
తెలంగాణ అసెంబ్లీ: ఇరిగేషన్‌పై మాటల యుద్ధం
Updates.. తెలంగాణ శాసన సభ నిరవధిక వాయిదా సభను నిరవధికంగా వాయిదా వేసిన స్పీకర్ 45 గంటల 32నిమిషాల పాటు నడిచిన అసెంబ్లీ 8 రోజుల శాసనసభ పనిదినాల్లో 59 మంది సభ్యులు మాట్లాడారు జీరో అవర్ లో 64మంది వారి సెగ్మెంట్ అంశాలను ప్రస్తావించారు ప్రభుత్వ ప్రకటనలు రెండు, మూడు బిల్లులకు ఆమోదం, ఒక లఘు చర్చ అసెంబ్లీ ఆవరణలో మల్లా రెడ్డి చిట్ చాట్ వీళ్ళకి మేడిగడ్డ తప్పా, వేరే గడ్డనే దొరకడం లేదు రోజు మేడిగడ్డ మేడిగడ్డ అంటే ప్రజలు బేజారవుతున్నారు మేడిగడ్డ ప్రాజెక్ట్ లీకేజ్ అయింది.. సరి చెయ్యాలి ఈసారీ అసెంబ్లీ సమావేశాలు అట్టర్ ప్లాప్ హరీష్ రావు వన్ మెన్ హీరో మేడిగడ్డలో రిపేర్ కాంట్రాక్ట్ పెద్ద కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇస్తే ఆయనే సరి చేస్తాడు అన్నారం డ్యామేజిపై అసెంబ్లీలో వీడియో ప్రదర్శన అన్నారం డ్యామేజీపై అసెంబ్లీలో వీడియో ప్రదర్శన చేసి చూపించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారం డ్యామేజి సీరియస్ అంశం మూడు బ్యారేజిలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ(ఎన్డీఎస్ఏ)కు అప్పగిస్తాం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారాంగానే నీళ్లు నింపాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన విషయాలను కోడ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు.. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే తెలంగాణ తెచ్చుకున్నాం అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు కాళేశ్వరంనకు అన్నీ తానే అని చెప్పుకుంటున్నా కేసీఆర్.. ఇప్పుడు ప్రాజెక్టు డ్యామేజ్పైపై చర్చ కు ఎందుకు రావడం లేదు ఒకనాడు కేసీఆర్‌కు దేవాలయం అయిన మేడిగడ్డ.. ఇప్పుడు బొందల గడ్డ ఎలా అయింది ప్రాజెక్టును తొందర గా కట్టాలనే ఆతృత తప్ప..ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ గురించి పట్టించుకోలేదు. ప్రాజెక్టు ప్రమాదం బీఆర్ఎస్ హాయాంలోనే జరిగింది ప్రమాదం జరిగిన తర్వాత ఎంత నీటి ని ఎత్తిపోసారో లెక్కలు చెప్పగలరా హరీష్‌రావు చిట్ చాట్@అసెంబ్లీ లాబీ నేను అసెంబ్లీలో కీలక అంశం మాట్లాడే టైంgలో మైక్ కట్ చేస్తున్నారు ఫేస్ చూపించకుండా కెమెరా వేరే వైపు టర్న్ చేస్తున్నారు ఈ రోజు గద్దర్, అందెశ్రీ పాట పాడుతుంటే కట్ చేసారు నేను మాట్లాడే సమయంలో అధికార పార్టీ నేతలు స్పీకర్‌కు స్లిప్ పంపుతున్నారు నా డ్యూటీ విషయంలో నేను వెనక్కి తగ్గను నల్గొండ మీటింగ్, మేడిగడ్డ టూర్ రోజు కూడా అసెంబ్లీ కి వచ్చాను నిన్ననే అసెంబ్లీ క్లోజ్ చేయమని చెప్పాం 3 గంటలు జీరో అవర్, 3 గంటలు బీసీ బిల్లు, 2 గంటలు టీ బ్రేక్ ఇచ్చారు.. మంత్రి భట్టి మాట్లాడుతూ.. కావాలనే ప్రాజెక్టులను రీ డిజైన్ చేశారు రీడిజైన్ పేరుతో అంచనాలు పెంచారు లక్షల కోట్లు వృధా చేశారు హరీష్‌రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు ఇప్పటికైనా తప్పు ఒప్పుకోండి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని కాదు కాళేశ్వరం తెలంగాణకు కళంకంగా మారింది సాగునీటి మంత్రిగా హరీష్‌ను ఎందుకు తప్పించారు ప్రజలు నమ్మి అధికారం ఇస్తే.. పదేళ్లు పాలించి నిండా ముంచారు ఈ పాపాలన్నింటికి హరీష్, కేసీఆరే కారణం తెలంగాణను చెదలు పట్టించారు హరీష్ మారాడు అనుకున్నా.. కానీ ఇంకా దిగజారాడు చేవెళ్లపై గతంలో సబితక్క(సబితాఇంద్రారెడ్డి) ధర్నా చేశారు ఇప్పుడు సబితక్క మాట్లాడకుండా హరీష్‌ను సమర్థిస్తున్నారు చేవెళ్ల ఎండిపోయినా వారికి కనిపించదు కడియం కూడా మంచోడే.. కానీ, ఆ స్కూల్లో చేరాక అలా తయాయ్యాడు అది వాళ్ల బడి.. అందులో చేరగానే సిలబస్ మారిపోతుంది కూలిన ప్రాజెక్టులు చూసి సిగ్గుపడండి విచారణకు వెళ్లి తప్పు ఒప్పుకుని రండి మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. మాటలతో ప్రజల్ని నమ్మించలేరు గట్టిగా మాట్లాడినంత మాత్రానా అబద్ధాలు నిజాలు అయిపోవు హరీష్‌రావు మాట్లాడుతూ.. సీఎం మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు సీడబ్ల్యూసీ CWC సూచనల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మించాం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్లకు ఒప్పుకోలేదుకే క్షమాపణ చెప్పాల్సింది కాంగ్రెస్ గతంలో దేవాదుల పైపులు, పగిలాయి.. టెన్నెల్స్ కూలాయి మిషన్ కాకతీయతో చెరువులు పునరుద్ధరించాం.. చెరువులు తెగిపోవడం తగ్గింది ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించింది మాపై కోపం ఉన్నా ఫర్వాలేదు.. రైతులకు అన్యాయం చేయొద్దు కేసీఆర్ చేసిన పనిని చెడగొట్టాలన్నది రేవంత్ ఉద్దేశం మేడిగడ్డ.. కేసీఆర్ ఆలోచనే: సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్ వేసిన నిపుణుల కమిటీయే ప్రాణహిత-చేవెళ్ల సాధ్యమని నివేదిక ఇచ్చింది మేడిగడ్డ కట్టాలన్నది కేసీఆర్ఆలోచన అక్కడే కట్టాలని కేసీఆర్ ఆదేశించారు వాళ్లు నియమించుకున్న ఇంజనీర్ల కమిటీతో నివేదిక ఇప్పించుకున్నారు వాళ్లు కూడా తుమ్మడిహట్టి దగ్గరే నిర్మించాలని చెప్పారు మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం సరికాదని నిపుణుల కమిటీయే చెప్పింది హరీష్‌రావు, వాళ్ల మామ కేసీఆర్ కలిసి తెలంగాణకు ద్రోహం చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే తెలంగాణ ఉద్యమం జరిగింది తెలంగాణ వచ్చాక ఆ అన్యాయం మరింతగా జరిగింది తెలంగాణ ఇచ్చింది మేమే.. తెచ్చింది మేమే పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారు? పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే బారిన పడింది మా కాంగ్రెస్ ఎంపీలే గోదావరి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రభుత్వం కమిటీ వేసింది ఆ కమిటీ నివేదిక ఇచ్చింది ఆ నివేదికలోని వివరాలనే ఇప్పుడు సభ ముందు ఉంచుతున్నాం ప్రాజెక్టులపై వాస్తవాలను ఉత్తమ్ బయటపెట్టే యత్నం చేస్తున్నారు ప్రతిపక్షం సలహాలు, సూచనలు ఇవ్వకుండా ఎదురుదాడి చేస్తోంది వాస్తవాలను కూడా తప్పుల తడక అని చెప్పి తప్పించుకునే యత్నం చేస్తున్నారు తప్పు ఒప్పుకోండి.. కప్పి పుచ్చుకోకండి మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణ వచ్చాకే కృష్ణా జలాల్లో ఎక్కువ దోపిడీ జరిగింది హరీష్‌రావు అన్నీ అబద్ధాలే చెబుతున్నారు గోబెల్స్ హరీష్‌రావు అని పేరు పెట్టుకోండి పదేపదే అబద్ధాలు చెప్పడం మానుకోండి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఉత్తమ్ మాట్లాడిన ప్రతీసారీ అబద్ధాలే చెబుతున్నారు అవినీతి ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధం కాంగ్రెస్ హయాంలోనే అవినీతి.. అన్యాయం జరిగిందని కవులు, కళాకారులు గొంతెత్తి పాడారు ప్రాణహిత చేవెళ్లను మేం మార్చాలనుకోలేదు ఇంజినీరింగ్ అధికారులు చెప్పారు గనుకే రీ డిజైనింగ్ చేశాం ఎస్ఆర్ఎసీ-2కి నీళ్లు ఇచ్చిన ఘనత మాది తెలంగాణ ఏర్పాడ్డాక.. భూగర్భ వనరులు పెరిగాయి తెలంగాణ రాష్ట్రం వచ్చాక వలసలు తగ్గాయి ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వస్తున్నారు అవినీతి ఆరోపణలపై ఏ ఎంక్వైరీకైనా రెడీ మంత్రి భట్టి మాట్లాడుతూ.. మేడిగడ్డ పిల్లర్ నిట్టనిలువునా చీటింది కాళేశ్వరంలో నాణ్యత లేదు మేడిగడ్డ ఒక్కటే కాదు..మిగతా రెండూ నాణ్యత లేవని NDSA తేల్చింది రూ.94 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టు కూలిపోతోంది గత గవర్నర్ హరీష్‌రావుకు కాళేశ్వరరావు అని పేరు పెట్టారు ప్రాజెక్టు పేరు మీద లక్షల కోట్ల అవినీతి జరిగింది.. ఆ విషయం కాగ్ కూడా చెప్పింది ఉత్తమ్ చెప్పిన విషయాల్ని నిజమని ఒప్పుకోండి కూలిన దానికి తప్పు ఒప్పుకోండి ఇంకా సమర్థించుకోవడం సరికాదు ఇరిగేషన్‌పై వాడీవేడి వాదనలు ఇరిగేషన్ శ్వేత పత్రంపై శాసన సభలో మాటల యుద్ధం మేడిగడ్డ లోపాలతో విపక్షాన్ని కార్నర్ చేసిన అధికార పక్షం తప్పుమీదంటే మీదంటూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలు లేచి బీఆర్ఎస్పై విరుచుకుపడ్డ మంత్రి కోమటిరెడ్డి కృష్ణాజలాల విషయంలో అన్నీ సక్రమంగా చేశామని అంటున్నారు: మంత్రి జూపల్లి మరి స్మితా సబర్వాల్ లేఖ సంగతి ఏంటి?: మంత్రి జూపల్లి మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. హరీష్‌రావు చెప్పిందే పదే పదే చెబుతున్నారు కేసీఆర్, జగన్ చాలాసార్లు నీటివాటాపై చర్చింఆరు అపెక్స్ కమిటీలో అభ్యంతరం చెబితే రాయలసీమ ప్రాజెక్టు ఆగేది శ్వేతపత్రం కాదు.. అబద్ధపు పత్రం తప్పుడు లెక్కలతో గత ప్రభుత్వాన్ని తప్పుబట్టే యత్నం చేస్తున్నారు ప్రాజెక్టులు అప్పగించాలన్న గెజిట్ నొటిఫికేషన్‌ను మేం వ్యతిరేకించాం మళ్లీ కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారానికి దిగింది ఎన్నికల ప్రచారంలో గోబెల్స్‌ప్రచారం చేసినట్లే.. సభలోనూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదు ఆయకట్టు విషయంలో రెండు చోట్ల రెండు రకాలుగా చెప్పారు రూ.775 కోట్లు ఖర్చు పెట్టి ఎల్లంపల్లి, మిడ్ మానేరు పూర్తి చేశాం సభను ఉత్తమ్ తప్పుదోవ పట్టించే యత్నం చేశారు హరీష్‌రావు మాట్లాడుతూ.. ఇరిగేషన్‌పై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం తప్పుల తడకగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం సత్యదూరంగా ఉంది మంత్రి ఉత్తమ్ సత్యదూరమైన మాటలు చెప్పారు గత ప్రభుత్వంపై బుదర చల్లాలనే శ్వేత పత్రం ప్రవేశపెట్టారు మిడ్‌మానేరు ప్రాజెక్టులను మా హయాంలోనే పూర్తి చేశాం ఇరిగేషన్‌పై చర్చకు 2గం. సమయం అవసరం మంత్రి ఉత్తమ్ ప్రసంగం అనంతరం.. తన సీట్లోంచి లేచి మాజీ సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సభలో మంత్రి ఉత్తమ్.. లక్షా 81వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పై గత ప్రభుత్వం ఖర్చు చేస్తే 15లక్షల ఎకరాలకు నీళ్లు మాత్రమే అందించారు రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతానికి 54వేల కోట్లు ఖర్చు చేసి 57లక్షల ఆయకట్టు సాగునీరు అందించింది అప్పటి ప్రభుత్వం కాళేశ్వరం పరిధిలోని బ్యారేజీలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA కు అప్పగించి విచారణ చేయిస్తాం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా పై విచారణ NDSA రిపోర్ట్ తో చర్యలు తీసుకుంటాం గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మేం సవరిస్తాం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 7లక్షల ఆయకట్టు ఏర్పాటు చేస్తాం సభలో మంత్రి ఉత్తమ్.. గత ప్రభుత్వం ఇరిగేషన్ పై బడ్జెట్ కేటాయింపులు కాకుండా 84వేల కోట్ల నిదులు లోన్స్ రూపంలో తెచ్చారు. అప్పులు వడ్డీల భారంతో రాబోయే పదేళల్లో రూ. 1లక్ష 35వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సభలో మంత్రి ఉత్తమ్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్లానింగ్.. డిజైన్ లోపం ఉంది ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన నిధులన్నీ గోదావరి పాలు అయ్యాయి కాళేశ్వరం ప్రాజెక్టు నిషేదిత ప్రాంతంగా ఉండేది మేడిగడ్డ కుంగుబాటు బాటు వల్ల మిగతా బ్యారేజీల పరిస్థితి ప్రశ్నర్ధకంగా మారింది ప్రాజెక్టుల నిర్మాణంలో అడ్డగోలుగా అవినీతి జరిగింది సభలో మంత్రి ఉత్తమ్.. కాళేశ్వరం తెలంగాణకు గుదిబండగా మారింది ఎస్సారెస్సీ పునరుజ్జీవన ప్రాజెక్టుతో ఒరిగిందేం లేదు గతంలో పోలిస్తే.. ఎకరాకు 12 రెట్లు ఖర్చు పెరిగింది ఆర్థిక క్రమశిక్షణతో ప్రాజెక్టులను నిర్వహించాలి అంతేకానీ అడ్డగోలు అవినీతి, నిర్లక్ష్యంతో కాదు సభలో మంత్రి ఉత్తమ్.. గత పదేళ్లలో ప్రాజెక్టుల కోసం అనాలోచితంగా ఖర్చు చేశారు ప్రాజెక్టుల రీడిజైన్ వల్ల అన్ని ప్రాంతాలకు నష్టం జరిగింది తెలంగాణకు రావాల్సిన నీటిని సాధించుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైంది గతంలో.. అపెక్స్ కమిటీ మీటింగ్ గత సీఎం కూడా పాల్గొన్నారు అప్పుడే కేఆర్ఎంబీకి నోటిఫికేషన్‌ను కేంద్రం రిలీజ్ చేసింది కానీ, అప్పటి ప్రభుత్వం ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు కేఆర్ఎంబీకి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాచింయింది కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తూ సూత్రప్రాయంగా బీఆర్ఎస్ ప్రభుత్వంనిర్ణయం తీసుకుంది సభలో మంత్రి ఉత్తమ్.. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఏపీ యధేచ్ఛగా నీటిని వాడుకుంది కృష్ణా జలాలను ఏపీ యధేచ్ఛగా దారి మళ్లించుకుంది తెలంగాణ వాటా 68 శాతం ఉంటే.. గత ప్రభుత్వం 50 శాతం మాత్రమే అడిగింది పోలింగ్ రోజు సాగర్ నుంచి అదనపు నీటిని తీసుకుంది బీఆర్ఎస్ మాత్రం ప్రేక్షక పాత్ర వహించింది శ్రీశైలం నుంచి అదనపు నీటిని ఏపీవాడుకుంటున్నా.. బీఆర్ఎస్ అప్పుడు పట్టించుకోలేదు సభలో మంత్రి ఉత్తమ్.. కుంగిన ప్రాజెక్టులలో నీళ్లు నింపొద్దని ఎన్డీఎస్ఏ చెబుతోంది ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది ఏపీకి నీళ్లను కట్టబెట్టి దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ నిర్ణయాలు.. తెలంగాణను నట్టేటా ముంచాయి ఇంత అవినీతి స్వతంత్ర భారతంలో ఎప్పుడూ జరగలేదు సభలో మంత్రి ఉత్తమ్.. కాళేశ్వరం ఆర్థికంగా అనుకూలమైనది కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అవసరం అయ్యే కరెంట్.. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్కరోజే అవసరం మల్లన్న సాగర్ విషయంలో గత ప్రభుత్వం గొప్పలు చెప్పింది కానీ, కాగ్ అనేక లోపాలు బయటపెట్టింది మల్లన్న సాగర్ ప్రమాదంలో ఉందని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది చిన్నపాటి భూకంపాలు వచ్చినా మల్లన్నసాగర్ తట్టుకోలేదు మల్లన్న సాగర్ కింద గ్రామాలు ప్రమాదంలో ఉన్నాయని కాగ్ పేర్కొంది సభలో మంత్రి ఉత్తమ్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమని గత ప్రభుత్వం చెప్పుకుంది కానీ, కాగ్ కాళేశ్వరం విషయంలో విస్తూపోయే విషయాలు కాగ్ చెప్పింది కరెంట్ కోసం ఏడాదికి రూ.10 వేల కోట్ల ఖర్చు అవుతుంది డీపీఆర్ అఫ్రూవ్ కాకుండానే కాంట్రాక్టర్లకు రూ.20 వేల కోట్లు కట్టబెట్టింది కాగ్ సూచించిన అంశాల పై ఖచ్చితంగా విచారణ చేస్తాం గతంలో జరిగిన వేల కోట్ల పనులను పక్కన పెట్టి రీ డిజైన్ పేరుతో ప్రాజెక్ట్ లను కొనసాగించారు మెట్టప్రాంతాలకు నీరు ఇవ్వాలన్నది ప్రాణహిత చేవెళ్ల లక్ష్యం ప్రాణహిత చేవెళ్ల కింద రూ. 81వేల కోట్ల ప్రాజెక్టును సీడబ్ల్యూసీ అనుమతి ఇస్తే.. గత ప్రభుత్వఅవినీతి వల్ల రూ.1లక్ష 47వేల కోట్ల అంచనాలకు పెరిగింది సభలో మంత్రి ఉత్తమ్.. అవినీతి, నిర్లక్ష్యం, నాసిరకం వల్లే ఈ పరిస్థితి మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారం ,సుంధిళ్ళ బ్యారేజ్ ల నిర్మాణం లో క్వాలిటీ లేదు అన్నారంకు క్రాక్స్ వచ్చాయి అన్నారం బ్యారేజీ కూడా ప్రమాదంలో ఉంది అన్నారం బ్యారేజీలో నిన్నటి నుంచే లీకులు మొదలయ్యాయి వెంటనే ఎన్డీఎస్ఏకి సమాచారం అందించాం నీటిని నింపొద్దని ఎన్డీఎస్ఏ చెబుతోంది ఉన్న నీటిని తొలగించమని చెప్పింది సభలో మంత్రి ఉత్తమ్.. మేడిగడ్డ ప్రాజెక్టు బాగా దెబ్బ తింది మేడిగడ్డ పనికి రాదు అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసింది అక్టోబర్‌లో మేడిగడ్డ కుంగితే కేసీఆర్ ఇప్పటిదాకా స్పందించలేదు అవినీతి, నిర్లక్ష్యం వల్ల బ్యారేజ్ బాగా దెబ్బతింది గత ప్రభుత్వ పెద్ద మనిషే చీఫ్ ఇంజనీర్.. డిజైనర్ గత పదేళ్లలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతి మరెక్కడా జరగలేదు ఇంత అవినీతి స్వతంత్ర భారతంలో ఇప్పటిదకా జరగలేదు యావత్ తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాలి నేషనల్ డ్యామ్ సేఫ్టీపై విచారణ జరిపించాలని కోరాం నీటి పారుదల శాఖ పై శ్వేత పత్రం 2014 వరకు నీటి పారుదల సామర్థ్యం 57.79లక్షల ఎకరాలు మొత్తం ఖర్చు 54,234కోట్లు 2014 వరకు ఓక్కో ఎకరానికి 93 వేల కోట్ల ఖర్చు 2014 నుంచి 23 వరకు ఇరిగేషన్ ఖర్చు 1.81లక్షల కోట్లు కొత్త ఆయకట్టు 15.81లక్షల ఎకరాలు ఒక్కో ఎకరం ఖర్చు 14.45లక్షలు సభలో కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ పపవర్ పాయింట్ ప్రజెంటేషన్.. ఇరిగేషన్ ప్రాజెక్టులపై పూర్తి అవగాహన కోసమే పవర్‌పాయింట్ ప్రజంటేషన్ సభ్యులకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే శ్వేతపత్రం కాళేశ్వరంలో మేడిగడ్డ కీలక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ గుండెకాయలాంటిది మేడిగడ్డ ప్రాజెక్టులో లోపాలున్నాయ్ అవగాహన లేకుండా మేడిగడ్డ నిర్మాణం చేపట్టారు మూడేళ్లకే ప్రాజెక్టు కుంగిపోయింది వందేళ్లు ఉండాల్సిన బ్యారేజ్.. దురదృష్టవశాత్తూ నాణ్యతా లోపంతో మూడేళ్లకే దెబ్బతింది రూ.1,800 కోట్లకు టెండర్ పిలిచి.. నిర్మాణానికి రూ.4 వేల కోట్లు ఖర్చు చేశారు ప్రాజెక్టుకు అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోయారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా నివేదిక ఇచ్చింది ప్రాజక్టు నిర్మాణం నాసికంగా ఉందని పేర్కొంది అసెంబ్లీ స్పీకర్ అన్ని రికార్డులను పరిశీలించి టెక్నీషియన్ ను సభలోకి అనుమతించా గతంలో సీఎం గా కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు సభలోనే టెక్నీషియన్ ఉన్నాడు నేను టెక్నీషియన్ కు అనుమతి ఇస్తున్నా..నన్ను ఎవరూ ప్రశ్నించొద్దు మంత్రి శ్రీధర్ బాబు.. గతంలో సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం,టెక్నీషియన్ ద్వారా నే ఇచ్చారు స్పీకర్ అనుమతి తోనే టెక్నీషియన్ సభ లోపలికి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు.. మెంబర్ కాకుండా సభలోకి ఇతరులు రాకూడదు అడ్వకేట్ జనరల్ తప్ప మరో వ్యక్తి రావోద్దు టెక్నీషియన్ ను సభలోకి అనుమతించ వద్దు మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి టెక్నీషియన్ ను బయటకు పంపాలి ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేత పత్రం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షాలపై మంత్రి పొన్నం ఫైర్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశాం కులగణనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు అందరికి ధన్యవాదాలు. మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు అన్ని పార్టీల ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నాం. మాజీమంత్రి గంగుల కమలాకర్ తీర్మానంపై అనుమానం వ్యక్తం చేయడం శోచనీయం. ఆ మాజీమంత్రికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సకల జనుల సర్వేను బయటపెట్టమని అడిగారా? అనుమానాలు పక్కన పెట్టి ఇప్పటికే జరిపిన ఆయా రాష్ట్రాల గురించి తెలుసుకోవాలి. మురళీధర్ కమిషన్ నుంచి తెలంగాణ ఉద్యమం, పార్లమెంట్లో బిల్లు ఆమోదం వరకు మేము ఉన్నాం. మిగతా వారిలాగా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలకే మేము పరిమితం కాలేదు. అందుకే సభలో తీర్మానం పెట్టాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేస్తాం ►తెలంగాణ అసెంబ్లీలో నేడు వాడీ-వేడి చర్చ జరుగనుంది. ►కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. ►నేడు ఎనిమిదో రోజు తెలంగాణ శాసనసభ సమావేశం కొనసాగనుంది. ►ఇరిగేషన్‌పై సభలో శ్వేతపత్రం విడుదల చేయనున్న కాంగ్రెస్ సర్కార్. ►సభలో నీటి పారదలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం ►పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసిన అధికారులు ►ఇప్పటికే KRMBపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ►ఈ క్రమంలో తమకు కూడా పీపీటీకి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ►నిన్న జరగాల్సిన ఇరిగేషన్‌పై చర్చ నేటికి వాయిదా ►ఇవ్వాల్టితో ముగియనున్న తెలంగాణ శాసన సభ సమావేశాలు ►ఇప్పటికే శాసన మండలి నిరవధిక వాయిదా. -
TS: నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల శాఖలో తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేసింది. ఇరిగేషన్ ఈఎన్సీ(జనరల్)గా ఉన్న మురళీధర్‌ను రాజీనామా చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అలాగే రామగుండం ఈఎన్సీ, కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావును తెలంగాణ ప్రభుత్వం సర్వీస్ నుంచి తొలగించింది. ఇటీవల ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్‌ను పదవి నుంచి తొలగించాలని పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, రిటైర్డ్ ఈఎన్సీ అధికారులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మురళీధర్.. 11 ఏండ్లకు పైగా ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతున్నారు. 2013లో ఈఎన్సీగా మురళీధర్ రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి మురళీధర్ ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతున్న విషయం తెలిసిందే. మాజీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మురళీధర్ కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైనింగ్ సహా అనేక ప్రాజెక్టులకు పని చేశారు. ఇటీవల మురళీధర్‌ను పదవి నుంచి తొలగించి.. విచారిస్తే ప్రాజెక్టుల అక్రమాలు బయటకు వస్తాయని పలు డిమాండ్లు వెల్లువెత్తాయి. -
కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కులను పోరాడి పరిరక్షించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో సీఎం వైఎస్ జగన్ విజయం సాధించారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణకు నాలుగున్నరేళ్లుగా ఆయన చేసిన పోరాటం, కృషి ఫలించాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ అంగీకరించింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ గతనెల 17న ఢిల్లీలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం అమలుకు గురువారం హైదరాబాద్‌లోని కృష్ణాబోర్డు కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఈ రెండు ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. అందుకు సంబంధించిన విధివిధానాలను ఈ సమావేశంలో రూపొందించారు. వాటిని కృష్ణాబోర్డు ఛైర్మన్ శివ్‌నందన్‌కుమార్ కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రాజెక్టుల అప్పగింత విధివిధానాలపై రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శులతో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి సమీక్షించనున్నారు. ఆ తర్వాత ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కృష్ణాబోర్డుకు అప్పగించనున్నారు. కృష్ణానదీజలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య తరచు విభేదాలు తలెత్తడానికి కారణమైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణాబోర్డుకు అప్పగించడం ద్వారా వివాదాలకు చెక్ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే గతనెల 17న రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులతో ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు ఆ సమావేశంలో అంగీకరించాయి. ప్రాజెక్టుల అప్పగింత విధివిధానాలను వారంలో ఖరారు చేయాలని త్రిసభ్య కమిటీని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి ఆదేశించారు. కానీ.. హైదరాబాద్‌కు వచ్చాక తెలంగాణ సర్కార్ అడ్డం తిరిగింది. కృష్ణాజలాల వాటాలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తేల్చేవరకు ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఇదే అంశంపై బుధవారం కేంద్రానికి లేఖ కూడా రాసింది. అడ్డంతిరిగి.. దారికొచ్చిన తెలంగాణ కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆదేశాల మేరకు కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే నేతృత్వంలో గురువారం త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సి.నారాయణరెడ్డి, మురళీధర్ హాజరయ్యారు. కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాను ట్రిబ్యునల్ తేల్చేవరకు ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోమని తెలంగాణ ఈఎన్సీ పాతపాట పాడటంతో ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి వాటాలు తేల్చేది ట్రిబ్యునల్ మాత్రమేనని.. త్రిసభ్య కమిటీ, కృష్ణాబోర్డు, అపెక్స్ కౌన్సిల్‌కు ఆ అధికారం లేదని గుర్తుచేశారు. ప్రాజెక్టుల అప్పగింతకే త్రిసభ్య కమిటీ పరిమితం కావాలని సూచించారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో తమ భూభాగంలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీచేశామని, తెలంగాణ తన భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్ల అప్పగింతపై ఇప్పటికీ తేల్చలేదని ఎత్తిచూపారు. దీంతో తమ భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను అప్పగించడానికి తెలంగాణ ఈఎన్సీ అంగీకరించారు. బోర్డు, ఏపీ, తెలంగాణ ప్రతినిధుల నేతృత్వంలో.. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కృష్ణాబోర్డుకు అప్పగిస్తూనే.. ఒక్కో అవుట్లెట్ వద్ద బోర్డు, ఏపీ, తెలంగాణ అధికారులు ఒక్కొక్కరిని నియమించి, నీటి విడుదలను పర్యవేక్షించాలని ఇద్దరు ఈఎన్సీలు చేసిన సూచనకు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే అంగీకరించారు. ఇందుకు రెండు రాష్ట్రాలు సిబ్బందిని సమకూర్చాలని సభ్య కార్యదర్శి చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ప్రతి నీటి సంవత్సరంలో ఎప్పటికప్పుడు త్రిసభ్య కమిటీ సమావేశమై.. రెండు రాష్ట్రాల అవసరాలపై చర్చించి, నీటివిడుదలకు చేసే సిఫార్సు మేరకు బోర్డు ఉత్తర్వులు జారీచేయాలనే ప్రతిపాదనపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. తాగునీటి అవసరాల కోసం తక్షణమే సాగర్ ఎడమకాలువ కింద ఏపీకి రెండు టీఎంసీల విడుదలకు త్రిసభ్య కమిటీ అంగీకరించింది. కుడికాలువకు మార్చిలో 3, ఏప్రిల్‌లో 5 టీఎంసీల విడుదలకు ఆమోదం తెలిపింది. హక్కుల పరిరక్షణ కోసం సీఎం జగన్ రాజీలేని పోరాటం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. కృష్ణాపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను నిలిపేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడం కోసం తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌లోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారు. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి 2020 అక్టోబర్ 6న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను నిలిపేసేలా తెలంగాణ సర్కార్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 2021లో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాకుండానే తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఇక్కడి నుంచి నీటిని సాగర్‌కు తరలించింది. ఇలా శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం జగన్ న్యాయపోరాటానికి దిగారు. కృష్ణాబోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడిచేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కృష్ణాబోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్‌లో రాష్ట్ర భూభాగం పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనా.. తెలంగాణ సర్కారు తన భూభాగంలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతోపాటు కుడికాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రాష్ట్రానికి అప్పగించాలని, లేదంటే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గతేడాది అక్టోబర్ 6న కృష్ణాబోర్డు రాష్ట్రానికి కేటాయించిన 30 టీఎంసీల్లో 17 టీఎంసీలను ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు తెలంగాణ సర్కార్ తరలించింది. ఆ 17 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడికాలువ ద్వారా విడుదల చేయాలన్న రాష్ట్ర అధికారుల విజ్ఞ్ఞప్తులను తెలంగాణ పట్టించుకోలేదు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తమ భూభాగంలో ఉందని ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ సర్కార్ తన ఆధీనంలోకి తీసుకుందని.. అదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతోసహా కుడికాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఆధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దీంతో నవంబర్ 30న తెల్లవారుజామున సీఈ మురళీనాథ్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు, జలవనరులశాఖ అధికారులు రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగాన్ని, కుడికాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం కుడికాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. దీనిపై తెలంగాణ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో సీఎం జగన్ ఆది నుంచి చేస్తున్న డిమాండ్ మేరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. ఏకాభిప్రాయంతో ప్రాజెక్టుల అప్పగింత త్రిసభ్య కమిటీ సమావేశంలో ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు ఏకాభిప్రాయం కుదిరింది. ఏపీ భూభాగంలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగింతకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశాం. తెలంగాణ భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను అప్పగించడానికి ఆ రాష్ట్రం అంగీకరించింది. త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు బోర్డు నీటి కేటాయింపులు చేస్తుంది. వాటిని బోర్డే విడుదల చేస్తుంది. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ, ఏపీ జలవనరులశాఖ త్రిసభ్య కమిటీ సిఫార్సులే కీలకం శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఏటా నీటి అవసరాలపై త్రిసభ్య కమిటీ చర్చించి.. కేటాయింపులపై బోర్డుకు సిఫార్సు చేస్తుంది. ఆ ప్రకారమే బోర్డు నీటిని విడుదల చేస్తుంది. మా భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను కృష్ణాబోర్డుకు అప్పగిస్తాం. కృష్ణాజలాల్లో 50 శాతం వాటా కోసం కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖ రాశాం. – మురళీధర్, ఈఎన్సీ, తెలంగాణ నీటిపారుదలశాఖ -
ఉమ్మడి ప్రాజెక్టులు బోర్డు నియంత్రణలోకి..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నియంత్రణలోకి తీసుకెళ్లడానికి తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖల ఈఎన్సీలు గురువారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో అంగీకరించారు. ఇకపై శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను కేఆర్ఎంబీ ప్రత్యక్ష నియంత్రణలో జరపాలని, ఇందుకోసం రెండు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతి కాంపొనెంట్ (విభాగం) వద్ద తెలంగాణ నుంచి ఒకరు, ఏపీ నుంచి మరొక ఉద్యోగిని పెట్టాలని నిర్ణయించారు. జలవిద్యుత్ కేంద్రాలు మినహా మిగిలిన 10 ఔట్లెట్లు (శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌వేతోపాటు రివర్ స్లూయిస్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్, నాగార్జునసాగర్ ఫ్లడ్ కెనాల్–హెడ్ రెగ్యులేటర్–పరిసరాలు, ఏఎంఆర్ ఎత్తిపోతల పథకం– పంప్‌హౌస్ పరిసరాలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్‌వేతోపాటు రివర్, చూట్ స్లూయిస్, నాగార్జునసాగర్ రైట్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్)లను బోర్డు నియంత్రణలోకి తీసుకెళ్లడానికి ఇరువురు ఈఎన్సీలు అంగీకారం తెలిపారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు కూడా 10 కాంపోనెంట్ల వద్ద మూడేసీ షిఫ్టులు (ఒక్కో షిప్టు 8 గం ఉండేలా ఇరు 30 మంది చొప్పున బోర్డు నియంత్రణలో పనిచేయడానికి అంగీకరించారు. అయితే నీటి విడుదల మాత్రం బోర్డుకు చెందిన త్రిసభ్య కమిటీ (బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయిపూరే, తెలంగాణ ఈఎన్సీ సి. మురళీధర్, ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి)ల నేతృత్వంలోని కమిటీ నిర్ణయం మేరకు జరుగుతుందనే అంగీకారం ఇరువురి మధ్య కుదిరింది. అయితే నాగార్జునసాగర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పనులు తెలంగాణ, శ్రీశైలం పనులను ఏపీ చేపట్టాలని నిర్ణయించారు. గంటన్నరపాటు సమావేశం... కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్, నాగార్జున సాగర్ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్, కృష్ణా బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.విజయకుమార్‌లు హాజరవగా ఏపీ నుంచి ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ సి. నారాయణరెడ్డితోపాటు ఆ రాష్ట్ర అధికారులు హాజరయ్యారు. దాదాపు గంటన్నరపాటు సమావేశం జరిగింది. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించాలని తాము సమ్మతించినట్లు ఈ సమావేశం అనంతరం ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వెల్లడించారు. అప్పటిదాకా అప్పగింత కుదరదు: తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై మీడియాలో వార్తలు రావడంతో తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా రంగంలోకి దిగారు. నీటి వాటాలు తేలేదాకా, శ్రీశైలం, సాగర్ ఆపరేషనల్ ప్రొటోకాల్స్‌పై స్పష్టత వచ్చేదాకా ప్రాజెక్టులను అప్పగించేది లేదంటూ తేల్చిచెప్పారు. దీనిపై జనవరి 27న కేంద్ర జలశక్తి శాఖకు రాసిన లేఖను బహిర్గతం చేశారు. కేంద్ర జలశక్తి శాఖ జనవరి 17న ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ అంగీకరించకున్నా అంగీకరించినట్లు పేర్కొంటూ మినిట్స్ విడుదల చేసిందని ఆ లేఖలో ఆయన ఆరోపించారు. ఆ సమావేశంలో తాము లేవనెత్తిన పలు అంశాలను మినిట్స్‌లో పేర్కొనలేదని గుర్తుచేశారు. ఆ మినిట్స్‌ను సవరించాలని లేఖలో కోరారు. మరోవైపు కృష్ణా బోర్డు సమావేశం ముగిసిన వెంటనే ప్రాజెక్టుల అప్పాగింతకు సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. తొలుత భేటీకి వెళ్లరాదనుకొని... అసలు కృష్ణా బోర్డు సమావేశాలకు హాజరు కాకూడదని అధికారులు తొలుత భావించినప్పటికీ తెలంగాణ అభిప్రాయాలను స్పష్టంగా బోర్డుకు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు స్వయంగా హాజరయ్యారు. అయితే లేఖకు కట్టుబడే ఉండాలని సమావేశంలో తెలంగాణ భావించగా తద్విరుద్ధంగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాగర్ పరిధిలో మొత్తం 8 కాంపోనెంట్లు ఉండగా అందులో 7 తెలంగాణ అదీనంలో ఉన్నాయి. వాటిలో ఐదింటిని అప్పగించడానికి, శ్రీశైలం పరిధిలో 7 కాంపోనెంట్లు ఉండగా అందులో తెలంగాణ అదీనంలో ఉన్న కాంపోనెంట్‌ను అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం అనంతరం ఈఎన్సీ (జనరల్) సి. మురళీధర్ ప్రకటన చేశారు. దాంతో విస్తుపోవడం తోటి అధికారుల వంతైంది. ఈ విషయం ప్రసార, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా జనవరి 27న కేంద్ర జలశక్తి శాఖకు రాసిన లేఖను నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మీడియాకు విడుదల చేశారు. దాంతో అధికారులు ముక్కున వేలేసుకున్నారు. ఈఎన్సీ ఒకదారిలో నడుస్తుండగా నీటిపారుదల శాఖ కార్యదర్శి మరోదారిలో నడుస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
మళ్లీ పునర్వ్యవస్థీకరణ!
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖను మళ్లీ పునర్వ్యవస్థీకరణ చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ యోచి స్తోంది. 2020 డిసెంబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదలశాఖను పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిర్లక్ష్యం, నిరాదరణకు గురైన విభాగాలు, ప్రాజెక్టులను గుర్తించి బలోపేతం చేయాలని ప్రస్తుత సర్కారు నిర్ణయించింది. తెలంగాణ వచ్చాక చేపట్టిన ప్రాజె క్టులు, తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్ర నీటిపారుదలశాఖ సమగ్ర నివేదికను సిద్ధం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యత ప్రశ్నార్థకంగా మారడంతో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ నైపుణ్యం, పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శాఖ పునర్వ్యవస్థీకరణ తర్వాత జరిగిన లాభనష్టాలపై నివేదిక అందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అవసరమైతే మళ్లీ శాఖను పునర్వ్యవస్థీకరించి గాడిలో పెట్టాలని భావిస్తోంది. ప్రభ కోల్పోయిన ‘సీడీఓ’ కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అక్రిడిటేషన్ ఉన్న ప్రతిష్టాత్మక సంస్థల్లో మన రాష్ట్ర నీటిపారుదల శాఖలోని ‘సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్’(సీడీఓ) ఒకటి. దేశంలోని కొన్ని రాష్ట్రాల సీడీఓలకు మాత్రమే ఈ గుర్తింపు ఉంది. సాగునీటి ప్రాజెక్టుల డ్రాయింగ్స్, డిజైన్లకు సీడీఓ ఆమోదిస్తూ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తేనే, ఆయా ప్రాజెక్టుల అంచనాలను కేంద్ర జల సంఘం ఆమోదిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ ఇంజనీర్(సీఈ) నేతృత్వంలో ‘సీడీఓ’స్వయంప్రతిపత్తి గల సంస్థగా పనిచేసేది. అప్పట్లో నిష్ణాతులైన ఇంజనీరింగ్ నిపుణులను మాత్రమే నియమించేవారు. ప్రాజెక్టుల డ్రాయింగ్స్, డిజైన్ల రూపకల్పన, ఆమోదానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో సీడీఓ స్వతంత్రంగా వ్యవహరించేది. దానిపై నీటిపారుదలశాఖ ఈఎన్సీల అజమాయిషీగానీ, ఒత్తిడి గానీ ఉండేది కాదు. 2020 చేపట్టిన నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణలో సీడీఓ స్వతంత్రతను కోల్పోయింది. ఈ విభాగాన్ని ఈఎన్సీ(జనరల్) పర్యవేక్షణ కిందకు తెచ్చి అందులో పనిచేసే ఇంజనీర్ల సంఖ్యనూ సగానికి పైగా కుదించేశారు. తర్వాత సరైన అధ్యయనాలు లేకపోయినా అత్యవసరంగా ఆమోదించాలని ఒత్తిడి పెంచి తమ వద్ద ప్రాజెక్టుల డిజైన్లు, డ్రాయింగ్స్కు ఆమోదం పొందారని ఆరోపిస్తూ సీడీఓ చీఫ్ ఇంజనీర్ ఇటీవల ఈఎన్సీ(జనరల్)కి లేఖ రాయడం విశేషం. ఈఎన్సీ(జనరల్)కు సర్వాధికారాలు కట్టబెట్టే రీతిలో పునర్వ్యవస్థీకరణ జరగడంతో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే విభాగాలు ప్రాధా న్యం కోల్పోయాయి. హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర జలవనరులు, ఆయకట్టు అభివృద్ధి సంస్థ(కాడా)లు సైతం గతంలో స్వతంత్రంగా పనిచేసేవి. మళ్లీ ఈ విభాగాలకు స్వతంత్రత ఇస్తే ప్రాజెక్టుల డిజైన్లు, నీటిలభ్యత అధ్యయనాలను స్వేచ్ఛగా నిర్వహించే అవకాశముంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఐడీసీ లిఫ్టులకు తాళాలు కాల్వల ఆధునీకరణ, ఆయకట్టు అభివృద్ధి, సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ), ప్రపంచ బ్యాంకు పథకాలు, నీటి సంఘాల నిర్వహణ చూసే కాడాకు గతంలో ఐఏఎస్‌లు బాస్‌లుగా ఉండేవారు. ఇప్పుడు సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయికి పరిమితం చేశారు. సాగునీటి అభివృద్ధి సంస్థ పరిధిలో 4.56లక్షల ఎకరాలకు నీరందించే 637 చిన్న ఎత్తిపోతల పథకాలున్నాయి. అందులో 216 పూర్తిగా, 137 పాక్షికంగా పనిచేస్తున్నాయి. 193 పూర్తిగా దెబ్బతిన్నాయి. 91 లిఫ్టులు అవసరం లేదని తాళాలు వేశారు. ప్రస్తుతం 2.18 లక్షల ఎకరాలకే సాగునీరు అందుతోంది. పునర్వ్యవస్థీకరణలో ఐడీసీ ప్రాజెక్టులు 19 మంది చీఫ్ ఇంజనీర్ల పరిధిలోకి వెళ్లగా, చిన్న లిఫ్టులను నిర్లక్ష్యం చేశారు. ప్రాజెక్టుల నిర్వహణ గందరగోళం పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో గందరగోళం నెలకొందని ఆ శాఖ ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ► గతంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఒక చీఫ్ ఇంజనీర్ పర్యవేక్షించేవారు. ఎడమకాల్వ ద్వా రా విడుదల చేసే నీరు ఏపీలోని పశి్చమగోదావరి జిల్లాకు చేరేవరకు ఆయనే పర్యవేక్షించేవారు. ప్రస్తుతం సాగర్ ఎడమ కాల్వ నిర్వహణను సూర్యాపేట చివరి వరకు నల్లగొండ సీఈ, ఆ తర్వాత నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఖమ్మం సీఈ పర్యవేక్షిస్తున్నారు. ► అడ్మిన్ కమ్ చీఫ్ ఇంజనీర్ పర్యవేక్షణలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉండేది. ఇప్పుడు నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, ములుగు, సూర్యాపేట, రామగుండం(పెద్దపల్లి) చీఫ్ ఇంజనీర్ల నిర్వహణలోకి ఈ ప్రాజెక్టు వెళ్లింది. ► కాళేశ్వరం ఈఎన్సీ(గజ్వేల్) పరిధి సిద్దిపేట వరకు మాత్రమే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఈఎన్సీ(రామగుండం) పరిధిలోకి వస్తాయి. ► పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ నాగర్‌కర్నూలు సీఈ పరిధిలో ఉండగా, వన పర్తి, మహబూబాబాద్, హైదరాబాద్ సీఈలు కాల్వలు, రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. ► ఒకే ప్రాజెక్టుకు సంబంధించిన సమీక్ష చేయాలన్నా, ఏదైనా నిర్ణయం అమలు చేయాలన్నా అందరూ ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లతో మాట్లాడాల్సిందే. గతంలో మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రత్యేక విభాగాల వారీగా పర్యవేక్షించేవారు. ఇప్పుడు అన్ని ప్రాజెక్టులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతో క్షేత్రస్థాయిలో ఆయా ప్రాజెక్టుల నిర్వహణలో గందరగోళం ఏర్పడింది. ► మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి నిర్వహణలోపం కూడా ఒక కారణంగా తేల్చగా, నిర్వహణను ఓఅండ్ఎం విభాగానికి అప్పగించారా? లేదా? అన్న దానిపై స్పష్టత కొరవడింది. డిఫెక్ట్ లయబిలిటీ కాలం పూర్తయ్యిందని, నిర్మాణ సంస్థ పట్టించుకోలేదని, నిర్మాణ సంస్థదే బాధ్యత అని నీటిపారుదలశాఖ నిర్లక్ష్యం చేసిందని ఆరోపణలున్నాయి. -
రూ. 37 వేల కోట్లు కేటాయించండి
సాక్షి, హైదరాబాద్: రానున్న ఆర్థిక సంవత్సరం (2024–25)లో నీటిపారుదల రంగానికి రూ.37 వేల కోట్లను కేటాయించాలని ఆ శాఖ ప్రతిపాదించింది. మంగళవారం నీటిపారుదల శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. 2024– 25లో కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల నిమిత్తం రూ.14,462.17 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, ఇది కాక రూ.3000 కోట్లను తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ కింద తీసుకున్న రుణాలకు చెల్లింపులున్నాయని అధికారులు నివేదించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టును సృష్టించేలా ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులకు ప్రాధాన్యం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ ప్రాజెక్టు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు, రాజీవ్ బీమా, కోయిల్‌సాగర్, నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం, చిన్నకాళేశ్వరం (ముక్తేశ్వర్), మొడికుంటవాగు, సీతారామ ఎత్తిపోతల పథకం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఇందిరమ్మ వరద కాలువ, పెద్దవాగు (జగన్నాధపూర్), చనాకా కొరాటా, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాలకు ప్రాధా న్యం ఇవ్వనున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ(జనరల్) మురళీధర్ రావు పాల్గొన్నారు. విద్యుత్ సంస్థల్లో సమ్మె నిషేధం.. విద్యుత్ సంస్థల్లో మరో ఆరు నెలలపాటు ఎలాంటి సమ్మెలు చేయకుండా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్‌కో, జెన్కో, దక్షిణ, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థల్లో సమ్మెను నిషేధిస్తూ ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మూడు బ్యారేజీలూ ప్రమాదంలోనే..
సాక్షి, హైదరాబాద్: స్వతంత్ర భారత చరిత్రలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అంత నిర్లక్ష్యంగా నిర్మించిన ప్రాజెక్టు మరోటి లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లోనే లోపం ఉందని ప్రాథమికంగా సమాచారం ఉందన్నారు. అలాగే, దాని నిర్మాణం, నిర్వహణ కూడా పూర్తి నిర్లక్ష్య పూరితంగా జరిగాయని చెప్పారు. శనివారం ఆయన సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి మీడియాతో మాట్లాడారు. రూ. 94వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రాజెక్టు 40వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇస్తుందని కాగ్ రిపోర్టు చెబుతోందని, అది కూడా కూలిపోయే స్థితికి చేరుకుందని ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు వ్యాప్కో సంస్థ డిజైన్ చేసిందని, అందులో రూ.38వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు డిజైన్ చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మూడు బ్యారేజీలూ ప్రమాదంలోనే ఉన్నాయన్నారు. కాళేశ్వరం అంటే ఈ మూడు బ్యారేజీలు మాత్రమేనని, వీటినే బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందని, పైనున్న ఎల్లంపల్లి, మిడ్ మానేరు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినవేనని వివరించారు. అన్నారం బ్యారేజీ తీవ్రంగా దెబ్బతిందని, డ్యామేజీతోపాటు నిర్లక్ష్యం కూడా చోటుచేసుకుందని, వీటికి సంబంధించిన ఫొటోలు త్వరలోనే విడుదల చేస్తామని ఉత్తమ్‌కుమార్ చెప్పారు. కృష్ణా బోర్డుకు అప్పగించలేదు కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు ఇస్తామని ఎలాంటి హామీ ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే కృష్ణానీటి దుర్వినియోగం జరిగిందని, వాళ్ల తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు ప్రచారం ప్రారంభించారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కేఆర్ఎంబీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒప్పందం చేసుకుందని దు్రష్పచారం చేయడం సిగ్గుచేటన్నారు. గత డిసెంబర్ 7న తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టుల స్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రాష్ట్రానికి కృష్ణా నీటి వాటా ఎందుకు తగ్గిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వారు చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో ముఖ్యమంత్రి రేవంత్, తాను సమావేశమైనప్పుడు కేఆర్ఎంబీపై య«థాతథస్థితి కొనసాగించాలని చెప్పినట్లు తెలిపారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి ప్రజల ముందు పెట్టనున్నట్లు చెప్పారు. కాళేశ్వరంపై పలు విచారణలు సాగుతున్నాయని, పూర్తి వివరాలతో నిపుణులే మాట్లాడతారన్నారు. విధ్వంసక మైండ్ సెట్ ఉన్నోళ్లే కరెంట్ బిల్లు కట్టొద్దని అంటున్నారని, విద్యుత్ శాఖలో రూ.వేలకోట్ల అప్పులు చేసి బిల్లులు కట్టొద్దని మాట్లాడటం శోచనీయమని అన్నారు. -
మీ కౌంటర్లో పస లేదు!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై క్షేత్ర స్థాయిలో పర్యటించి తాము సమర్పించిన నివేదికలోని అంశాలను ఖండిస్తూ గత డిసెంబర్ 7న నీటిపారుదల శాఖ పంపించిన నివేదికలో ఎలాంటి పస లేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్ఏ) తేల్చి చెప్పింది. బ్యారేజీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అదనపు సమాచారం సైతం అసంపూర్తిగానే ఉందని స్పష్టం చేసింది. సాధ్యమైనంత త్వరగా మిగిలిన సమాచారాన్ని పంపించాలని కోరింది. ఈ మేరకు ఎన్డీఎస్ఏ డైరెక్టర్ రాహుల్ కుమార్ ఈ నెల 12న రాష్ట్ర నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలోని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్(ఎస్డీఎస్ఓ)కు లేఖ రాశారు. ‘నాణ్యత’పై గోప్యత ఎందుకు ..? బ్యారేజీ నిర్మాణ సమయంలో నాణ్యతా పర్యవేక్షణకు తీసుకున్న చర్యలు, ప్రత్యేకించి థర్డ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నాణ్యతాపర్యవేక్షణకు సంబంధించిన సమాచారాన్ని సైతం అందించలేదని ఎన్డీఎస్ఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంతో కీలకమైన ఈ సమాచారాన్ని సమగ్రంగా విశ్లేíÙంచిన తర్వాతే బ్యారేజీ పియర్లు కుంగడానికి కారణాలు తెలుస్తాయని పేర్కొంది. బ్యారేజీ పునరుద్ధరణకు తదుపరిగా తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించడానికి నిర్ణయించడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. పొంతన లేని విభాగాల డ్రాయింగ్స్ భూగర్భంలో రాతిపొరల నిర్మాణ క్రమాన్ని తెలియజేసే ‘జియోలాజికల్ సెక్షన్’డేటాను, ప్రత్యేకించి బ్యారేజీకి సంబంధించి ఒక్కో విభాగానికి సంబంధించిన ‘సెక్షనల్ డ్రాయింగ్’ను వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎన్ఏకు సమర్పించింది. వీటిపై అధ్యయనం తర్వాత బ్యారేజీ పునాదుల కింద నుంచి ప్రవహించాల్సిన నీళ్లకు భూగర్భంలో నిర్మించిన కటాఫ్ గోడలు అడ్డుగా ఉన్నట్టు భావన కలుగుతోందని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. మరోవైపు ప్రాజెక్టు అధికారులు సమర్పించిన ‘డిజైన్ కాలిక్యులేషన్స్’మాత్రం బ్యారేజీ కింద భూగర్భంలో ప్రవాహానికి కటాఫ్ గోడలు అడ్డంకిగా లేవని స్పష్టం చేస్తున్నాయని ఎన్డీఎస్ఏ పేర్కొంది. ప్రాజెక్టు అధికారులు సమర్పించిన వేర్వేరు రకాల సమాచారాన్ని విశ్లేషించి, పరస్పర విరుద్ధమైన అభిప్రాయానికి ఎన్డీఎస్ఏ వచ్చింది. ప్రాజెక్టు డిజైన్‌కు సంబంధించి కీలకమైన ఈ అంశంపై మరింతగా పరిశీలన కోసం ..ప్రత్యేకించి బ్యారేజీ విభాగాల డ్రాయింగ్స్(సెక్షనల్ డ్రాయింగ్స్)ను జియోలాజికల్ వివరాలతో సహా అందజేయాలని విజ్ఞప్తి చేసినా ఇంత వరకు అందజేయలేదని ఎన్డీఎస్ఏ పేర్కొంది. మళ్లీ ఎన్డీఎస్ఏ బృందాన్ని పంపిస్తాం... ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని దారిమళ్లించి, బ్యారేజీ కుంగిన ప్రాంతం వద్ద ఉండే నీటి నిల్వలను తోడేసిన తర్వాత తమకు తెలియజేయాలని ఎన్డీఎస్ఏ సూచించింది. అలా తెలిపిన వెంటనే కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం వచ్చి వాస్తవాలను తెలుసుకోవడానికి తొలి పరిశీలన చేస్తుందంటూ నివేదికలో పేర్కొన్న అంశాన్ని ఎన్డీఎస్ఏ మళ్లీ గుర్తు చేసింది. బ్యారేజీ కుంగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే దర్యాప్తు అంశాలను సైతం తమకు తెలియజేయాలని కోరినట్టు పేర్కొంది. ఈ రెండు విషయాల్లో ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారాన్ని అందించలేదని తెలిపింది. -
మేడిగడ్డపై విజిలెన్స్
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం/తిమ్మాపూర్(మాన కొండూర్)/కరీంనగర్‌క్రైం/జ్యోతినగర్(రామగుండం): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిన అంశంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఆధ్వర్యంలో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంగళవారం ఈ విషయం వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మంగళవారం ఉదయం నుంచే రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లోని జలసౌధ సహా రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల శాఖకు సంబంధించిన 10 కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించి విస్తృత తనిఖీలు జరిపాయి. క్షేత్ర స్థాయిలో డివిజనల్, సర్కిల్ కార్యాలయాలతో పాటు ఈఎన్సీ, సీఈ, ఎస్ఈల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి ఫైళ్లు, రికార్డులు స్వాధీనం చేసుకున్నాయి. జలసౌధలో 50 మంది అధికారులు హైదరాబాద్ జలసౌధలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు సుమారు 50 మంది విజిలెన్స్ అధికారులు వేర్వేరు బృందాలుగా విడిపోయి ఫైళ్లను తనిఖీ చేశారు. ఒకటో అంతస్తులో ఉండే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్, గజ్వేల్ ఈఎన్సీ బి.హరిరామ్ క్యాంప్ కార్యాలయం, రెండో అంతస్తులో నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్ స్వీయ పర్యవేక్షణ కింద ఉండే కీలకమైన ప్రాజెక్టు అండ్ మానిటరింగ్ (పీఅండ్ఎం), హైడ్రాలజీ విభాగాల్లో తనిఖీలు జరిగాయి. అలాగే ఐదో అంతస్తులోని రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు క్యాంప్ కార్యాలయం, ఆరో అంతస్తులోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్స్ (సీడీఓ), క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ల కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. మేడిగడ్డతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌస్‌లకు సంబంధించిన ఫైళ్లను కూడా అధికారులు జప్తు చేసి తీసుకెళ్లారు. సీడీఓ సీఈ కార్యాలయం నుంచి బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల డిజైన్లు, డ్రాయింగ్స్‌ను పట్టుకెళ్లారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు తొలి దశ కింద చేపట్టిన రెండు టీఎంసీల ప్రాజెక్టు పనులతో పాటు మూడో టీఎంసీ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లను తీసుకెళ్లారు. మొత్తం అన్ని సర్వేలు, వ్యయ అంచనాలు, డీపీఆర్ తయారీ, టెండర్ల నిర్వహణ, కాంట్రాక్టర్లతో చేసుకున్న ఒప్పందాలు, పనుల్లో నాణ్యతా పర్యవేక్షణ, నిర్వహించిన పరీక్షలు, బిల్లుల చెల్లింపులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాల వినియోగం తదితర అంశాలకు సంబంధించిన ఫైళ్లను కూడా పట్టుకెళ్లారు. రాకపోకలు బంద్..సెల్ఫోన్ల స్వాదీనం తనిఖీల సమయంలో లోపలి వ్యక్తులు బయటికి వెళ్లేందుకు, బయటి వ్యక్తులు లోనికి వచ్చేందుకు అధికారులు అనుమతించలేదు. అలాగే తనిఖీలకు సంబంధించిన సమాచారాన్ని బయటకు చెప్పకుండా అధికారుల ఫోన్లను స్వాదీనం చేసుకున్నట్టు సమాచారం. కుంగిన పియర్ల పరిశీలన ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మహదేవపూర్ డివిజన్ కార్యాలయానికి చేరుకున్న అధికారులు మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పియర్లను పరిశీలించారు. మరో బృందం కన్నెపల్లిలోని లక్ష్మీపంపుహౌస్ మునిగిన ప్రాంతం, కంట్రోల్ రూమ్‌ను పరిశీలించింది. పలు కీలక రికార్డులు స్వా«దీనం చేసుకున్న అధికారులు.. ప్రాజెక్టు డీపీఆర్, సీడబ్ల్యూసీ క్లియరెన్స్‌లు, బ్యారేజీ, పంపుహౌస్‌ల డ్రాయింగ్, డిజైన్లు తదితర వివరాలు స్థానిక అధికారులను అడిగారు. నిర్మాణ పనులు పూర్తయిన సర్టిఫికెట్స్, భూమి అక్విటెన్స్ స్థితి, ప్రస్తుత పనులపై కూడా ఆరా తీశారు. నీటి విడుదల, విద్యుత్ వినియోగ వివరాలు, అధికారుల బదిలీల వివరాలు, ఫిర్యాదులు, ఆర్టిలతో తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. రాత్రి పొద్దుపోయే వరకు విచారణ కొనసాగింది. మరోవైపు తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో కరీంనగర్ విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఇవి కూడా రాత్రి 10 గంటల వరకు కొనసాగాయి. మరోవైపు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ కార్యాలయాల్లో సోదాలు కొనసాగాయి. స్థానికంగా పలు ఇంజనీరింగ్ విభాగాల కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. కాగా బుధవారం కూడా తనిఖీలు కొనసాగుతాయని ఎస్పీ రమణారెడ్డి తెలిపారు. హైకోర్టు సీజేకు ప్రభుత్వం లేఖ గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన 7వ బ్లాకు కుంగిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) ఆధ్వర్యంలోని బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి డిజైన్, నిర్మాణం, నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ లోపాలతోనే బ్యారేజీ కుంగిందని నివేదిక సమర్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. దీనిపై వారం రోజుల్లో న్యాయ విచారణకు ఆదేశిస్తామని ఇటీవల రాష్ట్ర శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర మంత్రివర్గ భేటీలో కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే మేడిగడ్డపై విచారణ కోసం సిట్టింగ్ జడ్జి ఒకరిని కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ గతంలోనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది. నేడు ముఖ్యమంత్రి సమీక్ష కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. న్యాయ విచారణ విషయమై గతంలోనే నిర్ణయం తీసుకోగా, తాజాగా విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి మూలకారణాలు తెలుసుకోవడం, బ్యారేజీ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు, బుంగలు ఏర్పడిన అన్నారం బ్యారేజీతో పాటు సుందిళ్ల బ్యారేజీల్లో లోపాలను గుర్తించడానికి నిర్వహించాల్సిన పరీక్షలు.. తదితర అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
మేడిగడ్డ బ్యారేజీ.. వాటిని కూల్చాల్సిందే
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన 7వ నంబర్ బ్లాక్‌లోని 18, 19, 20వ నంబర్ పియర్లు, వీటికి సంబంధించిన 3 రేడియల్ గేట్లు, 3 స్లాబులను పూర్తిగా కూల్చి వేయాల్సిందేనని నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ స్పష్టం చేశారు. కూల్చివేతకు డైమండ్ వైర్ కటింగ్, డ్రిల్ అండ్ బ్లాస్ట్, డ్రిల్ అండ్ వన్ టైం బ్లాస్ట్ అనే 3 ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. బ్యారేజీ మిగతా స్ట్రక్చర్‌కు నష్టం జరగకుండా దెబ్బతిన్న బ్లాక్‌లోని వించ్, వాక్ వే –1, యాక్సెస్ లా డర్, గంట్రీ ట్రాక్ గ్రైడర్, గాంట్రీ బీమ్వంటి భాగాలను అ త్యంత జాగ్రత్తగా తొలగించాల్సి ఉంటుందన్నారు. నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన మంత్రుల బృందానికి, మేడిగడ్డ బ్యారేజీ వద్ద పైన పేర్కొన్న అంశాలపై మురళీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రెండు నెలల్లోగా బుంగల పూడ్చివేత కొత్త బ్లాక్ కట్టడం కంటే కూల్చి వేతకు అధిక సమయం పడుతుందని ఈఎన్సీ చెప్పారు. డైమండ్ వైర్ కటింగ్ టెక్నాలజీతో కూల్చివేత పనులు చేపట్టాలని భావిస్తున్నా, ఇందుకు చాలా సమయం పడుతుందన్నారు. డ్రిల్ అండ్ బ్లాస్ట్ పద్ధతిని వినియోగిస్తే పక్కనే ఉన్న ఇతర బ్లాకులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు ఏర్పడిన బుంగలను రెండు నెలల్లోగా గ్రౌటింగ్ ద్వారా పూడ్చి వేస్తామని, నిర్మాణ సంస్థలే వ్యయాన్ని భరిస్తాయని ఈఎన్సీ చెప్పారు. బ్యారేజీకి త్వరలో పరీక్షలు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనకు కారణాలను తెలుసుకోవడానికి త్వరలో గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సర్వే, ఎలక్ట్రికల్ రెసెస్టివిటీ పరీక్షలను నిర్వహించనున్నట్లు మురళీధర్ తెలిపారు. బ్యారేజీ పునాదుల కింద జరిగిన మార్పులను, ఏర్పడిన లోపాలను తెలుసుకోవడానికి ఈ పరీక్షలతో వీలుంటుందన్నారు. ఏడవ బ్లాక్‌లోని పియర్ల పునరుద్ధరణ కోసం నిర్మిస్తున్న కాఫర్ డ్యామ్ పనులు వారం రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈఎన్సీ చెప్పిన మరికొన్ని ముఖ్యాంశాలు.. ♦ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.1.28 లక్షల కోట్లు ♦ ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.93,800 కోట్లు ♦ 2 టీఎంసీల నీటి ఎత్తిపోతలకు ఐదు వేల మెగావాట్ల కరెంటు ♦ మూడో టీఎంసీ పనులు చేస్తే 8,450 మెగావాట్ల కరెంటు ♦ ఐదేళ్లలో కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసింది 173 టీఎంసీలు ♦ ప్రాజెక్టు కింద సాగైంది 98,570 ఎకరాలు (నిర్మాణం పూర్తయ్యాక ఇచ్చిన నీరు స్థిరీకరణకు మాత్రమే) ♦ మూడో టీఎంసీ కోసం రూ.33,400 కోట్లతో ప్రతిపాదన ♦ ఏడాదిన్నరగా రూ.3 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి ♦ పాలమూరు ప్రాజెక్టుకు కాళేశ్వరం పేరుతో అప్పులు డైమండ్ వైర్ కటింగ్ అంటే.. మేడిగడ్డ ఏడవ బ్లాక్‌లోని మూడు పియర్లు, స్లాబులు తొలగించేందుకు డైమండ్ వైర్ కటింగ్ విధానాన్ని అవలంభించాలని ఇంజనీర్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పక్కనున్న పియర్లు, పైనున్న ఇతర స్లాబులకు ఎలాంటి నష్టం జరగకుండా తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఇది అధిక వ్యయంతో కూడిన, ఎక్కువ సమయం పట్టే విధానమని చెబుతున్నారు. ఈ విధానంలో.. వజ్రాల పొడి పొదిగిన లోహపు వైర్ రంపం వినియోగించి కాంక్రీట్ దిమ్మెలను కట్ చేస్తారు. దీనివల్ల ఎలాంటి ప్రకంపనలకు తావుండదు. ఎలాంటి పేలుడు పదార్థాలు ఉపయోగించరు. కాబట్టి పక్కన, పైన ఉన్న దిమ్మెలకు నష్టం వాటిల్లదు. -
ఆయకట్టు ఎకరా పెరగలేదు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని రాష్ట్ర మంత్రులు ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ వల్ల ఎకరా ఆయకట్టు అదనంగా పెరగలేదని, కేవలం వ్యయం మాత్రమే పెరిగిందని విమర్శించారు. రాష్ట్ర సచివాలయంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్లో గురువారం ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులపై ఇరిగేషన్ అధికారులతో భట్టి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సీతారామకు పర్యావరణ అనుమతులు రావాలి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.2,400 కోట్లతో చేపట్టిన ఇందిరా, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టుల అంచ నా వ్యయాన్ని రీ డిజైనింగ్ పేరిట రూ.13 వేల కో ట్లకు ఎందుకు పెంచాల్సి వచ్చిందని భట్టి విక్రమా ర్క అధికారులను ప్రశ్నించారు. అదనంగా ఆయక ట్టు పెరిగిందా? అని ప్రశ్నించగా, పెరగలేదని అధికారులు బదులిచ్చారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇందిరా సాగర్ ప్రాజెక్టును రీ డిజైనింగ్ చేశామని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బ్యారేజీ నిర్మాణానికి ఇంకా పర్యావరణ అనుమతులు రావాల్సి ఉందని, రెండు నెలల్లో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రాజెక్టులపై నివేదికలు ఇవ్వండి గత ప్రభుత్వం రూ.వేల కోట్లతో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడంతో ప్రజలపై భారం పడిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ఆరు నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులు, ఏడాదిలోగా పూర్తయ్యేవి, 18 నెలల్లోగా పూర్తయ్యేవి, 24 నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులు గుర్తించి, వాటి కావాల్సిన బడ్జెట్ అంచనా వ్యయాన్ని రూపొందించి వెంటనే నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖలో ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లను వెంటనే నిలిపివేయాలని, వర్క్ అలాట్మెంట్ చేసిన వాటిని కూడా ఆపి వేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం రీడిజైనింగ్ చేసిన సీతారామ ప్రాజెక్టు విషయంలో వెనక్కి పోలేము, ముందుకు పోలేమన్నట్టుగా ఉందని ఉత్తమ్ అన్నారు. బ్యారేజీ హెడ్ వర్క్ నుంచి చివరి కెనాల్ వరకు ఫేజ్‌ల వారీగా జరిగిన పనుల గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరా తీశారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి గత ప్రభుత్వ హయాంలో నల్లగొండ జిల్లా రైతులకు సాగునీటిని అందించేందుకు కనీస ప్రయత్నం కూడా జరగలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు, ఉదయ సముద్రం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదని ఈఎన్సీ మురళీధర్‌ను ప్రశ్నించారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సింగరాజుపల్లి రిజర్వాయర్, పాకాల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గొట్టెముక్కుల రిజర్వాయర్, పిల్లాయిపల్లి కెనాల్, నెల్లికల్ లిఫ్ట్ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయాయని అన్నారు. నల్లగొండ జిల్లా ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన అనుమతులు, నిధులు తీసుకొస్తానని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సస్యశ్యామలం కావాలంటే గత ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టుల పనులు ఆపకుండా త్వరగా పూర్తి చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. -
కాళేశ్వరంపై విచారణకు ఆదేశిస్తాం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు, నిర్మాణంలో లోపాలపై రాష్ట్ర మంత్రివర్గం ఆదేశాల మేరకు విచారణకు ఆదేశిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు అన్నారం బ్యారేజీలో బుంగలు ఏర్పడిన నేపథ్యంలో.. వాటిని డిజైన్ చేసిన, నిర్మించిన వారిని బాధ్యులుగా చేసి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై సవివరంగా లిఖితపూర్వక వివరణ సమర్పించాల్సిందిగా నీటిపారుదల శాఖను ఆదేశించినట్టు తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారిగా సోమవారం జలసౌధకు వచ్చిన మంత్రి.. శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై ఈఎన్సీ సి.మురళీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరణ ఇచ్చారు. సమీక్ష అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ప్రతి ప్రాజెక్టుపై సమగ్ర నివేదికకు ఆదేశం నీటిపారుదల శాఖలో భారీ అవినీతి జరిగిందని, ప్రాజెక్టుల నిర్మాణంలో గోప్యత పాటిస్తున్నారని, రహస్య జీవోలు ఇచ్చారంటూ అనేక ఆరోపణలున్నాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఇకపై శాఖ పనితీరు పారదర్శకంగా ఉండాలని, సమర్థతను పెంచుకోవాలని అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ వ్యయం, ప్రతిపాదిత ఆయకట్టు వంటి అంశాలపై సరైన అధ్యయనాలు లేకుండానే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని విమర్శించారు. కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.లక్ష కోట్లను ఖర్చు చేసినా, ఆయకట్టుకు నామమాత్రంగానే సాగునీరు లభిస్తోందన్నారు. ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన 32 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి ప్రాజెక్టు కింద స్థిరీకరించిన కొత్త ఆయకట్టు, ప్రాజెక్టుల నిర్వహణకు కానున్న విద్యుత్ చార్జీల వ్యయం ఇతర అంశాలపై సమగ్ర నివేదిక కోరామన్నారు. ప్రాణహిత–చేవెళ్ల చేపడతాం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం పక్కన పెట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును మళ్లీ చేపడతామని చెప్పారు. ప్రాణహితపై తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలనే అంశంపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను సత్వరంగా పూర్తి చేస్తామని చెప్పారు. సీఎంతో పాటు, మంత్రివర్గంలో చర్చించి ఎస్ఎల్బీసీ సొరంగం పనుల బిల్లులు విడుదల చేస్తామన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. మంత్రిగా ఈ నెల 14న బాధ్యతలు స్వీకరిస్తానని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. సమీక్షలో ఈఎన్సీలు బి.నాగేందర్ రావు, హరిరామ్, అనిల్‌కుమార్, సీఈలు హమీద్‌ఖాన్, అజయ్‌కుమార్ పాల్గొన్నారు. స్మితా సబర్వాల్ గైర్హాజరు జలసౌధలో జరిగిన సమీక్షకు ఆ శాఖ ఇన్చార్జి కార్యదర్శి స్మితా సబర్వాల్ గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి జలసౌధకు వస్తున్నారనే విషయాన్ని ఆమెకు తెలియజేసినట్టు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్మిత కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. -
‘సాగర్’లో సగం ఏపీ స్వాధీనం
సాక్షి, అమరావతి/సాక్షి, నరసరావుపేట/మాచర్ల/విజయపురిసౌత్ :కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో నాలుగున్నరేళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాష్ట్రానికి హక్కుగా దక్కిన జలాల వినియోగం విషయంలో ఇప్పుడు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతో సహా కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఆధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. దీంతో గురువారం తెల్లవారుజామున సీఈ మురళీనాథ్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర పోలీసులు, జలవనరుల శాఖాధికారులు నాగార్జునసాగర్‌కు చేరుకున్నారు. అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు వాస్తవాలను వివరించి.. రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతో పాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో సీఎం జగన్ రాజీలేని పోరాటం చేస్తున్నారనడానికి ఇది మరో తార్కాణమని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. తెలంగాణ తొండాట.. నిజానికి.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అక్టోబరు 6న కృష్ణా బోర్డు రాష్ట్రానికి 30 టీఎంసీలు కేటాయించింది. ఇందులో ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 15 టీఎంసీలను నాగార్జునసాగర్‌కు తెలంగాణ సర్కార్ తరలించింది. మాకు కేటాయించిన ఆ 15 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువ ద్వారా విడుదల చేయాలని ఏపీ అధికారుల విజ్ఞప్తులను తెలంగాణ సర్కార్ పట్టించుకోవడంలేదు. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి. నారాయణరెడ్డిలు వివరించారు. వాస్తవానికి.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తమ భూభాగంలో ఉందని ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ సర్కార్ తన ఆధీనంలోకి తీసుకుంది. ఇదే తరహాలో ఏపీ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతో సహా కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర హక్కులు తెలంగాణకు చంద్రబాబు తాకట్టు.. ♦ విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చేసేందుకు విభజన చట్టం ద్వారా 2014లో కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. దీని పరిధిని నోటిఫై చేసేదాకా ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలంను ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ సర్కార్ నిర్వహించాలని నిర్దేశించింది. ♦ దీంతో సాగర్‌ను 2014–15లో పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్న తెలంగాణ సర్కార్.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందనే సాకు చూపి దాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అదే సాకు చూపి పులిచింతల విద్యుత్కేంద్రాన్ని సైతం తన ఆధీనంలోకి తీసుకుంది. అయినాసరే.. నాటి సీఎం చంద్రబాబు ఇటు రాష్ట్రంలో.. అటు తెలంగాణలో టీడీపీని బతికించుకోవాలన్న రెండు కళ్ల సిద్ధాంతంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారు. ♦ ఇక శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తరలించవచ్చు. నీటి మట్టం 854 అడుగుల స్థాయిలో ఉంటే ఆరేడు వేల క్యూసెక్కులు మాత్రమే తరలించడానికి సాధ్యమవుతుంది. అంతకంటే తగ్గితే.. శ్రీశైలంలో నీటి కోటా ఉన్నా సరే సీమ అవసరాల కోసం నీటిని వినియోగించలేని దుస్థితి. కానీ, శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నుంచే రోజుకు 4 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. దిగువన నీటి అవసరాలు లేకున్నా.. కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే ఎడమ గట్టు కేంద్రం నుంచి యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ.. శ్రీశైలంలో నీటిమట్టం తగ్గేలా తెలంగాణ సర్కార్ చేస్తోంది. తద్వారా శ్రీశైలంలో రాష్ట్ర వాటా జలాలు వినియోగించుకోకుండా చేస్తోంది. ♦ శ్రీశైలం నుంచి 2015లో ఇదే రీతిలో సాగర్‌కు తెలంగాణ తరలించిన నీటిని.. కుడి కాలువ కింద సాగు అవసరాల కోసం విడుదల చేయాలని అప్పటి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ చేసిన విజ్ఞప్తిని తెలంగాణ అధికారులు తోసిపుచ్చారు. దీంతో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకునేందుకు 2015, ఫిబ్రవరి 13న ఆదిత్యనాథ్ దాస్ పోలీసులతో కలిసి సాగర్‌కు చేరుకున్నారు. కానీ, తక్షణమే వెనక్కి రావాలని ఆదిత్యనాథ్ దాస్‌ను చంద్రబాబు ఆదేశించారు. తద్వారా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను ఆయన తెలంగాణకు తాకట్టు పెట్టారు. ♦ శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచే రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలతోపాటు కల్వకుర్తి, నెట్టెంపాడుల సామర్థ్యం పెంచి.. సుంకేశుల బ్యారేజ్ జలవిస్తరణ ప్రాంతంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల, భక్తరామదాస ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టింది. కృష్ణా జలాలపై ఏపీ హక్కులను హరించి వేస్తున్నా ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు వాటిని తెలంగాణ సర్కార్‌కు చంద్రబాబు తాకట్టు పెట్టారు. సాగర్ నుంచి నీరు విడుదల గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో తీరనున్న తాగునీటి కష్టాలు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వలన తాగునీరు లేక మూడు జిల్లాల చెరువులు, భూగర్భ జలాలు తగ్గిపోయి ప్రజలు మంచినీటికి అల్లాడుతున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఊపిరిపోసింది. ఏపీ భూభాగంలోని 13 గేట్లను, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు స్వాధీనం చేసుకుని కుడికాలువ రెండు గేట్ల ద్వారా 2,300 క్యూసెక్కుల నీటిని గురువారం విడుదల చేశారు. అంతకుముందు.. భారీ స్థాయిలో ఏపీ పోలీసులు అక్కడ మోహరించారు. కుడికాలువపై పట్టు సాధించే క్రమంలో డ్యాంపై ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తెలంగాణ పోలీసులు ఏపీ జలవనరుల శాఖ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. దీంతో ఏపీ పోలీసులు శాంతియుత వాతావరణంలోనే వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం.. సాగర్ డ్యాంపై ఏపీకి చెందిన భూభాగంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన గేట్లను దాటి సగభాగం వరకు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఏపీ పరిధిలోని 13 క్లస్టర్ గేట్ల వరకు బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఈ చర్యలతో నాగార్జునసాగర్‌లో ఏపీ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షించినట్లయ్యింది. మరోవైపు.. నీరు విడుదల చేసి ప్రజల దాహార్తిని తీర్చేందుకు సీఎం జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఆ జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. హక్కుల పరిరక్షణకు సీఎం జగన్ రాజీలేని పోరాటం.. ఇక వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ అక్రమ ప్రాజెక్టులను నిలిపేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాల కోసం తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌లోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తడంతో.. దాన్ని పరిష్కరించడానికి 2020, అక్టోబర్ 6న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రానికి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని స్పష్టంచేసిన సీఎం జగన్.. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని డిమాండ్ చేయడమే కాక.. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ♦ శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాకుండానే 2021లో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి ప్రారంభించి.. సాగర్‌కు తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీచేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం వైఎస్ జగన్ న్యాయపోరాటానికి దిగారు. కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ♦ దీంతో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021, జూలై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్‌లలో రాష్ట్ర భూభాగం పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంకాగా.. తెలంగాణ నిరాకరించింది. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రాష్ట్రానికి అప్పగించాలని.. లేదంటే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని జగన్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. 1,311 మంది పోలీసులతో బందోబస్తు ఇక నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశమున్న నేపథ్యంలో.. ఏపీ పోలీసు శాఖ భారీ సంఖ్యలో పోలీసులను మోహరించింది. గుంటూరు రేంజ్ ఐజి పాల్‌రాజ్, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, ఎస్పీ రవీంద్రబాబుల ఆ«ధ్వర్యంలో 1,311 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. సాగర్ వద్ద పరిస్థితులు చక్కబడే వరకు వీరు అక్కడే ఉండే అవకాశముంది. -
‘మేడిగడ్డ’పై కేసీఆర్ స్పందించరేం?
సాక్షి, హైదరాబాద్: ‘2014 నుంచి 2018 వరకు హరీశ్‌రావు దగ్గర నీటిపారుదల శాఖ ఉంది. 2019 నుంచి ఇప్పటివరకు కేసీఆర్ దగ్గరే ఆ శాఖ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై ఇంత చర్చ జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు నోరు మెదపట్లేదు? బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ఆయన ఎందుకు ఆలోచిస్తున్నారు? మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన విషయంలో మాట్లాడేందుకు సీఎం కేసీఆర్ ప్రజల ముందుకు రావాలి’అని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ. రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం గాంధీ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ ప్రకారం నిర్మాణం, నిర్వహణ జరగలేదని... కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం బలైందని, మేడిగడ్డ కుంగిందని ఆరోపించారు. తన మేధస్సుతో కాళేశ్వరం నిర్మాణం జరిగిందని చెప్పుకున్న కేసీఆర్... ఇప్పుడు జరిగిన ఘటనను చిన్నదిగా చూపి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. నిర్మాణంలో నాణ్యత పాటించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం ప్రాజెక్టు బలి అయిపోయిందన్న రేవంత్... కేసీఆర్‌ను ఓ ఆర్థిక ఉగ్రవాదిగా అభివర్ణించారు. కేసీఆర్ కుటుంబమే ఆర్థిక ఉగ్రవాద కుటుంబమని, ఈ ఉగ్రవాదులను కేంద్రం శిక్షించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో జరిగిన వేల రూ. కోట్ల అవినీతిపై కేంద్రం ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. కేంద్రం వెంటనే సీబీఐతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాని మోదీ మౌనమేల? కేంద్ర జలశక్తి పరిధిలో ఉండే కమిటీ మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో తప్పు జరిగిందని చెప్పిందని, అవినీతిపరులను వదలనని చెప్పే ప్రధాని మోదీ ఈ కమిటీ నివేదిక వచ్చాక కూడా మౌనంగా ఎందుకు ఉంటున్నారని రేవంత్ ప్రశ్నించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని అడిగితే తాము అధికారంలోకి వచ్చాక తీసుకుంటామని అంటున్నారని, అంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని... కేసీఆర్‌పై చర్యలు తీసుకోబోమని చెప్పదలుచుకున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణకు సంబంధం లేని ఇతర రాష్ట్రాల అధికారులతో సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో కమిటీ వేసి కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదిక తెప్పించుకోవాలని, ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. 2014–2023 వరకు కాళేశ్వరం నిర్మాణం వెనుక హరీశ్, కేసీఆర్ ఉన్నందున వారిని పదవుల నుంచి తొలగించాలన్నారు. కాళేశ్వరం అంచనాలు, పెంచిన వ్యయంపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే డిసెంబర్ 9 తర్వాత ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని రేవంత్ స్పష్టం చేశారు. -
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాల్లేవు
సాక్షి, హైదరాబాద్: ఇసుకపై పునాదులు వేసి కట్టే బ్యారేజీల్లో సమస్యలు సహజమేనని, మేడిగడ్డ బ్యారేజీ డిజైన్, నిర్మాణంలో సమస్యల్లేవ ని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్‌కుమార్ స్పష్టం చేశారు. బ్యారేజీ డిజైన్‌లో లోపాలుంటే ఎప్పుడో కొట్టుకుపోయేదన్నా రు. మేడిగడ్డ బ్యారేజీ ఘటనపై ఆయన శుక్రవారం జలసౌధలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గతంలో ఫరక్కా, ధవళేశ్వరం బ్యారేజీల్లోనూ సమస్యలు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మోనోలిథిక్ డిజైన్‌తో బ్యారేజీ నిర్మించారని, గతేడాది భారీ వరదలను కూడా బ్యారే జీ తట్టుకుందని రజత్‌కుమార్ చెప్పారు. బ్యారేజీ మొత్తం ఎనిమిది బ్లాకులతో నిర్మిస్తే అందులో 7వ బ్లాకులోని పియర్ నంబర్ 16, 17, 18, 19, 20, 21లలో సమస్యలు ఉత్పన్నం అయ్యాయన్నారు. తొలుత కాఫర్ డ్యామ్ నిర్మించి ఎగువ ప్రాంతాల నుంచి వరదను మళ్లిస్తామని... ఆ తర్వాత చుట్టూ రింగ్ మెయిన్ నిర్మించి పియర్ల కుంగుబాటుకు గల కారణాలను గుర్తించాకే మరమ్మతు పనులు ప్రారంభిస్తామని ఆయన వివరించారు. బ్యారేజీ నిర్మాణం రివర్‌బెడ్‌పై జరగడం, ఇసుకపైనే పునాదులు ఉండటం వల్ల సమస్యలు వస్తాయన్నారు. పియర్ల కింద ఇసుక కదలడం వల్లే కుంగినట్లు చెప్పారు. మరమ్మతులకు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అనుమతించాలని తెలిపారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కోరిన వివరాలను సమర్పించినట్లు చెప్పారు. సమావేశంలో ఈఎన్సీ (సాధారణ) మురళీధర్, ఈఎన్సీ (పరిపాలన) అనిల్‌కుమార్, ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేంద్రరావు, ఈఎన్సీ (రామగుండం) నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్సీ (కరీంనగర్) శంకర్, నీటిపారుదల అదనపు కార్యదర్శి భీం ప్రసాద్, సీడీవో సీఈ మోహన్‌కుమార్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎల్అండ్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ ఏబీ పాండ్యా నేతృత్వంలో శనివారం బ్యారేజీని పరిశీలించనున్నట్లు రజత్‌కుమార్ చెప్పారు. -
మరింత కుంగిన మేడిగడ్డ బ్యారేజీ!
కాళేశ్వరం/సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ మరికాస్త కుంగింది. శనివారం సాయంత్రం బ్యారేజీ వద్ద ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చి, 7వ బ్లాక్‌లోని 20వ పియర్ వద్ద దిగువన పగుళ్లు ఏర్పడ్డాయి. దీనితో బ్యారేజీపై ఉన్న వంతెన కుంగి ప్రమాదకరంగా మారింది. వంతెనపై సైడ్ బర్మ్ గోడ, ప్లాట్‌ఫారంతోపాటు రోడ్డు సుమారు 2, 3 ఫీట్ల మేర కుంగిపోయాయి. దీనితో బ్యారేజీ గేట్లకు కూడా ప్రమాదం పొంచి ఉందని అంచనా. ఘటన జరిగిన వెంటనే సాగునీటిశాఖ అధికారులు, ఇతర నిపుణులు కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందనేది పరిశీలించేందుకు ప్రయత్నించారు. ఆదివారం నీటిపారుదల శాఖ ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్ధ మేనేజర్ సురేశ్‌కుమార్ తదితరులు ప్రాజెక్టు వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బ్యారేజీలోని మొత్తం 85 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. నీటిమట్టం తగ్గితే ప్రమాదమేంటి? దానికి కారణమేంటి? అన్నది తెలుస్తుందని చెప్తున్నారు. మరోవైపు ఉన్నట్టుండి నీటిని వదలడంతో గోదావరిలో, తీరం వెంట మేపుతున్న గొర్రెలు, మేకలు కొట్టుకుపోయాయని.. వ్యవసాయ మోటార్లు నీట మునిగాయని రైతులు వాపోతున్నారు. వంతెనపై రాకపోకలు నిలిపివేత బ్యారేజీ వంతెనపై తెలంగాణ–మహారాష్ట్ర మధ్య రాకపోకలను శనివారం రాత్రి నుంచే నిలిపివేశారు. బ్యారేజీ వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా మట్టిపోసి, బారికేడ్లు పెట్టి ఎవరూ రాకుండా చూస్తున్నారు. కుంగిన ప్రాంతం వద్దకు వెళ్లడానికి మీడియాను కూడా అనుమతించడం లేదు. మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్లు బ్యారేజీని పరిశీలించడానికి వేర్వేరు సమయాల్లో వచ్చారు. తొలుత వారిని అడ్డుకున్న పోలీసులు తర్వాత బ్యారేజీ పరిశీలనకు అనుమతించారు. బ్యారేజీకి ప్రమాదం లేదు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పరిస్థితిని సమీక్షించాక ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ఎల్అండ్టీ సంస్థ మేనేజర్ సురేశ్‌కుమార్ తదితరులు మీడియాతో మాట్లాడారు. శనివారం రాత్రి బ్యారేజీ వద్ద పెద్ద శబ్ధం వచ్చిందని, ఇంజనీర్లు వెళ్లి పరిశీలించగా బ్యారేజీ పియర్ కుంగినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. 7వ బ్లాక్‌లోని 20వ పియర్ దెబ్బతిన్నదని.. అయితే పక్కన ఉన్న పియర్లపై దీని ప్రభావం ఏమైనా ఉందా అన్నది పరిశీలిస్తున్నామని చెప్పారు. బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదని.. నెలన్నర రోజుల్లో పూర్వ స్థితికి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యారేజీ నిర్వహణ బాధ్యతను ఎల్అండ్టీ సంస్థ చూస్తోందని.. ప్రస్తుతం మరమ్మతుల బాధ్యతనూ చేపడుతుందని వివరించారు. ఎగువ నుంచి వస్తున్న వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. రెండు రోజుల్లో బ్యారేజీలోని నీటిని ఖాళీ చేస్తామని.. కుంగిన చోట ఏం జరిగింది? సరిచేయడానికి ఏమేం చర్యలు తీసుకోవాలి అన్నది తేల్చుతామని వివరించారు. ఈ ఘటనలో దుష్ట శక్తుల హస్తం ఏదైనా ఉందో, లేదో తెలుసుకునేందుకు మహదేవపూర్తోపాటు మహారాష్ట్ర వైపు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశామని చెప్పారు. ప్రపంచ రికార్డు వేగంతో నిర్మాణం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా గోదావరి నదిపై రూ.1,849 కోట్ల వ్యయంతో 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీని నిర్మించారు. ఎల్ అండ్ టీ సంస్థ కేవలం 24 నెలల్లో బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేసింది. బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు, దీనికి 87 హైడ్రో మెకానికల్ రేడియల్ గేట్లు ఏర్పాటు చేశారు. ఒక్కోటీ 110 మీటర్ల పొడవు, 4 నుంచి 6 మీటర్ల వెడల్పు, 25 మీటర్ల ఎత్తుతో నిర్మించిన పియర్స్ (గేట్ల మధ్య పిల్లర్లలా ఉండే కాంక్రీట్ నిర్మాణం) మధ్య ఈ గేట్లను అమర్చారు. బ్యారేజీ నిర్మాణంలో భాగంగా ఒకదశలో కేవలం 72 గంటల్లోనే ఏకంగా 25,584 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించినట్టు నిర్మాణ సంస్థ తమ వెబ్సైట్లో పేర్కొనడం గమనార్హం. నేడు మేడిగడ్డకు డ్యాం సేఫ్టీ బృందం బ్యారేజీ కుంగిన ఘటనపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పరిధిలోని ‘సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్’ నిపుణుల బృందం సోమవారం పరిశీలన జరపనుంది. కుంగిన ప్రాంతాన్ని సందర్శించి జరిగిన నష్టంపై అంచనా వేయనుంది. ఆ బృందం సిఫార్సుల ఆధారంగా మరమ్మతు పనులు చేపడతారు. వాస్తవానికి బ్రిడ్జిలు, బ్యారేజీలను బ్లాకులుగా నిర్మిస్తారు. పునాదుల పరంగా ఒక బ్లాక్‌కు మరో బ్లాక్‌తో సంబంధం ఉండదు. దీనివల్ల ఏదైనా బ్లాక్‌లో విపత్తు/ప్రమాదం ఎదురైతే మొత్తం బ్రిడ్జి/బ్యారేజీ దెబ్బతినకుండా సదరు బ్లాక్ వరకే నష్టం పరిమితం అవుతుంది. మేడిగడ్డ బ్యారేజీని 7 బ్లాకులుగా నిర్మించారు. తెలంగాణ వైపు నుంచి వాటికి నంబరింగ్ ఇచ్చారు. అలా మహారాష్ట్ర వైపు చివరన ఉన్నది ఏడో బ్లాక్. దీనిలోని 20వ నంబర్ పియర్ ప్రస్తుతం కుంగిపోయింది. దీని ప్రకారం ఏడో బ్లాక్ వరకు నష్టం పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని.. పునాదికి నష్టం జరిగితే ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాల్సి రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐదేళ్ల ‘డిఫెక్ట్ లయబిలిటీ (లోపాలుంటే సరిచేయాల్సిన బాధ్యత)’ సమయం ఇంకా పూర్తి కానందున.. నిర్మాణ సంస్థ ఎల్అండ్టీనే మరమ్మతుల వ్యయం భరించాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మరమ్మతులు పూర్తయ్యే వరకు బ్యారేజీలో నీళ్లను నిల్వచేసే అవకాశం ఉండదని అంటున్నాయి. -
‘కృష్ణా’లో కేటాయింపులే జరగలేదు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి తాగునీటి అవసరాలకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఏపీకి 26.29 టీఎంసీలు, తెలంగాణకు 6.04 టీఎంసీలను విడుదల చేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సిఫారసు చేసిందని పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ స్ప ష్టం చేసింది. ఈ నెల 21న త్రిసభ్య కమిటీ సమావేశమే జరగలేదని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆ రోజు త్రిసభ్య కమిటీ క న్వినర్, కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి డీఎం రాయిపూరే, ఏపీ జల వనరు ల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి మాత్రమే సమా వేశమై తాగునీటి అవసరాలపై మాత్రమే చర్చించా రని తెలియజేసింది. రెండు రాష్ట్రాలకు తాగునీటి కేటాయింపులు జరగలేదని, అసలు తెలంగాణ అంగీకారం తెలపలేదని వివరణ ఇచ్చింది. కృష్ణాబోర్డు సభ్యకార్యదర్శితో తెలంగాణ ఈఎన్సీ భేటీ కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ కన్వీనర్ డీఎం.రాయిపూరేను రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ గురువారం జలసౌధలో కలిసి కృష్ణా జలాల కేటాయింపులపై పత్రికల్లో వచ్చిన వార్తల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 21న ఏపీ జల వనరుల శాఖ ఈఎన్సీతో నిర్వహించిన సమావేశంలో తాగునీటి అవసరాలకుపై చర్చించిన అనంతరం, నీటి కేటాయింపులపై సిఫారసులతో రూపొందించిన ముసాయిదా ప్రతిపాదనలు(మినట్స్) అంతర్గతంగా సర్క్యులేట్ చేశామని, పత్రికలకు అధికారికంగా విడుదల చేయలేదని రాయిపూరే వివరణ ఇచ్చినట్టు తెలిసింది. త్వరలో త్రిస భ్య కమిటీ సమావేశం నిర్వహించాలని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ సూచించారు. ఇప్పటివరకు రెండు రాష్ట్రాల జలవినియోగం, నీటి నిల్వ లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని తాగునీటి అవసరాలను మదింపు చేసిన తర్వాత కేటాయింపులు జరపాలని కోరారు. తాగునీటి అవసరాలను త్రిసభ్య కమిటీలో చర్చించి, ఇరుపక్షాల అంగీకారం మేరకే నిర్ణయం తీసుకోవాలని కోరారు. -
కాళేశ్వరం కింద 97,170 ఎకరాలకు సాగునీరు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత వానాకాలంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద 97,170 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ సమావేశమై వానాకాలంలో వివిధ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని జలాశయాలన్నీ నిండి ఉన్న నేపథ్యంలో వాటి కింద పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించింది. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు ఇంకా నిండకపోవడంతో ఎగువ నుంచి వస్తున్న వరదలను పరిగణనలోకి తీసుకుని ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టుల కింద 36.81లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. రాష్ట్రంలో 13,16,557 ఎకరాల ఆరుతడి, 23,64,530 ఎకరాల వరి పంటకు కలిపి మొత్తం 342.43 టీఎంసీలు సరఫరా చేయనున్నారు. కాళేశ్వరం కింద 71600 ఎకరాల వరి, 25570 ఎకరాల ఆరుతడి పంటలు కలిపి మొత్తం 97,170 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని కమిటీ ప్రతిపాదించింది. -
నెత్తుటి పారుదల యాగమా ఇది?
అసూయాద్వేషాలు ఆపాదమస్తకాన్ని దహిస్తుంటే ఆ మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది? నిరాశా నిస్పృహలు నిలువెల్లా పోటెత్తుతుంటే అతడి మానసికస్థితి ఎలా ఉంటుంది? ఈ వారం రాయలసీమ పర్యటనలో చంద్రబాబు ప్రవర్తనలా ఉంటుంది. ఇంచుమించు ఉన్మాదస్థితిని తలపిస్తుంది. బాధాకరం. రాజకీయాల్లో ఆయనది నెగెటివ్ పాత్రే కావచ్చు. వెన్నుపోటుకు మారుపేరే కావచ్చు. విధానపరంగా పేదల వ్యతిరేకే కావచ్చు. పెత్తందార్ల ప్రతినిధే కావచ్చు. అవకాశవాద రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ కావచ్చు. కానీ పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరో పద్నాలుగేళ్లు ప్రతిపక్ష నాయకుని హోదా అనుభవించారు. నగరవాసమూ, అరణ్యవాసమూ తర్వాత మిగిలింది అజ్ఞాతవాసమే కదా! అందుకు సిద్ధపడాల్సిన సమయంలో ఈ దుఃస్థితి! తెలుగు వారందరూ విచారించ దగిన పరిణామం. సాగునీటి ప్రాజెక్టులపై ‘యుద్ధభేరి’ అనే పేరుతో కర్నూలు జిల్లా బనకచర్ల దగ్గర ఆయన యాత్రను ప్రారంభించారు. పేరు ఏదైనా సరే తన ఉద్దేశం వేరే ఉన్నట్లు తొలిరోజు నుంచే సంకేతాలు పంపిస్తున్నారు. పాల్గొన్న ప్రతి సభలో ముఖ్యమంత్రిపై దూషణలకు తెగబడ్డారు. స్థానిక ఎమ్మెల్యేలపై, మంత్రులపై ఇష్టారీతిన ఆరోపణలు చేశారు. నీటిపారుదల శాఖ మంత్రిని ఆంబోతుగా సంబోధించారు. చివరకు ముప్ఫయ్యేళ్ల వయసు కూడా లేని యువకుడు సిద్ధార్థరెడ్డిని కూడా వదల్లేదు. నాలుకను నాలుగించులు సాగదీసి మరీ బెదిరించారు. ఉన్నట్టుండి హఠాత్తుగా ఒక సభలో ఆటంబాంబు లాంటి స్టేట్మెంట్ను జనం మీదకు వదిలారు. ఆ బాంబును తయారుచేసిన ఒపెన్‌హైమర్ సినిమా ఇప్పుడు నడుస్తున్నందువల్ల స్ఫూర్తి పొందాడేమో తెలియదు. ‘ఏయ్! నేను సింహంలాంటోణ్ణి’ అనగానే సభికులు అవాక్కయ్యారు. వారి పంచేంద్రియాలు ఎవరో మంత్రించినట్టుగా స్తంభించిపోయాయి. నవనాడుల్లో రక్తప్రసరణ ఆగిపోయినట్టయింది. ఆంధ్రప్రదేశ్‌లో దసరాకు పులివేషాలు సహజమే – ఆ వేషాలు వేసే వాళ్లు లేక ఇప్పుడవీ తగ్గిపోయాయట! కానీ, బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తులు తమకు నప్పని, కుదరని వేషాలు వేస్తే జనం అంగీకరించరని అనేకమార్లు రుజువైంది. అందుకే ఎన్టీ రామారావు దేవదాసు వేషాన్నీ, నాగేశ్వరరావు దుర్యోధన వేషాన్నీ వేయడానికి సాహసించలేదు. కిల్‌బిల్ పాండే వేషంలో బ్రహ్మానందం ఎంత సీరియస్‌గా మొహం పెట్టినా అది కామెడీ ట్రాక్గానే మిగిలిపోయింది. ఈ కారణం వల్లనే చంద్రబాబు బాంబింగ్‌కు జనం స్పందించలేదు. చప్పట్లు కొట్టలేదు. నప్పని వేషాలు వేస్తేనే అంగీకరించని జనం స్వభావ విరుద్ధమైన పోలికలు తీసుకొస్తే, పొగడ్తలు కురిపిస్తే షాకవ్వడం సహజం. పోనీ, ఎవరో ఒక అభిమానో, లేదా కార్యకర్తో వచ్చి ‘అన్న టైగర్’, ‘అన్న లయన్’ అంటే అది వేరు. కానీ స్వయంగా ‘నేను లయన్’ను అని ప్రకటించుకోవడం కొంత ఎబ్బెట్టుగా అనిపించింది. కొంతమంది తాము కూర్చునే కుర్చీ వెనుక పెద్దపులి బొమ్మల్ని పటం కట్టించి పెట్టుకుంటారట! ఇలాంటి వారు స్వభావసిద్ధంగా పిరికివాళ్లనీ, దాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం ఇటువంటి బొమ్మల్ని పెట్టుకుంటారనీ సైకాలజిస్టులు చెబుతారు. ఇక స్వయంప్రకటిత నర‘సింహా’లకూ, నర‘శార్దూల’లకూ కూడా ఈ సూత్రం వర్తిస్తుందేమో తెలుసుకోవాలి. మొదటి సింహ ప్రయోగం రసాభాస కావడంతో రెండోరోజు కొంత కసరత్తు చేసి కార్యకర్తలను ముందుగానే సిద్ధం చేశారు. ఈ సభలో వారు చప్పట్లు కొట్టారు. ‘నేను సింహాన్ని, కొదమ సింహాన్ని’ అని రెండు మూడుసార్లు ఆయన ప్రకటించుకున్నారు. కొదమసింహం అంటే యువసింహం అని అర్థం. ఆయనే యువసింహం అయితే వాళ్లబ్బాయి బాలసింహం అవుతాడా, శిశుసింహం అవుతాడా అనే తర్కం అనవసరం. ఈ సింహోపాఖ్యానాన్ని వ్యూహం ప్రకారమే ఆయన ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో మరో ఓటమి తప్పదనే అంచనాలు ఆయనకు తెలియనివి కావు. గత ఎన్నికల్లో టీడీపీ కంటే పదిశాతం ఎక్కువ ఓట్లు వైసీపీకి లభించాయి. ఇప్పుడా తేడా మరింత పెరిగి దాదాపు పద్దెనిమిది శాతానికి చేరుకున్నట్టు వివిధ సర్వేల అంచనాలు తేల్చుతున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన కొన్ని జాతీయ సంస్థలతో ప్రతిపక్షాలు చేయించిన సర్వేలో వైసీపీకి 52 శాతం, తెలుగుదేశం పార్టీకి 34 శాతం ఓటర్ల మద్దతున్నట్టు వెల్లడైందట! గడచిన ఏడాది కాలంగా జరిగిన సర్వేల్లో ఈ బలాబలాల పొందికలో ఒకటి రెండు శాతానికి మించిన ఊగిసలాట కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఒక్క దానితో పొత్తు కుదిరినా ప్రయోజనం లేదు. బీజేపీతో సహా మిగిలిన పార్టీలన్నీ తనకు మద్దతుగా నిలబడాలి. అందరూ ఏకమవడం ఎలా కుదురుతుంది? బీజేపి మద్దతు ఉన్న కూటమి వైపే కాంగ్రెస్ వారూ, కమ్యూనిస్టులూ ఎలా నిలబడతారు? ప్రజాస్వామ్య పరిరక్షణ అనే పేరుతో ఏకం చేయవచ్చుననే అంధ విశ్వాసమేదో చంద్రబాబులో ఉన్నదని అంటారు. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ కూల్చివేసినప్పుడు ఈ ఐక్యత సాధ్యమైందట! తిరిగి అధికారంలోకి రావడానికి సహకరించినందుకు కృతజ్ఞతగా ఎన్టీరామారావు ఒక పక్క బీజేపీనీ, మరోపక్క కమ్యూనిస్టులనూ కలుపుకొని తదుపరి ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఐక్యతకు ప్రజాస్వామ్య పరిరక్షణ అనే పేరు పెట్టినప్పటికీ, కనిపించని ‘కామన్ త్రెడ్’ ఏదో వీరిని కలిపేసిందని అప్పట్లోనే కొందరు రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. ఆ ‘కామన్ త్రెడ్’ ఇప్పుడు కూడా అక్కరకొస్తుందని చంద్రబాబు ఆశ. కొందరు కమ్యూనిస్టులు, కొందరు కాంగ్రెస్ నాయకులతో కూడా ఈ మేరకు ఆయన చర్చలు జరిపినట్టు సమాచారం. మరి ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికను ఏర్పాటు చేయడానికి ఒక భూమిక కావాలి కదా! ఆ భూమిక కోసం ఇంతకు ముందే, ఒకటి రెండు ప్రయత్నాలు జరిగాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనీ, రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నారనీ ఎల్లో మీడియా సహకారంతో తెలుగుదేశం పార్టీ పెద్ద క్యాంపెయిన్నే నిర్వహించింది. కానీ, ఆ క్యాంపెయిన్ ప్రజలను నమ్మించలేకపోయింది. ఇటీవల గోదావరి జిల్లాల్లో బాబు భాగస్వామి పవన్ కల్యాణ్ రాష్ట్రం నుంచి వేల సంఖ్యలో ఆడపిల్లలను అక్రమంగా తరలిస్తున్నారంటూ చేసిన గాలి ఆరోపణను కూడా ఈ కోణంలోంచి చూడాలి. దానికి కొనసాగింపు చంద్రబాబు రాయసీమ పర్యటన. కర్నూలు జిల్లాలో సింహం మాస్క్‌తో మొదలై చిత్తూరు జిల్లాలో రక్తం చిందే వరకు సాగింది. అంగళ్లులో, పుంగనూరులో జరిగిన అల్లర్లలో చంద్రబాబు పాత్ర వీడియో ఫుటేజీల సాక్షిగా రుజువైంది. రెండు రోజుల కింద పులివెందులలోనే ఇటువంటి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులుగానీ, వైసీపీ శ్రేణులు గానీ కవ్వింపులకు రెచ్చిపోకుండా నిగ్రహం పాటించడంతో ప్రమాదం తప్పింది. అక్కడి నుంచి గుణపాఠం తీసుకున్న చంద్రబాబు గురి తప్పకుండా పుంగనూరులో అల్లర్లు జరిగేలా ప్లాన్ చేశారు. పర్యటన జరిగినన్ని రోజులూ మూడు నాలుగు జిల్లాల నుంచి సమీకరించిన రౌడీ దండును ఆయన వెంటేసుకుని తిరిగారు. ఈ రౌడీదండు తమ వెంట రాళ్లు, గాజుముక్కలతో పాటు కత్తులు, తుపాకులను కూడా ఉంచుకున్నారు. ఇవన్నీ సందేహాతీతంగా నిరూపణ కాబోతున్నాయి. నిందితుల మీద చర్యలు తీసుకుంటే ప్రత్యర్థులను వేధిస్తున్నారని గగ్గోలు పెట్టాలి. చర్యలు తీసుకోకపోతే మరింత చెలరేగిపోవాలి. ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నా, ఎవరి భాష్యాలు ఎలా చెప్పినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన ఒక తంతుగానే సాగింది. చిత్తం ప్రాజెక్టుల మీద, భక్తి పచ్చినెత్తురు మీద అన్నట్టుగా ముగిసింది. ఆయనకు చిత్తశుద్ధి ఉండి ఉంటే రాయలసీమ సాగునీటికి సంబంధించి వైసీపీ వాళ్లు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు. రాయలసీమ ప్రజల్లో, మేధావుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసేవారు. కానీ ఆయన లక్ష్యం అది కాదు. రాయలసీమ ఇరిగేషన్ ప్రధాన ఆధారం కృష్ణా ప్రవాహం. 1983–84లో తెలుగు గంగ ప్రాజెక్టు కోసం శ్రీశైలం జలాలను తరలించడానికి వీలుగా పోతిరెడ్డిపాడు వద్ద అప్పటి ఎన్టీరామారావు ప్రభుత్వం హెడ్ రెగ్యులేటర్‌ను ఏర్పాటుచేసింది. దాని సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు. ఈ రెగ్యులేటర్ ద్వారా తరలించిన నీటి పరిమాణం ఎంత అని ఇరవయ్యేళ్ల తర్వాత పరిశీలించినప్పుడు, రిజర్వాయర్‌లో ఆవిరైన నీటిలో సగానికంటే తక్కువని వెల్లడైంది. ఆ ఇరవై ఏళ్ల కాలంలో శ్రీశైలం డ్యామ్‌లోకి 19,642 టీఎమ్సీల నీరు చేరింది. అందులో 349 టీఎమ్సీల నీరు ఆవిరైంది. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా సీమకు చేరిన నీరు 160 టీఎమ్సీలు మాత్రమే. అంటే ఆవిరైన నీటిలో 0.45 శాతం. రామారావు తర్వాత తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి రెగ్యులేటర్ సామర్థ్యాన్ని ఎందుకు పెంచలేదని రాయలసీమ రైతులు, మేధావులు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దాని సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు రాజశేఖరరెడ్డి పెంచినప్పుడు తెలుగుదేశం శ్రేణుల చేత కర్నూలు రహదారిపై, ప్రకాశం బ్యారేజీపై ఎందుకు వ్యతిరేక ధర్నాలు చేయించావు చంద్రబాబూ అని వారు గత పద్దెనిమిదేళ్లుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీటి తరలింపు కార్యక్రమం రిజర్వాయర్‌లో 881 అడుగుల స్థాయి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతున్నది. ఈ స్థాయి నీటిమట్టం ఏడాదిలో సగటున 35 రోజులు మాత్రమే ఉంటుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 800 నుంచి 826 అడుగుల మట్టం నుంచే నీటిని తీసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎడమగట్టు కాల్వలను డిజైన్ చేసింది. 796 అడుగుల నుంచి విద్యుత్ కేంద్రం ద్వారా 44 వేల క్యూసెక్కులను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉన్నది. రోజుకు 6.5 టీఎమ్‌సీలను తక్కువ నీటి మట్టం నుంచే తరలించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అధికారంలో ఉండి ఏం చేశావన్నది రాయలసీమ ప్రజలు చంద్రబాబుకు వేస్తున్న ప్రశ్న. ‘ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు సీమ ప్రయోజనాలు తాకట్టు పెట్టలేదా’ అని వారు ఆగ్రహిస్తున్నారు. ఇందుకు విరుగుడుగా 800 అడుగుల మట్టం నుంచే ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతలను డిజైన్ చేసి జగన్మోహన్రెడ్డి ఎలా సీమ ప్రాజెక్టుల ద్రోహి అయ్యాడో వివరించమని వారు నిలదీస్తున్నారు. బనకచర్ల క్రాస్ టు వెలిగోడు లింక్ కెనాల్ సామర్థ్యం 15 వేల క్యూసెక్కులు. లైనింగ్ పనులు పూర్తి కాకపోవడంలో అందులో సగం కూడా వెళ్లలేని పరిస్థితి. బ్రహ్మంసాగర్ నిల్వ సామర్థ్యం 17.85 టీఎమ్సీలు. మట్టికట్ట లీకేజీల వల్ల నాలుగు టీఎమ్సీలు కూడా నిలబెట్టలేని స్థితి. అధికారంలో ఐదేళ్లు ఉండి పట్టించుకోని మీరా? అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలోనే ఆ పనులు పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డా? ఎవరు ద్రోహి? అని రాయలసీయ ప్రజలు సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు. గురు, శుక్రవారాల్లో చంద్రబాబు ఏ ప్రాంతంలోనైతే నెత్తురు పారించాలని ప్రయత్నం చేశాడో, ఆ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని హంద్రీ–నీవా, గాలేరు–నగరిని సంధానిస్తూ జగన్మోహన్రెడ్డి మూడు రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. వాటికి వ్యతిరేకంగా టీడీపీ నేతల చేత చంద్రబాబు ఎన్జీటీలో కేసులు వేయించారు. కడుపు మండిన ఆ ప్రాంత రైతులు రోడ్ల పక్కన నిలబడి చంద్రబాబుకు నిరసన తెలిపారు. రాయలసీమకు నీరందించే ఒక్కో ప్రాజెక్టు కింద ఒక్కో డజన్ ప్రశ్నలు చంద్రబాబు కోసం సిద్ధంగా ఉన్నాయి. వాటికి ఆయన దగ్గర సమాధానాల్లేవు, సమాధానం చెప్పే ఉద్దేశం కూడా లేదు. సీమలో సాగునీరు పారితే ఆయనకు అధికారం రాదు. ఏమో... నెత్తురు పారితే? ఎంతవరకు ఉపయోగమనే ట్రయల్‌రన్ నడుస్తున్నది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
‘కడెం’ కష్టమే.. ప్రాజెక్టు నిర్వహణపై చేతులెత్తేసిన నీటిపారుదలశాఖ
సాక్షి, హైదరాబాద్: కడెం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ చేతులెత్తేసింది. నిర్వహణతో నెట్టుకురాలేమని, తరచూ సమస్యలు ఉత్పన్నం అవుతాయని, గేట్లు మొరాయిస్తూనే ఉంటాయని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నుంచి దిగువకు 3.82 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యం ఉన్నా, గతేడాది జూలై 13న రికార్డు స్థాయిలో 5,09,025 క్యూసెక్కుల వరద పోటెత్తడంతో ప్రాజెక్టు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంది. ప్రాజెక్టు ఎత్తు 700 అడుగులు కాగా అప్పట్లో ప్రాజెక్టుపై నుంచి 706 అడుగుల ఎత్తులో వరద ప్రవహించింది. గతనెల చివరి వారంలో భారీ వర్షాలు కురవడంతో కడెం ప్రాజెక్టుపై నుంచి 702 అడుగుల ఎత్తులో వరద పారింది. గేట్ల మొరాయింపుతోనే సమస్య గేట్లు మొరాయించడంతో వచ్చిన వరదను వచ్చినట్టు కిందకు పంపించడం సాధ్యం కావడం లేదు. టాప్‌సీల్ గేట్ల కారణంగా వీటి నిర్వహణ సమస్యాత్మకంగా మారింది. గతేడాది వచ్చిన వరదలకు 4 గేట్లు మొరాయించడంతో వచ్చిన వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదలడం సాధ్యం కాలేదు. మళ్లీ ఆ గేట్లకు మరమ్మతులు చేసి పునరుద్ధరించారు. గత నెలలో వ చ్చి న వరదల సమయలోనూ మరో 4 గేట్లు మొరాయించడంతో ఇదే పరిస్థితి నెలకొంది. రెండు గేట్లకు అప్పటికప్పుడు మరమ్మతులు చేసి పైకి ఎత్తగలిగారు. మరో గేటుకు తర్వాత మరమ్మతులు పూర్తి చేశారు. చివరి గేటుకు మరమ్మతులు సాధ్యం కాలేదు. గేట్ల విడి భాగాలు లభించడం లేదు. ప్రత్యేకంగా ఆర్డర్ చేసి తయారు చేయించుకోవాలనుకున్నా, వీటి డిజైన్లు, డ్రాయింగ్స్ అందుబాటులో లేవు. కడెం ప్రాజెక్టు 18 గేట్లను పైకి ఎత్తడానికి కనీసం 2 గంటల సమయం పడుతుంది. అయితే కడెం నదిపరీవాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలతో గంట వ్యవధిలో కడెం ప్రాజెక్టుకు గత నెలలో 3 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరింది. మూడు చోట్ల పగుళ్లు.. ప్రాజెక్టు గేట్ల మధ్య పిల్లర్ తరహాలో ఉంటే కట్టడాన్ని పీయర్స్ అంటారు. కడెం ప్రాజెక్టుకు సంబంధించి మూడు పీయర్స్‌కు అర్ధ అంగుళం నుంచి అంగుళం నిడివితో పగుళ్లు వచ్చాయి. వీటికి సిమెంట్ మిశ్రమంతో మూసి గ్రౌటింగ్‌తో తాత్కాలిక మరమ్మతులు చేశారు. భవిష్యత్‌లో ప్రాజెక్టుకు భారీ వరదలు వస్తే పగుళ్లు వచ్చిన పీయర్స్ ఉధృతిని తట్టుకోవడం కష్టమేనని, అకస్మాత్తుగా కొట్టుకుపోతే దిగువన ఉన్న గ్రామాలు నీటమునిగే ప్రమాదముందని నీటిపారుదలశాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కుఫ్తీ కడితే పెద్దగా ప్రయోజనం ఉండదు.. ఎగువ పరీవాహక ప్రాంతంలో కుఫ్తీ డ్యాం నిర్మిస్తే కడెం ప్రాజెక్టుపై వరద ఉధృతి తగ్గుతుందని గతంలో నీటిపారుదల శాఖ భావించింది. అయితే కుఫ్తీ ప్రాజెక్టు నిర్మాణంతో కడెంపై పెద్దగా వరద ఒత్తిడి తగ్గదని, ఎగువ నుంచి వచ్చే వరదను ముందస్తుగా అంచనా వేసేందుకు అవసరమైన సమయం మాత్రం లభిస్తుందని తాజాగా నీటిపారుదలశాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది. ఆధునీకరణ ప్రతిపాదనలు ఇలా.. కొత్తగా రేడియల్ గేట్లు ఏర్పాటు చేయాలి. అదనంగా 1.5 లక్షల నుంచి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేలా డిజైన్ చేయాలి. అదనపు గేట్లు, కొత్త స్పిల్‌వే నిర్మించాలి. గతేడాది డ్యామ్ సేఫ్టీ అండ్ రిçహాబిలేషన్ ప్రోగ్రామ్(డీఎస్ఆర్పీ) కింద నిపుణులతో అధ్యయనం చేయించినా ఇదే సూచనలు చేసినట్టు సమాచారం. -
డ్యూటీలో మద్యం తాగి ఇంజినీర్లు చిందులు.. వీడియో వైరల్ కావడంతో
భువనేశ్వర్: ఉద్యోగస్తులు బయట ఎలా ఉన్న ఆఫీసులోకి వెళ్లగానే హుందాగా ప్రవర్తించడంతో పాటు వారి పనిని నిబద్దతతో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతీ సంస్థ తమ ఉద్యోగుల నుంచి ఆశిస్తుంది. అయితే కొందరు మాత్రం ఇవేవి తమకు పట్టవంటూ ఇష్టారీతిన వ్యవహరిస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒరిస్సాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేంద్రాపడా జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ ఇంజినీర్లు తమ కార్యాలయంలో మద్యం సేవిస్తున్నట్లు వీడియో వైరల్ అయ్యింది. దీంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌కుమార్ జెనా జలవనరుల శాఖను సోమవారం ఆదేశించారు. ఈ ఇరువురు నిందితులు మహానది నార్త్ డివిజన్లో ఇంజినీర్లుగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం జిల్లాలోని నారాయణపూర్ సెక్షన్ కార్యాలయంలో ఇంజినీర్లు, మరికొందరు వ్యక్తులు పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలో మద్యం, ఆహారం సరంజామాతో సమగ్ర వీడియో చిత్రీకరించి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో తీవ్ర కలకలం రేపింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ఇరువురు ఇంజినీర్లపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని జల వనరుల శాఖను ఆదేశిస్తూ సీఎస్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి అన్యోన్యంగా ఉండేవాళ్లు,ఎలాంటి లోటు లేదు.. కానీ ఆ ఒక్క కారణంతో భార్యను హతమార్చాడు! -
గౌరవెల్లిని ఆపేయండి
సాక్షి, హైదరాబాద్: గౌరవెల్లి రిజర్వాయర్ పనులను తక్షణమే నిలుపుదల చేయాలని, ఒక వేళ పనులు పూర్తయితే నీటిని నిల్వ చేయొద్దని తెలంగాణ రాష్ట్రాన్ని గోదావరి నది యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) ఆదేశించింది. ఇప్పటికే నీటిని నిల్వ చేసి ఉంటే కాల్వలకు విడుదల చేయొద్దని కోరింది. ఈ మేరకు గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి ఆర్.అఝగేషన్ శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌కు లేఖ రాశారు. పర్యావరణ అనుమతి తీసుకోకుండా గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టడాన్ని సవాలు చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో దాఖలైన కేసులో గోదావరి బోర్డు ప్రతివాదిగా ఉంది. ఎన్జీటీ ఆదేశాల మేరకు గౌరవెల్లి రిజర్వాయర్ పనులపై యథాస్థితిని కొనసాగించాలని, కొత్త పనులు చేపట్టరాదని తాజాగా గోదావరి బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘‘ఆ క్లాజుల ప్రకారం నడుచుకోవాలి’’ గోదావరి బోర్డు అధికార పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని క్లాజులు 1(డీ)(3), 2(ఎఫ్), 2(జీ) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని స్పష్టం చేసింది. క్లాజు 1(డీ) ప్రకారం అనుమతి లేని ప్రాజెక్టులకు గోదావరి బోర్డు, అపెక్స్ కౌన్సిల్, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ)ల నుంచి అనుమతులు పొందే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు, ఇతర మార్పులు, రెగ్యులేటర్లు, అప్రోచ్ చానల్, సొరంగం పనులు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పనులు చేపట్టాలన్నా గోదావరి బోర్డు, టీఏసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తప్పనిసరి అని గుర్తు చేసింది. క్లాజు 2(ఎఫ్) ప్రకారం అనుమతి లేని ప్రాజెక్టుల పనులు నిలుపుదల చేసి, గెజిట్ విడుదలైన ఆరు నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. క్లాజు 2(జీ) ప్రకారం అనుమతి రాని ప్రాజెక్టులను వినియోగించుకోకుండా పక్కనబెట్టాల్సి ఉంటుందని తెలిపింది. రాష్ట్రం వచ్చాక పెరిగిన గౌరవెల్లి సామర్థ్యం ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ వరద కాల్వ ప్రాజెక్టులో భాగంగా 1.04 టీఎంసీల సామ ర్థ్యంతో గౌరవెల్లి రిజర్వాయర్‌ను నిర్మించారు. తెలంగాణ వచ్చాక ప్రాజెక్టుల రీడి జైనింగ్‌లో భాగంగా గౌరవెల్లి సామ ర్థ్యాన్ని 8.5 టీఎంసీలకు పెంచాలని నిర్ణ యం తీ సుకున్నారు. ఇందుకోసం 1960 ఎక రాలను సేకరించారు. రిజర్వాయర్ పనులు పూర్తి కాగా, 1.02 టీఎంసీలను నింపారు. రిజ ర్వాయర్ సామర్థ్యం 8.5 టీఎంసీలకు పెరి గినా ప్రధాన కాల్వ సామర్థ్యం 1.04 టీ ఎంసీలే ఉంది. పర్యావరణ అనుమతులు లే కుండా ప్రాజెక్టు పనులు చేపట్టారని గ్రా మ స్తులు కొందరు కేసు వేయగా, ఎన్జీటీ గతంలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
త్వరలో ఏలేరు–తాండవ ప్రాజెక్టుల అనుసంధానం
నాతవరం (అనకాపల్లి జిల్లా): వర్షాకాలం తర్వాత ఏలేరు–తాండవ అనుసంధానం పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఇంజనీర్ ఇన్ చీఫ్, గోదావరి డెల్టా సిస్టం చీఫ్ ఇంజనీర్ ఆర్.సతీష్ కుమార్ చెప్పారు. నాతవరం మండలం జిల్లేడుపూడిలో ఏలేరు సొరంగం వద్ద తాండవ ప్రాజెక్టు కాల్వలను ఉత్తర కోస్తా సీఈ ఎస్.సుగుణాకరరావుతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఏలేరు, తాండవ ప్రాజెక్టుల అనుసంధానానికి ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు రూ.470 కోట్ల 5 లక్షలను కేటాయించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నంలో పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం రిజర్వాయర్ నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్, జీవీఎంసీ, ఇక్కడి పరిశ్రమలకు రోజుకు 95 జీఎండీల నీరు సరఫరా అవుతోంది. అనుసంధానం పనులు ప్రారంభించడానికి నీటి సరఫరాను నిలిపివేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇబ్బంది ఎదురుకాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు నీటిపారుదల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు. అనంతరం ఏలేరు, తాండవ ప్రాజెక్టు అధికారులతో పాటు జీవీఎంసీ, విస్కో అధికారులకు అనుసంధానం పనులపై ఇంజనీర్ ఇన్ చీఫ్ సతీష్‌కుమార్ దిశానిర్దేశం చేశారు. ఉత్తరాంధ్రలో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టు పనులను రూ.1,100 కోట్లతో పూర్తి చేస్తున్నామని ఉత్తర కోస్తా సీఈ ఎస్.సుగుణాకరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో వంశధార ప్రాజెక్టు లిఫ్ట్ పనులు రూ.150 కోట్లతో జరుగుతున్నాయన్నారు. హిరమండలంలో బ్యాలెన్స్ రిజర్వాయర్ పెండింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. రూ.123 కోట్లతో విజయనగరం జిల్లా తోటపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ పనులు చేస్తున్నామన్నారు. తారకరామ రిజర్వాయర్‌తో పాటు పలు ప్రాజెక్టులకు మరమ్మతులు చేస్తున్నామని వివరించారు. ధవళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ జి.శ్రీనివాసరావు, ఈఈ భాస్కరరావు, డీఈ వినోద్‌కుమార్, విస్కో సలహాదారు, విశ్రాంత ఎస్ఈ జగన్మోహన్రావు, తాండవ ప్రాజెక్టు డీఈ జె.స్వామినాయుడు, జేఈలు శ్యామ్‌కుమార్, వినయ్‌కుమార్, ఆర్.పాత్రుడు, రామకృష్ణ, నాగబాబు సిబ్బంది పాల్గొన్నారు. -
నీటిపారుదల శాఖకు 5,950 మంది వీఆర్ఏలు!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలోని 24 వేల మంది గ్రామ రెవెన్యూ సహా యకు(వీఆర్ఏ)ల్లో 5,950 మందిని నీటి పారుదల శాఖలో లష్కర్లుగా నియమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుతం వీరంతా రెవెన్యూ శాఖలో రూ.10,500 గౌరవ వేతనంపై తాత్కాలిక ఉద్యోగు లుగా కొనసాగుతున్నారు. వారి సేవలను అదే శాఖలో క్రమబద్ధీకరించడంతోపాటు కొత్త పేస్కేల్‌ను వర్తింపజే యాలని ప్రభు త్వం నిర్ణయించినట్లు తెలిసింది. అనంతరం అవసరాన్ని బట్టి వేర్వేరు శాఖల్లో వారిని విలీనం చేయాలని భావిస్తోంది. రూ.19 వేల మూల వేతనంతో కలిపి మొత్తం రూ.23 వేల స్థూల వేతనం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. 5,950 మంది వీఆర్ఏలతోపాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద నిర్వాసితులుగా మారిన కుటుంబాల నుంచి మరో 200 మందిని లస్కర్లుగా నియమించుకోవడానికి నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రాజెక్టుల కింద నిర్వాసితులుగా మారిన కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించడానికి ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవో 98 కింద 200 మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తయింది. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపి లస్కర్ల నియామకంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీఆర్ఏలను లస్కర్లుగా నియమిస్తామని ఆయన చాలా ఏళ్ల కిందే ప్రకటించిన విషయం తెలిసిందే. సాగునీటి ప్రాజెక్టులు, కాల్వలు, తూములకు కాపలా కాస్తూ పంట పొలాలకు నీళ్లు అందేలా లస్కర్లు పనిచేయాల్సి ఉంటుంది. కాల్వల్లో పిచ్చి మొక్కలు తొలగించడం, గండ్లు పడితే ఉన్నతాధికారులకు తక్షణమే సమాచారం ఇవ్వడం వంటి విధులు నిర్వహిస్తారు. తెలంగాణ వచ్చాక కొత్త ప్రాజెక్టులను పెద్ద ఎత్తున నిర్మించినా, నిర్వహణకు అవసరమైన క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించలేదు. లస్కర్ల నియామకంతో కొత్త ప్రాజెక్టుల నిర్వహణ మెరుగుపడే అవకాశాలున్నాయి. -
పాలమూరుకు ‘పర్యావరణ’ కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల జారీ ప్రక్రియ మళ్లీ వాయి దా పడింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని నిపుణుల మదింపు కమిటీ గత నెల 27న సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన మినిట్స్‌ను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం.. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టడం వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని చక్కదిద్దడానికి (పర్యావరణ పునరుద్ధరణకు) రూ.142 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసినట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ నివేదించింది. అయితే నష్ట నివారణ వ్యయాన్ని లెక్కించడంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను నీటిపారుదల శాఖ అనుసరించలేదని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. పర్యావరణానికి జరిగిన నష్టం విలువ, నష్ట నివారణ చర్యల వ్యయం, సామాజిక ప్రభావ నివారణ చర్యల వ్యయాలను ఎస్ఓపీ ఆధారంగా మళ్లీ లెక్కించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కాగా రూ.55,086.57 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు, ఇప్పటికే రూ.21,200 కోట్లు ఖర్చు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ శాఖకు తెలియజేసింది. ప్రాజెక్టు ద్వారా 6 జిల్లాల్లోని 70 మండలాల పరిధిలో మొత్తం 8,83,945 హెక్టార్లకు సాగునీరు అందుతుందని, సత్వరం పర్యావరణ అనుమతులు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. గత నవంబర్లోనే ఉల్లంఘనల నిర్ధారణ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం..పర్యావరణ ప్రభావం మదింపు (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్/ఈఐఏ) నోటిఫికేషన్ 2006ను ఉల్లంఘించినట్టు గతేడాది నవంబర్ 14న జరిగిన సమావేశంలో కమిటీ నిర్ధారించింది. వాస్తవానికి ఇలాంటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల జారీ విషయంలో అనుసరించాల్సిన ఎస్ఓపీని 2021లో కేంద్ర పర్యావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ప్రతిపాదనలను సైతం ఎస్ఓపీ ఆధారంగా మదింపు నిర్వహించాలని అప్పట్లో నిపుణుల కమిటీ నిర్ణయించింది. దీంతో ఎస్ఓపీ అమలులో భాగంగా.. అనుమతులు లేకుండా పనులు చేపట్టడంతో పర్యావరణానికి జరిగిన నష్టాన్ని చక్కదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.6124.36 కోట్లతో పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ)ని సిద్ధం చేసింది. అందులో రూ.142.49 కోట్లను పర్యావరణ పునరుద్ధరణకు కేటాయించింది. అయితే వీటిని లెక్కించే విషయంలో ఎస్ఓపీని పాటించలేదని నిర్ధారించిన నిపుణుల కమిటీ మళ్లీ కొత్తగా అంచనాలు రూపొందించాలని ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేకుండా 90 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంపై గతంలో ఎన్జీటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రూ.528 కోట్లను పర్యావరణ పరిహారంగా కృష్ణా బోర్డుకు చెల్లించాలని అప్పట్లో ఆదేశాలివ్వగా దీనిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. -
నీళ్లలా ఇంత ఖర్చా?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై తీవ్ర అభ్యంతరాలతో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు ఆర్థిక సుస్థిరత, భవిష్యత్తు మనుగడపై కాగ్ తీవ్ర సందేహాలను వ్యక్తం చేసినట్లు నీటిపారుదల శాఖ వర్గాల ద్వారా తెలియవచ్చింది. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో భాగంగా ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చడం ద్వారా అనవసర భారం పడినట్లు ఆక్షేపించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుపై రెండేళ్లపాటు సుదీర్ఘ ఆడిట్ నిర్వహించిన తర్వాత కాగ్ ఈ మేరకు ప్రాథమిక నివేదికను రూపొందించింది. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న రుణాలకు వడ్డీలతో కలపి చెల్లింపులకు ఏటా రూ. 13 వేల కోట్లు, ప్రాజెక్టు విద్యుత్ చార్జీలకు ఏటా మరో రూ. 12 వేల కోట్లు, ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతులకు రూ. 270 కోట్లు కలిపి ఏటా సుమారు రూ. 25 వేల కోట్ల వ్యయం కానుందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎకరం ఆయకట్టు సాగుకు కాళేశ్వరం పెట్టుబడి వ్యయం రూ. 6.4 లక్షలు కానుందని స్పష్టం చేసినట్లు తెలియవచ్చింది. ప్రాజెక్టు 12 శాతమే పూర్తి... కాళేశ్వరం ప్రాజెక్టులోని 56 పనుల్లో ఇప్పటివరకు 12 మాత్రమే పూర్తయ్యాయని, మరో 40 పనులు 3 శాతం నుంచి 99 శాతం వరకు, మిగిలిన 4 పనులు ఇంకా ప్రారంభం కాలేదని నివేదికలో కాగ్ వివరించినట్లు తెలిసింది. ప్రాజెక్టు భూసేకరణ కోసం 98,110 ఎకరాలకుగాను 63,972 ఎకరాలనే సేకరించారని తప్పుబట్టింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించిన అప్పుల్లో రూ. 1,700 కోట్లను ఇతర అవసరాలకు దారి మళ్లించినట్లు ఆరోపించింది. ఉన్నతాధికారుల భేటీ... కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ మేరకు కాగ్ తీవ్ర సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివరణలు ఇచ్చేందుకు రాష్ట్ర నీటిపారు దల శాఖ మల్లగుల్లాలు పడుతోంది. కాగ్ ని వేదికపై బుధవారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు చర్చించారు. దీనిపై ప్రభుత్వం నుంచి వివరణలను తీసుకున్నాక తుది నివేదిక సమర్పించే అవకాశం ఉంది. రుణాలు, వడ్డీల భారం.. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 6 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కలిపి 15 భారీ రుణాల రూపంలో మొత్తం రూ. 97,449 కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభు త్వం తీసుకుంది. వార్షిక వడ్డీ రేట్లు 8.25 శాతం నుంచి 10.9 శాతం వరకు ఉన్నాయి. 2023–24 నుంచి 2034–35 మధ్యకాలంలో ఏటా రూ. 13 వేల కోట్లను వడ్డీలతో సహా రుణాల తిరిగి చెల్లింపుల కోసం కట్టాల్సి ఉండనుంది. ఇప్పటివరకు పొందిన రుణాల తిరిగి చెల్లింపులు 2039–40 వరకు కొనసాగనున్నాయి. దీని నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 85 వేల కోట్లకుపైగా ఖర్చు చేయగా నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ. 1.50 లక్షల కోట్లకు ఎగబాకనుందని కాగ్ అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు కింద ఎకరా ఆయకట్టు సాగుకు రూ. లక్ష వరకు కరెంట్ బిల్లు కానుందని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
పోలవరం ప్రధానాంశంగా.. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌పై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన ఈ సమావేశం చేపట్టారు. సకాలంలో సాగునీరు: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్యాలెండర్ ప్రకారం రైతులకు సాగునీరు విడుదలచేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే గోదావరి, కృష్ణాడెల్టా, తోటపల్లి కింద ప్రాంతాలకు సాగునీరు విడుదల చేశామని వెల్లడించారు. చక చకా పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సమీపిస్తున్న కొద్దీ లెఫ్ట్ మెయిన్ కెనాల్‌పై కూడా దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కాగా ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో పనులు చురుగ్గా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్-1లో శాండ్ ఫిల్లింగ్, వైబ్రోకాంపాక్షన్ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. గ్యాప్-2 వద్ద కూడా ఇదే పనులు చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలమండలి అధికారులు గైడ్ బండ్లో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారని, నేల స్వభావంలో మార్పలు కారణంగా ఇది జరిగి ఉండొచ్చని అనుమానాన్ని కమిటీ వెల్లడించిందని తెలిపారు.దెబ్బతిన్న ప్రాంతాన్ని రాక్ డంప్‌తో సిమెంట్ స్లర్రీతో నింపాలని, గేబియన్స్‌తో సపోర్టు ఇవ్వాలని కమిటీ సూచించిందని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. ఆ మేరకు పనులు ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. పూర్తి విశ్లేషణ తర్వాత శాశ్వతంగా చేయాల్సిన మరమ్మతులను సూచిస్తామని కమిటీ చెప్పినట్టుగా వెల్లడించారు. పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి కేంద్ర ఆర్థికశాఖ రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని, కేంద్ర కేబినెట్లో పెట్టేందుకు కేబినెట్ నోట్ తయారీపై వివిధ మంత్రిత్వశాఖల మధ్య సంప్రదింపులు కొలిక్కి వస్తున్నాయని వెల్లడించారు. పోలవరం మొదటి దశ పరిధిలోకి వచ్చే 20,946 ముంపు బాధిత కుటుంబాల్లో 12,658 మందిని ఇప్పటికే తరలించామని, మిగిలిన 8,288 మందిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పారు. చదవండి: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ప్రాధాన్యత ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక శ్రద్ధ: సీఎం జగన్ ► ప్రభుత్వం ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న ప్రాజెక్టుల పూర్తిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ►ప్రతి 15 రోజులకోసారి పనుల ప్రగతిని సమీక్షించుకోవలన్నారు. ►ఈ మేరకు కార్యాచరణ చేసుకుని వేగంగా వాటిని పూర్తిచేయాలన్నారు. ► వెలగొండ, వంశధార, అవుకు సహా పలు ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో పరిస్థితులను సీఎం సమీక్షించారు. ►ఈ ప్రాజెక్టుల ప్రగతిని ముఖ్యమంత్రికి అధికారులు నివేదించారు. ► అవుకు రెండో టన్నెల్ నిర్మాణం పూర్తి, చివరిదశలో లైనింగ్ కార్యక్రమం ఉందని, ఆగస్టులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ► అవుకు ద్వారా 20వేల క్యూసెక్కుల సముద్రంలో కలిసే కృష్ణా వరదజలాలను రాయలసీమ దుర్భిక్షప్రాంతానికి తరలించేందుకు మార్గం సుగమమైందని, వరదలు సమయంలో సముద్రంలో కలవకుండా నీటిని కరవుపీడిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుందని తెలిపారు ►వెలిగొండ ప్రాజెక్టు పనులపై పురోభివృద్ధిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ►ఇప్పటికే మొదటి టన్నెల్ పూర్తయ్యిందని, రెండోటన్నెల్ పనులుకూడా కొలిక్కివస్తున్నాయని తెలిపారు. ►పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో రెండో టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ పనులు 92.14శాతం పూర్తయ్యాని, ఆగస్టు నాటికి హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తిచేస్తామన్నారు. ► టన్నెల్ తవ్వకం పనులు 18,787 మీటర్లకుగానూ, 17,461 మీటర్లు పూర్తిచేశామన్న అధికారులు. ►నీటిని తరలించడానికి వీలైనంత తర్వగా మిగిలిన పనులు త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ►వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా గొట్టిపాడు డ్యాం, కాకర్ల డ్యాం, తీగలేరు అప్రోచ్ ఛానల్, తీగలేరు హెడ్ రెగ్యులేటర్, ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయని అధికారులు తెలిపారు వంశధార పనులపైనా సీఎం సమీక్ష. ► ఈ ఏడాది వంశధార స్టేజ్-2, ఫేజ్-2 కింద డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌ను కూడా పూర్తిచేస్తున్నామని అధికారులు తెలిపారు. ► గొట్టాబ్యారేజీ నుంచి కూడా ఎత్తిపోతల ద్వారా హిరమండలం రిజర్వాయర్‌ను నింపే కార్యక్రమం వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చాలని సీఎం జగన్ ఆదేశించారు. ►తోటపల్లి బ్యారేజీ కింద మిగిలిపోయిన పనులు, తారకరామ తీర్థసాగర్, మహేంద్ర తనయ రిజర్వాయర్లపై సీఎం సమీక్ష. ►ఈ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయని అధికారుల వెల్లడి. ►వీటి తర్వాత ప్రాధాన్యతగా నిర్ణయించుకున్న ప్రాజెక్టులపైనా సీఎం సమీక్ష. ►కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయని అధికారులు తెలిపారు. ఏపీ నాలుగు జాతీయ జల అవార్డులు (నేషనల్ వాటర్ అవార్డ్స్ 2022) దక్కించుకోవడంపై మంత్రి, అధికారులను సీఎం జగన్ అభినందించారు. ఈ సమావేశానికి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఇదీ చదవండి: మినీ పోర్టులా ఉప్పాడ -
‘వార్ధా’ అంచనాలు పెరగలేదు!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ వార్ధా ప్రాజెక్టులో భాగంగా.. 2018లో బ్యారేజీ నిర్మాణానికి మాత్రమే రూ.750 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశామని రాష్ట్ర నీటి పారుదల శాఖ పేర్కొంది. భూసేకరణ, ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లు, ఫీల్డ్ చానళ్లు, కరకట్టలు, పంపుహౌజ్‌లు, విద్యుత్ సబ్స్టేషన్లు, రెగ్యులేటర్లు, క్రాస్ డ్రైనేజీ స్ట్రక్చర్లు, బ్రిడ్జీలు, నిర్వాహణ ఖర్చులతోపాటు 18 శాతం జీఎస్టీ పన్నును కలిపితే మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.4,550.73 కోట్లకు చేరిందని తెలిపింది. కేవలం జీఎస్టీ పన్ను వ్యయం రూ.622.40 కోట్లు కానుందని వెల్లడించింది. ‘వార్ధా ప్రాజెక్టు..భారీ బడ్జెట్’శీర్షికన సోమవారం ‘సాక్షి’లో వచ్చిన కథనంపై నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి వివరణ ఇచ్చారు. ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగలేదని పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టితో భారం తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా వార్ధా నదిపై బ్యారేజీని నిర్మించనుండటంతో వ్యయం గణనీయంగా తగ్గుతుందని నీటిపారుదల శాఖ పేర్కొంది. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ పొడవు 6.45 కిలోమీటర్లు, గేట్ల సంఖ్య 102కాగా.. వార్ధా బ్యారేజీ పొడవు 1751 మీటర్లు, గేట్ల సంఖ్య 29కి తగ్గుతాయని వివరించింది. తుమ్మిడిహెట్టి బ్యారేజీలో 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద గరిష్ట నిల్వ సామర్థ్యం 1.85 టీఎంసీలు మాత్రమేకాగా.. వార్ధా బ్యారేజీలో 155 మీటర్ల వద్ద 2.94 టీఎంసీలను నిల్వ చేయవచ్చని తెలిపింది. -
వార్ధా ప్రాజెక్ట్.. భారీ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు స్థానంలో ప్రతిపాదించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ‘వార్ధా’ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.750 కోట్లు ఉండనుందని గతేడాది రాష్ట్ర నీటిపారుదల శాఖ అంచనా వేయగా, తాజాగా రూ.4,550.73 కోట్లకు ఎగబాకింది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)కి తాజాగా రాష్ట్ర నీటిపారుదలశాఖ సమర్పించిన సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లో ఈ విషయాన్ని వెల్లడించింది. వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్విసెస్(వ్యాప్కోస్) ఈ డీపీఆర్‌ను తయారు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగాకుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గుండాయిపేట వద్ద వార్ధా బ్యారేజీ నిర్మించనున్నారు. నాలుగేళ్లలోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వార్ధా బ్యారేజీకి ఇరువైపులా తెలంగాణ, మహారాష్ట్ర భూభాగంలో ముంపు నివారణకు వరద రక్షణ గోడలను నిర్మించాలని నిర్ణయం తీసుకోవడంతో ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది. మొదట అనుకున్న తుమ్మిడిహెట్టి వద్ద కాదని.. ఉమ్మడి ఏపీలో ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి తెలంగాణ ఏడు జిల్లాల్లోని 16.4లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించేందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చెవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టింది. రూ.1919 కోట్లతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించాలని, 6.5 కి.మీల పొడవున ఉండనున్న ఈ బ్యారేజీకి 107 గేట్లను ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్యారేజీ నిర్మాణంలో మహారాష్ట్రలో 1852 ఎకరాలు, తెలంగాణలో 526 ఎకరాలు, నదీ గర్భంలో 3771 ఎకరాలు కలిపి మొత్తం 6149 ఎకరాల ముంపు ఉంటుందని తేల్చారు. ఆ తర్వాత బ్యారేజీ ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించేందుకు మహారాష్ట్రతో ఒప్పందం కూడా చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ ప్రక్రియను చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని పక్కనపెట్టింది. దీనికి బదులుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. కాళేశ్వరంతో పాటే తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మించి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లోని 2లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. వన్యమృగాల అభయారణ్యం ఉండడంతో తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీకి అనుమతులు రావని ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును విరమించుకుంది. మహారాష్ట్రతో మళ్లీ ఒప్పందం మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి పెరగడంతో వార్ధా నదిపై బ్యారేజీ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. వార్ధా నదిపై 36 గేట్లతో బ్యారేజీ నిర్మిస్తే సరిపోతుందని, దీనికి రూ.650 కోట్ల ఖర్చు కానుందని గతేడాది జనవరిలో నీటిపారుదల శాఖ అంచనా వేసింది. ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ హయంలో తవ్వి వదిలేసిన కాల్వలతో అనుసంధానం చేయడానికి అదనంగా తవ్వాల్సిన కాల్వకు మరో రూ.100 కోట్ల కానుందని, మొత్తం రూ.750 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయవచ్చని లెక్కలు వేసింది. కానీ తాజాగా అంచనా వ్యయం రూ.4550 కోట్లకు పెరిగిపోయింది. వరద రక్షణ గోడల నిర్మాణానికి రూ.1000 కోట్లను అంచనాల్లో ప్రతిపాదించారు. వార్ధా బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రతో మళ్లీ కొత్త ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. 1.34 లక్షల ఎకరాల ఆయకట్టు.. ఈ ప్రాజెక్టు కింద 1,34,880 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందని, మరో 5868 ఎకరాల స్థిరీకరణ జరగనుందని, ఏటా రూ.1224.18 కోట్ల ఆదాయాన్ని సృష్టించనుందని డీపీఆర్‌లో వ్యాప్కోస్ అంచనా వేసింది. 11.5 టీఎంసీల నీళ్లను ఈ ప్రాజెక్టు వాడుకోనుండగా, బ్యారేజీ నిల్వ సామర్థ్యం 2.96 టీఎంసీలు ఉండనుంది. 142.5 మీటర్ల ఎత్తులో బ్యారేజీకి 22 గేట్లను ప్రతిపాదించారు. తెలంగాణలో 3076 ఎకరాలు, మహారాష్ట్రలో 741.31 ఎకరాలు సేకరించాల్సి ఉండనుంది. -
10న కృష్ణా బోర్డు సమావేశం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీజలాల్లో వాటాల పంపకాలపై ఈ నెల 10న జరిగే కృష్ణా నదీ యాజమాన్యబోర్డు సమావేశం ఎజెండా ఖరారైంది. తెలంగాణ గతేడాది నుంచి పట్టుబడుతున్న కృష్ణాజలాల్లో చెరి ఏభై శాతం చొప్పున నీటిపంపిణీ చేయాలన్న అంశాన్ని ఎజెండాలో చేర్చారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తుతున్న అభ్యంతరాలు కూడా చర్చకు రానున్నాయి. 2022–23 వాటర్ ఇయర్లో నీటి పంపకాలు చేయకుండానే పూర్తికానిచ్చిన నదీ యాజమాన్య బోర్డు ఈసారి రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులకు సమావేశ ఎజెండాను పంపించింది. ఇప్పటివరకు ఉన్న 66:34 నీటి పంపకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. గతేడాది మే 6వ తేదీన జరిగిన సమావేశంలో తెలంగాణ అధికారులు మొదట చెరిసగం నీటి కేటాయింపులు చేయాలని డిమాండ్ చేసినా.. చివరలో బోర్డు చైర్మన్ విచక్షణకే వదిలేశారు. దీంతో తెలంగాణ అధికారులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశంలో గట్టిగా పట్టుపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తాగునీటికి కేవలం 20 శాతం మాత్రమే కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీతోపాటు పలు ప్రాంతాల్లో సెన్సార్ ఆధారిత రియల్ టైమ్ డేటా అక్విజేషన్ సిస్టమ్ కూడా ఈసారి బోర్డు ఎజెండాలో చేర్చారు. ఆర్డీఎస్ ఆధునీకరణ, కుడికాలువ పనుల నిలిపివేత కోసం తెలంగాణ చేసిన విజ్ఞప్తిని సమావేశంలో చర్చకు పెట్టారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలనే అంశం కూడా ఈసారి సమావేశంలో ప్రధాన అంశం కానుంది. జల విద్యుత్... శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో అవసరం లేకున్నా తెలంగాణ జలవిద్యుత్ ఉత్పాదన చేస్తుందన్న ఏపీ అభ్యంతరాలు, రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ(ఆర్ఎంసీ) సిఫారసుల అమలుపై కూడా చర్చించనున్నారు. జలవిద్యుత్ ఉత్పాదన, రూల్‌కర్వ్ మిగులు జలాల నిర్ధారణ వంటి అంశాలపై కూడా చర్చించనున్నారు. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటి కేటాయింపులు చేస్తూ తెలంగాణ సమర్పించిన డీపీఆర్‌తోపాటు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం తెలంగాణ రూ.1,450 కోట్లతో నిర్మిస్తున్న సుంకిశాల ఇంటెక్ వెల్ ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ అభ్యంతరాలు కూడా చర్చకు రానున్నాయి. -
జేడీ రహస్య విచారణ?
గద్వాల క్రైం: గద్వాల ఇరిగేషన్‌శాఖ విభాగం–4లో గత ఏప్రిల్ 12న సీపీఎస్ నిధుల కాజేత వ్యవహారంపై పే అండ్ అంకౌట్ అధికారి, సిబ్బంది పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం విధితమే. అయితే ఈ కేసు విచారణలో మాత్రం ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్లుగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. మూడు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర పీఓ (పెన్షన్ కార్యాలయం) జాయింట్ డైరెక్టర్ శైలజారెడ్డి గద్వాల ఇరిగేషన్‌శాఖ విభాగం– 4 కార్యాలయంలో రహస్య విచారణ చేపట్టి సిబ్బందితో మాట్లాడారు. సిబ్బంది వ్యక్తిగత యూసర్ ఐడీ, పాస్వర్డ్లు, హైదరాబాద్ కార్యాలయం యూసర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను టైపిస్టు జహంగీర్ ఎవరి ప్రమేయంతో తెలుసుకున్నాడు? సహకరించిన ఉదోగ్యి ఎవరు? ఈ శాఖలో కొలువు ఎలా వచ్చింది? కారుణ్య నియామకమా.. రాత పరీక్షల ద్వారా ఎంపిక అయ్యాడా? సర్వీసు బుక్ తదితర సమాచారంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. సీపీఎస్ నిధులు, ఇతరత్రా ప్రభుత్వ బిల్లులు సైతం కాజేశాడా? పలు విషయాలపై కార్యాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రూ.16, 83,130 నిధులు ఎవరి ఖాతాలోకి మళ్లించాడు. ఆ ఖాతాదారులెవరు? కాజేసిన సీపీఎస్ నిధులతో ఏం చేశాడు? కేసు నమోదైనప్పటి నుంచి పోలీసుశాఖ గుర్తించిన విషయాలు తదితర అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. జేడీ వచ్చిన విషయాన్ని ఇక్కడి సిబ్బంది బయటికి పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. ఇదిలా ఉండగా గద్వాల ఇరిగేషన్ శాఖలో నాలుగు విభాగాల్లో సిబ్బంది పనిచేస్తున్నారు. వీరి సీపీఎస్ నిధుల విషయమై పూర్తి నివేదికను సీఈ రఘునాథ్‌రావును అడిగినట్లు సమాచారం. దళారులతో రాజీ.. 12వ తేదీ ఫిర్యాదు అయినప్పటి నుంచి టైపిస్టు జహంగీర్ పలువురు దళారులతో రాజీకి తీవ్రంగా మంతనాలు చేస్తునట్లు తెలిసింది. ఎలాంటి కేసు లేకుండా చూడాల్సిందిగా వేడుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ మంత్రితో తనను ఈ గండం నుంచి గట్టెక్కించాలని ప్రాధేయపడినట్లు తెలిసింది. తగిన నజరానా సైతం ఇచ్చేందుకు ప్రయత్నం చేశాడని తెలిసింది. అయితే సదరు మంత్రి సైతం కేసు వ్యవహారంపై స్థానిక ఓ నాయకుడితో మాట్లాడి సమస్యను సద్దుమణిగేలా చూడాల్సిందిగా చెప్పినట్లు తెలిసింది. ఇక కేసు విచారణ సైతం పారదర్శకంగా జరగడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సిబ్బంది మాత్రం ఇక్కడి తీరు పై ఆక్రోశంగా ఉన్నారు. ఉదోగ్య సంఘాల నాయకులు స్పందించకపోవడం వెనుక ఆంతర్యం ఏమి టని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు కలెక్టర్ సైతం స్పందించకపోవడం, పోలీసులు ఈ వ్యవహారంలో జాప్యం చేయడంపై పెదవి విరుస్తున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ విభాగం–4 అధికారి శ్రీనివాసులును వివరణ కోరగా, జేడీ వచ్చిన మాట వాస్తవామే అన్నారు. పలు విషయాలపై సిబ్బందితో మాట్లాడారని, వ్యవహారం ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉందని తెలిపారు. సిబ్బందికి జరిగిన మోసంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. -
‘సాగు’ నిధుల్లో సగానికిపైగా అప్పులకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో సాగునీటి రంగానికి భారీగా కేటాయింపులు చూపినా.. నిధుల్లో సింహభాగం రుణ కిస్తీలు, వడ్డీల చెల్లింపునకే ఖర్చవుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్ 2023–24లో నీటి పారుదలశాఖకు నిర్వహణ పద్దు కింద రూ.17,504.1 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.8942.86 కోట్లు కలిపి మొత్తం రూ.26,446 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్లో చేసిన రూ.22,675 కోట్ల కేటాయింపులతో పోల్చితే ఇది రూ.3,771 అదనం. తాజా కేటాయింపుల్లో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.7,715.89 కోట్లు, మధ్యతరహా ప్రాజెక్టులకు రూ.335.58 కోట్లు, చిన్న ప్రాజెక్టులకు రూ.1,301.58 కోట్లు, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు రూ.256.56 కోట్లను చూపారు. నిర్వహణ పద్దు అప్పులకే.. తాజా బడ్జెట్లో నిర్వహణ పద్దు కింద చూపిన రూ.17,504 కోట్లలో ఏకంగా రూ.15,700 కోట్లు రుణ వాయిదాలు, వడ్డీల చెల్లింపులకే పోనున్నాయి. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి కాళేశ్వరం కార్పొరేషన్ పేరిట తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం గత ఏడాది బడ్జెట్లో రూ.11,745 కోట్లను కేటాయించారు. ఈ ఏడాది మరో రూ.3,955 కోట్లు పెరిగాయి. అసంపూర్తిగా ఉన్న కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, సీతమ్మసాగర్, వరద కాల్వ వంటి ప్రాజెక్టుల పూర్తికి మళ్లీ కొత్త రుణాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఉందని అధికార వర్గాలే చెప్తున్నాయి. -
త్వరలో నీటిపారుదల సమీకృత చట్టం
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖకు సంబంధించిన 18 వేర్వేరు చట్టాలను కలిపి కొత్తగా ఒక సమీకృత నీటిపారుదల చట్టాన్ని తెస్తున్నామని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే ముసాయిదా బిల్లును సిద్ధం చేశామని, బడ్జెట్ సమావేశాల్లో కాకుండా ఆ తర్వాత జరిగే సమావేశాల్లో ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశముందన్నారు. నీటిపారుదలశాఖపై ఈఎన్సీ సి.మురళీధర్‌తో కలసి మంగళవారం ఆయన జలసౌధలో సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నిజాం కాలం నాటి ఫసలి చట్టం 1935 అమల్లో ఉండగా రాష్ట్ర నీటిపారుదల రంగంలో సమూల మార్పులు రావడంతో కొత్త చట్టం అనివార్యమైందన్నారు. నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణతోపాటు నీటి నిర్వహణ పద్ధతులు, ఆర్థికపరమైన అధికారాలు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిబంధనల్లో భారీ మార్పులు వచ్చాయని... నీటిపారుదల ఆస్తుల పరిరక్షణ, నీటి భద్రత, నిర్వహణ అంశాలు పాత చట్టాల్లో లేవని, కొత్త చట్టంలో వాటిపై కచి్చతమైన నిబంధనలను పొందుపరచనున్నట్లు రజత్‌కుమార్ వెల్లడించారు. సెక్షన్–3పై వెనక్కి తగ్గలేదు.. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపకాల కోసం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం–1956లోని సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని రజత్‌కుమార్ తెలిపారు. కృష్ణా జలాల పంపిణీ బాధ్యతను కొత్త ట్రిబ్యునల్‌కు అప్పగించాలా లేక ఇప్పటికే మనుగడలో ఉన్న కృష్ణా ట్రిబ్యునల్–2 లేదా మరే ఇతర ట్రిబ్యునల్‌కు అప్పగించాలా? అనే అంశంపై న్యాయశాఖ సలహా మేరకు చర్యలు తీసుకుంటామని గత అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. దీనిపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆ శాఖ అధికారులు గతేడాది డిసెంబర్లో హామీ ఇచ్చారని... అందువల్ల ఈ విషయమై మళ్లీ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లాలనే భావనతో ఉన్నామని చెప్పారు. ఒకవేళ కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల వాటా ఉండగా తెలంగాణకు 575 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామని, ట్రిబ్యునల్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. గోదావరి జలాల విభజనకూ కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును ఏపీ కోరడంపై స్పందిస్తూ తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. ఎనిమిది డ్యామ్‌ల మరమ్మతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు.. ఆనకట్టల భద్రతా చట్టం కింద కడెం, మూసీ, స్వర్ణతోపాటు మొత్తం 8 డ్యామ్‌ల మరమ్మతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని తెలిపారు. మూసీ ప్రాజెక్టు పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. సీతమ్మసాగర్ జలాశయం నిర్మాణంతో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన పంపులు నీటమునగనున్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. -
నీటి లభ్యత తేల్చాకే కొత్త ప్రాజెక్టులకు అనుమతి
సాక్షి, అమరావతి: గోదావరిలో నీటి లభ్యతపై శాస్త్రీయ అధ్యయనం చేసి.. రెండు రాష్ట్రాల వాటాలు తేల్చాకే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని గోదావరి బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా చనాకా–కొరటా, చిన్న కాళేశ్వరం, గుత్ప ఎత్తిపోతలకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక అనుమతి ఇవ్వడం సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. వాటి అనుమతిని పునఃసమీక్షించి.. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించాలని కోరింది. దీనిపై గోదావరి బోర్డు చైర్మన్ ఎమ్కే సిన్హా స్పందిస్తూ.. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని సిఫార్సు చేస్తామన్నారు. ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డీపీఆర్)లపై రెండు రాష్ట్రాల అభిప్రాయాలను నమోదు చేసి సీడబ్ల్యూసీకి పంపుతామని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో ఎమ్కే సిన్హా అధ్యక్షతన గోదావరి బోర్డు 14వ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. ఏపీ తరఫున ఈఎన్సీ నారాయణరెడ్డి, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు, తెలంగాణ తరఫున ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. కడెం–గూడెం ఎత్తిపోతల, మోదులకుంటవాగు ఎత్తిపోతలకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ కోరడంపై ఏపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కడెం–గూడెం ఎత్తిపోతల డీపీఆర్‌లోనే కడెం వాగులో 17 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తెలంగాణ సర్కార్ పేర్కొందని.. అలాంటప్పుడు గోదావరి నుంచి 11.5 టీఎంసీలను ఎత్తిపోయాల్సిన అవసరం ఏముంటుందని నిలదీసింది. నీటి లభ్యత, వాటా తేల్చే దాకా కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చేందుకు అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చిచెప్పింది. తెలంగాణ ప్రాజెక్టులకు ఎలా అనుమతి ఇస్తారు చనాకా–కొరటా, చిన్న కాళేశ్వరం, గుత్ప ఎత్తిపోతలకు తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా.. కనీసం తమను సంప్రదించకుండా సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా కమిటీ ఎలా అనుమతి ఇస్తుందని ఏపీ అధికారులు నిలదీశారు. దీనిపై వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్న సీడబ్ల్యూసీ (హైడ్రాలజీ విభాగం) డైరెక్టర్ నిత్యానందరాయ్ స్పందిస్తూ.. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా ఆ మూడు ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతి ఇచ్చామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర పరిధిలో గోదావరిలో 1,430 నుంచి 1,480 టీఎంసీల లభ్యత ఉంటుందని తెలిపారు. గత ఐదేళ్లలో సగటున 1,600 టీఎంసీల లభ్యత ఉందని.. వాటి ఆధారంగానే ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చామన్నారు. దీనిపై ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు జరగని నేపథ్యంలో తెలంగాణ ప్రాజెక్టులకు ఎలా అనుమతి ఇస్తారని నిలదీశారు. దీనిపై నిత్యానందరాయ్ స్పందిస్తూ.. ఇకపై ఏపీ అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. పోలవరం బ్యాక్‌వాటర్‌పై తెలంగాణ పేచీ పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో భద్రాచలం పరిసర ప్రాంతాలు భారీ ఎత్తున ముంపునకు గురవుతున్నాయని.. దీనిపై మళ్లీ అధ్యయనం చేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని చర్చించడానికి గోదావరి బోర్డు సరైన వేదిక కాదన్న ఏపీ అభిప్రాయంతో ఎమ్కే సిన్హా ఏకీభవించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సమావేశంలో తెలంగాణ ఈ అంశాన్ని లేవనెత్తిందని గుర్తు చేశారు. బ్యాక్‌వాటర్ ప్రభావం అంశాన్ని పీపీఏలోనే చర్చించాలని తేల్చిచెప్పడంతో తెలంగాణ కూడా అంగీకరించింది. కాగా ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు ఆధునికీకరణకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఆయకట్టు ఆధారంగా ఆధునికీకరణకు అయ్యే వ్యయాన్ని దామాషా పద్ధతిలో ఏపీ 85 శాతం, తెలంగాణ 15 శాతం భరించనున్నాయి. అలాగే గోదావరి ప్రాజెక్టులపై 23 చోట్ల టెలీమీటర్లను ఏర్పాటు చేసి నీటి వినియోగాన్ని లెక్కించడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. బోర్డు నిర్వహణకు 2023–24లో చెరో రూ.ఐదు కోట్ల చొప్పున విడుదల చేయడానికి కూడా సమ్మతించాయి. -
వాలంతరీ ‘రియల్ ఎస్టేట్స్’
సాక్షి, హైదరాబాద్: నీరు, భూమి యాజమాన్య శిక్షణా పరిశోధన సంస్థ (వాలంతరీ) భూములను నీటిపారుదల శాఖ అమ్మకానికి పెడుతోంది. వాలంతరీతో పాటు తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ పరిశోధనశాల (టీఎస్ఈఆర్ఎల్)కు చెందిన 300 ఎకరాలను ప్లాట్లుగా చేసి అమ్మాలని, దీనిపై రూ.3 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. ఈ మేరకు భూములను అమ్మేందుకు పురపాలక శాఖకు ఆ భూములను అప్పగించాలని యోచిస్తోంది. వాస్తవానికి వాలంతరీ, టీఎస్ఈఆర్ఎల్కు హిమాయత్‌సాగర్, ప్రేమావతిపేట, కిస్మత్పురాలలో 217.15, 224.52 ఎకరాల చొప్పున భూములున్నాయి. ఇందులో వాలంతరీ, టీఎస్ఈఆర్ఎల్ కార్యాలయాలు పోను మిగిలిన భూములను అమ్మేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ భూములను మున్సిపల్ శాఖ ద్వారా హెచ్ఎండీఏకు బదిలీ చేస్తే, ఆ సంస్థ ఎకరాకు 2,900 గజాల స్థలాన్ని అమ్మకానికి పెట్టి అమ్మనుందని సమాచారం. రుణాలు తీసుకునే వెసులుబాటుపై కేంద్రం ఆంక్షలు విధించిన నేపథ్యంలో సొంతవనరుల ద్వారా రాబడులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఇప్పటిదాకా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని భూములను అమ్మకానికి పెట్టింది. కానీ, తొలిసారిగా నీటిపారుదల శాఖకు చెందిన భూములను ఆదాయ టార్గెట్‌గా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుండటం గమనార్హం. -
పోలవరం ముంపుపై పరిశీలన
బూర్గంపాడు/భద్రాచలం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురయ్యే ప్రాంతాలను గురువారం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణలోని బూర్గంపాడు, అశ్వా పురం, భద్రాచలం మండలాల్లోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతాయని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై కేంద్ర జలవనరుల సంఘం స్పందించింది. ఆయా ప్రాంతాలను పరిశీలించి నివేదిక అందించాలని ఇరు రాష్ట్రాల అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారులు భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం మండలాల్లో పర్యటించి వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో పర్యటించారు. ఈ ఏడాది వచ్చిన వరదల సమయంలో కిన్నెరసాని, ముర్రేడు, పెదవాగు, ఎదుర్లవాగులో వరద తీవ్రత ఎంతమేర వచ్చిందనే వివరాలు సేకరించారు. త్వరలోనే మరోసారి సర్వే నిర్వహిస్తామని తెలిపారు. ఈ బృందంలో తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ నాగేంద్ర కుమార్, సీఈ శ్రీనివాసరెడ్డి, ఎస్ఈ వెంకటే శ్వరరెడ్డి, ఏపీ ఇరిగేషన్ ఈఈ రమ ణ, డీఈఈలు పుల్లారావు, దామోదర్ ఉన్నారు. -
ఇరిగేషన్ శాఖ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన అయ్యన్న
-
అనుమతిలేని ప్రాజెక్టులకు ఏపీ టెండర్లు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా పలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఏపీ టెండర్లను ఆహ్వానించిందని, తక్షణమే వాటిని నిలుపుదల చేయించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. కృష్ణా జలాలను బేసిన్ వెలుపలి ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు చేపట్టిన ఈ పనులు బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. గండికోట రిజర్వాయర్ నుంచి నీటిని మంగపట్నం, గంగదేవిపల్లి చెరువులకు తరలించడానికి లిఫ్ట్‌లు, పైపులైన్ల నిర్మాణం, సూళ్లూరుపేట మున్సిపాలిటీకి తాగునీటిని తరలించడానికి సత్యసాయి గంగ కాల్వ వద్ద ఓటీ స్లూయిస్ నిర్మాణానికి ఏపీ టెండర్లు ఆహ్వానించినట్లు ఫిర్యాదు చేసింది. అలాగే ముడిగుబ్బ వద్ద జిల్లెడుబండ రిజర్వాయర్, హంద్రీనీవా ప్రధాన కాల్వ 377.1 కి.మీ. వద్ద సరప్లస్ వేర్, క్రాస్ రెగ్యులేటర్, హంద్రీనీవా–2 ప్యాకేజీ 25 లిఫ్ట్ నిర్మాణ పనులకు కూడా టెండర్లు పిలిచిందని ఫిర్యాదులో పేర్కొంది. గాలేరు నగరి (జీఎన్ఎస్ఎస్) పథకం ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను పెన్నానదిపై ఉన్న గండికోట జలాశయానికి తరలించడం బచావత్ అవార్డు ఉల్లంఘన అవుతుందని వివరించింది. హెచ్ఎన్ఎస్ఎస్, జీఎన్ఎస్ఎస్, వెలిగొండ, తెలుగు గంగ ప్రాజెక్టుల ద్వారా కృష్ణా జలాలను బేసిన్ వెలుపలి ప్రాజెక్టులకు తరలించడాన్ని కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట తాము వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ పనులను తక్షణమే నిలుపుదల చేయించాలని, ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. -
గుండ్లకమ్మ నుంచి ఖరీఫ్‌కు నీరిస్తాం
మద్దిపాడు: వచ్చే రబీ సీజన్‌కల్లా గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్‌కు, వచ్చే రబీ సీజన్లో పంటలకు ప్రాజెక్టు నుంచి నీరందిస్తామని, తాగు నీరు కూడా అందిస్తామని తెలిపారు. ఆయన శనివారం ప్రకాశం జిల్లాలోని కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ జలాశయాన్ని పరిశీలించారు. గడ్డర్లు ఊడిపోయిన మూడో గేటును పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిజర్వాయర్‌లో నీటిని 1.25 టీఎంసీలకు తగ్గించి పనులు చేస్తామన్నారు. సాగు నీటి సరఫరాకు ఏ ఇబ్బందీ కలగదని, అవసరమైతే సాగర్ కాలువల ద్వారా రిజర్వాయర్ నింపుతామని తెలిపారు. మూడో నంబర్ గేటుతో పాటు మరో తొమ్మిది గేట్లకు మరమ్మతులు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారన్నారు. ఈ పనులకు కాంట్రాక్టర్‌ను కూడా ఖరారు చేశామని చెప్పారు. నీరు కిందకు పోవడంవల్ల రైతులకు నష్టం జరుగుతోందంటూ టీడీపీ అధినాయకుడి డైరెక్షన్లో పచ్చ పత్రికలు వికృత భాషలో వండి వారుస్తున్నాయని మండిపడ్డారు. గేటు విరగడం నిన్న, మొన్న జరిగింది కాదని, 2014 – 19 మధ్య టీడీపీ ప్రభుత్వం రిజర్వాయర్‌కు మరమ్మతులు చేయించలేదని తెలిపారు. వారి హయాంలో మరమ్మతులకు రూ.6 కోట్లు మంజూరు చేయించుకుని గేట్లు, స్పిల్‌వేను పట్టించుకోలేదని చెప్పారు. ఆ డబ్బుతో రిజర్వాయర్ వద్ద బ్యూటిఫికేషన్, గెస్ట్ హౌస్‌లు అంటూ టీడీపీ నేతలు కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. పచ్చ పత్రికలకు ఇవేమీ కనిపించవని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పులిచింతలలో కొట్టు కుపోయిన గేటు రిపేరు చేస్తున్నామన్నారు. డ్యాములకు రిపేర్లు రావడం ఈ రోజు వచ్చిన సమస్య కాదని చెప్పారు. గత ప్రభుత్వం డ్యాముల నిర్వహణను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. అన్ని డ్వామ్‌లకు మరమ్మతులు చేపడతామని అన్నారు. రాష్ట్రానికి ఏ పరిశ్రమ రాకూడదని ప్రతిపక్షం కుట్రలు పన్నుతోందన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ రాకుండా కేంద్రానికి టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడు పర్యావరణ ఇబ్బందులు వస్తాయంటూ లేఖలు రాస్తున్నారని, ఇదేం పద్ధతని ప్రశ్నించారు. మూడు రాష్ట్రాలకు మాత్రమే డ్రగ్ పార్కులకు అవకాశం దక్కిందన్నారు. డ్రగ్ పార్క్ ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, వేలాది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. అటువంటి ప్రాజక్టును అడ్డుకోవడం వారి దుర్బుద్ధికి నిదర్శనమని చెప్పారు. -
‘కాళేశ్వరం’ విద్యుత్ బకాయిలు 3,114 కోట్లు!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విద్యుత్ బిల్లులు ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయి. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 140 టీఎంసీల నీటిని తరలించగా మొత్తం రూ. రూ. 3,600 కోట్ల విద్యుత్ బిల్లులు వచ్చాయి. అయితే బిల్లులను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇప్పటివరకు జరిపిన చెల్లింపులు పోగా ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)కు రూ. 2,575.58 కోట్లు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)కు రూ. 538.51 కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ రెండు సంస్థలకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ. 3,114.09 కోట్లకు చేరుకున్నాయి. ఈ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ రెండు డిస్కంలు నీటిపారుదల శాఖకు తాజాగా లేఖలు రాశాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలోని మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకమ్మసాగర్లకు నీళ్లను ఎత్తిపోయడానికి మూడేళ్లలో మొత్తం రూ.866.21 కోట్ల విద్యుత్ బిల్లులు రాగా, రూ. 327 కోట్లను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక టీఎంసీ నీటి తరలింపునకు రూ. 25.71 కోట్ల మేర విద్యుత్ చార్జీల వ్యయమైంది. అలాగే ఎకరం సాగుకు విద్యుత్ బిల్లుల రూపంలో రూ. 21,810 ఖర్చయింది. భవిష్యత్‌లో మరింత భారం... కాళేశ్వరం ఎత్తిపోతల కింద నెలకొల్పిన 19 పంపు స్టేషన్లలోని 82 మోటర్ల వినియోగానికి 4,627 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని ప్రభుత్వం తొలుత అంచనా వేసింది. అంటే కనీసం 13,558 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం ఉంటుందని భావించింది. ఈ లెక్కన ఒక్కో యూనిట్‌కు రూ. 6.30 ల చొప్పున (పెరిగిన విద్యుత్ చార్జీలు కాకుండా) మొత్తం సంవత్సరానికి రూ. 8,541.54 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మొత్తం 20 లిఫ్టులు ఈ ప్రాజెక్టుకు చెందిన లింకు ప్యాకేజీల్లో భాగం. కానీ ఇందులో 8 చోట్ల వినియోగించిన మోటారు పంపులకు మూడేళ్లలోనే రూ. 3,060 కోట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఇక పూర్తిస్థాయిలో అన్ని పంపుస్టేషన్‌లలో మోటారు పంపులను వినియోగిస్తే మరింత విద్యుత్ భారం పెరుగుతుందని ఇరిగేషన్, విద్యుత్తు శాఖల అధికారులు చెబుతున్నారు. పెరిగిన విద్యుత్ వ్యయం... ఈ ప్రాజెక్టుకు మొదట విద్యుత్ చార్జీలు యూనిట్‌కు వ్యయం రూ. 5.80 ఉంటే దానిని రూ. 6.30 పైసలకు పెంచారు. ఫిక్స్డ్ చార్జీలు కిలోవాట్‌కు రూ. 165 ఉంటే దానిని రూ. 275కి పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రెండేళ్లలో 99 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. 2019–20లో 66 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా 1906.59 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమైంది. దీనికి గాను ఒక యూనిట్‌కు రూ.5.80 చొప్పున 1105.82 కోట్ల ఖర్చయింది. 2020–21లో 33 టీఎంసీల నీటిని తరలించగా 1,697.88 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. పెరిగిన చార్జీల ప్రకారం రూ. 984.77 కోట్ల విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 5 వరకు మూడేళ్లలో ఎత్తిపోసిన మొత్తం 140 టీఎంసీలకు రూ. 3,600 కోట్ల విద్యుత్ వినియోగం జరగ్గా రూ. 2,575.58 కోట్ల మేరకు బకాయిలు ఉన్నట్లు ఎన్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. -
గోదావరి వరదలు.. ఏ హెచ్చరిక ఎప్పుడు జారీ చేస్తారు?
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: వరదల వేళ ముందస్తుగా చేస్తున్న హెచ్చరికలే ప్రజలకు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ హెచ్చరికల ఆధారంగానే ప్రభుత్వ యంత్రాంగం వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు అవసరమైన సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్దదైన గోదావరి నదికి జూలై నెలలో వచ్చే వరదలు సాధారణంగా పెద్దగా ప్రభావం చూపవు. చదవండి: 48 గంటల్లోపు ప్రతీ ఒక్కరికీ సాయం అందించాలి: సీఎం జగన్ అందుకు భిన్నంగా ఈసారి గోదావరి మహోగ్రరూపమెత్తి ప్రజలను భయపెడుతోంది. ఎగువన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఉప నదులైన మంజీరా, ప్రాణహిత, వార్ధా, ఇంద్రావతి, కిన్నెరసాని, శబరి, పెన్‌గంగ వంటివి పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ వరద నీరంతా చేరడంతో గోదావరి కూడా ఉప్పొంగిపోతోంది. మూడున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా భద్రాచలం నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ గత ఎనిమిది రోజులుగా గోదావరి ఉగ్రరూపం దాలి్చంది. శనివారం నాటికి కాటన్ బ్యారేజీ వద్దకు 25 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరింది. ఆదివారం నిలకడగా ఉన్నప్పటికీ దాదాపు అదే స్థాయిలో కొనసాగింది. రాత్రి నుంచి వరద క్రమేపీ తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. బ్యారేజీ నిర్మించినప్పటి నుంచీ.. ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడంలో వరద ప్రమాద హెచ్చరికలు ఎంతో తోడ్పడుతున్నాయి. గోదావరిపై ధవళేశ్వరం వద్ద 1847 – 1852 మధ్య సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట నిర్మించిన బ్రిటిష్ పాలకులు 1855లో రివర్ కన్జర్వెన్సీ చట్టం తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దీని ఆధారంగానే వరద పరిస్థితిని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పేరూరు నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ నీటి ప్రవాహాలను అధికారికంగా గంటగంటకూ ప్రకటిస్తూంటారు. గోదావరి ప్రవాహ వేగాన్ని బట్టి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూంటారు. వీటి ఆధారంగానే బ్యారేజీకి దిగువన ప్రజలను అప్రమత్తం చేస్తారు. పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. ఈ ప్రక్రియ బ్యారేజీ నిర్మించినప్పటి నుంచీ జరుగుతోంది. మొదటి ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 11.75 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తారు. ఆ సమయంలో బ్యారేజీ నుంచి 10 లక్షల క్యూసెక్కులకు మించి మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెడతారు. ఫ్లడ్ కన్జర్వేటర్‌గా హెడ్ వర్క్స్ ఈఈ వ్యవహరిస్తారు. గోదావరిలో నాటు పడవల రాకపోకలను నిషేధిస్తారు. శాశ్వత, తాత్కాలిక ఫ్లడ్ స్టోర్స్‌లో సామగ్రిని చెక్ చేసుకుంటారు. ఫ్లడ్ డ్యూటీ అధికారులు హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉంటారు. రెండో ప్రమాద హెచ్చరిక బ్యారేజీ వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 13 లక్షల క్యూసెక్కులకు మించి మిగులు జలాలను విడుదల చేస్తారు. బ్యారేజీ దిగువన ఉన్న వందలాది లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తారు. ఫ్లడ్ డ్యూటీ అధికారులు వెంటనే విధుల్లో చేరాలి. మూడో ప్రమాద హెచ్చరిక బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 17.75 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఆ సమయంలో బ్యారేజీ నుంచి 17.50 లక్షలు ఆపైన వచ్చిన మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తారు. మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయితే బ్యారేజీ దిగువన గోదావరి లంకలు నీట మునుగుతాయి. ఈ హెచ్చరిక ప్రకటించిన వెంటనే ఫ్లడ్ డ్యూటీ అధికారులు వారికి కేటాయించిన ప్రదేశాల్లో 24 గంటలూ డ్యూటీ నిర్వహించాలి. గోదావరిపై రాకపోకలను పూర్తిగా నిషేధిస్తారు. ఫ్లడ్ కన్జర్వేటర్‌గా ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో వరద బాధితుల పునరావాసం, ప్రమాద నివారణ చర్యలు ఆరంభిస్తారు. రివర్ కన్జర్వెన్సీ చట్టంతోనే.. బ్యారేజీ నిర్మించినప్పటి నుంచీ వరద ప్రమాద హెచ్చరికల జారీకి బ్రిటిష్ కాలం నాటి రివర్ కన్జర్వెన్సీ చట్టాన్నే అనుసరిస్తున్నారు. భద్రాచలం, పోలవరం, ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహ వేగాన్ని బట్టి ఈ హెచ్చరికలు జారీ చేస్తారు. వీటి వల్లే ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయడం సాధ్యమవుతోంది. మూడో ప్రమాద హెచ్చరికను రెడ్ అలర్ట్‌గా చెప్పవచ్చు. – విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్, రిటైర్డ్ ఎస్ఈ, హెడ్‌వర్క్స్, ధవళేశ్వరం -
Kadem Project: ఉన్న గేట్లు మార్చి.. కొత్త గేట్లు కట్టి..!
సాక్షి, హైదరాబాద్: చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భారీ వరదలు పోటెత్తడంతో కుదేలైన కడెం ప్రాజెక్టును ఆధునీకరించాలని నీటిపారుదల శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రాజెక్టు గరిష్ట నీటి విడుదల సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కులుకాగా.. ఈ నెల 13న అర్ధరాత్రి 6.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అంత వరదను కిందికి వదిలేందుకు వీల్లేకపోవడంతో.. నిల్వ సామర్థ్యానికి మించి నీరు చేరి ప్రాజెక్టు తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఎడమవైపు స్పిల్‌వేకు గండిపడి వరద వెళ్లేందుకు మరో మార్గం ఏర్పడటంతో ప్రాజెక్టుపై ఒత్తిడి తగ్గి ప్రమాదం తప్పింది. ప్రాజెక్టుకు 18 గేట్లు ఉండగా.. వరదల సమయంలో ఓ గేటు మొరాయించింది. మిగతా 17 గేట్లను ఎత్తగలిగారు. వరద తగ్గాక తిరిగి గేట్లను కిందికి దించడానికి ప్రాజెక్టు ఇంజనీర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వరదతోపాటు కొట్టుకువచ్చిన చెట్ల కొమ్మలు, వ్యర్థాలు, బురదతో గేట్లను ఎత్తే పరికరాల గదులు నిండిపోవడం, గేట్లను ఎత్తే రోలర్లు, విద్యుత్ పరికరాలు దెబ్బతినడంతో ఇంజనీర్లు చేతులెత్తేశారు. ఇక రెండు గేట్లకు సంబంధించిన కౌంటర్ వెయిట్స్ కొట్టుకుపోవడంతో.. ఆ గేట్లను కిందికి దించే పరిస్థితి లేదు. ఒకవేళ కిందికి దించగలిగినా.. మళ్లీ పైకి ఎత్తడం సాధ్యం కాదు. ఈ సమస్యలన్నింటి నేపథ్యంలో ప్రస్తుతానికి గేట్లను దించకుండా ప్రాజెక్టును ఖాళీ కానివ్వాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. మొత్తంగా 7.6 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన కడెం ప్రాజెక్టు కింద 1.74 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టును ఖాళీ చేస్తున్న నేపథ్యంలో.. ప్రత్యామ్నాయంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా ఆ ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. 5 లక్షల క్యూసెక్కులను వదలగలిగేలా.. కడెం ప్రాజెక్టును నిజాం కాలంలో 1.3 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యంతో నిర్మించారు. 1952లో 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది. దీంతో 3 లక్షల క్యూసెక్కులు విడుదల చేయగలిగేలా అప్పట్లో 8 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుత వరదలతో నీటి విడుదల సామర్థ్యాన్ని 5 లక్షల క్యూసెక్కులకుపైగా పెంచాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 18 గేట్లలో 9 జర్మన్ గేట్లు ఉన్నాయి. వాటిని తొలగించి కొత్తగా క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అదనంగా ప్రాజెక్టుకు రెండు వైపులా చెరో నాలుగు కొత్త గేట్లను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. సోమవారం ఇంజనీరింగ్ నిపుణులు కడెం ప్రాజెక్టును సందర్శించి.. ఆధునీకరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. ఈ పనుల పూర్తికి కనీసం ఏడాది పట్టొచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. అప్పటిలోగా ప్రాజెక్టును ఖాళీగానే ఉంచే అవకాశాలు ఉన్నాయి. డెడ్ స్టోరేజీకి కడెం నిర్మల్: ఎగువ నుంచి వరద తగ్గిపోవడం, ఉన్న నీళ్లన్నీ దిగువకు వెళ్లిపోతుండడంతో కడెం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరువైంది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 700 అడుగులకుగాను.. ఇప్పుడు 678 అడుగులకు పడిపోయింది. మరో మూడు అడుగులు.. అంటే 675 అడుగులకు తగ్గితే డెడ్ స్టోరేజీకి చేరుతుంది. నీటి నిల్వ కూడా 7.603 టీఎంసీల సామర్థ్యానికిగాను శనివారం సాయంత్రానికి 3 టీఎంసీలకు తగ్గింది. భారీ వరదలకు కొట్టుకొచ్చిన దుంగలు, చెట్ల కొమ్మలతో ప్రాజెక్టు దెబ్బతిన్నదని, ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.8 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. నీటిమట్టం పూర్తిగా తగ్గితే.. ప్రాజెక్టులో కింది వరకు నష్టం వివరాలు తెలుస్తాయని అంటున్నారు. మరోవైపు ప్రాజెక్టు మొత్తంగా ఖాళీ అవుతుండటంతో ఆయకట్టు రైతులు పంటల సాగుపై ఆందోళన చెందుతున్నారు. -
ఏపీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు ఆపండి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), కృష్ణా బోర్డు/అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు లేకుండా ఏపీలో నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులన్నింటినీ నిలుపుదల చేయించాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రూ.60 వేల కోట్లతో ఆదాని గ్రీన్ ఎనర్జీ ప్రతిపాదించిన 3700 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చిందని తెలిపింది. కడప జిల్లాలోని గండికోటలో 1000 మెగావాట్లు, అనంతపురం జిల్లాలోని చిత్రావతిలో 500 మెగావాట్ల ప్రాజెక్టులను నిర్మించడానికి అనుమతిచ్చినట్టుగా పత్రికల్లో వార్తలొచ్చాయని, వీటి నిర్మాణాన్ని తక్షణమే అడ్డుకోవాలని కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ తాజాగా కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. గతంలోనే వద్దన్నాం.. ఏపీ తమ రాష్ట్రంలోని కరువు ప్రాంతాల అవసరాలకని చెప్పుకుంటూ ..నీటి కొరత ఉన్న కృష్ణా బేసిన్ నుంచి తరలిస్తున్న జలాలను విద్యుదుత్పత్తి/పంప్డ్ స్టోరేజీ పథకాలకు వినియోగించడం సరికాదన్నారు. చిత్రావతి, గోరకల్లు రిజర్వాయర్ల వద్ద ఏపీ నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు గతంలోనే అభ్యంతరం తెలిపామని, అనుమతులొచ్చే వరకు నిలుపుదల చేయాలని బోర్డుకు లేఖ సైతం రాసినట్టు గుర్తుచేశారు. ఈ రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా నిలుపుదల చేయాలని కోరారు. కొత్త బ్యారేజీలనూ నిలిపివేయాలి ప్రకాశం బ్యారేజీ దిగువన ఏపీ రెండు కొత్త బ్యారేజీల నిర్మాణానికి కసరత్తు చేస్తోందని, వీటినిర్మాణం కూడా చేపట్టకుండా ఆ రాష్ట్రాన్ని నిలువరించాలని ఈఎన్సీ మురళీధర్ మరో లేఖలో కృష్ణా బోర్డును కోరారు. ఈ బ్యారేజీలకు సంబంధించిన డీపీఆర్‌లను ఏపీ సిద్ధం చేసినట్టుగా పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లను బోర్డుకు పంపించారు. -
ప్రాజెక్టుల అప్పగింతపై మళ్లీ పాతపాటే!
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీయాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) అధికార పరిధిని నిర్వచిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌లోని షెడ్యూల్–2లో పొందుపర్చిన 11 ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే విషయంపై తెలుగు రాష్ట్రాలు మళ్లీ పాతపాటే వినిపించాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న ఏకైక ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు మినహా మరే ప్రాజెక్టును అప్పగించే ప్రసక్తేలేదని తెలంగాణ మరోసారి తేల్చి చెప్పింది. తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులన్నింటినీ స్వాధీనం చేసుకుంటేనే తమ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని ఏపీ పట్టుబట్టింది. దీంతో ప్రాజెక్టుల అప్పగింతపై గోదావరి బోర్డు మెంబర్ కన్వీనర్ అజగేషన్ నేతృ త్వంలో గురువారం జలసౌధలో నిర్వహించిన సబ్ కమిటీ సమావేశం ఫలితం లేకుండానే ముగి సింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈ మోహ న్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్రమణ్య ప్రసాద, ఏపీ నుంచి సీఈ పుల్లారావు పాల్గొన్నారు. ఏపీ తమ పరిధిలోని తోట వెంకటాచలం లిఫ్టు, తాడిపూడి పంప్‌హౌస్, సీలేరు పవర్ కాంప్లెక్స్‌ల అప్పగింతపై బోర్డుకు నోట్‌ను అందించింది. అయితే తెలంగాణ ప్రాజెక్టులను సైతం స్వాధీనం చేసుకుంటేనే తమ ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరిస్తామని షరతు విధించింది. తెలంగాణ లోని ఎస్సారెస్పీ ప్రాజెక్టులో ఉన్న కాకతీయ క్రాస్ రెగ్యులేటర్, మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్, చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం లోని గంగారం పంప్‌హౌస్, దుమ్ముగూడెం వెయిర్, నావిగేషన్ చానల్, లాక్స్లను అప్పగిం చాలని గోదావరి బోర్డు కోరగా, తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. సీడ్‌మనీ కింద రూ.200 కోట్లు కోరిన బోర్డు సీడ్‌మనీ కింద రూ.200 కోట్ల చొప్పున రెండు రాష్ట్రాలు విడుదల చేయాలని బోర్డు కోరగా, ఖర్చుల ప్రతిపాదనలను సమర్పిస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ తెలిపింది. పెద్దవాగు నిర్వహణకు సీడ్‌మనీగా రూ.1.45 కోట్లతోపాటు సిబ్బందిని సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ బదులిచ్చింది. పెద్దవాగు ఆధునీకరణకు రూ.78 కోట్ల వ్యయం కానుందని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పిస్తే బోర్డుకు నిధులిస్తామని తెలిపింది. ఒక ఎస్ఈ, ఇద్దరు ఈఈ, నలుగురు జేఈ, ఇతర ఉద్యోగులను బోర్డుకు కేటాయించేందుకు తెలంగాణ అంగీకరించింది. -
ఆధారాలతో బయటప పెట్టిన ఇరిగేషన్ శాఖ
-
కృష్ణా జలాలపై తెలంగాణ తొండాట
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో వాటాపై తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై నీటిపారుదలరంగ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ 34 టీఎంసీల (ఎస్సార్బీసీకి 19, చెన్నై తాగునీటికి 15)ను మాత్రమే వాడుకుంటేనే.. ఉమ్మడి ప్రాజెక్టుల్లో 66 : 34 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణలకు నీటిని పంపిణీ చేయాలని సోమవారం కృష్ణాబోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి 34 టీఎంసీల కంటే అధికంగా వాడుకుంటే.. కృష్ణాజలాల్లో ఏపీ, తెలంగాణలకు చెరిసగం పంపిణీ చేయాలని.. ఇదే అంశాన్ని గత సమావేశంలో ప్రస్తావించినా వాటిని మినిట్స్‌లో పేర్కొనలేదని లేఖలో పేర్కొన్నారు. ఈనెల 6న జరిగే సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని కోరడంపై నిపుణులు నివ్వెరపోతున్నారు. ‘బచావత్’ కేటాయింపులే ఆధారం బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా ఉమ్మడి రాష్ట్రానికి చేసిన 811 టీఎంసీల కేటాయింపుల ఆధారంగా.. ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2015, జూన్ 19న కేంద్రం తాత్కాలిక ఒప్పందం కుదుర్చింది. దీనిపై అటు తెలంగాణ.. ఇటు ఏపీ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. 2015–16, 2016–17 సంవత్సరాల్లో ఇదే పద్ధతిలో కృష్ణా బోర్డు నీటిని పంపిణీ చేసింది. 2017, నవంబర్ 4న జరిగిన బోర్డు సమావేశంలో.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో లభ్యతగా ఉన్న నీటిని 66 : 34 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణలకు పంపిణీ చేయాలని రెండు రాష్ట్రాలు ప్రతిపాదించాయి. దాంతో.. ఆ పద్ధతి ప్రకారమే 2017–18, 2018–19, 2020–21, 2021–22లలో కృష్ణాబోర్డు నీటిని పంపిణీ చేసింది. ఏమిటీ వితండ వాదన.. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసిన బచావత్ ట్రిబ్యునల్.. వాటాగా దక్కిన జలాలను రాష్ట్రంలో ఎక్కడైనా వినియోగించుకునే స్వేచ్ఛనూ ఇచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కూడా కొనసాగించింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో.. ఇప్పటికీ బచావత్ ట్రిబ్యునల్ తీర్పే అమల్లో ఉంది. ఇక వరద జలాలను వాడుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది. ట్రిబ్యునల్ కేటాయింపుల ద్వారా హక్కుగా దక్కిన జలాలను.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవాతోపాటు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ వాడుకోవడం తప్పెలా అవుతుందని నీటిపారుదలరంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చినా.. కృష్ణా జలాల్లో ఏపీ వాటా ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదని గుర్తుచేస్తున్నారు. తెలంగాణ ఉన్నతాధికారులకు వాస్తవాలు తెలిసి కూడా వితండవాదనకు దిగడాన్ని వారు తప్పుపడుతున్నారు. -
ఎండిన భూముల్లో జలకళ
బుట్టాయగూడెం: సన్న, చిన్నకారు రైతులకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బోర్ల పథకం సత్ఫలితాలిస్తోంది. గతంలో పూర్తిగా వర్షాధారం, చెరువు నీటిపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న రైతులు ఉచితంగా బోర్లు వేయడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి వసతిలేని భూములు సస్యశ్యామలం కావాలనే సంకల్పంతో వైఎస్సార్ జలకళ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పొలాల్లో బోర్లు వేసి పంటలకు సాగు నీరు అందేలా కృషి చేస్తున్నారు. జిల్లాలో వైఎస్సార్ జలకళ పథకంలో సుమారు 3,263 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులు దరఖాస్తులు పరిశీలించి 3,075 బోర్లు మంజూరు చేశారు. వీటిలో ఇంతవరకూ రిగ్‌ల ద్వారా 516 బోర్లు విజయవంతంగా వేశారు. జిల్లాలోని 48 మండలాలు, 15 నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సుమారు 14 రిగ్‌లు ఏర్పాటు చేశారు. ఈ రిగ్‌ల ద్వారా రైతులకు ఉచితంగా బోర్లను వేసి సాగునీటి కొరతలేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకం అమలుకు సుమారు రూ. 100 కోట్ల వరకూ నిధులు కేటాయించారు. ఇంతవరకూ వర్షాధారం మీదే ఆధారపడిన రైతులు సొంతంగా ఉచితబోరు వేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలో.. ఈ పథకంలో భాగంగా గిరిజన ప్రాంతంలో వేస్తున్న ఉచిత బోర్లు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉచితబోర్ల పథకం ద్వారా 1132 బోర్లు మంజూరు కాగా ఇంత వరకూ 210 బోర్లు వేసినట్లు అధికారులు తెలిపారు. ఉచిత బోర్ల పథకంలో సాగునీటి సదుపాయం లభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలో బోర్ల ఏర్పాటు కోసం ఇంతవరకూ రూ. 2.88 కోట్ల వరకూ ఖర్చు చేసినట్లు అధికారులు చెప్పారు. మంజూరైన బోర్ల పనులను గిరిజన మండలాల్లో వేగవంతం చేశారు. నిబంధనల ప్రకారమే ఉచిత బోర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన చిన్న, సన్నకారు రైతులను గుర్తించి వారి భూముల్లో ఉచిత బోర్లు ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో ఇంతవరకూ 516 బోర్లు విజయవంతంగా వేసి రైతుల భూములకు సాగునీరు అందించే ఏర్పాటు చేశాం. మంజూరైన మిగిలిన బోర్ల పనులు అన్ని మండలాల్లో వేగవంతంగా జరిగేలా కృషి చేస్తున్నాం. –డి.రాంబాబు, డ్వామా పీడీ, ఏలూరు పుష్కలంగా సాగునీరు ఉచిత బోర్ల పథకంలో ఇంతవరకూ వేసిన బోర్లు విజయవంతమయ్యాయి. గిరిజన ప్రాంతంలో సుమారు 210 బోర్లు వేశాం. రైతులు ఆయా భూముల్లో మొక్కజొన్న, వరి, ప్రత్తి, పొగాకు వంటి పంటలు సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంజూరైన ప్రతీ రైతు భూమిలో బోర్లు వేసి సాగు నీరు అందించేందుకు కృషి చేస్తున్నాం. –కె. ప్రపుల్‌కుమార్, డ్వామా ఏపీడీ, జంగారెడ్డిగూడెం క్లస్టర్ సాగునీరు అందించడం ఆనందంగా ఉంది నేను 12 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. 3 ఎకరాల 15 సెంట్ల భూమిలో జీడిమామిడి సాగు చేస్తున్నాను. సాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడ్డాను. ఉచిత బోర్ల పథకంలో బోరు వేయడంతో కష్టాలు తీరాయి. ప్రస్తుతం సాగునీటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేస్తున్నాను. –మడకం దుర్గారావు, గిరిజన రైతు, వంకవారిగూడెం -
‘పర్యాటక’ పరవళ్లు
పిచ్చాటూరు: చిత్తూరు జిల్లాలో ఉన్న అరణియార్ పర్యాటకానికి మహర్దశ కలగనుంది. ప్రాజెక్టు సుందరీకరణ, అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు అవసరమైన నిధులు సమకూర్చడానికి తుడాతో పాటు పర్యాటక శాఖకు గత ఏడాది ప్రతిపాదనలు అందాయి. అంతే వేగంగా స్పందించిన తుడా రూ.1.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జనవరి 3న తుడా వీసీ హరికృష్ణ అరణియార్‌ను సందర్శించి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పర్యాటక శాఖకు రూ.5 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. అరణియార్ అభివృద్ధి, సుందరీకరణ పనులకు 20 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వద్ద జైకా నిధులు రూ.35 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ నిధుల మంజూరులో తిరుపతి ఎంపీ గురుమూర్తి సహకారంతో స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేసిన కృషి, చొరవ ప్రశంసనీయమైనది. అరణియార్ వద్ద చేపట్టనున్న పనులు తుడా అందించే నిధులతో అరణియార్ అందాలన్నీ తిలకించేలా ప్రాజెక్టు వద్ద వ్యూ టవర్ నిర్మించనున్నారు. నదిపై సరదాగా ప్రయాణించేందుకు బోటింగ్ ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులకు అనువుగా కాటేజీలు అందుబాటులోకి రానున్నాయి. పర్యాటల శాఖ అందించే నిధులతో అదనంగా మరో బోటింగ్, రిసార్టులు, చిల్డ్రన్స్ పార్క్, ఉద్యానవనాల అభివృద్ధి, సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్‌కు అనువుగా పచ్చిక మైదానాలు నిర్మించనున్నారు. పిచ్చాటూరు అరణియార్ ప్రాజెక్టు గతంలో షూటింగ్ స్పాట్‌గా పేరొందింది. ఇక్కడ సుమారు 20 సినిమాలకు పైగా చిత్రీకరణ సాగింది. అందులో ప్రధానంగా జానకిరాముడు, ప్రేమదేశం, అన్నకిళి, టూటౌన్ రౌడీ సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. దీంతోపాటు వందలాది సినిమాల్లో పాటల చిత్రీకరణ ఇక్కడే సాగింది. తెలుగు, తమిళం సినిమాల్లోని పాటల చిత్రీకరణకు ఇది చాలా అనువైన ప్రదేశంగా నిలిచింది. టీవీ సీరియళ్లు ఎక్కువ కాలం పాటు చిత్రీకరించేవారు. నాగమ్మ టీవీ సీరియల్ 80 శాతం ఇక్కడే రూపుదిద్దుకుంది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజేంద్రప్రసాద్, విజయశాంతి, రాధ వంటి మన తెలుగు హీరో, హీరోయిన్లు ఎందరో ఇక్కడ చిత్రీకరణలో సందడి చేసినవారే. అతి సుందరమైన ప్రదేశం పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి, మహా నగరమైన చెన్నై జాతీయ రహదారి పక్కనే కొలువైన అతిపెద్ద జలాశయం బహుసుందరంగా ఉంటుంది. ఇక్కడి నుంచి తిరుపతి, చెన్నై నగరాలకు 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చెన్నై నుంచి తిరుమలకు వెళ్లే యాత్రికులకు అరణియార్ వద్ద సేద తీరేవారు. ఇక్కడ ప్రకతి అందాలు సైతం ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడ ఆకట్టుకునే ఉద్యానవనం ఉండడంతో వెండితెర, బుల్లితెర దర్శకులు తరలివచ్చేవారు. అయితే 20 ఏళ్ల క్రితం పర్యాటక నిర్వహణకు నిధులు నిలిపివేయడంతో పార్కులన్నీ వెలవెలబోయాయి. ఇన్నేళ్లకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అరణియార్ సుందరీకరణకు శ్రీకారం చుట్టడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అరణియార్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకురావడానికి ఎమ్మెల్యే ఆదిమూలం తీవ్రంగా కృషి చేస్తున్నారు. అధికారుల సహకారంతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. ఎంపీని కలిసి నిధుల మంజూరుకు చొరవ చూపాలని విన్నవించారు. -
సుజల తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లలో రాష్ట్రంలో సగటు భూగర్భ జల మట్టం 4 మీటర్లకు పైగా పెరిగిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జలసౌధలో జరిగిన రాష్ట్ర భూగర్భ జలాల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ‘భూగర్భ వనరులు–2020’నివేదికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూగర్భజల మట్టం మీటర్ పెరుగుదల 100 టీఎంసీల నీటితో సమానమన్నా రు. ఐదేళ్లలో 400 టీఎంసీల మేరకు భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. 93% మండలాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందాయన్నారు. 50 శాతానికి తగ్గిన భూగర్భ జల వినియోగం 2016–17లో రాష్ట్రంలో 65 శాతం భూగర్భ జలాల వినియోగం ఉండగా, 2019–20 నాటికి 50 శాతానికి తగ్గిందని రజత్‌కుమార్ వెల్లడించారు. కాళేశ్వరం ఎత్తిపోతల, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాల ద్వారా భూగర్భ జలాల లభ్యత పెరగడమే ఇందుకు కారణమన్నారు. పెరిగిన భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకునే అంశంపై ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాలని అధికారులను కోరారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కు ‘ఏ కేటగిరీ’, తెలంగాణ రాష్ట్ర జలవనరుల మౌలిక సదుపాయా ల అభివృద్ధి సంస్థకు ‘ఏ కేటగిరీ’గ్రేడింగ్‌ను ఆర్ఈసీ కేటాయించిన నేపథ్యంలో.. ఈ సంస్థలు తీసుకున్న రుణాలకు వడ్డీ రాయితీ లభించనుందన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, భూగర్భ జల శాఖ డైరెక్టర్ ఎం.పండిత్ పాల్గొన్నారు. -
అక్రమార్కులకు ఏసీబీ కళ్లెం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) 2021లో క్రియాశీలకంగా వ్యవహరించింది. అవినీతి అధికారులను ట్రాప్‌చేసి అక్రమాలను అడ్డుకోవడంతో పాటు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నవారిపై చెప్పుకోదగ్గ స్థాయిలో దాడులుచేసి కేసులు నమోదు చేసింది. అలాగే, అవినీతి అధికారులు, ఉద్యోగులపై ఫిర్యాదు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన టోల్‌ఫ్రీ నంబర్ ‘14400’కు విశేష స్పందన లభించింది. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచేందుకు ఏసీబీ ఈ ఏడాది పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలూ నిర్వహించింది. ఈ మేరకు 2021 వార్షిక నివేదికను ఏసీబీ గురువారం విడుదల చేసింది. ఆ వివరాలు.. 72 ట్రాప్ కేసులు.. 2021లో 72 మంది ప్రభుత్వ అధికారులు/ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ఏసీబీ కేసులు నమోదు చేసింది. వీరు రూ.32.40 లక్షలు లంచాలు తీసుకుంటుండగా ట్రాప్‌చేసి కేసులు నమోదు చేసింది. ట్రాప్ కేసుల్లో అత్యధికంగా 36 కేసులు రెవెన్యూ శాఖ అధికారులు/ఉద్యోగులపైనే కావడం గమనార్హం. వాటిలో విశాఖ జిల్లా చోడవరం తహసీల్దారు బి.రవికుమార్ రూ.4 లక్షలు, శ్రీకాకుళం జిల్లా టెక్కలి తహసీల్దారు బి.నాగభూషణరావు రూ.4లక్షలు, ముదిగుబ్బ తహసీల్దారు అన్వర్ హుస్సేన్ రూ.2లక్షలు లంచాలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇక విద్యుత్ శాఖలో 8 కేసులు, పంచాయతీరాజ్ శాఖలో 7 కేసులు, హోం శాఖలో 6 కేసులు, పురపాలక శాఖలో 5 కేసులు, ఇతర శాఖల్లో 10 కేసులను ఏసీబీ నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు 12.. ఇక ప్రభుత్వ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని 12 కేసులు నమోదు చేసింది. బీసీ సంక్షేమ శాఖ ఎండీగా చేసిన బి.నాగభూషణం ఆదాయనికి మించి రూ.10.79 కోట్ల ఆస్తులు కలిగి ఉన్న కేసు సంచలనం సృష్టించింది. వాటితోపాటు ఆత్రేయపురం జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా చేసిన వెంకట వరప్రసాదరావు, పార్వతీపురం ఐటీడీఏ డిప్యూటీ డీఎం–హెచ్వోగా చేసిన ఎం. మార్కండేయ, నంద్యాలలో నీటిపారుదల శాఖ ఈఈగా చేసిన జాకబ్ రాజశేఖర్, ఇంటర్మీడియెట్ విద్యా శాఖ ఆడిటర్ కోనేరు సాయికృష్ణ తదితరులపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులున్నాయి. ఆకస్మిక తనిఖీలు 44.. 2021లో ఏసీబీ అధికారులు 44 సార్లు ఆకస్మిక తనిఖీలు చేసి వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అక్రమాలపై కేసులు నమోదు చేశారు. ఇందులో రెవెన్యూ శాఖ కార్యాలయాలపైనే 23 నిర్వహించడం గమనార్హం. రవాణా–ఆర్ అండ్‌బీ శాఖ కార్యాలయాలపై 6, పురపాలక శాఖ కార్యాలయాలపై 5, విద్యుత్, కార్మిక, పంచాయతీరాజ్ కార్యాలయాలపై రెండేసిసార్లు చొప్పున, మహిళా–శిశు సంక్షేమ కార్యాలయాలపై ఒకసారి తనిఖీలు నిర్వహించింది. వీటితోపాటు 26 సాధారణ తనిఖీలను కూడా ఏసీబీ చేపట్టింది. 5 కేసుల్లో దోషులకు శిక్షలు ఖరారు కోవిడ్ నిబంధనలతో ఈ ఏడాది కోర్టుల కార్యకలాపాలు అంతంతమాత్రంగా కొనసాగినప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో నిందితుల అవినీతిని ఏసీబీ నిరూపించగలిగింది. 5 కేసుల్లో దోషులకు కోర్టులు శిక్షలు విధించాయి. ‘14400’కు విశేష స్పందన ప్రభుత్వ అధికారుల అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు చేసేందుకు ఉద్దేశించిన ట్రోల్ ఫ్రీ నంబర్ 14400కు ఈ ఏడాది 2,851 ఫిర్యాదులు వచ్చాయి. వాటి ఆధారంగా 8 ట్రాప్ కేసులు నమోదు చేయడంతోపాటు 16 ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు విచారణ నిర్వహించారు. -
ముగిసిన కేఆర్ఎంబీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య మంగళవారం జరిగిన కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్లు వాటిపై ఉన్న కేంద్రాలను బోర్డుకు అప్పగించాలి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తే అక్టోబర్ 14 నుంచి గెజిట్‌ను అమలు చేయనున్నట్లు కేఆర్ఎంబీ పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఏపీ ఇరిగేషన్ సెక్రటరీ శ్యామలారావు మాట్లాడుతూ.. 'విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి తీసుకోకపోతే మాకు అంగీకారం కాదని చెప్పాము. శ్రీశైలం, సాగర్‌కు సంబంధించిన అన్ని కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకొస్తూ కేఆర్ఎంబీ తీర్మానం చేసింది. తీర్మానాన్ని ఏపీ ఆమోదించింది. బోర్డు నుంచి ప్రతిపాదనలు వచ్చిన వెంటనే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. తెలంగాణ ఇస్తుందో లేదో మాకు తెలియదు. మిగతా విషయాలు బోర్డు చూసుకోవాలి. రెండు మూడు నెలలు సంధికాలం ఉంటుంది' అని ఏపీ ఇరిగేషన్ సెక్రటరీ శ్యామలారావు అన్నారు. తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ మాట్లాడుతూ.. '65 కేంద్రాలు గెజిట్ నోటిఫికేషన్లో ఉన్నాయి. సాగర్‌పై 18, శ్రీశైలంపై 12 కేంద్రాలు ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించింది. బోర్డు నుంచి ప్రతిపాదనలు వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా కేటాయించే వరకు గెజిట్నోటిఫికేషన్ ఆపాలని కోరాం. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఏపీ కోరింది, మేము అంగీకరించలేదు. మాకు విద్యుత్ ఉత్పత్తి చాలా అవసరమని చెప్పాం. ప్రాజెక్టు యాజమాన్య హక్కుల విషయమై న్యాయసలహా అడిగాం' అని తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ అన్నారు. చదవండి: (తప్పుడు ఆరోపణలు చేయొద్దని మళ్లీ చెబుతున్నాం: డీజీపీ) -
‘గెజిట్’పై ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో దీనిపై ఎలా ముందుకు వెళ్లాలన్న విషయమై ఇరిగేషన్ శాఖ తీవ్ర మంతనాలు జరుపుతోంది. రాష్ట్ర ప్రాజెక్టులపై పడే ప్రభావం, బోర్డుకు కొత్తగా సంక్రమించే హక్కులు తదితరాలపై కూలంకషంగా అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో సోమవారం ఈ అంశంపై ప్రత్యేక సమావేశం జరపనుంది. ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రతజ్ కుమార్ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి ఈఎన్సీలతోపాటు అంతర్రాష్ట్ర జల విభాగ ఇంజనీర్లు, ఇతర న్యాయ నిపుణులు హాజరయ్యే అవకాశం ఉంది. గెజిట్‌తో రాష్ట్రానికి జరిగిన న్యాయాన్యాయాలు, తెలంగాణ భవిష్యత్తులో వ్యవహరించాల్సిన తీరుతెన్నులు, న్యాయ పోరాటం, కొత్త ట్రిబ్యునల్ కోసం తేవాల్సిన ఒత్తిడి వంటి అంశాల గురించి ఈ భేటీలో చర్చించనున్నారు. న్యాయ పోరాటమా.. కొత్త ట్రిబ్యునలా? కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలో ఉంచడాన్ని తెలంగాణ తొలి నుంచీ వ్యతిరేకిస్తోంది. ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు లేకుండా బోర్డుల పరిధిని నిర్ణయించరాదని కోరినా కేంద్రం మాత్రం వాటి పరిధిని నిర్ణయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ వెలువరించింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇరు రాష్ట్రాలు బోర్డుల పరిధిని నోటిఫై చేసేందుకు సమ్మతించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో గెజిట్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లే విషయమై రాష్ట్రం తర్జనభర్జన పడుతోంది. సుప్రీంకు వెళ్లినా రాష్ట్రానికి పెద్దగా ఉపశమనం ఉండదనే భావన ప్రభుత్వ పెద్దల నుంచి వస్తోంది. గెజిట్‌పై కొట్లాడటంకన్నా కొత్త ట్రిబ్యునల్ చేత విచారణ జరిపించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే రాష్ట్రానికి నదీ జలాల్లో వాటాలు పెరుగుతాయని ప్రభుత్వ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టులో తెలంగాణ వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును పరిశీలిస్తామని కేంద్ర మంత్రి స్వయంగా అపెక్స్ భేటీలో చెప్పిన నేపథ్యంలో కేంద్రం తన మాటకు కట్టుబడి ఉండేలా రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ ఉండాలనే సూచనలు వస్తున్నాయి. కొత్త ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో విచారణ జరిగితే పరీవాహకం, ఆయకట్టు ఆధారంగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న 811 టీఎంసీల్లో తెలంగాణ కనీసం 500 టీఎంసీల వరకు నీటి వాటా దక్కించుకునే అవకాశం ఉంటుందని, వరద జలాల ఆధారంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులకు నికర జలాల లభ్యత పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై సోమవారం భేటీలో ఇంజనీర్ల సలహాలు తీసుకొని న్యాయపోరాటం చేయాలా లేక రాష్ట్ర వాటాలు పెరిగేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే వ్యూహంతో ముందుకెళ్లాలా అనే విషయమై ఓ నిర్ణయానికి రానుంది. ప్రాజెక్టుల పనుల నిలుపుదలపై తర్జనభర్జన కేంద్రం తన నోటిఫికేషన్లో అనుమతులు లేని ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించడంతోపాటు నోటిఫికేషన్ వెలువడిన ఆరు నెలల్లోగా ఆయా ప్రాజెక్టుల సమగ్ర నివేదికలను బోర్డులకు సమర్పించి, కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం గెజిట్‌లో ప్రచురించిన తెలంగాణ ప్రాజెక్టుల పనులు నిలిపివేయడం, అనుమతుల ప్రక్రియ వేగిరం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. అనుమతుల్లేవని కేంద్రం చెబుతున్న తెలంగాణ ప్రాజెక్టుల్లో కృష్ణా బేసిన్ పరిధిలో పాలమూరు–రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ, ఎస్ఎల్బీసీకి అదనంగా 10 టీఎంసీల తరలింపు, కల్వకుర్తి, కల్వకుర్తికి అదనంగా 10 టీఎంసీల తరలింపు, డిండి, ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల, భక్త రామదాస, తుమ్మిళ్ల, నెట్టెంపాడు, నెట్టెంపాడు ద్వారా అదనంగా 3.40 టీఎంసీ తరలింపు, దుబ్బవాగు, సీతారామ మూడో పంప్‌హౌస్, మున్నేరులు ఉండగా గోదావరి బేసిన్లోవి కంతనపల్లి బ్యారేజీ, కాళేశ్వరం ద్వారా అదనపు టీఎంసీ మళ్లింపు, రామప్ప–పాకాల, ప్రాణహిత, గూడెం ఎత్తిపోతల, చిన్న కాళేశ్వరం, చౌట్పల్లి హమ్మంత్రెడ్డి ఎత్తిపోతల, కందుకుర్తి ఎత్తిపోతల, సీతారామ, మోదికుంటవాగు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిపై ఎలా నడుచుకోవాలన్న విషయమై ఇంజనీర్ల నుంచి స్పష్టత తీసుకోనుంది. అలాగే ప్రాజెక్టుల పర్యావరణ, అటవీ అనుమతుల ప్రక్రియను వేగిరం చేసే అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశాలున్నాయి. -
తాగునీటికే తొలి ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న జలాల వినియోగంలో తొలి ప్రాధా న్యం ప్రజల తాగునీటి అవసరాలకే ఇవ్వాలని ఇరి గేషన్ శాఖ నిర్ణయించింది. సమృద్ధిగా వర్షాలు కురిసి రిజర్వాయర్లు, డ్యామ్‌లు, బ్యారేజీల్లో పూర్తి స్థాయిలో నీరు చేరే వరకు తాగునీటికే ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాతే సాగు అవసరాలకు నీటిని విడుదల చేయాలని ఇటీవలి సమీక్షల సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. తాగునీటి అవసరాలు తీరుస్తున్న ‘మిషన్ భగీ రథ’కు నీటికొరత లేకుండా చూడాలని, ఈ మేరకు కనీస నీటిమట్టాల నిర్వహణను పక్కాగా చేపట్టా లని ఆదేశించిన నేపథ్యంలో అందుకనుగుణం గానే ముందుకు వెళ్లాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. శ్రీశైలంలో నీటిమట్టం తగ్గడంతో ఇక్కట్లు.. మిషన్ భగీరథకు కృష్ణా, గోదావరి బేసిన్లలోని 26 సెగ్మెంట్లకు నీరందించేందుకు ప్రాజెక్టుల నుంచి ఏటా 39.19 టీఎంసీల నీటిని వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నీటిని తీసుకునే క్రమంలో 37 ప్రాజెక్టుల్లో కనీస నీటిమట్టాలను కూడా నీటిపారుదల శాఖ నిర్ధారిం చింది. ఈ మేరకు మట్టాలను నిర్వహిస్తూనే ఆయ కట్టు సాగు అవసరాలకు నీటి విడుదల కొనసా గిస్తున్నారు. ప్రస్తుతం నీటి సంవత్సరం పూర్తి కావ డంతో కొన్ని రిజర్వాయర్లలో నీటిమట్టాలు తగ్గాయి. శ్రీశైలం జలాలపై ఆధారపడ్డ కల్వకుర్తి లోని ఎల్లూరు రిజర్వాయర్‌లో నీటిమట్టం పూర్తిగా పడిపోయింది. నిజానికి శ్రీశైలంలో కనీ సంగా 810 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే కల్వ కుర్తి పంపుల ద్వారా ఎల్లూరును నింపే అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచే నాగర్‌కర్నూల్ జిల్లా తాగు అవసరా లకు ఏటా 7.13 టీఎంసీల నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం శ్రీశైలంలో మట్టం 807 అడుగులకు పడిపోయింది. దీంతో ఇక్కడి నుంచి నీటిని తీసుకోవడం కష్టంగా మారింది. ఇదే పరిస్థితి కొన్ని రిజర్వాయర్లలో నెలకొంది. మరోవైపు జూన్ నుంచి పంటల సాగు మొదలైతే నారుమళ్లకు నీటి డిమాండ్ ఉంటుంది. దీంతో తాగునీటికి పక్కకు పెట్టాకే సాగు అవసరాలకు ఇవ్వాలని సీఎం ఇంజనీర్లకు సూచించారు. ఎస్సారెస్పీ, ఎల్ఎండీ, మిడ్ మానేరు, కడెం, నిజాంసాగర్, సింగూరులలో తాగుకు అవసరమైన నీటి లభ్యత ఉంది. సాగర్‌తో కొంత ఊరట సాగర్‌లో ప్రస్తుతం నీటిలభ్యత రాష్ట్రానికి ఊరట నిచ్చేలా ఉంది. ప్రస్తుతం సాగర్‌లో 533 అడుగుల మట్టంలో 174 టీఎంసీల మేర నీటినిల్వ ఉంది. కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన వినియోగార్హమైన నీరు 45 టీఎంసీల మేర ఉంది. 2020–21లో తెలంగాణకు కేటాయించిన నీటిని పూర్తిగా వినియోగించుకోలేనందున, 45 టీఎంసీల నీటిని 2021–22 ఏడాదికి క్యారీఓవర్ చేయాలని కృష్ణా బోర్డును తెలంగా ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో దీని పరిధిలో తాగునీటికి ఇక్కట్లు ఉండబోవని ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి. -
ఇరిగేషన్‌పై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిథిలో, దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించ తలపెట్టిన అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలను (ఎస్టిమేట్స్) జూన్ 15 వరకు పూర్తి చేసి టెండర్లు వేయడానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఇరిగేషన్‌పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇటీవల నెల్లికల్లులో శంకుస్థాపనతో మంజూరు చేసిన 15 లిఫ్టు ప్రాజెక్టులన్నింటికి, కాల్వల నిర్మాణం, పంపుల ఏర్పాటు తదితరాలన్నీ కలిపి అంచనాలను తయారు చేయాలని సీఎం సూచించారు. ఏలిప్టుకాలిప్టు ప్రకారం అంచనాలను వేరు వేరుగా తయారు చేసి అన్నింటికీ ఒకేసారి టెండర్లు పిలవాలని ఇరిగేషన్ శాఖాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ వరప్రదాయనిగా కాళేశ్వరం ప్రాజెక్టు మారిన నేపథ్యంలో వాన కాలం సీజన్ ప్రారంభం కాగానే నీటిని ఎత్తిపోసి పైనించి చివరి ఆయకట్టు తుంగతుర్తి దాకా వున్న అన్ని చెరువులను, రిజర్వాయర్లను, చెక్ డ్యాములను నింపుకోవాలని సీఎం సూచించారు. ఇప్పటికే కాళేశ్వరం నీటితో 90 శాతం చెరువులు, కుంటలు నిండివుండడంతో భుగర్భ జలాలు పెరిగాయని తద్వారా బోర్లల్లో నీరు పుష్కలంగా లభిస్తున్ననేపథ్యంలో రైతులు వరిపంట విస్తృతంగా పండిస్తున్నారని సీఎం చెప్పారు. రోహిణి కార్తె ప్రారంభమయిన నేపథ్యంలో, నారుమడి సిద్ధంచేసుకుంటే వరిపంట చీడపీడల నుంచి రక్షింపబడతుందనీ, అధిక దిగుబడి వస్తుందనే విశ్వాసంతో రైతులు వుంటారనీ, కాబట్టీ వారికి నీరు అందించడానికి ఇరిగేషన్ శాఖ సంసిద్ధం కావాలని సీఎం సూచించారు. కాళేశ్వరాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం తెలిపారు. కాళేశ్వరంతో వ్యవసాయ రంగ ముఖచిత్రం మారిపోయిందన్నారు. ‘‘కాళేశ్వరంతోనే 35 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండిస్తున్నాం. నదీ గర్భంలోనే 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే స్థాయికి చేరాం. జూన్ 30 వరకు మొదటి దశ చెక్‌డ్యాంలు పూర్తిచేయాలి. దేవాదుల ప్రాజెక్టును వరంగల్ జిల్లాకే అంకితం చేస్తాం. కాల్వల మరమ్మతుల కోసం రూ.700 కోట్లు కేటాయించాం. కాగజ్‌నగర్, బెల్లంపల్లిలో లిఫ్ట్‌కు ఆయకట్టు సర్వే చేయాలని’’ సీఎం కేసీఆర్ ఆదేశించారు. చదవండి: తెలంగాణ సర్కార్‌కి జూడాల షాక్ ఆ మాట వాస్తవమే: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి -
శివారు భూములకూ నీటి నెలవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులు, చెరువులతోపాటు ఎత్తిపోతల పథకాల కింద ఉన్న ఆయకట్టు అంతటికీ సమృద్ధిగా సాగునీరు అందించడంపై జల వనరుల శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. డిజైన్ చేసిన మేరకు కాలువల ప్రవాహ సామర్థ్యం ఉందా.. తగ్గిందా.. అనే అంశాన్ని పరిశీలించేందుకు అధునాతన ఏడీసీపీ (అకాస్టిక్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్) పరికరాన్ని వినియోగిస్తున్నారు. కాలువల ప్రవాహ సామర్థ్యం డిజైన్ చేసిన దానికంటే తక్కువగా ఉన్నట్టు తేలితే.. పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రధాన కాలువలు, ఉప కాలువలతోపాటు డి్రస్టిబ్యూటరీలకూ ఆయకట్టు అభివృద్ధి సంస్థ (కడా) నేతృత్వంలో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నారు. తద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేసి.. చివరి భూములకు సులభంగా నీళ్లందేలా చేస్తారు. ప్రవాహ సామర్థ్యం తగ్గడం వల్లే.. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రవాహ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు. ఈ కాలువ కింద తెలంగాణ పరిధిలోని నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 6.57 లక్షల ఎకరాలు.. ఏపీలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 3.82 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాలువను ఆధునికీకరించే పనులు కూడా పూర్తయ్యాయి. అయినా.. శివారు ఆయకట్టు భూములకు నీళ్లందించడం కష్టంగా మారింది. ప్రవాహ నష్టాలు 40 శాతం ఉన్నాయని తెలంగాణ వాదిస్తుంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ 27 శాతానికి మించవని ఏపీ స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని లెక్కించేందుకు ఈ ఏడాది ఏడీసీపీ పరికరాన్ని జల వనరుల శాఖ అధికారులు ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుకు చేరే నీటిని ఎప్పటికప్పుడు లెక్కించి.. ప్రవాహ సామర్థ్యం తక్కువగా ఉంటే డిజైన్ మేరకు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులను చేపడతారు. తద్వారా ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించాలని నిర్ణయించారు. కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాలతో పాటు శ్రీశైలం కుడి గట్టు కాలువ (ఎస్సార్బీసీ), తెలుగు గంగ, హెచ్చెల్సీ (తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ), ఎల్లెల్సీ (దిగువ ప్రధాన కాలువ), కేసీ కెనాల్ (కర్నూలు–కడప కాలువ), వంశధార, తోటపల్లి వంటి భారీ ప్రాజెక్టులతోపాటు చెరువులు, ఎత్తిపోతల పథకాల కింద కాలువల సామర్థ్యాన్ని కూడా ఇదే రీతిలో మదింపు చేసి.. డిజైన్ మేరకు ప్రవాహం ఉండేలా చర్యలు చేపట్టారు. ఖరీఫ్ మొదలయ్యేలోగా.. ఖరీఫ్ సీజన్ మొదలయ్యేలోగా భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల కింద కాలువలు, డి్రస్టిబ్యూటరీల మరమ్మతు పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం కడాను ఆదేశించింది. దీంతో ఆయకట్టు వ్యవస్థపై సమగ్రంగా సర్వే చేసి, మరమ్మతులు చేపట్టాల్సిన పనులను గుర్తించాలని 13 జిల్లాల చీఫ్ ఇంజనీర్లకు కడా సూచించింది. ఇందుకు సంబంధించి చీఫ్ ఇంజనీర్లు పంపిన ప్రతిపాదనలను ఆమోదించిన కడా ఆ పనులను శరవేగంగా పూర్తి చేయాలని నిర్దేశించింది. ప్రాజెక్టుల్లోకి నదీ జలాలు చేరేలోగా మరమ్మతులను పూర్తి చేయడానికి చర్యలు చేపట్టింది. తద్వారా నీటి వృథాకు పూర్తిగా అడ్డుకట్ట వేసి.. చివరి భూములకూ సమృద్ధిగా నీళ్లందించడానికి మార్గం సుగమం చేస్తోంది. -
పోలవరం అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్ల అంచనా వ్యయానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ (పెట్టుబడి అనుమతి) ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన 15 జాతీయ ప్రాజెక్టులకు ఇచ్చిన తరహాలోనే.. పోలవరం ప్రాజెక్టుకూ నీటిపారుదల విభాగం పనులకు నిధులు మంజూరు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను బలపరుస్తూ జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు ఎస్కే హల్దార్ మంగళవారం నివేదిక ఇచ్చారు. యూపీ సింగ్ అధ్యక్షతన పనిచేసే సీడబ్ల్యూసీ టీఏసీ (సాంకేతిక సలహా మండలి) 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇక ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కమిటీకి కూడా యూపీ సింగ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం నిధులు ఇచ్చేందుకు అంగీకరిస్తూ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వడం ఇక లాంఛనమే. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ పంపిన ఫైలును కేంద్ర ఆర్థిక శాఖ యథాత«థంగా ఆమోదించి కేంద్ర కేబినెట్‌కు పంపుతుంది. విభజన చట్టం ప్రకారం ఆ ఫైలును కేంద్ర కేబినెట్ ఆమోదిస్తుంది. దాంతో.. 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. చంద్రబాబు కమీషన్ల కక్కుర్తి విభజన చట్టం ప్రకారం వంద శాతం ఖర్చుతో పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాలి. కానీ చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని పదేపదే కోరుతూ వచ్చారు. ఇందుకోసం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాను సైతం తాకట్టు పెట్టారు. ఈ నేపథ్యంలో 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఆ మరుసటి రోజే 2014 ఏప్రిల్ 1 నాటికి ప్రాజెక్టు నీటిపారుదల విభాగంలో మిగిలిన పనికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామనే మెలిక పెట్టింది. ప్రత్యేక ప్యాకేజీని అమలు చేస్తూ అదే నెల 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమొరాండంలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ ప్యాకేజీకి ఆమోద ముద్ర వేసింది. అన్యాయంపై నోరుమెదపని వైనం పోలవరం ప్రాజెక్టుకు 2014 ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే విడుదల చేస్తామని.. డిజైన్ మారినా, ధరలు పెరిగి అంచనా వ్యయం పెరిగినా, భూసేకరణ వ్యయం పెరిగినా ఆ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని తేల్చిచెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు 2010–11 ధరల ప్రకారం మొదటిసారి సవరించిన అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లకు 2017 మే 8న కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్‌ను ఇచ్చినప్పుడు కూడా 2014 ఏప్రిల్ 1కి ముందు నీటిపారుదల విభాగానికి చేసిన ఖర్చుపోనూ, ఆ రోజు ధరల మేరకు మిగిలిన మొత్తాన్ని మాత్రమే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అప్పట్లో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి. టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరిలు కేంద్ర కేబినెట్లో సభ్యులుగా ఉన్నారు. అయినా ఈ అన్యాయంపై నాటి సీఎం చంద్రబాబు నోరుమెదప లేదు. 2013–14 ధరలతో నిధుల విడుదలకు ప్రధానికి లేఖ పైగా 2013–14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని ఆమోదించి నిధులు విడుదల చేయాలని కోరుతూ 2018 జనవరి 12న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇదే అంశాలను ఎత్తిచూపుతూ 2013–14 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం వ్యయాన్ని రూ.20,398.61 కోట్లుగా నిర్ధారించి, ఆమోదించాలని.. అప్పుడే రూ.2,234.28 కోట్లను రీయింబర్స్ చేస్తామని తేల్చిచెబుతూ 2020 అక్టోబర్ 12న కేంద్ర జల్ శక్తి శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. దాన్ని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)కి పంపిన కేంద్ర జల్ శక్తి శాఖ.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకోవాలని కోరింది. 2017–18 ధరల ప్రకారమే ఇవ్వాలన్న జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రతిపాదనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌లను హుటాహుటిన ఢిల్లీకి పంపారు. కేంద్ర ఆర్థిక, జల్ శక్తి శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్రసింగ్ షెకావత్‌లతో వారిద్దరూ సమావేశమై 2017–18 ధరల ప్రకారమే పోలవరానికి నిధులు ఇవ్వాలని కోరారు. కేంద్రం ఆమోదించిన భూసేకరణ చట్టం వల్ల పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, సహాయ పునరావాస (ఆర్ఆర్) ప్యాకేజీ వ్యయం రూ.28,191.03 కోట్లకు పెరిగిందని.. ఈ నేపథ్యంలో 2013–14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడానికి సాధ్యం కాదని.. 2017–18 ధరల ప్రకారమే నిధులను విడుదల చేసి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని కోరుతూ అక్టోబర్ 31న ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న లోపాలను లేఖలో ఎత్తిచూపారు. బేషరతుగా రూ.2,234.28 కోట్లు సీఎం లేఖపై ప్రధాని మోదీ స్పందించారు. కేంద్ర ఆర్థిక శాఖకు మార్గనిర్దేశనం చేశారు. దాంతో రూ.2,234.28 కోట్లను పోలవరానికి బేషరతుగా విడుదల చేస్తూ నవంబర్ 2న కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. అదే రోజున సమావేశమైన పీపీఏ సర్వసభ్య సమావేశం కూడా రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. 2017–18 ధరల ప్రకారం నిధులు విడుదల చేస్తేనే ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని తేల్చిచెబుతూ కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక పంపింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లతో సమావేశమైన ప్రతిసారి పోలవరానికి 2017–18 ధరల ప్రకారం నిధులు ఇచ్చి.. శరవేగంగా పూర్తి చేయడానికి సహకరించాలని కోరారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. రూ.2,234.28 కోట్లను ఇప్పటికే రీయింబర్స్ చేసింది. ఫలించిన సీఎం వైఎస్ జగన్ కృషి పోలవరానికి 2017–18 ధరల ప్రకారం నిధులు విడుదల చేయాలన్న పీపీఏ సిఫారసుపై కేంద్ర జల్ శక్తి శాఖ సీడబ్ల్యూసీ అభిప్రాయాన్ని కోరింది. ఈ నేపథ్యంలోనే ఎస్కే హల్దార్ మంగళవారం నివేదిక ఇచ్చారు. ప్రాజెక్టు పనుల్లో నీటిపారుదల, నీటి సరఫరా వేర్వేరు కాదని.. రెండు ఒకటేనని పునరుద్ఘాటించారు. నీటిపారుదల విభాగం కిందకు జలాశయం(హెడ్‌వర్క్స్),భూసేకరణ, ఆర్అండ్ఆర్ (సహాయ పునవాస ప్యాకేజీ), కాలువలు, పిల్ల కాలువలు (డిస్ట్రిబ్యూటరీలు) వస్తాయని తేల్చిచెప్పారు. సాగునీటి కాలువల ద్వారానే తాగునీరు.. పారిశ్రామిక అవసరాలకు నీరు సరఫరా చేస్తారని స్పష్టం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో చేపట్టిన 15 జాతీయ ప్రాజెక్టులకూ నీటిపారుదల విభాగం కింద నిధులు ఇస్తున్నామని ఎత్తిచూపారు. పోలవరం ప్రాజెక్టుకూ అదే రీతిలో నిధులు ఇవ్వాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే పోలవరం అంచనా వ్యయానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. ఆర్సీసీ ఆమోదించిన వ్యయానికే.. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2017–18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లుగా సీడబ్ల్యూసీ టీఏసీ 2019 ఫిబ్రవరి 11న ఆమోదించింది. జాతీయ ప్రాజెక్టుల అంచనా వ్యయం 25 శాతం కంటే పెరిగితే.. వాటిని రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ)కి పంపి.. మదింపు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ 2016లో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని ఆర్సీసీకి ప్రతిపాదించారు. కేంద్ర జల్ శక్తి శాఖ ఆర్థిక సలహాదారు జగ్మోహన్ గుప్తా నేతృత్వంలోని ఆర్సీసీ పోలవరం అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా తేల్చి కేంద్ర జల్ శక్తి, ఆర్థిక శాఖలకు నివేదిక ఇచ్చింది. ఈ అంచనా వ్యయానికే కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తుందని అధికారవర్గాలు తెలిపాయి. -
ఒకే గొడుకు కిందకు నీటి పారుదల శాఖలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో వచ్చిన పెను మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రగతిభవన్‌లో జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై ఆ శాఖ స్వరూపాన్ని ఖరారు చేశారు. భారీ, మధ్య, చిన్న తరహా నీటిపారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవడంతోపాటు, ఒకే ప్రాంతంలో ఉన్న అన్నిరకాల జల వనరుల శాఖ వ్యవహారాలను ఒకే అధికారి పర్యవేక్షించేలా పునర్వ్యవస్థీకరణ చేశారు. దీనికి అనుగుణంగా ఉన్నతాధికారుల పోస్టుల సంఖ్యను పెంచారు. 19 జల వనరుల ప్రాదేశిక ప్రాంతాలు..: రాష్ట్రం మొత్తాన్ని 19 జల వనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించి, ఒక్కొక్క దానికి ఒక్కో సీఈని నియమించి పర్యవేక్షణాధికారిగా బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆరుగురు ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ)లను నియమించి వారికి కూడా బాధ్యతలు పంచాలని నిర్ణయించారు. జనరల్, అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాలకు ప్రత్యేకంగా ఈఎన్సీలు ఉంటారు. ప్రాదేశిక సీఈల స్థానంలో కూడా ముగ్గురు సీనియర్ అధికారులకు ఈఎన్సీ క్యాడర్లో బాధ్యతలు అప్పగించారు. చదవండి: (కొత్త వైరస్: యూకే నుంచి తెలంగాణకు..!) 19 జల వనరుల ప్రాదేశిక ప్రాంతాలు ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, రామగుండం, వరంగల్, ములుగు, సంగారెడ్డి, గజ్వేల్, నల్లగొండ, సూర్యాపేట, వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మం సోమవారం ప్రగతిభవన్‌లో జలవనరుల శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ►రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత అంశంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టాం . ప్రధాన ప్రాజెక్టుల్లో భాగంగానే కొద్దిపాటి లింకులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలి. – సీఎం కేసీఆర్ 945 అదనపు పోస్టులు ... ప్రస్తుతం ముగ్గురు ఈఎన్సీలు ఉంటే కొత్తగా మరో మూడు ఈఎన్సీ పోస్టులను మంజూరు చేశారు. సీఈ పోస్టులను 19 నుంచి 22కు, ఎస్ఈల పోస్టులు 47 నుండి 57కు, ఈఈల పోస్టులు 206 నుంచి 234కు, డీఈఈల పోస్టులు 678 నుంచి 892కు, ఏఈఈల పోస్టులను 2,436 నుంచి 2,796కు, టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 129 నుంచి 199కి, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 173 నుంచి 242కు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 346 నుంచి 398కి, నాన్ టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్ల సంఖ్యను 31 నుంచి 45కు, సూపరింటెండెంట్ల సంఖ్యను 187 నుంచి 238కి, రికార్డు అసిస్టెంట్ల సంఖ్యను 134 నుంచి 205కు పెంచారు. పునర్వ్యవస్థీకరణ కారణంగా మొత్తం 945 అదనపు పోస్టులు అవసరమవుతాయని అంచనా వేశారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత అంశంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టామని కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రధాన ప్రాజెక్టుల్లో భాగంగానే కొద్దిపాటి లింకులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. జూన్‌లోగా ఛనాక–కొరాట పూర్తి చేయాలి.. ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఆ జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్షించారు. ఛనాక–కొరాట ప్రాజెక్టు బ్యారేజీ, పంప్ హౌస్, కాల్వలను 2021 జూన్ లోగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. చెన్నూరు లిఫ్టు ఇరిగేషన్ స్కీంతోపాటు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మధ్యతరహా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించి, మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. జల వనరులశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్‌తో పాటు ఉన్నతాధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి పరిస్థితిని సమీక్షించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టును అభివృద్ధి చేయడానికి ప్రాణహిత ప్రాజెక్టుపై అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కుప్టి ప్రాజెక్టు, మహబూబ్‌నగర్ జిల్లాలో గట్టు ప్రాజెక్టు, జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని నాగమడుగు ఎత్తిపోతల పథకం టెండర్లను వెంటనే పిలిచి, పనులు చేపట్టాలని కేసీఆర్ సూచించారు. వర్షాకాలంలోగా గోదావరి కరకట్టలు.. వరంగల్ జిల్లాలో గోదావరి కరకట్టల పనులను వచ్చే వానాకాలంలోపు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని కోనారెడ్డి చెరువుకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలన్నారు. పరకాల నియోజకవర్గం పరిధిలోని కోనాయమాకుల ఎత్తిపోతల పథకంలో మిగిలిపోయిన పనులను తక్షణం పూర్తి చేయాలని సూచించారు. అచ్చంపేట ఎత్తిపోతల పథకం చేపట్టాలని, దీనికోసం వెంటనే సర్వే నిర్వహించాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న అన్ని చెరువులకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. హుజూర్నగర్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రులు సి.లక్ష్మారెడ్డి , జోగు రామన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీలు సి.మురళీధర్, బి.నాగేంద్రరావు, హరిరామ్ పాల్గొన్నారు. -
‘ఒకే గొడుగు కిందకు నీటి పారుదల శాఖలు’
సాక్షి, హైదరాబాద్: ప్రధాన ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ఆదేశించారు. సోమవారం ఆయన ప్రగతిభవన్‌లో ఇరిగేషన్‌పై సమీక్ష నిర్వహించారు. భారీ, మధ్య, చిన్నతరహా నీటిపారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవడానికి నిర్ణయించారు. (చదవండి: ‘అప్పుడు తిట్లు.. ఇప్పుడు మద్దతా..’) రాష్ట్రం మొత్తాన్ని 19 జలవనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో సీఈని పర్యవేక్షణాధికారిగా నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. హుజూర్నగర్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. అత్యంత ప్రాధాన్యతా అంశంగా నీటిపారుదల ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.(చదవండి: న్యూ ఇయర్ కానుకగా పీఆర్సీ!) -
పోలవరం నేనే పూర్తి చేస్తా
సాక్షి, అమరావతి: ‘రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నం పోలవరం ప్రాజెక్టును మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభిస్తే.. ఆయన కొడుకుగా ప్రాజెక్టును నేనే పూర్తి చేసి తీరుతా’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని.. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యాలే అందుకు తార్కాణమన్నారు. బుధవారం శాసనసభలో పోలవరం ప్రాజెక్టుపై జరిగిన చర్చలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. 2014 – 2019 మధ్య పోలవరం ప్రాజెక్టు పనులు 70 శాతం చేశామని చంద్రబాబు అవాస్తవాలు వల్లె వేశారని.. వాస్తవంగా ఆయన హయాంలో జరిగింది కేవలం 20 శాతం పనులేనని ఎత్తిచూపారు. చంద్రబాబు చేసిన పాపాలను కడిగేస్తూ.. 2022 ఖరీఫ్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తామని పునరుద్ఘాటించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. పోలవరం ప్రాజెక్టు ఒక కల – స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పోలవరం ప్రాజెక్టు అన్నది ఒక కల. ఏ సీఎం ఈ కలను సాకారం చేయాలని అనుకోలేదు. 2004లో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే పోలవరం ప్రాజెక్టును సాకరం చేస్తూ పనులను పరుగులెత్తించారు. ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ కోసం 10,627 ఎకరాలు (86 శాతం) సేకరించారు. కుడి కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. – 2014లో చంద్రబాబు తిరిగి సీఎం అయ్యాక కుడి ప్రధాన కాలువలో సేకరించిన భూమి కేవలం 1,700 ఎకరాలు మాత్రమే. కేవలం 14 శాతం. నిజానికి 2005లో భూసేకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు కోర్టులో కేసులు వేయించి పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. – ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ కోసం వైఎస్ హయాంలో 10,342 ఎకరాలు (98 శాతం) భూసేకరణ జరగ్గా, 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక కేవలం 95.32 ఎకరాలు (0.89 శాతం) మాత్రమే సేకరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు తెచ్చారు. వైఎస్సార్ కుడి ప్రధాన కాలువను పూర్తి చేయకపోయి ఉంటే.. చంద్రబాబు పట్టిసీమ ఎత్తిపోతలతో నీటిని ఎలా తరలించే వారు? ఎక్కడికి తీసుకుపోగలిగేవారు? అప్పుడెందుకు నోరు పెగల్లేదు బాబూ? – 2016 సెప్టెంబరు 7న అరుణ్‌జైట్లీ అర్ధరాత్రి ఢిల్లీలో మీటింగ్ పెట్టి స్పెషల్ ప్యాకేజీ ఇస్తున్నట్లు ప్రకటించారు. అప్పుడు ఆయన పక్కనే టీడీపీ మంత్రి సుజానాచౌదరి, ఎంపీ సీఎం రమేష్, నాటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉన్నారు. – అదే రాత్రి చంద్రబాబు కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి.. అరుణ్‌జైట్లీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. – 2016 సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ ఒక మెమొరాండంను కేంద్ర జల శక్తి శాఖకు పంపించింది. 2014 ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటి పారుదల విభాగం పనులకు అయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని అందులో స్పష్టంగా ఉంది. అయినా అప్పుడు చంద్రబాబు ఎందుకు స్పందించలేదు? అదే సమయంలో ఇక్కడ అసెంబ్లీలో నేను ఆ విషయాన్ని ఆ రోజు ప్రస్తావించాను. (ఆ రోజు ఏం మాట్లాడింది వీడియో చూపారు.) – 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి అరుణ్‌జైట్లీ చెప్పిన దాని ప్రకారం పోలవం ప్రాజెక్టుకు రూ.16 వేల కోట్లు మాత్రమే వస్తుందని తెలిసినప్పుడు చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు. అందులో 2014 ఏప్రిల్ 1కి ముందు చేసిన ఖర్చు రూ.5,500 కోట్లు ఇవ్వం అని, పవర్ హౌస్, తాగునీటి సరఫరా వ్యయం రూ.2,800 కోట్లు ఇవ్వలేమని, కేవలం నీటి పారుదల విభాగం వ్యయం రూ.7,500 కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పినప్పుడు చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారు? – అసలు ఈ మనిషికి ఇంగ్లిష్ వస్తుందా? రాదా? అన్నది అర్థం కావడం లేదు. ఏ ప్రాజెక్టు పనుల్లో అయినా ధరలు ఒకే విధంగా ఉండవు. ఇదే అంశాన్ని నేను శాసనసభలో లేవనెత్తి, నిలదీసే ప్రయత్నం చేస్తే అప్పటి స్పీకర్ మా గొంతు నొక్కారు. అప్పుడే చంద్రబాబు స్పందించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అసెంబ్లీలో మాట్లాడుతున్న సీఎం జగన్ ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.37,883 కోట్లు అవసరం – ఇలాంటి పరిస్థితుల్లో మేము అధికారంలోకి వచ్చాం. చంద్రబాబు చేసిన పాపాలను కడిగేస్తున్నాం. అన్యాయమైన పరిస్థితులను మారుస్తూ వస్తున్నాం. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసమే రూ.26,585 కోట్లు కావాలి. ఇతర సివిల్ పనులకు రూ.7,174 కోట్లు, పవర్ ప్రాజెక్టుకు మరో రూ.4,124 కోట్లు కావాలి. ఆ విధంగా మొత్తం రూ.37,883 కోట్లు కావాలి. – పోలవరం ప్రాజెక్టులో నెలకొన్న పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. ఒకటికి రెండు సార్లు జల శక్తి మంత్రి, ఆర్థిక మంత్రులను కలిశాం. వాస్తవ పరిస్థితులను వివరించాం. చివరకు వారు 2013–14 ధరలతో ప్రాజెక్టు పూర్తి కాదని అంగీకరించారు. కేంద్రం కూడా దేవుడి దయతో సానుకూలంగా స్పందిస్తోంది. అందుకు కేంద్రానికి కృతజ్ఞతలు. – ఇంటి పెద్దగా చెబుతున్నాను. ప్రాజెక్టు ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గదు. మొత్తం 45.72 మీటర్లు కడతాం. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతాయి. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు కూడా ఎక్కడా ఆపం. సీడబ్ల్యూసీ ప్రొటోకాల్ ప్రకారమే నీరు నిల్వ చేస్తాం. – తెలుగు జాతి ప్రజల కోరిక మేరకు.. మన ఎమ్మెల్యేల తీర్మానం మేరకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని 100 అడుగుల ఎత్తుతో ప్రాజెక్టు వద్ద ప్రతిష్టిస్తాం. – ప్రాజెక్టు పనుల్లో ఒక్క పైసా కూడా మేం వృథా చేయడం లేదు. గత ప్రభుత్వం బస్సులు పెట్టి, ప్రజలు సందర్శించినట్లు రాసుకుంటూ ఏకంగా రూ.83.45 కోట్లు ఖర్చు చేసింది. (ప్రజలను తీసుకుపోయి జయము..జయము చంద్రన్నా అంటూ చిడతలతో మహిళలు పాడిన పాటల వీడియో ప్రదర్శించారు. ఈ పాట వస్తున్నంత సేపూ సభలో సభ్యులంతా విరగబడి నవ్వారు.) రివర్స్ టెండరింగ్‌లో ఆదా ఇలా.. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని అన్నారు. పోలవరం, ఇతర సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి చంద్రబాబు హయాంలో పిల్చిన టెండర్లను రద్దు చేసి.. యాపిల్ టు యాపిల్ పద్ధతిలో తొలుత రివర్స్ టెండర్లు పిలిస్తే రూ.1,142 కోట్లు ఆదా అయ్యాయి. రివర్స్ టెండరింగ్ విధానంలో ఆ తర్వాత చేపట్టిన ప్రాజెక్టుల పనుల్లో మరో రూ.201 కోట్లు ఆదా అయ్యాయి. ఆ రెండూ కలిపితే అక్షరాలా రూ.1,343 కోట్లు పోలవరం పనుల్లో ఆదా అయ్యాయి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జయము.. జయము చంద్రన్నకు రూ.83 కోట్లు ‘పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయిం ది.. రండి.. రండి.. చూసొద్దురు కానీ.. మేమే తీసుకెళ్తాం.. తీసుకొస్తాం.. మంచి భోజనం పెడతాం..’ అంటూ గత ప్రభుత్వ హయాంలో బస్సులు పెట్టి, జనాన్ని తరలించిన ఆర్భాటం అంతా ఇంతా కాదు. తీరా చూస్తే.. ‘ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లుంది వ్యవహారం. పునాదుల్లో ఉన్న ప్రాజెక్టును చూపించి, కీర్తనలు పాడించుకుని తరించిపోయారు అప్పటి (అ)ధర్మ ప్రభువులు. ఇలాంటి సీన్ల కోసం రూ.లక్ష కాదు.. రూ.కోటి కాదు.. ఏకంగా రూ.83.45 కోట్లు ఖర్చు చేశారు. అలా ప్రాజెక్టు వద్దకు తరలించి ‘జయము.. జయము చంద్రన్నా.. అంటూ మహిళలు పాడుతూ భజన చేస్తున్న ఓ పాటకు సంబంధించిన వీడియోను బుధవారం అసెంబ్లీలో ప్రదర్శించినప్పుడు సభ్యులు పొట్ట చెక్కలయ్యేట్లు విరగబడి నవ్వడం కనిపించింది. -
2022 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నం పోలవరం ప్రాజెక్టును మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభిస్తే.. ఆయన కొడుకుగా ప్రాజెక్టును నేనే పూర్తి చేసి తీరుతా’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని.. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యాలే అందుకు తార్కాణమన్నారు. బుధవారం శాసనసభలో పోలవరం ప్రాజెక్టుపై జరిగిన చర్చలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. 2014 - 2019 మధ్య పోలవరం ప్రాజెక్టు పనులు 70 శాతం చేశామని చంద్రబాబు అవాస్తవాలు వల్లె వేశారని.. వాస్తవంగా ఆయన హయాంలో జరిగింది కేవలం 20 శాతం పనులేనని సీఎం ఎత్తిచూపారు. పునాది స్థాయి దాటని పోలవరం ప్రాజెక్టు పనులను చూపేందుకు బస్సులో జనాలను పంపారని.. రవాణా ఖర్చులు, భోజనం ఖర్చుల కింద రూ.83.45 కోట్లను టీడీపీ నేతలే మింగేశారన్నారు. చంద్రబాబు చేసిన పాపాలను కడిగేస్తూ.. 2022 ఖరీఫ్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తామని పునరుద్ఘాటించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. పోలవరం ప్రాజెక్టు ఒక కల ► స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పోలవరం ప్రాజెక్టు అన్నది ఒక కల. గతంలో ఎందరో సీఎంలు అయ్యారు. ఏ ఒక్కరూ ఈ కలను సాకారం చేయాలని అనుకోలేదు. ఇదే చంద్రబాబు 1995 నుంచి 2004 వరకు సీఎంగా ఉన్నారు. కేంద్రంలో కూడా చక్రం తిప్పానని చెప్పుకున్నారు. ► కానీ ఏనాడూ పోలవరం గురించి పట్టించుకోలేదు. ఎగువన కర్ణాటకలో అల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతున్నా, ప్రాజెక్టులు కడుతున్నా ఏనాడూ పట్టించుకోలేదు. కలను సాకారం చేసిన మహానేత ► చంద్రబాబు దిగిపోయిన తర్వాత 2004లో ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే దశాబ్దాల కల అయిన పోలవరం ప్రాజెక్టును సాకరం చేస్తూ పనులను పరుగులెత్తించారు. వైఎస్ హయాంలోనే పోలవరం కుడి ప్రధాన కాలువ కోసం 10,627 ఎకరాలు (86 శాతం) సేకరించారు. కుడి కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. ► 2014లో చంద్రబాబు తిరిగి సీఎం అయ్యాక కుడి ప్రధాన కాలువలో సేకరించిన భూమి కేవలం 1,700 ఎకరాలు మాత్రమే. కేవలం 14 శాతం. నిజానికి 2005లో భూసేకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు కోర్టులో కేసులు వేయించి పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ► ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ కోసం వైఎస్ హయాంలో 10,342 ఎకరాలు (98 శాతం) భూసేకరణ జరగ్గా, 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక కేవలం 95.32 ఎకరాలు (0.89 శాతం) మాత్రమే సేకరించారు. వీటిని పరిశీలిస్తే పోలవరం ప్రాజెక్టు కోసం ఎవరు చిత్తశుద్ధితో పని చేశారన్నది తెలుస్తుంది. (చదవండి: అసెంబ్లీలో ‘చంద్రన్న భజన’.. పడి పడి నవ్విన సీఎం జగన్) అన్ని అనుమతులూ వైఎస్ హయాంలోనే ► వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు తెచ్చారు. ► 2005 సెప్టెంబర్‌లో ఎంఓఈఎఫ్ నుంచి సైట్ క్లియరెన్స్. ► 2005 అక్టోబర్‌లో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. ► 2006 జూలైలో నేషనల్ బోర్డు ఆఫ్ వైల్డ్ లైఫ్ నుంచి వైల్డ్ లైఫ్ క్లియరెన్స్. ► 2007 మే లో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ ఎఫెయిర్స్ నుంచి ఆర్ అండ్ ఆర్ క్లియరెన్స్. ► 2008 సెప్టెంబర్‌లో పర్మిషన్ ఫర్ డైవర్షన్ ఆఫ్ ఆర్ఎఫ్ ల్యాండ్ పర్‌టెయినింగ్ ఆఫ్ పాపికొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ► 2008 డిసెంబర్లో ఎంఓఈఎఫ్ నుంచి ఫారెస్టు క్లియరెన్స్ స్టేజ్-1 ► 2009 జనవరిలో సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి టీఏసీ క్లియరెన్స్. ► 2009 ఫిబ్రవరిలో ప్లానింగ్ కమిషన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్. ► 2009 మార్చిలో ఈఏసీ క్లియరెన్స్. ► 2010 జూలైలో ఫారెస్టు క్లియరెన్స్ స్టేజ్-2 ► ఈ అనుమతులన్నీ రావడానికి 4 ఏళ్లు పట్టింది. 2005లో దరఖాస్తు చేస్తే, తొలి ఫారెస్టు క్లియరెన్స్ డిసెంబర్ 2008లో వచ్చింది. సెకండ్ స్టేజ్ క్లియరెన్సు జూలై 2010లో వచ్చింది. 2010-11 ధరల ప్రకారం మొదటి సారి సవరించిన అంచనా వ్యయానికి సాంకేతిక సలహా మండలి(టీఏసీ) క్లియరెన్సు జనవరి 2011లో వచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి చాలా చిత్తశుద్ధితో భూసేకరణతో పాటు, పనులు కూడా చేశారు. ఎవరో పనులు చేపడితే... ► ఎవరో పనులు చేసి పెడితే, ఆ క్రెడిట్ తీసుకునే కార్యక్రమంలో ఎంత గొప్పగా చంద్రబాబు ఉంటారు అనడానికి నిదర్శనమే పట్టిసీమ. ► వైఎస్ రాజశేఖరరెడ్డి కుడి ప్రధాన కాలువను పూర్తి చేయకపోయి ఉంటే.. చంద్రబాబు పట్టిసీమ ఎత్తిపోతలతో నీటిని ఎలా తరలించే వారు? ఎక్కడికి తీసుకుపోగలిగేవారు? చంద్రబాబు చెప్పేవన్నీ తప్పుడు లెక్కలే ► 2014 జూన్ వరకు జరిగిన పోలవరం హెడ్ వర్క్స్, ఎడమ, కుడి కాలువలకు సంబంధించి చూస్తే 20.61 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తమ్మీద(ఓవరాల్‌గా) భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కూడా కలుపుకుని మొత్తం ప్రాజెక్టు పనులను చూస్తే 9.29 శాతం పూర్తయ్యాయి. ► 2014 జూన్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక, చంద్రబాబు హయాంలో అయిన పనులు హెడ్ వర్క్స్, ఎడమ, కుడి కాలువలకు సంబంధించి చూస్తే 39.53 శాతం పనులు, ప్రాజెక్టులో ఓవరాల్‌గా 20 శాతం పనులు మాత్రమే జరిగాయి. అది కూడా రూ.55 వేల కోట్ల ప్రాజెక్టు వ్యయం పరంగా చూస్తేనే. ► ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ప్రాజెక్టుకు సంబంధించి ఓవరాల్‌గా 29.80 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. హెడ్ వర్క్స్, ఎడమ, కుడి కాలువలకు సంబంధించి, అంతకు ముందు జరిగిన పనులు కూడా కలుపుకుని చూస్తే 60 శాతం మాత్రమే పూర్తయ్యాయి. కానీ చంద్రబాబు నోరు తెరిస్తే ప్రాజెక్టులో 70 శాతం పూర్తి చేశామని పదే పదే అవాస్తవాలు వల్లె వేస్తున్నారు. ► ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిన పనులన్నీ మేము పూర్తి చేస్తున్నాం. ఆ దివంగత నేత కొడుకు పూర్తి చేస్తున్నాడని గర్వంగా చెబుతున్నా. రివర్స్ టెండరింగ్‌లో రూ.1,343 కోట్లు ఆదా ► పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో స్వయంగా చంద్రబాబు అక్రమాలను ఏకరవు పెట్టారు. ► కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని అన్నారు. పోలవరం, సాగునీటి ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ చేస్తే అక్షరాలా రూ.1,343 కోట్లు ఆదా అయ్యాయి. అంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ఇట్టే తెలుస్తోంది. ► పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు హయాంలో పిల్చిన టెండర్లను రద్దు చేసి.. యాపిల్ టు యాపిల్ పద్ధతిలో తొలుత రివర్స్ టెండర్లు పిలిస్తే రూ.1,142 కోట్లు ఆదా అయ్యాయి. రివర్స్ టెండరింగ్ విధానంలో ఆ తర్వాత చేపట్టిన పనుల్లో మరో రూ.201 కోట్లు ఆదా అయ్యాయి. ఆ రెండూ కలిపితే అక్షరాలా రూ.1343 కోట్లు పోలవరం పనుల్లో ఆదా అయ్యాయి. పోలవరం ప్రాజెక్టులో ఎక్కడ తప్పు జరిగిందంటే.. ► 2016 సెప్టెంబరు 7న స్పెషల్ ప్యాకేజీ ఇచ్చారు. అరుణ్‌జైట్లీ ఆ అర్ధరాత్రి ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఆ విషయాన్ని చెప్పినప్పుడు ఆయన పక్కనే టీడీపీ మంత్రి సుజానాచౌదరి, ఎంపీ సీఎం రమేష్, నాటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉన్నారు. ► అదే రాత్రి చంద్రబాబు కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి.. అరుణ్‌జైట్లీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం అన్నీ మనకు గుర్తున్నాయి. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి, స్పెషల్ ప్యాకేజీ అంటూ డ్రామాలు చేయడం చూశాం. ► ఆ తర్వాత మర్నాడు సెప్టెంబరు 8న కేంద్ర ప్రభుత్వం ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. (సీఎం ప్రెస్ నోట్‌ను సభలో ప్రదర్శించి చూపి.. అందులో ముఖ్యాంశాలను చదివి వినిపించారు) ► 2014 ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టు పనుల్లో మిగిలిపోయిన నీటి పారుదల విభాగం పనులకు అయ్యే వ్యయాన్ని మాత్రమే వంద శాతం భర్తిస్తామని ఆ నోట్లో స్పష్టంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అడుగుతోంది కాబట్టి.. పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది. ► అయితే ఇంగ్లిష్‌లో ఉన్న ఆ నోట్ చంద్రబాబుకు ఏం అర్ధం అయిందో కాలేదో ఎవరికీ తెలియదు. కానీ అరుణ్‌జైట్లీకి శాలువా కప్పి సత్కరించి వచ్చారు. మామూలుగా నేతలు రాష్ట్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించమని అడుగుతారు. కానీ చంద్రబాబు మాత్రం జాతీయ స్థాయి ప్రాజెక్టును రాష్ట్ర స్థాయికి దిగజార్చడానికి ఎక్కువ ఆరాటపడ్డారు. అప్పుడెందుకు నోరు పెగల్లేదు బాబూ? ► 2016 సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ ఒక మెమొరాండంను కేంద్ర జల శక్తి శాఖకు పంపించింది. 2014 ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటి పారుదల విభాగం పనులకు అయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని అందులో స్పష్టంగా ఉంది. ► ఆ తర్వాత ఐదున్నర నెలలకు 2017 మార్చి 15న కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. అందులో టీడీపీకి చెందిన అశోక గజపతి రాజు, సుజనా చౌదరి ఉన్నారు. ఆ మంత్రివర్గ సమావేశ వివరాలను వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. అందులోనూ.. 2014 ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టు పనుల్లో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని.. అది ఎంతన్నది పోలవరం ప్రాజెక్టు అథారిటీ మదింపు చేస్తుందని స్పష్టం చేసింది. ► పోలవరం ప్రాజెక్టుకు ఇంత అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు అప్పుడు ఎందుకు స్పందించలేదు? అదే సమయంలో ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. దాంతో అసెంబ్లీలో నేను ఆ విషయాన్ని ఆ రోజు సభలో ప్రస్తావించాను. (ఆ రోజు ఏం మాట్లాడింది సీఎం వివరించారు. వీడియో కూడా చూపారు.) ► 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి అరుణ్‌జైట్లీ చెప్పిన దాని ప్రకారం పోలవం ప్రాజెక్టుకు రూ.16 వేల కోట్లు మాత్రమే వస్తుందని తెలిసినప్పుడు చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు. అందులో 2014 ఏప్రిల్ 1కి ముందు చేసిన ఖర్చు రూ.5,500 కోట్లు ఇవ్వం అని, పవర్ హౌస్, తాగునీటి సరఫరా వ్యయం రూ.2,800 కోట్లు ఇవ్వలేమని, కేవలం నీటి పారుదల విభాగం వ్యయం రూ.7,500 కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పినప్పుడు చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారు? ► ఇదే అంశాన్ని నేను శాసనసభలో లేవనెత్తి, నిలదీసే ప్రయత్నం చేస్తే అప్పటి స్పీకర్ మా గొంతు నొక్కారు. అప్పుడే చంద్రబాబు స్పందించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ► 2017 మే 8న కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. అందులో (లేఖను చదివి వినిపించారు) 2014 ఏప్రిల్ 1 నాటికి ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే వంద శాతం భరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అంతకంటే అంచనా వ్యయం పెరిగితే.. ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది. అప్పుడు కూడా టీడీపీ.. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. పోలవరం ప్రాజెక్టుకు ఇంత అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు స్పందించలేదు. చంద్రబాబుకూ ఇంగ్లిష్ వస్తుందా? రాదా? ► 2018 జనవరి 12న చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. (ఆ లేఖను చదివి వినిపించారు) ఆ లేఖలో 2016 సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమొరాండం ప్రకారం 2014 ఏప్రిల్ 1 నాటి ధరల మేరకు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను కేంద్ర జల సంఘానికి పంపామని.. దయచేసి మీరు తక్షణమే జోక్యం చేసుకుని ఆ ప్రతిపాదలను ఆమోదించాలని ప్రధానిని చంద్రబాబు కోరారు. ► అసలు ఈ మనిషికి ఇంగ్లిష్ వస్తుందా? రాదా? అన్నది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఏ ప్రాజెక్టు పనుల్లో అయినా ధరలు ఒకే విధంగా ఉండవు. అదే జరిగితే శ్రీశైలం ప్రాజెక్టును కేవలం కొన్ని వందల కోట్లతోనే పూర్తి చేసి ఉండేవాళ్లం ఆ రోజుల్లో. ► ఎందుకంటే భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ - 2013 చట్టం ప్రకారం, ఆ రెండింటిని ఏ రోజుకు ఆరోజే (ప్రాజెక్టు ఎప్పుడు చేపడితే అప్పుడు) లెక్కించాలి. ఏ ధర ఖరారు చేసినా, అది కేవలం ఒక ఏడాది వరకు మాత్రమే. ఆ తర్వాత భూసేకరణకు రీ నోటిఫికేషన్ జారీ చేయాలి. ► జాతీయ ప్రాజెక్టుల మార్గదర్శకాల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని మూడేళ్లకు ఒకసారి సవరించాలి. మరి అలాంటి పరిస్థితుల్లో.. 2014 ఏప్రిల్ 1 నాటి వ్యయానికి చంద్రబాబు ఏ రకంగా ఒప్పుకున్నారు? ఇంత అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు స్పందించ లేదు? అన్నది ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.37,883 కోట్లు అవసరం ► ఇలాంటి పరిస్థితుల్లో మేము అధికారంలోకి వచ్చాం. చంద్రబాబు చేసిన పాపాలను కడిగేస్తున్నాం. అన్యాయమైన పరిస్థితులను మారుస్తూ వస్తున్నాం. ► పోలవరం ప్రాజెక్టును ఇవాళ పూర్తి చేయాలంటే ఒట్టి భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసమే రూ.26,585 కోట్లు కావాలి. ఇతర సివిల్ పనులకు రూ.7,174 కోట్లు, పవర్ ప్రాజెక్టుకు మరో రూ.4,124 కోట్లు కావాలి. ఆ విధంగా మొత్తం రూ.37,883 కోట్లు కావాలి. పోలవరం ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.55,500 కోట్లకు పైనే కాగా, ఇప్పటి వరకు చేసిన వ్యయం రూ.17,665 కోట్లు. కాబట్టి ఇంకా కావాల్సిన నిధులు రూ.37,883 కోట్లు. ► 2013-14 రేట్ల ప్రకారం చూస్తే రూ.30,610 కోట్లు. ఇందులో ఇప్పటి వరకు చేసిన ఖర్చు రూ.17 వేల కోట్లు తీసివేస్తే.. మిగిలేది మరో రూ.13 వేల కోట్లు. ఒక్క భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కే రూ.26,585 కావాలి. మరి ఏ రకంగా ప్రాజెక్టు పూర్తవుతుంది? అది పూర్తిగా రాంగ్ పద్ధతి. సానుకూలంగా స్పందిస్తున్న కేంద్రానికి కృతజ్ఞతలు ► పోలవరం ప్రాజెక్టులో నెలకొన్న పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. ఒకటికి రెండు సార్లు జల శక్తి మంత్రి, ఆర్థిక మంత్రులను కలిశాం. మా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నాలుగుసార్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మను కలిశారు. ► జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిశారు. నేను స్వయంగా వెళ్లి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసి.. వాస్తవ పరిస్థితులను వివరించాను. ► కేంద్ర జల్ శక్తి, ఆర్థిక శాఖ అధికారులకు రాష్ట్ర జల వనరులు, ఆర్థిక శాఖ అధికారులు చాలా సార్లు ప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతో చివరకు వారు కూడా ఒప్పుకున్నారు. 2013-14 ధరలతో ప్రాజెక్టు పూర్తి కాదని అంగీకరించారు. అందులో తొలుత పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా ప్రాజెక్టు వ్యయాన్ని అంచనా వేయించాం. ► ఇప్పటికే పీపీఏ పాజిటివ్‌గా స్పందించింది. పీపీఏకి సంబంధించింది కేంద్ర జల్ శక్తి శాఖ కాబట్టి.. ఆ శాఖ కూడా సానుకూలంగా స్పందించింది. ఆ శాఖ కేంద్ర ఆర్థిక శాఖకు పంపుతుంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని పూర్తిగా క్లీన్ చేస్తూ, అందరితో మాట్లాడి పరిష్కారాలు వెతుకుతున్నాం. కేంద్రం కూడా దేవుడి దయతో సానుకూలంగా స్పందిస్తోంది. అందుకు కేంద్రానికి కృతజ్ఞతలు. ఒక్క అంగుళం కూడా తగ్గదు ఇంటి పెద్దగా చెబుతున్నాను. ప్రాజెక్టు ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గదు. మొత్తం 45.72 మీటర్లు కడతాం. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కొడుకును. ఆయన ఊహించినట్లు కడతాం. 2022 ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకువస్తాం. ఈ ప్రాజెక్టు కచ్చితంగా పూర్తవుతుంది. నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్లే ► మా నియోజకవర్గంలో చిత్రావతి ప్రాజెక్టు ఉంది. దాని సామర్థ్యం 10 టీఎంసీలు. కానీ ఏనాడూ 3 టీఎంసీలకు మించి నింపలేదు. కారణం రూ.240 కోట్లు.. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ నిధులు ఇవ్వలేదు. అదే విధంగా పులిచింతల, కండలేరు, గండికోట, వెలిగొండ కూడా. ప్రాజెక్టు కట్టిన తర్వాత ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకపోతే నీళ్లు ఎలా నింపుతాం? మేము అధికారంలోకి రాగానే చిత్రావతి ప్రాజెక్టుకు నిధులు ఇచ్చాం.10 టీఎంసీలు నింపాం. ► గండికోట ప్రాజెక్టు ప్రాజెక్టు సామర్థ్యం 27 టీఎంసీలు. కానీ.. గత ప్రభుత్వం 13 టీఎంసీలకు మించి నిల్వ చేయలేదు. ఎందుకంటే భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం నిధులు ఇవ్వలేదు. మేం అధికారంలోకి వచ్చాక ఆర్ అండ్కు రూ.600 కోట్లు ఇచ్చాం. ఈ రోజు అందులో 19 టీఎంసీలు నిల్వ చేశాం. ఇంకా ఎక్కువ నీటిని నిల్వ చేయవచ్చు. కానీ నిర్వాసితులు కాస్త సమయం కోరుతున్నారు. కండలేరు ప్రాజెక్టులో ఆర్ అండ్ ఆర్కు రూ.50 కోట్లు ఇవ్వకపోవడం వల్ల సామర్థ్యం కంటే 10 టీఎంసీలు తక్కువగా నిల్వ చేశారు. యుద్ధ ప్రాతిపదికన పోలవరం పనులు ► పోలవరం ప్రాజెక్టు ఒక్క అంగుళం కూడా తగ్గదు. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతాయి. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు కూడా ఎక్కడా ఆపం. పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల వరకు నీరు నిల్వ చేయాలంటే భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం రూ.3,383 కోట్లు కావాలి. ఆ స్థాయిలో 120 టీఎంసీల నీరు నిల్వ చేసుకోవచ్చు. ► ఆ తర్వాత 44 మీటర్ల ఎత్తు వరకు పోవడానికి మరో రూ.2 వేల కోట్లు భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం ఖర్చు చేస్తే 158.39 టీఎంసీలు నిల్వ చేయవచ్చు. 45 మీటర్లకు పెంచితే మరో రూ.4,500 కోట్లు ఖర్చు చేయాలి. అలా పెంచితే 180 టీఎంసీల వరకు నీరు నిల్వ చేయొచ్చు. ► దాని తర్వాత ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో అంటే 45.72 మీటర్లలో 194 టీఎంసీల నిల్వ చేయాలంటే రూ.13,699 కోట్లు ఆర్ అండ్ ఆర్ కోసం, భూసేకరణకు మరో రూ.3 వేల కోట్లు కావాలి. అంటే రూ.16 వేల కోట్లు అవుతాయి. సీడబ్ల్యూసీ ప్రొటోకాల్ ప్రకారమే నీటి నిల్వ ► జలాశయాల్లో నీటిని నిల్వ చేయడానికి సీడబ్ల్యూసీ డ్యామ్ సేఫ్టీ అండ్ స్టేబులిటీ ప్రోటోకాల్ ఉంటుంది. ప్రాజెక్టు కట్టగానే పూర్తి స్థాయిలో నీరు నింపరు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు ఒకసారి చూస్తే.. డ్యామ్ కట్టిన తర్వాత మొదటి ఏడాది 33 శాతం,, రెండో ఏడాది 50 శాతం, మూడో ఏడాది పూర్తి స్థాయిలో నీరు నింపాలి. ఏ డ్యామ్‌కు అయినా అవే నిబంధనలు వర్తిస్తాయి. ► ఇక్కడ మనం 41.5 మీటర్ల వరకు నిల్వకు వెళ్తాం. అంటే దాదాపు 120 టీఎంసీలు నిల్వ చేస్తాం. ఆ తర్వాత సీడబ్ల్యూసీ ప్రోటోకాల్ ప్రకారం వెళ్తాం. ► పోలవరం డ్యామ్, రిజర్వాయర్ కెపాసిటీ ఒక్క సెంటీమీటరు కూడా తగ్గించడం లేదు. అదే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాం. ఎందుకంటే రేపు ఎల్లో మీడియా, చంద్రబాబు ఏమైనా చెప్పగలుగుతారు. నిందిస్తారు. అందుకే అంత వివరంగా చెబుతున్నాం. వంద అడుగులతో వైఎస్సార్ విగ్రహం ► తెలుగు జాతి ప్రజల కోరిక మేరకు.. మన ఎమ్మెల్యేల తీర్మానం మేరకు దశాబ్దాల కల పోలవరం ప్రాజెక్టును సాకారం చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని 100 అడుగుల ఎత్తుతో ప్రాజెక్టు వద్ద ప్రతిష్టిస్తాం. ప్రాజెక్టు పనుల్లో ఒక్క పైసా కూడా మేం వృథా చేయడం లేదు. ► పోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం ఏ విధంగా వృథా వ్యయం చేసిందో చూద్దాం. బస్సులు పెట్టి, ప్రజలు సందర్శించినట్లు రాసుకుంటూ ఏకంగా రూ.83.45 కోట్లు ఖర్చు చేసినట్లు చూపారు. అందులో భోజనం బిల్లులు ఏకంగా రూ.14 కోట్లు. అంత జనం వచ్చిందీ లేదు. చూసిందీ లేదు. అయినా అడ్డగోలుగా లెక్కలు రాసి దోచుకున్నారు. అసలు ప్రాజెక్టు పనులు కూడా కాలేదు. ► డయాఫ్రమ్ వాల్. అంటే కేవలం పునాది పనులు. కాంక్రీట్ వేసే పేరుతో.. గేట్లు పెడుతున్నామనే పేరుతో చంద్రబాబు ఏకంగా మూడు సార్లు శంకుస్థాపన చేసి డ్రామా చేశారు. అలా హంగామా చేసిన దానికి రూ.83.45 కోట్లు ఖర్చు చేశారు. (ప్రజలను తీసుకుపోయి ఏం చేశారో చూద్దాం.. అంటూ నాడు చంద్రబాబును పొగుడుతూ జయము..జయము చంద్రన్నా అంటూ చిడతలతో మహిళలు పాడిన పాటల వీడియో ప్రదర్శించి చూపారు. ఈ పాట వస్తున్నంత సేపూ సభలో సభ్యులంతా విరగబడి నవ్వారు.) -
ఏసీబీ వలలో ఇరిగేషన్ డీఈ
అనంతపురం క్రైం: అవినీతి నిరోధక శాఖ వలకు ఇరిగేషన్ శాఖ డీఈ చిక్కాడు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఓ మహిళ నుంచి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత నెలలో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(సీబీఆర్) ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. అందులో భాగంగా ముదిగుబ్బ మండలం రాఘవపల్లిలో కంచం లీలావతికి చెందిన ఇంటికి ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా రూ. 21 లక్షలు మంజూరు చేసింది. ఈ క్రమంలో పార్నపల్లి సబ్ డివిజన్ డీఈ మోహన్‌గాందీ(సీబీఆర్) లీలావతిని రూ.2 లక్షలు లంచం ఇవ్వాలని కోరాడు. లీలావతి ఖాతాలో నష్టపరిహారం జమ కాగానే.. లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఈ నెల 25న ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన తిరుపతి ఏసీబీ డీఎస్పీ, అనంతపురం ఇన్చార్జ్ డీఎస్పీ అల్లాబ„Š బృందం.. శుక్రవారం ఉదయం రెడ్‌హ్యాండెడ్‌గా డీఈని పట్టుకున్నారు. విలాసవంతమైన భవనం పార్నపల్లి సబ్ డివిజన్ డీఈగా పని చేస్తున్న మోహన్‌గాంధీ ఇల్లు ఇంద్ర భవనాన్ని తలపిస్తుంది. ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్, బార్, జిమ్, హోం థియేటర్ ఉన్నాయి. ఆ ఇంటి ధర రూ.3 కోట్ల వరకు ఉంటుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. డీఈ ఇల్లు, ఫాంహౌస్‌తో పాటు పులివెందులలో ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. -
లంచం తీసుకుంటూ.. ఏసీబీకి అడ్డంగా దొరికిపోయి..
సాక్షి, జనగామ: ఇరిగేషన్ డిపార్టమెంట్‌కు చెందిన ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకెళ్తే.. ఇరిగేషన్ డిపార్టమెంట్ డీఈ రవీందర్ రెడ్డి శనివారం ఓ కాంట్రాక్టర్ నుంచి 50 వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. (నడి రోడ్డు మీద లంచావతారం..) -
ఇక ఉత్తరాంధ్రలో గోదారి 'గలగల'
సాక్షి, అమరావతి: వెనుకబడిన ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇప్పటికే విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించిన ప్రభుత్వం.. సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను తరలించి.. సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చడం ద్వారా ఆ ప్రాంత సమగ్రాభివృద్ధికి బాటలు వేయాలని నిర్ణయించింది. పోలవరం ఎడమ కాలువ 162.409 కిలోమీటర్ల వద్ద నుంచి రోజుకు ఎనిమిదివేల క్యూసెక్కుల చొప్పున 90 రోజుల్లో 63.20 టీఎంసీల నీటిని తరలించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులు చేపట్టింది. తొలిదశలో రూ.2,022 కోట్లతో పనులు ప్రారంభించిన ప్రభుత్వం రెండోదశలో రూ.6,265 కోట్లతో రెండు ప్యాకేజీల కింద పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధం చేసింది. అనంతరం దశలవారీగా భూదేవి, వీరనారాయణపురం, తాడిపూడి, గాదిగెడ్డ రిజర్వాయర్లను పూర్తిచేయాలని నిర్ణయించింది. మొత్తం రూ.15,448 కోట్ల వ్యయమయ్యే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టడానికి ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కార్పొరేషన్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ, జాతీయ ఆర్థికసంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చి.. ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేయడానికి ప్రణాళిక రచించింది. మహానేత వైఎస్ మానసపుత్రిక ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఏటా సగటున మూడువేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. వాటిలో పోలవరం ఎడమ కాలువ నుంచి 63.20 టీఎంసీలను తరలించడం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ పథకానికి 2009 జనవరి 2న గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. కానీ.. అంతలోనే మహానేత హఠాన్మరణంతో ఈ పథకం మరుగునపడింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ఇదీ.. ► పోలవరం ఎడమ కాలువలో 162.409 కిలోమీటర్ల వద్ద నుంచి 500 మీటర్ల లింకు కాలువ ద్వారా 1,300 క్యూసెక్కుల నీటిని తరలించి.. జామద్దులగూడెం, పెదపూడిల వద్ద రెండుదశల్లో ఎత్తిపోసి 3.16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే పెదపూడి రిజర్వాయర్‌కు తరలిస్తారు. ► ఎడమ కాలువ 162.409 కిలోమీటర్ల వద్ద నుంచి 23 కిలోమీటర్ల లింక్ కాలువ ద్వారా 6,700 క్యూసెక్కులు తరలిస్తారు. ► పాపాయపాలెం వద్ద ఎత్తిపోసి.. 106 కిలోమీటర్ల పొడవున తవ్వే లిఫ్ట్ కాలువ ద్వారా గాదిగెడ్డ రిజర్వాయర్‌కు సరఫరా చేస్తారు. ► లిఫ్ట్ కాలువ 102 కిలోమీటర్ల వద్ద నీటిని ఎత్తిపోసి కోటగండ్రేడు బ్రాంచ్ కాలువ ద్వారా శ్రీకాకుళం జిల్లాకు తరలిస్తారు. ► లిఫ్ట్ కెనాల్ 14 కిలోమీటర్ల వద్ద భూదేవి లిఫ్ట్ ద్వారా నీటిని ఎత్తిపోసి 6.2 టీఎంసీల సామర్థ్యంతో నిరి్మంచే భూదేవి రిజర్వాయర్, 48.50 కిలోమీటర్ల వద్ద నీటిని ఎత్తిపోసి 6.55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే వీరనారాయణపురం రిజర్వాయర్, 73 కిలోమీటర్ల వద్ద తాడిపూడి లిఫ్ట్ ద్వారా తరలించి 3.80 టీఎంసీల సామర్థ్యంతో నిరి్మంచే తాడిపూడి రిజర్వాయర్ నింపుతారు. ► తొలిదశలో 1.30 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి కాంట్రాక్టర్లకు అప్పగించిన లింక్ కెనాల్, జామద్దులగూడెం, పెదపూడి ఎత్తిపోతలు, పెదపూడి రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సీఎం వైఎస్ జగన్ జలవనరులశాఖకు దిశానిర్దేశం చేశారు. ► రెండోదశలో శ్రీకాకుళం జిల్లా వరకు నీటిని తరలించేలా 23 కి.మీ.ల లింక్ కెనాల్, 106 కి.మీ.ల లిఫ్ట్ కెనాల్, 60 కి.మీ.ల కోటగండ్రేడు బ్రాంచ్ కెనాల్ పనులు చేపట్టడానికి రూ.6,265 కోట్లు అవసరం. ఇందులో భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ పనులకు రూ.2,344 కోట్లను వెచి్చంచాల్సి ఉంటుంది. రూ.3,921 కోట్లతో లింక్ కెనాల్, లిఫ్ట్ కెనాల్, బ్రాంచ్ కెనాల్ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్ నోటిఫికేషన్ జారీచేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ► రెండోదశలో తొలి ప్యాకేజీకి రూ.2,539 కోట్లు, రెండో ప్యాకేజీకి రూ.1,382 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీచేస్తారు. ఈ పనులకు సమాంతరంగా భూదేవి, వీరనారాయణపురం, తాడిపూడి రిజర్వాయర్లు నిరి్మంచడంతోపాటు గాదిగెడ్డ రిజర్వాయర్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రచార బిల్లులు కూడా చెల్లించని టీడీపీ సర్కార్ 2019 ఎన్నికలకు ముందు ఓట్లకోసం టీడీపీ సర్కార్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలిదశను చేపడుతున్నట్లు ప్రకటించి 2018 నవంబర్ 15న శంకుస్థాపన చేసింది. ఆరోజున రూ.1,94,00,404 వెచ్చించి పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలతో ప్రచారం చేసుకుంది. కానీ తట్ట మట్టి కూడా ఎత్తలేదు. ప్రచార ప్రకటనల బిల్లులూ చెల్లించలేదు. ఆ బిల్లులను ఫిబ్రవరి 7న ప్రస్తుత ప్రభుత్వం చెల్లించింది. -
పక్కాగా ‘సాగునీటి’ ఆస్తుల లెక్క
సాక్షి, హైదరాబాద్: సాగునీటి శాఖ పరిధిలోని ఆస్తుల లెక్కలు పక్కాగా తేల్చి, వాటి నిర్వహణ సమర్థంగా ఉండేలా నీటిపారు దల శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. శాఖకు చెందిన భవనాలు, క్యాంపు కాలనీలు, వాటిల్లో క్వార్టర్లు, కాల్వలు, టన్నెళ్లు, పంపులు, మోటార్లు, గేట్లు, ట్రాన్స్ఫార్మర్లు, రిజ ర్వాయర్లు, లిఫ్టులు, చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు, వాహనాలు, మెషినరీ, ఫర్నిచర్, భూముల వివరాలను ఇప్పటికే సేకరించిన శాఖ, వాటి నిర్వహణ పక్కాగా ఉండేలా చర్యలు చేపట్టింది. ఈ ఆస్తుల సమగ్ర వివరాలన్నింటినీ ప్రాజెక్ట్ మానిటరింగ్ సిస్టమ్ (పీఎంఎస్)లో అందుబాటులో ఉంచనుంది. ప్రస్తుతం పొందు పరుస్తున్న వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునే అంశాలపై అన్ని స్థాయిల ఇంజనీర్లకు శాఖ ఉన్నతాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా భూసేకరణ, తర్వాత ఆ భూముల మ్యుటేషన్, రికార్డుల నిర్వహణతో పాటు, వాటి పర్యవేక్షణ, రెవెన్యూ శాఖతో సమన్వయం వంటి అంశాలపై వివిధ స్థాయిల ఇంజనీర్లకు బాధ్యతలు కట్టబెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రాజెక్టుల ఇన్వెంటరీ నివేదికను తయారుచేసే పనిలోపడ్డ ఇంజనీర్లు ప్రాజెక్టుల నిర్మాణాలకు, వాటి కింది కాల్వలకు సేకరించిన భూముల లెక్కలు తేల్చారు. దీనిపై మంగళవారం సాగునీటి శాఖ ఆస్తుల ఇన్వెంటరీ నిర్వహణపై జలసౌధలో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్ కుమార్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, హరిరామ్, నల్లా వెంకటేశ్వర్లు, అనిల్‌కుమార్, సీఈలు శ్రీనివాస్‌రెడ్డి, శంకర్, మధుసూధన్‌రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రజత్‌కుమార్ మాట్లాడుతూ, గడిచిన యాభై ఏళ్లుగా సాధించలేని పనిని ఆరు నెలల్లో సాగునీటి శాఖ ఇంజనీర్లు సాధించారని ప్రశంసించారు. సాగునీటి వనరుల ప్రధాన లెక్కలు ఇలా.. పీఎంఎస్లో పొందుపరచిన వివరాలను గోదావరి బేసిన్ కమిషనర్ మధుసూదన్‌రావు ఈ సందర్భంగా వెల్లడించారు. వివిధ అవసరాల కోసం సాగునీటి శాఖ సేకరించిన భూమి 12.80 లక్షల ఎకరాలను ఆధారాలతో సహా పొందుపరచగా, ఈ భూమి మొత్తం రెవెన్యూ అధికారులు సాగునీటిశాఖ పేరు మీదకు బదిలీ చేశారని అన్నారు. ఇరిగేషన్ శాఖ పరిధిలో 125 జలాశయాలు, 8,661 కి.మీ ప్రధాన కాలువలు, 13,373 కి.మీ డిస్ట్రిబ్యూటరీలు, 17,721 కి.మీ మైనర్లు, 910 కి.మీల పైపులు, 125 మేజర్ ఎత్తిపోతలు, 20 మధ్యతరహా ఎత్తిపోతలు, 13 చిన్న తరహా ఎత్తిపోతలు, 38,510 చెరువులు, కుంటలు, 8,021 చెక్ డ్యాంలు, ఆనకట్టలు, 175 కి.మీ సొరంగాలు, కాలువల మీద 1,26,477 స్ట్రక్చర్లు, 108 విద్యుత్ సబ్ స్టేషన్లు, 64 రెయిన్ గేజులు, 21 రివర్ గేజులు ఉన్నాయని ఆయన వివరించారు. అనంతరం ఇన్వెంటరీ నిర్వహణపై విస్తృత చర్చ జరిగింది. -
‘పునర్వ్యవస్థీకరణ’పై ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి శాఖ సంపూర్ణ ప్రక్షాళన దిశగా పూర్తి చేసిన కసరత్తు, దాని అవసరంపై అసెంబ్లీ సమావేశాల వేదికగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటన చేయనున్నారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్న నీటివనరులు, ఐడీసీ పథకాల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తూ పూర్తి చేసిన పునర్వ్యవస్థీకరణపై సమగ్రంగా వివరించనున్నారు. ముఖ్యమంత్రి ప్రకటన, దీనిపై చర్చ అనంతరమే పునర్వ్యవస్థీకరణ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రకటన సందర్భంగానే కొత్త పోస్టులు, నియామకాలపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పని విభజన పూర్తి.. రాష్ట్రంలో సాగునీటి వనరుల కింద ప్రస్తుతం 71 లక్షల ఎకరాల మేర ఆయకట్టు సాగులోకి రావడం, మరో 54 లక్షల ఎకరాల ఆయకట్టు వృద్ధిలోకి తెచ్చే లక్ష్యంతో ప్రాజెక్టుల నిర్మాణం ఉధృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో దానికి అనుగుణంగా నిర్వహణ, పక్కాగా నీటి పంపకం ఉండాలన్నా ఇరిగేషన్ శాఖలో పని విభజన జరగాలని సీఎం కేసీఆర్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి ఒక్క సీఈ పరిధిలోనే ప్రాజెక్టులు, చెరువులు, ఐడీసీ లిఫ్టులు, రిజర్వాయర్లు, బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, కాల్వ లు, సబ్స్టేషన్లు ఉండేలా పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ కసరత్తు పూర్తి చేశారు. ప్రాజెక్టులు, కాల్వ లు, రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, ఆయకట్టు పెరిగినందున ప్రస్తుతం ఉన్న 13 చీఫ్ ఇంజనీర్ల డివిజన్లను 19కి పెంచేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఒక్కో సీఈ పరిధిలో 5 లక్షల ఎకరాల నుంచి 7 లక్షల ఎకరాలు ఉండేలా పని విభజన చేశారు. మైనర్ ఇరిగేషన్, ఐడీసీని పూర్తిగా తొలగించారు. ఈ పునర్వ్యవస్థీకరణపై కేబినెట్ ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపారు. అయితే అంతకుముందే దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేసి చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకున్నాక ప్రభుత్వపరంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. నియామకాలపైనా స్పష్టత.. పునర్వ్యవస్థీకరణపై ప్రకటన సందర్భంగానే సాగునీటి శాఖ పరిధిలో కొత్త పోస్టులు, నియామకాలు, పదోన్నతులపైనా స్పష్టత రానుంది. 774 కొత్త పోస్టులు అవసరమని ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా అందులో 576 ఏఈ పోస్టులు, మరో 198 పోస్టులను పదోన్నతుల ద్వా రా భర్తీ చేయాలని ప్రతిపాదించారు. దీంతోపాటే ప్రాజెక్టుల కింది ఆయకట్టుకు నీటి సరఫరా పక్కా గా ఉండాలన్నా... బ్యారేజీలు, రిజర్వాయర్లు, హెడ్ రెగ్యులేటరీల పరిధిలోని గేట్లు, కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, తూముల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌కు తగినంత సిబ్బంది అవసరం ఉంది. గేట్లు ఎత్తేది మొదలు కాల్వల్లో చివరి ఆయకట్టుకు నీరు చేరే వరకు వర్క్ ఇన్స్పెక్టర్లు, ఆపరేటర్లు, ఫిట్టర్లు, లష్కర్లు, ఎలక్ట్రీషియన్ల అవసరం ఎంతైనా ఉంటుంది. ఇలాంటి సిబ్బంది 5,280 మంది అవసరం కాగా ప్రస్తుతం 1,150 మందే ఉన్నారు. ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల రిజర్వాయర్లు, బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు అందుబాటులోకి వస్తుండటంతో ఈ సంఖ్య ఏమాత్రం సరిపోవట్లేదు. ముఖ్యంగా కాల్వ ల నిర్వహణలో కీలకమైన లష్కర్లు 3,293 మందికిగాను కేవలం 419 మందే ఉన్నారు. ఫ్లడ్ గేట్ ఆపరేటర్లు 97 మంది అవసరంకాగా 18 మందితో నెట్టుకొస్తున్నారు. వర్క్ ఇన్స్పెక్టర్లు 728 మందికిగాను 196 మంది మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలు చేపట్టేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీనిపైనా అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశాలున్నాయి. నేడు మంత్రివర్గ భేటీ ►కొత్త రెవెన్యూ చట్టం బిల్లుకు లభించనున్న ఆమోదముద్ర ►మంత్రిమండలి ముందు మరికొన్ని కీలక బిల్లులు.. సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సోమవారం రాత్రి 7.30 గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశం కానుంది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడంతో పాటు పలు కీలక బిల్లులను ఆమోదించేందుకు సీఎం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శాసనసభలో ప్రవేశపెట్టనున్న కొత్త రెవెన్యూ చట్టం బిల్లు, విపత్తులు, అత్యయిక పరిస్థితుల్లో ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, పెన్షన్లలో కోతల విధింపు చట్టం బిల్లు, వైద్య అధ్యాపకుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంపు చట్ట సవరణ బిల్లు, జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణ చట్టం బిల్లుతో పాటు ఇతర ప్రతిపాదిత బిల్లులపై ఇందులో చర్చించి ఆమోదించే అవకాశముంది. ఇటు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించాలని కేంద్రానికి సిఫారసు చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేయనుంది. అలాగే కరోనా వ్యాప్తి నివారణ, వైద్య సదుపాయం, వర్షాలతో పంటనష్టం, శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం, ఏపీతో జల వివాదాలు తదితర అంశాలు సభలో చర్చకు వస్తే అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. -
‘పవర్’కు పంప్‌హౌస్‌లు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్న పరిస్థితుల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యత, బాధ్యత పెరుగుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో నీటి పారుదల శాఖ వికేంద్రీకరణ, పునర్వ్యవస్థీకరణ జరగాలని చెప్పారు. అవసరమైతే వెయ్యి కొత్త పోస్టులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వ్యవస్థ నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. నీటి పారుదల శాఖను ఇక నుంచి జల వనరుల శాఖ (వాటర్ రిసో ర్సెస్ డిపార్ట్మెంట్)గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఎత్తిపోతల పథకాల అన్ని పంప్‌హౌస్‌ల నిర్వహణను విద్యుత్ శాఖకు అప్పగించా లని సీఎం కీలక సూచన చేశారు. జల వనరుల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. తెలంగాణలో మారిన సాగునీటి రంగం పరిస్థితికి తగ్గట్టుగా జల వనరుల శాఖ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి అధికారులు రూపొందించిన ముసాయిదాను సీఎంకు అందిం చారు. ఈ ముసాయిదాపై సీఎం చర్చించారు. మొత్తంగా గోదావరి నుంచి ప్రతిరోజూ 4 టీఎంసీలు, కృష్ణా నుంచి 3 టీఎంసీలు లిఫ్టు చేసి, రాష్ట్రంలో కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన వ్యవస్థను సిద్ధంగా ఉంచాలని సీఎం అన్నారు. దీనికి తగ్గట్టుగానే పునర్వ్యవస్థీకరణ, వికేంద్రీకరణ ఉండాలని సూచిం చారు. ముసాయిదాకు కొన్ని మార్పులు చెప్పారు. అధికారులు మరోసారి వర్క్‌షాపు నిర్వహించుకుని సూచించిన మార్పులకు అనుగుణంగా పునర్వ్యవసీకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్ సీలు మురళీధర్‌రావు, నాగేందర్రావు, అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు, హరేరామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, పలువురు సీఈలు పాల్గొన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన సూచనలు, ఇచ్చిన ఆదేశాలు ఈ విధంగా ఉన్నాయి. ►ఎంతో వ్యయంతో, ఎన్నో ప్రయాసలకు ఓర్చి ప్రభుత్వం భారీ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. అలా నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. దీనికి తగ్గట్టుగా జల వనరుల శాఖ సంసిద్ధం కావాలి. ►జలవనరుల శాఖ ఒకే గొడుగు కింద ఉండాలి. వేర్వేరు విభాగాలు ఇకపై కొనసాగవు. రాష్ట్రాన్ని వీలైనన్ని ఎక్కువ ప్రాదేశిక ప్రాంతాల కింద విభజించాలి. ఒక్కో ప్రాదేశిక ప్రాంతానికి ఒక్కో సీఈని ఇంచార్జిగా నియమించాలి. ఇఇలు, డిఇల పరిధిలను ఖరారు చేయాలి. ప్రాదేశిక ప్రాంతంలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాల్వలు, చెరువులు, లిఫ్టులు, చెక్ డ్యాములు, సాగునీటికి సంబంధించిన సర్వస్వం సీఈ పరిధిలోనే ఉండాలి. ►సీఈ ప్రాదేశిక ప్రాంతం పరిధిలో ఎన్ని చెరువులున్నాయో ఖచ్చితమైన లెక్కలు తీయాలి. ప్రాజెక్టుల ద్వారా మొదట చెరువులను నింపడమే ప్రాధాన్యతగా పెట్టుకున్నందున, సీఈ పరిధిలో దానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం కావాలి. చెరువులు నింపే పని పకడ్బందీగా జరగాలి. ►పునర్వ్యవస్థీకరణ, వికేంద్రీకరణలో భాగంగా ఈఎన్సి నుంచి లష్కరు వరకు ఎంతమంది సిబ్బంది కావాలి? ప్రస్తుత ఎంతమంది ఉన్నారు? అనే విషయాల్లో వాస్తవిక అంచనాలు వేయాలి. ఖచ్చితమైన నిర్ధారణకు రావాలి. అవసరమైతే ఈ శాఖకు మరో వెయ్యి పోస్టులు కొత్తగా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఎంత మంది ఈఎన్సిలు ఉండాలనే విషయం నిర్ధారించాలి. ఈఎస్‌సి జనరల్, ఈఎస్‌సి అడ్మినిస్ట్రేషన్, ఈఎస్‌సి ఆపరేషన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ►ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు ఇలా ప్రతీచోటా ఖచ్చితంగా ఆపరేషన్ మాన్యువల్స్ రూపొందించాలి. దానికి అనుగుణంగానే నిర్వహణ జరగాలి. ప్రాజెక్టుల నిర్వహణకు ఏడాదికి ఎంత ఖర్చవుతుందో సరైన అంచనాలు వేయాలి. ►అన్ని పంప్ హౌజుల నిర్వహణ బాధ్యత విద్యుత్ శాఖకు అప్పగించాలి ►ఉపాధి హామీ పథకం ద్వారా సాగునీటి రంగంలో ఏఏ పనులు చేయవచ్చో నిర్ధారించి, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేయాలి. ►ప్రాజెక్టుల రిజర్వాయర్ల వద్ద గెస్టు హౌజులు నిర్మించాలి. సీఈలకు తమ పరిధిలో క్యాంపు కార్యాలయాలు నిర్మించాలి. -
రాయలసీమ ఎత్తిపోతలకు నేడు టెండర్ నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పనులకు ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో సోమవారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించిన ప్రతిపాదనలతో.. 30 నెలల్లో పనులను పూర్తి చేయాలనే షరతుతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ పనులకు రూ.3,278.18 కోట్లను ఐబీఎం(అంతర్గత అంచనా విలువ)గా నిర్ణయించింది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ నుంచి టెండర్ డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే రోజు నుంచి షెడ్యూళ్లు దాఖలు చేసుకోవచ్చు. టెండర్ షెడ్యూళ్లు దాఖలు చేసే వారు రూ. 10 కోట్లను ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ)గా చెల్లించాలి. – ఆగస్టు 3 మధ్యాహ్నం మూడు గంటల వరకూ టెండర్ డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే రోజున ఐదు గంటల్లోగా షెడ్యూళ్లను దాఖలు చేయాలి. – ప్రీ–బిడ్ సమావేశాన్ని ఈనెల 27న నిర్వహిస్తారు. టెండర్లో పాల్గొనే కాంట్రాక్టర్ల సందేహాలను జలవనరుల శాఖ అధికారులు నివృత్తి చేస్తారు. – వచ్చే నెల 4న ఉదయం 11 గంటలకు సాంకేతిక బిడ్‌ను, 7న ఉదయం 11 గంటలకు ఆర్థిక బిడ్‌ను తెరుస్తారు. – ఆర్థిక బిడ్‌లో తక్కువ ధర(ఎల్–1)కు కోట్ చేసిన కాంట్రాక్టర్ పేర్కొన్న మొత్తాన్నే కాంట్రాక్టు విలువగా పరిగణించి.. 10న ఉదయం 11 గంటల నుంచి ఈ–ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహిస్తారు. తక్కువ ధరకు కోట్ చేసిన (ఎల్–1) కాంట్రాక్టర్‌ను ఖరారు చేసి.. వీటిని ఎస్‌ఎల్‌టీసీ (స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ)కి పంపుతారు. వాటిని ఎస్‌ఎల్‌టీసీ పరిశీలించి ఆమోదించాక కాంట్రాక్టు ఒప్పందం చేసుకోవడానికి అనుమతి ఇస్తుంది. -
ఒకే గొడుగు కిందకు ఇరిగేషన్
సాక్షి, హైదరాబాద్ : నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ, సచివాలయ భవన సముదాయం నిర్మాణంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రెండు కీలక ఇంజనీరింగ్ విభాగాల ముఖ్యులతో సోమ, మంగళవారాల్లో విస్తృతస్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి నీటిపారుదల శాఖ, మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రోడ్లు భవనాల శాఖ మంత్రులు, ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు. సాగునీటి రంగం బలోపేతానికి.. ‘రాష్ట్రంలో సాగునీటి రంగానికి ప్రాధాన్యత పెరిగింది. దీన్ని గుర్తించిన కేసీఆర్, ఆ శాఖను పునర్వ్యవస్థీకరించి బలోపేతం చేయాలని సంకల్పించారు. ప్రస్త తం నీటిపారుదల శాఖ శాఖోపశాఖలుగా ఉంది. భారీ, మధ్య, చిన్న తరహా, ఐడీసీ, ప్రాజెక్టులు, ప్యాకేజీలుగా విభజించి ఉంది. ఇదంతా ఒకే గొడుకు కిందికి రావాలని, తద్వారా పర్యవేక్షణ పటిష్టంగా ఉంటుందని సీఎం భావించారు. అందుకే నీటి పారుదల శాఖను 15–20 ప్రాదేశిక విభాగాలుగా మార్చి, ఒక్కో దానికి ఒక్కో చీఫ్ ఇంజనీర్ (సీఈ)ని ఇన్చార్జిగా నియమించాలని నిర్ణయించారు. ఆ సీఈ పరిధిలోనే ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, లిఫ్టులు, కాలువలు, చెరువులు, చెక్‌డ్యామ్‌లు సమస్తం ఉంటాయి. దీనికి సంబంధించి ముసా యిదా తయారు చేయాలని గతవారం జరిగిన సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు. నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ 2రోజుల పాటు నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణపై వర్క్‌షాపు నిర్వహించి, ముసాయిదా రూపొందించారు. దీనిని సోమ వారం సీఎం కేసీఆర్‌కు సమర్పిస్తారు. దీనిపై సమీక్ష సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణ యం తీసుకుంటారు. ఈ సమీక్షలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, సీఎం కార్యదర్శి, ఈఎన్సీలు, సీఈలు పాల్గొంటారు’ అని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. సచివాలయం ఎలా ఉండాలి? తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవన సముదాయం నిర్మాణంపై మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సెక్రటేరియట్ తెలంగాణ ప్రతిష్ట, వైభవానికి ప్రతీకగా ఉండాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. దీనికి సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించారు. మంగళవారం నాటి సమీక్షలో డిజైన్లపై, సెక్రటేరియట్ బాహ్యరూపం ఎలా ఉండాలి? లోపల సౌకర్యాలు ఎలా ఉండాలి? అనే విషయాలపై చర్చిస్తారు. అనంతరం వాటిని మంత్రివర్గంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి, భవన సముదాయ నిర్మాణం ప్రారంభిస్తారు. ఈ సమీక్షలో ఆర్అండ్బీ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి, ఇంజనీరింగ్ అధికారులు, తమిళనాడుకు చెందిన ఆర్కిటెక్టులు ఆస్కార్, పొన్ని తదితరులు పాల్గొంటారు. -
వచ్చే ఖరీఫ్‌కు ‘సీతారామ’ నీరు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. డిసెంబర్లో ట్రయల్ రన్ నిర్వహిస్తామని, ఇందుకు అవసరమైన నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్ నిర్మాణ పనులను నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రట రీ రజత్‌కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్, ప్రభుత్వ సాగు నీటి రంగ సలహాదారు పెంటారెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. ములకలపల్లి మండలం రామవరం పంప్‌హౌస్ వద్ద సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికే ప్యాకేజీల వారీగా పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. డిసెంబర్ నెలాఖరు నాటికి పంప్‌హౌస్–2 పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతోందని, అలాగే.. నల్లగొండ జిల్లాకు కూడా నీరందుతోందని వివరించారు. మైనర్ ఇరిగేషన్ ద్వారా అదనంగా 2 లక్షల ఎకరాలు సాగవుతాయని పేర్కొన్నారు. సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణం కోసం భూసేకరణ ప్రారంభమైందని, టెండర్లు సైతం ఖరారయ్యాయని చెప్పారు. త్వరలో సీఎం కేసీఆర్ నిర్మాణ పనులను ప్రారంభిస్తారని తెలిపారు. నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్ మాట్లాడుతూ.. పంప్‌హౌస్–1, 2 నిర్మాణాలకు సంబంధించిన యంత్ర సామగ్రి సిద్ధంగా ఉందని, ఇక నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్యాకేజీల వారీగా పనులు పూర్తి చేస్తామన్నారు. అయితే.. 8వ ప్యాకేజీలో కొంత భూసేకరణ పూర్తి కావాల్సి ఉందన్నారు. ఈ విషయమై రైతులతో చర్చలు జరుపుతున్నామని, భూసేకరణపై పూర్తిగా దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. దాదాపు 104 కిలోమీటర్ల పరిధిలో సీతారామ ప్రాజెక్టు కాల్వలు నిర్మాణం జరుగుతున్న తీరును ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించినట్లు ఆయన వివరించారు. -
అప్పటికి ఎగువమానేరుకు గోదావరి జలాలు
సిరిసిల్ల: సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి నిధుల కొరత లేదని, ప్రాధాన్యత ప్రకారం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్ట్–9 ప్యాకేజీ పనులను మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్–19 కారణంగా రాష్ట్ర ఖజానాకు రాబడి తగ్గినా.. ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. 9వ ప్యాకేజీ పనులను సెప్టెంబర్‌లోగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 12 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తి అయ్యాయని, మరో 50 మీటర్లు పెండింగ్‌లో ఉందని అధికారులు వివరించారు. పంప్‌హౌస్ నిర్మాణం పూర్తిచేసి మధ్యమానేరు నుంచి ఎగువమానేరుకు నీటిని పంపింగ్ చేసేలా పనులు పూర్తి చేయాలన్నారు. రోజువారీగా పనుల ప్రగతి ఫొటోలను తనకు పంపించాలన్నారు. అక్టోబర్ 15 నాటికి ఎగువమానేరుకు గోదావరి జలాలు చేరాలని రజత్‌కుమార్ ఆదేశించారు. ఇది పూర్తి అయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా గుర్తించి పనులను వేగవంతం చేయాలని కోరారు. సొరంగంలో మూడు కిలోమీటర్ల మేర ఆయన ప్రయాణించి పనుల ప్రగతిని సమీక్షించారు. ఆయన వెంట ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళీధర్‌రావు, ఈఎన్సీ హరిరామ్, ట్రెయినీ కలెక్టర్ రిజ్వాన్ షేక్‌బాషా, ఎస్ఈ ఆనంద్, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. మల్లన్నసాగర్ పనుల పరిశీలన.. తొగుట (దుబ్బాక): సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో నిర్మిస్తున్న మల్లన్న సాగర్ కాల్వ నిర్మాణ పనులను నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో కలసి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా రంగనాయకసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు వెళ్తున్న గోదావరి జలాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. రోజుకు ఎన్ని మోటార్ల ద్వారా నీటిని తోడుతున్నారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు 12వ ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న దుబ్బాక నియోజకవర్గానికి సాగునీరు అందించే మల్లన్న సాగర్ కాల్వ పనులు పరిశీలించారు. కాల్వ పనుల్లో ఎందుకు ఆలస్యం జరుగుతుందని, పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్‌కు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన వెంట సీఎం సలహాదారు శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎస్ఈ ఆనందర్‌రావు తదితరులు ఉన్నారు. -
తెలుగు రాష్ట్రాలకు గోదావరి బోర్డు ఆదేశం
-
ముందుకెళ్లొద్దు: గోదావరి బోర్డు
సాక్షి, అమరావతి: కేంద్ర జల్‌శక్తి శాఖ ఉత్తర్వుల ప్రకారం.. గోదావరిపై కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని ఉభయ తెలుగు రాష్ట్రాలను గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఆదేశించింది. తెలంగాణలో కాళేశ్వరంతో సహా అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఇవ్వాల్సిందేనని బోర్డు స్పష్టం చేసింది. గోదావరి బోర్డు, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) డీపీఆర్‌లను పరిశీలించి సాంకేతికంగా సిఫార్సు చేయాలని, అపెక్స్ కౌన్సిల్ నుంచి ప్రాజెక్టులకు అనుమతి తీసుకోవాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు సూచించింది. ఈనెల 10వ తేదీలోగా డీపీఆర్‌లు ఇవ్వాల్సిందేనని ఇరు రాష్ట్రాలకు బోర్డు స్పష్టం చేసింది. అపెక్స్ కౌన్సిల్‌కు తక్షణమే అజెండాను పంపాలని మరోసారి సూచించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన గోదావరి బోర్డు సమావేశమైంది. రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్, బోర్డు సభ్య కార్యదర్శి పాండే తదితరులు పాల్గొన్నారు. సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతే ప్రాతిపదిక విభజన తర్వాత అంటే 2014 జూన్ 2 తర్వాత చేపట్టినవి, సీడబ్ల్యూసీ నుంచి సాంకేతిక అనుమతి లేని ప్రాజెక్టులన్నీ కొత్తవిగానే పరిగణిస్తామని బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశారు. 450.31 టీఎంసీల తరలింపు పనులు... ► తెలంగాణ సర్కార్ గోదావరిపై కొత్తగా ప్రాజెక్టులు చేపట్టలేదని ఆ రాష్ట్ర అధికారులు పేర్కొనటంపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘గోదావరి బోర్డు, అపెక్స్ కౌన్సిల్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే 225 టీఎంసీల సామర్థ్యంతో కాళేశ్వరం ఎత్తిపోతల, 22 టీఎంసీల సామర్థ్యంతో జీఎల్ఐఎస్–3, 70 టీఎంసీలతో సీతారామ ఎత్తిపోతల, 100 టీఎంసీలతో తుపాకులగూడెం, 23.76 టీఎంసీలతో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, 0.35 టీఎంసీల సామర్థ్యంతో భీమ్కుంద్ బ్యారేజీ, ఐదు టీఎంసీలతో చనాఖా–కోరటా, 1.20 టీఎంసీలతో పింపరాడ్–పర్సోడా బ్యారేజీల నిర్మాణాన్ని తెలంగాణ చేపట్టింది. రామప్ప లేక్ నుంచి పాకాల లేక్‌కు మళ్లింపు ద్వారా మూడు టీఎంసీలు వెరసి 450.31 టీఎంసీల గోదావరి జలాలను తరలించేలా తెలంగాణ సర్కార్ పనులు చేపట్టింది’ అని ఏపీ అధికారులు వివరించారు. డెల్టా, పోలవరం ఆయకట్టుపై తీవ్ర ప్రభావం... ► తెలంగాణ సర్కార్ కాళేశ్వరం ఎత్తిపోతల సామర్థ్యాన్ని 225 టీఎంసీల నుంచి 450 టీఎంసీలకు, సీతారామ ఎత్తిపోతల సామర్థ్యాన్ని 70 నుంచి 100 టీఎంసీలకు పెంచుతూ నిర్ణయం తీసుకుందని, దీనివల్ల 150 ఏళ్ల చరిత్ర ఉన్న గోదావరి డెల్టా, జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఏపీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్ కేటాయింపులే ప్రామాణికం.. ► గోదావరి జలాల్లో 967 టీఎంసీలను వినియోగించుకునేలా తెలంగాణలో ప్రాజెక్టులు చేపడతామని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారని, దీని ఆధారంగా తమ రాష్ట్రానికి గోదావరి జలాల్లో 967 టీఎంసీల వాటా ఉన్నట్లు స్పష్టమవుతోందని, వాటా జలాలను వినియోగించుకోవడానికే ప్రాజెక్టులు చేపట్టామని తెలంగాణ అధికారులు పేర్కొనడంపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి కేటాయింపులకు బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ప్రామాణికమని, అందులో తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు ఎక్కడ చేశారో చూపాలని ఏపీ అధికారులు ప్రశ్నించారు. కాళేశ్వరంతో సహా అన్ని డీపీఆర్‌లు ఇవ్వాల్సిందే... ► ఈ దశలో గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ జోక్యం చేసుకుంటూ కాళేశ్వరం సహా అన్ని కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను వెంటనే అందజేయాలని సూచించారు. తాము పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడి ఎత్తిపోతల డీపీఆర్‌లను ఇప్పటికే ఇచ్చామని, చింతలపూడి సామర్థ్యం పెంపు డీపీఆర్‌ను అందచేస్తామని ఏపీ అధికారులు తెలిపారు. తమ ప్రభుత్వంతో చర్చించి కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇస్తామని తెలంగాణ అధికారులు బోర్డుకు వివరించారు. ► పట్టిసీమ, పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తున్న గోదావరి జలాలకుగానూ కృష్ణా నీటిలో తమకు 45 టీఎంసీల వాటా అదనంగా ఇవ్వాలని తెలంగాణ అధికారులు పేర్కొనటంపై ఏపీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్ తీర్పు ఉమ్మడి రాష్ట్రానికి వర్తిస్తుందని, నదీ పరీవాహక ప్రాంతంలో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ఆ 45 టీఎంసీలు దక్కుతాయని, ఈ అంశాన్ని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) తేల్చుతుందని స్పష్టం చేశారు. టెలిమెట్రీకి అంగీకారం.. ► గోదావరి జలాల వినియోగం లెక్కలను తేల్చడానికి టెలీమీటర్లు ఏర్పాటు చేయాలన్న బోర్డు ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. వీటిని ఏర్పాటు చేసే ప్రాంతాలను గుర్తించేందుకు సీడబ్ల్యూసీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సీపీడబ్ల్యూఆర్‌ఎస్ (పుణే) అధికారులతో కమిటీని నియమించాలని బోర్డు నిర్ణయించింది. కమిటీ నివేదిక ఆధారంగా టెలీమీటర్ల ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ► పెద్దవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ నిధులను ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో కేటాయించాలన్న గోదావరి బోర్డు ప్రతిపాదనను ఇరు రాష్ట్రాలు ఆమోదించాయి. -
కృష్ణా జలాల వివాదం: రెండు రాష్ట్రాల ఆమోదం
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా వరద జలాల వినియోగంపై ఇరు రాష్ట్రాల వాదనలు కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని బోర్డు ఛైర్మన్ పరమేశం తెలిపారు. కృష్ణా జలాల వివాదాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు గురువారం జలసౌధలో నిర్వహించిన భేటీ ముగిసింది. ఇరు రాష్ట్రాలు లేవనెత్తుతున్న కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ అంశంతో పాటు, టెలిమెట్రీల వ్యవస్థ ఏర్పాటు, ఈ ఏడాదిలో నీటి పంపిణీ, మళ్లింపు జలాల వాటా తదితర అంశాలపై బోర్డు సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. భేటీ అనంతరం బోర్డు ఛైర్మన్ పరమేశం మాట్లాడుతూ.. కృష్ణ నదిపై నిర్మించే అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లను రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖలు తమకు సమర్పించాలని కోరినట్లు తెలిపారు. అలాగే గత ఏడాది తీసుకున్నట్లు గానే ఈ నీటి సంవత్సరంలో కూడా 66-34 నిష్పత్తిలో నీటి కేటాయింపులకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయని పేర్కొన్నారు. శ్రీశైలంలో విద్యుత్‌ను ఇరు రాష్ట్రాలు 50-50 శాతం వాడుకునేలా ఒప్పందం కురినట్లు వెల్లడించారు. అప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు వద్దు భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో బోర్డు చైర్మన్ పరమేశం మాట్లాడుతూ.. ‘రెండో దశ టెలిమెట్రీని అమలు చేసేందుకు రెండు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. ఈ ఏడాది నీటి వినియోగాలపై చర్చించాము. శ్రీశైలం-సాగర్ కేటాయింపుల్లో తెలంగాణ ప్రభుత్వం గతంలో పలు అంశాలను లెవనెత్తింది. ఏపీ కూడా పలు అభ్యంతరాలను తెలిపింది. ఇరు రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలను కేంద్ర జలాశక్తి శాఖకు పంపాము. దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుంది. రెండు రాష్ట్రాలు చేపట్టబోయే ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి డీపీఆర్ నివేదికలు ఇచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. గతంలో వాడుకొని నీళ్లను భవిష్యత్‌లో ఇవ్వాలని తెలంగాణ కోరిన అంశంపై చర్చ జరిగింది. దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రావాల్సిన నీళ్లు మాత్రమే వాడుకుంటాం.. మిగుల జలాల వాడకంపై కమిటీ వేశాము. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చాక నిర్ణయం తీసుకుంటాము. కమిటీ ఇప్పటికే ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ జరిపింది. పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నీళ్లను మాత్రమే వాడుకుంటామని చెబుతోంది. పట్టిసీమ 45 టీఎంసీల్లో ఇరు రాష్ట్రాలకు ఎంత మేరకు రావాలని అనే దానిపై జలాశక్తికి పంపాము. బోర్డ్ నిధుల సమస్య పరిష్కారం అయినట్లు ఇరు రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. ఉద్యోగుల విషయంలో కొన్ని చిన్న చిన్న విషయాలను చూసుకుని బదిలీలు చేయాలి. బోర్డు తరలింపు అనేది కేంద్ర జలశక్తి ఆధీనంలో ఉంటుంది. ’ అని అన్నారు. ఈ భేటీకి బోర్డు చైర్మన్ పరమేశంతో పాటు ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖ కార్యదర్శులు రజత్‌కుమార్, ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డిలు హాజరు అయ్యారు. ఆంధ్రప్రదేశ్ తరఫున ఆదిత్యాథ్ దాస్ బోర్డు ముందు వాదనలు వినిపించారు. బోర్డు సమావేశంలో తెలంగాణ తరఫున రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ వాదనలకు వినిపించారు. కృష్ణా నది యాజమాన్య బోర్డుకు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇచ్చామని రజత్ కుమార్ తెలిపారు. 16.5 టీఎంసీలు హైదరాబాద్‌కు రావాలనే విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తాగునీటి కేటాయంపులను 20 శాతం మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. పోలవరం, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి మళ్లించి ఆ మేరకు అదనపు జలాలను ఇవ్వాలని కోరినట్లు రజత్ కుమార్ చెప్పారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన పలు పెండింగ్ అంశాల గురించి బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. -
నేడు కృష్ణా బోర్డు భేటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జల వివాదాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు గురువారం ఇక్కడ జలసౌధలో భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ఆరంభం అయ్యే ఈ భేటీకి బోర్డు చైర్మన్ పరమేశంతో పాటు ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖ కార్యదర్శులు రజత్‌కుమార్, ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డిలు హాజరుకానున్నారు. ఇరు రాష్ట్రాలు లేవనెత్తుతున్న కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ అంశంతో పాటు, టెలిమెట్రీల వ్యవస్థ ఏర్పాటు, ఈ వాటర్ ఇయర్లో నీటి పంపిణీ, మళ్లింపు జలాల వాటా తదితర అంశాలపై బోర్డు సమావేశంలో చర్చించనున్నారు.ఈ బోర్డులో ప్రస్తావనకు తేవాల్సిన అంశాలపై శాఖ ఇంజనీర్లు రజత్‌కుమార్‌తో చర్చించారు. బోర్డు ముందు తేవాల్సిన అంశాల వారీగా నివేదికను సిద్ధం చేసుకున్నారు. గోదావరి బోర్డు ఎజెండా ఖరారు ఇక ఈనెల 5న జరిగే గోదావరి భేటీలో చర్చికు లేవనెత్తే ఎజెండా అంశాలను గోదావరి బోర్డు సిద్ధం చేసింది. ఏపీ అభ్యంతరం చెబుతున్న కాళేశ్వరం, సీతారామ తదితర ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణ, బోర్డుకు నిధుల కేటాయింపు, సిబ్బంది నియామకం, టెలిమెట్రీ ఏర్పాటు తదితర అంశాలను ఎజెండాలో చేర్చింది. -
జూన్‌కు చెప్పలేం... నవంబర్‌కు ఏమో..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నదులు, వాగులు, వంకలపై నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. వీటి నిర్మాణ పనులు వర్షాకాలం ఆరంభానికి జూన్‌కు ముందే పూర్తి కావాల్సి ఉండగా ఇంతవరకు కనీసం పూర్తిస్థాయి టెండర్లకు నోచుకోలేదు. అవి పూర్తయిన చోట్ల సైతం పనులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నా, కార్మికులు, ఇసుక, సిమెంట్ కొరత, రవాణాలో జాప్యం ఆ పనులకు అడ్డుగా నిలుస్తున్నాయి. ఆరు నెలల సమయం అవసరం.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 1,235 చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం కాగా, వీటికి రూ.4,920 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉంది. తొలి విడతగా ఈ ఏడాది గోదావరి బేసిన్లో 400, కృష్ణాబేసిన్‌లో 200 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలను రూ.2,681కోట్లతో చేపట్టాలని తలపెట్టి ఇప్పటికే సాంకేతిక అనుమతుల ప్రక్రియ పూర్తి చేశారు. అనుమతులిచ్చిన వాటిలో గోదావరి బేసిన్ పరిధిలో ఇప్పటివరకు 359 చెక్‌డ్యామ్‌లకు టెండర్లు పిలవగా, 40 చెక్‌డ్యామ్‌లపై ఏజెన్సీలతో ఒప్పందాలు జరిగాయి. అవి జరగకున్నా, కొన్ని చోట్ల టెండర్లు దక్కించుకున్న ఏజెన్సీలకు పనులు కొనసాగించేందుకు అనుమతించడంతో మొత్తంగా 46చోట్ల మాత్రమే పనులు ఆరంభమయ్యాయి. కృష్ణా బేసిన్లోనూ కేవలం 132 చోట్ల టెండర్లు పిలవగా, 25చోట్ల ఒప్పందాలు జరిగి, 18 చోట్ల పనులు ఆరంభించారు. మొత్తంగా 64చోట్ల పనులు ఆరంభమైనా అవి ప్రారంభ దశలోనే ఉన్నా యి. ప్రస్తుతం లాక్డౌన్ సడలింపుల నేపథ్యం లో పనులు వేగిరం చేసినా, కనిష్టంగా వీటిని పూర్తి చేసేందుకు 6 నెలలు.. అంటే నవంబర్ వరకు సమయం పట్టే అవకాశం ఉంది. వానాకాలం వర్షాలు తీవ్రంగా ఉండి ఉధృత ప్రవాహాలు కొనసాగితే చెక్‌డ్యామ్‌ల నిర్మాణం కష్టతరమే కానుంది. దీంతో మళ్లీ వేసవి వస్తేకానీ పనులు పూర్తి చచేసే అవకాశం లేదని నీటి పారుదల వర్గాలే చెబుతున్నాయి. సీజన్లో సందేహమే... ఇక పనులు ఆరంభించిన చాలా చోట్ల మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. దీంతో కొత్త కూలీలు దొరకడం గగనంగానే ఉంది. దీనికి తోడు ఇసుక లభ్యత తగ్గిపోయింది. లభ్యత ఉన్నా, వాటి ధరలు అధికంగా ఉండటం కాంట్రాక్టర్లకు కష్టాలు తెస్తోంది. దీంతో పాటే మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా సిమెంట్ బస్తాపై రూ.100 నుంచి రూ.150 వరకు పెంచి బస్తా రూ.450 వరకు విక్రయిస్తున్నారు. ఇది కూడా పనుల కొనసాగింపునకు పెద్ద సమస్యగా మారిందని నీటి పారుదల అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు ఈ సీజన్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పనులు వేగిరం చేసే అంశమై శనివారం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్ శాఖ ఇంజనీర్లతో సమీక్షించనున్నారు. పనుల వేగిరంపై మార్గదర్శనం చేయనున్నారు. -
కనీస మట్టం..ఇది నీటి కష్టం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ కనీస నీటి మట్టానికి పడిపోయింది. తెలుగు రాష్ట్రాలు తమ అవసరాలకోసం నీటిని వినియోగిస్తుండటంతో గురువారం ఉదయానికి ప్రాజెక్టు నిల్వలు కనీస నీటి మట్టం 834 అడుగులకు చేరింది. వేసవి ఇంకా పూర్తి స్థాయిలో ఆరంభం కాకముందే నిల్వలు తగ్గడం ఇరు రాష్ట్రాలకు మున్ముందు కష్టాలు తెచ్చిపెట్టే అవకాశాల నేపథ్యంలో మున్ముందు వినియోగంపై నియంత్రణ అవసరమని కృష్ణాబోర్డు ఇరు రాష్ట్రాలను హెచ్చరించింది. సాగర్ ఒక్కటే దిక్కు..? ఈ సీజన్లో విస్తారంగా కురిసిన వర్షాల నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు 1,784 టీఎంసీల వరద వచ్చింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తంగా 675 టీఎంసీల నీటిని వినియోగించుకున్నాయి. ఇందులో ఏపీ 513, తెలంగాణ162 టీఎంసీల వినియోగం చేసినట్లు కృష్ణాబోర్డు లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం సైతం శ్రీశైలం ద్వారా వివిధ అవసరాల నిమిత్తం ఇరు రాష్ట్రాలు 3,591 క్యూసెక్కుల నీటిని వినియోగం చేసుకుంటున్నాయి. దీంతో గురువారం ఉదయానికి ప్రాజెక్టులో నీటి మట్టం 885 అడుగులకు గానూ కనీస నీటి మట్టం 834 అడుగులకు పడిపోయింది. నిల్వలు 215 టీఎంసీలకు గానూ 53.85 టీఎంసీలకు చేరాయి. కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లి నీటిని వినియోగించాలంటే కృష్ణాబోర్డు అనుమతి తప్పనిసరి. ఇప్పటికే బోర్డు, శ్రీశైలంలో రోజుకు 440 క్యూసెక్కుల మేర నీరు ఆవిరవుతోందని, దీంతో మట్టాలు మరింత వేగంగా తగ్గే అవకాశాలున్న దృష్ట్యా, శ్రీశైలం నుంచి నీటి విడుదలను తగ్గించాలని వారం కిందట సూచించింది. అయినప్పటికీ వినియోగం కొనసాగుతుండటంతో నిల్వలు కనీస నీటి మట్టానికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇకపై తాగు అవసరాలకు నాగార్జున సాగర్‌పైనే అధారపడాల్సి ఉంటుంది. సాగర్‌లో ప్రస్తుతం 590 అడుగులకు గానూ 551 అడుగుల్లో 212 టీఎంసీల నిల్వలున్నాయి. ఇందులో కనీస నీటి మట్టం 510 అడుగులకు ఎగువన వినియోగార్హమైన నీరు 86 టీఎంసీల మేర ఉంటుంది. ఈ నీటినే ఇరు రాష్ట్రాలు జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంది. మిషన్ భగీరథ మట్టాల్లో మార్పులు.. మిషన్ భగీరథ కింద తాగు నీటి అవసరా లకు ఏటా 60 టీఎంసీల నీటి అవసరాలను అధికారులు గుర్తించి, దీనికి అనుకూలంగా కృష్ణాబేసిన్‌లోని 15, గోదావరి బేసిన్‌లోని 21 రిజర్వాయర్ల పరిధిలో తాగునీటిని తీసుకునేలా కనీస నీటి మట్టాలను గతంలో నిర్ధారించారు. ఈ ఏడాది మార్చి నుంచి జూలై వరకు తాగునీటికి 30 టీఎంసీల అవసరాలుంటాయని ఇప్పటికే సాగునీటి శాఖకు ప్రతిపాదించారు. ప్రాజెక్టుల్లో రెండు సీజన్లకు సరిపడేంత నీటి లభ్యత పెంచే ఉద్దేశంతో పలు ప్రాజెక్టుల పరిధిలో నీటి మట్టాలను పెంచాలని మిషన్ భగీరథ ఇంజనీర్లు ప్రతిపాదించారు. జూరాలలో కనీస నీటి మట్టాలు గతంలో 313.75 మీటర్లుగా ఉండగా, ప్రస్తుతం దాన్ని 315 మీటర్లకు పెంచాలని ప్రతిపాదించారు. ఎస్సారెస్పీలో గతంలో 320.35 మీటర్లు ఉండగా..322.67 మీటర్లకు, కడెంలో 204.21 మీటర్లకు గానూ 206.89 మీటర్లు, కొమరంభీమ్లో 234.60 మీటర్లకు గానూ 236.10 మీటర్లకు పెంచుతూ ప్రతిపాదించారు. ఇవి ప్రస్తుతం సాగునీటి శాఖ పరిశీలనలో ఉన్నాయి. -
త్వరలో రామప్ప, లక్నవరానికి గోదావరి నీళ్లు
సాక్షి, హైదరాబాద్: ‘అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనగానే ఎండిన మొక్కజొన్న జూళ్లు, ఎండిన వరి కంకులు, నీటి సమస్యకు చిహ్నంగా ఖాళీ బిందెలు, కరెంటు కోతలకు నిరసనగా కందిళ్ల ప్రదర్శనలు కనిపించేవి. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక ఇలాంటివి కన్పించట్లేదు. ప్రజారంజక పాలనకు ఇదే నిదర్శనం’అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా సీఎం కేసీఆర్ తరఫున నీటిపారుదల శాఖపై ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్ర చరిత్రలో యాసంగిలో ఏకంగా 38 లక్షల ఎకరాలు సాగుతో కళకళలాడటం తొలిసారి చూస్తున్నామని చెప్పారు. అద్భుతమైన రీతిలో సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి కోటి ఎకరాలు సాగులోకి తెచ్చే దిశగా తెలంగాణ సాగుతోందన్నారు. ఇటీవల సీడబ్ల్యూసీ చైర్మన్ కూడా తెలంగాణ ప్రాజెక్టులపై ప్రశంసలు కురిపించారని గుర్తు చేశారు. త్వరలో దేవాదుల ప్రాజెక్టులో భాగంగా రామప్ప చెరువును గోదావరి నీటితో నింపుతామని, అక్కడి నుంచి లక్నవరం చెరువుకు గ్రావిటీ ద్వారా అందిస్తామని తెలిపారు. వెరసి 8,700 ఎకరాలకు కొత్తగా సాగు నీరు అందిస్తామని చెప్పారు. లక్ష కోట్ల అవినీతి: కోమటిరెడ్డి సాగునీటిపై హరీశ్‌రావు మాట్లాడుతుండ గా.. కాంగ్రెస్ ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధికారపక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రాజెక్టుల పేరుతో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ గట్టిగా నినాదాలు చేశారు. దీంతో అధికార పార్టీ సభ్యులు ఆయనపై విరుచుకుపడ్డారు. భారీ అవినీతి జరిగినా, గొప్పగా పనులు జరిగాయంటూ చెప్పుకోవడాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. కాంట్రాక్టర్ల బకాయిలు చాలావరకు తీర్చాం: ప్రశాంత్‌రెడ్డి రోడ్ల అభివృద్ధికి గతం కంటే ఈసారి ఎక్కువ నిధులే కేటాయించుకున్నామని రోడ్లు భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కాంట్రాక్టర్లకు భారీగా బిల్లుల బకాయిలున్న మాట నిజం కాదన్నారు. గతంలో ఎక్కువే ఉండేవని, కానీ ఆర్డీఎఫ్ ద్వారా రుణం పొంది వాటిని చాలా వరకు తీర్చేశామని చెప్పారు. లుంబినీ పార్కులో తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నాన్ని అద్భుతంగా రూపొందిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోనూ ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు నిర్మించాలన్న సభ్యుల సూచనను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. 80 శాతం పూర్తయిన ‘భగీరథ’ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం 80% పూర్తయిందని, త్వరలో మిగతా పనులు పూర్తి చేస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. మిషన్ భగీరథ పుణ్యాన ఇప్పుడు వేసవిలోనూ రాష్ట్రంలో తాగు నీటి సమస్య లు లేవన్నారు. పుణ్యస్నానాలు ఆచరించే గోదావరి జలం ఇంటిలో నల్లా తిప్పగానే వస్తున్నందుకు అభినందించాల్సింది పో యి కాంగ్రెస్ నేతలు అనవసర ఆరోపణ లు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయనపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంలో రాజగోపాల్ ను ఉద్దేశించి మంత్రి వాడిన ఓ పదాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటిం చారు. అందుకు సారీ కూడా చెప్పారు. -
'డిండి' దారెటు?
సాక్షి, హైదరాబాద్: ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు రక్షి త మంచి నీటిని అందించే ఉద్దేశంతో చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకానికి మార్గదర్శనం కరువైంది. ఈ ప్రాజెక్టుకు నీటిని తీసుకునే అలైన్‌మెంట్‌ను ఐదేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఖరారు చేసినా, దీనికి ఇంతవరకూ ప్రభుత్వ ఆమోదం దక్కలేదు. పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్ నుంచి కాకుం డా ఏదుల (వీరాంజనేయ) రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునేందుకు ఇప్పటికే నీటి పారుదల శాఖ ఓకే చెప్పినా, ప్రభుత్వం ఇంకా నాన్చుతుండటంతో ఎటూ తేలడంలేదు. ఇక ఇప్పటికే మొదలైన రిజర్వాయర్ల పరిధిలోనూ భూసేకరణ, సహాయ పునరావాస పనుల్లో అనేక అవాంతరాలున్నా వాటిని పట్టించుకొని పరిష్కరించేవారే కరువయ్యారు. ఎట్టకేలకు కొలిక్కి వచ్చినా ముందుకు సాగలే... శ్రీశైలం నుంచి 30 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగిస్తూ, నాగర్ కర్నూల్, నల్లగొండ, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లోని 7 నియోజకవర్గాలు, 21 మండలాల పరిధిలోని 3.61 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించేలా రూ.6,190 కోట్లతో డిండి ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు 2015 జూన్ 11న సీఎం కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. అయి తే మొదట ఈ ప్రాజెక్టుకు పాలమూరు ఎత్తిపోతల్లోని రెండో రిజర్వాయర్ ఏదుల నుంచి రోజుకు 0.5 టీఎంసీ నీటిని 60 రోజుల పాటు 30 టీఎంసీల నీటిని తరలించేలా ప్రభుత్వం పరిపాలనా అనుమతులు సైతం ఇచ్చింది. అనంతరం తిరిగి పాలమూరు ప్రాజెక్టులోని మొదటి రిజర్వాయర్ నార్లాపూర్ నుంచే తీసుకునేలా ప్రణాళిక రూపొందించింది. అయితే ఈ ప్రతిపాదనలతో భూసేకరణ అవసరాలు ఎక్కువగా ఉండటం, అటవీ భూముల ముంపు సైతం ఉండటంతో తిరిగి ఏదుల నుంచే తీసుకోవాలని ఇటీవలే తుది నిర్ణయం తీసుకున్నారు. ఏదుల నుంచి 800 మీటర్ల మేర అప్రోచ్ చానల్, తర్వాత 2.52 కిలోమీటర్ల మేర ఓపెన్ చానల్, అటునుంచి తిరిగి 16 కిలోమీటర్ల మేర టన్నెల్ ద్వారా నీరు ప్రవహిస్తుంది. తర్వాత మళ్లీ 3 కిలోమీటర్ల మేర ఓపెన్ చానల్లో ప్రవహించి, సహజ సిద్ధ వాగులో కలసి, కొత్తగా ప్రతిపాదించిన ఉల్పర రిజర్వాయర్‌కు నీరు చేరుతుంది. అటు నుంచి డిండికి నీటిని చేరుస్తారు. ఈ ప్రతిపాదనకు రూ.1,293.55 కోట్లు అవు తుందని అంచనా వేశారు. ఈ ప్రతిపాదనలను జనవరిలోనే ప్రభుత్వ అనుమతికై పంపినా ఇంతవరకు అనుమతులివ్వలేదు. దీంతో ఈ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. ముఖ్యమంత్రి స్థాయిలో దీన్ని సమీక్షించి ఓకే చెబితే కానీ దీనికి అనుమతులు వచ్చేలా కనిపించడం లేదు. అనుమతులు వస్తే కానీ టెండర్లు పిలిచి పనులు చేపట్టడం సాధ్యం కాదు. భూసేకరణ నిధులకూ తంటాలు.. ఏదుల నుంచి డిండికి నీటిని తీసుకునే అలైన్మెంట్ ఖరారు కానుందున, అంతలోగా నల్లగొండ జిల్లాలో ఖరారైన సింగరాజుపల్లి (0.8టీఎంసీ), గొట్టిముక్కల (1.8 టీఎంసీ), చింతపల్లి (0.99 టీఎంసీ), కిష్ట రాంపల్లి(5.68 టీఎంసీ), శివన్నగూడం (11.96 టీఎంసీ) రిజర్వాయర్లు వాటికి అనుబంధంగా మెయిన్ కెనాల్ పనులను ప్రభుత్వం రూ.3,929 కోట్లతో చేపట్టింది. వీటిలో ప్రధాన పనులు ఇప్ప టికే ఆరంభమయ్యాయి. ఈ రిజర్వాయర్ల కింద 16,135 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా, 8 వేల ఎకరాల మేర పూర్తి చేశారు. మరో 8 వేల ఎకరాలు ఎక్కడికక్కడే ఉంది. ఇక్కడ సేకరించిన భూములకు సం బంధించి రూ.181 కోట్ల మేర ఇంతవరకూ చెల్లించలేదు. దీంతో కొత్తగా భూ ములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. అదీగాక కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ రైతులకు ఇచ్చిన మాదిరే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కిష్టరాంపల్లి, చింతపల్లి రిజర్వాయర్ పరిధిలోని ముంపు గ్రామాలు ప్రభుత్వం ప్రకటించిన దానికన్నా ఎక్కువ పరిహారం కోరుతున్నా యి. ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపితేనే ప్రాజెక్టులో కదలిక వస్తుంది. -
పాత ప్రాజెక్టులకు.. అరకొర నిధులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్లో సాగునీటిశాఖకు చేసిన నిధుల కేటాయింపుల్లో నిర్మాణంలోని పలు ప్రధాన ప్రాజెక్టులకు మొండిచేయి ఎదురైంది. ప్రాజెక్టుల పూర్తికి రూ. వందల కోట్లలో కేటాయింపులు కోరితే కేవలం రూ.పదుల కోట్లలో మాత్రమే నిధులు దక్కాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రా జెక్టు, ప్రాణహిత, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకూ అరకొర నిధులే ఇచ్చి ంది. ముఖ్యంగా పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ చివరి దశలో ఉన్నాయి. వీటికింద ఉన్న కొద్ది పాటి భూసేకరణ, సహాయ పునరావాసానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తే గణనీయంగా ఆయ కట్టు సాగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కల్వకుర్తి పరిధిలో భూసేకరణకోసం రూ. 24.18 కోట్లు, పనులకు సంబంధించి రూ.79.32 కోట్ల పెండింగ్ బిల్లులు ఉండగా, నెట్టెంపాడు పరిధిలో పనులకు చెందినవి రూ.11.47 కోట్లు, భూసేకరణవి రూ.8.98 కోట్లు, పునరావాసానివి రూ.1.83 కోట్లు బకాయిలు ఉండగా, భీమా పరిధి లోనూ రూ.36 కోట్ల బకాయిలున్నాయి. వీటిని తీర్చడంతో పాటు చివరి దశ పనుల పూర్తికి కనీసం రూ.1,200 కోట్లు కేటాయించాలని నీటి పారుదల శాఖ ప్రతిపాదించింది.అయినప్పటికీ బడ్జెట్లో మొత్తంగా రూ.50 కోట్ల నిధులే దక్కాయి. అధిక నిధుల అవసరాలున్న కల్వకుర్తి ప్రాజెక్టుకు కేవలం రూ.2.29 కోట్లతో సరిపెట్టారు.గతేడాది సైతం ఈ ప్రాజెక్టుకు రూ.3 కో ట్లు నిధుల కేటాయింపు జరగడం విశేషం.ఇక బీమాకు రూ.3.69 కోట్లు,నెట్టెంపాడుకు రూ.16.70 కోట్లు, కోయిల్‌సాగర్‌కు రూ.17.40 కోట్లతో నామమాత్రపు కేటాయింపులు చేశారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల పూర్తి ఎలా సాధ్యమన్నది భవిష్యత్తే చెప్పాల్సి ఉంది. టన్నెల్ అక్కడే..ప్రాణహిత పడకే.. ఇక ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ పనుల పూర్తికి నిధులను పూర్తిగా విస్మరించారు. ఈ ప్రాజెక్టు పరిధిలో పనులకు గాను రూ.126 కోట్ల మేర నిధులు పెండింగ్‌లో ఉండగా కేటాయించింది మాత్రం రూ.3.16 కోట్లు మాత్రమే. ఈ నిధులతో 43.89 కి.మీటర్ల టన్నెల్ పనుల్లో మిగిలిన మరో 10 కి.మీ.లకు టన్నెల్‌ను ఎప్పటిలోగా పూర్తి చేస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్న తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ ప్రాంతంపై ఇప్పటికీ స్పష్టత లేదు.బ్యారేజీ దిగువన పనులు జరుగుతున్న ప్యాకేజీల్లో ఇంకా భూసేకరణ అవసరాలకు రూ.269 కోట్ల నిధులు అవసరమున్నా ఇంతవరకు వాటికి అతీగతీ లేదు. బడ్జెట్లో నిధుల కేటాయింపు ఉంటుందని భావించినా కేవలం రూ.12 కోట్లు కేటాయించి ప్రభుత్వం పూర్తిగా నిరుత్సాహ పరిచింది. -
ప్రాజెక్టుల నిర్వహణకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ నుంచి ప్రధాన ఎత్తిపోతల పథకాలన్నీ నిర్వహణలోకి వస్తున్నందున వాటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌కు వీలుగా ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధుల కేటాయింపులు చేసిం ది. తొలిసారిగా సాగునీటి శాఖకు నిర్వహణ పద్దు కింద రూ. 7,446.97 కోట్లు కేటాయించింది. ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చూడాలని, దీనికి ప్రత్యేక బడ్జెట్ ఉండాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో ఆ మేరకు ప్రగతి పద్దుకు మించి నిర్వహణకు నిధుల కేటాయింపు భారీగా జరిగినట్లు నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎత్తిపోతల పథకాలకు ఈ ఏడాది నుంచి విద్యుత్ వినియోగం పెరగనుంది. దానికనుగుణంగా విద్యుత్ చార్జీలు తడిసిమోపెడు కానున్నాయి. ఇప్పటివరకు 1,400 మెగావాట్ల మేర విద్యుత్ అవసరాలు ఉండగా ఈ ఏడాది జూన్ నుంచి 7 వేల మెగావాట్లకు చేరే అవకాశం ఉందని లెక్కగట్టారు. వాటికి రూ. 7,000–8,000 కోట్ల వరకు బిల్లులు చెల్లించే అవకాశం ఉంటుంది. మొత్తంగా కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో 700 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రణాళిక ఉంది. ఇందులో కాళేశ్వరం ద్వారానే 360 టీఎంసీలు ఎత్తిపోయనుండగా దానికి 6 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరానికి నిర్వహణ పద్దు కింద ఏకంగా రూ. 5,219 కోట్లు కేటాయించారు. పాలమూరు–రంగారెడ్డి నిర్వహణకు రూ.18.40 కోట్లు, సీతారామ ఎత్తిపోతలకు రూ. 21.04 కోట్లు, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా పథకాలకు మరో రూ. 62.93 కోట్లను నిర్వహణ పద్దు కింద కేటాయించారు. -
సాగు నీరు..రుణాల జోరు!
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కేటాయింపు ఆశించిన మాదిరి లేకున్నా ఉపశమనం కలిగించేలా ఉంది. 2020–21 వార్షిక బడ్జెట్లో సాగునీటి రంగానికి మొత్తంగా రూ. 11,053.55 కోట్లు కేటాయించగా అందులో నిర్వహణ పద్దు కింద రూ. 7,446.97 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 3,606.58 కోట్ల మేర కేటాయింపులు చేసింది. గతేడాది బడ్జెట్లో కేటాయించిన నిధులకన్నారూ. 2,577.38 కోట్లు మేర కేటాయింపులు పెంచింది. గతంకన్నా భిన్నంగా ప్రాజెక్టుల పంపుల నిర్వహణ భారీగా ఉండనుండటంతో దానికింద నిర్వహణ పద్దు నిధులను పెంచారు. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు–రంగారెడ్డి, దేవాదుల ప్రాజెక్టులకు అధిక కేటా యింపులు చేశారు. అయినప్పటికీ ఈ నిధులతో ప్రాజెక్టులు పూర్తికాకుంటే ఇప్పటికే ఏర్పాటు చేసిన వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకొనే రుణాల ద్వారానే వాటిని పూర్తి చేయనున్నారు. అడిగింది కొండంత.. ఇచ్చింది కొంతే.. ఆర్థిక మాంద్యం, కేంద్రం నుంచి తగ్గిన కేటాయింపుల నేపథ్యంలో గతేడాది సాగునీటికి కేవలం రూ. 8,476.17 కోట్లే కేటాయించారు. ఈ ఏడాది కూడా మాంద్యం పరిస్థితులున్నా గతేడాదికన్నా రూ. 2,57 7,38 కోట్ల మేర పెంచి మొత్తంగా రూ.11,0 53.55 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది బడ్జెట్ లో కనీసం రూ. 21 వేల కోట్లు కేటాయించాలని ఆర్థికశాఖకు సాగునీటిశాఖ ప్రతిపాదనలు పంపింది. ఇందులో కాళేశ్వరానికి రాష్ట్ర బడ్జెట్కింద రూ. 7 వేల కోట్లు కోరింది. కానీ ఈ బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో కేటాయించింది రూ. 805.47 కోట్లు మాత్రమే కేటాయించింది. పాలమూరు కు రూ. 3,500 కోట్లు, దేవాదులకు రూ. 500 కోట్లు, తుపాకులగూడేనికి రూ. 500 కోట్లు కేటాయించాలన్న సాగునీటిశాఖ విజ్ఞప్తిని సర్కా రు పెద్దగా పట్టించుకోలేదు. పాలమూరుకు రూ. 368.58 కోట్లు, దేవాదులకు రూ. 292.38 కోట్లు, తుపాకులగూడేనికి రూ.73.83 కోట్లు మాత్రమే కేటాయించింది. పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, భీమా,నెట్టెంపాడు,కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పూర్తికి రూ. 1,200 కోట్లతో ప్రతిపాదనలు పంపినా కేటాయింపులు రూ. 50 కోట్లకే పరిమితమయ్యాయి. బకాయిలూ భారీగానే... సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో ఈ ఏడాది భారీగానే పెండింగ్ బకాయిలున్నాయి. రూ. 11,965.23 కోట్ల బకాయిలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో ప్రధాన పనులకు సంబంధిం చి బకాయిలు రూ. 5,550 కోట్లు ఉండగా రుణాల కోసం కార్పొరేషన్లకు మార్జిన్ మనీ కింద ఇవ్వాల్సినవి రూ. 1,695 కోట్లు, భూసేకరణ బకాయిలు రూ. 1,585 కోట్లు, విద్యుత్ బకాయిలు రూ. 3,072 కోట్ల మేర ఉన్నాయి. పాలమూరు పరిధిలో రూ. వెయ్యి కోట్లు, కాళేశ్వరం పరిధిలో రూ. 1,500 కోట్లు, ఎల్లంపల్లిలో రూ. 350 కోట్ల మేర ఉన్నాయి. ఇక ఈ ఏడాది మైనర్ ఇరిగేషన్‌కు కేటాయింపులు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే రూ. 42 కోట్లు తగ్గించి రూ. 602.45 కోట్లకు పరిమితం చేశారు. ఇందులో చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయకు రూ. 402 కోట్లు కేటాయించారు. అయితే దీని బకాయిలే రూ. 550 కోట్ల మేర ఉన్నాయి. ఆదుకునేది అప్పులే ప్రధాన ప్రాజెక్టుల కింద ఈ ఏడాది ఖరీఫ్, రబీ నాటికి భారీ ఆయకట్టు లక్ష్యాలున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటితో 360 టీఎంసీలను ఎత్తిపోయా లని ప్రణాళిక వేశారు. దీంతోపాటే సీతారామ ఎత్తిపోతలను పూర్తి చేయాలనే లక్ష్యం కూడా ఉంది. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా దేవాదులలో 100% పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలంటే రాష్ట్ర నిధులతో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ప్రభుత్వం కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా రూ. 61,500 కోట్ల రుణ సేకరణ చేపట్టగా అందులో రూ. 38 వేల కోట్ల రుణాల ద్వారానే ఖర్చు జరిగింది. ఇక సీతారామ, దేవాదుల, తుపాకులగూడెం కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా రూ. 17 వేల కోట్ల రుణ సమీకరణ చేయగా అందులో రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశారు. 2019–20 వార్షిక బడ్జెట్ నిధుల ద్వారా రూ. 8 వేల కోట్లు ఖర్చు జరగ్గా రుణాల ద్వారా చేసిన ఖర్చు రూ. 14 వేల కోట్లుగా ఉంది. ఈ ఏడాది సైతం రూ. 20 వేల కోట్ల రుణాల ద్వారా ఖర్చు చేసే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ ఆర్థిక శాఖకు ప్రతిపాదించింది. అందులో కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే రూ. 13 వేల నుంచి రూ. 15 వేల కోట్లు ఖర్చు జరిగే అవకాశం ఉండగా మిగతా ప్రాజెక్టులకు మరో రూ. 5 వేల కోట్ల నుంచి రూ. 7 వేల కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉంది. డబుల్ రోడ్లకు బ్యాంకు రుణాలే దిక్కు మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు నిర్మించే డబుల్ రోడ్లకు ఈసారి బ్యాంకు రుణాలే ఆధారం కానున్నాయి. ఈ రోడ్లకు ప్రణాళికలు రూపొందించిన కొత్తలో విరివిగా నిధులు అందగా, గత రెండు మూడేళ్లుగా చాలినన్ని విడుదల కావడం లేదు. ఈసారి కూడా బడ్జెట్ కేటాయింపులు దాదాపు అలాగే ఉన్నాయి. డబుల్ రోడ్లకు తాజా బడ్జెట్లో రూ.750 కోట్లు కేటాయించగా.. అందులో ప్రగతి పద్దు కింద రూ.655 కోట్లు చూపారు. గత బడ్జెట్లో దీనికి కేవలం రూ.187 కోట్లు కేటాయించారు. అంతకు ముందు బడ్జెట్లో అది రూ.460 కోట్లుగా చూపారు. 2017–18లో రూ.2,500 కోట్లు వచ్చాయి. ఆ సంవత్సరం పనులు ఊపుగా జరిగాయి. ఆ తర్వాత నుంచి నిధులు తక్కువగా రావడంతో కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో బిల్లులు పేరుకుపోయాయి. ఇటీవల బ్యాంకు లోన్ ద్వారా ఆ బకాయిలు తీర్చారు. ఇప్పుడు కూడా చాలినన్ని నిధులు వచ్చే అవకాశం లేనందున మళ్లీ బ్యాంకు రుణంపై ఆధారపడాల్సి ఉంది. రాష్ట్రంలో 65% పనులు పూర్తయ్యాయి. మరో 35% పనులు చేపట్టాల్సి ఉంది. తెలంగాణ కళాభారతికి రూ.50 కోట్లు.. జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనాలు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, నగరంలో పోలీసు కమాం డ్ కంట్రోల్ భవనం తదితరాల కోసం రూ.550 కోట్లు కేటాయించారు. తెలంగాణ కళాభారతికి రూ.50 కోట్లు కేటాయించారు. గజ్వేల్ ప్రాంత అభివృద్ధి అథారిటీకి ఈసారి నిధులు కేటాయించలేదు. బియ్యం సబ్సిడీకి రూ.2,362 కోట్లు రాష్ట్రంలో ప్రజా పంపి ణీ వ్యవస్థ కింద సరఫరా చేసే సబ్సిడీ బియ్యం కోసం బడ్జెట్లో రూ.2,362 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో అర్హులైన పేదలకు రూపాయికే కిలో బి య్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద మొత్తంగా 2.80 లక్షల మంది లబ్ధి్ధదారులకు సబ్సిడీ బియ్యం సరఫరాకు వీలుగా ఈ నిధుల కేటాయింపు జరిగింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది రూ.7 కోట్లు అదనంగా కేటాయించారు. -
700 టీఎంసీలు ఎత్తిపోసేలా...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టులన్నీ పూర్తి కావస్తున్న నేపథ్యంలో..వచ్చే వర్షాకాల సీజన్ నుంచి నీటి ఎత్తిపోతలు గణనీయంగా ఉండనున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుండటంతో నీటి వినియోగం గరిష్ట స్థాయికి చేరనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో ఎత్తిపోతలు ఏకంగా 700 టీఎంసీల వరకు ఉంటుందని నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. ఎత్తిపోసే నీటి పరిమాణానికి తగినట్టే విద్యుత్ వినియోగం సైతం 7 వేల మెగావాట్లను దాటే అవకాశం ఉందని శాఖ లెక్కలు కట్టింది. ఇకపై ‘డబుల్’ఎత్తిపోత.. కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాల ద్వారా ఏటా 282 టీఎంసీల మేర నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సీజన్లో కాళేశ్వరం ద్వారా 58 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోయడంలో అది 340 టీఎంసీలకు చేరింది. ఇందులో ప్రధానంగా పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు,భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ద్వారానే కనీసంగా 120 టీఎంసీలు, ఏఎంఆర్పీ ద్వారా మరో 50 టీఎంసీల మేర నీరు ఎత్తిపోస్తుండగా, దేవాదుల, ఎల్లంపల్లి, గుత్ప, అలీసాగర్ వంటి పథకాల కింద మరో 70 టీఎంసీల ఎత్తిపోతల కొనసాగుతూ వస్తోంది. పాత ప్రాజెక్టుల ద్వారా నీటిని తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ప్రాజెక్టు పరిధిలో పంపు మోటార్లు, వాటికి అనుగుణంగా విద్యుత్ అవసరాలు 1,600 మెగావాట్ల వరకు ఉన్నాయి. ఎత్తిపోతల పథకాలకు యూనిట్‌కు 5.80 చొప్పున గణించినా, రూ. 1,800 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. అయితే వచ్చే ఖరీఫ్ నుంచి నీటి ఎత్తిపోతలు గణనీయంగా పెరగనున్నాయి. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల ద్వారానే గరిష్టంగా 250 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోసేలా ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. ఇక గోదావరి బేసిన్లో 450 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నారు. ఇందులో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే 200–250 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నాయి. ఇక దేవాదుల పరిధిలోనూ కంతనపల్లి సిద్ధం కానుండటంతో రెండు సీజన్లలో కలిపి 100 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోసేలా ప్రణాళిక వేస్తున్నారు. మిగతా పథకాల కింద మరో 100 టీఎంసీల నీటిని తరలించనున్నారు. మొత్తంగా రెండు బేసిన్ల పరిధిలో 700 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. రెండు బేసిన్లలోని 22 ఎత్తిపోతల పథకాల పరిధిలో 96 పంప్‌హౌస్‌లు ఉండగా, 318 పంపుల నిర్మాణం కొనసాగుతోంది. ఇందులో 270 పంపులు జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయని భావిస్తోంది. వీటిని నిర్ణీత నీటిని ఎత్తిపోసేలా నడిపిస్తే విద్యుత్ వినియోగం 6,700–7000 మెగావాట్లు వరకు ఉంటుందని లెక్క గడుతోంది. ఇందులో అధికంగా కాళేశ్వరం ఎత్తిపోతలకే మోటార్లు తిరిగే రోజులు, వాటి సామర్థ్యాన్ని బట్టి 4,500 మెగావాట్ల నుంచి 5,500 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండవచ్చని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి. ఈ విద్యుత్‌కే ఖర్చు దాదా పు రూ.6,500 కోట్లు ఉంటుందని చెబుతున్నాయి. -
చెక్‌డ్యామ్‌లకు నాబార్డ్ రుణం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నదులు, వాగులు, వంకలపై నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌లకు నిధుల కొరత లేకుండా నాబార్డ్ నుంచి రుణాలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. ఆర్థిక మాంద్యం నేపథ్యం లో రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధుల కేటాయింపులు కష్ట సాధ్యం కావడంతో ఈ మేరకు రుణాలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. మొత్తంగా రూ.1,650 కోట్ల మేర రుణాలు తీసుకునేలా నాబార్డ్ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 1,235 చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం కాగా, వీటికి రూ.4,920 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉంది. తొలి విడతగా ఈ ఏడాది గోదావరి బేసిన్లో 410, కృష్ణాబేసిన్‌లో 200 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయాలని తలపెట్టి ఇప్పటికే సాంకేతిక అనుమతులు ఇచ్చే ప్రక్రియ వేగిరం చేశారు. ఇలా 250 చెక్‌డ్యామ్‌లకు అనుమతులివ్వగా, 100 వరకు టెండర్లు పిలిచారు. మిగతా వాటికి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. వాటికి నిధుల కొరత లేకుండా ఈ మార్చి నెల వరకు నిర్మించే చెక్‌డ్యామ్‌ల అవసరాలకు రూ.150 కోట్లు, ఆ తర్వాత వార్షిక ఏడాదికి మరో రూ.1500 కోట్లు రుణాలు తీసుకునేలా చర్చలు జరుపుతోంది. దీనిపై మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
2021 నాటికి పోలవరం పూర్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులను 2021 నాటికి పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని పోలవరం ప్రాజెక్టు అధికారులకు జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 28న సీఎం వైఎస్ జగన్ పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయనున్న నేపథ్యంలో మంగళవారం విజయవాడలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఈఎన్సీ నారాయణరెడ్డి, పోలవరం ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు, సహాయ, పునరావాస శాఖ కమిషనర్ బాబూరావు తదితరులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేలో 43 బ్లాకుల్లో పియర్స్ పనులు ఊపందుకున్నాయని సీఈ సుధాకర్‌బాబు వివరించారు. ఒక్కో పియర్‌ను 55 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని, ఒక పియర్‌లో ఒక మీటర్ ఎత్తు పనులు చేయడానికి నాలుగు రోజుల సమయం పడుతుందన్నారు. రోజుకు 1,500 క్యూబిక్ మీటర్ల చొప్పున స్పిల్ వేలో కాంక్రీట్ పనులు చేస్తున్నామని, జూన్ నాటికి స్పిల్ వేలో మొత్తం 2.05 లక్షల క్యూబిక్ మీటర్ల పనులను పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వద్ద నాలుగు టీఎంసీల మేర వరద జలాలు నిల్వ ఉన్నాయని, వాటిని ఖాళీ చేసే పనులు వేగవంతం చేశామని తెలిపారు. జూలైలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులను ప్రారంభించి, గడువులోగా పనులు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. రోజువారీ పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఒక యాప్‌ను తయారు చేసి, వాటిలో పొందుపర్చాలని మంత్రి అనిల్‌కుమార్ ఆదేశించారు. జూన్‌లోగా 41.15 మీటర్ల పరిధిలోని ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను వేగవంతం చేయాలన్నారు. పోలవరానికి రూ.1,400 కోట్లు పోలవరం పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.1,400 కోట్లను రీయింబర్స్ చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ పంపిన ప్రతిపాదనలను మంగళవారం కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఆమోదించారు. తక్షణమే నిధుల విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపారు. వాటిపై కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసి.. నిధులు విడుదల చేయాలని సిఫార్సు చేస్తే బహిరంగ మార్కెట్లో ఈ–ఆక్షన్ ద్వారా నాబార్డు నిధులు సేకరిస్తుంది. ఆ నిధులను జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ, పీపీఏ ద్వారా ప్రభుత్వానికి అందజేయనుంది. పోలవరానికి ఇటీవల కేంద్రం రూ.1,850 కోట్ల మేర రీయింబర్స్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం పోలవరానికి ఖర్చు చేసిన నిధుల్లో.. మిగిలిన రూ.3,283 కోట్లను రీయింబర్స్ చేసి, ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి సహకరించాలని ఇటీవల ప్రధానితో సమావేశమైనప్పుడు సీఎం జగన్ కోరారు. కేంద్ర జల్ శక్తి శాఖ ఆదేశాల మేరకు.. ఇటీవల పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన పీపీఏ సీఈవో చంద్రశేఖర్ సంతృప్తి వ్యక్తం చేశారు. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఆర్థిక సమస్యలు లేకుండా చూడాలని కేంద్రానికి నివేదిక ఇచ్చారు. -
‘సీతారామ’ వేగం పెంచండి
సాక్షి, కొత్తగూడెం: కాళేశ్వరం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని, మే చివరికల్లా మొదటి ప్యాకేజీ పనులు పూర్తవ్వాలని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్‌కుమార్ ఆదేశించారు. శనివారం అశ్వాపురం మండలంలో జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు పనులను ఆయన ఈఎన్సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేతో కలిసి పరిశీలించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా వచ్చిన బృందం నేరుగా అశ్వాపురం గౌతమీనగర్ హెవీవాటర్ ప్లాంట్‌లోని పర్ణశాల అతిథి గృహానికి చేరుకుంది. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి కుమ్మరిగూడెం వద్ద ప్రస్తుతం ఉన్న దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సీతమ్మసాగర్ పేరుతో మరో ఆనకట్ట నిర్మించేందుకు నిర్ణయించిన ప్రాంతాన్ని పరిశీలించారు. మ్యాప్‌ల ద్వారా కాంటెక్ సంస్థ, అధికారులతో మాట్లాడి కొత్త బ్యారేజీ ఎత్తు, నీటి నిల్వ సామర్థ్యం, వరద ముంపు తదితర వివరాలు తెలుసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పంప్‌హౌసులు, కెనాల్ పనుల వివరాలు తెలు సుకున్నారు. అనంతరం బీజీకొత్తూరులో సీతారామ ప్రాజెక్ట్ మొదటి ప్యాకేజీ పంప్‌హౌస్ పనులను పరిశీలించారు. సీతారామ ప్రాజెక్ట్ అధికారులు, నిర్మాణ సంస్థ బాధ్యులతో మాట్లాడి పంప్‌హౌస్ పనుల పురోగతిని, పనులు ఎప్పటి వరకు పూర్తవుతాయనే వివరాలు తెలుసుకున్నారు. పరిశీలన అనంతరం సీతారామ పనుల తీరుపై మేఘా సంస్థ అధికారులతో సీతారాంపురం వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. విద్యుత్ స్టేషన్‌కు వెళ్లే రహదారిపై దుమ్ము లేవకుండా నీళ్లు చల్లించాలని సూచించారు. 8 ప్యాకేజీలపై సమగ్ర సమీక్ష పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం ఉండొద్దని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్‌కుమార్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, నిర్ణీత కాలంలోనే పనులన్నీ పూర్తి చేయాలన్నారు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు 8ప్యాకేజీల పనులను రజత్‌కుమార్ సమగ్రంగా సమీక్షించారు. మొదటి ప్యాకేజీలో 75 శాతం పనులు పూర్తి కావచ్చాయని, రెండో ప్యాకేజీ పనులను వేగవంతం చేశామని ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. పనులపై రోజువారీ పర్యవేక్షణ చేయాలని ఎస్ఈ నాగేశ్వరరావును ఆదేశించారు. 3వ ప్యాకేజీ పనులు పురోగతిలో ఉన్నాయని, 4వ ప్యాకేజీలో మిషన్ భగీరథ పైపులైన్ల పనుల కారణంగా 60 శాతం వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ఇసుక కొరత ఉందని, కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు ప్రిన్సిపల్ సెక్రెటరీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఇసుక విషయమై సత్వర చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ను ఆదేశించారు. మార్చి 22 నాటికి సీతారామ ప్రాజెక్టు పనులు ఒక దశకు వచ్చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు, సీతారామ ప్రాజెక్ట్ ఎస్ఈలు వెంకటకృష్ణ, నాగేశ్వరరావు, ఈఈ బాబురావు, డీఈలు మహేశ్వరరావు, వెంకటేశ్వరరావు, తహసీల్దార్ భగవాన్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఇతర అధికారులున్నారు. -
రుణాలతోనే ‘సీతమ్మసాగర్’!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేసేందుకు వీలుగా రుణాల సేకరణ చేస్తున్న ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న సీతమ్మ సాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టుకు రుణ సేకరణ చేయాలని నిర్ణయించింది. ఆర్థిక మాంద్యం, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల జాప్యం, రాష్ట్ర నిధులన్నీ అభివృధ్ధి, సంక్షేమ కార్యక్రమాలకే సరిపోతున్న నేపథ్యంలో సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు రెండేళ్లలో పూర్తి చేసేలా రూ.3,400 కోట్ల రుణాలు సేకరించేందుకు కసరత్తులు ఆరంభించింది. 37 టీఎంసీల నిల్వ సామ ర్థ్యంతో పాటు, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సమృద్ధిగా నిధులను అందుబాటులో ఉంచేలా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) నుంచి రుణాలు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ ఏడాది జూన్, జులై నుంచే గోదావరి నీటిని ఎత్తిపోసేలా మోటార్లను సిద్ధం చేస్తోంది. -
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అలసత్వానికి తావు లేకుండా.. శ్రద్ధ వహించాలని చెప్పారు. పనులకు అడ్డంకులు రాకుండా నిధులు ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ శాఖపై సీఎం సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిపై.. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిపై సీఎం సమీక్షిస్తూ.. ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత గల ప్రాజెక్టు పోలవరం అని స్పష్టం చేశారు. పనులకు ఒక్క రోజు కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, కరవు బాధిత ప్రాంతాలకు జలాల తరలింపుపై సీఎం సమీక్షించారు. రాయలసీమ ప్రాజెక్టులకు వెళ్లే కాల్వల విస్తరణపై ప్రతిపాదనలను అధికారులు వివరించారు. సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను కరవు పీడత ప్రాంతాలకు తరలింపుపై సీఎం సమీక్షించారు. గోదావరి నీటిని వయా బొల్లాపల్లి మీదగా బనకచర్లకు తరలించే ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపైనా కూడా సీఎం సమీక్ష జరిపారు. విశాఖకు నిరంతరం తాగునీటి సరఫరా కోసం పైపులైన్లు వేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. -
ఎక్కడికక్కడే నీటి కట్టడి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాగులపై అవసరమైనన్ని చెక్ డ్యామ్‌లు నిర్మించాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మొత్తం ఎన్ని చెక్ డ్యామ్‌లు అవసరమో గుర్తిం చి, అందులో సగం చెక్ డ్యాములను ఈ ఏడాది, మిగతా సగం వచ్చే ఏడాది నిర్మించాలని చెప్పా రు. మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువుల నిర్వహణను ప్రతి ఏటా చేపట్టాలని ఆదేశిం చారు. చిన్న నీటి వనరుల వినియోగంపై సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి, భానుప్రసాద్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ఈఎన్సీలు మురళీధర్ రావు, విజయ్ ప్రకాశ్, వెంకటేశ్వర్లు, సీఈలు వీరయ్య, హమీద్ ఖాన్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ‘ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రానికి సాగునీటి సమస్య తీరుతోంది. కాళేశ్వ రం, దేవాదుల, సీతారామ ప్రాజెక్టులతో గోదావరి నది నుంచి మన వాటా ప్రకారం పుష్కలంగా నీటిని తీసుకుంటాం. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 500కు పైగా టీఎంసీల నీటిని తీసుకోవచ్చు. ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు, ఎస్ఆర్ఎస్పీలతో పాటు కొత్తగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ లాంటి రిజర్వాయర్లు నింపుకుంటాం. అన్ని చెరువులకు ప్రాజెక్టుల ద్వారా నీరిస్తాం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జలధార ఉంటుంది. పంటలు సంవృద్ధిగా పండుతాయి. పంటలకు నీళ్లిచ్చే క్రమంలో పడుబాటు నీళ్లు, వర్షం నీళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ నీళ్లు సహజంగా ఏర్పడిన వాగులు, వంకలు, డొంకల ద్వారా కిందికి వెళ్లిపోతాయి. ఈ నీళ్లను ఎక్కడికక్కడ ఆపడానికి విరివిగా చెక్ డ్యామ్‌లు నిర్మించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ వాగుకు ఎన్ని చెక్ డ్యామ్‌లున్నాయి? కొత్తగా ఎన్ని మంజూరయ్యాయి? ఇంకా ఎన్ని మంజూరు చేయాలి? అనే లెక్కలు తీయాలి. అవసరమైనన్ని చెక్ డ్యామ్‌లను గుర్తించిన తర్వాత వాటిలో సగం ఈ ఏడాదే నిర్మించాలి. దీని కోసం జనవరి 15 నాటికి టెండర్లు పిలవాలి. మిగతా సగం చెక్ డ్యామ్‌లను వచ్చే ఏడాది నిర్మించాలి. వీటి నిర్మాణం కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తాం’అని ముఖ్యమంత్రి చెప్పారు. చెరువుల నిర్వహణకు నిధులు.. మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువుల నిర్వహణకు బడ్జెట్లో నిధులిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ స్పూర్తితో మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించుకున్నాం. ఈ చెరువులు ఊరికి బతుకు దెరువుగా ఉపయోగపడుతున్నాయి. పునరుద్ధరించుకున్న చెరువుల కట్టలు, తూములు, కాల్వలు, ఇతరత్రా మళ్లీ పాడవకుండా ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మతులు చేయాలి. దీనికోసం ప్రతీ ఏటా బడ్జెట్లో నిధులు కేటాయిస్తాం. ప్రతీ వేసవిలో చెరువులోని పూడిక మట్టిని రైతులు తమ పొలాల్లోకి తీసుకువెళ్లేలా ప్రోత్సహించాలి. వ్యవసాయ శాఖ, రైతు సమన్వయ సమితి, గ్రామ పంచాయతీలు సమన్వయంతో వ్యవహరించి పూడిక మట్టిని పొలాలకు తరలించుకునేలా చూడాలి. గతంలో మాదిరిగా నీరటి కాడు వ్యవస్థను పునరుద్ధరించాలి. వీఆర్ఏలలో ఒకరికి చెరువుల పని అప్పగించాలి. చెరువుల్లో మొలిచే మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి’అని కేసీఆర్ అన్నారు. అక్టోబర్ నాటికే అన్నీ నింపాలి.. వర్షాకాలం ఆరంభంలోనే కడెం నుంచి పెద్ద ఎత్తున నీళ్లు ఎల్లంపల్లికి చేరుకునే అవకాశం ఉన్నందున, వేసవి కాలంలోనే ఎల్లంపల్లి నీటిని ఎస్ఆర్ఎస్పీకి తరలించాలని ముఖ్యమంత్రి ఇంజనీర్లకు సూచించారు. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు ఎప్పుడూ నీటి కొరత లేకుండా చూడాలన్నారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లను అక్టోబర్ నాటికి పూర్తిస్థాయిలో నింపాలని సూచించారు. మిర్యాలగూడ డివిజన్లోని నాగార్జునసాగర్ ఆయకట్టుకు పాలేరు నుంచి నీళ్లివ్వడానికి అనువుగా ఎత్తిపోతల పథకం నిర్మించే అంశాన్ని పరిశీలించాలని, సర్వే నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో మారిన నీటిపారుదల వ్యవస్థ స్వరూపం మేరకు నీటి పారుదల శాఖను ఐదారుగురు ఈఎన్సీల పరిధిలోకి తీసుకురావాలని, దీనికి తగ్గట్టు శాఖను పునర్వ్యవస్థీకరించాలని సూచించారు. అర్హులైన వారికి పదోన్నతులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈఎన్సీలు తమ పరిధిలోని ప్రాంతంలో అన్ని రకాల నీటి వనరులను పర్యవేక్షించాలని చెప్పారు. భారీ, మధ్య తరహా, చిన్న తరహా అనే తేడా లేకుండా నీటి పారుదల శాఖ ఒకే విభాగంగా పనిచేయాలని సీఎం కేసీఆర్ వివరించారు. -
వచ్చే ఐదేళ్లు.. రూ.2 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: సాగునీటి రంగాన్ని ఉరకలెత్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మున్ముందు భారీగా నిధులు వెచ్చించనుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తిచేస్తూనే కేంద్రం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధాన ప్రక్రియను పరుగులు పెట్టించనుంది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో ఏటా రూ.40 వేల కోట్ల చొప్పున మొత్తం రూ.2 లక్షల కోట్ల మేర ఖర్చు చేయనుంది. దేశంలో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టిన కేంద్ర ప్రభుత్వం, తన బడ్జెట్లో ప్రకటించినట్లుగా రూ.100 లక్షల కోట్లతో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను గుర్తించడం కోసం ఆర్థిక శాఖ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయగా దానికి తెలంగాణ ప్రభుత్వం సమగ్ర నివేదికను సమర్పించింది. ఐదేళ్ల వ్యవధిలో చేపట్టాల్సిన ప్రాజెక్టులపై ఖర్చు చేయనున్న నిధుల వివరాల్ని అందులో పేర్కొంది. మొదట ప్రాజెక్టులు.. ఆపై అనుసంధానం కృష్ణా, గోదావరి నదీజలాల పూర్తి వినియోగానికి వీలుగా ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. వీటితోపాటే నిర్మాణంలో ఉన్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తోంది. వీటి నిర్మాణాలకు భారీగా నిధులు కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మినహాయిస్తే 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా సాగునీటి రంగంపై రూ.30 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల మేర నిధులను ఖర్చు చేయనున్నట్లు టాస్క్‌ఫోర్స్‌కు పంపిన నివేదికలో తెలిపింది. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మూడేళ్ల పాటు రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తామని, పాలమూరు–రంగారెడ్డికీ ఇలాగే నిధులు వెచ్చిస్తామని, నదుల అనుసంధానంతో సహా మొత్తంగా వచ్చే ఐదేళ్లలో సాగునీటి రంగంపై రూ.2 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. 2023–24 నాటికి కొత్తగా చేపట్టిన భారీ ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తవుతాయని, ఆపై నిధుల ఖర్చంతా గోదావరి–కృష్ణా నదుల అనుసంధానంపైనేనని వెల్లడించింది. టాస్క్‌ఫోర్స్‌కు ఎందుకీ ఐదేళ్ల ప్రణాళిక? కేంద్ర ప్రభుత్వం 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తయారు కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు రూ.100 లక్షల కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంది. ఈ క్రమంలో చేపట్టా్టల్సిన ప్రాజెక్టులపై సమగ్ర నివేదిక రూపకల్పనకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి చైర్మన్ కాగా, వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, నీతి ఆయోగ్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. 2019–20 నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరం దాకా చేపట్టాల్సిన కార్యాచరణను టాస్క్‌ఫోర్స్ తన నివేదికలో పొందుపరుస్తుంది. దీనికోసం మౌలిక వసతుల రంగంలో ఖర్చుచేసే నిధుల వివరాలివ్వాలని టాస్క్‌ఫోర్స్ ఆయా రాష్ట్రాలను కోరింది. దీంతో రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ శాఖల ఐదేళ్ల ప్రణాళికల వివరాలను సేకరించి కేంద్రానికి సమర్పించింది. దీని ఆధారంగా ఎఫ్ఆర్బీఎం పరిమితుల సడలింపు, కేంద్రసంస్థల నుంచి ఆర్థిక సాయం, రుణ సేకరణ అవకాశాలు వంటివి కేంద్రం పరిశీలిస్తుంది. -
ఒక రిజర్వాయర్..రెండు లిఫ్టులు
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరంలో కొత్తగా అదనపు టీఎంసీ నీటిని ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు ఎత్తిపోసే ప్రణాళిక కొలిక్కి వచ్చింది. టన్నెల్ వ్యవస్థ ద్వారా నిర్మాణ ఖర్చు, గడువు పెరుగుతున్న నేపథ్యంలో ఎల్లంపల్లి దిగువన రెండు లిఫ్టులు, ఒక రిజర్వాయర్ నిర్మాణం ద్వారా పైప్లైన్ల నుంచే నీటిని ఎత్తిపోసే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనికి మొత్తంగా రూ. 12,700 కోట్లు ఖర్చవుతుందని నీటిపారుదలశాఖ అంచనా వేసింది. మూడో టీఎంసీ ద్వారా హైదరాబాద్ తాగునీటి సరఫరా కోసం చేపట్టే కేశవాపూర్ రిజర్వాయర్‌కు నీటిని అందించడంతోపాటు సింగూరు, నిజాంసాగర్, సూర్యాపేట జిల్లా వరకు ఉన్న ఎస్సారెస్పీ స్టేజ్–2 ఆయకట్టుకు నీటిని అందించనున్నారు. నీటి లభ్యత కరువైన సంవత్సరాల్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీటి కొరత లేకుండా చూడాలని నిర్ణయించిన ప్రభుత్వం... బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా సాగర్ ఆయకట్టుకు నీటిని తరలించే ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా అంచనా వ్యయం రూ. 12,700 కోట్లకు చేరనుందని నీటిపారుదల వర్గాలు వెల్లడించాయి. బుధవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించి ఆ తర్వాత టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టనున్నారు. -
ఏటా 724.3 ఎంయూల విద్యుదుత్పత్తి!
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై తలపెట్టిన 320 మెగావాట్ల దుమ్ముగూడెం జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణం పూర్తైతే ఏటా 724.3 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరగనుంది. రూ.4504 కోట్ల అంచనా వ్యయంతో దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం డీపీఆర్‌ను సిద్ధం చేసింది. 37 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో జలాశయం పాటు 320 మెగావాట్ల విద్యుదు త్పత్తి కేంద్రాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొ క్కటి 40 మెగావాట్ల సామర్థ్యం గల 8 విద్యుదుత్పత్తి యూనిట్లు కలిపి 320 మెగావాట్ల సామర్థ్యం గల ఇంటిగ్రేటెడ్ పవర్‌హౌజ్‌ను నిర్మించనుంది. ఏడెనిమిది ఏళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డీపీఆర్ నివేదిక ప్రకారం.. ఏటా 70–80 రోజుల పాటు నిరంతర వరద నీటి ప్రవాహం ఉండనుందని, ఆ మేరకు విద్యుదు త్పత్తి జరిగే అవకాశాలున్నాయి. ఇక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను 3 కి.మీ. దూరంలో ఉన్న అంగడిపేట సబ్‌స్టేషన్ ద్వారా సరఫరా చేయనుంది. రూ.4,504 కోట్ల అంచనా వ్యయంలో రూ.3,639 కోట్లు జలాశయం నిర్మా ణానికి ఖర్చు చేయనుండగా, మిగిలిన రూ.866 కోట్లతో జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మిస్తారని తెలంగాణ జెన్కో అధికార వర్గాలు తెలిపాయి. ఒక యూనిట్ విద్యుదుత్పత్తికి రూ.5 నుంచి రూ.6 వరకు వ్యయం కానుందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. రుణం+రాష్ట్ర ప్రభుత్వ వాటా: దుమ్ముగూడెం జలాశయాన్ని నీటిపారుదల శాఖ, జలవిద్యుదుత్పత్తి కేంద్రాన్ని జెన్కో ఆధ్వ ర్యంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గోదావరిపై సముద్ర మట్టానికి 63 మీటర్ల ఎత్తులో 6 కి.మీ. పొడవు, 6 కి.మీ. వెడల్పుతో తొలుత జలాశయాన్ని నీటిపారుదల శాఖ నిర్మించ నుంది. జలాశయానికి 70 రేడియల్ గేట్లను ఏర్పాటు చేయనుం ది. అనంతరం జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులను జెన్కో చేప ట్టనుంది. జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా కొంత భాగాన్ని కేటాయిస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చినట్లు జెన్కో అధికారవర్గాలు తెలిపాయి. మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో జెన్కో సమీకరించనుంది. -
రూ.33,397 కోట్ల పనులకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర సాగునీటి శాఖ పరిధిలో కొత్తగా చేపట్టనున్న పనులకు టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏకంగా రూ.33,397 కోట్ల పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఆరంభించాలని సీఎం కేసీఆర్ సాగునీటి శాఖను ఆదేశించారు. ఇందులో కాళేశ్వరం పరిధిలోని అదనపు టీఎంసీ పనులకు సంబంధించిన విలువే రూ.25 వేల కోట్లకు పైగా ఉండగా, ఖమ్మం జిల్లాలోని సీతారామ, కొత్తగా చేపట్టనున్న పనుల విలువ మరో రూ.7,400 కోట్ల మేర ఉండనుంది. ఈ పనులకు ఈ నెలాఖరులోగా టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అదనపు టీఎంసీకి భారీగానే.. కాళేశ్వరంలోని మేడిగడ్డ ద్వారా మొదటి దశలో రెండు టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోసేలా డిజైన్ చేసి పనులు పూర్తి చేశారు. అనంతరం మరో టీఎంసీ నీటిని సైతం తీసుకోవాలని నిర్ణయించి ఆ పనులను ఇప్పటికే మొదలు పెట్టారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలోని 3 పంప్‌హౌస్‌లకు కలిపి రూ.7,998 కోట్ల అంచనాతో చేపట్టగా, అదనపు టీఎంసీ పనులను మరో రూ.4,394 కోట్లతో చేపట్టారు. ఈ పనులు జరుగుతున్నాయి. ఇక గురువారం జరిగిన సమీక్ష సందర్భంగా ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు చేపట్టిన పనుల టెండర్లకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రూ.11,500 కోట్ల ఈ పనులకు వచ్చేవారం టెండర్లు పిలవనున్నారు. ఇక మిడ్‌మానేరు దిగువన మల్లన్నసాగర్ వరకు మొదట టన్నెల్ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించినా, దీని నిర్మాణాలకు చాలా రోజులు పడుతున్న నేపథ్యంలో పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నీటి తరలింపునకు 3 స్థాయిల్లో లిఫ్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిలో మిడ్‌మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్ వరకు పైప్‌లైన్ వ్యవస్థ నిర్మాణానికి రూ.4,142 కోట్లు, అనంతగిరి నుంచి మల్లన్నసాగర్ వరకు రూ.10,260 కోట్లు అవుతుందని అంచనా వేశారు. మొత్తంగా ఈ నిర్మాణానికి రూ.14 వేల కోట్లకుపైగా వ్యయం అవుతుండగా, ఈ పనుల టెండర్లకు సీఎం ఓకే చెప్పారు. అలాగే ప్రాజెక్టు పరిధిలోని క్యాంపు కార్యాలయాల కోసం రూ.43 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇక సీతారామ ఎత్తిపోతల పథకాన్ని రూ.13,884 కోట్లతో చేపట్టగా, ఇందులో ఇప్పటికే 8 ప్యాకేజీల పనులకు రూ.4,816 కోట్లతో టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టారు. ఇప్పుడు సత్తుపల్లి ప్రధాన కాల్వ ప్యాకేజీ–9 నుంచి జూలూర్పాడ్ మండలం వరకు (ప్యాకేజీ–13 వరకు) చేపట్టే పనులకు టెండర్లు ఈ నెలలోనే ఆరంభించాలని సీఎం సూచించారు. ఈ పనులకు రూ.2,952 కోట్లవుతుందని అంచనా వేశారు. దుమ్ముగూడెం బ్యారేజీ, పవర్‌హౌస్‌కు రూ.4,500 కోట్లు.. ఇక దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ఫ్లడ్ రిజర్వాయర్ లెవల్ 49.67 మీటర్లు ఉండగా నీటి సామర్థ్యం 1.3 టీఎంసీలుగా ఉంది. దీన్ని మరో 13 మీటర్ల మేర అంటే 63 మీటర్లకు పెంచి 37 టీఎంసీల మేర నీటి నిల్వ చేయాలని సీఎం నిర్ణయించారు. దీంతో పాటే 320 మెగావాట్ల సామర్థ్యంతో పవర్‌హౌస్ నిర్మించాలని సూచించారు. ఇందులో బ్యారేజీ నిర్మాణానికి రూ.3 వేల కోట్లు, పవర్‌హౌస్‌కు మరో రూ.1,500 కోట్లు అవుతుందని అధికారులు సీఎంకు నివేదించారు. ఈ బ్యారేజీ ద్వారా ఖమ్మం జిల్లాలో సీతారామ కింద నిర్ణయించిన 6.40 లక్షల ఎకరాలకు నీరివ్వడంతో పాటు, నాగార్జునసాగర్ కింద ఖమ్మం జిల్లాలో ఉన్న 2.60 లక్షల ఎకరాలకు నీరందించాలని సీఎం నిర్ణయించారు. ఈ పనులకు కూడా నెలాఖరులోగా టెండర్లు పిలిచి పనులు ఆరంభించాలని సీఎం సూచించడంతో ఆ దిశగా అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. -
పునరుజ్జీవన వ్యయం డబుల్!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల ను వరద కాల్వ మీదుగా ఎస్సారెస్పీకి పంపేందుకు తలపెట్టిన పునరుజ్జీవన పథకం వ్యయంరెట్టింపవుతోంది. ఏడాదిన్నర క్రితం చేపట్టిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.వెయ్యి కోట్ల నుంచి సుమారు రూ.2 వేల కోట్లకు పెరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైలు సిద్ధమవగా, ప్రభుత్వ అనుమతి కోసం వెళ్లనుంది. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి 2017, జూన్ 17న ప్రభుత్వం రూ.1,067 కోట్లతో అనుమతులిచ్చారు. ఈ నిధులతో 60 రోజుల్లో రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా మూడు పంప్‌హౌస్‌లను ప్రతిపాదించారు. వీటి నిర్మాణాలకు మొదట 5.79 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అవసరం ఉండగా.. నిర్మాణ పనుల్లో మార్పుల కారణంగా అది 6.14 లక్షల క్యూబిక్ మీటర్లకు పెరిగింది. స్టీల్ అంచనా 17,100 టన్నులకు పెరిగింది. దీంతో తొలుత వేసిన అంచనా వ్యయాన్ని ఈ ఏడాది జూన్‌లో రూ.1751.46 కోట్ల మేర పెంచుతూ నిర్ణయం జరిగింది. వీటి తర్వాత అదనంగా 2 తూముల, కార్యాలయాలు, ఇతర నిర్మాణాలు, సిమెంట్, స్టీలు, ఇంధన ధరలో మార్పులతో గతంలోనే రూ.62.68 కోట్ల మేర అంచనా పెరగ్గా, ప్రస్తుతం అది 135.94 కోట్ల మేర పెరనున్నట్లు ఇంజనీర్లు నిర్ధారించారు. మొత్తం అంచనా వ్యయం రూ.1999.56 కోట్లకు పెరగనున్నట్లు తేల్చారు. దీన్ని స్టేల్ లెవల్ స్టాండింగ్ కమిటీలో ఆమోదించిన అనంతరం ప్రభుత్వ అనుమతి కోసం సిఫార్సు చేయనున్నారు. -
100 టీఎంసీలు కావాలి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల కింద ఈ ఏడాది యాసంగి సీజన్లో రాష్ట్ర తాగు, సాగు నీటి అవసరాలకు 100 టీఎంసీల మేర అవసరం ఉంటుందని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. నాగార్జునసాగర్ కింద పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించడంతో అక్కడి అవసరాలు,ఏఎంఆర్పీ, హైదరాబాద్ తాగునీరు, కల్వకుర్తికి కలిపి ఈ నీళ్లు సరిపోతాయని తేల్చింది. నీటి లభ్యత పుష్కలంగా ఉన్న దృష్ట్యా బోర్డు నుంచి అభ్యంతరాలు ఉండబోవని భావిస్తోంది. లభ్యత పుష్కలం.. సాగర్కింద ఈ యాసంగిలో 6.40 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. గతేడాది పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరిచ్చిన సందర్భాల్లోనూ 45 నుంచి 50 టీఎంసీల నీటిని ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన విడుదల చేశారు. ఈ ఏడాది సైతం 50 టీఎంసీల నీటితో సాగు అవసరాలు తీర్చవచ్చని నీటి పారుదల శాఖ లెక్కలేస్తోంది. ప్రస్తుతం సాగర్‌లో 312 టీఎంసీలకు గానూ 294.55 టీఎంసీల లభ్యత ఉంది. ఇందులో తెలంగాణకు దక్కే వాటాల్లోంచి సాగర్‌కు అవసరమయ్యే నీటి విడుదలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇక సాగర్ కిందే ఏఎంఆర్పీ ఎస్ఎల్బీసీ కింద 2.80లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించగా, దీని అవసరాలకు మరో 20 టీఎంసీ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మరో 10 టీఎంసీలు అవసరం పడతాయని అంచనా వేస్తున్నారు. సాగర్ కిందే మొత్తంగా 80 టీఎంసీలకు అవసరం ఉంటోంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడ్డ కల్వకుర్తికింద 1.80 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరివ్వనున్నారు. దీనికి, తాగునీటి అవసరాలకు కలుపుకొని మొత్తంగా 20 టీఎంసీలు శ్రీశైలం నుంచి తీసుకో నున్నారు. శ్రీశైలంలోనూ 215 టీఎంసీలకు గానూ 182.61 టీఎంసీల లభ్యత ఉంది. మొత్తం రెండు ప్రాజెక్టుల్లోనూ ఉన్న నీటి లభ్యతలోంచి తెలంగాణకు ఇప్పటివరకు వినియోగించిన వాటా, ఇకపై వినియోగించే వాటాలు కలిపి గరిష్టంగా 175 టీఎంసీల వాటా దక్కే అవకాశం ఉందని ఇరు రాష్ట్రాలకు రాసిన లేఖలో కృష్ణా బోర్డు పేర్కొంది. ఈ వాటాల్లోంచే 100 టీఎంసీల నీటిని తెలంగాణ వినియోగించనుండగా, మిషన్ భగీరథతో పాటు జిల్లాల తాగునీటి అవసరాలకు మరింత నీటిని వినియోగించుకునే వెసులుబాటు తెలంగాణకు ఉండనుంది. ఎజెండాలో మళ్లింపు జలాలను చేర్చిన రాష్ట్రం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వచ్చే జూన్ వరకు నీటి కేటాయింపులకు సంబంధించి చర్చించేందుకు ఈనెల 3న మంగళవారం కృష్ణాబోర్డు భేటీ కానుంది. బోర్డు భేటీలో నీటి కేటాయింపులతో పాటు, కార్యాలయాన్ని అమరావతికి తరలింపు, బడ్జెట్ కేటాయింపులు, వర్కింగ్ మాన్యువల్, ఇతర అంశాలపై ఇందులో చర్చిద్దామని ప్రతిపాదించింది. ఇందులో పట్టిసీమ, పోలవరం ద్వారా మళ్లిస్తున్న జలాల్లో తెలంగాణకు దక్కే వాటా, తాగునీటికి కేటాయిస్తున్న నీటిలో వినియోగాన్ని కేవలం 20%గా మాత్రమే పరిగణించాలన్న అంశాలను చేర్చాలని కోరుతూ తెలంగాణ బోర్డును కోరింది. దీనికి బోర్డు అంగీకరించింది. -
పెండింగ్ బిల్లులు రూ.10 వేల కోట్లకు పైనే..
సాక్షి, హైదరాబాద్: సాగు నీటిశాఖ పరిధిలో ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించిన బిల్లులన్నీ పేరుకుపోతున్నాయి. ఆర్థిక మాంద్యం, ఇతర ప్రజా ప్రాయోజిత పథకాలకు నిధుల అవసరాలు బాగా పెరగడంతో ప్రాజెక్టు పనుల బిల్లులు చెల్లింపు కావడం లేదు. రుణ సంస్థల ద్వారా భారీ ఎత్తున నిధులను ఖర్చు చేస్తున్నా, ఇప్పటికీ సాగు నీటి శాఖ పరిధిలో రూ.10,216 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో పడటంతో కాంట్రాక్టు ఏజెన్సీలన్నీ ఆ శాఖ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. రూ.8 వేల కోట్లకు కుదింపు.. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు మార్చి నెలలో పెట్టిన బడ్జెట్లో రూ.14 వేల కోట్ల మేర కేటాయించగా, తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్లో దాన్ని రూ.8 వేల కోట్లకు కుదించారు. ఏప్రిల్ నుం చి ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర పద్దుల నుంచి రూ.6,756.41 కోట్లు చెల్లింపు చేశారు. కాళేశ్వరం, దేవాదుల, సీతారామ, తుపాకులగూడెం వంటి ప్రాజెక్టులకు రుణ సంస్థల ద్వారా మరో రూ.8,432.84 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్లు నీటి పారుదల శాఖ నివేదికలు చెబుతున్నాయి. కాళేశ్వరం కిందే రుణాల ద్వారా రూ.5,351 కోట్లు ఖర్చు చేశారు. అయినా ప్రస్తుతం రూ.10 వేల కోట్లకు పైగా పెండింగ్ బిల్లులున్నాయి. ఇందులో భారీ ప్రాజెక్టుల కిందే రూ.9,329 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టుల కిందే అధికంగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇందులో భూసేకరణ అవసరాలకు రూ.వెయ్యి కోట్ల మేర తక్షణ అవసరాలున్నాయి. ఈ నిధులను విడుదల చేసినా కొంత మేర ప్రాజెక్టులను వేగిరం చేసే అవకాశముంది. ఇక మిషన్ కాకతీయ చెరువులకు సంబంధించి రూ.700 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఆ కాంట్రాక్టర్లు నీటిపారుదల శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ బిల్లులు చెల్లించకపోవడంతో కొత్తగా తూముల నిర్మాణ పనులకు టెండర్లు వేసేందుకు వెనకాడుతున్నారు. -
కృష్ణా, గోదావరి బోర్డుల్లో అడ్మినిస్ట్రేటివ్ సభ్యుడిగా సోమేశ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డుల్లో రాష్ట్రం తరఫున అడ్మినిస్ట్రేటివ్ సభ్యుడిగా రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్‌సెక్రటరీ సోమేశ్ కుమార్‌ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఈ పోస్టులో నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సభ్యుడిగా ఉంటారు. అయితే గతంలో శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సోమేశ్ ఉండటంతో ఆయన్నే సభ్యుడిగా నియమించారు. తర్వాత ఆయన్ను రెవెన్యూ శాఖకు బదిలీ చేయడంతో ఆ బాధ్యతలు సీఎస్ జోషి చూడాల్సి ఉంది. జోషి వచ్చే నెలలో రిటైర్ అవుతుండటంతో సోవేశ్నే సభ్యుడిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. -
కాకినాడ కలెక్టరేట్లో సాగునీటి సలహామండలి సమావేశం