ప్రధాన వార్తలు

ఏసీబీ జడ్జి ఎదుట మిథున్‌రెడ్డిని ప్రవేశపెట్టిన సిట్
మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్.. లేటెస్ట్ అప్డేట్స్విజయవాడ కోర్టుకి మిథున్‌రెడ్డి తరలింపువిజయవాడ కోర్టుకి ఎంపీ మిథున్‌రెడ్డి తరలింపుఏసీబీ జడ్జి ముందు హాజరుపర్చిన సిట్ అధికారులుకోర్టు వద్ద పోలీసుల ఓవరాక్షన్న్యాయవాదులను సైతం లోపలికి అనుమతించని పోలీసులుకోర్టుకి అన్ని వైపులా బారికేడ్లతో దారులను మూసేసిన పోలీసులుకోర్టు ప్రధాన ద్వారం కూడా మూసివేసిన పోలీసులుపోలీసులకు న్యాయవాదులకు మధ్య వాగ్వాదం కాసేపట్లో ఏసీబీ జడ్జి ముందుకు..విజయవాడ జీజీహెచ్‌లో ఎంపీ మిథున్‌రెడ్డికి ముగిసిన వైద్య పరీక్షలులిక్కర్ స్కాం కేసులో ఏ-4గా ఉన్న మిథున్రెడ్డికాసేపట్లో ఏసీబీ జడ్జి ముందు హాజరుపర్చనున్న సిట్అక్రమ కేసులకు జడిసేది లేదురాష్ట్రంలో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారుఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అక్రమంలిక్కర్ పాలసీలో ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధం లేదులిక్కర్ పాలసీ ప్రభుత్వం నడిపింది.. అందులో ఎలాంటి అక్రమాలు జరగలేదువైఎస్సార్సీపీ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టిన భయపడేది లేదు:::ఎమ్మెల్యే విరుపాక్షివిజయవాడ: కోర్టు దగ్గర పోలీస్ ఆంక్షలుకోర్టుకు వచ్చే అన్ని దారులు బారికేడ్లు పెట్టి మూసేసిన పోలీసులుఅడ్వకేట్లను కూడా కోర్టులోకి అనుమతించని పోలీసులుపోలీసులతో వాగ్వాదానికి దిగిన అడ్వకేట్లు.. అనంతరం వారిని లోపలకు అనుమతించిన పోలీసులుగేట్లు సైతం మూసేసిన పోలీసులుప్రభుత్వాసుపత్రికి మిథున్‌రెడ్డి తరలింపువిజయవాడ ప్రభుత్వాసుపత్రికి ఎంపీ మిథున్‌రెడ్డి తరలింపుకాసేపట్లో మిథున్‌రెడ్డికి వైద్య పరీక్షలుఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు.. వైఎస్సార్సీపీ శ్రేణుల అడ్డగింతవైద్య పరీక్షల అనంతరం ఏసీబీ జడ్జి ఎదుట మిథున్‌రెడ్డిని ప్రవేశపెట్టే అవకాశంలిక్కర్ స్కాం కేసులో శనివారం రాత్రి మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్‌విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద పోలీసుల ఓవరాక్షన్‌కాసేపట్లో వైద్య పరీక్షలు నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కి మిథున్ రెడ్డిప్రభుత్వ హాస్పటల్ వద్ద భారీగా పోలీసు బందోబస్తుప్రభుత్వ హాస్పటల్ కు భారీగా చేరుకుంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులువైఎస్సార్‌సీపీ నేతల వాహనాలకు మాత్రమే అనుమతి నిరాకరణఏపీలో కొనసాగుతున్న రాజకీయ కక్షసాధింపులులేని లిక్కర్ స్కాం పేరుతో వైఎస్సార్సీపీ కీలక నాయకుల అరెస్టులుఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా 11 మంది అరెస్టుతాజాగా ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్టు చేసిన సిట్ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేసి 48 మంది పేర్లను ఛార్జిషీటులో పేర్కొన్న సిట్మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కీలక నేతల అరెస్టే లక్ష్యంగా పని చేస్తున్న సిట్ అధికారులునిజానికి చంద్రబాబు హయాంలో కంటే జగన్ హయాంలోనే ప్రభుత్వానికి ఎక్కువగా వచ్చిన ఎక్సైజ్ ఆదాయంఅయినప్పటికీ రూ.3 వేల కోట్లు పక్కదారి పట్టాయంటూ తప్పుడు కేసు నమోదురూ.50 వేల కోట్లు కొట్టేశారంటూ అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెప్పిన చంద్రబాబురూ.35 వేల కోట్లు అంటూ బొంకిన పవన్ కళ్యాణ్నోటికొచ్చినట్లు మాట్లాడుతూ లేని స్కాంని ఉన్నట్టు భేతాళ కథలు అల్లుతున్న ప్రభుత్వ పెద్దలుటీడీపీ కేంద్ర కార్యాలయంలో తయారయ్యే స్క్రిప్టునే ఛార్జిషీటు, రిమాండ్ రిపోర్టుల్లో పేర్కొంటున్న సిట్ఎల్లోమీడియా తప్పుడు రాతలు, సిట్ తప్పుడు విచారణలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్కోర్టుల్లోనే న్యాయపోరాటం చేస్తామంటున్న వైఎస్సార్‌సీపీఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డికి సంఘీభావం తెలిపిన పార్టీ నేతలుమిథున్ రెడ్డికి అండగా వైఎస్సార్సీపీజీజీహెచ్కు తరలించే ముందు సిట్ కార్యాలయం వద్ద మిథున్రెడ్డివాట్ నెక్స్ట్‌మద్యం పాలసీ అక్రమ కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌విచారణ పేరిట విజయవాడకు పిలిచి మరీ అరెస్ట్ చేసిన సిట్‌సుదీర్ఘ విచారణ తర్వాత.. అరెస్ట్ చేసినట్లు శనివారం రాత్రి మిథున్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారంఇవాళ ఏసీబీ కోర్టు/జడ్జి ఎదుట మిథున్‌రెడ్డిని ప్రవేశపెట్టే అవకాశంమిథున్‌రెడ్డిని కస్టడీకి కోరనున్న సిట్!రిమాండ్ విధించే అవకాశం?అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులు మద్యం అక్రమ కేసులో చంద్రబాబు సర్కార్ బరి తెగింపుఆధారాల్లేని లిక్కర్ స్కాంలో.. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌విచారణ పేరిట పిలిచి మరీ అరెస్ట్ చేసిన సిట్‌రాజకీయ కక్షతో పెద్దిరెడ్డి కుటుంబాన్ని వేధిస్తోన్న చంద్రబాబునేడు జడ్జి ఎదుట హాజరుపరిచే అవకాశంమిథున్‌రెడ్డిని రిమాండ్ కోరనున్న సిట్‌మద్యం మాఫియా మూలవిరాట్టు చంద్రబాబే 👉పూర్తి కథనం కోసం క్లిక్ చేయండిమద్యం స్కామ్.. ఓ కట్టుకథరెడ్ బుక్ రాజ్యాంగానికి రెడ్ కార్పెట్ వేసే పాలన సాగిస్తున్నారు.ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానుమద్యం స్కామ్ అనేది ఒక కట్టు కథవైయస్సార్సీపి నేతలను అరెస్టు చేయడం కోసమే మద్యం స్కామ్ ను తెరపైకి తెచ్చారు.వైయస్ జగన్ సన్నిహితులపై అక్రమ కేసులు పెడుతున్నారువైయస్‌ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి శునక ఆనందం పొందుతున్నారు..కూటమి నేతల తప్పుడు కేసులకు ఎవరూ భయపడరు.:::అరకు ఎంపీ తనుజారాణిఅబద్ధాలపుట్టగా ఛార్జ్‌షీట్‌లేని మద్యం కేసును సృష్టించి చంద్రబాబు కుట్రలుఅవాస్తవ వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కుతంత్రంలేని కుంభకోణం ఉన్నట్లుగా చూపే పన్నాగంఅబద్ధాల పుట్టగా చార్జ్‌షీట్ దాఖలుపెరిగిన నిందితులుమొత్తం 48కి పెరిగిన నిందితుల సంఖ్య 👉పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి మాఫియా డాన్ చంద్రబాబే2014-19 మధ్య యథేచ్ఛగా చంద్రబాబు దోపిడీఖజానాకు గండికొట్టి అస్మదీయులకు దోచిపెట్టిన బాబురూ.25 వేల కోట్లకు మించి అక్రమాలుసీఐడీ కేసులో ఇప్పటికీ బెయిల్‌పైనే చంద్రబాబుఅప్పటి దందానే నేడూ కొనసాగిస్తున్న వైనం!తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ కేసులు..అరెస్టులు👉పూర్తి కథనం కోసం క్లిక్ చేయండిమిథున్‌రెడ్డి అరెస్ట్ అక్రమం: వైఎస్సార్‌సీపీఇది స్కామ్ కాదు.. చంద్రబాబు ప్రతీకార డ్రామా: వైఎస్సార్‌సీపీలేని మద్యం కేసును సృష్టించి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్ మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఏమాత్రం సంబంధం లేని వారందరినీ కక్షపూరితంగా కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేసిన తీరుని వైయస్ఆర్… pic.twitter.com/CiIR4DyA1U— YSR Congress Party (@YSRCParty) July 19, 2025ఏడాది పాలనలో @ncbn చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని లేదు. ఆయన పాలన గురించి ఎవరూ ప్రశ్నించకూడదనే లేని లిక్కర్ కేసును సృష్టించి ఇలా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారు. ఆయన పాపం పండే రోజు కూడా వస్తుంది. @MithunReddyYSRC గారి అక్రమ అరెస్టును…— Roja Selvamani (@RojaSelvamaniRK) July 19, 2025రాష్ట్రంలో జరుగుతున్నది సుపరిపాలన కాదు, అరాచకపాలన. అధికారం ఉంది కదా అని లేని లిక్కర్ కేసును సృష్టించి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడం మంచి పద్ధతి కాదు. మా ఎంపీ @MithunReddyYSRC గారి అక్రమ అరెస్టును ఖండిస్తున్నా. @ncbn గారూ అధికారం శాశ్వతం…— Rajini Vidadala (@VidadalaRajini) July 19, 2025మిథున్‌రెడ్డి అన్న అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది #westandwithMidhunReddy pic.twitter.com/Pwr0hKRVnQ— Nandigam Suresh Babu - YSRCP (@NandigamSuresh7) July 19, 2025#SadistChandraBabu@ncbn లో రాజకీయ కక్ష తారా స్థాయికి చేరింది. అందులో భాగంగానే అసలు లేని అవినీతిని ఉందన్నట్లుగా ప్రజలకు భ్రమ కల్పించడమే బాబు లక్ష్యం. అందులో భాగంగానే మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు.-మల్లాది విష్ణు గారు, మాజీ ఎమ్మెల్యే pic.twitter.com/2ENNFeGgqj— YSR Congress Party (@YSRCParty) July 19, 2025#SadistChandraBabuప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తూ కూటమి ప్రభుత్వం ఒక రాక్షస క్రీడను ప్రారంభించింది. అందులో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను.-పర్వతరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ pic.twitter.com/Lp44S1Jp67— YSR Congress Party (@YSRCParty) July 19, 2025లిక్కర్ స్కామ్ అంటారు… కానీ:ఆధారం లేదుడబ్బు సీజ్ కాలేదుమద్యం లభించలేదుచార్ట్ షీట్ లో పేరు లేదు ..కానీ అరెస్ట్ ఉంది ఎందుకంటే టార్గెట్ జగన్ అన్న @ysjagan ఈ కుట్రలో మిథున్ అన్నను @MithunReddyYSRC కూడా లాగారు.ఇది స్కామ్ కాదు… ఇది @ncbn చంద్రబాబు గారి ప్రతీకార డ్రామా.… pic.twitter.com/LJu64TEgqe— Dr.Anil Kumar Yadav (@AKYOnline) July 19, 2025#SadistChandraBabuవైఎస్సార్సీపీని ఎదుర్కొనే ధైర్యం లేక @ncbn… అక్రమ కేసుల రూపంలో కక్ష తీర్చుకుంటున్నాడు. ఇది రాజకీయ అరాచకమే.ఎంపీ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను.-అరకు ఎంపీ గుమ్మా తనూజ రాణి గారు pic.twitter.com/cG0dQB2SuY— YSR Congress Party (@YSRCParty) July 19, 2025మిథున్ రెడ్డి అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపుపెద్దిరెడ్డి కుటుంబాన్ని, వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యంరాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్‌లులేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి అరెస్ట్‌లు చేస్తున్నారు ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులుఇది… pic.twitter.com/3YO54cIp9I— Rachamallu Siva Prasad Reddy (@rachamallu_siva) July 19, 2025

లేని లిక్కర్ స్కాం ఉన్నట్టుగా.. వాళ్లే టార్గెట్‌గా సిట్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రాజకీయ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. లేని లిక్కర్ స్కాం పేరుతో వైఎస్సార్సీపీ కీలక నాయకుల అరెస్టుల పర్వం సాగుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా 11 మంది అరెస్టు చేయగా.. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డిని కూడా సిట్ అరెస్టు చేసింది. ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేసి 48 మంది పేర్లను ఛార్జిషీటులో సిట్ పేర్కొంది. మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కీలక నేతల అరెస్టే లక్ష్యంగా సిట్ అధికారులు పనిచేస్తున్నారు.నిజానికి చంద్రబాబు హయాంలో కంటే వైఎస్ జగన్ జగన్ హయాంలోనే ప్రభుత్వానికి ఎక్కువగా వచ్చింది. అయినప్పటికీ రూ.3 వేల కోట్లు పక్కదారి పట్టాయంటూ తప్పుడు కేసు నమోదు చేశారు. రూ.50 వేల కోట్లు కొట్టేశారంటూ అసెంబ్లీలో చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారు. రూ.35 వేల కోట్లు అంటూ పవన్ కల్యాణ్ బొంకారు. ప్రభుత్వ పెద్దలు నోటి కొచ్చినట్లు మాట్లాడుతూ లేని స్కాంని ఉన్నట్టు భేతాళ కథలు అల్లుతున్నారు.టీడీపీ కేంద్ర కార్యాలయంలో తయారయ్యే స్క్రిప్టునే ఛార్జిషీటు, రిమాండ్ రిపోర్టుల్లో సిట్ పేర్కొంటుంది. ఎల్లోమీడియా తప్పుడు రాతలు, సిట్ తప్పుడు విచారణలపై వైఎస్సార్సీపీ మండిపడింది. కోర్టుల్లోనే న్యాయ పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ అంటోంది. ఇప్పటికే ఎంపీ మిథున్‌రెడ్డికి ఆ పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు.

అన్నదమ్ముల్ని పెళ్లాడిన యవతి.. ఇదెక్కడి ఆచారం!
ఒక వధువు.. ఇద్దరు పెండ్లి కొడుకులు.. పైగా అన్నదమ్ములు.. వివాహంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు వందలమంది హాజరై.. ఆ అరుదైన జంటను ఆశీర్వదించారు కూడా. ఈమధ్యకాలంలో జరిగే పరిణామాలతో పెళ్లంటేనే వణికిపోతున్న క్రమంలో.. ‘హవ్వా ఇదెక్కడి ఆచారం అనుకుంటున్నారా?’ అయితే ఈ కథనంలోకి పదండి.. హిమాచల్ ప్రదేశ్ సిరమూర్ జిల్లా షిల్లై గ్రామంలో జులై 12 నుంచి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. హట్టి తెగ జానపద పాటలతో, నృత్యాలతో అన్నదమ్ములైన ప్రదీప్, కపిల్‌లను సునీతా చౌహాన్ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ వేడుకకు హాజరై వాళ్లను ఆశీర్వదించారు కూడా. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రదీప్ స్థానికంగా ప్రభుత్వ ఉద్యోగి కాగా.. అతని సోదరుడు కపిల్ విదేశాల్లో జాబ్ చేస్తున్నాడు. కున్‌హట్ గ్రామానికి చెందిన సునీత పెద్దల మాటకు విలువ ఇచ్చే ఈ వివాహం చేసుకుందట. తమపై ఎవరి ఒత్తిడి లేదని, ఇష్టపూర్వకంగానే చేసుకున్నామని, పైగా ఇలా వివాహం చేసుకోవడం(polyandry) అనాదిగా తమ తెగలో వస్తున్న ఆచారమని చెబుతున్నారు. పైగా ఈ వివాహం తమకెంతో గర్వంగా ఉందని ఫొటో షూట్లో ఉత్సాహంగా పాల్గొంటూ చెప్పారు. Astonishing! Two real brother marry a Same Girl 👇In Shillai area of Sirmaur district, two real brothers have married the same girl. This has become a topic of discussion in the entire region. This tradition is ancient in the Giripar region but in today's modern era, due to the… pic.twitter.com/8fIOaeQtjs— Akashdeep Thind (@thind_akashdeep) July 19, 2025హట్టి తెగ ప్రజలు హిమాచల్ ప్రదేశ్-ఉత్తరాఖండ్ సరిహద్దులో ట్రాన్స్ గిరి రీజియన్‌లో 450 గ్రామాల్లో నివాసం ఉంటున్నారు. మూడేళ్ల కిందటే ఈ తెగకు షెడ్యూల్డ్ ట్రైబ్(గిరిజన తెగ.. ఎస్టీ) గుర్తింపు దక్కింది. అయితే వేల ఏళ్లుగా బహుభర్తృత్వం((polyandry)ను ఈ తెగ పాటిస్తోందట. అందుకు భూవివాదాలే ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. కుటుంబ ఐక్యత.. తద్వారా భూవివాదాలు లేకుండా ఉండేందుకే హట్టి తెగ ఈ ఆచారం మొదలుపెట్టిందట. సోదరుల మధ్య బంధం బలంగా ఉండి ఉమ్మడి కుటుంబంలో గొడవలు జరగవనేది మరో కారణం. అంతేకాదు.. ఇద్దరు భర్తలు ఉంటే తమ ఆడబిడ్డలకు రక్షణ బలంగా ఉంటుందని ఈ తెగవారు భావిస్తారట. అయితే.. మారుతున్న పరిస్థితులు, మహిళలు చదువుకోవడం, ఆర్థికంగా స్థితిగతులు మెరుగుపడడం.. కారణాలతో ఈ తరహా వివాహాలు అరుదుగా జరుగుతూ వస్తున్నాయి. ఈ తరహా వివాహాలకు అక్కడి రెవెన్యూ చట్టాలు కూడా సమ్మతిని తెలుపుతున్నాయి. జోడిధారా పేరుతో గత ఆరేళ్లలో ఈ తరహా వివాహాలు ఐదు జరిగాయని అధికారులు చెబుతున్నారు. హట్టి తెగలో ‘జాజ్దా’ పేరుతో ఈ వివాహ సంప్రదాయం కొనసాగుతుంది. పెళ్లి కూతురిని ఊరేగింపుగా పెళ్లి కొడుకులు ఉన్న ఊరికి తీసుకొస్తారు. అక్కడ వరుడి ఇంట సీంజ్ అనే పద్దతిలో పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. వాళ్ల భాషలో పంతులుగారు మంత్రాలు చదువుతూ.. పవిత్ర జలాన్ని వధువు- ఇద్దరు పెళ్లి కొడుకుల మీద జల్లుతాడు. ఆపై ఆ ముగ్గురు ఒకరికొరు బెల్లం తినిపించుకుంటారు. ఆఖర్లో కుల్ దేవతా ఆశీర్వాదంతో ఈ వివాహ తంతు ముగుస్తుంది. హిమాలయ పర్వతాల రీజియన్‌లోని కొన్ని తెగలు ఒకప్పుడు ఈ తరహా వివాహాలకు మక్కువ చూపించేవి. తమిళనాడులో తోడా అనే తెగ ఒకప్పుడు ఈ ఆచారం పాటించేది. అలాగే నేపాల్, కెన్యాలో కొన్ని తెగల్లో ఇప్పటికీ ఈ తరహా వివాహాలు జరుగుతున్నాయి.

అనుకున్నదే జరిగింది.. కరుణ్ నాయర్ గుడ్‌బై
అంతా ఊహించిందే జరిగింది. టీమిండియా వెటరన్ కరుణ్ నాయర్ విధర్బ జట్టుతో తెగదింపులు చేసుకున్నాడు. రాబోయే దేశవాళీ సీజన్లో తిరిగి కర్ణాటక తరపున ఆడేందుకు నాయర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. నాయర్ వ్యక్తిగత కారణాల వల్ల కర్ణాటకకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.కాగా 2022లో కర్ణాటక జట్టులో చోటు కోల్పోయిన కరుణ్ నాయర్.. తన మకాంను విధర్బకు మార్చాడు. ఈ క్రమంలో రెండు సీజన్ల( 2023, 2024) పాటు విధర్బకు నాయర్ ప్రాతినిథ్యం వహించాడు. ఈ రెండు సీజనల్లోనూ కరుణ్ అద్బుతంగా రాణించాడు. ముఖ్యంగా రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ సంచలన ప్రదర్శన కనబరిచాడు.గత సీజన్లో రంజీ ఛాంపియన్‌గా విధర్బ నిలవడంలో కరుణ్‌ది కీలక పాత్ర. ఈ టోర్నీలో 16 ఇన్నింగ్స్‌లలో 53.93 సగటుతో 863 పరుగులు చేసి నాలుగో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం విజయ్ హజారే ట్రోఫీలో (779 పరుగులు) కూడా తన సూపర్ ఫామ్‌ను కొనసాగించి విదర్భను రన్నరప్‌గా నిలబెట్టాడు.ఈ ప్రదర్శనల కారణంగా కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. నాయర్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు. కానీ ఇంగ్లండ్ గడ్డపై మాత్రం నాయర్ తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. 6 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 131 పరుగులు మాత్రమే చేశాడు.ఇక ఇది ఇలా ఉండగా.. కర్ణాటక సీనియర్ పేసర్ వాసుకి కౌశిక్ వచ్చే సీజన్లో గోవా తరపున ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమలో కౌశిక్ ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) నుండి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఈ విషయాన్ని గోవా క్రికెట్ అసోసియేషన్ ధ్రువీకరించింది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. బీసీసీఐ కీలక నిర్ణయం! ధోని శిష్యుడికి పిలుపు

20 ఏళ్లుగా కోమాలో.. సౌదీ ‘స్లీపింగ్ ప్రిన్స్’ కన్నుమూత
సౌదీ అరేబియా ప్రిన్స్ అల్వలీద్ బిన్ ఖలెద్(36) ఇక లేరు. గత 20 ఏళ్లుగా కోమాలో ఉన్న ఆయన.. శనివారం కన్నుమూశారు. ఈ కారణంగానే సౌదీ అరేబియా స్లీపింగ్ ప్రిన్స్‌గా ఈయనకంటూ ఓ పేరు ముద్రపడిపోయింది. ప్రిన్స్ అల్వలీద్ బిన్ ఖలెద్ సౌదీ అరేబియా రాజ కుటుంబానికి చెందినవారు. ఆయన ప్రిన్స్ ఖలెద్ బిన్ తలాల్ అల్ సౌద్ పెద్ద కుమారుడు. 2005లో లండన్‌లోని మిలిటరీ అకాడమీలో చదువుకుంటున్న టైంలో ఖలెద్ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. మెదడులో రక్తస్రావం జరిగి.. వెంటిలేటర్‌పై కోమాలో ఉంటూ ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఖలెద్ కోసం అమెరికా, స్పెయిన్ నుండి నిపుణులు కూడా చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జూలై 20న రియాద్‌లో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. Statement On the Passing of Prince Alwaleed bin Khaled bin Talal Al Saud pic.twitter.com/st19kxb7lC— Global Imams Council (GIC) (@ImamsOrg) July 19, 2025 View this post on Instagram A post shared by @arabianroyalagency

మద్యం మాఫియా మూలవిరాట్టు చంద్రబాబే!
వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు వెనుక పక్కా పన్నాగం దాగుంది. ఎందుకంటే గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తెగించి పాల్పడిన మద్యం దోపిడీని కప్పిపుచ్చే కుతంత్రం ఉంది. అసలు రాష్ట్రంలో మద్యం దందాకు ఆద్యుడు చంద్రబాబే అన్నది బహిరంగ రహస్యం. మద్యం మాఫియాను పెంచి పోషించిన వ్యవస్థీకృత దందాను స్థిర పరచింది ఆయనే. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అస్మదీయుల కంపెనీలకు అడ్డగోలు లబ్ధి కలిగించారు. అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ రెండు చీకటి జీవోలతో కుంభకోణానికి పాల్పడ్డారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున 2015 నుంచి 2019 వరకు రూ.5,200 కోట్లు గండికొట్టారు. ఈ విషయాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు కూడా. ఇక టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలో 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు.. వాటికి అనుబంధంగా 4,380 పర్మిట్ రూమ్‌లు.. 43 వేల బెల్ట్ దుకాణాలతో మద్యం ఏరులై పారించారు. ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి, ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. వెరసి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతో సహా బయట పడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్‌గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పుటి సీఎం చంద్రబాబు, తదితరులపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు అప్పటి నుంచి ముందస్తు బెయిల్‌పైనే ఉన్నారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మద్యం విధానం ముసుగులో మహా దోపిడీకి మరోసారి తెగబడ్డారు. 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్‌కు ఏకపక్షంగా కట్టబెట్టడంతోపాటు ఏకంగా 75 వేల బెల్ట్ దుకాణాలతో భారీ దోపిడీకి బరితెగించారు. టీడీపీ ప్రభుత్వంలో గతంలో చేసిన దోపిడీ.. ప్రస్తుతం బరితెగించి సాగిస్తున్న దోపిడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సిట్ ద్వారా మద్యం అక్రమ కేసు కుట్రకు తెగబడ్డారు. ‘ప్రివిలేజ్’గా ఖజానాకు గండి కొట్టారుమద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజు ప్రభుత్వానికి ఆదాయ వనరు. ఆ ఫీజును గుట్టుచప్పుడు కాకుండా రద్దు చేస్తే ఖజానాకు గండి పడుతుంది. సీఎం హోదాలో నోట్ ఫైళ్లపై సంతకాల సాక్షిగా ఆ నిర్వాకం చంద్రబాబుదే. మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ 2015లో రెండు చీకటి జీవోలతో ప్రివిలేజ్ పన్నును రద్దు చేశారు చంద్రబాబు. తద్వారా టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాలు, బార్ల యజమానులకు అడ్డగోలుగా ప్రయోజనం కలిగించారు. ఇలా నాలుగేళ్లలోనే రూ.5 వేల కోట్లు కొల్లగొట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇలాంటి ఒక్క చీకటి జీవోను కూడా జారీ చేయనేలేదు.తమవారికి దోచిపెట్టారు2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం నాలుగు డిస్టిలరీల నుంచే ఏకంగా 53.21 శాతం మద్యం కొన్నారు. సి–టెల్ అనే సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టి మరీ దందా సాగించారు. ఆ విషయాన్ని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ నివేదికే వెల్లడించింది కూడా. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం కేవలం కొన్ని డిస్టిలరీలకే ప్రయోజనం కలిగించలేదు. లోపభూ యిష్టమైన సి–టెల్‌సాఫ్ట్‌వేర్‌ను తొలగించింది. సగటున ప్రతి డిస్టిలరీకీ 5 శాతం నుంచి 10% ఆర్డర్లు వచ్చేలా పారదర్శకంగా వ్యవహరించింది.

‘బేబీ గ్రోక్’ వస్తుంది.. పిల్లల కోసం ప్రత్యేక ఏఐ యాప్
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎక్స్ఏఐ పిల్లల కోసం ప్రత్యేక ఏఐ చాట్‌బాట్ యాప్‌ను తీసుకురానుంది. తమ గ్రోక్ చాట్‌బాట్‌కు కిడ్-ఫ్రెండ్లీ వెర్షన్‌ను రూపొందించే పనిలో ఉన్నట్లు ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్) పోస్ట్ చేశారు.'ఎక్స్ఏఐలో బేబీ గ్రోక్ అనే యాప్‌ను రూపొందించబోతున్నాం' అని మస్క్ తాజాగా ట్వీట్ చేశారు. పిల్లలకే ప్రత్యేకమైన కంటెంట్‌తో ఈ యాప్‌ను రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త వెర్షన్ యువ వినియోగదారుల కోసం రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ గా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు, అయితే మరిన్ని వివరాలను ఇంకా ప్రకటించలేదు.మస్క్ యాజమాన్యంలోని ఎక్స్ స్పామ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ప్లాట్‌ఫామ్‌పై కొత్త గ్రోక్ ప్రస్తావనలను తాత్కాలికంగా నిలిపివేసిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. మరోవైపు వైరల్ వీడియోలను జనరేట్ చేయడానికి, దాని సృజనాత్మక సాధనాలను మరింత విస్తరించడానికి వీలు కల్పించే ‘ఇమాజిన్’ అనే కొత్త సామర్థ్యాన్ని ‘గ్రోక్’కు జోడించే పనిలో ఉన్నట్లు కూడా మస్క్ ఇటీవల వెల్లడించారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం ఇటీవల విస్తృతంగా పెరిగింది. ముఖ్యంగా పిల్లల్లో ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతోంది. కొన్ని నివేదికల ప్రకారం.. 44 శాతం మంది పిల్లలు జనరేటివ్ ఏఐని చురుగ్గా ఉపయోగిస్తున్నారు. ఇందులో తమ స్కూల్ వర్క్ లేదా హోమ్ వర్క్ చేయడానికే 54 శాతం వినియోగం ఉంటోంది.We’re going to make Baby Grok @xAI, an app dedicated to kid-friendly content— Elon Musk (@elonmusk) July 20, 2025

ఏందిరా నీ ఓవరాక్షన్.. నువ్వేం పీకలేవురా.. రేయ్
తాడిపత్రి టౌన్: ‘ఏందిరా నీ ఓవరాక్షన్ .. నువ్వేం పీకలేవు రా.. రేయ్’ అంటూ మూడు రోజుల క్రితం అనంతపురం నగరంలోని జెడ్పీ కార్యాలయం వద్ద జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) నాగరాజు నాయుడుపై తాడిపత్రి మునిసిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి బూతులతో రెచ్చిపోయిన విషయం విదితమే. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘జేసీ రౌడీయిజం.. రెడ్‌బుక్ పాలన’ శీర్షికతో ఆ వీడియోను ప్రజాస్వామ్యవాదులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఖండిస్తున్నారు. డీపీవో నాగరాజు నాయుడును ఉద్దేశించి...‘రేయ్ వాణ్ని పట్టుకో’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులను పురమాయించడం వీడియోలో ఉంది. ‘రేయ్ మర్యాద ఇచి్చన.. నువ్వు నోరు మూసుకో.. మూసుకో నా కొడకా.. లంచం దెం.. ఎప్పుడురా జాయింట్ కలెక్టర్ నీకిచి్చంది’ అనగానే డీపీవో నాగరాజు నాయుడు జేసీ వైపు చూశారు. దీంతో జేసీ ప్రభాకర్.. ‘ఏం అట్ల చూస్తావ్?! పీకలేవు రా రేయ్’ అంటూ దుర్భాషలాడుతూ కొట్టేవిధంగా డీపీవో మీదకు వెళ్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డిని అనుచరుడు పొట్టి రవి అడ్డుకోవడం కనిపించింది.

చేతులతో పాముని పట్టుకున్న సోనూ సూద్.. వీడియో వైరల్
పాము ఉందని తెలిస్తేనే ఆమడ దూరం పరుగెడతాం. కళ్లకు కనిపిస్తే.. భయంతో వణికిపోతాం. ఇక సినిమా వాళ్లకు పాము అంటే భయం ఇంకాస్త ఎక్కువనే చెప్పాలి. వాళ్లు రియల్ లైఫ్‌లో పాములను రేర్‌గా చూస్తుంటారు. చిన్న బల్లికే భయపడే స్టార్స్ చాలా మందే ఉన్నారు. కానీ ‘రియల్ హీరో’, నటుడు సోనూ సూద్(Sonu Sood ) మాత్రం పెద్ద పాముని తన చేతులతో పట్టుకున్నాడు. ఆ పాముని చూసి తన సిబ్బంది అంతా భయంతో దూరం జరిగితే.. ఆయన మాత్రం చాకచక్యంగా దాన్ని పట్టుకొని..అడవిలో విడిపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ముంబైలో సోనూ సూద్ నివాసం ఉండే సొసైటీలోకి ఈ పాము దారితప్పి వచ్చింది. పాముని చూసి అంతా భయంతో దూరంగా వెళ్లిపోయారు. సోనూ సూద్ మాత్రం ఉత్త చేతులతో దాన్ని పట్టుకొని సంచిలో బంధించాడు. అనంతరం దాన్ని సురక్షిత ప్రాంతంలో వదిలి పెట్టాలని తన సిబ్బందికి సూచించారు. అయితే తనలాగా ఇలాంటి స్టంట్లు చేయకుండా.. ఇళ్లలోకి పాములు ప్రవేశిస్తే నిపుణులను పిలించి మాత్రమే పట్టుకోవాలన్నారు. తన ఇంట్లోకి వచ్చిన పాము ర్యాట్ స్నేక్ (జెర్రిపోతు) అని, అది విషపూరితమైనది కాదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో పాముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.हर हर महादेव 🔱❤️#harharmahadev🙏🌿🕉️ pic.twitter.com/u500AcrlxS— sonu sood (@SonuSood) July 19, 2025

WCL: భారత్-పాక్ మ్యాచ్ రద్దు.. అఫ్రిదిపై వేటు!
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నీలో నేడు జరగాల్సిన పాకిస్తాన్ భారత్ మ్యాచ్ రద్దైంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లాండ్ బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ మైదానం వేదికగా షెడ్యూల్ ప్రకారం ఆదివారం రాత్రి 9గం. భారత ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య జరగాల్సి ఉంది. అయితే పాక్‌తో మ్యాచ్‌ను భారత ప్లేయర్లు బాయ్‌కాట్ చేసిన నేపథ్యం, ప్రజల మనోభావాలు దెబ్బ తిన్న నేపథయంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే పాయింట్ల విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.పాకిస్థాన్‌తో ఎలాంటి క్రికెట్ ఆడకూడదని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పహల్గాం దాడి తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు డబ్ల్యూసీఎల్లో ఇరు జట్లూ తలపడనున్న నేపథ్యంలో చాలా విమర్శలు వచ్చాయి. ఇంకోవైపు.. పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు మాజీ క్రికెటర్లకు ఎవరు అనుమతి ఇచ్చారంటూ? ప్రశ్నలు తలెత్తాయి. Dear all , pic.twitter.com/ViIlA3ZrLl— World Championship Of Legends (@WclLeague) July 19, 2025ఈ నేఫథ్యంలో.. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్, మాజీ ఆల్‌రౌండర్ సురేష్ రైనా, మాజీ ఆల్‌రౌండర్లు ఇర్ఫాన్, యూసుఫ్ పఠాన్లు డబ్ల్యూసీఎల్ 2025లో పాకిస్తాన్ మ్యాచ్ నుంచి తప్పుకున్నారు. పహల్గామ్ దాడి, ఆ తరువాత జరిగిన పరిణామాలు వారి నిర్ణయంకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌పై సోషల్ మీడియాలోనూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ నుంచి తప్పుకున్నారని స్పష్టమైంది.ఈ మ్యాచ్‌లో తాను ఆడేది లేదని.. సదరు విషయాన్ని డబ్ల్యూసీఎల్ ఆర్గనైజర్లకు ఇప్పటికే చెప్పినట్లు శిఖర్ ధావన్ వెల్లడించాడు. మే 11నే లీగ్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లినట్లు మెయిల్ స్క్రీన్షాట్లను ధావన్ పంచుకున్నాడు. ‘‘ఈ లీగ్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడకూడదని మే 11నే నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. నాకు నా దేశమే ముఖ్యం. దేశం కంటే ఏదీ ఎక్కువ కాదు. జై హింద్’’ అని మెయిల్ స్క్రీన్‌షాట్‌ను ధావన్ పోస్టు చేశాడు.ఇంకోవైపు.. పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ భారత్‌పై, భారత ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయగా దుమారం రేగింది. ఈ పరిణామాల నేపథ్యంలో అఫ్రిదీపై డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు వేటు వేసినట్లు తెలుస్తోంది. డబ్ల్యూసీఎల్ పోస్టర్ నుంచి అఫ్రిదీ ఫొటోను నిర్వాహకులు తొలగించారు. మిగతా మ్యాచ్‌లకూ అతన్ని దూరం పెట్టే యోచనలో నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం.
ధోతికట్టు..అదిరేట్టు..!
అబ్బా.. ఇంటికి ఏముంది ఎలివేషన్!
అంబేద్కర్ పేరుతో రూ.100 కోట్లకు కుచ్చుటోపీ.. బయటపడింది ఇలా
నెల్లూరులో కుబేర సినిమా తరహా స్కామ్
గొర్రెల కాపరి నుంచి.. డ్రగ్స్ డాన్‌గా ఎదిగి..
సగం పారితోషికమే తీసుకున్న హీరో.. రుణపడి ఉంటానన్న నిర్మాత
అందాల అనుపమా ఇష్టపడే ఫ్యాషన్ స్టైల్ వేరెలెవెల్..!
ఆస్ట్రేలియా తుది జట్టు ప్రకటన.. డేంజరస్ ప్లేయర్ అరంగేట్రం
పాక్‌లో వర్ష బీభత్సం.. 200 మంది మృతి
‘బేబీ గ్రోక్’ వస్తుంది.. పిల్లల కోసం ప్రత్యేక ఏఐ యాప్
రామ్‌చరణ్ సాయం..? ఒక్క రూపాయి రాకుండా చేశారు: ఫిష్ వెంకట్ కూతురు
కెప్టెన్‌గా నితీశ్ కుమార్ రెడ్డి
పుట్టెడు దుఃఖం, డిప్రెషన్.. అక్క కోసం ఇండియాకు వచ్చేశా: శిల్ప శిరోద్కర్
Junior Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ
'జూనియర్' కలెక్షన్.. మొదటిరోజు అన్ని కోట్లా?
పైలట్ ‘మాస్ మర్డర్-సూసైడ్’
ఓటీటీలోకి మలయాళ క్రైమ్ డ్రామా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో నూతనోత్సాహం
కుటుంబ సభ్యుల మోసం.. నాన్న కొత్త ప్రయాణం: అనసూయ
వెల్కం టూ అమెరికా! మీకు వీసా ఉన్నా మీ వెంటే ఉండి గమనించమని ట్రంప్ చెప్పారు..!
స్వామీ! మీరే కాపాడాలి.. ఎక్కడ మద్యం కేసులయినా మమ్మల్నే అందులోకి లాగుతున్నారు!
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. శుభవార్తలు వింటారు
ఈ రాశి వారికి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి
కాంగ్రెస్‌కు శశిథరూర్లాగా మనకూ ఈయన అలాగే ఉన్నాడనిపిస్తుంది సార్!
మీరే సేవ చేయించుకుంటున్నారు! ఇక మీరెక్కడ సేవ చేస్తారు!!
ప్రెగ్నెన్సీ ప్రకటించిన బిగ్‌బాస్ సోనియా.. ప్రాజెక్ట్ సక్సెస్ అంటూ రివీల్!
హైదరాబాద్‌లో బరితెగిస్తున్న బ్లడీ చీటర్స్
ఇద్దరితో సహజీవనం.. అతడితో పెళ్లి.. భార్యకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి..
ముగిసిన టీసీఎస్ బెంచ్ పాలసీ గడువు
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ ‘జాడ’ కనిపెట్టేశారు..!
ధోతికట్టు..అదిరేట్టు..!
అబ్బా.. ఇంటికి ఏముంది ఎలివేషన్!
అంబేద్కర్ పేరుతో రూ.100 కోట్లకు కుచ్చుటోపీ.. బయటపడింది ఇలా
నెల్లూరులో కుబేర సినిమా తరహా స్కామ్
గొర్రెల కాపరి నుంచి.. డ్రగ్స్ డాన్‌గా ఎదిగి..
సగం పారితోషికమే తీసుకున్న హీరో.. రుణపడి ఉంటానన్న నిర్మాత
అందాల అనుపమా ఇష్టపడే ఫ్యాషన్ స్టైల్ వేరెలెవెల్..!
ఆస్ట్రేలియా తుది జట్టు ప్రకటన.. డేంజరస్ ప్లేయర్ అరంగేట్రం
పాక్‌లో వర్ష బీభత్సం.. 200 మంది మృతి
‘బేబీ గ్రోక్’ వస్తుంది.. పిల్లల కోసం ప్రత్యేక ఏఐ యాప్
రామ్‌చరణ్ సాయం..? ఒక్క రూపాయి రాకుండా చేశారు: ఫిష్ వెంకట్ కూతురు
కెప్టెన్‌గా నితీశ్ కుమార్ రెడ్డి
పుట్టెడు దుఃఖం, డిప్రెషన్.. అక్క కోసం ఇండియాకు వచ్చేశా: శిల్ప శిరోద్కర్
Junior Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ
'జూనియర్' కలెక్షన్.. మొదటిరోజు అన్ని కోట్లా?
పైలట్ ‘మాస్ మర్డర్-సూసైడ్’
ఓటీటీలోకి మలయాళ క్రైమ్ డ్రామా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో నూతనోత్సాహం
కుటుంబ సభ్యుల మోసం.. నాన్న కొత్త ప్రయాణం: అనసూయ
వెల్కం టూ అమెరికా! మీకు వీసా ఉన్నా మీ వెంటే ఉండి గమనించమని ట్రంప్ చెప్పారు..!
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. శుభవార్తలు వింటారు
స్వామీ! మీరే కాపాడాలి.. ఎక్కడ మద్యం కేసులయినా మమ్మల్నే అందులోకి లాగుతున్నారు!
ఈ రాశి వారికి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి
కాంగ్రెస్‌కు శశిథరూర్లాగా మనకూ ఈయన అలాగే ఉన్నాడనిపిస్తుంది సార్!
మీరే సేవ చేయించుకుంటున్నారు! ఇక మీరెక్కడ సేవ చేస్తారు!!
ఇద్దరితో సహజీవనం.. అతడితో పెళ్లి.. భార్యకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి..
ప్రెగ్నెన్సీ ప్రకటించిన బిగ్‌బాస్ సోనియా.. ప్రాజెక్ట్ సక్సెస్ అంటూ రివీల్!
హైదరాబాద్‌లో బరితెగిస్తున్న బ్లడీ చీటర్స్
ముగిసిన టీసీఎస్ బెంచ్ పాలసీ గడువు
ఈగల్ టీమ్‌కు చిక్కిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, హెచ్ఆర్ మేనేజర్లు..!
సినిమా

పాన్ ఇండియా కాదు... పాన్ వరల్డ్
ఇండియన్ సినిమా రేంజ్ మారిపోతోంది. ప్రపంచమంతా ఇండియన్ సినిమావైపు చూస్తోంది. జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్, జేజే అబ్రామ్స్, డేనియల్ క్వాన్ వంటి... హాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్‌మేకర్స్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను మెచ్చుకున్న విషయాన్ని అంత త్వరగా మర్చిపోలేము. మన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు వచ్చిన ఆస్కార్ అవార్డునూ మర్చిపోలేము. ఈ ప్రోత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకుని భారతీయ ఫిల్మ్ మేకర్స్ హాలీవుడ్ రేంజ్‌కి తగ్గ సినిమాలను సిద్ధం చేస్తున్నారు. అలా పాన్ ఇండియా కాదు... పాన్ వరల్డ్ రేంజ్లో సినిమాలు చేస్తున్న కొందరు హీరో–దర్శక–నిర్మాతలపై ఓ లుక్ వేయండి.ఇంటర్నేషనల్ ప్లాన్‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్నారు. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మాధవన్ ఓ కీలక పాత్రలో నటిస్తారని, అతనిది మహేశ్‌బాబు తండ్రి పాత్ర అనే ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఫారెస్ట్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాల చిత్రీకరణ కోసం యూనిట్ విదేశాలకు వెళ్లనుంది. ఇంతవరకు బాగానే ఉంది.కానీ... ప్రతిసారీ తన సినిమా అనౌన్స్మెంట్ సమయంలోనో లేదా షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజుల తర్వాతనో తన సినిమా గురించి ఓ మీడియా సమావేశం నిర్వహించి, ఆ సినిమా కథ క్లుప్తంగా చెబుతారు రాజమౌళి. ఆ సమావేశం లోనే నటీనటుల వివరాలు, షూటింగ్ షెడ్యూల్స్, రిలీజ్ వివరాలు ఉండేవి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. కానీ మహేశ్‌బాబుతో చేస్తున్న సినిమా విషయంలో రాజమౌళి ఈ పంథాను ఫాలో కాలేదు. ఆ మాటకొస్తే... ఇప్పటివరకు రాజమౌళి–మహేశ్‌బాబు సినిమా గురించిన పూర్తి స్థాయి అధికారిక ప్రకటనే రాలేదు. మరి... దీని వెనక కారణం ఏంటో రాజమౌళికే తెలియాలి.ఆస్కార్ ప్లాన్: 95వ ఆస్కార్ అవార్డ్స్లోని ఉత్తమ విదేశీ చిత్రం విభాగం కోసం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంపిక అవుతుందని సినిమా లవర్స్ ఊహించారు. కానీ ఈ విభాగంలో భారతదేశం తరఫున ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో (ఇంగ్లిష్‌లో ‘లాస్ట్ ఫిల్మ్ షో’)ను ఎంపిక చేసింది. కానీ ‘లాస్ట్ ఫిల్మ్ షో’ సినిమాకు ఆస్కార్ రాలేదు. అయితే ఆస్కార్ కన్సిడరేషన్కు ‘ఆర్ఆర్ఆర్’ను పంపి, ఆస్కార్ కమిటీ రూల్స్‌ను ఫాలో చేసి, మొత్తానికి ఆస్కార్ బరిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రాజమౌళి అండ్ టీమ్ నిలపగలిగింది.ఓ దశలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో లీడ్ యాక్టర్స్‌గా చేసిన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు కూడా బెస్ట్ యాక్టర్ విభాగంలో నామినేషన్స్ వస్తాయేమో అన్నట్లుగా హాలీవుడ్ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఇది జరగలేదు కానీ... ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘నాటు నాటు’ పాటకు కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. కానీ ఈసారి ఆ తరహా ఇబ్బందులు ఏవీ రాకూడదని, ఓ హాలీవుడ్ ప్రముఖప్రోడక్షన్ సంస్థతో భాగస్వామ్యం కావాలని రాజమౌళి ప్రణాళికలు రచిస్తున్నారట. ఇలా ఓ హాలీవుడ్ ప్రముఖ నిర్మాణసంస్థతో భాగం అయితే, తమ సినిమా కూడా ఇంగ్లిషవిదేశీ స్పిరిట్‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయారు ప్రభాస్. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా సినిమాగానే రిలీజ్ అవుతోంది. కానీ సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్లో ప్రభాస్ చేయనున్న ‘స్పిరిట్’ మాత్రం భారతీయ భాషలతో పాటు జపాన్, చైనీస్, కొరియన్ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ విషయాన్ని ‘స్పిరిట్’ సినిమా అనౌన్స్మెంట్ సమయంలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అయితే ఈ సినిమా చిత్రీకరణ ఇంకాప్రారంభం కాలేదు. ప్రస్తుతం ‘రాజా సాబ్, ఫౌజి’ సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల తర్వాత ‘స్పిరిట్’ సినిమా షూటింగ్నుప్రారంభిస్తారు ప్రభాస్. ఈ సినిమాలో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఇందులో త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తారు. కొరియన్ యాక్టర్ డాన్ లీ ‘స్పిరిట్’ సినిమాలో విలన్‌గా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రణయ్ వంగా రెడ్డి, భూషణ్‌కుమార్ ఈ సినిమాను నిర్మించనున్నారు.గాడ్ ఆఫ్ వార్‘ఆర్ఆర్ఆర్’ (ఇందులో రామ్‌చరణ్ మరో లీడ్ రోల్ చేశారు) సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ పేరు సంపాదించుకున్నారు. ఈ గుర్తుంపుకి తగ్గట్లుగా అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమాను రిలీజ్ చేసేందుకు ఎన్టీఆర్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి హిట్ సినిమా తర్వాత హీరో ఎన్టీఆర్–దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ మైథాలజీ సినిమా రానుంది.గాడ్ ఆఫ్ వార్‌గా చెప్పుకునే కుమారస్వామి నేపథ్యంలో సాగే ఈ మైథాలజీ సినిమాను ‘రామాయణ’ తరహాలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తామని, వచ్చే ఏడాది షూటింగ్ప్రారంభం అవుతుందని నిర్మాత నాగవంశీ ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను నిర్మించాలనుకుంటున్నారు కాబట్టి అదే స్థాయిలో రిలీజ్‌ను ప్లాన్ చేస్తారు మేకర్స్. పైగా ఎన్టీఆర్ ఓ లీడ్ రోల్లో నటించిన స్పై యాక్షన్ డ్రామా ‘వార్ 2’ ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ వెర్షన్ థియేటర్స్‌లో విడుదలవుతోంది. ఇది కూడా ఎన్టీఆర్‌కు బాగా కలిసొచ్చే అంశమే. ఇక హృతిక్ రోషన్, కియారా అద్వానీ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ‘వార్ 2’ సినిమా ఆగస్టు 14న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.తెలుగు హీరో వర్సెస్ హాలీవుడ్ విలన్హీరో అల్లు అర్జున్–దర్శకుడు అట్లీ కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రానుంది. ఈ సినిమా కోసం ఓ సరికొత్త లోకాన్నే సృష్టిస్తున్నారట అట్లీ. కొన్ని హాలీవుడ్ సినిమాల్లో కనిపించే మాదిరి ఈ చిత్రంలోనూ కొన్ని విచిత్రమైన జంతువులు, జీవరాసులు కనిపిస్తాయట. ఆ దిశగా అల్లు అర్జున్, అట్లీ అండ్ టీమ్ సినిమాను సిద్ధం చేస్తున్నారని టాక్. ఈ సినిమాలో అల్లు అర్జున్ నాలుగు పాత్రల్లో కనిపిస్తారని, తాత–తండ్రి–ఇద్దురు కొడుకులు... ఇలా విభిన్నమైన పాత్రల్లో అల్లు అర్జున్ కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. అలాగే ఐదుగురు హీరోయిన్స్ కూడా ఉంటారట. వీరిలో దీపికా పదుకోన్ కన్ఫార్మ్ అయిపోయారు. మిగిలిన హీరోయిన్స్ పాత్రలకు రష్మికా మందన్నా, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, భాగ్య శ్రీ బోర్సే, ఆలియా ఎఫ్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి.అలాగే ఈ సినిమాలోని విలన్ పాత్రల కోసం విన్ డిజీల్, ది రాక్...వంటి హాలీవుడ్ స్టార్ యాక్టర్స్ పేర్లను మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇలా అయితే తమ సినిమాను హాలీవుడ్ రేంజ్లో విడుదల చేసేటప్పుడు బాగుంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట. దాదాపు రూ. 700 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను ఒకేసారి భారతీయ భాషలతో పాటు ఇతర విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేసేలా సన్నాహాలు మొదలు పెట్టారట అట్లీ అండ్ టీమ్. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన లాంగ్ షెడ్యూల్ ఆ మధ్య ముంబైలోప్రారంభమైంది. చిన్న బ్రేక్ రావడంతో అల్లు అర్జున్ వెకేషన్లో భాగంగా విదేశాలకు వెళ్లారట. వచ్చిన తర్వాత తిరిగి షూటింగ్ ఆరంభిస్తారు.రామాయణరూ. నాలుగువేల కోట్ల భారీ బడ్జెట్‌తో ‘రామాయణ’ (రెండు భాగాలు కలిపి) సినిమాను నిర్మిస్తున్నామని, ఈ చిత్రంతో ప్రపంచ సినిమా అంతా భారతదేశం వైపు చూస్తుందని, ఇందులో ఏ మాత్రం సందేహం లేదని ఈ చిత్ర నిర్మాత, డీఎన్ఈజీ (డబుల్ నెగటివ్) స్టూడియో అధినేత నమిత్ మల్హోత్రా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నమిత్ మల్హోత్రా వ్యాఖ్యలను బట్టి నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణ’ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని ఊహించవచ్చు. పైగా ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్లతో పాటు హాలీవుడ్లో అగ్రశ్రేణి స్టంట్ డైరెక్టర్లు టెర్రీ నోటరీ, గై నోరిస్, హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసినప్రోడక్షన్ డిజైనర్లు రవి బన్సాల్, రాంసే ఏవరీ వంటి బలమైన సాంకేతిక నిపుణులతో ‘రామాయణ’ రూపొందుతోంది.ఇక బడ్జెట్ పరంగా భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం‘రామాయణ’నే అవుతుంది. ఇంకా ‘డీఎన్ఈజీ’ స్టూడియో గ్రాఫిక్ వర్క్ చేసిన సినిమాల్లో 8 చిత్రాలు ఆస్కార్ అవార్డులను సాధించాయి. ఇవన్నీ ‘రామాయణ’ సినిమా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతోందని చెప్పడానికి కొన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇక ఈ హిందీ ‘రామాయణ’ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవిదూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుంది.‘రామాయణ పార్ట్ 1’ 2026 దీపావళికి, ‘రామాయణ పార్ట్ 2’ సినిమా 2027 దీపావళికి విడుదల కానున్నాయి. ఇటీవలేసూపర్ హీరోబాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్, తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సూపర్ హీరో సినిమా రానుంది. కార్తీతో ‘ఖైదీ 2’ సినిమా చేసిన తర్వాత, ఆమిర్ ఖాన్‌తో ఈ సూపర్ హీరో మూవీ చేస్తారు లోకేశ్ కనగరాజ్. కాగా ఈ సూపర్ హీరో సినిమాను గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రెడీ చేస్తామని, రిలీజ్ కూడా అంతర్జాతీయ స్థాయిలోనే ఉంటుందని ‘కూలీ’ సినిమా ప్రమోషన్స్‌లో చెప్పారు దర్శకుడు లోకేశ్ కనగరాజ్.2026 ద్వితీయార్ధంలో ఈ సినిమా షూటింగ్ప్రారంభం కానుంది. 2028లో విడుదలయ్యే చాన్సెస్ ఉన్నాయి. అలాగే ‘మహాభారతం’ ఆధారంగా ఆమిర్ ఖాన్ మూడు భాగాలుగా ఓ సినిమాలో నటించి, నిర్మించనున్నారు. ఈ ఆగస్టు నుంచి ఈ సినిమానుప్రారంభించనున్నట్లుగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ తెలిపారు. ఈ సినిమాను కూడా అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయాలన్నది ఆమిర్ ప్లాన్ అని బాలీవుడ్ టాక్.ఈ చిత్రాలతో పాటు మరికొన్ని పాన్ ఇండియా సినిమాలను పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ఆయా సినిమాల హీరోలు–దర్శక–నిర్మాతలు ప్రణాళికలు వేస్తున్నారు. – ముసిమి శివాంజనేయులు

పెద్ద సినిమా ఉంటేనే చిన్న సినిమాకి చాన్స్!: నిర్మాత ఏయం రత్నం
‘‘ఓ పెద్ద సినిమా రిలీజ్ అప్పుడు వీకెండ్లో టికెట్ ధరలు ఎక్కువ ఉండొచ్చన్నది నా ఉద్దేశం. విదేశాల్లో ఇలానే ఉంటుంది. కానీ మనోళ్లు ఫిక్స్ చేస్తే... వారమంతా ఒకటే రేట్ ఉంటుంది. వీక్ డేస్‌లో మామూలు ధరలు ఉంచి, వీకెండ్లో ధరలు పెంచుకునే సౌకర్యం ఉండాలి. అప్పుడు సినిమా టికెట్లు అందరికీ అందుబాటులో ఉంటాయి. ‘భారతీయుడు’ సినిమా సమయంలో కలెక్టర్స్ను రిక్వెస్ట్ చేసి, హైదరాబాద్, వైజాగ్‌లో టికెట్ ధరలు పెంచాను.ఇది తెలిసి రామానాయుడుగారు షాక్ అయ్యారు. రత్నం భలే చేశాడన్నారు’’ అని నిర్మాత ఏయం రత్నం అన్నారు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు’. జ్యోతికృష్ణ, క్రిష్ దర్శకత్వంలో ఏయం రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్ రావు నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘హరిహర వీరమల్లు: స్పిరిట్ వర్సెస్ స్వార్డ్’ ఈ నెల 24న విడుదల కానుంది.ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత ఏయం రత్నం చెప్పిన విశేషాలు.⇒ నా గత చిత్రాలు ‘కర్తవ్యం, భారతీయుడు’ వంటివాటి తరహాలోనే ‘హరిహర వీరమల్లు’లో కూడా వినోదంతోపాటు సందేశం ఉంది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కల్పిత కథే ఈ చిత్రం. పవన్ కల్యాణ్‌గారితో ‘ఖుషి, బంగారం’ చిత్రాల తర్వాత నేను చేసిన మూడో సినిమా ఇది.⇒ సినిమా అనేది అవసరం కాదు. ప్రేక్షకులు ఆ సినిమా పట్ల ఆసక్తిగా ఉంటే థియేటర్స్‌కు వస్తారు. లేక పోతే లేదు. కొందరు ఓటీటీలో చూద్దాంలే అని రావడం లేదు. నా సినిమా బాగుంది... కనీసం పెట్టిన డబ్బులైనా తిరిగి రావాలని, టికెట్ ధరలను పెంచమని ప్రభుత్వానికి విన్నవించుకున్నాను. తెలంగాణ ప్రభుత్వం చారిత్రక సినిమా అయితే ఇస్తామన్నారు. మాది చారిత్రక సినిమాయే అని చె΄్పాం. ఆడియన్స్ మామూలు సినిమా తీస్తే థియేటర్స్‌కు రావడం లేదు. క్వాలిటీ సినిమా అందించాలంటే నిర్మాణ వ్యయం పెరిగి పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా టికెట్నుపావలాకు, అర్ధణాకు అమ్మితే ఎలా వర్కౌట్ అవుతుంది. ఈ పరిస్థితుల్లో టికెట్ ధరలు తక్కు వగా ఉంటే సినిమా థియేటర్స్ మూసివేయాల్సి వస్తుంది. మన నేటివిటీ ఉన్న ఒకట్రెండు సినిమాలు ఆడొచ్చు. కానీ ఈ సినిమాలే ఉంటే థియేటర్స్ అనేవి ఉండవు. ఓపెనింగ్ తెప్పించే పెద్ద సినిమాల వల్లే థియేటర్స్ ఉంటాయి. అవి ఉంటేనే కదా... చిన్న సినిమాలకు చాన్స్ ఉంటుంది.

రామ్‌చరణ్ సాయం..? ఒక్క రూపాయి రాకుండా చేశారు: ఫిష్ వెంకట్ కూతురు
తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జూలై 18న) రాత్రి కన్నుమూశారు. కిడ్నీ మార్పిడి చేస్తే నాన్న బతికేవాడని అతడి కూతురు భావోద్వేగానికి లోనైంది. అలాగే హీరో రామ్‌చరణ్.. లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారన్న అసత్య ప్రచారం వల్ల తమ కుటుంబానికి ఎవరూ సాయం చేయలేదని వాపోయింది. నాన్న మరణించాక తమను పరామర్శించేందుకు గబ్బర్ సింగ్ టీమ్ తప్ప సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ రాలేరని పేర్కొంది.కిడ్నీతో పాటు కాలేయం కూడా..వెంకట్ కూతురు ఇంకా ఏమందంటే.. నాన్నకు మొన్నటివరకు కిడ్నీ సమస్య ఉందని మాత్రమే వైద్యులు చెప్పారు. నిన్న అన్ని టెస్టులు చేస్తే కాలేయం కూడా పాడైపోయిందన్నారు. ఇన్ఫెక్షన్ పెరుగుతోందని చెప్పారు. బతకడం కష్టమన్నారు. నిన్న సాయంత్రం ఆరింటి వరకు కూడా నాన్న బాగానే ఉన్నారు. అయితే 80% కోమాలో ఉన్నారని డాక్టర్స్ చెప్పారు. రాత్రి సడన్‌గా బీపీ పడిపోయింది, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. రాత్రి 9.25 గంటలకు నాన్న చనిపోయాడు.ఒక్క రూపాయి అందలేదునాన్నను ఆస్పత్రిలో చేర్పించినప్పుడే ఎవరైనా ఆర్థిక సాయం చేసుంటే ఆయన కచ్చితంగా బతికేవాడు. డబ్బు లేకపోవడం వల్లే నాన్నను కోల్పోయాం. ఇండస్ట్రీ నుంచి హీరో విశ్వక్ సేన్, జెట్టి ఫేమ్ కృష్ణ మానినేని సాయం చేశారు. హీరో రామ్‌చరణ్‌కు చెందిన క్లీంకార ఫౌండేషన్ నుంచి రూ.25 వేల సాయం అందింది. అయితే రామ్‌చరణ్ మా నాన్నను మంచి ఆస్పత్రిలో చేర్పించాడు, ఆర్థిక సాయం చేశాడంటూ పుకార్లు లేపారు. దీనివల్ల ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఒక్క రూపాయి కూడా విరాళం రాలేదు. నాన్నకు అంత సీరియస్‌గా ఉంటే గబ్బర్ సింగ్ టీమ్ తప్ప ఎవరూ చూడటానికి రాలేదు. డబ్బు సాయం చేసుంటే నాన్న ఈరోజు బతికి ఉండేవాడు అని చెప్పుకొచ్చింది.చదవండి: హీరోయిన్ ఫామ్‌హౌస్‌లో దొంగతనం.. సీసీటీవీలు ధ్వంసం!

ఈమెని గుర్తుపట్టారా? సిద్దార్థ్‌తో హిట్ సినిమా.. ఇప్పుడేమో ఇలా
కొందరు బ్యూటీస్ ఒకటి రెండు సినిమాలు చేసినా సరే మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. ఈమె కూడా సేమ్ అలానే అనుకోవచ్చు. తమిళంలో చాలా మూవీస్ చేసినప్పటికీ తెలుగులో ఒకే ఒక్క మూవీతో ఫేమస్ అయింది. అందులో హీరో సిద్దార్థ్. మరి ఇన్ని హింట్స్ ఇచ్చాం కదా ఈ నటి ఎవరో కనిపెట్టారా? మమ్మల్ని చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న నటి పేరు నందిత జెన్నీఫర్. తండ్రి చిన్నా కొరియోగ్రాఫర్ కావడంతో ఈమె కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచింది. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ఎంచుకుంది. 2000కి ముందు ఓ పక్క కొరియోగ్రఫీ చేస్తూనే మరోవైపు ఐటమ్ సాంగ్స్‌లోనూ అడపాదడపా మెరిసేది. అలా దర్శకుల దృష్టిలో పడి 'రిథమ్' అనే సినిమాతో నటిగా మారింది. అలా 2022 వరకు పలు చిత్రాల్లో నటించింది. తమిళంలో పలు రియాలిటీ షోల్లోనూ పాల్గొంది.(ఇదీ చదవండి: హన్సిక వైవాహిక బంధానికి బీటలు? ఒక్కమాటలో తేల్చేసిన భర్త!)దాదాపు తమిళ సినిమాలే చేసినా ఈమె.. సిద్దార్థ్ 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాతో తెలుగులోకి పరిచయమైంది. డాలీ పాత్రలో తనదైన యాక్టింగ్ చేసి ఆకట్టుకుంది. మూవీ చూసినా ప్రతిసారి ఈమె పాత్ర కూడా నచ్చేస్తుంది. దీని తర్వాత పవిత్ర, వేర్ ఈజ్ విద్యాబాలన్, నా రూటే సెపరేట్ చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్‌లో కనిపించింది.జెన్నీఫర్ వ్యక్తిగత జీవితానికొస్తే.. 2007లో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ కాశీ విశ్వనాథన్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు కొడుకులు పుట్టారు. ప్రస్తుతం ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈమె.. ఇన్ స్టాలోనూ యాక్టివ్గానే ఉంది. ఎప్పటికప్పుడు ఫొటోలు, రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంది. అయితే అప్పట్లో సిద్ధార్థ్ సినిమాలో చూసినప్పటికీ ఇప్పటికీ ఈమెలో ఎంత మార్పు వచ్చేసింది. చాలామంది గుర్తుపట్టలేకపోతున్నారు కూడా!(ఇదీ చదవండి: డైరెక్టర్ క్రిష్ లేకుండానే 'హరిహర వీరమల్లు' మేకింగ్ వీడియో) View this post on Instagram A post shared by Jeni_Chinna (@jenniferr252)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. బీసీసీఐ కీలక నిర్ణయం! ధోని శిష్యుడికి పిలుపు
మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభంకానున్న నాలుగో టెస్టుకు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత టెస్టు జట్టులోకి యువ పేసర్ అన్షుల్ కాంబోజ్‌ను బీసీసీఐ చేర్చింది. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగే ఈ మ్యాచ్‌కు పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ఆకాష్ దీప్ అందుబాటులో ఉంటారా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఆకాష్ దీప్ గాయపడగా.. నాలుగో టెస్టు కోసం ప్రాక్టీస్ సందర్భంగా అర్ష్‌దీప్ చేతి వేలికి గాయమైంది. అర్ష్‌దీప్ కోలుకోవడానికి దాదాపు 10 రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అన్షుల్ కాంబోజ్‌కు తొలిసారి సెలక్టర్లు పిలుపునిచ్చారు.దీంతో అతడు ఉన్నపళంగా భారత్ నుంచి లండన్‌కు బయలుదేరినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన అనాధికారిక టెస్టుల్లో భారత-ఎ తరపున కాంబోజ్ ఆడాడు. ఈ సిరీస్‌లో కాంబోజ్ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ పేసర్ 3 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టాడు.అన్షుల్ కాంబోజ్ ఐపీఎల్-2025 సీజన్లో ఎంఎస్ ధోని సారథ్యంలో సీఎస్కే తరపున ఆడాడు. ఐపీఎల్లో కూడా తన బౌలింగ్ ప్రదర్శనతో కాంబోజ్ ఆకట్టుకున్నాడు. అతడికి అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. గంటకు 138-139 కి.మీ వేగంతో బౌలింగ్ చేసి బ్యాటర్లను బోల్తా కొట్టించగలడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ఆడి 79 వికెట్లు పడగొట్టాడు. అతడి పేరిట ఓ పది వికెట్ల హాల్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అతడి సీనియర్ జట్టులోకి తీసుకున్నారు. ఇక అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భారత జట్టు 2-1 తేడాతో వెనకబడి ఉంది. దీంతో నాలుగో టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 2-1తో సమం చేయాలని గిల్ బృందం భావిస్తోంది.చదవండి: WCL: భారత్-పాక్ మ్యాచ్ రద్దు.. అఫ్రిదిపై వేటు!

WCL: భారత్-పాక్ మ్యాచ్ రద్దు.. అఫ్రిదిపై వేటు!
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నీలో నేడు జరగాల్సిన పాకిస్తాన్ భారత్ మ్యాచ్ రద్దైంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లాండ్ బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ మైదానం వేదికగా షెడ్యూల్ ప్రకారం ఆదివారం రాత్రి 9గం. భారత ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య జరగాల్సి ఉంది. అయితే పాక్‌తో మ్యాచ్‌ను భారత ప్లేయర్లు బాయ్‌కాట్ చేసిన నేపథ్యం, ప్రజల మనోభావాలు దెబ్బ తిన్న నేపథయంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే పాయింట్ల విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.పాకిస్థాన్‌తో ఎలాంటి క్రికెట్ ఆడకూడదని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పహల్గాం దాడి తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు డబ్ల్యూసీఎల్లో ఇరు జట్లూ తలపడనున్న నేపథ్యంలో చాలా విమర్శలు వచ్చాయి. ఇంకోవైపు.. పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు మాజీ క్రికెటర్లకు ఎవరు అనుమతి ఇచ్చారంటూ? ప్రశ్నలు తలెత్తాయి. Dear all , pic.twitter.com/ViIlA3ZrLl— World Championship Of Legends (@WclLeague) July 19, 2025ఈ నేఫథ్యంలో.. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్, మాజీ ఆల్‌రౌండర్ సురేష్ రైనా, మాజీ ఆల్‌రౌండర్లు ఇర్ఫాన్, యూసుఫ్ పఠాన్లు డబ్ల్యూసీఎల్ 2025లో పాకిస్తాన్ మ్యాచ్ నుంచి తప్పుకున్నారు. పహల్గామ్ దాడి, ఆ తరువాత జరిగిన పరిణామాలు వారి నిర్ణయంకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌పై సోషల్ మీడియాలోనూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ నుంచి తప్పుకున్నారని స్పష్టమైంది.ఈ మ్యాచ్‌లో తాను ఆడేది లేదని.. సదరు విషయాన్ని డబ్ల్యూసీఎల్ ఆర్గనైజర్లకు ఇప్పటికే చెప్పినట్లు శిఖర్ ధావన్ వెల్లడించాడు. మే 11నే లీగ్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లినట్లు మెయిల్ స్క్రీన్షాట్లను ధావన్ పంచుకున్నాడు. ‘‘ఈ లీగ్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడకూడదని మే 11నే నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. నాకు నా దేశమే ముఖ్యం. దేశం కంటే ఏదీ ఎక్కువ కాదు. జై హింద్’’ అని మెయిల్ స్క్రీన్‌షాట్‌ను ధావన్ పోస్టు చేశాడు.ఇంకోవైపు.. పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ భారత్‌పై, భారత ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయగా దుమారం రేగింది. ఈ పరిణామాల నేపథ్యంలో అఫ్రిదీపై డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు వేటు వేసినట్లు తెలుస్తోంది. డబ్ల్యూసీఎల్ పోస్టర్ నుంచి అఫ్రిదీ ఫొటోను నిర్వాహకులు తొలగించారు. మిగతా మ్యాచ్‌లకూ అతన్ని దూరం పెట్టే యోచనలో నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం.

బెంగాల్ ప్రాబబుల్స్‌లో షమీ
కోల్‌కతా: భారత వెటరన్ సీమర్ మొహమ్మద్ షమీ దేశవాళీ క్రికెట్ టోర్నీలో సత్తా చాటడం ద్వారా టీమిండియాకు ఎంపికవ్వాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఈ సీనియర్ పేసర్ ఈ సీజన్ ఐపీఎల్ తర్వాత మళ్లీ బరిలోకే దిగలేదు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తోన్న భారత జట్టుకు దూరమైన షమీ త్వరలోనే మొదలయ్యే దేశవాళీ సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. దీర్ఘకాలంగా వేధించిన చీలమండ గాయం నుంచి కోలుకుని ఈ ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆడిన షమీ ఆ టోరీ్నలో 9 వికెట్లతో రాణించాడు. ఈ మెగా టోరీ్నలో రోహిత్ నేతృత్వంలోని టీమిండియా విజేతగా నిలిచింది. అయితే తదుపరి ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగినప్పటికీ కేవలం 6 వికెట్లే పడగొట్టాడు. అన్ని ఫార్మాట్లలో ఆడే ఫిట్నెస్ ఉన్నప్పటికీ దీనిపై సంతృప్తి చెందని సెలక్టర్లు ఆసీస్ టూర్‌కు అతన్ని పక్కన బెట్టారు. అయితే బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) శనివారం ప్రకటించిన 50 మంది సభ్యులు గల ప్రాబబుల్స్‌లో అతనే ప్రధాన ఆటగాడిగా ఉన్నాడు. బెంగాల్‌తో పాటు దులీప్ ట్రోఫీలో ఈస్ట్‌జోన్ తరఫున కూడా బరిలోకి దిగేందుకు షమీ ఆసక్తి కనబరుస్తున్నాడు. ఈ ఏడాది నుంచి మళ్లీ ఇంటర్–జోనల్ పాత పద్ధతిలోనే నిర్వహించే దులీప్ ట్రోఫీ వచ్చే నెల 28 నుంచి జరుగుతుంది. షమీతో పాటు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పేసర్ ఆకాశ్ దీప్, బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్‌లు కూడా బెంగాల్ జంబో ప్రాబబుల్స్‌లో ఉన్నారు. పేసర్ ముకేశ్ కుమార్, బెంగాల్ కెప్టెన్ అనుస్తుప్ మజుందార్, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ షహబాజ్ అహ్మద్, వికెట్ కీపర్–బ్యాటర్ అభిõÙక్ పొరెల్ ప్రాబబుల్స్ జాబితాకు ఎంపికయ్యారు.

Andre Russell: ‘అదే నా అత్యుత్తమ మ్యాచ్’
కింగ్స్టన్ (జమైకా): అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విధ్వంసక ఆటగాడు ఆండ్రీ రసెల్ తన కెరీర్లో 84 మ్యాచ్‌లలో వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 163.08 స్ట్రైక్‌రేట్‌తో 1078 పరుగులు చేసిన అతను విండీస్ రెండు టి20 వరల్డ్ కప్ విజయాల్లో (2012, 2016) భాగంగా ఉన్నాడు. తన కెరీర్ విశేషాల గురించి చెబుతూ అతను తన అత్యుత్తమ మ్యాచ్ గురించి ప్రస్తావించాడు. 2016 వరల్డ్ కప్‌లో భాగంగా ముంబైలో జరిగిన సెమీ ఫైనల్ పోరు తన ‘బెస్ట్’ అని అతను వెల్లడించాడు. వాంఖెడే మైదానంలో జరిగిన ఈ పోరులో ముందుగా భారత్ 192 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో రసెల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఆ సమయంలో విండీస్ విజయానికి 41 బంతుల్లో 77 పరుగులు అవసరం కాగా...20 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో అజేయంగా 43 పరుగులు చేశాడు. కోహ్లి వేసిన చివరి ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ బాది అతను మ్యాచ్‌ను ముగించాడు. ఫైనల్ చేరిన విండీస్ ఆపై ఇంగ్లండ్‌ను ఓడించి రెండో సారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ‘నిస్సందేహంగా భారత్‌తో సెమీస్ మ్యాచే నా కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన. 190 పరుగుల లక్ష్యం...సొంతగడ్డపై ఆడుతున్న భారత్‌కే ప్రేక్షకుల నుంచి పూర్తి మద్దతు ఉంది. తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగా. అయితే పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలంగా ఉండటంతో నా ప్రణాళిక ప్రకారం చెలరేగి జట్టును గెలిపించా’ అని రసెల్ గుర్తుచేసుకున్నాడు.
బిజినెస్

హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బొనాంజా!!
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ షేర్హోల్డర్లకు బంపర్ బొనాంజా ప్రకటించింది. తొలిసారిగా బోనస్ షేర్లు జారీ చేయనుంది. 1:1 నిష్పత్తిలో షేరు ఒక్కింటికి ఒక షేరు చొప్పున కేటాయించనుంది. ఇందుకోసం ఆగస్టు 27ని రికార్డు తేదీగా నిర్ణయించారు. ఇష్యూని బోర్డు ఆమోదించిన రెండు నెలల్లోగా, అంటే సెపె్టంబర్ 18లోగా బోనస్ షేర్లు క్రెడిట్ అవుతాయని బ్యాంకు వెల్లడించింది. సుమారు రూ. 766.79 కోట్ల విలువ చేసే షేర్లను బ్యాంకు జారీ చేయనుంది. జూన్ క్వార్టర్ ఆఖరు నాటికి హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రూ. 2 లక్షల వరకు ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ గల చిన్న రిటైల్ షేర్హోల్డర్లు 36 లక్షల పైగా ఉన్నారు. వీరి వాటా సుమారు 10.32 శాతం వరకు ఉంటుంది. గతంలో 2011లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 10 ముఖ విలువ చేసే షేర్లను రూ. 2 ముఖ విలువ చేసే అయిదు షేర్లుగా విభజించింది. ఆ తర్వాత 2019లో వాటిని రూ. 1 ముఖ విలువ చేసే రెండు షేర్లుగా విడగొట్టింది. కంపెనీ షేరు ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 10 శాతం పెరిగి బీఎస్ఈలో ప్రస్తుతం రూ. 1,957 వద్ద ఉంది. బీఎస్ఈ రికార్డుల ప్రకారం బ్యాంక్ ఇప్పటివరకు ఎన్నడూ బోనస్ షేర్లు ప్రకటించలేదు. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1 ముఖ విలువ చేసే ఒక్కో షేరుపై రూ. 5 చొప్పున ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌ను కూడా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది. దీనికి జూలై 25 రికార్డు తేదీగా ఉంటుంది. ఆగస్టు 11న బ్యాంక్ డివిడెండ్ చెల్లిస్తుంది. 2024 మేలో రూ. 19.5 చొప్పున తుది డివిడెండ్ ఇచ్చిన బ్యాంకు, గత నెలలో రూ. 22 చొప్పున మరోసారి డివిడెండ్ చెల్లించింది. అంతకు ముందు 2022 మేలో రూ. 15.5 చొప్పున, 2023 మేలో రూ. 19 చొప్పున డివిడెండ్ ఇచి్చంది. కన్సాలిడేటెడ్ లాభం స్వల్పంగా డౌన్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 16,258 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది క్రితం క్యూ1లో నమోదైన రూ. 16,475 కోట్లతో పోలిస్తే స్వల్పంగా 1.31 శాతం తక్కువ. మరోవైపు, స్టాండెలోన్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం రూ. 16,174 కోట్ల నుంచి సుమారు 12 శాతం వృద్ధితో రూ. 18,155.21 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 83,701 కోట్ల నుంచి రూ. 99,200 కోట్లకు ఎగిసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మాత్రం ఆదాయం రూ. 1.17 లక్షల కోట్ల నుంచి రూ. 1.33 లక్షల కోట్లకు చేరింది.జూన్ క్వార్టర్ వివరాలు.. → సమీక్షా కాలంలో మొత్తం వ్యయాలు రూ. 59,817 కోట్ల నుంచి రూ. 63,467 కోట్లకు పెరిగాయి. → స్టాండెలోన్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 5.4 శాతం పెరిగి రూ. 31,438 కోట్లకు చేరింది. → నికర వడ్డీ మార్జిన్ 3.46 శాతం నుంచి 3.35 శాతానికి తగ్గింది. → నిర్వహణ వ్యయాలు రూ. 16,621 కోట్ల నుంచి రూ. 17,434 కోట్లకు పెరిగాయి. ఇందులో రూ. 6,158 కోట్ల మేర ఉద్యోగులపై వ్యయాలు, రూ. 11,276 కోట్లు ఇతరత్ర వ్యయాలు ఉన్నాయి. → మొత్తం ప్రొవిజన్లు రూ. 2,602 కోట్ల నుంచి రూ. 14,442 కోట్లకు ఎగిశాయి. ఇందులో ‘ఫ్లోటింగ్ ప్రొవిజన్’ రూ. 9,000 కోట్లు ఉన్నట్లు బ్యాంకు తెలిపింది. → అసెట్స్ నాణ్యత స్వల్పంగా క్షీణించింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి మార్చి త్రైమాసికంతో పోలిస్తే 1.33 శాతం నుంచి 1.4 శాతానికి పెరిగింది. → స్థూల రుణాలు రూ. 26,53 లక్షల కోట్లకు (6.7 శాతం వృద్ధి, డిపాజిట్లు 16.2 శాతం పెరిగి రూ. 27.64 లక్షల కోట్లకు చేరాయి. → కాసా నిష్పత్తి 38.2 శాతం నుంచి 33.9 శాతానికి తగ్గింది. సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు రూ. 6.39 లక్షల కోట్లుగా ఉండగా, కరెంట్ అకౌంట్ డిపాజిట్లు రూ. 2.98 లక్షల కోట్లుగా ఉన్నాయి. → కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన చూస్తే హెచ్డీబీ ఐపీవో ద్వారా వచి్చన నిధుల కారణంగా ఇతర ఆదాయం రూ. 21,730 కోట్లకు పెరిగింది. → స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 1.40 శాతంగా, నికర ఎన్పీఏల నిష్పత్తి స్వల్పంగా పెరిగి 0.47 శాతంగా నమోదైంది. → అనుబంధ కంపెనీ హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఐపీవోకి రావడంతో అందులో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వాటా 94.32 శాతం నుంచి 74.19 శాతానికి తగ్గింది.

శాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. బడ్జెట్లోనే హై ఎండ్ ఫీచర్స్
దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ నుండి కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ విడుదలైంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్36 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌లో లాంచ్ అయింది. బడ్జెట్ ధర రూ .20,000 లోపే ఇది లభ్యమవుతుంది. ఎక్సినోస్ 1380 చిప్సెట్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్స్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్తోపాటు గూగుల్ సర్కిల్ టు సెర్చ్, జెమినీ లైవ్ సహా ఏఐ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.శాంసంగ్ గెలాక్సీ ఎఫ్36 5జీ ధరగెలాక్సీ ఎఫ్36 5జీ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499గా ఉంది. శాంసంగ్ 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.18,999గా నిర్ణయించారు. శాంసంగ్ కొత్త ఎఫ్-సిరీస్ స్మార్ట్‌ఫోన్ జూలై 29 నుంచి ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ అధికారిక ఆన్లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. కోరల్ రెడ్, లక్స్ వయొలెట్, ఓనిక్స్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ మూడు కలర్ వేస్ లో లెదర్ ఫినిష్ రియర్ ప్యానెల్ ఉంది.స్పెసిఫికేషన్లుశాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 36 5జీ డ్యూయల్ సిమ్ హ్యాండ్ సెట్, ఇందులో 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, ఫుల్ హెచ్ డీ+ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.సెల్ఫీ కెమెరా కోసం డిస్ ప్లే పైభాగంలో వాటర్ డ్రాప్ నాచ్ ను అందించారు. ఆక్టాకోర్ ఎక్సినోస్ 1380 ఎస్ వోసీ, మాలి-జీ68 ఎంపీ5 జీపీయూతో ఈ ఫోన్ పనిచేస్తుంది. థర్మల్ మేనేజ్ మెంట్ కోసం వేపర్ ఛాంబర్ కూడా ఉంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 4కే వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేసే ప్రైమరీ 50 మెగాపిక్సెల్ ఎఫ్/ 1.8 సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇది 4కె వీడియో రికార్డింగ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది.శాంసంగ్ లేటెస్ట్ ఎఫ్ సిరీస్ ఫోన్ ఆండ్రాయిడ్-15 ఆధారిత వన్ యూఐ 7 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుది. ఆరు ఏళ్లు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్ డేట్స్, ఏడేళ్ల సెక్యూరిటీ ప్యాచ్ లను అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.గూగుల్ సర్కిల్ టు సెర్చ్, జెమినీ లైవ్, ఆబ్జెక్ట్ ఎరేజర్, ఇమేజ్ క్లిప్పర్, ఏఐ ఎడిట్ వంటి ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి.గెలాక్సీ ఎఫ్36 5జీలో 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఛార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం, ఫోన్ డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్ + గ్లోనాస్ను అందిస్తుంది.

మాల్స్‌లో ఆఫీసులు.. తక్కువ అద్దెలు
మాల్స్, స్టార్ హోటల్స్.. తినడానికో లేదా షాపింగ్ కేంద్రాలుగానే కాదు ఆఫీసు కేంద్రాలుగానూ మారుతున్నాయి. గతంలో ప్రత్యేకంగా ఒక వాణిజ్య భవనంలో కో–వర్కింగ్ స్పేస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీలు ఇప్పుడు షాపింగ్ మాల్స్, స్టార్ హోటళ్లనూ కార్యాలయాలుగా కేటాయిస్తున్నాయి. పనిచేసే చోటే రిటైల్, ఫుడ్ వసతులూ ఉంటేనే కంపెనీలు స్వాగతిస్తుండటంతో కో–వర్కింగ్ సంస్థలు మాల్స్, హోటళ్ల వైపు దృష్టిసారించాయి. – సాక్షి, సిటీబ్యూరోదశాబ్దం కాలంగా దేశంలోని కార్యాలయాల్లో పని వాతావరణంలో మార్పు వచ్చింది. ఆఫీసు డిజైన్, వసతులు, రంగులు వంటివి ఉద్యోగి నైపుణ్యం, ఉత్పాదకత, పని సంస్కృతి వంటి వాటి మీద ప్రభావం చూపిస్తున్నాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. కార్యాలయాల్లో గ్రీనరీ, సహజసిద్ధమైన గాలి, వెలుతురు, వాసన వంటి వాటితో ఉద్యోగిపై పని ఒత్తిడిని తగ్గిస్తుందని, దీంతో మరింత క్రియేటివిటీ బయటకొస్తుందని పరిశోధనల్లోనూ తేలింది. ఆయా వసతులను అందుబాటు ధరల్లో కో–వర్కింగ్ స్పేస్ భర్తీ చేస్తుండటంతో ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎంఎస్ఎంఈ, స్టార్టప్స్ మాత్రమే కాకుండా బహుళ జాతి సంస్థలూ కో–వర్కింగ్ స్పేస్‌లో కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి.గంట, రోజు, నెల వారీగా చార్జీలు..ఒకే అంతస్తులో ఒక ఆఫీసు బదులు పలు రకాల చిన్న ఆఫీసులు ఉండటాన్ని కో–వర్కింగ్ స్పేస్ అంటారు. ఇక్కడ వ్యాపారం ఎవరిది వారిదే, ఎవరి ప్రమాణాలు వారివే. ప్రతి ఒక్కరికీ కావాల్సిన ప్రైవేట్ ఆఫీసు, ఫిక్స్డ్ డెస్క్‌లు, సమావేశ గది, క్యాబిన్లు వంటి సౌకర్యాలు ఉంటాయి. వీటితో పాటూ ప్రత్యేకంగా బహుళ జాతి కంపెనీలకు ఉండే కొరియర్ సర్వీస్, ఫుడ్, లాంజ్, ఎల్సీడీ, పార్కింగ్, ప్రింటర్, ప్రొజెక్టర్, వైఫై వంటి అన్ని రకాల ఆధునిక వసతుంటాయి. కో–వర్కింగ్ కార్యాలయాల అద్దెలు గంట, రోజులు, నెల వారీగా ఉంటాయి. నగరంలో నెలకు రూ.8 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, నానక్‌రాంగూడ, బంజారాహిల్స్, సోమాజిగూడ, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో కో–వర్కింగ్ ఆఫీసులున్నాయి.అద్దెలు 25 శాతం వరకు తక్కువఐటీ కారిడార్లు, అభివృద్ధి చెందిన వాణిజ్య ప్రాంతాల్లో స్థలాల ధరలు ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రత్యేకంగా కార్యాలయాలను ఏర్పాటు చేసే బదులు కో–వర్కింగ్లోనే స్పేస్‌ను అద్దె తీసుకోవటం కంపెనీలకు సులువవుతుంది. ఇదే కో–వర్కింగ్ డిమాండ్‌కు ప్రధాన కారణం. గ్రీడ్–ఏ ఆఫీస్ స్పేస్‌తో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్‌లో అద్దెలు 25 శాతం వరకు తక్కువ ఉంటాయి. సాధారణ ఆఫీసులో సీట్లతో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్‌లో ఒక్కో సీటుకు 5–15 శాతం స్థలం ఆదా అవుతుంది. పైగా ప్రతి కంపెనీ ప్రత్యేకంగా మౌలిక వసతులు ఏర్పాటు చేసుకునే బదులు అన్ని కంపెనీలకు కలిపి ఒకటే పార్కింగ్, హౌస్ కీపింగ్, క్యాంటీన్, రిసెప్షన్ వంటి ఏర్పాట్లు ఉంటాయి. దీంతో కంపెనీలకు మౌలిక వసతుల వ్యయం కూడా తగ్గుతుంది.

ఈపీఎఫ్‌వో రూల్స్‌లో మార్పు.. ఆ కండీషన్లు ఇక ఉండవు
ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ఈడీఎల్ఐ అంటే ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ నిబంధనల్లో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ భారీ ఊరటనిచ్చింది. ఇప్పుడు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మునుపటిలా కఠినమైన షరతులు ఉండవు. దీని వల్ల లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు, ముఖ్యంగా విధుల్లో ఉండగా మరణించిన ఉద్యోగి కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది.కనీసం రూ .50,000 బీమాతాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఇప్పుడు ఉద్యోగి పీఎఫ్ బ్యాలెన్స్ రూ .50,000 కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఆ ఉద్యోగి మరణించినప్పుడు వారి కుటుంబానికి కనీసం రూ .50,000 బీమా ప్రయోజనం లభిస్తుంది. ఇంతకు ముందు ఈ ప్రయోజనాన్ని పొందడానికి, ఉద్యోగి ఖాతాలో నిర్ణీత పరిమితి వరకు బ్యాలెన్స్ ఉండాలి. కానీ ఇప్పుడా షరతు తొలగించారు.మరో ముఖ్యమైన మార్పుకనీస పీఎఫ్ బ్యాలెన్స్ షరతును తొలగించడంతోపాటు ఈ పథకంలో మరో ముఖ్యమైన మార్పు చేశారు. ఈ పథకం కోసం 12 నెలల నిరంతర సర్వీసును లెక్కించేటప్పుడు, ఉద్యోగి కంపెనీలు మారిన సందర్భంలో రెండు ఉద్యోగాల మధ్య 60 రోజుల వరకు గ్యాప్ ఉంటే, దాన్ని ఇకపై విరామంగా పరిగణించరు. అంటే ఉద్యోగి రెండుమూడు ఉద్యోగాలు చేసి, వాటి మధ్య 2 నెలల కంటే తక్కువ విరామం ఉంటే, అప్పుడు అన్ని ఉద్యోగాలు ఒకే (నిరంతర) సర్వీసుగా పరిగణిస్తారుఅంతే కాకుండా పీఎఫ్ పథకంలో సభ్యుడైన ఉద్యోగి చివరి పీఎఫ్ కంట్రిబ్యూషన్ నుండి 6 నెలల్లోపు మరణించిప్పుడు కూడా వారి కుటుంబానికి ఈ పథకం కింద బీమా మొత్తాన్ని ఇస్తారు. అయితే ఆ సమయంలో ఉద్యోగి కంపెనీ రోల్స్‌లో నమోదై ఉండాలి. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణించినప్పుడు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం ఈపీఎఫ్ఓ ఈడీఎల్ఐ పథకం ప్రధాన ఉద్దేశం.
ఫ్యామిలీ

చేంజ్ మేకర్.. సత్య, వేలమందిలో ఒకరిగా!
డాబాగార్డెన్స్: పది మందికి సేవ చేయాలని.. సమాజంలో అట్టడుగున ఉన్న పిల్లలు సామాజికంగా ఎదగాలన్నదే ఆమె తపన.. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు సమాజంలో రాణించాలని.. ధైర్యంగా నిలబడాలన్నదే తన లక్ష్యం. చదివింది డిగ్రీ. తల్లిదండ్రులు రేషన్ డిపో నడుపుతున్నారు. తనదైన శైలిలో ఎంతో మంది పాఠశాల పిల్లలు.. కళాశాల విద్యార్థులకు సోషల్ జస్టిస్.. సెల్ఫ్ డిఫెన్స్.. ఫిజికల్ ఫిట్నెస్.. ఉమెన్ సేఫ్టీపై అవగాహన కలిపిస్తూ వారంతా రాటుదేలేలా తీర్చిదిద్దుతున్నారు ఉన్నవ వెంకట సత్యకుమారి. ఇటీవల చెన్నైలో నిర్వహించిన సౌతిండియా ఉమెన్ అచీవర్స్ అవార్డు–2025 గెలుచుకుని మరెంతో మంది మగువలకు స్ఫూర్తిగా నిలిచారు.వివరాల్లోకి వెళ్తే.. ఉన్నవ సత్యకుమారి డిగ్రీ వరకు చదివారు. అక్కయ్యపాలెంలో నివాసముంటున్నారు. రేషన్ డిపో నడిపే తల్లిదండ్రులతో పాటు ఇంజినీరింగ్ పూర్తి చేసిన సోదరుడు ఉన్నారు. ఈ నెల 9న చెన్నైలోని ఎంసీసీ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించిన సౌత్ ఇండియా వుమెన్ అచీవర్స్ అవార్డుల కార్యక్రమంలో సత్యకుమారి ఛేంజ్మేకర్ విభాగంలో నామినేట్ అయ్యారు. ఆడపిల్లలు నిస్సందేహంగా సబలలని.. వారికి అవకాశం ఇచ్చి చూస్తే అద్భుతాలు సాధిస్తారని నిరూపించేలా సత్యకుమారి ఎంతో మంది పాఠశాల.. కళాశాలల విద్యార్థినులతో నిరూపించారు. ఫిజికల్ ఫిట్నెస్, సెల్ఫ్ డిఫెన్స్ వంటి అంశాలను వారికి బోధించి చక్కటి ఫలితాలు సాధించిన నేపథ్యంలోనే ఆమెను ఈ అవార్డు వరించింది. సత్యకుమారి ప్రతిభను ట్వెల్ మ్యాగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్, వ్యవస్థాపకుడు దీపక్ టాటర్ జైన్ నాయకత్వంలోని ఎంపిక కమిటీ గుర్తించింది. సివా పేరిట మహిళల సాధికారత, వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళల్ని గుర్తించి అవార్డులు అందజేసే క్రమంలో సత్యకుమారిని కూడా గుర్తించి అవార్డుతో గౌరవించింది.ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే! View this post on Instagram A post shared by Satya Kumari Wunnava (@satyawunnava)60 వేల దరఖాస్తులు రాగా.. సౌత్ ఇండియా వుమెన్ అచీవర్స్ అవార్డ్–2025కి దేశవ్యాప్తంగా 60 వేల దరఖాస్తులు అందాయి. సమాజ సేవ.. మహిళల సాధికారత.. వివిధ రంగాల్లో రాణిస్తున్న 300 మంది మహిళలను గుర్తించి అవార్డులు అందజేశారు. వీరిలో విశాఖ నగరానికి చెందిన ఉన్నవ వెంకట సత్యకుమారి చేంజ్ మేకర్ విభాగంలో తను చేస్తున్న సమాజ సేవకు గుర్తింపు లభించింది.సేవ చేయడంలో సంతోషం అవార్డు సాధించిన సత్యకుమారి ‘సాక్షి’తో మాట్లాడుతూ మన కాళ్ల మీద మనం బతకడం ముఖ్యం. అక్కడితో ఆగక.. మనం నేర్చుకున్న విద్య.. సంస్కృతి వంటివి పది మందికి తెలపడం మరింత సంతోషాన్నిస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఉమెన్ సేఫ్టీ.. సోషల్ జస్టిస్, ఫిజికల్ ఫిట్నెస్, సెల్ఫ్ డిఫెన్స్‌పై అవగాహన కలిపించాను. కలిపిస్తున్నాను కూడా. నగరంలోని ప్రేమ సమాజం వృద్ధులకు సోషల్ జస్టిస్‌పై అవగాహన కల్పించాను. ప్రతి ఒక్కరూ తాము ఎదుగుతూ.. పది మందికి సేవ చేయాలనే తపన ఉండాలని, మనకు తెలిసిన విద్యను బడుగు.. బలహీన వర్గాల పిల్లలకు అందజేస్తే వారు మరింత ఉన్నత స్థితికి చేరుకుంటారని పిలుపునిచ్చారు.ముఖ్యంగా మహిళలు, బాల బాలికలకు సెల్ప్ డిఫెన్స్ ముఖ్యమని, నానాటికీ పెరుగుతున్న దాడులను ఎదుర్కోవాలంటే సేఫ్టీ, సోషల్ జస్టిస్, ఫిజికల్ ఫిట్నెస్తో పాటు సెల్ఫ్ డిఫెన్స్‌పై అవగాహన ఉండాలని అభినందించారు. తను చేస్తున్న అవగాహన.. సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ ఏడాది ఏప్రిల్ 27న దేశ రాజధాని న్యూఢిల్లీలో భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి సుధా చంద్రన్, మిస్ ఇండియా మంజీర చేతుల మీదుగా ‘నారీ శక్తి’ అవార్డు అందుకున్నానని తెలిపారు. అలాగే విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ప్రశంసలు లభించాయని, తాజాగా చెన్నైలో జరిగిన సౌత్ ఇండియా వుమెన్ అచీవర్స్ అవార్డు–2025ను పలువురు ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నట్టు సత్యకుమారి తెలిపారు.

పిల్లల్లో మెధోవికాసం పెరగాలంటే..ఈ ఫుడ్స్ బెస్ట్
కొన్ని రకాల ఆహారాన్ని తరచు పిల్లలకు తినిపించడం వల్ల వారిలో మేధోవికాసం పెరుగుతుంది. కాబట్టి పిల్లలకు ఆరోగ్యంతో పాటు తెలివితేటలను పెంచే సూపర్ ఫుడ్స్ కూడా ఇస్తూ ఉండాలి. వేరుశనగ.. ఇందులో ధయామిన్తోపాటు విటమిన్ ఇ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉండటం వల్ల పిల్లల్లో మెదడు ఎదుగుదలకు కావలసిన శక్తి అంది, చక్కగా పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వోట్స్.. పిల్లల కోసం ఆరోగ్యాన్ని అందించే తృణధాన్యాలలో మొదటిది వోట్స్. ఇది మెదడుకు ఆరోగ్యాన్ని, శక్తిని అందిస్తుంది. ఓట్స్ లోని పీచుపదార్థం పిల్లల మెదడుకు మంచి ఇంధనంగా పనిచేస్తుంది. పొటాషియం, జింక్, విటమిన్ ఇ, బి వారి పెరుగుదలకు సహకరిస్తాయి.బెర్రీలు.. బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, చెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇవి రకరకాల రంగులలో ఎక్కువ పోషకాలను కలిగి ఉన్నాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.బీన్స్.. బీన్స్ ప్రత్యేకమైనవి. ప్రొటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్ శక్తితో పాటు విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉంటాయి. మానసికమైన సామర్థ్యాన్ని ఇస్తాయి. మెదడుకు బీన్స్ పింటో బీన్స్ ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యం కోసం చక్కగా పనిచేస్తాయి.ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే!

మనుషులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన పది విషయాలివేనట!
ఒకరెవరో చాట్ జీపీటీ (Chatgpt)ని తమాషాగా ఒక ప్రశ్న అడిగారు... మనుషులందరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన పది విషయాలేమిటీ... అని. దానికి చాట్ జీపీటీ ఇలా చెప్పింది...ఒకటి... ప్రతి వాళ్లూ 24 గంటలూ ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు లేదా మొబైల్ ఫోన్లకు బానిసలు అయిపోయారు.రెండు... మీరు తీసుకునే ఆహారం మీకు అనారోగ్యం కలిగించే విధంగా రూపొందించబడింది. మూడు... ఇంటర్నెట్ అంతా జల్లెడ పట్టేశారు... దానిని మీ నియంత్రణలోకి తీసుకున్నారు. నాలుగు... డబ్బు శూన్యం నుంచి సృష్టించబడింది. అప్పు చేయడం అందరికీ తప్పనిసరిగా మార్చేసింది. ఐదు... ఆధునిక వైద్యం మూలకారణాలకు కాకుండా పైకి కనిపించే సాధారణ లక్షణాలకు మాత్రమే చికిత్స చేసే విధంగా తయారైంది. ఆరు... చరిత్ర పాఠాలు అసలు విషయాలను, వాస్తవాలను చెరిపేసి వాటిని అలాగే మరుగున పడేసి ఎవరికి నచ్చిన విధంగా వారు రాసుకునేలా తయారైంది. ఏడు.. కృత్రిమ మేధ అంటే ఏఐ ప్రపంచ వాకిళ్లను బార్లా తెరిచేసి, సువిశాలం చేసేసింది. ఎనిమిది... అంతరిక్షం... మరీ అంత దూరం ఏం కాదు. నువ్వు అనుకున్న దానికన్నా దగ్గరే... భూమి పొర నువ్వు అనుకునేంత గట్టిగా ఏం ఉండదు. బాగా పెళుసైనది. తొమ్మిది... జీన్ ఎడిటింగ్ అంటే జన్యు సవరణ నువ్వనుకున్నదానికన్నా నిశ్శబ్దంగా వేగంగా ముందుకు సాగుతోంది. పది... భూమి సూర్యుణ్ణి ఇప్పుడున్న దానికన్నా వేగంగా చుట్టగలదా? అలా చుడితే ఎన్నో విపత్తులు, ఉపద్రవాలూ చోటు చేసుకోవూ..వీటికి నెటిజనులు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. చూడటానికి ఇవన్నీ ఏవో తమాషాగా.. సిల్లీ సమాధానాల్లా అనిపిస్తున్నాయి కానీ నిజంగానే అవి పరిగణనలోకి తీసుకోదగ్గవి. ఆలోచించ దగ్గవీనూ అని అంటున్నారు. ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే!

చెడుకు చెక్.. పిల్లల్లో ఈ అయిదు ప్రమాద సంకేతాలు
ఉదయం లేచింది మొదలు ఉరుకుల పరుగులు జీవితాలు. పిల్లలను రెడీ చేసి స్కూళ్లకు పంపించి, తాము రెడీ అయి ఆఫీసులకు వెళుతుంటారు తల్లిదండ్రులు. ఎలాగూ స్కూల్‌కి పంపిస్తున్నాం కదా...అన్నీ అక్కడ టీచర్లే చూసుకుంటారులే అని పేరెంట్స్, పిల్లల ప్రవర్తనను సరిచేయాల్సింది వారి తల్లిదండ్రులే అని టీచర్లు అనుకోవడం సాధారణంగా జరిగిపోతుంటుంది. మార్కులు, ర్యాంకులు, గ్రేడులు చూసుకొని సంతృప్తి పడిపోతారు. ‘కానీ, పిల్లలు సరైన దారిలో ఉన్నారా, చెడు స్నేహాల్లో తమను దాటిపోతున్నారా అనేది చూసుకోవాల్సింది తల్లిదండ్రులే. బిడ్డ చెడు సహవాసంలో ఉందని చెప్పడానికి ఈ 5 హెచ్చరిక సంకేతాలు విస్మరించవద్దు’ అంటున్నారు చైల్డ్ సైకియాట్రిస్ట్‌లు, నిపుణులు. ఈ విషయాల సాయంతో మీరు మీ పిల్లల ప్రవర్తనలో మార్పులను గుర్తించవచ్చు. సకాలంలో వాటిని సరిదిద్దడానికి సరైన చర్యలు తీసుకోవచ్చు. ఉపాధ్యాయుల గురించి ఎప్పుడూ చెడ్డగా మాట్లాడటం...: ఒక పిల్లవాడు తన ఉపాధ్యాయుల గురించి పదే పదే చెడుగా మాట్లాడటం లేదా తక్కువ చేసి మాట్లాడటం ప్రారంభించినట్లయితే, అది మీ బిడ్డ తప్పుడు సహవాసంలో ఉన్నాడనడానికి సంకేతంగా గుర్తించాలి. స్నేహితుడి తప్పులకు వత్తాసు పలకడం: ఒక పిల్లవాడు తన స్నేహితుడి చెడు ప్రవర్తనకు మద్దతు ఇవ్వడం ప్రారంభిస్తే, అది ఆ పిల్లవాడు ఆ చెడ్డ స్నేహితుడి ప్రభావానికి లోనయ్యా డనడానికి స్పష్టమైన సంకేతంగా గ్రహించాలి. దీనిని తల్లిదండ్రులు హెచ్చరికగా తీసుకోవడం మంచిది.తరచూ ప్రతికూల చర్చలు : మీ బిడ్డ అకస్మాత్తుగా తన గురించి తాను ప్రతికూలంగా మాట్లాడటం ప్రారంభిస్తే లేదా తక్కువ ఆత్మవిశ్వాసం ఉన్నట్లు అనిపిస్తే, అది అతని తోటివారి ప్రతికూల ప్రభావాల వల్ల కావచ్చని గుర్తించాలి.రహస్యంగా మాట్లాడటం లేదా చాటింగ్...: ఒక పిల్లవాడు అకస్మాత్తుగా తన ఫోన్‌ను దాచి స్నేహితులతో మాట్లాడటం లేదా చాటింగ్ చేస్తున్నప్పుడు తన మొబైల్ స్క్రీన్‌ను దాచుకోవడం ప్రారంభిస్తే, తల్లిదండ్రులు అలెర్ట్‌గా ఉండాలి.చదువు నుండి పారిపోవడం...: మీ బిడ్డ ఉన్నట్టుండి స్కూల్‌కి వెళ్లనని మొరాయించడం లేదా హోంవర్క్ చేయకుండా మొండికి వేయడం, స్కూల్ ఎగ్గొట్టడానికి రకరకాల సాకులు చెప్పడం లేదా చదువుపై ఆసక్తి చూపక΄ోవడం.. వంటివి గమనిస్తే అది సోమరితనం వల్ల మాత్రమే కాదు, చెడు సహవాసం వల్ల కూడా కావచ్చు అని గ్రహించాలి. పిల్లల ప్రవర్తనలో పై విధమైన మార్పులు గమనిస్తే సకాలంలో తగు చర్యలు తీసుకోవాలి. ఇందుకు స్కూల్ టీచర్ల సాయం తీసుకోవడం, నిపుణుల కౌన్సెలింగ్‌తో.. చెడు సావాసాలను గుర్తించి, పొరపాట్లను నివారించి, సమస్యను చక్కదిద్దవచ్చు.ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే!
ఫొటోలు
అంతర్జాతీయం

పీకల లోతు వరద నీటిలో రిపోర్టింగ్, చివరకు..
పనిలో డెడికేషన్ అనాలో.. టీఆర్పీ కోసం పాకులాట అనాలో.. వ్యూస్ కోసం స్టంట్లు అనాలో.. ఈ ఘటన గురించి చదివాక మీ స్పందన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పాకిస్తాన్లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఒక జర్నలిస్ట్ లైవ్ రిపోర్టింగ్ చేస్తూ నీటిలో కొట్టుకుపోయాడంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన రావల్పిండిలోని చాహన్ డ్యామ్ వద్ద చోటుచేసుకుంది. రిపోర్టర్ పీకల లోతు వరద నీటిలో నిలబడి అక్కడి పరిస్థితి వివరిస్తున్నాడు. ఆ సమయంలో వరద ఉధృతికి ఆకస్మికంగా ప్రవాహం అతన్ని లోపలికి లాక్కెళ్లిపోయింది.A Pakistani reporter is swept away by strong currents during a live broadcast while covering the floods in neck-deep water.#Pakistan #Floods pic.twitter.com/0raCbYaoer— Al Arabiya English (@AlArabiya_Eng) July 17, 2025అయితే ఈ వీడియో అక్కడికి మాత్రమే కట్ అయ్యింది. అతను కొట్టుకుపోయాడని, ఇప్పటిదాకా అతని ఆచూకీ తెలీయకుండా పోయిందనేది సదరు వార్త కథనాల సారాంశం. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అతనిది మూర్ఖపు చర్య అని కొందరు, విధి నిర్వహణలో తప్పేం కాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కెమెరామ్యాన్నెవర్డైస్ అంటూ మరికొందరు సరదా కామెంట్లు పెడుతున్నారు. అయితే.. మరికొందరు మాత్రం అతను అసలు రిపోర్టర్ కాదని, టిక్‌టాక్ లాంటి షార్ట్వీడియోస్ యాప్‌లలో వ్యూస్ కోసం ఇలాంటి స్టంట్లు చేస్తుంటాడని పలువురు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అతను సురక్షితంగానే ఉండి ఉంటాడన్నది ఆ కామెంట్ల సారాంశం. అయితే.. ఫ్యాక్ట్ చెక్‌లో అతని పేరు అలీ ముసా రాజా(Ali Musa Raza)గా తేలింది. రూహీ అనే చానెల్లో అతను చాలా కాలంగా రిపోర్టర్‌గా పని చేస్తున్నాడు. అతను క్షేమంగానే ఉన్నాడా? అనే దానిపై ఆ చానెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజా ఘటన నేపథ్యంలో పలువురు జర్నలిస్టులు సైతం అతనికి సంఘీభావం తెలుపుతున్నారు. అతను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. చీప్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కంటే ఇలాంటి ధైర్యమైన రిపోర్టర్లు సమాజానికి అవసరమని, అదే సమయంలో ఇలాంటివాళ్లు సురక్షితంగా కూడా ఉంటాలంటూ కామెంట్లు పెడుతున్నారు. రిపోర్టర్ అలీ ముసా రాజాకు ఇలాంటి స్టంట్లు కొత్తేం కాదు. కిందటి ఏడాది.. పంజాబ్ ప్రావిన్స్ సఖి సర్వర్ ఏరియాలో వరదలను నడుం లోతు నీళ్లలో కవర్ చేస్తూ వైరల్ అయ్యాడు కూడా. View this post on Instagram A post shared by NDTV WORLD (@ndtvworld)పాకిస్తాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది గత సంవత్సరం కంటే 124% ఎక్కువ వర్షపాతం అని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది. తాజా వరదల ధాటికి ఆ దేశంలో ఇప్పటికే 180 మంది మరణించారు. అయితే.. ఒక్క పంజాబ్ ప్రావిన్స్‌లో 54 మంది ఒకే రోజులో మరణించడం గమనార్హం.

భారత్, పాక్‌పై ట్రంప్ పిచ్చి వ్యాఖ్యలు.. నెటిజన్ల ఆగ్రహం!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నోటి దురుసుతో భారత్‌పై వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు ట్రంప్ పాత పాటే పాడారు. ఈసారి మరో అడుగు ముందుకేసి.. ఐదు జెట్లు కూలినట్టు తనకు సమాచారం ఉందని ట్రంప్ చెప్పారు. అయితే, కాల్పులు విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని ప్రధాని మోదీ స్వయంగా ట్రంప్‌తోనే చెప్పినప్పటికీ అధ్యక్షుడి వైఖరిలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం.భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తామే ఆపామని ట్రంప్ తెలిపారు. యుద్ధ సమయంలో విమానాలు కూల్చేశారని వ్యాఖ్యానించారు. ఐదు జెట్లు కూలినట్టు తనకు సమాచారం ఉందన్నారు. రెండు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేస్తూ ఉన్నాయి. ఇరు దేశాల మధ్య జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపామన్నారు. భారత్-పాక్ మధ్య పరిస్థితి తీవ్రమవుతుండగా.. ట్రేడ్ ద్వారా సమస్యను పరిష్కరించామని చెప్పారు. ట్రేడ్ డీల్ కావాలంటే యుద్ధం ఆపాలన్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి చర్చకు వచ్చాయి.Trump just reminded India who’s boss again. He said I stopped war b/w India , Pakistan but dropped a bonus 5 Indian jets shot down ⚡️. Sorry Don it’s 6-Nill 💀 pic.twitter.com/ookpeprp9K— Awais 🐺 (@awais4226) July 19, 2025భారత్-పాక్ మధ్య కాల్పులు ఆగితే, అందుకు క్రెడిట్ తీసుకుంటున్న ట్రంప్, తన బుద్ధి మార్చుకోవడం లేదు. గతంలోనే ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన భారత ప్రధాని మోదీ.. ఈ విషయంలో అమెరికా ప్రమేయమేదీ లేదని తేల్చిచెప్పారు. ఇది రెండు దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని, మధ్యవర్తి ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకే ఫోన్లో చెప్పానని మోదీ స్పష్టం చేశారు. తమ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించబోదని స్పష్టం చేశారు. ఆ సమయంలో తన జోక్యమేమీ లేదని.. భారత్-పాక్ దేశాలే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని చెప్పిన ట్రంప్.. మరోసారి మాట మార్చి వ్యాఖ్యలు చేశారు. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌నకు మతి మరుపు ఏమైనా వచ్చిందా? అని ప్రశ్నిస్తున్నారు.

300 మంది మరణించాక.. ఇజ్రాయెల్, సిరియా కాల్పుల విరమణ
డమాస్కస్: సిరియాలోని డ్రూజ్ కమ్యూనిటీ జనాభా అధికంగా కలిగిన స్వీడన్ ప్రావిన్స్‌లో రోజుల తరబడి కొనసాగిన మారణహోమం దరిమిలా ఇజ్రాయెల్- సిరియాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ ఘర్షణల్లో 300 మందికి పైగా జనం మృతిచెందారు. ఈ కాల్పుల విరమణకు ప్రాంతీయ మిత్రదేశాలు టర్కీ, జోర్డాన్ మద్దతు పలికాయి.సిరియాలోని దక్షిణ స్వీడన్ ప్రావిన్స్‌లో రోజుల తరబడి కొనసాగిన హింస అనంతరం ఇజ్రాయెల్- సిరియాలు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇప్పటివరకూ జరిగిన ఘర్షణల్లో మహిళలు, పిల్లలు, వైద్య సిబ్బందితో సహా మొత్తం 321 మంది మరణించారని మానవ హక్కుల పరిశీలకులు తెలిపారు. సిరియా అధ్యక్ష కార్యాలయం కాల్పుల విరమణను ప్రకటించింది. ఇందుకోసం దక్షిణాన ఒక ప్రత్యేక భద్రతా దళాన్ని మోహరించినట్లు తెలిపింది. పరిస్థితులు తీవ్రతరం కాకుండా నిరోధించడమే లక్ష్యంగా సమన్వయంతో కూడిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది.దక్షిణాన సిరియా సైనిక మోహరింపులను ఇజ్రాయెల్ వ్యతిరేకించినప్పటికీ, 48 గంటల పాటు స్వీడాకు పరిమిత సిరియన్ అంతర్గత భద్రతా దళాల ప్రవేశాన్ని అనుమతిస్తామని తెలిపింది. సిరియా కొత్త నాయకత్వం సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్‌లలోని డ్రూజ్ కమ్యూనిటీకి ముప్పు కలిగిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్.. స్వీడాపై దాడులను కొనసాగించింది. ఇది గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని సూచిస్తుంది. స్వీడా ప్రావిన్స్‌లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నట్లు స్థానిక వార్తా సంస్థ స్వీడా24 ప్రతినిధి ర్యాన్ మారౌఫ్ తెలిపారు.

‘ఊహలొద్దు.. దర్యాప్తు ముందుంది’: విమాన ప్రమాదంపై అమెరికా
వాషింగ్టన్: అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తును ముగించాలనే తొందరపాటు పలువురిలో కనిపిస్తున్నదని అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డు (ఎన్టీఎస్బీ) చైర్పర్సన్ జెన్నిఫర్ హోమెండి పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై ఇప్పటివరకూ వచ్చిన నివేదికలు ఊహాజనితమైనవేనని ఆయన అన్నారు.గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-7 ప్రమాదంపై ఎన్టీఎస్బీ సాయంతో భారత విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ)దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రస్తుత తరుణంలో ఊహాగానాలకు దూరంగా ఉండాలని ఏఏఐబీ, ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్‌బెల్ విల్సన్ ప్రజలను కోరారు. ‘ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఇటీవలి మీడియా నివేదికలు ఊహాజనితమైనవి. ఏఏఐబీ తన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. పూర్తి దర్యాప్తునకు ఇంకా సమయం పడుతుంది. ఏఏఐబీ కొనసాగుతున్న దర్యాప్తుకు మద్దతు ఇస్తున్నాం’ అని ఎన్టీఎస్బీ ‘ఎక్స్’లో ఒక పోస్టులో తెలిపింది. Statement from NTSB Chairwoman Jennifer Homendy:“Recent media reports on the Air India 171 crash are premature and speculative. India’s Aircraft Accident Investigation Bureau just released its preliminary report. Investigations of this magnitude take time. We fully support the…— NTSB Newsroom (@NTSB_Newsroom) July 18, 2025ఏఏఐబీ ప్రాథమిక నివేదిక ప్రకారం బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌లోని రెండు ఇంధన నియంత్రణ స్విచ్‌లను టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకు కటాఫ్ స్థానాన్ని గుర్తించారు. 10 సెకన్ల తర్వాత స్విచ్‌లను పునరుద్ధరించినప్పటికీ, విమానం అప్పటికే థ్రస్ట్‌ను కోల్పోయింది. ఇది ప్రమాదానికి దారితీసింది. అలాగే కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లో, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్.. కెప్టెన్ సుమీత్ సభర్వాల్‌ను ఎందుకు కట్ఆఫ్ చేశారని అడగటం వినిపిస్తుంది. అందుకు ప్రతిగా అతను అలా చేయలేదని చెప్పడం రికార్డయ్యింది. ఈ నివేదిక నేపధ్యంలో భారతదేశ పౌర విమానయాన నియంత్రణ సంస్థ దేశంలోని అన్ని బోయింగ్ 737, 787 విమానాలలో ఇంధన నియంత్రణ వ్యవస్థలను తనిఖీ చేయాలని ఆదేశించింది. పరిశీలన దరిమిలా వాటిలో ఎటువంటి లోపం లేదని ఎయిర్ ఇండియా ప్రకటించింది.
జాతీయం

తోటపని.. పిల్లలకు మంచిదని!
దయ, ఓర్పు, బాధ్యత వంటి సుగుణాలు గాల్లోంచి వీచి పిల్లల్లో ప్రవేశించవు. తల్లి ఒడి నేర్పించాలి. తండ్రి తన భుజాల పైకి ఎక్కించుకుని లోకాన్ని చూపించాలి. గురువు చెప్పే గద్దింపు పాఠాలు నేర్వాలి. అప్పుడే బిడ్డ ఎదుగుతాడు. ఎదిగేకొద్దీ ఒదుగుతాడు. అయితే ఇల్లు, బడి మాత్రమే కాకుండా బిడ్డకు బుద్ధులు నేర్పే పాఠాల్లో మరో ముఖ్యమైనది ఒకటి ఉంది. అదే... తోట పని. తోటను చూస్తూ, తోటలో పని చేస్తూ పెరిగి పెద్దయిన పిల్లలు సాటి మనుషులకు చల్లని నీడ అవుతారని, మానవత్వానికి ఊడలు అవుతారని మనో వైజ్ఞానిక నిపుణులు చెబుతున్నారు.సూర్యుడికి, చెట్లకు, పక్షులకు దూరంగా ఇళ్లలోనే పెరిగి పెద్దయి ఒకేసారి బయటికి అడుగు పెట్టే పిల్లల్లో ప్రకృతి సహజ లక్షణాలైన నెమ్మది, ప్రశాంతత ఉండవు. జీవన నైపుణ్యాలు కనిపించవు. నలుగురిలో కలవటం, కలుపుకొని పోవడం తెలియవు అని సైకాలజిస్టులు చెబుతున్నారు. కెరీర్లో దూసుకుపోతుంటారు కానీ, జీవితంలో ఉన్నచోటే ఉండిపోతారు. అందుకే ఈ డిజిటల్ ప్రపంచపు రోబో పిల్లల్ని తోట పనికి పంపాలి. తోటపని పిల్లల్ని మలిచే కుమ్మరి వంటిది. పెద్దయ్యాక బతకటానికి లోకంలో ఎన్నో పనులు ఉంటాయి. కానీ ఎలా బతకాలో చిన్నతనంలోనే తోట పని నేర్పిస్తుంది.తోటపనిలోకి ఎలా దింపాలి?ఆటలా ఉంటే చాలు, పిల్లలు దేనికైనా ‘సై’ అంటారు. కనుక తోటపనిని కూడా వాళ్లకు ఆటలా నేర్పించాలి. ఇందుకు మీరూ వాళ్లతో కలిసి ఆటలోకి దిగాలి. వంటింటి నుంచే మీ ఆటను మొదలుపెట్టండి. టమాటాను కోసి, అందులోంచి కొన్ని విత్తనాలను తీసి, ఎండబెట్టి, ఒక చిన్న కుండీలో నాటండి. ‘ఆహారం ఏదీ నేరుగా ప్యాకెట్లలో వచ్చేయదు. గింజ వేయటానికి నేల, మొక్క మొలిచాక సూర్యరశ్మి కోసం సూర్యుడు, మొక్క ఫలించటానికి కొంత సమయం, అప్పటి వరకు వేచి ఉండటానికి మనకు సహనం అవసరం’ అని పిల్లలకు నేర్పించటానికి ఇదొక చక్కని మార్గం.ఒక మొక్కను అప్పగించండిపాత టీ కప్పులు, ప్లాస్టిక్ సీసాలు లేదా టిన్ డబ్బాలలో మట్టిని నింపి చిన్న చిన్న మొక్కలను నాటండి. ఆ కప్పులు లేదా డబ్బాలకు మీ పిల్లల చేత వారికి చేతనైనట్లుగా అందమైన పెయింట్స్ వేయించండి. లేదా స్టిక్కర్లతో అలంకరించనివ్వండి. అలా ఒక రీసైకిల్ పాట్ గార్డెన్‌ను తయారవనివ్వండి. అప్పుడు వారు ఆ మొక్కల్ని తమ సొంతమైనవిగా భావిస్తారు. మొక్కకు వారినే ఏదో ఒక పేరు పెట్టమని చెప్పండి. అలా వాటితో అనుబంధం ఏర్పడుతుంది. వాటి ఆలనా, పాలనను వారే ఇష్టంగా తీసుకుంటారు. రోజూ ఉదయం నిద్ర లేవగానే వెళ్లి ఆ మొక్కను పలకరిస్తారు. చిన్నతనంలో మొక్కలతో ఏర్పడిన బాంధవ్యమే, పెద్దయ్యాక సాటి మనుషులతోనూ ఏర్పడుతుంది.సేంద్రియ ఎరువు తయారీవంట గది వ్యర్థాలు, తోటలో రాలిపడిన ఆకులు, మట్టి.. వీటన్నిటినీ ఒక పారదర్శకమైన సీసాలో ఒకదానిపైన ఒకటి పొరలుగా వేసి అవన్నీ కుళ్లిపోయి సహజమైన ఎరువుగా ఎలా మారుతుందో పిల్లలకు చూపించవచ్చు. నిజంగా అదొక అద్భుతమైన ప్రయోగంగా, మారువేషంలో ఉన్న ఒక సైన్స్ పాఠంలా పిల్లలకు అనిపిస్తుంది.విత్తనం నాటితే ఓర్పు మొలుస్తుంది⇒ తోటపని అంటే కేవలం మొక్కల పాదుల్ని శుభ్రం చెయ్యటం, మొక్కలకు నీళ్లు పెట్టటం మాత్రమే కాదు.⇒ మట్టిని తవ్వటం అనేది శ్రమించటాన్ని నేర్పిస్తుంది.⇒ విత్తనాలను నాటడం అన్నది ఆశగా⇒ ఎదురుచూడటం అలవరుస్తుంది.⇒ ఎదురుచూడటం అంటే తొందరపడకపోవటం. ఓపికపట్టడం. జీవితానికి అత్యంత కీలకమైన ఈ లక్షణాలను తోటపని బాల్యంలోనే అలవరుస్తుంది.⇒ ఇక మొక్కలకు నీళ్లు పెట్టటం బాధ్యత అవుతుంది. నీళ్లు పెట్టడం మర్చిపోయి, మొక్కలు వాడిపోయినప్పుడు బాధ్యతను మరువకూడదని తెలిసివస్తుంది.ఎదిగే దశలు ఉత్తేజపరుస్తాయితోటపని చేసే క్రమంలో మొక్కలు ఎదగటంలోని దశలు పిల్లలను ఉత్తేజపరుస్తాయి. మొక్కలు పెరగటానికి, పవ్వులు పూయటానికి, కాయలు కాయటానికి సమయం పడుతుందని వారు గ్రహిస్తారు. స్వయంగా నాటి, నీళ్లు పోసి, సంరక్షించిన మొక్కలు పుష్పించినప్పుడు, కాయలూ పండ్లూ కాసినప్పుడు తామే ప్రకృతిని పెంచి పెద్ద చేసిన గొప్ప ఆత్మవిశ్వాసపు భావన పిల్లల్లో అంకురిస్తుంది. వారిపై వారికి నమ్మకాన్ని ఏర్పరుస్తుంది. తోటపనిలోని ఈ అనుభవాలన్నీ జీవితంలో మున్ముందు అక్కరకు వస్తాయి.సృజనాత్మకత, సాత్విక గుణాలు⇒ తోటపని ప్రకృతితో పిల్లలకు స్నేహబంధాన్ని ఏర్పరుస్తుంది. మొదట్లో భయపెట్టిన వానపాములు తరవాత నేస్తాలు అవుతాయి. వర్షం ఉత్సాహమై కురుస్తుంది.⇒ తూనీగలు మీదకొచ్చి వాలతాయి. సీతాకోక చిలుకలు తలపై ఎగురుతాయి.⇒ పక్షులన్నీ రాగాల కోయిలలే అవుతాయి. ఇవన్నీ పిల్లల్లో సృజనాత్మకతను, సాత్విక గుణాలను ప్రేరేపిస్తాయి. మున్ముందు జీవితంలో అలుముకునే నిరాశ, నిస్పృహలకు, అనిశ్చిత పరిస్థితులకు కూడా తోటపనే వైద్యం, చికిత్స నేర్పి పంపుతుంది.తోటపనితో ఏమేం తెలుస్తాయి?⇒ సమస్యలను ఎలా పరిష్కరించాలి?⇒ ప్రణాళికతో పనిచేయడం⇒ సమయం, వనరుల సద్వినియోగం⇒ లక్ష్యసాధన⇒ కష్టం విలువఏమేం పెరుగుతాయి?⇒ ఆత్మవిశ్వాసం⇒ ఆత్మగౌరవం⇒ ఓర్పు, సహనం⇒ బాధ్యత⇒ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు⇒ ఎలా చేస్తే పని విజయవంతమవుతుందన్న ఆలోచనా ధోరణి⇒ పర్యావరణ పరిరక్షణ స్పృహఏమేం తగ్గుతాయి?⇒ ఒత్తిడి, ఆందోళన⇒ కోపం, అసహనం⇒ ఒక పనిని గుడ్డిగా చేయడం⇒ మొక్కలను నరికేయడం/కొట్టేయడం

స్మార్ట్ గూఢచారి!
అకస్మాత్తుగా మీ ఫోన్ దానంతటదే బ్లింక్ అవుతుంది. ఏదో మెసేజ్! తెరిచి చూస్తే అంకెలు, అక్షరాలు ఉంటాయి. అవేమిటో అర్థం కాదు. హఠాత్తుగా మీ ఫోన్ బ్యాటరీ 20 శాతానికి పడిపోయి ఉంటుంది. నిజానికి అప్పటికి గంట క్రితమే మీరు మీ ఫోన్‌ని పూర్తిగా చార్జి చేసి ఉంటారు. మీ ఫోన్‌ని మీరు ఉపయోగించకుండానే వేడెక్కిపోతుంటుంది. ఏదో సాంకేతిక సమస్య అని మీరు పట్టించుకోక పోవచ్చు. కానీ అవన్నీ... స్పైయింగ్ సాఫ్ట్వేర్ లేదా స్పైవేర్ మీ ఫోన్లో చొరబడి ఉండొచ్చనే దానికి సంకేతాలు కావచ్చునని అంటున్నారు నిపుణులు. మరోవైపు – స్మార్ట్ఫోన్ల ద్వారా నిఘా, గూఢచర్యం, సైబర్‌క్రైమ్‌లు పెరగటం పట్ల కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. – సాక్షి, స్పెషల్ డెస్క్స్మార్ట్ఫోన్ లో మన వ్యక్తిగత వివరాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. మనం వాడే అనేక యాప్‌లు.. మనకు సంబంధించిన కాంటాక్ట్‌లు, లొకేషన్ హిస్టరీ, ఫొటోలు.. ఇలా అన్నింటి యాక్సెస్ తీసేసుకుంటున్నాయి. అందువల్ల స్మార్ట్‌ఫోన్‌లో మన జీవితం తెరిచిన పుస్తకం అయిపోయింది. ఎంతో అమూల్యమైన ఆ సమాచారాన్ని ఎవరో, ఎక్కడి నుంచో రహస్యంగా వెతుకుతూ ఉంటే? చూస్తూ ఉంటే? మనకు తెలియకుండా వేరెవరికో ఇచ్చేస్తే? సర్వం పోగొట్టుకున్నట్లే. జీవితమే తలకిందులైపోవచ్చు కూడా. అందుకే స్పైవేర్ సంకేతాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ‘స్పైవేర్’ అనేది మన ఫోన్లోని విలువైన సమాచారాన్నంతా రాబట్టేందుకు రూపొందిన హానికరమైన సాఫ్ట్వేర్. మనకు తెలియకుండానే అది మన పాస్‌వర్డ్‌లన్నీ కనిపెట్టేస్తుంది. మన కదలికలన్నిటినీ గమనిస్తుంటుంది. మనం చేసిన కాల్స్‌నీ, మనకు వచ్చిన కాల్స్‌నీ రికార్డ్ చేస్తుంటుంది. మనకు తెలియకుండానే మన మైక్రోఫోన్, కెమెరాలను కూడా పని చేయించటం మొదలుపెట్టేస్తుంది.మనకెలా తెలుస్తుంది?..: మీ ఫోన్లో స్పైవేర్ చొరబడి మిమ్మల్ని గమనిస్తున్న విషయాన్ని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అవి :ఫోన్ పనితీరులో ఆకస్మిక సమస్యలు: యాప్‌లు పని చేయటం మానేస్తాయి లేదా ఫోన్ బాగా స్లో అయిపోతుంది. బ్యాటరీ త్వరగా డౌన్ అయిపోవటం: స్పైవేర్ అన్నది ఇరవై నాలుగు గంటలూ పని చేస్తుంటుంది. ఫోన్ బ్యాటరీ మొత్తాన్ని తాగేస్తుంది. అంతుచిక్కని డేటా వినియోగం: మీ మొబైల్ డేటా బిల్లు మీ వాడకానికి మించి అమాంతం పెరిగిపోయిందీ అంటే స్పైవేర్ మీ డేటాను వేరొకరికి బదిలీ చేస్తోందని అర్థం!వేడెక్కడం: మీ ఫోన్ వాడకంలో లేనప్పుడు కూడా వేడెక్కుతూ ఉంటే వెనుక ఏదో స్పయింగ్ పని నడుస్తూ ఉండొచ్చు. వింత సందేశాలు: వింత అక్షరాలు లేదా లింక్‌లతో కూడిన టెక్స్ట్ మెసేజ్‌లు వస్తుంటే అవి మీ ఫోన్లోని స్పైవేర్‌కు అందుతున్న ఆదేశాలు / సందేశాలు కావచ్చు.స్పైవేర్‌ను వేటాడటం ఎలా?మీ ఫోన్లో స్పైవేర్ సంకేతాలు కనిపిస్తే కనుక మీరు దానిని వేటాడి మట్టుపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం. అయితే ఆ వేట మీది ఏ రకం ఫోన్ అనే దాన్ని బట్టి ఉంటుంది. మీది ఆండ్రాయిడ్ అయితే» మొదట సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అక్కడి నుంచి యాప్స్‌లోకి వెళ్లండి. అక్కడ మీకేమైనా తెలియని యాప్‌లు కనిపిస్తున్నాయేమో చూడండి.» డివైజ్ అడ్మిన్ యాప్స్‌ని చెక్ చేసి, అక్కడ ఏయే పర్మిషన్లు హైలైట్ అయి ఉన్నాయో గమనించండి.» మాల్వేర్బైట్స్, లేదా అవస్త్ వంటి పేరున్న యాంటీ స్పైవేర్ యాప్‌లను ఇన్స్టాల్ చేసుకోండి.» ఆ తర్వాత వైరస్ల కోసం పూర్తిగా స్కాన్ చెయ్యండి. కొత్త ఫైల్స్ ఏమైనా వచ్చి చేరాయా అని తెలుసుకోవటం కోసం డౌన్లోడ్ ఫోల్డర్స్ చెక్ చేయండి.» గూగుల్ ప్లే ప్రొటెక్షన్ ఆన్‌లో పెట్టుకోండి.మీది ఐఫోన్ అయితే» మొదట సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. అక్కడి నుంచి ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి యాప్స్ పర్మిషన్స్ పరిశీలించాలి.» అక్కడి వి.పి.ఎన్. అండ్ డివైజ్ మేనేజ్మెంట్ ఆప్షన్లో అపరిచిత ఫైల్స్ ఉన్నాయేమో చూడాలి.» ముఖ్యంగా ఐఓస్ను అప్డేటెడ్గా ఉంచుకోవాలి. చాలావరకు స్పైవేర్లు సాంకేతిక లోపాలను ఉపయోగించుకుని లోనికి ప్రవేశిస్తాయి.» సాధారణంగా యాపిల్‌లోని ‘వాల్డ్ గార్డెన్’ రక్షణ వ్యవస్థ ఉండటం వల్ల స్పైవేర్ అంత ఈజీగా చొరబడలేదు. అలాగని స్పైవేర్ అటాక్ అసాధ్యం అని చెప్పలేం. ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై వినియోగదారులకు పూర్తి నియంత్రణను, అధికారిక యాప్ స్టోర్ వెలుపల ఉన్న యాప్‌లను ఇన్ స్టాల్ చేసే సామర్థ్యాన్ని అందించడానికి ఫోన్ తయారీదారు విధించిన సాఫ్ట్వేర్ పరిమితులను తొలగించే ‘జైల్బ్రేక్’ మార్గాన్ని స్పైవేర్ ఉపయోగించుకోవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.నివారణే ఉత్తమ పరిష్కారంస్పైవేర్ను గుర్తించడం కాస్త కష్టమే అయినప్పటికీ, దాన్ని నివారించడం మాత్రం సులభమే. అధికారిక యాప్ స్టోర్ల నుంచి మాత్రమే యాప్‌లను ఇన్ స్టాల్ చేసుకోండి. ఎస్.ఎం.ఎస్., వాట్సాప్, లేదా ఈమెయిల్ నుంచి వచ్చే అనుమానాస్పద లింకులను తెరవకూడదు. ఫోన్ ఆపరేటింగ్ సిస్టంలోని ‘జైల్బ్రేక్’ చేయకూడదు. అలా చేస్తే కీలకమైన భద్రతా కవచాలు తొలగిపోతాయి. అలాగే పటిష్టమైన, ఎవ్వరికీ ఊహకు కూడా అందని పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి. సాధ్యమైన రెండంచెల భద్రతను ఏర్పాటు చేసుకోండి. పబ్లిక్ వై–ఫైలు ఫ్రీగా వస్తున్నాయి కదా అని ఓ ఫోన్‌ని తెరిచి పెట్టుకోకండి. ఫైళ్లు, సినిమాలు వంటి డౌన్లోడ్ చేయడం చేశారో.. మీ పని అయిపోయినట్టే. ఇక మీ ఫోన్ హ్యాక్ అయిందని అనుమానం వస్తే ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌ని తొలగించి, ఆపరేటింగ్ సిస్టమ్‌ను తిరిగి ఇన్ స్టాల్ చేయడం స్పైవేర్‌ను తొలగించడానికి మిగిలిన ఏకైక, ఉత్తమమైన మార్గం.కేంద్ర ప్రభుత్వ ఆందోళనడిజిటల్ గూఢచర్యానికి స్మార్ట్ఫోన్లు, ఇతర డివైజ్‌లను సోషల్ మీడియా ఉపయోగిస్తున్న ధోరణిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తులకు రాజ్యాంగ హక్కులు ఉన్నట్టే సోషల్ మీడియా సంస్థలకూ ఉండాలని కర్ణాటక హైకోర్టులో ‘ట్విట్టర్’ చేసిన వాదనలకు స్పందిస్తూ, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా డిజిటల్ గూఢచర్యం అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. సెలబ్రిటీలు తమ కోసం వచ్చే సందర్శకులను ఫోన్లు బయటే పెట్టి రమ్మని విజ్ఞప్తి చేయవలసిన పరిస్థితి నేడు నెలకొని ఉందని ఆయన వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

డిజిటల్ అరెస్ట్ కేసులో... 9 మందికి యావజ్జీవం
కోల్‌కతా: డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసం కేసులో దేశంలోనే మొట్టమొదటిసారిగా పశ్చిమబెంగాల్ కోర్టు 9 మందికి యావజ్జీవ శిక్షలు విధిస్తూ తీర్పు వెలువరించింది. పెరిగిపోతున్న సైబర్ నేరాల కట్టడికి దేశం సాగిస్తున్న పోరులో నడియా జిల్లా కల్యాణి కోర్టు తీర్పు మైలురాయిగా నిలిచిపోనుంది. ఘటన జరిగిన ఎనిమిది నెలల్లోనే విచారణ పూర్తి చేసి, అదనపు సెషన్స్ జడ్జి తీర్పు వెలువరించడం మరో విశేషం. దోషుల్లో మహారాష్ట్రకు చెందిన నలుగురు, హరియాణా వాసులు ముగ్గురు, గుజరాత్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు. పార్థ కుమార్ ముఖర్జీ అనే రిటైర్డు సైంటిస్ట్ నుంచి సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ బూచి చూపి ఏకంగా కోటి రూపాయలు గుంజారు. ముంబై పోలీస్ అధికారినంటూ ఈ ముఠాలోని వ్యక్తి ముఖర్జీకి వాట్సాప్ కాల్ చేసి ఆర్థిక నేరాలకు పాల్పడినందున డిజిటల్ అరెస్ట్ తప్పదంటూ బెదిరించాడు. దీంతో, ఆయన ఈ ముఠా సభ్యులకు చెందిన పలు బ్యాంకు అక్కౌంట్లకు రూ.కోటి ట్రాన్స్ఫర్ చేశారు. మోసపోయినట్లు గుర్తించిన ముఖర్జీ 2024 అక్టోబర్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన రాణాఘాట్ సైబర్ క్రైం స్టేషన్ పోలీసులు నిందితులను గుర్తించి నాలుగున్నర నెలల్లో అంటే 2025 ఫిబ్రవరి 24వ తేదీతో విచారణ ముగించారు. మొత్తం విచారణ ప్రక్రియ 8 నెలల్లోనే పూర్తవడం విశేషమని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బివాస్ చటర్జీ చెప్పారు. ఈ ముఠా భారత సిమ్ కార్డులతో కంబోడియా నుంచి బాధితుడికి ఫోన్లు చేసి బెదిరించారన్నారు. ఇలా వీరు 100 మందిని మోసగించారని తెలిపారు. మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్, రాజస్తాన్‌లకు చెందిన 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 9 మందిపై ఫోర్జరీ, కుట్ర తదితర నేరారోపణలు చేశారన్నారు.

భారత్‌లో టెస్లా బ్రాండ్ బాజా బారాత్!
విశాల భారతావని.. 140 కోట్లకుపైగా జనాభా. విభిన్న తరాలు.. ఖర్చుల్లో అంతరాలు. పది రూపాయలకూ వెనుకడుగు వేసే కస్టమరే కాదు.. బ్రాండ్ కోసం రూ.10 కోట్లకూ సై అనే వినియోగదార్లు ఉన్నారు. ఇలా ప్రీమియం ధర చెల్లించే కొనుగోలుదారులు ఉన్నారు కాబట్టే భారత్‌లో టెస్లా రేస్ ప్రారంభించింది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాండ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ‘బ్రాండ్స్’ అంటే భారతీయులకు మక్కువ. రూ.50 లక్షలకుపైగా విలువ చేసే లగ్జరీ కార్లు సగటున గంటకు ఆరు రోడ్డెక్కుతున్న మార్కెట్ మనది. ఇలాంటి మార్కెట్లో రిటైల్‌తో పరుగు మొదలుపెట్టిన ఈ అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం రానున్న రోజుల్లో తయారీ చేపట్టే అవకాశమూ లేకపోలేదు.ప్రస్తుతం బీఎండబ్ల్యూ నం.1భారత్‌లో ప్రీమియం కార్ల మార్కెట్ విభాగంలో 2024–25లో 51,406 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఇప్పటికే దేశీయంగా బలమైన తయారీ, సర్వీస్ నెట్వర్క్ వ్యవస్థలను నిర్మించాయి. ప్యాసింజర్ వాహనాల (పీవీ) రంగంలో 2025 జూన్ నాటికి ఈవీల వాటా 4.5 శాతం మాత్రమే. లగ్జరీ పీవీల విభాగంలో ఈవీల వాటా 10 శాతం. ఇందులో బీఎండబ్ల్యూ 53 శాతం మార్కెట్ వాటాతో ఆధిపత్యం చెలాయిస్తోంది. 33 శాతం వాటాతో రెండో స్థానంలో మెర్సిడెస్–బెంజ్ పోటీపడుతోంది. టెస్లాకు ఇప్పటికే ఉన్న సవాళ్లకు తోడు ఈ సంస్థకు ప్రపంచ పోటీదారుగా ఉన్న చైనా దిగ్గజం బీవైడీ ఇండియాలో ఇప్పటికే అడుగుపెట్టింది. వియత్నాం కంపెనీ విన్ ఫాస్ట్ ఇక్కడ అడుగుపెట్టబోతోంది.పదేళ్ల నిరీక్షణ తర్వాత మనదేశంలోకి టెస్లా ఎంట్రీ ఇచ్చింది. తొలి ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను ముంబైలో ఆవిష్కరించింది. పూర్తిగా తయారైన కార్లకు దిగుమతి సుంకం భారత్‌లో 100 శాతం వరకు ఉంది. మనదేశంలో తయారీ చేపడితేనే ప్రయోజనాలు ఇస్తామని భారత్ స్పష్టం చేసింది. ఈ అంశాలే టెస్లా రాక ఆలస్యానికి కారణమయ్యాయి. మొత్తానికి పాలసీ అడ్డంకులు, సుంకాల సంక్లిష్టతలు, ఇతర బ్రాండ్లతో పోటీ, భౌగోళిక రాజకీయ ఒత్తిడి.. ఇవన్నీ అధిగమించి ఎట్టకేలకు అరంగేట్రం జరిగింది. దేశీయంగా తయారీ చేపట్టే అంశానికి కట్టుబడేముందు ఇక్కడి మార్కెట్‌ను పరీక్షిస్తామని టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ పలు సందర్భాల్లో పునరుద్ఘాటించారు. సుమారు రూ.60 లక్షల ధరతో తొలుత వై మోడల్‌ను టెస్లా ప్రవేశపెడుతోంది. ప్రపంచంలో అత్యధిక సుంకం ఉన్నది భారత్‌లోనే అని టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అందువల్లే, ఇతర దేశాలతో పోలిస్తే టెస్లా కారు ధర మనదేశంలోనే ఎక్కువ.టెస్లానా మజాకా!యూఎస్, జర్మనీ, చైనాలో టెస్లాకు తయారీ కేంద్రాలున్నాయి. ఇవి ఏటా 25–30 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయగలవు. 2019లో చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 3.8 శాతం మాత్రమే. అదే ఏడాది డిసెంబర్లో టెస్లా మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పటి నుంచి చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. 2024లో ఇది 24.6 శాతానికి చేరడంలో టెస్లా కీలకపాత్ర పోషించింది. ఆటో దిగ్గజాల మాదిరిగా కాకుండా ప్రకటనల విషయంలో టీవీలు, ఇతర మాధ్యమాలకు బదులు సెలబ్రిటీల ప్రభావం, నోటి మాటగా ప్రచారంపై టెస్లా ఆధారపడింది. ప్రీమియం, ప్రత్యేక బ్రాండ్‌గా కంపెనీ ఇమేజ్ను నిలబెట్టడంలో ఈ విధానం సహాయపడింది. నటుడు బ్రాడ్ పిట్, గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్, ‘ఈబే’ మొదటి అధ్యక్షుడు జెఫ్ స్కోల్, షావొమీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లే యూ.. ఇలా ఎందరో ప్రముఖులు టెస్లా కస్టమర్ల జాబితాలో ఉన్నారు.డెలివరీలు తగ్గాయ్అంతర్జాతీయంగా 2025 జనవరి–మార్చిలో టెస్లా డెలివరీలు 13% పడిపోయాయి. గడిచిన మూడేళ్లలో ఇది అత్యంత భారీ క్షీణత. పెరుగుతున్న ప్రపంచ పోటీ, నూతన మోడళ్ల రాక ముఖ్యంగా మోడల్–వై ఆలస్యం కావడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సలహాదారుగా ఎలాన్ మస్క్ పాత్రపై పెరుగుతున్న వ్యతిరేకత వంటివి ఈ క్షీణతకు దారితీశాయి. ఒకప్పుడు టెస్లాకు బలమైన మార్కెట్లలో ఒకటైన చైనాలో సంస్థ ఈవీ వాటా 2025 మొదటి ఐదు నెలల్లో 7.6%కి పడిపోయింది. ఇది గత సంవత్సరం 10%, 2020లో గరిష్ట స్థాయిలో 15%గా నమోదైంది. బీవైడీ, షావొమీ వంటి ప్రత్యర్థులు ఫీచర్–రిచ్ మోడళ్లు, పోటీ ధరలతో సవాల్ విసిరి మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టెస్లా 2025 జనవరి–మార్చి కాలంలో 3,36,681 వాహనాలను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 3,86,810గా నమోదైంది.
ఎన్ఆర్ఐ

లండన్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు
కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుక సంబరాలు అంబరాన్నంటాయి. శుక్రవారం రోజున బండి సంజయ్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని లండన్ ఇల్ఫార్డ్‌లోని బీజేపీ శ్రేణులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్, స్వీట్లు, పంపిణి మొక్కలు నాటడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టారు.బీజేపీ లండన్ అధ్వర్యంలో ఇల్ఫార్డ్ లోని బండి సంజయ్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, స్వీట్లు, పూల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాటిపల్లి సచిందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ క్షేత్రస్థాయిలో దిగ్విజయనేత అని కొనియాడారు. కార్పొరేటర్ నుండి ఎంపీ, కేంద్రమంత్రి స్థాయికి బండి సంజయ్ ఎదిగిన తీరు కార్యకర్తలకు ఆదర్శం, స్ఫూర్తిదాయకమన్నారు. సరస్వతీ శిశు మందిరం లో విద్యనభ్యసించిన బండి సంజయ్ కుమార్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని అన్నారు.ఆర్ఎస్ఎస్లో ఘటన్ నాయక్ గా, ముఖ్య శిక్షక్ గా ప్రాథమిక విద్యా స్థాయిలోనే బండి సంజయ్ పని చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో, బిజెపి కరీంనగర్ పట్టణ ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షులుగా, జిల్లా , రాష్ట్ర కార్యవర్గాల్లో వివిధ హోదాల్లో బిజెపిలో ఆయన బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కేరళ, తమిళనాడు రాష్ట్రాల ఇన్చార్జిగా ను ఆయన పని చేశారని, ఎల్కే అద్వానీ చేపట్టిన రథయాత్రలోనూ బండి సంజయ్ కుమార్ భాగం పంచుకున్నారని , 35 రోజులపాటు దేశవ్యాప్తంగా జరిగిన ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు. 1994 _ 2003 మధ్యకాలంలో బండి సంజయ్ కుమార్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా పని చేశారన్నారు.2005లో కరీంనగర్ 48వ డివిజన్ నుండి కార్పొరేటర్‌గా బండి సంజయ్ విజయం సాధించారని, వరుసగా మూడుసార్లు ఆయన కార్పొరేటర్ గా గెలుపొందారన్నారు.2019 లో కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారని తెలిపారు. అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ కుమార్ పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన సారాధ్యంలో బిజెపి రాష్ట్రంలో పుంజుకుందన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణ వ్యాప్తంగా బండి సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్రతో బీజేపీ గ్రామ గ్రామానికి చేరిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై, వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ, అధికార పార్టీపై తీవ్రస్థాయిలో బండి సంజయ్ కుమార్ విరుచుకుపడ్డారని తెలిపారు.బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో రాష్ట్రంలో జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు జిహెచ్ఎంసి ఎన్నికలు చరిత్ర సృష్టించాయన్నారు. బండి సంజయ్ దిశా నిర్దేశంలో రాష్ట్రంలో బిజెపి గ్రాఫ్ పెరిగిందన్నారు. అనంతరం బండి సంజయ్ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారని తెలిపారు. కరీంనగర్ చరిత్రలోనే భారీ మెజారిటీతో రెండోసారి బండి సంజయ్ పార్లమెంట్ సభ్యునిగా గెలుపొంది, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారని తెలిపారు. ప్రస్తుతం దేశ, రాష్ట్ర బిజెపి కీలక నేతల్లో బండి సంజయ్ ఒకరని చెప్పారు.ప్రధానంగా కరీంనగర్ పార్లమెంటు సర్వతో ముఖాభివృద్ధి కోసం బండి సంజయ్ కుమార్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, రెండు టర్ములలో పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజారిటి తో గెలుపొంది రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా పనిచేసి కేంద్రమంత్రి గా కొనసాగుతూ స్థానికంగా ప్రజలకి అందుబాటులో ఉంటున్నారని కొనియాడారు ఈ కార్యక్రమం లోఓవర్సీస్ బీజేపీ నాయకులు వాస భరత్, బండ సంతోష్, కోమటిరెడ్డి శివ ప్రసాద్ రెడ్డి, జయంత్, సంజయ్, బద్దం చిన్న రెడ్డి, సురేష్, చార్లెస్, జేమ్స్, ఆంథోనీ తదితరులు పాల్గొన్నారు.

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగ వైభవంగా జరిగింది. శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో సుమారు 900 మంది భక్తులతో ఈ వేడుకు ఘనంగా జరిగింది. అంతర్జాలం ద్వారా మరో 7,000 మంది వీక్షించారు. తెలంగాణ జానపద గేయాలు, భక్తిగీతాలు, నృత్యప్రదర్శనలు ఉత్సవానికి విశేష ఆకర్షణగా నిలిచాయి.బోయిన స్వరూప, పెద్ది కవిత, సరితా తులా, దీపారెడ్డి, మోతే సుమతి, గంగా స్రవంతి, సంగీత తదితర మహిళలు కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. మొదటి నుంచి చివరి వరకు సాంప్రదాయభరితంగా, సాంస్కృతిక ఘనతతో కొనసాగిన ఈ కార్యక్రమంలో తెలుగు కుటుంబాలు, కార్మిక సోదరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.మహిళలు, చిన్నారులు ఉత్సాహంతో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కాళికా అమ్మవారికి వేపచెట్టు రెమ్మలు, పసుపు, కుంకుమతో అలంకరించి, దీపం వెలిగించిన బోనాలను అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించారు. మట్టి కుండల్లో అన్నం, పాలు, పెరుగు, బెల్లంతో చేసిన బోనాలను తలపై మోస్తూ, డప్పులు, పోతురాజులు, ఆటగాళ్లతో ఆలయానికి తరలివచ్చారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను పంచిపెట్టారు. పెద్దపులి ఆట, పోతురాజు వేషధారణ, సాంస్కృతిక నృత్యాలు కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సింగపూర్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని నిర్వాహకుడు బోయిన సమ్మయ్య తెలిపారు.బోనాలు తెలంగాణకు ప్రత్యేకమైన సాంప్రదాయక పండుగ అని, తక్కువ సమయంలో పెద్ద ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిచారంటూ సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అభినందించారు. ఈ ఏడాది సమాజం సువర్ణోత్సవాలను కూడా ప్రకటించారు. కార్మిక సోదరులు పెద్దఎత్తున హాజరయినందుకు ఉపాధ్యక్షులు పుల్లన్నగారి శ్రీనివాసరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి స్పాన్సర్ వజ్ర రియల్‌ఎస్టేట్‌కు అభినందనలు తెలిపారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సింగపూర్ తెలుగు సమాజం, అరసకేసరి దేవస్థానం సభ్యులకు, ఆహుతులకు, హాజరైన భక్తులు అందరికీ గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.కోశాధికారి ప్రసాద్, ఉపకోశాధికారి ప్రదీప్, ఉపాధ్యక్షులు నాగేష్, మల్లిక్, కార్యదర్శి స్వాతి, కమిటీ సభ్యులు గోపి కిషోర్, జనార్ధన్, జితేందర్, భైరి రవి, గౌరవ ఆడిటర్లు ప్రీతి, నవత తదితరులు ఈ వేడుకలో భాగం పంచుకున్నారని, తెలుగు వారంతా బోనాల స్ఫూర్తితో పాల్గొని మన ఐక్యతను చాటారని నిర్వాహకులు పేర్కొన్నారు.

ట్రంప్‌కు మరో షాక్.. రాజీనామా యోచనలో కాష్ పటేల్!
ట్రంప్ వీరవిధేయుడు, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు విషయంలో విభేదాలతో ఎలాన్ మస్క్ డోజ్‌ను వీడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాష్ పటేల్ కూడా ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో అదే బాటలో పయనించే అవకాశం కనిపిస్తోంది.వాషింగ్టన్: భారత సంతతికి చెందిన కాష్ పటేల్(కశ్యప్ ప్రమోద్ పటేల్) ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో రాజీనామా చేస్తారనే ఊహాగానాల నడుమ.. కాష్ ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. డాన్ రాజీనామా చేసిన వెంటనే తన పదవి నుంచి వైదొలగాలని కాష్ భావిస్తున్నారని స్థానిక మీడియా కథనాలు ఇస్తోంది. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినోఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారాన్ని అమెరికా న్యాయ విభాగం.. ఎఫ్‌బీఐ కలిపి విచారిస్తోంది. అయితే ఈ కేసును అటార్నీ జనరల్ పామ్ బాండీకు అప్పగించినప్పటి నుంచి ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సెలవులపై వెళ్లారు. అయితే ఆమె ఉండగా తాను తిరిగి విధుల్లోకి రాలేనని బోంగినో ఎఫ్‌ఐబీకి స్పష్టం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలోనే కాష్ పటేల్ ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బోంగినో గనుక రాజీనామా చేస్తే.. కాష్ తాను పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నారని అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. పామ్ బాండీ‘‘ఈ దర్యాప్తులో పామ్ బాండీ ఉండాలని కాష్ పటేల్ కూడా కోరుకోవడం లేదు. బాండీ మరికొన్ని పత్రాలను విడుదల చేయకపోవడంపైనా ఎఫ్‌బీఐ వర్గాల్లో తీవ్ర అసహనం నెలకొంది. అందుకే బోంగినో గనుక వీడితే ఆయన కూడా ఎఫ్‌బీఐని వీడే అవకాశం ఉంది’’ అని ఓ ప్రముఖ జర్నలిస్టు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎఫ్‌బీఐకి, డీవోజే(డిపార్ట్మెంట ఆఫ్ జస్టిస్)కు నడుమ పొసగట్లేదన్న విషయాన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ట్రంప్ అనుచరురాలు లారా లూమర్ సైతం ధృవీకరించడం గమనార్హం. పారదర్శకత లోపించిందనేది ప్రధాన ఆరోపణతో ఎఫ్‌బీఐ వర్గాలు బాండీ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నాయంటూ లూమర్ తెలిపారు. ఈ క్రమంలో బాండీని.. బ్లోండీ అంటూ ఆమె ఎద్దేవా చేయడం గమనార్హం. ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఫైల్స్ ఇప్పటిదాకా బయటకు రాకపోవడంతో అమెరికా రాజకీయాల్లో, మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అయితే.. ఎప్స్టీన్ ఫైల్స్‌లో.. ప్రముఖుల పేర్లు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతామని ఫిబ్రవరిలో ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పామ్ బాండీ ప్రకటించారు. అయితే తాజాగా డీవోజే-ఎఫ్‌బీఐ సంయుక్తంగా విడుదల చేసిన మెమోలో.. ఎలాంటి ఆధారాల్లేవని, కేసును ముగించినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాండీ మాటమార్చి.. తన గత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఒకవైపు ఎలాన్ మస్క్ సైతం ఈ వ్యవహారంపై ట్రంప్ ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు. మరోవైపు ట్రంప్ ఈ వ్యవహారంపై తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటిదాకా ఎఫ్‌బీఐ వర్సెస్ జ్యూడీషియల్ డిపార్టెమెంట్ వ్యవహారంపై వైట్‌హౌజ్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇంకోవైపు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) ఉద్యమకారులు సైతం ఈ పరిణామాలపై అసంతృప్తితో రగిలిపోతున్నారు.కశ్యప్ పూర్వీకులు భారత్‌లోని గుజరాత్ నుంచి వలస వెళ్లారు. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఉగాండా నుంచి అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్‌లో కశ్యప్ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు.అనంతరం మియామీ కోర్టుల్లో లాయర్‌గా వివిధ హోదాల్లో సేవలందించారు. ఆ సమయంలోనే ట్రంప్‌కు ఆయన దగ్గరయ్యారు. ఫిబ్రవరి 22వ తేదీన ఎఫ్‌బీఐ 9వ డైరెక్టర్‌గా కాష్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో పామ్ బాండీ కాష్‌తో ప్రమాణం చేయించగా.. భగవద్గీత మీద చేయి ఉంచి ఆయన బాధ్యతలు చేపట్టారు.

యూఎస్‌కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్!
కూటి కోసం కోటి తిప్పలు..ఇది సగటు మనిషి ఆలోచన. మెరుగైన జీవితం కోసం డాలర్ డ్రీమ్స్ ఎందరివో. విదేశాలకు వెళ్లాలి. డాలర్లలో సంపాదించాలి అనేది లెక్కలేనంతమంది భారతీయు యువతీ యువకుల ఆశ, ఆశయం. కానీ డాలర్ డ్రీమ్స్ ఇపుడు మసక బారుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువమంది భారతీయ టెకీలు నివసించే అమెరికాలోరోజు రోజుకీ మారుతున్న పరిణామాలు భారతదేశానికి తిరిగి పయనమయ్యేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్డిట్‌లో అమెరికాలో ఉంటున్న ఒక యువజంట పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ జంట గత 15 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తోంది. వీరి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) హోదాను కలిగి ఉన్నారు, ఇది వారికి ఏ దేశంలోనైనా నివసించడానికి, పని చేయడానికి వెసులుబాటునిస్తుంది. కుమారుడికి కూడా అమెరికా పౌరసత్వం ఉంది. ముగ్గురు సభ్యుల ఫ్యామిలీ ఇండియాకు తిరిగి రావాలని ప్లాన్ చేస్తోంది. ‘‘మేం ఇద్దం 30ల్లో ఉన్నాం. టెక్నాలజీ, ఇక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారతదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నాం. ఒక ముగ్గురు సభ్యులున్న కుటుంబం ఇండియాలో బతకాలంటే రూ. 25 కోట్లు సరిపోతాయా... రిటైర్ మెంట్ తరువాత పిల్లలను పెంచుకుంటూ, హ్యాపీగా జీవించాలి అసలు ఎంత కావాలి దయచేసి తెలపండి’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇండియాకు వెళ్లాక కొంతకాలం విరామం తీసుకోవచ్చు. ఆ తరువాత ఇంట్రస్ట్‌ను బట్టి ఉద్యోగాలు వెదుక్కుంటాం. కానీ అది మా జీవితాలను ప్రభావితం చేయకూడదని పేర్కొన్నారు. దాదాపు 5.5 మిలియన్ల డార్లు (సుమారు రూ. 47.21 కోట్లు) ఉన్నాయంటూ తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా అందించారు.రెడ్డిటర్లు ఈ పోస్ట్‌పై స్పందించారు. అది మీరుండే నగరం, ఇల్లు,అలవాట్లు, జీవన శైలిసహా అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని కొందరు సాధారణంగా భారతీయ నగరంలో జీవించడానికి రూ. 25 కోట్లు సరిపోతాయని మరి కొందరు చెప్పగా, టైర్ 2 స్మార్ట్/బాగా అభివృద్ధి చెందిన నగరంలో నివసిస్తుంటే ప్రామాణిక ఖర్చులు అద్దె, ఆహారం, కొన్ని అవసరమైన వస్తువులు సహా 75 వేల రూపాయలు సరిపోతాయి. సొంత ఇల్లు ఇంకా మంచిది. పిల్లవాడికి ఒక మాదిరి స్కూలు ఫీజు నెలకు 30-50 వేలు చాలు. నికరంగా ఒక స్టాండర్డ్ లైఫ్‌కి నెలకు 2 లక్షలు బేషుగ్గా సరిపోతాయి రెండు మూడేళ్ల తరువాత ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటే చాలు అని ఒకరు వివరించారు. (Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!)ముగ్గురే కాబట్టి ఇక్కడ సౌకర్యవంతంగా బతకాలంటే జీవనశైలి బట్టి నెలకు కనీసంగా రూ. 4 లక్షలు, గరిష్టంగా రూ. 8 కోట్లు సరిపోతాయని లెక్కలు చెప్పారు. మరో యూజర్ ఏమన్నారంటే.. "నేను ఇటీవల భారతదేశంలో (ముఖ్యంగా బెంగళూరులో) కొంత సమయం గడిపాను. US కి దగ్గరగా జీవించాలనుకుంటే ఇండియాచాలా ఖరీదైనది. US సబర్బన్ లాంటి, బెంగళూరులోని ఆదర్శ్, బ్రిగేడ్ లేదా ప్రెస్టీజ్ వంటి కొన్ని ప్రీమియర్ గేటెడ్ కమ్యూనిటీలు 2000 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో రూ. 5 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతాయి కానీ మీరు ఇంతకంటే చవగ్గా కూడా బతకొచ్చు. కాబట్టి మూడు మిలియన్ డాలర్లు సరిపోతాయా లేదా అనేది మీమీదే ఆధారపడి ఉంటుదని మరొకరు వ్యాఖ్యానించారు.అంతేకాదు “ఇండియాలో ట్రాఫిక్, దుమ్ము, కాలుష్యం, అవినీతి, శాంతిభద్రతల సమస్యలు, వేడి, నీటి కొరత లాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.” అని మరో రెడ్డిటర్ వ్యాఖ్యానించాడు.ఇదీ చదవండి: Lishalliny Kanaran : భారతీయ పూజారిపై మిస్ గ్రాండ్ మలేషియా సంచలన ఆరోపణలు!
క్రైమ్

భార్యను చంపి.. భర్త ఆత్మహత్య
చంద్రగిరి: భార్య మీద అనుమానంతో ఓ భర్త ఆమె గొంతు కోసి ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం.. చిత్తూరు సమీపంలోని ఠాణాకు చెందిన లోకేశ్వర్(45)కు, మంగళం సమీపంలోని తిరుమల నగర్‌కు చెందిన ఉష(34)తో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 14 ఏళ్ల బాబు, 11 ఏళ్ల పాప ఉన్నారు. వీరిద్దరూ కోళ్లఫారం కాలనీలో నివాసం ఉంటున్నారు. లోకేశ్వర్ బీఎస్ఎన్ఎల్లో టెక్నీషియన్ కాగా, ఉష స్థానికంగా ఉండే ఓ కంపెనీలో పనిచేస్తోంది. భార్య ఉషపై లోకేశ్వర్‌కు అనుమానం ఉండటంతో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గత నెల 30న భార్యభర్తల మధ్య గొడవ తీవ్రరూపం దాల్చింది. దీంతో ఉష.. కాలనీ సమీపంలోని తిరుమలనగర్‌లో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు చేరింది. ఇదిలా ఉండగా, ఉద్యోగానికి వెళ్లేందుకు శనివారం ఉదయం 5 గంటలకు ఉష తన అమ్మ ఇంటి నుంచి బయల్దేరింది. భార్య కోసం బొమ్మల క్వార్టర్స్ వద్ద లోకేశ్వర్ కాపు కాశాడు. బస్సు కోసం బొమ్మల క్వార్టర్స్ వద్దకు వచి్చన ఉషపై ఒక్కసారిగా కత్తితో దాడి చేసి.. ఆమె గొంతు కోశాడు. దీంతో ఘటనా స్థలంలోనే ఉష ప్రాణాలు విడిచింది. ఉదయం అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, సీఐ సునీల్‌కుమార్‌లు సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. లోకేశ్వర్ కోసం అతని ఇంటికి వెళ్లగా.. అప్పటికే ఇంట్లో లోకేశ్వర్ ఉరివేసుకుని మృతి చెంది ఉన్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సునీల్‌కుమార్ తెలిపారు.

ఆ మృగాడికి బెయిల్ ఇవ్వలేం..
సాక్షి, అమరావతి: కామవాంఛతో యజమాని భార్యను కిరాతకంగా చంపడమే కాకుండా, ఆ తరువాత ఆమె మృతదేహంపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మృతురాలిపట్ల పిటిషనర్ పాశవికంగా, మృగంలా ప్రవర్తించాడని హైకోర్టు తెలిపింది. ఇలాంటి వారికి బెయిల్ మంజూరుచేస్తే అది సమాజంపై దు్రష్పభావం చూపుతుందని స్పష్టంచేసింది. ‘యజమాని భార్యను హత్యచేయడం ద్వారా అతని నమ్మకాన్ని పిటిషనర్ దారుణంగా వమ్ముచేశాడు. కాంపౌండర్‌గా తన ఇంట్లోనే ఉండేందుకు యజమాని స్థానం కల్పించాడు. విశ్వాసంగా ఉంటూ ఇంట్లో ఒకరిగా నమ్మకం కలిగించి పిటిషనర్ ఈ నేరానికి ఒడిగట్టాడు. కామవాంఛతో రగిలిపోయి మృతురాలిపట్ల ఓ మృగంలా ప్రవర్తించాడు. తన వాంఛను తిరస్కరించడంతో ఆమె తలపై అతిదారుణంగా, విచక్షణారహితంగా కొట్టి చంపాడు. హత్య అనంతరం కూడా అతని క్రూరత్వం ఏమాత్రం ఆగలేదు. మృతదేహంతో లైంగిక చర్యకు పాల్పడ్డాడు. ఇంతటి తీవ్రమైన చర్యలకు పాల్పడిన వ్యక్తికి బెయిల్ ఇవ్వడం సాధ్యంకాదు. చార్జిషీట్ దాఖలు చేసినంత మాత్రాన ఆరోపణల తీవ్రత ఎంతమాత్రం తగ్గదు’.. అని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఇటీవల తీర్పు వెలువరించారు. బంధువని ఆశ్రయమిస్తే.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన శ్రీకాంత్ బిశ్వాస్ తన తండ్రితో కలిసి గత 16 ఏళ్లుగా ఫిస్టులా ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. శ్రీకాంత్ తన భార్య అర్పితా బిశ్వాస్, తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి ఉంటున్నారు. తన దూరపు బంధువైన నయన్ బిశ్వాస్కు శ్రీకాంత్ తన ఆసుపత్రిలో కాంపౌండర్‌గా ఉద్యోగం ఇచ్చారు. 2024 డిసెంబరు 31న న్యూఇయర్ వేడుకల్లో భాగంగా శ్రీకాంత్, నయన్, మరో బంధువు కలిసి మద్యం తాగారు. అనంతరం ఎవరి గదులకు వారు వెళ్లి నిద్రపోయారు. నయన్ బిస్వాస్ హాలులో నిద్రపోయాడు. తెల్లవారి శ్రీకాంత్ లేచి చూసేసరికి అర్పిత ఇంట్లో లేదు. ఆమె గది నిండా రక్తం ఉంది. ఆమె కోసం వెతకగా, ఇంటికి సమీపంలో మురికికాలువలో తలపై తీవ్రగాయాలతో చనిపోయి నగ్నంగా కనిపించింది. దీంతో కావలి పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తన లైంగిక వాంఛను తీర్చుకోవడానికి అర్పితపట్ల నయన్ అసభ్యంగా ప్రవర్తించాడని, ఆమె ఎదురుతిరగడంతో ఎక్కడ నిజం బయటకు చెప్పేస్తుందోనన్న కారణంతో ఆమెను చంపేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ కిరాతకుడిని పోలీసులు అరెస్టు చేశారు.బెయిల్ పిటిషన్లు కొట్టివేత.. నిందితుడు నయన్ బిశ్వాస్ నెల్లూరు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దానిని కొట్టేసింది. ఆ తర్వాత అతను హైకోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మల్లికార్జునరావు ఇటీవల విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నయన్ బిశ్వాస్కు బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరిస్తూ అతని పిటిషన్‌ను కొట్టేశారు.

నువ్వు రా.. నా భర్త ఇంకా బతికే ఉన్నాడు!
వరుసకు మరిది అయ్యే వ్యక్తితో సంబంధం ఏర్పరుచుకున్న ఓ మహిళ.. తన భర్తను అతికిరాతకంగా కడతేర్చింది. ఈ ఘోరం బయటపడకుండా ఉండేందుకు కరెంట్ షాక్‌తో ప్రమాదత్తూ చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. చంపడానికి ముందు ఆ ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్.. ఆ మొత్తం ఘోరాన్ని బయటపెట్టింది. దేశ రాజధానిలో జరిగిన ఘోరం వివరాల్లోకి వెళ్తే..తన భర్త కరణ్ దేవ్(36) కరెంట్‌షాక్‌కు గురయ్యాడంటూ సుస్మిత ఈ నెల 13వ తేదీన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి స్థానికుల సాయంతో తీసుకెళ్లింది. అయితే అప్పటికే అతను మరణించాడని వైద్యులు తెలిపారు. దీంతో.. పోస్టుమార్టం కూడా వద్దంటూ అంత్యక్రియల కోసం ఉత్తమ్ నగర్‌లోని ఇంటికి మృతదేహాన్ని తరలించింది. ఈలోపు..స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. అంత్యక్రియలను అడ్డుకున్నారు. మృతుడి వయసు, చనిపోయిన తీరుపైనా అనుమానాలతో అటాప్సీ కోసం కరణ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈలోపు కరణ్ సోదరుడు కునాల్ పోలీసులకు ఓ షాకింగ్ విషయం తెలిపాడు.భర్త మృతిపై ఓ చానెల్‌తో మాట్లాడుతూ సుస్మిత కంటతడితన అన్న మరణం విషయంలో వదినతో పాటు తన కజిన్ రాహుల్ ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశాడు. అంతేకాదు.. వాళ్లిద్దరి మధ్య జరిగిన ఇన్స్టాగ్రామ్ చాటింగ్ వివరాలను పోలీసులకు స్క్రీన్ షాట్ వీడియో రూపంలో అందించాడు. అందులో కరణ్‌ను ఎలా హత్య చేయాలని వాళ్లిద్దరూ చర్చించుకున్నారు.పోలీసులు తమ శైలిలో ప్రశ్నించగా.. ఆ ఇద్దరూ నిజం ఒప్పుకున్నారు. కరణ్ తరచూ హింసించే వాడని.. అదే సమయంలో రాహుల్ తనను ఓదార్చేవాడని.. అదే ఇద్దరి మధ్య అనైతిక బంధానికి దారి తీసినట్లు తేలింది. ఈ క్రమంలో కరణ్ అడ్డు తొలగించుకునేందుకు సుస్మిత-రాహుల్ నిర్ణయించుకున్నారు.జులై 13వ తేదీన రాత్రి భోజనంలో కరణ్‌కు అధిక మోతాదులో(15) నిద్రమాత్రలు ఇచ్చారు. ఆపై మత్తులోకి జారుకున్నాక ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్ సారాంశం.. సుస్మిత: నిద్రమాత్రలు అన్నేసి వేసుకున్నాక చనిపోవడానికి ఎంత టైం పడుతుందో ఒకసారి నెట్లో చూడు. మూడు గంటలైంది తిని. వాంతి చేసుకోవడం లాంటి లక్షణాలేవీ కనిపించడం లేదు. ఇంకా చనిపోలేదు. ఏం చేయాలో త్వరగా చెప్పు.రాహుల్: అలాంటిదేం జరగకపోతే.. కరెంట్ షాక్ పెట్టుసుస్మిత: షాక్ ఇవ్వడానికి కట్టేయాలి కదా.. ఎలా?రాహుల్: టేప్‌తో కట్టేయ్సుస్మిత:నా భర్త ఊపిరి ఆగిపోలేదు.. ఇంకా బతికే ఉన్నాడు. నెమ్మదిగా శ్వాస పీలుస్తున్నాడు.రాహుల్: నీ దగ్గర ఉన్న అన్ని మాత్రలు వేసేయ్సుస్మిత: నోరు తెరవడానికి రావట్లేదు. నీళ్లు మాత్రమే తాగిపించడానికి వీలవుతోంది. నువ్వు రా.. ఇద్దరం కలిసి ఆ మందులేద్దాం. నాకు నిద్ర ముంచుకొస్తోందిమృతుడు కరణ్(ఎడమ వైపు).. చాటింగ్ వివరాలు (కుడివైపు)ఈ చాటింగ్ తర్వాత రాహుల్ ఇంటికి రాగా.. ఇద్దరూ కలిసి కరెంట్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణలో మరిది రాహుల్‌తో కలిసి భర్తను చంపినట్లు సుస్మిత ఒప్పుకుంది. తన భర్త డబ్బుక కోసం తరచూ తనను హింసించేవాడని, కార్వాచౌత్ ముందు రోజు కూడా చితకబాదాడని ఆమె చెబుతోంది. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పూర్తిస్థాయి పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. #WATCH | दिल्ली के उत्तम नगर में 'करंट वाली साजिश' का खुलासा@vishalpandeyk | | https://t.co/smwhXUROiK#Delhi #Uttamnagar #Crime #ABPNews pic.twitter.com/ALtr9GjYrJ— ABP News (@ABPNews) July 19, 2025

నోటీసు పీరియడ్‌లో ఉండగానే, పని ఒత్తిడి తట్టుకోలేక..
పని ప్రాంతాల్లో ఉద్యోగులపై ఒత్తిళ్లు సహజమే. అయితే ఆ ఒత్తిళ్లు ఈ మధ్యకాలంలో ఉద్యోగులను తీవ్ర నిర్ణయాల వైపు అడుగులేయిస్తున్నాయి. తాజాగా ఓ జాతీయ బ్యాంకులో పని చేసే సీనియర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడడం.. అదీ బ్యాంకులోనే కావడం.. అందునా రాజీనామా చేసిన వారానికే కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.శివశంకర్ మిత్రా.. మహారాష్ట్ర పుణే బారామతిలోని ఓ నేషనలైజ్డ్ బ్యాంకులో పని చేస్తున్నారు. 40 ఏళ్ల వయసులో పని ఒత్తిడి, అనారోగ్య కారణాలతో జులై 11వ తేదీన ఆయన తన చీఫ్ మేనేజర్ పోస్టుకు రాజీనామా చేశారు. అయితే ఏమైందో ఏమోగానీ నోటీసు పీరియడ్‌లో ఉన్న ఆయన అనూహ్యంగా ఘాతుకానికి పాల్పడ్డారు.గురువారం రాత్రి బ్యాంకు నుంచి సిబ్బంది అందరూ ఇళ్లకు వెళ్లిపోయాక.. తాళాలు తాను వేస్తానంటూ వాచ్‌మెన్‌కు చెప్పి ఆయన ఒక్కరే లోపలే ఉండిపోయారు. అంతకు ముందే తనతో పాటు తెచ్చుకున్న తాడులో బ్యాంకులోపలే ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదంతా అక్కడి సీసీటవీ కెమెరాల్లో రికార్డయ్యింది. భర్త ఇంటికి రాకపోవడం, ఫోన్‌కాల్స్‌కి ఎంతకీ స్పందిచకపోవడంతో ఆమె అనుమానంతో అర్ధరాత్రి బ్యాంకు వద్దకు చేరుకుంది. అందరూ వెళ్లిపోయి ఉంటారని వాచ్మెన్ చెప్పగా.. లోపల లైట్లు వేసి ఉండడంతో అనుమానంతో గేట్లు తీసి చూశారు. లోపల ఆయన ఫ్యానుకు విగతజీవిగా వేలాడుతూ కనిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో పని ఒత్తిడే కారణమని పేర్కొన్న ఆయన.. ఎవరి పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. అంతేకాదు తన భార్య, బిడ్డలను క్షమాపణ కోరుతూ.. వీలైతే తన కళ్లను దానం చేయాలని నోట్లో కోరారాయన. దీంతో ఆ కుటుంబం విలపిస్తోంది. రాజీనామా చేసిన కొన్నిరోజులకే ఆయన ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడంతో తోటి సిబ్బంది సైతం కంటతడి పెట్టారు. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో ఇదే పుణేలో ఈవై కంపెనీలో పని చేసే కేరళ యువతి అన్నా సెబాస్టియన్(26) పని ఒత్తిడి కారణంగా హఠాన్మరణం చెందింది. ఆమె తల్లి బహిరంగ లేఖతో ఈ వ్యవహారం వెలుగులోకి రాగా.. దేశంలో పని గంటలు, ఒత్తిళ్లు తదితర అంశాలపై విస్తృత చర్చ నడిచింది. అప్పటి నుంచి ఈ తరహా మరణాలు నెలలో కనీసం ఒకటి రెండైనా వెలుగు చూస్తున్నాయి. మొన్నటి మే నెలలో ఒలా ఏఐయూనిట్ కృత్రిమ్‌లో పని చేసే నిఖిల్ సోమవాన్షి ‘టాక్సిక్ వర్క్‌కల్చర్, పని ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడడం సైతం చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా మరణాలకు ప్రధాన కారణాలుఅత్యధిక పని గంటలు (55+ గంటలు/వారానికి)అనియంత్రిత డెడ్లైన్లుపరిమిత మానసిక ఆరోగ్య మద్దతుముఖ్యంగా హస్టల్ కల్చర్ (Hustle Culture) ప్రభావం.. అంటే విశ్రాంతికి చోటు లేకుండా టార్గెట్లు రీచ్ అయ్యేందుకు ఎప్పుడూ పని చేయాలనే మానసిక ధోరణి. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితంతో పాటు ఆరోగ్యాన్ని పట్టించుకోరు.Economic Times నివేదిక ప్రకారం, ఇండియాలో యువ ఉద్యోగులు అధిక పని గంటల వల్ల ఆత్మహత్యలు, గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ఐటీ, ఫైనాన్స్, హెల్త్‌కేర్ రంగాల్లో పని ఒత్తిడి అధికంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన EU నివేదిక ప్రకారం, వర్క్‌స్ట్రెస్ వల్ల ప్రతి సంవత్సరం 10,000 మంది మరణిస్తున్నారు. ఆత్మహత్య అనేది ఏ సమస్యకు పరిష్కారం కాదు.. అలాంటి అఘాయిత్యాలకు పాల్పడే ముందు ఒక్క క్షణం ఆలోచించండి.. కౌన్సెలింగ్ సెంటర్లను ఆశ్రయించి సాయం పొందండి. తెలంగాణలో.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.comఆంధ్రప్రదేశ్‌లో.. 1లైఫ్, ఫోన్ నెంబర్ 78930-78930; 100జీజీహెచ్ కాకినాడ.. 98499-03870