Top Stories
ప్రధాన వార్తలు
తిరుపతి చరిత్రలో ఈ తరహా ఘటన ఎప్పుడూ జరగలేదు: వైఎస్ జగన్
తిరుపతి: తిరుపతిలో తొక్కిసలాట( Tirupati Stampede Incident) జరిగి ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రులను మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్(YS Jagan Mohan Reddy) పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తిరుపతిలో ఈ తరహా ఘటన ఎప్పుడూ జరగలేదు. మనం చూడలేదు. ఈ ఘటన ఎందుకు జరిగిందనేది ఆలోచన చేయాలి. ఇది పూర్తిగా ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) వైఫల్యమే. ఈ ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబే. బాధిత కుటుంబాలకు కనీపం రూ. 50 లక్షల ఇవ్వాలి. క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందించడంతో పాటు వారు ఇంటికి వెళ్లేటప్పుడు రూ. 5 లక్షలు ఇవ్వాలి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.అత్యంత దారుణ ఘటనరాష్ట్ర చరిత్రలో తిరుపతిలో ఎప్పుడూ తొక్కిసలాట జరిగి మనుషులు చనిపోయిన ఘటన గతంలో మనం ఎప్పుడూ చూడలేదు. ఈరోజు ఇలాంటి పరిస్థితులకు దారితీసిన కారణాలు ఏంటన్నది అందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఘటన ఎందుకు జరిగింది. ఘటన జరగడానికి కారణాలు ఏంటన్నది ఆలోచన చేయాలి. వైకుంఠ ఏకాదశి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం. వైకుంఠ ఏకాదశి నాడు కొన్ని లక్షల మంది వెంకటేశ్వరస్వామి దర్శనానికి వస్తారని.. ఆరోజు వైకుంఠద్వార తెరుస్తారని అందరికీ తెలుసు. వైకుంఠ ద్వారం దర్శనం మహాపుణ్యాన్నిస్తుందని అందరికీ తెలుసు. ఆ పుణ్యం కోసం లక్షల మంది దర్శనానికి వస్తారు. 10వ తేదీ వైకుంఠ ఏకాదశి అని, ఆరోజు లక్షల మంది దర్శనానికి వస్తారని తెలిసినప్పటికీ టీటీడీలో ఎందుకు ప్రోటోకాల్స్ పాటించలేదు అని అడుగుతున్నాను.తెలిసినా ప్రొటోకాల్స్ పాటించలేదుఈ ఘటలనకు సీఎం మొదలు, టీటీడీ ఛైర్మన్, అధికారులు జిల్లా కలెక్టర్, ఎస్పీ అందరూ బాధ్యులే. చంద్రబాబునాయుడుగారికి కూడా 10వ తేదీన వైకుంఠ ఏకాదశి అని తెలుసు. అంతకు ముందే ఆయన కుప్పంలో మూడు రోజుల కార్యక్రమం పెట్టుకున్నారు. ఈనెల 6 నుంచి 8వ తేదీ మధ్యహ్నం వరకు ఆయన అక్కడే ఉన్నారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులతో పాటు, పోలీసు అధికారులు కూడా చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడం కోసం వెళ్లారు. సీఎం సెక్యూరిటీ కోసం దాదాపు 2 వేల మంది పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లను 8వ తేదీ రాత్రి 8.30 గం.కు ఇస్తున్నప్పుడు తొక్కిసలాటలు జరిగాయి. వైకుంఠ ఏకాదశి రోజున దర్శనానికి ఇన్ని లక్షల మంది వస్తారని తెలిసినప్పుడు, మరోవైపు చంద్రబాబు పర్యటన కుప్పంలో ఉందని తెలిసినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన పోలీసులు ఆ పని చేయలేదు. ఈ ఘటన జరగడానికి కారణం ఎక్కడా ప్రోటోకాల్ పాటించలేదు.ఏ మాత్రం జాగ్రత్త లేకుండా వ్యవహారంతిరుపతి, బైరాగిపట్టెడ కౌంటర్ ఎదురుగా పార్కులో ఉదయం 9 గం. నుంచి భక్తులను ఉంచారు. రాత్రి 8.30 గం.కు పార్కు గేట్లు తెరిచి కౌంటర్లు దగ్గర వెళ్లడానికి గేట్లు తెరిచారు. చీకట్లో అందరూ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. పార్కులో ఉంచినప్పుడు వారికి ఏ సౌకర్యాలు కల్పించలేదు. భక్తులు వచ్చిన వెంటనే వాళ్లను క్యూ లైన్లో నిల్చోబెట్టి, తగినంత పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు. కానీ అలా చేయలేదు. ఆయా సెంటర్లలో లైన్లలో పెట్టడానికి పోలీసులు అందుబాటులో లేకపోవడంతో పాటు భక్తులందరినీ గుంపుగా ఉంచి.. ఒకేసారి విడిచిపెట్టడంతో ఈ ఘటనలు జరిగాయి. చంద్రబాబునాయుడు గారు ఎంత దిక్కుమాలిన అబద్దాలు ఆడుతున్నారంటే.. ఒకే ఒక్క చోట తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీలు చూస్తే.. విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారని, బైరాగిపట్టెడిలో ఐదుగురు చనిపోయినట్టు మరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆస్పత్రిలో చూస్తే.. అన్ని కౌంటర్లలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కనిపిస్తున్నారు.ఇలాంటి ఘటన తొలిసారిఇంత ప్రాముఖ్యమున్న వైకుంఠ ఏకాదశి రోజున ఇన్ని లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినా ఇంత దారుణమైన ఏర్పాట్లు చేశారు. దీనికి టీటీడి ఒక్కటే బాధ్యులు కాదు. ఎస్పీ పోలీసు విభాగం, కలెక్టర్, రెవెన్యూ విభాగంతో పాటు చంద్రబాబు నాయుడు గారు తో సహా అందరూ బాధ్యత వహించాలిచంద్రబాబు సొంత జిల్లా ఇది.. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి నాడు లక్షలాది మంది భక్తులు వస్తారని తనకు తెలిసి ఉన్నా.. 6, 7, 8 తేదీల్లో తన కార్యక్రమం కోసం పోలీసులను నియమించుకుని.. ఇక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా గాలికొదిలేశారు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే 6గురు చనిపోయారు. తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. దేవుడి దయవల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు అందరూ కొద్దిపాటి గాయాలతో భయటపడడం సంతోషం. పద్మావతి, రుయా ఆసుపత్రి కలుపుకుంటే దాదాపుగా 50 నుంచి 60 మంది తొక్కిసలాటలో గాయాలపాలయ్యారు. తిరుపతిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇదే తొలిసారి.అడుగడుగునా నిర్లక్ష్యంఇంత దారుణమైన పరిస్థితుల్లో వీళ్లు వ్యవస్ధను నడుపుతున్నారు. ఇక్కడున్న పోలీసులు, టీటీడీ పెద్దలు ఎవరికీ టీటీడీ విశిష్టత తెలియదు. ఇక్కడున్న ఎస్పీ, కలెక్టరు వీళ్లు ఇలాంటి ప్రాముఖ్యత ఉన్న రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదానిపై దశాబ్దాలుగా చాలా కాలం నుంచి ప్రోటోకాల్ ఉన్న వీళ్లెవరూ పట్టించుకోలేదు.టీటీడీ ఛైర్మన్ నుంచి పోలీసు వ్యవస్ధ వరకూ తిరుమలలో ఇన్న లక్షల మంది వస్తున్న నేపధ్యంలో వారికి ఎలాంటి రక్షణ, వసతులు కల్పించాలన్న ఆలోచన ఎవ్వరికీ లేదు. కనీసం పార్కుల్లో ఉన్న వారిని అడిగితే ఉదయం 9 గంటలకు వచ్చాం. కనీసం నీళ్లు, ఆహారం, మజ్జిగ కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. క్యూలైన్లో నిలబెట్టడం, రోప్ పార్టీలు ఏర్పాటు చేయడం కూడా చేయలేదు. కనీసం వీళ్లు మనుషులుగా ఉన్నారని కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా గాలికొదిలేశారు.మా ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలను గొప్పగా చెప్పుకునేలా నిర్వహించాం. ఈ ప్రభుత్వంలో భక్తుల కనీస అవసరాలను కూడా పట్టించుకోలేదు.ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతతిరుపతిలో తొక్కిసలాట ప్రభుత్వ తప్పిదం. ప్రభుత్వ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగింది. దీనికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి చంద్రబాబును గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. చనిపోయిన వాళ్లకు ప్రతి ఒక్కిరికీ రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించడంతో పాటు గాయాల పాలైన వారందరికీ ఉచిత వైద్యం అందించడంతో పాటు ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షలు డబ్బులిచ్చి ఇంటికి పంపించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఘటనకు చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్, టీటీడీ ఈవో, టీటీడీ అడిషనల్ ఈవో, ఎస్పీ, కలెక్టరు బాధ్యత వహించాలి. తగినంత మంది పోలీసు సిబ్బందిని నియమించకుండా ఈ మరణాలకు కారణమైన వీళ్లందరిపైనా చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి, హోంమంత్రి, దేవాదాయశాఖమంత్రితో పాటు టీటీడీ ఛైర్మన్, ఈవో, అదనపు ఈఓ, కలెక్టర్, ఎస్పీ అందరూ బాధ్యత తీసుకోవాలి.ఎఫ్‌ఐఆర్ కచ్చితంగా మార్చాలితొక్కిసలాట ఘటనపై ఎఫ్‌ఐఆర్‌లో వీళ్లు దారుణమైన సెక్షన్లు నమోదు చేస్తున్నారు. ఈ ఘటనపై బీఎన్‌ఎస్ 194–సెక్షన్ నమోదు చేస్తున్నారు. అంటే ఇద్దరు వ్యక్తులు మధ్య జరిగే దొమ్మీ కింది కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన జరిగిన ఈ సంఘటనపై సెక్షన్–105 నమోదు చేయాల్సింది పోయి.. కావాలనే సంఘటనను చిన్నదిగా చూపేందుకు, కేసును నీరు గార్చేందుకు ప్రభుత్వం దారుణంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అందుకే వెంటనే ఎఫ్‌ఐఆర్ మార్చాలి.తప్పుల మీద తప్పులువీళ్లకు కనీస మానవత్వం, చిత్తశుద్ధి కూడా లేదు. బాగా చేయాలన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. తిరుమల తిరుపతి దేవస్ధానానికి సంబంధించిన పరువు, ప్రతిష్టను పెంచే పరిస్థితి నుంచి దిగజార్చే పరిస్థితి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వచ్చింది. ఆయన తప్పులు మీద తప్పులు చేస్తున్నారు. తిరుపతి లడ్డూ విషయంలో అబద్దాన్ని సృష్టించి దానికి రెక్కలు కట్టించి.. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని సైతం అప్రతిష్ట పాలు చేసిన చరిత్ర కలిగిన చంద్రబాబు మళ్లీ తాను చేసిన చర్యల వల్ల టీటీడీ చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ మార్క్‌గా నిల్చిపోయే ఘటన చోటుచేసుకుంది. ఇన్ని సంవత్సరాలుగా తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది.ఇక్కడికి వచ్చిన క్రౌడ్‌ను మేనేజ్ చేసే విశిష్టత తిరుమల తిరుపతి దేవస్ధానంకు ఉన్నట్టుగా ఎక్కడా ఎవరికీ లేదన్న ఖ్యాతి. ఎంతో పేరు ఉన్న స్ధితి నుంచి ఏకంగా చంద్రబాబునాయుడు లాంటి పాలకుడు ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్ధానంలో అడుగు పెట్టాలంటే ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయో చంద్రబాబు చేసి చూపించారు.మీడియా ప్రశ్నలకు సమాధానంగా..వారందరిదీ తప్పిదమే. ఎందుకంటే..?:చంద్రబాబునాయుడు ఈ ఘటనలో చిన్న చిన్న అధికారులను బదిలీ వంటి శిక్షలతో సరిపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. నిజానికి ఇందులో చంద్రబాబునాయుడు చేసిన తప్పు కనిపిస్తోంది. భక్తుల కోసం పోలీసులను కేటాయించాల్సింది పోయి.. తన పర్యటన కోసం పోలీసులను మోహరించుకున్నారు. అదే విధంగా జిల్లా ఎస్పీ కూడా చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు తాపత్రయపడ్డారే తప్ప.. లక్షలాది మంది భక్తులకు సెక్యూరిటీ కల్పించాలని ఆలోచన చేయలేదు. అదే విధంగా భక్తులకు క్యూలైన్లలో నిలబెట్టే కార్యక్రమంతోపాటు దానికి సంబంధించిన సమీక్షలు చేయని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు రికమెండ్ చేయాలన్న ఆలోచన చేయని కలెక్టర్‌ది కూడా తప్పే. భక్తులకు తాగడానికి నీళ్లు, తినడానికి తిండి ఏర్పాటు చేయకపోవడం కూడా కలెక్టర్ తప్పు. ఇంత మందిని దర్శనానికి ప్రవేశం కల్పించాలన్న ఆలోచన చేయని ఈఓ, అదనపు ఈఓది కూడా తప్పు. వీరందరికీ ఆజమాయిషీ చేసే టీటీడీ ఛైర్మన్‌ది కూడా తప్పే.ఏర్పాట్లపై ఏ మాత్రం శ్రద్ద లేదు:వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లుపై సమీక్ష చేయకుండా తాత్సారం చేసి ఇంత మంది చావులకు వీరంతా కారణమయ్యారు. ఏర్పాట్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. మూడు వేర్వేరు కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగింది. అన్ని చోట్ల తగినంత మంది పోలీసుల సిబ్బంది లేకపోవడం, సరైన ఏర్పాట్లు లేకపోవడమే ప్రధాన తప్పిదం.ముందుజాగ్రత్తగా ఆయా కౌంటర్ల వద్ద కచ్చితంగా ఆంబులెన్స్‌లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కనీసం ఘటన జరిగిన తర్వాత కూడా ఆంబులెన్స్ రావడానికి ముప్పావు గంట, గంట పట్టిందని ఆసుపత్రులో చికిత్స పొందుతున్న వారు చెబుతున్నారు. అది కూడా ఒక్కోటి వచ్చిందని చెప్పారు. ఇంకా కొందరు వాళ్లంతట వాళ్లే ఆసుపత్రికి వచ్చామని చెబుతుండగా... ఇతరుల సాయంతో మరికొంతమంది ఆసుపత్రి వచ్చామన్నారు.చంద్రబాబే మొదటి ముద్దాయి. ఎందుకంటే?చంద్రబాబునాయుడికి శాస్త్రం తెలియదు, మిగిలిన గుడుల్లో ఎలా చేస్తున్నారన్న ఆచరణ కూడా తెలియదు. దేవుడి మీద భయభక్తులు కూడా లేవు. దేవుడి మీద భక్తి, భయం ఉంటే.. తిరుమల తిరుపతి ప్రసాదం గురించి అబద్దాలు చెప్పగలుగుతాడా?. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి టీటీడీ ప్రతిష్టను దిగజార్చే పని చేస్తాడా?. దేవుడంటే భయం, భక్తి లేదు కాబట్టే ఇలా చేశాడు. చంద్రబాబు నాయుడే ఈ ఘటనలో మొదటి ముద్దాయి. చంద్రబాబునాయుడుకి ఈ పాపం కచ్చితంగా తగులుతుంది.తప్పు చేసిన తర్వాత దేవుడికి, భక్తులకి కనీసం క్షమాపణ చెప్పే చిత్తశుద్ధి, ఇంగిత జ్ఞానం లేదు. తాను చేసిన తప్పులకు వేరొకరి మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో పుష్కరాల్లో కూడా ఇదే పని చేశాడు. షూటింగ్ కోసం అందరినీ ఒకేచోట పెట్టి.. గేట్లు ఒకేసారి ఎత్తారు. తొక్కిసలాటలో 29 మంది చనిపోయారు. ఆయన షూటింగ్ కోసం ఆయన దగ్గర, ఆయన సమక్షంలోనే ఆ ఘటన జరిగింది.నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారునేను తిరుపతి వచ్చి.. జరిగిన విషయాలు ప్రజలకు చెప్తానని.. చంద్రబాబునాయుడు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లను కూడా ఇక్కడ నుంచి తరలించారు. మా పరిస్ధితి బాగాలేదని పేషెంట్లు ఇంకా కొంతమంది ఆసుపత్రిలో భీష్మించుకుని ఉన్నారు. నన్ను రాకుండా చేసేందుకు కుట్ర పన్నారు. మధ్యలో ఆపాలని చూశారు. ఇన్ని తప్పులు చేసిన చంద్రబాబుతో కుమ్మక్కైన అధికారులందరీకి దేవుడి మెట్టికాయలు కచ్చితంగా పడతాయి.
‘గేమ్ ఛేంజర్’ మూవీ ట్విటర్ రివ్యూ
మెగాఫ్యాన్స్ మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రామ్ చరణ్(Ram Charan) సోలో హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు( జనవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్ షో బొమ్మ పడిపోయింది. తెలంగాణలో శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి షోస్ పడనున్నాయి. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.గేమ్ ఛేంజర్ కథేంటి? ఎలా ఉంది? శంకర్, చరణ్ ఖాతాలో భారీ హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్ (ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.గేమ్ ఛేంజర్ సినిమాకు ఎక్స్‌లో మిక్స్‌డ్ టాక్ వస్తుంది. సినిమా బాగుందని కొందరు.. ఆశించిన స్థాయిలో సినిమాలేదని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. చరణ్ నటన అదిరిపోయింది కానీ.. శంకర్ మేకింగ్ బాగోలేదని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. పాటలు అయితే తెరపై చూస్తే అద్భుతంగా ఉన్నాయట. రా మచ్చా మచ్చా పాట అదిరిపోయిందంటూ చాలా మంచి నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. #GameChanger Strictly Average 1st Half! Follows a predictable commercial pattern so far. A few IAS blocks have came out well along with an interesting interval block. The love story bores and the comedy is over the top and ineffective. Ram Charan is doing well and Thaman’s bgm…— Venky Reviews (@venkyreviews) January 9, 2025ఊహించదగిన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంది.కొన్ని ఐఏఎస్ బ్లాక్‌లు బాగా వచ్చాయి, అలాగే ఆసక్తికరమైన ఇంటర్వెల్ బ్లాక్ కూడా వచ్చింది. ప్రేమకథ బోరింగ్‌గా ఉంది. కామెడీ కూడా అతిగా ఉంది మరియు అసమర్థంగా ఉంది. రామ్ చరణ్ బాగా చేస్తున్నాడు. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. సెకండాఫ్ కోసం ఎదురు చూస్తున్నాం అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.#GameChanger#RamCharan𓃵 #GameChangerReviewGood 1st halfAa dhop song kuni scenes teseste inka bagunu Interval scene 🔥🔥Thaman Bgm🔥🎇🎇Raa Macha Macha song🥵🔥🔥🔥#ShankarShanmugham #KiaraAdvani #Thaman https://t.co/l8Gg6IgdfK— Lucky⚡️ (@luckyy2509) January 9, 2025 ఫస్టాఫ్ బాగుంది. దోప్ సాంగ్ ఇంకాస్త బాగా తీయాల్సిది. ఇంటర్వెల్ సీన్‌అదిరిపోయింది. తమన్ నేపథ్య సంగీతం బాగుంది. రా మచ్చా మచ్చా సాంగ్ అద్భుతం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.#GameChanger First Half Review:Shankar's vintage taking shines as he delivers a gripping first half packed with grandeur, emotional highs, and slick action. Ram Charan impresses with his powerful performance, while Thaman's BGM and song picturization elevate the experience. A…— Censor Reports (@CensorReports) January 9, 2025 ఫస్టాఫ్ అదిరిపోయింది. అద్భుతమైన సన్నివేశాలు, భావోద్వేగాలు, యాక్షన్‌తో శంకర్ మరోసారి తన టేకింగ్ పవర్‌ని చూపించాడు. రామ్ చరణ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. తమన్ బీజీఎం అదిరిపోయిది. సెకండాఫ్‌పై హైప్ పెంచేలా ఇంటర్వెల్ సీన్ ఉందని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.Appanna Emotional shot!❤️💥👌#Anjali shared about the same scene & Said that #RamCharan will win National Award for sure🔥🔥#UnstoppableWithNBKS4#UnstoppableWithNBK#GameChanger#GameChanagerpic.twitter.com/a8AjdNpEya— Vishnu Writess (@VWritessss) January 8, 2025#GameChangerReview1st Half - ⭐⭐⭐Entry SongsBuildupthat Traffic Dance 😭🤮Love scenesFlat Screenplay Interval okay #RamCharan is Good#SSThaman Rocked it 💥💥#Shankar Proved he is not back 😭 #GameChanger #KiaraAdvaniHope 2nd Half Will Blast 🤞🏻🤞🏻... pic.twitter.com/oDstZwzvo0— Movie_Gossips (@M_G__369) January 9, 2025Gamechanger 1st half review Poor pacing👎🏻Boring love track 😴Decent performance from RC👍🏻RC looks 🫠Only hope is 2nd half 🙌BGM okaish 👍#GameChangerReview— ✌🏼 (@UGotLazered) January 9, 2025#GameChanger #GameChangerReview ⭐⭐⭐⭐ 4/5!!So far, fun mass, masala, entertainment. Awesome. That’s @shankarshanmugh for us 👌🏼👌🏼👌🏼🔥🔥❤️❤️❤️. What a technical brilliance 👏🏼👏🏼👏🏼 #RamCharan𓃵 #KiaraAdvani #Sankar #kiaraadvanihot #RamCharan #disastergamechanger… pic.twitter.com/NI0hDd9aDO— the it's Cinema (@theitscinemaa) January 9, 2025Appanna Characterization decent but routine n predictable with stammering role Once appanna died, same lag continues ..Very good climax is needed now #GameChanger #GameChangerReview https://t.co/UEpuZ74o1t— German Devara⚓️🌊 (@HemanthTweets39) January 9, 2025#GameChanger Tamil version!Good first half🔥👍Dialogues are good can feel the aura of @karthiksubbaraj in the build up of the story!Already better than @shankarshanmugh ‘s last three movies, Charan and SJS good.@MusicThaman 🔥#Gamechangerreview— Water Bottle🇵🇹 (@waterbotttle_07) January 9, 2025#GameChanger First Half:A Good First Half Thats Filled With Visual Extravaganza. Interval Ends With A Bang & A Great Twist That Keeps You Anticipated For The Second Half. Ram Charan At His Absolute Best In Dual Roles, You Can Witness The Efforts He Has Put In With Each Scene 👏 pic.twitter.com/Q3jrXfWykB— CineCritique (@CineCritique_) January 9, 2025
జగన్ హయాం ఆర్థిక ప్రగతికి కితాబు
ప్రపంచ చెస్ మాజీ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ రష్యాలో రాజకీయ అణచివేతలకు వ్యతిరేకంగా ఉద్య మిస్తూ, అనేక పుస్తకాలు రచించారు. ప్రస్తుత రష్యా పాలకుల చేత ఉగ్ర వాదిగా కూడా ముద్ర వేయించుకున్నారు. రష్యాలో నిరంతరం జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా ప్రపంచ వేదికలపై తన గళాన్ని తరచుగా వినిపిస్తున్నారు. ఒక సందర్భంలో ఆయన ‘తప్పుడు వార్తలను ప్రచారం చేసేవారి లక్ష్యం మనల్ని పెడతోవ పట్టించి వారి అజెండాను మనపై రుద్దడమే కాదు, నిజాలను తెలుసుకోవాలన్న మన ఆలోచనలను శాశ్వతంగా నాశనం చేయడం కూడా’ అంటారు. ప్రస్తుత సమాజంలో తప్పుడు కథనాలు, ప్రకటనలు ప్రజల మేధను కలుషితం చేస్తున్నాయి. వారు తప్పుడు నిర్ణయాలు తీసు కునేలా చేస్తున్నాయి. దీనికి ఒక ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. గత జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసినప్పటికీ, ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకొన్నప్పటికీ, అద్భుతమైన ఆర్థిక ప్రగతి సాధించినప్పటికీ; ప్రత్యర్థి రాజకీయ పార్టీలు, వారి అనుకూల మీడియా నిరంతరం చేసిన తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మారు. ఫలితంగా మంచి చేసే ప్రభుత్వాన్ని చేజేతులా గద్దెదించి, కూటమి నిప్పుల కుంపటిని నెత్తిన పెట్టుకున్నారు. దీని దుష్ఫలితా లను ఆంధ్రులు ఇప్పుడు అనుభవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వాగ్దానాలు అమలు చేయలేక చేతులెత్తేసి దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి నెలకో వివాదాన్ని సృష్టిస్తోంది. ఆంతేగాక గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాల కారణంగా రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందంటూ తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తోంది.కూటమి నేతలు నిత్యం తప్పుడు ప్రచారాలు చేస్తూ జగన్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వృద్ధి కుంటుపడిందనీ, తాము ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నా మనీ అంటున్నారు. అయితే వీరి అవాస్తవ ప్రచారాన్ని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంకు నివేదికలు పటాపంచలు చేశాయి. జగన్ హయాంలో కుప్పలు తెప్పలుగా అప్పులు చేశారనీ, అప్పుల భారం రూ. 14 లక్షల కోట్లకు చేరిందనీ... ఎన్నికల సమయంలోనూ, తర్వాత కూడా కూటమి నేతలు ప్రచారం చేశారు. అయితే ఈ అప్పులు రూ. 7.5 లక్షల కోట్లు మాత్రమేనని కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్ధారించాయి. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించిందంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా నివేదిక ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండి యన్ స్టేట్స్’లో పేర్కొంది.కోవిడ్ కారణంగా రెండేళ్ళపాటు దేశం ఆర్థిక ఒడు దుడుకులకు లోనయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాత్రం జగన్ పాలనలో అనేక రంగాల్లో రెండంకెల వృద్ధిలో దూసుకు పోయింది. 2022–23లో దేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు సుమారు 8 శాతం ఉంటే ఆ ఏడాది ఏపీలో 11.43 శాతం నమోదయ్యింది. జగన్ హయాంలో నాలుగేళ్ళ సగటు వృద్ధి 12.70గా నమోదయ్యింది. ఇది దేశంలోనే అత్యధిక వృద్ధి రేట్లలో ఒకటి. 2018–19 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2018–31 మార్చి 2019) చంద్రబాబు నాయుడు హయాంలో రూ. 7.90 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ) విలువ జగన్ ప్రభుత్వ హయాంలో రూ. 13.17 లక్షల కోట్లకు పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదికలో తెలిపింది. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 2018–19లో రూ. 1,54,031 కాగా, 2023–24లో అది రూ. 2,42,479 పెరిగింది. తయారీ రంగం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సమ కూరిన నికర స్థూల విలువ 2018–19లో రూ. 67.30 వేల కోట్లు కాగా, 2023–24లో జగన్ ప్రభుత్వ హయాం నాటికి రూ. 1.29 లక్షల కోట్లకు పెరిగింది. అలాగే ఆహార పంటల సాగు విస్తీర్ణం తగ్గి, వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. ఫలితంగా రైతుల ఆదాయాలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. 2018–19లో రూ. 9.97 లక్షల కోట్లుగా ఉన్న వ్యవసాయ రంగం నికర విలువ 2023–24లో రూ. 16.82 లక్షల కోట్లకు పెరిగింది. 2018–19లో రూ. 56.10 వేల కోట్లుగా ఉన్న నిర్మాణ రంగం నికర విలువ 2023–24లో రూ. 95.74 వేల కోట్లకు పెరిగింది.జగన్ పాలనలో పారిశ్రామిక వేత్తలు పారిపోయారంటూ విష ప్రచారం చేశారు. అయితే పారిశ్రామిక రంగం నికర విలువ 2018–19లో రూ. 1.57 లక్షల కోట్లు కాగా,అది 2023–24లో రూ. 2.82 లక్షల కోట్లకు పెరిగింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల నికర విలువ 2018–19లో రూ. 32.43 వేల కోట్లు కాగా, 2023–24 నాటికి రూ. 56.59 వేల కోట్లకు పెరిగింది. సేవా రంగం నికర విలువ 2018–19లో రూ. 2.96 లక్షల కోట్లు కాగా, అది 2023–24లో రూ. 4.67 లక్షల కోట్లకు పెరిగింది. ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగం గత ప్రభుత్వ హయాంలో 38.41 శాతం, నిర్మాణ రంగంలో 26.75 శాతం, మత్స్య రంగంలో 25.92 శాతం, పారిశ్రామిక రంగంలో 25.58 శాతం, తయారీ రంగంలో 24.84 శాతం, ఆతిథ్య రంగంలో 22.70 శాతం, సర్వీస్ సెక్టార్‌లో 18.91 శాతం, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 14.50 శాతం వృద్ధి సాధించి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం జగన్ ప్రభుత్వ హయాంలో యేటా 50 లక్షల టన్నుల చేపలు – రొయ్యల ఉత్పత్తులతో, 1.76 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఆయిల్ పామ్ సాగులో కూడా ఏపీ దేశంలోనే అగ్ర స్థానంలో ఉంది. దేశ ఎగుమతుల్లో సుమారు 11 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే జరిగాయి. ఏపీ నుంచి సుమారు రెండువేల రకాల ఉత్పత్తులు దేశ విదే శాలకు ఎగుమతి అయ్యాయి. జగన్ పాలనలో మహిళలు, పేదలు కనివిని ఎరుగని రీతిలో సంక్షేమ ఫలాలు అనుభవించారు. పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాల్లో రాష్ట్రం దేశానికే దిశానిర్దేశం చేసింది. కాని జగన్ రాజకీయ ప్రత్యర్థుల అబద్ధపు ప్రచారం ప్రజలను ప్రభావితం చేసింది. ఇప్పుడు ప్రజలు తాము మోసపోయామని వాపోతున్నారు. అధికారం కోసం వెంప ర్లాడే వారు, వారి అడుగులకు మడుగులొత్తే మీడియా వర్గాలు నిజాన్ని ఫణంగా పెట్టి చెప్పే ప్రతి అబద్ధానికి ఏదో ఒక రోజు మూల్యం చెల్లించ వలసి ఉంటుంది.వి.వి.ఆర్. కృష్ణంరాజు వ్యాసకర్త ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌మొబైల్: 89859 41411
క్షమార్హం కాని నేరం!
కోరి కొల్చినవారికి కొంగు బంగారమై కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం చెంత తిరుపతిలో బుధవారం ఒక మహాపరాధం జరిగిపోయింది. కేవలం పాలకుల చేతగానితనంవల్ల ఆరు నిండు ప్రాణాలు బలికావటం, 43 మందికి పైగా గాయపడటం చరిత్ర ఎరుగని విషాదం. శతాబ్దాలుగా ఏడుకొండలవాడి సన్నిధిలో ఎన్నడూ ఇటువంటి దారుణ ఉదంతం చోటుచేసుకున్నట్టు నమోదు కాలేదు. రాచరికం మొదలు ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ వరకూ ఎందరెందరో పాలకులొచ్చారు. కానీ ఎప్పుడూ ఎవరూ ఇంత చేటు నిర్లక్ష్యం ప్రదర్శించిన దాఖలా లేదు. ఇదే దారుణమనుకుంటే... దుర్ఘటన జరిగింది మొదలుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరసబెట్టి బాహాటంగా ప్రదర్శిస్తున్న అతి తెలివితేటలు ప్రజలను దిగ్భ్రాంతి పరుస్తున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా గురువారం బైరాగిపట్టెడ దగ్గర కెమెరాల కోసం ‘ప్రజాకోర్టు’ నిర్వహించి అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడటమైనా... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శకు వస్తున్నారని తెలిసి క్షతగాత్రులు కోలుకోకుండానే ఆదరాబాదరాగా ఆస్పత్రినుంచి వారిని పంపటానికి ప్రయత్నించిన తీరైనా బాబు వంచనాత్మక విన్యాసాలకు పరాకాష్ట. ఇవే కాదు... జరిగిన ఘోరంపై టీటీడీ చైర్మన్ మొదలుకొని మంత్రుల వరకూ ఒక్కొక్కరు వినిపిస్తున్న కథలు విస్తు గొలుపుతున్నాయి. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే సమాచారం ఉన్నదని చైర్మన్‌గిరీ వెలగ బెడుతున్న బీఆర్ నాయుడు చెబుతున్నారు. మరి వీరంతా కలిసి చేసిందేమిటి?అసలు ఏమైంది ఈ ప్రభుత్వానికి? ఎందుకింత చేష్టలుడిగిపోయింది? వైకుంఠ ఏకాదశి పర్వ దినం మొదలు వరసగా పదిరోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు ఉభయ తెలుగు రాష్ట్రాలనుంచి మాత్రమేకాదు... దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు పోటెత్తుతారని తెలుసు. అందుకోసం సీఎం కార్యాలయం మొదలుకొని టీటీడీలో అట్టడుగు సిబ్బందివరకూ పకడ్బందీ సమన్వయంతో ముందుకు సాగాలనీ తెలుసు. అంతక్రితం కేవలం రెండురోజులు మాత్రమే ఉండే వైకుంఠద్వార దర్శనాన్ని భక్తుల సంఖ్య నానాటికీ పెరగటాన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పదిరోజులకు పెంచింది. భక్తులు సజావుగా దర్శనం చేసుకుని తరించటానికి వీలుగా 9 కేంద్రాల్లో పదేసి కౌంటర్లలో సర్వ దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించింది. 24 గంటలముందే తెల్లారుజామున అయిదు గంటలకు టోకెన్ల జారీ మొదలయ్యేది. కానీ దీన్నంతటినీ తలకిందులు చేసి ముందురోజు అర్ధరాత్రి నుంచీ వేచి వున్న భక్తులను ఒకచోట చేర్చి రాత్రి ఎప్పుడో టోకెన్లు ఇవ్వటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తెల్లారుజాము నుంచి రాత్రి వరకూ సిబ్బంది ఏం చేసినట్టు? కనీసం టోకెన్ల కోసం ఆరుబయట పడిగాపులు పడుతున్న భక్తుల్లో పసిపిల్లల నుంచి వృద్ధుల వరకూ ఉన్నారన్న స్పృహ... వారికి తిండీ నీళ్లూ అందించాలన్న ఇంగితజ్ఞానం ఉండొద్దా? వచ్చిన వారిని వచ్చినట్టుగా క్యూలైన్లలో పంపి, వెంటవెంటనే టోకెన్లు జారీ చేయొద్దా? ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకొచ్చాయి గనుక జిల్లాల్లోనే ఆన్‌లైన్‌లో టోకెన్లు అందించే ప్రక్రియ అమలుచేయొచ్చు. అదే జరిగితే భక్తులందరూ స్వామివారిని తనివితీరా వీక్షించి, సురక్షితంగా తమ తమ ఇళ్లకు చేరుకునేవారు. కానీ పక్షవాతం వచ్చిన చందంగా ఎవరికివారు చేష్టలుడిగి ఈ ఘోర ఉదంతానికి కారకులయ్యారు.దీన్నంతటినీ కప్పిపుచ్చుకోవటానికి జిల్లా ఎస్సీని బదిలీ చేశారు. ఒక డీఎస్పీని సస్పెండ్ చేశారు. ఈవో, జేఈవోను వదిలేశారు. మరి శాంతిభద్రతల విభాగం దగ్గరుంచుకుని బాబు చేసిందేమిటి? ప్రమాణస్వీకారానికి ముందే తమ కనుసైగలతో ఊరూ వాడా దాడులూ, దౌర్జన్యాలూ, సామాన్య పౌరుల ఇళ్లు నేలమట్టం చేయించి మాఫియాలను తలపించే పాలనకు శ్రీకారం చుట్టిన పర్యవసానం కాదా ఈ ఉదంతం? తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని తప్పుడు ప్రచా రానికి పాల్పడలేదా? ఈ నేపథ్యంలో ఏ జిల్లాలోనైనా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చిత్తశుద్ధితో, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించగలుగుతున్నారా? ఎన్ని కేసులుంటే అంత గొప్పగా నెత్తెక్కించుకుంటామని అధికారంలోకి రాకముందు టీడీపీ శ్రేణుల్లో నేరస్వభావాన్ని పెంచిన ఘనత వీరిది. ఇప్పుడు పోలీసులకూ అదే రంధి పట్టుకుంది. ఎంతమందిపై అక్రమ కేసులు పెడితే అంతగా నజరానాలు పొందొచ్చన్న దురాశ పుట్టింది. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతోపాటు, సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు బనాయిస్తూ రాష్ట్రంలో ఈమూలనుంచి ఆ మూలకు తిప్పుతున్నారు. ఇక శాంతిభద్రతలు ఎటుపోతేనేం... పర్వదినాలకు వచ్చే భక్తులు ఏమై పోతేనేం! దేవుడంటే భయ భక్తుల్లేవు... ప్రజలంటే వెరపు లేదు! ఈ దుఃస్థితికి ఎన్డీయే కూటమి పాలకులు సామూహికంగా సిగ్గుపడాలి. విశాఖలో స్టీల్‌ప్లాంట్ భవిష్యత్తుపై ఒక్క మాటైనా మాట్లాడని ప్రధాని మెప్పు పొంద టానికి బాబు, పవన్, లోకేశ్‌లు అగచాట్లు పడితే... అక్రమ కేసుల పరంపరతో ఆ ముగ్గురి దగ్గరా మార్కులు కొట్టేద్దామని అధికార యంత్రాంగం పాట్లు పడుతోంది. వెరసి ఇలాంటి దారుణాలు రివాజయ్యాయి. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడినవారి కుటుంబ సభ్యులు చెబుతున్న విషయాలు వింటే గుండె తరుక్కుపోతుంది. 2015లో తన ఏలుబడిలో, తన వల్ల, తన సమక్షంలో గోదావరి పుష్కరాల్లో 29 మంది భక్తుల మరణానికి దారితీసిన ఉదంతాన్ని బాబు సోమయాజులు కమిషన్‌తో కప్పెట్టటాన్ని ఎవరూ మరిచిపోరు. కనుక తిరుపతి ఉదంతంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి. టీటీడీ చైర్మన్‌తో సహా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
వెంకన్న సన్నిధిలో విషాదం.. టీటీడీ చరిత్రలో కనివినీ ఎరుగని నిర్లక్ష్యం
చంద్రబాబు ప్రభుత్వ పెనునిర్లక్ష్యం మరోసారి అమాయక భక్తుల ప్రాణాలను బలిగొంది. పవిత్ర తిరుమల-తిరుపతి క్షేత్రాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టుపట్టించిన చంద్రబాబు దుర్మార్గం ఏడుగురు భక్తుల ప్రాణాలను హరించింది. ప్రభుత్వ వైఫల్యమే తిరుపతిలో తొక్కిసలాటకు దారితీసింది. చిత్తశుద్ధి లేని వ్యక్తులకు, వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇచ్చి.. తిరుమల క్షేత్రాన్ని రాజకీయ కేంద్రంగా మార్చారు. భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారు.
తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు, పవన్ తలోమాట
తిరుపతి : తొక్కిసలాట (tirupati stampede) ఘటనలో సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల వారికి తోచినట్లు మాట్లాడారు. తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తలోమాట మాట్లాడారు. ఇక్కడ వేర్వేరు అధికారులను టార్గెట్ చేశారు. అయితే ముందుగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై చంద్రబాబు నోరెత్తలేదు. కానీ పవన్ మాత్రం ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి, ఛైర్మన్ బీఆర్ నాయుడుల తప్పుందని తేల్చేశారు. వారిమధ్య సమన్వయలోపం వలనే తొక్కిసలాట జరిగిందని స్పష్టం చేశారు, కానీ వేరే అధికారులదే తప్పంటూ చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హర్షవర్ధనరెడ్డిలను సస్పెండ్ చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, సీఎస్‌వో శ్రీధర్‌లను ట్రాన్సఫర్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ల తలో మాట్లాడటంపై చర్చ జరుగుతుంది. పవన్ మాట్లాడుతూ..ప్రమాద బాధితుల్ని పరామర్శించిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘తిరుపతిలో తప్పు జరిగింది. టీటీడీలో ప్రక్షాళన జరగాలి. టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి విఫలమయ్యారు. శ్యామలరావు, వెంకయ్య చౌదరి,ఛైర్మన్ బీఆర్ నాయుడుల మధ్య సమన్వయ లోపం ఉంది. పోలీసుల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. రద్దీని అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. ఈ ఘటనకు పోలీసులు బాధ్యత వహించాలి’అని వ్యాఖ్యానించారు.
టాటా బోర్డులో ఇద్దరు వారసురాళ్లకు చోటు
సర్ రతన్ టాటా ఇండస్ట్రియల్ ఇనిస్టిట్యూట్ (SRTII) ట్రస్టీల బోర్డులో టాటా ట్రస్ట్ చైర్మన్ నోయెల్ టాటా కుమార్తెలు మాయ, లేహ్ నియమితులయ్యారు. వీరిరువురు అర్నాజ్ కొత్వాల్, ఫ్రెడ్డీ తలతి స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.మాయ, లేహ్ టాటాల నియామకం అర్నాజ్ కొత్వాల్‌తో అంతర్గత విభేదాలకు దారితీసింది. టాటా ట్రస్ట్స్‌లో ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న 'తారాపోరేవాలా'కు పంపిన ఈమెయిల్‌లో, నోయెల్ టాటా పట్టుబట్టడంతో.. అతను కోరినట్లుగా ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమస్యకు సంబంధించి సర్ దొరాబ్జీ.. టాటా ట్రస్ట్ అండ్ సర్ రతన్ టాటా ట్రస్ట్ ట్రస్టీ అయిన మెహ్లీ మిస్త్రీ నుంచి కూడా తనకు కాల్ వచ్చిందని కూడా ఆమె పేర్కొన్నారు. దీనిపై టాటా ట్రస్ట్‌లు స్పందించ లేదు.SRTII అనేది సర్ రతన్ టాటా ట్రస్ట్ యూనిట్, ఇది మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పనిచేస్తోంది. రతన్ టాటా మరణానంతరం అక్టోబర్‌లో టాటా ట్రస్ట్‌ల ఛైర్మన్‌గా నియమితులైన నోయెల్ టాటాకు.. లేహ్ (39), మాయ (36), నెవిల్లే (32) ముగ్గురు పిల్లలు. వీరు టాటా ట్రస్ట్‌లలో ఇప్పటికే వివిధ బాధ్యతలను నిర్వర్తించారు.లేహ్ టాటాలేహ్ టాటా.. ఇండియన్ హోటల్స్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్. అంతే కాకుండా ఈమె గేట్‌వే హోటల్స్ బ్రాండ్‌ను నిర్వహిస్తోంది. టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్, టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, జేఆర్డీ అండ్ థెల్మా జే టాటా ట్రస్ట్ బోర్డులలో కూడా ఉన్నారు.మాయ టాటామాయా టాటా.. టాటా క్యాపిటల్‌లోని ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్, టాటా ఆపర్చునిటీస్ ఫండ్‌లో తన వృత్తిని ప్రారంభించింది. ఆమె టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, ఆర్‌డీ టాటా ట్రస్ట్ మరియు జెఆర్‌డి మరియు థెల్మా జే టాటా ట్రస్ట్ బోర్డులలో పని చేస్తున్నారు.నెవిల్లే టాటానెవిల్లే టాటా గత సంవత్సరం టాటా గ్రూప్ రిటైల్ వ్యాపారాలను కలిగి ఉన్న ట్రెంట్ హైపర్ మార్కెట్ యూనిట్.. స్టార్ బజార్ అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. అతను టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్, జేఆర్డీ టాటా ట్రస్ట్ అండ్ ఆర్డీ టాటా ట్రస్ట్ బోర్డులలో ఉన్నారు.నోయల్ టాటాదివంగత పారిశ్రామిక దిగ్గజం.. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా వారసుడిగా 'నోయల్ టాటా' ఇప్పటికే నియమితులయ్యారు. అయితే ఆయన టాటా సన్స్ బోర్డులో కూడా అడుగుపెట్టారు. 2011 తర్వాత టాటా సన్స్, టాటా ట్రస్ట్ బోర్డులు రెండింటిలోనూ టాటా కుటుంబ సభ్యుడు స్థానం పొందడం ఇదే మొదటిసారి. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది.ఇదీ చదవండి: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఆలస్యమైతే రోజుకు రూ.100టాటా సన్స్‌లో 66 శాతం వాటాను కలిగి ఉన్న టాటా ట్రస్ట్స్, ఇప్పుడు నోయెల్ టాటా సారథ్యంలో ముందుకు సాగుతుంది. నోయెల్ టాటా సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డులలో కూడా పనిచేస్తున్నారు. ఉప్పు నుంచి టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లో టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఇప్పటి వరకు నోయల్ టాటా.. టీటా గ్రూపుకు చెందిన రిటైల్ బిజినెస్ చూసుకున్నారు. ఇప్పుడు టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు.
గేమ్ ఛేంజర్ టిక్కెట్ల విక్రయం...ఏ రాష్ట్రంలో ఎంతంటే...
చిత్రం విడుదలకు కేవలం ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలింది. రిలీజ్‌కు సంబంధించి కౌంట్‌డౌన్ ముగియనుంది. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత మరో అద్భుతమైన పాత్రలో తమ ఫేవరెట్ స్టార్‌ని చూడటానికి అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఏ పెద్ద స్టార్ సినిమా విడుదల ముందైనా సర్వసాధారణంగా జరిగేవే. అవన్నీ అలా ఉంచితే... ఇటీవల భారీ చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్లు బాగా చర్చకు నోచుకుంటున్నాయి. గత కొంత కాలంగా భారతీయ సినిమాలకు సంబంధించి హిట్స్, ఫ్లాప్స్ అన్నీ వసూళ్లతోనే ముడిపడడంతో ఈ పరిస్థితి వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్ గురించి కూడా సినిమా వర్గాల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. నిజానికి ఈ సినిమాకి భారీగా హైప్ వచ్చినప్పటికీ అడ్వాన్స్ టిక్కెట్ల విక్రయం ప్రకారం చూస్తే ఆశించిన స్థాయికి చేరుకోలేదనే చెప్పాలి. భారీ సంచలన చిత్రాల దర్శకుడు శంకర్, మెగా పవర్ స్టార్ ల కలయికే ఓ సెన్సేషన్ కావడంతో ఈ టాలీవుడ్ పొలిటికల్ థ్రిల్లర్ అందరి దృష్టినీ ఆకర్షించింది, అయితే కనపడుతున్న స్పందన మాత్రం అంచనాల కంటే చాలా తక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఈ సినిమా డైరెక్టరే అని పలువురు భావిస్తున్నారు. ఊహించిన దానికన్నా శంకర్ ప్రేక్షకుల్లో తన పట్ల ఆదరణ తగ్గించుకున్నాడని సినీ వర్గాలు అంటున్నాయి. అదే సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తోందని అభిప్రాయపడుతున్నాయి. నిజానికి ఒకప్పుడు శంకర్ అంటే పెద్ద బ్రాండ్, కానీ ఇటీవల ఈ డిఫరెంట్ సినిమాల ఫిల్మ్ మేకర్ తన క్రేజ్‌ను కోల్పోయాడు. అతని సినిమాలు గత కొంతకాలంగా దారుణంగా విఫలమవుతున్నాయి ఆయన చివరి సినిమా భారతీయుడు 2 ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో మనం చూశాం.కలెక్షన్లలో వ్యత్యాసం..చెబుతోంది అదే...సినిమా విడుదలకు మరో రోజు మిగిలి ఉండగా...గురువారం ఉదయం 10 గంటల నాటికి గేమ్ ఛేంజర్ 1వ రోజు మన దేశంలో దాదాపు 5 లక్షలకు పైగా టిక్కెట్‌లను విక్రయించిందని సమాచారం. మొత్తంగా అడ్వాన్స్ బుకింగ్ విలువ 14.83 కోట్ల గ్రాస్ (బ్లాక్ చేసిన సీట్లు మినహా)కు చేరింది. ఇప్పటివరకు దాదాపు 8,000 షోలు లిస్ట్ చేశారు. తర్వాత వాటి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.ఆంధ్రలో టాప్..తమిళనాడులో డ్రాప్...రాష్ట్రాల వారీగా చూస్తే టిక్కెట్ల విక్రయంలో ఆంధ్రప్రదేశ్ భారీ తేడాతో ముందంజలో ఉంది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే గేమ్ ఛేంజర్ మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 8.72 కోట్ల గ్రాస్ టిక్కెట్లను విక్రయించింది. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ 3.06 కోట్లు, కర్ణాటక 1 కోటి ఉన్నాయి. విశేషం ఏమిటంటే తమిళనాట ఇంకా 1 కోటి మార్కును సైతం ఈ సినిమా టచ్ చేయలేదు, విచిత్రంగా తమిళనాడుకు చెందిన టాప్ డైరెక్టర్ శంకర్ సినిమా అయినప్పటికీ అక్కడ ఈ పరిస్థితి ఉండడం షాకింగ్ అనే చెప్పాలి. శంకర్ పట్ల జనాదరణ ఎంతగా తరిగిపోయిందో చెప్పడానికి ఇదొక నిదర్శనంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.గుంటూరు కారం కన్నా..ఘాటు తక్కువే...రామ్ చరణ్ నటించిన సినిమా బుకింగ్స్ విలువ గురువారం ముగిసే సరికి 20 కోట్ల మార్క్‌ను చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు, కానీ అప్పటికీ ముందస్తు అంచనాలను ఇది అందుకోవడం లేదనే చెప్పాలి. ఇంత భారీ చిత్రంగా పేర్కొనని మహేష్ బాబు గుంటూరు కారం సినిమాను సైతం బీట్ చేయడంలో ఇది ఖచ్చితంగా విఫలమవుతుంది, గత సంక్రాంతి సందర్భంగా విడుదలైన గుంటూరు కారం మొదటి రోజు 24.90 కోట్ల గ్రాస్ టిక్కెట్లను విక్రయించింది.
ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఆలస్యమైతే రోజుకు రూ.100
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులు కస్టమర్లకు త్వరితగతిన సేవలు అందించాలని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వినియోగదారులకు అందించాల్సిన సేవలలో ఏ మాత్రం ఆలస్యం జరిగిన జరిమానా తప్పదని వెల్లడించింది.బ్యాంకులు లేదా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు కస్టమర్లకు అందించే సేవలలో ఎక్కువ ఆలస్యం చేస్తున్నాయని ఆర్‌బీఐ ఫిర్యాదులు అందుకుంది. దీంతో కొత్త ఆదేశాలను జారీ చేస్తూ.. నెల రోజులు లేదా 30 రోజుల లోపల వినియోగదారుల సమస్యలు పరిష్కారం కాకపోతే, రోజుకు 100 రూపాయలు జరిమానా విధిస్తామని వెల్లడించింది. ఈ డబ్బు వినియోగదారునికే పరిహారం రూపంలో అందించడం జరుగుతుంది.వినియోగదారుల క్రెడిట్ సమాచారాన్ని బ్యాంక్ లేదా ఆర్ధిక సంస్థ పొందినట్లయితే.. దానిని వారికి ఈమెయిల్ లేదా ఎస్ఎమ్ఎస్ రూపంలో తెలియజేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అంతే కాకుండా ఖాతాదారుడు డిఫాల్ట్‌గా లోన్ చెల్లించకుండా ఉంటే ఆ విషయాన్ని కూడా బ్యాంకులు తెలియజేయాలి. ఈ విషయాన్ని 21 రోజులలోపు తెలియజేయకపోతే.. వినియోగదారునికి రోజుకి 100 రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నియమం ఆర్ధిక సంస్థలకు కూడా వర్తిస్తుంది.ప్రస్తుతం భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాచే అధికారం పొందిన నాలుగు సీఐసీలు ఉన్నాయి. అవి సిబిల్, సీఆర్ఐఎఫ్, ఈక్విఫాక్స్, ఎక్స్‌పీరియన్. ఇవి కూడా వినియోగదారుల సమస్యలను 30 రోజుల్లో పరిష్కరించాలి లేదా ఫిర్యాదుకు సంబంధించిన అప్డేట్ కస్టమర్‌కు తెలియజేయాలి. ఇచ్చిన ఫిర్యాదును తిరస్కరించినట్లయితే.. దానికి కారణం కూడా చెప్పాలని ఆర్‌బీఐ ఆదేశించింది.ఆర్‌బీఐ నిర్ణయం వెనుక ఉద్దేశ్యంవినియోగదారులు లేదా ఖాతాదారులు ఏదైనా సమస్యను పరిష్కరించాలనుకుంటే.. రోజుల తరబడి బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్థల చుట్టూ పదే పదే తిరగాల్సి ఉండేది. దీనిని దృష్టిలో ఉంచుకుని, దేశంలోని అన్ని బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు వినియోగదారులకు వేగవంతమైన సేవలను అందించాలని.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఏటీఎంల గురించి ఆర్‌బీఐనగదు సర్క్యులేషన్ రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ.. భారతీయ బ్యాంకులు ఏటీఎంలను, క్యాష్ రీసైక్లర్‌లను క్రమంగా తగ్గించనున్నట్లు సమాచారం. చాలామంది ప్రజలు యూపీఐ, డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడటం వల్ల ఏటీఎంల వినియోగం కూడా భారీగా తగ్గిపోయిందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. భారతదేశంలో ఏటీఎంల సంఖ్య సెప్టెంబర్ 2023లో 2,19,000 ఉండేవి. కానీ వీటి సంఖ్య సెప్టెంబర్ 2024 నాటికి 2,15,000కు తగ్గిపోయింది. అదే సమయంలో ఆఫ్-సైట్ ఏటీఎంల సంఖ్య కూడా 97,072 నుంచి 87,638కి తగ్గాయి. సాధారణంగా ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి, అద్దె, సెక్యూరిటీ వంటి వాటికి.. సంబంధిత బ్యాంకులు భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే వినియోగం తగ్గినప్పుడు ఈ ఖర్చు మొత్తం వృధా. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏటీఎంల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి సన్నద్ధమవుతున్నాయి.
నెపం అధికారులపైకి నెట్టేస్తే సరిపోతుందా?
తిరుమల... ఎంత ప్రతిష్టాత్మక, పవిత్రమైన దేవాలయం..? ఎంత గొప్ప పేరు ఉన్న పుణ్య క్షేత్రం..? కానీ ఈ రోజు జరుగుతున్నదేమిటి? ఆంధ్ర ప్రదేశ్‌కే కాదు.. దేశానికే గర్వకారణమైన దేవస్థానంలో వైకుంఠ ద్వార ప్రవేశ టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన ఉదంతం ప్రపంచ వ్యాప్త హిందువులను కలచి వేస్తోంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక , చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో ఘోరాలు జరగుతున్నాయి. అకృత్యాలు, విధ్వంసాలు, అరాచకాలు చోటు చేసుకుంటున్నాయి. చివరికి తిరుమలేశుని కూడా వదలిపెట్టలేదు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీయడానికి కూడా వెనుకాడని నాయకత్వం ఇప్పుడు ఏపీలో పాలన చేస్తోంది. హిందూ మత ఉద్దారకులుగా పైకి ఫోజు పెట్టడం, లోపల మాత్రం ఎన్ని దందాలు చేయాలో అన్నీ చేయడం. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో లక్షల సంఖ్యలో భక్తులు వచ్చినా వారిని అసౌకర్యం లేకుండా స్వామి వారి దర్శన భాగ్యం కల్పించే వారు. అయోధ్య ఆలయ నిర్వాహకులు ఈ విషయాన్ని గుర్తించారు. అదెలాగో నేర్చుకోవడానికీ టీటీడీ అధికారులను ఆయోధ్యకు ఆహ్వానించి సలహాలు తీసుకున్నారు. అది జగన్ జమానా.. మరి ఇప్పుడు...??? అంతటి ఖ్యాతి వహించిన టీటీడీ క్రౌడ్ మేనేజ్మెంట్‌లో విఫలమైంది. వేలల్లో వచ్చిన జనాన్నే నియంత్రించలేకపోయింది. ఫలితంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించారు. యాభై మంది వరకూ గాయపడ్డారు. ఇంతటి విషాదం... దశాబ్దాలలో ఎన్నడూ జరగలేదు. ఈ ఘటన తిరుపతి గొప్పదనాన్ని దెబ్బ తీసిందని చెప్పక తప్పదు. తిరుమలను పరిరక్షించేందుకు, భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి, జగన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో టీటీడీ పలు సంస్కరణలు తెచ్చింది. ఇప్పుడు ఆ పని మాని గత ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిల కాలంలో ఏమైనా తప్పులు జరిగాయా? అని భూతద్దం పెట్టి అన్వేషించి వైఎస్సార్‌సీపీ రాజకీయ కక్ష సాధించడానికి, జగన్ ప్రభుత్వాన్ని ఎలా బద్నాం చేయాలన్న దానిపైనే చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో టీటీడీ పరువును పణంగా పెడుతోంది. కొత్తగా టీటీడీ ఛైర్మన్ అయిన ఒక టీవీ సంస్థ యజమాని బీఆర్ నాయుడు పూర్తి అసమర్థంగా వ్యవహరించారనిపిస్తుంది. గొడవ జరుగుతుందని ముందుగానే తనకు తెలుసునని ఆయన చెప్పడం గమనార్హం. గొడవ జరుగుతుందని తెలిస్తే ఎందుకు నివారణ చర్యలు తీసుకోలేకపోయారన్న ప్రశ్నకు జవాబు ఇవ్వలేక మళ్లీ మాట మార్చారు. ఈ మొత్తం ఘటనను బాధ్యతను అధికారులపైకి నెట్టి తప్పించుకునేందుకు చంద్రబాబు, బీఆర్ నాయుడులు చూస్తున్నారు. మరో ఘట్టం గురించి కూడా మాట్లాడుకోవాలి. తిరుమల ప్రసాదం లడ్డూకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆ లడ్డూను భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. ప్రత్యేకమైన రుచి కూడా ఉంటుంది. అలాంటి లడ్డూపై తీవ్రమైన అనుచిత ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘోర అపచారానికి పాల్పడ్డారని భక్తులు భావిస్తారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి ని వాడారంటూ చంద్రబాబు నీచమైన ఆరోపణ చేసి గత ముఖ్యమంత్రి జగన్ కు రుద్దాలని ప్రయత్నం చేశారు. పవన్ కల్యాణ్ సడన్ గా సనాతని వేషం కట్టి బాండ్ బాజా వాయించారు. దానికి జగన్ మీ ఇష్టం వచ్చిన విచారణ చేసుకోండి... కాని స్వామి వారికి అపచారం చేస్తున్నారు సుమా! అని హెచ్చరించారు. అయినా టీడీపీ, జనసేన, బీజేపీలు ఇష్టారీతిన దుర్మార్గపు ప్రచారం చేసి తిరుమల ఔన్నత్యాన్ని దెబ్బతీశాయి. ఒకవేళ లడ్డూకు సంబంధించి నిజంగానే ఏవైనా పొరపాట్లు జరుగుతుంటే వాటిని సరిచేసి బాధ్యతగా ఉండవలసిన ముఖ్యమంత్రే తన రాజకీయ స్వార్థం కోసం ఒక వదంతిని ప్రచారం చేశారు. చివరికి దానిపై సీబీఐ విచారణ వేస్తే ఏమైందో అతీగతీ లేదు. అనంతరం చంద్రబాబే మాట మార్చారు. దీనివల్ల స్వామి వారి ఆలయానికి అపవిత్రత తెచ్చిన అపఖ్యాతిని చంద్రబాబు, పవన్ లు పొందారు. కేవలం జగన్‌పై ద్వేషంతో ఆయన పాలనలో వీరు తిరుమలపై అనేక విమర్శలు చేసేవారు. దానివల్ల తిరుమల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఎన్నడూ ఫీల్ అయ్యేవారు కారు. జగన్ పై మతపరమైన ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయంగా లబ్ది పొందాలన్న యావ తప్ప మరొకటి ఉండేది కాదు. చంద్రబాబు ,పవన్ లు నిజాలు చెప్పరులే అని ప్రజలు భావించారు కాబట్టి సరిపోయింది కాని, లేకుంటే కూటమి పెద్దలు తిరుమలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితిని సృష్టించడానికి యత్నించారు. తిరుమలలో ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా సంక్రాంతి పర్వదినాల నుంచి వారం రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కార్యక్రమం జరిగింది. దీనిని చాలా పవిత్రంగా భక్తులు పరిగణిస్తారు. దానికి అధికారులు కూడా విస్తృతంగా ప్రచారం కల్పిస్తారు. ప్రతి ఏటా వేల సంఖ్యలో భక్తులు వచ్చినా ఇలాంటి తొక్కిసలాట జరగలేదు. కానీ ఈసారి తిరుపతిలో తొమ్మిది చోట్ల 90 కౌంటర్లు ఏర్పాటు చేసినా, ఈ తొక్కిసలాట జరిగిందంటే పర్యవేక్షణ లోపం తప్ప ఇంకొకటి కాదు. కారణం ఏమైనా బైరాగి పట్టెడ అనే చోట అకస్మాత్తుగా గేటు తెరవడంతో టిక్కెట్లు ఇస్తున్నారని అనుకున్న భక్తులు ఒక్కసారిగా తోసుకు వచ్చారు. అంటే అక్కడ అలా తోపులాట లేకుండా ముందుగానే అధికారులు చర్య తీసుకోలేదన్నమాట. గురువారం ఉదయం నుంచి ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక మొదలైన రాష్ట్రాల నుంచి కూడా భక్తులు బుధవారం మధ్యాహ్నమే తరలివచ్చారు. అధికారులు ఈ విషయాన్ని గమనించినా వారి నియంత్రణకు తగిన ప్రణాళిక రూపొందించలేదు. అందరిని ఒక పార్కులో పెట్టేశారు. మంచినీటి వసతి కూడా కల్పించలేకపోయారు. మరో రెండు చోట్ల కూడా తొక్కిసలాటలు జరిగాయి. ఇలాంటి వాటిపై కదా.. టీటీడీ ఛైర్మన్ ,పాలక మండలి, ఉన్నతాధికారులు దృష్టి పెట్టవలసింది?. గతంలో సమర్థంగా పనిచేసిన అధికారులపై వైఎస్సార్‌సీపీ ముద్ర వేసి, వారిని తొలగించి తమ అంతేవాసులను నియమించుకున్నారు. తిరుపతిలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసం ఒక పోలీసు అధికారిని ప్రత్యేకంగా పోస్టు చేశారట. వారు ఆ పనిలో ఉంటారు కాని, ప్రజల అవసరాలను ఎందుకు పట్టించుకుంటారు? పైరవీ చేసుకుని టీటీడీ ఛైర్మన్ అయిన బిఆర్ నాయుడుకు అసలు ఇలాంటి విషయాలలో ఏమి అనుభవం ఉంది? లేకపోయినా ఫర్వాలేదు. ఆయన నిబద్ధత ఏమిటి? కేవలం ఒక టీవీ సంస్థ ద్వారా తనకు బాజా వాయిస్తే పదవి ఇచ్చేశారు. పదవి తీసుకున్న తర్వాత అయినా టీటీడీ ఉద్దరణకు కృషి చేశారా? పోసుకోలు ఇంటర్వ్యూలు, ప్రకటనలు చేస్తూ కాలం గడిపి అసలు భక్తులను ఇక్కట్ల పాలు చేశారు. టెక్నాలజీని తానే కనిపెట్టినట్లు చంద్రబాబు మాట్లాడుతుంటారు. అయినా ఆన్ లైన్ లో కాకుండా ఇన్ని వేల మందిని, అది కూడా గంటల తరబడి వేచి ఉండేలా చేయడం అంటే ఈ ప్రభుత్వ చేతకాని తనమే కాదా? చంద్రబాబు నాయుడు గతంలో పుష్కరాల సమయంలో పబ్లిసిటీ కోసం, సినిమా షూటింగ్ కోసం సామాన్య భక్తుల స్నాన ఘట్టంలో స్నానం చేసి నప్పుడు కూడా ఇలాగే గేట్లు సడన్ గా తెరవడంతో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు. ఆ విషయంలో ఒక్క కానిస్టేబుల్ పై కూడా చర్య తీసుకోలేదు. సీసీటీవీ ఫుటేజీ సైతం మాయమైంది. ఆయన టైమ్ లో కేసును నీరుకార్చేసినా, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్ కూడా దానిపై దృష్టి పెట్టలేదు. తదుపరి కందుకూరు, గుంటూరులలో చంద్రబాబు సభలలో పదకుండు మంది మరణించినా, చంద్రబాబుపై ఆనాటి ప్రభుత్వం కేసులు పెట్టలేదు. అయినా చంద్రబాబు పోలీసులదే వైఫల్యం అని దబాయించి, రోడ్లపై సభలు వద్దన్నందుకు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించేవారు. ఇటీవల హైదరాబాద్ సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణిస్తే, దానికి నటుడు అల్లు అర్జున్ కారణమని ఆయనను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. అలా చేసినందుకు, టీడీపీ, జనసేన శ్రేణులు సమర్థించి సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టాయి. అదే కొలమానంగా తీసుకుంటే ఇప్పుడు ఎవరిపై చర్య తీసుకోవాలి. ఎవరిని అరెస్టు చేయాలి? టీటీడీ ఈవో, జాయింట్ ఈవో, తిరుపతి ఎస్పీ, డీఎస్పీ మొదలైనవారిని బాధ్యులు చేస్తారా? లేదా? ఎలాంటి చర్య తీసుకుంటారు? అసలు ఈ ఘటనకు నైతిక బాధ్యతగా బిఆర్ నాయుడు ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తారా? లేదా? ఒకవేళ ఆయన చేయకపోతే చంద్రబాబు ఆ మేరకు ఆదేశిస్తారా? అంటే అది జరిగే పని కాకపోవచ్చు. ఎందుకంటే బిఆర్ నాయుడుని నియమించిన చంద్రబాబు నాయుడు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది.అలాగే పనికట్టుకుని తనకు కావల్సిన అధికారులను నియమించి ,వారిని తన అడుగులకు మడుగులు ఒత్తేవారిగా మార్చుకున్న ఆయన కూడా బాధ్యత తీసుకోవాలి. అదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈపాటికి చంద్రబాబు, పవన్ లు రెచ్చిపోయి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసేవారు. ఎల్లో మీడియా గోల,గోల చేసేది. ఇప్పుడు మాత్రం అంత గప్ చిప్ అయ్యారు. అదేదో అధికారులదే తప్పన్నట్లుగా కథ నడపాలని చూస్తున్నారు. మొత్తం తిరుమలకు అపవిత్రత వచ్చేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇప్పటికైనా మార్చుకుంటే మంచిది. వైకుంఠ ద్వార దర్శనం ద్వారా మోక్షం పొందవచ్చన్న కొండంత ఆశతో వెళ్లిన భక్తులకు చంద్రబాబు ప్రభుత్వం నరకం సృష్టించడం బాధాకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
తిరుపతి తొక్కిసలాట ఘటన - ఇద్ధరు అధికారులపై వేటు
‘గేమ్ ఛేంజర్’ మూవీ ట్విటర్ రివ్యూ
కొంచెమైనా.. ముంచేస్తుంది!
బెనిఫిట్ షో అవసరమేముందో చెప్పండి
ఇందిరమ్మ ఇళ్ల ఫిర్యాదుల కోసం వెబ్సైట్
లోపలకు వచ్చినంత మాత్రాన దాడి చేస్తారా?
బెంగళూరులో 23 నుండి ఐఎంటీఈఎక్స్ 2025
లిక్కర్ బకాయిలు రూ. 2వేల కోట్లకు పైనే!
ఆర్గానిక్ ఎగుమతులకు చక్కని అవకాశాలు
వ్యవసాయ కూలీలు, డ్రైవర్లకు భారీ ఉపాధి
క్షమాపణలు చెప్పిన యాంకర్ శ్రీముఖి.. అసలేం జరిగిందంటే?
తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ వింత వ్యాఖ్యలు
ఎన్ని ఫిర్యాదులొచ్చినా మిమ్మల్ని వెతకడానికి ఎవరూ సాహసించరు సార్!!
సాక్షి కార్టూన్
ఏడు కొండలవాడా.. ఎంత ఘోరం.. ఎంత ఘోరం
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పనులు చకచకా సాగుతాయి.
Budget 2025: వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గింపు!
నా బండి ఫొటో ఎందుకు తీశావురా?
వైఎస్ జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు
విరాట్ కోహ్లి కీలక నిర్ణయం.. తొలిసారిగా!?
తిరుపతి తొక్కిసలాట ఘటన - ఇద్ధరు అధికారులపై వేటు
‘గేమ్ ఛేంజర్’ మూవీ ట్విటర్ రివ్యూ
కొంచెమైనా.. ముంచేస్తుంది!
బెనిఫిట్ షో అవసరమేముందో చెప్పండి
ఇందిరమ్మ ఇళ్ల ఫిర్యాదుల కోసం వెబ్సైట్
లోపలకు వచ్చినంత మాత్రాన దాడి చేస్తారా?
బెంగళూరులో 23 నుండి ఐఎంటీఈఎక్స్ 2025
లిక్కర్ బకాయిలు రూ. 2వేల కోట్లకు పైనే!
ఆర్గానిక్ ఎగుమతులకు చక్కని అవకాశాలు
వ్యవసాయ కూలీలు, డ్రైవర్లకు భారీ ఉపాధి
క్షమాపణలు చెప్పిన యాంకర్ శ్రీముఖి.. అసలేం జరిగిందంటే?
తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ వింత వ్యాఖ్యలు
ఎన్ని ఫిర్యాదులొచ్చినా మిమ్మల్ని వెతకడానికి ఎవరూ సాహసించరు సార్!!
సాక్షి కార్టూన్
ఏడు కొండలవాడా.. ఎంత ఘోరం.. ఎంత ఘోరం
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పనులు చకచకా సాగుతాయి.
Budget 2025: వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గింపు!
నా బండి ఫొటో ఎందుకు తీశావురా?
వైఎస్ జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు
విరాట్ కోహ్లి కీలక నిర్ణయం.. తొలిసారిగా!?
సినిమా
ఆ రోజు ఏది తినాలపిస్తే అది తింటా.. తాగుతా...: నాగార్జున
టాలీవుడ్ స్టార్ హీరో, కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) ఈ ఏడాది 66వ ఏట అడుగుపెడుతున్నారు. అయినా తెరపై తన వయసులో సగం లాగా కనిపిస్తారు. సిసలైన ఫిట్‌నెస్‌కు అసలైన చిరునామాలా కనిపించే నాగ్.. ఆరోగ్యకరమైన జీవనశైలి దీనికి కారణంగా చెప్పొచ్చు. తాజాగా ఆంగ్ల పత్రిక హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున తన ఫిట్నెస్ సీక్రెట్స్‌తో పాటు ఆరోగ్యార్ధుల కోసం పలు సూచనలు కూడా అందించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...ఉదయం వ్యాయామం..నిద్ర లేవగానే వర్కవుట్ చేయడమే నా మొదటి ప్రాధాన్యత. ఖచ్చితంగా వారానికి ఐదు రోజులు, వీలైతే ఆరు రోజులు వర్కవుట్ చేస్తాను. ఉదయం పాటు 45 నిమిషాల నుంచి ఒక గంట వరకు వ్యాయామం చేస్తాను. ఇలా వారానికి ఐదు నుంచి ఆరు రోజులు ఉదయం దాదాపు గంటసేపు వ్యాయామం చేస్తా. ఆ గంటలో స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియో వర్కవుట్స్ మేళవిస్తా. గత 30–35 సంవత్సరాలుగా నా రొటీన్ ఇదే. కాబట్టి స్థిరత్వం ఎక్కువ. నేను రోజంతా చురుకుగా ఉంటాను. నేను జిమ్‌కి వెళ్లలేకపోతే, కనీసం వాకింగ్ లేదా ఈత కొట్టడానికి అయినా వెళ్తాను. ఫిట్ బాడీ మాత్రమే కాదు సౌండ్ మైండ్‌ని నిర్వహించడానికి ఈత కొట్టడం గోల్ఫ్ ఆడటం వంటి కార్యకలాపాలను ఆస్వాదిస్తా. డైట్..నా ఆహారం కొన్ని సంవత్సరాల నుంచి మారిపోయింది. ఉదయం 7 గంటలకు వ్యాయామంతో ప్రారంభిస్తా. నా ఉదయపు దినచర్య లో ప్రోబయోటిక్స్ కూడా భాగం, ఇది గట్ ఆరోగ్యాన్ని పెంచడానికి శక్తివంతంగా రోజు గడిపేందుకు ఇది గొప్ప మార్గం. దీని కోసం‘నా దగ్గర కిమ్చి, సౌర్‌క్రాట్, పులియబెట్టిన క్యాబేజీ వంటి కొన్ని సహజమైన ప్రోబయోటిక్స్ ఉంటాయి. నేను కొంచెం గోరువెచ్చని నీరు కాఫీ తాగి వ్యాయామానికి వెళతాను. రాత్రి 7 గంటలకు లేదా గరిష్టంగా 7.30 గంటలకు నా డిన్నర్ పూర్తి చేస్తాను. నేను అడపాదడపా ఉపవాసం చేస్తాను. ప్రతిరోజూ 14 గంటల ఉపవాసం ఉంటుంది, నేను సాయంత్రం నుంచి మరుసటి ఉదయం వరకు రోజుకు కనీసం 12 గంటలు ఉపవాసం ఉంటాను. జీర్ణక్రియకు అది శ్రమను తగ్గిస్తుంది. ఆదివారం నా ఛీటింగ్ డే. ఆ రోజున నాకు ఇష్టమైన ఫుడ్‌ని ఆస్వాదిస్తాను. ముఖ్యంగా హైదరాబాదీ వంటకాలు బిర్యానీ కూడా లాగించేస్తా. ఆ రోజున నాకు ఏది తాగాలనిపిస్తే అది తిని తాగుతాను. నేను దాని గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించను. ఇలా చేయడం వల్ల మనం దేన్నీ కోల్పోతున్నట్టు మనకు అనిపించదు. (చదవండి: Game Changer: ‘గేమ్ ఛేంజర్’ని వదలని సినిమా కష్టాలు!)గోల్ఫ్‌తో మానసిక స్పష్టతశారీరకంగానే కాదు మానసికంగానూ చురుకుగా ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. మానసిక ఆనందం కోసం కొంచెం సేపు గోల్ఫ్ ఆడతాను. ఈ గేమ్‌ను సరిగ్గా ఆడటానికి ఏకాగ్రత స్థాయిలు చాలా ఎక్కువ కావాలి. అది మన మనస్సును చాలా చురుకుగా ఉంచుతుంది.నాగ్ సూచనలు→ చాలా మందికి, ఆ వ్యాయామాన్ని మానేయడానికి ఎప్పుడూ ఒక సాకు అందుబాటులో ఉంటుంది. అలా ఆలోచించొద్దు. ఫలితం కనిపించాలంటే సమయం, శ్రమ పెట్టాల్సిందే. వర్కవుట్ చేయడం వల్ల శారీరక లాభాలే కాదు అంతకు మించిన ప్రయోజనాలు ఉన్నాయి.→ మీ వ్యాయామాల మధ్య ఎక్కువ విశ్రాంతి తీసుకోకండి, కూర్చోవద్దు, వర్కవుట్ చేసే చోటుకి ఫోన్స్ తీసుకెళ్లవద్దు. ఏకాగ్రతతో మీ హార్ట్ బీట్ ఒక నిర్దిష్ట స్థాయి కంటే ఎక్కువగా ఉందని నిర్ధారించుకోండి. నేను నమ్ముతున్న (ఫిట్నెస్) మంత్రం స్థిరత్వం. మీ శరీరానికి ప్రతిరోజూ ఒక గంట నుంచి 45 నిమిషాల సమయం ఇస్తే సరిపోతుంది. నిద్ర (తగినంత) నీటితో ఎప్పుడూ హైడ్రేట్ చేయడం మర్చిపోవద్దు.→ మీరు 30 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మీ శరీరం ఏమి చేయగలదో అదే పని ఇప్పుడు చేయలేదు. దానికి అనుగుణంగా ఆహారంలో మార్పు చేర్పులు చేయాలి.–’ఆరోగ్యకరమైన అల్పాహారం, లంచ్ తినండి కానీ డిన్నర్‌తో జాగ్రత్తగా ఉండండి’ ఇది మీ ఆహారం జీవనశైలిని ట్రాక్ చేస్తుంది. చాలా మంది భారతీయులకు ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత డైరీ ఉత్పత్తులు నప్పవు. అలాగే బ్రెడ్, రోటీ తదితర కొన్నింటిలో కనిపించే గ్లూటెన్ కూడా. ఈ రెండూ, మీరు ఆపివేస్తే, సమస్యలు సగం పరిష్కారమవుతాయి. చాక్లెట్లు , స్వీట్స్ మాననక్కర్లేదు. అయితే మనకు ఇతర ఆరోగ్య సమస్యలు లేనప్పుడు వర్కవుట్ చేసినంత కాలం వాటి వల్ల నష్టం లేదు.→ షేప్‌ని పొందడానికి ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి ‘కొంతకాలం క్రితం ఒక శిక్షకుడు నాకు నేర్పించిన ఒక పాఠం.. అది కార్డియో లేదా శక్తి శిక్షణ అయినా, హృదయ స్పందనను మీ గరిష్ట రేటులో 70 శాతం కంటే ఎక్కువగా ఉంచుకోండి అనేది. అది రోజంతా మీ జీవక్రియను సమర్ధవంతంగా ఉంచుతుంది.చదవండి: స్నేహితుడు పోయిన దుఃఖంలో నటుడు.. 'ఆ వెధవ ఆత్మకు శాంతి అక్కర్లేదు
గేమ్ ఛేంజర్ టిక్కెట్ల విక్రయం...ఏ రాష్ట్రంలో ఎంతంటే...
చిత్రం విడుదలకు కేవలం ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలింది. రిలీజ్‌కు సంబంధించి కౌంట్‌డౌన్ ముగియనుంది. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత మరో అద్భుతమైన పాత్రలో తమ ఫేవరెట్ స్టార్‌ని చూడటానికి అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఏ పెద్ద స్టార్ సినిమా విడుదల ముందైనా సర్వసాధారణంగా జరిగేవే. అవన్నీ అలా ఉంచితే... ఇటీవల భారీ చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్లు బాగా చర్చకు నోచుకుంటున్నాయి. గత కొంత కాలంగా భారతీయ సినిమాలకు సంబంధించి హిట్స్, ఫ్లాప్స్ అన్నీ వసూళ్లతోనే ముడిపడడంతో ఈ పరిస్థితి వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్ గురించి కూడా సినిమా వర్గాల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. నిజానికి ఈ సినిమాకి భారీగా హైప్ వచ్చినప్పటికీ అడ్వాన్స్ టిక్కెట్ల విక్రయం ప్రకారం చూస్తే ఆశించిన స్థాయికి చేరుకోలేదనే చెప్పాలి. భారీ సంచలన చిత్రాల దర్శకుడు శంకర్, మెగా పవర్ స్టార్ ల కలయికే ఓ సెన్సేషన్ కావడంతో ఈ టాలీవుడ్ పొలిటికల్ థ్రిల్లర్ అందరి దృష్టినీ ఆకర్షించింది, అయితే కనపడుతున్న స్పందన మాత్రం అంచనాల కంటే చాలా తక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఈ సినిమా డైరెక్టరే అని పలువురు భావిస్తున్నారు. ఊహించిన దానికన్నా శంకర్ ప్రేక్షకుల్లో తన పట్ల ఆదరణ తగ్గించుకున్నాడని సినీ వర్గాలు అంటున్నాయి. అదే సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తోందని అభిప్రాయపడుతున్నాయి. నిజానికి ఒకప్పుడు శంకర్ అంటే పెద్ద బ్రాండ్, కానీ ఇటీవల ఈ డిఫరెంట్ సినిమాల ఫిల్మ్ మేకర్ తన క్రేజ్‌ను కోల్పోయాడు. అతని సినిమాలు గత కొంతకాలంగా దారుణంగా విఫలమవుతున్నాయి ఆయన చివరి సినిమా భారతీయుడు 2 ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో మనం చూశాం.కలెక్షన్లలో వ్యత్యాసం..చెబుతోంది అదే...సినిమా విడుదలకు మరో రోజు మిగిలి ఉండగా...గురువారం ఉదయం 10 గంటల నాటికి గేమ్ ఛేంజర్ 1వ రోజు మన దేశంలో దాదాపు 5 లక్షలకు పైగా టిక్కెట్‌లను విక్రయించిందని సమాచారం. మొత్తంగా అడ్వాన్స్ బుకింగ్ విలువ 14.83 కోట్ల గ్రాస్ (బ్లాక్ చేసిన సీట్లు మినహా)కు చేరింది. ఇప్పటివరకు దాదాపు 8,000 షోలు లిస్ట్ చేశారు. తర్వాత వాటి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.ఆంధ్రలో టాప్..తమిళనాడులో డ్రాప్...రాష్ట్రాల వారీగా చూస్తే టిక్కెట్ల విక్రయంలో ఆంధ్రప్రదేశ్ భారీ తేడాతో ముందంజలో ఉంది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే గేమ్ ఛేంజర్ మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 8.72 కోట్ల గ్రాస్ టిక్కెట్లను విక్రయించింది. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ 3.06 కోట్లు, కర్ణాటక 1 కోటి ఉన్నాయి. విశేషం ఏమిటంటే తమిళనాట ఇంకా 1 కోటి మార్కును సైతం ఈ సినిమా టచ్ చేయలేదు, విచిత్రంగా తమిళనాడుకు చెందిన టాప్ డైరెక్టర్ శంకర్ సినిమా అయినప్పటికీ అక్కడ ఈ పరిస్థితి ఉండడం షాకింగ్ అనే చెప్పాలి. శంకర్ పట్ల జనాదరణ ఎంతగా తరిగిపోయిందో చెప్పడానికి ఇదొక నిదర్శనంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.గుంటూరు కారం కన్నా..ఘాటు తక్కువే...రామ్ చరణ్ నటించిన సినిమా బుకింగ్స్ విలువ గురువారం ముగిసే సరికి 20 కోట్ల మార్క్‌ను చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు, కానీ అప్పటికీ ముందస్తు అంచనాలను ఇది అందుకోవడం లేదనే చెప్పాలి. ఇంత భారీ చిత్రంగా పేర్కొనని మహేష్ బాబు గుంటూరు కారం సినిమాను సైతం బీట్ చేయడంలో ఇది ఖచ్చితంగా విఫలమవుతుంది, గత సంక్రాంతి సందర్భంగా విడుదలైన గుంటూరు కారం మొదటి రోజు 24.90 కోట్ల గ్రాస్ టిక్కెట్లను విక్రయించింది.
థియేటర్లలో గేమ్ ఛేంజర్.. ఓటీటీల్లో ఏకంగా 7 చిత్రాలు రిలీజ్!
అప్పుడే సంక్రాంతి సీజన్ మొదలైంది. వరుసగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రానున్నాయి. అంతేకాకుండా ఈ శుక్రవారం నుంచే పొంగల్ సినిమాల సందడి స్టార్ట్ అయింది. థియేటర్లలో రామ్ చరణ్ గేమ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రెండు రోజుల గ్యాప్‌లో వరుసగా రిలీజ్ కానున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాలు పోటీపడనున్నాయి.అయితే ఈ సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసేందుకు మంచి సమయం. అందరికీ సెలవులు రావడం, పండుగ వాతావరణంలో కుటుంబంతో మూవీని వీక్షించడం మంచి ఎక్స్పీరియన్స్. అందుకే ఈ సంక్రాంతికి మీకోసం సరికొత్త కంటెంట్ అందించేందుకు ఓటీటీలు సిద్ధమయ్యాయి. థియేటర్లలో వచ్చే చిత్రాలపై బజ్ ఉన్నప్పటికీ.. అందరికీ వీలుపడదు. ఎంచక్కా ఇంట్లోనే కుటుంబంతో కలిసి సినిమాలు చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు.ఈ సంక్రాంతికి తెలుగు చిత్రం హైడ్ అండ్ సీక్ ఓటీటీకి రానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో విశ్వంత్, శిల్పా మంజునాథ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు బసిరెడ్డి రానా దర్శకత్వం వహించారు. ఈ మూవీ జనవరి 10 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు బాలీవుడ్ నుంచి విక్రాంత్ మాస్సే నటించిన సబర్మతి రిపోర్ట్, విక్రమాదిత్య మోత్వానే డైరెక్షన్లో తెరకెక్కించిన బ్లాక్ వారెంట్ అనే మరో మూవీ ఓటీటీకి రానున్నాయి. దీంతో ఈ శుక్రవారం ఒక్కరోజే దాదాపు 7 చిత్రాలు రానున్నాయి. థియేటర్లలో గేమ్ ఛేంజర్, సోనూ సూద్ ఫతే సందడి చేయనున్నాయి. ఏయే మూవీ ఏ ఓటీటీలో రానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.ఈ శుక్రవారం ఓటీటీ, థియేటర్ చిత్రాలు..థియేటర్స్..గేమ్ ఛేంజర్(తెలుగు సినిమా)-జనవరి 10ఫతే(హిందీ సినిమా)-జనవరి 10ఓటీటీ సినిమాలు..నెట్ఫ్లిక్స్యాడ్ విటమ్- జనవరి 10బ్లాక్ వారెంట్ -జనవరి 10ఆల్ఫా మేల్స్ సీజన్ 3- జనవరి 10డిస్నీ+ హాట్స్టార్గూస్బంప్స్: ది వానిషింగ్ -జనవరి 10జీ5సబర్మతి రిపోర్ట్- జనవరి 10ఆహాహైడ్ అండ్ సీక్- జనవరి 10 హోయ్చోయ్నిఖోజ్- సీజన్ 2-(బెంగాలీ వెబ్ సిరీస్) జనవరి 10
స్నేహితుడు పోయిన దుఃఖంలో నటుడు.. 'ఆ వెధవ ఆత్మకు శాంతి దొరక్కూడదు'
ప్రముఖ నిర్మాత ప్రతీశ్ నంది (73) బుధవారం కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. సినీ ఇండస్ట్రీలో అనేక సినిమాలు నిర్మించిన ఈయన ఒకప్పుడు ప్రముఖ జర్నలిస్టు కూడా! ప్రతీశ్ మరణం పట్ల ఆయన స్నేహితుడు, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.స్నేహితుడి మరణం బాధాకరంనా ప్రియమైన మిత్రుడు ప్రితీశ్ (Pritish Nandy) మరణవార్త నన్నెంతగానో కలిచివేసింది. అద్భుతమైన కవి, రచయిత, నిర్మాత.. అలాగే ధైర్యవంతుడైన జర్నలిస్ట్ కూడా! ముంబైలో అడుగుపెట్టిన కొత్తలో నాకెంతో సపోర్ట్‌గా నిలబడ్డాడు. మేము ఎన్నో విషయాలను పంచుకునేవాళ్లం. దేనికీ జంకకుండా ఎంతో ధైర్యంగా ఉండేవాడు. తన దగ్గరి నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. మిస్ అవుతున్నా..ఒకప్పుడు తను, నేను వేరు కాదు అన్నట్లుగా ఉండేవాళ్లం. కానీ రానురానూ కలుసుకోవడమే తగ్గిపోయింది. మనం కలిసున్న రోజుల్ని మిస్ అవుతున్నా.. నిన్ను కూడా ఎంతో మిస్ అవుతున్నా ఫ్రెండ్.. ఎక్కడున్నా నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ గుండె ముక్కలైన ఎమోజీతో ఈ పోస్ట్‌ను షేర్ చేశాడు. అనుపమ్ ఖేర్ (Anupam Kher).. ప్రతీశ్ను అంతలా పొగడం నటి నీనా గుప్తాకు ఏమాత్రం నచ్చినట్లు లేదు. (చదవండి: నేను చేసిన పెద్ద తప్పు అదే!: కంగనా రనౌత్)బుద్ధి తక్కువ వెధవనా విషయంలో అతడేం చేశాడో తెలుసా? తను చేసిన పనికి ఆగ్రహం పట్టలేక అందరిముందే అతడిని బుద్ధి తక్కువ వెధవ అని తిట్టాను. నా బిడ్డ బర్త్ సర్టిఫికెట్ దొంగిలించి దాన్ని మీడియాలో పబ్లిష్ చేశాడు. ఇందుకు సంబంధించిన సాక్ష్యం ఇప్పటికీ నా దగ్గరుంది. అందుకే అతడి ఆత్మకు శాంతి దొరకాలని నేను కోరుకోను అని కామెంట్ చేసింది. అయితే తర్వాత ఆ కామెంట్‌ను నీనా (Neena Gupta) డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.ఆమె అనుమతి లేకుండా దొంగిలించి మరీ..ఇకపోతే ప్రితీశ్ నంది జర్నలిస్టుగా ఉన్న సమయంలో నీనా గుప్తా కూతురు మసాబా బర్త్ సర్టిఫికెట్ దొంగిలించి సమాచారం లీక్ చేశాడు. దీని ఆధారంగా నీనా- క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ సంతానమే మసాబా అని జనాలకు తెలిసిపోయింది. పెళ్లితో సంబంధం లేకుండా వీరిద్దరూ రిలేషన్లో ఉన్నప్పుడే మసాబాకు పేరెంట్స్ అయ్యారని విస్తృతమైన చర్చ జరిగింది.ప్రితీశ్ నంది విషయానికి వస్తే..కుచ్ కట్టి కుచ్ మీఠి, బాలీవుడ్ కాలింగ్, ముంబై మ్యాట్నీ, చమేలి, జస్ట్ మ్యారీడ్, ధీమె ధీమె, ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, అగ్లీ ఔర్ పాగ్లీ, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ వంటి చిత్రాలను ప్రితీశ్ నిర్మించారు. జర్నలిస్టుగానూ పలు సంస్థల్లో పని చేశారు. 1977లో పద్మశ్రీ, 2008లో కర్మవీర్ పురస్కార్, 2012లో ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ అవార్డులు అందుకున్నారు. View this post on Instagram A post shared by Anupam Kher (@anupampkher) చదవండి: Game Changer: ‘గేమ్ ఛేంజర్’ని వదలని సినిమా కష్టాలు!
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు
మెరుపు అర్ద శతకం.. మ్యాక్స్‌వెల్ ఖాతాలో భారీ రికార్డు
బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఓ భారీ రికార్డును సాధించాడు. లీగ్ చరిత్రలో 3000 పరుగుల మార్కును దాటిన ఆరో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. బీబీఎల్ 2024-25లో భాగంగా సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ ఈ అరుదైన ఘనత సాధించాడు. మ్యాక్సీకి ముందు క్రిస్ లిన్, ఆరోన్ ఫించ్, డిఆర్కీ షార్ట్, మోసెస్ హెన్రిక్స్, జాన్ వెల్స్ మాత్రమే బీబీఎల్‌లో 3000 పరుగుల మైలురాయిని తాకారు. సిడ్నీ సిక్సర్స్‌తో మ్యాచ్‌లో మెరుపు అర్ద శతకం బాదిన మ్యాక్సీ.. బీబీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వెల్స్, హెన్రిక్స్లను అధిగమించాడు.బిగ్‌బాష్ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్స్..క్రిస్ లిన్-3908ఆరోన్ ఫించ్-3311డిఆర్కీ షార్ట్-3102గ్లెన్ మ్యాక్స్‌వెల్-3047మోసెస్ హెన్రిక్స్-3035మ్యాక్సీ మెరుపు అర్ద శతకంసిడ్నీ సిక్సర్స్‌తో మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ మెరుపు అర్ద శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను 32 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 58 పరుగులు చేశాడు. ఫలితంగా మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. మెల్బోర్న్ ఇన్నింగ్స్‌లో బ్యూ వెబ్‌స్టర్ (48) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. బెన్ డకెట్ (20), డాన్ లారెన్స్ (14) రెండంకెల స్కోర్లు చేశారు. సామ్ హార్పర్ (4), కెప్టెన్ మార్కస్ స్టోయినిస్ (4) విఫలమయ్యారు. సిక్సర్స్ బౌలర్లలో సీన్ అబాట్ మూడు వికెట్లు పడగొట్టగా.. జాక్ ఎడ్వర్డ్స్, హేడెన్ కెర్ తలో వికెట్ దక్కించుకున్నారు.19వ హాఫ్ సెంచరీఈ మ్యాచ్‌లో మ్యాక్సీ చేసిన హాఫ్ సెంచరీ బీబీఎల్‌లో అతనికి 19వది. ఓవరాల్‌గా అతను టీ20ల్లో 55 అర్ద శతకాలు సాధించాడు. టీ20 కెరీర్లో 427 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్స్‌వెల్ 154 స్ట్రయిక్‌రేట్‌తో 28 సగటున 10,183 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు ఉన్నాయి. ఆసీస్ తరఫున 133 అంతర్జాతీయ టీ20లు ఆడిన మ్యాక్సీ ఐదు సెంచరీల సాయంతో 2664 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మ్యాక్స్‌వెల్ 16వ స్థానంలో ఉన్నాడు.చిత్తుగా ఓడిన సిక్సర్స్157 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 17 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మార్క్ స్టీకిటీ (3/14), పీటర్ సిడిల్ (2/26), మార్కస్ స్టోయినిస్ (2/30), ఉసామా మిర్ (2/19) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి మెల్బోర్న్ స్టార్స్‌ను గెలిపించారు. సిక్సర్స్ ఇన్నింగ్స్‌లో జేమ్స్ విన్స్ (53) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మిగిలిన ఆటగాళ్లంతా విఫలమయ్యారు. కర్టిస్ ప్యాటర్సన్ (18), హేడెన్ కెర్ (21), మోసెస్ హెన్రిక్స్ (13) రెండంకెల స్కోర్లు చేశారు.
‘కొన్‌స్టాస్ పది టెస్టులు కూడా ఆడలేడు.. అతడి బలహీనత అదే!’
ఆస్ట్రేలియా యువ సంచలనం సామ్ కొన్‌స్టాస్(Sam Konstas) భవిష్యత్తుపై ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హార్మిన్సన్(Steve Harminson) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ టీనేజర్ పట్టుమని పది టెస్టులు కూడా ఆడలేడని పేర్కొన్నాడు. కాగా డేవిడ్ వార్నర్(David Warner) రిటైర్మెంట్ తర్వాత ఆసీస్ ఓపెనింగ్ స్థానంలో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసే క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా తొలుత నాథన్ మెక్‌స్వీనీ వైపు మొగ్గుచూపింది.మెక్‌స్వీనీపై వేటు.. టీనేజర్‌కు పిలుపుటీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా అతడిని జట్టుకు ఎంపిక చేసింది. అయితే, ఓపెనర్‌గా 25 ఏళ్ల మెక్‌స్వీనీ పూర్తిగా విఫలమయ్యాడు. పెర్త్ టెస్టులో అరంగేట్రం చేసిన అతడు రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 10, 0 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో(39, 10 నాటౌట్)నూ పెద్దగా రాణించలేకపోయాడు. మూడో టెస్టులో(9, 4)నూ పూర్తిగా విఫలమయ్యాడు.అరంగేట్రంలోనే అర్ధ శతకంఈ క్రమంలో మెక్‌స్వీనీపై వేటు వేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. 19 ఏళ్ల కుర్రాడైన సామ్ కొన్‌స్టాస్‌ను భారత్‌తో మిగిలిన రెండు టెస్టులకు ఎంపిక చేసింది. మెల్బోర్న్ టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కొన్‌స్టాస్.. అరంగేట్రంలోనే అర్ధ శతకం(60)తో దుమ్ములేపాడు. సిడ్నీలోనూ రాణించిన ఈ కుడిచేతివాటం బ్యాటర్.. మొత్తంగా రెండు టెస్టుల్లో కలిపి 113 పరుగులు సాధించాడు.కోహ్లి, బుమ్రాలతో గొడవఇక బ్యాట్ ఝులిపించడమే కాకుండా.. టీమిండియా సూపర్స్టార్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాలతో గొడవ ద్వారా కూడా కొన్‌స్టాస్ మరింత ఫేమస్ అయ్యాడు. తదుపరి శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడనున్న పదహారు మంది సభ్యుల ఆసీస్ జట్టులోనూ అతడు స్థానం సంపాదించాడు.డిఫెన్సివ్ టెక్నిక్ లేదుఈ నేపథ్యంలో స్టీవ్ హార్మిన్సన్ మాట్లాడుతూ.. ‘‘నాకైతే కొన్‌స్టాస్ కనీసం పది టెస్టులు కూడా ఆడలేడని అనిపిస్తోంది. అలా అని అతడి భవిష్యత్తుపై నేనిప్పుడే తీర్పునిచ్చేయడం లేదు. కానీ.. ఈ పిల్లాడు గనుక ఒక్కసారి లయ అందుకుంటే సూపర్‌స్టార్ స్థాయికి ఎదగగలడు. ఇండియాతో సిరీస్‌లో అతడు ర్యాంప్ షాట్లు, స్కూప్ షాట్లు ఆడాడు.కానీ.. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుతో తలపడుతున్నపుడు వికెట్ కాపాడుకోవాల్సిన అంశంపై మాత్రం దృష్టి పెట్టలేదు. టెస్టుల్లో ఓపెనర్‌గా రాణించాలంటే డిఫెన్సివ్ టెక్నిక్ ముఖ్యమైనది. అయితే, కొన్‌స్టాస్ ఈ విషయంలో బలహీనంగా ఉన్నాడు.మరో డేవిడ్ వార్నర్ కావాలని కొన్‌స్టాస్ భావిస్తున్నట్లున్నాడు. అయితే, ఈ టీనేజర్‌కు వార్నర్‌కు ఉన్న టెక్నిక్‌లు లేవు. ఏదేమైనా ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో కొన్‌స్టాస్ ఆడితే నాకూ సంతోషమే’’ అని పేర్కొన్నాడు. కాగా కొన్‌స్టాస్‌పై హార్మిన్సన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.ఆస్ట్రేలియాదే బోర్డర్- గావస్కర్ ట్రోఫీప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా సొంతగడ్డపై టీమిండియాను 3-1తో ఓడించింది. తద్వారా దశాబ్ద కాలం తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అంతేకాదు.. ఈ సిరీస్ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు కూడా అర్హత సాధించింది.డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ మెగా మ్యాచ్ బరిలో దిగనున్న కమిన్స్ బృందం.. టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఇక డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో ఆఖరిగా శ్రీలంకతో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. చదవండి: IND vs ENG: విరాట్ కోహ్లి కీలక నిర్ణయం
పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ
స్వదేశంలో వెస్డిండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యువ వికెట్‌కీపర్ బ్యాటర్ హసీబుల్లా ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్స్ సందర్భంగా హసీబుల్లా ఖాన్ గాయపడినట్లు పాక్ మీడియా తెలిపింది. 21 ఏళ్ల హసీబుల్లా ఖాన్ విండీస్‌తో టెస్ట్ సిరీస్‌లో మహ్మద్ రిజ్వాన్‌తో పాటు వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్‌గా ఎంపిక కావాల్సి ఉండింది. అయితే ఊహించని గాయం టెస్ట్ అరంగేట్రం చేయాలనుకున్న హసీబుల్లా ఆశలపై నీళ్లు చల్లింది. హసీబ్ గతేడాదే వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. హసీబ్ గాయపడటంతో విండీస్‌తో సిరీస్‌లో పాక్ రిజ్వాన్‌పైనే పూర్తిగా ఆధార పడాల్సి ఉంటుంది. విండీస్‌తో సిరీస్ కోసం పాక్ జట్టును త్వరలోనే ప్రకటిస్తారు.అందుబాటులో ఉండని స్టార్ బ్యాటర్పాక్ ఇటీవలే ఓ కీలక బ్యాటర్ సేవలు కోల్పోయింది. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ సందర్భంగా ఆ జట్టు స్టార్ ఓపెనర్ సైమ్ అయూబ్ తీవ్రంగా గాయపడ్డాడు. సైమ్‌కు ఆరు వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. దీంతో సైమ్ విండీస్‌తో సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదు.జనవరి 17 నుంచి ప్రారంభంవిండీస్తో తొలి టెస్ట్ జనవరి 17 నుంచి ప్రారంభమవుతుంది. ముల్తాన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. దీనికి ముందు విండీస్ పాక్-ఏతో రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ జనవరి 10, 11 తేదీల్లో జరుగుతుంది. జనవరి 25 నుంచి 29 తేదీల మధ్యలో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు కూడా ముల్తానే ఆతిథ్యమివ్వనుంది.18 ఏళ్ల విరామం తర్వాత..18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విండీస్ పాక్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడనుంది. దీంతో ఈ సిరీస్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.డబ్ల్యూటీసీ 2023-25లో చివరిదిపాకిస్తాన్ క్రికెట్ జట్టుకు విండీస్‌తో సిరీస్ డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో చివరిది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్, విండీస్ చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇరు జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి ఎప్పుడో బయటకు వచ్చాయి.కాగా, పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇటీవలే సౌతాఫ్రికా గడ్డపై ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను పాక్ 0-2 తేడాతో కోల్పోయింది.రెండు రోజుల వార్మప్ మ్యాచ్ కోసం పాక్-ఏ జట్టు..ఇమామ్ ఉల్ హాక్ (కెప్టెన్), మొహమ్మద్ హురైరా, ఒమైర్ యూసఫ్, అలీ జర్యాబ్, సాద్ ఖాన్, కషిఫ్ అలీ, మొహమ్మద్ సులేమాన్, హుసేన్ తలాత్, హసీబుల్లా ఖాన్ (వికెట్‌కీపర్), రొహైల్ నజీర్ (వికెట్‌కీపర్), ముహమ్మద్ మూసా, మొహమ్మద్ రమీజ్ జూనియర్పాకిస్తాన్తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు..క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, మిఖైల్ లూయిస్, కీసీ కార్టీ, జస్టిన్ గ్రీవ్స్, గుడకేశ్ మోటీ, జాషువ డ సిల్వ, తెవిన్ ఇమ్లాచ్, అమిర్ జాంగూ, ఆండర్సన్ ఫిలిప్, జోమెల్ వార్రికన్, కెవిన్ సింక్లెయిర్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్
టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే!
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)పై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)లో ఈ రైటార్మ్ బౌలర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడని కొనియాడాడు. కెప్టెన్‌గానూ బుమ్రా జట్టును ముందుకు నడిపించిన తీరు తనను ఆకట్టుకుందన్నాడు. ఆటగాళ్లపై ఒత్తిడి పడకుండా పరిణతి గల నాయకుడిగా మెప్పించాడని పేర్కొన్నాడు.ఇటు బౌలర్‌గా.. అటు కెప్టెన్‌గా రాణించికాగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పితృత్వ సెలవుల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో వైస్ కెప్టెన్ బుమ్రా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఇటు బౌలర్‌గా.. అటు కెప్టెన్‌గా రాణించి పెర్త్‌లో టీమిండియాకు 295 పరుగుల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం అందించాడు.వెన్నునొప్పి వేధిస్తున్నాఆ తర్వాత మరో మూడు టెస్టులకు సారథిగా వ్యవహరించిన రోహిత్ శర్మ.. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా వైఫల్యం చెందినందున ఆఖరి టెస్టు నుంచి తప్పుకొన్నాడు. జట్టు ప్రయోజనాల కోసం విశ్రాంతి పేరిట తానే స్వయంగా దూరంగా ఉన్నాడు. ఫలితంగా మరోసారి పగ్గాలు బుమ్రా చేతికి వచ్చాయి. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్‌లో జట్టును గెలిపించేందుకు అతడు గట్టిగానే శ్రమించాడు.పేస్ దళ భారాన్ని మొత్తం తానే మోశాడు. ఈ క్రమంలో వెన్నునొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లి వచ్చి మరీ బరిలోకి దిగాడు. అయినప్పటికీ సిడ్నీలో ఓటమిపాలైన టీమిండియా 1-3తో ఓటమిపాలై.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని ఆసీస్‌కు చేజార్చుకుంది. అయితే, జట్టు ప్రదర్శన ఎలా ఉన్నా బుమ్రాకు మాత్రం ఈ టూర్లో మంచి మార్కులే పడ్డాయి. ఐదు టెస్టుల్లో కలిపి మొత్తం 32 వికెట్లు పడగొట్టిన ఈ రైటార్మ్ పేసర్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.నాయకుడిగా మంచి పేరుఈ పరిణామాల నేపథ్యంలో సునిల్ గావస్కర్ బుమ్రాను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే!.. నా అభిప్రాయం ప్రకారం కచ్చితంగా అతడే పగ్గాలు చేపడతాడు. జట్టును ముందుండి నడిపించడంలో బుమ్రా తనకంటూ ప్రత్యేకశైలిని ఏర్పరచుకున్నాడు.నాయకుడిగా అతడికి మంచి పేరు వచ్చింది. సారథిగా ఉన్నా సహచర ఆటగాళ్లపై ఒత్తిడి పెంచేరకం కాదు. కొన్నిసార్లు కెప్టెన్లు తామే ఒత్తిడిలో కూరుకుపోయి.. పక్కవాళ్లనూ అందులోకి నెట్టేస్తారు. కానీ బుమ్రా ఏ దశలోనూ అలా చేయలేదు. తనపని తాను చేసుకుంటూనే.. జట్టులో ఎవరి విధి ఏమిటో అర్థమయ్యేలా చక్కగా తెలియజెప్పాడు.నిజంగా అతడొక అద్భుతంఈ క్రమంలో ఎవరిపైనా అతడు ఒత్తిడి పెట్టలేదు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లను డీల్ చేసిన విధానం బాగుంది. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన కనబరుస్తూనే.. సహచరులకు అన్ని వేళలా మార్గదర్శనం చేశాడు. నిజంగా అతడొక అద్భుతం. అందుకే టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ అతడే అని నేను బలంగా నమ్ముతున్నాను’’ అని గావస్కర్ 7క్రికెట్‌తో పేర్కొన్నాడు.కాగా ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర ఓటమిని చవిచూసిన టీమిండియా.. తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, గాయం కారణంగా బుమ్రా ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19న మొదలయ్యే చాంపియన్స్ ట్రోఫీ నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.చదవండి: ‘గంభీర్ ఒక మోసగాడు.. గెలిస్తే క్రెడిట్ నాదే అంటాడు.. కానీ’
బిజినెస్
టాటా బోర్డులో ఇద్దరు వారసురాళ్లకు చోటు
సర్ రతన్ టాటా ఇండస్ట్రియల్ ఇనిస్టిట్యూట్ (SRTII) ట్రస్టీల బోర్డులో టాటా ట్రస్ట్ చైర్మన్ నోయెల్ టాటా కుమార్తెలు మాయ, లేహ్ నియమితులయ్యారు. వీరిరువురు అర్నాజ్ కొత్వాల్, ఫ్రెడ్డీ తలతి స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.మాయ, లేహ్ టాటాల నియామకం అర్నాజ్ కొత్వాల్‌తో అంతర్గత విభేదాలకు దారితీసింది. టాటా ట్రస్ట్స్‌లో ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న 'తారాపోరేవాలా'కు పంపిన ఈమెయిల్‌లో, నోయెల్ టాటా పట్టుబట్టడంతో.. అతను కోరినట్లుగా ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమస్యకు సంబంధించి సర్ దొరాబ్జీ.. టాటా ట్రస్ట్ అండ్ సర్ రతన్ టాటా ట్రస్ట్ ట్రస్టీ అయిన మెహ్లీ మిస్త్రీ నుంచి కూడా తనకు కాల్ వచ్చిందని కూడా ఆమె పేర్కొన్నారు. దీనిపై టాటా ట్రస్ట్‌లు స్పందించ లేదు.SRTII అనేది సర్ రతన్ టాటా ట్రస్ట్ యూనిట్, ఇది మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పనిచేస్తోంది. రతన్ టాటా మరణానంతరం అక్టోబర్‌లో టాటా ట్రస్ట్‌ల ఛైర్మన్‌గా నియమితులైన నోయెల్ టాటాకు.. లేహ్ (39), మాయ (36), నెవిల్లే (32) ముగ్గురు పిల్లలు. వీరు టాటా ట్రస్ట్‌లలో ఇప్పటికే వివిధ బాధ్యతలను నిర్వర్తించారు.లేహ్ టాటాలేహ్ టాటా.. ఇండియన్ హోటల్స్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్. అంతే కాకుండా ఈమె గేట్‌వే హోటల్స్ బ్రాండ్‌ను నిర్వహిస్తోంది. టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్, టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, జేఆర్డీ అండ్ థెల్మా జే టాటా ట్రస్ట్ బోర్డులలో కూడా ఉన్నారు.మాయ టాటామాయా టాటా.. టాటా క్యాపిటల్‌లోని ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్, టాటా ఆపర్చునిటీస్ ఫండ్‌లో తన వృత్తిని ప్రారంభించింది. ఆమె టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, ఆర్‌డీ టాటా ట్రస్ట్ మరియు జెఆర్‌డి మరియు థెల్మా జే టాటా ట్రస్ట్ బోర్డులలో పని చేస్తున్నారు.నెవిల్లే టాటానెవిల్లే టాటా గత సంవత్సరం టాటా గ్రూప్ రిటైల్ వ్యాపారాలను కలిగి ఉన్న ట్రెంట్ హైపర్ మార్కెట్ యూనిట్.. స్టార్ బజార్ అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. అతను టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్, జేఆర్డీ టాటా ట్రస్ట్ అండ్ ఆర్డీ టాటా ట్రస్ట్ బోర్డులలో ఉన్నారు.నోయల్ టాటాదివంగత పారిశ్రామిక దిగ్గజం.. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా వారసుడిగా 'నోయల్ టాటా' ఇప్పటికే నియమితులయ్యారు. అయితే ఆయన టాటా సన్స్ బోర్డులో కూడా అడుగుపెట్టారు. 2011 తర్వాత టాటా సన్స్, టాటా ట్రస్ట్ బోర్డులు రెండింటిలోనూ టాటా కుటుంబ సభ్యుడు స్థానం పొందడం ఇదే మొదటిసారి. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది.ఇదీ చదవండి: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఆలస్యమైతే రోజుకు రూ.100టాటా సన్స్‌లో 66 శాతం వాటాను కలిగి ఉన్న టాటా ట్రస్ట్స్, ఇప్పుడు నోయెల్ టాటా సారథ్యంలో ముందుకు సాగుతుంది. నోయెల్ టాటా సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డులలో కూడా పనిచేస్తున్నారు. ఉప్పు నుంచి టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లో టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఇప్పటి వరకు నోయల్ టాటా.. టీటా గ్రూపుకు చెందిన రిటైల్ బిజినెస్ చూసుకున్నారు. ఇప్పుడు టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు.
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450 లాంచ్: ధర ఎంతంటే?
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) మార్కెట్లో 'ఈక్యూఎస్ 450' (EQS 450) లాంచ్ చేసింది. దీని ధర ఇప్పటికే అమ్మకానికి అందుబాటులో ఉన్న ఈక్యూఎస్ కంటే తక్కువ. ఇది 5 సీటర్ మోడల్.. కేవలం సింగిల్ మోటార్ సెటప్‌తో వస్తుంది. ఈ కారు డెలివరీలు ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.రూ. 1.28 కోట్ల ధర వద్ద లాంచ్ అయిన కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450 చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఈ కారు రేంజ్ కూడా దాని 580 మోడల్ కంటే 11 కిమీ కంటే ఎక్కువ. రేంజ్ కొంత ఎక్కువ ఉంది కాబట్టి మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450 ఎలక్ట్రిక్ కారు.. ముందు బంపర్, అల్లాయ్ వీల్స్ వంటి వాటిలో కొన్ని చిన్న మార్పులు చూడవచ్చు. ఇంటీరియర్ కూడా కొంత అప్డేట్స్ పొందుతుంది. ఇందులో MBUX హైపర్‌స్క్రీన్ చూడవచ్చు. లోపల గమనించాల్సిన అతిపెద్ద మార్పు మూడో వరుస సీట్లు లేకపోవడం. అయితే రెండవ వరుస సీట్లు పవర్ అడ్జస్టబుల్గా కొనసాగుతాయి. ఎక్కువ సౌలభ్యం కోసం స్లైడ్ అండ్ రిక్లైన్ రెండూ చేయవచ్చు.ఈ కొత్త లగ్జరీ కారులో 360 డిగ్రీ కెమెరా, ఎయిర్ వెంట్స్, 4 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సాఫ్ట్ క్లోజ్ డోర్లు, పుడ్ ల్యాంప్స్, ఇల్యూమినేటెడ్ రన్నింగ్ బోర్డ్‌లతో పాటు లెవల్ 2 ఏడీఏఎస్, తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు మొదలైనవి ఉన్నాయి.బెంజ్ ఈక్యూఎస్ 450 ఎలక్ట్రిక్ కారు వెనుక యాక్సిల్‌పై సింగిల్ మోటార్ సెటప్ ఉంటుంది. ఇది 355 Bhp పవర్, 800 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారు 6.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేహవంతం అవుతుంది. ఇందులోని 122 కిలోవాట్ బ్యాటరీ.. సింగిల్ ఛార్జీతో 671 కిమీ రేంజ్ అందిస్తుంది.ఇదీ చదవండి: భారత్‌లోని బెస్ట్ డీజిల్ కార్లు.. ధర కూడా తక్కువే!ఈక్యూఎస్ 450 ఎలక్ట్రిక్ కారు 200 కేడబ్ల్యు డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేయడానికి 31 నిమిషాల సమయం పడుతుంది. అయితే 22 కేడబ్ల్యు వాల్ ఛార్జర్ ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి పట్టే సమయం 6.25 గంటలు. ఈ కారు డెలివరీలు కూడా ఫిబ్రవరిలోనే జరుగుతాయి.ఇండియన్ మార్కెట్లో బెంజ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ.. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ లాంచ్ చేస్తోంది. ఇందులో భాగంగానే మెర్సిడెస్ బెంజ్ జీ క్లాస్ ఎలక్ట్రిక్ కారును కూడా లాంచ్ చేసింది. దీని ధర రూ. 3 కోట్ల కంటే ఎక్కువ. ఇది ఒక సింగిల్ చార్జితో 473 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.
మీ ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డులున్నాయి? ఇలా తెలుసుకోండి
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో.. సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. డిజిటల్ ప్రపంచంలో ఎంత తెలిసినవారైనా తప్పకుండా మోసపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే సిమ్ కార్డును కొనుగోలు చేసే సమయంలో తప్పకుండా చెల్లుబాటు అయ్యే చిరునామా, గుర్తింపు రుజువు అవసరం. దీనికి ఆధార్ కార్డును ఉపయోగిస్తారు. ఈ ఆధారాలను ఉపయోగించి కొందరు ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్నారు.ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న సమయంలో.. ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి సిమ్ కార్డు ఆధార్ కార్డ్‌కు లింక్ అయి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నిర్దేశించిన నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి పేరుతో తొమ్మిది సిమ్ కార్డులను తీసుకోవచ్చు.ఆర్ధిక నేరాలను తగ్గించడానికి.. ఆధార్ సమాచారాన్ని దుర్వినియోగం కాకుండా చూడటానికి, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ (DoT) టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAF-COP) అనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా మీ ఆధార్ కార్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు లేదా ఫోన్ నెంబర్లు లింక్ అయ్యాయో తెలుసుకోవచ్చు.ఆధార్ కార్డుకు ఎన్ని సిమ్ కార్డ్‌లు లింక్ అయ్యాయో చెక్ చేయడం ఎలా?సంచార్ సతి అధికారిక వెబ్సైట్ (www.sancharsaathi.gov.in) ఓపెన్ చేయాలి.వెబ్‌సైట్‌ను కిందికి స్క్రోల్ చేస్తే.. సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కనిపిస్తుంది. దానికి కింద మొబైల్ కనెక్షన్లను చూడటానికి ఆప్షన్ ఎంచుకోవాలి.మొబైల్ కనెక్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తరువాత.. మీకు మరో పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ మీ 10 అంకెల మొబైల్ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.దానికి కింద అక్కడ కనిపించే క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత మీ ఫోన్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.ఓటీపీ ఎంటర్ చేసిం తరువాత మీ ఆధార్ కార్డ్‌కి ఎన్ని నెంబర్స్ లింక్ అయ్యాయో డిస్ప్లే మీద కనిపిస్తాయి.అక్కడ మీరు అనవసరమైన నెంబర్లను బ్లాక్ చేసుకోవచ్చు.సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చే ఆఫర్లకు ఆకర్షితులై ఒక్కొక్కరు నాలుగైదు సిమ్ కార్డులు కొనేసి.. వినియోగించిన తరువాత పడేస్తుంటారు. ఇలాంటి నెంబర్లను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో విజయవాడకు చెందిన ఒకే వ్యక్తి కార్డుతో 658 సిమ్ కార్డులు యాక్టివేట్ అయినట్లు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. టెలికామ్ అధికారులు వీటిని మొత్తం బ్లాక్ చేశారు.ఇదీ చదవండి: అకౌంట్లోకి రూ.5000.. క్లిక్ చేస్తే అంతా ఖాళీ!సిమ్ కార్డులను ఉపయోగించిన తరువాత, ఎక్కడపడితే అక్కడ పడేయడం మంచిది కాదు. వాటిని కొంతమంది మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశం ఉంది. అంతే కాకుండా మీ ఆధార్ కార్డు లేదా ఇతర డాక్యుమెంట్స్ ఉపయోగించే తెలియనివారికి ఎట్టిపరిస్థితుల్లో సిమ్ కార్డులను కొనుగోలు చేసి ఇవ్వొద్దు. వారు ఏదైనా నేరాలకు పాల్పడితే.. దాని ప్రభావం మీ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఆలస్యమైతే రోజుకు రూ.100
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులు కస్టమర్లకు త్వరితగతిన సేవలు అందించాలని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వినియోగదారులకు అందించాల్సిన సేవలలో ఏ మాత్రం ఆలస్యం జరిగిన జరిమానా తప్పదని వెల్లడించింది.బ్యాంకులు లేదా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు కస్టమర్లకు అందించే సేవలలో ఎక్కువ ఆలస్యం చేస్తున్నాయని ఆర్‌బీఐ ఫిర్యాదులు అందుకుంది. దీంతో కొత్త ఆదేశాలను జారీ చేస్తూ.. నెల రోజులు లేదా 30 రోజుల లోపల వినియోగదారుల సమస్యలు పరిష్కారం కాకపోతే, రోజుకు 100 రూపాయలు జరిమానా విధిస్తామని వెల్లడించింది. ఈ డబ్బు వినియోగదారునికే పరిహారం రూపంలో అందించడం జరుగుతుంది.వినియోగదారుల క్రెడిట్ సమాచారాన్ని బ్యాంక్ లేదా ఆర్ధిక సంస్థ పొందినట్లయితే.. దానిని వారికి ఈమెయిల్ లేదా ఎస్ఎమ్ఎస్ రూపంలో తెలియజేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అంతే కాకుండా ఖాతాదారుడు డిఫాల్ట్‌గా లోన్ చెల్లించకుండా ఉంటే ఆ విషయాన్ని కూడా బ్యాంకులు తెలియజేయాలి. ఈ విషయాన్ని 21 రోజులలోపు తెలియజేయకపోతే.. వినియోగదారునికి రోజుకి 100 రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నియమం ఆర్ధిక సంస్థలకు కూడా వర్తిస్తుంది.ప్రస్తుతం భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాచే అధికారం పొందిన నాలుగు సీఐసీలు ఉన్నాయి. అవి సిబిల్, సీఆర్ఐఎఫ్, ఈక్విఫాక్స్, ఎక్స్‌పీరియన్. ఇవి కూడా వినియోగదారుల సమస్యలను 30 రోజుల్లో పరిష్కరించాలి లేదా ఫిర్యాదుకు సంబంధించిన అప్డేట్ కస్టమర్‌కు తెలియజేయాలి. ఇచ్చిన ఫిర్యాదును తిరస్కరించినట్లయితే.. దానికి కారణం కూడా చెప్పాలని ఆర్‌బీఐ ఆదేశించింది.ఆర్‌బీఐ నిర్ణయం వెనుక ఉద్దేశ్యంవినియోగదారులు లేదా ఖాతాదారులు ఏదైనా సమస్యను పరిష్కరించాలనుకుంటే.. రోజుల తరబడి బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్థల చుట్టూ పదే పదే తిరగాల్సి ఉండేది. దీనిని దృష్టిలో ఉంచుకుని, దేశంలోని అన్ని బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు వినియోగదారులకు వేగవంతమైన సేవలను అందించాలని.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఏటీఎంల గురించి ఆర్‌బీఐనగదు సర్క్యులేషన్ రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ.. భారతీయ బ్యాంకులు ఏటీఎంలను, క్యాష్ రీసైక్లర్‌లను క్రమంగా తగ్గించనున్నట్లు సమాచారం. చాలామంది ప్రజలు యూపీఐ, డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడటం వల్ల ఏటీఎంల వినియోగం కూడా భారీగా తగ్గిపోయిందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. భారతదేశంలో ఏటీఎంల సంఖ్య సెప్టెంబర్ 2023లో 2,19,000 ఉండేవి. కానీ వీటి సంఖ్య సెప్టెంబర్ 2024 నాటికి 2,15,000కు తగ్గిపోయింది. అదే సమయంలో ఆఫ్-సైట్ ఏటీఎంల సంఖ్య కూడా 97,072 నుంచి 87,638కి తగ్గాయి. సాధారణంగా ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి, అద్దె, సెక్యూరిటీ వంటి వాటికి.. సంబంధిత బ్యాంకులు భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే వినియోగం తగ్గినప్పుడు ఈ ఖర్చు మొత్తం వృధా. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏటీఎంల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి సన్నద్ధమవుతున్నాయి.
ఫ్యామిలీ
జాతీయ ఆధ్యాత్మిక ఉత్సవం కుంభమేళా
మహా కుంభమేళా భారతీయ ఆధ్యాత్మిక పరంపరకు ఒక నిలువుటద్దం. భారతదేశపు అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం. సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక ప్రాముఖ్యతకలిగిన మహాసమారోహం. గంగా నదీ తీరంలో కూడే ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమూహం. మహా కుంభ మేళాకు సుమారు 40 కోట్ల్ల మంది సందర్శకులు హాజరవుతారని అంచనా. పురాణాల ప్రకారం, దేవతలు అసురులు అమృతాన్ని పొదేందుకు కలసి సముద్ర మథనాన్ని నిర్వహించారు. అమృతపు కుంభం (పాత్ర)నుంచి నాలుగు బిందువులు హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్ రాజ్‌లలో పడ్డాయి. అవి పడ్డ ఈ నాలుగు ప్రదేశాలూ కుంభమేళా జరిగే పవిత్ర క్షేత్రాలుగా స్థిరపడ్డాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహామేళా జరుగుతుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ (మునుపటి అలహాబాద్) లో జనవరి 13 ప్రారంభమై ఫిబ్రవరి 26తో ముగుస్తుంది.కుంభమేళాలో పాల్గొనడం పాపవిమోచనకు దోహదపడుతుందని, మోక్షాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. భారతదేశంలోని వివిధ ్రపాంతాల నుండి వచ్చిన సాధువులు, నాగసాధువులు, ఆధ్యాత్మిక గురువులు ఈ మహాసమారోహంలో పాల్గొంటారు. ఈ సాధువులు తమ ఆధ్యాత్మిక సాధనను ప్రదర్శించడం, భక్తులకు ఉపదేశాలు ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణ. పండితులు, ఆధ్యాత్మిక గురువులు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలపై ఆసక్తికరమైన చర్చలు నిర్వహిస్తారు. ఈ చర్చలు భక్తులకు జ్ఞానం ప్రసాదిస్తాయి. ఈ ఉత్సవంలో సంగీతం, నృత్యం, నాటకాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. పర్యావరణ పరిరక్షణ...ఈసారి కుంభమేళాలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ్రపాధాన్యం ఇస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం, నదీజలాల శుభ్రతను మెరుగుపరచడం వంటి చర్యలు చేపడుతున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసే ఈ ఉత్సవంలో పాల్గొనడం అందరూ సుకృతంగా భావిస్తారు. ‘కుంభమేళా భారతదేశపు ఆధ్యాత్మికత, ఐక్యత, విశ్వభావనల ప్రతీక. భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటి చెప్పే ఈ‘మహాకుంభమేళా’ సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు అంటే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు పవిత్ర గంగ, యమున, సరస్వతీ నదుల త్రివేణి సంగమ ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్‌లో జరగనుంది. చరిత్ర...మరో పారాణిక గాథ ప్రకారం విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు పినతల్లి కద్రువ బానిసత్వం నుంచి విముక్తి కోసం కద్రువ కుమారులైన నాగుల కోరిక మేరకు దేవలోకం వెళ్లి ఇంద్రలోక రక్షకులందరినీ ఓడించి అమృత కలశాన్ని తీసుకొని వస్తుండగా ఇంద్రుడు వచ్చి కారణం తెలుసుకుని విషాన్ని చిమ్మే పాములకు మృత్యువే లేకుండా అమృతం ఇవ్వడం భావ్యం కాదని హితవు పలికి గరుత్మంతుని శక్తిని మెచ్చుకుంటూనే ‘నీవు అమృతభాండాన్ని నాగులకప్పగించి, వారి ఎదురుగా దర్భలపై ఉంచితే నీవు, నీ తల్లి విముక్తులు కాగలరు. అప్పుడు నేను వెంటనే ఆ అమృతాన్ని దేవలోకం తీసుకొని వెళ్తాను’ అని చెప్పి అలాగే చేశాడు. ఈ క్రమంలోనే ఆ కలశం నుంచి భూలోకం లో నాలుగు నదులలో నాలుగుచోట్ల కొన్ని అమృతం చుక్కలు పడినట్లు చరిత్ర, ఆ అమృతపు బిందువులు పడిన ప్రదేశాలను పుణ్యస్థలాలుగా... పుణ్యతీర్థాలుగా భావించి ప్రజలు పుణ్యస్నానాలు చేసే పరంపర ్రపారంభమైంది.ధర్మరక్షణ కోసం...కుంభమేళాలో సాంప్రదాయిక ఊరేగింపు జరిగేటప్పుడు నాగ సాధువులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరులు, అఖాడాలు కత్తులు, త్రిశూలాలు, గదలు ధరించి సనాతన ధర్మాన్ని రక్షించడానికి మేము ముందుంటామని నడుస్తుండ గా వెనుక శిష్యులు, సామాన్య భక్తులు లక్షలాదిగా పాల్గొంటారు. అనంతరం పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కుంభమేళాకు హాజరయ్యేందుకు సంక్రాంతి నుండి శివరాత్రి వరకు కోట్లమంది భక్తులు వస్తారు. వీరంతా ధర్మరక్షణకు మేమూ నిలబడతామనీ,’ధర్మరక్షణ అంటే వ్యక్తిగతంగా ధర్మాన్ని పాటించడమే అని భావించి సంకల్పం తీసుకొని పుణ్యస్నానాలాచరించి తిరిగి వస్తుంటారు’.పూజ్యులు పీఠాధిపతులు మఠాధిపతులు భక్తులకు మంత్రోపదేశము చేస్తుంటారు, ప్రవచనాలు చేస్తుంటారు, కుంభమేళాలో వేలాదిమంది సాధ్విమణులు (మహిళా సన్యాసులు) కూడా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ప్రబోధాలు చేస్తుంటారు. వారు చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు అందరికీ పరిచయం చేయడం జరుగుతుంటుంది.అలనాడు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ప్రయాగరాజ్‌ను సందర్శించి కుంభమేళాలో పాల్గొనగా, 1514 లో బెంగాల్‌కు చెందిన చైతన్య మహాప్రభు. తులసీ రామాయణాన్ని రచించిన సంత్ తులసీదాస్ కూడా కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించినట్లుగా చరిత్ర.వెల్లివిరిసే సమరసత...పుణ్యస్నానాలు ఆచరించడం కోసం దేశం నలుమూలల నుంచేగాక ప్రపంచంలోని అనేక దేశాల నుంచి కోట్లమంది ప్రజలు కలిసి వచ్చి ్రపాంతీయ, భాషా, కుల భేదాలు మరచి తరతమ భేదాలు లేకుండా కుంభమేళా సందర్భంగా కలసి స్నానాలు చేస్తారు. ఇంతటి సమాన భావనతోనే.. వచ్చిన భక్తులందరికీ ఆవాసాలు, పానీయాలు, అల్పాహారాలు, భోజనాలు అందించడం, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. పుణ్యస్నానాలు మాత్రమే కాదు..కుంభమేళా అంటే కేవలం కుటుంబమంతా వెళ్లి పుణ్యస్నానాలు చేయడం మాత్రమే కాదు, పండితులు నిర్ణయించిన క్షణం నుండి అనేకానేక వేడుకలు. కుంభమేళా ఖగోళ శాస్త్రం, జ్యోతిషశాస్త్రం, ఆర్థిక శాస్త్రం సామాజిక శాస్త్రం, ఆధ్యాత్మికత, సంప్రదాయాలు, సాంస్కృతిక ఆచారాలు, విజ్ఞాన శాస్త్రాలన్ని పండితులచేత, ఋషుల చేత మునులచేత సన్యాసుల చేత నెలల తరబడి ఆ ్రపాంతంలోనే ఉండి కఠినసాధన చేస్తూ గడచిన 12 సంవత్సరాలలో వారు కనుగొన్న ఎన్నో విషయాలను దేశం నలుమూలల నుంచి ప్రజలకు ప్రబోధించే సన్నివేశం అది. పాటించవలసిన మంచిని బోధించి సమాజానికి మార్గదర్శనం చేసి చూపించే ఈ çకుంభమేళాను అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవడం అవసరం. కుంభమేళా జరిగే పవిత్ర స్థలాలు1. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ వద్ద గంగానదిలో,2. మధ్యప్రదేశ్ ఉజ్జయిని వద్ద క్షీరాబ్ది నదిలో,3. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గోదావరి నదిలో 4. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమున, అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి నది సంగమం వద్ద.12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్ర స్నానాల సమయాన్ని‘కుంభమేళా’ అని. ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే దాన్ని ‘అర్ధ కుంభమేళా’ అని, ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే పవిత్ర స్నానాలను ’మాఘీమేళా’ అనే పేరుతో పిలుస్తారు. ఖగోళంలో జరిగే మార్పులను అనుసరించి పంచాంగం ప్రకారం లెక్కించిన విధంగా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క సమయంలో కుంభమేళా జరుగుతుంది. 2025 మేళా ముఖ్యమైన తేదీలు జనవరి 13 పూర్ణిమ సందర్భంగా, మొదటి రాజస్నానం జరుగుతుంది. జనవరి 14 మకర సంక్రాంతి, 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 03 వసంత పంచమి, ఫిబ్రవరి 12మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. ముఖ్యంగా గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తారు.
దొన్నె బిర్యానీ.. ఈ డిష్ వెరీ స్పెషల్
విభిన్న సంస్కృతుల సమ్మేళనం ‘హైదరాబాద్’లో ఒక్కో గల్లీ ఒక్కో ప్రత్యేకత సంతరించుకున్న విషయం విదితమే. ముఖ్యంగా ఆనాటి నుంచి విభిన్న రుచులకు సైతం భాగ్యనగరం కేంద్రంగా కొనసాగుతోంది. స్థానిక ఆహార వంటకాలు మొదలు విదేశాల కాంటినెంటల్ రుచుల వరకు మన నగరం విరాజిల్లోతోంది. ఈ ఆనవాయితీలో భాగంగానే ఈ మధ్య ‘దొన్నె బిర్యానీ’ సైతం నగరానికి చేరుకుంది.విశ్వవ్యాప్తమైన హైదరాబాద్ బిర్యానీ గురించి అందరికీ తెలుసు.. కానీ.. దొన్నె బిర్యానీ ఏంటనే కదా..?! ఇది కూడా దక్షిణాది ప్రత్యేక వంటకమే. కర్ణాటక, ప్రధానంగా బెంగళూరులో ఈ డిష్ వెరీ స్పెషల్. కొంత కాలంగా దొన్నె బిర్యానీ అక్కడక్కడా కనిపిస్తూనే ఉంది. అయితే బెంగళూరులో 90 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న శివాజీ మిలటరీ హోటల్ నగరంలోని మాదాపూర్‌కు విస్తరించింది. ఈ నేపథ్యంలో నగరంలో మరో కొత్త రుచి చేరిపోయిందని ఆహారప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.దక్షిణాది రుచులకు ఆదరణ.. బెంగళూరులోని ప్రముఖ శివాజీ మిలిటరీ హోటల్, నోరూరించే మాంసాహార వంటకాలకు ప్రసిద్ధి చెందింది. వందేళ్ల క్లబ్లో చేరబోతున్న ఈ ప్రముఖ భారతీయ హోటల్ మొదటిసారి మరో నగరంలో ఆవిష్కృతం అవడం, అది కూడా హైదరాబాద్‌ను ఎంచుకోవడంతో ఇక్కడి వైవిధ్యాన్ని మరింత పెంచుతోంది. కన్నడ వంటకాలు నగరంలో ఇది మొదటిసారి ఏమీ కాదు.. ఎస్ఆర్నగర్, మాదాపూర్, గచి్చ»ౌలి వంటి ప్రాంతాల్లో కన్నడ రుచులు ఇప్పటికే లభ్యమవుతున్నా.. పూర్తిస్థాయిలో అక్కడి రుచులకు ఆదరణ లభిస్తోందనడానికి ఇదో నిదర్శనం. దొన్నె బిర్యానీ, మటన్ ఫ్రై వంటి పలు వంటకాలకు ప్రసిద్ధి చెందిన శివాజీ హోటల్ హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో తమ సేవలను విస్తరించింది. 1935 నుంచి దక్షిణాదిలో తన ప్రత్యేకత పెంచుకున్న శివాజీ మిలిటరీ హోటల్ నగరవాసులకూ చేరువైంది. స్పైసీగా ఉండే మన హైదరాబాదీ బిర్యానీకి దొన్నె బిర్యానీ కాస్త బిన్నంగా ఉన్నప్పటికీ.. భౌగోళిక సమ్మేళనంలో భాగంగా ఇప్పటికే తెలుగు వారు సైతం ఈ బిర్యానీని రుచి చూస్తున్నారు.
మంచు పులులు
గడ్డ కట్టే మంచు, కోత పెట్టే చలి పరీక్ష పెట్టే వాతావరణంకాని తప్పని బతుకుపోరు...కశ్మీర్లో పురుషులతో పాటు స్త్రీలూ శ్రమ చేసి సంపాదిస్తేనే ఇళ్లు గడుస్తాయి. దాల్ లేక్ వెంబడి వందలాది స్త్రీలు చిల్లర వస్తువులు అమ్ముతూ బతుకు ఈడుస్తారు. ప్రస్తుతం దాల్ లేక్ గడ్డ కట్టింది. ఆగక మంచుకురుస్తోంది. బిడ్డల ఆకలి తీర్చడానికి సరస్సు వొడ్డున మంచుపులుల్లా తల్లులు తమ కొట్లు తెరిచి నిలుచున్నారు. వారి బతుకు చిత్రం.కశ్మీరీలు గిరిజనులే అయినా వారికి జ్ఞానం మెండు. ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడవ వారం నుంచి జనవరి మొదటి వారం వరకూ వచ్చే ‘చిలాయి కలాన్’ (భారీ మంచు)కు వారు సిద్ధమయ్యే వుంటారు. కాని ఈసారి చిలాయి కలాన్ గత 30 ఏళ్లలో లేనంత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకూ పడిపోయాయి. దాల్ లేక్ రాత్రిళ్లు పూర్తిగా గడ్డకట్టి మధ్యాహ్నానికి గాని కొద్దిగా పలుచబడదు. ఈలోపు ఎలా జీవించాలి?‘ఇంట్లో పండిన కూరగాయలను ఉదయాన్నే తీసుకొని షికారా (చిన్న పడవ)లో బయలుదేరి దాల్ లేక్ ఒడ్డు మీదకు వచ్చి అంగడి తెరుస్తాను. దాల్ లేక్ గడ్డ కడితే షికారా కదలదు. ట్రాలీలు వెతుక్కుని రోడ్డు మార్గాన రావాలి. అసలే మంచుతో కరువు... ఇదో ఖర్చు’ అంటుంది ఒక కశ్మీరీ దుకాణం దారు.శ్రీనగర్‌లో జనం రెండు విధాలుగా జీవిస్తారు. ఒక విధం దాల్ లేక్ చుట్టుపక్కల... మరో విధం మైదాన, ఎత్తయిన ఏరియాల్లో. దాల్ లేక్‌లో జీవించే వారికి హౌస్బోట్లు, విహార బోట్లు, రోడ్డు మీద చిల్లర అంగళ్లు... ఇవే ఆధారం. ‘మేము చాలామంది స్త్రీలము రోడ్డు మీద కూరగాయలు, పూలు, చేపలు, చిన్న చిన్న వస్తువులు అమ్ముతాం. నిజానికి మా అందరికీ ఈ పని చాలా కష్టం. కాని మా పిల్లలైనా బాగుపడాలని వేణ్ణీళ్లకు చన్నీళ్లుగా ఈ ప్రయత్నం చేస్తాం. ఇలా మా పూర్వికులు కూడా చేశారు. కాని బాగుపడిన వారు తక్కువ’ అంటారు వారు.8 నుంచి 13 గంటలు...కశ్మీర్ అంటే టూరిస్టులు. టూరిస్టులు వచ్చే వేసవి కాలంలో బేరాలు ఒక రకంగా ఉంటాయి. మంచు తీవ్రంగా కురిసే సమయంలో టూరిస్ట్‌లకు బ్రేక్ పడుతుంది. ఆ సమయంలో కూడా బతకడానికి దాల్ లేక్ ఒడ్డున అంగళ్లు తెరవక తప్పదు. ‘రోజూ తెల్లవారు జామునే వచ్చి సాయంత్రం వరకూ నిలబడతాము. 8 నుంచి 13 గంటలు రోడ్డు మీద ఉంటాము’ అని చె΄్తారు వీళ్లు. ‘నా కూతురు డాక్టర్ కావాలనుకుంటోంది. బాగా చదువుతోంది. దాని చదువు కోసం ఈ కష్టాన్ని మునిపంట నొక్కి చేస్తున్నాను’ అని ఒకావిడ చెప్పింది. దట్టమైన మంచు కురిసే సమయంలో వీరికి ఆస్పత్రి సౌకర్యం ఉండదు. ప్రసూతి అవసరాలకు ఆస్పత్రికి వెళ్లడానికి వీలు కానంతగా దార్లు మూసుకుపోతాయి. దాల్ లేక్ ఒడ్డున అమ్ముకునే స్త్రీలకు అవసరమైన టాయిలెట్లు కూడా ఉండవు. అయినా సరే వారు తమ కుటుంబాలు గడవడానికి మంచులో తడుస్తూనే ఉంటారు.టార్పాలిన్ కట్టకూడదు!దాల్ లేక్ ఒడ్డున రోడ్డు మీద వెళుతూ ఉంటే స్త్రీలు ఏ టార్పాలిన్ కట్టకుండా ఆకాశం కింద నిలబడి వస్తువులు అమ్ముతుంటారు స్త్రీలు. ‘మేము చలికి ఆగలేక, మంచు నుంచి రక్షించుకుందామని టార్పాలిన్లు కట్టుకుంటాం. కాని భద్రత దృష్ట్యా మునిసిపాలిటీ వాళ్లు, రక్షణ దళాలు వాటిని పీకేస్తాయి. ఏ ఉగ్రవాదులో ఈ టార్పాలిన్ల దగ్గర చాటు తీసుకుంటారని వీరి భయం. కాని మా ్రపాణాల సంగతి?’ అని మరో మహిళ ప్రశ్నించింది. మంచుకు తడిసి, నీటికి నాని ఈ స్త్రీలకు ఎన్నో ఆరోగ్య సమస్యలు. కాని చిరునవ్వు చెరగనివ్వరు. టూరిస్ట్‌లతో స్నేహంగా మాట్లాడుతూ సంధ్య చీకట్లలో ఇళ్ల వైపుకు వెళ్లిపోతారు. ఈ స్త్రీల శ్రమకు విలువ కట్టే షరాబు ఉన్నాడా?
పేద పిల్లల నేస్తం
బిహార్ విద్యాశాఖలో ఉన్నతాధికారి అయిన డాక్టర్ మంజు కుమారి రోహ్తాస్ జిల్లాలో, ముఖ్యంగా వెనకబడిన ప్రాంతమైన తిలౌతు బ్లాక్‌లో రకరకాల సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. బ్లాక్ రిసోర్స్ సెంటర్(బీఆర్‌సి) ఇంచార్జిగా ఆమె తన అధికారిక విధులకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఆర్థికంగా వెనకబడిన పిల్లలు చదువులో ముందుండేలా తన వంతు కృషి చేస్తోంది....ఆఫీసు సమయం అయిపోగానే అందరిలా ఇంటికి వెళ్లదు మంజు కుమారి. సమీపంలోని ఏదో ఒకగ్రామానికి వెళ్లి పేదపిల్లలకు పుస్తకాలు. బ్యాగులు, యూనిఫామ్ లాంటివి అందజేస్తుంది. దీని కోసం ఇతరులు ఇచ్చే డబ్బులు, స్వచ్ఛంద సంస్థలపై ఆధారపడకుండా తన జీతం నుంచే కొంత మొత్తాన్ని వెచ్చిస్తుంది. మంజు కుమారికి సామాజిక సేవపై ఆసక్తి చిన్నప్పటి నుంచే ఉంది. నాన్న శివశంకర్ షా తనకు స్ఫూర్తి.‘సామాజిక సేవకు సంబంధించి నాన్న ఎప్పుడూ చురుగ్గా ఉండేవారు. మా ఊరి పాఠశాల కోసం భూమిని ఉదారంగా ఇవ్వడమే కాదు అవసరమైన వనరులు అందించారు. ఇలాంటివి చూసి నాలో సామాజిక బాధ్యత పెరిగింది. ఆ స్కూల్ ఇప్పటికీ ఉంది. సామాజిక సేవాకార్యక్రమాలు మరిన్ని చేసేలా నిరంతరం స్ఫూర్తినిస్తుంది’ అంటుంది మంజు కుమారి.రాంచీ యూనివర్శిటీ నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్... ఆ తర్వాత పీహెచ్డీ చేసిన మంజు డెహ్రీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దశాబ్దానికి పైగా హిందీ టీచర్‌గా పనిచేసింది. 2023లో బీ ఆర్సి ఇంచార్జిగా నియామకం అయింది. దీంతో సామాజిక సేవలో మరింత క్రియాశీలంగా పనిచేస్తోంది.స్థానిక పాఠశాలలను తనిఖీ చేస్తుంటుంది. పాఠశాల పరిశ్రుభతపై ఎన్నో సూచనలు ఇస్తుంటుంది. విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగానికి ముందు ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేది మంజు కుమారి. ఆ సమయంలో గిరిజన గూడేలకు వెళ్లి ఎప్పుడూ స్కూల్‌కు వెళ్లని పిల్లలకు అక్షరాలు నేర్పించేది, పాఠాలు చెప్పేది. ఇది చూసి తల్లిదండ్రులు పిల్లలను రోజూ స్కూల్‌కు పంపించేవారు.‘ఇది నేను సాధించిన పెద్ద విజయం’ అంటుంది మంజు కుమారి. అయితే మంజుకుమారి ప్రయాణం నల్లేరు మీద నడక కాదు. ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. అత్తమామలు, భర్త అభ్యంతరం చెప్పేవాళ్లు. మంజుకుమారిని సామాజిక సేవ దారి నుండి తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవాళ్లు. అయినప్పటికీ ఆమె పట్టుదలగా ముందుకు వెళ్లింది.సామాజిక బాధ్యత, నైతిక విలువలు క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మంజు కుమారి... ‘తమ గురించి మాత్రమే ఆలోచించే ధోరణి ప్రజలలో బాగా పెరిగింది. సామాజిక స్పృహ లోపిస్తుంది. సేవా స్ఫూర్తిని, సామాజిక నిబద్ధతను పునరుద్ధరించాలని ఆశిస్తున్నాను’ అంటుంది.
ఫొటోలు
National View all
లోపలకు వచ్చినంత మాత్రాన దాడి చేస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఇంటి లోపలకు వచ్చినంత మాత్రాన జర్నలిస్ట్
గూగుల్ మ్యాప్‌తో పోలీసులు కాస్త దొంగలయ్యారు!
గూగుల్ మ్యాప్ మరోసారి హ్యాండిచ్చిన ఘటన ఇది. ఓ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గూగుల్ మ్యాప్‌ను నమ్ముకున్నారు.
బీబీఎంపీ బోర్ల స్కాం.. రెండోరోజూ ఈడీ తనిఖీలు
బనశంకరి: బెంగళూరు మహానగర పాలికెలో బోరుబావుల తవ్వకం, ఆర్‌ఓ ప్లాంట్ల ఏర్పాటు పథకంలో 2016–2019 మధ్య కోట్లా
‘డిజిటల్ మహాకుంభ్’.. సంస్కృతి, సాంకేతికతల కలబోత
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జనవరి 13 నుంచి ప్రారంభంకానుం
‘‘అలాగైతే ఇండియా కూటమిని రద్దు చేయండి’’
ఒకవైపు విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు నడుస్తుండగా..
International View all
చైనాలో మంకీపాక్స్ కొత్త వేరియంట్ కలకలం
బీజింగ్ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్
గుంపులో చిక్కుకుపోయారా? మిమ్మల్ని మీరు ఇలా కాపాడుకోండి
రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రమాదాలు పొంచివుంటాయి.
కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. అత్యవసర పరిస్థితి విధింపు
లాస్ ఏంజిల్స్: అమెరికాలోని లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలలోని అడవుల్లో కార్
హసీనా వీసా గడువు పెంపు
న్యూఢిల్లీ: విద్యార్థుల ఉద్యమం, ఎగసిన అల్లర్లతో స్వదేశం వీడి
ఆగని రష్యా దాడులు
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ దాడులు కొనసాగుతున్నాయి.
NRI View all
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా
ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!
అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్ దిగ్గజం యాపిల్ 185 మంది ఉద్యోగులను త
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!
భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్..!అచ్చం భారత్‌లో..
ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్ బిజినెస్‌లు.
క్రైమ్
క్లాస్‌మేట్‌పై జూనియర్ డాక్టర్ అత్యాచారం
గ్వాలియర్: ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలోని ఉపయోగంలో లేని హాస్టల్లో ఓ జూనియర్ డాక్టర్(25) తోటి వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలోని గజరాజా మెడికల్ కాలేజీలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు, బాధితురాలు వేర్వేరు హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. ఆదివారం నిందితుడు కాలేజీ ఆవరణలోనే ఉన్న ఉపయోగంలో లేని బాయ్స్ హాస్టల్లోకి రావాలని బాధితురాల్ని కోరాడు. అంగీకరించి అక్కడికి వెళ్లిన ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై బాధితురాలు కాంపు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు నగర ఎస్పీ అశోక్ జడొన్ చెప్పారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
ఏస్ నెక్ట్స్ జెన్, గ్రీన్కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
(మచిలీపట్నం): ఫార్ములా –ఈ రేసు కేసులో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. ఇప్పటివరకు రేసు నిర్వహణ, నిధుల మళ్లింపులో నిబంధనల అతిక్రమణ, హెచ్ఎండీఏ అధికారిక ఖాతాల నుంచి విదేశీ కంపెనీలకు నిధుల మళ్లించడంపై ఫోకస్ పెట్టిన అధికారులు, తాజాగా క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. తాజాగా తెరపైకి వచ్చిన క్విడ్ ప్రోకో కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫార్ములా–ఈ కారు రేసు నిర్వహణకు సంబంధించిన ఒప్పందాలకు కొద్ది నెలల ముందే బీఆర్ఎస్కు గ్రీన్కో అనుబంధ సంస్థల నుంచి ఎలక్టొరల్ బాండ్ల రూపంలో కోట్ల రూపాయలు వచ్చాయనే సమాచారంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ఫార్ములా ఈ రేసుకు మొదట్లో స్పాన్సర్‌గా వ్యవహరించిన ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు దాని అనుబంధ సంస్థ గ్రీన్కో కార్యాలయాల్లో మంగళవారం ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో సైబర్ టవర్స్‌లో, మచిలీపట్నంలోని గ్రీన్కో కార్యాలయాల్లో మంగళవారం రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. సహకరించని సిబ్బంది! ఏసీబీ అధికారుల తనిఖీలకు ఆయా సంస్థల సిబ్బంది ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. మాదాపూర్ సైబర్ టవర్స్‌లోని గ్రీన్కో కార్యాలయంలో సోదాలకు ఆ సంస్థ సిబ్బంది మొదట అనుమతించలేదు. అధికారులు సెర్చ్ వారెంట్ వారెంట్ చూపడంతో వెనక్కి తగ్గారు. ఇక అదే ప్రాంతంలోని ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో అధికారులు సోదాలు జరిపారు. పలు కీలక పత్రాలు, పైళ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. మరోవైపు ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న గ్రీన్ కో అనుబంధ సంస్థలైన ఏస్ అర్బన్ రేస్, ఏస్ అర్బన్ డెవలపర్స్ కార్యాలయాల్లోనూ మంగళవారం రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. పలు ఫైళ్లతో పాటు హార్డ్ డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మచిలీపట్నంలో కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న గ్రీన్ కో కంపెనీకి చెందిన గెస్ట్‌హౌస్‌లో కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కేటీఆర్‌కు తాజాగా ఈడీ సమన్లు ఫార్ములా–ఈ కారు రేస్ కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్‌కు ఈడీ అధికారులు మరోమారు సమన్లు జారీ చేశారు. వాస్తవానికి కేటీఆర్ మంగళవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సి ఉన్నా..తనకు మరికొంత సమయం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 16న విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్‌కు మంగళవారం మరోమారు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. కాగా ఈడీ అధికారులు ఇప్పటికే ఇచ్చిన సమన్ల ప్రకారం..ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ మాజీ సీఈ బీఎల్ఎన్ రెడ్డి బుధవారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు.
విధుల్లో ఉండగా.. కానిస్టేబుల్‌కు గుండెపోటు
మహబూబ్‌నగర్ క్రైం: విధుల్లో ఉన్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ గుండెపోటు రాగా.. ఆస్పత్రితో చికిత్స అందిస్తుండగానే మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని మర్లులో నివాసం ఉంటూ హెడ్‌క్వార్టర్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటేష్(50)కు సోమవారం ఎస్కాట్ డ్యూటీ పడింది. ఈక్రమంలో సోమవారం ఉదయం ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లా జైలుకు వెళ్లి అక్కడ ఖైదీలను వాహనంలో తీసుకుని కోర్టులో హాజరుపరిచి మళ్లీ మధ్యాహ్నం సమయంలో జైలులో ఖైదీలను అప్పగించి తిరిగి బయట వచ్చాడు. ఆ సమయంలో చాతీలో నొప్పి వస్తున్నట్లు వెంకటేష్ తోటి కానిస్టేబుల్స్‌కు చెప్పి కింద కూర్చుకున్నాడు. వెంటనే వారు చికిత్స కోసం జిల్లా జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు సీపీఆర్ చేయడంతో పాటు చికిత్స అందిస్తున్న క్రమంలోనే మృతి చెందాడు. క్యాజువాలిటీలో ఉన్న వెంకటేష్ మృతదేహన్ని ఎస్పీ డి.జానకి పరిశీలించి కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుడు వెంకటేష్‌కు భార్య వనీత, ఇద్దరూ కొడుకులు అభినవ్, వర్షవర్ధన్లు ఉన్నారు. మృతదేహన్ని అతని స్వస్థలం సీసీకుంటకు తరలించారు.
బాలిక ప్రాణం తీసిన సెంట్రింగ్ కట్టె
దొడ్డబళ్లాపురం: నిర్మాణదారుల నిర్లక్ష్యం తల్లిదండ్రుల కంటి దీపాన్ని బలిగొంది. పాఠశాల నుండి ఇంటికి తిరిగి వెళ్తున్న బాలిక తలపై సెంట్రింగ్‌కు వాడిన వెదురు కట్టె పడి చనిపోయిన బెంగళూరు వీవీ పురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలిక తేజస్విని (15) రోజు మాదిరిగానే శనివారం సాయంత్రం ఇంటికి తిగిరి వెళ్తుండగా రోడ్డుపక్కన కొత్తగా నిర్మిస్తున్న కట్టడంపై నుండి సెంట్రింగ్ కట్టె తలమీద పడడంతో తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చేర్పించగా సోమవారం మరణించింది. బాలిక తండ్రి సుధాకర్ రావ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీవీ పురం పోలీసులు భవన ఇంజినీర్‌ను అరెస్టు చేసారు. కట్టడం యజమాని, అనుమతులు ఇచ్చిన బీబీఎంపీ అధికారులు, కాంట్రాక్టర్లపై కూడా కేసు నమోదు చేశారు.