Top Stories
ప్రధాన వార్తలు
ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్‌రెడ్డిల మధ్య తోపులాట
కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్‌రెడ్డి(kaushik reddy)ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ‘నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత’ అనేంత స్థాయిలో వాగ్వాదం జరిగింది.జిల్లా సమీక్షా సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే సంజయ్(MLA Sanjay) మాట్లాడుతుండగా పాడి కౌశిక్‌రెడ్డి అడ్డుకున్నారు. ఇంతకీ మీ పార్టీ ఎంటంటూ సంజయ్‌ను కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్రస్థాయికి చేరి ఇద్దరు తోసుకునేంతవరకూ వెళ్లింది. దాంతో కౌశిక్‌రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఇదంతా ముగ్గురు తెలంగాణ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబుల సమక్షంలో జరగడం శోచనీయం.కౌశిక్‌రెడ్డి బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూఊ. ‘ ఎమ్మెల్యే సంజయ్ అమ్ముడుపోయారు. సంజయ్‌కు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష. దమ్ముంటే సంజయ్ రాజీనామా చేయాలి. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్లా అంటూ కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు.
మీరు అలా చేస్తే.. నేను పోటీనే చేయను: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో అన్ని మురికివాడల కంటే.. కేజ్రీవాల్(Arvind Kejriwal) సీఎంగా ఉన్న సమయంలో నివసించిన శీష్ మహల్ టాయిలెట్ల ఖరీదే ఎక్కవంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) చేసిన వ్యాఖ్యలను ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిప్పికొట్టారు. మీరు మురికివాడ(Delhi Slums)లను బాగు చేస్తే, తాను ఎన్నికల్ల్లో పోటీచేయనంటూ సవాల్ విసిరారు. ఢిల్లీలోని మురికివాడల కూల్చివేతలపై కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు వారికి పునరావాసం కల్పిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయడాన్ని విరమించుకుంటానన్నారు.‘మీరు మురికివాడల ప్రజలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోండి. దీనిపై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయండి. ఇళ్లు కోల్పోయిన మురికివాడ ప్రజలందరికీ అదే స్థలంలో ఇళ్లు నిర్మించండి. అప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరమే ఉండదు. ఈ నా చాలెంజ్ మీరు స్వీకరిస్తారా? అని ధ్వజమెత్తారు.‘ఒకవేళ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మురికివాడలను కూల్చివేయాలని భావిస్తోంది. వారి స్థలాలను ఆక్రమించేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది. ముందు మీ ఓట్లు కావాలి.. తర్వాత మీ స్థలం కావాలి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో ఢిల్లీలోని మురికివాడ ప్రజలకు కేవలం 4,700 ఫ్లాట్లు మాత్రమే నిర్మించి ఇచ్చింది. ఢిల్లీ మహానగరంలో నాలుగు లక్షలకు మందికి పైగా మురికివాడల్లో ఉన్నారు. మీరు అది చేయాలంటే మీకు వెయ్యేళ్లు పడుతుంది’ అంటూ సెటైర్లు వేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది ఏదో హోదా అనుభవించడం కోసం కాదని, ప్రజల హోదా పెంచడం కోసమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. మురికివాడల కంటే.. శీష్ మహల్లో టాయిలెట్ల ఖరీదే ఎక్కువఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో ఆప్ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం ‘శీష్ మహల్’ను అత్యంత విలాసవంతంగా నిర్మించారని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించిన సంగతి తెలిసిందే. నిన్న( శనివారం). ఢిల్లీలోని అన్ని మురికివాడల కంటే శీష్ మహల్‌లోని టాయిలెట్లే అత్యంత ఖరీదైనవని ఆయన వ్యాఖ్యానించారు.దేశంలోని పేదల కోసం ప్రధాని మోదీ 3.58 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తే..కేజ్రీవాల్ మాత్రం ప్రజల సొమ్ముతో ఆర్భాటంగా ఖరీదైన నివాసాన్ని నిర్మించారని విమర్శించారు. మంత్రి అమిత్ షా శనివారం జేఎల్ఎన్ స్టేడియంలో మురికివాడల నివాసితులతో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే మురికివాడల్లోని ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇస్తుందని భరోసా ఇచ్చారు. ఢిల్లీలో మౌలిక వనరుల కల్పనకు మోదీ ప్రభుత్వం రూ.68వేల కోట్లను వెచ్చించిందన్నారు.మురికివాడల్లో సమస్యలు, వాటి పరిష్కారంపై ఇప్పటికే ప్రధాని మోదీకి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు వివరాలను అందజేశామన్నారు. అధికారం చేపట్టిన వెంటనే వీటన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇదే జరిగితే.. రూ.10 లక్షల వరకు నో ట్యాక్స్?
ప్రతి సంవత్సరం బడ్జెట్ సమయంలో.. ట్యాక్స్ మినహాయింపుపై ప్రభుత్వం ఏమైనా కొత్త ప్రకటనలు చేస్తుందా? అని పన్ను చెల్లింపుదారులు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పరిమిత ఆదాయ వనరులతో.. సీనియర్ సిటిజన్లు పెన్షన్లపై ఆధారపడతారు. కాబట్టి ట్యాక్స్ మినహాయింపు వారికి కీలకమైన ఆర్థిక భద్రతగా పనిచేస్తుంది.2020 - 21 బడ్జెట్ సమయంలో కొత్త పన్ను విధానం ప్రకటించిన తరువాత.. పన్ను విధానంలో ఎలాంటి మార్పులు జరగలేదు. కాబట్టి త్వరలోనే జరగనున్న బడ్జెట్లో ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' (Nirmala Sitharaman) ఎట్టకేలకు పాత పన్ను విధానంలో పన్ను స్లాబ్‌లను సవరించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.2023-24 బడ్జెట్లో, ప్రభుత్వం ప్రాథమిక ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లు.. అంతకంటే ఎక్కువ) రూ.3 లక్షలకు, సూపర్ సీనియర్ సిటిజన్లకు (80 ఏళ్లు & అంతకంటే ఎక్కువ) రూ.5 లక్షలకు పెంచింది. అయితే రాబోయే బడ్జెట్లో ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని సీనియర్ సిటిజన్లకు రూ.5 లక్షలు, సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ.7 లక్షలకు పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభిస్తుంది.పాత పన్ను విధానంప్రస్తుతం పాత పన్ను విధానం ప్రకారం.. 60 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న సీనియర్ సిటిజన్లకు రూ. 3 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు. అయితే రూ. 3,00,001 నుంచి రూ. 5,00,000 మధ్య 5 శాతం, రూ. 5,00,001 నుంచి రూ. 10,00,000 మధ్య 20 శాతం, రూ. 10 లక్షలు దాటితే 30 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది.80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారికి రూ. 5 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. అయితే రూ. 5,00,001 నుంచి రూ. 10,00,000 మధ్య 20 శాతం, రూ. 10 లక్షలకు పైన 30 శాతం ట్యాక్స్ ఉండేది. సీనియర్ సిటిజన్లు సాధారణంగా కొన్ని సేవింగ్స్ స్కీముల్లో సేవింగ్స్ చేసుకుంటారు. వీరికి పాత పన్ను విధానంలోనే సెక్షన్ 80సీ మినహాయింపులు లభిస్తాయి. కొత్త పన్ను విధానంలో పరిమితిని పెంచితే.. ట్యాక్స్ నుంచి వారికి కొంత ఉపసమయం లభిస్తుంది.కొత్త శ్లాబులుఫిబ్రవరి 1న జరగనున్న బడ్జెట్లో పన్ను మినహాయింపు పరిమితిని పెంచితే.. 60 నుంచి 79 ఏళ్ల మధ్య వయసున్న వారు రూ. 5 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే రూ. 5,00,001 నుంచి రూ. 10,00,000 మధ్య 20 శాతం, రూ. 10 లక్షల పైన 30 శాతం ట్యాక్స్ చెల్లింపు ఉంటుంది.సూపర్ సీనియర్ సిటిజన్ల కోసం లేదా 80 సంవత్సరాలు & అంతకంటే ఎక్కువ వయసున్న వారు రూ. 7,00,000 వరకు ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 7,00,001 నుంచి రూ. 10,00,000 వరకు.. 20 శాతం, రూ. 10 లక్షల పైన 30 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: 'సరిగ్గా 10 గంటలు.. ప్రపంచాన్ని మార్చేయొచ్చు': ఆనంద్ మహీంద్రాపన్ను మినహాయింపు పరిమితి పెరిగితే 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్నవారు.. తమ ఆదాయం 10 లక్షలయినా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఎలా అంటే.. వారి ఆదాయం రూ. 10 లక్షలు అనుకుంటే.. అందులో రూ. 5 లక్షలు ప్రాథమిక మినహాయింపు పరిమితి. సెక్షన్ 80సీ ద్వారా రూ. 1.50 లక్షలు, సెక్షన్ 80సీసీడీ (1బీ) ద్వారా రూ. 50,000, సెక్షన్ 80డీ ద్వారా రూ. 50వేలు, స్టాండర్డ్ డిడక్షన్ మరో రూ. 50,000, సెక్షన్ 80TTB ద్వారా రూ. 50,000.. ఫ్యామిలీ పెన్షన్ స్టాండర్డ్ డిడక్షన్ ద్వారా రూ. 15,000.. సెక్షన్ 80DDB ద్వారా రూ. 1 లక్ష తగ్గింపు లభిస్తాయి. ఇలా మొత్తం మీద తగ్గింపు రూ. 5,65,000. కాబట్టి దీని ప్రకారం ఆదాయం 10 లక్షల రూపాయలైనా ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.
దుబాయ్ కారు రేసింగ్.. అజిత్ కుమార్ టీమ్ క్రేజీ రికార్డ్
దుబాయ్ కార్ రేసింగ్‌లో కోలీవుడ్ స్టార్ హీరో టీమ్ సత్తా చాటింది. హీరో అజిత్ కుమార్‌కు చెందిన టీమ్ ఈ రేస్‌లో మూడోస్థానంలో నిలిచింది. ఈ విజయంతో అజిత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను చేతపట్టుకుని అభిమానులకు అభివాదం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ప్రస్తుతం దుబాయ్‌లో 24హెచ్ కార్ రేసింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా తమిళ స్టార్ శివ కార్తికేయన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు.రేసుకు ముందు ప్రమాదం.. అయితే ఇటీవల తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు(Ajith Kumar) పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో అజిత్‌కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేసింది. అజిత్ ప్రమాదం నుంచి బయటపడడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.15 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ.. కాగా.. అజిత్ దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి రేసింగ్‌కు వచ్చాడు. అతని జట్టు ఈ కారు రేసింగ్‌లో విజయం సాధించింది. రేసింగ్ జట్టు యజమానిగా తాను రేసింగ్‌లో పాల్గొంటానని అజిత్ కుమార్ వీడియోను రిలీజ్ చేశారు. మోటార్‌స్పోర్ట్స్ అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించారు. అలాగే కుటుంబం, హార్ట్ వర్క్, సక్సెస్, ఫెయిల్యూర్‌ను జీవితంలో సమానంగా చూడాలని అభిమానులకు సూచించారు. కార్ రేసింగ్ గురించి మాట్లాడుతూ.. ' రేసింగ్ అనేది ఇతర క్రీడల మాదిరిగా వ్యక్తిగత క్రీడ కాదు. మీరు స్ప్రింట్ రేసర్లను చూసి ఉండవచ్చు. కానీ ఇందులో నలుగురు, ఐదుగురు డ్రైవర్లు ఒకే కారు నడుపుతారు. కాబట్టి మనమందరం అందరి పనితీరుకు బాధ్యత వహించాలి. మన కారును జాగ్రత్తగా చూసుకోవాలి. అదే సమయంలో మనం ల్యాప్ టైమింగ్‌లను సాధించాలి. ఇందులో సిబ్బంది, మెకానిక్స్, లాజిస్టికల్ సపోర్ట్‌తో పాటు డ్రైవర్ల సమష్టి కృషి ఉంటుంది. ఇది సినిమా పరిశ్రమ లాంటిది. ప్రతి ఒక్కరూ తమ పాత్రపై దృష్టి పెడితే ఫలితాలు వస్తాయని' అని అన్నారు.కాగా.. కోలీవుడ్ స్టార్ ప్రస్తుతం విదాముయార్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఊహించని కారణాలతో వాయిదా పడింది. ఈ సినిమాకు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జన్ సర్జా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్లో నిర్మించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అంతేకాకుండా మైత్రి మూవీ మేకర్స్‌తో అజిత్ కుమార్ జతకట్టారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే ద్విభాష చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అనివార్య కారణాలతో వాయిదా వేశారు. ఈ సినిమాను సమ్మర్లో అంటే ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. Big congratulations to you, AK sir, for your perseverance. Proud moment, sir 👏👏 🏆 👍❤️❤️#AjithKumarRacing pic.twitter.com/YQ8HQ7sRW2— Sivakarthikeyan (@Siva_Kartikeyan) January 12, 2025
మ్యాక్స్‌వెల్ ఊచకోత.. సిక్సర్ల సునామీ
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా మెల్బోర్న్ రెనెగేడ్స్‌తో ఇవాళ (జనవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఉగ్రరూపం దాల్చాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (45/4) ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మ్యాక్స్‌వెల్.. 52 బంతుల్లో 10 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 90 పరుగులు చేశాడు. నిదానంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మ్యాక్సీ.. ఇన్నింగ్స్ 16వ ఓవర్ నుంచి గేర్ మార్చాడు. ఆడమ్ జంపా వేసిన 16వ ఓవర్లో సిక్సర్, బౌండరీ బాదిన మ్యాక్స్‌వెల్.. కేన్ రిచర్డ్సన్ వేసిన ఆతర్వాతి ఓవర్లో మరింత రెచ్చిపోయాడు. ఈ ఓవర్లో అతను బౌండరీ, రెండు భారీ సిక్సర్లు బాదాడు. GLENN MAXWELL HITS 122 METER SIX IN BBL. 🤯- Glenn Maxwell, The Big Show..!!! 🔥pic.twitter.com/zcwV3b28Hd— Tanuj Singh (@ImTanujSingh) January 12, 2025ఈ ఓవర్లోని తొలి సిక్సర్ (రెండో బంతి) బిగ్‌బాష్ లీగ్ చరిత్రలోనే అతి భారీ సిక్సర్‌గా రికార్డైంది. ఈ సిక్సర్ 122 మీటర్ల దూరం వెళ్లింది. మ్యాకీకి ముందు బీబీఎల్‌లో భారీ సిక్సర్ రికార్డు సహచరుడు హిల్టన్ కార్ట్‌రైట్ పేరిట ఉండింది. ఇదే సీజన్లో కార్ట్‌రైట్ 121 మీటర్ల సిక్సర్ బాదాడు.అనంతరం సదర్‌ల్యాండ్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో మ్యాక్స్‌వెల్ పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడ్డాడు. ఈ ఓవర్లో అతను మూడు భారీ సిక్సర్లు సహా ఓ బౌండరీ బాదాడు. ఈ ఓవర్లో మ్యాక్సీ వరుసగా తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. సెంచరీకి 10 పరుగుల దూరంలో ఉండగా మ్యాక్సీ 20వ ఓవర్ తొలి బంతికి ఔటయ్యాడు. కేన్ రిచర్డ్సన్ మ్యాక్సీని క్లీన్ బౌల్డ్ చేశాడు. మ్యాక్స్‌వెల్ పుణ్యమా అని ఈ మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 165 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌కు ఎవరి సహకారం లభించనప్పటికీ ఒక్కడే ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఖాతా కూడా తెరవని ఉసామా మిర్‌తో మ్యాక్స్‌వెల్ ఎనిమిదో వికెట్‌కు 81 పరుగులు జోడించడం విశేషం. ఈ 81 పరుగులను మ్యాక్స్‌వెల్ ఒక్కడే చేశాడు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన మెల్బోర్న్ స్టార్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. ఆతర్వాత బెన్ డకెట్ (21), బ్యూ వెబ్‌స్టర్ (15) కొద్దిసేపు క్రీజ్‌లో నిలబడ్డారు. 32 పరుగుల వద్ద బెన్ డకెట్, థామస్ రోజర్స (0) ఔటయ్యారు. అనంతరం 45 పరుగుల వద్ద వెబ్‌స్టర్, 55 పరుగుల వద్ద సోయినిస్ (18), 63 పరుగుల వద్ద కార్ట్‌రైట్ (6), 75 పరుగుల వద్ద జోయల్ పారిస్ (3) పెవిలియన్‌కు చేరారు. 11 ఓవర్లలో మెల్బోర్న్ స్టార్స్ ఏడు వికెట్లు కోల్పోయి 100 పరుగులు కూడా చేసేలా కనిపించలేదు. ఈ దశలో మ్యాక్సీ ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. రెనెగేడ్స్ బౌలర్లలో టామ్ రోజర్స్, ఫెర్గస్ ఓనీల్, ఆడమ్ జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జేకబ్ బేతెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.NOVAK DJOKOVIC AT THE BBL. 🐐- The reaction after Stoinis was out. 😄pic.twitter.com/eruRdky7yL— Mufaddal Vohra (@mufaddal_vohra) January 12, 2025సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన జకోవిచ్ఈ మ్యాచ్ చూసేందుకు టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ వచ్చాడు. జకో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో జకో మెల్బోర్న్ స్టార్స్‌కు మద్దతుగా నిలిచాడు. స్టార్స్ కెప్టెన్ స్టోయినిస్ ఔట్ కాగానే జకో నిరాశ చెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.తడబడుతున్న రెనెగేడ్స్166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రెనెగేడ్స్ 13 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. మార్క్ స్టీకిటీ (3-0-14-3) అద్భుతంగా బౌలింగ్ చేసి రెనెగేడ్స్‌ను దెబ్బకొట్టాడు. రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో జోష్ బ్రౌన్ 4, మార్కస్ హ్యారిస్ 1, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 19, జేకబ్ బేతెల్ 1, విల్ సదర్‌ల్యాండ్ 15 పరుగులు చేసి ఔటయ్యారు. టిమ్ సీఫర్ట్ 26, హ్యారీ డిక్సన్ 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో రెనెగేడ్స్ గెలవాలంటే 42 బంతుల్లో 88 పరుగులు చేయాలి.
హైడ్రాపై మరోసారి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఈ-కార్ రేస్‌లో కేటీఆర్‌కు తాను క్లీన్చిట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్‌కు ఇమేజ్ పెరిగిందని మాత్రమే చెప్పానని.. విచారణ జరిగేటప్పుడు కామెంట్ చేయడం సరికాదన్నారు. క్విడ్‌ప్రోకో జరిగిందా లేదా తేల్చాలి. హైడ్రా వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అయిందని మళ్లీ చెబుతున్నాను. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలి. తాను ఫైటర్‌ను.. ఉప ఎన్నికకు భయపడేది లేదని దానం అన్నారు.‘‘నేను ఏది మాట్లాడినా కూడా సంచలనమే అవుతుంది. మూసీపై కంటి తుడుపు చర్యల్లాగా ఒక్కరోజు మూసీ నిద్ర చేశారని.. వారు నిద్ర చేయడానికి వెళ్లే ముందే ఏసీలు పెట్టించుకుని పడుకున్నారు. వారి ఇళ్లల్లోనే చేసిన జొన్న రొట్టెలు తినకుండా.. కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నారు. హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉందని ఇక్కడికి కొన్ని సంస్థలు వచ్చి స్థిరపడ్డాయి. హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ కాబట్టి ముంబయికి వెళ్ళే ఇన్వెస్టర్లు ఇక్కడికి వస్తున్నారు.’’ అని దానం నాగేందర్ చెప్పారు.‘‘పదేళ్ల అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర బడ్జెట్ చూస్తే ఖాళీగా ఉంది. అయినా ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందుకెళ్తుంది. రుణమాఫీ, రైతు భరోసా అమలు జరుగుతున్నందున సీఎంకి పాలాభిషేకం చేయాలి’’ అంటూ దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు @సేల్!
వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ.. సంచలనం సృష్టించిన ముంబై బ్యాటర్
బెంగళూరులోని ఆలుర్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న అండర్-19 మహిళల వన్డే కప్‌లో 14 ఏళ్ల ముంబై అమ్మాయి ట్రిపుల్ సెంచరీ సాధించింది. మేఘాలయాతో జరిగిన మ్యాచ్‌లో ఐరా జాదవ్ 157 బంతుల్లో 42 ఫోర్లు, 16 సిక్సర్ల సాయంతో 220.38 స్ట్రయిక్‌రేట్‌తో 346 పరుగులు (నాటౌట్) చేసింది. భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్లో అయినా ఇదే అత్యధిక స్కోర్. ఇరా జాదవ్ వైట్ బాల్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారతీయురాలు.మహిళల అండర్-19 లెవెల్లో ఐరా జదావ్‌కు ముందు నలుగురు డబుల్ సెంచరీలు సాధించారు. ప్రస్తుత టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన 224 నాటౌట్, రాఘ్వి బిస్త్ 219 నాటౌట్, జెమీమా రోడ్రిగెజ్ 202 నాటౌట్, సనికా ఛాల్కే 200 పరుగులు చేశారు. ఛాల్కే త్వరలో జరుగనున్న మహిళల అండర్-19 వరల్డ్‌కప్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించనుంది. రాఘ్వి బిస్ట్ విషయానికొస్తే.. ఈ అమ్మాయి ఇటీవలే భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసింది.ఐరా ట్రిపుల్.. ముంబై రికార్డు స్కోర్మ్యాచ్ విషయానికొస్తే.. ఐరా జాదవ్ ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కడంతో మేఘాలయాపై ముంబై కనీవినీ ఎరుగని స్కోర్ చేసింది. ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 563 పరుగులు చేసింది. అండర్-19 మహిళల వన్డే కప్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ముంబై తరఫున ఇదే అత్యధిక స్కోర్. మేఘాలయాతో మ్యాచ్‌లో ఐరాతో పాటు మరో ప్లేయర్ మూడంకెల స్కోర్ చేసింది. హర్లీ గాలా 79 బంతుల్లో 116 పరుగులు సాధించింది.ఐపీఎల్ వేలంలో ఎవరూ పట్టించుకోలేదు..!హిట్టర్‌గా పేరున్న ఐరా జాదవ్‌ను మహిళల ఐపీఎల్-2025 వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. 10 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో ఐరా మెగా వేలంలో పాల్గొంది.
ఈ సంక్రాంతి.. పచ్చ నేతలకే పండగ.. ప్రజలకు కాదు: కన్నబాబు
సాక్షి, కాకినాడ: గత సంక్రాంతికి ఈ ఏడాది పండగకు చాలా వ్యత్యాసం ఉందని.. గత ఏడాది సంక్రాంతికి ప్రతి కుటుంబాన్ని వైఎస్ జగన్ చేయి పట్టుకుని నడిపించారని.. ఈ సంక్రాంతికి చంద్రబాబు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ సంక్రాంతి పేదల పండగ కాదు.. పచ్చ నేతల పండగ అంటూ దుయ్యబట్టారు. పేదల జేబుల్లో డబ్బుల్లేవు.. మార్కెట్లు వెలవెలబోతున్నాయి. కూటమి నేతలు తరిమేసినవారు పండక్కి రావడానికి భయపడుతున్నారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం లేదు’’ అని కన్నబాబు చెప్పారు. ఈ సంక్రాంతికి చంద్రన్న కానుక పథకం ఏమైంది?. కూటమి నేతలకే పండగ.. ప్రజలకు కాదు. ఇష్యూ వస్తే డెవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్‌ను తిట్టడమే కూటమి నేతలు పనిగా పెట్టుకున్నారు. తిరుపతి తొక్కిసలాట చూసి కూటమి నేతలు సిగ్గుపడాలి. తిరుపతి తొక్కిసలాట కూటమి ప్రభుత్వ వైఫల్యం కాదా?. తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమాపణ అన్నట్లు బీఆర్ నాయుడు మాట్లాడారు. తిరుపతి తొక్కిసలాటపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. తిరుమల ప్రసాదంపై కూడా దుష్ప్రచారం చేశారు. వెంకన్న స్వామిని రాజకీయాల్లోకి లాగితే ఫలితాలు ఇలానే ఉంటాయి’’ అని కన్నబాబు వ్యాఖ్యానించారు.‘‘భక్తుల ఫోన్ నంబర్లతో కూటమి ప్రభుత్వానికి ఏం పని?. చంద్రబాబు మనుషులు చేసే తప్పులకు భక్తులు బలైపోతున్నారు. టీటీడీ సమావేశంలో ప్రైవేట్ వ్యక్తులకు ఏం పని?. సనాతన ధర్మాన్ని కాపాడే పెద్దలు ప్రైవేట్ వ్యక్తులపై ఎందుకు మాట్లాడటం లేదు?’’ అని కన్నబాబు ప్రశ్నించారు.ఇదీ చదవండి: బాబు బినామీ ముఠా గుప్పిట్లో శ్రీవారి ఆలయం..!
Daaku Maharaaj Review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ
టైటిల్: డాకు మహారాజ్నటీనటులు: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, సత్య తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకత్వం: బాబీ కొల్లిసంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ఎడిటర్: నిరంజన్ దేవరమానే, రూబెన్విడుదల తేది: జనవరి 12, 2025కథేంటంటే..చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన విద్యావేత్త కృష్ణమూర్తి (సచిన్ ఖేడ్కర్)కి ఓ కాఫీ ఎస్టేట్ ఉంటుంది. దాన్ని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు(రవి కిషన్) లీజుకు తీసుకొని కాఫీసాగు పేరుతో డ్రగ్స్, వన్య మృగాల అక్రమ రవాణ సాగిస్తుంటాడు. త్రిమూర్తులు, అతని తమ్ముడు కలిసి చేస్తున్న అరాచకాలు కృష్ణమూర్తికి తెలిసి పోలీసులను ఆశ్రయిస్తాడు. దీంతో త్రిమూర్తులు కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవితో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. చిన్నారి వైష్ణవికి ప్రాణ హానీ ఉందనే విషయం చంబల్ జైలులో ఉన్న మహారాజ్(బాలకృష్ణ)కు తెలుస్తుంది. తన అనుచరుల సహాయంతో అక్కడి నుంచి తప్పించుకొని కృష్ణమూర్తి ఇంటికి చేరుతాడు. నానాజీగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్‌గా చేరతాడు. చిన్నారి వైష్ణవిని చంపేందుకు ప్రయత్నించిన వారందరిని మట్టుబెడుతూ కృష్ణమూర్తి ఫ్యామిలీకి రక్షణగా నిలుస్తాడు. అసలు ఈ మహారాజ్ ఎవరు..? అతని నేపథ్యం ఏంటి..? చిన్నారి వైష్ణవికి, మహారాజ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? సివిల్ ఇంజనీర్ సీతారాం(బాలకృష్ణ), చంబల్ డాన్ బల్వంత్ ఠాకూర్(బాబీ డియోల్) మధ్య ఉన్న వైర్యం ఏంటి..? నందిని(శ్రద్ధా శ్రీనాథ్), కావేరి(ప్రగ్యా జైస్వాల్) ఎవరు..? ఇవన్నీ తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..బాలయ్య చేసే మాస్ యాక్షన్ సినిమాల నేపథ్యం దాదాపు ఒకేలా ఉంటుంది. విలన్ చెడు పనులు చేస్తూ జనాలను హింసించడం.. దాన్ని హీరో అడ్డుకోవడం. అన్ని కథలు ఇలానే ఉంటాయి. డాకు మహారాజ్(Daaku Maharaaj Review) కూడా అలాంటి కథే. అయితే పాత కథను కూడా కొత్తగా చెప్పడం కూడా ఓ కళ. అందులో దర్శకుడు బాబీ ఎప్పుడూ సక్సెస్ అవుతుంటాడు. రొటీన్ కథనే అయినా హీరో ఫ్యాన్స్‌కి నచ్చేలా తెరకెక్కిస్తాడు.బాలయ్య తాలుకు ఇమేజ్‌ని దృష్టిలో ఫక్తు కమర్షియల్ ఫార్మెట్లో డాకు మహారాజ్ కథనాన్ని సాగించాడు. ప్రతి పది నిమిషాలకొక యాక్షన్ సీన్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఆ యాక్షన్ సీన్లు కూడా కొత్తగా ఉంటాయి. గత సినిమాల మాదిరి బాలయ్య ఇందులో గట్టిగా అరవడం.. ఒంటి చేత్తో వందమందిని నరకడం లాంటివి ఉండవు. డీసెంట్ యాక్షన్ సీన్లతో బాలయ్యను కొత్తగా చూపించాడు. అయితే కథనం ఊహకందేలా సాగడం.. పాతకాలం నాటి సమస్యనే మళ్లీ తెరపై చూపించడం అంతగా ఆకట్టుకోదు. అలాగే మెయిన్ విలన్ని సెకండాఫ్ వరకు దాచడంతో హీరో, విలన్ల మధ్య సంఘర్షణ ఆసక్తికరంగా సాగలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా ఎత్తుగడ బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌ని ప్రారంభంలోనే చూపించి కథనంపై ఆసక్తిని పెంచేశారు. మొదటి పావుగంట కృష్ణమూర్తి ఫ్యామిలీ, ఎమ్మెల్యే త్రిమూర్తుల చుట్టూనే తిరుగుతుంది. నానాజీగా బాలయ్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. చిన్నారితో బాలయ్యకు ఏదో సంబంధం ఉంటుందని ఊహించినా.. అదేంటి అనేది సెకండాఫ్ వరకు దాచి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేశారు. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. సివిల్ ఇంజనీర్ సీతారాం, డాకు మహారాజ్ కథంతా ద్వితియార్థంలోనే వస్తుంది. చంబల్ ప్రజలకు ఉన్న ఓ ప్రధాన సమస్యను తీర్చేందుకు సీతారాం చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లోనే ఎక్కువ ఊచకోత ఉంటుంది. అది బాలయ్య అభిమానులను అలరిస్తుంది. ఎమోషన్ కోసం చిన్న పిల్లల పాత్రలను మరింత హింసాత్మకంగా తీర్చిదిద్దారు. అయితే ద్వితియార్థం ప్రారంభమైన కాసేపటికే ముగింపు ఎలా ఉంటుందని ఊహించొచ్చు. క్లైమాక్స్‌ని ఇంకాస్త షార్ఫ్ గా కట్ చేస్తే బాగుండేదేమో. బాలయ్య అభిమానులను మాత్రం ఈ సినిమా అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. బాలయ్యకు యాక్షన్ సినిమాలు కొత్తేమి కాదు. ఇలాంటి సినిమాల్లో మరింత దూకుడుగా నటిస్తాడు. డాకు మహారాజ్లో కూడా అదే స్థాయితో నటించాడు. నానాజీగా, సీతారాంగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి, ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించాడు. యాక్షన్ సీన్లలో ఎప్పటి మాదిరే అదరగొట్టేశాడు. ఇందులో గత సినిమాల మాదిరి పెద్ద పెద్ద డైలాగ్స్, అరవడాలు ఉండవు. బాలయ్య చెప్పే డైలాగ్ తీరు కొత్తగా ఉంటుంది. బల్వంత్ ఠాకూర్‌గా బాబీ డియోల్ తెరపై స్టైలీష్‌గా కనిపిస్తూనే డిఫరెంట్ విలనిజాన్ని చూపించాడు. ప్రగ్యా జైస్వాల్‌తో పోలిస్తే శ్రధ్ధా శ్రీనాథ్‌కి ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించింది. అయితే తెరపై మాత్ర ప్రగ్యానే ఎక్కువసేపు కనిపిస్తుంది. ఎమ్మెల్యే త్రిమూర్తులుగా రవికిషన్ చక్కగా నటించాడు. ఫస్టాఫ్‌లో ఆయన విలనిజం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఆయన పాత్ర ఇచ్చే సర్ప్రైజ్ ఆకట్టుకుంటుంది. ఊర్వశీ రౌతేలా పాటకే దబిడిదిబిడి పాటతో ఆకట్టుకోవడమే కాకుండా.. గ్లామర్‌తో యూత్‌ని అలరించింది. సచిన్ ఖేడ్కర్, చాందీనీ చౌదరితో పాటు వైష్ణవి పాత్ర పోషించిన చిన్నారి కూడా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. బాలయ్య సినిమా అంటే తమన్ రెచ్చిపోతాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాకు కూడా అదరిపోయే బీజీఎం అందించాడు. కొన్ని సీన్లకు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం గూస్బంప్స్ తెప్పిస్తాయి. పాటలు పర్వాలేదు. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. బాలయ్యతో కొత్త స్టంట్స్ చేయించారు. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
వెంకటేశ్వర చూస్తున్నావా..?
తిరుపతి,సాక్షి: తిరుపతి తొక్కిసలాటలో (tirupati stampede) మరణించిన బాధితుల కుటుంబాల పట్ల టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (br naidu) అత్యంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. వారికి అందించే నష్టపరిహారంలో ఒంటెద్దు పోకడను ప్రదర్శిస్తున్నారు. తిరుమల తొక్కిస లాట బాధిత కుటుంబాలకు చంద్రబాబు ప్రభుత్వం టీటీడీ డబ్బులతో నష్టపరిహారం చెల్లిస్తోంది. అయితే ఈ నష్టపరిహారాన్ని చెల్లించేందుకు బీఆర్ నాయుడు ఏ ఒక్క బాధిత కుటుంబానికి వెళ్లలేదు. వారిని పరామర్శించడం లేదు. టీటీడీ సభ్యులు, టీడీపీ నేతల ద్వారా పరిహారం పంపిణీ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు.తిరుపతి మహా విషాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మృతి చెందిన బాధిత కుటుంబాలకు టీటీడీ పాలక మండలి స్వయంగా క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించారు. అయితే, పవన్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బీఆర్ నాయుడు లెక్క చేయడం లేదు. విశాఖలో హోంమంత్రి అనిత, టీడీపీ ఎమ్మెల్యేల ద్వారా పరిహారం అందించి మమ అనిపిస్తున్నారు. పైగా, ప్రభుత్వం తరుఫు నుంచి కాకుండా టీటీడీ డబ్బులతోనే మృతుల కుటుంబాలకు చంద్రబాబు ప్రభుత్వం ఈ ఎక్స్ గ్రేషియా చెల్లిస్తోంది. పరిహారం విషయంలో చంద్రబాబు, బీఆర్ నాయుడిపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?క్షమాపణలు చెప్పితే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?.. ఎవరో ఏదో చెప్పారని మేం స్పందించాల్సిన అవసరం లేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కౌంటర్ ఇచ్చారు.తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, టీటీడీ చైర్మన్ బాధ్యత వహించాలని పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.. మృతుల కుటుంబాలకు టీటీడీ బోర్డు, పోలీసులు క్షమాపణ చెప్పాలన్నారు. తొక్కిసలాట జరుగుతుంటే పోలీసులు చోద్యం చూసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పోలీసుల వైఫల్యంపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగా జరగలేదన్నారు.మరోవైపు, టీటీడీ పాలకమండలి, ఈవో మధ్య వార్ కొనసాగుతోంది. అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. పాలకమండలి సభ్యులకు కనీస సమాచారం ఇవ్వడం లేదంటూ ఈవోపై సభ్యులు మండినట్లు సమాచారం.👉చదవండి : చింతించడం తప్ప చేసేదేమీ లేదు
Bus Accident: నలుగురు దుర్మరణం
ఇదేనా రైతురాజ్యం: హరీష్‌రావు
నేను విషం తాగి చస్తే మనశ్శాంతిగా ఉంటుందా? పావలా శ్యామల ఆవేదన
ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్‌రెడ్డిల మధ్య తోపులాట
కొత్త లుక్‌లో ఎలివేట్ బ్లాక్ ఎడిషన్: రేటెంతో తెలుసా?
పెళ్లికి ముందే ప్రియుడితో పూజ.. 'అబ్బాయి పేరెంట్స్ అయినా చెప్పాలిగా'
మ్యాక్స్‌వెల్ ఊచకోత.. సిక్సర్ల సునామీ
దుబాయ్ కారు రేసింగ్.. అజిత్ కుమార్ టీమ్ క్రేజీ రికార్డ్
ఇదే జరిగితే.. రూ.10 లక్షల వరకు నో ట్యాక్స్?
'ఆ దేవుడి ఆశీర్వాదం వల్లే బతికిపోయా..' ప్రముఖ బుల్లితెర నటి
సంక్రాంతికి వస్తానని.. తిరిగిరాని లోకాలకు
Daaku Maharaaj : ‘డాకు మహారాజ్’ ట్విటర్ రివ్యూ
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
నెలకు కనీసం రూ.7,500 పెన్షన్ ఇవ్వండి
Daaku Maharaaj Review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ
Ind vs Eng: భారత జట్టు ప్రకటన.. షమీ రీఎంట్రీ, సూపర్‌స్టార్‌పై వేటు!
గతంలో లడ్డూపై చేసిన వ్యాఖ్యలకా? నిన్న జరిగిన సంఘటనకా చెప్పేదీ!
'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
TG: రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల
వైఎస్ అభిషేక్‌రెడ్డి కన్నుమూత
Bus Accident: నలుగురు దుర్మరణం
ఇదేనా రైతురాజ్యం: హరీష్‌రావు
నేను విషం తాగి చస్తే మనశ్శాంతిగా ఉంటుందా? పావలా శ్యామల ఆవేదన
ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్‌రెడ్డిల మధ్య తోపులాట
కొత్త లుక్‌లో ఎలివేట్ బ్లాక్ ఎడిషన్: రేటెంతో తెలుసా?
పెళ్లికి ముందే ప్రియుడితో పూజ.. 'అబ్బాయి పేరెంట్స్ అయినా చెప్పాలిగా'
మ్యాక్స్‌వెల్ ఊచకోత.. సిక్సర్ల సునామీ
దుబాయ్ కారు రేసింగ్.. అజిత్ కుమార్ టీమ్ క్రేజీ రికార్డ్
ఇదే జరిగితే.. రూ.10 లక్షల వరకు నో ట్యాక్స్?
'ఆ దేవుడి ఆశీర్వాదం వల్లే బతికిపోయా..' ప్రముఖ బుల్లితెర నటి
సంక్రాంతికి వస్తానని.. తిరిగిరాని లోకాలకు
Daaku Maharaaj : ‘డాకు మహారాజ్’ ట్విటర్ రివ్యూ
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
నెలకు కనీసం రూ.7,500 పెన్షన్ ఇవ్వండి
Daaku Maharaaj Review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ
Ind vs Eng: భారత జట్టు ప్రకటన.. షమీ రీఎంట్రీ, సూపర్‌స్టార్‌పై వేటు!
గతంలో లడ్డూపై చేసిన వ్యాఖ్యలకా? నిన్న జరిగిన సంఘటనకా చెప్పేదీ!
'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
TG: రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల
వైఎస్ అభిషేక్‌రెడ్డి కన్నుమూత
సినిమా
అనారోగ్యంపై వార్తలు.. క్లారిటీ ఇచ్చిన హీరో విశాల్
హీరో విశాల్ (Vishal) ప్రధాన పాత్రలో నటించిన మదగజరాజ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షూటింగ్ పూర్తయిన 12 ఏళ్ల తర్వాత ఈ చిత్రం రిలీజ్‌కు నోచుకోవడం గమనార్హం. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విశాల్ బక్కచిక్కిపోయి వణుకుతూ కనిపించాడు. మైక్ పట్టుకున్నప్పుడు అతడి చేతులు వణకడంతో పాటు మాట కూడా తడబడుతూ వచ్చింది. సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అభిమానులు విశాల్‌కు ఏమైందని ఆందోళన చెందారు.వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న విశాల్ఈ క్రమంలో విశాల్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు అతడి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ప్రస్తుతం అతడు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని, పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ విశాల్ సినిమా ఈవెంట్‌కు రావడాన్ని పలువురూ అభినందిస్తున్నారు. అభిమానులు మాత్రం.. ఆయన ఆరోగ్యంపై దృష్టి సారించాలని, త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేశారు.ఆరు నెలలకోసారి దూరం?తాజాగా విశాల్ కోలుకున్నట్లు తెలుస్తోంది. మదగజరాజ సినిమా (Madha Gaja Raja Movie) ప్రీమియర్ షోకు హాజరైన విశాల్.. తన హెల్త్ అప్డేట్ ఇచ్చాడు. మా నాన్నగారి సంకల్పం వల్లే నేను ధృడంగా ఉండగలుగుతున్నాను. ఆయన ఇచ్చిన శక్తి వల్లే నా జీవితంలో ఎదురైన అడ్డంకులను దాటగలుగుతున్నాను. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే.. మూడు, ఆరు నెలలకోసారి సినిమాలకు దూరంగా ఉంటున్నానని, సరిగా పని చేయట్లేదని అంటున్నారు. ఎన్ని మాటలన్నా నేను మరింత శక్తి కూడదీసుకుని మీ ముందుకొస్తాను.(చదవండి: Daaku Maharaaj Review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ)ఇప్పుడు బానే ఉన్నానునేను అనారోగ్యంగా ఉండటం చూసి అభిమానులు ఆందోళన చెందారు. ఇప్పుడు నేను బాగున్నాను. చూడండి, నా చేతులు కూడా వణకడం లేదు. నా ఆరోగ్యం బాగుంది. మీరు చూపించిన ప్రేమకు తుదిశ్వాస వరకు రుణపడి ఉంటాను. మీ అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. మీరందరూ తప్పకుండా సినిమా చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పుకొచ్చాడు.ఆ సినిమాతో హీరోగా క్రేజ్కాగా విశాల్.. చెల్లమే (Chellamae Movie) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. సండ కోడి మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇంది తెలుగులో పందెం కోడిగా విడుదలవగా ఇక్కడ కూడా హిట్‌గా నిలిచింది. తామిరభరణి, మలైకొట్టాయి, సత్యం, తోరణై (పిస్తా), అవన్ ఇవన్, వేడి, పాట్టతు యానై, పాండియ నాడు, తుప్పరివాలన్, ఎనిమీ, సండకోడి 2, మార్క్ ఆంటోని వంటి పలు చిత్రాలతో అలరించాడు.ఎయిట్ ప్యాక్‌తో విశాల్మార్క్ ఆంటోని మూవీలో అదరదా పాట.. విశాలే ఆలపించాడు. అంతేకాదు మదగజరాజ సినిమాలోని మై డియర్ లవరూ సాంగ్ కూడా అతడే పాడటం విశేషం. ఇందులో విశాల్ ఎయిట్ ప్యాక్స్‌లో కనిపిస్తాడని డైరెక్టర్ సుందర్ తెలిపాడు. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో సుందర్ మాట్లాడుతూ.. క్లైమాక్స్‌లో 8 ప్యాక్స్‌తో కనిపించాలని హీరోకు చెప్పాను. కొన్ని కారణాల వల్ల ఆ క్లైమాక్స్ షూట్ ఆలస్యమైంది. అయినా సరే విశాల్ తన ఎయిట్ ప్యాక్ బాడీని ఏడాదిపాటు మెయింటెన్ చేశాడు అని సుందర్ పేర్కొన్నాడు. ఈ చిత్రంలో అంజలి హీరోయిన్గా నటించగా ఖుష్బూ కీలక పాత్ర పోషించింది. #Vishal Watching #MadhaGajaRaja Special Premiere 💯pic.twitter.com/sb9XNuvrt0— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) January 11, 2025 చదవండి: పుష్ప-2 రీ లోడ్ వర్షన్.. మేకర్స్ బిగ్ అప్డేట్
బాలయ్య 'డాకు మహారాజ్'.. ఏ ఓటీటీకి రానుందంటే?
నందమూరి బాలకృష్ణ నటించిన యాక్షన్ మూవీ డాకు మహారాజ్. బాలీ కొల్లి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిదంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంతో తమన్ మరోసారి తనదైన బీజీఎంతో అదరగొట్టేశాడని చెబుతున్నారు.డాకు మహారాజ్‌కు సక్సెస్ టాక్ రావడంతో సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ మూవీ ఓటీటీ గురించి అప్పుడే చర్చ మొదలెట్టారు. బాలయ్య మూవీ ఏ ఓటీటీకి రానుందని తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో ఓ టాక్ నడుస్తోంది. బాలకృష్ణ డాకు మహారాజ్ హక్కులను ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. భారీ ధరకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. అంతేకాకుండా ఈ సినిమాలో బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. (ఇది చదవండి: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ)టికెట్ ధరల పెంపు..జనవరి 12న విడుదల కానున్న మూవీకి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 12వ తేదీ ఉదయం 4 గంటల ప్రత్యేక షో కోసం అనుమతితో పాటు ఒక్కో టికెట్ రూ.500కు విక్రయించేందుకు అనుమతిచ్చింది. రోజుకు ఐదు షోలతో పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.135, సింగిల్ థియేటర్స్‌లలో రూ.110 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 26 వరకు ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి.ఈ సారి డాకు మహారాజ్ సినిమాపై అమెరికాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలో ఇప్పటికే టికెట్స్ ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో 10 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. అమెరికాలోని 125 లోకేషన్స్‌లలో 350 షోలు ప్రదర్శించారు.ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుజనవరి 9న జరగాల్సిన డాకు మహారాజ్ (Dsaku Maharaaj) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release Event) రద్దయింది. శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన భక్తులు తిరుపతిలో టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మరణించారు. ఇలాంటి విషాధ ఘటన సమయంలో సినిమా ఈవెంట్‌ను నిర్వహించడం సరైన నిర్ణయం కాదని చిత్ర యూనిట్ రద్దు చేసింది. ఈ నిర్ణయంతో బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. డైరెక్టర్ బాబీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం రాబోయే రోజుల్లో పలు సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్ముతున్నా. యాక్షన్‌తోపాటు మంచి వినోదం, భావోద్వేగాలతో కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది' అని అన్నారు. ఈ నెల 12న నా బర్త్ డే కానుకగా ఈ చిత్ర విజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్లు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కోరారు.
Daaku Maharaaj Review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ
టైటిల్: డాకు మహారాజ్నటీనటులు: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, సత్య తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకత్వం: బాబీ కొల్లిసంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ఎడిటర్: నిరంజన్ దేవరమానే, రూబెన్విడుదల తేది: జనవరి 12, 2025కథేంటంటే..చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన విద్యావేత్త కృష్ణమూర్తి (సచిన్ ఖేడ్కర్)కి ఓ కాఫీ ఎస్టేట్ ఉంటుంది. దాన్ని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు(రవి కిషన్) లీజుకు తీసుకొని కాఫీసాగు పేరుతో డ్రగ్స్, వన్య మృగాల అక్రమ రవాణ సాగిస్తుంటాడు. త్రిమూర్తులు, అతని తమ్ముడు కలిసి చేస్తున్న అరాచకాలు కృష్ణమూర్తికి తెలిసి పోలీసులను ఆశ్రయిస్తాడు. దీంతో త్రిమూర్తులు కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవితో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. చిన్నారి వైష్ణవికి ప్రాణ హానీ ఉందనే విషయం చంబల్ జైలులో ఉన్న మహారాజ్(బాలకృష్ణ)కు తెలుస్తుంది. తన అనుచరుల సహాయంతో అక్కడి నుంచి తప్పించుకొని కృష్ణమూర్తి ఇంటికి చేరుతాడు. నానాజీగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్‌గా చేరతాడు. చిన్నారి వైష్ణవిని చంపేందుకు ప్రయత్నించిన వారందరిని మట్టుబెడుతూ కృష్ణమూర్తి ఫ్యామిలీకి రక్షణగా నిలుస్తాడు. అసలు ఈ మహారాజ్ ఎవరు..? అతని నేపథ్యం ఏంటి..? చిన్నారి వైష్ణవికి, మహారాజ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? సివిల్ ఇంజనీర్ సీతారాం(బాలకృష్ణ), చంబల్ డాన్ బల్వంత్ ఠాకూర్(బాబీ డియోల్) మధ్య ఉన్న వైర్యం ఏంటి..? నందిని(శ్రద్ధా శ్రీనాథ్), కావేరి(ప్రగ్యా జైస్వాల్) ఎవరు..? ఇవన్నీ తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..బాలయ్య చేసే మాస్ యాక్షన్ సినిమాల నేపథ్యం దాదాపు ఒకేలా ఉంటుంది. విలన్ చెడు పనులు చేస్తూ జనాలను హింసించడం.. దాన్ని హీరో అడ్డుకోవడం. అన్ని కథలు ఇలానే ఉంటాయి. డాకు మహారాజ్(Daaku Maharaaj Review) కూడా అలాంటి కథే. అయితే పాత కథను కూడా కొత్తగా చెప్పడం కూడా ఓ కళ. అందులో దర్శకుడు బాబీ ఎప్పుడూ సక్సెస్ అవుతుంటాడు. రొటీన్ కథనే అయినా హీరో ఫ్యాన్స్‌కి నచ్చేలా తెరకెక్కిస్తాడు.బాలయ్య తాలుకు ఇమేజ్‌ని దృష్టిలో ఫక్తు కమర్షియల్ ఫార్మెట్లో డాకు మహారాజ్ కథనాన్ని సాగించాడు. ప్రతి పది నిమిషాలకొక యాక్షన్ సీన్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఆ యాక్షన్ సీన్లు కూడా కొత్తగా ఉంటాయి. గత సినిమాల మాదిరి బాలయ్య ఇందులో గట్టిగా అరవడం.. ఒంటి చేత్తో వందమందిని నరకడం లాంటివి ఉండవు. డీసెంట్ యాక్షన్ సీన్లతో బాలయ్యను కొత్తగా చూపించాడు. అయితే కథనం ఊహకందేలా సాగడం.. పాతకాలం నాటి సమస్యనే మళ్లీ తెరపై చూపించడం అంతగా ఆకట్టుకోదు. అలాగే మెయిన్ విలన్ని సెకండాఫ్ వరకు దాచడంతో హీరో, విలన్ల మధ్య సంఘర్షణ ఆసక్తికరంగా సాగలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా ఎత్తుగడ బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌ని ప్రారంభంలోనే చూపించి కథనంపై ఆసక్తిని పెంచేశారు. మొదటి పావుగంట కృష్ణమూర్తి ఫ్యామిలీ, ఎమ్మెల్యే త్రిమూర్తుల చుట్టూనే తిరుగుతుంది. నానాజీగా బాలయ్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. చిన్నారితో బాలయ్యకు ఏదో సంబంధం ఉంటుందని ఊహించినా.. అదేంటి అనేది సెకండాఫ్ వరకు దాచి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేశారు. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. సివిల్ ఇంజనీర్ సీతారాం, డాకు మహారాజ్ కథంతా ద్వితియార్థంలోనే వస్తుంది. చంబల్ ప్రజలకు ఉన్న ఓ ప్రధాన సమస్యను తీర్చేందుకు సీతారాం చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లోనే ఎక్కువ ఊచకోత ఉంటుంది. అది బాలయ్య అభిమానులను అలరిస్తుంది. ఎమోషన్ కోసం చిన్న పిల్లల పాత్రలను మరింత హింసాత్మకంగా తీర్చిదిద్దారు. అయితే ద్వితియార్థం ప్రారంభమైన కాసేపటికే ముగింపు ఎలా ఉంటుందని ఊహించొచ్చు. క్లైమాక్స్‌ని ఇంకాస్త షార్ఫ్ గా కట్ చేస్తే బాగుండేదేమో. బాలయ్య అభిమానులను మాత్రం ఈ సినిమా అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. బాలయ్యకు యాక్షన్ సినిమాలు కొత్తేమి కాదు. ఇలాంటి సినిమాల్లో మరింత దూకుడుగా నటిస్తాడు. డాకు మహారాజ్లో కూడా అదే స్థాయితో నటించాడు. నానాజీగా, సీతారాంగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి, ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించాడు. యాక్షన్ సీన్లలో ఎప్పటి మాదిరే అదరగొట్టేశాడు. ఇందులో గత సినిమాల మాదిరి పెద్ద పెద్ద డైలాగ్స్, అరవడాలు ఉండవు. బాలయ్య చెప్పే డైలాగ్ తీరు కొత్తగా ఉంటుంది. బల్వంత్ ఠాకూర్‌గా బాబీ డియోల్ తెరపై స్టైలీష్‌గా కనిపిస్తూనే డిఫరెంట్ విలనిజాన్ని చూపించాడు. ప్రగ్యా జైస్వాల్‌తో పోలిస్తే శ్రధ్ధా శ్రీనాథ్‌కి ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించింది. అయితే తెరపై మాత్ర ప్రగ్యానే ఎక్కువసేపు కనిపిస్తుంది. ఎమ్మెల్యే త్రిమూర్తులుగా రవికిషన్ చక్కగా నటించాడు. ఫస్టాఫ్‌లో ఆయన విలనిజం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఆయన పాత్ర ఇచ్చే సర్ప్రైజ్ ఆకట్టుకుంటుంది. ఊర్వశీ రౌతేలా పాటకే దబిడిదిబిడి పాటతో ఆకట్టుకోవడమే కాకుండా.. గ్లామర్‌తో యూత్‌ని అలరించింది. సచిన్ ఖేడ్కర్, చాందీనీ చౌదరితో పాటు వైష్ణవి పాత్ర పోషించిన చిన్నారి కూడా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. బాలయ్య సినిమా అంటే తమన్ రెచ్చిపోతాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాకు కూడా అదరిపోయే బీజీఎం అందించాడు. కొన్ని సీన్లకు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం గూస్బంప్స్ తెప్పిస్తాయి. పాటలు పర్వాలేదు. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. బాలయ్యతో కొత్త స్టంట్స్ చేయించారు. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
పుష్ప-2 రీ లోడ్ వర్షన్.. మేకర్స్ బిగ్ అప్డేట్
నెల రోజులు దాటినా బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఏమాత్రం తగ్గట్లేదు. ఇప్పటికే రూ.1831 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. బాహుబలి-2 రికార్డ్‌ను అధిగమించిన పుష్ప-2 మరో రెండు వేల కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఇదే క్రమంలో అమిర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ దంగల్ వసూళ్లపై కన్నేసింది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే దంగల్ రికార్డ్‌ను క్రాస్ చేయనుంది.మేకర్స్ బిగ్ ప్లాన్..పుష్ప-2 ఫ్యాన్స్‌కు ఇటీవలే గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. త్వరలోనే రీ లోడెడ్ వర్షన్ థియేటర్లలో విడుదల ప్రకటించారు. ఈనెల 17 నుంచి పుష్ప రీ లోడెడ్ థియేటర్లలో అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. తాజాగా దీనికి సంబంధించిన గ్లింప్స్ ప్రోమో మేకర్స్ విడుదల చేశారు. దాదాపు 25 సెకన్ల పాటు ఉండే రీ లోడ్ వర్షన్ గ్లింప్స్ ప్రోమో రిలీజ్ చేశారు. అదేంటో మీరు కూడా చూసేయండి. దంగల్‌పైనే గురి..'పుష్ప 2' (Pushpa 2 The Rule) ఇప్పటికే రూ.1000 కోట్లకుపైగా సాధించిన భారతీయ చిత్రాల లిస్ట్‌లో రెండో స్థానంలో ఉంది. అదే టాలీవుడ్ సినిమా లిస్ట్‌లో అయితే ప్రథమ స్థానం. ఇండియన్ బాక్సాఫీస్ టాప్ కలెక్షన్ల పరంగా ఇప్పటి వరకు 'దంగల్' (రూ. 2,070 కోట్లు), 'బాహుబలి 2' (రూ.1810 కోట్లు) సాధించి వరుస స్థానాల్లో ఉన్నాయి.అయితే ఇప్పటికే పుష్ప2 (Pushpa 2: The Rule) ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు (గ్రాస్) రాబట్టి కలెక్షన్స్ పరంగా రెండో స్థానంలో చేరిపోయింది. మరో రూ. 200 కోట్ల కలెక్షన్స్ వస్తే దంగల్ (Dangal) రికార్డ్ బద్దలవుతుంది. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం పుష్ప2 నిలుస్తుంది. ఇప్పటి వరకు దంగల్ రికార్డ్‌ను ఏ మూవీ అధిగమించలేకపోయింది. ఇప్పుడు ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టే ఛాన్స్ పుష్ప-2 మాత్రమే ఉంది.హిందీలో భారీ రికార్డులు..అల్లు అర్జున్ పుష్ప-2 ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. కేృవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికే 'బాహుబలి-2' వసూళ్లను పుష్ప-2 అధిగమించింది. జనవరి 17 నుంచి పుష్ప-2 రీ లోడెడ్ వెర్షన్ వస్తుందని చెప్పడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిందీలో అయితే గతంలో ఎప్పుడు లేని రికార్డులు నెలకొల్పింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో పాన్ ఇండియాలో ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించింది.ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ రికార్డ్..పుష్ప-2 విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టించింది. పుష్పరాజ్ కలెక్షన్స్ చూసి ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు. తొలి రోజు నుంచే ఇండియాలో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటించంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతమందించారు. మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ మరోసారి అభిమానులను మెప్పించారు. #Pushpa2Reloaded storms into theatres on JAN 17th! 🔥Here’s the GLIMPSE to ignite your excitement! ❤️🔥Telugu - https://t.co/5N7M2xgZTU#Pushpa2 #WildFirePushpa #Pushpa2TheRule pic.twitter.com/4M4KcZYmL2— Mythri Movie Makers (@MythriOfficial) January 12, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు
రాయల్స్ ఓపెనర్ విధ్వంసం.. మార్క్రమ్ మెరుపు ఇన్నింగ్స్ వృధా
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20 2025) నిన్న (జనవరి 11) రెండు మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌పై పార్ల్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కెప్టెన్ మార్క్రమ్ 49 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జోర్డన్ హెర్మన్ 10, జాక్ క్రాలే 27, టామ్ ఏబెల్ 20, మార్కో జన్సెన్ 4, ట్రిస్టన్ స్టబ్స్ 28 (నాటౌట్) పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో క్వేనా మపాకా, ముజీబ్ ఉర్ రెహ్మాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ 18.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ లుహాన్ డ్రే ప్రిటోరియస్ (51 బంతుల్లో 97; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) రాయల్స్ గెలుపుకు బలమైన పునాది వేశాడు. మరో ఓపెనర్ జో రూట్ 44 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 62 పరుగులు చేసి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. రూట్‌కు కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (17 నాటౌట్) సహకరించాడు. రాయల్స్ కోల్పోయిన ఏకైక వికెట్ మార్కో జన్సెన్కు దక్కింది.డిఫెండింగ్ ఛాంపియన్‌ను చిత్తు చేసిన సూపర్ కింగ్స్నిన్ననే జరిగిన రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌పై జోబర్గ్ సూపర్ కింగ్స్ ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు జార్జ్ లిండే (48 నాటౌట్), డెలానో పాట్గెటర్ (44 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఎంఐ ఈ మాత్రమే స్కోరైనా చేయగలిగింది. కేప్‌టౌన్ 75 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోగా.. లిండే, పాట్గెటర్ తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. జోబర్గ్ సూపర్ కింగ్స్ బౌలర్లలో తబ్రేజ్ షంషి, డేవిడ్ వీస్, సిపామ్లా, ఈవాన్ జోన్స్ తలో వికెట్ పడగొట్టారు.141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్‌కింగ్స్‌కు వర్షం పలుమార్లు అడ్డుతగిలింది. 11.3 ఓవర్ల అనంతరం మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన సూపర్ కింగ్స్‌ను విజేతగా ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి సూపర్ కింగ్స్ 3 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే 9, డుప్లెసిస్ 30, లుస్ డు ప్లూయ్ 24 (నాటౌట్), జానీ బెయిర్‌స్టో 14 పరుగులు చేశారు. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన డుప్లెసిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఎంఐ బౌలర్లలో రబాడకు రెండు, ట్రెంట్ బౌల్ట్‌కు ఓ వికెట్ దక్కాయి.
యాషెస్ సిరీస్‌లో బోణీ కొట్టిన ఆసీస్
మహిళల యాషెస్ సిరీస్-2025లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ఇవాళ (జనవరి 12) జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆష్లే గార్డ్నర్ ఆల్‌రౌండ్ షోతో (3/19, 42 నాటౌట్) అదరగొట్టి ఆసీస్‌ను గెలిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 43.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లు తలో చేయి వేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఆష్లే గార్డ్నర్ మూడు, కిమ్ గార్త్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, అలానా కింగ్ తలో రెండు, డార్సీ బ్రౌన్ ఓ వికెట్ తీశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ హీథర్ నైట్ (39), వ్యాట్ హాడ్జ్ (38), ఆమీ జోన్స్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. టామీ బేమౌంట్ (13), నాట్ సీవర్ బ్రంట్ (19), సోఫీ ఎక్లెస్టోన్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. మయా బౌచియర్ 9, అలైస్ క్యాప్సీ 4, చార్లీ డీన్ 1, లారెన్ బెల్ 1, లారెన్ ఫైలర్ 8 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 38.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అలైసా హీలీ (70) ఆసీస్ గెలుపుకు పునాది వేయగా.. ఆష్లే గార్డ్నర్ (44 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) తన జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 4, ఎల్లిస్ పెర్రీ 14, బెత్ మూనీ 28, అన్నాబెల్ సదర్‌ల్యాండ్ 10, తహిళ మెక్‌గ్రాత్ 2, అలానా కింగ్ 11 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్ తలో రెండు, లారెన్ బెల్, చార్లెట్ డీన్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మెల్బోర్న్ వేదికగా జనవరి 14న జరుగనుంది. కాగా, మూడు వన్డేలు, మూడు టీ20లు, ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఈ మ్యాచ్‌లన్నీ జరుగనున్నాయి.
గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్.. పూరన్, పోలార్డ్ కూడా ఏమీ చేయలేకపోయారు..!
దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషన్ లీగ్ టీ20, 2025 ఎడిషన్ (రెండో ఎడిషన్) నిన్న (జనవరి 11) ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్.. దుబాయ్ క్యాపిటల్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు పరాభవం ఎదురైంది. తప్పక గెలుస్తుందనున్న మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ పరుగు తేడాతో ఓటమిపాలైంది. విధ్వంసకర ఆటగాళ్లు నికోలస్ పూరన్, కీరన్ పోలార్డ్ జట్టులో ఉన్నా ముంబై ఇండియన్స్‌ను గెలిపించలేకపోయారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. దుబాయ్ ఆటగాళ్లలో బ్రాండన్ మెక్‌ముల్లెన్ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. రోవమన్ పావెల్ (25), దసున్ షనక (13), కెప్టెన్ సికందర్ రజా (10) రెండంకెల స్కోర్లు చేయగా.. షాయ్ హోప్ 9, రొస్సింగ్టన్ 9, గుల్బదిన్ నైబ్ 2, ఫర్హాన్ ఖాన్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై పేసర్ ఫజల్హక్ ఫారూకీ (4-0-16-5) ఐదు వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి దుబాయ్ క్యాపిటల్స్‌ను ఇబ్బంది పెట్టాడు. అల్జరీ జోసఫ్, జహూర్ ఖాన్‌కు తలో వికెట్ దక్కింది.స్వల్ప లక్ష్య ఛేదనలో ఎంఐ ఎమిరేట్స్ కూడా తడబడింది. ఆ జట్టు 23 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో కెప్టెన్ నికోలస్ పూరన్ (40 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) తన జట్టును గెలిపించుకునేందుకు విఫలయత్నం చేశాడు. పూరన్‌కు అకీల్ హొసేన్ (31 బంతుల్లో 30; 2 ఫోర్లు) కాసేపు సహకరించాడు. ఆఖరి ఓవర్లో కీరన్ పోలార్డ్ (15 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) ఎంత ప్రయత్నించినా తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. చివరి బంతికి ఆరు పరుగులు కావాల్సి ఉండగా పోలార్డ్ బౌండరీ బాదాడు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. దుబాయ్ క్యాపిటల్స్ పరుగు తేడాతో గెలుపొందింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఎంఐ ఎమిరేట్స్ 7 వికెట్ల కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో ముహమ్మద్ వసీం, ఆండ్రీ ఫ్లెచర్, అల్జరీ జోసఫ్ డకౌట్లు కాగా.. కుసాల్ పెరీరా 12, టామ్ బాంటన్ 7 పరుగులు చేశారు.గెలుపు దూరం చేసిన గుల్బదిన్ నైబ్, ఓల్లీ స్టోన్ఓ దశలో ఎంఐ ఎమిరేట్స్ సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. ఆ జట్టు 18 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే సాధించాల్సి ఉండింది. చేతిలో ఐదు వికెట్లు ఉండేవి. ఈ దశలో గుల్బదిన్ నైబ్ (4-0-13-3, ఓల్లీ స్టోన్ (4-1-14-2) ముంబైకు గెలుపును దూరం చేశారు. 18వ ఓవర్ వేసిన గుల్బదిన్ నైబ్ రెండు కీలక వికెట్లు తీసి (పూరన్, అల్జరీ జోసఫ్) కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనంతరం 19వ ఓవర్ వేసిన ఓల్లీ స్టోన్ మరింత పొదుపుగా బౌలింగ్ చేసి కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. చివరి ఓవర్ వచ్చే సరికి ముంబై గెలుపుకు 13 పరుగులు అవసరమయ్యాయి. ఫర్హాన్ ఖాన్ బౌలింగ్‌లో పోలార్డ్ రెండు బౌండరీలు బాదినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ఓవర్లో 11 పరుగులు మాత్రమే వచ్చాయి. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలకమైన వికెట్లు తీసిన గుల్బదిన్ నైబ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం న్యూజిలాండ్ జట్టు ప్రకటన
ఛాంపియన్స్ ట్రోఫీ-2025, దానికి ముందు పాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ఇవాళ (జనవరి 12) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మిచెల్ సాంట్నర్ ఎంపికయ్యాడు. కెప్టెన్ అయ్యాక సాంట్నర్‌కు ఇదే తొలి ఇసీసీ టోర్నీ. ఈ రెండు టోర్నీల కోసం పేస్ బౌలింగ్ త్రయం విలియమ్ ఓరూర్కీ, బెన్ సియర్స్, నాథన్ స్మిత్ ఎంపికయ్యారు. ఈ ముగ్గురికి ఇదే తొలి ఐసీసీ టోర్నీ. పేసర్ జేకబ్ డఫీ ఈ రెండు టోర్నీల కోసం స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ILT20 ప్లే ఆఫ్స్ నేపథ్యంలో లోకీ ఫెర్గూసన్ ట్రయాంగులర్ సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే స్టాండ్ బైగా డఫీ ఎంపికయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌ను ఆతిథ్య పాకిస్తాన్‌తో ఆడనుంది. టోర్నీ ఆరంభ రోజునే ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ తొలి ఎడిషన్‌లో (2000) న్యూజిలాండే విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.ఛాంపియన్స్ ట్రోఫీ-2025, పాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు.. మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్స్టాండ్ బై: జేకబ్ డఫీపాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 8- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ (ముల్తాన్)ఫిబ్రవరి 10- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (ముల్తాన్)ఫిబ్రవరి 12- పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (ముల్తాన్)ఫిబ్రవరి 14- ఫైనల్ (ముల్తాన్)ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్..ఫిబ్రవరి 19- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్ -ఏ, కరాచీఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్ఫిబ్రవరి 21- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా, గ్రూప్-బి, కరాచీఫిబ్రవరి 22- ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, లాహోర్ఫిబ్రవరి 23- పాకిస్తాన్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్ఫిబ్రవరి 24- బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఏ, రావల్పిండిఫిబ్రవరి 25- ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా, గ్రూప్-బి,రావల్పిండిఫిబ్రవరి 26- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, లాహోర్ఫిబ్రవరి 27- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఏ, రావల్పిండిఫిబ్రవరి 28- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, గ్రూప్-బి, లాహోర్మార్చి 01- దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, కరాచీమార్చి 02- న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్మార్చి 04- మొదటి సెమీ ఫైనల్ (A1 వర్సెస్ B2), దుబాయ్మార్చి 05- రెండో సెమీ ఫైనల్ (B1 వర్సెస్ A2), లాహోర్మార్చి 09- ఫైనల్ఈ టోర్నీలో మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి.
బిజినెస్
కాగ్నిజెంట్ సరికొత్త ఎత్తుగడ.. ప్రత్యర్థులకు దడ!
ప్రముఖ బహుళజాతి ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ (Cognizant) భారత్‌లోని తమ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును (retirement age) 58 నుండి 60 సంవత్సరాలకు పెంచింది. విస్తృత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కాగ్నిజెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది.పేరోల్‌లో ఎలాంటి మార్పు లేకుండా ఆన్-సైట్లో బదిలీ అయిన వారితో సహా దేశంలోని కాగ్నిజెంట్ ఉద్యోగులందరికీ ఈ మార్పు వర్తిస్తుంది. అనుభవజ్ఞులను నిలుపుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ మెమోలో వివరించింది.దేశంలోని చాలా ఐటీ కంపెనీల్లో (IT Company) ప్రస్తుతం పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలుగా ఉంది. అయితే రిటైర్మెంట్ వయసును పెంచుతూ కాగ్నిజెంట్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో పోటీతత్వ ప్రపంచంలో సరికొత్త మార్పులు రానున్నాయి. అనుభవజ్ఞులైన నిపుణులను సద్వినియోగం చేసుకునేందుకు కంపెనీకి ఆస్కారం ఏర్పడుతుంది.చిన్న నగరాలపై దృష్టిభారత్లో జరిగిన ఒక కార్యక్రమంలో కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ పీటీఐతో మాట్లాడుతూ.. కంపెనీ ప్రపంచ కార్యకలాపాలలో భారత్ పాత్ర ఉంటుందన్నది వివరించారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నుండి ఇటీవల ప్రవాసీ భారతీయ సమ్మాన్ 2025 అవార్డును అందుకున్న రవి, గ్లోబల్ టెక్నాలజీ ల్యాండ్‌స్కేప్‌లో భారత్‌కు పెరుగుతున్న ప్రాముఖ్యతను హైలైట్ చేశారు.“కాగ్నిజెంట్ చాలా పెద్ద కంపెనీ. భారత్‌లో మాకు 250,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇంతకుముందు, మేము పెద్ద నగరాల నుండి ఆపరేట్ చేశాము. ఇప్పుడు మేము చిన్న నగరాల నుండి ఆపరేట్ చేస్తున్నాము. మా ప్రయత్నం చిన్న నగరాలకు తీసుకెళ్లడం, కాబట్టి మేము ఇండోర్‌లో ప్రారంభించాము” అని పేర్కొన్నారు.పదవీ విరమణ వయస్సును పెంచడంతోపాటు భారత్-ఆధారిత ప్రతిభ వ్యూహాన్ని రెట్టింపు చేయడం ద్వారా గ్లోబల్ టెక్నాలజీ పవర్‌హౌస్‌గా ఎదుగుతున్న భారత్‌కు సహకారం అందిస్తూనే ప్రపంచ ఐటీ సేవల మార్కెట్లో అగ్రగామిగా తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని కాగ్నిజెంట్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఆప్షన్స్ ట్రేడింగ్‌లో సక్సెస్ కావాలంటే....
ఆప్షన్స్ ట్రేడింగ్ (options trading)లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించడానికి ఎంత అవకాశం ఉందో... ఉన్న డబ్బులు ఊడ్చిపెట్టుకుని పోవడానికీ అంతే అవకాశం ఉంటుంది. ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఎట్ ది మనీ (ఏటీఎం), ఇన్ ది మనీ (ఐటీఎం), అవుట్ ఆఫ్ ది మనీ (ఓటీఎం) లది ప్రధాన పాత్ర అని గత ఆర్టికల్ లో చెప్పుకున్నాం. అలాగే ఏటీఎం కాల్స్, పుట్స్ ఎలాంటి ప్రయోజనం కలగజేస్తాయో కూడా చర్చించుకున్నాం.ఇప్పుడు ఐటీఎం, ఓటీఎం ల గురించి మాట్లాడుకుందాం. ఆప్షన్స్ ట్రేడింగ్ లో స్మార్ట్ ట్రేడర్లు అనుసరించే పద్ధతి ఐటీఎం. మళ్ళీ ఎస్బీఐ షేరు నే ఉదాహరణగా తీసుకుందాం.ప్రస్తుతం ఎస్బీఐ షేరు ధర రూ.744 దగ్గర ఉంది. స్ట్రైక్ ప్రైస్ 10 రూపాయల తేడాలో 730, 740, 750... ఇలా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఇపుడు 730 రూపాయల కాల్ తీసుకుంటే.. అది ఐటీఎం కాల్ అవుతుంది. అంటే అండర్ లయింగ్ అసెట్ (ఈక్విటీ షేరు ధర) కంటే షేరు ధర తక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఐటీఎం కాల్ గా వ్యవహరిస్తారు. ఇంకా తక్కువ ధరలు ఉండే 720, 710, 700 రూపాయల కాల్స్ కొనుగోలు చేస్తే అవి డీప్ ఐటీఎం కాల్స్ అవుతాయి. ఇవి రేటు ఎక్కువ ఉంటాయి. ధరల్లో ఊగిసలాటలు కూడా ఎక్కువే ఉంటాయి. అంటే పెరగడం ఎంత వేగంగా పెరుగుతాయో పడటమూ అంతే వేగంగా ఉంటాయి. కాబట్టి సగటు ట్రేడరు కొంచెం ఎక్కువ రిస్క్ భరించాల్సి ఉంటుంది.ఇప్పుడు ఎస్బీఐ షేరు ధరను దృష్టిలో పెట్టుకుని 730 రూపాయల కాల్ సెలెక్ట్ చేసుకుందాం. దీని ధర ప్రస్తుతం రూ. 28 వద్ద ఉంది. షేరు పెరుగుతున్న కొద్దీ ఇది పెరిగే వేగం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే షేరు 730 దిగువకు రానంత సేపూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఒకవేళ కాల్ ధర తగ్గినప్పటికీ మళ్ళీ పుంజుకోవడానికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ జోరు తగ్గుతుంది. అదెలాగంటే... షేరు ధర 730 నుంచి 780 కి వెళ్ళేటప్పటికి మీరు కొన్న కాల్ 28 రూపాయల నుంచి 70 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. షేరు ధర 750 కి పడినప్పుడు 30 -35 కి వచ్చేస్తుంది. మళ్ళీ షేరు పెరగడం మొదలై 780 కి వెళ్లినా ఈసారి కాల్ ధర 60 దాటకపోవచ్చు. అంటే మొదట పెరిగినంత వేగంగా రెండోసారి పెరగదన్న మాట. దీనికి కారణం ఆప్షన్ గ్రీక్స్. ఇవే ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాయి. ఇక పుట్స్ విషయానికొస్తే... కాల్స్ కి ఇది రివర్స్. షేరు ధర 744 దగ్గర ఉంది కాబట్టి మనం 760 పుట్ కొంటే.... అది ఎంత పడితే పుట్ ధర అంత పెరుగుతూ వెళ్తుంది. ట్రేడర్లు సరిగా సద్వినియోగం చేసుకోగలిగితే... ఐటీఎం కాల్స్, పుట్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయన్నది నిర్వివాదం.ఇదీ చదవండి: Stock Market: ఎన్నాళ్లు ఆగితే.. అన్ని లాభాలు!ఇక ఓటీఎంల విషయానికొద్దాం. ఆప్షన్స్ ట్రేడింగ్ లో అత్యంత ప్రమాదకరమైనవే ఈ ఓటీఎం కాల్స్, పుట్స్. కానీ నూటికి 90 మంది ఈ ఓటీఎం ల్లోనే ట్రేడింగ్ చేస్తారు. సంపాదించేది తక్కువే అయినా.. పోగొట్టుకునేది మాత్రం వీటిలో ఎక్కువే. మరి డబ్బులు పోతాయి అని తెల్సినా... ఈ ఓటీఎంల్లోనే ఎందుకు ట్రేడింగ్ చేస్తారంటే దానికి రెండు కారణాలు చెప్పుకోవచ్చు.1. ప్రీమియం రేట్లు చాలా చౌకగా ఉండటం. 2. తక్కువ పెట్టుబడి తో భారీ లాభాలు సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు ఉండటం.ఎస్బీఐ షేరు 744 దగ్గర ఉంది కదా... చాలామంది 760, 770, 780 కాల్స్ కొంటారు. ఇంకా చెప్పాలంటే 800 కాల్స్ కూడా తీసుకుంటారు. వీటి రేట్లు వరుసగా 11, 8, 6, 3 స్థాయిలో ఉన్నాయి. అంటే 760 కాల్ ఒక లాట్ కొనడానికి 8250 పెట్టుబడి అవసరమైతే... 770 కాల్ కు 6000, 780 కాల్ కు 4500, 800 కాల్ కు 2250 పెట్టుబడి సరిపోతుంది. అంటే కేవలం ఓ 3000 నుంచి 10000 చేతిలో ఉన్న వ్యక్తి కూడా చాలా సులువుగా ఎస్బీఐ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేసేయగలడు. రిటైల్ ట్రేడర్లని ఆకర్షించేవి ఈ రేట్లే. 6 రూపాయలు పెట్టి 780 కాల్ కొన్న వ్యక్తికి గిట్టుబాటు కావాలంటే... షేర్ ధర 780 దాటి పెరగాలి. అది కూడా కంటిన్యూ గా పెరుగుతూ రావాలి. ఒకసారి పెరిగి, ఇంకోసారి పడి... ఇలా ముందుకెళ్తే కుదరదు. వీటిలో ఉన్న దుర్లక్షణం ఏమిటంటే.... పెరిగినప్పుడు చాలా స్వల్పంగా పెరిగితే.. షేరు ధర పడేటప్పుడు చాలా ఎక్కువగా పడిపోతూ ఉంటాయి. కాంట్రాక్టు ఎక్సపైరీ టైం కి మొత్తం పెట్టుబడి కాస్తా సున్నా అయిపోతుంది. కానీ సగటు ట్రేడరు మాత్రం మళ్ళీ పెరగొచ్చులే... అని చివరి దాకా ఎదురుచూస్తూనే ఉంటాడు. చివరకు నష్టంతోనే బయటకొస్తాడు. మార్కెట్ ను తిట్టుకుంటాడు.. మళ్ళీ పోగుట్టుకున్న డబ్బులు సంపాదించేయాలన్న ఆతృతతో విఫల యత్నాలు చేస్తూనే ఉంటాడు.ఇప్పుడు అర్ధం అయింది కదా... ఆప్షన్స్ ట్రేడింగ్ చిన్న ట్రేడర్లకు ఎంత ప్రమాదకరమో... ఆ తప్పులు చేయకూడదంటే.... ఆప్షన్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మార్కెట్ పరిస్థితులపై అవగాహన కల్పించుకోవాలి. తగిన క్యాపిటల్ చేతిలో ఉండాలి. ఎప్పటికప్పుడు వచ్చే న్యూస్ ఫాలో అవుతూ ఉండాలి. ప్రత్యేకించి ఒక షేరు కు సంబంధించి.. ఆప్షన్స్ కొంటున్నప్పుడు టైం కి ప్రాధాన్యమివ్వాలి.ఆప్షన్ గ్రీక్స్ అర్ధం చేసుకోవాలి. ఆప్షన్స్ చైన్ అనలైజ్ చేయడం రావాలి. టెక్నికల్ తెలిసి ఉండాలి. ఇవేవీ తెలియకుండా... చేతిలో కాసిన్ని డబ్బులు పెట్టుకుని... లక్షలు, కోట్లు సంపాదించేయొచ్చు అని వేషాలేస్తే... ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోవడం ఖాయం. అంచేత... పొరపాట్లకు తావివ్వక ముందుకు సాగే ట్రేడర్లు మాత్రమే ఆప్షన్స్ ట్రేడింగ్ లో సక్సెస్ అవుతారనేది తోసిపుచ్చలేని వాస్తవం.-బెహరా శ్రీనివాస రావుస్టాక్ మార్కెట్ విశ్లేషకులు
హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు @సేల్!
డిమాండ్‌కు మించి సరఫరా జరుగుతుండటంతో హైదరాబాద్‌లో (hyderabad) అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) (residential real estate inventory) పెరిగిపోతున్నాయి. దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే ముంబై తర్వాత హైదరాబాద్‌లోనే అత్యధిక ఇన్వెంటరీ ఉంది. - సాక్షి, సిటీబ్యూరోఇక, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పోలిస్తే మన దగ్గరే ఎక్కువ. గతేడాది నాటికి గ్రేటర్లో 1,01,091 ఇళ్ల ఇన్వెంటరీ (వీటిలో నిర్మాణంలో ఉన్నవి, పూర్తయినవి కలిపి) ఉంది. వీటి విక్రయానికి కనిష్టంగా 19 నెలల కాలం పడుతుంది. గత రెండేళ్లలో నగరంలో గృహాల సరఫరా పెరగడమే ఇన్వెంటరీ పెరుగుదలకు ప్రధాన కారణం.దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఏడాది తొలి తొమ్మిది నెలల కాలంలో మొత్తం 5,64,416 యూనిట్ల ఇన్వెంటరీ మిగిలి ఉందని, వీటి విక్రయానికి కనిష్టంగా 14 నెలల కాలం పడుతుందని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది.ఇదీ చదవండి: మెట్రో వెంట.. రియల్ ఎస్టేట్ బూమ్!2024లో కొత్త ఇళ్ల సరఫరా అంతకు ముందు ఏడాదితో పోలిస్తే తగ్గిందని అనరాక్ నివేదిక పేర్కొంది. ఎన్నికల నేపథ్యంలో అప్రూవల్స్‌లో జాప్యం కారణంగా హౌసింగ్ సప్లయి తగ్గిపోయినట్లు చెప్పినట్లు చొప్పుకొచ్చింది.2025 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ప్రధాన నగరాల్లో దాదాపు 253 మిలియన్ చ.అ.మేర కొత్త ఇళ్ల సరఫరాను ప్రారంభించే ప్రణాళికలను టాప్ 11 లిస్టెడ్ డెవలపర్లు ఏడాది ప్రారంభంలో ప్రకటించారని అనరాక్ గుర్తు చేసింది. అయితే సార్వత్రిక, రాష్ట్రాల ఎన్నికల కారణంగా వీటిలో కేవలం 23% లేదా 57 మిలియన్ చ.అ.ల మేర ప్రాజెక్ట్‌లు మాత్రమే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభమయ్యాయి.
టీవీఎస్ జూపిటర్.. 70 లక్షల స్కూటర్లు
టీవీఎస్ మోటార్ కంపెనీ మరో ఘనతను సాధించింది. కంపెనీ తయారీ జూపిటర్ స్కూటర్ (TVS Jupiter) 70 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంది. హోల్‌సేల్‌గా కంపెనీ 2024 నవంబర్ నాటికి 71,40,927 యూనిట్లను విక్రయించింది. 2013 సెప్టెంబర్ నుంచి సంస్థ మొత్తం 1.14 కోట్ల స్కూటర్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో జూపిటర్ వాటా ఏకంగా 62 శాతం ఉంది.స్కూటర్స్ విభాగంలో సెగ్మెంట్లో దేశంలో రెండవ స్థానంలో ఉన్న జూపిటర్ 110, 125 సీసీ ఇంజన్ సామర్థ్యంలో లభిస్తోంది. 2024 మార్చి నాటికి 80,000 జూపిటర్ స్కూటర్లను కంపెనీ ఎగుమతి చేసింది. 2016 జూన్ నాటికి 10 లక్షల యూనిట్ల మార్కును సాధించింది. 2017 సెప్టెంబర్ నాటికి 20 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. 2022 సెప్టెంబర్ నాటికి 50 లక్షల యూనిట్లను తాకింది.మరో 10 లక్షల యూనిట్లకు ఏడాది, ఆ తర్వాతి 10 లక్షలకు 14 నెలల సమయం తీసుకుంది. భారత స్కూటర్స్ పరిశ్రమలో రెండవ స్థానం దక్కించుకున్న టీవీఎస్‌కు 25 శాతం వాటా ఉంది. 2023–24లో 8,44,863 జూపిటర్ స్కూటర్స్ రోడ్డెక్కగా.. 2024–25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–నవంబర్‌లో ఈ సంఖ్య 7,01,360 యూనిట్లు ఉంది. ప్రస్తుతం 110 సీసీలో నాలుగు, 125 సీసీలో మూడు వేరియంట్లలో జూపిటర్ లభిస్తోంది.సుజుకీ యాక్సెస్ 60 లక్షలు ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా కూడా ఇటీవల సరికొత్త రికార్డు సాధించింది. సుజుకీ యాక్సెస్ 125 (suzuki access 125) మోడల్లో కంపెనీ 60 లక్షల స్కూటర్ల తయారీ మార్కును దాటింది. ఈ ఘనతను సాధించడానికి సంస్థకు 18 ఏళ్లు పట్టింది. సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడు అవుతున్న మోడల్ కూడా ఇదే.దీర్ఘకాలిక మన్నిక, మెరుగైన పనితీరు, మైలేజీ, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడంతో యాక్సెస్ 125 స్కూటర్‌కు కస్టమర్ల నుంచి దేశ విదేశాల్లో మంచి స్పందన ఉంది. భారత్‌తోపాటు అంతర్జాతీయంగా కస్టమర్ల నమ్మకానికి ఈ గణాంకాలే నిదర్శనమని కంపెనీ ఎండీ కెనిచి ఉమేద తెలిపారు. యాక్సెస్ 125 తొలిసారిగా భారత్‌లో 2006లో అడుగుపెట్టింది. భారత రోడ్లపై 125 సీసీ ఇంజన్ సామర్థ్యంతో పరుగెత్తిన తొలి స్కూటర్ కూడా ఇదే కావడం విశేషం.మూడవ స్థానంలో కంపెనీ..దేశవ్యాప్తంగా 2024 ఏప్రిల్–నవంబర్ మధ్య వివిధ కంపెనీలకు చెందిన 47,87,080 స్కూటర్లు రోడ్డెక్కాయి. ఇందులో సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా 14 శాతం వాటాతో మూడవ స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే 2024 ఏప్రిల్–నవంబర్‌లో కంపెనీ 18 శాతం దూసుకెళ్లి 6,84,898 యూనిట్ల స్కూటర్ల అమ్మకాలను సాధించింది. సుజుకీ ఎకో పెర్ఫార్మెన్స్ టెక్నాలజీతో 125 సీసీ ఎయిర్‌కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో ఇది రూపుదిద్దుకుంది.5,500 ఆర్పీఎం వద్ద 10 ఎన్ఎం గరిష్ట టార్క్ అందిస్తుంది. బ్లూటూత్ ఆధారిత డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏర్పాటు చేశారు. కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ అలర్ట్స్, మిస్డ్ కాల్ అలర్ట్స్ అందుకోవచ్చు. స్పీడ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవెల్ డిస్ప్లే, గమ్యస్థానానికి చేరుకునే సమయం వంటివి తెలుసుకోవచ్చు. 22.3 లీటర్ల స్టోరేజ్, ఈజీ స్టార్ట్ కీ సిస్టమ్, పొడవైన సీటు వంటివి అదనపు హంగులు.
ఫ్యామిలీ
వచ్చాడు బసవన్న
ఉదయం పూట చెట్ల కొమ్మలపై మంచుపూలు స్వాగతం పలుకుతుండగా సన్నాయి రాగం మధురంగా వినిపిస్తుంది. చేగంట మోగుతుండగా బసవన్న పాట వినిపిస్తుంది... ‘డూ డూ బసవన్నా ఇటురారా బసవన్నా/ఉరుకుతూ రారన్న రారన్న బసవన్నా/అమ్మవారికి దండం బెట్టు అయ్యగారికి దండం బెట్టు/రారా బసవన్నా... రారా బసవన్నా....’గంగిరెద్దులు ఊళ్లోకి అడుగు పెడితే ఊరికి సంక్రాంతి కళ సంపూర్ణంగా వచ్చినట్లే. విశేషం ఏమిటంటే... గంగిరెద్దుల ముందు పెద్దలు చిన్న పిల్లలై పోతారు. ‘దీవించు బసవన్నా’ అంటూ పిల్లలు పెద్దలై భక్తిపారవశ్యంతో మొక్కుతారు. కాలం ముందుకు వెళుతున్న కొద్దీ ఎన్నో కళలు వెనక్కి పోతూ చరిత్రలో కలిసిపోయాయి. అయితే గంగిరెద్దుల ఆట అలా కాదు. కాలంతో పాటు నిలుస్తోంది. ‘ఇది మన కాలం ఆట’ అనిపిస్తోంది...కొత్త కాలానికి... కొత్త చరణాలుకాలంతో పాటు బసవన్న పాటలోకి కొత్త చరణాలు వస్తుంటాయి. సందర్భాన్ని బట్టి ఆ పాటలో చరణాలు భాగం అవుతుంటాయి. ఒక ఊళ్లో... సంక్రాంతి సెలవులకు వచ్చిన పిల్లాడు బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అది ఎన్నో సంవత్సరాల చేదు జ్ఞాపకం అయినా సరే, ఊళ్లో సంక్రాంతి రోజు ప్రతి ఇల్లు పండగ కళతో కళకళలాడినట్లు ఆ ఇల్లు కనిపించదు. జ్ఞాపకాల దుఃఖభారంతో కనిపిస్తుంది. ఆ భారం నుంచి ఆ ఇంటి వాళ్లను తప్పించడానికి బసవడు ఆడుతాడు పాడుతాడు. ‘నవ్వించు బసవన్న నవ్వించు/అమ్మ వారికి దండం పెట్టి నవ్వించు/అయ్యవారికి దండం పెట్టి నవ్వించు/ వాళ్లు హాయిగా ఉండేలా దీవించు..ఆ దీవెన ఎంతో పవర్‌పుల్.పండగపూట బసవన్న ఇంటిముందుకు రాగానే బియ్యం లేదా పాత బట్టలతో రావడం ఒక విషయం అయితే... భవిష్యత్ వాణి అడగడం, ఆశీర్వాదం ఒక మరో విషయం. గంగిరెద్దులాయన సంచిలో బియ్యం పోస్తు ‘మా అబ్బాయికి ఈ సంవత్సరమన్నా ఉద్యోగం వస్తుందా బసవన్నా’ అని అడుగుతుంది ఒక అమ్మ, ‘అవును’ అన్నట్లు తల ఆడిస్తుంది. ‘మా తల్లే’ అని కంటినిండా సంతోషంతో గంగిరెద్దు కాళ్లు మొక్కుతుంది ఆ అమ్మ. గంగిరెద్దుల ఆటలో విశేషం ఏమిటంటే, తెలుగు ప్రాంతాల్లో ఒక్కో చోట ఒక్కో రకమైన ప్రత్యేతలు ఉన్నాయి. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా మందస ప్రాంతంలో గంగిరెద్దుల వారి పాటల్లో తత్వం ధ్వనిస్తుంది. సామాజిక విశ్లేషణ ఉంటుంది. ఉదా: ‘దేవా! ఏమి జరుగుతున్నది ప్రపంచం/అహో! ఏం చిత్రంగున్నదీ ప్రపంచం/ పసుపురాత తగ్గిపోయి....΄పౌడరు రాతలెక్కువాయె’...సంక్రాంతి రోజుల్లో బసవన్నల విన్యాసాలకు ప్రత్యేకంగా రంగస్థలం అక్కర్లేదు. ఊళ్లోకి అడుగుపెడితే... అణువణువూ ఆ కళకు రంగస్థలమే. మనసంతా ఉల్లాసమే. తరతరాల నుంచి ప్రతి తరానికి దివ్యమై అనుభవమే.– బోణం గణేష్, సాక్షి, అమరావతి
జీన్స్ తొడుక్కుని స్క్వాటింగ్ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్
ఆధునిక కాలంలో జీన్స్ ప్యాంట్లు లేనిదే కాలం గడవదు. ట్రెండ్‌కు,ఫ్యాషన్‌కు తగ్గట్టు అనేక రకాల జీన్స్ ప్యాంట్లు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. మహిళలతో పోల్చితే పురుషులే ఎక్కువగా జీన్ ప్యాంట్లను వినియోగిస్తారు. ఆఫీసులకు, బయటికి వెళ్లినప్పుడు, పార్టీలకు ఇలా ఏదైనా జీన్స్ ప్యాంట్లకే ప్రాధాన్యత ఉంటుంది. అన్ని వయసుల వారికి ఫిట్ అయ్యే జీన్స్ అనేవి చాలా పాపులర్. అనేక రకాల మోడల్స్‌లో ఇవి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ధరించడం వలన చాలా కంఫర్ట్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. వీటిని ఉతుక్కోవడం ఈజీ కావడం కూడా వీటికి ఆదరణ ఎక్కువ. కానీ జీన్స్పాంట్లు వేసుకున్నపుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.జీన్స్ వేసుకొని కింద కూర్చోవడం, అందునా జీన్స్ ప్యాంట్లు తొడిగి బాసిపట్లు వేయడం (సక్లముక్లం వేసి కూర్చోవడం) ఆరోగ్యానికి అంత మేలు కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. జీన్స్ ప్యాంట్ తొడుక్కొని ఇలా కూర్చోవడం వల్ల కండరాలు, నరాలు దెబ్బతింటాయనీ, ఇది మరీ విషమిస్తే ఒక్కోసారి జీన్స్ ప్యాంట్లతో బాసిపట్లు వేసుకుని కూర్చునేవారు పైకి లేవగానే నడవలేని పరిస్థితి వచ్చేందుకూ అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఇక వ్యాయామం చేసే సమయంలోనూ జీన్స్ అస్సలు తొడుక్కోవద్దనీ, వాటిని తొడిగి ‘స్క్వాటింగ్’ ఎక్సర్సైజ్ చేయడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఈ అంశాలన్నింటినీ ‘జర్నల్ ఆఫ్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సైకియాట్రీ’ అనే మెడికల్ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి. అవే కాకుండా బాగా బిగుతుగా ఉండే జీన్స్ వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశముందని కూడా మరికొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.జీన్స్ ప్యాంట్లు బాగా టైట్‌గా ఉండే జీన్స్ ప్యాంట్ ధరించి పడుకుంటే చర్మంపై బ్యాక్టీరియా పెరుగుతుంది. స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీంతో దురదలు, చర్మంపై ర్యాషెస్, దద్దుర్లు వస్తాయి. రక్తప్రసరణకు కష్టం : జీన్స్ ప్యాంట్ బిగుతుగా ఉండటంతో రక్తప్రసరణకు ఇబ్బంది కలుగుతుంది. దీంతో కొన్ని అవయవాలకు రక్తం సరిగా అందదు. జీన్స్ ప్యాంట్ ధరించి నిద్రించడం వల్ల శరీరంలోని వేడీ పెరుగుతుంది. పేగుల కదలికకు ఇబ్బందిగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియపై దుష్ప్రభావం పడుతుంది.
జుట్టు రాలిపోతోందా? డోంట్ వర్రీ..టీ వాటర్‌తో ఇలా చేస్తే..!
Tea Water for Hair: జుట్టు రాలడం చాలా సహజమైనదే. అయితే ఎప్పడికప్పుడు కొత్త జుట్టు వస్తూ ఉంటుంది. జుట్టు రాలిన విషయంమనకు తెలియకుండానే ఈప్రక్రియ జరిగిపోతుంది.అయితే అకారణంగా, చాలా ఎక్కువగా జుట్టురాలిపోవడం ఆందోలన కలిగించే అంశం. ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య. దీనిని ఎదుర్కోవడానికి లెక్కలేనన్ని ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పటికీ, సహజమైన పద్ధతులను ఎంచుకోవడం మంచిది. అలాంటి వాటిట్లో ఒకటి టీ నీటితో జుట్టును కడగడం. యాంటీఆక్సిడెంట్లు , పోషకాలతో సమృద్ధిగా ఉన్న టీ, జుట్టును బలోపేతం చేస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మాడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మరి దీని తయారీ, ఎలా ఉపయోగించాలో చూద్దాం.టీ వాటర్ ఎలా తయారు చేయాలిహెయిర్ వాష్ కోసం టీ వాటర్ ను తయారు చేయడం చాలా సులభంకావాల్సిన పదార్థాలు:2–3 టీ బ్యాగులు (బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ)2–3 కప్పుల నీరుకావాలంటే ఇందులో లావెండర్ లేదా రోజ్మేరీ ఆయిల్ కూడా కలుపుకోవచ్చు. ఎలా తయారు చేయాలి? ఎలావాడాలి?నీటిని మరిగించి, అందులో టీ బ్యాగులను 5–10 నిమిషాలు నానబెట్టాలి.ఇందులో కొద్దిగా లావెండర్, రోజ్మేరీ ఆయిల్ చుక్కలు కలపాలి.చల్లారిన తరువాత టీ నీటిని శుభ్రమైన స్ప్రే బాటిల్ లేదా కంటైనర్‌లో పోసుకోవాలి.ఇపుడు తేలికపాటి, సల్ఫేట్ లేని షాంపూతో జుట్టును శుభ్రంగా వాష్ చేయాలి.షాంపూ చేసిన తర్వాత జుట్టుంతా తడిచేలా స్ప్రే చేయాలి. తర్వాత 5–10 నిమిషాలు పాటు చేతులతో సున్నితంగా మసాజ్ చేయాలి.15-20 నిమిషాలు పాటు ఉంచుకుని సాధారణ నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోవాలి.ఇదీ చదవండి: మాయదారి గుండెపోటు : చిన్నారి ‘గుండెల్ని’ పిండేస్తున్న వీడియోప్రయోజనాలు జుట్టు సిల్కీగాఅవుతుంది. కొత్త మెరుపువస్తుంది. జుట్టు రాలడం తగ్గుతుంది, యాంటీఆక్సిడెంట్లు ,కెఫిన్ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడం తగ్గుతుంది.మాడు ఆరోగ్యానికి కూడా మంచిది. చుండ్రు, దురద లాంటి సమస్యలు తగ్గుతాయి. టీ వాటర్ జుట్టు క్యూటికల్‌ను మూసివేస్తుంది.కెఫిన్ కారణంగా రక్త ప్రసరణ బాగా జరిగిన జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తుంది. హెయిర్ ఫోలికల్స్ ను ఉత్తేజపరిచి, జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్ జుట్టు రాలడానికి కారణమవుతుంది. ఇది ఈ హార్మోన్ల ప్రభావాలను తగ్గించి జుట్టు రాలడాన్ని నిరోధించే సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి. కనుక ఈ ప్రక్రియ చాలామంచిది. జుట్టు చిట్లడం అనే సమస్యను కూడా దూరం చేస్తాయి.ఇదీ చదవండి : Sankranti 2025: పండక కళ, పేస్ గ్లో కోసం ఇలా చేయండి!
Sankranti 2025: పండక కళ, పేస్ గ్లో కోసం ఇలా చేయండి!
సంబరాల సంక్రాంతి సందడి సమీపిస్తోంది. ఏడాదిలో తొలి పండుగ సంక్రాంతి అంటే చాలా హడావిడి ఉంటుంది. దేశవ్యాప్తంగా సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటారు. ముఖ్యంగా తెలుగువారిలో మరింత సందడి ఉంటుంది. పిండివంటలు, షాపింగ్‌లు కాదు అందంగా కనిపించడం అమ్మాయిలకు అందరికీ ఇష్టం. కెమికల్స్‌తో నిండిన బ్యూటీ ఉత్పత్తులు కాకుండా, సహజంగా ముఖ చర్మాన్ని శుభ్రం చేసి కాంతివంతంగా మార్చడంతో పాటు కొన్ని సంరక్షణా టిప్స్ తెలుసుకుందాం.పండగ సందర్బంగా ముఖంమెరిసిపోవాలంటే.. ఇంట్లోనే దొరికే కొన్ని రకాల పదార్థాలో బ్యూటీ ప్యాక్స్‌ను తయారు చేసుకోవచ్చు. అలాగే ప్యాక్‌కు ముందు ముఖారికి ఆవిరి పట్టడం వలన మృత కణాలు తొలిగి, చర్మ రంధ్రాలు ఓపెన్ అవుతాయి. దీంతో మనం వేసుకున్న ప్యాక్ పోషకాలు అంది ముఖం మరింత అందంగా, షైనీగా ఉంటుంది.పొటాటో ప్యాక్ఒక చిన్న బంగాళదుంప (Potato) తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ,పల్చటి క్లాత్‌తో వడకట్టి రసం తీసుకోవాలి. ఈ రసంలో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి(Rice Flour) కొద్ది పెరుగు,(Curd) కొద్దిగా బాదం ఆయిల్ వేసిన అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి కొంచెం మందంగా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేసుకోవాలి. దీంతో నల్లమచ్చలు తొలిగి ఫేస్ అందంగా కనిపిస్తుంది.శనగ పిండి ప్యాక్రెండు స్పూన్ల శనగపిండి, కొద్దిగా పసుపు, రోజ్ వాటర్, పాల మీగడ, తేనె కలిపి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకొని ఆవిరిపట్టి చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఆ తర్వాత ఈ ప్యాక్ అప్లై చేయాలి. ఆరిన తరువాత మృదువుగా పిండిని తొలగిస్తూ, శుభ్రంగా కడుక్కోవాలి. ఇన్స్టంట్ గ్లో వస్తుంది. అలాగే వారానికి రెండు, మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని తలస్నానం చేసేముందు నలుగు పెట్టుకుంటే ముఖంతో పాటు చర్మానికి కూడా రాస్తే చాలా మంచిది. (కాల్షియం ఎక్కువగా ఎందులో ఉంటుంది రాగులా? పాలా?)కాఫీ పౌడర్కాఫీ పౌడర్, కొద్దిగా చక్కెర, నిమ్మరసం వేసి ముఖానికి అప్లయ్ చేయాలి. ఆరిన తరువాత శుభ్రంగా కడిగేసుకోవాలి. దీన్ని చేతులు, ముంచేతులు, మెడమీద కూడా రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆవిరి పట్టడం: వేడినీళ్లలో కాసిన్ని పుదీనా ఆకులు, తులసి, వేపాకులు, పసుపు వేసి ముఖమంతా చెమటలు పట్టేదాకా ఆవిరి పడితే చర్మం బాగా శుభ్రపడుతుంది. చర్మం రంధ్రాలు ఓపెన్ అవుతాయి. ఇదీ చదవండి: మాయదారి గుండెపోటు : చిన్నారి ‘గుండెల్ని’ పిండేస్తున్న వీడియోదోసకాయ నీటితో ఆవిరిదోసకాయ ముక్కలను మరుగుతున్న నీటిలో వేయాలి. నీరు బాగా మరిగిన తరువాత ఈ నీటిలో కొన్ని చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి. ఇందులో ఒక గ్రీన్ టీ బ్యాగ్ కూడా వేయచ్చు. దీని నుండి వచ్చే ఆవిరి పట్టడం వల్ల ముఖ చర్మం మెరుస్తుంది. నూనె, దుమ్ము, ధూళి కారణంగా మూసుకుపోయిన ముఖ చర్మ రంధ్రాలు క్లియర్ అవుతాయి.నిమ్మకాయమరుగుతున్న నీటిలో కొద్దిగా నిమ్మరసం, గ్రీన్ టీ బ్యాగ్ లేదా టీ ఆకులు వేయాలి. నీటిని దించాక దీంట్లో కొన్ని చుక్కల పిప్పరమెంట్ ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి. ఈ ఆవిరిని ముఖానికి పట్టడం వల్ల ముఖ చర్మం మెరుస్తుంది. చర్మం మీద ఉన్న మృత కణాలు, మురికి క్లీన్ అవుతాయి.మాయిశ్చరైజర్‌గా బాదం నూనెచలికాలం చర్మం పొడిబారడం సహజంగా జరుగుతుంటుంది కాబట్టి నూనె శాతం ఎక్కువ ఉన్న మాయిశ్చరైజర్లు వాడాలి.∙బాదం నూనె, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని చలికాలం మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. స్నానానికి ముందు టీ స్పూన్ బాదం నూనె, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసి, మసాజ్ చేయాలి. పొడిబారే చర్మం మృదువుగా తయారవుతుంది. టీ స్పూన్ బాదాం నూనెలో అర టీ స్పూన్ పంచదార కలిపి ముఖానికి రాసి మృదువుగా మర్దన చేయాలి. తర్వాత పెసరపిండిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం పొడిబారదు.
ఫొటోలు
National View all
Bus Accident: నలుగురు దుర్మరణం
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్(Uttarakhand)లో జరి
మీరు అలా చేస్తే.. నేను పోటీనే చేయను: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో అన్ని మురికివాడల కంటే..
మహాకుంభ్‌కు వింత బాబాలు.. షాకవుతున్న జనం
భారతదేశంలో 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం, వేదిక ఖరారు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (
80 మంది విద్యార్థునుల పట్ల స్కూల్ ప్రిన్సిపల్ పైశాచికత్వం!
ధన్‌బాద్: ఓ ప్రైవేట్ స్క
International View all
ఇరాన్ సంచలన నిర్ణయం? మారనున్న రాజధాని?
ఇరాన్ తన పొరుగు దేశమైన ఇజ్రాయెల్‌తోనూ, అగ్రరాజ్యం అమెరికాతోనూ ఉన్న వివాదం క
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం, వేదిక ఖరారు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (
ప్రాంక్ అని చెప్పి నిజమైన పెళ్లి..
రీల్స్, ఇన్‌స్ట్రాగామ్ ప్రపంచాన్ని ఏలుతున్న కాలంలో ఏది నిజమో? ఏది అబద్ధమో? తెలియడం లేదు.
మ్యాథ్స్ మహారాణి
గణితం అంటేనే ఆమడదూరం పరిగెత్తేవాళ్లు మనలో చాలా మందే ఉన్నారు.
దుమ్ము దుప్పట్లో విలాస నగరం
వాషింగ్టన్: ఆరు చోట్ల ఆరని పెను జ్వాలలు, కమ్మేసిన దుమ్ము, ధ
NRI View all
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్ఆర్ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా
ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!
అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్ దిగ్గజం యాపిల్ 185 మంది ఉద్యోగులను త
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!
భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్..!అచ్చం భారత్‌లో..
ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్ బిజినెస్‌లు.
క్రైమ్
సంక్రాంతికి వస్తానని.. తిరిగిరాని లోకాలకు
జవహర్‌నగర్: ‘సంక్రాంతికి వస్తా..నీవు ఆరోగ్యంగా ఉండు. నాకు చిన్న పని ఉంది చూసుకుని రేపు ఇంటికి బయలుదేరి వస్తా. పండగ అయ్యాక మనమిద్దరం కలిసి బియ్యం తీసుకుని హైదరాబాద్‌కు వెళ్దాం..’ అని గర్భవతి అయిన భార్యతో ఫోన్లో మాట్లాడి వెళ్లిన కొన్ని గంటలకే ఆ ఇంటి యజమాని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కరెంటు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృతిచెందాడు. జవహర్‌నగర్ సీఐ సైదయ్య, బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల బంజారా తండాకు చెందిన బానోతు ప్రశాంత్ (26), సరిత దంపతులు. వీరు సంతో నగర్లో నివాసం ఉంటున్నారు. ప్రశాంత్ బాలాజీనగర్ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే ప్రశాంత్ శుక్రవారం సంతోష్‌నగర్‌లో విద్యుత్ లైన్ల మరమ్మతులకు తోటి కారి్మకులతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో ఏఈ సాంబశివరావు, లైన్మెన్ నాగరాజుతో పాటు కాంట్రాక్టర్ రాజేశ్‌లు ఎల్సీ తీసుకున్నామని, మీరు పని పూర్తి చేయాలని చెప్పడంతో ప్రశాంత్ ఉదయం 10.20 నిమిషాల సమయంలో విద్యుత్ స్తంభం ఎక్కి వైర్ కట్‌చేస్తుండగా 11కేవీ తీగలు తగిలాయి. ప్రశాంత్ స్తంభంపైన పనిచేస్తుండగానే అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యుత్ సరఫరాను ఆన్ చేశారు. దీంతో విద్యుదాఘాతానికి గురై ప్రశాంత్ మృతిచెందాడు. తోటి కార్మికులు, ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం అందించి సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భార్యతో ఉదయం ఫోన్లో మాట్లాడిన కొద్దిసేపటికే..మృత్యువాత పడిన విషయం తెలిసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ప్రశాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం, అధికారులు అన్ని విధాలా ఆదుకోవాలని ఖమ్మం జిల్లా కామేపల్లి మండల మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్‌కుమార్ నాయక్ డిమాండ్ చేశారు. స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్మికుని కుటుంబానికి అన్నివిధాల ఆదుకుంటామని విద్యుత్ అధికారులు హమీ ఇచ్చారు. ప్రస్తుతానికి తక్షణ సహాయంగా రూ.10 లక్షలు ఇస్తున్నట్లు అధికారులు, కాంట్రాక్టర్ ప్రకటించారు. పండక్కి ఊరికి వస్తానంటివే.!
మీరట్‌లో దారుణం
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. దంపతులు, వారి 8 ఏళ్లలోపు ముగ్గురు కుమార్తెలు దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. పాత గొడవలే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. లిసారి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుహైల్ గార్డెన్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఇటీవలే మొయిన్ అలియాన్ మోయినుద్దీన్(52), అస్మా(45)దంపతులు అద్దెకు దిగారు. వీరికి ముగ్గురు కుమార్తెలు అఫ్సా(8), అజిజా(4), అడీబా(1)ఉన్నారు. మొయిన్ దంపతులు బుధవారం నుంచి కనిపించకపోవడంతో అస్మా సోదరుడు షమీమ్, మొయిన్ సోదరుడు సలీ వారుండే ఇంటికి వచ్చి చూడగా బయట తాళం వేసి ఉంది. శుక్రవారం అతికష్టమ్మీద ఇంటి పైకప్పును తొలగించి, లోపలికి వెళ్లి చూడగా భయానక దృశ్యాలు కనిపించాయి. పడుకునే మంచానికి ఉన్న అరలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు కుక్కి ఉండగా దంపతులను బెడ్‌షీట్‌లో చుట్టి పడేశారు. వీరి కాళ్లు కట్టేసి ఉన్నాయి. షమీమ్, సలీమ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అస్మా చిన్న మరదలు, ఆమె ఇద్దరు సోదరులతోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో అనుమానితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇది తెలిసిన వారి పనే కావొచ్చని పోలీసులు తెలిపారు.
వైఎస్ అభిషేక్‌రెడ్డి మృతి
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి (36) శుక్రవారం మృతి చెందారు. ఇతను వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు(వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి కుమారుడు). కొద్ది రోజులుగా డెంగీ జ్వరంతో బాధ పడుతూ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం సాయంత్రం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.హైదరాబాద్ నుంచి ఆయన పారి్థవదేహం రాత్రి పొద్దుపోయాక పులివెందుల చేరుకుంది. సౌమ్యుడు, వివాద రహితుడు, ఉన్నత విద్యావంతుడిగా అభిషేక్‌రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. సన్నీగా ఈ ప్రాంత వాసులకు సుపరిచితుడు. ఆర్థోపెడిక్స్ వైద్యుడిగా రాణిస్తూనే రాజకీయాల్లో కూడా చురుగ్గా వ్యవహరించారు. శనివారం మధ్యాహ్నం వరకు కార్యకర్తలు, నాయకుల సందర్శనార్థం పులివెందులలోని స్వగృహంలో అభిషేక్‌రెడ్డి పారి్థవదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం పులివెందులలోని వైఎస్ కుటుంబ సభ్యుల సమాధుల తోటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. అభిషేక్‌రెడ్డి మృతితో వైఎస్ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కాగా, వైఎస్ అభిషేక్‌రెడ్డికి భార్య డాక్టర్ సౌఖ్య, పిల్లలు వైఎస్ అక్షర, వైఎస్ ఆకర్ష ఉన్నారు.
పండుగ ముందు పెను విషాదం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే వేర్వేరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 17 మంది మరణించారు. పొట్ట చేతపట్టుకొని బతుకుదెరువు కోసం బయలుదేరిన కూలీలు గమ్యం చేరకముందే అనంతలోకాలకు చేరుకున్నారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకొని సోదరుడితో తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆ ఇద్దరు యువకులు మరణించగా.. స్కూటీపై వెళ్తున్న భార్యాభర్తలను లారీ ఢీకొనటంతో భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం చెందాడు. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు చనిపోయారు. దీంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొన్నది.ఐదుగురు వలస కూలీలు దుర్మరణంరోడ్డుపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా ఐదుగురు మృతిచెందారు. 15 మంది గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఒడిశాకు చెందిన 32 మంది వలస కూలీలు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గుప్త ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్‌కు గురువారం సాయంత్రం 4 గంటలకు బయలు దేరారు.ఐలాపురం గ్రామ శివారులో ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరు నుంచి సంగారెడ్డికి వెళ్తున్న ఇసుక లారీ టైరు పంక్చర్ కావడంతో పక్కకు నిలిపారు. ఆ లారీని ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ గరడ సునీల్ (40), ఒడిశాకు చెందిన కూలీలు రూపు హరిజన్ (51), సుల హరిజన్ (46), సునమని హరిజన్ (61) అక్కడికక్కడే మృతిచెందగా, ప్రత్యూష్ ప్రభాత్ హరిజన్ (17) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ పరిశీలించారు. బస్సు ఢీకొట్టిన వేగానికి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయాయి. జన్మదినం రోజే మృత్యు ఒడిలోకి..పెద్దపల్లి మండలం రంగాపూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన అనవేన అభిలాష్ (19), కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేటకు చెందిన చుంచు రాజ్‌కుమార్ (20) మరణించారు. వీరిద్దరూ అక్కాచెల్లెళ్ల కొడుకులు. చుంచు రాజ్‌కుమార్ జన్మదినం కావడంతో అప్పన్నపేటలోని అభిలాష్‌తో కలిసి బైక్‌పై గుండారంలోని స్నేహితుల వద్దకు వెళ్లారు. అక్కడ వేడుక చేసుకొని తిరిగి వస్తుండగా రంగాపూర్ శివారులో ట్రాన్స్‌కోకు చెందిన బొలేరో వాహనాన్ని బైక్‌తో బలంగా ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో అభిలాష్ అక్కడికక్కడే మరణించగా, రాజ్‌కుమార్‌ను కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. జగిత్యాల – ధర్మపురి జాతీయ రహదారిపై తక్కళ్లపల్లి శివారులో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన బూతగడ్డ అరవింద్ (21), బత్తుల సాయి (22), మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన దయ్యాల వంశీ (22) దుర్మరణం చెందారు. వంశీ 15 రోజుల క్రితమే దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. మనుమడి బారసాలకు వెళ్లి వస్తూ.. మనుమడి బారసాల వేడుకలు జరుపుకొని తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జనగామ – సూర్యాపేట రహదారిపై కొడకండ్ల మండలం మైదంచెరువు తండ వద్ద గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. నాగారం మండలం ఈటూరుకు చెందిన పేరాల వెంకన్నలక్ష్మి దంపతుల కుమారుడైన యుగంధర్‌కు కుమారుడు జన్మించగా గురువారం దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో బారసాల వేడుక జరిగింది.ఈ వేడుకకు వెంకన్న కుటుంబసభ్యులు, బంధువులంతా తుఫాన్ వాహనంలో వెళ్లారు. వేడుకల అనంతరం అదే వాహనంలో రాత్రి ఈటూరుకు తిరిగి వస్తుండగా మైదంచెరువు తండా శివారులో జాతీయ రహదారిపై నిలిపి ఉన్న డీసీఎం వాహనాన్ని తుపాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పేరాల వెంకన్న (45) అతని తమ్ముడి భార్య పేరాల జ్యోతి (35) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ పేరాల ఊషయ్య, పేరాల లక్ష్మి, వంగూరి నర్సమ్మ, పేరాల లావణ్య, ఉప్పలమ్మ, ముత్యాలును జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పేరాల లక్ష్మి, పేరాల ఊషయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. స్నేహితులను కబలించిన లారీ మెదక్ జిల్లా నర్సాపూర్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మరణించారు. శివ్వంపేట మండలం అల్లీపూర్‌కు చెందిన పిట్ల నాగరాజు (25), కమ్మరి దుర్గాప్రసాద్(25) స్నేహితులు. నాగరాజు తాను పనిచేసే కొంపల్లిలోని ఓ పౌల్ట్రీ కార్యాలయానికి దుర్గాప్రసాద్‌తో కలసి బైక్‌పై వెళ్లాడు. తిరిగి వస్తుండగా నర్సాపూర్ ఎస్బీఐ సమీపంలో జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు తుదిశ్వాస విడిచాడు. ఈ రెండు కుటుంబాలకు వీరు ఒక్కొక్కరే సంతానం కావటం గమనార్హంభార్య కళ్లెదుటే భర్త మృతిస్కూటీని లారీ ఢీకొట్టడంతో భార్య కళ్లెదుటే భర్త మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట కలెక్టరేట్ వద్ద రాజీవ్ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామానికి చెందిన ఎర్రవెళ్లి బాలకిష్టయ్య (59)కు బెజ్జంకి మండలం గుగ్గిళ్లకు చెందిన ఓ వ్యక్తితో వ్యవసాయ బావి విషయంలో భూ వివాదం ఉంది. వివాదం పరిష్కారం కోసం 20 రోజులుగా కలెక్టరేట్ చుట్టూ దంపతులిద్దరూ తిరుగుతున్నారు. శుక్రవారం అదే పని మీద వీరు స్కూటీపై కలెక్టరేట్‌కు వెళ్తుండగా, కలెక్టరేట్ ఎదుట వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టి.. స్కూటీని కొంత దూరం ఈడ్చుకెళ్లింది. తీవ్ర గాయాలై బాలకిష్టయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న రేణుకకు స్వల్ప గాయాలయ్యాయి. రేణుక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.