Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jaganmohan Reddy Fires On Chandrababu About Tirupati Stampede1
బాబే మొదటి ముద్దాయి: వైఎస్‌ జగన్‌

వైష్ణవులందరికీ మార్గదర్శకంగా నిలిచే ఆలయం తిరుమల. గతంలో లక్షలాది మంది భక్తులు వచ్చినా సంతోషంగా దర్శనం చేయించి పంపించగలిగాం. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు శాస్త్రం తెలియదు. ఆచరణలు తెలియవు. దేవుడిపై భయం లేదు. భక్తీ లేదు. భయమూ, భక్తి ఉన్న వాడెవడైనా తిరుమల శ్రీవారి ప్రసాదంపై ఇష్టమొచ్చి­నట్టుగా అబద్ధాలు చెప్పగలుగుతాడా? టీటీడీ ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమం ముఖ్యమంత్రి అనే­వాడు చేస్తాడా? ఈ ఘటనలో ముమ్మా­టికీ చంద్రబాబే మొదటి ముద్దాయి.తొక్కిసలాట ఒక ప్రాంతంలో జరగలేదు. రకరకాల ప్రదేశాల్లో జరిగింది. ఆయా ప్రాంతాల్లో పోలీస్‌ ఫోర్స్‌ లేకపోవడం, కనీస ఏర్పాట్లు లేకపోవడం స్పష్టంగా కన్పిస్తోంది. ఆయా ప్రాంతాల్లో అంబులెన్స్‌లను ప్రోటోకాల్‌ ప్రకారం పెట్టాలన్న బాధ్యత కూడా లేదు. తొక్కిసలాట తర్వాత అంబులెన్స్‌ రావడానికి, క్షతగాత్రులను తీసుకెళ్లడానికి ముక్కాలు గంట (45 నిమిషాలు) పట్టిందని బాధితులు చెబుతున్నారు. అది కూడా అప్పుడొకటి.. అప్పుడొకటి వచ్చాయని చెప్పారు. కొంత మంది వాళ్లంతట వాళ్లే కిందా మీద పడి వచ్చామని చెప్పారు. మరికొంత మంది రోడ్డున పోయే వారి సాయంతో వచ్చామని చెబుతున్నారు. ఈ రకమైన పరిస్థితులుండడం ఎంత దారుణం? ఈ ఘటనకు చంద్రబాబు, టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో, ఎస్పీ, కలెక్టర్‌.. బాధ్యత వహించాలి. ఇందులో వీరందరి తప్పు ఉంది. చంద్రబాబు నాయుడుకు ఈ పాపం తగలక మానదు. ఎందుకంటే తప్పు చేసిన తర్వాత కనీసం తప్పు చేశానంటూ దేవుడికి, భక్తులకు క్షమాపణ చెప్పాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. సిన్సియార్టీ లేదు. చిత్తశుద్ధి అంతకంటే లేదు. తాను చేసిన తప్పును ఇంకొకరి మీద మోపడమే ఆయనకు తెలుసు. – వైఎస్‌ జగన్‌సాక్షి, అమరావతి: వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన ఆరుగురు భక్తులు తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో చనిపోవడం దురదృష్టకరమని వైఎ­స్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చరిత్రలో ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ జరగలేదని గుర్తు చేశారు. టీటీడీ చరిత్రలో ఇది మాయని మచ్చగా నిలుస్తుందన్నారు. ఈ ఘటనలో ముమ్మాటికీ మొదటి ముద్దాయి చంద్రబాబేనని స్పష్టం చేశారు. తొక్కిస­లా­టలో గాయపడి, పద్మావతి మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రి (స్విమ్స్‌)లో చికిత్స పొందుతున్న బాధితులను గురువారం రాత్రి ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పవిత్ర టీటీడీలో ఇలాంటి పరిస్థితులకు దారితీసిన కారణాలను అందరూ ఆలోచించాలన్నారు. తొక్కిసలాట ఘటనలో ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటకు వచ్చా­యని చెప్పారు. ‘మనం వైకుంఠ ఏకాదశిని ప్రతి ఏటా జరుపుకుంటాం. ఆ రోజు లక్షలాది మంది భక్తులు వెంకటేశ్వరస్వామి దర్శనానికి వస్తారు. ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుందని తరలివస్తారు. 10వ తేదీన వైకుంఠ ఏకాదశి. ఈ విషయాలన్నీ తెలిసీ.. ప్రభుత్వం ఎందుకు టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర భద్రత చర్యలు, ప్రొటోకాల్స్‌ పాటించలేదు? అసలు చంద్రబాబుకు 10న వైకుంఠ ఏకాదశి అని తెలుసు కదా? అయినా కూడా కుప్పంలో తన ప్రోగ్రాం పెట్టుకున్నాడు. 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకు కుప్పంలోనే ఉన్నారు. పోలీసు శాఖ మొత్తం ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు కుప్పం తరలిపోయింది. 8వ తేదీ రాత్రి 8.30 గంటలకు టికెట్లు ఇచ్చే కార్యక్రమంలో తొక్కిసలాట ఘటన జరిగింది. లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినప్పుడు, కుప్పం­లో చంద్రబాబు పర్యటన ఉందని తెలిసినప్పుడు పోలీ­సులు ఎందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు? అందరూ చంద్రబాబు పర్యటనలో మునిగి పోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..మీడియాతో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క సారిగా గేట్లు తెరవడంతో.. బైరాగిపట్టెడ కౌంటర్‌కు ఎదురుగా ఉన్న పార్కులో ఉదయం 8 గంటల నుంచి భక్తులను గుంపుగా నిలబెట్టారు. రాత్రి 8.30 గంటలకు కౌంటర్‌ వద్దకు తీసుకొచ్చి గేట్లు తెరిచారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగిందని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు చెబుతున్నారు. చీకట్లో.. పార్కులో నిలబెట్టిన భక్తులకు ఉదయం నుంచి ఏమైనా ఇచ్చారా? వచ్చిన భక్తులను వచ్చినట్టు ఎందుకు క్యూలైన్లలోకి పంపించలేదు? అన్ని సెంటర్లలోనూ ఇదే పరిస్థితి. ఆయా సెంటర్లలో లైన్లలోకి పంపించడానికి పోలీసులు ఎక్కడా లేరు. అందుకే గుంపుగా నిలబెట్టి ఒకేసారి విడిచిపెట్టే కార్యక్రమం చేశారు. ఇప్పుడు పోలీసులు.. చంద్రబాబు దిక్కమాలిన అబద్ధాలు అడుతున్నారు. ఈ తొక్కిసలాట ఘటన ఒక చోటే జరిగినట్టు చెబుతున్నారు. విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయినట్టు, బైరాగిపట్టెడలో ఐదు మంది చనిపోనట్టు ఎఫ్‌ఐఆర్‌లలో నమోదైంది. ఆస్పత్రిలో బాధితులతో మాట్లాడినప్పుడు వివిధ కౌంటర్ల దగ్గర తొక్కిసలాటల్లో గాయపడినట్టు చెబుతున్నారు. చంద్రబాబుకు ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కుప్పంలో 6,7,8 తేదీల్లో ప్రోగ్రామ్స్‌ పెట్టుకున్నారు. పోలీసులు మొత్తాన్ని తన దగ్గరకే పిలిపించుకున్నారు. తిరుపతిలో మాత్రం భక్తుల కోసం ప్రత్యా­మ్నాయ భద్రత ఏర్పాట్లను గాలికి వది­లేశారు. ఫలితంగా భారీ తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దేవుడి దయతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఎటువంటి ప్రాణపాయం లేదు. రుయా, స్విమ్స్‌ ఆస్పత్రులను కలుపుకుంటే దాదాపు 50 నుంచి 60 మంది భక్తులు తొక్కిసలాటలో గాయపడినట్టు సమాచారం. ఒక్క స్విమ్స్‌లోనే 35 మంది ఉన్నట్టు తెలుస్తోంది. భక్తుల భద్రత, వసతులపై చిత్తశుద్ధి ఏదీ? మొట్టమొదటి సారిగా తిరుపతిలో ఇలాంటి దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. దారుణమైన పరిస్థితుల్లో వ్యవస్థను నడిపిస్తున్నారు. ఇక్కడి కలెక్టర్, ఎస్పీ, పోలీసులు, టీటీడీ పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానం విశిష్టత తెలియకుండా ప్రవర్తించారు. దశాబ్దాలుగా టీటీడీలో ప్రొటోకాల్స్‌ ఉన్నా, వీళ్లెవ్వరూ పట్టించుకోలేదు. తిరుపతికి లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో వారి భద్రత, వసతుల కల్పన గురించి ఆలోచించలేదు. ఉదయం 9 గంటలకు వస్తే కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని బాధితులు వాపోతున్నారు. అక్కడ మనుషులు ఉన్నారని వీళ్లు పట్టించుకుంటే కదా! మా ప్రభుత్వంలో ఐదేళ్లలో గొప్పగా భక్తులకు దైవ దర్శన సేవలందించాం. అలాంటిది ఈ రోజు భక్తులను క్యూలో నిలబెట్టేవారు లేరు. వారి ఆకలి, దప్పికలను కూడా గాలికి వదిలేశారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఇది ప్రభుత్వం చేసిన తప్పు. ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత తీసుకోవాలి. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షల నష్టప­రిహారం ఇవ్వాలి. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి.. ప్రభుత్వం తప్పిదంగా ఒప్పుకుంటూ ఉచిత వైద్యం అందించాలి. వారు డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లేటప్పుడు కనీసం రూ.5 లక్షలు అందించాలని చంద్రబాబును డిమాండ్‌ చేస్తున్నాం. ఈ ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి, దేవదాయ శాఖ మంత్రి, టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్‌ ఈవో, ఎస్పీ, కలెక్టర్, రెవెన్యూ అధికా­రులు అందరూ బాధ్యత వహించాల్సిందే. మొత్తం పోలీసు శాఖను తిరుపతిలో లేకుండా చేసి.. పలచ­గా అక్కడక్కడా బందోబస్తు పెట్టి, భక్తుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్నారు⇒ గతంలో గోదావరి పుష్కరాల సమయంలో 29 మందిని పొట్టన పెట్టుకున్న ఘతన ఈ చంద్రబాబుది కాదా? తన షూటింగ్‌ కోసం అందర్నీ ఒకచోట పెట్టాడు. షూటింగ్‌ బాగా రావాలని చెప్పి గేట్లు ఒకేసారి ఎత్తాడు. తొక్కిసలాటలో 29 మంది చనిపోయారు. ⇒ తిరుపతి ఘటనలో జరిగిన వాస్తవాలు ప్రజలకు చెప్పకూడదని చంద్రబాబు నాయుడు ఎంత దారుణమైన స్థాయికి దిగజారిపోయాడంటే.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులను నేను రాకముందే ఇక్కడ నుంచి షిప్ట్‌ చేసే కార్యక్రమం చేశారు. దీనికి మీరే సాక్ష్యం. గాయపడిన వారు చాలా మంది మేము పోము.. మా పరిస్థితి ఇంకా బాగోలేదు.. మమ్మల్ని ఎక్కడకు పంపిస్తారు.. మేము ఎందుకు పోవాలని బీష్మించుకొని ఆస్పత్రిలో ఉండిపోయారు.⇒ వారిని ఇక్కడి నుంచి బలవంతంగా పంపించేందుకు నా కాన్వా­య్‌ని పోలీసులు అడ్డగించారు. ట్రాఫిక్‌ పేరుతో నా కాన్వాయ్‌ ముందుకు కదలకుండా చేశారు. ఎస్పీకి ఒక మాట చెబుతున్నా.. చంద్రబాబుతో మీరంతా కుమ్మక్కై దారుణంగా వ్యవహ­రిస్తున్నారు. దేవుని విషయంలో కూడా ఎంత దారుణంగా ప్రవర్తించారో పైనున్న దేవుడు చూస్తున్నాడు. ఎస్పీ నుంచి చంద్రబాబు వరకు ఆ దేవుడే గట్టిగా మొట్టికాయలు వేస్తాడు.చిన్న కేసుగా పక్కన పడేసే కుట్రభక్తులు మృతి చెందిన ఘటనపై ఎఫ్‌ఐఆర్‌లో పేలవమైన సెక్షన్లు నమోదు చేశారు. ఇందులో 194 బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ కింద కేసు పెట్టారు. దొమ్మీ జరిగి ఇద్దరు కొట్టుకుంటే పెట్టే సెక్షన్లతో కేసు నమోదు చేస్తారా? ఇది ఇద్దరు కొట్టుకుంటే జరిగిన ఘటనా? ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగితే.. 105 బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ పెట్టాల్సింది పోయి.. కావాలని కేసును నీరు గార్చేందుకు కుట్రలు చేస్తున్నారు. ఇంత పెద్ద ఘటనను ఒక చిన్న కేసుగా.. తీసి పక్కన పడేసేందుకు దారుణంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారంటే.. వీళ్లకు అసలు మానవత్వం లేదు. చిత్తశుద్ధి కూడా లేదు. బాగా చేయాలనే ఆలోచన అసలే లేదు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం జరుగుతోంది. చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలు చేసి టీటీడీ లడ్డూ విషయంలో ఒక అబద్ధాన్ని సృష్టించారు. దానికి రెక్కలు కట్టి తిరుపతి వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని సైతం అప్రతిష్టపాలు చేసిన చరిత్ర చంద్రబాబుది. ఇదే పెద్ద మనిషి తన చర్యలతో మరో­సారి టీటీడీలో బ్లాక్‌ మార్కుగా నిలిచిపోయే ఘట­నకు కారణమయ్యాడు. దశాబ్దాలుగా తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడికి వచ్చిన లక్షలాది మంది భక్తులకు సురక్షితంగా భగవంతుడి దర్శనం కల్పించడం. అందుకే క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌లో టీటీ­డీకి ఉన్న విశిష్టత ఎక్కడా లేదు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు టీటీడీలోకి అడుగుపెట్టాలంటే.. అది కూడా చంద్రబాబు లాంటి పాలకుడు ఉన్నప్పుడు ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయోనని చూపించారు.తప్పంతా చంద్రబాబుదే ⇒ చంద్రబాబు.. ఓ షో పుటప్‌ చేసి, చిన్న స్థాయి అధికారులను బాధ్యులను చేస్తూ వారిని బదిలీ, సస్పెండ్‌ చేసే శిక్షలతో సరిపెట్టే కార్యక్రమం చేస్తుండటం బాధాకరం. ఈ ఘటనలో చంద్రబాబు చేసిన తప్పు కన్పించడం లేదా? 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకు కుప్పంలో పర్యటించ లేదా? పోలీసులందరినీ తన చుట్టూ పెట్టుకో­లేదా? భక్తుల కోసం పోలీసుల కేటా­యింపు లేకపోవడం వాస్తవం కాదా? జిల్లా ఎస్పీ.. చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకే తాపత్రయ పడ్డారే తప్ప, లక్షల మంది భక్తులకు సెక్యు­రిటీ కల్పించాలని ఆలోచించ లేదు. ఈ విషయంలో ఎస్పీది తప్పు కాదా? ⇒ కలెక్టర్‌ది కూడా తప్పు ఉంది. కనీసం అక్కడున్న వారిని క్యూలైన్‌లలో నిలబెట్టే కార్యక్రమంపై ప్రొటోకాల్‌ ప్రకారం ఆదేశాలు ఇచ్చేందుకు రివ్యూలు కూడా చేయక పోవడం తప్పు కాదా? కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు కూడా ఇవ్వాలనే ఆలోచన చేయలేదు. అక్కడకు వచ్చిన భక్తులకు కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదు. తినడానికి తిండి లేదు. ఇలా గంటల తరబడి భక్తులు పార్కుల్లో ఉండేలా చేశారు. అన్ని కౌంటర్ల వద్ద పోలీసులు లేకుండా చేయడంలో కలెక్టర్‌ది తప్పు కాదా?⇒ వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం ఎంత మందిని ప్రవేశింప చేయాలనే నిర్ణయం తీసుకున్నది ఈవో, అదనపు ఈవో. వీరందరినీ అజమాయిషీ చేసేది టీటీడీ చైర్మన్‌. వీరందరిదీ తప్పు కాదా? టోకెన్ల జారీపై రివ్యూలు తీసుకోకుండా ఇంత మంది చావులకు కారణం మీరు కాదా? మొత్తానికి ఈ ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబే.

Us President Elect Donald Trump Given Unconditional Discharge In Hush Money Case2
హష్‌ మనీ కేసు: అమెరికాలో చరిత్రలోనే నేరం నిరూపితమైన అధ్యక్షుడిగా ట్రంప్‌

న్యూయార్క్‌: హష్‌ మనీ కేసులో ట్రంప్‌ నేరాన్ని కోర్టు నిర్థారించింది. జైలు శిక్ష, జరిమానా నుంచి ట్రంప్‌కు మినహాయింపునిచ్చింది. అమెరికాలో చరిత్రలోనే నేరం నిరూపితమైన అధ్యక్షుడిగా ట్రంప్‌ నిలవనున్నారు. ఈ కేసులో న్యాయస్థానం తీర్పు వెలువరిస్తూ.. ఆయనకు అన్‌కండిషనల్‌ డిశ్చార్జ్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో ట్రంప్‌ దోషిగా తేలినప్పటికీ.. ఎటువంటి జైలు శిక్ష, జరిమానా ఎదుర్కోనవసరం లేదు. జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడుగా డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే.కాగా, అమెరికా రాజకీయ చరిత్రలో గతంలో ఎన్నడూ కనివినీ ఎరుగని వింత ఘట్టానికి న్యాయమూర్తి జువాన్‌ ఎం.మర్చన్‌ తెరలేపారు. క్రిమినల్‌ కేసులో దోషిగా తేలిన వ్యక్తిని శిక్షిస్తానంటూనే శిక్షాకాలం విధించబోనని చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే.. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణం చేయడానికి సరిగ్గా పది రోజుల ముందు జనవరి పదో తేదీ ఉదయం 9.30 గంటలకు సంబంధిత తీర్పు చెప్తానని జడ్జి ప్రకటించారు.నీలిచిత్రాల తార స్టార్మీ డేనియల్‌కు అనైతిక నగదు చెల్లింపుల కేసులో దోషిగా తేలిన ట్రంప్‌కు పదో తేదీన శిక్ష ఖరారు చేస్తానని న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌ కోర్టు జడ్జి వెల్లడించారు. ‘‘కారాగారంలో జైలుశిక్ష అనుభవించాల్సిన అవసరంలేకుండా ట్రంప్‌ను బేషరతుగా వదిలేస్తూ, కేసుకు ముగింపు పలుకుతూ తీర్పు రాస్తా. అన్‌కండీషనల్‌ డిశ్చార్జ్‌ తీర్పు వినేందుకు ట్రంప్‌ కుదిరితే ప్రత్యక్షంగా లేదంటే వర్చువల్‌గా కోర్టు ఎదుట హాజరవ్వాల్సి ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే.ట్రంప్‌కు ఎలాంటి ప్రొబేషన్‌ పిరియడ్, జరిమానా విధించబోను’’అని జడ్జి చెప్పారు. గతంలో తనతో శృంగారం జరిపిన విషయం ఎవరికీ చెప్పకుండా దాచేందుకు స్టార్మీ డేనియల్‌కు ట్రంప్‌ తన లాయర్‌ ద్వారా 2016 ఏడాదిలో 1,30,000 డాలర్లు ఇచ్చారు. ఈ నగదును లెక్కల్లో తప్పుగా చూపారు. ఈమెకు నగదు ఇచి్చన విషయాన్ని దాచి ఆ నగదును ఎన్నికల జమా ఖర్చు కింద మార్చిరాశారు. ఈ అనైతిక చెల్లింపును ‘హష్‌ మనీ’గా పేర్కొంటారు.ఎన్నికల విరాళాలను ఇలా అక్రమంగా దుర్వినియోగం చేశారని ట్రంప్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో 34 అంశాల్లో ట్రంప్‌ దోషిగా తేలిన విషయం విదితమే. జూలై 11వ తేదీనే ట్రంప్‌ కేసు ముగింపుకొచ్చినా అధ్యక్షునిగా గెలిచిన వ్యక్తికి క్రిమినల్‌ కేసు విచారణ నుంచి మినహాయింపు ఉంటుందంటూ ట్రంప్‌ న్యాయవాదులు ఇన్నాళ్లూ వాదిస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఇవన్నీ చెల్లవంటూ న్యాయమూర్తి ఇవాళ తన తీర్పున వెలువరించారు.

Case Filed On KTR At Banjara Hills Police Station Hyderabad3
కేటీఆర్‌పై మరో కేసు నమోదు

హైదరాబాద్‌: ఇప్పటికే ఫార్ములా ఈ-రేస్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)పై మరో కేసు నమోదైంది. నిన్న(గురువారం) ఏసీబీ(ACB) విచారణకు హాజరైన కేటీఆర్‌.. విచారణ ముగిసిన తర్వాత ర్యాలీగా వచ్చారు. దీనిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారనే కారణంతో కేటీఆర్‌పై నమోదైంది. ట్రాఫిక్‌ పోలీసుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఏసీబీ విచారణ తర్వాత ఆ కార్యాలయం నుంచి బీఆర్‌ఎస్‌ కార్యాలయం వరకూ కేటీఆర్‌ ర్యాలీగా వచ్చారు. దీనిపైనే ఇప్పుడు కేసు నమోదైంది.తీవ్ర ఉత్కంఠ రేపిన కేటీఆర్‌ విచారణఏసీబీ విచారణకు కేటీఆర్‌ విచారణకు హాజరైన క్రమంలో తీవ్ర ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. కేటీఆర్ను అరెస్టు చేస్తారనే వార్తల నేపథ్యంలో విచారణ తర్వాత ఆయన తిరిగి వచ్చేవరకూ ఉత్కంఠ కొనసాగింది. విచారణ ముగించుకుని కేటీఆర్‌ బయటకు వస్తున్నారనే వార్తలు వచ్చిన వెంటనే బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.కేటీఆర్‌ను ఏసీబీ విచారించే క్రమంలో ముఖ్యనేతలంతా పార్టీ కార్యాలయంలోనే ఉండి చర్చల్లో మునిగితేలారు. గురువారం ఉదయం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తును నందినగర్‌ నివాసానికి చేరుకుని ఏం జరుగుతుందో అనే అంశాన్ని నిశితంగా పరిశీలించారు.మరొకవైపు మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్సీ కవిత, పలువురు మాజీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు కేటీఆర్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. కేటీఆర్‌ ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన తర్వాత నందినగర్‌ నుంచి హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఇదీ కూడా చదవండి: ఇది తొలి పాడ్‌కాస్ట్‌.. కాస్త బెరుకుగా ఉంది: ప్రధాని మోదీ

Ttd Chairman Br Naidu Counter To Pawan Kalyan4
స్పందించాల్సిన అవసరం లేదు.. పవన్‌కు టీటీడీ ఛైర్మన్‌ కౌంటర్‌

సాక్షి, తిరుపతి: క్షమాపణలు చెప్పితే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?.. ఎవరో ఏదో చెప్పారని మేం స్పందించాల్సిన అవసరం లేదంటూ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) వ్యాఖ్యలకు టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు(BR Naidu) కౌంటర్‌ ఇచ్చారు.తొక్కి­సలాట ఘటనకు టీటీడీ(TTD) ఈ­వో శ్యామల­రావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, టీటీడీ చైర్మన్‌ బాధ్యత వహించాలని పవన్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.. మృతుల కుటుంబాలకు టీటీడీ బోర్డు, పోలీసులు క్షమా­పణ చెప్పా­లన్నారు. తొక్కిసలాట జరుగుతుంటే పోలీసు­లు చోద్యం చూసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పోలీసుల వైఫల్యంపైనే ఎక్కువ ఫిర్యా­దులు వస్తున్నాయ­న్నారు. క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ సరిగా జరగలేదన్నారు.కాగా, తొక్కిసలాట ఘటనపై ఇవాళ పవన్‌ కల్యాణ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షమాపణలు చెప్పేందుకు అధికారులకు ఎందుకు నామోషీ.. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుతో సహా పాలక మండలి సభ్యులు.. ఈవో, ఎఈవో ఘటనకు భాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పాలి. ఇలాంటి ఘటనలో తాను దోషిగా నిలబడాలా? అంటూ వ్యాఖ్యానించారు.మరోవైపు, టీటీడీ పాలకమండలి, ఈవో మధ్య వార్ కొనసాగుతోంది. అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. పాలకమండలి సభ్యులకు కనీస సమాచారం ఇవ్వడం లేదంటూ ఈవోపై సభ్యులు మండినట్లు సమాచారం.ఇదీ చదవండి: పవన్‌.. ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలి: బొత్సవైకుంఠ ఏకాదశి ఏర్పాట్లుపై సమాచారం పాలకమండలికి టీటీడీ అధికారులు ఇవ్వలేదని.. సమన్వయ లోపం కారణంగానే భక్తులకు సరైన ఏర్పాట్లు చేయలేదంటు ఈవోని సభ్యులు నిలదీశారు. తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు 25 లక్షలు, క్షతగాత్రులకు 2 నుండి 5 లక్షలు టీటీడీ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు కేటాయింపుపై పాలక మండలి నిర్ణయం తీసుకోనుంది. వైకుంఠ త్రయోదశి తర్వాత టోకెన్ లేకుండా సర్వదర్శనానికి అనుమతించాలని పాలకమండలిలో చర్చ జరిగింది.

 I feel nervous  This is my first podcast : PM Narendra Modi5
ఇది నా తొలి పాడ్‌కాస్ట్‌.. కాస్త బెరుకుగా ఉంది: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: తాను మనిషినేనని, దేవుణ్ని కాదని, మనుషలంతా ఏదొక తప్పు చేసినట్లు తాను కూడా తప్పులు చేస్తూ ఉంటానని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తెలిపారు. డబ్యూటీఎఫ్‌ సిరీస్‌లో భాగంగా జిరోడా కో-ఫౌండర్‌ నిఖిల్‌ కామత్‌ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌(Podcast)లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ‘ తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. నేను కూడా కొన్ని తప్పులు చేసుంటాను. నేను కూడా మనిషినే కదా.. దేవుణ్ని అయితే కాదు. మనిషిని కాబట్టే తప్పులు చేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది’ అని మోదీ పేర్కొన్నారు.సర్‌.. నాది బ్యాడ్‌ హిందీపాడ్‌కాస్ట్‌ ఆరంభంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నిఖిల్‌ కామత్‌ మాట్లాడుతూ.. తనది ‘బ్యాడ్‌ హిందీ’ అని, తన హిందీ భాష సరిగా లేకపోతే క్షమించమంటూ మోదీకి విన్నవించాడు. ‘ నేను సౌత్‌ ఇండియన్‌. నేను ఎక్కువగా బెంగళూర్‌లో పెరిగాను. మా అమ్మది మైసూర్‌ కావడంతో అక్కడ వారంతా ఎక్కవగా కన్నడ మాట్లాడతారు. తండ్రిదేమో మంగళూరు. నేను స్కూల్‌లో హిందీ నేర్చుకున్నాను. కానీ భాషపై పట్టు సరిగా లేదు’ అని మోదీకి చెప్పారు నిఖిల్‌ కామత్‌.ఏం ఫర్లేదు.. ఇద్దరం కలిసి మేనేజ్‌ చేద్దాంమనమిద్దరం కలిసి మేనేజ్‌ చేద్దాం. నేను నీ ముందే కూర్చొని మాట్లాడం నాకు కాస్త బెరుకుగా ఉంది. ఇది నాకు ఒక కఠినమైన పరీక్ష. ఎందుకంటే ఇదే నా తొలి పాడ్‌కాస్ట్‌. ఇది ప్రజల్లోకి ఎలా వెళుతుందో అనేది నాకు తెలియదు’ అని మోదీ పేర్కొన్నారు.సుమారు రెండు గంటల పాటు సాగిన పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ అనేక విషయాలను షేర్‌ చేసుకున్నారు. తన బాల్యం, విద్య, రాజకీయం తదితర విషయాలను మోదీ షేర్‌ చేసుకున్నారు. తన కుటుంబ సభ్యుల మొత్తం దుస్తుల్ని తానే ఉతికేవాడినన్నారు. ఎందుకంటే ఊరి చెరువు దగ్గరకు వెళ్లడానికి మా వాళ్లు నాకు అనుమతి ఇచ్చారు కాబట్టి(నవ్వుతూ).. దుస్తులు ఉతికే బాద్యత తీసుకునేవాడినన్నారు.ఈ వీడియోను ప్రధాని మోదీ తన సోషల్‌ మీడియా హ్యాండిల్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. దీన్ని అంతా ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తు న్నట్లు మోదీ పేర్కొన్నారు. ‘ఈ పాడ్‌కాస్ట్‌ను మేము ఎంతో ఎంజాయ్‌ చేస్తూ చేశామని, మీరు కూడా ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నాను’ అని వీడియో కింద మోదీ కామెంట్‌ చేశారు.An enjoyable conversation with @nikhilkamathcio, covering various subjects. Do watch... https://t.co/5Q2RltbnRW— Narendra Modi (@narendramodi) January 10, 2025 ప్రధాని రేసులో నేనూ ఉన్నా.. భారత సంతతి కెనడా ఎంపీ

Megastar Chiranjeevi Tweet On Ram Charan Game Changer Movie6
గేమ్ ఛేంజర్ రిలీజ్‌.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్‌ వైరల్!

రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్‌ మూవీపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ సినిమాకు చాలామంది ప్రశంసలు కురిపించడం ఆనందంగా ఉందన్నారు. అప్పన్న, రామ్ నందన్‌ పాత్రల్లో రామ్ చరణ్ అద్భుతంగా చేశారని తనయుడిని కొనియాడారు. ఈ సందర్భంగా సక్సెస్ సాధించిన గేమ్ ఛేంజర్ చిత్రబృందానికి ఆయన అభినందనలు తెలిపారు. గొప్ప సినిమాను అందించిన దర్శకుడు శంకర్‌తో పాటు దిల్‌ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్.‌ అభిమానుల భారీ అంచనాల మధ్య ఇవాళే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్‌‌ టాక్‌ను సొంతం చేసుకుంది. మెగా ఫ్యాన్స్ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అంటుంటే.. మరికొందరేమో ఫర్వాలేదని కామెంట్స్ చేస్తున్నారు.ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, సముద్ర ఖని ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు.Delighted to see lots of appreciation for @AlwaysRamCharan who excels as Appanna ,the righteous ideologue & Ram Nandan, the determined IAS officer out to cleanse the system. Hearty Congrats to @iam_SJSuryah @advani_kiara @yoursanjali ,Producer #DilRaju @SVC_Official , above…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 10, 2025 నాలుగు పాటలకే రూ.75 కోట్లు..ఈ చిత్రంలోనే నాలుగు పాటల కోసం ఏకంగా రూ.75 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పోస్ట్ చేశారు. కేవలం పాటలకే ఇంత భారీ బడ్జెట్‌ ఖర్చు చేయడంపై టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. అందువల్లే ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.సినిమా రిలీజ్‌కు ముందే గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే నాలుగు పాటలను విడుదల చేశారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. మొదటి సాంగ్ జరగండి.. జరగండి అనే పాట ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో 600 డ్యాన్సర్లు పాల్గొన్నారు. దాదాపు 13 రోజుల పాటు షూటింగ్‌ చేశారు. ఈ సాంగ్‌లో విజువల్స్ ఫ్యాన్స్‌ను అలరించాయి.గేమ్ ఛేంజర్ కథేంటంటే..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి( శ్రీకాంత్) ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని, నిజాయితీగా పని చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు, మైనింగ్‌ మినిస్టర్‌ బొబ్బిలి మోపిదేవి(ఎస్‌జే సూర్య)కి నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతిని కొనసాగిస్తుంటాడు. అంతేకాదు తండ్రిని తప్పించి సీఎం సీటులో కూర్చోవాలని కుట్ర చేస్తుంటాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఐపీఎస్‌గా విధులు నిర్వర్తిస్తూ.. సివిల్స్‌ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్‌గా సెలెక్ట్‌ అయిన రామ్‌ నందన్‌(రామ్‌ చరణ్‌).. విశాఖపట్నం కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతాడు. జిల్లాలో అవినీతి, దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్‌ ఇస్తాడు.ఈ క్రమంలో మంత్రి మోపిదేవి, కలెక్టర్‌ మధ్య వైరం ఏర్పడుతుంది. మరోవైపు సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్ట్‌ ఇస్తాడు. అదేంటి? అసలు సీఎం సత్యమూర్తిలో మార్పుకు గల కారణం ఏంటి? అప్పన్న(రామ్‌ చరణ్‌) ఎవరు? పార్వతి(అంజలి)తో కలిసి ఆయన పోరాటం ఏంటి? కలెక్టర్‌ రామ్‌కి అప్పన్నకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం సీటు కోసం మోపిదేవి చేసిన కుట్రలను రామ్‌ ఎలా అడ్డుకున్నాడు? ఒక ఐఏఎస్‌ అధికారిగా తనకున్న పవర్స్‌ని ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు? దీపిక(కియారా అద్వానీ)తో రామ్‌ ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Himachal Pradesh Man Get Rs 200 Crore Electricity Bill7
నెల కరెంట్ బిల్ రూ.200 కోట్లు: దెబ్బకు ఫ్యూజులు అవుట్

సాధారణంగా నెలకు కరెంట్ బిల్ ఎంత వస్తుంది? మహా అయితే వేల రూపాయలోనే ఉంటుంది, కదా. కానీ హిమాచల్‌ప్రదేశ్‌లోని ఓ వ్యక్తికి కరెంట్ బిల్ ఏకంగా రూ.200 కోట్ల కంటే ఎక్కువే వచ్చింది. కరెంట్ బిల్ ఏమిటి? రూ.200 కోట్లు ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథనం చదివేయాల్సిందే..హిమాచల్‌ప్రదేశ్‌లోని బెహెర్విన్ జట్టన్ గ్రామానికి చెందిన 'లలిత్ ధీమాన్' అనే వ్యాపారవేత్త.. తనకు వచ్చిన ఎలక్ట్రిక్ బిల్ చూసి అవాక్కయ్యాడు. ఎందుకంటే ఆయనకు వచ్చిన కరెంట్ బిల్ ఏకంగా రూ. 2,10,42,08,405. ఇప్పటి వరకు ఇంత కరెంట్ బిల్ బహుశా ఏ ఒక్కరికీ వచ్చి ఉండదు.రూ.2,10,42,08,405 కరెంట్ బిల్ రావడానికి ముందు నెలలో 'లలిత్ ధీమాన్'కు వచ్చిన బిల్లు రూ.2,500 మాత్రమే. భారీ మొత్తంతో కరెంట్ బిల్ రావడంతో అతడు ఫిర్యాదు చేసేందుకు విద్యుత్‌ బోర్డును సందర్శించాడు. సాంకేతిక లోపం వల్లనే ఈ బిల్లు వచ్చిందని.. విద్యుత్‌ బోర్డు అధికారులు వెల్లడించారు. ఆ తరువాత అతనికి సరైన కరెంట్ బిల్ ఇచ్చారు. నిజానికి అతనికి వచ్చిన కరెంట్ బిల్ రూ.4047 మాత్రమే.ఇదీ చదవండి: ఫిక్స్‌డ్ డిపాజిట్​పై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఇదే!సాంకేతిక లోపాల వల్ల భారీ బిల్లులు రావడం ఇదే మొదటి సారి కాదు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తికి 1,540 రూపాయల కరెంట్ బిల్ వస్తే.. విద్యుత్ శాఖ నుంచి 86 లక్షల రూపాయలకు పైగా బిల్లును స్వీకరించాడు. ఆ తరువాత జరిగిన తప్పిదాన్ని అధికారులు గుర్తించి ఆయనకు సరైన బిల్ ఇచ్చారు.

What If An Employee Work For 70 or 90 Working Hours Experts Says This8
అన్నేసి గంటలు పనిచేస్తే జరిగేది ఇదే!

భారత్‌లో పనిగంటల అంశం మరోసారి చర్చ తెర మీదకు వచ్చింది. ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యం ఉద్యోగులు వారం మొత్తం మీద ఏకంగా 90 గంటలు పని చేయాల్సిందేనంటూ వ్యాఖ్యానించడం ఇందుకు కారణం. మొన్నీమధ్యే ఇన్ఫోసిస్‌ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి 70 గంటలు పని చేయాలంటూ పిలుపు ఇవ్వడం తెలిసిందే. అయితే సుబ్రహ్మణ్యం ‘అంతకుమించి’ స్టేట్‌మెంట్‌ ఇవ్వడంతో ఇప్పుడు సెలబ్రిటీలు సైతం మండిపడుతున్నారు. ఈ దరిమిలా వీళ్లిద్దరి గురించి నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. అయితే.. ఇంతకీ 70.. 90.. మనిషి శరీరం ఒక వారంలో అసలు ఎన్నేసి పనిగంటలను చేయగలదు?. ఏ మేర పని ఒత్తిడిని ఒక ఉద్యోగి భరించగలరు?. అలా గనుక పని చేస్తే.. శరీరంలో కలిగే మార్పులేంటి?. ఈ విషయంలో అసలు వైద్యులు ఏం చెబుతున్నారు?.. బిజినెస్‌ టైకూన్లు చెబుతున్న అంతటి పని భారం ఉద్యోగి మోయ తరమేనా?.. వారంలో 90 గంటలపని.. అంటే ఏడు రోజులపాటు 13 గంటల చొప్పున పని చేయాలన్నమాట. మిగిలిన 11 గంటల్లోనే నిద్ర, ఇతర పనులు, ప్రయాణాలు, ఆఖరికి కుటుంబ సభ్యులతో గడపడం లాంటి వాటితో సర్దుకుపోవాలన్నమాట. అయితే ఇది శారీరకంగానేకాదు.. మానసికంగానూ మనిషిపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయం ప్రకారం.. వారంలో 55 గంటలకు మించి గనుక పని చేస్తే గుండె జబ్బుల బారినపడే అవకాశం ఉంటుందట. అలా పనిచేసే ఉద్యోగుల్లో వందలో 35 మంది స్ట్రోక్ బారినపడే అవకాశం ఉంది. వందలో 17 మంది ప్రాణమే పొగొట్టుకునే అవకాశం ఉంది అని ఆ స్టడీ వెల్లడించింది. ‘‘ఎక్కువసేపు పని చేయడమంటే గుండె మీద ఒత్తిడి పెంచడమే. దీనివల్ల కోర్టిసోల్‌, అడ్రినలిన్‌ హార్మోన్‌లపై ప్రభావం పడుతుంది. తద్వారా బీపీ, గుండె కొట్టుకునే వేగంలో మార్పులొస్తాయి. అలా హార్ట్‌ స్ట్రోక్, హార్ట్‌ ఎటాక్‌తో పాటు హార్ట్‌ ఫెయిల్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి. వారానికి 40 గంటల కంటే ఎక్కువ పని చేయడం వల్ల.. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు గట్టిపడడమో లేదంటే కుంచిచుపోతాయి’’ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: భారత్‌ బాగుండాలంటే.. ఉద్యోగుల పని గంటలు తగ్గాల్సిందే!.. ఇక ఎక్కువ గంటలు పని చేయడం డయాబెటిస్‌కు దారి తీసే అవకాశం లేకపోలేదు. ఇది రక్తంలో షుగర్‌ స్థాయిపై అనేక రకాలుగా ప్రభావం చూపెడుతుంది. మహిళలు 45 గంటలకంటే ఎక్కువసేపు పని చేసినా.. పురుషులు 53 గంటలకు మించి పని చేసినా షుగర్‌ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువని పలు అధ్యయనాలు తెలిపాయి కూడా. ఇక చాలాసేపు కూర్చుని పనిచేయడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయి పెరుగుతుందని పలు అధ్యయనాలు నిరూపించాయి కూడా. ఇది ఒబెసిటీ(స్థూలకాయం)కి దారి తీయొచ్చు. అన్నింటికి మించి.. విపరీతమైన పనిభారం మానసిక ఆరోగ్యాన్ని కుంగదీస్తుంది. ఇది బంధాలకు బీటలు తెచ్చే ప్రమాదం లేకపోలేదు. అందుకే.. విశ్రాంతి లేకుండా శరీరానికి పని చెప్పడం ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. జీరో రెస్ట్‌ వర్క్‌.. నిద్రాహారాలను నిర్లక్ష్యం చేయిస్తుంది. పని ఒత్తిడి వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతిమంగా.. అనారోగ్యకరమైన జీవనశైలి వైపునకు అడుగులు వేయిస్తుందని అంటున్నారు. భారతీయుల్లో ఇప్పటికే గుండె జబ్బులు, డయాబెటిస్‌లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్న వాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలో అధిక పని గంటల నిర్ణయాలతో పరిస్థితి మరింత ముదిరే అవకాశం ఉంటుంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: వారానికి మొత్తం 40 గంటలే పని ఉండాలి!ఇన్ఫోసిస్‌ మూర్తి(78) ఏమన్నారంటే..ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువ. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. మనమూ అలా శ్రమించాలి. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలి.తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శల నేపథ్యంలో మరోసారి ఆయన స్పందిస్తూ..ఇన్ఫోసిస్‌(Infosys)ను మేం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంపెనీలతో పోలుస్తాం. అలా పోల్చుకున్నప్పుడే భారతీయులు చేయాల్సింది చాలా ఉందనిపిస్తుంది. మన దేశంలో ఇంకా 80కోట్ల మంది ఉచిత రేషన్‌ అందుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా..! అందుకే మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలి. వారానికి 70 గంటలు పని చేయలేకపోతే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలం? మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పనిచేస్తారు?.ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యం(64) ఏమన్నారంటే..ఆదివారాలు మీతో పనిచేయించలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. మీతో అలా పనిచేయించగలిగితే.. నాకు సంతోషం. ఎందుకంటే నేను ఆదివారాలు పనిచేస్తున్నాను. అయినా ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు. ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలి. వారానికి 90 గంటలు పని చేయాలి. అందుకోసం ఆదివారం సెలవులనూ వదిలేయాలి. ఇదీ చదవండి: 104 రోజులు ఏకధాటిగా పని.. అనారోగ్యంతో వ్యక్తి మృతి

Game Changer Movie Review And Rating In Telugu9
‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ రివ్యూ

టైటిల్‌ : గేమ్‌ ఛేంజర్‌నటీనటులు: రామ్‌ చరణ్‌, కియారా అద్వానీ, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, అంజలి, నవీన్‌ చంద్ర, నాజర్‌ తదితరులునిర్మాణ సంస్థలు: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్కథ: కార్తీక్‌ సుబ్బరాజ్‌దర్శకత్వం-స్క్రీన్‌ప్లే: ఎస్‌. శంకర్‌సంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: తిరువిడుదల: జనవరి 10, 2025సంక్రాంతి టాలీవుడ్‌కి చాలా పెద్ద పండగ. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా పండక్కి మూడు భారీ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడుతున్నాయి. వాటిలో రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’(Game Chnager Review) నేడు(జనవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కించిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌, పాటలు ఆ అంచనాలను మరింత పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘గేమ్‌ ఛేంజర్‌’పై మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? శంకర్‌, చరణ్‌ ఖాతాలో బిగ్‌ హిట్‌ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి( శ్రీకాంత్) ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని, నిజాయితీగా పని చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు, మైనింగ్‌ మినిస్టర్‌ బొబ్బిలి మోపిదేవి(ఎస్‌జే సూర్య)కి నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతిని కొనసాగిస్తుంటాడు. అంతేకాదు తండ్రిని తప్పించి సీఎం సీటులో కూర్చోవాలని కుట్ర చేస్తుంటాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఐపీఎస్‌గా విధులు నిర్వర్తిస్తూ.. సివిల్స్‌ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్‌గా సెలెక్ట్‌ అయిన రామ్‌ నందన్‌(రామ్‌ చరణ్‌).. విశాఖపట్నం కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతాడు. జిల్లాలో అవినీతి, దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్‌ ఇస్తాడు.ఈ క్రమంలో మంత్రి మోపిదేవి, కలెక్టర్‌ మధ్య వైరం ఏర్పడుతుంది. మరోవైపు సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్ట్‌ ఇస్తాడు. అదేంటి? అసలు సీఎం సత్యమూర్తిలో మార్పుకు గల కారణం ఏంటి? అప్పన్న(రామ్‌ చరణ్‌) ఎవరు? పార్వతి(అంజలి)తో కలిసి ఆయన పోరాటం ఏంటి? కలెక్టర్‌ రామ్‌కి అప్పన్నకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం సీటు కోసం మోపిదేవి చేసిన కుట్రలను రామ్‌ ఎలా అడ్డుకున్నాడు? ఒక ఐఏఎస్‌ అధికారిగా తనకున్న పవర్స్‌ని ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు? దీపిక(కియారా అద్వానీ)తో రామ్‌ ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..శంకర్‌(Shankar) అద్భుతమైన ఫిల్మ్‌ డైరెక్టర్‌. అందులో డౌటే లేదు. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక సందేశం ఇచ్చేలా ఆయన సినిమాలు ఉంటాయి. జెంటిల్‌మెన్‌, ఒకే ఒక్కడు, భారతీయుడు, శివాజీ, అపరిచితుడు, రోబో లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలను అందించాడు. అయితే భారతీయుడు 2 రిలీజ్‌ తర్వాత శంకర్‌ మేకింగ్‌పై విపరీతమైన ట్రోల్స్‌ వచ్చాయి. బలమైన కథలు రాసుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. ఆ ఎఫెక్ట్‌ గేమ్‌ ఛేంజర్‌(Game Changer Review)పై కూడా పడింది. కానీ మెగా ఫ్యాన్స్‌తో పాటు శంకర్‌ అభిమానులు కూడా ఈ చిత్రం ఆయనకు కమ్‌బ్యాక్‌ అవుతుందని ఆశ పడ్డారు. కానీ వారి ఆశ పూర్తిగా నెరవేరలేదనే చెప్పాలి. కార్తీక్‌ సుబ్బరాజ్‌ అందించిన రొటీన్‌ కథను అంతే రొటీన్‌గా తెరపై చూపించాడు. ఈ సినిమా నేపథ్యం అవినీతి రాజకీయ నేతకు, నిఖార్సయిన ఐఏఎస్‌ అధికారికి మధ్య జరిగే ఘర్షణ అని ట్రైలర్‌లోనే చూపించారు. అయితే ఆ ఘర్షణను ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. శంకర్‌ గత సినిమాలను గుర్తు చేసేలా కథనం సాగుతుంది. అలా అని బోర్‌ కొట్టదు. మదర్‌ సెంటిమెంట్‌, తండ్రి ఎపిసోడ్‌ సినిమాకు ప్లస్‌ అయిందనే చెప్పాలి.ఎలాంటి సాగదీతలు లేకుండా కథను చాలా సింపుల్‌గా ప్రారంభించాడు. హీరో పరిచయానికి మంచి సీన్‌ రాసుకున్నాడు. ఇక హీరో కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కథనంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. రామ్‌ చరణ్‌, ఎస్‌జే సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో హీరోయిన్‌తో వచ్చే లవ్‌ట్రాక్‌ ఆకట్టుకోకపోగా.. కథకు అడ్డంకిగా అనిపిస్తుంది. కాలేజీ ఎపిసోడ్‌ వర్కౌట్‌ కాలేదు. హీరోహీరోయిన్ల లవ్‌ట్రాక్‌కి ప్రేక్షకులు కనెక్ట్‌ కాకపోవడంతో ఆ సీన్స్‌ సాగదీతగా అనిపిస్తాయి. కలెక్టర్‌, మంత్రి మోపిదేవి మధ్య సాగే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి. సీఎం సీటు కోసం మోపిదేవి వేసే రాజకీయ ఎత్తులను ఐఏఎస్‌ అధికారిగా తనకున్న అధికారాలతో హీరో చెక్‌ పెట్టడం ఆకట్టుకుంటుంది.ఇంటర్వెల్‌ సీన్‌ మాత్రం ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. విరామం ముందు వచ్చే ఓ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేస్తుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే అప్పన్న ఎపిసోడ్‌ అందరిని ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత కథనం మళ్లీ ఊహకందేలా రొటీన్‌గా సాగుతుంది. మోపిదేవి, రామ్‌ నందన్‌ మధ్య సాగే టామ్‌ అండ్‌ జెర్రీ వార్‌ బాగానే ఉన్నా.. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోవు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ బెటర్‌. ఎన్నికల అధికారి తనకున్న పవర్స్‌ని నిజాయితీగా వాడితే ఎలా ఉంటుందనేది తెరపై చక్కగా చూపించారు. క్లైమాక్స్‌ కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఈ చిత్రం ద్వారా ఎన్నికల వ్యవస్థకు, రాజకీయ పార్టీలతో పాటు ఓటర్లకు దర్శకుడు ఇచ్చిన సందేశం మాత్రం బాగుంది. అయితే ఆ సందేశాన్ని ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా బలంగా చూపించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు.ఎవరెలా చేశారంటే..రామ్‌ చరణ్‌(Ram Charan) నటన ఏంటో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసింది. మరోసారి ఆ రేంజ్‌ నటనతో ఆకట్టుకున్నాడు. అప్పన్న, రామ్‌ నందన్‌ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన చరణ్‌.. ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్‌ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అప్పన్న పాత్రలో చరణ్‌ అద్భుతంగా నటించేశాడు. యాక్షన్‌, ఎమోషన్‌ సీన్లలో అదరగొట్టేశాడు. చరణ్‌ తర్వాత సినిమాలో బాగా పండిన పాత్ర ఎస్‌జే సూర్యది. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పొలిటిషీయన్‌ బొబ్బిలి మోపిదేవిగా సూర్య తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సూర్యకు, చరణ్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అప్పన్న భార్య పార్వతిగా అంజలి అద్భుతంగా నటించింది. ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ భావోధ్వేగానికి గురి చేస్తుంది. రామ్‌ నందన్‌ ప్రియురాలు దీపికగా కియరా అద్వానీ మెప్పించింది. తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా.. తనదైన అందచందాలతో ఆకట్టుకుంది. బొబ్బిలి సత్యమూర్తిగా శ్రీకాంత్‌, సైడ్‌ సత్యంగా సునీల్‌ ఉన్నంతలో చక్కగా నటించారు. అయితే సునీల్‌తో పాటు వెన్నెల కిశోర్‌ల కామెడీ మాత్రం సరిగ్గా పండలేదు. బ్రహ్మానందం ఒక్క సీన్‌లో కనిపిస్తారు. జయరాం, నవీన్‌ చంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. తమన్‌ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు వినడం కంటే తెరపై చూస్తే ఇంకా బాగా ఆకట్టుకుంటాయి. శంకర్‌ మార్క్‌ గ్రాండ్‌నెస్‌ ప్రతి పాటలోనూ కనిపించింది. సినిమాటోగ్రఫీ పని తీరు అద్భుతం. ప్రతి ఫ్రేమ్‌ తెరపై చాలా అందంగా, రిచ్‌గా కనిపిస్తుంది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్ పర్వాలేదు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో దిల్‌ రాజు ఎక్కడా వెనకడుగు వేయలేదని సినిమా చూస్తుంటే అర్థమవుతుంది.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Fun Bucket Bhargav Sentenced To 20 Years In Prison10
ఫన్‌ బకెట్‌ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు

సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఫోక్సో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. బాలికను గర్భవతిని చేసిన కేసులో ఫన్‌ బకెట్‌ భార్గవ్‌(Fun Bucket Bhargav)కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2021లో పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. టిక్‌ టాక్‌తో ఫేమస్ అయిన ఫన్ బకెట్ భార్గవ్.. వెబ్ సిరీస్‌లలో ఆఫర్ ఇప్పిస్తానని చెప్పి బాలికను మోసం చేశాడు. దీంతో విశాఖ పోక్సో కోర్టు.. భార్గవ్‌కి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.4 లక్షల జరిమానా విధించింది.14 ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన కేసులో భార్గవ్‌ను టిక్‌టాక్‌ ఫేం ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ను 2021లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. టిక్‌టాక్‌ వీడియోల పేరుతో బాలికను లోబర్చుకొని, పలుమార్లు అత్యాచారం చేసినట్లు విశాఖ పీస్‌లో భార్గవ్‌పై కేసు నమోదయ్యింది.విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన భార్గవ్ టిక్‌టాక్‌ వీడియోలతో ఫేమస్‌ అయిన సంగతి తెలిసిందే. అతనికి విశాఖ జిల్లా సింహగిరి కాలనీకి చెందిన 14 ఏళ్ల యువతితో చాటింగ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ యువతికి సైతం టిక్‌టాక్‌ వీడియోలపై ఆసక్తి ఉండటంతో తరుచూ మాట్లాడుకునేవాళ్లు. విశాఖ విజయనగరం సరిహద్దులో ఉన్న సింహగిరి కాలనీ... భార్గవ్ గతంలో నివాసం ఉన్న ప్రాంతానికి దగ్గర కావడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.ఇదీ చదవండి: పుష్ప భామ శ్రీవల్లికి గాయం.. అసలేం జరిగిందంటే?ఈ పరిచయంతో మైనర్‌ బాలిక భార్గవ్‌ను అన్నయ్య అని పిలిచేది. అయితే ఇద్దరూ తరుచూ చాటింగ్‌ చేయడం, కలుసుకుంటుం‍డంతో సాన్నిహిత్యం పెరిగింది. టిక్‌టాక్‌ వీడియోల పేరుతో భార్గవ్‌ ఆమెను లోబర్చుకున్నాడు. ఇటీవలె బాలిక శారీరక అంశాల్లో మార్పు గమనించిన ఆమె తల్లి డాక్టర్‌ను సం‍ప్రదించగా యువతి అప్పటికే నాలుగు నెలల గర్భిణి అని తేలింది. ఇందుకు కారణం ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ అని ఆరోపిస్తూ బాలిక తల్లి ఏప్రిల్‌ 16, 2021న పెందుర్తి పోలీసులను ఆశ్రయించింది. ​ విశాఖ సిటీ దిశ ఏసిపి ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో కేసు విచారణ కొనసాగింది. బాలికను భార్గవ్‌.. చెల్లి పేరుతో లోబర్చుకొని గర్భవతిని చేసినట్లు తేలింది. దీంతో ఇవాళ విశాఖ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.ఇదీ చదవండి: అల్లు అరవింద్‌ బర్త్‌ డే సెలబ్రేట్‌ చేసిన పుష్పరాజ్.. పోస్ట్ వైరల్

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
హష్‌ మనీ కేసు: అమెరికాలో చరిత్రలోనే నేరం నిరూపితమైన అధ్యక్షుడిగా ట్రంప్‌

title
లాస్ ఏంజెల్స్‌ కార్చిచ్చు : చిక్కుల్లో మాల్యా కొడుకు-కోడలు, అప్‌డేట్‌ ఇదే!

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో చెలరేగిన మంటలు బీభత్సాన్ని సృష్టించాయి.

title
నా ఉరిశిక్షను రద్దు చేయండి.. కోర్టుకు ట్విన్‌ టవర్స్‌ దాడి మాస్టర్‌మైండ్‌

వాషింగ్టన్‌ :  అమెరికా చరిత్రలో అత్యంత విషాదాన్ని మిగిల

title
ఓ మై గాడ్‌.. అణు బాంబు పడిందా?

ఈ భూమ్మీద అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో అదొకటి. సినీ ప్రముఖులు, ధనవంతులకు నెలవుగా ఉండేదది.

title
ప్రధాని రేసులో నేనూ ఉన్నా.. భారత సంతతి కెనడా ఎంపీ

ఒట్టావా : కెనడా ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో (justin trudea

National View all
title
పరువు నష్టం కేసు.. రాహుల్‌ గాంధీకి బెయిల్‌

పుణె: పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (R

title
రాష్ట్రమంతా నకిలీ రూ.500 నోట్లు.. పోలీసుల అలర్ట్‌

రాష్ట్రమంతా నకిలీ 500 రూపాయల నోట్లు (Fake 500 rupee notes) చెలామణి అవుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని బిహార్ (Bihar) పోలీ

title
ఇది నా తొలి పాడ్‌కాస్ట్‌.. కాస్త బెరుకుగా ఉంది: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: తాను మనిషినేనని, దేవుణ్ని కాదని,  మనుషలంతా

title
కోల్డ్‌ కాఫీ చేసిన రాహుల్‌ గాంధీ, వైరల్‌ వీడియో

కాంగ్రెస్ నాయకుడు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకు సంబంధించి ఒక వీడియ

title
అమ్మల కోసం రూ.10 లక్షల వ్యయంతో ‘ఆణిముత్యాలు’

దాదర్‌: బహిరంగ ప్రదేశాల్లో పసిబిడ్డలకు పాలిచ్చేందుకు బాలింత

NRI View all
title
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా

ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్

title
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!

అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్‌ దిగ్గజం యాపిల్‌ 185 మంది ఉద్యోగులను త

title
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి

title
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)

title
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్‌..!అచ్చం భారత్‌లో..

ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్‌ బిజినెస్‌లు.

Advertisement

వీడియోలు

Advertisement