Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

KSR Comment: Pawan Became Bakara In Tirupati Stampede Row1
బాబు డ్రామాలో పవన్‌ బకరా!

తిరుపతిలో జరిగిన ఘోరమైన తప్పిదాన్ని కూటమి ప్రభుత్వం ‘సారీ’లతో ముగించేస్తోందా?. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే తన వంతు పాత్ర పోషించి పరువు పోగొట్టుకుంటే.. టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఏకంగా పవన్‌ గాలి తీసేందుకే ప్రాధాన్యమిచ్చి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. దీంతో మొత్తం కథ అడ్డం తిరిగినట్లు అయ్యింది. చివరకు బీఆర్‌ నాయుడు చర్యతో టీడీపీ అధిష్టానం కూడా కంగు తినాల్సిన పరిస్థితి. అయితే..స్వయంగా రంగంలోకి దిగి ఆయనతోనూ ఓ సారీ చెప్పించాల్సి వచ్చింది. మొత్తమ్మీద చూస్తే.. ఈ వ్యవహారంలో అసలు ఎవరి తప్పూ లేనట్టుగా తేల్చేసి అటు ప్రభుత్వాధినేతలు.. ఇటు టీటీడీ ఉన్నతాధికారులూ జారుకున్నారు. స్వామివారిపై భక్తితో భక్తులు తిరుమతి రావడమే తప్పు అని చెప్పడమే తరువాయి!!.వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం టోకన్ల జారీ కాస్తా తొక్కిసలాటకు దారితీయడం ఆరుగురు మరణించడం వెనుక టీటీడీ, పోలీసుల వైఫల్యం, అలసత్వం సుస్పష్టం. పైరవీలతో టీటీడీ ఛైర్మన్‌, బోర్డు సభ్యులను నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వాన్ని పరోక్షంగా నడుపుతున్న లోకేష్‌ల బాధ్యతారాహిత్యం కూడా కనపడతూనే ఉంది. అంత పెద్ద ఘోరం జరిగినా దాన్ని చిన్నదిగా చూపేందుకు ప్రయత్నించారు. ఇతర అంశాలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టి మరల్చేందుకూ చూశారు. సహకరించే మీడియా ఉండనే ఉంది. దానికి అనుగుణంగానే టీడీపీ జాకీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి తమ వంతు పాత్ర పోషించాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అనవసరంగా అప్రతిష్టపాలైంది పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఆటలో అరటి పండు చందంగా ఎవరూ పట్టించుకోనిది.. ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి!. అందుకేనేమో.. ఆయన తన ఉనికి కాపాడుకోవడానికి ఏవో పిచ్చి ఆరోపణలు చేశారు.గాయపడ్డ వారిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వేర్వేరుగా వెళ్లారు. సాధారణంగా ముఖ్యమంత్రి వెంటే మంత్రులు ఉండటం రివాజు. కానీ వేరే పార్టీ అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్‌ విడిగా వెళ్లి కొంత స్వతంత్రంగా వ్యవహరించారని చాలామంది భావించారు. జరిగిన తప్పుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు భక్తులకు క్షమాపణ చెప్పాలని పవన్‌ డిమాండ్‌ చేయడమే కాకుండా, ప్రభుత్వం తరుఫున తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు కూడా. అంతా ఓకే అనుకుంటున్న సమయంలోనే పవన్‌.. తొక్కిసలాటలో కుట్ర కోణం ఉందా? అని ప్రశ్నించి బాబు దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశారు.భక్తులకు క్షమాపణ చెప్పాలన్న పవన్ మాటలను టీటీడీ బాధ్యులు ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. దాంతో పవన్ పిఠాపురంలో సభలో కూడా మళ్లీ అదే డిమాండ్ చేశారు. అప్పుడే పవన్ ఈ ఉదంతం నుంచి చంద్రబాబును, టీడీపీని రక్షించే యత్నం చేస్తున్నారన్న సందేహం కలిగింది. కాకపోతే ఈ విషయం అర్థం బీఆర్‌ నాయుడు పవన్ కల్యాణ్‌ ఎవరో అన్నట్లుగా మాట్లాడి గాలి తీశారు. ఎవరో ఏదో చెప్పారని తానెందుకు స్పందిస్తానని అనడం ద్వారా ఈ వ్యవహారానికి కొత్త ట్విస్టు ఇచ్చారు. ఇది కాస్తా పవన్ వర్గానికి చిర్రెత్తించింది. చంద్రబాబుకు వెంటనే నిరసన చెప్పి ఉండాలి. ఆ వెంటనే చంద్రబాబు రంగంలో దిగి బీఆర్‌ నాయుడును ఆదేశించడంతో ఆయన తప్పనిసరి స్థితిలో సారీ చెప్పి, తన వ్యాఖ్యలు పవన్‌ను ఉద్దేశించి కాదని బుకాయించే యత్నం చేశారు.నిజానికి పవన్ కళ్యాణ్ కూడా ఇతర మంత్రుల మాదిరే ఒక మంత్రి. కాకపోతే ఉప ముఖ్యమంత్రి. ఈయనకేమీ ప్రత్యేక అధికారాలు ఉండవు. ఇతర మంత్రులపై, తనకు సంబంధం లేని ప్రభుత్వ సంస్థలపై అధికారం ఉండదు. అయితే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించవచ్చు. ఈ అవకాశాన్ని వాడుకుని స్వతంత్రంగా వ్యక్తిత్వంతో తిరుపతిలో తొక్కిసలాటపై మాట్లాడారులే అనుకున్న వారికి కొద్ది గంటలలోనే ఆయన అసలు స్వరూపం తెలిసిపోయింది.చంద్రబాబు నాయుడు సూచనల మేరకే పవన్ ఈ కథ నడిపారన్న విశ్లేషణ వస్తోంది. లేకుంటే పవన్ తిరుపతి ఆస్పత్రిలోని బాధితులను సందర్శించి టీటీడీ చైర్మన్ తదితరులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం ఏమిటి? ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఎవరెవరు బాధ్యులో వారందరిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని అడగాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని అనాలి. అవేవి చేయకుండా క్షమాపణల డ్రామా ఆరంభించారు. దీంతో తనకేదో పేరు వస్తుందని కూడా అనుకుని ఉండవచ్చు. కానీ అసలు విషయం బయటపడ్డాక, పవన్ కల్యాణ్‌ మళ్లీ భక్తులను, ప్రజలను మోసం చేశారని తేటతెల్లమవుతోందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పిన అబద్ధాలను భుజాన వేసుకుని ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ ఆరుగురు మరణించిన ఘటనలో ఆ ఊసే ఎత్తకపోవడాన్ని అంతా గుర్తిస్తున్నారు. అప్పుడు వేసుకున్న సనాతని వేషాన్ని ఇప్పుడు ఎందుకు ధరించలేదని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా హైందవ ధర్మాన్ని రక్షించడమా అని అడుగుతున్నారు.గతంలో చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ యావ కారణంగా రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే కూడా పవన్ నోరు విప్పలేదు. ఇప్పుడేమో తిరుపతిలో ఎన్నడూ జరగని దారుణ ఘటన జరిగితే, దానిని సైడ్ ట్రాక్ చేయడానికి అన్నట్లుగా అదేదో తనకు పవర్ ఉన్నట్లుగా హడావుడి చేసి చివరికి సారీలతో తుస్సుమనిపించారు. విశాఖ ప్రధాని సభలో తనతో సమానంగా లోకేష్ కు కూడా ప్రాధాన్యత ఇవ్వడంపై, ప్రచార ప్రకటనలలో లోకేష్ ఫోటో కూడా వేయడంపై పవన్ కు కొంత అసంతృప్తి ఉందని, దానిని పరోక్షంగా వ్యక్తం చేయడానికి తిరుపతి వెళ్లి తొక్కిసలాటకు తానే బాధ్యుడిని అన్నట్లు క్షమాపణ చెప్పారని కొందరు అనుకుంటున్నారు. పవన్ చర్య కొంత మంది టీడీపీ వారికి కూడా కోపం తెప్పించింది.ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు, పవన్ లు కలిసే ఈ కథ నడిపించారన్న అభిప్రాయం చివరికి కలుగుతుంది. కాకపోతే బీఆర్‌ నాయుడు తెలివితక్కువ వల్ల ఈ విషయం అంతా గందరగోళమై పవన్ పరువు పోయినట్లయింది. ఈ మొత్తం ‍వ్యవహారంలో కులాల గొడవ రావడం కూడా గమనించవలసిన అంశమే. కమ్మ సామాజిక వర్గం వారిని కాపాడుకుని మిగిలిన వారిని బలి చేస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.తాజాగా పాలక మండలి సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావును ఒంటరి చేసి బోర్డు ఛైర్మన్, సభ్యులు మాటల దాడి చేశారట. అంతేకాక ,శ్యామలరావు దేవాలయానికి వెళ్లినా అధికారులు ఎవరూ ఆయనతో మాట కలపలేదట!. దీనిని బట్టి ఆయనను బదిలీ చేస్తున్నారన్న ప్రచారం ఆరంభమైంది. బీసీ వర్గానికి చెందిన శ్యామలరావును అవమానించి బలి చేస్తారా? ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. తానేదో మానవత్వం ఉన్న వ్యక్తిగాను, అల్లు అర్జున్ వంటివారికి అది తెలియనట్లుగాను మాట్లాడిన పవన్ పిఠాపురంలో వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతూ ప్రమాదంలో మరణించిన ఇద్దరు యువకుల కుటుంబాలను వారి ఇళ్లకు వెళ్లి పవన్ పరామర్శిస్తారని అనుకున్నారు. కానీ ఆయన అలా చేయలేదు. వారి గ్రామాల నుంచి పిఠాపురం రప్పించారట. పవన్ సంక్రాంతి సంబరాలలో పాల్గొంటే బాధిత కుటుంబాల వారు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉసూరు మంటూ ఉదయం నుంచి అక్కడే కూర్చున్నారట. అయినా అంతిమంగా ఆయన వారిని పలకరించకుండానే వెళ్లిపోయారు. దాంతో బాధిత కుటుంబాలు తమవాళ్లు పోయారన్న విషాదంతో పాటు, ఈ అవమానపు బాధను కూడా భరించవలసి వచ్చింది.ఏది ఏమైనా రాజకీయాలలో ఎల్లప్పుడూ డ్రామానే పండదు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నట్లు ఆంధ్ర ప్రజలకు సినిమా వైబ్ అనండి.. పిచ్చి అనండి ఎక్కువగానే ఉండవచ్చు. వారివల్లే పవన్ వంటివారు అధికారంలోకి వచ్చి ఉండవచ్చు. కానీ సినిమా పిచ్చే ఎప్పటికీ ఉంటుందా? అనేది ఇక్కడ అసలు ప్రశ్న. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Ravindra Jadeja puts up cryptic post amid uncertainty over ODI future2
రవీంద్ర జడేజా రిటైర్మెంట్..! హింట్‌ ఇచ్చిన స్టార్‌ ఆల్‌రౌండర్‌

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టులకు గుడ్‌బై చెప్పనున్నాడా? అంటే అవును అనే సమాధనమే ఎక్కువ విన్పిస్తోంది. ఆస్ట్రేలియాతో సిడ్నీలో ఆడిన టెస్టే తన చివరి ‍మ్యాచ్‌, త్వరలోనే జడ్డూ రెడ్‌ బాల్‌ క్రికెట్‌కు విడ్కోలు పలకనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా జడేజా పెట్టిన ఓ పోస్ట్‌ ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో మూడో ధరించిన జెర్సీ ఫొటోను ఈ సౌరాష్ట్ర క్రికెటర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. దీంతో అతడు టెస్టులకు గుడ్‌బై చెప్పనున్నాడనే ప్రచారం మరింత ఊపందుకుంది.ఇక బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024-25లో జడేజా పర్వాలేదన్పించాడు. మిగితా క్రికెటర్లతో పోలిస్తే కాస్త మెరుగ్గానే కన్పించాడు. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన జడ్డూ.. 27 సగటుతో 135 పరుగులు చేశాడు.అదే విధంగా బౌలింగ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు 80 టెస్ట్‌లు ఆడిన జడేజా 3, 370 పరుగులు చేసి 323 వికెట్లు పడగొట్టాడు. కాగా సిరీస్‌ను 3-1 తేడాతో భారత్‌ కోల్పోయిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ సిరీస్‌ మధ్యలోనే స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. వన్డేల్లో డౌటే..ఇక ఇప్పటికే టీ20లకు విడ్కోలు పలికిన రవీంద్ర జడేజా.. వన్డేల్లో ఆడేది కూడా అనుమానమే. ప్రస్తుత పరిస్థితుల దృష్టా భారత వన్డే జట్టులో జడేజా చోటు ప్రశ్నర్ధాకంగా మారింది. జడేజా వన్డే కెరీర్‌ ముగిసినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఇంగ్లండ్‌తో వన్డేలు, ఛాంపియన్స్‌ ట్రోఫీకి అతడి స్దానంలో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ పేర్లను సెలక్టర్లు పరిశీలిస్తున్నారు. వీరిద్దరూ ఇప్పటికే తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకున్నారు. ఇంగ్లీష్‌ జట్టుతో సిరీస్‌కు, ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టును బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. ఒకవేళ ఈ జట్టులో జడ్డూ చోటు దక్కకపోతే పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికే అవకాశముందని క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు 197 వన్డేలు ఆడిన జడేజా 2756 పరుగులతో పాటు 220 వికెట్లు తీసుకున్నాడు.చదవండి: CT 2025: ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు స్టార్‌ ప్లేయర్‌ రిటైర్మెంట్‌..

Hyderabad real estate goes next level with metro 2.03
మెట్రో వెంట.. సొంతింటి ప్రయాణం!

హైదరాబాద్‌ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లింది మెట్రో, ఔటర్‌ ప్రాజెక్ట్‌లే.. మెట్రో రైలుతో ప్రధాన నగరంలో, ఓఆర్‌ఆర్‌తో శివారు ప్రాంతాలతో కనెక్టివిటీ పెరిగింది. దీంతో నగరంలో రియల్‌ బూమ్‌ ఏర్పడింది. తాజాగా ప్రభుత్వం రెండో దశలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకూ మెట్రో విస్తరించాలని నిర్ణయించింది. దీంతో మెట్రో మార్గంలో చుట్టూ 10 కి.మీ. వరకూ స్థిరాస్తి అవకాశాలు మెరుగవుతాయి. ఇదే సమయంలో మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్లను అనుసంధానిస్తే నగరం నలువైపులా ప్రయాణం సులువవుతుంది. బడ్జెట్‌ గృహాల లభ్యత పెరిగి, ఐటీ ఉద్యోగ వర్గాల సొంతింటి కల సాకారమవుతుందని జనప్రియ అప్‌స్కేల్‌ ఎండీ క్రాంతి కిరణ్‌రెడ్డి అన్నారు. – సాక్షి, సిటీబ్యూరోప్రజల దైనందిన జీవితంలో ప్రజారవాణా అత్యంత కీలకం. దీంతో ప్రభుత్వం మెట్రోని పొడిగించాలని నిర్ణయించింది. వచ్చే 5–10 ఏళ్లలో దశలవారీగా మెట్రో 2.0 అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ రియల్టీ మరింత దూరం విస్తరిస్తోంది. సాధారణంగా ప్రజలు మెరుగైన రవాణా సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోనే ఉండేందుకు ఇష్టపడతారు.ఐటీ కేంద్రాల చుట్టుపక్కల ఇళ్ల ధరలు రూ.కోటి దాటిపోయాయి. ఐటీ ఉద్యోగ వర్గాలకు అందనంత ఎత్తుకు ఎగబాకాయి. మెట్రోతో శివార్లకు రవాణా సౌకర్యం రావడంతో ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులు ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో వీరంతా తమ బడ్జెట్‌లో నివాసాలు దొరికే తూర్పు హైదరాబాద్‌లో కొనుగోలు చేశారు.విదేశాల్లో ప్రైవేట్‌కే స్టేషన్ల బాధ్యత.. సింగపూర్, న్యూయార్క్‌ వంటి దేశాల్లో మాదిరిగా నగరంలోనూ భూగర్భ మెట్రో ఉంటే మేలు. విదేశాలలో భూగర్భ మెట్రో స్టేషన్‌ నిర్మాణ వ్యయాన్ని స్థానికంగా హోటల్స్, మాల్స్‌ వంటి వాణిజ్య సముదాయాలకే అప్పగిస్తారు. స్టేషన్‌ నుంచి వచ్చిపోయే ప్రయాణికులకు ఆయా వాణిజ్య సముదాయాలకు యాక్సెస్‌ ఉంటుంది. దీంతో యజమానులకు బిజినెస్‌ అవుతుంది. ప్రతిఫలంగా స్టేషన్‌ నిర్మాణ వ్యయాన్ని వాణిజ్య యజమానులే భరిస్తారు. దీంతో అటు ప్రభుత్వం, ఇటు యజమానికి ఇద్దరికీ లాభమే.ఇదీ చదవండి: వెస్ట్‌ హైదరాబాద్‌.. వామ్మో ఎంత ఎత్తో..చిత్తడి, వదులుగా ఉండే నేలలో భూగర్భ మెట్రో కష్టమవుతుంది. కానీ, మనది రాతి భూభాగం. భూగర్భ మెట్రో లైన్‌ కోసం సొరంగం తవ్వడం కష్టమవుతుందేమో.. కానీ ఒకసారి తవ్వాక నియంత్రణ సులువు. రోడ్డు మార్గం ఎలా ఉంటుందో మెట్రో లైన్‌ కూడా అలాగే వేయాల్సి ఉంటుంది. పైగా వంకర్లు ఉండే మార్గంలో ఎక్కువ బోగీలతో మెట్రోను నడపడం కుదరదు. కానీ, భూగర్భ మెట్రోను ఏ నుంచి బీ పాయింట్‌కు సరళ రేఖ మాదిరిగా వేయవచ్చు. దీంతో మెట్రో రైలు వేగం పెరగడంతో పాటు ఎక్కువ బోగీలతో మెట్రో నడపొచ్చు.భవిష్యత్తు ఈ ప్రాంతాలదే.. ఇప్పటి వరకు ఐటీ, ఫార్మా రంగాల బహుళ జాతి సంస్థలే నగరానికి ప్రాధాన్యం ఇచ్చాయి. కానీ, కొన్నేళ్లుగా తయారీ రంగంలో కూడా మల్టీనేషనల్‌ కంపెనీలు విస్తరిస్తున్నాయి. ఫాక్స్‌కాన్, టాటా ఎయిరోస్పేస్‌ వంటి సంస్థలు ఆదిభట్ల, శంషాబాద్‌ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఐటీ అంతా వెస్ట్‌లోనే ఉంది కాబట్టి ఈ ప్రాంతాలకు ఎప్పటికీ డిమాండ్‌ ఉంటుంది. కానీ, ఇప్పటికే ఆయా ప్రాంతాలలో నివాస, వాణిజ్య భవనాలతో కిక్కిరిసిపోవడంతో ఈ అభివృద్ధి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తుంది. కొంగరకలాన్, ఆదిభట్ల, శంషాబాద్, కొల్లూరు, శామీర్‌పేట వంటి ప్రాంతాల్లో మార్కెట్‌ ఊపందుకుంటుంది.హైదరాబాద్‌ వర్సెస్‌ బెంగళూరు.. ఐటీలోనే కాదు రియల్‌ ఎస్టేట్‌లోనూ హైదరాబాద్, బెంగళూరు పోటీ పడుతున్నాయి. రెండు నగరాలకు ఉన్న తేడా.. రోడ్ల వెడల్పు. బెంగళూరులో ఎయిర్‌పోర్టు రోడ్డు తప్ప అన్నీ దాదాపు 60 ఫీట్ల రోడ్లే.. కానీ, మన దగ్గర 100, 140 ఫీట్ల రోడ్లు కూడా ఉన్నాయి. నగరంలో అంత పెద్ద రోడ్లు ఎలా వచ్చాయి? రోడ్డు వెడల్పుగా ఉంటే అపరిమిత ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌(ఎఫ్‌ఎస్‌ఐ) ఉంటుందని యజమానులు రోడ్ల కోసం భూములు ఇచ్చారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో అక్కడ.. కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!దీంతో భారీ టౌన్‌షిప్‌లు, స్కై స్క్రాపర్లు వస్తున్నాయి. తాజాగా హైరైజ్‌ ప్రాజెక్ట్‌లతో ట్రాఫిక్‌ పెరుగుతోందని ఎఫ్‌ఎస్‌ఐపై ఆంక్షలు పెట్టాలనే ప్రతిపాదనకు బదులుగా రోడ్లను ఇంకా వెడల్పు చేయడం ఉత్తమం. హైదరాబాద్‌ రియల్టీకి వరమైన జీవో–86 వల్లే దేశ, విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అలాంటి సమర్థవంతమైన జీవోపై ఆంక్షలు పెట్టాలనుకోవడం సరైన నిర్ణయం కాదు.

Biden Raises Bounty for Nicolás Maduro to $25 Million4
ఆయన అరెస్టుకు ఆధారాలిస్తే రూ.215 కోట్ల రివార్డు!

వెనిజులా అధ్యక్షునిగా నికోలస్ మదురో మూడవసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే వెనిజులా ఎన్నికల్లో ఆయన ఓడిపోయారనడానికి స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ నేపధ్యంలో మదురోను అరెస్టు చేసేందుకు తగిన అధారాలు అందించినవారికి ఇచ్చే బహుమతి మొత్తాన్ని 25 మిలియన్‌ డాలర్లకు(సుమారు 215 కోట్ల రూపాయలు) పెంచినట్లు బైడెన్‌ పరిపాలనా విభాగం ప్రకటించింది.మదురోను వెనిజులాకు అధ్యక్షునిగా అమెరికా గుర్తించలేదు. 2024, జూలై జరిగిన ఎన్నికల్లో తాను గెలిచినట్లు మదురో(Nicolás Maduro) ఎటువంటి ఆధారాలను సమర్పించలేదు. అయితే అతని ప్రత్యర్థి ఎడ్ముండో గొంజాలెజ్ అందుబాటులోవున్న ఓట్ల లెక్కింపు ఆధారాలను సమర్పించారు. ఇవి అతను అత్యధిక ఓట్లు గెలుచుకున్నారని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో గొంజాలెజ్.. వెనిజులా అధ్యక్షునిగా ఎన్నికయ్యారని యునైటెడ్ స్టేట్స్ ప్రకటించింది. అలాగే మదురోను పదవి నుంచి తప్పుకోవాలని కోరింది.కాగా తాత్కాలిక రక్షిత హోదాతో యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్న దాదాపు 600,000 మంది వెనిజులా వలసదారులకు మరింత రక్షణ కల్పిస్తున్నట్లు బైడెన్‌ పరిపాలనా విభాగం ప్రకటించింది. ఈ వలసదారులు అదనంగా మరో 18 నెలలు ఉండడానికి బైడెన్‌ హామీనిచ్చారు. జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ(John Kirby) మీడియాతో మాట్లాడుతూ మదురో అరెస్టుకు ఆధారాలు సమర్పించినవారికి బహుమతిని పెంచే నిర్ణయం వెనుక వెనిజులా ప్రజలకు సంఘీభావం అందించడమే ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈ బహుమతిని పెంచడం ద్వారా మదురోతో పాటు అతని ప్రతినిధులపై ఒత్తిడిని కొనసాగించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను మరింత పెంచామన్నారు.కాగా వెనిజులా వలసదారులకు తాత్కాలిక రక్షిత హోదా పొడిగింపును వారికి మద్దతు ఇచ్చే ప్రయత్నంగా బైడెన్‌(Biden) పరిపాలన ప్రతినిధి అభివర్ణించారు. 2020లో మదురోపై అమెరికాలో పలు కేసులు నమోదయ్యాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న నార్కో-టెర్రరిజం, అంతర్జాతీయ కొకైన్ అక్రమ రవాణా కుట్రలో మదురో నిందితుడు. మదురో తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిమిషాలకే, అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఎనిమిది మంది వెనిజులా అధికారులపై పలు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.ఇది కూడా చదవండి: అయోధ్యలో ఘనంగా ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవాలు

Game Changer First Day Collections Officially Out Now5
'గేమ్‌ ఛేంజర్' కలెక్షన్స్‌ ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

'గేమ్‌ ఛేంజర్' మొదటిరోజు కలెక్షన్స్‌ను చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. అయితే, బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటించే ప్రముఖ సంస్థలు కూడా ఇప్పటికే గేమ్‌ ఛేంజర్ కలెక్షన్స్‌ రిలీజ్‌ చేశాయి. కానీ, వారి ఊహలకు కూడా అందని విధంగా రామ్‌ చరణ్‌ సినిమా కలెక్షన్స్‌ రాబట్టింది. ఈమేరకు దిల్‌ రాజు నిర్మాణ సంస్థ అధికారికంగా ఒక పోస్టర్‌తో గేమ్‌ ఛేంజర్‌ లెక్కల వివరాలను ప్రకటించింది.రామ్‌ చరణ్‌ (Ram Charan), శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కిన పొలిటికల్‌ డ్రామా చిత్రం 'గేమ్‌ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో విడుదలైంది. ఈ చిత్రం తొలిరోజే రూ. 186 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు మేకర్స్‌ ప్రకటించారు. మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన చిత్రాల జాబితాలో గేమ్‌ ఛేంజర్‌ (Game Changer) చేరిపోయింది. మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా పుష్ప2 రూ. 294 కోట్లతో టాప్‌ వన్‌లో ఉంది. ఆ తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌ రూ. 223 కోట్లు, బాహుబలి2 రూ. 210 కోట్లు, కల్కి 2898AD రూ. 191 కోట్లుతో ఉంటే.. గేమ్‌ ఛేంజర్‌ రూ. 186 కోట్ల కలెక్షన్స్‌తో టాప్‌ ఫైవ్‌లో చేరిపోయింది. ఎన్టీఆర్ దేవరకు తొలి రోజు రూ.172 కోట్లు వచ్చిన విషయం తెలిసిందే.బాక్సాఫీస్‌ ట్రేడ్‌ వర్గాల లెక్కలు ఇలా'గేమ్‌ ఛేంజర్' తొలిరోజు కేవలం రూ. 51 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. గ్రాస్‌ పరంగా అయితే సుమారు రూ. 80 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.42 కోట్లు రాబట్టినట్లు సమాచారం. హిందీ వర్షన్‌లో అయితే రూ. 7 కోట్లతోనే ఈ చిత్రం సరిపెట్టుకుంది. తమిళ్‌ రూ.2.1 కోట్లు, కన్నడ రూ. 10 లక్షలు, మలయాళం రూ. 5 లక్షలు వరకు గేమ్‌ ఛేంజర్‌ రాబట్టింది. Sacnilk ప్రకారం గేమ్ ఛేంజర్ దేశవ్యాప్తంగా 17,161 షోలలో 9.39 లక్షల టిక్కెట్లను బుక్‌ మై షో విక్రయించింది. కేవలం ముందస్తు బుకింగ్‌లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 26.8 కోట్లు ఈ చిత్రం ఆర్జించింది.(ఇదీ చదవండి: ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ రివ్యూ)గేమ్‌ ఛేంజర్‌ సినిమా మొదటిరోజే ప్రేక్షకులను నిరుత్సాహ పరచడంతో ఆ ఎఫెక్ట్‌ కలెక్షన్స్‌ మీద పడింది అనేది అందరి అభిప్రాయం. దీంతో మొదటిరోజు రూ. 100 కోట్లు కూడా దాటడం కష్టం అని భావించారు. అయితే, తాజాగా చిత్ర యూనిట్‌ మాత్రం రూ. 186 కోట్లు ఫస్ట్‌ డే రాబట్టినట్లు పోస్టర్‌ విడుదల చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అపద్దం చేప్పడానికి కూడా ఒక హద్దు అనేది ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఎకంగా రూ. 100 కోట్లు పెంచడం ఏంటయ్యా అంటూ ట్వీట్లు చేస్తున్నారు. కనీసం కాస్త నమ్మేలా కలెక్షన్స్‌ ప్రకటించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇంకో రూ. 100 కోట్లు కలిపి పుష్ప2 రికార్డ్‌ బద్దలు అయిపోయిందని పోస్టర్‌ రిలీజ్‌ చేసి ఉంటే బాగుండేది కదా అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.King size entertainment unleashes in theatres 🔥#GameChanger takes a blockbuster opening at the BOX OFFICE 💥💥#BlockbusterGameChanger GROSSES 186 CRORES WORLDWIDE on Day 1 ❤‍🔥Book your tickets now on @bookmyshow🔗 https://t.co/ESks33KFP4Global Star @AlwaysRamCharan… pic.twitter.com/NqiqvscgR8— Sri Venkateswara Creations (@SVC_official) January 11, 2025Bro this is to much lie ki koda limit untadi bro dill raju garu— Balayya USA Fans (@BalayyaUsa) January 11, 2025Sare, ippudu original collections cheppandi...— నాని (@nani_SSMBfan) January 11, 2025Bayata rc midha jalikuda poindhi i poster chusi 😂😂😂— Ⲛ𝐚ᥒꭵ𝑇𝐚𝑟𝐚ķᵀᴹ (@taraknani_) January 11, 2025100 cr fake Ela chesaraa 🙏 only mega ke sadhyam 🙏— NTR ADMIRE 🌊 (@NTRADMIRE) January 11, 2025

Illegal Extortion Allegations On Nalgonda Intelligence SP Ganji Kavitha6
నల్గొండ ఇంటలిజెన్స్‌ ఎస్పీ కవితపై వేటు

నల్గొండ, సాక్షి: జిల్లా ఇంటెలిజెన్స్‌ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. ఆమెను డీజీపీ కార్యాలయానికి ఎటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్రమాలు, వసూళ్ల ఆరోపణల మీద ఆమెపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. సొంత సిబ్బందిని సైతం వదలకుండా ఆమె భారీగా డబ్బు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఆమె అవినీతి(Corruption)పై సొంత శాఖ సిబ్బందే ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఆ అక్రమాలపై బాధితులు 9 పేజీల లేఖను విడుదల చేశారు. ఇంటెలిజెన్స్‌ విభాగంలో పోస్టింగ్‌ల కోసం లంచం వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా సిబ్బందితో అధిక వడ్డీ, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సైతం చేయించినట్లు లేఖలో తెలిపారు. దీని ఆధారంగా అధికారులు విచారణ చేపట్టగా.. గంజి కవిత బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్‌ అధికారిగా గంజి కవిత(Ganji Kavitha) ఏడేళ్లు పని చేశారు. ఈ ఏడేళ్లలో ఆమె రేషన్‌, గుట్కా మాఫియాల నుంచి భారీగా ఆమె వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. అలాగే సొంత సిబ్బందిని ఆమె వదల్లేదని తేలింది. ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లతో కవిత ఈ దందా నడిచిపించినట్లు సమాచారం. దీంతో ఆమె షాడో టీంపైనా విచారణ కొనసాగుతోంది. సమగ్ర విచారణ తర్వాత ఆమెను సస్పెండ్‌ చేసే అవకాశం ఉంది.

Have you had similar nightmares meaning and consequences7
ఇలాంటి పీడ కలలు మీకూ వచ్చాయా? అర్థం, అనర్థాలేమిటి?

పీడకలలు (Nightmares) ప్రతి ఒక్కరికీ తమ జీవితంలోని ఏదో ఒక సమయంలో రావడం మామూలే. తీవ్రమైన మానసిక ఒత్తిడికీ, ఆవేదనకు గురైన / గురవుతున్న వారితో పాటు ఆర్థిక, సామాజిక కారణాలతో బాధపడుతూ ఉండేవారికి ఇలా పీడకలలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇక మరికొందరిలో సుదీర్ఘ విమాన ప్రయాణం తర్వాత జెట్‌లాగ్‌ టైమ్‌లో లేదా ఆ తర్వాత కూడా పీడకలలు రావచ్చు. ఇవి అదేపనిగా వస్తుంటే అందుకు కారణాలేమిటి, వాటికి చికిత్స ఏమిటన్న విషయాలను తెలుసుకుందాం.అందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో పీడకలలు రావడం అన్నది సాధారణమే అయినా... కొందరిలో రోజూ అలాంటి కలలే వస్తూ ఉండటం వల్లా... అలాగే వాటి దుష్ప్రభావం వారి దైనందిన జీవితంపై పడటంతో సామాజికంగా, వృత్తిపరంగా, ఆర్థికంగా దెబ్బతినడం జరగవచ్చు. దాంతో తమకు సంబంధించిన ఇతరత్రా పనులేవీ చేసుకోలేని విధంగా తీవ్రమైన మానసిక ఆందోళనకూ, తీవ్రమైన ఒత్తిడికీ, ఆందోళనకూ గురయ్యే అవకాశాలు ఎక్కువ. మాటిమాటికీ పీడకలలు వచ్చే కండిషన్‌ను ‘నైట్‌మేర్‌ డిజార్డర్‌’(Nightmare disorder)గా చెబుతారు. గతంలో ఈ మానసిక సమస్యను ‘డ్రీమ్‌ యాంగ్జైటీ డిజార్డర్‌’(Dream anxiety disorder) అనే వారు. అయితే ఇప్పుడు ఈ సమస్యను ‘నైట్‌మేర్‌ డిజార్డర్‌’ లేదా ‘రిపీటెడ్‌ నైటమేర్స్‌’ (Repeated nightmares) అంటున్నారు. (కాలుష్యం కాటేస్తది.. చెవి, ముక్కు, గొంతు జాగ్రత్త!)సాధారణంగా ‘నైట్‌మేర్‌ డిజార్డర్‌’ సమస్యకు మందుల అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. అయితే ఇలాంటి బాధితులకు ధైర్య వచనాలు చెప్పి సాంత్వన కలిగించడం అవసరం. అలాగే వాళ్లకు యాంగై్జటీ, ఒత్తిడి కలిగించే అంశాల విషయంలో కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి చర్యలతో ఈ సమస్యను చాలావరకు పరిష్కరించవచ్చు. అయితే కొంతమందిలో పదే పదే ఇలాంటి కలలు రావడానికి మరో అంతర్గత కారణం ఏదో ఉండి ఉంటుంది. అలాంటి అండర్‌లైయింగ్‌ మెడికల్‌ సమస్యలకు తగిన మందులు ఇవ్వడం ద్వారా కూడా ఇలాంటి కలలు రాకుండా చూడవచ్చు. మానసిక వైద్యనిపుణుల పర్యవేక్షణలో స్ట్రెస్‌ రెడ్యూసింగ్‌ టెక్నిక్‌లతో బాధితుల్లో ఒత్తిడి తగ్గించడం వల్ల కూడా ఇవి తగ్గిపోవచ్చు. అయితే భయంకరమైన యుద్ధం, కుటుంబంపై దాడి, కుటుంబ పెద్ద మరణం... ఇలాంటి ఏవైనా కారణాలతో కుటుంబమంతా అల్లకల్లోలం కావడం వంటి అత్యంత తీవ్రమైన వేదన కలిగించే దుర్ఘటన తర్వాత కలిగే... పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌’కు లోనైనవారిలో ‘ఇమేజరీ రిహార్సల్‌ థెరపీ’ అనే చికిత్సను అందిస్తారు. ఇందులో బాధితుల్లో వచ్చే పీడకల చివర్లో అంతా సుఖాంతమైనట్లుగా బాధితుల మనసులో నాటుకుపోయేలా చేస్తారు. ఫలితంగా పీడకలలు క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్‌ ఫుడ్‌ ఈ లడ్డూ...అంతేనా!

Punjab AAP MLA Gurpreet Gogi gunshot mysterious circumstances8
ఆప్‌ ఎ‍మ్మెల్యే మృతి కేసులో ట్విస్ట్‌

ఛండీగఢ్‌: లూథియానా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మృతి కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. గుర్తు తెలియనిక్తులుల్పులు జరపడంతో ఆయన మృతి చెందినట్లు తొలుత కథనాలు వెడ్డాయి. అయితే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం మరోలా చెబుతున్నట్లు పోలీసులు ప్రకటించారు.అర్ధరాత్రి ఆప్‌(AAP) ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగి మృతి చెందడం అక్కడ సంచలనంగా మారింది. శుక్రవారం అర్ధరాత్రి బుల్లెట్‌ గాయాల పాలైన ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఎమ్మెల్యే మృతి చెందినట్టుగా వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే.. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఎవరూ కాల్చలేదు.. ఆ టైంలో ఆయన గదిలో ఒంటరిగానే ఉన్నారని.. అది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన కావొచ్చని చెబుతున్నారు. తుపాకీని గురుప్రీత్‌ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలి బుల్లెట్‌ గాయమైందని పోలీసులను వాంగ్మూలం ఇచ్చారు. శవ పరీక్ష(autopsy) నివేదిక వచ్చాక ఘటనపై మరింత స్పష్టత రావొచ్చని అధికారులు అంటున్నారు. ఇక, 2022లో ఆప్‌లో చేరిన గురుప్రీత్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో లూథియానా వెస్ట్‌ నుంచి పోటీ చేసి మాజీ మంత్రి భరత్‌ భూషణ్‌ అషూని ఓడించారు. తాజాగా శుక్రవారంనాడు ఆయన పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండ వాటినిక సంబంధించిన వివరాలను తన ఫేస్‌బుక్‌ ఖాతాలోనూ పోస్ట్‌ చేశారు.Breaking: AAP MLA from Ludhiana West, Gurpreet Gogi, has died from a gunshot wound to the head. He was at his home when the incident occurred and was taken to DMC Hospital, where he was declared dead. The cause of death and further details are awaited. pic.twitter.com/7FfIafyksZ— Gagandeep Singh (@Gagan4344) January 10, 2025

Special Train Delay of Sankranti Train9
సంక్రాంతి రద్దీ.. ప్రయాణికులకు చుక్కలే!

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి రద్దీ మొదలైంది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో నగర వాసులు సొంత ఊళ్లకు తరలివెళ్తున్నారు. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్‌ రైళ్లలో రిజర్వేషన్‌లు పూర్తిగా నిలిచిపోయి రిగ్రేట్‌ దశకు చేరాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి టెర్మినల్ నుంచి కాకినాడ, తిరుపతి, విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాలకు కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది నగరవాసులు సొంత ఊళ్లకు తరలి వెళ్తుండగా.. అరకొరగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు ఏ మాత్రం ప్రయాణికుల డిమాండ్‌లను భర్తీ చేయడం లేదు. మరోవైపు అన్ని ప్రత్యేక రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అతికష్టంగా బెర్తులు సంపాదించి రైలెక్కినా గంటల తరబడి పట్టాలపైనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. సికింద్రాబాద్‌ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరితే మరుసటి రోజు మధ్యాహ్నం 12 దాటినా విశాఖకు చేరుకోలేకపోయామని కూకట్‌పల్లికి చెందిన కృష్ణారావు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి శబరిమలకు నడిచే రైళ్లు కూడా అయ్యప్ప భక్తులకు నరకం చూపుతున్నాయి. రెండు రోజులు గడిచినా హైదరాబాద్‌ నుంచి శబరిమలకు, తిరిగి అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోలేకపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చార్జీలు కూడా ‘ప్రత్యేకమే’.. ⇒నగరం నుంచి ప్రతి రోజు సుమారు వందకు పైగా రెగ్యులర్‌ రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. సుమారు 2.5 లక్షల మంది ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం రోజుకు మరో 50 వేల మంది అదనంగా బయలుదేరే అవకాశం ఉంది. ఈ డిమాండ్‌ మేరకు అదనపు రైళ్లు లేవు. కొన్ని రైళ్లలో బెర్తులు, అదనపు బోగీలు ఏర్పాటు చేశారు. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు మాత్రం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. కానీ ఈ రైళ్లలో చార్జీలు కూడా ఎక్కువే. సాధారణ చార్జీలపై 25 శాతం వరకు అదనపు చార్జీలు విధిస్తారు. అయినప్పటికీ మరో గత్యంతరం లేక ప్రత్యేక రైళ్లను ఆశ్రయించే ప్రయాణికులకు రైళ్లలో పడిగాపులు తప్పడం లేదు. ⇒ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పట్టాలపై రైళ్ల ఒత్తిడి పెరిగిందని, దీంతో సకాలంలో సిగ్నల్స్‌ లభించకపోవడం వల్ల జాప్యం చోటుచేసుకుంటోందని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ ఆలస్యం ప్రయాణికుల పండగ సంతోషాన్ని ఆవిరి చేస్తోంది. కనిష్టంగా 3 నుంచి గరిష్టంగా 12 గంటల వరకు కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. గతంలో ఇలాంటి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెల్లువెత్తినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. సంక్రాంతి సందర్భంగా బయలుదేరిన ప్రయాణికులు భోగి పండగ రోజు కూడా సొంత ఊళ్లకు చేరుకోలేకపోయారు. ప్రస్తుతం మరోసారి అదే పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. ఆర్టీసీ సైతం అదే బాటలో.. ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సుల పేరిట 50 శాతం అదనపు దోపిడీకి దిగింది. ఏపీతో పాటు, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో కూడా 25 శాతం నుంచి 50 శాతం వరకు అదనపు వసూళ్లకు పాల్పడుతోంది. చివరకు దివ్యాంగుల పాస్‌లను అనుమతించకుండా ఇష్టారాజ్యంగా చార్జీలు విధిస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని సుమారు 6 వేలకు పైగా అదనపు బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజులుగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఎల్‌బీనగర్, ఉప్పల్, హయత్‌నగర్, ఎంజీబీఎస్, జేబీఎస్‌ తదితర ప్రాంగణాలుప్రయాణికులతో సందడిగా మారాయి.ప్రైవేట్‌ బస్సుల దోపిడీ.. సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అడ్డగోలుగా దారి దోపిడీకి పాల్పడుతున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి విశాఖకు లగ్జరీ రూ.1800 వరకు ఉంటుంది. ఇప్పుడు ఆ చార్జీ రూ.3000 వరకు చేరింది. అలాగే ఏసీ బస్సుల్లో రూ.2500 నుంచి ఏకంగా రూ.5000 వరకు పెరిగినట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటిల్లిపాదీ కలిసి వెళితే చార్జీల కోసమే రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోందని ఏఎస్‌రావు నగర్‌కు చెందిన మల్లికార్జున్‌రావు చెప్పారు. అలాగే.. హైదరాబాద్‌ నుంచి కాకినాడ, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాలకు సైతం ప్రైవేట్‌ బస్సుల దోపిడీ విమాన చార్జీలను తలపిస్తోంది.సాక్షి ఎఫెక్ట్‌.. బస్సులు సీజ్‌అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తున్నప్రైవేట్‌ వాహనాల దందాపై సాక్షి వరుస కథనాలు ఇచ్చింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ఎల్బీనగర్ లో ప్రైవేట్ వాహనాలపై ఆర్టిఏ అధికారుల కొరడా జులిపించారు. సంక్రాంతికి అధిక బస్సు చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ వాహనాలపై ఆర్టిఏ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలోని టీం అడ్డుకుంది. దాదాపు 20 బస్సులపై కేసు నమోదు చేశారు. ఇక.. పెద్ద అంబర్ పేట్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారుల సీజ్ చేశారు. మరోవైపు.. రాజేంద్రనగర్‌ ఆరాంఘడ్‌ చౌరస్తా వద్ద రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల ఈ ఉదయం 4 గంటల నుంచే తనిఖీ చేపట్టారు. చెన్నై, తిరువంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారి నుండి హైదరాబాద్ వస్తున్న బస్సులను తనిఖీలు చేస్తున్నారు . ఈ క్రమంలో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నట్రావెల్స్‌పై కేసులు నమోదు చేస్తున్నారు. 11 బస్సుల పై కేసు నమోదు అయినట్లు సమాచారం.

Telegu Cultural Dancers Will Perform In Maha Kumbh Mela10
మహా కుంభమేళాలో తెలుగు కీర్తి

సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక కుంభమేళా. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాకు సర్వం సన్నద్దమైంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌ త్రివేణి సంగమంలో ఈనెల 13 నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు అంటే 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగరాజ్‌ వేదికగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమయ్యాయి. ఇందులో భాగంగా భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, మణిపూరి, సిత్రియా తదితర నాట్యాలతో పాటు సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు దేశవ్యాప్తంగా 160 మంది నృత్యకాళాకారులను ఎంపిక చేశారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు ఉండటం విశేషం. పద్మశ్రీ, ఎస్‌ఎన్‌ఏ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి, పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఆనంద శంకర్‌ జయంత్, కేంద్ర సంగీత నాటక అకాడెమీ పురస్కార గ్రహీత దీపికా రెడ్డి, ఎస్‌ఎన్‌ఏ అవార్డు గ్రహీత కళాకృష్ణ మహా కుంభమేళాలో నృత్య ప్రదర్శన చేయనున్నారు. ‘శివోహం’తో ఆనంద ‘శివోహం’ ఇతివృత్తంతో లక్షలాది మంది భక్తులను అలరించనున్నారు పద్మశ్రీ గ్రహీత ఆనంద శంకర్‌ జయంత్‌. దశబ్థాలుగా భరతనాట్యంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న ఆనంద శంకర్‌ జయంత్‌ 144 ఏళ్ల మహా కుంభమేళాలో తెలుగు వారిలో తొలి ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘గణేశ తాళనం, స్కంధ మయుర, దేవీ ఉపాసకం, శివోహం’లపై 45 నిమిషాల పాటు 17మంది నృత్య కళాకారులతో కలిసి ఆమె నాట్యమాడనున్నారు. ఇటువంటి మహోత్సవాల్లో ప్రదర్శన ఇవ్వడం అనేది జన్మధన్యంగా భావిస్తున్నారు భారతనాట్య నృత్య కళాకారిణి ఆనంద శంకర్‌ జయంత్‌. ‘శివసతాయం’తో దీపికా రెడ్డి ‘కూచిపూడి కళ కోసం జీవితాన్ని అంకితం చేశా’అనే మాట ముమ్మాటికీ నిజం అంటారు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్‌ పర్సన్‌’దీపికా రెడ్డి. నాట్యమే ఊపిరిగా అనేక ప్రదర్శనలు ఇచ్చిన దీపికా రెడ్డి మహా కుంభమేళాలో ఆమె తన ప్రదర్శనను ఇవ్వనున్నారు. ‘శివ సతాయం’అనే థీంతో దాదాపు 50 నిమిషాల పాటు 12మంది నృత్య కళాకారులతో కలిసి ప్రదర్శన చేయనున్నారు. ఈ నృత్యం ద్వారా గంగ అవతరణ, గంగ ద్వారా అందరికీ మంచి జరగాలనే కాన్సెప్ట్‌తో ఈనెల 26వ తేదీన దీపికా రెడ్డి మహా కుంభమేళాలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘శివపల్లవి’తో కళాకృష్ణ తెలుగు సాంప్రదాయ నృత్యాలైన ఆంధ్ర నాట్యం, పేరిణి వంటి వాటిలో ప్రపంచస్థాయిలో విశేష ఆదరణ సొంతం చేసుకున్న కళాకారుడు కళాకృష్ణ. ఎస్‌ఎన్‌ఏ అవార్డుతో పాటు, రాష్ట్రప్రభుత్వం పలు అవార్డులతో ఆయనను సత్కరించింది. 24.02.2025 న మహా కుంభమేళాలో ‘శివపల్లవి’థీంతో ఐదుగురుతో కలిసి ప్రదర్శన చేయనున్నారు. గంగ, పంచముఖస్త్రోత్రాలు, నీలకంఠ మహాదేవ కీర్తన ఈ మూడు అంశాలను 30 నిమిషాల్లో కళ్లకు కట్టినట్లుగా తన అపారమైన అనుభవంతో కుంభమేళాలో భక్తులను అలరించనున్నారు. ‘నమామి గంగే’తో పద్మజా రెడ్డి కూచిపూడి నృత్యంతో కళాప్రపంచంలో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి ఈ మహాకుంభా మేళాలో నృత్యప్రదర్శన చేయనున్నారు. దాదాపు 3వేలకు పైగా ప్రదర్శనలు ఇచి్చన పద్మజా రెడ్డి ‘ప్రణవ్‌’ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా అనేక మందికి నృత్యాన్ని పరిచయం చేస్తున్నారు. 10.02.2025న 30 నృత్యకళాకారులతో కుంభమేళాలో ‘నమామి గంగే’అనే థీంతో ప్రదర్శన చేయనున్నారు. ఇటీవల కాలంలో గంగానది కలుíÙతానికి గురైంది, గంగను ఎలా పరిరక్షించుకోవాలి, భావితరాలకు గంగ ప్రాముఖ్యతను వివరించాలనే అంశాలపై సుమారు గంట పాటు ‘నమామి గంగే’అనే ఇతివృత్తంతో అక్కడ ప్రదర్శన ఇవ్వనున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
NRI View all
title
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా

ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్

title
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!

అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్‌ దిగ్గజం యాపిల్‌ 185 మంది ఉద్యోగులను త

title
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి

title
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)

title
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్‌..!అచ్చం భారత్‌లో..

ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్‌ బిజినెస్‌లు.

Advertisement

వీడియోలు

Advertisement