SS Rajamouli
-
వారం రోజుల్లోనే ఓటీటీకి ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ
దర్శకధీరుడు తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఈ మూవీకి సంబంధించిన డాక్యుమెంటరీ చిత్రం ఈనెల 20న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ అనే పేరుతో ఈ డాక్యుమెంటరీ చిత్రం తెరకెక్కించారు. ఆర్ఆర్ఆర్ మూవీ జర్నీ గురించి ఈ మూవీలో చూపించారు. తాజాగా ఈ డాక్యుమెంటరీ మూవీ ఓటీటీ రిలీజ్ తేదీని రివీల్ చేసింది చిత్రబృందం. ఈనెల 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.కాగా.. 2022లో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో టాలీవుడ్ పేరు వరల్డ్ వైడ్‌గా మార్మోగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది. మరోవైపు రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. ఆ మూవీ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.Behind the scenes, beyond the legacy. Watch RRR: Behind and Beyond, an exclusive peek into the making of SS Rajamouli’s magnum opus on Netflix, out 27 December!#RRRBehindAndBeyondOnNetflix pic.twitter.com/Py9pyL7Nws— Netflix India South (@Netflix_INSouth) December 23, 2024 -
ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ చిత్రం.. ట్రైలర్ వచ్చేసింది!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ మూవీ ఆస్కార్ అవార్డ్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్‌ను సాధించింది. ఇటీవల ఈ మూవీకి సంబంధించి డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ అనే పేరుతో డాక్యుమెంటరీ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు.తాజాగా ఈ డాక్యుమెంటరీ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలో జరిగిన సన్నివేశాలతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ డాక్యుమెంటరీని డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.కాగా.. 2022లో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో టాలీవుడ్ పేరు వరల్డ్ వైడ్‌గా మార్మోగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది. మరోవైపు రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. ఆ మూవీ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.Hear and watch out… From the first clap on the sets to the standing ovation at the Oscars stage, #RRRBehindAndBeyond brings it all to you. 🔥🌊❤️#RRRMovie In select cinemas, 20th Dec. pic.twitter.com/EfJLwFixFx— RRR Movie (@RRRMovie) December 17, 2024 -
రాజమౌళి-మహేశ్ మూవీలో ఇంటర్నేషనల్ బ్యూటీ!
బాలీవుడ్ హీరోయిన్, మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా, హీరో మహేశ్‌బాబుకి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ‘ఎస్ఎస్ఎమ్బి 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొంనుంది. ఈ సినిమా కోసం పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, మీసాలతో సరికొత్త లుక్‌లోకి మారిపోయారు మహేశ్‌బాబు. దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా 2025లో ప్రారంభం కానుంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందనున్న ఈ సినిమాలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ ఈ మూవీని అనువదించనున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఈ సినిమాలో మహేశ్‌బాబు సిక్స్‌ప్యాక్‌లో కనిపిస్తారని టాక్. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ప్రియాంకా చోప్రా కథానాయికగా నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రముఖ సింగర్, యాక్టర్ నిక్ జోనాస్‌తో వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడ్డ ప్రియాంక కేవలం హాలీవుడ్ చిత్రాలపైనే దృష్టి పెట్టారు. అయితే ‘సిటాడెల్ సీజన్– 1’లో నటించిన ఆమె సీజన్ 2లో కూడా నటిస్తున్నారు. ఇక అబ్దుల్ మాజిద్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘తమిళన్’ (2002) మూవీతో హీరోయిన్గా పరిచయమైన ప్రియాంక చోప్రా తర్వాత దక్షిణాది సినిమాల్లో నటించకుండా కేవలం బాలీవుడ్‌కే పరిమితమయ్యారు. అయితే రామ్‌చరణ్‌కి జోడీగా ‘జంజీర్’ (2013) చిత్రంలో నటించినప్పటికీ అది స్ట్రైట్ బాలీవుడ్ మూవీ. ఒకవేళ ఆమె మహేశ్‌బాబు–రాజమౌళి కాంబో చిత్రంలో నటిస్తారన్న వార్త నిజమైతే అప్పుడు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత దక్షిణాదిలో ప్రియాంకా చోప్రా నటించినట్లు అవుతుంది. -
బాహుబలి సెంటిమెంట్ తో మహేష్, రాజమౌళి సినిమా..
-
స్టెప్పులతో ఇరగదీసిన రాజమౌళి, వీడియో వైరల్
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు, హీరో శ్రీసింహ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు మురళీ మోహన్ మనవరాలు రాగ మాగంటితో శ్రీసింహ కొత్త జీవితం ప్రారంభించనున్నాడు. వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా సంగీత్ వేడుక నిర్వహించారు. అన్న కుమారుడి పెళ్లిలో దర్శకధీరుడు రాజమౌళి డ్యాన్స్‌తో ఇరగదీశాడు.మాస్ డ్యాన్స్మాస్ మహారాజ- పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని లంచ్‌కొస్తావా.. మంచ్‌కొస్తావా.. పాటకు స్టెప్పులేశాడు. స్టేజీపై భార్యతో కలిసి రాజమౌళి మాస్ స్టెప్పులు వేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.సినిమాశ్రీసింహ విషయానికి వస్తే.. ఇతడు 'యమదొంగ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ తదితర సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశాడు. 'మత్తు వదలరా' సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. #SSRajamouli Garu 🕺👌 pic.twitter.com/WaU66KvHDe— TalkEnti (@thetalkenti) December 14, 2024చదవండి: రూ.1 కోటి ప్రశ్నకు కరెక్ట్ గెస్.. కానీ రూ.50 లక్షలే గెలిచింది! -
తన వన్ సైడ్ ప్రేమకథ బయటపెట్టిన రాజమౌళి
డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి పేరు చెప్పగానే 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'మగధీర' లాంటి అద్భుతమైన సినిమాలే గుర్తొస్తాయి. రాజమౌళి ఫ్యామిలీ గురించి చాలావరకు ప్రేక్షకులకు తెలుసు. ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు. కానీ ఇప్పుడు రానా టాక్ షోలో పాల్గొని.. తన ఇంటర్మీడియట్ ప్రేమకథని బయటపెట్టాడు.'ద రానా దగ్గుబాటి షో' పేరుతో నటుడు రానా ఓ టాక్ షోని హోస్ట్ చేస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్‌లో ప్రతి వీకెండ్ ఒక్కో ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారు. ఇదివరకే నాని, సిద్ధు జొన్నలగడ్డ-శ్రీలీల, నాగచైతన్య తదితరులు పాల్గొన్న ఎపిసోడ్స్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. తాజాగా రాజమౌళి-రాంగోపాల్ వర్మతో మాట్లాడిన ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగానే రాజమౌళి తన లవ్ స్టోరీ బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. మీడియాతో ఏమన్నాడంటే?)'ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఓ అమ్మాయి ఉండేది. ఆమె అంటే ఇష్టముండేది. కానీ మాట్లాడాలంటే భయం. మా క్లాసులో అబ్బాయిలందరికీ తెలుసు, నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నానని. నన్ను ఈ విషయమై ఏడిపించేవారు. మొత్తం ఏడాదిలో ఒకేఒక్కసారి ఆమెతో మాట్లాడాను. చాలా కష్టం మీద మాట్లాడాను. ట్యూషన్ ఫీజ్ కట్టావా? అని అడిగాను' అని రాజమౌళి చెప్పాడు. దీంతో రానా పగలబడి నవ్వాడు. ఈ సంభాషణ అంతా చూసి చాలామంది 90స్ కుర్రాళ్లు తమని తాము రాజమౌళి మాటల్లో చూసుకుంటున్నారు.చివరగా 'ఆర్ఆర్ఆర్' మూవీతో ప్రేక్షకుల్ని అలరించిన రాజమౌళి.. మహేశ్ బాబుతో కొత్త సినిమా చేయబోతున్నారు. చాన్నాళ్లుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. వచ్చే ఏడాది వేసవి నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటివరకు టైమ్ ఉండటంతో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇలా ఇంటర్వ్యూల్లో కనిపిస్తున్నాడు. (ఇదీ చదవండి: కావాలనే జైల్లో ఉంచారు.. పోలీసులపై కేసు పెడతాం: బన్నీ లాయర్) -
పుష్ప-2 మూవీ వీక్షించిన దర్శకధీరుడు.. ఏ థియేటర్లో చూశాడంటే?
డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్నాడు. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.829 కోట్ల వసూళ్లతో సినీ చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. ఈ ఊపు చూస్తుంటే ఐదు రోజుల్లోనే రూ.1000 కోట్లు సాధించేలా కనిపిస్తోంది. మరోవైపు నార్త్‌లోనూ పుష్ప-2 హవా కొనసాగుతోంది. తొలి రోజు నుంచే హిందీలో వరుస రికార్డులతో దూసుకెళ్తోంది పుష్ప-2. కేవలం హిందీలోనే నాలుగు రోజుల్లో రూ.339 నెట్ వసూళ్లు సాధించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డ్స్ సృష్టిస్తోంది.అయితే తాజాగా ఈ మూవీ దర్శకధరుడు ఎస్ఎస్ రాజమౌళి వీక్షించారు. హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌కు వెళ్లిన సినిమా నుంచి బయటికి వస్తోన్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వీడియో చూస్తే బాలనగర్‌లోని విమల్ థియేటర్లో పుష్ప-2 వీక్షించినట్లు తెలుస్తోంది.కాగా.. రాజమౌళి ప్రస్తుతం ప్రిన్స్ మహేశ్ బాబుతో ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. అమెజాన్ అడవులో నేపథ్యంలో అడ్వంచర్ చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ సిద్ధ కాగా.. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఈ మూవీ కోసం ఇప్పటికే లోకేషన్స్ వేటలో ఉన్నారు టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి. Director rajamouli sir watched #Pushpa2 🔥@alluarjun #Pushpa2TheRule pic.twitter.com/qlzzp8IEHn— AlluBabloo Mithun (@allubabloo18) December 9, 2024 -
రాజమౌళి మూవీపై డాక్యుమెంటరీ.. విడుదలపై అధికారిక ప్రకటన!
దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీతో ఆస్కార్ వేదికపై సగర్వంగా తెలుగు సినిమాను నిలిపారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్‌ను సాధించింది. మన సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది.ఆర్ఆర్ఆర్ ఘనవిజయంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ అనే పేరుతో డాక్యుమెంటరీ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు దర్శకుడు రాజమౌళితో కూడిన పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. అయితే రిలీజ్ తేదీని మాత్రం వెల్లడించలేదు.కాగా.. 2022లో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో టాలీవుడ్ పేరు వరల్డ్ వైడ్‌గా మార్మోగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది. మరోవైపు రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. ఆ మూవీ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. View this post on Instagram A post shared by RRR Movie (@rrrmovie) -
సడన్ గా గడ్డం తీసేసిన మహేష్ బాబు.. షాక్ లో రాజమౌళి..?
-
పుష్ప 2 ట్రైలర్‌పై దర్శకధీరుడు 'రాజమౌళి' కామెంట్స్
గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ చూసిన కూడా ఇప్పుడు పుష్పగాడి రూల్ నడుస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో ప్రతి సినిమా అభిమాని అల్లు అర్జున్ గురించే చర్చించుకుంటున్నారు. పట్నాలో జరిగిన ట్రైలర్ ఈవెంట్‌కు కోసం ఆయన ఫ్యాన్స్భారీగా తరలి వచ్చారు. దీంతో బీహార్ షేర్ అంటూ బన్నీని ప్రశంసిస్తున్నారు. అయితే, ట్రైలర్‌ను చూసిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి పుష్ప యూనిట్‌ను అభినందించారు.పుష్ప ట్రైలర్‌పై చాలామంది సినిమా ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళి చేసిన ట్వీట్ బన్నీ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతుంది. 'పట్నాలో పుష్ప వైల్డ్‌ఫైర్ మొదలైంది. అదీ దేశవ్యాప్తంగా వ్యాపిస్తుంది. డిసెంబర్ 5న విస్పోటనం చెందుతుంది. పార్టీ కోసం ఎదురుచూస్తూ ఉండలేకపోతున్నాం పుష్ప' అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే, అల్లు అర్జున్ కూడా జక్కన్నకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తప్పకుండా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది. సినిమా విడుదలకు ముందు పుష్పరాజ్ పలు రికార్డ్స్ సొంతం చేసుకుంటున్నాడు. ప్రీసేల్ బిజినెస్‌లో సత్తా చాటిన పుష్ప ఇప్పటికే సుమారు రూ. 1000 కోట్ల వ్యాపారం చేసిందని టాక్ వినిపిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా 40 మిలియన్ల వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న చిత్రంగా పుష్ప నిలిచింది. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా 11,500 స్క్రీన్స్‌లలో ఈ చిత్రం విడుదల కానుంది. -
మురళీమోహన్ మనవరాలితో కీరవాణి కొడుకు పెళ్లి...ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ ఫొటో వైరల్
టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు, హీరో శ్రీ సింహా పెళ్లికి సిద్ధమయ్యాడు. సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని గోల్కోండ రిసార్ట్స్ లో ఆదివారం రాత్రి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.(ఇదీ చదవండి: ఆ విషయంలో నన్ను క్షమించండి.. అల్లు అర్జున్ రిక్వెస్ట్)మురళీ మోహన్‌కు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు విదేశాల్లో సెటిలైంది. కుమారుడు రామ్ మోహన్.. ఈయన వ్యాపారాలను చూసుకుంటున్నారు. రామ్ మోహన్- రూపల కుమార్తెనే 'రాగ'. విదేశాల్లో బిజినెస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం రాగ కూడా తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలే చూసుకుంటోంది.శ్రీసింహ విషయానికి వస్తే 'యమదొంగ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. 'మత్తు వదలరా' రెండు చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ తదితర సినిమాల్లోనూ హీరోగా నటించాడు. కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవకు ఇంకా పెళ్లి కాలేదు. ఈలోపే చిన్నబ్బాయికి పెళ్లి జరగనుంది. దీంతో ఇదేమైనా ప్రేమ పెళ్లి అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: నాగచైతన్య-శోభిత పెళ్లి కార్డ్ ఇదే.. డేట్ ఫిక్స్) 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
SSMB 29: మహేశ్‌కి జోడీగా హాలీవుడ్ భామ.. ఎవరీ నవోమీ?
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బి 29’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కనుంది. అందుకే ఈ చిత్రంలో నటించే యాక్టర్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు రాజమౌళి. భారతదేశ నటీనటులే కాకుండా హాలీవుడ్‌కు చెందిన వారిని కూడా ఈ ప్రాజెక్టులోకి తీసుకోనున్నారాయన. అందులో భాగంగా మహేశ్‌బాబుకి జోడీగా హాలీవుడ్ నటి నవోమీ స్కాట్‌ని ఎంపిక చేసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నవోమీకి భారత మూలాలుగతంలో ‘ఎస్ఎస్ఎమ్బి 29’ హీరోయిన్ల జాబితాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్, ఇండోనేషియాకు చెందిన చెల్సియా ఇస్లాన్ పేర్లు వినిపించాయి. తాజాగా భారత మూలాలున్న నవోమీ స్కాట్‌ని ఎంపిక చేయనున్నారని భోగట్టా. ఇంగ్లాండులో పుట్టారు నవోమి. భారత సంతతికి చెందిన నవోమి తల్లి ఉషా స్కాట్ గుజరాత్ నుంచి ఇంగ్లాండుకు వలస వెళ్లారట. ‘ది మార్షియన్, అల్లాద్దీన్, ఛార్లీస్ ఏంజెల్స్, స్మైల్, విజర్డ్స్’ వంటి పలు సినిమాల్లో నటించిన నవోమీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. షూటింగ్ ఎప్పుడంటే..?‘ఎస్ఎస్ఎమ్బి 29’లో నటించే విషయంపై ఆమెతో రాజమౌళి చర్చలు కూడా జరిపారని ఫిల్మ్‌నగర్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి... మహేశ్‌బాబుకి జోడీగా నవోమీ స్కాట్ ఖరారు అయినట్టేనా? అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. -
రాముడిగా మహేశ్‌బాబు?
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు మహేశ్‌బాబు. మరోవైపు ఈ సినిమా చిత్రీకరణను వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని దర్శకుడు రాజమౌళి లొకేషన్స్ వేట ప్రారంభించారు. త్వరలోనే కొన్ని లొకేషన్స్‌ను ఫైనలైజ్ చేయనున్నారాయన. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనుందని చిత్రసంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి, కథా రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే పేర్కొన్నారు.అయితే ఈ సినిమా నేపథ్యం గురించి మాత్రం ఎప్పటికప్పుడు కొత్త ఊహాగానాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా కథనం ఓ నిధి అన్వేషణ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందన్న వార్తలు వినిపించాయి. తాజాగా ఈ చిత్రకథలో రామాయణం ఇతిహాసం ప్రస్తావన ఉంటుందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. అంతేకాదు... కొన్ని సీన్స్‌లో రాముడిగా మహేశ్‌బాబు కనిపిస్తారని, వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలు సినిమాలో కీలకంగా ఉంటాయని, ఈ సీన్స్ కోసం హైదరాబాద్‌లోనే వారణాసిని తలపించే సెట్‌ను రెడీ చేస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఇక ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభంలో ఆరంభం అవుతుందని సమాచారం. -
సత్యదేవ్‌కి అన్యాయం? 'ఆర్ఆర్ఆర్'లో 16 నిమిషాల సీన్స్ కట్
సత్యదేవ్.. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోతున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన ఇతడు.. చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలోనూ విలనిజం చేసి ఆకట్టుకున్నాడు. అయితే 'ఆర్ఆర్ఆర్' లాంటి క్రేజీ పాన్ ఇండియా మూవీలోనూ ఇతడు నటించాడు. కానీ ఆ సీన్లన్నీ లేపేశారు. ఆ విషయాన్ని మొహమాటపడుతూనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.'ఆర్ఆర్ఆర్' కోసం సత్యదేవ్.. దాదాపు 10 రోజుల పాట పనిచేశాడు. కానీ చివరకొచ్చేసరికి ఇతడికి సంబంధించి దాదాపు 16 నిమిషాలు సీన్లని ఎడిటింగ్‌లో తీసేశారు. ఆ టీమ్‌పై ఉన్న గౌరవంతోనే ఇప్పటివరకు బయటకు చెప్పలేదని.. కాకపోతే ఆ పదిరోజుల వర్క్ చేయడం మాత్రం మర్చిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)ఎడిటింగ్ చేస్తే చేశారు కానీ కనీసం 'ఆర్ఆర్ఆర్' టైటిల్ కార్డ్స్లోనైనా సత్యదేవ్ పేరు వేసి ఉండాల్సింది. కానీ ఈ సినిమాలో ఎక్కడా కూడా సత్యదేవ్ పేరు కనిపించదు. ఇతడు చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడట్లేదు గానీ ఈ విషయంలో మాత్రం అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు.సత్యదేవ్ లేటెస్ట్ మూవీ 'జీబ్రా'. నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. 'పుష్ప'లో జాలిరెడ్డిగా కనిపించిన కన్నడ ధనంజయ.. ఇందులో కీలక పాత్ర పోషించాడు. చాన్నాళ్లుగా హీరోగా సరైన హిట్ కోసం చూస్తున్న సత్యదేవ్‌కి ఈ సినిమాతోనైనా అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ) -
'కంగువ' నిర్మాత ఫోన్ వాల్ పేపర్‌గా రాజమౌళి ఫొటో
తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ 'కంగువ'. నవంబర్ 14న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శుక్రవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి రాజమౌళి అతిథిగా వచ్చారు. కాకపోతే రాజమౌళిపై తనకు, తన నిర్మాత జ్ఞానవేల్ రాజాకు ఎంత ఇష్టముందో అనేది చెప్పకనే చెప్పారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)'కంగువ' టీమ్‌కి కోసం వచ్చిన రాజమౌళి అంతా మాట్లాడిన తర్వాత సూర్య మైక్ అందుకున్నాడు. తాను ఎక్కాల్సిన ట్రైన్ మిస్ అయ్యానని, కాబట్టి సిగ్గు లేకుండా చెబుతున్నాను అదే స్టేషన్లో ఉన్నాను త్వరగానే ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నా అని రాజమౌళితో సినిమా చేయాలని ఉందని సూర్య తన మనసులో మాటని బయటపెట్టాడు.మీ 'బాహుబలి' పేరు పలకడానికి కూడా మాకు అర్హత ఉందో లేదో తెలీదు. మీరు వేసిన దారిలోనే మేం మీ వెనుక నడుస్తూ వస్తున్నాం. మీరు మా నిర్మాత జ్ఞానవేల్ రాజాకి షేక్ హ్యాండ్ ఇస్తే అదే మాకు పెద్ద ఆస్కార్ అని సూర్య చెప్పాడు. జ్ఞానవేల్ రాజా తనకు పరిచయమైనప్పటి నుంచి మీ ఫొటోనే ఫోన్ వాల్ పేపర్‌గా పెట్టుకున్నాడనే ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. దీంతో జ్ఞానవేల్ రాజా స్టేజీపైకి వచ్చి తన ఫోన్లోని రాజమౌళి ఫోటో చూపించడంతో పాటు రాజమౌళి కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. (ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)"In our mobile phones we keep Family photos as wallpaper, but Gnanavel has your photo as wallpaper. You have paved the way for #Kanguva. It will be like an Oscars If you shake hands with Gnanavel"- #Suriyapic.twitter.com/fJ7GKri4mT— AmuthaBharathi (@CinemaWithAB) November 7, 2024 -
కంగువని థియేటర్స్‌లోనే చూడాలి: ఎస్ఎస్ రాజమౌళి
‘‘కంగువ’ టీమ్ పడిన కష్టం మేకింగ్ వీడియోలో తెలుస్తోంది. సినిమా రిలీజ్ అయ్యాక ఈ కష్టానికి విజయం రూపంలో ప్రతిఫలం దక్కుతుందని నమ్ముతున్నాను. ‘కంగువ’ లాంటి సినిమాను థియేటర్స్‌లోనే చూడాలి. అప్పుడే ఆ సినిమాటిక్ అనుభూతిని ΄పొందుతారు’’ అని డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. సూర్య హీరోగా శివ దర్శకత్వం వహించిన చిత్రం ‘కంగువ’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘కంగువ’ ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సినిమాను నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కంగువ’ ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ–‘‘తెలుగు సినిమాను తెలుగుకే పరిమితం చేయకుండా మిగతా ్రపాంతాలకు తీసుకెళ్లాలని, అలాగే పాన్ ఇండియా మూవీస్ చేసేందుకు నాకు స్ఫూర్తినిచ్చింది సూర్యనే. ‘గజినీ’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల దగ్గరకు చేర్చడానికి తను చేసిన ప్రయత్నాన్ని కేస్ స్టడీగా నా నిర్మాతలు, హీరోలకు చెప్పేవాణ్ణి. నేను, తను గతంలో ఓ సినిమా చేయాలనుకున్నాం.. కానీ కుదరలేదు. తనతో సినిమా చేసే అవకాశం నేను మిస్ అయ్యాను’’ అని చెప్పారు. ‘‘కంగువ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తుంటే ఇది సక్సెస్ సెలబ్రేషన్స్లా ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు.‘‘ఈ సినిమా విజువల్స్, కంటెంట్ చూస్తుంటే అద్భుతంగా ఉంది. ‘కంగువ’ ఘన విజయం సాధించాలి’’ అని నిర్మాతలు సురేష్ బాబు, ‘దిల్’ రాజు తెలిపారు. ‘‘వెయ్యేళ్ల కిందటి కథలో ఐదు తెగల మధ్య అనుబంధాలు, ప్రేమలు, ప్రతీకారం, పోరాటం వంటివన్నీ ‘కంగువ’లో చూపించాం’’ అన్నారు శివ. ‘‘కంగువ’ వంటి అద్భుతమైన సినిమాని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాలి’’ అని కేఈ జ్ఞానవేల్ రాజా చెప్పారు. సూర్య మాట్లాడుతూ– ‘‘రాజమౌళిగారి ఏ సినిమాతోనూ మా ‘కంగువ’ని పోల్చలేం. ఆయనతో సినిమా చేసే అవకాశం మిస్ చేసుకున్నాను.కానీ, ఇప్పటికీ ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నాను. ‘కంగువ’ నాకు మర్చిపోలేని అనుభూతి ఇచ్చింది. ఈ చిత్రం కోసం రెండేళ్లు కష్టపడ్డాను. ఎవర్ గ్రీన్ సినిమాగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుందని నమ్ముతున్నాను’’ అని తెలిపారు. ఈ వేడుకలో డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, కెమెరామేన్ వెట్రి పళనిస్వామి, రైటర్ రాకేందు మౌళి, డిస్ట్రిబ్యూటర్ అభినేష్, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ శశి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ కూఛిబొట్ల తదితరులు మాట్లాడారు. -
ఆర్ఆర్ఆర్కు అరుదైన గౌరవం
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన లండన్‌లోని ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ సినిమా హాల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రదర్శితం కానుంది. వచ్చే ఏడాది మే 11న ఈ మూవీ స్క్రీనింగ్ ఉంటుందని ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ ప్రకటించింది. అలాగే ఈ కార్యక్రమంలో రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి లైవ్ కన్సర్ట్ ఇవ్వనున్నారు.కాగా ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా 2022 మార్చి 25న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో (నాటు నాటు పాటకు గాను) ఎమ్ఎమ్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ ఆస్కార్ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. పలు అంతర్జాతీయ, జాతీయ అవార్డులు కూడా లభించాయి. కాగా ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సినిమా ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో 2019లో ప్రదర్శితమైన విషయం తెలిసిందే. -
లొకేషన్ వేటలో రాజమౌళి..!
కెన్యాలో లొకేషన్ వేట ఆరంభించారు రాజమౌళి. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ ఆఫ్రికన్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసిన రాజమౌళి లొకేషన్స్‌ను ఫైనలైజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్‌లో రాజమౌళి ఉన్నారు. కెన్యా, ఆఫ్రికా లొకేషన్స్‌లో కొన్ని లొకేషన్స్‌ని ఎంపిక చేసి, తొలి షెడ్యూల్‌ని అక్కడే ఆరంభిస్తారని సమాచారం. ఇక ఈ సినిమాకు ‘మహారాజా’, ‘మహారాజ్’ అనే టైటిల్స్‌ను అనుకుంటున్నారని, 18వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఓ నిధి అన్వేషణతో ఈ సినిమా ఉంటుందనీ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. -
అడవుల్లో రాజమౌళి హంటింగ్.. ఆ సినిమా కోసమేనా?
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం వేకేషన్లో చిల్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్యాప్ ఎక్కువగా రావడంతో ఆఫ్రికాలో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం కెన్యాలోని అడవుల్లో వన్య ప్రాణలను చూస్తూ సేద తీరుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ప్రాంతంలో సినిమా షూటింగ్ లోకేషన్స్ కోసమే రాజమౌళి వెళ్లినట్లు తెలుస్తోంది. అడవుల్లో తిరుగుతున్న ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు దర్శకధీరుడు. (ఇది చదవండి: ఆ సమయంలో అవార్డ్ తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది: మెగాస్టార్)మరోవైపు ప్రిన్స్ మహేశ్‌బాబుతో తన తదుపరి చిత్రం తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధమైంది. ఈ సినిమాను ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో రూపొందించనున్నారు. ఈ మూవీని ఫుల్ యాక్షన్ అడ్వెంచరస్ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో కథ ఉంటుందని ఇప్పటికే హింట్ కూడా ఇచ్చారు. అందువల్లే ఆఫ్రికాలోని దట్టమైన అడవుల లోకేషన్స్ కోసమే రాజమౌళి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాదిలో ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. #TFNReels: Maverick Director @ssrajamouli is currently scouting locations in Kenya, Africa for #SSMB29!!🌎🔥#MaheshBabu #SSRajamouli #TeluguFilmNagar pic.twitter.com/ABq6DxfVOg— Telugu FilmNagar (@telugufilmnagar) October 29, 2024 View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) -
బాహుబలి 3 కి రంగం సిద్ధం..!
-
ఏఐలో శిక్షణ తీసుకుంటున్న రాజమౌళి
-
ఏఐలో శిక్షణ తీసుకుంటున్న రాజమౌళి?
సాధారణంగా దర్శకుడు రాజమౌళితో చేసే చిత్రాల కోసం హీరోలు ప్రత్యేక శిక్షణ తీసుకుంటుంటారు. కానీ ప్రస్తుతం రాజమౌళియే శిక్షణ తీసుకుంటున్నారట. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లో ట్రైనింగ్ తీసుకుంటున్నారట. ఇటీవలి కాలంలో ఏఐని సినిమా ఇండస్ట్రీ కథ మేరకు వినియోగించుకుంటోంది. ఆల్రెడీ కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఏఐని వారి సినిమాల్లో ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి కూడా ఫిల్మ్ మేకింగ్‌లో ఏఐ తెచ్చిన మార్పులను గురించి నేర్చుకోవడానికి ప్రత్యేకమైన క్లాసులు తీసుకుంటున్నారని సమాచారం. ఈ క్లాసుల కోసం ఆయన విదేశాల్లోని ఓ ప్రముఖ స్టూడియోతో అసోసియేట్ అయ్యారని భోగట్టా. ఇక మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. ఈ చిత్రం కోసం మహేశ్‌బాబు ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు. ఈ సినిమా కోసమే రాజమౌళి ఏఐను స్టడీ చేస్తున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రీకరణ మొదలుపెట్టనున్నట్లుగా ఈ చిత్ర కథారచయిత విజయేంద్రప్రసాద్ ఇటీవల వెల్లడించారు. అలాగే ఈ సినిమాకు కావాల్సిన లొకేషన్స్ అన్వేషణలో కార్తికేయ (రాజమౌళి తనయుడు) ఉన్నారని తెలిసింది. ఇక ఈ చిత్రం ఓ నిధి అన్వేషణ నేపథ్యంలో 18వ శతాబ్దంలో ఉంటుందని, రెండు భాగాలుగా విడుదలవుతుందని, ‘మహా రాజా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే ప్రచారాలు జరుగుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ను మించి..! ‘ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) సినిమాలోని ఇంట్రవెల్ సీన్లో లెక్కలేనన్ని జంతువులు కనిపిస్తాయి. కాగా మహేశ్‌బాబుతో తాను చేయనున్న సినిమాలో ‘ఆర్ఆర్ఆర్’ కంటే ఎక్కువ యానిమల్స్‌ని ప్రేక్షకులు చూస్తారని ఇటీవల రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. -
రెండో భాగం కూడా..?
హీరో మహేశ్‌బాబు, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్లో సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ చిత్రం ఒకటి కాదు రెండు భాగాలుగా రూపొందనుందనే న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.‘బాహుబలి’ సినిమా తరహాలోనే ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ మూవీ ప్రీప్రోడక్షన్ పనుల్లో బిజీబిజీగా ఉంది. ఈ సినిమా కోసం పొడవాటి హెయిర్ స్టైల్, గెడ్డం, కండలు తిరిగిన బాడీ పెంచే పనిలో ఉన్నారు మహేశ్‌బాబు.కాగా కథకు ఉన్నప్రాధాన్యం దృష్ట్యా ఒకే భాగంలో చెప్పడం సాధ్యం కాదని, అందుకే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. అలాగే సీక్వెల్స్ వస్తాయనే ఊహాగానాలూ ఉన్నాయి. ఈ వార్తలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. -
రాజమౌళి బాహుబలి-3 .. కంగువా నిర్మాత ఆసక్తికర కామెంట్స్!
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు బాహుబలి, బాహుబలి-2. ఈ సినిమాలతో తెలుగు ఖ్యాతి ప్రపంచస్థాయికి చేరింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించాయి. దీంతో పార్ట్-3 కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే బాహుబలి-3 గురించి కోలీవుడ్ నిర్మాత ఆసక్తికర కామెంట్స్ చేశారు. సూర్య భారీ యాక్షన్ చిత్రం కంగువా ప్రమోషన్స్‌లో భాగంగా బాహుబలి పార్ట్-3 గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడారు. కంగువా సీక్వెన్స్‌ల మధ్య గ్యాప్‌ను సమర్థిస్తూ ఈ ప్రస్తావన తీసుకొచ్చారు.కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ..'గత వారం బాహుబలి మేకర్స్‌తో చర్చించా. పార్ట్- 3 కోసం ప్లాన్ రూపొందించడంలో బిజీగా ఉన్నారు. దాని కంటే ముందు మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాతే కల్కి- 2, సలార్- 2 రిలీజ్ అవుతాయని అన్నారు. దీంతో బాహుబలి-3ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: పెళ్లైన 12 ఏళ్లకు గుడ్‌న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్)కాగా.. బాహుబలి రెండు పార్ట్‌లకు తమిళంలో నిర్మాతగా కేఈ జ్ఞానవేల్ రాజా వ్యవహరించారు. గతంలో బాహుబలి-3 గురించి ఎస్ఎస్ రాజమౌళి కూడా హింట్ ఇచ్చారు, కచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రాజమౌళి మహేశ్‌బాబుతో సినిమా చేయనున్నారు. వీరి కాంబోలో వస్తోన్న మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిని తర్వాతే బాహుబలి-3 మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.