Top Stories
ప్రధాన వార్తలు
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు కలెక్టర్లకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ మెమో జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్‌పై అటెస్టేషన్ అధికారి అధికారిక ముద్ర లేకపోయినా ఆ బ్యాలెట్‌ను తిరస్కరించవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఫాం 13ఏ పై రిటర్నింగ్ అధికారి తన సంతకం సహా పూర్తి వివరాలు నింపి ఉంటే అధికారిక ముద్ర లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని తెలిపింది.పోస్టల్ బ్యాలెట్‌పై సదరు రిటర్నింగ్ అధికారి సంతకం సహా బ్యాలెట్‌ను ధృవీకరించేదుకు రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలని ఈసీ వెల్లడించింది. పోస్టల్ బ్యాలెట్ కవర్ ఫాం సి పై ఎలెక్టర్ సంతకం లేదని సదరు బ్యాలెట్‌ను తిరస్కరించరాదని ఈసీ స్పష్టం చేసింది. ఫాం 13ఏ లో ఓటర్ సంతకం లేకపోయినా, రిటర్నింగ్ అధికారి అటెస్టేషన్ సంతకం లేకపోయినా, బ్యాలెట్ సీరియల్ నెంబరు లేకపోయినా సదరు బ్యాలెట్ తిరస్కరించ వచ్చని స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ పేపరుపై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయక పోయినా సదరు ఓటు తిరస్కరణకు గురి అవుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
IPL 2024 KKR vs SRH: ఐపీఎల్ విన్నర్లు, రన్నరప్స్ వీరే..!
ఐపీఎల్ 2024 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. కేకేఆర్, సన్‌రైజర్స్ మధ్య నేడు (మే 26) జరుగబోయే ఫైనల్‌తో ఐపీఎల్ 17వ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. ఈ సీజన్ గత సీజన్లకు భిన్నంగా సాగింది. బ్యాటింగ్‌కు సంబంధించి ఆల్‌టైమ్ రికార్డులు బద్దలుకావడంతో పాటు పలు సంచలన బౌలింగ్ ప్రదర్శనలు నమోదయ్యాయి. చెరి ఐదసార్లు ఛాంపియన్లైన ముంబై, సీఎస్కే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించాయి. దిగ్గజ కెప్టెన్లు రోహిత్, ధోని లేకుండా జరుగుతున్న ఐదో ఐపీఎల్ ఫైనల్ ఇది.ఐపీఎల్ 2024 ఫైనల్ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన 16 సీజన్లలో విజేతలు, రన్నరప్లపై ఓ లుక్కేద్దాం. ఇప్పటివరకు జరిగిన 16 ఫైనల్స్‌లో సీఎస్కే (2010, 2011, 2018, 2021, 2023), ముంబై (2013, 2015, 2017, 2019, 2020) చెరి ఐదుసార్లు టైటిల్ కైవసం చేసుకోగా.. కేకేఆర్ రెండు (2012, 2014), సన్‌రైజర్స్ (2016), రాజస్థాన్ రాయల్స్ (2008), గుజరాత్ టైటాన్స్ (2022), డెక్కన్ ఛార్జర్స్ (2009) తలో సారి టైటిల్ నెగ్గాయి. అత్యధికసార్లు రన్నరప్‌గా నిలిచిన ఘనత సీఎస్కేకు దక్కింది. సీఎస్కే ఐదుసార్లు (2008, 2012, 2013, 2015, 2019) ఫైనల్లో ఓటమిపాలైంది.ఆతర్వాత ఆర్సీబీ మూడు సార్లు (2009, 2011, 2016).. ముంబై ఇండియన్స్ (2010), కేకేఆర్ (2021), సన్‌రైజర్స్ (2018), రాజస్థాన్ రాయల్స్ (2022), గుజరాత్ టైటాన్స్ (2023), పంజాబ్ కింగ్స్ (2014), ఢిల్లీ క్యాపిటల్స్ (2020), రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ (2017) తలో సారి రన్నరప్‌గా నిలిచాయి.సీజన్ల వారీగా విజేతలు, రన్నరప్స్..2008- రాజస్థాన్ రాయల్స్ (విజేత), సీఎస్కే (రన్నరప్)2009- డెక్కన్ ఛార్జర్స్ (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2010- సీఎస్కే (విజేత), ముంబై ఇండియన్స్ (రన్నరప్)2011- సీఎస్కే (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2012- కేకేఆర్ (విజేత), సీఎస్కే (రన్నరప్)2013- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2014- కేకేఆర్ (విజేత), పంజాబ్ (రన్నరప్)2015- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2016- సన్‌రైజర్స్ (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2017- ముంబై (విజేత), పూణే (రన్నరప్)2018- సీఎస్కే (విజేత), సన్‌రైజర్స్ (రన్నరప్)2019- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2020- ముంబై (విజేత), ఢిల్లీ (రన్నరప్)2021- సీఎస్కే (విజేత), కేకేఆర్ (రన్నరప్)2022- గుజరాత్ (విజేత), రాజస్థాన్ (రన్నరప్)2023- సీఎస్కే (విజేత), గుజరాత్ (రన్నరప్)
టీడీపీ వీడియో ట్వీట్ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. పోలీసు అధికారులు కూడా బరితెగించి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ సందర్భంగా హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని కామెంట్స్ చేశారు.కాగా, పేర్ని నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘పోలీసు అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టరు. పోలీసులు ఏకపక్షంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు. అసలు ముద్దాయిని వదిలేసి తప్పుచేయని వారిపై కేసులు పెడుతున్నారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించలేదు. హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు.13వ తేదీన కేసు ఎందుకు పెట్టలేదు?..వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా అడ్డుకున్నారు. కూటమి నేతలు ఎవరిని నియమించాలని కోరితే వారినే నియమించారు. పాల్వాయి గేటు దగ్గర దౌర్జన్యం జరిగితే అడ్డుకోలేదు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13వ తేదీనే ఎందుకు కేసు నమోదు చేయలేదు. ఈ ఘటనపై టీడీపీ అప్పుడే ఎందుకు ఫిర్యాదుచేయలేదు. డీజీపీకి సిట్ ఇచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదు. ఈసీ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదు. ఎస్పీ సహా అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేశారు. పోలింగ్ ఆగినట్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్‌లో ఎందుకు లేదు?. ఛానళ్లలో చూసిన తర్వాతే ఈసీ అధికారులు స్పందిస్తారా?. టీడీపీ పిన్నెళ్లి వీడియోను ట్వీట్ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?. అసలు ఏం జరిగిందో విచారణ చేయరా?. కారంపూడిలో విధ్వంసకాడ జరిగితే చూస్తూ ఊరుకుంటారా?’ అని ప్రశ్నలు సంధించారు.పోలింగ్ ఆగిందా?..టీడీపీ వారు కర్రలు, రాళ్లతో స్వైరవిహారం చేస్తున్నా పట్టించుకోలేదు. గొడవలను ఆపటానికి ప్రయత్నించలేదు. కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. పోలింగ్ స్టేషన్ 202లో ఒక గంటసేపయినా పోలింగ్ ఆగిందా?. నిజంగానే ఎమ్మెల్యేనే ధ్వంసం చేస్తే అధికారులు వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదు?. కనీసం టీడీపీ ఏజెంట్లు అయినా ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. సిట్ అధికారులకైనా ఎమ్మెల్యేపై ఎవరూ ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. కానీ లోకేష్ మాత్రం ఎమ్మెల్యే ఒక వీడియోను రిలీజ్ చేయగానే ఈసీ వెంటనే ఎమ్మెల్యేను అరెస్ట్ చేయమని ఆదేశించింది. కోర్టులకు కూడా లేని అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఉపయోగించాలని చూసింది.ఈసీపై సెటైర్లు..కేంద్ర ఎన్నికల సంఘం తొందరపాటు చర్యలకు దిగటం దారుణం. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే పిన్నెల్లి తరపు లాయర్ కోర్టులో గట్టిగా వాదించి బెయిల్ తెచ్చుకున్నారు. దున్నపోతు ఈనిందని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పగానే దూడని కట్టేయమని రాష్ట్ర ఎన్నికల అధికారి అంటున్నారు. వాస్తవాలు ఏంటనేది మాత్రం ఇద్దరూ పట్టించుకోవటం లేదు. సీఐ నారాయణ స్వామి చౌదరికి గాయమైతే మొత్తం టీడీపీ కార్యకర్తలకు గాయాలైనట్లు ఫీలయ్యారు. ఘటన జరిగితే పది రోజులపాటు కేసు కూడా నమోదు చేయకపోవటం ఏంటి?. పిన్నెల్లిపై ఇంకా ఎన్ని కేసులు నమోదు చేస్తున్నారో పోలీసులు చెప్పాలి. రెంటచింతల మండలంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు బయటకు రాకుండా చేయాలని, కారంపూడి మండలంలో టీడీపీకి సహకరించేలా సీఐ నారాయణ చౌదరిని నియమించారు. ఆ సీఐ అత్యంత వివాదాస్పదుడు. గతంలో సస్పెండ్ అయ్యాడు. అలాంటి వ్యక్తిని సీఐగా ఎలా పంపించారు?. పదకొండు రోజుల తర్వాత పిన్నెల్లిపై రెండు కేసులు నమోదు చేశారు. సిట్ బృందానికి కూడా ఈ కేసుల గురించి చెప్పలేదు. పిన్నెల్లి హత్యకు టీడీపీ తీవ్రంగా పని చేస్తోంది. ఈ కుట్రకు సహకరిస్తున్న ప్రతీ పోలీసు అధికారి కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. పల్నాడులో పోలీసు ఐజీ నాయకత్వంలోనే ఈ కుట్రలన్నీ జరుగుతున్నాయి. ఎల్లో మీడియాలో వార్తలు రాయగానే పోలీసులు, ఎన్నికల సంఘం చర్యలకు దిగుతోంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
ఒక్క ఆలోచనతో రూ.15780 కోట్ల బిజినెస్.. ఎవరీ 'ప్రతీక్ సూరి'?
చదువు పూర్తయిన తరువాత ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకునే వారు చాలామంది ఉన్నారు. అయితే బిజినెస్ చేసి ఎదగాలని చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'ప్రతీక్ సూరి'. ఇంతకీ ఈయన ఎవరు? ఈయన చేస్తున్న బిజినెస్ ఏంటి? వ్యాపారంలో ఎలా సక్సెస్ సాధించారు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఢిల్లీకి చెందిన ప్రతీక్ సూరి తన పాఠశాల విద్యను బరాఖంబా రోడ్‌లోని మోడరన్ స్కూల్లో పూర్తి చేశారు. ఆ తరువాత 2006లో అతను దుబాయ్‌లోని బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదవడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి వెళ్లాడు.దుబాయ్‌లో చదువుకునే రోజుల్లోనే.. సుమారు 200 విభిన్న దేశాలకు చెందిన వ్యక్తులతో కూడిన యూఏఈ జనాభాలోని అపారమైన వైవిధ్యం అతనిని ఎంతగానో ఆకర్షించింది. ఆ సమయంలోనే గ్లోబల్ కమ్యూనిటీలో లీనమవ్వడం కావలసిన అపరిమితమైన అవకాశాల గురించి కూడా తెలుసుకున్నారు.చదువు పూర్తయిన తరువాత.. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచించి.. అనుకున్న విధంగానే 2012 ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే 'మాసర్' (Maser) సంస్థను స్థాపించారు. ఈ సంస్థ అతి తక్కువ కాలంలోనే ఆఫ్రికన్ మార్కెట్లో కూడా విస్తరించింది.కంపెనీ ఉత్పత్తి అయిన స్మార్ట్ టీవీ.. ఆఫ్రికన్ మార్కెట్లో అనూహ్యమైన ఆదరణ పొందగలిగింది. ఆ సమయంలో కంపెనీ ఏకంగా 8,00,000 యూనిట్ల బ్రాండ్ స్మార్ట్ టీవీలను విక్రయించగలిగింది. ఆ తరువాత ఆఫ్రికన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు పెట్టడంతో మాసర్ కంపెనీ మరింత గణనీయమైన పురోగతిని సాధించగలిగింది.ప్రతీక్ సూరి అచంచలమైన కృషి వల్ల కంపెనీ రోజు రోజుకి అభివృద్ధి వైపు అడుగులు వేసింది. వ్యాపార రంగంలో విజయవంతమైన బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేసింది. 2023లో మాసర్ నికర విలువ ఏకంగా 1.9 బిలియన్ డాలర్లకు చేరింది. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.15,780 కోట్లు. పోటీ వ్యాపార ప్రపంచంలో తనదైన ముద్ర వేయడానికి ఎదురయ్యే అడ్డంకులను ధిక్కరించి సెల్ఫ్ మేడ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన ప్రతీక్ సూరి కథ నేడు వ్యాపార ప్రపంచంలో ఎంతోమందికి ఆదర్శప్రాయం.
May 26th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 26th AP Elections 2024 News Political Updates..4:00 PM, May 26th, 2024అనంతపురం:అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలిని కలిసిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిధర్మవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేతలపై కేసులు నమోదు చేయవద్దని విజ్ఞప్తితాడిపత్రి అల్లర్లతో ధర్మవరం నేతలకు సంబంధం లేదునన్ను పరామర్శించేందుకు మాత్రమే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఇతర నేతలు తాడిపత్రి వచ్చారుధర్మవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించాలన్న ఆలోచన విరమించాలిధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేస్తే ఫ్యాక్షన్ ప్రేరెపించినట్లు అవుతుందివైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడితే న్యాయ పోరాటం చేస్తాం 2:00 PM, May 26th, 2024తాడేపల్లి :టీడీపీ హింసాత్మక చర్యలను బయటపెట్టిన వైఎస్సార్సీపీపోలింగ్ మరుసటిరోజు కూడా పల్నాడులో టీడీపీ విధ్వంసంకారంపూడిలో మారణాయుధాలతో దాడులకు తెగపడిన టీడీపీ కార్యకర్తలుటీడీపీ విధ్వంసానికి ముందే వెళ్లిపోయిన పోలీసులుఇదంతా టీడీపీ, పోలీసు అధికారుల కుట్రేనంటున్న వైఎస్సార్సీపీసాక్ష్యాధారాలతో సహా బయట పెట్టిన వైఎస్సార్సీపీకారంపూడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లు, షాపుల ధ్వంసమే లక్ష్యంగా రెచ్చిపోయిన టీడీపీ మూకలుమాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి హత్యకు టీడీపీ కుట్ర పన్నిందంటున్న వైఎస్సార్సీపీఏదో కేసులో ఎమ్మెల్యే అరెస్టుకు ఉత్సాహం చూపుతున్న పల్నాడు పోలీసులు 1:45 PM, May 26th, 2024పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ కీలక ఆదేశంపోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలుపోస్టల్ బ్యాలెట్‌పై గెజిటెడ్ అధికారి స్టాంప్ వేయలేదనే కారణంతో పోస్టల్ బ్యాలెట్‌ను చెల్లని ఓటుగా పరిగణించవద్దు. ఆర్వో సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు చెల్లుతాయి. ఫాం 13పై ఆర్వో సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలి. ఆర్వో సంతకం, బ్యాలెట్‌ను ధృవీకరించే రిజిస్టర్‌తో చూసుకోవాలి. ఆర్వో సంతకం, సీరియల్ నెంబర్‌లేని పోస్టల్ బ్యాలెట్ తిరస్కరణ. నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయకుంటే తిరస్కరిస్తాం. 12:50 PM, May 26th, 2024టీడీపీ వీడియో ట్వీట్ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?: పేర్ని నానిఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. పోలీసు అధికారులు కూడా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. పోలింగ్ సందర్భంగా హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు.టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టరు. పోలీసులు ఏకపక్షంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు. అసలు ముద్దాయిని వదిలేసి తప్పుచేయని వారిపై కేసులు పెడుతున్నారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించలేదు. హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు.వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా అడ్డుకున్నారు. కూటమి నేతలు ఎవరిని నియమించాలని కోరితే వారినే నియమించారు. పాల్వాయి గేటు దగ్గర దౌర్జన్యం జరిగితే అడ్డుకోలేదు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13వ తేదీనే ఎందుకు కేసు నమోదు చేయలేదు. ఈ ఘటనపై టీడీపీ అప్పుడే ఎందుకు ఫిర్యాదుచేయలేదు. డీజీపీకి సిట్ ఇచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదు. ఈసీ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదు. ఎస్పీ సహా అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేశారు. పోలింగ్ ఆగినట్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్‌లో ఎందుకు లేదు?. ఛానళ్లలో చూసిన తర్వాతే ఈసీ అధికారులు స్పందిస్తారా?. టీడీపీ పిన్నెళ్లి వీడియోను ట్వీట్ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?. అసలు ఏం జరిగిందో విచారణ చేయరా?. టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టరు.. ఏకపక్షంగా వైయస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు. అసలు ముద్దాయిని వదిలేసి తప్పుచేయని వారిపై కేసులు పెట్టడం దుర్మార్గం. -మాజీ మంత్రి పేర్ని నాని#TDPLosing#TDPGoons pic.twitter.com/AUK8As1QIX— YSR Congress Party (@YSRCParty) May 26, 2024 12:15 PM, May 26th, 2024ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరించింది: మంత్రి కాకాణినెల్లూరులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కామెంట్స్..ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణిలో వ్యవహరించింది..పోలీస్ అధికారులను ఉద్దేశ్యపూరీతంగా బదిలీ చేసింది..కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీస్ అధికారులు ఉద్రిక్తతలను రెచ్చగొట్టారు.. వైఎస్సార్సీపీ బలంగా ఉన్న చోట కేడర్‌ను భయబ్రాంతులకు గురి చేశారు..మాచర్ల ఘటన వీడియో ఎలా బయటికి వచ్చిందో చెప్పలేని దుస్థితిలో ఎన్నికల కమిషన్ ఉంది..ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని మా అభిప్రాయం..నెల్లూరు జిల్లాలోని కొన్ని పోలింగ్ బూతుల్లో కనీస మౌలిక వసతులు కల్పించలేదు..ఎన్నికల నిర్వహణలో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఘోరంగా విఫలమైంది..ఎన్నికల నిధులు దుర్వినియోగం, వైఫల్యంపై జిల్లా రిటర్నింగ్ అధికారిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాము. మాజీ మంత్రి సోమిరెడ్డి పట్టపగలు ఓటర్లకి డబ్బులు పంచితే.. దాని మీద ఫిర్యాదు చేస్తే జిల్లా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదు..మానవతా దృక్పధంతో సోమిరెడ్డి డబ్బులు పంచాడని జిల్లా ఎన్నికల అధికారి చెప్పడం హాస్యాస్పదం..ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ స్పందించకపోతే హైకోర్టుకు వెళ్తాను..జిల్లా కలెక్టర్ పక్షపాత ధోరణిలో పని చేశారు..జిల్లా రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతుందనే నమ్మకం మాకు లేదు..కౌంటింగ్ నిర్వహణకు ఒక అబ్జర్వర్‌ను నియమించాలని కోరుతున్నాం.. 11:40 AM, May 26th, 2024దెందులూరులో సంక్షేమానికే ప్రజల మద్దతు..దౌర్జాన్యాలతో, అరాచకాలతో చెలరేగిపోయిన చింతమనేని ప్రభాకర్2019 ఎన్నికల్లోనే చింతమనేనికి బుద్ధి చెప్పిన దెందులూరు నియోజకవర్గ ప్రజలు.దళితులను, అధికారులను తిట్టడం, కొట్టడంతో పేరుపొందిన చింతమనేని. ఈసారి కూడా చింతమనేనికి తమ పవరేంట్ చూపామంటున్న ప్రజలు. ప్రజలతో మమేకమై పనులు చేయించిన ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి 11:00 AM, May 26th, 2024విశాఖ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు ఏయూలో ఏర్పాట్లుఓట్ల లెక్కింపునకు 14 గంటలు పట్టే అవకాశం.ఉదయం 8 గంటల నుంచి లెక్కింపుతొలి రౌండ్ ఫలితాలు 9 గంటల నుంచి వెల్లడించే అవకాశంవిశాఖ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గం కలిపి 98 లోక్ సభ పరిధిలోని ఏది నియోజకవర్గాలు కలిపి 98 చొప్పున టేబుల్స్ ఏర్పాటుభీమిలి అసెంబ్లీకి 26 రౌండ్లతో రాత్రి 7:30 కు ఫలితం వచ్చే అవకాశంవిశాఖ తూర్పు 21 రౌండ్లలో సాయంత్రం ఐదు గంటలకువిశాఖ సౌత్ లో 17 రౌండ్లకు మధ్యాహ్నం మూడున్నరకువిశాఖ నార్త్ లో 22లకు సాయంత్రం ఐదు గంటలకువిశాఖ వెస్ట్ 16 రౌండ్లకు మధ్యాహ్నం 3:15 కుగాజువాకలో 22 రౌండ్లకు సాయంత్రం 5:45 గంటలకుపెందుర్తిలో 21 రౌండ్లకు సాయంత్రం 5:30 గంటలకుఎస్ కోట లో 19 రౌండ్లకు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఫలితాలు వెల్లడివిశాఖ జిల్లాలో మొత్తం ఓటర్లు 2012373ఓట్లు వినియోగించుకున్న ఓటర్లు 1409316పోస్టల్ బ్యాలెట్ 23,981విశాఖ లోక్‌సభ పరిధిలో 1962 పోలింగ్ కేంద్రాలు 14 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ 10:30 AM, May 26th, 2024విజయం వైఎస్సార్సీపీదే..పోలింగ్ ఫలితాలపై లెక్కలువేసుకుంటున్న ప్రధాన పార్టీలుతమ స్థానాలు ‘పది’లమంటున్న వైఎస్సార్‌సీపీపరువు నిలుపుకుంటామంటున్న టీడీపీజనసేన, బీజేపీ స్థానాల్లో గెలుపు అసాధ్యమేఓటు బదిలీ కాలేదంటున్న రాజకీయ పరిశీలకులువైఎస్సార్‌సీపీ ఖాతాలోకే కడప,రాజంపేట పార్లమెంటు స్థానాలు 9:50 AM, May 26th, 2024బరితెగించిన టీడీపీ నాయకులు..పచ్చ బ్యాచ్‌ను వెంటాడుతున్న ఓటమి భయం..ఓటమి భయంతో కారంపూడిలో బరితెగించిన టీడీపీ నాయకులుపోలింగ్ జరిగిన మరుసటి రోజున వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్తల షాపులను ధ్వంసం చేసి తగలపెట్టిన టీడీపీ గుండాలుఓటమి భయంతో కారంపూడిలో బరితెగించిన @JaiTDP నాయకులుపోలింగ్ జరిగిన మరుసటి రోజున వైయస్ఆర్ సీపీకి చెందిన కార్యకర్తల షాపులను ధ్వంసం చేసి తగలపెట్టిన టీడీపీ గుండాలు.#TDPLosing#TDPGoons pic.twitter.com/BzBkJBOkT1— YSR Congress Party (@YSRCParty) May 26, 2024 8:40 AM, May 26th, 2024పచ్చముఠా పైశాచికత్వం..కౌంటింగ్ ముంగిట పచ్చముఠా పైశాచికత్వంవైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని భయాందోళనకి గురిచేసేలా దాడులుతిరుపతిలో వెంకట శివారెడ్డిపై టీడీపీ గూండాలు దాడి.తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరికప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని అర్థమైందిరాష్ట్రవ్యాప్తంగా అరాచకాలకి మళ్లీ తెరలేపుతున్నావా టీడీపీ చంద్రబాబు కౌంటింగ్ ముంగిట పచ్చముఠా పైశాచికత్వంవైయస్‌ఆర్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని భయాందోళనకి గురిచేసేలా దాడులు తిరుపతిలో వెంకట శివారెడ్డిపై టీడీపీ గూండాలు దాడి. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిక ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని అర్థమై.. రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలకి మళ్లీ తెరలేపుతున్నావా…— YSR Congress Party (@YSRCParty) May 25, 2024 7:50 AM, May 26th, 2024దాడుల సంస్కృతి నాది కాదు: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిచంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కామెంట్స్..దాడుల సంస్కృతి నాది కాదు.. హుందా రాజకీయాలే నా నైజం!చంద్రగిరిలో ఐదేళ్లుగా లెక్కకి మించి నాపై టీడీపీ నేత పులివర్తి నానితో పాటు అతని భార్య నోరుజారినా.. ఏరోజూ నేను పల్లెత్తు మాట అనలేదుపులివర్తి నానీని నా రాజకీయ ప్రత్యర్థిగానే చూశాను తప్ప.. శత్రువుగా ఎప్పుడూ భావించలేదు దాడుల సంస్కృతి నాది కాదు.. హుందా రాజకీయాలే నా నైజం!చంద్రగిరిలో ఐదేళ్లుగా లెక్కకి మించి నాపై టీడీపీ నేత పులివర్తి నానితో పాటు అతని భార్య నోరుజారినా.. ఏరోజూ నేను పల్లెత్తు మాట అనలేదు పులివర్తి నానీని నా రాజకీయ ప్రత్యర్థిగానే చూశాను తప్ప.. శత్రువుగా ఎప్పుడూ భావించలేదు… pic.twitter.com/YMmEAgkK8s— YSR Congress Party (@YSRCParty) May 25, 2024 7:10 AM, May 26th, 2024ఓట్ల లెక్కింపు ఇలాజూన్ 4న ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రారంభంతొలుత పోస్టల్, సర్వీసు ఓట్ల లెక్కింపు ఆ తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు సువిధ యాప్‌లో నమోదు చేసిన తర్వాతే ఫలితాల వెల్లడి 7:00 AM, May 26th, 2024కౌంటింగ్ ఏజెంట్లే కీలకంఫారం–18 సమర్పించడం ద్వారా ఏజెంట్ల నియామకంఓట్ల లెక్కింపులో ఫారం–17సీ ఎంతో ముఖ్యంనిబంధనలు తెలియకుంటే అయోమయమే 6:50 AM, May 26th, 2024పదుల సంఖ్యలో వీడియో సాక్ష్యాలు అయినా ‘పచ్చ’పాతమే!పోలింగ్ రోజు, ఆ తర్వాత టీడీపీ గూండాల స్వైర విహారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓట్లేయనీయకుండా దాడులు వైఎస్సార్సీపీకి ఓటు వేశారనే కారణంతో విధ్వంసాలు పల్నాడులో పచ్చ మూకల దాడులపై వీడియోలు తీసిన ప్రజలుఒక్కొక్కటిగా బయటపడుతున్న టీడీపీ హింసాత్మక చర్యలు దుకాణాలపై రాళ్లు, బైక్‌ల ధ్వంసాలు, దహనాలు, లూటీలు.. పట్టపగలు విధ్వంసకాండను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్న జనం టీడీపీ దారుణాలు కళ్లెదుటే కనిపిస్తున్నా పట్టించుకోని పోలీసులు హత్యాయత్నం, అట్రాసిటీ కేసులున్నప్పటికీ చూసీచూడనట్లు వ్యవహారం చిన్న చిన్న సాకులతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై మాత్రం జులుం వెంటాడి కేసుల నమోదు.. భయభ్రాంతులకు గురిచేస్తూ దండనలుఇంకోవైపు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని ఈసీ బడుగు, బలహీన వర్గాల బాధితుల వేదన అరణ్య రోదనగా మారిన వైనం 6:40 AM, May 26th, 2024క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావాజనసేన కార్పొరేటర్ పీతల మూర్తికి సీఎస్ జవహర్‌రెడ్డి హెచ్చరికవిశాఖలో అసైన్డ్ భూములు కొనుగోలు చేయలేదుచట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరిక 6:30 AM, May 26th, 202421 లోక్‌సభ స్థానాల్లో విజేతలను నిర్ణయించేది మహిళలేఆ స్థానాల్లో పురుషుల కన్నా ఎక్కువగా నమోదైన మహిళల ఓట్లు కాకినాడ, అనంతపురం తప్ప మిగతా స్థానాల్లో భారీ వ్యత్యాసం మహిళల ఓట్లు వైఎస్సార్సీపీకే అంటున్న రాజకీయ విశ్లేషకులు
పదుల సంఖ్యలో వీడియో సాక్ష్యాలు అయినా ‘పచ్చ’పాతమే!
రాష్ట్రంలో టీడీపీ గూండాలు సాగిస్తున్న విధ్వంసకాండ గురించి పదుల సంఖ్యలో వెలుగు చూస్తున్న వీడియోలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మనం ఉంటున్నది ప్రజాస్వామ్య దేశంలోనేనా లేక ఆటవిక రాజ్యంలో ఉంటున్నామా.. అనే అనుమానం కలుగుతోంది. గుంపులు గుంపులుగా తోడేళ్ల మందలా వచ్చి దుకాణాలు, ఇళ్లపై పడుతున్నారు. కుర్చీలు, బల్లలు, మోటార్ సైకిళ్లను లాక్కొచ్చి రోడ్లపై పడేస్తున్నారు. లావుపాటి కర్రలు, ఇనుప రాడ్లతో వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఆయిల్ ట్యాంక్ పగులగొట్టి నిప్పంటిస్తున్నారు. నిర్భయంగా వచ్చిన దారినే కేకలు వేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఆ దృశ్యాలు చూస్తుంటే సినిమాల్లో సీన్లు కళ్ల ముందు మెదులుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించక పోవడం విస్తుగొలుపుతోంది. పైగా ఎక్కడ, ఏ చిన్న గొడవ జరిగినా.. దాన్ని వైఎస్సార్సీపీకి అంటగడుతూ ఎల్లో మీడియా, ఎల్లో బ్యాచ్ దుష్ప్రచారం సాగిస్తోంది. బాధితుల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా, అటు ఈసీ, ఇటు పోలీసులు.. టీడీపీ అనుబంధ సంఘాలన్నట్లు వ్యవహరిస్తుండటం దారుణం.సాక్షి, నరసరావుపేట: రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా టీడీపీ గూండాలు, రౌడీలు పేట్రేగిపోయారు. యథేచ్ఛగా రిగ్గింగ్ చేస్తూ అడ్డుకున్న వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులను దారుణంగా చితకబాదారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు వైఎస్సార్సీపీకి ఓటేయనీయకుండా వారిపై అత్యంత పాశవికంగా దాడులకు తెగబడ్డారు. కొన్నిచోట్ల ఈ వర్గాలు తమకు ఓట్లేయలేదని వారి ఇళ్లను ధ్వంసం చేశారు. దుకాణాలను లూఠీ చేశారు. ఇదేంటని అడ్డుకోవడానికి ప్రయత్నించినవారిని చావ బాదారు. స్వగ్రామాలను వదిలేసి బిక్కుబిక్కుమంటూ వేరే ఊళ్లలో తల దాచుకునేలా టీడీపీ మూకలు స్వైర విహారం సాగించాయి. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు టీడీపీ గూండాలకే కొమ్ముకాశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తమను కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేసినా ఏ ఒక్క పోలీసూ పట్టించుకోలేదు. రాష్ట్రంలో పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా చంద్రగిరి, తదితర ప్రాంతాల్లో టీడీపీ గూండాల దాడిని పోలీసులు చేష్టలుడిగి వేడుకలా చూశారు. మే 13న పోలింగ్ ముగిసిననాటి నుంచి వెలుగు చూస్తున్న వీడియోలు టీడీపీ మూకలు అరాచకాలు, విధ్వంస కాండను కళ్లకు కట్టినట్టు చూపుతున్నా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటే ఒట్టు. మాచర్ల ప్రాంతంలో పచ్చ మూక విధ్వంసం గురించి పదుల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతున్నా, వాటి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అటు ఈసీ, ఇటు పోలీసులు టీడీపీ అనుబంధ సంఘాలన్నట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. అదే మాచర్లలో ఒక్క వీడియోను సాకుగా చూపిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులను మాత్రం వెంటాడి వేధిస్తున్నారు. హత్యాయత్నం కేసులు, అట్రాసిటీ కేసులు నమోదు చేస్తూ ‘పచ్చ’పాతం చూపుతున్నారు. పోలీసుల మద్దతుతోనే టీడీపీ మూక దాడులు ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్సార్సీపీకి ఓటు వేశారన్న అక్కసుతో టీడీపీ మూక పల్నాడు జిల్లాలో చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పౌర సమాజం భయభ్రాంతులకు గురయ్యేలా వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై అత్యంత పాశవికంగా టీడీపీ గూండాలు జరిపిన దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పోలీసుల తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతమని ముందే తెలిసినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ చేసిన దాడికి కొంత మంది పోలీసుల మద్దతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ మరుసటి రోజు మే 14న కారంపూడిలో బుడగ జంగాలు, దళితులు, ముస్లింలపై టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. ఆ రోజు వందలాది మంది టీడీపీ రౌడీల దారుణ కాండను కొంత మంది ప్రజలు ఇళ్ల మీద నుంచి సెల్ఫోన్లలో వీడియోలు తీశారు. అందులో బడుగు, బలహీనవర్గాలకు చెందిన దుకాణాలు, ఇళ్లు, వాహనాలను టీడీపీ మూక ధ్వంసం చేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. వాటిలో వీడియో తీస్తున్న కుటుంబ సభ్యులు.. ఇంతవరకు ఇక్కడే ఉన్న పోలీసులు లేకుండా ఎటుపోయారని ఒకటికి రెండుసార్లు అనుకోవడం ఆ వీడియోలో రికార్డు అయ్యింది. ఆ సమయంలో టీడీపీ గూండాలు మారణాయుధాలతో చేస్తున్న స్వైరవిహారం చూసి భయపడిన కూతురు ఇంట్లోకి వెళ్లి తాళాలు వేసుకుందామని అనగా.. ఇంకో వీడియో తీస్తున్న వ్యక్తి.. ‘దాడి చేస్తున్నవారు మన టీడీపీ వాళ్లు.. మనల్ని ఏం చేయరు’ అని భరోసానివ్వడం గమనార్హం. ఇప్పుడు ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీ మూకలపై చర్యలేవి? టీడీపీ రౌడీలు, గూండాలు మారణాయుధాలతో విధ్వంస కాండకు దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము ఇంతగా వీడియోల ద్వారా ఆధారాలు అందిస్తున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ మూక దాడుల బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు, సమాచారం ఇచ్చేందుకు జిల్లా పోలీసులెవరూ ముందుకు రావడం లేదు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా వివరాలు వెల్లడించలేమంటున్నారు. కారంపూడి ఘటనలో వందలాది మంది టీడీపీ గూండాలు విధ్వంస కాండకు దిగారు. ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారు, ఎందరిపై కేసు నమోదు చేశారనేది తెలియనీయడం లేదు. ఇటీవల పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఓ ఉన్నతాధికారి కేసుల నమోదు, ఇతరత్రా వివరాలేవీ తనకు తెలియకుండా బయటకు వెళ్లనివ్వొద్దని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఏ సమాచారం బయటకు రానివ్వడం లేదు. వైఎస్సార్సీపీ శ్రేణులపై కేసుల నమోదుకు ఉత్సాహం.. వందలాది వీడియోల రూపంలో ఆధారాలు ఉన్నా టీడీపీ మూకలపై చర్యలు తీసుకోని పోలీసులు.. మరోవైపు మాచర్ల, నరసరావుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ నేత పిన్నెల్లి వెంకటరామిరెడ్డి లాంటి వారిపైన మాత్రం కేసుల నమోదుకు ఎక్కడలేని ఉత్సాహం చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లు, ఆస్పత్రిని విధ్వంసం చేయడంతోపాటు వైఎస్సార్సీపీ ఎస్సీ నేతలపై హత్యాయత్నం కేసుల్లో నిందితుడైన టీడీపీ నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు, ఆయన అనుచరులను అరెస్ట్ చేయడంలో పోలీసులు నిలువెత్తు నిర్లక్ష్యం చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పల్నాడులో 144 సెక్షన్ అమలవుతున్న నేపథ్యంలో శాంతియుతంగా ఉండాల్సిన చదలవాడ అరవింద్‌బాబు ఇంట్లోనే నిరసన దీక్షలు పేరిట మీడియాకు వీడియోలు, ఫొటోలు పంపి రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలపై తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు మర్రి రాజశేఖర్, రావెల కిషోర్ బాబు తదితరులు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకి శనివారం వినతిపత్రం అందజేశారు. ఎన్నికల కౌంటింగ్ దగ్గరపడుతున్నందున మళ్లీ టీడీపీ మూకలు హింసకు పాల్పడకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా కోరుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు ‘పచ్చ’పాతాన్ని మానుకోవాలని విన్నవిస్తున్నారు.
హైదరాబాద్‌లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి..
హైదరాబాద్ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంపన్నుల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. దేశంలో ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన దివీస్ లేబొరేటరీస్ వ్యవస్థాపకుడు మురళి దివి కుమార్తె నీలిమా ప్రసాద్ దివి ఇటీవల హైదరాబాద్‌లో రూ .80 కోట్లకు రెండు లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేశారు.జూబ్లీహిల్స్ పరిసరాల్లో ఆమె కొన్న మొదటి ప్రాపర్టీ 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 200 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాని కలిగి ఉంది. ఈ ప్రాపర్టీని ఆమె రూ.40 కోట్లకు కొనుగోలు చేశారు. జాప్కీ షేర్ చేసిన సేల్ డీడ్ డాక్యుమెంట్ల ప్రకారం.. 12,000 చదరపు అడుగుల రెండో ప్రాపర్టీని కూడా అంతే మొత్తానికి నీలిమా దివి కొనుగోలు చేశారు.సంపన్నులకు పేరుగాంచిన జూబ్లీహిల్స్ ప్రాంతంలో చదరపు అడుగుకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు ప్రాపర్టీ ధరలు ఉంటుంన్నాయి. వాణిజ్య పరంగా, రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు హైదరాబాద్ దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ఇటీవలి సంవత్సరాలలో హైదరాబాద్ హై-ఎండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై వ్యాపార ప్రముఖులు, నటులు, పరిశ్రమ ప్రమోటర్లతో సహా సూపర్-రిచ్ వ్యక్తులు గణనీయమైన ఆసక్తిని చూపుతున్నారు.
కాంగ్రెస్‌కు రుణమాఫీ చేసే తెలివిలేదు: కేటీఆర్
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో రూ.1000కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందులో ఢిల్లీ పెద్దల హస్తం కూడా ఉందని వ్యాఖ్యలు చేశారు.కాగా, కేటీఆర్ ఆదివారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సన్నబియ్యం కొనుగోలు విషయంలో కుంభకోణం జరిగింది. ప్రభుత్వంలో ఉండే మంత్రులు, ముఖ్యమంత్రి దీనిపై మాట్లాడటం లేదు. బీఆర్ఎస్ అంటే స్కీములు, కాంగ్రెస్ అంటేనే స్కాములు. గల్లీలో దోచుకో, ఢిల్లీలో పంచుకో అన్నట్టుగా రాష్ట్ర కాంగ్రెస్ తీరు ఉంది. రైతులు పడిగాపులు కాస్తున్న, ధాన్యం కొనుగోలు చేయాలని అడుగుతున్నా ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతుంది కాంగ్రెస్. ధాన్యం కుంభకోణంలో సుమారు రూ.1000కోట్ల కుంభకోణం జరిగిందని నేను ఆరోపిస్తున్నాను. ఇవన్నీ ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు ముడుపులుగా వెళ్ళాయి.అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే పెద్ద ఎత్తున కుంభకోణంతో దోపిడీ చేశారు. ధాన్యం కుంభకోణం జెడ్ స్పీడ్‌తో జరిగింది. ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి. ఇందులో వందల కోట్ల రూపాయలు ముడుపులు అందాయా లేదా ఎంక్వైరీ వేయాలి. పాడిలో మొదటి స్కాం, పాఠశాలల్లో సన్నబియ్యం విషయంలో రెండో స్కామ్. రెండిట్లో దాదాపు రూ.1100 కోట్లు స్కాం జరిగింది.నాలుగు సంస్థలకే టెండర్లు..బహిరంగ మార్కెట్లలో సన్నబియ్యం ధర 42 నుండి 45 వరకు ఉంది. దానిని పక్కకు పెట్టీ 56.90 పైసలతో కొంటున్నారు. కేవలం నాలుగు సంస్థలకు మాత్రమే టెండర్లు ఎందుకు?. సివిల్ సప్లై, ఎఫ్‌సీఐ ఉన్నప్పటికీ వాటిని ఎందుకు పట్టించుకోరు?. కాంట్రాక్టు సంస్థలతో కాంగ్రెస్ నాయకులు మిలాఖత్ అయ్యారు. బహిరంగ మార్కెట్లలో తక్కువ ధరకు సన్నబియ్యం వస్తుంటే ఇంత ధరలు ఎందుకు ఖరారు చేశారు. తెలంగాణలో బ్రూ ట్యాక్స్ నడుస్తోంది. మేము అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. ప్రభుత్వానికి రూ.2లక్షలు రుణమాఫీ చేసే తెలివి లేదు. బీజేపీపై అనుమానాలు..ధాన్యం కొనుగోలు, కాంట్రాక్టు, ఎంఎస్పీ అంత నిర్వహించేది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ బీజేపీ నాయకుడు గొంతు చించుకుంటున్నా కేంద్రంలో ఉన్న FCI నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మనీలాండరింగ్ విషయంలో FCI వెంటనే ఈడీకి ఫిర్యాదు చేయాలి. మీ బీజేపీ ఎంఎల్ఏ చెప్తున్న దాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే ఈడీ విచారణ చేయాలి. FCI స్పందించకపోతే బీజేపీపైన కూడా అనుమానం వ్యక్తం చేయాల్సి వస్తుంది. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మా ప్రభుత్వం అనేక కుంభకోణాలు అంటూ ఆరోపణలు చేశాడు. ఇప్పుడెందుకు రేవంత్ రెడ్డి స్పందించటం లేదు. దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపించాలి. లేదంటే మేమే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. విచారణ సంస్థలను కూడా కలుస్తాం అని వ్యాఖ్యలు చేశారు.
Sister Death Review: అక్కడ పేరు కనిపిస్తే మరణమే!
టైటిల్: సిస్టర్ డెత్‌నటీనటులు: అరియా బెడ్మర్, మరు వల్దీవిల్సో, లూయిసా మెరెలస్, చెలో వివరెస్, సారా రోచ్, అల్ముడెనా ఆమొర్ తదితరులుదర్శకుడు: పాసో ప్లాజాజానర్: హారర్‌ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్‌నిడివి: 1 గంట 30 నిమిషాలుహారర్ సినిమాలు చూస్తే ఆ కిక్కే వేరు! కొన్ని పేరుకే హారర్ మూవీస్ అంటారు కానీ అందులో భయపడేంత సీన్ ఏం ఉండదు. ఇక్కడ చెప్పుకునే సిస్టర్ డెత్ మూవీలో మాత్రం మొదట్లో దెయ్యాన్ని చూపించకుండా భయపెట్టేందుకు ప్రయత్నించారు. మరి అందులో సక్సెస్ అయ్యారా? అసలు ఈ సినిమా కథేంటి? ఎలా ఉందనేది రివ్యూలో మాట్లాడుకుందాం..కథసిస్టర్ నార్సిసా.. కాన్వెంట్ స్కూల్లో పిల్లలకు చదువు చెప్పడానికి వెళ్తుంది. అక్కడ ఉన్న నన్స్‌కు ఈమె పెద్దగా నచ్చదు. అది పట్టించుకోని నార్సిసా తన పని తాను చేసుకుపోతోంది. తన గదిలో ఏదో ఆత్మ ఉందని అర్థమవుతుంది. మరోవైపు స్కూల్లో బోర్డ్ మీద తనను తాను పరిచయం చేసుకుంటూ పేరు రాస్తుంది. అది చూసి అక్కడున్నవాళ్లు షాక్ అవుతారు. కారణం.. దెయ్యం ఆ బోర్డుపై ఎవరి పేరు రాస్తే వారి జీవితం అంతమైపోతుంది. అలా ఓసారి ఒక విద్యార్థి పేరు బోర్డు మీద ప్రత్యక్షమవుతుంది. నీకేం కానివ్వను అని హామీ ఇచ్చిన నార్సిసా ఆ బాలిక ప్రాణాలు కాపాడలేకపోతుంది. బాలిక చావుకు నువ్వే కారణమంటూ అక్కడి నన్స్ నార్సిసాను వెళ్లిపోమంటారు. పెట్టేబేడా సర్దుకుని బయటకు వెళ్లిపోయే క్రమంలో నన్స్ దాచిన రహస్యాన్ని ఆమె తెలుసుకుంటుంది. అక్కడి నుంచి కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. దెయ్యానికి హీరోయిన్ సాయం చేస్తుంది. అందుకు కారణమేంటి? తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే!విశ్లేషణనన్‌ను దెయ్యంగా చూపిస్తూ బోలెడన్ని సినిమాలు వచ్చాయి. ఇది కూడా అలాంటిదే! కానీ ఇందులో ఆ నన్ దెయ్యంగా ఎలా మారిందని చూపించారు. కొన్ని సంఘటనలు కలలా? నిజంగా జరుగుతున్నాయా? అనేవి అర్థం కావు. రియల్ సన్నివేశాల కంటే ఆ కలలే కాస్త భయంకరంగా ఉంటాయి. దెయ్యం తన గతానికి ముడిపడి ఉన్నవారిని చంపడం ఓకే కానీ ఏ సంబంధమూ లేని చిన్నారిని బలి తీసుకోవడం మింగుడుపడదు. చాలా సింపుల్‌గా కథను ముందుకు తీసుకెళ్లారు. దర్శకుడు వికృత ఆకారాలతో దెయ్యాన్ని చూపించి భయపెట్టాలనుకోలేదు. పెద్దగా ట్విస్టులు కూడా ఉండవు. రాసుకున్న కథ మాత్రం బాగుంది. చివర్లో జరిగేది ప్రేక్షకుడు ముందే పసిగట్టేలా ఉండటం మైనస్. నార్సిసా పాత్రలో స్పానిష్ హీరోయిన్ అరియా బెడ్మర్ చాలా బాగా నటించింది. మిగతా వారు కూడా తమ పాత్రల పరిధి మేర నటించారు. యాక్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. పీరియాడిక్ ఫిలిం కావడంతో సినిమా ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్‌లోనే సాగుతుంది.సినిమాను ఒకటిన్నర గంటలో పూర్తి చేయడం మెచ్చుకోదగ్గ విషయం. సినిమా ఎండింగ్లో ఇది వెరోనికా(2017) చిత్రానికి ప్రీక్వెల్ అని అర్థమవుతుంది. మీరు హారర్ సినిమా అభిమానులైతే వెంటనే చూసేయండి.. కాకపోతే ఈ స్పానిష్ సినిమాకు తెలుగు డబ్ వర్షన్ లేదు. హిందీ, ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంది.
రాజ్‌కోట్ ప్రమాదంలో 33కు చేరిన మృతుల సంఖ్య.. ప్రభుత్వం కీలక నిర్ణయం
రాజ్‌కోట్: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాజ్‌కోట్‌లోని గేమ్‌జోన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 33కు చేరుకుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తాజాగా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. కాగా, శనివారం సాయంత్రం రాజ్‌కోట్‌లోని టీఆర్పీ గేమ్ జోన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వీకెండ్ కావడంతో భారీ సంఖ్యలో పర్యాటకులు అక్కడికి వచ్చారు. వారంతా ఆటల్లో నిమగ్నమైన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వారని చుట్టుముట్టడంతో తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో గేమ్ జోన్ పైకప్పు కూలిపోవడంతో లోపల ఉన్న వారంతా బయటకు రాలేకపోయారు. ఈ క్రమంలో వారంతో మంటల్లో సజీవదహనమయ్యారు. తీవ్రంగా కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టం మారిందని అధికారులు వెల్లడించారు. మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందతూ కొందరు బాధితులు మృతిచెందారు. దీంతో, మృతిచెందిన వారి సంఖ్య 33కి చేరుకుంది. #WATCH | Gujarat CM Bhupendra Patel and Home Minister Harsh Sanghavi took stock of the situation at TRP game zone in Rajkot where a massive fire broke out yesterday claiming the lives of 27 people. pic.twitter.com/ks1YhRszH2— ANI (@ANI) May 26, 2024మరోవైపు.. ఈ ఘటన నేపథ్యంలో గేమ్ జోన్ వద్దకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వచ్చి పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించారు. ఈ సందర్భంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా.. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారిలో టీఆర్పీ గేమ్‌జోన్ యజమాని యువ్‌రాజ్ సింగ్ సోలంకితోపాటు దాని మేనేజర్ నితిన్ జైన్ కూడా ఉన్నారు. ఇక, ఈ ప్రమాద ఘటనపై ప్రభుత్వం సిట్‌ను నియమించింది. సీనియర్ పోలీస్ ఆఫీసర్ నేతృత్వంలో సిట్‌ను నియమించగా.. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.🚨 SHOCKING! At least 26 people, including at least 12 children, were killed in a massive fire that broke out at a game zone in Rajkot, Gujarat. pic.twitter.com/nN21BAP1WF— Indian Tech & Infra (@IndianTechGuide) May 26, 2024
తప్పక చదవండి
- ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్? సితార ఫన్నీ ఆన్సర్స్
- ఆ నలుగురికి చివరికి మిగిలిందేంటి?
- ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
- చంపుతామని బెదిరిస్తున్నారు: స్వాతిమలివాల్
- IPL 2024: రైజర్స్ VS రైడర్స్
- ఓటీటీ లవర్స్‌కు జియో సినిమా బంపరాఫర్
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
- Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'!
- Viral Video: నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. కార్లు, కత్తులతో ఫైటింగ్
- టీ20 ప్రపంచకప్ కోసం న్యూయార్క్‌కు బయల్దేరిన టీమిండియా
సినిమా
'లవ్ మీ' సినిమాకు తొలిరోజు షాకింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?
గత రెండు వారాలుగా థియేటర్లని చాలా చోట్ల మూసేశారు. ఈ వీకెండ్ పలు చిత్రాలు రిలీజ్ కావడంతో అవి మళ్లీ తెరుచుకున్నాయి. ఇక వచ్చిన వాటిలో దిల్ రాజు నిర్మించిన 'లవ్ మీ'.. ఉన్నంతలో కాస్త ఆసక్తి రేపింది. మరీ అంతలా కాకపోయినా ఓ మాదిరి టాక్ తెచ్చుకుంది. కానీ తొలిరోజు వచ్చిన వసూళ్లు మాత్రం నెటిజన్లకు షాకిచ్చాయి. ఇంతకీ ఎన్ని కోట్లంటే?(ఇదీ చదవండి: 'సలార్ 2' పక్కన పెట్టేశారని రూమర్స్.. ఒక్క ఫొటోతో క్లారిటీ)తెలుగులో హారర్ సినిమాలకు డిమాండ్ ఉంది. సరైన కథతో తీయాలే గానీ ఎప్పుడొచ్చినా సరే అలరించడం పక్కా. ఇప్పుడు దెయ్యాన్ని మనిషి ప్రేమించడం అనే కాన్సెప్ట్‌తో తీసిన మూవీ 'లవ్ మీ'. ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించారు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు తొలిరోజు రూ.4.5 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ విషయాన్ని నిర్మాతలు ప్రకటించారు.అయితే థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం అనే విషయంలో ఇంతకు ముందులా జనాలు ఆసక్తి చూపించట్లేదు. అయితే ఇప్పుడు 'లవ్ మీ' వసూళ్లు చూసిన తర్వాత నిజంగా అంతమంది జనాలు ఈ సినిమా చూడటానికి వచ్చేశారా? అనే సందేహం వస్తోంది. అలానే మూవీ రిజల్ట్ ఏంటనేది ఈ వీకెండ్ ఆగితే తెలిసిపోతుంది.(ఇదీ చదవండి: '96' దర్శకుడితో కార్తీ మూవీ.. మళ్లీ అలాంటి కాన్సెప్ట్)
చిన్న హీరో అంటూ ఆ హీరోయిన్ చులకనగా మాట్లాడింది: నవదీప్
జై సినిమాతో హీరో నవదీప్ తన కెరీర్ మొదలుపెట్టాడు. హీరోగానే కాకుండా విలన్‌గా, సహాయక నటుడిగానూ సినిమాలు చేశాడు. ఓటీటీలోనూ సినిమాలు, సిరీస్‌లతో ఆకట్టుకుంటున్నాడు. అతడు హీరోగా నటించిన లవ్ మౌళి మూవీ జూన్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ల స్పీడు పెంచాడు నవదీప్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను గూర్చి మాట్లాడాడు.రెండో సినిమాకే..'నా రెండో సినిమా మనసు మాట వినదు సమయంలోనే కాంట్రవర్సీ మొదలైంది. సక్సెస్‌కు చాలా గ్యాప్ వచ్చిన పెద్ద హీరోలకు హిట్లు ఇచ్చిన లక్కీ పర్సన్ తానే అని హీరోయిన్ అంకిత ఫీలైంది. అలాంటి నన్ను ఈ చిన్న హీరో డేట్ల కోసం ఇబ్బందిపెడతారా? అని నిర్మాతను ప్రశ్నించింది. అప్పుడు నాకింకా 17 ఏళ్లు. అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పటినుంచే..తర్వాత ఆ గొడవ సద్దుమణిగింది. ఆ సినిమా నుంచే నన్ను వివాదాలు చుట్టుముట్టడం మొదలయ్యాయి. రేవ్ పార్టీ, ఈడీ కేసులు.. అని ఏదేదో ప్రచారం చేస్తుంటారు. నాకు సంబంధం లేకపోయినా నా పేరు తీసుకొస్తుంటారు. కానీ అందులో ఏమాత్రం నిజముండదు. అసలు నాపై ఒక్క కేసు కూడా లేదు' అని నవదీప్ చెప్పుకొచ్చాడు.చదవండి: 'సలార్ 2' పక్కన పెట్టేశారని రూమర్స్.. ఒక్క ఫొటోతో క్లారిటీ
డ్రగ్స్ కేసులో ప్రముఖ సింగర్ అరెస్ట్
అమెరికన్ ప్రముఖ ర్యాపర్, గాయని నిక్కీ మినాజ్(41) అరెస్ట్ అయింది. అయితే, కొన్ని గంటల తర్వాత మళ్లీ ఆమెను విడుదల చేశారు. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో నిక్కీ మినాజ్‌కు ఈవెంట్ ఉంది. ఆ కార్యక్రమానికి వెళ్లేందుకు ఆమ్స్టర్డామ్లోని షిపోల్ ఎయిర్పోర్ట్ వద్దకు నిక్కీ చేరుకుంది. తన బ్యాగ్‌లో డ్రగ్స్ తీసుకెళ్తున్నట్లు ఆమెపై ఆరోపణలు రావడంతో ఆమ్స్టర్డామ్ అధికారులు ఆమెను నిర్బంధించారు. దీంతో ఆమె షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన సంగీత్ కార్యక్రమం వాయిదా పడింది. ఆమె పాల్గొంటున్న ప్రోగ్రామ్ కోసం సుమారు ఇరువై వేల మంది టికెట్లు కొన్నారు. నిక్కీ వద్ద డ్రగ్స్ ఉన్నాయని సమాచారం రావడంతో తనిఖీల పేరుతో ఆమెను కొన్ని గంటల పాటు ఎయిర్‌పోర్టులోనే పోలీసులు ఉంచారు. ఫైనల్లీ తనవద్ద డ్రగ్స్ లేవని తేలడంతో ఆమెను పోలీసులు వదిలిపెట్టారు. అప్పటికే సమయం గడిచిపోవడంతో ఆమె పాల్గొనాలనుకున్న కార్యక్రమం వాయిదా పడింది. అయితే మరో కొత్త తేదీని ప్రకటిస్తామని అభిమానులకు నిక్కీ టీమ్ తెలిపింది. అయితే, పోలీసుల తీరుపట్ల నిక్కీ మినాజ్ అసహనం వ్యక్తం చేసింది. తన వద్ద డ్రగ్స్ లేకున్నా కావాలనే తన ప్రోగ్రామ్ చెడగొట్టేందుకు ఎవరో ఇలాంటి గేమ్ ప్లాన్ చేశారని ఆరోపించింది. అభిమానులు కూడా ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.కాగా 2010లో ‘పింక్ ఫ్రైడే’ అల్బమ్ తో నిక్కీ మినాజ్ పాప్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ది పింక్ ప్రింట్, క్వీన్, ప్లే టైమ్ ఈజ్ ఓవర్ వంటి ఆల్బమ్స్ తో మంచి పేరు తెచ్చుకుంది. మినాజ్ ఎప్పటికప్పుడు అత్యంత ప్రభావవంతమైన హిప్ హాప్ కళాకారులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. తన కెరీర్ మొత్తంలో 10 గ్రామీ నామినేషన్లు, తొమ్మిది అమెరికన్ మ్యూజిక్ అవార్డులు, 11బీఈటీ అవార్డులు , నాలుగు బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డులు, ఇతర పురస్కారాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురి సంగీత అభిమానుల ప్రశంసలను ఆమె సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by Barbie (@nickiminaj)
పెళ్లి కోసం అబ్బాయిని తీసుకెళ్లినా.. ఇంట్లో వాళ్లు నమ్మేలా లేరు: అంజలి
తెలుగు బ్యూటీ అంజలి పెళ్లిపై చాలా రూమర్స్ వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. మొదట్లో ఓ తమిళ హీరోతో పెళ్లి అని పుకార్లు వచ్చాయి. దానిపై అంజలి వివరణ ఇచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు ఎలాంటి రూమర్స్ రాలేదు. మళ్లీ ఆమె సినిమాలతో బీజీ అయిన తర్వాత ప్రముఖ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుందనే ప్రచారం జరిగింది. అంతేకాదు త్వరలోనే సినిమాలకు పుల్‌స్టాప్ పెట్టి అమెరికాలో సెటిల్ అవుతుందనే ప్రచారమూ జరిగింది. అయితే వీటిని అంజలి ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. అయినా కూడా ఈ మ్యారేజ్ రూమర్స్ వస్తునే ఉన్నాయి. తాజాగా అంజలి తన పెళ్లిపై వస్తున్న పుకార్లపై స్పందించింది. ‘ఇప్పటికే సోషల్ మీడియా నాకు మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసింది(నవ్వూతూ..). మొదట్లో ఇలాంటి రూమర్స్ వస్తే ఇంట్లో వాళ్లు కంగారు పడేవాళ్లు. కానీ ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ మధ్య నేను పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయ్యాననే పుకారు వచ్చింది. అమెరికాలోనే ఉన్న మా అక్క నాకు కాల్ చేసి..‘పెళ్లి అయిందటగా’ అని అడిగింది. ఏమో మరి నాకే తెలియదు అని చెప్పా(నవ్వుతూ..). నా పెళ్లిపై వచ్చిన రూమర్స్ కారణంగా..నేను ఒక అబ్బాయిని తీసుకెళ్లి ఇతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పినా.. ఇంట్లో వాళ్లు నమ్మేలా లేరు. పెళ్లి అయితే కచ్చితంగా చేసుకుంటా. కానీ ఇప్పుడు కాదు. ప్రస్తుతం నేను సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. పెళ్లి చేసుకుంటే.. పర్సనల్ లైఫ్‌కి కూడా టైమ్ కేటాయించాలి. అందుకే కొంచెం టైమ్ తీసుకొని పెళ్లి చేసుకుంటా. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తాను’ అని అంజలి చెప్పుకొచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదలకు సిద్ధంగా ఉంది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. నేహా శెట్టి మరో హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మే 31న విడుదల కాబోతుంది.
ఫొటోలు
Prayaga Martin: పిశాచి మూవీలో దెయ్యంగా భయపెట్టిన బ్యూటీ.. ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)
Anasuya Sengupta: 'కేన్స్'లో చరిత్ర సృష్టించిన భారతీయ నటి (ఫోటోలు)
నేను బతికే ఉన్నా.. ఫోటోలతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ (ఫొటోలు)
హార్దిక్ పాండ్యాతో విడాకులంటూ వదంతులు.. ట్రెండింగ్‌లో నటాషా(ఫొటోలు)
Deepika Padukone: ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న స్టార్ హీరోయిన్ (ఫోటోలు)
క్రీడలు
IPL 2024 KKR vs SRH: ఐపీఎల్ విన్నర్లు, రన్నరప్స్ వీరే..!
ఐపీఎల్ 2024 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. కేకేఆర్, సన్‌రైజర్స్ మధ్య నేడు (మే 26) జరుగబోయే ఫైనల్‌తో ఐపీఎల్ 17వ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. ఈ సీజన్ గత సీజన్లకు భిన్నంగా సాగింది. బ్యాటింగ్‌కు సంబంధించి ఆల్‌టైమ్ రికార్డులు బద్దలుకావడంతో పాటు పలు సంచలన బౌలింగ్ ప్రదర్శనలు నమోదయ్యాయి. చెరి ఐదసార్లు ఛాంపియన్లైన ముంబై, సీఎస్కే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించాయి. దిగ్గజ కెప్టెన్లు రోహిత్, ధోని లేకుండా జరుగుతున్న ఐదో ఐపీఎల్ ఫైనల్ ఇది.ఐపీఎల్ 2024 ఫైనల్ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన 16 సీజన్లలో విజేతలు, రన్నరప్లపై ఓ లుక్కేద్దాం. ఇప్పటివరకు జరిగిన 16 ఫైనల్స్‌లో సీఎస్కే (2010, 2011, 2018, 2021, 2023), ముంబై (2013, 2015, 2017, 2019, 2020) చెరి ఐదుసార్లు టైటిల్ కైవసం చేసుకోగా.. కేకేఆర్ రెండు (2012, 2014), సన్‌రైజర్స్ (2016), రాజస్థాన్ రాయల్స్ (2008), గుజరాత్ టైటాన్స్ (2022), డెక్కన్ ఛార్జర్స్ (2009) తలో సారి టైటిల్ నెగ్గాయి. అత్యధికసార్లు రన్నరప్‌గా నిలిచిన ఘనత సీఎస్కేకు దక్కింది. సీఎస్కే ఐదుసార్లు (2008, 2012, 2013, 2015, 2019) ఫైనల్లో ఓటమిపాలైంది.ఆతర్వాత ఆర్సీబీ మూడు సార్లు (2009, 2011, 2016).. ముంబై ఇండియన్స్ (2010), కేకేఆర్ (2021), సన్‌రైజర్స్ (2018), రాజస్థాన్ రాయల్స్ (2022), గుజరాత్ టైటాన్స్ (2023), పంజాబ్ కింగ్స్ (2014), ఢిల్లీ క్యాపిటల్స్ (2020), రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ (2017) తలో సారి రన్నరప్‌గా నిలిచాయి.సీజన్ల వారీగా విజేతలు, రన్నరప్స్..2008- రాజస్థాన్ రాయల్స్ (విజేత), సీఎస్కే (రన్నరప్)2009- డెక్కన్ ఛార్జర్స్ (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2010- సీఎస్కే (విజేత), ముంబై ఇండియన్స్ (రన్నరప్)2011- సీఎస్కే (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2012- కేకేఆర్ (విజేత), సీఎస్కే (రన్నరప్)2013- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2014- కేకేఆర్ (విజేత), పంజాబ్ (రన్నరప్)2015- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2016- సన్‌రైజర్స్ (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2017- ముంబై (విజేత), పూణే (రన్నరప్)2018- సీఎస్కే (విజేత), సన్‌రైజర్స్ (రన్నరప్)2019- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2020- ముంబై (విజేత), ఢిల్లీ (రన్నరప్)2021- సీఎస్కే (విజేత), కేకేఆర్ (రన్నరప్)2022- గుజరాత్ (విజేత), రాజస్థాన్ (రన్నరప్)2023- సీఎస్కే (విజేత), గుజరాత్ (రన్నరప్)
65వ సెంచరీ నమోదు చేసిన పుజారా
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో టీమిండియా టెస్ట్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా చెలరేగిపోతున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ ప్రస్తుత సీజన్లో ససెక్స్ తరఫున రెండో సెంచరీ సాధించిన పుజారా.. ఓవరాల్‌గా 65వ ఫస్ట్ క్లాస్ సెంచరీ నమోదు చేశాడు. ససెక్స్ తరఫున కౌంటీల్లో పుజారాకు ఇది 10వ శతకం. కౌంటీ ఛాంపియన్షిన్ డివిజన్-2లో భాగంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా మిడిల్సెక్స్తో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా ఈ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో పుజారా తనదైన శైలిలో అడ్డుగోడ పాత్ర పోషించి 302 బంతుల్లో 15 బౌండరీల సాయంతో 129 పరుగులు చేసి ఔటయ్యాడు.పుజారాతో పాటు కెప్టెన్ జాన్ సింప్సన్ (167) శతక్కొట్టడంతో ససెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 554 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో టామ్ హెయిన్స్ (40), డానీ లాంబ్ (49) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మిడిల్సెక్స్ బౌలర్లలో బాంబర్ 3, బ్రూక్స్, హోల్మన్ తలో 2, ర్యాన్ హిగ్గిన్స్, నాథన్ ఫెర్నాండెజ్ చెరో వికెట్ పడగొట్టారు. PUJARA SMASHED HIS 65th FIRST-CLASS HUNDRED 🤯 💥- An all time legend, Puj. pic.twitter.com/dXSbmUDvJb— Johns. (@CricCrazyJohns) May 25, 2024అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మిడిల్సెక్స్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 62 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. సామ్ రాబ్సన్ (40), మ్యాక్స్ హోల్డన్ (18) క్రీజ్‌లో ఉండగా.. మార్క్ స్టోన్‌మన్ (4) ఔటయ్యాడు. ప్రస్తుతం మిడిల్సెక్స్ ససెక్స్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 492 పరుగులు వెనకపడి ఉంది.
పాక్‌తో సిరీస్ కంటే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడి ఉంటే బాగుండేది..!
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ స్వదేశీ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తీసుకున్న ఓ నిర్ణయంపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు. సహజంగా ఇతర దేశాల ఆటగాళ్లు, క్రికెట్ బోర్డులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వాన్.. ఈసారి ఓ విషయంలో స్వదేశీ బోర్డుపై దుమ్మెత్తిపోశాడు.వివరాల్లోకి వెళితే.. టీ20 వరల్డ్‌కప్ 2024 దృష్ట్యా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ దేశ క్రికెటర్లను ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడనీయకుండా నిషేధాజ్ఞలు విధించింది. ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లందరూ మెగా టోర్నీకి ముందు స్వదేశంలో పాక్‌తో జరిగే టీ20 సిరీస్‌లో తప్పక పాల్గొనాలని అల్టిమేటం జారీ చేసింది. దీంతో జోస్ బట్లర్ (రాజస్థాన్), విల్ జాక్స్ (ఆర్సీబీ), ఫిల్ సాల్ట్ (కేకేఆర్) లాంటి ఆటగాళ్లు కీలకమైన ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడకుండా స్వదేశానికి వెళ్లిపోయారు.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పందించాడు. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఇంగ్లండ్ క్రికెటర్లను ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడనీయకుండా ఈసీబీ పెద్ద తప్పిదమే చేసిందని మండిపడ్డాడు. మెగా టోర్నీకి ముందు పాక్ లాంటి జట్టుతో స్వదేశంలో సిరీస్ ఆడేకంటే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడి ఉంటేనే ఇంగ్లండ్‌కు మంచి జరిగి ఉండేదని అభిప్రాయపడ్డాడు. ప్లే ఆఫ్స్ ఆడి ఉంటే బట్లర్, జాక్స్, సాల్ట్‌లకు భారీ జనసమూహాల మధ్య ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలిసుండేదని అన్నాడు.ప్రపంచకప్‌కు ముందు లభించిన ఈ అరుదైన అవకాశాన్ని ఈసీబీ చేజేతులారా జారవిడ్చుకుందని ధ్వజమెత్తాడు. స్వదేశీ ఆటగాళ్ల విషయంలో ఈసీబీ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యిందో అర్దం కావట్లేదని మండిపడ్డాడు.కాగా, ప్రస్తుతం ఇంగ్లండ్ స్వదేశంలో పాక్‌తో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20 నిన్ననే ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పాక్‌పై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మిగిలిన రెండు మ్యాచ్‌లు 28, 30 తేదీల్లో జరుగనున్నాయి. జూన్ 1 నుంచి యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో పాక్, ఇంగ్లండ్ జట్లు వేర్వేరు గ్రూప్‌ల్లో పోటీపడుతున్నాయి. పాక్.. భారత్, కెనడా, యూఎస్ఏ, ఐర్లాండ్‌లతో పాటు గ్రూప్-ఏలో, ఇంగ్లండ్.. ఆసీస్, ఒమన్, నమీబియా, స్కాట్లాండ్లతో పాటు గ్రూప్-బిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
టీ20 ప్రపంచకప్ కోసం న్యూయార్క్‌కు బయల్దేరిన టీమిండియా
యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం టీమిండియా తొలి బ్యాచ్ నిన్న (మే 25) న్యూయార్క్‌కు బయల్దేరింది. The wait is over.We are back!Let's show your support for #TeamIndia 🇮🇳 pic.twitter.com/yc69JiclP8— BCCI (@BCCI) May 25, 2024విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చహల్, రింకూ సింగ్ (ట్రావెలింగ్ రిజర్వ్), ఖలీల్ అహ్మద్ (ట్రావెలింగ్ రిజర్వ్), ఆవేశ్ ఖాన్ (ట్రావెలింగ్ రిజర్వ్) మినహా మొత్తం టీమిండియా నిన్న సాయంత్రం ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది.రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియాకు భారత క్రికెట్ అభిమానులు ఘనంగా సెండాఫ్ ఇచ్చారు. వివిధ కారణాల చేత తొలి బ్యాచ్‌లో వెళ్లలేని వారు ఈ నెల 30న జట్టుతో కలుస్తారని సమాచారం. ప్రపంచకప్‌లో భారత ప్రస్తానం జూన్ 5న మొదలవుతుంది. TEAM INDIA AT THE MUMBAI AIRPORT...!!! 🇮🇳- Good luck, Rohit Sharma and his army!pic.twitter.com/v4iKNYzlNC— Mufaddal Vohra (@mufaddal_vohra) May 25, 2024దీనికి ముందు భారత్ జూన్ 1న బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. మెగా టోర్నీలో భారత్.. పాకిస్తాన్, యూఎస్ఏ, ఐర్లాండ్, కెనడా దేశాలతో కలిసి గ్రూప్-ఏలో పోటీపడనుంది. జూన్ 9న టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడనుంది.భారత బృందం ప్రపంచకప్ కోసం బయల్దేరిన దృశ్యాలను బీసీసీఐ సోషల్‌మీడియాలో షేర్ చేసింది. వీటికి భారత క్రికెట్ అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ఈసారి టీమిండియా తప్పక ప్రపంచకప్ ట్రోఫీతో తిరిగిరావాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.Rishabh Pant when the media asked 'jeet ke aana'. 🥹🇮🇳 pic.twitter.com/h22v9GBEzQ— Mufaddal Vohra (@mufaddal_vohra) May 25, 2024ప్రపంచకప్ కోసం బయల్దేరిన భారత బృందం..రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ (ట్రావెలింగ్ రిజర్వ్), అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మొహమ్మద్ సిరాజ్, శివమ్ దూబే, రాహుల్ ద్రవిడ్ (హెడ్ కోచ్), విక్రమ్ రాథోడ్ (బ్యాటింగ్ కోచ్), పరస్ మాంబ్రే (బౌలింగ్ కోచ్), టి దిలీప్ (ఫీల్డింగ్ కోచ్)
బిజినెస్
దేశంలో బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే?
బంగారం ప్రియులకు శుభవార్త. ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి. ఈ వారంలో వరుసగా తగ్గుముఖం పడుతుండడం కొనుగోలు దారులకు కలిసొచ్చే అంశమేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ధరలు స్థిరంగా ఉన్నాయని, పసిడి కొనుగోలుకు ఇదే మంచి తరుణమని అంటున్నారు. ఇక తాజాగా, ఆదివారం (మే 26) పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం) ధర రూ.66,400 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ. 72,440 గా ఉంది.ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,550 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ.72,590 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రూ.66,400 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ. 73,410కి చేరిందిచెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,550 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ.72,600 కు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,440గా ఉంది.
సంచలన నివేదికలు.. మరోసారి తెరపైకి షానన్ - మస్క్ సాన్నిహిత్యం
టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ మాజీ భార్య కోల్ షానన్‌కు, మస్క్‌కు సాన్నిహిత్యం ఉందని.. ఆ కారణంగానే సెర్గీ, నికోల్ దంపతులు విడాకులు తీసుకున్నారంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.సెర్గీబ్రిన్, ఎలోన్ మస్క్ ఒకప్పుడు ప్రాణస్నేహితులు. కాబట్టే మస్క్ ఎదుర్కొన్న అనేక ఆర్ధిక ఇబ్బందుల నుంచి సెర్గీబ్రిన్ బయటపడేసినట్లు మీడియా కథనాలు హైలెట్ చేశాయి. అయితే, ఇంతటి ప్రాణ స్నేహితులు విడిపోవడానికి నికోల్ షానన్‌తో మస్క్‌కు ఉన్న సాన్నిహిత్యమేనేని నిర్ధారించారు.షానహన్ -సెర్గీ బ్రిన్లు 2018లో వివాహం చేసుకున్నారు. ఐదేళ్ల తర్వాత కోల్ షానన్‌కు, మస్క్‌కు సాన్నిహిత్యం బయటపడడంతో సెర్గీ-నికోల్ దంపతులు విడాకులు తీసుకున్నారు. సెటిల్ మెంట్ కింద నికోల్‌కు సెర్గీ 1 బిలియన్ డాలర్లు ఇచ్చారు. ఎనిమిది మంది వ్యక్తులు సాక్షులు ,కీలక డాక్యుమెంట్లను న్యూయార్క్ టైమ్స్ వెలుగులోకి తెచ్చింది. ‘ఏ రన్నింగ్ మేట్స్ హిస్టరీ’ పేరుతో కథనాన్ని ప్రచురించింది. ఈ న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని షానహన్-సెర్గీ బ్రిన్లు ఖండించారు.
జర్నీకి ఐదు నిమిషాల ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలా అంటే?
చివరి నిమిషంలో ఊరు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? లేదంటే వీరే ప్రాంతంలో మీకు అత్యవసర పనిబడిందా? ఇందుకోసం మీరు ముందస్తుగా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోలేదా? చింతించకండి. ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ టికెట్ బుకింగ్‌లో కొత్త సదుపాయాన్ని కల్పించింది.పలు కారణాల వల్ల చివరి నిమిషంలో ప్రయాణికులు వారు బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్లను క్యాన్సిల్ చేస్తుంటారు. మరి ఆ టికెట్లు వృధాగా పోతున్నాయి. అందుకే రైలు ప్రయాణానికి ఐదు నిమిషాల ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.అయితే స్లీపర్, 3ఏసీ, 2ఏసీ, 1ఏసీలో సీట్లు ఖాళీగా ఉంటే.. జర్నీకి ఐదు నిమిషాల ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. మరి ఈ భోగీల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయా? లేదా? అని తెలుసుకునేందుకు ఆన్లైన్ చార్ట్ వెబ్సైట్లోకి వెళ్లి ..ట్రైన్ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత గెట్ ట్రైన్ చార్ట్ కనిపిస్తుంది. ఇందులో ట్రైన్ వివరాలు కనిపిస్తాయి. అక్కడ సీట్లు ఉన్నాయని తెలుస్తే బుక్ చేసుకోవచ్చు.
ఓటీటీ లవర్స్‌కు జియో సినిమా బంపరాఫర్
ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ జియో సినిమా యూజర్లకు శుభవార్త చెప్పింది. జియో సినిమా 12 నెలల ప్రీమియం యాడ్ ఫ్రీ ప్లాన్‌ను రూ. 599కే అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రారంభం ధర 50 శాతం డిస్కౌంట్‌తో రూ.299 లకే అందిస్తుంది. సంవత్సరం తర్వాత మళ్లీ రీఛార్జ్ చేసుకోవాలంటే రూ.599 చెల్లించాలి. జియో సినిమా గతంలో రూ.999 వార్షిక ప్లాన్ అందించింది. ఇప్పుడు దాన్ని రూ.599కి తగ్గించి.. ప్రారంభం ఆఫర్ కింద భారీ డిస్కౌంట్ ఇస్తోంది.నెలవారీ ప్లాన్ మాదిరిగానే, వార్షిక సబ్స్క్రిప్షన్ హెచ్‌బీఓ, పీకాక్, పారామౌంట్ ప్లస్ వంటి ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను సైతం జియో సినిమాలో వీక్షించవచ్చు. దీంతో పాటు ఐపీఎల్ ఇతర ప్రాంతీయ కంటెంట్‌ను ఫ్రీగా చూడొచ్చని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
వీడియోలు
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధం
భారీగా పెరిగిన కోడి గుడ్డు ధర
నాసిక్‌లోని బులియన్ వ్యాపారి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు
కనీసం మాట మాట్లాడటానికి ఇష్టపడటం లేదు: కేటీఆర్
BH రిజిస్ట్రేషన్.. బయటపడ్డ డీలర్ల మోసాలు
IPL 2024 ఫైనల్ జోరుగా బెట్టింగ్..
యాదాద్రి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు
Magazine Story: తిన్నారో.. చచ్చారే! హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్
టాప్ 30 హెడ్‌లైన్స్@11AM 26 May 2024
Cyclone Remal: ఉరుములు, మెరుపులతో వర్షాలు..
ఫ్యామిలీ
బ్రక్సిజమ్ అంటే...? పిల్లల పళ్లుకి ప్రమాదమా..?
కొందరు పిల్లలు... ఆ మాటకొస్తే కొందరు పెద్దలు కూడా నిద్రలో పళ్లు కొరుక్కోవడంతోపాటు దవడలు బిగబట్టి పళ్లు నూరుతుంటారు. దీనిని వైద్యపరిభాషలో ‘బ్రక్సిజమ్’ అంటారు. దీనివల్ల పళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం.తీవ్రమైన మానసిక ఒత్తిడి, యాంగై్జటీ వంటి పరిస్థితులే బ్రక్సిజానికి కారణం. ఎప్పుడో ఒకసారి పళ్లు బిగబట్టడం, కోపం వచ్చినప్పుడు పళ్లు కొరకడం సహజం. కానీ నిత్యం నిద్రలో ఇది జరుగుతుంటే మాత్రం దీన్ని రుగ్మతగా పరిగణించి చికిత్స తీసుకోవాలి. లక్షణాలు: ΄పొద్దున లేవగానే తలనొప్పి. ఒక్కోసారి ముఖం నొప్పి కూడా. చెవి పోటు దవడ కండరాల నొప్పులు కొందరిలో చెవిలో హోరు (టినైటిస్) నోరు నొప్పి కారణంగా ఆహారం తీసుకోలేకపోవడం నోరు తెరవడానికి, మూయడానికి ఇబ్బంది. రకాలు: అవేక్ బ్రక్సిజమ్ : కొందరు మెలకువగా ఉన్నప్పుడు పగటివేళ పళ్లు కొరుక్కుంటూ ఉంటారు. ఇలాంటి కేసుల్లో ఒత్తిడికి కారణం గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తే సరిపోతుంది. అంతకుమించి చికిత్స అవసరం ఉండకపోవచ్చు. కొందరిలో ఏదైనా విషయంపై తదేకంగా దృష్టి కేంద్రీకరించినప్పుడు అసంకల్పితంగా దవడ బిగిస్తుంటారు. దీనికీ చికిత్స అవసరం ఉండదు స్లీప్ బ్రక్సిజమ్: నిద్రలో ఉన్నప్పుడు అదేపనిగా పళ్లు కొరకడంతో ΄ాటు తాము అలా చేస్తున్నామన్న విషయమే పిల్లలకు తెలియదు. పగటివేళల్లో మామూలుగానే ఉంటారు. వీళ్లకు చికిత్స అవసరం. రిస్క్ ఫ్యాక్టర్స్: పిల్లల్లో తీవ్రమైన ఒత్తిడి, యాంగై్జటీ వంటి పరిస్థితుల తోపాటు మేజర్ డిప్రెసివ్ డిజార్డర్స్ లేదా జనరలైజ్డ్ యాంగై్జటీ డిజార్డర్స్ వంటి మానసిక పరిస్థితులు పెద్దవారిలో ఆల్కహాల్‌తో పాటు కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ వంటివి ఎక్కువగా తాగడం పెద్దల్లో యాంగై్జటీని తగ్గించడం కోసం వాడే కొన్ని రకాల ఔషధాలు. ఉదాహరణకు ‘సెలక్టివ్ సెరిటోనిన్ రీ–అప్ టేక్ ఇన్హిబిటార్స్ –ఎస్ఎస్ఆర్ఐస్ అనే మందులు పెద్దవారిలో గురక రావడం. చికిత్స: పిల్లలు నిద్రలో ఎప్పుడైనా పళ్లు కొరుకుతుంటే దానికి పెద్దగా చికిత్స అవసరం లేదు. కానీ అది పళ్లకు హాని కలిగించే ంత తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం సీరియస్‌గా తీసుకోవాల్సిందే. ముందుగా వారి పళ్లు దెబ్బతినకుండా పంటి డాక్టర్ ఆధ్వర్యంలో మౌత్ గార్డ్స్ అమర్చడం అవసరంస్ట్రెస్ తగ్గించడానికి తొలుత కౌన్సెలింగ్, తర్వాత ధ్యానం వంటి పద్ధతులతో తేలిక పాటి వ్యాయామాలు ‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’తో చాలావరకు ఉపయోగం ఉంటుంది కొన్ని పరీక్షల తర్వాత యాంగై్జటీ, డిప్రెషన్ వంటివి ఉన్నాయని తేలితే... యాంగ్జియోలైటిక్స్ అనే యాంటీ యాంగై్జటీ మందులతో పాటు మజిల్ రిలాక్సెంట్ ఔషధాలు. జీవనశైలి అంటే లైఫ్స్టైల్లో మార్పులు (మద్యం అలవాటు వదిలేయడం, పరిమితికి మించి కాఫీలు, పొగ తాగడాన్ని మానేయడం) డాక్టర్డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి సీనియర్ డెంటల్ సర్జన్(చదవండి: కిచెన్‌ని క్లీన్‌గా ఉంచడంలో టూత్‌పేస్ట్ ఎలా పనిచేస్తందో తెలుసా..!)
కడుపులో అల్సర్స్ తగ్గాలంటే..!
ఆహారపు అలవాట్లు మారడం తోపాటు జీవనశైలిలో ఒత్తిడి పెరగడం వల్ల జీర్ణకోశానికి వస్తున్న సమస్యల్లో కడుపులో అల్సర్స్ కూడా ఒకటి. ఆహారాన్ని జీర్ణం చేయడం కోసం కడుపులో ఆమ్లం (యాసిడ్) ఉత్పత్తి అవుతుంది. అది నిర్ణీత మోతాదులో ఉత్పత్తి కాకపోవడం వల్ల కడుపులో అల్సర్లు వస్తాయి. ఇలా జీర్ణాశయంలో వచ్చే అల్సర్‌ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు. ఈ అల్సర్స్‌ను అధిగమించాలంటే... యోగా, ధ్యానం వంటి వాటి ద్వారా మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం ఆహారంలో కారం, మసాలాలు తక్కువగా ఉండేలా జాగ్రత్తపడటం కాఫీ, టీలు పరిమితంగా తీసుకోవడం లేదా పూర్తిగా మానేయడం పొగతాగడం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం క్రమం తప్పకుండా రోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవడం.(చదవండి: ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ విపత్తు ఆస్పత్రి!ఎక్కడంటే..)
కిచెన్‌ని క్లీన్‌గా ఉంచడంలో టూత్‌పేస్ట్ ఎలా పనిచేస్తందో తెలుసా..!
టూత్‌పేస్ట్ దంతాలు శుభ్రంగా ఉంచుకోవడానికే కాదు. మన కిచెన్‌ని శుభ్రంగా ఉంచుకోవడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతుంది. ముఖ్యంగా స్టీల్ సింక్లు, ట్యాప్‌లు, ఎంత ఘోరంగా ఉంటాయో తెలిసిందే. అలాంటి వాటిపై ఉండే మొండి మరకలను క్లీన్ చేయడంలో టూత్‌పేస్ట్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఎలా ఈ టూత్ పేస్ట్ మన కిచెన్‌లో ఉన్న వస్తువులను క్లీన్‌గా ఉంచుతుందో సవివరంగా తెలుసుకుందాం.! మన ఇంట్లో వేస్ట్‌గా మిగిలిపోయిన పాత పేస్ట్‌లు వస్తువులను శుభ్రం చేయడంలో చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నీటిలోని ఫ్లోరైడ్ కారణంగా కొన్ని రకాల స్టీల్ వస్తువులపై తెల్లటి మరకలు ఉండిపోతాయి. అవి ఓ పట్టాన పోవు. అలాంటి వాటిని వదలగొట్టడంలో టూత్‌పేస్ట్ అద్భతంగా పనిచేస్తుంది. అలాంటి వాటిని క్లీన్ చేయడంలో ఎలా సహకరిస్తుందంటే..స్టెయిన్లెస్ స్టీల్ సింక్లు..వంటగదిలోని సింక్ మిలమిల మెరుస్తు కాంతిగా ఉండాలంటే టూత్‌పేస్ట్‌ని ఉపయోగించటం మంచిది. దానిపై పడు గీతలు, ఒక విధమైన తెల్లటి మరకలను వదలగొట్టడంలో టూత్ పేస్ట్ భలే పనిచేస్తుంది. స్పాంజ్ సాయంతో కాస్త ప్రెజర్ ఉపయోగించి క్లీన్ చేస్తే సులభంగా మరకలు, గీతలు వదిలిపోతాయి. కుళాయిలు..నీటి కుళాయిలపై ఉండు మచ్చలు, మరకులతో కాస్త అసహ్యంగా కనిపిస్తుంటాయి. అలాంటి వాటిని టూత్‌పేస్ట్‌ని పూసి క్లాత్‌తో క్లీన్ చేస్తే చక్కగా మెరుస్తూ అందంగా ఉంటుంది. గ్లాస్ అండ్ సిరామిక్ స్టవ్‌లు..గ్లాస్ అండ్ సిరామిక్ స్టవ్ టాప్‌లపై మరకలు, వండిన పదార్థాల అవశేషాలను నీటిగా వదలించడంలో టూత్‌పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. మగ్స్‌పై కాఫీ, టీ మరకలు..కొన్ని రకాల టీ కప్పుల్లో కాఫీ, టీ మరకలు ఓ పట్టాన వదలవు. అలాంటప్పడు టూత్‌పేస్ట్‌ని ఉపయోగిస్తే నీటిగా వదిలిపోతాయి. కటింగ్ బోర్డ్..కూరగాయలు కోసే కటింగ్ బోర్డ్‌లు వివిధ రకాల ఆహార పదార్థాల వాసనలతో, మరకలతో ఉంటాయి. వాటిని టూత్‌పేస్ట్‌తో శ్రభం చేస్తే చూడటానికి అందంగానే గాకుండా మంచి సువాసనతో ఉంటుంది. టూత్పేస్ట్ల్ ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, రాపిడి వాసనలను తొలగించి ఉపరితలాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.(చదవండి: ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..)
ఒంటెల్లాంటి చెట్లు! ఇవి కేవలం అక్కడ మాత్రమే..
మనం ఎన్నో రకాల చెట్లను చూసుంటాం. అందులో పొట్టివిగా, పొడవుగా ఏవైనా కావచ్చు. కానీ ఈ వింతరకమైనా చెట్లను ఎప్పుడైనా చూశారా! అచ్చం గజస్తంభాలను పోలిన విధంగా ఉన్నాయి. ఒంటె మెడలలాగా పొడవుగా, ఏనుడు ఆకారంలో భారీగా ఉన్నాయి. అవేంటో చూసేయండి!నిలువునా స్తంభాల్లా పెరిగే ఈ చెట్లను బేయబాబ్ చెట్లు అని అంటారు. ఇవి ఎక్కువగా మడగాస్కర్లోను, అరేబియన్ ద్వీపకల్పంలోను, ఆఫ్రికా ప్రధాన భూభాగంలోను, ఆస్ట్రేలియాలోను కనిపిస్తాయి. బేయబాబ్ చెట్లలో తొమ్మిది రకాలు ఉంటే, వాటిలో ఆరు రకాలు కేవలం మడగాస్కర్‌లో మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన వాటిలో రెండు రకాలు అరేబియన్ ద్వీపకల్పంలోను, ఆఫ్రికా ప్రధాన భూభాగంలోను, మరో రకం ఆస్ట్రేలియాలోను కనిపిస్తాయి. వీటి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ఇవి నిట్ట నిలువుగా పెరుగుతాయి. కాండానికి చిట్టచివర మాత్రమే కొమ్మలు ఉంటాయి. ఈ చెట్లు ఒంటెల్లాంటివి. వీటి కాండం చుట్టుకొలత 23 అడుగుల నుంచి 36 అడుగుల వరకు ఉంటుంది.ఆకురాలే కాలంలో కూడా ఈ చెట్లు తమ కాండంలో లీటర్ల కొద్ది నీటిని నిల్వ ఉంచు కుంటాయి. ఈ చెట్లు వెయ్యేళ్ల నాటివని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ శతాబ్ది ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో బేయబాబ్ చెట్లు పెద్ద సంఖ్యలో మరణించాయి. అయితే, అవి చీడపీడల వల్ల కాకుండా, నీటి కొరత కారణంగానే మరణించినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు.ఇవి చదవండి: తన రంగును మార్చుకునే.. సరస్సును ఎప్పుడైనా చూశారా!
న్యూస్ పాడ్‌కాస్ట్
సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో 61.11 శాతం ఓటింగ్ నమోదు.. ఇంకా ఇతర అప్డేట్స్
దేశ అభివృద్ధి కోసమే మూడోసారి బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్నికల్లో గెలుపు నా కోసం, నా కుటుంబం కోసం కాదు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వీడియో లీక్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు... ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు... ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
విపక్షాలది మతతత్వ, కులతత్వ, వారసత్వ కూటమి.. ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం
దక్షిణాదిలో బీజేపీకే అత్యధిక లోక్‌సభ సీట్లు... ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ విశ్వాసం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్న ఆలోచన మానుకోండి... కాంగ్రెస్ పార్టీకి హితవు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాకాండపై వినీత్ బ్రిజ్‌లాల్ నేత్వత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
Viral Video: నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. కార్లు, కత్తులతో ఫైటింగ్
యశవంతపుర: యువకునిపై కారు ఎక్కించి, తల్వార్లతో దాడి చేసిన ఘటన ఉడుపిలో జరిగింది. శుక్రవారం రాత్రి ఉడుపి శారద మండపం జంక్షన్లో రెండు గుంపుల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకొంది. హైవే – 169లో ప్రజలు తిరుగుతున్న సమయంలో దుండగులు పెద్ద పెద్ద కత్తులతో వీరవిహారం చేశారు. సినిమాలో మాదిరిగా కార్లలో ఒకరినొకరు గుద్దుకుంటూ గొడవలు పడడం చూసి జనం భయాందోళనకు గురయ్యారు. దగ్గర్లో అపార్ట్మెంట్లోని ఒక వ్యక్తి ఈ దృశ్యాలను వీడియో తీశారు. ఈ వీడియో చూసి ఇది ఉడుపియేనా, లేక ఇతర దేశమా? అని స్థానిక ప్రజలే నోటిమీద వేలు వేసుకొంటున్నారు. కాపు తాలూకాకు చెందిన గరుడ గ్యాంగ్ యువకులు ఒక కారు అమ్మకంపై మరో గుంపుతో గొడవ పడినట్లు తెలిసింది. ఈ దాడుల్లో పలువురికి గాయాలైనట్లు సమాచారం. ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. Very bad state of affairs Gang War at Udupi Incident happened recently late night, 2 groups fought on Udupi Manipal Highway near KunjibettuWhere is the younger generation heading ???Stringent action should be taken against all these culprits pic.twitter.com/EVAstmKumR— Dr Durgaprasad Hegde (@DpHegde) May 25, 2024
snake bite: పట్టిన పామే కాటేసింది
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం నగరంలోని బిబి రోడ్డులో ఓ కారులో పాము దూరింది అని కాల్ చేయడంతో పాముల నిపుణుడు పృథ్వీరాజ్ వచ్చి పట్టుకొన్నాడు, ఈ సమయంలో ఏమరుపాటుగా ఉండగా పాము కాటేసింది. కారులో పాము దూరిందని తెలిసి ఆయన వచ్చారు. పామును చాకచక్యంగా పట్టుకుని బయటకు తీసి బైక్‌లో సంచి కోసం వెతకసాగారు. ఈ సమయంలో జన సందోహం చేరి ఫోటోలు, వీడియోలు తీస్తుండగా పాము గిరుక్కున తిరిగి పృథి్వరాజ్ను తొడ పట్టుకుంది. కష్టమ్మీద పామును విడిపించి, దానిని సంచిలో వేశారు. కాగా, ఇది ర్యాట్ స్నేక్ అని, విషపూరితం కాదని తెలిసింది. ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
అవినీతి అందిపుచ్చుకుంటూ..
రావులపాలెం: కుర్చీ మహిమో.. చేతినిండా సంపాదించాలనే తాపత్రయమో.. అవినీతి మరకను ఒకరి తర్వాత ఒకరు పుచ్చుకుంటూ తలవంపులు తెస్తున్నారు. ప్రతి పనికీ చేయిచాపి, చివరికి ఏసీబీ వలకు చిక్కుతూ ఉన్న పరువును రచ్చకెక్కిస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాలోని రావులపాలెం పోలీస్ స్టేషన్ అంతటా హాట్‌టాపిక్‌గా మారింది. ఐదు నెలల వ్యవధిలోనే ఇక్కడ పనిచేసిన అధికారులు ఇద్దరు లంచం తీసుకుంటూ దొరికిపోవడం చర్చనీయాంశం అయ్యింది. నాడు ఎస్సై అవినీతికి పాల్పడుతూ వలలో చిక్కుకోగా, నేడు అదే స్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్న సీఐ ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. ఆ వివరాల్లోకి వెళ్తే.. గతంలో రావులపాలెం పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకి ఎస్సై ర్యాంకు అధికారి ఉండేవారు. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత ఈ స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేసి ఎస్సై స్థానంలో సీఐ స్థాయి అధికారిని నియమించారు. గత జనవరిలో ఇదే స్థానంలో ఎస్సై హోదాలో ఉన్న అప్పటి ఎస్సై ఎం.వెంకటరమణ ఒక కేసులో 41 నోటీస్ జారీ చేసే విషయంలో ముద్దాయిని స్టేషన్‌కు పిలిచి చార్జిïÙట్లో తక్కువ శిక్షపడేలా సెక్షన్లు మార్చి సహాయ పడతానంటూ, ఆ కేసులో అనపర్తి మండలం పొలమూరుకు చెందిన సత్తి విజయరామకృష్ణారెడ్డి నుంచి రూ. లక్ష డిమాండ్ చేశారు. దానికి బాధితుడు అంగీకరించకపోవడంతో రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి ఆ సొమ్ము తీసుకుంటూ అప్పటి ఎస్సై వెంకటరమణ, కంప్యూటర్ ఆపరేటర్ సత్యప్రసాద్‌లు ఏసీబీకి చిక్కారు. జనవరి 9న ఈ ఘటన జరగ్గా, అదే నెలలో 13న అప్‌గ్రేడ్ స్టేషన్‌గా మారిన రావులపాలెం పోలీస్ స్టేషన్‌కు సీఐగా తణుకు రూరల్ నుంచి బదిలీపై వచ్చిన సీహెచ్ ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. మొదటి నుంచీ సీఐపై పలు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎన్నికల అనంతరం తిరిగి పశి్చమ గోదావరి జిల్లా వెళ్లేందుకు ఇప్పటికే సీఐ సన్నాహాలు చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పాత కేసుల్లో నిందితుల నుంచి సొమ్ము దండుకోవాలనే లక్ష్యంతో వారం రోజులుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికోసం కిందిస్థాయి సిబ్బందితో వివిధ కేసుల్లో బాధితులకు ఫోన్లు చేయించి స్టేషన్‌కు రావాలని పిలుపిస్తున్నారు. గతనెల 16న రావులపాలెం మండలం పొడగట్లపల్లి వద్ద కోడిపందేల శిబిరంపై పోలీసులు దాడి చేసి, పలువురిని అరెస్ట్ చేయడంతో పాటు, వాహనాలు, కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో లక్ష్మణరాజును రూ.50 వేలు ఇవ్వాలని పలుమార్లు బాధించడంతో, అతను విసిగిపోయి రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో అతని నుంచి రూ.50 వేల లంచాన్ని తీసుకుంటూ సీఐ ఆంజనేయులు ఏసీబీ అధికారులకు చిక్కాడు. వెసులుబాటును అస్త్రంగా మలచుకుని.. నాడు ఎస్సై రూ.25 వేలు, నేడు సీఐ రూ. 50 వేలు తీసుకుంటూ పట్టుబడడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇక్కడకు ఏ అధికారి వచ్చినా అవినీతి మాత్రం తగ్గడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఏడేళ్ల లోపు శిక్షపడే కేసులను కోర్టుకు తీసుకు వెళ్లకుండా 41 నోటీస్ జారీచేసి పంపించే విధంగా చట్టంలో ఉన్న వెసులుబాటును అస్త్రంగా మలచుకుని రూ. వేలల్లో డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలులు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు, జిల్లాస్థాయి అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
ఉసురుతీసిన కలహాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కుటుంబ కలహాల కారణంగా అనుమానాస్పదంగా దంపతులు మృతి చెందిన సంఘటన రాజమహేంద్రవరం ఆనంద్‌నగర్‌లో శనివారం చోటుచేసుకుంది. అయితే సంఘటనా స్థలంలో ఆధారాలను బట్టి భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. జగ్గంపేటకు చెందిన శ్రీధర్ (28)కు ప్రత్తిపాడుకు చెందిన దేవి (22)కి ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడేళ్ల బాబు, ఆరేళ్ల పాప ఉన్నారు. తాపీ పనిచేసుకునే శ్రీధర్‌కు ఏడాది కిందట ప్రమాదం జరగడంతో వేరొకరిపై ఆధారపడే పరిస్థితి వచ్చింది.భార్య దేవికి ఫిట్స్ ఉన్నాయి. ఇదిలా ఉండగా భార్యాభర్తలు తరచూ ఘర్షణ పడేవారు. ఈ నేపథ్యంలో భార్య దేవి నెలరోజుల కిందట పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను కాపురానికి తీసుకు వచ్చేందుకు శ్రీధర్ వారం కిందట అత్తారింటికి వెళ్లాడు. పిల్లలను ప్రత్తిపాడులో వదిలేసి భార్యాభర్తలిద్దరూ కలసి ఆనంద్‌నగర్‌లోని ఇంటికి శనివారం ఉదయం 10.30 గంటలకు వచ్చారు. వస్తూ శ్రీధర్ వెంట మద్యం బాటిల్ తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి మధ్యాహ్నం వరకూ తలుపు వేసి ఉండడం, ఇంటి లోపలకు వెళ్లిన వారు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు ఎంత తట్టినా తీయలేదు. అనుమానం వచ్చి ఇంటి వెనుకవైపు నుంచి వెళ్లి తలుపులు తీసి చూడగా భార్యాభర్తలిద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో ఈ విషయాన్ని మూడో పట్టణ పోలీసులకు తెలిపారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. దేవి మెడకు చున్నీ ఉండడం, ఆమె కిందపడిపోవడంతో ఆమెను చంపి శ్రీ«ధర్ ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను సీఐ వీరయ్య గౌడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.